సెక్స్, ప్రేమ మరియు పెళ్లి

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు
    Download Formats:

అధ్యాయము 1
ముందు మాట

సెక్స్‌, ప్రేమ, పెళ్ళి! ఎంత ప్రాముఖ్యమైన అంశాలివి. వీటి ప్రభావానికి గురికాని వారెవ్వరూ ఉండరు. అయినా కూడా దేవుడు మానవులకిచ్చిన ఈ వరముల యొక్క నిజమైన ఉద్దేశ్యమును ఎరుగక ఎంతో అజ్ఞానము నెలకొని ఉంది.

మన దేశంలో, సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు, సంఘకాపరులు వారి యౌవనస్తులకు ఈ విషయములను గురించి సూచనలివ్వరు. దీని ఫలితముగా, యౌవనస్తులు దీనిని గురించిన సమాచారమును వక్రమార్గములో ''మురికి కూపము'' నుండి తెలుసుకుంటున్నారు. మొట్టమొదట, సంఘము వారికి పవిత్రమైన మార్గములో బోధించవలసియుండగా, సాతాను మరియు లోకము వాటి స్వంత మార్గములలో వారికి త్వరగా బోధిస్తున్నాయి. ఈ విషయములకు సంబంధించిన లేఖనానుసారమైన బోధను ఎరుగకుండుట వలన అనేక మంది యౌవనస్తులు సాతాను యొక్క నిగూఢమైన దాడులను ఈ విషయములో ఎదుర్కొనలేకపోతున్నారు. ఆ అవసరమును తీర్చే ప్రయత్నమే ఈ పుస్తకము. ఈ పుస్తకము దేవుని దృక్పథంలో సెక్స్‌, ప్రేమ, పెళ్ళిని చూచుటకు ప్రయత్నించుచున్నది.

స్వచ్ఛమైన ప్రేమకు దేవుడే ఆయువు పట్టు. ఆయనే కామమును సృజించి వివాహమును ఏర్పాటు చేశారు. కాబట్టి నిజముగా ప్రేమ అంటే ఏమిటో, సెక్స్‌ (కామము)ను మరియు వివాహమును మన అత్యున్నత మంచి కొరకు ఏవిధముగా ఉపయోగించవలెనో ఆయన మాత్రమే మనకు చెప్పగలడు. ఈ విషయములకు సంబంధించి దేవుడు తన వాక్యములో చెప్పిన దానికి, ఈ లోకము ఎంతో వ్యత్యాసముగా మనకు బోధిస్తుంది. దేవుని వాక్యము యొక్క బోధ ఒక బండ వంటిది. దాని మీద తన జీవితమును కట్టుకొనువాడు ఎన్నటికినీ పడిపోడు. ఏ తుఫానైనా, భూకంపమైనా వానిని కదిలించలేదు.

మనము పిడివాదమును కలిగియుండలేని కొన్ని విషయాలుంటాయి. ఇటువంటి విషయములలో నేను పిడివాదము కలిగిలేను. అయితే మరికొన్ని విషయాలున్నాయి. వాటిలో మాత్రము గట్టిగా ఉండాల్సిందే. అటువంటి విషయాలలో నేను ఎంతో రూఢిగా నా వైఖరిని తెలిపాను.

నేను కొన్ని విషయములను సరళముగా, నేరుగా ప్రస్తావించాను. బహుశా: తెలివిగల వారికి ఇది ఇబ్బంది పెట్టియుండవచ్చు! కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశములోని అనేక మంది సువార్తీకరణ క్రైస్తవులు ఎంతో కాలముగా ఈ విషయాల మీద మెతకతనాన్ని ప్రదర్శించారని నేను భావిస్తున్నాను. ఈ విషయముల మీద క్రైస్తవ నాయకులు గట్టిగా చెప్పియున్నట్లయితే చాలా మంది యౌవనస్తుల జీవితములు నాశనము కాకుండా రక్షించబడియుండేవి. కనుక కొన్ని విషయములలో గట్టిగా మాట్లాడుటకు నేను వెనుకాడుటలేదు. లైంగిక విషయములలో అనేక మంది క్రైస్తవులు సాతాను యొక్క ఉరులలో పడిపోవుట నేను చూశాను. అనేక వివాహములు దేవుని ఉద్దేశ్యమునకు బదులు సాతాను ఉద్దేశ్యములను నెరవేర్చుటను కూడా నేను చూశాను. ఈ అంశాల మీద అగ్గి రగల్చాలని ప్రయత్నం చేశాను. వీలున్న చోట్ల మారణాయుధాలను ప్రయోగించాను. ''అచ్చంగా అమ్మాయిలకే '' అనే ఆరవ అధ్యాయమును నా భార్య దయతో వ్రాసింది.

ఈ పుస్తకమును తీవ్రముగా చదవాలని యౌవనస్తులను నేను కోరుచున్నాను. భవిష్యత్తును గురించి ముందు హెచ్చరించబడటం, ముందుగా జాగ్రత్తపడటమే. రోగమును నయం చేయడం కన్నా అసలు అది రాకుండా చూసుకోవడమే శ్రేష్ఠము. ఈ పుస్తకములో చెప్పిన దానిని అనుసరించడం వల్ల భవిష్యత్తులో మీ హృదయములు గాయపడకుండా, మీ ఓడ బద్దలవకుండా ఉంటుంది.చాలా చోట్ల అతను, అతనికి అనే సర్వనామాలను వాడాను. అవి కేవలము పురుషులను మాత్రమే సూచించవు. సాధారణముగా మానవులందరినీ సూచించడానికి ఆవిధముగా ఉపయోగించాను. కాబట్టి ఇవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి. కాబట్టి చదువు వారు దీనిని గమనించాలి.

చాలా మంది ఈ వ్రాత ప్రతిని చదివి అమూల్యమైన సలహాలనిచ్చారు. వాళ్ళందిరికీ నేను కృతజ్ఞుణ్ణి. ప్రత్యేకముగా ప్రస్తావించితే తప్పితే, లేఖనములలోని వచనములన్నీ ఆంప్లిఫైడ్‌ బైబిలు నుండి వ్రాయబడ్డాయి. ఆంప్లిఫైడ్‌ ఓల్డ్‌ టెస్టమెంట్‌ లీ జోండర్‌వాన్‌ పబ్లిషింగ్‌ హౌస్‌, ఆంప్లిఫైడ్‌ న్యూ టెస్టమెంట్‌ లీ లాక్‌మాన్‌ ఫౌండేషన్‌, '' జె.బి.పి అంటే జె.బి ఫిలిప్స్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద న్యూటెస్టమెంట్‌ '' లీ జెఫ్రీ బ్లెస్‌ లిమిటెడ్‌...పబ్లిషర్స్‌, టి.ఎల్‌.బి అంటే ''ద లివింగ్‌ బైబిల్‌ '' లీ టిండేల్‌ హౌస్‌.

ఈ తర్జుమాల నుండి వచనములను ఉపయోగించుటకు ఇచ్చిన అనుమతిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.సెక్స్‌, ప్రేమ, పెళ్ళి లో దేవుని పరిపూర్ణ చిత్తమును కనుగొనుటకు ఈ పుస్తకము సహాయము చేసి, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని నా ప్రార్ధన.

- జాక్‌ పూనెన్‌

అధ్యాయము 2
పేలుడు పదార్ధం జాగ్రత్త!

స్వభావసిద్ధంగా సంక్రమించిన లక్షణాలలో శక్తివంతమైనది కామం. అది ఒక ప్రేలుడు పదార్ధంలాంటిది! దేవుడిచ్చిన ఈ వరములో ఎంత ఆశీర్వాదమున్నదో గదా! అయినప్పటికీ దీనిని దుర్వినియోగపరచుట ద్వారా ఎంతో వినాశనము కలుగుతుంది. ప్రతి స్త్రీ, పురుషులలో కూడా ఈ కామ వాంఛ మరియు కోర్కెలు ఉంటాయి. అందరిలో ఈ కోర్కెలు ఒకే విధముగా ఉండకపోయినప్పటికీ, యౌవన దశ నుండి కనీసం 30 సంవత్సరాలు ఈ కోర్కెలు ఒక శక్తిగా రూపొందుతాయి. ఒక ప్రేలుడు పదార్ధం వలె కామమును మంచి కొరకు ఉపయోగించవచ్చు, చెడు కొరకు కూడా ఉపయోగించవచ్చు. దేవుని మహిమ కొరకు ఉపయోగించవచ్చు లేక అపవాదిని సేవించుటకొరకై ఉపయోగించవచ్చు. పేలుడు పదార్ధములో పాపము లేదు కాని, దానిని మనము ఏవిధముగా మరియు దేని కొరకు ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని బట్టి ఉంటుంది. కామం విషయములో కూడా అంతే. దీనిని దేవుని యొక్క వరముగా అంగీకరించి, దేవుని యొక్క నియంత్రణలో జ్ఞానయుక్తముగా ఉపయోగించినట్లయితే, ఇది మానివుని యొక్క అత్యున్నతమైన సఫలతకు సాధనముగా ఉంటుంది. ఒక వేళ దీనిని దుర్వినియోగపరచినట్లయితే అతడిని భ్రష్టత్వము యొక్క అత్యంత లోతులలోనికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి చెప్పినట్లుగా, ఇది ఖచ్చితముగా ''అద్భుతమైన సేవకుడే గాని భయంకరమైన యజమాని''.

ఆహారము కొరకు మరియు విశ్రాంతి కొరకు కోరికలు కలిగియుండటము ఎంత సాధారణమో, లైంగిక సంబంధమైన కోరికలు కలిగియుండుట కూడా అంతే. కాని ఈ కోర్కెలను సృష్టించిన దేవుడే వాటిని సక్రమమైన పద్ధతిలో అనుభవించడానికి మార్గమును కూడా ఏర్పాటు చేశాడు.

విపరీత ధోరణులు

కామం దేవుని చేత సృష్టించబడినది, అది పరిశుద్ధమైనది మరియు పవిత్రమైనది. మానవుడు పాపములో పడిపోక మునుపే ఇది సృష్టించబడినది మరియు దేవుడు తానే ''చాలా మంచిది'' అని చెప్పిన లోకములో ఇది ఉన్నది. ఈ సత్యములను బట్టి ఇది స్పష్టముగా ఋజువగుచున్నది కాని మానవుడు పడిపోయినప్పటి నుండి, కామం పట్ల అతని వైఖరి చెడిపోయింది మరియు లైంగిక సంబంధమైన కోర్కెలకు తాను బానిసయ్యాడు. ఆదాము, హవ్వలు పాపము చేసిన వెంటనే వారు లైంగిక స్పృహను పొందారు మరియు వారి దిగంబరత్వాన్ని బట్టి సిగ్గుపడి వెంటనే వారి శరీరములను కప్పుకొనుటకు ప్రయత్నించారు. ఆ పతనము యొక్క విచార ఫలితాలను కోసుకుంటున్న లోకములో మనము జీవిస్తున్నాము. దాని ఫలితముగా, మానవునికి ఆశీర్వాదముగా ఉండవలసిన కామం భారముగా మారింది.

దేవుడిచ్చిన ''కామం'' అనే వరమును మానవుడు పదేపదే దుర్వినియోగపరచుట ద్వారా ''కామం'' అనే పదమే అనేకుల మనస్సులలో అపవిత్రమైన భావమును కలుగజేస్తుంది. దేవుడు పవిత్రముగా, సౌందర్యముగా మరియు పరిశుద్ధముగా ఉండాలని ఉద్దేశించిన దీనిని సినిమాలు, వ్యాపార ప్రకటనలు మరియు పుస్తకాలలోని బూతు సాహిత్యములు ఈనాడు కామమును గురించిన చెడిపోయిన మరియు వక్రమైన భావములు కలిగియుండుటకు దోహదపడుతున్నాయి.

కామమునకు సంబంధించి మన తలంపులు పెడమార్గము పట్టాయనడానికి అనేక ఋజువులున్నాయి. ''క్రైస్తవ ప్రవర్తన'' అనే పుస్తకంలో సి.యస్‌.లూయిస్‌ అనే రచయిత ఇలా వ్రాస్తున్నారు - అమ్మాయిలు తమ ఒంటిమీద ఉండే వస్త్రములను ఊడదీసే దృశ్యం ఉన్న నాటకానికి ఎక్కువమంది ప్రేక్షకులను రాబట్టవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని చూడడానికి ఎగబడే ప్రజలున్న ఒక దేశానికి నీవు వెళ్ళావనుకో, అక్కడ రంగస్థలంపై మూతపెట్టిన పళ్ళెమును ప్రతిరోజు ప్రదర్శిస్తున్నారనుకో, దాన్ని చూడ్డానికి ప్రజలు వేలం వెర్రిగా వస్తున్నారు. లైటు ఆపివేయక ముందు ఆ ప్రదర్శకుడు ఆ పళ్ళెంమీదనున్న మూత నెమ్మదిగా తీస్తున్నాడు. అందులో ఏముందా? అని ప్రేక్షకులు ఎంతో ఆతురతతో చూస్తున్నారు. చివరకు ఆ పళ్ళెంలో వారెప్పుడూ తినే మాంసాహారం మాత్రమే ఉంది. దాన్ని చూచి ఆనందముతో వారు వెళ్ళి మరలా తరువాత రోజు ఆ ప్రదర్శనకు తిరిగి వచ్చినట్లయితే వారినేమనాలి? బహుశా వారి అభిరుచుల్లో ఏదో లోపం ఉందని అనుకోవాలి గదా? అదేవిధంగా వేరే లోకంలో(వాతావరణంలో) పెరిగినవారు కూడా మనలో ఉన్న కామపూరిత ధోరణులను గురించి ఇదేవిధముగా అనుకుంటారు.

చెడిపోయిన ఈ లోకములో దేవుని కొరకు వెలుగువలె ప్రకాశించడానికి క్రైస్తవుడు పిలువబడ్డాడు. కనుక కామం అంటే కేవలం ఒక భౌతిక ప్రక్రియగా మరియు సుఖానికి మూలముగా భావించే ఈ లోకము యొక్క దిగజారిన అభిప్రాయములకు అతడు వ్యతిరేకముగా నిలబడాలి. కామమును దేవుడు ఏవిధముగా చూస్తున్నాడో అదేవిధముగా తాను కూడా చూడగలుగునట్లు దేవుడు తన మనస్సును రూపాంతరపరచునట్లుగా దేవుని ఆత్మను అనుమతించాలి. కామం అంటే పాపపూరితమైనది కాదు, దాని గురించి సిగ్గుపడనక్కరలేదు. దేవుడు సౌందర్యముగా సృష్టించిన ఒక పవిత్రమైన విషయముగా దీనిని చూడగలగాలి.

చాలామంది మతైకవాదులకు, తాత్వికులకు కామం పట్ల ఒకరకమైన దురభిప్రాయాలున్నాయి. అసలు ఈ మానవ శరీరమే ఒక పాపభూయిష్టమైనది కాబట్టి దీన్ని ఎంత త్వరగా త్యజిస్తే అంత మంచిది అనుకునేవాళ్ళు కొందరైతే, మరికొందరు మరొక విపరీత ధోరణికి వెళ్ళి శరీరాన్ని పూజిస్తూ శారీరక కోరికలన్నీ ఏ అనుమానం లేకుండా తీర్చుకోవాలి అని - వాదించేవాళ్ళున్నారు.

క్రైస్తవ దృక్పథం ఏమిటంటే, ఆత్మ మరియు ప్రాణమువలె శరీరము కూడా దేవుని సృష్టిలోని భాగమే. కావున శరీరమునకు కూడా దేవుని ప్రణాళికలో నిర్ధిష్టమైన ఉద్దేశ్యమున్నది. తన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి క్రైస్తవుడు తన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని బైబిలు బోధిస్తున్నది (1 కొరిందీ¸ 6:13-20). మన శరీరములను సజీవయాగముగా సమర్పించి దేవుణ్ణి ఆరాధించాలని మనము హెచ్చరించబడ్డాము (రోమా 12:1).

మానవ శరీరమే పాపమునకు హేతువు అని భావించేవారికి మార్టిన్‌ లూథర్‌ ఈ విధముగా చెప్పాడు - యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరమును కలిగియున్నాడు అయినా కూడా ఆయన పాపము లేకుండా ఉన్నాడు. కాని అపవాదికి శరీరము లేకున్నా కూడా పాపముతో నిండియున్నాడు. పాపము యొక్క మూలము మానవ శరీరములో కాదు గాని మానవ హృదయములో ఉంటుంది. మానవ శరీరమును లేక దాని కోరికలను నిర్మూలము చేయుట ద్వారా కాదు గాని హృదయము మారుట ద్వారా పాపము నుండి విడుదల కలుగుతుంది. కొందరు ప్రార్ధించినట్లుగా, మన లైంగిక సంబంధమైన కోర్కెలను తీసివేయమని మనము ప్రార్ధించవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా చేస్తే మన పురుషత్వాన్నే కించపరచి, దేవుని యొక్క ఆలయమును కొంతవరకు పాడుచేసినట్లవుతుంది. మనము జయజీవితములో జీవించే పరిపూర్ణ పురుషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిప్పు అది ఉండే స్థానములో ఉన్నట్లయితే దానిని ఆర్పివేయాల్సిన పని లేదు. అయితే ఆ నిప్పు వల్ల ఇల్లు కాలిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.

ఏదేను వనములో ఆదాము శోధించబడుటకు దేవుడు ఎందుకు అనుమతించాడో, లైంగిక సంబంధమైన విషయాలలో మనము కూడా శోధించబడుటకు దేవుడు అందుకే అనుమతిస్తాడు. ఆదాము అమాయకునిగా ఉన్నాడు కాని అతడు పరిశుద్ధునిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నైతికముగా ఆదాము ఎంపిక చేసుకొని శోధనను జయించినప్పుడు మాత్రమే అతడు పరిశుద్ధునిగా అవ్వగలడు. మన విషయములో కూడా ఇదేవిధముగా ఉంటుంది.

అపవిత్రమైన ఆలోచనలు

ప్రతి యౌవనస్తుడు కూడా ఎప్పుడో ఒకసారి అపవిత్రమైన ఆలోచనల చేత శోధించబడతాడు. స్త్రీలకంటే పురుషులలో ఈ కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి కనుక స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మనుష్యుల హృదయములో నుండి వచ్చే వాటిలో చెడ్డ తలంపులు మొదటివని యేసుప్రభువు (మార్కు 7:21) లో ప్రస్తావించారు. మార్పు చెందని వారు కూడా ఇదేవిధముగా దుష్టులుగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభువు వివరించినది మనందరి విషయములో సత్యమే. ఈ అపవిత్రమైన తలంపులు ఒక వ్యభిచారి మనస్సును ఏవిధముగా వేధిస్తాయో, నైతికముగా నిజాయితీ గల వ్యక్తిని కూడా అదేవిధముగా వేధిస్తాయి. అవకాశము లేక మరియు సామాజిక భయము ఈ నైతిక వ్యక్తిని శరీరములో వ్యభిచారము చేయకుండునట్లు అడ్డుపడుతుంది.

శోధనకు మరియు పాపమునకు ఉన్న వ్యత్యాసమును మనము తెలుసుకోవాలి. ''యేసు ప్రభువు కూడా అన్ని విషయములలో మనవలె శోధించబడ్డాడు''(హెబ్రీ 4:15). కాని ఆయన ఒక్కసారి కూడా శోధనకు లోబడలేదు(తన మనస్సులో కూడా). కాబట్టి ఆయన ఒక్కసారి కూడా పాపము చేయలేదు. ఈ భూమి మీద మన చివరి రోజు వరకు మనము కూడా శోదించబడుతూనే ఉంటాము. కాని మనము పాపము చేయవలసిన అవసరము లేదు. మన మనస్సులో దురాశను గర్భము ధరించినప్పుడే మనము పాపము చేస్తాము (యాకోబు 1:15). మన మనస్సులో కలిగే దురాశకు సంబంధించిన తలంపులను మనము అనుమతించినప్పుడు ఈవిధముగా జరుగుతుంది. మనము మొదటిసారే దానిని నిరాకరించినప్పుడు మనము పాపము చేయము.

ఒక పాతకాలపు ప్యూరిటన్‌ బోధకుడు ఈవిధముగా చెప్పాడు - ''నా తలమీద పక్షులు ఎగురకుండా నేను అడ్డుకోలేను గాని, నా తలమీద గూడు కట్టుకోకుండా అడ్డుకోగలను''. ఒక చెడ్డ తలంపు మన మనస్సులోకి వచ్చినప్పుడు, దానిని గురించి ఒక్క క్షణమైనా మనము ఆలోచించినట్లయితే అది మన మనస్సులలో గూడు కట్టుకొనునట్లు మనము అనుమతిస్తాము, తద్వారా పాపము చేస్తాము.

ఒక్కసారి మోహపు ఆలోచనలలో పడిపోయినట్లయితే అది ఆ వ్యక్తిని ఇంకా ఎక్కువగా బానిసగా చేసుకుంటుంది. సమయము గడిచేకొలదీ విడుదల కష్టమవుతూ ఉంటుంది. మనమెంత విడుదల కోసము చూస్తామో అంత సులభముగా విడుదల పొందవచ్చు. చెడు తలంపుల మీద విజయము(ఇతర పాపము మీద విజయము వలె), మన ఓటమిని యదార్ధముగా ఒప్పుకొనుట ద్వారా, విడుదల కొరకు ఆకలిదప్పులు కలిగియుండుట ద్వారా, క్రీస్తుతో మన మరణమును అంగీకరించుట ద్వారా, ప్రభువుకు మన శరీరములను, మనస్సులను సంపూర్ణముగా అప్పగించుకొనుట ద్వారా వస్తుంది (రోమా 6:1-14).

మనము నిరంతర జయమును అనుభవించాలంటే, మనము ''ఆత్మలో నడుచుకుంటూ'' మనలను మనము క్రమశిక్షణలో ఉంచుకుంటూ ఆయనతో ఏకీభవించాలి (గలతీ 5:16-18). మన కన్నులను మరియు చెవులను క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో (కామమునకు సంబంధించిన వాటిని చదవడం గాని, చూడటం గాని, వినడం గాని చేయకూడదు) మనము తప్పిపోయినట్లయితే మన తలంపులను కూడా మనము క్రమశిక్షణలో పెట్టుకోలేము (మత్తయి 5:28-30 వచనముల నిజమైన అన్వయింపు అదే). మోహపు తలంపుల నుండి విడుదల పొందుటకు శరీరము యొక్క క్రమశిక్షణ అవసరమైయున్నది. వారి మనస్సులలో లైంగిక సంబంధమైన శోధనలతో ఎల్లప్పుడూ యుద్ధం చేయవలసి వచ్చేదని గొప్ప పరిశుద్ధులు కూడా ఒప్పుకున్నారు. జయం పొందుటకు వారి శరీరములను ఎంతో తీవ్రంగా క్రమశిక్షణలో పెట్టుకోవలసి వచ్చింది.

యోబు వివాహితుడై పదిమంది పిల్లలను కలిగియున్నా కూడా తాను మోహపు తలంపుల నుండి విడుదల పొందాలంటే తన కన్నులను క్రమశిక్షణలో ఉంచుకోవాలని గుర్తించాడు. ''కన్యకను మోహపు చూపుతో చూడకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని'' (యోబు 31:1- ద లివింగ్‌ బైబిలు తర్జుమా). పురుషులకు, గొప్ప శోధనలు కన్నుల ద్వారా కలుగుతాయి. ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండకుండా ఒక అపవిత్రమైన తలంపును గాని లేక ఒక బొమ్మను గాని మన కంటి ద్వారము ద్వారా మన మనస్సులోనికి అనుమతించినట్లయితే, అక్కడ నుండి దానిని తొలగించడం దాదాపు అసాధ్యము.

మనము ఉదయమున లేచిన వెంటనే మరియు రాత్రి నిద్రపోయే ముందు కూడా దేవునితో సమయము గడుపుట కూడా ఈ క్రమశిక్షణలోని భాగమే. మనము ఉదయమున నిద్ర లేచి అదేపనిగా పడక మీద అటుఇటు దొర్లుతున్నట్లయితే మన మనస్సులోనికి చెడుతలంపుల ప్రవాహమునకు ద్వారము తెరచినట్లే. అనుదినము కూడా దేవుని వాక్యముతో నింపబడునట్లుగా మన మనస్సులను తెరవాలి - చెడుతలంపులకు భద్రత, దేవుని వాక్యమును మనస్సులలో నింపుకోవడమే. ''నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొనియున్నాను'' (కీర్తనలు 119:11).

''మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతయైనను, మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి'' (ఫిలిప్పీ 4:8). భారతదేశమునకు వచ్చిన గొప్ప మిషనరీ హెన్రీ మార్టిన్‌ తన పుస్తకంలో ఈవిధముగా వ్రాశాడు - ''అపవిత్రమైన తలంపులతో పోరాడేటప్పుడు లేఖనముల ఆజ్ఞకు విధేయత చూపించుట ద్వారా నేను గొప్ప సహాయం పొందాను''.

ఎప్పుడైతే ఒక అమ్మాయి యెడల మోహపు తలంపు వస్తుందో వెంటనే అతడు ఈవిధంగా ప్రార్ధించేవాడు. ఆమె తన హృదయములో, మనస్సులో పవిత్రపరచబడి తన దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంటూ దేవుని మహిమ కొరకు ఆమె ప్రతిష్టించుకోవాలని కోరుకునేవాడు. ఈవిధంగా ప్రార్ధించిన తరువాత అతడు ఆ అమ్మాయిని గురించిన తలంపులలో కొనసాగుటకు ధైర్యం చేసేవాడు కాదు. పవిత్రమైన తలంపులు కలిగియుండుటకు ఇది ఎంతో గొప్ప పద్ధతిగానున్నది.మనచుట్టూ నైతిక విలువలు ఎంతో తక్కువ ప్రమాణములలో ఉన్న ఈ ప్రపంచంలో అపవిత్రమైన తలంపుల నుండి పూర్తిగా విడుదల పొందడం ఎంతో కష్టమని కొందరంటుంటారు. కాని ఇటువంటి పరిస్థితులు కేవలం 20వ శతాబ్ధంలోనే ప్రత్యేకమైనవి కావు. మొదటి శతాబ్ధంలో కొరింథు పట్టణం కూడా జారత్వమునకు, కాముకత్వమునకు కేంద్రంగా ఉన్నది. అయినా కూడా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టవలెనని (2 కొరిందీ¸ 10:5) దేవుని యొక్క ఆత్మ క్రైస్తవులను బ్రతిమిలాడాడు. ఈనాడు కూడా మనము అదేవిధముగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. జీవమునకు పోవు మార్గము ఇరుకైనది మరియు కష్టమైనదైనా కూడా ఆ మార్గములో మనము నడచుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు.

మన జీవితములను క్రమశిక్షణలో పెట్టుకొనుటంటే అమ్మాయిల మీద(శీజూజూశీరఱ్‌వరవఞ) వ్యతిరేకమైన వైఖరిని పెట్టుకోమని కాదు. అవతలి వారు(శీజూజూశీరఱ్‌వరవఞ) ఆర్షణీయంగా కనబడుతున్నట్లయితే, అందులో పాపమేమి లేదు. ఇది ఎంతో సహజం. దేవుని యొక్క సౌందర్యమైన సృష్టిలో ఒక అందమైన ముఖమును ప్రశంశించుటలో తప్పేమి లేదు. కాని పడిపోయిన జీవులముగా, మనము జాగ్రత్తగా ఉండనట్లయితే ఆ అందమును గమనిస్తూ తరువాత మోహిస్తాము. అవతలి వారిలో ఉన్న ఆకర్షణలో అపవిత్రత ఏమి లేకున్నా కూడా మనము అపవిత్రమైన తలంపులు కలిగియుండునట్లు చేయగలదు.

''ఎ సెకండ్‌ టచ్‌'' అనే పుస్తకములో కెయిత్‌ మిల్లర్‌ ఈవిధముగా చెప్తాడు. ఎంతో లోతుగా దేవునికి ప్రతిష్ఠించుకున్నా కూడా అవతలి వారి(శీజూజూశీరఱ్‌వరవఞ) లో ఉన్న సౌందర్యమును గమనించకుండా ఆ ప్రతిష్ఠత కాపాడలేదని నేను గమనించాను. ఈవిధముగా గుర్తించడం అనేది ఏవిధముగానైనను పాపమని లేక ఒకరు ఆత్మీయముగా పరీక్షించుకోవాలని నేను అనుకోను. నిజానికి, అవతలివారిలో(శీజూజూశీరఱ్‌వరవఞ) భౌతిక సౌందర్యమును నీవు గుర్తించినట్లయితే, ఒకవేళ నీవు నా వయసులో ఉన్నట్లయితే, బహుశా నీ ఆరోగ్యమును నీవు పరీక్షించుకోవాలి. మరియు నేను చాలా తీవ్రంగా చెబుతున్నాను. నా అభిప్రాయములో ''గుర్తించడం'' అనేది పాపము కాదు. క్రైస్తవ గుణలక్షణములను మెరుగుపరచుకొనుటకు పడిపోవుటకు(పాపము చేయుటకు) గల అవకాశములను తెలుసుకొనుట అనేది ముఖ్యము. ఉదాహరణకు, ఒక గ్రుడ్డివాని ముందు బల్లమీద బంగారం పెట్టినట్లయితే, అతడు దొంగిలించనంత మాత్రమున నిజాయితీపరుడని మనము చెప్పలేము. కాని ఎవరైతే ఆ బంగారమును చూస్తారో, దానిని తీసుకోవాలనే ఒత్తిడిని కలిగియుండి కూడా దానిని తీసుకోరో వారిని నిజాయితీ పరులుగా పరిగణించవచ్చు. సమస్యలను కొనితెస్తుందని గుర్తెరిగినవాడు ఈవిధంగా చేస్త్తాడు.

పరిశుద్ధాత్ముడు మనలను పరీక్షించి మన కన్నులను మరియు మన తలంపులను వేరే మార్గములోనికి త్రిప్పమని చెప్పినపుడు ఎప్పుడైతే మనము వెంటనే పరిశుద్ధాత్మ స్వరమునకు విధేయత చూపిస్తామో, అందులోనే మన భద్రత ఉంది.

''ప్రభువా నేను జయించలేని శోధనను(ఈ విషయంలో) ఎదుర్కొనకుండునట్లు సహాయం చేయండి'' అని మనము తరచుగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనను యదార్థంగా చేసిన అనేకమంది యౌవనస్తులు జయమును పొందారు.

హస్త ప్రయోగం

ఆలోచనలలో సరిగా ఉండనట్లయితే శరీరము యొక్క కోరికలలో క్రమశిక్షణ లేకుండా పడిపోతాము. ఒక క్రైస్తవుడు ఈవిధముగా చేయకూడదు. ''పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురిచూడని వానివలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను'' (1 కొరిందీ¸ 9:25-27) అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.

మీలో ప్రతివాడును దేవుని యెరుగని అన్యజనులవలె కామాభిలాషయందు గాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగి ఉండుటయే దేవుని చిత్తము (1 థెస్సలోనిక 4:4-5) అని మరలా పౌలు చెప్తున్నాడు. ''ద బైబిల్‌ అండ్‌ సెక్స్‌ ఎది¸క్స్‌ టుడే'' అనే తన పుస్తకంలో సి.జి.స్కోరర్‌ ఈవిధంగా చెప్పారు. అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలలో నుండి బైబిల్లో నేరుగా ప్రస్తావించని మరొక విషయానికి సంబంధించి సలహాను తీసుకోవచ్చు. అదేమిటంటే రహస్యముగా, ఒంటరిగా స్వయంతృప్తి పొందడం లేక హస్తప్రయోగం. మనిషి యొక్క జీవితములోని రహస్య విషయముల గురించి వివరించడానికి క్రొత్త నిబంధన ప్రయత్నించలేదు. ఆధునిక మానసిక శాస్త్రము ఆవిధంగా చేయడానికి ప్రయత్నించవచ్చేమో; క్రీస్తు మరియు అపొస్తలులు ఆవిధంగా చేయలేదు. మన శరీరముల మీద దేవుని యొక్క అధికారమును ఈ స్వయం తృప్తి తిరుగుబాటు చేసే కోరికను పుట్టిస్తుంది. తన కోసమే శృంగారభరిత అనుభవమే పరమావధిగా ఇది చేస్తుంది. ఒక పురుషుడు గాని లేక స్త్రీ గాని తన స్వంత కోర్కెలను జయించే దానికి బదులుగా వాటికి బానిసలౌతారు. లైంగిక వాంఛలు ఆత్మీయశక్తికి విరోధముగా పనిచేస్తాయి. శరీరము యొక్క కోర్కెలు శరీరమును పరిపాలిస్తున్నట్లయితేే, అప్పుడు ఆత్మ ఏమి చేయలేదు. మానసికంగా వీటిని గుణలక్షణాలలోని అపరిపక్వత, స్వయం కేంద్రీకృతం, స్వయం తృప్తిగా సూచిస్తుంటారు. వీటన్నింటిని జయించవలసియున్నది. ఇది జారత్వమంత తీవ్రమైనదిగా పరిగణించబడదు ఎందుకంటే ఇందులో ఇతరులెవరు ఉండరు. కాని హఠాత్తుగా వచ్చే అలాంటి ఉద్రేకమైన కోర్కెల వలన తన్నుతాను నిగ్రహించుకోలేకపోతున్నాననే భావన ఆ వ్యక్తికి వస్తుంది. అది తన్నుతాను తక్కువగా భావించుకొనేటట్లు చేస్తుంది. తన స్వీయ ఔన్నత్యం విషయంలో ఉన్న కలవరమును బట్టి క్రీస్తు కొరకైన తన సాక్ష్యమును కూడా అది శూన్యపరుస్తుంది. ఆరంభములోనే ఇటువంటి లైంగిక ఉద్రేకములను చిత్తముతో మరియు విజ్ఞముతో ఎదిరించిన యెడల పరిష్కారం దొరుకుతుంది.

హస్తప్రయోగం అనేది ఏ జబ్బుకు దారితీయకపోవచ్చు కాని ఇది నిరాశలోనికి మరియు మన దృఢచిత్తమును బలహీనపరచునట్లుగా చేస్తుంది. ఇదంతా కూడా ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేయకుండా చేసి మరియు అతని ఆత్మీయ ప్రభావమును తగ్గిస్తుంది. ఒకవేళ దీనిలో ఎక్కువగా పడిపోతూ ఉన్నట్లయితే, వివాహం తరువాత లైంగిక సంబంధంలో కూడా సమస్యలను తెస్తుంది. దేవుని వరమైన శృంగారమును దుర్వినియోగపరుస్తుంది కాబట్టి హస్తప్రయోగము ఒక పాపము. దీని గురించి పశ్చాత్తాపపడాలి మరియు విడచిపెట్టాలి.

యౌవనస్తులు ఎక్కువగా శృంగారము గురించి వారి లోకసంబంధమైన స్నేహితుల యొద్ద నుండి చెడిపోయిన విధానములో నేర్చుకుంటారు గనుక ఈ చెడ్డ అలవాటు చేత పట్టబడతారు. ఒకసారి ఈ పాపమునకు లోనయినట్లయితే, ఒక వ్యక్తిని ఎంతో గట్టిగా పట్టుకొని పదే పదే దానిలో పడిపోయేటట్లు చేస్తుంది. అయితే క్రీస్తు అతనిని విడిపించగలడు.

ఒక కండరమును అనేక సంవత్సరములు ఉపయోగించనట్లయితే, అది ఏవిధముగా ఉపయోగపడకుండా పోతుందో, వారి మర్మాంగములను కూడా ఉపయోగించనట్లయితే పనికిరాకుండా పోతాయని, అందుకు హస్తప్రయోగం అవసరమని అనేకమంది స్నేహితులు యౌవనస్తులకు చెబుతూ ఉంటారు. ఇది ఎంతో తప్పుడు అభిప్రాయము. మర్మాంగములను ఉపయోగించనంత మాత్రమున అవి పనికిరావని లేక శక్తిని కోల్పోతాయని అనుకోవడం తప్పు, ఆవిధంగా జరగదని వైద్యనిపుణులు అంగీకరించారు. లైంగికసంబంధమైన కోర్కెలను అదుపులో ఉంచుకుంటే ఎటువంటి మానసికమైన హాని కూడా జరుగదు. నిజానికి లైంగిక సంబంధమైన కోరికలను అదుపులో ఉంచుకుంటే ఎటువంటి హాని కూడా జరుగదు. దానికి వ్యతిరేకముగా, ఆవిధముగా ఒక వ్యక్తి తనను క్రమశిక్షణలో పెట్టుకున్నట్లయితే, తన చిత్తము మరి యెక్కువ ధృడముగా మారి తన మనస్సు మరి యెక్కువ మెళకువగా ఉంటుంది. ఒక పురుషుడు తన మర్మాంగమును తన జీవితాంతము ఒక్కసారి కూడా ఉపయోగించకుండా ఉన్నా కూడా తన మనస్సులో, శరీరములో పరిపూర్ణమైన ఆరోగ్యమును కలిగియుండగలడు.

వారు నిద్రిస్తున్నప్పుడు జరిగే వీర్యస్ఖలనము గురించి కొంతమంది యౌవనస్తులు చింతిస్తుంటారు. ఇదంతా కూడా వారి శరీరములో జరిగే సహజ ప్రక్రియ మాత్రమే. శరీరంలో ఎక్కువగా ఉన్న పదార్ధములు బయటకు పంపించబడుతుంటాయి. వారు అసాధారణముగా ఉన్నవారు కాదు మరియు దానిని గురించి పట్టించుకోవలసిన పనిలేదు.

ప్రతి పురుషుడు కూడా తన లైంగిక కోర్కెలను వివాహానికి ముందే అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత ఈవిధంగా అదుపుచేసుకోవడం ఎంతో అవసరమవుతుంది. వివాహం తరువాత కూడా లైంగిక విషయాలలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అదుపులేని సంయోగమునకు వివాహం చేసుకొనుట అనేది అధికారపూర్వకముగా స్వేచ్ఛనిచ్చినట్లు కాదు. ఎవరైతే వివాహమునకు ముందు ఈవిషయములో క్రమశిక్షణ నేర్చుకోరో, వివాహం తరువాత తప్పకుండా నేర్చుకోవలసి వస్తుంది.

ఇప్పటికే ఈ చెడ్డ అలవాటులో పట్టబడినవారు దీని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటారు. దీని నుండి విడుదలకు మార్గమేమిటంటే క్రీస్తుతో తన మరణములోను మరియు పునరుత్థానములోను మన ఐక్యతను గుర్తించడమే. మరియు మనమీద పాపముకున్న పట్టు కూడా విరిగిపోయిందని గుర్తించడమే. పరిశుద్ధాత్మతో నింపబడుటకు మనలను మనము ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు జయము అనేది మన జీవితములలో నిజమౌతుంది (రోమా 8:2) .

మన జీవితములలో అనుదినము తీరిక లేకుండ మనము ప్రణాళిక వేసుకోవాలి. మన మనస్సులు మరియు ప్రత్యేకముగా మన శరీరములు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమైయుండాలి. సోమరితనము గల మరియు వ్యాయామం చేయని శరీరములే లైంగిక కోరికలకు ఎరగా దొరుకుతాయి. ఎవరైతే కష్టపడి పనిచేసుకుంటూ జీవిస్తుంటారో అలాంటివారు ఈ విషయములో అంత సమస్యలను ఎదుర్కోరు. మనుష్యుడు కష్టపడి పనిచేయాలని దేవుడు నియమించాడు. ఆదాము తన ముఖపు చెమట కార్చి ఆహారమును సంపాదించుకోవలసియున్నది (ఆదికాండము 3:19). మనకు ఎంతో సమయమును మిగిల్చే సాధనములను విజ్ఞానశాస్త్రము కనుగొన్నది. కాబట్టి ఇప్పుడు ఆధునిక యౌవనస్తులు ఎక్కువ సమయము సోమరులుగా ఉండుటను బట్టి అపవాది వారిని ఎంతో త్వరగా వాడుకుంటున్నాడు. కాబట్టి మనము అటువంటి సమయమును మిగిల్చే పరికరములను వాడకూడదని నేను చెప్పట్లేదు. వాటిని ఉపయోగించండి. కానీ మన ఖాళీ సమయమును ఏదైనా క్రొత్తగా ఆలోచించుటకు లాభకరముగా వాడుకోవాలి.

శరీరంలో ఉన్న శక్తి నాలుగు విధాలుగా ఖర్చవుతుంది. శారీరక శ్రమలో, మానసిక పనిలో, ఉద్రేకపూరితమైన అనుభవములలో లేక లైంగిక సంయోగములో. ఒకవేళ మన శరీరములోని శక్తి మొదటి మూడు విధాలలో ఖర్చు కానట్లయితే నాలుగవ విధానంలో ఖర్చవడానికి ఒత్తిడి పెరుగుతుంది. కాని ఈవిధముగా లైంగిక సంబంధముగా శక్తి ఖర్చు అయ్యేటప్పుడు మిగిలిన విధానములలో కంటే ఎక్కువగా, భౌతికముగా శరీరములో మరియు నరముల యొక్క శక్తి హరించుకుపోతుంది.

కొంతమందికి మిగిలిన వారి వలె లైంగిక సంబంధమైన కోరికలు మరియు ఒత్తిడి అంతగా ఉండవు. లైంగిక సంబంధమైన కోరికలను ఎక్కువగా కలిగియుండి ఈ ఒత్తిడిని ఎవరైతే ఎక్కువగా కలిగియుంటారో వారు అసాధారణముగా భావించవలసిన అవసరం లేదు. వారిలో ఎంతో సృజనాత్మకత దాగి ఉందని, వారు ఇతర ప్రయోజనకరమైన మార్గములలో దానిని ఉపయోగించవచ్చని ఇది సూచిస్తుంది. మోహముతో ఎల్లప్పుడూ మనము పోరాడాలని దేవుడు కోరట్లేదు. మన శరీరంలోని శక్తిని(లైంగిక సంబంధమైన ఆలోచనలు గాని మరియు ఆ కార్యములకు సంబంధించిన) దేవుణ్ణి మహిమ పరచే మరియు మన తోటి మనుష్యులకు సహాయపడే విధానములలో మళ్ళించాలని ఆయన కోరుకుంటున్నాడు.

తన శరీరము అనుదిన భౌతిక వ్యాయామములతో మరియు పనులతో ఉండునట్లు ప్రతి క్రైస్తవ యౌవనస్తుడు ఉంచుకోవాలి. తన ఖాళీ సమయమును సోమరిగా మాటలు చెప్పేదానికి బదులు బైబిలు అధ్యయనముతో మరియు ప్రార్ధనలతో గడపాలి(ఇది తన మనస్సుకు వ్యాయామం వలె ఉంటుంది). అప్పుడు దినము గడిచే సరికి తమ దేవుని కోసం ఎంతో సాధించడం మాత్రమే కాక ఎంతో అలసిపోయి పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. రాత్రి మోహపు తలంపులతో పీడించబడి, హస్త ప్రయోగము చేసుకొనుటకు శోధించబడే దానికి బదులు తాను ఆశీర్వాదకరమైన నిద్రలోనికి జారుకుంటాడు. ''కష్టపడి పనిచేసే వ్యక్తి బాగా నిద్రిస్తాడు'' అని బైబిలు చెప్తుంది (ప్రసంగి 5:12 ద లివింగ్‌ బైబిలు తర్జుమా).

తినుట మరియు నిద్రించుట అను సామాన్యమైన విషయాలలో క్రమశిక్షణను కలిగియున్నట్లయితే, లైంగిక సంబంధమైన కోర్కెలను అదుపులో పెట్టుకొనుట సులభమవుతుంది. వీటిలో క్రమశిక్షణను కలిగిలేని కారణమును బట్టి అనేకమంది లైంగిక సంబంధమైన విషయములలో ఓడిపోతున్నారు. అతిగా తినుటకు మరియు లైంగిక సంబంధమైన కోర్కెలు రేగుటకు మధ్య ఎంతో సంబంధం ఉంది. ''ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖ స్థితియు మరియు సోమరితనము'' (యెహెజ్కేలు 16:49) వలనే పురాతన సొదొమలో లైంగిక పాపములు పెరిగిపోవుటకు కారణములు. ఎవరైతే లైంగిక కోర్కెల ద్వారా జయించబడుచున్నారో వారు వారి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ కలిగి మరియు ప్రభువు యొక్క ముఖమును ఎంతో ఆసక్తితో ఉపవాసములతోను మరియు ప్రార్ధనలతోను వెదకినట్లయితే అతి త్వరలోనే వారు విడుదలనొందుతారు.

ప్రభువు ఎల్లప్పుడు మనతోనే ఉన్నాడు మరియు మనలను చూస్తున్నాడు అనే విషయమును గమనమును కలిగి అన్నింటికంటే పైగా మనము ఎల్లప్పుడు ప్రభువు యొక్క సన్నిధిని కలిగియుండాలి. ఇతర విశ్వాసి చూస్తున్నట్లయితే మనము ఖచ్చితముగా హస్త ప్రయోగములో పడిపోము. మరి మనము దేవునికి ఇంకెంత భయపడాలో కదా!

ఒకవేళ నీవెంత ప్రయత్నించినా కూడా, ఏదైనా ఒక సమయములో ఈ శోధనను జయించలేనట్లయితే అప్పుడు వెంటనే ఇతరుల సహవాసమును కోరుకొనుట మంచిది (ఒక విశ్వాసి దగ్గరకు వెళ్ళుట మంచిది). ఇది నీవు జయించునట్లు నిన్ను బలపరుస్తుంది.

వ్యభిచారం

ఒక స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక సంయోగం ఇరువురిని ''ఒక్క శరీరము'' గా చేస్తుంది. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏక దేహమైయున్నాడని మీరెరుగరా? - వారిద్దరు ఏక శరీరమైయుందురు అని మోషె చెప్పుచున్నాడు గదా? (1 కొరిందీ¸ 6:16). పాత నిబంధనలో స్త్రీ, పురుషుల మధ్య సంయోగం ''ఎరుగుట'' అని చెప్పబడింది. లైంగిక సంయోగం వలన కేవలం భౌతిక సంబంధమైన పరిణామాలు మాత్రమే ఉండవు. అది అంత సులభంగా మర్చిపోయేది కూడా కాదు. అది ఇద్దరు మనుష్యులను ''ఏక శరీరము''గా చేస్తుంది. అందుకే అక్రమమైన లైంగిక సంయోగమునకు దేవుడు ఆటంకములను ఉంచాడు. అవేమిటంటే మరణకరమైన వ్యాధులగు ఎయిడ్స్‌(ాXణూ), సిఫిలిస్‌(ూవజూష్ట్రఱశ్రీఱర) మొ||నవి.

''వేశ్యాసంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును'' (హెబ్రీ 13:4) అని బైబిలు చెప్తుంది.

యౌవనస్తులు సాధారణంగా బాధ్యతలు లేకుండా సంతోషం కోసం, అనందం కోసం చూస్తుంటారు. ఇందువలనే వివాహ జీవితములోని బాధ్యతల కోసం చూడకుండా లైంగిక సంబంధమైన ఆనందం కోసం వారు శోధించబడుతుంటారు. ఎవరైతే స్త్రీలను ఆవిధంగా తక్కువ చేస్తారో వారి జీవితములలోనికి దేవుని తీర్పు తప్ప మరేదియు రాదు.యౌవనస్తులు తమ పురుషత్వమును ఋజువుపరచుకోవాలని కొన్నిసార్లు తమ చెడిపోయిన స్నేహితుల ద్వారా సవాలు చేయబడుతుంటారు. ఒక అమ్మాయితో కలసి ఉండకపోయినా లేక లైంగికముగా ఏమైనా సాహసం చేయకపోయినా వారు వెక్కిరించబడుతుంటారు. నిజమైన పురుషత్వం అనేది లైంగిక ధృవీకరణలో కాదు గాని కోర్కెలను నిగ్రహించుకోవడంలోనే ఉంటుంది.

దురాశలను అదుపుచేసుకోలేక పాక్షికంగా ''తప్పిపోయిన'' దావీదు యొక్క ఉదాహరణను బైబిలు మనకిస్తుంది. అతడు పడిపోవుటకు నడిపించిన పరిస్థితులను గమనించండి. (2సమూయేలు 11:1,2) వచనములు మనకు ఏమి చెబుతున్నాయంటే అతడు యుద్ధరంగములో ఉండవలసియుండగా సోమరిగా ఇంట్లోనే ఉన్నాడు. అతడు తన పనిని మరచిపోయి సోమరితనమునకు మరియు సౌఖ్యమునకు తావిచ్చాడు. అప్పుడు అతడు బత్షెబను చూశాడు. తన కన్నులను క్రమశిక్షణలో పెట్టుకోకుండా ఆమెనే చూస్తూ ఉన్న కారణమును బట్టి పాపములో పడిపోయాడు.

అదుపు లేని తన దురాశల వలన సంసోను కూడా పూర్తిగా ''తప్పిపోయాడని'' మనము బైబిలులో చదువుతాము(న్యాయాధిపతులు 14 మరియు 16 అధ్యాయములు). అతడు ఒక అందమైన అమ్మాయిని చూసినపుడు ఒక దైవ సేవకునిగా తన పిలుపును మరచిపోయాడు. ఆవిధంగా తన పరిచర్యను కోల్పోయాడు. అనేకమంది ఈవిధముగా పడిపోయి తమ పరిచర్యలను కోల్పోయారు.

మరొక ప్రక్క మనము చూసినట్లయితే యోసేపుకు దావీదువలె సుఖసౌఖ్యములు మరియు గొప్ప స్థానము లేదు. సంసోను కలిగియున్నట్లుగా దేవుని సేవించుటకు యోసేపుకు గొప్ప పిలుపు కూడా లేదు. అయినా కూడా ఈ మోహం విషయంలో అతడు పూర్తిగా జయించాడు. ఆదికాండము 39వ అధ్యాయమును ప్రతి ఒక్క యౌవనస్తుడు కూడా చదవాలి మరియు అధ్యయనం చేయాలి. యోసేపుకు శోధన ఎటువంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా ఒక దినమున ఎలా వచ్చిందో 7వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనకు కూడా అదేవిధంగా వస్తుంది. మనం ముందే సిద్ధపడనట్లయితే తప్పకుండా దానిలో మనం పడిపోతాం. ఒకవేళ యోసేపు రహస్యముగా మోహపు తలంపులను కలిగియున్నట్లయితే సులభముగా పడిపోయుండేవాడు. కాని యోసేపు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. అతడు దేవుని యొద్ద నుండి కలలను కలిగియున్నాడు. కనుక ఒక శోధన వచ్చినప్పుడు, మరెవరి సన్నిధి కంటె కూడా ఎక్కువగా దేవుని సన్నిధి అతనికి ఎంతో వాస్తవికముగా ఉండేది. ఒకవేళ యోసేపు యొక్క ఆత్మీయత నిజముగా లోతుగా లేకుండా కేవలం ఇతరుల మెప్పును మాత్రమే కోరుకొనేదైతే, అప్పుడు అతడు ఖచ్చితముగా ఆ బలమైన శోధనలో పడిపోయుండేవాడు.ఇక్కడ మనం గమనించినట్లయితే, యోసేపును ఆ పాపములో పడకుండా చేసింది దేవుని యందలి భయమే గాని పట్టబడతానేమోనని లేక దేవుని చేత శిక్షించబడతానని కాదు(9వ వచనం). అయ్యో! కేవలం పైన చెప్పబడిన చివరి రెండు భయములే అనేకమందిని పాపము చేయకుండా కాపాడుతున్నాయి. కాని యోసేపుకు దేవునితో ఉన్న సంబంధం ఈనాడు అనేకమంది దేవునితో కలిగియున్న పైపై సంబంధము కంటే ఎంతో లోతైనది.

పోతీఫరు భార్య మరలా, మరలా యోసేపును పాపము చేయుటకు శోధించినా కూడా యోసేపు నిరోధించాడని మనము చదువుతాము(10వ వచనం). అతడు మొదటిసారి ''కాదు'' అని చెప్పాడు. అది రెండవసారి ''కాదు'' అని చెప్పుటకు సులభమైంది. మరియు మూడవసారి కూడా ''కాదు'' అని చెప్పుటకు సులభమైంది. ఒక కీర్తనలో చెప్పబడినట్లుగా ''శోధనకు అప్పగించుకొనవద్దు, అప్పగించుకొనుటే పాపము; ప్రతి విజయము కూడా మరొక విజయమునకు సహాయం చేస్తుంది''.

పోతీఫరు భార్య యొక్క సమక్షములో ఉండకుండా యోసేపు తొలగిపోయెనని (ఆదికాండము 39:10) మనకు చెబుతుంది. వీలైనంత వరకు శోధించబడే ప్రదేశము నుండి వెళ్ళిపోవుట ఎల్లప్పుడు కూడా భద్రతయైయున్నది.

అవతలివారితో(శీజూజూశీరఱ్‌వరవఞ) మన సంబంధముల విషయములలో ఎంతో జాగ్రత్తగా ఉండవలెనని యోసేపు యొక్క ఉదాహరణ మనలను హెచ్చరిస్తుంది. అందమైన మరియు ఆకర్షణీయమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండటం కాదు గాని ఆకర్షణీయముగా లేని అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అందంగా లేని అమ్మాయిలు వారు అందంగా లేరని పురుషులు తమ శరీరములను తాకునట్లు వారు స్వేచ్ఛనిస్తారు. ''జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి'' (1 కొరిందీ¸ 6:18-20) అని బైబిలు మనలను హెచ్చరిస్తున్నది. ''నీవు యౌవనేచ్ఛల నుండి పారిపొమ్ము'' (2తిమోతి 2:22) అని కూడా బైబిలు హెచ్చరిస్తున్నది.

యోసేపు కూడా అదే చేశాడు. అతడు నేరారోపణ చేయబడ్డ లేక చెరసాలలో వేయబడ్డా కూడా పట్టించుకోలేదు గాని ఆ దురాశకు అప్పగించుకొనుటకు మాత్రం నిరాకరించాడు. అందుకే దేవుడు అతణ్ణి ఘనపరచాడు. బహుశా ఈ విషయంలో ఓడిపోవుటను బట్టే అనేకమంది యౌవనస్తులను ఈనాడు దేవుడు ఘనపరచలేకపోతున్నాడు.

స్వలింగ సంపర్కం

స్వలింగ సంపర్కం అంటే ఒకే జాతికి(లింగమునకు) సంబంధించిన ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య కలిగే లైంగిక ఆకర్షణ. లోతు సమయంలో దేవుడు సొదొమ గొమఱ్ఱాలను తీర్పు తీర్చిన పాపములలో ఇదొకటి. లేవీయకాండం 18:22 మరియు 1 కొరిందీ¸ 6:9,10 వచనములలో ఇది నిశ్చయముగా ఖండించబడింది. ''ఇటువంటి అవాచ్యమైనది చేయట వలన తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యెడలనొకరు కామతప్తులైరి'' (రోమా 1:26-27) అని స్వలింగ సంపర్కులను బైబిలు హెచ్చరిస్తుంది. స్వలింగ సంపర్కులకు కనికరం లేకుండా మరణ శిక్ష విధించవలెనని (లేవీయకాండం 20:13) పాత నిబంధనలోని ధర్మశాస్త్రంలో ఉంది.ఒక విశ్వాసి ఇటువంటి స్వలింగ సంపర్కమునకు ఎంతో దూరంగా ఉండటం మాత్రమే కాక తన స్వంత జాతి (లింగము) వైపు ఎటువంటి అసహజమైన ఆకర్షణలు లేకుండా దూరంగా ఉండాలి. నిగూఢముగా స్వలింగ సంపర్క మనస్సు కలిగియున్న వారిని కూడా నిరోధించాలి. ఒకవేళ ఇప్పటికే నీవు ఈ చెడ్డ అలవాటులో చిక్కుకున్నట్లయితే, విడుదల కోసం ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిని వెదకాలి మరియు అవతలి వారితో(శీజూజూశీరఱ్‌వరవఞ) ఆరోగ్యకరమైన సంబంధమును కలిగియుండుటకు ప్రయత్నించాలి. ఒక పరిణితి చెందిన విశ్వాసిని సంప్రదించి, ప్రార్ధనా సహాయం కోరిన యెడల ఎంతో సహాయంగా ఉంటుంది.

శత్రువును జయించుట

మన దినములలో శృంగారమునకు సంబంధించి అనేక శోధనలున్నాయి. కుయుక్తి కలిగి సర్పము ఏవిధముగా మోసగించడానికి ప్రయత్నిస్తుందో, అపవాది కూడా గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని చూస్తున్నాడని బైబిలులో చెప్పబడింది. యౌవనస్తులను సుళువుగా చిక్కులలో పెట్టి వారి జీవితములను నాశనం చెయ్యడానికి లైంగిక విషయములను అపవాది ఎంచుకుంటాడు.

నిగ్రహం మరియు ఎల్లప్పుడూ మెళకువగా ఉండుటలోనే మన భద్రత ఉంది. స్వేచ్ఛను ఫణంగా పెట్టడమే ఎల్లప్పుడు మెలకువగా ఉండునట్లు చేస్తుంది అనేది ఈ విషయంలో కూడా అన్వయించబడుతుంది.

దేవుని వాక్యములోని ఆజ్ఞలు శత్రువు యొక్క ఉరి నుండి మనలను కాపాడుట కొరకు ఉన్నాయి. తన వాక్యంలో ముఖ్యంగా సామెతల గ్రంథంలో దేవుడు అనేక హెచ్చరికలు చేశాడు. ప్రతి యౌవనస్తుడు కూడా ఆ గ్రంథమును తరచుగా చదవాలి. కొందరు విశ్వాసులు రోజుకొక అధ్యాయము చొప్పున నెలకొకసారి సామెతల గ్రంథమును చదివే మంచి అలవాటును కలిగియుంటారు. ఇది శత్రువు యొక్క కదలిక గురించి మనలను ముందుగానే హెచ్చరిస్తుంది.

మనము జయము పొందాలని నిశ్చయించుకున్నట్లయితే, నిస్సందేహంగా మనము యుద్ధమును ఎదుర్కొనవలసి వస్తుంది. కాని మనం విడిచిపెట్టకూడదు. మనము ఇప్పటికే పడిపోయినట్లయితే, మన పాపములను మనము దేవుని యొద్ద ఒప్పుకుందాం. గతంలోని మన అపవిత్రమైన తలంపులన్నింటిని మరియు చెడ్డకార్యములను క్షమించుటకు ఆయన నమ్మదగినవాడు.

లోతుగా పాపం చేసిన కొందరు వారు చేసిన పాపములు క్షమించబడినప్పటికీ దాని యొక్క పరిణామాలతో జీవించాలి. కాని మనం అంత లోతుగా పడిపోనట్లయితే, మనం మెళకువగా ఉందాం. తాను నిలుచున్నాననుకొను వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి (1 కొరిందీ¸ 10:12) అని బైబిలు చెప్తుంది.

అన్ని సమయములలోను మనలను జయించుటకు నడపాలని దేవుడు కోరుకుంటున్నాడు (2 కొరిందీ¸ 2:14). మన జీవితములలో ఆవిధముగా చేయునట్లుగా ఆయనను మనము నమ్ముదాము.

అధ్యాయము 3
విజాతి ధృవాల మధ్య ఆకర్షణ

మగవాళ్ళు ఆడవాళ్ళతోను, ఆడవాళ్ళు మగవాళ్ళతోను స్నేహించాలని, కలసి సమయం గడపాలని ఒకరినొకరు మెచ్చుకోవాలని కోరుకుంటారు. మగవాళ్ళు మగవారి కంటే ఆడవారిని, ఆడవారు ఆడవాళ్ళ కంటే మగవారిని ఆకట్టుకోవాలనుకుంటారు. మనవాళ్ళు మనలను పట్టించుకోకపోయినా సర్దుకుంటాం కానీ అవతలివాళ్ళు(వేరే సెక్స్‌) మనలను పట్టించుకోకపోయినట్లయితే మనము నిరాశపడతాము. నాకు అటువంటి భావాలు లేవు అని చెప్పే వ్యక్తి స్వలింగ సంపర్కుడైనా అయ్యుండాలి లేక ఒక అబద్ధికుడైనా అయ్యుండాలి!

సాధారణ మనుష్యులందరిలో, పక్వదశలో (12 నుండి 14 సంవత్సరాల మధ్య ) ఆడవాళ్ళకు మగవాళ్ళ మీద, మగవాళ్ళకు ఆడవాళ్ళ మీద ఉండే వైఖరి మారుతూ ఉంటుంది. దానికంటే ముందు సాధారణముగా అబ్బాయిలు అబ్బాయిలతోను, అమ్మాయిలు అమ్మాయిలతోను ఉంటారు. కాని పక్వదశకు వచ్చేసరికి అబ్బాయిలకు అమ్మాయిల మీద, అమ్మాయిలకు అబ్బాయిల మీద ఆకర్షణ మొదలవుతుంది. దీనిని వారు నిదానముగా ఒప్పుకున్నా, ఇది నిజము. తన దుస్తుల మీద శ్రద్ధ పెరగడం ద్వారా లేక తాను ఏవిధముగా కనబడుతున్నాను అనే విషయము మీద లేక వారి ఎదుట సౌమ్యమైన వైఖరి ప్రదర్శించడం ద్వారా ఈ ఆకర్షణ బహిర్గతమవుతుంటుంది. ఇటువంటి ఆకర్షణ సహజసిద్ధమైనది మరియు అనివార్యమైనది. ఇది పాపము కాదు.

దేవుడే ఈవిధముగా మనలను సృష్టించాడు కాబట్టి వారితో సహజసిద్ధమైన మార్గములో స్నేహం చేయాలని దేవుడు తప్పకుండా ఆశిస్తాడు. స్నేహం కోసం అటువంటి కోరికలను అణచివేసుకోవాలని దేవుడు మన నుండి ఆశించడు. కాని ఆ కోరికలు ఎక్కువై మన చేయి దాటిపోకుండునట్లు వాటిని క్రమశిక్షణలో పెట్టుకోవాలని మాత్రం దేవుడు చెప్పాడు. వేరే సెక్స్‌ వారితో మరీ ఎక్కువగా స్నేహం కలిగియున్నా, ప్రత్యేకముగా ఒకే వ్యక్తితో స్నేహం చేస్తే సందేహం లేకుండా అందులో అపాయములు ఉంటాయి. కాని వారితో అసలు స్నేహం చేయకుండా దూరంగా తొలగిపోయి మరొక విపరీత ధోరణిలోనికి వెళ్ళినా కూడా అదేవిధమైన అపాయములు ఉంటాయి.

కొంతమంది తమకు తాము అతి పరిశుద్ధులమనుకుంటూ వేరే సెక్స్‌ వారితో అసలు మాట్లాడటమే మానివేస్తారు. ఇది వారు ఆత్మీయులు అని చెప్పుటకు సూచన కాదు గాని వారు స్వభావసిద్ధంగా లేరని సూచిస్తుంది. వేరే సెక్స్‌ వారితో స్నేహ కలిగియుండటం ఆత్మీయమైన విషయం కాదని చెప్పుట వివాహం చేసుకొనుట కంటే ఒంటరిగా ఉండుటే ధన్యత అని చెప్పే బోధలోని భాగమే. ఈవిధమైన లేఖనానుసారము కాని బోధ రహస్య పాపములోనికి నడిపిస్తుంది. మతానుసారముగా నుండి వివాహము చేసుకోకుండా ఉన్న అనేక మంది జారత్వములో పడిపోయినట్లుగా ఋజువులున్నాయి. అదేవిధముగా, స్వాభావికముగా ఇరువురితో స్నేహం కలిగియుండే వారిలో కంటే కేవలం పురుషులు పురుషులతోను, స్త్రీలు స్త్రీలతోను స్నేహం కలిగియుండే వారి మనస్సులు మరియు వారి రహస్య అలవాట్లు ఎంతో చెడ్డగా ఉంటాయి.

పైన చెప్పిన దానిని బట్టి పురుషులు స్త్రీలతోను, స్త్రీలు పురుషులతోను క్రమశక్షణ లేని స్నేహం కలిగియుండమని కాదు. ఇది ఒక వ్యక్తిని విచ్చలవిడితనములోనికి నడిపిస్తుంది. మేము కోరుకునేదేమిటంటే ఆరోగ్యకరమైన సమతుల్యత.డాక్టర్‌. హెర్బర్ట్‌ గ్రే అనే పండితుడు తాను రచించిన ''మెన్‌, ఉమెన్‌ అండ్‌ గాడ్‌'' అనే పుస్తకములో ఇలా వ్రాశారు. ఆడవారు, మగవారి మధ్య అలరారే చెలిమి, వివాహంతో సంబంధంలేని చెలిమి, ఎంతో ఆనందదాయకం, హర్షదాయకం, అసలు ఇలాంటి రెండు జాతులుగా సృష్టి నిర్మాణం జరగడం దైవసంకల్పాల్లో మిన్న. జీవితదశలన్నిట్లో ఏవో కొన్నిసార్లు మినహా ఆడ, మగ ఒకరినొకరు పరస్పరానురాగాలతో బంధించి ఉద్వేగపూరిత జీవితాన్ని అందించుకుంటారు. ఈ జీవితం మరోరకంగా లభించదు.

స్నేహములు

యౌవనస్తులు, యౌవన స్త్రీలను పూర్ణపవిత్రతో అక్కచెల్లెళ్ళుగా భావించాలని బైబిలు మనకు బోధిస్తుంది (1 తిమోతి 5:2). మరొక మాటలో చెప్పాలంటే నీ సహోదరిని ఇతరలు ఎలా చూడాలి అని నీవనుకుంటున్నావో, నీవు కూడా ఇతర అమ్మాయిలను అదేవిధముగా చూడాలి. ఇది అన్ని సమయాలలో కూడా పాటించవలసిన భద్రత గల నియమము.స్త్రీ, పురుషులు ఒకరినొకరు గౌరవించుకోవాలి, మర్యాదతో ప్రవర్తించాలి, అదే సమయములో అదుపులో, అణకువతో మెలగాలి. మనము అవతలి వారి వ్యక్తిగత విషయములను తెలుసుకోవాలనే ఉబలాటము గానీ లేక వారితో నిర్లక్ష్యముగా మాట్లాడుట గానీ చేయకూడదు. అవతలి వ్యక్తులతో గంభీరముగా మరియు స్వస్థబుద్ధి కలిగియుండుట ఎంతో జ్ఞానయుక్తమైనది. కొంచెం చమత్కారం కలిగియున్నప్పటికీ ఈవిధంగా ఉండుట మంచిది. మనము ఇతర సమయములలో కంటే కూడా అవతలి వ్యక్తులతో(వేరే సెక్స్‌) ఉన్నప్పుడే నిర్లక్ష్యంగా ఉండటానికి ఎక్కువ శోధించబడతామనే విషయమును ఎల్లప్పుడూ మనము మనస్సులో ఉంచుకోవాలి. ఈవిధంగా నిర్లక్ష్యంగా ఉండటం ప్రమాదము.

ఆడ, మగవారి మధ్య స్నేహం ఎంతో త్వరగా ఏ హెచ్చరిక లేకుండానే పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి నిరంతరం తన సామర్ధ్యమును ప్రదర్శించడానికి, అమ్మాయి తన ఆకర్షణతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనేకమంది దురుద్దేశాలతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

అమ్మాయిల బలహీనతలను ఆసరాగా తీసుకొని వాళ్ళంటే ఇష్టంలేకపోయినా ఇష్టం ఉన్నట్లుగా ఒక క్రైస్తవ యౌవనస్తుడు ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఏ ఉద్దేశ్యం లేకపోయినా కూడా అమ్మాయిలు తప్పుగా అర్ధం చేసుకుంటూ ఉంటారు. యౌవనస్తులందరూ కూడా దీనిని జ్ఞాపకముంచుకోవాలి. కాబట్టి అమ్మాయిలకు ఉత్తరాలు వ్రాయడం, వారిని ఆహ్వానించడం, బహుమానాలు ఇవ్వడం చేయకూడదు. వీటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వారు అపార్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధమైన అంశముల మీద కూడా ఉత్తరములు వ్రాయకూడదు. వివాహము కాని వేరే వ్యక్తికి(వేరే సెక్స్‌) సలహాలు ఇవ్వడం కాని, వ్యక్తిగతంగా సహాయం చేయుట కాని, ఆత్మసంబంధ విషయాలలోనైనా ఈవిధముగా చేయుట అజ్ఞానముతో కూడినది.

మన జీవిత భాగస్వామిగా ఒక అమ్మాయిని గురించి ఆలోచించడం తప్పుకాదు. కాని విద్యార్ధి దశలో ఉన్నప్పుడే అవతలి వ్యక్తితో మితిమీరిన (ప్రత్యేకమైన) స్నేహమును కలిగియుండుట జ్ఞానయుక్తమైనది కాదు. ఒక విద్యార్ధి తన ఉద్రేకములను ఐసు పెట్టెలో పెట్టి తన చదువు మీద శ్రద్ధ కలిగియుండాలి. ఒక యౌవనస్తుడు తన చదువు పూర్తి చేసుకునే వరకు, కనీసం 25 సంవత్సరములు వచ్చేవరకు వివాహమును గురించి ఆలోచించకూడదు. ఒక అమ్మాయికి 20 సంవత్సరములు వచ్చేవరకు వివాహమును గురించి ఆలోచించకూడదు. అప్పటివరకు కూడా వారి ఖాళీ సమయమంతటినీ మరే వ్యాపకము లేకుండా ప్రభువు పరిచర్యకే ఇవ్వాలి. వివాహము అయిన తరువాత అనేక బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి ప్రభువును సేవించడానికి అంతకుముందు వలె తగినంత ఖాళీ సమయము దొరకదు. భార్య కోసం గానీ, భర్త కోసం గానీ గాలిస్తూ తిరిగేవారికి, వేరే వారితో (వేరే సెక్స్‌) మితిమీరిన స్నేహం కలిగియుండేవారి జీవితములలో వివాహమైన వారికంటే ఎక్కువగా సమయము కరిగిపోతుంది. వివాహము ఆలస్యమవడానికి మరొక కారణమేమిటంటే జ్ఞానయుక్తముగా జీవిత భాగస్వామిని ఎంచుకొనుటకు యౌవనస్తులకు కావలసిన మానసిక మరియు భావోద్వేగాల పరిపక్వత కేవలం వయస్సుతో మాత్రమే వస్తుంది. దీనిని ఇంకా మనము 5 వ అధ్యాయంలో చూద్దాము.

కనీసం వివాహం నిశ్చయమయ్యే వరకు అమ్మాయిలతో స్వేచ్ఛగా స్నేహం చేయకూడదు. అమ్మాయిలు, ముఖ్యంగా అబ్బాయిలు కూడా వారి సంబంధాలలో యదార్ధంగా ఉండేటట్లు చూసుకోవాలి. అన్ని సమయములలో కూడా ఇరువైపులా వారి ఉద్దేశ్యములలో ఎంతో నిజాయితీగా ఉండాలి. ఈ నియమమును పాటించకపోవుట వలన అనేకుల జీవితములలో కలవరమునకు,

మానసిక ఉద్రేకములకు దారితీస్తుంది. పరీక్షలలో తప్పిపోవడం మరియు క్రైస్తవ సాక్ష్యమును పోగొట్టుకొనుట కూడా దీని ద్వారా కలుగుతుంది. పురుషులలో చొరవ ఉంటుంది. స్త్రీలలో ఆకర్షణ ఉంటుంది. అందుకే ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి.

ఒక అమ్మాయితో అతి స్వేచ్ఛగా ఉండి, ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు అనే అభిప్రాయాన్ని అందరిలో కలిగించి, నిజానికి అతనికి అటువంటి అభిప్రాయం లేకున్నా కూడా ఈవిధముగా చేయుట వలన ఆ అమ్మాయి జీవితము పాడైపోతుందని యౌవన పురుషులు గ్రహించాలి. ఇటువంటి పరిస్థితులలో అబ్బాయి ఎటువంటి మచ్చ లేకుండా, తన సాక్ష్యమును పోగొట్టుకొనకుండా తప్పించుకుంటాడు. కాని ఆ అమ్మాయి తన వైపు తప్పులేకుండానే అనుమానించబడుతుంది, మరియు తక్కువగా చూడబడుతుంది. ఏ క్రైస్తవ యౌవనస్తుడు కూడా ఇలా ప్రవర్తించకూడదు. పురుషుడే ముందు చొరవ తీసుకుంటాడు కాబట్టి ఇలాంటి ఉపద్రవము రాకుండా నిరోధించవలసిన బాధ్యత అతనిపైనే ఉంటుంది. వేరే వారి జీవితాలతో మనము ఆటలాడకూడదు. ఆవిధంగా చేసేవారిని దేవుడు తీవ్రంగా తీర్పుతీరుస్తాడు.

కొన్నిసార్లు యువకులు, అమ్మాయిలను రహస్యంగా ప్రేమిస్తారు. ఇదెవరికీ చెప్పరు. ఈ రహస్య ప్రేమ, అభిమానములు పెరుగుతూ ఉంటాయి. కాని వారు ''అభినందిస్తున్న వ్యక్తి'' వేరే వారిని వివాహము చేసుకున్నప్పుడు ఈ వ్యక్తి నిరాశా నిస్పృహలలోనికి వెళ్ళే అవకాశముంటుంది. అటువంటప్పుడు, వీలైనంత త్వరగా నిస్సంకోచంగా మీ ఆలోచనలు మీ తల్లిదండ్రులతో కాని లేక వివాహితుడైన ఒక పెద్ద విశ్వాసితో గాని పంచుకొని వారి సలహాలను తీసుకోవడం ఎంతో మంచిది.

ప్రణయ విహారాలు (డేటింగ్‌) చుంబనాది చర్యలు (పెట్టింగ్‌)

మన భారతదేశంలో రాను రాను ఈ ప్రణయ విహారాలు మరియు చుంబనాది చర్యలు ఎక్కువగుచున్నాయి కాబట్టి వీటిని గురించి కొన్ని మాటలు చెప్తాను. ''డేటింగ్‌'' అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలసి ఒంటరిగా బయటకు వెళ్ళడం. ''పెట్టింగ్‌'' అంటే సంయోగం మినహాయించి తక్కిన బాహ్య కామపూరిత ప్రణయ కార్యకలాపాలు.

ఒకవేళ విశ్వాసి తన సాక్ష్యమును కాపాడుకోవాలనుకుంటే, దేవునికి ఉపయోగపడాలనుకుంటే, వివాహం కుదిరినా కూడా అమ్మాయి, అబ్బాయి కలసి ప్రణయ విహారాలకు వెళ్ళకూడదు. అమ్మాయి, అబ్బాయి కలసి చీకటిపడిన తరువాత బయటకు వెళ్ళకుండా ఉండటానికి వీలైనంత వరకు ప్రయత్నించాలి. మన భారతదేశ సాంప్రదాయం తెలిసినవారెవరికైనా దీని గురించి అర్ధమవుతుంది. ఇటువంటి ఆరోపణలకు తావివ్వకుండా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి.

మన చుట్టూ ఉన్న వారి ఆచారాలనుండి, సాంప్రదాయాల నుండి క్రీస్తు మనలను విడిపించి దాసత్వము నుండి స్వతంత్రులుగా చేయలేదు అని కొందరు అంటారు. కాని దేవుడు మనలను విడిపించింది దేవుని వాక్యమునకు విధేయత చూపించడానికే. బైబిలులో డేటింగ్‌ చేయమని ఎక్కడా చెప్పలేదు. ఈ అంశం గురించి బైబిలులో ఎక్కడా ప్రస్తావించబడలేదు. దేవుని వాక్యమునకు మరియు మనుష్యుల సాంప్రదాయములకు ఎక్కడైతే బేధము ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మనము దేవుని వాక్యమునకే విధేయత చూపించాలి. అయితే మనకివ్వబడిన స్వాతంత్య్రమును ''శారీరక క్రియలకు హేతువు చేసికొనకుండునట్లు'' చూసుకోవాలి (గలతీ 5:13). అటువంటి సందర్భములలో రోమా 14:16 లో మనకివ్వబడిన నియమం ప్రకారం నడుచుకోవాలి. ఈ వచనమునకు రెండు తర్జుమాలున్నాయి. ''ఇతరుల దృష్టిలో చెడ్డదిగా ఎంచబడిన దానిని నీ దృష్టిలో సరియైనదైనా సరే నీవు చేయకూడదు'' (జెబిపి), ''మీరు చేసే మేలైన దానిని దూషణపాలు కానియ్యకుడి'' (టిఎల్‌బి).

1 కొరిందీ¸ 8వ అధ్యాయమును కూడా డేటింగ్‌ అనే అంశమునకు అన్వయించుకున్నట్లయితే ఈవిధంగా చెప్తుంది - అమ్మాయితో గాని అబ్బాయితో గాని డేటింగ్‌కు సంబంధించిన విషయంలో మనకు మాత్రమే సరియైన జవాబు తెలుసు అనుకోవడం ఎంతో సులభం. జ్ఞానము ఉప్పొంగజేయును కాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైననుతెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి మనము ఏమి చేయాలి. మనము డేటింగ్‌ చేయాలా? వద్దా? మన ఉద్దేశ్యములు పవిత్రముగా ఉన్నట్లయితే, వేరే వ్యక్తులతో(వేరే సెక్స్‌) కలసి బయటకు వెళ్ళడం లేక ఒక రెస్టారెంట్‌కు వెళ్ళి భోజనం చేయడం తప్పు కాదని మనకు తెలుసు. కాని భారతదేశంలో ఉన్న వాళ్ళందరు ఈవిధముగా భావించరు. వారిలో అనేకమంది వారి జీవితమంతయు కూడా డేటింగ్‌ తప్పు అనే భావము కలిగియుంటారు. మనము డేటింగ్‌ చేస్తున్నామా లేదా అన్న విషయమును బట్టి మనయెడల దేవుని అంగీకారం ఉండదని మనము జ్ఞాపకముంచుకోవాలి. మనము డేటింగ్‌ చేసినంతమాత్రాన శ్రేష్టులుగా ఉండము, చేయనంతమాత్రాన చెడ్డవారముగా ఉండము. కానీ ఈవిషయములో నీకున్న స్వాతంత్య్రమును బట్టి మరొక క్రైస్తవుడు(లేక సత్యమును అన్వేేషిస్తున్న ఒక క్రైస్తవేతరుడు) అభ్యంతర పడకుండా చూడాలి. ఉదాహరణకు( డేటింగ్‌ తప్పు అని అభిప్రాయం కలిగియున్న వ్యక్తి) నీవు ఒక అమ్మాయితో బయటకు వెళ్ళడం చూసినట్లయితే( లేక ఒక అమ్మాయి, అబ్బాయితో) నీ క్రైస్తవ సాక్ష్యము పట్ల ఆ వ్యక్తి గౌరవమును కోల్పోవచ్చు. అంతమాత్రమే కాక ఆ వ్యక్తి కూడా డేటింగ్‌ చేయడం ప్రారంభించవచ్చు. అతడు నీ అంత బలవంతుడు కాదు కాబట్టి పాపములో పడిపోవచ్చు. నీవు పరోక్షముగా ఈవిధముగా ప్రోత్సహించుట వలన మరొక వ్యక్తి పాపములో పడినట్లయితే నీవు క్రీస్తుకు విరోధముగా పాపము చేసినవాడవవుతావు. కాబట్టి నేను డేటింగ్‌ చేయడం ద్వారా నా సహోదరుడు గాయపడుట గాని లేక ఇతరులు తొట్రిల్లుటకు గాని కొంచెం అవకాశమున్నా నేను డేటింగ్‌ చేయను. మరియు ఇతరులు పడిపోవుటకు నేను కారణమవ్వను.

డేటింగ్‌లో కొనసాగేవారికి శారీరకంగా నిగ్రహించుకోవడం ఎంతో కష్టంగా ఉంటుంది. చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో మొదలయి, ముద్దులు ఇతర తాకిళ్ళ వరకు వస్తుంది. స్త్రీ కన్నా పురుషునికి కామ వాంఛ అమితంగా ఉంటుంది. అందువల్ల పురుషునిలో ఉద్వేగం ఎక్కువపాళ్ళు ఉంటుంది. పురుషులలో లైంగిక వాంఛలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి కోరికలు ప్రేరేపించబడినట్లయితే వాటిని నియంత్రించుకోవడం ఎంతో కష్టం. ఒకసారి ఒక జంట చుంబనాది చర్యలను చేయడం మొదలుపెట్టినట్లయితే వాటిని ఆపివేయడం ఎంతో కష్టం. ఒక దశ మరొక దశకు నడిపిస్తుంది. క్రితం కంటే ఈసారి మరింత ఉద్వేగాన్ని పెంచే క్రియలు చెయ్యడానికి ఉపక్రమిస్తారు. ప్రతిసారి కూడా వాటి నుండి మీకు ఎంతో తక్కువ తృప్తి కలుగుతుంది.శృంగార భరితమైన ఇలాంటి కామోద్రేక అనుభవాలు ఒక వ్యక్తి అంతరంగములోనికి చొచ్చుకొనిపోతాయి. చివరకు ఘోరమైన పరిణామాలకు దారితీస్తాయి. ప్రణయకలాపాలు వివాహ జీవితములో అన్యోన్యముగా ఉండుటకు దోహదపడతాయి కాబట్టి వివాహమునకు ముందు ఇలాంటివి చేయుట పాపము మరియు అజ్ఞానము. ప్రణయవిహారాలు కామకోరికల్ని కొన్నిసార్లు కించపరచుతాయి. కొన్నిసార్లు ఉద్రేకపూరితాలై అభిప్రాయ బేదాలను సృష్టించి, నిరాశను పెంచి, నరాల ఒత్తిడిని తెచ్చిపెడతాయి. చిట్టచివరకు ప్రేమకు బదులు ఏహ్యభావం, అసహ్యం పుడతాయి. ఇది సంయోగానికి గాని లేక అటువంటి దానిని అడ్డుకున్నట్లయితే ఆ ఒత్తిడి నుండి ఉపశమనం కొరకు హస్తప్రయోగమునకైనను ఇది దారితీస్తుంది. ఆ తరువాత వివాహ జీవితములో కష్టమవుతుంది. దీని ఫలితముగా అపరాధభావము, చింత ఎంతో కాలం వెంటాడుతాయి.

చాలాసార్లు అమ్మాయి, అబ్బాయిల మధ్య స్నేహం విడిపోతుంది. ఒకవేళ వారు ప్రణయకలాపాలు చేసియున్నట్లయితే తన జీవితమే కలుషితమైపోతుంది అని అమ్మాయి భావిస్తుంది. కాబట్టి అబ్బాయి తనను భౌతికంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అమ్మాయి భావించినపుడు తాను వెంటనే కళ్ళెం వేయాలి.పైన పేర్కొన్న విధంగా ప్రణయవిహారాలు శృంగార చేష్టలకు, శృంగార చేష్టలు అనూహ్యమైన సమస్యలకు నడిపిస్తాయి. కాబట్టి దేవుని మహిమపరచాలని ఆకాంక్షించే వారి జీవితాల్లో ప్రణయవిహారాలకు తావులేదు. నీ చుట్టూ ఉన్న ఇతర విశ్వాసులు ఆవిధంగా చేస్తున్నా కూడా నీవు వారిని అనుసరించకూడదు. వారిని గూర్చి అసూయపడవలసిన పని కూడా లేదు ఎందుకంటే వారు చివరకు చింతిస్తూ ఆందోళనలో ఉంటారు. నీవు దేవుణ్ణి ఘనపరచి, దేవుని వాక్యములోని నియమములకు లోబడినట్లయితే చింతలేని నిత్యజీవము నీకు నిశ్చయముగా లభిస్తుంది.

అధ్యాయము 4
ప్రేమ ఒక దివ్యమైన సంగతి

బైబిలు గ్రంథóములో ''ప్రేమ'' అనే పదమే బహుశా అత్యంత మనోహరమైన పదం. అయినా కూడా దీని యొక్క నిజమైన అర్ధమును అనేకమంది గ్రహించలేక పోవుటను బట్టి దీనికున్న అనేక కోణములలోని ప్రకాశమును అనుభవించలేక పోవుచున్నారు. దేవుని వాక్యములోని బోధ కంటే కూడా 20వ శతాబ్ధపు వినోదము మరియు శృంగారభరితమైన సాహిత్యము యొక్క ప్రభావము వలన అనేకమంది జంటలు నిజమైన ప్రేమ యొక్క సంపూర్ణతను, మాధుర్యమును కోల్పోయారు.

ప్రేమ యొక్కనిజమైన అర్ధమును గ్రహించలేకపోవుట వలన అనేక వివాహములు పాడైపోయాయి. వేరొక వ్యక్తి (వేరొక సెక్స్‌) యొక్క సమక్షంలో కలిగే భావోద్రేకములనే నిజమైన ప్రేమ అని తప్పుగా అర్ధం చేసుకొనబడుతుంది. దీనిని ఆధారముగా చేసుకొని అనేకమంది వివాహం చేసుకొన్న కొద్ది కాలం తర్వాతే ఈవిధంగా గ్రహిస్తారు. వారు అనుకున్నది ప్రేమ కాదు కేవలం శృంగారభరితమైన ఆకర్షణ.ఒక యౌవనస్తుడు ఒక అమ్మాయితో ''ప్రేమలో పడి'' తన్నుతాను, ఇంతకు మునుపు చూసిన సినిమాలోని లేక తాను చదివిన పుస్తకములోని కథానాయకుని వలె చేసుకొన్నట్లయితే ''ఎంతో సంతోషముగా జీవించవచ్చు'' అనే ఊహలలో జీవిస్తుంటాడు. కాని నిశ్చితార్ధం జరిగిన లేక వివాహం నిశ్చయం అయిన ఆ ఆకర్షణలో ఉన్న జంటకు వివాహము వారి కలల ప్రపంచమును కూల్చివేసేదిగా ఉంటుంది. అది వారిని మేల్కొలిపి నిజజీవితములో స్థిరముగా నాటుతుంది. ఒకవేళ ఆకర్షణ గ్రుడ్డిదైతే వివాహము తప్పకుండా కళ్ళు తెరిపించేదిగా ఉంటుంది.

నిజమైన ప్రేమ

ప్రేమ అంటే బైబిలు ఏమి చెబుతుందో మనం క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలి. లేకపోతే లక్షలాది మంది యువత, వివాహితులు పెడదారి పట్టినట్లే మనం కూడా పెడదారి పడతాం. ఆదిలో క్రొత్త నిబంధన గ్రీకు భాషలో లిఖితమైంది. ఆ భాషలో ప్రేమకు నాలుగు పదాలున్నాయి. అగాపె, ఫిలియా, స్టోర్జీ, ఇరాస్‌ అనేవి. వీటిల్లో స్ట్టోర్జీ అనే మాట తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల, బిడ్డలు తమ తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమకు మాత్రమే వాడతారు. అయితే మనమిప్పుడు స్త్రీ, పురుషుల వ్యవహారాన్ని చర్చిస్తున్నాం. కాబట్టి స్టోర్జీ అనే పదమును ప్రక్కన పెట్టి మిగిలిన పదాల్ని చూద్దాం. అగాపె, ఫిలియా, ఇరాస్‌ అనే పదములు ప్రేమ యొక్క మూడు స్థాయిలను సూచిస్తున్నాయి. ఇవి మానవుని యొక్క ఆత్మ, ప్రాణము మరియు శరీరమునకు సంబంధించి కూడా సూచించవచ్చు.

క్రింది స్థాయి నుండి మొదలు పెడదాం. ఇరాస్‌ అనే పదము బాహ్య సంబంధమైన భౌతిక ప్రేమను సూచిస్తుంది. ఇది ''సహించలేని ఘాటు ప్రేమ''. ఇది ముఖ్యంగా భౌతిక సంబంధమైన కలయిక కోసం మాత్రమే చూస్తుంది. శారీరక అనుభవం కోసం అర్రులు చాచే ప్రేమ. ఎప్పుడూ ఇతరుల నుంచే పొందాలి అనే భావాన్ని కలిగియుండే ప్రేమ.

తరువాత పదము ఫిలియా. గ్రీకులో సాధారణంగా ప్రేమ కొరకు ఉపయోగించే మాట ఇది. అనురాగానికి, స్నేహానికి ఈ మాటను ఉపయోగిస్తారు. ఇది సంరక్షణ గురించి అర్ధమును ఇచ్చే పదము. వివాహ బంధంలో ఆత్మలను పెనవేసే శక్తి దీనికుంది. ఈ ప్రేమకు మేధస్సును, ఉద్రేకాలకు మేళవించే శక్తి ఉన్నది. ఇది శారీరక సంబంధమైన ప్రేమ కంటే మెరుగుగా కనబడవచ్చు గాని ఇది కూడా స్వయం కేంద్రముగానే ఉంటుంది. తనను ఇతరులు కోరుకుంటున్నారని, తాను ఇతరులను కాపాడుతున్నానని, తన వల్ల ఇతరులు ప్రయోజనము పొందుతున్నారనే భావమును బట్టి సంతృప్తి చెందుతూ ఉంటుంది.

మూడవ పదమైన అగాపె, ప్రేమలోని అత్యున్నత స్థాయి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకనుగ్రహించే ప్రేమ (రోమా 5:5). ఇది వివాహములో ఒకరి ఆత్మతో మరొక ఆత్మను ఐక్య పరుస్తుంది. ఇది మనలను మనము ఇచ్చివేసుకొనే ప్రేమ. కలువరి సిలువ యొక్క ప్రేమ.

''మోర్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌'' అనే పుస్తకంలో విలియం బార్క్లే ఈవిధముగా చెప్పాడు. అగాపె ఓటమి ఎరుగని దయ, అవధులు లేని మంచితనం. ఇది కెరటాలలా పొంగిపొయ్యే ఉద్వేగం కాదు. మనస్సులో నుండి వెలువడిన నిశ్చితాభిప్రాయం. నిక్కచ్చిగా చేసుకున్న నిర్ణయం, సిద్ధించిన మనోగతం. వ్యక్తి హృదయాన్నే కాకుండా అతని మనస్సును కూడా బంధించివేస్తుంది. మానవుడు తన స్వంత శక్తి చేత ఈ ప్రేమను కలిగియుండలేడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమ తన హృదయములోనికి కుమ్మరించబడుతుంది.

అగాపె అను మాటను గురించి గ్రీకు నిఘంటువులో ఈవిధంగా ఉంది. కృతనిశ్చయంతోను, నిస్వార్ధంతోను, దయతోను వ్యవహరించే మనస్తత్వం గలది. ఈ ప్రేమ సర్వోన్నతమైన, పరిపూర్ణమైన రూపంలో ఉంటుంది. దీనికి మూలం దేవుడే. ఇది ఎవరి పట్ల చూపబడుతుందో వారి పట్ల దయతో వ్యవహరిస్తుంది.

అగపాన్‌ (అగాపెకు క్రియా రూపం) అంటే ''విలువివ్వడం, ఇతరుల యోగక్షేమాల పట్ల శ్రద్ధ చూపడం, నమ్మకంగా ఉండటం, సంతోషించడం''. భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ విషయానికొచ్చినట్లయితే, దీని ప్రకారం ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకొని గౌరవించాలి; ఒకరి యెడల ఒకరు శ్రద్ధ కలిగియుండాలి. ఒకరిని బట్టి ఒకరు ఆనందించాలి, సంతోషించాలి మరియు ఒకరి యెడల ఒకరు నమ్మకత్వం కలిగియుండాలి.

అగాపెను బైబిలు ఈవిధముగా వర్ణిస్తుంది ''ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును..... కాని ప్రేమ శాశ్వతముగా నిలిచిపోవును'' (1 కొరిందీ¸ 13:4-8).

అగాపెకు మరొక నిర్వచనముంది : ''అనుమానించుటకు నెమ్మదిగాను, నమ్ముటకు త్వరగాను ఉంటుంది. శిక్ష విధించుటకు నెమ్మదిగాను, న్యాయము తీర్చుటకు త్వరపడుతుంది. అభ్యంతరపడుటకు నెమ్మదిగాను, సమర్ధించుటకు త్వరపడుతుంది. బహిర్గతం చేయుటకు నెమ్మదిగాను, ఆశ్రయమిచ్చుటకు త్వరపడుతుంది. మందలించుటకు నిదానంగాను, భరించుటకు త్వరగాను ఉంటుంది. తక్కువచేయుటకు నిదానంగాను, అభినందించుటకు త్వరగాను ఉంటుంది. అడుగుటకు(డిమాండ్‌ చేసి) నిదానంగాను, ఇచ్చుటకు త్వరగాను ఉంటుంది. రేకెత్తుటకు నిదానంగాను, సమాధానపడుటకు త్వరగాను ఉంటుంది. అడ్డుపడుటకు నిదానంగాను, సహాయం చేయుటకు త్వరగాను ఉంటుంది. ద్వేషించుటకు నిదానంగాను, క్షమించుటకు త్వరగాను ఉంటుంది''.

వివాహజీవితములో ఈ ప్రేమలన్నీ ఉండాలి కానీ అవి సరియైన క్రమంలో ఉండాలి. మొట్టమొదట అగాపె, తరువాత ఫిలియ, మూడవది ఇరాస్‌. ఇది (1 థెస్సలోనికయులకు 5:23) లో ఉన్నట్లుగా ప్రాధాన్యతా క్రమంలో ఉన్నది. అందులో మొదటిది ఆత్మ, రెండవది ప్రాణము, మూడవదిగా శరీరముంటుంది. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవునిలో ఇవి ఈక్రమంలో ఉండాలనుకున్నాడు.

ప్రేమలో పడుట

ఒక విశ్వాసి ప్రేమలో పడటం సరియైనదేనా? అసలు ''ప్రేమలో పడుట'' అంటే అర్ధమేమిటి అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రేమ అంటే ఒక వ్యక్తిని అకస్మాత్తుగా బంధించివేసి నియంత్రించుకోలేని శక్తి అని లోకం భావిస్తుంది. ఒకవేళ ఈవిధమైన ''ప్రేమలో పడ్డ వ్యక్తి'' తాను ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేనట్లయితే తాను మరొకసారి ప్రేమలో పడేవరకు విషాదంలో గడపాల్సిందే గాని మరొక మార్గం లేదు. అనేకమైన సినిమా పాటలు, పాప్‌ సంగీతము ఇలా నిరాశపడ్డ ప్రేమికునికి సంబంధించినవే. ఈ లోకం ప్రేమ అంటే కేవలం ఫిలియ, ఇరాస్‌ స్థాయి వరకు మాత్రమే అర్ధం చేసుకోగలదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి ''ప్రేమలో పడుట'' అనేది విశ్వాసికి ఖచ్చితంగా తప్పే.

కాని ఒక దేవుని బిడ్డకు, ప్రేమ అనేది అగాపె స్థాయి నుండి కలగాలి మరియు ఇది ప్రాముఖ్యముగా ఆత్మీయ ఆకర్షణను ఆధారం చేసుకొని ఉండాలి. ఆవిధంగా మాత్రమే ''ప్రేమలో పడాలి''. తన ఉద్రేకములు అతడు అదుపులో ఉంచుకొని అవి నియంత్రణ కోల్పోకుండా ఉండునట్లు అతడు సంపూర్ణముగా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో జీవించాలి. ఒక విశ్వాసి తన జీవితములో ఇతర విషయములలో వలె ప్రేమ విషయములో కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుడు నీ కొరకు ఎవరినైతే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడో ఆ వ్యక్తి యొద్దకు కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే నడిపించగలడు. అటువంటి వ్యక్తిని మాత్రమే నీవు ప్రేమించాలి.

అలా అయితే మనమెంత జాగ్రత్తగా ఉండాలి! మనం అవిశ్వాసుల వలె ఒక వ్యక్తితో ప్రేమలో పడి కొన్ని నెలలు లేక సంవత్సరముల తరువాత మరో వ్యక్తితో ప్రేమలో పడటం లాంటివి చేయకూడదు. తన ఉద్రేకముల చేత ఆడబడే వస్తువుగా ఒక విశ్వాసి ఉండకూడదు. తన ప్రేమ తన చిత్తము నుండి కలగాలి గాని ఉద్రేకముల నుండి కాదు. ఉద్రేకములు మోసము చేయవచ్చును.

ప్రేమ భావనలు ఉండకూడదని కాదు గాని అవి చిత్తము నుండి కలిగిన ప్రేమను అనుసరించాలి. సిలువను నిరంతరం మన జీవితంలో పనిచేయుటకు అనుమతించి, మన స్వంత కోరికలను చంపివేసి, కేవలం దేవుని చిత్తమును మాత్రమే కోరుకునేటట్లు చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యము.ఒకవేళ నేను ఆకర్షించబడుతున్నాను అనే వ్యక్తిని(వేరే సెక్స్‌) నీవు కలుసుకున్నట్లయితే నీ స్వాభావిక ప్రేమ భావముల మీద సిలువను నిర్ధాక్ష్యిణ్యంగా పని చేయనివ్వాలి. అతనిలో లేక ఆమెలో ఉద్రేకములు(రహస్యంగానైనా సరే) కలుగకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే నీవు దేవుని చిత్తమును కనుగొనే స్థితిలో ఉంటావు. ఈ విషయములో దేవుని చిత్తమును కనుగొనే వరకు కూడా నీ ఉద్రేకములను నీవు అదుపులో ఉంచుకోవాలి. లేనట్లయితే నీ ఉద్రేకములు నిన్ను సరిగా ఆలోచింపకుండా చేసి నిన్ను తప్పు త్రోవ పట్టిస్తాయి.తరువాత నీవు పశ్చాత్తాపపడే స్థితికి వచ్చునట్లుగా నీ ఉద్రేకములు నిన్ను నడిపించకుండా ఉండునట్లు నీవు చూసుకోవాలి. ఒక వ్యక్తికి నీ ప్రేమను ఇచ్చిన తరువాత(రహస్యంగానైనా) ఆ వ్యక్తిని నీకొరకు దేవుడు ఎంపికచేయలేదు అని తెలుసుకోవడం ఎంతో విచారకరం. అప్పుడు అతని/ ఆమె యొద్ద నుండి భావోద్వేగములలో దూరముగా ఉండటం ఎంతో కష్టమౌతుంది. ఇలాంటి అనుభవం అనేక సమస్యలకు దారితీస్తుంది మరియు ఇది మనస్సులో నుండి అంత తేలికగా తొలగిపోదు. నీవు వేరొకరిని వివాహం చేసుకున్నా కూడా ఆ జ్ఞాపకాలు మరలా, మరలా వస్తుంటాయి. అపరాధ భావము మరియు పశ్చాత్తాపము నీ మనస్సును కలచి వేసి ఆవిధముగా నీ వ్యక్తిత్వమును గాయపరుస్తాయి మరియు నీ వివాహ జీవితమును పాడుచేస్తాయి.

భౌతిక సంబంధమైన సౌందర్యము మరియు ఆకర్షణను బట్టి కొట్టుకొని పోకుండునట్లు ప్రత్యేకముగా యౌవన పురుషులు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉండదో అక్కడ భౌతిక సంబంధమైన సౌందర్యమును పట్టించుకోకూడదు. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ ఎటూ భౌతిక సంబంధమైన సౌందర్యమునకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడదు.

ఇతర విషయాలలో వలె ప్రేమ విషయములో కూడా లేఖనముల యొక్క ఆజ్ఞ ఏమిటంటే ''మీరు ఈ లోకమర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి(పూర్తిగా) నూతనమగుట వలన రూపాంతరము(మార్పు) పొందుడి'' (రోమా 12:2).

వాంఛ(శృంగార భరిత) మరియు ప్రేమ

అగాపె ప్రేమకు మరియు శృంగార భరిత వాంఛకు ఎంతో వ్యత్యాసముంది. నేను ఒక అమ్మాయిని కాని అబ్బాయిని కాని నిజముగా ప్రేమిస్తున్నానా? లేక వాంఛ కలిగియున్నానా? అని ఎలా తెలుస్తుంది అని కొంతమంది అడగవచ్చు. ''వాంఛ''ను వెబ్‌స్టర్‌ డిక్షనరీ ఈవిధంగా నిర్వచిస్తుంది - ''విపరీతమైన లేక బుద్ధిహీనమైన తృష్ణను కలిగియుండి హేతుబద్ధంగా నియంత్రించుకోలేని స్థితి''. ఇద్దరి క్రైస్తవ యౌవనుల అనుభవములను మనము చూసినట్లయితే వాంఛకు మరియు అగాపె ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసము మనకు అర్థమౌతుంది. ప్రకాష్‌ ఒక అమ్మాయితో శృంగార భరిత వాంఛతో ఉన్నాడు, సురేష్‌ ఒక అమ్మాయిని నిజముగా(అగాపె ప్రేమతో) ప్రేమించాడు. ఇక్కడ ఇవ్వబడిన వృత్తాంతములు అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి. (డ్వైట్‌ హార్వే స్మాల్‌ యొక్క ''డిజైన్‌ ఫర్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌'' అను పుస్తకములో పైన వివరించబడిన వాంఛకు మరియు అగాపె ప్రేమకు గల అనేక వ్యత్యాసములు కనుగొనవచ్చును. దీనికి నేను కృతజ్ఞుడను).

శృంగార భరిత వాంఛకు ఉదాహరణ

ప్రకాష్‌ ఈ అమ్మాయిని కళాశాలలో కలిశాడు. అతనికి మొట్టమొదటి ఆకర్షణగా కనబడి మరియు తనకు స్పందిస్తుంది అనుకొన్న అమ్మాయి ఆమెనే. ఆమె అతనికి అంత బాగా తెలియదు గాని అకస్మాత్తుగా ''ఆమెతో ప్రేమలో పడ్డాను'' (అతడు పెట్టుకొన్న పేరు) అని అనుకున్నాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన దృశ్యమది. ఆమెతో ప్రేమలో పడుటకు నడిపించింది నిస్సందేహంగా కేవలం ఆమె యొక్క భౌతిక సౌందర్యమే. ఆ అమ్మాయి గురించి కొద్దిగానే తెలిసినా అతడు అభినందించ గల కొన్ని విషయాలు ఆమెలో చూశాననుకున్నాడు. ఆ కొన్ని విషయాలనే ఎక్కువగా ఊహించుకొని తన మనస్సులో ఆమె గురించి ఆదర్శమైన చిత్రమును పెట్టుకున్నాడు.

ఆమె పరిపూర్ణురాలు అని ఆయన ఊహించుకున్నాడు(ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి ఈవిధముగా ఉండదు అన్నట్లుగా) మరియు ఆమెలో ఏ తప్పును చూడటానికి నిరాకరించేవాడు(ఆమె తప్పులు ఇతరులకు బహిరంగముగా కనబడ్డా కూడా). తాను చేసుకొన్న కలల ప్రపంచంలో తాను జీవించాడు మరియు తరచు గాలిలో నడుస్తున్నట్లుగా తనకుండేది. దీనికి పైగా తాను,పరిపూర్ణురాలైన అమ్మాయిని కనుగొన్నానని ఉన్నతమైన తలంపులలో ఉండేవాడు. (శృంగార భరిత లైంగిక వాంఛతో కూడిన ప్రేమ గుడ్డిది). ఆమె వైపు అతడు నియంత్రణ లేకుండా ఎంతో ఆకర్షించబడ్డాడు. ఏదో ఒక సాకు చూపించి ఆమెకు దగ్గరగా ఉండాలని లేక ఆమెతో ఉండాలని ప్రయత్నించేవాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోయేవాడు. తనకు మరియు ఆమెకు సరిపడని, వేరుగా ఉన్న విషయాలు, బయటపడే అవకాశములు ఉన్న అంశములను మాట్లాడకుండా ఉండేవాడు.

ఆమె పరిపూర్ణురాలు అని ప్రకాష్‌ అనుకున్నాడు కాబట్టి ఆమెకు తాను కూడా పరిపూర్ణునిగా కనబడాలనుకునేవాడు. ఇది తనను ఎంతో కృత్రిమంగా చేసింది, దీని కోసం తనలో ఏదైతే ఆకర్షణీయంగా కనబడుతుందో అదే ప్రశ్నించేవాడు. అతడు నిస్వార్ధపరుడు మరియు దీనుడని కనపరచుకొనుటకు ప్రయత్నిస్తుండేవాడు. కాని తన అంతరంగములో చూసినట్లయితే అతడు స్వార్ధపూరితమైన ఉద్దేశ్యములను కలిగియున్నాడు మరియు అతడు ప్రాథమికముగా స్వయం క్రేందముగా కలిగిన వ్యక్తి. తన హృదయంలో ఉన్న బలమైన కోరికకు పరిష్కారము ఆమె మాత్రమే అని అతనికనిపించింది. అతడు సంతోషంగా ఉండటానికి ఆమెను నిజముగా కోరుకున్నాడు. ఆమెను మాత్రమే కోరుకున్నాడు. ఆమెను ఏవిధముగా సంతోషపరచాలని అతడు ఆలోచిస్తుండేవాడు, కాని ఇతరులను సంతోషపరచాలని ఎప్పుడు కూడా ఆలోచించే వాడు కాదు. కళాశాలలో ఏ అబ్బాయితో ఆమె మాట్లాడినా కూడా ఇతడు అసూయపడేవాడు మరియు అనుమానంగా చూసేవాడు. ఆమె ఏ ఇతర అమ్మాయిలతో కూడా మాట్లాడకుండా అతనితోనే మాట్లాడాలని కోరుకునేవాడు. ఇదంతా ఎందుకంటే ప్రకాష్‌ ఎంతో అభద్రతా భావంలో ఉండేవాడు. ఇతరుల చేత అంగీకరించబడని, ప్రేమించబడని చిన్ననాటి అనుభవాలు అతణ్ణి ఈవిధమైన అభద్రత భావంలోనికి తీసుకువచ్చాయి. దీని ఫలితంగా, ఆమె ప్రేమను గెలుచుటకు అతని సామర్ధ్యము మీద అతనికి నమ్మకము లేదు. అతడు గెలవలేనిది మరియు పాత్రుడు కాని దాని కోసం అతడు భయపడి ఆమె యొక్క రాజ భక్తిని కోరుకొనేటట్లు అతడు తయారయ్యాడు.

ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా ఎంతో తొందరపడ్డాడు. ఈ తొందరంతా కూడా ఆమెతో కలిసుండటానికే మరియు ఏ మాత్రం ఆలస్యమును కూడా సహించలేని స్థితి. ఆర్ధిక కొరత, తల్లిదండ్రుల అభ్యంతరాలు మరియు సాంప్రదాయమునకు సంబంధించిన వ్యత్యాసములు వారి వివాహమునకు అడ్డుగా నిలిచాయి. కాని ప్రేమ అన్నింటిని జయిస్తుందనే ప్రకాష్‌ యొక్క నమ్మకము. ఈ కష్టములన్నింటికి కళ్ళు మూసుకునేటట్లు చేసింది ''బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు'' .... (సామెతలు 22:3). వేరేవారు సలహాలిచ్చుటకు ప్రయత్నించినప్పుడు అతడు వినుటకు నిరాకరించేవాడు, ఎందుకంటే అతడు శృంగారభరితమైన లైంగిక వాంఛకు సంబంధించిన ప్రేమలో ఉన్నాడు(ఇటువంటి పరిస్థితిలో ఉన్నవారు సహేతుకముగా ఆలోచించుట కష్టము. వారి సహేతుకత చెప్పే మాటలను వారు వినేటట్లు చేయుట దాదాపు అసాధ్యము).

ప్రకాష్‌కు ఆమెకు మధ్య హఠాత్తుగా చిన్న అభిప్రాయ భేదము కలిగింది. దీని వలన వారిద్దరి మధ్య అపార్ధం చోటుచేసుకుంది. అప్పుడు ఆయన ఆమెలో ఇంతకు మునుపు చూడని బలహీనతలన్నీ చూడసాగాడు. ఆమెకు కోపంతో ఇవన్నీ చెప్పాడు. తన గర్వం గాయపరచబడింది. అది వెంటనే అతణ్ణి నిజమైన ప్రపంచంలోనికి తీసుకువచ్చింది. అతడు ఆమెను అసహ్యించుకున్నాడు, వెంటనే ఆమెను ద్వేషించసాగాడు. అమ్నోను తామారును (2 సమూయేలు 13:1-17) అసహ్యించుకొన్నట్లుగా. కాని ప్రకాష్‌ దీన్ని బట్టి అంత కలత చెందలేదు, ఎందుకంటే ఆమె యొక్క మనోభావములను గురించి అతడు పట్టించుకోలేదు. అంతమాత్రమే గాక, రహస్యంగా ఇంకొక అమ్మాయి మీద కన్నేశాడు. ఇప్పుడు ఈమె అతనికి ఎక్కువ అకర్షణీయముగాను మరియు ''పరిపూర్ణము'' గాను కనబడుతుంది.

అగాపె ప్రేమకు ఒక ఉదాహరణ

సురేష్‌ విషయంలోనైతే ఆమె తనకొరకై దేవుని చిత్తమును తెలుసుకోక ముందే సురేష్‌కు ఆమె పరిచయముంది. అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే ఆమె కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నది. వారిరువురి ఆలోచనా విధానం మరియు ఆసక్తులు ఒకే విధంగా ఉన్నాయి. కొంతకాలం నిరాటంకముగా వేర్వేరు పరిస్థితులలో అతడు సాధ్యమైనంత వరకు ఆమెను పర్యవేక్షించాడు. సురేష్‌ హృదయంలో ఆమె మీద ప్రేమ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. హఠాత్తుగా, కుదుపులాగా, దుడుకుగా ఇది జరుగలేదు. ఇది సాధారణ పరిచయం నుండి అగాపె ప్రేమకు నెమ్మదిగా, స్థిరముగా అభివృద్ధి చెందింది. ఆమె యొక్క ఆత్మీయత మరియు గుణలక్షణములే ఆమె యెడల అతడు ఆకర్షించబడుటకు గల ప్రాథమిక కారణం. చిన్న విషయమైనా, భౌతిక సంబంధమైన ఆకర్షణ కూడా దీనికి కారణమే. అలా అని ఆమె ఏదో అందాల పోటీలో బహుమతి సంపాదించేటంత అందమైనది కాదు. కాని ఇతరులు అందంగా ఉందని అనుకోకపోయినా ఆమె అందంగా ఉందని సురేష్‌ అనుకున్నాడు. కేవలం ఆమెలో ఉన్న మంచి విషయములను మాత్రమే కాక ఆమె నిజమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె ఆదర్శప్రాయముగా ఉంది కాని అది ఆశించిన స్థాయిలోనే. భయము లేకుండా, తన్నుతాను మోసం చేసుకోకుండా యాదార్ధంగా ఆమెను చూడగలిగాడు(అగాపె ప్రేమ, లైంగిక వాంఛతో కూడిన ప్రేమ వలె గ్రుడ్డిది కాదు). సురేష్‌ యొక్క ఉద్దేశ్యములు నిస్వార్ధమైనవి మరియు ఆమె కొరకు అతడు కలిగియున్న కోరిక పవిత్రమైనది. తనకంటె ఎక్కువగా ఆమె గురించి ఆలోచించేవాడు, నిజముగా పట్టించుకునేవాడు మరియు ఆమె క్షేమము గురించి ఆలోచించేవాడు. తన స్వంత వ్యక్తిగత సంతోషం కోసం ఆమెను కోరుకోలేదు. అతని కోరికేమిటంటే మొదటిగా వారిరువురు కలసి ప్రభువును సంతోషపరచాలని రెండవదిగా ఆమె సంతోషముగా ఉండాలని(పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యకరము) - (అపొ||కా 20:35). ఆమె క్షేమము కొరకు తాను కలిగియున్నదేదైనా సరే త్యాగం చేయుటకు సిద్ధపడ్డాడు. ఆమె కొరకు తన్నుతాను అంకితం చేసుకున్నాడు. ఆమె కలిగియున్న శక్తి చొప్పున ఆమె ఎదగాలనుకున్నాడు. తన స్వంత లాభం కొరకు ఆమెను ఏవిధంగా దోపిడీ చేయాలనుకోలేదు.

సురేష్‌ ఆమెకు దగ్గరలో ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛ మరియు సహజత్వం ఉండేవి. కృత్రిమంగా నటించడం ఉండేది కాదు. అతడెంతో పారదర్శకంగా నిజాయితీగా మరియు యదార్ధముగా ఉండేవాడు.అతడెల్లప్పుడూ ఆమె గురించే ఆలోచించేవాడు కాదు. తన చుట్టూ భౌతిక మరియు ఆత్మీయ అవసరాలు గలిగిన ప్రజల యొక్క అవసరాలు ఏవిధంగా తాను(వివాహమైన తరువాత ఇద్దరు కలసి) తీర్చాలని ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. సురేష్‌ ఎల్లప్పుడు తన అభిమానములలో ప్రభువైన యేసునే మొదట ఉంచేవాడు. ఆ తరువాత రెండవ స్థానములోనే ఆ అమ్మాయిని ఉంచేవాడు. ప్రభువు యొక్క పరిచర్య కూడా తన జీవితంలో మొదటి ప్రాధాన్యంగా ఉండేది. ఆమెను కలుసుకోవడానికి పరిచర్యను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. అదేవిధముగా ఆమె కూడా తన జీవితంలో మొదట ప్రభువునే కలిగియుండాలని అతడు కోరుకున్నాడు.

సురేష్‌ ఆమె మీద పూర్తి నమ్మకమును కలిగియున్నాడు. ఎటువంటి అభద్రతా భావమును కూడా తాను కలిగిలేడు. అతడేదీ బలముగా కోరుకోలేదు(డిమాండ్‌ చేయలేదు), వివేక శూన్యముగా ఆలోచించలేదు మరియు స్వాధీనపరచుకొనే మనస్తత్వమును కలిగిలేడు. ఎటువంటి అసూయ మరియు అనుమానము లేదు. ఆమె స్వాతంత్య్రమును అతడు దోచుకోలేదు. అదే అతడు ఆమెను ప్రేమిస్తున్నాడనుటకు గొప్ప ఋజువుగా ఉంది. ''కాదు'' అని చెప్పడానికి కూడా ఆమెకు స్వేచ్ఛనిచ్చాడు.

పరిస్థితులు వారిని ఎంతో కాలం దూరంగా ఉంచినా కూడా అతనికి ఆమె మీదున్న ప్రేమ తగ్గలేదు. అది ఇంకా పెరిగింది. వారు కూడా ఆర్ధిక ఇబ్బందులను మరియు ఇతర సమస్యలను కలిగియున్నారు. ఈ కారణములను బట్టి వారు కూడా వివాహము చేసుకొనుటకు కొంత సమయం ఆలస్యమైంది. కొంత సమయం అతడు నిరాశ పడినా కూడా దేవుడు మంచి ఉద్దేశ్యముతో దీనిని అనుమతించాడని అతడు అర్ధం చేసుకున్నాడు. ఈ వేచియుండే సమయంలో అతడు వివాహమునకు ఓపికతో సిద్ధపడ్డాడు. వారిద్దరు కలసి జీవించడానికి ప్రతి విధమైన సిద్ధపాటును కలిగియున్నాడు మరియు వెలను లెక్కించాడు. దేవుడు తనకొరకే ఆమెను ఏర్పరచాడనే నిశ్చయతను మరియు ఆమె మీద తన గాఢమైన ప్రేమను ఈ వేచియున్న కాలము నిశ్చయపరచింది.

ప్రతిసారి ఆమె చెప్పే ప్రతి విషయమును ఎల్లప్పుడు అతడు అంగీకరించలేదు. కాని ఆమె మీద తనకున్న ఆరని ప్రేమ, అంత ప్రాముఖ్యం కాని విషయముల మీద భిన్నాభిప్రాయములు కలిగియున్నా కూడా వారి విశిష్టమైన వ్యక్తిత్వములను పంచుకునేటట్లు చేసింది.సురేష్‌కు ఆమె మీదనున్న ప్రేమ శాశ్వతమైనది. మరే అమ్మాయిని ప్రేమించాలని ఎప్పుడూ ఆలోచించలేడు.

వైరుధ్యము.

ఈ రెండు ఉదాహరణలలో కూడా, శృంగారపూరిత లైంగిక వాంఛ(ప్రేమ అని తప్పుగా అర్ధం చేసుకోబడింది)కు మరియు బైబిలు ప్రకారం నిజమైన ప్రేమకు ఎంతో వ్యత్యాసమున్నది. ఎవరైతే ఇటువంటి శృంగారపూరిత లైంగిక వాంఛను కలిగియుంటారో వారు ప్రకాష్‌ కలిగియున్న లక్షణములలో కొన్నిటినే బయల్పరచవచ్చేమో. అయినా కూడా అది లైంగిక వాంఛే. సురేష్‌ యొక్క సాదృశ్యము పరిపూర్ణ ప్రేమికునికి దృష్టాంతంగా ఉంది. ఖచ్చితంగా అతని వలె ఎవరూ ఉండక పోవచ్చు కాని సంపూర్ణతే మన లక్ష్యంగా ఉండాలి. దానికంటె తక్కువైనది మన లక్ష్యంగా ఉండకూడదు. శృంగారపూరిత లైంగిక వాంఛ అనేది తగిన సమయములో అగాపె ప్రేమగా మారే అవకాశం ఉంది కాని అగాపె ప్రేమకు సంబంధించిన ముఖ్య లక్షణములను ఇది కనబరచే వరకు దీనిని మనం అగాపె ప్రేమగా పరిగణించలేము.

తప్పు త్రోవలో నడిపించబడకుండా లైంగిక వాంఛకు మరియు ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసమును యౌవనస్తులు తెలుసుకోవాలి. లైంగిక వాంఛ అనేది తక్కువ సమయములోనే తరిగిపోతుంది. అగాపె ప్రేమ వివాహజీవితములో కూడా నిలచియుంటుంది మరియు ప్రతి పని కూడా ఎంతో సంతోషముతో నెరవేరుస్తుంది.

జాగ్రత్తగా ఉండవలసిన అవసరత

పరమగీతములో మూడుసార్లు చెప్పబడ్డ (పరమగీతము 2:7; 3:5; 8:4) హెచ్చరికను మనం జాగ్రత్తగా హృదయములో ఉంచుకోవాలి. ''ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు, కలతపరచకయు నుండుడి'' (బార్క్లే తర్జుమా). మరో మాటలో చెప్పాలంటే, ముందుగానే శృంగారపూరిత లైంగిక వాంఛను అనుసరించి పరుగెత్తుట కంటె దేవుని యొక్క సమయం కోసం వేచియుండు.

''నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము'' (సామెతలు 4:23).

అధ్యాయము 5
ఇద్దరు ఒక్కటవుట

అనేక విధములుగా ఒకరికి ఒకరు ఎంతో వేరుగా ఉన్నవారు క్రైస్తవ భార్య, భర్తలుగా పరస్పరానురాగ భరితమైన దాంపత్య జీవితమును కలిగియుండుటను చూచుట కంటే ఎక్కువైన విషయము మరొకటి కలదా అని ఆశ్చర్యపోతాము. వివాహము ద్వారా దేవుడు బయల్పరచదలిచిన నిజమైన భిన్నత్వములో ఏకత్వము అనే ఉద్దేశ్యమును ఇటువంటి జంటలో మనము కనుగొనవచ్చు. అటువంటి ఏకత్వము కలిగియుండుటకు రహస్యమేమిటి?

మరొక ప్రక్క మనం చూసినట్లయితే, వివాహము చేసికొనిన ఎన్నో సంవత్సరాల తరువాత కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా, ఏకత్వంలో ఎంతో కొరత ఉన్నవారిని మనము చూస్తుంటాము. వారిలో అనేకమంది, అవకాశముంటే మరలా సంతోషముగా ఒంటరి జీవితానికి తిరిగి వస్తారు. మానవుని సంతోషం కొరకు దేవుడు ఏర్పరచిన వివాహము వారికి ఈ భూమి మీద ప్రత్యక్ష నరకంలాగా మారింది. వారిద్దరు కలసి ఒకే కప్పు క్రింద నివసిస్తుంటారు కాని వారేది సమిష్టిగా కలిగియుండక వేర్వేరు ఒంటరి వ్యక్తులుగా జీవిస్తారు. ఏదో, పిల్లల కోసం కలిసుంటారు లేదా విడిపోతే సమాజంలో నవ్వులపాలవుతామని సర్దుకుంటారు. వారి జీవితం కేవలం శూన్యమైన నటనగా ఉంటుంది. అయినా కూడా దాదాపుగా ఈ జంటలందరు కూడా ఏకత్వంతో, ప్రేమతో జీవించాలనే వారు వివాహం చేసుకుంటారు. మరి, వారు ఎక్కడ తప్పిపోయారు?

జయకరమైన వివాహజీవితానికి, దు:ఖకరమైన వివాహ జీవితానికి గల వ్యత్యాసం వాళ్ళు దేవుని వాక్యోపదేశమునకు చూపిన విధేయత మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు వివాహమును ఏవిధముగా చూస్తున్నాడో అదేవిధముగా ఒక వ్యక్తి తన మనస్సుతో చూడగలిగే వరకు వివాహ భాగస్వామి గురించి వెదకడం కూడా చేయకూడదు.

దేవుడు వివాహమును ఏర్పరచుటలో ఉద్దేశ్యము మరియు ప్రణాళిక ఏమిటి? మొదటిగా జరిగిన మరియు వ్రాయబడిన వివాహము గురించి చూద్దాం.

ఆదియందు...

(ఆదికాండం 2:18-25) లో, మానవ చరిత్రలోనే మొదటిసారిగా జరిగిన పెళ్ళి వివరాలు వ్రాయబడ్డాయి. అది దేవుని చేత జరిగించబడింది. (ఆదికాండం 1:27)లో ఏదైతే క్లుప్తంగా వ్రాయబడిందో దాని గురించి ఈ వాక్యభాగంలో ఎంతో వివరంగా వర్ణించబడింది. మొట్టమొదట దేవుడు పురుషుణ్ణి మాత్రమే సృష్టించాడు. ఆరవరోజు సగం వరకు కూడా తాను చేసినదానంతటిని చూసి ''మంచిది '', ''అది మంచిదని దేవుడు చూసెను'' అని మరలా, మరలా ఆరుసార్లు ప్రస్తావించబడింది (ఆది. 1:4-26) అని చెప్పిన దేవుడే ఇప్పుడు నరుడు ఒంటరిగానుండుట మంచిది కాదు (ఆది 2:18) అని చెప్పాడు. దేవుని దృష్టిలో ''మంచిది కాదు'' అని దేవుడు చెప్పిన మొట్టమొదటి విషయము ''ఒంటరితనము'' అని మిల్టన్‌ చెప్పాడు.

ఆ తరువాత ఆదాముకు భార్యగాను మరియు సహాయకురాలిగా ఉండుటకు దేవుడు స్త్రీని చేశాడు. ఇప్పుడు ఆయన వారిని చూస్తూ ''చాలా మంచిది'' అనే విశేషణమును వాడుతూ చెప్తున్నాడు (ఆది 1:31). దేవుని సృష్టిలో మార్పును తీసుకువచ్చింది ఆ దంపతులే.

వివాహము యొక్క ఉద్దేశ్యము

(1) తోడును కలిగియుండటం

వివాహము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యమేమిటంటే సహవాసము మరియు కలిసిమెలిసి జీవించడం. ఇది ఆదికాండం 2:18లో ఎంతో స్పష్టంగా వివరించబడింది. ఆదాముకు ఎల్లప్పుడు సాటియైన సహాయుముగా ఉండుటకు హవ్వ సృష్టించబడింది. ప్రతి విషయములో ప్రయోజనకరంగా ఉండుటకు ''సాటియైన సహాయకురాలుగాను, ఆమోదయోగ్యముగాను, ప్రతి విషయములోను సరిపోయిన సహాయకురాలిగా'' ఆమె సృష్టించబడింది.

ఆదాము, హవ్వలు ఇద్దరు కూడా ఒకరి ఆనందమును ఒకరు గుర్తించుకుంటూ, ఇద్దరూ కలసి దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. వారిరువురు కూడా ఒకరి కోసం ఒకరు మరియు దేవుని కోసం జీవించవలసియున్నది. ఆదాము యొక్క బలము లేకుండా హవ్వ చేయలేదు మరియు హవ్వ యొక్క సున్నితత్వము లేకుండా, దేవుడు లేకుండా ఆదాము ఏమీ చేయలేడు.

ఆ సహవాసం ద్వారా వారు ఆత్మీయముగా బలపడాలని దేవుడు కోరుకున్నాడు. ''ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును......ఒంటరియగు నొకని మీద మరియొకడు పడిన యెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు'' (ప్రసంగి 4:9-12).

హవ్వను ఆదాముతో ఉన్నప్పుడు కాక ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే సాతాను శోధించాడు. దీనిని బట్టి మనము పైన చెప్పిన సత్యమును ఎంతో స్పష్టముగా అర్ధంచేసుకోగలము. ఆదాము, హవ్వలు ఇద్దరు కలసి ఉన్నట్లయితే సాతాను యొక్క దాడిని త్రిప్పికొట్టగలిగే వారే. ఒంటరిగా ఉన్నప్పుడు ఇద్దరూ బలహీనులే. ఇద్దరు కలిసున్నప్పుడు(పైన చెప్పబడిన వచనములో వలె) వారి బలము కేవలము మరొక వ్యక్తి బలము పెరిగినట్లుగా కాదు గాని వారిరువురి బలము ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రతి క్రైస్తవ దంపతులు కూడా అటువంటి ఆత్మీయ బలమును ప్రత్యక్షపరచాలనేది దేవుని కోరిక.

దేవుడు ఒకరియెడల ఒకరికి నియమించిన స్థానములను భార్య, భర్తలు గుర్తించినప్పుడు మాత్రమే అటువంటి బలమును అనుభవించగలరు. ఎక్కడైతే భార్య భర్తలు స్నేహితులుగా(తోడుగా), మరియు ''జీవమను కృపావరములో పాలిభాగస్థులుగా'' ఉండరో (1 పేతురు 3:7) వారు వివాహము యెడల దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యమును పాడుచేయడం మాత్రమే కాక సాతాను లోపలికి ప్రవేశించుటకు విశాలమైన మార్గమును తెరుస్తారు.

దేవుడు హవ్వను ఆదాము యొక్క తలలోనుండి తీయలేదు ఎందుకంటె ఆమె పురుషుణ్ణి పరిపాలించాలని దేవుడు కోరుకోలేదు. అలాగని ఆమెను ఆదాము యొక్క పాదముల నుండి కూడా తీయలేదు ఎందుకంటె ఆమె పురుషునికి బానిసగా ఉండాలని కూడా దేవుడు కోరలేదు. అని ఈవిధముగా చెప్పడం బహుశా మీరు వినే ఉంటారు. ఆమె పురుషునికి సహాయకురాలిగా మరియు సహధర్మచారిణిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హవ్వ ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి హృదయము దగ్గర నుండి తీయబడింది. ఎల్లప్పుడు తన ప్రక్కన జ్ఞాపకముంచుకోవాలని(ఆమెను భద్రపరుస్తూ) మరియు ఆమెను ఎల్లప్పుడు తన హృదయమునకు దగ్గరగా ఉంచుకోవాలని(ఆమెను ప్రేమిస్తూ మరియు పోషిస్తూ) ఈ సాదృశ్యంలో ఎంతో గొప్ప సత్యమున్నది.

(ఆదికాండం 2:21)లో పేర్కొన్నట్లు ఆదాము నుంచి ప్రక్కటెముకను తీసిన తరువాత దేవుడు ఆ భాగమును మాంసంతో పూడ్చివేశాడు. ఇక్కడ కూడా సాదృశ్యరూపకమైన బోధ ఉంది. తన ప్రక్కటెముకను తీసినప్పుడు ఆదాము తనలో ఒక భాగమును కోల్పోయాడు. ఇది బయటకు కనబడదు ఎందుకంటె ఆ భాగము మాంసముతో పూడ్చివేయబడింది. ఇదేమి సూచిస్తుందంటే ఆదాము అంతరంగ జీవితములో శూన్యము ఉంది. అది కేవలం హవ్వచేత మాత్రమే నింపబడుతుంది. ఎందుకంటే ఆమె ఆ ప్రక్కటెముకనుండి చేయబడింది. యూదుల బోధకులు(రబ్బీ) ఈవిధంగా చెప్తారు - ''తన ప్రక్కటెముక తన యొద్ద నుండి తీసివేయబడుతుంది కనుక పురుషుడు విశ్రాంతిలో లేడు, ఆమె ఎక్కడ నుండి తీయబడిందో ఆ పురుషుని చేయి తాకే వరకు ఆ స్త్రీకి కూడా విశ్రాంతి ఉండదు'' .

భార్యభర్తల మధ్య ఇటువంటి సంబంధమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం అటువంటి సహవాసము మాత్రమే దేవుని యొక్క శక్తిని బయల్పరుస్తుంది మరియు దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేరుస్తుంది.

క్రొత్త నిబంధనలో, ప్రభువైన యేసు మరియు అపొస్తలుడైన పౌలు(పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి) కూడా భార్యభర్తల సంబంధం గురించి చెప్పినపుడు ఆదికాండం 2వ అధ్యాయంలోని ఈ వాక్యభాగమునే ఎత్తి చూపించినట్లుగా (మత్తయి 19:3-9; ఎఫెసీ 5:22-33) మనము కనుగొంటాము. నిజమైన క్రైస్తవ వివాహ భావనను మనము కలిగియుండాలంటే ఆదికాండంలోని ఈ వాక్యభాగము యొక్క బోధ ఎంతో ప్రాముఖ్యమైనది.

వివాహము యొక్క ఉద్దేశ్యము

(2) గృహమును కట్టుకొనుట

క్రొత్తగా పెళ్ళయిన ఈ జంటకు దేవుడు చెప్పిన మొట్టమొదటి మాటల్లో వివాహము యొక్క రెండవ ఉద్దేశ్యము ఉంది. దీనిని మనం (ఆదికాండం 1:28) లో చూస్తాము. వారు ఫలించాలి అని దేవుడు చెప్పాడు. సంతానాన్ని పొందడం మరియు కుటుంబమును కట్టుకోవడం అనేవి దేవుడు ఉద్దేశించుటకు మరొక కారణముగా ఉన్నవి. దేవుడు లైంగిక సంయోగమును ఇందుకోసమే ప్రాథóమికముగా ఉద్దేశించాడు.

దైవారాధనకు మరియు సేవకు గృహము కేంద్రముగా ఉండాలని బైబిలు నొక్కి చెబుతుంది. దేవుని శిరసత్వము క్రింద ఇంటిని క్రమపరచుకున్నట్లయితే దీని ద్వారా దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. దేవుడు పిల్లలను మన హృదయమును సంతోషపరచుటకు మాత్రమే కాక వారిని దేవుని భయములో పెంచి, వారి తరములో వారు నమ్మకమైన సాక్షులుగా ఉండే విధముగా మనము పెంచాలని ఇస్తాడు. ఇది లేఖనములలో మరలా, మరలా నొక్కి చెప్పబడింది (కీర్తనలు 78:5-7).

దేవునికి మహిమ తెచ్చునట్లుగా, ఆయన విశ్వాస్యతకు, మంచితనముకు సాక్ష్యముగా ఉండేవిధముగా గృహమును నిర్మించుట ప్రతి క్రైస్తవ దంపతుల యొక్క పిలుపైయున్నది. ప్రభువు యొక్క మార్గములలో నడచుకొనుచున్న పిల్లలే ఒక వ్యక్తి ఎంతో ప్రభావితముగా బోధించగలిగిన ప్రసంగములు. దేవుడు దీనికి జతచేసిన ప్రాముఖ్యత ఏమిటంటే అబ్రాహాము తన కుమారుణ్ణి దైవిక విధానములో పెంచినందున దేవుడు ఆశీర్వదించాడు. ఏలీ ఆవిధంగా చేయలేదు కనుక దేవుడు శపించాడు (ఆది 18:19; 1 సమూయేలు 3:13,14).

క్రొత్త నిబంధనలో కూడా దీని ప్రాముఖ్యత వివరించబడింది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ''సంఘము'', క్రీస్తు శరీరమనే మర్మమును వివరించిన తరువాత (ఎఫెసీ 1 నుండి 3 అధ్యాయములు) పౌలు ఈవిధంగా చెప్తున్నాడు - ఈ సత్యము యొక్క అన్వయింపు క్రైస్తవ గృహములోని సంబంధములలో చూడాలి అని చెప్తున్నాడు. భార్యభర్తల మధ్య, తండ్రి పిల్లల మధ్య, యజమానులు మరియు దాసుల మధ్య (అధ్యాయము 5:22; 6:9) ఉండాలి. ఇక్కడ ప్రాథóమికంగా పౌలు స్థానిక సంఘముకంటె కూడా గృహమును గురించి మాట్లాడటం విశేషం. ఇదేమి సూచిస్తుందంటే క్రైస్తవ గృహము యొక్క సాక్ష్యమే ప్రాథమికముగా దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. ఒక స్థానిక సంఘములోని గృహములు(కుటుంబములు) బలముగా ఉన్నప్పుడే ఆ స్థానిక సంఘము కూడా బలముగా ఉంటుంది. ఈ గృహములలో ఆత్మీయ వాతావరణము లేనట్లయితే స్థానిక సంఘములలో కూడా దుర్భర పరిస్థితులుంటాయి.

ఇటువంటి గృహము మీద సాతాను యొక్క తీవ్రమైన దాడులుండటం సహజమే. దేవుడు ఏర్పరచిన మొదటి గృహము మీదకు సాతాను నేరారోపణ, అసూయ, ద్వేషము మరియు హత్యను తీసుకొనివచ్చాడు (ఆది 3:12; 4:18). అప్పటి నుండి కూడా సాతాను ఏ ఒక్క దైవిక గృహమును కూడా విడిచిపెట్టలేదు. కనుక ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో క్రైస్తవ గృహము గురించి చెప్పిన వెంటనే ఆత్మసంబంధమైన యుద్ధము గురించి చెప్పబడింది (అధ్యాయము 6:10-18). దైవిక గృహమును కట్టుటకు చేసే ప్రతి ప్రయత్నమును సాతాను అడ్డుకుంటాడని మనము హెచ్చరించబడ్డాము. శత్రువు చేసే ప్రతి దాడిని ఎదుర్కొనుటకు దేవుడు మనకు సర్వాంగ కవచమును అనుగ్రహించాడు. దేవునికి మహిమ తెచ్చే విధంగా కుటుంబమును ఏర్పరచుకోవడం నిస్సందేహంగా వివాహములో దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం.

వివాహము యొక్క ఉద్దేశ్యము

(3) లైంగిక సంబంధం

ఫలించుడి (ఆదికాండం 1:22) అనే ఆజ్ఞ ఆదాము, హవ్వలు లైంగిక సంబంధమును కలిగియుండాలని సూచిస్తుంది. స్త్రీ, పురుషులు సంపూర్ణముగా వారి లైంగిక సంబంధమైన కోరికలను నెరవేర్చుకొనుటకు వివాహము అనేది దేవుడు ఏర్పరచిన వ్యవస్థ. ఇది వివాహము యొక్క మూడవ ఉద్దేశ్యము.

వివాహములో లైంగిక సంబంధమైన నెరవేర్పు అనేది కేవలం భౌతిక సంబంధమైన తృప్తి, ఆనందం కంటే ఎంతో ఎక్కువైనది. ఒకవేళ కేవలం భౌతిక సంబంధమైనదైతే అప్పుడు మానవుడు జంతువు కంటే శ్రేష్టమైనవాడు కాదు. లైంగిక సంబంధములోని భౌతిక విషయాలను బైబిలు తృణీకరించట్లేదు. సెక్స్‌ దేవుని చేత సృష్టించబడిందనీ అది పవిత్రమైనది మరియు స్వచ్ఛమైనదని ఒకటో అధ్యాయములోనే మనం చూశాము. భార్యభర్తలు వారి అంతరంగములో ఇప్పటికే కలిగియున్న లోతైన ఏకత్వమును ఈ సంయోగము సాదృశ్యరూపకముగా సూచిస్తుంది. వారు ఒకరి యెడల ఒకరు కలిగియున్న అగాపె ప్రేమకు ఇది శారీరక నిర్వచనం. వివాహ పాన్పు నిష్కల్మషమైన బలిపీఠముగా నుండాలి. దాని మీద భార్యభర్తలు సంయోగం ద్వారా వారి జీవితములోని ప్రతి విషయములో కూడా ఒకరికొకరు త్యాగపూరితమైన సేవచేస్తూ వారి కోర్కెలను పంచుకోవాలి.

వివాహములో లైంగిక సంబంధమైన ప్రేమను బైబిలు ఘనపరుస్తుంది. ఇద్దరు ప్రేమికులను గురించి వర్ణిస్తూ బైబిలులో ఒక పుస్తకమే ఉంది, అదే పరమగీతము. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను బట్టి సంతోషించినట్లుగా బైబిలులో ఉంది (యెషయా 62:5). అదేవిధంగా భర్త కూడా తన భార్యతో సంయోగ తృప్తి పొందాలని, అందులోని ఆనందమును ఆస్వాదించమని బైబిలు చెప్తుంది (సామెతలు 5:18,19; 1 కొరిందీ¸ 7:5). ఇందులో పాపమేమీ లేదు. ఇలా చెయ్యడం సరియైనది మరియు న్యాయసమ్మతమైనది. శృంగార విషయములో అనేకమంది మనస్సులలో ఉండే మాలిన్యమును బట్టి దేవుడు తన వాక్యములో ఇలాంటి విషయములను ఎందుకు వ్రాశాడో వారు అర్ధం చేసుకోలేరు. ''పవిత్రులకు(హృదయములో మరియు మనస్సాక్షిలో) అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును, అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడియున్నవి'' (తీతు 1:15). మన మనస్సులు ఇంకా శరీరానుసారముగా ఉంటే, ఏమీ లేని దగ్గర కూడా మనకు అపవిత్రత కనిపిస్తుంది. అప్పుడు దేవుడు తన వాక్యములో వ్రాసిన దానిని కూడా మనము అపవిత్రముగానే ఎంచుతాము. కాని మన మనస్సులు పరిశుద్ధాత్మ చేత రూపాంతరపరచబడినప్పుడు దేవుడు శృంగారమును ఏవిధముగా చూస్తున్నాడో మనము కూడా అదేవిధముగా చూస్తాము. అప్పుడు వివాహములో లైంగిక నెరవేర్పు పరిశుద్ధమైనదని, సరియైనదిని మనము గుర్తిస్తాము.

పాపము లోకములోనికి ప్రవేశించకమునుపు, ఏదేను తోటలో ఆదాము, హవ్వలు ఒకరి యెడల ఒకరు లైంగిక తృప్తి పొందారు. పాపము విస్తరించుట వలన వివాహము ఎప్పుడూ ఎంతో అవసరమైనదని బైబిలు చెప్తుంది(బహుశా ఇది ఎక్కువగా పురుషులకు అన్వయించబడుతుందేమో), ఒక అవివాహితుడు లైంగిక సంబంధమైన పాపములో ఎంతో సుళువుగా పడిపోవుటకు అవకాశమున్నది (1 కొరిందీ¸ 7:2). కామతప్తులగుట కంటే వివాహం చేసుకోవడం మంచిదని బైబిలు చెప్తుంది. స్త్రీ, పురుషులు వారి లైంగిక కోరికలను తీర్చుకొని సంతృప్తి చెందుటకు దేవుడు ఏర్పరచిన ఒకే ఒక వ్యవస్థ వివాహము.

వివాహము యొక్క సాదృశ్యము

లేఖనములలోని ఒక మహిమకరమైన ప్రత్యక్షత ఏమిటంటే భార్యభర్తల సంబంధం క్రీస్తుకు మరియు సంఘమునకు గల సంబంధమునకు సాదృశ్యముగానున్నది (ఎఫెసీ 5:22-23). ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో భార్యలు, భర్తలకు లోబడవలెనని చెప్పబడ్డారు. ఎందుకంటే, భార్యకు శిరస్సుగా భర్తను దేవుడు నియమించాడు. సమస్త విషయములలో(క్రీస్తుకు సంఘము లోబడవలసిన విధముగా) భార్యలు భర్తలకు విధేయత చూపించి వారిని గౌరవించి, ఘనపరచాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మన దినములలో అటువంటి విధేయత అంగీకరించబడక పోవచ్చేమో గాని అది దేవుని ఆజ్ఞ. ఏ గృహమైతే ఈ ఆజ్ఞను అతిక్రమిస్తుందో, ఆ గృహము ఏదో ఒకవిధముగా అవిధేయత యొక్క పరిణామాలను ఎదుర్కోవలసివస్తుంది. తన వివాహ జీవితంలో ఏ క్రైస్తవురాలైతే దేవుని యొక్క ఈ ఆజ్ఞలకు విధేయత చూపించుటకు ఇష్టపడదో ఆమె వివాహం చేసుకోకపోవడమే మంచిది. వివాహము చేసుకొని దేవుని ఆజ్ఞలకు నిరంతరం అవిధేయత చూపించుట కంటె ఆమె వివాహము చేసుకోకపోవడమే అతి శ్రేష్ఠము.

దేవుడు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు కదా అని ఏ భర్త కూడా భార్య నుండి నిర్హేతుకమైన కోర్కెలను(డిమాండ్‌లను) కలిగియుండకూడదు. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్నుతాను అర్పించుకున్నట్లుగా భర్తలు కూడా వారి భార్యలను ఈవిధముగా ప్రేమించాలని ఈ వాక్యభాగంలో ఉంది. దీని అర్ధమేమిటంటే భర్తలు, భార్యలను త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమించి వారికి కేవలం వస్తువులను మాత్రమే కాక వారి జీవితములను కూడా వారి భార్యలను సంతోషపరచుటకు, క్షేమము కొరకు అర్పించవలసియున్నది. క్రీస్తు సంఘమును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక భర్త కూడా తాను, తన భార్యచేత తిరిగి ప్రేమిచంబడుతున్నాడా లేదా అని కాక తన భార్యను నిరంతరం ప్రేమించవలసియున్నది.

తన శిష్యుల యెడల క్రీస్తు కలిగియున్న ప్రేమ, ఆయన వారి పాదములను కడుగునట్లుగాను మరియు వారి కొరకు చనిపోవునట్లుగాను నడిపించిందని జ్ఞాపకముంచుకోండి. వారి స్వంత శరీరములను ప్రేమించినట్లే తమ భార్యలను కూడా ప్రేమించవలెనని భర్తలు అదే వాక్యభాగములో ఆజ్ఞాపించబడ్డారు. తమ స్వంత శరీరములను ఉద్దేశ్యపూర్వకముగా ఏవిధముగా గాయపరచుకోరో అదేవిధముగా వారి భార్యల మనోభావములను కూడా భర్తలు ఉద్దేశ్యపూర్వకముగా గాయపరచకూడదు. అపాయము నుండి ప్రమాదము నుండి తమ స్వంత శరీరములను వారు ఏవిధముగా కాపాడుకుంటారో వారి భార్యలను కూడా భర్తలు అపాయము నుండి ప్రమాదము నుండి కాపాడవలసియున్నది. ఏ పురుషుడైతే ఇటువంటి లేఖనముల యొక్క బోధను అనుసరించుటకు కోరుకొనరో అటువంటి వారు వివాహము చేసుకోకపోవటమే శ్రేష్ఠము.

ప్రతి క్రైస్తవ భార్యాభర్తలు కూడ క్రీస్తు మరియు సంఘమునకు సాదృశ్యముగా ఉండవలెనని ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో దేవుడు తన ఉద్దేశ్యమును బయలుపరచాడు. వారిరువురు కలసి జీవిస్తున్న జీవితము ఈ బంధములోని సౌందర్యమును ప్రత్యక్షపరచాలి. పరిశుద్ధాత్మ పూర్ణులైయుండుడి అనే ఆజ్ఞ (ఎఫెసీ 5:18) భార్యాభర్తల సంబంధం గురించి చెప్పిన వాక్య భాగమునకు ముందుగా ఉంటుంది. ఇది మనకేమి సూచిస్తుందంటే పరిశుద్ధాత్మతో నింపబడటం వలన ప్రాథమికముగా మనము ఇంటిలో క్రీస్తు వలె ప్రవర్తిస్తాము. మన వివాహ జీవితములో దేవుణ్ణి మహిమ పరచాలంటే మనము తప్పనిసరిగా పరిశుద్ధాత్మతో నింపబడాలని కూడా ఇది సూచిస్తుంది. వివాహ భాగస్వామి కోసం చూడకమునుపే ప్రతి క్రైస్తవుడు కూడా పైన చెప్పిన విధముగా అటువంటి గృహమును కలిగియుండాలనే కోరికను కలిగియున్నానా లేదా అని తన్నుతాను ప్రశ్నించుకోవాలి. అటువంటి తృష్ణ లేకుండా ఎవరైనా తన వివాహంలో దేవుని నడిపింపును ఏవిధముగా ఆశిస్తారు. కాని నిజముగా నీవు ఇటువంటి లక్ష్యమును కలిగియున్నట్లయితే, తన సంపూర్ణచిత్తములో, నీవు వివాహము చేసికొనుటకు దేవుడు నిన్ను నడిపించుట మాత్రమే కాక అటువంటి ఇంటిని కట్టుటకు నిన్ను బలపరుస్తాడని నిశ్చయత కలిగియుండవచ్చు.

బ్రహ్మచర్యం

వివాహములోని ఉన్నత ఉద్దేశ్యముల గురించి మాత్రమే కాక బ్రహ్మచర్యంలోని ప్రయోజనముల గురించి కూడా బైబిలులో చెప్పబడింది. కాబట్టి మనము ఈ అధ్యాయమును ముగించుటకు మునుపు దీని గురించి కూడా(అసమతుల్యత లేకుండుటకు) ఒక మాట చెప్పడం అవసరం.

1 కొరిందీ¸ 7వ అధ్యాయములో పౌలు బ్రహ్మచర్యం గురించి మాట్లాడాడు. ఈ అధ్యాయము మరియు మత్తయి సువార్త 13:12లో ప్రభువు చెప్పిన మాటలను ఆధారం చేసికొని వివాహం చేసికోవడం కంటే ఒంటరి జీవితమే కోరదగినదని మరియు ఆత్మీయమైనదని చెబుతుంటాడు. కాని బైబిలు బోధించేది నిజముగా ఇదేనా?

1 కొరిందీ¸ 7వ అధ్యాయమును చదువుతున్నప్పుడు ఈ అధ్యాయములో పౌలు నాలుగుసార్లు తన స్వంత అభిప్రాయమును ఇచ్చాడు. పైన చెప్పబడిన విషయములో అతనికి ప్రభువు యొక్క మనస్సు అంత స్పష్టముగా తెలియబడలేదని మనము గుర్తుంచుకోవాలి (6,12,25,40 వచనములు) . మనుష్యులందరు నావలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు అని పౌలు చెప్తున్నాడు(7వ వచనం). ఇక్కడ ఆయన ''కృపావరము'' అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ఇది మనకేమి బోధిస్తుందంటే బ్రహ్మచర్యంలో ఎటువంటి గొప్పతనము లేదని ఆయన చెప్పాడు. ఇది ఏదో సాధించేది కాదు లేక ప్రతి ఫలం కాదు కాని కృపావరము. (మత్తయి 19:11) లో కూడా యేసు ప్రభువు ఇదే మాట ఉపయోగించాడు. కొంతమంది వివాహము చేసికొనకుండ ఉండుటకు అనుగ్రహము పొందారు. అనుగ్రహము పొందిన వారు మాత్రమే ఈవిధముగా జీవించగలరని ఆయన చెప్పాడు (మత్తయి 19:12). వివాహం చేసుకోకుండా ఉండుటలో ప్రత్యేకత ఏమీ లేదు. ఇది కొంతమందికి నిస్సందేహంగా దేవుని పిలుపైయున్నది.

కాని అనేకమంది జీవితాలలో వివాహము చేసికొనుటే దేవుని ప్రణాళికైయున్నది. నీవు ఒంటరిగా ఉండాలని దేవుడు కోరుకున్నట్లయితే ఆ విషయము నీకు చెబుతాడు. ఒకవేళ అటువంటి ప్రత్యేకమైన ఆజ్ఞ దేవుని యొద్ద నుండి నీ హృదయములోనికి వ్యక్తిగతముగా రానట్లయితే, దేవుడు నిన్ను వివాహము చేసుకోమంటున్నాడని నీవు అనుకొనవచ్చు. ఎవరైతే వివాహము చేసికోకుండా ఉందామని అనుకుంటున్నారో దానికి గల కారణాలను వారు పరిశీలించుకోవాలి. ఒకవేళ కేవలం ఒంటరిగా ఉండాలనే స్వార్ధంతోనో లేక నేనే గొప్ప అని భావించో లేక ఎదుటి వారిని(వేరే సెక్స్‌) హీనంగా చూసి లేక ''అనుకున్నది అందుబాటులో లేక అందుబాటులో ఉన్నది నచ్చని'' పరిస్థితులలోనో బ్రహ్మచర్యమును ఎన్నుకోవడం ఖచ్చితముగా తప్పే. అయితే ఒంటరిగా ఉండటం వల్ల దైవసేవ మరింత ఎక్కువగా కొనసాగించడానికి వీలుకలుగుతుంది అని భావించి బ్రహ్మచర్యమును ఎన్నుకోవడంలో కనీసం పవిత్రమైన ఉద్దేశ్యం ఉంది. అయినా కూడా ఇటువంటి జీవితము జీవించడానికి ప్రభువు యొద్ద నుండి రావల్సిందే. అపొస్తలుడైన పౌలు ఈవిధముగానే జీవించాడు (1 కొరిందీ¸ 7:32,33; 1 కొరిందీ¸ 9:5).

పరిశుద్ధమైన జీవితం జీవించడానికి బ్రహ్మచర్యం అనువైన జీవితం అని అనుకోవడం పెద్ద పొరపాటు. పెళ్ళయిన వాని కంటే పెళ్ళికాని వానికి మతసంబంధమైన కార్యకలాపాలను చేయుటకు ఎక్కువ సమయం లభిస్తుంది. పరిశుద్ధతకు ఈ కార్యములు అవసరము లేదు. హనోకు ''300 సంవత్సరములు దేవునితో నడచి(సహాయము చేసి) కుమారులను కుమార్తెలను కనెను'' (ఆది.5:22). అతడు వివాహం చేసికొని మొదటి కుమారుడు పుట్టిన తర్వాతనే దేవునితో నడవడం ప్రారంభించాడు. అతడు దేవునితో నడవడం అనేది తాను సాధారణ కుటుంబ జీవితమును కలిగి పిల్లలను కలిగియుండుటను అడ్డగించలేదు. తాను కుటుంబ బాధ్యతలను చూడటం కూడా దేవునితో నడవకుండా ఆపలేదు. కాబట్టి విశ్వాసులందరు పెళ్ళి చేసికోకుండా ఉండాలనేది పౌలు చెప్పిన దానికి అర్ధం కాదు. వివాహము చేసుకోకుండా ఉండాలి అనే నియమమును బోధించేవారు దయ్యముల సిద్ధాంతములను బోధిస్తున్నారు అని మరొకచోట పౌలు చెప్పాడు (1 తిమోతి 4:1-3).

(1 కొరిందీ¸ 7:25-28) లో పౌలు చెప్పిన మాటలు సందర్భానుసారముగా అర్ధం చేసుకోవాలి. ఈ వాక్యభాగమును ఎ.న్‌.ట్రిటాన్‌ ఈవిధముగా వివరించి వ్రాశాడు: ''నేనేమి ఆజ్ఞాపించను గాని కొన్ని సత్యాలను మనం మనస్సులలో ఉంచుకోవాలి. మనము దు:ఖములోను మరియు విపరీతమైన శ్రమల కాలము(క్రీ.శ.55) లో ఉన్నాము. ఒంటరిగా ఉన్నవాళ్ళ కంటే సంసార జీవితం గడిపేవాళ్ళను సులభంగా తమవైపు త్రిప్పుకోవచ్చుననే నమ్మకం, మనల్ని బాధించే వాళ్ళకుంది. కాబట్టి, పెండ్లి అయిన వారికి ఎక్కువ చింతలు, ఇబ్బందులు కలుగుతాయి. ఇవి మీకు కలుగకుండవలెనని మీరు వివాహము చేసుకొనవద్దని కోరుచున్నాను. దయచేసి గమనించండి, పెండ్లి చేసుకొనుట పాపమని నేను చెప్పుటలేదు. ఇప్పటి ఇబ్బందిని బట్టి పెండ్లి చేసుకొనుట వలన శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అవి మీకు కలుగకుండవలెనని నేను కోరుచున్నాను''.

ఏ దేశములలోనైతే విపరీతమైన హింస ఉందో మరియు యుద్ధములు జరుగుతుంటాయో అలాంటి దేశములలో ఉన్న విశ్వాసులకు ఈ మాటలు ఇప్పటికీ వర్తిస్తాయి. ఎట్టి పరిస్థుతులలో కూడా, దేవుడు మనయెడల ఉద్దేశించని దానిని చేయుటకు ప్రయత్నించకూడదు. మనం ఒంటరిగా ఉండాలా లేక వివాహం చేసుకోవాలా అనే విషయమును మన ప్రతి ఒక్కరి జీవితములో దేవుడు ఇప్పటికే ప్రణాళికను కలిగియున్నాడు. మన పనేమిటంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును తెలుసుకొనుటకు, ఒంటరి(వివాహము చేసుకొనకుండా) జీవితమును గురించిన పిలుపునకు మనము సిద్ధపడాలి - ఇటువంటి పిలుపు దేవుని దగ్గర నుండి స్పష్టముగా రావాలి. ఎక్కడైతే అటువంటి సిద్ధ మనస్సు ఉండదో, ఈ విషయములో దేవునికి అప్పగించుకోకపోవుట వలన మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును తెలుసుకోకుండా ఇది అడ్డుపడుతుంది.

(1 కొరిందీ¸ 7:29-36) లో పౌలు చెప్పిన మాటలను గమనించండి. ఈ వాక్య భాగమును ఎ.న్‌.ట్రిటాన్‌ ఈవిధముగా వివరించాడు: క్రైస్తవ పని చేయుటకు మరియు సాక్ష్యమిచ్చుటకు సమయము కొద్దిగానున్నది. మనము ఈ లోకమునకు మితముగా జీవించాలి. వీలైనంత వరకు పెండ్లి అయిన వారు పెండ్లికానట్లు జీవించవలెను. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి మరియు మనము పనిచేయుటకు నిత్యత్వపు విలువ గలిగిన పని ఉంది. అయితే పెండ్లి అయిన వారు వారి కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోలేరు కాబట్టి పెండ్లి కాని వారితో పోల్చినట్లయితే పెండ్లి అయిన వారికి పరిమితులుంటాయి. ఒకవేళ నీకు పెండ్లి అయినట్లయితే ఇంట్లో నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పనులుంటాయి కాబట్టి ఏకాగ్రతతో ప్రభువు యొక్క పరిచర్య చేయలేవు.

వివాహం చేసుకోకుండా ఉండుటకు ఇవి బలీయమైన కారణాలు. నీవు యౌవనస్తునిగా ఉన్న కాలంలో ఇవి నీకు బాగా ఉపకరించవచ్చును(36వ వచనం). వివాహం కాని వారికి, క్రైస్తవ పరిచర్యలో ఉండే ప్రత్యేకమైన అవకాశములు మరియు ఆధిక్యతలను గురించి ఆలోచించు. మరీ ఆలస్యమవుతుంది అనుకుంటే తప్ప అప్పటిదాకా వివాహమును వాయిదా వేసినట్లయితే నీకు ఎంతో అద్భుతమైన అవకాశములు పరిచర్యకు లభిస్తాయి. ''ఇప్పుడు మీకు ఉరియొడ్డవలెనని నేను మీకు ఈ మాటలు చెప్పట్లేదని దయచేసి గమనించండి'' (35వ వచనం). ''మీ ప్రయోజనము కొరకు మాత్రమే చెబుతున్నాను. ఒకవేళ పరిస్థితులు మిమ్మల్ని మరొకవిధముగా నడిపించినట్లయితే మీరు వివాహము చేసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఇది దేవుని కృపావరము'' (36వ వచనం).

బ్రహ్మచర్యం దేవుని కృపావరము అని మొదలుపెట్టిన పౌలు, వివాహం కూడా దేవుని వరమే అని ముగించాడు. ఈ విషయములో ఆయన సమతుల్యత కలిగియున్నాడు.ప్రభువు బ్రహ్మచర్యము గురించి మాట్లాడిన వెంటనే, చిన్నపిల్లలను తన చేతులలోకి తీసుకొని వారిని ఆశీర్వదించాడు. ఆవిధముగా ఆయన వివాహమును మంజూరు చేశాడు (మత్తయి 19:10-15). లేఖనములలో అటువంటి సమతుల్యత చూపబడింది. అదే సమతుల్యత గలిగి మనము సత్యమును పట్టుకోవాలి.

వివాహము పురుషుణ్ణి సంపూర్ణునిగా చేస్తుంది

పురుషుడు ఒంటరి జీవితం(వివాహము చేసుకోకుండా) జీవించమని దేవుడు చాలా అరుదుగా పిలుస్తాడు. ఒకవిధంగా చూస్తే పురుషుడు వివాహం చేసుకుంటేనే సంపూర్ణుడవుతాడని దేవుడు చెప్తున్నాడు. (ఆదికాండం 2:18)(బార్ల్కే తర్జుమా) లో ఈవిధంగా ఉంది. ''నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటియైన సహాయమును వాని కొరకు చేసి, సంపూర్ణునిగా చేయుదుననుకొనెను''. బైబిలు వివాహముతో ప్రారంభించబడింది (ఆది.2:18-25) మరియు వివాహంతో ముగించబడింది (ప్రకటన 19:7-9; 21:2-10) మరియు యేసుప్రభువు తాను చేసిన మొట్టమొదటి అద్భుతము కూడా వివాహములోనే (యోహాను 2:1-11). వీటన్నింటిని బట్టి వివాహం ఎంత ప్రాముఖ్యమో అర్ధమౌతుంది.

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా, అంటే - యోగ్యమైనదిగా ఎంచబడాలి, ప్రశస్తమైనదిగా ఉండాలి. ఎంతో ప్రియమైనదిగా మరియు విలువైనదిగా ఎంచాలి.

అధ్యాయము 6
అర్ధాంగి కోసం అన్వేషణ

నీకు సరిపోయే భాగస్వామి యొద్దకు నిన్ను దేవుడు మాత్రమే నడిపించగలడు. నిజానికి ఆయన స్వరం వినినట్లయితే ఆవిధముగా చేయుటకు ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నాడు.

ఆయన బిడ్డలలోని ప్రతి ఒక్కరి యెడల దేవునికి సంకల్పము(ఏర్పాటు) ఉన్నదని బైబిలు చెప్పుచున్నది(ఎఫెసీ 2:10). ఇదే నిజమైతే, నీవు పెళ్ళి చేసుకోవాలో లేదో ఆయన ముందుగానే నిర్ణయించాడని విశ్వసించక తప్పదు. నీవు పెళ్ళి చేసుకోవాలని దేవుడు నిర్ణయించినట్లయితే, నీవు ఎవరిని పెళ్ళి చేసుకోవాలో కూడా ఆయన ఏర్పాటు చేసియుంటాడు. కాని తనకు విధేయత చూపాలని దేవుడు ఎవరినీ బలవంతము చేయడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని ఏర్పాటును విసర్జించి లేక నిర్లక్ష్యం చేసి, దేవుని ఏర్పాటుకు వేరుగా పెళ్ళి చేసుకొనవచ్చును.

నీవు రక్షణ(నూతన జన్మ) పొందిన తరువాత నీ భాగస్వామిని ఎన్నుకొనుటయే ముఖ్యమైన నిర్ణయము. ఒకసారి నిర్ణయము తీసుకున్న తరువాత మరలా వెనుకకు తీసుకొనుటకు అవకాశము లేదు గనుక ఈ విషయము నీవు పొరపాటు చేయకూడదు. ఒకవేళ ఉద్యోగరీత్యా ఏదైనా పొరపాట్లు చేస్తే తరువాత సవరించుకోవచ్చును. అలాగే వేరే నిర్ణయాలు కూడా మార్చుకోవచ్చును. కాని దేవుని చిత్తము కాని పెళ్ళి చేసుకొనినట్లయితే, సరిదిద్దుకోవటానికి వీలుపడదు. అప్పుడు నీవు వివాహ జీవితాన్ని శ్రేష్టమైనదిగా చేసుకొనుటకు మాత్రమే ప్రయత్నించవచ్చును. వివాహజీవితములో దేవుని చిత్తమును తెలుసుకొనకపోవుట విచారకరము.

తొందరపడి దేవుని చిత్తప్రకారం కాకుండా వారి యిష్టప్రకారము పెళ్ళి చేసుకున్న వాళ్ళు తీరుబడిగా ఇప్పుడు పశ్చాత్తాపపడుచున్నారు. నిశ్చయముగా ఈ విషయములో వారు యౌవనస్తులకు హెచ్చరికగా ఉన్నారు.దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పెళ్ళి చేసుకోవటము కంటే చేసుకోకుండుట మంచిది. వివాహ విషయములో దేవుని చిత్తమును తప్పిపోయిన వారు, తరువాత పశ్చాత్తాపపడితే దేవుడు వారిని కనికరించి వారిని ఆశీర్వదించవచ్చేమో గాని దేవుని చిత్తములో ఉన్న వారికున్న సంపూర్ణ సంతోషము, సమాధానమును వారు అనుభవించలేక పోవచ్చును.

దేవుని మహిమార్ధమును మరియు మనము అతి శ్రేష్టమైన మేలు పొందునట్లును దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవటము తప్పనిసరి. దేవుడు ఆదాముకు భాగస్వామిని కలుగజేసినప్పుడు పదిమంది స్త్రీలను చేసి, నీకిష్టమైన స్త్రీని ఎన్నుకొనమని దేవుడు చెప్పలేదు. ఈ విషయములో ఆదామునకు ఎన్నుకొనుటకు లేదు. దేవుడు ఒకే స్త్రీని చేసి, ఆదామునకు ఇచ్చాడు. తనకు విధేయులైన పిల్లలందరికీ, ఒకే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశారు. అటువంటి విషయాలు సిద్ధాంతాలుగా అర్ధము చేసుకోవటము కష్టమే. దేవుని సర్వాధికారమును, మానవుని స్వంత చిత్తమును ప్రక్కన పెట్టి చూస్తే అది అర్ధం చేసుకొనుట కష్టముగా ఉంటుంది. అయినా వాక్యము బోధించేది అదే. ఆయన చిత్తమును మనము అంగీకరిస్తే, ఆదాముకు హవ్వ ఏలాగో అలాగే అన్ని విషయములలో మనకు సరిపోయే వ్యక్తిని దేవుడు మనకొరకు సిద్ధపరచినట్లు కనుగొనగలము.

ఇస్సాకుకు వధువును వెదకుటకు వెళ్ళిన అబ్రాహాము సేవకుడు ఈ సంగతిని గ్రహించాడు. కాబట్టి దేవా, మంచిగా ఉన్న అమ్మాయిలను కొంతమందిని నాకు చూపించు, వారిలోనుండి ఇస్సాకుకు సరిపోయే అమ్మాయిని ఎన్నుకుంటాను అని అతడు ప్రార్ధన చేయలేదు. కాని ప్రభువా, నీవు ఎవరినైతే ఇస్సాకుకు భార్యగా ముందుగానే నియమించినావో ఆమె యొద్దకు నన్ను నడిపించుము(ఆది 24:14-44) అని ప్రార్ధించాడు. అతని ప్రార్ధనకు దేవుడు జవాబిచ్చినప్పుడు, దేవుడు నన్ను నడిపించాడని అంటున్నాడు(ఆది 24:27). ఈమాట యేదో భక్తిని వ్యక్తపరుస్తూ ఈరోజుల్లో కొంతమంది అనే మాట కాదు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమైన మాట. ప్రతి క్రైస్తవ దంపతులు దేవుడే మమ్ములను జతకలిపియున్నాడనే నిశ్చయత కలిగియుంటే ఎంత బాగుండును?

తల్లిదండ్రుల నిర్ణయమా లేక సొంత నిర్ణయమా

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, మిత్రుల ద్వారానో లేక తల్లిదండ్రుల ద్వారానో దేవుడు నీకొరకు ఏర్పరచిన వ్యక్తి దగ్గరకు ఆయన నిన్ను నడిపించవచ్చును. బైబిల్లో, ఇస్సాకు మరియు రిబ్కాల విషయములో మాత్రమే దేవుని స్పష్టమైన నడిపింపు కనిపిస్తుంది. అబ్రాహామునకు గాని లేక అతని సేవకునికి గాని రిబ్కాను గురించి ఏమియు తెలియదు. కాబట్టి ఇస్సాకు పెళ్ళి కేవలము తల్లిదండ్రుల ద్వారానే ఏర్పాటు చేయబడలేదు. పెళ్ళికాక ముందు ఇస్సాకు మరియు రిబ్కా ఒక్కసారి కూడా కలుసుకోలేదు గనుక అది వారు కూడా నిర్ణయించుకున్నది కాదు. అది దేవుడే నిర్ణయించాడు.

ఆయన బిడ్డలను ఆయనే ఏకము చేశాడనేది ముఖ్యము కాని ఏ పద్ధతి ద్వారా దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడన్నది కాదు. ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పాటుచేయబడిన వ్యక్తియేనా అనేది ముఖ్యము గాని ఆ వ్యక్తి యొద్దకు తల్లిదండ్రుల ద్వారానా లేక స్నేహితుల ద్వారానా లేక మనమే నడిపించబడ్డామా అనేది ముఖ్యము కాదు.

నీ అవసరమును తీర్చాలని దేవుడు ఆసక్తిగా ఉన్నాడు

యౌవనస్తులైన విశ్వాసులలో చాలా మంది జీవిత భాగస్థులను, ఎన్నుకొనే సమయములో అనేక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చదువు, సాంప్రదాయాలు మొదలైనవేమైనా అడ్డువస్తాయేమోనని జాగ్రత్తపడతారు. అలాంటి వాళ్ళు వారి సమస్యలన్నిటి కంటే దేవుడు ఎంతో గొప్పవాడనే విషయాన్ని మరచిపోతారు. వారి సమస్యల విషయములో దేవునికి ఎటువంటి ఆసక్తి లేదనే భయాన్ని కలిగియుంటారు. దీనిని వారు బయటకు చెప్పకపోవచ్చును కాని వారి నిర్ణయాలు(క్రియలు) వారిని మోసగిస్తాయి.ఇలాంటి వారికి సంతోషకరమైన శుభవార్త అందిస్తున్నాను: ''ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు,.... ఆయన నీ గురించి జాగ్రత్త తీసుకుంటాడు'' (1 పేతురు 5:7). ఆదాముకున్న భార్య యొక్క అవసరాన్ని దేవుడే స్వయముగా చూచి, ఆదాముకు ఆయన భార్యను అనుగ్రహించాడని గుర్తుపెట్టుకొనుము(ఆది 2:18). ఆదాము దేవుని దగ్గరకు వెళ్ళి భార్య కావాలని అర్ధించలేదు. ఆదాము గురించి శ్రద్ధవహించిన దేవుడు, నిన్ను గురించి కూడా శ్రద్ధవహిస్తాడు.

దేవుణ్ణి విశ్వసించి ఆయన నడిపింపు కొరకు సహనముతో వేచియుండాలి. ఆవేశము వలన ఏమియు జరుగదు. అక్కడ సుందరమైన సాదృశ్యము ఉన్నది. దేవుడు ఆదాముకు నిద్రను కలుగజేసి మరియు అతనిని లేపిన తరువాత, హవ్వను అతని దగ్గరకు తీసుకొనివచ్చాడు(ఆది 2:21,22). నిద్ర విశ్రాంతికి సూచనగా ఉన్నది. ఆయన సిద్ధపరచిన వ్యక్తిని దేవుడు మనయొద్దకు తెచ్చువరకు మనము ఆయనలో విశ్రాంతిలో ఉండాలి. ఇక్కడ నేను చెప్పే విశ్రాంతి బాహ్యమైన విశ్రాంతి కాదు గాని మన ఆత్మలో, అంతరంగములో ఉండే విశ్రాంతి. కాబట్టి వివాహ భాగస్వామి కొరకు మనమేమియు చేయకూడదని కాదు.

ఈ విశ్రాంతిని మనము ఏవిధముగా కలిగియుండగలము? ''నాకాడి యెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడని'' యేసు చెప్పారు అనగా నీ జీవితములో ''నా చిత్తమును నెరవేర్చుము అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును'' (మత్తయి 11:29). అవికా జాతి మధ్య పనిచేసిన సువార్తికుడు జివ్‌ు ఎలియెట్‌ చెప్పినట్లుగా ''దేవుని చిత్తములో విశ్రాంతిలో ఉండాలి''. ఈవిధముగా చేస్తే మనకు తగిన వ్యక్తి దగ్గరకు మనలను తగిన సమయములో దేవుడు నడిపిస్తాడు. మిగతా విషయాలలో మనము దేవుని చిత్తము చేయుచున్నట్లయితే, ఈ విషయములో దేవుని చిత్తము జరుగదేమోనని భయపడవలసిన పనిలేదు. యౌవనస్తులు చదువుటకు మూడు మంచి పుస్తకములు ఉన్నవి. శ్రీమతి హోవర్డ్‌ టెయిలర్‌ రచించినది ట్రయంఫ్‌ ఆఫ్‌ జాన్‌ అండ్‌ బెట్టి స్టావ్‌ు, ఎలిజబెత్‌ ఎలియట్‌ రచించిన షాడో ఆఫ్‌ ది ఆల్‌మైటీ, జె.సి పొలాక్‌ రచించిన హడ్సన్‌ టేలర్‌ అండ్‌ మరీయ. ఇవి చాలా మంచి పుస్తకాలు.

దేవుణ్ణి నమ్ముటకు మనము ఇష్టపడాలి. ''విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను'' (హెబ్రీ 11:6). ఆయన చిత్తము చేయాలనే బలమైన కోరిక నీలో ఉంటే అనుమానం లేకుండా ఆయన నీకొరకు ఎన్నిక చేసిన వ్యక్తిని నీయొద్దకు నడిపిస్తాడు. ఇది తల్లిదండ్రుల ద్వారా కాని, మిత్రుల ద్వారా కాని లేక ప్రత్యక్షంగానైనను జరుగవచ్చును. ఏదో ఒక పద్దతి ఆయనే నిర్ణయిస్తాడు. తన సమయములో, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును(కీర్తన 37:4).

నీకు తగిన వ్యక్తిని దేవుడు, మీ సంఘములో నుండి గాని లేక వేరే సంఘము నుండి గాని నీ యొద్దకు నడిపిస్తాడు. నీవు ఒక వ్యక్తి విషయములో ఆకర్షింపబడిన యెడల, ఆ వ్యక్తిని నీవు క్రైస్తవ కూటములలో కలసిననూ పరవాలేదు. మీరిద్దరు కలుసుకొనుటకు దేవుడే ఆ పరిస్థితిని కలిగించియుండవచ్చును. ప్రేమ, లైంగిక విషయాలలో తప్పుడు అభిప్రాయము కలిగిన వారికి యిటువంటి కూటములలో అపరిశుద్ధముగా అనిపించవచ్చును. అయితే జీవిత భాగస్వామిని అన్వేషించడములో అపవిత్రత ఏమియు లేదు. దేవుని దృష్టిలో అది పవిత్రమే, నీవు శుద్ధ హృదయము కలిగియుండి క్రైస్తవ సత్ప్రవర్తన నీలో ఉంటే ఎవరేమి చెప్పుకున్నను భయపడవలసిన పనిలేదు.

ఇది ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇటువంటి విషయాలలో నాకు కొంత అనుభవము ఉన్నది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని క్రైస్తవ సహవాస కూటాలలో తగిన వ్యక్తులను ఎన్నుకోకుండా ఉండి, నామకార్ధ క్రైస్తవ తల్లిదండ్రుల ప్రోద్భలంతో అవిశ్వాసులనెవరినో పెళ్ళి చేసుకుంటారు. మానవుల పట్ల వాళ్ళకున్న భయంకొద్దీ సాతాను జాగ్రత్తగా పన్నిన వలలో పడతారు(సామెతలు 29:26). ఇలా జరుగుట వలన మంచి క్రైస్తవ కుటుంబాలు అటు దేవునికి ఇటు సంఘానికి దూరమయ్యాయి.

కొంతమంది విశ్వాసులకు నిజ క్రైస్తవ సహవాసము ఎక్కువగా లభించుటకు అనుకూల పరిస్థితులు కలుగకపోవచ్చును. ఒకవేళ కలిగినా నూతనముగా జన్మించిన క్రైస్తవులను చాలామందిని ఎరిగి యుండకపోవచ్చును. వ్యాధులు, కుటుంబ వ్యవహారాలు, దురదృష్టకరమైన కుటుంబ సమస్యలు, సంప్రదాయాలు అడ్డురావచ్చును. ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళు సరైన వ్యక్తులను ఎలా ఎన్నుకోవాలా అని విచారించవచ్చును. అనేక విధాల ప్రయత్నము చేసి ఆశలు అణగారిన వాళ్ళు తల్లిదండ్రులు ఏర్పాటు చేశారని గత్యంతరం లేక అవిశ్వాసులను చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆలోచనలన్నిటికీ కారణం అల్ప విశ్వాసము. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? ఆయనకు మనలోని ప్రతివారి పట్ల ఆసక్తి లేదా? నీ పరిస్థితి నీకు కష్టంగా ఉంటే దేవునికది అసాధ్యం కాదని గుర్తుంచుకొనుము. ఆయనయందు విశ్వాసముంచుము. నీ నమ్మికచొప్పున నీకు జరుగుతుంది(మత్తయి 9:29). ఆయన యెడల నీవు యదార్ధమైన హృదయము కలిగియుండి, ఆయన నియమాల ప్రకారము నీవు నడుచుకుంటే, నీ పక్షముగా యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది (2దినవృత్తాంతములు 16:9).

సాంప్రదాయ అడ్డుగోడలు, తల్లిదండ్రుల వ్యతిరేకత, క్లిష్టపరిస్థితులు తదితర వెయ్యిన్నూటొక్క ఆటంకాలు ఎదురవ్వచ్చు గాని అనేక అద్భుతాలు చేసే దేవునికి అవి సమస్యలు కావు. అన్య కుటుంబములో నుండి రక్షింపబడిన ఒక అమ్మాయి నాకు తెలుసు. ఆమె కుంటుంబము నుండి వెలివేయబడింది. ఆమె వివాహ విషయము సహాయము చేసేవారు ఎవరూ లేరు. అయినను దేవుడే ఆమెకు ఒక విశ్వాసిని చూపెట్టాడు. అతని తల్లిదండ్రులు ఈవిషయములో ఎటువంటి ఆటంకము చెప్పకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఆమె పరిస్థితులను పట్టించుకోకుండా ఆ పెళ్ళికి వాళ్ళు అంగీకరించడము ఆశ్చర్యకరము.

మన పరిస్థితులన్నిటి మీద ఆయన అధికారము కలిగినవాడు మరియు ఆయన మన కన్న తండ్రి. మనము ఆయనను రొట్టె అడిగితే, రాయిని ఇవ్వడని నిశ్చయత కలిగి ఉండవచ్చును. ''మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవులనియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యీవులనిచ్చును'' (మత్తయి 7:11). మన జీవిత భాగస్వామి ఒక మంచి యీవి అని బైబిలు చెప్పుచున్నది(సామెతలు 18:22).

దేవుడు తన బిడ్డల యెడల తన నమ్మకత్వాన్ని ఋజువుపరచుటకు ఎదురు చూస్తున్నాడు. కాని మీరు సహనాన్ని కలిగియుండాలి. తొందరబాటుతో మీ సహనాన్ని కోల్పోవద్దు. చాలామంది ఆలాగున సహనాన్ని కోల్పోయారు. పూర్ణహృదయముతో దేవుని యందు విశ్వాసము ఉంచండి. ఎవరైతే ఆయనను పూర్తిగా విశ్వసిస్తారో, వారు ఆయనను పూర్తిగా పొందుకుంటారు. తనపరిస్థితి మినహాయింపని ఎవరూ చెప్పలేరు. దేవుడు అన్నిటినీ పరిపాలించేవాడుగా ఉన్నాడు.

''దైవచిత్తాన్వేషణ'' అనే నా పుస్తకములో దేవుని చిత్తము ఏలాగు కనుగొనవలెనో వ్రాశాను కాబట్టి ఇక్కడ దాని గురించి చెప్పను. నూతనపరచబడిన మన మనస్సుల ద్వారా దేవుడు మనలను నడిపిస్తాడు. మనము ఒక వ్యక్తిని ఎన్నుకొనేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని మాత్రము ఇక్కడ ప్రస్తావించాను.

ఏకత్వము

ఆదాముకు సాటియైన సహాయముగా ఉండుటకు దేవుడు హవ్వను చేశాడు. కాబట్టి ఆమె అనేక విషయాలలో ఆదాముతో ఏకీభవించవలసి ఉన్నది. నీ విషయములో కూడా నీవు వివాహము చేసుకోబోయే వ్యక్తి అనేక విషయాలలో నీతో ఏకీభవించవలసియుంటుంది. వివాహములో ఇద్దరు ఒకటవుతారు. సమ్మతించకుండా ఇద్దరు కలసి నడతురా అని (ఆమోసు 3:3) లో

బైబిలు చెప్పుచున్నది. ఒక వివాహము విజయవంతము కావాలంటే ఐక్యత ఉండాలి, సమ్మతించాలి. ఆత్మ ప్రాణము, దేహము కలిగిన ఇద్దరు ఒకటవ్వాలంటే, ఈ విషయాలలో ఎంతో ఐక్యత అవసరము. ఏ స్త్రీ పురుషులైతే ఆత్మ ప్రాణ దేహము విషయములో ఐక్యమవుతారో, వారి వివాహము దేవునికిష్టమైనదిగా ఉంటుంది. ఆ ఐక్యత మూడురెట్లు ఉంటుంది కాబట్టి (ప్రసంగి 4:12) లో చెప్పినట్లు అది తెగిపోదు. ఇక్కడ విడాకుల గురించి మాత్రమే కాకుండా, భార్యాభర్తల మధ్య ఐక్యత గురించి చెప్పబడింది.

వివాహములో దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటే ఆ వ్యక్తిలో మూడు విషయాలు క్షుణ్ణంగా చూడాలి. ఒకదాని తరువాత ఒకటి చూద్దాము(ఇవి మగవారికే కాదు ఆడవారికి కూడా వర్తిస్తాయి).

ఆత్మ

మనిషిలో ఆత్మ అత్యున్నతమైంది గనుక ఆత్మతో ఆరంభిద్దాము. ఆత్మ విషయములో ఐక్యత లేనట్లయితే వేరే వాటిలో చూచుట వ్యర్ధము. మనుష్యుని ఆత్మ దేవునిఆత్మ (పరిశుద్ధాత్మ)తో నింపబడి దేవునితో సహవాసము చేయును. ఒకవ్యక్తి నామకార్ధ క్రైస్తవుడైయుండి, సంఘములో చురుకుగా ఉన్నప్పటికీ అతడు మారుమనస్సు పొంది క్రీస్తును తన జీవితములోనికి ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా స్వీకరించి నూతనముగా జన్మించనియెడల అతని ఆత్మ మృతమైయుండును.

మృతులు సజీవులతో ఐక్యమవ్వడం అసాధ్యము గనుక ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్ళి చేసుకోకూడదు. నీవు ప్రభువుతో ఏకమైతే, నీ ఆత్మ ప్రభువు ఆత్మతో ఒకటైపోయింది(1 కొరిందీ¸ 6:17). కాబట్టి ఎవరైతే ఆలాగున ప్రభువుతో ఒకటైయున్నారో వారితో వివాహం గురించి ఆలోచించాలి. ఒక పురుషుడు, స్త్రీ మరియు ప్రభువు ఒక్కటైనప్పుడే అది ఒక నిజమైన క్రైస్తవ కుటుంబము అవుతుంది. అంతకంటే తక్కువగా ఉన్నదానిని క్రైస్తవ వివాహమనలేము.

అధ్యాయము 6
అర్ధాంగి కోసం అన్వేషణ

మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?(2 కొరిందీ¸ 6:14). కాడి అనేది పెళ్ళికి గుర్తు. ఆ సాదృశ్యంలో ఉన్న విషయమేమిటంటే రెండు ఎద్దులు కలసి పొలాన్ని దున్నుట, అనగా సంసార జీవితములో భార్యాభర్తల మధ్య అలాంటి సామరస్యము ఉండాలని అర్ధము. పాత నిబంధనలో ఎద్దును గాడిదను కలిపి అరకలు కట్టొద్దని ఉంది(ద్వితీ 22:10). ఆ రెండూ వేరు వేరు స్వభావములు గల జంతువులు. విశ్వాసికి, అవిశ్వాసికి అలాంటి తేడా ఉన్నది. అందుకే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు దయ్యముతో ఏమి సాంగత్యము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?(2 కొరిందీ¸ 6:14,15) అని బైబిలు ప్రశ్నిస్తుంది.

నీవు దేవుని బిడ్డవైయుండి అవిశ్వాసిని పెళ్ళిచేసుకున్నట్లయితే(అనగా అపవాది బిడ్డ యోహాను 8:44; 1 యోహాను 3:10) అప్పుడు అపవాదియే నీకు మామగారు అవుతాడు. అలాంటి మామతో జీవితాంతము కష్టాలకు గురికావలసి వస్తుంది. ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసుకుంటే ఒక ఆత్మను నరకము నుండి రక్షించవచ్చునని కొందరు విశ్వాసులు తృప్తి పడతారు.

ఒకవేళ అలాగైతే నిజమైన విశ్వాసులందరినీ అలాగే చేయమని దేవుడు చెప్పియుండేవాడు. తన వాక్యములో ఆయన అలాగున ఎందుకు చెప్పలేదు? నిశ్చయముగా వివాహము ద్వారా ఆయన ఆత్మలను రక్షించాలనుకోలేదు. వాక్యానుసారము కాని ఆత్మలను రక్షించే విధానాన్ని ప్రభువు అంగీకరించడు. నీ భాగస్వామి వివాహానికి ముందు రక్షింపబడనట్లయితే, వివాహమయిన తరువాత రక్షణ పొందుట కష్టము.

ఎటువంటి పరిస్థితిలోనైనను విశ్వాసి అవిశ్వాసిని వివాహమాడితే అతను దేవుని వాక్యానికి మరియు దేవునికి అవిధేయత చూపించిన వాడవుతాడు. అలాంటి వివాహాన్ని ఆశీర్వదించమని అడగటం సబబు కాదు.

ఎట్టిపరిస్థితిలోనైనా సరే తన బిడ్డ ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసుకోటానికి దేవుడు అంగీకరించడు(మీరు మర్చిపోకముందే ఒక విషయాన్ని గుర్తు చేయనివ్వండి. నామకార్ధ క్రైస్తవుడు ఒక అవిశ్వాసితోను నాస్తికునితోను సమానుడు). విశ్వాసులు చేసుకొన్న అవిశ్వాసులలో కొందరు రక్షణపొందియున్నారని, కొన్ని జరిగిన సంఘటనలను ఉదహరించడం అనవసరము. ఎందుకంటే

మనము వాక్యముతోనే నడిపించబడాలి కాని వేరే వారి ఉదాహరణలతో కాదు. దేవునిలోనుండి శ్రేష్టమైన దానిని పొందాలనుకునే వారు అవిశ్వాసిని వివాహమాడే దానికన్నా ఒంటరిగా ఉండుట ధన్యకరము.

రక్షణపొందని వ్యక్తిని చేసుకోవాలని ఎవరు చెప్పినా చివరకు తల్లిదండ్రులు చెప్పినా ఆమాట వినాలని ఎక్కడా లేదు. ప్రభువు చిత్తమైతేనే మనము మన తల్లి దండ్రుల మాట వినాలి(ఎఫెసీ 6:1). ఇటువంటి విషయాలలో మనస్సాక్షికి వ్యతిరేకముగా గాని లేక దేవుని వాక్యానికి వ్యతిరేకముగా గాని మనము చేయకూడదు. తల్లిదండ్రులకు ఇష్టము లేకపోయినా, ఒక విశ్వాసి ప్రభువుకే నమ్మకముగా ఉండాలి. (మత్తయి 10:32-39)లో ప్రభువే ఆలాగున చెప్పారు. 37వ వచనములో ''తనకంటే ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమించు వాడు తనకు పాత్రుడు కాడని'' ప్రభువు చెప్పారు. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధి గల భార్య యోహోవా యొక్క దానము(సామెతలు 19:14).

కొన్నిసార్లు ఒక అమ్మాయి చేత నీవు ఆకర్షించబడవచ్చును. ఆ తరువాత ఆ అమ్మాయి నిజముగా రక్షణ పొందలేదని గమనించవచ్చును. ఒకవేళ నీవు రక్షణ పొందేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావనుకో, అప్పుడు ఆ అమ్మాయికి రక్షణ లేదని నీకు తేటగా తెలిసినప్పటికినీ రక్షణ ఉన్నట్లు భావించుకొనే శోధన నీకు రావచ్చును.

నీవు యదార్ధముగా ఉండి పరిశీలిస్తే నిన్ను నీవు మోసగించుకొనవు. ఆ అమ్మాయి యొక్క రక్షణ అవసరాన్ని గుర్తించి ఆమెకు సువార్తను బోధించాలి. అయితే దానివల్ల లభించే స్పందన నిజమైనదైయుండాలి. నీ పట్ల ఆ అమ్మాయికున్న ఆకర్షణ వలన మారుమనస్సు పొందినట్లు ప్రవర్తించవచ్చును. అది నిజమైన మారుమనస్సు కానట్లయితే కొంతకాలానికి తెలిసిపోతుంది. అలాగని సువార్త ప్రకటించవద్దని కాదు. అది పైపై భక్తియైయుండవచ్చునని మాత్రమే చెప్పుచున్నాను.

ప్రభువు సేవలో ఆసక్తి కనబరచే ఒక విశ్వాసి నాకు తెలుసును. అతని తల్లిదండ్రులు అతనికి పెళ్ళి ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి పేరుకు మాత్రమే క్రైస్తవురాలు. అప్పటికింకా ఆమె రక్షణ పొందలేదు. ఆమెకతను సువార్తను బోధించినప్పుడు తాను రక్షణపొందినట్లు చెప్పింది. ఇదంతా పెళ్ళికాక ముందు జరిగింది. కాని తీరా పెళ్ళి అయ్యాక ఆమె అసలు బుద్ధి బయటపడింది. పెళ్ళయిన తరువాత నాలుగు నెలలు గడిచేసరికి ఆమె నిజమైన రక్షణ పొందలేదని తెలిసింది. ఇంకా కొంతకాలానికి అతను చేసే ప్రభువు సేవకు అభ్యంతరకారణముగా అయింది. చివరికతను తన సాక్షి జీవితాన్ని మరియు ఆసక్తిని కోల్పోయాడు.

ఇలాంటి ''మారుమనస్సు పొందిన'' వారితో జాగ్రత్తగా ఉండాలి.

మారుమనస్సు పొందనివారిలో ఆకర్షణీయమైన గుణాలెన్నిటినో సాతాను మనకు చూపిస్తాడు. అనేక విషయాలలో ఆ అమ్మాయి ఎంత ఆకర్షణీయంగా ఉందో అతడు చూపిస్తాడు. అమ్మాయి అందముగా ఉన్నది. చక్కగా సర్దుకుపోతుంది అని చెవులలో చెప్తాడు. అయితే అతనిని లక్ష్యపెట్టవద్దు. అతడు అబద్ధములకు జనకుడు. ఆది దంపతులను మోసగించినప్పుడు అందమైనదాన్ని మంచిగా ఉన్నదాన్ని చూపెట్టి మోసగించాడు(ఆది 3:6). కాని దేవుడు దాన్ని నిషేధించాడు. అలాగే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండుటకు ఆయన నిషేధించాడు (2 కొరిందీ¸ 6:14). అది ఎంత మంచిగా కనిపించినను దేవుడు నిషేధించిన దానిలో పాలివారమైతే ఎంతో నష్టపోతాము.

నీవు రక్షణ పొందకముందే ఆమెతో ప్రేమలో పడితే నీవు రక్షణపొందిన తరువాత నీ ఆత్మీయ స్థితిని ఆమెకు వివరించుము. ఇప్పుడు నీవు అందరికంటే ఎక్కువగా ప్రభువైన యేసు క్రీస్తునే ప్రేమిస్తున్నావని ఆమె తెలుసుకునేటట్లు నీవు చేయాలి. ఆమె కూడా అలా రక్షణ పొందితేనే వివాహము గురించి ఆలోచిస్తానని చెప్పాలి. మీ జీవితాలలో క్రీస్తును ఎక్కువగా ప్రేమించనట్లయితే, మీ ఇల్లు నిజమైన క్రైస్తవ కుటుంబముగా ఉండదు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు(1 సమూ 2:30). ఆమెతో నీకున్న సంబంధాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడు ఆమెను నీకొరకు ఏర్పరచినట్లయితే, ఆయనే ఆమెను క్రీస్తుకు లోబడేటట్లు చేసి, అబ్రాహాముకు ఇస్సాకును తిరిగి ఇచ్చినట్లే నీకును ఆమెను తిరిగి ఇస్తాడు(ఆది.కా 22వ అధ్యాయం). ఒకవేళ దేవుడు ఆమెను నీకొరకు ఏర్పరచకపోయినట్లయితే, ఇష్మాయేలును అబ్రాహాము నుండి తొలగింపజేసినట్లే ఆమెను నీ నుండి తొలగింపజేస్తాడు(ఆది.కా 21వ అధ్యాయం). నీవు దేనికైనా ఇష్టపడాలి. దేవుడు ఎవరికి ఋణపడియుండడు కాబట్టి నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన అనుగ్రహించే శ్రేష్టమైన దానిని పోగొట్టుకొనవు.

వివాహితులు ఇద్దరు నిజముగా రక్షణ పొందినట్లయితే, దేవుని క్షమాపణ పొందుతూ దేవునిలో ఆనందిస్తారు. మరలా మరలా ఒకరినొకరు క్షమాపణ అడుగుటకును మరియు క్షమించుటకును ఇష్టపడతారు. అలాకానట్లయితే కుటుంబాలు విడిపోతున్నాయి.

క్రొత్తగా జన్మించుట మాత్రమే సరపోదు. ఆత్మీయ విషయాలలో ఆత్మలో ఐక్యత అవసరము. ప్రభువును ప్రేమించుట విషయములోను విశ్వాసులలో చాలా తేడాలు ఉంటాయి. ఒక ''వెచ్చగా'' ఉన్న క్రైస్తవుడు ఒక ''నులి వెచ్చని'' వ్యక్తిని పెళ్ళి చేసుకున్నట్లయితే చివరకు ఇద్దరు నులివెచ్చని వారు అవుతారు. ''వెచ్చగా'' (ఎంతో ఆసక్తిగా ఉన్న) వ్యక్తి, నులివెచ్చని స్థితికి దిగజారిపోతాడు. కాబట్టి ఆమె క్రొత్తగా జన్మించి ఉంటే సరిపోదు. దేవుని విషయములో నీకు ప్రోత్సాహకరంగా ఉంటుందా? లేక అభ్యంతరముగా ఉంటుందా? అని చూడాలి. దేవుని యెడల నీకున్న ఆకలిదప్పులు మరియు లోతైన ఆత్మీయ అనుభవము ఆమె కలిగియుండి మరియు ఆత్మీయ విషయాలలో ఆమె నిన్ను ప్రోత్సహించేదిగా ఉండాలి. వారిద్దరూ ఆత్మీయులైతే, ఒకరిని ఒకరు గౌరవించుకొని, ఒకరికంటే ఒకరు యోగ్యులని యెంచుకుంటారు(ఫిలిప్పీ 2:3).

అటువంటి భార్య నీకు ఉంటే, నీవు ఆత్మీయముగా పడిపోయినప్పుడు ఆమె నిన్ను ప్రోత్సహిస్తుంది. అలాగే నీవు కూడా ఆమెకు చేయవచ్చును. నీవు ఆత్మీయముగా మొద్దుబారినప్పుడు ఆమె పదును పెడుతుంది మరియు నీవు కూడా ఆమెకు అలాగే చేయవచ్చును(ప్రసంగి 4:10). అటువంటి భాగస్వామి విలువ వెల కట్టలేనిది.

కాని ఆత్మీయతను ఏవిధంగా తెలుసుకోవాలి? మత విషయాలలో వారికున్న ఆసక్తిని బట్టియా? ఆమె బైబిలు పఠనా కూటములు ఏర్పాటు చేస్తూ, ఇళ్ళల్లో సువార్తను ప్రకటిస్తూ మరియు ఆత్మీయురాలై యుండినప్పటికినీ కొందరు భార్యగాను మరియు తల్లిగాను రాణించలేరు. ఆత్మీయముగా(ఆత్మానుసారముగా) ఉండుట మరియు మత కార్యక్రమాలలో పాలుపొందుట ఒకేలా కనిపించే వేరు వేరు విషయాలు అని గుర్తుంచుకోవాలి. పెళ్ళయిన క్రొత్తలో పిల్లలకు ఎక్కువ సమయము కేటాయించాల్సి యుంటుంది(పిల్లలు కొన్నిసార్లు నిద్రాభంగం కూడా చేస్తారు). కాబట్టి నీ భార్యకు బైబిలు ధ్యానించుటకు, ప్రార్ధించుటకు మరియు పరిచర్యకు వెళ్ళుటకు ఎక్కువ సమయము ఉండదు. కాబట్టి ఆత్మీయత అంటే కేవలము బైబిలు చదివి, ఏదో ఒక మత సంబంధమైన పనులు చేయుట మాత్రమే అనుకొనే వారికి ఈ విషయాలన్నిటిని బట్టి విసుగుకొని అలిగెదరు. ప్రభువుతో సహవాసము చేయుటకు అభ్యంతరముగా ఉందని అనుకుంటారు.

క్రొత్తగా జన్మించిందా లేదా అని తెలుసుకొనుటకు మరియు ఆమె ఆత్మీయతను వివేచించుటయు అంత సులభము కాదు. ఈనాడు లోకములో అనేకులు నటించేవారుగా ఉన్నారు కాబట్టి తెలుసుకొనుట ఇంకా కష్టమైపోయింది. కొంతమంది మాత్రమే నిష్కపటముగా ఉన్నారు. చాలామంది విశ్వాసులు వారికున్న ఆత్మీయత కంటే ఎక్కువ ఆత్మీయులైనట్లు కనపరచుకోవాలని కోరుచున్నారు. ఇది యౌవనస్తులలో వాస్తవమైయున్నది. మరి ఎక్కువగా సహవాస కూటాలకు క్రమముగా వెళ్ళే వారిలో ఉన్నది. దీనిని మనము జ్ఞాపకముంచుకోవాలి. లేనట్లయితే పైరూపాన్ని చూసి మోసపోవచ్చు. సరిగా బేరీజు వేయుట చాలా కష్టం అయినప్పటికినీ వివాహ విషయములో ఇది చాలా ముఖ్యం. నోటిమాటలతో నేను రక్షణ పొందాను అని చెప్తే తృప్తిపడకూడదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు క్రొత్త జన్మ అనుభవం లేకపోయినప్పటికీ ఉన్నట్లు చెప్పవచ్చు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటామని ప్రభువు చెప్పారు(మత్తయి 7:16). మనము ప్రతి రోజు ప్రభువుతో నడిచినట్లయితే తగిన సమయములో సరియైన నిర్ణయము తీసుకొనునట్లు ఆయన సహాయపడెదరు.

ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే దాని కొరకు మనము చూడాలి(గలతీ 5:22,23). క్రైస్తవ సహవాస విషయములోను మరియు ప్రభువు పరిచర్య విషయములోను ఆసక్తి కలిగిన వ్యక్తియైయుండాలి.

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణము కలిగిన అమ్మాయియైయుండాలి(1 పేతురు 3:4). అంతేగాని 20వ శతాబ్దపు అమ్మాయిలలో కొందరిలాగా గొడవచేస్తూ, పెత్తనం చేస్తూ వాళ్ళను ఆడవాళ్ళుగా చేసి దేవుడు పొరపాటు చేశాడని అనిపించే విధంగా ఉండకూడదు.

(సామెతలు 31:10-31)లో గుణవతియైన భార్య లక్షణాలను బైబిలు వివరించింది. ఈ గుణాలను మనస్సులో పెట్టుకొని అమ్మాయిని పరిశీలించుట అబ్బాయికి మంచిది. బాహ్య సౌందర్యం, ఆకర్షణ వ్యర్ధమని, మోసకరమని వాక్యం చెబుతుంది(సామెతలు 31:30). ఆమె ఎంత పరిశుద్ధురాలైతే అంత ప్రభువు దృష్టికి అందంగా ఉంటుంది. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఇతరులను దేవుడు చూసినట్లు చూచుటను నేర్చుకోవాలి. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు కావలసిన షరతున ''రూపాంతరము పొందిన మనస్సు అని రోమా 12:2లో చెప్పబడింది''. దేవుడు హృదయమును చూస్తాడు గాని పైరూపమును చూడడు(1సమూ 16:7). ఇంకను మనము బాహ్య సౌందర్యాన్ని చూసినట్లయితే, దేవుని చేత నడిపించబడలేము. అప్పుడు మనము మోసపోయి, తప్పిపోవుటకు సాతానుకు ద్వారాన్ని తెరుస్తాము.

అన్ని మంచి లక్షణాలు కలిగిన గుణవతియైన భార్యను గురించి (సామెతలు 31:10-31) లో చెప్పబడింది. అదంతా ముఖ్యంగా అంతరంగ స్వభావానికి సంబంధించినదే. ఆమె ఎటువంటి అవమానము కలిగియుండదు. ఆమె తనకంటే తన భర్త క్షేమాన్ని ఎల్లప్పుడు కోరుకుంటుంది. కష్టించి సంతోషముగా తనపని తాను చేసుకుంటుంది. తన కుటుంబ భవిష్యత్తును దూరదృష్టితో పరశీలిస్తుంది. ఇంటిపని యేదైనా తన చేతులతో చేయడానికి వెనుదీయదు. డబ్బు ఖర్చు చేసే విషయములో పొదుపుగా ఉంటుంది. అలాగని పిసినారి కాదు. అవసరము ఉన్న వారికి సహాయం చేసే విషయములో కనికరముతో ఉంటుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మరియు ఎప్పుడు మౌనంగా ఉండాలో ఆమెకు తెలుసు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఆమె సమయాన్ని వృధా చెయ్యక, సద్వినియోగం చేసుకుంటుంది. అలాంటామెను తన భర్త, పిల్లలు మరియు దేవుడు కూడా మెచ్చుకుంటారు.

ఒక అమ్మాయిలో ఈ గుణలక్షణాలన్నీ ఉన్నాయా లేదా అని ఖచ్చితముగా తెలుసుకొనుట కష్టమే. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, ఈ విషయాలన్నీ మనస్సులో పెట్టుకొని ఒక నిర్ణయము తీసుకోవాలి.

ఇప్పుడు ఆత్మీయముగా సరిగా లేకపోయినను పెళ్ళైన తరువాత ఆమెను బలపరచవచ్చని సాతాను ఇచ్చే సలహా విషయములో జాగ్రత్తపడాలి. అది జరుగుట చాలా అరుదు. ఇప్పుడు ఆమె ప్రభువుకు సమర్పించుకోకపోతే, తరువాత చేస్తుందని చెప్పలేము. బల్లమీద నిల్చొని క్రిందవున్న వానిని బల్లమీదకు లాగాలంటే చాలా కష్టం. క్రిందవున్న వ్యక్తి పైనున్న వ్యక్తిని క్రిందకు లాగటం చాలా తేలికగా ఉంటుంది. ఆత్మీయ విషయములో కూడా ఇది నిజము.

నిజమైన క్రైస్తవ వివాహము చేసుకొనుటకు, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితియే నీకు ఆకర్షణగా ఉండాలి. నీవు మొదటిగా దీనిని చూచినట్లయితే, దేవుడు నీకొరకు ఏర్పరచిన వ్యక్తితో మిగిలిన విషయాలు కూడా ఉంటాయి. మత్తయి 6:33లో ఉన్న నియమము ఈవిషయములో కూడా పనిచేస్తుంది. ''దేవుని రాజ్యమును, నీతిని(మంచితనాన్ని) మొదట వెదకుము అప్పుడవన్నియు అనుగ్రహించబడును''. ఆత్మీయ విషయములను నిర్లక్ష్యము చేస్తే, దేవుడు సిద్ధపరచిన శ్రేష్టమైన దానిని పోగొట్టుకుంటాము.

ప్రాణము

ఒకని ప్రాణములో మనస్సు, ఉద్రేకములు మరియు చిత్తము ఉంటాయి. మంచి వివాహానికి ఈ విషయాలలో కూడా సమతుల్యత ఉండాలి. ఈ విషయాలలో ఆత్మీయ విషయాలలో ఉన్నంత ఖచ్చితంగా ఉండనవసరం లేదు. ఈ విషయాలలో సమతుల్యత లేకపోయినా కొన్నిసార్లు దేవుడు వివాహానికి నడిపిస్తాడు. ఇక్కడ సామాన్యంగా జరిగే విషయం మాట్లాడుతున్నాం.

ఆత్మ తరువాత ప్రాణము ప్రాధాన్యత వహించినా, ఇది శరీరము కంటే ముఖ్యమైంది. ఆత్మీయ విషయాన్ని పరిశీలించిన తరువాత, ఒక యౌవనస్తుడు తనకు తాను ఈ ప్రశ్న వేసుకోవాలి. ఆ అమ్మాయి ఎలా కనిపిస్తుంది అని కాదు గాని తెలివితేటలలో మరియు ఉద్రేకాలలో సరిపడుతుందా? సాధారణముగా దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు మానసికంగా సరిపోయి ఉంటారు. మానసిక వయస్సు మరియు శారీరకంగా ఉండే వయస్సు వేరుగా ఉంటాయి. కొందరు 25 సంవత్సరాలు వచ్చినను, 15 సంవత్సరముల వారి వలె ప్రవర్తిస్తారు. కొందరు శారీరకముగా ఎదిగే కొలది మానసికముగా ఎదుగరు. అది ఒక రోగము ద్వారా కాకపోవచ్చును. బహుశా తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడుట వలన గాని లేక పరిస్థితుల ప్రభావము వలన గాని అలా జరుగవచ్చును.

మానసిక ఎదుగుదల గురించి పరిశీలించుటకు కొన్ని కారణాలు ఉన్నాయి. వివాహ జీవితములో సంభాషణ(మాట్లాడు కొనుట) చాలా ముఖ్యమైన విషయము. వారిద్దరు ఏకీభవించే విషయాలు చాలా కొద్దిగా ఉన్నను లేక అసలు లేకపోయినను చాలా సమస్యలు వస్తాయి. వివాహ జీవితము కేవలము కొద్ది నెలలు మాత్రమే గాక అనేక సం||రాలు ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ ఇష్టమైన విషయాలు ఎక్కువగా ఉంటే మంచిది. ఇద్దరి తెలివి తేటల్లో ఎక్కువ వ్యత్యాసముంటే ఆ వివాహము సహజముగా ఉండదు. భర్తకంటే భార్య తెలివైనదైతే, ఆమె చేతిలో అతడు చదరంగంలో ఆడే పావుతో సమానం. ఒకవేళ భర్త తెలివిగలవాడైతే, భార్యకు ఊరు, పేరు లేకుండా పోతుంది. అప్పుడామె పనిమనిషి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కూడా కొందరు బాగుంటారు. ఇద్దరి తెలివి తేటలు సమానంగా ఉండాలని కూడా నేను చెప్పుటలేదు. నీవు డాక్టరువై ఒక చదువు రాని పల్లెటూరు అమ్మాయి ఎంత ఆత్మీయురాలైనప్పటికీ, పెళ్ళి చేసుకోవడం మంచిది కాదు. ఆమె తన భర్తకు సహాయకురాలిగా ఉండి, తాను చేసే పనుల్లో సహకరించేదిగా ఉండాలి.

ఏ.ఎస్‌ ట్రైటాన్‌ అనే వ్యక్తి తాను వ్రాసిన ''ఎవరి ప్రపంచము'' అనే పుస్తకములో ఒక దృష్టాంతాన్ని పెర్కొన్నాడు.

''ఆయన ఇట్లు చెప్పుచున్నాడు, చదువు సంస్కారం ఉన్న ఒకవ్యక్తి ఈ రచయితకు తెలుసును. అతడు 20సం||ల ప్రాయములో రక్షణ పొందాడు. అప్పుడు ఒక క్రైస్తవరాలిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు. అంతగా చదువుకోని ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొనమని అడిగాడు. ఆమె పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడింది. వారి పెళ్ళైంది. కాని త్వరలోనే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆమె ఎప్పుడైనను ఏదియు చదువలేదు. అతడైతే పుస్తకాలను చదివి తినేశాడు. ప్రతీది పుస్తకాలలో ఉన్నట్లు జరగాలని అతడు పట్టుబడితే, అలాకాదు స్వభావ సిద్ధంగానే జరగాలని ఆమె పట్టుబడుతుంది. ఒకరినొకరు బాగానే ప్రేమించుకున్నారు. వారిద్దరు నిజమైన క్రైస్తవులే. కాని వాళ్ళిద్దరూ ఆనందింంచ దగ్గ విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. తత్ఫలితంగా మనస్పర్దలు, తదితర కష్టాలు వచ్చాయి. వారు క్రైస్తవులు కాకపోతే విడిపోయి యుందురేమో. ప్రార్ధనలు చేయట ద్వారా మేలు కలుగుతుందని అతను ఆశపడ్డాడు గాని దానివలన ప్రయోజనమేమీ జరుగకపోయేసరికి పూర్తిగా కృంగిపోయాడు. మనం తెచ్చిపెట్టుకున్న కష్టాలన్నిటినీ ప్రార్ధన ద్వారా పరిష్కరించలేము. చివరకు ఒక అనుభవము గల సువార్తికుడు వారికి లభించాడు. ఈ కష్టం పోవాలంటే ముందుగా తన వైఖరి మారాలని మానవతా దృష్టితో వారిద్దరి మధ్య ఏర్పడిన అగాధానికి వారధి కట్టాల్సింది అతనేనని ఆయన సలహా ఇచ్చాడు. దానికొరకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేయమని చెప్పాడు. వారిద్దరు ఒకరి యెడల ఒకరు కనికరము కలిగి, ఎక్కువగా ప్రార్ధించాలి. పరిస్థితులకు తగినట్టు ప్రవర్తించే గుణం కూడా ఉండాలి. క్రమేణా ఆమె పుస్తకాలు చదివి ఆనందించడం నేర్చుకుంది. ఆమెకు ఇష్టమైన వాటిపట్ల అతడు ఆసక్తిని చూపడం నేర్చుకున్నాడు. ఇలా జీవితం బాగా సాగిపోయింది. దురదృష్టవశాత్తు క్రైస్తవ వివాహాలు యిలాంటి కష్టాలకు గురవుతూ ఉంటాయి. ఎందుకనగా పెళ్ళి విషయములో దేవుని చిత్తమును గ్రహించక(ఆలోచించక) పోవుటవలన జరుగుతుంది.''

పైన చెప్పిన సంఘటనను బట్టి ఇద్దరి తెలివితేటల్లో కొంతవరకన్నా సమానత్వం లేకపోతే వారిద్దరి మధ్య పొత్తు కలవడం చాలా కష్టం. వారిద్దరు మంచి సహవాసం కలిగియుండుట దేవుని చిత్తము కాబట్టి ఇటువంటి విషయాలను నిర్లక్ష్యము చేయుట ఆత్మీయత కాదు.ఒక అమ్మాయి గురించి పరిశీలించేటప్పుడు ఒక వ్యక్తి వేసుకోవలసిన ఒక మంచి ప్రశ్న ఏమిటంటే,

''నా పిల్లలకు తల్లిగా ఉండి మరియు జీవితములోని సమస్యల విషయములో ఆమెతో కలసి ప్రార్ధించి, మాట్లాడుకొని పరిష్కరించుకొనుటకు ఆమె తగిన వ్యక్తియేనా? అని చూడాలి''.

వివాహ జీవితములో ఇద్దరు కలసియుండి, సహవాసము చేయాలి కాబట్టి వారి ఉద్రేకాల విషయములో కూడా కొంత సమతుల్యత ఉండాలి. శాంతముగాను, గంభీరముగా ఉండేవాడు ఎక్కువ ఉద్రేకంగా ఉండే అమ్మాయితో సరిజోడుగా ఉండలేడు. వారిద్దరు ఆత్మీయులైనప్పటికీ వారి ఉద్రేకాలలో కూడా సమతుల్యత లేకపోతే వివాహ జీవితములో సమస్యలొస్తాయి.

అలాగని బాగా ఉద్రేకముగా ఉండేవారు అలాంటి వారినే పెళ్ళి చేసుకొనమని కాదు. ఉదాహరణకు, ధైర్యము కలిగి గంభీరముగా ఉండేవాడు అటువంటి వ్యక్తినే పెళ్ళి చేసుకుంటే ఆ ఇల్లు ఒక సమాధిలాగా ఉంటుంది. కాని ఉద్రేకాలలో మరీ ఎక్కువ తేడాలు ఉంటే మాత్రం ఆలోచించాలి.సరదాగా ఉండే వ్యక్తిని గూర్చి పరిశీలించవచ్చును. అలాగని అతనేదో హాస్యగాడు కావాలని కాదు(కాకపోవుటయే మంచిది). కాని కనీసం తన గురించైనా నవ్వుకునే వాడై ఉండాలి. రెండు కారణాలను బట్టి వివాహ జీవితములో నవ్వుకోవటం మంచిది. మొదటిగా ఇది కోపంగా వాధించుకోవటాన్ని అరికడుతుంది. రెండవది అది జీవితానికి ఆనందాన్నిస్తుంది. నవ్వులు లేని పెళ్ళి తలనొప్పిగా తయారవుతుంది.

ప్రాణములో మూడవది చిత్తము. నీవు చెప్పే ప్రతిదానికి ''అవును'' అని చెప్పే ఒక(మానవ యంత్రం)లాంటి అమ్మాయిని చూడవద్దు. పెత్తనం చెలాయించే అమ్మాయిని చూసుకోవడం ప్రమాదకరము. తనకంటూ కొన్ని మంచి ఉద్దేశ్యాలు ఉన్న అమ్మాయి అయితే భర్తలకు మంచిది. అమ్మాయి భర్తకు లోబడాలి కాని ప్రతిదానికి ''అవును, సరేనండి'' అని చెప్పేలాగా ఉండకూడదు. భార్యల యొక్క యదార్ధమైన, నమ్మకమైన విమర్శల ద్వారా చాలా మంది పురుషులు మేలుపొందారు.

''నేను ఒక యౌవనస్తుణ్ణి ప్రేమించాను'' అనే పుస్తక రచయిత వాల్టర్‌ ట్రోబిష్‌ తన పుస్తకములో కాబోయే భార్య ఎలా ఉండాలోనని తన స్నేహితుడు తనకు వ్రాసిన ఉదంతాన్ని చెప్పాడు,

  1. నిర్మొహమాటంగా నన్నువిమర్శించి, నన్ను సవాలు చేసి తద్వారా నన్ను ఉత్తమునిగా రూపొందించాలి.
  2. నన్ను బట్టి నిరుత్సాహపడినప్పుడు, ఆమె ధైర్యాన్ని కోల్పోకూడదు.
  3. నాలో ఉన్న బలహీనతలను నేను జయించుటకు ఆమె సహాయము చెయ్యాలి.
  4. నేనెప్పుడైనా ఆమెను నొప్పిస్తే యేమీ దాచకుండా నాతో చెప్పాలి.

ఆమె నటించకూడదు. ఆమెకు కూడా స్వంత ఉద్దేశ్యము ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తికి బానిస కాదు కాని భాగస్వామి కావాలి.

శరీరము

శరీరము కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే కాబట్టి పెళ్ళిని గురించి ఆలోచించేటప్పుడు శరీర విషయములో ప్రాముఖ్యతనివ్వాలి. అయితే కొందరు చేయుచున్నట్లుగా కామ కోరికల్ని తీర్చుకొనుటకు పెళ్ళి చేసుకోకూడదు. అలాంటి వారికి పెళ్ళంటే చట్టబద్ధమైన వ్యభిచారం. అదే సమయములో ఆత్మీయ విషయాలే అవసరమైనవి కాని శరీర సంబంధమైన వాటిని పట్టించుకోకూడదు అనే వేరొక తీవ్రమైన భావన వైపు వెళ్ళచ్చు. లేఖనాలలో ఈ రెండు ఉద్దేశ్యాలకు మధ్యస్తమైన మార్గము ఒకటి ఉన్నది.అయితే మనము శరీరమును విడిచిన అశరీరులము కాదు. పెళ్ళి చేసుకొనే వారి మధ్య శరీర సంబంధమైన ఆకర్షణ కూడా ఉండాలి. ఆత్మ మరియు ప్రాణము తరువాత శరీర సౌందర్యమునకు ప్రాధాన్యతనిచ్చుటలో తప్పులేదు. అయితే ఎవరైతే శరీర సౌందర్యానికి మరియు రంగుకు ప్రాముఖ్యతనిస్తారో వారు తరువాత నిరాశపడతారు. ఒక అమ్మాయి విశ్వాసి అయినప్పటికీ ఆమె యొక్క ఆత్మీయతను బట్టి గాక కేవలము శరీర సౌందర్యాన్ని బట్టి ఆకర్షించబడితే తరువాత సమస్యలు వస్తాయి. అందమైన అమ్మాయిలలో ఎక్కువమంది వారి అందాన్ని గురించి ఎరిగియుండి పురుషుల దృష్టి వారిమీద పడాలని కోరుతుంటారు. అలాగే పెళ్ళైన తరువాత తన భర్త నుండి కూడా అదే కోరుకుంటారు. అందమైన భార్య నీ సమయాన్ని, గమనాన్ని మరియు అనేక కోరికలను కోరుతుంది.

వయస్సు కూడా ప్రాముఖ్యమైన విషయమే. భార్యాభర్తల సంబంధము, క్రీస్తుకు, సంఘానికి ఉన్న సంబంధముతో పోల్చబడి, భర్త తన భార్యకు శిరస్సుగా ఉండాలి కాబట్టి భర్త భార్యకంటే వయస్సులో పెద్దవాడైయుండాలి. పురుషుడు మానసికంగా ఎదుగుటకు స్త్రీ కంటే ఎక్కువ సమయం పడుతుంది. కనుక అతడు తక్కువ వయస్సు కలిగియుంటే అతనిలో మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇది మంచిది కాదు. ఎందుకంటే భార్యయే భర్తమీద ఆధారపడాలి. పురుషుడు ఎక్కువ వయస్సు కలిగినవాడైతే అతనికి లోకజ్ఞానము కూడా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు త్వరగా పెద్దవారవుతారు. ముఖ్యంగా పిల్లలను కనేసరికి ఇంకా పెద్దవారుగా కనిపిస్తారు. అప్పుడు ఇద్దరి మధ్య వయస్సులో ఈ తేడా మరి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి తనకంటే వయస్సులో పెద్దమ్మాయిని పెళ్ళి చేసుకోవటం మంచిది కాదు.

అయినప్పటికీ ఈ వయస్సు తేడా కొందరికి వేరుగా ఉంటుంది. అందరికి ఒకేలాగా ఉండదు. తేడా తప్పనిసరి అయితే అమ్మాయికి రెండు, మూడు సం||ల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. అంతకు మించితే ఆమె అతనికి అమ్మలా ఉంటుంది కాని భార్యలాగా ఉండదు. మానసికంగా తనకంటే చిన్నవాణ్ణి అమ్మాయి పెళ్ళి చేసుకోకూడదు. మరొక సంగతి కూడా గమనించాలి. ఏఅమ్మాయి అయినా తన కంటే పదేళ్ళకంటే పెద్దవాడిని పెళ్ళి చేసుకొనకూడదు. ఆమెకు అతడు తండ్రిలాగా ఉంటాడు కాని భర్తగా ఉండడు.

పెళ్ళికి ఇంతవయస్సని నిర్ణయించటం కష్టం. అబ్బాయి అయితే 25 నుండి 32 సం||ల మధ్య పెళ్ళి చేసుకోవటం మంచిది. 25 సం||లకు ముందయితే అతనిలో మానసిక పరిణితి ఉండదు మరియు అతడు ప్రభువులో ఎదుగుతూ, పరిచర్యలో ఉండాలి. 32 సం||లు దాటితే సర్దుబాటు చేసుకొనే స్థితికి వెళతాడు(సర్దుబాట్లు పెళ్ళయిన తరువాత తప్పనిసరి). అదేవిధంగా అమ్మాయి 20 నుండి 27 సం||ల లోపుగా చేసుకోవాలి. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు ఆలస్యంగా పెళ్ళి చేసుకోవచ్చును కాబట్టి ఇవి ఖచ్చితమైన తీర్మానాలు కావు. కాని నీకవకాశమున్నంత వరకు వీటిని పాటిస్తే మంచిది.

శరీర సంబంధమైన విషయాలలో ఆరోగ్య విషయము కూడా ఆలోచించుకోవాలి. వారసత్వం ద్వారా కలిగే పరిణామాలను చూడాలి లేకపోతే వారి పిల్లలకు ప్రమాదం. ఇద్దరూ నిజాయితీగా ఉండాలి. వాళ్ళల్లో ఏదైనా లోపాలుంటే దాచకూడదు. మానసిక వ్యాధులు గాని, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు గాని ఏవైనా ఉంటే చెప్పటం మంచిది. లేనట్లయితే తరువాతి తరానికి నష్టం జరుగవచ్చును. అనుమానం నివృత్తి చేసుకొనేందుకు వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ఇటువంటి ఆరోగ్య విషయాలు వివాహాన్ని భంగపర్చనక్కర్లేదు. ఇది దైవచిత్తప్రకారం జరుగుతుందనియు మరియు దేవుడు తనను స్వస్థపరుస్తాడనే నమ్మకం అవతలివారికి ఉండవచ్చును. ఇటువంటి విషయాలు దాచి ఉంచినట్లయితే అది తప్పు, పాపమునైయున్నది. ఏదేమైనా ఒక విశ్వాసి నేరారోపణలో ఉండకూడదు. నిజాయితీగా ఉన్నందుకు నీవు చేసుకోబోయే వ్యక్తిని వదులుకోవాల్సి వస్తుందని భయపడవద్దు. నిజానికి అతడు నీ నిజాయితీని గౌరవించవచ్చును. నీ నిజాయితీని బట్టి అతడు నిన్ను విడిచిపెట్టినట్లయితే, దేవుడు ఇంకా మంచికార్యము చేస్తాడని నీవు ధైర్యంగా ఉండవచ్చును. ఇటువంటి పరిస్థితులలోను ఇంకా మంచి వ్యక్తిని ఇచ్చుటకు దేవుడు అనుమతించును.

రక్తసంబంధిని పెళ్ళి చేసుకోవటం ప్రమాదకరం. ఇద్దరిలో గుప్తంగా ఉన్న అసాధారణ లక్షణాలు పిల్లలలో ఉండవచ్చును. మరీ దగ్గర బంధువులను పెళ్ళి చేసుకొనకుండునట్లు, దేవుడే మానవ స్వభావములో దీనిని అభ్యంతరంగా ఉంచాడు. బైబిలు కూడా ఈ సంబంధాలను నిషేధిస్తుంది(లేవి 18:6).

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తన సొంత అక్క కూతురుని చేసుకొనే ఆచారము ఉన్నది. అమ్మాయి పెళ్ళి ఈడుకొస్తే పెళ్ళి చేసుకుంటారు. ఇది అన్యుల ఆచారం. ఏ విశ్వాసి దీని గూర్చి ఆలోచన చేయకూడదు. ఇది లేఖనాలకు, మానవ స్వభావానికి విరుద్ధము. ఒకచోట ఇట్టి దంపతులకు పుట్టిన పిల్లలంతా అసాధారణ లక్షణాలతో బాధపడటం నేను చూచాను. దేవుడు నిషేధించాడంటే అందుకు తగిన కారణాలు ఉండవచ్చును.

ప్రేమ

ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోవటానికి దేవుడు నిన్ను నడిపిస్తే, ప్రభువు ఎల్లప్పుడు ఆమెను ప్రేమించే గుణాన్ని ఇస్తాడు. ఆ ప్రేమ గుణాలను గూర్చి మూడవ అధ్యాయములో చూచాము. పెళ్ళికి ముందు ప్రేమ తగినంతగా ఉన్నా లేకపోయినా అసలు ప్రేమంటూ ఉండాలి. ఇస్సాకు రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు ఆమెను ప్రేమించాడు. అంతకు ముందు అతడు ఆమెను చూడలేదు(ఆది 24:67). దేవుడు తనకొరకు ఏర్పరచిన భార్యగా ఆమెను స్వీకరించాడు. అంతకుముందు ఆమెను ఎరుగక పోయినను అది దేవుని చిత్తమని నమ్మినప్పుడు అతని హృదయములో నుండి ఆమెను ప్రేమించాడు.

సాధారణంగా తనకు ఏమీ తెలియని ఒక వ్యక్తిని(ఇస్సాకు వలె) పెళ్ళి చేసుకొనుటకు దేవుడు నడిపించడను దానిని నేను అంగీకరిస్తాను. ఇస్సాకు విషయములో వలె దేవుని చిత్తాన్ని అద్భుతమైన ప్రత్యక్షత ద్వారా బయలుపరచడు. ఇక్కడ మనము నేర్చుకొనవలసినదేమిటంటే, ఆ వ్యక్తి నీ కొరకు దేవుని చేత ఏర్పరచబడియున్నదని తెలుసుకొనుట. నీవు ఆలోచిస్తున్న వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడినట్లయితే, నీవు నేరుగా గాని లేక తల్లిదండ్రుల ద్వారా గాని ఆమె దగ్గరకు నడిపించబడవచ్చును. అప్పుడు ప్రభువు నీ హృదయములో ఆమె పట్ల ప్రేమను ఉంచుతాడు.

ప్రేమను మనము ఉత్పత్తి చేయలేము. బలవంతము చేయబడకుండా సహజముగా ఉండే ప్రేమయే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ మనిషి మీద ఉన్న గౌరవం కొద్దీ పుడుతుంది. ఒకవ్యక్తిని గౌరవించి, అభిమానించలేకపోతే ప్రేమ మనస్సులో పుట్టదు.

సానుభూతిని ప్రేమగా అపార్ధం చేసుకోకూడదు. ఒక అమ్మాయి క్లిష్ట పరిస్థితులలో ఉందని సానుభూతి చూపిస్తూ ఆమెను పెళ్ళి చేసుకోవటం అవివేకం. అలా చెయ్యడం పెద్ద త్యాగమని, గొప్ప కార్యమని అనుకోవచ్చును. కాని అసలు ప్రేమ లేకపోతే పెళ్ళి ఊరకనే తేలిపోతుంది. ప్రతి క్రైస్తవ వివాహానికి ప్రేమ చాలా ముఖ్యం. సానుభూతి, దయ, జాలి ఉన్నంత మాత్రాన సరిపోదు.

ఒక అమ్మాయి ఆత్మీయతను నీవు గౌరవించలేకపోతే, తాను విశ్వసించిన దానిపట్ల ఆమెకున్న పట్టుదలను నీవు హర్షించలేకపోతే, ఆమె తెలివితేటలను నీవు అభినందించలేకపోతే,ఆ అమ్మాయిని మెచ్చుకునే గుణమే లేకపోతే పెళ్ళి మాట ఎత్తకుండా ఉండటం మంచిది. లోకములో ఉన్న వాటికంటే ప్రేమ గొప్పదని బైబిలు చెప్తుంది(1 కొరిందీ¸ 13:13). ఈ సత్యాన్ని విస్మరించలేము.

జాతి, సంస్క ృతి, కులము మరియు ఆస్తిపాస్తులు

జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు ఎలాంటి విషయాలు పరిశీలించాలో కొన్నిటిని ఆలోచించాము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి జాతి. వేరే జాతి వారిని విశ్వాసి పెళ్ళి చేసుకోవచ్చునా? జాతి బేధాలను గురించి బైబిలు ఏమి చెప్తుంది?

''..... గ్రీసు దేశస్థుడని యూదుడని బేధములేదు, సున్నతిపొందుటయని పొందకపోవుటయని బేధములేదు, పరదేశియని సిది¸యనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు''(కొలస్సీ 3:11).

''క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తుని ధరించుకొనియున్నారు.... పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరును ఏకముగా ఉన్నారు'' (గలతీ 3:27-28) అని బైబిలు చెబుతుంది.ఈ వాక్యాలు మనకొక సత్యాన్ని నేర్పుచున్నాయి. దేవుని నమ్మిన మనకు జాతులతో పనిలేదు. మనము ఏ జాతినుండి వచ్చినా అది పట్టింపులోనికి రాదు. క్రైస్తవ సంఘ సహవాసములో జాతిని గూర్చి ప్రశ్నించకూడదు. దీనర్ధం జాతుల మధ్య తేడాలేదని కాదు. గలతీ 3:28 ప్రకారము, ''క్రీస్తులో'' ఉన్నవారికి జాతిబేధము లేదు, లింగ బేధము లేదు. అలాగని లింగ బేధము అనగా పురుషులకు స్త్రీలకు తేడా లేదని కాదు. (గలతీ 3:28) ప్రకారము ఒక పురుషుడు మరొక పురుషుని పెళ్ళి చేసుకోకూడదు. అలాగే జాతుల మధ్య ఉన్న తేడాలను గురించి కూడా ఆలోచించాలి.

వాక్యానుసారంగా రెండు జాతులవారు వివాహం చేసుకోవడం తప్పు కాదు. కాని ఈ సందర్భములో రెండు విషయాలను గూర్చి గమనించాలి. ముఖ్యంగా భారతదేశంలో వేరువేరు జాతివాళ్ళకు పుట్టే పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. రెండవది, భాగస్వామి విదేశీయురాలైతే ప్రభువు సేవకు చాలా ఆటంకంగా ఉంటుంది. కొందరు తెలిసీతెలియని వయస్సులో ఈ సంగతులేమియు లెక్కచేయకుండా పెళ్ళి చేసుకుంటే కొన్ని సంవత్సరముల తరువాత బాధపడతారు.

జాతితో సంబంధము కలిగిన మరొక విషయం సంస్క ృతి. దీని గురించి కూడా ఆలోచించాలి. భారతీయులు విదేశీయులను వివాహమాడితే సంస్క ృతిపరంగా చాలా తేడాలు ఉంటాయి. పెళ్ళయిన తరువాత భారతదేశంలో జీవించాలంటే చాలా కష్టమవుతుంది. భారతదేశంలోనే వేరే ప్రాంతాల వాళ్ళను చేసుకున్నను సమస్యలు ఎదురవుతాయి. కొందరు ఈ సాంస్క ృతిక సమస్యలను సులభముగా అధిగమించవచ్చు. వేరువేరు భాషలు మాట్లాడేవాళ్ళు పెళ్ళి చేసుకొని బాగానే ఉండొచ్చు. అయితే ఏదొక భాష ఇద్దరికీ వచ్చియుండాలి అప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చును. ఇద్దరిలో ఎవరైనా ఎల్లప్పుడు వారి మాతృభాషలోనే మాట్లాడుతూ ఉంటే అవతలి వారికది కష్టతరమవుతుంది. ఈ సమయములో వాళ్ళు స్థిరంగా ఒకేచోట ఉండిపోయే గృహాన్ని గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఆయా పరిసర ప్రాంతాలను బట్టి అక్కడున్న సాంస్క ృతిక ప్రాధాన్యత ఏర్పడుతుంది.

భారతదేశంలో చాలా ప్రాంతాలలో కులం ప్రాధాన్యత వహిస్తుంది. ఇది సరిగా మారుమనస్సు పొందని క్రైస్తవులలోనికి కూడా వచ్చింది. క్రీస్తు కులతత్వాన్ని పూర్తిగా తీసివేసియున్నాడు కాబట్టి ఒక విశ్వాసి కులాన్ని బట్టి పెళ్ళిని నిరాకరించకూడదు. కులానికి ప్రాధాన్యతనిచ్చేవాడు అన్యుని వలె ప్రవర్తిస్తున్నాడు. కేవలం క్రైస్తవులలో ఇటువంటి తేడాలు ఉండవని ఋజువు చేయుటకు మాత్రమే ఈవిధంగా చేయుము. వివాహము గురించి ఆలోచించేటప్పుడు అవతలి వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులకు మరియు వారి సమాజములో వారికున్న సంబంధాలకు ప్రాధాన్యతనివ్వకూడదు. అయితే వారు జీవించే స్థాయి గురించి ఆలోచించవచ్చును. బాగా సౌఖ్యంగా జీవించిన వ్యక్తి, తక్కువ స్థాయితో సామాన్యంగా జీవించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇట్టి విషయాలలో కేవలము ఊహించుకొనక, యాదార్ధంగా ఉండాలి.

కట్నం

మన దేశములో ఉన్న మరొక ఘోరమైన ఆచారమేమిటంటే కట్నం అడగటం. ఇది మనిషికి మనిషికి ఉన్న సంబంధాన్ని తగ్గించి వ్యాపారపరంగా మారుస్తుంది. అవిశ్వాసులు(నామకార్ధ క్రైస్తవులు) దీనిని చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చును. ఎందుకంటే వారు ఆత్మీయముగా గ్రుడ్డివారుగా ఉన్నారు. కాబట్టి దురాశ వారి జీవితాల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడియున్నామని చెప్పుకునే విశ్వాసులు కూడా దీనిని చేస్తే మనమేమి అనగలము. ఈ విషయంలో సైతాను వారికి గ్రుడ్డితనం కలిగించాడు.

అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులను కట్నం ఇవ్వమని పట్టుబట్టినందువలన కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. దీనిని బట్టి మనదేశంలో ఎంతోమంది అమ్మాయిలు నిరాశనిస్పృహలకు గురి అగుచున్నారు.వివాహాలను వ్యాపార సాధనములుగా మార్చే వారిని దేవుడు కరిÄనంగా శిక్షిస్తాడు. ఈ శిక్ష దేవుని ఆలయంలో ముందుగా ప్రారంభమవుతుంది. నూతన జన్మ పొందాము అని చెప్పే వాళ్ళతో మొదలవుతుంది. చాలా మంది విశ్వాసులు దీనికి వ్యతిరేకముగా మాట్లాడరు. ఇది సంఘములో కొనసాగుచున్నప్పటికీ దాని గురించి మాట్లాడరు. ఈ దుష్ట లోకంలో దేవుని కొరకు యదార్ధంగా నిలబడవలసిన వారే ఇలాగున చేయుట బాధాకరం.

కట్నం అడిగింది మా తల్లిదండ్రులు గాని మేము కాదని తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. కట్నం తీసుకోకూడదనే ఒప్పుదల కలిగిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు దాని గురించి చెప్పవచ్చును కదా! రహస్యంగా కట్నం తీసుకోవాలనే కోరిక వారిలో ఉండవచ్చు. కట్నం తీసుకోకూడదని మనము ఒప్పించబడినట్లయితే, దాని గురించి మనము సత్యమునే మాట్లాడాలి. వేరే విషయాలలో దృఢమైన వైఖరిని కలిగిన అనేకులు కట్నం ప్రసక్తి వచ్చేసరికి వెన్నెముక లేని చేపలా ఉంటారు.

కొందరు ఇలా వివరిస్తారు. అబ్బాయి చదువుల కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు పెట్టారు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రుల నుండి కొంత కట్నం తీసుకోవడం సబబే అని సమర్ధిస్తారు. ఇప్పుడు కట్నం రూపంలో తీసుకునే డబ్బు మా సహోదరీల పెళ్ళి ఖర్చులకు పనికివస్తుందని కొంతమంది సమర్ధిస్తారు. కాని దేవుని యిష్టంలేని ఈ కట్నాల విషయం ఎంత సమర్ధించినా వ్యర్ధమే. నీవు దేవుని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరచి నీ కుటుంబ అవసరాలను తీర్చుతాడు(1 సమూయేలు 2:30).

అమ్మాయి తండ్రి సంతోషంగా ఇచ్చే డబ్బును స్వీకరించడంలో తప్పేముంది? అని కొందరు ప్రశ్నిస్తారు. అందులో కొంచెము కూడా తప్పు లేదు. అతడు ఇవ్వవచ్చును. గాని తనలోని దురాశకు అది ఒక సాకుగా ఏ యౌవనస్తుడు ఉపయోగించుకూడదు. అటువంటి పరిస్థితులలో ప్రతి యువకుడు మొట్టమొదట మూడు ప్రశ్నలు వేసుకోవాలి.

  1. పెళ్ళి నిశ్చయించడంలో కట్నం పాత్ర వహించిందా?
  2. పెళ్ళి నిశ్చయమైన తరువాత నువ్వు గాని, నీ ప్రతినిధి గాని(నీ తండ్రి గాని లేక బంధువులు గాని) ఆ సొమ్ము కావాలని అడిగారా?
  3. నీకు గాని లేక అమ్మాయికి గాని సొమ్ము ఇస్తే బాగుంటుందని మనస్సులో కోరుచున్నావా?

వేరే కారణాలు ఎన్ని చెప్పినను, ఈ ప్రశ్నలలో దేనికైనా ''ఔను'' అని సమాధానం వస్తే నీలో అత్యాస ఉన్నట్లే.

అటువంటి పరిస్థితులలో విశ్వాసి చెప్పే మాటలకు, చేసే పనులకు పొత్తు లేదని లోకానికి తెలుస్తుంది. అప్పుడు అవిశ్వాసులు ఇలాగంటారు, ''క్రైస్తవులు ఏ ప్రసంగం చేసినా, డబ్బు విషయం వచ్చేసరికి అందరిదీ ఒకే మతమని'' హేళన చేస్తారు. డబ్బుకు కక్కుర్తిపడి ఎవరో చేసే తప్పువల్ల క్రైస్తవులకు అవమానము కలుగుతుంది.

కట్నం తీసుకోకూడదని ఈ విధంగా ఖండిస్తే చాలామందికి కష్టంగా ఉండవచ్చును. కాని అత్యాసపరులైన మానవులు కల్పించిన ఈ పద్ధతి విగ్రహారాధన అని బైబిలు చెప్పుచున్నది(కొలస్సీ 3:5). విగ్రహారాధనను దేవుడు ఎలా అసహ్యించుకుంటాడో పాత నిబంధన చదివితే తెలుస్తుంది. ఈ విషయములో ప్రవక్తలు తీవ్రంగా ఖండించారు. దేవుడు త్రోసివేసిన ఈ పద్ధతిని ఖండించడానికి ప్రవక్తలు మాటలు మిగుల్చుకోలేదు.

ఇతర విషయాలు

పెళ్ళికి ముందు క్రైస్తవ సంఘశాఖలను, సిద్ధాంతపరమైన నమ్మకాలను గురించి ఆలోచించడం. ముఖ్యంగా తరువాత సమస్యలు రాకుండునట్లు సంఘ సహవాసము, బాప్తిస్మాన్ని గురించి ముందుగానే ఆలోచించడం మంచిది. లేకపోతే ఒక భాగస్వామి చిన్న పిల్లలప్పుడే బాప్తిస్మము ఇవ్వాలని, ఇంకొకరేమో వద్దని అనే అవకాశము ఉంది. ఇటువంటి విషయాలలో పెళ్ళైన తరువాత గొడవపడే కంటే ముందుగానే నిర్ణయించుకోవటం మంచిది. కుటుంబము అంతయు ఒకే సంఘానికి వెళ్ళుట చాలా అవసరం. ఒకే కుటుంబములో ఒకవేళ తండ్రి కొంత మంది పిల్లలతో ఒక సంఘానికి వెళ్ళి, తల్లి వేరే పిల్లలతో ఇంకొక సంఘానికి వెళ్ళినట్లయితే, కుటుంబములో సమాధానము ఉండదు. వాక్య నియమానికి కూడా అది వ్యతిరేకం. కుటుంబములో కలతలకు దారితీస్తుంది.మత సిద్ధాంతాల పట్ల ఏదైనా నిర్ధిష్టమైన నమ్మకాలుంటే వాటి గురించి పెళ్ళికి ముందే చర్చించాలి. మరొక ముఖ్య విషయమేమిటంటే, దేవుడు నిన్ను ఏదైనా స్థలంలో ఏదైనా సేవకు పిలిచినట్లయితే, ఆ ప్రత్యేక సేవపట్ల కాబోయే భార్యకు ఇష్టం ఉండాలి. ఆ సేవలో తాను కూడా పాలుపంచుకోవాలి. సాధారణముగా భారతదేశంలో భార్యలు భర్తలను అనుసరిస్తారు. అయినప్పటికీ సేవపట్ల ఆమెకు ఆసక్తి లేనట్లయితే ఆమె సేవకు అభ్యంతరముగా ఉండవచ్చును. రానురాను దేవుడు పిలిచిన సేవనుండి నిన్ను వైదొలగించే విధంగా ప్రవర్తించవచ్చును. కాబట్టి పెళ్ళి కాకముందే ఇలాంటి విషయాలను మాట్లాడుకోవాలి.

ఆర్ధిక పరస్థితుల గురించి కూడా మాట్లాడుకోవాలి. కుటుంబాన్ని పోషించే స్థోమత కలిగే వరకు ఒక యౌవనస్తుడు పెళ్ళి గురించి ఆలోచించకూడదు. ''దేవుడే ఇస్తాడు'' అని అనటం వాక్యాన్ని అపార్ధం చేసుకోవటమే అవుతుంది. ఇటువంటి విషయాలలో వాస్తవాన్ని పరిశీలించే జ్ఞానాన్ని దేవుడు ముందుగానే మనకిచ్చాడు. నీవు ఆ జ్ఞానాన్ని ఉపయోగించనట్లయితే, పెళ్ళైన తరువాత దేవుడు అద్భుతము చేసి నీ అవసరమును తీర్చడు. ఆర్ధికంగా స్థిరపడకుండా ఒక విశ్వాసి పెళ్ళి చేసుకొని ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు.ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అని ఆలోచించడం కూడా ముఖ్యమైన విషయం. పరిస్థితులు అనుకూలంగా లేనికారణమును బట్టి కొన్నిసార్లు వాయిదా పడవచ్చును. అప్పుడు కొంతకాలం వేచియుండాలి. పెళ్ళిరోజుకు సంవత్సరము కంటే ముందు అమ్మాయిని చూడకుండా ఉండుట మంచిది.

సమదృక్పథాన్ని యేర్పరచుకోవటం

లోకమంతటిలో అతి శ్రేష్టమైన ఆత్మీయు

అధ్యాయము 6
వివాహ శుభగడియలు

''పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, అయిదు..... '' అంతరిక్ష కేంద్రంలో రాకెట్‌ విడుదలకు సమయం దగ్గరవుతున్న కొద్దీ భావోద్రేకము పెరుగుతూ ఉంటుంది. మానవ సహిత రాకెట్‌ చంద్రునిలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉంది. ఈ రోజు కొరకు ఎన్నో నెలల పాటు తీవ్రముగా సిద్ధం చేయబడింది. చివరి నిమిషము వరకు కూడా ఎన్నో తనిఖీలు చేయబడ్డాయి. మానవుల జీవితములతో ఇవి ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం ఎంతో తీవ్రమైన పొరపాటు.

అంతరిక్షంలోనికి పంపించే రాకెట్‌ కంటే వివాహ జీవితము ఎంతో సాహసోపేతమైనది మరియు ఎంతో ప్రమాదకరమైనది కూడా. కాబట్టి నిర్లక్ష్యంగా లేక అజాగ్రత్తగా దీనిని సమీపించలేము. సిద్ధపాటు తప్పనిసరి.

వివాహ దినమునకు కొన్ని నెలలకు ముందు ఒక రోజున వివాహము గురించి ప్రకటిస్తే మంచిది(ఒకవేళ దీనిని ప్రధానము (వఅస్త్రaస్త్రవఎవఅ్‌) అని పిలువవచ్చు - పేరు అంత ప్రాముఖ్యమైనది కాదు). అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోబోతున్నారని ప్రజలకు ప్రకటించాలి. ఆ రోజు నుండి కూడా వివాహ దినము సమీపించే కొలదీ ఇద్దరు భాగస్వాములు కూడా భావోద్రేకములకు లోనగుట సహజమే. కానీ ఈ భావోద్రేకము వారు వివాహమునకు సిద్ధపడకుండా అడ్డుకోకూడదు.

ఈ ప్రధానము చేయబడుట(వఅస్త్రaస్త్రవఎవఅ్‌) లోని ముఖ్య ఉపయోగమేమిటంటే వివాహమునకు ముందు ఒకరినొకరు కొంతవరకు తెలుసుకొనవచ్చును. ఇప్పుడు వారు స్వతంత్రంగా, భయము లేకుండా, పుకార్లకు తావు లేకుండా కలుసుకొనవచ్చును. కుటుంబ సభ్యుల గురించిన వివరములు కూడా తెలుసుకొనుటకు ఇది దోహదపడుతుంది. ఇది మన భారతదేశములో ఎంతో ప్రాముఖ్యము, ఎందుకంటే భారతదేశములో వివాహము అంటే భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కూడా ఎంతో దగ్గరి సంబంధములను కలిగియుండాలి.

తల్లిదండ్రులతో అనుబంధం

ఈ ప్రధానం అయిన కాలంలో భాగస్వాములిద్దరు కూడా తమ తల్లిదండ్రులతో ఉన్న బలమైన సంబంధమును తగ్గించుకొని ఇరువురు ఒకరితో ఒకరు గడుపుటకు సమయం లభిస్తుంది. వివాహం తరువాత కూడా తల్లిదండ్రుల యోగ క్షేమములను పట్టించుకోవడం సరియైనదే. ఇది లేఖనానుసారం కూడా. కాని వివాహం అయిన తరువాత కూడా ఒక్కరు కాని లేక ఇరువురు భాగస్వాములు ఒకరితో ఒకరు అనుబంధం కలిగియుండుట కంటే తల్లిదండ్రులతో ఎక్కువ అనుబంధం కలిగియుండుట వల్ల అనేక వివాహములు నాశనమయ్యాయి.

బయటకు వెళ్ళకుండా ఎప్పుడు ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉన్న వారికి ఇతరులతో పోల్చినట్లయితే ఈవిధమైన అనుబంధమును కలిగియుండుటకు ఎక్కువ అవకాశములు ఉంటాయి. కాని ఈ అంశం మీద బైబిలు యొక్క బోధ ఎంతో స్పష్టంగా ఉంది.

''కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏకశరీరమైయుందురు'' (ఆది 2:24).

ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది (కీర్తనలు 45:10).

ఇద్దరు కలసి తిరుగుట

ప్రధానం అయిన తరువాత ఇద్దరూ కలసి తిరగడం, చుంబనాది చర్యలు(పెట్టింగ్‌) చేయడం సబబేనా? రెండవ అధ్యాయంలో ప్రస్తావించిన నియమములను మనస్సులో ఉంచుకోవాలి.

భారతదేశంలో ఇద్దరు కలసి బయటకు వెళ్ళడం అనేది నీవు పల్లెటూరులో నివసిస్తున్నావా లేక పట్టణంలో నివసిస్తున్నావా అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరిరువురు కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకోవడం, మాట్లాడాలనిపించడం సహజమే మరియు సరియైనదే. కాని దీన్నెంతో జ్ఞానయుక్తంగా చేయాలి. నీ చుట్టు ప్రక్కల ఉన్న సంప్రదాయమును నీవు గౌరవించాలి మరియు బుద్ధిహీనముగా ప్రవర్తించి నీ క్రైస్తవ సాక్ష్యమును పోగొట్టుకొనకూడదు. మీరిద్దరు కలసి ఒంటరి ప్రదేశమునకు వెళ్ళుట పుకార్లకు దారితీస్తుంది. అక్కడ లైంగిక సంబంధమైన శోధనలకు లోనవ్వకుండా కూడా మీరు జాగ్రత్తపడాలి.

చుంబనాది చర్యల విషయానికొస్తే, అది ఖచ్చితంగా తప్పే. ప్రధానం చేయబడటం అంటే లైంగిక చర్యకు లైసెన్స్‌(అనుమతి) ఇవ్వడం కాదు. ప్రతి దానికి కూడా సరియైన సమయం ఉంటుంది. కౌగలించుటకు, కౌగలించుట మానుటకు సమయము కలదు(ప్రసంగి 3:5). కౌగలించుకునే సమయం వివాహం తర్వాత ఉంటుంది. ఇక్కడ ఓపికతో ఉండండి, అప్పుడు మీ వివాహం ఎంతో సంతోషంగా ఉంటుంది మరియు పశ్చాత్తాపపడవలసిన అవసరం లేనిదిగా ఉంటుంది. వివాహమునకు ముందు ఎవరైతే చుంబనాది చర్యలకు తావిస్తారో వారి వ్యక్తిగత సంబంధము తగ్గిపోవుటకు మరియు భావోద్వేగముల ఒత్తిడి పెరుగుదలకు అవకాశమిచ్చిన వారవుతారు. కలసి ప్రార్ధన చేసుకోవడం తొలగిపోతుంది(ప్రార్ధనను చుంబనాది చర్యలు తొలగిస్తాయి) మరియు వివాహమునకు ముందే సంయోగములో పాల్గొనే అవకాశము కూడా ఉంటుంది. ప్రధానం(నిశ్చితార్ధం) చెడిపోయే అవకాశం కూడా ఉంటుందని మనస్సులో ఉంచుకోవాలి. ఒకవేళ చుంబనాది చర్యల్లో పాల్గోన్నట్లయితే, నిశ్చితార్ధం చెడిపోయినట్లయితే అబ్బాయిని తన శరీరమును తాకనిచ్చినందుకు అమ్మాయి చింతించాల్సి ఉంటుంది. అందుకే, నేను రెండవ అధ్యాయంలో చెప్పినట్లుగా అబ్బాయి తొందరపడుతున్నట్లయితే అమ్మాయి బ్రేకులెయ్యాలి. ఎందుకంటే అబ్బాయి కంటే అమ్మాయే ఎక్కువ కోల్పోవలసి వస్తుంది. ఆవిధమైన చర్యలు చేయుటకు అనుమతించనట్లయితే ఒకవేళ ఆ అబ్బాయిని కోల్పోతానేమోనని ఆమె భయపడవలసినవసరం లేదు. ఒకవేళ అతడు వివాహం చేసుకొనుటకు యోగ్యుడైనట్లయితే, దానిని బట్టి అతడు అభ్యంతరపడడు. దానికి బదులుగా ఆమెను ఇంకా ఎక్కువగా గౌరవిస్తాడు. ఒకవేళ అతడు అభ్యంతరపడినట్లయితే, ఆమె వివాహం చేసుకొనుటకు అతడు యోగ్యుడు కాడని అది బయలుపరుస్తుంది.

అభిప్రాయ బేధములు మరియు ఇబ్బందులు

ప్రధానం జరిగిన తరువాత ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ బేధములు కలిగినట్లయితే, మనిద్దరము ఒకరికొకరము సరిపోతామా లేదా అని కొంతమంది అనుకుంటారు. ప్రధానము చేయబడిన తరువాత ఇక కొనసాగించాలా లేదా అని అనుకుంటారు. పెళ్ళయిన తరువాత తన భాగస్వామితో ఎటువంటి అభిప్రాయ బేధములు రావు అని అనుకుండే వ్యక్తి ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నాడు మరియు వాస్తవము ద్వారా కాక కేవలం కట్టుకథల ద్వారానే ప్రభావితం చేయబడుతున్నాడు. ఎంతో పరిపూర్ణమైన వివాహములలోను మరియు ఎంతో ఆత్మీయముగా ఉన్న వ్యక్తుల మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయబేధములుంటాయి. కాబట్టి ఒకరికొకరము సరిపోమనో లేక ఇది దేవుని చిత్తము కాదనో ఇది సూచన కాదు. ఒకవేళ ఇదే నిజమైతే దేవుడు నిర్ణయించిన వివాహములు ఎక్కడా ఉండవు. చిన్న చిన్న విషయాలలో కూడా అభిప్రాయబేధములు రాకుండా ఉండే వివాహము ఎక్కడ ఉంటుందంటే అందులో ఎవరైనా ఒకరు స్వయం చిత్తం లేకుండా మరమనిషి(రోబో) వలె ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రధానం రద్దు చేసుకోవడానికి చిన్న చిన్న అభిప్రాయబేధములు కారణం కాకూడదు. దీనికి బదులు ఇద్దరు తగ్గించుకొని ఒకరినొకరు క్షమాపణ అడగగలిగినట్లయితే జీవితంలో ఇరువురికి ఇది ఎంతో ప్రయోజనకరమైన(ఆరోగ్యకరమైన) సూచనగా ఉంటుంది. స్త్రీ ఏవిధముగానైతే క్షమాపణ కోరుకొనుటకు సిద్ధంగా ఉంటుందో పురుషుడు కూడా అదేవిధముగా ఉండాలి. మన భారతీయ సమాజములో పురుషునికి ఇది అవమానకరముగా ఉంటుంది కాని ఒక క్రైస్తవునికి ఆ విధముగా ఉండకూడదు. ఏ పురుషుడైతే తన భార్యకు క్షమాపణ చెప్పుటకు సిద్ధంగా ఉండడో అతడు వివాహం చేసుకోకూడదు.

కొన్ని ఇతర విషయాల వల్ల ప్రధానం అయిన తరువాత పెళ్ళి జరగడానికి కొంత జాప్యం కలుగవచ్చు. ఆ సమయంలో కొన్ని చిక్కులు కలగడం, కొంత బాధాకరంగా ఉండటం సహజం. ఆర్ధిక సమస్యలు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం మొ||నవి ఇద్దరికీ బాధను కలిగించవచ్చు. ఇలాంటివి నిరాశను, నిరుత్సాహమును కలిగించునట్లు మనము అనుమతించకూడదు. దీనికి బదులు అవి ప్రేమ యొక్క బంధమును బలపరచి భవిష్యత్తులో నిర్మించుకునే గృహమునకు పునాదిని లోతుగా వేస్తాయి. నీవెంత వరకు సహించగలవో దేవునికి తెలుసు.

''నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కవగా ఆయన నిన్ను శోధింపబడనియ్యడు'' (1 కొరిందీ¸ 10:13).

తగిన సమయంలో ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోకి దిగ్విజయముగా మీరిద్దరు వెళ్ళే దారి ఆయనే సిద్ధం చేస్తాడు(నిర్గమ 14వ అధ్యాయం). కాబట్టి ఆయనను విశ్వసించు. నీ హృదయము నిరుత్సాహపడునట్లు అనుమతించవద్దు.

ప్రధానం - ఎంతకాలం

ప్రధానమైన తర్వాత ఎంతకాలం ఉండాలి? ఇంతకాలం అని చెప్పడానికి ఎటువంటి నియమములు లేవు కాని అమ్మాయి, అబ్బాయి ఒకచోట ఉండి తరచూ కలుసుకుంటున్నట్లయితే, ఆరునెలలు మించకుండా ఉండటం మంచిది. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే సాధారణంగా సంవత్సరం మించకూడదు. ఈ సమయంలో ఇద్దరి మనస్సులు గాలిలో తేలిపోతుంటాయి. కాబట్టి వారిని ఎక్కువ సమయం ఆవిధంగా ఉంచడం మంచిది కాదు. ఇది అనేక ఒత్తిడులకు దారితీస్తుంది.

''ఐ లవ్డ్‌ ఎ యంగ్‌ మాన్‌'' అనే పుస్తకంలో వాల్టర్‌ ట్రోబిస్క్‌ ప్రధానం అయిన కాలమును తల్లి గర్భములో ఉన్న శిశువుతో పోల్చాడు. వివాహ దినమును ఆ శిశువు జన్మ దినముతో పోల్చాడు. ఆ దినమునే అందరూ ఆ శిశువును చూడగలరు. కాని జన్మించుటకంటే ముందు గర్భములో కొన్ని నెలల సిద్ధపాటు ఉంటుంది. నిజముగా ప్రధానమైన తరువాత కాలం ఇలా ఉండాలి అని చెప్పుటకు ఇది ఎంతో అందమైన సాదృశ్యము.

ప్రధానం - ఒక గంభీర ఒడంబడిక

ప్రధానం అనేది ఒక వేడుకగా జరిగినా లేక సాధారణంగా జరిగినా అది వివాహమునకు ఒక ఒడంబడిక కాబట్టి దానిని తేలికగా తీసుకోకూడదు.

''అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పనివాడే దేవుని సన్నిధిలో నివసించు వాడని బైబిలు చెబుతుంది''(కీర్తనలు 15:4).

''అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు'' (సామెతలు 12:22).

ఒక క్రైస్తవుని మాట అవునంటే ''అవును'' కాదంటే కాదని ఉండాలి(మత్తయి 5:37; యాకోబు 5:12).

వివాహాన్ని గురించి ఏవైనా అనుమానాలొచ్చినప్పుడు అందుకు సంబంధించిన క్రొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు ప్రధానం రద్దుచేసుకోవచ్చా? అవతలి వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి కానట్లయితే ప్రధానమును వెంటనే రద్దుచేసుకోవాలి. అవతలి వ్యక్తి తిరిగి జన్మించెనో లేదో ప్రధానమునకు ముందే చూసుకోవాలి. ఇలా చెయ్యడం పైన పేర్కొన్న పేరాలోని ఒడంబడికను అతిక్రమించినట్లు కాదు. ఎందుకంటే వివాహము నీ గురించి మాత్రమే చేసుకొనేది కాదు గాని ఈ భూమి మీద ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చుటకు చేసుకునేది. ఇక్కడ నీవు (2 కొరిందీ¸¸6:14) ను బట్టి నడువవలసియున్నది. ఒకవేళ అవతలి వ్యక్తి తిరిగి జన్మించినవాడైనా, నీ విషయములో అపనమ్మకముగా ఉన్నట్లయితే లేక ఏదైనా ప్రాముఖ్యమైన విషయముల మీద తీవ్రమైన సిద్ధాంతపరమైన విబేధములు ఉన్నట్లయితే అప్పుడు ప్రధానమును రద్దుపరచుకోవచ్చు. ఒక వ్యక్తికి మాట ఇచ్చి తరువాత ఇది దేవుని చిత్తము కాదని మాట మార్చే చపలచిత్తులైన విశ్వాసులను దేవుడు ఘనపరచడు. తను విదేశాలకు వెళ్ళాలనే కారణముతో ప్రధానమును రద్దుచేసుకున్న ఒక యౌవనస్తుడు నాకు తెలుసు. ఆవిధముగా ఆ అమ్మాయి ఎంతో కష్టపడవలసి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయుటకు ఎంతో కష్టపడ్డారు. ఇలాంటివి స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా చేస్తారు. ఇటువంటి అస్థిరులైన వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు అవమానమును తీసుకువస్తారు. మాట ఇచ్చే ముందు ఒక వ్యక్తి నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఖచ్చితంగా లేనట్లయితే వేచియుండటం మంచిది. మన చంచల మనస్సు ద్వారా ఇతరుల జీవితములను పాడు చేయకూడదు. నీవు మ్రొక్కుకొనిన(ఇచ్చిన మాటను) దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు(ప్రసంగి 5:5).

సలహా కోరడం

పెళ్ళి చేసుకునే వారు పెళ్ళయిన విశ్వాసి దగ్గరకెళ్ళి సలహా కోరడం మంచిది. అలా సలహా ఇచ్చే వ్యక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. ఆడవాళ్ళు ఆడవాళ్ళ దగ్గరకి, మగవాళ్ళు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వివాహ జీవితం గురించి వాళ్ళు ఇచ్చే సలహా విలువైంది.లైంగిక విద్యను గురించి, శరీరతత్వమును గురించిన నియమములను తెలుసుకోవడం మంచిది. పురుషులైతే వివాహితుడైన వైద్యుని దగ్గరకు, స్త్రీలైతే వివాహితురాలైన వైద్యురాలిని సంప్రదించాలి. వైద్యులు విశ్వాసులైతే మరీ మంచిది. లైంగిక సంబంధమైన విషయాలు తెలియకపోవడం వలన సుఖమయ జీవితమును అనుభవించలేక బాధపడేవారున్నారు. లైంగిక సంబంధమైన విషయములను గురించిన సమాచారము ఈ దినములలో అనేక మంచి క్రైస్తవ పుస్తకములలో లభిస్తుంది.

వివాహ ఏర్పాట్లు

భాగస్వాములిద్దరు కలసి వారి వివాహ ఏర్పాట్లను గురించి చర్చించుకోవాలి. ఆ తరువాత వారు వారి తల్లిదండ్రులకు మరియు సంఘకాపరికి వారి వివాహము ఎలా జరగాలో తెలియజేయాలి. ప్రతి విశ్వాసి కూడా వారి వివాహములో అన్యుల ఆచారములు, సంప్రదాయములు లేకుండా సాధారణముగా మరియు క్రీస్తును ఘనపరచే విధముగా వారి వివాహము జరిగేటట్లు చూసుకోవాలి. అయ్యో! ఈనాడు భారతదేశములోని అనేక వివాహములలోనికి క్రైస్తవేతర మతములలో నుండి వచ్చిన సంప్రదాయములు వస్తున్నాయి. విశ్వాసులు కూడా అటువంటి సంప్రదాయములకు విధేయత చూపించడం సిగ్గుచేటు. దీనికి వారిని వారు సమర్ధించుకుంటూ మా తల్ల్లిదండ్రులను, బంధువులను అభ్యంతరపెట్టకుండుటకు అని చెప్తారు. దేవుడు దు:ఖపడినా, అవమానపరచబడినా మరియు అభ్యంతరపడినా వారికి పట్టింపు ఉండదు. వారు దేవునికి భయపడుట కంటే వారి బంధువులకే ఎక్కువ భయపడతారు. కనుక వారు ''సృష్టికర్త కంటే ఎక్కువగా సృష్టినే పూజించిరి'' (రోమా 1:25). అన్యాచారాలకు ద్వారాలు తెరచి వివాహంలో వాటికి చోటిస్తే ఆ వివాహంలో దేవుడున్నాడని అనుకోవడం భ్రమే అవుతుంది. దేవుని వాక్యమును పాటిస్తూ, ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు.

పెండ్లి కుమారునికి మరియు పెండ్లి కుమార్తెకు క్రీస్తునందున్న తమ విశ్వాసమును గురించి సాక్ష్యమిచ్చుటకు వివాహం అనేది ఒక మంచి అవకాశమును ఇస్తుంది. ఈ అవకాశమును వదులు కోకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఇదంతా కూడ తల్లిదండ్రులతో మరియు సంఘకాపరితో ముందుగానే చర్చించి దాని ప్రకారం వివాహమునకు ప్రణాళిక వేసుకోవాలి.

వివాహమైన తరువాత

పెళ్ళయిన వెంటనే లేదా సాధ్యమైనంత త్వరలో కనీసం ఒక వారం రోజులపాటయినా ఇద్దరూ ఒకరితో ఒకరు మరియు ప్రభువుతో గడపడం గురించి ఏదైనా ఏకాంత ప్రదేశమునకు వెళ్ళుట మంచిది. దీనిని హనీమూన్‌ అని పిలిచినా, పిలువకపోయినా ఈ సమయం ఎంతో అమూల్యం. ఒకవేళ నీ విషయంలో ఇది అసాధ్యమనిపించినట్లయితే దీని గురించి ప్రార్ధన చేసి చూడు. దేవుడు ఈ విషయంలో నీ గురించి చేసిన దానిని చూసి ఆశ్చర్యపడతావు.

వివాహమైన తరువాత, ఒక చిన్న గుడిసైనా సరే వారి స్వంత గృహములో నివసించుట మంచిది. బంధువులతో కలసి జీవించుట అనేక సమస్యలకు మరియు ఒత్తిడులకు దారితీస్తుంది. భారతదేశంలో, ఆర్ధిక పరిస్థితులను బట్టి కొంతమంది వారి తల్లిదండ్రుల దగ్గరే కలసి ఉండవలసి వస్తుంది. అటువంటి వారు ఎంతో తీవ్రముగా ఈ విషయమును గూర్చి ప్రార్ధన చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా ప్రత్యేకముగా(వేరుగా) ఉండుట దేవుని చిత్తమైయున్నది. వీలైనంత త్వరగా వారు తమ స్వంత గృహమును ఏర్పరచుకొనునట్లు ప్రభువును నమ్మాలి.

వివాహ ఏర్పాట్లను గురించి పరిగణలోనికి తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయములను గురించి మనము పైన చూశాము. వీటిలో దేనిని కూడా తేలికగా తీసుకోకూడదు. అంతరిక్షములోకి రాకెట్‌ను పంపక ముందు చేసుకొన్న ఏర్పాట్లను బట్టే ఆ రాకెట్‌ విజయవంతమౌతుంది. అదేవిధంగా సంతోషకరమైన వివాహ జీవితమునకు పునాది వివాహ దినమునకు ఎంతో ముందే వేయబడుతుంది.

అధ్యాయము 7
అచ్చంగా అమ్మాయిలకే

(ఈ అధ్యాయమును శ్రీమతి డా|| అనీ పూనెన్‌(యం.బి.బి.యస్‌) గారు వ్రాశారు)

గుణవతియైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముకంటే అమూల్యమైనది(సామెతలు 31:10). గుణవతిని గురించి బైబిలు ఈవిధంగా వర్ణిస్తుంది.

స్త్రీ పురుషుని కంటె తక్కువ స్థాయిలో సృష్టించబడిందని, అన్య సంస్క ృతి ఎప్పుడు స్త్రీని తక్కువ చూపు చూస్తుంది. స్త్రీకి దేవుడు నిర్ణయించిన స్థానం పురుషుని ప్రక్కనే గాని అతని కాళ్ళ క్రింద కాదని ప్రభువైన యేసు క్రీస్తు తన మాదిరి ద్వారా మరియు మాట ద్వారా ఎంతో స్పష్టముగా బోధించారు.

పురుషుడు నెరవేర్చలేని ప్రత్యేకమైన పనికోసం దేవుడు స్త్రీని సృష్టించాడు. కాబట్టి స్త్రీ భౌతికంగానే కాక మానసికంగా మరియు భావోద్వేగములలో కూడా పురుషుని కంటె వేరుగా సృష్టించబడింది. ఆమె తల్లిగా ఉండాలి కాబట్టి ఆమె పురుషుని కంటె సున్నితముగా, ఎక్కువ లోబడే దానిగా మరియు ఎక్కువ భావోద్వేగములు కలిగియున్నదిగా ఉంటుంది. ఆమె ప్రేమించుటకు ఎక్కువ సామర్ధ్యము కలిగియుంటుంది గనుక ప్రేమించబడాలని కూడా ఎక్కువ కోరుకుంటుంది. ఇవి లేకుండా ఉంటే ఆమెకు పస్తున్నట్లుంటుంది. పురుషునితో పోలిస్తే స్త్రీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటుంది ఎందుకంటేె ఆమె చేయవలసిన ప్రత్యేక పని నిమిత్తము అది అవసరము. కాబట్టి పురుషులతో పోల్చినట్లయితే స్త్రీకి బుద్ధిబలం(ఱఅ్‌బఱ్‌ఱశీఅ) ఎక్కువగా అనుగ్రహించబడింది. దీనిని పురుషులు గుర్తించకపోవచ్చు.

''స్టడీస్‌ ఇన్‌ ద ప్రాఫెసీ ఆఫ్‌ జెర్మియా'' అనే పుస్తకంలో జి.కేంప్‌ బెల్‌ మోర్గన్‌ అనే దైవజనుడు స్త్రీ భుజాల మీద మోపబడిన బాధ్యతను ప్రస్తావిస్తూ ఇలా అంటున్నాడు స్త్రీలు ఇది గ్రహించాలి. ప్రంపచానికి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు వాంఛించినప్పుడు స్త్రీ గర్భములోనే తన రూపురేఖలను దిద్దుకున్నాడు. సృష్టి ఆరంభములో ''మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము'' అని దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. పురుషునిగాను, స్త్రీ గాను వారిని సృజించెను. ఈ లేఖన భాగంలో ఉన్న కష్టం నాకు తెలుసు. అయితే దైవత్వాన్ని, మానవత్వాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే ఈ లేఖన భాగం చాలా ప్రాముఖ్యమైనది. దేవునిలో నిగూఢమైనది స్త్రీలో ప్రతిబింబించింది. పురుషునిలో అది లేదు. ఈ ప్రత్యేక ఏర్పాటు స్త్రీకే పరిమితం. పురుషుడు ఎంత ప్రయత్నించినా ఆ ప్రత్యేకతను అందుకోలేడు. ఇది దేవునికి సంబంధించిన పరమ సత్యం.

ఏమిటా సత్యం? ఈ సత్యమును ఖచ్చితంగా వివరించడం కష్టం. దేవుణ్ణి మనం తండ్రిలాగానే పేర్కొంటాం కాని దేవుడు తల్లి కూడా. దేవుని యొక్క పితృత్వం గురించి బైబిలు ఎంత స్పష్టంగా వివరిస్తుందో, దేవుని యొక్క మాతృ సిద్ధాంతం గురించి కూడా బైబిలు అంతే స్పష్టముగా వివరిస్తుంది(యెషయా 66:13; మత్తయి 23:37). స్త్రీ యొక్క మాతృత్వంలోనే మృదుత్వం యొక్క లోతైన రహస్యములు, ఆ పరిశుద్ధమైన గుణ లక్షణములు మనవంటి మరణ శరీరులకు అర్ధమగుటకు ఆధారం మాతృత్వమే.

''గర్భాన్ని ధరించిన తల్లులను గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. కొంతమంది నిజముగా తల్లులుగా లేకపోయినా సహజంగా సంక్రమించిన మృదుత్వం, పట్టింపు, సహాయం చేయుట, కాయుట, బాగుచేయు గుణములను కలిగియుంటారు. మృదుత్వం, సాధుత్వం, సౌందర్యం మిళితమై మాతృమూర్తికి శోభను చేకూర్చుతాయి. స్త్రీ యొక్క సున్నితత్వమును ఏరోజైనా పాడుచేయకుండా దేవుడు మనలను కాపాడునుగాక! వీటన్నింటి ద్వారా స్త్రీ దేవునికి ప్రతినిధివలె ఉండాలి. వీటన్నింటిని కలిపి మానవ మాటలలో మనము ''తల్లి'' అని పిలుస్తున్నాం(మాతృమూర్తి ద్వారా లోకమునకు వెల్లడైన సత్యములు దైవశక్తికి ప్రతీకలు). దేవుని ప్రత్యక్షత స్త్రీలో బహిర్గతం అయింది''.

స్త్రీ యొక్క పిలుపు ఇలాంటిది. ఒకవేళ ఆమె దేవునికి నిజముగా ప్రతిష్టించుకున్నట్లయితే, దేవుడు ఆమెకు అనుగ్రహించిన ప్రత్యేక లక్షణములను దేవుని మహిమ కొరకును మరియు ఇతరుల క్షేమాభివృద్ధి కొరకును వాడవచ్చు. కాని ప్రతి విషయములో ఆమె దైవభక్తి కోసం చూడనట్లయితే ఇవే లక్షణములను దుర్వినియోగపరచవచ్చును లేక వృధాచేసుకొనవచ్చును. దేవుడు స్త్రీకి ప్రత్యేకంగా ఇచ్చిన మృదుత్వము మరియు ఆకర్షణ ద్వారా జీవితములోని సామాన్యమైన విషయములకు సౌందర్యమును సేకరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆవిధముగా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.

స్త్రీకి కూడా లైంగిక సంబంధమైన కోరికలుంటాయి. పురుషుని వలె కాకుండా స్త్రీలో తక్కువ స్థాయిలో ఉంటాయి కాబట్టి వాటిని సులభముగా అదుపులో పెట్టుకోవచ్చు. ఈవిధముగా కలిగియుండుట సహజమే గాని ఈవిధమైన కోరికలు లేకుండా ఉన్నట్లయితే అస్వభావికము. ఇతరులు తన మీద శ్రద్ధను మరియు ప్రేమను కలిగియుండాలని స్త్రీ తపిస్తుంది. తన స్వంత గృహమును మరియు కుటుంబమును కలిగియుండాలని ఏ పురుషుని కంటే కూడా ఎక్కువగా ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి కోర్కెలు నిజానికి మాతృత్వమునకు సిద్ధపాటుగా ఉంటాయి. ఇది ఎంతో ఆరోగ్యకరమైన పరిణామము ఎందుకంటే దేవుడే మనలను ఈవిధముగా చేశాడు. ఇటువంటి కోర్కెలతో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకొనుటకు ఆకర్షితురాలవ్వడం సహజమే. భౌతిక సౌందర్యం కోసం, శారీరకంగా కలసి ఉండటం కోసం పురుషులు స్త్రీల వైపు ఆకర్షితులౌతారేమో గాని అమ్మాయిలైతే మాత్రం సాధారణంగా వివాహం చేసుకోవడానికే అబ్బాయిల పట్ల ఆకర్షితులౌతారు. వివాహం గురించి కాక ఇతర కారణాల వల్ల అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కాని ఇది అసహజం. దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించే వారు కూడా ఉన్నారు. వారు అబ్బాయిల పట్ల ఎటువంటి ఆకర్షణ కలిగియుండక అస్వభావికముగా అమ్మాయిల పట్లనే ఆకర్షితులౌతుంటారు. ఇది అసహజం మరియు ఆరోగ్యకరమైన పరిణామం కాదు. మరియు ఇది స్వలింగ సంపర్కమునకు చిహ్నంగా ఉంటుంది.

సరియైన వస్త్రధారణ

''జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి'' (1 పేతురు 3:3-5) అని బైబిలు యౌవన స్త్రీలను హెచ్చరిస్తుంది. పురుషులను ఆకర్షించే శక్తిని స్త్రీ తనలో కలిగియుంటుంది. ఇది దేవుడిచ్చిన శక్తి, కాని ఇది తరచుగా దుర్వినియోగపరచబడుతుంది. ఒకవేళ ఈ శక్తి పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో లేనట్లయితే, అమ్మాయి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లే. అమ్మాయిలు ఎదిగే కొలదీ, తమలో ఉన్న ఈ శక్తిని కనుగొని దానిని పెంచుకోవాలని చూస్తుంటారు. దాని ఫలితముగా ఎక్కువ ''మేకప్‌'' వేసుకోవడం, శరీరమును ఎక్కువగా ప్రదర్శించడం(క్రొత్త ఫ్యాషన్‌ దుస్తులు వేసుకోవడం ద్వారా) మరియు రకరకములుగా జడలు వేసుకొనుటకు ఎక్కువ సమయం గడపడం చేస్తుంటారు. ''మరియు స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను'' (1 తిమోతి 2:9-10). పైన చెప్పబడిన వాక్యములో నిజమైన సౌందర్యం అంటే ఏమిటో దేవుడు వర్ణించాడు.

మన దేహములను దేవుడు మనకు పరిశుద్ధముగా అప్పగించాడు వాటిని మనం దుర్వినియోగపరచకూడదు. మన దేహములతో ప్రభువును మహిమపరచాలని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. ఇవి మన శరీరపు అలవాట్లను మాత్రమే కాక మనము ఎటువంటి దుస్తులనుధరిస్తున్నామో దాని గురించి కూడా వర్తిస్తుంది. పురుషులను ఆకర్షించే శక్తిని నానారకములుగా దుర్వినియోగపరచిన కారణమును బట్టి పాత నిబంధనలో దేవుడు సీయోను కుమార్తెలను గద్దించాడు(యెషయా 3:16-24 ను చదువుము).

మనము అంతరగములో ఏమైయున్నామో మనం వేసుకొనే దుస్తులను బట్టి తెలుస్తుంది. మనం వేసుకొనే దుస్తులను బట్టి కొంత వరకు మన వ్యక్తిత్వం బయల్పడుతుంది. మనం వేసుకొనే దుస్తులను బట్టే ఇతరులు మనలను మొట్టమొదటిసారి చూసినప్పుడు వారికొక అభిప్రాయం కలుగుతుంది. మనం ఈ లోకంలోని ఫ్యాషన్‌ దుస్తులు వేసుకొన్నట్లయితే అవి క్రీస్తు కొరకు మనము కలిగియున్న సాక్ష్యమును కొట్టివేస్తాయి. క్రీస్తు మనలను ఈ దుష్టయుగం నుండి విడిపించాడని మనము చెప్పినపుడు వారు పైకి చెప్పరు గాని మనలను చూసి వారు లోపల నవ్వుకుంటారు. కాబట్టి మన వస్త్రధారణ విషయములో మనం జాగ్రత్తగా ఉండాలి.

అంటే మనం మురికిగా వస్త్రములు వేసుకోవాలని కాదు. అలా ఉండకూడదు. మనం శుభ్రంగా ఉండాలి. వీలైనంత ఆకర్షణీయంగా కనబడుటకు ప్రయత్నించాలి. మనం మురికిగా ఉండాలని కాని లేక మనము ఆకర్షణీయంగా కనబడకూడదని దేవుడు కోరుకోవడం లేదు. ఒక విశ్వాసి దుస్తులను సామాన్యముగాను మరియు పద్ధతిగాను ధరించాలి. వాటి ద్వారా ప్రత్యేకముగా ఇతరులకు కనిపించకూడదు. దుస్తులు వేసుకున్న వారికి కూడా ప్రత్యేకముగా అనిపించకూడదని ఎ.బి.సింప్సన్‌ గారు చెబుతారు. మనం అనుసరించుటకు ఇది మంచి నియమము.

ఎట్టి పరిస్థితులలోను మనం వేసుకునే దుస్తులు పురుషులు మోహపు చూపులు చూసే విధంగా వారిని రెచ్చగొట్టునట్లుగా ఉండకూడదు. మోహపు చూపులు చూసినందుకు పురుషులను దేవుడు తీర్పుతీర్చినట్లయితే, దానికి కారణమై ఆవిధంగా ప్రేరేపించునట్లు వస్త్రధారణ కలిగియున్న స్త్రీలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పడం సమంజసం.

బొట్టు (తిలకము/బొట్టుబిళ్ళ) పెట్టుకోవడం గురించి ఇక్కడ నేను ప్రస్తావించాలి. క్రైస్తవేతర మత సాంప్రదాయమైన దీనిని అనేకమంది క్రైస్తవ బాలికలు అనుసరించడం ఎంతో విచారకరం. ఈవిధంగా ఒక క్రైస్తవురాలు బొట్టుపెట్టుకొనుట ఆమెకు ఎంతో చెడ్డ సాక్ష్యమును తీసుకు వస్తుంది. దీని ద్వారా ఆమె క్రైస్తవేతర అమ్మాయిగా కనబడుతుంది(ఆమె ఈవిధంగా గుర్తించక పోయినప్పటికీ). మనలో కొంతమంది అనుకునేటట్లుగా అదేదో ఫ్యాషన్‌ కోసం పెట్టుకునేది కాదు. మన క్రైస్తవ సాక్ష్యమునకు అభ్యంతరకరంగా ఉండే ఈ లోక ఆచారములకు మరియు ఫ్యాషన్‌లకు విరోధముగా నిలబడేటట్లు దేవుడు మనకు ధైర్యమును అనుగ్రహించును గాక!

ఇస్సాకునకు(దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్ధానములను స్వతంత్రించుకున్న వ్యక్తి) భార్యగా ఉండే ఆధిక్యతను దేవుడు రిబ్కాకు ఎందుకిచ్చాడు. యేసు ప్రభువుకు తల్లిగా నుండుటకు మరియను దేవుడెందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకంటే దేవుణ్ణి సంతోషపరచే అంతరంగ సౌందర్యమును దేవుడు వారిలో చూశాడు. నిజమైన సౌందర్యము అంతరంగములోనుంటుంది. బాహ్యముగా కాదు. మరియు దీనిని ఏ కాస్మటిక్‌(సౌందర్యం కోసం వాడే ఉత్పత్తుల) షాపులోను కొనలేము(సామెతలు 31:30). బాహ్య సౌందర్యమును కలిగియుండి ఆత్మీయత లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదని బైబిలు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు(సామెతలు 11:22). ఇది ఎంత కరిÄనమైన పదజాలమో కదా! అయినా కూడా నిజమైన విలువలను గురించిన గ్రహింపు ఇది ఇస్తుంది అనేకమంది అమ్మాయిలు ఈ లోకంలోని ఫ్యాషన్లను అనుసరించుట ద్వారా దేవుడిచ్చే శ్రేష్ఠమైన వాటిని కోల్పోతున్నారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను.

పురుషులతో సంబంధములు

నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అబ్బాయిలు నీ పట్ల ఆసక్తి కలిగియున్నారని నీకు ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది. వారు నీ కళాశాల నుండి అయ్యుండచ్చు లేక సంఘములో నుండి లేక ఇరుగుపొరుగు వారైయుండవచ్చు. దీనిని నీవు తప్పించుకోలేవు. కనుక వారితో ఏవిధంగా ప్రవర్తించవలెనో తెలుసుకొనుట ఎంతో అవసరము.

అమ్మాయిలు అబ్బాయిలతో మరియు అబ్బాయిలు అమ్మాయిలతో ఏవిధంగా ప్రవర్తించాలో రెండవ అధ్యాయంలోనే వ్రాయబడింది గనుక వాటిని నేను మరలా వ్రాయాలనుకోవట్లేదు. కాని అమ్మాయిలు ప్రత్యేకంగా గమనించవలసిన కొన్ని విషయములను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను.

ఈరోజుల్లో అనేకమంది అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళుతున్నారు కాబట్టి ఒక శతాబ్దం క్రితంతో పోల్చి చూసినట్లయితే ఎంతో ఆలస్యంగా వివాహము చేసుకుంటున్నారు. వారు డిగ్రీ చదువుకునేటప్పుడో లేక ఏదైనా శిక్షణకు వెళ్ళినప్పుడో అబ్బాయిలతో కలసి చదువుకోవాలి కాబట్టి అక్కడ వారు అనేక శోధనలకు గురవుతున్నారు. వివాహం చేసుకోవాలనే తలంపు లేకుండానే సహజంగా వారికున్న ఆకర్షణతో అబ్బాయిలను ఆకర్షించాలని శోధించబడుతున్నారు. ఒకవేళ ఈ శోధనకు లోబడినట్లయితే, ఎంతో నష్టం వాటిల్లుతుంది.

మానసిక భావోద్వేగముల యొక్క ప్రభావము అబ్బాయిల కంటే అమ్మాయిల మీదే ఎక్కువగా ఉంటుందని అమ్మాయిలు గుర్తించాలి. ఒక యౌవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ తరువాత వెంటనే మరచిపోవడం అతనికి సుళువే. ఆ తరువాత అతడు ఎటువంటి భావోద్వేగములకు లోనవకుండా మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక అమ్మాయి ఎంతగా అనుమతిస్తుందో అంతగా భౌతికంగా తాకవలెనని అనేకమంది యౌవనస్తులు గురి కలిగియుంటారు. అటువంటి సంబంధములో అమ్మాయి ఎంతో భావోద్వేగములకు లోనవుతుంది కాని అబ్బాయి అసలు ఏవిధముగా భావోద్వేగములకు లోనుకాకపోవచ్చు. ఒకసారి ప్రేమించిన ఆ అబ్బాయి యొద్దనుండి మానసికంగా దూరమగుట ఆ అమ్మాయికి ఎంతో కష్టంగా ఉంటుంది మరియు కొంతమందైతే వివాహం అయిన తర్వాత కూడా ఆ అబ్బాయిని మర్చిపోలేకుండుంటారు. అందువల్ల వారి వివాహ జీవితము సంతోషంగా ఉండదు. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.

కనుక స్పర్శతో వచ్చే శోధన ఎంతో బలంగా ఉంటుందని నీవు మర్చిపోకూడదు. కనుక ఏ అబ్బాయి కూడా నీ చేయి తాకునట్లుగా నీవు అనుమతించకూడదు మరియు ముద్దు పెట్టుకొనునట్లుగా అసలు అనుమతించకూడదు. ఒకసారి నీవు ఈ విషయములను అనుమతించినట్లయితే, నీ మనస్సులో వచ్చే వ్యర్ధమైన ఆలోచనలను అదుపు చేసుకొనుట కష్టమౌతుంది మరియు ఒక అడుగు మరొక అడుగుకు దారితీస్తుంది.

ఒక అబ్బాయికి నీకున్న స్నేహం చెడిపోయినట్లయితే ఆ అబ్బాయి కంటే కూడా నీవు ఎంతో వెల చెల్లించవలెనని మనస్సులో ఉంచుకోవాలి. నిన్ను వదిలిపెట్టి వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడం అతనికెంతో సుళువు. కాని నీకైతే అది అంత సుళువు కాదు. ఆ తరువాత కూడా నీవు ఆ మచ్చను భరించవలసివస్తుంది. దీని ఫలితముగా ఆ తరువాత నీవు వివాహము చేసుకొనుటకు అబ్బాయిని కనుగొనుట ఎంతో కష్టమౌతుంది. ప్రత్యేకంగా భారతదేశంలోనైతే ఇది ఎంతో కష్టము. డేటింగ్‌ మరియు పెట్టింగ్‌(చుంబనాది చర్యలు) కు లోనైన వారి గురించి మాత్రమే నేనిక్కడ చెప్పట్లేదు. ఎవరైతే అబ్బాయితో పరిశుభ్రమైన(నిజమైన) ప్రేమ సంబంధమును కలిగియుంటారో(ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా) వారి సంబంధం కూడా ఇతరులకు తెలిసినట్లయితే(వారు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానే సంబంధం కలిగియున్నారని తెలిసినా కూడా) వారు కూడా శ్రమ పడవలసివస్తుంది. కాబట్టి అమ్మాయిలకే ఇక్కడ ప్రమాదమనే విషయమును వారు మరచిపోకూడదు.

వారు ప్రారంభములో జాగ్రత్త కలిగిలేని కారణమును బట్టి అనేకమంది అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడి, వారి ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. ఇటువంటి విషయములు వారి స్వంత సాక్ష్యమును పాడుచేయడం మాత్రమే కాక ప్రభువు యొక్క నామమునకు కూడా ఎంతో అవమానమును తీసుకువస్తాయి. మనం బలహీన ఘటములమని మరియు పురుషులతో పోలిస్తే సుళువుగా మోసగించబడతామని(1 పేతురు 3:7; 1 తిమోతి 2:14) బైబిలులో చెప్పబడింది.

సమీప భవిష్యత్‌లో నీవు అతనిని వివాహం చేసుకోవాలని నిశ్చయమైతేనే తప్ప ఏ అబ్బాయితోను నీవు సన్నిహితంగా ఎందుకు ఉండకూడదో నేను ఇక్కడ చెప్తాను. నీవు అవివాహితగా ఉన్న దినములలోనే ప్రభువు యొక్క సేవను స్వేచ్ఛగా మరియు ఎటువంటి ప్రతిబంధకములు లేకుండా చేయగలవు. నీకు వివాహం అయిన తరువాత నీ సమయమునకు నీవే యజమానురాలిగా ఉండలేవు. నీవు అవివాహితగా ఉన్న దినములను ప్రభువు సేవకు వినయోగించకుండా అబ్బాయిల గురించి కలలు కంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో అత్యధిక భాగం వ్యర్ధమౌతుంది. నిన్ను నాశనమునకు నడిపించునట్లుగా సాతానును అనుమతించవద్దు.

ఈ అంశం మీద నేను మరో రెండు సలహాలనిస్తాను. మొట్టమొదటిగా, ఆత్మ సంబంధమైన సలహాల గురించి ఒక అవివాహితుని దగ్గరకు వెళ్ళవద్దు. దానికి బదులుగా ఒక స్త్రీ దగ్గరకు వెళ్ళు లేక బాగా పెద్దవాడైన పురుషుని దగ్గరకు వెళ్ళు. రెండవదిగా, అతని భార్యతో కూడా అదేవిధమైన స్నేహం చేయకుండా, ఒక పెళ్ళయిన పురుషునితో స్నేహం చేయకు (సరదాగా కూడా).

వివాహం

అవివాహిత దినములలో కంటే వివాహం మరియు మాతృత్వం ద్వారా వారి జీవితములో నెరవేర్పు మరియు సంపూర్ణతను అనుభవించినట్లు దాదాపు తల్లులందరు అంగీకరిస్తారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండుటకు పిలువబడినవారు నెరవేర్పును కోల్పోతారని నేను చెప్పట్లేదు. ఒక క్రైస్తవురాలు వివాహిత అయినా, కాకపోయినా దేవుని చిత్తము నెరవేర్చుటలోనే తన సంతృప్తిని కనుగొనాలి. దేవునికి అటువంటి విధేయతతో అవివాహితురాలైన స్త్రీ కూడా అటువంటి నెరవేర్పును కలిగియుండవచ్చు. అయినా కూడా ఒంటరిగా జీవించుటకు దేవుని చేత పిలువబడిన స్త్రీకి ఇది వర్తించదు. ప్రాథమికంగా స్త్రీ భార్యగాను మరియు తల్లిగాను ఉండుటకు పిలువబడింది.

వివాహం తన క్రైస్తవ పరిచర్యకు ప్రతిబంధకంగా ఉంటుందని ఏ అమ్మాయి కూడా భావించనవసరం లేదు. తాను చేసే క్రియలు(క్రైస్తవ పరిచర్యకు సంబంధించి) చేయలేకపోవచ్చేమో గాని తన ఆత్మ సంబంధమైన పరిచర్య తగ్గిపోదు. క్రైస్తవ పరిచర్య(పని)లో చురుగ్గా పాల్గొంటున్న అమ్మాయి వివాహమైన తరువాత తాను ఒంటరిగా చేసే క్రైస్తవ పరిచర్యకు సంబంధించిన పనులు తగ్గిపోయినట్లుగాను మరియు వాటిలో తన స్వేచ్ఛను చాలా వరకు కోల్పోయినట్లు అనిపిస్తుంది. వివాహం అయిన తరువాత పురుషునికి ఈవిధంగా ఉండదు గాని స్త్రీకుంటుంది. వివాహమైన తరువాత దేవుడు తనకు వేరే విధమైన పరిచర్య ఇచ్చాడని తాను గుర్తించాలి. ఒకవేళ ఆమె విసుగుచెందకుండా, నిరాశపడకుండా ఉన్నట్లయితే ఆమె దీనిని అంగీకరించుటకు సిద్ధంగా ఉంటుంది. వివాహం అయిన తరువాత తన ప్రాథమికమైన పిలుపు ఏమిటంటే ఇంటిని కట్టుకొనుట. అలలచేత కొట్టబడిన అనేకమంది యౌవనస్తులకు(పెద్దలకు కూడా) ఆశ్రయముగానుండునట్లు తన ఇంటిని నిర్మించుకోవాలి మరియు తన పిల్లలను దేవుని యొక్క భయములో పెంచాలి. తన అవివాహిత దినములలో చేసిన మరే పరిచర్య కంటే కూడా ఈ రూపంలో ఉన్న పరిచర్య గొప్పది.

''ఏ స్త్రీ అయితే తన వివాహమును బట్టి సంతోషంగా ఉంటుందో, వివాహములోని అంశములను అనగా దానికి కావలసిన సమయము, శక్తి మరియు తన స్వేచ్ఛను కోల్పోవుటను అంగీకరిస్తుందో అటువంటి స్త్రీ యొద్ద ఇతరులకు ఇచ్చుటకు ఎంతో ఉంటుంది. తన గృహంలో సంక్రమించిన అనుభవపూరితమైన వైవాహిక ప్రేమ ద్వారా లభ్యమయ్యే అనుభవములకు జోడించి స్నేహపూరితమైన వాతావరణమును తానెక్కడ ఉన్నా కూడా సృష్టించుకుంటుంది'' అని ఎవరో అన్న మాట నిజం.

సుసన్నా వెస్లీ ప్రసంగీకురాలేమీ కాదు. అయితేనేం, ఆమె దైవభక్తి కలిగిన తల్లియైయుండి తన పిల్లలందరినీ దైవభక్తిలో(దేవుని భయములో) పెంచింది. తన పిల్లలలో ఇద్దరు జాన్‌ వెస్లీ మరియు చార్లెస్‌ వెస్లీ ఇంగ్లండు దేశమునకు ఉజ్జీవమును తీసుకు వచ్చుటకు దేవుని చేతిలో బలమైన సాధనములుగా వాడబడ్డారు. అవివాహితురాలైన స్త్రీ చేసిన దానికంటే పరిశుద్ధమైన ఆ తల్లి తన దేశమునకు ఎంతో చేసింది. తిమోతి యొక్క తల్లియైన యూనికే ఒక బోధకురాలిగా ఉండి చేయగలిగిన దానికంటే ఒక తల్లిగా ప్రభువుకు ఎంతో పరిచర్య చేసింది(2 తిమోతి 1:3).

వివాహమునకు సిద్ధపాటుగా, ప్రతి అమ్మాయి కూడా( సామెతలు 31:10-31) వచనములు తరచుగా చదివి, ధ్యానిస్తూ ఉండాలి. ఒక ఆదర్శవంతమైన తల్లిని గురించిన వర్ణన అక్కడ ఉంది. తన జీవితము యొక్క రహస్యమేమిటంటే దేవుని భయమును కలిగియుండుటయే(30 వ వచనం). కాని అటువంటి భార్యగా ఉండాలంటే వివాహమునకు చాలాకాలం క్రితమే పునాదులు వేసుకోవాలి. కనుక ఈ వాక్యభాగం ప్రతి క్రైస్తవ అమ్మాయికి సవాలుగా ఉండాలి. అక్కడ చెప్పబడిన ప్రతిమాట కూడా ఎంతో స్పష్టంగా ఉంది. ఎటువంటి వివరణ కూడా అవసరం లేదు. అక్కడ ప్రస్తావించబడిన మంచి లక్షణాలలో ఒకటేమిటంటే ''పొదుపు''. ఆదర్శవంతమైన భార్య డబ్బును ఖర్చుపెట్టే విషయములో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ప్రతి అమ్మాయి కూడా ఈ అలవాటును అలవర్చుకోవాలి. ఈనాడు అనేకమంది అమ్మాయిలు కళాశాలలో దుబారాగా ఖర్చు పెట్టేవారిగా ఉన్నారు. పొదుపు చేయడం ఇప్పుడే నేర్చుకున్నట్లయితే తరువాత మీరు వివాహం చేసుకున్నాక ఇది ఎంతో సహాయపడుతుంది. నీ ప్రస్తుత అనుభవములు అప్పుడు సహాయము చేస్తాయి.

వివాహమునకు సిద్ధపాటుగా అమ్మాయిలందరూ కూడా త్యాగగుణమును అలవరచుకోవాలి. త్యాగం లేకుండా ఏ వివాహంలో కూడా సంతోషం ఉండదు. ప్రత్యేకంగా అమ్మాయి విషయంలో ఇది నిజము. వివాహమైన తరువాత పురుషుని కంటే ఎక్కువగా స్త్రీ త్యాగం చేయవలసివస్తుంది. వివాహం చేసుకొనక ముందు కంటే వివాహమైన తరువాత ఆమె తన హక్కులను ఎన్నో కోల్పోవలసి వస్తుంది. వివాహమునకు ముందే నీవు త్యాగమంటే ఏమిటో నేర్చుకోనట్లయితే వివాహమైన తరువాత ఎంతో కష్టమౌతుంది. కాబట్టి దీనిని నేర్పమని దేవునిని అడుగు.

వివాహమునకు సిద్ధపాటుగా ఒక అమ్మాయి ముఖ్యముగా చేయవలసినదేమిటంటే నిస్సందేహముగా ప్రార్ధనే. నేను సలహా ఇచ్చేదేమిటంటే, వివాహం కోసం చూస్తున్న రెండు, మూడు సంవత్సరాల క్రితం నుండే ప్రతి అమ్మాయి కూడా తన భాగస్వామి గురించి పట్టుదలతో క్రమంగా ప్రార్ధన చేయాలి. దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని వివాహం చేసుకొనుటకు దేవుడు తనను నడిపించాలని ఆమె ప్రార్ధన చేయాలి. కాబట్టి మిగిలిన సంబంధములేమి కుదరకుండా చేయమని ప్రభువును అడగాలి. భారతదేశంలో, ఇది ఎంతో అవసరము ఎందుకంటే ప్రత్యేకంగా కుమార్తెల వివాహ విషయములో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. కనుక తన తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా కూడా వారిని నడిపించమని అమ్మాయి ప్రార్ధన చేయాలి. ఎవరైతే విశ్వాసముతో ఈవిధంగా కొనసాగిస్తారో వారి ప్రార్ధనలకు అద్భుతమైన జవాబును చూస్తారు. వివాహమునకు సిద్ధపాటు కొరకు అనుసరించవలసిన మరొక సలహా నీకు సమయం దొరికినస్పుడెల్లా ఇప్పుడే వంట చేయడం నేర్చుకో. నీకు వివాహం అయిన తరువాత అనేక ఇబ్బందుల నుండి, తడబాట్ల నుండి నిన్ను కాపాడుతుంది.

దేని కోసం చూడాలి

తనకు కాబోయే భర్తలో ఒక అమ్మాయి ఏమి చూడాలి? అయిదవ అధ్యాయంలో దీని గురించి ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పటికే ప్రస్తావించబడ్డాయి. అమ్మాయిలు మనసులో ఉంచుకోవలసిన కొన్ని విషయములను నేను ఇక్కడ మరలా చెప్పాలనుకుంటున్నాను.

తనకు సహాయం చేసే, ఆదరించే మరియు కొంతవరకు తనను అర్ధం చేసుకొని తనకు భద్రతను కలిగించి మరియు కాపాడగలిగిన భర్త ఒక అమ్మాయికి అవసరము. ఆమెకు ఆత్మన్యూనతా భావమును కలుగజేయకుండా, ఆమె తన మీద ఆనుకునేటట్లు బలవంతుని గాను మరియు పరిపక్వత గల వానిగాను అతడుండాలి. పురుషుని మీద ఆధారపడే విధంగా దేవుడు స్త్రీని సృష్టించాడు. కాబట్టి నీవు వివాహం కోసం చూస్తున్న వ్యక్తి నీలో ధైర్యమును నింపేవాడిగా ఉండాలి మరియు నీవు నిజముగా ఆధారపడదగిన వానిగా ఉండాలి.

''భార్య తన భర్తను ఎంతగానో గౌరవించాలి. విధేయత చూపించాలి, ఘనపరచాలి మరియు కొనియాడాలి'' అని బైబిలు చెప్తుంది(ఎఫెసీ 5:33 లివింగ్‌ బైబిలు). గౌరవం నుండి ప్రేమ కలుగుతుంది. భార్య తన భర్తను గౌరవించనట్లయితే అతణ్ణి ప్రేమించడం అసాధ్యం. ఒకవేళ ప్రేమించినా జాలిపడి ప్రేమించినట్లుగా ఉంటుంది. తన భర్త తనకంటే ఎక్కువ పరిపక్వత కలిగియున్నాడనే గౌరవం లేనట్లయితే తన భర్తను తనకు శిరస్సుగా గౌరవించలేదు. కనుక వివాహం కోసం ఒక వ్యక్తిని నీవు చూస్తున్నప్పుడు నీ మిగిలిన జీవితమంతా కూడా తనను గౌరవించి, అభిమానించగలవా లేదా అని చూసుకోవాలి. అటువంటి అభిమానం వివాహ జీవితములోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది.

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి పూర్తిగా(నిర్ధిష్టంగా) మనము తెలుసుకోలేమని నేను కనుగొన్నాను. కాని పైన చెప్పినది మరియు అయిదవ అధ్యాయంలో చెప్పినవి దేవుడు నీకొరకు ఏర్పరచిన వ్యక్తిని కనుగొనుటకు మార్గదర్శకములుగా ఉంటాయి. మనదేశంలో అనేకమంది అమ్మాయిలు చేసేటట్లుగా నీకు ఆ వ్యక్తి గురించి అసలు తెలియకుండా లేక అతికొద్ది సమాచారముతో ఎట్టి పరిస్థితులలోను వివాహం చేసుకోవద్దు. వివాహము జీవితాంతం ఉండే బంధం మరియు ఒక్కసారి అందులోనికి ప్రవేశించిన తరువాత వెనుకకు తీసుకోలేము. కనుక దీనిలోనికి అజాగ్రత్తగా(తేలికగా) ప్రవేశించలేము.

ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు ఒక అవిశ్వాసిని చూసినట్లయితే లేక నీకు తగని ఒక వ్యక్తిని చూసినట్లయితే వారికేమి చెప్పవలెనోనని నీవు ఆలోచిస్తున్నావేమో. అటువంటి పరిస్థితులలో ''కాదు'' అని తల్లిదండ్రులకు చెప్పే విషయములో అబ్బాయి కంటే అమ్మాయికే కష్టమని నేను కనుగొన్నాను. అయినా కూడా నీవు ప్రేమతో మరియు గట్టిగా నీ ఒప్పుదలల కోసం నిలబడాలి. నీవు ఆవిధంగా చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సాతాను నీ భవిష్యత్తుకు సంబంధించి అబధ్రతా భావములను తీసుకువచ్చి ఆ సంబంధమునకు అంగీకరించేటట్లు నిన్ను శోధిస్తాడు. అయినా కూడా వాని మాటలు వినవద్దు. దేవునికి విధేయత చూపించుట ద్వారా ఎవరూ ఏదీ కోల్పోలేదు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. నీవు ప్రభువును ఘనపరచి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపరచడు. తన స్వంత సమయంలో శ్రేష్ఠమైనది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీవు దానిని కోల్పోకూడదు. నీవు కోల్పోతావా? కట్నంకు సంబంధించిన ప్రశ్నల గురించి ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తాను. కట్నం అడిగే ఒక వ్యక్తిని వివాహం చేసుకొనే ముందు ఒక క్రైస్తవ అమ్మాయి అనేకసార్లు ఆలోచించాలి. బహుశా అతడు నీ కంటే నీ డబ్బునే ఎక్కువగా కోరుకుంటున్నాడేమో. అదే సమయంలో కేవలం ఒక వ్యక్తి యొక్క సంపదను లేక స్థానమును చూసి ఆకర్షించబడవద్దు. ''ప్రేమకు ప్రతిగా ధనమునివ్వలేము'' అని బైబిలు చెబుతుంది(పరమ 8:7).

ఒంటరి అమ్మాయి

ఒంటరిగా ఉండే అమ్మాయిల గురించి చెప్పకుండా ఈ అధ్యాయం పూర్తి కాదు. ఒక అమ్మాయి ఒంటరిగా ఉండుటకు నిర్ణయించుకొనుట భారతదేశ సమాజములో చాలా అరుదు. దేవుని దగ్గర నుండి కలుగు స్పష్టమైన నడిపింపుతోనే ఇటువంటి జీవితమును ఎన్నుకోవాలి. అలాంటి నిశ్చయతే పరీక్షలలో(శోధనలలో) పడిపోకుండా పట్టుకుంటుంది. కొంతమంది విషయంలో, దేవుడు ఒక ప్రత్యేకమైన పరిచర్యకు పిలచినప్పుడు వారు ఈలోక సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనకుండా కొన్ని సంవత్సరములు వివాహము చేసుకొనకుండుట దేవుని చిత్తమైయుంటుంది. తరువాత దేవుడు వారిని వివాహములోనికి నడిపించవచ్చును.

ఈ పుస్తకము చదువుతున్న వారిలో కొద్దిమంది మీద ఒంటరితనము బహుశా బలవంతంగా రుద్దబడియుండవచ్చు. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణమైన ఒక వ్యక్తి మీద గాని లేక పరస్థితి మీద గాని, కుటుంబము మీద గాని ద్వేష భావము లేకుండా ఉండుట నీకు ఎంత కష్టమో కదా! నీలో సహజమైన స్త్రీ యొక్క భావోద్వేగములు ఇతరులను ప్రేమించాలని, నీవు ఇతరుల చేత ప్రేమించబడాలని ఉప్పొంగుతున్నా కూడా నీ మీద నీవు జాలిపడకుండా ఉండటం ఎంత కష్టమో కదా! అయినా కూడా నీవు ఎంత అన్యాయముగా చూడబడినా కానీ ద్వేషము కలిగియుండుట మరియు నీ మీద నీవు జాలిపడటం తప్పే. అవి నీ ప్రవర్తన మీద కూడా ప్రభావమును చూపిస్తాయి. వాటిని ఒప్పుకొని విడచిపెట్టాలి. ఒకసారి ఈ చెడు విషయాల నుండి కడుగబడిన తరువాత దేవునితో నీ సంబంధం మరలా సమకూర్చబడుతుంది. అప్పుడు నీవు దీనత్వముతో నీ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు మీద కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారమును విశ్వసించవచ్చు. దేవుడు నీ పరిస్థితులన్నింటిని అద్భుతముగా మార్చివేయుటకు సమర్ధుడు. ఒకవేళ ఆయన ఆవిధంగా చేయనట్లయితే, దేవుడు నిన్ను గురించి ఇంకా శ్రేష్ఠమైన ప్రణాళిక కలిగియున్నాడని మరియు ఆయన నిన్ను కాపాడతాడని ఖచ్చితంగా నమ్మవచ్చు. దేవుని యొక్క అత్యధికమైన కృప నిన్ను ఎన్నటికినీ పడిపోనియ్యదు. నీ ప్రతి యొక్క అవసరతను దేవుడు అత్యధికముగా తీరుస్తాడని నీవు కనుగొంటావు(2 కొరిందీ¸ 12:7-10).

వివాహం చేసుకొనియున్న నీ సహోదరి మీద నీవు అసూయపడవలసిన అవసరం లేదు. నీకు లేని ఆధిక్యతలను ఆమె కలిగియున్నది. అది నిజమే. కాని ఆమెకు లేని కొన్ని ఆధిక్యతలను నీవు కూడా కలిగియున్నావని మరచిపోవద్దు. ఆమెతో పోల్చినట్లయితే నీవు ఏ చింత లేకుండా ప్రభువును సేవించవచ్చని 1 కొరిందీ¸ 7:34 లో చెప్పబడింది. అనేక పరిచర్యలలో నీవు ఫలవంతంగా ఉండవచ్చు. ఉదాహరణకు చిన్న పిల్లల పరిచర్య మరియు యౌవనస్తుల పరిచర్య వంటివి. జీవిత పోరాటములలో కష్టాలలో వెళుతున్న వారికి నీ స్వంత అనుభవము ద్వారా సానుభూతితో కూడిన స్నేహమును అందించవచ్చు.

అయినా కూడా ప్రతి ఒక్కరికి వచ్చినట్లుగానే ఏదో ఒకవిధమైన శోధనలు వస్తూనే ఉంటాయి. స్త్రీ సున్నితముగాను మరియు ఎక్కువ భావోద్వేగములతోను సృజించబడిన కారణమును బట్టి అపవాది ఎంతో సుళువుగా దాడి చేయుటకు ప్రయత్నిస్తుంటాడు. ''అయినా దేవుడు నమ్మదగినవాడు(తన మాటను బట్టి మరియు ఆయన కనికరమును బట్టి) నీ సామర్ధ్యమునకు మించి ఆయన నిన్ను శోధింపబడనియ్యడు. శోధనతో పాటు(ఎల్లప్పుడూ) తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలుగజేస్తాడు'' (1 కొరిందీ¸ 10:13). దేవుని యొక్క ప్రేమయందు, సార్వభౌమాధికారమందు మరియు విశ్వాస్యతనందు కలిగియుండే అచంచలమైన విశ్వాసము డాలు వలె ఉండి అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పును (ఎఫెసీ 6:16).

అనేకమంది అవివాహితులైన స్త్రీలు మధ్య వయస్సులోనికి వచ్చేసరికి ద్వేషమునకు మరియు తమమీద తాము జాలిపడుటకు ఎరగా వేయబడుతున్నారు. అలా ఉండనవసరం లేదు. ప్రభువు యెడల భక్తిని పెంచుకొనుట ద్వారా మరియు తన మార్గములన్నింటిని సంతోషంగా అంగీకరించుట ద్వారా మరియు చిన్న విషయములకు కూడా దేవుని యెడల మరియు మనుష్యుల యెడల కృతజ్ఞత కలిగియుండుట ద్వారా నీ జీవితము దేవుని యొక్క ఆనందంతో నిరంతరం నింపబడుతూ, అనేకమందికి ఆశీర్వాదముగా పొంగిపొర్లుతుంది.

సంఘములో ఎంతో విశేషమైన సేవచేసిన అవివాహిత స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. కేడ్‌గాన్‌(ఉత్తర భారతదేశం)లో ముక్తి మిషన్‌ను స్థాపించిన పండిత రామాభాయి(ఒక విధవరాలు) ఒక గొప్ప మాదిరి. భారతదేశమునకు వచ్చిన గొప్ప పరిశుద్ధ మిషనరీలలో ఒకరైన అమీకార్మికేల్‌(డోనాపూర్‌) మరొక ఉదాహరణ. వారి జీవితములలో నుండి పారిన ఆశీర్వాద సెలయేర్లు, వారు ప్రభువు దగ్గరకు వెళ్ళిన అనేక సంవత్సరాల తరువాత కూడా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈవిధంగా వీరిద్దరు మాత్రమే కాక ఇంకా అనేకమంది ఉన్నారు. నిజముగా ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, నీ జీవితంలో దేవుని పిలుపు ఏమైయున్నదో తెలిసికొని అది ఏదైనా సరే సంతోషంగా నెరవేర్చడంలోనే సమాధానం ఉంటుంది.

మన బలహీనతలలో ఆయన శక్తి

చివరిగా, ''బలహీనుల యందే నీ శక్తి పరిపూర్ణమగుచున్నది'' (2 కొరిందీ¸ 12:9) అని బైబిలులో చెప్పబడినట్లుగా మనము బలహీన ఘటములని ఎరిగి మన బలహీనత దేవునికి అతి సమీపముగా ఉండునట్లు చేయాలి. క్రీస్తు యొక్క శరీరంలో ఒక ప్రత్యేకమైన పరిచర్య గురించి దేవుడు నిన్ను సృష్టించాడని మరచిపోవద్దు. నీ జీవితంలో అది సంపూర్ణముగా నెరవేరును గాక!

అధ్యాయము 9
ఆనందమునకు రాజమార్గం

సెక్స్‌, ప్రేమ, పెళ్ళి అనే విషయాలకు సంబంధించి మనం ఆనందించుటకు రాజ మార్గములో ప్రయాణించాలని దేవుడు కోరుకున్నాడు. కాని అనేక మంది విచారం అనే మురికి కూపంలో ప్రయాణించడానికే మొగ్గు చూపిస్తుంటారు.

ఈ అంశములకు సంబంధించిన విషయములు ఇప్పటికే స్పష్టముగా వివరించబడ్డాయి. దీన్ని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన హృదయములలోని రహస్య విషయములకు సంబంధించి మనలోని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. నీవు అక్కడ తీసుకున్న నిర్ణయము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. కాని నీ జీవితము ప్రభావవంతంగా ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఆ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క రాజమార్గంలో ప్రయాణించాలంటే వెల చెల్లించవలసియున్నది. అదేమిటంటే ప్రతి విషయములో కూడా దేవునికి విధేయత అనే వెల చెల్లించాలి. ఆనందమునకు రాజమార్గము, పరిశుద్ధతకు కూడా రాజమార్గమైయున్నది(యెషయా 35:8,10).

ఈ మార్గముకు ఇరువైపుల కూడా దేవుడు కంచె వేశాడు. ఈ కంచె కొట్టిన వానిని పాము కరచును(ప్రసంగి 10:8) అని బైబిలులో వ్రాయబడింది. ఏదేను తోటలో కూడా దేవుడు, నిషేధించబడిన వృక్షము చుట్టు కంచె వేశాడు. కాని సాతాను ఆ వృక్ష ఫలము యొక్క సౌందర్యమును చూపించి, దానిని తినుటవలన ప్రయోజనములు కలుగుతాయని చెప్పి, దానిని తినుట వలన ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవలసిన పని లేదని హవ్వకు నిశ్చయత కలుగజేశాడు. ఆవిధంగా ఆమె ఆ కంచెను కొట్టుటకు రప్పించబడి, ఆ ప్రాచీన పాము చేత కరువబడింది. ఆ పాము సాతానే.

సెక్స్‌, ప్రేమ, పెళ్ళి అను విషయాలకు సంబంధించి దేవుడు నిషేధించి, కంచె వేసిన విషయాలు బైబిలులో ఎంతో స్పష్టంగా ఉన్నాయి. మరియు ఈ పుస్తకములో కూడా ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా దేవుని యొక్క రాజమార్గమును విడిచి, దేవుడు వేసిన కంచెను కొట్టి, దేవుడు నిషేధించిన వాటిలోనికి ప్రవేశించుటకు అనేక లక్షలమంది యౌవనస్తులను(పెద్దవారిని కూడా) ఆకర్షించుటలో సాతాను విజయం సాధించాడు. ఆ పాము కాటు మన ఆది తల్లిదండ్రులకు ఎంత మరణకరముగానుండెనో ఈనాడు కూడా అలాగే ఉన్నదని మీరు చాలా ఆలస్యముగా కనుగొంటారు.

దేవుని వాక్యమునకు ఖచ్చితముగా లోబడుటలోనే మన భద్రత దాగియున్నది. దేవుడు వేసిన కంచెలను గౌరవించడం ద్వారా అని దీనర్ధము. వాటిని కొట్టివేయకుండా జాగ్రత్తగా చూసుకో. ''తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో! ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు''(సామెతలు 5:11-14). ''దేవుణ్ణి కాదని మనము ఎప్పటికీ ఏమీ చేయలేము'' (గలతీ 6:7 లివింగ్‌ బైబిలు తర్జుమా).

గిన్నెలు పొంగి పొర్లుట

దేవుణ్ణి ఘనపరచుట ద్వారా వచ్చే ఆశీర్వాదము కానాలో జరిగిన వివాహము ద్వారా మనకు అర్ధమవుతుంది(యోహాను 2:1-11). యేసు ప్రభువు మొట్టమొదటి సారి తన మహిమను ఒక వివాహములో బయల్పరచాలని నిర్ణయించాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈనాడు కూడా ఆయన తన మహిమను ప్రతి వివాహములో బయల్పరచాలనుకుంటున్నాడు. సెక్స్‌, ప్రేమ, పెళ్ళి దేవుడు మనకిచ్చిన ఎంతో ప్రాముఖ్యమైన వరములు. దేవుడు తన మహిమను మనకు మాత్రమే కాదు ఇతరులకు కూడా ప్రత్యక్షపరచుటకు ఇవే మాద్యములుగా కాగలవు - ఒకవేళ మనము ఆయనకు అనుమతించినట్లయితే.కానా వివాహములోని ద్రాక్షారసము యొక్క కొరత ప్రతి వివాహంలో ఉండే సమస్యలు మరియు అవసరతలను సూచిస్తుంది. ఈ సమస్యలు చివరకు భార్యాభర్తలను నిరంతరం చిరాకులోనికి, నిరాశలోనికి తీసుకొని వెళ్ళగలవు. కాని వివాహములో యేసుక్రీస్తు ప్రభువుకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే, ఆయన కానాలో చేసినట్లుగా చాలా త్వరగా మన సమస్యలను పరిష్కరించి, మన అవసరములను తీర్చగలడు.ఏదో ఒక అతిది¸గా యేసు ప్రభువును ఇంట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆయన ప్రభువుగా ఉండాలి. ''క్రీస్తే ఈ గృహమునకు అధిపతి'' అనే అక్షరాలను ఇంట్లో వ్రేలాడదీసి, నిజానికి ఆ గృహమునకు భర్త(లేక భార్య) అధిపతిగా ఉన్నట్లయితే అపహాస్యం చేసినట్లవుతుంది. కాని ఎక్కడైతే క్రీస్తును అధిపతిగా, ప్రభువుగా గుర్తిస్తారో అక్కడ ఆయన రెండువేల సంవత్సరాల క్రితం కానాలో చేసినట్లుగా తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు(11 వ వచనం).

''ఆయన మీతో చెప్పునది చేయుడి'' అని మరియ అక్కడున్న పరిచారకులకు చెప్పింది(5 వ వచనం). వెంటనే వారు నిస్సందేహంగా ఆ మాటకు విధేయత చూపించారు. వెంటనే సమస్య పరిష్కరించబడింది. ఒకవేళ వివాహమైనవారు(వివాహం నిశ్చయం అయిన వారు) కూడా అదే మాటకు ప్రభువు యొక్క ఆజ్ఞలకు అంతే నిస్సందేహముగా, త్వరగా విధేయత చూపించినట్లయితే వారి సమస్యలకు ఎంత త్వరగా పరిష్కారం లభిస్తుందో కదా!

ఆ వివాహంలో నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. రంగు, రుచి లేకుండా సామాన్యంగా ఉన్న ఆ నీరు ఒక్క క్షణంలో మధురముగా, ఆకర్షణీయముగా, విలువైనదిగా మారింది. వివాహ జీవితంలోని సాధారణ విషయాలు(ఎప్పుడూ చేసే రోజువారి చాకిరి) కూడా ప్రభువుకు మన గృహము మీద పూర్తి నియంత్రణ ఇచ్చినప్పుడు ఎంతో ఆకర్షణీయముగా, మంచిగా మారతాయి. రుచిలేనిది మధురముగా మార్చబడుతుంది. ఇంతకుమునుపు తృణీకరించి, సాధారణముగా చూడబడినవాటికి అనంతమైన విలువ వస్తుంది. ఆ అద్భుతానికి ఫలితముగా అనేకమంది అవసరాలు తీర్చబడ్డాయి. కేవలం భాగస్వాములిద్దరికీ సంతోషం కలుగజేయడం ద్వారా క్రైస్తవ వివాహము యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడదు. వారి వివాహములో నిరంతరం వారి గిన్నెలు నిండి పొంగిపొర్లాలనేది(కీర్తనలు 23:5) దేవుని కోరికైయున్నది. అనేకమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజానికి వాళ్ళను కలిసిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. విధేయుడైన తన సేవకునితో దేవుడు ఒకసారి ఈవిధంగా చెప్పాడు. ''నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు'' (ఆది 12:2,3). గలతీ 3:14 ప్రకారము దేవుని యొక్క అదే ఆశీర్వాదము మనకు కూడా ఉంది. వివాహములో దీనికంటె మరి ఎక్కువైన లక్ష్యమును ఎవరైనా ఏమి కలిగియుండగలరు? మన అనుదిన జీవితములో దేవునికి మనము ఎంత విధేయత చూపిస్తున్నాము అన్న దానిని బట్టి మనము ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నామనేది ఆధారపడి ఉంటుంది. ''నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును'' (ఆది 22:18) అని ప్రభువు అబ్రాహాముతో చెప్పారు.

సెక్స్‌, ప్రేమ మరియు పెళ్ళికి సంబంధించి ఎవరైతే ఘోరతప్పిదములు చేసియున్నారో, పడిపోయారో వారికి కానాలోని అద్భుతము ఒక నిరీక్షణ సందేశముగా కూడా ఉంది. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారు ప్రభువు వైపు తిరిగినప్పుడు ప్రభువు వారిని సిగ్గుపరచలేదు. నీ ఓటమి ఎంత పెద్దదైనా సరే నీవు నీ అవసరంలో ప్రభువు వైపు తిరిగినప్పుడు ఆయన నిన్ను కూడా సిగ్గుపరచడు. ఆయన కేవలం నీ అవసరం గురించి నిజాయితీగా ఉండి( కానాలో వలె) నీ ఓటమి గురించి ఆయనకు చెప్పాలని కోరుకుంటున్నాడు. నీ బుద్ధిహీనత ద్వారా ఆ అమ్మాయితో(లేక అబ్బాయితో) చాలా దూరంగా వెళ్ళావా? ప్రేమ విషయంలో బహుశా తెలియక తప్పు చేశావా? దాని ఫలితంగా ఇప్పుడు నీవు ఇబ్బందిపడుతున్నావా మరియు భంగపడ్డావా? ఇతరులు నిన్ను అపార్ధం చేసుకొని నిందిస్తున్నారా? లేక దూషిస్తున్నారా? అయితే ఏమాత్రం తడవు చేయక వెంటనే ప్రభువు వైపు తిరుగు. ఆయన పాపులకు స్నేహితుడు. ఆయన కేవలం నీ పాపములను క్షమించుట మాత్రమే కాక సాతాను నీ జీవితములో అస్తవ్యస్తముగా చేసిన వాటిని శుభ్రపరుస్తాడు. ఈ రెండింటిని నెరవేర్చుటకే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు(1యోహాను 3:5,8). నిరాశకు తావివ్వద్దు. నీకు కూడా నిరీక్షణ ఉంది. కానా వివాహములో, కొదువగా ఉన్నదానిని ఎంతో సమృద్ధిగా చేసిన ప్రభువు, నీ జీవితంలో ఉన్న కొదువను కూడా ఎంతో సమృద్ధిగా చేయగలడు. కానాలో తన మహిమను ప్రత్యక్షపరచిన ప్రభువు, నీ విషయంలో కూడా అదే చేయగలడు.

ఒకవేళ నీవు నిరాశ చెందియున్నట్లయితే, క్రైస్తవ జీవితములో నిజమైన ఆశీర్వాదము పుచ్చుకొనుట కంటె ఇచ్చుటలోనేయున్నది(అపొ.కా 20:35) అనే సత్యము ద్వారా ధైర్యము తెచ్చుకో. సమస్తము నీ మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగించగలడు, నీ కోర్కెలన్నీ నెరవేర్చబడకపోయినా కూడా నీ జీవితాంతము ఆయన మహిమ కొరకు జీవించుటకు సహాయము చేస్తాడు.

మహిమ నుండి అధిక మహిమ

సెక్స్‌, ప్రేమ, పెళ్ళికి సంబంధించిన విషయములలో దేవుణ్ణి మహిమపరచుటే నీ లక్ష్యం అయినట్లయితే, తన సంపూర్ణమైన చిత్తమును ఈ విషయములలో తప్పిపోతానేమో అని నీవు భయపడనక్కరలేదు. దేవుడు నిన్ను తప్పకుండా ఎక్కడైతే సింహం, క్రూర జంతువులు ఉండవో వాటికి బదులు జీవితము యొక్క ప్రయాణములో చివరి వరకు కూడా ఎక్కువ కాంతివంతంగా, ఎక్కువ స్పష్టముగా అంతకంతకు దేవుని మహిమ ఎక్కడైతే ప్రకాశిస్తుందో ఆ రాజమార్గములో తప్పక నడిపిస్తాడు. నీ జీవితాంతం కూడా ఈ పరలోక రాజమార్గములో నీవు ప్రయాణించుదువు గాక. ఆమేన్‌.

అధ్యాయము 10
ఒక వివాహ ప్రార్ధన మరియు ప్రతిష్ఠిత కీర్తన

ఒక వివాహ ప్రార్ధన మరియు ప్రతిష్ఠిత కీర్తన

ప్రభువైన యేసుక్రీస్తు, మేము సంపూర్ణ సమర్పణతో సాగిలపడుచున్నాము,

నీవు కలువరిలో మమ్ములను కొన్నందుకు;

ఇప్పుడు మేము నీ వారము, మరియు ఎన్నటెన్నటికినీ నీ వారమే,

నిత్యత్వం వరకును మీరే మా భాగము.

మేము అడుగువాటన్నిటికంటెను ఊహించు వాటన్నిటికంటెను మరి ఎక్కువగా

ఓ ప్రియ ప్రభువా, మీరే మా జీవితములలో ఆశీర్వాదమైయున్నారు;

కృతజ్ఞతగలిగిన మా హృదయములలో స్తుతి, కీర్తనలు మ్రోగుతూ

ప్రేమ అనే నిత్యత్వపు త్రాడుతో మమ్ములను బంధించుచుండెను.

మేము బలహీనులమని ఎరిగి, మిమ్ము సేవించుటకు వెదకుచున్నాము

మేము బీదలమని, బలహీనులమని బాగుగా ఎరిగియుండి;

అయినా నీవే సర్వశక్తుడవని, సంపూర్ణుడవని తెలిసికొని

మా బలము నీవేయని మేమెప్పుడూ ఓడిపోమని.

మీ శ్రమలలో మాకు సహవాసం కావలెను;

మీ సిలువయందే మేము అతిశయించెదము;

మిమ్మును సంతృప్తిపరచుటయే, మా ఏకైక కోరిక;

మరియు ఈ భూసంబంధమైన లాభమంతయు నష్టముగా ఎంచుకొనెదము.

నిందలు, అవమానములను ఈ లోకం మామీద కుప్పగా వేయవచ్చునేమో;

దు:ఖము మరియు బాధలు మా మార్గములో ఉండవచ్చునేమో;

ప్రభువైన యేసూ అయినను, మేము నీతో మాత్రమే నడచెదము,

అయినను, అనుదినము నిన్నే మరెక్కువగా ప్రేమించెదము.

అనుదినము ఇతరులకు సహాయపడుటలో సంతోషమును మాకివ్వండి

వారి బాధలు, వారి శ్రమలు, వారి కన్నీళ్ళను పంచుకొనుటలో;

వారి కన్నులను కలువరి వైపుకు త్రిప్పుటకు ప్రభువా, మాకు సహాయం చేయండి

వారి పాపముల నుండి మరియు భయముల నుండి విడుదల పొందుటకు.

ప్రభువా, మీ ఆత్మ యొక్క మహా శక్తితో మమ్ములను నింపండి;

మేము కలుసుకున్న వారందరికీ ఆశీర్వాదముగా మమ్ములను చేయండి;

మీ జీవము మాలో నదివలె ప్రవహించును గాక,

మీ మాధుర్యముతో మేము వ్యాపించునట్లు మాకు సహాయం చేయండి.

మేము నిరంతరం మీ చిత్తమును మాత్రమే నెరవేర్చుటకు ఆశ కలిగియున్నాము,

ప్రభువా, కేవలం మీకొరకు మాత్రమే జీవించగోరుచున్నాము;

ఆ తరువాత ఒక శుభ దినమున మీ వైభవములో మీతో మేము పరిపాలించెదము

మరియు నిత్యత్వం ద్వారా మీ మహిమలో భాగస్తులమయ్యెదము.

- జాక్‌ మరియు అనీ పూనెన్‌

(మా వివాహము కొరకు వ్రాసినది)