WFTW Body: 

చిన్నపిల్లల వంటివారు ప్రార్థన చేయుట చాలా సులభము, ఎందుకనగా ప్రార్థన అనగా దేవుని ఎదుట మన నిస్సహాయతను మరియు బలహీనతను ఒప్పుకొనుట. తెలివిగల పెద్దవారు దీనిని ఒప్పుకొనుట కష్టము. అందువలన యేసుప్రభువు మనలను చిన్నబిడ్డలవలె ఉండమని చెప్పారు. మనము ఎంత ఎక్కువగా మనకున్న తెలివితేటలమీద మరియు కారణముల మీద ఆధారపడుదుమో అంత తక్కువగా ప్రార్థించెదము మరియు మనకు అర్థం కాని విధముగా దేవుడు ఎందుకు పనిచేయుచున్నాడని ప్రశ్నించినయెడల కూడా తక్కువగా ప్రార్థించెదము.

కారణమును బట్టిగాక విశ్వాసమును బట్టి విధేయత చూపించాలని దేవుడు కోరుచున్నాడు (రోమా 1:5). మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను ఎందుకు తినకూడదో దేవుడు ఆదాముతో చెప్పలేదు. దేవుడు తనను ప్రేమించుచున్నాడనియు మరియు తన మేలు కొరకే దేవుడు ఆజ్ఞాపించుచున్నాడనియు(మనకు అర్థం కాకపోయినప్పటికీ) ఆదాము తెలుసుకొనిన చాలును. "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము" (సామెతలు 3:5). కాబట్టి ఆదాము ఓడిపోయినప్పుడు, దేవుని యొక్క ప్రేమలోను మరియు దేవుని యొక్క జ్ఞానములోను విశ్వాసముంచకపోవుటయే కారణము. ఈ విషయములోనే మనము కూడా ఓడిపోయెదము.

దేవుడు మనలను అత్యధికముగా ప్రేమించుచున్నాడనియు మరియు మనకు ఏది శ్రేష్టమైనదో మనకంటె ఎక్కువగా దేవునికి తెలియుననియు మరియు ఆయన సర్వశక్తి గలవాడైయుండి భూమిమీద సమస్తమును నిర్వహించుననియు మనము విశ్వసించినయెడల ఇప్పటినుండి మన జీవితములలో సమస్తమును ఆయన చిత్తమునకు సమర్పించుకొని, సంతోషముతో ఆయన ఆజ్ఞలన్నింటిని గైకొనుచూ, వెంటనే జవాబు పొందనప్పటికి ప్రార్థించుచు మరియు మనము ప్రశ్నించక ఆయన అనుమతించిన దానికి లోబడెదము. దేవునియొక్క జ్ఞానములోను, ప్రేమలోను మరియు శక్తిలోను మనకు విశ్వాసం లేనట్లయితే, వీటిని మనము చేయము.

మనము చిన్నబిడ్డలవంటి వారమైతే సామాన్యమైన విశ్వాసముతో దేవునియొద్దకు వచ్చి మన హృదయమంతటిలోనికి పరిశుద్ధాత్మను పొందుకొనెదము (లూకా 11:13). ఆ విధముగా ఆత్మను పొందుకొనుటకు మనకు తెలిసిన పాపములను దేవునియెదుటను మానవుల యెదుటకు ఒప్పుకొని మంచి మనసాక్షి కలిగియుండి, పరిశుద్ధాత్మ నింపుదలకు ఆకలిదప్పులు కలిగియుండి, మన జీవితములలోని ప్రతివిషయమును ఆయనకు సమర్పించుకొని మరియు మనలను ప్రేమించే తండ్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని నమ్మవలెను. మనకు వెంటనే ఎటువంటి అనుభూతులు లేకపోయినప్పటికి, మనము అడిగిన దానిని దేవుడు అనుగ్రహించియున్నాడని మనము నమ్మవలెను. బాహ్యమైన ప్రత్యక్షతలు తరువాత కలుగును. కాబట్టి చిన్న బిడ్డవలె ఉండుము.

మనము విశ్వాసము ద్వారా రక్షణ పొందినట్లే జయమును కూడా విశ్వాసముతో పొందగలమా?.

1యోహాను 5:4లో "లోకమును జయించిన విజయము మన విశ్వాసమే" మరియు లోకమనగా 'నేత్రాశయు, శరీరాశయు, జీవపుడంబము' అని వాక్యములో చెప్పబడియున్నది (1యోహాను 2:16). కాబట్టి కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే వాటి అన్నిటిమీద జయము పొందెదమని వాక్యము బోధించుచున్నది. కాని విశ్వాసము అనగా ఏమిటి? విశ్వాసమనగా దేవునియొక్క సంపూర్ణమైన ప్రేమలోను, జ్ఞానములోను మరియు శక్తిలోను మనము సంపూర్ణమైన విశ్వాసము కలిగియుండి దేవుని మీద ఆధారపడుటయే. యోహాను 1:12లో చెప్పినరీతిగా విశ్వాసము అనగా పొందుటయే. ఇది కేవలము తెలివితో కూడిన విశ్వాసము కాదు. కాబట్టి దేవునియందు నమ్మికయుంచుట అనగా ఆయనయొక్క చిత్తము సంపూర్ణమైయున్నదని అంగీకరించి పొందుకొనుట. అనగా మన స్వచిత్తమును ఉపేక్షించుకోవాలి. శరీరేచ్ఛలు సిలువ వేయబడియున్నవి అనగా అర్థమిదే (గలతీ 5:24). మన స్వచిత్తమును ఉపేక్షించుకొనుటకు, మనకు దేవుని కృప అవసరము.

విశ్వాసము ద్వారానే ఇవన్ని ప్రారంభమవుతాయి. దేవుని యొక్క చిత్తము శ్రేష్టమని మనము నమ్మనియెడల, మన స్వచిత్తమును ఉపేక్షించుటకు ఇష్టపడము. ఉదాహరణకు నీవు టీ.వి చూచినప్పుడు, ప్రభువైనయేసు అదే పరిస్థితిలో ఉన్నట్లయితే ఆయన దానిని చూచి ఉండెడివాడేమో అనగా అనవసరమైన కార్యక్రమాలను లేక సినిమాలను మరియు లైంగిక వాంఛలను కలిగించే కార్యక్రమాలను ఆయన చూడడు. నీలో ఉన్న దురాశను రేకెత్తించేవే శ్రేష్టమైనవని నమ్ముచున్నావా? అది దేవుని చిత్తము శ్రేష్టమని నీవు నమ్ముట మీద ఆధారపడి ఉంది. విశ్వాసము లేకుండా జయము పొందలేము.

నీవు వెంబడించవలసిన ప్రభువైనయేసు గురించి ఎల్లప్పుడు ఆలోచించుము. నీ శరీరము ఎంతో బలహీనమైనదని ఎన్నటికి మరిచిపోవద్దు. ప్రభువైనయేసు సహాయము కొరకు ఎల్లప్పుడూ తండ్రికి మొరపెట్టెను. నీవు కూడా దానినే చేయాలి. నీవు దాడిచేయబడినప్పుడు యేసు నామము అనే బలమైన దుర్గముతో ఎదిరించాలని గుర్తించుకొనుము (సామెతలు 18:10). ఈ భూమిమీద నీకు ఎటువంటి కష్టము బాధ వచ్చినప్పటికి ప్రభువైనయేసు నామములో తండ్రికి ప్రార్థించుము.