WFTW Body: 

యెహెజ్కేలు 36:25-37 వచనాలు క్రొత్తనిబంధన జీవితమును గూర్చిన చక్కటి ప్రవచనము. ఇది దేవుడు ఉద్దేశించిన క్రైస్తవ జీవితము యొక్క వివరణ. ఆయన మొదటిగా మన హృదయమునుండి విగ్రహాలన్నిటిని తీసివేసి మనలను పూర్తిగా శుద్ధిచేయుదునని వాగ్ధానము చేస్తున్నాడు. ఆ తరువాత మన కఠిన హృదయమునకు బదులుగా మొత్తని హృదయాన్ని ఇస్తానని ఆ తరువాత మనలో ఆయన పరిశుద్ధాత్మను ఉంచి ఆయన మార్గములలో నడుచునట్లు ఆయన ఆజ్ఞలకు లోబడునట్లు చేసి తద్వారా మన అపవిత్ర అంతటిలోనుండి మనలను రక్షించుదునని చెప్తున్నాడు (యెహె. 36:25-29). కాని మనము దేవునికి ప్రార్థించి మనకొరకు ఇవన్నియు చేయమని ఆయనను అడిగినప్పుడే ఇవన్నియు జరుగును(యెహె. 36:37). మనము ఇటువంటి జీవితము కొరకు అడుగకపోతే మనము దానిని పొందలేము. మనము ఈ మహిమకరమైన జీవితములోనికి వచ్చినప్పుడు, మన గతాన్ని గుర్తుచేసుకొని మనలను మనము అసహ్యించుకుంటాము (యెహె. 36:31). ఒక ఆత్మ నింపుదల గల వ్యక్తి యొక్క లక్షణమేమిటంటే తన శరీరములో తను చూచే పాపాన్నంతటిని అసహ్యించుకొని "నేనెంతటి భ్రష్టుడను. నేను పాపులలో ప్రధానుడను" అని మెఱ్ఱపెడతాడు (రోమా 7:24, 1తిమోతి 1:15). ఆత్మనింపుదల గల వ్యక్తి తన శరీరములో ఒక పాపమును చూచి దానిని బట్టి తన్నుతాను అసహ్యించుకొనకుండా ఇతరులలో, ఆ పాపాన్ని చూడడు. మనము దేవునికి ఎంత దగ్గరవుతామో మన పాపమును గురించి మనమంత గ్రహింపును కలిగియుంటాము.

యెహెజ్కేలు 37వ అధ్యాయము పునరుత్థాన జీవితము యొక్క ఉపమానము. ఎండిన ఎముకలతో నిండియున్న ఒక లోయలోనికి దేవుడు యెహెజ్కేలును తీసుకువెళ్ళి మొట్టమొదటిగా వాటికి ప్రవచింపమని చెప్పాడు. దేవునివాక్యము మాత్రమే సరిపోలేదు. మనము ఆదికాండము 1వ అధ్యాయములో చూచినట్లు వాటికి పరిశుద్ధాత్మయొక్క శక్తికూడా అవసరమైయుండెను. దేవునివాక్యము మరియు పరిశుద్ధాత్మయు కలిసి పనిచేయుట వలన మరణమునుండి జీవమును తెచ్చెనని మనమక్కడ చూచాము. ఇక్కడ కూడా అంతే. ఈ రోజున కూడా అంతే. పరిశుద్ధాత్మ ఈ శవాలపైకి రాగా అవి లేచి వెంటనే ప్రభువు కొరకు ఒక ప్రతీకగా ఉన్నది. అనేకమంది క్రైస్తవులు ఆరంభములో, తన సిద్ధాంతములన్నియు సరియైనవైనప్పటికీ, ఖచ్చితముగా ఆ ఎండిన ఎముకలవలే చచ్చిన స్థితిలో ఉన్నారు. వారు దేవుని వాక్యానికి స్పందించినప్పుడు వారు క్రైస్తవులుగా కూడుకోవడం ప్రారంభిస్తారు (ఎముకకు ఎముక కలుస్తున్నవి) మరియు వారు సరైన జీవితాలను జీవించడం మొదలుపెడతారు (మాసంము ఎముకలను కప్పినప్పుడు కొంత అందమొస్తుంది). కాని ఈ క్రైస్తవులు దేవుని కొరకు ఒక శక్తివంతమైన సైన్యముగా మారాలంటే వీరికి మరొకటి అవసరమైయున్నది. వారు దేవుని పరిశుద్ధాత్మయొక్క మానవాతీతమైన శక్తిచేత అభిషేకించబడవలసియున్నది. అదే 37వ అధ్యాయముయొక్క సందేశము.

యెహెజ్కేలు 43వ అధ్యాయములో ఆలయమునుండి తొలగిపోయిన దేవుని మహిమ క్రొత్త ఆలయమునకు తిరిగి వచ్చుట గూర్చి మనము చదువుతాము. ఇది పెంతెకొస్తు దినమునుండి స్థాపించబడిన క్రొత్తనిబంధన సంఘము. దేవుడు సంఘమును నా గద్దె స్థలము(సింహాసనము) అని పిలుస్తున్నాడు. క్రొత్తనిబంధన సంఘ విధి ఈ విధంగా వర్ణించబడెను. దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము (యెహె 43:12). పాతనిబంధన మందిరములో పడమర దిక్కున ఉన్న ఒక చిన్నగది మాత్రమే "అతిపరిశుద్ధ స్థలము"గా పిలువబడెను. అక్కడ దేవుడు నివసించెను. కాని క్రొత్తనిబంధన సంఘములో, సంఘమంతయు(మందిరమంతయు) అతిపరిశుద్ధము. సంఘమును దేవుని మందిరముగా ఈ రోజున కట్టాలంటే మనము ఈ ఒక్క మౌళికమైన విధిని అనుసరించాలి. దానియందు ప్రతి సభ్యునికి పూర్తి పరిశుద్ధత ఉండాలి. పాపాన్ని ఏ రూపములోను మనము సహించకూడదు.

అటువంటి పరిశుద్ధ ఆలయమునుండి (ఆత్మతో నింపబడిన సంఘము లేక ఆత్మతో నింపబడిన వ్యక్తి) నుండి ఒక చిన్న నీటి ధార ప్రవహించడం ప్రారంభమై తరువాత ఒక నదిగా ఆ తరువాత అనేక నదులుగా మారును(యెహె 47వ అధ్యాయము). పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తినుండి జీవజలనదులు ప్రవహించునని యేసు చెప్పినప్పుడు (యోహాను 7:37-39) ఆయన ఈ వాక్య భాగమునే ప్రస్తావించెను. పెంతెకొస్తు దినమున ఆరంభమైనది ఇదే. అప్పటి నుండి భక్తిపరులైన స్త్రీ పురుషుల ద్వారా జీవజలనదులు ప్రవహిస్తున్నవి. ఈ జీవితము ఒక చిన్న ధారగా మొదలయి ఆ తరువాత నదిగా తరువాత అనేక నదులుగా మారుతుంది. ఆయన యెహెజ్కేలును ఈ నదిలోనికి అడుగు వెంబడి అడుగు నడిపించాడు.

యెహెజ్కేలు 47:3-6 వచనాలలో ఆత్మనింపుదల గల జీవితాన్ని జీవించడం అంటే ఏమిటో ప్రభువు యెహెజ్కేలుకు చిన్న రుచి చూపించాడు. ఆయన యెహెజ్కేలును ఈ నదిలోనికి అడుగువెంబడి అడుగు నడిపించాడు. దానిలో 500 మీటర్లు నడచిన తరువాత నీరు యెహెజ్కేలు చీలమండల లోతుండెను. మరో 500 మీటర్ల తరువాత నీళ్ళు అతని మోకాళ్ళ వరకు వచ్చెను. మరొక 500 మీటర్ల తరువాత నీళ్ళు అతని నడుము వరకు వచ్చెను. మరో 500 మీటర్ల తరువాత నీళ్ళు ఎంత లోతుండెనంటే యెహెజ్కేలు తన పాదములను నేలపై మోపలేకపోయెను. మరియు నదిచేత కొట్టుకొనిపోబడెను. మనము దేవునితో నడుస్తున్నప్పుడు యెహెజ్కేలు వలే ముందుకు వెళ్ళడానికి దేవుడు మనలను బలవంతము చేయడు. ఎలీషా ఏలియాను వెంబడించినప్పుడు(2 రాజులు 2) అతడు ఇంకా ఆకలి గలిగియుండెనో లేక అతడు పొందిన దానితో సంతృప్తిపడెనో అని చూచుటకు అతడు ఎలీషాను పరీక్షిస్తూ వచ్చెను. దేవుడిచ్చే శ్రేష్టమైన దానిని పొందేవరకు ఎలీషా తృప్తి పడలేదు. గనుక అతడు తన జీవితముపై రెండింతల అభిషేకమును పొందెను. ఇక్కడ యెహెజ్కేలు కూడా అదే విధంగా పరీక్షింపబడుట మనము చూస్తాము. అతడు ఈదుటకు కావలసినంత నీళ్ళు ఉన్నంతవరకు నదిలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళెను. నీవు నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యమును కొంత మట్టుకు అనుభవించి దేవుడిచ్చే శ్రేష్టమైన దానిని పొందకుండా ఆగిపోవచ్చు.

ఈ విషయాన్ని కూడా గమనించండి, నీరు యెహెజ్కేలు యొక్క చీలమండల వరకు లేక మోకాళ్ళ వరకు లేక నడుము వరకు ఉన్నప్పుడు అతని పాదములు భూమిపైనే ఉన్నాయని చెప్పవచ్చును. కాని మన పాదములు భూమిని అంటుకోకుండా ఉన్నప్పుడు నిజముగా మనము పరిశుద్ధాత్మతో నింపబడ్డామని మనకు తెలుస్తుంది. అప్పుడు మనము భూమికి, భూసంబంధమైన వాటికి, భౌతిక సంబంధమైన వాటికి అంటిపెట్టుకొని ఉండము మరియు మన సొంత చిత్తప్రకారము గాక దేవుని చిత్తప్రకారము మనము ఆత్మచేత నడిపించబడతాము

యెహెజ్కేలు గ్రంథము యొక్క చివరి వచనము (48:35 ఈ క్రొత్తనిబంధన సంఘము యొక్క పేరును యెహోవాషమ్మా(ప్రభువు అక్కడ ఉన్నాడు) అని చెప్పుచున్నది. ఇది ఒక క్రొత్తనిబంధన సంఘము యొక్క ప్రధాన గుర్తు. ప్రభువు ప్రతి కూటము మధ్యలో నుండుము మరియు ప్రజలు ఆయనను కలుసుకొనెదరు మరియు ఆయన మాటలను వినెదరు. ఇటువంటి సంఘమును కట్టుటకు నీవు నేను పిలువబడినాము. కాని దానిని కట్టుటకు ఆయనకు పూర్తిగా లోబడే యెహెజ్కేలు వంటి వారు దేవునికి అవసరమైయున్నారు.