జాక్ పూనెన్ గారి నలుగురు కుమారులు వారి తండ్రిని వారి హీరోగా ఎంతగానో గౌరవిస్తారు. వారి వివాహాలలో ఆయన బోధించాలని కోరుకున్నారు.
జాక్ గారు వారి వివాహాలలో బోధించిన సందేశాలు అక్షర రూపంలో ఉన్నాయి.
ఇది చాలా మంది వివాహిత జంటలకు వారి స్వంత వివాహ జీవిత ప్రమాణాలను, దేవుని ప్రమాణానికి పెంచడానికి సవాలుగా ఉండాలనే ప్రార్థనతో ఇది పంపబడుతుంది. జాక్ పూనెన్ మరియు ఆనీ పూనెన్ వివాహం చేసుకొని 44 సంవత్సరాలు(2012) గడచినవి. ప్రపంచంలోని అనేక దేశాలలో వారు కలిసి ప్రభువును సేవించారు మరియు అనేక కుటుంబాలను దైవిక గృహాలుగా నిర్మించాలని ప్రోత్సహించారు. వారి నలుగురు కుమారులు (మరియు వారి భార్యలు) అందరూ తిరిగి జన్మించారు. వారి తల్లితండ్రులు వారి తరంలో ఉన్నట్లే, ఇప్పుడు తమ తరంలో కుటుంబాలుగా ప్రభువుకు సాక్ష్యంగా ఉండాలని కోరుతున్నారు.
వివాహం అనేది దేవుడి ఆలోచనే తప్ప మనిషిది కాదని గుర్తుంచుకోవాలి. చెప్పాలంటే, ఆయనే ఈ పరికరం యొక్క “తయారీదారుడు”. కాబట్టి ఈ “పరికరం” ఎలా పని చేయాలి అనేది మన స్వంత ఆలోచనలపై కాక తయారీదారుని సూచనలపై ఆధారపడి ఉంటుంది!
ఇక్కడ “తయారీదారుని సూచనల” నుండి కొన్ని విషయాలు ఉన్నాయి:
క్రీస్తు పట్ల భక్తితో ఒకరికొకరు లోబడి ఉండండి. భార్యలారా, ప్రభువుకు వలే మీ స్వంత భర్తలకు లోబడి ఉండండి, ఎందుకంటే భర్త భార్యకు శిరస్సు, క్రీస్తు సంఘానికి అధిపతి. భర్తలారా, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, ఆమె కోసం తన్ను తాను అర్పించుకున్నట్లే, మీ భార్యలను ప్రేమించండి. భర్తలు కూడా తమ సొంత భార్యలను తమ సొంత శరీరాల వలె ప్రేమించాలి. (అప్పుడు) ఇద్దరూ ఏక శరీరమవుతారు. (ఎఫెసీయులు 5:20-31 ఆంగ్ల లివింగ్ తర్జుమా)
భార్యలారా, మీ భర్తల ప్రణాళికలకు అనుగుణంగా ఉండండి. మృదువైన మరియు సాధువైన ఆత్మ యొక్క శాశ్వతమైన ఆకర్షణతో, మీ హృదయాలలో అందంగా ఉండండి - అది దేవునికి చాలా విలువైనది.
భర్తలారా, మీ భార్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వారి అవసరాల గురించి ఆలోచించాలి మరియు బలహీనమైన ఘటముగా వారిని గౌరవించాలి. దేవుని ఆశీర్వాదాలను పొందడంలో మీరు మరియు మీ భార్యలు భాగస్వాములు అని గుర్తుంచుకోండి మరియు మీరు ఆమెకు తగిన విధంగా వ్యవహరించకపోతే, మీ ప్రార్థనలకు సమాధానాలు లభించవు.
ఇప్పుడు మీ ఇద్దరికీ ఈ మాట: మీరు సంతోషకరమైన కుటుంబంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు సానుభూతితో నిండి ఉండాలి, ఒకరినొకరు సున్నిత హృదయాలతో మరియు దీనమనస్సులతో ప్రేమించాలి” (1పేతురు 3:1-8 ఆంగ్ల లివింగ్ తర్జుమా) “ఒకరినొకరు సహించుచు, ప్రేమను బట్టి ఒకరిలోపాలను మరొకరు భరించండి” (ఎఫెసీయులు 4:2 ఆంగ్ల లివింగ్ తర్జుమా).
“తయారీదారుని సూచనలను” ఖచ్చితంగా పాటిస్తే, “పరికరం” ఖచ్చితంగా పని చేస్తుంది.
(నా పెద్ద కుమారుడు సంజయ్ మరియు కేథీ వివాహములో ఇవ్వబడిన వర్తమానం)
నా పెద్ద కుమారుని వివాహంలో మాట్లాడుట నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము అనేక సంవత్సరాలనుండి ఈ రోజు కొరకు ఎదురుచూస్తున్నాము.
ద్వితీయోపదేశకాండం 11:18-21 (ఆంగ్ల కె.జె.వి)లో ఉన్న ఒక మాటను సంజయ్ మరియు కేథీలతో పంచుకోవాలనుకొనుచున్నాను. అక్కడ దేవుడు, “మీ హృదయాలలో నా మాటలు ముద్రించుడి, అప్పుడు భూమిపై మీ రోజులు పరలోకంలోని రోజులవలె ఉండును” అని చెప్పెను.
“భూమిపై మీ రోజులు పరలోకంలోని రోజుల వలె ఉండును” అనునది ఎంత చక్కని మాట.
పరలోకంలోని రోజుల గురించి ఒకసారి ఆలోచించండి. అక్కడ పోట్లాటలు, గొడవలు ఉండవు, కేవలం సమాధానం, సంతోషం మాత్రమే ఉండును. వీటన్నిటికి పైగా - ప్రతిచోట ప్రేమ ఉండును. భూమిపై పరలోకంలోని రోజును కలిగిన ఇంటిని మీరు కూడా ప్రతిరోజు కలిగి ఉండవచ్చు. ప్రతి ఇల్లు కూడా ఆవిధంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు.
బైబిల్, ఆదాము హవ్వల వివాహంతో ప్రారంభమై క్రీస్తు మరియు సంఘమైన ఆయన ప్రజల వివాహంతో ముగుస్తుంది.
దేవుడు ఆదాము హవ్వల వివాహమును జరిగించినప్పుడు - భూమిపై వారి రోజులు పరలోకంలోని రోజుల వలె ఉండాలని కోరుకొనెను. వారి మొదటి గృహం పరదైసు - ఏదేను. కాని సాతాను వచ్చి వారి ఇంటిని నరకంగా మార్చాడు. ఈనాడు లోకమంతటిలో నరకం వంటి ఇళ్ళు ఉన్నాయి.
కాని అదే కథకు ముగింపు కానందుకు దేవునికి స్తోత్రం. అక్కడే ఏదేనులో ఆదాము పాపం చేసిన వెంటనే సాతాను సృష్టించిన సమస్యను పరిష్కరించుటకు తన కుమారుని పంపెదనని దేవుడు వాగ్ధానం చేసినట్లు బైబిల్ చెప్తుంది. అక్కడే ఈ గొప్ప సత్యమును చూస్తాము: దేవుడు ఎల్లప్పుడు మన పక్షంగా సాతానుకు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడు, ఆదాము పాపమునకు భూమిని శపింపక ముందు, సాతాను తలను చితకగొట్టు సంతతి స్త్రీనుండి వచ్చునని ఆదాము హవ్వలకు చెప్పెను. దాని తరువాత మాత్రమే వారి శిక్షను ప్రకటించెను.
అపవాది వచ్చి అన్నిటిని తారుమారు చేసినను, ఆదాము హవ్వల పక్షముగా, సాతానుకు వ్యతిరేకంగా తాను ఉండెనన్న విషయం వారు తెలుసుకొనవలెనని దేవుడు కోరుకొనెను. సాతాను, ఏ ఇంటిలోనైనా ఏమి చేసినా, దేవుడు గృహాలను విమోచించే పనిలో ఉన్నాడు. భూమిపై మన రోజులు పరలోకంలోని రోజుల వలె ఉండాలనే తన అసలైన ప్రణాళికలోనికి మన గృహాలను తీసుకురావలెనని కోరుతున్నాడు. ఇప్పుడైతే క్రీస్తు వచ్చి విమోచన కార్యమును ముగించారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే.
కొంతకాలం క్రితం నేను డిజిటల్ కెమెరాను కొన్నాను. దానికి ముందు, సాధారణమైన ఫిల్మ్ చుట్ట(రీల్) ఉన్న కెమెరాను వాడాను. కాని ఈ ఖరీదైన డిజిటల్ కెమెరాతో పోటోలు బాగుగా కాకుండా అధ్వానంగా వస్తున్నట్టు కనుగొన్నాను. అవి మబ్బుగా, అస్పష్టంగా వచ్చేవి. అనేక వివాహాలవలె, ఎంతో ఖర్చుపెట్టిన తర్వాత కూడా చెత్తకుండిలో వేయుటకు తగిన ఫోటోలే నేను పొందాను.
అలా ఎందుకు జరిగింది? ఎందుకంటే నేను తయారీదారుని సూచనలు చదువలేదు. ప్రతి ఖరీదైన పరికరం తయారీదారుని సూచనల పుస్తకంతో వస్తుందని మనకు తెలిసిందే. వివాహమును ఏర్పరచిన దేవుడు, మనకు ఎటువంటి సూచనలు ఇవ్వకుండా ఉండటం సాధ్యమేనా? ఖచ్చితంగా కాదు. ఆయన మనకు సూచనలు ఇచ్చాడు. నేను డిజిటల్ కెమెరాతో చేసినట్లు, మనం ఆ సూచనలను వెంబడించము కాబట్టి మన వివాహాలన్ని మబ్బుగా, అస్పష్టంగా, చెత్తబుట్టలో వేయుటకు తగినవిగా మారిపోయయి.
తరువాత నేను డిజిటల్ కెమెరాను ఎలా వాడాలో తయారీదారుని పుస్తకములో చదివి, సూచనలను పాటించాను. కెమెరా తయారు చేసిన వానికంటే ఎక్కువగా నాకు తెలుసు అని ఊహించుటకు నేను సాహసించలేదు. ఆవిధంగా ఆలోచించుట బుద్ధిహీనత. వివాహవిషయంలో ’తయారీదారుని సూచనలను’ విస్మరించే అనేకమందిలో అటువంటి బుద్ధిహీనతను కనుగొంటాము. వారు దేవునినుండి వినుటకంటే, మనసత్వ శాస్త్రవేత్తల మాటలు వినుటద్వారా, మానవ సాంప్రదాయాలను వెంబడించుట ద్వారా శ్రేష్ఠమైన వివాహమును తయారుచేసెదమని ఊహించుకొందురు.
దేవుడు వివాహవిషయంలో స్పష్టమైన సూచనలను ఇచ్చెను. నేను డిజిటల్ కెమెరా తయారీదారుని సూచనలను అనుసరించినప్పుడు, నా పోటోలు స్పష్టముగా వచ్చాయి. భార్యభర్తలు తయారీదారుని సూచనలు పాటించినప్పుడు, వివాహంలో కూడా ఖచ్చితంగా ఆవిధంగానే జరుగుతుంది.
వివాహ విషయంలో తయారీదారుని సూచనలు కలిగిన పుస్తకం ప్రపంచంలో ఒక్కటే ఉంది - బైబిల్. నా వివాహం కంటే ముందు అనేక సంవత్సరాలనుండి దాన్ని చదవటం ప్రారంభించాను. వివాహం తర్వాత నేను నా భార్య కలిసి దాన్ని చదివాము. మా 37 సంవత్సరాల వివాహ జీవితంలో, ’భూమిపై పరలోకం వంటి రోజు’లను కలిగి ఉండుట అంటే ఏమిటో కొద్దిగా రుచి చూశాము.
సువార్తయొక్క సందేశమిదే, మనం రెండు పరలోకములను కలిగి ఉండవచ్చు - ఒకటి ఇప్పుడు భూమిమీదనున్న మన రోజులు పరలోకంలోని రోజుల వలె అగుట. చివరగా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు భౌతికమైన పరలోకం.
దీనికి ప్రత్యామ్నాయంగా రెండు నరకములను కలిగి ఉండవచ్చు - ఒకటి ఇప్పుడు, ఇంకొకటి నిత్యంత్వంలో. దానినుండి రక్షించుటకు యేసుక్రీస్తుప్రభువు వచ్చెను.
సంజయ్ మరియు కేథీలు రెండంతుస్తులు గల ఇంటిలో నివసింపబోతున్నారు. దానిని మనం వివాహమునకు ఒక సాదృశ్యంగా చూడవచ్చు. ఆ ఇంటికి మొదటిగా పునాది ఉంటుంది, ఆ పునాదిపై మొదటి మరియు రెండవ అంతస్తు నిర్మింపబడ్డాయి.
ప్రతి ఇంటికి ముఖ్యమైన భాగం దాని పునాది. ప్రతి వివాహంలో మొదటిగా అవసరమైనది కూడా ఒక మంచి పునాదే. దేవుని పరిపూర్ణమైన షరతులు లేని ప్రేమే, ఒక మంచి వివాహానికి పునాది. దేవుని షరతులులేని ప్రేమను గూర్చిన సత్యం, బైబిలంతటిలో కనిపించే గొప్ప సత్యం. మనం తడబడినా, తప్పుచేసినా, విఫలమైనా, మన జీవితాలను గజిబిజి చేసుకున్నా, మనపట్ల దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు.
మన యెడల తన ప్రేమను వర్ణించాలనుకున్నప్పుడు, దేవుడు నవజాత శిశువు పట్ల తల్లికి ఉన్న ప్రేమను ఉదాహరణగా ఉపయోగించారు. ఒక తల్లి తన బిడ్డనుండి ఏమి తిరిగి ఆశించదని మనకు తెలుసు.
వేరొక ప్రక్క, టీవీలో, సినిమాలో చూపించే ప్రేమ ఎంతో స్వార్థపూరితమైన ప్రేమ. ఒక యౌవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పవచ్చు. కాని తన స్వంత ఆనందంకొరకు ఆ అమ్మాయినుండి ఏదో కోరుకొనును. ఆ అమ్మాయి కూడా అతనినుండి ఏదో తనకొరకు కోరుకొనును.
అయితే దేవుని ప్రేమ వేరుగా ఉంది. అది నవజాత శిశువు పట్ల తల్లికి ఉన్న ప్రేమ వంటిది. తన బిడ్డనుండి తల్లి దేనిని ఆశించదు. నిజానికి, తన చిన్న బిడ్డ తన తల్లికి ఏమి ఇవ్వలేదు. ఈ లోకంలో ఒక తల్లి ప్రేమ ఎంతో నిస్వార్థమైన ప్రేమ. మన యెడల తన ప్రేమను వర్ణించేటప్పుడు ఈ ఉదాహరణనే యెషయా 49:15లో ఉపయోగించారు - ఈ ప్రేమ పూర్తిగా నిస్వార్థమైనది, తిరిగి ఏమి ఆశించనిది. ఒక తల్లి వలె, దేవుడు తన బిడ్డలకు సేవచేయును మరియు వారికొరకు బాధ అనుభవించును. వ్యాధికలిగిన బిడ్డను ఒక తల్లి ఎలా చూసుకుంటుందో మీరు చూశారా? దేవుడు కూడా మనలను ఆవిధంగా ప్రేమిస్తున్నాడు.
మీరిద్దరు దేవుని పరిపూర్ణమైన ఈ ప్రేమను తెలుసుకొనుట, మీ కొత్త ఇంటికి పునాదిగా ఉండవలెను. ఆ పునాదిపై మీరు రెండు అంతస్తులను నిర్మించవచ్చు. మీరిద్దరు, వ్యక్తిగతంగా దేవుని ప్రేమలో భద్రపరచబడనట్లయితే, మీ ఇద్దరి మధ్యలో అనేక సమస్యలు వచ్చును.మనకున్న అనేక సమస్యలు, మన అభద్రత భావం ద్వారానే వస్తాయని నేను ఒప్పింపబడ్డాను. షరతులులేని పరలోకపు తండ్రియొక్క ప్రేమలోని భద్రతను మనం కనుగొనలేదు. పరలోకతండ్రి ప్రేమలో భద్రపరచబడనట్లయితే, ఇతరులను ప్రేమించవలసినంతగా మనం ప్రేమించలేము. మన సంబంధాలలో అసూయ, పోటితత్వపు ఆత్మ, ఇంకా అనేకమైన సమస్యలు వచ్చును. కాని ఒక్కసారి దేవుని ప్రేమలో భద్రపరచబడినట్లయితే, మనం స్వతంత్రులమై కట్టుట ప్రారంభించవచ్చు.
ఒకసారి యేసును గొప్పఆజ్ఞ ఏమిటని ఒకరు అడిగినప్పుడు, ఒకటికాదు రెండు ఆజ్ఞలు గొప్పవని ఆయన సమాధానం చెప్పారు. మొదటిది పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించుట, రెండవది ఆయన మనలను ప్రేమించినట్లు ఇతరులను మనం ప్రేమించుట.
అవి ఇంటికి రెండు అంతస్తులు. నీవు మొదటి అంతస్తు నిర్మిచకుండా రెండవ అంతస్తు నిర్మించలేవు. అనేకమంది ఈ తప్పునే చేస్తుంటారు - మొదటిగా వారి హృదయమంతటితో దేవుని ప్రేమించకుండా ఇతరులను ప్రేమించుటకు ప్రయత్నిస్తారు. వారు తయారీదారుని సూచనలు చదువలేదు - కాబట్టి కొంతకాలం తర్వాత ఇతరులపై వారి ప్రేమ వాడిపోతుంది. ఇతరులను ప్రేమించవలసినంతగా ప్రేమించుటకు ముందు, మనం మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి.
దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు, వారిని ఒకేసారి, ఒకే సమయంలో చేయలేదు. ఆయన అలా చేయాలనుకుంటే సులభంగా చేసి ఉండేవాడు. ఆయన ఒక మట్టిముద్దకు బదులుగా, రెండు మట్టిముద్దలు తీసుకొని పురుషుని మరియు స్త్రీని చేసి జీవాత్మను ఊది ఉండేవాడు. కాని ఆదాము ఒక్కడినే ఎందుకు చేశారు? ఆదాము తన కళ్ళు తెరచినప్పుడు అతను చూచే మొదటి వ్యక్తి దేవుడు - హవ్వ కాదు! తర్వాత ఆదాముకు గాఢనిద్ర కలుగజేశాడు. ఎందుకు? కేవలం అతని ప్రక్కటెముకలలోనుండి ఎముకను తీయుటకు మాత్రమే కాదు. తోటలో మరొక ప్రక్క దేవుడు హవ్వను చేసినప్పుడు, కళ్ళు తెరచి ఆమె చూసిన మొదటి వ్యక్తి దేవుడు - ఆదాము కాదు. ఆదాము ఉన్నాడన్న విషయం కూడా ఆమెకు తెలియదు. మొదటిగా ఆమె దేవుణ్ణి మాత్రమే చూసింది.
ఆదాము హవ్వలకు దేవుడు నేర్పించాలనుకున్న మొట్టమొదటి పాఠం అదే: “నీ దేవుడనైన నేను, నీ జీవితంలో ఎల్లప్పుడు మొదటిగా ఉండాలి”. ఆ పాఠాన్నే మనమందరము కూడా నేర్చుకోవాలి.
చెక్కలను అంటించుటకు ఉపయోగించే ఫెవికోల్ అనే జిగురు గురించి మీరు విని ఉంటారు. దాని గూర్చిన ఒక ప్రకటనను నేను చూచాను. ఆ ప్రకటనలో, ఫెవికోల్‌తో అతుకబడిన రెండు చెక్క ముక్కలను రెండు ఏనుగులు విడదీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ ఏనుగులు ఆ రెండు చెక్క ముక్కలను విడదీయలేకపోయాయి. క్రీస్తు కేంద్రముగా ఉండి భార్యభర్తలను కలిపిన నిజమైన క్రైస్తవ వివాహం కూడా ఆవిధంగానే ఉంటుంది. అటువంటి భార్యాభర్తలను, ఈ భూమిపై లేక పరలోకంలో ఉన్న ఏ శక్తి కూడా విడదీయలేదు. ఒకవేళ క్రీస్తు మొదటిగా లేకుండా, భార్యాభర్తలను కలిపి ఉంచే జిగురుగా ఉండనట్లయితే, ఆ వివాహం రెండు చెక్కముక్కలను ఎటువంటి జిగురు లేకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్లు ఉంటుంది. ఎవ్వరు వేరుచేయకుండానే, వారు వేరైపోతారు. లోకంలో అనేకమైన విడాకులను చూచుటలో ఆశ్చర్యమేమి లేదు. వారి పెళ్ళిరోజు, ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నామని నిజంగానే ఊహించుకున్నారు. కాని వారిది స్వార్థపూరితమైన ప్రేమ అని గుర్తించలేదు. ఎందుకంటే క్రీస్తు వారి జీవితాలకు ప్రభువు కాదు. కాబట్టి, కొన్ని నెలల తర్వాత ఒకరితో నొకరు పోట్లాడుకుంటారు.
“ఒకరినొకరు ప్రేమించుడి” అనేది ఎక్కువగా వాడే ఒక మంచి మాట. కాని నీవు మొదటిగా దేవుణ్ణి ప్రేమించకుండా దానిని చేయలేవు. క్రీస్తు నీ వ్యక్తిగత జీవితానికి ప్రభువుగా లేనట్లయితే, నీ భాగస్వామి యెడల ప్రేమలో చివరి వరకు కొనసాగలేవు.
కాని దేవుణ్ణి ప్రేమించుట అనే మొదటి అంతస్తును నీవు నిర్మించినట్లయితే, అప్పుడు ఒకరినొకరు ప్రేమించుట అనే రెండవ అంతస్తును నీవు నిర్మించగలవు.
ఒకరినొకరు ప్రేమించుట గూర్చి నేను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
మొదటిగా ప్రేమ ప్రశంసను వ్యక్తపరుస్తుంది. వివాహ ప్రేమను తెలియచేసే పరమగీతములు అనే పుస్తకాన్ని దేవుడు బైబిల్లో చేర్చాడు. వివాహమైన వారందరు ఆ పుస్తకాన్ని ఒకరికొకరు చదవాలి!. సర్వశక్తుడైన దేవుడు భార్యాభర్తలు ఒకరితో నొకరు ఎలా మాట్లాడాలని కోరుకుంటున్నాడో ఈ పుస్తకములో చూచుట ఎంతో అద్భుతంగా ఉంటుంది. మిగతా పుస్తకాలవలె ఈ పుస్తకం కూడా దైవ ప్రేరేపిత లేఖనం.
భార్యాభర్తలుగా ఒకరినొకరు ఎలా ప్రశంసించుకోవాలో నేర్చుకొనుటకు, ఈ పుస్తకంలోనుండి కొన్ని భాగాలను నేను చదువుతాను. ప్రశంసలు తెలియచేసే విషయంలో మనమందరము పిసినారి వారమే. మనం త్వరగా విమర్శిస్తాము కాని ప్రశంసిచుటలో ఎంతో నెమ్మదిగా ఉంటాము. మనం ప్రజలను చూచి వారిలో ఎన్నో లోపాలను కనుగొంటాము. అది మానవ స్వభావం. ఆవిధంగా నేరారోపణ చేయు అపవాది మనలో కాలు మోపును. వేరొక పక్క, ఇతరులను చూచి మనం ప్రశంసించినయెడల దేవుడు మనలను స్వాధీనపరచుకొనుట ఆరంభించును. మనలో ప్రతిఒక్కరము మన ప్రవర్తనను ఈ విషయంలో పరీక్షించుకోవాలి.
పరమగీతములో, భర్త భార్యకు ఏమి చెప్పుచున్నాడో చూడండి (ఆంగ్ల మెసేజ్ తర్జుమా):
“నా ప్రియురాలా, నీవు తలనుండి పాదాలవరకు అందమైన దానవు - పోల్చలేనంత అందమైనదానవు, ఏ కళంకమైనను లేనిదానవు. నేను పరవశించే మనోహరమైన ఊహలవలె నీవు ఉన్నావు. నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం. నా ప్రియ మిత్రమా, అంతరంగంలోను బాహ్యముగాను నీ అందం సంపూర్ణమైనది. నీవు ఒక ఉద్యానవనం.”
(నేను దీనిని కల్పించి చెప్పటం లేదు. ఇదంతా లేఖనాల్లో ఉంది.)
“నీవు నా హృదయాన్ని దోచావు. నీవు నన్ను చూడగానే, నేను ప్రేమలో పడితిని. నీ ఒక్క చూపుతో నిస్సహాయంగా నేను ప్రేమలో పడితిని, నా హృదయం ఉప్పొంగింది. ఓ! నిన్ను చూడగానే నాలో కలిగే భావాలు ఎన్నో, నిన్ను చూడగానే నాలో రేకెత్తే కోరికలు ఎన్నో. ఇక ఎవ్వరికి చెందకుండా నేను పాడైపోతిని!”
(ప్రతి భర్త విషయంలో ఇది నిజమవ్వాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను)
“ఈ భూమిమీద నీవంటి వారులేరు, ఇక ఉండరు, ఇక ఉండబోరు. నీవు పోలికకు మించిన స్త్రీవి.”
(అక్కడ కొంత పద్యరూపకమైన భావాలకు దేవుడు అనుమతించాడు. ఇక్కడ శాస్త్రీయ ఖచ్చితత్వం కాదు కానీ ఇవి భర్తయొక్క భావాలు.)
ఇప్పుడు భార్య ఏమి చెప్తుందో చూడండి. ఇది ఆమె స్పందన:
“నా ప్రియ ప్రేమికుడా, నీవు ఎంతో అందమైన వాడవు! లక్షల్లో ఒకడవు. నీవంటివాడెవడు! నీవు బంగారు కొండవు - నీవు కఱుకు పర్వతం వంటి మనిషివి. నీ మాటలు వెచ్చనివి, అవి భరోసానిస్తాయి. నీ మాటలు ముద్దుల వంటివి, నీ ముద్దులన్ని మాటలే. నిన్ను గూర్చిన ప్రతిదీ నన్ను ఆనందింపచేస్తుంది. నీవు నన్ను పులకరింపచేయుదువు! నిన్నేంతో ఆశిస్తున్నాను. నీకోసం తహతహలాడుతున్నాను. నీ ఎడబాటు నాకు బాధాకరం. నిన్ను చూసినప్పుడు, నిన్ను గట్టిగా పట్టుకొని కౌగిలించుకుంటాను. నిన్ను విడువను. నేను నీదానిని, నీవు నా ప్రియుడవు నీవు నా వాడవు.”
ఇటువంటి దానిని దేవుడు లేఖనాలలో ఎలా ఉంచాడు? ఎందుకంటే దేవుడు తానే ఒక ప్రేమికుడు.
సంజయ్ మరియు కేథీ, అటువంటి ప్రేమికులుగా ఉండండి. మీరు ఒకరినొకరు ఆవిధంగా ప్రేమించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఒకరినొకరు ఆవిధంగా ప్రశంసించుకున్నట్లయితే, భూమిమీద మీరోజులు పరలోకంలోని రోజుల వలె ఉండును.
ఈ విషయంలో యేసే మనకు గొప్ప మాదిరి. ప్రజలపట్ల ప్రశంసలు తెలియజేసే విషయంలో ఆయన ఎంత ఆడంబరంగా ఉన్నాడు.
నిజమైన ప్రేమ గూర్చిన రెండవ విషయం: ప్రేమ త్వరగా క్షమిస్తుంది. ప్రేమ నిందించుటలో నెమ్మదిగా ఉంటుంది కాని క్షమించుటలో త్వరపడుతుంది. ప్రతి వివాహంలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటాయి. కాని ఆ సమస్యలను నీవు పొయ్యిమీద పెట్టినట్లయితే, అవి తప్పకుండా బయటకు పొర్లుతాయి. కాబట్టి క్షమించుటకును, క్షమాపణ అడుగుటకును త్వరపడండి. సాయంకాలం వరకు ఎదురుచూడవద్దు. ఉదయం నీ అరికాలులో ముళ్ళు కుచ్చుకుంటే, నీవు వెంటనే దాన్ని తీసివేస్తావు. సాయంకాలం వరకు ఎదురుచూడవు. నీవు నీ భాగస్వామిని గాయపరచినట్లయితే, ఒక ముళ్ళుతో వారిని పొడిచావు. వెంటనే దానిని తీసివేయండి. వెంటనే క్షమాపణ అడుగు, త్వరగా క్షమించు.
చివరగా, ప్రేమ తన భాగస్వామితో కలసి పనిచేయుటకు కోరుకుంటుంది కాని ఒంటరిగా కాదు. అపవాది తోటలో హవ్వను శోధించుటకు వచ్చినప్పుడు, ‘నేను నిర్ణయం తీసుకునేముందు మొదట వెళ్ళి నా భర్తను సంప్రదించనివ్వు’ అని హవ్వ చెప్పిన యెడల మానవచరిత్ర ఎంత వేరుగా ఉండేదో కదా. అలా జరిగితే ఆ కథ ఎంత వేరుగా ఉండేదో.
ప్రపంచంలోని సమస్యలన్ని ఒక స్త్రీ తనకు తోడుగా ఇచ్చిన భాగస్వామిని సంప్రదించకుండా, తనకు తానుగా నిర్ణయం తీసుకొనుట వలన ప్రారంభమయ్యాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
నిజమైన ప్రేమ కలసి పని చేస్తుంది. ఒక్కరి కంటే, ఎల్లప్పుడు ఇద్దరు మేలు.
దేవుని వాక్యములో పరమగీతములు 8:6,7 వచనములను చదవుతూ ముగించుకుందాం (ఆంగ్ల మెసెజ్ తర్జుమా):
“ప్రేమాగ్ని దాని ముందున్నదంతా కాల్చివేస్తుంది. వరదలు దాని ఆర్పివేయలేవు. నిజమైన ప్రేమను కొనలేము. అది బజారులో దొరకదు.”
కేవలం దేవుని ప్రేమ మాత్రమే ఆవిధంగా ఉంటుంది. అందుకే ఈ ప్రేమ “ప్రభువు జ్వాల” అని 6వ వచనంలో పిలవబడింది.
కేవలం దేవుడు మాత్రమే అటువంటి ప్రేమను ఇవ్వగలడు.
సంజయ్ మరియు కేథీ, ఒకరినొకరు ప్రేమించుటకు అటువంటి ప్రేమను ఇవ్వమని దేవుణ్ణి అడగండి.
దేవుడు మీ ఇరువురిని దీవించును గాక ఆమేన్.
(నా రెండవ కుమారుడు సంతోష్ మరియు మేఘన్ వివాహములో ఇవ్వబడిన వర్తమానం)
దేవుడు మనకు ఒకే ఒక్క పుస్తకాన్ని ఇచ్చాడని మనం నిజంగా నమ్మితే, జీవితంలోని ప్రతిదానికి సంబంధించిన సూచనలను ఆ పుస్తకములో చూస్తాము. మనుష్యులకొరకు వివాహమును ఏర్పరచినది దేవుడే అని బైబిల్లో చదువుతాము. దానిగూర్చి మొదటగా ఆలోచించినది దేవుడే, ఏకమవ్వాలన్న కోరికతో పురుషుని స్త్రీని సృష్టించినది దేవుడే. వివాహమైన జంట ఎలా జీవించాలో దానికి సంబంధించిన హెచ్చరికలను, సూచనలను ఆయన తన పుస్తకములో ఇచ్చాడు.
ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము హవ్వల వివాహమును గూర్చి చదువుతాము. దేవుడు వారిని వివాహములో జతపరచిన వెంటనే, ఒక అందమైన తోటలోకి వారిని పంపెను. మానవునికోసం దేవుని ప్రణాళిక అయిన ఆనందకరమైన వివాహం మీరు కోరుకుంటే, ఆ తోటలో జరిగిన మూడు విషయాలలోనుండి, సంతోష్ మరియు మేఘన్ (మరియు వివాహమైన వారందరు) ఖచ్చితంగా ఎన్నుకోవలసిన మూడు ఎంపికలు చూస్తాము.
అటువంటి ఆనందకరమైన వివాహాలను మనం ఈ భూమిమీద అరుదుగా చూస్తాము ఎందుకనగా అనేకమంది లేఖనాలను చదవరు, చదివినా, దేవుడు వివాహజంట ఖచ్చితముగా ఎలా జీవించాలని కోరుకుంటున్నాడనే విషయాన్ని ధ్యానించరు.
దేవుడు, ఆదాము హవ్వలను తోటలోనికి పంపినప్పుడు, వారికి కావలసినంత స్వేచ్ఛనిచ్చినా, ఆయన ఒకేఒక్క విషయమును నియంత్రించాడు. ఒక చెట్టునుండి తినకుండా నియంత్రించాడు. దానికి ఒక కారణం ఉంది. ఎంపిక లేకుండా ఏ ఒక్కరు దేవుని కుమారుడు కాలేరు. వ్యక్తిగతంగా ఎన్నుకోకుండా ఎవ్వరు పరిశుద్ధులు కాలేరు. దేవుడు ఆదామును తోటలోనికి పంపినప్పుడు అతనికి ఎన్నుకొనే అవకాశం దేవుడు ఇవ్వనట్లయితే, దేవుడు కోరినట్లుగా ఆదాము ఎప్పటికీ కుమారునిగా మారి ఉండేవాడు కాదు. భూమిపై మన జీవితం కొరకు, ముఖ్యముగా నిత్యత్వం కొరకు మనం ఎన్నుకొనే ఎంపికలు ఎంత ముఖ్యమైనవో మనం ఇంకా గుర్తెరుగలేదు.
దేవుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఎన్నుకునే శక్తి. ఎవ్వరినుండి కూడా ఆయన దాన్ని తీసివేయ్యడు. నీవు దేవుని కుమారునిగా ఉండుటకు నిర్ణయించుకోవచ్చు లేక నీకు నీవుగా జీవించుటకు నిర్ణయించుకోవచ్చు. నీవు దేన్ని నిర్ణయించుకున్నా, నీ ఎంపికయొక్క పర్యావసానాన్ని నీ జీవితం చివరలో కోస్తావు.
“ఒక మనిషి దేనిని విత్తుతాడో దానినే అతను కోస్తాడు” అని బైబిల్ చెప్తుంది. “మనుష్యులు ఒక్కసారే చనిపోవాలని నియమింపబడెను తరువాత తీర్పు జరుగును” అని కూడా బైబిల్ చెప్తుంది. ఆ చివరి రోజున దేవుడు ఇష్టంవచ్చినట్లు మనుషులను తీర్పు తీర్చడు. ప్రతి మనిషి ఎన్నుకున్న ఎంపికల ఆధారంగా ఆయన తీర్పులు ఉండును.
ఈ నియమం వివాహానికి కూడా వర్తిస్తుంది. ఒక ఆనందకరమైన వివాహం కావాలో లేక విచారకరమైన వివాహం కావాలో నీవే ఎన్నుకోవచ్చు. ఆ ఎంపిక నీదే దేవునిది కాదు. ఆదాము, తన జీవితాన్ని దేవునికి లోపరచాలో లేక సాతానుకు లోపరచాలో ఎన్నుకోవచ్చు.
కాబట్టి సంతోష్ మరియు మేఘన్, మీ వివాహములో మీరు తప్పక ఎన్నుకోవలసిన మూడు ఎంపికల గూర్చి మీతో మాట్లాడలనుకుంటున్నాను:
మొట్టమొదటిగా, మీ జీవితంలోని అన్ని విషయాలలో దేవునినే కేంద్రముగా కలిగి ఉండుటకు ఎన్నుకోండి.
ఏదేను తోటలో రెండు చెట్లు ఉన్నాయి - అవి రెండు రకముల జీవితాలకు సూచనగా ఉన్నాయి. జీవవృక్షం దేవుడు కేంద్రముగా కలిగిన జీవితానికి సూచనగా ఉంది - మనిషి తీసుకునే ప్రతి నిర్ణయమునకు దేవుడే కేంద్రముగా ఉండును. మరోప్రక్క మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షం, స్వయం కేంద్రముగా కలిగి ఉన్న జీవితాన్ని సూచిస్తుంది - దేవుణ్ణి సంప్రదించకుండా ఏది మంచిదో ఏది చెడ్డదో తనకు తాను నిర్ణయించుకునే జీవితం. దేవుడు ఆదాము హవ్వలను తోటలోనికి పంపి, “ఈ రెండు మార్గాలలో దేన్ని అనుసరించి జీవించాలో ఇప్పుడు నీవు ఎన్నుకోవచ్చు” అని చెప్పినట్టుగా ఉండెను. ఆదాము దేనిని ఎన్నుకున్నాడో మనందరికి తెలుసు. తానే కేంద్రముగా కలిగిన జీవితాన్ని ఎన్నుకున్నాడు.
ఏది మంచిదో ఏది చెడ్డదో మనిషి తనకుతానుగా ఎంచుకొనుట ద్వారా, లోకంలో మన చుట్టూ చూసే కష్టాలు, దు:ఖం, హత్యలు, ప్రతి విధమైన దుర్మార్గమైన కార్యాలు కలిగినవి. దేవుడు తనకు చెప్పుట అతనికి ఇష్టం లేదు. సంతోషంలేని ప్రతి వివాహానికి (క్రైస్తవులలో కూడా) కారణం అదే. అనేకమంది క్రైస్తవులు స్వయంను వారి జీవితాలకు కేంద్రముగా కలిగి జీవిస్తున్నారు - వారు విత్తిన దాన్నే కోస్తున్నారు.
దేవుడు ఆదామును చేసినప్పుడు, అతడు భూమిని పరిపాలించాలని ఆయన కోరుకున్నాడు. ఆదాము ఒక రాజుగా ఉండుటకు సృష్టించబడ్డాడు, ఒక బానిసగా కాదు. ఆదాము ప్రక్కన ఒక రాణిగా హవ్వ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాని ఈరోజు మనం ఏమి చూస్తున్నాము? ప్రతిచోట వారి ఆశలకు, భూమిపై నశించిపోయే వాటికి బానిసలైన స్త్రీ పురుషులను చూస్తున్నాం.
దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు, ఆయన ప్రతిదీ అందముగా చేశాడు. నిషేధించబడిన చెట్టు కూడా అందమైనదే. ఆదాము హవ్వలు ఆ చెట్టు ముందు నిల్చున్నప్పుడు, వారు ఒక ఎంపికను చేసుకోవలసి ఉంది: దేవుడు సృష్టించిన అందమైన వాటిని ఎన్నుకోవాలా? లేక దేవుణ్ణే ఎన్నుకోవాలా?
ఈ ఎంపికనే ప్రతిరోజు మనమందరం ఎన్నుకోవాలి. మనకు మనమే కేంద్రముగా ఉంటే, దేవుని వరాలను (దేవుడు సృష్టించినవి) వెంబడిస్తాము కాని దేవుణ్ణి కాదు. ఇళ్ళలో జరిగే అనేక గొడవలు భూసంబంధ విషయాల కొరకై ఉంటాయి. భార్యాభర్తలు దేవుణ్ణి కాక సృష్టించబడిన వాటిని ఎన్నుకొనుట వలన అటువంటి గొడవలు వస్తుంటాయి - వారు ఎన్నుకున్న దాని పర్యావసనాన్ని వారు కోస్తుంటారు. వారు శరీరానికి విత్తి నాశనాన్ని కోస్తారు. తన సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఎన్నుకొనుట వలన మనిషి బానిసగా మారును.
ఈ బానిసత్వం నుండి విడిపించుటకు యేసు వచ్చెను. ఈ రోజు మనిషి డబ్బుయొక్క శక్తికి, అక్రమమైన లైంగిక సంతోషానికి, ఇతరుల అభిప్రాయాలకు, ఇటువంటి అనేక విషయాలకు బానిసయ్యాడు. అతడు స్వతంత్రుడు కాదు. ఆకాశంలో ఎత్తుగా ఎగురు డేగవలె ఉండాలని దేవుడు అతణ్ణి సృష్టించాడు. కాని ప్రతిచోట వారి కోపాన్ని జయించలేక, వారి నాలుకను అదుపు చేసుకోలేక, వారి కామపు కళ్ళను అదుపుచేసుకోలేని సంకెళ్ళలో ఉన్న వ్యక్తులను కనుగొంటున్నాము. యేసు మన పాపాల కోసం చనిపోవుటకు మాత్రమే కాదు కానీ ఈ బానిసత్వం నుండి విడిపించుటకు కూడా వచ్చాడు.
సంతోష్ మరియు మేఘన్, మీరు ఆదాము చేసిన ఎంపికను చేయుటకు నిరాకరించి, ‘ప్రభువా, మా జీవితాలలో స్వయం ఎప్పటికీ కేంద్రముగా ఉండదు. నీవు మాత్రమే కేంద్రము. మా జీవితంలోని ప్రతివిషయంలో నిన్నే కేంద్రముగా కలిగి ఉంటాము’ అని దేవునికి చెప్పినట్లయితే, అత్యంత ఆనందకరమైన వివాహమును మీరు కలిగి ఉండగలరు.
దేవుడు వెలుగు మరియు ప్రేమయై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవుని ప్రేమే ఆయన వెలుగు. ఒక చీకటి గదిలో, వెలుగుయొక్క శక్తి చీకటిని పారద్రోలును. దేవుని శక్తి అటువంటిది. దేవుని శక్తి మరియు ప్రేమ లేని జీవితం, కేవలం అంధకారమే.
భూమిపై మన జీవితమంతా, ప్రేమ చట్టం ద్వారా ప్రతిదీ పాలించబడే శాశ్వత రాజ్యం కోసం సిద్ధంచేయు పరీక్ష కాలం మరియు పరిశీలన కాలం. దేవుడు మనల్ని తీసుకువెళ్ళే ప్రతి పరిస్థితి, మనం ప్రేమ చట్టం ద్వారా జీవిస్తున్నామా లేదా అనే ఒకే ఒక్క విషయం పరీక్షించి తెలుసుకొనుటకు దేవునిచే రూపొందించబడినది. అందుకే దేవుడు అనేక శ్రమలను, ఇబ్బందికరమైన పరిస్థితులను మన జీవితాలలో అనుమతించును. దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ భూమిపై జీవితాన్ని మనకు ఎటువంటి శ్రమలు లేకుండా చేయగలడు. కాని దేవుడు తన గొప్ప జ్ఞానంలో, మనం ప్రేమించుట నేర్చుకొనునట్లు శ్రమలను నియమించాడు. మన స్వార్థమును జయించి, ప్రేమ మాత్రమే మనల్ని నడిపించుటకు నిర్ణయించుకొనిన యెడల, దేవుడు తన రాబోయే రాజ్యమునకు పరిపాలకులుగా మనల్ని సిద్ధం చేయగలుగుతాడు. దాని గూర్చి ఇప్పుడే మనం ఆలోచించాలి, లేకపోయినట్లయితే దేవుడు మనకు భూమిపై ఇచ్చిన అవకాశాలను కోల్పోయినట్లుగా, నేర్చుకోవలసిన వాటిని ఎప్పటికీ నేర్చుకోలేదని నిత్యత్వంలో కనుగొంటాము.
మీ వివాహంలో మీరు ఎన్నుకొనవలసిన ఎంపిక ఇది: మీరు ప్రేమ యొక్క చట్టంతో జీవిస్తారా? లేక స్వార్థం యొక్క చట్టంతో జీవిస్తారా? ఒకవేళ దేవుడు మీ జీవితాలకు కేంద్రముగా ఉన్నట్లయితే, మీరు చేయు మరియు చెప్పు ప్రతి దానిలో ఆయన ప్రేమ మిమ్మల్ని నడిపిస్తుంది.
నేను చెప్పాలనుకున్న రెండవ విషయం: ఒకరినొకరు అంగీకరించండి, ముసుగులు ధరించకండి.
పాపం రాక ముందు, “ఆదాము హవ్వలు దిగంబరులుగా ఉండి సిగ్గు ఎరుగని వారుగా ఉన్నారు”. వారు ఒకరియెడల ఒకరి పారదర్శకంగా, నిజాయితిగా ఉండి ఒకరిపట్ల ఒకరు ఏమి దాచుకోని వారుగా ఉన్నారు. కాని వారు పాపం చేసిన వెంటనే పరిస్థితులు మారిపోయాయి. వాళ్ళను వాళ్ళు అంజురపు ఆకులతో కప్పుకొన్నారు. ఎందుకు వారు ఆవిధంగా చేశారు? ఆ తోటలో వారిని “దాగి చూచే” వారు ఎవరు లేరు. వారు ఖచ్చితంగా జంతువులు చూడకుండా తమను తాము కప్పుకోవటం లేదు. అయితే ఎందుకు వారు అంజూరపు ఆకులతో తమను తాము కప్పుకున్నారు? వారు ఒకరినొకరు చూసుకోకుండా కప్పుకున్నారు.
మనం ఒకరినుండి ఒకరు దాచుకోవటం పాపం యొక్క ఫలితాలలో ఒకటి. అసహ్యముగా ఉన్నవి అనుకున్న వారి స్వభావంలోని భాగములను ప్రజలందరు దాచుదురు. వారి గూర్చిన ఆ వివరాలు ఇతరులకు తెలిస్తే ఇబ్బందిపడతారు. కాబట్టి వారు ముసుగులు ధరిస్తారు. వారెల్లప్పుడు నిదానంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నట్టు పైకి చూపిస్తారు కాని లోపల వారు ఓడిపోయినవారిగా, దయనీయంగా ఉంటారు.
మీ వివాహంలో మీరు ఒకరితోనొకరు మీరున్నట్టుగానే ఉండి ముసుగులు ఎప్పటికి ధరించకూడదని నిర్ణయించుకోవాలి. దాపరికం, అంజూరపు ఆకులు అనేవి ఉండకూడదు.
ప్రతి ఒక్కరిలో కూడా, తమ గురించి పూర్తిగా తెలిసినా తమను ప్రేమించే వ్యక్తిని కనుగొనాలనే కోరిక ఉంటుంది. ఇతరులతో చెడు అనుభవాలు ఉండుట చేత మనం ముసుగులు ధరిస్తాము. మన గూర్చి పూర్తిగా ఇతరులకు తెలిస్తే మనల్ని అంగీకరించరని మనకు తెలుసు. కాబట్టి మనల్ని వారు అంగీకరించేటట్లు మనం ఒక పైపొరను(ముసుగును) ధరిస్తాం. క్రైస్తవులలో కూడా ఇది నిజమే. యేసు భూమిపై ఉన్నప్పుడు, అనేక మతానుసారులైన ప్రజలు ముసుగులు ధరించడం కనుగొన్నారు - కనుక వారికి సహాయం చేయలేకపోయారు.
మీరు ఉన్నట్టుగానే ఒకరినొకరు అంగీకరిస్తామని, ఎప్పటికీ ముసుగులు ధరించమని నిర్ణయం తీసుకోవలసిందిగా మీ ఇద్దరిని కోరుతున్నాను. సంతోష్, నీవు మేఘన్‌లో తప్పులు చూసినప్పుడు ఆమెను అంగీకరిస్తావా? మేఘన్, నీవు సంతోష్‌లో తప్పులు చూసినప్పుడు అతణ్ణి అంగీకరిస్తావా?
దేవుని గూర్చిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, మనం ఉన్నట్టుగానే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను అంగీకరించే ముందు నిన్ను నీవు మెరుగుపరుచుకోవాలి అని చెప్పే మతం, ఒక తప్పుడు మతం. యేసు అటువంటి మతంతో రాలేదు. దేవుడు మనం ఉన్నట్టుగానే మనల్ని ప్రేమిస్తాడనే సందేశంతో వచ్చారు. మనల్ని మనం మార్చుకోలేమని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మనం ఉన్నట్టుగానే అంగీకరించి - ఆయనే మనల్ని మార్చును. సంతోష్ మరియు మేఘన్, “క్రీస్తు మిమ్మును చేర్చుకొన్న ప్రకారం మీరు ఒకరినొకరు చేర్చుకోవాలని” బైబిల్ మిమ్మును ప్రేరేపిస్తుంది.
కొంతకాలం క్రితం ఈ సమస్యను గూర్చి ఒక వ్యాసాన్ని చదివాను. రచయిత పేరు నాకు గుర్తులేదు. ఆ వ్యాసంలో ఈ విధంగా ఉంది:
“మనమందరం ‘దాగుడుమూతల ఆట’ ఆడుతూ జీవితాన్ని గడుపుతున్నాము. ఎందుకంటే మనమేమై ఉన్నామనే దాన్ని బట్టి సిగ్గుపడి, ఒకరినుండి ఒకరం దాచుకుంటున్నాము. మనలో ఉన్న నిజమైన వ్యక్తిని ఇతరులు చూడకుండా ముసుగులు ధరిస్తున్నాము. ఆ ముసుగులలో నుండి ఒకరినొకరు చూచుకొని, దాన్నే సహవాసం అని పిలుస్తున్నాము. మనం భద్రంగా, నిశ్చలంగా ఉన్నామని ఇతరులకు అభిప్రాయం కలిగిస్తున్నాము, కాని అది ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగు లోపల మనం కలవరంతో, భయంతో, ఒంటరిగా ఉన్నాము. ఇతరులు మనలోకి చూస్తారేమో అని మనకెంతో భయం. వారు మనలోని నిజమైన వ్యక్తి చూచినప్పుడు, వారు మనల్ని తిరస్కరిస్తారని నవ్వుతారని భయపడతాము-వారి నవ్వు మనల్ని చంపుతుంది. కాబట్టి మనం ‘నటించే ఆట’ ఆడుతాము -ఎంతో ఆత్మవిశ్వాసంతో, భరోసాతో ఉన్నట్టు చూపిస్తాం, కాని లోపల చిన్నబిడ్డవలె వణుకుతున్నాము. మన జీవితమంతా ఈ ముసుగుతో నిండిపోతుంది. మనం ఇతరులతో సరదాగా జోక్స్ వేస్తూ, మన హృదయాలు దేనికోసం మొరపెడుతున్నాయో వాటిని కాక, ప్రాముఖ్యంలేని విషయాలు చెప్తుంటాము.
ఇతరులచేత అంగీకరించబడాలని, అర్థంచేసుకోబడాలని, ప్రేమించబడాలని ఎదురుచూస్తుంటాము. కాని మన నిజ స్థితిని ఇతరులకు చూపించినప్పుడు వారు మనల్ని తిరస్కరించటం మన అనుభవాలలో చూశాము. మన గురించి అన్నీ తెలిసినా, మనల్ని అంగీకరించే వారి కొరకు వెదుకుతూనే ఉంటాము. కాని అటువంటి వ్యక్తిని మనం కనుగొనలేదు. తిరిగి జన్మించిన క్రైస్తవులు ప్రేమ గూర్చి మాట్లడటం విన్నప్పుడు, బహుశా వారు మనల్ని అంగీకరిస్తారని మన హృదయంలో నిరీక్షణ పుట్టింది. కాని మనం వారిలో చేరినప్పుడు, వారు కూడా ముసుగులు ధరిస్తున్నారని త్వరగానే కనుగొన్నాము. వారు కేవలం మనలో లోపాలనే కనిపెడుతున్నారు.
దీనికి పరిష్కారమేమిటి? మనం ఉన్నట్టుగానే మనల్ని దేవుడు అంగీకరించటం, ప్రేమించబడటం చూడాలి. దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుని ప్రేమను అనుభవించటం మనల్ని ధైర్యపరుస్తుంది. ఇక మనం నటించవలసిన అవసరం లేదు. అప్పుడు దేవునితో మరియు మనుష్యులతో మనకు మనం గానే ఉంటాము. దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడైనా ఏది చేయుటకైనా బలవంతపెట్టదు. మనలో ఉన్న లోటుపాటులన్నిటిని దేవుడు గుర్తించినప్పటికీ ఆయన మనల్ని ఖండించకుండా అంగీకరిస్తాడు. మరొక ప్రక్క, ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేయుటకు చూస్తున్నాడు. దేవుడు మనలో ఉన్నదంతా చూసి కూడా, మన గురించి అంతా తెలిసి కూడా మనల్ని అంగీకరించాడని తెలుసుకోవటం, సంతోషకరమైన క్రైస్తవజీవితానికి మూలం. యేసుప్రభువు ఈ సంమృద్ధి జీవాన్నే ఇచ్చుటకు వచ్చారు.
దేవుని ప్రేమను తెలుసుకొనుట, మనుష్యుల ఆమోదాన్ని కోరుకొనుటకు పూర్తి ముగింపు నిస్తుంది. మనమెంతో ధైర్యంతో నింపబడతాము. మన అపరాధభావం పోతుంది. మన భయం పారద్రోలబడుతుంది. మనం కొన్ని సార్లు ఏకాంతముగా ఉండవచ్చు, కాని ఎప్పటికీ ఒంటరిగా ఉండము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడువనని, ఎడబాయనని వాగ్ధానం చేశాడు.”
నీ వివాహ భాగస్వామిలో ‘అంగీకరించబడాలనే ఆశ’ మొరపెడుతూ ఉంది. కాబట్టి నీవు, నీ భాగస్వామి మాట్లాడే మాటలకే కాక, ఎప్పటికీ చెప్పబడని హృదయంలో ఉన్న మూగ మాటలకు చెవినివ్వాలి.
దేవుడు మనం ఉన్నట్టుగానే మనల్ని అంగీకరిస్తాడనే విషయాన్ని మనం నమ్మకపోవటం ఎంతో బాధాకరం. కాబట్టి మనం ఆయననుండి కూడా దాక్కుంటాము. ఆదాము హవ్వలు దానినే చేశారు. వారు చెట్లచాటున పరుగెత్తి దేవునినుండి దాగుకున్నారు.
దేవునిచే అంగీకరించబడ్డామన్న సంతోషాన్ని వారు కనుకొనలేకపోవుట చేత, అనేకమంది భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించలేక పోతున్నారు. వారు ఒక మతాన్ని కలిగి ఉన్నారు కాని క్రీస్తును కాదు. అపవాదియొక్క ఒక అద్భుతమైన ప్రణాళిక- క్రీస్తులేని క్రైస్తవ మతంయొక్క ఖాళీ గుల్లను(పై పెంకు) ప్రజలకు ఇవ్వటం. అది ప్రజలను దయనీయంగా చేసింది. నిజమైన క్రైస్తవ్యం కాని దానినుండి అనేకమంది ప్రజలు దూరమై పోయారు. క్రీస్తే నిజమైన క్రైస్తవ్యం.
యేసుక్రీస్తు కేంద్రముగా ఉన్న ప్రతి గృహం సమాధానంతో ఉన్న గృహంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఇల్లుగా ఉంటుంది. దేవుడు వారిద్దరిని అంగీకరించాడన్న సత్యంలో వారు భద్రపరచబడి, నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారు ఒకరినొకరు అంగీకరించుకుంటారు. అటువంటి ఇంటినే మీరు నిర్మించాలి.
నీవు చెడిపోయి, హీనంగా ఉన్నప్పుడే యేసు నిన్ను ప్రేమించాడు- నీవు ఆయన్ని సంతోషపెట్టినప్పుడు కాక చెడుగా ఉన్నప్పుడు, నీవు ఆయనను సంతోషపెట్టినప్ప్పుడు కాక బాధ పెట్టినప్ప్పుడే ఆయన నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు నీ భాగస్వామిని ఆవిధంగానే ప్రేమించాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు - ప్రేమించుటకు కారణాలు వెదకకుండా స్వేచ్ఛగా ప్రేమించాలని చూస్తున్నాడు.
మీరు కలిసి జీవించేటప్పుడు, ఇప్పుడు చూడని లోపాలను ఒకరిలో ఒకరు కనుగొంటారు. అప్పుడు ఒకరినొకరు ప్రేమించుటకు మీకు సహాయపడునది - దేవుడు మీలో లోపాలను చూచి కూడా అంగీకరించాడనే నిశ్చయత. ఈరోజు నీలో నీవు చూడని విషయాలను కూడా దేవుడు చూస్తున్నాడు- అయినను నిన్ను అంగీకరిస్తున్నాడు.
ఈ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, మీరు దాచుకున్న ప్రతి జైలు గోడలను బద్ధలుకొట్టుదురు. మీలో ఉన్న దేవుని ప్రేమ ఆ గోడలన్నిటి కంటే బలమైనది, ఆ గోడలన్నిటిని మెల్లగా కూలకొడుతుంది. అప్పుడు మీరివురు నిజముగా ఏకమవుతారు.
ఇప్పుడు ఆ వ్యాసం ముగింపు మాటలను చదవనివ్వండి:
“నీ దయ, సౌమ్యత మరియు మీ భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నించే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారన్న విషయం, మీ భాగస్వామికి రెక్కలను ఇస్తుంది - ప్రారంభంలో అవి చిన్న, బలహీనమైన రెక్కలే కానీ అవి రెక్కలు. నీవు విడిచిపెట్టనట్లయితే, ఆ రెక్కలు ఎదుగుతాయి. ఒకరోజు దేవుడు ఉద్దేశించినట్లు, మీరిద్దరు డేగలవలె ఆకాశంలోకి ఎగురుదురు.”
మీరు ఎన్నుకొనవలసిన మూడవ ఎంపిక, కలిసి పని చేయటం.
ఆదాము హవ్వలు తోటలోనికి వెళ్ళినప్పుడు, దేవుడు వారిని ఇద్దరిని కలిపి పంపాడు. కాని సాతాను వచ్చి, హవ్వను వేరుచేసి, ఆమెతో ఒంటరిగా మాట్లాడెను. ఆదాము అక్కడ నిల్చొని తన భార్య ఒక ప్రమాదకరమైన ఎంపిక తనకు తానే ఎన్నుకొనుటకు అనుమతించాడు. అతను “ఆగు ప్రియతమా, దేవుడు మనకు చెప్పినది జ్ఞాపకం తెచ్చుకో. ఆ వృక్ష ఫలం మనం తినకూడదు”. అతను ఆవిధంగా చెప్పి ఉంటే కథ ఎంత వేరుగా ఉండేదో కదా.
భార్యాభర్తలు ఎప్పుడైతే వేరువేరుగా పనిచేయటం ప్రారంభిస్తారో అప్పుడే అనేక సమస్యలు వస్తాయి. నీవు సాతానును నేరుగా ఎదుర్కొనలేవు. నీ జీవితాన్ని, నీ ఇంటిని గందరగోళం చేయుటకు సాతాను అవకాశాల కొరకు చూస్తున్నాడు. ఇల్లు అతడు దాడిచేయు మొదటి ప్రాంతం - ఈరోజున కూడా అతను అక్కడే దాడి చేయును. యేసు చెప్పినట్టు, సాతాను దొంగిలించుటకు, చంపుటకు, నశింపజేయుటకును వచ్చును. కాని మీరివురు కలిసి నిలబడినట్లయితే, సాతానును జయించుదురు.
ప్రసంగి 4:9-12 ఈవిధంగా చెప్తుంది:
“ఒకరి కంటే ఇద్దరు మేలు, ఒకరు పడిపోయినప్పుడు, మరొకరు అతని తిరిగి లేపును. ఒంటరిగా ఉన్న వ్యక్తిపై దాడిచేసి ఓడించవచ్చు, కాని ఇద్దరు కలిసి జయించవచ్చు. ముగ్గురు ఇంకా మంచిది, ముప్పేట తాడు సులువుగా తెగదు.”
మత్తయి 18:18-20లో ఉన్న వాగ్ధానానికి పై వచనాలు దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అనేకమంది భార్యాభర్తలు ఈ వాగ్ధానాన్ని స్వతంత్రించుకొనలేకపోతున్నారు. ఎందుకంటే స్వతంత్రించుకొనుటకు వారు ఒకరితో నొకరు ఏకీభవించాలి. మీ ఇద్దరికి ఈ వాగ్ధానాన్ని అందచేస్తున్నాను - ఎందుకంటే, మేము వివాహం చేసుకున్న 38సంవత్సరాలలో నేను మరియు ఆనీ చేసిన ప్రార్థనలకు అద్భుతమైన జవాబులను తీసుకొని వచ్చింది.
మీ ఇద్దరు ఏకీభవించి, ఆత్మలో సమ్మతించినట్లయితే, యేసు మీమధ్యలో ఉన్నాడు కాబట్టి మీరు ఏమి అడిగినను మీ పరలోకపు తండ్రి మీకు ఇచ్చును (మత్తయి 18:19,20). యేసు మూడవ వ్యక్తిగా మీ మధ్యలో ఉన్నట్లయితే, మీ ఇద్దరు సాతాను కార్యములను బంధించవచ్చు. అవి బంధించబడును. మీరు ముగ్గురు తెగిపోని ముప్పేట తాడువలె ఉందురు.
మీ జీవితంలో ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించును. మనుష్యులు పరిష్కరించలేని అనేక సమస్యలను మీరు ఎదుర్కొని ఉండవచ్చు. కాని దేవుడు పరిష్కరించలేని సమస్య ఏమి లేదు. కాని దేవుడు మీ సమస్యలను పరిష్కరించుటకు మీరు ఏకమవ్వాలి. కాబట్టి అన్ని కలిసి చేయండి.
మీ భాగస్వామిని మీరు గాయపరిచారని గ్రహించిన వెంటనే ఒకరినొకరు క్షమించండి. ఆలస్యం చేయవద్దు. వెంటనే క్షమాపణ అడగండి. ఎటువంటి వెల చెల్లించి అయినా, ఈ భూమిపై మీరు ఏమి కోల్పోయినా, మీ ఐక్యతను కాపాడుకోండి. మీ ఐక్యతను కాపాడుకొని ప్రార్థించినట్లయితే, దేవుని నుండి వెంటనే జవాబు వస్తుంది. సాతాను మీ ఇంటిలోనికి ఎప్పటికి ప్రవేశించలేడు. అది దేవుని వాగ్ధానం.
చివరలో మరొక మాట చెప్పనివ్వండి: మీ వివాహంలో ప్రేమతో జరగని ప్రతి పని, మాట, ఆలోచన ఒక రోజున నాశనం చేయబడుతుంది.
ప్రతి కష్టాన్ని ఎదుర్కొనుటకు దేవుని ప్రేమ మిమ్ము బలపరుస్తుంది. అది మూయబడిన తలుపులు తెరుస్తుంది, అడ్డుగోడలను పగులగొడుతుంది. ఈ ప్రేమను మీరు వెదకినట్లయితే, మీ వివాహము ఈ ప్రపంచమంతటిలో అత్యంత సంతోషకరమైనది అవుతుంది.
సరియైన వ్యక్తిని ఎన్నుకోవడం మాత్రమే సరిపోదు - మీరు ఇప్పటికే ఎన్నుకున్నారు. ఇప్పుడు మీ వివాహ జీవితమంతటిలో సరియైన ఎంపికలు చేసుకోవాలి.
ఈరోజే ఈ ప్రేమ నియమాన్ని మీరు అవలంబిస్తే, మీ వివాహానికి ఉత్తమమైన ప్రారంభం అవుతుంది. ఈ మార్గంలో ప్రతిరోజు కొనసాగితే, దేవుని ప్రేమ ప్రతిదాన్ని జయించునని, ఎప్పటికీ ఓడిపోదని ఈ భక్తిలేని తరానికి నిరూపించగలరు. మీ జీవితాలలో దేవుడు మహిమపరచబడతాడు.
ప్రభువు కొరకు ఒక గొప్ప సాక్ష్యముగా మీ ఇల్లు ఉండాలని నేను ప్రార్థింస్తున్నాను. మీరు విన్న ఈ మాటలు, కేవలం మాటలుగా ఉండకుండా మీ జీవితంలో ఒక భాగంగా మారి, మీ ఇల్లు ఇతరులకు వెలుగుగా అవునట్లు నేను ప్రార్థిస్తున్నాను.
లోకం అవసరంలో ఉన్న వారితో నింపబడింది. దేవుడు మీలో పనిచేసి తన ప్రేమను మీద్వారా వ్యక్తపరచుకున్నట్లయితే, ఆయన మిమ్మును ఉపయోగించుకొనును - నా మాటలు గుర్తుంచుకోండి - మీ చుట్టూ అవసరంలో ఉన్న ఇళ్లకు సహాయం చేయుటకు మిమ్మును ఉపయోగించుకొనును.
దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించును గాక. ఆమెన్.
(నా మూడవ కుమారుడు సందీప్ మరియు లారా వివాహములో ఇవ్వబడిన వర్తమానం)
మొదటి వివాహమును దేవుడు ఒక తోటలో చేశాడు. ఈ వివాహంలో మన చుట్టు ఉన్న పరిసరాలు ఇక్కడ మనం కలిగి ఉండుట ఎంతో మంచి విషయం. ఇక్కడ ఉన్న తోటవలె ఏదేను ఉండెను - ఇంతకంటే ఎంతో అందముగా ఉండెను. ఈ వివాహంలో ఇక్కడ కలుసుకున్నందుకు దేవునికి వందనస్తులం.
సందీప్ మరియు లారా, యెషయా 58:11లో ఉన్న వాగ్ధానాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను: ‘నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు’. “మీ వివాహం ఒక నీరు కట్టిన తోట వలె ఉండును” అని నేను చేర్చుతున్నాను.
ఆదికాండం 2వ అధ్యాయంలో ‘దేవుడు ఒక తోటను నాటి, దానిని సేద్యపరచుటకు పురుషుని స్త్రీని దానిలో ఉంచినట్టుగా’ చెప్పబడింది. కాని ఆదాము మరియు హవ్వలు సాగుచేయుటకు మరొక తోటను దేవుడు వారికి ఇచ్చాడు - అది వారి పరస్పర సంబంధం. ఆ తోటను వారు సాగు చేయలేదు. వారి మధ్యకు అపవాది వచ్చుటకు వారు అనుమతించారు.
ప్రభువు ఈరోజు మీ ఇరువురికీ సేద్యపరచుటకు ఒక తోటను ఇచ్చాడు. నిర్లక్ష్యపరచినట్లయితే ఆ తోట సులువుగా అరణ్యంవలె మారుతుంది. సామెతలు 24:30-34లో ఒక సోమరివాని యొక్క తోట అటువంటి అరణ్యంగా మారినట్టు చదువుతాము. అనేక వివాహాలలో అదే జరిగింది. అయితే అది మీ వివాహంలో జరగ వలసిన అవసరం లేదు. “మీ వివాహం ఒక నీరు కట్టిన తోటవలె ఉండును” అనేది మీఇద్దరికి దేవుని వాగ్ధానం.
లేఖనాలలో ఉన్న మూడు తోటల గురించి నేను ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ఒక తోటలో పాపం వచ్చింది. రక్షణ కూడా ఒక తోటలోనే వచ్చింది. క్రీస్తును మహిమపరచే తోటగా మీ వివాహం ఉండవచ్చు.
ఆ తోటలోకి పాపం ఏవిధంగా వచ్చింది? ప్రాథమికంగా ఆదాము హవ్వల రెండు తప్పుడు వైఖరుల వలన వచ్చింది.
మొదటిది గర్వం. దేవుని కంటే వారికి ఎక్కువగా తెలుసు అనుకున్నారు. దేవునికి అవిధేయత చూపించి దాని నుండి తప్పించుకోవచ్చు అనుకున్నారు. ఈరోజు కూడా అనేకమంది అలాగే అనుకుంటున్నారు.
రెండవది స్వార్థం. ఆ పండు తిన్నట్లయితే వారు ఏదో పొందుతారని ఆలోచించారు. “ఆ స్త్రీ ఆ పండును, చూపుకు మంచిదిగా, తన ఆశను సంతోషపెట్టేదిగా, తనను జ్ఞానవంతురాలు చేయగలిగినదిగా చూచినట్లు” అక్కడ చెప్పబడింది.
గర్వం మరియు స్వార్థం ప్రారంభంలో పాపానికి కారణం. ఈరోజు మానవాళిలో పాపానికి ఇవే మూల కారణం. వీటికి అనేక రకాల వ్యక్తీకరణలున్నాయి.
ప్రాథమికంగా, మనిషి తనకు తానే కేంద్రముగా ఉండి దేవుని నుండి స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటాడు. ఆవిధంగా పాపం వస్తుంది.
ఒక తోటలోనే పాపం వచ్చింది. యేసు మన రక్షణను కూడా ఒక తోటలోనే తీసుకువచ్చాడు.
అనేకమందికి గెత్సెమనే తోట గురించి తెలుసు. కాని వారికి యేసు ఒక తోటలోనే సిలువవేయబడ్డారని, ఒక తోటలోనే పాతిపెట్టబడ్డారనే విషయం తెలియదు.
యోహాను 19:41 ఇలా చెప్తుంది:
“ఆయన సిలువవేయబడిన చోట ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవ్వరూ పాతిపెట్టబడని ఒక కొత్త సమాధి ఉండెను”.
ఒక తోటలోనే యేసు మోసగింపబడ్డారు, ఒక తోటలోనే సిలువవేయబడ్డారు, ఒక తోటలోనే సమాధిచేయబడ్డారు, ఒక తోటలోనే మృతులలోనుండి తిరిగిలేచారు. ఆ తోటలోనే మీ ఇద్దరి రక్షణ వచ్చింది. ఆ తోటలో యేసు చేసిన దానంతటి ప్రతిఫలం ఈరోజు మీది కాగలదు.
భూమిమీద యేసుప్రభువు జీవితాన్ని చూచినప్పుడు, ఆదాము జాతిలో ఉన్న గర్వానికి స్వార్థానికి సరిగ్గా వ్యతిరేఖమైన దాన్ని చూస్తాము.
క్రీస్తు జీవితంలో, తన తండ్రి ఏమి చేయాలని కోరుకున్నాడో అదే చేయడానికి సిద్ధంగా ఉన్న దీనత్వమును మనం చూస్తాము - అది సిలువ మీద చనిపోవటం సరే. ఆయన దాపరికం లేకుండా, తక్షణమే ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు.
క్రీస్తుకూడా తన అవసరం కోసం కాకుండా నిస్వార్థంగా ఇతరుల అవసరాల గురించి ఆలోచించాడు. వారికి సహాయం చేయడానికి తనను తాను త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి వైఖరినే మీ ఇద్దరు కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
నేను ప్రస్తావించదలిచిన మూడవ తోట చాలా మంది క్రైస్తవులకు అంతగా తెలియదు. ఈ తోట పరమగీతములో ప్రస్తావించబడింది. ఈ పరమగీతము, ఒక పెండ్లి కూమారునికి పెండ్లి కుమార్తెకు, ఒక భర్తకు భార్యకు ఉన్న సంబంధాన్ని గురించి వివరిస్తుంది.
పరమగీతము 4:12లో, “నా పెండ్లికుమార్తె నా సొంతమైన ఉద్యానవనం వంటిది (మూయబడిన ఉద్యానవనం)”. ఇక్కడ చెప్పబడిన పెండ్లికుమారుడు క్రీస్తే. ఆయన పెండ్లి కుమార్తెయైన మనం, ఆయన కొరకే ప్రత్యేకపరచబడిన తోటగా ఉన్నాము. మొదటిగా మీరు ఈ విషయాన్ని గుర్తించాలి: మీ వివాహంలో మీరు ఒక తోటను నాటాలి. ఆ తోట ముఖ్యముగా మీ ప్రయోజనాల కొరకు, ఇతరుల ప్రయోజనాల కొరకు కాకుండా ప్రభువు కొరకై ఉండాలి. మీ వివాహం ప్రభువు కొరకు ఒక సొంతమైన తోటగా ఉండాలని మనస్సులో ఉంచుకోండి. అప్పుడు దాని ఫలితంగా, ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు.
యేసు దీనినే బోధించారు. ధర్మశాస్త్రములో గొప్ప ఆజ్ఞ ఏమిటని ఒకరు యేసును అడిగినప్పుడు, ఆయన ఇలా చెప్పారు,
“నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించవలెను అనేదే గొప్ప ఆజ్ఞ -అప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలవు” (మత్తయి 22:37-40 వివరణ)
మన జీవితం మొదటిగా దేవునితో ప్రారంభించబడాలి. అందుకోసమే దేవుడు ఆదాము హవ్వలను ఒక్కసారే కాకుండా వేరువేరుగా సృష్టించాడు. ఆవిధంగా ఆదాము తన కళ్ళు తెరచినప్పుడు అతను చూచే మొదటి వ్యక్తి దేవుడే కాని హవ్వ కాదు. హవ్వ తన కళ్ళు తెరచినప్పుడు ఆమె చూచే మొదటి వ్యక్తి దేవుడే కాని ఆదాము కాదు. మీ వివాహం ఒక నీరు కట్టబడిన తోటవలె ఉండాలంటే, మీ జీవితంలో కూడా ఎల్లప్పుడు ఆవిధంగానే ఉండాలి.
ప్రతి తోటకు వర్షం కావాలి. కొత్తనిబంధనలో, పరలోక వర్షమైన పరిశుద్ధాత్మతో నింపబడే అవకాశాన్ని మనం కలిగి ఉన్నాము. దీని కొరకు దేవుణ్ణి పూర్ణహృదయంతో వెదకమని మిమల్ని ప్రోత్సహిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే, మీ జీవితంలోని ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండటం. కనుక మీ జీవితంలో ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరలోక వర్షానికి తెరచుకోండి.
తూర్పు దేశాల సంస్కృతికి, పాశ్చాత్య సంస్కృతికి ఎంతో తేడా ఉన్నట్లు నేను కనుగొన్నాను. కాని రెండు సంస్కృతులలో గర్వం ఒక్కటే!. తూర్పు దేశాల సంస్కృతిలో భారతదేశంలోని పెళ్ళిలలో, “పెండ్లి కూతురు రమ్ము” అని పాడరు, “పెండ్లి కుమారుడా రమ్ము” అని పాడుతారు. కొన్ని భారతదేశ వివాహాలలో పెండ్లి కుమారుడు గుర్రంపై స్వారీచేస్తు వస్తాడు ఎందుకంటే తూర్పు దేశాల సంస్కృతిలో అతనే ప్రాముఖ్యమైన వాడు. పెండ్లికూతురు ఆ గుర్రం వెనక నడుస్తుంది, ఎందుకంటే ఆమె తక్కువగా ఎంచబడుతుంది. అది తూర్పు దేశాల సంస్కృతి.
పాశ్చాత్య సంస్కృతిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కార్యక్రమంలో పెండ్లికూతురి కొరకు అందరు నిలబడతారు, కాని పెండ్లి కుమారుని కొరకు ఎవరు నిలబడరు!. ఇక్కడ ప్రాముఖ్యత పెండ్లికూతురుది: “ఇదిగో పెండ్లికుమార్తె వస్తున్నది”!.
కాని క్రైస్తవ సంస్కృతిలో “ఇదిగో ప్రభువు వస్తున్నాడు” అని ఉండాలి. తూర్పు దేశాల సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి రెండు పాపం చేత అపవిత్రం అయ్యాయి. ఒక దానిలో పురుషుడు ప్రాధాన్యమైన వాడు, వేరొక దానిలో స్త్రీ ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వబడుతుందో, అప్పుడు “ఇదిగో ప్రభువు వస్తున్నాడు” అని చెప్పుదుము.
ఇంకా ముందుకు చూచినట్లయితే: తూర్పు దేశాల సంస్కృతిలో అబ్బాయి ‘నేను వెళ్ళి ఆమె కొరకు అడగలేదు. ఆమె తండ్రి వచ్చి నాకొరకు అడిగాడని’ చెప్పును. ఇక్కడ ఉన్న గర్వాన్ని చూశారా? పాశ్చాత్య సంస్కృతిలో అమ్మాయి ‘నేను అతని కొరకు వెదకలేదు. అతనే వచ్చి నన్ను అర్థించి(లాలించి) గెలుచుకున్నాడు’. ఇక్కడ కూడా గర్వం ఉంది.
క్రైస్తవ సంస్కృతిలోనైతే, “ప్రభువు మమ్మల్ని జతపరిచాడు. మేము ప్రభువును ప్రేమిస్తున్నాము. ఆయన దృష్టిలో మేమిద్దరము సమానమే” అని దీనులముగా చెప్పుదుము.
నేను మీ ఇద్దరిని మీ సంస్కృతులలో ఉన్న గర్వాన్ని అధిగమించి క్రైస్తవులుగా ఉండమని ప్రోత్సహిస్తున్నాను. ప్రతి ఉదయమున మీ పాట “ఇదిగో ప్రభువు వస్తున్నాడు” అనేదిగా ఉండాలి. మీ ఇద్దరు ఆయన దీనులైన సేవకులుగా ఉండాలి. అప్పుడు మీ వివాహము నీరుకట్టిన తోటవలె ఉంటుంది.
గర్వంతో పాటు స్యార్థం కూడా అన్ని సంస్కృతులలో సాధారణంగా ఉంటుంది. ఒక అబ్బాయి పెళ్ళి చేసుకొనుటకు ఒక అమ్మాయి కొరకు చూస్తున్నప్పుడు, అతను స్వార్థంతో అందంకొరకు, అందంగా ఉండే అమ్మాయి కొరకు చూస్తాడు. ఒక అమ్మాయి పెళ్ళి చేసుకొనుటకు ఒక అబ్బాయి కొరకు చూస్తున్నప్పుడు, ఆమె స్వార్థంతో డబ్బు కొరకు, ధనవంతుడైన అబ్బాయి కొరకు చూస్తుంది. ఇది ప్రపంచమంతటా నిజం.
కాని క్రైస్తవ సంస్కృతిలో, నీవు ప్రాథమికంగా, ఒక వ్యక్తి ప్రభువును ప్రేమిస్తున్నాడని, ప్రభువును ఘనపరుస్తున్నాడని ఎన్నుకుంటావు. కాబట్టి మానవ జాతి యొక్క స్వార్థం కంటే పైకి ఎదగమని నేను మీ ఇద్దరినీ కోరుకుంటున్నాను.
మీరిద్దరూ భిన్నమైన సంస్కృతులకు చెందినవారు కాబట్టి, ఏ సంస్కృతి వేరొక సంస్కృతికంటే గొప్పది కాదన్న విషయం మీకు స్పష్టం చేయాలని అనుకున్నాను. తూర్పుదేశాల వారు పాశ్చాత్యులకంటే గొప్ప వారమనుకుంటారు, పాశ్చాత్యులు తూర్పుదేశాల వారికంటే గొప్ప వారమనుకుంటారు. కాని ఇద్దరు తప్పే. క్రైస్తవ సంస్కృతి ఉన్నతమైనది. మీరు దానిని వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మంచి తోటను ఎలా నాటాలో తెలుసుకోవడానికి నేను గూగుల్‌లో వెదికాను. నేను కనుగొన్న ఐదు నియమాలు ఇవి:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటల కోసం దేవుడే చేసిన నియమాలు ఇవి. కాబట్టి మీ కుటుంబానికి మీ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
ఇప్పుడు పరగీతములు 4:16 చూద్దాం:
“ఓ ఉత్తర గాలి లెమ్ము, దక్షిణ గాలి రమ్ము (ఉత్తర గాలి చల్లనిది, దక్షిణ గాలి వెచ్చనిది). నా తోట పరిమళాలను వెదజల్లేలా చేయండి. దాని సుగంధ ద్రవ్యాలు విదేశాలకు తరలిపోనివ్వండి. నా ప్రియమైన ప్రభువు తన తోటకి వచ్చి శ్రేష్టమైన పళ్ళు తినాలి!”
ప్రతివివాహంలో, మనం ప్రతికూల చల్లని ఉత్తరగాలిని, శ్రేయస్సుయొక్క వెచ్చని దక్షిణ గాలిని ఎదుక్కొంటాము. అయితే యేసు మనకు శిరస్సుగా ఉన్నప్పుడు, మన జీవితాలను నియంత్రించడానికి ఆయనను అనుమతించినప్పుడు, ప్రతికూలమైన లేదా శ్రేయస్సయినా, శ్రమ లేదా సుఖం ఎదురైనా, ఈ రెండు గాలులు మన ద్వారా క్రీస్తు సువాసనను విదేశాలకు వ్యాపింపజేస్తాయి.
లోకంలోని వారు అలా చేయలేరు. ప్రపంచంలో, ప్రతిదాని గురించి వారు ఫిర్యాదు చేస్తారు. కష్టసమయాల్లో వారు దేవునిపై కూడా ఫిర్యాదు చేస్తారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శ్రేయస్సుయొక్క దక్షిణ గాలిని నిర్వహించగలరు. కానీ వారు ప్రతికూల ఉత్తర గాలిని తట్టుకోలేరు.
కానీ క్రీస్తు వధువు కష్టాలు మరియు శ్రేయస్సు రెండింటినీ విజయవంతంగా నిర్వహించగలదు. ఇది మీ ఇద్దరికీ, పెళ్ళయిన మనందరికీ అలాగే ఉండగలదు.
చివరిగా: “నా ప్రియుడు తన తోటకి వచ్చి శ్రేష్టమైన పళ్ళు తినాలి” అని ఇక్కడ చదువుతాము. కష్ట సమయాల్లో మీ విజయాలు ప్రభువు మాత్రమే చూడాలి కాని మీరు ఇతరులకు చూపించడానికి కాదు. ఇతరులు చూడని సమయాల్లో ప్రభువు మీ రహస్య జీవితాన్ని చూస్తాడు. ఆయన తన తోటలోకి వచ్చినప్పుడు, తన హృదయాన్ని సంతోషపరచేదాన్ని ఎల్లప్పుడూ అక్కడ కనుగొనాలి.
దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించును గాక. ఆమెన్.
(నా నాల్గవ కుమారుడు సునీల్ మరియు అనుఘ్ర వివాహములో ఇవ్వబడిన వర్తమానం)
దేవుని వాక్యమే మన జీవితానికి, మన ఇంటికి, ఈ ప్రపంచంలోని అన్నిటికీ పునాది. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మాత్రమే మన పునాదిగా ఉంచుకుంటే, ఏ తప్పు జరగదు.
నిర్గమకాండము 25లో, దేవుడు తాను మానవునితో నివసించాలనుకుంటున్నట్లు తన చిత్తమును బయలుపరచుటను మొదటిసారిగా చూస్తాము. దేవుడు అక్కడ నిర్గమ.కాం. 25:8లో ఇలా చెప్పాడు,“నేను వారి మధ్య నివసించునట్లు వారు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను”. అది దేవుని అగ్ని నిలిచే ప్రత్యక్షగుడారమును సూచిస్తుంది. దేవుని మహిమ ఆ ఇశ్రాయేలీయులను ప్రపంచంలోని ఇతర ప్రజలందరి కంటే భిన్నంగా నిలిపింది..
నిర్గమకాండములో మనం చదివే ఒక ప్రత్యక్షగుడారాన్ని తయారుచేయడం చాలా సులభం, ఎందుకంటే దాని కొలతలు అన్నీ అక్కడ ఇవ్వబడ్డాయి. మనం ఆ గుడారానికి ఖచ్చితమైన ప్రతిరూపాన్ని తయారు చేయగలము, కానీ అక్కడ మనం నకిలీ చేయలేని ఒక విషయం ఉంది - దాని మీద నిలిచిన దేవుని మహిమ. దేవుని మహిమ దానిపై నిలిచి ఉండటమే ఆ గుడారం గూర్చిన అతి ముఖ్యమైన విషయం. ఇది తన ప్రజల మధ్య దేవుని ఉనికిని సూచిస్తుంది.
సునీల్ మరియు అనుఘ్ర, ఇప్పుడు మీరు వివాహం చేసుకోబోతున్నారు. మీ ఇంటిని దేవునికి పరిశుద్ధ స్థలంగా మార్చడమే మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం. మీరు ఒకరినొకరు సంతోషపెట్టాలని ఖచ్చితంగా కోరుకోవాలి అయినను మీరు ఒకరినొకరు సంతోషపెట్టాలని కోరుకునే స్థలంగానే ఉండకూడదు, మీ ఇల్లు ఇతరులను ఆశీర్వదించాలి అయినను ఇతరులను ఆశీర్వదించే స్థలంగానే ఉండకూడదు. కానీ ప్రధానంగా దేవుడు తన సన్నిధిని కనబరచగల ప్రదేశంగా, యేసు తన ఇంటిలో ఉన్నట్లు భావించే స్థలంగా ఉండాలి. దేవుడు “నేను నివసించుటకు ఒక స్థలాన్ని నా కొరకు తయారుచేయండి” అని చెప్పాడు. మీ ఇద్దరికి నేను చెప్పాలని కోరుకునేది ఏమిటంటే: దేవుడు తాను నివసించుటకు ఒక ఇంటిని కట్టమని మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.
మనం కొందరి ఇళ్ళలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం అసౌకర్యంగా భావించటం మన అందరికి తెలుసు. మరి కొంత మంది ఇంటికి వెళ్ళినప్పుడు, మనం ప్రవేశించిన క్షణం నుండి, మన సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిని వివరించడం కష్టం, కానీ మనందరికీ తెలుసు. యేసు తన సొంత ఇంట్లో ఉన్నట్లు భావించే ప్రదేశంగా క్రైస్తవ ఇల్లు ఉండాలి. అంటే తాను చూసే ప్రతిదానిని బట్టి సంతోషంగా ఉండాలి. మీరు చదివే పుస్తకాలను బట్టి, మీరు తెచ్చిన పత్రికలను బట్టి, భార్యాభర్తల మధ్య సంభాషణను బట్టి, మీరు మాట్లాడే సంగతులను బట్టి, మీరు టీవీలో చూసే కార్యక్రమాలను బట్టి, మిగతా వాటిని బట్టి ఆయన సంతోషించాలి. అనేక క్రైస్తవ గృహాలలో, గోడపై బైబిల్ వచనాలు వేలాడదీయబడి ఉంటాయి. కానీ యేసు తన ఇంట్లో ఉన్నట్లుగా అక్కడ ఉండలేడు.
దేవుడు ఆదాము హవ్వలను ఎంత అద్భుతమైన నిరీక్షణతో ఒకచోట చేర్చాడో మీరు ఊహించగలరా. ఒక తండ్రిగా ఆయన వారి కోసం ఎంత అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో కదా. నేను ఒక తండ్రిని, నా కొడుకు పెళ్ళి చేసుకోవడం గూర్చి నిరీక్షించడం నాకు తెలుసు. కాని దేవుడు ఆదాము హవ్వలను ఒకచోట చేర్చినప్పుడు అనుభవించిన దానిలో కొంత భాగం మాత్రమే నేను అనుభవిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆయనే మొదటి స్థానంలో ఉండే అధ్బుతమైన ఇల్లు వారికి ఉండాలని ఆశించాడు. కానీ దేవుడు ఎంత త్వరగా నిరాశ చెందాడు. ఆయన వారి విషయంలో కోపగించలేదు కానీ బాధపడ్డాడు. ఈ రోజు చాలా మంది క్రైస్తవ ఇళ్ళ పరిస్థితి చూసినప్పుడు దేవుని హృదయంలో చాలా విచారం ఉందని నేను నమ్ముతున్నాను. అక్కడ శాంతి లేదు గొడవలు కొట్లాటలు మాత్రమే ఉన్నాయి. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయనను ఆశ్రయిస్తారు. ఈ లోకంలోని ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే దేవుని వైపు మొగ్గు చూపుతారు. కానీ క్రైస్తవులుగా మనం భిన్నంగా ఉండాలి. దేవుడు, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చెసే అత్యవసర నంబర్ కాదు. దేవుడు అన్ని సమయాలలో మన జీవితాలకు కేంద్రంగా ఉండాలి.
మనం కొనుగోలు చేసే ఏదైనా పరికరంతో మనకు లభించే ‘తయారీదారుని సూచనల’ పుస్తకం వలెనే దేవుని వాక్యం మనకు ఇవ్వబడింది. ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ సూచనలను ఖచ్చితంగా పాటించడానికి మనమందరం చాలా జాగ్రత్తగా ఉంటాము. మీ పరికరంలో ఏదైనా సమస్య ఉంటే, మీరు దాని తయారీదారుని వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అతను అడిగే మొదటి ప్రశ్న, “మీరు తయారీదారుని సూచనల పుస్తకాన్ని ఖచ్చితంగా అనుసరించారా?” అనేది. వాస్తవానికి, చాలా గ్యారెంటి కార్డులలో మీరు సూచనలను ఖచ్చితంగా పాటించకపోతే గ్యారెంటి చెల్లదని స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది.
అయితే దేవుని గురించిన అద్భుతమైన విషయమేమిటంటే, మనం ఏ సమయంలోనైనా మన గజిబిజి జీవితంతో ఆయన వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన దానిని సరిదిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనది ఒక సంవత్సరం గ్యారెంటి కాదు! అది జీవితాతం వర్తించేది. మీరు మీ విరిగిన జీవితంతో ఆయన వద్దకు వస్తే, ఆయన దానిని సరిచేస్తాడు. దేవునికి సంబంధించిన అద్భుతమైన విషయం అది- ఆయన ప్రేమగల తండ్రి. మీ ఇంటిని తన కొరకు పరిశుద్ధ స్థలముగా చేయమని మిమ్మల్ని అడుగుతున్నది ప్రేమగల తండ్రి అని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆయన ఈ మొదటి రోజునుండి మీ జీవితాలపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. యేసు తిరిగి వచ్చే రోజు వరకు మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
మా వైవాహిక జీవితంలో చాలా దశాబ్దాలుగా నేను నా భార్యతో కలిసి ఆ ఆనందాన్ని కొంచెం రుచి చూశాను. మీరు జీవించే అద్భుతమైన జీవితం యేసు మీ జీవితానికి కేంద్రముగా ఉండి, మీ ఇంటిలో ప్రతిదీ ఆయనను సంతోషపరుస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని నేను మీకు చెప్పగలను - మీరు మీ సమయాన్ని గడిపే విధానం, మీరు మీ డబ్బును ఖర్చు చేసే విధానం, మీరు అన్నిటిని చేసే విధానం ఆయనను సంతోషపరుస్తుందా లేదా? మీరు అలా జీవిస్తే, మీరు మీ జీవిత ముగింపుకు వచ్చినప్పుడు, లేదా అంతకు ముందే క్రీస్తు వచ్చినప్పుడు, మీరు ఆయన ముందు నిలబడినప్పుడు -‘భళా! (బాగా చేశావు)’ అని మెచ్చుకుంటాడు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనేది పట్టించుకోనవసరం లేదు.
బాహ్య రూపాన్ని బట్టి తీర్పుతీర్చటం మనిషి యొక్క ఒక లక్షణం. నేను అక్షరానుసారంగా ఉన్నప్పుడు, అనేక సంవత్సరాలు అలాగే తీర్పుతీర్చాను. కానీ దేవుడు చూస్తున్నది హృదయమని ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాను. మీ హృదయాలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలనే విషయం మీరిద్దరూ గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇల్లు రాజభవనమైనా లేక గుడిసె అయినా అది ప్రధానమైనది కాదు - బాహ్య స్వరూపం ద్వితీయమైనది. దేవుడు చూసేది నీ హృదయం. కాబట్టి మీ హృదయాలు దేవుడు నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలంగా ఉండేలా చూసుకోండి.
దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మొట్టమొదటిగా సమాధానం ఉన్న ఇంట్లో నివసిస్తాడు. లూకా 10:5-7లో, యేసు తన శిష్యులను బోధించడానికి వివిధ ప్రాంతాలకు పంపినప్పుడు, సమాధానం ఉన్న ఇంటికోసం వెతకమని చెప్పాడు. వారికి అలాంటి ఇల్లు దొరికినప్పుడు, వారు అక్కడ ఉండవలసి ఉంటుంది, మరొక ఇంటి కోసం వెతకవద్దు. ఆయన ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే వారికి సమాధానం ఉన్న ఇళ్లు దొరకడం కష్టమని ఆయనకు తెలుసు.
కొట్లాటలు లేని ఇంటిలో దేవుడు నివసిస్తాడు. భార్యాభర్తలు ఏ విషయంలో గొడవ పడతారు? ఎక్కువగా భౌతిక విషయాల గురించి - తప్పు జరిగిన కొన్ని భూసంబంధమైన విషయాల గురించి. ఈ ప్రపంచంలో విషయాలు తప్పుగా జరుగుతాయి. కాని ఏదైనా తప్పు జరిగినప్పుడు, కేవలం పాపం మాత్రమే తీవ్రమైనది అని గుర్తుంచుకోండి. మిగిలిన అన్ని విషయాలు తరువాతవి, అప్రధానమైనవి. పాపం మాత్రమే తీవ్రమైనదన్న విషయం మీరు స్పష్టంగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా విరోధము కలిగి ఉండి భూసంబంధమైన సమస్యల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే, అది దేవుని హృదయాన్ని బాధపెడుతుంది. ఈ కొద్ది జ్ఞానాన్ని నన్ను మీతో పంచుకోనివ్వండి: పాపాన్ని ద్వేషించండి -ఎందుకంటే అది మాత్రమే మీ వివాహాన్ని నాశనం చేయగలదు.
మీ ఇల్లు దేవునికి ఒక నివాసస్థలంగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. మీ ఇంటిలో సమాధానానికి భంగం కలిగించేది ఏదైనా వచ్చినట్లయితే, అది దేవునికొరకు నివాసస్థలంగా ఉండదు. ప్రభువు మీపై కోపగించుకుంటాడాని లేదా శపిస్తాడని నేను చెప్పడం లేదు. అలా కాదు. ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని శపించడు లేదా మీతో కోపంగా ఉండడు. ఆయన సంతోషం కలిగిఉండడు. మొదటిరోజు నుండి యేసు మీ ఇంట్లో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మీరు చేసే ప్రతి పనిలో మీరు ఈ విధంగా చెప్పాలని నేను ప్రార్థిస్తున్నాను:
“ప్రభువా, మనుష్యులు మాతో సంతోషంగా ఉన్నారా లేదా అనే దానిపై మాకు ఆసక్తి లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావా? మా జీవితాలలో, మా ఆలోచనలలో లేదా ఒకరి పట్ల మరొకరి దృక్పధంలో మీకు అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందా? మీరు మా ఇంట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ‘ఇది ప్రభువును సంతోషపెడుతుందా?’ అనే ప్రశ్నతో మా జీవితంలో ప్రతిదాన్ని అంచనా వేస్తాము.”
అప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుందో ఊహించగలరా? ప్రత్యక్షగుడారంమీద ప్రకాశించిన దేవుని మహిమనే దానిపై ఉంటుంది. మీ ఇంటి ద్వారా ప్రజలు సజీవ దేవుని వైపుకు ఆకర్షించబడతారు.
సమాధానంకోసం భార్యాభర్తలిద్దరూ తమ హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నచోట దేవుడు నివసిస్తాడు. ఒకసారి తమ రైలును అందుకోవడానికి వెళ్తున్న ఒక యువజంట నా దగ్గరకు వచ్చి “బ్రదర్ జాక్, రెండు నిమిషాల్లో మీరు మాకు ఒక హెచ్చరికను(ఉద్బోధను) ఇవ్వగలరా?” అని అడిగారు. నేను “తప్పకుండా. ఇదిగో: ఎల్లప్పుడూ ఒకరి నుండి ఒకరు క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉండండి, ఎల్లప్పుడూ ఒకరినొకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉండండి.”
మీరు తప్పు చేసిన వెంటనే క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటే మరియు అవతలి వ్యక్తి క్షమాపణ అడిగిన వెంటనే క్షమించడానికి సిద్ధంగా ఉంటే, ప్రతిరోజు సమాధానంతో ఉన్న ఇల్లుగా మీ ఇల్లు ఉంటుందని నేను మీకు వ్రాతపూర్వక హామీ ఇవ్వగలను.
మీ ఇల్లు అలా ఉండవచ్చు. అయితే ఈ విషయంలో మీరు చాలా సున్నితంగా ఉండాలి. మీ పాదంలో ముల్లు గుచ్చుకుంటే, దాన్ని తీసివేయడానికి మీరు ఒక్క క్షణం కూడా వేచి ఉండరు. అదేవిధంగా, మీరు మీ హృదయంలో కొంత కలవరాన్ని కనుగొన్న వెంటనే, మీరు దాన్ని వెంటనే తొలగించాలి. అది ఒక ముల్లు అది నిన్ను నాశనం చేస్తుంది. ఒక ముల్లు నీ పాదాన్ని పాడుచేసే దానికంటే ఎక్కువగా అది మీ హృదయాన్ని పాడు చేస్తుంది. ఎంత వెల చెల్లించైనా సమాధానాన్ని వెంటాడండి. డబ్బు లేదా మరేదైనా పోగొట్టుకున్నా పట్టించుకోకండి. ఆ విషయాలు సమాధానమంత ప్రాముఖ్యమైనవి కావు. మీరు సమాధానాన్ని డబ్బును ఒక త్రాసులో ఉంచినట్లయితే, డబ్బుకంటే సమాధానం చాలా బరువుగా ఉంటుందని గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. దాన్ని గుర్తుంచుకోండి!.
ఒకరోజు ఇంట్లో ఏదైనా తప్పు జరిగిందా? ఆహారం మాడిపోయిందా? పర్వాలేదు. ఆహారం మాడిపోవటం వలన ఒక్కపూట తినకపోవటం అంత పెద్ద విషయం కాదు. అది బహుశా మిమ్మల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బహుశా మిమ్మల్ని మరింత ఆధ్యాత్మికంగా కూడా చేస్తుంది!. కానీ మీరు దాని గురించి కలత చెందితే, అపవాది విజయం సాధించినట్టే.
దేవుడు స్థాపించిన మొదటి ఇంటికి ఏమి జరిగిందో గుర్తుంచుకోండి. ఆదాము హవ్వల మధ్యకు రావడానికి అపవాది పక్కనే వేచి ఉన్నాడు. అతను విజయం సాధించాడు. యోబు మరియు అతని భార్య మధ్య రావడంలో కూడా విజయం సాధించాడు. ఇస్సాకు మరియు రిబ్కా మధ్య రావడంలో కూడా విజయం సాధించాడు.
సాతాను భార్యాభర్తల మధ్యకు రావడం దేవుని చిత్తం కాదు. కనుక ఇది మీకు ఎప్పటికీ జరగకూడదు. మీ ఇంటి విషయంలో దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి మీకు అన్ని సమయాలలో సమాధానాన్ని ప్రసాదించును గాక.
నేను చెప్పదలచుకున్న రెండవ విషయం యెషయా 57:15లో ఉంది:
“దేవుడు ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు మరియు విరిగి నలిగిన వారి వద్ద ఉంటాడు”.
ఆత్మలో విరిగి నలిగిన వారితో దేవుడు నివసిస్తాడు. విరిగిన వ్యక్తి అంటే ఇతరుల కంటే తన స్వంత లోపం మరియు వైఫల్యం గురించి ఎక్కువగా ఎరిగిన వ్యక్తి. ఇతర వ్యక్తుల వైఫల్యాల గురించి తెలిసిన వ్యక్తులతో ప్రపంచం నిండి ఉంది. నేటి సగటు ఇంటిలో సంభాషణ ఎక్కువగా ఇతర వ్యక్తుల మరియు వారి కుటుంబాల వైఫల్యాల గురించే ఉంటుంది. ఇతరుల వైఫల్యాలను మనం త్వరగా గమనించవచ్చు. కానీ తరచుగా, మనం ఆ వ్యక్తులలో మంచి విషయాలను చూడము. మనమందరం ఈ విషయంలో దోషులమే. నేను కూడా గతంలో ఈ విషయంలో దోషినే. దేవుడు ఈ చెడుపై నాకు వెలుగునిచ్చాడు, నేను పశ్చాత్తాపపడ్డాను.
మనం దేవుని కృపతో రక్షించబడిన పాపులం కాబట్టి ఎవరిపైనా రాళ్ళు విసిరే హక్కు మనకు లేదు. కానీ మనం అదే పాపాన్ని ముఖ్యంగా ఇతరుల తప్పుల గురించి మాట్లాడే పాపాన్ని మరల మరల చేయడం ఇష్టంలేని వ్యక్తులుగా ఉండుటకు నిరీక్షణ ఉన్న వ్యక్తులం. స్నానాల గదిలోని అద్దానికి డ్రైవింగ్ అద్దానికి ఉన్న తేడా మనందరికి తెలుసు. స్నానాల గదిలోని అద్దంలో మన ముఖం మనకు కనిపిస్తుంది. డ్రైవింగ్ అద్దంలో మనం వేరొకరి ముఖం చూస్తాము. దేవుని వాక్యం అద్దం లాంటిదని యాకోబు 1:23-25లో చెప్పబడింది. అయితే ఇది స్నానాల గదిలోని అద్దమా లేదా డ్రైవింగ్ అద్దమా? అందులో మీకు ఎవరి ముఖం కనిపిస్తుంది? అందులో మీకు వేరొకరికి బోధించే మాట కనిపిస్తుందా? లేదా మీరు విధేయత చూపని దాన్ని అందులో చూస్తున్నారా? హెబ్రీ 10:7లో “పుస్తకంలో నా గురించి వ్రాయబడిన ప్రకారం...” అని చెప్పబడింది.
నేను నా జీవితంలో చాలా సంవత్సరాలు దేవుని వాక్యాన్ని డ్రైవింగ్ అద్దంలా చూస్తూ, ఇతర వ్యక్తులకు బోధించడానికి వచనాల కోసం వెతుకుతూ మూర్ఖంగా గడిపాను. ఆ సంవత్సరాలలో నేను దయనీయంగా ఉన్నాను మరియు ఇతరులను కూడా బానిసత్వంలోకి తెచ్చాను. కానీ నేను ఇప్పుడు వాటన్నిటి నుండి విముక్తి పొందాను. ఇప్పటికీ నా ఒప్పుదలను నేను కలిగి ఉన్నాను కానీ నేను వాటిని ఇతరులపై ఎప్పుడూ రుద్దను. నేను వాటిని ఇతరులతో పంచుకుంటాను కానీ నేను వాటిని ఇతరులపై రుద్దను(విధించను). ఎందుకంటే అది నా పని కాదు. నేను ఒంటరిగా దేవుని ముఖం ఎదుట జీవించాలి.
దేవుడు నాకు ఇచ్చినంత వెలుగు ఇతర వ్యక్తికి ఉండకపోవచ్చన్న అద్భుతమైన సత్యం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. గత 20 మరియు అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా ఈ సత్యం నాకు ఎంతో సహాయపడింది. అంతకు ముందు, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను కలిగి ఉన్న అదే వెలుగు, పాపం గురించి అవగాహన కలిగి ఉండాలని ఆశించాను. కానీ ప్రతి వ్యక్తికి కొంత వెలుగు మరియు అవగాహన మాత్రమే ఉంటుందని నేను ఈ సంవత్సరాలలో కనుగొన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి వ్యక్తి తనకు తాను కలిగి ఉన్న వెలుగు ప్రకారం మాత్రమే జీవించాలని ఆశిస్తున్నాడు, మరొకరికి కలిగి ఉన్న వెలుగు ప్రకారం కాదు. దేవుడు మనకు ఎంత వెలుగు ఇచ్చాడో మనకు తెలుసు. కానీ దేవుడు ఆ అవతలి వ్యక్తికి ఎంత వెలుగు ఇచ్చాడో మనకు తెలియదు. కాబట్టి మనం కనికరం కలిగి ఉండాలి.
(ఈ సమయంలో వదులుగా ఉన్న వైరు కారణంగా వీడియోలైట్ ఆగిపోయింది)
ఇప్పుడు ఆ లైట్ ఆరిపోయిన తీరు చూశారా! అది ఒక దృష్టాంతం. కొంతమంది వ్యక్తులు ప్రకాశవంతమైన కాంతిలో విషయాలను స్పష్టంగా చూస్తారని, ఇతరులు మసకబారిన కాంతిలో విషయాలను చూస్తారని గుర్తించండి. ఇప్పుడు ఆ లైట్ ఆరిపోవటంతో దేవుడు ఆ సత్యాన్ని ప్రదర్శించడం మంచిదయ్యింది.
కాబట్టి సునీల్, కొన్ని విషయాలలో నీకున్నంత వెలుగు అనుఘ్రకు ఉండకపోవచ్చని గుర్తించు.
అనుఘ్ర, కొన్ని విషయాలలో నీకున్నంత వెలుగు సునీల్‌కు ఉండకపోవచ్చని గుర్తించు.
మీలో ప్రతి ఒక్కరు మీరు కలిగి ఉన్న వెలుగు ప్రకారం జీవించాలి, మరొకరు తనకు ఉన్న వెలుగు ప్రకారం జీవించడానికి వదిలివేయాలి.
రెండవ తరగతి విద్యార్థి కంటే ఆరవ తరగతి విద్యార్థికి ఎక్కువ తెలుసు. కాబట్టి ఆరవ తరగతి విద్యార్థి తనకు తెలిసినంత ఎక్కువగా రెండవ తరగతి విద్యార్థికి తెలియాలని కోరుకున్నట్లయితే, అతను మూర్ఖుడు. 65 సంవత్సరాల వయస్సులో దేవుని మార్గాలపై నాకు ఉన్నంత వెలుగు మరియు అవగాహన, 26 సంవత్సరాల వ్యక్తి కలిగి ఉండాలని ఆశించినట్లయితే నేను బుద్ధిహీనుడను. కానీ నేను బుద్ధిహీనుడిగా ఉండను.
చాలా మంది క్రైస్తవులు బుద్ధిహీనులుగా ఉంటారు. తాము ముప్పై ఏళ్లలో సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇతరులు ఒక్క ఏడాదిలో పొందాలని ఆశిస్తారు.
ఈ యువజంటకు ఎంత జ్ఞానం ఉండాలని నేను ఆశిస్తున్నాను? ఇరవైలలోని వ్యక్తులకున్న జ్ఞానం మాత్రమే.
సునీల్ మరియు అనుఘ్ర, మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను మీకు ఒక విషయం చెబుతాను: నేను మీ వయస్సులో ఉన్నప్పుడు నేను చేసిన దానికంటే మీరు బహుశా పది రెట్లు తక్కువగా తెలివితక్కువ పనులు చేస్తారు!. దీన్ని బట్టి మీరు ప్రోత్సహించబడ్డారని ఆశిస్తున్నాను. కానీ దేవుడు నా పట్ల దయతో, నేను తప్పులు చేసినప్పటికీ ఆయన నన్ను ప్రోత్సహించాడు.
ఒక తండ్రిగా మీ ఇద్దరికీ ఒక విషయం చెబుతాను. ఇంకొక మాట అనుఘ్ర, నేను నీ మామను కాను, నేను ధర్మశాస్త్రం క్రింద కాకుండా కృప క్రింద ఉన్నాను కాబట్టి నేను కోడళ్ళను కాక కూతుర్లను కలిగి ఉంటానని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాను. రాబోయే సంవత్సరాలలో, నేను నిన్ను కూతురులా చూస్తున్నానో లేక కోడలిగా చూస్తున్నానో నీవు నన్ను పరీక్షించి చూడవచ్చు. నేను ఎప్పుడైనా తప్పిపోతే, నేను నిన్ను కూతురులా చూసుకుంటానని ఈరోజు చెప్పిన విషయాన్ని నాకు దయచేసి గుర్తు చేయి. నేను కుతురులా చూసుకుంటాను.
మీ తండ్రిగా మీ ఇద్దరికీ నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, మీలో ఎవరికీ నాకు ఉన్నంత వెలుగు లేదా జ్ఞానం ఉండాలని నేను ఎప్పుడూ ఆశించను. మీకు 65 సంవత్సరాలు రాకముందే, బహుశా 45 సంవత్సరాలు వచ్చేసరికే నాఅంత జ్ఞానం మీకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు 65 సంవత్సరాలు వచ్చేసరికి, ప్రస్తుతం నాకంటే ఎక్కువ జ్ఞానం మీకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
కాబట్టి మీరు, 40 సంవత్సరాలలో వారు సంపాదించిన జ్ఞానం మీరు కలిగి ఉండాలని ఆశించేవారిని కలిసినప్పుడు, వారిని పట్టించుకోకండి. యెషయా 42:19లో ఒక అందమైన వచనం ఉంది, ప్రభువుయొక్క నిజమైన సేవకుడు గుడ్డివాడు మరియు చెవిటివాడు అని అది చెప్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాలకు గుడ్డిగా మరియు చెవిటిగా ఉండండి. ఆ వచనం నాకు బాగా ఉపయోగపడింది. అది మీకు కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాలకు చెవిటిగా మరియు గుడ్డిగా ఉన్నప్పుడే, మీరు దేవుని సేవకులుగా ఆయన ముఖం ఎదుట జీవించగలరు.
కాబట్టి మిమ్మల్ని విమర్శించే వారిలో కాకుండా, మీలో ఏమి తప్పు ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరులు మిమ్మల్ని విమర్శించడం ద్వారా తమను తాము నాశనం చేసుకోవాలనుకుంటే, నాశనం చేసుకోనివ్వండి. అయితే నన్ను నేను అలా నాశనం చేసుకోకూడదని చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. నేను యౌవనస్తునిగా చాలా తెలివితక్కువ పనులు చేశాను. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంది. పౌలు ఇలా చెప్పాడు, “నేను చిన్నతనంలో చిన్నపిల్లవాడిలా ప్రవర్తించాను, చిన్నపిల్లవాడిలా మాట్లాడాను, చిన్నపిల్లవాడిలా నటించాను. ఇప్పుడు పెద్దవాడనై, చిన్నపిల్లవాడి చేష్టలు విడిచిపెట్టాను” (1కొరింథీ 13:11).
మీరిద్దరూ కూడా త్వరగా ఎదగాలని నేను ప్రోత్సహిస్తున్నాను.
భార్యాభర్తలు ప్రతిరోజు పరిశుద్ధంగా నడిచే ఇంటిలో దేవుడు నివసిస్తాడు. యెహెజ్కేలు 43:12 ఇలా చెప్తుంది: “మొత్తం ప్రాంతమంతా పవిత్రంగా ఉండాలి - ఇది దేవుని ఆలయ నియమం”.
ప్రత్యక్షగుడారంలో మూడు భాగాలు ఉన్నాయి - ఆవరణం, పరిశుద్ధస్థలం, అతి పరిశుద్ధస్థలం. ఈ మూడింటిలో అతి పరిశుద్ధస్థలం అన్నింటికన్నా చిన్నది.
అయితే కొత్తనిబంధనలో, ఆవరణ, పరిశుద్ధ స్థలం ఉండదని మొత్తం ప్రాంతమంతా అతి పరిశుద్ధ స్థలమని చదువుతాము. అంటే కొత్తనిబంధనలో, దేవుని మహిమ కేవలం గుడారంలో ఒక మూలన మాత్రమే కాకుండా, గుడారం మొత్తంపై ఉంటుంది.
అది మీ జీవితానికి ఎలా అన్వయించబడుతుందంటే, కేవలం ఆదివారాలు మాత్రమే కాకుండా అన్ని వేళలా మీరు పవిత్రంగా ఉండబోవుతున్నారు. కేవలం బైబిలు చదివినప్పుడు మాత్రమే కాకుండా, ప్రతి పని చేసేటప్పుడు మీరు పవిత్రంగా ఉండబోవుతున్నారు. మీ జీవితంలో, మీ ఇంటిలో ప్రతి మూల, ప్రతి సందు పవిత్రంగా ఉండబోవుతుంది. పరిశుద్ధత అంటే, ఏదో కొన్ని మతపరమైన ఆచారాలను అనుసరించడం కాదు కానీ మీకున్న వెలుగు ప్రకారం, దేవునికి నచ్చని ప్రతిదానికీ దూరంగా ఉండటం. మీ ఇద్దరి జీవితంలో ఇది నిజం కావాలి.
జంటగా మీ జీవితాల కోసం దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుడు మొదట ఆదామును సృష్టించినప్పుడు, హవ్వ లేదు. దేవుడు ఆదాములోనికి జీవవాయువును ఊదాడు. ఆదాము కళ్ళు తెరచినప్పుడు, అతను చూసిన మొదటి వ్యక్తి దేవుడే. సునీల్, నీ జీవితంలో ప్రతిరోజు నీవు చూసే మొదటి వ్యక్తి దేవుడే అవుతారని నేను ఆశిస్తున్నాను. అప్పుడు దేవుడు ఆదామును నిద్రపుచ్చి, అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి హవ్వను చేసాడు. హవ్వ కళ్ళు తెరచినప్పుడు, ఆమె చూసిన మొదటి వ్యక్తికూడా దేవుడే. అనుఘ్ర, నీ జీవితంలో ప్రతిరోజు నీవు చూసే మొదటి వ్యక్తి దేవుడే అవుతారని నేను ఆశిస్తున్నాను. హవ్వ దేవుణ్ణి చూసినప్పుడు, ఆదాము ఉన్నాడన్న విషయమే తెలియదు. ఆ తర్వాత, దేవుడు హవ్వను ఆదాము వద్దకు తీసుకొని వచ్చి, “ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకోవచ్చు” అన్నాడు. అప్పుడు వారు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు - ఎందుకంటే వారిద్దరూ మొదట దేవుణ్ణి చూశారు. ఇద్దరూ ముందుగా దేవుణ్ణి చూడటమే వివాహంలో కొనసాగే ప్రేమయొక్క రహస్యం.
సునీల్, దేవుడు ఆదాము కొరకు ఏమి చేశాడో, నీకోసం కూడా అదే చేశాడు. 26 సంవత్సరాల క్రితం నీవు పుట్టినప్పుడు, నీ తల్లితండ్రులుగా మేము సంతోషిచాము. కానీ ఆ రోజుకు చాలా రోజుల ముందే నీ పుట్టుక గురించి దేవునికి తెలుసు. మీ అమ్మ మరియు నేను వివాహం చేసుకోవడానికి చాలా కాలం ముందే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది. అద్భుతమైన సత్యం ఏమిటంటే, నీవు పుట్టకముందే దేవుడు నీ వివాహం కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత, దేవుడు భారతదేశంలోని మరొక ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయిని పుట్టించాడు. దేవుని ప్రణాళిక గురించి నీకు తెలియదు మరియు అనుఘ్రకు కూడా తెలియదు. దేవుడు ఒక గొప్ప వివాహాలు కుదిర్చేవాడు. మీ ఇద్దరికి తెలియని ఒక అద్భుతమైన ప్రణాళికను మీఇద్దరి కొరకు ఆయన కలిగి ఉన్నాడు. ఈ చిన్న అమ్మాయి పెరిగేకొద్దీ, ఆమెకోసం దేవుడు నిన్ను మనస్సులో ఉంచుకున్నాడు. ఆపై ఒక రోజు, ఆయన మీ ఇద్దరినీ ఒక చోట చేర్చాడు. సరిగ్గా ఆదాము హవ్వలను చేర్చినట్లే చేర్చాడు. దేవుడు మీ విషయంలో ఎంత మంచివాడుగా ఉన్నాడు.
దేవుడు మీ జీవితంపట్ల నిజంగా సంతోషంగా ఉండాలని, దేవుని కోసం ఒక పరిశుద్ధ స్థలంగా మీ ఇంటిని మీరు నిర్మించాలని మీ ఇద్దరికోసం నా ప్రార్థన.
దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించును గాక. ఆమెన్.