మా ఆర్ధిక విధానం


Our Financial Policy
దేవునియొక్క నిజమైన (దేవుడే ఆరంభించి మరియు కొనసాగించే) పనికి ధనము అవసరమే కాని ఆపని(పరిచర్య) ధనము మీద ఆధారపడదు. అది కేవలము పరిశుద్ధాత్మశక్తి ద్వారా జరుగుతుంది. ఎక్కడైతే ధనము మీద ఆధారపడి పరిచర్య జరుగుతుందో అది దేవుని పని కాదు.
ప్రభువైనయేసు యొక్క పరిచర్య కేవలము పరిశుద్ధాత్మమీద ఆధారపడి ఉంటుంది. ఆయన పరిచర్యకు తన శిష్యులనుండి ధనమును స్వీకరించారు (లూకా 8:2,3). అయితే ఆయన ఎప్పుడైనను, ఎవరినైనను ధనము కొరకు అడుగలేదు మరియు ఆయన యొక్క ధనసంబంధమైన అవసరమును ఎవరికీ చెప్పలేదు కాని తన తండ్రికి మాత్రమే చెప్పారు.
ప్రభువైనయేసు ఈ లోకంలో ఉన్నప్పుడు తన మొదటి "శరీరమును" కలిగియున్నారు. ఈనాడు మనము "క్రీస్తుయొక్క ఆత్మ సంబంధమైన శరీరము"గా ఉన్నాము. కాబట్టి ధనసంబంధమైన విషయములలో ఆయన యొక్క భూలోకసంబంధమైన జీవితము యొక్క మాదిరినే అనుసరిస్తాము.
కాబట్టి 1975 సంవత్సరము నుండి ఈ నాలుగు దశాబ్దములలో మా అవసరములను ఏఒక్కరినీ ధనము గూర్చి అడుగలేదు మరియు మాకు ధనము అవసరమున్నదని మేము ఎవరికీ పత్రికలు పంపలేదు. బెంగుళూరు సంఘములోగాని లేక దేశ విదేశాలలో ఉన్న మా సంఘములన్నిటిలోగాని మేము ఎన్నడైనను చందాపట్టలేదు. ప్రభువు పరిచర్యకొరకు ఎవరైతే రహస్యముగాను, సంతోషముగాను, స్వచ్ఛందముగాను ఇవ్వాలని అనుకుంటారో వారికొరకు కానుకల పెట్టి మా యొక్క సంఘకూడికలు జరిగే భవంతిలో వెనుక భాగమున ఉంచెదము. ఇండియాలో ఆయా ప్రాంతములలో జరిగిన మా కూడికలన్నిటిలో వచ్చినవారందరికీ భోజన వసతి సదుపాయములను ఉచితముగా అందించాము. అపొస్తలుడైన పౌలువలె మా సంఘములలో ఉన్న పెద్దలందరు పనిచేసుకుంటూ వారిని వారే పోషించుకుంటున్నారు. పెద్దలెవరికీ సంఘములు ఆర్ధిక సహాయము (జీతము ఇవ్వరు) చేయరు. ఇంటర్‍నెట్‍లో ఉన్న మా పుస్తకములుగాని, వర్తమానములుగాని ప్రపంచములో ఎవరైనను వాటిని ఉచితముగా పొందుకొనవచ్చును. ప్రభువుయొద్ద నుండి మేము సమస్తమును ఉచితముగా పొందుకొనియున్నాము కాబట్టి అంతటినీ ఉచితముగా ఇస్తాము.
మీరు కానుక ఇచ్చే ముందు దయచేసి క్రింద వాటిని చదవండి.
1. నీవు క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డవేనా?
2. నీ కుటుంబ అవసరములకు సరిపోవు ధనము నీ దగ్గర ఉన్నాదా?
3. ఇంటి కొరకు తీసుకున్న అప్పు తప్ప మరేదైన అప్పు నీకున్నదా?
4. నీవు అందరితో సమాధానపడియున్నావా?
5. నీవు సంతోషముగా ఇచ్చుచున్నావా?
ఈ పరిచర్య అంతటికీ ఎంతో ధనము అవసరము అయితే మా సంఘములలో కోటీశ్వరులు ఒక్కరు కూడా లేరు. ఇండియా బీదదేశము అయినప్పటికీ దేవునిరాజ్యమును మొదటిగా మేము వెదకియున్నాము కాబట్టి ఎల్లప్పుడు దేవుడు మా అవసరమంతటినీ తీర్చాడు. గనుక మా పరిచర్య ఆరంభించినప్పటినుండి మేము ఒక్కసారి కూడా అప్పు చేయలేదు. మా యొక్క సంఘకూటములు జరిగించే భవంతులకొరకు మేము ఒక్కసారి కూడా బ్యాంకు నుండి అప్పు తీసుకొనలేదు మరియు తాకట్టు పెట్టలేదు. వేరే విధానములో పరిచర్య చేసే వారిని మేము తీర్పు తీర్చము. అయితే దేవుడు మమ్ములను ఈ రీతిగా నడిపించారు. క్రీస్తుయొక్క మాదిరిని వెంబడించుటనే మేము కోరియున్నాము.
కాబట్టి ప్రజలు మా పరిచర్యకు కానుకలు ఇవ్వాలని కోరినట్లయితే క్రింది భాగమును చదవాలని కోరుచున్నాము.
1. నీవు క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డవేనా?
దేవుని పరిచర్యకు కానుకలు ఇచ్చుట ఎంతో ఘనత మరియు ధన్యత. కాని దేవుని మూలముగా క్రొత్తగా జన్మించిన వారికి మాత్రమే ఈ ధన్యత ఉన్నది (3 యోహాను 7).
2. నీ కుటుంబ అవసరములకు చాలినంత ధనము నీయొద్ద ఉన్నదా?
నీవు ఇచ్చుటవలన నీకుటుంబానికి ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలుగదు గదా? మొదట నీవు నీకుటుంబాన్ని పోషించుకోవాలి(1 తిమోతి 5:8). మన పరలోకపు తండ్రి శోధింపశక్యముగాని ఐశ్వర్యముగల వాడు (భూలోకములోని ధనవంతులైన తండ్రులవలె). కాబట్టి ఆయన పరిచర్య కొరకు ధనము ఇచ్చినందున ఆయన పిల్లలెవరును పస్తులుండకూడదని లేక ఇబ్బందిపడకూడదని దేవుడు కోరుచున్నాడు.
3. నీవేమైనా పెద్దమొత్తములో అప్పు చెల్లించవలసియున్నదా?
అట్లయితే మొదటిగా ఆ అప్పులను తీర్చుము. అప్పులేమియు లేని, సమాధానకరమైన విశ్రాంతిలో తన బిడ్డలు జీవించాలని దేవుడు కోరుచున్నాదు. మొదటిగా మనము కైసరువి కైసరు కివ్వాలి తరువాత దేవునికివ్వాలి ఎందుకనగా దేవుడు కైసరు యొక్క ధనముగాని లేక వేరే వారి ధనముగాని కోరుటలేదు (మత్తయి 22:21; రోమా 13:8)
(గమనిక: ఇల్లు కట్టుటకు తీసుకున్న అప్పు విషయం: అప్పు తీసుకున్న ధనమునకు సరిపోయే ఇల్లు ఉన్నది కాబట్టి అటువంటి అప్పు ఉన్నట్లయితే మనము కానుక ఇవ్వవచ్చును. అలాగే ఏదైనా వాహనానికి తీసుకున్న అప్పు విషయము కూడా.
4. నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉన్నదా?
నీవు ఎవరినైతే గాయపరిచావో వారితో సమాధానపడియున్నావా? ఇతరులను గాయపరచి వారిని క్షమాపణ అడిగి సమాధానపడనట్లయితే, దేవుడు వారి అర్పణను అంగీకరించడు (మత్తయి 5:23,24).
5. నీవు సణుగుకొనక, బలవంతముగా కాక సంతోషముగాను, స్వచ్ఛందముగాను ఇస్తున్నావా? బలవంతముగా ఇచ్చువారిని కాదుగాని సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. బలవంతముగా ఇచ్చే వారి కానుకలు దేవునికి అవసరము లేదు లేక వారి మనస్సాక్షిని నిర్మలపరచుకోవడానికి గాని లేక దానికి బదులుగా ప్రతిఫలము ఆశించిగాని ఇచ్చేవారి కానుకలు దేవుడు కోరుటలేదు (2 కొరింథీ 9:7).
ఈ విషయాలలో మీరు మమ్ములను సంప్రదించవచ్చును. ధన సంబంధమైన విషయములలో ప్రభువైన యేసు యొక్క మాదిరిని మరియు బోధను అనుసరించాలని మేము కోరుచున్నాము.
క్రైస్తవ సహవాస సంఘమునకు ఇవ్వాలనుకొనినచో
పైన విషయాలు చదివిన తరువాత కూడా మీరు ఈ పరిచర్యకు కానుక ఇవ్వాలనుకొనినట్లయితే
మీరు ఈవిధముగా కానుకను పంపవచ్చును.