ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు
మత్తయి 5:3లో, "ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు" అని యేసు చెప్పారు. "ధన్యత" అనే ఈ పదానికి "సంతోషం" లేదా యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పినట్లుగా "అసూయపడదగిన వ్యక్తి" అని అర్థం వస్తుంది. మీరు భూమిపై ఎవరి మీద అయినా అసూయపడాలనుకుంటే, ధనవంతుడిని చూసి అసూయపడకండి, ప్రసిద్ధమైన వ్యక్తిని చూసి అసూయపడకండి మరియు అందంగా కనిపించే వ్యక్తిని చూసి అసూయపడకండి.