జాక్ పూనెన్ గారి గురించి


Zac Poonen
Zac Poonen

జాక్ పూనెన్ గారు గతములో భారత నౌకాదళములో ఒక అధికారిగా పనిచేసిరి. గత 40 సంవత్సరములుగా బైబిలు బోధకుడుగా మరియు అనేక సంఘములపై బాధ్యత కలిగిన పెద్దగా భారత దేశములో సేవ చేయుచున్నారు.


ఆయన ఇంగ్లీషులో అనేక పుస్తకములను మరియు సందేశములను వ్రాసెను. అందులో కొన్ని యితర భారతీయ భాషలలోనికి తర్జుమా చేయబడినవి. ఆయన భారత దేశములో మరియు పై దేశములలో యిచ్చిన సందేశములు ఆడియో మరియు వీడియో క్యాసెట్లు మరియు సీ.డి.లుగా అందుబాటులో నున్నవి (పుస్తకములు, ఆడియో మరియు వీడియో భాగమును చూడండి).


సి.ఎఫ్.సి లో నుండిన ఇతర పెద్దలవలె జాక్ పూనెన్ గారు కూడా ఆయన కొరకు మరియు ఆయన కుటుంబము కొరకు "డేరాలు తయారు చేయు" విధానముపై ఆధారపడుదురు, కాని ఆయన సేవలలో దేని గూర్చి ఆయన ఏ జీతము తీసుకొనరు. సి.ఎఫ్.సి. ద్వారా ప్రచురమవుచున్న ఆయన యొక్క పుస్తకములు, ఆడియో క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు లేక సీ.డి.లు పై ఏ విధమైన ప్రతిఫలమును పొందరు.