1975 ఆగష్టులో ఇండియాలోని బెంగుళూరు పట్టణములో కొన్ని కుటుంబములు కలిసి క్రైస్తవ సహవాస సంఘముగా (సి.ఎఫ్.సి) కలుసుకొనుట ఆరంభించారు. జాక్ పూనెన్ మరియు ఇయాన్ రాబ్సన్ అను ఇద్దరు ప్రభువైన యేసు శిష్యులుగా ఉండాలని నిర్ణయించుకొని మరియు మత్తయి 28:18-20 ప్రకారం ప్రభువు ఆజ్ఞాపించినరీతిగా ఇతరులను శిష్యులునుగా చేయవలెనని నిర్ణయించుకున్నారు. క్రొత్తగా జన్మించుట గూర్చియు, అంతరంగంలో పరిశుద్ధత కలిగియుండుట గూర్చియు, ఒకరినొకరు ప్రేమించుట గూర్చియు, పవిత్రులునుగా ఉండుటను గూర్చియు, ఆర్ధిక విషయాలలో నమ్మకముగా ఉండుటను గూర్చియు మరియు దేవునియొక్క సత్యవాక్యమును ఇతరులకు ప్రకటించుటను గూర్చియు, వారి జీవితములోని అన్ని విషయములలో వాక్యానుసారముగా ఉండునట్లును వారు కోరియున్నారు.
ఒక చిన్న ఇంటిలో ఆరంభమైన ఈ సంఘము, క్రీస్తు శరీరముగా వృద్ధి పొందుచు, గ్రహించుటలోను మరియు ఆత్మలో క్రొత్త నిబంధనలోని దేవుని జీవాన్ని సమృద్ధిగా అనుభవించుటలోను అభివృద్ధి పొందియున్నారు. ఆరంభమునుండి గత 40 సంవత్సరాలుగా ఒకే విధముగా కొనసాగుచున్నారు. ఇతరులతోకూడా మా జీవితములను రూపాంతరపరచిన ఈ అద్భుతమైన సత్యములను, జయజీవితములను గూర్చిన మాసపత్రికను మరియు కేసెట్స్ పరిచర్య మరియు శిష్యులుగా జీవించాలని కోరేవారికి కూటములను పెట్టుటకు ఆరంభించియున్నాము. 1981 లో వృద్ధి పొందుచున్న ఈ సంఘము బెంగుళూరులోని డకోస్టా స్క్వేర్, 40 లో కూటములు జరిపించుటకు మందిరము కట్టబడింది. 1982-1989 వరకు అనేక పట్టణములలోను ఇండియాలోని ఇతర రాష్ర్టాలలోను సంఘములను నిర్మించుట ఆరంభించబడింది.
1989-1995 సంవత్సరము వరకు జాక్ పూనెన్ గారు అనేక పుస్తకములను వ్రాసి మరియు 20 పుస్తకములకంటే పైగా వ్రాసియున్నారు. 1997 సంవత్సరానికి కేసెట్స్ పరిచర్య కూడా విస్తరించింది. అనేక ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటించు నిమిత్తము జాక్ పూనెన్ గారు, 60 సంవత్సరముల వయస్సులో బెంగుళూరు సి.ఎఫ్.సి పెద్దగా ఉండుటనుండి తొలగియున్నారు. 2003వ సంవత్సరం నుండి ఇంటర్‍నెట్‍లో కూడా పరిచర్య విస్తరించి మరియు అనేక ఖండములలో సంఘములు నిర్మించబడుట ఆరంభించబడినది. 2014 సంవత్సరములో బెంగుళూరులోని స్థానిక సంఘము పాత మందిరము నిండినందున బెల్లహల్లి, ప్యారడైజ్ ఎన్‍క్లేవ్ వద్ద నున్న మందిరానికి మార్చబడింది.
బెంగుళూరు సి.ఎఫ్.సి లో ఉన్న పెద్దలు
స్థానిక సంఘములోని పెద్దల విషయములో మొదటనుండి క్రొత్త నిబంధన బోధ ప్రకారం ఉండుటకు క్రైస్తవ సహవాస సంఘము కోరియున్నది (తీతు 1:5, అ.కా. 14:23).