"దైవభక్తిని గూర్చి మర్మము" అనగా ఒక విశ్వాసి దైవభక్తి విషయములో తీవ్రముగాలేనట్లయితే లేక ఇతరులచేత విమర్శించబడతాననే భయముతో లేఖనములలోని సత్యము కొరకు నిలబడుటకొరకు భయపడువారికి దేవుడు ఆ సత్యమును మర్మముగా ఉంచును (1తిమోతి 3:16).
బైబిలు (66 పుస్తకములు) ప్రేరేపింపబడిన మరియు మార్పు లేని దేవుని వాక్యము, ఈలోకములో మన యొక్క జీవితమునకు సంపూర్ణమైన మరియు సరిపడినంత మార్గదర్శకత ఇచ్చునది.
నిత్యకాలము (ప్రారంభము మరియు ముగింపులేని కాలము) నుండి ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మలుగా యుండెను.
యేసుక్రీస్తు యొక్క దైవత్వము, ఆయన కన్యకకు పుట్టిన విషయము, ఆయన మానవత్వము, ఆయన యొక్క పరిపూర్ణమైన పాపరహిత జీవితము, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా మరణించిన ఆయన
మరణము, ఆయన శరీరముతో పునరుథ్థానుడవుట, ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమవుట మరియు తన పరిశుద్ధుల కొరకు తిరిగి ఈ భూమి మీదకు ఆయన వచ్చు విషయము నమ్ముచున్నాము.
మానవులందరు వారి పాపములలో మరణించి సంపూర్తిగా నాశన మార్గములోనికి పోయిరి. వారి పాపములు క్షమింపబడుటకుండిన ఒకే ఒక మార్గము పశ్చాత్తాపము ద్వారా ప్రభువైన
యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుథ్థానము నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే కలదు.
పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుట ద్వారా ఒక వ్యక్తి తిరిగి జన్మించి దేవుని బిడ్డగా అగునను విషయము.
నీతిమంతునిగా తీర్చబడుట క్రీస్తు నందు విశ్వసించుట వలన మాత్రమే జరుగును, దాని యొక్క రుజువు దేవుని మహిమపరిచే మంచి పనులు చేయుట ద్వారా తెలియును.
నూతన స్వభావము కలిగిన తరువాత తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో నీటిలో ముంచబడుట ద్వారా బాప్తిస్మము పొందవలెను.
క్రీస్తు కొరకు జీవితము ద్వారా మరియు మాట ద్వారా సాక్ష్యముగా నుండుటకు శక్తి కొఱకు నిరంతరము పరిశుద్ధాత్మ చేత నింపబడు అవసరత కలిగియున్నాము.
నీతిమంతులు నిత్యజీవము కొరకు మరియు అనీతిమంతులు నిత్యనాశనము కొరకు తిరిగి లేచుదురు.