అభ్యాసత్వక శిష్యత్వము

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
    Download Formats:

అధ్యాయము 1
శిష్యులా లేక క్రైస్తవులుగా మారిన వారా?

ఏదైనా ఒక విషయాన్ని గురించి ఒక వాక్యమును తీసికొని అదే విషయము గూర్చిన ఇతర వాక్యములను విడిచి పెట్టుట విశ్వాసుల్లోని సాధారణమైన తప్పిదం.

సాతాను మన ప్రభువును..''ఈలాగు వ్రాయబడియున్నది'' (మత్తయి 4:6) అను మాటతో శోధించెను. కానీ మన ప్రభువు......''అని కూడా వ్రాయబడియున్నది'' (మత్తయి 4:7)అను మాటలతో శోధనను త్రోసివేసెను. వాక్యమును వాక్యముతో పోల్చి చూచుకొనినప్పుడు - అనగా ....''ఈలాగున వ్రాయబడియున్నది''. అను మాటలను...''అని కూడా వ్రాయబడియున్నది''అను మాటలతో కలిపి చదివినపుడు మాత్రమే దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశ్యమును అర్థం చేసుకొనగలము.

''శిష్యులకు అప్పగింపబడిన గొప్ప కార్యము''అను విషయాన్ని చూద్దాం.

యేసు తన శిష్యులతో సర్వలోకమునకు వెళ్ళి ''సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి'' (మార్కు 16:15) అని ఆజ్ఞాపించియున్నాడు. ''మీరు వెళ్ళి అన్ని దేశములనుండి శిష్యులను చేయుడి'' (మత్తయి 28:19) అని కూడా వారికి ఆజ్ఞాపించియున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు, నెరవేర్చవలసిన ఒక గొప్ప కార్యము యొక్క రెండు భాగములైయున్నవి. దీనిని జాగ్రత్తగా ఆలోచించి ఆ గొప్ప కార్యములోని రెండు భాగములకు విధేయత చూపుట ద్వారా దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని తెలుసుకొని నెరవేర్చిన వారమగుదుము.

సువార్తీకరణ

లోకములోనికి వెళ్ళి సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించుటమనేది మొదటి మెట్టని స్పష్టమవుతుంది (మార్కు 16:15). ఈ ఆజ్ఞ ఏ ఒక్క విశ్వాసిని సంబోధించినది కాక, క్రీస్తు శరీరమైన సంఘమునకిచ్చినది సర్వ ప్రపంచములోని మనుష్యులందరికి సువార్తను ప్రకటించుట ఏ ఒక్క స్థానిక సంఘమైనా లేక ఏ ఒక్క మనిషి మాత్రమే చేయుట మానవులముగా అసాధ్యమైన పని. మనలో ఒక్కొక్కరికి ఈ మహాకార్యములోని ఒక చిన్న భాగము మాత్రమే చేయుట సాధ్యపడుతుంది.

కాని ఆ భాగము ఎంత చిన్నదైనా, మనము నెరవేర్చగలగాలి. ఇక్కడే అపొ.కా. 1:8 లోని వాక్యమునకు సంబంధించి చూడగలము. క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా ఉండాలంటే ప్రతి విశ్వాసిలోనికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చి శక్తితో నింపబడియుండాలి. జాగ్రత్తగా గమనించినట్లైతే అందరు సువార్తికులుగా పిలువబడలేదు (క్రీస్తు తన సంఘమునకు కొందరినే సువార్తికులుగా ఇచ్చియుండెనని ఎఫెసీ 4:11 తేటగా చెప్తుంది), కాని అందరూ తనకు సాక్షులుగా పిలువబడ్డారు.

సువార్తికుడు పనిచేయు పరిధి ఒక సాక్షిపరిధి కన్నా విస్తృతంగా ఉంటుంది. సాక్షి తాను పనిచుయు స్థలంలో నడిచే మార్గములో అంటే - తన బంధువులకు, ఇరుగు పొరుగువారికి, తను పనిచేయు కార్యాలయములోని తోటి కార్మికులకు, తనకు రోజూ తటస్థ పడేవారికి, ప్రయాణాల్లో ఎవరితో కలిసేటట్టు అతడు నడిపింపబడినాడో వారికి క్రీస్తును గూర్చి ప్రకటించాల్సి ఉంటుంది. మనము ఈ లోకంలో ఏ వృత్తిలో నున్నా, పైన చెప్పబడిన విధంగా మనమందరము సాక్షులుగా ఉండవచ్చును.

దేవుని ఎరుగని వారిని చేరుటకు చేయాల్సిన విస్తృతమైన పరిచర్య కొఱకు యేసు క్రీస్తు సంఘమునకు సువార్తికులను కూడా ఇచ్చెను. అయితే సువార్తికుడి పని కేవలము 'ఆత్మలను సంపాదించుట లేక ప్రజలను క్రీస్తు యొద్దకు రాబట్టుట' (సాధారణముగా మనము విను మాట) మాత్రమే కాక, క్రీస్తు సంఘమును కట్టుటైయున్నది (ఎఫెసీ 4:11,12 లో విశదీకరించిన విధంగా). ఈనాటి సువార్త పరిచర్యలోని గొప్ప వైఫల్యము ఇక్కడే ఉంటున్నది. చాలా వరకు ఈ రోజుల్లోని సువార్త పరిచర్య క్రీస్తు సంఘమును కట్టుటకు సంబంధించి కాక ఆత్మలను రక్షించుటతోనే నిండియున్నది. ఈ ఆత్మలు తిరిగి వారు తప్పిపోవునట్లు వారి వారి మృతతుల్యమైన సంఘాలకు పంపబడుచున్నారు అంతగా కాకపోతే ఒక రోజున ప్రభువు నోటినుండి ఉమ్మివేయుటకు మాత్రమే పనికి వచ్చునట్లు నులివెచ్చని వారగుచున్నారు (ప్రకటన 3:16).

రెండు విధాలా, వీరు క్రీస్తు సంఘములోనికి కట్టబడుట లేదు. ఆవిధంగా సాతాను ఉద్దేశ్యాలు మాత్రమే నెరవేర్చబడుచున్నవి - ఆ మనిషి రెండింతలుగా నరకమునకు సంబంధించిన బిడ్డ అగుచున్నాడు, (మత్తయి 23:15) - మొదట దేవుని ఎఱుగని వానిగా ప్రారంభించాడు మరియు రెండవదిగా తాను ఇంకనూ తప్పిపోయి ఉంటూ, ఒక సువార్తికుని ద్వారా రక్షింపబడితినన్న భ్రమలో నుండెను!! ఈ విధమైన సువార్త పరిచర్య ద్వారా కట్టబడేది ఆ సువార్తికుని స్వంత ఆస్థానము మాత్రమే. సాధారణంగా ఇలాటి సువార్త యొక్క ఉద్దేశ్యము, ఆ సువార్తికుడు డబ్బు సంపాదించాలన్న ఆశ లేక మనుష్యులమెప్పు పొందడమో లేక రెండునో అయి ఉంటుంది!!

యేసు సువార్తికులను 'మనుష్యులను పట్టే జాలరులని' పిలచెను. రక్షణ పొందని 'క్రైస్తవ' మత పెద్దలు లేక గుంపుల సహకారంతో లేక ఎన్నికల్లో ఓట్లనాశించే రాజకీయనాయకుల ప్రోత్సాహముతో చేయు సువార్త పరిచర్య, చిల్లులు ఉన్న వలతో చేపలు పట్టడంలాగుంటుంది. యేసు, తాను అన్నాను లేక కయిప లేక హేరోదు లేక పిలాతు లాంటివారిని ఆహ్వానించి వేదికపై తనతో కూర్చొని సువార్త కూడికలను ప్రారంభించమనటం మనము ఊహించలేము! అయిననూ, ఈనాటి సువార్తికులు ఈ విధంగా చేయుచూ మరియు ఆ మార్పుచెందని నాయకులను వేదిక మీద పొగడ్తలతో ముంచెత్తడం పరిపాటయింది.

ఇంకను ఆ వలలతో పట్టబడిన చేపలు సముద్రంలోనికి (మృత తుల్యమైన సంఘములు) తిరిగి వెళ్ళుటకు వదలబడుతూ, ఆ తదుపరి సువార్త కూడికల్లో మరొకసారి సముద్రంలోనికి వదిలిపెట్టబడటానికి పట్టబడుతూ ఉంటాయి!! ఈ రోజుల్లో, అనేక మంది సువార్తికులు వివిధ శాఖల సమ్మిళిత క్రైస్తవ కూడికలు నిర్వహించి అందులో ప్రతి సువార్తికుడు ఎత్తబడిన చేతులను పంచబడిన నిర్ణయపు కార్డులను లెక్కవేయుటలాంటి ప్రక్రియ అనేక మార్లు జరపబడుతున్నది. అట్టి సువార్త పరిచర్య పరలోకములోని దేవదూతలకు సంతోషమివ్వక, సాతాను అనుచరులకు సంతోషమునిస్తుంది! ఎందుకంటే రెండింతలు నరక సంతానముగా చేయబడిన వారిని గూర్చి దేవదూతలు ఏవిధంగా సంతోషించగలరు? ఈనాటి సువార్త కూడికల్లోని గణాంకములు పూర్తిగా మోసపూరితమైనవి.

ప్రభువైన యేసు పాపములను క్షమించి, రోగములను స్వస్థపరచుననే విషయాన్ని ప్రకటించుటలో, సూచనలు మరియు అద్భుతములు తోడైననూ, ఆ సువార్త పరిచర్య ద్వారా ఎంతమంది శిష్యులుగా చేయబడి క్రీస్తు సంఘములోనికి కట్టబడితిరి అన్న ప్రశ్న ఇంకా మిగిలిపోతుంది.

మన ప్రభువు యొక్క అపొస్తలులు ఈ విధమైన సువార్త పరిచర్యను చేయలేదు. మార్పు చెందిన వారిని స్థానిక సంఘములలో నుంచి వారిని శిష్యులుగా చేసి, వారు ఆత్మీయముగా బలపడులాగున చేశారు.

ఎఫెసీ 4:11లో వ్రాయబడిన అయిదు పరిచర్యలు (అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు బోధకులు). వాటి ప్రాధాన్యత క్రమమును 1కొరిందీ¸ 12:28లో పొందు పరచబడియున్నది. దేవుడు సంఘములో మొదట అపొస్తలులు, రెండవవారు ప్రవక్తలు, మూడవ వారు బోధకులు, తరువాత స్వస్థపరచు వరములు (సువార్తికులను సూచించును, ఎందుకనగా క్రొత్త నిబంధన కాలమందు సువార్తికులందరికి స్వస్థపరచు వరము ఉండినది కావున) మరియు ప్రభుత్వములు చేయువారిగాను (ఎవరైతే నావను నడుపుదురో అట్టివారిని, అంటే కాపరులు, పాదిరులు) నియమించెనని మనకు చెప్పబడినది.

దేవుని దృష్టిలో అపొస్తలుల పరిచర్య ప్రవక్తల మరియు బోధకుల పరిచర్యలు క్రీస్తు సంఘమును కట్టుటకు సువార్తికుని పరిచర్య కన్నా ప్రాముఖ్యమైనవని ఇందునుబట్టి అర్థమవుతుంది. సువార్తికుడు ఎప్పుడైతే అపొస్తలుల, ప్రవక్తల మరియు బోధకుల పరిచర్యలను లోబడినట్టి స్థానమును ఎంచుకుంటాడో అప్పుడే తాను తన పరిచర్యలో తగిన స్థానములో నుండగలుగుతాడు. అప్పుడే తన పరిచర్య క్రీస్తు సంఘమును కట్టుటకు సహాయపడుతుంది. ఇచ్చటే నేటి 20వ శతాబ్దపు సువార్త సేవ దేవుని వాక్యము నుండి వేరైపోతుంది.

శిష్యులుగా చేయుట

శిష్యులకు అప్పగింపబడిన గొప్ప కార్యము యొక్క రెండవ భాగపు వెలుగులో చూచినట్లైతేనే, సువార్త పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశమును సంపూర్తిగా అర్థం చేసుకోగలము. అది ప్రపంచములోని ప్రతి దేశమునుండి శిష్యులను చేయుట (మత్తయి 28:19). ఈ విధంగా మార్పు చెందని జనాంగమునుద్దేశించినట్టి దేవుని ప్రణాళిక సంపూర్తి కాబడుతుంది.

మార్పు చెందిన వ్యక్తి శిష్యుడుగా తయారుకావలెను. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మారుమనస్సు పొందినట్టు పిలువబడే వ్యక్తి నిజంగా మార్పు పొందిన వ్యక్తిగా ఉండుటలేదు ఎందుకంటే చాలా వరకు తాను సరైన రీతిలో మారుమనస్సు పొందుటలేదు. సువార్త కూడికల్లో మారుమనస్సు లేక సరిచేసుకొనుటను గూర్చిన ప్రస్తావన లేకుండా యేసును నమ్మమని మాత్రమే అతడికి చెప్పియుండవచ్చు. అలాగున మార్పు చెందిన వారు యేసు వద్దకు ఆశీర్వాదము పొందుటకు, స్వస్థపరచబడుటకు వచ్చుదురు కాని వారి పాపములనుండి విడుదల పొందుటకు మాత్రం కాదు. ఈ రోజుల్లో మార్పు చెందుతున్న అనేకమంది, గణాంకముల మీద ఆశతో సహనము కోల్పోయిన మంత్ర సానుల (సువార్తికుల)చే శిశువులు జన్మించుటకు సిద్ధపడక మునుపే బయటకు లాగబడిన పరిపక్వత చెందని శిశువులను పోలియుంటున్నారు. సాధారణంగా ఈ పరిపక్వత చెందని శిశువులు త్వరగా చనిపోతుంటారు లేక జీవితాంతము సమస్యలతో, వారి కాపరులకు (పాస్టరులకు) లేక్కలేనన్ని సమస్యలు కలిగిస్తూ జీవిస్తుంటారు. అలాంటి వారిని తిరిగి వెనుకకు జారిపోయిన వారుగా పిలువలేము ఎందుకంటే వారు ఎన్నడూ మొదట ఆత్మీయ అభివృద్ధి జరుగలేదు!! పరలోకమందున్న దేవదూతలు, పాపులు మారుమనస్సు పొందుటను బట్టి సంతోషించెదరే గాని, పాపులు మారుమనస్సు పొందకుండా విశ్వసించుట వలన మాత్రము కాదు (లూకా 15:7,10).

జక్కయ్య తాను గతంలో చేసిన తప్పుడు లావాదేవీలను దిద్దుబాటు చేస్తానని ప్రమాణము చేసిన తరువాత మాత్రమే, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చియున్నదని యేసు చెప్పెను కాని అంతకు ముందు మాత్రం కాదు (లూకా 19:9). దురదృష్టవశాత్తు, ఈనాటి సువార్తకులు దిద్దుబాటు(సరిచేసుకొనుట) గూర్చి అసలు ప్రస్తావించకనే 'రక్షణ వచ్చియున్నది' అని ప్రకటిస్తున్నారు!

ఒకవేళ ఎక్కడైతే నిజమైన పశ్చాత్తాపముండి, ఒక మనిషి మార్పు నమ్మదగినదిగా ఉంటుందో, అతడు దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చుటకు, శిష్యరికపు జీవితంలోనికి ఇంకా నడిపింపబడాలి. శిష్యరికపు జీవితములోనికి నడిపించని సువార్తపరిచర్య అసంపూర్తిగా మిగిలిన పనే.

సాధారణముగా సువార్తికుడు తన స్వంత రాజ్య వ్యాప్తి గూర్చిన ప్రాకులాట మూలముగా మార్పునొందిన వారిని శిష్యులుగా నడిపించేవారితో కలిసి పనిచేయడు. ''తీర్పు తీర్చకుడి'' అని చెప్పబడినది గనుక మనము అటువంటి సువార్తికులను తీర్పు తీర్చనవసరములేదు. కాని చివరిదినాన, వారిచే మార్పు చెందబడిన వారు శిష్యులగుటకు వారే అడ్డుగా ఉండినందుకు ప్రభువుకు తప్పక జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

మార్కు 16:16లో యేసు విశదీకరించిన విధంగా మరియు పేతురు పెంతెకొస్తు దినాన ప్రకటించిన విధంగా (అపొ.కా. 2:38) ప్రజలను మారుమనస్సు మరియు విశ్వాసములోనికి నడిపించే మొదటి మెట్టుతో బాటు, నీటి బాప్తిస్మము అనే ప్రక్రియ జరగనివ్వాలి. నీటి బాప్తిస్మము యొక్క అవసరతను మత్తయి 28:19 కూడా చెప్తుంది. కాబట్టి మారుమనస్సు పొందిన ప్రతి వారికి ఇది రెండవ మెట్టు అని అర్దమవుతుంది.

ఆ పిమ్మట, తాను తన దైనందిక జీవితములో యేసు శిష్యుడుగా నడవాలి.

శిష్యత్వము యొక్క షరతులు

శిష్యత్వమునకు అవసరమైన షరతులను లూకా 14:25-35 లో తేటతెల్లముగా ఇవ్వబడియున్నది.

ఒక మనిషి గోపురము కట్టుటకు పునాది వేసి, నిర్మాణమునకయ్యే ఖర్చులను వెచ్చించలేక దానిని పూర్తి చేయలేని పరిస్థితి గూర్చి (28-30 వచనములు) యేసు అక్కడ చెప్పెను. అది శిష్యుడుగా ఉండాలంటే కొంత ఖర్చు అవుతుందని ఋజువు చేస్తుంది. నిర్మాణపు పని ప్రారంభమునకు మునుపే మొదట కూర్చొని ఆ ఖర్చును లెక్కచూచుకొనుమని యేసు చెప్పెను.

శిష్యత్వమునకు వెచ్చించాల్సిన ఖర్చును గూర్చి అర్థం చేసుకొనటానికి మన పాపములు క్షమింపబడిన తరువాత ఎన్నో ఏళ్ళవరకు వేచియుండరాదని దేవుడు కోరుచున్నాడు. ప్రజలు యేసు యొద్దకు వచ్చిన వెనువెంటనే శిష్యత్వమునకు వెచ్చించాల్సిన ఖర్చు గూర్చి ఆయన వారికి చెప్పెను. ఒక విశ్వాసి శిష్యుడుగా ఉండుటకు ఇష్టపడకపోతే తాను రుచిని కోల్పోయిన ఉప్పు వలె దేవునికి పనికిరాని వాడవుతాడని కూడా చెప్పెను (లూకా 14:35).

మార్పు చెందిన వ్యక్తి శిష్యుడుగా కావాలంటే దేవుని వెంబడించటానికి అవాంతరమయ్యే బంధుప్రీతిలాంటి వాటిని మొదటగా త్యజించుకోవాలి (లూకా 14:26). రెండవదిగా, తన్ను తాను ఉపేక్షించుకుంటూ స్వజీవాన్ని (స్వచిత్తాన్ని) ప్రతి రోజూ మరణానికి గురిచేయాలి (లూకా 14:27). మూడవదిగా, సిరి సంపదల యెడల గల ప్రేమను తాను వదులుకోవాలి (లూకా 14:33). ఎవడైనా శిష్యుడు కాదలుచుకుంటే ఈ మూడు అర్హతలు తప్పనిసరిగా కలిగియుండాలి.

మనకు మన బంధువుల యెడల గల సహజసిద్ధమైన, అసాధారణమైన ప్రేమను తెగతెంపులు చేసుకొనుట శిష్యత్వమునకు కావలసిన మొట్టమొదటి షరతు.

యేసు ''ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని బార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు'' అని చెప్పెను (లూకా 14:26).

అవి కరిÄనమైన మాటలు. ద్వేషించుట అనగా అర్థమేమిటి? ద్వేషించుట చంపుటతో సమానము (1యోహాను 3:15). బంధువుల యెడల మనకు ఉండే సహజమైన ప్రేమను మరణమునకు గురిచేయమని ఇక్కడ మనకు చెప్పబడినది.

అంటే మనము వారిని ప్రేమించకూడదనా? కాదు. ఖచ్చితంగా అలాగున కాదు. ఎప్పుడైతే మనము వారిపై మానవాపేక్షను వదులుకుంటామో, అప్పుడు దేవుడు దాని స్థానంలో దైవిక ప్రేమను ఉంచును. అప్పుడు మన బంధువుల పట్ల మన ప్రేమ మలినము లేనిదిగా ఉంటుంది అంటే మన అపేక్షలతో ఎల్లప్పుడు బంధువులు కాక దేవుడు మొదటగా ఉంటాడు.

అనేకమంది వారి తండ్రి, తల్లి లేక భార్య మొదలగు వారిని అభ్యంతరపెట్టాల్సి వస్తుందేమో అని భయపడి దేవునికి లోబడరు. మన జీవితంలో ప్రభువు ప్రథమ స్థానమును కోరుచున్నాడు. ప్రథమ స్థానమివ్వలేక పోతే మనము ఆయన శిష్యులుగా ఉండలేము. యేసు ప్రభువు మన జీవితాల్లో సర్వానికి ప్రభువుగా ఉండాలి లేదా ఆయన మన జీవితములో ప్రభువు కానేకాదు.

ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు మాదిరినే చూడండి. విధవరాలయిన తన తల్లిని ప్రేమించినప్పటికీ, చిన్న చిన్న విషయాలలో సైతము తన తండ్రి యొక్క సంపూర్ణ చిత్తాన్నుండి దూరం చేయగలిగే తన తల్లి ప్రభావమును ఒప్పుకొనలేదు. కానాను వివాహ సందర్భముగా తన తల్లి చెప్పిన మాటలకనుగుణంగా నడవకుండుట దీనికి ఉదాహరణగా చూడవచ్చు (యోహాను 2:4).

మన సహోదరులను ఎలా ద్వేషించాలో కూడా యేసు నేర్పెను. సిలువకు వెళ్ళకుండా ఆయనను పేతురు నివారించినందుకు ఆయన ఏ మనిషితో ఎప్పుడూ మాట్లాడనటువంటి, పదునైన మాటలతో గద్దించెను. ''అయితే ఆయన పేతురు వైపు తిరిగి - సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను'' (మత్తయి 16:23). పేతురు మానవ సంబంధమైన అమిత ప్రేమతో ఆ సలహాను ఇచ్చాడు. కాని తాను ఇచ్చిన సలహా తండ్రి చిత్తానికి విరుద్ధమైనందు వల్ల యేసు పేతురును గద్దించెను.

యేసు తన అపేక్షలలో తండ్రికి మిక్కిలి ప్రాధాన్యతనిచ్చారు. తన యెడల కూడా మనకు అదే వైఖరి కలిగియుండాలని ఆశిస్తున్నాడు. పునరుత్థానము తరువాత, సంఘములో తనను కాపరిగా చేయకమునుపు ప్రభువు పేతురును, ఈ లోకములోనున్న ఏ ఇతర వాటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగెను (యోహాను 21:15-17). తన సంఘములో ఎవరైతే ప్రభువును మిక్కిలిగా ప్రేమిస్తారో, అట్టివారికే బాధ్యతలు ఇవ్వబడతాయి.

ఎఫెసు సంఘనాయకుడు ప్రభువుపై తనకు మొదట ఉండిన ప్రేమను పోగొట్టుకున్నందువల్ల తాను తిరస్కరింప బడునంతటి అపాయములో ఉండినాడు (ప్రకటన 2:1-5).

కీర్తనాకారుడు అన్నట్లు, ''ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కరలేదు'' అని మనము అనగలిగితే శిష్యత్వమునకు కావాల్సిన మొదటి షరతును నిజముగా సంపూర్తిచేసిన వారమవుదుము (కీర్త 73:25).

మానవాపేక్షలతో సమ్మిళితమై ఉండే ఉద్రేకము, మనసును మైమరపించే భక్తిని చూపే కదిలింపచేసే పాటలలో నున్న ప్రేమను యేసు క్రీస్తు మననుండి అడుగుట లేదు.అది ఏ మాత్రము కాదు. మనము ఆయనను ప్రేమించినట్లైతే, మనము ఆయనకు లోబడుదుము (యోహాను 14:21).

శిష్యత్వమునకు కావాల్సిన రెండవ నియమము మన స్వజీవమును ద్వేషించుట. ''ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు'' (లూకా 14:26).

ఎవడైనను తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనట్లైతే, అతడు నా శిష్యుడు కానేరడు అని ఆయన ఇంకా విడమరచి చెప్పెను (లూకా 14:27). యేసు బోధలలో అతి తక్కువగా అర్థంచేసుకొన్న వాటిలో ఇదొకటి.

ఒక శిష్యుడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజూ తన సిలువ నెత్తుకొనవలెనని యేసుచెప్పెను (లూకా 9:23). బైబిలు చదువుకొనుట, ప్రార్థన చేయుట కన్నా ప్రతి రోజు మనలను మనము ఉపేక్షించుకుంటూ మన సిలువనెత్తుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. మనలను మనము త్యజించుకొనుట అనగా ఆదాము నుండి సంతరించుకున్న మన స్వజీవమును ద్వేషించుటయే. అట్టి జీవితమును మనము వధించక మునుపు మొదట ద్వేషించాలి.

మన స్వజీవము క్రీస్తు జీవమునకు ముఖ్యవిరోధి. దీన్నే బైబిలు 'శరీరము' అని పిలుస్తుంది. 'శరీరమున' నిరంతరము స్వలాభాపేక్ష, గౌరవింపబడుట, మన స్వంత ఇష్టము, మన స్వంత దారి మొదలైన స్వంత చిత్తాన్ని నెరవేర్చుటకు శోధించే మనలోని దురాశలకు నిలయము.

మనము నిజాయితీ పరులమైతే మన యొక్క మంచి పనులు సైతము మన దురాశల నుండి వెలువడే దురుద్దేశములతో చెడిపోతుంటాయని ఒప్పుకొనక తప్పదు. ఇలాంటి 'శరీరమును' ద్వేషించనట్లైతే మనము ప్రభువును వెంబడించలేము.

ఇందుకే యేసు ప్రభువు మన ప్రాణమును ద్వేషించుట (పోగొట్టుకొనుట) గూర్చి చాలాసార్లు చెప్పెను. ఈ మాటలు సువార్తలందు ఏడుసార్లు మళ్ళీ చెప్పబడియుంది (మత్తయి 10:39, 16:25; మార్కు 8:35; లూకా 9:24, 14:26; 17:33 యోహాను 12:25). ఇవి సువార్తలయందు పలుసార్లు గుర్తు చేయబడిన మన ప్రభువు మాటలు అయినప్పటికీ ఇవి అతి తక్కువగా అర్థము చేసుకొన్న అతి తక్కువగా బోధింపబడుతున్న మాటలు!

మన స్వజీవమును ద్వేషించుట అంటే మన స్వంత హక్కులను, ఆధిక్యతలను వదులుకొనుట, మన స్వంత గౌరవము కొఱకు ప్రాకులాడకుండుట, మన స్వంత ఇష్టాలను, ఆశలను వదులుకోవడం మరియు మన స్వంత దారినే వెళ్ళుట మానుకోవడం లాంటివి. ఈ మార్గములో వెళ్లుటకు ఇష్టపడితేనే యేసుకు శిష్యులు కాగలం.

శిష్యత్వమునకు కావలసిన మూడవ నియమము మనకు కలిగియున్నదంతయు వదులుకొనుట.

''మీలో ఎవరైనను, మీకు కలిగియున్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు'' అని యేసు చెప్పెను (లూకా 14:33).

మనకు ఉన్నదంతయు అనగా మనము స్వంతముగా కలిగియున్నవన్నింటిని విడిచిపెట్టడమంటే, అవి మన స్వంతమని ఎన్నడును అనుకొనకపోవడం.

దీని గూర్చిన ఉదాహరణను మనము అబ్రాహాము జీవితమందు చూడగలము. ఇస్సాకు తన స్వంత కుమారుడు, తన ఆస్తి. ఒకరోజు దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని తనను అడిగాడు. అప్పుడు అబ్రాహాము ఇస్సాకును బలిపీఠముపై పరుండబెట్టి వధించుటకు సిద్ధపడెను. కాని దేవుడు అడ్డుపడి, అబ్రాహాము లోబడుటకు ఇష్టపడెనని నిరూపించుకొన్నందున, బలి అవసరము లేదని చెప్పెను, (ఆదికాండము11:22). అటు తరువాత అబ్రాహాము ఇంటిలో ఇస్సాకు ఉండినప్పటికినీ, అతడు ఎన్నటికీ తన స్వంతము కాదని అబ్రాహాము గ్రహించెను ఎందుకనగా ఇస్సాకు ఇప్పుడు దేవునికి సంబంధించినవాడు.

మనము మనకు కలిగియున్నదంతయు వదులుకొనుట అంటే ఇదే. మనకు కలిగియున్నవన్నింటిని బలిపీఠముపై ఉంచి దేవునికి సమర్పించుకోవాలి.

సమర్పించిన వాటిలో కొన్నింటిని వాడుకొనుటకు దేవుడు మనకు అనుమతి ఇవ్వవచ్చును. కానీ ఎన్నడూ అవి మన స్వంతమైనవని అనుకోకూడదు. మనము మన స్వంత గృహమునందు నివసించుచున్నప్పటికినీ, అది అద్దె లేకుండా ఉండుటకు అనుమతింపపడిన దేవుని గృహమన్న భావన కలిగియుండాలి! ఇది నిజమైన శిష్యత్వము.

మన ఆస్తులన్నిటిని ఆవిధముగా చేసియున్నామా? మన బ్యాంకు నిల్వ, ఆస్తి, ఉద్యోగము, అర్హతలు, వరములు మరియు తలాంతులు భార్య పిల్లలు మరి ఈలోకంలో మనము విలువిచ్చే అన్నియు మన ఆస్తులవుతాయి. మనము నిజమైన శిష్యులమవ్వాలంటే వాటన్నింటిని బలిపీఠముపై అర్పించాలి.

అప్పుడే దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించగలము. మత్తయి 5:8లో యేసు చెప్పిన పరిశుద్ధ హృదయము ఇదే. నిర్మలమైన మనస్సాక్షి ఉంటే సరిపోదు. నిర్మలమైన మనస్సాక్షి అంటే మనకు తెలిసిన ప్రతి పాపమును విడిచి పెట్టుట మాత్రమే. పరిశుద్ధ హృదయమంటే ప్రతి దానిని విడిచిపెట్టుట!

కాబట్టి నిజమైన శిష్యత్వములో

  1. మన బంధువులు మరియు మనము ప్రేమించు వారు
  2. మన స్వజీవమును
  3. మన సంపదల

విషయంలో సమూలముగా మారినట్టి తీవ్రమైన స్వభావము కలిగియుండుటైయున్నది.

ఇట్టి పరిస్థితులను నిజాయితీతో ధైర్యంగా ఎదుర్కొనకపోతే, మన జీవితాల్లో దేవుని పూర్ణ ఉద్దేశ్యమును నెరవేర్చలేము.

బోధకులు ఈ శిష్యత్వపు సందేశాన్ని నీరు గార్చకుండా ప్రకటించితేనే తప్ప, క్రీస్తు శరీరమును కట్టుట వారికి సాధ్యము కాదు.

శిష్యత్వపు మార్గము

మన ప్రభువిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞకు తప్పక లోబడుటకు, అభ్యాసము చేయుటకు శిష్యులకు బోధించవలెనని మత్తయి 28:20 చెప్తుంది. ఇదే శిష్యత్వపు మార్గము. అనేకమంది విశ్వాసులు లోబడుటకు పట్టించుకోని యేసు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలను మత్తయి 5,6 మరియు 7వ అధ్యాయములను చదివినంత మాత్రమున చూడవచ్చును.

శిష్యుడనగా నేర్చుకొనువాడు మరియు వెంబడించువాడు.

ఈనాడు మనదేశమునకు, ఎవరైతే యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి వారికి వారుగా విధేయత చూపుదురో ఎవరైతే యేసు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపునట్లు ఇతరులకు బోధించు కోర్కె కలిగియుండి ఆ విధముగా క్రీస్తు శరీరమును కట్టుదురో, ఎవరైతే దేవుని సంపూర్ణ సంకల్పమును ప్రకటించాలనే పిలుపుతో పట్టబడుదురో అటువంటి వారి అవసరమున్నది. యేసు ప్రభువు ఆజ్ఞాపించినవన్నింటికీ మొదట లోబడుతూ, లోబడాలని ఇతరులకు కూడా బోధించాలన్న ఆశ కలిగి, దేవుని సంపూర్ణ సంకల్పాన్ని ప్రకటించాలన్న పిలుపుతో పట్టబడిన వారి అవసరత మన దేశమునకెంతైనా ఉంది.

ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగియుండుటను బట్టి తన శిష్యులందరు గుర్తింపబడెదరని యేసు చెప్పెను (యోహాను 13:35).

అది గమనించండి! యేసు క్రీస్తు శిష్యులు వారి బోధలలో నుండిన నాణ్యత లేక వారి సంగీతము, ఇంకా వారు భాషలలో మాట్లాడుట లేక కూటములకు బైబిలు పట్టుకొని వెళ్ళుట, కూటములలో వారు చేయు శబ్దమును బట్టి గుర్తింపబడరు. వారు ఒకరిపైనొకరికుండిన తీవ్రమైన ప్రేమను బట్టి గుర్తింపబడెదరు.

క్రీస్తు యొద్దకు జనులను తీసుకువచ్చే సువార్త కూటము, ఒకరి నొకరు ప్రేమించుకొనే శిష్యులుగల సంఘము స్థాపింపబడునట్లు వారిని నడిపించవలెను.

అయినప్పటికిని విచారించాల్సిన విషయమేమిటంటే, సంవత్సరము తరువాత సంవత్సరము సువార్త కూటములుజరిగే అనేక స్థలములలో, ఒకరితో ఒకరు పోట్లాడుకొనుట లేక ఒకరి గూర్చి ఒకరు వెనుక మాట్లాడుకొనుట మొదలైనవి లేకుండా ఒకరి నొకరు ప్రేమించుకొనే సభ్యులు గల సంఘమని చెప్పబడే సంఘముండుటను చూచుట బహు కష్టము.

క్రొత్తగా మార్పు చెందిన వారు అటువంటి జయ జీవితమును జీవించ లేకపోవుటను అర్థము చేసుకొనవచ్చును. కాని మన దేశ సంఘములలో చివరకు పెద్దలు మరియు క్రైస్తవ నాయకులలో తగువులు, అపరిపక్వత ముఖ్య లక్షణముగా ఉంటే దానికి ఏమనాలి?

ఇది 'అప్పగింపబడిన గొప్ప పనిలో రెండవది మరియు ముఖ్య భాగము' (మత్తయి 28:19,20లో చెప్పబడినది), అది శిష్యత్వము మరియు యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి లోబడుట అను దానిని పూర్తిగా పట్టించు కొనలేదను దానికి తేటయైన ఋజువుగా నున్నది.

సాధారణముగా మనకు అప్పగింపబడిన గొప్ప పనిలో (మార్కు 16:15) మొదటి భాగము మాత్రమే ప్రతి చోట వక్కాణించి చెప్పబడుతుంది. అందులో ప్రాముఖ్యమైనది సువార్తీకరణ, వర్తమానము దేవుని చేత సూచక క్రియలు అద్భుతములతో స్థిరపరచబడుటై యున్నది.

అదలా ఉండగా మత్తయి 28:19,20లో శిష్యత్వము గూర్చిన ప్రాధాన్యత, అది యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికి పూర్తిగా విధేయత చూపు శిష్యుని యొక్క జీవితములో కనబడుతుంది. అనేక మంది క్రైస్తవులు మొదటి దానినే ముఖ్యముగా ఎంచుకొందురు, కాని చాలా కొద్ది మంది మాత్రమే తరువాత దానిని ఎంచుకొందురు. కాని ఇది లేకుండా మొదటిది కలిగియుండుట మానవ శరీరములో సగభాగము ఉన్నట్లుగానే ఏవిలువా లేనిదిగా నుండును. కాని ఎంత మంది దీనిని చూస్తున్నారు?

యేసుప్రభువు యొక్క పరిచర్యలో ఆయన యొక్క సువార్త సేవను బట్టి, స్వస్థత పరిచర్యను బట్టి జన సమూహములు ఆయనను వెంబడించినట్లు చదువుదుము. అయితే ఆయన ఎప్పుడూ వారివైపు తిరిగి శిష్యత్వము గూర్చి చెప్తూ ఉండేవారు (లూకా 14:25,26). ఈనాటి సువార్తికులు అలా చేయగలుగుచున్నారా? అది వారికి వారు కాని, లేక సువార్తికులు మొదలు పెట్టిన పనిని, అపొస్తలులు, ప్రవక్తలు, బోధకుల మరియు కాపరుల సహకారముతో పూర్తి చేయగలుగుచుంటిరా?

శిష్యత్వము గూర్చిన సందేశమును బోధించుటకు బోధకులు ఎందుకు వెనుకాడుదురు? అది వారి సంఘములో సంఖ్యను తగ్గించును కాబట్టి దానిని బోధించరు. కాని వారు అర్థము చేసికొనని దేమంటే అది వారి సంఘము యొక్క నాణ్యతను ఎంతగానో పెంచుతుందనేది!!

యేసు ప్రభువు శిష్యత్వము గూర్చి జన సమూహములకు బోధించినప్పుడు, వెంటనే సంఖ్య పదకొండు శిష్యులకు తరిగిపోయినది (యోహాను 6:2ను 6:70 తో పోల్చి చూడండి). ఇతరులు ఆయన బోధ బహు కష్టమైనదని చెప్పి ఆయనను విడిచి వెళ్లిపోయిరి (యోహాను 6:60,66). అయితే ఆయనతో పాటుగా ఉండిన ఆ పదకొండు మంది శిష్యులతోనే చివరకు దేవుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాడు.

మొదటి శతాబ్దములో ఆ పదకొండు మంది శిష్యులు మొదలు పెట్టిన ఆ పరిచర్యను, ఈనాడు క్రీస్తు శరీరమైయున్న మనము కొనసాగించవలసియున్నది. జనులు క్రీస్తు యొద్దకు తీసుకురాబడిన తరువాత వారు శిష్యుత్వములోనికిని మరియు విధేయత లోనికి నడిపింపబడాల్సియున్నది. ఆ విధముగా మాత్రమే క్రీస్తు శరీరము కట్టబడుతుంది.

జీవమునకు వెళ్ళు మార్గము ఇరుకైనది, కొద్ది మంది మాత్రమే దానిని కనుగొందుము.

వినుటకు చెవి గలవాడు వినును గాక.

అధ్యాయము 2
శిష్యత్వము మరియు గృహము

శిష్యుడనగా ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ నేర్చుకొనువాడు. అతడు అన్ని విషయములలో యేసుప్రభువును తనకు మాదిరిగా చేసికొని తనకు సాధ్యమైన ప్రతి విషయములో తన యజమానుని జీవితము వలె తన జీవితము నుండునట్లు చూచుకొనును.

ప్రేమవలెనే, శిష్యత్వము కూడా ఇంటిలోనే మొదటగా ప్రారంభమగును.

శిష్యత్వము మరియు తల్లి దండ్రులు

మన జీవితములలో ప్రతి విషయములో యేసుక్రీస్తును ప్రభువుగా చేసికొని మనకు మనమును మరియు మనకుండిన ప్రతిదానిని ఆయనకు ఇచ్చుకొనుటలో శిష్యత్వము యొక్క నిజమైన పునాది యున్నది.

మొదటిగా ప్రభువు మనకు ఆజ్ఞాపించిన, మన తల్లిదండ్రులను ద్వేషించుట అను విషయమును ఆలోచించుదము (లూకా 14:26).

దీనికి మొదటి మెట్టు వారిని గౌరవించుటైయున్నది. ఇది ఒక వాగ్దానముతో కూడియుండిన మొట్టమొదటి ఆజ్ఞ (ఎపెసీ 6:2). మొదటిగా మన తల్లిదండ్రులను మనము గౌరవించుట నేర్చుకొననట్లయితే, ప్రభువు కోరిన విధముగా మనము వారిని ద్వేషించలేము. ఈనాడు అనేకులైన దేవునినెరుగని పిల్లలు వారి తల్లిదండ్రులను ద్వేషించమంటే ఎంతో సంతోషించుదురు! మతమౌఢ్యపువాదులు కూడా ఈ వచనాన్ని తప్పుగా వాడుకొని, తల్లిదండ్రులను గౌరవించడమంటే ఏమిటో తెలియని వారిని వారి చుట్టూ కూర్చుకొంటున్నారు.

యేసు యొక్క ప్రతి శిష్యుడును ఆయన యొక్క మాదిరినే అనుసరింపవలెను. మనము అట్లు చేసినట్లయితే మనము ఎప్పుడును త్రోవతప్పిపోము. అయితే ఆయన యొక్క మాదిరిని చూడకుండా, ఆయన మాటల భావాన్ని చెప్పుకొన్నట్లయితే, చాలా మంది క్రైస్తవుల వలె మనము కూడా తప్పుదారిని పోవుదుము. ఆయన యొద్ద నేర్చుకొనమని (మత్తయి 11:29) మన ప్రభువు చెప్పెను.

యేసు ఏ విధముగా ఆయన యొక్క ఇహలోక తల్లిని ద్వేషించెను? మొదటగా ఆయన నజరేతులో యోసేపు, మరియల ఇంటిలో నున్నప్పుడు, వారి అధికారమునకు లోబడుట ద్వారా వారిని గౌరవించెను (లూకా 2:51).

యేసు ప్రభువు నజరేతులో గడిపిన 30 సంవత్సరములను గూర్చి బైబిలులో కేవలము రెండు విషయములు చెప్పబడినవి. మొట్టమొదట, హెబ్రీ 4:15లో, ఆయన అన్ని విషయములలో మనవలె శోధింపబడెను కాని ఎప్పుడు పాపము చేయలేదని చెప్పబడెను. దానిని బట్టి ఎవ్వరైనా తన చిన్నతనము నుండి యౌవనము వరకు ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నారో అటువంటి శోధనలను యేసు నజరేతులో నుండిన 30 సంవత్సరముల కాలములో ఎదుర్కొన్నారని మనము నేర్చుకొనవచ్చును.

మార్కు 6:3ను బట్టి యేసునకు కనీసము నలుగురు సోదరులు ఇద్దరు సోదరిలు ఉన్నట్లు గ్రహించగలము. కనుక కనీసము ఇంటిలో తొమ్మండుగురు కలసి జీవించేవారు, మరియు అది ఒక పేద గృహము. (లూకా 2:24ను లేవీ 12:8 తో పోల్చి చూచినట్లయితే మరియు ఒక గొఱ్ఱెపిల్లను కూడా అర్పణకు ఇచ్చుకోలేనంత బీదరాలుగా మనము గ్రహించవచ్చును). కనుక యేసునకు ఇంటిలో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వెళ్ళి ఒంటరిగా ఉండటానికి ఒక స్వంత పడక గది కూడా లేదని స్పష్టమవుతున్నది. ఆయన సహోదరులు ఆయనయందు నమ్మిక యుంచలేదని యోహాను 7:5 చెప్తుంది. వారు ఎప్పుడూ కోపము తెచ్చుకొనని మరియు స్వార్థపూరితముగా ప్రవర్తింపని ఈయనపై తప్పనిసరిగా అసూయ పడియుండెడి వారు. వారందరూ ఆయనకు వ్యతిరేకముగా గుమికూడి ఆయనను చికాకుపరచి అనేక మార్లు ఏడిపిస్తూ ఉండి యుండవచ్చును. ఎవరైనా ఒక చిన్నయింటిలో, పెద్ద కుటుంబముతో క్రైస్తవులుకాని కుటుంబ సభ్యులతో కలసి జీవించిన వారికి యేసుక్రీస్తు నజరేతులో ఎదుర్కొనిన సమస్యలు అర్థమగును. అయినప్పటికిని ఆయన పాపము చేయలేదు. వీటన్నింటితో కలిపి, బహుశా యేసు 13-30 సంవత్సరాల యౌవనప్రాయంలో ఎప్పుడో ఆయన తండ్రి యోసేపు చనిపోయి యుండవచ్చును (ఎందుకనగా యేసు యొక్క పరిచర్య కాలములో యోసేపు గూర్చి ఎక్కడా మనము చదవము). అటువంటప్పుడు 8 మంది కుటుంబ సభ్యులను పోషించే భారము పెద్ద కొడుకుగా యేసుపై పడును. తన కుటుంబమును పోషించుకొనుటకు ఆయన కష్టపడి పని చేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితులలో యేసు అనేక శోధనలను ఎదుర్కొనవలసి వచ్చియుండును. అయినప్పటికిని ఆయన పాపము చేయలేదు.

రెండవదిగా యేసు, యోసేపు మరియు మరియల ఇంటిలో నివసించిన 30 సంవత్సరములు వారికి లోబడి యుండెను (లూకా 2:51). అది అంత సులువైన విషయంకాదు అనునది మన చిన్ననాటి రోజులు నుండి మనందరకు తెలియును.

మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మన తల్లిదండ్రులు వేరేది చేయమన్నప్పుడు స్వాభావికముగా మనము దానిని ఇష్టపడక పోవుటను మన చిన్నతనములో ఎంతో తరచుగా చూస్తుంటాము.

అందుచేత యేసు యొక్క మాదిరిని మన పిల్లలందరకు చూపుదము. పిల్లలను ప్రభువు యొక్క భయములో మరియు శిక్షణలో పెంచవలెనని తండ్రులు ఆజ్ఞాపింప బడినారు (ఎఫెసీ 6:4). దేవుని భయము అనగా ఏమిటి? అది మన ప్రభువు పిల్లలకు మాదిరిగా నజరేతులో గడిపిన కాలము.

ఏ పిల్లలేతై పైన మనముచూచిన రెండు విషయములలో ప్రభువు యొక్క మాదిరిని అనుసరించినట్లయితే యేసును గూర్చి వ్రాయబడినట్లే వారుకూడా జ్ఞానమందును, దేవుని దయ యందును ఎదుగుదురు (లూకా 2:52).

మనము పెద్దవారమై వివాహము చేసుకొనిననూ, మనమింకను మన తల్లిదండ్రులను గౌరవించవలెను. నోవహు యొక్క కుమారుడు హాము తన తండ్రి మత్తుడై దిగంబరిగా గుడారములో నుండుట చూచిన విషయం ఆది. 9:21-27లో మనము చదువుతాము. హాము పెద్దవాడు మరియు జలప్రవాహమునకు ముందే అతడికి పెండ్లి అయినది. అతడు వెళ్లి ఈ విషయమును తన సోదరులకు తెలుపుట ద్వారా అతడు తన తండ్రిని అగౌరవపర్చెను. దానికి ఫలితముగా హామును, అతడి కుటుంబమును శపింపబడిరి. నిజము చెప్పినా మనిషి వెనుక మాట్లాడుకొనువారు దేవుని చేత శపింప బడుదురు. నీ వెనుక మాట్లాడు కొనువారెవ్వరును యేసు క్రీస్తు శిష్యులు కాదు.

నోవహు ఇద్దరు కుమారులు షేము, యాఫెతు, వెనుకకు నడచి అతడి దిగంబరత్వమును కప్పుట ద్వారా వారి తండ్రిని గౌరవించిరి (ఆ విధముగా వారు వారి తండ్రి యొక్క దిగంబరత్వమును చూడకుండిరి). మరియు వారును వారి కుటుంబములును దీవింపబడెను.

ఈ ఉదాహరణ ద్వారా మనము నేర్చుకొనునదేమనగా, ఎవరైతే వారి తల్లిదండ్రలను గౌరవించెదరో వారిని దేవుడు దీవించుననియు, ఎవరైతే వారిని తృణీకారముగా చూచెదరో వారిని దేవుడు శపించునని నేర్చుకొంటిమి. ఆ ఉదాహరణ మనకందరకు చిన్నవారమైనా పెద్దవారమైనా, హెచ్చరిక కలుగునట్లు బైబిలులో ప్రారంభములోనే చెప్పబడినది.

యోసేపు మరియలు దేవుని భయము కలిగి యున్నవారైనా (పాత నిబంధన ప్రమాణాల ప్రకారము), వారికి పాపముపై విజయము లేదని మనము గ్రహించవలెను (అది ప్రత్యేకముగా క్రొత్త నిబంధన వాగ్దానము - రోమా 6:14). వారికి పరిశుద్ధాత్మ లేడు మరియు ఈనాడు మనమున్నట్టుగా వారు కృప క్రిందలేరు. కనుక వారికి ఇంటిలో వాదనలు, ఒకరిపై ఒకరు కోపపడుట మరియు అనేక విధముల పాపము చేసియుందురు. యేసు ప్రభువు యోసేపు మరియలు అటువంటి పాపములు చేయుట అనేకమార్లు నజరేతులో తన యింటిలో చూచియుండును. (ఒకవేళ దీనిని నమ్ముటకు నీకు కష్టముగా ఉన్నట్లయితే బహుశా మరియ పాపరహితమైనదని నీవు నమ్ముచుండవచ్చును). అయినప్పటికిని ఆయన వారిని తృణీకరించలేదు. మన తల్లిదండ్రులను గౌరవించుటలో ఇది ముఖ్యమైన భాగము. సామెతలు 23:22 ముదిమియందు నీ తల్లిని తృణీకరించవద్దని చెప్తుంది. నీవు నీ తల్లిదండ్రులలో లోపములను (దిగంబరత్వము) చూచినట్లయితే, వారిని తృణీకారముగా చూడవద్దు. వారి బలహీనతలను కప్పి వాటిని గూర్చి ఎవ్వరితో మాట్లాడవద్దు. నిజానికి ఇదే పద్దతిని మనము అందరి విషయములో పాటించవలెను ఎందుకనగా ''నిజమైన ప్రేమ అనేక పాపములను కప్పును'' అని చెప్పబడినది.

నీవు రక్షింపబడినవాడవై, నీ తల్లి దండ్రులు రక్షణ లేనివారుగా నుండి, వారు నిన్ను వాక్యానికి విరుద్ధమైనది ఏమైనా చేయమని అడిగినట్లయితే (ఉదాహరణకు విగ్రహపూజ చెయ్యమని గాని, అవిశ్వాసురాలను పెండ్లిచేసుకొనమని మొదలగునవి), అప్పుడు చేయలేనని వారితో గౌరవముగా చెప్పవలసియున్నది. నీవు తప్పనిసరిగా దేవుని కొరకు నిలువబడాల్సి యున్నది. కాని అది అమర్యాదకరంగా చేయకూడదు! నీవు అట్లు చేయలేవని వారితో గౌరవముగా చెప్పవలసియున్నది. నీవు మర్యాద పూర్వకముగా కాదని చెప్పవలెను.

అయితే వాక్యానికి అవిధేయత కాని విషయములలో, బిడ్డలు వారి తల్లిదండ్రుల ఇంటిలోనున్నంత వరకు వారికి లోబడాల్సియున్నది. అయితే వారు తల్లిదండ్రుల ఇల్లు విడచి పెట్టి వారి స్వంత ఇంటిని ఏర్పర్చుకొనినప్పుడు, వారు వారి తల్లిదండ్రులకు లోబడాలని లేదు. కాని అప్పటికిని వారు వారి తల్లిదండ్రులను గౌరవించాలి మరియు వారి గూర్చిన జాగ్రత్త వహించాలి.

యేసుయొక్క జీవితములో, ఆయన శిష్యులు వెంబడించునట్లు ఈ విషయములో ఆయన యొక్క మాదిరిని చూచెదము. యేసు 30 సంవత్సరములు వచ్చిన పిదప ఇంటిని విడిచిపెట్టి, బాప్తిస్మము తీసుకొనిన తరువాత మొదటి సూచక క్రియ కానా వివాహములో జరిగినట్లుగా సువార్తలో వ్రాయబడెను. బహుశా అక్కడ మరియ తన కుమారుడు ఒక అద్భుతము చేయునని ఊహించియుండదు. కాని ఆమె కుమారుడు అనేక సందర్భములలో ఇంటిలో జ్ఞానముతో మరియు అసాధారణ తెలివితేటలతో సమస్యను పరిష్కరించుట చూచి ఆ పరిస్థితులలో ద్రాక్షరసము గూర్చి ఏదో ఒకటి చేయగలడని ఆమె అడిగినది.

అక్కడ యేసు మొదటిసారిగా తన తల్లితో నిర్మొహమాటముగా, అమ్మా, నాతో నీకేమి పని? (యోహాను 2:4) అని చెప్పుట చూచెదము. ఆయన ఇప్పుడు యింటిని విడిచిపెట్టెను కాబట్టి ఆయన ఆమెకు లోబడుట నుండి విడుదల పొందెను.

తల్లిదండ్రులను ద్వేషించమని యేసు శిష్యులకు చెప్పుటలో నుండిన అర్థమిదే. ఇటువంటి సమతూకమే మనకును ఉండవలెను. వారి ఇంటిలో మనము నివసిస్తున్నప్పుడు వారికి విధేయత చూపాలి. మరియు దేవుడు ఆజ్ఞలకు లోబడుటకు ఆటంకపరచినప్పుడు వారిని ద్వేషించవలెను. దేవుని చిత్తము నెరవేర్చు విషయములోను, తండ్రి తనకు అప్పగించిన పరిచర్యను నెరవేర్చు విషయంలోను, మరియతో యేసు ప్రభువు నా సమయమింకను రాలేదు (యోహాను 2:4) అనెను. మనము మన స్వంత ఇంటిని ఏర్పర్చుకొనిన తరువాత, మనము మన తల్లిదండ్రుల క్రింద నుండము. బైబిలులో మొట్ట మొదట ఇవ్వబడిన ఆజ్ఞ, ''కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును'' (ఆది 2:24) అని ఉండుట చూచుటకు ఆసక్తికరముగానుండును. ఈ ఆజ్ఞ ఆదికాండము 2వ ఆధ్యాయములో, ఆదాముకు విడిచిపెట్టుటకు తల్లిదండ్రులు లేనప్పుడు చెప్పబడినది! ఇది స్పష్టముగా అటు తరువాత పెండ్లి చేసికొను వారి కొరకు ఇవ్వబడినది.

దురదృష్టవశాత్తు మన దేశములో అనేక వివాహములలో భర్తలు ఈ ఆజ్ఞను పాటించరు. క్రైస్తవేతరులు తమ భార్యలకంటె తమ తల్లిదండ్రులను ఎక్కువగా హత్తుకొని యుండుటను మనము అర్థము చేసికొనవచ్చును. అయితే ఈ విషయములో భారతదేశములో నుండిన క్రైస్తవేతర సంప్రదాయాన్ని అనుసరించే క్రైస్తవుల గూర్చి ఏమనాలి? వారు ఈ దేశానికి దేవుడు చూపించదల్చిన వైవాహిక జీవితమును చూపించలేకపోవుచున్నారు. అది ఒకరి తల్లిదండ్రులను భౌతికంగా విడచిపెట్టుట కాదు, గాని మనోభావములలో వారి నుండి దూరమగుటైయున్నది. ఒక భర్త యొక్క మొదటి బాధ్యత మరియు అంతరంగిక సంబంధము మొదటగా భార్యతో నుండవలెను కాని తల్లిదండ్రులతో కాదు. అదే విధముగా భార్య తన తండ్రి యింటిని మరువవలెనని ఆజ్ఞాపింపబడినది (కీర్తనలు 45:10).

మన తల్లిదండ్రులు వృద్ధులై బలహీనులైనప్పుడు వారి గూర్చి మనము తప్పక జాగ్రత్త తీసుకొనవలెను. ఈ విషయంలో కూడా యేసు ప్రభువు సిలువపై చనిపోయే ముందు తన విధవరాలైన తల్లిని యోహాను యొద్ద ఉంచే ఏర్పాటు చేయుట ద్వారా (యోహాను 19:26,27) మనకు ఒక మాదిరిని చూపారు. కాని తల్లి దండ్రులు ఎట్టి పరిస్థితులలోనూ భార్యాభర్తల మధ్యకు వచ్చుటకు అనుమతి నివ్వకూడదు. భారతదేశములో అనేకమంది క్రైస్తవులు వారి తల్లిదండ్రులతో వారికుండిన మితిమీరిన మరియు సహజ సిద్ధమైన అనుబంధమును బట్టి ప్రభువును వెంబడింపకుండా ఆటంక పర్చబడుచున్నారు.

ద్వితీ 33:8-11లో లేవీ గోత్రమువారు ఎందువలన దేవుని చేత యాజకులుగా ఎన్నుకోబడినారో చెప్పడినది. వారు దేవునిని వారి తల్లిదండ్రులు మరియు అన్నదమ్ములు మరియు వారి బిడ్డల కంటె ముందుంచుటను బట్టి ఈ పరిచర్య వారికి బహుమతిగా ఇవ్వబడినది. ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసికొని మ్రొక్కినపుడు, ప్రభువు వైపుననున్నవారు తనతో వచ్చి నిలువుమని మోషే చెప్పినప్పుడు, ఒక్క లేవీ గోత్రము వారు మాత్రము వచ్చి మోషేతో ఆరోజున నిలువడెను. అప్పుడు విగ్రహారాధన చేసినవారి స్వంత బంధువులను పాళెములోనికి వెళ్లి చంపునట్లు లేవీయులకు ఆజ్ఞ ఇవ్వబడినది (నిర్గ 32:26). ఆ లేవీయులు నిజమైన యేసు శిష్యులకు మాదిరిగా ముందు పరిగెత్తినవారు.

తల్లిదండ్రులను సన్మానింపుమని ఉండిన ఆజ్ఞలకు ధర్మశాస్త్రము అంతకు కొద్ది దినముల ముందే మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినది (నిర్గ 20). కాని ఇప్పుడు వారి ఖడ్గములు తీసి వారి బంధువులను చంపుమని వారికి చెప్పబడెను. అక్కడ సత్యమునకుండిన రెండవ ప్రక్కను మనము చూడగలము. లేవీయులు వారి కుటుంబీకులు విగ్రహారాధన చేయుచుండగా చూచి, వారిని విడిచిపెట్టి వెళ్లి ఇంకొకరిని సంహరించవచ్చును. కాని వారు అలా చేయలేదు. వారు తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, కుమారులనైనను లక్ష్యపెట్టలేదు (ద్వితీ 33:9).

ఎంతమంది తమ తల్లిదండ్రుల కన్నీళ్లు చూచిగాని లేక ''నీగురించి మేమెంత చేసామో చూడు'' అనువారి మాటలను బట్టి కాని కదలిపోయి ప్రభువు యొక్క ఆజ్ఞలకు లోబడి వెంబడింపకుండా ఉంటున్నారు. ఆ విధముగా వారికి వారే యేసు యొక్క శిష్యులుగా ఉండకుండునట్లు చేసికొనుచున్నారు.

అయితే దీనికి వేరుగా, నీవు ఇప్పటికే నీ స్వార్థ పూరిత కారణములను బట్టి నీ తల్లిదండ్రులను ద్వేషించువాడవైనట్లయితే (అనేకులు అట్లున్నారు), ఇంతవరకు చెప్పినది నీకు వర్తించదు. నీవు మొదటగా నేర్చుకొనవలసినది నీ తల్లిదండ్రులను గౌరవించుము అనునది. ఎవరైతే మొదట తన తల్లిదండులను సన్మానించుట నేర్చుకొనెదరో, వారు మాత్రమే వారిని ద్వేషించమని యేసు ప్రభువు చెప్పిన దానిని అర్థము చేసికొనగలరు.

ఎవరైతే ఖడ్గమును వాడరో (యేసు ప్రభువు చేసినట్లు), మానవ మెతక వైఖరి వలన రాజీపడిపోవుదురో వారు కొంత కాలమైన తరువాత ఆత్మీయ జీవితములో దెబ్బతినుదురు. లేవీయులు తమ తల్లిదండ్రులపై కత్తి దూయుట వారికి బాధాకరమే. కాని వారు అది ప్రభువు కొరకు చేసి యున్నారు.

లేవీయులు దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన నామమునకు భయపడుట చేత ఆయన వారితో జీవమునకును, సమాధానమునకును కారణమైన నిబంధనను వారికిచ్చెనని మలాకీ 2:4,5లో ప్రభువు చెప్పెను. అయితే ఆ సమాధానము ఖడ్గముతో వచ్చియున్నది.

అదంతా ఈ దినాల్లో ఏవిధముగా అన్వయించుకోవచ్చు? పాత నిబంధన కాలములో లేవీయులు ఉపయోగించినట్లు ఇప్పుడు మనము ఇతరులపై నిజమైన ఖడ్గములను ఉపయోగించము. ఇప్పుడు, కత్తి దూయుట అనగా మన తల్లిదండ్రులు మరియు బంధువుల యెడల మనకుండిన మానవ పరమైన అభిమానములను తెంపుకొని దానికి బదులుగా దైవికమైన అభిమానమును చూపుటైయున్నది. మన తల్లిదండ్రులు, బంధువులు మొదలైన వారి యెడల మనకుండిన మానవపరమైన అభిమానము, వారిని సంతోషపర్చుట కొరకు మనము పాపము చేయునట్లు చేయును. అయితే దైవికమైన అభిమానము మనము పాపము చేయకుండా ఆపుట మాత్రమే కాక, వారిని ఎంతగానో లోతుగా మరియు పవిత్రముగా ప్రేమించగలుగునట్లు చేయును.

కొన్ని పరిస్థితులలో మన తల్లిదండ్రులు చెప్పినది చేయాలా లేక దేవుడు చెప్పినది చేయాలా అనే పోరాటము వచ్చినప్పుడు, మనము తప్పనిసరిగా దేవునికి లోబడవలెను. అటువంటి పరిస్థితిలోనే మనము దేవుని సంతోషపర్చువారముగా ఉన్నామా మరియు ఆయనకు భయపడ్తున్నామా లేక మన బంధువులను సంతోషపెడ్తున్నామా అనునది దేవుడు పరీక్షించి చూచును.

మన జీవితములో మన తల్లిదండ్రుల, భార్య, పిల్లలు మరియు ఇతర బంధువుల స్థానము కంటె దేవునికి ఉండిన స్థానము వేరైనదని మన క్రైస్తవ జీవిత ప్రారంభములో ఒక్కమారు స్థిరపర్చబడవలెను. లేనట్లయితే మన జీవితమంతా మనకు ఎడతెగని సమస్యలుండును.

మనము దేవునిని ఘనపర్చినట్లయితే ఆయన మనలను ఘనపర్చును. నీవు దేవుని కొరకు నిలువబడినట్లయితే ఆయన నీ తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించును. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యము మన మేలు మరియు ఇతరుల యొక్క మేలు కూడా అయి ఉన్నది. కనుక ఎవరైతే రాజీపడి దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చరో వారు ఆత్మీయముగా తప్పిపోవుటే కాకుండా, వారి తల్లిదండ్రులు కూడా వారిని బట్టి దేవుని దీవెనలను పోగొట్టుకొనెదరు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుట ద్వారా నీవు ఎప్పటికిని దేనిని పోగొట్టుకొనవు.

దేవుడు ఇస్సాకును బలిగా ఇమ్ము అని అబ్రాహామును అడిగినప్పుడు, ఇదే నియమమును దేవుడు వక్కాణించి చెప్పెను. ఇస్సాకు అబ్రాహాముహృదయమునకు ప్రియుడుగాను మరియు ఒక విగ్రహముగాను అయ్యెను. కనుక దేవుడు ఇస్సాకును విడిచి పెట్టుమని అబ్రాహామునకు చెప్పెను.

నీకు నీ తల్లిదండ్రుల యెడల కాని, నీ భార్య యెడల కాని నీ పిల్లల యెడల కాని అటువంటి అనుబంధమున్నదా? అలా అయినట్లయితే నీవు శిష్యుడుగా నుండలేవు.

నీ భార్య నీ దగ్గరకు వచ్చి నీ సంఘములో ఒక సహోదరుని గూర్చి ఏవో మంచివి కాని మాటలు చెప్తున్నట్లయితే, ఆ మాటలు వెనుకనున్న ఆత్మతో నీవు ఏకీభవిస్తున్నావా? లేక తిరస్కరిస్తున్నావా? నీవు నీ భార్యను సంతోషపర్చాలని చూస్తున్నావా? అలా చేసినట్లయితే నిన్ను నీవు పోగొట్టు కొనుటయే కాకుండా నీ భార్యను కూడా పోగొట్టుకొనెదవు. నిన్ను నీవు పవిత్రముగా ఉంచుకొనినట్లయితే కనీసం నిన్ను నీవు కాపాడుకొందువు. అలా కాలము గడిచేకొద్దీ నీ భార్య కూడా రక్షింపబడవచ్చును. కనుక ద్వేషించుట అను మార్గము అటువంటి విషయాలకు సంబంధించిన వారి కందరకు శ్రేష్టమైన మార్గమైయున్నది.

మనము అటువంటి విషయాల్లో తీవ్రమైన భావాలతో ఉన్నట్లయితే ఎవరును మనలను క్రొత్త నిబంధన యాజకులు కాకుండా ఆపలేరు.

ఈ విషయమును మరియొక మారు చెప్పుదును. నీవు నీ తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలువవలసి వచ్చినప్పుడు, నీవు వారితో దురుసుగా నుండకూడదు. చక్కని మాటలతో, ఇది దేవుని వాక్యమునకు వ్యతిరేకము కాబట్టి నేను చేయలేను. నన్ను క్షమించండి అని చెప్పవలెను. అనేక సమస్యలు యౌవన విశ్వాసులు సత్యము కొరకు నిలువబడుటకును, దురుసుగా నుండుటకును మధ్య తేడా తెలుసుకొనకపోవుట చేత వచ్చుచున్నవి.

శిష్యత్వము మరియు వివాహము

వివాహము ఒక వ్యక్తి యొక్క జీవితమంతటిని కట్టుట కాని లేక చెఱుపుట కాని చేయునది కాబట్టి అది ఎంతో ముఖ్యమైనది.

వివాహము గూర్చి దేవుని చిత్తమును వెదకు యౌవనస్థులందరూ వారు మొదటగా యేసు ప్రభువుకు శిష్యులనియు, అందువలన వివాహము కంటె యేసును వెంబడించుటయే వారికి జీవితములో అతి పెద్ద విషయమని దేవునికి చెప్పవలెను. అన్నిటిని విడిచి పెట్టినవాడే శిష్యుడు. దేవుడు అతడిని ఒంటరిగా ఉండమంటే ఉండుటకు కూడా సిద్ధపడవలెను. అటువంటి యౌవనులు దేవుని నుండి వివాహము విషయములో శ్రేష్టమైన దానిని పొందుదురు. ఈ దినాల్లో విశ్వాసులలో అనేకమంది సంతోషము లేనటువంటి మరియు సఖ్యత లేని వైవాహిక జీవితములు చూచినప్పుడు, ఆ దంపతులు మొదటగా ప్రభువు యొక్క శిష్యులుగా వివాహములోనికి ప్రవేశించలేదని స్పష్టమౌతుంది.

మన జీవితములో మనము దేవునిని మొదటగా ఉంచుకొనినట్లయితే, మనము దేవుని చిత్తాన్ని విశ్రాంతి అనే పునాది నుండి వెతుకు కొనవచ్చును. దేవుడు ఆదామునకు భార్యను సిద్ధపరుస్తున్నప్పుడు,అతడిని నిద్రింపచేసెనని జ్ఞాపకము తెచ్చుకొనండి. ఆదాము తోట అంతా తన భాగస్వామి గూర్చి తిరగాల్సిన పని లేదు!! అలాగే దేవుని చిత్తము చేయుటలో మనము కూడా విశ్రాంతిలో ఉండవలసిన అవసరమున్నది. అప్పుడు తగిన సమయమందు దేవుడే మన కొరకు తగిన జీవిత భాగస్వామిని తెచ్చును. దీని అర్థము మనము ఒక భాగస్వామి కొరకు చూడకూడదని కాదు, కాని మనము క్రిందా మీదా పడవలసిన అవసరము లేదని దాని అర్థము. యువకులు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు, యువతులు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు వారి భవిష్యత్తు జీవిత భాగస్వామిల గూర్చి ప్రార్థించుట మొదలు పెట్టవలెను. నీకు ఆ వయసు రాకముందే వివాహము గూర్చిన ఆలోచనలు లేకుండా నీవు కేవలం ప్రభువును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి మరియు ఆయన పనిని గూర్చి మాత్రమే ఆలోచింపవలెను. నీకు తారసపడిన ప్రతి ఆకర్షణీయమైన అబ్బాయిని లేక అమ్మాయిని నీ భవిష్యత్తు జీవిత భాగస్వామిగా ఊహించుకొని సమయాన్ని వృథా చెయ్యకు. మరియు నీవు నిజంగా ఎంతో ఆకర్షణీయముగా నుండిన ఒకరిని చూచినప్పుడు ఇంకొకరెవరైనా తనను స్వంతం చేసికొనక ముందే నేను స్వంతం చేసికొనుట మంచిది అనుకొనకు. దేవుడు ఆ వ్యక్తిని నీ కొరకు నిజంగా ఎంపిక చేసినట్లయితే ఆయన ఆ వ్యక్తిని నీ కొరకు ప్రత్యేకపరచి ఉంచును. ఎవ్వరు కూడా ఆమెను లేక అతనిని స్వంతం చేసికొనలేరు. నీవు యేసు ప్రభువుకు నిజమైన శిష్యుడవైనట్లయితే ఆయన నీ కొరకు శ్రేష్టమైన వ్యక్తిని ప్రత్యేకించి ఉంచును.

దావీదు సౌలురాజు దగ్గరనుండి సింహాసనము లాక్కొనలేదు, కాని దేవుని సమయము కొరకు కనిపెట్టెను. అందుచేతనే దావీదును, దేవుడు నా హృదయానుసారుడు (అపొ.కా. 13:22) అని పిలిచెను. నీవు కూడా ఎదురుచూచుటకును ప్రతీది ఆయన చేతి నుండి పొందుటకును ఇష్టపడినట్లయితే నీ గూర్చి కూడా ఆయన అట్లే చెప్పును. నీవు దేవుని రాజ్యమును మొదట వెదకుటకు నీ సమయాన్ని వెచ్చించినట్లయితే, నీ వివాహము గూర్చిన విషయాన్ని ఆయనచేతులలో భద్రంగా విడిచిపెట్టవచ్చు. నీవు ఆయనను ఘనపరచినట్లయితే ఆయన నిన్ను ఘనపర్చును.

ఒక తండ్రి తన కుమారులకు భూములను, ధనమును ఇచ్చును, కాని వారికి మంచి భార్యలను ప్రభువు మాత్రమే ఇచ్చునని సామెతలు 19:14లో చెప్పబడెను. కనుక నీ వివాహ భాగస్వామిని దేవుని యొద్ద వెదకుము.

ఒక శిష్యుడు తన జీవిత భాగస్వామిని ఎట్లు పొందగలడు?

నేను వారికి వారు నిర్ణయించుకొన్నవి కాక ఏర్పాటు చేయబడిన వివాహములు - దేవునిచే ఏర్పాటు చేయబడిన వివాహములపై గట్టి నమ్మకము కలవాడను. బైబిలులో అటువంటి రెండు వివాహముల గూర్చి మనకు తెలియును. దేవుడు ఆదామునకు భాగస్వామిని ఏర్పాటు చేసెను. ఇస్సాకునకును దేవుడు భాగస్వామిని ఏర్పాటు చేసెను. దేవుడు నాకు కూడా నాకు తగిన శ్రేష్టమైన భాగస్వామిని ఏర్పాటు చేసెనని నా సాక్ష్యమిచ్చెదను. ఎవరి హృదయమైతే పూర్తిగా ఆయనదో, అట్టివారికి సహాయము చేయుటకు యెహోవా కన్నులు లోకమంతా అటు ఇటు సంచరించుచున్నవి (2దిన 16:9). దేవుని వలె ఎవ్వరును లోకమంతా వెదకలేరు. అందువలన ఆయనయందు నమ్మిక యుంచువారెన్నడును నిరుత్సాహపడరు.

కనుక నీకు ఒక మంచి భార్య కావలయునంటె, మొదట నీవు యేసు క్రీస్తునకు నిజమైన శిష్యుడవు కమ్ము. అప్పుడు దేవుడే నీ యొక్క వివాహమునకు ఏర్పాటు చేయును. ''నీవు విశ్వసించిన ప్రకారము నీకగును'' (మత్తయి 8:13). అబ్రాహాము సేవకుడు సరియైన అమ్మాయిని చూపుమని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు అట్లు నడిపించెను (ఆది 24) దేవుడు నీకు కూడా అట్లే చేయును.

దేవుని చిత్తము నూతన పర్చబడిన మనసు ద్వారా మనకు తెలియజేయబడునని బైబిలు చెప్తుంది (రోమా 12:2). కనుక దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును తెలుసుకొనగలుగునట్లు మన మనసులు రూపాంతరము చెందుటకు మనము అవకాశమివ్వవలెను. నూతన పర్చబడిన మనస్సనగా ప్రజలను దేవుని యొక్క కోణం నుండి చూచుటకు నేర్చుకొనుట.

సామెతలు 31:10-31లో దేవుడు సిఫారసు చేసిన భార్య గురించి చెప్పబడినది. యువకులందరు వారు వివాహము కొరకు అమ్మాయిని గూర్చి ఆలోచించునప్పుడు చూడవలసిన గుణములు అక్కడ తెలిపెను. మరియు యౌవన స్త్రీలందరు వారి జీవితములో సంపాదించుకొనవలసిన విలువలు అవియే.

అనేక మంది యౌవనులు స్త్రీలో అందమును, సొగసును చూచెదరు, వాటినే సామెతలు 31:30 మోసకరమనియు, వ్యర్థమనియు చెప్పెను. సామెతలు 11:22 అందముగా నుండి వివేకములేని స్త్రీ (దేవుని యెడల భయము వివేకమునకు మొదటి మెట్టు)ని గూర్చి చాలా కరిÄనమైన మాటలలో పంది ముక్కున బంగారు కమ్మివంటిదని చెప్పెను. కొందరు పురుషులు ఆ బంగారు కమ్మి (అందమైన ముఖము) యెడల ఆకర్షితులై వారు పందిని (స్త్రీ) పెండ్లి యాడుదురు!!

సామెతలు 31లో చెప్పబడిన స్త్రీ ఆమె చేతులతో కష్టపడి పనిచేయునది మరియు ప్రతి ఉదయమున వేకువనే నిద్ర లేచునది (31:13,15). ఆమె తన కుటుంబము కొరకు మరికొంత సంపాదించుటకు ఒక ద్రాక్షతోటను నాటునది (వ16), ఆమె ద్రవ్యమును ఖర్చుపెట్టుటలో జాగ్రత్త కలిగియుండును బీదలకు సహాయము చేయును మరియు ''కృపగల ఉపదేశమును ఆమె బోధించును'' (వ26). వేరొకమాటలలో ఆమె కష్టపడి పని చేయునది, పొదుపుచేస్తూ దానము కూడా చేయును మరియు ఆమె మాటలు కృపాసహితముగా నుండును.

ఆమె చేతులు కష్టపడుట చేత గట్టిగా నుండినా ఆమె నాలుక (మాట) మెత్తగా నుండును. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అనేక క్రైస్తవ స్త్రీలలో అందుకు సరిగా వ్యతిరేకమయినది చూస్తున్నాము. వారి చేతులు మెత్తగా నుండి (బద్దకమును బట్టి) వారి నాలుకలు గట్టిగా (పొగురుబోతుదనము వలన) నుంటున్నాయి! అటువంటి స్త్రీని పెండ్లియాడిన పురుషునికి అయ్యో! శ్రమ.

ఒక మంచి భార్య ఎప్పుడూ బైబిలు బోధిస్తూ ఉండే అమ్మాయిలలోనే దొరుకుందనేమి లేదు. యౌవనులు మతాసక్తితో కూడిన క్రియలను ఆత్మీయ క్రియలని పొరపాటు పడే అవకాశమున్నది!! నువ్వు పెండ్లి చేసుకొన్న తరువాత నీకు కావాల్సింది ఒక భార్య మరియు నీ పిల్లలకు ఒక తల్లి, అంతే కాని వాక్యోపదేశకురాలు కాదు!! అది జ్ఞాపకముంచుకోండి!

పరమగీతము 8:9లో రెండు రకములైన స్త్రీల గూర్చి చెప్తుంది. ప్రాకారమువలె నుండువారును, ద్వారము వంటివారును, ద్వారమువంటివారు నీ యొద్దకు వారి హృదయమును తెరచుకొని ముందుకు వచ్చువారు. ప్రాకారము వంటి అమ్మాయి సిగ్గు పడేటటువంటి, తన మట్టుకు తాను ఉండేవిధముగా, ఆడపిల్లలు ఎలా ఉండాలని దేవుడు సృష్టించెనో అలా ఉండేవారు. ద్వారము వలె నుండే అమ్మాయిలగూర్చి, ఆ వచనములో వారి తల్లిదండ్రులు అడ్డుకట్టలు(అది అనేక విషయాలకు అడ్డు చెప్పవలెనని) వెయ్యవలెనని చెప్పబడినది, అయితే ఆమె ప్రాకారము వంటిదైనట్లయితే ఆమె జీవితము ద్వారా ఒక దైవికమైన గృహము (వెండి గోపురము) కట్టబడును.

యేసు యొక్క శిష్యులుగా ఉండాలనుకొనే స్త్రీలు, దేవుడు వారిలో సాధువైనట్టిదియు మృదువైనట్టిదియునైన గుణములుమాత్రమే విలువైనవిగా చూచును కాబట్టి ఖరీదైన వస్త్రధారణ లేకుండా చూచుకొనవలెనని 1పేతురు 3:3,4 చెప్పబడినది. శిష్యత్వములో ఒక వ్యక్తి ఎటువంటి వస్త్రధారణతో నుండెననునది ముఖ్యము కాకపోయినను, ఒక స్త్రీ యొక్క వస్త్రధారణ చాలా వరకు ఆమె స్వభావ లక్షణములను బయలు పర్చుననునది సత్యము. ఆమె హృదయములో ఎటువంటి వాటికి విలువ ఇచ్చుననునది ఆమె వస్త్రధారణ బట్టి సాధారణముగా బయల్పడును. యేసుక్రీస్తు యొక్క శిష్యులు మురికిగా లేక అజాగ్రత్తగా వస్త్రధారణ చెయ్యరు. కాని ఆమె తన సొమ్మును కళ్ళు చెదిరే మరియు ఖరీదైన వస్త్రములపై ఆభరణములపై ఖర్చుపెట్టదు.

కనుక యౌవనస్థులు దైవికమైన భార్య గూర్చి చూచునప్పుడు ముఖ్యముగా సాధువైనట్టి మృదువైన స్వభావము కలిగి శ్రమపడు స్వభావము, దయగలిగిన మాటతీరు, సిగ్గు బిడియము కలిగి సామాన్యముగా నుండి వీటన్నిటిలో దేవుని భయము కలిగియున్న వారిని చూచుకొనవలెను.

అమ్మాయిలు వివాహము గూర్చి ఆలోచించునప్పుడు సాధారణముగా విద్య, ధనము మరియు మంచి రూపము గల పురుషుని గూర్చి చూచెదరు. ఒక అమ్మాయి వివాహము కొరకు ఒక వ్యక్తిని గూర్చి ఆలోచించునప్పుడు అతడు కుటుంబమును పోషించుటకు కనీసపు సంపాదన లేకపోయినట్లయితే అతడి గూర్చి ఆలోచించకూడదు. ఎందుకనగా ఒకడు తన యింటిని కుటుంబమును కట్టుకొనుటకు ముందు మొదట తన వ్యాపారమును (రాబడికి సంబంధించిన సంపాదన) అభివృద్ధి పర్చుకొనవలెనని బైబిలు చెప్తుంది (సామెతలు 24:27) కాని అదే అంతా కాదు.

ఒక అమ్మాయిగా మొదటగా నీవు చూడాల్సినది నీవు ఆలోచిస్తున్న ఆ అబ్బాయి నీవు మాదిరిగా చూడగల్గిన యేసు క్రీస్తు శిష్యుడుగా ఉన్నాడా అనునది. నీవు అతడిని బైబిలు ఆజ్ఞాపిస్తున్నదని కాక నీకు నీవుగా సంతోషముగా నీ తలగా చేసుకొనగలవా? అనునవి మీరు అడుగుకొనవలసిన మొదటి విషయములు. (దీని గూర్చి ఇంకను వివరములకొరకు క్రైస్తవ థృక్పథంలో సెక్స్‌, ప్రేమ, పెళ్ళి అనే నా పుస్తకాన్ని చదవండి).

శిష్యత్వము మరియు గృహము

మలాకీ 2:15లో దేవుడు భార్యభర్తలను ఒకటిగా చేసినది వారి ద్వారా ఆయన దైవికమైన సంతతిని పొందవలెనని చెప్పబడినది. ఎవరైనా పిల్లలను పెంచవచ్చును కాని యేసు ప్రభువు యొక్క శిష్యులు మాత్రమే భక్తిగల బిడ్డలను పెంచగలరు. దీనికిగాను మొదటగా కావలసిన ముఖ్యమైన విషయము తల్లిదండ్రులలో ఒకరైనా వారి హృదయమంతటితో ప్రభువును ప్రేమించు నిజమైన యేసు శిష్యుడై యుండవలెను. సగము హృదయముతో క్రైస్తవులుగానుండు వారు భక్తిగల బిడ్డలను పెంచలేరు.

రెండవ ముఖ్యమైన విషయము భార్యాభర్తల నడుమ ఐకమత్యము. ఇద్దరిలో ఒకరు శిష్యుడు కానట్లయితే ఇది సాధ్యము కాకపోవచ్చును. అప్పుడు వేరొక భాగస్వామి తన బిడ్డల కొరకు ఒక్కడే సాతానుతో పోరాడవలసి వచ్చును. కాని ఇద్దరూ నిజమైన శిష్యులైతే ఆ పని సుళువవుతుంది. అందుచేతనే వివాహ భాగస్వామిని ఎంచుకొనుట ఎంతో ముఖ్యమైనది.

భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ తగవులాడుకుంటూ ఒకరిపై ఒకరు నింద వేసుకొనుచున్నట్లయితే బిడ్డలను దైవికముగా పెంచుట చాలా కష్టము. నీవు దైవికమైన గృహమును కట్టదలచినట్లయితే నీ భార్య (భర్త) తో అది నీకు ఎంత నష్టమైనా, కష్టమైనా చివరకు దానిని బట్టి నీకున్న ఎన్నో హక్కులను కోల్పోవలసి వచ్చినా ఐకమత్యమును వెదకు. నీ బిడ్డలు ప్రభువును వెంబడించుట నీవు చూచినప్పుడు, దాని కొరకు ఎంతో కాలము గడచినా నీ నిర్ణయమునకు తగిన విలువయున్నదని నీవు తెలుసుకొందువు.

ఇద్దరు శిష్యుల మధ్యయుండిన ఐకమత్యమునకు ఎంతో గొప్ప శక్తి యున్నది. ఇద్దరు శిష్యులు భూమిపై ఏకీభవించినప్పుడు, వారికి ఆకాశమండలమందున్న (ఎపెసీి 6:12) దురాత్మల కార్యకలాపములను బంధించగలిగే అధికారముండునని యేసు ప్రభువు చెప్పెను (మత్తయి 18-18-20). ఆ విధముగా మన యిండ్లను మరియు మన పిల్లలను పాడు చేయకుండా దురాత్మలను దూరముగా పారద్రోలవచ్చును.

ఎఫెసీ 5:22 - 6:9లో పరిశుద్ధాత్ముడు ఇంటిలోనుండిన, భార్యభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, సేవకులు యజమానుల మధ్య నుండిన సంబంధము గూర్చి మాట్లాడెను. వెంటనే దాని తరువాత (10వ వచనము నుండి) పరిశుద్ధాత్ముడు ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుట గూర్చి చెప్పెను. అది మనకు ఏమి బోధిస్తుంది? అది సాతాను యొక్క దాడి ముఖ్యముగా ఇంటిలో నుండిన సంబంధాలపైనే అనునదియే. ఇక్కడనే మనము అన్నింటికంటె ముందు సాతానును జయించవలెను.

భార్యాభర్తలు ఎవరైతే పోట్లాడుకుంటూ ఉందురో వారు, సాతానువచ్చి వారి బిడ్డలపై దాడిచేయునట్లు తలుపులు తెరుచుచున్నారని (వారి మధ్య దూరము ఏర్పడుట ద్వారా) గ్రహించరు. తల్లిదండ్రలకు దురుసుగా సమాధానమిచ్చు ఒక బిడ్డ ఆ అలవాటును అటువంటి పరిస్థితులలో అతడి తల్లి ఆమె భర్తతో మాట్లాడిన దానిని బట్టియో లేక తన తండ్రి ఏదొక విషయములో దేవునిని ఎదురించిన దాని నుండియో నేర్చుకొనును. మొదటిగా ఇంటిలోనికి అటువంటి అంటురోగమును తల్లిదండ్రులు తెచ్చియుండగా ఆ పిల్లవాడిని నిందించి ప్రయోజనము లేదు!! ఆ విషయములో తల్లిదండ్రులు మొదట పశ్చాత్తాప పడవలెను.

నీ యిల్లు ఎంత ఉన్నది లేక దాని అందము లేక నీ యింటిలో నుండిన వస్తువుల కంటె నీ యింటిలో నుండిన ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటిగా ఒక కుటుంబములోని వారు యేసు ప్రభువు యొక్క శిష్యులైనట్లయితే, ఆ కుటుంబము ఒక గుడిసెలో నివసించినా దేవుని యొక్క మహిమ అక్కడ ప్రత్యక్ష పర్చబడును.

నిజమైన యేసు యొక్క శిష్యులు ఏదేను వనములో ఆదాము హవ్వలు ఏ అంటురోగము కలిగియుంటిరో ఆ నిందమోపుకొనుట అనే భయంకర రోగమునుండి విడుదల పొందుదురు. ఆదాము అతడి పాపము కొరకు హవ్వను, హవ్వ ఆమె పాపము కొరకు సర్పమును నిందించెను.

ఆత్మ విషయమై దీనులైన వారిదే దేవుని రాజ్యము (మత్తయి 5:3). ఆత్మలో దీనులైన వారియొక్క మొదటి లక్షణమేమనగా అటువంటి వారికి వారి యొక్క లోపము మరియు అవసరము మొదట కనపడును. ఆత్మలో దీనులైన భార్యా భర్తలిద్దరు వారి ఇంటిని ఈ భూమిపై చిన్నపాటి పరలోకముగా మార్చుకొందురు. అటువంటి ఇంటిలో భార్యాభర్తలిద్దరు నిందించుకోకుండా ఎవరికి వారు తీర్పుతీర్చుకొనుచుందురు. అపవాదికి అటువంటి ఇంటిలోనికి ప్రవేశించు అవకాశమేమాత్రము ఉండదు. అటువంటి ఇంటిలో నుండిన బిడ్డలు ఎటువంటి దీవెనలను స్వాస్థ్యాముగా పొందుదురో ఊహించగలరా?

పని చేసే తల్లులను గూర్చి ఒక మాట. మన రోజుల్లో, జీవనపు ఖర్చు ఎక్కువైనందు వలన కొన్ని పట్టణాలలో దురదృష్టవశాత్తు ఇది తప్పనిసరి అయినది. కాని అటువంటి తల్లుల మనసుల్లో కొన్ని సూత్రములు ఉంచుకొనవలెను.

స్త్రీ యెడల దేవుని చిత్తము ''ఇంటిలో నుండి పని చేయువారుగా నుండుట'' యని తీతు 2:5 చెప్తుంది. కనుక ఏ తల్లి కూడా ఇంటి బయట పని కొరకు ఇంటిలో బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువు, తన భర్త, తన పిల్లలు - ఆ క్రమంలో ఎప్పుడును ఆమె యొక్క అభిమానము, శ్రద్ధ చూపవలెను. ఆమె ఉద్యోగము పై మూడు విషయముల తరువాత నాల్గవదిగా నుండవలెను.

వివాహమై పిల్లలు లేని స్త్రీలు ఎటువంటి సమస్య లేకుండా ఉద్యోగము(పని) చేసుకోవచ్చును.

సాధారణముగా చిన్న బిడ్డలుగల తల్లులు రెండు కారణాల వలన పని చేయుటకు వెళ్లుదురు. 1. భర్త యొక్క జీతము ఇంటి అవసరములకు సరిపోనప్పుడు జీవన అవసరము కొరకు. 2. విలాసము కొరకు, భార్యాభర్తలు ఎక్కువ స్థితి గల జీవితము జీవించుటకు.

నీవు దేవుని యెదుట యధార్థముగా నీ కారణము జీవన అవసరము గూర్చి అని చెప్పగలిగినట్లయితే, అప్పుడు దేవుడు నీ కుటుంబ బాధ్యతలకన్నిటికిని కావాల్సిన కృపను ఇచ్చును. కాని నీ నిజమైన కారణము గొప్ప కోసమైనట్లయితే, నీవు నిజమైన ప్రమాదములో నుంటివని చెప్పవచ్చును. ఎన్నో సంవత్సరాల తరువాత, నీ బిడ్డలు నిన్ను విడిచి వెళ్లి, బాధ్యత లేకుండా మొండిగా తయారై దేవునికి ఉపయోగము లేకుండా అయినప్పుడు నీవు ఇప్పటి పరిస్థితి పర్యవసానాన్ని పొందుదువు. అప్పుడు ఏమి చేయుటకైనా సమయము మించిపోయి యుండును.

నేనేమి ఆచరిస్తున్నానో అదే భోధిస్తున్నాను దానికి నాకు దేవుడే సాక్షి. 1969లో మా మొదటి కుమారుడు జన్మించినప్పుడు నా భార్య డాక్టరుగా పనిచేసేది. ఆ సమయములో మా సంపాదన నాకు ప్రతి నెలా వచ్చే కొద్ది మొత్తము మాత్రమే. మాకు దాచుకొన్న సొమ్ము ఏమీ లేదు. కాని అప్పుడు నా భార్య ఇంటి దగ్గర ఉండికుటుంబమును చూచుకొనవలెనని మేము నిర్ణయించుకొన్నాము. అటు తరువాత 28 సంవత్సరములు ఆమె ఎప్పుడూ ఉద్యోగము చెయ్యకుండా ఇంటిలోనే ఉండి మా నలుగురు అబ్బాయిలు ప్రభువును ప్రేమించి ఆయనను వెంబడించునట్లు పెంచినది. దాని పలితమేమిటి? మా నలుగురు కుమారులు తిరిగి జన్మించి, బాప్తిస్మము తీసుకొని, ప్రభువును వెంబడిస్తూ ఆయన కొరకు సాక్ష్యమిచ్చుట చూచుట మా కెంతో సంతోషముగానున్నది. అటువంటి ఆశీర్వాదము నా భార్య డాక్టరుగా ఉద్యోగము చేసి 28 సంవత్సరాలలో సంపాదించవలసిన 30 లేక 40 లక్షల రూపాయల కంటె ఎంతో గొప్పది. ఈ రోజున దాని గూర్చి ఎటువంటి విచారము లేదు. ఈ విషయములో దేవుని చిత్తమును వెదకే ఇతర తల్లులకు ప్రోత్సాహముగా నుండునట్లు మా సాక్ష్యమును ఇక్కడ చెప్పాము.

నిజమైన శిష్యుడు తన ఇంటిలోనికి తెచ్చు పత్రికలు, పుస్తకములు, చూచే టెలివిజన్‌ కార్యక్రమమములు మరిము వీడియో ప్రోగ్రాములు విషయమై జాగ్రత్త కలిగియుండును. ఇంటికి యజమానిగా భర్త తన యింటిలోనికి లోకపు తత్వము ఏమీ ప్రవేశింప కుండా ఖచ్చితమైన ద్వార పాలకునివలె జాగ్రత్త కలిగియుండవలెను. అతడు ఒక ఫేక్టరీలో నాణ్యతను పరీక్షించి సర్టిఫికేటు ఇచ్చే ఒక అధికారి వలె నుండవలెను. తమ బిడ్డలు శిష్యులు కావలెని కోరుకొనే తల్లిదండ్రులు వారు అడిగిన ప్రతీది వారికి ఇవ్వకూడదు, అటువంటి విషయములో అది ప్రేమ కాదు కాని, తెలివి తక్కువతనము మరియు దేవుని యెడల అపనమ్మకత్వము అయి ఉన్నది.

ఏ సంఘము యొక్క బలమైనా అందులో నుండిన కుటుంబముల యొక్క బలముపై ఆధారపడి యుండును. గృహములు బలహీనమైనట్లయితే సంఘము బలహీనమగును. సంఘము యొక్క బలము గట్టిగా చేయు శబ్దముపైన లేక వినసొంపైన పాటలు లేక చివరకు మంచి ప్రసంగములపై ఆధారపడియుండదు. కాని సంఘములో గల కుటుంబములు యొక్క భక్తిపై ఆధారపడియుండును.

మన దేశములో మన ప్రభువుకు మహిమ తెచ్చు గృహములను కట్టుకొందము గాక.

అధ్యాయము 3
ధనమునకు సంబంధించిన విషయములలో శిష్యత్వము

''ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవించలేరు'' (లూకా 16:13).

ఇక్కడ దేవునికి బదులుగా నుండిన యజమానుడు సిరి (ధనము మరియు వస్తు సంపదలు) అని మన ప్రభువు తేటపరిచారు. యేసు యొక్క ఏ శిష్యుడు కూడా దేవునిని ప్రేమిస్తున్నానని అనుకుంటూ అదే సమయములో సాతానును ప్రేమించే ప్రమాదములో ఉండడు కనుక ప్రత్యామ్నాయపు యజమాని సాతానుకాదు! కాని సిరిని గూర్చి ఆ ప్రమాదమున్నది.

మనము ఈ లోకములో జీవించినంత కాలము ప్రతిదినము సిరితో పని ఉంటుంది. మరియు మనము యేసు యొక్క శిష్యులుగా జాగ్రత్త పడకపోయినట్లయితే దేవునిని మరియు సిరిని ఒకే మారు ప్రేమించగలమని అనుకొనే ప్రమాదమును ఎదుర్కొనెదము.

ధనము మనపై సులువుగా పట్టుసాధించి ప్రభువునకు శిష్యులుగా ఉండకుండునట్లు ఆటంకము కలిగించును. కనుక సాతాను విషయములో ఎలాగైతే తటస్థవైఖరి చూపమో అట్లే ధనము విషయంలో కూడా తటస్థవైఖరి చూపలేము. మనము యేసు ప్రభువు శిష్యులుగానైనా ఉందుము. లేదా సిరికి శిష్యులుగానైనానుందుము. మనము ఇరువురికి శిష్యులుగా నుండలేము! మనము దేవునిని సంతోష పరచునట్లుగానైనా గురి కలిగియుందుము లేక ధనము సంపాదించే గురి కలిగియుందుము. ఈ రెండు ఆయస్కాంతమునకుండిన ఉత్తర ధృవము దక్షిణ ధృవము వంటి వ్యతిరేక విషయములు. మనము సరియైన విధముగా దేవుని వైపునకు ఆకర్షింపబడినట్లయితే మనము సిరి నుండి దూరముగా పోవుదుము. దేవునిని సంపూర్తిగా ప్రేమించాలంటే నీవు సిరిని ద్వేషించవలెను. నీవు ఈ మాటను సత్యమని నమ్మాలి లేనట్లయితే యేసు ప్రభువు అబద్ధము చెప్పినట్లు నిందవేసినట్లవుతుంది!!

ధనమును తృణీకరించుటయనగా దాని గూర్చి నీవు చింత కలిగి యుండకపోవుట. నీవు దానిని ఉపయోగించుదువు, కాని దానిని అంటిపెట్టుకొని ఉండకపోవుట. పరలోకములో వీధులు బంగారంతో చేయబడినవి. ఇక్కడ భూమిపై ప్రజలు బంగారమును వారి తలలపై పెట్టుకొనుచున్నారు, కాని, పరలోకములో బంగారము మన కాళ్ళ క్రిందనుండును. ఎవరైతే, ఈ లోకములో ధనమును వారి కాళ్ళ క్రిందనుంచుటను నేర్చుకొందురో అటువంటి వారి కొరకు పరలోకము సిద్ధపర్చబడినది.

యేసు ప్రభువు అనేక విషయముల గూర్చి తన శిష్యులకు కరిÄనమైన మాటలు చెప్పెను. మన కుడి కన్ను మనము పాపము చేయుటకు కారణమైతే దానిని ఊడబెరికి పారవేయమని (మత్తయి 5:29) ఆయన చెప్పెను. దానిని బట్టి మన కన్నులతో పాపము చేయుట ఎంత తీవ్రమైన విషయమో మనకు చెప్పెను. ఆయనను వెంబడించు వారు తమ స్వంత బంధువులను ద్వేషించవలెనని (లూకా 14:26) కూడా ఆయన చెప్పెను. అక్కడ మనము ఆయనను వెంబడించుటలో ఏ విధముగా మన కుటుంబ సభ్యుల ద్వారా మనకు ముఖ్య అభ్యంతరములు వచ్చుననే విషయమును ఆయన సూచించెను. సరిగా అదే విధముగా ఇక్కడ ధనమును గూర్చి కూడా యేసు తీవ్రమైన మాట చెప్పెను. మనము దేవుని ప్రేమించుటకు తప్పనిసరిగా ధనమును ద్వేషింపవలెనని ఆయన చెప్పెను. అనేక క్రైస్తవుల చేతిని ధనము అంటిపెట్టుకొని ఉంటున్నది. ఇందుచేతనే వారు దేవునిని అంటిపెట్టుకొని ఉండలేక పోవుచుంటిరి. చాలా కొద్ది మంది విశ్వాసులు ఈ ఆజ్ఞలను తీవ్రముగా తీసుకొనుచున్నారు. అందుచేతనే మిగిలిన వారు శిష్యత్వపు మార్గములో ఎప్పుడు నడువలేకపోవుచున్నారు.

ప్రభువు తన శిష్యులను వివాహమును, ఉద్యోగమును, ఆస్థిని మరియు ధనమును విడచిపెట్టి అడవులలో సన్యాసుల వలె జీవించుటకు పిలువలేదు. క్రైస్తవులు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క శిష్యులు కాదు గాని యేసు యొక్క శిష్యులు. మరియు యేసు ఆయన యొక్క ఈలోక కుటుంబ సభ్యులను పోషించుటకు తన జీవితములో ఎక్కువ కాలము వడ్రంగివానిగా జీవించెను.

ఈలోక విషయముల గూర్చి యేసుక్రీస్తు యొక్క వైఖరి చాలా సమతూకము నుండెడిది. ఆయన ఒక వివాహపు విందులో సమృద్ధిగా ద్రాక్షారసమును తయారు చేసెను. మరియు ఆయన 40 దినములు ఉపవాసముండగలిగెను. అదేవిధంగా ఒక నిజమైన శిష్యుడు కూడా ఒక మంచి భోజనమును బట్టి సంతోషించుటను మరియు అవసరమైనప్పుడు ఎట్లు ఉపవాసముండవలెనో కూడా తెలిసికొని యుండెను.

ధనాశ మనందరిలో ఉన్నది. ఒకడు తను ధనాన్ని ప్రేమించలేదనుకొంటే అది తనను తాను మోసపర్చుకొనడమో లేక అతడు అబద్దికుడో అయి ఉండును. ఎందుకనగా ప్రతి మానవుడు ధనమును ప్రేమించును. ధనాశ సమస్త కీడులకు మూలము (1తిమోతి 6:10) అని బైబిలు చెప్పుచున్నది. ప్రభువు మాత్రమే దాని నుండి మనలను విడుదల చేయగలడు.

మొదట చక్కగా ప్రారంభించి అటు తరువాత ధనము వెంబడి పడుట చేత వారి యెడల దేవుని యొక్క ఉత్తమ ఉద్దేశమును కోల్పోయిన వారి ఉదాహరణలు బైబిలులో ఎన్నో కలవు. లోతు ధనమును సంపాదించుటకు సొదొమ వెళ్ళి తన కుటుంబమంతటిని నాశనపర్చుకొనెను. బిలాము ధనమునాశించి ప్రవచించుట ద్వారా తనను తాను నాశన పర్చుకొనెను. గెహాజీ నామాను యొక్క ధనమును ఆశించుటచేత దేవుని యొక్క ప్రవక్త అయ్యే అవకాశమును పోగొట్టుకొనెను. దేమా ఈ లోక విషయములను ప్రేమించుట చేత పౌలును విడిచిపెట్టెను (2తిమోతి 4:10). క్రైస్తవ చరిత్రలో అటువంటి సంఘటనలెన్నో ఉన్నవి.

ధనమునకు సంబంధించిన విషయములలో నీతిగా యుండుట

ఒకడు తను క్రైస్తవుడుగా మార్పు చెందని దినములలో ఆర్థిక విషయములలో అవినీతితో నుండినట్లయితే, అతడు క్రైస్తవుడుగా మార్చు చెందిన తరువాత, దేవుడు తన గత పాపములను క్షమించెను కాబట్టి తన గత తప్పులను సరిచేసుకొను అవసరము లేదనుకొనకూడదు. క్రైస్తత్వములోనికి వచ్చిన వెంటనే గతములో దొంగిలించిన సొమ్మును వీలైనంత త్వరగా తిరిగి యిచ్చివేయవలెను. అప్పులు కూడా సాధ్యమైనంత త్వరగా తీర్చివేయవలెను అవసరమైతే నీవు కొన్ని మార్లు భోజనం మానుకొని మరియు నీ యింటిలో అనవసరమనుకొన్నవి అమ్మివేసి కూడా అటువంటి విషయములు త్వరగా పరిష్కరించు కొనవలెను. శిష్యత్వపు మార్గమిదే.

బహుశా తిరిగి యిచ్చివేయుటకు నీ దగ్గర తగినంత సొమ్ము లేకపోవచ్చును. అయినను నీవు కొద్దికొద్దిగా చెల్లించుట మొదలు పెట్టవచ్చును. బహుశా నెలకు పది రూపాయల చొప్పున, దేవుడు ఆయనను ఘనపర్చువారిని ఘనపర్చును. మన శక్తికి మించి కాదు కాని, సిద్ధమనస్సు కలిగి యిచ్చినదే దేవునికి అంగీకారమని బైబిలు చెప్పుచున్నది (2కొరిందీ¸ 8:12). జక్కయ్య తను ఇతరుల దగ్గరనుండి అన్యాయముగా తీసుకొనినది తిరిగి చెల్లిస్తానని వాగ్దానము చేసినప్పుడు మాత్రమే ఆ యింటికి రక్షణ వచ్చియున్నదని యేసు చెప్పెను. అంతేకాని దానికి ముందు కాదు (లూకా 19:9). దేవుడు అవినీతిని ఎప్పుడును దీవించడు. అనేక మంది క్రైస్తవులు వారు అన్యాయముగా తీసుకొనినది తిరిగి యిచ్చివేయక పోవుటచేత వారు ఆత్మీయముగా ఎదుగుట లేదు.

రోమా 13:8లో మనము ఎవ్వరికిని ఏదీ అచ్చియుండకూడదని చెప్పబడినది. మనము ఎవ్వరి దగ్గరైనా అప్పు తీసుకొనినట్లయితే, మనము సాధ్యమైనంత త్వరగా అది తీర్చి వేయవలెను. దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ఆశీర్వారములలో ఒకటి, వారు ఆయనకు లోబడినట్లయితే వారెప్పుడూ అప్పు తీసుకొనరనునది (ద్వితీ 28:12). క్రెడిట్‌ (వాయిదాల పద్ధతి) ద్వారా వస్తువులు కొనుట కూడా ఒక విధముగా డబ్బును అప్పుగా తీసుకొని అప్పులో పడినట్లే. దేవుని యొక్క ఆశీర్వాదము లేకుండా జీవించుట కంటే ఒక వస్తువు లేకుండా జీవించుటయే మంచిది.

బ్యాంకు నుండి కాని పనిచేయు ఆఫీసు నుండి కాని అప్పు తీసుకొనుట గూర్చి ఏమిటి? ఇల్లు కట్టుకొనుటకు కాని లేక వాహనము కొనుక్కొనుటకు కాని అప్పు తీసుకొనుట సరియైనదా? ఇక్కడ మన మనసులో ఉంచుకొనవలసిన సూత్రం బరువును చూపు త్రాసు యొక్క సూత్రం అయివున్నది. నీవు అప్పు తీసుకొనిన ద్రవ్యమునకు సమానమైన వస్తువు నీ దగ్గర చూపించుటకు ఉన్నది. కావున, నీవు అప్పు తీసుకొనిన ద్రవ్యమునకు తగినట్టుగా నుండిన వస్తువు (ఇల్లు లేక స్కూటరు వంటిది) త్రాసులో అవతలి ప్రక్కన నుండినట్లయితే, అప్పుడు నీవు నిజముగా అప్పులో లేనట్లే, నీవొకవేళ అకస్మాత్తుగా చనిపోయినట్లయితే, నీ భార్య ఆ అప్పు యొక్క భారముతో నుండదు. ఆ యిల్లు కాని స్కూటర్‌ కాని అమ్మివేసి ఆ అప్పు తీర్చగలిగియుండును. అయితే నీవు ఒక వివాహపు విందు కొరకు అప్పు తీసుకొని అంతయు ఖర్చుపెట్టినట్లయితే, అప్పుడు త్రాసులో ఇంకొక ప్రక్క చూపుటకు ఏమియు ఉండదు. అప్పుడు నీవు అప్పులో ఉండినట్లే. ఇటువంటి అప్పుల నుండి మనము తప్పించుకొనవలెను.

అనేక మంది క్రైస్తవులు వారి డబ్బును పెండ్లి కొరకై ఖర్చు పెట్టే విషయములో బుద్ధిహీనులుగా నుందురు. అనేక మంది దంపతులు వారి పెండ్లి రోజున ఘనమైన విందు ఇవ్వవలెనను కోరిక వలన వారి వివాహపు జీవితములను అప్పు అనే శాపము వారి తలలపై వ్రేలాడి ఉండునట్లు ప్రారంభింతురు. ఆ అప్పు తీరుటకు వారికి అనేక సంవత్సరములు పట్టును. అది అంతా గొప్ప విందులో ప్రజలు మెప్పు పొందవలెననే కోరిక వలన అయినది. సామాన్యమైన విందు ఇచ్చినట్లయితే ప్రజలేమనుకొందురో అనే విషయము గూర్చి వారు భయపడుదురు, కాని దాని తరువాత చాలా సంవత్సరములు వారు అప్పులో నుండుటను గూర్చి దేవుడేమనుకొనునను దాని గూర్చి భయపడరు. కేవలము కాఫీ, బిస్కట్లతో పెండ్లి విందు యిచ్చుటకు ధైర్యము కలవారిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, వారికి అంతే సామర్థ్యముండుటచేత అంతే చేసారు. గొప్ప పెండ్లి విందు ఇచ్చుటకు నీకు వనరులు ఉన్నట్లయితే నీ ఇష్ట ప్రకారము నీవు ఇవ్వవచ్చును. కాని గొప్ప విందు చేయుటకు నీవు అప్పుల్లో దిగినట్లయితే అది దేవునికి అపకీర్తి తెచ్చినట్లే. ఇది వినుటకు తీవ్రవాదముగా అనిపించవచ్చును. అయితే శిష్యత్వము తీవ్రవాదకరమైనదే.

అనేక మంది విశ్వాసులలో ఉంటున్న మరొక చెడ్డ విషయము వరకట్నం. యేసు క్రీస్తు యొక్క ఏ ఒక్క శిష్యుడు కూడా ఎప్పుడును వివాహసంబంధము నిర్ణయించుకొనుటకు గాను ఒక అమ్మాయినుండి కాని, ఆమె తల్లి దండ్రుల యొద్దనుండి కాని, వరకట్నము (డౌరీ) ను అడుగడు. వివాహమునకు పిదప అమ్మాయి తండ్రి ఏదైనా బహుమతిగా ఇచ్చుటలో తప్పేమీలేదు. కాని, వివాహ సంబంధము నిర్ణయించుకొనుట కొరకు డబ్బు ఒక ముఖ్యమైన కారణమయినట్లయితే అది తప్పనిసరిగా తప్పే! వరకట్నపు వ్యవస్థ పూర్తిగా సాతానుకు సంబంధించినది. అయినప్పటికిని అన్ని శాఖలకు సంబంధించిన క్రైస్తవులు కూడా దీనిని తీసుకొనుటను చూడగలము. 200 సంవత్సరముల క్రితం ఫ్రెంచి దేశపు నాస్తికుడైన వోల్టేరు అనే వ్యక్తి చెప్పినది, అయ్యో! ఎంత సత్యమైనది. అతడు ఇలా అన్నాడు. క్రైస్తవ మత శాఖలు వారి సిద్ధాంతపరమైన బోధలను బట్టి అనేకములుగానున్నవి, కాని డబ్బు విషయమొచ్చేసరికి వారందరకు ఒకే సిద్ధాంతమున్నది. అదేమిటంటే వారందరు దీనిని ప్రేమిస్తారు. ఇప్పుడు వరకట్నం విషయమొచ్చేసరికి కూడా వాళ్లందరకు ఒకే సిద్ధాంతమున్నది-దానిని ప్రేమిస్తారు.

నీటి బాప్తిస్మము కంటే కూడా వరకట్నము విషయములలో సరియైన ఆత్మీయ ఆలోచన ఉండుట ఎంతో ముఖ్యము. ఎందుకంటే పసిపిల్ల వానిగా ఉన్నప్పుడు బాప్తిస్మము తీసుకొని కూడా ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశింపవచ్చును కాని, లోభత్వము కలవాడు దేవుని రాజ్యములో ఎప్పుడును ప్రవేశింపలేడు (1కొరిందీ¸ 6:10).

దేవుడు మనకు ఇచ్చిన దానితో సంతృప్తి కలిగియుండుట భక్తి విషయములో మరొక ప్రాముఖ్యమైన విషయము. యేసు శిష్యులందరును వారు సంపాదిస్తున్న రాబడి యొక్క గిరిలోపలనే జీవించుట నేర్చుకొనవలెను. తన పిల్లలు ఎంత సంపాదించాలని నిర్ణయించునది దేవుడే కనుక మన కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఇతర క్రైస్తవులతో మనము పోల్చుకొనకూడదు. ఇతరులతో పోల్చుకొన చూచువారు గ్రహింపు లేనివారు అని బైబిలు చెప్తుంది (2కొరిందీ¸ 10:12). దేవుడు మన చుట్టూ గీసిన గిరిలో జీవించుట అనగా, ఉదాహరణకు, ఇతర కుటుంబముల వారు వారి ఇండ్లతో కొన్ని వస్తువులు కలిగియుండినా మనకు అందుబాటులో లేనప్పుడు వాటిని మనము కొనకపోవుట. మనమేదైతే కొనగలమో వాటియందే సంతృప్తి కలిగియుండుట మనము నేర్చుకొనవలెను.

యేసు ప్రభువునకు ఒక పశువుల పాకలో జన్మనిచ్చిన మరియ వైఖరిని గూర్చి ఆలోచించండి. ఆమె బిడ్డను ప్రసవించునప్పుడు, ఆమెకు ఒక శుభ్రమైన గది లేదు లేక చివరకు మరుగు స్థలము కూడాలేదు!! కాని ఆమె దాని గూర్చి ఫిర్యాదు చేయలేదు. ఆమె తనను తాను తగ్గించుకొని దేవుడు ఆమెకు ఏర్పర్చిన పరిస్థితిని అంగీకరించినది. ఒకరి యొక్క గిరిలోనే సంతృప్తిపడుట అంటే అదే.

ధనమునకు సంబంధించిన విషయములలో నమ్మకత్వము కలిగియుండుట

మన రాబడికి తగినట్లు జీవించుట, అప్పులను తప్పించుకొనుట మరియు ధనమునకు సంబంధించిన విషయములలో నీతి కలిగియుండుట సరిపోదు. అక్కడ నుండి దేవుడు మనకు ఇచ్చిన ధనము విషయములో మనము నమ్మకత్వము కలిగియుండవలెను.

ద్వితీ 8:18లో దేవుడే మనము భాగ్యమును సంపాదించుకొనగల్లునట్లు సామర్థ్యమునిచ్చునని చెప్పబడినది. అది మనమెప్పుడును మరచిపోకూడదు. నీవు ఒక బిక్షగాని కుటుంబములో జన్మించునట్లు ఆయన చేసియుండవచ్చును. నీవు ఒక మూఢుడుగానో లేక అవలక్షణం ఉన్నవాడిగానో ఉండునట్లు ఆయన అనుమతించవచ్చును. నీవు భాగ్యమును సంపాదించు కొనగలుగునట్లు నీకు కావాల్సిన వివేకవంతమైన సామర్థ్యమును మరియు తెలివిని ఇచ్చినది దేవుడే అను విషయం నీవెప్పుడును మరువకూడదు.

ధనము విషయములో నమ్మకత్వం కలిగియుండుట అనగా యేసు బోధించునట్లు మనము సంపాదించినదంతయు, దశమ భాగము మాత్రమే కాక(పాత నిబంధనలో అర్థముచేసికొన్నట్లు) మొత్తమంతా దేవునిదే అని గుర్తించుటైయున్నది. అందులో ఏదీ మనదికాదు. కనుక అంతయు బలిపీఠము పై నుంచి దేవునికి తిరిగి అర్పింపవలెను. మరియు ఆయన తిరిగి మనకు ఇచ్చిన దానిని, మనము పొదుపుగా, నమ్మకముగా మన ఈలోక అవసరములకు వాడవలెను.

5000 మందికి ఆహారము పెట్టిన సంఘటనలో మనము కనీసము రెండు విషయములను నేర్చుకొందుము. మొదటిగా దేవుడు దీవించినట్లయితే, కొంచెముండినా మన అవసరములన్నియు తీరుటకు అది చాలును అనునది. రెండవది దేవుడు వ్యర్థపుచ్చుటను యిష్టపడరనేది. యేసు తన శిష్యులతో మిగిలిన రొట్టె ముక్కలను మరియు చేపలను వ్యర్థము కాకుండునట్లు పోగుచేయుమని చెప్పెను. రొట్టెను చేపలను అధికమగునట్లుగా చేసినది తన తండ్రి కాబట్టి; అక్కడ తినగా మిగిలిన రొట్టె ముక్కలను, చేపలను అక్కడ కొండ ప్రక్కనే వ్యర్థముగా పడి ఉండినట్లు విడచిపెట్టే వైఖరి యేసు ప్రభువు కలిగియుండవచ్చును కాని, ఆయన అట్లు చేయలేదు. దేవుడు మనకు సమృద్ధిగా దీవించినంత మాత్రము చేత ఖర్చు విషయములో యిష్టమొచ్చినట్లు ఉండకూడదు.

కొద్దిగా పాడైనంత మాత్రము చేత నీవు వస్తువులను పారవేస్తున్నావా? అది ధనికుల యొక్క వైఖరి. ఒక భక్తిపరుడు పాడైన వస్తువులను బాగుచేయును. అటువంటి విషయాలకు ఆత్మీయతకు సంబంధము లేదని నీవనుకొనుచున్నావా? తప్పక ఉన్నది.

యేసు యొక్క శిష్యులుగా మనము, ఖర్చుపెట్టే విషయములో క్రమశిక్షణ కలిగియుండవలెను. భర్త ఇంటి యజమానిగా ఇంటిలో ఆర్థిక విషయాలను చూచుకొనవలెను. అనవసర ఖర్చులను ఆటంకపర్చుట తన బాధ్యతైయున్నది. తన భార్య కొనవలెనని అనుకొన్న కొన్నిటిని వారు కొనగలిగే స్థితిలో లేరని అతడు ఆమెకు వివరించవలెను.

ఎవడైతే కొద్దిలో నమ్మకముగా నుండునో అతడు అధికములో కూడా నమ్మకముగా నుండును. మనము చిన్న విషయములోను మరియు వస్తువుల గూర్చి నమ్మకముగా లేకపోయినట్లయితే, దేవుడు మనకు నిజమైన ధనమును ఇవ్వడు. ఆ ధనము ఆయన మాటను గూర్చిన బయల్పాటు మరియు ఆయన స్వభావమనే ధనసమృద్ధి. ఇది దేవుని యొక్క ముఖ్యమైన సూత్రమైయున్నది.

మనము ఆత్మీయముగా ఎదుగవలెనంటే దేనినైనను వ్యర్ధపుచ్చుట మానివేయవలెను. నీవు దేవుని నమ్మకమైన సేవకుడుగా నుండవలెనంటే, అనవసరమైన వాటిని కొనుట మానివేయవలెను. గొప్ప భోజనము గూర్చి కాని లేక ఖరీదైన జీవన శైలిగూర్చికాని డబ్బు వ్యర్థపుచ్చవద్దు. ఇంకను ఉపయోగించుటకు వీలున్న వస్తువులను పారవేయవద్దు. ఒకవేళ అవి నీకు ఇంక అవసరము లేక పోయినట్లయితే, కనీసము బీదలైన వారికి ఉచితముగా ఇచ్చివేయుము.

లూకా 14:33 మనకు కలిగినదంతయు విడచిపెట్టుమని చెప్తుంది.మనకు అనేక వస్తు వాహనములు ఉండవచ్చును. కాని, వాటిలో ఏదీ మనదిగా నుండకూడదు. కనుక, ఖరీదైన ఒకటి మన దగ్గర నుండి దొంగిలింపబడి లేక పాడైనట్లయితే అది నిజానికి మనది కాదు కాబట్టి దాని గూర్చి మనము కలత చెందడము లేక బాధపడిపోవడము చేయనక్కర్లేదు. మనము మన యజమాని యొక్క సంపదకు కేవలము గృహ నిర్వాహకులము మాత్రమే. దేవుడు అనేక వస్తువులను తన మహిమ కొరకు వాడబడులాగున మనకిచ్చెదరు. కాని మనము కేవలము ఇక్కడ యాత్రికులము మాత్రమే.

ఒక వ్యక్తి తనకున్నదంతయు దేవునికి ఇచ్చివేస్తే తప్ప అతడు శుద్ధహృదయము కలిగియుండలేడు. శుద్ధహృదయము, నిష్కల్మషమైన మనస్సాక్షి వేరైనది. ధనమునకు సంబంధించిన విషయములలో నీతిగా ఉండుట వలన నిష్కల్మషమైన మనస్సాక్షి కలిగియుండవచ్చును. కాని, శుద్ధహృదయము కలిగియుండుట అనగా ధనమునకు సంబంధించిన విషయములలో నమ్మకముగా నుండుట. నీవు నిష్కల్మషమైన మనస్సాక్షి కలిగియుండవచ్చును, అయినప్పటికి నీ హృదయము ఏదొక భూసంబంధమైన వస్తు, వాహనములకు గాని లేక ఒక ఉద్యోగమునకు గాని అతుక్కొని ఉండవచ్చును. అప్పుడు నీవు నీ హృదయమంతటితో దేవుని ప్రేమిస్తున్నావని నీవు చెప్పలేవు ఎందుకంటే నీ హృదయము పవిత్రముగాలేదు.

దేవునికిచ్చుట

ఇశ్రాయేలీయులు వారి రాబడిలో సుమారు నూటికి పదిహేను వంతులు దేవునికిచ్చెడి వారు (పదియవ భాగము మరియు ఇతర అర్పణలు కలసి). దశమ భాగమిచ్చుటలో నుండిన ఉద్దేశ్యము ద్వితీ 14:22,23 లో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు...నీవు దశమ భాగమివ్వవలెను అని చెప్పబడినది. ఇశ్రాయేలీయులు వారి పంట కోత సమయంలో కలసికొనినప్పుడు వారు అందులో పదియవ భాగమును ఇవ్వవలసియుండెను. దాని ద్వారా వారు ప్రతిది దేవుని నుండియే పొందిరనియు అందును బట్టి వారి జీవితాల్లో ఆయనకు ప్రథమస్థానమిచ్చుచున్నారనే విషయాన్ని ఒప్పుకొనుచుండిరి. కాని క్రమేణా దశమ భాగార్పణ ఒక ఆచారముగా మరియు ఒక భారముగా మారిపోయెను. ఈనాడు అనేక మంది విశ్వాసులకు కూడా అలాగే అయినది.

క్రొత్త నిబంధనలో కూడా సిరికంటే దేవునికే మొదట స్థానమివ్వాలనే సూత్రమే నిలచియున్నది. అయితే మనము దేవునికి ఎంత యివ్వవలెను? దేవుడు మనలను వృద్ధిపరచిన కొలది మనము ఇవ్వవలెనని క్రొత్త నిబంధన చెప్తుంది (1కొరిందీ¸ 16:2). కాని, ఇప్పటి ముఖ్యమైన విషయము ఇచ్చినదెంతైనా సంతోషముతో నివ్వవలెనని చెప్పబడెను (2కొరిందీ¸ 9:7).

లూకా 6:38లో మనమిచ్చినట్లయితే తిరిగి మనకివ్వబడుతుందని చెప్పబడినది. కాని నీవు తిరిగి పొందుదువనే ఆలోచనతో నిచ్చినట్లయితే నీవు నిరాశ చెందవచ్చును. ఎందుకంటే దేవుడు మనము ఇచ్చుటలో వెనుకనున్న ఉద్దేశ్యమును చూచువాడు కాబట్టి నీవు ఆయన యొద్ద నుండి ఏమియు పొందకపోవచ్చును. నిజానికి ఎవరైతే తిరిగిపొందుటకు ఆశించకుండా సంతోషముతో నిచ్చెదరో వారు మాత్రమే దేవుని యొద్ద నుండి ఉత్తమమైన దానిని పొందుదురు.

ఒకసారి ఒక సహోదరుని గూర్చి వింటిని, ఆయనకు ఎక్కువగా లేకపోయిననూ, ఆయన యింటిలో కావలసిన వాటికి ఆయన ఎప్పుడూ లోటు కలిగియుండలేదు మరియు ఎప్పుడూ అప్పులోకూడా లేడు. ఒకరు ఆయన జీవితములో నుండిన రహస్యము గురించి అడిగినప్పుడు, నేను దేవుడు నాకిచ్చిన దానిలో నుండి ఆయన తట్టు నాపారతో కొంత విసురుతున్నాను. ఆయన తిరిగి నావైపు విసురుచుండెను. అయితే దేవునిది చాలా పెద్ద పారయని నేను గమనించితిని, అని ఆయన చెప్పెను; మనమెప్పుడును మనము దేవునికిచ్చినదాని కంటే ఎక్కువగా పొందుదుము.

2కొరిందీ¸ 9:6, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని చెప్తుంది.

నేనెక్కడ బోధించినా దశమ భాగార్పణ గూర్చి వ్యతిరేకముగా బోధిస్తాననే విషయం బాగుగా తెలిసినదే. కాని ప్రజలు అర్థంచేసికోనిది, దశమ భాగార్పణకంటే కష్టమైన దానిని నేను బోధిస్తున్నాననే విషయం. అది దేవునికి నూటికి నూరువంతులు సంతోషముతో ఇచ్చు విషయము. యేసు ప్రభువు అదే బోధించారు. ధర్మ శాస్త్రమునకు లోబడు పరిసయ్యులకు నూటికి పదివంతులు ఇమ్మనమని (మత్తయి 23:23) ఆయన చెప్పెను. కాని పెంతెకొస్తు తరువాత నూతన నిబంధనకు లోబడవలసిన తన శిష్యులకు, తమకు కలిగినదంతయు ఇవ్వవలెనని ఆయన చెప్పెను (లూకా 14:33) దీనినే నేను గత 40 సంవత్సరాలుగా బోధిస్తున్నాను మరియు పాటిస్తున్నాను.

మనము దేవుని ఘనపరచినట్లయితే ఆయన మనలను ఘనపర్చును. మనము దేవుని రాజ్యమును మరియు నీతిని వెదికినట్లయితే, ఈ జీవితమునకు కావలసిన భూసంబంధమైన ప్రతి అవసరమును తీర్చబడుతుంది (మత్తయి 6:33). దేవుడు మనము కోరిన వాటినన్నిటిని ఇచ్చు బుద్ధిలేని పనిచేయడు, ఎందుకనగా ఆయన ఈ లోకపు తండ్రులమైన మనకంటే ఎంతో తెలివైనవాడు. కాని ఆయన మనకు అవసరమైన ప్రతీది ఇచ్చుటలో నమ్మకమైన వాడు, మనము కోరుకొన్న వాటికిని మరియు మనకు అవసరమైన వాటికిని ఎంతో తేడా యున్నది. ఫిలిప్పీ 4:19లో ఉన్న వాగ్దానము ఆయన మన అవసరములన్నియు తీర్చును అనునది.

మనము ఇచ్చుటలో కూడా జ్ఞానము కలిగియుండవలెను. అనేక మంది బీద ప్రజలు నమ్మకముగా ఇచ్చెదరు కాని, జ్ఞానయుక్తముగా ఇవ్వరు. వారు దేవుని పని అనుకొనిన దానికి ఇచ్చెదరు. కాని, వారిచ్చు డబ్బు ఎక్కడో ఒక దగ్గర ఒక అపనమ్మకస్థుడైన ఒక క్రైస్తవుడు గొప్ప ధర్జాతో జీవించుటకు ఉపయోగపడుతుంది. అటువంటి పేద ప్రజలు సద్భావముతో ఇచ్చువారే కాని వారు ఇచ్చుటలో తెలివిలేని వారైయున్నారు. మన సొమ్ము ఎక్కడికి వెళ్తుందని ఎట్లు ఖర్చు చేయబడుతుందనే విషయం మనము తప్పక తెలుసుకొనవలెను.

బీదలకు ఇచ్చుట

అందరి యెడలను, మరి విశేషముగా విశ్వాసగృహమునకు చెందిన వారి యెడలను మేలు చేయుదము, అని మనము ఆజ్ఞాపించబడినాము (గలతీ 6:10). ప్రతిచోట నుండిన విశ్వాసులలో బీదలకు సహాయపడాల్సిన బాధ్యత మనపైయున్నది. కాని సంఘములో నుండిన ఔదార్యము కలవారి నుండి ఆర్థికమైన మేలు పొందుటకు మాత్రమే సంఘమునకు వచ్చువారిని సంఘమునకు ఆకర్షించకుండునట్లు మనము జాగ్రత్త వహించవలెను. ఒక వ్యక్తి మొదటిగా స్థానిక సంఘ విశ్వాసులలో ఒక నిజమైన సహోదరునిగా ఋజువు చేసుకోగలుగుట చేత మాత్రమే ఇండియా దేశము వంటి బీద దేశములో అటువంటి ప్రమాదము నుండి తప్పించుకొనగలము. అప్పుడు మాత్రమే అతడు ఆర్థికముగా సహాయము పొందునట్లు చేయవలెను. అలా కానట్లయితే మనము సంఘమునకు శిష్యులనుకాక పరాన్న జీవులను చేర్చిన వారమగుదుము.

మొదటి క్రైస్తవులలో ఎవరికైతే సంపదకలదో వారు బీదలకు సహాయపడుటచేత అవసరంలో నుండిన వారెవ్వరూ లేరని అపొ.కా. 4:34లో చదువుదుము. ఎవ్వరు కూడా బీదల కిమ్మనమని ధనికులను బలవంతము చేయలేదు. వారు స్వేచ్ఛగా వారి హృదయములనుండి యిచ్చిరి.

కాని అనేకమంది విశ్వాసులకు బీదలకు సహాయము చేయుటకు తగిన జ్ఞానము లేకుండాయున్నది. వారు మనసుకు సంబంధించిన ఔధార్యముతో, కానివారికి బుద్దితక్కువగా ఇచ్చెదరు. దీని ఫలితముగా దేవుని యొక్క సొమ్ము వ్యర్థమగుటయే కాక, ధనికులిచ్చు సహాయము పొందుటకు మాత్రమే వచ్చు పరాన్ప జీవులు సంఘమునకు చేర్చబడుదురు. బీదలలో పేరు సంపాదించాలని మరియు బీద ప్రజలను తమ చుట్టూ త్రిప్పుకోవాలనే ఆలోచన కలిగిన ధనికుల చేత అటువంటి సహాయములు జరుగును. కొద్ది మొత్తములు అప్పుడప్పుడూ ఇచ్చినట్లయితే సమస్యరాదు. కాని, పెద్ద మొత్తములు కాని లేక సంఘములో ఒకరికి ఎప్పుడూ మానక సహాయపడాలని ఉద్దేశించినప్పుడు, నీకంటే జ్ఞానము కలిగిన ఒక భక్తిగల పెద్ద సహోదరుని ఈ విషయములో సలహా అడుగుట ఎప్పుడూ శ్రేయస్కరం. అంతేకాక ఆ పెద్దలకు సంఘములో ఎవరికి ఎక్కువ అవసరమున్నదో తెలిసియుండే అవకాశమున్నది.

మొదటి క్రైస్తవులు అటువంటి విషయములలో వారికి జ్ఞానము లేదని తమ్మును తాము తగ్గించుకొని ఒప్పుకొనిరి. అందుచేతనే వారిచ్చిన అర్పణలను బీదలకు పంచిపెట్టుటకు అపొస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. కాని, ఆ అపొస్తలులు ఆ సొమ్మును వారికి వారిగా ఎప్పుడూ తాకలేదు. పేతురు, యోహానులు ''వెండి, బంగారములు నాయొద్దలేవని'' చెప్పగలిగినంత నమ్మకత్వముతో వారి యొద్దకు వచ్చిన లక్షల సొమ్మును ఇతరులకు చేరునట్లు చేసిరి. ఆ సొమ్మంతా వారి చేతులకు ఏ మాత్రమును అంటుకొనకుండా వారి చేతుల ద్వారా వెళ్ళినది. అందుచేతనే వారి జీవితాంతము వరకు పరిశుద్ధాత్మ అభిషేకమును వారు ఉంచుకొనగల్గిరి. డబ్బును అందుకొంటున్న ఇప్పటి బోధకుల చేతులకు ఎంతో అంటుకొంటున్న ఈనాటి కథ ఎంతో వేరు.

మన నుండి అప్పుకోరు వారికి అప్పు ఇచ్చుటను గూర్చి ఏమిటి?

నేను నేవీలో పనిచేయు దినములలో నేనుండిన సంఘములో గల ఒక విశ్వాసి నా దగ్గరకు అప్పుకు వచ్చిన విషయం నాకు జ్ఞాపకం ఉన్నది. ''నిన్ను అడుగు వానికిమ్ము. నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు'', అని చెప్పబడిన దేవుని మాట నాకు తెలియును (మత్తయి 5:42). ఆ మరుసటి నెలలోనే అప్పుతీర్చివేయుదునని అతడు నాకు చెప్పెను. కనుక అతడు అడిగినది అతడికిచ్చాను. కాని అతడు ఆ మరుసటి నెలలో తిరిగి ఇవ్వలేదు సరికదా ఇంకొంత అడిగెను. నేను ఎక్కువ జీతం సంపాదిస్తున్నాను, సామాన్య జీవితం గడుపుతున్నాను మరియు నాకు కుటుంబములేదు.అందుచేత ఇచ్చుటకు నా దగ్గర కావలసినంత సొమ్ము ఉండినది. నేను అతడికి ఇంకొంత సొమ్మిచ్చాను మరల అతడు ఆ పైనెలలో అడిగినప్పుడు ఇంకొంత యిచ్చితిని. కొంత కాలమైన తరువాత అతడు ఆత్మీయముగా జారిపోయి, త్రాగుతూ డబ్బు వ్యర్థపుచ్చుచుండెను. అది చూచి నేను, అతడు ఆ విధముగా సాతానుకు యిచ్చటకు డబ్బు ఉండినట్లయిన నాకు ఇవ్వవలసినది తిరిగి యిచ్చినట్లయితే నేను దేవునికిచ్చు కొందునని చెప్పితిని. అతడు దానికెంతగానో కోపించి నేను తనను బాధిస్తున్నానని అనెను. కనుక అతనిని అప్పు తీర్చుమని అడుగుట మానివేసితిని.

అప్పుడు నేను దేవుని యొద్దకు వెళ్ళి నేను ఎక్కడ పొరపాటుచేసితినని అడిగితిని.ఆయన నా పొరపాటును చూపారు. ప్రభువు ఈ విధముగా చెప్పెను. నీవు నీ దగ్గరుండిన డబ్బును నీ స్వంతమైనట్లుగా అనుకొంటివి. అది నిజానికి నాది. నీవు అప్పుగా ఇచ్చినా సరే నీవు మొదటనన్ను సంప్రదించాల్సింది. ఒకరు నాకు పదివేల రూపాయలు యిచ్చి జాగ్రత్తగా ఉండమంటే, అది తెల్సుకొనిన నీవు నా దగ్గరకు వచ్చి దాని నుండి కొంత అప్పుయిమ్మంటే, ఆ సొమ్ము నాది కాదు కాబట్టి, నీకు అప్పిచ్చుటకు ముందు నేను స్వంతదారుని అడుగవలెనని చెప్పుదును. అయితే పై విషయములో నేనలా చేయలేదు. నా డబ్బు దేవునిదని నేను గుర్తించలేదు. యేసు లూకా 14:33లో ఆజ్ఞాపించినట్లు నేను అన్నిటిని విడిచిపెట్టినట్లయితే (ప్రభువు కొరకు), నా కున్నదంతా ప్రభువుది కాబట్టి దీని గూర్చి ప్రభువును అడుగవలెనని అతడికి చెప్పి యుండెడివాడను. కాని, దానికి బదులుగా నేను అక్షరానుసారమైన లేఖనమునకు యాంత్రికముగా లోబడుట ద్వారా దేవుని సొమ్మును కొంతపోగొట్టు కొనియున్నాను. సాతాను కూడా ఒకమారు యేసు ప్రభువుకు లేఖనము నెత్తి చూపెను. నేను లేఖనమును లేఖనముతో సరిపోల్చి చూడవలసింది.

మనము తప్పక అవసరతలో నుండు వారికి సహాయము చేయ్యవలెను. కాని, ప్రతిసారి దానిగూర్చి ప్రభువును అడుగవలెను. మనము దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలన జీవించవలెను. మనము దేవునిని వెదకినట్లయితే, అతనికి డబ్బు యివ్వవచ్చునా లేదా అనునది మన ఆత్మలో ఒక సాక్ష్యము పొందుదుము. ఒక్కొక్క మారు నిన్ను ధన సహాయమడుగుతున్న వ్యక్తి దేవుడు పందుల మధ్య క్రమశిక్షణ నిస్తున్న ఒక తప్పిపోయిన కుమారుడేమో నీకేమి తెలియును. అలా అయినట్లయితే, నీవిచ్చిన సొమ్ము ఎంతయినా అది అతడు తండ్రి యింటికి తిరిగిరాకుండునట్లు ఆటంక పరుస్తుందే తప్ప అతడికి సహాయపడదు.

ఈనాడు మనము ధర్మశాస్త్రము యొక్క నియమనబంధనల చేత జీవించనక్కర్లేదు, కాని ప్రతి పరిస్థితిలో, మనము ఏమిచెయ్యాలో, ఏమి చెయ్యకూడదో అద్భుతంగా చెప్పు పరిశుద్ధాత్మ నడిపింపు నందు జీవించుదుము, దానిని బట్టి దేవునికి స్తోత్రము.

పూర్తి కాలపు క్రైస్తవ పనివారు

1 కొరిందీ¸ 9:14 సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించవలెనని ప్రభువు నియమించియున్నాడని చెబుతుంది. అయితే పౌలు 15 నుండి 18 వచనాలలో తనకు అలాంటి ఆధారము అక్కర్లేదని చెప్పాడు. ఎందుకనగా తనను తాను పోషించుకుంటూ ప్రభువుకు సేవించు పద్దతిలో ఆయన పనిచేసెను. అందును బట్టియే ప్రభువునకు ధనము ఇచ్చుటను గూర్చి ఆయన కొరిందీ¸ క్రైస్తవులతో స్వేచ్ఛగా మాట్లాడగలిగియుండెను. ఆయనెప్పుడు వారి దగ్గర ఎటువంటి ఆర్థిక సహాయము తీసుకొనలేదు కావున అట్లు మాట్లాడగలిగియుండెను. అవసరములో నుండిన విశ్వాసులకు వారి యొక్క ధన సహాయము ఇమ్మనమని వేడుకొనెను.

యేసు ప్రభువు గాని లేక ఇతర అపొస్తలులు గాని ఎప్పుడూ వారి పరిచర్య కొరకు ఆర్థిక సహాయము చేయుమని అడుగుటను మనము ఎక్కడా చూడము. బీదలకు ఇమ్మనమని మాత్రమే వారు చెప్పిరి. (మార్కు 10:21; యోహాను 13:29; 2కొరిందీ¸ 8,9 అధ్యా; గలతీ 2:10). ధనమునకు సంబంధించిన విషయములో శిష్యత్వపు మార్గమిదియే.

ఈ సందేశము ఈనాటి పూర్తి సమయపు పనివారికి ప్రత్యేకముగా అవసరమైయున్నది. ఎందుకనగా అనేకులు వారి పరిచర్యకు సహాయపడమని సిగ్గుపడకుండా అడుగుటయే కాక ఇవ్వని వారిని దేవుడు శిక్షాస్తాడని చెప్తూ ఒత్తిడి చేయుదురు. ఇది దేవుని మార్గము కాదు. మనము మన సమయమును మరియు శక్తిని ఇతరుల కొరకు నీరువలె పోసినప్పుడు ఇతరుల కొరకు జాగ్రత్త తీసుకొనిన మన కొరకు దేవుడు నీటిని పోయును (మన కొరకు జాగ్రత్త తీసుకొనును - సామెతలు 11:25). ఇది దేవుని యందు విశ్వాసముంచిన మార్గము, ఇందులో మనము మనుష్యులపై ఆధారపడకుందుము.

నేను భారతీయ నౌకాదళములో పనిచేసినప్పుడు, నా శరీరావసరములు మరియు జీతము విషయములో ఆ నావికాదళమే నా గూర్చి జాగ్రత్త వహించింది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆర్థిక సహాయము అడుగవలసిన అవసరము నాకుండెడిది కాదు. నావికాదళము కంటే లేక మరి ఏ యజమాని కంటె దేవుడు గొప్పవాడు కాడా? మనము నిజముగా సర్వోన్నతుడైన దేవుని సేవకులమైనట్లయితే, మనము మానవమాత్రుల సహాయము అడుగవలసి యుంటుందా? ఆయన యొక్క సేవకులు వెళ్ళి ఇతర విశ్వాసుల నుండి ద్రవ్యమును అడుగుకొనుట మన దేవుని యొక్క గౌరవానికి అవమానము. ఆయన యొక్క సేవకులు మనుష్యులపై కాక ఆయన పైననే ఆధారపడాలని దేవుడు ఎంతగానో కోరుకొనును. ఆయన రోషము గలవాడు.

నేకొక ఉదాహరణ చూపుదును. ఒక రోజున ఒక సూటును వేసికొని వచ్చిన ఒక పాశ్చాత్యుడు నీ యింటికి వచ్చి అతడు అమెరికా దేశపు రాయబారినని నీకు పరిచయము చేసికొన్నాడనుకొందాము. తరువాత అతడు తన దేశము ఆర్థికముగా యిబ్బందుల గుండా వెళ్తుందని అందుకోసమే తన దేశపు అవసరాల నిమిత్తము కొంత సొమ్మును (అది ఎంత తక్కువైనా) సహాయము చేయమని నిన్ను అడిగినట్లయితే నీవేమనుకొందువు? అతడు మాయమాటలు చెప్తున్నాడనియు, అతడు నిన్ను మోసపుచ్చటానికి ప్రయత్నిస్తున్నాడనియు నీవు వెంటనే తెల్సుకొందువు. ఎట్లు తెల్సుకొందువు? అమెరికా దేశపు ప్రభుత్వము ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సొమ్మును దండుకొనే స్థితికి ఎప్పుడు దిగజారలేదని నీకు బాగుగా తెలియుట చేత.

ఇప్పుడు ఒకాయన మీ యింటికి వచ్చిగాని లేక ఒక పత్రిక పంపుట ద్వారా కాని ఆయనను యేసు ప్రభువు యొక్క రాయబారిగా పరిచయం చేసికొని, దేవుని యొక్క రాజ్యము ధనమునకు యిబ్బందిలో నున్నది కావున దేవుని పనికి ఎంతో కొంత సొమ్మిచ్చుట ద్వారా (అది ఎంత తక్కువైనా) దేవునిని యిబ్బంది నుండి తప్పించమని అడిగెననుకొనండి. అతడిని నీవు నమ్ముదువు. ఎందుకు? దేవుని రాజ్యము అమెరికా ప్రభుత్వము కంటె ఎంతో తక్కువ స్థితిలో నున్నదని నీవు అనుకొనుటచేత, అది ఎంతో విచారించాల్సిన సత్యము!! మరియు ఈ కారణము చేతనే అనేక మంది నమ్మకముగా మోసపుచ్చువారు ''దేవుని సేవకులు''గా చూపుకొనుచూ వేల మంది విశ్వాసులను వంచించుచున్నారు.

అనేక మంది దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు దేవుని రాజ్యము యొక్క గౌరవాన్ని ఎంతగానో దిగజార్చేసారు. దీనికి కారణము వారు ధనమునకు సంబంధించిన విషయములో యేసు యొక్క శిష్యులు కాకపోవుటైయున్నది. అందుచేతనే వారు ఎవరినీ ధనమునకు సంబంధించిన విషయములలో యేసు యొక్క శిష్యులుగా చేయలేక పోవుచున్నారనునది స్పష్టమగుచున్నది.

ఈనాడు అనేక బోధకులు బైబిలు పాఠశాలలు మరియు అనాధాశ్రమములు స్థాపించుట ఇతరులకు సహాయపడుటకు కాక వారి కొరకు మంచి సంపాదన సంపాదించుటకును మరియు వారి కుటుంబము గొప్పగా జీవించుటకు వీలగునట్లును అయి ఉన్నది. వారి ప్రయాసము యొక్క ఫలితముల గూర్చిన గొప్ప నివేదికలను వారి యొక్క పత్రికల ద్వారా మహోన్నతమైన డాలరును సంపాదించుటకు ఇతర దేశములకు పంపించుదురు. ధనమును గూర్చిన వెదకులాట మనదేశములో ఎందరో దేవుని సేవకులను నిజముగా నాశనము చేసినది.

దేవుని పని కొరకు ఇవ్వబడిన ద్రవ్యము లోకములో నుండిన ద్రవ్యమంతటికంటె పవిత్రమైనది. ప్రత్యేకముగా మనను ఉద్దేశించి ఇవ్వకపోయినప్పుడు, ఆ సొమ్ములో ఎంతో కొంత మన స్వంతానికి కాని లేక మన కుటుంబ అవసరానికి కాని, తీసుకొనినట్లయితే, మనము చాలా ప్రమాదములో నిల్చున్నట్లే. అది మన యొక్క నిత్యత్వమును కోల్పోయేటంతటి ప్రమాదమైయున్నది. మన యొక్క జన్మ హక్కును ఒక పూట కూటి (ధనము) కొరకు పోగొట్టుకొందుము.

క్రైస్తవ పనివారు పొదుపుగా జీవించు అవసరత ఎంతో నున్నది. ఇది కూడా ధనాశ నుండి విడుదల పొందుటలో ఒక భాగమైయున్నది. క్రైస్తవ పనివారు వారి స్వంత జీతములో ఖర్చు పెట్టాల్సివచ్చినప్పుడు ఎంతో జాగ్రత్త కలిగియుండుట నేనుచూచాను. కాని దేవుని పని కొరకు ఇవ్వబడిన దానిని ఖర్చు పెట్టునప్పుడు వారు దుబారాగా నుందురు. అమెరికా దేశములో నున్న కొందరు బీద విధవరాళ్ళు వారి కష్టము నుండి పొదుపు చేసిన సొమ్మును ఇండియా దేశములో దేవుని పని కొరకు పంపుదురు. ఇక్కడ ఇండియా దేశపు పనివారు అటువంటి సొమ్మును తన కొరకు ఖరీదైన గొప్ప ఇంటిని కట్టుకొనుటకు మరియు విచ్చలవిడిగా ఖర్చయ్యే భోజనాలు యొదలగు వాటికి ఖర్చు చేయుదురు. ఇది, అపనమ్మకత్వమైయున్నది. అటువంటి పనివారు బోధించినప్పుడు ప్రవచన వాక్కు లేకపోవుటకు ముఖ్యకారణము అదియే.

ఇండియా దేశపు సంఘమునకు ప్రవక్తల లోటు ఎందుకున్నది? సుమారు 100 కోట్ల ప్రజలున్న ఈ దేశానికి మన రోజుల్లో ప్రవక్తలను పంపనంతగా ప్రభువు పట్టించుకొనక పోవుట సాధ్యమా? దేవుడు తప్పనిసరిగా ఇండియా దేశము గూర్చి ఆసక్తి కలిగియున్నాడు. మరియు మన దేశములో అనేకులను ప్రవక్తలుగా పిలచియుండిరి. కాని వారిలో అనేకులు వారి ప్రవచనవరము సిరికి అమ్మివేసి బిలాము మరియు గెహాజీ మార్గమున వెళ్ళిరి. ఈనాడు ప్రవక్తలు చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు.

ఇండియా దేశపు సంఘము తన స్వంతకాళ్ళపై నిలువబడాల్సిన అవసరమొచ్చినది. అది నెరవేరుటకు ఇండియా దేశములో క్రైస్తవ పనికై పై దేశాలనుండి వచ్చు ద్రవ్యమును ప్రభువు ఒక దినాన ఆపివేయవచ్చును. ప్రభువు ఆ విధముగా చేసినట్లయితే జీతగాళ్ళు వెంటనే బయల్పడుదురు, ఎందుకనగా వారు చేయుపని వదలి వారు పారిపోవుదురు. అప్పుడు బహుశా నిజమైన ప్రవక్తలు లేచుదురు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము కట్టబడును మరియు మన ప్రభువు యొక్క నామము మనదేశములో మహిమ పర్చబడును.

దేవుడు నిన్నొకవేళ ఆయనను సేవించుటకు పూర్తి కాలము పనిచేయు వానిగా పిలిచినట్లయితే, నీవు దేవునికి సేవకునిగా నుండునట్లు రూఢిపర్చుకో అంతే కాని ఎప్పటికిని మనుష్యులకు సేవకునిగా మారకు. ధనికులు నీకు వ్యక్తిగతముగా ద్రవ్యము నిచ్చుట మొదలు పెట్టినప్పుడు, దేవుని యొక్క సందేశమును రాజీపర్చుట సుళువవుతుంది, అదేవిధముగా వారిని అభ్యంతరపరచు విధముగా నీవు ఎప్పుడూ ఏమీ చెప్పకుందువు. మనము వెల యిచ్చికొనబడినవారము కావున మనమెప్పుడూ మనుష్యులకు సేవకులుగా మారకూడదని 1 కొరిందీ¸ 7:21,23 లో బైబిలు చెప్తుంది. అనేకమంది విశ్వాసులు వారిచ్చు బహుమానముల ద్వారా నిన్ను వారికి బానిసలుగా చేసుకొనవలెనని ప్రయత్నించుదురు. అందును బట్టి వాటి గూర్చి జాగ్రత్త కలిగియుండుము.

ఇతర విషయములు

ఈనాడు ఇండియా దేశములో ప్రభువు యెడల అనేక క్రైస్తవుల విశ్వాసము మరియు నమ్మకత్వము పరీక్షింపబడు ఒక అంశమేమనగా, క్రైస్తవేతరులు వారి పండుగలు జరుపుకొనుటకు క్రైస్తవుల దగ్గరకు వచ్చి డబ్బు అడుగు విషయం. ఒక క్రీస్తు యొక్క శిష్యుడు దయాళుత్వముతో నుండవచ్చును కాని అటువంటి విషయములలో ఖచ్చితముగా నుండవలెను. అటువంటి సమయములలో అతడు బీదలకొరకు ఏదైనా చేయుటకు సంతోషముతో నివ్వగలను కాని తనకు నమ్మకము లేక పోవుట చేత ఇతర పండుగలకు డబ్బివ్వలేనని చెప్పవలెను. ఈ దినాల్లో మన దేశములో కొన్నిచోట్ల, ఆ విధముగా తిరస్కరించుట, క్రైస్తవుని యొక్క ప్రాణానికి కూడా ప్రమాదము రావచ్చును. అటువంటి పరిస్థితులలో, శిష్యుడైనవాడు జ్ఞానము కలిగియుండవలెను. అతడు ప్రభువును ఎట్టి పరిస్థితులలోను కాదనకూడదు. కాని అతడి నుండి ప్రజలు బలవంతముగా డబ్బును ఒక దోచుకొనువాడు తీసుకొనునట్లు తీసుకొనినట్లయితే, దాని గూర్చి అతడు అపరాధభావముతో నుండనక్కర్లేదు, ఎందుకనగా దేవుడు అతడి పరిస్థితిని అర్థము చేసికొనును.

మనదేశములో అనేకులు ఎదుర్కొను వేరొక సమస్య, ప్రభుత్వ కార్యాలయములలో మనకు న్యాయ సమ్మతముగా రావాల్సిన పర్మిటు లేక లైసెన్సు లేక శాంక్షను మొదలగు వాటి కొరకు డబ్బు ఇవ్వవలసి రావడము గూర్చియైయున్నది. అనేకమంది బోధకులు వారి యొక్క ''పరిశుద్ధత'' గూర్చిన పేరు పోతుందనే భయముతో ఈ అంశమును గూర్చి బోధించుటకు భయపడుదురు. కాని మన దేశములో క్రైస్తవులు ప్రతిదినము ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ విషయం గూర్చి సరియైన బోధ ఎంతో అవసరమైయున్నది. కనుక దీని గూర్చి కొంత వివేకముతో కూడిన సలహా నేనివ్వవలెననుకొనుచున్నాను. అది అనేకమంది విశ్వాసుల భుజములపై నుండిన అనవసరమైన అపరాధ భారమును తీసివేయును.

1కొరిందీ¸ 6:12, 10:23లో చదివినట్లు మనము జీవించగల్గిన మూడు స్థాయిలున్నవి.

  1. చేయకూడనివి - అవినీతితో చేయు పనులు.
  2. చేయదగినవి - కనీసమైన నీతితో జీవించు జీవితము.
  3. క్షేమాభివృద్ధి కలుగజేయునవి - విశ్వాసము యొక్క అత్యున్నత స్థాయిలో జీవించుట.

మనమెప్పుడూ చేయకూడనివి చేయు స్థితికి దిగజారకూడదు అనునది స్పష్టము. అందును బట్టి మనమెప్పుడూ దుర్నీతితో దేనినైనా పొందుటకు ఎవ్వరికిని ద్రవ్యమివ్వకూడదు. అది ప్రభుత్వమును (సంస్థను) మోసము చేయుటయై యున్నది మరియు నీవిచ్చేది లంచమైయున్నది.

అయితే ఒక అధికారి న్యాయసమ్మతముగా ఖచ్చితముగా రావాల్సిన ఒక పర్మిటు కొరకు ద్రవ్యమడిగినట్లయితే, ఆ ఆఫీసు చుట్టూ మరల మరల తిరుగకుండునట్లు అడిగిన ద్రవ్యము నిచ్చినట్లయితే అది ఏమిటి? అటువంటి పరిస్థితిలో నీవు ఎవరిని మోసగించలేదు. నీకు నీవుగా నీ స్వంత సొమ్మును, ఒక హోటలులో సర్వరుకు అతడు నీకు చేసిన సేవకు సంతోషించి ఇచ్చిన బహుమానము (టిప్‌) ఇచ్చినట్లు నీవిచ్చితివి. ఇది ఒక దోపిడి దొంగ తన తుపాకిని నీపై గురిపెట్టి నిన్ను అడిగినప్పుడు నీవు నీ డబ్బును తీసియిచ్చిన దానితో కూడా పోల్చవచ్చును. నీ ప్రాణాన్ని రక్షించుకొనుటకు నీవు ఆ దోపిడి దొంగకు నీ యొక్క డబ్బు ఇచ్చెదవు. ఇక్కడున్న తేడా ఏమిటంటే ఆ అధికారి తుపాకీ కాక ఒక కాగితపు సందేశాన్ని నీపై గురిపెడుతున్నాడు. అయినప్పటికిని ఇది పగటి దోపిడి. కాని ఇందులో నీ స్వంత ప్రయోజనము కొరకు దుర్నీతి ఏమీ జరుగలేదు. ఇది రెండవ స్థాయి - చేయదగినవి అను స్థాయి.

అయినప్పటికి, వేరొక సహోదరునికి, సరిగా ఇటువంటి పరిస్థితిలోనే, ఆ గుమాస్తాకు సొమ్ము ఏమీ ఇవ్వకుండగనే ప్రభువు తనకు కావాల్సిన పనిని చేయుంచుననే విశ్వాసము కలిగియుండవచ్చును. ఇది అన్నిటికంటె ఉన్నతమైన స్థాయి. కాని అందరకు అటువంటి స్థాయి గల విశ్వాసముండక పోవచ్చును. ఎవరికైతే అటువంటి విశ్వాసముంటుందో వారు అటువంటి విశ్వాసములో జీవించవచ్చును. కాని వారు, వారికున్నంత విశ్వాసము వేరేవారికి లేదని ఇతరులను తీర్పు తీర్చకూడదు (ఇది రోమా 14 అధ్యాయములో తేటగా చెప్పబడినది).

అయితే మనము కేవలము దేవుని నమ్మినట్లయితే, అప్పుడు దేవుడు మన కొరకు ఒక అద్భుతము చేయాలనుకొన్న పరిస్థితిలో మనము ఒక అవినీతిపరుడైన అధికారికి డబ్బిచ్చి ఆ కష్టపరిస్థితి నుండి తప్పించుకోవాలని చూస్తున్నామేమో మనము తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులను మనము గ్రహించుకోవాలి. కనుక మనమెదుర్కొన్న ప్రతి కష్టమైన పరిస్థితిలో మనము దేవునిని వెదకి ఆయనకు సంత

అధ్యాయము 4
శిష్యత్వము మరియు సంఘ విషయములు

యేసు ప్రభువు యొక్క శిష్యుడెప్పుడును ఒంటరివానిగా నుండడు, అతడు ఎప్పుడును స్థానిక సంఘములో నుండిన శిష్యులతో సహవాసము కలిగియుండును.

ఒకరినొకరు ప్రేమించుకొనుట (యోహాను 13:35) ఆయన శిష్యుల యొక్క ముఖ్యమైన గుర్తు అని యేసు చెప్పెను. ఒక శిష్యుడు ఇతర శిష్యులతో సంబంధము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమగును. కనుక శిష్యుడు ఒంటరివాడుగా నుండుట అనేది ఉండదు.

భూమిలో పడి మరణించని గోధుమ గింజ ఒంటరిగానే, యుండునని యోహాను 12:24లో తేటగా చెప్పబడింది. అయితే చనిపోయిన గింజ ఎక్కువగా ఫలిస్తుంది. అటువంటి శిష్యుడు క్రీస్తు శరీరముగా నుండిన స్థానిక సంఘము కట్టగలుగునట్లు ఇతర శిష్యులను కనుగొననైనా కనుగొంటాడు లేక ఇతరులను శిష్యులుగా తయారు చేస్తాడు. ప్రతి శిష్యుడు అటువంటి స్థానిక సంఘములో తప్పక భాగమై యుండవలెను. నీవు ఒంటరిగా ఉన్నావంటే అది నీవు భూమిలో పడి చావక పోవుట చేతనే.

దేవుని యెడల భయము

క్రొత్త నిబంధనలో సంఘము దేవుడు కట్టుచున్న ఇంటిగా చూపింపబడినది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని సామెతలు 24:3లో చెప్పబడినది.

ఒక శిష్యుడు కేవలం వాక్యమును చదివినంత మాత్రాన జ్ఞానవంతుడు కాడు. అది కేవలము వాక్య పరిజ్ఞానాన్ని మాత్రమే పెంచుతుంది. జ్ఞానమునకు మూలము దేవుని భయమైయున్నది (సామెతలు 9:10). దేవుని యందలి భయము క్రైస్తవ జీవితమునకు 'అ' 'ఆ'లు అయిఉన్నవి. ''పై నుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైయున్నది'' అని యాకోబు 3:17లో చెప్పడినది. అందువలన క్రీస్తు శరీరమును కట్టదలచిన వారెవరైనా మొదట దేవుని యెడల భయమును నేర్చుకొనవలెను. ''నా యొద్దకు రండి నేను యెహోవా యందలి భయభక్తులు నేర్పెదను'' (కీర్తనలు 34:10) అని వారు ఇతరులకు చెప్పగలిగి యుండవలెను.

మనము సిద్ధాంతపరమైన ఖచ్చితత్వమును, ఉద్రేకపూరిత అనుభవాలను, స్తుతి ఆరాధనను, సువార్తీకరణను ఇంకను ఇటువంటి వెన్నిటినో ప్రాముఖ్యముగా చెప్పవచ్చును. కాని వీటన్నిటి క్రింద దేవుని యెడల భయము అనే పునాది లేనట్లయితే, మనము కట్టినదంతా ఒకనాడు కూలిపోవును.

దేవుని సంఘము కార్యక్రమములతో, వేరు వేరు పనులలో ధనముతో, మానవ ప్రణాళికలతో లేక వ్యాపార ప్రపంచము యొక్క ఏ సూత్రముతో కూడా కట్టబడదు. అటువంటి సూత్రములతో చేయబడిన క్రైస్తవ పని చూచుటకు మానవదృష్టికి ఆకర్షణీయముగా నుండవచ్చును. కాని దేవుడు అగ్నితో దానిని పరీక్షించినప్పుడు, అది కేవలము కర్ర, గడ్డి, కొయ్యకాలుగా బయల్పర్చబడును (1కొరిందీ¸ 3:11,15).

దేవుని యొక్క ఇంటికి ప్రత్యేకముగా కనబడే ముఖ్య లక్షణము తమను తాము తీర్పు తీర్చుకొనుటైయున్నది (1పేతురు 4:17) తనను తాను తీర్పు తీర్చు కొనుటయనునది దేవుని ముఖము యెదుట నిలువబడుట యొక్క ఫలితమైయున్నది. యెషయా, యోబు మరియు యోహాను ఈ ముగ్గురు కూడా వారు దేవుని చూచినప్పుడు వారిలోనున్న పాపాన్ని మరియు వారి యొక్క పనికిమాలినతనాన్ని చూడగలిగారు (యెషయా 6:5; యోబు 42:5,6; ప్రకటన 1:17).

ఆదాము హవ్వలు దేవుని పరిశుద్ధతను అతిక్రమించినప్పుడు, వారు ఏదేను వనమునుండి తరిమి వేయబడ్డారు. అప్పుడు దేవుడు జీవవృక్షమునకు ముందు ఖడ్గజ్వాలలతో కెరూబులను నిలువబెట్టెను. ఈ జీవవృక్షము యేసు ఇచ్చు నిత్యజీవము (దైవ స్వభావము) ను సూచిస్తుంది. ఖడ్గము, మనము దైవ స్వభావములో పాలివారమగుటకు ముందు మనకు మనము చనిపోవుటను గూర్చి చూపిస్తుంది. యేసు పై ఆ ఖడ్గము మొదట పడెననునది సత్యమైయున్నది. అయితే మనము కూడా ఆయనతో సిలువ వేయబడినాము (గలతీ 2:20) మరియు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యిచ్చలతోను దురాశలతోను సిలువ వేసి యున్నారు (గలతీ 5:24).

కెరూబులవలె, సంఘములో పెద్దలు కూడా కత్తిదూసి, దైవికమైన జీవితమునకు ఒకే ఒక్క మార్గము శరీర ఇచ్ఛలు, దురాశల విషయములో చనిపోవుట అను విషయమును ప్రకటించాలి. దేవునితో సహవాసమునకు మొదట నుండిన మార్గము కూడా ఖడ్గముద్వారానే. ఈ ఖడ్గము దూయబడక పోవుట చేతనే ఈనాడు అనేక సంఘములు రాజీపడేవారితో నిండిపోయి క్రీస్తు శరీరమునకు ప్రతినిద్యము వహించుట లేదు.

సంఖ్యా 25:1 లో ఇశ్రాయేలీయులు మోయాబీయులతో వ్యభిచారము చేసిన విషయమును మనము చదువుతాము. ఇశ్రాయేలీయులలో ఒకడు ఒక మోయాబు స్త్రీని తన గుడారములోనికి కూడా తెచ్చెను (6వ). కాని ఒక యాజకుడు ఫినెహాసు ఇశ్రాయేలు జనాంగము నాశనము కాకుండా ఆరోజు కాపాడెను. అతడు దేవుని యొక్క ఘనత కొరకు ఎంతో ఆసక్తి కలిగియుండి, అతడు వెంటనే ఒక ఈటెను తీసుకొని ఆ గుడారములోనికి వెళ్లి ఆ స్త్రీని, ఆ పురుషుని ఒకే దెబ్బతో చంపెను (7,8వ). అప్పుడు దేవుడు ఆ తెగులును ఆపెను (9వ). కాని అప్పటికే 24,000 మంది ప్రజలు చనిపోయిరి. ఆ కత్తి దూసిన ఒక్క కెరూబు లేక పోయినట్లయితే ఆ రోజు ఇశ్రాయేలు సమాజమంతా ఆ తెగులుచేత చనిపోయి ఉండేది. అంత త్వరగా ఆ తెగులు వ్యాపించినది.

ఖడ్గదారియైన కెరూబు ప్రతి సంఘములో నుండుట ఎంత విలువైనదో నీవు చూచావా?

ఈనాడు ఖడ్గమును ఎలాగు ఉపయోగించవలెనో తెలిసిన ఫినెహాసులు తగినంత మంది లేక పోవుట చేత క్రైస్తవలోకములో తెగులు ఎంతో వడిగా వ్యాపిస్తున్నది. ఎంతో మంది పెద్దలు, భోదకులు మనుష్యులను సంతోషపెట్టువారుగా నుండి మోయాబీయులను ప్రేమించమని ఎప్పుడూ చెప్పుచుందురు. సంఘములో ఖడ్గమును ఉపయోగించకూడదని సాతాను ఒక వంద వాదనలు విసిపిస్తుండును. అతడు తన వాదనలను బలవపర్చుకొనుటకు చివరకు వాక్యమును కూడా ఆధారముగా చూపును. యేసు ప్రభువునకు అట్లే లేఖనములను ఎత్తిచూపెను.

ఫినెహాసు ఖడ్గమును ఉపయోగించుట వలన అతడికి కలిసివచ్చినదేమిటి? ఏమీ లేదు. దానికి బదులుగా అతడు పోగొట్టుకొనునది ఎక్కువ. దయగలవాడు, సాత్వీకుడు అను కీర్తిపోయెను. అంతేకాక చంపబడిన వ్యక్తి యొక్క బంధువులు మరియు స్నేహితులు కోపమునకు మరియు అతడి వెనుక అనేక మాటలు మాట్లాడుకొనుటకును అతడు గురి అయ్యెను. కాని దేవుని నామము యొక్క మహిమ, ఘనత ఫినెహాసు అట్లు చేయుటకు ప్రేరేపించినది. నేను ఓర్వలేనిదానిని అతడును ఓర్వలేకపోయెను (సంఖ్యా 25:11) అని చెప్పుటు ద్వారా దేవుడు అతడి పరిచర్యను ఆమోదించెను. ఆఖరుగా విశ్లేషించి చూచినప్పుడు, దేవుడు ఆమోదించిన ముద్రించినదే కావాల్సినది. దేవుడు ఇంకా అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను...ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగియుండెను ...(సంఖ్యా 25:12,13) అని ఫినెహాసు గూర్చి చెప్పెను. దీని ముందు ఒక అధ్యాయములో కూడా దేవుడు ఏవిధముగా లేవీయులు ఖడ్గమును ఉపయోగించుట వలన వారికి ఆయన యొక్క సమాధాన నిబంధనను యిచ్చెనో చూడగలము (మలాకీ 2:4,5).

ఈనాడు అనేక సంఘములలో సమాధానము లేకపోవుటకు కారణము, దేవుని యొక్క ఖడ్గమును ఉపయోగించకుండా మానవరీతిలో సమాధానమును కోరుకొనుట వలననే, దాని ఫలితము తగవులు, గొడవలు అయి ఉన్నది. ఇంటిలో కాని సంఘములో కాని దేవుని యొక్క సమాధానమును ఖడ్గముతోనే తేవల్సియున్నది (అది స్వంత జీవమును చంపుట ద్వారా).

సంఘములో నాయకత్వము వహించువారు, వారు సంఘమును పవిత్రతో నుంచవలెనంటె వారు దేవుని ఘనత కొరకు అత్యాసక్తి కలిగిన కోర్కెతో నుండవలెను. వారు దయగలవారని, మృధువైన వారను పేరుపొందుటకు మరచి, కేవలం దేవుని నామ మహిమ కొరకు మాత్రమే ఆలోచన కలిగియుండవలెను.

దేవుని నామ ఘనత విషయములో అటువంటి ఆసక్తియే యేసు ప్రభువు రూకలు మార్చు వారిని దేవాలయములో నుండి వెళ్లగొట్టునట్లు చేసినది. దేవుని యింటిని గూర్చిన ఆసక్తి ఆయనను భక్షించెను (యోహాను 2:17). క్రీస్తు వలె ఉండుటలో ఇది ఒక ముఖ్యమైన విషయము. కాని అది ఒకరికి అపకీర్తి తెచ్చునట్లును, అపార్థము చేసికొనునట్లును చేసినట్లయితే క్రీస్తు పోలికలో ఉండుటకు ఎవరు కోరుకొనెదరు?

హోషేయ 6:1లో, దేవుడు మొదట మనలను చీల్చివేసి తరువాత మనకు కట్టుకట్టి బాగుచేయును అని మనకు చెప్పబడినది. ప్రతి సంఘములో అటువంటి తూకము మనకు కావాల్సియున్నది. అది లోపలున్న కేన్సరు పుండును తీసివేయుటకు కోసి చీల్చడము, తరువాత బాగుపడునట్లు కట్టు కట్టడము అవసరము. అటువంటి పరిచర్య ఇద్దరు సహోదరులు ఏకభావముతో కలసి పనిచేసినప్పుడు మాత్రమే నెరవేరును. ఒకరు కోసి చీల్చడము చేసినట్లయితే వేరొకరు దానిని తిరిగి అతకునట్లు చేయవచ్చును. పౌలు, బర్నబాలను పరిశుద్ధాత్ముడు ఒక జోడిగా పిలిచెను (అపొ.కా. 13:2). అందులో పౌలు ఎక్కువగా కోసి చీల్చే పనియు బర్నబా ఎక్కువగా తిరిగి అతికే పని చేసేవారు.

ఆయన మాటలు వాడిగల ఖడ్గముగా యున్నవనియు (యెషయా 49:2), అలాగే అలసిన వానిగా ఊరడించు మాటలు(యెషయా 50:4) కలవాడిగా ఉండునని యేసు ప్రభువు గూర్చి యెషయా ప్రవచించెను. ప్రభువు, సంఘములో ఈనాడు వాడి కలిగినటువంటి విధముగా మరియు ఆదరణ కలుగునట్లు రెండు విధములుగా మాట్లాడును.

యేసు ప్రభువు దినములలో ఆయన మాటలు విన్నవారు పశ్చాత్తాపపడి ఆయన శిష్యులుగానైనా అయ్యేవారు లేక అభ్యంతరపడి ఆయనను విడిచైనా వెళ్లి పోయేవారు. యేసు ఒకమారు పేతురుతో ఖటువుగా మాట్లాడారు (మత్తయి 16:23). అయినా కూడా పేతురు అభ్యంతర పడలేదు, ప్రభువును విడచి వెళ్ళలేదు (యోహాను 6:68). వేరొక విషయములో ఇస్కరియోతు యూదా, యేసు అనిన చిన్న మాటకు అభ్యంతరపడి విడచి వెళ్లిపోయెను (యోహాను 12:4-8; మత్తయి 26:14 తో కలిపి చూడండి). దేవుని వాక్యము ఈనాడు కూడా మనము అభ్యంతర పడుదుమో లేదో పరీక్షించి చూచును. ఈ విధముగా దేవుని వాక్యము ప్రకటింపబడని సంఘము దేవుని ఉద్దేశమును నెరవేర్చదు.

సహవాసము మరియు ఐక్యత

ప్రేమ యేసు శిష్యులయొక్క ముఖ్యమైన గుర్తు. కనుక యేసు యొక్క శిష్యుల మధ్య సహవాసము ఎంతో ప్రాముఖ్యమైనది.

మత్తయి 18:18-20లో యేసు యొక్క శిష్యుల మధ్య ఉన్న అటువంటి సహవాసము నుండి వచ్చు శక్తిని గురించి మనము చదువుతాము. ఆ వచనాలలో నుండిన భావము సుమారుగా ఇలా ఉంటుంది.

''నా శిష్యులు ఇద్దరు లేక ముగ్గురు వారి మధ్యన ఏ అనైక్యత లేకుండా అనేకమైన సంగీత వాయిద్యములు వేరు వేరు ధ్వనులు చేయుచున్నను ఒకే రాగము పలికిస్తున్నట్లుగా అంగీకారముతో నుండినట్లయితే, అప్పుడు వారి మధ్యను నేను యుందును మరియు అప్పుడు వారు నా తండ్రిని ఏమడిగినను అది వారికివ్వబడును. సాతాను పనులను భూమిపై ఏ స్థలమందైనా బంధించుటకు వారికి అధికారముండును. ఇక్కడ భూమిపై సాతాను యొక్క ఎటువంటి క్రియలనైనా వారు బంధించినప్పుడు, వాటి మూలస్థానమైన ఆకాశమండలములో (రెండవ ఆకాశము, - సాతాను యొక్క అపవిత్రాత్మలు అక్కడనుండియే పని చేయును) అవి బంధింపబడును. అటువంటి విశ్వాసులకు భూమిపై సాతాను చేత బంధింపబడిన వారిని విడుదల చేయుటకు కూడ శక్తి యుండును'' అని యేసు చెప్పెను.

యేసు ప్రభువు యొక్క శిష్యుల మధ్య నుండిన ఐక్యతలో మరియు సహవాసములో గల గొప్ప శక్తి సాతానుకు తెలియును. కాని చాలా మంది విశ్వాసులకు అది తెలియదు. అందుచేతనే విశ్వాసుల మధ్య బేధములు కల్పించుట సాతానుకు ఎప్పుడూ ముఖ్యమైన పనిగా నుండును. ఆవిధంగా వారు అతడి యెదుట శక్తి హీనులగునట్లుగా చేయుచున్నాడు.

ఒక ఇంటిలో భార్య, భర్త ఆత్మలో ఒకటిగా నుండినట్లయితే ఆ ఇంటిలో ఎంతో శక్తి యుంటుంది. అటువంటి ఇంటిని సాతాను ఎప్పుడునూ జయించలేడు!

ఒక సంఘములో ఒకవేళ కేవలం ఇద్దరు శిష్యులు ఒకే ఆత్మతో నుంటె అటువంటి సంఘములో ఎటువంటి శక్తి యుండునో కదా! అటువంటి సంఘమును సాతాను ఎప్పటికిని జయించలేడు.

అటువంటి ఐకమత్యము మరియు సహవాసము లేకపోవుట చేతనే సాతాను అనేక క్రైస్తవ సంఘములపై, గృహములపై జయమును పొందగలుగుచుండెను.

దయ్యములను వెళ్లగొట్టుట గురించి నేను చెప్పుట లేదు. యేసు ప్రభువు మార్కు 16:17లో చెప్పినట్లుగా ఆ విషయములో విశ్వాసముండిన ఏ విశ్వాసియైనా, ఒంటరిగానే యేసు నామములో దయ్యములను వెళ్లగొట్టవచ్చును. నిజానికి అవిశ్వాసులు కూడా యేసు నామములో దయ్యములను వెళ్లగొట్టగలరని మత్తయి 7:22,23లో మనము చదువుతాము.

కాని అపవాది పనులను బంధించట, దాని ద్వారా ప్రజలను సాతాను కల్పించిన సమస్యల నుండి విడుదల చెయ్యుట ఎంతో కష్టమైన విషయము. ఒక విశ్వాసి ఒంటరిగా ఆ పని చెయ్యలేడు. దానికి క్రీస్తు శరీరముగా చెప్పబడునది కావలెను. క్రీస్తు శరీరముగా చెప్పబడుటకు కనీసము ఇద్దరు శిష్యులుండవలెను. అటువంటి శరీరము ద్వారా ప్రయోగింపబడిన అధికారమే చీకటి శక్తులను దూరముగా నుంచగలదు.

ప్రతి సంఘములో ఒకరితోనొకరు సంపూర్తిగా ఏకీభవించు వారు కనీసము ఇద్దరుండవలెను. సాతాను ఎప్పుడూ అటువంటి ప్రధానమైన వారిని గురిగా ఎంచుకొని వారిని విడదీయుటకు ఎప్పుడూ ప్రయత్నించును. అపవాది ఆ విషయము సాధించినట్లయితే, అప్పుడు ఆ సంఘము వాని ఎదుట శక్తి లేనిదగును. అయితే ఆ ప్రధానమైన వారు ఇంకను ఐక్యముగానుండుట కొనసాగించినట్లయితే ఆ సంఘము యెదుట సాతాను శక్తిహీనుడగును. ఇది ఒక గృహము విషయములో కూడా వర్తించును.

ఒక కుటుంబములో ఎదిగిన పసి పిల్లలు ఉండినట్లే ప్రతి సంఘములో కూడా పరిణితి చెందినవారు మరియు క్రొత్తగా క్రీస్తును విశ్వసించిన వారుందురు. పసిపిల్లలు సమాధానకరమైన మార్గమును అర్థము చేసికొనకపోవుట చేత వారు ఒకరితో ఒకరు దెబ్బలాడు కొనుచు, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొనుచు సణుగుకొనుచూ మరియు గాలి కబుర్లు చెప్పుకొనుచుండ వచ్చును. అటువంటి పసిపిల్లలు ప్రతి ఎదుగుతున్న సంఘములోనూ ఉందురు. కాని వారు దేవుని కార్యమును ఎప్పుడు ఆటంకపర్చజాలరు. సంఘములో ప్రధాన భాగముగా నుండిన ఐక్యత కలిగిన పెద్దలు ఆ సంఘమును ఒక జయించు సంఘముగా తయారు చేయగలరు. ప్రతి సంఘములో పసిపిల్లలుగా నున్న వారు ఎక్కువ సంఖ్యలో నుండవచ్చును. అయితే దేవుడు ఎప్పుడూ ప్రధాన భాగమును ఆత్మీయముగా మరియు సంఖ్యాపరముగా కట్టుటకు చూచును. సాతానుకు వ్యతిరేకముగా పోరాడునది మరియు సంఘమును జీవముతోను మరియు విజయములోనూ ఉంచునది ఆ ప్రధాన భాగమైయున్నది.

ఒక సంఘములో సహవాసము, సువార్త ప్రకటించుట కంటె ప్రాముఖ్యమైనది. తప్పిపోయిన గొఱ్ఱెపిల్ల ఉపమానములో మందలో నుండిన 99 గొఱ్ఱెలు మారుమనస్సు పొందనవసరము లేని 99 నీతిమంతులని యేసు చెప్పెను (లూకా 15:7). మారుమనస్సు పొందనక్కర్లేని వారెవరు? ఎవరైతే వారిని వారు ఎప్పుడూ తీర్పు తీర్చుకొందురో, వారు వారి పాపముల గూర్చి ఎప్పుడూ పశ్చాత్తాపము చెందుచుందురు కావున వారికి ఎటువంటి మారుమనస్సు అక్కర్లేదు. అటువంటి శిష్యులకు ఒకరితో ఒకరు కలసి ఉండుటకు ఎటువంటి సమస్యా ఉండదు.

ఒకవేళ మందలో నుండిన 99 గొఱ్ఱెలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి దెబ్బలాడుకుంటూ, ఒకదానికొకటి చీల్చివేసుకుంటూ ఉండినట్లయితే, ఆ గొఱ్ఱెల కాపరి తప్పిపోయిన గొఱ్ఱెను అక్కడికి తిరిగి తీసుకొనిరాడు. ఎందుకనగా అటువంటి మందలోనికి వచ్చి చంపబడుట కంటె ఎక్కడో కొండపై ఉండుటయే దానికి మంచిది.

మన సంఘములు ''మారుమనస్సు అవసరములేని నీతిమంతులను కలిగియుండాలి''. అప్పుడు మాత్రమే తప్పిపోయిన గొఱ్ఱెపిల్లలు తీసుకొని రాబడుటకు వీలైన స్వస్థత మరియు సమాధానము ఇచ్చు స్థలముగా మన సంఘములుండును. ప్రభువు తనగొఱ్ఱెలను పచ్చికగల చోట్లకు నడిపించి శాంతికరమైన జలముల యొద్ద పరుండ చేయును. యేసు ప్రభువు నిర్మించు సంఘము సమాధానకరమైన స్థలముగా నుండును. అటువంటి సంఘములోనికే తప్పిపోయిన గొఱ్ఱెలు తేబడవలెను. అనేక సంఘములు అట్లులేవు. దానికి కారణం అందులో సభ్యులు క్రైస్తవ్యంలోనికి మారిన వారు తప్ప శిష్యులైన వారు కాదు.

నేకొకమారు బౌద్ధమతము నుండి క్రైస్తవుడుగా మారిన వానిని కలుసుకొన్నాను. అతడు మొదటసారి ఒక క్రైస్తవ సంఘములో చేరినప్పుడు అక్కడ జరుగుతున్న గొడవులు చూచి ఎంతగానో భయపడి బౌధ్ధమతమే మంచిదేమో అని కొన్నిసార్లు అనుకొన్నట్లు చెప్పాడు. అటుతరువాత నిజమైన ప్రేమ, సహవాసము గల ఒక సంఘమును కనుగొన్నాడు. అప్పుడు అతడు ఆదరణ పొందాడు.

పక్షపాతము

అనేక సంఘాలలో మనముచూచే మరియొక చెడ్డ విషయం పక్షపాతము చూపుట (యాకోబు 2:1). ఆ అధ్యాయములో యాకోబు, మన కూటాల్లో ధనికులకు ప్రత్యేక ఆసనములు ఇవ్వడం గురించి మనలను హెచ్చరిస్తాడు. అలా చేయువారు పాపము చేసినట్లే (యాకోబు 2:9). ఇది భాషాపరంగా మరియు కులపరంగా ప్రత్యేకత చూపు విషయానికి కూడా వర్తిస్తుంది.

అనేక సంఘములలో ఒక భాషకు సంబంధించిన విశ్వాసులు వేరొక భాషకు సంబంధించిన విశ్వాసులతో సాధారణంగా కలవరు. ఒక ప్రాంతానికి చెందినవారు ఇతర ప్రాంతము వారితో సహవాసము చేయరు. అలాగే వేరు వేరు కులములకు సంబంధించిన వారు వారిలో వారే సహవాసముగా కలసియుందురు. అయితే వారు యేసు యొక్క శిష్యులైనట్లయితే నాగరికుడు మర్యాద తెలియని వాడు ఏ సమస్యా లేకుండా సహవాసములో కలసియుందురు.

క్రొత్త నిబంధన ప్రకారము శరీరానుసారముగా ఎవ్వరినీ ఎరుగము అని 2కొరిందీ¸ 5:16లో చెప్పబడినది. ప్రతియొక్కడు క్రీస్తునందు నూతన సృష్టి (17వ) కాబట్టి మనము శరీర రంగును కాని, జాతి లేక కులమును కాని చూడకూడదు. నూతన సృష్టిలో భాష, జాతి లేక కులముల యొక్క ప్రత్యేకతలుండవు. మనము విశ్వాసులను అటువంటి జీవితములోనికి నడిపించనట్లయితే, మనమెప్పటికిని యేసు క్రీస్తు యొక్క సంఘమును కట్టలేము.

ఇక్కడ ఒక హెచ్చరిక మాట అవసరమైయున్నది. ఒకడు కులపరమైన బేధములను పట్టించుకొనువాడు కాదని ఋజువు చేసికొనుటకుగాను ఒక యేసు క్రీస్తు యొక్క శిష్యుడు వేరొక కులమునకు సంబంధించిన వారిని చేసికొనాలని లేదు. కొందరు అలా చేసికొని చివరకు చికాకుల్లో పడినవారున్నారు. వివాహములో ఒకరితో ఒకరు సర్దుకుపోవాల్సియున్నది. కనుక ఇద్దరిలో నుండిన వ్యత్యాసములు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. యేసు యొక్క శిష్యుడుగా నుండుట అనగా వివాహము గూర్చి ఆలోచించునప్పుడు ఒకడు వయస్సు, విద్యార్హత, కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి మొదలైన వాటిని ఆలోచించకూడదని కాదు. ఒకడు సరియైన నిర్ణయమునకు వచ్చుటకు ముందు ఇవన్ని కూడా ఆలోచింనవలసి వచ్చును.

ఒక సంఘ పెద్దగా నీవు పక్షపాతము కలగియుండు విషయమును గూర్చి కూడా ఆలోచించుము. నీవు బోధించునప్పుడు, ఒక విషయము గూర్చి గట్టిగా చెప్పునట్లు నీ ఆత్మలో ప్రేరేపింపబడి, అట్లు చేయుచు నీ మాటలు వినువారిలో అవి ఎవ్వరికో బాధ కలిగిస్తాయని నీవు గ్రహించావనుకో అప్పుడు వారిని బాధపెట్టుట నీకిష్టము కాకపోవుటచేత, ఆత్మ నీలో చెప్పినది నీవు చెప్పకపోయినట్లయితే, నీవు మనుష్యులను సంతోష పెట్టుట కొరకు నీకివ్వబడిన ఖడ్గాన్ని దేవుడు ఉద్దేశించినట్లు నీవు ఉపయోగించలేదన్నమాట. ఇది ఒకరిపై ప్రత్యేక అభిమానాన్ని చూపుటైయున్నది. దానిని బట్టి నీ పరిచర్యలో నీవు దేవుని అభిషేకాన్ని పోగొట్టుకొందువు.

పరిశుద్దాత్ముని వరములు

ఆత్మీయ వరముల గూర్చి ఇప్పుడు చూచెదము. క్రీస్తు శరీరమును కట్టుటకు ఇవి కూడా అవసరమైయున్నవి.

క్రొత్త నిబంధనలో మూడు జాబితాలలో ఆత్మీయవరములు గూర్చి చెప్పబడినది (1కొరిందీ¸ 12:8-10; రోమా 12:6-8; ఎఫెసీి 4:11).

మానవ శరీరములో అవయవముల ఉపయోగముతో ఆత్మీయ వరముల ఉపయోగము 1కొరిందీ¸ 12:12-26లో పోల్చబడినది. ఒకనికి ప్రాణముండవచ్చును. కాని అతడు గ్రుడ్డి, మూగ, చెవుడు, మరియు పక్షవాతము గలవాడుగానుండవచ్చును. అనేక సంఘములు అట్లే యున్నవి. వారి సభ్యులు నూతనముగా జన్మించినవారు. కాని ప్రభువును సేవించుటకు వారికి పరిశుద్ధాత్మ వరములు లేవు. అందుచేత వారు శక్తిహీనులై యున్నారు.

ఆత్మ వరములు క్రీస్తు శరీరము చూడగలుగునట్లు, వినగలుగునట్లు మాట్లాడ గలుగునట్లు మరియు నడవగలుగునట్లు చేయును. దైవభక్తి క్రీస్తు శరీరమునకు ప్రాణమైయున్నది. కాని ఆత్మవరములు లేకుండా క్రీస్తు శరీరము ఇతరులకు ఏమి చేయగలుగును. ఆత్మ యొక్క వరములు లేకుండా యేసు ఎలా ఉండేవారు? అవి లేకుండా కూడా ఆయన పాపాన్ని జయించి ఉండేవారు మరియు పరిశుద్ధమైన జీవితమును జీవించియుండేవారు కాని ఆత్మ యొక్క అభిషేకము లేకుండా ఆయన బోధించిన విధముగా, రోగులను స్వస్థపర్చి, దెయ్యములను వెళ్లగొట్టి, లేక అనేక అద్భుతాలు చేసి బోధించి యుండేవారు కాదు.

యేసు ప్రభువు 30 సంవత్సరాల వయసున్నప్పుడు పరిశుద్ధాత్మచేత అభిషేకింపబడుట అంతకు ముందు కంటె ఆయనను మరి ఎక్కువగా పరిశుద్దునిగా చేయలేదు. ఆయన యొక్క 31వ సంవత్సరములో ఆయన 29వ సంవత్సరము కంటె ఎక్కువ పరిశుద్దునిగా లేరు. కాని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వలన ఆయన ఇతరులకు పరిచర్య చేయుటకు కావాల్సిన శక్తిని పొందారు. యేసు ప్రభువు కేవలము ఇతరులకు ఆయన పరిశుద్ధతను చూపిస్తూ తిరుగుతున్నట్లయితే, ఆయన జీవితంలో తండ్రియొక్క ఉద్దేశములను నెరవేర్చకుండా యుండియుందురు. అదే విధముగా ఇప్పుడు కూడా సంఘము ఇతరులకు తన పరిశుద్ధ్దమైన జీవితమును చూపించుట ద్వారా దేవుని ఉద్దేశమును నెరవేర్చదు. యేసు ప్రభువు పరిశుద్ధత మరియు వరములు, రెండూ కలిగియుండెను. ఈనాడు ఆయన శరీరము కూడా ఆ రెండూ కలిగియుండవలెను.

ఈనాడు క్రైస్తవలోకంలో నుండిన విచారించాల్సిన విషయం, కొన్ని గుంపులు పరిశుద్ధ జీవితం గూర్చి మరికొన్ని ఆత్మవరములు గూర్చి ఎక్కువ చేసి చెప్తున్నాయి. కాని ఇవి, ఇది లేక అది అని ఎంచుకోవాల్సిన అంశములు కావు. బైబిలు ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము (ఎల్లప్పుడు పరిశుద్ధమైన జీవితమును ధరించుకొనుట), నీ తలకు నూనె తక్కువ చేయకుము (ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద జీవించుట) అని చెప్తుంది (ప్రసంగి 9:8). మనకు ఆ రెండును కావలయును.

ఆత్మ వరములు ఎవరినీ ఆత్మీయమైన వానిగా చేయవు. కొరిందీ¸ క్రైస్తవులకు ఆత్మవరములు అన్ని కలవు (1కొరిందీ¸ 1:7). వారు వారి కూటములలో జ్ఞాన వాక్కును అభ్యాసము చేసారు (అది ఆత్మవరములలో నొకటి). అయినప్పటికిని వారిలో ఒక జ్ఞానవంతుడైనవాడు (ఆత్మీయముగా) కూడా లేకుండెను (1కొరిందీ¸ 6:5). జ్ఞాన వాక్కు ఒక శరీరానుసారుడైన వాని యొద్దనుండి కూడా వచ్చును. కాని జ్ఞానము ఒక ఆత్మీయమైన వాని యొద్దనే ఉండును. ఒకడు దేవుని నుండి ఒకానొక క్షణంలో జ్ఞానవాక్కును పొందవచ్చును. కాని జ్ఞానము అనేక సంవత్సరములు సిలువ మోయుట ద్వారా వచ్చును.

క్రీస్తు శరీరములో ఒకని పరిచర్యకు ఏ వరము సరిపోవునో నిర్ణయించేది దేవుడే కాబట్టి ఆత్మవరములను మనకు మనము ఎంచుకొనలేము. కాని క్రీస్తు శరీరము కట్టుటకు ఉపయోగమైన వరములను ఆసక్తితో అపేక్షించుమని మనము ఆజ్ఞ పొందియున్నాము. అందులో ముఖ్యముగా ప్రవచన వరమును అపేక్షించవలెను (1కొరిందీ¸ 14:1,12).

యేసు ప్రభువు తన శిష్యులను పరిశుద్ధాత్మ గూర్చి తండ్రిని వేడుకొనుమని చెప్పినప్పుడు, తన పొరుగు వాని యింటికి వెళ్లి ఆహారము గూర్చి అడిగిన ఒక మనుష్యుని ఉపమానమును ఆయన చెప్పెను (లూకా 11:13). రెండు ముఖ్య విషయములు ఈ ఉపమానములో మనము గ్రహించవలెను.

  1. ఆ మనుష్యుడు అతడి కొరకు కాక ఇతరుల కొరకు ఆహారమును అడిగెను.
  2. అతడికి కావల్సినది దొరికినంత వరకు అతడు అడుగుచూ ఉండెను.

ఈ ఉపమానము నుండి మనము నేర్చుకొనేదేమిటి? మొదటగా మనము మన స్వంత ప్రయోజనాల కొరకు ఆత్మ వరములు కోరుకొనకూడదు. కాని ఇతరుల కొరకు మాత్రమే అడుగవలెను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును మరియు ఆత్మ వరములను కోరుకొనువారు ఈ ఒక్క సూత్రమును వారియెదుట నుంచుకొనినట్లయితే వారు ఆత్మీయ స్థితిలో ఎంతో ఎదుగుదురు. మరియు ఈనాడు క్రైస్తవ్యంలో నకిలీ ఆత్మవరముల అభ్యాసములుండక పోవును. దురదృష్టవశాత్తు ఇతరులకు దీవెనకరముగా నుండుటకు కాక, వారి కొరకు ఒక అనుభవాన్ని పొందుటకే పరిశుద్ధాత్మ శక్తిని కోరుమని అనేకుల బోధలలో వింటున్నారు.

మన చుట్టూ అనేకులు అవసరతలో నున్నారు. వారి అవసరాలు మన ద్వారా తీర్చాలని దేవుడు ఉద్దేశించెను. అందుచేతనే వారు మనలను కలుసుకొనేటట్లు చేయుచుండెను. అటువంటి వారిని విడుదల చేయటకును దీవించుటకును ఆత్మవరములు ఆయనయొద్ద కోరుకొనవలెనని ఆయన ఆశించుచున్నాడు.

ఒకసారి ఒకడు తన కుమారునికి దయ్యము పట్టినదని యేసు ప్రభువు శిష్యుల యొద్దకు తీసుకువచ్చెను. కాని శిష్యులు అతడికి సహాయమేమి చేయలేకపోయెను. అప్పుడు ఆ మనుష్యుడు యేసు నొద్దకు వెళ్ళి ''నీ శిష్యుల యొద్దకు సహాయము కొరకు వెళ్లినా వారేమి చేయలేక పోయిరి'' అని చెప్పెను (మత్తయి 17:16). మన పొరుగు వారు, మన స్నేహితులు ఈ రోజు ప్రభువు దగ్గర మన గూర్చి అట్లు చెప్పుచున్నారా?

మన కొరకు మాత్రమే ప్రభువు దగ్గర మనము దీవెనలు కోరుకొన్నట్లయితే మనము ఎండిపోయెదము. నీళ్లు పోయువారికి మాత్రమే నీళ్లు (సహాయము) పోయబడును (సామెతలు 11:25). బహుశా నీకు దగ్గరలో ఉన్న ఒకనికి తన క్రుంగిన స్థితిలో ఒక ప్రోత్సాహరిచే మాట కావలసి యుండెనేమో. ఇంకొకరు ఏదో ఒక బంధకముల నుండి విడుదల అవసరమై యున్నారేమో. అటువంటి వారికి సహాయము చేయటకు దేవుని యొద్ద మనము వరములను అడుగవలెను.

ప్రతి ఆత్మ యొక్క వరము ఇతరులను దీవించుటకును, క్షేమాభివృద్ధి కలుగజేయుటకును మాత్రమే మనకు ఇవ్వబడెను. లూకా 4:18,19 యేసు ప్రభువు పరిశుద్ధాత్మలో అభిషేకింపబడిన ఫలితము గూర్చి చెప్తుంది. అది ఆయన బీదలకు సువార్త ప్రకటించుట, చెరలో నున్న వారిని విడిపించుట, గ్రుడ్డి వారికి చూపునిచ్చుట, నలిగిన వారిని విడిపించుట, ప్రభువు యొక్క హిత వత్సరమును ప్రకటించుటకునై యున్నది. ఇక్కడ చెప్పబడిన ప్రతీది ఇతరుల ప్రయోజనము గూర్చినది. ఆత్మ యొక్క వరములు ప్రభువునకు ఆయన జీవితములో ఆయనకేమీ ప్రయోజనము కల్పించలేదు.

ఆత్మ వరములను సరియైన రీతిలో అడుగ వలెనంటె, మనకు ఇతరులను గూర్చిన భారము మరియు వారికి సహాయపడుటలో మన యొక్క చేతకాని తనము మన గ్రహింపులో నుండవలెను.

పై ఉపమానములో మనము నేర్చుకొనవలసిన రెండవది, మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందువరకు దేవునిని అడుగుతూ ఉండవలెనననునది. మనము నిజముగా ఆయన శక్తిని పొందుటకు ఆసక్తి కలిగియున్నామా మరియు ఆయన వరములకు విలువ నిస్తున్నామా అనేది ఆయన పరీక్షించును. మరియు ఆయన శక్తి లేకుండా ఆయనను సేవించుటలో నిజముగా మనము చేతగాని వారముగా మనము అనుకొను చున్నామో లేదో చూచుటకు కూడా ఆయన కనిపెట్టును. అనేకులు వారిపై వారికి నమ్మకముండుట చేత త్వరలోనే ప్రార్థించుట మాని వేయుదురు కూడా, అట్లు వారు ఈ పరీక్షలో తప్పిపోవుదురు.

స్థానిక సంఘములో కూటములు

1కొరిందీ¸ 12లో చెప్పబడిన ఆత్మ వరములన్నిటిలోనూ స్థానిక సంఘ కూటములలో వాక్కుకు సంబంధించిన వరములనే అభ్యాసము చేయుటను మనము గమనించగలము. అవి బోధించుట, ప్రవచించుట, భాషలు మరియు భావము చెప్పుట (1కొరిందీ¸ 14:26 చూడండి). సంఘ కూటములలో ఏదైనా అద్భుత కార్యములు చేయు వరము అభ్యాసము చేయబడినట్లు అక్కడ చదువము. సువార్త కూటములలో, ఇప్పటికి కూడా స్వస్థత, దెయ్యములను వెళ్ళగొట్టు ఆత్మీయ వరములు సువార్త సందేశము స్థిరపర్చబడునట్లు జరుగుచున్నవి (మార్కు 16:15-18). సువార్తికులుగా పిలువబడినవారు (ముఖ్యముగా సువార్త చేరని ప్రదేశములకు) దేవుడు వారికి ఇటువంటి వరము లిచ్చునని తప్పక ఎదురు చూడవలెను. కాని ఇది తప్పనిసరిగా ప్రతి స్థానిక సంఘ కూటములలో జరుగక పోవచ్చును.

సంఘకూటములో ప్రధానముగా అభ్యాసము చెయ్యవలసినది ప్రవచన వరము. పాత నిబంధనలో ప్రవచనమనగా భవిష్యత్తులో జరుగబోవు దానిని చెప్పుట. కాని క్రొత్త నిబంధన ప్రవచనమనగా క్షేమాభివృద్ధి (కట్టబడుటకు) కలుగునటువంటి, హెచ్చరిక (సవాలు చేయబడుట) మరియు ఆదరణ (ప్రోత్సాహము) కలుగునట్లుగా దేవుని వాక్యమును మాట్లాడుటగా నున్నది (1కొరిందీ¸ 14:3 చూడండి). ప్రతి సంఘములో ఈ వరమును అభ్యాసము చేయు సహోదరులు తప్పక నుండవలెను. స్థానికంగా ఒక సంఘమునకు అపొస్తలులు, బోధకులు మరియు సువార్తికులు అక్కరలేదు (ఈ పరిచర్యలు వేరు వేరు ప్రదేశములు తిరుగుచుండిన వారి ద్వారా నెరవేరును). అయితే సంఘము పరిపక్వత పొందవలెనంటె ప్రవక్తలు మరియు కాపరులు తప్పక అవసరము.

పాతకాలపు ప్రవక్తలు వారి హృదయములో మోయుచుండిన దేవుని యొక్క భారమును మాట్లాడు చుండేవారు. అహరోను తన రొమ్ముపై న్యాయవిధాన పతకముపై 12 రత్నములను (ఇశ్రాయేలు వారి 12 గోత్రములను బట్టి) ధరించవలెను (నిర్గమ 28:29). ఇది ఇప్పుడు దేవుని వాక్యము భోదించు (ప్రవచించు) వారు వారి హృదయములపై ప్రజలను మోసుకొనవలసిన దృశ్యముగా నున్నది. అది ఒక తల్లి తన గర్భములో బిడ్డను మోసికొనునట్లుండును (ఫిలిప్పీ 1:7 చూడండి).

ప్రవచన వాక్కు వరముగా కలవారు మొదట అసమయమునకు సంఘమునకు అవసరము గల వాక్యమును దేవుని యొద్దనుండి పొంది సంఘ కూటములో మాట్లాడవలెను (1పేతురు 4:11). ఒక మతపరమైన ప్రసంగమునకును, ప్రవచనవాక్కునకు ఎంతో తేడా యున్నది. ఒక ప్రసంగము ఒక మనుష్యుని యొక్క తన నుండి తనకున్న తెలివి తేటలను బట్టి ప్రయాసపడుట ద్వారా వచ్చును. అది వినువారి మెప్పు పొందవచ్చును. అయితే ప్రవచన మనునది దేవుని నుండి ఒక మనుష్యుని హృదయము ద్వారా వచ్చును. అది వినువారి మెప్పు కోరదు. కాని వారి హృదయ రహస్యములను బయల్పరచి వారిని క్రియలోనికి పురికొల్పును. అటువంటి ప్రవచన వాక్యమునకు స్పందించి వారిని వారు సరిదిద్దు కొందురు. దానినిబట్టి ఎవరైతే చికాకుపడుదురో వారు ఆ ప్రవక్తపై కోపగించుకుందురు. ప్రవక్తలు ఎప్పుడూ ఖ్యాతినొందరు కాని ద్వేషింపబడుదురు, అపార్థము చేసికొనబడుదురు మరియు హింసింపబడుదురు. యేసు ప్రభువు నజరేతులోని సమాజ మందిరములో ప్రసంగించుచుండినప్పుడు, ప్రజలు ఆయన ప్రసంగం మధ్యలో ఆపివేసి, ఆయనను బయటకు ఈడ్చుకు వచ్చి చంపుటకు ప్రయత్నించిరి.

మనము పాపము యొక్క మోసమును బట్టి కరిÄన పర్చబడకుండునట్లు ప్రతిదినము ఒకరినొకరము బుద్ధి చెప్పుకొనవలెనని బైబిలు చెప్తుంది (హెబ్రీ 3:13). కనుక సంఘములో ప్రవచనమంతా (హెచ్చరిక) ప్రజలు వారి పాపములను బట్టి మోసపోకుండు నిమిత్తమై యున్నది. ప్రవచనము వారి హృదయములలో నుండిన రహస్య పాపములను బయల్పరుస్తుంది. అప్పుడు వారు దేవుని యెదుట సాగిలపడి పశ్చాత్తాపము చెందుదురు (1కొరిందీ¸ 14:25).

మనకు మనము తీర్పు తీర్చుకొని ''మన రక్షణ భయముతోను, వణకుతోను కొనసాగించుకొనిన'' యెడల (ఫిలిప్పీ 2:12), ప్రభువు యొదటగా మనకు వెలుగునిచ్చి మన స్వంత పాపము యొక్క మోసము నుండి మనలను రక్షించును. అప్పుడు అదే మాటను మనము ఇతరులు రక్షింపబడునట్లు వారికి బోధించవచ్చును. మనము ఒప్పింపబడిన దానినే ఇతరులకు బోధింపవలెను.

ఇక్కడ ముఖ్యమైన హెచ్చరిక అవసరమైయున్నది. ప్రవచన వాక్యమును విను వారందరు దానిని వివేచింపవలెనని ఆజ్ఞాపింపబడెను (1కొరిందీ¸ 14:29). మొదట వారు వినినది దేవుని వాక్యముతో పొంతన కలిగియున్నదా? అనునది చూడవలెను. రెండవది అది వారి హృదయములకు దేవుడిచ్చిన మాట ఔనో కాదో తేల్చుకొనవలెను. ఇది ఎందుకనగా ప్రకటింపబడిన ప్రతి సందేశము, ఇవ్వబడిన ప్రతి ప్రవచనము, భాషకు చెప్పిన ప్రతి అర్థముతో మాట్లాడు వాని యొక్క స్వంత ఆలోచనలు కూడా కలిసి యుండును. కనుక మనము ప్రతిదానిని పరీక్షించి మేలైన దానిని చేపట్టవలెనని ఆజ్ఞాపింపబడినాము (1థెస్స 5:21).

మనలో నుండిన అభిషేకము, మనము విను ప్రవచనములో కొంత భాగమును గూర్చి సాక్ష్యమివ్వక పోయినట్లయితే, దానిని మనము తిరస్కరించవలెను. మనలను మనము మోసపర్చుకొనకుండా రక్షించే పద్దతి అది ఒక్కటే (1యోహాను 2:28). అనేక మంది విశ్వాసులు వారు వినిన ప్రతి ప్రవచనము దేవుని యొద్ద నుండే వచ్చినదని నమ్మి గ్రుడ్డిగా స్వీకరించి, వారు వినిన దాని ప్రకారము చేయుట చేత చెప్పలేనంతటి నష్టమును పొందియున్నారు.

నీవు మెచ్చుకొను ఇతర బోధకులను అనుసరించుట గూర్చి ఒక హెచ్చరిక. అటువంటి అనుసరణ నీకు తెలియకుండగానే జరిగిపోతున్నట్లయితే, అది అంత ప్రమాదము కాదు. కాని అటువంటి అనుకరణ నీవు కావాలని చేస్తున్నట్లయితే నీవు నష్టపోదువు. ఎందుకనగా దేవుడు నీ ఒక్కడి ద్వారానే, జరుగవలెనని ఉద్దేశించిన ఆ ప్రత్యేకమైన పరిచర్యకు అటువంటి అనుకరణ ఆటంకముగా నుండును.

క్రొత్త నిబంధన అంతయు పరిశుద్ధాత్మునిచే ప్రేరేపింపబడినను, పౌలు, పేతురు మరియు యోహానులు సత్యమును తెలియజేయుటకు ఒకే విధమైన శైలిని ఉపయోగించలేదు. వారిలో ప్రతివారు వారికి సహజంగా వచ్చిన మాటలతో వాక్యమును వ్రాసారు. పౌలు ఒక్కమారు కూడా ''నూతనముగా జన్మించుట''గూర్చి వ్రాయలేదు, కాని ''క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట'' గూర్చి మరియు ''ప్రాచీన పురుషుని సిలువవేయుట'' గూర్చి (రోమా 6:4) వ్రాసెను. పేతురు పత్రికలు వ్రాసినప్పుడు ఆయన పౌలు పద ప్రయోగమును అనకరింపవచ్చును. కాని ఆయన అట్లుచేయలేదు. ఆయనకు సహజముగా వచ్చిన పదప్రయోగమును బట్టి ''శరీరములో శ్రమపడుట'' గూర్చి వ్రాసెను. అనేక సంవత్సరముల తరువాత వ్రాసిన యోహాను తన శైలిలో తన ప్రత్యేకతను చూపెను. ఆయన పౌలు యొక్క లేక పేతురు యొక్క శైలి కాక ''దేవుని మూలముగా పుట్టినవాడు'' అను మాట ఆయన ప్రత్యేకతగా వ్రాసెను.

ఇది దేవుడు మనలను ఇతరులు ఉపయోగించిన మాటలనే ఉపయోగించవలెనని కోరుకొనుట లేదని చూపిస్తుంది. వాక్య పరిచర్య చేయునప్పుడు మన వ్యక్తిత్వమును ఆయన పూర్తిగా తొలగించుట లేదు. లేక తన యజమాని ఏది టైపు చెయ్యమంటే అదే టైపు చేయు ఒక సహాయకుని వలె ఆయన మనలను వాడుకొనుట లేదు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకింపబడినప్పుడు కూడా ఆయన మన వ్యక్తిత్వాన్ని కాపాడును.

ప్రకటన 21:19,20లో సంఘము అనేక రంగులు కల విలువైన రాళ్ళతో కట్టబడు ఒక భవనమును పోలియుండుటను మనము చూచుదుము. అందులో ప్రతి రాయి నుండి ప్రకాశించు వెలుగు ఒక్కటే అది యేసు యొక్క జీవితము. కాని వాటినుండి ప్రకాశించు రంగులు ఎరుపు, నీలము మరియు ఆకుపచ్చ మొదలైనవి వేరువేరుగా నుండెను. మనలో ప్రతి ఒక్కరము యేసు యొక్క జీవమును చూపించుటకు పిలువబడినాము. కాని అది మనకుండిన ప్రత్యేకమైన వ్యక్తిత్వముతో చూపవలెను.

నీవు నా పరిచర్యను కాని లేక నేను మాట్లాడినట్లుగా లేక నేను వ్రాసినట్లుగా అనుకరించుటకు ప్రయత్నించినట్లయితే నీవు చివరకు నిష్పలుడవవుదువు. నీవు నీ స్వంత జీవితము నుండి నీకు సహజముగా వచ్చునట్లు మాట్లాడవలెను. అది నీకు కలిగిన విశిష్టమైన రీతి, అప్పుడు నీవు క్రీస్తు శరీరమునకు ఒక దీవెనకరముగా నుందువు. దేవుడు తన సంఘములో ఒక్క ''జాక్‌ పూనెన్‌''లే కోరుకుంటున్నాడు. వేరొక ''జాక్‌ పూనెన్‌'' అవసరం లేదు. ఆయన నిన్ను నీవుగా ఉండాలని అనుకొనుచున్నారు.

సంఘకూటములలో, ప్రభువునొద్ద నుండి బోధించుటకు వాక్యము కలవారు పెద్దల అధికారము క్రింద మాట్లాడవచ్చును. అది పురుషులకును స్త్రీలకును వర్తించును. ఎందుకనగా దేవుడు పురుషులపైనను స్త్రీల పైనను కూడా ఆయన ప్రవచనాత్మను కుమ్మరించుదునని తేటగా చెప్పెను (అపొ.కా. 2:17,18). ఒక స్త్రీ తన తలపై ముసుగు వేసుకొన్నట్లయితే, ఆమె సంఘకూటములలో ప్రార్థించుటకు కాని ప్రవచించుటకు కాని దేవుడు అనుమతి నిచ్చెను (1కొరిందీ¸ 11:5).

అనేకులు వారికుండిన ఆత్మీయ బద్దకము చేత లేక వారి యొక్క బిడియము చేత సంఘములో ప్రవచింపకుండా యుందురు. తిమోతి అటువంటి బిడియము కలవాడు కాని దేవుడు అతడికి యిచ్చిన వరమును ఉపయోగించమని పౌలు అతడికి చెప్పెను (1తిమోతి 4:14; 2తిమోతి 1:6,7). మనము సంఘ కూటములకు వచ్చునప్పుడు బిడియపు ఆత్మను మరియు అపనమ్మకపు ఆత్మను బంధించవలసి యున్నది.

సంఘములో నుండిన ఈ స్వేచ్చను, వారి స్వంత స్వరమును వినుటకు ఇష్టము కలిగిన కొందరు శరీరానుసారులైన వారు అవకాశముగా తీసుకొని లేచి నిలువబడి వినువారందరికి విసుగు కలుగునట్లు మాట్లాడుదురు. సంఘములో ప్రతి విషయము క్రమముగాను మర్యాదగాను జరుగునట్లు (1కొరిందీ¸ 14:40 ), అటువంటి వారిని పెద్దలు మౌనముగా నుండునట్లు చేయవలెను. ఈనాడు అనేక సంఘములలో పెద్దలు బిడియము వలన లేక మంచి సహోదరులుగా గౌరవమును పొందుటకు, శరీరానుసారులైన, ఎక్కువ సమయము మాట్లాడే వారిని ఆపకుండుట విచారించాల్సిన విషయము.

ఇంకొక విషయమును కూడా మనము మనసులో నుంచుకొనవలెను. సంఘకూటములో స్తుతి ఆరాధన అవసరమైనదే కాని అదే ఎంతో ప్రాముఖ్యమైన భాగము కాదు - కాని దేవుని ప్రవచన వాక్యము ప్రకటించు సమయము ముఖ్యమైనది.

ఆత్మీయ నాయకత్వము

దేవుని సంఘములో నాయకత్వమును గూర్చిన అంశమును ఇప్పుడు చూచెదము.

దేవుడు ప్రతి సంఘములోను ఆయన మార్గములో నడిపించుటకు పెద్దలను ఏర్పాటు చేసారు (1కొరిందీ¸ 14:23; తీతు 1:5). ఒక పెద్ద ప్రథమంగా ఒక బోధకుడు కాడుగాని ఒక నాయకుడై యుండును. ఒక నాయకుడు ఇతరులకు ముందుగా వెళ్ళువాడు. అతడు ఎప్పుడును ముందుకు సాగువాడైయుండెను. నేను యేసును వెంబడించునట్లు నన్ను వెంబడించుడి అని అతడు చెప్పును.

అనేకమంది బోధకులు ''నన్ను అనుసరింపవద్దు, యేసు వైపు చూచుచు ఆయనను వెంబడించుడి'' అని చెప్పుదురు. అది వినుటకు వినయముగా నుండును. కాని ఆది అపొస్తలులో ఎవ్వరును అట్లు చెప్పలేదు. వారు క్రీస్తును వెంబడించినట్లుగా వారిని వెంబడించవలెనని వారు విశ్వాసులను ఆహ్వానించిరి (1కొరిందీ¸ 11:1; ఫిలిప్పీ 3:17). వారు పరిపూర్ణులుగా నుండుటను బట్టి వారట్లు చెప్పలేదు, కాని వారు సరైన దిశలో ప్రయాణిస్తున్నందున అట్లు చెప్పిరి.

పెద్దరికము అనునది సాపేక్షముగా ఉంటుంది. ఒక ఉదాహరణ ఇది తేటగా అర్థమగునట్లు చేయును. తల్లిదండ్రులు కొద్ది సమయము ఇల్లు విడిచి వెళ్ళునప్పుడు, వారి యొక్క పెద్దకుమారుని అతడు 10 సంవత్సరములు గల వాడైనను పెద్దగా నుండునట్లును, వారు లేని సమయమున నిర్ణయములు తీసుకొనుమనియు అడుగవచ్చును. అతడు పరిపక్వత చెందినవాడు కాడు. కాని అతడు 7 సంవత్సరముల వయసు గలవాని కంటెను, 4 సంవత్సరాల వయసు గలవాని కంటెను ఎక్కువ పరిపక్వత కలిగియుండును. అతడి తల్లిదండ్రులు వచ్చిన తరువాత అతడు ఏమాత్రమును పెద్దగా కొనసాగడు.

సంఘములో కూడా పెద్దరికము అట్లే యుండును. ఒక సంఘములో అందరికంటే ఎక్కువ పరిపక్వత కలిగియుంటే ఒక యౌవనస్తుడు కూడా ఆ సంఘమునకు పెద్ద కావచ్చును. ఇతరులు ఎదుగుతూ ఉన్నప్పుడు అతడు కూడా వారితో పాటు ఎదుగుచుండును. కాని అతడు ఆత్మీయముగా ఎదుగుట ఎప్పుడు నిలిచిపోవునో అప్పుడు అతడి కంటె ఆత్మీయముగా ముందుకు వేరొకరు ఆ సంఘమునకు పెద్ద సహోదరుడుగా అగును. కనుక పెద్ద అనునది ఒక బిరుదుకాని లేక దేవుని ఇంటిలో ఒక అధికారి కాని కాదు, కాని ఇతరులను నడిపించుటకై కావలసినంత పరిపక్వత అయియున్నది.

అటువంటి నాయకులకు మనము లోబడవలసియున్నది (హెబ్రీ 13:17). ద్రాక్షతోటను గుత్తకిచ్చిన ఉపమానములో, యజమానుడు, పంట ఫలమును వసూలు చేసి కొనుటకు తను స్వయముగా వెళ్లక సేవకులను పంపుటను మనము గమనిస్తాము (మత్తయి 21:34). అదే విధముగా దేవుడు తన సంఘములో ఆయన అధికారమిచ్చిన వారిని ప్రతినిధులుగా నియమించును. జనులు అపొస్తలులను చేర్చుకొనినప్పుడు అది ఆయననే చేర్చుకొనునట్లవుతుందని యేసు అపొస్తలులతో చెప్పెను (మత్తయి 10:40). ఇక్కడ క్రైస్తవులలో ఈనాడు ఉండిన అనేకమంది యాజకులు, పాదిరులు, బోధకుల గూర్చి చెప్పుట లేదు, కాని నిజమైనదేవుని సేవకులుగా నీవు ఎవరిని గుర్తిస్తావో వారి గూర్చి మాత్రమే చెప్తున్నాను.

దేవుని సంఘములో అధికారము, పై నుండి బలవంతముగా రుద్దేది కాక క్రింద నుండి అంగీకరించేదిగా ఉండును.

దీని అర్థము, నీవు గౌరవించే పెద్దలకు మాత్రమే నీవు లోబడవలసియున్నది. నీవు ఒక పెద్దను భక్తిపరునిగా చూడనట్లయితే నీవు అతడికి లోబడనక్కర్లేదు. అయితే అటువంటప్పుడు నీవు ఆ సంఘమును విడిచిపెట్టి నీ వెక్కడైతే ఒక భక్తి పరుడైన పెద్దను చూచెదవో ఆ సంఘమునకు వెళ్లుట నీకు మంచిది. దురదృష్టవశాత్తు ఈనాడు లోకంలో ఎక్కువ మంది భక్తులైన పెద్దలు లేరు. అయితే నీవు అటువంటి వారినొకరిని కనుగొన్నప్పుడు నీవు అతడిని తప్పక ఘనపరచి మెచ్చుకొనవలెను (1తిమోతి 5:17; 1థెస్స 5:12).

ఒకమారు నీవు ఒకరిని