దేవుని పరిచర్యను దేవుని మార్గములో చేయవలెను

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
    Download Formats:

అధ్యాయము 0
పరిచయం

దేవుని పరిచర్యను దేవుని మార్గములో చేయవలెను


క్రొత్త నిబంధన సంఘముల యొక్క నాయకత్వము''అంత్యదినమందు, దేవుడు నీవు చేసిన పరిచర్యను అగ్నిచేత పరీక్షిస్తాడు. ఏదైతే బంగారము, వెండి మరియు వెలగల రాళ్ళతో కట్టబడుతుందో అది మాత్రమే నిలుస్తుంది. ఏదైతే కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలుతో కట్టబడుతుందో అది కాలిపోతుంది. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరు ఏవిధముగా కట్టుచున్నామోనని జాగ్రత్త పడెదము'' (1 కొరింథీ 3:10-15)

అధ్యాయము 1
క్రైస్తవ పరిచర్య - అప్పుడు మరియు ఇప్పుడు

నేను నోవహు దినములలో నివసించియున్నయెడల, నా ఖాళీ సమయములో ఓడను నిర్మించుటలో నోవహుకు సహాయపడుటయే నా జీవితగమ్యమై యుండెడిది. ఎందుకనగా ఆ కాలములో ఆ ఓడ మాత్రమే దేవుని తీర్పు తరువాత కూడా నశింపక నిలిచియుంటుంది.


ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సంఘమును నిర్మించుటయే ఇప్పుడు కూడా నా జీవిత గమ్యమైయున్నది. ఎందుకనగా దేవుడు ఈ లోకమును నాశనము చేసినప్పుడు ఆ సంఘము మాత్రమే నశింపక నిత్యత్వము నిలుస్తుంది. నీవు జ్ఞానవంతుడవైతే, నీవు కూడా దానినే చేస్తావు.


ఈనాడు జరుగుచున్న క్రైస్తవపరిచర్య మరియు క్రొత్త నిబంధన స్థాయి(అంతస్థు):


భూమిమీద ఇప్పుడు జరుగుచున్న పరిచర్యకును మరియు క్రొత్త నిబంధన ప్రకారము జరుగవలసిన పరిచర్యకును చాలా తేడా ఉన్నదని మనము చూస్తాము. క్రొత్త నిబంధన నియమముల ప్రకారము సంఘమును నిర్మించుటకు చాలా కొద్ది మంది ప్రయత్నిస్తున్నారు. నిజానికి, మన తరములో ఆ నియమముల ప్రకారము చేయుట అసాధ్యమనియు మరియు కష్టమనియు చాలామంది క్రైస్తవ నాయకులు భావిస్తున్నారు. కాబట్టి ఈనాడు, జరుగుచున్న క్రైస్తవపరిచర్య ఎక్కువగా లోకములోని సంస్థలలో చేసినట్లుచేయుచున్నారు. అనగా అపొస్తులులు చేసిన దానికి ఎంతో వేరుగా చేయుచున్నారు.


దానికి కొన్ని ఉదాహరణలు:


కంపెనీలు సి.యి. ఓ. లను పెట్టుకొనినట్లే సంఘములు కూడా పాస్టర్లను జీతానికి పెట్టుకుంటున్నారు.


కంపెనీలు సి.యి.ఓ. లకు జీతాలు ఇచ్చినట్లే సంఘములు కూడా పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు.


కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ ఘనత మరియు పెద్ద జీతాలు ఇచ్చే కంపెనీలకొరకు వెదకినట్లే అనేకమంది పాస్టర్లు ఎక్కువ ఘనత మరియు పెద్ద జీతాలు ఇచ్చే సంఘముల కొరకు వెదకుచున్నారు.


లోకములోని కంపెనీలలో వలే సంఘపరిచర్యలో కూడా డబ్బు చాలా ప్రాముఖ్యమైయున్నది.


కంపెనీలలో ఉద్యోగముకొరకు కాలేజీ చదువులు (డిగ్రీలు) అవసరమైనట్లే క్రైస్తవ పరిచర్యలో కూడా బైబిలు సెమినరీ చదువులు అవసరమైయున్నవి. (ఇలాగైనట్లయితే యేసుయొక్క 11మంది శిష్యులు ఈనాటి పరిచర్యకు అర్హులు కారు).


అనేకమంది పాస్టర్లు పరిశుద్ధాత్మ అభిషేకము మరియు నడిపింపును అనుసరించక, వారి సంఘములను నడుపుటకు లోకసంబంధమైన పద్ధతులు వాడుచున్నారు.


ఇంకెన్నో ఇలాంటి ఉదాహరణలు.


ఈ విషయములే కాక ఈనాడు క్రైస్తవ్యములో, క్రొత్త నిబంధనలోని సంఘముయెడల దేవుని యొక్క సంకల్పానికి విరోధమైన అనేక విషయములున్నవి. సంఘము లోకమును అనుసరించుచున్నది మరియు అనేక సంఘములు సువార్త సిద్ధాంతమును కలిగి మరియు వారి సంఘములకు అనేక వేలమంది వచ్చుచున్నప్పటికిని అనేక సంఘములలో ఆత్మీయ మరణము ఏలుచున్నది. బబులోను క్రైస్తవ్యము చాలా ఎక్కువగా విస్తరించియున్నది. వారి సిద్ధాంతము సరిగా ఉన్నప్పటికిని వారి జీవితములు మరియు వారి ప్రాధాన్యతలు సరిగాలేవు. కాబట్టి ఒకరోజు అది దేవునిచేత పూర్తిగా నాశనము చేయబడుతుంది (ప్రకటన 17,18 అధ్యాయములు).


చాలామంది క్రైస్తవులు మత్తయి 7:1, ''తీర్పుతీర్చకుడి'' అను మాటలను అపార్థము చేసుకొని మరియు వేరే క్రైస్తవులనుగాని, సంఘములనుగాని తీర్పుతీర్చకూడదని చెబుతారు. అది పైకి ఆత్మీయ సలహాగా ఉన్నప్పటికినీ అది నిజము కాదు. ప్రకటన 2 మరియు 3 అధ్యాయములలో ప్రభువు యోహానుతో అక్కడ సంఘపెద్దలను విమర్శిస్తూ, ఐదు సంఘములకు వ్రాయమని యోహానుకు ప్రభువు చెప్పాడు. మరియు ఈ పత్రికలు రహస్యముగా ఉంచనవసరములేదు. ఆ ప్రాంతములోని విశ్వాసులు అందరూ హెచ్చరిక పొందునట్లు అక్కడ సంఘములలోను సంఘపెద్దలలోనూ తప్పిపోయిన వారి పరిస్థితిని గురించి అందరునూ తెలుసుకొనునట్లు, ఆ ప్రాంతములోని సంఘములన్నిటికి పత్రికలు వ్రాయమని యోహానుతో ప్రభువైన యేసు చెప్పాడు. ఒక సంఘమునకును మరియు ఆ సంఘపెద్దకును ఈ విధముగా వ్రాయమని ప్రభువు చెప్పాడు. ''నీవు జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నదిగాని నీవు మృతుడవే'' (పక్రటన 3:1). మరొక సంఘమునకు ఆ సంఘపెద్దకును యోహాను ద్వారా ప్రభువు సందేశమేమనగా, ''నీవు ఆత్మీయముగా దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దింగబరుడవునై యున్నావు'' (పక్రటన 3:17). కొరింథులోను మరియు గలతీయలోను ఉన్న క్రైస్తవులలోని అనేక తప్పిదములను సరిచేయుటకు ప్రభువు పౌలును ప్రేరేపించి ఆ సంఘములకు పత్రికలు వ్రాయించెను (1కొరింథీ, గలతీ పత్రికలు చూడండి). ఇది దేవుని మార్గము.


ప్రభువైన యేసు ఈనాడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు కాబట్టి తన సేవకుల ద్వారా సంఘమునకు శిరస్సుగా ఉండి క్రైస్తవులలోను సంఘపెద్దలలోను ఉన్నటువంటి తప్పిదములను బహిర్గతము చేయుచున్నాడు. కాని మొదటి శతాబ్దమువలె ఈనాడు కూడా నాయకులు దిద్దుబాటు స్వీకరించరని ప్రభువుకు తెలియును కాబట్టి, ఆయన చివరిగా ఈ మాట చెప్పియున్నాడు. ''చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక'' (పక్రటన 2:7,11,17,29; 3:6,13,22). ప్రభువు చెప్పినది అనేకులు వినరుగాని కొద్దిమందే వింటారు.


1966 మే నెలలో దేవుని పిలుపు ప్రకారము పూర్తికాలపు క్రైస్తవ పరిచారకుడుగా ఉండాలని, నా నావికాదళపు ఉద్యోగానికి రాజీనామా చేసాను. ఆ సమయములో క్రైస్తవ పరిచర్య చేయుచున్న ప్రతివాడు పరలోకసంబంధమైన మనస్సుగలవారై ఆత్మాభిషేకము గలవారని అనుకొనియున్నాను కాని కొన్ని సంవత్సరములలోనే అది తప్పు అని గ్రహించాను.


తన సొంతము కోరక మరియు తన్నుతానే పోషించుకొనుచూ అనేక స్థానిక సంఘములను నాటి మరియు నిర్మించిన పౌలువంటివారు చాలా కొద్దిమందే క్రైస్తవ పరిచారకులున్నారని నేను కనుగొన్నాను. దానికి బదులుగా బోధకులు డబ్బును, ఘనతను, పేరు ప్రతిష్ఠలు కోరెడివారుగా ఉన్నారు. పౌలు కాలములోను దేమా వలె తమ సొంతలాభమును కోరేవారు అనేకులు ఉన్నారు (2 తిమోతి 4:10). పౌలు కాలములోని స్వార్థములేని తిమోతి వంటివారు చాలా కొద్దిమందియే ఉన్నారు (ఫిలిప్పీ 2:19-21) మరియు ఈనాడు కూడా అటువంటివారు చాలా కొద్దిమందే ఉన్నారు.


1975 జనవరిలో దేవుడు నన్ను తాజాగా పరిశుద్ధాత్మతో నింపి నా అవసరమును తీర్చాడు. అప్పటి నుండి ''క్రీస్తులో మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించెను'' మరియు ''క్రీస్తులో అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము'' (2కొరింథీ 2:14; రోమా 8:37). ఇటువంటి పౌలు జీవితములోని అనుభవాలను నా జీవితములో కూడా అనుభవించాలని హృదయపూర్వకముగా కోరుచున్నాను.


ఏడు నెలల తరువాత (1975 ఆగష్టులో) ఎవరైతే కలసి సహవాసము చేసి మరియు జయజీవితము జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని వెదకుచున్నారో అటువంటి వారితో సహవాసాన్ని మా ఇంటిలో ఆరంభించాము. తరువాత కొన్ని సంవత్సరములలో కొందరు వచ్చియున్నారు మరియు వచ్చినవారిలో కొందరు వెళ్ళియున్నారు. కాని కొందరు మాతోనే నిలిచియున్నారు. ఇతర క్రైస్తవులద్వారా మేము వేర్పాటువాదులు మరియు మతబేధం కలిగించేవారిగా ఉన్నామని పిలువబడ్డాము. ప్రభువైన యేసు మరియు పౌలు కూడా వారి జీవితకాలములో ఆ పేర్లతోనే పిలవబడియున్నారు గనుక ఆ విధముగా మమ్మును పిలిచినందుకు మేము భంగపడలేదు. నిజానికి, అనేకమంది దేవుని గొప్ప సేవకులు ఈనాడు గొప్ప ప్రవక్తలుగాను సంస్కర్తలుగాను గుర్తింపబడినవారు వారి జీవితకాలములలో కూడా వేర్పాటువాదులు, మతబేధం కలిగించే వారుగా పిలువబడియున్నారు.


మా గృహములో ఒక వారములో అనేకసార్లు కలుసుకున్నాము. నెమ్మదిగా, విశ్వాసుల యొక్క సహవాసముగా నున్న మమ్ములను క్రొత్తనిబంధన సంఘముగా ప్రభువు మార్చియున్నాడు. భారతదేశములోని బెంగళూరులోని ఒక మూలన ప్రభువు ఏడు సంవత్సరములు మమ్మును ఉండనిచ్చి, క్రొత్త నిబంధన క్రైస్తవ్యాన్ని మేము అనుభవించేటట్లుగా ప్రభువు చేసాడు.


తరువాత 1983నుండి భారతదేశములోని అనేకపేద గ్రామములలోను మరియు ధనిక పట్టణములలోను క్రొత్త నిబంధన సంఘములను ప్రభువు నిర్మించియున్నారు. కొన్ని సంవత్సరముల తరువాత ఇటువంటి సంఘములను ఇతర దేశములలో కూడా నిర్మించుటకు ప్రభువు ఆరంభించారు.


అంధకారసంబంధ శక్తులు మమ్ములను అనేకవిధములుగా దాడిచేసాయి కాని మాలో ప్రభువు నిర్మించుచున్న సంఘము ఎదుట అవి నిలువలేకపోయెను.


ఋజువు పరచబడని విషయములు చెప్పకూడదని, నేను ఈ పుస్తకమును వ్రాయుటకు 43 సంవత్సరములు వేచియున్నాను. మన పరిచర్య మీద ప్రభువుయొక్క ఆశీర్వాదమును బట్టియు, ఆయన వాక్యములోని అద్భుతకరమైన అనేకమైన ప్రత్యక్షతలు నాకిచ్చినందున మరియు అద్భుతముగా అనేక సంఘములను ప్రభువు నిర్మించుటను బట్టియు క్రొత్త నిబంధన సంఘములు నిర్మించుటలో నేను నేర్చుకున్న దేవుని మార్గములను విశ్వాసులందరికి చెప్పుటకు నేను ఋణపడియున్నాను.


ఈ ఋణమును తీర్చుకొనుటకే ఈ పుస్తకమును వ్రాసియున్నాను.


తమ నిజజీవితములో ప్రభువైన యేసును వెంబడించాలని మరియు దేవుని మహిమార్థమై క్రొత్త నిబంధన సంఘములను నిర్మించుటలో అపొస్తులను వెంబడించాలని ఆసక్తి గలవారి కొరకు ఈ పుస్తకము వ్రాయబడింది.


అధ్యాయము 2
క్రొత్త నిబంధన ప్రకారము చేసే పరిచర్య

''ప్రభువైన యేసు మొదట జీవించి(చేసి) తరువాత బోధించారు'' (అపొ.కా. 1:2).


పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన వర్తమానములు వారి రహస్య జీవితము కంటే ఎంతో ప్రాముఖ్యమై యుండెడివి. కాని ప్రభువైన యేసు వచ్చిన తరువాత, ఆయన మొదటిగా జీవించి మరియు ఆయన చేసిన దానినే బోధించారు.


''మీరు వచ్చి మరియు దేవుని సందేశాన్ని వినుడి'' అను పాత నిబంధన ప్రవక్తల యొక్క ఆహ్వానము, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ''మీరు వచ్చి మరియు ప్రభువు మా జీవితములను ఏవిధముగా మార్చెనో చూడుడి'' అనే విధముగా మార్చబడింది.


క్రొత్త నిబంధనలో ఇతరులకు మనము బోధించుటకు ముందుగా దేవునిని మన జీవితములో పనిచేయనివ్వాలి. ఇది జయ జీవితమునకును అలాగే స్థానిక సంఘము నిర్మించే విషయములోను ఈ విధముగా చేయాలి.


అంధకార శక్తులు తాను నిర్మించే సంఘము యెదుట నిలువనేరవని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 16:18). విశ్వాసులు జయజీవితము జీవించుటకును మరియు సంఘమును నిర్మించుటకును పౌలు తన జీవితాన్ని దారపోసియున్నాడు. తిమోతి కూడా అలాగే చేసియున్నాడు.


ప్రభువు తన అపొస్తులకు ఇచ్చిన గొప్ప పరిచర్యలో రెండు భాగములున్నవి.


1. సమస్త జనులకు సువార్త ప్రకటించుడి (మార్కు 16:15, 16).


2. ప్రభువైన యేసు బోధించినదంతయు వారికి బోధించి మరియు వారిని శిష్యులుగా చేయవలెను (మత్తయి 28:18 - 20).


మొదటి భాగమైన సువార్తీకరణ సూచకక్రియల ద్వారా జరుగుతుందని ప్రభువైన యేసు చెప్పారు (మార్కు 16:17, 18). రెండవ భాగము (శిష్యులుగా చేయుట) సూచక క్రియలు ద్వారా కాదుగాని ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుటవలెనని శిష్యులకు బోధించవలెనని ఆయన చెప్పారు (మత్తయి 28:20). సువార్త చెప్పుటద్వారా ఇతరులను రక్షణలోనికి నడిపించే పరిచర్య లోకములోని అనేకమంది విశ్వాసులు చేయుచున్నారు. కాని రెండవభాగమైన శిష్యులను చేసే పరిచర్య చాలా మంది నిర్లక్ష్యము చేయుచున్నారు.


తప్పిపోయిన గొఱ్ఱెలను వెదకి మందలోనికి తెచ్చుటకు అనేకమంది సువార్తికులు మరియు మిషనరీలు పరిచర్య చేయుచున్నారు. అది మంచిదే. కాని దురదృష్టవశాత్తు వారు తీసుకొని వెళ్ళే మంద (సంఘము) మారుమనస్సు అక్కరలేని 99 నీతిమంతులను కలిగిలేదు (లూకా 15:7) అని ప్రభువు చెప్పారు. అనేక క్రైస్తవ మందలు (సంఘములు) కోపముతోను, మోహపుచూపులతోను, ధనాపేక్షతోను మరియు అనేక శరీరేచ్ఛలతో ఓడిపోయిన వారితో నింపబడి మరియు తప్పిపోయిన గొఱ్ఱెలకంటే ఎక్కువ మారుమనస్సు పొందవలసిన అవసరము కలిగియున్నారు.


మందలోని 99 గొఱ్ఱెలు నిజమైన మారుమనస్సు పొంది మరియు నీతిమంతులుగా జీవించుటలోనికి నడిపించుట ఎంతో అవసరమైయున్నది. అప్పుడు తప్పిపోయిన గొఱ్ఱెలు వచ్చుటకు మంచి అవకాశము ఉంటుంది. లేనట్లయితే ఆ తప్పిపోయిన గొఱ్ఱె మందలో చేరి, వారికున్న ఆత్మీయ రోగమును పొందే అవకాశమున్నది.


కాబట్టి మన సంఘములో (క్రైస్తవ సహవాస సంఘము, బెంగుళూరు, ఇండియా) శిష్యత్వమును గూర్చియు మరియు ప్రభువైన యేసు ఆజ్ఞలన్నిటికి లోబడుటను బోధించుటకును ప్రభువుచేత మనము పిలువబడియున్నాము. మనము ఇప్పటికిని సువార్త ప్రకటిస్తాము మరియు 1975వ సంవత్సరములో 10 మందితో ఒక చిన్న సంఘముగా ఆరంభించి ఈనాడు అనేక వేల మందితో అనేక సంఘములు కలిగియున్నాము. కాని మనము సువార్త చెప్పిన తరువాత రక్షణ పొందిన వారిని శిష్యత్వములోనికి నడిపిస్తాము. అప్పుడు ప్రభువైన యేసు ఆజ్ఞలన్నిటిని గైకొనవలెనని శిష్యులకు బోధిస్తాము.


రెండవ భాగములో ఉన్నటువంటి ఈ పరిచర్యలో 7 ముఖ్యమైన సత్యములు మత్తయి 28:18 - 20లో ఉన్నవి.


1. ''పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది''. ఆయనకు సర్వాధికారమున్నది గనుక మనము వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయుదము. ప్రజలలో అవసరముంది కాబట్టి మనము సర్వ లోకమునకు వెళ్ళము కాని ప్రభువైన యేసుకు పరలోకములోను భూమిమీదను సర్వాధికారము ఉంది కాబట్టి మనము వెళ్ళెదము మరియు మనము ఆయన అధికారములో ఉండి, ఆయన ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళెదము. మనము ఎక్కడకి వెళ్ళినప్పటికిని ఆయన తన అధికారములో మనలను కాపాడి సంరక్షిస్తాడు. దీనిని మనము విశ్వసించనట్లయితే మనము వెళ్ళకూడదు ఎందుకనగా మనము దేవుని చిత్తము నెరవేర్చలేము.


2. ''శిష్యులనుగా చేయుడి''. మన బంధువుల కంటెను, మన స్వజీవము కంటెను మరియు మనకున్న ఆస్తిపాస్తుల కంటెను ఎక్కువగా మనము ప్రభువైన యేసును ప్రేమించాలి అను శిష్యుడిగా ఉండే మూడు షరతుల విషయములో మనము రాజీపడకూడదు, అవి (లూకా 14:26,27,33)లో ప్రభువైన యేసు చెప్పారు.


3. ''సమస్త జనులను'' శిష్యత్వము గూర్చిన ఈ సందేశముతో లోకమంతా కూడా వెళ్ళునట్లు మనము అన్ని విధములుగా ప్రయత్నించాలి. మన స్వంత పట్టణములో కొంతమందిని శిష్యులుగా చేసి మనము తృప్తి పడకూడదు.


4. ''తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్క నామములోనికి వారికి బాప్తిస్మమివ్వాలి''. మనము దేవునిని సిగ్గుపడకుండా త్రిత్వముగా ప్రకటించాలి మరియు కేవలము పాప క్షమాపణ మాత్రమే కోరేవారు కాక ప్రభువైన యేసు శిష్యులునుగా వెంబడించాలని కోరేవారికి మనము బాప్తిస్మము ఇవ్వాలి.


5. ''ఆయన ఆజ్ఞాపించిన వాటిని గైకొనవలెనని వారికి బోధించాలి''. క్రీస్తు బోధించిన ఆజ్ఞలన్నిటిని గైకొనవలెనని ప్రతి శిష్యునికి చెప్పాలి.


6. ''నేను మీతో కూడా ఉంటాను'' అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ పరిచర్యను మనము ప్రభువుతో కలసి చేయాలి మరియు ఆయన తన సన్నిధిని ఇచ్చుట ద్వారాను మరియు ఆయన శక్తి ద్వారాను ఈ పరిచర్యలో మనలను బలపరచును.


7. ''యుగసమాప్తి వరకు''. మన జీవితకాలమంతయు ప్రభువు మనతో ఉండి మనలను నిశ్చయముగా బలపరచును. అయితే మన జీవిత కాలమంతయు చెప్పిన వాటన్నిటిని చేయుచూ ఉండాలి.


ఈనాడు ప్రభువు అదే విధానములో పనిచేయుచున్నాడు


దేవుని వాక్యము ఈ విధముగా చెప్పుచున్నది.


''దేవుని వాక్యము మీకు బోధించిన నాయకులను జ్ఞాపకము చేసికొనుచు..... వారి ప్రవర్తన ద్వారా మీరు పొందిన మేలులు గూర్చి శ్రద్ధగా తలంచుకొనుచు... ప్రభువైన యేసు నిన్న నేడు ఒకేరీతిగా ఉన్నాడు. గనుక వారు ప్రభువుని విశ్వసించినట్లే మీరును విశ్వసించుడి మరియు నానావిధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి... '' (హెబీ 13:7 - 9 లివింగ్‌ బైబిలు).


పైవచనములను వెంబడించుటకు మేము ప్రయత్నించుచున్నాము.


దేవుని వాక్యమును బోధించిన మొదటి అపొస్తులను మా నాయకులుగా అంగీకరించుచున్నాము.


వారు చేసిన మంచి పరిచర్యను క్రొత్త నిబంధనలో మేము చూసాము.


ప్రభువైన యేసు ఆనాడు ఉన్నట్లే ఈనాడు ఉన్నారు గనుక, వారివలే మేము ప్రభువును విశ్వసించి వారివంటి పరిచర్య మా మధ్యలో చేయుచున్నాము.


క్రైస్తవ పరిచర్యలో ఈనాడు మనము చూచుచున్నట్లుగా నానావిధములైన అన్యబోధలకు మేము ఆకర్షించబడలేదు.


దేవునికి పక్షపాతము లేదు గనుక మీలో కూడా దేవుడు ఈ విధముగా చేయగలడని మీ విశ్వాసములో బలము పొందెదరని నమ్ముచున్నాము. ప్రతి తరములోను మరియు ప్రతి స్థలములోను ఆయనను వెదకు వారికి ఆయన ఫలము దయచేయును (హెబీ 11:6).


అపొస్తలుల యొక్క మాదిరిని వెంబడించుట


పౌలు తన కాలములోని అనేకబోధకులవలే కాక ఉన్నతస్థాయిలో జీవించుటకు ప్రభువు సహాయపడియున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి తన పత్రికలలో వ్రాసియున్నాడు. పౌలు ఇట్లు అన్నాడు, ''నా అతిశయమును ఎవరునూ ఆటంకపరచలేరు. నేను ఇప్పుడు చేయుచున్నదే చేయుచూ ఉంటాను. నేను చేసినట్లే వారు కూడా పరిచర్య చేయచున్నామని చెప్పుటకు కారణము దొరకకుండునట్లు ఈ విధముగా చేయుచున్నాము. దేవుడు వారిని పంపలేదు. వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొన్నవారై దొంగ అపొస్తలులును మోసగాండ్రైయున్నారు'' (2 కొరింథీ 11:10 - 13 లివింగ్‌ బైబిలు).


తన కాలములోని ఇతర బోధకులతో తనను పోల్చుకొనుట వృథాతిశయము కాదు. దానికి బదులుగా దేవునికి గొప్ప మహిమతెచ్చిన సాక్ష్యమై యున్నది. మరియు అతని కాలములో ఉన్న విశ్వాసులు అతనిని వెంబడించుటకు ఇది సవాలు చేసియున్నది.


పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన ఇటువంటి ఆత్మసంబంధమైన అతిశయానికి (దేవుని పరిచర్య చేయుచున్న వారందరూ దీనిని కలిగియుండాలి) మరియు గర్వపుఆత్మచేత ప్రేరేపింపబడిన శరీరానుసారమైన పరిసయ్యుల అతిశయమునకు చాలా తేడా ఉన్నది (దీనిని మనము గుర్తించాలి) (లూకా 18:10-14).


''నేను క్రీస్తును పోలినడచుకొనుచున్నట్లు మీరు నన్ను పోలి నడచుకొనుడి'' అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు చెప్పాడు (1 కొరింథీ 11:1, ఫిలిప్పీ 3:17). పౌలు యొక్క జీవితము మరియు పరిచర్యలో క్రైస్తవులు వెంబడించుటకు కావలసిన మాదిరియున్నది. పౌలు క్రొత్త నిబంధన పరిచర్యను ఏవిధముగా నెరవేర్చాడు?


దేవుని యొద్దనుండి పౌలుకు ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. అతని పరిచర్యలో రెండు భాగములు ఉన్నవి.


1. మొదటిగా క్రీస్తును గూర్చి ఎన్నడును విననటువంటి ప్రజలుగల ప్రదేశములలో పౌలు మొదటిసారిగా వారికి సువార్త ప్రకటించాడు. అతడు ఇట్లు అన్నాడు, ''ఇతరులచేత ఇప్పటికే సువార్త ప్రకటించబడి సంఘము ఆరంభించిన స్థలములలో కాక క్రీస్తునామము ఎన్నడైనను ఎరుగని ప్రదేశములో సువార్త ప్రకటించవలెనని నా కోరిక'' (రోమా 15:20 లివింగ్‌ బైబిలు).


2. రెండవదిగా పాత నిబంధన సమాజమందిరములున్న ప్రదేశములలో, పౌలు ఒక అపొస్తులునిగా క్రొత్త నిబంధన సంఘములను ఆరంభించాడు. కొరింథీ సంఘముతో ఇతడు ఇట్లు చెప్పి యున్నాడు, ''పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసితిని'' (2 కొరింథీ 11:2).


పౌలు పరిచర్యలోని మొదటి భాగములో అతనిని వెంబడించుట: అనేక దైవజనులైన మిషనరీలు, అనేక శతాబ్దములుగా, సువార్త చెప్పుటకు దేవునిచేత పిలువబడి మరియు పౌలు యొక్క మాదిరిని వారు వెంబడించి, వారి ప్రాణములను తెగించి క్రీస్తు నామం ఎరుగని ప్రాంతములలో ఆయన నామము ప్రకటించారు. ఈనాడు కూడా అనేకమంది మిషనరీలు ఈ పరిచర్యను చేయుచున్నారు. వారందరిని బట్టి దేవునిని స్తుతిస్తున్నాను మరియు వారందరి యెడల నాకు గొప్ప గౌరవమున్నది. దేవుడు ఇటువంటి పరిచర్యకు నన్ను పిలువలేదు కాబట్టి దీనిని నేను చేయలేను కాని చాలా ప్రసిద్ధి పొందిన సువార్తికులు కూడా పౌలు చేసిన విధముగా వారు పరిచర్య చేయుటలేదు. అనేక వేలమంది క్రైస్తవులను మరియు అనేక సంఘములను కలిగిన ప్రాంతములలోని వారు సువార్తను ప్రకటిస్తున్నారు.


పౌలు పరిచర్యలోని రెండవ భాగములో అతనిని వెంబడించుట: పాత నిబంధన సంఘములున్న స్థలములలో క్రొత్త నిబంధన సంఘములు ఆరంభించే పౌలు పరిచర్యలో రెండవ భాగమును చేయుటకు నన్నును మరియు మన సంఘములను పిలిచియున్నాడు. దేవుడు దీనినే మన ద్వారా జరిగించియున్నాడు కనుక దీనిని మాత్రమే నేను వ్రాయగలను.


క్రొత్త నిబంధన సంఘములను నిర్మించే విషయములో పౌలు రెండు అపాయములను చూచి మరియు వాటిని నిరోధించాడు.


ధనము యొక్క అపాయము: మనము దేవునిని మరియు సిరిని ప్రేమించలేమని ప్రభువైన యేసు చెప్పాడు (లూకా 16:13). కాబట్టి మొదటిగా పౌలు దేవునిని మాత్రమే సేవించు నిమిత్తము తన జీవితములోను మరియు పరిచర్యలోను ఉన్న ధనాపేక్షనుండి విడుదల కోరియున్నాడు. ఈ విషయములలో మనము కూడా పౌలును వెంబడించుటకు వెదికియున్నాము.


మనుష్యుల యొక్క ఆధిపత్యమనే అపాయము: సంఘము క్రీస్తు శిరస్సత్వము క్రింద ఉండుటకు బదులుగా మనుష్యుల ఆధిపత్యములో ఉండుట. దేవుడు పౌలు ద్వారా నిర్మించిన సంఘముల విషయములో, పౌలు దేవుని ద్వారా అపొస్తలత్వమును పొందియున్నాడు. కాని పౌలు అధికార విషయములో తన పరిధిలో ఉండుటకు జాగ్రత్తపడి మరియు సంఘములోని పెద్దలు మరియు విశ్వాసులు క్రీస్తునే శిరస్సత్వముగా హత్తుకునేలా చేసాడు. ఈ విషయములో కూడా పౌలు యొక్క మాదిరిని వెంబడించుటకు ప్రయత్నించాము.


ధనాపేక్షను జయించుట:


1. పౌలు ఆర్థిక విషయములలో ఎవరిమీద ఆధారపడకుండా తనను తానే పోషించుకున్నాడు (అపొ.కా. 20:33, 34). తాను పరిచర్య చేయుచున్న విశ్వాసులు ఒక దేవుని సేవకునిని ఆర్థికముగా పోషించవచ్చును (1 కొరింథీ 9:6 - 14). కాని తన కాలములో దురాశపరులు మరియు ధనాపేక్ష కలిగిన బోధకులనుండి తాను వేరైయుండుటకు పౌలు తననుతానే పోషించుకున్నాడు (1 కొరింథీ 9:15 - 19, 2 కొరింథీ 11:12, 13). ఇండియాలోని అనేకమంది ''పాస్టర్లు'' కూడా దురాశపరులై, ధనాపేక్ష గలవారైయున్నారు. కాబట్టి ఇటువంటి వారికి వేరుగా ఉండునిమిత్తము మన సంఘములలోని సంఘపెద్దలు ఆర్థికముగా తమను తామే పోషించుకొనుచున్నారు మరియు ఏ మనిషిమీదను ఆధారపడుటలేదు. గత సంవత్సరములన్నిటిలో మనము ఆవిధముగా పరిచర్యను చేసియున్నాము.


2. ప్రభువైన యేసు వలె పౌలు తన యొక్క ఆర్థిక అవసరతలన్నిటిని గూర్చి దేవునికి తప్ప మరెవరికిని చెప్పలేదు మరియు విశ్వాసులు బీదవారికి వారి ధనమును ఇమ్మని అతడు ప్రోత్సహించాడు (1 కొరింథీ 16:1, 2, 2 కొరింథీ 8, 9 అధ్యాయములు). మన సంఘములు కూడా అదే మాదిరిని వెంబడించియున్నాయి. మన అవసరములను గూర్చి ఏ మనుష్యునికి చెప్పుటలేదు. బీద విశ్వాసులకు సహాయపడుటకు అనేక లక్షల రూపాయలు ఇచ్చియున్నాము. కానుకలు రహస్యముగా ఇవ్వాలని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 6:3). కాబట్టి మనము ఒకసారి కూడా కానుక పెట్టెను విశ్వాసుల యొద్దకు తీసుకొని వెళ్ళి అడుగలేదు. గత 43 సంవత్సరములనుండి మన సంఘములలో ఈ విధముగా చేసాము. విశ్వాసులు తమ కానుకలను రహస్యముగా వేయుటకు, మన మందిరములలో కానుక పెట్టెను తలుపు యొద్ద పెట్టుచున్నాము (మార్కు 12:41 - 44). సంతోషముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును (2కొరింథీ 9:7). కాబట్టి కానుకల పెట్టెలో కానుకలు వేయమని మనము ఒక్కసారి కూడా ఎవరిని అడుగలేదు. మన సంఘములో అందరునూ స్వచ్ఛందముగా ఇచ్చెదరు అనేకవేల మంది విశ్వాసులు హాజరైన రెండు వందలకు పైగా బహిరంగ కూటములను ఇండియాలో కలిగియున్నాము. ఆ కూటములన్నిటిలో ప్రభువైన యేసు వలె వారిని డబ్బును అడగకుండానే భోజన సదుపాయము కలిగించియున్నాము.


3. సువార్త వ్యాప్తి కొరకు కూడా పౌలు ఒక్కరిని కూడా డబ్బు అడుగలేదు. ఆయన పరిచర్యలో ఉన్న అవసరములను గూర్చి ఇతరులకు వ్రాతపూర్వకముగా పంపలేదు. సువార్త వ్యాప్తి నిమిత్తము మనము కూడా ఎవరిని డబ్బు అడగలేదు. ఈ 43 సంవత్సరములలో మనము ఎవరికిని గాని ఎక్కడికైనగాని మన పరిచర్య గూర్చి ఒక్క రిపోర్టు కూడా పంపలేదు. మనుష్యులను మనము ప్రేరేపించకుండగానే, ప్రభువే వారిని ప్రేరేపించి మన పరిచర్యను కొనసాగిస్తున్నారు, ప్రభువైన యేసువలే మరియు పౌలు వలె ఇతరుల దగ్గరనుండి కానుకలను తీసుకొనే వారి మాదిరిని వెంబడించాము (లూకా 8:2, 3, 2 కొరింథీ 11:7 - 9, ఫిలిప్పీ 4:12 - 19).


4. పౌలు తన పరిచర్య కొరకు ప్రతీ ఒక్కరిదగ్గరనుండి కానుకలు అంగీకరించలేదు. కొంతమంది విశ్వాసులయొద్దనుండి మాత్రమే అతడు కానుకలు తీసుకొనియున్నాడు (ఫిలిప్పీ 4:15 - 19). అతడు ఇతరుల యొద్దనుండి కానుకలు తీసుకొనే విషయములో కొన్ని నియమములు కలిగియున్నాడు. సంఘముగా మనము కూడా అదే నియమములను పాటించుచున్నాము. మన సంఘములలో ఎవరైనను కానుకలు వేయవలెనని కోరినట్లయితే ఇక్కడ వారికి ఐదు ప్రశ్నలు ఉన్నవి:


1. నీవు క్రొత్తగా జన్మించిన దేవుని బిడ్డవేనా? దేవుని పరిచర్యకు కానుకలు ఇచ్చుట ఎంతో ఘనత మరియు ధన్యత. కాని దేవునిమూలముగా క్రొత్తగా జన్మించిన వారికి మాత్రమే ఈ ధన్యత ఉన్నది (3 యోహాను 7).


2. నీ కుటుంబ అవసరాలకు చాలినంత ధనము నీ యొద్ద ఉన్నదా? నీవు ఇచ్చుట వలన నీ కుటుంబానికి ఎటువంటి ఆర్థికఇబ్బంది కలుగదు గదా? మొదట నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి (మార్కు 7:9 - 13, 1 తిమోతి 5:8). మన పరలోకపు తండ్రి శోధింపశక్యముగాని ఐశ్వర్యము గలవాడు (భూలోకములోని ధనవంతులైన తండ్రులవలె). కాబట్టి ఆయన పరిచర్య కొరకు ధనము ఇచ్చినందున ఆయన పిల్లలెవరును పస్తులుండకూడదని లేక ఇబ్బందిపడకూడదని దేవుడు కోరుచున్నాడు.


3. నీవేమైనా పెద్ద మొత్తములో అప్పు చెల్లించవలసియున్నదా? అలా అయితే, మొదటిగా ఆ అప్పులను తీర్చుము. అప్పులేమియు లేని, సమాధానకరమైన విశ్రాంతిలో తన బిడ్డలు జీవించాలని దేవుడు కోరుచున్నాడు (రోమా 13:8). మనము మొదట ''కైసరు''కు ఇవ్వవలసినవి కైసరుకు ఇవ్వాలి తరువాత దేవునికివ్వాలి. ఎందుకనగా దేవుడు కైసరు యొక్క ధనముగాని లేక వేరే వారి ధనమును గాని కోరుటలేదు. యేసు దానిని మత్తయి 22:21 లో స్పష్టం చేస్తున్నారు.


(గమనిక: ఇల్లు కట్టుటకు తీసుకున్న అప్పు విషయం: అప్పు తీసుకున్న ధనమునకు సరిపోయే ఇల్లు ఉన్నది. కాబట్టి అటువంటి అప్పు ఉన్నట్లయితే మనము కానుక ఇవ్వవచ్చును. అలాగే ఒక వాహనానికి తీసుకున్న అప్పు విషయము కూడా)


4. నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉన్నదా? నీవు ఎవరినైతే గాయపరిచావో వారితో సమాధానపడియున్నావా?ఒకరిని బాధించి వారిని క్షమాపణ అడగకుండా వారు తెచ్చే అర్పణలను దేవుడు అంగీకరించడు (మత్తయి 5:23, 24).


5. నీవు స్వచ్ఛందముగా మరియు సంతోషముతో ఇస్తున్నావా? - మరియు ఏ వ్యక్తి నుండి లేదా నీ సొంత మనస్సాక్షి నుండి ఒత్తిడి లేకుండా ఇస్తున్నావా? దేవుడు సంతోషముతో ఇచ్చేవారిని ప్రేమిస్తాడు, అయిష్టతతో ఇచ్చేవారిని కాదు. ఒత్తిడితో ఇచ్చే వారి నుండి లేదా కొంత బాధ్యతను నెరవేర్చటానికి లేదా వారి మనస్సాక్షిని నిర్మలపరచుకోవడానికి లేదా బదులుగా దేవుని నుండి కొంత ప్రతిఫలాన్ని పొందడానికి ఎవరు ఇస్తారో వారి బహుమతులు దేవునికి అక్కరలేదు (2 కొరింథీ 9:7).


5. మనము ఎవరికిని అచ్చియుండవద్దని పౌలు చెప్పియున్నాడు (రోమా 13:8). కాబట్టి ఏ సమయములోనైనను అప్పులేకుండుటను మన సంఘములన్నిటిలోను పాటించియున్నాము. ఇండియాలోని అనేక ప్రాంతములలో విశ్వాసుల సంఖ్య పెరుగుట వలన మనము మన మందిరములను నిర్మించవలసియుంది కాని మనము ఏ మందిరమైననూ కట్టుటకు అప్పుచేయలేదు. తగినంత ధనము ఉండినప్పుడే మందిరమును కట్టుచున్నాము. (ఏదిఏమైనా మనము ఏ బ్యాంకులోనూ ఋణముతీసుకొనలేదు).


6. పౌలు తాను వ్రాసిన వాటికి ఎటువంటి రుసుము (రాయాలిటీ) తీసుకొనలేదు. కాని ఈ నాటి క్రైస్తవ రచయితలు వారు రచించిన వాటిని బట్టి అనేక లక్షల రూపాయలు రుసుముగా తీసుకొనుచున్నారు. ఇప్పటి వరకు అనేక బాషలలో మన 30 పుస్తకములు 10 లక్షలకు పైగా ముద్రించియున్నాము కాని ఏ పుస్తకానికి కూడా మనము రుసుము తీసుకొనలేదు. పౌలు వలే ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో మన రచనలన్నిటిని ఉచితముగా పెట్టియున్నాము. అలాగే 1000 వీడియో ప్రసంగములు వెబ్‌సైట్‌లో పెట్టియున్నాము. ఇవి అనేక భాషలలోనుండి మరియు ఎవరైనను చూడవచ్చు మరియు డౌన్‌లోడ్‌ ఉచితముగా చేసుకోవచ్చును.


7. ఇండియా వివాహ వ్యవస్థలో పెండ్లికుమార్తెతండ్రి పెండ్లి కుమారుడితండ్రికి కట్నము ఇచ్చే విషయములో ప్రభువైన యేసు, పౌలు వ్యతిరేకించెడివారు. ఇండియాలోని అన్ని డినామినేషన్‌లోని ఉన్న క్రైస్తవులు దీనిని పాటించుచున్నారు. కాని మనము కట్నము తీసుకొనుటను పూర్తిగా వ్యతిరేకించాము. కాబట్టి ప్రతి వివాహములో పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె వారి తల్లిదండ్రులు, కట్నము ఇవ్వలేదనియు లేక తీసుకొనలేదనియు వారు వ్రాతపూర్వకముగా వ్రాసి ఇవ్వాలి.


మనుష్యులయొక్క ఆధిపత్యమనే అపాయము:


1. పౌలు ఆరంభించిన సంఘములన్నిటిలో పౌలు పెద్దలను (బహువచనము) నియమించాడు. ఒక పాస్టరును కాదు (అపొ.కా. 14:23, తీతు 1:5). ఈ విధముగా సంఘము ఒక్క మనుష్యుడు ఆధిపత్యము చేయుటనుండి కాపాడబడింది. స్థానిక సంఘములోనుండి ఆ పెద్దలను నియమించాడు. కాబట్టి పెద్దలందరికి వారి సంఘస్థులందరూ తెలిసియుంటారు. గనుక వారు సులభముగా వారి మందకు ఆత్మీయ ''తండ్రులుగా'' ఉండగలరు. మన సంఘములన్నిటిలో ఆవిధముగానే చేసాను. మన సంఘములలో పాస్టర్లు లేరు. మనము పెద్దలను నియమిస్తాము మరియు ఆ పెద్దలందరూ ఆ స్థానిక సంఘమునకు చెందినవారై ఉంటారు. సంఘమును నడిపించుటకు వేరే స్థలమునుండి ఎప్పుడైననూ పెద్దను తీసుకొని రాలేదు.


2. సంఘములు ఒక డినామినేషన్‌గా ఉండవు గనుక పౌలు నిర్మించిన సంఘములకు అతడు ప్రధాన కార్యాలయమును పెట్టలేదు. ప్రతి స్థానికసంఘమును క్రీస్తు యొక్క శిరస్సత్వము క్రింద ఉన్న పెద్దలు నడిపిస్తారు. మేము కూడా దానినే అనుసరిస్తున్నాము. ఒక స్థానిక సంఘము స్థిరపడిన వెంటనే, అక్కడ నాయకత్వమును స్థానిక పెద్దలకు అప్పగిస్తాము. ఆ సంఘమునకు సంబంధించిన విషయములన్నిటిని వారు నిర్ణయిస్తారు. మరియు ఆర్థిక విషయములను కూడా వారే నిర్వహిస్తారు. మా సంఘములకు ప్రధానకార్యాలయము లేదు. పౌలు సంఘములకు వ్రాసిన పత్రికలలో వలే, సంఘపెద్దలకు కావలసిన సలహాలను ఎల్లప్పుడు ఇచ్చియున్నాము. ఏ పెద్దమీదనైనను మేము ఆత్మీయ అధికారము ప్రయోగించలేదు గాని ఎప్పుడైతే వారికి అవసరమున్నదని స్వచ్ఛందముగా అడిగియున్నారో అక్కడ సహాయపడియున్నాము.


ప్రభువైన యేసు మరియు అపొస్తులుడైన పౌలు పరిచర్యలోని ప్రతి విషయములో వారి మాదిరిని వెంబడించాము. ఈ రోజులలోను మరియు ఈ తరములోనూ క్రొత్త నిబంధన అనుసరించుట సాధ్యమేనని మేము కనుగొన్నాము.


ప్రభువైన యేసు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడని మా పరిచర్యద్వారా బయలుపరిచియున్నాము.


దేవుని పరిచర్యలోని ఒక చిన్న భాగము:


ఈనాడు ప్రపంచములోని క్రీస్తు శరీరమైయున్న సంఘములో ఉన్న అనేక విధములైన పరిచర్యలలో మేము చేసేది కొంచెము భాగమేనని గుర్తించియున్నాము.


కాని ప్రభువైనయేసు ఆయన అపొస్తులు బోధించిన ప్రకారము, వాక్యములో ఉన్న నియమముల ప్రకారము ప్రతీ పరిచర్య జరగాలి.


ప్రతీ ఒక్కరూ దేవునికే లెక్క అప్ప చెప్పవలసియున్నది గనుక క్రొత్త నిబంధన నియయములను వెంబడించని సంఘములను గాని పరిచర్యలకు గాని మేము తీర్పు తీర్చము. 98 శాతం అన్యులున్న మన బీద దేశములో ప్రభువైన యేసు మరియు అపొస్తులులు దేవుని వాక్యము బోధించిన బోధను పాటించగలమని చెప్పుటకు మన సి.ఎఫ్‌.సి. సంఘము ఇప్పుడు సాక్ష్యముగా ఉండాలని కోరుచున్నాము.


జీవమార్గము ఇరుకుగా ఉంటుందనియు మరియు కొద్దిమందే దానిని కనుగొంటారనియు ప్రభువైన యేసు చెప్పియున్నారు గనుక మా సంఘములలో అనేక వేలమంది వచ్చియుండాలని మేము కోరుటలేదు (మత్తయి 7:14). కాబట్టి ఆ కొద్దిమందిని కనుగొనుటయే మా గురి. భూమిమీద ఉన్న ప్రతీ ఒక్కరూ పరలోకము వెళ్ళాలి అనుకొందురు గనుక వారు చనిపోయినప్పుడు పరలోకము వెళ్ళాలని కోరేవారి కొరకు మేము చూచుట లేదు. కాని వారు చనిపోకముందే ఈ భూమి మీద ప్రభువైన యేసుని హృదయ పూర్వకముగా వెంబడించాలని కోరిన వారికొరకే మేము చూచుచున్నాము. కాబట్టి మనకు పెద్ద సంఘములు లేవు మరియు భవిష్యత్తులో ఉండవు.


మనము సంఘములను బంగారము, వెండి మరియు వెలగల రాళ్ళతోనే గాని లేక కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలుతో గాని నిర్మించవచ్చని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పౌలు చెప్పాడు (1కొరింథీ 3:12-15). ఒకడు శిష్యునికి ఉన్న షరతులను మరియు పవిత్రజీవితము గూర్చి బోధించనియెడల, అనేక వేల మందితో కూడి ఉన్న సంఘములు కట్టవచ్చు కాని అది కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలుతో కట్టబడియున్నది. పైన చెప్పిన విధముగా విశ్వాసులందరిని దేవుడు తీర్పు తీర్చే దినమున ఆ పరిచర్య అంతయు కాలిపోతుంది. అయితే శిష్యత్వమును గూర్చియు మరియు క్రీస్తుయొక్క ఆజ్ఞలన్నిటిని గైకొనుటను గూర్చియు చేసిన పరిచర్య - బంగారము, వెండి, వెలగల రాళ్ళతో నిర్మించబడినదై అగ్నిలో కాలిపోకుండా మరియు నిత్యత్వము ఉంటుంది. కాబట్టి ఒక బుద్ధిగల క్రైస్తవుడు సంఖ్యను కాకుండా నాణ్యతను చూస్తాడు.


దేవుడు మన మధ్యలో చేసిన దానిని బట్టి మనము మౌనముగా (నకిలీ దీనత్వముతో) ఉండవచ్చును. కాని అప్పుడు:


1. దేవునికి చెందవలసిన మహిమను మనము దొంగిలించిన వారమగుదుము.


2. మన దినములలో విశ్వాసులు సవాలు పొంది జీవించుటకు క్రొత్త నిబంధన ప్రకారము పరిచర్య చేయనట్లయితే దొంగలించిన వారమగుదుము.


ప్రభువు మన మధ్యలో చేసిన కార్యములు చెప్పుటకు మరో కారణమున్నది: మన తరువాతి తరము వారు కూడా వారి జీవిత కాలములో సారముగల ఉప్పువలె ఉండునట్లు వారు ఈ నియమములను గ్రహించి మరియు వాటి ద్వారా జీవించాలి.


తన జీవితములోను తన పరిచర్యలోనూ దేవుని కృపద్వారా చేసిన కార్యములను గూర్చి పౌలు మౌనముగా లేడు. మనము కూడా మౌనముగా ఉండము కాబట్టి పౌలు వలె మన అతిశయమును ఎవరునూ ఆటంకపరచరు (2 కొరింథీ 11:10).


అపొస్తులులు అభ్యసించిన నియమముల ప్రకారము ఈనాడు కూడా ప్రభువు పరిచర్య చేయవచ్చని ఋజువు పరచుటకు మనము చేయుచున్న పరిచర్యను కొనసాగించెదము.


అధ్యాయము 3
శరీరధారియగుట యొక్క నియమము

శరీరధారియగుట యొక్క నియమమే ఫలభరితమైన పరిచర్యకు ముఖ్యమైన నియమము అనగా ప్రభువు పరలోక మహిమనంతటిని విడిచిపెట్టి మరియు మనుష్యకుమారుడుగా ఈ భూమిమీద జీవించి మనకొక మాదిరిని ఉంచాడు.


కొలొస్సై క్రైస్తవులకొరకు పౌలు ఈ విధంగా ప్రార్థించాడు: ''విషయములను దేవుని దృష్టితో మీరుకూడా చూడగలుగునట్లు మేము దేవునికి ప్రార్థించుచున్నాము'' (కొలొస్స 1:9 జె.బి ఫిలిప్స్‌ తర్జుమా). ప్రతి వ్యక్తిని, ప్రతి విషయమును, ప్రతి పరిస్థితిని మనము కూడా అంతకంతకు దేవుని దృష్టితో చూడగలుగుటకు మన మనస్సులను నూతనపరచాలని (ఆలోచనా విధానమును మార్చవలెను) దేవుడు కోరుచున్నాడు. యేసువలె మనము నడచుకొనుట మరియు క్రీస్తు సారూప్యములోనికి మనము మార్పుచెందుట అనగా ఇదియే (1 యోహాను 2:6). మన మనస్సు నూతన పరచబడుట ద్వారా మనం క్రీస్తు యొక్క సారూప్యములోనికి రూపాంతరపరచబడుదుము (రోమా 12:2).


ప్రభువైన యేసు కూడా మనవలె భూమి మీదకు వచ్చియున్నాడు


ప్రభువైన యేసు అన్ని విషయములలో మనవలె భూమిమీదకు వచ్చియున్నాడని మనము ఒప్పించబడినప్పుడు మాత్రమే యేసువలె మనము కూడా జీవించగలము అనే విషయమును అంగీకరించగలము.


''తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు'' (హెబీ 2:18).


''ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను'' (ఫిలిప్పీ 2:6,7).


భూమి మీద ప్రభువైనయేసు ఆరాధనను అంగీకరించి యున్నాడు కనుక భూమిమీద ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడై యున్నాడు (సువార్తలలో 7సార్లు చెప్పబడింది మత్తయి 8:2, 9:18, 14:33, 15:25, 20:20, మార్కు 5:6, యోహాను 9:38). కాని ఆయన భూమిమీద ఉన్నప్పుడు దేవునిగా ఆయనకున్న శక్తులను ఆయన విడిచిపెట్టి మరియు మనవంటి మనుష్యుని యొక్క పరిమితులను అంగీకరించాడు.


యోహాను 6:38లో ''నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని''.


నిత్యత్వము నుండి ప్రభువైన యేసు తండ్రితోను మరియు పరిశుద్ధాత్మతోను సమానుడైయుండి మరియు ఎల్లప్పుడూ వారితో కలసి పనిచేసాడు. వారు ఎల్లప్పుడూ ఆవిధముగా ఐక్యత కలిగియున్నారు.


కాని ప్రభువైన యేసు భూమి మీదకు వచ్చినప్పుడు, మనుష్యులందరికీ ఉన్నట్లే సొంత చిత్తము ఉన్నది. (క్రొత్త నిబంధనలో యేసు శరీరధారియై వచ్చెననుదాని అర్థమిదే) తన సొంత చిత్తము కలిగియుండుట పాపము కాదు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతడు సొంత చిత్తము కలిగియున్నప్పటికిని పాపము లేకుండా ఉండెను.


కాని యేసు ఎప్పుడైనను తన సొంత చిత్తము చేయలేదు ఆయన ఎల్లప్పుడూ తండ్రి చిత్తమే చేసాడు. ఆవిధముగా ఆయన పాపము చేయలేదు. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనలో ఆయన ఇట్లన్నాడు, ''తండ్రీ నా చిత్తప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. నీ చిత్తమే సిద్ధించు గాక'' (మత్తయి 26:39, 42). మనము నూతనమైనదియు జీవముగల మార్గములో మనము నడుచునట్లు ఆయన తన జీవితకాలమంతయు తన సొంతచిత్తానికి చనిపోయాడనటానికి ఋజువుగా ఆయన తన శరీరమను తెర సిలువ వేయబడినప్పుడు దేవాలయములోని తెర రెండుగా చీలెను (హెబీ 10:20). మనుష్యుని యొక్క స్వచిత్తానికి చనిపోవుట అనే సిలువను ప్రభువైన యేసు ప్రతిరోజు మోసెను మరియు ఇప్పుడు మనము కూడా మన సిలువనెత్తుకొనవలెనని ఆయన అడుగుచున్నాడు(లూకా 9:23).


దేవుడు ఒక్కడే గాని ముగ్గురు వ్యక్తులు కాదనియు మరియు ఆయనకు కేవలము మూడు పేర్లు మాత్రమున్నవనియు క్రైస్తవ్యములో కొందరు తప్పుడు బోధ చేయుచున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వమని మత్తయి 28:19లో చెప్పియుండగా కొందరు దానికి విరోధముగా యేసు ప్రభువే తండ్రియు, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడని బోధిస్తూ యేసు నామములోనే బాప్తిస్మము ఇవ్వాలని చెప్పుచున్నారు. ఆవిధముగా వారు ప్రభువైన యేసు శరీరధారియై వచ్చియున్నాడనే సంగతిని అంగీకరించుటలేదు. ప్రభువైన యేసు మరియు తండ్రి ఒక్కరే అయియున్నట్లయితే గెత్సేమనే తోటలో ప్రభువైన యేసు తనకు తానే ప్రార్థించుకొనునట్లుగా ఉంటుంది! అది హాస్యాస్పదముగా ఉంటుంది మరియు యోహాను 6:39లో ''నా చిత్తమును కాదుగాని నా తండ్రి చిత్తమునే చేయుటకు పరలోకమునుండి దిగివచ్చియున్నాను'' అనినట్లుగా ఉంటుంది. ఇదికూడా హాస్యాస్పదమే కాబట్టి త్రిత్వమును అంగీకరించనివారు యేసు ప్రభువు శరీరధారిగా వచ్చియున్నాడని ఒప్పుకొనుటలేదు. మరియు యోహాను దీనిని క్రీస్తువిరోధిఆత్మ అని చెప్పుచున్నాడు (2 యోహాను 1:7). ఇటువంటి తప్పుడు బోధ విషయములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.


ప్రభువైన యేసు నామములో మాత్రమే బాప్తీస్మమును తీసుకొనినవారు మీ సంఘమునకు వచ్చినయెడల వారు తెలియని రీతిగా తండ్రిని మరియు కుమారునుని ఒప్పుకోలేదు గనుక దానిని మీరు వివరించాలి. అప్పుడు మత్తయి 28:19లో ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా వారికి బాప్తీస్మము ఇవ్వాలి.


ప్రభువైన యేసు మనవలె శోధింపబడినప్పటికి ఆయన పాపము చేయలేదు


దైవభక్తిని గూర్చిన మర్మము ''ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమై మరియు ఆత్మవిషయమై నీతిపరుడై యుండెనని'' దానిలో ఉన్నది (1 తిమోతి 3:16) మరియు అక్కడ ఇట్లు చెప్పబడింది ''సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది'' (1 తిమోతి 3:15).


లివింగ్‌ బైబిలులో ఈ వచనములు ఈ విధంగా వివరించబడినవి:


''దైవభక్తి కలిగి జీవించుట అంత సులభము కాదు అనునది ఎంతో నిజము కాని ఆయన మానవుడుగా ఈ భూమిమీదకు వచ్చి మరియు ఆత్మ విషయములో నీతిపరుడుగా తీర్పుపొందియున్నాడు కాబట్టి దీనికి జవాబు క్రీస్తులో ఉన్నది''


''అపొస్తులుల ద్వారా రక్షకుడని జనములలో ప్రకటించబడెను'' అని ఈ వచనము చెప్పుచున్నది. కాని ఈ సత్యము అనేకమంది క్రైస్తవులు ఒప్పుకొనుటలేదు. యేసు పాపము చేయలేడు అని వారు చెప్పుచున్నారు. అలాగైనట్లయితే ఆయన మనవలె శోధింపబడలేదు కాని హెబీ 4:15లో క్రీస్తు అన్ని విషయములలో మనవలె శోధింపబడెనని చెప్పుబడియున్నది. హెబీ 2:18లో ఆయన మనవలె అన్ని విషయములలో శోధింపబడియున్నాడు గనుక మనము శోధింపబడినప్పుడు ఆయన మనకు సహాయము చేయగలడు.


ఈ విషయాన్ని ఎ.డబ్లు. టోజర్‌ ఇట్లు వివరించాడు,


ఒక వ్యక్తి పాపము చేయలేనివాడుగా చేసినట్లయితే, అతడుగాని ఆమెగాని చక్రముతోను మరియు గుండీలతోను చేసిన బొమ్మవలె (లోబడుచు) ఉంటాడు. చెడు చేయలేని వ్యక్తి మంచిని కూడా చేయలేడు. నీతిగా ఉండుటకు మానవుని యొక్క స్వచిత్తము అవసరము. నేను మరల చెబుతాను: మనం కీడు చేయలేని విధముగా మన చిత్తము ఉన్నయెడల అప్పుడు మంచిని కూడా చేయలేము.


కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పాపము చేయలేడు అను సంగతిని నేను అంగీకరించలేను. ఆయన పాపము చేయలేనట్లయితే, ఆయన అరణ్యములో శోధింపబడుట హాస్యాస్పదముగా ఉంటుంది మరియు దేవుడు దీనిలో భాగస్థుడై ఉంటాడు. ఆవిధముగా కాదు ఒక మనుష్యుడుగా ఆయన పాపము చేసియుండేవాడే కాని ఆయన పాపముచేయకుండుట ద్వారా పరిశుద్ధుడైన మనుష్యునిగా ఉండెను.


ఒక వ్యక్తి పాపము చేయలేనందువలన పరిశుద్ధుడు కాడుగాని పాపమును చేయుటకు ఇష్టపడనందువలన పరిశుద్ధుడు కాగలడు. పాపము చేయలేనివాడు కాదుగాని పాపము చేయనివాడే పరిశుద్ధుడు.


మాట్లాడలేనివాడు శక్తిమంతుడు కాదు మాట్లాడగలిగియుండి కూడా అబద్ధము చెప్పనివాడు సత్యవంతుడు.


జైలులో ఉండి అబద్ధికుడుగా ఉండకుండుట ద్వారా ఒక వ్యక్తి నిజాయితీపరుడు కాదు. ఒక నిజాయితీపరుడు యథార్థముగా ఉండుట వలన నీతిమంతుడైయున్నాడు.


(''సంఘములోని విషాదము - కనుమరుగైన వరాలు'' 7వ అధ్యాయము ఎ.డబ్లు. టోజర్‌ పుస్తకమునుండి).


''ప్రభువైన యేసు మనవలే సమస్త విషయములలో శోధింపబడినను ఆయన పాపములేని వాడుగా ఉండెను'' అను సత్యమును నిజాయితీగా ఉండే ప్రతివ్యక్తియు ఒప్పుకొనును (హెబీ 4:15).


శోధన మరియు పాపమును వేరుచేయవలసియున్నది. మనవలే సమస్త విషయములలో యేసు శోధింపబడ్డారు. కాని ఆయన మనస్సులో దానిని అంగీకరించనందువలన ఆయన పాపము చేయలేదు. మరొకమాటలో ఆయన తన సొంత చిత్తమును ఒకసారి కూడా చేయలేదు లేక ఆయన ఒకసారికూడా తనను తాను సంతోషపరచుకొనలేదు (రోమా 15:3).


అనేక విషయములలో మనలను మనము సంతోషపెట్టుకొనుటకును మరియు మన స్వచిత్తమును నెరవేర్చుటకును శోధించబడతాము. ఒక వ్యక్తి ఆ శోధనను అంగీకరించి మరియు తన సొంత చిత్తమును నెరవేర్చునపుడు మాత్రమే అతడు పాపము చేయును. పౌలు రచనలలో ''దురాశ'' అనగా చెడ్డ కోరిక అనికాదు బలమైన కోరిక అని అర్థము ఎందుకనగా ఆత్మకు విరోధముగా శరీరము ఆపేక్షించునని వ్రాయబడియున్నది (గలతీ 5:17). అనగా మన స్వచిత్తానికి విరోధముగా పరిశుద్ధాత్ముడు బలమైన కోరిక కలిగియున్నాడు.


స్వచిత్తమనేది గర్భము ధరించి పాపము కనును (యాకోబు 1:15). కాని మన స్వచిత్తాన్ని ఉపేక్షించుకున్నట్లయితే, మనము పాపము చేయము. ఒక దైవజనుడు చెప్పిన రీతిగా, ''నా తలమీదిగుండా పక్షులు వెళ్ళకుండా ఆపలేను కాని అవి గూడు కట్టుకొనకుండా చేయగలను''. ఒక చెడ్డ తలంపు మనకొచ్చినప్పుడు, కొద్దిసేపు దానిగురించి ఆలోచించి సంతోషించినయెడల, మనము ''గూడు కట్టుకొనుటకు'' అనుమతించి మరియు పాపముచేసెదము. కాని మనవలె శోధింపబడి ఒక్కసారి కూడా పాపము చేయని యేసుప్రభువే మనకు మాదిరి.


క్రీస్తు యెడల మన నమ్మకత్వమునకు పరీక్ష:


ఇది ''దైవ భక్తిని గూర్చి మర్మము'' అనగా ఒక విశ్వాసి దైవభక్తి విషయములో తీవ్రముగాలేనట్లయితే లేక ఇతరులచేత విమర్శించబడతాననే భయముతో లేఖనములలోని సత్యము కొరకు నిలబడుటకొరకు భయపడువారికి దేవుడు ఆ సత్యమును మర్మముగా ఉంచును (1 తిమోతి 3:16). ఆయనకు భయపడువారికే దేవుడు తన మర్మములను బయలుపరుచును (కీర్తన 25:14). దేవుని విషయములలో ''పిరికి వారుగా'' ఉండుట అపాయకరము ఎందుకనగా పక్రటన 21:8లో ''హంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు కంటే ముందుగా పిరికివారు అగ్ని గుండములో వేయబడుదురని చెప్పబడింది''!


మార్టిన్‌ లూథర్‌ ఈవిధముగా చెప్పాడు:


''నేను దేవుని సత్యమంతటిని నమ్మమని చెప్పి, ఈ సమయములో అపవాదిని ఎదిరించే ఒక సత్యము విషయములో నేను మౌనముగా ఉన్నట్లయితే, నేను నిజముగా క్రీస్తును ఒప్పుకొనుట లేదు. ఈ కాలములో ఎక్కడైతే పోరాటము ఎక్కువగా ఉంటుందో ఆ విషయములో సైనికుడు నమ్మకముగా ఉండాలి. ఇప్పుడు జరుగుచున్న పోరాటములో ఒక సైనికుడు ధైర్యముగా నిలబడనిచో, మిగతా విషయములన్నిటిలో అతడు నమ్మకముగా ఉన్నప్పటికిని ప్రయోజనము లేదు''.


''క్రీస్తు మనవలే శోధింపబడియు ఒక్క పాపము కూడా చేయలేదు'' అను సత్యమును గూర్చి ఇండియాలో మన సంఘములో గత 43 సంవత్సరములుగా పోరాడుచున్నాము. ''ఆ సంఘము సత్యమునకు స్థంభమును, ఆధారమునైయున్నదని'' సత్యమును గూర్చి మనము నిలువబడియున్నాము (1 తిమోతి 3:15). మరియు దానిని ఎంతో ధైర్యముతోను మరియు సిగ్గుపడకుండా ప్రకటించియున్నాము. మరియు దాని ఫలితముగా అనేకమంది జీవితములు మార్పుచెందుట చూచాము.


1 తిమోతి 3:16లో దైవభక్తిని గూర్చిన మర్మము ''క్రీస్తు శరీరధారియై వచ్చియున్నాడని'' సిద్ధాంతములో లేదు గాని ''శరీరధారియై వచ్చియున్న క్రీస్తులో ఉన్నది''. చాలామంది దైవభక్తిని క్రీస్తులో కాక ఒక సిద్ధాంతముగా చూచుచున్నారు గనుక పరిసయ్యులుగా మారియున్నారు. అక్షరము (సరియైన సిద్ధాంతమైనప్పటికి) చంపును. ఆత్మ మాత్రమే జీవింపచేయును (2 కొరింథీ 3:6). మనము ప్రజలను క్రీస్తులోనికి నడిపించవలెను గాని ఏ సిద్ధాంతము యొద్దకు కాదు.


ప్రభువైన యేసు శరీరధారియై వచ్చియున్నాడని మన ఆత్మతో ఒప్పుకున్న యెడల (కేవలం మనస్సుతోనే కాకుండా - 1 యోహాను 4:2) అనగా ఆయన మనవలే సమస్తవిషయములలో శోధింపబడెననియు మరియు మనకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ శక్తి ఆయనకివ్వబడలేదనియు, మనము హృదయపూర్వకముగా నమ్మినయెడల ఆయన నడుచుకొనిన ప్రకారము మనము కూడా నడుచుకొనగలము (1 యోహాను 2:6).


మన సొంతమును కోరక మరియు మన స్వచిత్తమును నెరవేర్చాలని కోరుకొనకుండా మనము ఆయనను వెంబడించాలి.


భూమిమీద ఉన్నప్పుడు ఆయన శోధనల ద్వారా నేర్చుకొనిన తండ్రియెడల విధేయతను గురించి మనకు ప్రత్యక్షత అవసరము. ''ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను'' అని వ్రాయబడియున్నది (హెబీ 5:8). ప్రతీ శోధననకు ఆయన అత్యంత నమ్మకముగా పోరాడియున్నాడు. ఆయన నమ్మకముగా తన ప్రాణమును ధారపోసియున్నాడు (యెషయా 53:12). కాబట్టి దేవుని యొక్క సంపూర్ణజీవము ఆయన ద్వారా బయలుపరచబడియున్నది. మొదటిగా వారికి తెలిసిన ప్రతీ పాపము మీద నమ్మకముగా పోరాడేవారు దేవుని దృష్టిలో కొందరే ఉన్నారు గనుక పరిశుద్ధపరచబడుటకు వారి ప్రాణమును ధారపోయువారు కొద్దిమందే ఉన్నారు.


ప్రభువైన యేసు ఆయన శరీరమను తెరద్వారా ఏర్పరచిన నూతనమైనదియు, జీవముగల ఈ మార్గమును గూర్చిన సత్యమును గ్రహించకుండా అనేకమంది విశ్వాసులు వారి జీవితములో దేవుని చిత్తమును పోగొట్టుకొనుచున్నారు. గనుక నేను ఈ విషయమును వివరించియున్నాను (హెబీ 10:20). మనము సత్యమును గ్రహించిన యెడల ''సత్యము మనలను స్వతంత్రులుగా చేయును'' (యోహాను 8:32).


యేసు ప్రభువు మన పెద్ద అన్నయ్య అయియున్నాడు:


యేసు ప్రభువు మన పెద్ద అన్న కనుక (రోమా 8:29) దేవుడు యేసుని ప్రేమించినట్లే మనలను కూడా ప్రేమించుచున్నాడు (యోహాను 17:23). దేవునికి పక్షపాతము లేదు (రోమా 2:11) గనుక మనము దీనిని నమ్ముచున్నాము.


1. యేసు యొక్క తమ్ముళ్ళు మరియు చెల్లెళ్ళు అయిన మనకు, దేవుడు యేసుకు చేసినదంతయు మనకూ చేయును. కాబట్టి పాపము యొక్క శక్తినుండి మనలను విడిపించును.


2. దేవుడు యేసును గూర్చి శ్రద్ధవహించి జాగ్రత్త తీసుకొనునట్లే మనగురించి కూడా శ్రద్ధ వహించి జాగ్రత్త తీసుకొనును. కాబట్టి మనలను ప్రతీ భయమునుండియు చింత అంతటినుండియు విడిపించును.


పాపము మరియు భయము అను రెండు పెద్ద సమస్యలు ఈ భూమిమీద మనకున్నవి. ప్రభువైన యేసు కూడా ఈ విషయములలో మనవలె శోధింపబడియు పాపము చేయలేదనియు మరియు ఆయన ఎప్పుడునూ భయపడక మరియు చింతించకఉండుట ఉండెనని మనము చూచినప్పుడు వీటినుండి మనము విడుదల పొందెదము (1 యోహాను 2:6).


1977లో ఈ సత్యముచేత పట్టబడినప్పుడు దేవుడు ఈ పాట వ్రాయుటకు సహాయపడియున్నాడు.


శ్రమల వలన, చింతల వలన కృంగిన వేళ


నీ ప్రాణము నిరాశ చెందిన వేళ,


నీవు భయపడనక్కర లేదు,


దేవుడు ఎంతో సమీపముగా ఉన్నాడు,


తన కుమారుని ప్రేమించినట్లే ఆయన నిన్ను ప్రేమించును


ఆయన నీకు కూడా సహాయం చేయును,


కేవలం ఆయనిచ్చిన వాగ్ధానము నమ్ము


ఆయన నిన్ను ఆదుకొనును


పల్లవి:


ఇదే సువార్త - దేవుడు చేయునది


ఆయన యేసుకు ఏమి చేసెనో, నీ కొరకు కూడా అదే చేయును


తన ప్రభావముతో, శక్తితో ఆయన నిన్ను బలపరచును


దేవుడు చేయగలిగిన దానికి అంతంలేదు.
ఈ లోకము పాపము మరియు దుష్టత్వముతో నిండియున్నా


నీవు వాటిచేత జయింపబడుతున్నా,


అయినా దేవుని వాక్యము సత్యము


''పాపము నీ మీద ప్రభుత్వము చేయదు''


నీవు బలంగా శోధింపబడుతున్న సమయంలో


దేవుని కృప నీకు ఆశ్రయముగా నుండును


కావున యేసు నడచినట్లే అనుదినము


నీవు విజయములో నడువవచ్చును
వ్యాధి, బాధలు నీ కొచ్చినా,


నీకు ప్రియమైన వారిని ముట్టినా,


నీ బాధను దేవుడెరుగును,


నిన్ను స్వస్థపరచుటకు ఆయన శక్తి కలిగియుండెను


నీ తండ్రి నీ అవసరం తీర్చును;


ఆయన నమ్మదగినవాడు మరియు సత్యవంతుడు


ఆయన యేసును చూచుకున్నట్లుగా


నిన్ను కూడా చూసుకొనును
యేసును ప్రభువుగాను మరియు జ్యేష్ఠ సహోదరునిగాను


నీవు తెలుసుకున్నట్లయితే


ఎంత మహిమకరమైన ఆదరణ లభిస్తుందో కదా


ఇప్పుడు దేవుడు కలిగియున్నవన్నియు నీవేయగును


ఆయన నిన్ను విడువడు


ఇప్పుడు దేవుడు నీ పక్షముగా నున్నాడు


నీకు విరోధి ఎవ్వడు?
మనము యేసును వెంబడించవలసిన 7 విషయములు:


మొదటిగా యేసు అన్ని విషయములలో తండ్రి మహిమను వెదికాడు (యోహాను 7:18). మనుష్యులకు మేలుచేయుట కూడా ఆయన యొక్క గొప్ప కోరిక కాదు. (అది ఎంత మంచి ఉద్దేశ్యమైనప్పటికిని) తన తండ్రి నామ మహిమనే ఆయన కోరాడు (యోహాను 17:4). ఆయన తన తండ్రి యెదుటనే జీవించి మరియు ప్రతీ విషయములో తన తండ్రినే సంతోషపెట్టుట కోరియున్నాడు. ఆయన తన బోధ వినువారియెదుట కాకుండా తన తండ్రియెదుట నిలువబడి వాక్యాన్ని బోధించాడు. ఆయన ప్రాముఖ్యముగా ప్రజలను కాదుగాని తండ్రినే సేవించాడు.


మనము కూడా దేవునికి సేవ చేయాలి. మనము ప్రాముఖ్యముగా సంఘమునకు కాదుగాని దేవునికి సేవకులుగా పిలువబడ్డాము. ప్రభువు నేర్పిన మొదటి ప్రార్థన ఏమనగా, ''తండ్రీ నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక''. మనము కేవలము ప్రజలను సేవించినయెడల, మనుష్యులను సంతోషపెట్టే వారముగా మారి చివరికి మనము పేరు ప్రతిష్టలు పొందెదము.


రెండవదిగా సంఘము నిమిత్తము ప్రభువైన యేసు సమస్తమును ఇచ్చియున్నాడు. ఆయన సంఘముయొక్క పునాది వేయునప్పుడు ఆయన తనకంటూ ఏదీ ఉంచుకొనలేదు. ''క్రీస్తు సంఘమును ప్రేమించి మరియు దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను'' (ఎఫెసీ 5:27).


తన క్షేమమును గూర్చి కొంచెము కూడా ఆలోచించకుండా మరణించాడు అని యెషయా ఆయన మరణము గూర్చి ప్రవచించాడు (యెషయా 53:8 మెసేజ్‌ బైబిలు). తన సొంత క్షేమాన్ని గూర్చి ఆయన ఆలోచించక, ఆయన జీవించి మరియు మరణించాడు. సంఘము కొరకు తన సమస్తమును ఆయన ఇచ్చియున్నాడు. మనలను కూడా ఆవిధముగా నడుచుకోమని ఆయన కోరుచున్నాడు. మరియు ఈ మార్గములో నడుచుకొనువారే క్రొత్త నిబంధన సంఘములను నిర్మించగలరు. దీనిగురించి ఆలోచించండి.


ఇటువంటి సంఘమును నిర్మించుటకు, మన జీవితములో అనేక ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసియుండును. మన జీవితములలో ఇతరుల ద్వారా భంగము కలగవచ్చును, ఇతరుల చేత ఆసరగా చేసుకొనబడుట మన ఆస్తిపాస్తులు ఇతరులు వాడుకొనుట మరియు ఫిర్యాదు చేయకుండా ప్రతీ ఒత్తిడిలో వెళ్ళుట.


మూడవదిగా, ఆయన మన బాధలలో పాలివాడాయెను. ఆయన మనకు సహాయపడునట్లుగా మనతో తనను తాను ఐక్యపరచుకొన్నాడు. ఆయన దేవుని కుమారుడైనప్పటికిని మనకు సహాయపడుట కొరకు శ్రమలద్వారా విధేయత నేర్చుకొనియున్నాడు (హెబీ 2:17, 5:8). ఆవిధముగా ఆయన మన అందరికంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు (హెబీ 6:20).


మన జీవితములలోని శ్రమలద్వారా విధేయత నేర్చుకొనుటకు మనము ఇష్టపడని యెడల, ఇతరులకు సహాయపడలేము. మనము కేవలము బోధకులమై యుండక, మన సంఘములోని సహోదరీ సహోదరుల కంటే ముందుగా వారి పక్షముగా మనము వెళ్ళాలి. మనము కేవలము వాక్యము చదువుట ద్వారాగాని లేక ఒక పుస్తకము చదువుట లేక ఒక ప్రసంగము వినుటద్వారా గాని లేక మన జీవితములో అనేక బాధాకరమైన శ్రమల గుండా వెళ్ళి ఆ పరిస్థితులన్నిటిలోనూ దేవుని యొక్క శక్తిని ఆదరణను అనుభవించినట్లయితే అప్పుడు మనము ఇతరులకు జీవమును ఇవ్వగలము (2 కొరింథీ 1:4).


నాలుగవదిగా, ప్రభువైన యేసు ఎల్లప్పుడూ తన శిష్యులను తన హృదయములో ఉంచుకొని యున్నాడు. ఆయన ఎల్లప్పుడు వారి మేలునే కోరియున్నాడు. ఇందులో రెండు భాగములున్నవి.


అన్ని సమయములలో తన శిష్యులకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వారియొద్దనుండి ఏమి ఆశించలేదు కాని ఎల్లప్పుడూ వారిని ఆశీర్వదించి మరియు సహాయపడుటకు కోరియున్నాడు.


వారి యొద్ద కనికరముగల వాడనని గుర్తింపు పొందక, వారియొక్క నిత్యమైనమేలు కోరి అవసరమైనప్పుడు కఠినమైన మాటలతో వారిని గద్దించాడు.


పౌలువలె మనము కూడా పరిచర్య చేసిన వారికి ఈ విధముగా చెప్పగలగాలి. ''మేము ఎవరికీ అన్యాయము చేయలేదు, మేము ఎవరి ధనమునుగాని కానుకలను గాని కోరలేదు. మీకు చెందినదేదియు నేను కోరలేదు గాని మిమ్ములనే కోరియున్నాను. ప్రయోజనకరమైనదేదియు దాచుకొనక దేవుని సంకల్పమంతటిని బోధించియున్నాము'' (వీటిని ధ్యానించుడి 2 కొరింథీ 7:2, అపొ.కా. 20:33, 1 కొరింథీ 9:15, ఫిలిప్పీ 4:17, 2 కొరింథీ 12:14 మరియు అపొ.కా. 20:20).


పాత నిబంధన ప్రవక్తలు ఇశ్రాయేలులో మాట్లాడుటకు ముందుగా దేవుని సన్నిధిలో వారి స్థితిని గూర్చి ఆలోచించారు. ఎవరైతే ప్రభువు సన్నిధిలో ఇతరుల అవసరములను గూర్చి ఆలోచిస్తారో మరియు వారి శ్రమలను గూర్చియు సమస్యలను గూర్చియు శ్రద్ధ వహిస్తారో అటువంటి వారికే దేవుడు ప్రవచనాత్మక పరిచర్యను ఇచ్చును.


ఇతరుల స్థానములో మనలను పెట్టుకొని మరియు వారు వెళ్ళుచున్న పరిస్థితులలో వెళ్ళుచున్నట్టుగా ప్రయత్నించి, వారి గురించి ఆలోచించాలి. మనకంటే బీదలైన వారితో వారి ఇంటికి వెళ్ళి మరియు వారితో సహవాసము చేసి వారి శ్రమలలో పాలు పొందవచ్చును లేనట్లయితే మన పరిచర్య వారి అవసరములకును మరియు సమస్యలకును ఉపయోగపడదు.


ఐదవదిగా, ప్రభువైన యేసు మొదట జీవించి మరియు ఆయన చేసినదానినే బోధించాడు. ఉదాహరణకు, 'కొండమీద ప్రసంగమును' (మత్తయి 5,6,7 అధ్యాయములు) ప్రభువు ఆ ముందు రాత్రి సిద్ధపడలేదు. కాని ఆయన 30 సంవత్సరములు జీవించి ఆయన జీవితములోనుండి బోధించాడు.


ఉదాహరణకు మనము నిజమైన విశ్రాంతిలోనే ప్రవేశించకుండానే ప్రవేశించినట్లు ఇతరులకు బోధించవచ్చును. అటువంటి జీవితము కొరకు బలమైన కోరిక మనలో లేనట్లయితే మనం నిజముగా సిగ్గుపడాలి. అటువంటి జీవితములోనికి మనము ప్రవేశించునట్లు అత్యంత ఆసక్తితోను దు:ఖముతోను దేవుని ముఖమును వెదకాలి. అప్పుడు మనము అధికారముతో మాట్లాడవచ్చును.


అన్ని సమయములలో మనలను మనము తగ్గించుకొని ఏదైతే మన జీవితములో అనుభవించియున్నామో లేక దేనినైతే అనుభవం కావాలని హృదయపూర్వకముగా వెదకుచున్నామో, దానిని గూర్చి మాట్లాడవచ్చును.


ఆరవదిగా, ఆయన దేనిని కూడా తనంతట తానే చేయవలెనని కోరలేదు. కానాలో నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు, 5 వేలమందికి ఆహారం పంచిపెట్టినప్పుడు మరియు లాజరును తిరిగి లేపినప్పుడును ఆ అద్భుతము చేయుటకు ఇతరులను కూడా వాడుకొనియున్నాడు. అటువంటి విషయములలో అసాధ్యమైనది ఆయన చేసి మరియు సులభమైన దానిని ఇతరులను చేయమన్నాడు! చివరిగా తన కంటే గొప్ప కార్యములను తన శిష్యులు చేసెదరని ఆయనే చెప్పాడు (యోహాను 14:12).


మన స్థానిక సంఘములలో సమతుల్యమైన పరిచర్య చేయగలుగుటకు, ఈ మాదిరిని వెంబడించాలి. అప్పుడు మాత్రమే మన సంఘముల ద్వారా దేవుని యొక్క సంకల్పము నెరవేరుతుంది. క్రీస్తు శరీరములో అవయవములైయున్న ప్రతీ ఒక్కరినీ వారియొక్క పరిచర్యను వారు నెరవేర్చుటకును దేవుడు ఆయా పరిస్థితులద్వారా ఆత్మీయ పాఠములను నేర్పిస్తాడు. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి పొందుటకు వారందరూ ఏదో ఒక పరిచర్య చేస్తారు. సంఘము ఆత్మీయముగా క్షేమాభివృద్ధి పొందుటకు ఆ సంఘములోని సహోదరీ సహోదరులు శ్రమల ద్వారా ప్రభువు యొద్ద వారు నేర్చుకొనిన వాటిని పంచుకొనుట ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందును. నీ సంఘమును నీవు మాత్రమే ఆశీర్వదించగలవని, గొప్ప తలంపులు కలిగియుండి పరిచర్యకు అభ్యంతరముగా ఉండకూడదు.


ఏడవదిగా ఆయన జీవితముకొరకును మరియు ఆయన పరిచర్యకొరకును సహాయము పొందుటకు ప్రభువైన యేసు తండ్రి యొద్ద ప్రార్థించాడు. మన పరిచర్య ఫలభరితముగా ఉండవలెనంటే, మనం ఆసక్తితో ప్రభువుని వెదకి ప్రార్థించాలి. ప్రభువు కోరిన రీతిగా సంఘమును నిర్మించుటకు, మన సొంత జ్ఞానం మీద మరియు శక్తిమీద ఆధారపడక పరిశుద్ధాత్మ వరములకొరకు ఆసక్తితో ప్రార్థించాలి.


పరిశుద్ధత మరియు ప్రేమ:


నిజమైన పరిశుద్ధత ఎల్లప్పుడూ ఇతరుల యెడల ప్రేమ కలిగియుండును. ప్రభువైన యేసు తన జీవితము ద్వారా బయలుపరచిన దానిని పరిశుద్ధతను మరియు జయజీవితమును కోరుచున్న మనము మరిచిపోకూడదు.


1 థెస్సలో. 3:12,13లో పౌలు ఇట్లు అన్నాడు, ''మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీ యెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక''.


క్రైస్తవులముగా దేవుని సత్యమునకు మరియు పరిశుద్ధత గురించి ఎంత ఎక్కువగా రాజీపడకుండా ఉండెదమో అంత ఎక్కువగా ప్రజలను ప్రత్యేకముగా మనలను అంగీకరించని వారిని ప్రేమించాలి. లేనట్లయితే మనలను మనమే మోసగించుకొనుచూ జీవిస్తాము మరియు మనది నకిలీ క్రైస్తవ్యముగా ఉండును.


''నేను ప్రేమలేని వాడనై గంభీరముగా ఇతరులతో మాట్లాడినను అది తుప్పు పట్టిన గేటు శబ్దము వలె ఉండును''.


నేను దేవుని వాక్యమును శక్తివంతముగాను వాక్యములోని మర్మములన్నిటిని స్పష్టముగా మాట్లాడినను నేను ప్రేమలేని వాడనైతే వట్టివాడను.


నేను ఏది చెప్పినప్పటికి, దేనిని నమ్మినప్పటికి మరియు దేనిని చేసినప్పటికిని నాలో ప్రేమలేనట్లయితే ప్రయోజనము లేదు.


తనకు లేని దానిని ప్రేమ ఎన్నడునూ కోరదు.


ప్రేమలో తల బిరుసుతనము ఉండదు.


ప్రేమ త్వరగా కోపపడదు.


ఇతరులు చేసిన పాపమును ప్రేమ గుర్తుపెట్టుకొనదు.


ప్రేమించే జీవితమును కలిగియుండుటకు ఆశపడుము, నీ ప్రాణము దానిమీద ఆధారపడునట్లు దానిమీద ఆధారపడము - ఎందుకనగా దాని మీద నిజముగా ఆధారపడినది (1 కొరింథీ 13:1 - 14:1 మెసేజ్‌ బైబిలు).


అధ్యాయము 4
ప్రతి స్థలములో ఒక పవిత్రమైన సాక్ష్యము కలిగియుండుట

క్రొత్త నిబంధన యుగములో (మలాకీ 1:11) చెప్పబడిన ప్రకారము తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో ''ప్రతీ స్థలములో ఒక పవిత్రమైన సాక్ష్యము కలిగియుండాలని ప్రభువు కోరుచున్నాడు''. 1975లో బెంగుళూరులో దీనినే గురిగా కలిగియుండుటకు ప్రభువు సంఘమును ఆరంభించాడు.


ఆత్మానుసారమైన సంఘముగా ఉన్న సాక్ష్యమును చెడగొట్టుటయే సాతాను యొక్క ముఖ్యమైన గురి. ఒక సంఘమునకు ఎక్కువమంది వచ్చినప్పటికిని అతడు ఆటంకపరచడు. నిజానికి ఆవిధముగా ఒక సంఘానికి ఎక్కువమంది వచ్చినప్పుడు, వారిలో శరీరానుసారమైన విశ్వాసుల ద్వారా ఆ సంఘము యొక్క సాక్ష్యము చెడగొట్టుట సాతానుకు సులభమవుతుంది.


ప్రభువు కొరకు ఒక సంఘమును పవిత్రముగా ఉంచుటకు పోరాడాలి. ఒక సంఘమును మంచిగా ప్రారంభించుట సులభమే కాని కొంతకాలము తరువాత అక్కడ నియమములను తక్కువగా చేసి చివరకు మృతమైన సంఘముగా మారవచ్చును. ఈ విషయములో మనము సాతాను యొక్క కుయుక్తులను యెరిగి మరియు మెలకువగా ఉండాలి. మొదటిగా మన జీవితములలో దీనిని తీవ్రముగా తీసుకున్నట్లయితే మనము ఈ విషయములో జాగ్రత్తపడి మెలకువగా ఉండెదము.


మన సంఘకూటములకు శరీరానుసారమైన ప్రజలు రాకుండా ఆటంకపరచలేము. ప్రభువైన యేసు ''సంఘము''లో కూడా ఇస్కరియోతు యూదా ఉండియున్నాడు. మరియు పౌలు ఆరంభించిన కొరింథీ సంఘములో కూడా అనేకమంది శరీరానుసారులు ఉన్నారు. మన సంఘములో కూడా శరీరానుసారులు ఉండెదరు. దానిని మనము నివారించలేము.


కాని సంఘ నాయకత్వమును ఎల్లప్పుడూ ఆత్మసంబంధమైన వారికి ఇచ్చుట చాలా ముఖ్యమైయున్నది. మరియు ఆ సంఘములో చెప్పే వర్తమానములు పవిత్రమైనవై మరియు క్రొత్త నిబంధన వర్తమానమై ఉండాలి.


తిమోతితో పౌలు మొదటిగా తన గురించి జాగ్రత్తపడమని చెప్పుచున్నాడు (1 తిమోతి 4:15, 16). ఆత్మకు మరియు శరీరానికి కలిగిన సమస్త కల్మషమునుండి తమనుతాము నమ్మకముగా పవిత్రపరచుకొనువారు సాతాను యొక్క కుయుక్తులను తెలుసుకొనగలరు (2 కొరింథీ 7:1). మరొక మార్గము లేదు. మనము ఆత్మసంబంధమైన శక్తులతో పోరాడవలెను గనుక మరియు ఈ పోరాటము శరీరులతో గాని లేక తెలివితేటలు గలవారితో గాని పోరాడము. సిద్ధాంతమును యెరిగియుండుట గాని మరియు ఆత్మవరములను కలిగియుండుట వలన గాని ప్రయోజనము లేదు.


సంఘ నిర్మాణమే ప్రాముఖ్యముగా కలిగిన దీనులైన నాయకులు:


ఆత్మీయమరణమును జయించే సంఘమును నిర్మిస్తానని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 16:18). ప్రభువు మాత్రమే అటువంటి సంఘమును నిర్మించగలడు, మనము నిర్మించలేము కాని మనము ఆయన చిత్తప్రకారము వాడబడే పనివారమై యుండగలము. కాని సంఘము యొక్క ప్రభుత్వము ప్రభువు మీద మాత్రమే ఆధారపడియుండాలి (యెషయా 9:6). దీనిని ఎప్పుడైననూ మనము మరచిపోకూడదు. ప్రభువు సంఘమును నిర్మించని యెడల, మనము చేసే పరిచర్య అంతయు వ్యర్థమే (కీర్తన 127:1). ఎవరైతే ప్రభువు సంఘమును ఎక్కడైననూ తామే నిర్మిస్తున్నామని అనుకుంటారో అటువంటివారు తెలియకుండానే ''ఈ బబులోను నేను నిర్మించిన నగరము కాదా?'' అని చెప్పిన నెబుకద్నెజరుతో సహవాసము కలిగియున్నారు (దానియేలు 4:30). అటువంటి గర్వము, బబులోను సంఘమైన లోకసంబంధమైన సంఘమును కట్టును (పక్రటన 17:5).


దీనులైన నాయకుల కొరకు దేవుడు చూచుచున్నాడు. నోవహు ఓడను నిర్మించిన రీతిగా ఎవరైతే దేవుని రాజ్యమును మొదటిగా వెదకుచూ తమ జీవితములలో సంఘ నిర్మాణమే ప్రాముఖ్యముగా ఉంటుందో అటువంటి వారి కొరకు దేవుడు చూచుచున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి దానికొరకు తనను తాను అప్పగించుకొనియున్నాడు (ఎఫెసీ 5:27). మనము సంఘమును ప్రేమించినయెడల దాని కొరకు మనకున్న దానితోపాటు మనలను మనమే అర్పించుకొనెదము. సంఘ నిర్మాణము కంటే ఈ లోక సంబంధమైన ఉద్యోగమును (వ్యాపారమును) ఎక్కువగా ప్రేమించేవారు బబులోనును నిర్మించగలరు. అనగా మన ఉద్యోగములకు రాజీనామా చేయవలెనని కాదు ఎందుకనగా క్రైస్తవేతరులు డబ్బుకొరకే క్రైస్తవ పరిచర్య చేస్తున్నారనే అభిప్రాయము కలిగియున్నారు. కనుక పౌలు వలె మనలను మనమే పోషించుకొనుచూ పరిచర్య చేయుట మంచిది. మనము ఉద్యోగము చేయుచున్నప్పటికిని, మన ఆలోచనలలో దేవుని రాజ్యమే ముఖ్యమైయుండాలి.


సంఘనిర్మాణములో దేవుడు మనతో ఉండుటకు, మన తలంపులలోను మరియు మన జీవితములలోను సంఘనిర్మాణమే ప్రాముఖ్యమై యున్నదో లేదో పరీక్షిస్తాడు.


మన సంఘములు గాని లేక సంఘములో విశ్వాసులుగాని విస్తరించాలని ఎక్కువ ఆసక్తి కలిగియుండకూడదు. ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగియుండుట కొరకే ఆసక్తి కలిగియుండాలి. దేవుడు కూడా ఆ విషయములోనే ఆసక్తి కలిగియున్నాడు. మనము దేవునికి ప్రార్థించినప్పుడు మొదటిగా ఈ విధముగా ప్రార్థించమని ప్రభువు చెప్పారు, ''తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక'', మరియు సంఘ సభ్యులు ఎక్కువ అగుటకాదు. ఒక అపవిత్రమైన మరియు చెడ్డ సాక్ష్యము కలిగిన సంఘము కలిగియుండుట కంటే అసలు సంఘము లేకుండుటయే మేలు.


సంఘ పెద్దలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన రెండు అవసరతలు ఏమిటనగా దేవునియెడల భయభక్తులు మరియు మరెక్కువ దీనత్వము.


త్యాగపూరితమైన ఆత్మకలిగిన నాయకులు:


సంఘ నిర్మాణము కొరకు ప్రభువైన యేసువలె సమస్తము ఇచ్చెడివారే నిజమైన సంఘము నిర్మించగలరు.


''క్రీస్తు సంఘమును ప్రేమించి మరియు దానికొరకు తనను తాను అప్పగించుకొనెను'' (ఎఫెసీ 5:27). ఈనాడు సంఘమును నిర్మించాలని కోరే ప్రతివారు ఈ త్యాగమును చేయవలెను. అనగా ప్రతీ రోజు స్వజీవమును పూర్తిగా త్యాగము చేయవలెను. క్రీస్తు యొక్క శరీరము నిర్మించుట కొరకు దీనికంటే సులభమైన మార్గము లేదు.


మానవ చరిత్ర ఆరంభం నుండి ఈ నియమమును మనము చూచెదము.


కయీను కేవలము ఒక అర్పణ దేవుని కొరకు తెచ్చియున్నాడు మరియు దేవుడు దానిని నిరాకరించాడు. కాని హేబెలు తన మందలోని శ్రేష్ఠమైన వాటిని అర్పణగా తెచ్చాడు. మరియు దేవుడు దానిని అర్పణగా అంగీకరించాడు (ఆదికాండము 4:3 - 5). కొంచెము వెల కలిగిన అర్పణలు తెచ్చే మతానుసారమైన క్రైస్తవులకు కయీను సూచనగా ఉన్నాడు. తమకున్న సమస్తాన్ని వెలగా చెల్లించి అర్పించే ఆత్మానుసారమైన విశ్వాసులకు హేబెలు సూచనగా ఉన్నాడు.


మోరియా పర్వతము మీద దేవుని పిలుపు ప్రకారము అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు అది తన జీవితములో అత్యంత గొప్ప త్యాగమైయున్నది. అతడు హేబెలును అనుసరించియున్నాడు (ఆదికాండము 22 అధ్యాయము).


1000 సంవత్సరముల తరువాత అదే పర్వతము మీద దావీదు అర్పణ అర్పించి మరియు ఈ విధముగా చెప్పాడు, ''వెల యియ్యక నేను తీసుకొనిన దానిని యెహోవాకు దహనబలిగా అర్పించను'' (2 సమూయేలు 24:24).


దేవుడు అబ్రాహాము యొక్క మరియు దావీదు అర్పణలను చూచి అదే మోరియా పర్వతము మీద ఒర్మాను కళ్లమందు సొలొమోనుకు దేవాలయము కట్టమని దేవుడు చెప్పాడు (2 దినవృత్తాంతములు. 3:1).


ఎవరైతే త్యాగపూరితమైన ఆత్మను కలిగియుంటారో వారితో మాత్రమే దేవుడు తన ఆత్మీయ మందిరమును నిర్మిస్తానని దేవుడు చూపిస్తున్నాడు. పెండ్లికుమార్తెయైన యెరూషలేమును అటువంటివారు మాత్రమే నిర్మించగలరు (పక్రటన 21:2). ఇతర క్రైస్తవులందరూ వేశ్యయైన బబులోనును మాత్రమే నిర్మించగలరు (ప్రకటన 17,18 అధ్యాయములు).


మతానుసారమైన ప్రజలు మరియు ఆత్మానుసారమైన ప్రజలు అను రెండు ప్రవాహములు కయీను మరియు హేబెలు ద్వారా ఆరంభమైనవి. ఇశ్రాయేలు చరిత్రలో అబద్ధ ప్రవక్తలు మరియు నిజ ప్రవక్తల ద్వారాను మరియు ప్రభువైన యేసు కాలములో పరిసయ్యుల ద్వారాను చివరకు బబులోను మరియు యెరూషలేము ఈ రెండు ప్రవాహములు చూడగలము (ప్రకటన 17,18 మరియు 21 అధ్యాయములు).


ప్రభువైన యేసు మహిమను చూచే నాయకులు:


చాలా మంది విశ్వాసులు దేవదూతలను ప్రభువైన యేసును శరీరధారిగా చూడాలని ఆశపడతారు కాని మనమైతే ఆయన భూమి మీద జీవించిన విధానములో యేసు జీవములో ఉన్న మహిమను చూడాలని ఆసక్తి కలిగియుండాలి. మనం వెంబడించుటకు ఇదియే మాదిరి.


పౌలు ఇట్లు అన్నాడు, ''నా శరీరములో మంచిది ఏదియు నివసించదు... నేను ఎంత దౌర్భాగ్యుడను'' (రోమా 7:18,24). తన్ను తాను దీనిని బట్టియే పవిత్రపరచుకొనుటకు ఎంతో ఆసక్తి కలిగియున్నాడు. మన శరీరంలో ఉన్న భ్రష్టత్వమును గూర్చిన ప్రత్యక్షత మనకు కూడా అవసరము. అప్పుడు మాత్రమే ''మనకు ఈ వాగ్ధానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందుము''. ఆవిధముగా మనము సంపూర్ణముగా పవిత్రతలో కొనసాగగలము (2 కొరింథీ 7:1).


వీటిని మనము కేవలము పవిత్రమైన సిద్ధాంతములుగా విశ్వసించి బోధించినట్లయితే మనము దాని శక్తిని అనుభవించకుండా కేవలము పైకి భక్తి గలవారమై యుండెదము. ఇవి సిద్ధాంతముల కంటే మనకు ఎంతో ఎక్కువై ఉండాలి. అవి మనకు ప్రత్యక్షతగా మారి మన జీవితాంతం ఆ ప్రత్యక్షతలో అభివృద్ధి చెందాలి. మన జీవితములో వచ్చే అనేక శోధనలను మనము నమ్మకముగా ఎదుర్కొని మరియు పోరాడుచూ ఉన్నట్లయితే మన అంతరంగ జీవితములో క్రీస్తు వలే లేని అనేక విషయములను ఆత్మ మనకు బయలు పరచును. అప్పుడు వాటినుండి మనము పవిత్రపరచుకొనగలము.


అటువంటి ప్రత్యక్షతను ఎల్లప్పుడూ పొందకపోయినట్లయితే మనము సంఘమును నిర్మించుట అసాధ్యము. మన శరీరములో ఉన్న భ్రష్టత్వమును గూర్చి ప్రత్యక్షత పొందకుండా ''పరిశుద్ధతను'' పొందినట్లయితే అది కేవలము పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన నీతిగలిగి మరియు పాత నిబంధన పరిశుద్ధులవలే ఉందుము. దానిని బట్టి మన తోటి విశ్వాసులలో మనకు గుర్తింపు రావచ్చుగాని దేవుని దృష్టిలో మనము సంపూర్ణులము కాము (పక్రటన 3:1, 2).


మనకు శోధన వచ్చినప్పుడు ప్రభువైన యేసు మాదిరి చూడనట్లయితే, మనం ఇప్పటికే ఆత్మీయముగా దిగజారిన వారమగుదుము.


పవిత్రమైన సాక్ష్యము కలిగియుండుటకు కావలసిన బోధలు:


మనము ఇతరులను రక్షణలోనికి మాత్రమే కాకుండా వారిని శిష్యులుగా చేయవలెనని ప్రభువైన యేసు చెప్పారు.


కాబట్టి పవిత్రమైన సాక్ష్యము కలిగియుండుటకు మొదటిగా, మన సంఘములో పాలి భాగస్తులు కావాలని కోరే వారికి శిష్యుని యొక్క షరతులను బోధించి మరియు శిష్యత్వము మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితమును మరియు మన సంఘ జీవితమును ఏవిధముగా ప్రభావితము చేస్తుందో బోధించాలి.


ప్రభువు లూకా 14:26-33లో చెప్పిన శిష్యునికుండవలసిన ముఖ్యమైన మూడు షరతులు గురించి వారికి బోధించాలి.


1. మన కుటుంబ సభ్యులందరికంటెను, బంధువుల కంటెను మరియు సహోదర సహోదరీల కంటెను ఎక్కువగా ప్రభువైన యేసును ప్రేమించాలి (లూకా 14:26). ప్రభువు చెప్పిన దానిని మనము చేయునట్లు వీరిలో ఎవరు అభ్యంతర పరచకుండునట్లు మనము చూసుకోవాలి.


2. మన స్వజీవము కంటే ప్రభువైన యేసును ఎక్కువ ప్రేమించాలి (లూకా 14:27). మనము శోధింపబడినప్పుడు మన స్వజీవాన్ని ఉపేక్షించుకొని మరియు ప్రతిరోజు అనేకసార్లు దానిని సిలువ వేయాలి (లూకా 9:23).


3. మనము కలిగియున్న భూసంబంధమైన ఆస్తిపాస్తుల కంటే ప్రభువైన యేసును ఎక్కువగా ప్రేమించాలి (లూకా 14:33). భూసంబంధమైన అనేక వస్తువులు కలిగియుండుటకు దేవుడు మనకు అనుమతిస్తాడు. కాని మనము వాటిని గట్టిగా హత్తుకొని ఉండకూడదు. అది దేవుని యొక్క ఆస్తి అని గ్రహించి అవసరమైతే దానిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండాలి.


రెండవదిగా ప్రభువు కొండమీద చేసిన ప్రసంగమును అనేకసార్లు వివరముగా వారికి వివరించాలి (మత్తయి 5,6,7 అధ్యాయములు). ప్రభువు ఆ ప్రసంగమను 3 ఉపమానములతో ముగించారు.


ఇరుకు మార్గము నిత్య జీవమునకు నడుపుతుందని ఈ ప్రసంగములో ప్రభువు చెప్పారు (మత్తయి 7:14).


ఈ ప్రసంగంలో చెప్పిన వాటికి విధేయత చూపుట ద్వారానే మనము ఆయన శిష్యులమై మరియు దేవుని మహిమకొరకు ఫలించే చెట్ల వలే ఉండెదము (మత్తయి 7:16 - 20).


ఈ ప్రసంగములో ప్రభువు చెప్పిన దానంతటికి విధేయత చూపుట ద్వారానే మనము ఆయన శిష్యులమైయుండి, ఎప్పటికి చలించని నిత్యమైన పునాదిమీద మన వ్యక్తిగత జీవితమును, మన కుటుంబ జీవితమును మరియు మన సంఘ జీవితమును కట్టుకొనగలము (మత్తయి 7:24 - 27).


మూడవదిగా పైన చెప్పిన విధముగా మనము జీవించుటకు మన సొంత శక్తితో అసాధ్యము గనుక ఎల్లప్పుడు మనము పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవునిని ప్రార్థించాలని మన సంఘములోని ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించాలి. ఎందుకనగా మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఆ విధముగా జీవించగలము (అపొ.కా. 1:8, ఎఫెసీ 5:18).


నాలుగవదిగా భద్రతలేని, దుష్టమైన ఈ లోకములో ప్రతి విశ్వాసి దేవునిలో భద్రత కలిగియుండునట్లు వారు పరలోకములో ఉన్న దేవునిని వారి సొంత తండ్రిగా ఎరుగునట్లు వారిని నడిపించాలి.


ఐదవదిగా ప్రభువైన యేసు, ''అన్ని విషయములలో మనవంటి వాడయ్యాడు'' (హెబీ 2:17) మరియు ''సమస్త విషయములలోను మనవలె శోధించబడ్డాడు'' (హెబీ 4:15) అను గొప్ప సత్యములు అందరూ విశ్వసించి మరియు ఆయన ఎలాగున నడచుకొనెనో అలాగున మనము కూడా నడుచుకొనగలమని వారు నమ్మునట్లు చేయాలి (1 యోహాను 2:6).


మన పరిచర్యను ఆరంభించినప్పుడు లేఖనములలో ఈ సత్యమును అనేక నెలలు ధ్యానించాను. తరువాత గొప్ప ఫలితాలను చూసాను.


ఆ విధముగా మాత్రమే ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగిన క్రొత్త నిబంధన సంఘమును నిర్మించగలము.


ప్రకృతి సంబంధమైనవారు కాకుండా ఆత్మసంబంధమైన నాయకులు:


మనము సంఘమును నిర్మించవలెనని కోరినట్లయితే మన ప్రాణమును (మనస్సు మరియు ఉద్రేకములు) లో ఉన్న బలమైన కోరికలను చంపాలి. మనలో ఉన్న ఆత్మను మరియు ప్రాణమును దేవుని వాక్యము విభజిస్తుంది (హెబీ 4:12). ఇటువంటి కోరికలను, సౌలు చంపని అమాలేకీయుల గొఱ్ఱెలతో పోల్చవచ్చు. దీనిని బట్టి సౌలు తన సింహాసనాన్ని పోగొట్టుకొనెను (1 సమూయేలు 15:15). ఇవి శరీరేచ్ఛల వలె చెడ్డ కోరికలు కాదు (అమాలేకీయులు చెడ్డ గొఱ్ఱెలను సౌలు చంపాడు). కాబట్టి ఇవి మోసకరమైనవి మరియు ఎంతో అపాయకరమైనవి.


కాబట్టి సాతాను కొన్నిసార్లు పాపమును బట్టియే గాక కుయుక్తితో, మానవజ్ఞానముతో ఉద్రేకములతోను మరియు మంచిగా కనబడే ఇతర విషయముల ద్వారా సంఘమును పాడు చేయవలెనని సాతాను గురి. కాబట్టి దేవునిలో నుండి కాకుండా మన తెలివితేటలనుండి వచ్చిన తలంపులను బట్టి మనము కొన్ని పరిచర్యలు చేయవచ్చు. ఆ విధంగా మనము గురి తప్పిపోవచ్చు. దేవునిలో నుండి రానటువంటి ప్రతీ పరిచర్య (సంస్థ) ఒక రోజు దేవుని చేత పెకిలించి వేయబడి మరియు నాశనం చేయబడుతుంది (మత్తయి 15:13).


ఈ విషయములలో మనలను మనము నమ్మకముగా తీర్పు తీర్చుకున్నట్లయితే మన పరిచర్య ప్రవచనాత్మకముగాను మరియు క్షేమాభివృద్ధి కలుగజేసేదిగా ఉంటుంది. మనుష్యుల తెలివితేటలనుండి వచ్చు బోధ అంతయు ఆత్మీయ మరణమును తెచ్చును. ప్రజలను ఉద్రేక పరిచే పరిచర్య కూడా ఆత్మీయ మరణము తెచ్చును. దురదృష్టవశాత్తు అనేకమందికి మనుష్యుల ఉద్రేకముల ద్వారా చేసే పరిచర్యకును మరియు పరిశుద్ధాత్మ ద్వారా చేసే పరిచర్యకును తేడా తెలియదు. మన పరిచర్యలో మనుష్యురీతిగా ఉన్నదానిపై వెలుగు పొందాలి. లేనట్లయితే మనకున్న మంచి ఉద్దేశ్యాలన్నిటితో కూడా తెలియని రీతిగా సంఘమును కలుషితము చేసెదము.


మనమందరమును తెలివితేటలు కలిగియుంటాము గనుక శరీరానుసారమైన ఆ తెలివితోను మరియు జోకులు వేయుచు ప్రసంగము చేయవచ్చును. పౌలు వాక్యపరిచర్య చేసిన ప్రతిసారి పౌలు ఎందుకు భయముతో వణకి చేసియున్నాడో తెలుసుకొనుటకు (1 కొరింథీ 2:1 - 5) చదివి ధ్యానించాలని ప్రోత్సహించుచున్నాను. పౌలు తన తెలివి గల మనస్సుపై ఆధారపడుటకు భయపడి యున్నాడు. కాబట్టి మనము ''జ్ఞానులమగునట్లు వెఱ్ఱివారము కావలెనని'' పౌలు చెప్పుచున్నాడు (1 కొరింథీ 3:18).


ప్రభువు యొద్దనుండి మన భారమునకును మరియు మనకున్న గొప్ప ఆలోచనలకును ఎంతో తేడా ఉన్నది. ఎంతో ప్రార్థన ద్వారాను మరియు మన జీవితములలో ప్రభువు మనలను క్రమశిక్షణలో పెట్టుట ద్వారాను ప్రభువుయొక్క భారమును మన మనసులలో కలిగియుండగలము. కాని పేరు ప్రతిష్ఠలు సంపాదించుట కొరకు మనము గొప్ప ఆలోచనలు కలిగి బోధించవచ్చును. మన బోధ ద్వారా ఘనతను, పేరు ప్రతిష్ఠతలు పొందాలనే కోరికనుండి విడుదల పొందాలి. మనము పూర్తిగా విడుదల పొందుట కొరకు హృదయపూర్వకముగా పోరాడాలి.


మనకు తెలిసిన పాపముతో నమ్మకముగా పోరాడుచు మరియు ఎల్లప్పుడూ దేవుని యెదుట దీనులమైతే ఈ విషయములో దేవుడు మనకు వెలుగు ఇస్తాడు. మరొక విధముగా దీనిని కనుగొనలేము.


మనము అంతకంతకు ఎక్కువగా ప్రభువుతో సహవాసము (ప్రార్థన) చేయనట్లయితే, నెమ్మదిగా మనము వెనుకకు దిగజారిపోయి మరియు మన వాక్య పరిచర్యలో అభిషేకాన్ని పోగొట్టుకొని ఎక్కడైననూ క్రీస్తుయొక్క శరీరమను సంఘమును నిర్మించలేము.


స్వజీవమునకు చనిపోయే మార్గములో నడిచే నాయకులు:


ఒక గోధుమ గింజ భూమిలో పడి మరియు బహుగా ఫలించినట్లే మనము కూడా మన స్వజీవ విషయములో కూడా భూమిలో పడి చనిపోయినట్లయితేనే మన జీవితములో బహుగా ఫలించగలమని ప్రభువైన యేసు బోధించారు (యోహాను 12:24).


మనము ప్రతి దినము స్వజీవము విషయములో నమ్మకముగా చనిపోతామో లేదో అని దేవుడు చూచును. నిన్ను ఇబ్బంది పరచు వారి మధ్యలో దేవుడు నిన్ను ఉంచినట్లయితే, నీ స్వజీవమునకు చనిపోవుటకు దేవుడు అనేక అవకాశములు ఇచ్చుచున్నాడని నీవు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి వారిని ప్రేమించి మరియు వారిని ఆశీర్వదించాలి. నీ శరీరములో ఉన్న నీ స్వయమనే భ్రష్టత్వము గురించి నిజముగా విడిపించబడాలని నీవు కోరిన యెడల, నీ స్వజీవానికి చనిపోవుటకు అనేక అవకాశములు నీ జీవితములో చూడగలవు.


మనము ప్రజలను మనుష్యులయొక్క నీతిలోనికి నడిపించకుండుటకు జాగ్రత్త పడాలి. దేవుని యొక్క స్వభావములో మనము పాలివారమగుచు మరియు ఇతరులు కూడా పాలి వారగునట్లు వారిని నడిపించుట కొరకు మనము పిలువబడ్డాము (2 పేతురు 1:3). ''యేసు యొక్క జీవము మీ శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడు వహించుకొని పోవుచున్నాము''. ఈ విధముగా దేవుని స్వభావములో మనము పాలివారమగునట్లు, ''మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము'' (2 కొరింథీ 4:10 - 12).


ఇతర సంఘములలో ఉన్న క్రైస్తవుల కంటే కొద్దిగా మెరుగైన జీవితమును జీవిస్తూ మరియు దానితో తృప్తిపడిన యెడల మనము ధర్మశాస్త్రము ద్వారా వచ్చే నీతినేగాని దేవుని నీతిని పొందలేము. ఆ విధముగా మనము దేవుని నీతిలోనికి నడిపించలేము. కాబట్టి మన స్వనీతిని ఇతరులు మెచ్చుకొన్నప్పుడు దానికి మనము విలువనివ్వకూడదు. మన మంచితనమును బట్టియు మరియు మన నీతిని బట్టియు ఇతరుల యొద్ద ఘనతను కోరుటయే పరిసయతత్వానికి మూలము మరియు అది క్రీస్తు ఆత్మకు విరోధమైయున్నది. కాబట్టి అది క్రీస్తువిరోధియొక్క ఆత్మ. మనము జయించువారముగా ఉండాలని కోరినట్లయితే దీనిని కనికరము లేకుండా చంపాలి. కొద్దిమంది మాత్రమే ఈ విషయములలో నమ్మకముగా ఉన్నారు. కాని ఆ కొద్దిమందిలో నీవు ఉండాలి.


సిలువ మార్గమును (స్వజీవమునకు చనిపోవుట) గూర్చి మనము ఎల్లప్పుడునూ మాట్లాడుచున్నట్లయితే మన విషయములో అనేకులు అభ్యంతరపడవచ్చును. అయినప్పటికిని మనము దీనిని బోధిస్తూనే ఉంటాము. ఎవరైతే దేవుని నీతికొరకు ఆకలి దప్పులు కలిగియుండరో అటువంటివారు ఇటువంటి ప్రసంగములు విని మరియు అభ్యంతరపడి పడిపోవునట్లుగా చేయును.


ఎల్లప్పుడూ ఘనతను కోరే బోధకులు దురద చెవులుగలవారిని తృప్తి పరుచుటకు ఎల్లప్పుడూ క్రొత్త విషయము గూర్చి మాట్లాడెదరు (2 తిమోతి 4:3,4, అపొ.కా. 17:21). నశించుచున్న వారికి మరియు ''ఆయన పవిత్రుడైయున్నట్లుగా తననుతాను పవిత్రపరచుకోవాలని కోరువారికి సిలువను గూర్చిన వార్తయే దేవుని శక్తియై యున్నది'' (1 యోహాను 2:6, 3:3).


బబులోను నుండి యెరూషలేమునకు వెళ్ళుట:


దానియేలు గ్రంథములో బబులోను నుండి యెరూషలేముకు దేవుని ప్రజలు వెళ్ళుట గురించి చూస్తాము. ఈనాడు కూడా ''నా ప్రజలారా బబులోనును విడిచి రండి'' (పక్రటన 18:4) అని దేవుని యొక్క పిలుపుకు కొందరు లోబడి దేవుని క్రొత్త నిబంధన సంఘముగా నిర్మించబడుటకు అనేకులు రాజీపడచున్న క్రైస్తవ్యమును విడిచి బయటకు వచ్చుచున్నారు.


ఈ ఉద్యమము బబులోను కాలములో రాజీపడని దానియేలు అను ఒక వ్యక్తితో ఆరంభమయింది. అతడు దేవుని యొక్క ఉద్దేశ్యము యెడల ఆసక్తి కలిగి అది నెరవేర్చబడుటకు అతను ఉపవాసముండి ప్రార్థించాడు. ''ప్రభువా ఈ ప్రదేశములో ఒక పవిత్రమైన సంఘము ఉండవలెనని కోరుచున్నాను మరియు దానికొరకు ఎంత వెలయైనను చెల్లిస్తాను'' అని ఒక వ్యక్తి ఒక ప్రదేశములో భారముతో ప్రార్థించుట ద్వారా ఏ ప్రదేశములో అయినను దేవుని యొక్క సంఘము నిర్మించబడుతుంది. అది నెరవేర్చబడకమునుపు చాలా కాలము అతడు ఆ భారము కలిగియుంటాడు. ఒక తల్లి తన బిడ్డను గర్భములో ధరించినట్లే మన హృదయములో ఈ భారము భరించవలసియుంది. ఆ విధముగా దానియేలు ఈ భారమును భరించియున్నాడు.


దానియేలు జీవితములో ఒక ప్రత్యేకమైన గుణలక్షణమేమనగా, ''తనను తాను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నాడు'' (దానియేలు 1:8). దేవుని వాక్యములోని అల్పమైన ఆజ్ఞలకు కూడా రాజీపడకుండా విధేయత చూపించాడు. మత్తయి 5:19లో ప్రభువు ఇట్లన్నాడు, ''కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును''. ఎవరైతే కోపము మరియు మోహపు తలంపులను పెద్ద పాపములో నుండి విడుదల పొందుటను గూర్చియు (మత్తయి 5:22, 28) మరియు స్త్రీలు ప్రార్థించినప్పుడు ముసుగు వేసుకొనుట మరియు సంఘ కూటములలో ప్రవచించుట గూర్చియు అను చిన్న ఆజ్ఞలకు (1 కొరింథీ 11:1 - 16) లోబడవలెననియు బోధిస్తారో అటువంటి వారితో దేవుడు క్రొత్త నిబంధన సంఘమును నిర్మిస్తాడు.


ఆరంభములో యూదులందరూ రాజీపడుచున్నప్పటికీ దానియేలు ఒక్కడే దేవుని కొరకు నిలబడియున్నాడు. దానియేలు దేవుని కొరకు నిలవబడుటను చూచి హనన్యా, మిషాయేలు, అజర్యా (వారు బబులోనులో షద్రకు, మేషాకు, అబేద్నెగో అని పిలువబడ్డారు) అనువారు ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు నిలువబడిరి (దానియేలు 1:11).


వారి ప్రదేశములో ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము కలిగియుండాలని ఈనాడు కూడా హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారు అనేకులు ఉన్నారని నేను నమ్ముచున్నాను. కాని వారు తమంతట తాముగా ధైర్యము వహించలేరు. వారిని నడిపించుటకు వారికి దానియేలు వంటివారు కావాలి. వారి గ్రామములోగాని లేక పట్టణములోగాని దానియేలులాంటి వారు వచ్చినప్పుడు వారు కూడా బయటకు వచ్చి అతనితో కలిసెదరు.


రాజును సంతోషపెట్టవలెనని కోరే అనేకవేలమంది యూదులకంటే బబులోనులో హృదయపూర్వకముగా వెంబడించే నలుగురిద్వారా దేవుడు శక్తివంతమైన సాక్ష్యము కలిగియున్నాడు. దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు దేవుని కొరకు నిలుచుట ద్వారా అత్యంత శక్తివంతమైన బబులోను దేశమును మరియు దాని పరిపాలకులను ఎంతో ప్రభావితము చేసారు.


రాజీపడే క్రైస్తవులు ఒక పట్టణములోగాని దేశములోగాని వేలమంది ఉన్నప్పటికిని, వారు ప్రభువు కొరకు వెలుగుగా ఉండలేరు. దేవుడు హృదయ పూర్వకమైన విశ్వాసులను కోరుచున్నాడు. ఎందుకనగా ''శక్తి చేతను బలముచేతను కాదుగాని దేవుడు తన ఆత్మ ద్వారానే కార్యముచేయును'' (జెకర్యా 4:6).


ఎంత వెల చెల్లించవలసినప్పటికిని రాజీపడకుండా వారి ప్రదేశములో ఒక నూతన నిబంధన సంఘమును నిర్మించాలని భారము కలిగిన వారికొరకు దేవుడు చూచుచున్నాడు.


అధ్యాయము 5
ఒక మతానుసారమైన సమూహమా లేక క్రీస్తుయొక్క శరీరమా?


క్రీస్తు శరీరమే నిజమైన సంఘం మరియు విశ్వాసులు కేవలము ప్రతివారము కలుసుకొనుట కాదు. కాబట్టి మనం నిర్మించేది ఒక శరీరమా లేక మతానుసారమైన సమూహమా అనుదానిని నిశ్చయపరచుకోవాలి. క్రీస్తు శరీరమనే సంఘమును నిర్మించుటకు మనకు దేవుని కృపయు మరియు అభిషేకము కావాలి ఎందుకనగా దానికొరకు మనలను మనము ఉపేక్షించుకొనుచు, ప్రతి దినము చనిపోవుచు మరియు పరిశుద్ధాత్మతో నింపబడుచుండవలెను.


పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులు ఒక సమాజమే గాని ఒక శరీరము కాదు. ఈనాడు అనేక పెద్ద సంఘములు కూడా సమాజములే గాని శరీరములు కాదు. కొన్ని చిన్న సంఘములు శరీరముగా ఉండక క్లబ్‌గా ఉండుచు కొంత శ్రేష్టముగా ఉంటున్నారు కాని ప్రభువైన యేసు తన శరీరమును నిర్మించుచున్నారు.


నిందను భరించుట:


క్రీస్తు యొక్క మొదటి శరీరమును మనుష్యులు చూచారు, ఆయన పశువుల పాకలో పరుండ బెట్టబడ్డాడు. అవమానకరమైన అటువంటి జన్మద్వారా కాపరులు క్రీస్తు యొక్క శరీరమును కనుగొనగలరు (లూకా 2:12). మరియు కలువరి సిలువలో చివరిగా క్రీస్తుయొక్క శరీరము సిలువవేయబడుట ద్వారా నిందించబడియున్నాడు. పుట్టినప్పటి నుండి మరణించేవరకు లోకస్తుల ద్వారాను మరియు మతస్తుల ద్వారాను క్రీస్తు యొక్క శరీరము నిందించబడియున్నది.


ఈనాడు కూడా క్రీస్తుయొక్క నిజమైన శరీరముగా ఉన్న సంఘము లోకమునుండియు మరియు బబులోను క్రైస్తవ్యమునుండియు నిందించబడతారు. మనయొక్క స్థానిక సంఘము క్రీస్తు యొక్క నిందను భరించే సంఘముగా లేనట్లయితే దానికి కారణము బహుశా రాజీపడుట మరియు మనము బబులోను అను శిబిరము బయటకు వెళ్ళలేదు (హెబీ 13:13). క్రీస్తు యొక్క నిందను భరించుటకును మరియు మన యొక్క పాపమును బట్టిగాని లేక బుద్ధిహీనతను బట్టిగాని లేక నులువెచ్చని స్థితినిబట్టిగాని నిందించబడుటకును చాలా తేడా ఉన్నది. కాబట్టి మనము పొరపాటు పడకూడదు.


''మనమతని చూచి అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. ఆయన తృణీకరింపబడిన వాడును మరియు మనుష్యులచేత విసర్జింపబడినవాడును'' (యెషయా 53:2,3) అని ప్రభువైన యేసును గూర్చి వ్రాయబడింది. ఆయన కృపాసత్య సంపూర్ణుడైయుండి తన అంతరంగ జీవితములో మహిమను కలిగియున్నాడు. ఇది అనేకమందికి మరుగుచేయబడింది (యోహాను 1:14). మన స్థానిక సంఘములు కూడా లోకమునకు గాని బబులోను క్రైస్తవ్యమునకు గాని ఆకర్షణగా ఉండకూడదు. దైవభక్తిగల జీవితము కొరకు ఆసక్తి కలిగి మన సంఘములోనికి వచ్చువారికి మాత్రమే అది ఆకర్షణగా ఉండాలి. ప్రత్యక్ష గుడారములో లోపల ఉన్న తెరలు అందముగా ఉండెడివి. కాని వాటి బయట మాత్రమే మురికితో ఉన్నటువంటి గొఱ్ఱెల చర్మముతో కప్పబడింది. దాని అందమంతయు లోపల ఉన్న తెరలో ఉన్నది. క్రీస్తు యొక్క పెళ్ళికుమార్తె కూడా ''అంతరంగ జీవితములో మహిమగలదైయుండును'' (కీర్తన 45:13). మరియు దాని మహిమంతటి మీద వితానముండును (నింద) (యెషయా 4:5).


ఈ విషయములో సంఘపెద్దలు గొప్ప బాధ్యత కలిగియున్నారు. వారు సంఘమును నడిపించిన విధానమును బట్టి అది మనుష్యుల మెప్పును పొందని యేసువలెగాని లేక లోకము చేత ఘనపరచబడి కొనియాడబడే దానిగాను ఉండవచ్చును. మనము లోకమునుండియు లేక శరీరానుసారమైన క్రైస్తవ్యమునుండి మెప్పును లేక ఘనతను కోరినయెడల మనము బలులోనును నిర్మించెదము. మనము పేరు ప్రతిష్టలు పొంది మరియు క్రైస్తవులందరి చేత అంగీకరించబడుటకు కోరినయెడల మనము యేసు యొక్క అడుగుజాడలను పూర్తిగా పోగొట్టుకొని యున్నామని నిశ్చయపరచుకోవచ్చును.


ప్రభువైన యేసు ఇట్లన్నాడు, ''నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి'' (మత్తయి 5:11, 12).


20 శతాబ్దముల క్రితము యేసు బాలుడుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మొదటి శరీరమును చంపవలెనని హేరోదు మరియు అతని సైనికులు కోరియున్నారు. ఈనాడు కూడా చాలా ప్రదేశములలో క్రీస్తుయొక్క శరీరము ఆరంభించబడకుండునట్లు, దానిని నాశనము చేయవలెనని అనేకులు కోరుచున్నారు. దేవుని స్వరమును సున్నితముగా విని మరియు దానికి వెంటనే లోబడుట ద్వారా యేసు యొక్క శరీరమును కాపాడియున్నారు (మత్తయి 2:13 - 15). క్రీస్తుయొక్క సంఘములో బాధ్యత కలిగిన మనము కూడా యోసేపు వలె ఉండవలెను. పరిశుద్ధాత్ముడు మనతో చెప్పేదానిని వినువారమై యుండి మరియు దానికి వెంటనే లోబడాలి. మనము దానిని విని లోబడని యెడల క్రీస్తు యొక్క శరీరమైయున్న సంఘము ఏదొక విషయములో నష్టపోవును మరియు అంత్యదినమందు దానికి బాధ్యత వహించవలెను. మనకు అప్పగింపబడిన వారందరి విషయములో దేవునికి లెక్క అప్పజెప్పవలెను గనుక మనము ఈ బాధ్యతను తీవ్రముగా తీసుకొనవలెను (హెబీ 13:17).


దీనత్వము - క్రీస్తు శరీరమునకు ఉన్న గుర్తు:


''ప్రభువు ఇట్లనుచున్నాడు, పరలోకము నా సింహాసనము అటువంటి మందిరమును మీరు నా కొరకు నిర్మించగలరా? కాని ఎవడు దీనుడై మరియు విరిగినలిగిన హృదయము కలిగి మరియు నా మాట విని వణకుచుండునో అటువంటి వారికి నా ఇల్లు కట్టుటకు సహాయపడెదను'' (యెషయా 66:1, 2 పేరాప్రేజ్‌).


క్రీస్తు మొదట శరీరముతో ఈ భూమిమీద ముప్పైమూడున్నర సంవత్సరములు జీవించాడు. కాబట్టి ఈనాడు క్రీస్తు యొక్క ఆత్మసంబంధమైన శరీరమును నిర్మించుటకు ఆయన భూమిమీద చూపించిన మాదిరిని వెంబడించాలి. మన జీవితములోని ప్రతి విషయములో మరియు పరిచర్యలోను ఆయన జీవించిన నియమములతోనే మనము జీవించాలి. క్రీస్తు యొక్క శరీరములోని అవయవములుగా మనలోని ప్రతీ ఒక్కరు ప్రతీ విషయములో యేసును మాదిరిగా తీసుకోవాలి. కాబట్టి మనము ప్రభువుతో సహవాసము చేస్తూ, చేయలేనిదిగాని లేక చెప్పలేనిదిగాని మనము చేయకూడదు.


ప్రభువైన యేసు శరీరధారియై వచ్చినప్పుడు మొట్టమొదటిగా తననుతాను తగ్గించుకున్నాడు. కాబట్టి మనము కూడా ప్రభువైన యేసును వెంబడించుటకు ఇక్కడే ఆరంభించాలి.


దీనత్వము మొదటి మెట్టు - ప్రభువైన యేసు దేవునిగా తనకున్న మహిమను(అధికారమును) విడిచిపెట్టి మనుష్యుని పోలికగా పుట్టాడు.


దీనత్వము రెండవమెట్టు - ప్రభువైన యేసు ఒక మానవుడిగా ప్రతీ ఒక్కరికి దాసుడగుట ద్వారా తననుతానే తగ్గించుకున్నాడు.


దీనత్వము మూడవ మెట్టు - ఆయన మరణము పొందుట ద్వారా అనగా ఒక నేరస్తుని వలె సిలువ మరణము పొందుట ద్వారా దాసుడగుటకంటే ఎక్కువగా తగ్గించుకొని యున్నాడు.


ఫిలిప్పీ 2:5 - 8లో ఈ మూడు మెట్ల గురించి చెప్పబడింది. క్రైస్తవ జీవితములో ఉన్న మూడు రహస్యములు: దీనత్వము, దీనత్వము, దీనత్వము! ఈ మూడు రహస్యములను మనము నేర్చుకొనని యెడల, మన జీవితములలో దేవుని చిత్తమును నెరవేర్చలేము!


మనము ఎల్లప్పుడూ యేసును చూచుచున్నయెడల ఎన్నటెన్నటికి గర్వించము. ఒక పాటలో మనము ఈవిధంగా పాడెదము.


''అద్భుతమైన సిలువ మీద మహిమాస్వరూపి మరణించుటను నేను గమనించినప్పుడు, అతిశ్రేష్టమైన దానిని నష్టముగా ఎంచుకొని మరియు నా గర్వమంతటిని ద్వేషించెదను''.


మనము యేసుని కాకుండా, ఇతరులను చూచి మరియు వారితో పోల్చుకొనిన యెడల పేతురు సముద్రములో మునిగినట్లుగా మనమూ గర్వముతో మునిగెదము (మత్తయి 14:30). గర్వము ప్రజలను నరకమునకు పంపును మరియు అది దేవునిని మనకు శత్రువుగా చేసి మరియు మన ఆత్మీయతను నాశనము చేయును (1 పేతురు 5:5). ఈనాడు అనేక దేశములలో అనేకమంది యౌవనస్థులు దీనులుగా కొనసాగనందున దేవుని ప్రవక్తలుగా వాడబడకుండా పతనమయ్యారు. దేవుడు దీనులకు మాత్రమే కృపనిచ్చును.


నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? మనకున్నదంతయు దేవుడిచ్చిన వరమే. కాబట్టి నీకు ఉన్నదానిని బట్టి గాని లేక నీవు ఏమైయున్నావు అన్నదానిని బట్టిగాని గర్వించవద్దు (1 కొరింథీ 4:7 లివింగ్‌).


ఆత్మ విషయమై దీనులైన వారు (ఎవరైతే వట్టివారమని అనుకుంటారో) ధన్యులు పరలోక రాజ్యము వారిది (మత్తయి 5:3 యాంప్లిఫయిడ్‌).


మనము జీవితాంతం వరకు ఆత్మవిషయమై దీనులమై జీవించినట్లయితే, ఈ భూమిమీద మహిమకరమైన జీవితం జీవించుటయేకాక దేవుని రాజ్యములో సమృద్ధిగా ప్రవేశించుదుము.


మనం చేసిన వాటన్నిటిని బట్టి దేవుడు హర్షించకపోవచ్చు. ఎందుకనగా ఆయనకు పక్షపాతము లేదు. దేవుడు గర్విష్టులందరిని ఎదిరించి మరియు దీనులకు మాత్రమే కృపనిస్తాడు.


యూదా ఇస్కరియోతు మరియు అననీయ సప్పీరాలు అందరియెదుట బట్టబయలు చేయబడ్డారు. ఎందుకనగా వారు దేవుడు శక్తివంతముగా పనిచేయుచున్న ప్రజలతో సహవాసం చేయుచున్నారు. ఈనాడు దేవుడు తన సంఘమును పవిత్ర పరుస్తూ ఉన్నాడు. కనుక వేషధారులు మరియు గర్విష్టులయిన సహోదరులు శక్తివంతమైన సంఘములో ప్రవేశించినప్పుడు ఏదో ఒక రోజున వారు బట్టబయలు చేయబడుదురు. కొన్నిసార్లు ఒక నాయకునిలో ఉన్న వేషధారణను, గర్వమును దేవుడు చాలాకాలం భరిస్తాడు కాని చివరకు బహిర్గతం చేస్తాడు.


ఒక వ్యక్తి ఎల్లప్పుడు తనకు తాను తీర్పు తీర్చుకొనుచూ మరియు ఇతరుల యొక్క దిద్దుబాటును అభ్యంతరపడకుండా స్వీకరిస్తూ ఉన్నట్లయితే, అతడు ఎన్నటికి దేవునికి దూరం కాడు.


అధికారానికి విధేయత చూపుట:


ఎవరైనను సంఘములో పాలిభాగస్తుడై ఉండవలెనని కోరినట్లయితే, అతడు సంఘ విషయములో సంఘపెద్దలకు లోబడి యుండాలి. ఇతర విషయములలో అతడు సంఘపెద్దలను సంప్రదించనవసరం లేదు. ఒక సంఘపెద్ద యొక్క జీవితం మరియు పరిచర్యను బట్టి అతని మీద నమ్మకము కలిగినయెడల అన్ని విషయములను గూర్చి అతనిని సంప్రదించవచ్చును. ఒక దైవికమైన సంఘపెద్ద ఒక తండ్రివలె తన బిడ్డలను కాపాడుటకును మరియు వారిని అతి శ్రేష్టమైన మార్గములో నడిపించుటకును తన అధికారమును ఉపయోగించును. నాయకులముగా మన సంఘము గూర్చి ఎటువంటి త్యాగమైనను చేయుటకు ఇష్టపడాలి.


మన స్థానికసంఘమును గూర్చి మాత్రమే మనం బాధ్యత వహించాలి. అయినను ఇతర స్థానిక సంఘపెద్దలు మనలను సంప్రదించిన యెడల వారికి సహాయపడవచ్చును. కాబట్టి నీవు వేరే సంఘమునకు వెళ్ళినప్పుడు, ఆ సంఘపెద్దల అధికారమును అంగీకరించాలి. ఇతర సంఘములోని విషయములేవియు నీకు తెలియకుండినప్పుడు, వారికి సలహా ఇవ్వకుండుట మంచిది. ఎందుకనగా ఆ సలహాను బట్టి అక్కడ కలవరము కలుగవచ్చును. ఇతర సంఘ విషయములలో అనగా ఇతర సంఘపెద్దలు నిన్ను దైవజనునిగా గుర్తించినప్పుడు నీవు ఆ సంఘమును గూర్చి బాధ్యత వహించవచ్చును. లేనట్లయితే నీ స్థానిక సంఘమును గూర్చి బాధ్యత కలిగి ఉంటావు.


ఒక సంఘమును నాటి మరియు ఆరంభించి మరియు మిమ్ములను సంఘపెద్దలుగా నియమించిన వ్యక్తి అపొస్తులుడుగా ఉన్నాడు. కనుక సంఘపెద్దలు అతనికి విధేయత చూపించాలి. ఒక సంఘపెద్దను నియమించిన అపొస్తులుడు అవసరమైతే ఆ వ్యక్తిని సంఘపెద్ద పదవినుండి తొలగించవచ్చును.


అపొస్తులులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు:


క్రీస్తు మీద మాత్రమే మన వ్యక్తిగత జీవితం నిర్మించబడుతుంది (1 కొరింథీ 3:11). కాని సంఘం క్రీస్తును పునాది రాయిగా కలిగి అపొస్తులులు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద నిర్మించబడుతుంది (ఎఫెసీ 2:19, 20). క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు కూడా సంఘములో అపొస్తులులను నియమించాడు (ఎఫెసీ 4:10, 11).


క్రీస్తు సంఘమునకు, అపొస్తులులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనువారిని వరముగా ఇచ్చాడు (ఎఫెసీ 4:13). వీరిలో మొదటిగా అపొస్తులులు, ప్రవక్తలు, ఉపదేశకులు ఉన్నారు (1 కొరింథీ 12:28). సామాన్య విశ్వాసులందరు ఒక సంఘముగా నిర్మించబడుటకు, ఈ వరములు కలిగినవారందరు పరిచర్య చేయుదురు (ఎఫెసీ 4:12). కాబట్టి క్రీస్తు యొక్క సంఘమును నిర్మించుటకు క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది.


ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు ఒక అపొస్తులుని పంపించెను.


మనం క్రొత్త నిబంధనలో చూచిన ప్రకారము అపొస్తులులు చేసే కొన్ని పరిచర్యలు:


1. అతడు సంఘమును నాటి మరియు వాటిని సిద్ధపరచును (అపొ.కా. 13 - 19 అధ్యాయములు).


2. అతడు ప్రతి స్థానిక సంఘములలో పెద్దలను నియమించును (అపొ.కా. 14:23, తీతు 1:5).


3. అతడు సంఘపెద్దలకు తండ్రియై యున్నాడు (1 కొరింథీ 4:15).


4. సిద్ధాంతముల విషయములలోను, ఇతర విషయములలో సంఘమును నడిపిస్తాడు (అపొ.కా. 15:6 - 29, అపొ.కా. 6:3).


5. సంఘములలో సమస్యలు వచ్చినప్పుడు అతడు క్రమశిక్షణలో పెట్టును (1 కొరింథీ 1:11, 1 కొరింథీ 5:4, 5, 13, 2 కొరింథీ 13:2).


6. పెత్తనం చేసే పెద్దలనుండి విశ్వాసులను కాపాడును (1 తిమోతి 5:20, 3 యోహాను 1:9).


7. సంఘములను హెచ్చరించుటకును, నడిపించుటకును అతడు పత్రికలు వ్రాయును (పౌలు ఎల్లప్పుడు చేసినట్టుగా).


అపొస్తులుల ద్వారా దేవుడు నిర్మించే సంఘముల మీద అతనికి దేవుడు అధికారం ఇస్తాడు. కాని ఏ విశ్వాసికైనను అపొస్తలుడు ప్రభువుగా ఉండడు (2 కొరింథీ 1:24). వారి యొక్క సొంత భద్రత కొరకు, సంఘములు సంతోషముతోను, సంపూర్ణముగా అపొస్తులుని యొక్క అధికారాన్ని అంగీకరిస్తాడు.


అపొస్తులులు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద ప్రతి స్థానిక సంఘము నిర్మించబడుట దేవుని యొక్క సంకల్పమైయున్నది (ఎఫెసీ 2:20).


సంఘము యొక్క ప్రస్థుత అవసరమును ఎరిగి మరియు భయము లేకుండా దేవుని వాక్యమును ప్రకటించుచూ మరియు కనికరముతో దేవుని ప్రజలను మారుమనస్సు పొందుటకు నడిపించువాడే ప్రవక్త (అపొ.కా. 15:32). ఒక ప్రవక్త సంఘములో క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించును (1 కొరింథీ 14:3). ఒక నిజమైన ప్రవక్త ప్రజలతో మాట్లాడినప్పుడు, వారి హృదయములు మండును (లూకా 24:32). దాని ఫలితముగా వారిలో ఉన్న రహస్య పాపములను వారు చూచి మరియు వాటిని ఒప్పుకొని, దేవుడు మీలో నిజముగా ఉన్నాడని చెప్పుదురు (1 కొరింథీ 14:25).


సువార్తికులు పాపులను క్రీస్తులోనికి నడిపించి మరియు సంఘములోనికి తెచ్చుదురు.


కాపరులు తమ సంఘములోని విశ్వాసులను గురించి శ్రద్ధ తీసుకొని మరియు ప్రోత్సహించి మరియు వారు సంపూర్ణసిద్ధి పొందునట్లు చేయుదురు.


దేవుని వాక్యములోని లోతైన మర్మములను అనేక సంఘములలోని విశ్వాసులకు ఉపదేశకులు బోధిస్తారు.


ప్రతి స్థానిక సంఘమును పెద్దలు నడిపించెదరు:


పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వారిమీద ఆత్మీయ అధికారమును కలిగియుండెడివాడు. కాని క్రొత్త నిబంధనలో, ప్రతి సంఘములో కనీసం ఇద్దరు పెద్దలు ఉండవలెనని దేవుడు సంకల్పించియున్నాడు. ఒక కుటుంబములో కేవలం తండ్రిని మాత్రమే గాక సమతుల్యము కలిగి యుండునట్లు ఒక తండ్రిని మరియు ఒక తల్లిని పెద్దలుగా దేవుడు నియమించాడు. అదే విధముగా సంఘము కూడా పరలోక సంబంధమైన కుటుంబము కనుక నాయకత్వములో సమతుల్యం ఉండునట్లు ఒక స్థానిక సంఘములో ఒకరికంటె ఎక్కువగా సంఘపెద్దలను దేవుడు నియమించాడు.


ఇది క్రొత్త నిబంధన పద్ధతి అయినప్పటికి ఈనాడు అనేక సంఘములలో ఈ పద్ధతి చూడము. మనం ఎక్కువగా చూసేది ఏమిటనగా:


1. పెద్ద డినామినేషన్స్‌లో ఒక బిషప్పు గాని ఒక సూపరింటెండెంట్‌గాని లేక ఒక పోపుగాని అధికారము కలిగియుంటారు. (వీరు ఓట్లు వేయుట ద్వారా ఎన్నుకోబడుదురు). పెద్ద కంపెనీలలోని ఎన్నుకోబడిన డైరక్టర్ల వలె వీరు ఉంటారు.


2. లేక ఏ అధికారానికి లోబడని స్వతంత్రసంఘము మరియు వారు పాస్టర్లను వారే నియమించుదురు. ఇటువంటి సంఘములు అనేక కంపెనీల వలె ఉండి మరియు వారికి ఇష్టమైన వారిని నిర్వాహకులుగా నియమించుదురు.


ఈ రెండు పద్ధతులు మనుష్యుల తలంపులే గాని, ఇవి క్రొత్త నిబంధనలో లేవు. ఇతర విషయములలో క్రొత్త నిబంధన ప్రకారం జీవించేవారు సంఘ విషయములో మాత్రం క్రొత్త నిబంధనను అనుసరించరు. వారు క్రొత్త ద్రాక్షారసమును కోరుదురు గాని క్రొత్త తిత్తిని కోరరు. కాబట్టి క్రొత్త ద్రాక్షారసము అందులో ఉండదు (లూకా 5:37,38). వారు దేవుని యొక్క అతి శ్రేష్టమైన దానిని పోగొట్టుకుందురు.


స్థానిక సంఘమును నిర్మించే దేవుని యొక్క పద్ధతి క్రొత్త నిబంధనలో చూపించబడింది. కాని సంఘపెద్దలను నియమించే అపొస్తులుడు లేనియెడల, అక్కడి విశ్వాసులు మానవ పద్ధతులతో దేవుని పనులను చేయవలసివచ్చును.


ఇటువంటి పరిచర్య చేయుటకు వెల చెల్లించుటకు కొద్దిమంది విశ్వాసులు మాత్రమే ఇష్టపడుతున్నారు. కనుక ప్రతి దేశములో చాలా కొద్దిమంది అపొస్తలులు ఉన్నారు.


మన యొక్క సరిహద్దులలో మనం నిలచియుండాలి:


ప్రతియొక్క సంఘపెద్ద దేవుడు తన చుట్టూ ఉంచిన సరిహద్దులోనే అతడు పరిచర్య చేయాలి. దేవుడు నియమించిన సరిహద్దులో అతడు నిలచియున్నంత కాలము దేవుడు అతనిని ఎంతో బలపరచును.


2 కొరింథీ 10:13 - 15లో ''మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచియిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్నవారము కాము. మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము''.


ఒక సంఘపెద్ద తన పరిచర్యను దేవుడిచ్చిన పరిధి (సరిహద్దు) దాటి పరిచర్య చేసినట్లయితే, అక్కడ దేవుని పరిచర్యలో కలవరము, గందరగోళము ఉంటుంది. దేవుడిచ్చిన పొలిమేరను దాటి చేసే పరిచర్యను దేవుడు బలపరచడు. బైబిలు ఇట్లు చెప్పుచున్నది, ''గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. కంచె కొట్టువానిని పాము కరచును'' (పస్రంగి 10:8).


ఈ విషయమును రాజైన ఉజ్జియా జీవితము మనకు తెలియజేయుచున్నది. ఉజ్జియా ఒక రాజుగా తన పొలిమేరలో ఉండి ఎన్నో మంచి కార్యములు చేసియున్నాడు (2 దినవృత్తాంతమలు 26:3-15). దేవుడు అతనిని ఎంతో ఆశీర్వదించి యున్నాడు. కాని రాజుగా అతడు పొందిన జయమును బట్టి అతడు గర్వించి మరియు దేవుడు అతనికి పెట్టిన సరిహద్దు దాటి యాజకుడుగా కూడా పరిచర్యచేశాడు. అతడు దానిని చేసిన వెంటనే దేవుడు అతనిని కుష్ఠు వ్యాధితో మొత్తియున్నాడు మరియు అతడు కుష్ఠు రోగముతో మరణించియున్నాడు (2దినవృత్తాంతములు 26:16 - 21). ఇది మనందరకు హెచ్చరికగా యున్నది.


సౌలు రాజు కూడా రాజుగా తన సరిహద్దును దాటి పొరపాటు చేశాడు. రాజుగా దేవుడు అతనిని ఆశీర్వదించినందువలన, యాజకుడుగా కూడా పరిచర్య చేయవలెనని అతడు నిర్ణయించుకున్నాడు. అతడు దానిని చేసిన వెంటనే, దేవుడు తన యొక్క రాజరికమును తీసివేసియున్నాడని సమూయేలు అతనికి చెప్పాడు (1 సమూయేలు 13:8 - 14).


కాబట్టి దేవుడు పెట్టిన సరిహద్దులో మనం నిలచియుండుట ప్రాముఖ్యమైనది. ఇతరులకు దేవుడిచ్చిన దానిని మనం ఆశించకూడదు అనే ఆజ్ఞను ఇతరుల యొక్క పరిచర్యను కూడా ఆశించకూడదని చెప్పవచ్చును. మరియు దురాశ అంతయు విగ్రహారాధన అయియున్నది (కొలొస్స 3:5).


మనం దేవుని ఆజ్ఞకు లోబడక తిరస్కరించినయెడల దేవుని పరిచర్యలోనికి కలవరం తెచ్చెదము. కనుక మనం దేవునికి భయపడి ఆయన పెట్టిన సరిహద్దులో నిలచియున్నప్పుడు మాత్రమే మనము దేవునిని కనుగొనగలము (అపొ.కా. 17:26, 27).


ప్రతి స్థానిక సంఘము స్వాతంత్య్రము కలిగియున్నది:


ఏ సంఘము కూడా ఇతర సంఘములకు ప్రధాన కార్యాలయము కాకూడదు. అపొస్తులులు నిర్మించిన సంఘములన్నియు స్వాతంత్య్రము కలిగియుండి ప్రభువైన యేసుయొక్క శిరస్సత్వము క్రింద మాత్రమే యున్నవి.


పాత నిబంధనలో భూసంబంధమైన యెరూషలేము మత సంబంధమైన కార్యములన్నింటికి, ఇశ్రాయేలీయులకు ప్రధాన కార్యాలయముగా ఉన్నది. ఈనాడు డినామినేషన్స్‌లలో ఉన్న సంఘములకు కూడా భూమి మీద ప్రధాన కార్యాలయములు ఉన్నవి.


కాని క్రొత్త నిబంధనలో, మనం పరలోక సంబంధులము కనుక ఈ భూమిమీద మనకు ప్రధాన కార్యాలయము లేదు (గలతీ 4:26). క్రొత్త నిబంధనలోని ఏడు కొమ్మలు కలిగిన యూదుల దీపస్తంభమునకు బదులుగా క్రొత్త నిబంధనలో వేరు వేరుగా ఉన్న ఏడు దీప స్తంభముల మధ్యలో క్రీస్తు ఉన్నాడు (పక్రటన 1:11-20).


కాబట్టి తాను నిర్మించిన సంఘములకు యెరూషలేములో గాని అంతియొకయలోగాని పౌలు ప్రధాన కార్యాలయమును ఏర్పరచలేదు. అందువల్ల ఆ సంఘములు మృతమైన డినామినేషన్స్‌ వలె మారలేదు.


ఆ సంఘములన్నియు నేరుగా క్రీస్తుయొక్క శిరస్సత్వము క్రిందనే యున్నవి. ప్రతి సంఘములోను వారికి సంఘపెద్దలు ఉన్నారు. మరియు ఆర్థికముగా కూడా స్వతంత్రులయి ఉన్నారు. ఈనాడు బబులోను క్రైస్తత్వములో మనం చూచుచున్నట్టుగా కొన్ని సంఘములకు కలిపి, బిషప్పులు కాని లేక ఆర్చిబిషప్పులు కాని వారి మీద అధికారం చేయలేరు. మనం క్రొత్త నిబంధననను అనుసరించినట్లయితే, ఒక సంఘములో భ్రష్టత్వము వచ్చినప్పటికిని డినామినేషన్స్‌లలో వలె అది ఇతర సంఘములకు వ్యాపించదు.


సంఘ నాయకులకును మరియు సంఘములకును మధ్య ఉన్న సహవాసము, ఒకరియెడల ఒకరికి ఉన్న ప్రేమను బట్టియు, గౌరవమును బట్టియు మరియు క్రీస్తువలె రూపాంతరము చెందవలెనని గురిని కలిగియుండుట మీద ఆధారపడును. అంతేగాని సంస్థాగతమైన ఐక్యత కాదు.


దేవుని యొక్క ధర్మవిధులను అనుసరించుట:


మోషే ప్రత్యక్షపు గుడారము నిర్మించినట్లును మరియు నోవహు ఓడను నిర్మించినట్లును ఒక సంఘమును నిర్మించుట కూడా గొప్ప పరిచర్య గనుక మనకు ప్రభువుయొక్కకృప మరియు జ్ఞానము అవసరము.


''మోషే గుడారము అమర్చబోయినప్పుడు -కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవచేయుదురు'' (హెబీ 8:5).


ఓడ మరియు ప్రత్యక్షపు గుడారములను నిర్మించవలెనని దేవుడు మానవునికి ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు నోవహుకును, మోషేకును వాటి యొక్క వివరములన్నియు స్పష్టముగా చూపించాడు. తెలివైన వారు ఇచ్చిన సలహాలను బట్టికాని లేక వారి కున్న స్వంత తెలివితేటలను బట్టిగాని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నోవహు కాని, మోషే కాని మార్చకుండా జాగ్రత్తపడాలి.


వారు దేవుని ఆజ్ఞలన్నిటికి విధేయత చూపించుటవలన వారు చేసిన పరిచర్యమీదకు దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది మరియు దేవునిమహిమ ప్రత్యక్షపుగుడారము మీద ఉన్నది.


మనము సంఘమును నిర్మించినప్పుడు దీనిని జ్ఞాపకముంచుకొనవలెను.


అధ్యాయము 6
ఇతరులు అనుసరించదగిన ఒక నాయకుడు

ఉన్నత ప్రమాణాలతో స్థానిక సంఘమును నిర్మించుటకు ఉన్నత ప్రమాణాలు కలిగిన నాయకులు అవసరము.


''నన్ను వెంబడించుడి'' అని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 9:23).


మరియు ''నేను క్రీస్తును పోలి నడచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడచుకొనుడి'' అని పౌలు చెప్పాడు (1 కొరింథీ 11:1, ఫిలిప్పీ 3:17).


పౌలు యొక్క ఈ మాటలను బట్టి ప్రతి యొక్క సంఘపెద్ద తమ సంఘములోని ప్రతివారితో ఈవిధంగా చెప్పవలెనని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడని మనము చూస్తున్నాము.


''నన్ను వెంబడించకుడి, కాని క్రీస్తుని వెంబడించుడి'' అని చాలామంది సంఘపెద్దలు చెప్పెదరు. ఇది పైకి చాలా దీనముగా ఉన్నది కాని నిజానికి వారి ఓడిపోయిన జీవితాన్ని తప్పించుకొనుటకు ఇది ఒక సాకు మాత్రమే మరియు ఇది పరిశుద్ధాత్మ బోధకు పూర్తిగా వ్యతిరేకమైనది.


ఒక నాయకుడుగా నీ జీవితము మరియు నీ మాటలు ఒక మాదిరిగా ఉండాలి. మరియు నేను క్రీస్తును పోలి నడచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడచుకొనుడని మీ సంఘములోని అందరికీ చెప్పగలగాలి. పౌలు మారుమనస్సు పొందకమునుపు, అతడు పూర్తిగా ఓడిపోయాడు. అతడు పరిపూర్ణుడు కాకపోయినప్పటికినీ దేవుడు అతడిని మార్చి ఇతరులు నడచుకొనుటకు అతనిని ఒక మాదిరిగా ఉంచాడు (ఫిలిప్పీ 3:12 - 14). ఈ లోకంలోఉన్న అందరికంటే అత్యుత్తమమైన క్రైస్తవుడు కూడా పరిపూర్ణుడు కాడు. కాని అతడు సంపూర్ణుడవుటకు సాగిపోతాడు. కాబట్టి నీ జీవితములో గతములో అనేక విషయములలో నీవు ఓడిపోయినప్పటికినీ, ఇతరులు నిన్ను పోలి నడచుకొనునట్లుగా దైవభక్తి గల నాయకునిగా దేవుడు నిన్ను మార్చగలడు.


దేవుని ప్రజలకు నాయకునిగా నీవు ఇక్కడ ఇవ్వబడిన ఏడు గుణలక్షణములను కలిగియుండుటకు ప్రయత్నించాలి.


1. నీవు ఎల్లప్పుడు దీనుడవైయుండి ఇతరులకు అందుబాటులో ఉండాలి. ప్రభువైన యేసు దీనుడైయుండి ఇతరులకు అందుబాటులో ఉండియున్నాడు (మత్తయి 11:29). ప్రజలు ఆయనను ఎక్కడైనను, ఏ సమయమందైనను కలుసుకొనెడివారు. నీకొదేము ఆయనను అర్ధరాత్రియందు ఆయన ఇంటిలో కలిసాడు మరియు ఎవరైనను ఎప్పుడైనను ప్రభువైన యేసుతో మాట్లాడవచ్చును. బీదలకు సువార్త ప్రకటించుటకు ప్రభువైన యేసులో ఉన్న దీనత్వం ఆసక్తి పుట్టించింది (లూకా 4:18). తన పొరపాటులను వెంటనే ఒప్పుకొని మరియు క్షమాపణ అడుగునంతగా పౌలు దీనుడైయున్నాడు (అపొ.కా. 23:1 - 5). ఒక పెద్దగా సంఘములో ధనికులకు మరియు పేదవారికి నీవు ఎటువంటి వ్యత్యాసం చూపించకూడదు. నీ గురించి నీవు ''గొప్పతలంపులు'' కలిగియుండ మరియు నీ పొరపాట్లకు వెంటనే క్షమాపణ అడిగేవాడుగా ఉండాలి. నీవు ఎల్లప్పుడు సామాన్య సహోదరుడుగా ఉండాలి.


2. నీ అవసరతల కొరకుకాని నీ పరిచర్య కొరకుకాని ఎవరినైనను ఎప్పుడైనను డబ్బు అడుగకూడదు మరియు నీవు సామాన్యముగా జీవించాలి. పౌలు అప్పుడప్పుడు తీసుకొనిన రీతిగా నీవు ఇతరుల నుండి తీసికొనినట్లయితే వారు నీకంటే ధనవంతులై యుండాలి కాని నీకంటే బీదవారై యుండకూడదు. తన కొరకుకాని తన పరిచర్యకొరకుకాని ఒక్కసారి కూడా ఎవ్వరినీ డబ్బు అడుగలేదు. ఆయన కంటే ధనవంతులైన వారియొద్ద మాత్రమే ఆయన కానుకలను తీసుకున్నాడు (లూకా 8:3). ప్రభువైన యేసు మరియు పౌలు ఇద్దరూ సామాన్యముగా జీవించారు. డబ్బు విషయములోను మరియు వస్తువాహనముల విషయములోను నీవు వారి వంటి వైఖరి కలిగియుండాలి.


3. దైవజనుడుగా నీకు ఒక సాక్ష్యము ఉండాలి. పరిశుద్ధత కొరకు ఆసక్తి కలిగిన యథార్థమైన వ్యక్తివని నీ స్థానిక సంఘములో నీవు గుర్తింపు పొందాలి- అనగా ఏ విషయములోను తన స్వంతమును కోరనివాడు. నీ నోటిని నీవు అదుపులో పెట్టుకొనువాడవని ప్రజలు నిన్ను గుర్తించాలి (యాకోబు 1:26, ఎఫెసీ 4:26 - 31). మరియు ఓడిపోయిన వారి విషయములో కనికరము గలవాడవైయుండాలి (హెబీ 5:2). స్త్రీలందరి విషయములో అనగా చిన్నలు మరియు పెద్దలు విషయములో నీవు పవిత్రమైన సాక్ష్యము కలిగియుండాలి (1 తిమోతి 5:2). ఇది నీ జీవితములో దేవునియొక్క సువాసనగా ఉండాలి.


4. ప్రభువును ప్రేమించే వారిగా నీ పిల్లలను నీవు పెంచాలి. విశ్వాసులును మరియు విధేయులైన పిల్లలు గల వారినే సంఘ పెద్దలుగా నియమించాలని పరిశుద్ధాత్ముడు చెప్పాడు (1 తిమోతి 3:4, 5, తీతుకు 1:6). మన పిల్లలు మనలను ఎల్లప్పుడు ఇంటిలో చూస్తారు గనుక మన గురించి ఇతరులకంటే ఎక్కువగా వారికే తెలుస్తుంది. మనము దైవభక్తి కలిగి ఇంటిలో జీవిస్తున్నట్లయితే వారు కూడా ప్రభువును వెంబడిస్తారు (సామెతలు 22:6). ఇది సులభమైన పనికాదు. కాని ప్రభువు యొక్క సహాయం కొరకు మనము ఆయనను నమ్ముకొనవచ్చును. కాబట్టి నీ పిల్లలు ప్రభువును ప్రేమించునట్లుగాను, వారు అందరిని గౌరవించునట్లును కృప కొరకు ప్రభువును వెదకుము (ప్రార్థించుము).


5. దేవుని నిత్య సంకల్పమంతటిని భయము లేకుండా నీవు బోధించాలి. నీవు ఎప్పుడైనను ఇతరుల మెప్పు కోరక క్రొత్త నిబంధనలోని ప్రతియొక్క వాగ్ధానము మరియు ప్రతి ఒక్క ఆజ్ఞను పాటించాలి (అపొ. కా. 20:27; గలతీ 1:10). నీ ప్రసంగములు ప్రోత్సహించేవిగాను మరియు ఇతరులకు సవాలుగాను ఉండునట్లును నీవు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందునట్లు ప్రార్థించాలి.


6. క్రీస్తుయొక్క శరీరము నిజముగా ప్రత్యక్షపరచబడునట్లుగా నీ స్థానికసంఘము నిర్మించబడునట్లు నీవు గొప్ప ఆసక్తి కలిగియుండాలి. తన యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచుటకు భూమి మీద ప్రజలను వారి పాపములనుండి రక్షించి మరియు వారిని తన శరీరములోని అవయవములుగా నిర్మించుటకు ప్రభువైనయేసు భూమిమీదకు వచ్చారు (మత్తయి 16:18). క్రీస్తుయొక్క శరీరమును ప్రత్యక్షపరచుటకు లేక బయలుపరచుటకు ప్రతి స్థలములో అటువంటి స్థానిక సంఘములు నిర్మించాలని పౌలు ఆసక్తి కలిగియుండెను (ఎఫెసీ 4:15,16). అదియే నీ యొక్క ఆసక్తి కూడా అయియుండాలి. అటువంటి స్థానిక సంఘములు నిర్మించుటకు పౌలు ఎంతో కష్టపడి పరిచర్య చేశాడు. నీవు కూడా అదేవిధముగా కష్టపడి పరిచర్య చేయాలి (కొలస్స 1:28, 29).


7. నీకున్న దర్శనమును మరియు నీకున్న ఆత్మను పంచుకొనే కొందరిని మీ సంఘములో సిద్ధపరచాలి. రాబోయే తరములో కూడా మీ సంఘములో ప్రభువు యొక్క పవిత్రతతో కూడిన సాక్ష్యము కాపాడబడునట్లు ఒక పెద్దగా నీవు శ్రద్ద తీసుకోవాలి. ప్రభువైన యేసు తన యొక్క ఆత్మతో కలపబడినవారై, ఆయన వలె జీవించి పరిచర్యను కొనసాగించుటకు 11మంది శిష్యులను ఆయన సిద్ధపరిచాడు. పౌలు కూడా తన యొక్క దీనాత్మ మరియు స్వార్థరహితమైన పరిచర్య కొనసాగించుటకు తిమోతి మరియు తీతును సిద్ధపరిచాడు (ఫిలిప్పీ 2:19 - 21, 2 కొరింథీ 7:13 - 15). నీ యొక్క దర్శనము మరియు నీ యొక్క ఆసక్తిని కొనసాగించుటకు మీ స్థానిక సంఘములో కొందరిని సిద్ధపరచుటకు నీవు ప్రభువుయొక్క సహాయమును కోరాలి.


కాబట్టి నీ సంఘములోని వారందరు నిన్ను పోలి నడచుకొనునట్లుగా నీవు ఈ గుణలక్షణములను కలిగియుండునట్లును, ఎల్లప్పుడు పరిశుద్ధాత్మచేత అభిషేకము పొందునట్లును నీవు ప్రభువును ప్రార్థించుము.


అధ్యాయము 7
మంచి నాయకుల యొక్క కొన్ని గుణ లక్షణములు

ఇతరులకు నీమీద నమ్మకము కలుగునట్లు నీవు కోరవలసిన కొన్ని గుణలక్షణములు ఇక్కడ ఉన్నవి. వారు దీనిని చూడాలి.


నీవు మనుష్యుల మెప్పును (దైవ జనుల మెప్పును కూడా) కోరక దేవుని మెప్పునే కోరాలి.


దేవునిరాజ్యము మరియు ఆయననీతి నీకు ప్రాముఖ్యమైయుండాలి.


నీవు ప్రభువైనయేసుకు సమర్పించుకొనిన శిష్యుడవైయుండాలి.


దేవుని కొరకు నీవు మండుచున్న ప్రేమను కలిగియుండాలి.


దేవుని మహిమను గూర్చియు మరియు ప్రభువైన యేసు నామము గూర్చియు నీవు శ్రద్ధ కలిగిన వాడవై యుండాలి.


నీవు విరిగి నలిగిన ఆత్మను కలిగియుండాలి.


నీవు దైవభక్తిని ఆకర్షణీయముగా చేయాలి.


సంఘము పవిత్రతలో కొనసాగించుటకు నీవు ఆసక్తి కలిగియుండాలి.


నీవు సత్యము విషయములో ధైర్యముగా ఉండాలి.


నీకున్న ఒప్పుదలను బట్టి నీవు జీవిస్తూ మరియు నీవు బోధించిన దానిని అభ్యసించాలి.


నీవు కోపమును అధుపులో పెట్టుకొని మరియు నీవు ముభావముతో ఉండకూడదు.


నీవు మాటలోను మరియు క్రియలోను ప్రేమించాలి.


నీవు ప్రజలందరితో కనికరము కలిగి వ్యవహరించాలి.


నీవు సహజముగా ప్రవర్తిస్తూ మరియు నటించకూడదు.


నీవు ఎవరిని కించపరచకూడదు.


నీవు ''పెద్ద సహోదరుడుగా గాక'' సామాన్య సహోదరుడుగా ప్రవర్తించాలి.


నీవు అన్ని సమయములలో సులభముగా అందుబాటులో ఉండాలి.


నీవు ఇతరులతో సంతోషముగాను మరియు స్నేహితుడుగా ఉండి మరియు వారు నీతో ఉన్నప్పుడు వారి సొంత యింటిలో ఉన్నట్లుగా అనిపించాలి.


మీ యింటిలో ఆతిథ్యమిచ్చేవారిగా ఉండాలి.


నీవు దైవభక్తి కలిగియుండుటే కాకుండా ఒక తండ్రిగా ఉండాలి.


అన్ని సమయములలో నీ సహోదర, సహోదరీలకు నిత్యమైన మేలు కలగాలని కోరాలి.


సంఘములో నీవు పూర్తిగా పక్షపాతం లేకుండా ఉండాలి.


కుటుంబ సంబంధమును బట్టికాని లేక కులమును బట్టికాని లేక మరిదేనిని బట్టియైనను ఎవరికి అనుకూలముగా ఉండవు లేక ప్రతికూలముగా ఉండవు.


చిన్న వారైనను, పెద్దవారైనను, చిన్నబిడ్డయైనను లేక దాసుడైనను నీవు అందరిని ఒకేలాగా చూస్తావు.


నీవు అందరితోను ప్రత్యేకముగా నీకంటే పెద్దవారితోను మర్యాదగా మాట్లాడెదవు.


నీవు ప్రత్యేకముగా బీదవారి యెడలను యౌవనస్థులయెడలను మరియు పిల్లల యెడలను శ్రద్ధ వహించెదవు.


నీ సహోదర సహోదరీలను నీ హృదయములో ఉంచుకొనెదవు.


దేవుని వాక్యమును బట్టియేగాని నీకున్న అనుభవాన్ని బట్టి అధికారము చేయవు.


నీ తలంపుల విషయములో నీవు తొందరపడక మరియు నీవు ఇతరులతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండెదవు.


ఇతరులకు కనబడునట్లుగా నీవు క్రీస్తు యొక్క సారూప్యములోనికి ఎదుగుచు ఉండెదవు.


నీవు నిర్ణయములు తీసుకొనినప్పుడు, నీ స్వంత ఉద్దేశ్యము మీద కాకుండా పరిశుద్ధాత్మ మీద ఆధారపడెదవు.


నీ మీద ఉన్న నమ్మకమును బట్టి ఇతరులు చెప్పిన సంగతులను ఎవరికి చెప్పకుండా (భార్యకు కూడా చెప్పకుండా) ఉండెదవు.


నీవు ఇచ్చిన మాట మీద నిలబడాలి.


నీ బాధ్యతలను నీవు సంపూర్ణముగా నెరవేర్చాలి.


నీవు సూటిగా సత్యమును ప్రేమతో చెప్పాలి.


నీవు ఎవరిని మోసగించకూడదు.


నీవు అందరితో సహనము కలిగియుండాలి.


నీవు మానవ బలహీనతలుగలిగిన మంటిఘటమై యున్నావనే సంగతిని మరుగుగా ఉంచవద్దు.


నీవు కఠినముగా ఉండక సులభముగా లోబడేవాడుగా ఉండాలి.


నీ వ్యక్తిత్వాన్ని బట్టికాని లేక నీకున్న వరములను బట్టిగాని ఇతరుల మీద ఒత్తిడి చేయవద్దు.


నీవు ఇతరులకు సలహా ఇచ్చినప్పుడు, వారు దానిని తిరస్కరించుటకు కూడా స్వాతంత్య్రము ఇవ్వాలి.


నీవు అభ్యాసము చేయుచున్న దానిని, ఇతరులకు చట్టముగా చేయవద్దు.


నీవు పెద్ద గుంపుమీద కాక వ్యక్తుల మీద ఆసక్తి కలిగియుండాలి.


నీవు జాలియు మరియు నిజమైన ఆసక్తిని కలిగినవాడవై నీవు ఇతరుల సమస్యలలో ప్రవేశించాలి.


ఇతరుల ఓటములను మాటిమాటికి గుర్తు చేయకూడదు.


నీవు ఇతరుల బలహీనతలను మరియు పొరపాట్లను భరించే వాడవైయుండాలి.


నీ సహోదర, సహోదరీలను నీవు దేవుడు చూచినట్లు చూచుచూ మరియు వారి విషయములో ఎల్లప్పుడు నిరీక్షణ కలిగియుండాలి.


ఇతరులు ఓడిపోయినప్పటికిని నీవు వారిలో నిరీక్షణ కలుగజేయాలి.


బలహీనులకు నీవు నిజమైన స్నేహితుడుగా ఉండాలి.


నీ శత్రువులను గురించి నీవు మాట్లాడినప్పుడు, చెడుగా మాట్లాడకూడదు.


సమాజములలోను మరియు వ్యక్తిగతముగాను పాపమునకు వ్యతిరేకముగా నీవు హెచ్చరించాలి.


దేవుని వాక్యం చెప్పిన దానినే నీ పరిచర్యలో బోధించాలి.


నీవలె పరిణితి చెందని వారితో కూడా కలిసి నీ బాధ్యతలను పంచుకోవాలి.


సంఘ విషయములలో నీ భార్య యొక్క ప్రమేయం లేకుండా చూడుము.


నీవు జీవితాన్ని తీవ్రంగా తీసుకొని మరియు ఒక జోకర్‌గా పిలువబడాలని కోరవద్దు.


ఇతరులు గాయపరచబడకుండునట్లు నీవు జోకులు వేయవచ్చును.


నీవు ప్రజలను శిరస్సైయున్న క్రీస్తునకు కలపాలి కాని నీకు కాదు.


నమ్మకత్వము ఏవిధంగా పోతుంది:


ఇతరులకు నీమీద నమ్మకం ఉండదు.


నీకు సంబంధంలేని విషయములలో నీవు ఆసక్తి కలిగియున్నట్లయితే,


నీవు సహజముగా నడుచుకొనుచు మరియు ఆత్మీయుడవుగా కనపరచగోరినను,


నకిలీ దీనత్వముతో నీవు దీనుడవుగా నటించినట్లయితే,


నీ పేరు ప్రతిష్ఠల కొరకు నీవు ఆశపడుచున్నట్లయితే,


నీ కొరకును, నీ కుటుంబము కొరకును, నీ సహోదర సహోదరీల ద్వారా కష్టమైన పనులు చేయించుకొని, వారు చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వనట్లయితే,


నీ సంఘములో ఉన్న నీ సహోదర సహోదరీల కంటె నీ స్నేహితులకు మరియు నీ బంధువులకు ఎక్కువ విలువ ఇచ్చినట్లయితే,


నీ మార్గములలో నీవు యథార్థముగా ఉండక కుయుక్తితోను, మోసముతోను ఉన్నయెడల,


ఇతరుల సలహాలను వినుటకు నీవు ఇష్టపడని యెడల,


నిన్ను నీవు సమర్థించుకొనినయెడల,


నీవు ప్రత్యేకమైనవాడవని అనుకొని, సహోదరులను నీకు దూరముగా నుంచిన యెడల,


నీవు సంగతులను పరీక్షించకుండా, ఇతరులు చెప్పిన దానినంతయు నమ్మినయెడల,


నీవు కనికరము చూపించుటకు త్వరపడక తీర్పుతీర్చుటకు త్వరపడిన యెడల,


నీవు సత్యవంతుడవు కానియెడల,


నిన్ను ప్రేమించుచున్న వారినే నీవు ప్రేమించినయెడల,


ఇతరుల నుండి పొందుకొనుటకు వారిని పొగడినయెడల,


ఇతరులు చెడిపోవునట్లు, జ్ఞానము లేకుండా వారిని పొగడినయెడల,


నీవు ధనవంతులను దర్శించి మరియు బీద విశ్వాసులను నిర్లక్ష్యం చేసిన యెడల,


ఆత్మీయ విషయములలో రాజీపడుట ద్వారా,


ఇతరులను వెలగా పెట్టి జోక్స్‌ వేయుట వలన,


నీవు క్షమించకుండా ఉండి మరియు ద్వేషించుటవలన,


నీకును లేక నీ కుటుంబమునకును అనుకూలముగా ఉండునట్లు సంఘ విషయములలో నిర్ణయములు తీసుకొనుట,


ఇతరులు చేసిన చిన్న పొరపాట్లను విడిచిపెట్టక వాటిని పెద్దవిగా చేయుట,


ఇతరులతో నీవు మాట్లాడినప్పుడు వారి ముఖమును చూడలేకపోవుట,


నీ ప్రసంగములు విసుగు పుట్టించేవిగా ఉన్నప్పటికి, నీవు దానిని గుర్తించక పోవుట,


ఈ అధ్యాయములో చెప్పబడిన దైవికమైన గుణలక్షణములను నీవు కలిగియున్నయెడల మీ సంఘస్తులందరు, దేవునిచేత వారికివ్వబడిన సంఘపెద్దగా వారు గుర్తించెదరు.


పైన ఉన్నటువంటి గుణలక్షణములలో ఏదైనను నీలో లేనట్లుగా నీవు గుర్తించినయెడల, నీ బలహీనతలలో నీవు జయముపొంది మరియు దేవునిపిలుపును దేవునిభయముతో నమ్మకముగా నెరవేర్చునట్లు ఆ గుణలక్షణములు పొందుటకు దేవునికి ప్రార్థించుము.

అధ్యాయము 8
నాయకులుగా మన యొక్క బాధ్యత

ప్రకటన 2 మరియు 3 అధ్యాయములలో ఆసియాలో ఉన్న ఏడు సంఘముల పెద్దలకు ప్రభువు వర్తమానములు పంపించారు. సుమారు 40 సంవత్సరాల క్రితము అపొస్తులులు ఈ సంఘపెద్దలను నియమించారు. కాని వీరిలో ఐదుగురు పెద్దలు ఆత్మీయముగా వెనుకంజ వేసియున్నారు. మరియు వారి సంఘములు ఎంతో దిగజారియున్నవి. అయితే దీని ప్రభావం ఆ సంఘమును నిర్మించిన అపొస్తులుల మీద పడలేదు.


తాను వెళ్ళిన తరువాత కొందరు తోడేళ్ళవలె వచ్చి సంఘమును పాడుచేసెదరని ఎఫెసీ సంఘ పెద్దలను పౌలు హెచ్చరించియున్నాడు (అపొ.కా. 20:29, 30). కాని ఆ సంఘ పెద్దలు పౌలు యొక్క హెచ్చరికను తీవ్రముగా తీసుకొని మారుమనస్సు పొందలేదు. కాబట్టి ఎఫెసీ సంఘమును మరియు ఆ సంఘపెద్దలను ప్రభువు యెడల మొదటి ప్రేమను కోల్పోయి ఆత్మీయముగా పడిపోయారు (పక్రటన 2:4). కాబట్టి ఉప్పు సారమును కోల్పోయి మరియు వెలుగును పోగొట్టుకొనినవి.


ఒక సంఘము దానియొక్క పెద్దలవలె మార్పు చెందుతుంది:


వెనుకంజ వేసిన ఆ ఐదు సంఘముల పెద్దలు వారి సంఘములను పౌలుకాని, యోహానుకాని స్థాపించి మరియు సంఘపెద్దలుగా నియమించారని వారు అతిశయించియుండవచ్చును. అయితే అది యూదులు అబ్రాహాము తమ తండ్రి అని అతిశయించినట్లుగా ఉంటుంది (మత్తయి 3:9 మరియు యోహాను 8:39). ఈనాడు కూడా అనేకమంది సంఘనాయకులు తమ సంఘములను నియమించిన దైవజనులను బట్టి అతిశయించుచున్నారు. ఒక సంఘం యొక్క నాయకుడు ఆత్మానుసారమైన మనస్సు కలిగిలేనట్లయితే, అటువంటి అతిశయము బుద్ధిహీనతయై యుంటుంది.


సాధారణముగా ప్రతి సంఘము దాని నాయకులను బట్టి ఆత్మీయముగా పైకికాని క్రిందకుకాని వెళుతుంది. ఎందుకనగా అనేకమంది విశ్వాసులు గొఱ్ఱెలవలె ఉండి, పరీక్షించకుండా వారి యొక్క కాపరులను వెంబడించెదరు. కాబట్టి నాయకులముగా, దేవుని యెదుట మనకు గొప్ప బాధ్యత ఉన్నది. మనము దీనిని ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నట్లయితే, ప్రభువుయెదుట మన ముఖములను దుమ్ములో పెట్టుకొని ఆయన కృపకొరకు మొఱపెట్టెదము.


వెనుకంజ వేసిన ఐదు సంఘముల యొక్క పెద్దలు, నాయకుడు ప్రభువు యెడల మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు, సంఘము కూడా కోల్పోతుంది. ఒక నాయకుడు బిలాము బోధను (రాజీపడుచు మరియు డబ్బుకొరకు ఘనత కొరకు దేవుని సేవించుట) అనుసరించినప్పుడు ఆ సంఘ విశ్వాసులు కూడా బిలాము వంటివారు అగుదురు. ఒక నాయకుడు ఆత్మీయముగా మరణించినను లేక గర్వించినను అతని బోధ వినువారు కూడా అతని వంటి వారగుదురు (ప్రకటన 2 మరియు 3 అధ్యాయములు).


కాని కొందరు ఆ విధముగా లేరు (పక్రటన 3:4)లో సార్దీస్‌ సంఘస్తులు వారి నాయకులవలె వెనుకంజ వేయలేదు. వారి సంఘపెద్ద మృతుడైనప్పటికిని, వారు దేవునియెడల పూర్ణ హృదయము కలిగియున్నారు. అదే విధంగా ఆత్మీయముగా జీవముగల స్ముర్న మరియు ఫిలదెల్పియా సంఘములలో కూడా ఆత్మీయముగా మృతులైన వారు ఉండవచ్చును.


కాబట్టి ఒక సంఘము యొక్క నాయకుని బట్టి ఆ సంఘము ఆత్మీయముగా పైకికాని, క్రిందకుకాని వెళుతుందని సామాన్యముగా చెప్పవచ్చును. కాబట్టి దేవునియెడల మన బాధ్యతను తీవ్రముగా తీసుకొనవలెను.


సంఘనాయకులు ఆత్మీయముగా చెవిటివారు అయినయెడల:


ఈ సంఘపెద్దలు ఆత్మీయముగా వారు పడిపోయిన స్థితిని గురించి తెలియని వారుగా ఉన్నారు. అపొస్తులుడైన యోహానుద్వారా దేవుడు వారిస్థితిని బయలుపరచవలసి వచ్చింది. యోహాను ద్వారా కాకుండా వారు నేరుగా ఎందుకు దేవుని వద్దనుండి వినలేకపోయిరి? క్రొత్త నిబంధనలో ప్రతి యొక్క విశ్వాసితో దేవుడు సూటిగా మాటలాడవలెనని కోరుచున్నాడు. దీనికి కారణం వారి సంఘ కూటములలో ఇతరులకు ఏమి బోధించవలెనని వారు ఎక్కువగా ఆలోచించెదరు. ''ఇతరులకు బోధకునిగా ఉండవలెనని'' ఎక్కువగా ఆలోచించేవారు వారి యొక్క ఆత్మీయస్థితిని గురించి తెలుసుకొనలేరు.


ప్రభువు ఆ సంఘపెద్దలకు వర్తమానమును వ్యక్తిగతముగా పంపించలేకపోవుట గమనార్హము. ఆ విధముగా కాదు. ఆ వర్తమానములు సంఘములన్నింటిలో చదువబడినవి (పక్రటన 1:11). కాబట్టి సంఘములలో ఉన్న వారందరు అన్ని సంఘముల యొక్క నాయకుల యొక్క ఆత్మీయస్థితిని తెలుసుకొనియున్నారు. నిజానికి ఈ వర్తమానములు శ్రద్ధగా వినినవారు ధన్యులు అని చెప్పబడెను (పక్రటన 1:3).


పౌలు తిమోతికి ఇట్లు వ్రాయుచున్నాడు, ''ఇతరులు భయపడు నిమిత్తము పాపములో జీవించుచున్న పెద్దలను అందరి యెదుట గద్దించుము'' (1 తిమోతి 5:20).


పౌలు తన సహపరిచారకులగు దేమా ఇహలోకమును స్నేహించి తన్ను విడిచిపెట్టి యున్నాడని చెప్పుచున్నాడు (లోకము అనగా ధనాపేక్ష మరియు మనుష్యుల యొక్క ఘనత మరియు సుఖబోగములు) (2 తిమోతి 4:10). తనను వ్యతిరేకించిన వారి పేర్లను కూడా అనగా పుగెల్లు, హెర్మొగెనే, అలెక్సంద్రు, హుమెనైయులను చెప్పియున్నాడు (2 తిమోతి 1:15, 4:14, 1 తిమోతి 1:20). పేతురు మరియు బర్నబాల యొక్క వేషధారణను గూర్చి గలతీ సంఘములకు పౌలు చెప్పాడు (గలతీ 2:11 - 16).


నాయకుల గురించి ఈ విధముగా మాటలాడుటకు దేవుడు విశ్వాసులందరికి అనుమతించలేదు. కాని ఒక అపొస్తులుడు, పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడినవాడై ఈ విషయములు చెప్పవచ్చు. శరీరానుసారులైన వారి పేర్లను మరియు వారి ఓటములను పౌలు బయలు పరచుటను తప్పు పట్టెదరు. కాని ఆ అపొస్తులుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడియున్నాడు.


ఒక అపొస్తులుని యొక్క గద్దింపులను మరియు దిద్దుబాటులను, నీవు దీనుడవై అంగీకరించినయెడల నీవు ఆశీర్వదించబడుదువు.


దేవుని యెడల భయభక్తులు కలిగిన నాయకులు:


పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు వెనుకంజ వేసిన ప్రతిసారీ వారి యొక్క ప్రవక్తల ద్వారా ఎల్లప్పుడు వారి యొక్క నాయకులను (రాజకుమారులు, యాజకులు మరియు అబద్ధ ప్రవక్తలు) గద్దించాడు. వారి నాయకుల యొక్క నిర్లక్ష్యము మరియు ఆసక్తి లేకపోవుటను బట్టియు ఇశ్రాయేలీయులు తొలగిపోయిరి. వారి నాయకులు దేవుని యొక్క భయభక్తులను కోల్పోయినప్పుడు ఆ ప్రజలు కూడా కోల్పోయిరి.


క్రొత్త నిబంధనలో, దేవుని భయములో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనవలెనని మనము ఆజ్ఞాపించబడి యున్నాము (2 కొరింథీ 7:1). సంఘపెద్దలముగా, పోయిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము దేవుని భయములో మన పరిశుద్ధత ఎక్కువ కానట్లయితే మనము దేవుని ప్రజలను నడిపించలేము. ఇతరుల విషయములను మనం ఆసక్తితో చూడవచ్చును. కాని మన విషయములలో మనలను గమనించేవారు ఉండరు. కొన్నిసార్లు ఇతరులు దిద్దుబాటు చేసినప్పటికిని మనం సరిచేసుకోలేనంతగా వెనుకకు దిగజారి పోవచ్చును.


అప్పుడు మనము ఏమి చేయవలెను? మనము పూర్తిగా దిగజారిపోకుండునట్లు, దేవుడు తన బలిష్ఠమైన చేతితో మనలను నిర్వహించవలెనని ఆయనకు ప్రార్థించాలి. ప్రభువైన యేసులో దేవునియొక్క ఆత్మ దేవుని యెడల భయభక్తులు పుట్టించాడు (యెషయా 11:2). మనము అనుమతించినట్లయితే మనలో కూడా ఆత్మ భయభక్తులు పుట్టించగలడు. దేవుడు మనలను గాయపరుస్తాడని కాదు గాని మనమే దేవునిని గాయపరచెదవేమో అనే భయము.


మొదటిగా మన వ్యక్తిగత జీవితములో ఇటువంటి దేవుని భయము కలిగి యుండుట అవసరము. దేవునితో మనము ముఖాముఖిగా సహవాసము చేయకుండా వారము తరువాత వారము మనము సంఘ కూటములలో మాట్లాడవచ్చును. తన శరీరమును నలుగగొట్టుకొని లోబరచకొననట్లయితే ఇతరులకు ప్రకటించిన తరువాత తీర్పు దినమందు బహుమానము కోల్పోదునేమోనని పౌలు వలె మనము కూడా బోధకులుగా భయపడాలి (1 కొరింథీ 9:27).


పరిశుద్ధాత్మలో బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ వరము:


మన కాలములో పరిశుద్ధాత్మలో ముంచబడి పొందవలసిన బాప్తీస్మము గురించి విలువ ఇవ్వడం అవసరమైనది. ఈనాడు క్రైస్తవ్యంలో రెండు విపరీతమైన వైఖరులు ఉన్నవి. కొందరు పరిశుద్ధాత్మలో పొందవలసిన బాప్తీస్మమును బొత్తిగా నిరాకరించుచున్నారు. మరియు కొందరు పరిశుద్ధ జీవితం జీవించుటకుగాను లేక పరిచర్య చేయుటకు గాని శక్తిని ఇవ్వని నకిలీ బాప్తీస్మము గురించి అతిశయించుచున్నారు. మనము ఈ రెండు వైఖరులను విసర్జించి మరియు జీవించుటకును మరియు పరిచర్య చేయుటకును అవసరమైన జీవమును, శక్తిని ఇచ్చే బాప్తీస్మము పొందవలెను.


మనము ఎదిగిన దానికంటె ఎక్కువగా మన సంఘములను ఎదిగింపలేము. మనము కేవలం నకిలీ అనుభవం కలిగిన యెడల, ఇతరులను కూడా నకిలీ అనుభవంలోనికి నడిపించెదము. మనము నిజముగా పరిశుద్ధాత్మలో ముంచబడవలెను. అది మాత్రమే సరిపోదు. మనము ప్రభువు కొరకు ప్రభావితముగా ఉండవలెనని కోరినచో, మనము ఎల్లప్పుడు నిరంతరము పరిశుద్ధాత్మలో నింపబడవలెను. మనము ఎల్లప్పుడు ఆత్మపూర్ణులమై యుండాలి (ఎఫెసీ 5:18).


మన సంఘములో ఫలభరితమైన పరిచర్య చేయవలెనని కోరినయెడల, మన సంఘములోని సహోదర, సహోదరీల ఆత్మీయ అభివృద్ధి గురించి శ్రద్ధ వహించాలి. మన తోటి సహోదరులను సేవించవలెనని కోరినయెడల, అది ప్రవచన వరము కొరకు దేవునికి ప్రార్థించేటట్లు చేస్తుంది. పరిశుద్ధాత్మ వరము లేకుండా వాక్యపరిచర్య చేసి దేవుని సేవించుట అసాధ్యము. కాబట్టి ఆ వరము కొరకు హృదయమంతటితో ప్రార్థించాలి. మన సంఘములో అవసరములో ఉన్నవారియెడల మనం శ్రద్ధకలిగి యుండవలెననుటకు ఒక వ్యక్తి తన స్నేహితుని కొరకు రొట్టెలను అడుగుటకు మధ్యరాత్రిలో తన పొరుగువాని యింటికి వెళ్ళుటను గూర్చిన ఉపమానమును ప్రభువైన యేసు చెప్పారు. మనకవసరమైనంత పరిశుద్ధాత్మను పొందేవరకు, మనం దేవుని యొద్దకు వెళ్ళి తలుపు తట్టి ప్రార్థించాలి (లూకా 11లో 8 మరియు 13 వచనములను పోల్చిచూడండి).


క్రొత్త నిబంధనలో ప్రవచించుట అనగా సంఘము క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు పొందునట్లు దేవుని వాక్యమును ప్రకటించుటకు అవసరమైన పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగియుండాలి (1 కొరింథీ 14:4, 24, 25). 1కొరింథీ 14వ అధ్యాయములో స్థానిక సంఘముల యొక్క కూటములలో ప్రవచించుట యొక్క ప్రాముఖ్యతను పౌలు చెప్పియున్నాడు. ఇటువంటి అభిషేకముతో కూడిన ప్రవచించుట లేకుండానే సంఘమును నిర్మించినయెడల, అప్పుడు దేవుడు ఈ వరమును సంఘమునకు అనవసరముగా ఇచ్చినట్లుండును. అప్పుడు, ''విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి'' అను హెచ్చరిక అనవసరముగా ఉండును (1 కొరింథీ 14:1, 39). కాని సంఘమును నిర్మించుటకు ఈ వరము అత్యవసరమైయున్నది. ఈ విధముగా ఆత్మలో ప్రవచించే సహోదరుడు ఒక సంఘములో కనీసం ఒకరు కూడా లేనియెడల ఆ సంఘము చివరకు ఆత్మీయ మరణమును పొందును.


ఆత్మాభిషేకమును నిర్లక్ష్యముచేయుట ద్వారా పెంతెకొస్తురోజు పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడుట అనవసరమనియు మరియు ఆయనయొక్క శక్తి లేకుండానే ప్రభువుయొక్క పరిచర్య చేయగలమని చెప్పినట్టుండును. అంతేగాక దేవుని రాజ్యములోనికి వెళ్ళుటకు ప్రభువైన యేసుకూడా భూమి మీదకు శరీరధారిగా రానవసరములేదని చెప్పినట్లుండును. త్రిత్వములో మకూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను నిర్లక్ష్యము చేసి, తిరస్కరించుట త్రిత్వములో రెండవ వ్యక్తిని కూడా నిర్లక్ష్యము చేసినట్లవుతుంది. ఇది చాలా తీవ్రమైన పాపము.


కొందరు విశ్వాసులు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును దూషించుచున్నందువలన దానిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. నీకు పరిశుద్ధాత్మ శక్తిలేనియెడల, ప్రభువు యొక్క పరిచర్య చేయుటకు నీ యొక్క స్వంత తలాంతులు మరియు నీ అనుభవముతో చేసెదవు. అది దేవుని సంకల్పమును ఎన్నటికి నెరవేర్చదు.


ఒక వైపున ప్రజలను పరిసయ్యతత్వంనుండియు మరియు ధర్మశాస్త్రమునుండియు విడిపించి మరొక వైపున రాజీపడుట నుండియు లోకత్వము నుండియు ప్రజలను విడిపించాలి. ఇటువంటి పరిచర్యను చేయగలవారు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు మాత్రమే అటువంటి శక్తిని కలుగజేయగలడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చే జ్ఞానము కొరకును మరియు ఆయన శక్తి కొరకును మనము దేవునికి ప్రార్థించాలి. ఎఫెసీ క్రైస్తవుల కొరకు పౌలు ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ జ్ఞానము కొరకును, శక్తికొరకును ప్రార్థించాడు (ఎఫెసీ 1:17-19, 3:18-18). వీటి కొరకు మనం కూడా ప్రార్థించాలి.


అక్షరానుసారత (లీగలిజం) మరియు లోకతత్వము యొక్క అపాయములు:


అక్షరానుసారతనుండి విడుదల పొందుటకు, పూర్ణహృదయముతో విడుదల పొందుటకు కోరుకోవాలి. ఆవిధంగా మాత్రమే క్రొత్త నిబంధన సంఘమును నిర్మించగలము.


లోకతత్వము వలే లీగలిజము కూడా తీర్పు తీర్చుటకు నడిపించి మరియు దేవుని పరిచర్యను పాడుచేయును. లీగలిజము మరియు లోకతత్వము అను రెండు విపరీత వైఖరుల ద్వారా బబులోను సంఘములు నిర్మించబడును. కాని ఈ రెండింటిలో లోకత్వము కంటె లీగలిజం ఆత్మీయముగా కనబడును కనుక ఇది దానికంటె అపాయకరమైనది. లోకతత్వముతో ఉండిన సంఘముల కంటె ఈ సంఘములు ఆత్మీయముగా కనిపించును. ఎందుకనగా లోకతత్వముతో ఉండిన సంఘముల కంటె ఈ సంఘములలో వేషదారణయు, నటనయు ఉండును.


పరిసయ్యులు లీగలిస్టులుగాను మరియు హేరోదియులు లోకసంబంధులుగాను ఉన్నారు. కాని ప్రభువైన యేసును సిలువవేయవలెనని హేరోదీయులు కోరలేదు కాని పరిసయ్యులు కోరియున్నారు. ఇక్కడ మనము లీగలిజము యొక్క అపాయమును చూడగలము.


రోమా 6వ అధ్యాయము పాపము నుండి విడుదల పొందుట గూర్చి చెప్పుచున్నది మరియు రోమా 7వ అధ్యాయము లీగలిజం నుండి విడుదల పొందుట గూర్చి చెప్పబడింది. ఈ రెండు విషయములనుండి మనము విడుదల పొందాలి.


పెద్దలు లీగలిస్టులుగా ఉన్నారనుటకు ఒక ఉదాహరణ: నగలు ధరించుట లోకత్వమని వారు బోధిస్తారు.


రెండు విషయములను మనము స్పష్టముగా తెలుసుకొనవలసి యున్నది:


మొదటిగా లోకతత్వము ప్రాముఖ్యముగా మనసులో ఉంటుంది. రోమా 12:2లో ''మీ విషయములో... మీ మనసులో లోక మర్యాదను అనుసరించకుడి''. కొండెములు చెప్పుట, చాడీలు చెప్పుట, ధనాపేక్ష, లోకములోగాని సంఘములోగాని మనుష్యుల యొక్క ఘనతను కోరుట మరియు ఖరీదైన వస్త్రములు మరియు నగలను ధరించి ఇతరులకు చూపించుకొనుటలో లోకతత్వము ఉన్నది. కొండెములు చెప్పుట మనుష్యులను గాయపరచును గనుక ఇది నగలు ధరించుట కంటె పది లక్షల రెట్లు చెడ్డదైయున్నది. లోకతత్వము మనసులో ఆరంభమగును గనుక మొదటిగా దీనిని మనసులోనుండి తీసివేయాలి. అప్పుడు సహజముగానే గిన్నె పైభాగము శుద్ధి అగుతుంది (మత్తయి 23:26 లో ప్రభువైన యేసు చెప్పినట్లుగా).


రెండవదిగా, ఏదైనా ఒక దానిని చేయమని ఒక విశ్వాసిని బలవంతపెట్టిన యెడల, అది నిర్జీవ క్రియ అగును మరియు దేవునియెదుట దానికి విలువ ఉండదు. నిర్జీవ క్రియలనుండి మారుమనస్సు పొందవలెనని చెప్పబడింది (హెబీ 6:1). కాబట్టి పాపము కానిదైనను చేయమని మన సంఘములో ఎవరిని బలవంత పెట్టకూడదు. ఉదాహరణకు, కొండెములు చెప్పుట పాపము కాబట్టి దానిని ఆపమని ప్రజలకు చెప్పాలి. కాని నగలు ధరించుట పాపము కాదుగాని సామాన్యముగా ఉండాలి. గనుక నగలు ధరించవద్దని మనము ఎవరినీ బలవంతపెట్టకూడదు. సామాన్యమైన విషయములలో వారికున్న ఒప్పుదలను బట్టి వారు జీవించునట్లు వారికి స్వాతంత్య్రము ఇవ్వాలి. కాని మన ఒప్పుదలను బట్టి వారికి చెప్పకూడదు.


నా భార్యగాని నేనుగాని నగలు ధరించము. ఎందుకనగా బంగారముతోనైననూ, ముత్యములతోనైనను అలంకరించుకొనక అని 1 తిమోతి 2:9 మరియు బంగారు నగలు పెట్టుకొనుట అలంకారముగా ఉండవద్దని 1 పేతురు 3:3లో దేవుని వాక్యములో స్పష్టముగా చెప్పబడింది. కాని నగలు ధరించేవారిని మనం తీర్పుతీర్చము. ఎందుకనగా మనం దానిని గ్రహించునట్లుగా వారు దానిని గ్రహించలేరు.


మనము సాధువులుగాను మరియు మృదువైన వారుగాను ఉండుటయు వెలగల వస్త్రములు నగలు ధరించి ఇతరులకు చూపించుకొనుట విరుద్ధమైనవని పౌలు మరియు పేతురు చెప్పారు (1 తిమోతి 2:9 మరియు 1 పేతురు 3:3). అనవసరముగా విలువైన వాటికి డబ్బును ఖర్చుపెట్టి ఇతరుల యొక్క ఘనతను కోరవద్దని వారు సహోదరీలను మరియు అందరిని కోరుచున్నారు. బంగారము, ముత్యములు, వెలగల వస్త్రములు మరియు జడలు అల్లుకొనుటయు గురించి చెప్పియున్నారు. కాని ఇటువంటి విలువైన అనేక వస్తువులను అనేకమంది విశ్వాసులు వారి గృహములలో కలిగియున్నారు.


''వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడని'' ప్రభువైన యేసు ఆజ్ఞాపించారు (యోహాను 7:24).


కాబట్టి నగలు ధరించిన ఒక సహోదరిని నీవు విమర్శించే ముందుగా, మీ యింటిలో అనవసరమైన వస్తువులు ఏమైనా ఉన్నవేమోనని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అది నిజమయినట్లయితే నీ వేషధారణ నుండియు స్వనీతి నుండియు మరియు తీర్పు తీర్చే ఆత్మనుండియు విడుదల పొంది మొదటిగా నిన్ను నీవే తీర్పు తీర్చుకొనవలెనని నేను చెప్పుచున్నాను. నీ యింటిలో అత్యంత విలువైన అనవసరమైన వస్తువులను కలిగియుండి ఒక సహోదరి సామాన్యమైన నగలు ధరించినదని నీవేలాగు విమర్శించగలవు?


''నీవు ఇతరులను వ్రేలుపెట్టి విమర్శించిన ప్రతిసారీ నీకు వ్యతిరేకముగా నీవే తీర్పు తీర్చుకొనుచున్నావని గుర్తు తెచ్చుకొనుము. ఇతరులను తీర్పు తీర్చుట, నీలో ఉన్న బలహీనతలను నీవు చూడగలిగేటట్లు చేస్తుంది. కాని దేవుడు వెక్కిరించబడడు. నీలోవున్న సమస్త వేషధారణను దేవుడు చూచి మరియు నీవు చేసినదానికి నిన్నే బాధ్యునిగా చేస్తాయి. నీవు ఇతరులను వ్రేలుపెట్టి చూపించుట ద్వారా దేవుడు నీయొక్క తప్పులను చూచి మరియు నిన్ను తీర్పు తీర్చును. ఆయన మంచి దేవుడు కాబట్టి నిన్ను తీర్పుతీర్చడని నీవు అనుకొనవద్దు. ఆవిధముగా కాదు నీవు తప్పించుకొనలేవు కాబట్టి మరుమనస్సు పొందుము...'' అని బైబిలు చెప్పుచున్నది (రోమా 2:1 - 5 మెసేజ్‌ బైబిలు).


నగలను ధరించుకొనుటయే కాక ఇంకను అనేక విషయములకు ఈ నియమమును అన్వయింపవచ్చును. కాబట్టి వీటన్నింటి విషయమై జాగ్రత్తపడుము. ఒక సహోదరుడు ఉపయోగించే కారును బట్టిగాని లేక అతడు ధరించిన జీన్స్‌ వస్త్రమును బట్టిగాని లేక అనేక రంగులలో ఉన్న బట్టలను బట్టిగాని నీవు తీర్పు తీర్చవచ్చును.


దీని యొక్క సారాంశము ఇక్కడ ఉన్నది. ''ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢి పరచుకొనవలెను'' (రోమా 14:5). ఒకరు ఎంత యింటిలో నివసించవచ్చుననిగానీ, ఎటువంటి కారు, స్కూటరును ఉపయోగించవచ్చుననిగానీ మరియు అతను అతని కుటుంబస్తుల బట్టలు ధరించే విషయములోగానీ, ఆహారం తినే విషయంలోగాని, అతని యింటిలో పెళ్ళికి ఖర్చుపెట్టే విషయంలోగానీ మొదలగు వాటిని ప్రతివాడు తన మనస్సులో రూఢి పరచుకొనవలెను. ఈ విషయములన్నింటిలో లోకానుసారత నిజముగా ఉండవచ్చును కాని ఈ విషయములను బట్టి ఎవరిని తీర్పు తీర్చకూడదు. మనలను మనమే తీర్పు తీర్చుకొనవలెను.


నగలు ధరించేవారి ద్వారా గానీ లేక కొన్నిఖరీదైన వస్తువులు కలిగియున్న వారి ద్వారా గాని బబులోను నిర్మించబడదు. తాను బోధించిన దానిని జీవించకుండా మరియు ఇతరులను తీర్పు తీర్చే వేషధారుల ద్వారానే బబులోను నిర్మించబడుతుంది.


విమర్శించవచ్చు కానీ ఖండించకూడదు:


క్రైస్తవులలో చాలామంది ''తీర్పుతీర్చుట'' అను మాటను అపార్థము చేసుకొనుట వలన ఇతరులను విమర్శించవచ్చునా లేక విమర్శించకూడదా అని అనుకుంటారు.


విశ్వాసులముగా, ప్రజల గురించి వివేచన కలిగియుండుటకు మనము ఇతరులను విమర్శించవచ్చును. మనం ఒక వర్తమానమును వినినప్పుడు మనము దానిని పరీక్షించవలెనని వాక్యము చెప్పుచున్నది (1 కొరింథీ 14:29). కాబట్టి ప్రతి ఒక్కరి వర్తమానమును మనము పరీక్షించవలసిందని పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించుచున్నాడు. ఈనాడు క్రైస్తవ్యంలో అనేకమంది అబద్ధ బోధకులు ఉన్నారు. కనుక ఈ విధముగా మాత్రమే వారు మోసమునుండి తప్పించుకొనగలరు.


దేవుని వాక్యము ఈవిధముగా చెప్పుచున్నది, ''ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి'' (1 యోహాను 4:1).


ఇతరులను తీర్పుతీర్చే విధానమును ప్రభువైన యేసు చెప్పారు. ఆయన యిట్లన్నారు, ''మీరు చూచిన దానిని బట్టి వెంటనే తీర్పుతీర్చక, యథార్థముగా తీర్పుతీర్చుచు మరియు న్యాయముగాను, నీతిగాను తీర్పు తీర్చుడనెను'' (యోహాను 7:24 ఆంప్లిఫయిడ్‌).


''తీర్పు తీర్చకుడి'' అని ప్రభువైన యేసు చెప్పినప్పుడు ఆయన భావము ఏమైయున్నది? (మత్తయి 7:1).


గ్రీకు భాషలో తీర్పుతీర్చుట అనగా ఖండించుట. ఆంప్లిఫయిడ్‌ బైబిలు ఈ వచనమును ఈ విధంగా తర్జుమా చేసింది ''మీరు ఖండింపబడకుండునట్లు మీరు ఇతరులను ఖండించకుడి'' (మత్తయి 7:1 ఆంప్లిఫయిడ్‌).


తన గురించి ప్రభువైన యేసు ఇట్లన్నారు, ''నేను ఎవరిని ఖండించను లేక తీర్పుతీర్చను'' (యోహాను 8:15 ఆంప్లిఫయిడ్‌).


కాబట్టి ఖండించుటయు మరియు ఇతరులను తీర్పుతీర్చుటయు (మాటలతోకాని మనస్సుతోకాని) నిషేధించబడింది. దానిని చేయుటకు దేవునికి మాత్రమే అధికారం ఉన్నది.


కాని మనం పరీక్షించి మరియు వివేచించాలి.


ప్రభువైన యేసు ఎవరిని తీర్పుతీర్చడని ప్రవచించబడింది. ''కంటిచూపును బట్టి అతడు తీర్పుతీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శచేయడు. నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును'' (యెషయా 11:3, 4). మనం కూడా ఆయన మాదిరిని అనుసరించి, మనం చూచిన దానినిబట్టియు లేక వినినదానిని బట్టియు తీర్పుతీర్చకూడదు. మనము ఒక విషయమును క్షుణ్ణముగా పరిశీలనచేసిన తరువాతే నీతిగాను మరియు పక్షపాతము లేకుండా తీర్పు చెప్పాలి.


''ప్రభువా, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము'' (కీర్తన 36:9). దేవుని వెలుగులో మనలను మనం తీర్పు తీర్చుకొనుటను నేర్చుకొనుట క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైయున్నది. చాలామంది దీనిని నేర్చుకొననందువలన వారు ఆత్మీయ అభివృద్ధిని పొందుటలేదు.


ఇక్కడ ఒక అద్భుతమైన వాగ్ధానమున్నది, ఎవరైతే తమ్మునుతాము నమ్మకముగా తీర్పుతీర్చుకొనుచుంటారో అటువంటి వారిని అంత్యదినమందు దేవుడు తీర్పుతీర్చడు. ''అయితే మనలను మనమే విమర్శించు కొనినయెడల తీర్పుపొందకపోవుదము'' (1 కొరింథీ 11:31).


మనము ఇతరులను తీర్పుతీర్చక పోయినప్పటికిని, పాపమునకు వ్యతిరేకముగా మనము బోధించాలి. ప్రభువైన యేసు కొన్ని పాపములను గూర్చి వ్యతిరేకముగా చెప్పారు. అవేవనగా కోపము, మోహపు చూపులు చూచుట, ధనాపేక్ష, చింతించుట, భయము, చెడ్డతలంపులు, అబద్ధములు చెప్పుట, మనుష్యుల ఘనతను కోరుట, శత్రువులను ద్వేషించుట మొదలగునవి (మత్తయి 5,6,7 అధ్యాయములు). ఇతరులను ఖండించకుండా ఇప్పుడు మనము ఇంటర్నెట్‌లో బూతు బొమ్మలను చూచుటను వ్యతిరేకించాలి. ప్రభువైన యేసు లోకమును తీర్పుతీర్చుటకు రాలేదు కాని లోకమును రక్షించుట కొరకు మాత్రమే వచ్చియున్నాడు (యోహాను 3:17). దేవుడు మాత్రమే తీర్పుతీర్చువాడు మరియు మనుష్యులందరికి న్యాయాధిపతి (యాకోబు 4:12).


దేవుడు సంఘములోనుండి గర్విష్టులను మరియు అహంకారులను వెళ్ళగొట్టును:


సంఘములోని గర్విష్టులు మరియు అహంకారులైన విశ్వాసులను మనము ఎదుర్కొనవలెను. గర్విష్టులందరు ప్రభువు నామమును అవమాన పరచెదరు గనుక ఒక సంఘపెద్ద అటువంటి వారి విషయములో సౌమ్యముగాను, దౌత్యముగానూ ఉండక ధైర్యముగా ఉండి వారితో ప్రవచించాలి. అటువంటి పరిస్థితుల ద్వారా సంఘపెద్దలు మనుష్యులను సంతోషపెట్టువారుగా ఉన్నారా లేక సంఘములో దేవుని యొక్క మహిమకొరకు ఆసక్తిగలవారుగా ఉన్నారా అని ప్రభువుచేత పరీక్షించబడతారు.


మనము సరిదిద్దినప్పుడు ఇతరులు అభ్యంతరపడి సంఘమును విడిచిపెట్టినప్పటికి మనము నిరాశపడకూడదు. ఎందుకనగా అటువంటి గర్విష్టులను సంఘములో నుండి వెళ్ళగొట్టవలెనని దేవుడే నిర్ణయించాడు.


దేవుడు ఇట్లనుచున్నాడు, ''మీలోనుండి గర్విష్టులందరిని మరియు అహంకారులను వెళ్ళగొట్టెదను. సంఘమనే పరిశుద్ధ కొండమీద ఎటువంటి గర్వముగానీ లేక అహంకారము గానీ ఉండదు. దు:ఖితులగు దీనులను మరియు ప్రభువు యొక్క నామమును ఆశ్రయించువారును మీతో ఉండెదరు. వారు ఎటువంటి వంచనతో ఉండరు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై నెమ్మదిగా జీవించెదరు. మీలో ప్రభువు నివసించుచున్నాడు గనుక మీరు పూర్ణ హృదయముతో దేవునికి ఉత్సాహగానము చేయుడి. మీరు భయపడనవసరం లేదు. మీ దేవుడు మీలో నివసించుచున్నాడు గనుక ధైర్యము తెచ్చుకొనుడి. ఆయన శక్తిగల రక్షకుడు. ఆయన మీకు జయము నిచ్చును. ఆయన బహు ఆనందముతో మీయందు సంతోషించును. ఆయన నిన్ను ప్రేమించును గానీ నిన్ను నిందించడు'' (జెఫన్యా 3:11 - 18 లివింగు బైబిలు).


''తండ్రి నాకనుగ్రహించిన వారందరును నా యొద్దకు వచ్చెదరు'' అని ప్రభువైన యేసు చెప్పారు (యోహాను 6:37). మనము కూడా ఆవిధముగా చెప్పగలము. మనము ఎవరికైతే పరిచర్య చేయవలెనని తండ్రి కోరుచున్నాడో అటువంటి వారు మనలో ఉండెదరు మరియు అటువంటి విశ్వాసులు మనతో ఉండవలెనని మనము కోరెదము. మిగతావారినందరిని మనము వెళ్ళనిచ్చెదము ఎందుకనగా వారు మనతో ఉన్నయెడల అనేక సమస్యలకు కారణమగుదురు.


కాబట్టి ఇతర సంఘములుగానీ పాస్టర్లుగానీ కొందరిని తీసుకొనిపోయినయెడల, వారిని వెళ్ళనిచ్చెదము. దేవుడు తన సార్వభౌమాధికారముతో, ఒక కారణమును బట్టి అనుమతిస్తాడు. యోహాను యిట్లు చెప్పుచున్నాడు, ''వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్లిరి'' (1 యోహాను 2:19).


దేవుడు అటువంటి విభజనను అనుమతించినప్పుడు, మనతో ఉన్న అత్యంత బలహీనమైన విశ్వాసిని కూడా పోగొట్టుకొనమని మనము నిశ్చయత కలిగియుండాలి. ప్రభువు ఇట్లనుచున్నాడు, ''నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించునట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని యొక చిన్న గింజయైన నేల రాలదు'' (ఆమోసు 9:9). ఇది ఆయన యొక్క వాగ్ధానము.


గోధుములవలె మన సంఘము జల్లించబడాలి. లేనట్లయితే దేవుడు నిర్మించే సంఘమనే ''రొట్టెలో'' రాళ్లు ఉండును. కాబట్టి దేవుని వలె మనకు కూడా సంఘములో నాణ్యత ముఖ్యము కానీ సంఖ్య ముఖ్యము కాదు.


సంఘములో క్రమశిక్షణ:


సంఘములో మనము దేవుని యొక్క అత్యున్నతమైన ప్రమాణములను కలిగియుండాలి. కాబట్టి అవసరమైతే కొన్నిసార్లు, పాపములో జీవించుచున్న సహోదరుని సంఘములోనుండి పంపించవచ్చును. పౌలు అపొస్తులుడుగా ఒకసారి యిట్లుచెప్పాడు ''ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతోకూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానుకును అప్పగింపవలెను'' (1 కొరింథీ 5:4, 5). ఆ విధంగా మాత్రమే సంఘము పవిత్రంగా ఉంటుంది.


ఒక సంఘపెద్ద కూడా పాపములో జీవించుచున్నయెడల అందరి యెదుట అతనిని గద్దించవలెనని పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించియున్నాడు. సంఘపెద్దకు రెట్టింపు సన్మానము చేయవలెనని చెప్పిన చోటనే వారు పాపములో జీవించు చున్నయెడల వారిని గద్దించవలెనని కూడా లేఖనములలో చెప్పబడింది (1 తిమోతి 5:17 మరియు 20). దేవుడు మోషేను మరియు పేతురును అందరియెదుట ఘనపరచియున్నాడు. అందరి యెదుట వారిని గద్దించియున్నాడు కూడా. ప్రకటన 2 మరియు 3 వ అధ్యాయములలో వెనుకంజ వేసిన ఐదుగురు పెద్దల విషయములో కూడా ఆ విధంగానే చేశాడు.


మనము ఎవరినైననూ గద్దించే ముందుగా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచున్నామా అనేది పరీక్షించుకోవాలి (ఎఫెసీ 4:15). 1 యోహాను 3:16లో ''మన సహోదరుల నిమిత్తము మనము మన ప్రాణములను పెట్టబద్దులమై యున్నామని'' చెప్పబడింది. కాబట్టి ఆ వ్యక్తిని పాపమునుండి విడిపించబడుటకు మన స్వజీవమును విడచిపెట్టుటకు ఇష్టపడుచున్నామా లేక కేవలం అతని యొక్క పాపమును గురించి అతనికి చెప్పవలెనని కోరుచున్నామా అని మనం పరీక్షించుకోవాలి.


కీర్తన 12:6 యిట్లు చెప్పుచున్నది, ''యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో ఏడుమారులు కడిగి ఊదిన వెండియంత పవిత్రములు''. కాబట్టి మొదటిగా మన మాటలు ''ప్రభువుయొక్క మట్టిమూసలో'' ఏడుసార్లు కడగబడి మరియు ప్రభువుచేత పవిత్రపరచబడాలి మరియు ఆయన చిత్త ప్రకారము మనం మాట్లాడాలి. ప్రతియొక్క పరిస్థితిని బట్టి దేవుని యొక్క ప్రేమ బలముగాగానీ లేక నెమ్మదిగా గాని మాట్లాడును. గనుక మనము కూడా అవసరమును బట్టి నెమ్మదిగా గాని లేక బలముగా గాని మాట్లాడెదము.


సంఘము నుండి బయటకు పంపిన విశ్వాసుల యెడలను లేక తిరుగుబాటుతో సంఘమును విడచివెళ్ళిన విశ్వాసులతో గానీ మనము ఏవిధంగా ఉండవలెనని దేవుడు వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. ''అట్టివారితో సాంగత్యము చేయవద్దనియు'' (1 కొరింథీ 5:11 మరియు 2 థెస్సలో. 3:14) మరియు ''అట్టివారినుండి తొలగిపొమ్మనియు'' (రోమా 16:17) పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు.


పరిశుద్ధాత్ముడు ఇక్కడ కఠినముగా వ్రాయించాడని కొందరు విశ్వాసులు భావించి మరియు బుద్ధిహీనతతో అటువంటి తిరుగుబాటు దారులను ఆదరించెదరు. కాని ఆ తిరుగుబాటుదారులు ''పందులతో తినుట విషయములో ఎన్నటికి మారుమనస్సు పొంది తండ్రి యింటికి వెళ్ళరు'' (లూకా 15:16, 17). ఆ విధంగా వారు నిత్యత్వానికి వారు నష్టపోయెదరు. ఇటువంటి సందర్భములలో అటువంటి తిరుగుబాటు దారులు మారుమనస్సు పొంది మరియు వారి పాపములను ఒప్పుకొని ప్రభువుతోను మరియు ఆయన ప్రజలతోను సహవాసమును కలిగియుండవలెనని వారికి చెప్పవచ్చును.


సంఘములో నీతికి విరోధముగా రాజభక్తితో మనం ఎవరి పక్షమున ఉండకూడదు. ఒక సహోదరుని బలపరచుటకు దేవుని యొక్క ఉన్నత ప్రమాణములను మనము త్యాగము చేయకూడదు. దేవుని ప్రేమ ఎల్లప్పుడు సత్యములో ఆనందించుచూ మరియు దుర్నీతితో ఎటువంటి సహవాసం కలిగియుండదు (1 కొరింథీ 13:6). ఈ విధముగా మనము ఒక మతారాధన వ్యవస్థ (కల్ట్‌) కు వేరుగా ఉండెదము. వీరిలో ఎవరైననూ దుర్నీతితో ఉన్నప్పటికినీ వారు అతనితో సాంగత్యము చేసెదరు. బహిరంగముగా పాపము చేసి ఇతర సంఘములచేత బయటకు వెళ్ళగొట్టబడినవారు - మారుమనస్సు పొంది సరిచేసుకోనప్పటికిని వీరు వారి సంఘములలో చేర్చుకొనెదరు.


మన సంఘస్తుల సంఖ్య పెరుగుట కంటె వారి యొక్క నిత్యత్వపు క్షేమమే మనకు ముఖ్యము.


మీ సంఘము ఒక చెడ్డ సాక్ష్యమును కలిగియున్నట్లయితే, దానిని సమర్థించుకొని మరియు అంతా బాగుగానే ఉందని అనుకొనుట కంటె దానిని ఒప్పుకొనుట మంచిది. ప్రభువైన యేసు తన యొక్క ఐదు సంఘములలోని లోపములను కప్పిపెట్టలేదు (ప్రకటన 2 మరియు 3 అధ్యాయములలో). కాని దానిని బహిర్గతం చేసి, దానిని అందరు చదువమని చెప్పాడు! ఆయన స్వనీతిపరుల కొరకు రాలేదు కానీ యథార్థముగా తన పాపములను ఒప్పుకొను వారికొరకు వచ్చియున్నాడు. తమ తప్పిదములను ఒప్పుకొనక కప్పిపుచ్చుకొనే వారు పవిత్రపరచబడరు.


క్రొత్త నిబంధన సంఘములో ఒక సంఘ పెద్దగా నుండుట గొప్ప ధన్యతయైయున్నది. కాని అది గొప్ప బాధ్యతను కూడా అనగా ప్రభువు ఎదుట భయముతోను వణకుతోను ఉండేటట్లు ఆ బాధ్యత చేస్తుంది. పెద్దలుగా మనకు వచ్చే ఘనతను గురించి అనేక అర్హతల గురించి ఎక్కువగా ధ్యానించకూడదు. పెద్దలుగా మనకున్న బాధ్యతలను గూర్చి ఎక్కువగా ఆలోచించాలి. మనము దీనులుగా ఉన్నయెడల, అంతము వరకు మనము నమ్మకముగా ఉండునట్లు ప్రభువు మనకు కృప నిచ్చును.


ఐక్యతలో సంఘమును నిర్మించుట:


వారి సంఘములలో పరిపూర్ణ ఐక్యత ఉండునట్లు పెద్దలు భారము కలిగియుండాలి. కాని ఆ ఐక్యత పెద్దలలో మొదలవ్వాలి.


యోహాను 17:21లో గొప్ప ఐక్యత కలిగియుండాలని ప్రభువైన యేసు నియమించారు. భూమి మీద ఆయన ఉన్నప్పుడు, ప్రభువు మరియు ఆయన తండ్రియు కలిగియున్న ఐక్యతను శిష్యులు కూడా కలిగియుండాలని ఆయన కోరుచున్నాడు. భూమిమీద ఉన్నప్పుడు అన్ని సమయములలో తన స్వచిత్తమును ఆయన ఉపేక్షించుకొనుట ద్వారా తండ్రితో ఆయన ఐక్యత కలిగియున్నాడు (యోహాను 6:38, మత్తయి 26:39). అందువలన అన్ని సమయములలో సిలువ మనకు కేంద్రముగా ఉండాలి. సంఘపెద్దలు వారి స్వంతమును కోరక, తమ్మునుతాము ఉపక్షించుకొని మరియు జీవముతో నింపబడుచు ఒకరియెడల ఒకరు ఐక్యత కలిగియున్నయెడల సాతాను సంఘములో ప్రవేశించలేడు.


ప్రజలు తమ స్వంతమును కోరక, తమ్మునుతాము ఉపేక్షించుకొనుచు మరియు దేవుని మందిరమును నిర్మించవలెనని పాతనిబంధనలో హగ్గయి ప్రవక్త ప్రోత్సహించుచున్నాడు.


''ప్రభువు యిట్లనుచున్నాడు, నా మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన ఖరీదైన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? దాని యొక్క ఫలితాన్ని చూడండి.... మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. మీ యొక్క రాబడి చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా అదృశ్యమగుచున్నది... మీరు విస్తారముగా కావలెనని కోరినను మీకు కొంచెమే దొరికినది. మీరు దానిని యింటికి తెచ్చిన తరువాత అది చాలా కొద్ది కాలమే ఉంటుంది. ఎందుకని? ఎందుకనగా నా మందిరము పాడైయుండగా మీరు దానిని పట్టించుకొనలేదు. మీ యొక్క మంచి యిండ్ల గురించి మాత్రమే మీరు ఆసక్తి కలిగియున్నారు. అందువలన నేను పరలోకమునుండి వర్షము పడకుండా ఆపివేసి, మీకు కొద్ది పంటనే ఇచ్చుచున్నాను.. అప్పుడు దేవుడు ప్రజలందరి ఆత్మలను కదిలించినప్పుడు, ఆ ప్రజలు వచ్చి దేవుని మందిరమును నిర్మించియున్నారు'' (హగ్గయి 1:3 - 14 లివింగు బైబిలు మరియు ఎన్‌ ఎ ఎస్‌ బి).


సంఘమును నిర్మించుటకు ప్రభువు మన హృదయములను కూడా ప్రేరేపించవలెనని కోరుచున్నాడు.


''క్రీస్తు సంఘమును ప్రేమించి మరియు దాని కొరకు తన్నుతాను అప్పగించుకొన్నాడు'' (ఎఫెసీ 5:27).


స్వభావములోను మరియు పరిచర్యలోను ఎదుగుట:


ప్రభువు యొక్క పరిచర్యలో ఎదగకుండా మనము స్వభావములో మాత్రమే ఎదుగుట చాలా సులభము. మనము స్వభావములోనూ, పరిచర్యలోనూ ఎదుగుట ద్వారా మాత్రమే ప్రభువైన యేసు సారూప్యములోనికి మార్చబడగలము. లేనియెడల అది ఒక మనుష్యుడు ఒక ప్రక్కన బలమైన కండరములను కలిగియుండి (స్వభావముగానీ లేక పరిచర్య గానీ) మరొక ప్రక్క మాంసమును మరియు ఎముకలను కలిగియున్నట్లుగా ఉండును.


మనము పాపమును జయించినప్పటికి, ప్రభువు యొక్క సంఘనిర్మాణ విషయంలో ఆసక్తి లేనియెడల అప్పుడు మనం ప్రభువైన యేసువలె ఉండము. పరలోకములో నిత్యత్వము దేవునిని ఆరాధించబోవుచున్నప్పటికినీ, మనము త్యాగపూరితముగా పరిచర్య చేయుటకు ఒకే ఒక్క జీవితము ఉన్నది.


మన అంతరంగములో త్యాగము చేయట ద్వారా అనగా మన స్వచిత్తమును ఉపేక్షించుకొనుట ద్వారా మన స్వభావము అభివృద్ధి చెందుతుంది. కానీ మనము సంఘమును నిర్మించవలెనని కోరినయెడల నిద్రను, విశ్రాంతి, సౌకర్యములను, ఆరోగ్యమును, డబ్బును మొదలగు బాహ్య సంబంధమైన వాటిని నష్టపోవలసి వచ్చును. ప్రభువు నజరేతులో జీవించిన 30 సంవత్సరములు బాహ్యసంబంధమైన త్యాగములు కొన్ని మాత్రమే చేయవలసివచ్చును. కాని ఆయన పరిచర్య ఆరంభించిన తరువాత ఆయన అనేక ప్రదేశాలకు ప్రయాణం చేసి, నిద్రపోవుటకు స్థలము లేకయు, తినుటకు సమయంలేకయు మరియు సాతాను నుండియు, ప్రజలనుండియు వ్యతిరేకతను పొందియున్నాడు.


కాబట్టి మన జీవితములలోనూ, మన పరిచర్యలోనూ ప్రభువైన యేసును త్యాగపూరితముగా వెంబడించుదము.


అధ్యాయము 9
ఒక సేవకుడిగా ఉండిన నాయకునియొక్క ఆత్మీయ అధికారము

ఒక వ్యక్తిని దేవుడు మాత్రమే ఆత్మీయనాయకుడిగా నియమించును. పరిచర్యలోగానీ లేక సంఘములోని ఆఫీసులోగానీ పరిచర్య చేయుటకు నీవు కేవలం మనుష్యులచేత నియమించబడిన యెడల నీవు క్రీస్తు యొక్క అధికారమును కలిగి ఉండలేవు.


ప్రభువైన యేసుయొక్క మాదిరిని అనుసరించుట:


క్రీస్తును వెంబడించుటలోని మొదటి మెట్టును ఈ మాటలలో చూడగలము. ''క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు ....... మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను'' (ఫిలిప్పీ 2:5 - 7).


మనుష్యులందరికి దాసుడు అగుట ద్వారా మనయొక్కప్రభువు మొదటి తీర్మానం చేసుకొనియున్నాడు. పెద్దలముగా మనముకూడా మొదటిగా అటువంటి తీర్మానము చేసుకోవాలి. ఒక పెద్దగా నీవు ఇతరుల కంటె అధికుడవని ఊహించిన యెడల, నీవు పెద్దగా ఉండుటకు అర్హుడవు కాదు.


''పరిశుద్ధుల యొక్క పాదములు కడిగే దాసులుగానూ'' మరియు ''ఆత్మీయ మరుగుదొడ్లు శుభ్రపరచేవారిగా ఉండి సంఘమును శుద్ధిచేసేవారిగా ఉండవలెను''. వారు ఎల్లప్పుడు సామాన్య సహోదరులుగా ఉండి, ఏ సమయములోనైననూ సంఘపెద్దగా ఉండక సామాన్య సహోదరుడగుటకు ఇష్టపడవలెను. మరుగుదొడ్లు కడుగు ఎవరినైననూ, వాటిని కడుగుట ఆపివేసి కుటుంబ సభ్యులతో కూడా భోజనము చేయమని అడిగిన యెడల అతడు అభ్యంతర పడడు. సంఘపెద్దగా ఉండుటను విడిచిపెట్టి మరియు సంఘములో సామాన్యసహోదరునిగా ఉండమని చెప్పిన యెడల అతడు అభ్యంతరపడడు.


ఏ సమయయులోనైననూ నీవు సంఘపెద్దగా ఉండుట విడిచిపెట్టమని దేవుడు చెప్పగలుగునట్లు నీవు సంఘపెద్ద పదవిని గట్టిగా పట్టుకొనకుండా ఉండెదవు. నీవు పెద్దగా ఉండే పదవిని విడిచిపెట్టక గట్టిగా పట్టుకొన్నట్లయితే అప్పుడు అది నీకొక విగ్రహము అయివుండి మరియు నీవు ప్రభువైన యేసునకు శిష్యునిగా ఉండలేవు (లూకా 14:33).


ఒక సహోదరుడైయున్న ఒక నాయకుడు:


ఒక ఆత్మీయనాయకుడు తన సంఘములోని వారిని సిలువ మార్గములో నడిపించాలి. కాబట్టి అతడు నమ్మకముగా తననుతాను ఉపేక్షించుకొనుచూ జీవించాలి. క్రీస్తువలె, ఇతరులకు దాసునిగా ఉండటానికి ఇష్టపడనివాడు క్రీస్తుయొక్క శరీరములో నాయకునిగా ఉండలేడు. ప్రభువైనయేసు ఇట్లన్నారు, ''అన్యజనులలో రాజులు మరియు గొప్పవారు ఇతరుల మీద ప్రభుత్వము చేయుదురు. కాని మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైననూ గొప్పవాడై యుండగోరినయెడల అతడు ఇతరులకు దాసుడైయుండవలెను. మరియు ఎవరైననూ అందరిలో గొప్పవాడై యుండగోరినయెడల, అతడు అందరికి దాసుడై యుండవలెను. మెస్సీయ అనే నేను కూడా పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ ఇతరులకు పరిచారము చేయుటకు వచ్చియున్నాను'' (మార్కు 10:42 - 45 లివింగు బైబిలు). అందరికంటె ఎంతో అధికారము కలిగిన గొప్ప అపొస్తులుడైన పౌలు అందరికి దాసుడిగా ఉండెను (2 కొరింథీ 4:5, 1 కొరింథీ 9:19).


ఒక ఆత్మీయనాయకుడు, దేవుడు తనకిచ్చిన వారి మీద అధికారము చేయుచు మరియు అదే సమయములో అతడు వారికి సహోదరుడిగా ఉండి మరియు ఆ సంఘములో ఒక సభ్యుడిగా ఉండును. నాయకుడిగాను, సహోదరుడిగాను సమతుల్యతను కలిగియుండుట కష్టమే. మనము ఏదొక ప్రక్కకు వెళ్ళుచుందుము. మనము సామాన్య సహోదరుడిగా ఉండుటకు ఎల్లప్పుడు ప్రభువు యొక్క కృప మనకు ఎంతో అవసరమైయుండును. మనము దేవునితో ముఖాముఖిగా సన్నిహితమైన సహవాసం కలిగియుండుట ద్వారా మనం సమతుల్యత కలిగియుండగలము. 40 సంవత్సరములు అనేక క్లిష్ట పరిస్థితులలో 20 లక్షలమంది దేవుని ప్రజలను ఎంతో బాగుగా నడిపించిన మోషే యొక్క రహస్యమిదియే (ద్వితీయోపదేశకాండము 34:10, సంఖ్యాకాండము 12:8).


ఇతరుల మీద పెత్తనం చేయుటకుగానీ లేక ఇతరులు మనకు లోబడవలెనని బలవంతపెట్టుట ద్వారాగానీ కాక దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ అధికారముతో చేయవలెను. ఇతరులు మన మాట వినవలెననికాని లేక మనకు లోబడవలెననికాని మనము బలవంతము చేయకూడదు. తన యొక్క ప్రతినిధులను ఎదిరించే వారి విషయములో దేవుడే చూచుకొనును. ప్రభువు యొక్క దాసుడు ఎవరితోనూ జగడమాడకూడదు (2 తిమోతి 2:24, 25). దేవుడే నిన్ను బలపరచినయెడల, నీ పదవిని నీవు ఎందుకు సమర్థించుకోవాలి? దేవుడే నిన్ను సమర్థించి మరియు నీ యొక్క అధికారమును స్థిరపరచును. ఆ విధంగా కాకుండా నీయంతట నీవే అధికారము కలిగియుండవలెనని కోరినయెడల, అది దేవుడిచ్చిన అధికారము కాదు.


''నాయకుడు'' అని మనము పేరు పెట్టుకొనకూడదు (మత్తయి 23:10). ఎఫెసీ 4:13లో చెప్పబడిన రీతిగా ''అపొస్తులులు, ప్రవక్తలు, ఉపదేశకులు మరియు సువార్తికుల వలె ''కాపరులు (పాస్టరులు)'' అనునది ప్రభువు సంఘమునకిచ్చిన వరమే కాబట్టి మనము మనలను ''కాపరులు (పాస్టరులు)'' అని పిలిపించుకొనకూడదు. ఇవి ఒక స్థానిక సంఘములోని పదవులు కాదు గనుక వీటిని మన పేర్లకు ముందుగా పెట్టుకొనకూడదు.


దూషించబడినప్పుడు స్పందించుట:


దూషించబడినప్పుడు కాని లేక దాడిచేయబడినప్పుడుగాని ఒక ఆత్మీయ నాయకుడు తన్నుతాను సమర్థించుకొనుటకాని లేక నిందించుటకాని చేయడు. బైబిలు ఇట్లు చెప్పుచున్నది, ''క్రీస్తే మీ మాదిరి అయియున్నాడు. ఆయన అడుగు జాడలయందు మనము నడుచుకొనవలెను.... ఆయన దూషించబడియు బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవుని చేతులకు తన్నుతాను అప్పగించుకొని యున్నాడు'' (1 పేతురు 2:21, 23 లివింగ్‌ బైబిలు).


అత్యున్నతమైన అధికారం కలిగిన దేవుని కుమారుడు, మనుష్యులతో పోరాడుటను మరియు వారి మీద అధికారం చేయుటకును నిరాకరించియున్నాడు. దేవునిచేత సమర్థించబడి మరియు కాపాడబడుటకు ఆయన దేవునికి అప్పగించికొనియున్నాడు. సంఘములో ఆయన క్రింద కాపరులమైన మనము అదే మార్గములో వెళ్ళెదము. నీవు దేవుని అధికారముక్రింద జీవించుచున్నయెడల, సురక్షితముగా అన్నిటిని ఆయన చేతికి అప్పగించుకొనవచ్చును. నీకు విరోధముగావచ్చే దూషణలను, విమర్శలను మరియు కొండెములను నీవు నిర్లక్ష్యము చేయగలవు. ఎందుకనగా ఇటువంటి దాడులనుండి ఆయన సేవకులను ఆయనే కాపాడునని దేవుడు వాగ్ధానం చేశాడు (యెషయా 54:17). ఎవరైననూ నీ మీద బురద వేసినప్పుడు, దానిని తుడిచివేయుటకు నీవు ప్రయత్నించినయెడల అది నీ బట్టలకు అంటును. కాని నీవు ఆ బురదను అలాగే విడిచిపెట్టిన యెడల, కాలం గడిచే కొలది ఎండి మరియు రాలిపోవును మరియు అక్కడ మరకలు ఉండవు. దూషణను ఈ విధంగా జ్ఞానముతో నిర్వహించవలెను.


ఈనాడు ఆత్మానుసారమైన మనస్సులేని నాయకుల కారణంగా సంఘము నష్టపోవుచున్నది. ఈనాడు అనేకులు పదవులు కలిగి మరియు అధికారము చెలాయించుచున్నారు. కాని నిజమైన ఆత్మీయ నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. ప్రభువైనయేసు తనయొద్దకు వచ్చిన జనసమూహములను చూచి కనికరపడి వారితో యిట్లనెను, ''వారికి పెద్ద సమస్యలుండుట చేత, వారికి ఏమి చేయవలెనో మరియు సహాయము కొరకు ఎవరి యొద్దకు వెళ్ళవలెనో తెలియక యున్నారు. వారు కాపరులు లేని గొఱ్ఱెలవలె ఉన్నారు'' (మత్తయి 9:36 లివింగ్‌ బైబిలు). ఈనాడు కూడా పరిస్థితి ఆ విధంగానే ఉన్నది.


దేవునియెడల భయభక్తులు కలిగి మరియు ఆయన మాట విని వణకు చుంటారో, కాపరి వంటి హృదయమును మరియు దాసుని యొక్క ఆత్మను కలిగిన నాయకులు సంఘములో ఎంతో అవసరమై యున్నది.


విధేయత - సంతోషముగా అంగీకరించాలి మరియు బలవంతము చేయకూడదు:


ఇతరులు మనలను 'గొప్పదైవజనుడుగా' చూచుటకుగాని లేక గొప్ప వారిగా చూచుటకుగాని అనుమతించకూడదు. ప్రజలు ఎల్లప్పుడు మనలను మెచ్చుకొనువారిగా అనుమతించకూడదు. వారు ఎల్లప్పుడు మన సహోదరులైయుండాలి. లేనట్లయితే వారు క్రీస్తును శిరస్సుగా కలిగి యుండనందున ఆత్మీయముగా అభివృద్ధి చెందరు.


మనము ఎవరిని కేవలము మనవైపు ఆకర్షించుకొనకూడదు. కానీ వారు దేవుని యెదుటనే జీవించునట్లు మనం వారిని ప్రోత్సహించాలి. వారు చేసే పనుల విషయములో వారు మన అనుమతిని అడుగనవసరం లేదు. ఎవడైననూ దేవునితో కంటే మనతో ఎక్కువ సంబంధం కలిగియుండవలెనని కోరుచున్నట్లయితే, మనము వెంటనే వారిని దానినుండి విడిపించాలి. మనము ఇతరులకు సలహాలు చెప్పినప్పుడు, వారు దానిని అంగీకరించుటకును మరియు తిరస్కరించుటకును మరియు వారి ఇష్టప్రకారమే చేసుకొనుటకును మనము వారికి స్వాతంత్య్రము ఇవ్వాలి. ఒకవేళ అతడు పొరపాటు చేసినయెడల, ''నేను నీకు ముందుగానే చెప్పియున్నానని ఎప్పుడునూ చెప్పక మరియు వెంటనే అతనికి సహాయపడాలి.


ఒక సంఘపెద్ద సంఘములోని అందరును తనకు విధేయులగునట్లు, దేవుడు పెట్టిన అధికారమునకు లోబడుట ఎంతో ముఖ్యమని వారికి కపటముతో చెప్పకూడదు. ఈ విధముగా చేసినట్లయితే వారు ఆయన చెప్పిన దానిని అంగీకరించకుండా ఉండుటకు ప్రజలు భయపడుదురు. ఇది చెడ్డది. మన జీవితములో ఉన్న దేవునికృపను బట్టియు, మన కుటుంబ జీవితమును బట్టియు మరియు అభిషేకముతో మనము మాటలాడిన మాటలు వారి అవసరములో సహాయపడుటను బట్టి విధేయత చూపించెదరు.


మనము పెద్దలము కాబట్టి ఇతరులు మనకు విధేయత చూపించవలెనని బలవంతము చేసిన యెడల, మనకు దేవుడు తెలియదనియు మరియు మనలో అభద్రత ఉన్నదనియు అది చూపుచున్నది. ఎందుకనగా దేవుడు ప్రజలు తనకు విధేయత చూపుటకును మరియు అవిధేయత చూపుటకును ప్రజలకు స్వాతంత్య్రము ఇచ్చియున్నాడు మరియు మనము దేవునికంటె గొప్పవారము కాదు. కాబట్టి పెద్దలముగా ఎవరైనను మనకు విధేయత చూపించాలని బలవంతం చేయకూడదు. మనము ఇతరుల విధేయతను కోరుటకుకాదుగాని పరిచర్య చేయుటకు పిలువబడ్డాము.


మన యొక్క వ్యక్తిత్వం ద్వారా మనం ఎవరి యొక్క విధేయతను కోరుకొనకుండా జాగ్రత్తపడాలి. ఒక బలమైన మనస్సు గల పెద్ద తన యొక్క వ్యక్తిత్వం ద్వారా సంఘములోనూ ఇతరుల మీద ఆధిపత్యం కలిగియుండుట చాలా సులభము! అది మానసికమైనది మరియు చెడ్డది. అటువంటి స్వంత శక్తిని మనం చంపాలి. సంఘములో అందరు మనతో మంచి సహవాసం కలిగి మరియు మనలను బట్టి భయపడకూడదు.


అక్షరానుసారమైన అధికారము మరియు నిర్జీవ క్రియలు:


సంఘములో అనేక భారమైన నియమనిబంధనలు సహోదర, సహోదరీల మీద పెట్టి ఒక నియంతవలె సంఘమును నడిపించకూడదు. దానివలన సంఘము అక్షరానుసారమైన ఒక క్లబ్‌వలె మార్చబడినందు వలన, సహోదర సహోదరీలు సంతోషముగా సహవాసము చేయలేరు. దానికి బదులుగా అన్ని విషయములలో మనకు లోబడే శరీరానుసారమైన వారు సంఘములో అధికారం పొందెదరు.


అనేకనియమములు పెట్టుట ద్వారా మనము పరిశుద్ధతను తయారుచేయలేము. మనము వాక్యమును బోధించాలి కానీ ఒక ప్రత్యేకమైన పద్ధతికి ప్రజలు కట్టుబడి ఉండాలని బలవంతము చేయకూడదు. వ్యక్తిగతముగా ఒప్పుదల లేకుండా, కేవలం మనలను సంతోషపెట్టుటకు చేసే క్రియలు, అవి మనుష్యుల దృష్టిలో ''నీతిగలవియు'' మరియు మంచివియు అయినప్పటికిని అవి నిర్జీవక్రియలై యున్నవి.


ఒకరి మనస్సాక్షిని సమాధానపరచుకొనుటకును లేక ఇతరులను సంతోషపెట్టుటకు గానీ చేసే క్రియలన్నియు నిర్జీవక్రియలై యున్నవి. నిర్జీవ క్రియలన్నింటిని దేవుడు అంగీకరించడు. కేవలం ఆయనను సంతోషపెట్టుటకు చేయు క్రియలను మాత్రమే దేవుడు అంగీకరించును. సహోదర సహోదరీలు అటువంటి క్రియలను చేయుటకు, ఏదేను తోటలో ఆదాము, హవ్వలకు దేవుడు స్వాతంత్య్రము ఇచ్చినట్లే మనము వారికి స్వాతంత్య్రము ఇవ్వాలి. క్రైస్తవ నాయకులకు భయపడుట ద్వారా మాత్రమే కాదు గానీ దేవుని భయముతో మాత్రమే నిజమైన పరిశుద్ధత పరిపూర్ణమగుచున్నది (2 కొరింథీ 7:1).


తండ్రిలాంటి హృదయమును కలిగియుండవలెను:


మనకున్న పదవినిగాని లేక ''పెద్ద'' అనే బిరుదునుగాని మనం ప్రేమించకూడదు. మన సహోదర సహోదరీల కంటే ఏ విషయములోనైననూ మనం గొప్పవారమని ఎంచుకొనకూడదు, నిజానికి సంఘములోని అందరిని మనకంటె యోగ్యులని ఎంచుకొనవలెనని ఆజ్ఞాపించబడితిమి (ఫిలిప్పీ 2:3).


దేవుడు ఇతరులకు పరిచర్యనుఇచ్చి మరియు సహోదరులు మనకంటె అతని మీద నమ్మిక యుంచినయెడల, ఇది దేవునికార్యమని మనం గుర్తించి మరియు అభిషేకం కలిగిన వారికి సంఘములో అధికప్రాధాన్యం ఇవ్వాలి. లేనట్లయితే మనం దేవునికే విరోధముగా పోరాడినవారమగుదుము.


ఒక నిజమైన ఆత్మీయతండ్రి తనయొక్క పిల్లలు అతని కంటె గొప్ప ఆత్మీయులు కావాలని ఆశపడును. ఇతరుల యెడల మనకు అటువంటి కోరికలేనట్లయితే మనము ఆత్మీయతండ్రులము కాదు. అప్పుడు మనము పెద్దలముగా ఉండుటకు అర్హులము కాదు. మన ప్రాంతములో క్రీస్తుయొక్క శరీరమై యున్న స్థానిక సంఘము నిర్మించబడుటకు మనము అభ్యంతరముగా ఉందుము.


చలింపబడే దానంతటిని దేవుడు చలింపజేయును:


మన బైబిలు జ్ఞానము, మనం బోధించగలుగుట మరియు ఇతరులను ప్రభావితం చేయగల మన వ్యక్తిత్వం బట్టి, దేవుడు మనలను బట్టి సంతోషించుచున్నాడని కాదు. దేవుడు ఎంతో దీర్ఘశాంతము గలవాడు గనుక తీర్పు తీర్చుటకు ముందుగా ఎంతో కాలము వేచియుంటాడు.


కొందరు పెద్దలు వారి యొక్క అధికారముతో కూడిన వైఖరి మరియు సంఘములోని స్నేహితుల యెడల వారికున్న పక్షపాతము మొదలగునవి వారిలో ఉన్నప్పటికి బాగానే ఉన్నామని అనుకొనుచున్నారు. కాని ప్రభువు ప్రతి దానిని జాగ్రత్తగా చూచి మరియు అన్ని విషయములను లెక్క రాయుచున్నాడు. మరియు ఆయన సమయము వచ్చినప్పుడు ఆయన స్పందించును. అప్పుడు వేషధారులుగాను లేక సంఘముల నియంతగా ఉన్నవారిని లేక మొదలగువాటిని చేయు పెద్దలను ఆయన కనికరించడు. దేవునికి పక్షపాతం లేదని ఆ దినమందు తెలుసుకొనెదము. కాబట్టి, ''తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను'' (1 కొరింథీ 10:12).


''ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడును'' (హెబీ 12:27) లో చెప్పబడింది.


ఈనాడు క్రైస్తవ్యంలో, గొప్ప బోధకులు పాపములో పడుటయు, మరియు క్రొత్త నిబంధనను అనుసరించుచున్న సంఘములు కూడా విభజింపబడుచూ మరియు కదిలింపబడుచున్నవి. ఈనాడు జరుగుచున్న వీటన్నిటిమధ్యలో అనగా క్రైస్తవత్వంలో ఉన్న లోకత్వము మరియు రాజీపడుట మరియు అక్షరానుసారత మరియు పరిసయతత్వము, మనము చలించబడని క్రీస్తు శరీరము నిర్మించబడవలెనని మనము కోరిన యెడల ''దేవుడు దహించుఅగ్ని కనుక మనము దైవకృప కలిగి భయభక్తులతో పరిచర్య చేయాలి''.


అనుమతించుట అనే పాపము:


ఒక విశ్వాసి మంచిఉద్దేశ్యము కలిగినప్పటికినీ సంఘములో కూర్చుని తీర్పు తీర్చుటకు అనుమతించకూడదు. ఏ కారణంచేతనైననూ అతడు సంఘములో సంతోషముగా లేనట్లయితే, అతడు ఆ సంఘమును విడిచిపెట్టి మరియు వెళ్ళి వేరొక సంఘములో చేరవలెను.


ఒక ఉదాహరణను గమనించెదము. ప్రత్యక్ష గుడారము లేవీ గోత్రపు వారైన లేవీయులు మాత్రమే పరిచర్య చేయాలి. దానిని కాపాడవలెనని మంచి ఉద్దేశ్యముతో లేవీయుడు కాని ఉజ్జా దేవుని మందసమును ముట్టినప్పుడు దేవుడు అతనిని మొత్తగా అతడు చనిపోయెను (2 సమూయేలు 6:6, 7). ఈ సంఘటన నుండి మనము ఏమి నేర్చుకొనగలము?


సంఘము ప్రభువు యొక్క సొత్తయి ఉంది కనుక అభిషేకించబడిన ఆయన దాసుల ద్వారా ఆయన మాత్రమే తీర్పు తీర్చగలడు మరియు సరిదిద్దగలడు. ప్రకటన 2 మరియు 3 అధ్యాయములలో అపొస్తలుల ద్వారా సంఘపెద్దలకు, సంఘములకును ఆయన యొక్క హెచ్చరికలు పంపించాడు.


కాబట్టి సంఘము కూలిపోవుచున్నదని ఒకడు తలంచిననూ, సంఘమునకు తీర్పుతీర్చుటకు గాని దిద్దుబాటు చేయుటకు గానీ ప్రభువు నొద్దనుండి అధికారం పొందని వ్యక్తి దానిని చేయకూడదు. అటువంటి ఉజ్జాల సహాయము లేకుండానే దేవుడు తన సంఘమును కాపాడగలడు!


వ్యక్తిగతముగా తనకు విరోధముగా ఎవరైననూ పాపము చేసినయెడల ఒక విశ్వాసి అతనిని గద్దింపవచ్చును (లూకా 17:3, మత్తయి 18:15). కాని ఒక వ్యక్తికి దేవుడు సంఘములో బాధ్యత ఇవ్వనియెడల, అతడు స్థానిక సంఘమును తీర్పుతీర్చకూడదు. మన సంఘములో ఉన్న ప్రతిఒక్కరూ ఈ విషయములో వారి పరిధిలో ఉండాలి. విశ్వాసులు తీర్పు తీర్చి మరియు స్థానిక సంఘములో పొరపాట్లు కనుగొనిన యెడల, దీనిని బట్టి వారికి దేవుని భయము లేదని తెలియుచున్నది. వారు ఉజ్జాలైయున్నారు. మరియు ఏదొక విధముగా దేవుడు వారిని శిక్షించును. ఆ సంఘమును విడిచిపెట్టుట వారికి ఎంతో క్షేమకరము.


ఎక్కువ మంది సాధారణముగా తప్పుచేయుదురు:


దేవుని వాక్యమునకును మరియు ప్రభువైన యేసు చెప్పిన దానికి విరుద్ధముగా బోధించేవారితో మనము సహవాసం కలిగియుండలేము. దేవుడు లేకుండా అనేకమందితో కలసియుండుట కంటే దేవునితో కలసి ఒక్కరిగా ఉండుట మేలు.


క్రైస్తవ్యంలో సాధారణముగా ఎక్కువమంది తప్పుచేయుదురు.


దేవుని వాక్యములో దీని గురించి ఐదు ఉదాహరణలు చూడగలము.


1. అనేకులు దూడను ఆరాధించునప్పుడు, దేవునివైపు ఎవరు ఉండెదరని మోషే అడిగినాడు. లేవీ గోత్రపువారు మాత్రమే అతనితో నిలచియున్నారు. అందువలన వారికి యాజత్వము ఇవ్వబడింది (నిర్గమకాండము 32:26). పదకొండు గోత్రముల వారు తప్పు చేసియున్నారు


2. కానాను దేశమునకు 12మంది వేగులవారిని పంపినప్పుడు వారిలో పదిమంది అవిశ్వాసులుగా ఉన్నారు (సంఖ్యాకాండము 13,14 అధ్యాయాలు). కాని యెహోషువ మరియు కాలేబుతో దేవుడు ఉన్నాడు. వారిలో అనేకులు తీసుకొనిన నిర్ణయమును బట్టియు మరియు వారి అవిధేయతను బట్టియు 600000 మంది అరణ్యములో మరణించారు.


3. అభిషేకము పొందిన దావీదుమీద దాడిచేయవలెనని సౌలు తీసుకొనిన నిర్ణయము ఎంతో ఆపదను తెచ్చింది. ఇశ్రాయేలీయులలో అనేకులు సౌలు పక్షముగా ఉన్నారు. కాని దేవుడు దావీదుతో ఉన్నాడు (1 సమూయేలు 16). దావీదును వెంటాడిన అబ్షాలోముతో ఇశ్రాయేలీయులు అనేకులు ఉన్నారు. కాని దేవుడు దావీదుతో ఉన్నాడు (2 సమూయేలు 15).


4. ప్రభువైన యేసును విసర్జించవలెనని యూదులు తీసుకొనిన నిర్ణయమును బట్టి వారు 1900 సంవత్సరముల నుండి చెల్లాచెదురుగా ఉన్నారు. అనేకులు యూదుల పక్షమునను మరియు పరిసయ్యుల పక్షమునను ఉండిరి. కాని దేవుడు ప్రభువైన యేసుతో ఉండి ఆయనను మృతులలో నుండి లేపెను.


5. పౌలు యొక్క జీవితాంతమున, అతని యొక్క స్నేహితులు అనేకులు అతనిని విడిచిపెట్టియున్నారు. కాని ప్రభువు పౌలుతో అంతము వరకు ఉన్నాడు (2 తిమోతి 1:15, 4:16 - 18).

అధ్యాయము 10
దేవునిమీద సంపూర్ణముగా ఆధారపడి ఆయనను సేవించుట

మతానుసారమైన క్రైస్తవ్యమునకు మరియు దేవుని వాక్యమునకును దుర్నీతి మరియు నీతిని గురించిన అభిప్రాయములో చాలా తేడా ఉంది. పాపమును చేయువారిని మతానుసారమైన క్రైస్తవులనియు, దుష్టులనియు మరియు మంచి క్రియలను చేయుచూ, సంఘమునకు వెళ్ళుచూ మరియు బైబిల్‌ చదివి ప్రార్థించే వారిని నీతిమంతులని భావించెదరు.


కాని ''తమ్మునుతామే నమ్ముకొని ఓడిపోయే వారిని దుష్టులనియు మరియు దేవునిని మాత్రమే నమ్ముకొని జీవించువారు నీతిమంతులనియు'' దేవుని వాక్యము చెప్పుచున్నది (హబక్కూకు 2:4 లివింగు బైబిలు). తన్నుతానే నమ్ముకొనువాడు దుష్టుడైయున్నాడు. మరియు దేవునిలో మాత్రమే నమ్మకముంచువాడు నీతిమంతుడై యున్నాడు.


ఏదేను తోటలో దేవుడు ఆదాము యెదుట ఉంచిన రెండు వృక్షములు దీనికి సూచనగా ఉన్నవి. అవి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, జీవవృక్షము. మంచి చెడుల గురించి జ్ఞానము కలిగియుండి మరియు వాటిగురించి నీవే నిర్ణయించుకొనుట. నీలోనీవే నమ్మకము కలిగి జీవించుటయై యున్నది లేక దేవుడే నీకు మంచి చెడులను గురించి చెప్పునట్లు నీలో దేవుని జీవమును కలిగియుండుట. ఆ విధముగా దేవునియందు నమ్మిక యుంచి జీవించాలి.


''దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన మనుష్యుడు జీవించునని'' ప్రభువైన యేసు చెప్పారు(మత్తయి 4:4). ఎల్లప్పుడు దేవునిస్వరమును వినుచు మరియు ఆయన చెప్పిన దానినిబట్టి జీవించుటయే క్రొత్త నిబంధన యొక్క సారాంశం. మంచి చెడులను నిర్ణయించుకొనుచు అనగా మంచిచెడుల వృక్షముపై ఆధారపడి జీవించుట మరొక విధానమైయున్నది. ఈ వృక్షము ద్వారా అతడు మనుష్యుల దృష్టికి నీతిమంతుడై జీవించవచ్చును. కాని దేవుని దృష్టిలో ఇది సరియైనది కాదు. ఎందుకనగా ఇది విశ్వాసము ద్వారా ఎల్లప్పుడు దేవుని మీద ఆధారపడి జీవించుటకు సాదృశ్యమైయున్న జీవవృక్షము కాదు (పక్రటన 3:2).


హృదయము యొక్క సున్నతి:


పాత నిబంధనలో ఉన్న అనేక ఆచారములు క్రొత్త నిబంధనలో నేరవేర్చబడియున్నవి. పాత నిబంధనలో సున్నతి ఒక ముఖ్యమైన ఆచారము. కాబట్టి క్రొత్త నిబంధనలో ఖచ్చితముగా దీనికి ఆత్మీయ అర్థము ఉన్నది.


ఫిలిప్పీ 3:3, 4లో ''శరీరమును ఆస్పదము చేసికొనక అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము, యేసునందు మహిమయు, శరీరమునందు నమ్మిక ఉంచక యుండుటయు''. ఇవి ఒకదానికొకటి సంబంధము కలిగియున్నవి. క్రీస్తుయేసునందు మాత్రమే అతిశయించుటయే ఆత్మలో ఆరాధించుట మరియు మనము శరీరమును ఆస్పదము చేసుకొనకుండా జీవించెదము.


పాత నిబంధనలో కొంచెం శరీరమును కత్తిరించుట ద్వారా సున్నతి చేసెడివారు. కాని మన స్వజీవమును ఉపేక్షించుకొని మరియు చంపుటద్వారా ఆత్మీయ సున్నతిని పొందుదము. పాత నిబంధనలో సున్నతి పొందనివారు ఇశ్రాయేలీయులతో పాలిభాగస్తులు కారు (ఆదికాండము 17:14). క్రొత్త నిబంధనలో తన శరీరమును ఆస్పదము చేసుకొనువాడు ఎవడును ప్రభువైనయేసుక్రీస్తుయొక్క నిజమైన సంఘములో పాలిభాగస్తుడై యుండడు. క్రీస్తులో మాత్రమే అతిశయించుచూ మరియు ఎవరికైతే తమ మీద తమకు నమ్మకము ఉండదో వారే నిజమైన సంఘము. ఇతరులు సంఘమును నిర్మించిన దానికంటె మనము శ్రేష్ఠముగా సంఘమును నిర్మించియున్నామని అతిశయించినయెడల దేవుని నిజమైన సంఘములో మనకు స్థానము ఉండదు.


తమ స్వహస్తములతో చేసిన దానినిబట్టి అతిశయించువారిని గురించి అపొ.కా. 7:41లో చెప్పబడియున్నది. మనము సాధించిన దానిని బట్టి గర్వించినట్లయితే, మనము ఆత్మీయ సున్నతి పొందలేదు. నీ స్వంత శక్తితో నీవు సాధించితివని అనుకొనినట్లయితే, అప్పుడు నీ విశ్వాసం ఓడిపోయింది. అప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడుటయే నిజమైన విశ్వాసమని నీవు నేర్చుకొనునట్లు, రాత్రంతయు పట్టినను ఒక్క చేప కూడా దొరకకుండా దేవుడు ప్రేమతో చేయును (యోహాను 21:3).


ఒకరోజు నెబుకద్నెజరు తన రాజధానియగు బబులోను నగరునందు సంచరించుచుండగా, తాను కట్టించిన బబులోను రాజ్యమును బట్టి అతిశయించాడు (దానియేలు 4:29, 30). ఆవిధముగా అతడు తలంచిన వెంటనే దేవుడు అతని రాజ్యమును అతని యొద్దనుండి తీసివేసి మరియు అతనిని జంతువుగా మార్చెను. మరల అతడు రాజు అగుటకు చాలా సంవత్సరములు పట్టింది. దేవుని కొరకు తాను సాధించిన దానిని బట్టి అనేకులు అతనివలె గర్వించుదురు. కాని చివరకు నెబుకద్నెజరు తన యొక్క బుద్ధిహీనతను బట్టి మారుమనస్సు పొంది మరియు దేవునిని మహిమపరిచాడు (దానియేలు 4:34 - 36). ఆవిధముగా అతడు హృదయములో సున్నతి పొందియున్నాడు. అనేకమంది క్రైస్తవనాయకులు ఆత్మీయ సున్నతి పొందకపోవుట చాలా బాధాకరమైనది.


మనము దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించునట్లు మనము హృదయములో సున్నతి పొందవలెనని దేవుడు కోరుచున్నాడు (ద్వితీయో.30:6). ఇదియే హృదయము యొక్క సున్నతికి గుర్తు. మనలను మనమే ప్రేమించుకొనుచు మరియు మనలను బట్టి గర్వించినట్లయితే అది సున్నతి కాదు.


దేవుని యొక్క అవసరము - మానవుని యొక్క అవసరము కాదు:


ప్రభువు కొరకు నీవు చేసే పరిచర్యను బట్టి నీవు గర్వించనారంభించినట్లయితే, దేవుడు నీకు అనుగ్రహించిన వరమును నీవు కలిగి యున్నప్పటికిని పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉండదు. పరిపూర్ణమైన దూతగా సాతాను సృష్టించబడినప్పుడు దేవుడు తనకిచ్చిన వరములను ఇప్పటికి కలిగియున్నాడు. కాని తనకు ఒకప్పుడు ఉన్న అభిషేకాన్ని ఇప్పుడు పోగొట్టుకొనియున్నాడు (యెహెజ్కేలు 28:14 - 18).


అప్పుడు నీవు చేసే క్రైస్తవ పరిచర్య, కేవలం మనుష్యులకే కాని దేవునికి చేసే పరిచర్య కాదు. ఈ రెండు పరిచర్యల మధ్య ఉన్న తేడాను మనం గుర్తించాలి. చాలా మంది నాయకులు ప్రజల యొక్క అవసరమునుచూచి మరియు వారి అవసరమును తీర్చవలెనని కోరి మరియు దేవునికి గొప్ప పరిచర్య చేయుచున్నామని తలంచుచున్నారు. కాని వారి మనస్సులు దేవుని యొక్క అవసరంపైన కాక మానవుని యొక్క అవసరం మీద కేంద్రీకృతమైయున్నది. రక్షించబడుట, స్వస్థత పొందుట, విడుదల పొందుట మొదలగునవి మానవుని యొక్క అవసరమైయుండవచ్చును. ప్రభువైన యేసు ప్రార్థించుట నేర్పినట్లుగా దేవుని నామం మహిమ పరచబడుటయు, దేవుని రాజ్యము మనలోనికి వచ్చుటయు మరియు పరలోకంలో తండ్రి చిత్తం నెరవేరుచున్నట్లు భూమిమీద కూడా నెరవేరుటయు దేవుని యొక్క అవసరమైయున్నది (మత్తయి 6:9, 10). దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థించిన తరువాత మా అనుదిన ఆహారము మాకనుగ్రహించుము అని ప్రార్థించుట చాలా మంచిది. ఈ పరిచర్య కేవలం మానవుని అవసరం తీర్చినట్లయితే, అది శక్తిలేనిదిగాను, శూన్యముగాను మరియు మనుష్యుని కేంద్రముగా చేసుకొనిన పరిచర్యగా ఉండును.


మనసంఘములో కేవలం మనుష్యుల అవసరం తీర్చబడుటయే గాక ప్రాముఖ్యముగా ప్రభువైన యేసునామము మహిమ పరచబడునట్లు మనము ప్రార్థించాలి. మనం చేసే సత్క్రియలద్వారా దేవుని నామం మహిమ పరచబడుట ద్వారా మన వెలుగు ప్రకాశించునని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 5:16). మన హృదయములలో సున్నతి జరిగినప్పుడు, దేవుడే మహిమ పరచబడవలెనని మనము కోరుదుము. ఆత్మీయముగా సున్నతి పొందనివాడు మనుష్యుల యొక్క ఘనతను కోరును. అతడు వాక్యము పంచుకొనుట ద్వారా ఆశీర్వదించబడియున్నామని ప్రజలు చెప్పినప్పుడు అతడు గర్వించుటకు ఆరంభించును.


ఇశ్రాయేలీయులు దేవుని కార్యములను మాత్రమే చూశారు. కాని మోషే దేవుని మార్గములను కూడా చూశాడు (కీర్తన 103:7). ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులు దేవుని కార్యములను బట్టి సంతోషించుచున్నారు. ప్రజలు రక్షింపబడుట మరియు స్వస్థత పొందుట మొదలగునవి జరుగుట చూచి వారు ఆనందించుచున్నారు. కాని దేవునినామం మహిమపరచబడవలెనని వారు కోరుటలేదు.


దేవునినామం పరిశుద్ధపరచబడవలెనని మన హృదయమంతటితో కోరుకొనవలెను. ప్రభువు యొక్క నామం మనలోను మనద్వారాను మహిమపరచబడవలెనని మొదటిగా ప్రార్థించాలి. స్వస్తత కొరకు లేక ఆర్థికఇబ్బందులగురించి, కుటుంబసమస్యల గురించి మొదలగు వాటి గురించి మొదటిగా ప్రార్థించకూడదు. ఇతరులు మనకు అనేక సమస్యలు కలిగించుచున్నప్పటికిని, దాని యొక్క పరిష్కారము రెండవదిగా ఉండాలి. దేవుడు మహిమపరచబడుటయే మన గురియైయుండాలి (1కొరింథీ 10:31). అప్పుడు మన సమస్యలన్నింటిని దేవుడు పరిష్కరించును. కాని ఈ విధముగా మనము ఆలోచించుటకు మన హృదయములో సున్నతి జరుగవలసియున్నది.


మానవునియొక్క అవసరం చూచి ప్రభువైనయేసు పరలోకంనుండి దిగివచ్చియున్నాడని అనేకులు తలంచుచున్నారు. కాని తన తండ్రి పంపినప్పుడు మాత్రమే ఆయన వచ్చియున్నాడు. ఆదాము పాపము చేసిన తరువాత 4000 సంవత్సరములు ఆయన పరలోకములో వేచియున్నాడు. కాని ఆదాము పాపము చేసిన వెంటనే ప్రభువైన యేసు భూమిమీదకు దిగివచ్చియుంటే బాగుండునని మనము అనుకొనుచున్నాము. కాని దేవుడు ప్రతిదానిని సరియైన సమయములో చేస్తాడు.


జనసమూహములు కాపరులు లేనివారిగా ఉండటం ప్రభువు చూచినప్పుడు, మీరు వెళ్ళి వారి అవసరం తీర్చమని తన శిష్యులతో చెప్పలేదు. కోతవారిని పంపమని తండ్రిని వేడుకొనమని చెప్పారు (మత్తయి 9:36 - 38). తండ్రి మాత్రమే నిజమైన కాపరులను పంపగలడు. ఈనాడు ప్రజలయొక్క అవసరంచూచి మరియు దేవునియొద్ద వారి పిలుపు గురించి కనిపెట్టకుండా వెంటనే వెళ్ళి పరిచర్య చేయవలెనని క్రైస్తవ్యంలోని అనేకులు ఇతరులను ప్రోత్సహించుచున్నారు. ఇది చాలా వేరుగా ఉన్నది. కాబట్టి ఈనాడు దేవుని పరిచర్యలో కలవరము మరియు గందరగోళము ఉన్నది.


పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట:


సంఘములను నిర్మించి మరియు దేవుని కొరకు వారి జీవితములో ఎంతో నెరవేర్చిన దైవజనులను గురించి మనం చదివినట్లయితే, వాక్యమనే విత్తనమును విత్తుటకును లేక పంట కోయుటకును వారు దేవుని చేత పంపబడి మరియు ఆయన పంపిన స్థలములకే వెళ్లియున్నారు. ఆవిధంగా వారి జీవితంలో దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చియున్నారు.


మనము అనేక పరిచర్యలను చేయుటకు ప్రయత్నించి మరియు అవి మన జీవితములో దేవుని చిత్తం కాదని తరువాత తెలుసుకొని పశ్చాత్తాపపడక మన సమయమును వృథాచేయకయుందుము. ఆ విధముగా మనము ఓడిపోకుండా ఉండుటకు, మన పరిచర్యలో దేవుని చిత్తమేమిటో తెలుసుకొనే అలవాటును కలిగి మరియు ఆయన చెప్పిన విధంగా ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిచర్య చేయాలి. మనము ప్రజలచేత గాక దేవునిచేత పంపబడాలి.


ఆయన యెదుట సహనముతో కనిపెట్టుచు ఆయన స్వరము వినువారితోనే దేవుడు మాట్లాడును. దేవుడు ప్రతి దినము మాట్లాడుననియు మరియు ఆయన మాట్లాడినప్పుడు అద్భుతములు జరుగుననియు బైబిలులోని మెట్టమొదటి అధ్యాయము చెప్పుచున్నది. ఈనాడు కూడా ప్రతిదినము ఆయన స్వరమును వినుటతో ఆరంభించవలెననియు మరియు ఆయన స్వరమును వినుచు ఉండవలెననియు దేవుడు కోరుచున్నాడు. ''శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతియుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు'' (యెషయా 50:4). దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటను మనము ఎల్లప్పుడు వినుటద్వారా మాత్రమే మనము దేవుని కొరకు జీవించగలము (మత్తయి 4:4).


పౌలు గలతీయ మీదుగా ఆసియా మైనరు వెళ్ళుచుండగా అతడు ఆసియా వెళ్ళకుండునట్లు పరిశుద్ధాత్ముడు ఆపియున్నాడు (అపొ.కా. 16:6). తానెక్కడికి వెళ్ళవలెనో తెలుసుకొనుటకు పౌలు ఎల్లప్పుడు దేవుని నడిపింపును కోరియున్నాడని మనము ఇక్కడ చూడగలము. ఆ విధముగా అతడు దేవుని చిత్త ప్రకారము ఒక స్థలమునుండి మరొక స్థలమునకు వెళ్ళి తనజీవితంలో ఎంతో పరిచర్య చేసాడు. ఆ విధముగా గలతీయ ప్రాంతములో కొంత కాలముండుటకు నడిపించబడ్డాడు. ఆవిధముగా దైవజనులు దేవునిచేత నడిపించబడతారు (కీర్తన 37:23).


పరిశుద్ధాత్ముడు పౌలుకు అనారోగ్యము అనుమతించుట ద్వారా అతడు గలతీయకు వెళ్ళకుండా ఆటంకపరచబడ్డాడని గలతీ పత్రికలో చదువుతాము (గలతీ 4:13). దేవుని మార్గములు ఆశ్చర్యకరములు. పౌలు అనారోగ్యంతో ఉన్నప్పటికిని గలతీయులు అతనిని దేవుని యొక్క ప్రవక్తగా అంగీకరించారు (గలతీ 4:14). ఒక దేవుని సేవకుడు అనారోగ్యం పాలైనట్లయితే అతని జీవితంలో ఒప్పుకొనని పాపము గాని లేక స్వస్థత పొందుటకు తగిన విశ్వాసము అతనిలో లేదనియు గర్విష్ఠులైన అనేకమంది క్రైస్తవులు తీర్పుతీర్చుదురు కాని దీనులైన గలతీయులు పౌలును ఆవిధముగా తీర్పు తీర్చలేదు. పౌలు కూడా తన అనారోగ్యము గురించి ఫిర్యాదు చేయలేదు. ఆవిధంగా అతడు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చాడు. పౌలువలె మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొనిన యెడల, మన జీవితములలో దేవునియొక్క పరిపూర్ణ చిత్తము నెరవేర్చునట్లు మనకున్న రోగములను కూడా దేవుడు వాడుకొనగలడు.


అపొ.కా. 16:10లో, ''వారు'' అనునది ''మనము'' అనునది అకస్మాత్తుగా మార్చబడెను. అక్కడే డాక్టరును మరియు అపొస్తలుల కార్యములు వ్రాసిన లూకా పౌలుతో కలిసియున్నాడు పౌలు రోగముతో ఉండెను కాని అతడు బీదవాడైనందున డాక్టరు యొద్దకు వెళ్ళలేకపోయెను. కాబట్టి అప్పటి నుండి పౌలుతో ప్రయాణించుటకు దేవుడు డాక్టరు లూకాను అతని యొద్దకు పంపించాడు. దేవుని మీద పూర్తిగా నమ్మకముంచి మరియు తమ మీద తమకు నమ్మకములేని తన దాసుల యొక్క ప్రతి అవసరమును ప్రభువు తీర్చును.


మన అంతరంగ జీవితంనుండి పరిచర్య ప్రవహించాలి:


మనము ప్రత్యక్షతను కోరుచున్నట్లయితే లేఖనములలో మనకు ఎంతో ప్రోత్సాహమున్నది. లేఖనములలోని అమూల్యమైన ఐశ్వర్యములు పై భాగమున లేవు. మనము లోతుగా త్రవ్వి ప్రత్యక్షత కొరకు పరిశుద్ధాత్మకు మొఱ్ఱపెట్టిన యెడల వాటిని కనుగొనెదము (సామెతలు 25:2).


యేసులోని ప్రతి విషయమును మనకు బయలుపరచి మరియు వాటిని మనలోనికి తెచ్చుటకు పరిశుద్ధాత్ముడు వచ్చియున్నాడు (యోహాను 16:14). ప్రభువైన యేసు రోగములను స్వస్థపరచుట లేక దయ్యములను వెళ్ళగొట్టుట గురించి కాదు. ఈ సంగతులను చూచుటకు ఆత్మ యొక్క ప్రత్యక్షత అవసరంలేదు. ప్రభువైన యేసు యొక్క అంతరంగ జీవితమును మరియు వైఖరిని మనకు చూపించుటకు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చియున్నాడు. ఉదాహరణకు ప్రభువైన యేసు వారితో ఉన్న మూడున్నర సంవత్సరములు ఆయన ఎల్లప్పుడు వారివలె అన్ని విషయములలో శోధింపబడి కూడా ఆయన పాపము చేయలేదని వారికి తెలియదు. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఈ ప్రత్యక్షతను పొందియున్నారు.


ప్రభువైన యేసుయొక్క పరిచర్య అంతయు ఆయన అంతరంగ జీవములోనుండి ప్రవహించెను. మనము కూడా దేవునితో నడుచుట ద్వారానే ఆవిధమైన పరిచర్య చేయగలము. లేనట్లయితే మన పరిచర్య కేవలం బాహ్యమైనదిగా ఉంటుంది. అనేకమంది విశ్వాసులు, ప్లైవుడ్‌ మీద టేక్‌ వెనిగర్‌ అనే రంగువేసినట్లుగా పైకి మంచిగా కనబడెదరు. వెనిగర్‌ మీద గీత గీసినప్పుడు మనకు ప్లైవుడ్‌ కనిపించినట్లే వీరిని విసిగించినప్పుడు వారిలో ఉన్నది బయటకువచ్చును. కాని దేవుడు మనలో పనిచేసినప్పుడు అది మన అంతరంగమంతటిలోనికి వెళుతుంది. దేవుడు మన హృదయములో సున్నతి చేయును. అప్పుడు మనము నిజముగా పరిశుద్ధులమై యుందుము.


దేవుని యెదుట రహస్యజీవితం:


క్రొత్త నిబంధనలో విశ్వాసమనగా దేవునియందు విశ్వాసముంచి మరియు దేవుని మహిమపరచి మరియు మనలో మనకు నమ్మకము లేకపోవుట. కొందరు మనుష్యుల యొక్క ఘనతను కోరుదురు గనుక వారిలో విశ్వాసములేదని ప్రభువైనయేసు చెప్పారు (యోహాను 5:44).


ఒక సంఘములోని ఇద్దరు సహోదరులు, పైకి దీనులైయుండి మరియు మంచి కార్యములు చేయవచ్చును. కాని అందులో ఒకరు మాత్రమే దేవుని ముఖముయెదుట జీవిస్తూ, ప్రభువైన యేసును మాత్రమే చూచుచు మరియు తననుతాను తీర్పు తీర్చుకొనుచున్నాడు. తనకు తానుగా ఏమియు చేయలేనని ఎరిగి మరియు పూర్తిగా ప్రభువు మీద ఆధారపడును. మరొక సహోదరుడు పైకి దీనుడుగా కనబడినప్పటికి తన మీద తనకు ఎంతో నమ్మకముకలిగియుండి మరియు ఇతరులకంటె తాను శ్రేష్టమైనవాడనని అనుకుంటాడు. మొదటిసహోదరుని యొక్క పరిచర్య విశ్వాసము కలిగియుండి మరియు నిత్యత్వానికి నిలుచును. రెండవ సహోదరుని యొక్క పరిచర్య భూమితో పాటు నశించును.


కాబట్టి దేవునిముఖము యెదుటనే జీవించాలి మరియు ప్రభువైన యేసుతో తప్ప మరెవరితోనైనను మనం పోల్చుకోకూడదు. ''ఎవరైతే ఇతరులతో పోల్చుకుంటారో వారు ఆత్మీయముగా బుద్ధిహీనులైయుంటారు'' (2 కొరింథీ 10:12).


ఏలీయా దేవునియెదుట నిలువబడి మాట్లాడెను (1 రాజులు 17:1). మనము ప్రభువు యెదుట మాత్రమే నిలువబడి మాట్లాడినట్లయితే, అప్పుడు ప్రజలను సంతోషపెట్టుట కొరకు మాట్లాడము.


ఇశ్రాయేలీయులు పడిపోయినప్పుడు, సున్నతిలేని ప్రజలను తన పరిశుద్ధ స్థలములోనికి అనుమతించిన లేవీయులు అప్పటినుండి దేవునికి కాక ప్రజలకు మాత్రమే పరిచర్యచేయుటకు అనుమతించబడ్డారు (యెహెజ్కేలు 44:6 - 14). వారికమీదట దేవునికి పరిచర్య చేయకుండునట్లు శిక్షింపబడ్డారు.


కాని సాదోకు సంతతివారు ఇతరుల వలె పడిపోలేదు కనుక దేవునికి పరిచర్య చేయుటకు అనుమతించబడ్డారు (యెహెజ్కేలు 44:15). ప్రజలకు పరిచర్యచేయుటకును మరియు దేవునికి పరిచర్య చేయుటకును చాలా తేడా ఉన్నది.


పరిశుద్ధస్థలంలో సాదోకు సంతతివారు దేవునికి పరిచర్యచేసిన తరువాత వారు ప్రజలలోనికి వెళ్ళినప్పుడు వారియొక్క ప్రతిష్ఠిత వస్త్రములను తీసివేయాలి (యెహెజ్కేలు 44:19). ప్రజలు ఆ వస్త్రములను చూడకూడదు. మన అంతరంగ జీవితంలో మనలో ప్రభువు వ్యవహరించిన విషయములను ఇతరులకు చూపించకూడదు. మనము ఉపవాసము ఉండినప్పుడు, ఆ విషయము ఇతరులకు తెలియకూడదు (మత్తయి 6:17, 18). దేవునితో మనం నడిచిన రహస్యజీవితం ఇతరులకు చెప్పుట ద్వారా వారిని పరిశుద్ధులుగా చేయలేము. హృదయములలో సున్నతి పొందినవారు మాత్రమే పరిశుద్ధులు కాగలరు.


విశ్వాసమూలముగా జీవించేవారు దేవునితో రహస్యముగా జీవించెదరు. ఎవరైననూ వారిని మెచ్చుకొనినయెడల, ఇతరుల యొక్క ఘనతను పొందుటకు బహిరంగముగా కాక వారి అంతరంగములో రహస్యముగా దేవుని మహిమపరచెదరు.


ఆత్మీయగర్వంనుండి మనంతట మనము విడుదల పొందలేము. కాని ఆ విడుదలను నిజంగా మనము కోరుచున్నామని దేవుడు చూచినప్పుడు ఆయన సహాయపడును. మనము ఆయన యెదుట దీనులమై యుండవలెనని కోరుచున్నామని దేవుడు చూచినప్పుడు, మనము గర్వించుటకు ఆరంభించిన వెంటనే దీనులమవుటకు కొన్ని పరిస్థితులను అనుమతించును. పౌలు శరీరంలో ఒక ముల్లు ఉంచుటద్వారా దేవుడు అతనికి సహాయపడెను మరియు ఆయన మనకు కూడా ఆ విధంగా సహాయపడును.


మనము విశ్వాసముంచినట్లయితే, మనకు సమస్తము సాధ్యమే (మార్కు 9:23). చాలామంది దేవుని వాక్యమును చదువుతారు కాని వాటి ద్వారా ఆయన స్వరమును వినరు. కేవలం చదువుట ద్వారా విశ్వాసంరాదు. కాని క్రీస్తుయొక్క మాటలు వినుటద్వారా విశ్వాసం కలుగును (రోమా 10:17). పాపమును జయించిన వారికి సమస్తమును సాధ్యమని వ్రాయబడలేదు గానీ విశ్వాసముంచిన వారికే సాధ్యము. మనము పరిశుద్ధులమయినప్పటికిని విశ్వాసం లేనట్లయితే, దేవుని యొద్దనుండి పొందుకొనము.


క్రీస్తుయొక్క శరీరం ద్వారా క్రమశిక్షణ:


మనము అనుకొనిన స్థలానికి కాదుగానీ, దేవుడు పంపిన స్థలానికి వెళ్ళవలెను. మన జీవితములలో సొంత ఉద్దేశ్యములు కలిగియున్నట్లయితే ఎప్పటికి నశింపక నిత్యము నిలచే దానిని చేయలేము. మనలో అనేక తేడాలు ఉన్నవి. కొందరు తెలివి కలిగినవారై మరియు చేయగలవారైయున్నారు మరియు కొందరు ఆవిధంగా లేరు. అభిషేకము పొందుట ద్వారా మాత్రమే దేవునిపరిచర్య చేయగలము మరియు మానవ శక్తిసామర్థ్యాలతో కాక విశ్వాసంతోను దీనత్వముతోను చేయుదము.


హృదయము నిండియుండిన దానిని బట్టి నోరు మాట్లాడును (మత్తయి 12:34). నీ మాటలలో నీవు జాగ్రత్తగా ఉండినప్పటికిని, నీ హృదయములో ఉన్న గర్వమును నీ స్వరము చూపించును. ఆ గర్వమును నీవు కనిపెట్టి మరియు నిన్నునీవు తగ్గించుకొన్నట్లయితే నీవు ధన్యుడవు.


వేరొక సహోదరునిలోని క్రీస్తు యొక్క దీనత్వమును పరిశుద్ధాత్ముడు మనకు చూపించి ఒప్పుకొనచేస్తాడు. మనము ప్రసంగములను వినుట ద్వారా మాత్రమేకాక దైవభక్తి గలిగిన సహోదరుల ద్వారా దేవుని మహిమను చూడగలము.


మనము సంఘములోనికి వచ్చినప్పుడు, తెలివితేటలలోను మరియు వృత్తిరీత్యాను మరియు అనేక విషయములలో చాలా తేడాలు ఉన్నవి. కాని ప్రభువు మనలను క్రమశిక్షణ చేయుట ద్వారా సంఘములో అందరిలో మనముకూడా ఒకరిగా ఉండెదము. ఈ విధముగా పవిత్రపరచబడవలెనని కోరువారికి నిజమైన సంఘములో ఉండుట మంచిది. మన హృదయములు సున్నతి చేయబడవలెనని కోరిన యెడల, మనము విరుగగొట్టబడుటకు మరియు దీనులము అగుటకు అవసరమైన పరిస్థితులను దేవుడు అనుమతించినప్పుడు వాటిని మనము అంగీకరించాలి.


దేవుడు ఎందుకు జవాబులను ఆలస్యము చేస్తాడు:


మన యొక్క కొన్ని ప్రార్థనలకు జవాబిచ్చుటకు ఎందుకు ఆలస్యము చేస్తాడో మనము అర్థము చేసుకొనలేము. కాని ఆయన మార్గము పరిపూర్ణమైనది మరియు ఆయన మన మార్గములను పరిపూర్ణము చేయును (కీర్తన 18:30, 32).


అపొ.కా. 1:7లో కాలములను, సమయములను తండ్రి తన ఆధీనములో ఉంచుకొనియున్నాడనియు వాటిని తెలుసుకొనుట మన పని కాదనియు ప్రభువైనయేసు చెప్పారు.


కొన్ని సంగతులు దేవునికి మాత్రమే చెందియున్నవి. ఉదాహరణకు:


1. ఆరాధించబడుటకు (మత్తయి 4:10).


2. మహిమను పొందుటకు (యెషయా 42:8)


3. పగదీర్చుకొనుటకు (రోమా 12:19)


4. కాలములను మరియు సమయములను తెలుసుకొనుటకు (అపొ.కా. 1:7) మానవునికి అనుమతించబడలేదు.


ఈ నాలుగు దేవునికి సంబంధించిన అంశాలు. పై రెండు విషయములను ప్రతి క్రైస్తవుడు అంగీకరిస్తాడు. అనేకులు మూడవ విషయమును కూడా అంగీకరించెదరు. కాని ఆత్మ సంబంధమైన వారు మొదటి దానివలె నాల్గవ విషయమును కూడా వెంటనే అంగీకరిస్తారు. కాబట్టి కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చుట చాలా సమయం తీసుకొనినట్లయితే, మనము దీనత్వముతో ఆయన చిత్తమును అంగీకరించాలి.


దేవుడు ఇంకను సింహాసనాసీనుడై యున్నాడు మరియు ఆయన తన వారిని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని మరియు సమస్తమును సమకూర్చి వారి మేలు కొరకై జరిగించును.


''దేవుని పక్షమున ఉన్నవాడు ఎల్లప్పుడు జయించును. అతడు దేనిని పోగొట్టుకొనడు. తాను ఏర్పరచుకొనుట ద్వారా జయము పొందినప్పుడు దేవుని చిత్తము అతనికి మధురముగా ఉండును''.


కాబట్టి మనము ''ప్రార్థనయందును వాక్య పరిచర్యయందును ఎడతెగక యుందుము'' (అపొ.కా. 6:4). అప్పుడు మనము ''ధైర్యముగా దేవుని రాజ్యమును గూర్చియు ప్రభువైన యేసును గూర్చియు ఆటంకము లేకుండా ప్రకటించగలము'' (అపొ.కా. 28:31).


మనలోనుండి జీవజలనదులు ప్రవహించుట:


క్రొత్త నిబంధన యొక్క శుభవార్తను వినుటకు, ప్రపంచమంతటిలో అనేకమంది విశ్వాసులు అవసరతలో ఉన్నారు. ధనాపేక్షకులైన బోధకులద్వారాను మరియు ఇతరులమీద అధికారం చెలాయించే బోధకుల ద్వారాను ఈనాడు అనేకప్రాంతములలో నున్న విశ్వాసులు పీడించబడుచున్నారు. ఇటువంటి విశ్వాసులకు మనము స్వాతంత్య్రము ప్రకటించాలి.


మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా పరిచర్యకు వెళ్ళాలి (యెషయా 30:21). అనేకమంది విశ్వాసులు సత్యమును గూర్చి వినుటకు ఇష్టపడని సమయము ఆసన్నమగుచున్నవి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడును మరియు అనుకూలముగా లేనప్పుడునూ ఎల్లప్పుడూ సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి (2 తిమోతి 4:2, 3).


విశ్వాసముతో ఈ దేవుని వాగ్ధానమును స్వతంత్రించుకొనెదము. ''జీవజలనదులు మన సంఘములో నుండి అన్ని దిక్కులకు ప్రవహించి తూర్పునకును, పడమటకును సంవత్సరమంతయు ప్రవహించును'' (జెకర్యా 14:8).


అధ్యాయము 11
ఆత్మీయగర్వము మరియు దేవునియొక్క అంగీకారము

వేషధారణ మరియు ఆత్మీయగర్వము దేవుని దృష్టికి ఎంతో అసహ్యమైన రెండు విషయములు. ఇవన్నిటికంటే చాలా చెడ్డవనే విషయమును మనము గుర్తించనియెడల మనము చాలా అపాయములో ఉండెదము. ప్రభువైనయేసు భూమిమీద ఉన్నప్పుడు, ఆయన పరిసయ్యులలో ఈ రెండు విషయములను చూచి మరియు వారికి వ్యతిరేకముగా ఎవరిగురించి చెప్పని రీతిగా వారి గురించి ప్రభువు మాట్లాడియున్నాడు (మత్తయి 23వ అధ్యాయము). ఆయన నేడు కూడా అదే విధముగా ఉన్నాడు. కాబట్టి పరిసయ్యులు ఎక్కడ ఉన్నప్పటికిని ఆయన ఇప్పుడు కూడా వారిని అదే విధముగా నిందించును మరియు సంఘపెద్దలయితే మరి ఎక్కువగా నిందించును. విశ్వాసియైనను లేక అవిశ్వాసియైనను లేక చిన్నవాడైనను లేక పెద్దవాడైనను గర్విష్ఠియైన ప్రతిఒక్కరిని దేవుడు ఎదురించును. ఆయన దీనులకు మాత్రమే కృపనిచ్చును మరియు ఆయనలో పక్షపాతము లేదు (1 పేతురు 5:5). దీనిని ఈ విధంగా వివరించవచ్చను. మనము దీనులము అయినయెడల, దేవుడు మనలోను మరియు మన వెనుకను ఉండి ఎల్లప్పుడు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి చెందునట్లు మనలను ముందుకు నెట్టును. కాని మనము అహంకారులమయినట్లయితే, ఎల్లప్పుడు దేవుడు ఎదురుగా ఉండి మనలను వెనుకకు నెట్టును. సాతాను, లోకము మరియు మన శరీరేచ్ఛలు ఇప్పటికే మనలను వెనుకకు నెట్టుచున్నవి. అనేకమంది పెద్దలు వారి జీవితములలో ఆత్మీయ అభివృద్ధి చెందకపోవుటకును మరియు వారి యొక్క ప్రసంగములలో అభిషేకము లేకపోవుటకును మొట్టమొదటి కారణం గర్వము. కాబట్టి మనము ఫలభరితమైన పెద్దలుగా ఉండుటకు, మన హృదయమంతటితో దీనత్వమును వెంటాడాలి. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మాదిరి: బాప్తిస్మమిచ్చుయోహాను దీనత్వము విషయములో మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. క్రీస్తుయొక్క మొదటి రాకడకు ముందుగా ప్రజలను సిద్ధపరచుటకు అతడు దేవునిచేత పంపబడ్డాడు. క్రీస్తుయొక్క రెండవ రాకడకు ప్రజలను సిద్ధపరచుటకు ఇప్పుడు మనము పిలువబడ్డాము. ప్రవక్తలందరికంటె గొప్పవాడని ప్రభువైనయేసు చెప్పిన బాప్తిస్మమిచ్చుయోహాను యొద్దనుండి మనము కొన్ని ముఖ్యమైన పాఠములు నేర్చుకొనవచ్చును. 1. తాను కేవలం ఒక శబ్దమై యున్నానని యోహాను చెప్పాడు (యోహాను 1:19 - 23). అతడు ఇతరులచేత చూడబడవలెననికానీ లేక ఒక ప్రవక్తగాగానీ లేక దైవజనునిగాగానీ అతడు గుర్తింపు కోరలేదు. దేవుని కొరకు ఒక శబ్దమై యుండుటలో తృప్తి పడియున్నాడు. 2. ప్రభువైన యేసు ఇతరుల దృష్టిలో గొప్పగా కనబడునట్లు, అతడు తన్నుతాను తగ్గించుకొనవలెనని కోరియున్నాడు (యోహాను 3:30). 3. ప్రభువైన యేసుయొక్క చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడనుకానని అతడు చెప్పాడు (మత్తయి 3:11). మనము ప్రభువైన యేసుతో ఎంత సన్నిహితముగా ఉన్నప్పటికిని, ఆయన దేవుడనే గౌరవమును కలిగియుండాలి. 4. యోహాను తనగురించి తాను ప్రకటించుకోలేదు. అయినప్పటికిని అనేకులు ఆయన స్వరమును వినుటకు వచ్చియున్నారు (మత్తయి 3:5). యోహాను అరణ్యములో బోధించినట్లుగా మన సంఘము ఏ మారుమూల ప్రాంతములో ఉన్నప్పటికిని, నీవు అభిషేకం కలిగిన దైవజనుడవై, దేవుని యొద్దనుండి పొంది ప్రకటించినప్పుడు అనేక దూరప్రాంతములనుండి దైవభక్తిగల అనేకులు నీ వర్తమానమును వినుటకు వచ్చెదరు. మనము దేవునివాక్యము ఎక్కడ ప్రకటించినప్పటికినీ, క్రీస్తే మహిమ పరచబడునట్లు మనలను మనమే మరుగు చేసుకోవాలని చెప్పే ఒకమంచి పద్యము ఇక్కడ ఉన్నది. 1. ఆ దినమున అతడు సత్యమనే దీపమును పట్టుకొనెను ఎవరు దారి తప్పిపోకుండునట్లు దానిని పట్టుకొనెను; అందరికి కనబడునట్లు ఎత్తుగా దానిని పట్టుకొనెను, లోకము యొక్క గొప్ప వెలుగు అందరికి కనబడెను. చూచిన వారు ఆ దీపమును మాత్రమే చూచిరి దానిని పట్టుకొనిన చేయి ఎవరికి కనబడలేదు 2. అతడు వంగి ఆ కడవను పట్టుకొనెను, క్రిందనున్న పిల్లల పెదవులకు అందునట్లు పట్టుకొనెను. అలసియున్న భక్తునికి అందునట్లు దానిని పైకెత్తెను, అతడు రోగముతో సొమ్మసిల్లునప్పుడు త్రాగమని చెప్పెను. వారిద్దరు కడవలోని నీరు త్రాగిరి, దానిని పట్టుకొనిన చేయి ఎవరికి కనబడలేదు. 3. అతడు బూరను మెల్లగా స్పష్టముగా ఊదెను, వణకుచున్న పాపులు భయపడకుండునట్లు ఊదెను ఆ తరువాత సాతాను యొక్క ప్రాకారములు కూలునట్లు బిగ్గరగా ధైర్యముగా ఆ బూరను ఊదెను, ఆ బూర అందరికి కనబడెను గాని, దానిని పట్టుకొనిన చేయి ఎవరికి కనబడలేదు. 4. అయితే సేనాధిపతి తన సేవకునితో, ''భళా, నమ్మకమైన మంచి దాసుడా'' అని చెప్పినప్పుడు, ఆ కడమను ఆ దీపమును విడచిపెట్టిన, ఆ బూరను ఆ పాళెమును విడచిపెట్టిన, ఆ అలసియున్న చేయి అప్పుడు కనబడును మేకులు కొట్టబడిన చేతుల మధ్యనుండును మనము ఆ విధముగా ఉండవలెనని నిజముగా కోరినట్లయితే అప్పుడు క్రీస్తే మనలో కనబడును మరియు మన జీవితముల ద్వారా దేవుడు మహిమపరచబడును. కాని మనము గర్వించి నష్టపోవునట్లు సాతాను అనేకవిషయముల ద్వారా మనము గర్వించేటట్లు చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము పెద్దగా ఉండుట ఒక ఇంటిలో ఒక దాసుడు (దాసురాలు) చేసే పరిచర్య కంటెను మరియు ప్రభువైన యేసు పాదములు కడిగిన దానికంటెను గొప్పదని తలంచుచున్న యెడల నిశ్చయముగా మనలో గర్వము ప్రవేశించి మరియు మనము వెనుకకు దిగజారెదము. ఆవిధముగా దేవుని కృపను పొందము. పెద్దలుగా మన యొక్క పదవిని ప్రేమించడం మొదలుపెట్టినట్లయితే, మనము ఇప్పటికే తప్పిపోయియున్నామని నిశ్చయపరచుకొనవచ్చును. ద్వారము యొద్ద పొంచియున్న పాపము: సంఘములో పరిచర్య చేయువారందరికి, ఆత్మీయగర్వం అనే పాపము ద్వారముయొద్దనే పొంచియుండును. పౌలు కూడా అత్యధికముగా హెచ్చించుకొనే పాపములో ఉన్నాడని తాను ఒప్పుకొనియున్నాడు (2 కొరింథీ 12:7). కాని అతడు ఆ అపాయమును గుర్తించియున్నాడు గనుక దానినుండి అతడు రక్షింపబడియున్నాడు. ఆత్మీయగర్వము అను అపాయము విషయములో మనము ఎల్లప్పుడు మెలకువగా యుండినయెడల, అది ఎప్పటికి మన హృదయములో ప్రవేశించదు. ''మనుష్యుల చేత తృణీకరించబడుటకును మరియు విసర్జించబడుటకును'' (యెషయా 53:3) ఇష్టపడిన యేసుయొక్క దీనత్వములోని మహిమను ఎల్లప్పుడు దేవునియొక్క ఆత్మద్వారా చూడాలి. మన యొక్క ఆత్మీయతను బట్టిగానీ లేక మన పరిచర్యను బట్టిగానీ ఘనత పొందాలనే తలంపును ద్వేషించాలి. సంఘములో పాపమును ధైర్యముగా ఖండించాలి. మనలను మనము నమ్మకముగా కడుగుకొనుచున్నట్లయితే దైవికమైన అధికారముతో దానిని చేయగలము. మన స్వంత శరీరములో ఉన్న దేనినైతే మనం తీర్పుతీర్చియున్నామో దానినే సంఘములో కూడా తీర్పుతీర్చవచ్చును. మనము చూచిన దానికంటెను మరియు మన స్వంత శరీరములో మనము తీర్పుతీర్చుకొన్న దానికంటెను ఎక్కువగా బోధించిన యెడల అది వేషధారణ అగును. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు కలిగే ఆత్మీయగర్వము: మన పరిచర్యలను దేవుడు ఆశీర్వదించినప్పుడు మనకు ఆత్మీయ గర్వము కలిగే అపాయములో ఎల్లప్పుడు ఉండెదము. మనము ఎల్లప్పుడు ఏమి కానివారమైనప్పటికినీ మనము గొప్పవారమని ఊహించుకొనుట చాలా సులభము. వారెవరైనప్పటికిని దేవుడు అహంకారులందరిని ఎదురించును. కనుక మనలను కూడా ఎదిరించి మనకు విరోధముగా పోరాడును. మనకు ఆత్మీయ వరములున్నప్పుడు లేక మన వ్యక్తిగతజీవితము మరియు కుటుంబజీవితము మంచిగా ఉన్నప్పుడు లేక మన సంఘము విస్తరించుచున్నప్పుడు లేక మనము ఎక్కువగా సిరిసంపదలను పొందినప్పుడు గర్వించుట చాలా సులభము. వేరే పాపములన్నింటి కంటె ఆత్మీయగర్వము మరియు స్వార్థము మీద వెలుగు పొందవలసిన అవసరమున్నది. ఈ విషయములలో మనలను మనము సులభముగా మోసగించుకొనవచ్చును. మనము గర్విష్టులము మరియు స్వార్థపరులము అయియుండి, మనము దీనులము మరియు నిస్వార్థులమని ఊహించుకొనవచ్చును. సాతాను గొప్ప మోసగాడు. మనయొక్క నిజస్థితిని తెలుసుకొనుటకు ఆత్మీయగర్వము నీకు ఉండే కొన్ని ఋజువులను ఇక్కడ మనము చూచెదము. అభ్యంతరపడుట, కోపపడుట, లైంగికతలంపులు, తప్పును ఒప్పుకొనుటకు ఇష్టపడకపోవుట, క్షమాపణను ఆలస్యముగా అడుగుట, సంఘములోని ఇతర సహోదరులతో సమాధాన పడుటకు ఆలస్యము చేయుట మొదలగునవి. మనము మన భార్యలను ప్రేమించినట్టు మన సహోదరులను ప్రేమించవలెనని ప్రభువైన యేసు ఆజ్ఞాపించినట్లు, ఒక సంఘపెద్ద ఇతర విశ్వాసులతోను పెద్దలతోను ఎందుకు త్వరగా సమాధాన పడలేకపోవుచున్నాడు? ఎఫెసీ 5:25 మరియు యోహాను 13:34 ఈ రెండు సమానమైన ఆజ్ఞలు. ఎందుకనగా అతడు తన యింటిలో సమాధానమును ఎంతో కోరుచున్నాడు. కాని సంఘములోని తన సహోదరులతో ఈ విధంగా సమాధానపడవలెననే అవసరమును చూడుడి! తననుతాను తగ్గించుకొని ఇతరులను క్షమాపణ అడగమని పరిశుద్ధాత్ముడు అతనిని ప్రేరేపించినప్పుడు, తన స్వార్థమునుబట్టియు ఆత్మీయగర్వమును బట్టియు గ్రుడ్డివాడు ఆ స్వరమును వినలేకపోవుచున్నాడు. ఆత్మీయగర్వము బబులోనును నిర్మించును: ఒక గర్వము కలిగిన పెద్ద సంఘములో ఒక నియంతవలె ప్రవర్తిస్తూ మరియు ఒక అధిపతి కంపెనీని నడిపిస్తున్నట్లుగా సంఘమును నడుపును. అటువంటి వ్యక్తి సంఘమును ఒక శరీరముగా నిర్మించలేడు. శరీరమునుండియు మరియు నోటినుండివచ్చు దుర్వాసన వలె ఆత్మీయ గర్వము ఉండును. దానియొక్క వాసన మనకు తెలియదు కాని ఇతరులకు తెలియును. ఉదాహరణకు, ఒక సంఘపెద్ద తన పరిచర్య గురించి గొప్పలు చెప్పినట్లయితే, అతడు అతనిలోనుండి వచ్చుచున్న ఆత్మీయగర్వమనే దుర్వాసనను గుర్తించలేడు. కాని ఒక దైవభక్తి కలవాడు అతనిలోనున్న ఆత్మీయగర్వమును వెంటనే చూడగలడు. మనము నెబుకద్నెజరు వైఖరిని చూచినట్లే, ఒక గర్వముగల సంఘపెద్ద వైఖరి బబులోను సంఘమును నిర్మించును (దానియేలు 4:30). దేవుడు అతనిని దీనుడుగా చేసి మరియు వెంటనే అతనిని విసర్జించెను. ఈవిధంగా ప్రార్థనచేసే ఒక పరిసయ్యుడి గురించి ప్రభువైన యేసు ఒకసారి చెప్పారు, ''దేవా, నేను ఇతరుల వలె లేనందుకు నీకు వందనములు ....'' (లూకా 18:11). అతడు కూడా వెంటనే దేవునిచేత విసర్జించబడ్డాడు. రాజకీయనాయకుల వలె ప్రవర్తించే సంఘపెద్దలు: ప్రభువు యొక్క ఆమోదమును మాత్రమే కోరక, తమ సంఘములోని ప్రజల యొక్క ఆమోదమును మాత్రమే పొందగోరేవారు దానికి తగినట్లుగా రాజకీయ నాయకులవలె మాట్లాడుచు మరియు పరిచర్య చేయుదురు. నీవు ఆ విధముగా చేసినట్లయితే నీవు వెనుకంజ వేయుట మాత్రమేగాక ఒక వేశ్యవలె మారవచ్చును. ఇతరులను సంతోషపెట్టుగోరువారు ఎవరైననూ క్రీస్తుకు దాసులు కానేరరు (గలతీ 1:10). మనకు దేవునియొక్క అంగీకారము కావలెను కాని, మన సంఘములలోని సహోదరుల సహోదరీల యొక్కయు లేక అపొస్తలుల యొక్క అంగీకారము అవసరము లేదు. మనము శరీర, మానసిక జ్ఞానముతో మనుష్యుల యొక్క అంగీకారము సులభముగా పొందవచ్చును! అందరిని సంతోషముగా ఉంచుట ద్వారా నీవు సంఘపెద్దగా కొనసాగవచ్చును. కానీ నీ విషయములోగాని లేక మీ సంఘం విషయంలోగానీ దేవుడు సంతోషంగా ఉండడు. తన పరిచర్య అంతటిని దేవునికి బలియాగముగా సమర్పించుకొని మరియు దేవుని దృష్టిలో తాను అంగీకరింపబడవలెనని పౌలు కోరియున్నాడు (రోమా 15:16). దేవుడు మన తలంపులను, మన ఉద్దేశ్యములను, మన వైఖరులను చూచును గనుక దేవుని దృష్టిలో అంగీకరించబడుట చాలా కష్టము. రహస్యముగా మన స్వజీవమును చంపనియెడల, దేవుని దృష్టిలో మన పరిచర్య ఎప్పటికీ అంగీకరించబడదు. మనము పరిణితి చెందనప్పుడు అనేక పొరపాట్లను మరియు అనేక బుద్ధిహీనమైన పనులను చేయుదము. కానీ మనం చేసిన పొరపాట్లనుండియు మరియు బుద్ధిహీనమైన పనులనుండియు మనము నేర్చుకొనే అలవాటు ఉండినయెడల మనము అభివృద్ధి చెందెదము. కానీ ఒక బుద్ధిహీనుడు క్రక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు (సామెతలు 26:11). ఆత్మీయగర్వమును జయించుట: ఆత్మీయగర్వము, పెద్దలను మరియు దేవునిని కలిగిన వారిని సన్మానించకుండా చేయును. అటువంటి సంఘపెద్ద తన సంఘములోని వారందరు తనకు లోబడవలెనని కోరును. కానీ దేవుడు అతని మీద పెట్టిన అధికారానికి అతడు లోబడడు. అంత్యదినములలో ఇటువంటి అగౌరవము క్రైస్తవులలో అంతకంతకు విస్తరిస్తుంది. ఈ దినములలో చిన్నపిల్లలలో మరియు యౌవనస్తులలోను, పెద్దలలోను మరియు దైవజనులలోను ఈవిధంగా మాట్లాడుట మనము చూచుచున్నాము. దియొత్రెఫే (3 యోహాను 1:9) మరియు ప్రకటన 2,3 అధ్యాయములలోని వెనుకంజ వేసిన ఐదుగురు సంఘపెద్దలు మనకందరకు హెచ్చరికగా ఉన్నారు. మనము ఇంతకు ముందు చూచిన రీతిగా, ఆ పెద్దలు తమ్ముతాము తీర్పు తీర్చుకొనినయెడల దేవుడే స్వయముగా వారి ఓటములను చూపించేవాడు. అప్పుడు దేవుడు అపొస్తలుడైన యోహాను ద్వారా వారితో మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు. మనలను మనము తీర్పుతీర్చుకొనుట ఆపివేసినప్పుడు, మనము అన్ని తెలిసిన వారివలె బోధించుటకు ఆరంభించుదుము. మరియు ప్రభువు మన పక్షముగా ఉండడు. కాబట్టి ప్రతిరోజు మనలను మనము తీర్పు తీర్చుకొనుచు మరియు మన పరిచర్య గురించి తక్కువ తలంపులు కలిగి జీవించాలి. దేవుడు మన జీవితము గురించి మరియు మన పరిచర్యల గురించి సాక్ష్యము చెప్పుచున్నాడా అనేది మనలను మనము పరీక్షించుకోవాలి లేనట్లయితే తప్పిపోవుదము (గలతీ 6:4). సంఘ పెద్దలందరికి నేను మూడు హెచ్చరికలు చేయుచున్నాను. 1. ఎల్లప్పుడు మీ ముఖము దుమ్ములో పెట్టుకొని, దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి. 2. నీవు ఒక సామాన్యసహోదరుడవని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 3. నీవు దేవునిని ఎక్కువగా ప్రేమించుచున్నావని ఊహించుకొనుట కంటే నీయెడల దేవుని ప్రేమను ఎల్లప్పుడు ధ్యానించుము. ఆత్మ విషయములో దీనుడవై యుండుట అనగా, నీవు ప్రాముఖ్యత లేనివాడవని అనుకొనవలెను (మత్తయి 5:3 ఆంప్లిఫయిడ్‌ బైబిలు) మరియు ఎల్లప్పుడు వ్యక్తిగత అవసరతను, నిస్సహాయతను ఎరిగియుండుట. పెద్దలు దేవునియొక్క ఆమోదాన్ని పొందాలి: మన స్థానిక సంఘములోని సహోదర సహోదరీలను నడిపించే ధన్యత ప్రభువు మనకిచ్చియున్నాడు. గనుక ఆయన మనలను ఆమోదించాడని కాదు. మనము కొంతకాలం తరువాత ఆ ఆమోదాన్ని పొందాలి. మనమందరము తర్ఫీదులో ఉన్నాము. మరియు ప్రభువు తనను తాను అప్పగించుకొనక ముందు మనలను అనేక పరిస్థితులలో పరీక్షిస్తాడు (యోహాను 2:24). 25 సంవత్సరములు దేవుని పరిచర్య చేసిన తరువాత, దేవుని ఆమోదాన్ని పొందాలని పౌలు తిమోతిని హెచ్చరించుచున్నాడు (2 తిమోతి 2:15). హృదయపూర్వకముగా ఉండిన తిమోతి కూడా దేవుని ఆమోదాన్ని పొందవలసి యున్నది. ఫిలిప్పీ 2:19 - 22 లో తిమోతి గురించి పౌలు గొప్ప తలంపులు కలిగియున్నప్పటికీ దీనితో సంబంధం లేదు. ప్రకటన 2,3 అధ్యాయములలో ఐదు సంఘములలో ఉన్న పెద్దలు ఆ దినములలోనే అంత త్వరగా వెనుకంజవేసి యున్నప్పుడు, ప్రభువు వారితో మాట్లాడియున్నాడు. ప్రభువు ఆ పెద్దలను పూర్తిగా ఆమోదించలేదు. అయినప్పటికినీ వారు సంఘ పెద్దలుగా కొనసాగుతూ మరియు ఆ సంఘములలో వర్తమానికులుగా ఉన్నారు. అది మన హృదయములను భయపెట్టునట్టు చేయుచున్నది మరియు మనము ఎల్లప్పుడు అటువంటి భయమును కలిగియుండవలెను. సౌలురాజు దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్న తరువాత, దేవుడు తనను తొలగించే వరకు అనగా 10 సంవత్సరములు రాజుగా కొనసాగెను. ''మీ క్రియలను నేనెరుగుదును'' అని ప్రకటన 2,3 అధ్యాయములలో సంఘపెద్దలకు చెప్పినట్లుగా ప్రభువు మనకును చెప్పుచున్నాడు. మరియు ప్రభువుకు పక్షపాతము లేదు. పెద్దలు సామాన్య సహోదరులుగా ఉండవలెను: చాలామంది ''పాస్టర్లు'' వారి సంఘములలోని విశ్వాసులకు మరియు క్రీస్తుకును మధ్యవర్తులుగా వ్యవహరించుచున్నారు. ప్రజలకు అటువంటి అభిప్రాయము కలుగకుండా మనము జాగ్రత్త పడాలి. ఇటువంటి ''పాస్టర్ల'' నుండి వచ్చిన సామాన్యమైన విశ్వాసులకు అటువంటి అభిప్రాయము కలుగకుండునట్లు మనము గట్టిగా ప్రయత్నించాలి. ''మధ్యవర్తియైన పాస్టర్లు''గా మీ సంఘస్తులు భావించిన యెడల అది కేవలం నీయొక్క పొరపాటే. వారు నిన్ను వారి యొక్క దాసుడుగాను వారి యొక్క సహోదరుడుగాను మరియు వారివంటి ఒక సామాన్య సహోదరుడిగాను వారు నిన్ను చూడాలి. నీవు ''పాస్టరు'' అని పిలిపించుకొనక పోయినప్పటికిని నీవు అధికారం చెలాయించకూడదు. నీవు ఎవరినైనను ఆత్మీయముగా నీమీద మాత్రమే ఆధారపడేలా చేయకూడదు. నీ సలహాను ఎవరైనను పాటించనియెడల, అతడు పాపము చేసినట్లు కాదు. అతడు దేవునికి అవిధేయత చూపించినయెడల అది పాపమగును. కాని నీకు అవిధేయత చూపినయెడల అది పాపము కాదు. ఈ విషయమును అందరు తెలుసుకొనవలెను. మన సంఘములోని ప్రతి ఒక్కరు సంపూర్ణులగునట్లు మనము కష్టపడి పనిచేయాలి. లేనట్లయితే మన పరిచర్యలో జయముండదు. మనతో ''అవును సహోదరుడా అని'' ఎల్లప్పుడు చెప్పుచూ నుండు సహోదరులు ఉండకూడదు. మన సంఘములోని వారందరును దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకోవాలి మరియు వారు స్వతంత్రులయి ఉండాలి. మనలో బలమైన వ్యక్తిత్వం గలవారందరును ఇతరులు మనమీద ఆధారపడకుండ, స్వతంత్రులైయుండి సంపూర్ణులగునట్లు మన స్వంత శక్తిని చంపివేయాలి. మన వ్యక్తిత్వాన్ని బట్టి ఇతరులను బలవంతము చేయకూడదు. మన కుటుంబములలో ఉన్న పిల్లలు పరిణితి చెంది పెద్దవారైనట్లే, మన సంఘములోని వారందరు ఒక కుటుంబంలోని వారివలె పరిణితి చెందునట్లు మన పరిచర్య దేవునికిష్టమైనదిగా నుండిన యెడల దేవుడు కృప నిచ్చును. నీకంటె ఎక్కువ పరిణితిగల, సత్యము చెప్పుటయందు ధైర్యము గలవ్యక్తి నీ జీవితము గురించియు మరియు నీ బోధను గురించియు నిజమైన అభిప్రాయమును తెలుసుకొనుటకు కోరుకొనుము. ఒకవేళ నీ భార్య దానిని చేయగలిగినట్లయితే, అది చాలా మంచిది. లేనట్లయితే నీకు నమ్మకము ఉన్న ఒక దైవజనుని నీ జీవితము గురించియు మరియు నీ పరిచర్య గురించియు తన అభిప్రాయాన్ని అడుగవచ్చు మరియు అతడు నీతో సత్యమును ఖచ్చితముగా చెప్పమని అడుగుము. దాని ప్రకారము నిన్ను నీవు తీర్పుతీర్చుకొని మరియు సరిచేసుకొనుము. నీ ఆత్మీయస్థితిని గురించి నీకంటె ఎక్కువగా దైవజనుడు ఎరుగును. మన సంఘములోని సహోదరీ, సహోదరుల మీద ప్రభువులాగా ఉండునట్లు ఒక 'నియంతగా' మారుట చాలా సులభము. ప్రభువైన యేసు ఇట్లన్నారు, ''ఆ నాయకులు సంఘ విందులలో అగ్రపీఠములను ప్రేమించెదరు మరియు సమాజములలో ఇతరుల చేత పొగడబడుటకును, ఇతరుల నుండి గౌరవము పొందుటకు ''డాక్టరు'' మరియు ''రెవరెండ్‌'' అను బిరుదులు కలిగి యుండుటకును ఇష్టపడుదురు. మీరు ఆ విధంగా పిలిపించుకొనవద్దు. మీకందరికిని ఒక్కడే బోధకుడు ఉన్నాడు మరియు మీరందరు విద్యార్థులై యున్నారు. ఇతరుల చేత మీరు పూర్తిగా ప్రభావితము చేయబడకూడదు. మనకందరికిని జీవాన్నిచ్చే ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనే క్రీస్తు. మిమ్మును మీరు హెచ్చించుకొనవద్దు. మీరు తగ్గించుకొని దాసునివలె ఉండాలి. మిమ్ములను హెచ్చించుకొనిన యెడల తగ్గించబడెదరు, కాని నీవు కలిగిన దానితో తృప్తి కలిగిన యెడల, నీవు సమృద్ధిగా పొందెదవు'' (మత్తయి 23:6 - 12 మెసేజ్‌ పారాఫ్రేజ్‌ బైబిలు). తమ సంఘములోని వారి యొక్క వ్యక్తిగత జీవితములను నియంత్రించుటకు పెద్దలు ప్రయత్నించకూడదు. ''సంఘవిషయములను'' మరియు ''వ్యక్తిగత విషయములను'' మనము వేరు చేయాలి. సంఘపెద్దలుగా ఒక వ్యక్తి జీవితంలోని వారియొక్క ప్రతి వ్యక్తిగత విషయములను నియంత్రించుటకు మనము పిలువబడలేదు. విశ్వాసులు ఎదుర్కొనే విషయములలో 90 శాతం ఎక్కువగా వ్యక్తిగత విషయములే ఉండును. అటువంటి విషయములలో, వారు స్వంత నిర్ణయము తీసుకొనుటకు వారికి స్వాతంత్య్రము ఇవ్వాలి. అవి ఒక వ్యక్తిని నియంతగా చేయును కావున ఒకపెద్ద ఇటువంటి విషయములలో జోక్యం చేసుకొనకూడదు. పెద్దలు నియంతలుగా ఉన్నట్లయితే, సంఘములు క్రీస్తు శరీరములుగా నిర్మించబడక అది ఒక మతవ్యవస్థగా మారును. కడపటివారు మొదటి వారగుదురు: ఈ లోకములోని మొదటివారు అనేకులు దేవుని దృష్టిలో కడపటివారగుదురు. ఈ అద్భుతమైన విషయము యేసు చెప్పిన ఏడు ఉపమానములలో ఉన్నది. 1. మత్తయి 20:1లో 11 గంటలప్పుడు కూలికి వచ్చినవారు, 90 శాతం వారి జీవితమును వృథా చేసుకొనినవారు (12 గంటలలో 11 గంటలు) మొదటిగా జీతమును పొందిరి. 2. లూకా 15:22 తన తండ్రి ఆస్తిలో 50 శాతం ఆస్తిని పోగొట్టుకొని మరియు తండ్రి నామమును అవమానపరచినవాడు తన యింటిలో ''ప్రశస్తవస్త్రమును'' మరియు ''ఉంగరమును'' పొందియున్నాడు. స్వనీతిపరుడైన పెద్ద కుమారుడు ఈ రెండింటిని పొందలేదు. 3. లూకా 7:41 ఎక్కువగా పాపం చేసినవారు ఎక్కువగా క్షమించబడుటవలన ప్రభువును ఎక్కువగా ప్రేమించి ఆయనకు దగ్గరవుదురు. 4. మత్తయి 21:28 మొదటిగా తిరుగుబాటు చేసిన కుమారుడు, తన సహోదరునివలె కాక చివరకు తన తండ్రి చిత్తమును నెరవేర్చెను. 5. లూకా 15:3, తప్పిపోయిన గొఱ్ఱె కాపరియొక్క భుజముపై ఉండుట వలన వేరే గొఱ్ఱెలకంటె అది కాపరికి ఎంతో సన్నిహితముగా ఉన్నది. 6. లూకా 14:10, పెండ్లి విందులో కడపట చోట కూర్చున్నవారు పైచోటికి పిలువబడి యున్నారు. 7. లూకా 18:9, బాహ్య విషయములలో పరిసయ్యునికంటె ఎంతో చెడ్డవాడైన సుంకరి దేవునిచేత నీతిమంతునిగా తీర్పు తీర్చబడియున్నాడు. ఈ ఉపమానములన్నింటిలో ఉన్న సందేశమేమనగా చెడుగా ఆరంభించిన అనేకులు బహుమానమును పొందియున్నారు. మన పరుగును ఎలా ఆరంభించామనే దానికంటే ఎలా ముగించామనేది ముఖ్యమైయున్నది. పౌలు వలె నిరాశ పడక మరియు వారి జీవితములలో చెడుగా ఆరంభించినప్పటికిని తమ్మునుతాము ఖండించుకొనక ముందుకు వెళ్ళినవారు బాగుగా ఆరంభించిన వారికంటే ముందుగా వెళ్ళియున్నారు. తమ జీవితములను పాడుచేసుకొనిన వారికి ఇది ఎంతో ప్రోత్సాహముగా ఉన్నది. మరియు ఎన్నటికి నిరాశపడక వారి పరుగును కొనసాగించారు. ప్రభువైన యేసును కలువక మునుపు పౌలు తన జీవితములోని మొదటి 30 సంవత్సరములను పాడు చేసుకొనియున్నాడు. ఈ లోకములో తాను జీవించనైయున్న కొద్ది కాలములో, గత జీవితములోని ఓటమిలన్నింటిని మరచిపోయి యేసువలె రూపాంతరము పొందవలెననే గురి యొద్దకే పరుగెత్తవలెనని పౌలు నిర్ణయించుకున్నాడు (ఫిలిప్పీ 3:13, 14). దేవుడు తాను పిలిచిన పరిచర్య కూడా దీనిలో ఇమిడియున్నది. తన జీవితాంతమున పౌలు ఇలా చెప్పాడు, ''మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. ఇకమీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడియున్నది'' (2 తిమోతి 4:7, 8). కొరింథీలోని శరీరానుసారమైన క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు, ''బహుమానము పొందునట్లుగా మీరు పరుగెత్తుడి'' (1 కొరింథీ 9:24). మారుమనస్సు పొంది మరియు దృఢనిశ్చయతతోను మరియు క్రమశిక్షణతోనూ పరుగెత్తిన యెడల శరీరానుసారమైన క్రైస్తవులు కూడా క్రైస్తవ పరుగుపందెములో మొదటి బహుమానము పొందగలరు. ఓడిపోయిన ప్రతి క్రైస్తవుడు మారుమనస్సు పొంది క్రీస్తువలె రూపాంతరము చెందుటకు వెల చెల్లించుటకు సిద్ధముగా నున్నయెడల, వారు రూపాంతరము పొందగలరనే నిరీక్షణను పెద్దలమైన మనము కలిగించాలి.

అధ్యాయము 12
సంఘములోని ఆర్థిక విషయములు

ప్రభువు పరిచర్యకు ఇచ్చిన ధనము ఈ లోకములో ఎంతో పవిత్రమైనది. ఈ విషయములో ఎవరైనను అపనమ్మకముగా ఉన్నయెడల నిశ్చయముగా అతని మీదకును అతని కుటుంబము మీదకును శాపము వచ్చును. ధనము విషయములో తప్పుచేసిన వారు అన్ని విషయములలోను తప్పిపోవుదురు.


ధనము విషయములో నమ్మకముగా ఉన్నవారికి మాత్రమే దేవుడు నిజమైన ఐశ్వర్యము నిచ్చునని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 16:11). ధనము విషయములో మనము అజాగ్రత్తగా ఉన్నయెడల, మన జీవితములలో దేవుని యొక్క ఐశ్వర్యములను పోగొట్టుకొనెదము.


ధనము మరియు బబులోను:


క్రైస్తవ్యములోని బబులోను సంఘములకు 3 లక్షణములు ఉన్నవి.


1. వారు శిష్యత్వము గురించి బోధించరు కాబట్టి వారు చాలా కొద్దిమంది శిష్యులను మాత్రమే కలిగియుందురు. వారు మారుమనస్సు పొందునట్లు చేయుదురు. అయినప్పటికి అనేకులు సరియైన విధముగా క్రొత్తగా జన్మించరు.


2. వారు క్రొత్త నిబంధన సంఘము నియమములను బోధించరు. కాబట్టి వారు మృతమైన డినామినేషన్‌ను వదలిపెట్టరు. క్రీస్తు శరీరమైన స్థానిక సంఘమును నిర్మించుటకు వారు కనీసం ప్రయత్నించరు. వారు కేవలము పాత నిబంధన సమాజములను మరియు క్రైస్తవ క్లబ్‌లను నిర్మించెదరు.


3. ప్రభువైన యేసు మరియు పౌలు అనుసరించిన ఆర్థిక పరమైన నియమములను వారు బోధించరు లేదా పాటించరు. వారి పరిచర్య గురించి వారు ఎక్కువగా చెప్పుకొని మరియు మృతమైన డినామినేషన్‌లలో ఉన్న నామకార్థ క్రైస్తవులను, వారు సిగ్గులేకుండా డబ్బు అడిగెదరు. లోకములోని కంపెనీలు వారి ఉద్యోగస్తులకు జీతమిచ్చినట్లు వారి పాస్టర్లకు వారు నెల నెలా జీతమిచ్చెదరు.


దేవుడు లేక సిరి అనే రెండు యజమానులను మాత్రమే సేవించగలమని ప్రభువైన యేసు చెప్పారు. కాబట్టి ప్రతి సంఘములోని ప్రతి సంఘపెద్ద ఆర్థిక పరమైన విషయములను సరిగా నిర్వహించరు.


దేవుని పరిచర్య కొరకు గేహజీ నయమానును డబ్బును అడిగి ఆ ధనమును తనతోనే ఉంచుకొనినందున అతని మీదికి శాపం వచ్చింది (2 రాజులు 5:22 - 27). బీదలకు చెందవలసిన డబ్బును ఇస్కరియోతు యూదా తీసుకొనినందున అతని మీదకు శాపం వచ్చింది.


క్రైస్తవ్యంలో ప్రతి చోట ఈ రోజు గేహజీలు మరియు యూదా ఇస్కరియోతులను కనుగొనగలము. ప్రభువైన యేసు సంఘములోనే ఒక యూదాను కనుగొనినయెడల, మీ సంఘములలో కూడా కొందరు యూదాలను కనుగొనగలము. సాతానుకు ప్రతి స్థలములో దూతలు ఉన్నారు. కాబట్టి సంఘపెద్ద తమ సొంత ధనము కంటె, సంఘమునకు సంబంధించిన విషయములలో జాగ్రత్తగా ఉండాలి.


దేవుని ధనమును ఖర్చుపెట్టే విధానమునుబట్టి దేవుడు మనకు ఇచ్చిన పరిచర్య వైఖరిని తెలుసుకొనగలము. దేవుని ప్రజలచేత సంఘపరిచర్యకు త్యాగపూరితముగాను మరియు ధారాళముగా ఇవ్వబడిన ధనము పెద్దలు దేవునికి లెక్క చెప్పవలెను.


బబులోనుకు మరియు సిరికి చాలా దగ్గర సంబంధము ఉన్నది. ప్రకటన 18వ అధ్యాయములో దీనిని స్పష్టముగా చూడగలము. ప్రపంచములోని ప్రతి దేశములో క్రైస్తవ సంస్థలు పనిచేసే విధానము బబులోను నియమములను కనుగొనగలము. అటువంటి సంస్థలలో ఉన్న విశ్వాసులకు మన దగ్గర ఒకే ఒక వర్తమానము ఉన్నది... ''నా ప్రజలారా బబులోను నుండి బయటకు రండి, అని ప్రభువు చెప్పుచున్నాడు'' (పక్రటన 18:4).


అప్పు లేకుండుట (అప్పు చేయకుండుట):


మొదటిగా ధనము విషయములో నీతిగా ఉండవలెను. మరియు మొదటిగా మనకు అప్పులేకుండా చూచుకొనవలెను మరియు ఆవిధముగా విశ్వాసులకు బోధించవలెను.


అచ్చి యుండకూడదను క్రొత్త నిబంధన ఆజ్ఞను అనేకులు పెద్దలు బోధించుట లేదు. మనము ఎవనికిని అచ్చి యుండకూడదని పరిశుద్ధాత్ముడు స్పష్టముగా ఆజ్ఞాపించియున్నాడు (రోమా 13:8). ఎవరి యొద్దనుండియైనను డబ్బును అప్పుగా తీసుకొనకూడదని పరిశుద్ధాత్ముడు చెప్పలేదు. కొన్ని అత్యవసర పరిస్థితులలో అనగా అనారోగ్య పరిస్థితులలోను లేదా పిల్లల చదువుల విషయములలోను బీద విశ్వాసులు అప్పు చేయవచ్చు. అయితే వారు కొద్దికాలములో తిరిగి చెల్లించగలిగినంత మాత్రమే అప్పు చేయవలెను. నెలకు కొంత సొమ్మును చెల్లించిఅయినా సాధ్యమైనంతవరకు తొందరగా అప్పును చెల్లించవలెను.


ఒక సహోదరుడు అధిక మొత్తంలో అప్పు చెల్లించవలసినప్పుడు, అతని యింటిలోని కొన్ని విలువైన వస్తువులను అమ్మి మరియు దానితో అప్పు తీర్చవలెను. దురదృష్టవశాత్తు అనేకులు పెద్దలు దేవుని ఆజ్ఞను తీవ్రముగా తీసుకొనుటలేదు. అందుకే దేవుడు తన అధికారముతో వారికి సహకరించడు.


1. సామాన్యముగా జీవించవలెననియు మరియు 2. ప్రతినెల కొంత పొదుపు చేసుకొనవలెననియు విశ్వాసులకు పెద్దలు ప్రకటించాలి. ఆవిధముగా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు, వారు అప్పుచేయవలసిన అవసరం ఉండదు. మా సంఘములలో చేరుటకు వచ్చిన అనేకులకు, వారికి నేను డబ్బును ఇవ్వకుండా, వారు సామాన్యముగా జీవించి మరియు వారి ఆర్థిక విషయములలో క్రమశిక్షణ కలిగియుండాలని చెప్పుట వలన వారు అప్పులను తీర్చియున్నారు.


''అప్పుచేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు'' (సామెతలు 22:7) మరియు ఒక దేవుని బిడ్డ ఎవరికైనను దాసుడుగా ఉండుట మంచిది కాదు. కొద్ది కొద్దిగా చెల్లించియైనను సాధ్యమైనంత తొందరగా అప్పును తీర్చవలెను. మన దగ్గర కొంచెమే ఉన్నప్పటికినీ దేవుని ఆజ్ఞకు లోబడవలెనని కోరుచున్నామా లేదా అనేది దేవుడు చూచుచున్నాడు (2 కొరింథీ 8:12). అప్పుచేసి ఆరు నెలలు గడచినయెడల, అప్పుచేసినవాడు అసలుతో పాటు బ్యాంకు వడ్డీని కలిపి తిరిగి చెల్లించవలెను (లూకా 19:8) లో జక్కయ్య చేసిన విధముగా.


పెద్దలముగా, మన సంఘ సభ్యులకు అప్పుచేయవద్దని చెప్పవలసిన బాధ్యత మనము కలిగియున్నాము. మన విశ్వాసులు వ్యభిచారములో జీవించుటకు మనము అనుమతి ఇవ్వనట్లే, అప్పులో ఉండి జీవించుటకు అనుమతించకూడదు!


గమనిక: ఒక ఇంటి నిర్మాణమునకుకాని లేక ఒక వాహనము కొనుటకుగానీ ఋణము తీసుకొనిన యెడల అది అప్పుగా పరిగణించబడదు. ఎందుకనగా ఆ అప్పుకు సరిపోవు మన దగ్గర ఇల్లుగానీ, వాహనముగానీ ఉన్నది. లాభము పొందుచున్న వ్యాపారమునకు కూడా ఋణము తీసుకొనవచ్చును. కానీ వ్యాపారము చేసే అనుభవములేని కొందరు విశ్వాసులు, వారి నిజస్థితిని తెలుసుకొననందువలన ఋణము తీసుకొని అనేక సంవత్సరములు అప్పులో ఉన్నారు. పెద్ద మొత్తములో వ్యాపారము చేయాలనుకొనే విశ్వాసులు మొదటిగా పెద్దలను సంప్రదించాలి.


క్రెడిట్‌ కార్డు ద్వారా అప్పుచేయుట చాలా తీవ్రమైన విషయము. ఎందుకనగా అది చాలా త్వరగా పెరుగుతుంది. కాబట్టి అవకాశమున్నప్పుడు క్రెడిట్‌ కార్డు కంటె డెబిట్‌ కార్డును ఉపయోగించమని విశ్వాసులకు చెప్పాలి. క్రెడిట్‌ కార్డు వలన కలిగే ఉపయోగములను బట్టి ఎవరైనను దానిని వాడినయెడల నెలనెల బిల్లు చెల్లించవలెను. ఒక నెల బిల్లు చెల్లించలేకపోయినను, దానిని పూర్తిగా చెల్లించేవరకు క్రెడిట్‌ కార్డును ఉపయోగించకూడదు. అప్పును తీవ్రముగా తీసుకొనిన వారిని దేవుడు ఘనపరచును. అప్పుచేసి ఖరీదైన వస్తువులను కొనకూడదు. వారు దానికి అవసరమైన ధనమును పొదుపుచేసికొని మరియు అప్పుడు కొనాలి. ప్రభువైన యేసు ఆవిధముగా చేసియుండెడివారు. దురాశ వలనను మరియు విచ్చలవిడిగా ఖర్చుపెట్టుటవలనను అప్పుచేయవలసి వచ్చుచున్నది.


చీమ యొద్దనుండి నేర్చుకొనుడి:


ప్రతి నెల కొంత సొమ్మును పొదుపు చేసుకొనవలెనని పెద్దలు విశ్వాసులకు బోధించాలి. తమకంటె పైస్థాయిలో జీవించేవారితో పోల్చుకొనక తమకున్న రాబడిని బట్టి తమ కుటుంబఖర్చులను తగ్గించుకొని పొదుపు చేసుకోవాలి. అనవసరమైన వస్తువులను కొనుట ద్వారాగాని లేక ఎక్కువ ఖర్చుతో విందులు చేయుటగాని చేయకూడదు. ఇతరులయొద్దనుండి ఘనత పొందుటకే అనేక విందులు జరుగుచున్నవి. ఇది ఒకలాంటి విగ్రహారాధనే. కుటుంబానికున్న ఆర్థిక స్థాయిని బట్టి ఆతిథ్యమివ్వాలి. అతిథ్యమిచ్చే కుటుంబమనే పేరు పొందుట కంటే, భవిష్యత్తు కొరకు కొంత పొదుపు చేసుకొనుట మంచిది.


తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చవలెనని బైబిలు చెప్పుచున్నది (2 కొరింథీ 12:14). ఒకని కుటుంబ అవసరతల కొరకు పొదుపు చేసుకొనుట దేవునియందు విశ్వాసముంచుటకు విరోధమైనది కాదు. భూమి మీద అత్యంత చిన్నవియైన చీమల యొద్దనుండి జ్ఞానము నేర్చుకోమని బైబిలు ఆజ్ఞాపించుచున్నది. శీతాకాలమందు కష్టపరిస్థితులు వచ్చునని యెరిగి, చీమలు వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును (సామెతలు 6:6 - 11). భవిష్యత్తులోని అత్యవసరములయిన ఖర్చుల కొరకు పొదుపు చేసుకొనుటను చీమల యొద్దనుండి నేర్చుకోవాలి. పెద్ద మెదడు కలిగిన అనేకుల మనుష్యులకంటె అత్యంత చిన్నమెదడు కలిగిన చీమకు ఎక్కువ జ్ఞానము ఉన్నది!


పిల్లలచదువుల కొరకును మరియు కుటుంబసభ్యులు అనారోగ్యముతో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల కొరకు విశ్వాసులు కొంత పొదుపు చేసుకొనవలెనని విశ్వాసులకు బోధించాలి. ఎవడైనను తన యింటివారిని సంరక్షించక పోయినయెడల అతడు అవిశ్వాసి కంటె చెడ్డవాడై యుండునని బైబిలు చెప్పుచున్నది (1 తిమోతి 5:8).


ఉద్యోగం చేయకుండా ఇంటిలో ఉంటున్న భార్యలు ఆర్థిక విషయములలో గ్రహింపు లేనివారై ఎక్కువగా ఖర్చుపెట్టెదరు. అటువంటి సందర్భములో వారి కుటుంబ ఆర్థిక స్థితినిగురించి భర్తలు తమ భార్యలకు వివరించి మరియు అంత ఖర్చుపెట్టకూడదని వివరించాలి. వారి కుటుంబముల కొరకుకొంత ద్రవ్యమును కూడబెట్టాలని ఆ విధంగా భర్తలు భార్యలకు చెప్పమని పెద్దలు వారికి బోధించాలి.


ఈ విధంగా ఆర్థిక పరమైన క్రమశిక్షణను పాటించి మరియు ప్రతినెల కొన్ని ఖర్చులను తగ్గించుకొనినయెడల ప్రతి యింటిలో ద్రవ్యమును కూడబెట్టుకొనవచ్చును. భర్తలందరు దీనిని చేయునట్లు పెద్దలు వారిని ప్రోత్సహించాలి.


మనము అంత్యకాలములో ఉన్నాము కనుక డబ్బును ఖర్చుపెట్టు విషయములో విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ''అస్థిరమైన ధనమునందు మనము నమ్మికయుంచము''. పరలోకమందున్న మన తండ్రియందు మాత్రమే నమ్మికయుంచెదము (1 తిమోతి 6:17). ''దేవుడు మన యొక్క ప్రతి అవసరమును తీర్చును'' అనే వాగ్దానమును మనము విశ్వాసులకు బోధించాలి (ఫిలిప్పీ 4:19). దేవుని రాజ్యమును మొదటిగా వెదకుచు మరియు దేవుని ఆజ్ఞ ప్రకారం చీమల యొద్దనుండి మనం నేర్చుకొనిన యెడల ఈ వాగ్దానము మనలో నెరవేరును (మత్తయి 6:33).


59 సంవత్సరములు నేను ఒక విశ్వాసిగా (ఇందులో 50 సంవత్సరముల వివాహ జీవితమున్నది) మేము కొంతకాలం చాలా బీదవారిగా ఉన్నప్పటికిని నేనుగాని నా భార్యగాని ఒక్కసారైనా ఎవరి యొద్దనుండి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకొనలేదు. దేవుని వాక్యానికి విధేయులమై, మా గృహములో ఆత్మీయ క్రమశిక్షణను పాటించాము. మా పిల్లలకు క్రొత్త బట్టలు గానీ మేము కొనలేని ఏ వస్తువులుగాని మేము కొనలేదు. పెద్ద పిల్లల బట్టలు చిన్న పిల్లలకు వాడియున్నాము. దాని ఫలితముగా ఈనాడు దేవుడు మమ్ములను మా పిల్లలను ఆశీర్వదించియున్నాడు. ఇతరులకు కూడా ఆర్థికపరమైన క్రమశిక్షణను నేర్పుటకు సహాయపడింది. రోమా 13:8ను మరియు మత్తయి 6:33లకు మా యింటిలో విధేయులమై యున్నాము కనుక దేవుడు మా భూసంబంధ అవసరములను తీర్చుటయే కాక ఆత్మీయ ఐశ్వర్యములను కూడా ఇచ్చియున్నాడు. కాబట్టి ప్రతివిశ్వాసికి ఈ విధంగా చెప్పగలను. ''దేవుని వాక్యానుసారముగా, అప్పుచేయక మరియు మనకున్న దానిలోనే జీవించువిషయములో నన్ను వెంబడించుడి''.


దేవుని వాక్యానుసారముగా ఉంటున్నామా లేక లౌకికమైన క్రైస్తవులను అనుసరించుచున్నామా అని ప్రశ్నించుకోవాలి. అప్పు చెల్లించకుండా జీవించుట ఒక దేవుని బిడ్డకు అవమానకరము. ఎందుకనగా వారు దేవుని వాక్యమునకు అవిధేయులై మరియు దేవుని యెదుట వారిమీద నిందారోపణ చేయుటకు సాతానుకు అవకాశమిచ్చుచున్నారు (పక్రటన 12:10).


నీవు ఒక పెద్దవై యుండి మరియు నీకు చాలా అప్పులుండినను ప్రతినెల కొంత అప్పును తీర్చుటకు ప్రతి విధమైన ప్రయత్నము చేయనియెడల, అప్పుడు నీవు పెద్దగా ఉండుటయు, బోధించుటయు మానివేసి అప్పులను తీర్చుటకు ప్రయత్నించాలి. లేనట్లయితే చాలా చెడ్డ సాక్ష్యమును కలిగియుండెదవు.


ఇచ్చుటలోను మరియు అప్పుఇచ్చుటలోను ఉన్న జ్ఞానము:


పెద్దలను సంప్రదించకుండా పెద్ద మొత్తములో అప్పులను ఇవ్వకూడదని విశ్వాసులకు చెప్పాలి. లేనట్లయితే సంఘములోని సంబంధములు పాడగును.


''నిన్ను అడుగు ప్రతివానికిని ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువారి యొద్దనుండి దాని మరల అడుగవద్దు'' (లూకా 6:30).


లేఖనములలోని ఒక వాక్యమును మనము అర్థము చేసుకొనుటకు ఒక లేఖనమును ఇంకొక లేఖనముతో పోల్చి చూడాలి. లేనట్లయితే ఆ లేఖనమును మనము తప్పుగా అర్థం చేసుకొనెదము. దేవాలయము మీదనుండి దూకమని సాతాను చెప్పినప్పుడు, ''ఈ విధంగా వ్రాయబడెను అని'' సాతాను చెప్పాడు. కాని ''మరియొకచోట ఇంకను వ్రాయబడింది అని'' ప్రభువైన యేసు ఆ సలహాను తృణీకరించాడు (మత్తయి 4:6, 7). కాబట్టి లేఖనములోని సత్యమంతయు ''వ్రాయబడెను'' అను దానిలో లేదు గాని ''వ్రాయబడెను మరియు మరల వ్రాయబడెను'' అనుదానిలో ఉన్నది.


కాబట్టి లూకా 6:30 అను వచనమును చదివినప్పుడు, ''నిన్ను అడుగు ప్రతివానికిని ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్దనుండి దానిని మరల అడుగవద్దు'' దానితోపాటు 1 కొరింథీ 10:26 ''భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై యున్నవి'' అను వచనమును కూడా చూడాలి. కాబట్టి మనకున్న ధనము, ఆస్థి మరియు కూడబెట్టిన ద్రవ్యమంతయు ప్రభువునకు చెందినదే. కాబట్టి నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము అను ఆజ్ఞను నెరవేర్చుటకు ముందుగా దాని యజమానుడైన ప్రభువును మనము అడగాలి. మరియు మనము ఆవిధంగా ప్రభువును అడిగినట్లయితే వారి హృదయములను చూచి, - కొందరికి కొంత ఇమ్మని చెప్పును మరియు కొందరికి ఇవ్వవద్దని చెప్పును. ఆవిధముగా ప్రభువు మోసగించువారినుండి రక్షించును.


ఇటువంటి విషయములలో విశ్వాసులు జ్ఞానము కలిగి జాగ్రత్తపడని యెడల, వారు ధనము విషయములో బుద్ధిహీనముగా ఉండవచ్చును. పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చినప్పుడు, పెద్దలతో సంప్రదించాలని విశ్వాసులందరికి చెప్పాలి. ఎందుకనగా అప్పు తీసుకొనినవాడు అప్పు చెల్లించకపోవచ్చును. శిష్యత్వము యెడల ఆసక్తిలేకుండా, ఇతర విశ్వాసులనుండి పొందవలెనని సంఘములో చేరినట్లయితే సంఘము చెడిపోవచ్చును!


''ప్రేమ మరియు మంచితనము'' మాత్రమే బోధించి, ''శిష్యత్వము'' గురించి బోధించని సంఘములో ఇటువంటి సమస్యలు వచ్చును. శిష్యత్వము గురించి ప్రభువైనయేసు బోధించిన విధానము తరచుగా బోధించి మరియు విశ్వాసుల ''సంఖ్య పెరిగినప్పుడు'' ఘనత పొందాలనే కోరిక లేకుండా మరియు మీ సంఘములలో దైవభక్తి గల కుటుంబములను నిర్మించవలెనని పెద్దగా మీరు కోరినయెడల ఇటువంటి మోసగాళ్ళ నుండి కాపాడబడెదరు.


మన సంఘములలో, కనీసం రెండు సంవత్సరములనుండి శిష్యుడుగా అవ్వాలనే ఆశగా ఉండిన బీదవారికి, ఆర్థిక సహాయము చేయుచున్నాము.


ధనము విషయములో నీతిగాను మరియు నమ్మకముగాను ఉండుట:


ధనము విషయములో మొదటిగా నీతిగా ఉండిన తరువాత రెండవదిగా నమ్మకముగా ఉండాలి. మనము మోసము చేయకుండా, దొంగిలించకుండా మరియు అప్పుచేయకుండా ధనము విషయములో నీతిగా ఉండవచ్చు కాని ధనము విషయములో నమ్మకముగా ఉండకపోవచ్చును.


ధనము విషయములో అపనమ్మకముగా ఉండుట అనగా మన కొరకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టుట మరియు సంఘముయొక్క ధనమును కూడా విచ్చలవిడిగా వాడుట. చాలా సంఘములలో మరియు క్రైస్తవ సంస్థలలోనూ అనేకులు సంఘధనమును విచ్చలవిడిగా ఖర్చుచేయుచు మరియు దేవుని ప్రజలు ఇంకా ఇంకా ఇవ్వాలని కోరెదరు.


మన సంఘములలో కష్టపడి పనిచేసే బీద సహోదరులు అనేకులు ఉన్నారు. వారు వారి గృహములలో అనేక సౌఖ్యములను అనుభవించరు. వారు సంఘమునకు ఇచ్చిన ధనముతో, సంఘము యొక్క ఖర్చులకు కూడా ఎక్కువగా వాడకూడదు. మన ఉద్దేశ్యములు మంచివైయుండవచ్చును. కాని లూకా 10:38 - 42లో ప్రభువు కొరకు మార్త మంచి ఉద్దేశ్యముతో పరిచర్య చేసింది. అయినప్పటికి ఆమె పరిచర్యను బట్టి ప్రభువు ఆమెను గద్దించారు. మరియవలె ప్రభువైన యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన దిద్దుబాటులను మరియు గద్దింపులను వినుట మంచిది.


ప్రభువైన యేసు మనకంటె ముందుగా వెళ్ళి మనకు మాదిరిగా ఉన్నాడు. దేవుని ప్రజల యొద్దనుండి బహుమానముల రూపములో చాలా డబ్బును పొందియున్నాడు. కాని ఆయన ఆ విషయములో జాగ్రత్తగా ఉండి మరియు నమ్మకముగా ఖర్చుచేశారు. ఆయన ఖర్చుపెట్టిన విధానమును యోహాను 13:29లో ఆయన మాటలలో చూడగలము. ''అవసరమైన వాటిని మాత్రమే కొనుడి మరియు బీదలకు ఏమైనను ఇయ్యుడని చెప్పెను'' (పేరాఫ్రేజ్‌). మన కుటుంబములోను మరియు మన సంఘములోను మనం ఖర్చుపెట్టే విషయంలో ఈ మాదిరి బాగున్నది.


డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండి వృథా చేసినట్లయితే మనము అభిషేకం పోగొట్టుకొనే అవకాశం ఉన్నది. ప్రభువైన యేసు ఇట్లనెను, ''మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయుదురు?'' (లూకా 16:11). చాలామంది పెద్దలు ఈ విషయంలో ఓడిపోయినందున అభిషేకం పోగొట్టుకొని దేవుని కొరకు వారి సంఘములను మండించలేకపోవుచున్నారు.


మన యింటిలోను మరియు మన సంఘములోను డబ్బు విషయంలో మితముగాను మరియు జ్ఞానముతోను ఖర్చుచేసినయెడల నమ్మకముగా ఉండెదము.


బీదలకు సహాయపడుట:


భాష, సంస్కృతి లేక కులమును బట్టి ప్రజలను విభజించక, అందరు ఒకటైయుండి క్రీస్తుయొక్క శరీరమును నిర్మించుటకు సంఘములను ఒక కుటుంబముగా నిర్మించాలి.


మన సంఘమనే కుటుంబములో బీదలైయుండి మరియు అవసరములో ఉన్నవారిని కనుగొని, వారికి సహాయపడుట పెద్దలుగా మన యొక్క బాధ్యత.


ఆది సంఘములో, విశ్వాసులు బీద విశ్వాసులకు సహాయపడాలనుకున్నప్పుడు, వారు ధనమును వారి నాయకులైన అపొస్తలులకు ఇచ్చారు. వారి కంటె వారి నాయకులకు అవసరములో ఉన్న విశ్వాసుల గురించి ఎక్కువగా తెలుసునని గుర్తించారు (అపొ.కా. 4:34, 35). విశ్వాసులు ఈ విధంగా బీదలకు సహాయపడుట ఎల్లప్పుడు మంచిది. మీ ధనమును పెద్దలకు ఇచ్చినట్లయితే వారు సరైన విధముగా బీదలకు ఇచ్చెదరు.


కాని విశ్వాసులే స్వయంగా బీదలకు ఇచ్చినట్లయితే, తమ అవసరతను గురించి చెప్పుకొనేవారు ఎక్కువగా పొందుకొని మరియు నిజముగా అవసరతో ఉన్నవారు సహాయమును పొందుకొనలేకపోవచ్చును.


అవిశ్వాసులకు సహాయపడవద్దని నేను చెప్పుటలేదు. మన సంఘమనే కుటుంబములోని వారికి ఇచ్చుట ప్రాముఖ్యమైయున్నది. ఉదాహరణకు: మీ పట్టణములోని బిక్షకులకు మీరు ధనము ఇచ్చినయెడల, అది మంచి కార్యము. కాని దాని ఫలితముగా మీ సొంత పిల్లలు ఆకలితో ఉన్నయెడల అది బుద్ధిహీనమైన పని. కాని మన సొంత డబ్బుతో అటువంటి బుద్ధిహీనమైన పనిని ఎన్నటికిని చేయము. దేవుని డబ్బుతో కూడా అటువంటి బుద్ధిహీనమైన పనిని చేయకూడదు.


బైబిలు ఇట్లు చెప్పుచున్నది, ''ఎవడైనను స్వకీయులకు, విశేషముగా తన యింటివారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును'' (1 తిమోతి 5:8). ''కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరియెడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారియెడలను మేలు చేయుదము'' (గలతీ 6:10).


ఒక తండ్రి తన సొంత బిడ్డలను అడుగవచ్చును:


యెరూషలేములోని అవసరములో ఉన్న పరిశుద్ధులకు కొంత డబ్బును సమకూర్చి పంపవలెనని కొరింథీలో ఉన్న క్రైస్తవులను పౌలు అడిగియున్నాడు (2 కొరింథీ 8,9 అధ్యాయములు మరియు 1 కొరింథీ 16:2). తన యొక్క ఆత్మీయ పిల్లలైయున్న కొరింథు క్రైస్తవులకు మాత్రమే పౌలు వ్రాసియున్నాడని గమనించాలి. రోములోను మరియు కొలస్సలోను అతడు సంఘములను నిర్మించలేదు కనుక వారిమీద తనకు అధికారంలేనందున అక్కడి క్రైస్తవులకు అతడు చెప్పలేదు. ఒక ఆత్మీయతండ్రి మాత్రమే బీదలకు డబ్బు ఇవ్వవలెనని తన పిల్లలను అడుగగలడు. కాని ఇతరుల యొక్క పిల్లలను అడుగలేడు.


ఈ నియమములను నీవు పాటించినయెడల, నీవు సురక్షితముగా ఉండెదవు. బబులోను సంఘములు పడిపోయిన గోతిలో మనము పడిపోకుండునట్లు ఆత్మీయవిలువలను మనము కాపాడాలి.


''దేవుని రాజ్యమును మరియు నీతిని వెదకువారికి, వారి పరలోకపు తండ్రి వారి యొక్క భూ సంబంధమైన ప్రతి అవసరమును తీర్చును'' అని మేము ధృఢముగా నమ్ముచున్నాము (మత్తయి 6:33). క్రొత్త నిబంధన నియమముల ప్రకారం మనము పరిచర్య చేసినయెడల, మన పరిచర్యలో ఉన్న ఆర్థికపరమైన అవసరతలన్నియు దేవుడు ఎల్లప్పుడు తీర్చునని మనము నమ్ముచున్నాము.


డబ్బు విషయములో పౌలు యొక్క వైఖరి:


ఈ క్రింది వచనములలో డబ్బు విషయములో పౌలు యొక్క మాదిరిని మనము చూచెదము:


1 కొరింథీ 9:11 - 19 ''నేను సువార్తను ప్రకటించవలెను గనుక, నేను సువార్త ప్రకటించినందుకు అతిశయపడను..... మరియు నాయొక్క బహుమానము ఏమిటి? సువార్త యందు నాకున్న అధికారమును నేను వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని''.


అందరికి దాసులమైయుండి, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు ఉచితముగా సువార్తను ప్రకటించుటయే మార్గమని గమనించగలము.


2 కొరింథీ 11:7-12 (ఎన్‌.ఎ.ఎస్‌.బి మరియు లివింగ్‌) ''మిమ్మును హెచ్చించవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపము చేసితినా?..... నేను మీ యొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవని మీదను భారము మోపలేదు. ఇక ముందుకును మీమీద భారము మోపను. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన?.... మేము దేవుని పరిచర్య చేయుచున్నట్లే, మేము కూడా పరిచర్య చేయుచున్నామని చెప్పువారికి, అతిశయ కారణము దొరకుకుండునట్లు మేము యిట్లు చేయుచున్నాము''


మన సంఘములోని విశ్వాసులకు ''ఉచితముగా'' సువార్తను ప్రకటించుట ద్వారా మనలను మనము తగ్గించుకొని మరియు పరిచర్య చేయగలమని పౌలు చెప్పుటను గమనించండి.


''ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. మీరును ఈ లాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు - పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైనయేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను'' (అపొ.కా. 20:33 - 35).


''ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు; ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారము లేదనిచేయలేదు'' (2 థెస్స. 3:7 - 9).


ఇక్కడున్న లేఖనములను చాలాచాలా కొద్దిమంది బోధకులు పాటించుచున్నారు. కాని ఆయన మాదిరి అనుసరించుచు మరియు ఈనాటి బబులోను క్రైస్తవ్యములోని బోధకులకు మనము వేరుగా ఉండాలి.


పౌలు పెద్దవాడై మరియు పనిచేయలేనప్పుడు అద్భుతముగా దేవుడు అతడి అవసరతలను తీర్చాడు. పౌలు యెరూషలేములోని జైలులో ఉన్నప్పుడు కొందరు యూదులు అతనిని చంపవలెనని ప్రతిజ్ఞ చేశారు (అపొ.కా. 23:12 - 15). కాని దేవుడు తన సార్వభౌమాధికారంతో, పౌలు యొక్క సహోదరి కుమారుడు ఆ మాటను విని మరియు జైలుకి వచ్చి పౌలుకు చెప్పాడు (అపొ.కా. 23:16). ఆ విధముగా పౌలు యొక్క జీవితం సంరక్షించబడింది. తరువాత అతడు ఫేలిక్సును కలుసుకొనుటకు సిజెరియ ప్రాంతమునకు అక్కడికి తీసుకొని పోబడ్డాడు. ఫేలిక్సు పౌలును విడిపించిన యెడల అతనికి ద్రవ్యము దొరుకునని ప్రయత్నించాడు కాని పౌలు ఇవ్వలేదు (అపొ.కా. 24:26). ఏ గవర్నరు అయినను ఎక్కువ ద్రవ్యమును ఆశించెదరు. ఒక బీదబోధకుడైన పౌలు అంత ద్రవ్యమును ఇవ్వగలడని ఫేలిక్సుకు ఏవిధంగా తెలియును.


మనము ఊహించవచ్చును!


తార్సులో పౌలు యొక్క కుటుంబము వ్యాపారం చేసే యూదా ధనిక కుటుంబం. అతడు క్రైస్తవుడుగా మారినప్పుడు అతని ఆస్తిని వారు నిలిపివేసియుండవచ్చును. అయితే పౌలు జైలులో ఉన్నాడని వారికి తెలిసినప్పుడు, వారు బాధపడి అతని ఆస్తి అంతటిని అతని మేనల్లుడి కుమారుని ద్వారా తిరిగి ఇచ్చి యుండవచ్చు. ఆవిధంగా అతని జీవితకాలానికి సరిపోయే డబ్బును అతడు పొందియుండవచ్చును. ఫేలిక్సు ఆ విషయమును వినియుండవచ్చును. తరువాత ఆ దినములలో అత్యంత ఖరీదైన రోమా పట్టణములో రెండు సంవత్సరములకు ఇల్లును అద్దెకు తీసుకొని జీవించెను (అపొ.కా. 28:30, 31). పౌలు అప్పటికే చాలా డబ్బును పొందియున్నాడని సూచించుచున్నది.


అనేక దశాబ్దములుగా పౌలు ఆర్థికపరమైన విషయములలో నమ్మకముగా ఉండి దేవునిని ఘనపరచాడు. పౌలు స్వంతముగా పనిచేసి మరియు తన యొక్క అవసరతలను తీర్చుకొనలేనప్పుడు, అతని కుటుంబసంపదను అతడు తిరిగి పొందేటట్లుగా చేసి దేవుడు అతనిని ఘనపర్చాడు. తనను ఘనపరచేవారిని దేవుడు ఎల్లప్పుడు ఘనపరచును. ఈ విషయము తెలుసుకొనుట మనకుఎంతో ప్రోత్సాహకరము!


''మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు'' (2 కొరింథీ 7:2) అని పౌలు చెప్పినట్లుగా మనము కూడా చెప్పగలుగునట్లు ప్రతి యొక్క పెద్ద దేవునిని ఘనపరచాలి.


అధ్యాయము 13
నిజమైన ప్రవక్తలు మరియు అబద్ధ ప్రవక్తలు

విశ్వాసులందరు ప్రవక్తలు కారు. అయితే విశ్వాసులందరు ప్రవచన వరమును కలిగియుండాలని ఆజ్ఞాపించబడింది (1 కొరింథీ 14:1). క్రొత్త నిబంధన యుగములో పరిశుద్ధాత్మడు క్రుమ్మరించబడినందు వలన కలిగే ఫలితాలలో ఇది ఒకటి (అపొ.కా. 2:17, 18).


క్రొత్త నిబంధనలో ప్రవచించుట అనగా సంఘమునకు క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు మరియు ఆదరణయు కలుగునట్లు మాట్లాడుట (1 కొరింథీ 14:3). ఆత్మతో నింపబడిన విశ్వాసులు సంఘ కూటములలో క్లుప్తముగా ప్రవచించవచ్చును (1 కొరింథీ 14:31). మిగిలిన విశ్వాసులు చెప్పబడిన మాటలు దేవునిలోనుండి వచ్చినవా లేక మనుష్యునిలోనుండి వచ్చినవా అని లేఖనముల ద్వారా పరీక్షించాలి (1 కొరింథీ 14:29).


దేవుడు సంఘములో కొంతమంది ప్రవక్తలను నియమించాడు. వీరు సంఘమును క్రీస్తు యొక్క శరీరముగా నిర్మించుటకు దేవునినుండి వరమును పొందినవారు. విశ్వాసులు సవాలు చేయబడుటకు మరియు బలపరచబడుటకును ప్రసంగములు చేయుదురు. ''యూదాయు సీలయు కూడా ప్రవక్తలై యుండి నందున పెక్కు మాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి'' (అపొ.కా. 15:32). కాని కొద్దిమంది విశ్వాసులు మాత్రమే సంఘములో ప్రవక్తలుగా పిలువబడుచున్నారు. మరియు ప్రతి ఒక్కరు దీనిని గుర్తుపెట్టకోవాలి (1 కొరింథీ 12:28, ఎఫెసీ 4:13).


ఒక ప్రవక్త సంఘకూటములో మాట్లాడుచున్నప్పుడు, అది ఒక అరటిపండు తినినట్లుగా ఉండును. మనము దాని తొక్కను అనగా (మానవ సంబంధమైనది) తీసివేసి మరియు ఆ పండుయొక్క లోపలి భాగమును అనగా (దేవునివద్దనుండి వచ్చునది) తినవలెను. ఒక యౌవన విశ్వాసిలో ఆ తొక్క (తోలు) మందముగా ఉండి దేవుని వద్దనుండి కలిగేది (లోపల భాగము) కొద్దిగా ఉండును. కాని మనము ఆ కొంచెమైనను సంతోషముగా తీసుకోవాలి. ఒక పరిణితి చెందిన విశ్వాసిలో ఆ తొక్క సన్నదిగా ఉండి మరియు దేవుని నుండి కలిగే లోపలిభాగము ఎక్కువగా ఉండును.


సహోదరీలు కూడా ప్రవచించవచ్చును (అపొ.కా. 2:17, 18). కాని పెంతెకొస్తుదినము తరువాత క్రొత్త నిబంధనలో సహోదరీలు ప్రవక్తలుగా లేరు. అలాగే సహోదరీలు అపొస్తలులుగా కూడా లేరు.


అపొ.కా. 21:9లో ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు ప్రవచించిరి అని చదువుతాము. కాని వారు ప్రవక్త్రిలు కారు. దీనిని తరువాత స్పష్టముగా చూడగలము. ఫిలిప్పు యింటిలో పౌలుకు ప్రవచనాత్మక సందేశం ఇవ్వవలెనని దేవుడు కోరినప్పుడు ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలను వాడుకొనలేదు గానీ దానికి బదులుగా అగబు ప్రవక్తను దూరప్రాంతమునుండి తీసుకువచ్చి పౌలుతో మాట్లాడెను (అపొ.కా. 21:10, 11).


ఈనాడు ఏ స్త్రీయైనను ఒక ప్రవక్త్రిగా ఉండుటకు ప్రయత్నించిన యెడల, ఆమె యెజెబెలు వలె అబద్ధప్రవక్తగా మారి చివరకు స్థానికసంఘమును పాడుచేయును (పక్రటన 2:20 - 26, 1 రాజులు 19:1, 2). ఈ విషయమును బట్టి ఏ సహోదరియైనను అభ్యంతరపడినయెడల, ఆమె తన్నుతాను తగ్గించుకొని మరియు క్రొత్తనిబంధనను బాగా చదివి మరియు క్రొత్త నిబంధనలో ప్రభువు ఒక్కసారి కూడా ఒక సహోదరిని ప్రవక్త్రిగా నియమించలేదని చూడవచ్చును. దేవునియొక్క పరిచర్య దేవుని యొక్క మార్గములో జరగాలి. అంతేగాని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చేయకూడదు!


తనకున్న విశ్వాస పరిమాణము చొప్పున ఒక వ్యక్తి ప్రవచించాలి (రోమా 12:6). అందువలననే, ''ప్రభువు యిట్లు చెప్పుచున్నాడు'' అని అను పదములను పౌలు ప్రవచించినప్పుడు వాడుటకు భయపడియున్నాడు. అతడు యిట్లు చెప్పియున్నాడు, ''దేవుని ఆత్మ నాకును కలదని తలంచుకొనుచున్నాను'' (1 కొరింథీ 7:40). మనము ప్రవచించునప్పుడు, మనము ఒక లేఖనమును చెప్పినప్పుడు తప్ప ''ప్రభువు యిట్లు అనుచున్నాడు'' అను మాటలను ఉపయోగించకూడదు. అటువంటి మాటలను ఉపయోగించకూడదని యిర్మీయా మనలను హెచ్చరించుచున్నాడు (యిర్మీయా 23:21). మరియు మనము ప్రవచించినప్పుడెల్లను, మనము చెప్పిన వర్తమానము మనలో నుండి వచ్చినదా లేక ప్రభువునుండి వచ్చినదా అని వివేచించుటకు విశ్వాసులకు అవకాశము ఇవ్వాలి.


మన భవిష్యత్తు గురించి చెప్పే ప్రవచనము గూర్చి జాగ్రత్తపడవలెను:


ఒక పరిస్థితిలో ఇతరులు ఏమి చేయవలెనో అని పాత నిబంధనలోవలె క్రొత్త నిబంధనలో ఏ ప్రవక్త కూడా చెప్పలేదని మనము గుర్తుంచుకోవాలి. అపొ.కా. 11:28లో అగబు ప్రవక్త కరవు వస్తుందని ప్రవచించాడు గాని దాని విషయంలో వారు ఏమి చేయవలెనో అని వారికి చెప్పలేదు. అదే విధంగా అపొ.కా. 21:11లో, ''పౌలు యెరూషలేములో బంధించబడతాడు అని చెప్పాడు గానీ పౌలు అక్కడకు వెళ్ళవచ్చా లేదా అని చెప్పలేదు.


పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలో ఉండుటయే దీనికి కారణము మరియు ప్రతి విశ్వాసియు ఏమి చేయవలెనో ఏమి చేయకూడదో ఆయన వారికి చెప్పును. కాని పాత నిబంధనలోని ప్రజలను నడిపించుటకు పరిశుద్ధాత్ముడు వారిలో నివసించలేదు. కాబట్టి ఆత్మనుకలిగిన ప్రవక్త మాత్రమే ప్రభువు వారిని ఏమి చేయవలెనని కోరుచున్నాడో చెప్పగలడు.


ఇటువంటి హెచ్చరికలు ఉన్నప్పటికీ, పరిణితి చెందని అనేకమంది విశ్వాసులకు పాత నిబంధన ప్రవక్తలవలె ఈనాడు విశ్వాసులు ఏమి చేయవలెనో వారికి చెప్పుచున్నారు. తూరులో కూడా కొందరు పరిణితిచెందని అహంకారులైన కొందరు విశ్వాసులు పౌలును యెరూషలేమునకు వెళ్ళవద్దని వారి సొంత ఆత్మనుండి చెప్పియున్నారు (అపొ.కా. 21:4). కాని పౌలు వారు చెప్పిన మాటలను తిరస్కరించి అక్కడకు వెళ్ళియున్నాడు (అపొ.కా. 21:13). కాబట్టి తూరులో ఉన్న విశ్వాసులు చెప్పిన ''ప్రవచనం'' పూర్తిగా తప్పయియున్నది. అది ప్రభువులో నుండి రాలేదు. మనము ఏమి చేయాలి లేక ఏమి చేయకూడదో అను ప్రవచనం చెప్పువారి మాటలను ఎప్పుడైనను విని మోసపోవద్దని మన సంఘములలోని విశ్వాసులకు చెప్పాలి.


క్రొత్త నిబంధన ప్రవచనం:


క్రొత్త నిబంధన ప్రవచన ఉద్దేశ్యమేమనగా 1. దేవుని యొక్క ప్రజలు వారి పాపములనుండి రక్షించబడుటకును 2. వారు సంఘముగా నిర్మించబడుటకును ప్రవచించాలి. మన సంఘకూటములన్నింటిలో మనము వీటిని ప్రకటించుచు ఉండాలి. ఎందుకనగా రెండు ఉద్దేశ్యములను నెరవేర్చుటకు ప్రభువైన యేసు వచ్చియున్నారు. 1. తన ప్రజలను వారి పాపమంతటినుండి రక్షించుటకును (ఇది క్రొత్త నిబంధనలోని మొదటి వాగ్ధానం - మత్తయి 1:21). 2. ఆయన తన సంఘమును నిర్మించుటకును వచ్చియున్నాడు (మత్తయి 16:18).


ఆ విధముగా కాకుండా అనగా పాపమునుండి విడుదలను గూర్చియు మరియు క్రీస్తు యొక్క శరీరము నిర్మించబడుటను గూర్చియు కాక ఆత్మవరములను గూర్చియే ఎక్కువగా మాట్లాడినయెడల, అప్పుడు మీ సంఘము కూడా కొరింథీ సంఘములో వలె ఆత్మ వరములను కలిగియున్నప్పటికి పరిణితిచెందక, శరీరానుసారులుగాఉండి మరియు పోట్లాడుచుందురు (1 కొరింథీ 1:7) మరియు మీ సంఘము లవొదికయు సంఘమువలె దౌర్భాగ్యులుగాను దిక్కుమాలినవారుగాను దరిద్రులుగాను దిగంబరులుగాను, గ్రుడ్డివారుగాను మారవచ్చును. ఇది ఎంతో దౌర్భాగ్యము.


మీరు క్రొత్త నిబంధన సంఘమును నిర్మించవలెనని కోరినయెడల అప్పుడు మీరు ఈనాటి క్రైస్తవ సంఘములలో బోధించే వాటిని గాక ప్రభువైనయేసు మరియు అపొస్తలులు బోధించిన వాటినే బోధించాలి.


కేవలం ప్రసంగములను చేయువారా లేక ప్రభువు చేత పంపబడినవారా?


మీరు ప్రభువు యొద్దనుండి తరచుగా వినుచున్నట్లయితే, ఆయన మిమ్మును కొన్నిసార్లు గద్దించును మరియు సరిచేయును. హబక్కూకు యొక్క మాదిరిని మనము అనుసరించుట మంచిది. అతడు యిట్లు అన్నాడు, ''ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొంటిని '' (హబక్కూకు 2:1).


క్రీస్తును ప్రకటించియున్నానని పౌలు చెప్పాడు. ''ప్రతి మనుష్యుని క్రీస్తుయందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను'' (కొలొస్స 1:28, 29).


మొదటిగా ప్రభువు తన యొక్క స్వంతశక్తిని, స్వయమును విరుగగొట్టి బలముగా పనిచేయుటకు ప్రభువుతో అతడు సహకరించాడు. అప్పుడు ఇతరులను క్రీస్తులో సంపూర్ణులుగా చేసియున్నాడు. మనలో కూడా దీనిని చేయవలెనని ప్రభువు కోరుచున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పౌలు పరిచర్య చేయుటకు సిద్ధపరచియున్నాడు. మనము కూడా సరియైన విధముగా పరిచర్య చేయుటకు అదే పరిశుద్ధాత్మశక్తిని మనకివ్వవలెనని ప్రభువు కోరుచున్నాడు.


కేవలం ప్రసంగములను చేయుట కాదు గాని ప్రభువు యొక్క అభిషేకమును కలిగి సంఘములో బోధించాలి. కేవలం ప్రజల యొక్క మెప్పుకొరకే బోధించే పెద్దలు బబులోనును నిర్మించెదరు. ప్రజల యొక్క ఘనత కొరకు బోధించుటయు మరియు డబ్బు కొరకు బోధించుటయు రెండూ చెడ్డవే.


పౌలు ఇట్లనెను, ''మేము దేవుని వలన యోగ్యులమని యెంచబడి, సత్యమును బోధించుచున్నాము. మన హృదయములను పరీక్షించు దేవుని మాత్రమే సేవించుచు, ప్రజలకు ఇచ్ఛకపు మాటలను ఒకటి కూడా చెప్పలేదు. మీకు తెలిసిన రీతిగా, మేము ఎన్నడును మీ పొగడ్తలను కోరకయు మరియు మీ యొక్క డబ్బును ఆశించి మీ స్నేహితునివలె మేము నటించలేదు. ఇది దేవునికిని తెలుసు'' (1 థెస్సలో. 2:4, 5 లివింగ్‌).


పెద్దలైన మనమందరము పాటించుటకు ఇది ఎంతో గొప్ప మాదిరి.


క్రీస్తు శరీరములోని అనేక పరిచర్యలను గుర్తించుట:


పౌలును మరియు బర్నబాయు పాపు అను ఊరిలో పరిచర్య చేసినప్పుడు, వారి పరిచర్యలో చాలా తేడాను చూచారు (అపొ.కా. 13:7 - 10). పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఎలుమ అనే గారడీవాడిని గద్దించాడు. అయితే బర్నబా కూడా పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండిన వాడైనప్పటికినీ ఆవిధంగా ఎవరిని గద్దించలేదు (అపొ.కా. 11:24). దేవుడు బర్నబాకు వేరొక పరిచర్యను యిచ్చాడు. పౌలు దీనిని గుర్తించి తన వలె మాట్లాడమని బర్నబాను కోరలేదు. బర్నబా కూడా పౌలు పొందిన కృపను చూచి మరియు పౌలును ఆవిధముగా మాట్లాడవద్దని చెప్పలేదు.


పౌలువలెగాని మరియు స్తెఫనువలెగానీ ప్రజలను గద్దించమని ప్రతి బోధకునిని పరిశుద్ధాత్ముడు అడుగడు. ఎందుకనగా కొందరు బర్నబావలె పరిచర్య చేయుటకు పిలువబడియున్నారు. కాబట్టి పౌలువంటి పరిచర్యను పొందిన వారిని ఆవిధముగా చేయుటకు మనము అనుమతించాలి. మరియు వారు మనవలెనె మాట్లాడవలెనని కోరకూడదు.


మన శరీరములోని అవయవములవలె క్రీస్తు శరీరములోని ప్రతి ఒక్కరికి దేవుడు ఒకే పరిచర్యను కలిగిలేడు. మనం తినే ఆహారము గొంతు ద్వారా కడుపులోనికి వెళ్ళును. అయితే కడుపులో అదే ఆహారము మీద రసాయనములు పోయబడును. కడుపు ఆహారంమీద రసాయనములను ఎందుకు పోయుచున్నదో గొంతుకు తెలియకపోవచ్చును అయితే అది కడుపును ఆ పని చేయనిచ్చును. మనము తినిన ఆహారము అరుగుటకును మరియు వాంతి అవ్వకుండుటకును దేవుడే కడుపుకు ఆ ''పరిచర్యను'' ఇచ్చియున్నాడు. క్రీస్తు శరీరములో కూడా, పరిచర్యలన్నియు వేరువేరుగా ఉన్నప్పటికినీ, అవన్నియు విలువైనవే. పౌలు చేయగలిగినది బర్నబా చేయలేడు మరియు బర్నబా చేయగలిగినది పౌలు చేయలేడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి యిచ్చిన పరిచర్యను చేయుటకు మనము అనుమతించాలి.


ఎవరైనను లేఖనములను అధిగమించినట్లయితే, అప్పుడు వ్యక్తిగతముగా వారితో లేఖనముల ప్రకారం వారి పొరపాట్లను చూపించాలి. కాని దేవుడు మనకిచ్చిన పరిచర్యను బట్టి ఇతరులకు తీర్పు తీర్చకూడదు.


క్రీస్తు శరీరములో ఉన్న మనకందరకును వేరే వేరే పరిచర్యలు ఉన్నాయి. కాని అనేకసార్లు మనం చేసే పరిచర్య ముఖ్యమైనది అని తలంచే అవకాశమున్నది. కాని ''వినయమైన మనస్సు కలవారై ఒకని ఒకడు తన కంటె యోగ్యులని యెంచవలెనని'' దేవుని వాక్యము హెచ్చరించుచున్నది (ఫిలిప్పీ 2:3).


ఆత్మలను పరీక్షించుట:


లేఖనములలో మనము హెచ్చరించబడియున్నాము. ''ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి'' (1 యోహాను 4:1). ''ప్రవచనములని'' ఈనాడు పిలువబడుచున్న వాటిని వివేచించి గ్రుడ్డిగా నమ్మకూడదు (1 కొరింథీ 14:29). ''ప్రతి ప్రవచనమును పరీక్షించించి మేలైన దానిని చేపట్టాలి'' (1 థెస్సలో. 5:21).


పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను అబద్ధ ప్రవక్తల గురించి ఈ విధంగా హెచ్చరించాడు. ''మరియు - ఏదొకమాట యెహోవా చెప్పినదికాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనినయెడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు'' (ద్వితీయో. 18:21, 22).


మన గురించి సత్యమును మనము ప్రేమించుట ద్వారా అనగా ధనాపేక్ష విషయంలోనూ, లైంగికపవిత్రత విషయంలోనూ మరియు ఘనతను కోరే విషయంలోనూ మనలను మనము తీర్పు తీర్చుకొన్న యెడల మనము మోసపోము (2 థెస్సలో. 2:10, 11). ఈ పాపముల విషయంలో పోరాడని వారు మోసపోవుదురు. బైబిలు జ్ఞానము ఉన్నప్పటికినీ పెద్దలు కూడా మోసపోవచ్చును.


''తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్త పడవలెను'' (1 కొరింథీ 10:12).


అంత్యదినములలో ఎక్కువగా మోసముండునని ప్రభువైన యేసు మరియు పౌలు చెప్పిన సంగతిని గుర్తుంచుకోవాలి (మత్తయి 24:4, 5, 11, 23-25, 1 తిమోతి 4:1,2, 2 థెస్సలో. 2:9-11). మనము మోసమును తప్పించుకొని సంపూర్ణరక్షణపొందుటకు ఎల్లప్పుడు మనలను మనము తీర్పుతీర్చుకొనుచు ఉండవలెను. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ..... (1 పేతురు 4:18). మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని మరియు ఇతరులను నడిపించి, సంఘమును నిర్మించుటకు పాపములకు వ్యతిరేకముగా బలాత్కారము చేయవలెను (మత్తయి 11:12).


అబద్ధప్రవక్తలను గురించి జాగ్రత్తపడుడి:


అబద్ధప్రవక్తలను గుర్తించుటకు ఆది అపొస్తలులు కొన్ని గుర్తులను చెప్పారు. అందులో ఒకటి, మిమ్ములను డబ్బు అడిగే ప్రతి ఒక్కడు అబద్ధ ప్రవక్త. అతడు చెప్పు వాటిని మీరు వినవద్దు (12 మంది అపొస్తలుల బోధ అను పుస్తకము నుండి. ఈ పుస్తకము మొదటి శతాబ్దములో వ్రాయబడిన పుస్తకములలో ఒకటి). దీని ప్రకారం, ఈనాడు క్రైస్తవ్యములో అనేకమంది అబద్ధ ప్రవక్తలు వచ్చుచున్నారు.


క్రైస్తవ టీ.వి కార్యక్రమములలో ''స్వస్తత కూటములు'' అని పేరు పెట్టి పిలువబడుచున్న వాటికి ఈ దినములలో ఎంతో ప్రభావితం చేయబడుచున్నది. ఈ బోధకుల యొక్క రహస్య జీవితముల గురించి మనకు ఏమి తెలియదు. వీరు విడాకులు తీసుకొనకుండా మంచి కుటుంబమును కలిగియున్నారో లేదో తెలియదు. వారు ఒక స్థానిక సంఘములో సభ్యులై యున్నారో లేదో తెలియదు .కాని డబ్బు విషయములో వారి వైఖరిని బట్టియు వారు పరిచర్య చేసే విధానమును బట్టియు వారు క్రీస్తు యొక్క దాసులు కారని మనము స్పష్టముగా చూడవచ్చును.


ఒకనికున్న పేరు ప్రతిష్టలను బట్టికాని వారు చేసే ప్రదర్శనను బట్టిగానీ లేక వారి ఫలితాలను బట్టిగానీ ఒక వ్యక్తి మంచి బోధకుడని మనం ఎంచకూడదు. ఎందుకనగా ఈ రోజు మనుష్యులకు ఆకర్షణీయముగా కనబడే ఫలితములు అంత్యదినమున దేవునిచేత ''కర్ర, గడ్డి, కొయ్యకాలు''గా యెంచబడును.


ప్రభువైన యేసు నామములో నిజముగా అద్భుతములను చేసిన అనేకమంది బోధకులు పాపములో జీవించినందున, అంత్యదినమున ప్రభువైన యేసు మీరెవరో నేనెరుగను. నా యొద్ద నుండి పొండని చెప్పును (మత్తయి 7:22, 23). కాబట్టి నకిలీ ''అద్భుతములు'' చేయువారిని ఇంకెంత కఠినముగా తీర్పు తీర్చును.


ఈ క్రింది పరీక్షల ద్వారా ఒక బోధకుని అంచనా వేయవచ్చు.


1. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్యలో అనుసరించిన పద్ధతులను మరియు క్రొత్త నిబంధన నియమములను అతడు పాటించుచున్నాడా? ప్రత్యేకముగా డబ్బు విషయములో?


2. ఒక బోధకుడు తన బోధ ద్వారా మనలను కేవలం ఉద్రేకపరుస్తున్నాడా లేక దేవుని వాక్యమును మనము ఒప్పుకొనేటట్లు చేసి క్రీస్తు యొక్క ఆజ్ఞలకు మనము విధేయులము అగునట్లు ప్రోత్సహించుచున్నాడా? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమునకును మరియు మానవపరమైన అనర్గళముగా మాట్లాడుటకును తేడా తెలిసియుండాలి (దీనిని రాజకీయనాయకులు మరియు టీ.విలో మాట్లాడేవారు కలిగియుందురు).


3. ఒకని బోధ మనకు వినోదము కలిగించి నవ్వేటట్లు చేస్తున్నదా లేక మన పాపమును ఒప్పింప జేసి మరియు మారుమనస్సు కలుగజేయుచున్నదా?


4. బోధ ద్వారా ఆ బోధకుని మెచ్చుకొనేటట్లు చేయుచున్నదా లేక మనలను క్రీస్తు యొద్దకు నడిపించుచున్నదా?


వీటిద్వారా మీరు పరీక్షించిన యెడల మీరు అనేక బోధకులను తప్పుగా అంచనా వేసారనియు మరియు దాని ఫలితముగా మీరు ఆత్మీయముగా మరియు ఆర్థికముగాను నష్టపోయారనియు కనుగొనగలరు. కాబట్టి ఇటువంటి దుర్భోధకులకు మీ డబ్బును ఇచ్చి నష్టపోకుండా జాగ్రత్తపడుడి.


ప్రభువు నామములో అనేకమంది బోధకులు కానుకలు పట్టుచున్నారు. ప్రభువు భూమిమీద జీవించినప్పుడు, ఆయన ఎవరిని డబ్బు అడుగలేదు కనుక దీనికొరకు ప్రభువు నామమును వ్యర్థముగా ఉపయోగించి మరియు మోసము చేయకూడదు. కాబట్టి ఆయన నామములో ఎవరైనను డబ్బును ఏ విధముగా అడుగగలరు. పరలోకము వెళ్ళిన తరువాత ప్రభువు డబ్బు విషయములో తన వైఖరిని మార్చుకొనలేదు. క్రొత్త నిబంధనను జాగ్రత్తగా చదవని సామాన్యమైన విశ్వాసులను కొందరుబోధకులు ఈవిధముగా మోసగించెదరు.


ఈ దినములలో, ''కొందరు స్వస్థపరచే సువార్తికులు'' అని పిలువబడేవారు (బహిరంగ కూటములలో, టీ.వీ లలో మరియు మానపత్రికలలో) బోధించేవారు దేవుడు సమస్తమును చేయగలడనియు అనగా గ్రుడ్డివారు చూచెదరనియు కుంటివారు నడచెదరనియు, కేన్సరును స్వస్థపరచుననియు మరియు మృతులను లేపుననియు చెప్పి మరియు ''ఈ అద్భుతములను పొందుటకు విశ్వాస ముంచవలెననియు'' చెప్పుదురు. వీటన్నింటిని చెప్పిన తరువాత, చాలా పెద్ద మొత్తంలో వారికి డబ్బును ఇవ్వమని వినేవారిని బ్రతిమాలుదురు! కాబట్టి ఈ బోధకుల ప్రకారం, తన పరిచర్య కొరకు సర్వశక్తిగల దేవుడు డబ్బును మాత్రము ఇవ్వలేడు! ఇది ఎంత బుద్ధిహీనతయో మీరు చూశారా? ఈ విధముగా డబ్బు కొరకు భిక్షమెత్తుట ద్వారా ప్రభువైనయేసుక్రీస్తు నామమును అవమానపరచుచున్నారు. దాదాపు ఈ విధముగా భిక్షమెత్తెటి వారందరును ''పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందియున్నామనియు మరియు అన్యభాషలతో మాట్లాడుచున్నామనియు చెప్పుదురు. కాబట్టి వెలుగుదూత వేషమేసుకున్న దురాత్మ ద్వారా మోసగించబడి మరియు నకిలీ అనుభవమును పొందియున్నారు (2 కొరింథీ 11:13 - 15). కాని అనేక లక్షలమంది విశ్వాసులు ఈ మోసమును గుర్తించక మరియు బుద్ధిహీనులై వారికి డబ్బును పంపెదరు.


మనుష్యులను వెనుకకుపడవేయుట ద్వారాను మరియు నియంత్రణలేకుండా నవ్వేటట్లు చేసి మరియు ఇవి పరిశుద్ధాత్మద్వారా కలిగేవి అని చెప్పి బోధకులు విశ్వాసులను మోసగించుచున్నారు. ఇటువంటి బోధకుల ద్వారా మోసపోకుండునట్లు ప్రతి దానిని 4 ప్రశ్నల ద్వారా పరీక్షించుడి.


1. ప్రభువైన యేసు దీనిని చేసియున్నారా?


2. ప్రభువైన యేసు దీనిని బోధించియున్నాడా?


3. అపొస్తలులు దీనిని చేసియున్నారా?


4. అపొస్తలులు దీనిని బోధించియున్నారా?


ఈ నాలుగు పరీక్షలలో ఒక బోధకుడు ఓడిపోయిన యెడల, అతడు ఎంత పేరుప్రతిష్టలు కలిగినప్పటికినీ అతనిని మరియు అతని క్రియలను నకిలీవని భావించి విసర్జించవలెను.


బీదలను దోపిడీచేయు బోధకులు:


ప్రభువైన యేసు దేనినైతే తీవ్రముగా వ్యతిరేకించియున్నారో, దానిని నేను కూడా చాలా తీవ్రముగా వ్యతిరేకించుచున్నాను. దేవుని సేవించుచున్నామని చెప్పుకొనుచు మరియు దేవుని నామములో బీదల యొద్దనుండి డబ్బులు తీసుకొనువారిమీద ప్రభువైన యేసు కొరడాను ఉపయోగించాడు (యోహాను 2:14 - 17).


దేవుని పరిచర్యకు కానుకలు ఇవ్వనియెడల దేవుని యొక్క తీర్పు వారిమీదకు వచ్చునని అమాయకులైన విశ్వాసులను బోధకులు బెదిరించినప్పుడు, అది ప్రభువైనయేసు డబ్బుని లాక్కునేవాడుగా చూపించుచున్నారు. వారు ఈ విధంగా ప్రభువు నామమును అవమానపరచుచుండగా, అది నాలో పరిశుద్ధమైన కోపమును మండుచుండేటట్లు చేయుచున్నందువలన గత నలభై సంవత్సరములుగా దీని గురించి చాలా వ్యతిరేకముగా బోధించియున్నాము.


మలాకీ 3:8, 9 అను బైబిలులోని వచనములు తప్పుగా వ్యాక్యానించబడి మరియు అపార్థము చేసుకొనబడినవి. ''మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు'' (మలాకీ 3:8, 9). కాని ఈ వచనము పాత నిబంధనలోని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. ఇశ్రాయేలు దేశం దేవునియొక్క ప్రభుత్వం క్రింద ఉన్నది గనుక వారు లేవీయులను పోషించుటకు దశమ భాగము ఇవ్వవలసివచ్చింది. ఇతర దేశములలో వలె, పన్ను చెల్లించని వారిని శిక్షించెదరు.


క్రొత్త నిబంధనలో ఉన్న మనకు అది వర్తించదు. పెంతెకొస్తురోజున పాత నిబంధన కొట్టివేయబడింది. దేవునిని తండ్రిగా కలిగిన కుటుంబమే సంఘము. ఏ తండ్రియు బిడ్డల యొద్దనుండి పన్నును కోరడు! దేవుని యొక్క బిడ్డలకు వాక్యము ఇట్లు చెప్పుచున్నది, ''సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును'' (2 కొరింథీ 9:7).


అన్య దేశమైన భారతదేశములో కూడా ప్రభువును ప్రజలయొక్క డబ్బును కోరేవాడుగా చూపించుట సిగ్గుచేటై యున్నది.


ఇటువంటి విషయములు ప్రభువు నామమునకు అవమానము తెచ్చును గనుక, అవి నాకు కోపము తెప్పించుటే గాక దు:ఖము కూడా కలుగజేయుచున్నవి.


పౌలు ఇట్లన్నాడు, ''సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరినిగూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటియందే మనస్సు నుంచుచున్నారు'' (ఫిలిప్పీ 3:17-19).


పౌలు పాపమునకు చాలా వ్యతిరేకముగా బోధించినందువలన డబ్బు తీసుకొనేవిషయంలో ఇటువంటి వైఖరి కలిగిన దేమా అతనిని విడిచిపెట్టాడు. పౌలు చివరి పత్రికలో యిట్లు చెప్పుచున్నాడు, ''ఆసియాలోని వారందరును నన్ను విడిచిపోయిరి. వారిలో ప్రుగెల్లు, హెర్మోగెనే అనువారు ఉన్నారు''. కాని కొందరు అతనితో చివరివరకు ఉన్నారు. ''ప్రభువు ఒనెసిఫోరు యింటివారి యందు కనికరము చూపును గాక. ఎందుకనగా అతడు నన్ను సిగ్గుపరచలేదు'' మరియు పౌలు తిమోతితో, ''నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుమని చెప్పాడు'' (2 తిమోతి 1:13-16).


''దేవుని వాక్యమును కలపి చెరిపెడువారు అనేకులు'' మొదటి శతాబ్దములో ఉన్నారు (2 కొరింథీ 2:17).


ప్రభువైన యేసు చెప్పిన రీతిగా దేవుడు మరియు సిరి అనే ఇద్దరు యజమానులు, మనుష్యులు వారిని సేవించవలెనని కోరుచున్నారు. నీవు పూర్తిగా దేవుని చేత పరిపాలించబడనియెడల, సిరి నిన్ను పరిపాలిస్తుంది. అప్పుడు నీవు డబ్బును ప్రేమించే బోధకులచేతను మోసగాళ్ళచేతను మోసపోయెదవు.


అంత్యదినములలో నీవు మోసపోకుండ ఉండవలెనని కోరినయెడల, ధనాపేక్షనుండి విడుదల పొందుటను కోరవలెను.


క్రొత్త నిబంధన అనుసరించి మరియు ప్రభువైన యేసు జీవితము మరియు పరిచర్యలో ఉన్న నియమములను పాటించినయెడల, నీవు ఎన్నటికి తప్పిపోవు.


ఈ అంత్య దినములలో ఉన్న మోసము:


2 థెస్సలోనిక 2వ అధ్యాయములో, అంత్యదినములలో రానైయున్న క్రీస్తువిరోధి గురించి హెచ్చరించుచున్నది. ''ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటిపైగా తన్నుతాను హెచ్చించుకొనుచూ, తాను దేవుడనని కనుపరచుకొనును'' (4, 9). ఈనాడు క్రైస్తవ్యములో క్రీస్తువిరోధి ఆత్మను కనుగొనగలము (1 యోహాను 2:18 - 20). నకిలీ ప్రవచనాల ద్వారాను మరియు నకిలీ సూచనలు ఆశ్చర్య కార్యముల ద్వారాను, ఇతరులను వారి యొద్దకు ఆకర్షించుకొనుచు మరియు ఇతరుల యొద్దనుండి కానుకలను అడుగుచు మరియు అనేకకార్యముల ద్వారా ఇతరులను తమ ఆధీనములో ఉంచుకొనుచు, తమ్ముతాము హెచ్చించుకొనుచు మరియు వారి యెదుట దేవునివలె నడుచుకొను అనేకమంది బోధకులను కనుగొనగలము. (1 సమూయేలు 2:12 - 17, ఏలీ కుమారులవలె).


2 ధెస్సలోనిక 2:10, 11లో కొందరిని దేవుడే మోసగించునని హెచ్చరించబడింది. మనము ''సత్యమును ప్రేమించి రక్షించబడవలెనని కోరినయెడల మనం రక్షించబడవచ్చునని'' ఈ వచనములు బోధించుచున్నవి. అనగా,


1. దేవుడు చూపించిన రీతిగా మనలో ఉన్న పాపమును గూర్చియు, స్వార్థమునుగూర్చియు మరియు గర్వమునుగూర్చియు ఉన్న సత్యమును మనము ప్రేమించిన యెడల


2. దేవుడు తన వాక్యములో మనకు చూపించిన సత్యములను ప్రేమించుట ద్వారాను


3. 22పాపమంతటినుండి మనము రక్షించబడుటకు'' కోరవలెను (ఉదాహరణకు స్వార్థము, గర్వము, మోహపుతలంపులు, కోపము మరియు ధనాపేక్ష అనే పాపములు).


ఈ దినములలో ప్రపంచములోని అనేక ''క్రైస్తవ'' పరిచర్యల ద్వారా దేవుడు విశ్వాసులను పరీక్షించుచున్నాడు. ప్రతి యొక్క విశ్వాసి తనలో ఉన్న ఆసక్తిని బట్టి ఆయా పరిచర్యలకు ఆకర్షించబడును. దైవభక్తి గల జీవితము కొరకు ఆకలిదప్పులు గలవారు, దానిని బోధించేవారి పరిచర్యలవైపు ఆకర్షించబడుదురు.


కాని దేవుడు అనేక అబద్ధ (నకిలీ) పరిచర్యలను కూడా వర్ధిల్లజేయుచున్నాడు. అదేదనగా ''ఆరోగ్యము - సిరిసంపదలను గూర్చిన సువార్త'', ''నకిలీ అన్యభాషలు'', ''అబద్ధ సూచనలు, అద్భుత కార్యములు'', ''అసత్యమైన ప్రవచనములు చెప్పుట'', ''స్తుతించేటప్పుడు కొన్ని మాటలను మరల మరలా చెప్పుట ద్వారా అసత్యముగా ఆరాధించుట'', పాపములో జీవించుచున్నవారికి ఆదరణ కలిగించే బోధ, క్రైస్తవ రాక్‌ సంగీతము మరియు శిష్యత్వముగురించి కాక కేవలం సువార్తచెప్పుట. దేవుడు తన బిడ్డలను పరీక్షించుటకు ఈ అంత్యదినములలో ఈ పరిచర్యలను వర్ధిల్లేటట్లు చేయుచున్నాడు. అనేకమంది విశ్వాసులు ప్రాథమికముగా దైవభక్తిని కోరుటలేదు గనుక ఈ పరీక్షలలో ఓడిపోయెదరు.


కాని నిజముగా దేవుని ఆరాధించువారు, ప్రభువైన యేసునే మాదిరిగా కలిగి మరియు శిష్యులుగా ఉండుటకు కోరెదరు గనుక ఈ మోసమును తప్పించుకొందురు. అటువంటి విశ్వాసులు తమలో ఉన్న పాపమును వెంటనే ఒప్పుకొని ఎల్లప్పుడు లేఖనముల యొక్క అధికారాన్ని అంగీకరించెదరు గనుక వారు ఎప్పటికి మోసపోరు. వీరు మనుష్యుల ఆచారములను మరియు సొంత సంశయములను పాటించరు.


అధ్యాయము 14
దైవికమైన విధానములో దేవుని వాక్యమును బోధించుట

''ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించునట్లు బోధింపవలెను'' (1 పేతురు 4:11).


దేవుని వాక్యమును ఇతరులకు సరిగా బోధించుటకు మనము ప్రభువు సన్నిధిలో జీవించవలెను. యెషయా, యెహెజ్కేలు మరియు యోహానులను ప్రభువు ఈ విధంగా సిద్ధపరిచియున్నాడు.


యెషయా 6:1లో, యెషయా దేవుని మహిమను చూచిన తరువాత ప్రజలకొరకు దేవుడు అతనికి ఒక వర్తమానము ఇచ్చెను (యెషయా 6:9).


యెహెజ్కేలు 1:26లో, యెహెజ్కేలు దేవుని మహిమను చూచిన తరువాత ప్రజలకొరకు దేవుడు అతనికి ఒక వర్తమానము ఇచ్చెను (యెహెజ్కేలు 2:3).


పక్రటన 1:17లో అపొస్తలుడైన యోహాను ప్రభువైనయేసు యొక్క మహిమను చూచిన తరువాత ఏడు సంఘములకు వర్తమానములు వ్రాయమని ప్రభువు చెప్పాడు (పక్రటన 1:19, 20).


మనము అన్ని సమయములలో ఆత్మాభిషేకమును కలిగియున్నయెడల, మనము ఎల్లప్పుడు ప్రభువు సన్నిధిలో జీవించెదము. దేవుని యొక్క ప్రజలు నిర్మించబడునట్లుగా వారిని ప్రోత్సాహించి మరియు సవాలుచేయుటకు సమతుల్యము కలిగి మరియు ప్రవచనాత్మకముగా బోధించునట్లు ఆత్మాభిషేకము చేస్తుంది (1 కొరింథీ 14:3).


మనము సవాలుచేయుచు మరియు గద్దించుచు బోధించిన ప్రతిసారి ఆదరణయు మరియు ప్రోత్సాహమును కలుగునట్లు బోధించవలెను.


డబ్బు విషయంలోను మరియు మాట్లాడే విషయంలోను నమ్మకముగా ఉండుట:


మన యొక్క బోధ అభిషేకములో మాత్రమే గాక పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతతో కూడా ఉండవలెను. దేవుని వాక్యములో ఉన్న శోధింపశక్యము కాని ఐశ్వర్యమును ఇతరులకు బోధించుటకు మనము పిలువబడ్డాము. కాని ఆ ఐశ్వర్యములను దేవుని యొద్దనుండి ఏ విధంగా పొందుకొనగలము?


దేవుని వాక్యమును చదువుట ముఖ్యమైయున్నది. దేవుని వాక్యములోని ఐశ్వర్యములను గూర్చిన ప్రత్యక్షతలు పొందుటకు వాక్యమును ధ్యానించువారు, దానికి లోబడుచు శిష్యులుగా ఉండవలెను (మత్తయి 13:52 మెసేజ్‌ పేరాఫ్రేజ్‌).


ఒకవ్యక్తి దేవునివాక్యమును సరిగా బోధించుటకు అతడు తనయొక్క డబ్బును మరియు నాలుకను ఉపయోగించే విషయంలో నమ్మకముగా ఉండాలి.


మన డబ్బు విషయంలో ప్రభువైన యేసు యిట్లన్నారు, ''కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును'' (లూకా 16:11). క్రీస్తువలె రూపాంతరము చెందుట మరియు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మరియు దేవుని వాక్యమును గూర్చిన ప్రత్యక్షతలే నిజమైన ధనము. మన వ్యక్తిగత జీవితములో డబ్బును ఉపయోగించే విషయములో నమ్మకముగా ఉండినయెడల ఈ ఐశ్వర్యములను పొందగలము. ఈనాడు క్రైస్తవ్యములో ప్రత్యక్షతగల బోధ కొదువగా ఉండుటకు ముఖ్యకారణం ఈ విషయములో ఓడిపోవుటే. డబ్బు విషయములో అనేకమంది బోధకులు అపనమ్మకముగా ఉన్నారు. చాలామంది డబ్బు విషయంలో నీతిగా ఉండవచ్చును గానీ దానిని ఉపయోగించే విషయములో నమ్మకముగా లేరు. ఈ విషయమును గురించి ఇప్పటికే ఎక్కువగా చెప్పియున్నాను. కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు.


మన బోధ: దేవుడు మన ద్వారా మాట్లాడుట అనునది మనము మాట్లాడే విషయంలో నమ్మకముగా ఉండుటపై ఆధారపడియుండును. యిర్మీయా 15:19లో ప్రభువు ఇట్లన్నారు, ''ఏవి నీచములో యేవి ఘనములో గుర్తిపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు''. మన యింటిలో గాని మరెక్కడైననూ వ్యర్థమైన మాటలు పలుకక మరియు ఏదైతే అవసరమో మరియు విలువైనదో దానినే మాట్లాడినయెడల, మనము దేవుని వాక్యమును బోధించునప్పుడు దేవుడు కూడా మనతో ఉండును. నిజానికి నీవు నా నోటివలె ఉందువని దేవుడు చెప్పుచున్నాడు. ఇది ఎంతో గొప్ప ఘనత!


మిగతా సమయములలో నీ నాలుకను ఉపయోగించుటకు నీవు అపవాదికి అవకాశమిచ్చిన యెడల, నీవు బోధించునట్లు దేవుడు నీ నాలుకను ఉపయోగించుకొనడు. తమ నాలుకలను నిర్లక్ష్యముగా ఉపయోగించుట వలన అనేకమంది తమ పరిచర్యలను పాడు చేసియున్నారు.


బైబిలు యిట్లు చెప్పుచున్నది, ''జీవమరణములు నాలుక వశము'' మరియు ''సాత్వికమైన నాలుక జీవవృక్షము'' (సామెతలు 18:21, 15:4). కాబట్టి నాలుక నుండి ఆత్మీయజీవము గానీ మరణముగానీ వచ్చును.


క్రొత్త నిబంధనలో నాలుక గురించి రెండు రకముల అగ్నిలు ఉన్నవి. అందులో ఒకటి ''అగ్నిజ్వాలల వంటి నాలుక''. శిష్యులు బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చియున్నాడు (అపొ.కా. 2:3). మరొకటి ''నాలుక అగ్నియే, అది నరకము చేత చిచ్చుపెట్టబడి యున్నది'' (యాకోబు 3:6). మనకు కావలసిన అగ్నిని మనం కోరుకోవలెను.


మన నాలుకను అదుపు చేసుకొనుటకు, ముందుగా హృదయమును అదుపు చేసుకొనవలెను. ప్రభువైన యేసు యిట్లన్నారు, ''సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును'' (మత్తయి 12:34, 35). కాబట్టి మొదటిగా మన హృదయమును సరిచేసుకోవలెను. నీళ్ళ ట్యాంకర్‌ మురికి నీటితో ఉన్నయెడల కుళాయిలో నుండి కూడా మురికి నీరే వచ్చును. మొదటిగా నీళ్ళ ట్యాంకర్‌ను శుద్ధిచేయవలెను. అప్పుడు శుద్ధజలము వచ్చును.


మన హృదయములలో నిండిన తలంపులను బట్టియే మనము ఎల్లప్పుడు మాట్లాడెదము. కాబట్టి మీరు ఎక్కువగా దేవుని వాక్యమును ధ్యానించినయెడల, అటువంటి తలంపులే మీలోనుండి వచ్చును. కాని మీ హృదయము ఇతరుల విషయములో అసహనముతో ఉన్నయెడల అదియే మనలో నుండి వచ్చును.


''క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి'' (కొలొస్స 3:15). కాబట్టి మన హృదయములను అభ్యంతరపరచే విషయములను ఎన్నడైనను మాట్లాడకూడదు మరియు వ్రాయకూడదు. ఒకచోట పొరపాటు జరిగినప్పుడు ఒక మధ్యవర్తి ఈల వేసినట్లుగా మన హృదయములలో సమాధానము కోల్పోయెదము. అప్పుడు ఆ పొరపాటును సరిచేసుకొని మనం ముందుకు వెళ్ళాలి.


''యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టిమూసలో ఏడు మారులు కడిగి ఊదిన వెండియంత పవిత్రములు'' (కీర్తన 12:6). కాబట్టి ఎప్పుడైనను మీకు ఇబ్బంది కలిగించే తలంపులు వచ్చినయెడల, వాటిని మరలా మరలా ప్రభువు యొద్దకు ఏడుసార్లు తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఆయన కొలిమి మానవ సంబంధమైన కోపమును మరియు అసహనమును తీసివేయును. అప్పుడు అవి గద్దించే మాటలు అయినప్పటికిని, దేవునిచేత పవిత్రపరచబడిన మాటలు ఆయన కోరిక చొప్పున మాట్లాడెదవు. అప్పుడు దేవుడు నీ పరిచర్యను బలపరచును. అదే విధంగా నీవు ఇతరులను సరిదిద్దుటకు ఈమెయిల్‌గాని ఉత్తరంగాని వ్రాసెదవు.


దేవుని యొక్క వాక్య పరిచర్య చేయుట:


సామాన్యముగాను మరియు స్పష్టముగాను ఉండాలి:


ఇతరులకు మనము ఒక వర్తమానమును బోధించుటకు ముందుగా, దేవుని వాక్యమును లోతుగా ధ్యానించి, లేఖనములను లేఖనములతో సరిపోల్చుతూ మరియు ఆయన వాక్యము మీద ప్రత్యక్షత మనకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చునట్లు ప్రార్థించుచూ మరియు ఆయన వర్తమానము మీద అవగాహన కలిగి స్పష్టముగా ప్రకటించునట్లు దయచేయుమని ప్రార్థించాలి.


దేవుని ప్రజలతో మనము పంచుకునేదంతయు సామాన్యముగాను మరియు స్పష్టముగాను ఉండాలి. ఇతరులనుండి ఘనత పొందుటకు గొప్ప ప్రసంగములను చేయవలెననే శోధనను నివారించాలి. మనము తలలోనుండి మాట్లాడునది ఇతరుల యొక్క తలలోనికి వెళ్లును. కాని మన హృదయములో నుండి మాట్లాడే సామాన్యమైన మాటలు, ఇతరుల హృదయములలోనికి వెళ్ళును.


దేవుడు మనతో మాట్లాడిన కొన్ని మాటలను మనము వ్రాసుకొనుట మంచిది. యోహానుతో దేవుడు చెప్పే మాటలను వ్రాసుకొనమని దేవుడు ప్రకటన గ్రంథములో 12 సార్లు చెప్పాడు (పక్రటన 1:11, 19, 2:1, 8, 12, 18, 3:1, 7, 14, 14:13, 19:9, 21:5) లేనట్లయితే దేవుడు తనతో చెప్పిన దానిని యోహాను మరచిపోవును. ఒకరోజులో అనేక సమయములలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దానిని వ్రాసుకొనుటకు మనము ఎల్లప్పుడు ఒక పుస్తకమును మరియు పెన్నును కలిగియుండుట మంచిది. అప్పుడు ప్రభువు మన మనస్సులలో పెట్టిన తలంపులను మరచిపోకముందే వ్రాసుకోవచ్చును. మీకు మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లయితే, నీవు దానిలో కూడా వ్రాసుకోవచ్చును.


స్థూల దృష్టి మరియు అభిషేకము:


నీవు దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు, గురి లేకుండా చెప్పిన దానినే మరల మరలా చెప్పకూడదు. ఇది పాపము కాదు గానీ ఇతరుల సమయమును వృథాచేసి మరియు ఆ కూటములలో విసుగుతెచ్చును. నీవు పంచుకోవాలని కోరుకొనిన ముఖ్యమైన విషయములను నీవు ముందుగానే వ్రాసుకొనిన యెడల నీ ప్రసంగము క్లుప్తముగా ఉండుటయే గాక వినుటకు సులభముగా ఉండును కాబట్టి పలభరితముగా ఉండును. కొందరు సహోదరులకు మంచి జ్ఞాపకశక్తి ఉండుట వలన, ముఖ్యమైన విషయములను వ్రాసుకొనకుండానే వారు మాట్లాడుదురు.


పౌలు యొక్క బోధ ''మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక సామాన్యముగా ఉండి మరియు అతని మాటలలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉండెడిది'' (1 కొరింథీ 2:4, 5). మనము ఎల్లప్పుడు దేవుని వాక్యమును ఆ విధముగా బోధించవలెనని ఆసక్తి కలిగియుండాలి. ''అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు'' (1 సమూయేలు 3:19). అప్పుడు వినినవారు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడి వారు యింటికి వెళ్ళెదరు. ప్రభువైన యేసు చెప్పినట్లుగా, ''ఆదరణకర్త వచ్చినప్పుడు, సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మరియు మీరును సాక్ష్యమిచ్చెదరు'' (యోహాను 15:26, 27). అనగా మన యొక్క బోధను పరిశుద్ధాత్ముడు బలపరచును. కాబట్టి మనము ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును కలిగి దేవునివాక్యమును ఫలభరితముగా బోధించునట్లు మనము దేవునికి ప్రార్థించాలి.


ఆరోగ్యకరమైన హితబోధ:


పౌలు హెచ్చరించిన అంత్యదినములలో మనము నివసించుచున్నాము. ''ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును'' (2 తిమోతి 4:3, 4).


కాబట్టి ''వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము బుద్ధిచెప్పుము'' (2 తిమోతి 4:2).


మూడవ వచనములోని హితబోధ అనగా ఆరోగ్యకరమైన సిద్ధాంతము. మంచి ఆసుపత్రులలో ఎటువంటి చిన్న క్రిములు కూడా రాకుండా ఉండుటకు నేలను ఎల్లప్పుడు యాంటీసెప్టిక్‌ ద్రవములతో శుభ్రము చేసినట్లుగా మన బోధ వినువారు కూడా చిన్న పాపములనుండి విడుదల పొందుటకు మనము జాగ్రత్తపడాలి.


ఆసక్తికరముగాను మరియు అర్థవంతముగాను ఉండాలి:


మన ప్రసంగములు ఆసక్తికరముగా ఉండాలి. మన ప్రసంగముల ద్వారా విసుగు చెందుట ద్వారా కాని లేక మనము బోధించేటప్పుడు ఎక్కువగా తిట్టుటద్వారాగానీ ప్రజలు మన సంఘమును విడిచిపెట్టినప్పుడు వారిని నిందించకూడదు.


పస్రంగి 12:9-11 (లివింగ్‌ బైబిల్‌)లో ఇట్లు చదివెదము. ప్రసంగి జ్ఞానియైయుండెను. అతనికి తెలిసినదంతయు ఇతరులకు బోధించుచుండెను. అతడు సామెతలను అనుక్రమ పరచెను. ఎందుకనగా ప్రసంగి జ్ఞాని మాత్రమే కాదు మంచి బోధకుడు. అతడు తనకు తెలిసిన దానినంతటిని బోధించుటయే కాదు గానీ దానిని ఆసక్తితో బోధించెను. జ్ఞానము గల వ్యక్తి యొక్క మాటలు ములకోలల వలెను చక్కగా కూర్చబడి దిగగొట్టబడిన మేకుల వలె ఉన్నది.


పై వచనము నుండి మనము అనేక విషయములను నేర్చుకొనెదము. ఆ వచనమును నెమ్మదిగా చదివి మరియు ప్రతిమాటను ధ్యానించాలి. మన ప్రసంగములు ఇతరులకు ఆసక్తికరముగా ఉండాలి. వారు మన మాటలను వినినప్పుడు ఆవిధంగా చేయుటకు వారు ప్రోత్సహించబడాలి. దానికొరకు మన తలంపులన్నింటిని సమకూర్చి మరియు సరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక మంచి గృహిణి మంచి భోజనమును సిద్ధపరచిన తరువాత, ఆకర్షణీయముగా ఆహారమును పాత్రలలో ఒక భోజనపు బల్ల మీద పెట్టునట్లుగా మనము కూడా ఇతరులకు ఆసక్తికరముగాను మరియు సులభముగా అర్థము చేసుకొనేటట్లుగా ఉండాలి. మన ప్రసంగము ఇతరులకు ఆకర్షణీయముగా నుండునట్లు దాని సిద్ధపరచుటకు మన సమయమును వెచ్చించి మరియు దానికొరకు ప్రయాసపడాలి. ప్రభువైనయేసు ఈ విధంగా బోధించారు.


గొప్ప బోధకుడను మనం అనుసరించాలి:


మనకు అనేక సంవత్సరములు పట్టినను ప్రభువైన యేసు బోధించిన విధానమును పొందుటకు మనము ప్రయాసపడాలి.


ఈ దినములలో అనేక భారతదేశపు బోధకులు, పాశ్చాత్య బోధకుల వలె ప్రజలలో ప్రచారము పొందటానికి అనుసరించే చిట్కాలను మరియు పద్ధతులను అనుసరించుచున్నారు. ప్రభువైన యేసును మాత్రమే నీకు మాదిరికరమైన బోధకునిగా చేసుకొనుము.


ప్రభువైన క్రీస్తు యొక్క రక్తము మనకొరకు ఏమిచేస్తుంది:


గతములో వారి యొక్క పాపజీవితమును బట్టి అనేకమంది విశ్వాసులు నేరారోపణలోనూ మరియు నిరాశలోనూ జీవించుచున్నారు. సాతాను యొక్క నిందారోపణనుండిగాని అతని యొక్క బంధకముల నుండిగానీ విడుదలపొందినట్లు వీరు కనబడెదరు. ప్రభువు యొక్క దాసులముగా మనము వారిని విడిపించాలి.


దేవుడు ఉచితముగా ఇచ్చే పాపక్షమాపణను అవకాశముగా తీసుకొని, ప్రభువైన క్రీస్తు రక్తము కుళాయి నుండి వచ్చే నీటిగా భావించి పాపములో జీవించుచున్నారు (హెబీ 10:26 - 29). కాబట్టి యథార్థమైన విశ్వాసులు క్రీస్తురక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడెదరనే వర్తమానమును మనము ఆపకూడదు. ఎందుకనగా కొందరు విశ్వాసులు అనవసరముగా నేరారోపణలో జీవించుచున్నారు (రోమా 5:9).


యాత్రికుని ప్రయాణము:


350 సంవత్సరముల క్రితము జాన్‌ బన్యన్‌ వ్రాసిన యాత్రికుని ప్రయాణము అనే పుస్తకము, అనేక శతాబ్దములనుండి అనేకమంది దేవుని బిడ్దలకు ఆశీర్వాదకరముగా ఉన్నది. నీవు ప్రభువైన యేసు యొక్క మంచి శిష్యుడిగా ఉండుటకు ఆ పుస్తకము నీకు సహాయపడగలదు.


బోధించే విషయములో సరియైన వైఖరి కలిగియుండుట:


రోమా 12:3, 6లలో పౌలు యిట్లు చెప్పుచున్నాడు ''తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను..... ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము''.


కొందరు తమ గురించి ఎక్కువ తలంపులు కలిగి యున్నందున దేవుడు వారికి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున కాకుండా ఎక్కువసేపు బోధించి పొరపాటు చేయుచున్నారు.


మనము బోధించినప్పుడు, ''మీ గురించి మీరు తక్కువగా ఎంచుకొనవలెనని'' లేఖనములలో హెచ్చరికలేదు. ఎందుకనగా అటువంటి అపాయము లేదు. ''మీరు బోధించినప్పుడు మీ గురించి మీరు ఎక్కువగా ఎంచుకొనే అవకాశమున్నదా లేక తక్కువగా ఎంచుకునే అవకాశమున్నదా అని మీరు ప్రశ్నించుకొనకుడి. మనకు దీని జవాబు తెలియును. ఎల్లప్పుడు మనలను మనము ఎక్కువగా ఎంచుకొనే అపాయము ఉన్నది.


మనము అభధ్రతలో ఉన్నాము కనుక మన గురించి మనము తక్కువ తలంపులు కలిగియుండాలి. ఆ విధముగా కాదు. మన తండ్రియైన దేవుని ప్రేమలో మనము ఎల్లప్పుడు భద్రత కలిగియుండాలి. మన పరలోకపు తండ్రియెడల మనము పూర్తి నమ్మకము కలిగియుండాలి. ప్రభువైన యేసు నామములో మనము సాతానును ఎల్లప్పుడు ఎదిరించాలి. మరియు మనుష్యులందరియెడల ఎల్లప్పుడు సంపూర్ణులముగా దీనులమై యుండాలి.


''మనము దేవుని కొరకు చేసిన దానిని బట్టిగాక దేవుడు మనకొరకు చేసినదానిని బట్టి మనము ఆనందించాలి'' (లూకా 10:20 మెసేజ్‌ పారాఫ్రేజ్‌). మనము ఏమైయున్నామను విషయములోనూ మరియు దేవునికొరకు మనము ఏమి చేయవలెనన్న విషయములోనూ మనలను మనము తక్కువగా ఎంచుకోవాలి. దానికి బదులుగా దేవుడు ఏమైయున్నాడో అనియు మరియు ఆయన మనకొరకు చేసి ముగించిన దానిని గూర్చియు మరియు ఆయన మనకొరకు చేయగలదానిని గూర్చియు ధ్యానించాలి. అప్పుడు మనలను గూర్చి మనము తక్కువగా ఎంచుకొని మరియు దేవుడు మనకొరకు చేయగలిగిన దానిని ఇతరుల కొరకు కూడా చేయగలడని విశ్వసించగలము. ప్రతిఒక్క బోధకుడు యిటువంటి సరియైన వైఖరిని కలిగియుండాలి.


రోమా 12:4 - 8లో పౌలు యింకను ఇట్లు చెప్పుచున్నాడు, ''మన కనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగియున్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హచ్చరించుటలోను పని కలిగియుందము''.


బోధించుట మరియు హెచ్చరించుట అనునవి రెండు వేరువేరు వరములు.


ఇతరులు ప్రేరేపించబడునట్లుగా బోధించుట అనునది దేవుని చేత ఇవ్వబడిన ఆత్మీయ వరము. కాని ఆ వరము పొందిన బోధకులు కొద్దిమందియే ఉన్నారు (యాకోబు 3:1).


కాని ఇతరులను ప్రోత్సహించి, హెచ్చరించే వరమును సహోదరులందరు కోరవలెను. అది కూడా తనకు ఇవ్వబడిన కృపాపరిమాణము చొప్పున చేయవలెను.


సంఘ కూటములలో నీవు బోధించుటకు కావలసిన మాటలను, ప్రభువు దగ్గర కనిపెట్టి మరియు ఆయన నుండి పొందుకొనవలెను. లేనట్లయితే వినువారి యొక్క సమయమును నీవు వృథా చేయుదువు. ఇతరుల యొక్క సమయము వృథాచేయుట వారి యొక్క సొమ్మును దొంగిలించుటతో సమానముగా చూడవలెను. ఈ వెలుగులో నీవు చూడగలిగినయెడల, బోధించుటకు నీవు తీసుకొనిన సమయమును బట్టి నీవు జాగ్రత్తపడెదవు. నీవు గొప్ప వరమును కలిగియుంటే తప్ప, 20 నిమిషములు కంటే ఎక్కువగా బోధించకుండుట మంచిది (ఇది ఒక సూచన మాత్రమే కాని నియమము కాదు). ఎక్కువమంది బోధకులు ఎక్కువ సమయము తీసుకొని, చెప్పిన దానినే మరల మరలా చెప్పుచూ విసుగు పుట్టించెదరు.


నీ ప్రసంగము ముగిసిన తరువాత, వినినవారు ప్రభువును కలుసుకొని యున్నామని భావించాలి (1 కొరింథీ 14:24, 25). ప్రతి యొక్క సంఘ కూటము ఈ విధముగా ఉండాలి. కాని దీనికొరకు మనము ఎక్కువగా ప్రార్థించుచూ, దేవుని వాక్యమును ఆసక్తిగా ధ్యానించుచూ మరియు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకును మరియు ప్రవచన వరము కొరకును ప్రార్థించాలి.


ప్రోత్సహించే పరిచర్యే గాని నేరారోపణ చేసే పరిచర్య కాదు:


నీవు ఎల్లప్పుడు ఇతరులను ప్రోత్సహించే పరిచర్య చేయవలెను.


హెబీ 3:13 - 15లో స్పష్టముగా ఉన్నది, ''పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు - నేడు అను సమయముండగానే, ప్రతిదినము ఒకనినొకడు ప్రోత్సహించవలెను''. ప్రతి కూటములో సహోదర సహోదరీలు అందరు ప్రోత్సహించే మాటలు మాట్లాడుటకు పిలువబడియున్నారు.


మీరు బోధించినప్పుడు ఎన్నటికిని నేరారోపణ చేయకూడదు. లేనియెడల మీరు నేరారోపణ చేసే సాతానుతో చేతులు కలిపిన వారగుదురు. మరొక వైపున నీవు మాట్లాడే ప్రతిసారీ మీ సంఘములో ప్రతి ఒక్కరిని కేవలం ప్రొత్సహించుటకు మాట్లాడవలెనని నిర్ణయించుకోవాలి.


పాపము మోసకరమైనది. వారి జీవితములోని మోసకరమైన పాపమునుండి రక్షించబడి యున్నామని ఎరుగునట్లు మీరు ప్రోత్సహించవలెను.


మరొకవైపున, నీవు ఇతరులను తిట్టుచున్నట్లయితే, నీ ప్రసంగముల ద్వారా నీ బోధ వినువారికి నేరారోపణ కలిగించినట్లయితే, నీవు వారిని నేరారోపణలోనికిని మరియు పెద్ద సహోదరుడిగా నీ గురించి అనారోగ్యకరమైన భయము కలిగియుండేటట్లు చేయగలవు.


నీవు నీ బోధ ద్వారా నీతోనున్న విశ్వాసుల యొక్క పాదములు కడిగే దాసునిగా పిలువబడి యున్నావని గుర్తుంచుకొనుము. నీవు మాట్లాడునప్పుడు, నీవు ఎప్పటికిని కోపపడకుండునట్లు నీ ఉద్రేకములను పరిశుద్ధాత్ముని చేత నియంత్రించబడనిమ్ము. నిన్ను నీవు ఒక ప్రవక్తగా నియమించుకొనవద్దు!


ఇశ్రాయేలులో 3000 సంవత్సరముల క్రితము, తన గర్వమును బట్టి సౌలును దేవుడు విసర్జించాడు (అతడు ఇతరుల అందరికంటె ఎత్తైనవాడు - 1 సమూయేలు 10:23). మరియు అతనికి బదులుగా దావీదును నియమించాడు (అందరికంటె ఇతని హృదయము శ్రేష్టమైనది - అపొ.కా. 13:22 మరియు 1 సమూయేలు 13:14). శరీరానుసారులైన విశ్వాసులు సొంత బలము కలవారిని మెచ్చుకొనెదరు (వారు తెలివిగలవారును మరియు వరములుగలవారు). కాని దేవుడు హృదయములో దీనత్వము, మంచితనము, ప్రేమ గలవారిని మెచ్చుకొనును.


మనము ''తలలో'' బలహీనులమైనప్పటికి మన హృదయము దేవుని యెదుట సరిగా ఉండాలి! మనము తెలివితేటలు లేనివారమైనప్పటికిని లేక బోధించలేకపోయినప్పటికిని, లేఖనములను ఎక్కువగా ఎరుగనప్పటికిని పరవాలేదు. కేవలం తలలో సొంత జ్ఞానం కలవారితో దేవుడు సంఘమును నిర్మించడు గానీ దేవుని యొక్క హృదయానుసారులై మరియు దేవుని ప్రజల విషయములో ఆయన ఆలోచించునట్లే ఆలోచించే వారితో ఆయన నిర్మించును.


ఆహారము పెట్టుటకే గానీ కొట్టుటకు మనము పిలువబడలేదు:


లూకా 12:42, 43లో ప్రభువు యిట్లన్నారు, ''తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు''.


మనము దేవుని ప్రజలకు బోధించే ప్రసంగములను నమ్మకస్థులమై మరియు జ్ఞానము కలిగిన దాసులముగా సిద్ధపడాలి. మన యింటికి ముఖ్యమైన అతిథిలు వచ్చుచున్నయెడల, మనము సమయమును వెచ్చించి మంచి భోజనమును సిద్ధపరుచుదము. తక్కువ రకమైన వాటితో పనికి రాని భోజనము పెట్టినయెడల అది వారికి అవమానకరమైయుండును, ఆ విధముగానే మనము అజాగ్రత్తగా ఉండి సిద్ధపడకుండా బోధించినయెడల, దేవుని ప్రజలను అవమానించుచున్నాము. మన సహోదర సహోదరీలను గౌరవించి వారికి మనము ఇవ్వగలిగిన శ్రేష్టమైన ఆహారమును, మనము బోధించే ప్రతిసారీ ఇవ్వగలుగునట్లు మనము ప్రతి ప్రయత్నము చేయాలి. దాని కొరకు నిశ్చయముగా మనయొక్క సమయము మరియు త్యాగము అవసరము. కాని ''నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకులుగా ఉండుటకు ఇష్టపడుచున్న వారెవరు?'' (లూకా 12:43).


దేవుని వాక్యముతో మన సహోదర సహోదరీలను కొట్టుటను గురించి ప్రభువు మనలను హెచ్చరించుచున్నాడు (లూకా 12:45). వారి ఓటములను బట్టి నీవు ఎన్నడైనను దేవుని ప్రజలనకు నీవు తీర్పు తీర్చకుండుటకు జాగ్రత్తపడవలెను. ప్రేమతో మాత్రమే దిద్దుబాటు చేయవలెను. ప్రేమలేనట్లయితే అసలు దిద్దుబాటు చేయకుండుట మంచిది. పిల్లల కొరకు బెత్తెమును ఎప్పుడో ఒకసారి ఉపయోగించవలెను. కాని మంచి ఆహారముతో వారిని ఎల్లప్పుడు పోషించాలి. తమ బిడ్డలకు మంచి ఆహారమిచ్చుట కంటె ఎక్కువగా తమ బిడ్డలను కొట్టుచున్న వారి తల్లిదండ్రుల గురించి మీరేమనుకుంటారు? అది బుద్ధిహీనమైయున్నది మరియు మనము ఆవిధముగా చేయకూడదు. కాని అనేకమంది బోధకులు ఆ విధంగా ఉన్నారు.


నీవు శరీరానుసారముగా ఇతరుల మీద అధికారము కలిగియుండి మరియు కఠినముగా బోధించే పెద్దగా ఉండుట ఎంతో సులభము. ఒక అభిషేకము కలిగిన ప్రవక్త మాట్లాడినప్పుడు దేవుని వలె ఖచ్చితముగా ఉంటుంది మరియు తన ప్రసంగములలో ఇతరులను గద్దించుచు మరియు సరిచేయును. కాని నీవు ప్రవక్తవు కాకుండానే, ప్రవక్తగా నటించినయెడల, నీవు బయలుపరచే కఠినత్వము శరీరానుసారముగా ఉండును.


నీ అభిప్రాయములకు వేరుగా ఉన్న వారిమీద కఠినముగా ఉండుటకు నీవు శోధింపబడవచ్చును. అప్పుడు దేవుడు కూడా నీ మీద కఠినముగా ఉండును ''దయగలవారియెడల నీవు దయచూపించుదువు. యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు'' (కీర్తన 18:25, 26).


దైవికముగా దేవుని యొక్క కఠినత్వమును కొద్దిమంది పెద్దలు మాత్రమే వ్యక్తపరచెదరు. కాబట్టి ఎల్లప్పుడు ప్రోత్సహించే పరిచర్యను మాత్రమే కోరుట మంచిది మరియు బుద్ధిచెప్పుట మరియు సరిచేయుట అనే పరిచర్యను చేయకుండుట మంచిది.


బుద్ధిచెప్పుట మరియు సరిచేయుట అనే పరిచర్యను దేవుని కఠినత్వము దైవికముగా వ్యక్తపరచే అభిషేకము గల ప్రవక్తలకే విడిచిపెట్టుము.


ఇతరులమీద కఠినముగా ఉండకుండానే సంఘములో ఉన్నతమైన ఆత్మీయస్థితిని కలిగియుండవచ్చును. కఠినత్వముతోను, తిట్టుటతోను చేసిన ప్రసంగమునే కనికరముతోను మరియు సాత్వికముతోను చేసినయెడల మంచి ఫలితములు కలుగును.


ఇతరులు మనచేత అంగీకరించబడుటకు సంఘములోని వారు మనకు విధేయులై యుండవలెనని గాని లేక భయము కలిగి యుండవలెననిగాని అనుకొనకూడదు. ఈవిధముగా వ్రాయబడి యున్నది, ''నావలని భయము నిన్ను బెదరించదు. నా చెయ్యి నీమీద బరువుగా నుండదు'' (యోబు 33:7).


మనలను అంగీకరించని వారి విషయములో మనము మౌనముగా ఉండకూడదు. ఎందుకనగా అది రాజకీయమవుతుంది. దీనత్వము విషయములోను మరియు దాసత్వము విషయములో అందరికిని మాదిరిగా ఉండవలెను. మనలను వ్యతిరేకించే వారిని దేవుడు అనుమతించినప్పుడు, మనము దేవుని కృపను పొందునట్లుగా మనలను మనము తగ్గించుకోవాలి.


చివరిగా దీనిని గుర్తుంచుకోవాలి. ''వారి మీద కనికరించువాడు వారిని తోడుకొని పోవును'' (యెషయా 49:10).


నీ సంఘములోని విశ్వాసులు ''బుద్ధిహీనులనియు మరియు హృదయపూర్వకముగా లేరనియు'' నీవు సులువుగా మాట్లాడుచున్నయెడల, వారి మీద పెద్దగా ఉండుటకు నీవు అర్హుడవు కాదని సూచించుచున్నది. ఒక దైవికమైన పెద్ద తన సొంత బలహీనతలను గుర్తించును. అందువలన అతడు ఇతరుల విషయములో సాత్వికుడై యుండును. మనము దేవునికి ఎంత దగ్గరగా వెళితే, అంత ఎక్కువగా మన సొంత బలహీనతలను గుర్తించెదము. మనము పరిశుద్ధులము అయ్యే కొలది ఇతరులయెడల సాత్వికులమై యుందుము.


చాలామంది పెద్దలకు ప్రభువైన యేసు గురించి తెలియదు. దేవుని మందిరములో ఆయన ఎల్లప్పుడు ప్రజలను కొరడాతో కొట్టే వానిగా వారు ఆయనను చూచుదురు! కాని నిజమైన యేసు ఆయన పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరములలో రెండు రోజులు మాత్రమే కొరడాను ఉపయోగించెను. కాని నీవు ప్రతి ఆదివారము కొరడాను ఉపయోగించినయెడల, నీవు ''మరియొక యేసు''ను వెంబడించుచున్నావు. ఒక నాయకుడు ''తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు'' (హెబీ 5:2).


ప్రభువైన యేసు ప్రజలను ఎంతో కనికరముతో చూసియున్నాడని సువార్తలలో అనేకసార్లు చదువుతాము. ''ఆయన సమూహములను చూచి, వారు కలవరములోను గమ్యము లేనివారిగాను మరియు కాపరిలేని గొఱ్ఱెలవలెను ఉండుట వలన ఆయన హృదయము బ్రద్దలయ్యెను'' (మత్తయి 9:36, మెసేజ్‌ పేరాఫ్రేజ్‌). ఆయన మనకు మాదిరియైయున్నాడు. ''నేను దీనమనస్సు కలవాడను మరియు సాత్వికుడను గనుక మీరు నాయొద్ద నేర్చుకొనుడి'' అని ఆయన మనలను ఆహ్వానించుచున్నాడు (మత్తయి 11:29). అనేకమంది క్రైస్తవ నాయకులకు సాత్వికము మరియు దీనత్వము ఎంతో అవసరమైయున్నది. కాని వారు వాటిని ఎంతో తక్కువగా కలిగియున్నారు.


మోషే గురించి ఒక సుందరమైన కథ కలదు (ఇది బైబిల్‌లో లేదు గాని యూదుల ఆచారములో ఉన్నది) మోషే యిత్రో మందను మేపుచున్నప్పుడు, ఒక చిన్న గొఱ్ఱెపిల్ల నీళ్లుత్రాగుటకు దూరముగా నున్న నీళ్లు ఉన్న స్థలమునకు వెళ్ళింది. మోషే పరుగెత్తుకొని వెళ్లి దానిని ఎత్తుకొని ఇట్లు అన్నాడు, ''నీకు దాహముగా ఉన్నదని నాకు తెలిసినయెడల నేనే నిన్ను మోసుకొని వచ్చెడివాడను''. నిజముగా ఇశ్రాయేలులకు నీవు సరియైన కాపరి అని వెంటనే పరలోకమునుండి ఒక స్వరము వినబడింది.


ఇది మామూలు కథ అయి ఉండవచ్చును. దేవుని హృదయము ఆవిధముగా ఉన్నది గనుక ఇది నిజమని నేను నమ్ముచున్నాను మరియు ఎక్కడైతే ఇతరుల బలహీనతను నిస్సహాయతను మరియు తప్పిపోవుట చూచి కనికరపడే వారిని దేవుడు చూచినప్పుడు, దేవుడు వారితో ఇట్లనెను, ''నిజముగా నీవు ఒక పెద్దగా ఉండుటకు అర్హుడవు''.


ప్రార్థన మరియు దేవునియొక్క వాక్య పరిచర్య:


''మేము ప్రార్థన యందును వాక్యపరిచర్యయందును యెడతెగక యుండెదమని చెప్పిరి'' (అపొ.కా. 6:4).


దేవునికే సమస్త మహిమ కలుగునట్లు, ప్రభువైన యేసు బోధించుటకు ముందుగాను, బోధించిన తరువాత ప్రార్థించెడివారు (లూకా 5:15, 16). మనము కూడా మనలను మనము తీర్పుతీర్చుకొనుటకును మరియు ప్రభువైనయేసువలె సమస్త మహిమను దేవునికి చెల్లించుటకును బోధించిన తరువాత ప్రార్థించవలెను. నా బోధ అంతకంతకు పరిపూర్ణమగునట్లు నేను ఎల్లప్పుడూ ఈ విధముగా చేయుచున్నాను.


మన సంఘములోని దేవుని ప్రజలను ఒకే శరీరముగా నిర్మించుటయే పెద్దలుగా మనయొక్క ముఖ్యమైన బాధ్యత. దీని కొరకు సరియైన రీతిగా ప్రవచించుటకు దేవునియొక్క అద్భుతశక్తి మనకు అవసరము గనుక మనము ఎల్లప్పుడు ఆసక్తితో ప్రార్థించవలెను.


సంఘము విషయములో పౌలుకున్న భారము ఏమనగా, ''మేము ప్రజలను హెచ్చరించుచు మరియు బోధించెదము. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని యెదుట నిలువబెట్టాలని కోరుచున్నాము. క్రీస్తు యొక్క శక్తివంతమైన ప్రభావముబట్టి నాలో పనిచేయుచున్నది గనుక నేను ఆవిధముగా చేయగలను. ప్రార్థనలో మీకొరకు ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను'' (కొలొస్స 1:28 - 2:1, 2 లివింగ్‌ బైబిలు).


పౌలు ఎల్లప్పుడు ప్రభువు యెడలను ఆయన ప్రజల యెడలను ఎంతో ప్రేమ కలిగియున్నాడు గనుక వారికి ఎల్లప్పుడు సరియైన వాక్యము బోధించియున్నాడు.


దేవుడు ఆమోసు ద్వారా ప్రవచించిన రీతిగా మనము జీవించుచున్న ఈ దినములలో ఎంతో ఆత్మీయకరువు ఉన్నది.


''రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కు నుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు'' (ఆమోసు 8:11, 12).


అటువంటి కరువు మన సంఘములలో ఉండకూడదు. ప్రతివారము మన సంఘములకు వచ్చినవారు శక్తివంతమైన దేవుని వాక్యము వినవలెను కాబట్టి మీరు బోధించినప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకముకొరకు మరియు ప్రవచనవరము కొరకు ఆసక్తితో ప్రార్థించుడి (2 కొరింథీ 14:1).


మీకు దేవునివాక్యము బాగా తెలిసియుండవలెను మరియు ప్రతిదినము దేవుని వాక్యము ఆసక్తితో చదివినయెడలనే అది సాధ్యము. పౌలు తిమోతితో ఈవిధముగా చెప్పారు, ''దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము'' (2 తిమోతి 2:15).


పౌలు ఈవిధముగా కూడా తిమోతితో చెప్పాడు, ''అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరియెక్కువగా భక్తిహీనులగుదురు'' (2 తిమోతి 2:16). ప్రార్థనను నీ జీవితములో ప్రాముఖ్యమైనదిగా చేయవలెనని కోరినయెడల అనేకమంది విశ్వాసులవలె అపవిత్రమైన వట్టి మాటలతో, ఫేస్‌బుక్‌ మరియు మొదలగు వాటితో సమయము వృథా చేసుకొనకూడదు. సమయము ఎంత విలువైనదో గుర్తించని వారిని, వారి సమయమును వృథా చేసుకొననిమ్ము కాని సంఘము నిర్మించుటకు ప్రభువుచేత పిలువబడిన మనకు దేవుని వాక్యము ధ్యానించుట మరియు ప్రభువు సన్నిధిలో ప్రార్థించుటయు ముఖ్యమైయున్నది. వాక్యము చదువుచు, ప్రార్థించుచుండవలెను.


''అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని అన్నియూ చేయదగినవి కావు'' (1 కొరింథీ 6:12). కాబట్టి నీ జీవితములో శ్రేష్టమైన వాటిని చేయుటకు కొన్ని మంచి విషయములను విడిచిపెట్టుము.


వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికొరకు వేగిరపడవలెను:


మనము ప్రతిదినము ''వెనుకున్నవి మరిచి మందున్న వాటికొరకు వేగిరపడవలెను'' (ఫిలిప్పీ 3:13). అనగా ఇప్పటివరకు మనము ప్రభువు కొరకు ఏమి చేయలేదని అనుకొనుచూ మరియు ఆ దినము ప్రభువు కొరకు నూతనముగా పరిచర్య చేయుచున్నామని అనుకొనుచూ ప్రతిదినము జీవించాలి.


ప్రతిదినము ''క్రీస్తులేకుండా నేనేమియు చేయలేను'' మరియు ''క్రీస్తుతో నేను సమస్తమును చేయగలను'' (యోహాను 15:5 మరియు ఫిలిప్పీ 4:13). ఏమియూ చేయలేమనగా నిత్యత్వపు విలువ గలిగిన దానిని ఏదియూ చేయలేము మరియు సమస్తము అనగా నా జీవితములోని దేవుని చిత్తమంతయు.


కాబట్టి నిన్ను నీవే దేవునికి సరిగా కనపరచుకొనుటకు జాగ్రత్తపడుము (2 తిమోతి 2:15).


అధ్యాయము 15
నాయకులు ఎందుకు పడిపోవుదురు

పైకి భక్తిగలవారై యుండి మరియు కేవలము మతానుసారముగా యుండి ఆత్మీయులు కాకుండా ఉండే గొప్ప అపాయములో ప్రతీఒక్క నాయకుడు ఉన్నాడు. దేవుని ఇంటికి ఉన్న ఒక గుర్తు ఏమనగా మనలను మనమే తీర్పుతీర్చుకొనెదము (1 పేతురు 4:17). మరియు మనలను మనమే విమర్శించుకున్న యెడల వెంటనే మనము వెలుగును పొందుచుండెదము. పెద్దలముగా అనేక విషయములలో ఆసక్తి కలిగి మరియు శక్తివంతముగా బోధించుచున్నప్పటికిని, చాలా సులభముగా మనలను మనము తీర్పుతీర్చుకొనుట ఆపివేయవచ్చును. అప్పుడు మనమీద మనము వెలుగుపొందము.


అందరూ తనను మెచ్చుకొనుచున్నారు గనుక తన యొక్క విషయములన్నియు బాగున్నవని అనుకొనిన ఒక పెద్ద సహోదరుడితో, ప్రభువు ఈవిధముగా మాట్లాడెను, ''నీవు జీవించియున్నావని పేరు ఉన్నది గాని మృతుడవే'' (పక్రటన 3:1).


ఒక కాపరి అపనమ్మకముగా ఉన్నయెడల ఆ గొఱ్ఱెలు నష్టపోవును (2 సమూయేలు 24:17). అపనమ్మకస్తులైన కాపరులను అంత్యదినమందు దేవుడు చాలా కఠినముగా తీర్పుతీర్చును. కాబట్టి మనము భయభక్తులు కలిగియుండవలెను.


ప్రతీఒక్కరికీ హెచ్చరికగా ఉండునట్లు, సంఘముల యొక్క నాయకులు పడిపోవుటకు కొన్ని కారణములు చెప్పుచున్నాను.


రహస్యముగా అన్నిటిని విడిచిపెట్టకుండుట:


కొందరు పెద్దలు, క్రీస్తుయేసు యొక్క శరీరమును నిర్మించవలెనని కోరినప్పటికిని, దాని కొరకు తగిన వెల చెల్లించుటకు ఇష్టపడరు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుటకు తమకు కలిగినదంతయు విడిచిపెట్టుటకు ఇష్టపడరు (మత్తయి 13:44, 46). వారు సంఘమును నిర్మించవలెనని కోరెదరు గాని దాని కొరకు సాధ్యమైనంత తక్కువగా ఇచ్చుటకు ఇష్టపడెదరు. వారు తమ ఉద్యోగములను, మంచి ఆహారమును, చాలా ధనమును మరియు భూమిమీద సౌకర్యవంతమైన జీవితమును లోకస్తులవలె కొందరు అదే సమయములో సంఘమును నిర్మించుచున్నామనే ఘనతను కోరెదరు. రెండు రాజ్యములయొక్క శ్రేష్టమైన వాటిని వారు కోరెదరు. దేవుడు వారి హృదయములను చూచును గనుక ఆయన అక్కడ కలవరమును మరియు పరిచర్యలో ఓటమిని తెచ్చును.


దేవునికి పక్షపాతము లేదు శక్తివంతమైన సంఘములో సభ్యులుగా ఉండుటనుబట్టి లేక ఒక మంచి దేవుని సేవకునితో సంబంధం కలిగియున్నప్పటికి దేవుడు సంతోషించడు. తెలివితేటలుకలిగి మరియు సిద్ధాంతంకొరకు ఆసక్తి కలిగియుండుట కూటములలో క్రొత్త నిబంధన పద్ధతులు అనుసరించుట ద్వారా దేవుని సంతోషపెట్టలేము.


మన యొక్క శిష్యత్వము మరియు మన రహస్య జీవితములో నమ్మకముగా ఉండుటయు, దేవుడు చూచి మనకు ఫలము ఇచ్చును. ఒక నాయకుడు ఎంత నమ్మకముగా ఉండునో అంత ఫలమును పొందును. అపనమ్మకత్వమునకు కూడా ఫలముండును. దేవుడు మోసగించబడడు మరియు ప్రతి ఒక్కరూ దేనిని విత్తెదరో దానినే కోసెదరు. ప్రతి నాయకుడు భూమిలో పడి మరియు స్వజీవమునకు చనిపోయిన యెడల అతడు బహుగా ఫలించును. ప్రభువు స్వయముగా దానిని వాగ్ధానము చేసియున్నాడు (యోహాను 12:24). 'ఫలమనగా' ఒక సంఘములో ఎక్కువమంది చేరుట కాదు వారు కొద్దిమందైనను దేవుని యొక్క సొంత స్వభావములో పాలివారగుదురు.


దేవుడు ఎల్లప్పుడు సంఖ్యను కాదు గాని నాణ్యతను చూచును.


డబ్బు విషయములో నమ్మకముగా ఉండకపోవుట:


డబ్బు విషయములో దుర్నీతిపరులై ఉన్నందువలన కొందరు నాయకులు ఓడిపోయి ఉన్నారు. గత అధ్యాయములో దీనిని వివరముగా చూచియున్నాము అయినప్పటికిని మనకు మరల హెచ్చరిక అవసరము ఎందుకనగా అనేకమంది నాయకులు డబ్బు విషయములో వారి సంఘస్తుల మీద ఆధారపడుతున్నారు. అదే సమయములో క్రీస్తుయొక్క శరీరము నిర్మించుచున్నామనే ఘనతను పొందవలెనని కోరుచున్నారు ఇది మోసకరము.


ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఈ విషయములో దేవునియొక్క అంతస్తును తగ్గించకూడదు. కొన్నిసార్లు అపొస్తలులు కానుకలు తీసుకొనినప్పటికిని వారు కానుకలు కొరకు ఏ సంఘము కొరకైనను ఏ వ్యక్తి కొరకైనను ఎదురు చూడలేదు.


పౌలు తిమోతితో ఇట్లనెను ''ధనాపేక్ష నుండియు మరియు ధనవంతులు కావలెననే కోరికనుండియు పారిపొమ్ము దానికి బదులుగా ప్రజల యెడల ప్రేమను సాత్వికమును వెంటాడుము'' (1 తిమోతి 6:9 - 11).


సిరిసంపదలు అపాయకరమైనవి మనము ఆర్థికముగా ఇబ్బంది పడుచున్నప్పుడు భద్రతలో ఉండెదము. కాని మనము ధనవంతులైనయెడల ధనంతోపాటు గర్వము అహంకారము వచ్చును గనుక అది అపాయకరము. కాబట్టి ఈ విషయములో మనము మెలకువగా ఉండవలెను.


మన క్రైస్తవ జీవితము ఆరంభించినప్పుడు డబ్బు విషయములో ఉన్న మన వైఖరికంటే మన జీవిత ముగింపులో మన వైఖరి ముఖ్యమైయున్నది. ''మీపైనున్న నాయకుల విశ్వాసము చూచి మరియు దానిని అనుసరించుడి'' (హెబీ 13:7 పారాఫ్రేజ్‌) అని బైబిలు చెప్పుచున్నది.


నైతిక పవిత్రత లేకపోవుట:


కొందరు పెద్దలు లైంగిక విషయములో నమ్మకముగా ఉండుట తప్పిపోవుదురు. స్త్రీల విషయములో పవిత్రతను కాపాడుకొనలేని వాడు ఒక పెద్దగా ఉండుటకు అర్హుడు కాలేడు మరియు అతడు క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉండలేడు. లైంగిక విషయములలో జయించనివాడు ఇతరులమీద కాపరిని అని ఊహించుకొని తననుతానే మోసగించుకొనుచున్నాడు. తలంపుల విషయములో ఎల్లప్పుడు అజాగ్రత్తగా ఉండుట వలన ఈ విషయములో ఆ కొందరు తీవ్రముగా ఉండరు. ఎందుకనగా వారిలో దేవుని భయము కొదువుగా ఉన్నది. లైంగిక పాపము విషయములోనే మొట్టమొదటిగా బైబిల్‌లో ''దేవుని యెడల భయభక్తులు'' అనుమాట ఉపయోగించుట ఆసక్తికరముగా ఉన్నది. ''దేవుడు ఎవరి విషయములో అయితే సంతోషముగా ఉండడో వారు వ్యభిచారములో పడెదరు'' అని బైబిలు చెప్పుచున్నది (సామెతలు 22:14).


ఒకడు తన మోహపు తలంపుల నుండి పారిపోనియెడల లైంగిక అపవిత్రతలో అతడు పడిపోవచ్చును. ఈ విషయములో తలంపులలో మరియు అలవాట్లలో ఓడిపోయినవారు, తమనుతాము ఎక్కువగా ఎంచుకొనక భయభక్తులు కలిగియుండవలెను. ఈ విషయములో నాకు జయము లేక పోయినప్పటికిని ఇతర విషయములలో జయించినవాడిగా నటించిన యెడల ఒక రోజు దేవుడు నిన్ను అందరియెదుట బయలుపరచును.


పౌలు తనకు అత్యంత సన్నిహితమైన వాడు మరియు పూర్ణహృదయము గల తన సహపరిచారకుని ఈ విధముగా హెచ్చరించియున్నాడు: ''మనుష్యులందరూ శోధించబడుతున్న లైంగిక సంబంధమైన చెడ్డ తలంపులనుండి పారిపొమ్ము. దానికి బదులుగా హృదయశుద్ధిని కోరుచున్న సహోదరులతో సహవాసము కలిగి ప్రేమ మరియు సమాధానమును వెంటాడుము'' (2 తిమోతి 2:22 మెసేజ్‌ పారాఫ్రేజ్‌). ఒక పెద్దగా నీవు ఈ ఆజ్ఞను తీవ్రముగా తీసుకొనుచున్నావా లేదా పరీక్షించుకొనుము.


నీవు అనేక సంవత్సరములనుండి ప్రభుని సేవించుచున్నావు గనుక ఆత్మీయ పరిణితి పొందిన నీవు ఈ హెచ్చరిక నీకు అవసరములేదని తలంచవచ్చును. తిమోతి 25 సంవత్సరములనుండి ప్రభువుని సేవించుచున్నాడు అయినప్పటికి ఈ విషయములో అతనిని హెచ్చరించవలెనని అపొస్తలుడైన పౌలు భావించియున్నాడు. మనకందరికిని ఈ హెచ్చరిక అవసరము.


ఇటువంటి హెచ్చరికను మనము వినినయెడల, మనము సంపూర్ణరక్షణ పొందెదము. అప్పుడు మన సంఘములు కూడా పవిత్రతలో అభివృద్ధి చెందును మరియు ఎల్లప్పుడు మనము ప్రవచనాత్మకముగా మాట్లాడెదము. ఈ విషయములో మనము ఎక్కడ ఓడిపోయినను మారుమనస్సు పొంది మనలను మనము తీర్పుతీర్చుకొనవలెను. దేవుడు యథార్థవంతులను ప్రేమించును. మన జీవితకాలమంతయు ఈ విషయములలో మెలకువగా ఉండి జాగ్రత్తపడవలెను.


దీనత్వములో వేరుపారుకొనకపోవుట:


తాను ఒక పెద్దననే తన పదవిని బట్టి గర్వించుట వలన కొందరు పెద్దలు పడిపోయారు. గత అధ్యాయములో దీనిగురించి మాట్లాడియున్నాము. అయినప్పటికిని మరల చెప్పవలసియున్నది. జీవితకాలమంతయు ఒక నాయకుడు తన తలంపులలో సామాన్య సహోదరుడుగా ఉండినయెడల, అటువంటి వారికి దేవుడు ఎల్లప్పుడునూ కృపనిచ్చును.


కాని కొందరు పెద్దలుగా నియమించబడిన వెంటనే ఉప్పొంగి అతిశయించెదరు. ఒక సంఘపెద్ద తనను ఒక ప్రత్యేకమైన సహోదరుడని తలంచిన వెంటనే తప్పిపోవును. సామాన్య సహోదరులు తమ జీవితకాలమంతయు ఆత్మీయముగా వర్ధిల్లెదరు. కాని ఎవరైతే తాను ప్రత్యేకమైన సహోదరులనుకుంటారో వారు సులభముగా తప్పిపోవుదురు.


ప్రత్యేకముగా నీవు వాక్యపరిచర్య చేసే వరము కలిగి ఒక సంఘమును చూచుచకున్న యెడల నీవు జాగ్రత్తపడాలి. ఇతర విశ్వాసులచేత ప్రత్యేకముగా చూడబడవలెనని కోరిక కలిగిన విశ్వాసి క్రీస్తువిరోధియొక్క ఆత్మచేత ప్రభావితము చేయబడి మరియు సాతానుకి గురిగా ఉండును. కేవలము దాసులుగా ఉండుటకు మనము పిలవబడియున్నాము. అందులోనే మన భద్రత ఉన్నది.


పరిశుద్ధాత్మ యొక్క ప్రతీఆశీర్వాదమును నీకు ఇచ్చుటకు దేవునికి ఎంతో సులభమైయున్నది. కాని ఆయన నిన్ను ఆశీర్వదించిన తరువాత నిన్ను దీనుడిగా ఉంచుట ఆయనకు చాలా కష్టము. ఎందుకనగా నీ సహకారము లేకుండా ఆయన నిన్ను దీనుడుగా ఉంచలేడు. నీవు ఆయన కాడిని ఎత్తుకొని మరియు ఆయన యొద్ద దీనత్వమును నేర్చుకొనవలెను (మత్తయి 11:29). ఈ విషయములో ఓడిపోయినందున అనేకమంది పెద్దలు పడిపోయిరి.


యథార్థత లేకుండుట:


యథార్థత మరియు దీనత్వము కవలలు. ఎల్లప్పుడూ ఈ రెండు కలిసియుండును. సామాన్యముగా చాలామంది పెద్దలు వారు పాపములో పట్టబడినప్పుడు మాత్రమే దీనత్వముతోను యథార్థతతోనూ అనుభవము గల సహోదరుని యొద్దకు వెళ్ళెదరు. వారు బహిర్గతము చేయబడేవరకు వేషధారులవలె ఉండెదరు మరియు వారిలో కొందరు తమ పాపములు కప్పిపుచ్చుకొనుటకు అబద్ధములు చెప్పెదరు. ఇతరులను దైవభక్తిలోనికి నడిపించవలసిన వారై యథార్థతలోను మరియు సత్యములోను కొదువుగా ఉండుట ఆశ్చర్యకరము.


అనేకమంది పెద్దలు పాపములో పడినప్పుడు తమనుతామే సమర్థించుకొందురు, చివరకు వారు తమ పాపములు ఒప్పుకొనినప్పటికి, సౌలు రాజు వలె మనుష్యుల యొక్క ఘనతను కోరుతూ చేసెదరు (1 సమూయేలు 15:30).


వేషధారులందరిని దేవుడు చివరకు బహిర్గతపరచును. అననీయ మరియు సప్పీరాలు ఒక శరీరానుసారమైన కొరింథీ సంఘములో ఉండినయెడల, వారు చాలాకాలము జీవించిఉండేవారు. కాని ఒక పవిత్ర సంఘముతో వారు బహిర్గతం చేయబడుటను తప్పించుకొనలేరు (అనగా ఆ దినములలోని యెరూషలేములోని సంఘము).


దేవుడు సంఘములను మరియు వారి నాయకులను బలపరచుచున్నాడు అనుటకు ఒక బలమైన సూచన ఏదనగా వారిలో ఉన్న వేషధారుల యొక్క పాపమును ఏదో ఒక సమయములో బహిర్గతము చేయును మరియు ప్రత్యేకముగా నాయకులుగా ఉండాలని కోరెడివారు.


సహపెద్దల మీద పెత్తనము చేయుట:


ఒక బలమైన సంఘపెద్ద తన సహపెద్దలయొక్క అభిప్రాయమును దీనుడై అంగీకరించక తన అభిప్రాయమే జరగవలెననికోరును. నీ సహపెద్దలు వారి అభిప్రాయము చెప్పుటకును మరియు నీతో అంగీరించుటకును వారికి పూర్తి స్వాతంత్య్రమియ్యవలెను. ఆవిధముగా దేవుడు నిన్ను బుద్ధిహీనతనుండియు మరియు అనేక పొరపాట్లు చేయుటనుండియు రక్షించును.


ప్రతి పెద్ద తన అభిప్రాయమును యథార్థముగాను ధైర్యముగాను మరియు తనకంటే అనుభవముగల పెద్ద సహోదరుడు చెప్పిన అభిప్రాయమును భయపడకుండా తన అభిప్రాయమును చెప్పవలెను. అనుభవముగల పెద్దతో నీవు అంగీకరించనప్పుడు, చివరకు నీవు అతనికి లోబడినప్పటికిని, ప్రేమతో నీవు అంగీకరించుటలేదని చెప్పవలెను. అంగీకరించక పోవుట అనగా ఐక్యత లేకపోవుట కాదు.


5 లేక 6 సంవత్సరములు తరువాత కూడా నీవు ఒక్కడివే సంఘపెద్దగా కొనసాగుచూ మరియు బాధ్యతలు తీసుకొనుటకు ఇతరులను పెద్దలుగా ఉండుటకు ప్రోత్సహించని యెడల అప్పుడు నీవు ఒక పెద్ద సహోదరుడుగా కాక ఒక చిన్న నియంతగా ఉన్నావేమో ప్రశ్నించుకొనవలెను. నీ బలమైన వ్యక్తిత్వమును బట్టి (దానిని నీవు చంపవలెను) మీ సంఘములో ఇతరులు పెద్దలుగా ఎదుగుటలేదు.


ఒక బలమైన పెద్ద వ్యక్తిత్వము కలిగియుండి, వరమును కలిగియుండిన యెడల, అతడు తన ''స్వజీవమును మరణమునకు అప్పగించుచు'' మరియు సహోదర సహోదరీలు తమకు కాకుండా ప్రభువుకు కలపవలెను. అతడు కూడా సహోదర సహోదరీల స్థాయికి దిగివచ్చును మరియు ఇతరులు తనకు భయపడకుండాచూడవలెను. తనకు వేరుగా ఉన్నప్పటికిని సంఘములో ఉన్న సహోదరులతో సహవాసమును కలిగియుండాలి. మరియు రాజకీయనాయకుల వలె తనకు మ్రొక్కె వారికే సంఘములో బాధ్యతలు ఇవ్వకూడదు.


ఒక పెద్దగా ఇతర స్థలములలో ఉన్న సంఘములను ఎక్కువగా చూచుకొనుచు మరియు తన స్థానిక సంఘమును అనగా ద్రాక్షతోటను నిర్లక్ష్యము చేయకూడదు (పరమగీతము 1:6). అనేక సంఘములకు వెళ్ళి బోధించుచు మరియు తన స్థానిక సంఘమును నిర్లక్ష్యము చేయుట సులభము.


నీ స్థానిక సంఘములో నీవు సహోదరత్వము నిర్మించని యెడలను మరియు నీ స్థానిక సంఘములో బాధ్యతలను తీసుకొనుటకు ఇతరులను లేపనియెడల, నీవు ఏది చేసినప్పటికిని ఒక పెద్దగా నీవు పరిచర్యలో ఓడిపోయియున్నావు. ఇతర సంఘములకు నీవు ఏమి బోధించగలవు? నీ పరిచర్యకు కావలసిన కృపను దేవుని యొద్దనుండి పొందకపోవచ్చు. ఒక పెద్ద సహోదరునికి తన పరిచర్యలో దేవుడు కృప నిచ్చిన యెడల, ఆ స్థానిక సంఘములో సహోదరుల మధ్య ఐక్యత కలుగుటయే ఒక గుర్తుగా యుండును. మరియు సహోదరుల ఐక్యత ఏ ఒక్కరి మీద ఆధారపడియుండదు.


ఇతరులను తమ ఆధీనములో ఉంచుకొనగోరే కొందరు పెద్దలు, ప్రతి సంఘములో కనీసం ఇద్దరు పెద్దలు ఉండవలెను గనుక ప్రతి దానికి ''అవును అని చెప్పే వ్యక్తిని'' రెండవ పెద్దగా నియమించును. పెద్దగా నియమించబడిన వ్యక్తి మొదటి నుండి పెద్దగా ఉన్న సహోదరుడు ఆత్మీయ పరిణితి కలిగి జ్ఞానము కలిగి యుండవచ్చును. అయినప్పటికినీ మొదటి నుండి ఉన్న పెద్ద చెప్పిన వాటి అన్నింటికి గ్రుడ్డిగా అవునని చెప్పకూడదు. అలా అయినట్లయితే సహపెద్దగా నీవు నీ బాధ్యతను సమతుల్యతతో నెరవేర్చుటలేదు. నీ పరిచర్యను క్రొత్తగా నియమించబడిన పెద్ద చేయుటకు, మొదటినుండి ఉన్న పెద్ద నేర్పించవలెను.


పేతురు తన సహపెద్దలను ఈ విధంగా హెచ్చరించాడు, ''మీమందకు ప్రభువులైనట్లు ఉండకుడి. నియంతలుగా ఉండవద్దు. ఒక యజమానుడి వలె వారితో చెప్పవద్దు. మంచి మాదిరిని సాత్వికముతో చూపించుచు మందకు మాదిరులుగా ఉండుడి'' (1 పేతురు 5:3 అనేక తర్జుమాలలో).


పెద్దలు అధికారములో మత్తులై యుండి మరియు వారికి అన్ని తెలుసు అనుకొని మరియు వేరే వాళ్ళు చెప్పినది వినరు. వారు దిద్దుబాటు చేయబడలేని స్థితికి వచ్చినయెడల, అది చాలా ప్రమాదకరము. ''మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు'' (పస్రంగి 4:13).


ఒక పెద్దగా ఉండవలసిన వ్యక్తికి ఉండదగిన మొదటి అర్హత ఏదనగా, ఎవరిమీద అయినను ఆధిపత్యము చేయవలెనని కోరక ఇతరులకు దాసుడుగా ఉండి మరియు దీనత్వముతో వారి పాదములు కడుగును.


నీ సంఘములో పరిణితి చెందుచున్న యౌవన సహోదరులను, మీ సంఘములో అనేక బాధ్యతలను అంతకంతకు ఎక్కువగా తీసుకొనుటకును మరియు వాక్య పరిచర్య చేయుటకును ప్రోత్సహించాలి. మీ సంఘములో ఋజువు పరచబడిన యౌవనస్తులను, వాక్య పరిచర్య ఆరంభించుటకు పెద్దలందరు ప్రోత్సహించాలి. ఒక పెద్ద సహోదరుడు ఎన్నటికి రాజీనామా చేయడు. కాని అతడు ఇతరులకు ఎక్కువగా బాధ్యతలు ఇచ్చుచుండవలెను. ఆ విధముగా ఇతర సంఘములకు సహాయపడుటకు అతనికి అవకాశము దొరుకును.


కాబట్టి అన్ని సమయములలో దేవుని యెదుట భయభక్తులు కలిగియుండి మరియు నీ గురించి తక్కువ తలంపు కలిగియుండుము. ''నీవు ఇతరులకు చిన్న దేవుడవు'' కాకుండునట్లు వారు పూర్తిగా నీ మీద ఆధారపడకుండునట్లు చూచుకొనుము. నీవు దేవునియెదుట దీనుడవై నడుచుకొనుచున్న యెడల ఆయన నీకు కృపనిచ్చును మరియు ఆయనలో ఎటువంటి పక్షపాతము లేదు.


క్రొత్త నిబంధనలో ప్రత్యేకముగా సంఘపెద్దలకు వ్రాయబడిన పత్రికలను నీవు తరచుగా చదువుచూ మరియు ధ్యానించుచూ, ప్రార్థించాలి. (1 తిమోతి, 2 తిమోతి, తీతు, మరియు ప్రకటన గ్రంథములో 2,3 అధ్యాయములు).


పక్షపాతము చూపుట:


తన స్నేహితులకు మరియు బంధువులకు ఒక పెద్ద సహోదరుడు పక్షపాతము చూపుట చెడ్డ విషయము.


దేవుని వాక్యము ఇట్లు చెప్పుచున్నది, ''అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను'' (లేవీయకాండము 19:15).


పక్షపాతము చూపుట ఎంతో ప్రమాదకరమైనదని తనకు అత్యంత సహపరిచారకుడైన తిమోతిని పౌలు హెచ్చరించుచున్నాడు. మరియు 1 తిమోతి 5:21లో కఠినమైన మాటలతో హెచ్చరించుచున్నాడు. ''విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను''.


45 సంవత్సరములు కలిగిన పూర్ణహృదయముతో వెంబడించే సహోదరుడును మరియు 25 సంవత్సరముల నుండి పౌలుతో పరిచర్య చేయుచున్నప్పటికిని పక్షపాతము చూపించే అవకాశమున్నదని ఇది చూపించుచున్నది. లేనట్లయితే ఈ హెచ్చరిక అతనికి అవసరము లేదు.


''నేను ఎప్పటికిని పక్షపాతిని'' కాదు అని చెప్పే ఏ పెద్దయైనను ఈ హెచ్చరికను నిర్లక్ష్యము చేసి మరియు పాపమువిషయంలో ఎక్కువ నేరారోపణ కలిగియుండును.


అరణ్యములో ఇశ్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించినప్పుడు, మోషే పర్వతము మీదనుండి దిగివచ్చి మరియు ప్రభువు పక్షముగా నున్నవారందరు తనతో కలువమని చెప్పాడు. లేవీ గోత్రపు వారు మాత్రమే అతనితో కలిశారు. అప్పుడు అతడు వారిని ఆ పాళెములో ఉన్న వారందరిని మరియు వారిలో ఉన్న సొంత బంధువులతో సహ పక్షపాతము లేకుండా అందరిని చంపమని చెప్పాడు. వారు ఖచ్చితముగా అదే చేసియున్నారు మరియు దేవుడు వారికి ఇశ్రాయేలీయులలో యాజకత్వము అనే బహుమానము ఇచ్చియున్నాడు (నిర్గమకాండము 32:27 - 29).


తన తరువాత ఉండబోయే నాయకుని నియమించేటప్పుడు మోషే పక్షపాతము చూపించలేదు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాని అతడు ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఇశ్రాయేలీయుల మీద నాయకత్వము ఇవ్వలేదు. అతడు యెహోషువాను నియమించాడు. అతడుదేవునియెదుట నిలువబడి మరియు దేవుని స్వరమును విని మరియు దేవుడు ఎన్నుకొనిన వానిని నియమించాడు. ఒక నిజమైన నాయకుడు ఈ విధముగా చేయును. మరియు మనము కూడా ఈ విధముగా చేయవలెను.


ప్రవక్తయైన సమూయేలు ఈ విషయములో ఓడిపోయియున్నాడు. అతడు పక్షపాతము కలిగియుండి మరియు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు. ఆ కుమారులు ''ధనాపేక్ష కలిగిన వారై మరియు లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి'' (1 సమూయేలు 8:3). తమ్మును తాము తీర్పు తీర్చుకొనని యెడల, గొప్ప నాయకులు కూడా ఈ విషయములో పడిపోయెదరు. ఇది మనకందరికిని గొప్ప హెచ్చరిక.


సంఘములో తమ కుమారులయెడలను మరియు కుమార్తెల యెడలను మరియు సన్నిహితమైన స్నేహితులయెడలను పెద్దలు పక్షపాతమును చూపుటను నేను చూసియున్నాను. ఈ విధముగా అన్యాయము జరిగినది. మనుష్యులందరి యొక్క హృదయములను చూచే దేవుడు ఇటువంటి పెద్దలనుండి తన కృపను తీసివేయును. ఇటువంటి పెద్దలు రక్షణను పోగొట్టుకొనరు లేక పెద్దలుగా వారికున్న పదవులను పోగొట్టుకొనరు. కాని అభిషేకమును మరియు ఆత్మీయ వివేకమును కోల్పోయెదరు. మరియు నెమ్మదిగా ప్రజలు వీరి మీద వారికున్న నమ్మకమును కోల్పోయెదరు.


పైనుండి వచ్చు దేవుని జ్ఞానము ఏ ఒక్కరియెడలను పక్షపాతము కలిగియుండదు (యాకోబు 3:17).


మన గత జీవితములలో గానీ మరియు క్రియలలో గానీ, నిర్ణయములలో గానీ పక్షపాతముతో చేసి యున్నామేమో యని పరీక్షించుకొనుట మంచిది. మనమందరము పరీక్షించుకొనుట మంచిది. మనమీద మనకు వెలుగు నివ్వమని దేవునికి ప్రార్థించాలి. లేనట్లయితే ఈ విషయములో మన శరీరములో ఉన్న భ్రష్టత్వమును మనము ఎన్నటికి చూడలేము కనుక మనము జీవితకాలమంతయును పక్షపాతముతో ఉండెదము.


గత జీవితములో నీవు తీసుకొనిన నిర్ణయములలోను మరియు నీవు చేసిన క్రియలలోనూ పక్షపాతము ఉన్నదని ఊహించుకొని మరియు ఈ విషయములలో వెలుగు నివ్వమని దేవుని ప్రార్థించాలి. అప్పుడు ఆయన నీకు వెలుగు నిచ్చును.


ఇటువంటి ప్రశ్నలను నీవు వేసికొనుము. ఒక వ్యక్తి నీ స్నేహితుడైనందున, అతడు చేసిన తప్పును మూసివేసియున్నావా. నీకు ఇష్టములేని ఒక వ్యక్తిని, గద్దించవలసిన దానికంటె ఎక్కువగా గద్దించియున్నావా? నీవు వెలుగు పొందునట్లు ఇటువంటి ప్రశ్నలను వేసుకొనుము. ఒక విషయములో దేవుడు నీకు వెలుగు ఇచ్చినప్పుడు, మారుమనస్సు పొందుము.


దేవుని దృష్టిలో ప్రజలందరు సమానులే మరియు మనకు కూడా ప్రజలందరును సమానులైయుండవలెను. పక్షపాతమును కడుగుకొనినప్పుడు మనము ఆత్మీయ గ్రహింపును పొంది మరియు తరువాత ఫలభరితమైన పెద్దగా మారెదము.


ఒక బీదవాడిని, తన బీదరికమును బట్టి నీవు పక్షపాతముతో చూడకుండునట్లు జాగ్రత్తపడుము (నిర్గమకాండము 23:3). ధనికులయెడల పక్షపాతము చూపుట అంతే చెడ్డది!


కాని అనేక సంఘములలో ధనికులైన వారు మరియు చదువుకున్న వారు పక్షపాతము చేత ఘనపరచబడుచున్నారు (యాకోబు 2:1 - 4). ఈ విషయములో నిన్ను నీవు పరీక్షించుకొనుట మంచిది. ఒక పెద్దగా నీతో సన్నిహితముగా ఉండు సహోదరులను మరియు నీవు బాధ్యతలు అప్పగించు వారందరును ధనవంతులై చదువుకున్న సహోదరులేమో చూచుకొనుము. ఒకవేళ నీకు తెలియని రీతిగా చదువుకున్న ధనవంతులకు విలువనిచ్చి మరియు చదువుకొనని బీదలను ప్రక్కనపెట్టి యున్నావేమో చూచుకొనుము. అనగా నీకు తెలియకుండానే, నీవు ఆత్మీయత కంటె విద్యకును మరియు సంపదకును విలువ నిచ్చుచున్నావు. ఇటువంటి వైఖరి ద్వారా చివరకు మీ సంఘము నష్టపోవచ్చును. అనేక మార్గములలో మీ సాక్ష్యమును సాతాను తటస్థపరచును.


చేపలు పట్టేవారిని ప్రభువైన యేసు తన అపొస్తలులుగా చేసుకొనియున్నాడని ఎన్నటికిని మరచిపోవద్దు.


అధ్యాయము 16
దిద్దుబాటు స్వీకరించుట మరియు విరుగగొట్టబడుట


పెద్దలుగా మనయొక్క పొరపాట్లను ఎరుగుటకు, మన కంటె పరిణితి చెందిన సహోదరుల యొక్క దిద్దుబాటును తీసుకొనుటకు సిద్ధముగా ఉండాలి.


పరిణితి చెందియున్నామనుటకును మరియు ఒకనియెడల ఒకనికి నమ్మకము కలిగియున్నదనుటకును ఒక గుర్తు ఏమనగా, మనము అభ్యంతరపడకుండా అనేక విషయములు స్పష్టముగా మాట్లాడుకొనగలము.


వివాహమైన మొదటి సంవత్సరములలో, వారి మధ్యలో ఉన్న సంబంధం ఇంకా బలపడలేదు గనుక భార్య భర్తలు ఇద్దరును ఒకరితో ఒకరు మాట్లాడే విషయములో జాగ్రత్తగా ఉండెదరు. కాని ఒకరియెడల ఒకరు ప్రేమలో వృద్ధిపొందే కొలది ఒకరియెడల ఒకరు భద్రత కలిగి తన భాగస్వామి అభ్యంతరపడునేమోనని తలంచక మామూలుగా మాట్లాడెదరు.


పెద్దల విషయములో కూడా ఆ విధముగా ఉండాలి. దేవుని ప్రేమలో పెద్దలు బలమైన సంబంధము కలిగియున్న యెడల, సంఘము యొక్క ప్రయోజనము కొరకు, అవతల వ్యక్తి తప్పు చేయుచున్నయెడల, మనము ప్రేమతో దానిని అంగీకరించకపోవచ్చు. కాని బాధకరమైన విషయమేమనగా చాలామంది పెద్దలు వారి జీవితకాలమంతయు ఇటువంటి స్థాయికి రాలేరు మరియు చిన్న దిద్దుబాటు చేయబడినప్పుడు అభ్యంతరపడెదరు.


ప్రభువైన యేసు ఒకసారి పేతురును అందరియెదుట ''సాతానా'' అని పిలిచాడు. కాని ఆ గద్దింపునకు పేతురు అభ్యంతర పడలేదు (మత్తయి 16:23). ఒకసారి పౌలుచేత కూడా పేతరు బహిరంగముగా గద్దించబడ్డాడు, అయినప్పటికిని అతడు అభ్యంతరపడలేదు (గలతీ 2:11, 12). పేతురు నిజముగా ఆత్మానుసారమైన వ్యక్తి. కాని ఇస్కరియోతు యూదా మాత్రం, ప్రభువైన యేసు కొద్దిగా దిద్దుబాటు చేసిన వెంటనే అభ్యంతరపడి ప్రభువుకు ద్రోహం చేసియున్నాడు (యోహాను 12:4 - 8 మరియు మత్తయి 26:10 - 16).


పేతురు మరియు పౌలు దేవునితో వారికున్న సంబంధాన్ని బట్టి ఎంతో భద్రతలో ఉండి మరియు ఒకనినొకరు దేవుని యొక్క ప్రేమతో గాఢంగా ప్రేమించి అభ్యంతరపడలేదు. పెద్దలముగా మనము కూడా ఆ స్థాయిని చేరుకొనుటకు ప్రయత్నించాలి. కాని అక్కడకు చేరుకొనే ముందుగా, నన్ను ఒక్క విషయం చెప్పనివ్వండి, మనము ఇతరులను దిద్దుబాటు చేయుటకు ముందుగా మనము అభ్యంతరపడకుండా దిద్దుబాటును స్వీకరించుట నేర్చుకోవాలి.


1 మరియు 2 తిమోతిల నుండి కొన్ని పాఠములు:


1 తిమోతి 4:16లో పౌలు తిమోతితో యిట్లన్నాడు, ''నిన్ను గూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు''.


తిమోతి పౌలుకు శ్రేష్ఠమైన సహపరిచారకుడుగా ఉన్నాడు. అయినప్పటికిని అనేక విషయములలో పౌలు అతనిని హెచ్చరించాడు. ఇక్కడ పౌలు ఇచ్చిన 14 హెచ్చరికలు ఉన్నవి.


1 తిమోతిలో:


1. 4:7, దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము


2. 4:12, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.


3. 5:21, పక్షపాతముతో దేనిని చేయకుము.


4. 5:23, నీ యొక్క శారీరక ఆరోగ్యము గురించి జాగ్రత్తపడుము. ఇది చాలా ముఖ్యమైయున్నది. లోకసంబంధులే మంచి ఆరోగ్యముతో దీర్ఘకాలం జీవించుచుండగా, దేవుని సేవకులమైన మనము దేవుని యొక్క మహిమార్థం దీర్ఘకాలం ఎందుకు జీవించకూడదు?


5. 6:5-11, నీకు ఉన్న దానితో సంతృప్తిపడి మరియు ధనాపేక్షనుండి పారిపొమ్ము. డబ్బు సంపాదించుట కొరకు నీవు బోధించకుండా జాగ్రత్తపడుము (దైవభక్తి గల తిమోతికే ఈ హెచ్చరిక అవసరమైయున్నది).


6. 6:20, అపవిత్రమైన వట్టిమాటలకు విముఖుడవై యుండుము (ఇది పౌలు యొక్క రెండవ పత్రికలో కూడా ఉన్నది).


2 తిమోతిలో:


7. 1:6, 7, ఎల్లప్పుడు నీవు పిరికివాడవై యుండక దేవుని కొరకై మండుచుండవలెను.


8. 2:3, సువార్త నిమిత్తము శ్రమను అనుభవించుము.


9. 2:4, ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనవద్దు.


10. 2:17, 15, దేవుని వాక్యమును సరిగా అర్థము చేసుకొని ఇతరులకు సత్యవాక్యమును సరిగా బోధించుటకు ఆసక్తితో ప్రార్థించుము.


11. 2:22, నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము.


12. 2:23 - 26, నీవు సాత్వికుడవును మరియు దయకలిగి మరియు జగడమాడవద్దు.


13. 4:12, అన్ని సమయములలో వాక్యపరిచర్య చేయుటకు సిద్ధముగా ఉండుము (అనగా ఎల్లప్పుడు ప్రతికూటములో లాభకరమైన దానిని బోధించుము)


14. 4:2, ఇతరులను సంతోషపెట్టుటకుగానీ వారి ఘనత పొందుటకు గానీ కాకుండా ఖండించుము, గద్దించుము, బుద్ధిచెప్పుము.


45 సంవత్సరముల వయస్సు కలిగియుండి మరియు 25 సంవత్సరములనుండి పౌలుతో కలసి నమ్మకముగా పరిచర్య చేయుచున్న తిమోతికి పౌలు ఈ హెచ్చరికలు ఇచ్చియున్నాడు.


ఈ 14 హెచ్చరికలను నీవు చదివి మరియు వీటిని తీవ్రముగా తీసుకొంటున్నావో లేదోయని పరీక్షించుకొనుము.


దిద్దుబాటును తీసుకొనుటకు కావలసిన దీనత్వము:


ఈనాడు ఒక పెద్ద సహోదరుడు నుండి ఈ విధముగా హెచ్చరించబడిన యెడల నీవు ఏవిధముగా స్పందించెదవు. ఇటువంటి దిద్దుబాటులు గానీ హెచ్చరికలు గానీ నీకు అవసరం లేనంతగా నీవు పరిణితి చెందియున్నావని నీవు అనుకొనుచున్నావా? ఇటువంటి వైఖరిని దేవుడు నీలో చూచినయెడల, నిన్ను దిద్దుబాటు చేయుటకు ఆయన ఎవరిని పంపించడు. మరియు అప్పుడు నీవు నష్టపోయెదవు. అప్పుడు నీవు ''దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును మరియు దిగంబరుడవు''గా తెలియకుండానే ఆ విధముగా మారగలవు (పక్రటన 3:17).


''బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు'' (పస్రంగి 7:5). వివేచనలేని మరియు పరిణితిలేని సహోదర సహోదరీలు మాత్రమే వ్యర్థమైన బుద్ధిహీనుల పాటలను పాడెదరు. అటువంటి పాటలను విని మరియు ధ్యానించుచుండిన యెడల నీవు గొప్ప తలంపులను కలిగియుండి మరియు నెమ్మదిగా నీకు దిద్దుబాటు ఏమియు అవసరంలేదని అనుకొనెదవు.


దేమా ఒకప్పుడు పౌలు యొక్క సహ పరిచారకుడు (కొలొస్స 4:14) మరియు పౌలు తిమోతిని హెచ్చరించినట్లే దేమాను కూడా హెచ్చరించియుండవచ్చును. కాని అతడు అభ్యంతరపడి మరియు పౌలును విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళెను (2 తిమోతి 4:10).


యాకోబు 1:21లో సాత్వికముతో మనము దేవుని వాక్యమును మరియు దిద్దుబాటును కూడా అంగీకరించిన యెడల రక్షింపబడగలము.


ఇశ్రాయేలీయులు వెనుకంజవేసినప్పుడు దేవుడు వారియొక్క నాయకులను ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. వారి యొక్క నాయకులు బాధ్యతలేనివారును జాగ్రత్తలేనివారును అయినందున ఇశ్రాయేలీయులు తప్పిపోయిరి. వారినాయకులు దేవుని యెడల భయభక్తులు కోల్పోయినందున వారు కూడా భయభక్తులు కోల్పోయిరి.


దేవుని యెడల భయభక్తులు మరియు దిద్దుబాటును స్వీకరించుట:


2 కొరింథీ 7:1లో దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనవలెనని మనము ఆజ్ఞాపించబడియున్నాము. కాబట్టి గత సంవత్సరము కంటె ఈనాడు మన పరిశుద్ధత ఎక్కువ కానియెడల, మనము దేవునికి సరిగా భయపడుట లేదని ఋజువు పరుచుచున్నది. ఈ విషయములో పెద్దలమైన మనము ఒరితో ఒకరు సహకరించవలెను. ఎందుకనగా మన సహోదరులను మనం నడిపించవలెను. అందువలన ఒకరికంటె ఎక్కువ పెద్దలను ఒక సంఘములో దేవుడు నియమించును. హెబీ 3:13 - 15లో పాపము వలన కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచబడకుండునట్లు ఒకనినొకడు ప్రతిదినం ప్రోత్సహించుకోవాలి.


యెషయా 11:2లో ప్రభువైన యేసులో ''దేవునియెడల భయభక్తులు పుట్టించే ఆత్మ'' ఉన్నదని చదివెదము. మనము అనుమతించిన యెడల, పరిశుద్ధాత్ముడు మనలో కూడా దేవునియెడల భయభక్తులు పుట్టించును. మనము నిజముగా పరిశుద్ధాత్మతో నింపబడిన యెడల, దేవుని యెడల భయభక్తులతో నింపబడెదము.


దేవుడు ఎల్లప్పుడు మన పక్షముగా ఉండును మరియు మనము పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరేదాని కంటె ఎక్కువగా తన ఆత్మతో నింపాలని దేవుడు ఆసక్తి కలిగియున్నాడు. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికిని, మనందరిలో ఆయన గొప్పకార్యము చేయగలడు. అయితే మనము ఎల్లప్పుడు దీనులమై యుండి ఆయనకు ప్రార్థించుచుండవలెను. మన శరీరేచ్ఛలకును మరియు సాతానుకును వ్యతిరేకముగా దేవుడు మన పక్షమున ఉన్నాడు.


మనము క్రైస్తవులలో మరియొక యేసును (శిష్యత్వమును కోరనివారు) ప్రకటించే దినములలో ఉన్నాము, మరియొక ఆత్మను పొందుకొను చున్నారు (ప్రజలను పరిశుద్ధ పరచబడక నకలీ వరములను ఇచ్చుచున్నారు) మరియు మరియొక సువార్త (ఆరోగ్యము మరియు సిరిసంపదలు) గురించి ప్రకటించుచున్నారు (2 కొరింథీ 11:4). కాబట్టి మనము నిజమైన యేసును మరియు పరిశుద్ధాత్మను మరియు దేవుని యొక్క కృపా సువార్తను ఈ సమయములలో నమ్మకముగా ప్రకటించాలి.


నిన్ను నీవు సమర్థించుకొనక క్షమాపణ అడుగవలెను:


మనము విరిగి నలిగిన హృదయమును కలిగి మరియు ఆత్మలో దీనులము కానట్లయితే, మనము ఏదైనను తప్పు చేసినట్లు తెలుసుకొనిన వెంటనే, దీనులమై క్షమాపణ చెప్పుటకు వెనుకాడవద్దు.


''నేను చింతించుచున్నాను. అది నా యొక్క పొరపాటు దయచేసి నన్ను క్షమించండి'' అను పది మాటలు పలుకుటకు అనేకులకు కష్టమైయున్నది.


మనము విరుగగొట్టబడని యెడల, క్షమాపణ చెప్పినను మనలను మనము సమర్థించుకొనెదము. మనము ఏ విధముగా నైనను సమర్థించుకొనుచున్నయెడల, క్షమాపణ చెప్పినను అది క్షమాపణ అడిగినట్లు కాదు. మనము క్షమాపణ చెప్పునప్పుడు, మనలను మనము సమర్థించుకొనే వాసన కొంచెమున్నప్పటికిని, మనము విరుగగొట్టబడలేదని నిశ్చయించుకొనవచ్చును. తన్నుతాను సమర్థించుకొనుట పరిసయ్యుని యొక్క లక్షణమని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 16:15).


మనము తప్పుచేసియున్నామని గుర్తించిన వెంటనే దానిని ఒప్పుకొని మరియు సరిచేసుకోవాలి. ఒక విరుగగొట్టబడిన వ్యక్తి దీనిని సులభముగా చేయును కాని ఒక విరుగగొట్టబడని వ్యక్తి వీటిని చేయుటకు ఆలస్యము చేయును. మరియు అతడు క్షమాపణ అడిగినప్పటికిని, అతడు ఎవరో ఒకరిని నిందించుచు చేయును. ఆదాము పాపము చేసినప్పుడు, తినకూడని పండును తాను తినియున్నానని ఒప్పుకొనినప్పటికిని దేవుడు తనకు ఇచ్చిన భార్య తనకు ఇచ్చుట వలనే తినియున్నానని, తనను తాను సమర్థించుకొన్నాడు. ఆ విధముగా అతడు అతని భార్యను మరియు అటువంటి భార్యను తనకు ఇచ్చిన దేవునిని నిందించియున్నాడు. ఏ పాపమునైనను మరియు పొరపాటునైనను ఈ విధముగా ఒప్పుకొనకూడదు.


కాని 51వ కీర్తనలో దావీదు పాపమును ఏవిధముగా ఒప్పుకొనియున్నాడో గమనించండి. అక్కడ తనను తాను సమర్థించుకొనుట అను వాసన కొంచెము కూడా లేదు. అదియే నిజముగా విరుగగొట్టబడిన వ్యక్తి యొక్క గుర్తు. 51వ కీర్తనను మీరు ధ్యానించి మరియు దానిని ప్రార్థనగా చేసి విరుగగొట్టబడుటయు మరియు పాపము ఒప్పుకొనుట గూర్చి అర్థము చేసుకొనవలెనని కోరుచున్నాను.


మరియు నిన్ను నీవు సమర్థించుకొనుటకు, నీవు ఒక అబద్ధమును కూడా చెప్పవచ్చును. జరిగిన సంఘటలను దాచుటకుగాని లేక అతిశయోక్తిగా గానీ యుండుటకు మరియు మనలను మంచిగా చూపించుకొనుటకు ఒక చిన్న అబద్ధమైయుండవచ్చును. ఒక అబద్ధము చెప్పుట సులభమే గానీ ఎప్పుడైనను ఒకే ఒక అబద్ధము సరిపోదు. కాబట్టి ఆ మొదటి అబద్ధమును కప్పిపుచ్చుకొనుటకు అనేక అబద్ధములు చెప్పవలసియుండును. మనము అబద్ధమును ద్వేషించి మరియు సత్యమును హృదయపూర్వకముగా ప్రేమించవలెను. లేనట్లయితే మన అభిషేకమును కోల్పోయెదము మరియు దేవునికి ఇష్టులముగా ఉండము. మరియు ఆ గొప్ప నష్టమును మనము భరించలేము.


మనలో బహిర్గతము చేయబడి నశింపచేయబడవలసిన గర్వమును దేవుడు చూచినప్పుడు, మనము తొట్రుపడి, పడిపోవునట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించును (యెహెజ్కేలు 3:20లో, ''నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా'').


మనము పడిపోయినప్పుడు, 1. మనము పడిపోవుటకు కారణమైన గర్వమును మనము ఒప్పుకొనుచున్నామా 2. మన పాపమును ఒప్పుకొనుచున్నామా 3. ఆయన ఎదుట దీనులముగా ఉన్నామా మరియు 4.మనుష్యులతో సంగతులు సరిచేసుకొనుచున్నామా అని ప్రభువు మనలను పరీక్షించుచున్నాడు. మనలను మనము పరీక్షించుకొని మరియు ఈ విధముగా చేసినయెడల, మనము తీర్పుపొందము. కాని మనలను మనము సమర్థించుకొనుచూ, విరుగగొట్టబడని యెడల ఒక దినము మనము లోకముతో పాటు తీర్పు తీర్చబడెదము (1 కొరింథీ 11:31, 32).


మన పొరపాట్లను ఒప్పుకొనుట:


మన పొరపాట్లను యథార్థముగా ఒప్పుకొనవలెనని దేవుడు కోరుచున్నాడు.


కాని అనేకమంది పెద్దలు తమ పొరపాట్లను ఒప్పుకొనుటకు ఇష్టపడుటలేదు. ఇది చాలా తీవ్రమైయున్నది మరియు గర్వమే దీనికి కారణము. దేవుడు అహంకారులను ఎదురించును గనుక వారి పరిచర్యలో దేవుని కృప ఉండదు.


ఎవరైతే తమ్మునుతాము తీర్పు తీర్చుకొనుచు మరియు వెంటనే వారి పొరపాట్లు ఒప్పుకొని క్షమాపణ అడిగెదరో, వారికే దేవుడు విలువ నిచ్చును. ఒక సహోదరుడు నాకు అబద్ధము చెప్పియున్నాడని నేను కనుగొనినప్పుడు లేక తన తప్పులను ఒప్పుకొని క్షమాపణ అడుగుటకు అయిష్టముగా ఉన్నాడని నేను చూచినయెడల అతనిమీద నేను నమ్మకమును కోల్పోయెదను.


మనమందరము పొరపాట్లు చేయుదము. దేవుడు మాత్రమే ఎన్నటికిని ఒక పారపాటు కూడా చేయడు. మరియు మనము ఒక పొరపాటు చేసినప్పుడు దానికి దేవుని యెదుటను మరియు దాని ప్రభావం పడినవారి యెదుటను ఒప్పుకొనవలెను. మన పాపమును బట్టి ప్రభావితమైన వారి యెదుట మన పాపమును ఒప్పుకొనుట ద్వారా ఒక పెద్దగా మన దీనత్వము పరీక్షించబడుతుంది.


పెద్దలందరు వేసుకోవలసిన ఒక మంచి ప్రశ్న, ''నేను నా పొరపాటును (పాపమును) గూర్చి మరొక సహోదరుని క్షమాపణ అడిగి ఎంత కాలమయినది?''.


మన పాపములను మనము యథార్థముగా దేవుని యెదుటను మరియు మానవుని యెదుటను ఒప్పుకొనినయెడల, మన పాపములను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని దేవుడు మనతో చెప్పును (హెబీ 8:12).


గతములో మనము చేసిన పొరపాట్లనుండి మనము పాఠములను నేర్చుకొనవలెను. లేనియెడల చేసిన పొరపాట్లను మరల చేయుదుము.


మనలను విరుగగొట్టుటకు దేవునికి అనుమతి ఇవ్వాలి:


ఒక సమూహమునకు పంచిపెట్టుటకు ప్రభువైన యేసు 5 రొట్టెలను ఉపయోగించాడు. మొదటిగా ఆయన రొట్టెలను ఆశీర్వదించాడు. కాని 5 రొట్టెలు 5 రొట్టెలు గానే ఉన్నవి. మరియు జన సమూహమునకు రొట్టెలు పంచిపెట్టలేదు. ఆ రొట్టెలు విరుగగొట్టబడినప్పుడు మాత్రమే జనసమూహమునకు పంచిపెట్టిరి. కాబట్టి ఆత్మాభిషేకమనే ఆశీర్వాదముపొందుట మాత్రమే సరిపోదు. ప్రభువుచేత మనము విరుగగొట్టబడవలసియున్నది. అప్పుడు మన ముఖమును దుమ్ములో పెట్టుకొనుచున్నయెడల, దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఆటంకము లేకుండా మనలోనుండి ప్రవహించుచుండును.


నిర్గమకాండము 4వ అధ్యాయములో, మోషే మరియు అహరోనులు దేవుని ప్రజల మీద నాయకులుగా నియమించబడిరి. మోషే బాగుగా మాట్లాడలేడు గానీ అహరోను మాట్లాడగలడు (నిర్గమ 4:10, 14). కాని మోషే విరుగగొట్టబడియున్నాడు గానీ అహరోను విరుగగొట్టబడలేదు. గనుక దేవుడు అహరోనును కాదు గానీ మోషేను వాడుకొనియున్నాడు.


మోషే అరణ్యములో 40 సంవత్సరములు విరుగగొట్టబడియున్నాడు. రాజభవనములో పరిపాలించవలసిన మోషేను అరణ్యములో గొఱ్ఱెలు మేపేటట్లు చేసి, దేవుడు అతనిని దీనునిగా చేసెను. అతడు మామ దగ్గర 40 సంవత్సరములు ఇల్లరికం ఉండి అతని కొరకు పనిచేసేటట్లుగా దేవుడు అనుమతించాడు. ఆ విధంగా అతడు పూర్తిగా విరుగగొట్టబడియున్నాడు. అహరోను ఆ విధముగా విరుగగొట్టబడలేదు. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసమున్నది.


నిర్గమకాండము 32లో, వీరిద్దరి మధ్యనున్న వ్యత్యాసమును చూడగలము. విరుగగొట్టబడిన మోషే ఇశ్రాయేలీయులలో ఉన్నంతవరకు వారు ప్రభువును వెంబడించారు. కాని మోషే 40 దినములు వారి యొద్దనుండి వెళ్ళినప్పుడు తాత్కాలికంగా అహరోను వారి నాయకుడై వారిని నడిపించాడు. కాని వారు వెంటనే తప్పిపోయి బంగారుదూడను ఆరాధించి మరియు విగ్రహారాధికులైరి. అహరోను బాగుగా మాట్లాడగలడు. కాని అతడు మనుష్యులను సంతోషపెట్టువాడుగా ఉన్నాడు గనుక, అతడు దేవుని ప్రజలను పవిత్రతతో కొనసాగింపచేయలేకపోయాడు.


విరుగగొట్టబడని పెద్దలు ఎల్లప్పుడు వారి సంఘములో ప్రజల యొక్క ఘనతను కోరుదురు. ఆ విధముగా ప్రజలు ప్రభువు యొద్దనుండి తొలగిపోవుదురు.


అరణ్యములో 40 సంవత్సరములు విరుగగొట్టబడిన మోషే, 20 లక్షల మంది ప్రజలను దేవుని మార్గాలలో నడిపించాడు. శతాబ్దములన్నింటిలోని సంఘ చరిత్రలో కూడా జరిగినది. దేవుడు తన సంఘమును ఆయన మార్గములో ఉండునట్లు విరుగగొట్టబడిన వారిని దేవుడు వినియోగించుకొనును.


విధేయత ద్వారా విరుగగొట్టబడగలము:


మన పెద్దలకు మనము లోబడుట ద్వారా దేవుడు మనలను విరుగగొట్టును. నేను వ్రాసిన ఒక ఆత్మీయ నాయకుడు అను పుస్తకము నుండి క్రింది భాగమును తీసుకొనియున్నాము.


ఒక దైవజనుడికి లోబడుటవలన మనము అనేక అవివేక కార్యాలు చేయకుండా భద్రపర్చబడటమేగాక అతని దగ్గర అమిత జ్ఞానము నేర్చుకునేందుకు దోహదపడుతుంది. మనకు తెలియని, తన జీవితంలో తాను ఎదుర్కొన్న ప్రమాదముల గూర్చి అతడు మనల్ని హెచ్చరించగలుగుతాడు. కాబట్టి తల్లిదండ్రుల అదుపులో ఉన్న పిల్లలకు ఎటువంటి క్షేమము కలుగుతున్నదో అటువంటి క్షేమమే ఆత్మీయ అధికారం క్రిందవుండటంవల్ల కూడా లభిస్తున్నది.


యౌవనస్థులు తమ పెద్దలకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు గర్విష్టులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని 1 పేతురు 5:5 లో మనం చదువుతాము. దేవునినుండి ఆత్మీయ అధికారం పొందుటకుగల మహారహస్యము ఇక్కడ ఉంది.


ఒకేఒక కారణంచేత దేవునినుండి ఎన్నడూ ఆత్మీయ అధికారంపొందని చాలామంది సహోదరులను నేను ఎరుగుదును. తమ జీవితమంతటిలోనూ ఎవ్వరికీ లోబడిఉండుట వారెన్నడూ నేర్చుకోలేదు. అందుచేత బలిష్టమైన తమస్వచిత్తము ఎన్నడూ విరుగగొట్టబడలేదు. విరుగగొట్టబడని మనిషిచేతుల్లోని అధికారము అతి ప్రమాదకరము. మొట్టమొదట నీ జీవితంలో నీకు విరుగగొట్టబడిన అనుభవం లేకుండా ప్రజలపై అధికారం చెలాయించుటకు ప్రయత్నిస్తే ఆ విధానంలో వారిని నాశనం చేయటమేగాక నిన్నునీవు కూడా నాశనం చేసుకుంటావు. మనలో ఎవరికైనా ఆత్మీయ అధికారాన్ని అప్పగించుటకు ముందు దేవుడు మొట్టమొదట మన గర్వము యొక్క బలమును విరుగగొట్టాలి.


నా సొంత అనుభవాన్ని మీతో క్లుప్తంగా పంచుకుంటాను. నేను 20-30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా పరిచర్యను చూచి అసూయపడిన కొన్ని సంఘాలపెద్దలు నన్ను అణచివేసి బహిరంగముగా అవమానపరిచేలా దేవుడు నా జీవితములో అనుమతించాడు. అటువంటి సందర్భాల్లో కూడా నోరు మూసుకొని ఆ సంఘ పెద్దలను ప్రశ్నించక వారికి లోబడి ఉండమని దేవుడు నాకు చెప్పాడు. నేను అలాగే చేశాను. నేను వారి సంఘాల్లో ఉన్నప్పుడు, ఆ సంఘాలను విడిచి వెళ్లిన తరువాత కూడా వారితో మంచి సంబంధం కలిగియున్నాను. భవిష్యత్తులో దేవుడు నాకు ఎటువంటి పరిచర్యను దాచియున్నాడో ఆ రోజుల్లో తెలియలేదు. అయితే సంవత్సరాల తరబడి నన్ను విరుగగొడుతూ ఆత్మీయఅధికారం నేర్పుటలో దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. నన్ను విరుగగొట్టు పనిని దేవుడు ఇంకా ముగించలేదు. గత కొద్ది సంవత్సరాలుగా నేనెన్నడూ అనుభవించని క్రొత్త అసాధారణ శోధనలగుండా దేవుడు నన్ను పోనిచ్చాడు - 10 సంవత్సరములలో మతానుసారులచేత కోర్టుకు తీసుకొని పోబడ్డాను మరియు అన్యాయముగా నిందించబడ్డాను. అయితే నా జీవితములో ఆయన ఉద్దేశ్యము మారదు - తన జీవమును,అధికారమును అధికంగా నాకు అప్పగించుటకు ఆయన నన్ను ఇంకా విరుగగొడతాడు.


మన బలమును, గర్వమును విరుగగొట్టుటలో దేవుడు మన నాయకుల ద్వారా మనల్ని సరిచేయుట మరో విధానము. దిద్దుబాటును స్వీకరించుట విశ్వాసులందరికీ కష్టతరమైన విషయమే. రెండు సంవత్సరముల బిడ్డకు కూడా దిద్దుబాటును స్వీకరించుట కష్టమే- ప్రత్యేకముగా బహిరంగముగానైతే ఇంకా కష్టము.


నీ జీవితములో బహిరంగదిద్దుబాటును సంతోషంగా ఒప్పుకొని ఎంతకాలమైనది? కనీసం ఒక్కసారైనా నీ జీవితములో దానిని సమ్మతించావా? లేని పక్షంలో నీవు ఆత్మీయ అధికారలోపం కలిగి ఉన్నావనుట ఆశ్చర్యము కాదు.


విరుగగొట్టబడని వారు ఒంటరిగా ఉండెదరు. వారు ఎవరికీ విధేయత చూపలేరు. వారు ఎ్కడకు వెళ్ళవలెనని కోరితే అక్కడకు వెళ్ళెదరు మరియు వారికిష్టమొచ్చినట్లు చేసెదరు. అటువంటి విరుగగొట్టబడని విశ్వాసులు, వారికి పూర్తిగా విధేయులైన వారితోను మరియు వారు చెప్పేదానంతటినీ అంగీకరించే వారితో మాత్రమే పరిచర్య చేస్తారు. దేవుడు ఒక శరీరమును నిర్మించుచున్నాడు గాని విడివిడిగా ఉండే కొందరు విశ్వాసులను కలుపుటలేదు కాబట్టి అటువంటి వారికి ఆయన ఆత్మీయఅధికారమును ఇవ్వడు.


అధ్యాయము 17
సాతానును జయించుట

ప్రభువైనయేసు సంఘమును గూర్చి మొట్టమొదటిగా చెప్పినప్పుడు, సాతాను యొక్క శక్తులతో సంఘము పోరాడవలసి ఉంటుందని ప్రభువైన యేసు చెప్పారు. ఆయన యిట్లనెను, ''నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవు'' (మత్తయి 16:18).


ఆయన చెప్పిన దానిని జాగ్రత్తగా గమనించండి. సంఘము యొక్క ద్వారముల మీద అంధకార శక్తులు దాడిచేయును అని లేదు గానీ సంఘమే పాతాళ లోక ద్వారములమీద దాడిచేయును. సంఘములయొక్క సంఘపెద్దలందరు దీనిని స్పష్టముగా తెలుసుకోవాలి. అదేమనగా ప్రభువైన యేసువలె (క్రీస్తుయొక్క మొదటిశరీరము) సాతాను యొక్క దాడులనుండి కాపాడబడుటకు పిలువబడలేదు గానీ వాటి మీద దాడిచేయుటకు పిలువబడ్డాము.


సిలువమీద సాతాను ఓడించబడెను:


సిలువ మీద సాతాను నిశ్చయముగా ఓడించబడియున్నాడని మొదటిగా మనం తెలుసుకోవాలి.


1. క్రీస్తు మన పాపముల కొరకు సిలువమీద మరణించాడు (1 కొరింథీ 15:3). కాబట్టి మనయొక్క సమస్త పాపములు క్షమించబడియున్నవి.


2. క్రీస్తు మనకొరకు సిలువమీద శాపమాయెను (గలతీ 3:13, 14). కాబట్టి ఎటువంటి శాపము (పితరులనుండి వచ్చినది కాని లేక మరి ఏ శాపమైనను) మనమీద ఉండదు.


3. సిలువమీద మన ప్రాచీనస్వభావము క్రీస్తుతో సిలువ వేయబడియున్నది (రోమా 6:6). కాబట్టి మన జీవితములలో మనము పాపములకు దాసులముగా ఉండనవసరము లేదు.


4. సాతాను సిలువమీద ఓడించబడి మరియు నిరాయుధుడుగా చేయబడియున్నాడు (కొలొస్స 2:13-15, హెబీ 2:14,15). కాబట్టి మనము అతనికి ఎన్నటికిని భయపడనవసరం లేదు మరియు అతని శక్తి మనమీద పనిచేయదు.


సాతాను ఓడించబడియున్నాడని నాల్గవసత్యమును అనేకమంది విశ్వాసులు నిర్లక్ష్యము చేయుచున్నారు.


ప్రభువైన యేసు యిట్లనెను, ''ఒకడు మొదట బలవంతుని (సాతానును) బంధింపనియెడల ఏలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి ఆ యింటిని దోచుకోగలడు; అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. ఎవడైనను నా పక్షమున ఉండి పోరాడని యెడల వాడు నాకు విరోధి (మత్తయి 12:29, 30).


కాబట్టి సాతాను యొక్క ఓటమిని గురించి మనం ఒప్పించబడాలి.


పాతనిబంధన కాలములో, సాతాను ఓడించబడలేదు గనుక వారు సాతానుతో పోరాడుటకు దేవుడు అనుమతించలేదు. అట్లు చేసినయెడల సాతాను జయించెడివాడు. కాని ఒకసారి సాతాను ఓడించబడిన తరువాత సంఘము ఎల్లప్పుడు సాతానుతో పోరాడి జయించగలదు. మనము అతనిని ఎదిరించినయెడల, అతడు మన యొద్దనుండి పారిపోవును (యాకోబు 4:7).


ఇప్పుడు మనము సాతానుతో పోరాడనవసరం లేదుగానీ అతనిని ఎదిరించాలి. సిలువ మీద సాతాను ఓడిపోయాడని మరియు అతనికి మన మీద శక్తిలేదనియు మరియు మన నోటితో ఎల్లప్పుడు ఒప్పుకొనుచు మరియు ప్రభువైన యేసు నామములో అతనిని ఎదిరించినయెడల, అతడు పారిపోవును. ఈ సత్యమును మనము గట్టిగా పట్టుకొని నోటితో ఒప్పుకొనుచున్నంతకాలము, సాతాను మనలను నిరాశపరచలేడు మరియు ఓడించలేడు. ఇటువంటి మనయొక్క సాక్ష్యముద్వారా మనము సాతానును జయించగలము (పక్రటన 12:11).


సాతాను యొక్క దాడులు మరియు దయ్యముల యొక్క సిద్ధాంతములు:


రెండువేలసంవత్సరముల నుండి సాతాను సంఘములమీద దాడిచేయుచున్నాడు.


1. బయట నుండి సంఘమును హింసించినయెడల, సంఘములోని వారందరు ఐక్యమై దాడిని ఎదురించుదురని సాతానుకు తెలుసు కాబట్టి అతడు సంఘములో చొరబడి లోపలనుండి దాడిచేయును.


2. నైతికముగా పడిపోయిన నాయకుని మీద విశ్వాసులకు నమ్మకము ఉండదు అని సాతానుకు తెలుసు కాబట్టి అతడు నైతికముగా పడిపోయేటట్లు చేయకుండా, ఆ నాయకుడు మంచిజీవితము జీవించుచునే తప్పుడు సిద్ధాంతము బోధించేటట్లు చేసి, సాతాను సంఘముమీద దాడిచేయును. కాని చాలామంది విశ్వాసులకు వివేచనలేదు గనుక, మంచి జీవితము జీవించుచున్న వారిని మోసగించి మరియు తప్పిపోయేటట్లు చేయగలడని సాతానుకు తెలియును.


3. తాను వెలుగుదూత వలె వచ్చి బైబిలు మరియు ''ప్రేమను'' (సత్యము విషయములో రాజీపడే నకిలీ ప్రేమ) గురించి బోధించుట ద్వారా. అతడు చీకటి దూతగా వేరే పరిశుద్ధ గ్రంథము తీసుకొని వచ్చినను లేక ''ద్వేషము''ను గూర్చి బోధించుట కంటెను, వెలుగు దూత వలె వచ్చి బైబిలు మరియు ''ప్రేమ''ను గురించి బోధించుటద్వారా అతడు ఎక్కువమంది విశ్వాసులను తప్పిపోయేటట్లు చేయగలడని సాతానుకు తెలియును.


చాలామంది విశ్వాసులకు లేఖనములను గురించి సరిగా తెలియనందున సత్యమును గూర్చి ఒక ప్రక్కగా మాట్లాడువారి ద్వారా సులభముగా తప్పిపోయెదరు. సాతాను ఒకవైపు మాత్రమే సత్యమును గూర్చి ప్రభువైన యేసుతో చెప్పినప్పుడు, ఆ సత్యమును గురించి రెండవవైపున దానిని గురించి ప్రభువు చెప్పారు (మత్తయి 4:6, 7). లేఖనములలోని ఒక వచనమును ఆధారము చేసికొని, ఆ వచనమును గూర్చి సంపూర్ణ సత్యమును చెప్పే వచనములను నిర్లక్ష్యము చేయువారి ద్వారా క్రైస్తవ్యములో ఈనాడు అనేక తప్పుడు సిద్ధాంతము మరియు కల్ట్‌ (మత వ్యవస్థ) ఉన్నవి.


1 తిమోతి 4:1 - 3లో లేఖనములలో చెప్పిన విధముగా మోసపరచు ఆత్మల ద్వారా క్రైస్తవ్యములో ''దయ్యముల'' బోధలు ఉన్నవి. ఈ సిద్ధాంతములు పుస్తకముల ద్వారాను మరియు ఇంటర్నెట్‌ ద్వారాను ప్రతిచోట విస్తరించుచున్నవి. ఇది బూతు సాహిత్యం (బొమ్మలు) కంటె ప్రమాదకరమైనవి. ఎందుకనగా ఈ సాహిత్యం కంటె ఈ సిద్ధాంతములు చెడ్డవని గుర్తించుట కష్టమైయున్నది.


ఈ భూమిమీద ఎక్కువగా విస్తరించుచున్న రెండు దయ్యముల యొక్క బోధలు:


1. దేవునికి అవిధేయత చూపించినప్పటికిని నీవు చనిపోవని సాతాను హవ్వతో అబద్దం చెప్పాడు (ఆదికాండము 3:4). ''ప్రేమగల దేవుడు పాపమును బట్టి తాను సృష్టించిన వారిని ఎవరిని శిక్షించడని సాతాను చెప్పియున్నాడు. ఈనాడు కూడా నీవు పాపములో జీవించుచున్నప్పటికినీ, ప్రేమగల దేవుడు ఎవరిని నరకానికి పంపించడను విషయమును సాతాను ప్రచారము చేయుచున్నాడు.


2. నీవు దేవునివలె ఉందువనియు మరియు దేవునివలె స్వతంత్రురాలువై యుందువనియు సాతాను హవ్వతో చెప్పాడు. గతములో సాతాను తిరుగుబాటు చేసినట్లే ఆమెను కూడా అధికారానికి తిరుగుబాటు చేయమని ఆమెకు బోధించెను. ఇది ఈనాడు అనేకమంది క్రైస్తవుల యొక్క లక్షణమైయున్నది. వారు వారిపైనున్న ఏ అధికారమునకు లోబడరు. ఆ విధముగా వారు తప్పుడు సిద్ధాంతములతో తప్పిపోయెదరు. కుటుంబములో బిడ్డలను కాపాడుటకు తండ్రులు ఉన్నట్లే, సంఘములో కూడా దేవుడు ఆత్మీయ తండ్రులను నియమించియున్నాడు. ఈ ''తండ్రులు'' యొక్క కాపుదలను అంగీకరించని వారు అపాయములో ఉన్నారు.


సాతాను చేత హవ్వ మోసగించబడినది మరియు ఈనాడు కూడా అనేకులు మోసగించబడుచున్నారు. దేవుని సన్నిధిలోనుండి హవ్వ (తోసివేయబడినది మరియు ఈనాడు సాతాను యొక్క సిద్ధాంతము నమ్మెడి వారు దేవుని సన్నిధిలో నుండి ఒకరోజు వెళ్ళగొట్టబడెదరు.


తిరుగుబాటుఆత్మ కలిగిన పరలోకములోని దూతలందరిని కలిపేటట్లుగా సాతానుగా మారిన ప్రధానదూతకు దేవుడు అనుమతించాడు. అప్పుడు ఒక్క క్షణములో వారందరిని పరలోకమునుండి త్రోసివేసియున్నాడు. ఆ విధముగా పరలోకము పవిత్రపరచబడినది. సంఘములోని తిరుగుబాటు చేసే ఆత్మను కలిగిన వారందరిని కలుపునట్లు తిరుగుబాటు చేసే ఆత్మకు దేవుడు అనుమతించును. సంఘము రెండుగా చీలునట్లు ఆయన అనుమతించును. ఆ విధముగా సంఘము పవిత్రపరచబడుతుంది. ఈనాడు అనేక సంఘములలో లూసిఫరు యొక్క పరిచర్య కొనసాగుచున్నది మరియు సంఘమును పవిత్ర పరచుటకు దేవుడు దీనిని అనుమతించును.


నిందారోపణలు:


విశ్వాసులందరిని నిందించే ప్రధాన నిందితుడుగా సాతాను ఉన్నాడు (పక్రటన 12:10). విశ్వాసుల మధ్యలో ఈ పరిచర్యను చేయుటకు అతనితో సహకరించే వారికొరకు సాతాను ఎల్లప్పుడు చూచుచున్నాడు. మరియు లోకమంతట అతనితో సహకరించే అనేకులు అతడు కనుగొనుచున్నాడు.


సాతాను మనతో అబద్ధములు చెప్పును. కాని అతడు దేవుని దగ్గర మనమీద నిందారోపణ చేయునప్పుడు, ఆయనతో అబద్ధము చెప్పుటకు సాహసము చేయలేడు గనుక అతడు సత్యమునే చెప్పును. అతడు సత్యమును చెప్పినప్పటికిని, అతడు నిందించేఆత్మను కలిగియున్నాడు. దానిని బట్టి మనము ఒక పాఠమును నేర్చుకోవాలి. అదేమనగా ఒక సహోదరుని యొక్క పాపములను గూర్చి సూటిగా తనతో మాట్లాడక, ఇతరులతో మాట్లాడినయెడల, మనము చెప్పినదంతయు సత్యమైనప్పటికిని నిందించే పరిచర్యలో మనము సాతాను యొక్క సహపరిచారకులమగుదుము.


నేరారోపణ చేసే వారితో మనము ఎన్నటికి సహవాసం చేయకూడదు. ఒక సహోదరుడు పాపం చేసినయెడల సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారిలోనికి తీసుకొని రావలెనని ఆజ్ఞాపించబడి యున్నాము (గలతీ 6:1). అతనితో నేరుగా మాట్లాడవలెను. అతడు వినుటకు అంగీకరించనియెడల, అప్పుడు అతని గూర్చి పెద్దలకు చెప్పవలెను. అతడు పెద్దల మాట కూడా విననియెడల, అప్పుడు అతడు ఆత్మీయ అధికారానికి లోబడుటలేదని సంఘమంతటికి తెలియచెప్పవలెను. తరువాత అతనిని సంఘమునుండి బయటకుపంపవలెను. మత్తయి 18:15 - 20లో, ప్రభువైనయేసు ఈ పద్ధతిని గూర్చి స్పష్టముగా చెప్పారు. ఆ విధముగా సంఘములో ఉన్న నేరారోపణ మోపే సాతానును బంధించవలెనని ప్రభువైన యేసు చెప్పారు.


ఒక పెద్ద మీద దోషారోపణ చేయబడినయెడల, ఇద్దరు ముగ్గురు నమ్మకమైన సాక్షులు ఉంటేనే దానిని అంగీకరించవలెను (1 తిమోతి 5:19). తరువాత ఆ విషయమును అనుభవముగల పెద్దలు జాగ్రత్తగా పరిశీలించాలి. పాత నిబంధనలో దేవుడు స్పష్టముగా ఆజ్ఞాపించియున్నాడు ''నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను'' (ద్వితీయోపదేశకాండము 13:13). ఒక పెద్ద పాపములో జీవించుచున్నాడని ఋజువైనయెడల, సంఘములోవున్న అందరియెదుట ఒక అనుభవం కలిగిన పెద్ద అతనిని గద్దించాలి. ''ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము'' (1 తిమోతి 5:20).


అనుభవం కలిగిన ఆ పెద్ద నకిలీ కనికరంతో అతనిని అందరియెదుట గద్దించనియెడల, పరిశుద్ధాత్మ కన్నా తనకు ఎక్కువగా తెలియునని అతడు చెప్పుచున్నాడు. మనము దీనులమై మరియు దేవుని వాక్యమునకు లోబడవలెను.


అన్యాయముగా నిందించబడుచున్న వారికి ఇక్కడ రెండు వాగ్ధానములు ఉన్నాయి.


''దేవుడు నాకు సహాయము చేయును గనుక వారి యొక్క అవమానములు నన్ను గాయపరచలేదు. నేను వాటిని సహించెదను. దేవుడు నాకు సన్నిహితముగా ఉండి మరియు నేను పాపము లేనివాడనని ఆయన ఋజువు చేయును గనుక నన్ను అవమానపరచడు. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? మనము కలసి కోర్టుకు వెళ్ళెదము. ఆయనను నిందించనిచ్చెదము. నా మీద నేరారోపణ చేయువారందరు అదృశ్యమయ్యెదరు. చిమ్మెట వారిని తినివేయును.... ఇతరులను నాశనము చేయగోరువారు, వారి మీదకే నాశనము తెచ్చుకొందురు. దేవుడే దానిని జరిగించును'' (యెషయా 50:7 - 11 గుడ్‌ న్యూస్‌ బైబిలు).


''నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. ఇది దేవుని సేవకుల యొక్క స్వాస్థ్యము. నేనే ఈ ఆశీర్వాదమును ఇచ్చియున్నానని ప్రభువు చెప్పుచున్నాడు'' (యెషయా 54:17 లివింగు బైబిలు).


తన ప్రజలను పరీక్షించుటకు దేవుడు సాతానుకు అనుమతి నిచ్చాడు. ఆ విధముగా ఆయన పేరు పెట్టబడిన వారి హృదయస్థితిని అందరికి తెలిసేటట్లు చేయును. అబద్ధములతోను ద్వేషములతోను నిండిన ఈ లోకములో మనము అంతము వరకు సత్యములోనూ మరియు ప్రేమలోను నిలచియుండెదమో లేదోయని దేవుడు ఆయా పరిస్థితులను అనుమతించును.


ఆవిధముగా దైవభక్తి గలవారికిని మరియు లేనివారికిని, మంచి ఉద్దేశ్యముతో చేయువారికిని మరియు అసూయతోను ద్వేషముతోను చేయువారికిని తేడాను వివేచించుటకు చూచుటకు కన్నులున్నవారు చూడగలరు. కాని కొందరు పరిసయ్యుల వలె గ్రుడ్డివారైయుండి, చివరి వరకు వివేచన లేనివారై యుందురు. బంగారము అగ్నిలో పవిత్రపరచబడుతుంది. కాని ఎండినగడ్డి అగ్నిలో బూడిదగా మారుతుంది.


ప్రభువైనయేసు సాతానును జయించెను:


ప్రభువైన యేసు సిలువమీద ''ఇది సమాప్తమైనది'' అని చెప్పినప్పుడు, సాతాను యొక్క రాజ్యము సమాప్తమైనది. కాబట్టి ఈనాడు మనము ఓడిపోయిన సాతానును ఎదిరించగలము.


మన జీవితములలో శ్రమలను ఎదుర్కొనుచున్నప్పుడు, దీనిని మనము ఎల్లప్పుడు మన మనస్సులలో ఉంచుకొనవలెను. మీ గృహములో కాని మీయొక్క ఆర్థిక విషయాలలోగాని, మీ కంపెనీలలోగాని లేక ఇబ్బందిపెట్టే మీ బిడ్డతోగాని మీరు బాధపడుచున్నయెడల, సిలువ మీద సాతాను యొక్క శక్తి నశింపచేయబడినదని గుర్తించుకొనవలెను. సాతాను ఎటువంటి క్లిష్టపరిస్థితిని మీకు తెచ్చినప్పటికిని, అతడు ఓడిపోయియున్నాడు గనుక ఈ పోరాటములో అతడు గెలువడు. ''ఇది సమాప్తమైనది'' అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను ఎల్లప్పుడు గుర్తించుకొని మరియు అతడు ఓడించబడియున్నాడనియు మరియు నీ మీద అతనికి ఏ అధికారములేదనియు సాతానుతో నీవు చెప్పాలి.


మారుమనస్సు పొందని ఒక స్త్రీని ఒక వ్యక్తి ప్రార్థన కొరకు మా యింటికి తీసుకొని వచ్చియున్నాడు. నేను మరియు నా భార్య కూర్చొని ఆమెతో మాట్లాడియున్నాము. ఆమెతో మాట్లాడిన తరువాత ప్రార్థించుచూ, ఆమెను సాతానుతో ఈ విధముగా చెప్పమని అడిగాను, ''సాతానా, నేను నీకు చెందను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద నిన్ను ఓడించియున్నాడు''. వెంటనే ఆమె పెద్ద స్వరముతో ఇట్లనెను, ''సిలువమీద నేను ఓడించబడలేదు''. ఆమెలో దయ్యమున్నదని అప్పుడు నేను గ్రహించాను. కాబట్టి అధికారముతో దయ్యముతో ఇట్లన్నాను, ''దయ్యమా, నీవు అబద్ధికుడవు. నీవు సిలువ మీద ఓడించబడియున్నావు. ప్రభువైన యేసు నామములో, ఆమెలోనుండి ఇప్పుడు వెళ్ళిపొమ్ము''. వెంటనే ఆ దయ్యము వెళ్ళిపోయినది. అప్పుడు ఆమె సాతానుతో ధైర్యముగా, సిలువమీద ప్రభువైనయేసు నిన్ను ఓడించియున్నాడని చెప్పినది.


నీవు నిర్మలమైనమనస్సాక్షిని మరియు విశ్వాసమును కలిగియున్నట్లయితే, దయ్యములను వెళ్ళగొట్టుటకు నీవు పెద్దగా కేక వేయనవసరము లేదు. వెళ్ళిపొమ్మని ఒక్కసారి చెప్పినయెడల చాలును. ''ఒక్క మాటతో ప్రభువైన యేసు దురాత్మలను వెళ్ళగొట్టియున్నారు'' (మత్తయి 8:16,17) మరియు ఆయన మెల్లని స్వరముతో మాట్లాడెను మరియు ఆయన నామములో, మనము కూడా ఆ విధముగా చేయవచ్చును.


సిలువమీద తాను ఓడిపోయియున్నాడని వినుటకు సాతానుకు యిష్టములేదని ఆ దినమున నేను నేర్చుకొనియున్నాను.


కఠినమైన పరిస్థితుల గుండా నీవు చాలాకాలం నుండి వెళ్ళుచున్నప్పటికిని, నీవు విడిచిపెట్టవద్దు. సాతానుయొక్క దాడులన్నిటిని నీవు నిశ్చయముగా జయించగలవు. నీవు అలాగే కొనసాగుచూ ఎప్పటికి విడిచిపెట్టవద్దు. దేవుడు నిన్ను విజయోత్సాహముతో నడిపించును.


దేవునిని నమ్మినవారు ఎప్పటికిని సిగ్గుపరచబడరు. కాబట్టి ఎన్నటికి నిరుత్సాహపడవద్దు. సాతానుకు విరోధముగా ఎల్లప్పుడు దేవుడు నీ పక్షమున ఉన్నాడు మరియు ఆయన నిన్ను సిగ్గుపరచడు.


భయమునుండి విడుదల:


సాతాను భయమును కలిగించువాడుగా ఉన్నాడు. ప్రభువైనయేసు పాపమును వ్యతిరేకించినట్లే భయమును వ్యతిరేకించాడు. ఆయన అనేకసార్లు పాపము చేయవద్దని చెప్పినట్లే భయపడవద్దని ప్రజలతో చెప్పాడు. ప్రజలు పాపములో జీవించుటను, ప్రభువైనయేసు వ్యతిరేకించియున్నాడు.


మనము ప్రభువులో విశ్వాసముంచుచున్నాము కనుక మనము ఎన్నటికి భయపడనవసరం లేదు. కాని మనము అనుకొననిరీతిగా భయపడినను మరియు చింతించినను, వెంటనే, మనము పైకి లేచి మన భయమును దేవునియెదుట ఒప్పుకొని మరియు ఆయన కాపాడునని నమ్మవలెను.


దేవునియొక్క పరిచర్య మీద సాతాను అనేక విధములుగా దాడిచేయును. తన బిడ్డల యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చును. కొన్ని దయ్యములను ఉపవాస ప్రార్థన ద్వారానే వెళ్ళగొట్టగలమని ప్రభువైనయేసు ఒకసారి చెప్పారు. అనగా మనము ఉపవాసముండి ప్రార్థించనియెడల, దయ్యములు అక్కడే నిలచియుండి దేవునియొక్క పనిని ఆటంకపరచును. క్రీస్తు శరీరమైయున్న మనమీద దేవుని పరిచర్య ఆధారపడునట్లు దేవుడు చేశాడు. ఇది గొప్ప ధన్యత మాత్రమే కాదు భాద్యతయైయున్నది. తన సంఘము ఎదుట అంధకారశక్తులు నిలువనేరవని ప్రభువు వాగ్ధానం చేసియున్నాడు.


లోకములో అనేక క్రైస్తవవ్యతిరేక శక్తులు పనిచేయుచున్నవి. కాని దేవుడు మనకు భయపడే ఆత్మను ఇవ్వలేదు. ఆయనను ఘనపరచువారు ఆయనచేత ఘనపరచబడెదరు. కాబట్టి మనము ఏ సమయములోనైనను భయముచేత చలించకూడదు. దావీదు సౌలు యొక్క కవచము మీద ఆధారపడనట్లుగానే, అటువంటి సమయములలో మనము కూడా మనుష్యుల మీదగాని మనస్వంత బలముపైగానీ ఆధారపడకూడదు. ప్రభువుయొక్క నామమనే ఆత్మీయ ఆయుధముతో దావీదు గొల్యాతుపై పోరాడెను. మన ఆయుధములు కూడా ఆత్మీయమైనవి (2 కొరింథీ 10:4) మరియు మనము ఎల్లప్పుడు జయించెదము.


మనలను దుష్టలోకములోనికి పంపుచున్నానని ప్రభువైన యేసు చెప్పారు. అనగా తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపినట్లుగా ఆయన మనలను పంపుచున్నాడు. కాని అదే వచనములో పాములవలె వివేకులై యుండవలెనని చెప్పాడు (మత్తయి 10:16).


సకలజనులను శిష్యులుగా చేయుటకు మనము వెళ్లిన యెడల, పరలోకములోనూ మరియు భూలోకములోనూ సర్వాధికారము కలిగిన ప్రభువు, అన్ని సమయములలో మనతో ఉంటాననియు మరియు ఆయన పక్షముగా అధికారమును వినియోగించవలెననియు ఆయన వాగ్ధానము చేసియున్నాడు (మత్తయి 28:19, 20). ఆయన మనతో నుండినయెడల అది చాలును. ఆయన మనతో ఉన్నాడు గనుక లోకమంతయు మనలను ఎదిరించినను మనము ఎదుర్కొనగలము.


ప్రభువైనయేసు యిట్లన్నారు, ''మీరు కలవరపడుటకు గాని లేక శాంతిని సమాధానమును కోల్పోవుటకు గాని అవకాశమియ్యకుడి మరియు మీరు భయబ్రాంతులు అగుటకును మరియు పిరికివారు అగుటకును, బెదరిపోవుటకును అనుమతించకూడదు'' (యోహాను 14:27 యాంప్లిఫయిడ్‌).


దేవునివాక్యము ఈ విధముగా ఆజ్ఞాపించుచున్నది. ''అనేకులవలె మీరు భయపడవద్దు, పరలోకమందున్న ప్రభువునకు తప్ప ఏ మనిషికైనను మరియు దేనికైనను భయపడవద్దు. మీరు దేవునికి భయపడిన యెడల మరి దేనికిని భయపడనవసరంలేదు. ఆయనే స్వయముగా మన భద్రతయైయున్నాడు'' (యెషయా 8:12 - 14 లివింగు బైబిలు).


దేవుడిట్లనుచున్నాడు, ''నిన్ను ఏ మాత్రమును విడువను ఎన్నడును ఎడబాయను''. కాబట్టి మనము ధైర్యముగా యిట్లు చెప్పగలము, ''ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్న, నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును యుగయుగముల వరకూ ఒక్కటే రీతిగా ఉండును'' (హెబీ 13:5 - 8).


''భయము'' విషయములో ఈ రెండు విషయములను గుర్తుపెట్టుకోవాలి.


1. మనము ఏ నిర్ణయము తీసుకొనినను భయముతో తీసుకొనక, ఎల్లప్పుడు దేవునియందు విశ్వాసముతో తీసుకోవాలి.


2. భయము సాతాను యొక్క ఆయుధము కాబట్టి ఇతరులను భయపెట్టువారును లేక బెదిరించువారు వారికి తెలియనప్పటికి నిజానికి వారు సాతానుతో సహవాసం కలిగియున్నారు. కాబట్టి ఈ ఆయుధమును మనము ఎవరిమీదైనను ఉపయోగించకూడదు. (ఎఫెసీ 6:10 మరియు 2 తిమోతి 1:7).


దేవునియొక్క వాక్యము మీద మనము క్రొత్తగా ప్రత్యక్షతలు పొందుటకును మరియు ఆయన కృపను అంతకంతకు మరియెక్కువగా పొందుకొనుటకును, ఇతరులు మనకు చేయు కీడును దేవుడు ఉపయోగించును. మరొక మార్గంలో వీటిని పొందలేము.


దేవుని వాక్యము యిట్లు చెప్పుచున్నది, ''మనము మనుష్యులతో పోరాడము కాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్థుత అంధకార సంబంధమగు లోకనాధులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను మనము పోరాడుచున్నాము'' (ఎఫెసీ 6:12). నేను సాతానుయొక్క శక్తులతో పోరాడవలెనని కోరినయెడల, నేను మనుష్యులతో ఎన్నటికి పోరాడకూడదని ఈ వచనము నుండి ప్రభువు నాకు బోధించాడు.


పాతనిబంధనలో ఇశ్రాయేలీయులు మనుష్యులతో పోరాడియున్నారు. కాని క్రొత్త నిబంధనలో, మనము ఎన్నటికిని మనుష్యులతో పోరాడముగాని కేవలము సాతానుతో మరియు దురాత్మలతోను పోరాడెదము. ప్రభువైనయేసు జీవించి మనకు మాదిరి చూపించాడు. అనేకమంది విశ్వాసులు వారి భార్యలతో, వారి భర్తలతోను, వారి ఇరుగుపొరుగు వారితోను మరియు ఇతర విశ్వాసులతోను మొదలగు వారితోను పోరాడెదరు. గనుక వారు సాతానును జయించలేక పోవుచున్నారు.


నీవు సాతానుతో బలముగా పోరాడవలెనని కోరినయెడల, భవిష్యత్తులో నీవు ఏ మనుష్యునితోనైనను పోరాడకుండునట్లు తీర్మానించుకొనుము.


దేవుని మార్గములను మనము ఖచ్చితముగా వెంబడించినయెడల, మనము ఎల్లప్పుడు సాతానును మరియు అతని యొక్క కుయుక్తులను ఎదిరించి మరియు ఎల్లప్పుడు జయించగలము.


అధ్యాయము 18
శ్రమలు వచ్చినప్పుడు


క్రైస్తవ్యములోని మొదటి 300 సంవత్సరములు, దాదాపు క్రైస్తవులందరును క్రైస్తవవిరోధులైన పాలకులచేత శ్రమలుపొంది మరియు వారిలో అనేకులు చంపబడిరి. దేవుడు తన యొక్క మహిమార్థము, ఆయన యొక్క జ్ఞానముతో తన యొక్క పిల్లలను శ్రమపెట్టుటకు ప్రజలకు అనుమతించాడు. ఈనాడు కూడా దేవుడు తనయొక్క ప్రియమైనకుమారులలో కొందరిని హింసించే ప్రభుత్వంక్రింద ఉండేటట్లు దేవుడు అనుమతించుచున్నాడు.


సంఘము శ్రమలలో గుండా వెళ్ళెను:


హింసింపబడినప్పుడెల్లను సంఘము బహుగా విస్తరించెను. కాని సంఘము సుఖసౌఖ్యములను మరియు వస్తు వాహనములను సమృద్ధిగా పొందినప్పుడు, వారిలో అనేకులు లోకానుసారులైరి.


మనము ఈ లోకములో జీవించుచున్నంతవరకు, మనకు శ్రమలును, హింసలును మరియు పరీక్షలును కలుగును. కాబట్టి మనము ఈ యుగాంతములో ఉన్నాము. కనుక మనము పనిచేసే స్థలములలోగాని మరియు మన వ్యక్తిగతముగాగాని సౌఖ్యముగా(సులభముగా) ఉంటుందని అనుకోకూడదు.


ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. కాబట్టి మనము సామాన్యముగా జీవించుటకు ఇప్పుడే నేర్చుకోవాలి. సుఖ సౌఖ్యములతో జీవించేవారికి, రాబోయే దినములు కష్టముగా ఉండును. భవిష్యత్తులో మనము ఇతరుల మీద ఆధారపడకుండునట్లు, మనము కొంత డబ్బును పొదుపు చేసుకొనవలెను. కాని మనము దేవునినే నమ్మెదముగాని మనము పొదుపు చేసిన ధనమును నమ్మము. మన దేవుడు రోషము గలవాడు గనుక సృష్టించబడినవాటిని మనము నమ్మునట్లు ఆయన అనుమతించును.


సృష్టించబడిన వస్తువులను నమ్ముచున్నవారు కదిలించబడునట్లు, ఈ లోకములో ఉన్న ఆర్థిక వ్యవస్థలను దేవుడు కదిలించబోవుచున్నాడు. ప్రభువైన యేసు చెప్పిన రీతిగా, సహోదరుడు సహోదరుని మీద నమ్మకద్రోహము చేయుననియు మరియు మన కుటుంబీకులే మనకు శత్రువులగుటను మనము చూచెదము (మత్తయి 10:21). ఆఫీసులలోను మరియు ఫ్యాక్టరీలలోను మరియు విశ్వాసులు హింసించబడుదురు. ఇవన్నియు మనలను పవిత్రపరచి మరియు మంచి క్రైస్తవులనుగా చేయును.


1 పేతురు 3:13లో మనము మంచి విషయములో ఆసక్తి కలిగియున్నట్లయితే, మనకు ఎవరు హానిచేయరని చెప్పుచున్నది. కాబట్టి మనము దేవుని కృపను అనుభవించుట ద్వారా, ప్రతి ఒక్కరికి మేలు చేయునట్లు నిర్ణయించుకొనెదము. మనలను ద్వేషించువారిని ప్రేమించెదము, శపించువారిని దీవించెదము మరియు మనలను బాధించు వారికి పాపక్షమాపణను గూర్చి ప్రార్థన చేయుదము. అప్పుడు మనకు ఎవరును హానిచేయలేరు. సాతాను మరియు అతని యొక్క దూతలు మనకు మోసము చేయవచ్చును, మనలను ఇబ్బంది పెట్టవచ్చును, మనలను వేధించవచ్చును, దొంగిలించవచ్చును, మనలను గాయపరచవచ్చును, మనలను జైళ్లలో పెట్టవచ్చును మరియు చివరకు మనలను చంపవచ్చును. కాని ఆత్మీయముగా వారు మనకు ఎటువంటి హానిని చేయలేరు.


ప్రభువు మనలను ఎల్లప్పుడూ బలపరచును:


నిత్యత్వము వరకు ప్రభువు మనలను విడువడు మరియు ఎడబాయడు. మనము హింసించబడుచున్న సమయములలో మనము తొట్రిల్లి మరియు ఓడిపోయినను, మనలను మనము తగ్గించుకొనినయెడల ఆయన మనలను విడిచిపెట్టడు. విరిగి నలిగిన హృదయము గలవారికి ప్రభువు ఎల్లప్పుడు సమీపముగా ఉండును. ''దేవుడు మన చేయిని పట్టుకొని యున్నాడు. గనుక మనము పడిపోయినను లేచెదము'' (కీర్తన 37:24 లివింగు బైబిలు).


దేవుడు ఎంతో సార్వభౌమాధికారమును మరియు సంపూర్ణుడై యుండి ఇతరులు మనకు చేసిన కీడును, మనకు మేలుగా మార్చుటయే గాక మన యొక్క ఓటముల ద్వారా కూడా మనకు మేలు కలిగేటట్టు చేయగలడు. ఆయన మనకు జరుగు వాటన్నింటిని సమకూర్చి, మనకు అత్యంత మేలుగా మార్చగలడు (రోమా 8:28). ఆయన మనలను ప్రతి యొక్క కీడునుండి విడిపించి మరియు మనలను విజయోత్సాహముతో నడిపించగలడు. అంతము వరకు ఆయన మనలను కాపాడగలడని ఆయనను నమ్ముచున్నాము మరియు మన స్వంత శక్తిని ఎన్నటికి మనము నమ్ముటలేదు. ఆయనయే మన ధైర్యమైయున్నాడు. కాబట్టి మనము భయముతో కాక గొప్ప ధైర్యముతో భవిష్యత్తు కొరకు చూచుచున్నాము.


మనము ప్రభువైన యేసు కాని దానంతటిని విడిచిపెట్టి అనగా మనయొక్క గత ఓటములను, మన యొక్క బలహీనతలను లేక భవిష్యత్తును గూర్చిన భయములన్నింటిని విడిచి యేసును మాత్రమే చూచుచు పరుగెత్తెదము (హెబీ 12:2). మనము ఎంత బలహీనులము అయినప్పటికిని మరియు గతములో అనేకసార్లు ఘోరముగా ఓడిపోయినప్పటికిని ప్రభువు మనలను జయించువారుగా చేయగలడు.


రాబోయే దినములలో విశ్వాసమును బట్టి కలిగే హింసలన్నిటి కొరకు, ప్రపంచములోని క్రైస్తవులను మనము సిద్ధపరచాలి. ఆ దినముల కొరకు ప్రభువు మనకు నాలుగు ఆజ్ఞలను ఇచ్చియున్నాడు.


1. ''మనము పాములవలె వివేకులమును మరియు పావురములవలె నిష్కపటులమై యుండవలెను'' (మత్తయి 10:16).


మనము సాక్ష్యము చెప్పినప్పుడు బుద్ధిహీనులమై యుండక జ్ఞానము కలిగియుండాలి. మనము జీవించే స్థలములోను మరియు మనము పనిచేసేస్థలములోను మనము క్రీస్తునే జీవించాలి మరియు క్రీస్తునే మాట్లాడాలి. మనము ప్రభువు కొరకు సాక్ష్యము చెప్పినప్పుడు, ఇతర మతములకంటె క్రైస్తవమతము గొప్పదని కాక ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. ప్రభువైన యేసు మనలో మహిమ పరచబడునట్లు, ఆయన తనవైపుకు అనేకులను ఆకర్షించును (యోహాను 12:32).


క్రైస్తవ్యము యెడల, ఆసక్తి ఉన్నట్లుగా నటించి మరియు మనము చెప్పిన కొన్ని మాటలను బట్టి నిందించుచు మరియు బలవంతముగా మతమార్పిడి జరిగించుచున్నామని చెప్పి, కోర్టుకు తీసుకు వెళ్లాలని కోరే క్రైస్తవులు కానివారియెడల మనము జాగ్రత్తగాఉండవలెను.


కాబట్టి ప్రభువైన యేసువలె మనము జ్ఞానమును మరియు ప్రేమను కలిగియుండాలి.


''ప్రభువైన యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు'' (యోహాను 2:24, 25). మనము ప్రతి ఒక్కరిని వివేచించవలెను.


''యూదయలోని యూదులు ఆయనను చంపవలెనని కోరుచున్నారు గనుక అక్కడికి వెళ్ళుటకు ప్రభువైన యేసు ఇష్టపడలేదు'' (యోహాను 7:1). అనవసరమైన అపాయమును మనము తెచ్చుకొనరాదు.


''మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి'' (మత్తయి 5:44). మంచివాడవై యుండుము మరియు ఇతరులు చెడ్డవారు గనుక నీవు చెడ్డవాడవై యుండకుము.


2. ''దేవుని నోటిలోనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించుము'' (మత్తయి 4:4).


మనము హింసించబడుచున్న సమయములలో, దేవుడు మన హృదయములతో మాట్లాడుచున్న మాటలను మనము వినవలెను. మనము రోజంతయు దేవుని నుండి వినే అలవాటును అభివృద్ధి చేసుకొనవలెను. దేవునిలోనుండి వచ్చిన మాటలను మనము విశ్వసించి మరియు మనము లోబడాలి. లేనట్లయితే, దానికి విలువ ఉండదు. దేవుని స్వరమును మనము వినగలుగునట్లు దేవుని వాక్యమును (ప్రత్యేకముగా క్రొత్త నిబంధనను) ఎక్కువగా ధ్యానించవలెను. ''అప్పుడు మనము నమ్మి లోబడగలము''.


3. ''నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగల వారైనయెడల దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను'' (యోహాను 13:34, 35).


మన యింటిలోను మరియు మన సంఘములలోను, ఒకరిని ఒకరు తీర్పు తీర్చుటయు, ఒకరి మీద ఒకరు కొండెములు మరియు చాడీలు చెప్పుటయు, ఒకరిమీద ఒకరు పోట్లాడుటయు మరియు ఒకరిని ఒకరు అనుమానించుటయు పూర్తిగా ఆపివేయవలెను. మన జీవితములలోని పాపముమీద మరియు సాతానుమీద పోరాడుట గురించి దృష్టిపెట్టే సమయమిది. మన యొక్క భాగస్వాములను ప్రేమించుట కొరకును మరియు మనయొక్క సహవిశ్వాసులను ప్రేమించుట కొరకును ప్రయాసపడవలెను.


4. ''లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుము. నేను లోకమును జయించియున్నాను'' (యోహాను 16:33).


దేవుడు సింహాసనాసీనుడై యున్నాడు మరియు ఆయన తన వారిని ఎన్నటికిని విడిచిపెట్టడు. రెండు వేల సంవత్సరముల క్రితము సాతాను ఓడించబడియున్నాడు. మనము దేవుని యొక్క కనుగ్రుడ్డుయై యున్నాము. కాబట్టి ఆయన మన చుట్టూ అగ్నిప్రాకారముగా ఉన్నాడు (జెకర్యా 2:5, 8). మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు (యెషయా 54:17). కాబట్టి మనము, ''ధనాపేక్షలేనివారమై కలిగిన వాటితో తృప్తి పొందియుండెదము, ఎందుకనగా దేవుడే యిట్లనుచున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను. నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?'' (హెబీ 13:5, 6).


మనము ఈ విధముగా ప్రార్థించెదము, ''ఓ యేసుప్రభువా, త్వరగా రమ్ము'' (పక్రటన 22:20).


హింసింపబడుచున్నప్పుడు జ్ఞానము కలిగియుండుట:


ఇండియాలో పరిస్థితులు మారుచున్నవి. కాబట్టి మనము దేనికొరకు నిలబడగలమో మరియు దేనికొరకు నిలబడకూడదో అను విషయములో సంఘపెద్దలు జ్ఞానము కలిగియుండవలెను. మన యొక్క సహవిశ్వాసులకు సలహాచెప్పుటకు మనకు జ్ఞానము అవసరము.


వ్యతిరేకించబడుట, హింసించబడుట కంటె వేరుగా ఉన్నది. మనము క్రొత్త నిబంధన నియమములను పాటించుచున్నప్పుడు, మనకు ఎల్లప్పుడు వ్యతిరేకత ఉండును. హింసించబడుట అనగా శరీరమునకు హానిచేయుట మొదలగునవి (ఇవి ఎక్కువగా క్రైస్తవేతరులనుండి కలుగును).


సువార్త ప్రకటించుటకు ప్రభువైన యేసు తన శిష్యులను పంపినప్పుడు, మీరు ఒక పట్టణములో హింసించబడిన యెడల, మరొక పట్టణమునకు పారిపోవుడి అని చెప్పాడు (మత్తయి 10:23). మనము సువార్త ప్రకటించుటకు వేరొకచోట అనుకూలముగా ఉన్నప్పుడు, హింసించబడుచున్న స్థలములో సువార్త ప్రకటించుట మంచిదికాదు. ''ఒకడు పోరాడి మరియు పారిపోయినయెడల, అతడు మరొక రోజు పోరాడవలసియున్నది''.


రెండు విషయములను మనము ఇక్కడ గమనించవలసియున్నది.


మొదటిగా, యూదయలో యూదులు తన్ను చంపవెదకుచున్నందున, ప్రభువైన యేసు అక్కడికి వెళ్ళలేదు (యోహాను 7:1, 11:53, 54). కాని తన తండ్రియొద్ద స్పష్టమైన నడిపింపు పొందినప్పుడు, ఆయన అక్కడకు వెళ్లాడు. ఆయనను ఎవరు ఆపలేకపోయిరి (లూకా 9:51). పౌలు విషయములో కూడా ఆ విధముగానే జరిగినది (అపొ.కా. 21:11 - 13). మనకు స్పష్టముగా ప్రభువు యొద్దనుండి నడిపింపుఉండినయెడల, మనము అపాయకరస్థలములోనికి వెళ్ళవచ్చును. నడిపింపు లేనియెడల వెళ్ళకూడదు.


రెండవదిగా, సంఘము నిర్మించుట సువార్తీకరణకు వేరుగా ఉన్నది. మనకు ఒక స్థానిక సంఘములో బాధ్యత ఉండినయెడల, హింసించబడుచున్న సమయములో వారిని విడిచిపెట్టి పారిపోలేము. తోడేళ్ళు వచ్చినప్పుడు జీతగాడు పారిపోవునని ప్రభువైన యేసు చెప్పారు (యోహాను 10:12). కాబట్టి మత్తయి 10:23లో ప్రభువైన యేసు తన శిష్యులను వేరొక పట్టణమునకు పారిపోవుడి అని చెప్పినప్పుడు, వారు సువార్తను ప్రకటించుచున్నారు గాని సంఘమును నిర్మించుటలేదు. మనము సంఘకాపరులము అయినప్పటికిని, మన ప్రాణములకు ప్రమాదము ఉన్నయెడల జ్ఞానము కలిగి నడుచుకొనవలెను. కొన్నిసార్లు ఒక నాయకుడు తాత్కాలికముగా పౌలువలె వేరొక ప్రాంతమునకు వెళ్లవచ్చును (అపొ.కా. 17:10). విశ్వాసమూలముగా జీవించుట అనగా మన యొక్క ఇంగిత జ్ఞానమునకు ఉపయోగించకూడదని కాదు. విశ్వాసము దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడియున్నది (రోమా 10:17). దేవుని యొద్ద నుండి మనకు స్పష్టమైన వాక్యము మనకు లేనప్పుడు, మనయొక్క ఇంగిత జ్ఞానమును ఉపయోగించాలి. లేనట్లయితే మనము బుద్ధిహీనులమై మరియు రోగము వచ్చినప్పుడు కొందరు మందులు నిరాకరించినట్లే మనము కూడా నకిలీ ధైర్యముతో ప్రవర్తించెదము.


ప్రభువైనయేసు చెప్పినట్లుగా రాబోయే దినములలో క్రైస్తవులు అంతకంతకు ''తోడేళ్ళ మధ్య గొఱ్ఱెలవలె ఉండెదరు'' (మత్తయి 10:16). కాని మన తలవెండ్రుకలన్నిటిని గురించి మన పరలోక తండ్రి జాగ్రత్తవహించియున్నాడు. మరియు లోకములో ఉన్న పక్షులన్నింటి కంటె మనము ఎంతో విలువైన వారము (మత్తయి 10:29, 30). కాబట్టి మనము మనుష్యులకు గాని సాతానుకు గానీ భయపడము. అలాగే మనము క్రైస్తవవ్యతిరేక సంస్థకు గాని లేక ప్రభుత్వమునకు గానీ భయపడము. బైబిలు మరియు క్రీస్తు యొక్క బోధనల ప్రకారము, మన యొక్క మనస్సాక్షి అనుమతించినంత వరకు ప్రభుత్వము యొక్క చట్టములన్నింటికిని లోబడెదము. మనము సత్యమను నమ్మినదాని విషయములో ఎన్నటికిని రాజీపడము.


దేవుని వాక్యములో దేవుని ఆజ్ఞలతో సంఘర్షణ లేనంతవరకు ప్రభుత్వము పెట్టిన ప్రతి చట్టమును మనము గౌరవించెదము. దేవుని వాక్యములో ఆయన నిషేధించిన దానిని లౌకిక అధికారులు చెప్పినప్పుడు మాత్రమే మనము లోబడము (అపొ.కా. 5:29).


అదే సమయములో మనము ''పాములవలె వివేకులును, పావురములవలె నిష్కపటులమై యుండవలెనని'' ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 10:16). కాబట్టి మన క్రియల ద్వారా కాని లేక మన మాటల ద్వారా కాని ఎవరికి కీడు చేయకూడదు.


చివరిగా, మనము ఎల్లప్పుడు చేయవలసిన రెండు ముఖ్యమైన విషయములను గుర్తుపెట్టుకొనుడి.


1. మనము ఎల్లప్పుడు మంచి మనస్సాక్షి కలిగియుండి మరియు దీనులమైయుండాలి. అప్పుడు దేవుడు మనతో ఉండును మరియు ''దేవుడే మన పక్షమున నుండగా మనకు విరోధి యెవ్వడు'' (రోమా 8:31).


2. ఎల్లప్పుడు విశ్వాసముతో నిర్ణయములు తీసుకొనవలెను. ప్రతి యొక్క విషయములో మనము జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఉండవలెను కాని భయముతో నిర్ణయము తీసుకొనకూడదు.


తీర్పు తీర్చకుండుటకు జాగ్రత్తపడవలెను:


ఇతరమతములను గాని మరియు వారి విగ్రహములను గాని పేరు పెట్టి తీర్పు తీర్చకుండుటకు మనము జాగ్రత్తపడవలెను. వారిని గురించి హాస్యముగా మాట్లాడకూడదు. ఇటువంటి విషయములను గురించి ప్రభువైన యేసు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నిజమైన దేవుడు తమకు తెలుసని చెప్పుకొనే వేషధారణనను గురించి ఆయన ఎక్కువగా మాట్లాడియున్నాడు.


అపొస్తలుడైన పౌలు యొక్క ఉదాహరణను గమనించెదము. అతడు ఎఫెసీ పట్టణములో రాజీపడకుండా సత్యమును బోధించినప్పుడు, ఆ పట్టణములో పెద్ద గందరగోళము జరిగినది. చివరకు ఆ పట్టణము యొక్క మేయరు ఇట్లన్నాడు, ''ఇతడు మన దేవతను దూషింపలేదు'' (అపొ.కా. 9:37). పౌలు క్రీస్తునే ప్రకటించాడు. కాని ఎఫెసులోని వారు ఆరాధించుచున్న అన్యదేవతలను అతడు ఖండించలేదు. క్రీస్తు వారి యొక్క పాపములనుండి రక్షించగలడని, వారికి అనుకూలమైన వర్తమానమును చెప్పెను. వారి దేవతలను మరియు వారి విగ్రహములను తీర్పుతీర్చుచు, వారికి ప్రతికూలముగా మాట్లాడలేదు. అది దైవిక జ్ఞానము. ఒక వ్యక్తి ఒకసారి క్రీస్తు యొద్దకు వచ్చినయెడల, తన యొక్క విగ్రహములనుండి ప్రభువే అతనిని విడిపించును.


ఇటువంటి జ్ఞానమును మనము కూడా కలిగియుండాలి. మనము ఏ మతమునైనను లేక వారి విశ్వాసములను లేక వారి ఆచారములనైనను తీర్పుతీర్చకూడదు. అది మన యొక్క సందేశము కాదు. మనము క్రీస్తును మాత్రమే ప్రకటించెదము అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువవేయబడి యున్నాడనియు, మృత్యుంజయుడై లేచియున్నాడనియు, ఈనాడు పరలోకములోను మరియు మనలోను జీవించుచున్నాడనియు మరియు లోకమునకు తీర్పు తీర్చుటకు త్వరలో రాబోవు చున్నాడనియు బోధించెదము. ఇదియే మన సందేశము మరియు ప్రతి ఒక్కరు వారి పాపములను ఒప్పుకొని మరియు ప్రభువైన క్రీస్తును ప్రభువుగాను మరియు రక్షకునిగాను వారిలోనికి స్వీకరించవలెనని వారిని పిలుచుచున్నాడు. ప్రతి ఒక్కరికి అనగా పిల్లలకు కూడా దీనినే ప్రకటించెదము. క్రీస్తును వారిలోనికి స్వీకరించమని మనము వారిని ఆహ్వానించెదము గాని వారిని బలవంతపెట్టము. దేవుడు ప్రతి ఒక్కరికి స్వాతంత్య్రము ఇచ్చియున్నాడు. ప్రజలు వారి జీవితములోనికి నిజముగా క్రీస్తును స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారియొక్క పాపమును ఒప్పింపచేయును గనుక వారితో ఉన్న వ్యర్థమైన విషయములనుండి కాలము గడిచే కొద్ది కొద్దికొద్దిగా విడుదల పొందెదరు.


క్రీస్తు మాత్రమే లోకరక్షకుడని ప్రకటించుటకు మనము పిలువబడియున్నాము. మనము పాపమునకు విరోధముగా మాట్లాడుచు, మనలను మనము తీర్పు తీర్చుకొనుచు మరియు మన మధ్యలో ఉన్న వేషధారణను బహిర్గతము చేయాలి. జ్ఞానములేని కొందరు సహోదర సహోదరీలు, వారి మాటలలోను మరియు ప్రార్థనలలోనూ వేరే మతములను గూర్చి పేరు పెట్టి చెప్పెదరు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నుండవలెనని మనము ప్రజలను హెచ్చరించాలి. మనము ఏ మతము పేరైనను ఉపయోగించుకొనక, ''క్రైస్తవేతరులు'' అని చెప్పుట మంచిది. ఈ లోకమును తీర్పుతీర్చుటకు కాక ఈ లోకమును రక్షించుటకు మాత్రమే దేవుడు తన కుమారుని పంపియున్నాడు (యోహాను 3:17). మనము యేసు యొక్క మాదిరిని వెంబడించుటకు పిలువబడియున్నాము. గనుక మనము ఎల్లప్పుడు ఇతరులను రక్షించుటకొరకే ప్రయాసపడాలి కాని వారిని తీర్పు తీర్చకూడదు.


న్యాయవాదులు మరియు పలుకుబడి కలవారి సహాయమును ఉపయోగించుకొనుట:


మనము పోలీసుస్టేషన్‌కు తీసుకొని పోబడినప్పుడు గానీ లేక ఒక కోర్టులో మన మీద నిందమోపబడినప్పుడుగాని ఒక న్యాయవాది యొక్క సహాయము పొందుటలో తప్పులేదు.


శత్రువులను ఎదుర్కొనబోయేటప్పుడు కత్తిని తీసుకొని వెళ్ళమని తన శిష్యులతో ప్రభువైన యేసు చెప్పారు (లూకా 22:36 - 38). ఈ కత్తితో మనము శత్రువుల మీద దాడిచేయము. పేతురు కత్తితో దాడి చేసినప్పుడు, యేసు నీ కత్తి ఒరలో పెట్టమని చెప్పి, కత్తి పట్టుకొనువారందరు కత్తిచేతనే నశింతురు అని చెప్పారు (మత్తయి 26:52). మొదట శత్రువులు దాడిచేసినయెడల, మనలను రక్షించుకొనుటకు మాత్రమే కత్తిని వాడవలెను. కాబట్టి శత్రువు యొక్క దాడినుండి రక్షించుకొనుటకు న్యాయసమ్మతముగా మనము ఒక న్యాయవాదినిగాని లేక పోలీసు అధికారులకు ఫిర్యాదుచేయుట వలనగాని మనలను రక్షించుకొనవచ్చును. కోర్టులో పౌలు తననుతాను సమర్థించుకొని రోములోని (కైసరు) సుప్రీంకోర్టునకు వెళ్లియున్నాడు (అపొ.కా. 25:11).


మనకు సహాయపడుటకు పలుకుబడిగలవారిని మనము ఉపయోగించుకొనవచ్చును. క్రీస్తు యొక్క శరీరమును సిలువమీదనుండి దించి మరియు భూస్థాపితం చేయుటకు పిలాతుతో కలుసుకొనుటకు అరిమతయి యోసేపు పలుకుబడిని ఉపయోగించాడు. కాబట్టి పలుకుబడికలిగినవారు దేవునియొక్క పరిచర్య విస్తరించుటకు సహాయపడాలని కోరినయెడల, మనము వారి సహాయమును పొందవచ్చును.


న్యాయవాదులనుగాని లేక పలుకుబడిగలవారిని మనము ఉపయోగించుకొనినను, మనము మనుష్యులను నమ్ముకొనము గాని దేవునిని మాత్రమే నమ్ముకొనెదము. చికిత్స పొందుటకు మనము వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు, మనము అతనిని గాని అతడిచ్చే మందులనుగాని నమ్మము గాని దేవునిని మాత్రమే నమ్మెదము (యిర్మీయా 17:5 - 8).


మనము అధిపతులయొద్దకును అధికారులయొద్దకును తీసుకొని వెళ్ళబడినప్పుడు మనము మాట్లాడవలసిన మాటలు చెప్పుటకు దేవుడు జ్ఞానమిచ్చునని మనము మన మనస్సులో పెట్టుకొనవలెను (లూకా 12:11, 12 మరియు 21:12 - 15).


ఈ యొక్క చెడిపోయిన అంధకారములో ఉన్న లోకములో అన్ని సమయములలో ఆయన యొక్క సాక్షులముగా మనము నుండునట్లు, ఎల్లప్పుడు పరలోకములో ఉన్న మన తండ్రిని మాత్రమే మనము విశ్వసించవలెను. మనలను సేవించి మరియు మనకు సహాయపడుటకు ఆయన దూతలను కూడా పంపునని జ్ఞాపకముంచుకొనవలెను (హెబీ 1:14).


శుద్ధహృదయము కలిగినవారు దేవునిని చూచెదరు:


యోహాను 18:10, 11లో గెత్సేమనే తోటలో ''సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు - కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను''.


పేతురు కేవలము ఇస్కరియోతుయూదాను మరియు రోమా సైనికులను మాత్రమే చూశాడు. కాని ఆ యొక్క గిన్నెను తన తండ్రియే తనకిచ్చియున్నాడని ప్రభువైన యేసు చూశాడు. ఆ యొక్క గిన్నెను యూదా ఒక పోస్టుమ్యాన్‌ వలె తీసుకొని వచ్చెను.


హృదయశుద్ధిగలవారు మాత్రమే దేవునిని చూచెదరు అని మత్తయి 5:8లో మనము చూడగలము. కాబట్టి మన యొక్క పూర్ణహృదయముతో దేవునిని ప్రేమించినయెడల, ప్రతియొక్క పరిస్థితిలో దేవునిని మాత్రమే చూచెదము. కాని మన యొక్క మనసులు మనయొక్క శత్రువులతోనూ మరియు ఇబ్బందికర పరిస్థితులతోనూ నింపబడినయెడల మనము శుద్ధహృదయము కలిగిలేమని ఋజువు పరచుచున్నది.


భూలోకమంతయు దేవుని మహిమతో నింపబడియున్నదని యెషయా 6:3లో దేవదూతలు (సెరాపులు) ప్రకటించారు. వారు దేవుని మహిమను పరలోకములోనే గాక భూమిమీద కూడా చూచియున్నారు. అనగా భూమిమీద జరిగే ప్రతి విషయము దేవుని ఆధీనములో ఉన్నదని గ్రహించెదము. దానియేలు 4:35లో నెబుకద్నెజరు ఇట్లన్నాడు, ''భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు''. దేవుడు సింహాసనాసీనుడై యున్నాడు మరియు ఆయన పిల్లలలోని అత్యంతబలహీనమైన వారిని కూడా ఆయన ఎన్నటికిని మరువడు.


2 కొరింథీ 11:3లో, క్రీస్తు యెడల మనకున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను సాతానుద్వారా తొలగిపోయే అపాయమున్నదని హెచ్చరించబడుచున్నాము. హవ్వ మంచి చెడుల తెలివినిచ్చు చెట్టుయొద్దకు వచ్చునట్లు సాతాను ఆమెను మోసగించాడు. దేవుని సన్నిధిలోనికి ఆమె రాకుండునట్లు ఆ చెట్టు ఆటంకపరచింది. మనము ప్రభువు యొద్దకు ఆకర్షించబడకుండునట్లు అనేక ఆటంకములు ఉండును. వాటన్నిటివిషయంలో మనము భయము కలిగియుండాలి. ఈ దినములలో మనము తొందర ఏమియులేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని 1 కొరింథీ 7:35లో పౌలు హెచ్చరించుచున్నాడు.

అధ్యాయము 19
దైవజనుల యొక్క యాభై గుర్తులు

ప్రతి సంఘపెద్ద ఖచ్చితంగా దైవజనుడై యుండాలి. ఇక్కడ దైవజనులకు ఉండవలసిన 50 గుర్తులు ఉన్నవి.


1. ఎవరైతే ప్రతి దినము ఆయన ముఖము ఎదుట నిలువబడి ఆయన స్వరము విందురో,


2. ఎవరికైతే వారి హృదయములో దేవునిపై కాక దేనిపైన కాని ఎవరిపైన కాని కోర్కె ఉండదో,


3. ఎవరైతే ఏ రూపముననున్న పాపమునైనా ద్వేషించి వారి మార్గాలన్నిటిలో సత్యమును, నీతిని ప్రేమించునట్లు దేవుని యెడల గొప్ప భయము కలిగియుందురో,


4. ఎవరైతే కోపాన్ని మరియు కామపూరితపాపము ఆలోచనలను జయించి, వారి ఆలోచనల్లో లేక వైఖరిలో పాపము చేయుటకంటే చనిపోవుటమేలు అని తలంతురో,


5. ఎవరి జీవన శైలి ప్రతిదినము వారి సిలువనెత్తికొని పరిపూర్ణులగుటకు సాగిపోవునట్లుండునో మరియు ఎవరైతే వారి స్వంత రక్షణను ఎల్లప్పుడూ భయముతో వణకుతో కొనసాగించుకొందురో (హెబీ 6:1, ఫిలిప్పీ 2:12, 13),


6. పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడి, ఇంకొకరు వారి నెంతగా కవ్వించినా వారియెడల చూపు ప్రేమ నుండి కదలకుండునట్లు ఎవరైతే ప్రేమలో వేరుపారియుందురో,


7. ఎవరైతే మనుష్యుల యొక్క పొగడ్తలు లేక ఆత్మీయ ఎదుగుదల లేక దైవికముగా ఇవ్వబడిన పరిచర్య కాని లేక మరి ఏ ఆధిక్యతనైనా వారు పరిశుద్ధులలో కడమ వానికంటే కూడా తక్కువవానిననే ఆలోచన నుండి తప్పించనంతటి దీనత్వములో వేరుపారి యుందురో (ఎఫెసీ 3:8),


8. ఎవరైతే దేవుని వాక్యము ద్వారా ఆయన యొక్క స్వభావమును మరియు ఉద్దేశ్యములను అర్థము చేసికొనుచు మరియు దేవుని వాక్యములో అతి చిన్న ఆజ్ఞకు కూడా అవిధేయత చూపకుండా లేక ఇతరులకు దానిని బోధించుటలో అలక్ష్యము చేయకుండా ఉండునట్లు ఆ వాక్యమును బట్టి వణుకుచుందురో (యెషయా 66:2, మత్తయి 5:19),


9. ఎవరైతే మానవులయెడల దేవుని సంపూర్ణ ఉద్దేశ్యమును ప్రకటించుచూ ఆత్మీయజారత్వమును మరియు వాక్యానుసారము కాని మానవఆచారములను బహిరంగపరచుదురో,


10. ఎవరికైతే దైవభక్తి గూర్చిన మర్మము గూర్చియు, క్రీస్తు మానవ శరీరముతో వచ్చి ఆయన శరీరము ద్వారా ఒక నూతనమైనదియు మరియు జీవముగలదియునైన మార్గము తెరచెనను విషయము గూర్చి పరిశుద్ధాత్మయొక్క బయల్పాటు కలిగియుందురో (1 తిమోతి 3:16, హెబీ 10:20),


11. ఎవరైతే ఆసక్తితో కష్టపడి పనిచేయువారై యుండి హాస్యానికి తావిచ్చువారును మరియు తీరికచేసికొని పిల్లలతో ఆడుట ఎలాగో తెలిసిన వారును మరియు దేవుడు ప్రకృతిలో ఇచ్చిన మంచి విషయములను బట్టి సంతోషింపగలిగిన వారైయుందురో,


12. ఎవరైతే సన్యాసులుగా నుండక, అదే సమయములో క్రమశిక్షణ జీవితాన్ని జీవిస్తూ కష్టమైన పరిస్థితులను గూర్చి భయపడరో (1 కొరింథీ 9:27, 2 తిమోతి 2:3),


13. ఎవరికైతే ఖరీదైన దుస్తులపై లేక క్రొత్త ప్రదేశాలను చూచుటయందు ఆసక్తి యుండదో మరియు ఎవరైతే వారి సమయాన్ని ఆత్మీయముగా లాభకరముకాని కార్యక్రమములపై వ్యర్థపుచ్చరో మరియు వారి యొక్క ధనాన్ని అవసరము కాని వాటిని కొనుటకు ఖర్చుచేయరో,


14. ఎవరైతే రకరకాల రుచుల భోజనపదార్థాల విషయములో జయము పొందుదురో మరియు ఎవరైతే సంగీతానికి లేక ఆటలకు లేక చట్టబద్దమైన ఏ కార్యక్రమమునకైనా బానిసకారో (1 కొరింథీ 6:12, 13),


15. ఎవరైతే ఇబ్బందులు దూషణలు, శ్రమలు, అపనిందలు, శారీరక అస్వస్థతలు, ఆర్థిక ఇబ్బందులు మరియు బంధువుల నుండి మత పెద్దల నుండి వ్యతిరేకతల కొలిమిలో దేవుని చేత క్రమశిక్షణ పొందియుండిరో,


16. ఎవరైతే, వారిని వారు పాపులలో ఆధములుగా చూచుకొనుట వలన పాపులలో ఘోరమైన పాపుల యెడలను, విశ్వాసులలో చెడ్డవారి యెడలను సానుభూతి కలిగియుండి, వారిని గూర్చి నిరీక్షణ కలిగియుండి, కనికరముతో నిండియుందురో (1 తిమోతి 1:15),


17. ఎవరైతే తమ పరలోకపు తండ్రి ప్రేమ యందు లోతుగా వేరుపారి యుండుట చేత, దేని గూర్చియు ఎప్పుడు ఆతురత పడకయుండి సాతానుగూర్చి కాని, దుష్టులైన మనుష్యులగూర్చి కాని లేక క్లిష్ట పరిస్థితులు లేక దేనిగూర్చి భయపడకుందురో,


18. ఎవరైతే అన్ని విషయములు వారి మేలు కొరకై సర్వాధికారియైన దేవుడు సమకూర్చి జరిగించునని నమ్ముట చేత ఎల్లప్పుడు, మనుష్యులందరి కొరకు, అన్ని సంగతుల గూర్చి మరియు అన్ని సమయములందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింతురో (రోమా 8:28, ఎఫెసీ 5:20, 1 థెస్సలో. 5:16-18, 1 తిమోతి 2:1),


19. ఎవరైతే వారి ఆనందాన్ని దేవునియందు మాత్రమే కనుగొనుటచేత దేవునియొక్క సంతోషాన్ని పొందిన వారై, చెడు మనోభావాలను జయించుదురో,


20. ఎవరైతే వారి కున్న సహజసిద్ధమైన సామర్థ్యమునందు నమ్మికయుంచక, అన్ని పరిస్థితులలో దేవుడే వారిని సిగ్గుపడనివ్వని సహాయకుడని నమ్మి జీవముగల విశ్వాసము కలిగియుందురో (ఫిలిప్పీ 3:3),


21. ఎవరైతే వారి స్వంత గ్రహణశక్తి చెప్పు మాటలను బట్టి కాక పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి జీవించుదురో,


22. ఎవరైతే నిజముగా క్రీస్తుచేత పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మము పొందుదురో (అంతేకాని ఏదో ఉద్వేగపూరితమైన నకిలీ అనుభవము లేక వేదాంత పరమైన వాదనతో ఒప్పింపబడుట కాదు) (మత్తయి 3:11),


23. ఎవరైతే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉండి, వారికి ఆయన ఇచ్చే మానవాతీత వరములతో యుందురో (ఎఫెసీ 5:18, 1 కొరింథీ 14:1),


24. ఎవరికైతే సంఘము క్రీస్తు యొక్క శరీరమని (ఒక సమాజము లేక మత సంస్థ కాదని) బయల్పడునో మరియు ఎవరైతే వారి శక్తి యుక్తులు, వారి వస్తు వాహనాలు మరియు ఆత్మీయవరాలు ఆ సంఘమును కట్టుటకు వెచ్చింతురో,


25. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా వారి నాలుకలకు కళ్లెము వేయుట నేర్చుకుందురో మరియు ఎవరి నాలుకయితే ఎప్పుడూ దైవికమైన వాక్యముతో మండుచుండునో,


26. ఎవరైతే అన్నిటిని విడిచిపెట్టి, ధనానికి కాని వస్తు వాహనాలకు కాని అతుక్కుని ఉండరో మరియు ఎవరైతే ఇతరులనుండి ఏ బహుమతులను ఆశించరో (లూకా 14:33),


27. ఎవరైతే వారి ఇహలోక అవసరాలన్నిటిని గూర్చి దేవునియందే నమ్మికయుంచెదరో మరియు ఎవరైతే వారి భౌతిక అవసరాల గూర్చి ఎప్పుడూ ఎవరికీ తెలియునట్లు ప్రవర్తించరో లేక వారు పడిన శ్రమల గూర్చి వారి మాటలలో కాని లేక ఉత్తరాల నివేదికల ద్వారా తెలియపర్చరో (మత్తయి 6:33),


28. ఎవరైతే మొండిగా నుండక మర్యాదగాను, విమర్శకు తావిచ్చువారి గాను మరియు తమకంటే పెద్దవారి నుండి మరియు జ్ఞానము గల సహోదరుల నుండి దిద్దుబాటు తీసుకొనుటకు ఆశ కలిగియుందురో,


29. ఎవరైతే ఇతరులను అధిగమించాలని లేక ఇతరులకు సలహా ఇవ్వాలని (అనగా అడిగినప్పుడు సలహా ఇచ్చుటకు సిద్ధముగా ఉండవలెను) మరియు నాయకులుగా పెద్దలుగా అనిపించుకొనుటకు ఆసక్తి లేని వారును, ఎవరైతే కేవలము సామాన్యమైన సహోదరులుగా మరియు అందరికి సేవకులుగా ఉండుటకు ఆశ కలిగియుందురో,


30. ఎవరితోనైతే సులువుగా కలిసిపోగలమో మరియు ఎవరైతే యిబ్బంది పర్చబడుటకు ఇష్టపడుదురో మరియు ఇతరులు వారిని ఉపయోగించుకొనుటకు యిష్టపడుదురో,


31. ఎవరైతే లక్షాధికారికిని భిక్షమెత్తుకొనువానికిని, తెలుపు రంగు చర్మమునకును నలుపు రంగు చర్మమునకును, తెలివితేటలు కలవారికిని తెలివిలేని వానికిని మరియు నాగరికునికి మరియు అనాగరికుల మధ్య తేడా చూపక అందరిని ఒకేలా చూచునో,


32. ఎవరైతే తన భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు లేక ఇతర విశ్వాసుల చేత క్రీస్తు యెడల తనకున్న అంకిత భావమునుండి లేక దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట నుండి ఏ మాత్రము తగ్గకుండా చూచుకుందురో,


33. ఎవరైతే దేవుని నియమముల విషయములో రాజీపడుటకు సాతాను ఎటువంటి ఆశను చూపినా అటువంటి లంచమునకు (అది ఘనత లేక ధనము లేక ఇంకేదైనా కావచ్చు) లొంగరో,


34. ఎవరైతే మన నాయకులకు కాని, ప్రభుత్వ అధినేతలకు కాని భయపడక క్రీస్తు కొరకు భయము నెఱుగని సాక్షులుగా నుందురో,


35. ఎవరైతే దేవునిని కాదని ఈ భూమిపై నుండిన ఏ మానవుని సంతోషపర్చుటకు ఆశ చూపరో మరియు దేవునిని సంతోష పర్చుటకు అవసరమైతే మనుష్యులందరినీ అభ్యంతరపర్చుటకు (కోపము తెప్పించుటకు) ఇష్టపడుదురో,


36. ఎవరికైతే దేవుని మహిమ, దేవునిచిత్తము మరియు దేవునిరాజ్యము మానవ అవసరము కంటే మరియు వారి స్వంత సౌఖ్యము కంటే ముందుగా నుండునో,


37. ఎవరైతే దేవుని కొరకు ''నిర్జీవ క్రియలు'' చేయుటకు ఇతరులచేత కాని, లేక వారిస్వంత ఆలోచన చేతకాని బలవంత పెట్టబడకుండా యుండి, వారి జీవితాల్లో దేవుని చేత బయల్పర్చబడినవి మాత్రమే చేయుటకు ఆసక్తి మరియు సంతృప్తి కలిగియుందురో,


38. ఎవరైతే క్రైస్తవ పనిలో ఆత్మీయమైన దానిని మరియు మనసుకు సంబంధించిన దానిని వేరు చేసి చూడగలిగియుందురో,


39. ఎవరైతే విషయాలను భూసంబంధదృష్టితో కాక పరలోక సంబంధదృష్టితో చూచుదురో,


40. ఎవరైతే దేవుని కొరకు వారు పడిన శ్రమకు వారికివ్వజూపే ఇహలోక సంబంధమైన బిరుదులన్నిటిని మరియు ఘనతలన్నిటిని తిరస్కరింతురో,


41. ఎవరైతే మానక ప్రార్థింతురో మరియు అవసరమైనప్పుడు ఉపవాసముండి ప్రార్థింతురో,


42. ఎవరైతే ధారాళముగా, సంతోషముగా, రహస్యముగా మరియు జ్ఞానముతో ఇచ్చుటను నేర్చుకుందురో,


43. ఎవరైతే మనుష్యులందరి కొరకు వారిలో కొందరినైనా రక్షించుటకు అన్ని విషయములలో వారివలె అగుటకు యిష్టపడుదురో,


44. ఎవరైతే ఇతరులు రక్షింపబడవలెనను కోర్కె మాత్రము కాక, వారిని క్రీస్తు యొక్క శిష్యులుగా చేయవలెననియు, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి విధేయత చూపునట్లు వారిని సత్యము యొక్క గ్రహింపులోనికి తేవలెనని ఆశ కలిగియుందురో (మత్తయి 28:19, 20, 1 తిమోతి 2:4),


45. ఎవరైతే ప్రతి స్థలములో దేవుని కొరకు స్వచ్ఛమైన సాక్ష్యము స్థిరపర్చబడుట చూచుటకు ఆశ కలిగియుందురో,


46. ఎవరికైతే సంఘములో క్రీస్తుమహిమ బయలుపర్చబడవలెననే ఆశ మండుచుండునో,


47. ఎవరైతే ఏ విషయములోనూ తమ స్వప్రయోజనమును వెదకుకొనరో,


48. ఎవరైతే ఆత్మీయమైన అధికారము మరియు ఆత్మీయమైన గౌరవము కలిగియుందురో,


49. ఎవరైతే అవసరమయితే దేవుని కొరకు లోకములో ఒంటరిగా నిలువబడుదురో,


50. ఎవరైతే పాతకాలపు ప్రవక్తలు మరియు అపొస్తలుల వలె ఏ మాత్రము రాజీపడని వారుగా యుందురో, అటువంటి వారు కావలసియున్నది.


పాపముతోను మరియు అవినీతితోను నిండిపోయిన జనాంగము మద్యన మరియు రాజీపడుచున్న క్రైస్తవ్యము మధ్య అటువంటి దైవజనునిగా యుండుటకు నీ హృదయమంతటితో నిశ్చయించుకొనుము.


దేవునికి పక్షపాతము ఉండదు కావున, నిన్ను ఒక దైవభక్తి కలిగిన పెద్దగా నీ యొక్క సంఘములో దోహదపడునట్లు దేవుడు ఆసక్తి కలిగియున్నాడు.


అధ్యాయము 20
ఆత్మీయ ఉద్యమములు పైకిలేచుట మరియు పడిపోవుట


''భక్తిగలవారు కనుమరుగగు చున్నారు. ఈ లోకములో నమ్మదగిన వారిని కనుగొనగలమా? ప్రతిఒక్కరు మోసగించువారును అబద్ధములు చెప్పువారును ఇచ్ఛకములాడు వారునైయున్నారు. ఎక్కడైనను యథార్థతలేదు'' (కీర్తన 12:1, 2 లివింగు బైబిలు).


పై వచనములలో చెప్పిన రీతిగానే ఈనాటి క్రైస్తవ్యము ఉన్నది. ఒకప్పుడు దేవునియెడల భయభక్తులు కొరకు వెదికినవారు, వారి యొక్క స్వంత లాభము కొరకు మోసగించుచు, ఇచ్ఛకములాడుచూ మరియు అబద్ధములు చెప్పుచున్నారు.


ప్రజలు కేవలము బైబిలు తెలుసుకొని దానిలో ఉన్న దేవునిని తెలుసుకొననందున, వారు సులభముగా మోసపోయెదరు. ఎందుకనగా వారి యొక్క సొంత సిద్ధాంతములను ప్రసిద్ధి చేసుకొనుటకు లోకములో ప్రతియొక్క క్రైస్తవ తెగవారు బైబిలునే ప్రమాణముగా వాడుచున్నారు. అందువలన గత 150 సంవత్సరములలో అనేక మతఆరాధన వ్యవస్థలు వచ్చియున్నవి మరియు అనేకులు వాటిని అంగీకరించుచున్నారు. ఆ విధముగా అనేకమంది విశ్వాసులు తప్పిపోయి మరియు రక్షణపోగొట్టుకునే అవకాశముఉన్నది.


క్రొత్త నిబంధనలో, తన యొక్క ప్రతి బిడ్డ తనను వ్యక్తిగతముగా ఎరుగవలెనని దేవుడు కోరుచున్నాడు (హెబీ 8:11). కాని పాత నిబంధనలో కేవలం ప్రవక్తలు మాత్రమే దేవునిని వ్యక్తిగతముగా ఎరిగియున్నారు. పాత నిబంధనలోని అత్యంత గొప్ప ప్రవక్త కంటెను క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలు దేవునిని ఎక్కువగా ఎరుగగలరు. మత్తయి 11:11లో ప్రభువైనయేసు స్పష్టముగా చెప్పారు.


దేవునిని వ్యక్తిగతముగా తెలుసుకొనవలెనని ఆసక్తి గలిగిన విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు. బైబిలును అక్షరానుసారముగా తెలుసుకొనుటకును మరియు ఉద్రేకపూరితమైన అనుభవములు కలిగియుండుటకును అనేకమంది విశ్వాసులు ఆసక్తి కలిగియున్నారు. ఆవిధముగా అనేకులు మోసగించబడుట వలన, క్రొత్త నిబంధన గురించి మరియు క్రీస్తు యొక్క శరీరముగా నిర్మించబడుటలో ప్రత్యక్షత వారికి లేదు.


వెనుకకు దిగజారుట మరియు సంస్కరణలు:


అంత్యదినములలో, క్రైస్తవుడుగా జీవించుట కష్టమని మనకు చెప్పబడింది (2 తిమోతి 3:1 లివింగు). హింసింపబడుట వలన కాదు గాని అనేకమంది ''క్రైస్తవులు'', పైకి భక్తి గలవారివలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉందురు (2 తిమోతి 3:5). అనగా వారు సరియైన సిద్ధాంతమును గురించి చూచెదరు గాని క్రీస్తుతో వ్యక్తిగత సహవాసము కలిగియుండరు. మరియు దేవుని యెడల భయభక్తులు కలిగియుండే విషయంలో ఆసక్తి కలిగియుండరు.


అనేకులు ఆత్మీయసత్యముల కొరకు మృతమైనక్రైస్తవ తెగలను విడిచియున్నారు. కాని కొద్ది కాలము తర్వాత, వారు ఉద్రేకపూరితములైన అనుభవముల కొరకును లేక అక్షరానుసారముగా ఉండుటకును లేక రాజీపడుటకును సాతాను వారిని తప్పు త్రోవ పట్టించుచున్నాడు.


మొదటి శతాబ్దములోనే, అపొస్తలుల చేత నిర్మించబడిన కొన్ని సంఘములు 50 సంవత్సరముల తరువాత లోకానుసారులుగాను మరియు రాజీపడే వారుగాను తప్పిపోయిరి.


తరువాత శతాబ్దములలో, క్రైస్తవ సంఘములు యింకను దిగజారియున్నవి. కాని అప్పుడప్పుడు దేవునిచే నిర్మించబడే సంఘములను నిర్మించవలెనని కోరిక గలిగిన వారిని దేవుడు కనుగొని యున్నాడు. వారి ద్వారా దేవుడు మరల సంఘమును సంస్కరించుచున్నాడు.


సంఘ చరిత్రలో కలిగిన ప్రతి యొక్క సంస్కరణ ఉద్యమము తీవ్రముగా దేవునిని కోరుకొనిన వ్యక్తి చేత ఆరంభించబడి మరియు అటువంటి మనస్సు కలిగిన కొందరు మృతమైన సంఘములను విడిచిపెట్టి అటువంటి వారితో కలిసియున్నారు. అటువంటి వ్యక్తి ద్వారా దేవుడు సంఘ సంస్కరణను ఆరంభించును.


అటువంటి విభజనలు జరుగుట అవసరమని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు, ''మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు'' (1 కొరింథీ 11:19).


దేవుడు తన నామముయొక్క సాక్ష్యము కాపాడబడునట్లు యిటువంటి భిన్నాభిప్రాయములను ఆయనే అనుమతించెను. ఆరంభములో దేవుడు వెలుగు కలుగజేసినప్పుడు, ఆయన చీకటినుండి వెలుగును వేరుపరచియున్నాడు (ఆదికాండము 1:4). మరియు దేవుడు సంఘములలో ఆ విధముగా చేయుచున్నాడు.


మనుష్యులనుండి వచ్చే ఘనత మరియు సిరిసంపదల యొక్క అపాయము:


దేవుని యొక్క ఒక క్రొత్త ఉద్యమము ఆరంభమైన దినములలో, ఆ ఉద్యమము ఇతర క్రైస్తవులచేత తృణీకరించబడి విసర్జించబడింది మరియు ఆ ఉద్యమములో పాల్గొనేవారు సాధారణముగా బీదలైయుండెదరు. ఇటువంటి పరిస్థితులు నిజానికి ఆ ఉద్యమమునకు భద్రత కలుగజేయును. ఎందుకనగా దానిలో ఉన్న ప్రజలు దేవునిని మాత్రమే సంతోషపెట్టవలెనని కోరెదరు.


కాలము గడిచే కొలది, మొదట ఉన్నవారివలె కాక పూర్ణ హృదయముతో వెంబడించని శిష్యులు ఎక్కువగా చేరుదురు. వారి యొక్క పిల్లలు కూడా పెద్దవారైన తరువాత, వారి తల్లిదండ్రుల వలె పూర్ణహృదయము కలిగియుండరు.


ఉద్యమము విస్తరించేకొలది ఎక్కువ ధనం వచ్చుచుండుట చేత, అది అపాయముగా మారును. ధనము మంచి సేవకుడే గాని భయంకరమైన యజమాని. డబ్బును వినియోగించే విషయంలో ఉద్యమం యొక్క నాయకులు ఎల్లప్పుడు జాగ్రత్తపడనియెడల ఆ ధనమును బట్టి ఉద్యమము పాడగును. క్రైస్తవ్యంలో అనేక మంచి ఉద్యమములను విస్తారమైన ధనము ద్వారా సాతాను చెడగొట్టియున్నాడు.


కొన్ని ఉద్యమములలో, దానిని స్థాపించిన వాడు దీనిని ఎదిరించవచ్చును. కాని అతను చూచినట్లుగా అతనితో పనిచేసే సహపరిచారకులు ఈ అపాయమును స్పష్టముగా చూడరు. కాబట్టి అతడు మరణించిన తరువాత, ఆ ఉద్యమము వెనుకంజ వేసి మరియు దానియొక్క దర్శనమును పోగొట్టుకొనును. అప్పుడు మరియొక హృదయపూర్వకమైన వ్యక్తి దొరికే వరకు దేవుడు వేచియుండాల్సి వచ్చును.


ఒక ఉద్యమములోని ఆత్మీయత ఆ ఉద్యమము యొక్క నాయకులకు క్రీస్తు యెడల నున్న వారి భక్తి మీదను మరియు వారి యొక్క దీనత్వము మీదను, పాపము విషయంలో వారి వైఖరి మీదను, ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో ఎల్లప్పుడు నిలచియుండుట మీద ధనాపేక్షనుండి వారు విడుదల పొందుట మీదను, వారితో ఉన్న పెద్దలకు విలువిచ్చుట ద్వారాను, దేవుని యొక్క మందను ప్రేమించుట మీదను మరియు వారు దేవునితో నడుచుట మీదను ఆధారపడియున్నది.


దేవుని యొక్క హృదయానుసారులైన కాపరులు:


యిర్మీయా 3:14, 15లో దేవుడు తన ప్రజలకు ఈ విధముగా వాగ్ధానములు చేయుచున్నాడు, ''భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు''.


సీయోను అనగా దేవునిచేత నిర్మించబడే నిజమైన సంఘము. దేవుడు ఒక పట్టణమునుండి ఒకరిని మరియు ఒక కుటుంబములోనుండి ఇద్దరిని సీయోనులోనికి నడిపించును. మరియు ప్రభువు చేత నిర్మించబడే సంఘములోనికి ఈ ప్రజలు వచ్చినప్పుడు - తన యొక్క హృదయానుసారులైన కాపరులను దేవుడు వారికిచ్చును.


దేవునిచే నిర్మించబడే నిజమైన సంఘము యొక్క ఒక గుర్తు ఏమనగా ఆ సంఘములో దేవుని హృదయానుసారులైన కాపరులు ఉండును.


దేవుని యొక్క హృదయము - తన స్వంతమును కోరని ప్రేమతో నింపబడియున్నది. కాబట్టి ఏ విషయములోను తమ స్వంతమును కోరనివారే, దేవునియొక్క హృదయానుసారులైన కాపరులు. వారు ఎవరి యొద్దనుండియైనను ధనమును గాని ఘనతనుగాని కోరరు. వారు మనుష్యులను సంతోషపెట్టేవారుగా ఉండరు. దానికి బదులుగా క్రీస్తులో వారు సంపూర్ణులు అగునట్లు, వారు నిర్మించబడుటకు కోరెదరు (కొలొస్స 1:28). ఇటువంటి ఆసక్తి కలిగిన వ్యక్తిని ప్రపంచములోని ఏ పట్టణములోనైనను లేక ఏ గ్రామములోనైనను లేక ఏ తరములోనైనను దేవుడుకనుగొనిన యెడల అతని ద్వారా దేవుడు తన సంఘమును నిర్మించును.


మరొక ప్రక్కన, ముఖ్యమైన డినామినేషన్‌లలో నుండి వచ్చిన విశ్వాసులు, కేవలము క్రొత్త నిబంధన యొక్క మాదిరిని అనుసరించి, వారు మంచి సిద్ధాంతమును కలిగియున్నప్పటికిని చివరకు ధనాపేక్ష కలవారిగానూ మరియు వారి స్వంతమును కోరువారైయున్నప్పటికిని క్రీస్తు యొక్క శరీరమును నిర్మించుకొనుచున్నామని ఊహించుకొనుచున్నారు. కాబట్టి వారియొక్క పరిచర్య ఫలితముగా కలవరమును గందరగోళమును కలిగి, చివరకు మరియొక బబులోనును నిర్మించుచున్నారు.


తన స్వంతమును కోరుకొనని వ్యక్తిని దేవుడు కనుగొనినప్పుడు మాత్రమే, అతని ద్వారా ఆయన నిజమైన సంఘమును నిర్మించును. కేవలము క్రొత్త నిబంధన మాదిరిని అనుసరించే వెయ్యిమంది సగము హృదయముతో వెంబడించే విశ్వాసుల కంటె దేవుని ప్రజలను ఆయన వలె ప్రేమించే ఒక వ్యక్తి ఆయనకు ఎంతో విలువైనవాడు.


దేవుని హృదయానుసారుడుగా ఒక కాపరిగా ఉండుటకు త్యాగము, అననుకూలత మరియు శ్రమలు ఉండును. అనగా అపార్థము చేసుకొనబడుటకును, తృణీకరించబడుటకును, వ్యతిరేకించబడుటకును, నిందలు పొందుటకును సంతోషముగా స్వీకరించుట మరియు దానికితోడుగా స్వంతమును కోరని భార్యను ఆ కాపరి కలిగియున్నట్లయితే ఆ విధముగా దేవుని యొక్క పరిచర్య కొరకు ఆ గృహము తెరువబడినయెడల, వారిద్దరి ద్వారా దేవుడు చేసే కార్యములకు పరిమితులు ఉండవు.


అనేకమంది ప్రజలను సమకూర్చుట గురించి నేను మాట్లాడుటలేదు. అక్కడకు వచ్చే ప్రజలయొక్క నాణ్యత గురించి మాట్లాడుచున్నాను. సంఖ్యను బట్టి దేవుని ఆశీర్వాదమును అంచనా వేయకూడదు. అనేక అన్య మతములలోను మరియు మత సంస్థలలోను లక్షలమంది సభ్యులుగా ఉన్నారు. ఇది దేనిని కూడా ఋజువుచేయుట లేదు.


ప్రభువైన యేసు కాలంలో, ఆయన చుట్టూ ఉన్న జనసమూహములు కాపరులు లేని గొఱ్ఱెలవలె ఉన్నారని ఆయన చూచాడు. ఈ రోజున కూడా ఆ విధముగానే జరుగుచున్నది. దేవుని యొక్క హృదయానుసారులైన కాపరులయొక్క అవసరము ప్రతి స్థలములోనూ ఎంతో ఎక్కువగా ఉన్నది.


ఇశ్రాయేలీయుల చరిత్ర అంతటిలోను వారు చేసిన అనేక పొరపాట్లను, మనము చేయకుండుటకు పాతనిబంధనలో వివరించబడింది. దేవుని నుండి తప్పిపోకుండుటను, ఇశ్రాయేలీయుల చరిత్రను చదువుట ద్వారా ఒక జ్ఞానము గల వ్యక్తి నేర్చుకొనును.


యెహోషువ మరియు దావీదుయొక్క కాలము:


ఇశ్రాయేలీయులు కానానులో ప్రవేశించినప్పుడు దైవజనుడైన యెహోషువ వారికి మంచి నాయకత్వమును అందించాడు. ఇశ్రాయేలీయులైన మీరు దేవునిని విడిచిపెట్టినను, నేనును, నా యింటివారును దేవునిని సేవించెదము అని అతడు నిర్ణయించుకున్నాడు (యెహోషువ 24:15). ఆ విధముగా దేవుని కొరకు ఒక్కడైనను నిలచియుండుటకు తీర్మానించుకొనినవారు ఈనాడు సంఘములో దైవికమైన నాయకత్వమును ఇవ్వగలరు. యెహోషువ కాలములో, ఇశ్రాయేలీయులు జయము తరువాత జయము పొందియున్నారు.


కాని యెహోషువ మరణించాడు. అతడు మరణించిన తరువాత జరిగిన సంగతులను మనము చూచినయెడల, ఒక దేశములో ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో దేవుడు సిద్ధపరచి నడిపించిన వ్యక్తులు, దేవుడు వారికిచ్చిన పరిచర్యను చేసి మరణించిన తరువాత అప్పుడు జరిగిన సంగతులే మరలా జరుగుటను చూచెదము.


న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీయులు ఏవిధముగా వెనుకంజ వేసిరో చదివెదము. యెహోషువ యొక్క నాయకత్వము నుండి వారు పొందిన అనుభవమును బట్టి, రెండవతరము వారు కొద్ది కాలము కొనసాగియున్నారు. తరువాత వారు విగ్రహారాధనలో పడిపోయిరి. యెహోషువ కాలములో, ఒక రైలు ఒక ఇంజను ద్వారా శక్తివంతముగా పర్వతము మీదకు నడిపించబడినట్లు, ఇశ్రాయేలీయులు నడిపించబడిరి. యెహోషువ మరణించినప్పుడు ఆ ఇంజనుతో సంబంధము కోల్పోయిరి. తరువాత వారికి నడిపించుటకు ఇంజను లేదు. కాబట్టి ఆ రైలు నెమ్మదిగా ఆగిపోయి మరియు ఆ పర్వతము యొక్క క్రిందకు వెళ్ళి వృథా అయింది.


దావీదు కాలములో కూడా అదే జరిగినది.


సౌలు ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు. అతడు ఎంతో దీనత్వముతో ఆరంభించి, అతడు తన యొక్క అభిషేకమును దేవుడు తీసివేయునంతగా వెనుకంజ వేశాడు. మొదటి తరములోనే ఒక ఉద్యమము క్షీణించిపోవుటను మనము సౌలు జీవితములో చూడగలము మరియు క్రైస్తవ్యములో అలాంటి సంఘటనలు అనేకములు ఉన్నవి.


దేవుని యొక్క హృదయానుసారుడైన ఒక వ్యక్తికి రాజ్యమును ఇచ్చెదనని దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడెను (1 సమూయేలు 13:14). ఆ వ్యక్తి దావీదే. ఈ విషయము దావీదు మీద సౌలు ఎంతో అసూయ పడేటట్లు చేసినది. దావీదును చంపేటంతగా సౌలు అతనిని ద్వేషించాడు.


కాని దేవుని అభిషేకము కలిగినవ్యక్తిని గుర్తించిన ఇశ్రాయేలీయులు దావీదుతో కలసిరి. ఆ విధముగా దావీదుతో కొందరు సమకూడిరి. కాని వారు సౌలు చేత హింసింపబడి మరియు వెంటాడబడి మరియు ఆ దేశమంతయు వెళ్ళగొట్టబడి మరియు వారిని రక్షించుకొనుటకు పారిపోవలసి వచ్చింది. కాని దావీదు ఆ కొందరితోనే ఉన్నాడు.


అనేక సంవత్సరముల క్రితమే అభిషేకము కోల్పోయినప్పటికిని ఈనాడు వెనుకంజవేసిన అనేక క్రైస్తవ నాయకులు సౌలువలె అనేక సంవత్సరములు నాయకులవలె కొనసాగుచున్నారు. ఈనాడు అనేక క్రైస్తవ ''నాయకులకు'' అనేకమంది ప్రజలు వారితో ఉండినట్లే సౌలుతో కూడా అనేకమంది ప్రజలు ఉండిరి. దేవుడు వారితో లేనప్పుడు, వారితో ఎంతమంది ఉన్నప్పటికిని వ్యర్థమే. క్రైస్తవేతర మత నాయకులను కూడా ఎంతోమంది వెంబడించుచున్నారు.


ప్రతి తరములోను పూర్ణ హృదయముతో తనను వెంబడించే వారిద్వారా, దేవుడు ఎల్లప్పుడు గొప్ప కార్యములు చేసియున్నాడని క్రైస్తవ చరిత్రలో మరలా మరలా ఋజువు చేయబడింది. సౌలు దావీదును హింసించినట్లే ఇటువంటి వారు క్రైస్తవ్యములో ఉన్న సంస్థలద్వారా ద్వేషించబడి, అపార్థము చేసుకొనబడి మరియు హింసింపబడుచున్నారు. వీరి కాలములో దేవుడు చేయుచున్న దానిని గూర్చి, వీరు గ్రహింపు లేనివారైయున్నారు.


దేవుడు దావీదును మరియు అతనితో ఉన్న కొంతమందిని కాపాడియున్నాడు. మరియు దావీదు రాజుగా 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. ''దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవచేసి నిద్రించెను'' అని అతని పరిపాలన గూర్చి వ్రాయబడింది (అపొ.కా. 13:36).


దావీదు తన తరము వారికి మాత్రమే దేవుని సంకల్పము చొప్పున సేవ చేయగలిగెనని మనము గమనించుచున్నాము.


అతడు మరణించిన తరువాత విషయములు వెంటనే క్షీణించుట ఆరంభించెను. అతని కుమారుడైన సొలొమోను, ఎంతో వెనుకంజవేసి పూర్తిగా వైఫల్యం చెందాడు. దైవజనుడైన తన తండ్రిద్వారా పొందిన దానిని బట్టి ఆరంభములో బాగానే ఉన్నాడు. కాని ఆ విధముగా అతడు కొనసాగుటకు, అతనిలో దేవునియెడల ఉండవలసిన ఆసక్తిలేదు. మన కాలములో ఉన్న అనేక క్రైస్తవబోధకుల వలె సంపద మరియు స్త్రీలద్వారా అతడు తప్పిపోయాడు (1 రాజులు 10:23, 11:1 - 9).


దావీదు మరియు సొలొమోను చరిత్రలో మనము చూచిన క్షీణతయే క్రైస్తత్వములో మరలా మరలా జరుగుచున్నది. క్రైస్తవ్యములో ఆరంభమైన ప్రతి ఉద్యమమును మీరు జాగ్రత్తగా పరిశీలించిన యెడల, అవి దేవునితో ఆరంభమైన మరియు రెండవ మరియు మూడవ తరములోకి వచ్చేసరికి ఇదే విషయము పునరావృతమవుచున్నది.


ఈ విధముగా ఎందుకు జరుగుచున్నది? దీని జవాబు సామాన్యముగా నున్నది. ఎందుకనగా ఆ విశ్వాసులు వాక్యమైయున్న యేసు క్రీస్తు అనే వ్యక్తిని ఎరుగుటకంటే లేఖనములను మాత్రమే ఎరిగియున్నారు. క్రీస్తు యెడల మనకున్న భక్తికంటెను ఒక సిద్ధాంతము మనకు ప్రాముఖ్యమైనప్పుడు, ఆత్మీయముగా దిగజారి మరియు దాని ఫలితముగా స్వనీతి మరియు పరిసయతత్వమును కలుగును.


ఎఫెసులో ఉన్న సంఘము:


ఎఫెసులో ఉన్న సంఘచరిత్రను చూచెదము. అపొస్తలుడైన పౌలు మూడు సంవత్సరములు రాత్రింబవళ్ళు శ్రమించి దేవుని సంకల్పము అంతటిని వారికి బోధించాడు (అపొ.కా 20:27 - 31). కాబట్టి ఎఫెసీ సంఘస్తులు పౌలు యొక్క అనేక వందల ప్రసంగములు వినియున్నారు. వారి మధ్యలో ప్రభువు అనేక అద్భుతములను చేసియున్నాడు (అపొ.కా. 19:11). రెండు సంవత్సరములలో వారి ద్వారా యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియాలో ఉన్న వారందరి యొద్దకు దేవుని వాక్యము వెళ్ళెను. వారు ఉజ్జీవమును అనుభవించిరి (అపొ.కా. 19:10, 19). అపొస్తుల కాలములో సంఘములన్నింటి కంటె వారు ఎంతో ధన్యులై యున్నారు. మరియు ఆ కాలమంతటిలో ఆసియాలో అత్యుత్తమ సంఘముగా ఉన్నారు. పౌలు ఎఫెసీయులకు పత్రిక వ్రాసినప్పుడు, ఇతర సంఘములకు పత్రిక వ్రాసినట్లు ఈ పత్రికలో ఎటువంటి దిద్దుబాటు చేయలేదు.


కాని పౌలు ఎఫెసీ పట్టణమును విడిచి వెళ్ళినప్పుడు, అక్కడి పెద్దలను ఈ విధముగా హెచ్చరించాడు. ''నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు'' (అపొ.కా 20:29, 30).


పౌలు అక్కడున్నంత కాలము, ప్రభువు యొద్దనుండి అతడు ఆత్మీయాధికారమును పొందుకొని, మంచి ద్వారపాలకునివలె ఉన్నాడు గనుక, ఎఫెసీ సంఘములోనికి తోడేళ్లు ప్రవేశించుటకు ధైర్యము చేయలేదు (మార్కు 13:34). కాని అతనివలె ఇతరసంఘపెద్దలు, ప్రభువు యెడల అంకిత భావము కలిగిలేరని అతనికి తెలియును. కాబట్టి అతడు వెళ్ళినవెంటనే పరిస్థితులు మారి మరియు తోడేళ్ళ వంటివారు సంఘనాయకత్వమును వహించెదరని అతనికి తెలియును.


తోడేళ్ళు సంఘములోనికి వచ్చునని పౌలు హెచ్చరించినప్పుడు అక్కడి సంఘపెద్దలకు అతడు ప్రవచనము చెప్పుటలేదు. అది కేవలము హెచ్చరిక మాత్రమే. సంఘపెద్దలు తమ్మును తాము తీర్పు తీర్చుకొనుచు మరియు మారుమనస్సు పొందుచున్నయెడల, పౌలు చెప్పినట్లుగా జరిగియుండెడిది కాదు. నీనెవె యొక్క నాశనము గూర్చి యోనా ప్రవచించాడు. నీనెవె ప్రజలు మారుమనస్సు పొందియున్నారు గనుక, అతడు చెప్పినట్లు జరుగలేదు. ఎఫెసీ సంఘస్తులు కూడా మారుమనస్సు పొందియున్నట్లయితే పౌలు చెప్పినట్లుగా జరిగియుండెడిది కాదు కాని ఆ పెద్దలు పౌలు చేసిన హెచ్చరికలను తీవ్రముగా తీసుకొనలేదు కనుక వారు ప్రభువు యొద్దనుండి తప్పిపోయిరి.


యాభై సంవత్సరముల తరువాత, ఎఫెసీ సంఘములోని పరిస్థితులు చాలా చెడుగా మారిపోయినవి. వారి యొక్క సిద్ధాంతములు సరిగానే యున్నవి మరియు వారు క్రైస్తవ పరిచర్య చేయుటలో ఆసక్తి కలిగియున్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూటములు మరియు ప్రత్యేకకూటములు వారు కలిగి యుండవచ్చును. కాని వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంతగా దిగజారెనంటే సంఘముగా వారికున్న గుర్తింపును తీసివేస్తానని ప్రభువు చెప్పాడు. వారి యొక్క నేరమేమిటి? వారు ప్రభువు యెడల వారికుండిన మొదటి ప్రేమను మరియు అంకితభావమును కోల్పోయిరి (పక్రటన 2:4, 5).


ఎఫెసీ సంఘము యొక్క చరిత్ర మనకు ఏమి బోధించుచున్నది? ప్రభువు యెడల మనకున్న ప్రేమయు మరియు అంకితభావమును సిద్ధాంతములన్నింటి కంటెను లేక పరిచర్యలన్నింటి కంటెను ముఖ్యమైనవి. యేసు యొక్క జీవము మన జీవితములలో అంతకంతకు ప్రత్యక్షపరచబడుటయే నిజమైన ఆత్మీయతకు గుర్తు మరియు ప్రభువుతో మనము ప్రార్థన ద్వారా ఎక్కువ సమయము గడుపుట ద్వారా దీనిని మనము పొందగలము.


తన జీవిత కాలము అంతయు ప్రభువైన యేసునందు అంకితభావము మరియు విశ్వాస్యత కలిగి, పౌలు అపొస్తలుడుగాను దైవజనుడుగాను ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు యెడలనున్న సరళత నుండియు పవిత్రతనుండియు సాతాను తన కుయుక్తిచేత తమను మోసపరచునేమోయని అతడు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు (2 కొరింథీ 11:3).


మొదటి తరము మరియు రెండవ తరము:


పౌలు కూడా తన తరములో మాత్రమే దేవునిసంకల్పము చొప్పున సేవ చేసెనని మనము చూచుచున్నాము. తిమోతి వలె అతనితో జీవించినకొందరు అతనిలో ఉన్న ఆత్మను తమలో ఇముడింప చేసుకొని మరియు స్వార్థము లేకుండా క్రీస్తుతో అంకిత భావము కలిగి జీవించిరి (ఫిలిప్పీ 2:19 - 21). కాని తన తరువాత తరములో తాను నిర్మించిన సంఘములలో ఉన్న విశ్వాసులలోనికి పౌలు తన ఆత్మీయతను ప్రసరింపచేయలేక పోయెను. వారికి వారే దేవునిని తెలుసుకోవలసియున్నది.


క్రైస్తవ చరిత్రలో, క్రైస్తవ్యమును తన యొద్దకు నడిపించుటకు, దేవుడు సిద్ధపరచిన దైవజనులైన సంస్కర్తలు వారి తరములో ఉన్న వారికి మాత్రమే దేవుని సంకల్పము చొప్పున సేవ చేయగలిగిరి.


దేవుడు ఒక దేశములోను, ఒక ప్రత్యేక తరములోను ఆ దేశములోని సంఘమును సంస్కరించుటకు, అపొస్తులుల యొక్క బోధించిన సత్యమును ప్రకటించుట ద్వారా ప్రజలను దైవభక్తిలోనికి నడిపించుటకు దైవజనులను ఆయన పంపును. ఆ విధముగా ఒక ఉద్యమము అతని ద్వారా ఆరంభమై వారి యొక్క తరములోని క్రైస్తవ్యములోని వేషధారణకును మరియు అసత్యమునకు విసుగు చెందిన కొందరు పూర్ణ హృదయులైన విశ్వాసులు అతనితో చేరెదరు. త్వరలోనే ప్రభువు కొరకు పవిత్రమైన సాక్ష్యము నిర్మించబడును.


ఎల్లప్పుడు అటువంటి ఉద్యమము యొక్క ఆరంభములో కొందరే ఉండెదరు మరియు అనేకసార్లు వారు బీదవారైయుండి మరియు పాత సంఘముల చేత వారు హింసింపబడి ద్వేషించబడెదరు. ఆ ఉద్యమము యొక్క నాయకుడు అందరికంటె ఎక్కువగా ద్వేషించబడును. మరియు గత తరములో దేవునిచేత లేపబడిన ఉద్యమము యొక్క నాయకులు దేవుడు వారిని విడిచిపెట్టి యున్నాడని గ్రహింపక, క్రొత్తగా వచ్చిన ఉద్యమములో ఉన్నవారియందు అసూయపడి మరియు ఎక్కువగా ద్వేషించెదరు. ఈ ఉద్యమమునకు వ్యతిరేకముగా సాతాను కూడా వారితో కలిసి మరియు ఆ పాత ఉద్యమములో ఉన్న ''విశ్వాసుల'' ద్వారా ఎక్కువగా నిందించును.


కాని దేవుడు లేపిన ఒకవ్యక్తి ద్వారా ఆయననామము యొక్క సాక్ష్యము స్థిరపరచబడునట్లు ఆ హింసగాని లేక మనుష్యులయొక్కయు దయ్యములయొక్క కుయుక్తులు గాని పనిచేయవు.


కాని ఆ సంస్కర్త చనిపోయినప్పుడు ఏమి జరుగును? దాదాపు ప్రతి ఉద్యమములో, తరువాతి తరములో అతనిని వెంబడించువారు, క్రీస్తు యెడల అతడు కలిగియున్న అంకిత భావమును వారు కలిగియుండక కేవలము అతడు బోధించిన సిద్ధాంతములకు ఎక్కువ విలువఇచ్చెదరు. పైకి భక్తి కలిగియుండుటకే ప్రాముఖ్యత నిచ్చెదరు గాని దాని యొక్క శక్తిని నిర్లక్ష్యము చేయుదురు. ఆ విధముగా అది అంతకంతకు క్షీణించిపోవును.


ఆ ఉద్యమము మూడవ తరములోనికి చేరేసరికి, అది పూర్తిగా చెడిపోవును. తరువాత ఆ సంస్కర్తకు ఉన్న దైవభక్తిగానీ ఆత్మీయత గానీ వారిలో కనబడదు. వారు అవే సిద్ధాంతములు ప్రకటించి మరియు అతని పేరును బట్టి గర్వించినప్పటికిని వారు బబులోనును మాత్రమే నిర్మించెదరు.


ఒక ఉద్యమము ఆత్మీయముగా ఆరంభించినప్పటికిని చివరకు అది లోకానుసారముగాను శరీరానుసారముగాను మారవచ్చును. నిజానికి ఒక దైవజనుని ద్వారా ఆరంభించబడిన ఉద్యమము, ఒక నాటికి ఒక మత సంస్థగా మారవచ్చును.


ప్రభువైన యేసు యెడల మనకుండవలసిన అంకిత భావమునకు, ఎంత మంచి లేక ముఖ్యమైన సిద్ధాంతమైనను సాటిరాదు.


ఆత్మీయ సంఘ సంస్కర్తలందరు ప్రభువును ఎరిగియున్నారు. రెండవ తరమువారు సంస్కర్తను మరియు అతను బోధించిన సిద్ధాంతములను మాత్రమే ఎరుగుదురు.


ప్రతి ఒక్క ఉద్యమములోను సామాన్యముగా జరుగునది ఏమనగా, అవి రెండవ తరము చేరుకొనే వరకు అందులోని సభ్యులు ధనవంతులై ఎంతో డబ్బును మరియు సొంతఇండ్లను మరియు స్థలములను మొదలగువాటిని కలిగియుందురు. చాలా కొద్దిమంది విశ్వాసులకు మాత్రమే డబ్బును జాగ్రత్తగా వినియోగించుట తెలుసును గనుక అనేకులు వారికున్న ఆస్తిపాస్తులను బట్టి గర్వించి మరియు వాటితో సంతృప్తిపడెదరు.


సామాన్యముగా ఉద్యమము యొక్క మొదటి తరమువారు బీదలైయుండి దేవునికి సన్నిహితులైయుందురు. రెండవ తరమువారు సిరిసంపదలు కలిగినవారై లోకానికి దగ్గరగా ఉంటూ వారి ఆత్మీయతను కోల్పోయెదరు. అప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టును. కాబట్టి అది బబులోనుగా మారును.


సంఘ చరిత్రలోని ప్రతి ఉద్యమములోను ఈ విధముగా జరుగును. మొదటి ఉద్యమము వెనుకంజ వేసిన ప్రతిసారీ, దేవుడు మరియొక ప్రాంతములో, మరియొక వ్యక్తి ద్వారా మరియొక ఉద్యమము ఆరంభించును. క్రైస్తవ చరిత్రలో, ''మరణము మరియు పునరుత్థానము'' అనునది మరలా మరలా జరుగుచువచ్చుచున్నది మరియు ఆ విధముగా అన్ని సమయములలో దేవుడు తన నామము కొరకు చిన్నదైనప్పటికిని పవిత్రమైన సాక్ష్యము కలిగియున్నాడు.


కాబట్టి జ్ఞానము గలవారు తమ తరములోను మరియు తమ ప్రాంతములోను దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద నిలచియున్నదో గమనించి, అటువంటి సంఘముతో పూర్తిగా కలసిపోయెదరు. గత తరములో అభిషేకము ఎవరి మీద నున్నదో అని వారు చూడరు. దేవుడు ఇప్పుడు ఎ్కడ సంచరించుచున్నాడో వారు చూచెదరు గాని గత తరములో దేవుడు చేసిన దానిని చూడరు.


''పైకి భక్తిగలవారివలె ఉండువారికి విముఖుడవై యుండి (2 తిమోతి 3:5) మరియు పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన (ప్రభువు నామమును పిలుచువారు) చేయువారితో'' సహవాసము చేయవలెనని లేఖనము స్పష్టముగా చెప్పుచున్నది (2 తిమోతి 2:22). ప్రభువును పూర్ణహృదయముతో ప్రేమించువారే పవిత్ర హృదయులు. అటువంటి విశ్వాసులు ఎక్కువ ధనమును కాని, సౌఖ్యమును గాని, ఘనతను గాని కోరరు. వారు ప్రభువునకు మాత్రమే అంకితమయ్యెదరు కాని ఏ సిద్ధాంతమునకు కాదు. మనము ఎల్లప్పుడు అటువంటి విశ్వాసుల సహవాసమును కోరవలెను.


ఆ విధముగా దేవునియొక్క పరిచర్య ఒక తరమునుండి మరియొక తరమునకు, ఎప్పటికి ఆగిపోకుండా కొనసాగునట్లు తన యెడల అంకిత భావము గలవారిని ప్రతి తరములోను దేవుడు లేపును. ఆ విధముగా దేవుని యొక్క సంకల్పమును సాతాను యొక్క కుతంత్రములన్నియు కలిపి కూడా ఆపలేవు.


అధ్యాయము 21
హృదయరహస్యములు బయలుపరచబడును

ప్రభువైన యేసును గురించి సుమెయోను ఈ విధముగా ప్రవచించాడు, ''అనేకులు ఎదిరించునట్లు ఈయనను ఒక గుర్తుగా నియమించియున్నాడు. ఆ విధముగా వారి యొక్క హృదయ రహస్యములను ఆయన బయలుపరచును'' (లూకా 2:34, 35 జె.బి. ఫిలిప్స్‌).


ఈ పుస్తకములో మనము చెప్పిన వాటినిబట్టియు మరియు మనము ప్రకటించిన నియమములను బట్టియు మనలను విమర్శించవచ్చు. కాబట్టి చివరిగా నన్ను ఈ విధముగా చెప్పనివ్వండి, ప్రభువైన యేసు బోధించిన ఉన్నతమైన నైతిక ప్రమాణములను బట్టి ప్రజలు తీర్పుతీర్చి మరియు ఎదిరించినప్పుడు, నిజానికి వారు ఆవిధముగా చేయుటద్వారాను మరియు మాట్లాడుటద్వారాను వారిలో ఉన్న భ్రష్ట హృదయము యొక్క స్థితిని వారు బయటపెట్టుచున్నారు. ప్రభువైనయేసు వారి మధ్యలోనికి వచ్చియుండక పోయినట్లయితే ఈ విధముగా ఎప్పటికిని జరిగి యుండెడిదికాదు.


కపెర్నహూములోని ఒక సమాజమందిరములో ప్రభువైనయేసు ఒకసారి బోధించుచున్నప్పుడు, దయ్యములు పట్టిన ఒకవ్యక్తి కేకలు వేశాడు. గత సంవత్సరములన్నింటిలో సమాజమందిరములలో పరిసయ్యులు బోధించుచున్నప్పుడు ఆ దయ్యము సమాధానముతో నెమ్మదిగా ఉండెను. కాని ప్రభువైన యేసు వచ్చి బోధించిన వెంటనే, ఆ వ్యక్తిలోని అంతరంగస్థితి బహిర్గతంచేయబడింది (మార్కు 1:21 - 27).


ప్రభువైన యేసు వారి మధ్యకు వచ్చి బోధించినప్పుడెల్లను, వారి యొక్క అంతరంగిక స్థితి మరియు వారి హృదయములో ఉన్న వైఖరి బహిర్గతం చేయబడింది.


సమాజములలోని మత నాయకులందరును ప్రజల ఎదుట పరిశుద్ధులుగా కనబడెదరు. కాని ప్రభువైన యేసు వారి మధ్యకు వచ్చినప్పుడు, వారిలో ఉన్న బయటకు కనబడేదంతయు చింపివేయబడి మరియు వేషధారులుగాను మరియు మోసగాళ్ళగానూ వారు చూపించబడెదరు.


వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపవలెనని కోరిన పరిసయ్యుల మద్యలో ఒకసారి ప్రభువైన యేసు ఉన్నప్పుడు, వెంటనే వారి యొక్క హృదయవైఖరులు బయలుపరచబడినవి (యోహాను 8:1 - 7). ప్రభువైన యేసు మీద నేరము మోపుటకు తగిన కారణమును కనుగొనవలెనని వారు కోరియుండిరి (యోహాను 8:6). పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని ప్రభువైనయేసు చెప్పారు. వెంటనే వారి హృదయములో ఉన్న అంతరంగికస్థితి బయలుపరచబడి మరియు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. పెద్దలైన పరిసయ్యులు ఎల్లప్పుడు గొప్ప వేషధారులైయున్నారు.


ప్రభువైనయేసు వారి మధ్యలోకి వచ్చిన వెంటనే, ఆమెను నిందించువారి హృదయములో ఉన్న ఆలోచనను బహిర్గతంచేయుటకు ఆ స్త్రీ యొక్క పాపమును ప్రభువు ఉపయోగించాడు.


ప్రభువైన యేసు ఈ రోజు మన హృదయములలో మాట్లాడుచున్న మాటలను మనము తీవ్రముగా తీసుకొననట్లయితే అనగా, ''ఇతరులను తృణీకరించవద్దు. పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయనిమ్ము''. అప్పుడు పరిసయ్యుల వలె మనము కూడా ప్రభువైన యేసు సన్నిధి నుండి వెళ్ళగొట్టబడెదము. కాబట్టి ఎల్లప్పుడు నీతిన్యాయములు గల దేవునికే తీర్పు తీర్చుటను అప్పగించాలి.


ఎవరికి భయపడని వాడుగాను మరియు ఎవరి యొక్క అభిప్రాయమును లెక్కజేయనివాడుగాను మరియు శక్తిగల పాలకుడుగా పిలాతు కనబడెను. కాని ప్రభువైన యేసు అతని యెదుట నిలచి మరియు అతనితో మాటలాడినప్పుడు, పిలాతు యొక్క నిజస్థితి బయలుపరచబడింది. ప్రభువైన యేసు నిర్దోషి అని అతనికి తెలిసినప్పటికిని, సిలువ వేయబడుటకు ఆయనను ప్రజలకు అప్పగించాడు. ఆ విధముగా ప్రజల యొక్క అభిప్రాయమునకు భయపడేవాడుగా పిలాతు బయలుపరచబడియున్నాడు.


ఈ విషయములన్నింటిలోను ప్రభువైన యేసును వ్యతిరేకించిన అందరియొక్క హృదయాలోచనలు బయలు పరచబడటం ద్వారా పైన సుమెయోను చెప్పిన ప్రవచనము నేరవేరినది.


ప్రభువైన యేసు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు చేసిన పరిచర్యనే ఈనాడు క్రీస్తు శరీరములోని అవయవములైన మనము కూడా చేయవలెను.


ప్రభువైన యేసు బోధించిన ఉన్నత నైతిక ప్రమాణములను మనము ప్రకటించుచుండగా, ఈనాటి శరీరానుసారమైన క్రైస్తవులు మనకు తీర్పు తీర్చుట ద్వారా వారి హృదయములలో ఉన్న శరీరానుసారమైన స్థితిని బయట పెట్టుకొనుచున్నారని వారు గుర్తించుట లేదు. క్రొత్త నిబంధన స్థాయిని (అంతస్థును) మనము ప్రకటించనియెడల ఈ విధముగా ఎన్నటికిని జరిగి యుండెడిది కాదు.


ఒక ఉదాహరణ చూడండి, ''ప్రభువైన యేసు మరియు అపొస్తలులు ఆర్థిక విషయములలో మనకు మాదిరియైయున్నారు. వారు పరలోక సంబంధమైన గౌరవము గలిగినవారై, వారి స్వంత అవసరములకొరకే కానీ లేక వారి పరిచర్యల కొరకు గాని ఒక్కసారైనను మరియు ఒక్కరినైనను ఎన్నడైనను డబ్బును అడుగలేదు. బీదలకు సహాయపడుమని మాత్రమే వారికి చెప్పిరి'' అని మనము ప్రకటించుచున్నాము.


మనము ప్రకటించే దేవుని వాక్య నియమమును, పాత నిబంధనలోని లేవీయుల యొక్క ఉదాహరణను తీసుకొని శరీరానుసారులైన బోధకులు మరియు పాస్టర్లు వెంటనే మనలను ప్రశ్నించెదరు. ఆ విధముగా వారి హృదయములలో ఉన్న క్రింది రహస్యములు బయలు పరచబడును.


1. క్రొత్త నిబంధనలో ఉన్న ఆర్థిక విషయములలో ఉన్న నియమములను వారు నిరాకరించుచున్నారు.


2. దేవుడు వారి అవసరము తీర్చగలడని విశ్వసించక పోవుట.


3. పాత నిబంధన కొట్టి వేయబడిందనే సత్యమును వారు నిరాకరించుట మరియు ప్రభువైన యేసు మరియు అపొస్తులులు మాత్రమే మనకు మాదిరియై ఉన్నారు మరియు లేవీయులు కాదు (హెబీ 8:7 - 13, 12:1, 2:1, 1 కొరింథీ 11:1, ఫిలిప్పీ 3:17).


ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకను అనేక ఉదాహరణలు ఉన్నవి.


కాబట్టి ప్రభువైనయేసు వలెనే, ఈనాటి మతనాయకులు మరియు బోధకులు మనలను వ్యతిరేకించినప్పుడు ఆశ్చర్యపడవద్దు. 20 శతాబ్దముల క్రితము ప్రభువైన యేసు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన చేసిన పరిచర్యనే, ఆయన శరీరమైయున్న మనము కూడా చేసెదము. ఫలితము కూడా ఆ విధముగానే ఉండును. ప్రజల యొక్క హృదయాలోచనలు బహిర్గతము అయ్యేటట్లు దేవుడు మనయొక్క వర్తమానములను ఉపయోగించును.


తన ప్రజలయొక్క శ్రమల ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు ఇతరుల యొక్క హృదయస్థితిని బహిర్గతపరచును. యోబుకు బోధించిన ముగ్గురు బోధకుల యొక్క స్వనీతిని మరియు కాఠిన్యమును బహిర్గతపరచుటకు దేవుడు యోబు యొక్క శ్రమలను ఉపయోగించాడు (యోబు 1 నుండి 42 అధ్యాయములు).


ప్రభువైనయేసు సిలువమీద వ్రేలాడి శ్రమపొందినప్పుడు, అనేకమంది ప్రజల యొక్క హృదయాలోచనలు బయలుపరచబడెను. దానిని చూచుచు వెళ్ళుచున్నవారు ఆయనను వెక్కిరించుట ద్వారా వారి హృదయములలో ఉన్న భ్రష్టత్వము బయలుపరచబడింది. మరొక వైపున, ప్రభువైన యేసు దేవుని కుమారుడని ప్రకటించిన రోమా సైనికునియొక్క యథార్థత బయలుపరచబడింది. సిలువ వేయబడిన ఒక దొంగ యొక్క భ్రష్టహృదయము బయలుపరచబడి మరియు అతను నరకానికి వెళ్ళాడు. నిజముగా మారుమనస్సు పొందిన సిలువవేయబడిన మరియొక దొంగ హృదయము బయలుపరచబడి మరియు అతను పరదైసులో ప్రవేశించాడు.


మార్కు 3:2లో ప్రభువైనయేసు ఒక సమాజ మందిరములో ఉన్నప్పుడు కొందరు కోపముతో ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను సన్నిహితముగా కనిపెట్టుచుండిరి. ఈనాటి పరిసయ్యులు కూడా యథార్థముగా జీవించే విశ్వాసులమీద నేరము మోపుటకు వారిలోని బలహీనతలను చూచుటకు వారు కనిపెట్టెదరు.


ఒక వ్యక్తిమీద నీకు కోపమున్న దానిని బట్టియు లేక అతనిమీద అసూయపడిన దానినిబట్టియు, అతనిలోని తప్పులను కనుగొనుటకు సన్నిహితముగా అతని జీవితమును చూచెదవు. వ్యక్తిగత జీవితములోను లేదా కుటుంబ జీవితములోను మనుష్యులందరి జీవితములలో ఉన్నట్లే అతని జీవితములో కొన్ని పొరపాట్లు ఉండవచ్చును. దేవుని సేవకులలో ఉన్న పొరపాట్లను తీర్పు తీర్చే వారి యొక్క హృదయములను భ్రష్టత్వమును బయలుపరచుటకు వారి పొరపాట్లను దేవుడు ఉపయోగించును.


ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ''నా జనులలో దుష్టులున్నారు. వారు పక్షి వేటకాండ్రువలె పొంచియుందురు. మనుష్యులను పట్టుకొనుటకు వారు బోనులను పెట్టుదురు. వారి యిండ్లు చెడ్బవాటితోను కపటముతోను నిండియున్నవి... ఏమియు జరగనట్లుగ నిన్ను చూచి చూడనట్లుగా ఉండెదనా?'' (యిర్మీయా 5:26, 29 లివింగు).


ఒక సమయములో పరిసయ్యులు, ''ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి'' (లూకా 11:53, 54). మరియు ఆ సందర్భములో, ''వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి'' (మార్కు 12:13).


ఈనాటి క్రైస్తవ్యములో ఇతరులను సన్నిహితముగా చూచుచు వారిని మాటలలో చిక్కపరచవలెనని ప్రశ్నలు వేయుచున్న పరిసయ్యులు ఉన్నారు. కాబట్టి వారి మధ్యలో మనము పాముల వలె వివేకులమై యుండి పావురములవలె నిష్కపటులమై యుండవలెను (మత్తయి 10:16).


విశ్వాసుల జీవితములను సన్నిహితముగా చూచుట పరిసయ్యులగుటకు అత్యంత సులభమైన మార్గము. కాబట్టి నీవు పరిసయ్యుడవు అవ్వకుండుటకు కోరినయెడల, ప్రజలకు సహాయపడుటకు గాక వారిలో పొరపాటును చూచుటకు వారిని కనిపెట్టి చూసే అలవాటును పూర్తిగా విసర్జించవలెను. కనికరముచూపుట, పరిసయ్యతత్వంనుండి విడుదల పొందుటకు మంచి విరుగుడు అయియున్నది. కాబట్టి దేవుడు మనయెడల కనికరము చూపించుచున్నట్లు మనము కూడా కనికరము చూపించుట నేర్చుకొందుము.


ప్రభువైన యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు, దేవుని యొక్క ప్రేమ మరియు కనికరము మరియు మంచితనమును ఆయన జీవితము ద్వారా ప్రత్యక్షపరచెను.


ఈనాడు, అదే దేవునిప్రేమ మరియు కనికరము మరియు మంచితనము మన జీవితముల ద్వారా ప్రత్యక్ష పరచబడునట్లు మనము కూడా పరిశుద్ధాత్మతో అనగా క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడవచ్చును.


మనందరి జీవితములలో ఈ విధముగా జరుగును గాక.


ఆమేన్‌.