నా కుమారులు అవివాహితులై మరియు చదువుల నిమిత్తమును మరియు ఉద్యోగ నిమిత్తమును దూర ప్రాంతములలో ఉన్నప్పుడు నేను వారికి వ్రాసి పంపిన ఈ-మెయిల్స్ ఈ పుస్తకములో ఉన్నవి. ఆ సమయములో వారు యౌవనస్తులైయుండి మరియు 30 సంవత్సరములలోపు వారైయున్నారు.
దేవునియొక్క ఉపదేశములో నీ పిల్లలను పెంచవలెనని తండ్రులకు చెప్పబడియున్నది. కాబట్టి ప్రభువైన యేసు యెడల వారు మొదటిప్రేమను కలిగి ఆయనకు అంకితమగునట్లు దేవునివాక్యములో నుండి వారికి కొన్ని విషయములను వ్రాసితిని. ''వ్యభిచారులైన చెడ్డతరము'' నుండి యౌవనస్తులు కాపాడబడుటకు దేవుని వాక్యములోనున్న సత్యములో వారు స్థిరపరచబడవలెనని నేను కోరియున్నాను (మత్తయి 16:4). మరియు వారు దేవునిసత్యమును ఇతరులతో ఖచ్చితంగా పంచుకోవలెనని కోరియున్నారు.
కొన్ని సత్యముల యొక్క ప్రాముఖ్యతను బట్టి నా మెయిల్స్‌లో వాటిని అనేకసార్లు పంపియున్నాను. అందువలననే క్రొత్త నిబంధనలో కొన్ని విషయములు అనేకసార్లు చెప్పేవాడను. పరిశుద్ధత, మన సిలువనెత్తుకొని వెంబడించుట మరియు జయ జీవితము గురించి ఈనాటి క్రైస్తవ్యములో ఎక్కువగా చెప్పబడుటలేదు గనుక వాటిని గూర్చి మరలా మరల చెప్పాను.
ఆ కాలములో కెసెట్స్‌లో ఉన్న నా ప్రసంగములను క్రమము తప్పకుండా వినమని చెప్పాను. ఈనాడు మీరు ఆ ప్రసంగములను యూ ట్యూబ్‌లో మరియు సి.ఎఫ్.సి వెబ్‌సైట్‌లోను వినవచ్చును.
ఈ పుస్తకములోని ఒక అధ్యాయములో వారు వారి యొక్క జీవిత భాగస్వామిని ఎన్నుకొనుట మరియు వివాహము చేసుకొనుట గురించి చెప్పాను. ఆ అధ్యాయములో నేను వివరించిన రీతిగా ఆ నలుగురు నా సలహాను విని మరియు దైవభక్తిగల అమ్మాయిలను వివాహము చేసుకున్నారు. దీనిని బట్టి నేను ప్రభువుకు ఎంతో వందనస్తుడైయున్నాను.
దేవుడు నాకు అనుగ్రహించిన విత్తనమునే నేను నాటియున్నాను. దేవుడే ఆ విత్తనాలకు నీరుపోసి, అవి పరిణితి చెంది మరియు వారి జీవితములో ఫలములను తెచ్చినవి. వారి జీవితములో పనిచేసినందుకు నేను దేవునినే మహిమ పరుచుచున్నాను.
ఇందులోని అనేక పత్రికలు 25 సంవత్సరముల క్రితమే వ్రాసియున్నాను. నా అభిప్రాయము ఇప్పటికి అలాగే ఉన్నది మరియు నేను వ్రాసిన దానంతటికి కట్టుబడియున్నాను.
నా యొక్క ఈ-మెయిల్స్ అన్నిటిని ఇక్కడ ఇచ్చియున్నాను. అయితే శీర్షికలు, తారీకులు, శుభాకాంక్షలు మరియు పేర్ల వలన ఉపయోగము లేదు గనుక ఈ పుస్తకములో నుండి వాటిని తీసియున్నాను.
చదువుటకు సులభముగా ఉండు నిమిత్తము మాత్రమే అధ్యాయములను విభజించియున్నాను. ఒక అంశమును బట్టిగాని లేక క్రమ పద్ధతిలో అధ్యాయములు చేయబడలేదు.
నా కుమారులకు వ్రాసినదానంతటిలో 90 శాతం యౌవన స్త్రీలు కూడా అన్వయించకొనవచ్చును. కాబట్టి వారు కూడా ఈ పుస్తకమును చదువవచ్చు.
అనేక అంశముల మీద నేను వ్రాసిన మెయిల్స్ ఈ పుస్తకములో ఉన్నవి. గనుక నెమ్మదిగా చదవండి. కేవలము ''పాలు'' మాత్రమే కాక ''బలమైన ఆహారము'' కూడా కలదు. కాబట్టి నేను చెప్పునదేమనగా, మీరు రోజుకు ఒక అధ్యాయము మాత్రమే చదివి మరియు అందులో ఉన్న సత్యములు అన్నీ అనుభవించునట్లు మీరు ధ్యానించవలెను. ఇక్కడ చెప్పబడిన లేఖనములన్నిటిని చదివి, ధ్యానించవలెను. ఆవిధంగా కొద్ది కాలములోనే మేలు పొందునట్లు మీరు మార్పు చెందెదరు.
ఈ పుస్తకము చదువు యౌవనస్తులందరు ఆశీర్వదించబడవలెనని ప్రార్థించుచున్నాను.
బెంగళూరు
జాక్ పూనెన్
జనవరి 2017
నీవు ప్రభువైన యేసు యొక్క శిష్యుడవైనప్పటికి, అందరికి ఉండినట్లుగానే నీ జీవితములో కూడా ఒడిదుడుకులు ఉండును. అయినప్పటికిని, శిష్యులుగా ఉండవలెనని నీవు తీసుకొనిన నిర్ణయములో మార్పు ఉండదు. ఆత్మీయముగా ప్రభువైన యేసును వివాహము చేసుకొనుటకు మరియు నిత్యత్వానికి ఆయనను వెంబడించుటకు నీవు కోరికొనియున్నావు. ఆ నిర్ణయము విషయములో నీవు ఎన్నటికిని వెనుదిరగవద్దు. నీ వ్యక్తిగత లాభం కొరకు గాని లేక స్వార్థముతోగాని ఈ నిర్ణయమును తీసుకోలేదు గాని ప్రభువు నీ కొరకు చేసి ముగించిన అంతటిని బట్టి కృతజ్ఞతతో ఆ నిర్ణయము తీసుకొనియున్నావు. మొదటిగా ఆయన నిన్ను ప్రేమించియున్నాడు గనుక ఇప్పుడు నీవు ఆయనను ప్రేమించెదవు.
నీతిమంతుల మార్గమువలె నీవు మహిమలో నుండి అధిక మహిమలోనికి నడిపించబడుటయే నీ యెడల దేవుని యొక్క చిత్తము (సామెతలు 4:18). కాబట్టి ఒక్కొక్క సంవత్సరము గడిచే కొలది నీవు పవిత్రతలోను, దీనత్వములోను మరియు ప్రేమలోను ఇంతకుముందున్న దానికంటే అంతకంతకు వృద్ధిని పొందెదవు. ఇదియే మన గురిగా ఉండవలెను.
రాబోయే కాలములో దేవుని సంఘములో పరిచర్య చేయుటకు ఆయన నీ కొరకు పరిచర్య కలిగియున్నాడు. కాబట్టి నీ జీవితకాలమంతయు పవిత్రత, దీనత్వము మరియు ప్రేమయే నీ గురిగా ఉండవలెను. ఎందుకనగా అపవిత్రమైన లేక గర్విష్ఠులైన పాత్రలను దేవుడు వాడుకొనడు. ఆత్మపూర్ణులై, మండే పాత్రలుగా ప్రభువు మిమ్మును చేయును గాక. పరిశుద్ధాత్మ శక్తి కొరకు దేవునికి ప్రార్థించుడి మరియు దేవుని యెడల భయభక్తుల విషయములో, దీనత్వము విషయములో ఎల్లప్పుడూ అంతకంతకూ లోతుగా స్థిరపడవలెను (సామెతలు 22:4). ఆయన యెడల భయభక్తులు గలవారిని దేవుడు కాపాడును మరియు దీనులకు ఆయన కృప నిచ్చును.
నీ యొక్క భావములు మార్పుచెందుచుండును గనుక ఎల్లప్పుడూ వాటి మీద ఆధారపడలేవు. దేవుని పక్షమున ఉండవలెను. నీవు తీసుకొనిన నిర్ణయము నిజమైన ఆత్మీయతయైయున్నది కాబట్టి నిరాశ పడకుండుటకు నీవు తీర్మానించుకొనుము. నీవు పాపములు ఒప్పుకొనిన వెంటనే యేసు రక్తములో కడుగబడెదవు గనుక యేసు రక్తమును బట్టి అపవాది యొక్క నేరారోపణను జయించుము (పక్రటన 12:11).
ప్రభువైనయేసు చేత అంగీకరించబడినవారు:
మన అందరియొద్ద నుండి ముఖ్యముగా దేవుడు యథార్థతను కోరుచున్నాడు. కీర్తన 51లో (దీనిని లివింగ్ బైబిలులో చదవండి), ఒక స్త్రీతో వ్యభిచారం చేసి మరియు భర్తను చంపిన దావీదు యొక్క హృదయవైఖరిని బట్టి దేవుడు అతనిని అంగీకరించియున్నాడు. కాని సౌలు చేసినది చిన్న పొరపాటువలె కనబడినప్పటికిని మరియు అతడు మనుష్యుల ఘనతను కోరియున్నాడు గనుక దేవుడు అతనిని విసర్జించియున్నాడు (1 సమూయేలు 15:30). కపటము మరియు వేషధారణ పులిసిన పిండివలె ఉండును. వాటిని ఎక్కువ కాలము దాచలేము. ఇప్పుడు కాకపోయినను తరువాత అయినను అవి బహిర్గతమగును. అన్నిటికంటె ఈ రెండు చెడ్డవాటి గురించి ఎక్కువ జాగ్రత్త పడవలెను.
ప్రభువైన యేసు భూమిమీద ఉండినప్పుడు కొందరు ఆయన యొద్దకు రాలేకపోయిరి.
పరిసయ్యులు - వీరు స్వనీతిపరులును, ఇతరులను తృణీకరించువారును మరియు తమనుతాము సమర్థించుకొనువారు.
శాస్త్రులు మరియు వేదాంతులు వారియొక్క తెలివితేటలను బట్టియు మరియు బైబిలు జ్ఞానమును బట్టియు గర్వించెదరు.
ధనవంతుడైన యౌవనస్థుడు అతడు సిరిని ఎంతో ప్రేమించి మరియు ప్రభువైన యేసు విడిచిపెట్టమనిన దానిని విడిచి పెట్టలేదు.
శిష్యులు కావాలని కోరేవారు (లూకా 9:59 - 62) వారు వారి బంధువులతో ఎక్కువ సంబంధం కలిగియున్నారు.
ప్రభువైన యేసు యొద్దకు సులభముగా రాగలిగిన వారిని చూచెదము:
వెళ్ళగొట్టబడిన కుష్ఠురోగి (మత్తయి 8:1 - 4)
వ్యభిచారము వలన పట్టబడిన స్త్రీ (యోహాను 8:1 - 11).
ప్రభువును ఎరుగనని మూడుసార్లు బొంకిన పేతురు (యోహాను 21:15 - 17)
రోమా శతాధిపతి (మత్తయి 8:5 - 13)
ఒక కనాను స్త్రీ (మత్తయి 15:21 - 28)
చివరి ఇద్దరు ఇశ్రాయేలీయులు కారు కాని సువార్తలలో ప్రభువు ఈ ఇద్దరి యొక్క గొప్ప విశ్వాసమును మాత్రమే బహిరంగముగా కొనియాడిరి. ఈ వాక్యభాగములు మీరు చదివి మరియు వారి లోతైన దీనత్వము, ప్రభువు యెడల వారి వైఖరిని గమనించుడి. గొప్ప దీనత్వమునకు మరియు గొప్ప విశ్వాసమునకు ఎల్లప్పుడు సంబంధమున్నది. ఆత్మవిషయమై దీనులైన వారు ప్రభువు యొద్దకు వచ్చెదరు మరియు పరలోకరాజ్యము అటువంటి ప్రజల యొక్క సొత్తైయున్నది. ఈ విషయమును మీ జీవితకాలమంతయు గుర్తు పెట్టుకొనుడి.
నీతిమంతులుగా తీర్చబడుట:
అనేకమంది దేవునియొక్క బిడ్డలు ఎల్లప్పుడు నేరారోపణ కలిగించే భావనలో ఉండుటవలన, దేవునియొద్దకు ధైర్యముగా రాలేక పోవుచున్నారు. నీవు నీ పాపమును ఒప్పుకొని మరియు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచియున్నావు గనుక దేవునిచేత నీవు నీతిమంతునిగా తీర్పుతీర్చబడి, ప్రకటింపబడి యున్నావనునది నిశ్చయమై యున్నది.
ఎఫెసీ పత్రికలో చెప్పినరీతిగా, మనము ''క్రీస్తులో'' ఉన్నాము అనగా క్రీస్తును ధరించుకొనియున్నాము. కాబట్టి క్రీస్తు దేవుని యొద్దకు వచ్చినట్లే నీవును ఆయన యొద్దకు రావచ్చు. నీ గత పాపములు అన్నియు, అవి ఎన్నియైనను మరియు అవి ఎంత గొప్ప తీవ్రమైన పాపములైనను అవన్నియు క్షమించబడియున్నవి మరియు అవి సంపూర్ణముగా కడుగబడియున్నవి మరియు దేవుడు వాటిని యుగయుగముల వరకు జ్ఞాపకము ఉంచుకొనడు (హెబీ 8:12). ఇప్పుడు నీవు ''క్రీస్తులో దేవునియొక్క నీతియై యున్నావు'' (2 కొరింథీ 5:21).
దేవుడు నీ పాపములన్నిటిని క్రీస్తుమీద వేయుటయే కాక, ఆయన నిన్ను క్రీస్తుయొక్క నీతితో ధరింపజేసియున్నాడు. లేనియెడల దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళుట నీకు అసాధ్యము ఎందుకనగా దూతలు కూడా వారి ముఖమును కప్పుకొందురు. ఇప్పుడు దేవునిచేత నీతిమంతుడుగా ప్రకటింపబడిన నీవు, నీ పాపమును వెంటనే దేవునితో మరియు మనుష్యులతో ఒప్పుకొనుట ద్వారా నీ మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలముగా ఉంచుకొనవలెను (అపొ.కా. 24:16). ఆ విధముగా నీవు ఎల్లప్పుడు దేవునిసన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలవు (1 యోహాను 3:21). నీవు ధైర్యమును ఎన్నటికిని కోల్పోకూడదు ఎందుకనగా అది నీకు గొప్ప బహుమానము తెచ్చును (హెబీ 10:35).
నీ యొక్క పరలోక తండ్రిని నీవు సమీపించినప్పుడెల్లనూ నీవు భయపడకూడదు. ఎల్లప్పుడు ఆయన యొద్దకు ధైర్యముగా వెళ్ళుము. ఎందుకనగా దేవునియొద్ద నుండి ఎన్నటికిని నేరారోపణ భావము కలుగదు. ఆయన తన బిడ్డలకు బల్ల క్రిందపడిన రొట్టెముక్కలను కాక జీవాహారమును ఇచ్చును. దూరప్రాంతమునకు వెళ్ళి తప్పిపోయిన తన కుమారులను కూడా, వారు వచ్చిన వెంటనే ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి విందు చేయును.
పాప క్షమాపణ పొందుట మరియు నీతిమంతులుగా తీర్చబడుట:
సాతాను యొక్క నేరారోపణలను మనము ప్రభువైన యేసుయొక్కరక్తము ద్వారా పాపక్షమాపణ పొందుటయే గాక నీతిమంతులుగా ఆయన మనలను ప్రకటించియున్నాడని సాతానుతో ఒప్పుకొనుట ద్వారా జయించగలము (పక్రటన 12:11). పాపక్షమాపణ పొందుటయు మరియు నీతిమంతులుగా తీర్చబడుట మధ్య చాలాతేడా ఉన్నది. ఒక వ్యక్తి మీద కోర్టులో నేరము మోపబడి మరియు అవి ఋజువు చేయబడిన యెడల, అతడు మారుమనస్సు పొందినయెడల న్యాయాధిపతి అతనిని క్షమించవచ్చును. అతడు క్షమించబడిన పాపిగా తన తలదించుకొని కొంత సంతోషముతో కోర్టునుండి బయటకు వెళ్ళును. కాని ఆ న్యాయాధిపతి అతనికి విరోధముగా ఉన్న నేరారోపణలు క్షుణ్ణముగా పరిశీలించి, అతనిలో ఏ తప్పులేదని కనుగొని మరియు అతడు నూరు శాతం నీతిమంతుడని ప్రకటించిన యెడల అప్పుడు ఆ వ్యక్తి తల ఎత్తుకొని కోర్టునుండి బయటకు వెళ్ళును ఎందుకనగా అతనిలో ఒక్క నేరము కూడా కనబడలేదు మరియు అతడు నీతిమంతుడుగా ప్రకటించబడియున్నాడు. ఈ విధముగా దేవుడు మనలను నీతిమంతులుగా చేసి మరియు నీతిమంతులుగా ప్రకటించియున్నాడు. మన తలలను ఎత్తుకొనచేయువాడని దేవుడు పిలువబడుచున్నాడు (కీర్తన 3:3).
అనేకమంది విశ్వాసులు ప్రభువైన యేసు రక్తములో వారిని నీతిమంతులుగా తీర్చుటకు కావలసిన శక్తి ఉన్నదని గ్రహించనందున వారి తలలు దించుకొనెదరు. వారు పాపములను క్షమించే శక్తిని గురించి మాత్రమే వారు వినియున్నారు. మన పాపములను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొననని (హెబీ 8:12) దేవుడు చెప్పుచున్నాడు. అనగా, మన జీవిత కాలమంతటిలో మనము ఒక్క పాపము కూడా చేయనివారిగా మనలను చూచుచున్నాడు. ప్రతీ ఉదయము ఆయన నూతన వాత్సల్యత కలిగియున్నాడని (విలాపవాక్యములు 3:23) అనగా ప్రతీ ఉదయము దేవుడు మనలను ఒక్క పాపము కూడా చెయ్యనివారుగా చూచుచున్నాడు. కాబట్టి ఏ సమయములో కూడా నేరారోపణ కలిగించే భావనలను అనుమతించకూడదు. ఎందుకనగా అది దేవునియొక్క మంచితనము, కనికరమును అనుమానించుటయే. ''నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' (కీర్తన 23:6).
సాతాను మనలను నిరాశపరచగలిగినప్పుడు లేక నేరారోపణ భావము కలిగించినప్పుడు మనమీద అతడు అధికారము పొందును. మనము మొదట భయముతో ప్రభువుకు అంకితము చేసుకొనముగాని మనలను మాటిమాటికి క్షమించుచు తనయొక్క విశేషమైన కనికరము మరియు మంచితనమునకు స్పందించి మనలను ఆయనకు అంకితము చేసుకొనెదము. ''ఎక్కువగా క్షమించబడిన వాడు ఎక్కువగా ప్రేమించును అని ప్రభువైన యేసు చెప్పారు'' (లూకా 7:47). నేను ఈనాడు ప్రభువుచేత ఎంతో ఎక్కువ క్షమించబడియున్నాను గనుక ఆయనను ప్రేమించుటకు బద్దుడైయున్నాను మరియు నా యొక్క పరిచర్యల కొరకు నిత్యత్వ బహుమానముల కొరకు నేను ఎదురుచూచుట లేదు. ఆయన నన్ను ఎన్నోసార్లు ఎంతో క్షమించుటయే నాకు బహుమానము. ఒకరు ఈ విధముగా చెప్పినట్లు:
''నా ఆత్మను రక్షించుకొనుటకు నేనేమి చేయలేను
నా ప్రభువే దానిని చేశాడు.
కాని దేవుని ప్రియకుమారుని యొక్క ప్రేమ కొరకు
నేను బానిసవలె పనిచేస్తాను''
ఈ లోకములో నీకు వస్తువాహనములు తక్కువగా ఉన్నను, ఎక్కువగా ఉన్ననూ నీవు ఎల్లప్పుడూ ఈ పాటను పాడుచున్నట్లయితే నీవు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండెదవు.
దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీర్చును:
పాత నిబంధనలో నీతిమంతులుగా తీర్చబడుటనుగూర్చి చూచెదము. కుష్ఠురోగము (పాపమునకు సాదృశ్యము) గల వ్యక్తిని నిర్వహించు విధానము లేవీయకాండము 13వ అధ్యాయములో ఉన్నది. 9 నుండి 17 వచనములు ఎంతో ప్రయోజనకరము. ఒక చిన్న తెల్లని వాపు కనబడిన యెడల కుష్ఠురోగము ఉన్నట్లుగా నిర్ధారించబడును (10,11 వ వచనము) కాని ఆ తెల్ల మచ్చ శరీరమంతయు విస్తరించినయెడల, ఆ పొడగలవానిని పవిత్రుడని నిర్ణయించబడును (12, 13వ వచనము). అయితే వాని వెలుపట పచ్చిమాంసము కనబడు దినమున అతడు అపవిత్రుడని నిర్ణయించబడును (14,15వ వచనము). మరల శరీరమంతయు తెల్లబారినయెడల, అతడు పవిత్రుడుగా నిర్ణయించడును (16,17వ వచనము).
ఈనాడు దీనిని మనము అన్వయించుకోవచ్చును. నీలో కొంత మంచితనము ఉన్నదని నీవు తలంచినంతవరకు (అనగా మంచితనము అనే చిన్న పొర) నీవు దేవుని సన్నిధిలో అపవిత్రుడుగా ఎంచబడుదువు. కాని నీవు సంపూర్ణుడుగా భ్రష్టుడవని నీవు గుర్తించిన యెడల (మన శరీరములో మంచిది ఏదియు నివసింపదు రోమా 7:18) అనగా నీలో మంచితనము కొంచెము కూడా లేదని నీవు ఒప్పుకొనిన యెడల దేవుడు నిన్ను పవిత్రుడుగా ప్రకటించును.
నీవు చేసిన ఏ క్రియను బట్టి అయినను ఇతరులు కలవరపడిన యెడల లేక గాయపరచబడిన యెడల నీ ఉద్దేశ్యములు మంచివని నీవు సమర్థించుకున్నప్పటికిని నీలో కుష్ఠు ఉన్నది. కాని నీ శరీరమంతయు దుష్టమైనదియు మరియు నీలో మంచిది ఏదియు లేదని నీవు ఒప్పుకొనిన యెడల, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చును (రోమా 7:18) నీవు ఇప్పుడు పవిత్రుడవవుదువు.
''తమ్మును తాము నీతిమంతులమని సమర్థించుకొనని వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చును'' ఇది ఒక నియమము.
దేవాలయములో ఒక పరిసయ్యుడు తనలోని మంచితనమును చూసియున్నాడు గనుక దేవునిచేత తృణీకరించబడి వెళ్ళియున్నాడు. కాని తనలో మంచిదేదియు లేదని చూచిన సుంకరి నీతిమంతుడుగా తీర్చబడియున్నాడు (లూకా 18:14). దేవుడు వెంటనే నిన్ను నీతిమంతుడుగా తీర్చునట్లు అన్నిసమయములలో నీలో ఉన్న భ్రష్టత్వమును, పాపమును త్వరగా ఒప్పుకొనుము.
ఫిర్యాదు చేయువారిని ఎదుర్కొనుట:
నీ క్రైస్తవ జీవిత ఆరంభములో నీలో కొన్ని ఒడిదుడుకులు ఉండును. నీ జీవితమనే గ్రాఫు పైకి, క్రిందకి ఉండును. కాని నీవు ఆవిధముగా కొనసాగే కొలది నీ యొక్క గ్రాఫ్ సరిగా ఉండును. కాబట్టి నీవు ఓడిపోయినప్పుడు నిరాశపడవద్దు. నీవు లేచి మరియు కొనసాగించుము.
గతములో వారు చేసిన భయంకరమైన తప్పిదములను బట్టి బాధించబడు వారు అపవాది యొక్క నిందారోపణలు వినకూడదు. ప్రభువైన యేసు రక్తములో నీ పాపములు అన్నియు పవిత్రపరచబడినవని విశ్వసించు (పక్రటన 12:11) అప్పుడు హెబీ 8:12లో నీ పాపములు ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొననని దేవుడు చేసిన వాగ్దానమును సాతానుతో చెప్పుము. దయ్యములు మరియు చెడ్డవారు నీ గతము గుర్తు చేసి మరియు నీ గత జ్ఞాపకములు బట్టి నిన్ను బాధపెట్టవలెనని కోరెదరు. కాని దేవుడు ఎన్నటెన్నటికిని చేయడు. నీవు చేసిన గత పాపము మాటిమాటికి గుర్తు వచ్చి మరియు నీవు పొందియున్న క్షమాపణ విషయములో అనుమానము ఉన్నయెడల, చివరిసారిగా ఆ పాపము దేవుని యెదుట ఒప్పుకొని మరియు క్షమాపణ అడిగి మరియు దేవుడు నిన్ను క్షమించుటకు నమ్మదగినవాడు, నీతిమంతుడని నమ్మవలెను. తరువాత ఆ పాపమును గురించి ఎప్పుడైనను ఆలోచించవద్దు ఆవిధముగా ప్రభువైన యేసుయొక్క గొప్ప శక్తిని దేవుని యొక్క విశేష కనికరమును మహిమపరచెదము.
కాంతి కిరణమంత వేగంతో సాతాను యొక్క నిందారోపణలు జయించవలెను (లూకా 10:18). ''నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము మరియు ఆయన మన శత్రువును మన మీద జయించుటకు అనుమతించడు. కాబట్టి మనము సిగ్గుపడము'' (కీర్తన 25:1, 7). 25వ కీర్తనలో దావీదు తన యొక్క బాల్యములో పాపము చేసినప్పటికిని జ్ఞాపకము కలిగి వాటిని మనతో చెప్పలేదు. 51వ కీర్తనలో కూడా తన పాపమును గూర్చి సామాన్యముగా చెప్పాడు గాని తాను చేసినటువంటి పాపమునుగూర్చి చెప్పలేదు. ఇదియే జ్ఞానము. మనము కూడా ఈ విధముగా జ్ఞానము కలిగి మనం చేసిన పాపమును కాక సామాన్యముగా మనుష్యులు ఎదుట ఒప్పుకొనవలెను. మనుష్యులకు వ్యతిరేకముగా మనం పాపంచేసిన యెడల దానిని వారి ఎదుట ఒప్పుకొనవలెను. మనము దేవుని యొద్ద స్పష్టముగా ఒప్పుకొనవలెను గాని మనుష్యులు యొద్దకాదు. రోమన్ క్యాథలిక్‌ల వలె మూర్ఖులైనవారు కొందరు ప్రొటెస్టంట్ సంఘములోకూడా మనుష్యుల ఎదుట పాపము ఒప్పుకొనుట అనే నియమము కలదు.
ఎఫెసీ 2:6, 7లో అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచుట కొరకేగాని మన యొక్క నమ్మకత్వమును కనపరుచుటకు కాదు. సమస్తమును ఆయన కృపను బట్టియే జరుగును. ఆ దినమున పాపులలో ప్రధానులైన అనేకులు దేవుని కృపద్వారా ఏ విధముగా చేయబడిరో చూచి సాతాను నోరు మూసుకొనును. పేతురువలె ఓడిపోయిన విశ్వాసులను దేవుడు చూపించి మరియు వారు ఏవిధముగా రూపాంతరము పొందితిరో దేవుడే చూపించును. భ్రష్టులైన పాపులలోను, ఓడిపోయిన విశ్వాసుల జీవితాలలోను దేవుడు చేయగలిగిన గొప్ప కార్యములను దేవదూతలు చూచి ఆశ్చర్యపడెదరు.
మనము పరిశుద్ధాత్మను పొందుకునే విషయమును అపొ.కా. 2:38లో స్పష్టముగా పేతురు చెప్పాడు. తమ పాపములను ఒప్పుకొనువారు, ''పేతురు - మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు'' (అపొ.కా. 2:38). క్రీస్తును ఏవిధముగా మన హృదయములలోనికి స్వీకరించియున్నామో అదే విధముగా పరిశుద్ధాత్మను కూడా మన హృదయములలోనికి స్వీకరించవలసియున్నది.
రోమా 8:9లో క్రీస్తు యొక్క ఆత్మ (పరిశుద్ధాత్మ) లేనివాడు, ఆయనకు చెందినవాడు కాడు అనగా అతను కనీసం క్రొత్తగా జన్మించలేదు. ప్రభువైన యేసును మన హృదయములోనికి రమ్మని మనము ఆహ్వానించినప్పుడు క్రీస్తుయొక్కఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన హృదయములోనికి వచ్చును. ఎందుకనగా ప్రభువైన యేసు పరలోకములో ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట ద్వారా మనము ఆత్మమూలముగా జన్మించెదము.
పరిశుద్ధాత్మలో బాప్తీస్మము (ముంచబడుట) పొందుట అనగా పరిశుద్ధాత్మతో నింపబడుట. యోహాను 7:31లో ప్రభువైనయేసు చెప్పిన రీతిగా ఎవరైతే దప్పిక కలిగియుంటారో, వారే పరిశుద్ధాత్మతో నింపబడి సంతృప్తిపరచబడెదరు. నీ హృదయములో ప్రతి విషయమును ప్రభువుకు సమర్పించుకొని మరియు ఆత్మతో నింపబడుటకు విశ్వాసముతో ప్రార్థించవలెను. పరిశుద్ధాత్మయొక్క అగ్ని ఏ మానవునినుండి రాదుగాని పరలోకములో నుండి మనలోనికి వచ్చును. పరలోకపు అగ్ని పొందుటకు నీవు ఏ కూటమునకు వెళ్ళనవసరము లేదు. యథార్థహృదయము కలిగియున్నవారు ఎక్కడ ఉన్నప్పటికి దేవుడు వారిని సంతృప్తి పరచును. నీ గదిలో కూర్చుని నీవు ప్రభువుకు ప్రార్థించవచ్చును మరియు ప్రభువు అక్కడనే నిన్ను కలుసుకొనును. గొప్పదైవజనులు కొందరు వారి గదిలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొంది నింపబడిరి. ఆసక్తితో వెదికే వారికి మన దేవుడు ఫలమిచ్చును.
పెంతెకొస్తు రోజున యోవేలు చెప్పిన వాగ్ధానము, ''నా దాసుల అందరిమీదను నా ఆత్మను కుమ్మరించెదను'' (అపొ.కా. 2:18). దాసుడు అనగా హక్కులు లేనివాడు. దాసుడుగా ఉండుట అనగా నీ జీవితముమీద సర్వాధికారము దేవుడికిచ్చుట అనగా ఇప్పటినుండి నీవు ఫిర్యాదు చేయకుండా దేవుడు తన ఇష్టప్రకారము నిన్ను నిర్వహించుటకు నీవు అంగీకరించాలి.
మనము నీటిని త్రాగినట్లే పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రభువైన యేసు చెప్పారు (యోహాను 7:37 - 39). 1 కొరింథీ 10:4, 12:3లో పౌలు కూడా ఇదే పదకము ఉపయోగించాడు. మన యొక్క నోరుతెరిచి నీటిని త్రాగినట్లే మనము పరిశుద్ధాత్మతో నింపబడునట్లు మన హృదయములను సామాన్యమైన విశ్వాసముతో తెరువవలెను. దేవుని చిత్తానుసారముగా నీవు దేనిని అడిగినప్పటికిని, నీవు అడిగినవాటినన్నిటినీ పొందియున్నావని నమ్మవలెను (మార్కు 11:24). కాబట్టి నీ జీవితములో ప్రతీవిషయమును ప్రభువుకు సమర్పించుకొని విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడాలని అడుగవలెను. తరువాత నీ ప్రార్థన వినినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను. మన హృదయములో ఉన్నటువంటి కృతజ్ఞతలు మన నోటి ద్వారా ప్రవహించుట ద్వారా వ్యక్తపరచగలము (మత్తయి 12:34). కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచూ మరియు ఆయన పరిశుద్ధాత్మతో నింపియున్నాడనే నిశ్చయతను దయచేయమని అడుగవలెను.
ఆత్మవరములు:
ఆత్మతో నింపబడుట ఉద్రేకపూరితమైనది కాదు కాని అనేకులు దానితోనే తృప్తిపడుట బాధాకరము. జయజీవితము జీవించుటకు కావలసిన శక్తియు మరియు క్రీస్తుకు సాక్షిగా ఉండుటకు ధైర్యమును మనకు అవసరము. ఎల్లప్పుడూ వీటిని వెదుకుము. ప్రభువైన యేసు ఇట్లన్నారు, ''అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను'' (అపొ.కా. 1:8).మనము పరిశుద్ధాత్మతో నింపబడియున్నామనుటకు, శక్తిని పొందుటయే ఋజువని ప్రభువైన యేసు చెప్పారు. పరిశుద్ధాత్మతో నింపబడుట ఉద్దేశమేమనగా ప్రభువైన యేసు గూర్చి సాక్షము చెప్పుటయే కాదుగాని ఆయన సాక్షులుగా జీవించి మరియు మాట్లాడవలెను.
కాబట్టి 1 కొరింథీ 14:1 మరియు 39 లో ఆజ్ఞాపించిన రీతిగా ప్రవచనవరము కొరకు ప్రభువు దగ్గర వెతుకుము. అప్పుడు నీ బోధ వినువారు వ్యక్తిగతముగా మరియు వారు సంఘముగా నిర్మించబడుటకు, వారి యొక్క ఆత్మీయ అవసరములు తీర్చబడుటకు నీవు ప్రవచించగలవు. వ్యక్తిగతముగాగాని బహిరంగముగాగాని మనము ప్రజలయొద్ద ప్రవచించుచుండగా వారు ప్రోత్సహించబడి, ఆదరించబడి మరియు నిర్మించబడాలి (1 కొరింథీ 14:3). ఇది అన్నిటికంటే ఎక్కువగా కోరవలసిన ఆత్మవరము. దేవుడు మనలను ధైర్యముగా ఉండవలెనని కోరుచున్నాడు, కాబట్టి పిరికితనముగలఆత్మ దేవుని యొద్దనుండి రాదు గనుక దానిని వెళ్ళగొట్టాలి (2 తిమోతి 1:7).
లూకా 11:5 - 13లో తన అతిథియొక్క ఆహారము కొరకు మధ్యరాత్రిలో తన పొరుగువాని ఇంటికి వెళ్ళి ఆహారముకొరకు అడిగినరీతిగా మనము కూడా ఆత్మవరములు కొరకు ప్రార్థించాలని ప్రభువు చెప్పారు (లూకా 11:13). తనకు తెలిసిన వారు మరియు కలుసుకొనువారి యొక్క ఆత్మీయ అవసరము తీర్చుటకు ఆసక్తి కలిగినవారికే దేవుడు ప్రవచనవరము ఇచ్చును.
మనము ఒక్కసారే పొందుకొనము గనుక మనము మరల మరల ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడవలెను. దీనికొరకు దప్పిక మరియు విశ్వాసము అనే రెండు షరతులు ఉన్నాయి. నీ యొక్క జన్మహక్కుగా ప్రభువైన యేసునామములో యోహాను 7:37-39ని స్వతంత్రించుకొనుము. దేవుని ప్రార్థించినప్పుడు ఆయన వాగ్ధానమును స్వతంత్రించుకొనుట మంచిది. ఆ విధముగా నీవు ధైర్యము పొంది దేవుని యొద్దకు బల్ల క్రిందపడే రొట్టెముక్కల కొరకు బిక్షగాడిలా గాక ఆయన కుమారునిగా ఆశతో వచ్చియున్నావని ఋజువు పరుచును.
అన్యభాషలలో మాట్లాడుట:
పరిశుద్ధాత్మతో నింపబడుటలో అన్యభాషలలో మాట్లాడేవరము కూడా ఉన్నది. గనుక దాని గురించి ఒక మాట చెప్పెదను. ఈ వరము అందరికి అవసరములేదని దేవుడు చూచెను. గనుక ఈ వరమును ప్రతీ ఒక్కరికి ఇవ్వరు. అందరూ అన్యభాషలలో మాట్లాడరని 1 కొరింథీ 12:30లో స్పష్టముగా చెప్పబడింది. కాబట్టి దేవునియొద్ద నీ హృదయమును తెరుచుకొని ఆ వరమును నీకు ఇచ్చు విషయమును ఆయనకే విడిచిపెట్టుము.
మొదటిగా కోపము, అబద్ధములు చెప్పుట మొదలగు వాటిని జయించుటకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించుము. అన్యభాషలలో మాట్లాడే వరము కంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైన వరము. మాటలవిషయములో తప్పిపోని వాడు పరిపూర్ణులు అని యాకోబు 3:2 చెప్పుచున్నది. కాని అన్యభాషలలో మాట్లాడుట ఎవ్వరినీ పరిపూర్ణునిగా చేయదు.
అన్యభాషలలో మాట్లాడుట యొక్క ఉద్దేశమేమిటి? మనము దేవుని స్తుతించునప్పుడు, ఇంగ్లీషు భాషలో దానికి సరిపోయిన పదములు లేవు. మన హృదయము నింపబడియున్నది గనుక ఇంగ్లీషు భాష అనే సన్నటి పైపు ద్వారా మన నోటితో దానిని స్తుతించలేము. గనుక మన మనస్సును దాటిపోయి మన హృదయములో ఉన్నదంతయు సూటిగా నోటిద్వారా బయలుపరచబడును. అప్పుడు మన హృదయములో ఉన్నదంతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట లేక మనలో ఒత్తిడిద్వారా కృంగిపోవుట, అంతటిని మనకు తెలియని భాషలో దేవునితో మాట్లాడెదము. ఎందుకనగా దేవుడు మన హృదయములో ఉన్నదానిని వినును. ఆ విధముగా మాట్లాడుటద్వారా మన హృదయములో ఉన్న ఒత్తిడినుండి విడుదల పొందెదము. మనము అన్యభాషలో మాట్లాడునప్పుడు, దానిని మన మనస్సు గ్రహించదని 1 కొరింథీ 14:14లో చెప్పబడింది. కాబట్టి మనము అన్యభాషలలో మాట్లాడినప్పుడు మన మాటలను వివరించుటకు ప్రయత్నించకూడదు.
లెక్కలలో కూడిక కంటె కలన గణితం ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే సంశయము కంటే విశ్వాసము అంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము జీవించుచున్న లోకములో మనస్సు గురించి మరియు ప్రతి దానికి కారణము కూడా ఎక్కువ చెప్పబడుచున్నది. కాని దేవుడు మనలో పెట్టిన ఆత్మ మనస్సు కంటే ఎంతో ప్రాముఖ్యమైనది. అందువలన ఆత్మయొక్క భాషను మనస్సు గ్రహించదు. మనకున్న తెలివితేటలు దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరము. దానిని మనము నాశనము చేయనవసరము లేదు. పౌలు తన యొక్క పరిచర్యలో అందరికంటే ఎక్కువ ఒత్తిడిలో వెళ్ళియున్నాడు గనుక అందరికంటే ఎక్కువగా తాను భాషలలో మాట్లాడియున్నాడని చెప్పుచున్నాడు (1 కొరింథీ 14:18).
మనము నిరాశలో ఉన్నప్పుడు మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనము ప్రార్థించలేనప్పుడు లేక మనము పూర్తిగా అలసిపోయి విశ్రాంతి పొందవలెనని కోరినప్పుడు భాషలలో మాట్లాడేవరము సహాయపడును. మనము పడుకొని భాషలతో ప్రార్థించవచ్చు. అన్యభాషల వరముతో నీ పరలోక తండ్రియెదుట నీ హృదయమును కుమ్మరించి నీకు అర్థము కాని మాటలతో నీ హృదయాంతరంగాలలో ఉన్న భావనలు దేవునికి చెప్పవచ్చును.
గత డిసెంబరులో శిష్యత్వమును గూర్చిన కూటములకు రాలేని ఒక యౌవనస్థుని నుండి ఒక ప్రోత్సాహకరమైన ఉత్తరము వచ్చింది. అతడు ఆ కూటములకు రాలేదు కాని ఆ కూటములలో ఉన్న ప్రసంగములను ఒక టేపు ద్వారా వినవలెనని కోరియున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడుట గురించి ఆ కూటములలో చెప్పబడిన సందేశము అతడు టేపు ద్వారా విని మరియు పరిశుద్ధాత్మ గురించి ఎంతో దప్పిక కలిగియున్నాడు. ''నీవు నన్ను ఆశీర్వదించు వరకు, నేను నిన్ను విడువను'' (ఆదికాండము 32:26) అని యాకోబు దేవునితో ప్రార్థించినట్లు అతడు ప్రార్థించవలెనని నిర్ణయించుకున్నాడు. అతడు తన గదిలోనికి వెళ్ళి ప్రార్థించాడు. కాని అతని ప్రార్థనలో భారముగాని ఆసక్తిగాని లేదు కాని అతడు తనను తాను పరిశోధించుకొనినప్పుడు అతడు ప్రభువుకు సమర్పించుకొనని ఒక విషయమును జీవితములో కలిగియున్నాడు. అది పాపము కాదు. అయినప్పటికి అతని జీవితములోని ప్రభువు స్థానము అది ఆక్రమించియున్నది. ఆ విషయమును అతడు ప్రభువుకు సమర్పించుకొన్న వెంటనే దేవుడు తన పరిశుద్ధాత్మను అతనిపై కుమ్మరించాడు. మరియు అతడు అన్యభాషలలో మాట్లాడుట ఆరంభించి సంతోషముతో కన్నీరు కార్చియున్నాడు.
కూటములకు రాలేని వ్యక్తిని కూడా దేవుడు ఏ విధముగా కలుసుకుంటాడో చూచినప్పుడు ఎంతో ప్రోత్సాహకరముగా ఉన్నది. సంఖ్యాకాండము 11:25 - 29 నాకు గుర్తుకు వచ్చుచున్నది. ''యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్డదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు. ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచి యుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవవాని పేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చి - ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ - మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే - నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను'' (సంఖ్యాకాండము 11:25 - 29).
మోషే కాలములో పనిచేసిన విధముగానే దేవుడు ఈనాడు కూడా పనిచేయుచున్నాడు. దేవునిలో పక్షపాతము లేదు. దీనత్వముతో ఆయనను శ్రద్ధగా వెదికే వారికి ఆయన ప్రతిఫలము ఇచ్చును. వారికున్న గర్వమును బట్టి తెలివితేటలు కలిగియున్నవారు విడిచిపెట్టబడుదురు (అంతేకాని వారి తెలివితేటలను బట్టికాదు).
అపొ. కా. 2:4లో శిష్యులు పెంతెకొస్తు రోజున అన్యభాషలలో మాట్లాడుట గమనించవలసియున్నది. ఈ వచనమును జాగ్రత్తగా చదవండి. శిష్యులు అన్యభాషలు మాట్లాడినప్పుడు, వారి నోరు తెరచి వారి నాలుకలు ద్వారా వారే మాట్లాడిరి. పరిశుద్ధాత్ముడు వారి నాలుకలను కదల్చలేదు. ఆయన ఎవరి నాలుకనైనను కదల్చడు. ప్రజల యొక్క నాలుకలు కదల్చబడునట్లు అపవిత్రాత్మలు మనుష్యులను పట్టును. నేను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు, దురాత్మలు మనుష్యుల ద్వారా మాట్లాడుట వినియున్నాను. ఒక దురాత్మ వారి నాలుకను కదిలించియున్నది గనుక వారి నాలుక వారి ఆధీనములో ఉండదు. కాని పరిశుద్ధాత్ముడు ఆ విధముగా పనిచేయడు. ఆయన మనకు వరమును మాత్రమే ఇచ్చును. మనకు ఆయన ప్రవచించు వరమును మనకు ఇచ్చినప్పుడు మనము బోధించినట్లే, అన్య భాషలలో కూడా మాట్లాడవలెనని ఆయన కోరుచున్నాడు. ''నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపుదును'' (కీర్తన 81:10).
నీవు భాషల వరమును పొందినప్పుడు, వ్యక్తిగతముగా ప్రార్థించినప్పుడు నీవు ప్రార్థించుటకు ఏమి లేనప్పుడు ఈ వరమును ఉపయోగించుము. వ్యక్తిగతముగా మనము దేవునితో సహవాసము చేయుటకే గాని ప్రాముఖ్యముగా సమాజములో ఉపయోగించుటకు కాదు. భాషకు అర్థము చెప్పువాడు ఉన్నప్పుడు మాత్రమే సంఘకూటములలో దానిని వినియోగించాలి (1 కొరింథీ 14:28). అర్థము చెప్పువారు ఉన్నారో లేదో మనకు తెలియదు గనుక పౌలువలె ఈ వరమును వ్యక్తిగతముగా వినియోగించుట మంచిది (1 కొరింథీ 18, 19). కాని ఇంతకు ముందు నేను చెప్పిన రీతిగా, నీవు మాట్లాడే మాటలలో పవిత్రతను కోరుకొనుము.
ఈ పరిశుద్ధాత్మ వరమును నమ్మని క్రైస్తవులతో దీనిని గురించి మాట్లాడవద్దు. ఎందుకనగా అనవసరమైన వాదనలు కలుగును. కొంత మంది క్రైస్తవులు ఈ ఆత్మ వరమును తృణీకరించెదరు కాబట్టి నీవు అటువంటి విశ్వాసులతో సహవాసము చేసినయెడల నీవు కూడా ఈ వరమును చులకనగా చూడగలవు. నీ చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ ఆలోచన విధానములోనికి నీవు వెళ్ళుటకు అనుమతించవద్దు. దేవుని వాక్యములోని హితబోధకు కట్టుబడియుండుము.
ప్రభువైన యేసు పరిమితులులేని మనస్సు కలిగి మరియు సంపూర్ణముగా పవిత్రుడై మరియు ఎల్లప్పుడు తన తండ్రితో పరిపూర్ణమైన సహవాసమును కలిగియున్నాడు. గనుక ఆయనకు భాషలలో మాట్లాడే అవసరము లేదు అందువలన మనము పరలోకము వెళ్ళిన తరువాత సంపూర్ణులమై యుండి మరియు చిన్న పిల్లల సంగతులను విడిచిపెట్టి మరియు ప్రభువును ముఖాముఖిగా చూచెదము గనుక పరలోకములో అన్యభాషలతో మాట్లాడుట ఉండదు (1 కొరింథీ 13:8 - 12). ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిపూర్ణులము కాదు గనుక తాత్కాలికముగా వాడుకొనుటకు ఈ వరము ఇవ్వబడింది కాని సంఘకూటములలో ప్రవచించుట, అన్యభాషలలో మాట్లాడుట కంటే 2000 రెట్లు శ్రేష్ఠమైయున్నది (1 కొరింథీ 14:19) ఎందుకనగా దేవుని వాక్యమును ప్రవచించినప్పుడు ఇతరులు ప్రోత్సహించబడి మరియు ఇతరులతో నిర్మించబడెదరు. (1 కొరింథీ 14:3).
సంఘకూటములలో ఎవరైననూ అన్యభాషలలో మాట్లాడిన యెడల వెర్రివారిగా పిలవబడెదరని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు (1 కొరింథీ 14:23). కాబట్టి అటువంటి సంఘములను విడిచిపెట్టుడి. కాని భాషలతో మాట్లాడుటను ఆటంక పరచకుడి అని కూడా ఆయన చెప్పుచున్నాడు (1 కొరింథీ 14:39). ఇది సరియైన సమతుల్యత.
పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుట యొక్క ఉద్దేశ్యము:
1975 జనవరిలో నేను తాజాగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మత్తయి 1వ అధ్యాయము నుండి మరల చదవాడానికి నిర్ణయించుకొంటిని. ఆ మొదటి దినమున, పరిశుద్ధాత్మతో నింపబడియున్నాననే నిశ్చయత కలిగింది. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అవుట గురించి చదివాను. పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చియున్నట్లే ఆమె మీదకు కూడా వచ్చియున్నాడు. ఆ రోజన మత్తయి 1:18 - 23 నుండి ఈ సత్యములు నేర్చుకొన్నాను:
పరిశుద్ధాత్ముడు తనలో చేసిన కార్యము మరియకు తప్ప ఎవరికీ తెలియనట్లే నా విషయములో కూడా జరిగింది.
అనేక నెలల వరకు, మరియకుగాని ఇతరులకుగాని ఆమె గర్భవతి అయినట్లు బాహ్యంగా ఋజువులేదు. అదే విధముగా చాలా కాలము గడిచే వరకు పరిశుద్ధాత్ముడు నాలో చేసిన దానికి కూడా బాహ్యమైన ఋజువు లేదు. నేను విశ్వాసముతో జీవించవలసియున్నది. కాని కాలము గడిచే కొలది మరియ మరియు ఇతరులు దానిని చూడగలిగిరి. మరియు కాలము గడచుచున్న కొలది దేవుడు చేసినదానిని నేను మరియు ఇతరులు అంతకంతకు చూడగలిగారు.
మరియను ఇతరులు అపార్థము చేసుకొని మరియు ఆమె గురించి చెడుగా మాట్లాడారు. నేను కూడా దీనిని ఎదుర్కొనెదను.
యేసు యొక్క శరీరము ఆమెలో ఏర్పడునట్లు పరిశుద్ధాత్మ మరియ మీదకు వచ్చియున్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు నా మీదకు వచ్చినప్పుడు, మొదటిగా క్రీస్తు యొక్క జీవము నా ద్వారా వ్యక్తపరచబడుటకును మరియు రెండవదిగా నా పరిచర్యల ద్వారా క్రీస్తు శరీరముగా నేనును మరియు ఇతరులు నిర్మించబడెదము.
పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మీయ పోరాటము మొదలగును. మన ఆత్మలో పోరాటము ఉండునట్లు దేవుడు అనుమతించుట ద్వారా మనము సాతానును మరియు దురాత్మలను దేవుని యొక్క సర్వశక్తి ద్వారా వాటిని జయించెదము. ప్రభువైన యేసు లూకా 10:19లో ఈ విధముగా చెప్పారు, ''ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు''. గలిలయ సముద్రము గుండా శిష్యులతో కలసి ప్రభువైన యేసు వెళ్లుచుండినప్పుడు, దేవుడు తుఫానును అనుమతించెను. ఆ తుఫానును దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన నిమ్మళపరచెను.
మనము కొద్దికాలమే జీవించెదము గనుక నీవు జయించువాడవు అగుటకు నీ జీవితములో కలిగే ప్రతీ శోధనను సంపూర్ణముగా ఉపయోగించుకొని మరియు జ్ఞానము గల హృదయమును సంపాదించుకొని జీవితాంతము దేవుని యెదుట యోగ్యుడుగా నిలబడునట్లు ప్రయత్నించాలి (కీర్తన 90:12). నీవు కొన్ని పాపములు జయించకుండా ఉండి ఈ లోకమును విడిచిపెట్టకూడదు. హృదయపూర్వకముగా ఉండుట అనగా దేవునియెదుట ఎటువంటి మచ్చ డాగు లేకుండా ఉండవలెనని తీవ్రముగా కోరుట (హెబీ 9:14).
శోధనకు మరియు పాపమునకు మధ్య తేడా ఉన్నది. నీకు ఒక చెడ్డ తలంపు కలుగుట ద్వారా శోధన వచ్చును. నీవు ఆ చెడ్డ తలంపులనే ఆలోచించి లేక దానిని అంగీకరించిన యెడల అవి పాపమగును. నీవు ఒక అమ్మాయిని చూచినప్పుడు, మోహపు తలంపు కలిగిన యెడల అది శోధన. నీవు ఆమెనే చూచుచు ఉండినయెడల లేక ఆమెను గురించి ఆలోచించుచున్న యెడల నీవు పాపము చేసెదవు. ఆమెను మొదటగా చూచుట ద్వారా శోధన కలుగును మరియు దానిని నివారించలేము కాని రెండవసారి చూచిన యెడల పాపమగును. మరియు నీవు దానిని నివారించవచ్చును. నీ మనస్సులో ఒక శోధన కలిగినప్పుడు నీవు నిందారోపణకు గురికావలసిన అవసరము లేదు. ప్రభువైన యేసు కూడా తన మనస్సులో శోధింపబడియున్నాడు. నీవు నీ చిత్తమును ఉపయోగించి దానికి ''కాదు'' అని చెప్పవచ్చు. అప్పుడు నీవు జయించువాడవగుదువు. కాదు అని చెప్పుటకు కావలసిన శక్తిని పొందుటకే ప్రభువైన యేసు కన్నీటితో ప్రార్థించెను (హెబీ 5:7). సహాయము కొరకు నీవు కూడా ఆ విధముగా కన్నీటితో ప్రార్థించాలి.
సాతాను ఓడించబడియున్నాడు:
2000సంవత్సరాల క్రితము సిలువమీద ప్రభువైన యేసుచేత సాతాను ఓడించబడియున్నాడు. ఈ సత్యమును నీవు ఎన్నటెన్నటికిని మరచిపోకూడదు. ఈనాడు మనము జయించుటకు పోరాడము ఎందుకనగా మనము జయము మీద నిలిచియున్నాము. మనుష్యుల కంటే సాతాను ఎంతో శక్తిమంతుడును మరియు ఎంతో తెలివిగలవాడైయున్నాడు. అనేక శతాబ్దములనుండి అతడు అనేక కోట్లమందిని మోసగించి మరియు జయించాడు కాని నీవు ప్రభువైన గొఱ్ఱెపిల్ల రక్తములో నీ హృదయము కడగబడి, నీవు మంచి మనస్సాక్షిని కలిగియుండి మరియు ప్రభువైన యేసు నామములో అతనితో మాట్లాడి ఎదిరించినయెడల అతడు నీ యొద్ద నుండి పారిపోవును (పక్రటన 12:11, యాకోబు 4:7). దీనిని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను దీనిని విశ్వసించి, అభ్యసించి బోధించుచున్నాను. ఈ విషయమును వినుటకు సాతాను ఇష్టపడడు.
యుగయుగముల వరకును సాతాను మరియు అతని దూతలు కలువరి సిలువ మీద సంపూర్ణముగా ఓడించబడియున్నారనే సత్యము నీలో లోతుగా వేరుపారి స్థిరపరచబడాలి (హెబీ 2:14, 15, కొలొస్స 2:15). అప్పుడు ఏ సమయములోనైనను సాతాను నిన్ను భయపెట్టలేడు. సాతానుకు వ్యతిరేకముగా దేవుడు ఎల్లప్పుడు మన పక్షముగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ''లోకములో ప్రభువైన యేసు వలె మనము కూడా ఉన్నాము'' (1 యోహాను 4:17).
సాతానును ఎదిరించే విషయములో నాలో విశ్వాసము కలిగించి కలలు ద్వారా ప్రభువు నన్ను ప్రోత్సహించియున్నాడు. అపవాది నా యొద్దనుండి పారిపోవుచున్నట్లు నేను కలలు కనియున్నాను. నేను రాత్రి సమయములో నిద్రలేచినప్పుడు ప్రభువైన యేసునామములో సాతానును ఎదిరించెదను.
సాతానుతోను మరియు దురాత్మలతోను ఇటువంటి పోరాటముద్వారా ఏది దైవసంబంధమైనదో లేక ఏది మోసపూరితమైనదో తెలుసుకొనవలెను. దైవికసత్యము ఎల్లప్పుడూ యథార్థమైన ఆత్మ, దీనత్వము, పవిత్రత మరియు ప్రేమ అను క్రీస్తు యొక్క ఆత్మ లక్షణములు కలిగియుండును. శక్తి ద్వారా బయలు పరచబడినవన్నియు దేవునినుండే కలిగినవని నమ్మి అనేకులు మోసపోవుచున్నారు కాని అటువంటి ప్రత్యక్షతలు అనేకములు సాతాను నుండి వచ్చును.
పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఎల్లప్పుడు విధేయత చూపించుటకు మెలకువగా ఉండుము. ఉదాహరణకు ఒక సమయములో త్వరగా ప్రార్థించమనియు లేక లేఖనము చదవమనియు లేక ఒకరి కొరకు ప్రార్థించుము, ఒకరిని దర్శించుమనియు, ఒకరితో మాట్లాడమనియు, ఒకరిని క్షమించమనియు, చెడ్డదానినుండి నీ కళ్లు త్రిప్పివేసుకోమనియు, చెడు సంభాషణ వినవద్దు అనియు, నీ స్నేహితులు వ్యర్థమైన వాటిని మాట్లాడినప్పుడు అక్కడ నుండి వెళ్ళిపొమ్మనియు లేక ఆ సంభాషణ మధ్యలో నీవు వేరొక విధముగా మాట్లాడవలెననియు మొదలగు రీతులుగా ఆత్మ మనలను ప్రేరేపించును. అటువంటి ఆత్మల యొక్క ప్రేరేపణలకు విధేయత చూపుట ద్వారా, నీవు ఆత్మలో జీవించుట నేర్చుకొనెదవు.
వివేచన యొక్క ప్రాముఖ్యత:
మనము యుగాంతమునకు వచ్చుచున్నాము గనుక సంఘములో పరిశుద్ధాత్ముడు అంతకంతకు ఎక్కువ పని చేయును. లోకములోని భ్రమపరిచే ఆత్మలు కూడా ఎక్కువగా పనిచేయును. నీవు మోసగించబడకూడదని కోరినచో ఈ క్రింది వాటిని చూడుము.
1. మోసపూరితమైన ఉద్రేకముతో కూడిన అనుభవము.
2. సమతుల్యత లేకుండా ఒక విషయమును నొక్కి చెప్పుట (తీవ్రవాదము)
3. పరిసయ్యతత్వము
4. మతచాంధస్తులు
పరిశుద్ధాత్మ పనిచేయుచోటనెల్లను శత్రువు కూడా పనిచేయును. కాబట్టి నీవు చూచుదానినంతటిని వినుదానినంతటిని అంగీకరించవద్దు. వివేచన కలిగియుండుము.
పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరించునప్పుడు, ఉద్రేకములు మరియు గొప్ప శబ్దముతో మాట్లాడుట ఉండవచ్చును. అయితే ప్రజలలో ఉన్న భయమునుండి విడుదల పొందుటకు అది సహాయపడదు. ఉద్రేకములను మనకు దేవుడు అనుగ్రహించియున్నాడు గనుక వాటిని మనము తక్కువ చేయము కాని అదే సమయములో వాటికి మనము ఎక్కువ విలువ ఇవ్వకూడదు. ఎందుకనగా దేవుడు మన హృదయములను చూచునుగాని ఉద్రేకములను కాదు. నీవు గొప్ప శబ్దముతో స్వరమెత్తి ప్రార్థించుట మంచిది ఎందుకనగా నీ ప్రక్కనున్న వారి గురించి నీవు మరిచిపోయెదవు. అది నీవు ప్రార్థించినప్పుడు నీవు పూర్తిగా మనసును కేంద్రీకరించుటకు మరియు ఇతరులనుండి అభ్యంతరపడకుండునట్లు కళ్ళుమూసుకొని ప్రార్థించినట్లుగా ఉండును. అటువంటి క్రియలు నిన్ను మరి ఎక్కువగా ఆత్మీయుడుగా చేయలేకపోవచ్చును గాని నీ చుట్టూ ఉన్న పరిస్థితులనుండి నీవు విమోచించబడెదవు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనము కేకలు వేయుట ద్వారా ప్రత్యక్షపరచబడదు గాని పరిశుద్ధ జీవితము ద్వారాను సంఘములో శక్తివంతమైన పరిచర్య చేయుట ద్వారాను మరియు మనము ఉద్యోగము చేసే ప్రాంతములో ప్రభువు కొరకు సిగ్గుపడకుండా సాక్షులుగా ఉండుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని ప్రత్యక్షపరచెదము.
మానవ ప్రాణములో ఎంతో శక్తి ఉన్నది (తెలివితేటలు ద్వారాను, ఉద్రేకములద్వారాను, చిత్తము ద్వారాను శక్తి గలిగి యుండెదము). అనేకులు వీటిని ఉపయోగించుట ద్వారా (యోగా వలె) పరిశుద్ధాత్మ శక్తిని పొందెదమని ఊహించుకొందురు. ఇటువంటి శక్తిని బట్టి నీవు మోసపోవద్దు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు క్రీస్తును మాత్రమే మహిమపరచును గాని మనుష్యులను గాని లేక ప్రత్యక్షతలనుగాని మహిమపరచడు కాబట్టి ఆ విధముగా నీవు ఈ మోసమును కనిపెట్టగలవు.
క్రమశిక్షణ:
''దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదుగాని శక్తియు, ప్రేమయు మరియు ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే అనుగ్రహించెను'' (2 తిమోతి 1:7). పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న భయమంతటిని మరియు పిరికితనమంతటిని తీసివేసి మరియు దాని స్థానములో శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును ఉంచును.
క్రమశిక్షణ (ఇంద్రియ నిగ్రహము) లేకుండా ఎవరునూ నిజముగా ఆత్మీయులు కాలేరు. ఆశానిగ్రహము అనునది ఆత్మయొక్క ఫలము (గలతీ 5:23). క్రమశిక్షణలేని జీవితము, కారిపోయే పాత్రవలె ఉండును. ఆ పాత్ర ఎన్నిసార్లు నింపబడినను, మరల ఖాళీ అగుచుండును. మరల మరల నింపుచూ ఉండవలెను. మూడు విషయములలో మనము ప్రత్యేకముగా క్రమశిక్షణ కలిగియుండాలి. 1. నీ శరీరము 2. నీ సమయము మరియు 3. నీ ధనము.
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన శారీరక క్రియలను చంపవలెనని రోమా 8:13లో చెప్పబడింది. ఇది హృదయపూర్వకముగా కావాలని చేసిన పాపములు కాదు. ఉదాహరణకు అతిగా తినే విషయములో లేక ఎక్కువగా నిద్రించే విషయములోగాని సోమరితనముతో గాని లేక ఎక్కువగా మాట్లాడుట మొదలగు విషయములను మనము అదుపులో పెట్టకుండా ఉండుట ద్వారా చేసే కార్యములు. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకముగా మన నాలుకను (మాటలను) అదుపులో పెట్టవలెనని కోరుచున్నాడు.
మన సమయమును ఎంతో సద్వినియోగము చేసుకొనవలెనని ఎఫెసీ 5:16లో చెప్పబడింది. నిన్ను నీవు క్రమశిక్షణలో పెట్టుకున్నట్లయితే సమయమును వృథాచేయక లేఖనములు ధ్యానించుటకు ఆ సమయమును ఉపయోగించెదవు. అనగా మీరు విశ్రాంతి తీసుకోకూడదని లేక ఆటలు ఆడకూడదని గాని మొదలగు వాటిని నేను చెప్పుటలేదు. నీవు సన్యాసివికాకూడదు ఎందుకనగా అది నిన్ను బంధకములోనికి నడిపించును. ఏదియు పోగొట్టుకొనకుండా శిష్యులు రొట్టెలను 12 గంపలలోనికి ఎత్తిన రీతిగా మనము కూడా అప్పుడప్పుడు కొంత సమయమును సంపాదించుకొనవలెను (యోహాను 6:12). సాధ్యమైనంత వరకు మీ సమయము సద్వినియోగము చేసుకొనుటకు ప్రయత్నించుము కాని ఆ విషయములో మూర్ఖుడవై ఉండవద్దు. విశ్రాంతిలో ఉండుము.
లూకా 16:11లో ధనము విషయములో నమ్మకముగా లేనివారికి నిజమైన ఆత్మీయ ఐశ్వర్యమును దేవుడు ఇవ్వడని ప్రభువైన యేసు చెప్పారు. మోసము చేయకుండా అప్పులన్నియు తీర్చుచు, ధనము విషయములో నీతిగా ఉండుట మొదటి మెట్టు. వృథా ఖర్చు చేయకుండా, ఎక్కువ సౌఖ్యములను కోరక మరియు ధనమును అనవసరముగా ఖర్చుపెట్టకుండా, ధనము విషయములో నమ్మకముగా ఉండుట రెండవ మెట్టు. ఎవరైతే వారి జీవితములలో పరిశుద్ధాత్మ యొక్క క్రమశిక్షణను అనుమతిస్తారో అటువంటి క్రైస్తవులు దేవుని యొద్దనుండి అత్యంత శ్రేష్టమైన వాటిని పొందెదరని గుర్తుంచుకొనుము.
ప్రభువైన యేసుకు అంకితమగుట:
ప్రభువైనయేసుని నీ జీవితములో మహిమ పరచుటకు పరిశుద్ధాత్ముడు నీ హృదయములోనికి వచ్చియున్నాడు గాని కొన్ని అనుభూతులను ఇచ్చుటకు కాదు. కాబట్టి నీవు ప్రభువైన యేసు యొద్దకు అంతకంతకు ఆకర్షింపబడి మరియు ప్రభువైన యేసు యొక్క మహిమను అంతకంతకు చూచి అనుభవించేటట్లు చేయునట్లుగా పరిశుద్ధాత్మను నీలో అనుమతించుము. నీవు దేవుని యొక్క బిడ్డలందరిని ప్రేమించగలుగునట్లు, తన శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టిన యేసుయొక్క ప్రేమను నీ హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించును (రోమా 5:5).
నీవు ఎల్లప్పుడు ప్రభువైన యేసుయెడల సామాన్యమైన అంకితభావం కలిగియుండుము (2 కొరింథీ 11:3). క్రైస్తవ జీవితములో ఇది ఎంతో ప్రాముఖ్యమైయున్నది. నీవు అనేక రకములైన సిద్ధాంతములను మరియు అనేక రకములైన వివరములను వినుట ద్వారా ప్రభువు యెడల నీ కున్న మొదటి ప్రేమను కోల్పోకుము.
నీవు ప్రభువైన యేసుకి అంకితము చేసుకొనినయెడల, క్రీస్తు శరీరమైయున్న నీ స్థానిక సంఘములో సభ్యులకి కూడా అంకితము చేసుకొనెదవు. అనేకమంది దేవుని పిల్లలవలె పరిశుద్ధాత్ముడు సంకుచితముగా ఉండడు మరియు వారిలో కొందరివలే సిద్ధాంతముల బేధములను బట్టి ఇతరులను విభేదించడు. ఆయన హృదయమును చూచును గాని మనకున్న వేదాంతపరమైన జ్ఞానమును కాదు. కొందరు సిద్ధాంతములను సరిగా అర్థము చేసుకోనప్పటికిని, యథార్థ హృదయము కలిగియుండినయెడల దేవుడు వారిలో పనిచేయును. పేతురు కొర్నేలీ ఇంటికి వెళ్ళినప్పుడు దీనిని గురించి ఈ విధముగా చెప్పాడు, ''దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును'' (అపొ.కా. 10:34, 35). ప్రతి గుంపులో నిజమైన దేవుని బిడ్డలందరియెడల పరిశుద్ధాత్మవలే విశాలహృదయము ఎల్లప్పుడు కలిగియుండవలెను.
ఒంటరిగా ఉండుటలో ఉన్న అపాయము:
ఇతర విశ్వాసులతో కలవకుండా మరియు ఒంటరిగా ఉండుట గురించి జాగ్రత్తపడుము. నీ స్థానిక సంఘములో విశ్వాసులు ఎవరితో అయినను విభేదము పెట్టుకొనకూడదు. కొందరు విశ్వాసులు ఈనాడు ఈ విధముగా చేయుచున్నారు. శత్రువుల చేతిలోనుండి యెరూషలేము పట్టణము కాపాడుటకు నెహెమ్యా గోడలను నిర్మించియున్నాడు. అతడు నిజమైన ఇశ్రాయేలీయులందరిని ఆ పట్టణములోనికి వచ్చుటకు అనుమతించెను. సాతానును మరియు లోకమును మనము ఆ గోడలబయట ఉంచవలెను గాని మనతో అంగీకరించిన దేవుని బిడ్డలను కాదు. సిద్ధాంతములను బట్టి మనలను అంగీకరించని విశ్వాసులతో కలసి మనము పరిచర్య చేయలేకపోవచ్చును కాని మనము విశ్వాసులందరితోను సహవాసము కలిగియుండవలెను.
జెకర్యా 2:4, 5లో దేవుడు ఆ పట్టణము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును గనుక మీరు యెరూషలేము చుట్టూ గోడలు కట్టనవసరములేదని దేవుడు చెప్పుచున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మన సంఘమును కాపాడును. మన సంఘములో ఆ అగ్ని చేత దహించబడుటకు అనుమతించినయెడల లోకముయొక్క ప్రభావము నుండి పరిశుద్ధాత్మ మనలను కాపాడును. దేవుడే స్వయముగా మన చుట్టూ ఒక గోడగా ఉండినట్లయితే, అప్పుడు విశ్వాసులు పవిత్రులుగా ఉండునట్లు నియమ నిబంధనలు పెట్టుట బుద్ధిహీనతై యున్నది. మనుష్యులు పెట్టినటువంటి అటువంటి గోడలు ఒంటరిగా ఉండుటకును పరిసయ్యతత్వము కలిగియుండుటకును మరియు మతస్థులుగా ఉండుటకును నడిపించును (ఆ గోడలు పైకి ఆత్మీయముగా కనబడవచ్చును). అటువంటి వారిచేత నీవు ప్రభావము చేయబడకూడదు. శిష్యత్వము గురించి ప్రభువైన యేసు చెప్పిన రీతిగా ఇరుకు ద్వారము గురించి చెప్పవలెను కాని దాని కంటే ఎక్కువ ఇరుకుగా చేయకూడదు.
ఇతర విశ్వాసులు నిన్ను విరోధించినప్పటికి నీవు వారిని ప్రేమించి మరియు వారి యెడల విశాలహృదయము కలిగియుండవలెను. అడ్విన్ మత్నన్ వ్రాసిన పద్యము
''మత విరోధి'' ''తిరుగుబాటు దారుడు'' అని వెక్కిరించి
నన్ను బయటికి నెట్టివేసి, వారు ఒక వృత్తాన్ని గీశారు
కాని నేను కలిగియున్న ప్రేమ మరియు గెలుచుకోవాలనే తపన వలన
వారు లోపలికి వచ్చునట్లు మేము వృత్తమును గీశాము
ఆ విధముగా ప్రేమించుట ద్వారా మనము జయించాలి.
ప్రభువుచేత నీవు ఎక్కువగా క్షమించబడియున్నావని తెలుసుకొనినప్పుడు, నీవు కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమించెదవు (లూకా 7:47). ఇతర విశ్వాసులు నీ కంటే భిన్నమైన అభిప్రాయము కలిగియున్నప్పటికిని నీవు వారిని ప్రేమించెదవు.
మన యెదుట ప్రభువైన యేసు మాత్రమే ఉండవలెను
ప్రభువైన యేసు ఎల్లప్పుడూ తన తండ్రిని చూచుచుండెను. కావున ఆయన హృదయము ఎల్లప్పుడూ సంతోషించెను. ఆయన తండ్రి ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక ఆయన సంపూర్ణ సంతోషము పొందెను (అపొ.కా. 2:25,26 మరియు కీర్తన 16:10, 11). కాబట్టి అన్ని సమయములలో నీ యెదుట ప్రభువుని పెట్టుకొనుము. మరియు అప్పుడు ఆయనలోనుండి సంపూర్ణసంతోషము అనుభవించెదవు మరియు నీవు ఎల్లప్పుడూ కదల్చబడకుండునట్లు ఆయన నీ కుడి పార్శ్వమున ఉండును కాబట్టి నీకును ప్రభువునకు మధ్యలో ప్రజలనుగాని పరిస్థితులనుగాని రానియ్యకుడి.
శుద్ధహృదయము గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు (మత్తయి 5:5). మరియు వారు అన్ని పరిస్థితులలోను ప్రజలను గాని లేక పరిస్థితులను చూడక దేవునిని మాత్రమే చూచెదరు. నీవు క్రీస్తు యొక్క అందముచేత ఆకర్షించబడి పట్టబడినయెడల నీకు వచ్చే శోధనలు బలహీనమైపోవును. నీవు ప్రజలను మరియు పరిస్థితులను ప్రభువులో గుండా చూచినప్పుడు, ఆ పరిస్థితులన్నిటిని మరియు ఆ ప్రజలందరిని సమకూర్చి దేవుడు నీ మేలు కొరకే సమస్తమును జరిగించుచున్నాడన్న నిశ్చయతను కలిగి మరియు నీవు విశ్రాంతిలో ఉండెదవు (రోమా 8:28). భవిష్యత్తులో రాబోయే పెద్ద శ్రమలు నీవు ఎదుర్కొనునట్లు, నీ జీవితములో ప్రతీరోజు లుగుచున్న చిన్న శోధనలు, పరీక్షలన్నిటిలోను విశ్రాంతిలో ఉండుట నేర్చుకొనుము.
ఏ మనుష్యునిగాని, ఆ మనుష్యుడు వ్రాసిన పుస్తకముగాని ఎన్నటికి విగ్రహముగా చేసుకొనవద్దు. నిజమైన దైవజనులు మరియు నిజమైన ఆత్మీయ పుస్తకములు ఎల్లప్పుడూ జీవవాక్యమైయున్న యేసు యొద్దకును మరియు వ్రాయబడియున్న బైబిలు యొద్దకు నిన్ను నడిపించును. అటువంటి వారిని వెంబడించుము మరియు అటువంటి పుస్తకములను చదువుము.
దేవునియొక్క సార్వభౌమాధికారము:
సృష్టించుటలో కాదుగాని ప్రభువైన యేసు యొక్క మరణపునరుత్థానము ద్వారా సాతాను ఓడించబడినప్పుడు దేవుని యొక్క శక్తి అద్భుతంగా ప్రత్యక్షపరచబడింది (ఎఫెసీ 1:19,20). మానవ చరిత్రంతటిలో ప్రభువైన యేసుని సిలువవేయుట అత్యంత దారుణమైన పాపము. ఈ భూమి మీద జరిగిన అత్యంత శ్రేష్టమైనది కూడా ప్రభువును సిలువ వేయుటయే. చరిత్ర అంతటిలో జరిగిన అత్యంత చెడ్డవిషయమునే అత్యంత మేలు కరమైనదిగా చేయ శక్తిగలవాడు దేవుడే. కాబట్టి నీ జీవితములో జరిగే దానిఅంతటిని మహిమకరమైనదిగా మార్చగలడని నీవు నిశ్చయముగా నమ్మవచ్చును (రోమా 8:28).
దేవుడు ఎటువంటి ఆర్భాటముకాని లేక చూపించుకొనుటగాని లేకుండా రహస్యముగా పని చేయవలెనని కోరుచున్నాడు. దాని ఫలితముగా కొన్నిసార్లు నీ జీవితములో జరుగువాటిని బట్టి నీవు అదృష్టము అనుకొనవచ్చునుగాని నిజానికి నీవును నీ కొరకు ఇతరులు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు దానిని జరిగించియున్నాడు. ''నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరచుకొను దేవుడవై యున్నావు''. ఆయన ఆవిధంగా పనిచేయును (యెషయా 45:15). ఆయన మార్గములను గ్రహించుట ఎంతో కష్టము (రోమా 1:33 లివింగు).
నీవు చేయగలిగినదంతయు చేసి దానియొక్క ఫలితము దేవునికి విడిచిపెట్టుము. దేవుడే స్వయంగా నీ విషయములలో కలుగజేసుకొని దానిని మేలుగా చేయును. నీవు చేసిన పొరపాటులు మరియు ఓటములు కూడా ప్రభువు వాటిని ఆత్మీయలాభం పొందునట్లుగా మార్చును. ఈ లోకములో జరుగువాటన్నిటిని, పరిపాలించువాడైన ఇటువంటి దేవుని మనము ఆరాధించుచున్నాము. కాబట్టి నీవు చేసిన పొరపాట్లను బట్టి నీవు బాధపడకూడదు. ఆ విధముగా బాధపడుట ద్వారా సాతానును నీ సంతోషమును దొంగలించబడనీయకు. దేవుడు ఎంత శక్తిమంతుడైయున్నాడంటే మనము చేసిన పొరపాటును కూడా ఆయనకు మహిమకరముగాను మరియు మేలు కరముగాను చేయును. కేవలము గర్వమును బట్టియు ఒప్పుకొనని పాపమును బట్టి చింతించాలి. నిన్ను నిరాశపరచుటకు, నీవు గతములో చేసిన పాపములను సాతాను గుర్తు చేయును. నీ గత ఓటములను బట్టి ఎల్లప్పుడూ నిరాశపడుచున్నయెడల, నీవు మరల సాతాను ఆధిపత్యములోనికి వెళ్ళెదవు.
నీవు ఏదైన ఒక సంక్షోభములో ఉన్నప్పుడు పేతురువలె నీవు, దానివైపు కాకుండా యేసు వైపు చూడవలెను (మత్తయి 14:30). నీవు పనిచేసే దగ్గరగాని నీ చుట్టుప్రక్కలగాని సంక్షోభం ఉండవచ్చును. కాని నీవు ప్రభువైనయేసును మాత్రమే చూచిన యెడల (ప్రార్థించినయెడల) కలవరముగా ఉన్న సముద్రములో కూడా విజయవంతముగా నడువగలవు.
అపాయములనుండి కాపాడబడుట:
పరిశుద్ధాత్మశక్తి అభిషేకం పొందిన తరువాత ప్రభువైన యేసు క్రూరమైన తోడేళ్ళను (మార్కు 1:13) మరియు క్రూరమైన మనుష్యులను ఎదుర్కొనెను (లూకా 4:13 - 16, 28 - 30). దేవుని సమయము రాలేదు గనుక వారు ఎవరును ప్రభువైన యేసుని చంపలేకపోయిరి. యోహాను 7:30లో దీనిని చదివెదము. దేవుడు ప్రభువైన యేసుని ప్రేమించినట్లే మనలను ప్రేమించుచున్నాడు (యోహాను 17:23). గనుక ఆ అద్భుతమైన వచనము మన విషయములో కూడా నెరవేరింది.
అపాయములలోనుండి దేవుడు నిన్ను కాపాడటమే, ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ వహించి నిన్ను కాపాడుతున్నాడనుటకు ఋజువు. కొన్నిసార్లు మనము మరిచిపోయెదము. మనచుట్టూ కంచె వేయబడియున్నది (యోబు 1:10 - 12). కాబట్టి దేవుడు అనుమతిస్తేనే గాని సాతాను ఈ కంచెలగుండా మనయొద్దకు రాలేడు. లోకములో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు (1 యోహాను 4:4). నీ గత జీవితములో జరిగిన సంఘటనలు, నీవు మరణించకుండా కాపాడబడినప్పుడు నీవు సంపూర్ణముగా దేవుని కాపుదలలో ఉన్నావని గుర్తించగలవు. కాబట్టి అటువంటి సంఘటనలను గుర్తుపెట్టుకొనుట ద్వారా దేవునికి ఎంత ఋణపడియున్నావో గుర్తించగలము.
పౌలు మరణమును మరల, మరల ఎదుర్కొనెను (2 కొరింథీ 11:23 లివింగు). మరియు అతడు దేవుని యొక్క సర్వశక్తి ద్వారా మరల మరల విడిపించబడియున్నాడు. ఆ విధముగా అతడు గొప్ప అపొస్తలుడును అయ్యెను. 2 కొరింథీ 11:24 - 28లో మూడు సార్లు ఓడ పగలి రాత్రింబగళ్లు సముద్రములో గడపుట ద్వారాను, దొంగలవలనైన ఆపదలలోను మొదలగు శ్రమలను అతడు పొందినట్లుగా వివరించాడు. పౌలు పొందిన దానిలో మనము కొద్ది భాగమే పొందవలసియున్నది కాని రాబోయే దినములలో నీవు ఆయన పరిచర్య చేయు నిమిత్తము ఆ శ్రమలు ద్వారా దేవుడు నిన్ను సిద్ధపరచును.
నీవు ఎదుర్కొనే అనేక పరిస్థితులలో, నీవు దేవునిని విశ్వసించనట్లయితే అద్భుతములు జరుగవు. గలతీ 3:5 లివింగు బైబిలులో ఇట్లు చెప్పుచున్నది, ''మీరు ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటను బట్టి దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మరియు మీ మధ్యలో అద్భుతములు చేయునా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయుట ద్వారా దేవుడు చేయడు కాని నీవు నీ పూర్ణహృదయముతో క్రీస్తును విశ్వసించి నమ్మిన యెడల ఆయన చేయును''.
మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని యెషయా 54:7లో దేవుడు వాగ్ధానము చేసియున్నాడు దానిని నీవు స్వతంత్రించుకొనవచ్చును. అన్ని పరిస్థితులలోను దేవుడే నీ పక్షముగా ఉండి మరియు నిన్ను నీతిమంతుడుగా తీర్చును. నీ సొంత బలహీనతను నీవు గుర్తించినప్పుడు మాత్రమే నీవు బలవంతుడవు కాగలవు. ప్రభువైన యేసు బలహీనుడిగా ఉండుటకు ఇష్టపడియున్నాడు గనుక సిలువ వేయబడియున్నాడు (2 కొరింథీ 12:9, 13:4). మనము పాట పాడిన రీతిగా:
''ప్రభువా, నన్ను నీవు వశపరచుకొనుము అప్పుడు నేను స్వతంత్రుడనగుదును. నా కత్తిని వరలో పెట్టుకొనుటకు నన్ను బలవంతము చేయము మరియు నేను జయించెదను''
సమస్తమును బట్టి దేవునిని స్తుతించుము:
దేవునికి నీవు అంగీకారముగా లేవని ఎల్లప్పుడూ భావించినయెడల, నీ జీవితము దౌర్భాగ్యకరమైయుండును. ఆవిధముగా నీవు ఎన్నటికిని దు:ఖించకూడదు కాని దానికి బదులుగా క్రీస్తులో నిన్ను ఉన్నపాటున దేవుడు అంగీకరించియున్నాడు గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. దేవుడు నిన్ను నడిపించిన పరిస్థితులన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. లైంగిక సంబంధమైన మురికి తలంపులవలె సణుగుడు గొణుగుడు తలంపులను పూర్తిగా విసర్జించాలి.
నీలో బహిర్గతము చేసే కార్యము సరిగా జరుగుచున్నయెడల బయట నుండి వచ్చుచున్నది ఏదియు నిన్ను కలుషితము చేయదు (మార్కు 7:18 - 23). అనేక బాహ్య సంబంధమైన విషయములలో నీవు గ్రుడ్డివాడిగాను మరియు చెవిటివాడుగాను ఉండుట నేర్చుకొనుము (యెషయా 42:19, 20). నీవు చూచే దానిని అంతటిని మరియు వినే దాని అంతటిని నీ మనసులో క్రమబద్దీకరించు కొనవలెను. వెంటనే అవి నీ మనసులో నుండి తీసివేయబడవలెను ఉదాహరణకు ఇతరులు నీకు చేసిన కీడును, భవిష్యత్తును గురించిన చింత మొదలగునవి. అప్పుడు మాత్రమే నీవు ఎల్లప్పుడు విశ్రాంతిలో ఉండి మరియు దేవునిని స్తుతించగలవు.
ప్రభువైన యేసు మనకు స్తుతి వస్త్రమును మరియు ఉల్లాసవస్త్రమును ఇచ్చుటకు వచ్చియున్నాడు (యెషయా 61:1-3). కల్వరికి వెళ్ళకముందుగా ఆయనే స్వయముగా పాట పాడియున్నాడు (మత్తయి 26:30) మరియు ఇప్పుడు సమాజము మధ్యలో ఆయన కీర్తిని గానము చేయుదును (హెబీ 2:12) మనము దేవునిని స్తుతించుచున్నప్పుడు, మన హృదయములో ఆయనకు సింహాసనమును వేయుచున్నాము (కీర్తన 22:3) ఆయినను స్తుతించుటయే మనము విశ్వసించుచున్నామనుటకు ఋజువు (కీర్తన 106:12). ఆవిధముగా దేవుడు విశ్వములో సింహాసనాసీనుడైయున్నాడనియు మరియు నీ జీవితములో జరిగే సంఘటనలన్నియు ఆయన అనుమతి ద్వారానే జరుగుచున్నవనియు నీవు నమ్ముచున్నావని ఋజువు పరచుదువు (''నాకు జరుగునదంతయు ఆయనకు తెలియును'' యోబు 23:11 లివింగు). దేవుడు తనను క్రమశిక్షణ చేసిన తరువాత నెబుకద్నెజరుకు దేవుని యొక్క సార్వభౌమాధికారము గురించి చాలా స్పష్టముగా చెప్పియున్నాడు. ''భూనివాసులందరిని దేవుడు ఎన్నికలేని వారిగా చూస్తున్నాడు. పరలోకములో ఉన్న దూతలు మరియు భూమిమీద ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన ఆధీనములో ఉన్నారు. ఆయన చిత్తమును ఎవరూ ఎదిరించలేరు లేక ఆయన జరిగించు దానిగురించి ప్రశ్నించలేరు'' (దానియేలు 4:35 గుడ్‌న్యూస్ బైబిలు). అతడికి బుద్ధివచ్చినప్పుడు ఈవిధముగా చెప్పాడు (దానియేలు 4:36). ఆవిధంగా బుద్ధిగల ప్రతి విశ్వాసి నమ్మును లేక విశ్వసించును. ఇటువంటి విశ్వాసమును మనము కలిగియుండవలెనని దేవుడు కోరుచున్నాడు. అటువంటి విశ్వాసులు అన్ని సమయములలోను మరియు అన్ని పరిస్థితులలోను దేవునిని స్తుతించెదరు.
దేవాలయములో పసిపిల్లలు గొప్పశబ్దముతో స్తుతించుచున్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వచ్చి వారి గొప్ప శబ్దము చేయుచున్నారని ప్రభువుకు ఫిర్యాదు చేసియున్నప్పుడు బాలురయొక్కయు చంటిపిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివని (మత్తయి 21:16, కీర్తన 8:2 చెప్పెను. ''సంపూర్ణముగా స్తుతించుటకు నీవు పసిబిడ్డలకు నేర్పించితివి'' కీర్తన 8:2 లివింగు బైబిలు)యేసు చెప్పియున్నాడు. కాబట్టి దీనత్వమును మరియు పవిత్రహృదయమును కలిగి చేసే స్తుతిని దేవుడు అంగీకరించును గాని కేవలము మాటలను కాదు (వీటిని చంటి బిడ్డలు కలిగియుండెదరు) చిన్న పిల్లలు ఎప్పటికిని సణగరు లేక ఫిర్యాదు చేయరు. అందువలన దేవుడు వారి స్తుతిని అంగీకరించును. మన జీవితములలో ఉదయముగాని సాయంత్రముగాని లేక రాత్రిగాని వారంలోని 7 రోజులు, సంవత్సరము తరువాత సంవత్సరము సణగడంగాని ఫిర్యాదు చేయుట అనే వాసన లేనట్లయితే అప్పుడు కేవలము ఆదివారము ఉదయము స్తుతించుటయేగాక, స్తుతించుట అనునది మన జీవితములో భాగమైయుండును. పాటను సరైన రాగముతో పాడ లేనప్పటికిని దేవుడు అటువంటి స్తుతిని సంతోషముతో అంగీకరించును.
క్రొత్త నిబంధన:
మనము పరలోక రాజ్యములో ప్రవేశించు నిమిత్తము పరిసయ్యుల నీతికంటే మన నీతి అధికముగా ఉండవలెను (మత్తయి 5:20). ముఖ్యముగా ఇది పదవ ఆజ్ఞకు సంబంధించియున్నది. 10 ఆజ్ఞలలోని మొదటి 9 ఆజ్ఞలను పరిసయ్యులు పాటించియున్నారు. 9 ఆజ్ఞలకు సంబంధించినంత వరకు నీతి విషయమై అనింద్యుడైయుంటిని అని పౌలు చెప్పుచున్నాడు (ఫిలిప్పీ 3:16).
కాని 10వ ఆజ్ఞలోని ''ఆశింపవద్దు'' అను ఆజ్ఞను నెరవేర్చలేక పోయానని (రోమా 7:7) పౌలు చెప్పుచున్నాడు. తన హృదయములో సకల విధములైన దురాశలు ఉన్నవని పౌలు కనుగొన్నాడు. విడుదల కొరకు అతడు ఎంతో కోరియున్నాడు (రోమా 7:24) కాని దురాశపడకుండా తన హృదయమును కాపాడుకొనుట అసాధ్యమని అతడు కనుగొన్నాడు. క్రొత్త నిబంధనలో దేవుడు హృదయ శుద్ధిని కోరుచున్నాడని అతనికి తెలియును. అతనిలో అటువంటి పవిత్రత లేదు కాని దానిని కోరియున్నాడు. దేవుడు పౌలు యొక్క ఆకలిని చూచి క్రొత్త నిబంధనలో ఏవిధంగా పవిత్రహృదయమును కలిగియుండవచ్చునో దేవుడు చూపించియున్నాడు.
దీనినే పౌలు రోమా 8వ అధ్యాయములో వివరించాడు. దేవుడు మనకు కలుగజేసిన సదుపాయము గూర్చి అక్కడ మాట్లాడియున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రీస్తుయొక్క జీవాన్ని అనుగ్రహించుచున్నాడు. ఆవిధముగా మన అంతరంగములో దేవుని జీవాన్ని కలిగియుండి ధర్మశాస్త్రమును అనగా ప్రేమించుచు మరియు శరీరాశలను జయించగలము. రోమా 13:9-10, మరియు రోమా 8:4 పౌలుకున్న యథార్థత మరియు ఆకలిదప్పికలు మనము కూడా కలిగియున్నయెడల, దేవునికి పక్షపాతము లేదు గనుక పౌలు యొక్క అనుభవములోనికి మనలను కూడా దేవుడు నడపగలడు.
ధర్మశాస్త్రమునకు మరియు సువార్తకు ఉన్న బేధాన్ని ఇక్కడ చూడగలరు. ఒక వ్యక్తి పందితో మురికియున్న చోట నడవవచ్చు మరియు అది బురదలోనికి వెళ్ళకుండునట్లు అతడు మెడదగ్గర గట్టిగా పట్టుకొనవచ్చును. ఆ విధముగా బహుమానమును పొందెదమను నిరీక్షణబట్టియు మరియు దేవుని తీర్పు వచ్చునని భయమును బట్టియు ధర్మశాస్త్రము క్రింద ఉండవచ్చు కాని ఇప్పుడు ధర్మశాస్త్రము చేయలేని దానిని మన కొరకు దేవుడు చేయుచున్నాడు. పందిలో పిల్లి స్వభావమును ఆయన పెట్టుచున్నాడు. ఈ క్రొత్త స్వభావము ఎల్లప్పుడు పవిత్రముగా ఉండవలెనని కోరుచూ మరియు మురికి తలంపులను కోరదు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము అనే గొలుసు మనకు అవసరము లేదు. ఈ విధముగా దేవుడు మనలను నీతిమంతులుగా చేసెను. బాహ్యముగా ఆజ్ఞలనే గొలుసు ద్వారా మనలను నడిపించుట ద్వారా కాక ఆయన పరిశుద్ధతలో ఆనందించే దేవుని స్వభావములో పాలివారలుగా చేయుచున్నాడు.
పాపము మీద జయము:
నీకు తెలిసిన ప్రతీ పాపమును పూర్తిగా జయించుటకు ఎంత సమయము పట్టినను నీ హృదయమంతటితో దానిని కోరుకొనుము. నిశ్చయముగా దేవుడు దానిని నీకిచ్చును. నీవు పాపములో పడిపోయిన ప్రతిసారి దు:ఖించినయెడల, ఆ పాపమును జయించుటకు నీవు దప్పిక కలిగియున్నావని దేవుడు చూచును. కేవలము పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా పాపమును జయించగలమని చెప్పలేము. ప్రతిదినము ఆ సిలువనెత్తుకొని వెంబడించుట ద్వారాను మరియు దేవుని వాక్యమును మన మనస్సులో నింపుకొనుట ద్వారాను జయము పొందెదరు. ఈ రెండు విషయములలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడును.
పాపము మీద జయము పొందుట, కూటములలో సాక్ష్యము చెప్పుట మరియు నీ సహచరులతో సాక్ష్యము చెప్పుట మొదలగునవి ఈత నేర్చుకొనునట్లుగా ఉండును. ఆరంభములో చాలా కష్టముగా ఉంటుంది. తరువాత వాటిని చేయుటలో నీవు ఆనందించెదవు. కాబట్టి ఈ విషయములన్నింటిలోను, ''నీటిలో దూకుటకు వెనుకాడవద్దు''. నీవు నీటిలో మునుగవు ఆ విధముగా ఈత కొట్టుట నేర్చుకొనవలెను. నీవు ఆలస్యము చేయుచున్నట్లయితే నీవు అంతకంతకు ''నీటికి'' అనగా (ప్రజలకు) అంతకంతకు భయపడెదవు. మనుష్యుల భయమునుండి విడుదల పొందుటకు దేవునికి ప్రార్థించుము. మనకందరికి ఈ విడుదల ఎంతో అవసరము.
నీ జీవితకాలమంతయు శోధనలు మరియు పొరపాటులు ఉండును. తరువాత నీకు తెలిసిన పాపము మీద కొంతకాలానికి జయము పొందెదవు మరియు తరువాత ఆ పాపములో చాలా తక్కువగా పడెదవు.
లైంగిక వాంఛ అనే గొప్ప దురాశను జయించాలి. ముఖ్యముగా (యౌవనస్థులు) ఇది మనుష్యులందరి యెదుట గొలియాతు నిలబడి ఇట్లు చెప్పిట్లు ఉండును, ''అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులమగుదుము'' (1 సమూయేలు 17:9). దేవుని యొక్క శక్తితో దావీదు గొల్యాతును చంపినప్పుడు, ఫిలిష్తీయులు అందరూ పారిపోయి ఇశ్రాయేలు చేత చంపబడిరి (1 సమూయేలు 17:51, 52). అదే విధముగా నీవు లైంగిక వాంఛను జయించినట్లయితే, ఇతర వాంఛలను (దురాశలను)జయించుట సులభమవుతుంది.
ఏ అమ్మాయితో అయినను సన్నిహిత స్నేహము కలిగియుండకూడదు. నీలో కోర్కెలను పుట్టించి రేకెత్తించే పుస్తకముల నుండి (ఇంటర్‌నెట్ వెబ్‌సైట్ కూడా) పారిపొమ్ము. ఉపయోగము లేని టీ.వీ కార్యక్రమములు చూచి సమయమును వృథా చేసుకొనుట నుండి పారిపొమ్ము. కొండెములను వినుటనుండి పారిపొమ్ము. చెడ్డ వాటిని వినుటగాని, చెడ్డవాటిని చదువుటగాని మరియు చెడ్డవాటిని చూచుటగాని చేసినట్లయితే నీవు చెడ్డ వాటిని తెలుసుకొందువు. కాని ఆ చెడ్డ సమాచారము నీకు అవసరమా? అది నిన్ను కలుషితము చేసి మరియు నాశనము చేయును, అటువంటి సమాచారము విషయములో నీ చెవులను, కళ్ళను ఇప్పటినుండి మూసుకొనుము. ఇతరులు చేసిన కీడు తెలుసుకొనుట ద్వారా నీవు ఎన్నటికి జ్ఞానవంతుడవు కావు.
కీడు విషయములో పసిబిడ్డలు వలె ఉండవలెనని బైబిలు హెచ్చరించుచున్నది. (1 కొరింథీ 14:20). ఒక బిడ్డ యొక్క మనస్సు కీడంతటి విషయములో పవిత్రముగా ఉండును. కాని ఇప్పుడు మనకున్న సువార్త ఏమనగా బిడ్డలాంటి మనస్సు నీవు కోరినయెడల, గత సంవత్సరములన్నిటిలో చెడ్డ సమాచారమంతటినిబట్టి నీ మనస్సంతటిని పాడుచేసుకున్నప్పటికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడును. ఇదియే దేవుని కృప మన కొరకు చేయును దేవునికి స్తోత్రము.
మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై ఉండుటకు మనము పిలువబడియున్నాము (రోమా 16:19). కాబట్టి ప్రభువైన యేసు జీవించిన విధానమును చూపించమని పరిశుద్ధాత్మను అడుగుము. అప్పుడు మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉండుట తెలుసుకొందురు.
ప్రభువైన యేసు శోధింపబడియున్నాడు కాని ఎల్లప్పుడు జయించెను:
ప్రతిదినము మనము పొందుచున్న శోధనలనే ప్రభువైన యేసు ఎదుర్కొన్నాడని గుర్తుంచుకొనుము (హెబీ 4:15) మనకున్న పరిమితులన్నియు ఆయన కలిగియుండి ఆయన జయించియున్నాడు. ఎందుకనగా ఆయన నీతిని ప్రేమించి మరియు పాపమును ద్వేషించి మరియు శోధన వచ్చిన ప్రతిసారి సహాయము కొరకు తన తండ్రికి మొరపెట్టెను (హెబీ 1:9, 5:7). మానవుడిగా ప్రభువైన యేసుకి పరిశుద్ధాత్ముడు సహాయపడియున్నాడు. మరియు అదేవిధముగా మనకును సహాయపడును.
ఒక యౌవనస్థుడిగా ప్రభువైన యేసు శోధనలు ఎలా ఎదుర్కొనెనో అప్పుడప్పుడు ఆలోచించుము. యౌవనస్థులందరికి కలిగే శోధనల ద్వారా ఆయన ఆకర్షింపబడియున్నాడు. శోధనలు జయించుట ఆయనకు సులభము కాదు. నిజానికి ఆయన పరిపూర్ణమైన పవిత్ర స్వభావము కలిగియున్నాడు. గనుక శోధనలు మనకంటే బహు బలముగా ఆయనకు వచ్చి ఉండవచ్చును. దానిని జయించుట కష్టమే అయినప్పటికిని ఆయన జయించాడు.
కాబట్టి ఈ శోధనలు పోరాడుటలో ఇప్పుడు ప్రభువైన యేసు నీ పక్షానఉన్నాడు మరియు ఆయన నీకు సహాయము చేయుటకు నీ ప్రక్కనే నిలిచియున్నాడు. గర్వమనే గొప్ప బరువుగల లంగరు గల వ్యక్తి సాతాను పక్షమున ఉన్నాడు. దాని తరువాత స్వార్థమున్నది కాని దేవుడు మిగతా పాపములన్నిటితో పాటు ఈ రెండింటిని తీసివేయుటకు దేవుడు నీకు సహాయపడును మరియు నీవు జయించెదవు. దేవునికి స్తోత్రము.
''ప్రభువైన యేసు మనము తొట్రిల్లకుండా (ఓడిపోకుండా) కాపాడును'' అను వాగ్దానమును మనము విశ్వాసముతో స్వతంత్రించుకొనవలెను (యూదా 24). శారీరకముగా మనము నడుచుకొనుట నేర్చుకొన్నట్లే విశ్వాసముతో కూడా నడుచుకొనుట నేర్చుకొనవలెను. చిన్నపిల్లలవలె ఆరంభములో కూడా అనేకసార్లు పడిపోయెదము కాని కాలము గడిచేకొలది అంతకంతకు వారు తక్కువగా పడిపోయెదరు. చివరకు అతితక్కువగా పడిపోయెదము. అయితే అత్యంత గొప్ప పరిశుద్ధుడు కూడా నేను ఎన్నటికిని పడిపోనని చెప్పలేడు.
నీవు పడిపోయినప్పుడు, దానిని పాపమని కాక వేరొక పేరుతో పిలవాలనే శోధన నీకు రావచ్చును. అది అపాయకరము. అనేకమంది వారి పాపములను ''పొరపాటులనియు'', తప్పులనియు మొదలగు పేర్లతో పిలిచెదరు. పాపము యొక్క పర్యవసానము పొందకుండుటకు ఆ విధముగా చెప్పెదరు. కొందరు వారి పాపములను కప్పిపుచ్చుకొనుటకు రోమా 7:17 ''కావున దానిని చేయునది నేను కాదు గాని నాలో నివసించు పాపము'' ను చూపెదరు. ఇది అపాయకరమైన మార్గము. దీనిని తృణీకరించుము. లేనియెడల నీవు కూడా ఇతరులవలె మోసగించబడెదవు. మన పాపములను మనము ఒప్పుకొనినయెడల దేవుడు నమ్మదగిన వాడు కనుక మనలను క్షమించి, పవిత్రపరచును (1 యోహాను 1:9). మనయొక్క పాపములను ''పొరపాట్లు'' అని పిలిచిన యెడల పవిత్రపరచబడెదమనే వాగ్దానము లేదు. ప్రభువైన యేసు రక్తము పాపములనుండి మాత్రమే పవిత్రపరచును కాబట్టి నీవు పాపములో పడిన ప్రతీసారి యథార్థముగా ఉండుము. నీవు దానిని పాపము అని పిలచి, దానినుండి వెనుదిరిగి, దానిని అసహ్యించుకొని, దానిని విడిచిపెట్టవలెనని కోరి, దేవుని యొద్ద ఒప్పుకొనిన యెడల అది తీసివేయబడును. అప్పుడు నీవు దానిని మరచిపోవచ్చును.
కొన్ని పాపములు చాలా తీవ్రమైనవి:
బాహ్యంగా మనము చేసే పాపముల కంటే, మనము గుర్తించలేని పాపపు వైఖరులు చాలా తీవ్రమైనవి. వైఖరితో చేసే కొన్ని పాపములు. గర్వము, తీర్పు తీర్చేవైఖరి, ద్వేషము, అసూయ, మనస్సులో ఇతరులను తీర్పుతీర్చుట (మనము చూచిన లేక వినిన దానిని బట్టి యెషయా 11:3), నీ సొంతము కోరుట, స్వార్థము, పరిసయ్యతత్వము మొదలగునవి.
పాపము మీద జయమును బోధించే ఒక విశ్వాసి ఇతరులను చిన్నచూపు చూచినయెడల, ఆత్మీయ గర్వము అనే అత్యంత గొప్ప పాపము మీద అతడు జయము పొందలేదని రుజువగుచున్నది. ఇతరులను తృణీకరించుట, ఎల్లప్పుడు వ్యభిచారము చేయుటతో సమానము. అటువంటి విశ్వాసి పాపము మీద జయమును బోధించుట బుద్ధిహీనతైయున్నది. నీవు ఆత్మీయముగా అభివృద్ధి చెందేకొలది, నీవు ఎక్కువగా పరిశుద్ధతలో పాలుపొందేకొలది మరియు నీవు పాపము మీద జయము పొందే కొలది నీవు దీనుడవగుదువు. నిజమైన పరిశుద్ధతకు ఇదియే ముఖ్యమైన ఋజువు. ఒక పండ్లు కాసిన చెట్టులో, ఎక్కువ పండ్లు కలిగిన కొమ్మ ఎక్కువగా క్రిందకు వ్రేలాడును.
చాలామంది తమ సొంత ఇంద్రియనిగ్రహమును దేవుని స్వభావములో పాలివారమగుచున్నామని భావించుచున్నారు. మానవుని యొక్క ఆశానిగ్రహము బాహ్యముగా మాత్రమే మార్పును తెచ్చును. కాని అతని యొక్క అంతరంగ పురుషుడు గొప్ప తలంపులు కలిగియుండి మరియు గర్వము కలిగియుండి మరియు పరిసయ్యతత్వము కలిగియుండును. పాపమును జయించుటకు మనము దేవునిలో కృపను పొందుటకు పిలువ బడియున్నాము. మనము ఉచితముగా పొందిన దానినిబట్టి ఎన్నటికి గర్వించము. మనము కలుగజేసిన దానిని బట్టి మాత్రమే గర్వించగలము. మన సొంత ప్రయత్నములతో కలుగజేసిన పరిశుద్ధత అంతయు ఎల్లప్పుడు నకిలీ పరిశుద్ధత అయియుండును.
ప్రేమ అనే దేవుని స్వభావములో పాలివారగుటకు మనము పిలువబడియున్నాము. దేవుడు మంచి వారియెడలను చెడ్డవారి యెడలను దయకలిగి మరియు మంచివాడుగా ఉన్నాడు. మరియు మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడు ఉదయించునట్లు చేయుచున్నాడు (మత్తయి 5:46-48). దీనినే మీరు కూడా వెంబడించాలి. ఇతరులు మీతో అంగీకరించినను లేక అంగీకరించకపోయినను ప్రతీ ఒక్కరిని ప్రేమించాలి. ఒక మరణకరమైన వ్యాధిని విసర్జించినట్లే వివాదస్పదమైన వాదనలను మరియు మాటలను మనము విసర్జించవలెను. ఇతరులు ఎవరైనను దేని విషయములోనైనను వాదన పెట్టుకొనవలెనని కోరినయెడల, అటువంటి వాదములలో మేము పాలుపొందమని ప్రేమతో చెప్పాలి. ప్రేమలో నీవు పరిపూర్ణుడవుటకు నీ పూర్ణ హృదయముతో వెంటాడుము.
జయము పొందే మార్గము:
పరిశుద్ధ జీవితమునకు దేవునియెడల భయభక్తులే పునాది. ప్రభువైన యేసుమనవలె శరీరధారియై మరియు అన్ని విషయములలో మనవలె శోధింపబడియు, ఆయన జయించెనను దానిని చూచుటయే దైవభక్తియొక్క మర్మము. కాని అనేకులకు ఈ సత్యమును అక్షరానుసారముగా యెరిగియుండుట వలన వారు గర్విష్టులై ఉండెదరు. వారు దైవభక్తి యొక్క సిద్ధాంతమును యెరిగి యుండెదరు గాని దైవభక్తియొక్క మర్మమును ఎరుగరు (1 తిమోతి 3:16). ఆ మర్మము ఒక సిద్ధాంతములో లేదుగాని ఒక వ్యక్తిలో ఉన్నది. నిజముగా దేవుని యెడల భయభక్తులు కలిగియుండనివారు సిద్ధాంతపరముగా నకిలీ పరిశుద్ధతను కలిగియుండెదరు (ఎఫెసీ 4:22). దేవుని యెడల భయభక్తులు కలిగియుండుట ద్వారా మాత్రమే పరిశుద్ధతలో పరిపూర్ణులు కాగలరు (2 కొరింథీ 7:1).
కాబట్టి నీ మనసాక్షిలో ఎప్పుడైననూ కొంచెమైననూ విశ్రాంతిలేనియెడల వెంటనే దానిని సరిచేసుకొనుము. కేవలము నీ తలంపులలో తప్పిపోయినప్పటికిని, ఆ పాపము దేవుని యెదుట ఒప్పుకొనుము. ఓడిపోయిన ప్రతిసారి దు:ఖపడుము. అవసరమైనప్పుడు ఇతరులను క్షమాపణ అడుగుము. అప్పుడు దేవుడు నిన్ను ఏవిధముగా బలపరచునో చూడుము. యోసేపువలె శోధనను విసర్జించి మరియు దానినుండి పారిపోవుటయే జయము పొందుటకు శ్రేష్టమైన మార్గము (ఆదికాండము 39:7-12). నీవు బలముగా శోధింపబడి మరియు నిన్ను బలహీనపరిచే ప్రదేశాలు మరియు ప్రజలకు దూరముగా ఉండుము. మమ్మును శోధనలోనికి తేకుము అని ప్రార్థించమని ప్రభువైన యేసు చెప్పారు.
నివారించుము, నివారించుము, నివారించుము. పారిపొమ్ము, పారిపొమ్ము, పారిపొమ్ము ఈ విధముగా నీవు చేసినందుకు నిత్యత్వములో ఎంతో కృతజ్ఞత కలిగియుంటావు.
భూమిమీద కూడా నీ శక్తికి మించిన శోధన నీకు రాకుండునట్లు అటువంటి స్థలములను మరియు ప్రజలను నివారించినందుకు కృతజ్ఞత కలిగియుండెదవు. అటువంటి ప్రదేశములు మరియు ప్రజలను నీవు నిరాకరించుట ద్వారా ప్రభువుని మాత్రమే నీవు సంతోషపెట్టవలెనని కోరుచున్నావని ఋజువుపరచుచున్నది (సామెతలు 7వ అధ్యాయము యౌవనస్థులు అప్పుడప్పుడు చదువుట మంచిది).
భవిష్యత్తు కొరకు మంచి పునాది వేసుకొనుటకు యౌవనదశ చాలా ముఖ్యమైయున్నది. కాబట్టి ఆ సంవత్సరములలో ప్రభువు నీలో పనిచేయవలెను. అది నీకు కావలెనని ప్రభువుకి ప్రార్థన చేయుము. నీవు ఎన్నిసార్లు పడిపోయినను ఫర్వాలేదు. నీవు లేచి దు:ఖించి జయము కొరకు దేవునిని ప్రార్థించుము. మరియు నిన్ను నీవు సంపూర్ణముగా దేవునికి అప్పగించుకొనుము.
పట్టుదల:
పట్టుదల, పట్టుదల, పట్టుదల ఇదియే జయము పొందుటకు రహస్యము. ఒక కంప్యూటర్‌లో ఒక సమస్య పరిష్కరించే వరకు అతడు ఆ కంప్యూటర్‌లో పనిచేసినట్లుగా ఉండును. నిరాశపడుట అనే శోధన సార్వత్రికమై యున్నది. కాని నీవు విడిచి పెట్టవద్దు. నీవు పుట్టకముందే దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక చేసియున్నాడు (కీర్తన 139:16). సాతానుచేత దానిని చెడ్డగొట్టబడనీయకుము. ఏది ఏమైననూ నీవు ప్రభువు కొరకు నిలువబడుము.
లోకాధికారి వచ్చినప్పుడు, అతడు తనలో ఏమియూ కనుగొనలేడని ప్రభువైన యేసు యోహాను 14:30లో చెప్పారు. ప్రభువైన యేసువలే మనము నడుచుటకు పిలువబడియున్నాము. సాతాను నీ యొద్దకు వచ్చినప్పుడు, అతడు నీలో ఏమియు కనుగొనకూడదు. అందువలన ''నేను దేవునియెడలను మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను'' (అపొ.కా. 24:16). నీవు తెలిసిన పాపము చేయకుండునట్లు కావలసిన కృపను జీవమును పొందునట్లు పూర్ణ హృదయముతో దేవునిని వెదకవలెను. నీలో ఉన్న దురాశలకు నీవు లోబడుచున్నట్లయితే సాతాను నిన్ను పట్టుకొనును. రోమా 6:1లో, మనము పాపములో నిలిచియుండెదమా? అని అడుగుచున్నాడు మరియు రోమా 6:15లో పాపము చేయుట ఎన్నటికీ కుదరదు అని చెప్పియున్నాడు. ఈ రెండు ప్రశ్నలకు, ''ఒక్కసారి కూడా వద్దు అని చెప్పుచున్నాడు''.
ఒకవేళ నీవు పాపములో పడిపోయినట్లయితే వెంటనే పశ్చాత్తాపపడి మరియు క్షమాపణ అడుగుము. లేనట్లయితే నీవు పాపమును చులకనగా తీసుకొని దానినుండి విడుదల పొందుటకు చాలా కష్టమగును. ఏ విషయములో అయినను దేవునికి వ్యతిరేకముగా పాపము చేసియున్నావని నీకు తెలిసినప్పుడు, వెంటనే వాటిని ఒప్పుకొనుము మరియు మారుమనస్సు పొంది విడుదల పొందుటకు హృదయమంతటితో కోరుము.
అసత్యము:
జయజీవితము పొందేవిషయములో అసత్యము అనేది గొప్ప అపాయకరమైయున్నది. అనేకులు సత్యమును గ్రహించనందున, వారికి జయించే అవకాశమున్నదనే విశ్వాసము కోల్పోయి మరియు ఇది పనిచేయదు అని చెప్పెదరు. నీవు అవిశ్వాసక్రైస్తవుల యొక్క ప్రసంగములనుండి కాక దేవుని వాక్యములోనుండి విశ్వాసము పొందినయెడల దేవుని యొక్క వాగ్దానము నీలో పనిచేయును. ''వినుట వలన విశ్వాసము కలుగును మరియు క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును'' (రోమా 10:17). మరియు పాపుల యొక్క సాక్ష్యము ద్వారా విశ్వాసము పొందము.
అదే సమయములో, దేవుని పరిశుద్ధత కంటే ఎక్కువ పరిశుద్ధత కోరవద్దు. దేవుని వాక్యములో ఉన్న సమతుల్యతను కలిగియుండుము. కొందరు ప్రకృతి సంబంధమైన బోధకులు మనము అందుకోలేని పరిశుద్ధత గురించి బోధించెదరు. వారి ద్వారా మోసగించబడకుండుటకు జాగ్రత్తపడుము. ఆత్మశక్తికిని మరియు ప్రాణశక్తికిని మధ్య ఉన్న తేడాను తెలుపుమని పరిశుద్ధాత్మను అడుగుము. నిజమైన ఆత్మీయత ఎల్లప్పుడు దీనత్వమును, దయను, ప్రేమను వెల్లడి పరచును. ఈ గుణలక్షణాలు కలిగిన బోధకుల యొక్క బోధ మాత్రమే వినుము. శ్రేష్టమైన సంఘములలో కూడా ప్రభువైన యేసును వెంబడించేవారు ఉన్నారు, అలాగే పరిసయ్యులను వెంబడించేవారున్నారు. కాబట్టి నీవు నష్టపోకుండునట్లు నీకు వివేచన ఉండాలి. వారిని తీర్పుతీర్చకుము కాని వివేచన కలిగి వారిని నివారించుము.
దీనత్వము మరియు విశ్రాంతి:
ప్రభువైన యేసు యొక్క శిష్యులముగా అన్నిటికంటే ఎక్కువగా దీనులమై యుండవలెను. ఆండ్రూ ముర్రే గారు వ్రాసిన దీనత్వము అనే పుస్తకములో దీని గురించి చాలా మంచిగా వివరించాడు.
''నఖిళీ పరిశుద్ధతను మనం కనుగొనుటకు ప్రధానమైన గుర్తు ఏమిటంటే దీనత్వం లేకపోవుట. మనం దీనులముగా ఉండుటకు నడిపించుటకు మూడు ప్రధానమైన కారణాలు ఉంటాయి. మొట్టమొదటిగా, మనం సృష్టించబడిన వారము. రెండవది, మనం పాపులము. మూడవది, మనం పరిశుద్ధులము. మనం పాపాత్ములము అనే అంశమును ఈ విషయంలో ఎక్కువగా బోధిస్తారు కనుక మనం దీనులుగా ఉండాలంటే పాపం చేస్తూ ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. కొంతమంది నిరంతరం తమ్మునుతాము తీర్పు తీర్చుకొనుటయే దీనత్వమునకు రహస్యం అని అనుకుంటారు. కాని మనలను దీనులను చేసేది పాపం కాదు కాని కృప మాత్రమే. దేవుడు మరియు ఆయన మహిమను గురించి చూసేవారే ఆయన ఎదుట దీనమైన స్థానమును తీసుకుంటారు. గాని వారి స్వంత పాపముతో తీరికలేకుండా ఉన్నవారు కాదు. మన జీవితంలోని ప్రతి ఓటమికి దీనత్వం లేకపోవుటయే కారణము.
యేసు భూమిమీద జీవించిన దినములలో దేవుడే సమస్తముగా ఉండునట్లు తన్నుతాను రిక్తునిగా చేసుకున్నాడు. తండ్రి తనలో కార్యము చేయునట్లుగా యేసు తన చిత్తమును మరియు సామర్థ్యములను పూర్తిగా తండ్రికి అప్పగించుకున్నాడు. యేసు తండ్రియెదుట తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మనుష్యులయెదుట తగ్గించుకోవడానికి మరియు అందరికి సేవకునిగా ఉండటానికి ఎంతో సులభమైనది. మనలను మనం ఉపేక్షించుకొనుట అంటే మన శరీరంలో మంచిదేదియు నివసింపదని తెలుసుకోవాలి. మరియు దేవుడే సమస్తముగా ఉండునట్లు దేవునియెదుట మరియు మనుష్యులయెదుట వట్టివారముగా ఉండాలి''.
దీనిని మరల చదువుము. దీనిలో గొప్ప ధన నిధి ఉన్నది. అన్ని సమయములలో నీవు దీనత్వములో వేరుపారి స్థిరపరచబడాలి.
ఎల్లప్పుడూ పరిసయ్యుడవవుతావేమోననే భయము కలిగియుండవలెను. అప్పుడు నీవు ఎన్నటికీ పరిసయ్యుడవు కాలేవు. ఎల్లప్పుడూ ఇతరులు నీంటే ఎక్కువ ఆత్మీయులు కానప్పటికిని నీ కంటే యోగ్యులు అని ఎంచుకొనవలెను (ఫిలిప్పీ 2:3). అనగా మనలను మనము తక్కువగా ఎంచుకొనమని కాదు ఎందుకనగా జగత్పునాది వేయబడక మునుపే మనము దేవుని చేత ఎన్నుకోబడి, జీవముగల దేవుని కుమారులము మరియు రాజులకు రాజు యొక్క కుమారులమై యున్నాము. కాబట్టి మనము దేవునికి ఎంతో విలువైనవారము కాబట్టి మనము ఏ మనుష్యునికి బానిసలమై యుండము. మరియు ఏ మనుష్యునికి భయపడము. కాని మనము అందరిని గౌరవించెదము.
రోజంతయు మన మనస్సులోను శరీరమంతటితో పని చేయుచున్నప్పటికిని, అన్ని సమయములలో మన హృదయములో విశ్రాంతి ఉండవలెనని ప్రభువు కోరుచున్నాడు (మత్తయి 11:28). దేవుని యెడలను మరియు ఇతరుల యెడలను మన హృదయములో సంకుచితత్వము యున్నయెడల అనేకసార్లు హృదయములో విశ్రాంతి ఉండదు (2 కొరింథీ 6:11-13). దేవుడు తన చిత్తప్రకారము ఉపయోగించుకున్నట్లు మనకున్నదంతయూ దేవునికి ఇచ్చుట ద్వారా ఆయన యెడల విశాలహృదయము కలిగియుండగలము (యోహాను 17:12). ఇతరుల మీద ద్వేషము పెట్టుకొనక వెంటనే వారిని క్షమించి మరియు వారికి విడుదల ఇచ్చుట ద్వారా ప్రజల విషయములో విశాల హృదయము కలిగియుండగలము. నీవు ఏ సమయములోనైనను అయినను ఏ వ్యక్తిపైనైననూ పగపెట్టుకొనకూడదు. అన్ని సమయములలో ఈ విషయములో నీవు నమ్మకముగా ఉన్నయెడల, నీవు దేవుని విశ్రాంతిలో జీవించగలవు.
అన్ని సమయములలో దేవుని యెడలను మరియు మనుష్యుల యెడలను కృతజ్ఞత కలిగి యుండుము. నీవు దీనుడవైతే ఇది చాలా సులభము. మనలో ఉన్న గర్వము మరియు ఇతరుల యెడల మనకున్నటువంటి కోర్కెలు కృతజ్ఞత లేనివారిగా చేయును.
దేవుని వాక్యమును ధ్యానించుము:
నీవు ఎన్నటికిని మోసపోకుండునట్లు, దేవుని వాక్యము నీలో లోతుగా వేరుపారుట మంచిది. ప్రతిరోజు కొద్ది నిమిషములు నీకు ఆశీర్వాదముగా ఉండు నిమిత్తము దేవుని వాక్యము చదివి ఆ దినమంతయు ధ్యానించుట మంచిది. దానితోపాటు, నీకు సమయమున్న యెడల, ప్రతిరోజు క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయము మరియు పాతనిబంధనలో మూడు అధ్యాయములు చదవాలి. ఆవిధముగా మూడు వందల రోజులలో బైబిలు అంతయు చదువగలవు.
ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పొందిన తరువాత, ఆయన మొట్టమొదటిగా చెప్పినదంతయు గుర్తించుకొనవలెను. ''అందుకాయన, మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలన జీవించును'' (మత్తయి 4:4). యాకోబు 1:21-25లో దేవుని వాక్యము లోతుగా చదవాలని హెచ్చరించుచున్నది. ఇక్కడ స్వాతంత్య్రం ఇచ్చే నియమము మరియు పరిపూర్ణ నియమము గురించి క్రొత్త నిబంధనలో చెప్పబడింది. మోషే ధర్మశాస్త్రమువలె కాకుండా, క్రొత్త నిబంధన మనలను ప్రతి యొక్క బంధకము నుండి అనగా పాపము మరియు ప్రజల అభిప్రాయముల యొక్క బంధకములనుండి విడిపించి, మనలను సంపూర్ణతలోనికి మరియు స్వాతంత్రములోనికి నడిపించును.
నీవు ఒంటరిగా ఉన్న దినములలో ప్రతి అవకాశమును ఉపయోగించుకొని దేవుని వాక్యమును చదువుము. ఇటువంటి అవకాశములు మరల నీకు రాకపోవచ్చును. ఎక్కువ సమయము దేవుని వాక్యము చదువుటకు నీవు ప్రయత్నించుము. నేను ఆవిధముగా చేసియుండుట వలన నా జీవితములో అనేక ఆత్మీయ బహుమానములు పొందియున్నాను.
నీవు సరియైన వైఖరి కలిగియుండి సంఘ కూటములకు వెళ్ళుట ముఖ్యమైయున్నది. నీలో ఏదైన వ్యతిరేకమైనది ఉన్నయెడల, అది దేవుడు నీతో మాట్లాడే విషయమును వినబడకుండా చేయును. దేవుడు మనతో చెప్పాలని కోరేదానిని మనము వినకుండునట్లును, కుయుక్తితో సాతాను కొన్ని ఆటంకములు పెట్టును. లూకా 1:53లో మరియ చెప్పిన నియమము నిత్యత్వానికి నిజమైయున్నది. ''ఆకలి గొనినవానిని ఆయన మంచి పదార్థములతో తృప్తిపరిచి మరియు ధనవంతులను ఒట్టిచేతులతో పంపెను''. కాబట్టి నీవు ఆకలితోను మరియు ఒక అవసరమున్న వ్యక్తిగా ప్రతీ సంఘకూటమికి వెళ్ళిన యెడల దేవుడు నిన్ను మంచి పదార్థములతో నింపి తృప్తి పరచును.
దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక:
నీ జీవితములో దేవుని యొక్క పరిపూర్ణమైన సంకల్పము నెరవేర్చుట కంటే ఈ భూమి మీద గొప్ప విషయము ఏమీలేదు. నీ జీవితము ద్వారాను మరియు పరిచర్య ద్వారాను ఈ లోకములో ఏదొక ప్రాంతములో నీ ద్వారా ఆయన సంఘమును నిర్మించుటకు దేవుడు మిమ్ములను వాడుకొనవలెనని ప్రార్థించుచున్నాను. భూసంబంధమైన మీ యొక్క అవసరములు తీర్చుకొనుటకు మాత్రమే మీరు చదువుకొనవలెను. కాని దేవుని కొరకు జీవించుటయే మీ పిలుపైయున్నది. కాబట్టి మీరు చేసే ఉద్యోగము మీకు ఒక విగ్రహము కాకూడదు.
దేవుడు ఇప్పటికే నీ జీవితములో ప్రతివిషయమును ప్రణాళిక వేసియున్నాడు. అనగా స్కూలులో, కాలేజీలో మీరు చేరి మీరు చదవవలసిన వాటిగురించి దేవుడు ప్రణాళిక వేసియున్నాడు. దేవుడు తనయొక్క సార్వభౌమాధికారముతో నీ జీవితములో అన్నిటినీ సమకూర్చి చివరకు నీవు మంచి వృత్తిని చేపట్టునట్లు చేయును. కాబట్టి కొన్ని సందర్భములలో మీరు కోరుకొనిన కోర్సులు మీరు ఎంత ప్రయత్నించినను రానియెడల, నిరాశపడక దేవునిని స్తుతించుము. కొన్ని సంవత్సరముల తరువాత దేవుడు నీమీద తన దృష్టిని ఉంచి, నీవు గ్రహించనప్పటికిని సమస్తమునూ సమకూర్చి నీ మేలు కొరకే జరిగించుచున్నాడని తెలుసుకొనుము (రోమా 8:28). దేవుని యొక్క ఈ వాక్యమును విశ్వసించి జీవించుము.
ఈ భూమిమీద యేసుయొక్కజీవమును నీ జీవితము ద్వారా బయలుపరచవలెనని దేవుడు ముఖ్యముగా కోరుచున్నాడు. కాబట్టి నీవు భూసంబంధమైన గురిని కలిగియుండకూడదు. జీవితాన్ని తీవ్రముగా తీసుకొనుము. దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని వెదకుము. తీర్పు దినమును నీవు ప్రభువు యెదుట చింతించకుండునట్లు నీవు ఇక్కడ జీవించవలెను. ఆ అంత్యదినమందు ముఖ్యముగా నీవు కాలేజీలో గ్రేడ్ పాయింట్ సరాసరి కాదు గాని దేవుని యొక్క మెప్పు మరియు అంగీకారము ముఖ్యమైయున్నది (1 కొరింథీ 4:5). ఇది మాత్రము నిత్యత్వమును నిలుచును.
అటువంటి అద్భుతమైన విధానమును దేవుడు మన జీవితములో ప్రణాళిక వేసియున్నాడు. నా జీవితములో దీనిని అనేకసార్లు కనుగొనియున్నాను. అందువలన రాబోయే దినములలో నా పూర్ణహృదయముతో ఆయనకు పరిచర్య చేసి నా కొరకు శ్రమపొందిన దేవుని గొఱ్ఱెపిల్ల కొరకు జీవించాలని కోరుతున్నాను. 18వ శతాబ్దములో జింజన్ డోర్ఫ్ అనే నాయకుని ద్వారా మోరావియన్ క్రిస్టియన్స్ ఆయొక్క గురితో పరిచర్య చేసిరి. ఇప్పుడు అది జెకోస్లోవియాలో ఉంది.
దేవునికి నీ జీవితములో ఉన్నటువంటి పరిపూర్ణ ప్రణాళిక నెరవేరుటకు భూసంబంధమైన అర్హతలు అవసరములేదు. నీ మనస్సులో మరియు విశ్వాసములోను దీనుడవైన యెడల చాలు కాబట్టి నీవు ఎల్లప్పుడూ ఆ గుణలక్షణములు కలిగియుండవలెను.
మన జీవితములో బుద్ధిహీనమైన కొన్ని పొరపాట్లు చేయకుండుట అసాధ్యము. మనము దీనులమై యుండి మన పాపములను ఒప్పుకొని మరియు ఇతరులను నిందించక విశ్వాసముతో ఇట్లు చెప్పిన యెడల, ''ఓ యేసు ప్రభువా, నేను బుద్ధిహీనమైన పొరపాట్లు చేసినప్పటికిని నీ యొక్క కనికరము ద్వారా నా జీవితములో నీ చిత్తము నెరవేరునట్లు చేయగలవని నమ్ముచున్నాను''. అప్పుడు దేవుడు నీవు చేసిన బుద్ధిహీనమైన పనులన్నిటిని క్షమించును. అనేకమంది విశ్వాసులు వారి ఓటమిని బట్టి నిరాశపడి మరియు దేవుని కనికరమందు విశ్వసించరు. ఆ విధముగా వారు వారి ఓటములనే హెచ్చించి దేవుని యొక్క శక్తిని మరియు కనికరమును అగౌరవపరిచెదరు. నీవు దేవుణ్ణి విశ్వసించి మరియు ఆయన గొప్ప కనికరమును బట్టి ఆయనను మహిమపరచవలెను. అప్పుడు నీకు సంవత్సరము తరువాత సంవత్సరము గొప్ప మేలు కలుగును.
అపార్థము చేసుకొనబడుటను వ్యవహరించుట:
నీ జీవితములో ఎప్పుడైనను అపార్థము చేసుకున్నయెడల లేక అనుమానించబడినయెడల, దేవుడు నీకు ఆత్మీయ పాఠములు నేర్పించుటకు చిన్న వయస్సులో నీవు అర్హుడవని దేవుడు భావించినందుకు నీవు సంతోషించెదవు. నిన్ను అనుమానించిన వారియెడల నీవు విశాల హృదయము కలిగియుండుము. దేవుని ప్రణాళిక చొప్పున నీవు ఆత్మీయ పాఠములు నేర్చుకొనునట్లు అటువంటి పరిస్థితులు నీకు అవకాశమైయున్నవి. ఆవిధముగా నీవు ఇతరులచేత చూడబడుట ద్వారా నీవు దేవుని ప్రేమలో అభివృద్ధి చెందెదవు.
అపార్థము చేసుకొనబడుట మరియు తృణీకరించబడుట విషయములో నీవు తేలికగా తీసుకొనుట నేర్చుకొనుము. అటువంటి పరిస్థితులు ద్వారా నీవు వ్యక్తిగతముగా ప్రభువుని ఎరుగుటలో మరియు ప్రజల అభిప్రాయమునుండి విడుదల పొందుటకు సహాయపడును. ఆ దినాన మీరు సంతోషించుడి అని ప్రభువైన యేసు చెప్పినట్లుగా నేను నా జీవితములో కనుగొనియున్నాను (లూకా 6:23).
యెషయా 42:19, 20లో ప్రభువుయొక్క సేవకులు అనేక విషయములను వినుటకు చెవిటివారై యుండెదరని చెప్పబడింది. చివరకు నీ జీవితము గూర్చియు మరియు నీ వైఖరులను గూర్చియు ప్రభువుకు మాత్రమే లెక్క చెప్పవలసియుందని గుర్తుంచుకొనుము. దీనిని నీవు గుర్తించినప్పుడే క్రీస్తుకు నిజమైన దాసుడుగా ఉండెదవు. నీవు ప్రజలను సంతోషపెట్టగోరినయెడల, నీవు ఎన్నటికి క్రీస్తు దాసుడవు కాలేవు (గలతీ 1:10). అనేకమంది యౌవనస్థులు ఇతరుల అభిప్రాయము చేత బంధింపబడియున్నారు. ఈ బానిసత్వమునుండి నీవు విడుదల పొందని యెడల నీవు అభివృద్ధి చెందవలసిన రీతిగా నీవు ఆత్మీయ అభివృద్ధిచెందవు.
ఇతరుల యొక్క ఘనతను మరియు అంగీకారము పొందుటకొరకు, లోకములోగాని సంఘములోగాని ఇతరులను అనుకరించకు. అనగా వారివలె ప్రవర్తించుట, మాట్లాడుట, ప్రార్థించుట చేయవద్దు. నీవు ప్రత్యేకముగా ఉండుము. అన్ని సమయములలో దేవుడు నీలో ఉండవలెనని కోరుచున్నాడు. నీవు కృత్రిమముగా ఉండవద్దని దేవుడు కోరుచున్నాడు. ప్రతీ క్రైస్తవ సమూహములో, వారి వలె ఉండునట్లు ఇతరులచేత బలవంతపెట్టబడెదరు. అటువంటివి ఎదుర్కొనుట మంచిది. ఎందుకనగా ఆ ఒత్తిడిని ఎదుర్కొనుట ద్వారా ఆత్మీయ కండరములు బలముపొంది మరియు జయించెదరు.
కమ్యూనిస్టు దేశములలో, స్కూలులో మరియు ఇతర ప్రదేశములలో క్రైస్తవ నాయకుల యొక్క పిల్లలు హింసింపబడెదరు. వాటితో పోలిస్తే ఇతరులు ద్వారా నీవు ఎదుర్కొనుచున్నది కేవలము చీమ కుట్టుట వంటిది. కాబట్టి భయపడకుండా ధైర్యముగా ఉండుము. మరియు ఈ విషయములలో జయించేవాడిగా ఉండుము. నీవు దైవజనుడవగుటకు అవసరమైనవి దేవునిచేత ప్రణాళిక చేయబడి మరియు ఆయన జరిగించుచున్నాడు.
''మరియు - ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని ఆర్ఖిప్పుతో చెప్పుడి'' (కొలొస్స 4:17).
ఇతరులకు ఆశీర్వాదముగా మారుట:
మత్తయి 14:19లో ఇతరులకు ఆశీర్వాదముగా మారుటకు గల మూడు మెట్లను చూచెదము. 1. రొట్టెలను మరియు చేపలను ప్రభువైన యేసు తీసుకొనును, 2. ఆయన వాటిని ఆశీర్వదించెను, 3. ఆయన వాటిని విరిచెను. అప్పుడు జన సమూహములు పోషింపబడిరి. ఈ విధముగా నిన్ను కూడా ఇతరులకు ఆశీర్వాదముగా చేయాలని ప్రభువు కోరుచున్నాడు. ఆ చిన్నవాడు చేసినట్లుగా మొదటిగా నీకున్నదంతయు ప్రభువుకి ఇవ్వవలెను. అప్పుడాయన నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో ఆశీర్వదించును. అప్పుడు అనేక పరీక్షలు ఓటములు, రోగములు, మోసగించబడుట ద్వారా, అనుకున్నవి జరగకుండుట ద్వారా మరియు అనేక రీతులుగా ఆయన నిన్ను విరుగగొట్టి, నిన్ను దీనుడిగా చేసి మరియు మనుష్యుల దృష్టిలో నిన్ను ఏమి కానివాడుగా చేయును. అప్పుడు నీ ద్వారా ఆయన అనేకులను ఆశీర్వదించును. కాబట్టి ఆయన చేత విరుగగొట్టబడుటను అంగీకరించుము. ప్రభువైన యేసు మొదటిగా నలుగగొట్టబడి మరియు తండ్రి ఉద్దేశ్యము ఆయన ద్వారా సఫలపరిచెను (యెషయా 53:10-12).
ఆయన జీవితములోని అనేక పరిస్థితులలో తన స్వచిత్తము నలుగగొట్టబడుటకు ప్రభువైన యేసు అనుమతించారు. ఆవిధముగా ఆయన ఎటువంటి మచ్చ లేకుండా తండ్రికి అప్పగించగలిగెను. దీనికొరకే పరిశుద్ధాత్మ ఆయనను బలపరిచెను (హెబీ 9:14). నీ సొంత శక్తిని విరుగగొట్టుటకు పరిశుద్ధాత్మ శక్తిని నీవు అనుమతించినప్పుడే నీవు ఆత్మీయుడవగుదువు. దేవుని చిత్తముకాక నీ స్వచిత్తము నెరవేర్చవలెనని బలమైన కోరిక నీకున్నప్పుడు అది విరుగగొట్టబడాలి.
నీ స్వచిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడైతే దేవుని చిత్తము ఉంటుందో అక్కడ నీవు సిలువను కనుగొందువు. అక్కడ నీ స్వచిత్తము సిలువ వేయబడాలి. నీ చిత్తమునకు చనిపోవాలి. ఆత్మ నీకు చెప్పును, నీవు ఎల్లప్పుడూ ఆత్మ స్వరమునకు లోబడుచున్నయెడల, నీవు విరుగగొట్టబడిన వాడిగా జీవించెదవు. మరియు ఎల్లప్పుడు విరిగి నలిగిన హృదయము గలవారిని ఉజ్జీవింపచేసెదనని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. ''మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు -నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను, అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను'' (యెషయా 57:15).
నీవు ఆత్మ విషయములో దీనుడవై అన్ని సమయములలో నీ యొక్క అవసరము ఎరిగియుండుట మంచిది. ఆసక్తితో దేవునిని వెతికే వారికి ఆయన ఫలమిచ్చునని కూడా నమ్మవలెను. దేవుడు నిన్ను ఆశీర్వదించి మరియు ఆయన శక్తితో నిన్ను నింపును అని నీవు నమ్మనియెడల, నీవు దీనాత్మను కలిగియుండుట వ్యర్థము.
ప్రతీ సంఘములోని బీదలతోను మరియు బలహీనులైన వారితో సహవాసము చేసి మరియు వారిని ప్రోత్సహించుము. చాలామంది పిల్లలను నిర్లక్ష్యము చేసెదరు గనుక వారిని చేరదీసి ప్రోత్సహించుము. మరియు సంఘములో ఎల్లప్పుడు కనబడకుండా చేసే సామాన్య పరిచర్య చేయుటకు ఇష్టపడాలి. ఏ సంఘములో అయినను పేరు ప్రతిష్టలను కోరక మరియు నీకున్న వరములను బట్టియు తలాంతులను బట్టియు ఎవరిమెప్పును కోరవద్దు. ముఖ్యముగా యౌవనస్త్రీలను ఆకట్టుకొనకుండా జాగ్రత్తపడాలి. ఒక మందిరములో ఊడ్చుటకు లేక సంగీతము వాయించుటకు కాని లేక నీకు చేతనైన ఏ పరిచర్యను చేయుచు మరియు ప్రతి కూటములో సాక్ష్యము చెప్పుము. పరిచర్య విషయములో ఎవరితో అయినను పోటీపడవద్దు. నీవు నమ్మకముగా ఉండినట్లయితే తగిన సమయములో దేవుడు తన చిత్తక్రారము నీకు ఒక పరిచర్య ఇచ్చును.
త్రాగుడుకు బానిసలైన యౌవనస్థులకు సహాయపడే విషయములో జ్ఞానము కలిగియుండుము. అటువంటి వారికొరకు సహాయపడుటకు మొదటిగా దేవునికి ప్రార్థించినయెడల దేవుడు జ్ఞానమిచ్చును (యాకోబు 1:5). నిజానికి అటువంటి వారికి సహాయపడుటకు నీకు అవసరమైన జ్ఞానమంతటిని ఇచ్చెదనని ఆయన వాగ్దానము చేసియున్నాడు (లూకా 11:5-8).
నీ యొక్క పిలుపు:
ఈ లోకములో చాలాచాలా కొద్దిమందే దేవుని యొక్క బిడ్డలున్నారు. దేవుని కృపను బట్టి ఆ కొద్దిమందిలో నీవు ఒకడవై యున్నావు. చిన్న వయస్సునుండే నీవు సువార్తను వినుటకు దేవుడు అనుగ్రహించినందుకు నీవు ఎంతో కృతజ్ఞత కలిగియుండవలెను. నీకు పరలోకపు జన్మహక్కు ఉన్నది. ఈ చెడ్డ లోకములో దేనికొరకైనను దానిని వదులుకొనకుము. ఈ లోకములో గొప్పవాటిని మరియు ఘనమైన వాటిని అభిమానించుచున్న యెడల, నీవు ఒకరోజు దానికి మొక్కుదువు. ఈలోక మహిమను పొందుటకు ప్రభువైన యేసు సాతాను చేత శోధించబడెను. కాని ఆయన జయించాడు మరియు నీవు కూడా జయించగలవు. నీవు జయించువాడవు అగుదువని నేను నమ్ముచున్నాను.
నీవు శోధింపబడినప్పుడు గెలిచిన యెడల, సాతాను కంటే నీకు ప్రభువైన యేసు అమూల్యమైన వాడని ఋజువు పరచుచున్నది. భూమి మీద ఈ సత్యమునకు కొందరే సాక్షులు ఉండుటవలన, నీవు అటువంటి సాక్ష్యము కలిగియుండవలెనని దేవుడు ఆశించుచున్నాడు.
ఇదియే నీయెడల దేవునియొక్క పిలుపు, రాబోయే కాలములో నీవు ఆయన సేవకుడవు అగునట్లుగా ప్రభువు సహాయపడునట్లు నేను ప్రార్థించుచున్నాను. కాబట్టి నీ జీవితము పవిత్రముగా ఉండునట్లుగా చూచుకొనుచు మరియు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థించుము. నీవు డబ్బును వృథా చేసికొనక నీ జీవితములోను, సమయములోను క్రమశిక్షణ కలిగియుండుము. నీ వయస్సులో ఉన్న అనేకమంది యౌవనస్థులవలె సమయము వృథా చేసుకొనుచు మరియు దేవుని పిలుపును పోగొట్టుకొనిన వారివలె ఉండకుండునట్లు జాగ్రత్తపడుము.
నీవు ఈ భూలోకములో అద్భుతమైన జీవితమును మరియు పరిచర్యను కలిగియుండి మరియు ఒకరోజు దేవుని రాజ్యములో ప్రవేశించునిమిత్తము దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. అంత్యదినములలో నీవు సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను.
వివాదము మరియు పోటీతత్వము:
మనుష్యులందరిని ప్రేమించుము కాని అదే సమయములో అందరినుండి విడుదల పొందుము. ఆత్మీయ అభివృద్ధి పొందుటకు ఇదియే మార్గము. వివాదస్పదమైన వాదములను అస్సలు పెట్టుకొనవద్దు. ఇండియాలోని బజారులలో ఉన్న గోతులలో పడకుండా తిరిగివెళ్ళుము లేనట్లయితే అవినిన్ను కుదించగలవు. నీ నాలు గురించి నీవు జాగ్రత్తపడవలెనని దేవుడు కోరుచున్నాడు. మన మాటల ద్వారా ఎక్కువగా శక్తిని కోల్పోవుదము. ప్రతీరోజు నిన్ను ఆత్మతో నింపమని దేవునికి ప్రార్థించుము మరియు జారిపోకుండా జాగ్రత్తపడుము.
ఇతర ప్రాంతములో ఉన్న వేరే సంఘముల గురించి మాట్లాడుటకు ఎల్లప్పుడూ నిరాకరించుము. ఇతర సంఘములలో ఉన్న విషయములమీద తీర్పుతీర్చుచున్న వ్యక్తికి తన గురించి తనకి చాలా గొప్ప తలంపులు ఉన్నవి. మనుష్యుల హృదయములలో ఉన్న రహస్యములు బయలు పరచబడుటకు వేరేవేరే సంఘములలో జరిగే సంఘటనలు సహాయపడును (లూకా 2:34,35). వారియొక్క సొంత విషయము గురించి మాత్రమే ఆలోచించేవారిని దేవుడు ఆయన బిడ్డలలో పరీక్షించును. నీవు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడగునట్లు చూచుకొనుము. అనవసరమైన అభిప్రాయములనుండి విడుదల పొందుము. ప్రార్థన కొరకని క్రైస్తవుల మధ్యలో జరుగుతున్న కొండెములనుండి విడుదల పొందుము. అటువంటి కొండెములు చెప్పుటను నిరాకరించుము.
యౌవనస్థుడుగా, నీ యొక్క సరిహద్దును గుర్తించుట నీకు మంచిది. ఒక పెద్ద సహోదరుడు మాట్లాడే విషయములను, నీకు అటువంటి జ్ఞానము లేదుగనుక మాట్లాడకుండుట మంచిది. నీకు ఉన్న ఒప్పుదల విషయములలో ఖచ్చితముగా ఉండి, ఎప్పటికీ రాజీపడవద్దు మరియు ఎవ్వరిని ఆ విషయములో నిన్ను మార్చకుండునట్లు చూచుకొనుము. కాని సాధ్యమైనంత వరకు నీవు దీనత్వములో అందరియెడల సమాధానమును మరియు సహవాసమును కోరుకొనుము. ఇటువంటి సమతుల్యతను కొందరు యౌవనస్థులు కొన్నిసార్లు కలిగియుండలేరు, కాని అటువంటి సమతుల్యతను కలిగియుండుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించుము.
నీవు వెళ్ళుచున్న సంఘములోని సహోదర సహోదరిలందరిని గౌరవించుము. నీవు ఎవరిని తిరస్కరించవద్దు మరియు ఎవరితోనూ వాదన పెట్టుకొనవద్దు. ఎందుకనగా అది నిన్ను నాశనము చేయును. ప్రతి విశ్వాసినుండియు మంచి దానిని స్వీకరించుము అలాగే నీవు సహవాసము చేసే సంఘమునుండియు మంచి వాటిని స్వీకరించుము కాని ఎల్లప్పుడూ వివేచన కలిగియుండుము. ''పాములవలె వివేకులను మరియు పావురము వలె కపటము లేని వారుగా ఉండుము''. నన్ను మరల చెప్పనివ్వండి, ప్రతివిషయమును దేవుని వాక్యములో నుండి చూడకుండా మరియు నీవు చూచే దానిని అంతటిని వినే దానంతటిని స్వీకరించకుము. బెరియన్ల వలె ఉండుము (అపొ.కా. 17:11).
మనస్సాక్షి మరియు నీతి:
మేము ఎన్ని విషయములలో మీ గురించి మా కుమారులుగా మెచ్చుకొనుచున్నామో మీకు తెలియదు మరియు సమయమున్న యెడల ఇంకా ఎన్నో విషయములు గురించి నేను ఆలోచించవచ్చును.
''నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము'' ఇది మొట్టమొదటి హెచ్చరిక (సామెతలు 23:17).
మనము పరలోక రాజ్యములో ప్రవేశించవలెనని కోరినయెడల, పరిసయ్యుల నీతికంటే మననీతి అధికముగా ఉండవలెనని ప్రభువైనయేసు చెప్పిన మాటలను మరిచిపోవద్దు (మత్తయి 5:20). దాని తరువాత వెంటనే మనము కోపపడకూడదనియు (మత్తయి 5:22), మొహపుచూపు చూడకూడదనియు (5:28), అసత్యములో ఉండకూడదనియు (5:37), పగతీర్చుకొనకూడదనియు (5:38-44), మనుష్యుల మెప్పును కోరకూడదనియు (మత్తయి 6:1-18) మొదలగు వాటిని ప్రభువైన యేసు వివరించారు. మరొక మాటలో చెప్పవలెనంటే, మన అంతరంగ జీవితము, బాహ్య జీవితము ఒకటిగా ఉండాలి. ధర్మశాస్త్రము ద్వారా ఈ విధముగా ఏ ఒక్కరు జీవించలేరు. కాని మనము ఈ విధంగా జీవించుటకు ప్రభువైన యేసు ఒక మార్గము తెరిచారు. దీని కొరకు నీ హృదయమంతటితో నీవు కోరుకొని మరియు సహాయము కొరకు దేవునికి ప్రార్థించాలి. ఆయనను వెదకువారికి ఫలమిచ్చే దేవుడు గనుక ఆయన నీ ప్రార్థనలకు జవాబు ఇచ్చును.
మనస్సాక్షిలో సున్నితత్వము కోల్పోవుట అనగా కుష్ఠురోగముతో శరీరము స్పర్శను కోల్పోవును. ఇది చాలా తీవ్రమైన విషయము. ఇది అంతటను విస్తరించి చివరకు నిన్ను నాశనము చేయును. కాబట్టి ప్రభువు నుండి నిన్ను దూరము చేసేవారితో సహవాసము చేయవద్దు. నీవు లోకస్థులతోను మరియు నామకార్థ విశ్వాసులతోను జాగ్రత్తగా ఉండవలెను. వారు నిన్ను క్రమముగా లోకములోనికి నడిపించుచున్న యెడల మరియు నీవు వారిని ప్రభువువైపు ఆకర్షించనియెడల, అప్పుడు అటువంటి స్నేహితులను వెంటనే విడిచిపెట్టి, వారిని నీవు క్రమక్రమముగా ప్రభువులోనికి నడిపించగలిగిన యెడల వారితో స్నేహము చేయుము. లేనియెడల నీవు చివరకు ఎంతో నష్టపోవుదువు.
జీవ కిరీటము:
యాకోబు 1:12 ఇట్లు చెప్పుచున్నది, ''శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును''. ఈ వచనము ప్రకారము ప్రభువును ఎల్లప్పుడూ ప్రేమించుచు మరియు శోధనలు వచ్చినప్పుడు నమ్మకముగా ఉండినయెడల జీవకిరీటము పొందెదము. కాబట్టి శోధనలు వచ్చిన ప్రతీసారి నమ్మకముగా ఉండువారు మాత్రమే ప్రభువును ప్రేమించుచున్నామని చెప్పగలరు.
కాబట్టి నీకు శోధనలు వచ్చినప్పుడే ప్రభువుయెడల నీకున్న ప్రేమ పరీక్షింపబడుతుంది. మనము అంగీకరించబడినప్పుడు మాత్రమే జీవకిరీటము పొందెదమని మనము చదువుచున్నాము. ఇప్పటివరకును ఎవరునూ జీవకిరీటము పొందలేదు గనుక జీవితాంతము వరకు నమ్మకముగా ఉన్నవారిని దేవుడు అంగీకరించునని తెలుసుకొనుము. కాబట్టి జీవితాంతము వరకు పరిశీలన కాలములో ఉండెదము. కొంత కాలము ఎంతో ఉజ్జీవముగా ఉండి మరియు తరువాత వెనుకంజవేసి లేక నులువెచ్చని స్థితికి వెళ్ళవచ్చును.
ప్రతిదినము నమ్మకముగా ఉండుము. మరియు ఎల్లప్పుడు మొరపెట్టుము. నీ గదిలో నీవు గొప్ప శబ్దముతో ప్రార్థించలేనియెడల అన్ని సమయములలో నీ హృదయములో మొరపెట్టుము. ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగియుండి మరియు ప్రతీపరిస్థితిలో నిన్ను నీవు తగ్గించుకొని పరిశుద్ధాత్మతో నింపబడుచు ఉండుము.
మనతో అంగీకరించని వారిమీదకు అగ్నిని కురిపించమని లేక తీర్పు తీర్చమని చెప్పకూడదు. ఒకసారి యోహాను మరియు యాకోబులు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు ఇట్లు గద్దించారు. ''మీరు ఎటువంటి ఆత్మను కలిగియున్నారో మీకు తెలియదు. ఎందుకనగా మనుష్యులను నాశనముచేయుట కాక వారిని రక్షించుట కొరకే మనుష్యుకుమారుడు వచ్చియున్నాడు'' (లూకా 9:51-56). తమతో అంగీకరించని వారు నష్టపోవలెనని కోరేఆత్మ సాతాను యొక్క ఆత్మ.
లూకా 9:49-56 చదవండి. అక్కడ శిష్యులతో కొందరు అంగీకరించలేదు. (వారికి వేరే పరిచర్య కలదు) మరికొందరు ప్రభువైన యేసును ఆయన శిష్యులను చేర్చుకొనలేదు. ప్రభువైనయేసు గద్దించిన విధానము గురించి ధ్యానించుము. అప్పుడు నీవు ఈనాడు క్రైస్తవ్యములోని నామకార్థవిశ్వాసులలో ఉన్న తప్పుడుఆత్మను గురించి, ఆ తప్పుడు ఆత్మనుండి రక్షింపబడెదవు. ఎల్లప్పుడూ ఈ విధముగా ప్రశ్నించుకొనుము. ''ఇక్కడ ఎవరినైనను రక్షింపవలెనని కోరుచున్నానా లేక నాశనము చేయవలెనని కోరుచున్నానా?''.
దేవుడు ఆదామునకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానికి అవిధేయత చూపెను. దేవుడు చిన్నపిల్లలకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ''నీ తల్లిదండ్రులను సన్మానించుము (అనగా వారికి విధేయత చూపించి వారిని గౌరవించుము) మరియు వారు దానికి అవిధేయత చూపెదరు. ప్రభువు మనలను ప్రేమించినట్లే మనము ఒకరికొకరు ప్రేమించవలెనని ఒకే ఒక ఆజ్ఞ ప్రభువైన యేసు తన శిష్యులకిచ్చారు. మరియు అనేకమంది క్రైస్తవులు దానికి అవిధేయత చూపెదరు.
మనము ఇతరులను ప్రేమించినప్పుడు మాత్రమే ప్రభువుని ప్రేమించగలుగుచున్నామని ఋజువుపరచగలము. లేనట్లయితే అబద్ధికులమని యోహాను చెప్పుచున్నాడు (1 యోహాను 4:20).
సాతాను యొక్క గుర్తులు:
సాతాను గురించి కొన్ని విషయములు తెలుసుకొనుట మంచిది. శత్రువుల గురించి తెలుసుకొనుట ద్వారాను మరియు అతని కుయుక్తులు తెలుసుకొనుట ద్వారాను సులభముగా జయించగలము. మన ప్రాణములకు శత్రువు అయిన సాతాను గురించి కొన్ని విషయములు ఇక్కడ ఉన్నవి:
1.సాతాను యొక్క ఆరంభము: ప్రధాన దూత తన అందమును బట్టియు, జ్ఞానమును బట్టియు మరియు స్థానమును బట్టియు మరియు దేవుడు తన చుట్టూ ఉంచిన పరిధులను బట్టియు తృప్తిపడక మరియు దేవుని అధికారమునకు తిరుగుబాటు చేసి సాతానుగా మారెను. (యెషయా 14:12-15, యెహెజ్కేలు 28:12-19).
2. సాతాను యొక్క వివరణ: అవ్వ దేవుని వాక్యమును మరియు దేవుని ప్రేమను అనుమానించునట్లుగా చేసి మోసముతో, ఆమెను మరియు ఆమె భర్తను నాశనము చేసెను. (ఆదికాండము 3:4-7). ఆకర్షణలోను కుయుక్తితోను వచ్చు సర్పము యొక్క స్వరము గురించి జాగ్రత్తపడుము.
3. సాతాను ఉపయోగించే పద్ధతులు: దేవుని వాక్యముకంటే తన శరీరఅవసరతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చునట్లును,
ఘనత పొందుటకు దేవుని నామములో గొప్పకార్యములు చేయుటకును,
తనకు నమస్కారము చేసినయెడల లోక రాజ్యముల మహిమ అన్నిటిని ఇచ్చెదనని సాతాను ప్రభువైన యేసును శోధించెను. మన ఒప్పుదలకు రాజీపడిన యెడల, ఈ లోకములో అనేక విషయములు సాతాను మనకు ఇచ్చునని చెప్పును (మత్తయి 4:1-10).
4. సాతాను ఓడించబడెను: ప్రభువైనయేసు యొక్క సిలువ మరణము ద్వారా సాతాను శక్తిహీనునిగా చేయబడ్డాడు మరియు ఇప్పుడు ప్రభువైన యేసు నామములో అతనిని ఎదిరించిన యెడల, అతడు పారిపోవును (హెబీ 2:14, కొలొస్స 2:15, యాకోబు 4:7).
5. దేవుడు సాతానును ఎందుకు నాశనము చేయలేదు: యోబువలె మనము కూడా సాతానుచేత పరీక్షింపబడి మరియు ఆత్మీయముగా బలవంతులు అవ్వవలెనని దేవుడు కోరుచున్నాడు (యోబు 1 మరియు 2వ అధ్యాయములు).
కాబట్టి సంఘములు మరియు విశ్వాసులు సాతానుచేత పరీక్షింపబడుట దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళిక అయియున్నది. మనము పాపము చేయుటకు శోధించబడినప్పుడు లేక సాతాను మనలను మోసగించవలెనని కోరినప్పుడు, మనము దేవునియెడల భయభక్తులు కలిగియుండి మరియు పాపమును ద్వేషించినయెడల దేవుడు మనలను జ్ఞానవంతులుగా చేసి మరియు మంచిచెడు విషయములలో మనకు వివేకము ఇచ్చును. ఆవిధముగా దేవుడు కోరిన విధముగా మనము జ్ఞానములో అభివృద్ధిపొందుచు పరిశుద్ధతలోను జ్ఞానములోను అభివృద్ధిచెందెదము.
మనుష్యుల యొక్క అభిప్రాయము నుండి స్వతంత్రులగుట:
ఇతరుల యొక్క అభిప్రాయములనుండి స్వతంత్రులగుటద్వారా క్రైస్తవుడు అభివృద్ధి చెందునని నేను కనుగొన్నాను.
హెబ్రీ 4వ అధ్యాయములో ''దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించుట'' అను మాట క్రొత్త నిబంధనలో ముఖ్యమైయున్నది. ''మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు'' (13వ). చివరకు మనము లెక్క చెప్పవలసిన దేవునియెదుట జీవించుటను నేర్చుకొనుట ద్వారా మాత్రమే దేవుని విశ్రాంతిలో ప్రవేశించగలము. చిన్న వయస్సులోనే ప్రజల అభిప్రాయములో నుండి విడుదలపొంది మరియు ఎవరిని నిర్లక్ష్యముచేయక, ఎవరికంటే గొప్పవారమని అనుకోక ఉండుట ఎంతో మంచిది.
క్రైస్తవ్యములోని ప్రతి యొక్క డినామినేషన్‌లో సంగతులు చలించును గనుక ఆ దినమున నీవు ప్రభువులో బలముగా నిలిచియుండవలెను. కాబట్టి ఇప్పుడే దాని కొరకు సిద్ధపడుము. మతానుసారులైన క్రైస్తవులనుండి నేను పొందిన వ్యతిరేకత అంతటి ద్వారా మనుష్యులందరియొక్క అభిప్రాయము నుండి విడుదల పొందియున్నాను. గత కొన్ని సంవత్సరములలో నాకు దేవునిలో ఉన్న సమాధానము, విశ్రాంతి ఇంతకు ముందు ఎన్నడునూ లేదు. మీలో కూడా అటువంటి విశ్రాంతి మరియు సమాధానము ఉండవలెననని కోరుచున్నాను.
దైవభక్తి యొక్క మర్మమును గూర్చి మనము తెలుసుకొనిన యెడల అనగా ప్రభువైన యేసు శరీరధారియైవచ్చి, మన వలే శోధింపబడినప్పటికిని పాపము చేయలేదు (హెబీ 4:15, 1 తిమోతి 3:16). ఈ సిద్ధాంతములను వివరించుట ద్వారా మనము క్రీస్తు యొక్క జీవములోను, స్వభావములోను పాలివారమగుతూ మరియు యేసువలె జీవించుటను పోగొట్టుకోకూడదు. ఒక సామెతలో చెప్పబడినట్లు, ''మనము చెట్టుకొరకు ఒక అరణ్యమును పోగొట్టుకొనవచ్చును'' అనగా పెద్ద విషయముల కంటే చిన్న విషయములను ప్రాముఖ్యమైనవిగా చూడవచ్చు.
అనేక సంవత్సరముల నుండి పరిశుద్ధత బోధిస్తారు గాని ఒకరినొకరు నిందించుకొనుచు మరియు ఒకరిమీద ఒకరు ఫిర్యాదుచేయుట మనము చూచుచున్నాము. అనగా ఈ సంవత్సరములన్నింటిలో వారు సిలువ మార్గములో నడవలేదు. వారికి సిద్ధాంతము మాత్రమే తెలియును.
సమయమును సద్వినియోగము చేసుకొనుట:
మన అజాగ్రత్త ద్వారా మరియు పాపము చేయుట ద్వారా పోగొట్టుకొనిన సమయమును మరల పొందలేము. దేవుడు మనయొక్క పాపజీవితమును క్షమించి మరియు ఆయన రాజ్యములోనికి తీసుకొనిపోవును కాని మనము వృథా చేసుకొన్న సమయమును దేవుడు కూడా తిరిగి ఇవ్వలేడు. వృథా చేసుకొన్న సమయమును నిత్యత్వానికి కోల్పోయినట్లే దానిని తిరిగి మనము పొందలేము. కాబట్టి చిన్న వయస్సు నుండే ప్రభువుని వెంబడించుట మంచిది. ఈ భూమిమీద కొద్దికాలమే జీవించెదము. కాబట్టి నీవు సమయమును సంపాదించుకొనుచు ప్రతి శోధనను జయించుటకు ప్రయత్నించుము. మరియు అందరికీ మేలు చేయుము. ఏది ఏమైననూ దీనత్వములోను, పవిత్రతలోను మరియు ప్రేమలోను వేరు పారవలెను.
ప్రభువైన యేసు మరల తిరిగివచ్చినప్పుడు, ఆయనను ముఖాముఖిగా చూచి మరియు మనము పొందిన వెలుగునుబట్టి జీవించిన జీవితమును బట్టి ఆయన ఎదుట సిగ్గుపడకూడదు. అనేకమంది విశ్వాసులు ఆ రోజున పరలోకములో ప్రవేశించినప్పటికిని, వారు ప్రభువైన యేసును చూచి మరియు ఆయనయొక్క ప్రేమను చూచి ఎంతో దు:ఖముతో చింతించెదరు. అటువంటి బాధనుండి దేవుడు నిన్ను కాపాడునుగాక. దానిని గురించి నీవు ఇప్పుడే ధ్యానించి మరియు జ్ఞానము కలిగియుండుము. ఏశావువలె ఒకపూట కూటికొరకు (శరీరేచ్ఛలను నెరవేర్చుటకు) ఆత్మీయ ఆశీర్వాదమైన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకొనవద్దు.
''అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు'' (హెబీ 12:14).
''ఆయనను మనము చూచినప్పుడు, ఆయనకు మనము ఎక్కువ ఇచ్చియుండవలసియున్నదని కోరెదము''
దేవునియెడల భయభక్తులు:
ప్రభువైన యేసు చిన్న వయస్సులో నుండే జ్ఞానములో ఎదిగెనని మనము చదివెదము (లూకా 2:40, 52). యౌవనస్థులు అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేసెదరని మనము ఊహించెదము. ప్రభువైనయేసు యౌవన వయస్సులో ఉన్నప్పుడు ఒక్క బుద్ధిహీనమైన పని కూడా చేయలేదు. నీవు ఆయనను మాదిరిగా పెట్టుకొనినయెడల, నీ యౌవన వయస్సులో అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయకుండా కాపాడబడెదవు. దేవునియెడల భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. ప్రభువైనయేసు భయభక్తులు కలిగియుండి మరియు ఆత్మీయ మరణమునుండి రక్షింపబడుటకు ప్రార్థించెను (హెబీ 5:7). ప్రభువైన యేసును ప్రేమించినట్లే దేవుడు మనలను కూడా ప్రేమించుచున్నాడు. ప్రభువైన యేసు వలే నీవు భయభక్తులు కలిగియున్న యెడల ఆయన నీ ప్రార్థనలకు కూడా జవాబు ఇచ్చును.
ఆదికాండము 22:12లో అబ్రాహాము తన ఒక్క కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, ''నీవు దేవుడికి భయపడువాడవని'' అబ్రాహాముతో దేవుడు చెప్పెను. అబ్రాహాము ఆ పర్వతము మీద దేవునికి విధేయత చూపించాడు. తన యొక్క విధేయతను దేవుడు మాత్రమే చూడవలెనని కోరాడు. రాత్రి కాలములో అబ్రాహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడెను (ఆదికాండము 22:1). దేవుడు అతనితో చెప్పిన విషయము ఎవరికీ తెలియదు మరియు అబ్రాహాము రహస్యముగా దేవునికి విధేయత చూపించాడు. ఎవ్వరూ చూడనప్పుడు నీవు రహస్యముగా చేసే క్రియలను బట్టి, నీవు దేవునికి భయపడుచున్నావా లేదా అని కనుగొనవచ్చును.
యోబు దేవునియెడల భయభక్తులు కలిగియున్నాడని దేవుడు సాతానుతో చెప్పెను (యోబు 1:8). సాతానుకి అందరి రహస్యజీవితము తెలియును. గనుక నీ గురించి కూడా దేవుడు, యోబువలె అతిశయించుట మంచిది. ఎందుకనగా సాతాను లోకమంతా సంచరించుచున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండునట్లు యోబు తన కళ్ళతో నిబంధన చేసుకొనియున్నాడు (యోబు 31:1). బైబిలు లేకపోయినప్పటికిని, పరిశుద్ధాత్మతో నింపబడి, తనకు సవాలు చేసి ప్రోత్సహించే సహోదరులు లేనప్పటికిని, ధర్మశాస్త్రము కూడా లేకపోయినప్పటికిని అతడు అటువంటి నిర్ణయము తీసుకొనుట ఆశ్చర్యకరము. తీర్పు రోజున యోబు లేచి దురాశలతోను మరియు పాపముతోను నిండిన ఈ లోకమునకు తీర్పు తీర్చును.
నీవు వెంబడించుటకు యోసేపు మరియొక మంచి మాదిరి. అతడు చిన్నవాడైనప్పటికిని తల్లిదండ్రులకు ఎంతో దూరముగా ఉన్నాడు. కాని అతడు దేవునికి భయపడినందున ఒక పాపాత్మురాలైన స్త్రీ అతనిని ప్రతి రోజు ప్రేరేపించినప్పటికిని అతడు ఒప్పుకొనక ఆమె యొద్దనుండి పారిపోయెను.
లైంగికవాంఛ మరియు వ్యభిచారమునుండి కాపాడబడుటకు యోబు మరియు యోసేపులవలె దేవుని యెడల భయభక్తులు కలిగియుండినచో సరిపోవును. దేవునియెడల భయభక్తులే జ్ఞానమునకు ఆరంభము.
నిన్ను గూర్చి నీవు జాగ్రత్తపడినట్లయితే, అప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడును (1 తిమోతి 4:15, 16).
స్తుతియాగము అనే బలిని మనము దేవునికి సమర్పించాలి (హెబీ 13:15). కష్ట పరిస్థితిలో ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యెడల అది ఒక బలిగా ఉండును. నీ దేవుడు పాలించుచున్నాడు అనునది సువార్తలోని శుభవార్త అయియున్నది (యెషయా 52:7 మరియు రోమా 10:15). ఆయన ఎల్లప్పుడూ పరిపాలించుచున్నాడు. గనుక మనకు ఏది జరిగినప్పటికిని అన్ని పరిస్థితులలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము.
ప్రభువైనయేసు మత్తయి 24లో చెప్పినట్లు అంత్యదినములు నోవహు కాలమువలె నుండినట్లయితే, ఈ దినములలో కూడా నోవహు వలె పాపమునకు మరియు దుర్నీతిని వ్యతిరేకించి మరియు సత్యముకొరకును పవిత్రతకొరకును దేవునికొరకు నిలిచియుండెదరు.
నీవు సంపూర్ణముగా పవిత్రపరచబడువరకు, లైంగిక విషయాలలో పోరాడాలి. ఒక అమ్మాయితో నీవు మాట్లాడే విధానమునుబట్టి కూడా నీవు కలుషితము కావచ్చును. ప్రభువైన యేసువలే పవిత్రుడగువరకు నీవు సాగిపోవాలి. ఒక స్త్రీతో ప్రభువైన యేసు మాట్లాడుచున్నప్పుడు, ఆయన శిష్యులు ఆశ్చర్యపడిరి అని మనము చదువుతాము (యోహాను 4:27). అది ఆయన యొక్క సాక్ష్యము. నీవు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు నీవు తీవ్రముగా లేకుండా మాట్లాడినట్లయితే, నీవు ఆ విషయములో పూర్తి జయమును పొందలేవు. కాబట్టి జాగ్రత్తగాఉండుము.
ప్రభువైన యేసు మార్గములో వెళ్ళుము:
నీ జీవితము ముగింపు ఆరంభంకంటే శ్రేష్టమైనదిగా ఉండాలి (పస్రంగి 7:8). మనమందరము కూడా చిన్న బిడ్డలమై జీవితమును ఆరంభించెదము. మన జీవితము శ్రేష్టమైన విధముగా ముగించుట అనగా, మనము పసిబిడ్డలవలె పాడుటయే గాక జ్ఞానము కూడా కలిగి ఉండవలెను (1 కొరింథీ 14:20). కాని నీవు శోధన సమయములో నమ్మకముగా ఉండినట్లయితేనే దానిని చేరుకొనగలవు. అన్ని విషయములలో జ్ఞానము పొందుటకు పూర్ణహృదయముతో వెదకుము.
సిలువ మీద అనేక విషయములు సంభవించినవి:
1. మన పాపముల యొక్క శిక్షను ప్రభువైన యేసు భరించారు (1 కొరింథీ 15:3)
2. మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడియున్నాడు (నేను అను అహము) కాబట్టి ప్రతిదినము మృతుడవని ఎంచుకొని మరియు ప్రభువుని వెంబడించాలి (రోమా 6:6,11)
3. ఈ లోకమును, ఈ లోకములో ఉన్న మహిమనుండి విడుదల పొందునట్లు, మన విషయములో లోకము సిలువ వేయబడింది (గలతీ 6:14).
4. మనకు ఎన్నటికిని హాని చేయకుండునట్లు సాతాను ఓడించబడియున్నాడు. అతని విషయములో మనము భయపడము లేక అతడు మనకు ఏదియూ చేయలేడు (కొలొస్స 2:14, 15, హెబీ 2:14).
5. మనము దేవుని ఆశీర్వాదమునకు వారసులగునట్లు ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి నిత్యత్వానికి విడిపించబడుటకు ప్రభువైన యేసు మనకొరకు శాపగ్రస్తుడు అయ్యాడు (గలతీ 3:13, 14).
ప్రభువైన యేసు వెళ్ళిన మార్గము చేత అనేకులు పట్టబడనందువలన అంత్యదినములలో అభ్యంతరపడి తప్పిపోయెదరు. ప్రభువైన యేసు దేవుడుగా ఉండుటను విడిచిపెట్టి, శరీరధారియై మనుష్యులందరికి దాసుడగుట ద్వారా తగ్గించుకొన్న విషయము చేత మీరు పట్టబడాలి. ఎల్లప్పుడునూ, ప్రభువుయెదుట నీ ముఖమును దుమ్ములో పెట్టుకొన్నయెడల నీవు జయించువాడవగుదువు (పక్రటన 1:17).
క్రీస్తుయొక్క గుణలక్షణములు మనలో విస్తరించుట:
క్రీస్తుయొక్క గుణలక్షణాలు మనలో ఎల్లప్పుడూ అంతకంతకు విస్తరించుట ద్వారా మాత్రమే మనము తప్పిపోకుండా కాపాడబడగలము (2 పేతురు 2:5-10).
ప్రభువైనక్రీస్తు న్యాయపీఠము గురించి అనేకసార్లు తలంచవలెనని నిన్ను ప్రోత్సహిస్తున్నాను. అనగా అనేకసార్లు నిన్ను నీవు ప్రభువు ఎదుట పెట్టుకొని నిన్ను తీర్పుతీర్చమని అడుగుము. మనలను మనము తీర్పుతీర్చుకొనిన యెడల, మనము తీర్పు పొందకపోదుము (1 కొరింథీ 11:31). కాబట్టి తీర్పుదినమందు ప్రభువైన యేసు నిన్ను అడగబోయే ప్రశ్నలు గురించి ఆలోచించుము. నిశ్చయముగా ఆయనే నీ సిద్ధాంతము గురించి పరీక్షించును. గర్వమునకును, స్వార్థమునకును మరియు ధనాపేక్షకును మరియు చెడ్డతలంపులకును వ్యతిరేకముగా నీవు పోరాడి మరియు ఇతరులను ప్రేమించుటకు ప్రయాసపడియున్నావా అని ఆయన అడుగును. కాబట్టి చివరి పరీక్ష కొరకు సిలబస్‌లో ఉన్న దాని గురించే శ్రద్ధ వహించి మరియు ఇతర విషయముల కొరకు నీ సమయము వృథా చేయకుము.
ప్రభువైన యేసు ఒక సింహమును మరియు ఒక గొఱ్ఱెపిల్లయు అయియున్నాడు (పక్రటన 5:5, 6). దేవుని మహిమ విషయములోను మరియు దేవుని పవిత్రత విషయములోను ఆయన కొదమ సింహమువలెఉండి, దేవాలయములో రూకలు మార్పుచేయుచు బీదవారిని మతము పేరుతో పీడించే పరిసయ్యులును గద్దించి బయటకు పంపెను కాని తన వ్యక్తిగత విషయములో (ప్రజలు తనమీద ఉమ్మి వేసినప్పుడు మరియు దయ్యములకు అధిపతి అని ఆయనను నిందించినప్పుడు) గొఱ్ఱెపిల్లవలె మౌనము వహించెను. ఈ యొక్క మాదిరిని మనము వెంబడించాలి కాని అనేకమంది విశ్వాసులు దీనికి వ్యతిరేకముగా ఉన్నారు. దేవుని నామము అవమానించబడినప్పుడు, సంఘము రాజీపడుచున్నప్పుడు వారు గొఱ్ఱెపిల్లల వలె ఉందురు గాని ఎవరైనను వారికి కోపంతెప్పించినప్పుడు అవమానపరచినప్పుడు సింహములగుదురు అందువలననే మనము పూర్తిగా మార్పు చెందాలి.
మనస్సాక్షి మరియు విశ్వాసము:
నీతియొక్క ఫలము ఎల్లప్పుడు సమాధానమైయుంది (యాకోబు 3:18). నీ హృదయములో సమాధానము, విశ్రాంతి లేనట్లయితే నీతిని కలుగజేసే విత్తనము విత్తలేరు. అందువలన మీ హృదయములలో విశ్రాంతిలేక కలవరముఉన్నట్లయితే, ఒప్పుకొనని పాపముగాని లేక ఇతరుల విషయములో తప్పుడు వైఖరిగా భూసంబంధవిషయాలలో చింతించుటగాని కారణమైయుండవచ్చు. అప్పుడు వెంటనే నీవు దేవుని యొద్దకు వెళ్ళి నీ సొంత తలంపులను విసర్జించి నీ చిత్తమును దేవుని వైపు ఉంచి, నీ పాపమును ఒప్పుకొని, నీవు క్షమించవలసినవారిని క్షమించి, నీ చింతయావత్తు దేవునిమీద వేసి మరియు విశ్రాంతిలోనికి రమ్ము. ఏ సమయములో అయినను నీ హృదయములో కలవరమును ఉండుటకు అనుమతించవద్దు.
''నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు'' (యాకోబు 1:20).
ఎల్లప్పుడు గుర్తించుకొనుము మన జీవితమనే ఓడ ప్రయాణించుటకు మంచి మనస్సాక్షి మరియు యథార్థమైన విశ్వాసము అను పట్టులు సరిగా ఉండవలెను. ఈ రెండిటిలో దేనిని నిర్లక్ష్యము చేసినప్పటికిని ఓడ బద్దలైపోవును (1 తిమోతి 1:19,20).
కాబట్టి ఎల్లప్పుడూ నీ మనస్సాక్షి సున్నితముగా ఉండునట్లు చూచుకొనుము. నీ మనస్సాక్షి భంగపడినప్పుడు అప్పుడు నీవు సరియైన మార్గము విడిచి మరియు అపాయములో ఉన్నావని నిశ్చయించుకొనుము. మనస్సాక్షి యొక్క గద్దింపులను నిర్లక్ష్యము చేయుచూ, నీవు అలాగే కొనసాగుచున్నయెడల, నీ జీవితమనే ఓడ బద్దలైపోయే అవకాశమున్నది. కాబట్టి ఈ విషయములో నీవు ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉండుము.
నీవు క్షేమముగా వెళ్ళుటకు విశ్వాసము అనునది ముఖ్యమైయున్నది. విశ్వాసమునగా పూర్తిగా దేవుని మీద ఆనుకొనుటయు, మార్పులేని ప్రేమను ఎల్లప్పుడూ ప్రేమను సంపూర్ణముగా నమ్ముటయు ఆయన యొక్క సర్వశక్తిని, సంపూర్ణ జ్ఞానమును నమ్ముట.
దేవుడు తనయొక్క మార్పులేని ప్రేమద్వారా మన జీవితములో జరిగే వాటినన్నిటిని అనుమతించును. కొన్నిసార్లు అపరిపూర్ణమైన ప్రేమను బట్టి మన ప్రార్థనలను వినకపోవచ్చును.
మన శక్తికి మించిన శోధన మనకు రాకుండునట్లు తనయొక్క సర్వశక్తితో దేవుడు వాటిని ఆపివేయును (1 కొరింథీ 10:13) మరియు అది ఆ శోధన జయించుటకు మనకు సహాయపడును (హెబీ 4:16) మరియు సమస్తమును సమకూర్చి మనకు అతిశ్రేష్టమైన మేలు కలుగునట్లు ఆయన చేయుచున్నాడు (రోమా 8:28).
దేవుడు తన యొక్క సంపూర్ణ జ్ఞానమును బట్టి మన జీవితములో దేనిని పొరపాటుగా అనుమతించడు మరియు మన నిత్యమైనమేలు గురించి ఆయనకే తెలియును.
దేవునియొక్క ఈ మూడు గుణలక్షణములలో నీవు నమ్మకమును కోల్పోకూడదు. విశ్వాసమూలముగా జీవించుట అనగా ఇదియే. దురదృష్టవశాత్తు ఈనాడు పూర్తికాలపు పరిచర్య చేయువారికి దేవుడు వారియొక్క అవసరములు తీర్చుటయే విశ్వాసమూలముగా జీవించుట అని చెప్పుచున్నారు. ఆ వాక్యమును ఆవిధముగా ఉపయోగించకూడదు. ''నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించెదరని'' బైబిలు చెబుతుంది (రోమా 1:17). బైబిలులో ఉన్న మాటలను ఎల్లప్పుడూ బైబిలు ఉపయోగించిన రీతిగానే ఉపయోగించవలెను.
విశ్వాసవిషయములోను మరియు మంచిమనస్సాక్షి విషయములోనూ మనము నిర్లక్ష్యముగా ఉండినయెడల, నెమ్మదిగా మనలో దుష్టహృదయమును (ఒక చెడ్డ మనస్సాక్షి) మరియు విశ్వాసములేని హృదయము (విశ్వాసమును కోల్పోయినవాడు) కలుగును. ఇవి మనలను దేవునిని విడిచిపెట్టినట్లుగా చేయును (హెబీ 3:12).
ఈ విధముగా మనము తప్పిపోకుండుటకు, ప్రతి దినము ఒకరినొకరు హెచ్చరించుకొనుచూ ప్రోత్సహించుకొనుచు ఉండవలెను (హెబీ 3:12). కాబట్టి ప్రతి దినము లేఖనములను చదివి, ధ్యానించి, ప్రార్థించుటద్వారాగాని లేక కొన్ని మంచి క్రైస్తవ పుస్తకములు చదువుట ద్వారాగాని లేక సంఘకూటములలోను మరియు సీ.డిల ద్వారా ప్రసంగములను వినుట ద్వారాను ప్రోత్సహించబడాలి.
మనయొక్క తలంపులను జయించుట:
1 కొరింథీ 15:24లో సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యమును అప్పగించును. మన విషయములో కూడా ఆయన ఆవిధముగానే చేయును. మనలో ఉన్న తిరుగుబాటు అంతటిని మరియు శరీరేచ్ఛలన్నింటిని కొట్టివేసి మనలను తండ్రికి అప్పగించవలెనని ప్రభువు కోరుచున్నాడు. మనలను దేవునికి ఇచ్చుటకు ముందుగా ప్రభువైన యేసు క్రీస్తుయొక్క సిలువ శక్తిద్వారాను (క్రీస్తు మరణమనే గొప్ప ఆయుధము ద్వారాను) ప్రతి యొక్క ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టవలెను (2 కొరింథీ 10:4, 5).
మనము మనస్సులలో గొల్యాతువంటి ఆజానుబాహువుల వలె వచ్చే శోధనలు, కొట్టబడి మరియు తరిమివేయబడి మరియు పూర్తిగా లయపరచబడవలెను. మనము దేవునితో సహకరించినయెడల, మన స్వచిత్తమంతయు నశింపచేయబడుటకు అవసరమైన ప్రజలను మరియు పరిస్థితులను దేవుడు అనుమతించును. మన అంతరంగములో ఆయన పాలించేవరకు ఆయన ఈ విధముగా చేయును. అప్పుడు నీ శత్రువులందరు ఓడించబడెదరు. నీలో నీవు బలహీనుడవైయున్నప్పుడే, ప్రభువులో బలవంతుడవుగా ఉండెదవు.
నీవు ఉదయమున లేచిన వెంటనే దేవునితో కొద్ది నిమిషములు గడుపుట మంచిది. ఆ కొద్ది సమయము దినమంతటిలో గొప్పమార్పు తెచ్చును. ఆ సమయములో వేరే తలంపులను విసర్జించుము. అటువంటి సమయములలో నీకు చింతలు మరియు కలవరములు ఉన్నట్లయితే నీవు వాటినే ప్రార్థనగా చేసి మరియు నీ చింతయావత్తు దేవునిమీద వేసి కొనసాగుము.
దేవునిని ఎరుగుట:
దేవునిని ఎరుగుటయే ఈ లోకములో అతి శ్రేష్టమైన విషయము. ఎందుకనగా మనము దేవునిని ఎరిగియున్నయెడల, మనము ఎదుర్కొనే ప్రతిపరిస్థితులలో ఏమి చేయవలెనన్నది ఎరుగుదుము. మనము బలమైన పునాది మీద నిలచియున్నాము కనుక లోకమంతయు మనలను వ్యతిరేకించినను ధైర్యముగా మనము ఎదుర్కొనగలము. దేవునిని ఎరుగుటకు సమయము పట్టును. కాబట్టి నీవు యౌవనస్థుడుగా ఉన్నప్పుడే దానిని ఆరంభించుము. దేవునిని ఎరుగుటకు, ఆయనతో పోల్చినప్పుడు ఈ లోకములో ఉన్నదంతయు పెంటగా ఎంచుదుము. అనగా లోకస్థులు గొప్పగాయెంచే వాటిని బట్టి నీవు ఆకర్షించబడకుండుటయే గాక దానిని చెత్తగా చూచెదవు. పౌలు విషయంలో ఆవిధముగానే యున్నది (ఫిలిప్పీ 3:8). నీవు డబ్బునుగాని సుఖ సౌఖ్యములనుగాని మరియు ఘనతను గాని లేక లోకములో గొప్పవాటినిగాని వెంటాడినయెడల, నిత్యత్వపు వెలుగులో ఒక దినమున నీ చేతులలో ఉన్నదంతయు చెత్తేనని గ్రహించెదవు. తన యొక్క శోధింపశక్యముగాని ఐశ్వర్యమును స్వతంత్రించుకొనుటకు ఎల్లప్పుడు దేవుడు మనలను పిలచుచుండగా వ్యర్థమైన వాటి కొరకు మన జీవితమును వ్యర్థము చేసుకొనియున్నామని కనుగొనెదవు. కాబట్టి జ్ఞానము కలిగి భూవస్తువులను వాడుకొనుము (ఎందుకనగా మనం జీవించుటకు అవి అవసరము). కాని వాటిచేత కొనిపోబడవద్దు. ఎందుకనగా ఒక్కపూట కూటికొరకు నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోగలవు.
నీవు క్రైస్త జీవితము గురించి తీవ్రముగా ఉన్నావని దేవుడు చూచిన యెడల, దేవునితో నీకున్న సంబంధం విషయంలో నీవు మోసపోకుండునట్లు, నీ జీవితంలో చలించే వాటన్నింటిని ఆయన చలింపజేయును. నీ ఆత్మ కొరకు ఆయన ఎంతో ఆసక్తి కలిగియున్నాడు. కేవలము పుస్తకము (బైబిలు) ద్వారా కాని లేక వేరే వ్యక్తి ద్వారా గాని కాకుండా వ్యక్తిగతముగా నీవే ఆయనను ఎరిగి యుండవలెనని ఆయన కోరుచున్నాడు.
మనము ఇప్పుడే సరిజేసుకొనగలుగునట్లు మన నిజస్థితిని మనకు ప్రేమతో చూపించుచున్న దేవునికి స్తోత్రములు. మనము కేవలము పాపమును ద్వేషించి మరియు పవిత్రముగా ఉండుటయే సరిపోదు. ప్రభువైన యేసుతో వ్యక్తిగతముగా లోతైన సంబంధమును కలిగియుండాలి. లేనట్లయితే కేవలము నిన్ను నీవు బాగుచేసుకొనే వాడవుగా ఉందువు. ప్రభువైన యేసుతో సన్నిహితమైన సంబంధమును కలిగియుండుటకు మొదటిగా నీకు తెలిసిన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి మరియు నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు ప్రయాసపడుము. ఒక రోజులో ప్రభువుతో అనేకసార్లు మాట్లాడుటను అలవాటు చేసుకొనుము. నీ చుట్టు ఉన్నదంతయు ఒక రోజు నశించిపోయినప్పుడు, ప్రభువుతో నీకున్న సంబంధము మాత్రమే నిలచును.
ప్రభువును ఎరుగుట మాత్రమే నిత్యజీవమై యున్నది. గనుక నా కుమారులందరు ఆయనను ఎరుగవలెననే గొప్ప కోరిక నాకు కలదు (యోహాను 17:3). నేను వ్యతిరేకించబడినప్పుడు మరియు ఇండియాలోను మరియు ఇతర దేశములలోనూ ఉన్న వేరే క్రైస్తవ గుంపులు మరియు పాస్టర్లచేత నిందించబడినప్పుడు, కేవలము ప్రభువును ఎరుగుటను బట్టి, నేను భంగపడక విశ్రాంతిలో ఉండి మరియు అందరిని ప్రేమించాను. మీరు కూడా ఆవిధముగా ప్రభువును ఎరుగవలెననియు మరియు అంతకంటె ఎక్కువగా ఎరుగవలెననియు కోరుచున్నాను.
దేవునివాక్యము ఎదుట వణకుట:
మిమ్ములను అమ్మాయిలకు దూరముగా ఉంచి మరియు తప్పిపోకుండ కాపాడబడుటకు సామెతలు 7వ అధ్యాయము (లివింగు బైబిలు)ను చదివి ధ్యానించవలెనని కోరుచున్నాను. ''దాని ఇల్లు పాతాళమునకు వెళ్ళుమార్గము'' అని 27వ వచనములో గొప్ప హెచ్చరిక ఉన్నది. సామెతల గ్రంథం 1 నుండి 9వ అధ్యాయము వరకు అప్పుడప్పుడు చదువుట మంచిది.
దేవుడు చెప్పిన దానిని చేయడని సాతాను కుయుక్తితో హవ్వతో చెప్పాడు (ఆదికాండము 3:1-6). ''మీరు నిశ్చయముగా చావరని'' అతడు ఆమెతో చెప్పాడు. ఆ విధముగా అతడు హవ్వను పాపము చేయుటకు నడిపించాడు. ఈనాడు కూడా అతడు అదే పద్ధతిలో ఉపయోగించును. ''మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల మీరు చావవలసిన వారైయుందురని విశ్వాసులకు దేవుని వాక్యము చెప్పుచున్నది'' (రోమా 8:13). కాని ''మీరు నిశ్చయముగా చావరు'' అని సాతాను చెప్పును. అనేకమంది విశ్వాసులు అతనిని నమ్మి పాపములో జీవించుచున్నారు.
ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుటకంటే ఒక కంటిని కోల్పోయి గ్రుడ్డివాడిగా ఉండుటయు మరియు లైంగిక పాపమును చేయుట కంటే తన కుడి హస్తమును కోల్పోవుటయు మంచిదని ఎంతమంది నమ్ముచున్నారు. కోపమును మరియు లైంగిక పాపమును తీవ్రముగా తీసుకొనని వారు చివరకు నరకానికి వెళ్ళెదరని ఎంతమంది నమ్ముచున్నారు? (మత్తయి 5:22-30). ఒక అవిశ్వాసిని పెండ్లి చేసుకొనుట దేవుని యెదుట పిడికిలి బిగించినట్లుగా సాక్ష్యమునకు అవిధేయత చూపించినట్లని ఎంతమంది నిజముగా నమ్ముచున్నారు (1 కొరింథీ 6:14). హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవునిని చూచెదరని ఎంతమంది నమ్ముచున్నారు? (మత్తయి 5:8). మనుష్యులందరితో సమాధానమును మరియు పరిశుద్ధతను వెంటాడని వారు ప్రభువును చూడలేరని ఎంతమంది నమ్ముచున్నారు? (హెబీ 12:37). లోకములో ఈ దేవుని మాటలను నమ్మువారు బహుకొద్దిమందియే యున్నారు. క్రైస్తవులను సాతాను ఆవిధముగా మోసగించాడు. దాని ఫలితముగా అనేకమంది విశ్వాసులు దేవునియెడలను మరియు ఆయన హెచ్చరికల యెడలను భయమును కోల్పోయారు. సాతానుచేత పూర్తిగా నాశనము చేయబడేవరకు వారు పాపముతో చెలగాటమాడెదరు.
ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలవారై మరియు ఆయన మాట విని వణుకుచుందురో వారినే దేవుడు చూచును (యెషయా 66:1, 2). దేవునియొక్క ప్రతి హెచ్చరిక విషయము మనము భయపడాలి. దేవుని యెడల భయభక్తులు కలిగియున్నామనుటకు ఇదియే ఋజువు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనేవారు క్రీస్తు శరీరములో అవయవములై యుండెదరు. జయించువారే రెండవ మరణము (అగ్నిగుండం) నుండి రక్షించబడి జీవవృక్షములో పాలివారై యుందురు (పక్రటన 20:7, 11). సంఘములన్నింటిలో ఆత్మ చెప్పుచున్న మాట యిదియే. కాని వినుటకు చెవులు గలవారు చాలా కొద్దిమందియే ఉన్నారు.
మన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుట:
మన బాహ్యపురుషుడు దినదినము కృషించిపోవును. అది సహజముగా జరుగుచుండును. అయితే మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుట దేవుని చిత్తమైయున్నది (1 కొరింథీ 4:16). కాని ఇది దానంతట అదియే జరగదు.
అనేకమంది విశ్వాసులు ప్రతిదినము వారి సిలువ నెత్తికొనుచు పునరుత్థానశక్తిని అనుభవించనందున వారు నూతన పరచబడుటలేదు (లూకా 9:23). క్రీస్తు యొక్క జీవము మన అంతరంగములో అంతకంతకు విస్తరించుటద్వారా మన ఆంతర్యపురుషుడు నూతన పరచబడును (2 కొరింథీ 4:10). మత్తయి 6:34లో ప్రభువైన యేసు చెప్పినట్లుగా ప్రతిరోజు కొన్ని పరీక్షలు, శోధనలు, కొన్ని పరిస్థితులు వచ్చును. ఈ పరీక్షలలో మన సిలువనెత్తుకొని మరియు మన స్వజీవమునకు చనిపోవుచున్నయెడల, ఆ విధముగా మహిమనుండి అధిక మహిమ పొందుదుము.
మనము కొన్నిసార్లు అత్యుత్సాహముతోను మరియు కొన్నిసార్లు నిరాశతోను జీవించుట దేవుని చిత్తము కాదు. మన ఆంతర్యపురుషుడు నిరంతరము నూతనపరచబడునట్లు మనము పైనున్న వాటినే వెదకాలి. ప్రతిదినము అవకాశము వచ్చిన ప్రతిసారి క్రీస్తుయొక్క సిలువను సహించాలి. కేవలము కూటములలో ఉద్రేకరించబడుట ద్వారా దేవుని జీవాన్ని పొందలేము. కొందరు కూటములలో ఉద్రేకభరితులవుట ద్వారా ఆత్మీయముగా మారెదమని అనుకొని మోసపోవుచున్నారు. కేవలము కూటములకు వెళ్లుట ద్వారా దేవునిజీవాన్ని సమృద్ధిగా పొందుకొని అభివృద్ధిపొందలేము. మన అనుదినజీవితములలో క్రీస్తు మరణానుభవము ద్వారా వెళ్ళుట ద్వారా దేవుని జీవాన్ని సమృద్ధిగా పొందుకొని, అభివృద్ధి పొందగలము. ప్రతి దినము మనము కూటములకు వెళ్ళలేము. కాని ప్రతిదినము మనకు శోధనలు వచ్చును. గనుక ప్రతిదినము నూతనపరచబడవచ్చును. ప్రభువు మనలను సృష్టించి విలువపెట్టి మనలను కొనియున్నాడు.
గనుక మన జీవితములు ఆయనకు చెందియున్నవి గనుక మనకు ప్రతిదినము వచ్చే శోధనలలో ప్రభువును విశ్వసించుచు మరియు సణగక గొణగక యుండునట్లు ప్రతిదినము కోరవలెను. అప్పుడు మనము ప్రతిదినము నూతన పరచబడెదము. మన బాహ్యపురుషుని యొక్క శరీరము కృషియించిపోవుటను ప్రతిదినము చూడలేనట్లే, మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడుటను కూడా కొన్ని సంవత్సరముల వరకు చూడలేము. మనము నమ్మకముగా ఉన్నట్లయితే దినదినము నూతనపరచబడెదము (2 కొరింథీ 4:16). కాబట్టి పెద్ద మరియు చిన్న విషయములలో నమ్మకముగా ఉండవలెను. దేవునిని మొదటగా ఉంచుకొని మరియు ఆయన కొరకే జీవించునట్లు నీ శరీరేచ్ఛలను సిలువవేయుట ఎంతోమంచిదని నీవు కనుగొనెదవు (గలతీ 5:24).
నిత్యత్వములో చింతించకుండుట:
దేవునియెదుట ఒక సత్యమును చెప్పనివ్వండి. నా కుమారులయిన మీరు ఈ లోకములో గొప్పవారిగా గాని లేక సిరిసంపదలు గలవారిగా గాని ఉండవలెనని కోరుటలేదు. ఎందుకనగా అదంతయు పనికిరాని చెత్తవలె యున్నది. మీరు దైవభక్తి కలిగినవారై మరియు ఇండియాలోగాని మరెక్కడైనాగాని సంఘమును నిర్మించుచు మరియు మీ జీవితములలో దేవుని చిత్తమంతయు నెరవేర్చవలెనని కోరుచున్నాను. నా హృదయవాంఛలను నెరవేర్చి దానిని చూచునట్లు చేయమని దేవుని ప్రార్థించుచున్నాను.
భూసంబంధమైన జీవితములలో దేవుని యొక్క శ్రేష్టమైన దానిని పోగొట్టుకొనుట నిత్యమైన వాటిని పోగొట్టుకొనుటవలె నేను చూచుచున్నాను. ప్రభువు వారిని ఎంతగా ప్రేమించి వారికొరకు ఎన్ని శ్రమలనుభవించియున్నాడో పరలోకంవెళ్ళిన తరువాత తెలుసుకొని, వారి యొక్క హృదయములను మరియు శరీరములను మరియు ఆయన చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకొననందుకు చింతించెదరు.
ఎక్కువగా క్షమించబడినవారు ఎక్కువగా ప్రేమించెదరు (లూకా 7:47) కనుక పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోకూడదు. రక్షణ పొందకముందు మరియు రక్షణ పొందిన తరువాత నీవు ఎంతగా క్షమించబడియున్నావనే దానిని మరచిపోయినట్లయితే సులభముగా పరిసయ్యుడవగుదువు. దేవుని యెదుట పౌలువలె, నేను కూడా పాపులలో ప్రధానుడనని నన్ను నేను చూచుకొనుచున్నాను (1 తిమోతి 1:15). దేవుడు నన్ను పిలచి పరిచర్య ఇచ్చినప్పుడు నేను ఎంతో అపాత్రుడను మరియు ఎంతో అయోగ్యుడనని ఎంచుకొన్నాను మరియు ఆయన నా కొరకు చేసిన దానంతటికి బదులుగా నేను చేయవలసినది చాలా ఉన్నది.
క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట అనేకుల అనుభవమును గురించిన మంచి పద్యము ఇక్కడ ఉన్నది.
నేను క్రీస్తు న్యాయ సింహాసనం యెదుట నిలబడినప్పుడు,
ఆయన నా కొరకు కలిగియున్న ప్రణాళికను చూపించినప్పుడు,
ఆయన చిత్త ప్రకారం జరిగియుంటే,
నా జీవితంలోని ప్రణాళిక ఏ విధంగా యుండియుండేది -
కాని నేనాయనను ఇక్కడ అడ్డగించాడు, అక్కడ కాదన్నాను
నా చిత్తమును ఆయనకు అప్పగించలేదు.
నా రక్షకుని కన్నులలో దు:ఖముండునా
నన్ను ప్రేమిస్తున్నను దు:ఖముండునా?
ఆయన నన్ను ధనికునిగా ఉండగోరెను,నేను దరిద్రునిగా నిలబడియున్నాను, ఆయన కృప తప్ప మరేమియు నాయొద్ద లేదు,
నా జ్ఞాపకశక్తి ఎంతగా పరుగెత్తినను
అది వెళ్లలేని త్రోవలు యెన్నో ఉన్నవి.
అప్పుడు నా దిక్కుమాలిన హృదయము పగిలిపోవును
నేను కార్చలేని కన్నీరుతో పగిలిపోవును
నా ఖాళీ చేతులతో నా ముఖమును కప్పుకొనెదను
మకుటములేని నా శిరస్సును వంచుకొనెదను
ప్రభువా నాకు మిగిలియున్న సంవత్సరములను
నీ హస్తమునకు అప్పగించుచున్నాను
నన్ను తీసుకొని విరుగగొట్టి తిరిగి రూపించుము
నీ ప్రణాళిక చొప్పున నన్ను మార్చుము
(ఆనీ జాన్సన్ ఫ్లింట్)
ప్రార్థన మరియు దేవుని వాక్యము - యుద్ధము యొక్క ఆయుధములు:
ప్రార్ధన ద్వారా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చవచ్చు. దేవుడు నీ కొరకు ఎంతగా చేయగలడో ప్రార్థించిచూడుము. దేవుడు ప్రతి ఒక్కరికి స్వచిత్తమును ఇచ్చియున్నాడు గనుక పాపము చేయకుండా ఆపడు. కాని ఇతరులు చేసే క్రియలను బట్టి మన శక్తికి మించిన శోధన రాకుండా కాపాడును.
మనలను పాప నియమమునుబట్టి మన శరీరములోనున్న ఆదాము స్వభావము అంతటి నుండి సంపూర్ణముగా రక్షించునని దేవుడు సువార్త ద్వారా చెప్పుచున్నాడు (రోమా 7:25). మనము పాపములో పడిపోయినప్పుడెల్లా దు:ఖించినయెడల, మనము పాప నియమమును సేవించుట విషయములో అలసి సొమ్మసిల్లిపోయామని దేవుడు వినును. ఇశ్రాయేలీయులు దేవుని యెదుట నిట్టూర్పులు విడిచుచు మొఱ్ఱపెట్టినప్పుడు దేవుడు వారిని ఐగుప్తునుండి విడిపించినట్లే, నీతిమంతుడైన దేవుడు మన యొక్క మొఱ్ఱను కూడా విని మరియు సంపూర్ణముగా విడిపించును (నిర్గమ కాండము 2:23-25).
ప్రభువైనయేసు మన కంటే ముందుగా మన పక్షమున దేవుని సన్నిధిలో ప్రవేశించినందున మనము కూడా నిశ్చలమైన నిరీక్షణను లంగరు వలె కలిగియున్నాము (హెబీ 6:19,20). కాబట్టి నిరాశపడుటకు మనము తిరస్కరించెదము. మన జీవితములోని సుఖదు:ఖములన్నింటిలోను దేవుని సన్నిధిలో నిశ్చలమైన నిరీక్షణ కలిగియుండెదము. కుయుక్తితో సాతాను మీ మీద దాడిచేసినప్పుడు నిశ్చలమైన ఈ నిరీక్షణ మీరు కలిగియుండాలని నేను ప్రార్థించుచున్నాను.
భయపడుటకును మరియు చింతించుటకును శోధన వచ్చినప్పుడు ఇటువంటి లేఖనములను నమ్మి స్తుతించాలి. ''నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను గదా'' (హెబీ 13:6). లేక ''నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును'' (మీకా 7:8). లేఖనములను చెప్పుట ద్వారా ప్రభువైనయేసు సాతానును జయించారు. మనము జయించునట్లు లైంగిక విషయములలో శోధన అనుమతించినట్లే భయము విషయములోను దేవుడు శోధన అనుమతించును. నీవు శోధించబడునప్పుడు సంతోషించుము. ఎందుకనగా దానిని జయించుట ద్వారా మెప్పును పొందెదవు. మరియు ఆ విధముగా రాబోయే దినములలో నీవు ఇతరులకు మాదిరిగా ఉండెదవు. భవిష్యత్తులో ఇతరులకు పరిచర్య చేయగలగుటకు ఈ దినమున దేవుడు సమస్తమును అనుమతించుచున్నాడు.
దావీదుతో ఉన్న బలమైన సైనికుడైన ఎలీయాజరు గురించి ఆలోచించుము (2 సమూయేలు 23:9,12). ఇశ్రాయేలీయులందరు పారిపోయినప్పుడు అతడు ఫిలిష్తీయులనందరిని ఎదిరించెను. ఆ పోరాటము జరిగిన తరువాత అతని చేయి తిమ్మిరిగొని తన చెయ్యి ఆ కత్తికి అంటుకొని పోవుచుండెను (10వ). ఆ యొక్క జయమును చూచిన తరువాత ఇశ్రాయేలీయులు వెనుకకు వచ్చిరి. వెంబడించుటకు ఇది ఒక మంచిమాదిరి. దేవునివాక్యము యెన్నటికి పోగొట్టుకొనకుండునట్లు అది మీ యొక్క మనస్సులో అంటుకొని మరియు ప్రభువైనయేసు సిలువ మీద పొందిన జయమును బట్టి ప్రభువుతో నిలువగలము. ఆ విధముగా వెనుకంజ వేసిన వారిని కూడా సవాలు చేయగలవు.
దేవునియొక్క మహిమలో పాలివారమగుట:
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను గూర్చిన సువార్తలోని అద్భుతమైన విషయములను అనేకమంది విశ్వాసులు చూడకుండునట్లు సాతాను గ్రుడ్డితనము కలిగించుచున్నాడు (2 థెస్సలో. 2:14). ఆ సువార్త ఏదనగా మన సమస్తమును క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడగలదు. 1 పేతురు 1:9 లో ఉన్న ప్రాణరక్షణ అనగా మన ప్రాణమంతయు క్రీస్తు సారూప్యములోనికి మార్పుచెంది, ఆదాము యొక్క వైఖరి నుండి విడుదల పొంది కేవలం బాహ్య ప్రవర్తన కాకుండా మన అంతరంగములో నిజమైన మార్పు కలుగును.
మనము సవాలుచేసే ప్రసంగములను విని మరియు తాత్కాలికముగా మనము ఉజ్జీవింపబడవచ్చును. కాని మనము క్రీస్తువలె మార్పుచెందుట యొక్క మహిమను చూచినప్పుడు విషయములను తీవ్రముగా తీసుకొనెదము. ప్రభువైన యేసువలె శోధనలో నమ్మకముగా ఉన్న యెడల మనము మహిమలో పాలుపొందెదము. ఈ మహిమను మనము చూచామనుటకు ఋజువు ఏమనగా త్వరగా దేవునికి లోబడెదము, త్వరగా మనలను మనము తగ్గించుకొనెదము, మనము గాయపరచినవారిని త్వరగా క్షమాపణ అడిగెదము. మరియు శోధననుండి పారిపోవుచు మరియు దేవుని బిడ్డలతో సహవాసమును కోరెదము. ఈ మహిమను ఇంకను చూడని విశ్వాసులు ఈ విషయములో మందమతులై యుండెదరు.
పాపమంతయు ఆలోచనలలో ఆరంభమగును. చాలాకాలము తరువాత అది క్రియారూపము దాల్చును. కాబట్టి మనము ఆలోచనలలో నమ్మకముగా లేనట్లయితే ఏదో ఒక రోజు పడిపోయెదము. నిత్యత్వానికి పాపాన్ని మన హృదయములో దాచలేము. అదే విధముగా మొదటిగా మన ఆలోచనలలోనే మహిమ ఆరంభమగును. అది క్రియారూపము దాల్చుటకు కొన్ని సంవత్సరములు పట్టును. కాబట్టి మనము మనుష్యులను సంతోషపెట్టుటకు గాక అన్ని సమయములలో దేవునియెదుట జీవించుటకు సవాలు చేయబడెదము. మనుష్యులందరి యెదుట ప్రభువును గూర్చి మంచి సాక్ష్యముకలిగి యుండుటకు జాగ్రత్తపడుము.
అత్యంత ఖరీదైనది మరియు చౌకగా దొరికే వజ్రములు మన యెదుట కొన్నిసార్లు ఉంచబడును. మనము ఒక దానిని యెంచుకొనవలెను. సాతాను యెదుట నీవు కొంచెము మోకరించినయెడల, ఈ లోక మహిమను అతడు కొంచెము నీకు ఇవ్వజూపును. ప్రభువైన యేసు కూడా ఆ విధముగా శోధింపబడియున్నాడు. శరీరమునకు ఆకర్షణీయముగా ఉండువాటిని మనకు ఇస్తానని సాతాను మనకు చెప్పును. ప్రభువు నామము నిమిత్తము భూసంబంధమైన వాటిని నీవు విడిచిపెట్టెదవా లేదా అని ప్రభువుచేత పరీక్షించబడుచున్నాము. దేవునిని మనకు వేరుగా చేసేదేదైనను మనకు విగ్రహము కావచ్చును. వెలగల వాటిని ప్రభువుకు సమర్పించవలెను. అంతేగాని విలువ లేనివాటిని కాదు. ఏదైనా విలువైన దానిని నీవు ప్రభువుకు ఇచ్చినట్లయితే, అప్పుడు ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించుచున్నావని ఋజువుపరచుచున్నావు.
ఆరోగ్యము లేనివారిని నీవు చూచినప్పుడు, దేవుడు మనకు ఆరోగ్యమును ఇచ్చి అద్భుతమైన వరమును ఇచ్చాడని గుర్తించెదము. మన శరీరవిషయములలో అనేక పొరపాట్లు జరుగవచ్చును. అయినప్పటికిని దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మనము ఆరోగ్యముగా ఉన్నాము. మనము మన శరీరములతో దేవుని చిత్తమును నెరవేర్చి మరియు ఆయనను మహిమపరచుటకు ఆయన కృపద్వారా మనకు అనుగ్రహించిన ఆరోగ్యమును బట్టి కృతజ్ఞులై యుండవలెను.
మన సొంతమును కోరుటయే కీడు అంతటికి కారణము:
మన స్వచిత్తమును ఉపేక్షించుకొని మరియు దేవుని చిత్తము చేయుటయే నిజమైన క్రైస్తవ్యము. ఎక్కడైతే నీ స్వచిత్తానికి దేవునిచిత్తము వ్యతిరేకముగా ఉన్నదో అక్కడ నీ స్వచిత్తాన్ని ఉపేక్షించుకొనవలెను. ఇక్కడే దేవుడిలో ఉన్న విశ్వాసము మరియు ఆయనయెడల నీకున్న ప్రేమ పరీక్షించబడును. చాలామంది విశ్వాసులు కూటములకు వెళ్ళుట మరియు బాహ్యముగా మంచిగా జీవించుటచేత తృప్తి పడుచున్నారు. కాని ప్రతిదినము సిలువ ఎత్తుకొనుట ద్వారానే ప్రభువైన యేసుని వెంబడించగలము. లేనియెడల మతానుసారులమై యుండెదము. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ నీ స్వంత విషయములో చనిపోవుటకు ప్రభువు కృప ఇచ్చును గాక. ఇదియే సంతోషముకు, ఆనందానికి, ఆశీర్వాదానికి దేవుని చిత్తము నెరవేర్చుటకు మరియు నిత్యజీవాన్ని సమృద్ధిగా పొందుటకు మార్గము. ప్రభువైన యేసు భూమి మీద జీవించుట ద్వారా మార్గమును చూపించారు.
అనేకులు రక్షింపబడునట్లు తమ సొంతమును ఏదియూ కోరలేదని పౌలు చెప్పుచూ మరియు తరువాత తాను క్రీస్తును పోలి నడుచుకొను రీతిగా మనము కూడా నడుచుకొనవలెనని చెప్పుచున్నాడు (1 కొరింథీ 10:33, 11:1). క్రొత్త నిబంధనలో రెండు అధ్యాయముల మధ్యలో ఉన్న కొన్ని సత్యములను పోగొట్టుకొనియున్నారు (ఉదాహరణకు యోహాను 7:53, మరియు 8:1, రోమా 7:25 మరియు 8:1, హెబీ 11:40 మరియు 12:1-4, 1 కొరింథీ 9:27 మరియు 10:1-5).
మనము మోహపు చూపును, కోపమును, ద్వేషమును, ధనాపేక్ష మొదలగు వాటిని నుండి విడుదల పొందినప్పటికిని స్వార్థమనే పాపము అనే వేరు నుండి విడుదల పొందకపోవచ్చు. లూసిఫరు మరియు ఆదాము వ్యభిచారము ద్వారాగాని లేక హత్య ద్వారాలేక కొండెములు చెప్పుట ద్వారాగాని లేక మోహపుచూపులు చూచుట ద్వారాగాని పాపాము చేయలేదు. వారు వారియొక్క స్వార్థము కొరకు లాభము అపేక్షించుట వలన పాపము చేసారు. స్వార్థముతో మన సొంతమును కోరుటయే పాపమంతటికి మూలము.
నీ చెడ్డవేరుమీద గొడ్డలి వేయుట ద్వారానే మన జీవితము యొక్క గమ్యము మార్చబడును. లేనట్లయితే మనము అనేక పాపములలో జయం పొందినప్పటికిని మన సొంతలాభమును మరియు ఘనతను కోరెదము. అందువలననే పాపము మీద జయమును బోధించేవారు కూడా పరిసయ్యులుగా మారుతున్నారు.
కాబట్టి పౌలువలె స్వార్థంనుండి విడుదల పొందవలెనని తీవ్రముగా కోరినయెడల, అనేకులు రక్షింపబడినట్లు పౌలువలె కోరెదము (1 కొరింథీ 10:33). 1 కొరింథీ 10:32లో మూడు రకముల ప్రజల గురించి చెప్పారు. అనగా యూదులు, అన్యులు, సంఘము. వీరు పాతనిబంధనను మరియు ఏ నిబంధనలేని వారిని మరియు క్రొత్త నిబంధనలో ఉన్న వారిని చూపించుచున్నారు. వీరు రక్షణ పొందవలెనని అతడు ఎంతో కోరియున్నాడు. ఈనాడు మన మధ్యలో కూడా మూడు రకముల ప్రజలు ఉన్నారు. వారు ఎవరనగా పాపము మీద జయము పొందని విశ్వాసులు (పాతనిబంధన), అవిశ్వాసులు ( ఏ నిబంధన లేనివారు) మరియు జయములో జీవించుచున్న యేసుయొక్క శిష్యులు (క్రొత్త నిబంధన). ఈ ప్రజలందరి యెడల మన వైఖరి ఇట్లుండవలెను: ''నేను నా సొంతమును కోరను గాని వారి శరీరములో నివసించుచున్న పాపమునుండి వారు రక్షింపబడాలని వారి యొక్క మేలునే కోరుచున్నాను. పరలోకమునుండి భూమిమీదకు దిగివచ్చునప్పుడు ప్రభువైన యేసు యొక్క వైఖరి కూడా అదియే.
విశ్వాసులు కూడా ఇటువంటి వైఖరి కలిగియున్నప్పుడు మాత్రమే, అనగా అనేకులు రక్షింపబడవలెనని కోరుచున్నాను కాని నా సొంతమును కోరను అను వైఖరి కలిగియున్నప్పుడే క్రీస్తు శరీరము అను సంఘము నిర్మించబడుతుంది. లేనట్లయితే గొప్ప సందేశములు చెప్పినప్పటికిని వారి యొక్క ఘనతను పొందుటకే చేసెదరు.
ప్రభువైన యేసు ఆయన సొంతమును కోరలేదు. ఆయన ఎల్లప్పుడు తండ్రి మహిమనే కోరియున్నారు. ఇది మాత్రమే నిజమైన ఆత్మీయత మరియు ఇంతకంటే తక్కువది కాదు. ఒక వ్యక్తి జీవించు ఉద్దేశ్యమును బట్టి అతడు దైవభక్తి గలవాడా లేక పాపి అని చెప్పవచ్చును. ఎందుకంటే కొన్ని పాపములు జయించుట ద్వారా కూడా తన స్వార్థము కోరుటలేదని ఋజువు పరుచుచున్నాడు. ప్రభువైన యేసు మరొక సందర్భములో చెప్పిన రీతిగా కొన్నిటిని విడిచి, కొన్నిటిని చేయవలసి యున్నది.
దేవుని కృపమీదనే గురిపెట్టుకొనుము:
దేవుని ముఖము ఎదుట జీవించనియెడల ఒక విశ్వాసి తన ఆత్మీయ స్థితిని నిర్లక్ష్యము చేయుట సులభము. ప్రకటన గ్రంథములో ఏడుగురు సంఘపెద్దలను గద్దించుటను చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. లవొదొకియ సంఘములో ఉన్న పెద్దతో ఈ విధముగా చెప్పాడు, ''నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగవు''.
మన హృదయ రహస్యములు బయలుపరచబడునట్లు దేవుడు మన జీవితములో అనేక పరిస్థితులు అనుమతించును. ఇబ్బందికరమైన ప్రజలతో మనము ఇబ్బందికరమైన పరిస్థితులగుండా వెళ్ళినందువలన మన హృదయములో కొన్ని జ్ఞాపకములను ఉంచుకొనవలెను. అవి మన యొక్క హృదయము అడుగులో ఉండును గనుక మన హృదయము పవిత్రములు అని ఊహించుకొనెదము. అప్పుడు మన హృదయములో ఉన్నవన్ని మన మనస్సులలోకి వచ్చునట్లు దేవుడు ఒక చిన్న విషయమును అనుమతించును. అటువంటి సమయములో వారిని క్షమించి మరియు ప్రేమించాలని నిర్ణయించుకొనుట ద్వారా పవిత్రపరచుకొనగలము. ఇటువంటి అవకాశము వచ్చునప్పుడు మన హృదయము కడుగుకొనిన యెడల, అది మన హృదయపు అడుగునకు వెళ్ళి అక్కడే నిలచియుండును. అంతా బాగుందని మనము ఊహించుకొనవచ్చును. కాని నిజానికి బాగుగాలేదు. మరొక చిన్నవిషయము వాటిఅన్నిటిని మన మనస్సులోనికి తేగలదు కాబట్టి ఇది జరిగినప్పుడు మనలను పవిత్రపరచుకొనవలెను.
తప్పిపోయిన కుమారుని యొక్క అన్న తన తమ్ముడు విషయములో తప్పుడు వైఖరి కలిగియున్నాడని చూచెదము. అయితే అది తన తమ్ముడు వచ్చి విందు చేయుచున్నప్పుడే బయటపడింది. అప్పుడు తన తమ్ముని మీద తప్పుడు నిందలు మోపుచు అది నిజమో కాదో తెలుసుకొనకుండా మాట్లాడెను (ఉదాహరణకు నీ ఆస్థిని వేశ్యలతో తినివేసిన యీ నీ కుమారుడు). ఒక వ్యక్తితో మనము సరియైన సంబంధం కలిగిలేనట్లయితే, అతని గురించి చెడ్డ విషయములను నమ్మెదము.
నాకున్నదంతయు నీదే అని తండ్రి పెద్ద కుమారునితో చెప్పాడు. తనకు అనుగ్రహించిన దానితో తృప్తిపడక తన సొంత క్రియలతో నింపబడియున్నాడు. ఉదాహరణకు ''యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే''. అతడు తన తమ్ముని బలహీనతలతో నింపబడి యీ నీ కుమారుడు ఆస్థిని వృథా చేసెను'' (లూకా 15:29-30). ఆ తండ్రి వలె మన దేవుడు కూడా ''నా వన్నియు నీవని'' మనతో చెప్పుచున్నాడు. ప్రభువైన యేసులో ఉన్నవన్నియు మనవైయున్నవి. ఆయనయొక్క జీవము, పవిత్రత, మంచితనము, సహనము, దీనత్వము మొదలగునవన్నియు మనవైయున్నవి.
దీనినుండి మనము నేర్చుకొనవలసిన పాఠమేమనగా దేవుడు నీకు అనుగ్రహించిన కృపామహిదైశ్వర్యములతో నింపబడియుండుము. మరియు నీవు సాధించినవాటితోగాని లేక నీ సహవిశ్వాసుల ఓటములతోగాని నింపబడి యుండవద్దు.
దీనత్వములోను మరియు జ్ఞానములోను ఎదుగుట:
స్వజీవమునకు చనిపోవుటను ప్రభువైనయేసు ఈ భూమిమీద జీవించిన విధానము చూచుటకు మన కళ్ళు తెరువబడినందుకు సంతోషించుచున్నాను. నీ జీవితాంతము వరకు ఈ దర్శనమును కలిగియున్న యెడల, నీ కిరీటమును ఎవరునూ అపహరించలేరు (పక్రటన 3:11). ప్రభువైన యేసు మన కొరకు తెరచిన మహిమకరమైన మార్గము విశ్వాసులందరూ తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఫిర్యాదులనుండి సణుగుటనుండి, భయమునుండి, ఒత్తిడిలనుండి మరియు ప్రతికీడునుండి దీనిద్వారా విడుదల పొందెదము. అప్పుడు సాతానుకు మనమీద ఎటువంటి అధికారము ఉండదు.
ప్రభువైన యేసు తనయొక్క చిన్నతనమునుండి ఎల్లప్పుడూ తన గురించి తక్కువ తలంపులు కలిగియున్నాడు. ఆయన ఎల్లప్పుడూ పరిపూర్ణమైన దీనుడు గనుక ఆయన దీనత్వములో ఎదుగనవసరము లేదు. 15 ఏళ్ల వయస్సులో మరియు 33 సంవత్సరముల వయస్సులోను కల్వరి మీద నేరస్థులలో ఒకడిగా ఎంచబడుటకు ఇష్టపడియున్నాడు (యెషయా 53:12). ఆయన ఎదుర్కొనిన అనేక పరిస్థితులద్వారా తననుతాను తగ్గించుకొనుటకు అనేక అవకాశములను పొందియున్నాడు. ఆవిధముగా ఆయన జ్ఞానములో ఎదిగియున్నాడు. ఆయన వయస్సులో పెద్దవాడైన కొద్ది పెద్ద శోధనలగుండా వెళ్ళియున్నాడు. వాటిని జయించుట ద్వారా ఆయన జ్ఞానములో ఎదిగి మరియు పాపము చేయలేదు. ఎప్పుడైననూ బుద్ధిహీనమైన పనిచేయలేదు. మనము మనకొరకే అనేక సంవత్సరములు జీవించి మరియు చాలా గర్విష్ఠులుగా ఆరంభించియున్నాము. గనుక మనము దీనత్వములోను జ్ఞానములోను ఎదుగవలసియున్నది. కాని మనము మనలో ఉన్న గర్వమంతటిని మరియు గొప్పతలంపులను విసర్జించి దీనత్వములోనుండి వచ్చు జ్ఞానముతో ఎదుగవలెను.
సాతాను మీద అధికారము:
ప్రభువైన యేసు నీకు అత్యంత అమూల్యమైనవాడు కానట్లయితే, ఆయనను స్పష్టముగా చూడలేకుండునట్లు నీకును ఆయనకును మధ్యలో ఒక తెర ఉండును (2 కొరింథీ 3:14-16). అది శరీరమనే తెర (హెబీ 10:20). కాని నిజానికి భూసంబంధమైన వ్యక్తులతో గాని లేక వస్తువాహనములతో గాని ఉద్యోగములలో గాని లేక మొదలగు వాటితో గాని ప్రభువుకంటె ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగియుండుట, కొన్నిసార్లు బైబిలు గురించి జ్ఞానము కూడా నీవు ప్రభువుని ఎరుగకుండుటకు ఆటంకముగా ఉండవచ్చు (2 కొరింథీ 3:14). బైబిలు జ్ఞానము ద్వారా క్రీస్తు యెడల భక్తి వృద్ధికానట్లయితే అది మోసము. అటువంటి జ్ఞానము గర్వమును పరిసయ్యతత్వమును పెంచును.
నీ ఆత్మ కొరకు దేవుడు ఎంతో ఆసక్తి కలిగియున్నాడు (యాకోబు 4:5). మరియు నీవు ఆయనకొరకు మాత్రమే ఉండునట్లు నిన్ను కాపాడవలెనని కోరుచున్నాడు (నీ పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రేమించవలెను). అప్పుడు మాత్రమే నీవు ఇతరులను పవిత్రమైన ప్రేమతో ప్రేమించగలవు లేనియెడల ఇతరుల యెడల నీ ప్రేమ స్వార్థపూరితమైనది.
ప్రభువు ఆజ్ఞాపించిన రీతిగా మనము రొట్టెవిరిచినప్పుడు ప్రభువైన యేసును నలుగగొట్టుట తండ్రికి ఇష్టమని గుర్తుతెచ్చుకొందుము (యెషయా 53:10). ఆవిధంగా నలుగగొట్టుటకు ప్రభువైన యేసు సంపూర్ణముగా లోబడియున్నాడు. గనుక ఆయన సాతానును నశింపజేసెను. మనము కూడా ఈ మార్గములో వెళ్ళవలెను. నీ స్వచిత్తమును పూర్తిగా (నీ వ్యక్తిత్వమునుకాదు ఎందుకనగా దేవుడు ఎన్నటికి వ్యక్తిత్వమును నశింపజేయడు) నశింపచేయుటకు నీవు దేవునికి అనుమతించిన యెడల అప్పుడు నీవు సాతాను మీద అధికారము పొందుటవలన సాతాను శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద తొక్కబడును (రోమా 16:20). పరిస్థితుల ద్వారాను మరియు మనుష్యుల ద్వారా ఆ సమయములలో శోధింపబడినప్పుడు, దేవునిచేత వారి స్వచిత్తమును విరుగగొట్టుటకు అనుమతించరు. గనుక అనేకులు క్రైస్తవ జీవితములో ఎదుగుట లేదు. లేక సాతానును జయించలేదు. చీకటికంటే వెలుగు ఎంత శ్రేష్టమైనదో, మన స్వచిత్తముకంటే దేవుని చిత్తము కూడా అంత శ్రేష్టమైనదనే మహిమకరమైన సత్యమైన విషయములలో సాతాను వారికి గ్రుడ్డివారిగా చేయును. పరలోకములో ప్రభువైన యేసుతో కూడా కూర్చునిఉన్నామనే అనుభముతో భూమిమీద ఎల్లప్పుడూ జీవించుటకు పిలువబడియున్నాము. ఆ విధముగా సాతాను మరియు సమస్తమును నీ పాదాలక్రింద ఉన్నవి.
నీవు రొట్టె విరిచినప్పుడు మొదటిగా అందరిని క్షమించినయెడల నీకు తెలియక చేసిన పాపములు కూడా ప్రభువైన యేసు రక్తములో కడకుగబడినవని గుర్తించుకొనుము. దేవుడు నీకిచ్చిన వెలుగులో నడుచుచూ మరియు నీకు తెలిసి చేసిన ప్రతీ పాపమును ఒప్పుకొనుము. అప్పుడు నీవు సమస్త దుర్నీతినుండి పవిత్రపరచబడుదువు (1 యోహాను 1:7,9).
రక్తము కారి మరణించునంతగా ప్రభువైన యేసు పాపముతో పోరాడెను (హెబీ 12:4). కాబట్టి నీవు కూడా బల్లలో పాల్గొనునప్పుడు పాపవిషయములో అటువంటి వైఖరిని కోరుకొనుము.
మన హృదయములో విశ్వసించిన దానిని అంతటిని నోటితో ఒప్పుకొనవలెను (రోమా 10:9, 10). నీవు ఇతరులతో మాట్లాడేమాటలు (సంఘకూటములో గాని లేక వ్యక్తిగతముగా గాని) విశ్వాసము లుగజేసే మాటలు అయియుండవలెను అంతేగాని నిరాశపరిచేమాటలు లేక అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. సంఘకూటములలో నీ పాపములు కాదుగాని నీ విశ్వాసమును ఒప్పుకొనుము. అనేకులు జ్ఞానములేనివారై యుండి మరియు కూటములలో వారి పాపములు ఒప్పుకొందురు. వారు దీనులని చూపించుకొనుటకు దీనిని చేసెదరు అనగా ఘనతను కోరుటయే, అందరియెదుట నీ ఓటమిని ఒప్పుకొనుట ద్వారా సాతానుని ఘనపరిచెను. నీవు ఎల్లప్పుడూ విశ్వాసము మరియు నిరీక్షణ కలిగించే మాటలే మాట్లాడుము. అనగా ఆ సమయములో సంగతులు సరిగా లేనప్పటికిని దేవుడు బాగుగా చేయునని నిరీక్షణ కలిగించాలి.
ప్రభువైన యేసువలె నీవు చెప్పిన సాక్ష్యము ద్వారా సాతానును జయించగలవు (పక్రటన 12:11). మరియు నీ నోరు తెరచి సాతానుతో ధైర్యముగా ఇలాగు చెప్పుము:
పాపము నీమీద ప్రభుత్వము చేయదనియు (రోమా 6:14)
నీ శక్తికిమించిన శోధనగాని పరీక్షనుగాని దేవుడు ఎప్పటికీ అనుమతించడనియు (1 కొరింథీ 10:13)
దేవుడు సమస్తమును సమకూర్చి నీ యొక్క శ్రేష్టమైన మేలు కొరకే జరిగించుననియు (రోమా 8:28)
దేవుడు ఎన్నటెన్నటికిని విడువడు ఎడబాయడనియు (హెబీ 13:5, 6). నీవు పడిపోయినను నిశ్చయముగా లేచెదవనియు (మీకా 7:8)
సాతాను అబద్ధికుడనియు (యోహాను 8:44), మరియు సిలువ మీద ప్రభువైన యేసుచేత సాతాను ఓడించబడియున్నాడనియు (హెబీ 2:14)
ఇటువంటి దేవునియొక్క మాటలు చెప్పవలెను.
కుమారులేగాని దాసులు కారు:
దేవుడు నిన్ను కుమారునిగా ఉండవలెనని కోరుచున్నాడు గాని దాసుడుగా కాదు. ఒక దాసుడు తన యజమానుని కొరకు ఎంత తక్కువచేయవలెనని ఆలోచించును. ఒక కుమారుడు తన తండ్రి కొరకు ఎంత ఎక్కువచేయగలను అని ఆలోచించును. పాత నిబంధనఆత్మకు మరియు క్రొత నిబంధనఆత్మకు తేడా ఇదియే (గలతీ 4:7).
క్రైస్తవలోకములో దురదృష్టవశాత్తు దేవునికుమారుని కంటే దేవునిదాసుడే గొప్పవాడని అనుకొనుచున్నారు. ఇది బుద్ధిహీనతై యున్నది. ఎందుకనగా ఏ ఇంటిలో అయినను కుమారుని కంటే దాసుడు ఎక్కువకాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు దాసులైయున్నారు, కాని మనము కుమారులైయున్నాము (యోహాను 15:15, గలతీ 4:7). ఇప్పుడు ఆయన కుమారులుగా మనమందరము ఆయనకు నిజమైన దాసులముగా ఉండవచ్చును.
నన్ను ఘనపరచువారినే నేను ఘనపరిచెదనని పాత నిబంధనలో దేవునియొక్క వాగ్ధానము ఉన్నది (1 సమూయేలు 2:30). ''ఎవడైనను నన్ను సేవించిన యెడల, నా తండ్రి అతనిని ఘనపరచునని'' ప్రభువైన యేసు చెప్పారు (యోహాను 12:26). ఆయన సేవించుట అనగా ఏమిటో ఇక్కడ ప్రభువైన యేసు చెప్పారు. ఆయన సేవించేవారు ఆయనను వెంబడించవలెననియు అనగా భూమిలో పడి చనిపోవలెనని చెప్పారు (యోహాను 12:24). మరియు ఆయనవలె ఈ లోకమును స్వజీవమును ద్వేషించాలి (25వ). అటువంటి విశ్వాసులు దేవుని సేవించుటద్వారా దేవుని కుమారులుగా మారి మరియు తండ్రిచేత ఘనపరచబడెదరు (26వ). మనము నిజముగా దేవునిచేత ఘనపరచబడవలెనని కోరినయెడల, సంతోషముతో ఈ మార్గములో వెళ్ళెదము. అక్కడ స్వజీవమును ద్వేషించుట అనగా మన స్వజీవము మరియు మన స్వచిత్తము. ప్రభువైన యేసుకి కూడా స్వచిత్తమున్నది. కాని ఆయన దానిని ద్వేషించి మరియు ఒక్కసారిగా దానిని చేయలేదు (యోహాను 6:38). ఆయనవలె మన స్వచిత్తమును ద్వేషించి ఉపేక్షించుకొననియెడల ప్రభువైనయేసును వెంబడించుట అసాధ్యము. మన స్వజీవమును కాపాడుకొనుచు మరియు లోక విషయములలో ఆసక్తి కలిగియున్నయెడల, ఒక రోజు దానిని కోల్పోయెదము. కాని ఇప్పుడు దానిని పూర్తిగా పోగొట్టుకొనుటకు ఇష్టపడిన యెడల, దాని స్థానములో నిత్య జీవమును సమృద్ధిగా పొందెదము (25వ). ఈ మార్గమును ఎంచుకొనువారు తండ్రిచేత ఘనపరచబడెదరు.
దీనత్వము మరియు పరిణితిచెందుట:
చెడుగా మాట్లాడుటకును మరియు అంగీకరించకుండుటకును మధ్య తేడాను వివరించెదను. పౌలు పేతురుతో అంగీకరించకుండుటయే కాక దాని గురించి పరిణితి చెందని క్రైస్తవులకు వ్రాసినాడు (గలతీ 2:11-21). పౌలు అంగీకరించకుండుట గాని లేక దాని గురించి వ్రాయుటగాని పాపము అయినట్లయితే, దానిని వ్రాయమని పౌలును ప్రేరేపించిన పరిశుద్ధాత్మను నిందించవచ్చును. దేవుని వాక్యములోని సత్యములు సంబంధించినంతవరకును మనము పిరికివారమై రాజీపడకూడదని ఈ లేఖనభాగము తెలియజేయుచున్నది. నా కుమారులైన మీరు ఎన్నటికిని పిరికివారు కాకూడదని నేను ప్రార్థించుచున్నాను. అలాగని మీరు ఎవరినైననూ ప్రేమించకుండా ఉండకూడదు లేక దేవుడు నియమించిన అధికారానికి తిరుగుబాటు చేయకూడదు. ఆయనపిల్లలను తీర్పుతీర్చు వారిని లేక ఆయన పెట్టిన ప్రతినిధిలుపై తిరుగుబాటు చేయుటకుగాని ఎన్నటికి ఆమోదించడు.
సంపూర్ణ సువార్త ప్రకటించనందువలనను మరియు దేవునిని పరిమితి చేయుచున్నారని భావించినందువలన నా జీవితములో నేను కొన్ని సంఘములను విడిచిపెట్టి యున్నాను కాని వారి అందరి విషయములో నేను ప్రేమించే వైఖరిని కలిగియుండుటకు జాగ్రత్తపడియున్నాను. మీరు కూడా ఈ విషయములో జాగ్రత్తగా ఉండవలెను. నా ఒప్పుదలల ప్రకారము నేను నడిచియుండనట్లయితే ఈనాడు నా కుటుంబ పరిస్థితి ఏవిధంగా ఉండేదో ఆలోచించుము. మనమందరము ఏదోఒక మృతమైన డినామినేషన్‌లో ఉండెడివారము. కాని అంగీకరించకపోవుటను బట్టి అమర్యాదగా ఉండకూడదు. రోమా 14లో చెప్పబడిన బోధ మన జీవితములో అనుభవం కావాలి.
మీరు వెళ్ళే సంఘ కూటములకు దీనాత్మతో వెళ్ళవలెను మరియు వ్యక్తిగత విషయములను తెలుసుకొనవలెనని ఉత్సుకతతో ప్రశ్నలు అడిగేవారిని నివారించుము. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుము. ప్రాముఖ్యముగా దేవునిని కలుసుకొనుటకు కూటములకు వెళ్ళెదము. అయితే మనము దీనులమై, పొందుకోవాలనే ఆశ కలిగిన హృదయము కలిగినవారమై వెళ్ళినట్లయితే దేవుడు మనతో మాట్లాడి మరియు మన అవసరములు తీర్చును. పరిసయ్యతత్వము కలిగిన, పరిణితి చెందని విశ్వాసులు ప్రతిచోట ఉండెదరు. అయితే మనము పరిణితి చెందిన వైఖరి కలిగి మరియు వారి మాటలకు విసుగు చెందక, వారిని పట్టించుకొనకూడదు. వారు అడిగే ప్రశ్నలకు జ్ఞానముతోను మరియు దీనత్వముతోను జవాబు ఇవ్వాలి. ఈ లోకమంతయు ఇటువంటి ప్రశ్నలు అడిగే వారితో నింపబడింది. వారిని తప్పించుకొనుటకు మనము ఈ లోకమును విడిచి మరియు పరలోకమునకు వెళ్ళాలి. కాని నీవు వారిని ప్రేమించుచు వారి విషయములో భంగపడక, వారి మాటలు పట్టించుకొనకుండా ఉండవచ్చును. అప్పుడు నీవు జయించువాడవగుదువు. నీ భద్రతను ఎల్లప్పుడూ దేవునిలోనే కనుగొనవలెను.
యథార్థముగాఉండుట అనగా నీ ఓటములను గురించి గాని లేక నీవు ఎదుర్కొనిన సమస్యలను గురించి గాని ఇతరులకు చెప్పుటకాదు. ''నీవు బాగున్నావా?'' అని ఎవరైనా సామాన్యముగా అడిగినయెడల నీకున్న జబ్బులన్నిటిగురించి బుద్ధిహీనముగా చెప్పకూడదు. నీవు మౌనముగా ఉండవచ్చు. మనుష్యుల అభిప్రాయములు చెత్తకుండిలో వేయుటకు పనికివచ్చునని నేను అనేకసార్లు చెప్పుట విని యున్నారు. కాబట్టి మనుష్యులను సంతోషపెట్టుటకు మీరు ఎప్పుడైనను జీవించవద్దు.
మంచి పోరాటము పోరాడుము:
నీవు పోరాటముల గురించి వినుట మంచిది. ఒక యుద్ధములో అనేక పోరాటములు ఉన్నవి. అక్కడక్కడ కొన్ని పోరాటములలో ఓడినప్పటికిని పర్వాలేదు. యుద్ధమును గెలువవచ్చును. నిజానికి నీవు గెలిచెదవు. అటువంటి నిరీక్షణను నీవు ఒప్పుకొనవలెను. దేవునిని ఘనపరచినయెడల దేవునిచేత ఘనపరచబడెదవు. దుర్నీతిపరులు, పాపములో జీవించుచు నీ చుట్టుప్రక్కల ఉన్నవారు, నీవు దేవుని కొరకు నిలిచి మరియు పవిత్రతో ఉండుట వారి పాపములను ఎత్తిచూపును గనుక వారు అభ్యంతరపడవచ్చును. ఆవిధముగా చీకటిలో ప్రకాశించే వెలుగుగా ఈ లోకములో నీవుండెదవు.
నీ తల్లియు (ఆమె మెడికల్ కళాశాలలో చదివే విద్యార్థిగా ఉన్నప్పుడు) మరియు నేనును (నేవీలో పనిచేయుండగా) మేము ప్రభువు కొరకు నిలువబడి కొన్ని విందులకు వెళ్ళే విషయములో మేమిద్దరము దేవుని కొరకు నిలబడి ఆయనను ఘనపరచినందువలన, పాపము నుండియు మరియు బుద్ధిహీనతనుండియు మరియు వెనుకకు దిగజారిపోవుటనుండియు, దేవుడు మా యౌవనంలో కాపాడినందుకు ఆయనకు వందనాలు చెల్లించుచున్నాను.
మనలో కొన్ని విపరీతమైన తలంపులు వచ్చినప్పుడు మనము అటువంటి తలంపులలోనూ మరియు శరీరేచ్ఛలతోను మరియు సాతానుతోనూ దేవుని వాక్యమును ఒప్పుకొనుచూ ఈ విధముగా చెప్పాలి: ''దేవుడు ఇంకనూ సింహాసనాసీనుడైయున్నాడు. నా పాపములన్నియు క్షమించబడి మరియు పవిత్రపరచబడియున్నవి. ఒక్కసారి కూడా పాపము చేయనివాడిగా దేవుడు నన్ను చూచుచున్నాడు. కనబడేవన్నియు తాత్కాలికమైనవి. సమస్తమును కూడి నా మేలు కొరకే జరుగుచున్నవి. సిలువ మీద సాతాను నిత్యత్వానికి ఓడించబడియున్నాడు. దేవుడు నా పక్షముగా ఉన్నాడు గనుక నేను అనేకసార్లు పడిననూ లేచెదను, చివరకు నేను విజయమొందెదను''.
పౌలు చెప్పుచున్న రీతిగా, ''మేము పడద్రోయబడిననూ నశించువారము కాదు'' (2 కొరింథీ 4:9). 10వ సంఖ్య లెక్కించే సరికి మనము లేచి సాతాను మీద యుద్ధము చేసెదము. ఒకటి రెండు సార్లు ఓడిపోవచ్చునుగాని చివరకు మనమే గెలిచెదము. మన తలంపులు అటు ఇటుగా ఉండినప్పటికి అటువంటి వైఖరి మనము పరుగుపందెములో ముందుకు వెళ్లునట్లు చేయును. అన్ని సమయములలో మీరు ఆవిధముగా ఉందురు గాక. మీరు మీ తలంపులలో కాక ఎల్లప్పుడూ ప్రభువైన యేసును వెంబడించవలెనని నిర్ణయములతో జీవించవలెను. నీ నిర్ణయమును బట్టియే నీవు మారెదవు.
దేవునికి ఎల్లప్పుడూ స్పందించుట
దేవుడు నీకు చేసిన దానంతటిని బట్టి ఆయన విషయములో ఏవిధంగా స్పందించెదవు? కేవలము కృతజ్ఞత చెల్లించుటయే సరిపోదు. రోమా 12వ అధ్యాయము ఈ ప్రశ్నకు జవాబు అయియున్నది. దేవునియొక్క కృపాకనికరములు బట్టి మనము ఈవిధముగా చేయవలెను. 1. మొదటగా మీ శరీరమును సజీవయాగముగా ఆయనకు సమర్పించుకొనవలెను (1వ). యాగము అనగా ప్రభువు కొరకు కొంత వెలచెల్లించి నీవు ఇవ్వవలసి యుంది. నీవు కొంత త్యాగము చేయవలసియుండి మరియు నీ కళ్ళను, చెవులను, నాలుకను మరియు ఉద్రేకములను మరియు కోరికలను మొదలగు వాటిద్వారా నిన్నునీవు సంతోషపెట్టుకొనవలెననే స్వచిత్తమును ఉపేక్షించుకొనవలెను.
2. పరిస్థితులను ప్రజలను దేవుడు చూచునట్లుగా నీవు చూచుటకు నీ యొక్క మనస్సు మారి నూతన పరచబడాలి (2వ). అనగా అమ్మాయిలను చూచే విషయములోను, నీకు హాని చేసే వారిని ద్వేషముతో చూచే వారి విషయంలోను, నీవు ఇష్టపడని వారిమీద చూచే పక్షపాతమునుండియు మరియు పరిస్థితులను బట్టిగాని భవిష్యత్తును బట్టిగాని అవిశ్వాసములోను చింతలలోను భయముతోను ఉండుటనుండి పవిత్రపరచుకొనవలెను. ''ఈ వ్యక్తిని లేక ఈ పరిస్థితిని దేవుడు ఏవిధముగా చూచును?'' అని ఎల్లప్పుడూ నిన్ను నీవే ప్రశ్నించుకొనుము. చూచే విధానములో ఆవిధముగా నిన్ను పవిత్రపరచుకొనుము.
3.నిన్ను నీవు ఎక్కువగా ఎంచుకొనకుము (3వ). నీ విశ్వాస పరిమాణమును బట్టియే గాని నీకున్న జ్ఞానమును బట్టిగాని లేక విశ్వాసమును బట్టి నీ యొక్క ఆత్మీయతను బేరీజు వేయలేము.
4. క్రీస్తు శరీరమును నిర్మించుటకు నీకు ఇవ్వబడిన వరాలు మరియు తలాంతులు ఉపయోగించి పరిచర్య చేయుము (4-8వ). ఆ ఒక్క తలాంతు ఉన్న వ్యక్తి వలే నీ తలాంతును పాతిపెట్టవద్దు. ఆసక్తితో ప్రభువు పరిచర్య చేయుము (11వ). మరియు తరచుగా వాక్యము చదివి లేక విని మరియు దానిని బట్టి దేవునితో మాట్లాడుము (12వ).
5. చెడును విసర్జించి మంచిదానిని హత్తుకొనుము(9వ). చెడును విసర్జించుట ద్వారా మంచిని సులభముగా చేయగలము.
6. నీ సహోదరులందరిని ప్రేమించి సన్మానించుము. ఎందుకనగా వారు యేసు యొక్క సహోదరులైయున్నారు (9,10వ). వారికి మేలు చేయుము (13వ). వారు సంతోషించినప్పుడు సంతోషించుము మరియు వారు దు:ఖపడునప్పుడు బాధపడుము (15వ). అందరియెడల దీన వైఖరి కలిగియుండుము. ప్రత్యేకముగా బీదలయెడల క్రీస్తు శరీరములో తక్కువ వరములు కలిగిన వారియెడల.
7. మనుష్యులందరిని, ప్రత్యేకముగా నీకు కీడుచేసిన వారిని ప్రేమించి ఆశీర్వదించుము (14,17-21వ). సాధ్యమైనంతవరకు అందరితో సమాధానము కలిగియుండుము. పగ తీర్చుకొనవద్దు లేక నీకు కీడు చేసిన వారికి కీడు జరగాలని కోరవద్దు. వారికి మేలు చేసి మరియు కీడును మేలుతో జయించుము. కీడును మరింత కీడుతో జయించవలెనను ప్రజలతో లోకమంతయు నిండియున్నది. కాని కీడు ఎప్పటికిని కీడును జయించదు. కీడు కంటే మేలు ఎంతో శక్తి మంతమైనది గనుక కీడును మేలు మాత్రమే జయించగలదు. కలువరిలో ప్రభువైన యేసు దీనినే ప్రదర్శించెను. దేవుడు నీ జీవితములో అనుమతించే శ్రమలను సహించి మరియు అవన్నియు క్రీస్తు సారూప్యము నీలో ఏర్పడునట్లుగా అనుమతించెనని నిరీక్షణతో సంతోషించవలెను (12వ).
ఈ విధముగా దేవుడు నీకొరకు చేసి ముగించిన దానికిని మరియు మనలను అనేకసార్లు క్షమించుచూ ఆయన కృపామహదైశ్వర్యమును అనుగ్రహించినందువలన కృతజ్ఞులైయున్నామని ఋజువుపరచుచున్నాము.
పరిశుద్ధాత్మతో నింపబడియుండుట:
మన క్రైస్తవ జీవితమును గ్రాఫ్‌గా (రేఖా చిత్రము) గీసిన యెడల తిన్నగా ఉండక పైకి క్రిందకి ఉండును. ప్రతీ ఒక్కడి క్రైస్తవఅనుభవం కూడా ఈ విధముగా ఉండును కాని సంవత్సరము గడిచే కొలది గ్రాఫ్ పైకి వెళ్ళుచుండును. మనం నెమ్మదిగా అనుభవములో పైకి వెళ్ళుచుండవలెను. క్రమక్రమముగా మన ఓటములు తగ్గుచుండవలెను. నెమ్మదిగా పైకి పైకి వెళ్ళుచుండవెను. కాని కొందరు దేవుని వాగ్ధానములు విశ్వసించనందువలన లేక దేవుడియెడల భయభక్తులు లేనందున లేక జయము పొందుటకు ఆసక్తితో వెదకనందున గ్రాఫ్ క్రిందకు వెళ్ళుచుండును. అయినప్పటికిని, ఆ గ్రాఫ్ ఎల్లప్పుడూ పైకి వెళ్లదు. కొన్నిసార్లు క్రిందకి కూడా వచ్చును.
పాపమును తీవ్రముగా తీసుకొని మరియు పాపములో పడిపోయిన ప్రతిసారి పశ్చాత్తాప పడుము. ఆ విధముగా నీవు దేవునియెడల భయభక్తులు కలిగియున్నావని తెలియును. నేను అనేకసార్లు చెప్పిన రీతిగా మనము పాపములో పడిపోవుటకంటే దాని గూర్చి పశ్చాత్తాప పడుటను తీవ్రముగా తీసుకొనుము. నీవు పాపములో పడిపోయిన వెంటనే మారుమనస్సు పొంది పశ్చాత్తాపపడమని నీకు బోధించినయెడల, తండ్రిగా నా బాధ్యత నెరవేర్చియున్నాను. దానిని మీకు సరిగా బోధించాను అని నమ్ముచున్నాను.
2 రాజులు 4వ అధ్యాయములో ఎలీషా తన యొద్దకు వచ్చిన విధవరాలుతో పొరుగు వారి యొద్దనుండి పాత్రలను తెమ్మని చెప్పి మరియు వాటిలో ఆ నూనెను పోయమని చెప్పెను. ఆ విధముగా ఆమె యొక్క అప్పును తీర్చెను. ఆమె ఆ విధముగా చేసినప్పుడు, పాత్రలన్నియు నిండినవని ఆమె యొక్క కుమారుడు చెప్పెను. అప్పుడు నూనె కూడా ఆగిపోయెను.
నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవములో చాలామంది ఈ విధముగానే ఉన్నారు. ఆరంభములో వారు నింపబడియున్నారు. కాని కాలముగడిచే కొలది కొంత మందిలో పరిశుద్ధాత్మ యొక్క అవసరతను కలిగియుండుట లేదు. అనగా నింపబడుటకు పాత్రలు లేవు. ఆవిధముగా వారిలోనుండి ఆత్మ ప్రవహించుట ఆగిపోవును. మనము క్రీస్తువలె లేని విషయములు, ఈ ఖాళీ పాత్రలను చూపించుచున్నవి. మన జీవితములో ఆవిధముగా నింపబడవలసిన అనేకవిషయములు ఉన్నవి.
కొన్ని విషయములలో అనగా నీవు పాపముమీద జయముపొందని విషయములలో నీవు పాక్షికముగా నింపబడుటవలన క్రీస్తువలె మార్పు (లేక దేవునిస్వభావములో పాలివారగుట) చెందుటలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తిని ద్వేషించకుండా ఉండుటకును మరియు ప్రేమించకుండుటకును తేడా ఉంది. మొదటిది కేవలము పాపమును జయించుట మాత్రమే రెండవది దేవుని స్వభావములో పాలుపొందుట. అదే విధముగా కోపపడకుండుటకును మరియు మృధువుగా మాట్లాడుటకును చాలా తేడాఉన్నది. మిగతా విషయములలో కూడా ఆవిధముగానే ఉండును. ఒక విషయములో పాపము జయించామని తృప్తిపడినయెడల, అది ఖాళీ పాత్రలు లేవని సూచించుచున్నది. అప్పుడు నూనె ప్రవహించుట ఆగిపోయి మరియు మనము వెనుకకు దిగజారెదము.
మనము ఇతరులను తీర్పుతీర్చక ఎల్లప్పుడు మారుమనస్సు పొందెదము. ఎల్లప్పుడు నింపబడుటకు ఖాళీపాత్రలు ఉండునట్లు మనము చూచుకొనవలెను, అప్పుడు మాత్రమే మనము ఆ విధవరాలువలె అప్పులు తీర్చెదము. రోమా 13:8లో ప్రేమించే విషయములో మనము అందరకు ఋణపడియున్నామని చెప్పబడింది. ఆవిధముగా మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండెదము. మన స్వయమునుండి విడుదలపొంది మరియు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటకు దేవుడు ప్రతిపరిస్థితిని అనుమతించును. మన యొక్క ఖాళీ పాత్రలు మొదటిగా నింపబడనియెడల మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడరు.
దేవునియెదుట ధైర్యముగా ఉండుట:
భూమిమీద నున్న అత్యంత శ్రేష్టమైన తండ్రికంటె దేవుడు మంచితండ్రి. మనము దేవునిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మను మరియు శ్రేష్టమైనవాటన్నింటిని మనకిచ్చునని విశ్వసించని యెడల దేవునిని అవమానించెదము (లూకా 11:13, మత్తయి 7:11). అందువల్ల అవిశ్వాసము భయంకరమైన పాపము. అవిశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే భూమిమీద నున్న తండ్రులకంటె దేవుడు చెడ్డవాడని నిందించునట్లు ఉండును. అనేకులు విశ్వాసముతో ప్రార్థించనందున వారు దేవునియొద్ద నుండి పొందుకొనుటలేదు. వారి యొక్క గత ఓటములను బట్టి నేరారోపణతో నింపబడుటవలన దేవుడు వారికి ఏమియు ఇవ్వడని తలంచుదురు. కాని దేవుని వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది (విలాప వాక్యములు 3:22,23). మన పాపములను మనము ఒప్పుకొనుచున్నయెడల, గత దినము చేసిన పాపములను కూడా దేవుడు జ్ఞాపకముంచుకొనడు. ఈ సత్యమును మనము నమ్మినయెడల, మనము దేవునియొద్దకు ధైర్యముగా వెళ్ళెదము. దేవుని యొక్క మంచితనమును అనేకులు ఆసరాగా తీసుకొనుచున్నారు. అయితే మనము వారిలో ఉండనవసరము లేదు. అయితే దేవుడనుగ్రహించిన పాపక్షమాపణను బట్టి కృతజ్ఞత కలిగి, ఆయనకు ఇష్టులుగా ఉండవలెనని కోరే వారితో మనముండవలెను.
పైకి భక్తిగలవారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉండే అపాయము ఉంది (2 తిమోతి 3:5). మనుష్యుల యొక్క ఘనతను మనము కోరినప్పుడు మనము ఈ అపాయమును ఎదుర్కొనెదము. శోధనలలోను మరియు ఇతరులు మనలను రేపినప్పుడును దేవుని యొక్క శక్తిద్వారా మనము పవిత్రతలోను ప్రేమలోను ఉండగలము. మనము మంచిగా మాట్లాడుటద్వారాను మరియు మంచిగాపాటలను పాడుటద్వారాను మొదలగునవి చేయుటద్వారా మన యొక్క రహస్యపాపములను కప్పిపుచ్చుకొని మరియు మన హృదయములు నిజానికి బాగాలేవని ఇతరులకు తెలియకుండునట్లు చేయవచ్చు. దీనిని మనము పూర్తిగా ద్వేషించవచ్చును. మనయొక్క పాపములను మరియు ఓటములను ఇతరులకు చెప్పనవసరము లేకుండినప్పటికిని, ఉన్నదానికంటె మన యొక్క ఆత్మీయతను చూపించు కొనకూడదు.
కలవరములలో చేసే ప్రార్థన:
మన జీవితములలో జరుగుచున్న సంఘటనలను మనం గ్రహించలేనప్పుడును లేక మన ప్రార్థనలకు జవాబు రానప్పుడును, సిలువమీద ప్రభువైన యేసు చేసిన దానిని మనము కూడా చేయాలి. ఆయన తండ్రికి ఈవిధముగా ప్రార్థించాడు, ''నాదేవా, నాదేవా నన్నేల చెయ్యి విడిచితివి'' మరియు పరలోకము నుండి జవాబు పొందనందున ప్రభువైన యేసు యిట్లనెను, ''తండ్రీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను''. మనము కూడా దేవునికి అప్పగించుకుని ఈ విధముగా చేయాలి.
శత్రువు విషయంలో న్యాయము కొరకు విధవరాలు న్యాయాధిపతిని మాటిమాటికి అడిగినందువలన చివరకు ఆమె అడిగిన దానిని పొందియున్నది (లూకా 18). ఇదియే విశ్వాసమునకు ఋజువు. దేవునిచిత్త ప్రకారము మనము ఏదైనా అడిగినప్పుడు (ఉదాహరణకు పాపక్షమాపణ మరియు పాపము మీద జయము, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మరియు లేఖనములలోని ప్రతి యొక్క వాగ్ధానము) అది పొందే వరకు అడుగుచునే ఉండవలెను. మనము వెంటనే జవాబు పొందని యెడల విశ్వాసముతో ఆ విషయమును మన తండ్రికి అప్పగించుకొనవలెను.
ఇక్కడ నేను చదివిన ఒక మంచి పద్యము ఉన్నది.
''ఆట ఆడనిదే దానిని గెలువలేము,
ప్రార్థన చేయనిదే దానికి జవాబు పొందలేము
గనుక దినములో నీవెంత తీరిక లేకున్ననూ
ప్రార్థించుటకు సమయము కల్పించుకొనుము
దేవుడు నీ ప్రార్థన ఆలకించెనో లేదో అని తలంచకుము
నీ చింతలను ఆయన పట్టించుకొనునో లేదో అని తలంచకుము
నీ సమస్య ఆయనతో చెప్పి భయపడకుము
ఆయన జవాబు కొన్నిసార్లు ఆలస్యము కావచ్చు.
దేవుడెన్నడు తొందరపడడు, ఆయనెన్నడు ఆలస్యము చేయడు
అయితే మనలను వేచియుండమని చెప్పినప్పుడు ఆయన మనలను పరీక్షించును
అది పెద్ద సమస్య కావచ్చు లేక చిన్న సమస్య కావచ్చు
దేవుడు వాటన్నిటిని పరిష్కరించుటకు జ్ఞానము గలవాడు.
మనమనుకున్నట్టుగానే ఆయన ఎల్లప్పుడు చేయడు
అయితే నీకు శ్రేష్ఠమైన విధానంగా ఆయన ఎల్లప్పుడు చేయును
మనం ఆయనను సుఖమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును,
ఘనతను, పేరు ప్రఖ్యాతలను ఇమ్మని కోరెదము
అయితే కిరీటమునకు బదులుగా ఆయన సిలువను పంపించును
లాభమునకు బదులుగా నష్టముతో మనము పేదవారిమిగా చేయబడెదము
అయితే మనము ప్రభువు చిత్తమును వివేచనమును నమ్మినయెడల
మన ఆనందము గొప్పదిగా మన ప్రతిఫలము నిండుగా ఉండును''.
(హెలెన్ స్టెయినర్ రైస్)
దేవుని యొక్క ప్రేమలోని భద్రత:
దేవుడు మనకు తండ్రియై ఉన్నాడు గనుక దానిలో మనము భద్రత కలిగియుండాలి. మనయొక్క ఆత్మీయ ఎదుగుదలకొరకు గాని లేక క్షేమాభివృద్ధికొరకు గాని దేవునికి ప్రార్థించినప్పుడు అనగా కృపగాని లేక జ్ఞానము గాని లేక పరిశుద్ధాత్మ యొక్క నింపుదలగాని మనము గత జీవితములో ఎంతో ఘోరముగా ఓడిపోయి అనర్హులముగా ఉన్నాము. గనుక దేవుడు మనకు ఇచ్చుట లేదని ఒక పొరపాటును మరియు రెండు తప్పులను చేసెదము.
1. పొరపాటు:
మనము అర్హులము అయినప్పుడు మాత్రమే దేవుని యొక్క వరములను పొందెదమని తలంచెదము కాని దేవుని యొక్క అత్యంత చిన్న వరములను పొందుటకు కూడా అనేక లక్షల సంవత్సరములు ప్రయత్నించినను చేరుకోలేమనే సత్యము మనలో లోతుగా వేరుపారాలి. కాబట్టి మనయొక్క అర్హతను బట్టి కాదుగాని దేవుని యొద్దకు ప్రభువైన యేసు ద్వారా వెళ్ళగలము. ప్రభువైన యేసునామములో ప్రార్థించుట అనగా ఇదియే. దేవునియొక్క వాగ్ధానములన్నియు ప్రభువైన యేసులో అవును మరియు ఆమేన్ అయిఉన్నవి (1 కొరింథీ 1:20).
2. మొదటి తప్పు:
మన పాపములను మనము ఒప్పుకొనినప్పటికి మనము సరిగా ఒప్పుకొనలేదని అనుకొని మనము ప్రార్థించినప్పుడు, దేవుడు మన పాపములను గుర్తు చేసుకొనుచున్నాడు అని నిందారోపణలో ఉండెదము. అందువలన ప్రభువైన యేసుయొక్క రక్తము మనము గతములో చేసిన సమస్తపాపములను సంపూర్ణముగా తుడిచివేయగలదనే సత్యమును మనం విసర్జించుచున్నాము. ప్రభువైన యేసుయొక్క రక్తము యొక్క శక్తికంటే మనయొక్క పాపము యొక్క నేరారోపణను ఎక్కువగా చేయుచున్నాము. మనయొక్క పాపములను మనము నమ్మకముగా ఒప్పుకొనినప్పటికిని దేవుడు నమ్మకముగా సమస్త దుర్ణీతినుండి పవిత్రపరచలేదనుట ఎంతో ఎంతో చెడ్డ విషయము. ఎంత చెడ్డ విషయమనగా దానిగూర్చి మనము మారుమనస్సు పొంది మరియు దేవుడు తన వాక్యము విషయములో సత్యముగా లేడని నిందించకుండా ఉండవలెను.
3. రెండవ తప్పు:
తమ పిల్లలు అనేకసార్లు ఓడిపోయినప్పటికిని వాటిని పట్టించుకొనక మరియు వారికి మంచి వాటిని ఇచ్చే ఈ లోకపు తల్లిదండ్రుల కంటే, తండ్రియైన దేవుడు తక్కువగా క్షమించి మరియు శ్రేష్ఠమైనవాటిని ఇవ్వడని నిందించుట (మత్తయి 7:7-11).
అవిశ్వాసము ఎంతో చెడ్డది. అది మనకు తెలియని యెడల తప్పిపోయెదము (హెబీ 3:4). అవిశ్వాసము ఎంత చెడ్డదో అని మనము చూడనంత వరకు దానిని సరిగా ద్వేషించము. మనము ఎల్లప్పుడు, దేవుడు క్రీస్తులో మనలను అంగీకరించి మరియు ఆయన పిల్లలుగా చేసుకొని మరియు ఆయన ఒడిలో మనలను కూర్చుండబెట్టుకొనియున్నాడని విశ్వసించాలి ఎందుకనగా దేవుడు మన గురించి జాగ్రత్తవహించును గనుక మనము ధైర్యముగా ఉండెదము.
కనికరములో పరిపూర్ణులుగా ఉండుట
''మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు'' (మత్తయి 5:48) అని ప్రభువైన యేసు ఆజ్ఞాపించెను. మనలను గాయపరచువారిని లేక మనకు కీడుచేసిన వారిని లేక మనగురించి చెడుగా మాట్లాడినవారికి మేలు చేసి మరియు వారిని ప్రేమించవలెనని ఇక్కడ ప్రభువు చెప్పియున్నాడు. ఇటువంటి వచనమే లూకాలో కూడా చెప్పబడింది. ''మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి'' (లూకా 6:36). ఇతరులయెడల మీరు కనికరములో పరిపూర్ణులు అగునట్లు ప్రయత్నించుడి.
ప్రభువు మరణించిన సిలువమీద మనము అనేక సంగతులను చూచెదము. మనము సిలువ నెత్తుకొనినప్పుడు, మనము ఏవిధంగా అంతరంగములో స్పందించాలో ఇక్కడ మనము చూడగలము.
ప్రభువైన యేసుతో సహవాసము కలిగియుండుటకు రొట్టె విరువబడిన రీతిగా దేవునిని వ్యతిరేకించే స్వచిత్తము కూడా విరుగగొట్టబడాలి. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు రక్తము ద్వారా (ఇతరులను క్షమించమని మొరపెట్టెదము) క్రొత్త నిబంధన సహవాసము కలిగియుండెదము. హెబేలు రక్తము వలె ఇది పగతీర్చుకొనదు (హెబీ 12:24).
ప్రభువైన యేసును సిలువవేయుటయే, ఈ భూమిమీద అత్యంత ఘోరపాపము. ప్రభువైన యేసును చంపిన వారికి, వారేమి చేసియున్నారో వారికి తెలియును. అయినప్పటికి వారేమి చేయుచున్నారో వారెరుగరు గనుక వారి యొక్క క్షమాపణ కొరకు యేసు ప్రార్థించెను. ఇతరుల యెడల కనికరము చూపుట అనగా ఇదియే.
సిలువ మీద ప్రభువైన యేసు తన తలవంచుకొని మరణించారు. అప్పుడు సైనికులు వచ్చి ఆయన నిజముగా చనిపోయాడా లేదా అని పరీక్షించెను. మనము క్రీస్తుతో కూడా నిజముగా చనిపోయామా లేదా అని దేవుడు మనయెడల కూడా పరీక్షలను అనుమతించును. దేవుడు మనలను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయవలెనని నిర్ణయించుకొని మరియు మనము పొడవబడునట్లు ఆయన అనుమతించెను. ప్రభువైన యేసు ఈటెతో పొడవబడినప్పుడు, ఆయన నిజముగా మరణించెను గనుక ఆయన స్పందించలేదు. మరియు ఆయన రక్తము కారి దానిని కప్పెను. ఆ విధముగా క్రొత్త నిబంధన రక్తముతో ఆ ఈటె కప్పబడినది. మనము కూడా ఇదే విధముగా వెళ్లవలెను. మనలను ఈటెతో పొడిచిన వారిని మనము వెంటనే, వారిని విడుదల చేసి మరియు దేవుని ప్రేమతో స్పందించాలి. ఈ విధముగా ప్రభువైన యేసును వెంబడించాలి.
నీతి మరియు మంచితనము:
పరిసయ్యుల నీతికంటే మన నీతి అధికముగా ఉన్నయెడల, మంచితనముతో నిండిన దేవునినీతివలె మన నీతి ఉండవలెను (మత్తయి 20:44-48). నీతికంటె మంచితనము శ్రేష్ఠమైనది ''నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును'' (రోమా 5:7). నీతి మన శరీరములో ఎముకలవలె ఉండి మరియు మంచితనము ఎముకలను కప్పే మాంసముగా ఉండవలెను. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటికి లోబడుటద్వారా మనము ఎముకలన్నింటిని కలిగియుండాలి. కాని మంచితనము లేనట్లయితే, మనము అస్థిపంజరమువలె ఉండెదము. మన శరీరములో ఎముకలు దాగివున్నట్లే దేవుని ఆజ్ఞలకు లోబడుట రహస్యముగాఉండాలి.
ఇతరులు మనయొక్క మంచితనమును మాత్రమే చూడాలి. మత్తయి 6:1లో మన యొక్క నీతి ఇతరులకు కనపడకుండా చూచుకొనుడి గాని మీ సత్క్రియలు ఇతరులు చూచునట్లుగా చేయుడి అని ప్రభువైన యేసుచెప్పాడు (మత్తయి 6:1 మరియు 5:16). సంఘమునకు బయట ఉన్న వారికి మనయొక్క మంచితనమును వ్యక్తపరచి, వారిని క్రీస్తుయొద్దకు ఆకర్షించాలి. మరియు అస్థిపంజరములాంటి నీతిని బట్టి వారు వెళ్ళిపోకూడదు. ప్రభువైన యేసు ఎముకలు మాంసముతో కప్పబడిన రీతిగా కృపాసత్య సంపూర్ణుడిగా దేవుని యొక్క మహిమను బయలుపరచాడు. పరిసయ్యుల యొక్క అస్థిసంజరము లాంటి నీతి పాపులు వెళ్ళిపోయేటట్లు చేసింది. కాని పరిసయ్యుల కంటె ఎక్కువ ఎముకలు (నీతి) ఉన్న ప్రభువైన యేసు దగ్గరకు పాపులు ఆకర్షించబడిరి. దీనినుండి మనము నేర్చుకొనవలెను.
దైవికశక్తి మరియు మానవబలము:
మనసులో ఒక తలంపుగా మనకు శోధన వచ్చును.వెంటనే దానిని మనము ఎదిరించాలి. కాని మనము జయము పొందవలెనని కోరుచున్నప్పుడు కనీసం కొన్ని సెకండ్ల వరకు మనము దానిని ఎదురించలేము ఎందుకనగా అనేక సంవత్సరములు ఈవిధంగా భావించుట అలవాటయినది. ఇది సున్నా అగువరకు మనము పోరాడి దానిని ఎదురించుచుండవలెను. మనము పాపము చేసినయెడల, దానిని వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపపడవలెను.
మన సొంత శక్తితోనా లేక దేవుని శక్తితో ఎదురించుచున్నామా అని వివేచింపనవసరము లేదు. నీవు పాపమును ఎదురించుచున్నంత వరకు మంచిగానే చేయుచున్నావు. అటువంటి సమయములలో అది దేవునిశక్తియా మరియు సొంతశక్తియా అని తెలుసుకొనుట కష్టము. అది పరీక్షలలో మనకు సహాయము చేయవలెనని ప్రార్థించునట్లు ఉండును. నీవు పరీక్ష వ్రాయునప్పుడు దేవుని యొక్క శక్తి ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. మనకు తెలియని రీతిగా దేవుని యొక్క శక్తి నిశ్శబ్దంగా మన యొద్దకు వచ్చును.
పరిశుద్ధాత్మశక్తితో వాక్యపరిచర్య చేయుటకు ప్రార్థించుట కూడా అలాగే ఉండును.
మనము దేవునిశక్తితో మాట్లాడునప్పుడు ఇది దేవునిశక్తితో అనిగాని సొంత శక్తితో అనిగాని అని నిర్ణయించుట కష్టము. దానిని తెలుసుకొనుటకు మనము సమయము వృథా చేయకూడదు. ఎందుకనగా అది అసాధ్యము మరియు లాభకరము కాదు. పాపము మీద జయముపొందు విషయము అలాగే ఉండును. పాపమునకు వ్యతిరేకముగా మనము పోరాడుట ముఖ్యము.
పాపము మీద జయము పొందుట:
ప్రభువైనయేసు నామములో మన శరీరములో నుండి పాపమును వెళ్లగొట్టలేము. ప్రభువైనయేసు నామములో దయ్యమును మాత్రమే వెళ్ళగొట్టగలము మరియు అతడు మనయొద్ద నుండి పారిపోవును కాని అతడు ఆ క్షణము మాత్రమే పారిపోవును (యాకోబు 4:7). ప్రభువైన యేసు వద్దకు వచ్చునట్లు అతడు మరల వచ్చును (లూకా 4:13). అప్పుడు అతడిని మరల ఎదిరించవలెను.
కాని పాపము వేరుగా ఉన్నది. పాపము మన శరీరములో నివసించుచున్నది. కాబట్టి జీవితకాలమంతయు అనగా మనము చనిపోవువరకు శోధించబడెదము.
పాపమునుండి పారిపోవుటద్వారా జయము పొందవచ్చును. యౌవనేచ్ఛలనుండి పారిపొమ్మనియు (2 తిమోతి 2:22) మరియు జారత్వమునుండి పారిపొమ్మనియు బైబిలు మనకు చెప్తుంది. వాటితో పోరాడవద్దు (1 కొరింథీ 6:18).
సముద్రములో పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురు సహాయముకొరకు కేకవేసి ప్రార్థించినట్లే మనకు ఎప్పుడైనా శోధన బలముగా వచ్చి మరియు ఓడిపోయెదమని భయపడినయెడల వెంటనే సహాయము కొరకు ప్రార్థించవలెను (మత్తయి 14:30). సమయోచితమైన సహాయము కొరకు ఈ విధముగా కృపాసింహాసనము దగ్గరకు రావలెను. పాపము యొద్దనుండి పారిపోవుటయు మరియు పాపమునకు వ్యతిరేకముగా పోరాడుటయు, మీరు పాపము మీద జయము పొందుటకు నిర్ణయించుకొనియున్నారనుటకు దేవునియెదుట రుజువైయున్నది మరియు దేవుడు ఎంతో ఎక్కువగా సహాయపడును.
సాతాను గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని ఎల్లప్పుడు చూచుచుండును (1 పేతురు 5:8). ఇప్పటికి అతడు అనేకులను మ్రింగియున్నాడు. చూపులలో అజాగ్రత్తగా ఉండేవారికొరకు, ఇతరులను ద్వేషించువారికొరకు మరియు దుర్నీతిపరులకొరకును అతడు చూచుచున్నాడు. అటువంటి విశ్వాసులను నెమ్మదిగా మ్రింగుటకు గురిపెట్టుకొనియున్నాడు. కాబట్టి మనము పడిపోకుండునట్లు ఎల్లప్పుడు జాగ్రత్తగా ఉండవలెను.
ఒక క్రీడాకారుడు అనేక సంవత్సరములు తననుతాను క్రమశిక్షణలో పెట్టుకొనును. నీవు సాతానును మరియు శరీరేచ్ఛలను జయించి మరియు నీవు పరలోకపు పరుగుతో జయము పొందవలెనని కోరినయెడల నీ శరీరేచ్ఛలను అధుపులో పెట్టుకొనవలెను. పౌలు ఇట్లు అనుచున్నాడు, ''నా శరీరము ఏది చేయవలెనో దానినే చేయునట్టును మరియు అది కోరినది చేయకుండునట్లును నా శరీరమును నలుగగొట్టుచున్నాను లేనియెడల ఇతరులకు ప్రకటించినయెడల నేనే బహుమానమును పోగొట్టుకొనెదను'' (1 కొరింథీ 9:27 లివింగు).
పరిసయ్యుల నీతికంటే మనయొక్కనీతి అధికముగా ఉండవలెనని ప్రభువైన యేసు కొండమీద ప్రసంగములో చెప్పారు (మత్తయి 5:20). ప్రత్యేకముగా మనయొక్క కళ్లు, మనయొక్క నాలుక, మరియు మనయొక్క చేతులు గురించి జాగ్రత్తపడుమని చెప్పారు (మత్తయి 5:29, 22, 37, 30 మరియు మత్తయి 12:36, 37). నీ శరీరములోని ఈ మూడు అవయవముల విషయములో చాలా జాగ్రత్తగా ఉండవలెను. యౌవనస్థులు అనేకులు ఈ విషయములలో పాపముచేసెదరు మరియు నేను చెప్పిన క్రమములో అవి యుండును.
మన శరీరములోని ఈ అవయవములను ప్రతిదినము దేవునికి సజీవయాగముగా సమర్పింపవలెను (రోమా 12:1). దేవుడు మన కొరకు చేసి, ముగించిన దానినంతటిని బట్టి మనము ఇది చేయలేమా అని పరిశుద్ధాత్ముడు అడుగుచున్నాడు (రోమా 12:1 లివింగ్).
సాతాను మరియు మనయొక్క ఇచ్ఛలు ఎంతో బలమైనవిగా యుండునట్లు దేవుడు అనుమతించియున్నాడు గనుక వాటిని మనయొక్క సొంతశక్తితో జయించగలమని ఊహించుకొనకూడదు. దేవునియొక్క శక్తికొరకు ప్రార్థించుటకు బలవంతము చేయబడుచున్నాము. కానానులో ఉన్న ఆజానుబాహులను చూచినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క వేగులవారు వారియెదుట ''మేము మిడుతల వలె ఉండినట్లుగా చూచాము'' అని చెప్పారు. కాని యెహోషువా మరియు కాలేబులు దేవుని యొక్క శక్తిని విశ్వసించి, దేశములో ప్రవేశించి వారిని హతము చేసిరి. మన యిచ్ఛలన్నిటిని జయించుటకు మనకు కూడా అటువంటి ఆత్మ కావలెను. కాబట్టి ఎల్లప్పుడు విశ్వాసముతో దేవునియొక్క శక్తి ద్వారా సాతానును మరియు నా యిచ్ఛలన్నింటిని నేను జయించగలనని చెప్పుచుండవలెను.
ప్రతియొక్క శోధనలో రెండు మార్గములు ఉన్నవి. 1. సుఖించుమార్గము 2. శ్రమించుమార్గము, అనగా నీ శరీరము కోరుచున్న సుఖమును ఉపేక్షించుటద్వారా శరీరములో శ్రమపడుటయే రెండవ మార్గము (1 పేతురు 4:1). నీవు పాపమును ఎదురించుచూ మరియు శ్రమపడుచున్న యెడల చివరకు పాపము చేయుటకంటే మరణించుటకు సిద్ధపడుదువు. అప్పుడు రక్తము కారునంతగా పాపముతో పోరాడెదవు (హెబీ 12:4). అంతము వరకు ఈ మార్గములో నడుచుటకు ప్రభువు మిమ్మును ప్రోత్సహించును గాక.
చదువుకొనుటలోను మరియు ఆత్మీయతలోను సమతుల్యత కలిగియుండుట:
మీరు అనేకక్రైస్తవ గుంపులతో సహవాసము చేయుచున్నప్పుడు, వారిలో కొందరు పరిసయ్యతత్వము కలిగియుండెదరు. కాబట్టి మీరు సమతుల్యత కలిగి జాగ్రత్తగా ఉండవలెనని కోరుచున్నాను. మీరు ప్రకృతిసంబంధమైన మరియు ఆత్మసంబంధమైన తేడాను గుర్తించనియెడల, మీరు కూడా పరిసయ్యతత్వము కలిగిన వారితో కలసిపోయే అవకాశము ఉన్నది. మీ గుంపులో ఉన్న వారినే కాక ఇతరగుంపులో ఉన్న దేవుని పిల్లలందరిని విలువనిచ్చుట నేర్చుకొనుడి. ఆ విధముగా మీరు పరిసయ్యతత్వము నుండి రక్షింపబడెదరు.
కాలేజీలో ఆత్మీయతకును మరియు చదువుకొనుటకును మధ్య సమతుల్యతను కనుగొనవలెను. ఎందుకనగా ఈ రెండు విషయములను దేవుడే నియమించాడు. మనము ఎల్లప్పుడు బైబిలు చదువుచు మరియు కూటములకు వెళ్ళవలెననికాదు గాని అవసరమునుబట్టి భూసంబంధమైన పనులను చేయవలెను అనగా ఆఫీసుకు వెళ్లుట లేక కాలేజీలో చదువుకొనుట లేక తల్లిదండ్రులుగా ఇంటిలో పనులు చేయవలెను.
నీవు చదువును నిర్లక్ష్యముచేయుచు మరియు తక్కువ మార్కులు పొందునట్లు, నీవు ఎల్లప్పుడు క్రైస్తవకూటములకు వెళ్ళుటద్వారా దేవునిని మహిమపరచలేవు. దేవునిని మొదటిగా పెట్టుట మంచిది కాని లెక్కలేని కూటములకు వెళ్ళుట మంచిది కాదు. మనము కూటములను మరియు దేవునిని సమానము చేయకూడదు. మనము సత్యమును గ్రహించాలి.
నీ చదువుకొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టబడుచున్నది గనుక చదువుకొనుటకు నీవు చేయగలిగినదంతయు చేయవలెను. అప్పుడు నీవు దేవుని మహిమపరచెదవు. నీకున్న తెలివితేటలను మించి ఫలితములను ఆశించవద్దు. ఎందుకనగా దేవుడు కూడా ఆ విధముగా కోరడు. అయితే నీవు కష్టపడి చదవాలని కోరుచున్నాడు. దాని నిమిత్తము కొన్ని కూటములకు నీవు వెళ్లలేకపోవచ్చును. మీ సంఘములో ఉన్న ప్రతి కూటముకు మరియు కూటములకు వెళ్లవలసిందే అని ఆలోచించవద్దు. ఉద్యోగవిషయములన్నింటిలో సమతుల్యత కలిగియుండవలెను.
కాలేజీలో మంచి మార్కులు పొందుటకు పూర్ణహృదయముతో చదవని క్రైస్తవులను బట్టి దేవుని నామము అగౌరవపరచబడుచున్నది. ఆ విధముగా కష్టపడి చదివినప్పటికిని తక్కువ మార్కులు వచ్చినయెడల, అది దేవుడు నీకు అనుగ్రహించిన తెలివితేటలు మీద ఆధారపడును. గనుక అది సరియైనదే కాని సోమరితనముగా ఉండకూడదు. చెమటోడ్చి నీవు సంపాదించుకొనవలెనని దేవుడు ఆదాముతో చెప్పెను. ఆ విధముగా కష్టపడి పనిచేయవలెనని మనందరి విషయములో దేవుడు నియమించాడు.
వారియొక్క చదువులను నిర్లక్ష్యము చేయవచ్చని కొంతమంది మతస్థులు నిర్లక్ష్యముచేసి వారియొక్క కార్యక్రమములలో పాలుపొందవచ్చని చెప్పెదరు. ఇటువంటి వారికి దూరముగా ఉండుము. నీ జీవితకాలమంతయు ఎల్లప్పుడు దేవుని రాజ్యమును మరియు నీతిని మొదట వెదుకుము. నీవు ఎల్లప్పుడు పరలోకసంబంధమైన మనసు కలిగియుండి మరియు భూలోకసంబంధమైన మనసును కలిగియుండకూడదు. ప్రభువైనయేసు తన ఇంటిలో వడ్రంగి పని చేసియున్నాడు. కనుక ఆయన ప్రతిరోజు సమాజమందిరకూటములకు వెళ్ళలేదు. కాని నీవు ఎక్కువ సమయము చదువుకొనుచు మరియు ఆత్మవిషయము నిర్లక్ష్యము చేసినయెడల, అప్పుడు దానికి వ్యతిరేకముగా హెచ్చరికలు చేసెదను. ప్రభువైన యేసు నడిచిన మార్గమునకు కుడికిగాని ఎడమకుగాని వెళ్లక తిన్నగా వెళ్లునట్లు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును. యెషయా 30:21 లో ఈ విధముగా చదివెదము, ''నీ సొంత కళ్లతో నీ బోధకుని (యేసుని) చూచెదవు. నీవు దేవుని మార్గములను విడిచి తప్పిపోవుచున్నయెడల నీ వెనకనుండి పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఒక స్వరము వినెదవు, ''ఇది కాదు, ఈ మార్గమున వెళ్లుము'' (లివింగ్ బైబిలు). సమతుల్యత కలిగియుండుటకు మనమందరము ఎల్లప్పుడు ఈ స్వరము వినవలెను. అన్ని విషయములలో సమతుల్యత కలిగియుండుటే జ్ఞానము.
దేవునిని మీరు హృదయమంతటితో కోరుటనుబట్టి తల్లిదండ్రులముగా మేము దేవునికి కృతజ్ఞతకలిగినవారమై మరియు రాబోయేదినములలో ఆ ఆసక్తి ఎక్కువకావలెనని కోరుచున్నాము. మీరు ఒక ఉల్కవలె పైకి ఎగసి అదృశ్యమయ్యే వారిగా ఉండకుండునట్లు, మీ యొక్క ఆసక్తి జ్ఞానముతో కూడినదై సమతుల్యత కలిగియుండవలెనని ఇవన్నియు చెప్పుచున్నాను. మీరు ఎల్లప్పుడు ప్రకాశించే నక్షత్రమువలె ఉండవలెనని మేము కోరుచున్నాము. దేవుడు మహిమపరచబడునట్లు మీరు సమతుల్యతలో ఎదగాలి. దాని కొరకు దేవుడు మీకు సహాయపడునని మేము నమ్ముచున్నాము.
మీరు కాలేజీలో అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేయనవసరము లేదు. శనివారములలోను మరియు మీ సెలవులలోను అవసరమును బట్టి పనిచేయవచ్చు. బోధించిన దానిని కేవలము చదువుట సరిపోదు మీరింకా ఎక్కువ లెక్కలను పరిష్కరించుట మరియు ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ చేయుట, మీకు అర్థముకానియెడల ప్రొఫెసర్‌లను మరియు విద్యార్థులను అడుగుటకు వెనుకంజవేయకూడదు. ఒక విషయమును గురించి మనకు అంతయు తెలుసునని అనుకోకూడదని గుర్తుపెట్టుకొనుము. నీకు అర్థమయినవని అనుకున్న అనేక విషయములలో నిజానికి నీవు అర్థము చేసుకోలేదు. ఆ సబ్జెక్టులోని కొన్ని సమస్యలను నీవు పరిష్కరించినట్లయితే, దానిని బట్టి నీవు గ్రహించగలవు.
మీడియాను బట్టి ప్రభావితము కాకూడదు:
టీ.వి కార్యక్రమముల గురించి ఒక హెచ్చరికను ఇవ్వనివ్వండి. ప్రపంచములో జరుగుచున్న వాటిని తెలుసుకొనుటకు మరియు విరామము తీసుకొనుటకును వార్తలను మరియు కొన్ని ఆటలను చూడవచ్చు. కాని టీ.విలో వచ్చే అనేక కార్యక్రమములు మనస్సును పాడుచేయుటయే గాక లేఖనములను చదువుటకును మరియు దేవునితో సయయమును గడుపుటకును సమయము లేకుండా చేయును. కాబట్టి మనస్సులు కలుషితం కాకుండుటకును లేదా సమయమును వృథాచేసుకొనకుండుటకును జాగ్రత్తపడుము.
టీ.వి కార్యక్రమములను చూడవలెనని కోరినప్పుడు, బైబిలును చదువుటకు సమయమును గడిపామా లేదా అని మొదట అడుగుకొనవలెను. మిమ్ములను పరిపాలించుటకు పరలోకమందున్న దేవుడినా లేక ఈ లోక దేశతను కోరుచన్నారా?
డేవిడ్ విల్కర్‌సన్ ఒక యౌవన పాస్టరుగా వ్రాసిన సిలువ మరియు స్విచ్ బ్లేడ్ అను పుస్తకములో, ప్రతి రోజు టీ.వి కార్యక్రమం చూడకుండా రెండు గంటలు ప్రార్థన చేయవలెనని నిర్ణయించుకొన్నాడు. ఆ విధముగా ప్రార్థించిన కొద్దికాలానికి న్యూయార్క్‌లోని ఒక గుంపు గురించి వార్తాపత్రికలలో చదివాడు. అటువంటి వారికి సహాయపడవలెనని ప్రభువు అతనికి భారము ఇచ్చియున్నాడు. మరియు అతడు మత్తుపదార్థములకు బానిసలైన వారిని ప్రభువైన క్రీస్తు యొద్దకు నడిపించే పరిచర్యను ఆరంభించి తరువాత ప్రపంచ వ్యాప్తముగా ఆ పరిచర్యను చేసెను.
చిన్న చిన్న విషయములలో పరీక్షించబడి నమ్మకముగా ఉన్నవారు పెద్ద విషయములలో కూడా నమ్మకముగా ఉండెదరు. ఇది మీకు ఒక పోరాటమేనని నాకు తెలియును. శత్రువు వశపరచుకొన్న దేశమును ఎప్పుడైన పోరాటము ద్వారానే పొందెదము. కాని తరువాత ఈ పోరాటమెంతో శ్రేష్ఠమైనదని తెలుసుకొనెదవు. ప్రభువు సన్నిధిలో నీవు ప్రవేశించినప్పుడు మంచి పోరాటము పోరాడినావని సంతోషించెదవు.
రాబోయే సంవత్సరములలో లోకమునుండియు లోభత్వము నుండియు మరియు కలుషితము చేసే వాటన్నింటినుండియు కాపాడబడి మరియు ఎటువంటి పరిస్థితివచ్చినను, ఎవరు అభ్యంతరపడినను దేనికైతే ''కాదు'' అని చెప్పవలెనో దానికి కాదుఅని చెప్పుటకును కావలసిన కృపను, శక్తిని దేవుడిచ్చును గాక. నీవు మనుష్యుల ఘనతను కోరుచున్నావా లేదా దేవుని ఘనతను కోరుచున్నావా అని పరీక్షించబడుటకు దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించును. అటువంటి ప్రతి పరీక్షలోనూ మీరు గెలుచుదురుగాక.
కపటము నుండి విడుదల పొందుట:
క్రీస్తు యొక్క వధువుగా లక్షా నలభైనాలుగు వేల మంది మాత్రమే ఉండెదరని నీవు వ్రాసియున్నావు. ప్రకటన గ్రంథమంతయు సూచనలతో నింపబడియున్నదని గుర్తుంచుకొనుము (పక్రటన 1:1లో దీని సూచనలను చూడగలము). కాబట్టి ప్రకటన 14లోని లక్షానలభై నాలుగువేలు సూచనగాఉన్నది గాని నిజముకాదు. దేవుని గొఱ్ఱెపిల్ల ఎక్కడకు వెళ్ళినను వెంబడించుచూ మరియు వీరినోట ఏ అబద్ధమును లేని లక్షానలభై నాలుగు వేలమంది పక్రటన 14:1-5, పక్రటన 7:9,14లో ఉన్న తమ వస్త్రములను గొఱ్ఱెపిల్ల రక్తములో కడుగుకొనిన లెక్కింపజాలని గొప్ప సమూహముతో పోల్చినప్పుడు కొద్ది మందియే. పక్రటన 14:5లో ఉన్న కపటము లేకుండా గొప్ప సాక్ష్యము కలిగినవారు లక్షా నలభై నాలుగు వేలమంది. మన జీవితములలో చిన్నప్పటినుండి కపటమును కలిగియున్నాము. మన తల్లిదండ్రులను అనేక విధములుగా మోసగించి మరియు కొన్ని దొంగతనములను చేసి మరియు ఇతరులు మనలను ఆత్మీయులనుకొనునట్లు ప్రవర్తించితిమి. ఇదంతయు చెడ్డది మరియు మన జీవితములలో ఉన్న దీనినంతటిని మనము కడుగుకొనవలెను. అందువలన మనము ఎల్లప్పుడు తీర్పు తీర్చుకొనవలయును. లేనట్లయితే కపటములేని కొద్ది మందిలో మనము ఉండలేము.
విధవరాలు ఉపమానములో ప్రభువైన యేసు చెప్పినట్లుగా దివారాత్రులు మనము ఆయనకు మొఱ్ఱపెట్టవలెను (లూకా 18:7). శత్రువు యొక్క శక్తినుండి మనము విడుదల పొందుటకును, పవిత్రపరచబడుటకును మరియు పరిశుద్ధాత్మఅగ్నిని ఎప్పటికిని కోల్పోకుండుటకును ఆ విధవరాలివలె మనము ప్రార్థించాలి. ఒక్క పాపపు తలంపు (అపవిత్రత గురించికాని లేక ద్వేషము గురించికాని లేక ధనాపేక్ష గురించికాని) వచ్చిన యెడల దానిని ఎయిడ్స్ రోగము కంటె ఎక్కువ తీవ్రముగా తీసుకోవాలి. ''దేవుని ఆధారము చేసుకొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడని'' దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒకసారి చెప్పాడు (యెషయా 64:7). తిమోతి కూడా దేవుడిచ్చిన వరమును ప్రజ్వలింపచేసుకొనవలసి యున్నది (2 తిమోతి 1:6). దేవుడు మన జీవితములో దానంతటదియే జరుగునట్లు ఏదియు చేయడు. ఎందుకనగా అది మన స్వచిత్తమును దోచుకొనుటయే. కాని ఆయన కొరకును మరియు ఆయన యొక్క శ్రేష్ఠమైన వాటన్నిటి కొరకును మనకు కొంచెము ఆసక్తి ఉన్నప్పటికిని, ఆయన అద్భుతముగా మనకు ఎంతో సహాయముచేయును.
దేవునికి నీయెడల పరిపూర్ణమైన ప్రణాళిక ఉన్నది:
దేవుడు అన్ని సమయములలో మనకు సహాయుడని మనము నమ్మవలెను...
1. మన శరీరేచ్ఛలన్నింటిని జయించుటకును,
2. ప్రతి పరీక్షలోను ఆయన సంకల్పం మనలో నెరవేరునట్లును,
3. ప్రతి పరిస్థితిలోను జయించువారిగా ఉండునట్లును,
4. కీడంతటి యెదుట క్రీస్తు యొక్క గుణలక్షణములను వ్యక్తపరచుటకును ఆయన సహాయపడును
అప్పుడు మనము ఎన్నటికిని నిరాశచెందము.
మన కొరకు అద్భుతములు చేసే ప్రేమాస్వరూపియైన తండ్రి మనకున్నాడని అవిశ్వాసుల యెదుటను మరియు రాజీపడుచున్న క్రైస్తవులయెదుటను మనము సజీవసాక్ష్యముగా ఉండవలెను. దేవునికి నీ యెడల ఒక ఉద్దేశ్యము ఉన్నది. దినదినము నీవు ఆయనను ఘనపరచేకొలది, ఆ ఉద్దేశ్యమును నీవు కనుగొనగలవు. తగిన సమయములో సహవాసము విషయములోను, ఉద్యోగ విషయములోను, ఇంటి విషయములోను సమయము వచ్చినప్పుడు ఆయన మంచి ద్వారము తెరచును. దేవుని ఘనపరచువారికి కాలేజీలో తక్కువ మార్కులు వచ్చినప్పటికిని, పలుకుబడిగాని లేక ఆర్థిక వనరులు గాని లేనప్పటికిని మరియు ఏ దేశములో ఎటువంటి కరువు ఉన్నప్పటికిని మేలే జరుగును.
నీవు చేయు ప్రతిపనిలో జ్ఞానము కలిగి ఉండవలెనని నీ కొరకు ప్రార్థించుచున్నాను. యౌవనస్తులు అనేక మందిలో మూడత్వమున్నది. జీవితాంతం బాధపడవలసిన పరిస్థితులను కలుగజేసే తీవ్రమైన పొరపాటులు నీవు చేయకుండునట్లు దేవుని కృప మాత్రమే నిన్ను కాపాడగలదు. కాబట్టి అన్ని సమయములలో దేవునియెడల భయభక్తులు కలిగియుండి మరియు జాగ్రత్తగాఉండవలెను.
నీ జీవితంలోని దేవుని సంకల్పమును పోగొట్టుకొనవద్దు. పందొమ్మిదిన్నర సంవత్సరముల వయస్సులో నన్ను నేను సంపూర్ణముగా ప్రభువునకు సమర్పించుకొన్నాను. అనేక సంవత్సరముల తరువాత ఇప్పుడు నేను మంచిదనుకొని చేసియుండిన దానికంటే ఎంతో ఎక్కువగా శ్రేష్ఠమైన విధముగా దేవుడు చేసినందుకు నేను సంతోషించుచున్నాను. అనగా నేను ఎప్పుడైనను పాపము చేయలేదని గాని లేక బుద్ధిహీనమైన పనులు నేను ఎప్పుడు చేయలేదనిగాని లేక ఈ సంవత్సరములన్నింటిలో నేను పొరపాట్లు చేయలేదనిగాని నేను చెప్పుటలేదు. వీటన్నింటిని నేను చేశాను. మరియు నేను చేసిన బుద్ధిహీనమైన పనులను బట్టి నేను సిగ్గుపడుచున్నాను. కాని దేవుడు నా యెడల కనికరము చూపించి వాటన్నింటిని తీసివేసి, నన్ను నడిపించి యున్నాడు. నేను అనేక తప్పులు చేసినప్పటికిని, ఆయన చిత్తమును మాత్రమే చేయవలెనని కోరియున్నానని ఆయన చూచియున్నాడని తలంచుచున్నాను. ఆయననను పూర్ణహృదయముతో వెదకేవారు, అనేక పొరపాట్లు చేసినప్పటికిని ఆయన ఫలమిచ్చును. అదే కృపాక్షేమములు నీ జీవితకాలమంతయు నిన్ను వెంబడించునని నేను నమ్ముచున్నాను (కీర్తన 23:6).
నీవు ఆయనను ఘనపరచవలెనని కోరినయెడల, ప్రేమతో ఆయన నీ గురించి సమస్తమును ప్రణాళిక వేయుచున్నాడు. గనుక అనేక సంతోషకరమైన విషయములు నీ కొరకు వేచియున్నవి (జెఫన్యా 3:17 పేరాఫ్రేజ్). ఆత్మ సంబంధమైనది మరియు భూలోక సంబంధమైనది అనగా నీ భవిష్యత్తులో ప్రతి విషయము అందులో ఉన్నది. నీవు ప్రతిదినము దేవునిని ఘనపరచవలెనని నిర్ణయించుకొనినయెడల, దేవుని యొక్క అతి శ్రేష్ఠమైన దానిని పొందెదవు. లోకస్థులవలె మనము భవిష్యత్తును గురించి ప్రణాళిక వేసుకొనము. దేవుడు మనలో పనిచేయుచు మరియు మనము అర్హులము కానివాటిని మనకు అనుగ్రహించును. ఉద్యోగంవంటి భూసంబంధమైన విషయములనకు కూడా ఆయన అనుగ్రహించును. కాబట్టి భవిష్యుత్తును గురించి మనము కొంచెము కూడా చింతించము. ప్రభువైన యేసు చెప్పినట్లు, ఆకాశమందున్న పక్షులవలె మనము భవిష్యత్తును గురించి చింతించక ఒక్కొక్క దినము జీవించెదము. దేవునికి స్తోత్రములు.
సంతోషముగా తన యొక్క పరిచర్యను ముగించుట కంటే తన జీవితము విలువైనదని పౌలు ఎంచుకొనలేదు (అపొ. కా. 20:24). తల్లిదండ్రులు తమ చిన్నబిడ్డను స్కూలులో చేర్చినప్పుడు, ఆ స్కూలు విద్యను అతడు ముగించవలెనని కోరుదురు. దేవుడు కూడా ఆ విధముగా ఉండును. ఆయన మన జీవితములో ఒక సంకల్పమును కలిగియున్నాడు. దేవుడు మన కొరకు నిర్ణయించిన సంకల్పమును ఈ భూమిమీద మనము నెరవేర్చాలి. మన యొక్క జీవితములలో అనేక పొరపాట్లను మరియు తప్పులను చేయుచు మరియు బుద్ధిహీనముగా మన సమయమును వృథాచేసుకొందుము. కాని స్కూలులో లెక్కలలో అనేక తప్పులు చేసినట్లే ఇవి కూడా ఉన్నవి గనుక దేవునికి వందనాలు. మన జీవితములలోని ముఖ్యవిషయములలో అనగా ఉద్యోగము, వివాహము మొదలగు వాటిలో దేవునికి పరిపూర్ణమైన సంకల్పము కలదు. కాని పరిశుద్ధతలో అభివృద్ధిచెందుటకు మనము కోరినయెడల ఇవన్నియు నెరవేరును. మనము పూర్ణ హృదయముతో దేవుని పరిశుద్ధతలో పాలు పొందవలెనని కోరినయెడల, భూసంబంధమైన విషయములన్నింటిలో ఆయన చిత్తము నెరవేరునట్లుచేయును.
ఉజ్జీవము అనగా ఏమిటి?
క్రైస్తవులలో ఎక్కువగా ఉజ్జీవముగురించి మాట్లాడుచున్నారు. గనుక నీవు దీనిని గుర్తించుకొనవలెను.
శబ్దముచేయుట మరియు ఉద్రేకముగాఉండుట ఉజ్జీవము కాదు.
మతానుసారమైన విషయములలో ఆసక్తి కలిగియుండుట ఉజ్జీవము కాదు.
గొప్పగా బోధించుట ఉజ్జీవము కాదు.
సిద్ధాంతము సరిగా ఉండుట ఉజ్జీవము కాదు.
కాని,
క్రీస్తు కొరకు పాపమంతటిని మరియు లోకసంబంధమైన వాటిని విడిచిపెట్టుట ఉజ్జీవము.
స్వార్థము నుండి విడుదల పొందుటయే ఉజ్జీవము.
అల్పులుగా ఉండునట్లు దీనులమై యుండుటయే ఉజ్జీవము.
పరిసయ్యతత్వము నుండి విడుదల పొందుటయే ఉజ్జీవము.
పాపమును జయించుటకు శక్తిని పొందుటయే ఉజ్జీవము.
దేవుని పిల్లలందరిని ప్రేమించుటయే ఉజ్జీవము (రోమా 5:5).
కృపాసహితముగా మాట్లాడుటయే ఉజ్జీవము.
క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలని కోరుటయే (అపొ.కా. 1:8).
ఏ ఉజ్జీవమైనను ఒక వ్యక్తి ఈ లోకమును మరియు ఈ లోకమహిమను మరియు ఈ లోకఘనతను పెంటగాఎంచుకొని మరియు ప్రభువైన యేసు యెడల అత్యంత ప్రేమగల భక్తిని మండించని యెడల, అది నకిలీ ఉజ్జీవము.
దేవుని యొక్క శ్రేష్టమైన వాటి కొరకు వేచియుండుము:
నీ జీవితములో తన యొక్క రాజ్యమునకు నీవు ఆటంకముగా ఉండెదవేమోనని భయపడి, సాతాను నిన్ను గురిగా పెట్టుకొనును. సాతాను యొక్క కుయుక్తులనుండి నిన్ను నీవు రక్షించుకొనుటకు మూడు విషయములు చెప్పుచున్నాను.
1. ఎల్లప్పుడు దీనుడవై యుండుము. దేవుని యెదుట నీ ముఖమును దుమ్ములో పెట్టుకొనుము.
2. ఎల్లప్పుడు ప్రేమలో నిలచియుండుము. దేవునియొక్క పిల్లలందరియెడల నీ హృదయమును విశాలపరచుకొనుము.
3. ఎల్లప్పుడు పవిత్రతలో ఉండుము. అమ్మాయిల యొక్క సంబంధాల విషయములలో జాగ్రత్తగాఉండుము.
అనేకమంది యౌవనస్తులు ఒక తప్పుడు వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఒక విశ్వాసి చేయగల గొప్ప తప్పును చేయునట్లుగా సాతాను శోధించి అనేక సంవత్సరములుగా అనేకమందిని పడగొట్టియున్నాడు. దేవుడు ఈ తప్పును నిశ్చయముగా క్షమించగలడు. అయినప్పటికిని దానిని బాగుచేయకపోవచ్చు. అటువంటి విశ్వాసుల యెడల దేవుడు కనికరము కలిగియుండును. కాని దేవుని యొక్క చిత్తము కొరకు వారు కనిపెట్టియుండిన యెడల వారి కుటుంబము ఇంకా బాగుగా ఉండును. కాబట్టి మీ అజ్ఞానమును మీరు గుర్తించి మరియు దీనుడవై దేవుని మీద ఆధారపడుము. ఈ విషయములో మరియెక్కువగా నేను హెచ్చరించలేను. సాతాను నీ వెంటే ఉండును. కాబట్టి దేవునికి సన్నిహితముగా ఉండుము. దేవుడు నీ కొరకు సిద్ధపరచిన అమ్మాయిని, అద్భుతమైన విధానముగా తగిన సమయములో నిన్ను కలుసుకొనునట్లు చేయును. కాని నీవు దేనిని ఎన్నుకొనెదవో అని పరీక్షించుటకు, సమయము రాకమునుపే ఇతరులచేత నీవు శోధించబడుటను ఆయన అనుమతించును.
రెండు వృక్షములలో ఆదాము ఒక దానిని ఎన్నుకోవలసి యుండెను. రెండవ వృక్షము కూడా ఉచితమే అయినప్పటికి ఆదాము తప్పుడు వృక్షమును ఎన్నుకొనెను. దేవుడు మనలను కూడా పరీక్షించును. తాను చూచిన దానిని బట్టియు మరియు తాను అనుకొనిన దానిని బట్టియు ఆదాము చేసినతప్పును నీవు చేయవద్దు. దేవుని వాక్యమును వినుము. అది ఆదామును రక్షించియుండెడిది మరియు ఆ వాక్యము నిన్ను కూడా రక్షించును. ఒక్కపూట కూటికొరకు ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనియుండెను. కొన్ని సంవత్సరముల తరువాత అతడు విషయములన్నింటిని తెలుసుకొని తాను మారుమనస్సు పొంది దానిని పొందవలెనని కోరాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. హెబీ 12:16, 17లో ఏశావు వలె మనము భ్రష్టులముగా ఉండకూడదని మనము హెచ్చరించబడియున్నాము.
మనము కలుసుకొనబోయే కొందరు దైవభక్తి గల మిషనరీలు:
25 సంవత్సరములు గల హెన్రీ మార్టిన్ 1806వ సంవత్సరములో ఇండియాకు వచ్చి మరియు 6 సంవత్సరముల తరువాత మరణించాడు. కాని ఆ కొద్ది కాలములోనే అతడు ప్రజలను ప్రభావితం చేసి ఈనాటికిని గుర్తుచేసుకొనబడుచున్నాడు. ఒక అందమైన అమ్మాయిని చూచి అతడు శోధించబడినప్పుడు, ఆమె పవిత్రురాలై పరిశుద్ధాత్మకు ఆలయమై యుండునట్లు ఆమె కొరకు ప్రార్థించెడివాడు. ఆమె కొరకు ప్రార్థించిన తరువాత, ఆమె విషయములో శోధించబడుట అసాధ్యమని అతడు కనుగొన్నాడు.
1888 లో 18 సంవత్సరములు గల డాన్ క్రాపోర్డ్ ఆఫ్రికాలోని కాంగో దేశమునకు మిషనరీగా వెళ్ళి మరియు అక్కడ 22 సంవత్సరములు జీవించాడు. 4 సంవత్సరముల వయస్సులో అతని తండ్రి చనిపోయాడు. గనుక విధవరాలైన తన తల్లికి సహోదరికి సహాయపడుటకు చిన్న వయస్సులోనే స్కూల్ విడచిపెట్టాడు. నిరుద్యోగులైన బీదవారికి తన ఆహారమును పంచిపెట్టి మరియు వారికి సువార్తను చెప్పెడివాడు. చిన్న విషయములలో అతడు నమ్మకముగా ఉండుటను దేవుడు చూచి మరియు ఆఫ్రికాలో గొప్ప పరిచర్యను అతనికి ఇచ్చాడు.
22 సంవత్సరముల వయస్సులో రాబర్టు మఫర్ట్ 1817లో ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళి మరియు 50 సంవత్సరములు అక్కడున్న వారికి సువార్తను ప్రకటించి మరియు అనేకులను ప్రభువు వైపుకు నడిపించాడు. అతడు తాను వ్రాసిన జీవిత చరిత్ర గ్రంథములో
అన్యుల హృదయము నా పత్రిక,
దానియందు వెలుగు లేదు
అది చీకటితో తుఫానులతో కూడియున్నది
దానియందు యేసు నామమును వ్రాసెదను
అప్పుడు ఆ అన్యులు ప్రార్థించుట చూచినప్పుడు
అది నా ప్రాణమునకు సంతోషమును ఇచ్చును.
25 సంవ్సరముల వయస్సు గల జేమ్స్ కల్వర్ట్ తన భార్యతో కలసి ఫిజీ దేశమునకు మిషనరీగా వెళ్ళాడు. వారు ఫిజీ వెళ్ళిన తరువాత వారు ప్రయాణం చేసిన ఓడ కెప్టెన్ వారితో, వెళ్ళవద్దని చెప్పి ఈ విధముగా చెప్పాడు, ''మీరు వారి మధ్యలోనికి వెళ్ళిన యెడల మరణించెదరు''. కాని కల్వర్ ''మేము ఇక్కడకు రాకమునేపే మరణించియున్నాము'' అని చెప్పాడు.
పరలోకములో ఒక రోజున వీరిని మరియు ఇతర దైవజనులను కలుసుకొనెదము. ఆ రోజున, ఈ లోకములో మనము జీవించిన దానిని బట్టి నిరాశపడము. మిషనరీలుగా ఉండుటకు గాని లేక పూర్తికాలపు పరిచర్యచేయుటకు గాని అందరు పిలువబడరు. మన పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించుచున్నామని ఋజువు పరచుటకు మనం ఆఫ్రికా వెళ్ళనవసరం లేదు. కాని మన జీవితములలో దేవుని యొక్క సంకల్పము ఏదైనను మరియు ఎక్కడైనను మనము నెరవేర్చుటకు పిలువబడ్డాము. ''బలులు అర్పించుట కంటె మాట వినుట శ్రేష్ఠము'' (1 సమూయేలు 15:22).
కల్వరి సిలువమీద ప్రభువు యొక్క ప్రేమను గురించి మనము ఎప్పుడు పాడినను క్రొత్త పాటగా నుండునట్లు ప్రభువు యెడల మనమెల్లప్పుడు భక్తి కలిగియుండాలి (పక్రటన 5:9). ఆ పాట మనకు తెలియును కనుక, మన యెడల ప్రభువు యొక్క ప్రేమను గూర్చియు ఆయన మందలోకి మనలను తెచ్చిన ఆయన కృపను గూర్చియు, చులకనగా ఉండకూడదు. ఆయన ప్రేమను గూర్చిన ఆశ్చర్యమును క్రమముగా పోగొట్టుకొనుచున్నయెడల, మనము ఆత్మీయముగా వెనుకంజవేయుట ఆరంభించుచున్నామనియు మరియు కొన్ని సంవత్సరములలో అవి బహిర్గతంఅగునని గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఎల్లప్పుడు ప్రభువుయెడల పవిత్రమైనభక్తి కలిగియుండునట్లు చేయగలడు. నీకు కలిగిన కృపావరము ఎల్లప్పుడు ప్రజ్వరిల్లునట్లు చేసుకొనుము (2 తిమోతి 1:6).
సమతుల్యమైన జీవితముకొరకు కావలసిన జ్ఞానము:
ప్రభువైన యేసు మానవుడిగా నజరేతులో జీవించినప్పుడు, ఇంటిలో తల్లికి సహాయపడుటలోను మరియు వడ్రంగి పని చేయుటలోను సమయము గడుపుచు మరియు దేవునితో ఎంత సమయము గడపాలనే విషయములో ప్రభువైనయేసుకు సమతుల్యత అవసరమైయున్నది. ఈ విషయమును వేరెవ్వరు మనకు నేర్పించలేరు. లేనట్లయితే ప్రభువైన యేసుకు నేర్చుకొనుటకు 30 సంవత్సరములు పట్టియుండదు. మనకిష్టమైన దానిని ఉపేక్షించుకొనుట ద్వారా మనము నేర్చుకొనగలము. తన యింటిలోగాని లేక వడ్రంగిషాపులో గాని చేయవలసినపని ఉన్నప్పుడు, ప్రార్థన కూటములకు గాని లేక ఆత్మీయ కూటములకు గాని వెళ్ళవలెననే శోధన ఆయనకు 30 సంవత్సరములలో అనేకసార్లు వచ్చియుండును. ఆయన శోధననుజయించి మరియు జ్ఞానమునునేర్చుకొని సరియైన సమతుల్యత కలిగియుండెను. ఇప్పుడు మనము కూడా అదే జ్ఞానము నేర్చుకొనవలెను. కాబట్టి మనము కూడా సరియైన సమతుల్యతను నేర్చుకొనునట్లు దేవుడు మనకు కూడా అటువంటి శోధనలను అనుమతించును. ఆ విధముగా నీ జీవితాంతమున జ్ఞానము గల హృదయమును దేవునికి అప్పగించగలవు (కీర్తన 19:12).
తనకు విధేయులైన పిల్లలను తనయొక్క ప్రేమతో దేవుడు చూచుచుండును. కాబట్టి మనకు సులభకరమైన జీవితములను అనుమతించడు. తనను ఘనపరచువారందరిని దేవుడు ఘనపరచును గనుక నీవు దేవునిని ఘనపరచవలెనని నిర్ణయించుకొనినయెడల, నీవు భూమిమీద ఉన్నంతవరకు ప్రతిదినము దేవుడు శ్రేష్ఠమైన దానిని ఇచ్చును. దేవునిని ఘనపరచుట అనగా అనేక కూటములకు వెళ్ళుటకాదు. ఘనపరచుట అనగా పవిత్ర హృదయము కలిగియుండి, ప్రేమగలిగి దీనుడవైయుండి మరియు నీ జీవితములో ప్రతిదినము దేవునికి మొదటి స్థానమును ఇవ్వవలెను. అప్పుడు భూమిమీదను మరియు నిత్యత్వములోను, మీ కాలేజీలో ఉన్న అందరికంటె మీకు గొప్ప భవిష్యత్తు ఉండును.
చివరిగా ప్రభువు నిన్ను ఒక్క మాటతో ప్రోత్సహించుచున్నాడు. ''ఇందును గూర్చి - దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు'' (1 కొరింథీ 2:9).
వెలుగులో జీవించుట:
''దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు'' (1 యోహాను 5:18). వెలుగులో మాత్రమే దేవుని యొక్క బిడ్డలను సాతాను ముట్టలేడు. సాతాను చీకటికి అధిపతియైయున్నాడు. మరియు చీకటికి సంబంధించిన దానంతటిని దేవుడు అతనికి అప్పగించాడు. ఒక విశ్వాసి చీకటి ప్రాంతములలో సంచరించుచున్న యెడల, అతని మీద సాతాను శక్తిని పొందును. అందువలన కపటము కలిగియుండి చేయకూడని వాటిని, చదవకూడనివాటిని లేక మాట్లాడకూడనివాటిని లేక వెలుగులో చూచినయెడల సిగ్గుపరచువాటిని చేయుట అపాయకరము.
చీకటి రాజ్యానికి సాతాను అధిపతిగా ఉన్నట్లే, అబద్ధాలకు కూడా అతడు తండ్రియైయున్నాడు. అబద్ధములను పుట్టించుటకు అతడు తల్లుల కొరకు చూచుచున్నాడు. అబద్ధములు చెప్పువారందరు వారిలోనికి సాతాను వచ్చుటకు అవకాశమిచ్చుచున్నారు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచూ తప్పిపోవుదురు (కీర్తన 58:3). మనము యౌవనదశలోనికి వచ్చేసరికి తల్లిదండ్రులతోను మరియు టీచర్లతోనూ అబద్ధములు చెప్పెదము. మనము రక్షణ పొందునాటికి మనము అబద్ధముతోనూ కపటముతోనూ నిండియుండెదము. మనలో ఉన్న ఈ చెడ్డవి కడుగబడాలి.
అబద్ధమంతటిని మరియు కపటమంతటిని మనము ద్వేషించనియెడల, అబద్ధము గాని కపటముగాని లేని సీయోనుపర్వతము మీద మనము నిలువలేమని వ్రాయబడింది (పక్రటన 14:1, 5). ప్రజలనేకులు బుద్ధిహీనులై ఈ విషయములలో సాతానుకు అధికారమిచ్చెదరు. కాబట్టి ఈ విషయములను తీవ్రముగా తీసుకొనుము.
కపటము లేకుండా ఉండుట అనగా, నీ యొక్క రహస్యములన్నియు ఇతరులకు చెప్పుట కాదు. ప్రతి ఒక్కరికి బయలుపరచని రహస్యములను దేవుడు కలిగియున్నాడు మరియు నీవు దేవుని కంటె శ్రేష్ఠుడవు కావు. కాబట్టి నీ యొక్క రహస్యములను నీలోనే ఉంచుకొనుము. కాని ఎల్లప్పుడు సత్యమే మాట్లాడుము. నిన్ను నీవు ఎక్కువ ఆత్మీయుడవుగా కనుపరచుకొనుటకు ప్రయత్నించవద్దు. ఇతరులు తమకు తామే అటువంటి అభిప్రాయమును కలిగియున్నయెడల, ఆ విషయములో నీవు ఏమి చేయలేవు. కాని వారికి అటువంటి అభిప్రాయము కలుగునట్లు నీవేమియు చేయకూడదు మరియు చెప్పకూడదు.
కాని తల్లిదండ్రులమైన మేము మీకు సహాయపడి మంచి సలహాలు ఇచ్చెదము. గనుక మాతో మీరు యథార్థముగా ఉండాలి. మేము మిమ్ములను ప్రేమించుచున్నామనియు, మీ విషయములో నమ్మకముగా ఉండెదమనియు మరియు మీ రహస్యములను ఎవరికి చెప్పమనియు మీకు తెలియును.
యౌవనస్తుల కొరకు సామెతలు:
యౌవనస్తులందరు మనస్సులో ఉంచుకొనుటకు ఇక్కడ కొన్ని సామెతలు ఇవ్వబడినవి. ఈ వచనములను లివింగు బైబిలులో చదవండి.
''మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది. తన దేవుని నిబంధనను మరచునది. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును. దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు'' (సామెతలు 2:16-20).
''దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియ్యకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందు మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును'' (సామెతలు 3:3-6).
''నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము. పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయును. అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము'' (సామెతలు 4:23-27).
''జారస్త్రీ పెదవులనుండి తేనె కారును. దాని నోటిమాటలు నూనెకంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు. అది రెండంచులుగల కత్తియంత పదునుగలది. దానినడతలు మరణమునకు దిగుటకు దారితీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము. దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు. నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు'' (సామెతలు 5:3-14).
''నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. దానిచక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు'' (సామెతలు 6:20-29).
''జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యముచేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది. ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు'' (సామెతలు 6:32-35).
''నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. జ్ఞానముతో - నీవు నాకు అక్కవనియు, తెలివితో - నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. - సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని యింటిమార్గమున నడుచుచుండెను. అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొనవచ్చెను.అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను - సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపుమీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము. పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు. దూరప్రయాణము వెళ్లియున్నాడు. అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచుకొనెను. తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొనిపోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి. నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము. దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు. అది చంపినవారు లెక్కలేనంతమంది. దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును'' (సామెతలు 7:1-27).
శరీరము మరియు ప్రాచీన పురుషుడు:
మానవుడుగా ప్రభువైనయేసుకు స్వంతచిత్తము ఉన్నది. కాని ఆయన స్వచిత్తమును ఎప్పుడు చేయలేదు. దేవుని స్వభావము ఆయనను పరిపాలించునట్లు ఆయన తన స్వచిత్తమును అన్ని సమయములలో సిలువవేసియున్నాడు. మనము క్రొత్తగా జన్మించినప్పుడు మనకు దేవునిస్వభావం ఇవ్వబడినది. కాని మన స్వచిత్తమును ఉపేక్షించుకొను దానిని బట్టి, దేవుని స్వభావము మనద్వారా వ్యక్తపరచబడును. కాబట్టి గలతీ 5:17లో చెప్పబడిన రీతిగా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును.
ప్రాచీనపురుషుడు మరియు శరీరమువిషయములో అనేకులకు సరియైన అవగాహన లేదు. ప్రాచీనపురుషుడు మరియు నూతనపురుషుడు అనునవి రెండు స్వభావములు - మొదటిది ఆదాము నుండి వచ్చిన మానవస్వభావము. మరియు రెండవది దేవునిలో నుండి వచ్చిన దేవస్వభావము. శరీరము అనగా అనేక దురాశలచేత మనలను శోధించును. దొంగలు వచ్చి తలుపు కొట్టుచున్నట్టే ఈ శోధనలు కూడా హృదయమనే ద్వారమునొద్దకు వచ్చి తట్టుచుండును. ఆదాముస్వభావము కలిగిన ప్రాచీనపురుషుడు అపనమ్మకస్తుడై ద్వారము తెరచును. దేవుడు ప్రాచీనపురుషున్ని సిలువ వేసి (రోమా 6:6) మరియు దేవుని స్వభావాన్ని కలిగిన నవీనపురుషున్ని దేవుడు మనలో ఉంచెను. అయితే ఈ శరీరములో దురాశలు ఆ విధముగానే యున్నవి. కాని నూతనపురుషుడు బాగుగా తిని మరియు బలము పొందనట్లయితే ఆ తలుపును మూయలేడు. ఒక విశ్వాసి పాపములో పడాలని కోరనప్పటికిని అతడు పాపములో పడును.
రాజులు విధేయతను నేర్చుకొనలేనట్లే ప్రభువైన యేసు కూడా పరలోకములో విధేయతను నేర్చుకొనుట అసాధ్యము, కాబట్టి ఆయన మానవుడిగా విధేయత నేర్చుకొనెను (హెబీ 5:8). కాని మనవలెనే ప్రభువైనయేసు దేవునిస్వభావమును స్వతంత్రించుకోనవసరము లేదు. పుట్టినప్పటినుండియే ఆయన ఆ స్వభావమును కలిగియున్నాడు. కాని ఆయన నమ్మకముగా తన సిలువ నెత్తుకొనియున్నాడు. గనుక జ్ఞానములో ఎదిగియున్నాడు. అనగా ఒక మానవునిగా ఆయనకు వచ్చిన పరిస్థితులను మరియు అనేక శోధనలను ఎదుర్కొనుటకు కావలసిన జ్ఞానమును పొందియున్నాడు. ఈ విధముగా ప్రభువైన యేసు విధేయతను నేర్చుకొన్నాడు. ఉదాహరణకు, ప్రభువైన యేసుకు 12 లేక 13 సంవత్సరములు వచ్చేవరకు లైంగికవిషయములో శోధించబడలేదు. కాని ఆయనకు ఆ వయస్సు వచ్చిన తరువాత ఆ విషయములో తన స్వచిత్తమును ఉపేక్షించుకొని విధేయతను నేర్చుకొన్నాడు. అనగా అప్పటివరకు ఆ విషయములో అపవిత్రుడుగా ఉన్నాడని కాదు. ఆయన ఎల్లప్పుడు పరిపూర్ణముగా పవిత్రముగా ఉండెను. ఒక విద్యార్థి 11వ తరగతి చేరుకొనే వరకు కలనగణితంలో ఉత్తీర్ణుడు కాలేడు. అనగా ఆ విద్యార్థి ఉత్తీర్ణుడు కాలేదని అర్థము కాదు. అతడు 11వ తరగతి వచ్చేవరకు కలనగణితంను చదువలేడు.
మనము ఎల్లప్పుడు ప్రభువైన యేసు యొక్క జీవితమును చూచుచూ మరియు ఆయనతో మాత్రమే పోల్చుకొనుట ద్వారా మాత్రమే అన్ని సమయములలో దీనులుగా ఉండెదము.
కాని ప్రభువైనయేసు భూమిమీద ఉన్నంతకాలం ఎల్లప్పుడు దేవుడై యున్నాడు. అందువలననే ఆయన ఆరాధన అంగీకరించాడు. మనము ఆరాధనను అంగీకరించము. ఉదాహరణకు, నీవు చీమలకు సహాయపడుటకు చీమగా నీవు మారినప్పటికిని, నీ వ్యక్తిత్వమును కోల్పోవు. కాని చీమలకున్న పరిమితులను, శోధనలను, అనుకూల విషయములను మరియు వాటికున్న శక్తి సామర్థ్యములను కలిగియుండెదవు. నీవు వ్యక్తిగా మారవు కాని శక్తి సామర్థ్యములలో మారెదవు.
ప్రభువైనయేసు యొక్క స్వభావమును గురించి ఎక్కువగా పరిశీలన చేయుట మంచిది కాదు. ఆయన మనవలె శోధించబడి జయించియున్నాడనియు మరియు మనము ఆయన అడుగుజాడలలో నడచుకొనుచున్నయెడల మనము కూడా జయించగలమని తెలుసుకొనుట చాలును. మనయొక్క జీర్ణమండలము పని చేసే విధానము గురించి, మనము వివరించలేనప్పటికిని మనము తినే ఆహారము జీర్ణమగుచున్నది. వీటిని గురించి వివరించేవారు తప్పుచేయుదురు. శోధన యొద్దనుండి పారిపోయి మరియు మీరు దేవుని ఆజ్ఞలకు లోబడాలి.
దీనత్వము మరియు దేవునియెడల భయభక్తులు కలిగియుండుట:
దీనత్వము మరియు దేవునియెడల భయభక్తులు కలిగియుండుట రెండు కలసి వెళ్ళును (సామెతలు 22:4). దేవునియెడల భయభక్తులు కలిగియుండుటయే నిజమైన దీనునియొక్క గుర్తు. మనగురించి మనము తక్కువ అభిప్రాయము కలిగియుండుటయే దేవునియందు భయభక్తులు కలిగియుండుట.
ప్రభువైనయేసు దేవునియందు భయభక్తులు పుట్టించే ఆత్మతో నింపబడెను. ''యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటిచూపును బట్టి అతడు తీర్పుతీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శిచేయడు'' (యెషయా 11:2, 3). దేవునియందు భయభక్తులు కలిగి దీనులము కానియెడల, ఇతర ప్రజలను ఆయా పరిస్థితులలో మనము చూచిన దానిని బట్టియు మరియు వినిన దానినిబట్టియు వెంటనే మన అభిప్రాయములను చెప్పెదము. వినుటకు వేగిరపడుటయు మరియు మాట్లాడుటకు నిదానించుటయే దైవభక్తికి ఒక గుర్తు (యాకోబు 1:19) మరియు నెమ్మదిగా మనము ఒక అభిప్రాయాన్ని కలిగియుండి మరియు దేవుని యొద్ద నుండి మొదటిగా విని అప్పుడు మన అభిప్రాయమును చెప్పెదము.
నీకేదైన చేయవలెనని అనిపించినప్పుడు, దానిని గురించి నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు చిన్న ప్రార్థన చేసి ఈ విషయములో నెమ్మది ఉన్నదని ఊహించుకొని మరియు వెంటనే దానిని చేయుట ద్వారా నిన్ను నీవు మోసపరచుకొనెదవు. ఆ విధముగా నీవు దేవునిచిత్తమును నీవు పూర్తిగా పోగొట్టుకొనెదవు. నీవు ఎంత ముఖ్యమైన నిర్ణయము తీసుకొనగోరితే అంత ఎక్కువగా దానిని గూర్చి ప్రార్థించి నిర్ణయించుకొనవలెను. మీరు చివరిగా నిర్ణయించుకొనునప్పుడు తల్లిదండ్రులమైన మాతో సంప్రదించుడి.
దేవుని యొద్దనుండి వినుటకు మనలను క్రమశిక్షణ చేసుకొనవలెను:
శరీరము ప్రాముఖ్యముగా సోమరితనమును మరియు సుఖభోగములను ప్రేమించును. దీనిని బట్టి నీవు మోసపోవద్దు. దేవుని చిత్తమును కనుగొనుటకు నీవు ప్రయత్నించుచున్నప్పుడు నీకు వచ్చే తలంపులను విసర్జించుము. నీ తలంపులకును మరియు దేవునియొక్క తలంపులకును, పరలోకానికి మరియు భూలోకమునకు ఉన్నంత తేడా ఉన్నది (యెషయా 55:8, 9). నీకంటె దేవునియొక్క మార్గములు ఎంతో ఉన్నతమైనవి. అందువలన నీవు దేవునికి లోబడి అత్యంతశ్రేష్ఠమైన వాటిని పొందవలెనని ఆయన కోరుచున్నాడు.
కాలేజీలో ఒక విద్యార్థిగా, ఎక్కువగా ప్రార్థించుటకు నీకు ఖాళీ లేకపోవచ్చును. కాని నిర్ణయము తీసుకొనునప్పుడు దేవునియొద్ద కనిపెట్టే వైఖరి నీవు కలిగియుండాలి. కాబట్టి ప్రతిదినము సాధ్యమైతే ఉదయకాలము కొంత సమయమును దేవునితో గడుపుము. ఉదయ కాలము సాధ్యపడనట్లయితే, వేరొక సమయములో ప్రార్థించుము. లేనట్లయితే నీకు వచ్చుచున్న తలంపుల ద్వారా నీ జీవితముపట్ల దేవుని చిత్తమునుండి తొలగిపోగలవు.
ప్రతిదినము దేవుడు నీతో మాట్లాడాలని కోరుచున్నాను. బైబిలులో మొదటి పేజీలో ఉన్న వర్తమానమేమనగా, ''మొదటి రోజున దేవుడు పలికెను..... మరియు రెండవ రోజున దేవుడు పలికెను...... మరియు మూడవ రోజున దేవుడు పలికెను..... నాల్గవ రోజున దేవుడు పలికెను... ఐదవ రోజున దేవుడు పలికెను.... మరియు ఆరవ రోజున దేవుడు పలికెను''. ప్రతిదినము దేవుడు మాట్లాడినప్పుడు ఏదో ఒకటి జరిగి చివరకు దాని ఫలితముగా చాలా మంచిదిగా చేసెను. ప్రతిదినము దేవునియొద్ద నుండి వినినట్లయితే నీ జీవితములో కూడా ఆవిధముగానే జరుగును. ''మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును'' అని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 4:4). నీ జీవితంలో ప్రతిదినము దేవునికి మొదటి స్థానమును ఇవ్వనియెడల సులభముగా వెనుకంజవేయుదువు.
దేవునియొద్దనుండి వినుట అనగా కేవలం బైబిలు చదువుట మాత్రమేకాదు గాని, దినమంతయు దేవునికిష్టమైన దానిని చేయుచు మరియు ఆయనకిష్టము లేనిదానిని విసర్జించుచు మరియు నీ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ స్వరమును వినాలి.
దేవుడు మన ప్రార్థనలను ఎల్లప్పుడు వినాలని కోరుచున్నాడు. కాని ఆయన యొద్దనుండి జవాబు పొందుటకు మనము కనిపెట్టాలి. కొన్నిసార్లు అది ''కాదు'' అయియుండవచ్చును లేక కొన్నిసార్లు ''వేచియుండుము'' అయియుండవచ్చును. ట్రాఫిక్ లైట్స్‌లో ఉన్నట్లే ఎరుపు, పసుపు మరియు పచ్చరంగువలె దేవుని జవాబు కూడా ''కాదు'', ''వేచియుండుము'' లేక ''అవును'' అయియుండవచ్చును.
''ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మానివేయనట్లయితే ఆత్మీయముగా చెవిటివాడవగుదువు'' (యెషయా 58:9). ఈ చెడ్డవాటిని మనము మానివేయాలి. అప్పుడు దేవుని యొద్దనుండి మనము స్పష్టముగా వినగలము.
ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుటయే కాదు దేవునియొద్ద నుండి వినాలి. ఆయనతో మాట్లాడుటకంటే వినుట ముఖ్యమైయున్నది. నీవు ఫోన్‌లో నీ కంటె పెద్దవాడైన దైవజనుడితో మాట్లాడేటప్పుడు, మాట్లాడుటకంటే ఎక్కువగా వినెదవు. అలాగే దేవునితో మాట్లాడుట కంటే వినుటయే నిజమైన ప్రార్థన.
స్నేహము, ఆలోచన వినుట మరియు సంభాషణలు:
నీ స్నేహితులు వెళ్ళకూడని స్థలములకు వెళ్ళుచున్నారని నీవు కనుగొనినయెడల, ధైర్యముగా వారియొద్దనుండి వెళ్ళిపోవాలి. నీ గదిలో ఒంటరిగా కూర్చొనవలసి వచ్చినప్పటికిని, సరియైన సమయములో నీ స్నేహితుల యొద్దనుండి వెళ్ళిపొమ్ము. వారితో నేను రాను అను చెప్పుటకు ధైర్యమిమ్మని దేవునికి ప్రార్థించుము. చాలామంది యౌవనస్తులకు సొంతముగా వారు ఎదుర్కొనలేరు. కాబట్టి నీ స్నేహితుల విషయం జాగ్రత్తగాఉండుము.
తీతు 2:6(లివింగు బైబిలు)లో, యౌవనస్తులకు రెండు హెచ్చరికలు చదివెదము. ''1. జ్ఞానముకలిగి నడుచుకొనుము మరియు 2. జీవితమును తీవ్రముగా తీసుకొనుము''. అన్ని సమయములలో ఈ హెచ్చరికలను జ్ఞాపకముంచుకొనుము. ఈ దినములలో అనేకమంది క్రైస్తవ యౌవనస్తులు ఆత్మీయశక్తిలేని వారైయుండి మరియు పైకి భక్తిగలవారివలెఉండుట వలన నిత్యత్వములో వారు చింతించెదరు. ఎక్కువ తీవ్రత కొరకును, ఎక్కువ త్యాగం కొరకును మరియు ఎక్కువ భక్తి కొరకును నీవు వారిని ప్రభావితం చేయాలి. దీనిని తీవ్రముగా తీసుకొనుము.
దేవుని వాక్యములోని ప్రమాణములను అంగీకరించని వారితో వాదనలు పెట్టుకొని సమయమును వృథాచేయవద్దు. ఎవరైతే సొంత చిత్తమును నెరవేర్చుకొనుచు మరియు తమ్మును తామే సంతోషపరచుకుంటారో వారు భూమిమీద ఎన్నో బాధలు భరించి మరియు నరకానికి వెళ్ళెదరు. వారి యొక్క పాపమార్గములు అనుమతించబడుటకు వారు కోరుదురు. అటువంటి వారిని వారి సొంత చిత్తమును విడిచిపెట్టుమని మనము బలవంత పెట్టలేము. సంఘములలో వాక్యమును తక్కువ ప్రమాణములతో బోధించుటవలన, దేవునియందు భయభక్తులు లేకుండా వారి యొక్క సొంత చిత్తమును నెరవేర్చగోరుచున్నారు. దేవుని వాక్యమునకు అవిధేయత చూపించుట ఎంతో చెడ్డదనియు మరియు సాతాను సంబంధమైనదనియు ప్రజలు చూడనియెడల వారు ఎల్లప్పుడు పాపములో జీవించుదురు. కాని యథార్థవంతులు అపవాది యొక్క బంధకములనుండి దేవుని చేత విడిపించబడెదరు. ఇతరులు సాతాను చేత నశించెదరు.
నీవు ప్రజలతో సంభాషించునప్పుడు, ప్రత్యేకముగా క్రైస్తవ పరిచర్యల విషయమై ప్రేమను కలిగియుండాలి. పనికిరాని సంభాషణ చేయవద్దు. నీ యొక్కయు మరియు నీ కుటుంబముల యొక్కయు రహస్యములు తెలుసుకొనవలెనని కొందరు ఆసక్తి కలిగియుందురు. వారికున్న ఆసక్తిని తీర్చవద్దు. వీటిని గురించి నేను మాట్లాడను అని వారితో చెప్పుము. పావురములవలె నిష్కపటులును మరియు సర్పములవలె వివేకులునై యుండవలెనని ప్రభువైన యేసు చెప్పారు.
మరియు అమ్మాయిలతో ఎక్కువ సహవాసము చేయవద్దు. సహోదరీల కంటె సహోదరులతో ఎక్కువ సహవాసము చేయాలి.
నిన్ను చిక్కించుకొనవలెనని చూచే వారి విషయములలో జాగ్రత్తగా ఉండుము. నీవు ఉత్తరములలో వ్రాసే విషయములలో జాగ్రత్తగా ఉండుము. ప్రజలు నీ యొక్క ఉత్తరములను దాచియుంచి మరియు ఒకరోజు వాటిని బట్టి నిన్ను నిందించవచ్చు. కాబట్టి నిర్లక్ష్యముగా ఉండవద్దు. ప్రతి విషయములో జాగ్రత్తగా ఉండుము.
మీరు డిగ్రీ పూర్తి చేయుచుండగా, ఆత్మీయతను పోగొట్టుకొనకూడదని కోరుచున్నాను. నీ యొక్క క్రైస్తవవిశ్వాసము నీవు చేసే ప్రతి పనికి మూలమైయుండాలి. ఈ రోజున అనేకమంది విశ్వాసులు ఎక్కువ సమయము వారిష్టానుసారము జీవించి మరియు ఆదివారమున మాత్రము వారి మనస్సాక్షిని నెమ్మదిగా ఉంచుకొనుటకు కొన్ని మత కార్యములు చేయుదురు. ఆవిధముగా దేవునికి చెందియున్న దానిని దేవునికి ఇచ్చియున్నామని భావించెదరు. మనకు సమస్తమును అనుగ్రహించిన వానికి అది ఎంత అవమానకరమో.
నీ జీవితములో తీసుకొనిన నిర్ణయములను బట్టియు, నీ జీవితములోని ప్రాధాన్యతనుబట్టియు మరియు ఆయా రీతులుగా నీవు పొందుకొనిన సమాచారమును బట్టియు (ప్రత్యేకముగా టీ.వి. చూచుట ద్వారా) ఒక రోజున నీవు సంతోషించెదవు మరియు దు:ఖించెదవు. ప్రతి దినము నీ బైబిలు చదువుము మరియు నీ హాస్టల్‌లో నీతో ఉన్నవారి కంటే నీవు ప్రత్యేకముగా ఉండాలి.
''దినమంతయు దేవుని యెడల భయభక్తులు కలిగియుండుము'' (సామెతలు 23:17). అజాగ్రత్తగా ఒకసారి పడిపోవుట ద్వారా జీవితాంతం బాధపడే వాటిని చేయవద్దు.
ఎల్లప్పుడు ప్రభువు కొరకు మీరు పూర్ణహృదయము గలవారైయుండవలెనని, తల్లిదండ్రులముగా మేము కోరుచున్నాము. అదే మా యొక్క కోరికయు మరియు ఆశయై యున్నది. మరియు దానికొరకు ఎల్లప్పుడు ప్రార్థించుచుండుము. దేవుడు మా ప్రార్థనలను విని జవాబిచ్చునని నమ్ముచున్నాను. మీరు ఈ లోకములో ధనవంతులైయుండవలెనని గాని లేక పేరు ప్రతిష్ఠలు గలవారిగా ఉండవలెననిగాని లేక గొప్పవారై యుండవలెననిగాని మేము కోరుటలేదు. మీరు ఎల్లప్పుడు ప్రభువైన యేసుకు మండే సాక్షులుగా ఉండవలెనని కోరుచున్నాను.
మరియొక యేసు:
ఈ లోకములో ఉన్నవాటినన్నింటిని విసర్జించి వాటిని పెంటతో ఎంచుకొనుట ద్వారా క్రీస్తును సంపాదించియున్నానని పౌలు చెప్పుచున్నాడు (ఫిలిప్పీ 3:8). ఒక విలువైన వజ్రమును కొనుటకు, ఒక వర్తకుడు తన కున్నదంతయు అమ్మియున్నాడని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 13:46). కాని ఈనాటి క్రైస్తవులు లోకసంబంధమైన దానినుండి విడుదల పొందకుండానే, క్రీస్తును ఏవిధముగా సంపాదించుకొనుచున్నారు? ఈనాడు అనేకమంది ''విశ్వాసులు'' లోకవిషయములలో అనేక కోరికలు పెట్టుకొని మరియు సుఖభోగములను మరియు సౌఖ్యములను ప్రేమించుచూ మరియు క్రీస్తును సంపాదించుకొని యున్నామని చెప్పుచున్నారు. అప్పుడు వారు సంపాదించిన వాడు ''మరియొక యేసు'' (2 కొరింథీ 11:4) మరియు అతడు పౌలు సంపాదించిన క్రీస్తు కాదు. క్రీస్తుతో పోల్చినప్పుడు ఈ లోకములో ఉన్న విషయములన్నియు చెత్తతో సమానము. మీరు దీనిని స్పష్టముగా చూడాలని నేను ప్రార్థించుచున్నాను.
మీ తెలివితేటలు గాని, మీ ఆరోగ్యంగాని, మీ అందచందాలుగాని, మీకున్నవరములు మీకున్న శక్తి సామర్థ్యములుగాని, మీరు చదివిన మంచి కాలేజీగాని, మీరు చదువుకున్న చదువుగాని మొదలగువాటిని దేవునియెదుట ఘనమైనవిగా ఎంచకూడదు. నీకున్న తెలివితేటలులేనివారిని లేక నీకున్న అవకాశములు లేనివారిని గురించి ఆలోచించుడి. దేవుని దృష్టిలో వారెవరికంటెను మీరు శ్రేష్టులు కారని మీరు గుర్తుంచుకొనుడి. దేవుని స్వభావములో మీరు పాలివారగుటయే దేవుని యెదుట ఎంతో విలువైనది. మీ బ్రతుకు దినములన్నియు దీనిచేత పట్టబడాలని నేను ప్రార్థించుచున్నాను.
సహించే విశ్వాసులు:
నీకేమి ఉన్నప్పటికిని, విశ్వాసము లేనట్లయితే దేవునికిష్టులై యుండుట అసాధ్యము (హెబీ 11:6). హవ్వ విశ్వాసము విషయములో ఓడిపోయింది. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను మరియు జ్ఞానమును ఆమె విశ్వసించినయెడల, అందమైన వృక్షముచేత శోధించబడినప్పుడు, దేవుడు ఎందుకు పండును తినవద్దని నిషేధించాడో తనకు తెలియనప్పటికిని పాపము చేసేడిది కాదు. కాని దేవుని ప్రేమను ఆమె అనుమానించేటట్లు సాతాను చేసినందువలన ఆమె వెంటనే పడిపోయింది. దేవుడు కొన్ని కార్యములు చేయకూడదని నిషేధించాడు. మరియు కొన్ని ప్రార్థనలకు కూడా ఆయన జవాబు ఇవ్వడు. అటువంటి సమయములలో దేవుని యొక్క జ్ఞానములోను పరిపూర్ణమైన ప్రేమలోనూ నమ్మకము ఉంచాలి. ప్రభువైనయేసు సిలువమీద విడిచిపెట్టబడినప్పటికిని తండ్రియందు విశ్వాసముంచియున్నాడు. ''ఓ దేవా, నన్నేల చేయి విడిచితివి?'' అని ఆయన చెప్పలేదు గాని నా దేవా అని పిలిచియున్నాడు అనగా నీవు నన్ను ఎందుకు చేయి విడిచియున్నావో నాకు తెలియనప్పటికిని, నీవే నా దేవుడవు ప్రభువైన యేసు ప్రార్థనకు జవాబు లేదు కాని ఆయన విశ్వాసముతో మరణించాడు. నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనుచున్నానని చెప్పారు. చివరివరకు విశ్వాసముతో సహించుట అనగా ఇదియే.
సాతాను పేతురును జల్లించవలెనని కోరియున్నాడని ప్రభువైన యేసు పేతురుతో చెప్పాడు. పాత నిబంధనలో యోబును జల్లించుటకు సాతాను దేవునియొక్క అనుమతినే కోరినట్లున్నది. దేవుని అనుమతి లేకుండా సాతాను మనలను ఏమి చేయలేడు. పేతురు జల్లించబడినప్పుడు అతని నమ్మిక తప్పిపోకుండా ప్రార్థించెదనని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 22:31, 32). ఇదియే ముఖ్యమైయున్నది. ప్రభువైన యేసు మనము శోధించబడకూడదని, మన ఆరోగ్యము గురించిగాని, ఉద్యోగము విషయములలో తప్పిపోకుండునట్లు ప్రార్థించడు గాని నమ్మిక తప్పిపోకుండునట్లు ప్రార్థించును.
కాబట్టి ప్రభువైన యేసు దృష్టిలో విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైయున్నది. పేతురు వలే మనము అతి ఘోరముగా ఓడిపోయినప్పటికిని, మనకు విశ్వాసము ఉన్న యెడల ఎన్నటికిని నిరాశపడము. మన పాపములను దేవునియెదుట ఒప్పుకొనినప్పుడు, ప్రభువైన యేసు రక్తము చేత సమస్త దుర్నీతినుండి పవిత్రపరచబడియున్నదని మన సాక్ష్యము ద్వారా జయించగలము (పక్రటన 12:11). మన పాపములు అన్నియు ప్రభువైనయేసు రక్తములో పవిత్రపరచబడినవనియు మరియు మన పాపములను దేవుడు ఎన్నటికిని జ్ఞాపకముంచుకొనడనియు మనము సాతానుతో చెప్పాలి (హెబీ 8:12). మనము నోరుతెరచి గట్టి శబ్దముతో సాతానుతో చెప్పాలి ఎందుకనగా అతడు మన తలంపులను వినలేడు. ఆవిధముగా మనము అతనిని జయించెదము మరియు అతడు మన యొద్దనుండి పారిపోవును.
''నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగిలేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాని చూచును -నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలె త్రొక్కబడును'' (మీకా 7:8-10).
అన్ని సమయములలో ధైర్యముగా ఈ విధముగా చెప్పాలి, ''కాబట్టి - ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి - నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా'' (హెబీ 13:6,5).
మనస్సు విషయములో జాగ్రత్తపడుము:
నీవెక్కడికి వెళ్ళినప్పటికిని శోధన విషయములో మెళకువగా ఉండుము. మనలను ప్రేరేపించే బొమ్మలను, పుస్తకము మరియు మ్యాగజిన్స్‌లో వ్యాసములు మనకు గొప్ప నష్టము చేయును. ఒకసారి నీ మనస్సులో ఏదైనా పెట్టుకున్నయెడల అవి ఎప్పటికినీ నీ మనస్సులోనే ఉండునని జ్ఞాపకముంచుకొనుము. మారుమనస్సు పొందినయెడల క్షమించబడెదము కాని నీ జ్ఞాపకములో నుండి దానిని తీసివేసుకొనలేవు. నీ యొక్క కలలో మరియు తలంపులలోనూ అవి మరల వచ్చి నిన్ను బాధించకుండునట్లునూ అవి నీ జ్ఞాపకములన్నిటి యొక్క అడుగుభాగములో వెళ్ళినట్లు వాటిని త్రోసివేయవలెను. నీవు దేవుని వాక్యమును నీ మనస్సులోనింపుకొనుట ద్వారా వాటిని క్రిందకు త్రోసివేయగలవు.
క్రైస్తవ పుస్తకములలో నుండి కనీసము ఒక అధ్యాయము చదువుటకును (నా పుస్తకములతో ఆరంభించుము) ప్రతీ వారానికి కనీసము ఒక వర్తమానము వినుటకును మరియు ఒకటి లేక రెండు వారములలో కనీసం ఒక విశ్వాసితో సహవాసము చేయునట్లు ప్రయత్నించవలెను.
నీ తలంపులలో దేనికిని బానిసగా ఉండవద్దు. దేవుని మహిమార్థము నీవు బాగా చదువుకోవాలి. నీవు చదువులోను నిర్లక్ష్యము చేసి సంఘకూటములకు వెళ్ళుట వలన ప్రయోజనము ఉండదని నేను మరల చెప్పుచున్నాను. సహవాసము ముఖ్యమేగాని కూటములకు వెళ్ళకపోయినప్పటికిని ఒకరిద్దరు విశ్వాసులతో సహవాసము చేయవచ్చును.
విశ్వాసము:
మనము విశ్వాసము ద్వారా రక్షణ పొందినట్లే జయమును కూడా విశ్వాసముతో పొందగలము. 1 యోహాను 5:4లో ''లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' మరియు లోకమనగా నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబము అని వాక్యములో చెప్పబడియుంది (1 యోహాను 2:16). కాబట్టి కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే వాటి అన్నిటిమీద జయము పొందెదమని వాక్యము బోధించుచున్నది. కాని విశ్వాసము అనగా ఏమిటి? విశ్వాసమనగా దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమలోను, జ్ఞానములోను మరియు శక్తిలోను మనము సంపూర్ణమైన విశ్వాసము కలిగియుండి దేవుని మీద ఆధారపడుటయే. యోహాను 1:12లో చెప్పిన రీతిగా విశ్వాసము అనగా పొందుటయే. ఇది కేవలము తెలివితో కూడిన విశ్వాసము కాదు కాబట్టి దేవునియందు నమ్మికయుంచుట అనగా ఆయన యొక్క చిత్తము సంపూర్ణమైయున్నదని అంగీకరించి పొందుకొనుటయే అనగా మన స్వచిత్తమును ఉపేక్షించుకోవాలి. శరీరేచ్ఛలు సిలువ వేయబడియున్నవి అనగా అర్థమిదే (గలతీ 5:24). మన స్వచిత్తమును ఉపేక్షించుకొనుటకు, మనకు దేవుని కృప అవసరము కాని విశ్వాసము ద్వారానే కృపను పొందెదము. దేవుని యొక్క చిత్తము శ్రేష్టమని మనము నమ్మనియెడల, మన స్వచిత్తమును ఉపేక్షించుటకు ఇష్టపడము. ఉదాహరణకు నీవు టీ.వి చూచినప్పుడు, ప్రభువైన యేసు అదే పరిస్థితిలో ఉన్నట్లయితే ఆయన దానిని చూచి ఉండెడివాడేమో అనగా అనవసరమైన కార్యక్రమాలను లేక సినిమాలను మరియు లైంగిక వాంఛలను కలిగించే కార్యక్రమాలను ఆయన చూడడు. నీలో ఉన్న దురాశను రేకెత్తించేవే శ్రేష్టమైనవని నమ్ముచున్నావా? అది దేవుని చిత్తమే శ్రేష్టమని నీవు నమ్ముట మీద ఆధారపడి ఉంది. విశ్వాసము లేకుండా జయము పొందలేము.
నీవు వెంబడించవలసిన ప్రభువైన యేసు గురించి ఎల్లప్పుడు ఆలోచించుము. నీ శరీరము ఎంతో బలహీనమైనదని ఎన్నటికి మరిచిపోవద్దు. ప్రభువైనయేసు సహాయము కొరకు ఎల్లప్పుడూ తండ్రికి మొరపెట్టెను. నీవు కూడా దానినే చేయాలి. నీవు దాడిచేయబడినప్పుడు యేసునామము అనే బలమైన దుర్గముతో ఎదిరించాలని గుర్తించుకొనుము (సామెతలు 18:10). ఈ భూమిమీద నీకు ఎటువంటి కష్టము బాధ వచ్చినప్పటికి ప్రభువైనయేసు నామములో తండ్రికి ప్రార్థించుము.
సంపూర్ణులగుటకు సాగిపొమ్ము:
రోమా 7:14-25 సంపూర్ణులగుటకు సాగిపోవువారికి మంచి వాక్యభాగమైయున్నది. క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడుగా పౌలు తన అనుభవమును చెప్పుచున్నాడు. ఎందుకనగా రక్షణ పొందని వ్యక్తి ''అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను'' అని చెప్పలేదు (రోమా 7:22).
రోమా పత్రికలో మొదటి అధ్యాయమునుండి మనలను రక్షించుటకు సువార్త, దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని పౌలు వ్రాసియున్నాడు. 3,4,5 అధ్యాయములలో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట గురించి మాట్లాడి మరియు రోమా 6వ అధ్యాయములో పాపము మీద జయము గురించి పౌలు మాట్లాడుచున్నాడు. 7వ అధ్యాయములో తరువాత జరిగే దానిగురించి పౌలు చెప్పుచున్నాడు. తన జీవితములో మారుమనస్సు పొందని కాలములో జరిగిన విషయము గురించి చెప్పుటలేదు. ఆయన సువార్తను వివరించుచున్నాడు. సంపూర్ణులగుటకు సాగిపోవాలని కోరేవ్యక్తి యొక్క అంతరంగజీవితములో జరిగే పోరాటమును గురించి ఇక్కడ చెప్పుచున్నాడు. దేవునిచిత్తము మాత్రమే చేయవలెనని అతడు కోరుచున్నాడు. అతడు జయమును కోరియున్నాడు మరియు తనకు అవసరమైనప్పుడు కృపను పొందియున్నాడు. అయినను రెండు విషయములను అతడు కనుగొనుచున్నాడు. 1. అజాగ్రత్తగా ఉన్నసమయములో వెలుగుపొందిన తెలిసిన పాపములో ఓడిపోవుటను గమనించాడు. 2. కొన్ని పాపముల విషయములలో వెలుగు లేనందువలన తనకు తెలియని రీతిగా పడిపోయిన తరువాత కొంతకాలానికి పడిపోయినట్లుగా తెలుసుకొనియున్నాడు.
పూర్తిగా సంపూర్ణులు అవ్వాలని కోరనివారు రోమా 5వ అధ్యాయములో ఆగిపోయెదరు. గనుక వారికి పోరాటముండదు. పాపమంతటి మీద జయము పొందాలని కోరేవారు (రోమా 6:14) ఈ పోరాటములు కలిగియుండి మరియు తనతోతాను ఇట్లు చెప్పుకొనెను, ''అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?'' (రోమా 7:24).
ఇటువంటి పోరాటము తమ జీవితములో లేదని చెప్పువారు యథార్థవంతులుకాదని ఒప్పుకొనుచున్నారు. మన బలహీన సమయములో పడిపోయినప్పటికిని మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది కాబట్టి మనము ఆ పాపమును ఒప్పుకొని మరియు విడిచిపెట్టి మరియు క్రీస్తుయొక్క రక్తములో కడగమని అడుగవలెను. ఇటువంటి పాపమును చేయవలెనని నిర్ణయించుకొని చేయలేదు. మనము పొందిన పశ్చాత్తాపమే దానిని స్పష్టము చేయుచున్నది. మనము చేసిన పాపములను ద్వేషించి మరియు దు:ఖపడినయెడల, ఒక రోజు వాటిమీద జయము పొందెదము.
రోమా 7వ అధ్యాయము జాగ్రత్తగాచదివి మరియు దానిమీద వెలుగునిమ్మని దేవునికి ప్రార్థించుము. రోమా 7:1-13లో ధర్మశాస్త్రము నుండి మనము విడుదల పొందుటను గురించి మాట్లాడుచున్నది. ఇప్పుడు మనకు క్రీస్తుతో వివాహము జరిగియున్నది. కాబట్టి ధర్మశాస్త్రము కంటే ఎక్కువ స్థాయిలో మనము జీవించెదము. మనము అక్షరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా నవీన స్థితికలిగి సేవ చేయుదుము (రోమా 7:6).
వారిపోరాటము విషయములో యథార్థముగా లేనివారు జయమును పొందలేరు. రోమా 7వ అధ్యాయము పూర్తిగా అర్థంచేసుకొనుట కంటే మన పోరాటవిషయములో సంపూర్ణముగా యథార్థముగా ఉండుట ముఖ్యము. వారి అంతరంగ జీవితములో పోరాటముల గురించి యథార్థముగా లేనివారు వేషధారులు గనుక వారితో సహవాసము చేయకుము. నీకు వివేచన ఉండాలి. సర్పమువలె జ్ఞానము కలిగి మరియు పావురమువలె నిష్కపటముగా ఉండాలి. నీ యొద్దనుండి యథార్థతను అన్నిటికంటే ఎక్కువగా దేవుడు కోరుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. పవిత్రతకు ఇది మొదటి మెట్టు.
దేవుని యెడల భయభక్తులు:
నీకు శ్రేష్టమైనది ఏదో నీకు తెలియునని అనుకొనుట చాలా సులభము. బుద్ధిహీనమైన పనులు చేయుటకు ఒక యౌవనస్తుడు భయపడనియెడల, అతడు అటువంటి కార్యములను ఎన్నో చేయును. దానినుండి నీవు రక్షణ పొందే మార్గమేమనగా 1. దేవునియెడల భయభక్తులతో అన్ని సమయములలో నిన్ను నీవు భద్రపరచుకొనుము. నీవు దీనుడవై నీ యొక్క బలహీనతలను ఒప్పుకొని మరియు దేవుని యొక్క సహాయము కొరకు మొరపెట్టాలి.
యోసేపు 18 సంవత్సరముల వయస్సులో పరాయి దేశములోనుండి, దేవునియెడల నమ్మకస్థుడుగా ఉండి మరియు దేవునియెడల భయభక్తులు కలిగియున్నందున అతడు సాతాను యొక్క ఉరినుండి కాపాడబడెను. నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికిని దేవుడు నిన్ను కూడా ఆవిధముగా కాపాడునుగాక. 18 సంవత్సరాల వయస్సులో కూడా ప్రభువు విషయములో యథార్థముగా ఉండుట సాధ్యమేనని యోసేపులో చూచుచున్నాను.
1. అతడు దుర్నీతిలో ఉండిన సమాజములో జీవించుచున్నప్పటికిని
2. ప్రతిదినము ఒక స్త్రీచేత శోధించబడినప్పటికిని
3. తన తల్లిదండ్రులు అనేక వందల కిలోమీటర్ల దూరములోఉండి మరియు తాను మరణించాడు అనుకొన్నప్పటికిని
4. తనని ప్రోత్సహించుటకు అతనికి బైబిలుగాని దైవసంబంధ పుస్తకములుగాని లేకపోయినప్పటికి
5. అతడు పరిశుద్ధాత్మ శక్తి పొందనప్పటికిని
6. సహవాసము చేయుటకు విశ్వాసులు ఎవరూ లేనప్పటికిని
7. అతడు వెళ్ళుటకు ఆత్మీయ కూటములు లేనప్పటికిని అతడు ప్రభువు యెడల నమ్మకముగా ఉండెను.
కాని అతడు తన ఇంటిలో ఉన్నప్పుడు 17 సంవత్సరములు జీవించినప్పుడు తన తండ్రియైన యాకోబు తనలో నాటిన దేవునియెడల భయభక్తులు అతడు కలిగియున్నాడు. మరియు ఈనాడు కూడా దేవునియెడల భయభక్తులు కలిగియున్నయెడల యౌవనస్తులు పాపమునకు దూరముగా ఉండగలరు.
నిర్లక్ష్యము మరియు తప్పుడు ప్రాధాన్యతలు:
ఈనాటి కాలేజీలలో ఎంతో కీడు జరుగుచున్నది. కాబట్టి నీవు పాపమునకు వ్యతిరేకముగా తీవ్రముగా ఉండనియెడల తప్పిపోగలవు. ఒక సంవత్సరములోగాని మరియెక్కువ కాలములో ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన పాపములో పడనియెడల, అతడు జయించెడివాడని ఊహించుకొనుటకు ఆరంభించుకొనును. అప్పుడు ఒక వ్యక్తికి తనమీద తనకు నమ్మకము కలిగినప్పుడు అతడు మరల ఓడిపోవును. రెండు విషయములు నీవు చదువుటకు ఆటంకముగా ఉండవచ్చు 1. అమ్మాయిలు 2. వేరే కార్యక్రమములలో (క్రైస్తవ కూటములు అయినప్పటికి) ఎక్కువ ఆసక్తి కలిగియుండుట.
మొదటిది నిజముగా అపాయకరము. అమ్మాయిలతో నిర్లక్ష్యముగా ఉండుటచేత గత తరములు అన్నిటిలో అనేకవేలమంది యౌవనస్తులు వారి జీవితములను మరియు వారి భవిష్యత్తును పాడుచేసుకొనిరి. కొన్నిసార్లు ఒక్క పొరపాటు కూడా మన భవిష్యత్తును పాడుచేయగలడు. వీటిని నీవు గుర్తించిన యెడల, అన్ని సమయములలో ఈ విషయములలో జాగ్రత్తగా ఉండెదవు.
రెండవది అంత అపాయకరముగా కనబడకపోవచ్చును. అనేక కూటములకు వెళ్ళి దేవునిని ఘనపరచునట్లుగా కనబడవచ్చును మరియు ఆవిధముగా దేవుని ఘరపరచినయెడల ఆయన నిన్ను ఘనపరచునని ఊహించుకొనవచ్చును. తనను ఘనపరచువారిని దేవుడు ఘనపరచును అనే మాట ఎన్నటికిని నిజమైయున్నది. కాని నీవు అనేక కూటములకు వెళ్ళుట ద్వారా నీ చదువులను నిర్లక్ష్యము చేసి నీవు లేఖనములలోని ఏదొక వాగ్ధానమును పట్టుకొని నీ పరీక్షలలో సహాయంకావాలని దేవునిని కోరినయెడల బుద్ధిహీనమైయున్నది. ప్రభువైన యేసును కొండమీద నుండి దూకమని కీర్తన 91:12 చెప్పినట్లున్నది. ఇది దేవుని శోధించుట, రోగము వచ్చినప్పుడు కొందరు ఔషదము తీసుకొనక మరియు దేవుడే స్వస్థపరచునని బుద్ధిహీనముగా నమ్ముచున్నారు. ఏ రైతు కూడా విత్తనాలు విత్తకుండా, కేవలము ప్రార్థన ద్వారా పంటను కోయలేడు.
దేవుడికి మొదటి స్థానమిచ్చుట మంచిదే కాని అనేక క్రైస్తవ కూటములకు వెళ్ళుట ద్వారా దేవునిని మొదటిగా ఉంచలేవు. ఉదాహరణకు నజరేతులోని వడ్రంగి షాపులో ప్రభువైన యేసు ఒక బల్లను తయారుచేయుచూ అది కొనుగోలుదారునికి ఇవ్వవలసిన సమయము అయినది గనుక, ప్రభువైన యేసు సమాజమందిర కూటమికి వెళ్ళకుండా ఆ పనిని పూర్తిచేసేవాడు. చిన్నవిషయములలో నమ్మకముగా ఉండుట అనగా ఇదియే. మరియు ఇదియే నిజమైన ఆత్మీయత. ప్రభువైన యేసు తన తండ్రిని ఎల్లప్పుడూ మొదటి స్థానములో ఉంచియున్నాడని మనకు తెలియును. కాబట్టి ప్రభువైన యేసు యొక్క మాదిరినుండి మనము నేర్చుకొనవలెను. మన తెలివితేటల మీద మనము ఆధారపడినయెడల, చివరకు మనము మతానుసారమైన వారమవుదముగాని ఆత్మానుసారులము కాము.
ఇతర యౌవనస్థులు చేసే పొరపాట్లు మీరు చేయకుండునట్లు అవి హెచ్చరికలు. కాబట్టి అటువంటి బుద్ధిహీనమైన పనులు మీరు చేయకుడి. ఒక జ్ఞానవంతుడు ఇతరుల పొరపాట్లు ద్వారా నేర్చుకొనును మరియు అతడు అటువంటి పొరపాట్లు చేయడు. దేవుడు మిమ్ములను కాపాడి తనకొరకు భధ్రపరచి మీ చుట్టూ ఉన్న అనేకులకొరకు మిమ్మును ఆశీర్వాదముగా చేయునుగాక.
విశ్వాసము మరియు హేతువు:
చిన్నపిల్లలు ప్రార్థన చేయుట చాలా సులభము, ఎందుకనగా ప్రార్థన అనగా దేవునిఎదుట మన నిస్సహాయతను మరియు బలహీనతను ఒప్పుకొనుట. తెలివిగల పెద్దవారు దీనిని ఒప్పుకొనుట కష్టము. అందువలన మనము చిన్నబిడ్డలమైయుండటం మంచిదని ప్రభువైన యేసు చెప్పారు. మనము ఎంత ఎక్కువగా మనకున్న తెలివితేటలమీద మరియు కారణముల మీద ఆధారపడుదుమో అంత తక్కువగా ప్రార్థించెదము మరియు మనకు అర్థముకాని విధముగా దేవుడు ఎందుకు పనిచేయుచున్నాడని ప్రశ్నించినయెడల కూడా తక్కువగా ప్రార్థించెదము.
కారణమునుబట్టిగాక విశ్వాసమునుబట్టి విధేయత చూపించాలని దేవుడు కోరుచున్నాడు (రోమా 1:5). మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను ఎందుకు తినకూడదని దేవుడు ఆదాముతో చెప్పలేదు. దేవుడు తనను ప్రేమించుచున్నాడనియు మరియు తన మేలు కొరకే దేవుడు ఆజ్ఞాపించుచున్నాడనియు ఆదాము తెలుసుకొనిన చాలును. ''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము'' (సామెతలు 3:5). కాబట్టి ఆదాము ఓడిపోయినప్పుడు, దేవుని యొక్క ప్రేమలోను మరియు దేవుని యొక్క జ్ఞానములోను విశ్వాసముంచకపోవుటయే కారణము. ఈ విషయములోనే మనము కూడా ఓడిపోయెదము.
దేవుడు మనలను అత్యధికముగా ప్రేమించుచున్నాడనియు మరియు మనకేదైతే శ్రేష్టమైనదో మనకంటె ఎక్కువగా దేవునికి తెలియుననియు మరియు ఆయన సర్వశక్తి గలవాడైయుండి భూమిమీద సమస్తమును నిర్వహించుననియు మనము విశ్వసించినయెడల, ఇప్పటినుండి మన జీవితములలో సమస్తమును ఆయన చిత్తమునకు సమర్పించుకొని, సంతోషముతో ఆయన ఆజ్ఞలన్నింటిని గైకొనుచూ, వెంటనే జవాబు పొందనప్పటికి ప్రార్థించుచు మరియు మనము ప్రశ్నించక ఆయన అనుమతించిన దానికి లోబడెదము. దేవుని యొక్క జ్ఞానములోను, ప్రేమలోను మరియు శక్తిలోను మనకు విశ్వాసంలేనట్లయితే, వీటిని మనము చేయము.
మనము చిన్న బిడ్డలవంటి వారమైతే సామాన్యమైన విశ్వాసముతో దేవునియొద్దకు వచ్చి మరియు మన హృదయమంతటిలోనికి పరిశుద్ధాత్మను పొందుకొనెదము (లూకా 11:13). ఆ విధముగా ఆత్మను పొందుకొనుటకు మనకు తెలిసిన పాపములను దేవునియెదుటను మానవుల యెదుటను ఒప్పుకొని మంచి మనస్సాక్షిని కలిగియుండి, పరిశుద్ధాత్మ నింపుదలకు ఆకలిదప్పులు కలిగియుండి, మన జీవితములలోని ప్రతివిషయమును ఆయనకు సమర్పించుకొని మరియు మనలను ప్రేమించేతండ్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని నమ్మవలెను. మనకు వెంటనే ఎటువంటి అనుభూతులు లేకపోయినప్పటికి, మనము అడిగిన దానిని దేవుడు అనుగ్రహించియున్నాడని మనము నమ్మవలెను. బాహ్యమైన ప్రత్యక్షతలు తరువాత కలుగును. కాబట్టి చిన్న బిడ్డవలె ఉండుము.
విశ్వాసము - దేవునిలో సంపూర్ణ ధైర్యము కలిగియుండుట:
మనము బాప్తీస్మము తీసుకొనినప్పుడు, మనకు బాప్తీస్మము ఇచ్చే వ్యక్తి మనలను కేవలము నీటిలో ముంచుటయే కాక నీటిలోనుండి పైకి లేపునని నమ్ముదుము. మన జీవితములోని అన్ని పరిస్థితులలో ఈ విధముగా మనము విశ్వాసముంచాలి. మన స్వజీవమును ఉపేక్షించుకోవలసిన పరిస్థితిగాని లేక ఇతరులచేత మనము సిలువవేయబడే పరిస్థితిగాని ఆయన అనుమతించినప్పుడు వీటన్నిటి వెనుక దేవుడే ఉన్నాడని మనము చూడగలగాలి. శుద్ధహృదయము గలవారు, దేవునినే గాని మానవ పరిస్థితులను చూడరని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 5:8). మనము సిలువవేసే వారిని మాత్రమే మనము చూచుచున్నయెడల, మనము శుద్ధ హృదయము కలిగిలేమని అది మనకు చూపించుచున్నది. అప్పుడు వారికి వ్యతిరేకముగా మనకు ఫిర్యాదులు ఉండును. కాని మనము శుద్ధ హృదయము కలిగియున్నయెడల, దేవునిని మాత్రమే చూచెదము. గనుక నీటి బాప్తీస్మములో వలె మనలను మరణములోనికి ముంచబడుట అనుమతించిన దేవుడు పైకి లేపునని నమ్ముదుము. ''మనమాయనతో కూడా చనిపోయినవారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము'' (2 తిమోతి 2:11). అప్పుడు మనము దేవునిలో ఉన్న నమ్మకముద్వారా విశ్వాసముచేత చనిపోయెదము. అప్పుడు మనము మహిమకరమైన పునరుత్థానజీవితములో ప్రవేశించుదము. లేనట్లయితే ఇదివరకు జీవించినట్లే ఆదామువలె ఎల్లప్పుడు ఓడిపోయెదము. మన స్వజీవమునకు చనిపోవుటకు తిరస్కరించినయెడల, అది మనలో దేవునియెడల నమ్మకముగాని విశ్వాసముగాని లేదని ఋజువుపరచుచున్నది.
విశ్వాసమున్న వ్యక్తి ద్విమనస్కుడై యుండడని యాకోబు 1:6-8లో చదివెదము. అటువంటి వ్యక్తిలో దేవున్ని సంతోషపెట్టి మరియు ఆయనను మహిమపరచవలెనని ఒకేఒక గురి కలిగియుండును. అటువంటి వ్యక్తి మాత్రమే విశ్వాసమూలముగా జీవించును. ఎందుకనగా అదృశ్యమైనవి నిత్యమైనవని అతడు గుర్తించును. అనగా దేవునివాక్యము చెప్పేదానిని అతడు విశ్వసించును. వారు నరకానికి వెళ్ళకుండునట్లు అనేకమంది విశ్వాసులు ప్రభువైన యేసును విశ్వసించెదరు. కాని వారు విశ్వాసమూలముగా జీవించరు. దేవుని వాక్యము సత్యమైయున్నదని వారు ఒప్పించబడరు. వారి జీవితములలో చేసిన వాటన్నింటిని మరియు వారు చేయుచున్నవాటన్నింటిని గురించి దేవునికి లెక్క చెప్పవలసివుందని వారు విశ్వసించరు. తమ్మునుతాము సంతోషపెట్టుకొనుటకును, లోకములోని సుఖభోగములను అనుభవించుటకును మరియు ధనాపేక్షతో డబ్బు సంపాదించుటకును జీవించినయెడల ఈ లోకమును విడిచి నిత్యత్వములోనికి వెళ్ళిన తరువాత చింతించవలసియుండునని వారు నమ్మరు. ధనవంతుడు చనిపోయినవెంటనే నరకానికి వెళ్ళి, చింతించెను మరియు తాను చేసిన పొరపాటు అనగా ప్రతిరోజు మారుమనస్సు పొందకపోవుట గురించి సహోదరులకు ఎవరైనను వెళ్ళిచెప్పవలెనని అతడు కోరెను (లూకా 16:28, 30). ఈ భూమిమీద మనమందరము కొద్దికాలమే యుండెదము మరియు మనము జంతువులవలె కేవలము ఈ లోకముకొరకు మాత్రమే జీవించెదమా లేక మంచితనము, ప్రేమ, పవిత్రత మరియు దీనత్వము మొదలగువాటిని కలిగి నిత్యమైన విలువైన వాటికొరకు జీవించుచున్నామా అని దేవునిచేత పరీక్షించబడుచున్నాము. నిత్యత్వపువిలువగల వాటికొరకు జీవించుటకు దేవుడు మీకు కృపనిచ్చును గాక.
దేవుడు బలహీనుల పక్షముగా ఉన్నాడు:
సంఘములో బోధించిన ఉన్నతస్థాయి జీవితమునకు చేరుకొనుటకు ప్రయత్నించినప్పటికిని, దానిని చేరుకొననివారు ఎన్నటికిని నిరాశపడనవసరంలేదు. ఎందుకనగా రోగుల కొరకేగాని ఆరోగ్యము గలవారికి సహాయముచేయుటకు ప్రభువైన యేసు రాలేదు. బలహీనులయెడలను, నిస్సహాయులయెడలను, పరదేశులను, విధవరాండ్రయెడలను మరియు తండ్రిలేనివారియెడలను దేవుడు శ్రద్ధవహించునని బైబిలు బోధించుచున్నది. వ్యభిచారుల యెడలను, దొంగలయెడలను (సుంకరులు, సిలువ మీదున్ను దొంగ), కుష్ఠురోగులను, దయ్యముపట్టిన వారియెడలను మరియు యూదులచేత అంటరానివారుగా చూడబడిన వారియెడలను (ఉదాహరణకు రోమన్ శతాధిపతులు) ప్రభువైన యేసు శ్రద్ధవహించెను. ఈనాడు కూడా అనేకసార్లు మాటిమాటికి ఓడిపోయిన వారిని గురించి మరియు వారి విషయములో సిగ్గుపడి సంఘకూటములలో వెనుకకూర్చున్న వారిని గురించియు ఆయన శ్రద్ధ వహించుచున్నాడు.
1 సమూయేలు 16లో యెష్షయి తన చిన్న కుమారుడైన దావీదు గురించి తక్కువ అభిప్రాయము కలిగియుండి, తన కుమారులలో ఒకని రాజుగా ఎన్నుకొనుటకు సమూయేలు వచ్చినప్పుడు అతడు దావీదును పిలువలేదు. కాని దేవుని యొక్క దృష్టి దావీదు మీద ఉన్నది. మరియు అతనిని ఎన్నుకొనెను. దావీదు వ్యభిచారము మరియు హత్య అనే పాపము చేసినప్పటికిని, దు:ఖముతో అతడు మారుమనస్సు పొందినందున దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. నిజానికి అతని ఓటమిని బట్టి అతడు 51వ కీర్తన వ్రాయుట ద్వారా అనేక లక్షలమంది ఆశీర్వదించబడియున్నారు. అతడు ఓడిపోనట్లయితే దీనిని వ్రాసియుండెడివాడు కాదు.
ఇతరులచేత తృణీకరించబడి మరియు వాక్యానుసారముగాలేరని వారు పిలువబడినప్పటికిని మరియు ఆత్మీయజీవితములో వారు ఓడిపోయినప్పటికిని, వారు మారుమనస్సు పొందినయెడల ప్రభువు వారిని చేర్చుకొనెను. ప్రభువును ఎరుగనని మూడుసార్లు బొంకి ఓడిపోయినందువలన, పేతురు కనికరముగల అపొస్తులుడు అయ్యాడు. కాబట్టి అతడు పాపులను పరిసయ్యులవలె కఠినముగాకాక కనికరముతో చూచెను. అటువంటివారు మాత్రమే అపొస్తులులు కాగలరు. ప్రభువైన యేసు నీతిమంతులను కాక పాపులను పిలుచుటకు వచ్చెను. గత 20 శతాబ్దములలో అత్యంత ఘోరపాపులను అత్యంత గొప్ప అపొస్తులులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొన్నాడు. కాబట్టి మనందరికి నిరీక్షణ ఉన్నది.
దేవుడు నమ్మకస్తుడు:
అనేక సంవత్సరముల క్రితము ప్రభువుతో నేనిట్లు అన్నాను, ''ప్రభువా, నీ కుటుంబమును నేను చూచెదను మరియు నా కుటుంబమును నీవు చూచుకొనుము''. అప్పటినుండి దేవుడు ఎంతో నమ్మకముగా మామీద శ్రద్ధ వహించాడు. కాబట్టి నాయొక్క కుమారులైన మీ నలుగురిని - ఆత్మీయముగాను, శారీరకముగాను, ఆర్థికముగాను, ఉద్యోగ వివాహవిషయములలోను మరియు అన్ని విషయములలోను మీ జీవితాంతము ప్రభువు మీ యెడల శ్రద్ధ వహించునని నమ్ముచున్నాను. ఆయనను ఘనపరచువారిని దేవుడు ఘనపరచును (1 సమూయేలు 2:30). మరియు ''యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు'' (సామెతలు 20:7).
అనేక సంవత్సరముల క్రితము నాకును మీ మమ్మీకి వేరుగా దేవుడు ఒకే వాగ్ధానము ఇచ్చియున్నాడు. ''నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును'' (యెషయా 54:13) మరియు పౌలు ఒకసారి యిట్లనెను, ''నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను'' (అపొ.కా. 27:25). ప్రభువు తన వాగ్ధానము నెరవేర్చెను గనుక, మీ విషయములలో నాకు భయము లేదు. తల్లిదండ్రులముగా మేము చేయవలసినది చేసియున్నాము. ప్రభువు చేయవలసినది కూడా ఆయన నిశ్చయముగా చేయును. ''కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' (ఫిలిప్పీ 4:19) అని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు. ఈ వాగ్ధానములో శారీరకమైన, వస్తుసంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, తెలివితేటలు, లేక ఆత్మీయ సంబంధమైన ప్రతి అవసరమును తీర్చబడును. దేవుడు మన యొక్క ప్రతి అవసరమును తీర్చును. మనము కోరినదంతయు దేవుడు ఇవ్వడు గాని మన అవసరమంతా తీర్చును. ''దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని మొదటిగా వెదకుము'' (మత్తయి 6:33) అను షరతులు నెరవేర్చినయెడల ఈ వాగ్ధానమును స్వతంత్రించుకొనెదము. మనము అడుగకమునుపే మన అవసరములన్నియు మన పరలోకపుతండ్రికి తెలియును (మత్తయి 6:8, 32). కాబట్టి ఆయన రాజ్యము మరియు ఆయన నీతి మన జీవితములలో ప్రాముఖ్యమైయున్నయెడల, మనము అడుగకపోయినప్పటికి దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును.
దేవుని వాక్యమూలముగా జీవించుట:
ప్రతి దినము ఉదయముననే కొద్ది నిమిషములు దేవునితో గడిపి మరియు దేవుని స్వరమును వినుట మానవద్దు. ఒక దినమును ఈ విధముగా ఆరంభించినప్పుడు, అది ఎంతో శ్రేష్ఠమైనదిగా ఉండును. ఈ క్రమశిక్షణను పాటించుము. నీవు ఒకవేళ ఉదయ కాలమున ప్రార్థించలేనట్లయితే, ఆ దినములో తరువాతయిన చేయవలెను. ఒక చిన్న క్రొత్తనిబంధన బైబిలు నీ జేబులో ఉంచుకొనుట మంచిది. ఆ విధముగా అప్పుడప్పుడు నీవు వాక్యమును చదువవచ్చు మరియు సాధ్యమైతే, ఒక వారములో కనీసం నా యొక్క ప్రసంగము ఒక దానిని వినండి.
మనయొక్క ప్రతిసమస్యకు దేవుని వాక్యములో ఏదో ఒకచోట పరిష్కారము దొరుకును. దేవుని నోటనుండి వచ్చిన ప్రతిమాటను బట్టి మనుష్యుడు బ్రదుకునని ప్రభువైన యేసుచెప్పారు. దేవునివాక్యము మనకు తెలియనియెడల, మనము జీవించలేము - ఆత్మీయముగా మరణించెదము. మన అవసరమును బట్టి వెంటనే ప్రార్థించుటకు పది సెకన్లకంటె ఎక్కువ సమయము పట్టదు. కాని అది నిరాశ, నిస్పృహలనుండి మనలను రక్షించును. ఆదాముయొక్క పిల్లలు 5 ఇంద్రియముల ద్వారా జీవించిరి. కాని మనమైతే దేవుని వాక్యము మూలముగా జీవించెదము.
ప్రతి ఒక్క పరిస్థితిలో ''(దేవుని యొద్దనుండి) వినుటకు వేగిరపడువాడవుగాను మరియు కోపించుటకును, మాట్లాడుటకును నిదానించువాడవుగాను నుండవలెను'' (యాకోబు 1:19). దేవాలయములో రూకలు మార్చువారిని ప్రతి సంవత్సరమును అనగా 18 సంవత్సరములు ప్రభువైనయేసు చూచియున్నాడు (ఆయన వయస్సు 12 నుండి 30 సంవత్సరముల వరకు). కాని ఆయన దానినిబట్టి కోపగించుకొనలేదు. ఆ విషయములో తండ్రి చిత్తముకొరకు కనిపెట్టికొనియున్నాడు. తరువాత ఆయన తండ్రిచిత్తము చేశాడు. కాని అప్పటివరకు ఆయన తన్నుతాను అదుపులో పెట్టుకొనియున్నాడు.
''దేవుడు తన వాక్కును పంపి మరియు వారిని బాగుచేసియున్నాడు'' అని బైబిలులో చదివెదము (కీర్తన 107:20). దేవుని వాక్యము ద్వారా స్వస్థత కూడా కలుగును. దేవుడు వర్తమానము పంపి మరియు యోసేపును జైలు నుండి విడిపించెను (కీర్తన 105:20) మరియు యోనాను చేప కడుపులోనుండి విడిపించెను (యోనా 2:10). భూమి గాఢాందకారములో ఉన్నప్పుడు దేవుని వాక్యము బాగుచేసెను (ఆదికాండము 1:1-3). మనకు కూడా వాక్యము ఆవిధముగానే చేయును. కాబట్టి వాక్యము చదువుటకు సమయము లేనంతగా ఉండవద్దు. బైబిలు చదివిన ప్రతిసారి క్రొత్తవాటిని పొందుకొనెదవు. కాని చదువుటద్వారా కంప్యూటర్ డేటాతో నింపబడినట్లు మనము నింపబడెదము. మనకు అవసరమైనప్పుడు దేవునియొక్క ఆత్మ మనలో ఉన్నటువంటి వాక్యములో నుండి ఆ పరిస్థితికి తగిన వాక్యమును ఇచ్చును. క్రిందవున్న ఈ పాటను ప్రతిదినము ప్రార్థనగా చేయుడి.
''నాలో ఉన్న సమస్తము
నిన్నును మరియు నీ మార్గములను ప్రచురించునట్లు
ఓ ప్రభువా, నా దేవా నీ జీవముతో నన్ను సమృద్ధిగా నింపుము.
స్తుతులతో నన్ను నింపుము''
ఫిలదెల్ఫియలో ఉన్న పెద్దతో, నీకున్న దానిని గట్టిగా చేపట్టుము, లేనియెడల నీ కిరీటమును పోగొట్టుకొనెదవని ప్రభువైనయేసు చెప్పారు (పక్రటన 3:11). ప్రభువు మనకొరకు సిద్ధపరచిన దానిని పోగొట్టుకొనకుండునట్లు, అన్ని సమయములలో జాగ్రత్తగాఉండుము. మన చదువులతోను మరియు మన పనులతోను మునిగిపోయి సమయములేనియెడల ప్రభువును గురించి కాని లేఖనముల గురించి కాని నీవు ఆలోచించలేవు. కాని ప్రభువు స్వరము వినుటకు మన హృదయములను ఎల్లప్పుడు మెలకువగా ఉంచుకొనవచ్చును. పెండ్లి కుమార్తె ఇట్లనుచున్నది, ''నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది'' (పరమగీతము 5:2, 3). ప్రభువు స్వరము వినుటకు నీ హృదయము ఎల్లప్పుడు మెలకువగా ఉండాలి. ప్రత్యేకముగా రాబోయే అపాయములను ముందుగా తెలుసుకొనుటకు మనము అనేక శోధనలనుండి కాపాడబడునట్లు, మన జీవితములలో ఎల్లప్పుడు ఏదొక పని కలిగి యుండుటకు దేవుడు అనుమతించును. ప్రజలు సోమరులుగా ఉన్నప్పుడు పాపము చేయుటకు శోధింపబడుదురు.
క్రొత్త నిబంధన యొక్క పరిపూర్ణత:
క్రొత్తనిబంధనలో పరిపూర్ణత అనగా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగియుండుట (ఫిలిప్పీ 2:5). ఈ గురియొద్దకే మనము ప్రతిదినము వెళ్ళవలెను. పాపము విషయములోను, తన శిష్యుల విషయములోను, తన యొక్క శత్రువుల విషయములోను, పాపులవిషయములోను, స్త్రీలవిషయములోను, వస్తువాహనముల విషయములోను, ఉద్యోగవిషయములోను, లోకసంబంధమైన విషయములోను, ఆటలు మొదలగు వాటి విషయములోను ప్రభువైన యేసు వైఖరిని మనము కలిగియుండెదము.
సాధారణముగా ప్రతి విషయములో మన స్వలాభమును మరియు సుఖసౌఖ్యమును కోరెదము. ఇది దౌర్భాగ్యకరమైన జీవితము, ఎందుకనగా కృపలో అభివృద్ధి చెందము. క్రీస్తుయేసు యొక్క మనస్సు మనము కూడా కలిగియుండునట్లు, మనయొక్క స్వాభావికమైన కోరికలను చంపాలి. అందువల్ల మన జీవితమంతటికి కేంద్రము సిలువ మార్గమైయున్నది.
మన స్వంతము కోరుకొనేటట్లు సాతాను చేసే ఆరు మార్గములు ఇక్కడ ఉన్నవి.
1. గర్వము - మనము చేయగలిగిన వాటిని బట్టి లేక మనము సాధించిన వాటిని బట్టియు
2. లైంగిక అపవిత్రత - ఇది తలంపులలో ఆరంభమగును.
3. ద్వేషము - క్షమించలేకపోవుట, పగతీర్చుకోవాలనే తలంపులు మొదలగునవి.
4. రాజీపడుట - లౌకికతత్వము (ధనాపేక్ష) మరియు స్వలాభము కొరకు యథార్థముగా ఉండకపోవుట.
5. భయము, చింతించుట - భవిష్యత్తు గురించి మరియు మొదలగునవి.
6. అక్షరానుసారత (లీగలిజం) - పరిసయ్యతత్వము
ఈ విషయములలో ప్రభువైనయేసు ఎప్పుడైనను పడిపోలేదు మరియు మనము కూడా పడిపోము.
కాని సిలువ మీద ప్రభువైన యేసు శరీరముపై దాడిచేయుటకు సాతానును దేవుడు అనుమతించి మరియు ఆ విధముగా సాతానును ఓడించాడు. సాతాను యేసు యొక్క మడిమ మీద కొట్టెను మరియు సాతాను యొక్క తల చితుక కొట్టబడెను (ఆదికాండము 3:15). ఆ విధముగానే పౌలుశరీరములో సాతానుద్వారా ఒక ముల్లును దేవుడు అనుమతించెను. కాని పౌలు హృదయములో ఉన్న గర్వమును నశింపచేయుటకు దేవుడు సాతానును ఉపయోగించాడు (2 కొరింథీ 12:7). మన మార్గములన్నిటిలో మనము ప్రభువుకు విధేయులమైయున్నయెడల, సాతానుకు వ్యతిరేకముగా దేవుడు మన పక్షమున ఉండి మరియు ఎల్లప్పుడు మనలను జయములోనికి నడిపించును.
కృతజ్ఞత కలిగిన వైఖరి:
మొన్నటి దినమున నేను మోటారు సైకిలు మీదనుండి రైలు పట్టాల మీద పడినప్పుడు దేవుడు నన్ను కాపాడియున్నాడు (30-08-1993). రైలు గేటు దగ్గర పనిచేసే వ్యక్తి, నేను గేటు దాటకముందే దానిని క్రిందకు దించుటవలన, అది నాకు తగులుటవలన నేను క్రిందపడ్డాను. రైలు పట్టాల మీద కొంతసేపు నేను స్పృహలేకుండా పడియున్నాను. ఏదైనా రైలు రాకముందే ఒక వ్యక్తి నన్ను లేపియున్నాడు. మృతులలో నుండి లేచినవాడుగా నన్ను నేను భావించుచున్నాను. నా శేష జీవితకాలమంతయు దేవునికి ఋణపడియున్నానని తాజాగా గుర్తుతెచ్చుకొనియున్నాను. నా యొక్క సమయమును గాని లేక శక్తినిగాని లేక డబ్బునిగానీ నా యిష్టప్రకారము ఖర్చుపెట్టను. నా కిష్టమైన దానిని నేను చదువలేను. నాకిష్టమైచ్చినట్లు మాట్లాడలేను. సమస్తము దేవుని మహిమార్థము జరగాలి. ప్రభువైన యేసు ఆ విధముగా జీవించియున్నాడు. గనుక ఇటువంటి జీవితము ద్వారా నష్టపోము గాని మహిమకరమైన జీవితమును కలిగియుండెదము. మీరు రోడ్డుమీద వెళ్ళుచున్నప్పుడు ఇటువంటి ప్రమాదముల గురించి అనుభవములు మీకు ఉండవచ్చును. కాని దేవునియొక్క దూతలు మిమ్ములను కాపాడియున్నారు. కాబట్టి మీరు కూడా దేవునికి ఋణపడియున్నారు. మనలను కాపాడుచున్నందుకు దేవునికి స్తోత్రములు. మృతులలో నుండి సజీవులమనుకొని మనము జీవించెదముగాక.
ప్రమాదము జరిగిన మూడు వారముల తరువాత, నా చేయి మరియు భుజము 95 శాతం మామూలు స్థితికి వచ్చినది. ఈ అద్భుతమును బట్టి దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఆ మూడు వారములలో దేవునిని స్తుతించేటప్పుడు నా చేతులు ఎత్తలేకపోతిని. కాబట్టి నా జీవితములోని చిన్న విషయములను బట్టి కూడా కృతజ్ఞత కలిగియుండుట నేర్చుకొనియున్నాను. దేవుని స్తుతించేటప్పుడు నా చేతులెత్తుటకు కావలసిన శక్తిని ఇచ్చినందుకు, 54 సంవత్సరములలో మొదటిగా దేవునిని స్తుతించాను. అప్పటివరకు దానిని మామూలుగా తీసుకొనియున్నాను. ఆ విధముగానే నాశరీరములోని ఇతర అవయవములైన - నా కళ్ళను బట్టియు, నా చెవులను బట్టియు మరియు నాలుకను బట్టియు, అన్నింటిని బట్టియు కృతజ్ఞత కలిగియున్నాను.
సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగియుండాలి. చేప కడుపులో నుండి యోనా చేసిన ప్రార్థన చాలా మంచిది (యోనా 2వ అధ్యాయము). చేప కడుపులో అతడు మొత్తబడుచున్నప్పటికిని, రసాయనము అతని మీద పడుచున్నప్పటికి, అక్కడ ఉండుటకు దేవుడు అతనికి అనుమతించినందుకు యోనా కృతజ్ఞతలు చెల్లించాడు. అతడు కృతజ్ఞతలు చెల్లించుటకు ఆరంభించినప్పుడు మాత్రమే, ఆరిననేల మీద అతనిని కక్కునట్లు దేవుడు చేపకు ఆజ్ఞాపించెను (యోనా 2:9, 10). కాబట్టి నీ పరిస్థితులను బట్టిగాని లేక ఆహారమునుబట్టిగాని లేక ఇంటినిబట్టిగాని ఫిర్యాదు చేయవద్దు. కృతజ్ఞత కలిగియుండుము. చాలామంది పిల్లలు వారి ఇంటినుండి బయట ప్రపంచములోనికి వెళ్ళి, జీవితమెంత కష్టమో చూచేటంతవరకు వారి తల్లిదండ్రులను బట్టిగాని మరియు వారి గృహమును బట్టిగాని కృతజ్ఞత కలిగియుండరు. కృతజ్ఞతలు చెల్లించేఆత్మ కలిగియుండుట ద్వారా యోనా వలె అనేక బంధకముల నుండి విడుదల పొందెదరు.
పాతనిబంధన యొక్క బలులను, క్రొత్త నిబంధనలో అన్వయించుట:
ఐదు బలులను తెమ్మని దేవుడు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించాడు. ఇవి లేవీయకాండము మొదటి ఐదు అధ్యాయములలో వివరించబడినవి (ప్రతి అధ్యాయములో ఒక బలి).
1. దహనబలి అనగా ప్రభువైన యేసు తన శరీరమును సంపూర్ణముగా తన తండ్రికి సమర్పించుకొనినట్లే మనము కూడా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి.
2. నైవేద్యబలి అనగా రక్తము చిందించకుండా, మనము భుజించుటకు ప్రభువైన యేసే మనకు జీవాహారముగా నుండునట్లు తన్నుతాను అప్పగించుకొన్నాడు.
3. సమాధానర్థబలి అనగా ప్రభువైన యేసు తన్నుతాను అప్పగించుకొనుట ద్వారా దేవునికిని మరియు మానవుల మధ్యను మరియు సంఘములోని మనిషికి ఒక మనిషికి మధ్యను సమాధానమును కలుగజేసెను. మనకును మరియు ఇతరులకును మధ్య సమాధానముండునట్లు మనము కూడా అర్పించుకొనవలెను.
4. పాపపరిహార్థా బలి అనగా మన పాపముల కొరకు ప్రభువైన యేసు మరణించుట (దేవుని మహిమను పొందక పోవుటయే పాపము) (రోమా 3:23).
5. అపరాధ పరిహారార్థబలి అనగా ప్రభువైన యేసు మన అపరాధములను భరించి మనకు నేరారోపణ లేకుండా చేయుట. పాపము ఎంతో తీవ్రమైనది కనుక దాని కొరకు దేవుడు పాత నిబంధనలో రెండు బలులనుంచెను. ఒకటి పాపము కొరకు మరియు మరొకటి నేరారోపణ తీసివేయుట కొరకు (ఇవి రెండూ ఒకటేనని మనము భావించెదము).
అప్రయత్నంగా చేసే పాపముకొరకు పాత నిబంధనలో దేవుడు కొన్ని సదుపాయములు కలిగించాడు. వాటిని లేవీయకాండము 4:2,13, 22, 27 మరియు 5:4, 15, 17లలో చదివెదము. అప్రయత్నంగా చేసే పాపమనగా మనకు తెలియని రీతిగాగాని లేక ఒక పరిస్థితిలో ఒత్తిడిని బట్టిగాని చేసే పాపము (అనగా మనము అనుకొనని రీతిగా మోహపు చూపు చూడవచ్చును లేక కోపముతో అరువవచ్చును). దానిని చేయవలెనని ముందుగా మనము అనుకొనలేదు లేక దానిని చేయవలెనని ముందుగా ఆలోచించలేదు. ముందుగానే నిర్ణయించుకొని చేసే పాపములు తీవ్రమైనవి. ఉద్దేశ్యపూర్వకముగా చేసే పాపమునకు ధర్మశాస్త్రములో ఎటువంటి సదుపాయములేదు.
కాని ఇప్పుడు కృపలో, ఉద్దేశ్యపూర్వకముగా చేసే పాపములకు కూడా సదుపాయముఉన్నది. లేనట్లయితే మనమందరము నేరారోపణలోఉండెదము. కాని అనేకులు ఈ సదుపాయమును బట్టి అనగా సుమారు 90శాతం క్రైస్తవులు పాత నిబంధనలోని యూదులకున్న పరిశుద్ధతలో కూడా జీవించుటలేదు.
మన నోటిగుండా వచ్చే చెడ్డమాటలు గురించి కూడా ఆలోచించుటలేదు. మనము చేసే దానికంటే ఎక్కువగా దానియొక్క ఉద్దేశ్యమును దేవుడు చూచును. మనము బుద్ధిపూర్వకముగా అనేకసార్లు పాపము చేయుచు జీవించుచున్నయెడల పాపములకు బలి ఇకను ఉండదు. ఎందుకనగా అప్పుడు నీవు క్రీస్తు యొక్క రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుచున్నావని హెబీ 10:26 - 29లలో చెప్పబడింది. కాబట్టి మనము పాపమును తీవ్రముగా తీసుకొని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనవలెను (2 కొరింథీ 7:1).
మహిమంతయు దేవునికే చెల్లును:
నీవు ప్రభువును వెంబడించవలెనని కోరినయెడల, ప్రభువైన యేసువలె మనుష్యుల యొక్క ఘనతను నీవు కోరకూడదు (ఫిలిప్పీ 2:5). ప్రభువైనయేసు మనుష్యులచేత ఆకర్షింపబడకుండునట్లు మనుష్యుల దృష్టిలో చూడనొల్లనివాడాయెను (యెషయా 53:2). లోకములో ఘనముగా ఎంచబడునది దేవునిదృష్టిలో అసహ్యము (లూకా 16:15). మానవులుగా మనకున్న సహజముగా ఉన్న తలంపుల బట్టి మరియు వరములను బట్టి గర్వించినయెడల, దేవుడు తన శక్తిని మన ద్వారా వ్యక్తపరచడు. పౌలు ఇట్లన్నాడు, ''నా శక్తి సామర్థ్యములను గాక క్రీస్తుయొక్కశక్తి నాలో బయలుపరచుటను బట్టి సంతోషించుచున్నాను'' (2 కొరింథీ 12:9 లివింగు బైబిలు). ఇదియే మన పిలుపు. నీకున్న తలాంతులను బట్టియు, వరములను బట్టియు మరియు సామర్థ్యములను బట్టియు నీవు గర్వించవద్దు. దానికి బదులుగా ఇతరులు నిన్ను ఒక బలహీనమైనవ్యక్తి (గొఱ్ఱెపిల్ల) గా చూడనిమ్ము. కాని ప్రభువైనయేసు శిష్యుడి (సింహము)వలె ధైర్యముగా ఉండుము.
మనము నిజమైన సంఘముగా నున్నప్పుడు ఇతర క్రైస్తవుల ద్వారా అపార్థము చేసుకొనబడెదము మరియు విమర్శించబడెదము. కాని అటువంటి జీవితము ఎంతో మహిమకరమైయున్నది. మన ఇచ్ఛలనుజయించి మరియు సాతానును మన పాదముల క్రింద ఉంచబడునట్లు మనము దేవునికి ఇష్టులముగా జీవించెదము. మనుష్యులయొక్క ఘనత చెత్తతో సమానము గనుక దానిని కోరకూడదు.
ప్రభువైనయేసు 70 మంది శిష్యులతో ఇట్లనెను, ''అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను'' (లూకా 10:20). మనమేమైయున్నామో అను దానినిబట్టి గాని లేక మనం చేసినదానిని బట్టిగాని లేక మనము చేయగలిగిన దానిని బట్టిగాని మనము సంతోషించకూడదు. కాని ప్రభువు ఏమైయున్నాడనే దానిని బట్టియు, ప్రభువు మన కొరకు చేసి ముగించిన దానిని బట్టియు మరియు ప్రభువు చేయగలిగిన దానిని బట్టియు సంతోషించాలి. మనము చేయగలిగిన దానిని బట్టి సంతోషించినయెడల, మనమే ఘనతను పొందెదము మరియు ఇతర విశ్వాసుల కంటే మనలను గొప్పగా చేయును. ఇది పరిసయ్యతత్వము. మనము దయ్యములను వెళ్ళగొట్టుట, రోగులను స్వస్థపరచుట, వాక్యమును ప్రకటించుట కొన్ని వ్యాసములను వ్రాయుట, ఆతిథ్యము ఇచ్చుట, బాగుగా వంటచేయుట, కారును బాగుగా నడుపుట మొదలైన భూసంబంధమైన వాటిని గొప్పగా చేయుట ద్వారా మనము సంతోషించెదము (అపొ.కా. 7:41). మనము ఘనత పొందుటకు అనేకమార్గములు ఉన్నవి. కాని ఇదంతయు విగ్రహారాధన. కాని దేవుడు చేసిన దానిని బట్టి మనము సంతోషించినయెడల, అప్పుడు మనము దీనులముగా ఉండి, ఇతర విశ్వాసులతో సమానస్థాయిలో ఉందుము. మరియు ఇక్కడ క్రీస్తుయొక్క శరీరము నిర్మించబడును.
దీనత్వము మరియు కృప:
కృపను పొందకుండా క్రొత్తనిబంధన ఆజ్ఞలకు లోబడియుండుట అసాధ్యము. 10 ఆజ్ఞలలోని మొదటి 9 ఆజ్ఞలను కృపలేకుండా కొందరు నెరవేర్చవచ్చును కాని నీది కానిదానిని ఆశించవద్దు అనే 10వ ఆజ్ఞను దేవునికృపను పొందకుండా ఎవరు నెరవేర్చలేరు. కృపను పొందనియెడల క్రొత్తనిబంధన జీవితము (మత్తయి 5 నుండి 7 అధ్యాయములు) జీవించలేము. దీనులకే దేవుడు కృప నిచ్చును.
దీనత్వమనే గుణలక్షణము సులభముగా కల్తీ చేయవచ్చు. మనలో ఇతరులు చూడగలిగినది నిజమైన దీనత్వము కాదు. అది మనలో ఉండును మరియు దేవుడు చూచును. ప్రభువైన యేసు యొక్కజీవితములో అది స్పష్టముగా చూపించబడినది. ఫిలిప్పీ 2:5 - 8లో ప్రభువైన యేసు దేవునిగా ఉండుట విడిచిపెట్టి మరియు దాసుడయ్యెను. మరియు మనుష్యుల చేత సిలువవేయబడుటకు ఇష్టపడెను. ఆ దీన మార్గములోనే మనము వెంబడించాలి. ప్రభువైన యేసు దీనుడై 3 మెట్లు దిగియున్నాడు.
1. ఆయన మనుష్యుడిగా పుట్టెను.
2. ఆయన దాసుడయ్యెను.
3. ఒక నిందితునిగా సిలువ వేయబడుటకు ఆయన ఇష్టపడెను.
ఇక్కడ క్రైస్తవ జీవితములో మూడు రహస్యములు ఉన్నవి. అవి దీనత్వము, దీనత్వము, దీనత్వము.
ప్రభువైన యేసు ముప్పైమూడున్నర సంవత్సరములు భూమిమీద జీవించి మరియు దీనత్వముతోను సహనముతోను అవమానమును భరించుచు మరియు గాయపరచబడుచు అనేకులకు పరిచర్యచేయుట దూతలు చూచియుండవచ్చును. అనేక సంవత్సరములనుండి ఆ దూతలు ఆయనను పరలోకములో ఆరాధించియున్నారు. కాని భూమిమీద ఆయన యొక్క ప్రవర్తననను వారు చూచినప్పుడు, ప్రభువైన యేసు పరలోకములో ఉన్నప్పుడు వారు చూడనటువంటి దేవుని స్వభావములోని ఆయనలోని దీనత్వమును మరియు తగ్గింపు స్వభావమును వారు చూచియున్నారు. ఇప్పుడు సంఘములో ఉన్న మనలోని క్రీస్తుయొక్క ఆత్మను పరలోకములోని దూతలు చూడవలెనని దేవుడు కోరుచున్నాడు (ఎఫెసీ 3:10). ఇప్పుడు దూతలు మనలను చూచినప్పుడు మనలోను, మనయొక్క ప్రవర్తనలోను ఏమి చూచుచున్నారు? మనయొక్క ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చుచున్నదా?
దీనత్వము అన్ని గుణలక్షణముల కంటే గొప్పది. మనమేమైయున్నామనునదియు మరియు మనకున్న వరములన్నియు దేవునికి చెందినవి అని ఒప్పుకొనుటయే దీనత్వము. మనుష్యులందరిని ప్రత్యేకముగా బలహీనులకు, నాగరికతలేనివారికి, కుంటివారికి మరియు బీదలకు విలువ నిచ్చేటట్లు దీనత్వము చేయిస్తుంది. అటువంటి దీనత్వమనే పొలములోనే ఆత్మ యొక్క ఫలములు మరియు క్రీస్తుయొక్క గుణలక్షణములు అభివృద్ధి చెందును. కాబట్టి ఎల్లప్పుడు నిన్ను నీవు తీర్పుతీర్చుకొనుచు, గొప్ప తలంపులనే విషముగాని లేక ఘనత కోరుటగాని లేక దేవునికి చెందవలసిన మహిమను పొందుటకాని ఎన్నటికి నీ హృదయములో ప్రవేశించకుండా చూచుకొనుము. ప్రభువైనయేసు యొక్క దీనత్వమును ధ్యానించుము. అది నేను మీకిచ్చే గొప్ప హెచ్చరిక.
వాక్యమును ప్రకటించుట:
మీరున్న స్థలములో ఇతరులకు పరిచర్య చేయుటకును మరియు వారు ఆయనను వెంబడించుటకు వారిని, ప్రోత్సహించుటకు ప్రభువు మీకిచ్చిన అవకాశములను బట్టి ఆయనకు వందనములు చెల్లించుచున్నాను. దీనులైయుండి, దేవునియెదుట మీ ముఖములను దుమ్ములో పెట్టుకొనుచు ఉండినయెడల, మీ జీవితములలో అంతకంతకు మేలు జరుగును.
ఎప్పుడైనను దేవుని వాక్యమును ప్రకటించే అవకాశము వచ్చినప్పుడు, ప్రసంగములోని ముఖ్యమైన విషయములను బైబిలులోనుండి వ్రాసుకొని ముందుగానే సిద్ధపరచుకొనుము. వాక్యమును ధైర్యముగా బోధించుము. దేవుని వాక్యమును ఖచ్చితముగా ప్రకటించుము. బెంగుళూరులో అనేక సంవత్సరములు మీ జీవితములలో దేవుడు అనేక కార్యములు చేసెను మరియు అనేకమంది క్రైస్తవులకు క్రొత్త నిబంధనను అర్థం చేసుకొనని వారు అనేకులు ఉన్నారు. కనుక అవకాశము వచ్చినప్పుడు వారికి చెప్పుట మీ బాధ్యత.
మీ చుట్టు ప్రక్కల ఉన్న యౌవనస్థులను ప్రోత్సహించుటకు ప్రభువు అవకాశమిచ్చినప్పుడు, ఈ క్రిందనున్న మూడు విషయములు జాగ్రత్తపడుము..
1. ఆత్మీయగర్వము (అనగా మీ వరములను బట్టి, తలాంతులను బట్టి, స్థానాన్ని బట్టి, జీతాన్ని బట్టి లేక బైబిలు జ్ఞానాన్ని బట్టి).
2. వేషధారణ (మీరు అభ్యసించాలని కనీసం ప్రయత్నించని వాటిని ప్రకటించుట)
3. ప్రజల యొక్క మెప్పు కొరకు చేయుట - ప్రత్యేకముగా అమ్మాయిల విషయములో.
మీరు పరిచర్య చేసిన తరువాత, ఎల్లప్పుడు తీర్పు తీర్చుకొనుటయే వీటినుండి విడుదల పొందుటకు మార్గము. ఇక్కడే అనేకమంది బోధకులు పడిపోయారు. బోధించుటకు ముందు అనేకులు ప్రార్థించుదురు. కాని వారు బోధించిన తరువాత ప్రభువు యెదుట తమ్మును తాము పరీక్షించుకొనరు మరియు ప్రభువుతో గడపరు.
నీవు ఎంత ఎక్కువ ఇతరుల యెదుట నిలబడతావో (బోధించునప్పుడు గాని లేక సంగీతం వాయించినప్పుడు గాని) అంత రహస్యముగా ప్రభువు యెదుట మోకరించాలి. నీవు గర్వించేటట్లును లేక యథార్థము లేకుండా ప్రవర్తించునట్లును చేయుటకు సాతాను ప్రయత్నించును. కాబట్టి జాగ్రత్తపడుము.
దైవభక్తి కలవారికి ఎల్లప్పుడు మేలే జరుగును:
నీవు దైవభక్తి గలవాడవుగా ఉండుటకు నిర్ణయించుకొన్న యెడల, భవిష్యత్తులో ప్రతి విషయములో దేవుడు నిన్ను నడిపించును. దేవునినుండి అత్యధికముగా పొందుకొనిన వారై ఆయనను ఘనపరచెదరు. కాని తెలివిగలవారుగాని లేక ధనవంతులు గాని లేక ప్రత్యేకమైన వారుగాని కారు. మన జీవితములో దైవభక్తి గలిగియుండాలని నిర్ణయించుకొనకపోవుట వలన భవిష్యత్తు గురించి ఎంతో అభధ్రత ఉన్నది. కాబట్టి అన్ని సమయములలో దేవుని ఘనపరచాలని నిర్ణయించుకొనుము. అప్పుడు దేవుడు నీకు ఆత్మీయముగా శ్రేష్ఠమైన వాటిని ఇచ్చును. మరియు అదే సమయములో ఈ లోకములోని శారీరక మరియు ఆర్థిక సంబంధమైన ప్రతి అవసరమును తీర్చును. నాయొక్క గత 30 సంవత్సరములలో ఇది సత్యమని కనుగొన్నాను. కాలేజీలో నీవు చదువవలసిన కోర్సుల గురించి, నీవు చేయబోయే ఉద్యోగము గురించియు, వివాహ విషయములోను మరియు ప్రతి విషయములోను దేవుడు నిన్ను నడిపించును. ఎల్లప్పుడు దేవునిని ఘనపరచవలెననియు మరియు ఒక దైవభక్తి గలవానిగా జీవించవలెననియు ఇప్పుడు నీవు నిర్ణయించుకొనవలెను.
అనగా ప్రతి చిన్న విషయములో నమ్మకముగా ఉండుట. అనగా నీవు ఎన్నటికి పడిపోవు అని కాదు, ఓడిపోవుఅని కాదు. కాని నీవు ఓడిపోయినప్పుడు పశ్చాత్తాపపడుము.
ఇతరులకు చెందినదేదియు అనగా ఒక ఇంటిలోనుండిగాని, ఒక వ్యక్తి యొద్దనుండి గాని లేక కాలేజీనుండిగాని లేక ఆఫీసునుండిగాని లేక మరెక్కడనుండియైనగాని లేక కనీసం పెన్నుగాని, పెన్సిలుగాని తీసుకొనకూడదు. చిన్న విషయాలలో కూడా ఎవరిని మోసగించకూడదు. అలాగే మేము చెప్పిన రీతిగా పరీక్షలలో కూడా ఏవిధమైన మోసం చేయకూడదు. మోసగించి పాసయ్యేకంటే బీదలుగా ఉండుట మంచిది. నీ మనస్సును కలుషితం చేసే పుస్తకములను చదువవద్దు మరియు టీ.వీ కార్యక్రమములను చూడవద్దు. అన్ని విషయములలో ఎల్లప్పుడు నీ మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆవిధముగా జీవించేవారు కరువు ఉన్నప్పటికిని, ప్రతి తరములో దేవుని యొక్క శ్రేష్ఠమైన వాటిని పొందెదరు.
నా కుమారులందరు అటువంటివారుగా ఉండాలని కోరుచున్నాను. అప్పుడు మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మరియు మీరు ఆశీర్వదించబడినట్లే మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడెదరు. నీతిమంతులు ఆకలిగొనరనియు మరియు దేవునిని ఘనపరచువారిని ఆయన ఘనపరచుననుదానికి అవిశ్వాసులయెదుట మీరు సాక్షులుగా ఉండెదరు. మీ తెలివితేటలను బట్టిగాని లేక మీరు సాధించిన దానినిబట్టిగాని లోకము యొక్క ఘనతను పొందుటకంటే ఈ లోకములో దేవునియొక్క సజీవసాక్షులుగా ఉండుటకు మీ హృదయమంతటితో కోరుకొనుము. ఇతర విషయములు ఏవియు మీకు దేవుడిగా ఉండకుండునట్లు జాగ్రత్తపడుము.
నా నలుగురు కుమారులు పాపము మీద జయమును మరియు స్వజీవమునకు చనిపోవుటగురించి ప్రకటించవలెననియు (దీనిని మీ జీవితములలో అనుభవించుచు) మరియు క్రీస్తు శరీరములో దేవుడు మీకు నిర్ణయించిన పరిచర్యను మీయొక్క ఉద్యోగములు చేసుకొనుచు, ఎవరిమీద ఆధారపడక పౌలువలె మిమ్ములను మీరు పోషించుకొనుచు పరిచర్యను చేయవలెనని మీ కొరకు ప్రార్థించుచున్నాను. దీనిని లోకము చూడవలసిన అవసరము ఉన్నది. మరియు మీ విషయములలో ఇదే నా యొక్క గొప్ప కోరిక. ఎల్లప్పుడు దేవుని రాజ్యమును మరియు నీతిని మొదట వెదకువారు, ప్రభువైన యేసు మరలా వచ్చినప్పుడు చింతించరు.
కాలేజీలోని యౌవనవిద్యార్థులను శోధించుటకు దుర్నీతితోను మరియు వ్యభిచారముతోను నిండియున్న ఆత్మలు పనిచేయుచున్నవి. కాబట్టి ఈ విషయములలో మీరు ఎల్లప్పుడు సాతానును ఎదురించవలెనని నేను కోరుచున్నాను. టీ.వీ ద్వారా గాని పుస్తకముల ద్వారాగాని లేక ఏవిధముగానైను ఈ విషయములో సాతాను శోధించుటకు అనుమతించవద్దు. తన యొక్క పనిని ఎక్కువగా ఎవరైతే చెడగొట్టుదురో, వారినే సాతాను గురిగా పెట్టుకొనును. కాబట్టి ప్రభువైనయేసు మీద దాడిచేసినట్లే మనమీద కూడా దాడిచేయుట మనకు గౌరవ ప్రదమైయున్నది. కాని మన రక్షకుడైన ప్రభువుద్వారా కలువరి సిలువ మీద సాతాను సంపూర్ణముగా నశింపచేయబడి ఓడింపబడియున్నాడు. గనుక మనము సాతానుకు భయపడము (కొలొస్స 2:14, 15).
లైంగిక విషయములలో ఆశానిగ్రహము లేకపోవుటకు యెహెజ్కేలు 16:49లో 4 కారణములు ఇవ్వబడినవి - గర్వము, తిండిబోతుతనము, సోమరితనము మరియు స్వార్థము. ఈ 4 విషయములలో నీవు నమ్మకముగా పనిచేసినయెడల లైంగిక విషయములలో జయించెదవు.
ఓడిపోతామనే భయమును మొదట జయించాలి. నీవు ఏ విషయములోనైనను (ఆత్మీయ విషయములోగాని లేక చదువు విషయములోగాని) 1000 సార్లు పడిపోయినను లేచి పరుగెత్తుము. నీ యొక్క గత ఓటములను బట్టి చింతించవద్దు. గత ఓటములు ఎప్పుడు గుర్తువచ్చినప్పటికిని, నీ చిత్తమును ఉపేక్షించి మరియు వాటిని విసర్జించుము. నీవు ఈ విధముగా నమ్మకముగా చేయుచున్నట్లయితే కాలము గడిచేకొద్ది అవి తగ్గిపోవుచూ మరియు ఆగిపోవును. అనగా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లుగా చెరపట్టెదము (2 కొరింథీ 10:5).
ఆత్మయే జలముగా ఉన్నది:
ఒకడు నీటి మూలముగాను మరియు ఆత్మమూలముగాను జన్మించవలెనని ప్రభువు చెప్పినప్పుడు అక్కడ నీరు ఆత్మకు సాదృశ్యముగా ఉన్నది. యోహాను సువార్తలో నీటిని మూడు రకాలుగా వాడియున్నారు. అది మూడు రకాల ఆత్మీయస్థితిని చూపించుచున్నది:
1. నీటిమూలముగా జన్మించుట - ఆరంభములో (ఒక గిన్నెలో నీరు వలె ఉండును) (యోహాను 3:5, రక్షణ పాత్ర కీర్తన 116:13).
2. ఒక నీళ్ళ బావి - అనగా క్రీస్తు ద్వారా పూర్తిగా సంతృప్తిపరచబడుట (యోహాను 4:14).
3. జీవజలముల నదులు - దేవుని యొక్క జీవము మనలోనుండి అనేకులకు ప్రవహించుట (యోహాను 7:13).
పరిశుద్ధాత్మలోనూ మరియు అగ్నిలోను బాప్తిస్మము పొందుడి అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు అనగా నీరు బాహ్యముగా మనలను శుద్ధి చేసినట్లే అగ్నికూడా ఆత్మగా మన అంతరంగమును పవిత్రపరచును (నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముగలవారమై యుండుట) (హెబీ 10:22). (సంఖ్యాకాండము 31:22, 23 లో కూడా మొదటిగా నీటిలో కడుగబడి తరువాత అగ్ని ద్వారా అంతరంగములో పవిత్రపరచబడునని చెప్పబడింది).
ఒక జయజీవితము:
మనము ఏది చేసినప్పటికిని విశ్వాసము లేకుండా దేవునికిష్టులైయుండుట అసాధ్యము (హెబీ 11:6) మరియు మనకు విశ్వాసము ఉన్నప్పుడు మనకు అసాధ్యమైనది ఏదియులేదు (మార్కు 9:23). అనగా మన జీవితములో దేవుని చిత్తమేదైనను అసాధ్యము కాదు అని అర్థము. ఒక విశ్వాసము గలవాడు, తన జీవితములో ప్రతీ చిన్న విషయము కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలో సంపూర్ణమై ఉన్నదని విశ్వసించును కాబట్టి దేవుని చిత్తము కానిదానిని అతడు ఆశించడు మరియు దానికొరకు దేవునికి ప్రార్థించడు. కాబట్టి దేవుని చిత్తప్రకారము అతనికి సమస్తము సాధ్యమే.
సాతానుకు వ్యతిరేకముగా దేవుడు తన పక్షమున ఎల్లప్పుడూ ఉండుననియూ ఒక వేళ పాపములో పడిపోయినయెడల దేవుని యెదుట ప్రభువైనయేసు అను ఉత్తరవాది ఉన్నాడని ఒక విశ్వాసము గల వ్యక్తి నమ్మును. ప్రతీ పాపమును జయించుటకును మరియు ప్రతిఆజ్ఞకు లోబడుటకును దేవుడు సహాయపడుననియు మరియు ఈ లోకములో దేవుడు తనను ఒంటరిగా విడిచిపెట్టడనియు అతడు విశ్వసించును. అటువంటి వ్యక్తి అన్ని పరిస్థితులలో జయించుచూ ఉండును.
నీ జీవితములో చేయునదంతయూ సాధ్యమే అని ఊహించుకొనుము. అటువంటి జీవితము ఎటువంటి సంతోషమును జయమునిచ్చునో కదా! నీవు ఈవిధముగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అందువలన నీకు విశ్వాసమున్న యెడల నీవు జీవించెదవు కాబట్టి నీవు ఎంత వెల చెల్లించవలసి వచ్చినప్పటికిని దేవుని యొక్క ప్రణాళికను మరియు ఆయన ఆజ్ఞలను నీకు ఎంతో శ్రేష్టమైనవిగా నీ పూర్ణహృదయములో ఉంచుకొనవలెను.
నీలో విశ్వాసము పరిపూర్ణమగునట్లు, ప్రతిదినము ఆత్మ నీ హృదయములో మాట్లాడు దానిని వినుము. దీని నిమిత్తము, దేవుని గురించి ఆలోచించుచూ ఒక దినమును ఆరంభించవలెను. అప్పుడు ఆ దినములో ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు అనగా, దీనిని చేయుము, దీనిని చేయవద్దు. దానిని చదువవద్దు, లేక కొద్ది నిమిషములు లేఖనములు ధ్యానించుము అను మాటలకు లోబడవలెను. ప్రభువా, ఇప్పుడు నాతో మాట్లాడుమనియు మొదలగునవి చేయుము.
ఇతరులు నిన్ను అపార్థము చేసుకొనినప్పటికిని ప్రభువైన యేసు నామమును ఒప్పుకొనుటకును ఆయన శిష్యుడవని చెప్పుకొనుటకును సిగ్గుపడవద్దు. ఒక మనిషియొక్క ఘనతనిమిత్తము రాజీపడుట ద్వారా ఎన్నటికి సాతానుకి నమస్కరించవద్దు.
మన శరీరములకు గాలి అత్యవసరమైనట్లే, మన క్రైస్తవ జీవితానికి కూడా విశ్వాసము అత్యవసరము. కాబట్టి నీ అంతరంగములో చిన్న విషయములలో ఆత్మయొక్క స్వరము విని నమ్మకముగా ఉండుము. అప్పుడు నీ విశ్వాసములో ఎదిగి, ఆత్మీయముగా బలపడి మరియు అన్ని సమయములలో జయించెదవు.
లైంగికవాంఛ విషయములో తీవ్రముగా ఉండుట:
ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినవాడు ఆమెతో వ్యభిచరించినట్లే అని కొండమీద ప్రసంగములో ప్రభువైన యేసు చెప్పారు. రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళుటకంటే ఒక న్నును పెరికివేయుట మంచిదని ప్రభువు చెప్పారు. అనగా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ స్త్రీలను మోహపుచూపులు చూచే అలవాటు కలిగియున్నయెడల చివరకు అతడు నరకానికి వెళ్ళే ప్రమాదము ఉంది.
ఆదాము కాలమునుండి ప్రతీ ఒక్క పురుషుని హృదయము ఈ దురాశఅనే అగ్ని రగులుచున్నది. పరిశుద్ధాత్మ అగ్ని మాత్రమే దీనిని నశింపచేయగలదు. నీ యొక్క హృదయము పాపము కొరకుగాని లేక ప్రభువైన యేసు కొరకుగాని మండుచుండును. నీవు వాటిలో ఒక దానిని ఎన్నుకోవాలి; ఇప్పుడు పవిత్రపరిచే అగ్నిగాని లేక భవిష్యత్తులో నరకాగ్నిగాని కోరుకోవాలి. మూడవ మార్గము లేదు.
ప్రభువు మాట్లాడిన యూదులు అప్పటికే ధర్మశాస్త్రము కలిగియున్నారు. వారు ఎంతో నైతికముగా జీవించారు మరియు వ్యభిచారులను మరణదండముతో శిక్షించేవారు. ఆ కాలములో బూతుబొమ్మల పుస్తకములు లేక మ్యాగజిన్స్‌గాని లేక టీ.వీ కార్యక్రమములుగాని ప్రజలను శోధించేవి కావు. ప్రతి స్త్రీ మంచిగా వస్త్రధారణ చేసుకొని మరియు పురుషులు స్త్రీలతో ఎక్కువగా మాట్లాడేవారుకాదు. అయినప్పటికిని అటువంటి ఆంక్షలు ఉన్నప్పటికిని, పురుషులు మోహపు చూపులు చూచేవారని ప్రభువు ఎరుగును. అందువలన ప్రభువు దానికి వ్యతిరేకముగా హెచ్చరించారు. అటువంటి సమాజమునకు ప్రభువు ఆవిధముగా చెప్పినప్పుడు ఈనాటి సమాజములో యౌవనస్థులకు ఇంకా ఎంతో ఎక్కువగా ప్రభువు హెచ్చరించును.
ఈనాటి సమాజములో అనేక విధములుగా లైంగికవాంఛలు కలిగించే విషయములున్నవి. అందువలన ఈ దినములలో మనము ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను. ఈ యొక్క అగ్నిని ఆర్పవలెనని నీవు తీవ్రముగా కోరినయెడల, అగ్నిని కలుగజేసే ఇంధనమును సరఫరా చేయకూడదు. కనికరము లేకుండా ఆ యొక్క ఇంధనమును పూర్తిగా విసర్జించాలి. ఒక కంటిని పెరికివేసి మరియు నీ చేతిని పోగొట్టుకొనుట అంటే ఇదియే. పాపము చేయుటకు ప్రేరేపించే దానిని నశింపచేయమని ప్రభువైన యేసు ఆజ్ఞాపించారు. పాపముయొక్క అపాయమును మరియు నరకాగ్నిగురించి ప్రభువైన యేసు ఎరిగియున్నారు. గనుక మనము పాపమునుండి రక్షింపబడుటకు ఇటువంటి ఆత్మీయ చికిత్స అవసరమని ప్రభువైన యేసు చెప్పారు.
ఈనాడు ప్రభువు ఆజ్ఞాపించునది ఏమనగా, ''టీ.వీ ఒకవేళ నిన్ను పాపము చేయుటకు ప్రేరేపించుచున్న యెడల, వెంటనే దానిని తీసివేయుము. టీ.వీ నటులతో కలసి నరకానికి వెళ్ళుటకంటే టీ.వీ లేకుండా పరలోకానికివెళ్ళుట మేలు లేక ఒక మ్యాగజిన్‌గాని లేక ఒకరకమైన సంగీతముగాని నిన్ను పాపముచేయుటకు ప్రేరేపించినయెడల వాటిని కూడా తీసివేయుము. భూమి మీద నీవు ఎల్లప్పుడూ హత్తుకొని ఉండేటంత అమూల్యమైనది ఏదియులేదు. భూమిమీద నీవు ఎల్లప్పుడు దేనినైన హత్తుకొన్నయెడల చివరకు పరలోకాన్ని పోగొట్టుకొని నరకానికి వెళ్ళెదవు.
దీనిని నీవు చదువుచుండగానే, చిన్న విషయములను బట్టి నీవు నిశ్చయముగా నరకానికి వెళ్ళవని సాతాను నీ యొద్ద గుసగుసలాడును. నీవు మ్యాగజిన్లు చూచిన బొమ్మలను బట్టి దానిని ఆశించిననూ లేక టీ.వీలో చూచిన వ్యక్తిని ఆశించిననూ అది వ్యభిచారము కాదని సాతాను చెప్పును. మొదటినుండి సాతాను అబద్ధికుడని ప్రభువైనయేసు చేసిన హెచ్చరికను మరువకుము.
భవిష్యత్తులో ఈ పాపము విషయములో మంచిగా చేయుదుననియు లేక ఈ పాపమును విడిచిపెట్టుటకు ప్రయత్నించెదనని చెప్పవద్దు. కీడుగా కనబడే దానంతటికి వేరుగా ఉండమని బైబిలు హెచ్చరించుచున్నది. ఈ పాపమును వెంటనే మరియు శాశ్వతముగా విడిచిపెట్టుటకు దేవుడు నీకు సహాయపడునని విశ్వసించుము. ఈ రోజునుండి పోరాడుము మరియు జీవముగల దేవుని సైన్యములో ఉన్న నిన్ను లుషితము చేసిన ఈ గొలియాతు తల చితుకగొట్టే వరకు విడిచిపెట్టవద్దు.
ప్రభువు దేవాలయము మరొకసారి పవిత్రపరచుచున్నది ఇప్పుడు మన దేహమే ఆయన ఆలయము. నీలో సంపూర్ణముగా పనిచేయుటకు ఆయనను అనుమతించుము.
అమ్మాయిలతో శారీరకముగా కలువవద్దని 1 కొరింథీ 7:1లో హెచ్చరిక ఉన్నది. ఒక విషయము మంచిదికాదని పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు, దానిని పూర్తిగా విసర్జించుట మంచిది. ధర్మశాస్త్రానుసారులు అక్షరానుసారముగా జీవించెదరు, కాని శిష్యులు ఆత్మానుసారముగా జీవించెదరు. ఉదాహరణకు: ఏడవ ఆజ్ఞప్రకారము ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అది వ్యభిచారమని ప్రభువు ఎరిగియున్నారు. అదేవిధముగా నీవు పూర్ణహృదయముతో ఉన్నయెడల, దేవునియొక్క ఆజ్ఞలన్నిటి యొక్క సారాంశము ఎరిగెదవు. పౌలు తిమోతితో చెప్పిన దానిని చూడుము, ''యౌవనస్థులు సాధారణముగా శోధించబడే దానినుండి పారిపొమ్ము'' (2 తిమోతి 2:23 లివింగు బైబిలు). అటువంటి శోధనలకు అవకాశము ఉన్నప్పుడు పారిపొమ్ము.
ఏర్పరచబడిన పాత్ర:
ఒక అందమైన పద్యమును నేను చదివెదను
''వాడుకొనుటకు ఒక పాత్ర కొరకు యజమానుడు వెదకుచుండెను
ఆయన యెదుట అనేక పాత్రలుండెను - ఆయన దేనిని ఎంచుకొనును?
''నన్ను తీసుకో'' అన్నది బంగారు పాత్ర, ''నేను తళ తళ మెరుస్తున్నాను''
''నా వెళ గొప్పది నేను పనులను సరిగా చేస్తాను''
నా అందము నా ప్రకాశము అన్నిటికంటే గొప్పది''
''నీవంటి యజమానునికి బంగారు పాత్రయే శ్రేష్టమైనది''
యజమానుడు మాట చెప్పకుండానే దాటి వెళ్ళిపోయెను
ఒక సన్ననైన పొడవైన వెండిపాత్రను చూచెను
''ప్రియ యజమానుడా, నిన్ను సేవించెదను, ద్రాక్షారసమును నీకు పోసెదను''
''నీవు భోజనము చేసిన ప్రతిసారి నీ బల్లపైన నుందును''
''నేను చాలా అందముగా చేయబడిన పాత్రను''
''వెండి పాత్ర నీకు తగిన పాత్ర''
యజమానుడు లెక్కచేయకుండా ఇత్తడి పాత్ర యొద్దకు వెళ్లెను
అది వెడల్పుగా బాగా మెరుగుపెట్టినదిగా నుండెను
''నీకు కావలసిన పాత్రను నేనే'' అని ఆ పాత్ర అరిచెను
అందరు చూచునట్లుగా నన్ను నీ బల్లపై పెట్టుకొనుము.
''నా వైపు చూడుము'' అన్నది గాజు పాత్ర.
నేను పెళుచుగా ఉన్నను నిన్ను భయభక్తులతో సేవించెదను
తరువాత యజమానుడు చెక్క పాత్ర యొద్దకు వచ్చెను
అది చెక్కబడి మెరుగుపెట్టబడి నిలబడెను
''యజమానుడా, నన్నువాడుకొనుము, అయితే నన్ను రొట్టె కొరకు
కాకుండా, ఫలము పెట్టుకొనుటకై వాడుము'' అని ఆ చెక్క పాత్ర చెప్పెను
అప్పుడు యజమానుడు ఒక మట్టి పాత్రవైపు చూచెను
అది పగిలిన ఖాళీ స్థితిలో బలహీనముగా పడియుండెను
యజమానుడు దానినెంచుకొని, శుభ్రపరచి వాడుకొనుననే
నిరీక్షణ ఆ పాత్రకు ఏ మాత్రము లేకుండెను
''నేను వెదకుచున్న పాత్ర ఇదే, దీనిని బాగుచేసి, వాడుకొని
నా దానిగా చేసుకొనెదను అని యజమానుడు చెప్పెను
గర్వించే పాత్ర నాకక్కరలేదు, అటకపై కూర్చుండే పాత్ర నాకక్కరలేదు
శబ్దము చేస్తూ అతిశయించే పాత్ర, లేక దానిలో ఉన్న దానిని
ప్రదర్శించే పాత్ర నాకక్కరలేదు.
అప్పుడాయన సౌమ్యముగా ఆ మట్టిపాత్రను పైకెత్తెను
దానిని బాగుచేసి శుభ్రపరచి ఆ రోజున నింపెను
''నీవు చేయవలసిన పని ఉన్నది, నేను నిన్ను నింపినట్లే
నీవు ఇతరులను నింపుము'' అని దయతో దానితో చెప్పెను.
(తెలియబడని రచయిత)
విరుగగొట్టును గాని వెళ్ళగొట్టడు:
దేవుని మార్గములు మన మార్గముల వంటివికావు. మొదటిగా ఆయన అనేక ఒత్తిడిలు మరియు ఓటముల ద్వారా విరుగగొట్టును. ఆవిధముగా నీయెడల దేవునికున్న సంకల్పము ప్రకారము నీకు ఆత్మీయగ్రహింపును ఇచ్చును.
మోషేను 40 సంవత్సరములు అరణ్యములో గొఱ్ఱెలు కాయుటకు పంపించి మరియు తన మామ దగ్గర పనిచేసి, అవమానములు పొందుటద్వారా ఆ 40 సంవత్సరములలో ఇశ్రాయేలు కొరకు గొప్ప నాయకుడను దేవుడు సిద్ధపరిచాడు. ఇది దేవుని యొక్క మార్గము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చుటకుముందుగా కూడా దేవుడు ఆవిధముగా చేసాడు. ఒక మనుష్యుని విరుగగొట్టుటయే దేవుడు చేయవలసిన కష్టమైన పని కాని ఒక వ్యక్తిని దేవుడు విరుగగొట్టినయెడల ఒక అణుబాంబులో నుండి వచ్చిన శక్తికంటే ఎంతో ఎక్కువ శక్తి అతనిలో నుండి వచ్చును.
రైలుగేటు దగ్గర మోటారు సైకిల్ నుండి నేను పడినప్పుడు దేవుడు నన్ను కాపాడి మరియు త్వరగా కోలుకొనుటకు కృపను ఇచ్చెను. తన దూతలయొక్క కాపుదల నాకు ఉన్నదని అదొక ఋజువు. ''మేము పడద్రోయబడిన వారమైననూ మేము లేచి మరియు వెళ్ళుచున్నాము'' (2 కొరింథీ 4:9 లివింగు బైబిలు). ఆ రోజున నా అనుభవము కూడా అదియే. అప్పుడప్పుడూ మనము పడిపోవునట్లు దేవుడు అనుమతించును. కాని ఇతరులవలే అక్కడే ఉండము. మనము లేచి మరియు వెళ్ళుచుండెదము మరియు దీనిని బట్టి సాతాను కలవరపడును. మనలను పడగొట్టుట ద్వారా దేవుడు మనలను పరిశుద్ధపరచి దానిని మనకు మేలుగా మార్చును. కాబట్టి ప్రభువు వచ్చు పర్యంతము ప్రభువైన యేసు జయమును మరియు సాతాను యొక్క ఓటమిని నేను వెళ్ళు ప్రతిచోట ప్రకటించెదను. హల్లెలూయా.
మనము మన యొక్క ముగింపునకు వచ్చుట:
''ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి'' (మత్తయి 11:28) అను ప్రభువైన యేసుయొక్క ఆహ్వానమును, ఎవరైతే తమ జీవితములలో అలసిపోయి, ముగింపునకు వచ్చెదరో వారు మాత్రమే ఆయన యొద్దకు రాగలరు. ప్రతియొక్కరిని తనయొద్దకు రమ్మని ప్రభువైన యేసు చెప్పుటలేదు. వారి జీవితములో పాపములో ఓడిపోయి మరియు విసిగి వేసారిన వారిని మాత్రమే ప్రభువు ఆహ్వానించుచున్నాడు. తన సమస్తమును ఖర్చుపెట్టి మరియు తనకు ఎవరు ఏమి ఇవ్వని సమయములో తప్పిపోయిన కుమారుడు తండ్రియొద్దకు వచ్చియున్నాడు (లూకా 15:16-18). ఇతరుల యొక్క ఘనతను కోరక మరియు ఇతరులను బట్టిగాని పరిస్థితులను బట్టిగాని ఫిర్యాదులు చేయుట ఆపివేసి మరియు తమ జీవితములో ఉన్న ఓటమినిబట్టి అలసిపోయినవారై ఆత్మీయముగా అభివృద్ధి చెందుదురు. ఇదియే నిజమైన మారుమనస్సు.
లేనట్లయితే అకాలముగా పుట్టిన బిడ్డలను ఇంక్యూబేటరులో పెట్టినట్లుగా ఇతరులు వారిని ఎల్లప్పుడు ప్రోత్సహించుచూ ఉండవలెను. మనయొక్క భద్రతను సంఘములోనే కాదు గాని ప్రభువులో మాత్రమే ఉండవలెను. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు అనుగ్రహించే సమృద్ధి జీవితము గూర్చి యెహెజ్కేలు 36:25, 26లో ప్రవచించబడింది. మనము ఇటువంటి జీవితములోనికి ప్రవేశించిన తరువాత ఈ విధముగా చెప్పెదము, ''అప్పుడు మీరు మీ దుష్‌ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు'' (31వ వచనము). ఒక దైవజనునిలో అన్ని సమయములలో ఉండే ఒక ప్రాథమిక కోరిక ఏమనగా రోమా 7:24 ''ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?'' దుష్టత్వము నుండియు మరియు పాపము యొక్క వాసననుండి విడుదల పొందుటకు అతడు ఎల్లప్పుడు ఆశపడును.
కష్టకాలములో నీవు ధైర్యముగా ఉండమని దేవుడు కోరుచున్నాడు (సామెతలు 24:10). కాని ఆ సమయములో నీవు బలముగా ఉండవలెనని కోరినయెడల, నీవు సమాధానము ఉన్నప్పుడే ప్రభువుని ఎరుగుచుండవలెను.
ఆత్మీయశక్తి:
''పైకి భక్తిగలవారి వలే ఉండి దానియొక్క శక్తిని ఆశ్రయింపనివారు'' అంత్యదినములలో ఉండెదరు (2 తిమోతి 3:2). మనకున్న వరములను బట్టి తలాంతులను బట్టి మనము తృప్తిపడుట చాలా సులభము. తెలివితేటలు, ఉద్రేకముతో కూడిన శక్తి, మరియు ధృఢచిత్తమును కలిగియుండుట ఇవన్నియు మనయొక్క స్వశక్తి నుండి వచ్చును. కాని ప్రభువైన క్రీస్తుగాని మరియు పరిశుద్ధాత్ముడుగాని అనుగ్రహించే శక్తి వీటికి వేరుగా ఉండును.
గొప్ప శాస్త్రవేత్తలు, వేదాంతులు మరియు గొప్ప బోధకులలో ఇటువంటి తెలివిగల శక్తిని చూచెదరు. రాక్ సంగీతకారులు మరియు అనేకమంది బోధకులు ఇతరులలో ఉద్రేకము కలిగేటట్లు చేయుదురు. యోగా చేసే వారిలో, ఉద్యమించేవారిలోను మరియు ఇతరుల మీద పెత్తనము చేయాలని కోరే బోధకులలోను సంకల్పశక్తిని చూచెదము. వీటిని మనము ఆత్మీయశక్తి అని అనుకొనకూడదు.
ఆత్మీయశక్తి మొదటిగా ప్రతివిషయములో దేవునికి విధేయత చూపునట్లు చేస్తుంది. అనేక లక్షల సంవత్సరములనుండి గ్రహములు మరియు నక్షత్రములు దేవుని యొక్క శక్తి ద్వారా వాటియొక్క కక్ష్యలలో తిరుగుచున్నవి. దానికి కారణము ఏమనగా అవి దేవునియొక్క నియములకు సంపూర్ణముగా లోబడుచున్నవి. దేవునికి సంపూర్ణముగా లోబడుటయే అన్నింటికంటే శ్రేష్టమైనదని ఇవన్నియు సాక్ష్యమిచ్చుచున్నవి.
ప్రభువైన యేసు సాతానును శరీరానుసారమైన శక్తితోగాక ఆత్మశక్తితో జయించాడు. ప్రభువైన యేసు నలభైదినములు ఉపవాసముండి ఎంతో ఆకలితో ఉన్నప్పటికి, రాళ్లను రొట్టెగా మార్చుకొనమని సాతాను యేసును (ఆయనను) శోధించినప్పుడు యేసు తిరస్కరించాడు, కాని అవ్వ ఆకలితో లేనప్పటికిని తన శరీరము తృప్తి పరచుకొనుటకు ఏదేను తోటలో ఆ పండ్లను తినెను. ఆహారము కొరకు ఉన్నట్లే మన శరీరములో లైంగిక వాంఛ కూడా ఉండును. అది కూడా ఎల్లప్పుడు తృప్తి పరచబడుటకు ఆశపడును. తన శరీరమును తృప్తి పరచుకొనుటకంటే దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవించవలెనని ఆత్మీయశక్తిగలవారై ప్రభువైన యేసు చెప్పినట్లు చెప్పగలరు.
సింహములను చీల్చివేయుటకు కావలసిన శక్తిని సంసోను కలిగియుండెను కాని అతనిలో ఉన్న లైంగికవాంఛ అతనిని చీల్చివేసెను. కాబట్టి ఎటువంటి సింహముకంటెను లైంగికవాంఛ బలమైనదని ఋజువగుచున్నది. కాని యోసేపు సంసోనుకంటే బలమైనవాడైయుండి దినదినము అనేకసార్లు లైంగికవాంఛ అనే సింహమును చీల్చివేశాడు (ఆదికాండము 39:7-13).
మనయొక్క ఉద్దేశ్యములనుబట్టియే దేవుడు ఆత్మీయశక్తిని అనుగ్రహించును. నీ జీవితములో దేవునినే సంతోషపెట్టి మరియు ఆయనను ఘనపరచుటయే నీ గురియైనయెడల ఆయన వెంటనే అనుగ్రహించును. కాని మీరు మీ భోగముల నిమిత్తమే దురుద్దేశ్యముతో అడగెదరు గనుక మీరు పొందరు (యాకోబు 4:3).
మనము జీవించుటకు అవసరము గనుక ఉద్యోగము, వ్యాపారము చేసెదము కాని దేవునిని మాత్రమే సంతోషపెట్టుటయే మన గురియైయుండి మరియు మనకొరకు మనము జీవించక లేక లోకములో గొప్పవారిగా ఉండాలని కోరకూడదు. ఈ లోకముయొక్క మహిమతో సాతాను ప్రభువైనయేసుని కూడా శోధించాడు. కాబట్టి అతడు మనలను కూడా నిశ్చయముగా శోధించును. మనము ఏదొక విధముగా సాతానుకు నమస్కారము చేయుట ద్వారా లోకఘనతను పొందెదము. గనుక ప్రభువైన యేసు వలె ఆ శోధనను తిరస్కరించాలి. మన జీవితములలో దేవునియొక్క సంకల్పమును నెరవేర్చునట్లు ధనాపేక్ష విషయములో జాగ్రత్తపడవలెను. ధనాపేక్షద్వారా శోధింపబడకుండ ఉండునట్లు జాగ్రత్తపడవలెను. భవిష్యత్తులో అనగా రెండువేల సంవత్సరముల తరువాత కూడా మనకు దీని విషయములో చింతలుండకూడదు.
ప్రభువైన యేసుతో కూడా మరణించుట:
పాతనిబంధనలో కనీసము మరణించిన ఇద్దరు తిరిగిలేచినప్పటికిని మరియు ప్రభువైన యేసు పరిచర్యలో ముగ్గురు తిరిగిలేచినప్పటికిని తరువాత వారు మరణిచారు. ప్రభువైన యేసు మాత్రమే మరణమును జయించారు.
హెబీ 2:14, 15లో ప్రభువైన యేసు తన మరణము ద్వారా మరణబలముగల అపవాదిని శక్తిహీనునిగా చేసి మరియు జీవితకాలమంతయు మరణభయముతో ఉన్నవారిని విడిపించెనని ఉన్నది.
మనము నిత్యత్వానికి ప్రభువైన యేసుతో కూడా చనిపోవాలని నిశ్చయించుకొనినచో, మనము శారీరక మరణమునకు భయపడము. క్రొత్త నిబంధనలో ఒక విశ్వాసి యొక్క మరణము ''నిద్రించుట'' అని చెప్పబడింది (అపొ.కా. 7:60లో స్తెఫను). 1 థెస్సలో. 4:13లో ప్రభువైన యేసులో నిద్రించినవారు, ఆయన మరలా వచ్చినప్పుడు తిరిగి లేచెదరు అని మనము చదివెదము కాని సిలువమీద ప్రభువైనయేసు నిద్రించెనని వ్రాయబడలేదు. మనయొక్క పాపములన్నిటి యొక్క శిక్ష ఆయన భరించాడు గనుక ఆయన మరణించాడు.
ప్రభువైనయేసుతో మనయొక్క మరణమును అంగీకరించినయెడల, మరణము గురించి యోబుతో చెప్పినమాటలు మన జీవితములలో ఆత్మీయముగా నెరవేరినవి. ''మరణించిన తరువాత, 1. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు.
2. బలహీనులై అలసినవారు విశ్రాంతినొందుదురు.
3. బంధించబడినవారు విశ్రమించుదురు.
4. దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులైయుందురు (యోబు 3:17-19).
పత్మాసులో యోహాను ప్రభువైన యేసును చూచినప్పుడు చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడెను (పక్రటన 1:17,19).
మనము కూడా మన జీవితకాలమంతయు చచ్చినవారివలె ప్రభువైన యేసు పాదముల యొద్ద పడవలెను. అప్పుడు ప్రభువైన యేసు యోహానును బలపరచినట్లే మనలను కూడా బలపరచును. అటువంటి వారి విషయములో ప్రభువైనయేసు మరణముయొక్క తాళపుచెవులు కలిగియున్నాడు (18వ). వారి పరిచర్య ముగించే వరకు వారు క్షయమైన వారిగా ఉండెదరు కాని ప్రభువైనక్రీస్తుతో కూడా వారియొక్క మరణమును అంగీకరించనివారి విషయములో సాతాను వారియొక్క మరణముయొక్క తాళపు చెవులు కలిగియుండును. కాబట్టి వారు నిర్ణయించిన సమయమునకు ముందుగానే మరణించెదరు. మనము ఎన్నటికిని మరణము రుచిచూడకుండునట్లును, ప్రభువైన యేసుతో మనయొక్క మరణమును అంగీకరించుట ఎంత మంచిది.
అన్ని సమయములలో మనము ''పాపము విషయములో మృతులుగాను దేవుని విషయములో సజీవులుగా ఎంచుకొనమని'' (రోమా 6:7) చెప్పుచున్నది. ఇతరులు మనలను రేకెత్తించినప్పుడుగాని లేక లైంగికముగా శోధించినప్పుడుగాని నిన్ను నీవే రెండు ప్రశ్నలను అడుగుకొనుము. ''ఇటువంటి పరిస్థితిలో మరణించినవాడు ఏవిధముగా స్పందించును?'', మరియు ''ప్రభువైన యేసు ఏ విధముగా స్పందించును?''. వెంటనే నీకు జవాబు దొరుకును. అప్పుడు దాని ప్రకారము చేయుము.
కృపాసహితముగా పెద్దవారగుట:
నీవు చెల్లించవలసిన ఫీజు చెల్లించుటకొరకు ఎక్కువ సమయము పనిచేయవద్దు. నీవు చదువు విషయములో నష్టపోకుండ చూచుకొనవలెను. అయితే మరొకవిధముగా చూచినయెడల, నీవు ఎల్లప్పుడు పని గలిగియుండుట వలన నీవు అనేక శోధనల నుండి తప్పించుకొని మరియు రాత్రి సమయములో మంచిగా నిద్రపట్టును. కష్టపడే విద్యార్థులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్రనొందుదురు అయితే ఐశ్వర్యవంతులగు విద్యార్థులకు తమ ధనసమృద్ధి చేత నిద్రపట్టదు (పస్రంగి 5:12 లివింగు బైబిలు).
ప్రసంగిలో ఒక దినమున ఈ విధముగా చదివాను, ''మనము బ్రతికివుండుట అద్భుతమైన విషయము. ఒక వ్యక్తి చాలా సంవత్సరములు బ్రతికిన యెడల, అతడు ప్రతిరోజు సంతోషించవచ్చును కాని నిత్యత్వముతో పోల్చినయెడల ఇది ఎంతో తక్కువగా ఉండును. యౌవనస్తులకు యౌవనము ఉత్తమమైనది. ప్రతి నిమిషము సంతోషించుము. నీవు చేయగలిగినట్లయితే నీ కిష్టమైనదంతయు చేయుము. కాని నీవు చేసినదానంతటిని గురించి ఒక రోజున దేవునికి లెక్క అప్పజెప్పవలెనని గుర్తించుకొనుము. కాబట్టి నీకు నొప్పిని మరియు బాధనుకలిగించే వాటిని చేయకుము మరియు నీవు యౌవనుడుగా ఉన్నప్పుడు నీకు ఎంతో భవిష్యత్తు ఉందని గుర్తించి పెద్ద పొరపాట్లు చేయకుండుటకు జాగ్రత్తపడుము. నీ యొక్క యౌవనకాలములో నీ సృష్టికర్తను మరచిపోకుము. నీకు దుర్ధినములు రాకముందు ఆయనను ఘనపరచుము. లేనట్లయితే అది ఆలస్యమగును (పస్రంగి 11:7, 12:1 లివింగు బైబిలు).
వయస్సు మళ్ళిన తరువాత దుర్దినములు అనగా తలవెంట్రుకలు నెరసినవాడై లైంగిక వాంఛలు లేకుండా జీవించును (పస్రంగి 12:5 లివింగు బైబిలు). ఒకడు యౌవనస్తుడుగా ఉన్నప్పుడే పాపమును జయించినయెడల భవిష్యత్తులో తన జీవితం మహిమకరముగా ఉండును. లేనట్లయితే అతని భవిష్యత్తు బాధాకరముగా ఉండును. చేదైన వేరును మరియు ద్వేషమును కలిగి పనికిరాని జీవితము జీవించే ముసలివారిని చూశాను. ఎందుకనగా వారియొక్క యౌవనదశలో దేవుని యొక్క నియమములను తీవ్రముగా తీసుకొని మరియు పాపమును సరిగా నిర్వహించలేదు.
ప్రభువైనయేసు తప్ప ఆదాము తరువాత పుట్టిన వారందరును యౌవనములో బుద్ధిహీనపుపనులు చేశారు. కాని ఎవరైతే తీవ్రముగా మారుమనస్సుపొంది మరియు దేవునిని ఘనపరచవలెనని నిర్ణయించుకొనెదరో, వారు ఓడిపోయినప్పటికిని మహిమకరమైన జీవితములోనికి వచ్చి మరియు ఆ విధముగా జీవించెదరు. మిగిలినవారు ఈనాటి అనేకమంది బోధకులవలె 50 మరియు 60 సంవత్సరముల వయస్సులో వ్యభిచారములో జీవించి, అవమానకరముగా మరణించెదరు. ఎందుకనగా వారు యౌవనవయస్సులో లైంగిక సంబంధమైన మురికి తలంపులను జయించలేదు.
లైంగిక వాంఛలు లేకుండుటను పస్రంగి 12:5లో చెడుతనముగా చెప్పబడింది. లైంగికవాంఛను చంపమని యోగా బోధించుచున్నది. కాని ఇది దేవుని విధానము కాదు. ఇది ఆకలిని మరియు నిద్రను చంపినట్టుగా ఉండును. కనుక ఇది చెడ్డది. లైంగిక వాంఛను పూర్తిగా తీసివేయమని మనము కోరకూడదు. ఆహారము, నిద్రించుట మరియు లైంగిక వాంఛను దేవుడు మానవ శరీరములో ఉంచియున్నాడు. మూడింటిని కోరనివారు రోగులై యున్నారు. కాబట్టి మీకు లైంగికవాంఛలు బలముగా ఉన్నయెడల నీకు ఆత్మీయ పరీక్ష అవసరమని కాదు. ఆహారము కొరకు నీకు ఆకలైనట్లును లేక అలసిపోయి నిద్రపోవుట కోరుట లాంటిదే ఇది. వీటిని గురించి సిగ్గుపడము గనుక మూడవ దాని విషయములో కూడా సిగ్గుపడము. నీ యొక్క వయస్సులో లైంగికవాంఛలు లేకపోయినట్లయితే డాక్టరుకు చూపించుకొనవలెను. అయితే ఇవి మనలను పరిపాలించి మన శరీరములను నాశనము చేయుటకంటే వాటిని అదుపులో ఉంచుకొనుట ద్వారా మన శరీరములకు మేలు కలుగును. కాబట్టి వీటిని అదుపులో పెట్టుకొనుట ముఖ్యమైయున్నది. కాబట్టి నీవు తిండిబోతువు కాకుండునట్లును మరియు ఎక్కువగా నిద్రపోయి సోమరివి కాకుండునట్లు దేవునికి ప్రార్థించుము. అప్పుడు లైంగికవాంఛను కూడా అదుపులో పెట్టుకొనవచ్చును.
ప్రకృతి సంబంధి లేక ఆత్మ సంబంధి:
1 కొరింథీ 2:14, 15లో ప్రకృతి సంబంధియైన మనుష్యుడు మరియు ఆత్మ సంబంధియైన మనుష్యుడు గురించి చదివెదము. ప్రకృతి సంబంధమైన క్రైస్తవునికి మరియు ఆత్మ సంబంధమైన క్రైస్తవునికి చాలా తేడా ఉన్నది. ''ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు''. మానవ జ్ఞానముతో అర్థము చేసుకోలేమని ఇక్కడ వ్రాయబడియున్నది.
కన్ను మరియు చెవి వేరుగా ఉన్నట్లే, ఆత్మ మరియు మనస్సు వేరుగా ఉండును. ఒక వ్యక్తి బాగుగా వినగలిగినప్పటికిని గ్రుడ్డివాడుగా ఉండుట సాధ్యమైనట్లే, ఒక వ్యక్తి చాలా తెలివితేటలు కలిగియుండి కూడా ఆత్మ విషయములో మృతుడైయుండవచ్చును మరియు ఆత్మీయముగా జీవము కలిగినప్పటికిని అతనికి తెలివితేటలు లేకపోవచ్చు. ఈ లోకములో పనిచేయుటకు మనకు మంచిమెదడు అవసరము కాని దేవుని విషయములను గ్రహించుటకు మన యొక్క ఆత్మీయస్థితి ముఖ్యమైయున్నది. దేవునియొక్క సంగతులను గ్రహించుటకు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత మనకు అవసరము. మరియు పసిబిడ్డల వంటి దీనాత్మగలవారికే ఆయన ప్రత్యక్షతలు ఇచ్చును (మత్తయి 11:25). మరియు ఆయన జ్ఞానులకును వివేకులకును వీటిని మరుగు చేయును (వారు దీనులైతే అనుగ్రహించును). జ్ఞానము గలవాడు దీనుడగుట కష్టము, కాని అది అసాధ్యముకాదు. ఒక స్వనీతిపరుడైన పరిసయ్యుడు తాను పాపినని ఒప్పుకొనుట కష్టమే, కాని అది అసాధ్యము కాదు. వ్యభిచారులకును మరియు దొంగలకును తాము పాపులమని ఒప్పుకొనుట సులభము. ఆవిధముగానే దేవునియొక్క ప్రత్యక్షతలు కూడా జ్ఞానములేని వ్యక్తి తనకు తెలియదని ఒప్పుకొనుటద్వారా దేవునియొక్క ప్రత్యక్షత పొందుకొనెదరు. అందువలననే ఏమియు నేర్చుకొనని చేపలు పట్టువారైన పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురితో ప్రభువైన యేసు ఎక్కువగా సహవాసం చేసెను, ఎందుకనగా వారు ఆత్మ విషయములకు ఎక్కువగా స్పందించారు మరియు పరిసయ్యులు కూడా వారి తెలివితేటలనుబట్టి గర్వించి మరియు ఆత్మీయముగా బుద్ధిహీనులమని ఒప్పుకొనక పోయినందున ప్రభువైన క్రీస్తును అంగీకరించలేదు. తెలివితేటలు గల కాలేజీ విద్యార్థులతో నీవు ఉంటున్నప్పుడు దీనిని జ్ఞాపకముంచుకొనుము.
మానవతెలివితేటలకు దేవునియొద్ద విలువలేదు. మన శరీరములకు ఉన్న రంగువలె అవి పుట్టుకతోనే మనకు వచ్చును గనుక, వాటిని గూర్చి దేవుని యెదుట ప్రత్యేకతఉండదు. మనుష్యుల స్వనీతివలె తెలివితేటలు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి (యెషయా 64:6). క్రీస్తే స్వయముగా మనయొక్క నీతియైయున్నాడు. అంతేకాదు క్రీస్తే మనయొక్క జ్ఞానమైయున్నాడు (1 కొరింథీ 1:31).
పౌలు స్వనీతిపరుడైన పరిసయ్యుడును మరియు ఎంతో తెలివితేటలు గలవాడైనప్పటికిని, అతడు రక్షణపొందుటయే కాక క్రీస్తుయొక్క గొప్ప అపొస్తులుడయ్యాడు. కాని అతడు ఎల్లప్పుడు తన్నుతాను తగ్గించుకొనెను. నేను మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనకుండునట్లు భయముతోను ఎంతో వణుకుతోను మీ మధ్యలో ఉంటినని పౌలు కొరింథీయులతో చెప్పుచున్నాడు (1 కొరింథీ 2:3). పరిశుద్ధాత్మశక్తితో గాక తన యొక్క స్వంత జ్ఞానముతో బోధించెదనేమోయని అతడు భయపడియున్నాడు. మనం మాట్లాడే ప్రతీసారి అటువంటి భయమును కలిగియుండాలి. మనకు పరిశుద్ధాత్మయొక్క శక్తి ఎల్లప్పుడు అవసరం కనుక ఎల్లప్పుడు దానికొరకు ప్రార్థించాలి.
కాబట్టి ఆత్మతో కాకుండా తెలివితేటలతో బైబిలు సత్యమును బోధించుట విషయములో పొరపాటు చేయకూడదు. లేక ఒక ఉద్రేకముతో కూడిన ప్రసంగము ఆత్మ సంబంధమైనదని అనుకొనకూడదు. తెలివితేటలు మరియు ఉద్రేకములు మన ప్రాణములో ఉన్నవి. ఇది మంచిసేవకులే గాని చెడ్డయజమానులు. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన జీవితములకు ప్రభువైయుండవలెను. దీనత్వము, దీనత్వము, దీనత్వము అను మూడు రహస్యములు కలిగిన క్రైస్తవుడే ఆత్మసంబంధమైన వాడగును.
సిలువ మార్గము:
''సాతానా, నా వెనుకకు పొమ్ము'' అని మత్తయి 4:10 మరియు 16:23లో మాత్రమే యేసు చెప్పారు. ఈ రెండు సందర్భములలో ప్రభువైన యేసు సిలువ యొద్దకు వెళ్ళకుండా ఒకసారి సాతాను తానే స్వయముగాను మరియు రెండవసారి పేతురు ద్వారా ప్రయత్నించాడు. మొదటిసారి సాతాను ప్రభువైన యేసుకు లోకమహిమనంతటిని చూపించాడు (కాని ప్రభువైనయేసు దేవుని దగ్గరకు వచ్చుటద్వారా జయించాడు). అనగా రాజీపడుటద్వారా సిలువయొద్దకు వెళ్ళే అవసరము ఉండదు. అక్కడ సాతాను జయము పొందలేదు కనుక ప్రభువు తనమీద తాను జాలిపడునట్లు పేతురు ద్వారా ప్రేరేపించాడు. రెండవసందర్భములో ప్రభువైనయేసు సాతాను స్వరమును గుర్తించాడు. ఇటువంటి సందర్భములోనే అనేకులు సాతాను స్వరమును గుర్తించుట లేదు. ప్రతి పరిస్థితిలోను సిలువ మార్గమును తప్పించుకొనుమని చెప్పే అపవాది స్వరమును నీవు గుర్తుపెట్టుకోవాలి.
కొంతమంది క్రైస్తవులు వారి శరీరేచ్ఛలను సిలువవేయుటకు బదులుగా సాతానును గద్దించెదరు. మన శరీరములో ఉన్న దురాశలను బట్టి మనకు చెడ్డతలంపులు వచ్చును. సాతాను మరియు అతని యొక్క దయ్యములు కొన్ని విషయములను మన దృష్టికి తెచ్చి ఉద్రేకపరచును. మన స్వచిత్తమే శోధనకు లోబడునట్లు చేయునని మర్చిపోకుము. అటువంటి సమయములో ఆ శోధనను ఎదురించి మరియు సిలువవేయుటకు కావలసిన శక్తిని ఇమ్మని (కృపను ఇమ్మని) దేవున్ని ప్రార్థించాలి.
ప్రభువైనయేసు దయ్యములను వెళ్లగొట్టినప్పుడుగాని లేక రోగులను స్వస్థపరచినప్పుడు గాని లేక ఆయన బోధించినప్పుడుగాని సాతాను ఓడించబడలేదు. ప్రభువైన యేసు సిలువమీద చనిపోయినప్పుడు సాతాను ఓడించబడెనని (హెబీ 2:14లో స్పష్టముగా చెప్పబడినది) మనము కూడా క్రీస్తుతో సిలువవేయబడి ఉన్నామనే విషయముతో ఏకీభవించినయెడల మనము కూడా సాతానును జయించెదము. దానిని చేయకుండ సాతాను నిన్ను ఆటంకపరచును కాని నీవు ఎల్లప్పుడు సిలువ మార్గమును ఎంచుకొనుచున్నట్లయితే, సాతానుకు నీమీద అధికారము ఉండదు.
అందువలననే ఎల్లప్పుడు క్రీస్తుయొక్క మరణానుభవమును భరించుట గురించి అనేక సంఘములలో బోధించకుండా సాతాను ఆటంకపరచుచున్నది (2 కొరింథీ 4:10). ప్రతిదినము మనము సిలువనెత్తుకొని వెంబడించవలెనని ప్రభువైనయేసు చెప్పెను (లూకా 9:23). ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించుటను బోధించని సంఘములలో జాగ్రత్త. ఎవరైనను అవిశ్వాసులకు మన పాపములకొరకు ప్రభువైనయేసు సిలువ వేయబడియున్నాడని మాత్రమే బోధించి, మనము క్రీస్తుతో కూడా సిలువవేయబడియున్నామనియు మరియు ప్రతిదినము మనము సిలువనెత్తుకొని వెంబడించాలని బోధించని సువార్త సంపూర్ణమైనది కాదు. ఒక నాణెమునకు రెండు ప్రక్కలున్నట్లే సువార్తకు కూడా రెండు ప్రక్కలున్నవి.
ప్రతిదినము మనము సిలువనెత్తుకొననియెడల, దేవునియొక్క శక్తిని మనము అనుభవించలేము. ఈ దినములలోని క్రైస్తవబోధలో అనేకమంచి సంగతులు బోధించుచున్నారు కాని ప్రతిదినము సిలువనెత్తుకొనుటగురించి ప్రసక్తి లేదు. ప్రభువైనయేసుతో కూడా ప్రతిదినము చనిపోవుట గురించి సాతాను మరుగుచేసియున్నాడు. కాబట్టి నీకు సువార్త చెప్పుటకు అవకాశము దొరకునప్పుడు ఎల్లప్పుడు ప్రతిదినము సిలువనెత్తుకొనుట గురించి చెప్పి బోధను సమతుల్యపరచవలెను దానిని బట్టి నీవు ప్రసిద్ధి చెందకపోవచ్చును గాని పరలోకములో గొప్పవాడిగా అవుదువు.
23 సంవత్సరముల వయస్సులో పరిశుద్ధాత్మశక్తి కొరకు దేవునికి ప్రార్థించుట ఆరంభించాను. అప్పుడు ప్రభువైన యేసు మరణానికి సాదృశ్యముగా బాప్తిస్మము పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందెనని దేవుడు నాకు చూపించెను (మత్తయి 3:16). మరియు నేను సిలువ మార్గమును ఎంచుకొనుచు ఉన్నట్లయితే అనగా నా స్వజీవానికి చనిపోవుచున్నయెడల నేను కూడా పరిశుద్ధాత్మను పొందెదనని ప్రభువైనయేసు చెప్పాడు. కాని నేను ఆ మార్గమును విడిచిపెట్టనట్లయితే, నేను ఆయన శక్తిని కోల్పోయెదను. నేను ఆ మార్గము ఎంచుకొనియున్నాను గనుక దానిని బట్టి ఎంతో సంతోషముగా ఉన్నాను. మీరు కూడా ఆ మార్గమున వెళ్లవలెనని ప్రోత్సహించుచున్నాను.
జీవమార్గము:
మనము దేవుని స్వభావములో పాలివారము కావచ్చుననునది క్రొత్తనిబంధనలోని సువార్త. ప్రేమయే దేవుని స్వభావము. తన యొక్క స్వంతమును కోరకపోవుటయే ప్రేమలోని ముఖ్యస్వభావము. ప్రభువైనయేసు తన స్వంతమును కోరలేదు గనుక మనలను రక్షించుట కొరకు ఆయన భూమిమీదకు దిగివచ్చాడు. ఒక చంటిబిడ్డయెడల తల్లికున్న ప్రేమతో మనయెడల ఆయనకున్న ప్రేమను ఆయన పోల్చుచున్నాడు (యెషయా 49:15). క్రొత్తగా జన్మించిన బిడ్డయెడల తల్లియొక్కప్రేమ ఈ భూమిమీద ఉన్న ప్రేమలన్నింటికంటే గొప్పది ఎందుకనగా ఒక మంచితల్లి తన బిడ్డయొద్ద నుండి ప్రతిఫలముగా ఏమియు కోరుకొనక, నిస్వార్థముగా ఆ బిడ్డకొరకు సమస్తమును చేయును. దేవునిప్రేమ వివేకముగా ఉండును మరియు మనము ఇటువంటి స్వభావములో పాలివారము కావలయును. అప్పుడు ప్రభువైన యేసు చేసినట్లే మనము కూడా దేవుని ప్రజలకు పరిచర్య చేయగలము.
ప్రేమ అనే ఇంధనమే క్రైస్తవజీవితమును నడుపును. ఇంధనము లేనట్లయితే కారును త్రోయవలసియున్నది. అదే విధముగా ప్రభువుయెడల మనయొక్క మొదటిప్రేమ చల్లారినయెడల ఆయన కొరకు మనము చేసే పరిచర్య ఒక కారును త్రోసినట్లే భారముగా ఉండును. అప్పుడు ఇతరుల యొక్క బలహీనతలను మరియు బుద్ధిహీనతలను మనము భరించలేము. కాబట్టి మనము పెట్రోలు బంకుకు మరల మరల వెళ్లి నింపుకొనవలెను. ''ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైయుండుడి'' (ఎఫెసీ 5:14).
కోపముమీదను మరియు మోహపుచూపుల మీదను జయము పొందుట ద్వారా దేవుని స్వభావములో పాలివారమగుటకు సిద్ధపడవచ్చును. మనము ఎంతో స్వార్థపరులము మరియు ఈ స్వార్థమైన స్వభావమునకు ప్రతి దినము చంపివేయాలి. మన స్వంతమునుగాని లేక ఘనతనుగాని లేక సుఖభోగములనుగాని మనము కోరుచున్నయెడల నిత్యమరణము పొందెదము. ఎంతవెల చెల్లించవలసి వచ్చినప్పటికిని మన జీవితములలోని దేవుని చిత్తము మాత్రమే చేయవలెనని కోరుటయే జీవమార్గము. ప్రతిదినము మనలను మనము తీర్పుతీర్చుకొనుచు మరియు ఒకరోజులో అనేకసార్లు చేయుచు మరియు మన అంతరంగములో చూచుకొనక యేసునే చూచుచున్నయెడల, దేవుని మహిమనుగాక సొంత మహిమను కోరే విషయములను కనుగొనగలము. ఆవిధముగా స్వజీవమునుంచి పవిత్రపరచబడెదము. పరిపూర్ణులమగుటకు మార్గము ఇదియే. చాలా కొద్దిమంది మాత్రమే నమ్మకముగా శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి పవిత్రపరచుకొనుచున్నారు. అందువలననే చాలా కొద్దిమందియే ఆత్మీయముగా ఎదుగుచున్నారు (2 కొరింథీ 7:1).
బలాత్కారము చేయువారే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనెదరని ప్రభువైన యేసు చెప్పారు (మత్తయి 11:12). అనగా దేవుని ఆజ్ఞలకు మనము లోబడకుండా ఆటంకపరిచే ప్రతిదానిని ఎదురించవలెను. పెద్ద ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనయొక్క విధేయతను ఋజువుపరచలేము కాని అల్పమైన ఆజ్ఞలకు లోబడుట ద్వారా దేవుని రాజ్యములో గొప్ప వారగుదురు అని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 5:19). హత్య చేయకుండుటద్వారా గాని లేక స్కూలులో వ్యభిచారము చేయకుండుటద్వారాగాని ఒక చిన్నబిడ్డకు విధేయత పరీక్షించబడదు. అతడు ఆడుకొనవలెనని కోరినప్పుడు, అతని తల్లి అతన్ని సహాయపడుటకు రమ్మనికోరిన్పుడు అతని విధేయత పరీక్షించబడును. కాబట్టి దేవునియెడల మనకున్న సంబంధము బట్టికూడా ఉండును. మన నిజజీవితములోని చిన్న చిన్న విషయములలో కూడా నమ్మకముగా ఉండవలెను. లేనట్లయితే అవిధేయులమగుదుము.
దేవుడు లేక సిరి:
మన జీవితములలో ఈ లోకసంబంధమైన సిరిసంపదలు మన దేవునియొక్క పరిపాలనను వ్యతిరేకించుచుండును. మనమెప్పుడు దానిని సేవించవలెనని కోరే మరియొక యజమాని సిరిసంపదలు. లూకా 16:13లో మనము ధనాపేక్షను జయించి మరియు పాదముల క్రిందవుంచనియెడల మనము దేవునిని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించలేమనియు లేక దేవునికి హత్తుకొనియుండలేమని చెప్పుచున్నది. మనము డబ్బును సంపాదించవచ్చునుగాని వాటిని సంపాదించుకొనుటకు ఆత్మీయ విషయములను త్యాగము చేయకూడదు. మన జీవితములో దేవుడే మొదటిగా ఉండవలెను. ప్రభువైనయేసు మనకు ప్రభువైయుండవలెను లేదా ఆయన మనకు ప్రభువైయుండడు.
అనేకమంది విశ్వాసులు శ్రమలలోను, బాధలలోను మరియు బీదలైయున్నప్పుడు ప్రభువును ఆసక్తితో వెంబడించవలెనని కోరెదరు కాని వారు ధనవంతులైనయెడల లేక సుఖసౌకర్యములు కలిగియున్నయెడల అనేకులు తప్పిపోయెదరు. నీవు చేసే ఉద్యోగము నీవు కేవలము బ్రతుకుటకొరకే అని గుర్తుంచుకొనుము. లోకములో ఇప్పుడు ఖర్చులు అంతకంతకు ఎక్కువవుచున్నందునను మరియు క్రైస్తవులకు ఉద్యోగము దొరుకుట కష్టముగా ఉన్నందునను భవిష్యత్తులో నీవు మంచి ఉద్యోగము పొందునట్లు చిన్నవయసులోనే బాగా చదువుకొనవలెను. కాని దేవుని యొక్క రాజ్యమును మరియ నీతిని మొదటిగా వెదుకుటయే ఎల్లప్పుడు నీయొక్క గురి అని మర్చిపోవద్దు. మిగతావన్నియు తరువాత వచ్చును. లేనట్లయితే సిరి నీకు యజమానిగా మారును.
ప్రభువైనయేసు యొద్దకు వచ్చిన ధనవంతుడైన యౌవనస్థునికి అనేక మంచిలక్షణములున్నవి. కాని అతనికి ఒకటి కొదువగా ఉన్నది. అతడు దేవునికంటే ధనమును ఎక్కువగా ప్రేమించెను. దానిని బట్టి అతను దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేకపోయెను. ఈనాడు అతను ఎంత చింతించుచున్నాడో చూడుడి.
డబ్బుకు విలువున్నది కాబట్టి మనము ఆ విషయములో ఖచ్చితముగా ఉండవలెను. పరలోకములో సుద్దసువర్ణముతో రాజవీధులు ఉండుననియు మరియు వాటిమీద మనము నడిచెదము గనుక డబ్బును మన పాదములక్రింద ఉంచెదము (పక్రటన 21:21). ప్రభువైనయేసు చెప్పినట్లు భూమిమీద డబ్బువిషయములో నమ్మకముగా ఉన్నవారికే దేవుడు నిజమైనఐశ్వర్యమును ఇచ్చును (లూకా 16:11). అందువలన డబ్బును ఉపయోగించే విషయములో జాగ్రత్తగాఉండుము. నిజమైన ధనమును మనము పోగొట్టుకొనవలెనని కోరుటలేదు. గతములో మనము డబ్బు విషయములో అనేక తప్పులు చేసినప్పటికిని దేవుడు మనలను గద్దించక కనికరము చూపి మనలను క్షమించును కాని మన మేలుకొరకు భవిష్యత్తులో మనము నమ్మకముగా ఉండెదము.
చిన్నబిడ్డలవలే మారి మరియు మండుచుండుట:
దేవుని రాజ్యములో ప్రవేశించుటకు, చిన్నబిడ్డలవలే మార్పుచెందవలెనని ప్రభువైన యేసు తన శిష్యులకు చెప్పారు (మత్తయి 18:3). అనగా చిన్నబిడ్డలవలే మనము మార్పుచెందవలెను అనగా చిన్నప్పటినుండి మనము నేర్చుకొన్నవాటినన్నింటిని విడిచిపెట్టుట ద్వారా సొంతమును కోరుకొనమని లోకపు ఆత్మ భావించును. ఎందుకనగా ఆవిధముగా ఈలోకములో పొందెదము. ఈ వైఖరినుండి విడుదల పొందుము. అప్పుడు మరలా చిన్నబిడ్డలవలే మారెదము. మనము ద్వేషమునుండియు, పగనుండియు, ఫిర్యాదులుచేయుట నుండియు, అపవిత్రత మొదలగు వాటినుండియు విడుదల పొందవచ్చుననునదియే అద్భుత శుభవార్త.
నీతిమంతులు సూర్యునివలె తేజరిల్లెదరని మత్తయి 13:43లో ప్రభువైన యేసు చెప్పారు. అనేక లక్షలడిగ్రీలతో సూర్యుడు ఎల్లప్పుడు మండుచుండును. సూక్ష్మక్రిములు ఏవియు అక్కడ నివసింపలేవు అదేవిధముగా మనము కూడా ఎల్లప్పుడు మండుచు, ఎల్లప్పుడు ఆసక్తితోను మరియు పవిత్రతతోను ఉండుటకును ఇతరులను సేవించి మరియు ఆశీర్వదించుటకును, దీనులమై ఉండుటకును, కూటములలో సాక్ష్యము చెప్పుటకును మరియు సంఘములను నిర్మించుటకును ఎల్లప్పుడు మండుచుండవలెను. ఈ విషయములో యౌవనస్థులైన మీరు ముందుగా ఉండవలెను. తరువాత మూడు వచనములలో (మత్తయి 13:44-46) రెండు ఉపమానములద్వారా మనము ఎల్లప్పుడు ఏవిధముగా మండుచుండవలెనో ప్రభువు చెప్పాడు (దాచబడిన ధనము మరియు అమూల్యమైన ముత్యము). ఈ రెండు ఉపమానములలో తనకున్నదంతయు అమ్మెనను మాట చూచెదము. ఇదియే రహస్యము. మన స్వచిత్తమును, మన హక్కులను, మన ఘనతను మరియు సమస్తమును విడిచిపెట్టవలెను. అప్పుడు మాత్రమే ఎల్లప్పుడు సూర్యునివలె మండెదము.
బబులోనుయొక్క ఆత్మ:
మనము అనేకవిషయములు నేర్చుకొనునట్లు దేవుడు మనలను బబులోను క్రైస్తవత్వములో నడిపించును. రక్షణపొందిన తరువాత నేను కూడా 1975 వరకు 16 సంవత్సరములు దానిలో ఉన్నాను. నీవు వెళ్ళిన అనేక రాజీపడే సంఘములద్వారా ఇప్పుడు నీవు నేర్చుకొనుచున్నావు. పక్రటన 18:4లో చెప్పిన రీతిగా, ఈనాడు అనేకమంది దేవుని బిడ్డలు బబులోనులో ఉన్నారు. ''నా ప్రజలారా, దానియొద్దనుండి బయటకు రండి'' అని ఈ వచనములో దేవుడు పిలుచుచున్నాడు. ప్రజలను తప్పిపోవునట్లుగా చేసే నాయకులు మరియు పాస్టర్లదే సమస్య. ప్రభువైన యేసు కాలంలో ఉన్నట్లే, ఈనాడు కాపరిలేని గొఱ్ఱెల వలే ప్రజలున్నారు (మత్తయి 9:36). యెరూషలేములోని దేవాలయములో ప్రతి సంవత్సరము మూడుసార్లు మరియు నజరేతులోని సమాజమందిరములో ఆయనకు 12 సంవత్సరములనుండి ముప్పైసంవత్సరముల వరకు దేవునినామము ఏవిధముగా అవమానించబడుటను ప్రభువు చూచియున్నాడో ఆలోచించుము. దేవుని సమయము ఇంకను రాలేదు గనుక ఆయన దానిని గురించి ఏమియు చేయలేదు మరియు ఏమియు చెప్పలేదు. కాని తాను చేయబోయే పరిచర్యకొరకు నజరేతులో ఈయొక్క అనుభవములద్వారా ఆయన వెళ్ళుట ముఖ్యమైయున్నది. కాబట్టి ఇప్పుడు మన విషయములో కూడా అలాగే జరుగును.
''దానిలోనుండి మనము ఏమి పొందెదము?'' (మత్తయి 19:27 లివింగు బైబిలు)లో పేతురు ప్రభువైన యేసుతో చెప్పినమాటలే బబులోను ఆత్మ యొక్క మూలమైయున్నది. మనము కూడా అనేక విషయములు దేవునికి సమర్పించుకొనిన తరువాత, ఈ లోకములోను తరువాత పరలోకములోను ఏవిధముగా దేవుడు బహుమానమిచ్చును. అనగా దైవభక్తి, మన స్వలాభము కొరకు ఉన్నదనుకొని మరియు స్వార్థపరులమై యున్నామని అది ఋజువు చేయుచున్నకొందరు తమ బోధద్వారాను మరియు ప్రభువు కొరకు చేసే పరిచర్యద్వారాను డబ్బును లేక ఘనతను కోరుచున్నారు. మరికొందరు పరలోకములో బహుమానముగాని లేక క్రీస్తుయొక్క పెండ్లికుమార్తెగా ఉండవలెనని కోరుచున్నారు. మన స్వంతముకొరకు మనము కోరుచున్నంత కాలము, మనలో బబులోను ఆత్మ ఉన్నట్లే. ఈ కల్మషమునుండి మన ఆత్మను పవిత్రపరచుకొనవలెను.
ప్రభువును సేవించుటవలన మేము ఏమి పొందుదుమని పేతురు యేసును అడిగినప్పుడు మత్తయి 20:1-16లో ప్రభువు ఒక ఉపమానము చెప్పారు. ఇందులో రెండు రకముల పనివారిని గురించి చెప్పారు, 1. జీతముకొరకు పనిచేయువారు - కొందరు ఒక దేనారము కొరకు (2వ వచనము) మరియు కొందరు న్యాయమైన దానిని పొందుటకొరకు (4వ వచనము).
2. జీతమును గురించిన వాగ్ధానము లేకుండా వచ్చినవారు (7వ వచనము).
మొదటి రకపు పనివారు గంటకు దేనారము చొప్పున ఎక్కువ జీతము పొందిరి. మిగిలిన వారందరు తక్కువ జీతము పొందిరి. మొదటివారు 12 గంటలు పనిచేసినందుకు ఒక దేనారము గనుక వారు గంటకు 0.08 దేనారము పొందిరి. ప్రభువు మానవునియొక్క పరిచర్యలో నాణ్యతను మరియు ఉద్దేశ్యమును పరీక్షించును గనుక నిత్యత్వములో అనేకులు మొదటివారు కడపటివారు అగుదురని ప్రభువైనయేసు చెప్పారు (1 కొరింథీ 3:13 మరియు 4:5). మరియు ఆయన పరిచర్యయొక్క పరిమాణమును చూడడు.
యెరూషలేములోని సంతలో డబ్బు సంపాదించుకొను వారిని ప్రభువైన యేసు వెళ్ళగొట్టలేదు. ఎందుకనగా డబ్బు సంపాదించుకొనుటకు అది సరియైనస్థలము. క్రైస్తవులు కష్టపడి ఎంతైనను సంపాదించుకోవచ్చునని జాన్‌వెస్లీ చెప్పాడు. నేను దానిని అంగీకరించుచున్నాను. దేవుని మందిరములో తమ స్వలాభము పొందుట కొరకు ప్రయత్నించు వారిని ప్రభువైన యేసు వెళ్ళగొట్టారు. ఈనాడు సంఘములో కూడా ఎవరైతే ఘనతను లేక డబ్బును లేక ఇతర స్వలాభములను కోరువారినుండి ప్రభువైనయేసు సంఘమును పవిత్రపరచుచున్నారు. సంఘము త్యాగములు చేసే స్థలము. ప్రభువైన యేసు మరలా వచ్చినప్పుడు దేవుని మందిరములో వర్తకులు ఉండరని జెకర్యా గ్రంథము చివరిలో చెప్పబడింది (జెకర్యా 12:21 లివింగు బైబిలు). ప్రభువు కొరకు మనము చేసే పరిచర్యలో మన స్వంతము కొరకు దేనిని కోరకూడదు.
ప్రభువును నమ్మకముగా సేవించిన వారికి బహుమానములు ఉన్నవని క్రొత్తనిబంధనలో మత్తయి నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రభువైన యేసు చెప్పినప్పటికిని, మనము బహుమానముకొరకు పరిచర్య చేయకూడదు. కలువరిలో ప్రభువైన యేసు మనకొరకు చేసి ముగించిన దానినంతటిని బట్టి కృతజ్ఞతతో పరిచర్య చేసెదము. కేవలము బహుమానముపొందుట కొరకే పరిచర్యచేసేవారు దానిని పొందరు.
రైలు పట్టాలమీద జరిగిన ప్రమాదములో నేను చనిపోవలసియున్నది. దానిని బట్టి ఈ విధముగా ఆలోచించెదను.
1. నేను ఈ భూలోకము విడిచేముందు, నేను ఇంకను అనేక విషయములలో నేను యేసువలె రూపాంతరము చెందవలసియున్నది. కాబట్టి ప్రభువైన యేసువైపు చూచుచు నాలో ఉన్న కొదువను చూచుచు మరియు నన్ను నేను తీర్పుతీర్చుకొనుచు మరియు దేవుడు నాకు వెలుగునిచ్చు విషయములలో జయము పొందవలెనని ఆ సమయములో నేను భావించాను.
2. కలువరి సిలువలో ప్రభువైన యేసు నా కొరకు చేసిన దానంతటికి కృతజ్ఞత చెల్లించుటకు 34 సంవత్సరములు (19 సంవత్సరం నుండి 53 సంవత్సరము వరకు) సరిపోదని నేను భావించాను. కాబట్టి దేవుడు నన్ను కాపాడి మరియు అవసరమున్న ఈ లోకములో ఆయన కొరకు పరిచర్య చేయుట ద్వారా కృతజ్ఞత చెల్లించుటకు మరికొన్ని సంవత్సరములు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను.
సంపూర్ణ సువార్త:
అక్కడ వాక్యము ప్రకటించుటను మరియు దేవునిని సేవించుటకును ప్రభువు మీకు అవకాశము ఇచ్చుచున్నందుకు సంతోషముగా ఉన్నాము. ఇటువంటి క్రియలు చేయుట ద్వారా అనేకశోధనల నుండి వచ్చు ఒత్తిడిలనుండి రక్షించబడెదరు.
పరిసయ్యులవలె కాక ఆత్మీయ అధికారముతో ప్రభువైనయేసు మాట్లాడెను (మత్తయి 7:29). ఎందుకనగా తాను బోధించకముందు 30 సంవత్సరములు ఆయన ప్రతి శోధనను జయించారు. మనము కూడా ఆ విధముగా జీవించి బోధించాలి. ఆవిధముగా ఆత్మీయఅధికారము కలిగియుండెదము.
వ్యభిచారములో పట్టబడిన స్త్రీతో ప్రభువైనయేసు చెప్పిన రెండు మాటలలో సంపూర్ణసువార్త ఉన్నది. ''నేను నీకు శిక్ష విధించను (గతపాపముల కొరకు) మరియు నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుము'' (యోహాను 8:11). ప్రభువు యొక్క ఈ రెండు మాటలు ఒక నాణెము యొక్క రెండు ప్రక్కల వలెఉన్నవి. ఒక ప్రక్కఉన్న నాణెము (లేక ఒక సువార్త) నకిలీదైయున్నది.
ప్రభువైన యేసు మంచిగా ఉండుట గురించి మరియు దీనులైయుండుటను గూర్చి బోధించినందుకు సిలువవేయబడలేదు గాని దేవుని వాక్యమునకు విరుద్ధముగానున్న పెద్దల యొక్క ఆచారములను తిరస్కరించినందువలన ఆయనను సిలువ వేశారు (మార్కు 7:6-13). ఈనాడు కూడా, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగకుండుటకు మానవులయొక్క ఆచారములే ఆటంకములై యున్నవి. నీవు క్రైస్తవుల యొక్క మెప్పును కోరేవాడవైతే, దేవుని వాక్యమునకు విరుద్ధముగా నున్న ఆచార విషయములలో మౌనముగా నుండెదవు.
క్రీస్తుశరీరములో అవయవములుగా ఉన్నవారు ఎల్లప్పుడు పాపమును ఎదిరించెదరు (ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాడును గలతీ 5:17). కేవలము మన పాపములను క్షమించుటకొరకు మాత్రమే ప్రభువైన యేసు మరణించలేదు (1 కొరింథీ 15:3) గాని మనము కూడా క్రీస్తుతో సిలువవేయబడునట్లు ఆయన మరణించాడు (గలతీ 2:20) మరియు ఆ విధముగా ఇప్పుడు మన కొరకుకాక ఆయన కొరకే జీవించెదము (2 కొరింథీ 5:14, 15).
నులువెచ్చని స్థితిలో ఉన్న వారిని గురించి అనగా వారు లోకస్థులు (చల్లగా) కాదు మరియు మండుచున్న (వెచ్చగా) వారు కాదు. ఇట్టివారిని గురించి ప్రభువు సంతోషించడు. ఇట్టి వారిని నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను (పక్రటన 3:16). ఇది మన కడుపులో ప్రవేశించిన తరువాత, అందులో ఇమడని ఆహారమును మనము క్రక్కివేసినట్లుగా ఉండును. కాబట్టి ఆయన సంఘమును నిర్మించుటకును, క్రీస్తుయొక్క సాక్షిగా ఉండుటకును మరియు పరిశుద్ధంగా జీవించుటకును నీవు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మఅగ్నితో మండుచుండవలెను.
కనికరము మరియు కృప:
ఈనాడు ''కృపను'' సరిగా అర్థము చేసుకొనుటలేదు. తెలివి గల క్రైస్తవులు కృపకు అనేక నిర్వచనములు కనిపెట్టారు. కాని ఇక్కడ ప్రభువే స్వయముగా పౌలు యిచ్చిన నిర్వచనము చూడగలము. ''నా కృప నీకు చాలును - నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది'' (2 కొరింథీ 12:9). కాబట్టి కృప అనగా నా బలహీనత ఏదైనప్పటికిని ఆ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. మన బలహీనత ఏదైనప్పటికిని - కోపము గాని లేక గత ఓటములుగాని లేక మరిఏదైనప్పటికిని, దానిని జయించుటకు దేవునికృప శక్తినిచ్చును.
సమయోచిత సహాయముగా దేవునికృప హెబీ 4:16లో పిలువబడింది (అనగా మనము శోధించబడిన సమయములో కృపను పొందవచ్చును, 15వ). మనము అత్యంతబలహీనులము కాని తాము బలహీనులమని చాలా కొద్దిమందే గ్రహించెదరు. అందువల్ల వారు దేవునికృప కొరకు ప్రార్థించరు. మనము ఎంతో బలహీనులము గనుక ఒక అందమైన ముఖముద్వారా గాని లేక ఒక పుస్తకములోనిబొమ్మ చూచుట ద్వారాగాని మనము శోధనలో పడిపోయెదము. మనకున్న శక్తి సామర్థ్యములను బట్టి ఇతరులు మెచ్చుకొనినప్పుడు గర్వములో పడిపోయెదము. అకస్మాత్తుగా ఆర్థికలాభము వచ్చినప్పుడు ధనాపేక్షలో పడిపోయెదము. ఈ విషయములలోని బలహీనతలు సాతానుకు తెలియును గాని అనేకసార్లు మనకు తెలియదు. మన బలహీనతలను గుర్తించినయెడల, దేవుని కృప కొరకు ఎల్లప్పుడు మొఱ్ఱపెట్టెదము.
మనము శోధించబడినప్పుడు పాపములో పడకముందే మనకు కృప అవసరము కాని తరువాత కాదు. మనము ఒక పర్వతము ఎక్కుచున్నవారివలె ఉన్నాము. కాబట్టి మనము తొట్రిల్లినప్పుడు మన చేతులతో వ్రేలాడెదము. కాని మనము గర్వముతో సహాయము కొరకు అడుగము. సాధారణముగా క్రిందపడి మన ఎముకలు విరిగిన తరువాత సహాయమును అడిగెదము. అప్పుడు కృప అనే అంబులెన్సు వచ్చి, మనలను హాస్పటల్‌కు తీసుకొని వెళ్ళును.
కాని హెబీ 4:16లో మనకు అవసరముఉన్నప్పుడు కృప కొరకు ప్రార్థించవలెనని చెప్పుచున్నది అనగా మనము శోధనలో పడిపోక ముందుగా ప్రార్థించాలి. పడిపోయిన తరువాత కాదు మనము కృపకొరకు ప్రార్థించినయెడల అప్పుడు విడుదల పొందెదము. అనేకమంది క్రైస్తవులు అనేకసార్లు పడిపోవుచున్నారు మరియు అనేకసార్లు ఆసుపత్రికి అంబులెన్సులో వెళ్ళెదరు. మనము శోధించబడినప్పుడు సహాయము పొంది మరియు మంచి జీవితము జీవించవచ్చు. సహాయము కొరకు ప్రార్థించుము.
కనికరము మరియు కృపను ఇచ్చెదనని ప్రభువైన యేసు క్రొత్తనిబంధనలో శుభవార్త చెప్పుచున్నాడు.
దేవునియొక్క కృపను (శక్తిని) పొందుటకు ఉన్న రహస్యమేమనగా మొదటగా మనయొక్క అవసరమును, మనయొక్క ఓటములను, మనయొక్క వేశధారణను, మరియు మనయొక్క శక్తిహీనతను యథార్థముగా ఒప్పుకొనవలెను. మరియు దేవుని శక్తికొరకు దప్పికకలిగియుండి ఆయన నిశ్చయముగా అనుగ్రహించునని విశ్వసించాలి. ఇక్కడ విశ్వాసమునకు నా యొక్క నిర్వచనము ఉన్నది: దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములను మనలో నెరవేర్చుటకు, మనకంటే ఆయన ఎంతో ఆసక్తి కలిగియున్నాడని విశ్వసించుటయే.
''కాని దేవుడు దీనులకు మాత్రమే కృపనిచ్చును'' (1 పేతురు 5:5). క్రీస్తుయొక్క శరీరమును ఒక సంఘముగా దీనులు మాత్రమే నిర్మించగలరు. సంఘమునుకు పునాది వేయుటకు ముందుగా ప్రభువైనయేసు దాసుడాయెను.
ధర్మశాస్త్రము కంటే కృప శ్రేష్టమైయున్నది:
మోషేకంటే ప్రభువైన యేసు ఎంతో శ్రేష్టమైనవాడు, ధర్మశాస్త్రము కంటే కృప అంత శ్రేష్టమైనది. ధర్మశాస్త్రము పాపక్షమాపణ తెచ్చినట్లయితే (కీర్తన 102:3 మరియు 32:1) అప్పుడు కృప నిశ్చయముగా పాపము మీద జయమిచ్చును (రోమా 6:13 మరియు 8:3, మత్తయి 1:21).
ప్రభువైన యేసు చిన్ననాటినుండి సిలువమీద చనిపోయేవరకు జయించుటకు కృపయే సహాయపడెను (లూకా 2:40 మరియు హెబీ 2:9). ఆయన జయించియున్నాడు కాబట్టి ఇప్పుడు తండ్రితో కూడా ఆసీనుడైయున్నాడు (పక్రటన 3:21). అదేవిధముగా ఆయనవలె శోధన జయించినవారిని, ఆయనతో కూడా సింహాసనముపై కూర్చుండబెట్టెదనని ప్రభువు చెప్పుచున్నాడు. యాకోబు మరియు యోహానులు దీనికొరకే ప్రభువుని అడిగియున్నారు మరియు తండ్రియే దానిని అనుగ్రహించునని ప్రభువైన యేసు చెప్పారు. జయించుట ద్వారానే సింహాసనము మీద ప్రభువైన యేసు కుడి మరియు ఎడమ వైపున కూర్చుండబెట్టి ఘనపరచెదనని ఇప్పుడు ప్రభువైన యేసు చెప్పుచున్నారు.
శిష్యత్వము మరియు పాలివారమగుట:
లూకా 14:26, 27, 33లో శిష్యత్వమునకు ఉన్న షరతులను నెరవేర్చిన వారినే సంఘము నిర్మించుటకు ప్రభువు వాడుకొనును. అదేమనగా, 1. మన హృదయములలో మరియు జీవితములలో ప్రభువుకు మొదటి స్థానమునిచ్చుట, 2. మనయొక్క ఆదాము సంబంధమైన స్వజీవమును ద్వేషించుట 3. భూసంబంధమైన వస్తువుల విషయములో విడుదల కలిగియుండుట (ధనము, ఉద్యోగము మొదలగునవి) మనము అనేక విషయములు కలిగియుండుటకు దేవుడు అనుమతించును కాని అవి మన సొంతము అనుకొని వాటిని గట్టిగా పట్టుకొనకూడదు. మనము గృహనిర్వాహకులమైయుండి సమస్తమును ప్రభువు కొరకు ఉపయోగించి ఆయనను మహిమపరచాలి.
క్రైస్తవజీవితమనగా యేసుతో పాలివారమగుటయే. నా కాడి ఎత్తుకొని మరియు నేర్చుకోమని ఆయన చెప్పారు (మత్తయి 11:29). ఇక్కడ ఒక కాడిని రెండు ఎద్దులు మోసుకొని వెళ్ళుచుండగా అనుభవములేని ఎద్దు అనుభవంగల దానియొద్దనుండి నేర్చుకొనును. కాబట్టి మన సొంతశక్తితో దేనినైనా చేయమని ప్రభువు కోరుట లేదు. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికిని లేక నీవు ఏమీ చేయునప్పటికినీ (టీ.వీ చూచుచున్నప్పటికిని) ప్రభువైన యేసుతో కూడా ఆయన కాడిని మోసుకొనుచూ చేయాలి. ఏదైనా చేయబోవుచున్నప్పుడూ, ప్రభువైన యేసు దానిని అంగీకరించడు అని నీకు అనిపించిన యెడల, దానిని వెంటనే విడిచిపెట్టుము.
అపవాదికి చోటియ్యకుడి:
ప్రభువైన యేసుచేత సిలువమీద సాతాను నిత్యత్వానికి ఓడిపోయెను (హెబీ 2:14 మరియు కొలొస్స 2:14, 15). కాబట్టి నీవు అతనికి ఎన్నడునూ భయపడనవసరము లేదు. నీవు మొదటిగా దేవునికి లోబడి మరియు అప్పుడు సాతానును ఎదిరించినయెడల, అతడు నీ యొద్దనుండి పారిపోవును (యాకోబు 4:7).
ప్రభువైన యేసునామమును నీ శత్రువుకి వ్యతిరేకముగా ఒక ఆయుధముగా ఉపయోగించమని మిమ్మును ప్రోత్సహించగోరుచున్నాను. ఆయన నామము బలమైన దుర్గము కాబట్టి నీతిమంతులు అందులోనికి పరుగెత్తుదురు (సామెతలు 18:10). ప్రభువైన యేసునామములో సాతానును ఎదురించుము. నీవు ఏ సమయములో అయిననూ నిరాశనుండి విడుదల పొందుటకును, ఓ యేసు ప్రభువా, అని యేసు నామమును పిలువుము. అప్పుడు ఆయన నిన్ను విడిపించును. సాతానుకు ఎప్పుడునూ చోటు ఇయ్యకుడి. పరలోకములో సాతానుకి స్థలము లేదని పక్రటన 12:8 చెప్పుచున్నది. నీ హృదయములో కూడా అతనికి స్థలము ఉండకూడదు. ఎల్లప్పుడునూ దేవునిని స్తుతించే ఆత్మను కలిగియుండుట ద్వారా సాతాను మీ జీవితములలో రాకుండా సహాయపడును.
ఇశ్రాయేలీయుల అతిశయమునుండి నేర్చుకొనుట:
ఇశ్రాయేలుదేశము యొక్క ఓటమినుండి మనము అనేక పాటములు నేర్చుకొనవచ్చును. దేవుడు తమ విషయములో మాత్రమే ఆసక్తి కలిగియున్నాడని వారు బోధించి గొప్ప పొరపాటు చేసియున్నారు. కాని దేవుడు ఇతరులను కూడా పిలిచెదనని హోషెయా మరియు యెషయా ప్రవక్తల ద్వారా చెప్పాడు (రోమా 9:24-32).
నజరేతులో ప్రభువైన యేసు యొక్క మొదటి ప్రసంగానికి ప్రజలు రెండురకాలుగా స్పందిచారు. యెషయా చెప్పిన ప్రవచనము వారి మధ్యలో నెరవేర్చెననియు మరియు వారిని బంధకములో నుండి విడిపించుటకు దేవుడు తనను పంపియున్నాడనియు ఆయన చెప్పినప్పుడు యూదులు ఆయనను మెచ్చుకొనియున్నారు (లూకా 4:22). ఇటువంటి వాటిని విని ప్రజలు ఎల్లప్పుడూ ఆమోదించెదరు. కాని ఏలీయాను దేవుడు పోషించగోరినప్పుడూ ఇశ్రాయేలీయులందరినీ విడిచిపెట్టి అతనిని పోషించుటకు ఒక అన్యురాలైన విధవరాలిని దేవుడు ఎన్నుకున్నాడు మరియు దేవుడు ఇశ్రాయేలీయులు కుష్ఠురోగులందరిని విడిచిపెట్టి నయమాను అనే అన్యుడిని ఎలీషా కాలములో స్వస్థపరిచాడు. దేవుడు అన్యులను ఆశీర్వదిస్తాడని వినిన వెంటనే వారియొక్క స్పందన మారియున్నది. వారికి ఎంత కోపము వచ్చిందంటే వారు ప్రభువైన యేసును పట్టుకొని మరియు ఆయనను చంపుటకు ప్రయత్నించిరి (లూకా 4:28, 29). ఈ వాక్యభాగము చదవండి.
గత శతాబ్దము అన్నింటిలో క్రైస్తవ్యము కూడా అలాగే ఉంది. దేవుడు ఎప్పుడైనను క్రొత్తవారి ద్వారా ఒక ఉద్యమమును ఆరంభించినయెడల, ఆ ఉద్యమములో ఉన్న ప్రజలు దేవునిచేత మేము మాత్రమే ఎన్నుకొనబడియున్నామనియు మరియు ఇతరులెవరినీ దేవుడు ఆశీర్వదించడనియు అనుకొనెదరు.
ఎల్లప్పుడూ మనలను మనము తీర్పు తీర్చుకొనుటద్వారా మరియు ఇతరులను తీర్పు తీర్చకుండుట ద్వారాను దీనిని తప్పించుకొందుము. ప్రజలను గురించి మనకు తప్పకుండా వివేచన ఉండాలి. కాని మనము ఎవ్వరినీ తీర్పు తీర్చనవసరము లేదు, ఖండిచనవసరము లేదు. యూదాఇస్కరియోతు గురించి ప్రభువైనయేసు స్పష్టముగా వ్యతిరేకభావము కలిగియున్నాడు. మరియు కొరింథీయులు శరీరానుసారమైన స్థితిగురించి పౌలు ఒక అభిప్రాయము కలిగియున్నాడు. కాబట్టి ఇతరులయెడల అటువంటి అభిప్రాయము కలిగియుండుట తప్పు కాదు. నిజానికి ఇతరులచేత మోసగించబడుటకు ఇది అవసరము కాని మనము ఎవ్వరినీ తీర్పుతీర్చకూడదు, ఖండించకూడదు.
పరిచర్య మరియు నిదించబడుట:
''సౌఖ్యముగా ఉన్నవారిని కలవర పరచుటయూ మరియు కలవరముతో ఉన్నవారిని ఆదరించుటయే'' ప్రవచించే పరిచర్యలు. ఆ విధముగా ప్రభువైనయేసు పరిచర్యను కలవరపరిచి, మారుమనస్సు పొందిన వారిని ఆదరించాడు. ప్రభువైన యేసు బోధకు పరిసయ్యులు కోపపడి మరియు ఆయనను ద్వేషించారు కాని మారుమనస్సు పొందిన పాపులు ప్రోత్సహించబడి ఆయనను ప్రేమించారు. ఈనాడు కూడా ప్రతి ప్రవక్త మారుమనస్సు పొందుచున్న పాపులద్వారా గొప్పగా ప్రేమించబడి మరియు వేషధారులు మరియు స్వనీతిపరుల ద్వారా ద్వేషింపబడును.
లూకా 2:32, 35లో ప్రభువైనయేసు పరిచర్యద్వారా అనేక హృదయరహస్యములు బయలుపరచబడుటద్వారా అనేకులు పడెదరనియు మరియు కొందరు తిరిగి లేచెదరు అని సుమెయోను మరియతో చెప్పెను. ఈనాడు కూడా ప్రభువు ఆయన దాసులద్వారా ప్రవచించినప్పుడు ఆవిధముగానే జరిగినది.
మతానుసారమైన క్రైస్తవులనుండి మూడు రకములుగా విసర్జించబడెదము (హెబీ 13:11-13)లో చెప్పబడింది:
1. ధర్మశాస్త్రములో, చనిపోయిన పశువులు అపవిత్రముగా ఎంచబడి మరియు శిబిరము వెలుపట దహించివేయబడును.
2. ప్రభువైనయేసు దేహమును కూడా యూదులు అపవిత్రమైనదిగా ఎంచి మరియు యెరూషలేము బయట ఆయనను చంపిరి.
3. ఇప్పుడు మతానుసారులద్వారా మనము కూడా అపవిత్రులుగా ఎంచబడవలసియుంది (మనము రాజీపడకుండా ప్రభువు కొరకు నిలిచినట్లయితే).
ప్రభువైనయేసు వలే మతానుసారమైన క్రైస్తవ్యమునుండి బయటకువెళ్ళుటకు మనము ఇష్టపడాలి. నిజమైన ప్రతి శిష్యుడునూ మరియు నిజమైన ప్రతీ స్థానికసంఘము నిర్మించబడును. అది వారియొక్క బుద్ధిహీనతనుబట్టి పరిసయ్యతత్వమును బట్టికాక దేవుని కొరకును, వాక్యము కొరకును నిలిచి మరియు ఆయన సంపూర్ణసంకల్పము ప్రకటించిననప్పుడు ఆవిధముగా జరుగును.
కృప - క్రొత్తనిబంధన యొక్క ఆశీర్వాదము:
పాత మరియు క్రొత్తనిబంధన యొక్క ముఖ్యమైన తేడా ఏదనగా పాతనిబంధన భూలోకసంబంధమైనది మరియు క్రొత్తనిబంధన పరలోకసంబంధమైనది. వారు ధర్మశాస్త్రము పాటించినయెడల పాతనిబంధనలో సిరిసంపదలు మరియు అనేకపిల్లలు, పశువుల మందలు మరియు శారీరకఆరోగ్యము ఇశ్రాయేలీయులకు మోషేద్వారా వాగ్ధానము చేయబడింది. కాని ప్రభువైనయేసు అటువంటి వాగ్ధానములతో రాలేదు. మన యొక్క దురాశలమీద జయము పొందెదమని ఆయన వాగ్ధానము చేయుచున్నాడు. కాబట్టి మనకు ఏ నిబంధన (క్రొత్త నిబంధనా లేక పాతనిబంధన) ఆశీర్వాదముకావలెనో నిర్ణయించుకొనవలెను. కాని అనేకమంది విశ్వాసులు పాతనిబంధన ఆశీర్వాదముతోనే తృప్తి పడుచున్నారు. పాతదే మంచిదని అనేకులు చెప్పెదరని ప్రభువైనయేసు చెప్పారు (లూకా 5:29).
ఇస్సాకు మరియు యాకోబు:
పాత నిబంధనలో ఇస్సాకు మరియు యాకోబు జీవితములు ఎంతో వ్యత్యాసముతో ముగించబడిందని చూచెదము. దీనికి ఒక కారణము ఉంది. ఇస్సాకు యొక్క జీవితములో పోరాటములు లేవు. తన యొక్క తండ్రి అబ్రాహామునుండి సిరిసంపదలు పొందియున్నాడు మరియు తన ఇంటియొద్ద ఉచితముగా సమస్తమును అనుభవించాడు. తన యొక్క భార్యను కూడా తండ్రియే చూచాడు. మరియొక వైపున యాకోబు ప్రతివిషయములో పోరాడవలసి వచ్చెను. తన సహోదరుడు తనను చంపవలెనని వెదకుచున్నాడు గనుక అతడు తన ఇంటియొద్దనుండి పారిపోవలసివచ్చింది. అతడు తన యొక్క ఆస్థిని మరియు తన ఇద్దరు భార్యలను పొందుటకు ముందు తన మామ అయిన లాబానుచేత మోసగించబడెను.
చివరకు వారి ఇద్దరి జీవితములు యొక్క ఫలితమేమిటి? ఇస్సాకు జీవితములో అతడు తిండిబోతుగా ఉండి తన కుమారుల ఇద్దరిలో దేవునిచేత ఎన్నుకోబడిన వాడెవడో తెలుసుకొనుటకు ఆత్మీయ వివేచన లేకుండా ఉన్నాడు. కేవలము ఏశావు తనకిష్టమైన కూర చేసియున్నాడు గనుక జ్యేష్ఠత్వపు హక్కును ఏశావుకు ఇవ్వవలెనని అతడు నిర్ణయించుకున్నాడు (ఆదికాండము 27:2-4).
కాని యాకోబు తన జీవితాంతము వేరుగా ఉన్నాడు. పెనూయేలు దగ్గర దేవునిచేత అతడు విరుగగొట్టబడి ఇశ్రాయేలుగా మారాడు. యోసేపు తన కుమారుడైన మనష్షే మరియు ఎఫ్రాయీములను ఆశీర్వదించుటకు యాకోబు యొద్దకు తెచ్చినప్పుడు, యాకోబుకు ఎక్కువగా ఎవరిని ఆశీర్వదించవలెనో తెలిసియుండెను. కాబట్టి అతడు తన చేతులు చిన్నవాడైన ఎఫ్రాయీము మీద పెట్టి ఆశీర్వదించెను. యాకోబు తన కుమారులందరి భవిష్యత్తును గురించి ప్రవచించాడు (ఆదికాండము 48:8 - 49:27). దేవుడు యాకోబును విరగగొట్టెను మరియు అందువలన అతడు ఆత్మవివేచనగలిగి ఒక ప్రవక్తగా మారెను.
అనేకమంది విశ్వాసులు ఇస్సాకువలె, ఇతర విశ్వాసుల యొద్దనుండి ఆత్మీయముగా పొందిన దానినిబట్టి జీవించుదురు. వారియొక్క ఆత్మీయతండ్రులనుండి వారుపొందిన దానినే ఇతరులకు ఇవ్వగలరు. ఇది మంచిదేగాని శ్రేష్టమైనది కాదు. కాని ఇతర విశ్వాసులు వ్యక్తిగతముగా శ్రమలద్వారా దేవున్ని వ్యక్తిగతముగా ఎరిగెదరు. మరియు యాకోబువలె దేవునియొద్దనుండి ఆత్మీయ ఐశ్వర్యము (ప్రత్యక్షతలు) పొందుకొని, దేవునియొక్క మార్గములు మరియు ఆయన మనస్సును తెలుసుకొనుట ద్వారా ఆత్మీయవివేచన పొందెదరు. మీరు కూడా ఈవిధముగా ఉండవలెను. కాబట్టి మీరు ఎదుర్కొను ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనములు చెప్పుకొనుట నేర్చుకొనవలెను. కుమ్మరివాడు కుండను చేసినట్లే దేవుడు మిమ్ములను చేయనివ్వండి.
ప్రభువైనయేసుని సమస్తమునకు ప్రభువుగా చేయుడి:
2 కొరింథీ 2:14లో ''క్రీస్తునందు ఎల్లప్పుడూ మమ్మును విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' అని పౌలు చెప్పుచున్నాడు. లివింగు బైబిలులో ఈ వచనము ఈ విధముగా ఉన్నది, ''క్రీస్తు మా కొరకు చేసి ముగించిన దానినిబట్టి, మనము ఎల్లప్పుడు విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి వందనములు''. కాబట్టి మన జీవితములో కూడా అన్ని విషయములలో జయించాలి.
ఒక రోజున ప్రభువైన యేసు ఎదుట ప్రతిమోకాలు వంగును మరియు ప్రతినాలుకయు యేసే ప్రభువని ఒప్పుకొనును (ఫిలిప్పీ 2:10, 11) కాని ఇప్పుడే మీలో ఉన్న ప్రతీకోరిక ఆయన ఎదుట వంగి యేసే ప్రభువని ఒప్పుకోవాలి. మీలో ఉన్న దురాశలు మోకరించి మరియు మీ శరీరమునకు యేసే ప్రభువని ఒప్పుకోవాలి.
''నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కు వరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు'' (యెహెజ్కేలు 21:4, 5).
ప్రభువైన యేసు క్రీస్తుకే అన్నిటిలో ప్రాముఖ్యముండునట్లు దేవునిని మనలో పనిచేయనివ్వాలి (కొలొస్స 1:18). దానిని నీవు గురిగా పెట్టకొనినచో అప్పుడు నీ జీవితములో మరియు ఆయనకు నీవు సాక్షిగా ఉండుటలోను అన్ని సమయములలో దేవుని యొద్దనుండి సహాయము పొందెదవు.
నీ సమయమును నీ డబ్బును ఖర్చుపెట్టే విషయములోనూ, నీవు పుస్తకము చదివే విషయములోను నీవు వినే సంగీతము విషయములోను, నీవు చూచే టీ.వీ కార్యక్రమములోనూ, నీ స్నేహితుల విషయములోనూ, నీ మాటల విషయములోనూ, ప్రతీ విషయములోనూ, క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ విధముగా యేసుకి నీ సమస్తమును ప్రభువుగా చేయాలి. అప్పుడు నీయొక్క ప్రతివిషయములో దేవుడు జయమిచ్చెనని చెప్పగలవు. ఇది ఒక్కరాత్రిలోనే జరుగదు. కాని చాలా కాలము పడుతుంది మరియు దానిలో కొనసాగుము. అప్పుడు దినము తరువాత దినము, సంవత్సరము తరువాత సంవత్సరము ఆ గురియొద్దకే అంతకంతకు చేరుదుము.
ప్రభువైనయేసు దేవుని గొఱ్ఱెపిల్లగా లోకపాపములు మోసుకొనిపోయెను. ఇప్పుడు మన విషయములో ఇతరులు చేసే పాపములు భరించుటకు వధకు తేబడే గొఱ్ఱెలుగా మనము ఉన్నాము. మోరియా పర్వతము మీద ఉన్న కట్టెలు మరియు అగ్ని అనగా మన జీవితములో ఉన్న పరిస్థితులన్నియు సిద్ధముగా ఉన్నవి. కాని ప్రశ్న ఏమిటంటే ఇస్సాకు తన తండ్రిని అడిగినట్లుగా, ''గొఱ్ఱెపిల్ల ఎక్కడ ఉంది?'' (ఆదికాండము 22:7). దీనిజవాబు ఏమనగా, ఆ గొఱ్ఱె పిల్లవు నీవే.
పరిశుద్ధాత్ముడు ఏమి చేయగోరుచున్నాడు:
ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచుటకు 4 సంగతులను చేయుటకు దేవుడు తనను పంపియున్నాడని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు (లూకా 3:5). 1. ప్రతి పల్లము పూడ్చబడును 2. ప్రతి కండయు, మెట్టయు పల్లము చేయబడును. 3. వంకరి మార్గములు తిన్ననివగును. 4. కరుకు మార్గములు నున్నవి అగును.
వీటినే మన జీవితములో చేయవలెనని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు.
1. మన జీవితములలోని పల్లములను ఆయన పూడ్చును అనగా భూసంబంధమైన సిరిసంపదలు, లైంగిక వాంఛలు, మానవ ఘనత మొదలగువాటి చేత పరిపాలించబడుట.
2. గర్వము, అహంకారము, మొండితనము మరియు ఇతరుల కంటె గొప్పవారమని అనుకునే తలంపులన్నియు పల్లము చేయబడవలెను.
3. మనలో ఉన్న వంకర మార్గములన్నియు తిన్ననివిగా చేయబడును.
4. మనలో ఉన్న కఠినత్వము, కరుకుతనము మెత్తనివిగా చేయబడును.
అప్పుడు దేవుడు వాగ్ధానము చేసిన రక్షణ ప్రతి ఒక్కరి జీవితములలోనికి వచ్చును (లూకా 3:6). అప్పుడు మన శరీరమంతయు దేవుని మహిమను ప్రత్యక్షపరచును. మనలో ఉన్న శరీరసంబంధమైన దంతయు లయమగునట్లు దేవుని మహిమ అగ్నివలె కొద్దికొద్దిగా మరియు ప్రతి విషయములోను విస్తరించును.
మన జీవితములలోని వ్యర్థమైన వాటిని తీసివేయుట:
యిర్మీయా 43:10లో ''యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును (అనగా ప్రభువైన యేసుకు మన జీవితములో ప్రతి విషయములో ప్రభువుగా చేయుట) మరియు రక్తము ఊడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును (అనగా శరీరేచ్ఛతో త్వీముగా పోరాడకుండుట). తరువాతి వచనములో మోయబు ఈ కుండలోనిది ఆ కుండలోనిది క్రుమ్మరించబడునందువలన, దాని వాసన ఎప్పటివలె నుండెను.
ఒక కుండలోనుండి మరియొక కుండలోనికి పోయుట అను శీర్షికను వ్రాసిన జాన్ ఖోల్లేటె మనలోని వ్యర్థమైన పదార్థములు పోవుటకు దేవుడు అనేక పాత్రలో పోయుటను గూర్చి చెప్పుచున్నాడు - అనగా అపార్థము, నిందారోపణ చేయుట మరియు అనేక పరీక్షలు అనే పాత్రలు గురించి చెప్పాడు. మన జీవితములలోని వ్యర్థమైన వన్నియు తీసివేయబడి మరియు ద్రాక్షారసము మాత్రము మిగులునట్లు, వ్యర్థమైనవన్నియు క్రిందకు చేరును. ఒకసారి వ్యర్థమైనవి పాత్ర క్రిందకు చేరిన వెంటనే దేవుడు మనలను మరియొక పాత్రలో పోయును. కాని మనలను మనము సమర్థించుకొనకుండా విశ్రాంతిలో ఉండటం నేర్చుకొనవలెను. లేనట్లయితే వ్యర్థమైన వాటినుండి ద్రాక్షారసము వేరుచేయబడదు. కాని దేవుని ప్రజలు తమ్మును తాము సమర్థించు కొనుచు మరియు తమ చింతయావత్తు దేవుని మీద వేయరు గనుక అనవసరముగా శ్రమపడుచున్నారు.
జెకర్యా 2:13లో ''సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులైయుండుడి''. (10వ వచనము కూడా చూడండి). అన్ని సమయములలో మనలో ఈ విధముగా జరగాలి.
క్రీస్తు యొక్క సిలువ మీద మాత్రమే మహిమ గలదు:
కలువరి సిలువను గురించి ఎక్కువగా ధ్యానించవలెనని మిమ్ములను ప్రోత్సహించుచున్నాను మరియు నీ కోసం వస్త్రహీనుడుగా సిలువవేయబడుటకు సిగ్గుపడని ప్రభువైన యేసుకొరకు నీవును సిగ్గుపడకుము. నీవు క్రైస్తవుడవని నీతోటి విద్యార్థులకు స్పష్టముగా తెలిసేటట్లు చేసినట్లయితే నీవు వనుకంజ వేయవు. నీ చుట్టు ప్రక్కలనున్న వారివలె ఎన్నటికిని సాతానుకు మ్రొక్కకుము. యథార్థముగాను మరియు నిలుకడగాను నిలువుము. ప్రభువు యిట్లన్నాడు, ''మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని'' (లేవీయకాండము 26:13).
ఫిలిప్పీ 3:17-19లో రెండు రకాల విశ్వాసుల గురించి పౌలు చెప్పుచున్నాడు. మొదటిరకము పౌలువలె గురియొద్దకే పరుగెత్తేవారు. గురియొద్దకే పరుగెత్తే విషయములో తనను పోలి నడుచుకొనమని పౌలు చెప్పుచున్నాడు. కాని అనేక డినామినేషన్‌లలోని బోధకులు నకిళీ దీనత్వముతో, ''నన్ను చూడకండి లేక నన్ను వెంబడించకుడి. క్రీస్తును మాత్రమే వెంబడించమని'' చెప్పుదురు. అది దీనముగా కనబడినప్పటికిని అది వాక్యానుసారము కాదు. మనము బోధించే దానికి మనమే సాక్షులమై యుండాలి. రెండవరకం విశ్వాసులను క్రీస్తు సిలువయొక్క శత్రువులుగా పిలచియున్నారు. ఇటువంటి విశ్వాసులకు 1. వారి కడుపే (వారిలో ఉన్న దురాశలు) వారికి దేవుడు 2. సిగ్గుపడవలసిన వాటియందు అతిశయించుచున్నారు.
మన శరీరము యొక్క రంగును బట్టికాని, లేక అందమును బట్టిగాని లేక తెలివితేటలను బట్టిగాని చదువును బట్టిగాని ఆస్థిని బట్టిగాని లేక భూసంబంధమైన ఏ విషయములోను లోకస్థులవలె అతిశయించము. పౌలు వలె మనము క్రీస్తు సిలువ విషయమందే అతిశయించవలెను. ఎందకనగా లోకవిషయములలో మరియు లోకములోని ఆకర్షించే వాటి విషయములోను మరణించాము (గలతీ 6:14 లివింగ్ బైబిలు). నీవు ప్రభువు కొరకు నిలచినప్పుడు లోస్థులు (కొందరు లోకానుసారులైన విశ్వాసులు) నిన్ను వింతగా చూచెదరు. కాని దానిని బట్టి నీవు భయపడకుము. లోకస్తులైన నీ స్నేహితుల యెదుట ప్రభువు కొరకు నిలువబడి మరియు క్రీస్తు సాక్షిగా ఉండుటకు సిగ్గుపడకుము.
మన జీవితములలో అభిషేకము లేనప్పుడును లేక మనము పాపములో ఎల్లప్పుడూ ఓడిపోవుచున్నప్పుడును లేక దేవునియెడల మనకు ఆకలి దప్పులు లేనప్పుడును మరియు మనయొక్క మాదిరిని బట్టి ఇతరులను సవాలు చేయలేనప్పుడును మనము సిగ్గుపడి దేవుని యెదుట దు:ఖపడవలెను. అటువంటి దు:ఖము మనకు మంచిది. దేవుడు దానియందు లక్ష్యముంచి మరియు మనకు కృపను మరియు జయమును ఆయన మనకు త్వరగా అనుగ్రహించును.
కాని మనయొక్క మానవ బలహీనతను బట్టి అనగా రోగములను బట్టిగాని మరియు తెలివితేటలు లేనందుకుగాని బీదరికమును బట్టిగాని లేక అందవిహీనాన్ని బట్టిగాని సిగుగపడరు. దేవుడు సినిమా తారలను గాని లేక సైంటిస్టులను గాని తన పరిచర్యకు పిలవడు గాని మనుష్యుల దృష్టిలో ఆకర్షణ లేనివారిని పిలుచును.
నీవు ఆత్మీయముగా అభివృద్ధి చెందవలెనని కోరినట్లయితే, దేవుడు విలువ ఇచ్చిన వాటికే నీవు విలువ ఇవ్వాలి మరియు దేవుడు విలువ ఇవ్వని వాటికి నవు కూడా విలువ ఇవ్వకూడదు.
ఇది మంచి జీవితము - దేవుడు మనలను ఆశీర్వదించెను:
కొంతకాలం క్రితం నేను ఆశీర్వదించబడిన ఒక పద్యము.
''మనము కొన్ని తుఫానులను ఎదుర్కొన్నాము
కాని సూర్యుని వెలుగుతో తేజోవంతమైన దినములు
తుఫానుతో కూడిన దినముల కంటే అధికముగా నున్నవి కనీసం యాబదిరెట్లు
మనము కొన్ని కరుకైన మార్గముల గుండా వెళ్ళాము
కాని దేవుడు పంపించిన నున్నని మార్గములు కనీసం మూడువేల
శాతం అధికముగా నున్నవి,
వంద పాత్రల ఆనందం - అర్ధ పాత్ర ప్రయాసము
జీవిత ఋతువులలో దేవుడు ఈ విధంగా మనలను ఆశీర్వదిస్తాడు''
(తెలియబడని రచయిత)
గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయములు:
ఈ మధ్య జరిగిన బెంగళూరు కూటములలో ఈ విషయములను ధ్యానించాము.
''దేవుని విషయములలో మనము ఆసక్తి కలిగియుండవలెనని'' అని ప్రభువు చెప్పుచున్నాడు (పక్రటన 3:19 లివింగు). పాపమునకు వ్యతిరేకముగాను మరియు నీతి కొరకును మరియు దేవుని స్తుతించుటకును మొదలగు వాటి విషయములో మనము ఎల్లప్పుడు మండుచుండవలెనని దేవుడు ఎల్లప్పుడు కోరుచున్నాడు. నులువెచ్చని స్థితిలో ఉన్నవారు చివరకు ఉమ్మివేయబడుదురు.
నమ్మకత్వము కొరకు దేవుడు ప్రాముఖ్యముగా చూచుచున్నాడు. చిన్న చిన్న విషయములలోను, డబ్బును ఖర్చుపెట్టి విషయములోను మరియు ఇతరుల విషయములలోను మనము నమ్మకముగా ఉండాలి (లూకా 16:10-12).
అసూయ ఎంతో చెడ్డది. కయీనులోను, సౌలు రాజులోను, పెద్ద కుమారునిలోను (తప్పిపోయిన కుమారుని ఉపమానం) మరియు ప్రభువైన యేసుమీద అసూయ పడిన పరిసయ్యులలోను దీనిని చూచుచున్నాము. అసూయ మరియు మత్సరము అను పదములను కన్‌కార్డెన్స్ సహాయంతో ధ్యానించాలి. ఈ చెడ్డ దానినుండి మనము పూర్తిగా విడుదల పొందాలి.
యెషయా 53వ అధ్యాయము మనము నడుచు కొనవలసిన మార్గము. మనము దేవునిచేత నలుగగొట్టబడినప్పుడు మాత్రమే ఆయన ఉద్దేశ్యము మనలో సఫలమగును (యెషయా 53:10).
దేవుని యొక్క శక్తిలేకుండా క్రైస్తవ జీవితము జీవించుట అసాధ్యము కనుక ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడునట్లు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించాలి.
మనకు ఎదురయ్యే పర్వతములను తీసివేయుటకు మంచి మనస్సాక్షిని కలిగియుండుట ద్వారా విశ్వాసమును కలిగియుండుము. దేవునిని వెంబడించకుండా వచ్చే ఆటంకములను అంగీకరించి మౌనముగా ఉండకూడదు. వాటికి వ్యతిరేకముగా మనము నిలచి మరియు ప్రభువైన యేసు నామములో వాటిని తీసివేయాలి.
మానవ ఉద్రేకములకును మరియు పరిశుద్ధాత్మతో నింపబడుటకును తేడాను మనము వివేచించాలి. దేవుడు మాత్రమే వివేచనను ఇవ్వగలడు. మనము దేవునితో నడుచుచూ పరిపూర్ణులము అయ్యే కొలది వివేచనను పొందెదము.
ప్రార్థన గురించి కొన్ని విషయములు:
విధవరాలు న్యాయాధిపతి యొద్దకు మాటిమాటికి వెళ్ళినట్లే మనము కూడా ఎల్లప్పుడూ విసుగక ప్రార్థించాలని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 18:1).
దేవుడు మన ప్రార్థనలను వినవలెనని కోరినయెడల (అనగా మనము ఫోన్ చేసిన వెంటనే మాట్లాడునట్లు ఎందుకనగా మన యొక్క ప్రార్థన ఫోన్‌లో మాట్లాడినట్లే ఉండాలి) (కీర్తన 66:18). మన హృదయములు పవిత్రముగాను (అనగా దేవుని విషయములలో) మరియు మంచిగాను (అనగా ఇతరుల విషయములలో) ఉండవలెను. అప్పుడు మనయొక్క స్తుతులు పరలోకమందున్న దూతలతో ఏకమై దేవుని యొద్దకు చేరును.
మనయొక్క సొంత అవసరమును చూచుట: గ్రుడ్డి బిక్షకుడు అయిన బర్తిమయి ప్రార్థించినట్లుగా మనకు వెలుగులేని విషయములలో వెలుగు నివ్వమని మన యొక్క అవసరమును చూచే శక్తినివ్వమని ప్రభువైన యేసుకు మొఱ్ఱపెట్టాలి (మార్కు 10:46). బర్తలోమయికి వెలుగిచ్చినట్లే మనకు వెలుగు ఇవ్వాలని ప్రభువైన యేసు ఇష్టపడుచున్నాడు. అనేక విషయములలో మన యొక్క అవసరము చూచునట్లు దృష్టిని పొందుటయే దేవుని యొక్క గొప్ప వరములలో ఒకటి. మనం ఎక్కువగా ప్రార్థించవలసిన విషయములలో ఇది ఒకటి. ఇతరుల యొక్క పొరపాట్ల మీదనే దృష్టి పెట్టుట మన కళ్ళలో ఇసుక వేసుకొన్నట్లే ఉండును. ఆవిధముగా గ్రుడ్డివారమగుదుము.
ఇతరులయొక్క అవసరమును చూచుట: (సామెతలు 11:24, 25)లో దయగలిగినవారు వర్ధిల్లెదరనియు మరియు ఇతరులకు నీళ్లు పోయువారికి దేవుడు స్వయముగా నీళ్లు పోయునని చెప్పుచున్నాడు. ఇతరులయొక్క భారములను గురించియు మరియు అవసరములను గురించియు మనము శ్రద్ధవహించినయెడల, దేవుడు మనకు గొప్పగా సహాయపడును. కాబట్టి మన సొంత అవసరముల గురించి మాత్రమే ఎల్లప్పుడు ఆలోచించుట నుండి విడిపించబడుచు స్వార్థమునుండి మనము విడుదలపొందాలి. యోబు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు తన యొక్క రోగము నుండి స్వస్తత పొందాడు (యోబు 42:10). ఒక బిడ్డ కొరకు అబ్రాహాము తన వివాహజీవితములో ప్రార్థించాడు. అయినప్పటికి శారా గొడ్రాలిగానే ఉండెను. అప్పుడు ఒకరోజు గొడ్రాలిగా ఉన్న స్త్రీ కొరకు అబ్రాహాము ప్రార్థించెను (ఆదికాండము 20:17,18). అప్పుడు దేవుడు ఆ స్త్రీ కొరకు చేసిన అబ్రాహాము ప్రార్థన వినుటయే కాక, మరుసటి రోజుననే శారా గర్భమును కూడా దేవుడు తెరిచెను (ఆదికాండము 21:10).
మనకు ప్రార్థన గురించి అర్థం కాకపోయినప్పటికిని మనము ప్రార్థించాలి. ప్రార్థన విషయములో మన సొంత జ్ఞానము మీద ఆధారపడకూడదు. సాతాను పేతురును జల్లించవలెనని కోరినప్పుడు ప్రభువైన యేసు అతడి కొరకు ప్రార్థించాడు. ఒకవేళ ప్రభువైన యేసు ప్రార్థించనియెడల ఏమి జరిగియుండేదో ఊహించుకొనుము.
ప్రభువైన యేసు గెత్సేమనే తోటలో ఒత్తిడిలో ఉన్నప్పుడు పేతరు యాకోబు మరియు యోహానులను తనకొరకు ప్రార్థించమని ప్రభువైనయేసు దీనుడైయున్నాడు. మన కొరకు ఇతరులను ప్రార్థించమని అడుగుటకును మరియు ఇతరులతో కలిసి ప్రార్థించుటకును మన గర్వమే ఆటంకముగా ఉన్నది. ప్రభువైన యేసు వలె మనలో ఉన్నటువంటి ఒత్తిడిలు గురించి (ఇబ్బందికర పరిస్థితుల గురించి) ఇతరులకు చెప్పనవసరము లేదు. అయినప్పటికిని ఆయన వారిని ప్రార్థించమని అడిగెను మరియు ఆ ముగ్గురి శిష్యులు ప్రార్థించనందుకు ఆయన నిరాశపడెను.
సాత్వికము మరియు దీనత్వము - ప్రభువైన యేసుయొక్క కాడిని ఎత్తుకొనుట:
దేవునిని మనతండ్రిగాను మరియు ప్రభువైనయేసు క్రీస్తును మనయొక్క ప్రభువుగాను, రక్షకునిగాను మరియు మనకంటే ముందుగా దేవుని సన్నిధిలో మనకొరకు ప్రవేశించినవాడుగాను ఎరుగుటయే నిత్యజీవము (యోహాను 17:3). నీవు క్రైస్తవ జీవితములో అంతకంతకు వర్ధిల్లవలెనని కోరినచో మనయొక్క పరలోకపు తండ్రితోను మరియు ప్రభువైన యేసుతోను సన్నిహిత సహవాసము కలిగియుండుము. ఇది మనము వెనుకంజవేయకుండ కాపాడును. దేవునియొద్దనుండి అభిషేకము కలిగిన వర్తమానములను వినుటయేసరిపోదు. ఆకాశమునుండి కుమ్మరించబడిన మన్నా 24 గంటలలో పురుగులుబట్టి వాసనకొట్టెను (నిర్గమ కాండము 16:20). నీ యొక్క క్రైస్తవ జీవితములో తాజాదనమును 24 గంటలలో పోగొట్టుకొనుట సులభము కాని ఆ మన్నా ప్రత్యక్ష గుడారములో అనగా దేవుని యొక్క సన్నిధిలోని అతిపరిశుద్ధ స్థలములో ఉంచినప్పుడు నలభై సంవత్సరముల వరకు పురుగుపట్టలేదు మరియు కంపుకొట్టలేదు. మరియు తరువాత కానానులో 400 సంవత్సరములు కూడా అది పురుగుపట్టి కంపుకొట్టలేదు (నిర్గమకాండము 16:33, హెబీ 9:4). మన జీవితములలో కూడా దేవునియొక్క సన్నిధిలో ఉన్న శక్తి మాత్రమే సమస్తమును తాజాగా ఉంచును. కాబట్టి ఇతరులయొద్దనుండి ప్రభువు గురించి నీవు వినినదానిని అనగా కూటములలోగాని లేక టేపులోగాని వినినదానిని ప్రభువుయొద్దకు తీసుకొని వెళ్లి ప్రార్థించినయెడల అప్పుడు ప్రభువుయొద్దనుండి నేరుగా పొందెదవు.
ప్రభువైనయేసు మనకు బయలుపరచనియెడల మనము తండ్రిని యెరుగుట అసాధ్యము అని మత్తయి 11:27-29లో ప్రభువైన యేసు చెప్పారు. మనము ఆయనయొద్దకు వెళ్లి ఆయన కాడిని (సిలువను) ఎత్తుకొని మరియు సాత్వికమును దీనత్వమును ఆయన యొద్ద నేర్చుకొనమని ప్రభువు మనలను ఆహ్వానించుచున్నాడు (ఆ మూడు వచనములను కలిపి చదవండి). ఈ రెండు విషయములను మాత్రమే ఆయనయొద్దనుండి మనము నేర్చుకొనవలెనని ప్రభువు చెప్పారు కాబట్టి ఈ మూడు విషయములలో ప్రభువైన యేసు మహిమను చూచుటకు మనము వాక్యమును చూడాలి.
1. సాత్వికము: మొదటిగా ప్రభువైన యేసు పరిసయ్యులకు వ్యతిరేకముగా ఉండి మరియు ఎల్లప్పుడు పాపులైనవారి పక్షముగా ఉండుటలో ఆయన యొక్క సాత్వికమును చూచెదము. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ విషయములో మనము దీనిని చూచెదము (యోహాను 8:1-12) మరియు పరిసయ్యుడైన సీమోను ఇంటిలో పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసు యొక్క పాదములను అభిషేకించుటలో దీనిని చూడగలము (లూకా 7:36-50). పాపాత్మురాలైన స్త్రీని సీమోను విమర్శించనంత వరకు ప్రభువైన యేసు అతనితో ఏమియు చెప్పలేదు కాని అతడు ఆమెను తృణీకరించిన వెంటనే దేవుని యెడల గౌరవము మరియు ప్రేమల విషయములో ఉన్న కొదువనుబట్టి ప్రభువు అతనిని గద్దించెను (లూకా 7:40-37). మారుమనస్సు పొందుచున్న పాపులను విమర్శించే వారి విషయములో ప్రభువైన యేసు తీవ్రముగా ఉండెను. ఆయన ఎల్లప్పుడు బైబిలును ఎరిగిన పరిసయ్యులకు వ్యతిరేకముగాఉండి మరియు మారుమనస్సు పొందుచున్న పాపులపక్షముగా ఉండెను. ఇది తెలుసుకొనుటద్వారా మనకు గొప్ప ఆదరణ కలుగుచున్నది. ఈ సాత్వికమును మనము ఆయన యొద్ద నుండి నేర్చుకొనవలెను.
తనకు హానిచేసిన వారిని క్షమించే విషయములో ప్రభువైనయేసు యొక్క దీనత్వమును చూడగలము. ప్రజలు తనను దయ్యములకు అధిపతి అని పిలిచినప్పుడు, వెంటనే వారి పాపమును క్షమించాడు (మత్తయి 12:24,32). వారు ఆయనను దూషించినప్పుడు, ఆయన వారిని బెదిరించలేదు. ఆయన మౌనముగా ఉండెను (1 పేతురు 2:23). ప్రభువైన యేసు యొక్క ఈ సాత్వికమును కూడా మనము నేర్చుకోవాలి. మన చేతిమీద పడిన బల్లిని గాని బొద్దింకనుగాని మనము ఏ విధముగా విసర్జించెదమో ఆవిధముగానే ద్వేషమునుగాని, పగనుగాని, లేక క్షమించలేని ఆత్మనుగాని పూర్తిగా విసర్జించాలి.
2. దీనత్వము: మత్తయి సువార్తలోని మొదటి ఆరు వచనములు, ప్రభువైన యేసు ఈలోకములో పుట్టుటకు ఎన్నుకొనిన కుటుంబము, ఆయన యొక్క దీనత్వమును చూపించుచున్నది. యూదులు సామాన్యముగా స్త్రీలయొక్క పేర్లను చెప్పరు. తామారు, రాహాబు, రూతు, బత్సెబ అను నలుగురు స్త్రీల గురించి చెప్పబడింది. తామారు అను స్త్రీ తన యొక్క మామ అయిన యూదాతో వ్యభిచారము వలన ఆమెకు బిడ్డ పుట్టెను (ఆదికాండము 38వ అధ్యాయము). రాహాబు యెరికోలో పేరుపొందిన వ్యభిచారి (యెహోషువ 2వ అధ్యాయము). రూతు మోయాబీయురాలు అనగా లోతు కుమార్తె అతనితో వ్యభిచారము చేయుటవలన పుట్టినవారు (ఆదికాండము 19వ అధ్యాయము). మరియు బెత్సెబా దావీదుతో వ్యభిచారము చేసెను. లైంగికపాపము చేసిన ఈ నలుగురు స్త్రీలయొక్క పేర్లు క్రొత్త నిబంధనలోని మొదటి పారాలో ఎందుకు వ్రాయబడినవి? ఎందుకనగా ప్రభువైన యేసు పాపులతో ఏకమై మరియు వారిని రక్షించుటకు ఆయన వచ్చియున్నాడని చూపించుచున్నది.
యేసుప్రభువు ఈ భూమిమీద చేసిన వండ్రంగి పని మరియు ఈ భూమిమీద ఆయన జీవితకాలమంతయు ఆయన ఒక దాసునిగా ఉండుటలోను ఆయనయొక్క దీనత్వమును చూడగలము. ఒక దాసునియొక్క వైఖరి అనగా ఎల్లప్పుడు మెలకువగా ఉండి ఇతరుల యొక్క అవసరములను చూచుచు మరియు చూచినవెంటనే వారికి సహాయపడవలెనని కోరెను (ఉదాహరణకు: ప్రభువైనయేసు తమ శిష్యులయొక్క పాదములు కడుగుట).
ఆండ్రూ ముర్రే వ్రాసిన దీనత్వము అను పుస్తకములో దీనత్వమును గురించి ఈ విధముగా చెప్పెను: ''దేవుడే మనలో సర్వములో సర్వమగునట్లు, మనము ఏమి కానివారముగా కావలయునని కోరవలెను''. ఈవిధముగా ఉండుటకు ప్రభువైన యేసు సంతోషించెను. ఆయన యొద్దనుండిన దీనినే మనము నేర్చుకొనవలెను.
కాబట్టి ఆయనయొక్క కాడిని ఎల్లప్పుడును మన మెడమీదపెట్టకొని మరియు సాత్వికమును దీనత్వమును ఆయన యొద్ద నేర్చుకొనవలెను. ఆ విధముగా ఆయన మనకు తండ్రిని అంతకంతకు బయలుపరచును.
హృదయవైఖరిని బట్టి దేవుని స్వభావములో పాలివారమగుదుము:
రోమా 12:2ను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుట మంచిది. మన ఆలోచనా విధానము అంతకంతకు మార్పుచెందుట ద్వారా మనము రూపాంతరము పొందుదుము. ప్రజల గురించి గానీ లేక పరిస్థితుల గురించిగానీ దేవుని తలంపులు మన తలంపులవంటివి కావు. మనము ఎవరినైనను లేక దేనినైనను ఆదాము బిడ్డలవలె చూడకూడదు. మీరు ఎల్లప్పుడు ఈ విధముగా ప్రశ్నించుకోవాలి, ''ఈ వ్యక్తిని లేక ఈ పరిస్థితిని దేవుడు ఏవిధముగా చూస్తున్నాడు?'' మరియు అప్పుడు దేవుని తలంపులతో మీరు ఏకము కావలెను.
ఒక వ్యక్తిని ఎల్.కె.జీ నుండి పి.హెచ్.డీ చదువుటకు 25 సంవత్సరములు పట్టినట్లే మనము దేవుని స్వభావములో పాలివారమగుటకు కూడా అనేక సంవత్సరములు పడుతుందని మనుష్యులవలె మనము ఆలోచించకూడదు. యౌవనస్తుడైన స్తెఫెను కొత్తగా జన్మించిన తరువాత 4 లేక 5 సంవత్సరములలోనే ఎంతో క్రీస్తువలె రూపాంతరము చెందాడు (అపొ.కా. 6:7). 40 సంవత్సరములు క్రైస్తవులుగా జీవించినవారు నిత్యత్వములో అతనికంటె గొప్పగా ఉండెదరని మీరనుకొనుచున్నారా? ఆవిధముగా ఉండనవసరములేదు. మన హృదయముయొక్క వైఖరేగాని మనము జీవించిన కాలమును బట్టి దేవుని స్వభావములో పాలివారముకాలేము. డేవిడ్ బ్రయినార్డ్ (1718-1747) 29 సంవత్సరముల వయస్సులోపే అమెరికాలోని భారతీయులవిషయంలో ఎంతో దేవుని కనికరముతో నింపబడియుండి, చిన్న వయస్సులోనే గొప్ప పరిచర్య చేశాడు. ఇతరులు 100 సంవత్సరములో చేసే పరిచర్యను, అతడు 10 సంవత్సరములలో చేశాడు. కాబట్టి మీరు ప్రభువును సేవించుటకు పెద్దవారయ్యే వరకు వేచియుండనవసరములేదు. మీరింకా ఆత్మీయముగా పరిణితి చెందలేదు. కనుక మీకు 50 సంవత్సరములు వచ్చిన తరువాత ప్రభువు పరిచర్య చేయుడని అపవాది చెప్పును. ఆ అబద్ధికుని మాటలను వినకుము.
దేవుని యొక్క అగ్ని:
ఏలీయా కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు అగ్ని ద్వారా జవాబిచ్చువాడే నిజమైన దేవుడని 450 మంది అబద్ధప్రవక్తలతో చెప్పాడు (1 రాజులు 18వ అధ్యాయము). అగ్ని పవిత్రత గురించి మాట్లాడును. అన్యులు కూడా దానిని గుర్తించెను. అగ్ని అనగా ఉద్రేకము కాదు లేక మంచిగాపాడుట కాదు. అరణ్యములో మోషే యిత్రో గొఱ్ఱెలను మేపుచుండగా, పొదల మధ్యలో ఉన్న ఒక పొద మీద దేవునిఅగ్నిని చూచెను. ఆ పొదలో దేవుడు నివసించాడు. ఈనాడు నిజమైన సంఘము యొక్క గుర్తు ఇదియే. అది పవిత్రతతో మండుచుండును. దేవుడు దహించు అగ్నియైయున్నాడు. అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడే నిజమైనదేవుడు.
పూర్తిగా బలి చేయబడిన బలిపీఠం మీదనే ఎల్లప్పుడు అగ్నిపడును. అందువలన దేవుడు ఎల్లప్పుడు మనమీదికి అగ్ని పంపునట్లు, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట గురించి సంఘములో బోధించెదము. సొంతమును కోరువారిని (మనుష్యుల యొక్క ఘనతను మరియు ఆర్థికలాభము కోరువారు) దేవాలయములో ప్రభువైనయేసు పవిత్రపరచాడు. ఈనాడు కూడా ఆయన దానినే చేయుచున్నాడు. ఆ దినమునవారు దేవాలయములో పావురములను అమ్మినట్లే, ఈనాటి బోధకులు నకిలీ ఆత్మవరములను కలిగియుండి స్వస్థతకూటములలో వాటిని అమ్ముకొనుచున్నారు. ప్రభువు నామములో వారు బీదల యొద్దనుండి డబ్బును తీసుకొనుచున్నారు. దేవుని వరములను ఉపయోగించుట ద్వారా డబ్బు సంపాదించిన బోధకులను మరియు మనుష్యులఘనతను కోరు బోధకులను ప్రభువైన యేసు ఒక దినమున వెళ్ళగొట్టును.
సంఘమును నిర్మించుటకు దేవుడు ఒక ప్రణాళికను మరియు ఒక పద్ధతిని కలిగియున్నాడు. మనము కట్టుచున్నసంఘము ఆయన చిత్తప్రకారములేదని ఒప్పుకొని మరియు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై దేవుని మాటవిని వణుకుచుండునో, అటువంటి వారిని దేవుడుచూచి మరియు వారు సరిగా సంఘమును నిర్మించుటకు ఆయన సహాయపడును.
యెహెజ్కేలు 40 నుండి 48 అధ్యాయములలో దేవాలయము నిర్మించుటకు దేవుడు ప్రణాళికను ఇచ్చెను. సంఘనిర్మాణము ఈ విధముగా జరగాలి. ప్రభువు యొక్క దాసులను ఇక్కడ సాదోకు సంతతివారు అనగా ప్రజలకు కాక ప్రభువుకే పరిచర్య చేసెడివారు (యెహెజ్కేలు 44:15-27). యోహాను 7:37-39లో ప్రభువైనయేసు చెప్పినట్లుగా సంఘములో నుండి జీవజల నదులు ప్రవహించునని యెహెజ్కేలు 47లో చెప్పబడింది. దేవుని యొక్క చిత్త ప్రకారము కాకుండా సంఘములను నిర్మించుటను బట్టి సిగ్గుపడువారికే దేవుడు తన యొక్క ప్రణాళికను చూపించునని యెహెజ్కేలు చెప్పుచున్నాడు (యెహెజ్కేలు 43:10,11). పరిశుద్ధతయే దేవునియొక్క మందిరములో నియమము.
ప్రకృతిసంబంధమైన, మానవసంబంధమైన మరియు పరిసయ్యతత్వము, ఆత్మీయముగాను, దైవికముగాను మరియు క్రీస్తువలె కనబడవచ్చును. యెహెజ్కేలు 43:8లో నిజమైన మందిరమునకు ప్రక్కగానే నకిలీ మందిరము కూడా కట్టబడెను. కాబట్టి వివేచనలేని ప్రజలు ఏ ద్వారాము గుండా ప్రవేశించాలో తెలియక కలవరపడెదరని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి తెలివితేటలు ద్వారాను మరియు ఉద్రేకముల ద్వారాను కలిగే దానికిని మరియు పరిశుద్ధాత్మ ద్వారా కలిగే నిజమైన అగ్నికిని తేడా తెలిసియుండాలి. పరిసయ్యుల నీతికిని మరియు క్రీస్తుద్వారా పొందే నీతికిని తేడా మీకు తెలిసియుండాలి. కేవలము మానవ మంచితనమునకును మరియు ఒక వ్యక్తి దేవునిస్వభావములో పాలివాడైనందున కలిగే దానికిని తేడా తెలిసియుండాలి.
దేవునిప్రేమ మరియు మానవప్రేమ:
కృతజ్ఞత లేనివారికి దేవుడు ఉపకారియై యుండుటలో ఆయన ప్రేమను చూడగలము (లూకా 6:35). మానవప్రేమ ఎల్లప్పుడు ఇతరులనుండి గౌరవమును మరియు ప్రేమను మరియు బహుమానములను కోరును. కాని దైవికమైనప్రేమ దేనిని కోరదు. తాను ప్రేమించే వారి యొద్దనుండి అది ఏమియు కోరదు. మంచివారి మీదను మరియు చెడ్డవారిమీదను సమానముగా దేవుడు సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. మరియు చెడ్డవారిమీదను మరియు కృతజ్ఞతలేనివారి మీదను దేవుడు దయ మరియు కనికరములను చూపించుచున్నాడు. ఇటువంటి దైవికమైన ప్రేమలో మనము జీవించుట వలన మాత్రమే పరిసయ్యతత్వము నుండి రక్షించబడగలము.
పరిసయ్యులు మరియు మతస్థులు అన్ని విషయములలో వారితో ఏకీభవించే వారిని మాత్రమే ప్రేమించెదరు. అది మానవప్రేమ మాత్రమే గాని దైవికమైన ప్రేమ కాదని ఋజువు చేయుచున్నది. ఇదియే వారి కఠినత్వానికి మరియు అహంకారానికి కారణము. నిన్ను ప్రేమించే వారిని మాత్రమే, నీవు ప్రేమించి మరియు మేలు చేసినయెడల, మీరు పాపులు కంటే శ్రేష్ఠులు కాదని ప్రభువైన యేసు చెప్పారు. కమ్యూనిస్టులు కూడా ఒకరినొకరు ప్రేమించెదరు. ప్రతిఫలమును ఆశించకుండా, ఏవిధముగా ప్రేమించాలో ఆదాము సంతతికి తెలియదు.
నీవు దేవుని యందు మాత్రమే నిరీక్షణ యుంచవలెను (కీర్తన 62:5). అప్పుడు నీవు ఎన్నడును నిరాశపడవు. సమస్త నిరాశలు మరియు సణుగులన్నియు ఇతరుల యొద్దనుండి గౌరవములు మరియు బహుమానములను మొదలగువాటిని కోరుటవలన కలుగుచున్నవి. మీ చుట్టుప్రక్కలనున్న వారు మార్పు చెందవలెననిగాని లేక మంచిగా ప్రవర్తించవలెనని గాని లేక నిన్ను పట్టించుకొనవలెనని గాని కోరుటను నీవు ఆపివేసిన యెడల నీ జీవితము మహిమకరముగా ఉండును.
విస్తారమైన రాజ్యములోనికి ప్రవేశించుటకు ఇరుకుద్వారము:
ఒక సూది బెజ్జములో ఒంటె ప్రవేశించుట కంటే దేవుని రాజ్యములో ప్రవేశించుట కష్టమని ప్రభువైనయేసు చెప్పారు. అయినప్పటికిని అది ఒంటెకు అసాధ్యమైనప్పటికి అది అమీబాకు ఎంతో సులభము. దానియొక్క పరిమాణము మీద అది ఆధారపడును. మన దృష్టిలో మనము ఎంత చిన్నవారముగా ఉండెదమో, అంత సమృద్ధిగా దేవుని రాజ్యములో ప్రవేశించుదుము (2 పేతురు 1:11). దేవుని రాజ్యము ఎంతో ఎంతో పెద్దది. కాని దాని యొక్క ద్వారము సూదిబెజ్జము వలె ఇరుకుగా ఉన్నది. మనకున్న వరములను బట్టియు, మనకున్న తలాంతులను బట్టియు, శక్తిసామర్థ్యములను బట్టియు, బైబిలుజ్ఞానమును బట్టియు లేక ప్రభువుకొరకు చేసే పరిచర్యను బట్టియు మొదలగు వాటిని బట్టియు మనము గర్వించిన యెడల, అది మనలను పెద్దవారిగా చేయును. మీరందరు చక్కటివారును, తెలివైన వారును, వరములు కలవారును మరియు కొన్నిటిని సాధించిన వారుగాను మరియు లేఖనములను ఎరిగినవారుగాను మరియు ఆత్మానుసారమైన మనస్సుగలవారునై యున్నారు. వీటిని బట్టి మీలో మీరు ఎప్పుడైనను గొప్పవారై యుండకూడదని నేను ప్రార్థించుచున్నాను. ఎల్లప్పుడు మీ దృష్టిలో మీరు చిన్నవారై యుండి మరియు వారి మతమును బట్టిగాని లేక డినామినేషన్‌ను బట్టిగాని లేక వెలుగు లేకపోవుటను బట్టిగాని ఎవరిని తృణీకరించకూడదు. మరియు మీరు అత్యంతచెడ్డవారిని చూచినప్పుడు, నీతో నీవు ఈ విధముగా చెప్పుకొనవలెను, ''నేనేమై యున్నానో అది దేవుని కృపయే''.
ప్రభువైన యేసు ఎల్లప్పుడు తన గురించి మనుష్యకుమారుడనని అనగా సామాన్య మానవుడనని చెప్పుకున్నాడు. మీరు కూడా ఎల్లప్పుడు అందరి విషయములో సామాన్యమానవులుగా ఉండాలి. దేనినిబట్టి ఎప్పుడైనను ఉప్పొంగవద్దు మరియు మీ శక్తి సామర్థ్యములను గురించియు లేక మీరుసాధించిన వాటిని గురించియు ఎప్పుడైనను ధ్యానించవద్దు. మీరేమైయున్నారో దానినిబట్టి దేవుని కనికరముకొరకై కృతజ్ఞత కలిగియుండుడి.
రక్షణకార్యమంతయు దేవునియొక్క పనియై యున్నదని ఒప్పుకొనుము:
మానవుడు తనను రక్షించుకొనుట అసాధ్యమని ప్రభువైన యేసు చెప్పారు. దేవుడు మాత్రమే మనలను రక్షించగలడు. అనగా గత పాపములకు క్షమాపణ, ప్రస్తుతము పాపమును జయించుటకు కావలసినశక్తిని పొంది మరియు భవిష్యత్తులో పాపము లేని పరలోకములో ప్రవేశించెదము (మార్కు 10:26, 27). ''రక్షణ ప్రభువు యొద్దనుండి మాత్రమే కలుగును'' అని చేప కడుపులో ఉన్న యోనా ఒప్పుకొనినప్పుడు అతడు చేప కడుపునుండి బయటకు వచ్చెను (యోనా 2:9). తరువాత వచనములో ఇట్లున్నది, ''అప్పుడు ఆరిననేల మీద యోనాను క్రక్కివేయుమని దేవుడు చేపకు ఆజ్ఞాపించెను''.
రక్షణ అనగా మనలను మనము బాగుచేసుకొనుట కాదు. మనము బాహ్యముగా మాత్రమే మార్చుకొనగలము కాని దేవుడు మనలో పనిచేసినప్పుడు మన అంతరంగములో మార్పుకలుగును. రోమా పత్రికలో మనలో సువార్త పనిచేసే విధానము ప్రతి అధ్యాయములో చూడగలము.
1-3 అధ్యాయములు: మానవునియొక్క నిందారోపణ గురించి చెప్పబడింది.
4వ అధ్యాయము: విశ్వాసముద్వారా ఉచితముగా దేవునిచేత నీతిమంతులముగా తీర్చబడియున్నాము.
5వ అధ్యాయము: క్రీస్తురక్తముద్వారా ఉచితముగా దేవుని సన్నిధిలో ప్రవేశించుట.
6వ అధ్యాయము: మన ప్రాచీనపురుషుడు క్రీస్తుతో కూడా సిలువవేయబడెను కాబట్టి పాపములకు దాసునిగా ఉండనవసరము లేదు.
7వ అధ్యాయము: ధర్మశాస్త్రమునుండియు మరియు అక్షరానుసారమునుండి విడుదల పొందుట.
8వ అధ్యాయము: ఇప్పుడు మనము ఆత్మలో జీవించుచు, శరీరేచ్ఛలను ప్రతిదినము ఆత్మచేత చంపుట.
ఆ విధముగా జీవించుటద్వారా మనము క్రీస్తులో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37). కాని దీన్నంతటిని మనమే సాధించామని అనుకొని గర్వించే అపాయమున్నది. కాబట్టి మనము 9 నుండి 11 అధ్యాయములకు వెళ్లెదము.
9వ అధ్యాయము: దేవుని యొక్క సార్వభౌమాధికారము దేవుడు అబ్రాహాము యొక్క ఒక్క కుమారుని మాత్రమే అనగా ఇస్సాకును మాత్రమే ఏర్పరచుకొనియున్నాడు. ఇస్సాకు యొద్ద ఇద్దరు కుమారులలో ఆయన యాకోబును మాత్రమే ఏర్పరచుకొనియున్నాడు. వారిద్దరు పుట్టకముందే అనగా వారింకను పుట్టి మేలైనను కీడైనను చేయకముందే దేవుడు యాకోబును ఏర్పరచుకొనెను (రోమా 9:11). ఆ విధముగా దేవుడు నిన్నుకూడా ఏర్పరచుకొనియున్నాడు. ''కాగా ఇది పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలనననైనను కాదుగాని, కరుణించు దేవునివలననే అగును'' (రోమా 9:16). దీనిని నీవు ఎన్నడైనను మర్చిపోకూడదు.
10వ అధ్యాయము: దేవునియొక్క నీతి: నీ యొక్క నీతికార్యములు దేవుని దృష్టిలో మురికిగుడ్డ వంటివి (యెషయా 64:6). దేవుడు నీ హృదయములో అనగా నీ అంతరంగములో నీతిని కలుగజేయాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులు తమ స్వనీతిని స్థాపించ బూనుకొనియున్నారు కనుక వారు దేవునినీతిని పొందలేదు (రోమా 10:33).
11వ అధ్యాయము : దేవుని యొక్క నమ్మకత్వము.
ఇశ్రాయేలీయులు ఓడిపోయినప్పటికిని దేవుడు నమ్మదగినవాడైయున్నాడు. దేవుని వాక్యములో వాగ్ధానములును మరియు హెచ్చరికలును ఉన్నవి మరియు దేవుడు నమ్మకముగా వాటిని మనలో నెరవేర్చుచున్నాడు.
12వ అధ్యాయము: ''(12:1,2).
ఇప్పుడు మనము ఏమి చెప్పెదము. దేవునియొక్క వాత్సల్యములను బట్టి మన శరీరములను మరియు మన మనస్సులను ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకొనుట ద్వారా ఆయనచిత్తమును చేసెదము.
దేవుడు మనలను నరకానికి పంపిస్తాడనే భయముతో కాక ఆయనయొక్క వాత్సల్యమునుబట్టి సమస్తమును ఆయనకు ఇచ్చెదము.
నీ గత పాపములన్నింటిని, నీవు బాప్తిస్మము తీసుకొన్న తరువాత చేసిన పాపములన్నింటిని ఆయన క్షమించియున్నాడు.
నీ గత పాపములను ఆయన ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనడు.
నీ యొక్క దిగంబరత్వమును మరియు నీ యొక్క ఓటములను ఇతరులకు కనపడకుండా దాచియున్నాడు.
నీవు అర్హుడవు కాకపోయినప్పటికిని ఆయన మాటిమాటికి ఆయన నిన్ను ఆశీర్వదించుచున్నాడు.
అటువంటి దేవునిని నీవు ఏ విధముగా ఆసరగా తీసుకొనగలవు? తమ యొక్క యజమాని కఠినుడనియు మరియు విత్తనిచోట కోయుననియు, ఒక తలాంతు పొందినవాడు దానిని పాతిపెట్టెను. దేవుడు కఠినుడని అనుకొనువారు తమ జీవితములను పాడుచేసుకొని మరియు సమయమును వృథాచేసుకొనెదరు. ప్రతి విషయములో దేవుడు అతిశ్రేష్ఠమైన దానిని మీకు ఇవ్వవలెనని కోరే మంచిదేవుడని దేవునిని మీరు తెలిసికొన్నందుకు దేవునికి వందనములు.
13వ అధ్యాయము: దేవునియొక్క సువార్తకు లోబడి, దేవుడు వారిపై ఉంచిన అధికారులకు లోబడుటయే దేవునికి భయపడుచున్నామనుటకు గుర్తు.
14-15 అధ్యాయములు: క్రీస్తు నిన్ను చేర్చుకొనిన ప్రకారము ఇతర డినామినేషన్లనుండి వచ్చిన విశ్వాసులను అభిప్రాయభేధములున్నప్పటికిని వారిని చేర్చుకొనవలెను. పరిసయ్యులను మరియు అహంకారులైన క్రైస్తవులను రోమా 14 మరియు 15 అధ్యాయముల ద్వారా బయలుపరచును. అనేకమంది విశ్వాసులతో కలిసి నీవు పరిచర్యచేయలేక పోవచ్చుగాని ఆయనప్పటికిని నిన్ను చేర్చుకొనిన ప్రకారము, నీవు వారిని చేర్చుకొనవలెను.
16వ అధ్యాయము: సాతాను మన పాదముల క్రింద శీఘ్రముగా తొక్కబడుననే (16:20) సందేశముతో చివరగా సువార్త ముగియుచున్నది.
రోమా 16:20 వచనమువరకు నిన్ను నడిపించుటకు నీవు పరిశుద్ధాత్మకు అనుమతించినయెడల, ఆశీర్వదింపబడెదవు.
అనర్హులకు దేవునియొక్క ఆశీర్వాదములు:
ప్రభువైనయేసు చెప్పిన అనేక ఉపమానములు మరియు సువార్తలలోని ఆయన జీవితములో జరిగిన సంఘటనలన్నియు ఒకే ఒక సత్యమును బోధించుచున్నవి. దేవుడు మనకు అర్హతలేనివాటిని ఇచ్చుచున్నాడు. మనయొక్క అర్హతలనుబట్టి దేవునియొక్క ఆశీర్వదములు పొందము. దీనిని మనము స్పష్టముగా అర్థము చేసుకొననియెడల, మనము బైబిలు చదవనప్పుడుగాపి లేక పాపములో పడినప్పుడుగాని మనముదేనినైనను దేవుని యొద్దనుండి పొందుటకు అర్హులముగాదు అని అనుకొని, విశ్వాసముతో ప్రభువైనయేసు నామములో ప్రార్థించలేము. ఇక్కడ కొన్ని ఉదాహరణలు
తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తనకు అర్హతలేకపోయినప్పటికిని ఎంతో ఆశీర్వదింపబడ్డాడు (లూకా 15).
రాజు కుమారుని యొక్క పెళ్లి విందునకు వీధులలో ఉన్న అడుక్కొనే బిక్షగాళ్లు ఆహ్వానించబడిరి మరియు వారికి ఉచితముగా వివాహవస్త్రము ఇచ్చుటద్వారా వారికి అర్హతలేనప్పటికి ఎంతో ఆశీర్వదింపబడిరి (మత్తయి 22).
చివరిగంటలో వచ్చిన పనివారికి మొదటగా జీతము ఇవ్వబడెను (మత్తయి 20).
సిలువలో చనిపోవుచున్న దొంగ ఘోరపాపములో జీవించినప్పటికిని ఎన్నడైనను ఒక్క పాపము కూడా చేయని యేసుతో కూడా ఒకే రోజున పరదైసులో ప్రవేశించెను.
దయ్యములచేత పట్టబడి మరియు వ్యభిచారిగా ఒకప్పుడు ఉన్న మరియ మగ్దలేనుకు పునరుత్థానుడైన ప్రభువైన యేసును మొదటిగా చూచే ధన్యత కలిగింది (యోహాను 20).
అర్హతలేని వారియెడల యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు (యాకీర్తన 10:38 లివింగు).
నీ యొక్క సొంత రక్షణను కొనసాగించుకొనుము:
యాకోబు 1:19-25లో ''ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై యుండవలెనని వ్రాయబడియున్నది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు (యాకోబు 1:20). కాబట్టి విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును గడ్డివలె పెరగకుండునట్లు జాగ్రత్తపడుము (21వ వచనము). తప్పుడు వైఖరులన్నింటిని సమూలముగా పెరికివేయవలెను. అప్పుడు దుష్టత్వము పెరగదు.
మనము వాక్యము వినిన తరువాత, దానిని మర్చిపోయేవారముగా ఉండవచ్చును లేక మన రక్షణను కొనసాగించవచ్చును (25వ వచనము). అద్దమనే దేవుని వాక్యములో మనము చూచుకొనిన తరువాత సులభముగా మర్చిపోవచ్చును. దేవుడు మనతో మాట్లాడిన వాటిని మన హృదయములో భద్రపరచుకొని మరియు కొనసాగవలెను.
1 కొరింథీ 13లో, మనము చదివి మరల మరల ధ్యానించవలసిన విషయములు చాలా ఉన్నవి. అప్పుడు మోసపోకుండా కాపాడబడెదము. ఈ అధ్యాయములో చెప్పబడిన ప్రేమ మనలో లేనియెడల మనకున్న జ్ఞానము, ఆసక్తి, త్యాగము మరియు వరములన్నియు దేవుని దృష్టిలో సున్నాఅగును. మనయొక్క ప్రేమ పక్షపాతము లేనిదిగాను మరియు మంచితనముతో నిండుకొనిన పరిపూర్ణమైనప్రేమను పొందేవరకు మనము అద్దములో చూచుకొని మరియు మన కొదువను చూడాలి.
క్రీస్తురక్తము యొక్క శక్తి:
సహోదరులమీద నిందారోపణచేసే అపవాదిని జయించుటకు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి మరియు దేవునిచేత అంగీకరించబడి, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి ధైర్యముగా ప్రవేశించాలి (పక్రటన 12:10,11).
క్రీస్తు యొక్క రక్తము ఎంత శక్తివంతమైనదంటే, ప్రభువైన యేసు మరణించిన రోజు - ముప్పైమూడున్నర సంవత్సరములలో ఒక్క పాపము కూడా చేయని ప్రభువైన యేసు మరియు తన జీవితకాలమంతయు తుదిశ్వాస విడిచేవరకు పాపములో జీవించి మారుమనస్సు పొందిన దొంగయు ఒకేసారి పరదైసులోనికి నడిచిరి. వారిద్దరు నీతిమంతులుగా పరదైసులోనికి నడిచివెళ్లిరి. దీనిని వినిన వారు అనేకులు దేవుని కృపను ఆసరాగా తీసుకొనవచ్చును. వారిని ఆ విధముగా చేయనిమ్ము. ఆవిధముగా వారు తమ్మునుతాము నాశనము చేసుకొనెదరు కాని యథార్థవంతులమైన మనము ఇటువంటి వర్తమానము వినిన తరువాత ఇటువంటి క్షమించుచు కృపచూపించు ప్రభువునకు మరిఎక్కువగా సమర్పించుకొని మరియు ఒక్కసారి కూడా పాపము చేయవద్దని కోరెదము. దేవుని యొక్క అనుగ్రహము మనలను మారుమనస్సు పొందుటకు ప్రేరేపించును (రోమా 2:4). దేవుడు మన జీవితములలో అద్భుతములు చేయునట్లు ఆయనను విశ్వసించెదము. మరియు అవిశ్వాసమువలన గాని లేక అయోగ్యులమని అనుకొనుటద్వారాగాని దేవునిని పరిమితి చేయకూడదు.
తమ సమాజములోలేని విశ్వాసులను అనేకమందివిశ్వాసులు త్వరపడి విమర్శించుకొనుటను బట్టి చింతించుచున్నాను. అటువంటి విశ్వాసులు తమయొక్క గత పాపములన్నింటినిలో నుండి పవిత్రపరచబడియున్నామని మరచిపోయెదరు. యోహాను 8వ అధ్యాయములో వారు ఆ స్త్రీ మీద రాళ్లువేయుటకు సిద్ధముగా ఉన్నారని ప్రభువు మనకు చూపించాడు. ప్రభువు ఆమెకు ఎదురుగా నిల్చుండి మరియు ఆ రాళ్ళతో కొట్టబడి నన్ను చంపుడి అని చెప్పవచ్చు. కలువరిలో ప్రభువు దానినే చేశాడు. దేవుని మరియొక బిడ్డమీద రాళ్లు వేసినట్లయితే అది ప్రభువైన యేసు మీద వేసినట్లే. దీనిని ఎప్పుడైనను చేయకుము.
వెనుకున్న వాటిని మర్చిపోవుట:
ప్రతిదినము మనము పౌలు చేసిన విధముగా చేయవలెను. ''(ఫిలిప్పీ 3:13, 14). అనగా నీవు సాధించిన వాటన్నింటిని మరియు ఆ దినమువరకు పొందిన ఓటములన్నింటిని మరచిపోవాలి. అప్పుడు నీవు ఒకే విషయముగురించి ఆలోచించాలి. ప్రభువైనయేసువలె రూపాంతరము చెందుటకు, నేను ఎంతగా అభివృద్ధి చెందాలి. అది పరిణితి చెందిన క్రైస్తవునియొక్క గుర్తు అని పౌలు చెప్పుచున్నాడు (ఫిలిప్పీ 3:15).
ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సాతానును సిగ్గుపరచును గాక. ఇతరులనుండి తృణీకరింపబడే సంవత్సరముగా ఉండవచ్చును. మీకు హానిచేసిన వారందరిని గురించి మరియు వారిని ఆశీర్వదించి ప్రతిదినము దేవునియెడల భయభక్తులతో జీవించుచు, ప్రభువుతో సన్నిహిత సహవాసము గల సంవత్సరముగా ఉండునుగాక.
నిందించుట మరియు వెళ్లగొట్టుట అని నేను ఎందుకు చెప్పియున్నానంటే అంత్యదినములలో అది మరిఎక్కువగా జరుగును. ప్రభువైన యేసు ఇట్లన్నారు, ''(మత్తయి 10:25). తమ సమాజమునకు చెందని విశ్వాసులను అన్ని చెడ్డ పేర్లతో పిలిచేవారు ప్రతియొక్క క్రైస్తవసమాజములో ఉన్నారు.
మీ సమస్తమును బట్టి నేను గర్వించుచున్నానని, నా కుమారులైన మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. మీరు నా కుమారులైనందున క్రైస్తవుల నుండి నాకు వచ్చిన ఒత్తిడిలను బట్టియు వ్యతిరేకతను బట్టియు మీరు ఎంతో ఒత్తిడికి గురి అయివున్నారు కాని ఆ ఒత్తిడిని జయించుటకు దేవుడు మీకు కృపను అనుగ్రహించి మరియు నన్ను మరియు మిమ్ములను ద్వేషించిన వారిని ప్రేమించేటట్లు దేవుడు చేశాడు. దానిని బట్టి ప్రభువునకు స్తోత్రములు.
దేవుడు మిమ్ములను చూచినప్రకారమే నేనును చూచుచున్నాను. అనగా క్రీస్తులో మీరు నీతిమంతులుగా చేయబడిరనియు మరియు ఎప్పుడైనను ఒక్కసారి కూడా పాపము చేయనివారిగాను, పూర్ణహృదయము గల విశ్వాసులందరిని నేనును చూచుచున్నాను. తండ్రిచేత మనము అంగీకరించబడినందుకు మనము సంతోషించినట్లే, ఇతర విశ్వాసులు కూడా తండ్రిచేత అంగీకరించబడినందుకు మనము సంతోషించాలి. తన జీవితకాలమంతయు హంతకుడిగా జీవించినవ్యక్తితో (అనగా అతడు సిలువవేయబడు వరకు) యేసు పరదైసులో నడిచెను. ఇదియే కృప. మానవుని పాపము ఎంత ఎక్కువగా విస్తరించునో, దేవుని యొక్క కృప అంతకంటే ఎక్కువగా విస్తరించును.
నీతిమంతులుగా తీర్చబడుట:
ఈ మధ్య కాలములో సి.ఎఫ్.సిలో ప్రతి ఒక్కరూ చదువుకొనుటకు ముద్రించిన పేపరు ఇచ్చియున్నాము:
''ఓ ప్రభువా, నా జీవితములో నీకు బాధాకరముగా ఏదైనాయున్న యెడల నాకు చూపించుము'' (కీర్తన 139:24 లివింగు).
ఈ ప్రార్థన గతము గురించి కాదుగాని ప్రస్తుతము గురించి యున్నది. మన గతము గురించి దుష్టులు మరియు సాతాను మరచిపోనప్పటికిని, దేవుడు మన గతమంతటిని క్షమించుటయే కాక వాటిని తీసివేసి ఇక ఎన్నడునూ జ్ఞాపకము చేసుకొనడు. ఇప్పుడు మనము ప్రస్తుత విషయమునే సరిచేసుకొనవలెను. ప్రభువు యొక్క నామము, ''నేను ఉన్నవాడను'' అంతేకాని నేను ఒకప్పుడు ఉండిన వాడను కాదు (నిర్గమకాండము 3:14). కాబట్టి ప్రభువు ఎప్పుడూ మనతో గతము గురించికాదు గాని ప్రస్తుత విషయమే నిర్వహించును.
ప్రభువైన యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడియున్నాము (మనము ఒక్కసారిగా పాపము చేయనివారిగా దేవుడు చూచును) అను సత్యము మనలో లోతుగా వేరుపారాలి (రోమా 5:9). దేవుడు మనలను నీతిమంతులుగా ప్రకటించియున్నాడు. అంతేగాని కేవలము నిర్దోషులముగా కాదు. వీటి రెండింటి మధ్య తేడాను గమనించండి. నిర్దోషిగా తీర్చుట అనగా దేవుడు మనలను నేరస్థులుగా ప్రకటించినప్పటికిని ఆయన పాపక్షమాపణను ప్రకటించును. ఇది సంపూర్ణ సువార్త కాదు కాని నీతిమంతులుగా తీర్చబడుట అనగా, మనము నేరస్థులు కానేకాదు కాని దేవునివలె నీతిమంతులము, పవిత్రులము మరియు పరిశుద్ధులము అయియున్నామని దేవుడు మనలను ప్రకటించుచున్నాడు. ఇప్పుడు మనకు క్రీస్తే నీతియైయుండి, క్రీస్తు యొక్క నీతిచేత కప్పబడియున్నాము. యథార్థముగా లేని విశ్వాసులు దీనిని పాపమును చేయుటకు హేతువుగా చేసుకొనెదరని అనేకులు దీనిని బోధించుటకు భయపడుదురు. కాని దీనిని బట్టి యథార్థపరులైన విశ్వాసులు ఈ శుభవార్తకు దూరముగా ఉండెదరు. మనము నీతిమంతులుగా తీర్చబడియున్నామను సత్యములో మనము లోతుగా వేరుపారనియెడల, క్రైస్తవ జీవితములో మనము అభివృద్ధి పొందలేము. మనము ఎల్లప్పుడూ ప్రయాసపడుచు భారము మోయుదము.
పేతురు యొక్క ఉదాహరణను గమనించండి. ప్రభువుని నేను ఎరుగనని మూడుసార్లు బొంకి ప్రభువును తృణీకరించిన పేతురు మూడు వారముల తరువాత నిలువబడి రెండుసార్లు ఈవిధముగా చెప్పాడు: ''మీరు యేసును నిరాకరించిరి, మీరు యేసును నిరాకరించిరి'' (అపొ.కా. 2:13,14). రెండు నెలలు క్రితమే తానుచేసిన పాపమునకు వ్యతిరేకముగా అతడు ఎంత ధైర్యముగా బోధించియున్నాడో చూడుడి. అవును పేతురు తన గతమంతటిని వెనుకకు వేసి మరియు క్రీస్తుయొక్క రక్తములో ఉన్న శక్తి ద్వారా నీతిమంతుడుగా తీర్చబడిన పాపిగా ఉన్నాడు. దేవుని కృప ఎంతో అపరిమితముగా విస్తరించెనని అతడు విశ్వసించాడు (రోమా 5:20). ఈ యొక్క వర్తమానముతో క్రొత్త సంవత్సరమును ఆరంభించెదము.
మార్పు చెందే నూతనసంవత్సరము - లెక్కలు అన్నిటిని సరిచేసుకొనుము:
యాకోబు 4:14, 15లో రేపు ఏమి జరుగునో మనకు తెలియదనియు రేపటికి మనము జీవించెదమో లేదోయని చెప్పబడింది. కాబట్టి గత సంవత్సరమంతయు ప్రతీ దినము దేవుడు మనలను కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించెదము. ఇప్పుడు ఈ నూతన సంవత్సరములో ఏ రోజుకు ఆ రోజు జీవించాలి. ఈ సంవత్సరములో గత సంవత్సరము కంటే ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరినయెడల, అప్పుడు మనము ఈ ఆజ్ఞకు లోబడి జీవించాలి. ''ప్రతిదినము యెహోవా యందు భయభక్తులను కలిగియుండుము'' (సామెతలు 23:17). ఈ విధముగానే మనము అభివృద్ధి చెందగలము. మనము భవిష్యత్తు గురించి అనేకప్రణాళికలు వేసుకున్నప్పటికి, రేపటి గురించి చింతించకూడదు.
ఒక సంవత్సరం ముగించే ముందుగానే దేవునితోను మరియు మనుష్యులతోను అన్ని విషయములను సరిచేసుకోవాలి. మనము ఎవరికీ అచ్చియుండలేదనియు మరియు అవసరమైనవాటన్నిటిని సరిచేసుకున్నామనియు నిశ్చయపరచుకొనవలెను. మరియు మనకు హాని చేసిన వారందరిని క్షమించవలెను.
పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రికలో అద్భుతమైన వర్తమానము ఉన్నది. అక్కడ పౌలు ఒనేసీము గురించి ఫిలేమోనును బ్రతిమాలుచున్నాడు. ఫిలేమోను దగ్గరనుండి ఒనేసీము దేనిని దొంగలించినప్పటికిని, దానిని తానే చెల్లించెదనని పౌలు చెప్పుచున్నాడు. నీకేమైనా అతడు ఋణమున్నయెడల అది నా లెక్కలో చేర్చుమని పౌలు చెప్పుచున్నాడు (18వ వచనము). ప్రభువుకూడా మనతో దానినే చెప్పుచున్నాడు: ''నా శరీరములోని సహోదరులుగాని సహోదరీలుగాని నీకు హాని చేసి మరియు ఏదైనా ఋణపడి యున్నయెడల, దానిని నా లెక్కలో చేర్చుము, దానిని నేను తీర్చెదను''. కాబట్టి మనకు హాని చేసిన ప్రతిఒక్కరిని మనము విడిపించవలెను. నూతన సంవత్సరములోనికి దేనినైననూ తీసుకొనివెళ్ళకూడదు.
తీర్పువస్తుందనే భయముతో గాత లేక దేవుడు మనకొరకు చేసిన ముగించిన దానినంతటిని బట్టి కృతజ్ఞతతో ప్రభువునిసేవించి మరియు ఆయన ఆజ్ఞలకు లోబడెదము. పాతనిబంధనలో మొదటి విధానమున్నది. క్రొత్త నిబంధనలో కృతజ్ఞతతో చేసెదము. ఉదాహరణకు దేవుడు మనలను అనేకసార్లు ఎంతో క్షమించియున్నాడు గనుక మనము కూడా ఇతరులను క్షమించెదము. అంతేగాని క్షమించకపోతే శిక్షించబడతామనే ఉద్దేశ్యముతో కాదు.
హిజ్కియా గురించి ఈవిధముగా చెప్పబడింది, ''అతడు తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదు'' (2 దినవృత్తాంతములు 32:25). అనేక సంవత్సములనుండి ప్రభువు యొద్దనుండి మనము పొందినదానినిబట్టి మనము మేలు చేయవలెను.
ఇశ్రాయేలీయులు వారానికి ఒక్కరోజే విశ్రాంతి దినము కలిగియుండిరి. మనకు ప్రతిదినము విశ్రాంతిదినము. వారు 50 సంవత్సరములకు ఒకసారి హిత వత్సరము కలిగియుండగా (7I7 సంవత్సరములు-లేవీయకాండము 25) మనము ప్రతి సంవత్సరము హితవత్సరము కలిగియుండవలెను. ఆవిధముగా మనము ప్రతిఒక్కరిని క్షమించి వారిని విడిపించాలి. ''అది ఎంతో సంతోషకరమైన సంవత్సరము'' అని లేవీయకాండము 25:11 లివింగు బైబిలులో చెప్పబడియుంది. హితవత్సరము అనగా సంతోషము. నీకు క్రొత్త సంవత్సరము ఆవిధముగా ఉండవలెను.
దేవుడు మన గత పాపములన్నిటిని క్షమించుటయే గాక మరి వాటన్నిటిని ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనడు. మనము కూడా అందరి పాపములు క్షమించి మరియు వాటిని జ్ఞాపకము చేసుకొనకూడదు. ఆ స్థాయికి మనము చేరుటకు, సాతాను మనకు గుర్తుచేయుచున్నప్పటికిని మన గతమును మరియు ఇతరులయొక్క గతమును మరచిపోవాలి. ఒక వ్యక్తిని గాయపరిచే విధముగా అతని యొక్క గత పాపములు గురించి మనము మాట్లాడము ఎందుకనగా మనము ఇతరులను ఏ కొలతతో కొలిచెదమో అదే కొలతతో దేవుడు మనలను కొలుచును. కాబట్టి ఆయన మనయెడల కృప చూపించును.
దీనత్వము మరియు విశ్వాసము:
నీవు ఎల్లప్పుడు దీనుడవైయున్నయెడల, దేవుడు నీకు ఎంతో సహాయపడును. ఒక దీనుడు ఇతరులు తనకు చేసిన కీడును గుర్తుంచుకొనడు. గాని ఇతరులు తనకు చేసిన మేలులు ఎల్లప్పుడు గుర్తుంచుకొనును. అతడు ఇతరులకుచేసిన మేలులు కూడా గుర్తుంచుకొనడు. ఒక దీనుడు తన శక్తి సామర్థ్యములను బట్టిగాని లేక భూసంబంధమైన అర్హతలనుబట్టిగాని లేక తాను సాధించినదానిని బట్టిగాని గర్వించక మరియు ఇతరులు ముఖము చిన్న బుచ్చుకొనునట్లు చేయడు.
నీకు విశ్వాసముంటేనే దేవుడు నీకు సహాయపడును. నీకు అర్హతలేని వాటిని దేవుడు నీకు దయచేయవలెనని నీవు విశ్వసించవలెను. ఇదియే విశ్వాసము. ప్రభువు పునరుత్థానుడైన తరువాత మొదటిసారి తనను చూసే ధన్యతను, దయ్యము పట్టిన మరియ మగ్దలేనేకు ఇవ్వవలెనను తలంపు మనకు వచ్చియుండెడిది కాదు. దేవుడు మాత్రమే ఆవిధముగా ఆలోచించును. నీవు దేనికైతే అర్హుడవో దానిని మాత్రమే దేవుడు నీకిచ్చునని నీవు నమ్మినయెడల నీవు దేవునిని పరిమితిచేయుచున్నావు. దేవుడు ఎంతో మంచిదేవుడు. దీనిని మనము ఆసరాగా తీసుకొనము గాని దీనినిబట్టి ఆయనను మరి ఎక్కువగా సేవించెదము.
నీకు ఆటంకముగా నున్న పర్వతములను కూడా విశ్వాసము ద్వారా తొలగిపొమ్మని ఆజ్ఞాపించగలవు. ''నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను'' (ఫిలిప్పీ 4:13).
ప్రతి విశ్వాసియెడల దేవునికి ఒక సంకల్పము ఉన్నది:
నీవు ఏదొక ప్రాంతములో దేవునియొక్క ద్రాక్షతోటలో పనిచేయుటకు నీవు చేయుచున్న పనులద్వారాను మరియు నీవు చదువుచున్నప్పుడును ఆయన నిన్ను సిద్ధపరచుచున్నాడని మరచిపోకుము. ఒక యౌవనస్తుడు దీనిని గుర్తించుట ఎంతో ముఖ్యమైయున్నది. నేను నీ వయస్సులో ఉన్నప్పుడు, నా జీవితములో దేవునికి ఒక సంకల్పము ఉన్నదని గుర్తించాను. మరియు నేను క్రొత్తగా జన్మించిన తరువాత కూడా అనేకసార్లు ఓడిపోయినప్పటికిని మరియు వెనుకంజ వేసినప్పటికిని దేవుడు నా జీవితములో కార్యము చేసియున్నాడు. ఇప్పుడు నా గత జీవితమును చూచుకొనునప్పుడు నేను అనేక పొరపాట్లను చేసి ఓడిపోయినప్పటికిని, నాకు తర్ఫీదు ఇచ్చినందుకు దేవునికి వందనములు చెప్పుచున్నాను. లోకములో ఉన్న పాపులెవరిని ఎన్నటికిని చిన్నచూపు చూడకూడదని నా ఓటముల ద్వారా నేను నేర్చుకొనియున్నాను. ఒక పాపినిగాని లేక ఒక తప్పిపోయిన వ్యక్తినిగాని తృణీకరించుట నాకు అసాధ్యము. దేవుడు ఆ కృపా కార్యమును నాలో చేసినందుకు దేవునికి వందనాలు.
రాబోయే కాలములో దేవుడు మీ కొరకు పరిచర్య కలిగియున్నాడు. గనుక మీరు ఎల్లప్పుడు దీనత్వములో నిలచియుండి, ఏ పరిస్థితిలోనైనను మిమ్ములను మీరు సమర్థించుకొనక, ఎల్లప్పుడు దేవునిసహాయం కొరకు మొఱ్ఱపెట్టుచు మరియు మీలో ఉన్న నటనంతయు ద్వేషించుచు మీరు సిద్ధపడుడి. కీర్తన 73:25ను మీ సాక్ష్యముగా ఉండనియ్యుడి - సంపూర్ణముగా ప్రభువైన యేసుకు సమర్పించుకొనుడి.
''నేను నా తండ్రిపనుల మీద నుండవలయును'' (లూకా 2:49) అని 12 సంవత్సరముల వయస్సులో ప్రభువైన యేసు చెప్పిన దానిని బట్టి నేర్చుకొనవలెను. ఆయన దేవుని పరిచర్య విషయంలో బాధ్యత కలిగినవాడై మరియు ఎల్లప్పుడు దానిని మొదటిగా ఉంచెను. 12 సంవత్సరముల వయస్సులోనే ఆయన ఆ విధముగా చేసినప్పుడు, మీరు మీ వయస్సులో ఇంకా చేయవలసియున్నది. అనగా దేవునిరాజ్యమును మరియు ఆయన నీతిని మొదటిగా వెదకుచు పాపము విషయములోను భూసంబంధమైన విషయములలోను ఈ వైఖరి మారవలెను. బైబిలు చదివే సమయముగాని లేక ప్రార్థించేసమయముగాని ప్రాముఖ్యము కాదు.
మీ చదువులలో మీరు పడుచున్న ప్రయాసంతటిలో ప్రభువు మీకు కృప ఇచ్చును గాక. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో గాని లేక మరి ఏ విషయములోనైనను మీరు ఆగిపోయిన యెడల దేవుని సహాయం కొరకు ప్రార్థించి ఆయనను వెదకుడి. ఇటువంటి సమయములలోనే మీ దేవుడు మీ జీవితములలోని ప్రతి విషయము గురించి శ్రద్ధ వహించుచున్నాడని ఋజువు పరచగలరు.
పరిశుద్ధపరచబడుట - ఇది జీవితకాలమంతయు కొనసాగే ప్రక్రియ:
నీతిని వెదకువారందరును పరిసయ్యుతత్వములోను మరియు ఆత్మీయ గర్వములోను పడిపోవు ప్రమాదమున్నది. కాబట్టి ఈ రెండు చెడ్డ విషయములు అందరిలోను ఉన్నవి. ఇవి మనకు దూరముగా లేవు. వీటిని ఇతరులలో చూచుట చాలా సులభము కాని మనలో ఉన్న వీటిని కనుగొనుట చాలా కష్టము. అనేకమంది యౌవనస్తులు కృత్రిమముగా ఉండుటద్వారా ఆత్మీయమరణమును పొందెదరు.
నీవు పోరాడుచున్న అనేక విషయములలో పాపము సంపూర్ణముగా చంపబడునట్లు నీవు పనిచేయవలెను. పైకి జయముగా కనబడే దానితో తృప్తిపడకూడదు. ప్రతి కోరిక ఒక ఉల్లిపాయవలె ఉన్నది. ఇందులో అనేకపొరలు ఉండును. నీవు పైనున్న పొరను తీవ్రముగా తీసివేయనియెడల, దాని క్రిందనున్న పొరను చూడలేవు. పరిశుద్ధత అనగా జీవితకాలమంతయు యేసువలె ఆయన చూచిన విధముగా చూచుట, సిరిసంపదలను ఆయన చూచిన విధముగా చూచుట, ఆయన తన యొక్క శత్రువులను చూచిన విధముగా మీరు మీ శత్రువులను చూచుట మొదలగునవి. ఆ గురియొద్దకు చేరుటకు జీవితకాలమంతయును పట్టును. కాని ఆ గురియొద్దకు వెళ్ళుటకు మీరు ప్రయత్నించవలెను. ఈ క్రింద వచనములలో ఉన్న అర్థము ఇదియే, ''సంపూర్ణులమవుటకు సాగిపోదుము'' (హెబీ 6:1). మరియు ''ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును'' (1 యోహాను 3:3). మరియు ''సహోదరులారా, నేనిదివరే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను'' (ఫిలిప్పీ 3:13,14). నీవు ఈ పోరాటమును విడచినట్లయితే శత్రువు జయించే అవకాశము ఉన్నది. 1 పేతురు 4:1,2 చెప్పిన రీతిగా మీరు ఎల్లప్పుడు శరీరములో శ్రమపడుచున్నయెడల అనగా రహస్యముగా మీ స్వజీవమును ఉపేక్షించుకొనుచున్నయెడల, మీరు పాపముచేయుట మానెదరు.
ఇతరులకు రాని శోధనలు నీకు వచ్చునని నీవు ఎప్పుడైనను తలంచవద్దు. ఈ అబద్ధము ద్వారా అపవాదిచేత మోసగించబడవద్దు. ఎందుకనగా అది నిన్ను నిరాశపరచును.
1 కొరింథీ 10:13లో ''సాధారణముగా మనుష్యులందరికి కలిగే శోధనలే మనకు వచ్చును. కాని దేవుడు తన వాగ్ధానము నెరవేర్చును. మరియు నీ శక్తికి మించిన శోధన ఆయన నీకు అనుమతించడు. కాని శోధన వచ్చినప్పుడు దానిని జయించుటకు శక్తిని (కృప) నిచ్చును మరియు నీవు ఆ విధముగా తప్పించుకొనెదవు. తప్పించుకొనలేని శోధన రాదు'' (లివింగు బైబిలు, గుడ్‌న్యూస్ బైబిలు).
సాధారణముగా మనుష్యులందరు తమ స్వచిత్తమును చేయవలెనని శోధించబడెదరు. పాపములో అనేక విషయములు ఉండును. అబద్ధము చెప్పుటగాని లేక కోపించుటగాని ఇతరులను ద్వేషించుటగాని సణుగుటగాని, వ్యభిచరించుటగాని లేక ఏ పాపమైనను దేవుని చిత్తము కాక తమ స్వచిత్తమును చేయుటకు శోధించబడెదరు. కాని ఆయన దేవునిసహాయము కొరకు ప్రార్థించి శోధనను ఎదిరించాడు (హెబీ 5:7). కాబట్టి ఆయన ఒక్కసారి కూడా పాపము చేయలేదు (యోహాను 6:38). ఆయన మాదిరిని మనము వెంబడించవచ్చును.
కాబట్టి పాపములన్నియు వేరువేరుగా ఉన్నవని చూడవద్దు. కొందరు ఒక విషయంలో శోధించబడుదురు మరియు ఇతరులు వేరొక విషయములో శోధించబడుదురు. కాని ప్రతిసారి, తమ స్వంత చిత్తముచేయుట ద్వారానే పాపము చేయుదురు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శరీరేచ్ఛలను అనగా స్వచిత్తమును చంపివేయుటకు దేవునికి ప్రార్థించుము (రోమా 8:30 మరియు గలతీ 5:25).
ప్రభువైనయేసు యెడల భక్తిశ్రద్ధలు కలిగియుండుటద్వారా జయించగలము మరియు ఆ విధముగా అన్ని సమయములలో కాపాడబడుదుము. ఎల్లప్పుడు మీరిట్లు చెప్పవలెను, ''నిన్ను తప్ప భూమిమీద మరిదేనిని కోరుకొనను'' (కీర్తన 73:25). ప్రభువైన యేసుయెడల ఉన్న ప్రేమ నీ హృదయములోనుండి ఇతర ప్రేమలను మరియు దురాశలను వెళ్ళగొట్టును. మీరిట్లు చెప్పాలి, ''నేను ఎల్లప్పుడు ప్రభువును నా యెదుట ఉంచుకొనుచున్నాను (యోసేపు చెప్పినట్లుగా అప్పుడు పాపముచేయుటకు భయపడుదుము) మరియు ఆయన ఎల్లప్పుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు (నేను పాపము చేయకుండా నాకు కృపనిచ్చుటకు)'' (కీర్తన 16:8). ఎల్లప్పుడు జయించుటకు ఇదియే రహస్యము.
దేవునికొరకు నిలచుట:
దేవుడు ఒక స్థలములో తన కొరకు నిలబడేవ్యక్తి కొరకు ఎల్లప్పుడు చూచుచున్నాడు (యెహెజ్కేలు 22:30). ఒక సమయములో ఆయన హనోకును, తరువాత నోవహును, తరువాత అబ్రాహామును మరియు తరువాత ఏలీయాను మరియు బాప్తిస్మమిచ్చు యోహానును ఆయన కనుగొన్నాడు.
బబులోనులో ఆయన దానియేలును కనుగొన్నాడు. దానియేలు స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యా (తరువాత వీరు షడ్రకు, మేషాకు, అబెద్నెగోలు అని పిలువబడ్డారు) అను వారి గురించి దానియేలు 1:7లో చెప్పినప్పటికిని దానియేలు 1:8లో దానియేలు ఒక్కడే ''తన్నుతాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెనని'' వ్రాయబడియున్నది. తరువాత మాత్రమే మిగిలిన ముగ్గురు ధైర్యము తెచ్చుకొనియున్నారు. ఈనాటి విశ్వాసులలో, తమకు తామే ప్రభువు కొరకు నిలచుటకు ధైర్యము లేని హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారు అనేకులు ఉన్నారు. కాని వారి మధ్యలో దానియేలు లాంటివారు ప్రభువు కొరకు నిలచినయెడల, వారు కూడా ధైర్యము తెచ్చుకొని నిలచెదరు. కాబట్టి నీవు ఎక్కడున్నప్పటికిని ప్రభువు కొరకు దానియేలు వలె ఉండుటకు నిర్ణయించుకొనుము.
మరొక వైపున కీడు విషయములో కూడా అలాగే చూచెదము. పరలోకములో ఏదొక విషయములో కొంత అసంతృప్తితో ఉన్న దూతలు ఉండిరి. కాని లూసిఫరు తిరుబాటు చేయువరకు, వారు తిరుగుబాటు చేయుటకు ధైర్యము చేయలేకపోయిరి. లూసిఫరు తన తిరుగుబాటును వ్యక్తపరచినప్పుడు, వెంటనే మూడవవంతు దేవదూతలు అతనితో కలసిరి (పక్రటన 12:4). అప్పుడు లూసిఫరుతో పాటు అనేకలక్షల మంది దూతలు దేవునిచేత వెళ్ళగొట్టబడి మరియు దయ్యములుగా మారి అనేకమందిని పట్టుచున్నారు. దేవుని యొక్క నిత్య నియమము ఏమనగా ''ఆయన గర్విష్టులను వ్రెళ్ళగొట్టి మరియు దు:ఖితులను దీనులను నీ మధ్య నుండనిత్తును'' (జెఫన్యా 3:11,12). ఆ విధముగా ఆయన గతములో పరలోకమును శుద్ధిచేసెను. మరియు ఈనాడు సంఘమును కూడా ఆయన ఆవిధముగా పవిత్రపరచుచున్నాడు.
ఇప్పుడు ప్రపంచములో రెండు ఉద్యమములు నడుచుచున్నవి. ప్రభువు కొరకు ఇద్దరు లేక ముగ్గురిని సమకూర్చే దానియేలులు మరియు అపవిత్రతలోనికిని మరియు అధికారమునకు తిరుగుబాటు చేయుటకును మరియు దేవునియొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపుటకును అనేక లక్షలమందిని సమకూర్చే లూసిఫరులు ఉన్నారు. కాని దానియేలుతో ఉండే ఒకరిద్దరు చివరకు జయించెదరు. ఎందుకనగా దేవునితో ఒక వ్యక్తి ఉన్నప్పటికిని అది ఎంతో మంది ప్రజలతో సమానము. ఒక ప్రాంతములో దేవుడు దానియేలును కనుగొనని యెడల, అప్పుడు అపవాది తన మార్గములో నడిపించుటకు ఎవరొకరిని కనుగొనును. కాబట్టి నీవున్న స్థలములో దేవుని కొరకు ఒక దానియేలువలె ఉండుము. అతనివలె దేవునియొక్క ప్రతి ఆజ్ఞకు లోబడవలెనని నిర్ణయించుకొని మరియు సింహాల గుహలో వేయబడినప్పటికిని, దేవుని కొరకు నిలబడుము.
దేవుడు మీకు కృపను, బలమును, జ్ఞానమును ఇచ్చునట్లు మేము ప్రార్థించెదము. ఇక్కడ నేను ఒక ప్రార్థనను చెప్పుచున్నాను, ''ప్రభువా నేను తృణీకరించవలసిన విషయములకు నేను కాదు అని చెప్పే ధైర్యమును నాకు దయచేయుము. నేను చేయవలెనని నీవు కోరుచున్నవాటిని చేయుటకు శక్తి నిమ్ము మరియు వీటి మధ్య ఉన్న తేడాను తెలుసుకొనుటకు జ్ఞానము నిమ్ము''.
అవసరమైనది ఒక్కటే:
''ఎంపిక-ఎంపిక-ఎంపిక'' ఎంపికయే ఉపయోగకరమైన జీవితమునకు రహస్యము. మీరు చదువుకునేటప్పుడుకలిగే ఒత్తిడిలలోను మరియు తొందరపడుటలోను జీవితములోని అనేక గొప్ప పాఠములను నేర్చుకొనెదరు. దేవుడు యిర్మీయాతో ఇట్లనెను, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టగలవు (యిర్మీయా 15:19). అది నిన్ను ఆత్మ సంబంధిగా చేసి ఫలభరితమైన జీవితము జీవించుటకు సహాయముచేయును. అనేకవిషయములు చేయుటకు మనకు స్వాతంత్య్రము ఉన్నప్పటికిని అన్నియు ప్రయోజనకరమైనవి కావు (1 కొరింథీ 6:12, 10:23). అత్యవసరములు అనిపించే అనేకవిషయములు నిజానికి ఆత్యవసరములు కావు. ఒక్కటి మాత్రమే అవసరమైయున్నదని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 10:42). యౌవనదశలో మన స్వంత కోరికలనుబట్టియు మరియు సంశయములను బట్టియు సరియైనఎంపికలను చేసుకొనలేము (ఇప్పుడు కూడా నేను చేయగలిగినంత కార్యములను చేయుటలేదు, యౌవనకాలములో ఎంతో అసంపూర్ణముగా చేసెడివాడను).
మనము మనయొక్క నిస్సహాయతను మరియు బుద్ధిహీనతను తెలుసుకొని మరియు మన గత ఓటముల కొరకు మరియు దేవునియొక్క కనికరము కొరకును మరియు భవిష్యత్తులో వాటిని జయించుటకును కావలసిన కృపకొరకును మనము దేవునిమీద ఆధారపడునట్లును, మనము అనేకసార్లు ఓడిపోవునట్లుగా దేవుడు అనుమతించును. మా యౌవనకాలములో అందుబాటులో లేని అనేక విషయాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఎల్లప్పుడు దీనులైయుండి విరిగినలిగిన హృదయము కలిగియుండి మరియు దేవునివాక్యము యెడల వణుకుచుండవలెను. దేవుడు అటువంటి వారిమీదనే దృష్టియుంచును (యెషయా 66:1,2).
క్రీస్తుయేసువలె యుండుటకు బలమైనకోరిక కలిగియుండుట:
ఎల్లప్పుడు మనము క్రీస్తు సారూప్యములోనికి అంతకంతకు మార్పు చెందుటకు మండే కోరిక కలిగియుండవలెను. ఎందుకనగా మనము దానిని కోరనియెడల దానిని దేవుడు చేయలేడు. కాని యేసువలె మార్పుచెందవలెనని కోరికయుండినచో ప్రతిదినము మనము మనలను తీర్పుతీర్చుకొనుచు, పవిత్రపరచుకొనెదము (1 యోహాను 3:2,3) అప్పుడు మనము కొంచెమే అభివృద్ధి చెందినప్పటికి దేవుడు సంతోషించును. మనము ఇష్టపడినయెడల దేవుడు దానిని అంగీకరించును. ఎందుకనగా దేవుడు ఒక విత్తనమును ఒక చెట్టువలె అభివృద్ధి చెందాలని కోరుచున్నాడు (2 కొరింథీ 8:12). కాబట్టి మనము క్రీస్తును పోలిన విషయములలో మార్పుచెందుటకు బలమైన కోరిక కలిగియుండాలి. చాలా మంది విశ్వాసులు యేసువలె యుండుటకు ప్రార్థించెదరు గాని కొంతమంది మాత్రమే తలంపులలోను మరియు వైఖరిలోను యేసువలె లేని విషయములలో పశ్చాత్తాపపడెదరు. ఈ విధంగా పశ్చాత్తాపపడువారు మాత్రమే మార్పుపొందెదరు మరియు అటువంటి వారిని మాత్రమే క్రీస్తు సారూప్యములోనికి దేవుడు మార్చును.
దేవుని దృష్టిలో మనము ఒట్టివారమని మనము గుర్తుంచుకొనవలెను. మనకు ముందుగా క్రీస్తు మొదటిగా ఉండవలెను. మనుష్యుల దృష్టిలో కూడా ఏమీకానివారముగాను ఒట్టివారముగాను ఉండవలెను. నీ ఆత్మీయఅభివృద్ధి అంతయు రహస్యముగా దేవుని యెదుటే ఉండనిమ్ము. ఏ మానవుని యొద్దనుండియు అంగీకారము అవసరములేదు. నీ యొక్క ఎముకలవలె నీ యొక్క నీతి మనుష్యులకు కనబడకుండా ఉండనిమ్ము (మత్తయి 6:1). ఇతరులు నీ యొక్క పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు నీ సత్క్రియలను వారియెదుట చేయవలెను (అది మాంసమువలె ఎముకలను కప్పును) (మత్తయి 5:16). చర్మముతో కప్పబడనియెడల అది ఒక అస్థిపంజరమువలె ఉండును.
కీడు చేసిన వారికి మేలుచేయుము. లోతు కొరకు తన హక్కులను విడిచిపెట్టిన అబ్రాహాము యొద్దనుండి పాఠము నేర్చుకొనుము. లోతు తన కొరకు తానే ఎన్నుకొన్నాడు. కాని అబ్రాహాముకొరకు దేవుడు ఏర్పరచి మరియు అబ్రాహామును ఆశీర్వదించెను (ఆదికాండము 13:7-18). ఇస్సాకు కూడా తన తండ్రియొద్ద నుండి నేర్చుకొని మరియు నీటి బావులను త్రవ్వుటకు పోట్లాడలేదు. అతని హక్కులను విడిచిపెట్టాడు.
అప్పుడు దేవుడు అతనిని కూడా ఆశీర్వదించెను (ఆదికాండము 26:18-25). ఈనాడు కూడా దేవుడు అటువంటి వారినే ఆశీర్వదించును అనగా అందరితో సమాధానమును వెదకువారు. కాబట్టి ఎల్లప్పుడు అందరితో సమాధానము కలిగియుండుము.
కృపలో ఎదుగుట:
కృపలోను మరియు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానములోను ఎదుగుటయే మన గురి (2 పేతురు 3:18). కీర్తన 90:12లో మోషే ప్రార్థించినట్లు మనము ప్రార్థించాలి. ''ప్రభువా, నాకు జ్ఞానహృదయము కలుగునట్లు చేసి నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము''. తద్వారా మన భూలోక జీవితము ఉపయోగకరముగా ఉండును.
2 కొరింథీ 8:9లో కృపయొక్క నిర్వచనము చూచెదము. ''ఆయన ధనవంతుడైయుండియు, మనము ఆయన దారిద్య్రమువలన ధనవంతులము కావలెనని మన నిమిత్తము దరిద్రుడు అగుట''లో ప్రభువైనయేసు కృపను చూచెదము. మన జీవితములలో కూడా కృప దీనినే చేయును. అవసరములో ఉన్న లోకమునకు మనము ఆశీర్వాదముగా ఉండవలెనని కోరినయెడల, మనలను మనము తగ్గించుకొని గుర్తింపుపొందకుండుటకును, ఇతరులచేత తృణీకరించబడుటకును మరియు ఇతరుల దృష్టిలో బీదవారిగా ఉండాలని ఇష్టపడెదము. ప్రభువైన యేసు ఎల్లప్పుడు తన తండ్రియొద్ద నుండి కృపను పొందియున్నాడు. గనుక మేలుచేయుచు జీవించుచుండెను (అపొ.కా. 10:38). ఆ విధముగా కృప నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదముగా చేయును.
ప్రభువైనయేసు క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు, ''తండ్రీ, ఈ పరిస్థితినుండి నన్ను విడిపింపుము'' అని ప్రార్థించలేదు గాని ''నీ నామము మహిమ పరచమని ప్రార్థించెను'' (యోహాను 12:27). కిష్టపరిస్థితులలో నీవు కూడా ఈ విధముగా ప్రార్థించవలెను. కేవలము సుఖముగా జీవించుటను కోరక దేవుడు నీ జీవితములో మహిమపరచబడుటకు ఎంత వెలయైనను చెల్లించుటకు సిద్ధముగా ఉండుము. దేవుడు నీ యెదుటనుంచిన ఇబ్బంది పెట్టు వారినిగాని లేక అటువంటి పరిస్థితులను గాని మార్చుమని ప్రార్థించకు. ఆ పరిస్థితులలో నిన్ను మార్చమని ప్రార్థించుము. అటువంటివారు గతములో ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికిని ఆ విధముగా ప్రార్థించుచున్నయెడల వారు కృపలో ఎదుగుచు నిజముగా పరిశుద్ధులు అవుదురు.
వైఖరితో కూడిన పాపములు అనగా గర్వము, స్వార్థము, అసూయ, ధనాపేక్ష, ద్వేషము, స్వనీతి మొదలగునవి క్రియా పాపములవలె అనగా అబద్ధములు చెప్పుట, మోహపు చూపు చూచుట, దొంగిలించుట మొదలగు వాటివలె గుర్తించబడవు. కాబట్టి అవి మన ప్రాణములను సులభముగా నాశనము చేయును. రెండు రకముల పాపములను నిరోధించాలి కాని నకిలీ పరిశుద్ధతతో అనగా పైకి కనబడునటువంటి ప్రార్థించుట, బైబిలు చదువుట, కూటములకు వెళ్లుట, వాటితో కాక దేవుని దృష్టిలో అంతరంగములో పరిశుద్ధతను మరియు ఇతరుల యెడల దయను కలిగియుండవలెను. క్రియలలో కాక కృపలో అభివృద్ధి చెందవలెను.
నీయొక్క పనులలోను చదువులోను ప్రభువుయొక్క కృపను అనుభవించుచున్నారని నేను నిరీక్షించుచున్నాను. ''నా కృప నీకు చాలును'' అను వాగ్ధానము గురించి ఆలోచించుము (2 కొరింథీ 12:9). నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికిని మరియు ప్రతి పరీక్షకును మరియు ప్రతి సమస్యకును ఎల్లప్పుడు దేవునికృప నీకు చాలును. నీవు పనిచేయునప్పుడు అప్పుడప్పుడు ఐదు సెకన్లు ప్రార్థించవలెను. ప్రత్యేకముగా నీవు శోధింపబడునపుడు ప్రార్థించుము.
క్రీస్తువిరోధి యొక్క ఆత్మ:
ఆదాము మరియు హవ్వలు కేవలము ఆకర్షణీయమైన పండుగురించి శోధింపబడలేదు. దేవునివలె యుండుటకు శోధింపబడిరి. ''ఈ పండుతినిన యెడల దేవునివలె యుందురని'' సాతాను వారితో చెప్పాడు (ఆదికాండము 3:5). అనేక సంవత్సరముల క్రితము సాతాను కూడా అదే శోధనలో పడెను. సాతాను ప్రభువైనయేసును కూడా ఆ విధముగానే శోధించాడు. ''ఆ శోధకుడు ఆయయొద్దకు వచ్చి - నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆందుకాయన - మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను'' (మత్తయి 4:3,4). అక్కడ ప్రభువైనయేసు తాను సామాన్య మానవునివలె దేవునివాక్యానికి లోబడవలెనని చెప్పుట ఆశ్చర్యకరముగా ఉన్నది. దేవుని ఆజ్ఞలను మనము తీవ్రముగా తీసుకొననియెడల (ఉదాహరణకు లైంగిక విషయములు) దేవునికి తగినంతగా మనము భయపడనియెడల సర్వశక్తిగల దేవుడు చేసిన నియమములను మన పరిస్థితులకు తగినట్లుగా మార్చి, మనయొక్క కోరికలను మరియు దురాశలను తృప్తిపరచుకొనెదము.
క్రీస్తువిరోధి దేవునివలె హెచ్చించుకొని దేవుని మందిరములో దేవునివలె కూర్చుండునని చెప్పబడింది (2 థెస్సలోనిక 2:4). ఈ క్రీస్తువిరోధి యొక్క ఆత్మ సంఘములో కూడా ఇతరులయెడల దేవునివలె ప్రవర్తించునట్లు చేయును. సంఘములో మనము గుర్తింపు కోరినయెడల లేక ఇతరులు మనయెడల కఠినముగా ప్రవర్తించినప్పుడు అభ్యంతరపడినయెడల అప్పుడు దేవునివలె ఉండాలని అపవాది కోరినట్లే మనము కూడా కోరుచున్నాము. ''పోగొట్టుకొనిన పరదైసు'' (జాన్‌మిల్టన్ వ్రాసిన) పద్యములో ఇట్లనెను, ''పరలోకములో సేవించుట కంటే లూసిఫర్ నరకములో పరిపాలించుట మేలు'' ఇదియే ఇతరులమీద పెత్తనము చేయాలని కోరే క్రీస్తువిరోధియొక్క ఆత్మ. కొంతమంది నాయకులు ఆవిధముగా వారి సంఘసభ్యులను పరిపాలించును.
ప్రభువైన యేసు అటువంటి ఆత్మను పూర్తిగా జయించాడు తద్వారా తన భూలోక జీవితమంతటిలో మనుష్యులందరికి దాసునిగా ఉండవలెనని నిర్ణయించుకొనెను. ఆయన దేవుడయినప్పటికిని, ఇతరులమీద పెత్తనము చేయలేదు. దేవునితో సమానముగా ఉండే హక్కును విడచిపెట్టెను, దేవునితో సమానముగా ఉండవలెననే కోరికయే సాతాను ఆత్మయొక్క మూలము అందువలన ఎల్లప్పుడు క్రిందకు వెళ్లుచుండుటద్వారా రక్షణపొందుచు ఉండెదరు. లోకములోని అధికారులలో ఎల్లప్పుడు కలవరముండును. కాని సామాన్యులయొద్ద సమాధానము ఉండును. మనయొక్క స్వయముగాని లేక ప్రభువైనయేసుక్రీస్తు గాని మన హృదయములో దేవునిగా ఉండెదరు. మనకు ఎవరు ప్రభువుగా ఉండవలెననే విషయము మన హృదయములో నిర్ణయించుకొనవలెను.
నీ పూర్ణహృదయముతోను ప్రాణముతోను, శక్తితోను మరియు మనస్సుతోను ప్రభువును ప్రేమించుము. 1959లో నా జీవితమును ప్రభువునకు సమర్పించుకొన్నప్పుడు నా మొదటి బైబిలులో హృదయమనే పటము నాకు గుర్తున్నది. మరియు అందులో ప్రభువు పేరును మరియు నా పేరును వ్రాసి మరియు దానిక్రింద ఈ విధముగా వ్రాసితిని, ''యుగయుగముల వరకును ఈ హృదయము నీదే''. మరియు ప్రభువును వెంబడించిన గత సంవత్సరములలో ప్రభువుతో నా సంబంధము అంతకంతకు మధురముగా ఉన్నది మరియు నా చుట్టూ ఉన్న ప్రతి విషయమునుండి అంతకంతకు విడుదల పొందుచున్నాను. ఏ సమయములోనైనను ప్రభువైన యేసుకును మరియు మీకును మధ్యలో ఎటువంటి మేఘము లేకుండునట్లు మీరు ఆయనను ప్రేమించవలెనని నేను ప్రార్థించుచున్నాను. మీరు పాపములో పడినవెంటనే ఒప్పుకొనుడి. ఒక్క క్షణము కూడా వేచియుండవద్దు. ప్రపంచములో ప్రతి పరిస్థితిని మన తండ్రి నిర్వహించుచున్నాడు గనుక మీరు ఎప్పుడైనను నిరాశపడవద్దు.
ప్రభువైన యేసుయొక్క రెండు ఆహ్వానములు - రండి మరియు వెంబడించుడి:
ప్రభువైన యేసు యొక్క రెండు ఆహ్వానములలో క్రైస్తవజీవితమంతయు ఉన్నది, ''నా యొద్దకు రండి'', ''నన్ను వెంబడించుడి''. మనము మన యొక్క ఆరంభములోనే కాక ఎల్లప్పుడు ప్రార్థించుట ద్వారా యేసు యొద్దకు వచ్చుచుండవలెను, ఎందుకనగా మనము చిన్న విషయములలో వెనుకంజవేసే అవకాశమున్నది.
నా యొద్దకు రండి.... ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు, అనేకులు వారి పాపములను ఒప్పుకొనుటకు ఇష్టపడనందువలన ప్రభువైన యేసు యొక్క ఆహ్వానమును అంగీకరించలేదు. అప్పుడు ప్రభువైన యేసు వారితో వ్యంగ్యముగా ఇట్లనెను, ''నేను మీలాంటి నీతిమంతులకొరకు రాలేదు గాని పాపులకొరకే వచ్చియున్నాను. ఎందుకనగా రోగులకే వైద్యుడు అవసరం'' (మార్కు 2:17). మనము ఎల్లప్పుడు యేసు యొద్దకు వచ్చుచుండుటకు, మన యొక్క బలహీనతలను, పాపములను మరియు ఓటములను ఒప్పుకొనుచుండవలెను. మనుష్యులకు వ్యతిరేకముగా మనము పాపము చేసినయెడల, వారిని క్షమాపణ అడుగవలెను. మనుష్యుల యొద్ద క్షమాపణ అడుగుటకు మనము ఇష్టపడనియెడల, మనలో కడుగబడవలసిన గర్వమున్నదని అర్థము. అప్పుడు మనము యేసు యొద్దకు రాలేము. మనము కేవలము ఇతరుల పొరపాట్లనే చూచుచు మరియు మనలోవున్న పొరపాట్లు చూడనియెడల, అప్పుడు మనము దేవాలయములో ఉన్న పరిసయ్యునివలె మారెదము. అప్పుడు మనము యేసు యొద్దకు రాలేము (లూకా 18:10-14). కాని సుంకరి, నేను పాపిని అని చెప్పి యున్నాడు. భూమిమీద అతను అత్యంత ఘోరపాపినని అతడు గ్రహించాడు. పౌలు కూడా తాను పాపులలో ప్రధానుడనని భావించాడు (1 తిమోతి 1:15). అటువంటి వారు ప్రభువైన యేసు నొద్దకు సులభముగా రాగలరు. అనగా ఎల్లప్పుడు పాపము చేయమని కాదు, ఎందుకనగా పౌలు ఆ విధముగా చేయలేదు. అలాగే మన చుట్టు ప్రక్కల ఉన్నవారు మనకంటె ఆత్మీయులని కూడా భావించకూడదు. పౌలు ఆ విధముగా ఎప్పుడైనను భావించలేదు. కనుక అది దీనత్వము కాదు. శరీరానుసారమైన కొరింథీ క్రైస్తవుల కంటె తాను ఆత్మీయుడైయున్నాడని పౌలుకు తెలియును. కాని మనము దేవునికి ఎంత సన్నిహితముగా వెళితే, అంత ఎక్కువగా మన శరీరములో ఉన్న పాపమనే భ్రష్టత్వమును చూడగలము.
నన్ను వెంబడించుడి... పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మతో నింపబడు వరకు శిష్యులు కూడా ఆయనను వెంబడించుటను గ్రహించలేకపోయారు. ఎందుకనగా వారు అన్యాయముగా బాధించబడుటకును మరియు ఎల్లప్పుడు బాధించబడుటకు ఇష్టపడలేదు. ఆయన అనేక శ్రమలలో గుండా వెళ్లవలసియున్నదని ప్రభువైన యేసు పేతురుతో చెప్పినప్పుడు, ప్రభువైన యేసును ఆవిధముగా వెళ్ళవద్దని పేతురు చెప్పాడు. వెంటనే సాతానుయొక్క స్వరమును గ్రహించిన యేసు, సాతానా నా వెనుకకు వెళ్ళుము అని చెప్పారు (మత్తయి 16:23). మనము యేసుని వెంబడింపగోరినయెడల అపార్థము చేసుకొనబడుటకును, అన్యాయముగా నిందించబడుటకును, అవమానములో గుండా వెళ్ళుటకును, తిట్టబడుటకును, పరిహాసము చేయబడుటకును, అన్యాయము చేయబడుటకును మరియు శరీర సంబంధమైన శ్రమలద్వారా వెళ్ళుటకు ఇష్టపడవలెను. ఈ మార్గములో వెళ్ళుటకు ఇష్టపడని వారు ప్రభువైనయేసును వెంబడించలేరు. కాబట్టి ప్రభువైనయేసు యొక్క ఈ రెండు ఆహ్వానములను ఎల్లప్పుడు వినుడి.... ''నా యొద్దకు రండి మరియు నన్ను వెంబడించుడి''.
విశ్వాస పరిమాణము చొప్పున కృప పొందెదము:
క్రైస్తవజీవితములో నియమనిబంధనలు లేవు. మోషే ధర్మశాస్త్రము తెచ్చెను. కాని ప్రభువైన యేసు మరి కఠినమైన ధర్మశాస్త్రముతో రాలేదు, గాని కృపతో వచ్చెను (యోహాను 1:17).
ఈ లోకములో డబ్బు ఏ విధముగా ఉన్నదో దేవుని రాజ్యములో కృప ఆ విధముగా ఉన్నది. ఈ భూమిమీద జీవించుటకు డబ్బు ఎంత అవసరమైయున్నదో, అలాగే దైవభక్తి గల జీవితము జీవించుటకు కృప అంత అవసరమైయున్నది. నీవు దేవునియొద్దనుండి కృపను ఎంత ఎక్కువగా పొందెదవో, అంత ధనవంతుడవవుదువు. ప్రతి దినము నీకు కావలసిన కృపను పొందుటకు, విశ్వాసమనునది బ్యాంకులో వేసే చెక్కు వంటిది. దేవుని యొక్క వాగ్ధానములే ఈ చెక్కులు మరియు ఈ చెక్కులను బ్యాంకుకు వెళ్ళి డబ్బు తెచ్చుకొనినట్లే విశ్వాసము ద్వారా కృపను పొందవలెను. లేనట్లయితే చెక్కులు వ్యర్థమైపోవును. కాబట్టి నీ యొక్క నమ్మికచొప్పున పరలోకబ్యాంకు నుండి కృపను పొందుదువు (అనగా చెక్కు మీద నీవు వ్రాసినంత పొందెదవు).
''నా కృప నీకు చాలునని'' దేవుడు పౌలుతో చెప్పాడు (2 కొరింథీ 12:9). దేవుని యొక్క కృప నీ జీవితములోని ప్రతి పరిస్థితికి సరిపోవును. చెడ్డ అలవాట్లనుండి విడిపించబడుటకును లేక లోకములో ఎదుర్కొనే శ్రమలకును లేక ఇతర విశ్వాసులచేత అపార్థము చేసుకొనబడుటను జయించుటకు దేవుని కృప చాలును. కాని నీవు అనుమానించి మరియు చెక్కుమీద కొంచెము కృప కొరకే వ్రాసిన యెడల, నీవు అంతవరకే పొందెదవు. ప్రతి పరిస్థితిలో నీవు జయించుటకు కావలసినకృప కొరకు ధైర్యముతో ప్రార్థించుము.
ఒక దైవజనుడు ఒక సమస్యను ఎదుర్కొనుచున్నప్పుడు దానిని తీసివేయమని దేవునికి ప్రార్థించాడు. కాని దేవుడు ఒక కల ద్వారా, నదిలో అతడు దోనెలో వెళ్ళుచుండగా దోనె ఆ నదిలో ఎదురుగా ఉన్న బండను కొట్టుచున్నందువలన అది ముందుకు వెళ్ళలేదు. అప్పుడు దేవుడు, నేను ఆ బండను (సమస్యను) తీసివేయను గాని నదిలో నీళ్ళను (కృపను) ఎక్కువగా చేసి దోనె దాని మీదుగా వెళ్ళేటట్లు చేసెదను. అప్పుడతడు జయించును. దేవుని యొక్క కృపను మనము ఎక్కువగా అనుభవించి మరియు జయించువారమగునట్లు, ఆయన అనేక సమస్యలు మరియు శ్రమలను క్రైస్తవజీవితములో అనుమతించును.
దేవునియొక్క చిత్తములో విశ్రాంతిలో ఉండుట:
ఏ విషయములోనైననూ దేవుని చిత్తమును వెదకునప్పుడు, ఆయన చిత్తమేదైనను అంగీకరించుటకు సిద్ధముగా ఉన్నానని ప్రభువుకు చెప్పవలెను. నీ సమస్తమును బలిపీఠం మీద పెట్టి, నీవు ప్రతి విషయములో దేవునిమహిమను మాత్రమే కోరుచున్నావా అని పరీక్షించుకొనుము. అప్పుడు ఆయన నీకు సరియైన ద్వారమును తెరచును. నీవు ముందుకు వెళ్ళుచుండగా నీలో కొంత అనుమానము ఉండవచ్చు. ఎందుకనగా నీవు వెలిచూపుతో కాక విశ్వాసము ద్వారా నడువవలెనని దేవుడు దానిని అనుమతించును.
ఒకసారి నీవు నిర్ణయించుకొనిన తరువాత, అన్నియు నీవనుకొనుచున్నట్లుగా జరుగనియెడల చింతించవద్దు. అపొ.కా 16లో పౌలు మాసీదోనియ పిలుపును విని ఫిలిప్పీనకు వెళ్ళి అక్కడ జైలులో వేయబడెను. కాని అది దేవునియొక్క సంపూర్ణచిత్తము ఎందుకనగా అక్కడ జైలు అధికారి రక్షణపొందవలసి యున్నది.
మనము దేవుని రాజ్యమును మొదటిగా వెదకినయెడల, ప్రభువుచేత మన అవసరములన్నియు తీర్చబడును. 1966 మే మాసములో, నేను నావికాదళము విడిచిపెట్టినప్పటి నుండి నేను అది చూశాను.
నీ ఓటములద్వారా కూడా దేవుడు పరిపూర్ణముగా ప్రణాళిక వేయును. ప్రతి పరిస్థితిలోను ఆయనను మరిఎక్కువగా ఎరుగవలెనని ఆయన కోరుచున్నాడు. ఇదియే ఆయన గురి. నా కుమారులారా, నా కంటె ఎక్కువగా మీరు దేవునిని తెలుసుకొనవలెనని కోరుచున్నాను.
మీ యొక్క సెలవు దినములలో కూడా ప్రార్థనాత్మను కలిగియుండుము. గాలి పీల్చుకొనునట్లు మీ జీవితములలోని చిన్న విషయముల గురించి మరియు పెద్ద విషయములను గురించియు ప్రార్థించుడి. ''అన్ని సమయములలో ప్రార్థించుడి'' (లూకా 18:1) మరియు ''ఎల్లప్పుడు విడువక ప్రార్థించుడి'' (1 థెస్సలో. 5:17) అనగా అర్థమిదియే.
సమస్తముసమకూడి మేలు కొరకే జరుగును:
మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష ద్వారా మీ విశ్వాసము సవాలు చేయబడి మరియు మీరు గుణలక్షణములలో అభివృద్ధిచెందవలెను. మిమ్ములను నిత్యత్వములోనికి సిద్ధపరచుటకు, దేవుడు వాటిని మీ జీవితములలో అనుమతించుచున్నాడు. ప్రజల యొక్క వ్యతిరేకతకును మరియు పరిస్థితులకును ఇప్పుడు ఏ విధముగా స్పందించియున్నామనునది రెండు వేల సంవత్సరముల తరువాత కూడా ముఖ్యమైయున్నది. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతటిని ప్రభువు ఓర్చుకొనియున్నాడు (హెబీ 12:3).
మీరు జయించేవారుగా ఉండగోరిన యెడల చిన్న విషయములలో, ఎల్లప్పుడు రోమా 8:28లో లోతుగా వేరుపారుడి. రోమా 8:28లో సమస్తము అనగా సమస్తమునైయున్నది. ఎందుకనగా మన జీవితములలో సమస్తము ఆయన నియంత్రించగలడు. కాబట్టి మీ విశ్వాసమును ఎప్పుడైనను తప్పిపోనియ్యకుడి. ఎందుకనగా అది ముఖ్యమైయున్నది. ఏమి జరిగినను నిరాశపడవద్దు. దేవునిని స్తుతించుటయే మీ విశ్వాసమునకు గుర్తు. ఐగుప్తీయులు మునిగిపోయిన తరువాతనే, ఇశ్రాయేలీయులు దేవుని విశ్వసించి మరియు దేవుని స్తుతించిరని కీర్తన 106:12లో చదివెదము. కాని ఇప్పుడు, వెలిచూపుతో కాక విశ్వాసముతో నడిచే మనము ప్రార్థనలకు జవాబు పొందకమునుపే దేవుని స్తుతించెదము. ఎందుకనగా మనము విశ్వాసమూలముగా జీవించెదము.
మీ విశ్వాసమును బలపరచుటకు దేవుడు అనేక విషయములను అనుమతించును. నీ జీవితము సాఫీగాను మరియు సమస్యలులేనిదిగాను ఉండునట్లు కొన్నిసార్లు మీరు కోరవచ్చును. కాని ఆ మార్గములో నీవు దేవునిని అనుభవించకుండా శిథిలమైన క్రైస్తవుడుగా ఉండెదవు. కాని అసాధ్యమైన విషయములలో కూడా దేవునిని విశ్వసించినయెడల మరియు నీకు కీడు చేసిన వారిని ప్రేమించుచున్నయెడల అప్పుడు నీవు దేవునియొక్క శక్తిని అనుభవించుట ద్వారా నీ గుణశీలము వృద్ధిపొందుటయే గాక ఇతరులకు పరిచర్య కూడా చేసెదవు. కాబట్టి దేవుడు పరిపూర్ణముగా పరిస్థితులన్నిటిని ప్రణాళికవేసి అనుమతించుచున్నాడు.
''నీకు జరుగుచున్నదంతయు ఆయన ఎరుగునని'' ఎల్లప్పుడు గుర్తించుకొనుము (యోబు 23:10 లివింగు).
ప్రేమించుట విషయములో అచ్చియున్నాము:
మత్తయి సువార్త 25వ అధ్యాయములోని 10 మంది కన్యకల ఉపమానములో సిద్దెలలో నూనె కలిగియుండుట గురించి ప్రభువైనయేసు చెప్పారు. ఆ నూనె మన రహస్య జీవితమునే కాక మరియెక్కువ చూపించుచున్నది. పాత నిబంధనలోని ఇద్దరు విధవరాండ్రను గురించి గమనించండి. ఒకామె ఏలీయా కొరకు ఆహారము సిద్ధపరచుటకు తన బుడ్డిలోని నూనెను పోయిచున్నప్పటికిని ఆ బుడ్డి ఎల్లప్పుడు నూనెతో నిండియుండును (1 రాజులు 17). మరొక స్త్రీ తన బుడ్డిలోని నూనెను పొరుగువారి యొద్దనుండి తెచ్చిన పాత్రలన్నింటిలోనికి నూనె పోసినప్పటికిని ఆ నూనె ఇంకా వచ్చుచూనే యున్నది (2 రాజులు 4). మన సిద్దెలు ఎప్పుడు నూనెతో నిండియుండుటకు మనము ఎల్లప్పుడు నిస్వార్థులుగా జీవించుచూ మరియు ఇతరులకు పరిచర్య చేయుటయే. బుద్ధిగల కన్యకలవలె ప్రభువు నామములో ఇతరులకు పరిచర్యచేయువారై ప్రభువు యొక్క రెండవరాకడకు సిద్ధముగా ఉండెదము.
నీవు కలిసే ప్రతి ఒక్క వ్యక్తి విషయములో, ప్రేమించే విషయంలో ఋణపడియున్నావు (రోమా 13:8). దేవుడు నీకిచ్చిన సత్యమును మరియు ఆశీర్వాదములను నీ కొరకే ఉంచుకొనక, ఇతరులను ఆశీర్వదించుచున్నయెడల దేవుడు నీకు నీళ్ళు పోయును (సామెతలు 11:24, 25). అప్పుడు నీ జీవితము ఎల్లప్పుడు తాజాగా ఉండును.
కారణం లేకుండా ప్రజలు నిన్ను ద్వేషించినప్పుడు, నీవు ఏమి చేయాలి? (యోహాను 15:25). దీనియొక్క జవాబు స్పష్టముగా నున్నది. ఎటువంటి కారణము లేకుండా నీవు వారిని ప్రేమించాలి. ఆ విధముగా మేలుచేత కీడును జయించెదవు. సూర్యుడిని మంచివారిమీద చెడ్డవారిమీద ఉదయింపజేసే నీ పరలోకపు తండ్రివలె నీవుండునట్లు, ప్రతి ఒక్కరిని అంతము వరకు ప్రేమించుము. ''అంతము వరకు ప్రేమలో సహించువాడే రక్షించబడును'' (మత్తయి 24:10).
ప్రేమలో నిలచియుండుము:
నీవు ప్రేమలో నిలచియున్నావా లేదా అని పరీక్షించుటకు నీకు సమస్తమును జరుగుచున్నది. సమస్తమును ప్రేమ నియమముతో జరిగే దేవుని రాజ్యములో ఒక రోజు నీవు పరిపాలించుటకు, ఈ లోకములో నీవు సిద్ధపరచబడుచున్నావు. ఇక్కడ మనము అర్హులము అయినయెడల, క్రీస్తుతో కూడా ఏలెదము. కాని మనము కీడుచేసిన వారికి కీడు చేసినయెడల మనము ఈ పరీక్షలో ఓడిపోయెదము. ఎల్లప్పుడు నిత్యమైనవాటిని నీ మనస్సులో ఉంచుకొనుము. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది - పెద్ద ఉద్యోగములు కాని లేక పేరు ప్రతిష్ఠలుగాని దేవుని దృష్టిలో ఎల్లప్పుడు అసహ్యమైనవని గుర్తుపెట్టకొనుము (లూకా 16:15). ప్రేమ, మంచితనము మరియు కనికరము మాత్రమే నిత్యత్వములో నిలచియుండును. బైబిలుప్రకారము కనికరము అనగా కేవలము ఇతరులపాపము క్షమించుటయే గాక మంచిసమరయుని ఉపమానములో వలె కనికరముతో కొన్ని పనులు చేసెదము (లూకా 10:37).
దేవుడుకోరినట్లయితే భూమిమీద ఆయన పిల్లలందరిని అయిన్‌స్టీన్ లేక బిల్‌గేట్స్ వలే అత్యంత ధనవంతులుగా చేయగలడు. కాని జ్ఞానమునకు మరియు సిరిసంపదలకును దేవుని రాజ్యములో స్థలము లేదు. కాబట్టి ఆయన దానిని చేయలేడు. కాబట్టి ఈ భూమిమీద కొద్దికాలము జీవించుటకు దేవుడు మనకనుగ్రహించిన జ్ఞానమును బట్టియు సిరిసంపదలను బట్టియు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను. మనము ఎంతవరకు ప్రేమించుచున్నామనునదియే ముఖ్యము.
రోమా 12:2లో చెప్పిన రీతిగా, ''మీ మనస్సు మారి నూతనపరచబడుట వలన రూపాంతరము పొందుడి'' అనగా మనము రూపాంతరము పొందుటకు మన యొక్క ఆలోచనా విధానముతో ఆరంభించెదము. మన తలంపులద్వారానే మనము లోకస్థులముగాను లేక పరిశుద్ధులముగాను మారెదము. ఆ విధముగానే మన ఆలోచనలద్వారానే స్వార్థపరులుగాను మరియు నిస్వార్థపరులుగాను ఉండెదము.
హెబీ 10:19-25లో తన యొక్క శరీరమను తెరద్వారా ప్రభువైనయేసు నూతనమైనదియు మరియు జీవముగలమార్గములో మనలను అతిపరిశుద్ధ స్థలములో ప్రేవేశింపజేసెను. అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన తరువాత ప్రజలు ఏమి చేసెదరు? 25వ వచనము ప్రకారము, వారు ప్రేమ చూపుటకును సత్కార్యములు చూపుటకును ఒకరినొకరు పురికొల్పవలెనని చూచెదరు.
దాహము గలవారి దాహము తీర్చువారును, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చువారును మరియు జైలులో ఉన్నవారిని దర్శించువారును, తన రాజ్యములో కుడి ప్రక్కన కూర్చుండెదరని ప్రభువైన యేసు చెప్పెను. ఇవన్నియు కూడా ఆలోచనల ద్వారా ఆరంభమగును. వారు ఇతరుల యొక్క అవసరములను చూచుచు మరియు వారికి చేయగలిగినదిచేయుటకు నిర్ణయించుకొనెదరు. ఇతరులు వేరే వారి అవసరములను గురించి ఆలోచించెదరు గాని ఏమియు చేయరు
ఇతరులయొక్క అవసరతల గురించి ఆలోచించుట:
క్రీస్తు యేసు కలిగియున్న వైఖరే మనము కూడా కలిగియుండాలని ఫిలిప్పీ 2:5లో చెప్పబడియున్నది. దీనత్వము గురించి ఈ అధ్యాయములో గొప్పగా చెప్పబడింది. కాని ఇతరుల అవసరములలో ఆలోచించే విషయములో కూడా ఈ అధ్యాయము గొప్పది. ప్రభువైనయేసు పరలోకములోఉండి మనలను గురించి ఆలోచించుట వలన ఆయన పరలోకములో నుండి మనయొద్దకు దిగివచ్చెను. ఇతరులగురించి ఆలోచించుటవలన ఆయన తన్నుతాను తగ్గించుకొన్నాడు.
అటువంటి వైఖరే మనము కలిగియుండవలెనని మనము ఆజ్ఞాపించబడియున్నాము. స్వార్థముతో ఏమియు చేయవద్దని ఇక్కడ హెచ్చరించబడుచున్నాము (ఫిలిప్పీ 2:3). స్వార్థముతో మనము ఏమియు చేయకుండు స్థితికి ఈ భూమిమీద మనము చేరుట ఆశ్చర్యకరమైయున్నది. స్వార్థమంతటినుండి దేవునియొక్క శక్తిద్వారా రక్షించబడుదుమనునదియే శుభవార్త.
చరిత్రలో ఉన్న గొప్ప మిషనరీలందరు ఇతరుల గురించి ఎంతో ఆలోచించియున్నారు. వారు ఇతరుల యొక్క అవసరతలు గురించి ఆలోచించి, పరలోకములో ఉన్న ప్రభువైన యేసు చేసినట్లే వారు కూడా కొంత చేసియున్నారు.
ప్రభువైన యేసుకు కలిగియున్న ఆ వైఖరే మీరు కూడా కలిగియుండునట్లు ప్రభువు చేయునుగాక. హెబీ 10:16లో దేవునియొక్క ప్రేమ మరియు నిస్వార్థమైన నియమమును ఆయనే మన మనస్సులలో (తలంపులలో) వ్రాసెదనని వాగ్ధానము చేసియున్నాడు. దేవుడు మనలో ఆ విధముగా కార్యముచేయుటకు మనము సహకరించాలి.
దేవుని మహిమనుమాత్రమే కోరుటయే నిజమైన పరిశుద్ధత:
నీతియు మరియు దుర్నీతియు అనగా అర్థము ఏమిటి? నీతి అనగా అనేకమంచి కార్యములు చేయుటయు మరియు దుర్నీతి అనగా అనేకచెడ్డ కార్యములు చేయుట అనియు మనుష్యులు (పరిసయ్యులవలె) అనుకొనెదరు. కాని యోహాను 7:18లో ప్రభువైన యేసు చెప్పినట్లుగా ''దేవుని మహిమను వెదకువాడే సత్యవంతుడు మరియు అతనియందు ఏ దుర్నీతియు లేదు''. ఆ వచనము మొదటి భాగములో, తన స్వకీయ మహిమను వెదకువాని గురించి ప్రభువైన యేసు చెప్పారు. కాబట్టి మన స్వకీయ మహిమను వెదకుట అంతయు కడగబడి మరియు దేవునిమహిమను మాత్రమే వెదకుటద్వారా దుర్నీతినుండి కడుగబడగలము. దేవునిమహిమను పొందలేక పోవుటయే పాపమని రోమా 3:23లో చెప్పబడింది. మనము చేసినదేదైనను, దేవునిమహిమ పరచనియెడల అది పాపమే. మనుష్యుల ఘనత కొరకుచేసే ప్రార్థనగాని బోధగాని లేక పాడుటగాని మరియు మంచికార్యములు చేయుటఅంతయు పాపమే. మనము నీతిమంతులమా లేక దుర్నీతిపరులమా అనునది మన వైఖరే నిర్ణయించును. ఇతరుల హృదయములలో ఉన్న వైఖరులు మనకు తెలియదు గనుక వారిని తీర్పుతీర్చుట ఎంతో బుద్ధిహీనత అయియున్నది. మరియు మన హృదయములలో ఉన్న వైఖరులు మనకు తెలుసును. గనుక మనలను మనమే తీర్పుతీర్చుకొనుట జ్ఞానమైయున్నది ''కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును'' (1 కొరింథీ 4:5). మన యొక్క ఉద్దేశ్యము దేవుని మహిమయే అయియున్నప్పుడు, మనము పొరపాటు చేసినను దేవుడు వందశాతం మార్కులు మనకు ఇచ్చును. కాని మనము మన స్వంత ఘనతను కోరి మనము పరిపూర్ణముగా చేసినప్పటికిని దేవుడు సున్నా మార్కులు ఇచ్చును. కాబట్టి అవతలవ్యక్తి నీతిపరుడా లేక దుర్నీతిపరుడా అని మనము ఎప్పుడైనను నిర్ణయించకూడదు. కాని మనము దేవునిమహిమ కొరకు సమస్తము చేయుచు, మన హృదయములు దీనత్వముతోను పవిత్రతలోను ఉండునట్లు కాపాడుకొనవలెను. మన హృదయములో ఉన్న చీకటిలోనికి దేవునివెలుగు ప్రసరించునట్లు ప్రార్థించాలి. కాబట్టి మనము చేసే పరిచర్యను బట్టి దేవుని మహిమను ముట్టము. ''యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును'' (కీర్తన 112:4). ఈ వచనము నా చెవులలో మారుమ్రోగుచున్నది.
మీ జీవితములలో దేవునియొక్క మహిమయే గురిగా పెట్టుకొనుము. మీరు చేయుచున్న దానినంతటిని బట్టి దేవునిమహిమను కోరుటయే నిజమైన పరిశుద్ధత. కొన్ని విషయములలో మీరు దేవునిచిత్తము తెలియక పొరపాటు చేసినప్పటికిని, ఈ మార్గములో వెళ్ళినచో ప్రతి విషయములో శ్రేష్ఠమైనవాటినే దేవుడు మనకు అనుగ్రహించును. నీవు దేవునియొక్క మహిమను కోరినయెడల, నీవు ఇతరులను తీర్పుతీర్చక నిన్నునీవే తీర్పు తీర్చుకొందువు. ఇతరులను తీర్పు తీర్చుట దేవునికి విడిచిపెట్టుము. మన సహాయములేకుండా ఆయన దానిని చాలా బాగుగా చేయగలడు.
కొన్ని విషయములను చాలా జాగ్రత్తగా ఆలోచించెదము:
ఈ మధ్య జరిగిన బెంగుళూరు కాన్ఫరెన్సులో చెప్పబడిన కొన్ని విషయములు ఇక్కడ ఇవ్వబడినవి.
దేవుని యొక్క ప్రతిమాటను తీవ్రముగా తీసుకొని మరియు దానికి లోబడుటయే ప్రభువైన యేసు జీవితములోని రహస్యము. దేవుడు వారిమీద దృష్టినిలుపునని యెషయా 66:1,2 లో చెప్పబడింది.
ప్రభువైన యేసు పాపులకు వ్యతిరేకికాదని నాలుగు సువార్తలలో స్పష్టముగా చెప్పబడింది. ఆయన వేషధారులకు వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రభువైనయేసు పాపులను ప్రేమించి మరియు వారిని రక్షించవలెనని కోరుచున్నాడు. వారి గతమంతటిని పూర్తిగా తుడిచివేసియున్నాడు.
ప్రజలను దేవుడు చూచినట్లే మనము కూడా చూచినయెడల, ప్రతిఒక్కరి కొరకు ప్రభువైన యేసు మరణించియున్నారు కాబట్టి మనము ప్రతిఒక్కరికి విలువనిచ్చెదము. మనము వారెవరిని తృణీకరించము.
మంచి, చెడు అను నియమనిబంధనలు పెట్టుకుని మనం జీవించాలని దేవుడు కోరుటలేదు. ఇది మంచి చెడుల వృక్షమునుబట్టి జీవించుటయై యున్నది. మరియు ఎల్లప్పుడు ఇది మరణమునే తెచ్చును. మనము ఏమిచేయవలెనో లేక ఏమి చేయకూడదో తెలుసుకొనుటకు ఎల్లప్పుడు దేవునిమీద ఆధారపడుచు, విశ్వాసమూలముగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు.
మనలో నుండి జీవజలనదులు ప్రవహించునంత వరకు తృప్తి పడకూడదు. దీని నిమిత్తము మనము ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థించాలి.
క్రీస్తు శరీరమును ధరించెను అనగా దేవునిప్రేమ శరీరరీతిగా వెల్లడి పరచబడెను. ఒక రోజు ఆయనతో కూడా మనము పరిపాలించునట్లు, ప్రేమించుటకు తర్ఫీదు ఇచ్చుటకు దేవుడు మనలను భూమిమీద ఉంచాడు. ప్రభువు నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినవారు ఆయనతో కూడా పరిపాలించెదరని పక్రటన 20:4 చెప్పుచున్నది. మనలో ఉన్న ఆదాము యొక్క స్వభావము శిరచ్ఛేదనము చేయబడాలి. అప్పుడు మనకు శిరస్సై యున్న క్రీస్తులో అంటుకట్టబడి మరియు ఆయన శరీరములోని అవయవములై యుండెదము. ఆవిధముగా మనము ఆయన శిరస్సత్వము క్రింద ఉండి శరీరముగా పనిచేసెదము.
యెషయా 57:15 ప్రకారం వినయము మరియు దీనత్వము గలవారికి మాత్రమే ఉజ్జీవము నిచ్చును.
దేవుని ఇంటిలో మనము బంగారము మరియు వెండివంటి వెలగల పాత్రలవలె మనము ఉండవలెనని కోరినయెడల మనలను పవిత్ర పరచుకొనవలెను (2 తిమోతి 2:20,21). ఆవిధముగా మాత్రమే దేవుని అంగీకారము పొందిన సేవకులుగా ఉండుటకు మనలను సమర్పించుకొనెదము.
దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు ఉచితముగా అనుగ్రహించినప్పుడు, ఆయనతో పాటు నిశ్చయముగా సమస్తమును మనకు అనుగ్రహించును. ఆయన మన పాపక్షమాపణ కొరకు కనికరమును మరియు పాపమును జయించి క్రీస్తువలె జీవించుటకు కావలసిన కృపను ఆయన మనకు ఇచ్చును.
కనికరము మరియు తీర్పు:
దేవుడు నాకు ఇచ్చిన తాజా ప్రత్యక్షత నేను చెప్పుచున్నాను...
''దైవజనుడను మరియు దైవభక్తిగలవారు మరియు భక్తిహీనులు పొందే శ్రమల ద్వారాను, తీర్పు సింహాసనము మీద కూర్చుని మరియు ఇతరులను నిందించు వారి యొక్క దుష్టత్వమును బహిర్గతము చేయుటకు దేవుడు దైవజనులయొక్క శ్రమలను మరియు భక్తిగలవారు, భక్తిహీనులు చేసిన పాపములను ఉపయోగించును.''
మార్కు 3:5 లివింగు బైబిలులో ''కోపముతో ఉన్న పరిసయ్యులను ప్రభువైన యేసు చూచి, మనుష్యుల యొక్క అవసరములు చూచి సహాయపడని వారి హృదయ కాఠిన్యమును చూచి ఆయన దు:ఖించెను''. ఈనాడు కూడా మన చుట్టుప్రక్కల ఉన్నవారి శారీరక మరియు ఆత్మీయ అవసరతలు చూచి సహాయపడనట్లయితే ఆయన దు:ఖించును.
ధనవంతుడు మరియు లాజరు ఉపమానము దీనిని వివరించుచున్నది. లాజరు యొక్క అవసరమును అతడు పట్టించుకొనలేదు. కాబట్టి అతడు నరకానికి వెళ్ళెను.
మంచి సమరయుని ఉపమానము కూడా దీనిని వివరించుచున్నది. ఒక సహవిశ్వాసి సాతాను చేత కొట్టబడినప్పుడు, యాజకుడు మరియు లేవీయుడు పట్టించుకొనలేదు.
యోబు గ్రంథము ఈ సత్యమును వివరించుచున్నది. యోబు మారుమనస్సు పొంది ఒక మాట పలికినప్పుడు, అతడు దేవునిగురించి పలికిన తప్పుడు మాటలన్నియు క్షమించబడెను (యోబు 42:6). ఇది ఒక టేపులో చెడ్డభాగము తుడిచివేసి మరియు మంచిభాగము ఉంచినట్లుండును. కాబట్టి యోబు గ్రంథములో వ్రాసిన ప్రకారము అతడు దేవునికి వ్యతిరేకముగా మాట్లాడిన మాటలన్నియు తుడిచివేయబడెను గనుక పరలోకములోని దేవుని గ్రంథములో అది వ్రాయబడలేదు. యోబు చెప్పిన మంచిమాటలు మాత్రమే అందులో ఉన్నవి. దేవుని యొక్క పాప క్షమాపణయు, నీతిమంతులుగా తీర్చబడుటయు ఎంత అద్భుతమైనవి. కాని స్వనీతిపరులైన బోధకులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు, యోబు జీవితములోని పాపమును బట్టియే అతనికి రోగమొచ్చినదని చెప్పారు. వారు యోబు హృదయమును తెలుసుకొనకుండా తీర్పుతీర్చారు కాబట్టి దేవుడు వారిని ఖండించెను (యోబు 42:7). యోబు యొక్క రోగము ద్వారా వారి హృదయములో ఉన్న దుష్టత్వము బహిర్గతమయ్యెను.
అదే విధముగా వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఖండించుట ద్వారా పరిసయ్యుల హృదయములలో ఉన్న దుష్టత్వము బహిర్గతమైంది.
కాబట్టి మనం ప్రతి ఒక్కరి విషయములో కనికరముగలవారమై ఎవరిని తీర్పు తీర్చకూడదు. అప్పుడు దేవుడు మనయెడల అత్యంత కనికరము చూపును. కనికరము లేకపోవుటయే పరిసయ్యుల యొక్క ముఖ్యలక్షణము. ఈ విషయములో మనము జాగ్రత్తపడాలి.
యెరూషలేము మరియు బబులోను:
కేవలము సిద్ధాంతబేధములను బట్టి, ఇతర డినామినేషన్‌లో ఉన్న విశ్వాసులను తృణీకరించుట బుద్ధిహీనతయై యున్నది. అది పరిసయ్యులగుటకు మార్గము. వారు మనకంటె ఎక్కువగా దేవుని మహిమను కోరుచుండవచ్చును. మరియు దేవుడు దానినే కోరుచున్నాడు. ఇటువంటి దీనత్వము మత చాంధస్సులకు (కల్ట్‌లకు) లేదు. వారిది మాత్రమే నిజమైన సంఘమని వారు భావించెదరు. అటువంటి పరిసయ్యులవిషయమై జాగ్రత్త.
వారి సిద్ధాంతము వేరైనప్పటికిని రెండురకముల విశ్వాసులు ఉన్నారు. ఒకటి బబులోను మరియు మరొకటి యెరూషలేము. ఒకటి వేశ్య (సాతాను యొక్క నకిలీ సంఘము) మరియు మరొకటి క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె. ఈ రెండు గుంపులు.
తమ సొంతమహిమను కోరేవారు మరియు దేవునిమహిమను కోరేవారు (యోహాను 7:18, ఫిలిప్పీ 2:19-21).
తమ్మునుతాము తగ్గించుకొనువారు మరియు తమ్మునుతాము హెచ్చించుకొనువారు (1 పేతురు 5:5).
భూసంబంధమైన వాటిని వెదకువారు మరియు పరలోకసంబంధమైన వాటిని వెదకువారు (కొలొస్స 3:2).
మనుష్యులను సంతోషపెట్టగోరువారు మరియు దేవునిని సంతోషపెట్టగోరువారు (గలతీ 1:10).
దేవుని ఆశీర్వాదములను మాత్రమే కోరువారు మరియు దేవుని యొక్క అంగీకారమును కోరువారు (2 కొరింథీ 5:9).
ఏ గుంపులో ఉండవలెనో మనము నిర్ణయించుకొనవలెను. ఇప్పుడు ప్రతిరోజు మనము తీసుకొను నిర్ణయములే నిత్యత్వములో సంతోషమును గాని దు:ఖమును గాని ఇచ్చును. కాబట్టి జ్ఞానము కలిగియుండి మరియు దూరదృష్టి కలిగియుండుము.
ప్రేమయే శ్రేష్టమైనది:
''మన పూర్వ పాపములకు శుద్ధి కలుగజేసిన సంగతి మరచిపోయినట్లయితే, గ్రుడ్డివారమును దూరదృష్టి లేనివారమును అగుదుము'' (2 పేతురు 1:9). ప్రభువు మనలను క్షమించి మరియు ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొననని చెప్పిన వాటి విషయములో, నీవు నేరారోపణకు గురి అగుటకు సాతానుకుగాని మానవునికిగాని అనుమతినివ్వవద్దు. కాని అదే సమయములో నీవు ప్రభువును ఎక్కువగా ప్రేమించునట్లు ప్రభువు క్షమించిన పాపములన్నింటిని మరచిపోవద్దు (లూకా 7:47). మరియు ప్రతి ఒక్కరిని వెంటనే క్షమించుము (ఎఫెసీ 4:32) మరియు పాపములన్నింటికంటె ఘోరపాపమైన పరిసయతత్వము నుండి రక్షించబడెదరు.
ఒక విషయమును గుర్తించుకొనుము... ఒక వ్యక్తికి దేవుడు ఎంత ఎక్కువగా పరిచర్య నివ్వవలెనని కోరినచో, అతనియొక్క యౌవన కాలములో సుమారు 30 సంవత్సరముల వరకు అంతగా అతనికి దేవుడు శ్రమలను పరీక్షలను అనుమతించును. ఆవిధముగా ప్రభువైన యేసును కూడా తండ్రి అంగీకరించారు. మీలో ప్రతి ఒక్కరికి పరిచర్యఉన్నదని నేను నమ్ముచున్నాను. కాబట్టి దేవుడు మిమ్ములను ఆ మార్గములలో నడిపించును.
మీరు పరీక్షలన్నింటిలో గుండా వెళ్ళుచున్నప్పుడు, ప్రేమలో వేరుపారి స్థిరపరచబడుటకు ప్రయత్నించుడి. మీరు అన్యభాషలలో మాట్లాడకపోయినప్పటికి లేక ప్రవచించనప్పటికిని లేక పర్వతములను పెకలించలేక పోయినప్పటికిని లేక రోగులను స్వస్థపరచ లేకపోయినప్పటికిని లేక బీదలకు నీ డబ్బంతయు ఇవ్వనప్పటికిని లేక హతసాక్షిగా మరణించనప్పటికిని, అన్నింటికంటె ప్రేమయే శ్రేష్టమైనది కనుక నీ పూర్ణహృదయముతో దేవునిని ప్రేమించి (మరియు పవిత్రులుగా ఉండినయెడల) మరియు 1 కొరింథీ 13లో చెప్పిన ప్రేమతో ఇతరులను ప్రేమించుచున్న యెడల ఈ భూమిమీద జీవించినవారందరిలో మీరు గొప్పవారు అగుదురు. మనము శరీరఆరోగ్యము నిమిత్తము అప్పుడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొనినట్లే 1 కొరింథీ 13వ అధ్యాయము ఆత్మీయ పరీక్ష చేసుకొనుట మంచిది. ప్రేమయే శ్రేష్టమైనది.
సాతాను వెలుగు దూతవలె వచ్చి, ప్రజలతో ధనము లేక లైంగికసంతోషము లేక శరీరసంబంధమైన ఉద్రేకములు లేక పేరుప్రతిష్టలు పొందుటయే శ్రేష్టమైనవని చెప్పును. వెలుగుదూత వలె విశ్వాసుల యొద్దకు వచ్చి అన్యభాషలలో మాట్లాడుటయే శ్రేష్టమైనదని చెప్పును (1 కొరింథీ 13:1). లేక ఆత్మ వరములైన బోధించుటగాని మరియు అద్భుతములు చేయుటగాని శ్రేష్టమైనవని చెప్పును (2వ). లేక దయకలిగి బీదలకు ఇచ్చుట, కాల్చబడుటకు శరీరమును అప్పగించుట శ్రేష్టమైనదని చెప్పును (3వ). కాని ఇవన్నియు సాతాను చెప్పే అబద్ధములు. శ్రేష్టమైనది ప్రేమయే. దీనికి మన జీవితములే సాక్ష్యములై యుండవలెను. ఆవిధముగా సాతాను యొక్క అబద్ధములను బహిర్గతము చేయుదము.
1 కొరింథీ 13:4-7లో చెప్పబడిన ప్రేమయొక్క లక్షణములు ఇతరుల విషయములో మనం స్పందించే విధానము మరియు మన ఆత్మీయముగా పరీక్షించుకొనుటకు దేవుడు అవకాశమిచ్చుచున్నాడు.
దేవునిని మరియు ఇతరులను ఈ విధముగా ప్రేమించుటకు, మీకు మంచి పునాది ఉండవలెను. రెండస్థుల భవనంవలె ప్రేమ ఉండును. మనయెడల దేవునికి ఉన్న ప్రేమయే పునాదియై ఉన్నది. మనముదేవుని ప్రేమించుట మొదటిఅంతస్థు మరియు మనము ఇతరులను ప్రేమించుట రెండవ అంతస్థు. మన యెడల దేవునికున్న ప్రేమంతటిని మొదటిగా ధ్యానించినయెడల బలమైన పునాది కలిగియుండెదము (మొదటిగా ఆయన మనలను ప్రేమించియున్నాడు గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము 1యోహాను 4:19) మరియు రెండవదిగా దేవుడు మనలను ఎంతగా (ఎన్నిసార్లు) ప్రేమించియున్నాడో ధ్యానించవలెను (విస్తారమైన పాపములు క్షమించబడినవాడు విస్తారముగా ప్రేమించును లూకా 7:47). అప్పుడు దేవునిని మరియు ఇతరులను ప్రేమించుట సులభముగా ఉండును. మనయొక్క పూర్వపాపములకు శుద్ధికలిగిన సంగతి మరచిపోయిన యెడల గ్రుడ్డివారమగుదుము (2 పేతురు 1:9). కాబట్టి మనము వీటిని మరచిపోకూడదు.
అంతమువరకు ప్రేమించుట:
ప్రభువైనయేసు తనవారిని అంతము వరకు ప్రేమించెను (యోహాను 13:1). ఈవిధముగా ''మొదటి బల్లలో పాల్గొనే కూటమి'' మరియు మనము కూడా బల్లలో పాల్గొనిన ప్రతిసారి ఆవిధముగా ఉండాలి. ప్రభువు తన శిష్యులయొక్క పాదములు కడుగుటలో తన ప్రేమ వెల్లడి పరచబడింది. అనగా ఇతరులను నిందించుట మరియు నేరముమోపక, మొదటిగా వారి శరీరఅవసరములను తీర్చి మరియు ఇతరుల కంటిలో నలుసును కడిగి ఆత్మీయముగా పవిత్రపరచును.
అయినప్పటికి క్రీస్తు ఆత్మకు విరోధముగా, యూదా ఇస్కరియోతును చూస్తాము. ప్రభువైన యేసు తన పాపములు కడిగి మరియు రొట్టె ముక్కను ఇచ్చి అతనిని ఘనపరచినప్పటికిని అతడు తన హృదయమును కఠినపరచుకొనెను.
మరియు ఈనాడు కూడా రొట్టె విరిచే కూటములో పరలోకము యొక్కయు మరియు నరకము యొక్క ఆత్మను కలిగినవారున్నారు. మనము ప్రభువైనయేసువలె దీనులమైయుండి, తగ్గించుకొనుచు, ప్రేమతో పరిచర్య చేయుచు నమ్మకద్రోహము చేసినవారిని క్షమించుచూ ఉండవచ్చును. లేక ఇస్కరియోతుయూదావలె ద్వేషమును, హృదయకాఠిన్యమును కలిగియుండవచ్చును.
సాతాను త్వరగా యూదా హృదయములోనికి ప్రవేశించెను (26వ) మరియు అతడు ఆ రాత్రిలో వెళ్లిపోయెను. ఎల్లప్పుడు సాతాను రాత్రిసమయములలోనే ఎవరి హృదయములోనికైనను వచ్చును. మారుమనస్సుపొందుటకు ఆత్మయొక్క పిలుపును ఒక వ్యక్తి తిరస్కరించుచున్నయెడల అది ఒక రబ్బరు బ్యాండును లాగినట్లు ఉండును. కొద్ది సమయానికి అది మరలా వెనుకకు వచ్చును. ఆ విధముగా ఎల్లప్పుడూ జరుగుచున్నట్లయితే అటువంటి వ్యక్తి రక్షణను కోల్పోవచ్చును. మరియు అప్పుడు సాతాను మరియు దురాత్మలు అతనిలోనికి వచ్చును. దానిని ఆలోచించుటయే భయంకరముగా ఉన్నది. కాని కొందరికి ఈవిధముగా జరిగింది.
ఒక వ్యక్తి తాను వెళ్ళుచున్న స్థానిక సంఘముతో ఏకీభవించనియెడల, అతడు ఆ స్థానికసంఘమును విడచి మరొక సంఘమునకు వెళ్ళవచ్చును. అతని హృదయములోనికి సాతాను ప్రవేశించలేడు. కాని ఒక వ్యక్తి ద్వేషముతో నింపబడి ఒక సంఘమును విడచి మరొక సంఘములో చేరినయెడల, సాతాను అతని హృదయములో ప్రవేశించును.
సంపూర్ణరక్షణ పొందుటకు మార్గము, ''ప్రభువును మరియు ప్రజలందరిని అంతమువరకు ప్రేమించుటయే''. అనగా ప్రభువు ప్రేమించినట్లే.
ధనము విషయములో నమ్మకముగా ఉండుట:
నీవు విద్యార్థిగా ఉన్న ఈ దినములలో, డబ్బు ఖర్చుపెట్టు విషయములో జాగ్రత్తగా ఉండుము. ఆవిధముగా భవిష్యత్తుకొరకు నిన్ను సిద్ధపరచును. మరియు వస్తువులను ఉపయోగించే విషయంలో నమ్మకముగా ఉన్నవారికి, దేవుడు బహుమానములు ఇచ్చును. కనుక మీరు ఆత్మీయఐశ్వర్యమును పొందెదరు.
నిత్యమైనవిలువ లేనివాటికొరకు మనకున్న కొద్దిజీవితమును వృథా చేసుకొనకూడదు. కాబట్టి డబ్బు ఖర్చుపెట్టే విషయములో జాగ్రత్తగా ఉండవలెను. ఈభూమి మీద జీవించుటకు దేవుడనుగ్రహించిన డబ్బును ఉపయోగించే విధానమే, నీవు కలిగియున్న భక్తిని వ్యక్తపరచును. అనవసరమైన వాటికొరకు నీవు దానిని వృథా చేయకూడదు. నీవు ఖర్చుపెట్టే విషయంలో మితముగా ఉండుట నేర్చుకొనవలెను.
నీవు విద్యార్థిగా మితముగా ఖర్చుపెట్టుట నేర్చుకొనవలెను. నీ ఖర్చులను లెక్క వ్రాసుకొనుట మంచిది. అప్పుడు నీవు ఎక్కడైతే ఎక్కువ ఖర్చుచేసియున్నావో రాబోయే సెమిస్టర్‌లో తక్కువ ఖర్చు చేసుకొనవచ్చును. కాలేజీ బిల్లులను ఆ గడువులో చెల్లించాలి. మరియు నీవు చెక్కువ్రాసే ముందుగా బ్యాంకులో సరిపోయే డబ్బు ఉన్నదో లేదో చూచుకొనవలెను. సంవత్సరఆరంభములో కాలేజీ వారు నీకిచ్చిన డబ్బు నీకు ఆ సంవత్సర ఖర్చులన్నింటికి సరిపోవునట్లుగా ఖర్చుపెట్టుకొనవలయును.
తరువాత నీకు ఉద్యోగము వచ్చినప్పుడు, నీ పైఅధికారులను గౌరవించి, మర్యాదగా ఉండి మరియు సంపూర్ణముగా యథార్థముగా ఉండవలెను. ఆవిధముగా వారినుండి మంచి గుర్తింపు పొందవలెను. మరియు నీవు చేసే పని మంచిగా ఉండునట్లు, కష్టపడి పనిచేయుచు అవసరమైతే ఎక్కువ సమయము చేయవలెను.
సంగీతము మరియు టెలివిజన్ మధ్యవున్న తేడాను గుర్తించుట:
ఈ విషయములలో నీవు సాతానుచేత మోసగించబడకుండా, దేవునిని మహిమపరచునట్లు ఈ దినములలో వివేచనఉండుట ఎంతో మంచిదని మీకు గుర్తు చేయుచున్నాను. ఉదాహరణకు సంగీతము ఈ దినములలో ఎంతో అపాయకరముగా ఉన్నది. దీనిద్వారా సాతాను అనేకలక్షల మందిని ప్రభువుకు దూరపరచియున్నాడు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. మీరు కలిగియున్న ప్రతి తలాంతు దేవుడు అనుగ్రహించినదే కాబట్టి ఆయన కొరకే దానిని ఉపయోగించవలెను. కాబట్టి సంగీతము వినే విషయములో తీవ్రముగా ఉండవలెను. కొంత విశ్రాంతి కొరకు శాస్త్రీయసంగీతము వినవచ్చును. కాని ''ఆధునిక'' సంగీతము అని చెప్పబడేది అపవాదికి సంబంధించినదై మరియు అపాయకరమైయున్నది. మరియు మన గృహములో ఉన్న నియమం ప్రకారం లోకసంబంధమైన పాటలు కొన్నిసార్లు పాపపుతలంపులు తెచ్చును. గనుక వాటిని వినకూడదు. అటువంటి టేపులుగాని సీ.డీలుగాని మీ దగ్గర ఎప్పుడూ ఉంచుకొనకూడదు. అటువంటివి ఏమైనను మీవద్ద ఉన్నట్లయితే, ఎఫెసీయులు మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకములు కాల్చివేసినట్లే మీరు వాటిని నాశనం చేయవలెను (అపొ.కా. 19:19).
అదే విధముగా, కుయుక్తితో మీకు సలహాలనిచ్చే టీ.వీ కార్యక్రమములను చూడవద్దు. ఎందుకనగా అవి అనేక సంవత్సరములు మీ మనస్సులలో ఉండును. ఈ విషయములలో మీరు జాగ్రత్తగాఉన్నట్లయితే, నిత్యత్వములో చింతలుఉండవు. అన్ని సమయములలో ప్రభువుయెడల ఆత్మీయఆసక్తి కలిగియుండుడి. ఈలోకపు ఆత్మచేత మీరు ఆత్మీయముగా మొద్దుబారకూడదు. ఎల్లప్పుడు మీ హృదయములను మరియు మీరు కలిగినవాటి విషయములోను శుద్ధి చేసుకొనుడి.
మీ హృదయమును పవిత్రముగా ఉంచుకొనుడి:
అనేక సంవత్సరములనుండి మీ తల్లిదండ్రులలో చూచిన, దేవుని వాక్యములోని నియమములను జ్ఞాపకము ఉంచుకొనుడి. మీ తరములో మీరు కూడా ఆ నియమములతో జీవించుటకు ప్రభువు మీకు కృపనిచ్చునుగాక.
ప్రభువైనయేసు మరలా వచ్చినప్పుడు, దేవునికి భయపడువారు మరియు దేవునికి భయపడనివారు అను రెండు గుంపులుగా చేయును (మలాకీ 3:18) లేక గిన్నెను లోపల శుద్ధి చేసుకొనువారు మరియు కేవలము వెలుపల శుద్ధిచేసుకొనువారు (మత్తయి 23:25,26). దేవునియెడల భయభక్తులు కలవారు మనుష్యుల యెదుట కాదు గాని దేవునియెదుట తమ హృదయములను శుద్ధి చేసుకొందురు. మనము పాపములో పడిన ప్రతిసారీ దు:ఖించినయెడల జయము పొందెదము.
నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు మరియు శుద్ధహృదయమును కలిగియుండుటకును తేడాఉన్నది. తెలిసిన పాపము నుండి స్వతంత్రులమగుటయే నిర్మలమైన మనస్సాక్షి మరియు దేవునిని తప్ప మరిదేనిని కొరనిదే శుద్ధ హృదయము. ''హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు''. ప్రతి పరిస్థితిలోను శుద్ధ హృదయము దేవునినే చూచును (మత్తయి 5:8). అప్పుడు నీవు దుష్టుల చేతనైనను మరియు కష్టపరిస్థితులతోనైనను నింపబడక దేవునినే చూచెదరు. కాబట్టి ఇతరులకు వ్యతిరేకముగా ఫిర్యాదులు చేయుచూ మరియు విమర్శించుచున్నయెడల, నీ హృదయము దేవునిచేత కొనిపోబడలేదని సూచించుచున్నది. నీవు శుద్ధహృదయము కలిగి దేవునిని మాత్రమే చూచుచున్నయెడల, దేవుడు సమస్తమును నీ మేలుకొరకే జరిగించుచున్నాడని విశ్వసించుచు మరియు ఎల్లప్పుడు ఆయనను స్తుతించెదవు. ప్రపంచములోని ప్రజలందరును మరియు విశ్వములోని దయ్యములన్నియు నీకు విరోధముగా కలసినను దేవుడు నీతో ఉన్నయెడల, నీ జీవితములోని దేవుని ప్రణాళికను ఆటంకపరచలేవు. మరియు ప్రతి పరిస్థితిలోను జయించువాడవుగా ఉండి మరియు నీ జీవితములో దేవుని సంపూర్ణచిత్తమును నెరవేర్చుదువు.
''నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును'' (సామెతలు 27:19). ఈ వచనముయొక్క ఒక అర్థం ఏమనగా, ఇతరులు మనకు చేసినదానిని బట్టి మనము తప్పుడు వైఖరులను కలిగియున్నయెడల, నిజానికి మన హృదయము యొక్క స్థితిని బయలుపరచుచున్నాము. వారు మనకు చేసిన క్రియలు, మనము చేసినయెడల ఎటువంటి చెడ్డ ఉద్దేశ్యముతో చేసెదమో, అటువంటి ఉద్దేశ్యముతోనే వారు చేసియున్నారని ఊహించుకొనెదము. కాని మనము ఎల్లప్పుడు మనలను మనము తీర్పుతీర్చుకొనుచు, ఇతరులను తీర్పు తీర్చక ఎల్లప్పుడు పవిత్రపరచుకొనెదము. ఇతరుల బాహ్యమైన క్రియలను మాత్రమే తీర్పుతీర్చుచున్నామని ప్రభువు చెప్పాడు (''వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు'' మత్తయి 7:16) మరియు వారి యొక్క వేళ్ళను (వారియొక్క ఉద్దేశ్యములను) మనము చూడలేము.
13వ శతాబ్దములో అస్సిసీకి చెందిన ఫ్రాన్సిస్‌కు శిష్యుడైన జానిఫర్ ఉండెను. అతడు ఎల్లప్పుడు సామాన్యమైన వస్త్రములనే ధరించేవాడు. ఒక రోజున అతని సహోదరులలోని ఒకడు ఖరీదైన దుస్తులు ధరించెను. అప్పుడు అతడు తనతో యిట్లనుకొనెను, ''ఖరీదైన దుస్తులు ధరించిన ఇతడు, సామాన్యదుస్తులు ధరించిన నాకంటే దీన హృదయము కలిగియుండెనేమో''. అటువంటి పవిత్ర హృదయముతో తన సహోదరునికి తీర్పుతీర్చకుండ కాపాడబడెను. ఈ మంచి మాదిరిని మనమందరమును వెంబడించవచ్చును.
సణుగులను మరియు గొణుగులను పూర్తిగా మానవలెను:
పస్రంగి 2:14లో సొలొమోను చెప్పిన రీతిగా ప్రపంచములోని విశ్వాసులును మరియు అవిశ్వాసులును సమస్యలను ఎదుర్కొనెదరు. ఆవిధముగా ఎందుకు జరుగును? అటువంటి సమస్యలనుండి దేవుడు తన బిడ్డలను ఎందుకు కాపాడడు? ఎందుకనగా అంత్యదినమున తనయొక్క బిడ్డలు ప్రతి పరిస్థితిలోను సణగక మరియు ఫిర్యాదు చేయకుండునట్లు దేవునియొక్క కృపామహదైశ్వర్యమును అనుభవించియున్నారని దేవుడు చూపించాలనికోరుచున్నాడు. ఆవిధముగా దేవునికి విరోధముగా ఫిర్యాదుచేసిన అవిశ్వాసుల యొక్క నోళ్లను ఆయన మూసివేయును.
దేవునికి విరోధముగాను మరియు ప్రజలకు విరోధముగాను గొణుగుచు, సణుగుచు మరియు ఫిర్యాదు చేసే ప్రజలతో లోకము నింపబడియున్నది. మన జీవితములలో సణుగులను సంశయములను పూర్తిగా మానివేయుటద్వారా ఈ లోకములోని వక్రజనము మధ్య జ్యోతులవలె ఉండి, దేవుని వెలుగును ప్రకాశింపచేసెదము (ఫిలిప్పీ 2:14,15).
అనేకమంది గొప్ప పరిశుద్ధులు మరియు మిషనరీలు (మరియు కొన్ని శతాబ్దములనుండి కమ్యూనిస్టు దేశములలో క్రీస్తు నిమిత్తము హింసించబడినవారు) క్రీస్తులో వారికున్న విశ్వాసము నిమిత్తము సణగక లేక ఫిర్యాదు చేయకుండా అనేక శ్రమలు అనుభవించిరి. తీర్పు దినమున వారి యొక్క వీడియోలను మనము చూచినప్పుడు, మన జీవితములలోని చిన్న చిన్న విషయము కొరకే ఫిర్యాదు చేసి సణిగినందుకు సిగ్గుపడెదము. రెండు వేల సంవత్సరముల తరువాత విలువలేని వాటి గురించి సణుగుటలో విలువలేదు.
మరియు మనము దేవుని సంకల్పమును కోరుచూ మరియు ఆయనను ప్రేమించిన యెడల, సమస్తమును సమకూర్చి మనమేలుకొరకు జరిగించునని దేవుడు వాగ్ధానము చేశాడు. కాబట్టి మనము ఫిర్యాదు చేయవలసిన కారణము ఏమియులేదు.
మనకు హానిచేసినవారిని దేవుడు వెంటనే శిక్షించడు. దేవుడు ఆవిధముగా బెదిరించడు. వారిని శిక్షించుటకు బదులుగా జయించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించి మరియు సమస్తమును బట్టియు మరియు మనుష్యులందరిని బట్టియు కృతజ్ఞత చెల్లించువారుగా చేయును (ఎఫెసీ 5:20, 1 తిమోతి 2:1) మరియు వారిని ప్రేమించునట్లుగా దేవుడు చేయును. దేవుడు తన శత్రువులను నోరు మూయించుట కంటె ఈ విధముగా చేసినందుకు దూతలు ఆశ్చర్యపడుదురు.
శ్రమలయొక్క రహస్యము:
పోరాటము ఎంత పెద్దదైనను, ప్రభువునే గట్టిగా పట్టుకొనుము. ఒక పాటలో ఉన్న రీతిగా, ''ప్రభువైన యేసును చూచుటయే చాలును''. ప్రతియొక్క పరిస్థితిని ఎదుర్కొనుటకు కావలసిన కృపను శక్తిని ప్రభువులో నుండి పొందుకొనుట ద్వారా మరి ఎక్కువగా దైవజనులుగా మారెదరుగాక. దేవుడు తన ప్రజలను సులభముగా విడిపించగలిగినప్పటికి వారికి అనేక శ్రమలు అనుమతించుట ఒక రహస్యముగా ఉండును. బాప్తిస్మము ఇచ్చు యోహాను జైలులో చాలా కాలము ఉన్నప్పుడు, అతడు విడుదల పొందనందువలన, ప్రభువైన యేసు నిజమైన మెస్సయ్యేనా అని ఆశ్చర్యపోయెను (మత్తయి 11:3). ప్రభువైన యేసు బాప్తిస్మసమయములో అతడు ఆయన గురించి సాక్ష్యమిచ్చెను. ఈనాడు కూడా చైనాలోను మరియు ఇతర ప్రాంతములలోను సువార్త నిమిత్తము జైళ్లలో వేయబడినందున దేవుడు వారికి ఈ శ్రమలు ఎందుకు అనుమతించెనో అని ఆశ్చర్యపడుచున్నారు. వారు ప్రార్థించినను జవాబు రానందువలన ''ఓ యేసు ప్రభువా, ఎంతకాలము.....?'' అని మొరపెట్టుచున్నారు.
రష్యా మరియు రొమేనియా మొదలగుప్రాంతములలో గత పదునాలుగు సంవత్సరములనుండి విడుదలపొందకుండా జైళ్లలో ఉన్నవారియొక్క కుటుంబసభ్యుల గురించి నేను ఆలోచించుచున్నాను. వారి యొక్క ప్రియులు జైళ్లలో అనేకశ్రమలు పొందుచున్నప్పుడు, వారు ఎంతో బాధలో ఉండి ప్రార్థించినను పరలోకమునుండి జవాబు రాలేదు.
ఆ విశ్వాసులలోని కొందరు అనేక సంవత్సరములు నిర్బంధంలో ఉంచబడిరి. వారు అపొస్తులుడైన పౌలును పోలి నడచుకొనిరి. అటువంటి వారిని నేను ఎంతో గౌరవించెదను. క్రీస్తునిమిత్తము మనము శ్రమలు పొందినప్పుడు, ఇతర విశ్వాసులయెడల సానుభూతి చూపగలము.
భవిష్యత్తులో మీ అందరి కొరకు దేవుడు ప్రత్యేకమైన పరిచర్య కలిగియున్నాడు. నా పూర్ణహృదయముతో దానిని నమ్ముచున్నాను. దేవునిహస్తము మీ జీవితముల మీద ఉన్నది. కాబట్టి ప్రత్యేకముగా ఆత్మీయమైన పాఠములను నేర్చుకొనెదరు.
1969 నవంబరు నుండి (భక్త్ సింగ్ సహవాసము వారు నన్ను తిరస్కరించినప్పుడు) 1975 ఆగస్టు వరకు (సి.ఎఫ్.సి ఆరంభించువరకు) అనగా ఆరు సంవత్సరములు దేవుని చిత్తమును తెలుసుకొనలేక కలవరపడ్డాను. అప్పుడు నాకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పరలోకమునుండి ఎటువంటి స్వరము వినబడనందువలన కటిక చీకటివలె ఉండెను. కాని ఇప్పుడు నేను వెనుకకు చూచినయెడల, దేవుడు నా కొరకు సిద్ధపరచిన పరిచర్యను నేను చేయుటకు, ఆయన నన్ను విరుగగొట్టి మరియు సిద్ధపరచియున్నాడు. మీరు ఆయనను ప్రేమించినయెడల, ఆదాముకు సంబంధించినదంతయు మీలో నుండి బయటకు పోవువరకు ఆయన మిమ్ములను విరుగగొట్టును. ఈ లోకములో కాలేజీ విద్యగాని లేక ఒక కంపెనీలో పనిచేయుటవలన పొందే అనుభవము గొప్పది కాదు. దేవుడే స్వయముగా మీకు నేర్పించినది మాత్రమే గొప్పది.
కాబట్టి రెండు విషయములలో నమ్మిక తప్పిపోకూడదు: 1. దేవుని ప్రేమించువారికి, ఆయన సమస్తమును సమకూర్చి వారి మేలుకొరకు జరిగించును (రోమా 8:28).
2. మీ శక్తికి మించిన శోధనను దేవుడు అనుమతించడు. అంతేకాక శోధనతో పాటు కృపను కూడా అనుగ్రహించును (1 కొరింథీ 10:13).
దేవుని వాక్యమే సత్యము మరియు మిగిలినదంతయు అసత్యము. మీరు మీ సొంత జ్ఞానమును ఆధారము చేసుకొనక, పూర్ణ హృదయముతో దేవునియందు విశ్వాసముంచిరి.
దేవుడు మిమ్ములను ప్రోత్సహించి మరియు ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మరియు మీ జీవితములోని ప్రతియొక్క పరిస్థితులన్నిటిలో, దేవుడు కనికరము చూపును గాక. దేవుడు మన యెడల ఎంతో కనికరము చూపియున్నాడు. కాబట్టి చిన్నచిన్న మేలులకు కూడా మనము కృతజ్ఞత కలిగియుండాలి. మనము పొందుచున్నదంతయు నరకము కంటే శ్రేష్టమైయున్నది.
కష్టాలలో దేవునిని నమ్ముట:
1 తిమోతి 3:16 (నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది - ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను). మరియు 1 తిమోతి 4:1 (కొందరు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు). అంత్యదినములలో, ప్రభువైనయేసు పవిత్రతతోను, దీనత్వముతోను మరియు ప్రేమతోను ఈ భూమిమీద జీవించినరీతిగా, ఆయనను వెంబడించుటను విశ్వాసులు తీవ్రముగా తీసుకొనరు. ప్రభువైన యేసు తన జీవితకాలమంతయు శ్రమల మార్గములో వెళ్లిరి. మరియు ఈనాటి క్రైస్తవులకు అది ఆకర్షణీయముగా లేదు.
ప్రభువైన యేసుజీవితములో తన యొక్క తండ్రి అనుమతించిన శ్రమలలో ఆయన విశ్వాసముద్వారా వెళ్లుటను గూర్చి మూడు ఉదాహరణలు చూచెదము:
1. భూమి మీద ముప్పైమూడు సంవత్సరములు తన తండ్రికి సంపూర్ణవిధేయత చూపించి, ఈ గిన్నెను తొలగించుమని ప్రభువు చేసిన ప్రార్థనకు తండ్రి జవాబు ఇవ్వలేదు.
2. నన్నేల చేయి విడిచితివని ప్రభువు తండ్రికి చేసిన ప్రార్థనకు జవాబు పొందలేదు.
3. ఈ లోకములో చివరిసారిగా ప్రభువైనయేసు సిలువ మీద వస్త్రహీనుడుగా వ్రేలాడి, బహిరంగముగా అవమానపరచబడి మరియు అపార్థము చేసుకొనబడియున్నాడు.
ప్రభువుకి లోబడి జీవించుచున్నప్పటికి మనము ఆయనను ప్రార్థించినప్పుడు, మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మరియు సమాజములో అవమానమును అనుమతించినప్పటికి ఆయనను వెంబడించుటకు ఎంత మంది సిద్ధముగా ఉన్నారు. ఇదియే విశ్వాసజీవితము అనగా పరిస్థితులన్నిటిని మన జీవితములో అనుమతించే పరలోకపుతండ్రి ఉన్నాడు అని సంపూర్ణముగా విశ్వాసముంచి మరియు ఆయనను ప్రశ్నించకుండా అన్ని పరిస్థితులలో సంపూర్ణముగా లోబడియుండుట.
దేవుడు మన చుట్టూ ఉంచిన పరిమితులను గౌరవించుట:
సాతాను పేతురుని జల్లించవలెనని కోరినప్పుడు, అతని విశ్వాసముకొరకు ప్రభువు ప్రార్థించెను (లూకా 22:31,32). మనము పేతురువలే లోకస్తుల మధ్యలో ఉన్నప్పుడు సాతాను మనలను జల్లించి మరియు తప్పిపోవునట్లుగా ప్రయత్నించును.
హృదయపూర్వకముగా ప్రభువు కొరకు జీవించాలని మీరు కోరుచున్నారు గనుక మీరు సాతానుకి గురిగా ఉండెదరు. అంతమాత్రమే కాక మీ తల్లిదండ్రులు కూడా ప్రభువుని సేవించుచున్నారు. కాని సాతానుకి ముఖ్యమైన గురిగా ఉండుట ఆధిక్యత అయియున్నది. అయితే మనము జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఉండవలెను. మనము సాతానుకు భయపడము గనుక దేనిగురించి భయపడము. సిలువమీద సాతాను నిత్యత్వమునకు ఓడించబడియున్నాడు. మరియు అతడు పక్షపాతముగల పామువలె శక్తిహీనుడై యున్నాడు. అయితే మనము క్రీస్తుతో సిలువమీద నిలిచియుండవలెను. కాని లోకానుసారమైన స్నేహితులద్వారా సాతాను మనలను మోసగించి ప్రభువు యొద్దనుండి దూరపరచును.
దేవుడు వారిచుట్టూ ఉంచిన పరిమితులను ఆదాము హవ్వలు గౌరవించనందున వారు ఓడిపోయెను. దేవుడు మాత్రమే పరిమితులులేని వాడైయున్నాడు. సృష్టించబడిన వారము గనుక మన చుట్టూ దేవుడు పరిమితులు ఉంచియున్నాడు. అన్ని సమయములలో ఆ పరిమితులను మనము గౌరవించవలెను. కొన్ని విషయములు నిషేధించబడినవి మన మేలుకొరకే దేవుడు వాటిని నిషేధించాడు. కాని నిషేధించబడినవి ఆకర్షణీయముగా ఉండవచ్చు. ఆ విషయములలో మనము శోధించబడి ఆకర్షించబడెదము.
''కంచె కొట్టు వానిని పాము కరచును'' (ఆ కంచె దేవుడు పెట్టిన పరిధి) (పస్రంగి 10:8). దేవునియందు విశ్వాసమూలముగా జీవించుట అనగా నిషేధించబడిన వస్తువుల విషయములలో దేవుని అభిప్రాయమే సరియైనదని నమ్మి మరియు సాతాను యొక్కయు మరియు మన స్నేహితుల యొక్క అభిప్రాయములు తప్పు అని నమ్ముట. మనము ఇట్లు చెప్పెదము, ''ప్రతీ మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు'' (రోమా 3:4).
అన్నిటిని తెలుసుకోవాలనే ఆసక్తి అపాయకరమైనది. నిషేధించబడిన ఫలములను రుచి చూడవలెనని ఆదాము మరియు అవ్వలు కోరియున్నారు. ఈవిధముగా అనేకులు బూతు పుస్తకములు చదువుటకును, సినిమాలుచూచుటకును మరియు త్రాగుబోతులు అగుటకును మొదలగు వాటిని చేయుటకు ఆకర్షించబడియున్నారు. ఆదాము స్వయముగా ఆ పండు తినేవాడో కాదో మనకు తెలియదు కాని అవ్వ ద్వారా అతడు నడిపించబడ్డాడు. మరియు అనేకమంది యౌవనస్థులు ఈవిధంగా నడిపించబడతారు. తమంతట తామే వారు నిషేధించబడినవాటిని చేయరు. కాని వారి స్నేహితుల ద్వారా వాటియొద్దకు నడిపించబడెదరు. కాబట్టి అవసరమైతే మీ స్నేహితులతో ''కాదు'' అని చెప్పాలి. మరియు మీరు దేవుని అంగీకారము కోరినయెడల మీ స్నేహితుల మెప్పును పొందకపోవచ్చును. దానియేలు వలే ''తనను అపవిత్రపరచుకోకూడదని'' మీరు నిర్ణయించుకొనవలెను (దానియేలు 1:8).
కృప యొక్క ఉద్దేశ్యము:
ఈ ఉదయకాలమున నేను మంచి వచనము చదివాను, ''మీరు ఎందుకు నిద్రించుచున్నారు. శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను'' (లూకా 22:46).
శిక్షించబడతాము అనే భయముతో పాపము చేయకుండుట, పాత నిబంధన పద్ధతి అయియున్నది. (ధర్మశాస్త్ర ప్రకారము తీర్పును గురించిన భయము). కాని క్రొత్త నిబంధనలో దేవునికి అవమానమును మరియు మనకు హానిచేయును గనుక పాపము చేయకుండునట్లు శ్రేష్టమైన మార్గమును ప్రభువైనయేసు చూపెను.
మీరు పాపము చేసిన ప్రతిసారి ఈవిధముగా చెప్పవలెను, ''ఇక్కడ నేను కృపను పొందలేదు''. ఆ సమయములో మీరు కృపలో ఉండినయెడల, పాపము యొక్క శక్తి మీమీద ఉండదు (రోమా 6:14). మరియు మీరు కొంచెము ముందుకు వెళ్ళి మరియు మీతో ఈవిధముగా చెప్పుకొనవలెను, ''దేవుడు ఎల్లప్పుడూ దీనులకే కృపను ఇచ్చును గనుక నేను ఏదొక విషయములో గర్వించియున్నాను. అందువలన నేను కృపను పొందలేదు''. కాబట్టి మీరు పాపములో పడినప్పుడు ఈవిధముగా ప్రార్థించవలెను, ''ఓ యేసు ప్రభువా, నీ కృపను పొందకుండునట్లు నేను ఎక్కడ గర్వముగా ఉన్నానో చూపించుము''. దేవుని కృపను పొందకుండా గర్వము ఆటంకపరచును. నీవు అవసరములో ఉన్నప్పుడు మీలో ఉన్న ఆత్మవిశ్వాసము దేవునికి ప్రార్థించకుండా చేయును. బహుశా అందువలన నీవు పడిపోయి ఉండవచ్చును. అట్లయినచో భవిష్యత్తు కొరకు నీవొక పాఠము నేర్చుకొనవచ్చు.
నిత్యజీవము అనగా నిత్యత్వమునకు జీవించేజీవము. ఆ జీవము తాత్కాలికమైన వాటికంటే నిత్యమైనవాటికే ఎక్కువ విలువనిచ్చును. మరియు భూమిమీద ఉన్నవాటిని నిత్యత్వపు వెలుగులో చూచును. ఒక గోతిలో ఉన్న వ్యక్తి తాడుపట్టుకొని పైకితేబడు రీతిగా ఈ నిత్యజీవాన్ని సంపాదించుకొనుటకు మనము పిలువబడ్డాము (1 తిమోతి 6:12). . నీ పూర్ణహృదయముతో నిత్యజీవమును చేపట్టుము.
మనము మొదటిగా రక్షణపొందవలసిన విషయములు ఏమనగా సణుగుట, వాదించుట, ఫిర్యాదుచేయుట, పోట్లాడుట మరియు గొణుగుట. అనగా అసంతృప్తితో ఉండవద్దు. సంతృప్తి సహితమైన భక్తి ఎంతో లాభసాధకమై యున్నది (1 తిమోతి 6:6).
ఒక బానిసకు ఎటువంటి హక్కులు ఉండవు మరియు అతడు దేనిని బట్టి ఫిర్యాదు చేయడు. మొదటి శతాబ్దములో, ఒక ఇంటిలో ఒక చిన్న వస్తువు యొక్క హుక్కులవలె ఒక బానిస ఉండెను. ప్రభువైన యేసు మన నిమిత్తము దాసుడైయున్నాడు. ఇదియే మన పిలుపు కాబట్టి ఇతరులు మనలను ఏవిధముగా చూచినను మనము ఫిర్యాదు చేయము.
యేసుజీవించిన వాటికొరకే మనము జీవించెదము.
మంచి హృదయము కలిగియుండుట:
దేవుడు మాత్రమే సత్ పురుషుడు అయియున్నాడని ప్రభువైన యేసు చెప్పాడు. మనము ఈ భూమిమీద మంచివని పిలిచేవి ఏవియు దేవుని మంచితనము కాదు. దేవుడు ఎప్పుడూ ఇతరులయొక్క శ్రేష్టమైన వాటిని కోరును. ఇదియే ఆయన మంచితనము. తిరుగుబాటుచేసిన ఇశ్రాయేలీయులతో, యిర్మీయా ద్వారా దేవుడు ఇట్లు అనుచున్నాడు, ''రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు'' (యిర్మీయా 29:11). ఈ మంచితనమును మన హృదయములలో వ్రాసెదనని దేవుడు చెప్పుచున్నాడు (హెబీ 8:10). అన్ని సమయములలో మనము ఇతరులను ఏవిధముగా చూసినప్పటికి మనుష్యులందరికి మేలుమాత్రమే జరగాలని కోరే దేవునిస్వభావములో మనము పాలివారముకావలెను. దేవుడుమాత్రమే అటువంటి స్వభావము మన హృదయములో కలుగజేయును. మన సొంత మంచితనము ఏదైనను అది బాహ్యముగా ఉండి మరియు బాహ్యజీవితమును మెరుగుపరచును. మనము నూతనహృదయమును పొందవలసియున్నది. ఇతరులవిషయములో తప్పుడు వైఖరి కలిగిన ప్రతిసారి దు:ఖించే వారికి దేవుడు దీనిని చేయును.
''ఆయన యొక్క మంచితనమే దేవునియొక్క మహిమ'' (నిర్గమకాండము 33:18,19). మోషే దేవుని మహిమను చూపించమని కోరినప్పుడు దేవుడు ఈ విషయమును చెప్పారు. ఈ మహిమనే మనుష్యులు అందరూ పొందలేకపోవుచున్నారు (రోమా 3:23). ఈ మహిమను కలుగజేయుటకే ప్రభువైన యేసు వచ్చియున్నారు. కాబట్టి ఇతరుల విషయములో మనము మంచిగా లేని ప్రతిసారి దు:ఖించెదము. ఈ విషయములో మనము పోరాడి మరియు అందరియెడల మంచిగాఉండెదము.
కాని అంత్యదినములలో పరిశుద్ధాత్ముడు ఈవిధంగా హెచ్చరించుచున్నాడు, ''దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు'' (2 తిమోతి 3:13) మరియు బైబిలు యొక్క చివరి పేజీలో ఈవిధముగా చదివెదము, ''అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. అపవిత్రమైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము'' (పక్రటన 22:11). అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయుట. పాపములో జీవించుమని బైబిలులో ఇక్కడ ఎందుకు చెప్పబడింది? ఎందుకనగా ఒక వ్యక్తి బైబిలు అంతా చదివి (అది పరిశుద్ధముగా జీవించవలెనని కోరుచున్నప్పటికి) పాపములో జీవించవలెనని కోరినయెడల, అతడికి నిరీక్షణ లేదు. దేవుడు అతడిని విడిచిపెట్టును కాబట్టి అతడు ఆవిధముగా అన్యాయము చేయుచు మరియు తనని తాను నాశనము చేసుకొనును.
ఓటములు ఆశీర్వాదములుగా మారుట:
నా యౌవనకాలములో నేను ప్రభువును ఎంతగా గాయపరచియున్నానో, అంతకంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించి రాబోయే కాలములో ఆయనను మరియెక్కువగా సేవించవలెనని కోరుచున్నాను. ఎక్కువగా క్షమించబడినవాడు ప్రభువును ఎక్కువగా ప్రేమించును. ప్రభువునన్ను సంపూర్ణముగా క్షమించియున్నాడు గనుక ఆయనను మరిఎక్కువగా ప్రేమించేటట్టు చేసింది. ఆ విధముగా నా ఓటములు కూడా ఆశీర్వాదముగా మారియున్నవి. ప్రభువు నన్ను ఎంతో ఎంతో క్షమించియున్నాడు గనుక ఆయన కొరకు పరిచర్య చేయవలెనని కోరుచున్నాను. ఆవిధముగా సి.ఎఫ్.సి సంఘములో, ఎవరు ఎంతగా పడిపోయినప్పటికిని, నేను వారిని తృణీకరించలేదు. ఇది నేను జయము పొందినప్పుడు గర్వించకుండా చేసింది. నేను పడిపోకుండా కాపాడువాడు ప్రభువైన యేసు మాత్రమే. మన ఓటములను కూడా ఆయననామమునకు మహిమకలుగునట్లుగా మార్చే దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు.
''తన యొక్క సువార్త ప్రకటించుటకు ప్రభువు అపొస్తులను ఏర్పరచుకొనినప్పుడు, ఆయన పాపులకొరకే గాని నీతిమంతులకొరకు రాలేదని రుజువుచేయుటకు పాపులలో ప్రధానులను ఏర్పరచుకొనెనని'' మొదటి శతాబ్దములో (70 మరియు 132 ఏ.డి) ''బర్నబా యొక్క పత్రిక'' లో వ్రాసాడు. ఆయన ఎదుట ఎవరును అతిశయించకుండుటకు దేవుడు ఈ విధముగా చేయును. దౌర్భాగ్యుడైన నన్ను రక్షించిన అద్భుతమైనకృపను నేను ఎరుగుదును గనుక గత సంవత్సరములన్నింటిలో నన్ను గర్వించకుండా చేసింది.
చిన్న విషయములలో నమ్మకముగా ఉండుము. అప్పుడు రాబోయే కాలములో ప్రభువు గొప్పవాటిని ఇచ్చును. మీ జీవితములో దేవునికి ప్రత్యేక ఉద్దేశ్యం ఉన్నది. అది అంతయు నెరవేరునట్లు చూసుకోవాలి. ఇతర క్రైస్తవులనుబట్టి నీవు నీ జీవితములో అనుభవించిన అన్నింటి ద్వారా దేవుడు నిన్ను తన యొక్క పరిపూర్ణ సంకల్పములోనికి నడిపించుచున్నాడు.
సి.ఎస్. లూయీస్ వ్రాసిన ''స్క్రూ టేప్ లెటర్స్''లోని కొన్ని భాగములు:
ఈ ''స్క్రూ టేప్ లెటర్స్''లలో నేను ఒకరోజు సెక్స్, ప్రేమ మరియు వివాహము గురించి చదివాను. మీకు కూడా అది ఆశీర్వాదముగా ఉండును. అతడు దానిని ఎంతో లోతైన గ్రహింపుతో వ్రాసాడు. అక్కడ ఆ పుస్తకము దొరికినయెడల తీసుకొని చదువుము. సాతాను దయ్యముల ద్వారా పురుషులను పాపములు చేయుటకు ప్రేరేపించును అని వ్రాసాడు.
''వివాహమునకు ముందుగా ఒకరినొకరు ప్రేమించుకొనుట, కేవలం వివాహము మాత్రమే చేసుకొనుటకు అయ్యుండవలెను'' కాబట్టి పెద్దదయ్యము చిన్నదయ్యముతో ప్రేమించుటకు ప్రేరేపించమని పురుషులను ఒప్పించి, కేవలం కొద్దికాలమే ప్రేమించి పెళ్ళిచేసుకొనకుండా చేయును.
స్త్రీలు సహజముగా ఉండుట కంటే అర్ధనగ్నంగా నటించునట్లుగా దయ్యము వారిని ప్రరేపించును. ఆ విధముగా పురుషులు స్త్రీలను కోరుకొనునట్లు చేయును.
మరియొక అధ్యాయములో మనుష్యుల యొక్క జీవితములలో అనేక అనుభూతులు కలుగుచున్నప్పుడు వాటి ద్వారా కీడు చేయుటకు సాతాను ప్రేరేపించును. మనమెప్పుడైనను నిరాశతో ఉన్నప్పుడు, నిజానికి ప్రభువు మనలను ఆయన యొద్దకు ఆకర్షించుచున్నాడు. ఆయన సన్నిధి ఉన్నదని అనిపించనప్పటికిని మనము ధైర్యముతో ఆయనకు లోబడునట్లుగా ప్రభువు అటువంటి తలంపులు అనుమతించును. పతనావస్థలో ఉన్నప్పుడు లైంగికముగా శోధించబడుదుము.
ఇతరులను నీతిమంతులుగా చేయుటకు మనము నీతిమంతులముగా తీర్చడియున్నాము:
ఎల్లప్పుడు ప్రభువైన యేసువైపు మాత్రమే చూచుచు మరియు ఆయనతో మాత్రమే పోల్చికొనినయెడల, ఎల్లప్పుడు దీనత్వములో ఉండెదము. యేసువైపు మాత్రమే చూడవలెనని హెబ్రీ పత్రికలో ప్రాముఖ్యముగా వ్రాయబడియున్నది. ప్రభువైన యేసు నిస్వార్థముతో మనకొరకు పరలోకమునుండి భూలోకమునకు దిగివచ్చి, మనలను రక్షించుటకు దాసుడైయుండుటను ఎల్లప్పుడు ధ్యానిస్తున్నయెడల మనయొక్క స్వార్థమును చూచుకొనుటయేగాక ఎన్నడైనను మనము గర్వించము. ఎల్లప్పుడు మారుమనస్సుపొందుచు మనముఖము దుమ్ములో పెట్టకొనెదము. అప్పుడు ప్రభువైనయేసు మనలను చూచినట్లుగా మనము ఇతరులను చూచెదము. ఆయన మనలను నీతిమంతులుగా చేసినట్లు మనము కూడా ఇతరులను నీతిమంతులముగా తీర్చెదము.
దేవుడు మన శరీరములలోని భ్రష్టత్వమునుండి తప్పించినట్లే, మనము కూడా ఇతరులను తీర్పు తీర్చక, ఖండించక వారియొక్క భ్రష్టత్వమును కప్పెదము. జెకర్యా మూడవ అధ్యాయములో, న్యాయాధిపతియైన దేవుని ఎదుట యెహోషువ మలిన వస్త్రములతో ఉండెనని చదివెదము. అక్కడ సాతాను నిందించువాడిగా ఉన్నాడు మరియు ప్రభువువైన యేసు ఉత్తరవాదిగా ఉన్నాడు. జెకర్యా న్యాయస్థానములో నిలబడియున్నాడు. ప్రభువైన యేసు యొక్క నీతి అనే ప్రశస్తవస్త్రములతో దేవుడు యెహోషువను అలంకరించియున్నాడు. దానిని బట్టి జెకర్యా సంతోషించి, ''అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని'' చెప్పెను. ఆవిధముగా తన సహోదరుని నీతిమంతుడుగా చేయుటకు ప్రభువైనయేసుతో సహకరించెను. మనము కూడా దీనినే చేయవలెను. ఇతరులలో చెడును చూసినప్పుడు మనము అతనిని నిందించవచ్చును లేక అతని కొరకు విజ్ఞాపన చేయవచ్చును. దానిని మనము నిర్ణయించుకొనవలెను. సాతాను నిందారోపణచేయును. ప్రభువైన యేసు విజ్ఞాపనచేయును.
నిజమైన మరియు నకిలీ పరిశుద్ధత:
దీనత్వముతోలేని పరిశుద్ధతగాని లేక ఆసక్తిగాని నకిలీదైయున్నది. ఇది మానవ ప్రయత్నంద్వారా అనగా ధర్మశాస్త్రముద్వారా కలిగిన పరిశుద్ధత. యోగాచేయుట ద్వారా చాలా మంది పైకి కనబడేకోపమును, లైంగికవాంఛను జయించారు (కాని ఈ పాపము వారి హృదయములలోనే ఉన్నది. ఇది నకిలీ పరిశుద్ధత. ప్రభువైన యేసు ఎల్లప్పుడు మన హృదయములలోని పాపములనుండి విడిపించును. దేవునికృపను అనుభవించుటద్వారా కలుగునది నిజమైనపరిశుద్ధత మరియు దేవుడు దీనులకు మాత్రమే కృపను ఇచ్చును. కాబట్టి క్రీస్తుయొక్క దీనత్వమును కలిగినదే నిజమైన పరిశుద్ధత మరియు ఆసక్తి విషయములో ఇతరులకంటే కమ్యూనిష్టులే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండెదరు.
తన యొద్దనుండి దీనత్వము మరియు సాత్వికముమాత్రమే నేర్చుకొనమని ప్రభువైన యేసు చెప్పాడు (మత్తయి 11:29). ఈ రెండు పాఠములను నేర్చుకొననియెడల సమస్తమును వ్యర్థము.
ప్రభువైనయేసుయొక్క శిష్యులగుర్తు ప్రేమయే:
మనము ఒకరితోఒకరు ఏకీభవించినాగాని లేక ఒకరితో ఒకరు కలిసి పరిచర్యచేసినను కాదుగాని ఒకరినొకరు ప్రేమించినప్పుడే శిష్యులమగుదుము (యోహాను 13:35). జాన్‌మార్కు విషయములో పౌలు మరియు బర్నబా ఏకీభవించనప్పుడు, వారు పోట్లాడలేదు గాని సమాధానముతోవేరై మరియు పరిచర్యచేసిరి (అపొ.కా. 15:39). దాని ఫలితముగా దేవుడు వారి పరిచర్యను ఆశీర్వదించెను.
పౌలుకాని లేక బర్నబా గాని ఆ సహోదరుడిని ''వేశ్య'' అని గాని లేక ''క్రీస్తువిరోధి'' అనిగాని పిలిచినయెడల, ఆ విధముగా పిలిచివారి పరిచర్యను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించడు. కాబట్టి మనతో ఏకీభవించనివారిని మరియు మనయొద్దనుండి వెళ్లిపోయినవారిని విడిచిపెట్టి మరియు దేవుని యొక్క పరిచర్య మీద కేంద్రీకరించవలెను. సంఘములోని మన పరిచర్య ఎల్లప్పుడు అనుకూలముగా ఉండవలెను మరియు ఎవరికి వ్యతిరేకముగా ఉండకూడదు. మనము బోధకులలోని తప్పులను మరియు తప్పుడు సిద్ధాంతములను మరియు క్రీస్తును పోలిలేనటువంటి ఆచారములను బయలుపరిచెదము. కాని మనము వారికి వ్యతిరేకులము కాదు. మనము అపవాదికి మాత్రమే వ్యతిరేకులము.
క్రొత్త నిబంధన జీవితము:
ప్రభువైనయేసు రక్తముతో సంతకము చేయుటద్వారా దేవుడు మానవునితో చేసిన ఒప్పందమే క్రొత్త నిబంధన (హెబీ 13:20 లివింగు బైబిలు). ఇప్పుడు మనము స్వజీవమనే రక్తముతో మనము సంతకము చేయవలెను. వేరొక విధముగా ఈ నిబంధనలో ప్రవేశింపలేము. అనేకులు వారి స్వజీవముయొక్క రక్తముతో సంతకము చేయనందువలన, వారు సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితములో ప్రవేశించటంలేదు.
ఈ లోకములో ప్రభువు జీవించినంతకాలము తన యొక్క శరీరముతో ఒక్కసారి కూడా స్వచిత్తము చేయకుండునట్లు తండ్రితో నిబంధన చేశాడు (హెబీ 10:5). ఆయన తన స్వచిత్తమును చంపివేసి మరియు ఆ విధముగా ''రక్తము'' (సిలువ) ద్వారా నిబంధన చేసెను. ఇప్పుడు మనము కూడా ఆ విధముగా సహవాసము చేయుటకు పిలువబడియున్నాము. ఈ మార్గము కష్టమైనది కాదు నిజానికి ఇది సంపూర్ణసంతోషము కలుగుచేయును. బాప్తిస్మము ద్వారాను మరియు రొట్టెలో పాల్గొనుట ద్వారాను ఈ నిబంధన నుంచి సాక్ష్యము ఇచ్చుచున్నాను.
లూకా 5:38 లో ప్రభువు చెప్పిన క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త నిబంధనలో మనము పాలుపొందే దేవుని జీవము గూర్చి చెప్పుచున్నది. పాత ద్రాక్షారసము నియమ నిబంధనలతో కూడిన ధర్మశాస్త్రము క్రింద ఉన్న జీవితమును చూపించుచున్నది. ఏదేను తోటలో ఉన్న రెండు వృక్షములుకూడా ఈ రెండు నిబంధనలను చూపించుచున్నవి. నియమనిబంధనల ద్వారా పైకి పాపరహితముగా కనబడేజీవితము మరణానికి నడిపించును. దీనిని గురించి అనగా మంచిచెడుల తెలివినిచ్చే వృక్షం గురించి దేవుడు ఆదామును హెచ్చరించెను. కొన్ని విషయములు చెడ్డవనియు కొన్ని విషయములు పవిత్రములనియు మనకు బోధించే క్రీస్తు యొక్క జీవములో అంతకంతకు పాలివారమగుటయే నిజమైన క్రైస్తవ్యము. మనకు స్వాతంత్య్రము ఉన్నప్పటికిని నియమనిబంధనలను బట్టిగాని (''ముట్టవద్దు, రుచిచూడవద్దు'' కొలొస్స 2:21) లేక మనుష్యుల మెప్పుకొరకుగాని మనము కొన్నిటిని చేయము.
ప్రభువైనయేసు ఈ భూమిమీద జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన శరీరములో చేసినదానిని మనలోకూడా చేయునట్లు, ప్రతిదినము సజీవయాగముగా మనశరీరమును సమర్పించుకొనుచు క్రొత్త ద్రాక్షారసతిత్తియైన క్రీస్తు శరీరమువలే మనము నిర్మించబడవలెను. ఇది ఈ మార్గములో నడిచేవారితో మనము ఏకమగునట్లుగా చేయును. ఆవిధముగా దేవుడు మనకు అవసరమైన వరములను అనుగ్రహించి క్రీస్తులో ఒక్క శరీరముగా అనగా సంఘముగా నిర్మించును.
ఆవిధముగా సాతాను మన కాళ్లక్రింద త్రొక్కిపెట్టబడును (రోమా 16:20). మనము నిందిచబడుటకును లేక నేరారోపణలో ఉండుటకును, సాతానుకు అవకాశము ఇచ్చినయెడల అతడు మనతలమీద కూర్చుండును కాని అతడు మన పాదములక్రింద ఉండవలెను.
దేవుడు అనుగ్రహించు మహిమను పొందకపోవుటయే పాపము (రోమా 3:23). మరియు ప్రభువైనయేసు యొక్క జీవితములో దేవుని మహిమను చూడగలము. కాబట్టి ప్రభువైనయేసుతో సహవాసముచేయుచు మనము చేయలేనిది ఏదైనను పాపమని గుర్తుంచుకొనుము. పాతనిబంధలో పరిశుద్ధాత్మ ద్వారా పాపము కప్పబడేది. మరియు పాపము తీసివేయబడదు (కీర్తన 32:1,2). అది పవిత్రపరచబడదు లేక అది తుడిచివేయబడదు అది అనేక సంవత్సరములు గుర్తుండేది (హెబీ 10:3,4). కాని క్రొత్త నిబంధనలో ప్రభువైనయేసు రక్తములో మన పాపము పవిత్రపరచుటయేగాక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని దేవుడు వాగ్ధానము చేసెను (హెబీ 3:12). ఈ రెండు నిబంధనల మధ్య ఉన్న తేడాను మీరు స్పష్టముగా తెలుసుకోవాలి.
దేవుని సన్నిధిలో జీవించుట:
అపొ.కా. 2:25,26లో ప్రభువైన యేసు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అటువంటి శోధనకుగాని లేక పరీక్షకుగాని కదల్చబడక, ఎల్లప్పుడు సంపూర్ణ సంతోషము కలిగియుండెనని పరిశుద్ధాత్ముడు బయలుపరచుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు తన తండ్రిని చూచుచుండెను. ఆయన ఎల్లప్పుడు తన తండ్రి తన ఎదుటనే ఉన్నాడని గమనములో జీవించెను కాబట్టి తండ్రి తన కుడిపార్శమునే ఉండి ఆయనకు సహాయపడెను.
ఒక దైవభక్తిగల సహోదరుడితో మనం ఉన్నప్పుడు, మనము పాపమునకు దూరముగా ఉండెదము. మనము శోధించబడినప్పుడు ఒక సామాన్యసహోదరుడు మనతో ఉండినయెడల, అనేక పాపముల నుండి తప్పించబడినయెడల, ఆ సమయములో ప్రభువు సన్నిధి మనతో ఉండెనని గుర్తించినయెడల ఇంకా ఎంతో ఎక్కువగా పాపమునుండి తప్పించబడెడివారము. మనము ఎల్లప్పుడు ప్రభువు యొక్క సన్నిధిని గుర్తించినయెడల కోపమునుండియు మరియు వ్యర్థమైన వాటిని చదువుటనుండియు మరియు వ్యర్థమైన టీ.వీ కార్యక్రమములు చూచుటనుండియు తప్పించుకొనెడివారము. మనము అన్యులమధ్యలో ఉన్నప్పుడు, ప్రభువు మనతో ఉన్నాడని గ్రహించినయెడల, ప్రభువుకొరకు ధైర్యముతో నిలబడేవారము కాబట్టి ప్రభువు ఎల్లప్పుడు మీతో ఉన్నాడని గమనము కలిగియుండుటకు నేర్చుకొనవలెను. ఇది లేనిదానిని ఊహించుకొనుట కాదు కాని మనము కలిగియున్నదానిని గుర్తించుట.
మనము శరీరములో జీవించుచున్నాము గనుక దురదృష్టవశాత్తు శరీరభావములనే కలిగియుండెదము. ప్రభువు మనలోను మనతోను ఉన్నాడని గుర్తించే ఆత్మీయస్పర్శను అభివృద్ధి చేసుకొనవలెను.
విశ్వాసము - తలలో ఉన్నదా? లేక హృదయములో ఉన్నదా?
''నాకు అసాధ్యమైనదేదైనా యుండునా?'' అని యిర్మీయా 32:27లో దేవుడు యిర్మీయాను ప్రశ్నించుచున్నాడు. అదే ప్రశ్నను మనకు వేసినయెడల, ''దేవునికి అసాధ్యమైనదేదియు లేదు అని'' సరియైన సమాధానము చెప్పెదము కాని శోధనలు మరియు పరీక్షలు కలిగినప్పుడు, మన హృదయములో దేవుని విశ్వసించనందు వలన, అనేక విషయములు చేయుట దేవునికి కష్టమన్నట్లుగా మనము ప్రవర్తించెదము. తలలో ఉన్న విశ్వాసానికి మరియు హృదయములో ఉన్న విశ్వాసానికి తేడా ఉన్నది.
యిర్మీయా ప్రవచించిన సందర్భమును తెలుసుకొనుటకు, అప్పటి వరకు జరిగిన ఇశ్రాయేలు చరిత్రను మీకు చెప్పెదను. క్రీస్తు పూర్వము 1490లో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకువచ్చి మరియు 1450లో కనానులో ప్రవేశించిరి. కాని అయిదువందల సంవత్సరముల తరువాత అనగా క్రీ.పూ. 975లో సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో రెండు దేశములుగా వీడిపోయెను. పది గోత్రములు కలిగిన ఉత్తరదేశస్థులు తామే ఇశ్రాయేలీయులమని పిలుచుకొనిరి. యూదా మరియు బెన్యామీను గోత్రములు కలిగిన దక్షిణపు దేశస్థులు, యూదా దేశముగా పిలువబడెను. ఉత్తరపు దేశమను ఇశ్రాయేలు త్వరలో విగ్రహారాధికురాలైనందున క్రీ.పూ. 730లో దేవుడు వారిని బానిసత్వమునకు అప్పగించెను. వారు రెండువందలయాభై సంవత్సరములు మాత్రమే దేశముగా ఉండిరి. వారు అష్షూరీయుల చేత బానిసలుగా కొనిపోబడిరి.
100 సంవత్సరముల తరువాత (క్రీ.పూ. 640) దేవుడు యిర్మీయా ప్రవక్తను యూదా దేశమునకు పంపించి మరియు ఉత్తరదేశమైన ఇశ్రాయేలీయులనుండి పాఠము నేర్చుకొననియెడల, మిమ్ములను కూడా ఆవిధముగానే శిక్షించెదనని దేవుడు చెప్పాడు. ఈనాడు అనేకమందివిశ్వాసులు ఆలోచించునట్లుగా యూదాప్రజలు కూడా దేవుడు వారిని శిక్షించరనుకొని యిర్మీయా చెప్పినదానిని నమ్మలేదు.
కాని 40 సంవత్సరములు యిర్మీయా యూదాలో ప్రవచించిన తరువాత, యెరూషలేముమీద దాడిచేయుటకు బబులోను రాజైన నెబుకద్నెజరును దేవుడు పంపెను. అప్పుడు అష్షూరు కంటే బబులోను ప్రపంచములో శక్తివంతమై ప్రసిద్ధిగాంచెను. ఆ సమయములో యిర్మీయా 32వ అధ్యాయములోని విషయములు జరిగినవి.
70 సంవత్సరముల తరువాత యూదా దేశమును బబులోను బానిసత్వమునుండి విడిపించి యెరూషలేమునకు నడిపించెదని దేవుడు యిర్మీయాతో చెప్పెను (యిర్మీయా 29:10). కాని దానిని ఎవరు విశ్వసించలేదు. అప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యము ద్వారా దేవునివాగ్ధానము యెడల యిర్మీయాకు ఉన్న విశ్వాసము చూపించమని దేవుడు కోరెను. దేవుడు అతనియొక్క స్వగ్రామములో ఒక స్థలము దాచిపెట్టమని చెప్పెను (యిర్మీయా 32:14). శత్రువు వారి ప్రదేశమును ఆక్రమించుకొనునప్పుడు, అందరు వారియొక్క ఆస్తులు అమ్ముకొనుచుండగా అక్కడ కొనుట బుద్ధిహీనమైయున్నది.
దేవుని ప్రజలు తిరిగివచ్చి వారి ప్రదేశమును స్వాధీనపరచుకొనును అని నమ్మిన యిర్మీయా ఆ విధముగా చేశాడు. ''ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదియు లేదని'' యిర్మీయా స్పందించెను (యిర్మీయా 32వ అధ్యాయము అంతాచదువుట మంచిది). 70 సంవత్సరములు తరువాత జెరూబ్బాబెలుతో కలిసి తమ బంధువులు అక్కడికి వచ్చి మరియు డెబ్బైసంవత్సరముల క్రితము యిర్మీయా కొనినస్థలములలో నివసించెను (నెహెమ్యా 7:27 మరియు 11:32).
దేవుడు తన వాక్యము ద్వారా ఏ విషయమైనను స్పష్టముగా మాట్లాడినను, మనము విశ్వాసముతో స్పందించవలెనని దేవుడు కోరుచున్నాడు. కాని యిర్మీయావలె లేఖనములలో నుండి దేవుని ద్వారా స్పష్టమైనవాగ్ధానము పొందిన తరువాతే దానిని విశ్వసించి చేయవలెను. ఇతరులు చేసినదానిని నీవు చేయకూడదు. ఇక్కడొక హెచ్చరిక ఉన్నది: దేవునియొక్క స్పష్టమైన వాగ్ధానమును విశ్వసించి ఇశ్రాయేలు ఎర్రసముద్రము దాటిరి. ఐగుప్తీయులు అలాగు చేయచూచి మునిగిపోయిరని (హెబీ 11:29) చెప్పుచున్నది. ఇతరులయొక్క విశ్వాసమును అనుసరించకూడదని హెచ్చరించబడుచున్నది.
దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్రసముద్రములో గుండా తీసుకుని వెళ్లినప్పుడు వారు సముద్రముగుండా వెళ్లుటకు బయలుదేరినప్పుడు దానిని ఆరిననేలగా దేవుడు చేసెను. అది విశ్వాసముతోగాక వెలిచూపుతో నడచుట అయియున్నది. ఆ సమయమువరకు ఇశ్రాయేలీయులు దేవునిని అనుభవించలేదు. కాబట్టి దేవుడు వారికొరకు ముందుగానే ఓ అద్భుతం చేసెను. మోషేయొక్క కర్రను ఎత్తిపట్టుకొనమని మాత్రమే దేవుడు చెప్పాడు (నిర్గమకాండము 14:16-21). కాని నలభై సంవత్సరముల తరువాత ఇశ్రాయేలీయులు యోర్ధాను నది దాటినప్పుడు అది వేరుగా ఉండెను. ఈ సమయములో నదిలోనుంచి నీళ్లు ఇంకను ప్రవహించుచుండగానే యాజకులు వారి పాదములను మోపమని దేవుడు చెప్పాడు. వారు విశ్వాసముతో నీటిలో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు వారు వెళ్లుటకు మార్గము ఏర్పడెను (యెహోషువ 3:8-15). కాబట్టి ఈ సమయములో యాజకుల పాదములు తడిచెను. అరణ్యములో నలభైసంవత్సరములుగా ఇశ్రాయేలీయులు దేవునియొక్క అద్భుతములను చూశారు.
దేవుని వద్దనుండి ఎక్కువగా పొందినవారు ఎక్కువ లెక్కచెప్పవలెను.
ప్రభువైనయేసు పేతురును దోనెదిగి నీటిలో నడవమని చెప్పినప్పుడు కూడా ఈ నియమమును చూచెదరు. పేతురు విశ్వాసముతో అడుగువేయవలసి ఉండెను. అతని యొక్క పాదము నీటిమీద పెట్టినప్పుడు ఆ నీరు బండవలె ఉండెను.
దేవుడు పరిష్కరించలేనిది ఏదైనను నీ జీవితములో రాదని గుర్తుపెట్టుకొనుము. కష్టమైన ప్రతిపరిస్థితిని పరిష్కరించుటకు ఆయన జ్ఞానమును మరియు శక్తియును కలిగియున్నారు. కాబట్టి ఎల్లప్పుడు ఆయన నా పక్షమున పనిచేయునని నమ్ముము. ఒక కష్టపరిస్థితులలో నిర్ణయము తీసుకొనే జ్ఞానం నీకు లేనియెడల దేవుడు నిన్ను గద్దింపడు (యాకోబు 1:5). ఆయన నిన్ను ప్రేమించి, అర్థము చేసుకొని మరియు కనికరము చూపే కన్న తండ్రి.
కానీ నీవెప్పుడు అనుమానముతో అడుగుముందుకు వేయవద్దు. లేఖనములలో ఆధారము లేకపోయినప్పటికిని, కొంతమంది క్రైస్తవులు రోగము వచ్చినను మందులు వాడరు. అది బుద్ధిహీనతయు మరియు దేవుని శోధించుట అయియున్నది. తిమోతికి కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము తీసుకొనమని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి పౌలు వ్రాశాడు (1 తిమోతి 5:23). సామెతలు 18:9లో, ''పనిచేయుటలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు మరియు స్వస్థత పొందుటకు చికిత్స తీసుకొననివాడు ఆత్మహత్య చేసుకొను వాడికి సోదరుడు'' (ఆంప్లిఫయిడ్ బైబిలు). బైబిలు అంతటిలో ఇక్కడ మాత్రమే ఆత్మహత్య గురించి చెప్పబడింది.
దేవునియొక్క వాక్యము ప్రకారమే మనము ఒక అడుగువేయుదుము. దేవుడు వారికి స్పష్టముగా చెప్పినందువలన యాజకులు యోర్ధాను నదిలో పాదములు మోపిరి. దోనెలో నుండి సముద్రములోనికి రమ్మని ప్రభువు స్పష్టముగా చెప్పినందువలన పేతురు నీటి మీద నడిచెను. అనుమానానికి మరియు విశ్వాసానికి చాలా తేడా ఉంది.
పైకి పిలువబడుట:
''పైకి రమ్ము'' అని ప్రభువు యోహానును పిలిచాడు ( పక్రటన 4:1, పక్రటన 9:1లో, యోహాను భూమిమీద పత్మాసు ద్వీపముమీద ఉన్నప్పుడు ప్రభువు సంఘములో ఉన్న పరిస్థితులను చూపించెను).
ప్రకటన 2 మరియు 3 అధ్యాయములు, అప్పుడు పరలోకస్థలములోకి పైకి రమ్మని ప్రభువు యోహానుతో చెప్పెను. అప్పుడు భూమిమీద ఉండి చూడలేని అన్నివిషయములను అక్కడ ఉండి చూచెదము. ప్రభువు అతనిని పైకి తీసుకొనివెళ్లలేదు. అతడు ప్రభువుయొక్క ఆహ్వానానికి స్పందించి మరియు తానే పైకి వెళ్లవలసియున్నది. అతడు ఆ ఆహ్వానానికి స్పందించనియెడల, ప్రకటన గ్రంథములో మూడుఅధ్యాయములు మాత్రమే ఉండేవి. అనేకమంది విశ్వాసులు ఈ విధంగానే ఉన్నారు. పరలోకవిధానములో ఆలోచించుటకు పైకి రమ్మని పిలిచినప్పుడు, అనేకులు స్పందించనందువలన, వారు జీవితాంతం భూసంబంధులుగానే ఉండెదరు. ఆత్మీయముగా సోమరులుగా ఉండక మరియు ఆత్మీయ విషయములో నిర్లక్ష్యంలేకుండా మరియు మనుష్యుల ఆచారములను ఎదురించుచు బలాత్కారము చేయువారు పరలోకరాజ్యమును స్వతంత్రించుకొనెదరు (మత్తయి 11:12).
''యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును'' (కీర్తన 112:4). మన జీవితములోని అన్ని విషయములలో యథార్థముగాను మరియు నీతిగాను నుండినయెడల, అనేక ఆశీర్వాదములు పొందెదము. 112వ కీర్తనలో అద్భుతముగా చెప్పబడింది. మరియు మనలను ద్వేషించువారు (అపవాది మరియు అతనితో సహవాసము గలవారు) క్షీణించిపోవుదురని చివరి వచనములో చెప్పబడింది.
కాబట్టి గతములో మనము అనేకసార్లు ఓడిపోయినను మరియు వాటిని బట్టి మనము సిగ్గుపడవలసియున్నను, మన తలలను పైకి ఎత్తెదము ఎందుకనగా మనము క్రీస్తులో దేవునిచేత అంగీకరించబడియున్నాము (ఎఫెసీ 1:6) మరియు మన గతమంతయు నిత్యత్వానికి కొట్టివేయబడెను (హెబీ 8:12) లో ''మీ పాపములను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను'' మరియు యెషయా 44:12లో మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను, నా యొద్దకు మళ్లుకొనుము). ఈ వచనములను ఎల్లప్పుడు నీ హృదయములో జ్ఞాపకముంచుకొనుము.
దేవునిచేత చెక్కబడిన జీవితము:
దేవునిచేత మెప్పుపొందినవానిగా దేవుడు ప్రభువైనయేసును కనబరిచెను (అపొ.కా. 2:22). దేవుడు ప్రభువైనయేసుక్రీస్తును ప్రేమించినట్లే మనలను కూడా ప్రేమించుచున్నాడు కనుక దేవుడు ప్రభువైనయేసుకు చేసినదంతయు మనకు కూడా చేయును. (ప్రభువైన యేసువలె మనము కూడా షరతులను నెరవేర్చవలెను). దేవుడు మన జీవితములలో కూడా అత్యుత్తమమైన దానిని చేయును (అద్భుతములు చేయనప్పటికిని) బాప్తిస్మమిచ్చు యోహాను ఒక అద్భుతము కూడా చేయనప్పటికిని భవిష్యత్తు గురించి ఒక ప్రవచనము కూడా చెప్పనప్పటికిని, ప్రవక్తలందరికంటె అతడు గొప్పవాడు అని ప్రభువు చెప్పెను (మత్తయి 11:11 మరియు యోహాను 10:41). అయినను దేవుడు అతడి జీవితమును మరియు పరిచర్యను అంగీకరించాడు.
మన దేవుడు పరలోకములోనుండి పరిపాలించినను మరియు సాతానుకు వ్యతిరేకముగా మన పక్షమునఉండెననియు మరియు దేవుడు తన ఐశ్వర్యముచొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుననియు (ఫిలిప్పీ 4:19) మరియు సాతానును మన పాదముల క్రింద ఆయన త్రొక్కిపట్టుననియు (రోమా 16:20) మనము లోకమునకు చూపించవలెను.
దేవుడు మన జీవితములో అనేక శోధనలు మరియు పరీక్షలు అనుమతించవచ్చును కాని మనము ఆత్మీయముగా ఎదుగుచున్న కొలది మన శక్తికి మించినశోధనను ఆయన అనుమతించడు (1 కొరింథీ 10:13). కాని ప్రతిపరీక్షలో ఆయన జయమునిచ్చును (2 కొరింథీ 2:14) అన్ని సమయములలో ఆయన మనకు జయమిచ్చును.
దీని గురించి ఒక మంచి పద్యము ఇక్కడయున్నది.
దేవుడు వాగ్దానము చేసినవి
''నీలి ఆకాశమును పువ్వులతో వెదజల్లిన త్రోవలను
మన జీవితకాలమంతయు దేవుడు మనకు వాగ్దానము చేయలేదు
వర్షము లేని సూర్యుని, దు:ఖము లేని సంతోషమును
బాధలేని సమాధానమును దేవుడు మనకు వాగ్దానము చేయలేదు
కష్టములు శోధనలు ఇబ్బందులు శ్రమలు మనము
భరించమని ఆయన మనతో చెప్పలేదు
మనము వెళ్ళే దారిలో ఎత్తైన పర్వతములు, లోతైన నదులు ఉండవని
ప్రయాణము సజావుగా త్వరగా ఉండునని, త్రోవ చదునుగా ఉండునని
దేవుడు వాగ్దానము చేయలేదు.
అయితే దినమునకు సరిపడే బలమును
కష్టమునకు కావసిన విశ్రాంతిని, మార్గమునకు కావలసిన వెలుగును
శోధనలకు తగిన కృపను, పైనుండి సహాయమును
నమ్మదగిన సానుభూతిని, శాశ్వతమైన ప్రేమను
దేవుడు వాగ్దానము చేసెను.
(ఆనీ జాన్సన్ ఫ్లింట్)
శరీర స్వస్థత కొరకు కావలసిన విశ్వాసము:
1 కొరింథీ 6లో మన శరీరము గూర్చి నాలుగువిషయములు ఉన్నవి.
1. మనదేహము క్రీస్తు శరీరములో అవయవమై ఉన్నది (15వ).
2. మన దేహము పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉన్నది (19వ).
3. మన దేహము ప్రభువు నిమిత్తమై ఉన్నది (13వ).
4, అప్పుడు ప్రభువు మనదేహము నిమిత్తము ఉండును (13వ).
కాబట్టి ఈ లేఖనములను ఆధారముచేసుకొని ప్రభువును సేవించుటకు మనకు ఆరోగ్యము అవసరము గనుక మన దేహములకొరకు మనం క్రీస్తు జీవాన్ని పొందుకొనవలెను. మన శరీరములకొరకు యేసుయొక్క పునరుత్థానజీవమును రుచిచూడవలెను అనగా హెబీ 6:5లో చెప్పినరీతిగా ''రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించుట'' మన యొక్క శరీరముయొక్క ఆరోగ్యము కొరకు ప్రార్థించవచ్చును కాని దేవుడు కొన్నిసార్లు దానిని మన ఆత్మీయమేలు కొరకు ఆలస్యము చేయవచ్చును లేక స్వస్థపరచక పోవచ్చును (పౌలు శరీరములో కూడా ఒక ముళ్లు ఉంచబడెను (2 కొరింథీ 12:7-9). కాబట్టి మనము ఎప్పుడైనా రోగస్థులమైనయెడల, ప్రభువైనయేసు నామములో ప్రార్థించవచ్చును లేక ఆ రోగమును భరించుటకు కావలసిన కృపను ఇవ్వమని ప్రార్థించవలెను. అప్పుడు దేవుడు మనకు మేలైనదానిని చేయును.
స్వభావముల గురించి:
నా యౌవన కాలములో నేను పిరికివాడను గాక ధైర్యముగలవాడిగా ఉండవలెనని కోరియున్నాను. కాని ప్రతియొక్క స్వభావములో ప్రత్యేకమైన బలమున్నట్లే అలాగే బలహీనతయుండెను. నేను ధైర్యముగల వానిగా ఉండినట్లయితే, అనేకులకు సువార్త ప్రకటించే వాడిగా ఉండెడి వాడననియు కాని బైబిలు లోతుగా ధ్యానించి మరియు దానిని బోధించలేక పోయెడివాడును మరియు పుస్తకములను కూడా వ్రాసెడివాడను కాదు. దేవుడు ఒక్కొక్కరియెడల ఒక్కొక్క సంకల్పం కలిగియుండెను. క్రీస్తు యొక్క శరీరములో, మనము చేయవలసిన పరిచర్యకు తగిన రీతిగా, తల్లి గర్భములో మనలను రూపించియున్నాడు. కాబట్టి ఇతరుల యొక్క తెలివితేటలను బట్టిగాని లేక వరములను బట్టిగాని మనము అసూయపడము. కొందరు ఎంతో కష్టపడి పనిచేయుదురు. ఇతరులు పనిచేసినట్లుగా మనము చేయలేనట్లయితే నిరాశపడవద్దు. మనలను సృష్టించుటలో దేవుడు పొరపాటు చేయలేదు. దేవుడు మనలను చేసిన విధానమును మనము అంగీకరించవలెను, అనగా మన స్వభావాన్ని బట్టిగాని లేక శరీరపోలికలనుబట్టి గాని ఫిర్యాదు చేయము మరియు ఇతరులవలె మనము ఉండవలెనని కోరము కాని మనలో ఉన్న బలహీనతలు జయించుటకు, దేవుని సహాయము కొరకు ప్రార్థించవలెను.
మనయొక్క స్వభావమును గురించి నాలుగు విషయములు క్లుప్తంగా చూచెదము.
బహిర్ముఖి:
1. కోపిష్టి: వీరు బలమైన చిత్తము కలిగి, స్వతంత్రులుగా ఉండెదరు మరియు ధైర్యముగా ఉండి త్వరగా నిర్ణయములు తీసుకొనెదరు. కాని వారు త్వరగా కోపపడెదరు మరియు ఇతరుల మీద పెత్తనంచేయుచు, ఇతరులను పట్టించుకోని, స్వతంత్రులై మరియు ఉద్రేకములు లేనివారవుదురు.
2. ఆశలునిండినవారై తృప్తికలిగిఉండెదరు: వీరు ఎల్లప్పుడు సంతోషముగాను, స్నేహపూరితముగాను, మాట్లాడేవారిగాను ఉండెదరు. కాని వీరు బలహీనమైన చిత్తము కలవారు, క్రమశిక్షణలేనివారునై యుండెదరు మరియు వారిమీద ఆధారపడలేము.
అంతర్ముఖులు:
1. ముభావముగా ఉండుట: వీరు చాలా సున్నితమైనవారై, పరిపూర్ణతను కోరువారై మరియు ఆదర్శవాదులైయుందురు. కాని వారు భావోద్రేకముకలవారై, తీర్పు తీర్చువారైయుండి, ఒంటరిగా ఉండుటకు ఇష్టపడుచు మరియు సులభముగా నిరాశపడెదరు.
2. ఆవేశము: ప్రశాంతతగలవారై, త్వరపడనివారై, తెలివిగలవారై మరియు హాస్యపరులైయుండెదరు కాని వారు పిసినిగొట్టులై, భయస్థులైయుండి, నిర్ణయము తీసుకోలేనివారైయుండి మరియు నిదానముగా ఉండెదరు.
కాబట్టి మీరు దేనిని కోరెదరు? మన బలహీనతలలో మనకు జయమును అనుగ్రహించి మరియు మనలను క్రీస్తువలె రూపాంతరపర్చుటకు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ప్రతిదినము పరిశుద్ధాత్మకు లోబడుచున్నయెడల, ఆయన మనలను క్రమక్రమముగా క్రీస్తు సారూప్యములోనికి నడిపించును. మరియు మీరు అంతకంతకు బలహీనతను జయించెదరు.
మన శరీరము ''దీన శరీరమని'' మీరెప్పుడు మర్చిపోవద్దు (ఫిలిప్పీ 3:21) కాబట్టి మనము ఈ శరీరములో ఉన్నంతవరకు, ఏ మానవునికంటె కూడా హెచ్చించుకొనక మరియు ఎవరిని తక్కువచేసి మాట్లాడకుండెదము. ప్రభువైన యేసు, ''మనుష్యుని పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించెను'' (ఫిలిప్పీ 2:7). కాబట్టి ఒక మానవుడిగా దాసుడిగా ఉండుటయే మంచిదని ఆయన గుర్తించెను.
కేవలం భయభక్తులుమాత్రమే మన జీవితములో ఆత్మీయఎదుగుదలను కలుగజేయవుగాని సంతృప్తిసహితమైన భక్తి ఆత్మీయఎదుగుదలను ఇచ్చును (1 తిమోతి 6:6). సంతృప్తి సహితముగాని భక్తి వ్యర్థము. ఆర్థికముగా మనయొక్కస్థితిని బట్టి తృప్తిపడి మరియు ఉన్నదానితో పొదుపుగా ఉండుటను నేర్చుకొనవలెను. జీవితములో ఈ రెండు ముఖ్యమైన పాఠములు మనము భూమిమీద సామాన్యముగా జీవించుచు మరియు సమస్తమును బట్టి కృతజ్ఞతకలిగియుండుటకు మనలను దేవుడు ఇక్కడ ఉంచియున్నాడు. ఆ రెండు పాఠములను త్వరగా నేర్చుకొనవలెను.
కృతజ్ఞత కలిగిన ఆత్మ:
ప్రభువు సిలువ వేయబడకముందు రోజు రాత్రి తన శిష్యులతో రొట్టె విరువవలెనని ఆయన ఎంతో కోరుకొనెను (లూకా 22:15). ప్రభువుతోను మరియు ఆయన బిడ్డలతోను ఎల్లప్పుడు సహవాసము చేయుటకు మనము కూడా ఎల్లప్పుడు ఆశపడవలెను. అప్పుడు మాత్రమే రొట్టె విరచుట మనకు ఆశీర్వాదముగా ఉండును. ప్రభువైన యేసు రొట్టెను విరిచి మరియు కృతజ్ఞతను చెల్లించెను (1 కొరింథీ 11:24). క్రీస్తులో మనమందరము ఒకే శరీరమై యున్నామని రొట్టె చూపించుచున్నది (1 కొరింథీ 10:17). క్రీస్తు శరీరములోని సభ్యులందరిని బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించవలెనని, ప్రభువుకృతజ్ఞతను చెల్లించుటద్వారా నేర్చుకొనుచున్నాము.
మనలో ఒకరిమీద ఒకరికి ఫిర్యాదులు ఉండినయెడల, సాతాను మన తలలమీద కూర్చుండును కాని అతడు మన పాదములక్రింద ఉండవలసియున్నది. ఎల్లప్పుడు దేవునియెడలను మరియు సంఘములోని సహోదరసహోదరీల యెడలను కృతజ్ఞత కలిగియుండినయెడల సాతాను మన పాదముల క్రింద ఉండును. మనయొక్క సహోదర మరియు సహోదరీలయెడల కృతజ్ఞత కలిగియుండుట, మనము ఆత్మీయముగా ఎదుగుచున్నామనుటకు ఋజువు. ఇతరవిశ్వాసులతో సహవాసము చేయకుండా పొందే పరిశుద్ధత నకిలీదైయున్నది. కృతజ్ఞత కలిగియుండుట దీనత్వములో వేరుపారుచున్నామనుటకు రుజువైయున్నది. ఆ విధముగా పరిశుద్ధతలో ఎదిగెదము.
సమతుల్యమైన సువార్త:
పౌలు వ్రాసిన ఎఫెసీ పత్రికలో సమతుల్యమైన సువార్త ఉన్నది. 1 నుండి 3 అధ్యాయాలలో ఒక హెచ్చరిక కూడా లేదు. దేవుడు మనకొరకు చేసిముగించిన దానిని ఈ అధ్యాయములు వివరించుచున్నవి. తరువాత మూడు అధ్యాయములలో మనము దేవుని కొరకు చేయవలసినవి వ్రాయబడియున్నవి. సువార్త నాణెమునకు రెండు ప్రక్కలు ఉన్నవి. ఈ నాణెము (సువార్త) ఒక ప్రక్క పోయినను, అది పనికి రాదు. మరొకసువార్త ప్రకటించు వారు శాపగ్రస్తులగుదురని గలతీ 1వ అధ్యాయములో చెప్పబడింది. కాబట్టి మనము సంపూర్ణ సువార్తను ఇతరులకు ప్రకటించాలి.
క్రీస్తులో పరలోకసంబంధమైన, ఆత్మసంబంధమైన ప్రతిఒక్క ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు (ఎఫెసీ 1:3). దేవుడు మనకొరకు చేసి ముగించిన దాని ద్వారా, మన క్రైస్తవజీవితము ఆరంభమగును. మొదటిగా ఆయన మనలను ప్రేమించాడు. గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. మొదట ఆయన మనకు పరిచర్య చేసియున్నాడు. గనుక మనము ఆయనకు పరిచర్య చేయుచున్నాము. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనలను ఎరిగియున్నాడు (ఎఫెసీ 1:4). మనము భూతవర్తమాన భవిష్యత్తు కాలములు కలిగియున్నాము. గనుక దానిని గ్రహించలేము. కాని దేవుడు ''నేను ఉన్నవాడను అని చెప్పుచున్నాడు'' (నిర్గమకాండము 3:14). దేవుడు నిత్యత్వము వర్తమానకాలములో జీవించుచున్నాడు. ఆయన దేనినైననూ సృష్టించకమునుపే మన పేర్లను ఎరిగియున్నాడు. ప్రపంచములను సృష్టించకమునుపే దేవుడు మనలను క్రీస్తులో ఉంచియున్నాడు.
క్రీస్తులోఉండుట అనగా ఏమిటో ఇక్కడ వివరించెదము. నీవు ఒక కాగితము తీసుకొని మరియు దానిని ఒక పుస్తకములో పెట్టి తరువాత ఆ పుస్తకమును కాల్చినయెడల ఆ కాగితము కూడా కాలిపోవును. నీవు ఆ పుస్తకమును భూమిలో పెట్టినయెడల కాగితము కూడా భూమిలో ఉండును. నీవు ఆ పుస్తకమును చంద్రమండలానికి పంపినయెడల ఆ కాగితము కూడా చంద్రమండలము వెళ్ళును. అదేవిధముగా జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు ఆయన మనలను క్రీస్తులో ఉంచియున్నాడు. కాబట్టి క్రీ.శ 29లో క్రీస్తు సిలువ వేయబడినప్పుడు, క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడియున్నాము. మరియు ఆయన భూమిలో పాతిపెట్టబడినప్పుడు మనము కూడా ఆయనతో పాతిపెట్టబడియున్నాము. మరియు క్రీస్తు మృత్యుంజయుడై మరియు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు, ''క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను'' (ఎఫెసీ 2:6). ఇది అద్భుతమైన సత్యము కాని మనము దేవుని వాక్యము విశ్వసించినట్లయితేనే మనము దేవుని వాక్యమును అనుభవించగలము. ''నీ నమ్మిక చొప్పున నీకు జరుగును'' మత్తయి 9:29 అనునది దేవునియొక్క నియమము.
క్రీస్తులో దేవుడు మనకొరకు చేసిన దానంతటి విషయములో మనము స్థిరపరచబడాలి. పునాదివేసిన తరువత మాత్రమే, 4 నుండి 6 అధ్యాయములలో చెప్పబడిన రీతిగా మనము నూతనమార్గములో నడుచుచూ మరియు అపవాదినిజయించుచూ ఒక గృహముగా నిర్మించబడెదము. లేనట్లయితే మనము ఎల్లప్పుడు నేరారోపణలో ఉంటూ నిరాశపడెదము. కాబట్టి మొదటిగా 1 నుండి 3 అధ్యాయములు ఎక్కువగా ధ్యానించుము.
చాలామంది క్రైస్తవులు పునాది ఒక స్థలములో వేసి మరియు గృహమును వేరొకచోట నిర్మించుదురు. కాబట్టి ఆ గృహము కూలిపోవును. ఎఫెసీ పత్రిక చివరి మూడు అధ్యాయములలో ఉన్న హెచ్చరికలు దేవునికి మనయెడల ఉన్న ప్రేమను బట్టి ఇచ్చెను మరియు ఆయన మనలను అంగీకరించియున్నాడు. ఇది మూలపాఠము. అయినప్పటికి మనము మరచిపోయెదము. ఒకరోజు 45 నిమిషములు బైబిలు చదివినందువలన దేవుడు మనలను అంగీకరించాడనియు మరియు మరొక దినమున ఒక్క నిమిషము కూడా లేఖనము చదువలేదు గనుక దేవుడు కోపముగాఉన్నాడనియు మరియు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడనియు అనుకొనెదము మరియు ఏదైనా కీడు జరిగినప్పుడు ఆ రోజున బైబిలు చదవనందుకే జరిగిందని అనుకొనెదము. మనము బైబిలు చదివిన దానిని బట్టి దేవుడు అంగీకరిస్తాడు అనియు మరియు క్రీస్తు మనకొరకు చేసి ముగించిన దానినిబట్టి కాదు అనియు అనుకొనుట మూఢనమ్మకము అయియున్నది. బైబిలు చదువుట చాలా ముఖ్యమైనది. కాని దానినిబట్టి దేవునిచేత అంగీకరించబడలేము. ఇది గృహములోని ఒక భాగము. ఈ సత్యములో మీరు స్థిరపడుట చాలా చాలా ముఖ్యమైయున్నది. లేనట్లయితే మానవుని కేంద్రముగా గలిగిన సువార్త కలిగి పునాదిలో తలుపులను కిటికీలను పెట్టెదము. ఎఫెసీ 1 నుండి 3 అధ్యాయములను నిర్లక్ష్యము చేయువారు చివరకు పరిసయ్యులు అగుదురు.
అయితే గృహము నిర్మించుటకొరకే పునాది వేసెదము. కాబట్టి పునాదివేసి ఆపివేయము, తరువాత గృహమును నిర్మించవలెను.
పరలోక సంబంధమైన ప్రతిఒక్క ఆశీర్వాదమును దేవుడు తన చేయి చాపి మరియు మనకు ఇచ్చుటయే కృప. దేవుని యొక్క చేతిలో ఉన్న ఆశీర్వాదములు తీసుకొనుటకు మన చేతిని చాపుటయే విశ్వాసము. కాబట్టి ప్రభువైన యేసునామములో మనము విశ్వాసము ఉంచినకొలది పొందెదము. పరలోకబ్యాంకులో దేవుడు అనేకలక్షల ఆశీర్వాదములు ఉంచి మరియు ప్రభువైనయేసు నామము సంతకము పెట్టిన అనేక చెక్కులను దేవుడు మనకు ఇచ్చియున్నాడు. ఇప్పుడు మనము దానిమీద సంతకము పెట్టి పరలోకబ్యాంకుకు వెళ్ళి మరియు దాని అంతటిని పొందవచ్చును.
దైవికమైన మార్పిడి:
ఒక దానిని గురించి నన్ను పంచుకొననివ్వండి. కలువరిసిలువ మీద జరిగిన మూడు మార్పిడిలు - మనకొరకు ప్రభువైన యేసు ఏమైయున్నాడు మరియు దాని ఫలితముగా ఈనాడు మనము ఏమైయున్నాము.
1. క్రీస్తులో మనము దేవుని నీతిఅగునట్లు పాపమెరుగని ఆయన మనకొరకు పాపముగా చేయబడ్డాడు (2 కొరింథీ 5:21). విశ్వాసముద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుట అనే అద్భుతమైన సత్యమిది. దేవునియొద్దకు వెళ్ళుటకు సరియైన నీతి లేదని గుర్తించిన దీనులు మాత్రమే ఈ ఉచితమైన వరమును పొందెదరు. ప్రభువైన యేసు మన పాపముల యొక్క శిక్షను భరించుటకు మాత్రమేకాక ఆయనే మనకొరకు పాపమాయెను. పంది మురికిని ప్రేమించినట్లే మనము పాపమును ప్రేమించియున్నాము. గనుక ప్రభువైన యేసుకు అది ఎంత కష్టమైయుందో గ్రహించలేము. ప్రభువు మనపాపము కొరకు చేసిన దానిని కొంచెము తెలుసుకొనగోరినయెడల, ఒక వ్యక్తి సెప్టిక్ ట్యాంక్‌లో దూకి మరియు అందులోనే ఉన్న మురికిలో మరియు పెంటలో జీవించుచున్నట్లు ఆలోచనచేయుడి. మనము క్రీస్తులో దేవునినీతి అగునట్లు, ఆయన ద్వేషించే పాపముగా మారాడు. దీనిలో దేవునియొక్క ప్రేమ యొక్క లోతును చూడగలము. ఈ భూమిమీద ఒక అత్యంత పరిశుద్ధునిలో ఉన్న నీతి కంటే దేవుడు అనుగ్రహించేనీతి భూమికంటే పరలోకము ఎంత ఎత్తైనదో అంత ఉన్నతమైనది. పాపరహితులు అయిన దూతలు కూడా దేవుని ముఖము చూడలేరు (యెషయా 6:2,3) కాని మనము క్రీస్తులో ఉన్నాము గనుక చూడగము. క్రీస్తును సిలువవేసిన పాపమును మనము చూచినయెడల దానిని ద్వేషించెదము. క్రీస్తులో మనము ఏమైయున్నామని మనము చూసినయెడల, దేవుని చేత అంగీకరించబడినందుకు ఎంతో సంతోషించెదము.
2. మనము ధనవంతులగుటకు క్రీస్తు దరిద్రుడాయెను (2 కొరింథీ 8:9). ఈ వచనములో వస్తువాహనములు గురించి మరియు ధనసంపద గురించి చెప్పబడింది. క్రీస్తు ఒకప్పుడు ధనవంతుడైయున్నాడని ఈ వచనము చెప్పుచున్నది. ధనవంతుడైయుండుట అనగా అర్థమేమిటి? అనగా ఎక్కువ ధనమును సంపద కలిగియుండుట కాదుగాని మన అవసరములన్నియు తీర్చబడుచు మరియు ఇతరులకు ఇచ్చుటకు మరియు ఆశీర్వదించుటకు కొద్దిగా మిగిలియుండుట. మనము ఈ విధముగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. ''ఏమియు కొదువలేక పోవుటయే, ధనవంతుడుగా ఉండుట'' (పక్రటన 4:17). దేవుడు కూడా ఈవిధముగా ధనవంతుడైయున్నాడు. దేవునికి కూడా బంగారముగాని వెండిగాని లేక బ్యాంకు ఖాతాగాని లేక డబ్బు సంచిగాని లేదు. కాని ఆయనకు ఏ అవసరము లేదు. ప్రభువైనయేసు భూమి మీద ఉన్నప్పుడు ఆవిధముగా ధనవంతుడైయున్నాడు. స్త్రీలు మరియు పిల్లలుకాక ఐదువేల మంది పురుషులను ఆయన పోషించారు. ఈనాడు ఒక ధనవంతుడు మాత్రమే దానిని చేయగలడు. పన్నులు కట్టుటకు ఆయన దగ్గర డబ్బుఉన్నది. మనుష్యులు బ్యాంకులోనుండి పన్నులు చెల్లించెదరు కాని ప్రభువు చేపనుండి చెల్లించారు. బీదలకు ఇచ్చుటకు సరిపోయే ధనము ఆయన యొద్ద ఉన్నది (యోహాను 13:29). ఆయనకు ఏ కొదువలేదు గనుక భూమిమీద ఆయన బీదవాడు కాదు. కాని సిలువమీద ఆయన బీదవాడైయ్యాడు. అత్యంత బీదవాడైన బిక్షగాడికి కూడా వేసుకొనుటకు వస్త్రము ఉండును. ప్రభువైనయేసు సిలువ వేయబడినప్పుడు వస్త్రహీనుడైనాడు. ఆయన మరణించినప్పుడు నిజముగా బీదవాడాయెను. సిలువ మీద ఆయన ఎందుకు బీదవాడాయెను? మన జీవితములో ఎప్పుడైనా కొదువ లేకుండునట్లు ఆయన ఆవిధముగా చేసెను. మనము కోరినదంతయు దేవుడు వాగ్ధానము చేయలేదు. జ్ఞానముగల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు కోరినదంతయు ఇవ్వరు. కాని మన అవసరములన్నిటిని తీర్చెదనని ఆయన వాగ్ధానము చేశారు (ఫిలిప్పీ 4:19). మనము దేవునిరాజ్యమును నీతిని మొదట వెదకినయెడల, ఈ భూమి మీద మనకు జీవించుటకు కావలసినవన్నియు ఎల్లప్పుడూ దొరుకును (2 పేతురు 1:4).
3. మనము అబ్రాహాముయొక్క ఆశీర్వాదమును (పరిశుద్ధాత్మ వాగ్ధానము) పొందుటకు క్రీస్తు శాపగ్రస్తుడాయెను (గలతీ 3:13, 14). ధర్మశాస్త్రమును అనుసరించనందువలన కలిగే శాపము గురించి (ద్వితీయోపదేశకాండము 28:15-68)లో - కలవరము, దీర్ఘకాలిక రోగాలు, తెగుళ్ళు, ఎల్లప్పుడు ఓడిపోవుట, గ్రుడ్డితనము, ఇతరులచేత బాధించబడుట, పిల్లలు సాతాను చేతపట్టబడుట, అత్యంత పేదరికము మొదలగునవి. ప్రభువైన యేసు మనకొరకు శాపగ్రస్తుడాయెను. గనుక వీటిలో ఏదియు మనకు రాదు. కాని ఇక్కడ వాగ్ధానము చేయబడిన ఆశీర్వాదము (ద్వితీయోపదేశకాండము 28:1-14)లో చెప్పబడిన రీతిగా ఎక్కువ ధనము మరియు ఎక్కువమంది పిల్లలు కలిగియుండుట కాదుగాని అబ్రాహాము యొక్క ఆశీర్వాదము (ఆదికాండము 12:2,3)లో ఇది వివరించబడింది. ఆ ఆశీర్వాదమేమనగా: ప్రభువు మనలను ఆశీర్వదించి మనము కలుసుకొనే ప్రతివ్యక్తికి మనలను ఆశీర్వదకరముగా చేయును. ప్రభువు మనలో పెట్టిన నీటిబుగ్గనుండి జీవజలనదులు పరిశుద్ధాత్మగా ప్రవహించి తృప్తి పరచబడెదము (యోహాను 4:14). మరియు మన కడుపులోనుండి జీవజలనదులు ప్రవహించి మరియు అనేకలను ఆశీర్వదించెదము (యోహాను 7:37,39). అత్యంత ఘోర పాపికి కూడా ప్రభువు ఈ విధముగా వాగ్ధానము చేయుచున్నాడు, ''మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి'' (జెకర్యా 8:13).
మీరు ఎక్కడ జీవించుచన్నప్పటికిని మీరు కలిసే ప్రతి ఒక్క వ్యక్తికి, దేవుడు మిమ్మును ఆశీర్వాదకరముగా చేయునని నమ్ముచున్నాను. కాని, ఇది మీ జీవితములో జరుగునట్లు దేవుని యందు విశ్వసించవలెను. శాపగ్రస్తమైనదేదియు మిమ్ములను ముట్టదని నమ్ముడి. సిలువమీద సాతాను ఓడించబడియున్నాడు కాబట్టి మీ జీవితములో ఏ విషయములోనైనను అతనికి అధికారముండదు. ఈ సత్యములన్నిటిని ఎల్లప్పుడూ మీ నోటితో ఒప్పుకొనుచూ మరియు జయించువారిగా ఉండుము. దేవుని యొక్క ప్రతీ ఒక్క ఆశీర్వాదము మనము విశ్వసించుచూ మరియు నోటితో ఒప్పుకొనుచు మరియు స్వతంత్రించుకొనవలెను. దేవుని వాక్యమును మన నోటితో ఒప్పుకొనుచుండవలెను. మరియు హృదయములో విశ్వసించవలెను. మనము నోటితో ఎల్లప్పుడూ ఒప్పుకొనుటద్వారా, రక్షింపబడి విడుదల పొందెదము (రోమా 10:10). మనము ఇచ్చు సాక్ష్యమునుబట్టి, మనము సాతానుయొక్క నిందారోపణను జయించెదము (పక్రటన 12:11).
నిరీక్షణ:
కృప, సాత్వికము, దీనాత్మను కలిగియుండుట మరియు జయించుట మొదలగు వాటివలే నిరీక్షణ కూడా క్రొత్తనిబంధన పదము. చాలా కొద్ది మంది విశ్వాసులు నిరీక్షణ గురించి ఆలోచించెదరు. కాని కన్‌కార్డెన్స్‌లో దీనిని ధ్యానించుట మంచిది.
దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడెదమని రోమా 5:2-4 చెప్పుచున్నది. శ్రమలు ఓర్పును కలుగజేయును. గనుక శ్రమలయందును అతిశయపడెదము. ఆవిధముగా నిరీక్షణ కలుగును. గతములో దేవుడు మనలో మార్పును కలుగజేసినరీతిగా రాబోయే కాలములో ఆ మార్పును సంపూర్ణముగా కలుగజేయును.
భవిష్యత్తును గూర్చిన నిరీక్షణతో మనలను నింపవలెనని దేవుడు కోరుచున్నాడు. మన చుట్టుప్రక్కల ఉన్నవారివలె మనము నిరాశ నిస్పృహలతో భవిష్యత్తును ఎదుర్కొనము. మనలో ఈ సత్కార్యమును ఆరంభించినవాడు, దానిని సంపూర్ణముగా చేయునని ఎంతో నిరీక్షణ కలిగియున్నాము (ఫిలిప్పీ 1:6). నిరీక్షణద్వారా నిరాశను జయించెదము.
నిరీక్షణవిషయమై మనము ఒప్పుకొనినదానిని గట్టిగా పట్టుకొనెదము (హెబీ 10:23). అనగా మనము ఇప్పుడు ఓడిపోయినప్పటికిని, దేవుడు వాగ్ధానము చేసిన రీతిగా నిశ్చయముగా ఆయన మనకు జయమిచ్చునని మన నోటితో ధైర్యముగా ఒప్పుకొనవలెను. నిరీక్షణను బట్టి మనము సంతోషించెదము. దేవుడు వారికి చేసిన దానిని బట్టి సాధారణముగా విశ్వాసులు కృతజ్ఞత చెల్లించెదరు. కాని దేవుడు మనకు చేయబోవుచున్నదానిని గురించి కూడా నిరీక్షణ కలిగి సంతోషించెదము.
కీర్తన 1:3లో అతడు చేయునదంతయు సఫలమగునని వాగ్ధానము ఉన్నది. మనయెడల ఇదియే దేవుని చిత్తము మరియు క్రీస్తులో దీనిని జ్యేష్ఠత్వపుహక్కుగా పొందవలెను.
సంతోషము:
''ఆయన సన్నిధిలో సంపూర్ణసంతోషము కలదు'' (కీర్తన 16:11). గనుక మనలోనుండి సంతోషము ప్రవహించుటయే దేవుని సన్నిధిలో ఉన్నామనుటకు ఋజువు. నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మలో ఆనందమైయున్న దేవునిరాజ్యము మన హృదయములలోనికి వచ్చియున్నదని దీనిద్వారా తెలుసుకొనెదము (రోమా 14:17). నీతిని ప్రేమించి మరియు దుర్నీతిని ద్వేషించువారిమీద ఆనందతైలాభిషేకము ఉండును. కనుక మనము పాపమును ద్వేషించి మరియు నీతిని ప్రేమించిన యెడల ఆ సంతోషము మనలో ఉండును (హెబీ 1:9). ప్రభువునందు ఆనందించుటయే ఎల్లప్పుడు మీ బలమైయుండును గాక (నెహెమ్యా 8:10). సంతోషము, శోధనను పోరాడుటను సలుభము చేయును.
రెండు కారణములను బట్టి నానా విధశోధనలు వచ్చినప్పటికిని ఆనందించుమని యాకోబు చెప్పుచున్నాడు (యాకోబు 1:1-4). మనలోఉన్న విశ్వాసము నిజమైనదా కాదా అని తెలుసుకొనెదము (అనగా మనవద్ద ఉన్న బంగారము నిజమైనదా లేదా నకిలీదా అని మనము కనుగొనుటద్వారా మనము బీదవారమైయుండి ధనవంతులమని మోసపోము). 2. మన ఓర్పు పరిపూర్ణమగును. అప్పుడు మనము ఏ విషయములోను కొదువలేనివారమై సంపూర్ణులమగుదుము.
మనకొచ్చుచున్న శోధనలను మనము ఆనందముగా ఎదుర్కొనుచున్నయెడల, అద్భుతమైన ఫలితములను పొందెదము. విశ్వాసులు వృథాగా శోధనలలో గుండా వెళ్ళుచున్నారు. వారు ఆనందించుటకు బదులుగా ఫిర్యాదు చేయుచు సణుగుచున్నారు. గనుక ఆ శ్రమలద్వారా ధనవంతులు కాలేకపోవుచున్నారు.
విశ్వాసము మరియు ఓర్పు:
విశ్వాసము మరియు ఓర్పు ద్వారా మాత్రమే వాగ్ధానములను స్వతంత్రించుకొనెదమని హెబీ 6:12లో చదువుచున్నాము. కాబట్టి విశ్వాసమొక్కటే సరిపోదు. మనము దేవుని చిత్తము నెరవేర్చినవారమై వాగ్ధానము పొందు నిమిత్తము ఓర్పు అవసరమైయున్నదని హెబీ 10:36 చెప్పుచున్నది. ఓర్పును సహనముగా ఎన్.ఎ.ఎస్.బి బైబిలులో తర్జుమా చేశారు.
దేవుడు సమస్తమును సమకూర్చి మన మేలుకొరకే జరిగించుచున్నాడు. గనుక మనలను ఇబ్బంది పెట్టువారి గురించి ఫిర్యాదు చేయము (రోమా 8:28). రోమా 8:28 నీటిని శుద్ధిచేసే పరికరము వంటిది. దానిలో ప్రజలు ఎటువంటి మురికి నీటిని పోసినప్పటికిని దానిలోనుండి శుద్ధ జలము బయటకువచ్చును. ప్రజలు మనకు మేలు చేసినను లేక కీడు చేసినను - వారు మనలను పొగడినను లేక శపించినను, వారు సహాయపడినను లేక హానిచేసినను, రోమా 8:28ను మనము విశ్వసించినయెడల వీటిద్వారా మనము మేలే పొందెదము. కాని మనము విశ్వసించాలి. నీటిని శుద్ధి చేసే పరికరాన్ని మనము స్విచ్ ఆన్ చేయుటయే విశ్వాసము. విద్యుత్‌శక్తి అనే విశ్వాసము లేనియెడల అది పనిచేయదు.
కాబట్టి మనకు ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికి ఇతరుల యొక్క పొరపాట్ల ద్వారాగాని లేక దుష్టులు ఉద్దేశ్యపూర్వకంగా చేసినప్పటికిని లేక ప్రమాదశాత్తు జరిగినప్పటికిని, వీటిద్వారా క్రీస్తుయొక్క సారూప్యము మనలో ఏర్పడునట్లు మన మేలుకొరకే దేవుడు సమకూర్చి జరిగించును (రోమా 8:29).
దేవుడు వాటన్నింటిని మన జీవితములో అనుమతించుటయే కాక జ్ఞానము, ప్రేమ మరియు శక్తిగల మన దేవుడు వాటన్నింటిని మన మేలుకొరకు సమకూర్చి జరిగించునని ధైర్యముతో విశ్వసించవలెను.
బైబిలు ధ్యానము:
నేనెప్పుడైనను గ్రీకు చదువలేదు. కాని బైబిలులోని హెబ్రీ మరియు గ్రీకు పదములను చదువవలెనని కోరినయెడల, యంగ్స్ కన్‌కార్డెన్స్‌లో బైబిలులోని హెబ్రీ మరియు గ్రీకు పదములన్నియు ఇంగ్లీషులో వ్రాయబడియున్నవి. దానిని చదువుట మంచిది. బైబిలును ధ్యానించుటకు అది మంచి పుస్తకము మరియు 1961 నుండి బైబిలును ధ్యానించుటకు ఆ పుస్తకమును వాడుచున్నారు.
యంగ్స్ కన్‌కార్డెన్స్‌లో చూచిన ఒక ఉదాహరణను నేను చెప్పెదను.
''రెవయ్య'' అను హెబ్రీ పదమునకు సంపూర్ణమని అర్థము. పాతనిబంధనలో ఈ పదము రెండుసార్లు ఉన్నది.
1. కీర్తన 23:5 ''ప్రవహించుచున్నది'' (కె.జె.వి), ''పొర్లిపారుచున్నది'' (ఎన్.ఎ.ఎస్.బి).
2. కీర్తన 66:12 ''సమృద్ధిగల చోటు'' (కె.జె.వి), ''సమృద్ధిగా'' (ఎన్.ఎ.ఎస్.బి).
ఈ రెండు వచనములను ఒకచోట పెట్టినయెడల, ఈ ఆత్మీయసత్యమును పొందెదము. దేవుడు మన తలను నూనెతో అభిషేకించిన తరువాత కీర్తన 23:5, దేవుడు బంధీగృహములో మనలను ఉంచి, నరులు మన నెత్తిమీద ఎక్కునట్లు చేయును. మన నడుముల మీద గొప్ప భారములను పెట్టును. కాని మనశక్తికి మించి అనుమతించడు. మరియు నిప్పులలోను నీళ్ళలోను నడుపును (కీర్తన 66:11,12). మరియు ఆ విధముగా మన గిన్నె నిండి పొర్లిపారునట్లు చేయును (కీర్తన 66:12ని కీర్తన 23:5తో పోల్చిచూడండి). కాబట్టి అభిషేకమునకు మరియు నిండిపొర్లి పారుటకును మధ్యలో మనము శ్రమలలో గుండా వెళ్ళవలసియుండును. అప్పుడు మాత్రమే ప్రవహించే జీవితము కలిగియుండెదము.
నీకు కలిగిన వాటిలో దేవుని యొద్దనుండి పొందనిది ఏది?:
మన శరీరము, మన ప్రాణము మరియు మనస్సు, ఉద్రేకములు లేక మన ఆత్మను, సమస్తమును మనము దేవునిలోనుండి పొందియున్నామని 1 కొరింథీ 4:7 చెప్పుచున్నది. మన జ్ఞానము, మన ఉద్రేకములు, మన పరిస్థితులు, మన చదువు, జీవితములో మనము పొందుచున్నవి, మనము దేవునిని కోరుకొనుట, మన యొక్క ఆత్మీయ అభివృద్ధి, మన గృహములలో పెద్దవారమగుట మొదలగునవి అన్నియు దేవుడిచ్చిన వరములే. ఇవి నిజమైతే, ఇతరుల కంటే గొప్పవారమని మనము ఏ విధముగా యెంచుకొనెదమని పౌలు అడుగుచున్నాడు. మనము ఈ విషయమును మరచిపోయినప్పుడు, మన మనస్సులలో గొప్ప తలంపులు కలిగియుండి ఎక్కువగా తెలివితేటలు లేనివారిని లేక నాగరికత లేనివారిని లేక ఆత్మీయులుకానివారిని మొదలగువారిని తృణీకరించుటకు ఆరంభించెదము.
తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు పరిసయ్యులను దేవుడు కఠినముగా తీర్పు తీర్చెను (సున్నము కొట్టిన సమాధులనియు, సర్ప సంతానము మొదలగునవి) (లూకా 18:9). హత్య కంటెను మరియు వ్యభిచారముకంటెను మరియు దేవునిదృష్టిలో ఉన్న పాపములన్నింటికంటెను అది గొప్పది. పాపమును దేవుడు చూచునట్లుగా మనము చూచునట్లు మన హృదయములు నూతనపరచబడినయెడల, మనము కూడా దేవునివలె పాపములను చూచెదము.
మనము రొట్టె విరచుటలో పాలు పొందినప్పుడు, రొట్టెను మరియు ద్రాక్షారసమును పుచ్చుకొనెదము. వాటిలోనిది ఏదియు మనము చేయలేదు. ఆ రెండును దేవుడిచ్చిన ఉచిత వరములే. ఈ సత్యమును ఈ క్రింది పాటలో చూడగలము. ''రాతి యుగములలో.... '' ''నా చేతులతో నేనేమియు తేలేదు''
''నీ సిలువను హత్తుకొనెదను''
సమస్తమును దేవునియొద్దనుండి పొందియున్నామని మనము గుర్తించినయెడల, ఆయనచేతిలో నుండి పొందిన ప్రతి చిన్న మేలును బట్టి ఎంతో కృతజ్ఞత కలిగియుండెదము. మన యొక్క సహవాసములో ఉన్న సహోదర, సహోదరీలను బట్టి, వారు పరిపూర్ణులు కాకపోయినప్పటికిని వారిని బట్టి కృతజ్ఞత కలిగియుండెదము
ఆత్మీయత లేక మతమా?:
మతానుసారతను మరియు ఆత్మీయతను విభజించుట నేర్చుకొనవలెను. అనేక క్రైస్తవపరిచర్యలు చేయుట మతానుసారతైయున్నది. కాని ప్రభువైనయేసు వలే మన వైఖరిని అంతకంతకు నూతన పరిచే పరిశుద్ధాత్మను మనలో పని చేయుటకు అనుమతించినయెడల ఆత్మీయులమగుదము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి (ఫిలిప్పీ 2:5). స్త్రీల విషయములోను, డబ్బు విషయములోను, ప్రజల విషయములోను, పరిస్థితుల విషయములోను, భూసంబంధమైన ఘనత విషయములోను మొదలగు వాటి విషయములలో మన వైఖరి మార్పుచెందక పోయిననూ, ఆత్మీయముగా ఎదుగుతున్నామని అనుకొనిన యెడల మనలను మనము మోసపరచుకొనెదము. కేవలము మత సంబంధమైన క్రియలు చేయుట పరిసయ్యులువలె సున్నము కొట్టిన సమాధులువలె ఉండును. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తప్పుడు వైఖరుల నుండి సంపూర్ణ రక్షణ పొందుటకు ప్రయాసపడవలెను.
మతానుసారిగా ఉండుటకును మరియు ఆత్మీయుడుగా ఉండుటకు ఎంతో తేడా ఉంది. పాతనిబంధనలో అనేకులునీతిని వెదకి పరిసయ్యులుగా మారిరి. వారు ప్రభువైన యేసుకు గొప్ప శత్రువులు అయియున్నారు. ఈనాడు కూడా మనము నియమనిబంధనలతో (ధర్మశాస్త్రముతో) క్రొత్త నిబంధన సత్యములు పొందుకొని మరియు మతానుసారులము కావచ్చును. అప్పుడు మనము కూడా ఈనాడు గొప్పశత్రువులు కాగలము.
పరిశుద్ధాత్మతో నింపబడుటకంటే ఒక వ్యక్తి దేవుని వాక్యమును చదువుటలో ఆసక్తి కలిగియున్నయెడల, అతడు ఆత్మీయ క్రైస్తవుడుగా కాక మతానుసారమైన పరిసయ్యుడుగా మారును. ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించమని పాతనిబంధనలో ఆజ్ఞాపించబడిరి (కీర్తన 1:2). కాని క్రొత్త నిబంధనలో సువార్తలలలో ఉన్న ప్రభువైనయేసు మహిమను గూర్చి మనము ధ్యానించవలెను (2 కొరింథీ 3:18). అక్షరము చంపును. ఆత్మ జీవింపచేయును.
దేవుని రాజ్యము అనగా నీతితో కూడిన సమాధానము మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందము (రోమా 14:17). మతస్థులలో మానవనీతి ఉండవచ్చును గాని సమాధానము ఆనందము ఉండదు. వారిలో సణుగుట మరియు గొణుగుట, భయములు మరియు చింతలు ఉండును. కాని నిజమైన క్రైస్తవ విశ్వాసము సంపూర్ణ సమాధానములోనికి నడిపించును అనగా దేవునితో సమాధానము (అన్ని విషయములలో నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుట) మనుష్యులతో సమాధానము (సాధ్యమైనంతవరకు) మరియు అంతరంగములో సమాధానము (చింతనుండి విడుదల పొందుట) అది సంపూర్ణ సంతోషమును తెచ్చును అనగా అన్ని పరిస్థితులలో కృతజ్ఞతలు మరియు స్తుతులుజీవితములో నుండి ప్రవహించును. మనము ఈ విధముగా ఉండెదము.
''ఆయన తన సొంత దు:ఖములు బట్టి కన్నీరు కార్చలేదు
కాని నా కొరకు ఆయన చెమటను రక్తమువలె కార్చెను''
ప్రభువైన యేసు ఆవిధముగా జీవించెను. తన కొరకు ఆయన ఎప్పుడైనను బాధపడలేదు. కాని రక్తము కారుచు మరియు ఆయన సిలువను మోయుచున్నప్పుడు, నా నిమిత్తము మీరు ఎడవకుడి అని చెప్పెను (లూకా 23:28). ఆయన తనమీద తాను ఎప్పుడైనను జాలిపడలేదు. ఆయన తండ్రిముఖము ఎదుట జీవించియున్నాడు గనుక ఇతరులు బాధించినను ఎల్లప్పుడు సంతోషించెను. మనము కూడా ఆవిధముగా మన కొరకు కన్నీరు కార్చకుండా జీవించాలి.
మతంలో చాలా కార్యక్రమములు ఉన్నవి. కాని ఇతరులను తృణీకరించుచూ మరియు గర్వము కలిగియుండెదరు. మనము ఇతరులను చిన్నచూపు చూసినయెడల లేక మనస్వనీతిని బట్టి గర్వించినయెడల అప్పుడు మనము ఆత్మానుసారులముగా కాక మతానుసారులముగా నుండెదము (దీనత్వము క్రొత్త నిబంధన యొక్క సుగుణము కనుక పాత నిబంధనలో లేదు). కాబట్టి మన బైబిలు జ్ఞానము అధికమయ్యే కొలది, మనము మతానుసారులము కాక ఆత్మానుసారులమైయున్నట్లు చూచుకొనవలెను.
నీకు కీడు చేసిన వారిని క్షమించుము. దేవునితోను మరియు మనుష్యులతోను సమాధానము కలిగియుండి పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థించుము. మరియు దేవుని యొక్క కృపద్వారా యేసు యొక్క మరణానుభవములో జీవించుటకు నిర్ణయించుకొనుము. అప్పుడు నీవు ఆత్మీయుడవగుదువు.
విశ్వాసము మరియు ధైర్యము:
''అవిశ్వాసము వలన దేవుని వాగ్ధానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్ధానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను'' (రోమా 4:20,21). విశ్వాసము వలన అబ్రాహాము బలమునొందెను.
అసాధ్యమైన పరిస్థితులలో మనము దేవుని నమ్మినయెడల, దేవుని మహిమ పరచెదము. దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదియులేదు. ఎక్కడైనను సాతాను కలుగజేసే సమస్యలన్నింటిని ఆయన పరిష్కరించగలడు. అధ్యక్షుని హృదయముకూడా దేవుని చేతిలో ఉన్నది మరియు ఆయన దానిని మనకు అనుకూలముగా త్రిప్పగలడు (సామెతలు 21:1).
కాబట్టి ఏది జరిగినను, ఎల్లప్పుడు దేవునియందు విశ్వాసముంచుము మరియు నీ విశ్వాసమును నోటితో ఒప్పుకొనినయెడల, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద త్రొక్కి పట్టును. అప్పుడు అతడు మీకు ఏమి చేసినను, సాతానును జయించుదువు. నా జీవితములో ఇలాగు జరుగుట అనేకసార్లు చూచితిని.
భూమిమీద దేవుడు నీకు ఆత్మీయ విద్యను నేర్పాలని చూచుచున్నాడు. గనుక, కాలముగడిచే కొలది పెద్ద సమస్యలు వచ్చును. అనగా స్కూలులో నీవు పై తరగతులకు వెళ్ళే కొలది పెద్ద పరీక్షలు వచ్చినట్లుండును. కాని నీవు ఆ పెద్ద సమస్యను తప్పించుకొనుటకు, క్రింది తరగతులకు వెళ్ళవలెనని నీవు కోరవు. కాబట్టి నీవు కృపలో ఎదిగే కొలది పెద్ద సమస్యలు వచ్చినయెడల నీవు ఆశ్చర్యపడవద్దు. ఆ విధముగా నీవు బలమైన మరియు ధైర్యము గల క్రైస్తవుడవగుదువు.
ఏ విషయములోనైనను నీ మనస్సాక్షి నేరారోపణ చేయకుండునట్లు జాగ్రత్తపడుము. అప్పుడు మాత్రమే నీవు దేవుని దగ్గరకు ధైర్యముగా వెళ్ళి మరియు నీ సమస్యలను పరిష్కరించమని అడిగెదవు (1 యోహాను 3:21,22). శ్రమలలో ఉన్నప్పుడు జ్ఞానము కొరకు దేవుని అడుగుట, నీవు ఎదుర్కొనుచున్న సమస్యకు పరిష్కారమడుగుటయే (యాకోబు 1:1-7). ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారమున్నది గనుక వాటిని బట్టి సంతోషించమని యాకోబు చెప్పుచున్నాడు. ఎందుకనగా ఆ విధముగా దేవునిని నూతనముగా అనుభవించెదవు.
దేవునియొక్క మహిమను చూచుట:
యెషయా, దేవుని మహిమను చూచినప్పుడు, ''సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని'' దూతలు పాడుటను అతడు వినియున్నాడు (యెషయా 6). ఇది చాలా అద్భుతమైన విషయము. ఎందుకనగా భూమిమీద అనేకులు వారున్న పరిస్థితులలో దేవుని మహిమను చూడలేకపోవుచున్నారు. వారు దుష్టత్వము మరియు కీడును మాత్రమే చూచుచున్నారు. ఎలీషా యొక్క సేవకుడు అతని చుట్టూ దేవుని దూతలు ఉండుటను చూచిన దర్శనమును మనము కూడా కలిగియుండాలి (2 రాజులు 6:17).
మనము దానిని చూచినప్పుడు ఈ విధముగా చెప్పెదము, ''దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడు?''. దేవుడు పరిష్కరించలేని సమస్య ఏదియులేదు గనుక ఎటువంటి పరిస్థితిలోనైనను మనము భయపడము.
మనము భూమిమీద ఉన్నప్పటికిని పరలోకమందు కూర్చుండబెట్టబడియున్నాము (ఎఫెసీ 2:7). మనము పరలోకసంబంధమైన వస్త్రముకలిగి (చంద్రమండలములోనికి వెళ్ళేవారు వేసుకొనే దుస్తులు) అంతరంగములో పరలోక వాతావరణమును కలిగియుండెదము. కాబట్టి మనము ఈ లోకములో జీవించుచున్నప్పటికి అపవిత్రతగాని, సణుగుటగాని, భయముగాని మనలో ఉండదు. ఎందుకనగా అవి పరలోకములో ఉండవు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి దీనిని చేయును. అందువలన ఎల్లప్పుడు మనము పరిశుద్ధాత్మతో నింపబడవలెను.
తృణీకరించబడుట యొక్క ఆశీర్వాదము:
నేను నావికాదళములో ఉన్నయెడల, నాకు 58 సంవత్సరములు పూర్తి అగుచున్నవి గనుక పదవీవిరమణ చేసియుండెడివాడను (నవంబరు 5,1997). ఈ లోకములో నేను దేవునికొరకు ఉపయోగకరముగా జీవించునట్లు 31 సంవత్సరముల క్రితము నావికా దళమును విడిచిపెట్టినందుకు వందనములు.
గత మాసములో (1997 అక్టోబరు) నేను మరియెక్కువగా హింసను, వ్యతిరేకతను మరియు తృణీకరించబడుదునని ప్రభువు చెప్పారు. దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. కాని రాబోయే సంవత్సరములలో నేను ఎదుర్కొనబోయే వాటిగురించి ప్రభువు ముందుగా హెచ్చరించారు.
ప్రభువైన యేసు వాక్యమును విని యూదులు విసర్జించినట్లే, ఇప్పుడు క్రైస్తవులు కూడా నన్ను విసర్జించెదరని నాకు తెలియును. అయినప్పటికి ప్రభువునందు సంతోషించుచు ముందుకు సాగెదను.
కాని మన సంఘములు అంతకంతకు మహిమకరముగా మారుచున్నవి. పూర్ణహృదయముగల సహోదర సహోదరీలను దేవుడు మన మధ్య లేపియున్నాడు. అది నాకు ఎంతో సంతోషమిచ్చుచున్నది. మరియు ఇప్పుడు పరిచర్యకొరకు అనేక ద్వారములు తెరువబడుచున్నవి.
''ఎదురించు వారు అనేకులు ఉన్నప్పటికి కార్యానుకూలమైన మంచి సమయము తనకు ప్రాప్తించియున్నదని'' పౌలు చెప్పుచున్నాడు (1 కొరింథీ 16:8,9). అపొస్తలుల కాలము నుండి తెరువబడిన ద్వారాములు మరియు ఎదురించువారు అను రెండు విషయములు ఉన్నవి.
దేవుని రాజ్యమును మరియు నీతిని వెదకినయెడల అత్యంత సంతోషకరమైన జీవితము జీవించవచ్చుననుటకు, మన కుటుంబమును సజీవసాక్ష్యముగా ఉంచియున్నాడు. మన కుటుంబమును దేవుడు ఆశీర్వదించినందుకు కొందరు అసూయపడి మనకు వ్యతిరేకులైరి. ఒక సామాన్య పరిచారకుని కుమారుడు ఆత్మీయముగాను మరియు లోకములోను వర్ధిల్లుట వారు చూడలేక పోయియున్నారు.
కొన్ని సంవత్సరముల క్రితము ప్రభువు నాతో చెప్పిన విషయమును మీతో పంచుకొనెదను. ''నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించునట్లు నిన్ను నియమించితిని'' (యిర్మీయా 6:27). గర్వించినట్లు ఉంటుంది గనుక ఇతరులతో దీనిని చెప్పలేను. కాని గత సంవత్సరములలో సి.ఎఫ్.సి లో ఉన్న వారిని నేను నిర్వహించియున్నాను గనుక దాని నెరవేర్పును చూచియున్నాను. నాతో సన్నిహితముగా ఉన్నవారుగాని లేక మన సంఘములలో ఉన్నవారుగాని కొందరు పాపములోగాని లేక పరిసయ్యతత్వంలోగాని జీవించుచూ మరియు మారుమనస్సు పొందుటకు ఇష్టపడని వారి స్థితిని దేవుడు బయలు పరచియున్నాడు. ఇది అనేకసార్లు జరుగుట నేను చూచితిని. ప్రజలు వారి పాపమును గుర్తించి మారుమనస్సు పొందవలెనని, దేవుడు వారి రహస్యపాపములను వారికి చూపించును. కాని మారుమనస్సు పొందుటకు ఆయన వారిని బలవంతం చేయడు.
తల్లిదండ్రులముగా మీ యెదుట మేముంచిన మాదిరిని ప్రభువు మరలా వచ్చువరకు మీరు వెంబడించి మరియు దేవుడిచ్చే నిత్య బహుమానమును పొందెదము. దేవునియొక్క పరిచర్య ఎంతో విస్తారముగా ఉన్నది. గనుక ప్రభువు మరలా వచ్చువరకు నేను ఉండెదనని నేను నమ్ముచున్నాను. కాని మనకు శ్రేష్టమైన దానిని దేవుడు ఎరిగియున్నాడు మరియు ఆయన మనయొక్క దినములు లెక్కించియున్నాడు.
సాతానుకు స్థలమివ్వవద్దు:
పక్రటన 12:8లో సాతాను గురించి రెండు విషయములు నేర్చుకొనెదము.
1. దేవునిదూతలను మరియు దేవునికుమారులైన మనలను ఎదుర్కొనే శక్తి సాతానుకు మరియు అతని యొక్క దయ్యములకు లేదు. పరలోకములోగాని లేక మన హృదయములలో గాని సాతానుకు స్థలములేదు.
కోపముతో జీవించే వారిని ఎఫెసీ 4:26,27 లేక ఎవరినైనను క్షమించకుండా ఉండే వారిని సాతాను అవకాశముగా తీసుకొనును (2 కొరింథీ 2:10,11). కాబట్టి ఈ రెండు పాపములను జాగ్రత్తగా తృణీకరించవలెను.
ఎల్లప్పుడు దేవునిని స్తుతించే పరలోకములో సాతాను జీవించలేడు. మనము కూడా దేవునిని స్తుతించే ఆత్మను కలిగియుండాలి మరియు ఎల్లప్పుడు స్తుతించుచున్నయెడల సాతాను మన హృదయములలోనికి ప్రవేశించలేడు.
వారి యొక్క శత్రువులు ఎర్ర సముద్రములో మునిగిన తరువాత మాత్రమే ఇశ్రాయేలీయులు దేవునిని స్తుతించిరి (కీర్తన 106:8). కాని ఈనాడు మనము విశ్వాసమూలముగా జీవించుచున్నాము. కాబట్టి విడుదల పొందకముందే దేవునిని స్తుతించడము ద్వారా ఆయన మన శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచి మరియు ఆనంద తైలాభిషేకముతో అభిషేకించును (కీర్తన 23:5).
యోనా చేప కడుపులో ఉన్నప్పుడు, మూడు రోజులు దానితో పోరాడియున్నాడు. మూడురోజుల తరువాత మాత్రమే ప్రార్థించుటకు ఆరంభించెను (యోనా 1:17 మరియు 2:1). మనము కూడా ఒక క్లిష్టపరిస్థితి ఎదుర్కొనినప్పుడు, సాధారణముగా మనము మొదట ప్రార్థన చేయము. మనము చేసిన ప్రయత్నములన్నియు సఫలము కానప్పుడే ప్రార్థించెదము. కాని యోనా దేవునిని స్తుతించుట ఆరంభించిన తరువాత మాత్రమే విడుదల పొందియున్నాడు.
యోనా ఇట్లు ప్రార్థించాడు, ''యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను'' (యోనా 2:7). అప్పుడు అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కెను (యోనా 2:10). మనము ప్రభువుని స్తుతించుటకు ఆరంభించినప్పుడు మాత్రమే క్లిష్టపరిస్థితి నుండి విడుదల పొందెదము. ఆ విధముగా సర్వశక్తిగల దేవునియందు మన విశ్వాసమును వ్యక్తపరచెదము. దేవుడు ఇట్లు అనుచున్నాడు, ''స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచి నేను అనుగ్రహించే విడుదలకొరకు మార్గము సిద్ధపరచుకొనియున్నాడు'' (కీర్తన 50:23 పారాఫ్రేజ్). యోనా అనుభవించెను కాబట్టి మనము కూడా అనుభవించవచ్చును.
ప్రభువైనయేసు దేనిని గురించి ఆశ్చర్యపడియున్నాడు?:
మనము రెండుసార్లు మాత్రమే ''యేసు ఆశ్చర్యపడెను'' అని చదువుతాము, ఒకటి ఆయన విశ్వాసము చూచినప్పుడు మరియు రెండవది అవిశ్వాసము చూచినప్పుడు. ప్రభువా నీవు మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడునని శతాధిపతి చెప్పినప్పుడు ప్రభువు అతని విశ్వాసము చూచి ఆశ్చర్యపడెను (మత్తయి 8:9-10). మరియు ఆయన కపెర్నహూములో వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను (మార్కు 6:5). ప్రభువైన యేసు తను ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడు కానని చెప్పి, తననుతాను ఎంతో తగ్గించుకొనెను.
ఒక కనాను స్త్రీ కూడా తన కూతురిని స్వస్థపరచమని అడిగినప్పుడు, ఆమె యొక్క గొప్ప విశ్వాసమును ప్రభువు కొనియాడెను (మత్తయి 15:28). పిల్లలయొక్క ఆహారమును కుక్కలకు పెట్టనని ప్రభువు చెప్పినప్పుడు, ఆమె ఎంతో దీనురాలై, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల క్రిందపడు రొట్టెలను తినునని ఎంతో దీనురాలై చెప్పెను. ఆమె అభ్యంతర పడలేదు. ఈ రెండు సంఘటనలలో ఒకే విషయము చూచెదము. దీనత్వము మరియు విశ్వాసమునకు మధ్య సంబంధమున్నది. మనము ఎంత దీనులమైతే, మన మీద మనకు ఎంత తక్కువ నమ్మకముంటే మరియు మనము చేసిన వాటిని గురించిగాని మరియు మన తలాంతులుగురించిగాని ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువ విశ్వాసము కలిగియుండెదము. ఎంత గర్విష్టులైతే అంత తక్కువ విశ్వాసము కలిగియుండెదము.
ప్రభువు ఎదుట నిలువబడుటకు మనము అయోగ్యులమని ఎల్లప్పుడు గుర్తించవలెను. ఆయన యొక్క అద్భుతమైన కృపనుబట్టి ఆయన సన్నిధిలోనికి మనలను అనుమతించుచున్నాడు. మనము దానిని చులకనగా చూడకూడదు. కాబట్టి హృదయమంతటితో దీనత్వమును కోరుకొనుము.
ఓడిపోని విశ్వాసము:
మన శత్రువులకు శత్రువునై ఉండెదనని దేవుడు వాగ్ధానమిచ్చియున్నాడు (నిర్గమకాండము 23:22). పాత నిబంధనలో మనుష్యులే ఇశ్రాయేలీయులయొక్క శత్రువులై యున్నారు. ఈనాడు మనకు సాతాను మరియు అతనిదూతలు మరియు మనశరీరేచ్ఛలు మనకు శత్రువులై యున్నారు. మనము శరీరులతో పోరాడము (ఎఫెసీ 6:12). నీవు మనుష్యులతో పోరాడను అని నిర్ణయించుకొనినయెడల, దేవుడు నీ కొరకు పోరాడును. సాతానుకు విరోధముగా దేవుడు ఎల్లప్పుడూ నీ పక్షముగా ఉన్నాడని గుర్తుంచుకొనుము.
దేవునికి పేతురుమీద నమ్మకము ఉండుటవలన మరియు అతనియెడల గొప్ప పరిచర్య కలిగియుండుటవలన, పేతురుని జల్లించుటకు ఆయన అనుమతినిచ్చెను. కాని అతడు జల్లించబడినప్పుడు అతని నమ్మిక తప్పిపోకుండునట్లు ప్రభువైన యేసు పేతురు కొరకు ప్రార్థించెను. సాతాను నిన్ను జల్లించే ప్రతిసారి ప్రభువైనయేసు నీ కొరకు ప్రార్థించుచున్నాడనే గొప్పఆదరణ మనకు ఉన్నది.
ఒక ఇల్లు మంటలలో కాలిపోవుచున్నప్పుడు, ఆ ఇంటిలో ఉన్న విలువైన వాటిని కాపాడవలెనని ప్రజలు కోరెదరు. ఆ ఇంటిలో పసిబిడ్డలు ఉన్నట్లయితే, పాత వార్తాపత్రికలు కాదుగాని ఆ బిడ్డను రక్షించెదము. అదే విధముగా పేతురు అగ్నిగుండములోగుండా వెళ్ళినప్పుడు అతని విశ్వాసము కాపాడబడునట్లు ప్రభువైన యేసు ప్రార్థించెను. ఎందుకనగా విశ్వాసము ప్రాముఖ్యమైయుండి అమూల్యమైయున్నది. మిగతావన్నియు పాత వార్తాపత్రికలవలె పనికి రానివి.
సాతాను మిమ్మును జల్లించినప్పుడు మీ విశ్వాసము తప్పిపోకూడదు. మీకు విశ్వాసము ఉన్నయెడల మీరు శ్రమలగుండా వెళ్ళుచున్నప్పుడు ఈవిధముగా నోటితో ఒప్పుకొనెదరు: ''నా పరలోకపు తండ్రి నన్ను సంపూర్ణముగా ప్రేమించుచున్నాడు. మరియు ఆయన పరలోకమును భూలోకమును పరిపాలించుచున్నాడు. ప్రభువైనయేసు సిలువ మీద సాతానుని ఓడించియున్నాడు. సాతాను అబద్ధికుడు మరియు నా జీవితముమీద అధికారము లేదు. దేవుడు సమస్తమును సమకూర్చి నా మేలు కొరకే జరిగించుచున్నాడు. విశ్వాసము గలవాడు ఈ విధముగా నోటితో ఒప్పుకొనుచున్నాడు. జల్లించబడిన తరువాత అతడు మారుమనస్సు పొంది తన సహోదరులను స్థిరపరచునని ప్రభువైన యేసు చెప్పారు (లూకా 22:31,32). మనము పరీక్షించబడినప్పుడు విశ్వాసమునుండి తప్పిపోయినయెడల ఇతరులను బలపరచలేము.
ప్రభువు పేతురుని సాతాను అని పిలిచినప్పుడు అభ్యంతరపడలేదు గనుక ప్రభువైన యేసు పేతురులో గొప్ప కార్యము చేసియున్నారు (మత్తయి 16:23). కాని బేతనియలో చిన్న దిద్దుబాటును కూడా స్వీకరించక అభ్యంతరపడిన యూదా కొరకు ప్రభువు ఎప్పుడూ ప్రార్థించలేదు (యోహాను 12:4-8 మరియు మత్తయి 26:8-15).
ప్రభువు నిన్ను గద్దించినప్పుడు అభ్యంతరపడకూడదు. మీ అందరియెడల దేవునికి గొప్ప ఉద్దేశ్యము ఉన్నది. మన యెడల ఎంత గొప్ప సంకల్పమున్నదో అంతగా సాతాను చేత జల్లించబడుటకు దేవుడు అనుమతించును. కాని ప్రతీ శోధనలో నుండి జయోత్సవముతో జయించెదము.
అన్నిటిని చేయవచ్చును గాకి అన్నియు ప్రయోజనకరము కావు:
హెబ్రీ క్రైస్తవులు వినుటకు మందులై శిశువులై యుండిరి గనుక శరీరధారియై యున్న క్రీస్తును గురించి ఎక్కువగా చెప్పవలెనని ఉండినప్పటికిని చెప్పలేకపోయితిని (హెబీ 5:7-14).
పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు క్రీస్తులో ఉన్న విషయములను మనకు చూపించునని ప్రభువు చెప్పాడు. క్రీస్తు జీవితములో ఉన్న దేవుని మహిమను పరిశుద్ధాత్ముడు చూపించాడు. అప్పుడు ప్రభువైన యేసు భూమిమీద జీవించినట్లే మనము కూడా దేవునిజీవమును కలిగి జీవించవలెనని గుర్తించెదము. అప్పుడు మనము చెడ్డవాటినే గాక ప్రభువైన యేసు తృణీకరించిన వాటిని కూడా తృణీకరించెదము.
అన్నిటిని చేయదగినప్పటికిని అన్నియు లాభకరము కాదని (1 కొరింథీ 6:12 మరియు 10:23) పౌలు చెప్పాడు. మనము క్రైస్తవ జీవితము రెండు స్థాయిలలో జీవించవచ్చును. ఒకటి చెడ్డవాటిని విసర్జించి చేయదగిన వాటన్నిటిని చేయుట. రెండవది కొన్ని చేయదగినప్పటికి చేయకుండుట. కాబట్టి మీరు చేయుచున్నవాటిని ఈ విధముగా పరీక్షించుకొనవలెను. ప్రభువైనయేసుతో కలిసి వీటిని చేయగలమా అని మీరు ప్రశ్నించుకొనవలెను. ఆవిధముగా మాత్రమే మీరు ఆత్మీయులగుదురు. లేనట్లయితే మీరు కేవలము దేవునిజీవములేని మంచి మనుష్యులుగా ఉందురు. అనేకమంది క్రైస్తవులు ఈవిధముగా ఉన్నారు. మనము 3 స్థాయిలలో జీవించవచ్చును:
ఆత్మ సంబంధమైన: లాభకరమైన వాటిని మరియు ఉపయోగకరమైన వాటిని చేయుట.
ప్రకృతి సంబంధమైన: చేయదగిన వాటన్నిటిని చేయుట.
శరీరసంబంధమైన: చెడ్డవాటిని కూడా చేయుట
ప్రతీ రోజు నీవు ఎదుర్కొనుచున్న శోధనలలో, మీరు దైవికముగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనుటకును మరియు ప్రకృతిసంబంధిగాను మరియు శరీరసంబంధిగాను ఎదుర్కొనుటలో ఉన్న తేడాను వివేచించుటకు దేవుడు మీకు కృపను ఇచ్చునుగాక (హెబీ 5:14).
ప్రభువు కొరకు మాత్రమే జీవించుట:
ఈ దినములలో ఇండియాలో ఎక్కడికి వెళ్ళినను దేవుడు మనలను ఎంతో ప్రోత్సహించుచున్నాడు. ఈ దేశములో చాలా అవసరమున్నది. మరియు దేవుడు నన్ను ఇప్పటి వరకు జీవింపచేసి ఆయనను నేను ముఖాముఖిగా ఎదుర్కొనుటకు ముందుగా ఆయన కొరకు కొంత పరిచర్య చేయుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను.
మీ అందరిజీవితములలో దేవునికి ఒక సంకల్పమున్నది. ఆయనకొరకు జీవించే ధన్యతను మరియు ఘనతను పోగొట్టుకొనక మరియు ప్రతిదినము ఆయనచిత్తము చేయుటకు ఆయనను వెదకుము. కలువరి సిలువ మీద ప్రభువైనయేసు మన కొరకు చేసి ముగించిన దానంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుటకు ఈ జీవితము సరిపోదు. ప్రభువు మరలా తిరిగి వచ్చువరకు వందశాతం ప్రభువు కొరకే మీరు జీవించవలెనని నా కుమారులైన మీ కొరకు ప్రార్థించుచున్నాను.
మీరు ప్రతిదినము పరిశుద్ధాత్మతో నింపబడుటకును మరియు శిష్యులుగా ఆయనను వెంబడించుటకును మరియు ఆయనకొరకే మీరు జీవించునట్లు ప్రభువుచేత మీరు కాపాడబడునట్లును మరియు మీ చదువులలో ఆయన సహాయపడునట్లు మేము ప్రార్థించుచున్నాము. గత జీవితములో కంటే ఈ సంవత్సరము మరీ ఎక్కువ సన్నిహితముగా ప్రభువుని వెంబడించేకృపను ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఇది కొద్ది జీవితమే మరియు అల్పమైన వాటికొరకు అది ఇవ్వబడలేదు. ఈ నూతన సంవత్సరములో దేవుని బిడ్డగా ఉండుటయు మరియు ఈ భూమిమీద ఆయన సాక్షిగా ఉండే తీవ్రత మీ హృదయములలో స్థిరపడునుగాక. మీరు సంవత్సరాంతమునకు వచ్చినప్పుడు, ఆ సంవత్సరమును బట్టి తృప్తిబడుదురు గాక. సమయం త్వరగా గతించిపోవును మరియు తన మహిమకొరకు సృష్టించిన దేవుని యెదుట త్వరలో నిలబడెదము. ఆ దినమున మీ జీవితమును బట్టి బహుగా సంతోషించుదురుగాక.
వృథా చేయుటకు నా జీవితములో నాకు సమయము లేదు
నా ధన్యుడైన నా యజమాని నడచిన త్రోవ ఇది కాదు
అయితే ప్రతి ఘడియలో ప్రతి తలాంతుతో కష్టించి పనిచేసెదను
ఎల్లప్పుడు సమస్తమును దేవునికిచ్చెదను.
సమయము వేగముగా గతించుచున్నది, నిత్యత్వము సమీపముగా నున్నది
త్వరలో నేను మంటిలో కలిసిపోగలను
నా జీవితమును నేనలా వృథా చేయగలను
ఎల్లప్పుడు సమస్తమును దేవునికివ్వకుండా ఎలా ఉండగలను.
(ఎ.బి.సింప్సన్)
నైతికంగా భ్రష్టుపట్టిన దేశంలోను మరియు లోకత్వము నుండి తీవ్రముగా వేరుపడాలనే కోరని విశ్వాసుల మధ్య మీరు జీవించుచున్నారు. కాబట్టి ఇతర క్రైస్తవుల స్థాయికి సులభముగా దిగజారిపోయి మరియు వారు చేయుచున్నవే చేసే అవకాశమున్నది. ఇది మీరు ఎదుర్కొనుచున్న గొప్ప ప్రమాదము. కాబట్టి సాతాను తంత్రముల గురించి మెళకువగా ఉండి మరియు ప్రభువైనయేసునే మాదిరిగా పెట్టుకొనుము. ఎల్లప్పుడూ ప్రభువైనయేసు మీద మాత్రమే మీ దృష్టి నిలుపుడి. మీ చుట్టు ప్రక్కలున్న క్రైస్తవులందరు చేసినప్పటికి, ప్రభువైన యేసుతో కలసి చేయలేనివాటిని చేయకుడి.
ఎల్లప్పుడూ ప్రభువైన యేసును మాత్రమే చూచుచూ ఆయన సన్నిధిలో జీవించుడి. అప్పుడు మిమ్మును మీరే తీర్పు తీర్చుకొనెదరు. ఆ విధముగా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందెదము. అక్కడ మీరు వెళ్ళుచున్న ఏ సంఘములో అయిననూ ఈ వర్తమానము చెప్పరు. కాబట్టి మీ కొరకు మీరే బోధించుకొనవలెను. ఎక్కువ ఆలోచించకుడి ఎందుకనగా అది నేరారోపణలోనికి నిరాశలోనికి నడిపించును. కాని ఎల్లప్పుడూ యేసును మాత్రమే చూడుడి. మరియు మీరు ఆయనను చూచుచుండగా యెషయా, యోబు మరియు యోహానుల వలె ఈ భ్రష్టత్వమును చూచెదరు. అప్పుడు మిమ్మును మీరు తీర్పు తీర్చుకొనవచ్చును.
నేను ఎప్పుడైనను నాలోపలికి చూడను. పవిత్రతయు ఆయన ప్రేమయు ఆయన దీనత్వమును నేను ఎల్లప్పుడు యేసులో చూచెదను. అది ఎల్లప్పుడు నా యొక్క అవసరమును చూపించును.
దేవుని రాజ్యమును మాత్రమే వెదకుట:
దేవునికి మీయెడల ఒక సంకల్పము ఉన్నది మరియు మీరు ఆ సంకల్పమును వందశాతం నెరవేర్చవలెనని కోరుచున్నాము. మీ యొక్క తల్లిదండ్రులముగా, మమ్మును మేము సంతోషపరచుకొనక దేవునిని ఘనపరచకోరియున్నాము. కాబట్టి మేము విత్తిన దానిని మా పిల్లలు కోసెదరని నమ్ముచున్నాము. ఎందుకనగా దేవునిని ఘనపరచువారిని ఆయన ఘనపరచును అను నియమమున్నది మరియు నీతిమంతులయొక్క పిల్లలు ఆశీర్వదించబడుదురు (సామెతలు 20:7). కాబట్టి దేవుడు మీ అందరికి ఉద్యోగవిషయములోనూ మరియు వివాహ విషయములో సరియైన ద్వారములు తెరుచును. మేము క్రమముగా మీ కొరకు ప్రార్థించుచున్నాము మరియు ఆ ప్రార్థనలు భూమిలో పడవు. కాని మేము యోగ్యులమని మా ప్రార్థనలకు జవాబు ఇవ్వడు గాని, తన మహిమార్థము ప్రభువైనయేసులో మాత్రమే మా ప్రార్థనలకు జవాబు ఇచ్చును.
మీ జీవితములో దేవుని సంకల్పమంతయు నెరవేరవలెనని కోరుచున్నాము. అది ఒక విషయము మీద మాత్రమే ఆధారపడియున్నది. అదేమనగా దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని మొదటగా వెతికెదరా లేక వెదకరా. అది వేరే విషయముల మీద ఆధారపడదు. గత 35 కంటె ఎక్కువ సంవత్సరములుగా దానిని నేను ఋజువు పరిచియున్నాను. కాబట్టి ఆ విషయములో మీరు మొదటిగా ఎల్లప్పుడు దేవునిని వెదకుడి మరియు సమస్తము మంచిగా జరుగును.
తమ సొంత కార్యములను చూచుకొనేవారితో ఈ లోకము నింపబడియున్నది (ఫిలిప్పీ 2:21). ఆదాముద్వారా పుట్టిన ప్రతిఒక్కరూ అనగా ప్రతీదేశములోనూ ప్రతీ తరములోనూ ఆ నియమముతో జీవించుచున్నారు. ప్రభువైన యేసు అటువంటి లోకములోనికి వచ్చి మరియు తన సొంత కార్యములకొరకు కాక తన తండ్రియొక్క చిత్తమునే ఎల్లప్పుడు నేరవేర్చారు. ప్రభువైన యేసును వెంబడించుట అనగా ఈ విధముగా తీవ్రముగా ఉండి మరియు మీరు చేసేదంతయు మరియు మాట్లాడేదంతయు దేవుని నామ మహిమార్థము మరియు దేవుని రాజ్యనిమిత్తము చేసెదరు.
పక్రటన 3:21లో ఆయన జయించినట్లే మనము జయించవలెనని ప్రభువు చెప్పుచున్నారు. అనగా ఆయన కూడా పోరాడి జయించవలసియున్నదని స్పష్టముగా బోధించుచున్నది. మీరు శోధించబడినప్పుడు మరియు పరీక్షించబడినప్పుడు ప్రభువైన యేసు జయించిన విధానమును పరిశుద్ధాత్మ మీకు చూపించునట్లు ఆయనను అనుమతించవలెను. మరియు ఆవిధముగా జయించుటకు కావలసిన శక్తిని ఆయనలోనుండి పొందుకొని యేసువలే జీవించెదము.
మన పొరపాట్లు అన్నిటిని ప్రేమగల దేవుడు చూడడు:
ప్రభువుని వెంబడించాలనే మీ కోరికను బట్టియు, మీ పరిపూర్ణ యథార్థతను బట్టియు, మీ నిస్సహాయతను బట్టియు మరియు కష్టపడే స్వభావాన్నిబట్టియు మేము నిజముగా అతిశయించుచున్నాము.
ఇప్పటివరకు దేవుని చిత్తములో ఆయన మిమ్ములను ఉంచియున్నాడని నేను దేవునిని నమ్ముచున్నాను మరియు ప్రార్థనయొక్క శక్తి ద్వారా ఆయన చేసాడని నమ్ముచున్నాను. మీరొక నిర్ణయముతీసుకొనే విషయములో తప్పుచేసిన యెడల, దేవుడు దానిని నిర్లక్ష్యపెట్టి మరియు భవిష్యత్తులో ఆయన సంపూర్ణ చిత్తము నెరవేరునట్లు చేయును. జీవితము చాలా చిన్నది మరియు మీ జీవితములో తీవ్రమైన పొరపాట్లు చేయకుండునట్లు ప్రార్థించుచున్నాను. మీరు చేయుదానంతటిలో దేవునిని మరియు ఆయన నీతిని మొదటిగా ఉంచుడి అప్పుడు సమస్తము మంచిగా జరుగును. దానికంటే శ్రేష్టమైన దానిని నేను కోరుటలేదు. మీరు ఈ లోకములో పాములవలె వివేకులును మరియు పావురమువలె నిష్కపటులుగా ఉండుటకు దేవుని జ్ఞానము అవసరమైయున్నది. మీరు భూసంబంధమైన ఉద్యోగము కొరకు వెదకినప్పటికిని ఎల్లప్పుడూ నిత్యమైన వాటిని గుర్తుంచుకొనవలెను. కాబట్టి ఈ జ్ఞానముకొరకు దేవునికి ప్రార్థించుడి. నానాటికి కావలసిన అనుదినఆహారము కొరకు ప్రార్థించమని ప్రభువు చెప్పియున్నాడు గనుక దానికొరకు ప్రార్థించిన యెడల దేవుడు మీ చదువులను అలాగే మీ ఉద్యోగములను ఆశీర్వదించును. ఆయన మనలను నిత్య మరణమునుండి రక్షించుటయే కాక అనేకప్రమాదములనుండియు మరియు శారీరకమరణమునుండి కాపాడినందుకు ఆయనకు ఋణపడియున్నాము.
మీ కాలేజీ జీవితమంతటిలో అప్పులేకుండా చేసినందుకు దేవుని మంచితనమును బట్టి ఆయనను స్తుతించుచున్నాను. చాలామంది విద్యార్థులు వారు డిగ్రీ పూర్తిచేసుకొనే సమయానికి అప్పులలో ఉండి నిరాశలోఉండెదరు.
మనం ఎదురు చూచువాటికంటెనూ మరియు మనకు ఉత్తమమైనదానిని ఎన్నుకునే దానికి వ్యతిరేకముగా అనేకసంగతులు జరుగవచ్చును. అటువంటి వాటిని దేవుడు మన జీవితములో దేనికొరకు అనుమతించునో మనకు తెలియదు. కాని మనము నిత్యత్వములో ప్రవేశించిన తరువాత వాటి యొక్క ఉద్దేశ్యములు తెలుసుకొని మరియు ప్రభువుతో సమ్మతించి ఈవిధముగా చెప్పెదము, ''ప్రభువా, నీవు సమస్తమును బాగుగా చేసియున్నావు''. దేవుడు ఎన్నటికిని పొరపాటుచేయడు. అది నిశ్చయము. దైవభక్తిగల వారి పిల్లలకు స్వాస్థ్యము ఉండును. కాబట్టి భవిష్యత్తులో మీరు నిశ్చయముగా ఆశీర్వదించబడెదరు. ''మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిరి'' (1 కొరింథీ 2:9).
మీరు ఇంకా ఎక్కువగా ప్రభువుకొరకు జీవించవలెనని ఇది వ్రాయుచున్నాను.
మీరు కృత్రిమముగాఉండక మరియు మీ క్రైస్తవ్యము అంతయు హృదయమునుండి వచ్చినదియు స్వభావసిద్ధముగా ఉండవలెను. ఆత్మీయముగాను మరియు శారీరకముగాను ప్రభువు మిమ్మును కాపాడి భద్రపరచునుగాక.
తల్లిదండ్రులకు విధేయులగుట:
దేవుడు ఆదాముకు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చెను మరియు అతడు దానికి అవిధేయత చూపెను. ఆదికాండము 2,3 అధ్యాయాలు. ఒకరిని ఒకరు ప్రేమించవలెనని క్రైస్తవులకు ప్రభువైనయేసు ఒకే ఒక ఆజ్ఞనుఇచ్చెను మరియు అనేకమంది దానికి అవిధేయులు అగుచున్నారు (యోహాను 13:34,35). అదేవిధముగా తల్లిదండ్రులకు విధేయత చూపవలెనని పిల్లలకు ఒకే ఆజ్ఞ ఇచ్చియున్నారు. మరియు అనేకమంది అవిధేయత చూపుచున్నారు (ఎఫెసీ 6:1-3).
తల్లిదండ్రులను సన్మానించునట్లు తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పవలెను. వారి జీవితకాలమంతయు వారి పిల్లలు వారి తల్లిదండ్రులతో గౌరవముగా మాట్లాడవలెను. మరియు పిల్లలు తల్లిదండ్రులతో ఇంటిలో జీవించుచున్నప్పుడూ అన్ని విషయములలో తల్లిదండ్రులకు లోబడవలెను. ప్రభువైనయేసు ఈ మాదిరిని మన యెదుట ఉంచియున్నారు. 30 సంవత్సరముల వరకు ప్రభువు మరియకు ఇంటిలో లోబడియున్నారు. మరియు తరువాత కానా అను ఊరిలో ఆమెకు లోబడనవసరములేదనియు తన యొక్క పరలోకపు తండ్రికే లోబడవలెనని చెప్పెను. కాని ఆయన సిలువమీద వ్రేలాడబడుచున్నప్పుడు ఆమె గురించి జాగ్రత్త వహించెను. ప్రభువైనయేసు యొక్క మాదిరి వెంబడించే పిల్లలందరికీ మేలు జరుగును.
తల్లిదండ్రులముగా మేము దేవునిని చూపించాము. దీనికొరకు అవసరమైన కృప కొరకు సహాయము కొరకు ప్రార్థించితిమి.
కొన్ని సహాయకరమైన మాటలు:
ఈ మధ్యకాలములో నేను చదివిన కొన్ని మంచిమాటలు:
''ఆదియందు దేవుడు మానవుని నిర్మించాడు, ఇప్పుడునూ జరుగుచున్నది''.
శ్రమలగురించి: ''నేను ఒక కఠిన మార్గములో వెళ్ళవలెనని చెప్పబడినయెడల, ఆ మార్గములో ఎదుర్కొనే కుదుపులు అన్నియు, నేను సరియైన మార్గములోనే ఉన్నాను అని గుర్తుచేయును''.
''మర్యాదగా ప్రవర్తించుటను బట్టి కలిగియుండుటను బట్టి సువార్తను శుభవార్తగా చెప్పవచ్చును''.
''లోతు సొదొమ ప్రాంతమును ఎన్నుకొనుటవలన సమస్తమును కోల్పోయాడు. అబ్రాహాము దేవునిని ఎన్నుకొనుటవలన యుగయుగములు సమస్తమును పొందుకొనియున్నాడు''.
విశ్వాసముయొక్క నిజమైనగుర్తులు:
గలతీ 5:6లో ఈ విధంగా చెప్పబడింది, ''యేసు క్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును''. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము మనలో లేనియెడల సున్నతిపొందుట, భాషలుమాట్లాడుట లేక పాపముమీద జయము పొందుట మొదలగు సిద్ధాంతమలు తెలిసినప్పటికి ప్రయోజనములేదు. నిస్సహాయులముగా దేవునిమీద ఆధారపడుటయే విశ్వాసము. మన జీవితములో అంతమువరకు వచ్చినప్పుడే విశ్వాసము కలిగి దేవునిమీద ఆధారపడెదము. ఆ విశ్వాసము ఇతరులయెడల ప్రేమను కలుగజేయును.
మనకు ఎటువంటి కారణములు ఉన్నప్పటికిని, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కేవలము మన మేలుకొరకని విశ్వసించుటయే విశ్వాసికున్న మరొక గుర్తు. దేవుని రాజ్యమును మొదటిగా వెదకుట, హృదయశుద్ధి కలిగియుండుట, ఎల్లప్పుడూ మనలను మనము తగ్గించుకొనుట, మనకు కీడు చేసిన వారిని క్షమించుట, కీడును మేలుతో జయించుట - ఇవన్నియు మనకెంతో శ్రేష్టమైనవి. దేవునిబలిష్టమైన చేతిక్రింద మనలను మనము తగ్గించుకొనుటకు పిలువబడియున్నాము. మనము నెట్టివేయబడుటకు దేవుడు అనుమతించే ప్రజలు, పరిస్థితులే ఆయన బలిష్టమైన చేయి. మనలను మనము తగ్గించుకొని మరియు సమర్థించుకొనిన యెడల ప్రజలు దానిని అవకాశముగా తీసుకొనెదరేమో అని ఆశ్చర్యపడెదము. కాని ఆ విధముగా భయపడనవసరములేదు. ఎందుకనగా, ''దేవుడు ఎల్లప్పుడు మన గురించి ఆలోచించుచూ మన యొక్క ప్రతివిషయము గురించియు చింతించుచున్నాడు'' (1 పేతురు 5:6,7). మన శక్తికి మించినశోధన ఆయన అనుమతించడు. రక్షణపొందని వారిని మరియు దుష్టులను మనము ప్రేమించినయెడల, వారు దానిని అవకాశముగా తీసుకొనెదరని భయపడవలసిన అవసరము లేదు. (దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా).
నా కొరకు చేయవలసినవాటిని చేయుటకు మరిచిపోయిన వారిని బట్టి సణగక సర్వాధికారముగలిగిన దేవునికి అప్పగించవలెనని ఆయన నాకు బోధించియున్నాడు. ఫరో యొక్క పానదాయకునిద్వారా యోసేపును తగిన సమయములో సింహాసనము యొద్దకు నడిపించినట్లు, క్రమశిక్షణలేని కొందరు చేసిన క్రియలద్వారా దేవుడు తనసంకల్పమును నెరవేర్చును (ఆదికాండము 40:23, 41:1). కావాలని కోరి చేసే పాపమును మాత్రమే దేవుడు ద్వేషించును. మిగిలినవాటన్నిటిని ఆయన గమనించకుండా మరియు ఆయన మహిమ కొరకు దానిని ఉపయోగించును.
స్వజీవమునకు చనిపోయి మరియు క్రీస్తుశరీరమును నిర్మించుట:
మనము క్రీస్తుతోకూడా మృతిపొందినయెడల నిత్యముకూడా ఆయనతో జీవించెదము. మనకు దేవునియెడల విశ్వాసమున్నయెడల, క్రీస్తు యొక్క మరణానుభవము అనగా స్వచిత్తమునకు చనిపోవుటకు (సొంత సుఖమును కోరుట, ఘనతను కోరుట మొదలగునవి) అంగీకారము తెలిపెదము. దేవుడు అనుమతించిన పరిస్థితులన్నిటిలో మనము మరణానుభవములో ఉన్నయెడల, భ్రష్టుపట్టిన ఆదాము జీవమునకు బదులుగా దేవుని జీవమును మనకు అనుగ్రహించును.
మన తల్లిదండ్రులద్వారా మనము పొందిన జీవముకంటే ప్రభువైనయేసు ద్వారా పొందే పునరుత్థానము ఎంతో ఎంతో శ్రేష్టమైనది. కాని మనము యేసుయొక్క జీవమును పొందుటకు ముందుగా ఆదాముయొక్క జీవమును మరణమునకు అప్పగించవలెను (2 తిమోతి 2:11, 2 కొరింథీ 4:10). దానిని ఒక బిక్షగాడి గిన్నెలో ఉన్న కొన్ని నాణెములకు బదులుగా దేవుడు అనేక లక్షలరూపాయలు ఇచ్చునట్లు ఉండెను. ఒక బుద్ధిహీనుడు మాత్రమే దీనిని విసర్జించును. కాని లోకమంతయు అటువంటి బుద్ధిహీనులతో నిండియున్నది. కాబట్టి వారికున్న కొద్ది నాణెములను పట్టుకొని (ఆదాము యొక్క భ్రష్టజీవము) వారికొచ్చిన శోధనల ద్వారా ఆత్మీయముగా దేవుని స్వభావములో పాలుపొందుచూ ధనవంతులగుటకు బదులుగా వారు ఆవిధముగానే వారి జీవితమును ముగించెదరు. మనము వాటిద్వారా సంతోషపడెదమని చెప్పే దురాశలు మనలో ఉన్నవని బైబిలు చెప్పుచున్నది (ఎఫెసీ 4:22). మన జీవితకాలమంతయు సిలువ మార్గములో జీవించవలెనని మనము గ్రహించనియెడల క్రీస్తుయొక్క శరీరమును నిర్మించలేము. ఈ విధముగామాత్రమే క్రీస్తుయొక్క శరీరమును నిర్మించెదము.
మనము క్రీస్తువలె మారుటయే మనయెడల దేవునియొక్క గురి:
యేసువలె మనలను మార్చవలెనని దేవుడు గురిగా కలిగియున్నాడు. ఈ విషయములో మూడు వచనములు ఉన్నవి.
1. రోమా 8:28,29 ఈ గురిని మనము చేరుటకు మన తండ్రి సమస్తమును సమకూర్చి జరిగించును.
2. 2 కొరింథీ 3:18 మనము ఈ గురిని చేరుటకు అంతరంగములో పరిశుద్ధాత్మతో నింపబడెదము.
3. 1 యోహాను 3:23 క్రీస్తుయొక్క రెండవ రాకడ గురించిన నిరీక్షణ కలిగిన వారందరు ఈ గురియొద్దకే పరుగెత్తెదరు.
మనము చిన్న పొరపాట్లు చేసినప్పటికిని మనలను గద్దించుట, శిక్షించుట అను రెండు గుర్తులను దేవునిప్రేమలో చూచెదము (హెబీ 12:5-8, పక్రటన 3:19). అనగా ఆయన మనలను కుమారులుగా చూచుచున్నాడు. మనము ఈ గురియొద్దకు చేరుకొనవలెనని కోరినప్పుడు దేవుడు కూడా మనము యేసువలె మార్పుచెందుటకు మనలో పనిచేయును.
మన పూర్ణ హృదయముతో ఆయనను వెదికినప్పుడు మాత్రమే మన జీవితములో ఆయన సంకల్పమును నెరవేర్చును (యిర్మీయా 29:11-13). ఆసక్తితో వెదుకువారికి ఫలమిచ్చే వాడే మనదేవుడు (హెబీ 11:6). కాబట్టి మీరు యౌవనులుగా ఉన్నప్పుడే ఆయనను ఆసక్తితో వెదకవలెను.
మరణముద్వారా దేవునిజీవమును పొందెదము:
1 కొరింథీ 11లో, మనము రొట్టె విరుచునప్పుడు ప్రభువుయొక్క మరణమును మనము గుర్తుచేసుకొనవలెనని పౌలు చెప్పాడు. ప్రభువైనయేసు భూమిమీదకు వచ్చి మరియు తన జీవితముద్వారా మనకు చూపించి బోధించినది ఏమనగా, ''మరణము ద్వారా దేవునిజీవమును పొందెదము'' (2 కొరింథీ 4:10). కాబట్టి ప్రభువు యొక్క మరణములోని ప్రతీ విషయమును ధ్యానించి మరియు స్పష్టముగా అర్థము చేసుకొని ఆయన మరణములో పాలివారగుటయు మరియు క్రీస్తుతో కూడా సిలువ వేయబడుటయు అనగా ఏమిటో తెలుసుకోవాలి.
ఆయన చేయనిదానికొరకు క్రీస్తు సిలువమీద అవమానము పొందియున్నాడు. అనగా ఆయన చేయని దానికి శిక్ష అనుభవించి యున్నాడు (కీర్తన 68:4). ఇది ఆదాము చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నది. అతడు తాను చేసినదానికి నిందను భరించక మరియు భార్యను నిందించాడు (ఆదికాండము 3:12). ఈ విధముగా ఆదాముయొక్క పిల్లలు మరియు దేవునియొక్క పిల్లలు వ్యతిరేకమార్గములలో నడిచెదరు.
ఆదాము యొక్క పిల్లలు తమ తండ్రివలె సమర్థించుకొనెదరు. ప్రభువైన యేసు పరిసయ్యులతో మీరు మనుష్యులయెదుట నీతిమంతులును అనిపించుకొనువారు అనెను (లూకా 16:15). ఆదాము తన యొక్క అవసరమును గాని లేక తన యొక్క పాపమునుగాని చూడలేకపోయెను. అతడు ఇతరుల పాపములనే చూడగలిగెను. ఎవరైనను ఇతరులను నిందించుచు మరియు తమలోని తప్పులను చూడలేనియెడల, వారు నిజానికి నేరారోపణ చేసే సాతానుతో సహవాసము కలిగియున్నారు.
''ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము'' అనుమాటను బట్టి మాత్రమే దొంగ రక్షణపొందలేదు. ఆ మాటలను చెప్పుటకు ముందుగా తనయొక్క పాపములకు నింద తానే భరించాడు.
ఇతరులను తీర్పుతీర్చుటకు దేవునికి మనయొక్క అవసరము లేదు. దానంతటిని ఆయనే స్వయముగా చేయగలడు. మనలను మనమే తీర్పుతీర్చుకొనవలెనని ఆయన కోరుచున్నాడు. ఈ లోకములో అటువంటి విశ్వాసులు అత్యంతసంతోషము గలవారై యుండెదరు.
ఉత్తర రాజ్యములోని ఇశ్రాయేలీయుల ఓటములద్వారా యూదాదేశము పాఠములు ఏమియు నేర్చుకొనలేదని యిర్మీయాద్వారా దేవుడు చెప్పాడు (యిర్మీయా 3:6-8). మరియు యూదా కంటే ఇశ్రాయేలీయులు శ్రేష్టమని ఆయన చెప్పాడు. మృతమైన డినామినేషన్ నుండి బయటకు వచ్చిన అనేకమంది క్రైస్తవులు ఆ మృతమైన డినామినేషన్ నుండి పాఠము నేర్చుకొనరు. అందువలన వారు మరిఎక్కువ పరిసయ్యులుగా మారి మరియు ఆ డినామినేషన్ కంటే ఎక్కువగా మరణించెదరు.
ఒక్క దానిని చేయుటకు మాత్రమే దేవుడు మనలను పిలచుచున్నాడు. ''నీ అతిక్రమములు ఒప్పుకొనుము'' (యిర్మీయా 3:13).
నిజమైన సంతోషము:
ప్రపంచములోని మనుష్యులందరూ సంతోషమును వెదకుచున్నారు. కాని వారు తప్పుడు మార్గములో వెదకుచున్నారు. వారు వ్యభిచారముచేయుట ద్వారా లేక ధనసమృద్ధిని బట్టి లేక పేరుప్రతిష్టలనుబట్టి మరియు అధికారమునుబట్టి సంతోషము కలుగునని తలంచుచున్నారు. వాటిలో కొంత సంతోషము ఉండును. కాని అది అంతము వరకు ఉండదు.
మనము సంతోషంగా ఉండవలెనని దేవుడు కూడా కోరుచున్నాడు కాని ''శుద్ధహృదయముగలవారు సంతోషించెదరని'' ఆయన చెప్పుచున్నాడు (మత్తయి 5:8 లివింగు). పరిశుద్ధముగా ఉండుట ద్వారానే నిజమైన సంతోషము పొందగలము. ఒక క్రైస్తవుడుగా పరిశుద్ధుడవై యున్నావు గనుక ఎంతో సంతోషము అనుభవించుచున్నావని లోకస్థులకు చూపించాలి. దేవుడు నిషేధించిన పాపముల ద్వారా సంతోషమును పొందనవసరము లేదని మీరు ఇతరులకు చూపించాలి.
ఉద్యోగము లేక వివాహమునుబట్టి కూడా నిజమైనసంతోషము పొందలేము. మనము వీటిని కలిగి ఉండవచ్చును. కాని వాటి ద్వారా సంతోషము పొందలేము. ప్రభువులో మాత్రమే మీరు ఆనందించగలరు. అప్పుడు మాత్రమే సువార్తయొక్క సత్యమునకు ఫలభరితమైన సాక్షులుగా ఉండెదము.
మన హృదయములు అపవిత్రముగా ఉండినప్పుడు మనము నిజముగా సంతోషించలేము. రహస్యపాపములు మరియు ఇతరుల యొక్క తప్పుడు వైఖరులు, కయీను వలె ముఖము చిన్నబుచ్చుకొనునట్లు చేయును. ''నీవెందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావని దేవుడు కయీనును ప్రశ్నించెను'' (ఆదికాండము 4:6). తాను పొందబోయే అపాయము గురించి దేవుడు కయీనును హెచ్చరించెను. పాపము తన హృదయమను తలుపునొద్ద పొంచియుండి అతనిని మ్రింగవలెనని చూచుచున్నదని దేవుడు అతనితో చెప్పాడు. అన్ని సమయములలో పాపము మనకు ఎంతో సన్నిహితముగా ఉన్నది. ఎల్లప్పుడూ దీనిని గుర్తించినవారు ధన్యులు. ఎందుకనగా శోధన వచ్చినప్పుడు వారు మెలకువగా ఉండెదరు. తమ శరీరములో బలహీనతను గుర్తించినవారు, వారు పడిపోకుండునట్లు దేవుని సహాయము కొరకు ఎల్లప్పుడూ మొరపెట్టుదురు.
దేవునియొక్క ఆశీర్వాదము సహవాసములోనికి నడిపించును:
కలువరి సిలువ దేవుడు పాపిని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాడో తెలుపుటయే గాక పాపమును ఎంతగా ద్వేషించుచున్నాడో తెలుపుచున్నది. మనము మొదటిసత్యమునే గాక రెండవసత్యమును కలువరి సిలువ మీద చూడవలెను.
దేవుడు అతడితో మాట్లాడినప్పుడు ఆదాము కనీసము సమాధానము చెప్పాడు. కాని కయీను దేవునితో సమాధానముకూడా చెప్పకుండా ఆయన సన్నిధినుండి వెళ్ళిపోయి మరియు తన సహోదరుని వెంటనే చంపియున్నాడు. దేవుడు మరల అతడితో మాట్లాడినప్పుడు తన సహోదరుని గురించి తనకు తెలియదని అబద్ధము చెప్పాడు. అప్పుడు కయీనును శపించాడు.
ఆదాము శపించబడలేదుగాని కయీను శపించబడెను. ఆదికాండము 3లో దేవుడు భూమిని శపించాడు గాని ఆదామును శపించలేదు. దేవునియొక్క హెచ్చరికలను తృణీకరించియున్నాడు. గనుక దేవుడు కయీనును శపించెను. భూమిమీద దిగులుపడుచు దేశదిమ్మరివై యుండెదవని చెప్పెను. కొందరు క్రైస్తవులు దేవునితోగాని స్థానికసంఘముతో గాని సహవాసము చేయనందువలన ఇటువంటి పరిస్థితులలోనే ఉన్నారు. వారు ఏ యొక్క స్థానికసంఘములో అయిననూ పాలివారైయుండక, ఎల్లప్పుడూ ఒక సంఘమునుండి మరొక సంఘమునకు మారుతూ ఆత్మీయదేశదిమ్మరివలె ఉండెదరు. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మనము సహవాసము కలిగియుండెదము. ''దేవుడు ఏకాంగులను సంపారులుగా చేయువాడు'' (కీర్తన 68:6). లేనియెడల మనము దేశదిమ్మరివలె ఉండెదము.
లోకమునుండి రక్షింపబడుట:
ప్రభువైనయేసు మనలను పాపమునుండి మాత్రమేకాక లోకతత్వమునుండి రక్షించుటకు వచ్చెను. సాతాను ఈ లోకాధికారి. ఈ లోకములో మనము తటస్థముగా కనిపించే వినోదకార్యక్రమములు, చదువు మొదలగువిషయాల వెనుక సాతాను ఉన్నాడు. ఉదాహరణకు, మంచిక్రైస్తవసంగీతము వినుటకు మన ఖాళీ సమయమంతా ఉపయోగించినయెడల, దేవుని స్వరము వినకుండా సాతాను మనలను ఆటంకపరచును. అప్పుడు మంచిది శ్రేష్టమైనదానికి శత్రువు అగును.
ప్రభువు మనలను లోకములోనుండి తీసుకొని వెళ్ళలేదు. యోహాను 17:15లో ''నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు. గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను''. ఈ యొక్క లోకములో మాత్రమే మనము అంతకంతకు పరిశుద్ధులుగా మారెదము. ఒక ఓడలోనికి నీరు ప్రవేశించుటలేదని తెలుసుకొనుటకు దానిని సముద్రములో పరీక్షించెదరు మరియు భూమిమీద కాదు.
నోవహు మరియు లోతు దినములవలే ప్రజలు తినుచూ, త్రాగుచూ, కొనుచూ, అమ్ముచూ, ఇల్లు కట్టుకొనుచు, పెండ్లాడుచూ పెండ్లికియ్యబడుచు ఉందురని ప్రభువు చెప్పారు (లూకా 17:26-28). ఇవన్నియు చేయదగినవి. మనము వీటన్నిటిలో మునిగిపోయి దేవునికి సమయము ఇవ్వకుండా ఉండవచ్చు. అంత్యదినములలో ఇదియే అపాయకరము. మరియు అటువంటి దినములలో మనము నివసించుచున్నాము. మనము ఆర్థికముగా అభివృద్ధి చెంది మరియు ఇష్టానుసారముగా సుఖించుచూ, దేవుని యొద్దనుండి తప్పిపోయెదము. ''సంతుష్టిసహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై యున్నదని'' బైబిలు చెప్పుచున్నది (1 తిమోతి 6:6). ఇదియే రక్షణ దినము. దేవునికంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించినయెడల మారుమనస్సు పొందవలెను.
ఒక కన్నుగల డినామినేషన్:
ప్రభువైనయేసు ఇద్దరు గ్రుడ్డివారిని ''నేను స్వస్థపరచగలను అని మీరు నమ్ముచున్నారా'' అని అడిగినప్పుడు వారిలో ఒకడు ఒక కన్ను మాత్రమే స్వస్థపరచగలవని నమ్మినయెడల అతడు ఒక కన్నునే స్వస్థతపొందును. నీ నమ్మికచొప్పున నీకు జరుగునను నియమము ప్రజలందరికి వర్తించును. అప్పుడు అతడు ఒక కన్ను డినామినేషన్‌ను ఆరంభించి మరియు రెండు కన్నులు తెరువబడునని చెప్పిన వారిని మతద్రోహులు అని పిలిచెదరు. దీని అర్థమేమనగా
ఒక కన్ను తెరువబడుట రెండు కన్నులు తెరువబడుట
1.పాపక్షమాపణ పొందుట పాపము మీద జయము పొందుట కూడా
2. దేవునియొక్క తీర్పు ఉండదు పాపములో పడిపోకుండుట
3. క్రీస్తు నాకొరకు చనిపోయాడని విశ్వసించుట క్రీస్తుతో కూడా నేను మృతి
పొందితిని అని విశ్వసించుట
4. దేవునిజీవమును కలిగియుండుట సమృద్ధి జీవమును కలిగియుండుట
5. దేవుని ఆశీర్వాదమును వెదకుట దేవుని యొక్క ఆమోదమును కూడా వెదకుట 6. ఒంటరిగా క్రైస్తవుడిగా జీవించుట క్రీస్తు శరీరములో ఇతర విశ్వాసులతో కలిసి
జీవించుట
వెల చెల్లించనియెడల లాభము ఉండదు:
ముగ్గురు వ్యక్తులకు తలాంతులు ఇవ్వబడిన ఉపమానములో మత్తయి 25:14-30, నిత్యత్వములో మనము బహుగా లాభము పొందునట్లు ఇక్కడ జ్ఞానముతో మన జీవితములను వ్యవహరించవలెనని చెప్పబడింది.
బ్యాంకులో కొంత సొమ్మును డిపాజిట్ చేసినయెడల, 11 సంవత్సరముల తరువాత 100 శాతం లాభము కలుగును (7 శాతం వడ్డీ చొప్పున). ఒక తలాంతుఉన్నవాడు సంవత్సరానికి వచ్చే రాబడి పొందలేదు కాని 5 మరియు 2 తలాంతులు గలవారు కొద్దికాలములోనే 100 శాతం లాభము పొందియున్నారు. అనగా వారు కొంత వెల చెల్లించారు. వెల చెల్లించిన వారికి మాత్రమే బహుమానము ఉండును. వెలచెల్లించని వారు కొద్దిగానే పొందెదరు.
పేతురు మరియు మత్తయి వారి ఉద్యోగములు విడిచిపెట్టుటద్వారా నష్టపోయారు. ప్రభువు వారిని పిలువనియెడల ఆ విధముగా చేయుట బుద్ధిహీనతైయున్నది. మనుష్యులు పిలిచినప్పుడు లేక త్యాగము చేయవలెనని చెప్పినప్పుడు కొందరు బుద్ధిహీనమైన క్రైస్తవులు ఉద్రేకపడి ఆవిధముగా చేసెదరు. ప్రభువుమాత్రమే పిలవాలి. కాని ప్రభువు వారిని పిలచిన వెంటనే, వారు విధేయతచూపిరి. ఆవిధముగా వారి జీవితములలో ఎంతో ఆత్మీయ లాభము పొందియున్నారు.
వెల ఎంత చెల్లించవలసినప్పటికిని ప్రభువు దేనినైననూ చేయమని పిలిచినవెంటనే లోబడవలెను. దేవునిని శోధించుటకుగాని లేక విశ్వాసమును వ్యక్తపరచుటకుగాని దేవాలయముమీద నుండి క్రిందకు దూకకూడదు. కాని దోనెలోనుండి దిగి నీటిమీద నడవమని చెప్పగానే మనము లోబడవలెను.
ఆఫీసులో సత్యముకొరకు నిలువబడుచు మరియు నిర్మలమైనమనస్సాక్షి కలిగియుండుటకు అవసరమైతే ఉద్యోగమును పోగొట్టుకొనుటకు అయినా సిద్ధపడాలి. అప్పుడు ప్రభువుయొక్క వాగ్ధానము ప్రకారము 100 రెట్లు బహుమానము పొందెదవు (10000 శాతం). నీవు నీ స్నేహితుల యొద్ద రాజీపడకుండుటద్వారా లేక వారు వేసిన జోక్స్‌కు నీవు నవ్వనందువలన నీ స్నేహితులు నిన్ను విసర్జించవచ్చును. కాని అటువంటి వెల చెల్లించినప్పుడు గొప్ప బహుమానము పొందెదము.
ఇతరులను ప్రేమించుటలో ఎంతో వెలచెల్లించవలసియున్నది. వారు కృతజ్ఞతలేనివారై యుండవచ్చును. లేక నీకు ఒక రోజు వ్యతిరేకులు కావచ్చును. అటువంటి ఉద్దేశ్యముతో ప్రభువైన యేసు భూమిమీదకు వచ్చెను. కృతజ్ఞతలేని వారికి నీ ప్రేమను చూపియుండవచ్చును. అప్పుడు నీవు ఇతరులను ప్రేమించవద్దని నీవు నిర్ణయించుకొనవచ్చును. అది బుద్ధిహీనతైయున్నది. కృతజ్ఞతలేని వారినిబట్టిగాని లేక దుష్టులనుబట్టిగాని నీకు చేదు అనుభవము కలిగినయెడల, ఆసక్తి కోల్పోవుదువు. అటువంటి వారిని ప్రేమించే మరియు వారికి మంచి చేయుటలో దేవుడు ఎంతో ప్రత్యేకమైనవాడు. మనము ఈ భూమి మీద ఉన్నంతవరకు మనలను ద్వేషించువారిని ప్రేమించుచూ, కీడుకు బదులుగా మేలు చేయుచు మరియు అవి ఎంత కష్టమైననూ జీవితాంతము చేసెదము. అప్పుడు ఒకరోజు ప్రభువు మనతో ఇట్లు అనును, ''భళా నమ్మకమైన మంచి దాసుడా'' అని సంతోషముతో మనలను పిలుచును. అప్పుడు మనము సంతోషించెదము.
దేవుడు అనుగ్రహించిన దాని విషయములో పిసినిగొట్టుగాఉండి గట్టిగా పట్టుకొనువారు తమకు ఉన్నది కూడా పోగొట్టుకొనెదరు. దేవుడు నీళ్ళు పోయువారికినీళ్లు పోయును. కాబట్టి ఇతరులకు ఇచ్చువారు ధనవంతులగుదురు (సామెతలు 11:24,25). మేలు చేయుటయు మరియు ప్రేమించుటయే ఆశీర్వదించబడుటకు మార్గము (అపొ.కా. 20:35). దేవునివాక్యము మనలను ఆశీర్వదించినప్పుడు, దానిని మనలోనే నుంచుకొనినయెడల బీదవారిమగుదుము. కాని దానిని మనము ఇతరులతో పంచుకొనినయెడల మనము ధనవంతులమగుదుము మరియు ఆ వాక్యము ఎప్పటికి జ్ఞాపకముండును. నీ జీవితమును, నీ వరములను మరియు నీకున్నవాటిని ఉపయోగించి ఇతరులను ఆశీర్వదించుము. ఒక తలాంతు కలిగినవాడు దీనిని నేర్చుకొనలేదు.
ఇండియాలో సి.ఎఫ్.సి. సంఘములలో జరుగుచున్నపరిచర్య దేవుని కార్యమే కాని నేను చేసినదికాదని నేను ఎల్లప్పుడు చెప్పుచుందును. ఆయన పంపిన చోటకు నేను వెళ్లి మరియు ఆయన చెప్పినదానిని ప్రకటించుటకు నేను అందుబాటులో ఉండెదను. సమస్యలను పరిష్కరించుటకు మరియు ఇబ్బందికరమైన వారిని నిర్వహించుటయు ఆయన పనియైయున్నది. చెప్పింది చేసే సేవకుడిగా ఉండుట, యజమానిగాఉండుట కంటే ఎంతో సులభము. ''దేవుడు అన్నిటిని నిర్వహించే శ్రీమంతుడు'' (1 తిమోతి 6:15).
మోసము - అంత్యకాలములకు ఒక గుర్తు:
మనము మెలకువగా లేనియెడల, ప్రభువుయొక్క రెండవ రాకడకుముందుగా మోసపోయే అవకాశమున్నదని ప్రభువైనయేసు శిష్యులను హెచ్చరించెను (మత్తయి 24:4). ఈనాడు క్రైస్తవ్యములో ఎంతో మోసమున్నది మరియు ప్రభువైన యేసు నామములో జరుగుచున్న దానంతటిని లేక పరిశుద్ధాత్మ పరిచర్య అని చెప్పుచున్నదానంతటిని మనము స్వీకరించకూడదు. దేవునివాక్యముతో ప్రతి దానిని పరీక్షించుము. లేనియెడల మీరు మోసపోయెదరు. గృహముల మధ్యను మరియు దేశముల మధ్యను గొడవలు మరియు యుద్ధములు జరుగును కాబట్టి మీ హృదయములలో ఎంతమాత్రము ద్వేషము ఉండకూడదు. ఎందుకనగా అది కొంచెము నరకమును మన హృదయములోనికి తెచ్చును.
మీరు వెలుగులో నడిచినయెడల, మీలోవున్న పాపములమీద మీరు వెలుగు పొందెదరు. అప్పుడు వాటిని జయించుటకు కావలసిన కృప కొరకు దేవునికి ప్రార్థించవచ్చు. మనము వెలుగులో నడుచుచున్నామనుటకు, ఇంతకుముందు తెలియనిపాపముల మీద అంతకంతకు వెలుగు పొందుటయే ఋజువు. (1 యోహాను 1:7)లో స్పష్టముగా ఉన్నది, ''అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును''. అప్పుడు మాత్రమే దేవునితో సహవాసము కలిగియుండెదము.
నోవహు దినములవలే అంత్యదినములుండును. లోకములో వ్యభిచారము మరియు హింసవిస్తరించును, ఈనాడు లోకమంతయు ఆ విధముగా వెళ్ళుచున్నది కాని అంత్యదినములలో నోవహు వంటివారు మరియు అతనివంటి కుటుంబములు ఉండును. దేవునికి స్తోత్రము కాబట్టి మనము నోవహువలే ధైర్యముగాను రాజీపడనివారముగాను, నీతిమంతులముగాను, వెల చెల్లించవలసినప్పటికి మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టవలెను. ఇతరులు మనలను పిచ్చివారిగా ఎంచవచ్చును కాని ఒకరోజు మనము యేసుని చూచినప్పుడు అది ఎంతో విలువైనదిగా ఉండును.
''మనము పేరు సంపాదించుకొనెదము రమ్మని'' అనే నినాదముతో కట్టబడునదే బబులోనుక్రైస్తవత్వం (ఆదికాండము 11:4). దేవుడు తనయొక్క శక్తిని, జీవమును, స్వభావమును మరియు ఆయన యొక్క వరములను మనకు ఇచ్చును. కాని ఆయన మహిమను ఇవ్వడు (యెషయా 42:8). దేవునికిచెందిన మహిమను ముట్టుట అనగా, స్వాభావికముగా (అందము, తెలివితేటలు, సంపద మొదలగునవి) ఉన్న వాటిని బట్టి అతిశయించుట లేక కృపద్వారా పొందిన ఆత్మీయతను బట్టి దేవుని సత్యమును ఎరుగుటను బట్టి వరములను బట్టి గర్వించుట గొప్పపాపము. మనకు తెలియకుండానే అనేకసార్లు దేవుని మహిమను ముట్టెదము గనుక ఎల్లప్పుడు మారుమనస్సు పొందుచుండవలెను.
సంఘము: దేవుడు తనయొక్క హృదయానుసారులైన కాపరులను ఒకనిజమైన స్థానిక సంఘమునకు ఇచ్చును. అది అద్భుతమైన ఆశీర్వాదములలో ఒకటి (యిర్మీయా 3:14,15). ప్రభువైనయేసు ఆజ్ఞాపించిన విధముగా, దేవుడు అటువంటి కాపరులను నా దేశములో లేపవలెనని ప్రార్థించవలెను (మత్తయి 9:36-38). మీ కంటే చిన్నవారికి సహాయపడిన యెడల మీరుకూడా అటువంటి కాపరులుకాగలరు. మీకంటే చిన్నవారితో స్నేహము చేయుచు మరియు వారిని ప్రభువునొద్దకు ఆకర్షించవలెను. ఆ విధముగా మీరు దేవునికి హృదయానుసారులైన కాపరులగుదురు.
దేవునియొక్క రాజ్యమునకును మరియు ఒకరోజు ప్రభువైన యేసు ఈ భూమిమీద చేసే పరిపాలనకును మరియు పరలోకమునకును సంఘము నమూనాగా ఉన్నది. జీవమునిచ్చే ఆత్మ మనలో సమృద్ధిగా నివసించునట్లు, ఆదామునుండి మనము పొందిన దానంతటిని మరణమునకు అప్పగించవలెనని సంఘములో ఎల్లప్పుడు బోధించవలెను.
పక్రటన 3:20లో, ప్రభువైన యేసు మనలోనికి వచ్చి, మనతో భోజనము చేయుటకు హృదయమనే తలుపును తట్టుచున్నాడు. మనము ఆయనతో కలసి తినవలెననియు మరియు త్రాగవలెననియు కోరుచున్నాడు. మనము రొట్టె విరిచినప్పుడు, ప్రభువును మరియు ఆయన సంఘమును ఎంతో అవసరమని ఎల్లప్పుడు సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు మాత్రమే మన అవసరమైయున్నాడని ఒప్పుకొనుచున్నాము.
పరిసయ్యతత్వమును జయించుటకు మూడు మార్గములు:
1. నీ బాహ్య జీవితముకంటే అంతరంగ జీవితముగురించి శ్రద్ధ వహించుము.
2. ఎప్పుడైనను లేక ఎవరినైనను తృణీకరించవద్దు లేక చిన్నచూపు చూడవద్దు.
3. యేసును మాత్రమే కోరుకొనుము.
మీరు ఎల్లప్పుడు వీటిని చేయుచున్నయెడల, మీరు ఎన్నటికి పరిసయ్యులుగా మారరు.
మన శరీరములను సజీవయాగముగా సమర్పించుట-ఆత్మ సంబంధమైన ఆరాధన:
పౌలు తిమోతితో ఇట్లన్నాడు, ''నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము'' (2 తిమోతి 1:14). ఈ భూలోకజీవితములో దేవుడు మనకు అనుగ్రహించిన శరీరములను దేవుని కొరకు భద్రపరచుకొనవలెను. ఈ భూమిమీద మన జీవితయాత్రముగిసే వరకు మన శరీరములు పాపమునుండి కడగబడి మరియు పరిశుద్ధతలో కాపాడుకొనుటకు ప్రతి దినము దేవునికి సమర్పించుకొనవలెను. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ: ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు తీసుకొనిపోవుటకు ఒక కంపెనీవారు నీకు 50,000,00 రూపాయలు ఇచ్చియున్నారు. కాని దానిలో మనము కొంత వృథాగా ఖర్చుచేసి మరియు మిగతావి పోగొట్టకొనియున్నాము. ఇప్పుడు ఓడిపోయిన మనము మారుమనస్సు పొంది ప్రభువుదగ్గరకు వచ్చియున్నాము. అప్పుడు ప్రభువు ఏమి చేయును? ఆయన మనలను తృణీకరించడు దానికి బదులుగా మనలను క్షమించి మరియు మరొక 50,000,00 రూపాయలు మనకు అనుగ్రహించి మరియు జీవితాంతము కాపాడవలెనని చెప్పియున్నాడు. మన దేవుడు ఎంతమంచివాడు.
లోకస్థులకంటే క్రైస్తవులమైన మనము నైతికముగా ఉన్నత స్థితిలో జీవించవలెను. చెడుగా కనబడే దానిని కూడా మనము చేయకూడదు. మనకు ఏవిషయమైనా అనుమానమున్నయెడల మనము జాగ్రత్తపడి మరియు విచక్షణతో వ్యవహరించవలెను.
దేవునిని మాత్రమే కోరుకొనుట:
రహస్యస్థలములలో దేవునియెదుట నివసించుచు మరియు ఆయనకొరకు దప్పికతో మొరపెట్టుచుండవలెను. దేవునికొరకు ఈ దప్పిక కోల్పోయినయెడల క్రైస్తవత్వము శూన్యమై ఎండిపోవును. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనైనను దేవునికొరకు మాత్రమే దప్పిక కలిగియుండవలెను. అది మీ విశ్వాసములో ప్రాముఖ్యమైయున్నది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవునికొరకు మన ప్రాణము ఆశపడవలెను. లోకస్థులు నిరాశలు అని పిలిచే అనుభవములను మన మేలుకొరకు దేవుడు అనుమతించును. కాని ఇవి మన మేలు కొరకు దేవుడు అనుమతించే మంచి విషయములు. ఇటువంటి అనుభవము గుండా మనం వెళ్ళనట్లయితే, ఇతరులను మనము ప్రోత్సహించలేము. లోకములో 99.9 శాతం ఓడిపోయిన వారితో నిండియున్నారు గనుక మనం ఓడిపోవుట కూడా దేవుడు సంకల్పమై ఉన్నది. ఆవిధముగా వారికి సహాయపడగలము. ఓడిపోవుటకుగల రెండు కారణములు 1. మనలను దీనులుగాచేయుటకు (విరుగగొట్టబడుట).
2. ఇతరులయెడల కనికరము కలిగియుండుటకు.
మీఆత్మీయ పోరాటము కూడా ఆత్మీయఎదుగుదల కొరకే. భూసంబంధమైన వాటికొరకే మనము ఎంతోకష్టపడిన యెడల పరలోక సంబంధమైన నిత్యమైనవాటికొరకు ఎంతో ఎక్కువ కష్టపడవలసియుంది. కాలము కొద్దిగానే ఉన్నది మరియు చెడ్డ దినములలో ఉన్నాము. భూసంబంధమైన వాటికొరకు మనము వెదకునప్పుడు కూడా పరలోక సంబంధమైన మనస్సు కలిగియుండవలెను. ఎల్లప్పుడు మిమ్మును మీరు తీర్పుతీర్చుకొనుచూ మరియు ఎల్లప్పుడు అంతరంగములో ప్రభువుతో జీవించాలి.
ప్రభువు ఎల్లప్పుడు మీకు ఆయన చిత్తమే కేంద్రముగా ఉండునట్లు ఆయన మిమ్మును కాపాడును గాక. మరియు మీ చదువులు మరియు వివాహములు మొదలగు ముఖ్యమైన విషయములలో ఆవిధంగా చేయునుగాక. మీ జీవితములలో ముఖ్యమైన నిర్ణయములు తీసుకొనునప్పుడు తొందరపడి నిర్ణయము తీసుకొనకుండుట ఒక నియమముగా ఉండవలెను.
కనికరము మరియు కఠినత్వము (లీగలిజము):
నిన్నటి మన సంఘకూటములో ఒక వ్యభిచారిని విలువైనఅత్తరుతో ప్రభువు పాదములు కడుగుటను గూర్చి చెప్పాను (లూకా 7:37,38). బహుశా ఆమె వ్యభిచారము చేసి ఆ అత్తరును సంపాదించవచ్చును. ఒక వ్యభిచారి యొక్క వ్యభిచారములో సంపాదించిన డబ్బును నిషేధించాలని ప్రభువైన యేసుకు తెలియును (ద్వితీయోపదేశకాండము 23:18). అయినప్పటికిని ఆయన లీగలిస్టు కాదు గనుక ఆమెను సంతోషముతో అంగీకరించెను. ఆయన ఆమె హృదయమును చూచెను.
నీ క్రియలకంటే ఎక్కువగా దేవుడు నీ హృదయమును చూచును. ఇటువంటి పరిస్థితులలోనే పరిసయ్యులు (మొదటి శతాబ్దములో మరియు 20వ శతాబ్దములలో) బయలు పరచబడుచున్నారు. మరియు యథార్థమైనవిశ్వాసులను విమర్శించుట కూడా బయలు పరచబడుచున్నది. ఒక వ్యభిచారి యొద్దనుండి పరిసయ్యులు ఎన్నటికి బహుమానము స్వీకరించరు. ప్రభువుయొక్క హృదయము వారి హృదయములకంటే ఎంతో విశాలమైనది.
సముద్ర విశాలము వలె, దేవుని దయలో ఎంతో విశాలలత ఉంటుంది;
ఆయన న్యాయములో కనికరము ఉంటుంది, అది స్వాతంత్య్రం కంటే గొప్పది;
మన మనస్సు కంటే దేవుని ప్రేమ ఎంతో విశాలమైనది;
మరియు నిత్యుడగు దేవుని హృదయం అత్యద్భుతమైన కనికరం గలది.
కాని మన తప్పుడు పరిమితుల ద్వారా ఆయన ప్రేమను ఎంతో కుదింపజేస్తాము;
మరియు ఆయన యొక్క క్రమశిక్షణను ఎక్కువ చేసి చూపిస్తాము
దీనిని మనం ఎప్పుడూ మరచిపోకూడదు.
ధనాపేక్షనుండియు మరియు వ్యభిచారము నుండియు విడుదల పొందుట:
ప్రభువు యొక్క మరణమును రెండు విధములుగా ప్రకటించవలెను - ఒకటి, క్రీస్తు మనకొరకు మరణించాడు మరియు రెండవది మనము క్రీస్తుతో కూడా మృతిపొందియున్నాము. ఈ రెండువిషయములను మనము అంగీకరించి వీటిని మన అనుభవపూర్వకముగా జీవించినయెడల అర్థవంతముగా రొట్టెవిరుచుటలో పాలుపొందగలము. మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించెను. కాబట్టి మనము ప్రతిపాపమును తీవ్రముగా తీసుకొనవలెను. కొండమీద ప్రసంగమును మనము జాగ్రత్తగా చదివినయెడల ఎవరైతే ఇతరుల మీద కోపము పెట్టుకొని జీవించెదరో మరియు ఎవరైతే మోహపుచూపులు చూస్తూ జీవించెదరో, అటువంటి వారు నరకానికివెళ్ళే అవకాశమున్నదని చెప్పారు. రెండవది పాపము చేయకుండుటకు మనము గుడ్డివారు కావలెనని ప్రభువు చెప్పారు. కాని ఈ పాపమునిమిత్తము మనము మారుమనస్సు పొంది ఒప్పుకొనినయెడల క్రీస్తురక్తము ద్వారా ప్రతిపాపము క్షమించబడును. కాని ఈ పాపములు ఎంత తీవ్రమైనవో మనము తెలుసుకొనవలెను. ఈ పాపములు మనలను నరకమునకు తీసుకొనివెళ్ళే అపాయము ఉన్నదని గుర్తించితేనే మనము విడుదల పొందగలము. మరియు ఈ పాపముల నిమిత్తమే మన రక్షకుడు సిలువమీద శ్రమపడి మరణించాడు. ఈ పాపములు మనము తీవ్రముగా తీసుకొనినప్పుడు మాత్రమే దేవుని వాక్యము తీవ్రముగా తీసుకొనియున్నామని చెప్పగలము.
స్త్రీలను మోహపుచూపుతో చూచుటను మీరు తీవ్రముగా తీసుకొని మరియు దానిని జయించుటకు కృపకొరకు దేవునికి ప్రార్థించవలెనని మీ కొరకు నేను దేవునిని ప్రార్థించుచున్నాను. ఈ గొల్యాతును మీరు చంపినయెడల (1 సమూయేలు 17:51) చెప్పినరీతిగా మిగిలిన ఫిలిష్తీయులందరు పారిపోయెదరు.
డబ్బును మీరు దేవుడుగా చేసుకొనకుండునట్లు మీ కొరకు ప్రార్థించుచున్నాను. ఎందుకనగా అది చివరకు మిమ్ములను నాశనముచేయును. ప్రపంచములోని దాదాపు ప్రతిఒక్కరు డబ్బును మరియు లైంగికవాంఛను మరియు ఘనతను కోరుచున్నారు. మీరు వెలుగుగా ఉండవలెనని కోరినయెడల, మీరు వీటిని వెదుకుటనుండి విడుదల పొందవలెను. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించినప్పుడు దేవునిరాజ్యమును మొదటిగా వెదుకుట గురించి జాగ్రత్తపడుడి. క్రీస్తుయొక్క సాక్షులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి కాని ఈ లోకములో ధనవంతులుగాగాని గొప్పవారిగా ఉండుటకుగాని పిలువబడలేదు. మీ యొక్క సంపద విషయములోను మరియు ఘనతవిషయములోను దేవుడిని అప్పగించుము. దానిని ఆయన నిర్ణయించును. మరియు ఆయన బిడ్డలకు వేరువేరుగా అనుగ్రహించెను కొందరు దేవుని బిడ్డలు ధనవంతులై ఘనత పొందుచున్నారు. మిగిలినవారు బీదలై ఉండి అవమాన పరచబడుచున్నారు.
నిత్యత్వపు విలువలతో ఎల్లప్పుడూ జీవించుడి:
ప్రభువైన యేసు పాపము తన హృదయములో ప్రవేశించకుండునట్లు ఎల్లప్పుడు జాగ్రత్తపడియున్నాడు గనుక తండ్రి ఎల్లప్పుడు ఆయన ప్రార్థనలు వినియున్నాడు.
ఒకశోధన పాపములోనికి ఈ విధముగా నడిపించును:
1. శోధన మొదటిగా మన మనస్సులో ఆలోచనగావచ్చును (అక్కడనుండి అది హృదయములోనికి ప్రవేశించును)
2. అది హృదయములోనికి దిగివచ్చును (అప్పుడు అది పాపమగును). (అక్కడ నుండి శరీరము ద్వారా పాపము బయలుపరచబడును)
3. నాలుక ద్వారాను, కళ్ళద్వారాను చేతులద్వారాను మొదలగువాటి ద్వారా పాపము బయలుపడును (దీనిని ఇతరులు చూడగలరు)
ప్రభువైనయేసు శోధించబడియున్నారు. కాని రెండవ మెట్టు ఆయన ఆపియున్నాడు. కనుక ఆయన ఒక్క పాపము కూడా చేయలేదు.
కృపకు మూలమగుఆత్మను మరియు విజ్ఞాపనచేసే ఆత్మను మన మీద కుమ్మరించి, మనము ప్రభువైనయేసుని గాయపరిచినందుకు దు:ఖించునట్లుచేయమని ప్రార్థించవలెను. గతములో మనము శోధనను అనుమతించి పాపము చేసి ఆయనను గాయపరచినందుకు దు:ఖపడవలెను (జెకర్యా 12:10). పాపములు గురించి పశ్చాత్తాపపడువారందరికి ప్రభువు అనుగ్రహించుఆదరణను మీకును అనుగ్రహించునుగాక.
కాల్వినిజం మరియు అర్మినియనిజం:
కాల్వినిజం మరియు అర్మినియనిజం గురించి కొన్ని విషయములు ఇక్కడ ఉన్నవి. ఒక స్విట్జర్‌లాండ్ క్రైస్తవుడైన జాన్ కాల్విన్ (1509-1564) వారి యొక్క ఐదు విషయములు సమీపముగా చెప్పుచున్నాడు.
1. మాలిన్యంతో నిండియుండుట: దేవుని సహాయం లేకుండా మారుమనస్సు పొందలేము అని వారు చెప్పెదరు. మారుమనస్సు పొందవలెనని మనము ఎవరిని అడుగము. పేతరు మరియు పౌలు దీని గురించి ఏమందురు?
2. షరతులు లేకుండా ఎన్నుకొనబడుట: మానవుడు ఏ షరతునైనను నెరవేర్చకుండానే, దేవుడు తన పిల్లలను ఏర్పరచుకొనియున్నాడు. అట్లయినచో నరకానికి వెళ్ళేవారిని నిందించలేము.
3. పరిమితిగల బలిఅర్పణ: క్రీస్తు అందరి కొరకుకాదుగాని ఏర్పరచబడినవారి కొరకే మరణించాడు. కాని 1 యోహాను 3:2 ప్రభువైన యేసు సర్వలోకముకొరకు మరణించెనని వ్రాయబడియున్నది.
4. ఎదిరించలేని కృప: దేవునిచేత ఏర్పరచబడిన వారు దేవుని పిలుపునుగాని మరియు ఆయనకృపనుగాని ఎదురించలేరనియు మరియు నిశ్చయముగా రక్షించబడుదురనియు వారు చెప్పుదురు. ఇవి మానవున్ని ఒక బొమ్మలాగా చేసి మరియు క్రొత్తనిబంధనలో చెప్పిన స్వచిత్తమునకు వ్యతిరేకముగా ఉండును.
5. పరిశుద్ధులు కాపాడబడెదరు: ఒకవ్యక్తి ఒకసారి రక్షణపొందిన తరువాత అతడు రక్షణ పోగొట్టుకొనడని చెప్పెదరు. కాని హెబీ 3:14 విశ్వాసమును అంతము వరకు చేబడితేనే క్రీస్తులో పాలివారమగుదమని చెప్పుచున్నది. మరియు పక్రటన 3:5లో విశ్వాసులు జయించనియెడల జీవ గ్రంథమునుండి వారిపేర్లు తీసివేయబడును అని ప్రభువు చెప్పాడు.
పైన ఉన్న ఐదు విషయములను నమ్మెడివారిని హైపర్ కాల్వినిస్టులు అనెదరు. ఇవి దేవుని వాక్యానికి విరోధముగాఉన్నాయి గనుక నేను వాటిని నమ్మను.
ఆర్మీనియనులు (యాకోబు ఆర్మీనియనుల యొక్క అనుచరుడు అతడు ఒక డచ్ క్రిష్టియన్ (1560-1609). మానవునికి స్వచిత్తము ఉన్నదనిచెప్పి మరియు పైనున్న వాటిని అంగీకరించదు.
దేవుడు సార్వభౌమాధికారి అని బైబిలు చెప్పుచున్నదని హైపర్ కాల్వినీయనులు చెప్పినట్లు కాదు. సత్యమును ఒక ప్రక్కకు తీసుకొనిన యెడల తప్పు జరుగను. దేవుడు మనలను ఏర్పరచుకొనియున్నాడా లేక మనము దేవునిని ఏర్పరచుకొనియున్నామా? రెండూ నిజమే. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి మనలను ఏర్పరచుకొనియున్నాడు (1 పేతురు 1:1,2). అనగా దేవుడు నిత్యత్వమంతయు ఎరిగినవాడై వారిని ఏర్పరచుకొనెను.
చార్లెస్ సిమియోను (ఇంగ్లండుకు చెందిన ఒక క్రైస్తవుడు, 13వ శతాబ్దము) ఈ విషయంగురించి ఈ విధంగా చెప్పెను. ''ఒక సత్యము సమతుల్యము కలిగియుండును. అది మద్యస్తముగా చాలా తక్కువగా ఉండును. సత్యము రెండు ప్రక్కలను పట్టుకొనియుండును!! అతడు దీనిని చాలా మంచిగా వివరించాడు.
కాబట్టి నేను దేవుని సార్వభౌమాధికారమును మరియు మనుష్యులందరికి దేవుడు అనుగ్రహించిన స్వచిత్తమును నేను నమ్మెదను. కాబట్టి నేను బోధించునప్పుడు వారి స్వచిత్తమును దేవునికి సమర్పించుకొనమని ప్రజలను సవాలు చేసెదను. కాని నేను ప్రార్థించునప్పుడు, దేవుడు సర్వశక్తిగలవాడై యుండి సమస్తమును చేయగలడనియు మరియు ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదని నమ్ముతాను. ప్రపంచములను సృష్టించకముందు నిజముగా దేవుడు మనలను ఏర్పరచుకొనియున్నాడు. ఈ వాస్తవము మనలను దీనుడిగా చేయును. అంతమువరకు సహించినవాడే రక్షించబడునని ప్రభువైనయేసు చెప్పిన మాటలను మనము నమ్మెదము (మత్తయి 24:13). దేవుడు మనలను ఏర్పరచుకొనుటను మనకున్న స్వాతంత్య్రము గురించి పూర్తిగా గ్రహించలేము కాని మనము విశ్వసించవలెను.
జాన్‌వెస్లీ ముఖ్యముగా అర్మీనియునిగా ఉన్నాడు. కాని అతని సమకాలికుడైన జార్జ్ విట్ ఫీల్డ్ ప్రాముఖ్యముగా కాల్వీనియుడైయున్నాడు. వారిద్దరు కలిసి పరిచర్య చేయనప్పటికిని వారిద్దరు ఒకరినొకరు గౌరవించుకొనిరి. వారిద్దరును దేవునిచేత ఆశీర్వదించబడి, 13వ శతాబ్దములో ఇంగ్లండులో గొప్ప ఉజ్జీవముతెచ్చారు. వారియొక్క కూటములకు బోధ వినుటకు అనేక వేలమంది వచ్చెడివారు. జార్జ్‌విట్‌ఫీల్డ్ మరణించినప్పుడు, అతనియొక్క కోరిక చొప్పున జాన్‌వెస్లీ మాట్లాడియున్నాడు. అతనిని సమాధిచేసిన తరువాత వెస్లీని వెంబడించేవారు, విట్‌ఫీల్డ్‌ని పరలోకములో చూచెదమా అని అడిగిరి. అప్పుడు వెస్లీ ఇట్లనెను, ''కాదు'' చెప్పి దానికి కారణము ఏమనగా, ''దేవునియొక్క మహిమలో జార్జ్‌విట్ పీల్డ్ గొప్ప ప్రకాశమైన నక్షత్రమువలెఉండి మరియు దేవుని సింహాసనమునకు అత్యంతసమీపముగా నిలిచియుండును. కాని నాలాంటి అల్పులైనవారు అతని మహిమను ముట్టుకొనలేరు''. ఇదియే క్రైస్తవ దీనత్వము. తీర్పుదినమందు దేవుడు మనయొక్క సిద్ధాంతములను పరీక్షించడుగాని మన హృదయములను మన జీవితములను పరీక్షించును.
వివేచనలో ఎదుగుట:
అనేకమంది క్రైస్తవులు ఉజ్జీవములని చెప్పుచున్నవి నిజముకాదని మీరు వివేచించుచున్నందుకు నాకు సంతోషముగా ఉన్నది. క్రైస్తవకూటములలోను మరియు క్రైస్తవ బోధనలలోను ఉన్నటువంటిది మానసికమైనదా లేక ఆత్మీయమైనదా అని మీరు వివేచించవలెను. మంచిగా కనబడేదానంతటినీ మీరు గ్రుడ్డిగా వెంబడించవద్దు. ''సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి'' అని మనము ఆజ్ఞాపించబడియున్నాము (అనగా దేవునిలోనుండి వచ్చునది) (1 థెస్సలో. 5:21).
గత సోమవారం సహోదరుల కూటమిలో వివేచనలో ఎదుగుట యొక్క అవసరము గురించి మాట్లాడియున్నాము. మీ ప్రేమ తెలివితోను మరియు వివేచించుటలోను అభివృద్ధి పొందవలెనని పౌలు ఫిలిప్పీయులకొరకు ప్రార్థించెను (ఫిలిప్పీ 1:9). పరలోకములోని దూతలను చూచియున్నామని కొందరు గర్వముతో చెప్పుచున్నారు. కాని సాతాను వెలుగుదూత వేషం ధరించుకొనినవాడైయున్నాడని గర్తు పెట్టుకొనవలెను (2 కొరింథీ 11:14). కాబట్టి బహుశా వారు దయ్యములను దూతలుగా చూచియుండవచ్చును. దానిలో అతిశయించుటకు ఏమీలేదు. మనము మెలకువగా లేనట్లయితే మోసపోవుదుము. ఎల్లప్పుడు ఆత్మీయముగా మెలకువగా లేనట్లయితే, సలుభముగా పాపములో పడెదము.
సరసాలాడే అమ్మాయిల విషయములో మీరు వెంటనే వివేచించవలెను లేదా వారి ఉరిలో పడెదరు. వారు ఆత్మీయులో కాదో మీరు వివేచించాలి. ఆత్మ సంబంధంగాని క్రైస్తవులతో మీరు సహవాసము చేసినయెడల, క్రమక్రమముగా మీయొక్క ఆత్మీయజీవితం దిగజారుటను చూచెదరు. మీరు బెంగళూరులో ఉన్నప్పుడు వినిన హచ్చరికలను అక్కడ మీరు వినరు. గనుక మరిఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బైబిలులోనుండి పరిశుద్ధాత్మ ద్వారా ఆ హెచ్చరికలను పొందుచుండవలెను. పరిశుద్ధాత్మ మన ఆత్మతో చెప్పుచున్న సాక్ష్యమును బట్టి జీవించినయెడల అనేక అపాయములనుండి కాపాడబడెదరు. మీరు బ్రతుకు దినములన్నియు ప్రభువు మిమ్ములను కాపాడి మరియు ఆయనరాజ్యము కొరకు ఉపయోగకరమైన సేవకులుగా ఆయన మిమ్ములను చేయునుగాక.
మీయొక్క జ్యేష్ఠత్వపు హక్కుకు విలువనిచ్చుట:
మీకు ఏ పనిలేనప్పుడు లేక విసుగుగా (బోరుగా) ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండవలెను. అటువంటి సమయాలలో ఎక్కువగా లైంగికతలంపులు కలుగును. అప్పుడు మీరు వెళ్ళి ఇతర విశ్వాసులతో సహవాసముచేయవలెను లేక బయటకువెళ్లవలెను.
అత్యవసరమయితే తప్ప ఒంటరిగా ఒక అమ్మాయితో కారులో వెళ్ళకూడదు మరియు అది కొద్ది ప్రయాణమై యుండవలెను. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకొనినయెడల భవిష్యత్తులో అనేక చింతలనుండి కాపాడబడెదరు.
దేవాలయశిఖరమునకు వెళ్లి దూకవలెననియు మరియు అప్పుడు దూతలు వచ్చి కాపడెదరనియు సాతాను ప్రభువును శోధించెను కాని ప్రభువు బుద్ధిహీనముగా దేవుని శోధించుటకు నిరాకరించాడు (మత్తయి 4:7). మీరు కూడా అమ్మాయిలదగ్గరకు వెళ్లి దేవుణ్ణి బుద్ధిహీనముగా శోధించవద్దు. మీరు బుద్ధిహీనముగా ఒక అమ్మాయితో తిరుగుచున్నయెడల, మీరు పడిపోకుండా దేవుని యొక్క దూతలు కాపాడెదరని ఊహించుకొనవద్దు. అనేకమంది కావాలని కాదుగాని అనుకోనిరీతిగా ఇటువంటి వాటిలో పడెదరు. కాబట్టి అటువంటి వాటినుండి దూరముగా ఉండుట మంచిది. నేను చెప్పుచున్న దానిని గురించి ఆలోచించండి మరియు ప్రభువు మీకు గ్రహింపును ఇచ్చును.
యౌవనస్థులందరు ఏశావు ఉదాహరణ గురించి ధ్యానించుట మంచిది. అతడు జ్యేష్ఠత్వపుహక్కును పోగొట్టుకొనుటద్వారా యేసయ్యకు ఆదిపురుషుడుగా ఉండే ఆధిక్యతను కోల్పోయాడు. దానికి బదులుగా ఏమి పొందాడు? అతడు గంజి గిన్నెను పొందెను. అతడు అతని జీవితాంతమున, అతడు పొందినదానిని మరియు పోగొట్టుకొనినదానిని చూచుకొని ఏడ్చెను. కాని అప్పటికి ఆలస్యమైంది. ఇవి మన కొరకే వ్రాయబడియున్నవి. అన్ని విషయములలో ఆత్మీయవిలువలను మొదటగా ఉంచవలెను. లోకము దానియొక్క ఘనతలు, దానియొక్క సుఖభోగములు మరియు దానియొక్క సిరిసంపదలు మరియు తెలివితేటలన్నియు గతించిపోవును. దేవుని చిత్తమును జరిగించువాడు. నిరంతరము జీవించవచ్చును (1 యోహాను 2:17).
ఈనాడు అనేక గంజిపాత్రలను సాతాను యౌవనస్థులకు చూపించుచున్నాడు. వాటివలన నష్టము కలుగును గనుక జ్ఞానము గలవారు వాటన్నిటిని తృణీకరించుచున్నారు. మీయెడల దేవునికి ఒక చిత్తము ఉన్నది. దానిని మీరు తీవ్రముగా తీసుకొననియెడల, మీరు సాతానుయొక్క కుయుక్తులలో పడెదరు.
హెబీ 12:17లో తరువాత ఏశావు జ్యేష్ఠత్వపుహక్కు కావాలని కోరినప్పటికి పొందలేకపోయెను. ఇటువంటి ''తరువాతలు'' మన జీవితములో కూడా ఉండును. అటువంటి ''తరువాతలు'' కూడా మీ జీవితముల సంతోషముగా ఉండునుట్ల మంచి నిర్ణయములు తీసుకొనవలెను.
విశ్రాంతి మరియు దీనత్వము:
మత్తయి 11:28-30 వచనాలలో విశ్రాంతి మరియు భారముగురించి ప్రభువైన యేసుచెప్పారు. ఈ మాటలు ఈ విధముగా చెప్పవచ్చును. భూసంబంధమైన విషయములన్నింటిలో మనము విశ్రాంతిలోఉండి మరియు మనహృదయములో ప్రభువు యొక్క కాడిని మోయవలెను. భూసంబంధమైన భారములన్నింటిని మనము ప్రభువుకి సమర్పించనియెడల ప్రభువుయొక్క భారములను మోయలేము (''నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును'' కీర్తన 55:22). తినుటగురించియు మరియు దుస్తుల గురించియు ఎక్కువగా చింతించకుడి. మీరు దేని గురించైనా చింతించవలెనని కోరినయెడల దేవుని రాజ్యము మరియు ఆయన నీతిని గురించి చింతించుడి'' (మత్తయి 6:31,33 పారాఫ్రేజ్).
మీ మనస్సంతయు భూసంబంధమైన వాటిని గురించిన చింతలతో నిండియుండిన యెడల, ప్రభువుకొరకు మీరు సామర్థ్యము కలిగియుండలేరు. భూసంబంధమైన వాటిగురించి మీరు నిశ్చయముగా ఆలోచించవలెను, కాని వాటిగురించి చింతించకూడదు. నిత్యమైన వాటి గురించి మాత్రమే మీ హృదయములలో చింతించవలెను. ఈ విధముగా మనము భూసబంధమైన వారికంటే వేరుగా ఉండెదము. మీ యొక్క పరీక్షలలో పొందే ఫలితములు కూడా నిత్యత్వపు విలువలు కలిగియుండవు. కాని మీరు కష్టపడి చదువవలెను. ఫలితము గురించి చింతించకూడదు.
దేవునిరాజ్యమును ఆయననీతిని వెదుకుటలో 100 శాతం మార్కులు మీరు పొందినయెడల నిత్యత్వములో మీరు మొదటిగా ఉండెదరు. అనేకసంవత్సరముల క్రితము దీనినే నేను నిర్ణయించుకొనియున్నాను. జెఫన్యా 3:17లో జరగబోయే ప్రతివిషయములో దేవుడు నీ యందున్న ప్రేమనుబట్టి శాంతమువహించి నీ కొరకు ప్రణాళికవేయుచున్నాడు'' మరియు ప్రభువు ఈవిధముగా జ్ఞాపకము చేయుచున్నాడు.
''నేను చేయుచున్నవి ఇప్పుడు నీకు తెలియదు గాని ఇకమీదట తెలిసికొందువు'' (యోహాను 13:7).
తల్లిదండ్రులముగా మీ జీవితములలో దేవునివాక్యమను విత్తనము బహుగా విత్తియున్నాము గనుక రాబోవు కాలములో మీరు బహుగా ఫలించెదరని నమ్ముచున్నాము. మొదటిగా ఆత్మీయముగాను మరియు భూసంబంధమైన విషయములలోను దేవుడు మీకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించును. కాబట్టి మీ నలుగురు విషయములలో నాకు ఎటువంటి భయములేదు.
చివరిగా నేను ప్రతీచోట ప్రోత్సహించుచున్నట్లే మీరు కూడా దీనత్వమును వెదకి మీగురించి తక్కువతలంపులు కలిగియుండాలని మిమ్ములను ప్రోత్సహించుచున్నాను. అనగా మీరు దేవుని బిడ్డలుగా ఉన్న ధన్యతనుబట్టిగాని లేక వరములుబట్టిగాని లేక దేవుడు ఇచ్చిన అర్హతలుబట్టిగాని మిమ్మును మీరు తక్కువగా ఎంచుకొనకూడదు. మిమ్ములను ఎరిగినవారు మిమ్మును చూచి దేవునిని మహిమపరచవలెను. మీ చిత్తమును ఉపేక్షించుకొని దేవుని చిత్తము నెరవేర్చినప్పుడే అది జరుగును. అనగా దేవుడు మీకు అనుగ్రహించిన వాటినన్నిటిని బట్టి ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచుటకును మరియు ఆయన ఇచ్చినవాటిని ఆయన మహిమార్థమై ఉపయోగించునట్లు మీరు తీర్మానించుకొనవలెను.
ఏ మానవునిగురించి అయినను వారిలో ఎన్ని పొరపాట్లున్నను, ఎన్ని బలహీనతలున్ననూ ఒక్కసారి కూడా చిన్నచూపు చూడకూడదు. దేవుడు దీనులకే కృపను అనుగ్రహించును. వారు ఆత్మీయముగా ఎంతో అభివృద్ధి చెందెదరు. ప్రభువైనయేసు వలె మీరు కూడా ఎల్లప్పుడూ దీనత్వములో జీవించుదురుగాక.
పరీక్షలలో దేవునియొక్క సహాయము:
నీ యొక్క పరీక్షలలో మీరు మంచిమార్కులతో ఉత్తీర్ణులగునట్లు మీకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించవలెనని మేము ప్రార్థించుచున్నాము. మీరు స్కూలులో చదువుచున్నప్పుడు మీ విషయములలో నేను స్వతంత్రించుకోవలెనని కోరిన ఒక వచనము గుర్తున్నది, ''ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించుతెలివిగలవాడై యుండెను'' (దానియేలు 1:17).
మీరు విశ్వాసముతో దేవునియొక్క వాగ్ధానములు స్వతంత్రించుకొననియెడల వాటిని మీ జీవితములో అనుభవించలేరు. ''మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు'' (యాకోబు 1:5,6) ''మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును'' (మత్తయి 7:11). కాబట్టి చిన్నవిషయములకొరకును పెద్దవిషయములకొరకును మీ తండ్రి అనుగ్రహించిన ప్రతివాగ్ధానమును స్వతంత్రించుకొనుడి.
విజయవంతమైన క్రైస్తవజీవితము:
ఒక అద్భుతమైనకూటములను బెంగుళూరులో ఈ మధ్య కలిగియున్నాము. అందులో చెప్పబడిన కొన్ని అంశములు:
1. క్రీస్తును పోలి జీవించుచూ మనము నమ్మిన సిద్ధాంతమును ఘనపరచవలెను.
2. తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్ముడు ఆదినుండి కలిగియున్నజీవమును మరియు సహవాసమును ముఖ్యమైయున్నవి. అంతేగాని వేరే సత్యములతో మనము కొనిపోబడకూడదు (1 యోహాను 1:3).
3. దేవుడు ప్రభువైనయేసును మృతులలోనుండి లేపినట్టుగానే మనలనుకూడా లేపునని విశ్వసించి ప్రతిదినము మనలను ఉపేక్షించుకొనవలెను.
4. ఈ యొక్క చెడ్డదినములలో యౌవనస్థులు దేవునికొరకు కాపాడబడవలెనని కోరినచో లైంగికవాంఛ మరియు ఆత్మీయగర్వము అను గొల్యాతులను జయించవలెను. ఐగుప్తు కప్పలతో నిండియుండునట్లు అపవిత్రమైన ఆత్మలతో నింపబడియున్నది. మన పడక గదులలో గాని లేక మన మనస్సులలోగాని కప్పలు ఉండకూడదు (పక్రటన 16:13).
5. ధనాపేక్ష రహస్యముగా మనుష్యులను దేవునియొద్దనుండి దూరము చేయును. దానిని మనము ప్రేమించినయెడల దేవునిని ద్వేషించెదము. మనము దానిని గట్టిగా పట్టుకొనినయెడల దేవునిని విసర్జించెదము (లూకా 16:13). ధనవంతులగుటకు అపేక్షించువారు అనేక నష్టములలోను మరియు బాధలలోనుపడుదురు. కాని ధనవంతులైనవారు కాదు లేక ధనవంతులగుచున్నవారు కాదు. కాని ధనవంతులగుటకు అపేక్షించువారు నష్టపోయెదరు. కాబట్టి ధనాపేక్షలో ఉన్న శక్తిని మనము ఎరిగియుండవలెను.
6. దేవునిలో విశ్వాసముంచుటమాత్రమే దేవునికొరకు మనము చేసే పనైయున్నదని ప్రభువు చెప్పారు (యోహాను 6:28,29). అనగా ప్రతిపరిస్థితులలోను, ప్రతిసమయములోను, దేవుడు ప్రపంచములో జరుగుచున్నసమస్తమును నిర్వహించగలడనియు కాబట్టి ఆయా సమయములలో మన అవసరమంతటిని ఆయన తీర్చగలడనియు ప్రభువైన యేసునందు విశ్వాసముమాత్రమే ఉంచవలెనని దేవుడుకోరుచున్నాడు. మనము మంచివారమైతేనే దేవుడు మనలో పనిచేయునని మనము తలంచెదము. కాని 10వేల సంవత్సరాలలో కూడా మనము మంచివారముకాలేము. కాబట్టి ఆయనను నమ్మువారికి మాత్రమే దేవుడు తన వాగ్ధానములు నెరవేర్చును. ఎవడైనను మరొకసువార్తను ప్రకటించినయెడల అతడు పరలోక దూతలవలె పరిశుద్ధుడైనప్పటికిని శాపగ్రస్తుడగును (గలతీ 1:8,9). అందువలన కేవలము విశ్వాసము ఉంచుటద్వారా మాత్రమే మనము పరిశుద్ధాత్మను పొందెదము. మరియు ఆత్మ సంబంధమైన ప్రతీఆశీర్వాదమును పొందెదము.
7. మనము మేలైనను కీడైనను చేయకముందే అనగా జగత్తుపునాది వేయబడకమునుపే ఆత్మసంబంధమైన ప్రతీఒక్కఆశీర్వాదమును క్రీస్తులో మనకు అనుగ్రహించవలెనని దేవుడు నిర్ణయించియున్నాడు (రోమా 9:11). అందువలన ఇప్పుడు మన విషయములో దేవుడు తన మనస్సు మార్చుకొనడు.
మీరు బెంగుళూరులో నున్న కూటములకు రాలేకపోవుటవలన చాలా పోగొట్టుకొనుచున్నారని అప్పుడప్పుడు ఆలోచించెదము. ఆ సమయములో మీరు ఇక్కడ ఉండవలెనని నేను కోరియున్నాను. కాని మీరు చదువుచున్న కాలేజీలో మీరు చదువుటకు ప్రభువు ద్వారము తెరచియున్నాడు. కాబట్టి మీరు అక్కడ ఉన్నప్పటికిని మీ భాగము పొందుటకు ప్రార్థించుచున్నాను. మీరు ఆయనను వెదకినయెడల, మీరు ఎంతో దూర ప్రాంతములలో ఉన్నప్పటికిని, ఎల్దాదు మరియు మేదాదు అనువారు ప్రత్యక్షగుడారమునకు ఎంతో దూరమున ఉన్నప్పటికి దేవుడు ఆయన ఆత్మను వారియొద్దకు పంపినట్లు, మీరు కూడా మీ భాగమును పొందెదరు (సంఖ్యాకాండము 11:24-30). ప్రభువు మరలావచ్చు పర్యంతము ఆయన మిమ్ములను ఆశీర్వదించి మరియు మిమ్మునుకాపాడి మరియు ఎల్లప్పుడు ఆత్మీయముగా తాజాగా ఉండునట్లుచేయును గాక.
మీ జీవితములో ప్రతివిషయమును దేవుడు ప్రణాళిక వేసియున్నాడు:
మనము పరలోకము వెళ్ళినప్పుడు భూమిమీద మనము చేసిన ప్రయాణములన్నిటిలో దూతలు మనలను ఏవిధముగా కాపాడియున్నారో చూచెదము. అంత్యదినమందు మన జీవితమంతయు వీడియో టేపులో చూచినప్పుడు, కొన్ని వేలమందిదూతలు మనకు సహాయపడెదరని కృతజ్ఞతలు చెప్పెదము. ఇప్పుడు కూడా రోడ్డుమీద కొన్ని ప్రమాదములనుండి కాపాడబడినప్పుడు మనకు తెలియదు. కాని ఆ రోజున మరికొన్ని ప్రమాదములనుండి రక్షింపబడియున్నామని కనుగొనెదము, కాబట్టి కృతజ్ఞత కలిగియుండుము.
మనమేలు కొరకే సమస్తముసమకూడి జరుగుచున్నవి. కొన్ని సంవత్సరముల క్రితము నాకు ప్రమాదము జరిగినప్పుడు నేను ఇట్లు అన్నాను, ''ప్రభువా, సిలువమీద నీవు నాకు చేసి ముగించిన దానిఅంతటి కొరకు నేను పూర్తిగా కృతజ్ఞతలు చెల్లించలేదు. కాబట్టి నేను కృతజ్ఞతలు చెల్లించుటకు కొంతసమయము దయచేయుము''. అప్పుడు నేను ఈ విధముగా తలంచితిని, ''ప్రభువు మనకొరకు సిలువమీద చేసిన దానికొరకు ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగియుండవలెను''.
ప్రతీవిషయములో దేవునికి ఒక సంకల్పంఉన్నది. యాకోబు గురించి ఈ విధముగా చెప్పబడింది. ''విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చెతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను'' (హెబీ 11:21). ఆ చేతి కఱ్ఱ ప్రతివిషయము కొరకు నిస్సహాయముగా దేవునిపై ఆధారపడుటను చూపించుచున్నది. ఆ విధముగా అతడు ఇశ్రాయేలుగా మారెను. ఆ విధముగా అతడు యువరాజుగా దేవునియెడలను మనుష్యులయెడలను శక్తి కలిగియున్నాడు. ఆ వచనములో చెప్పినట్లుగా మనము బలహీనులమైనను ఇతరులకు ఆశీర్వాదముగా ఉండగలము. మీరుకూడా అటువంటి అనుభవమును కొంత పొందుకొని, దేవునిమీద మాత్రమే మీరు ఆధారపడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీ యొక్క మానవబలమును విరుగగొట్టబడనీయుడి.
దేవుడు మన జీవితములో ప్రతివిషయము సంకల్పించియున్నాడు. సాతాను ప్రభువైనయేసు మీద దాడిచేయునట్లు అనుమతించినట్లే, మిమ్మును కూడా సాతాను దాడి చేయునట్లు దేవుడు అనుమతించును. ''మీకు జరుగుతున్నదంతయు దేవుడికి తెలియును'' (యోబు 23:11 లివింగు). మీరు క్లిష్టపరిస్థితులలో వెళ్ళుచున్నప్పటికిని ఆయన సమస్తము సమకూర్చిజరిగించును (రోమా 8:28). కాబట్టి దానిలో ఆదరణపొందుడి. మానవుల యొక్క సహాయము వ్యర్థమని మీరు కొనుగొనినప్పుడు దేవునిమీద మాత్రమే ఆధారపడే మంచి అవకాశము కలుగుతుంది. ఆ విధముగా ఆత్మీయముగా వృద్ధి పొందెదము. సి.టీ. స్టడ్ ఒకసారి ఈ విధముగా చెప్పాడు. ''నేను దేవునియొక్క అద్భుతములు చూడగలుగునట్లు కష్ట పరిస్థితులను ప్రేమించుచున్నాను''.
దేవుడు మనలను ఏర్పరచుకొనియున్నాడనియు, ఆయన ప్రియకుమారుని రక్తము ద్వారా మనలను కొనియున్నాడనియు, మనము దేవునియొక్క సొత్తుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడియున్నామనియు గుర్తించినప్పుడు మనకు గొప్పవిడుదల కలుగుతుంది (ఎఫెసీ 1:1-13). దేవుని కృపద్వారా మాత్రమే మనము సంపూర్ణరక్షణ పొందుచున్నాము. మనము ''అవును'' అని చెప్పేవరకు దేవుడు వేచియుండి మరియు చెప్పిన తరువాత సమస్తమును జరిగించియున్నాడు (ఎఫెసీ 2:1-8). మనము కేవలము రోబోట్‌లు కాదు గనుక మనము ఆయనను అనుమతించే వరకు ఆయన మనలను రక్షించలేడు.
దేవునియొక్క స్వరమును మరియు సాతానుయొక్క స్వరమును వేరుచేయుట:
ప్రభువైనయేసును సిలువయొద్దకు వెళ్ళవద్దని మంచి మనస్సుతో పేతురు చెప్పాడు కాని అది సాతానుయొక్క సలహా అని ప్రభువు వెంటనే గుర్తించి మరియు పేతురుతో ఇట్లు అన్నాడు, ''సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని'' పేతురుతో చెప్పెను (మత్తయి 16:23). దేవునిసంగతుల మీద మన మనస్సుని పెట్టినప్పుడుమాత్రమే దేవుని స్వరమేదో మరియు సాతాను స్వరమేదో గుర్తించగలము. ప్రాముఖ్యముగా మన మనస్సులు సొంత విషయముల మీదనే ఉండినట్లయితే సాతానుస్వరమును దేవుని స్వరమని పొరపాటు చేయగలము. కాబట్టి మనము చేయువాటన్నింటిని అనగా చదువుట, పనిచేయుట మరియు అడుగుట మొదలగునవి పరలోక దృష్టితో చేయవలెను. సమస్తము దేవునిమహిమ కొరకే చేయవలెను. ఎరిక్ లిడిల్, అతడు ఒలింపిక్ బంగారుపతకం పోయినప్పటికి అతడు ఒప్పుకొనిన దాని విషయములో రాజీపడలేదు. ఆవిధముగా చదువులోను ఆడుటలోను ఎల్లప్పుడూ దేవునిని మహిమపరచాడు. మీరు కొన్ని క్రైస్తవ ప్రమాణాలు కలిగియున్నారని ఇతరులు తెలుసుకొనినప్పుడు మీరు సిగ్గుపడవద్దు. ప్రభువు మీకు సహాయంచేయునుగాక.
కాలేజీలో మీ యొక్క పోరాటములలో దేవునిని ఘనపరచవలెనని మీకున్న కోరికను బట్టి మేము అతిశయించుచున్నాము. క్రమముగా మీ కొరకు మేము ప్రార్థించుచున్నాము. దేవుడు మీకు కృపను అనుగ్రహించి మరియు సాతాను యొక్క దాడులను రాజీపడకుండా ఎదుర్కొనుటకు శక్తిని ఇచ్చునని మేము నమ్ముచున్నాము. సాతానుకు విరోధముగా దేవుడు నీ పక్షమునఉన్నాడు మరియు కీడును జయించేవారిగాచేయును.
మనము భూమిమీద ఉన్నవాటికంటే దేవునిని ఎక్కువగా ప్రేమించుచున్నామని ఋజువుపరచబడునట్లు, భూమిమీద కొన్ని ఆకర్షణీయమైన వాటిని దేవుడు ఉంచియున్నాడు. ఆవిధముగా మనము సాతానుని సిగ్గుపరచెదము. సృష్టికంటే ఎంతో ఎక్కువగాను, ఎంతో అద్భుతముగాను ఎంతో సంతృప్తిని సృష్టికర్త ఇచ్చును. ఇది సత్యము మరియు దీనిని మనము విశ్వసించవలెను. మనయొక్క విశ్వాసము ద్వారానే లోకములో ఉన్న ఆకర్షణీయమైనవాటిని జయించెదము. మనము గుడ్డిగా విశ్వసించుచున్నయెడల తరువాత అనుభవములో అది వెంబడించెదము. మనము అనుభూతులు కొరకు చూడకూడదు.
సాతానుతో పోరాడుట మన ఆత్మలకు మంచిది. ఆవిధముగా మనము బలవంతులమయ్యెదము. క్రీస్తు కొరకు మంచి సైనికుడుగాఉండుము. ప్రభువు మీ మీద ఆధారపడుచున్నాడు. ప్రభువునామము ఎప్పటికి ఆవమానపరచబడకుండునట్లు మీరు జయించువారిగా ఉండెదరని మేము కూడా చూచుచున్నాము.
విలువైన జీవితమును జీవించవలెను:
తమయొక్క దేశము స్వతంత్రముగా ఉండునట్లు సైనికులు వారిదేశము కొరకు ఎంతో త్యాగము చేయుచుండగా, సాతాను అవమానపరచబడి ప్రభువునామము మహిమ పరచబడునట్లు మనము ఇంకెంతగా మన జీవితములను త్యాగము చేయవలెను.
మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నిటిలో అద్భుతముగా దేవునికృపను పొందుచున్నారని నమ్ముచున్నాను. మీ యొక్క చదువులలో మరియు పనులలో మంచితలంపులు దయచేయమని దేవునికి ప్రార్థించాలి. దేవుడు మీకు సహాయపడును. విశ్వాసముతో అడగండి మరియు మీరు అద్భుతములు చూడగలరు. ఇటువంటి పరిస్థితులలో మన విశ్వాసము పరిపూర్ణమగుచున్నది. ఎల్లప్పుడు దేవునిని ఘనపరచుడి. దేవుని ఘనపరచువారు వారి జీవితములో అన్ని విషయములలో శ్రేష్టమైన దానిని పొందెదరు. నేను రక్షణ పొందిన నాటినుండి, ప్రతిస్థలమునకు వెళ్ళి ఈ విషయములు చెప్పవలెనని కోరియున్నాను.
అన్నివిషయములలో దేవుని ఘనపరచుడి
ఎల్లప్పుడు దేవునిని మొదటగా ప్రేమించుడి.
ఎల్లప్పుడు మీ మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుకొనుడి.
అప్పుడు మాత్రమే మీరు విలువైనజీవితమును జీవించగలరు.
ఈ విషయములకు ప్రాధాన్యతఇవ్వకుండా వారికున్న తలాంతులనుబట్టియు మరియు భూమిమీద వారు సాధించిన దానినిబట్టియు విలువైనజీవితము జీవించగలమని అనుకొనువారు అత్యంత బుద్ధిహీనులైయున్నారు. వీటిద్వారా ఎవరును సంతృప్తిపరచబడరు.
యోహాను 15 అద్భుతమైనఅధ్యాయము. దేవుడు మన ప్రతివిషయము గురించి చింతించుచున్నాడని విశ్వసించుచు చింతించక ఆయనలో విశ్రాంతిలో నిలిచి యుండెదము (ఒక ద్రాక్షావల్లియొక్క తీగవలె). కొన్ని పోరాటములు మరియు కష్టపరిస్థితులు వచ్చును. కాని చింతించము లేక కలవరపడము. నిరంతరము తీగలలోనికి చెట్టులోనుండి రసము ప్రవహించుట ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడే అవసరమును చూపించుచున్నది.
పరిసయ్యతత్వము మరియు లీగలిజము:
క్రొత్తసంవత్సర ఆరంభములో మంచి కూటములు కలిగియున్నాము. దాని అంశము ''పరిసయ్యతత్వము మరియు లీగలిజమునుండి విడుదలపొందుట''. ముట్టకూడదు, రుచిచూడకూడదు మొదలగు నియమనిబంధనలతో జీవించుచున్న సహోదరసహోదరీలు విడుదల పొందియున్నారని తలంచుచున్నాము. నూతన సంవత్సరములో రెండు క్రొత్త పద్ధతుల గురించి ఆలోచించితిమి 1. ప్రతిదినము నిన్ను నీవే తీర్పు తీర్చుకొనుము. 2. ప్రతిదినము ఇతరులయెడల కనికరము చూపుము. ఈ రెండును తీర్పు దినమందు మనకు ఎంతో విడుదల నిచ్చును (యకోబు 2:13).
మీరు వెళ్ళుచున్న పరిస్థితులన్నియు (రాబోవుచున్న దినములలో మీరు వెళ్ళబోవుచున్న పరిస్థితులన్నియు) ఈ లోకములో తమ జీవితములు పాడుచేసుకొని ఓడిపోయినవారికి గొప్ప నిరీక్షణ కలుగునట్లు వారికి పరిచర్య చేయుటకు దేవుడు మిమ్మును సిద్ధపరచుచున్నాడు. మీ యొక్క వ్యక్తిత్వము, తెలివితేటలు, అర్హతలు, మీరు పెంచబడిన విధానము అన్నియు దేవుని యొక్క సంపూర్ణప్రణాళికై ఉన్నవి. కాబట్టి దేవునికి స్తోత్రము.
ఈ నూతన సంవత్సరము ఆరంభించుచుండగా మీకు రెండు సలహాలు ఇవ్వాలనుకున్నాను. రెండు విషయముల కొరకు ప్రభువుని వెదకుడి:
1. మీ జీవితములో ఒక్కసారి కూడా పాపము చేయనట్లుగా దేవుడు మిమ్మును చూచినట్లు దేవుని వాక్యము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. దానిని వాక్యపు వెలుగులో చూపించమని అడుగుడి.
2. మనుష్యుల అభిప్రాయములనుండి పూర్తిగా విడుదలపొందుట. ప్రజలు మనగురించి ఏమనుకొనుచున్నారో అను విషయములో ఎంత బంధించబడియున్నామో మనము గుర్తించలేము.
ఈ రెండు విషయముల మీద మీరు శ్రద్ధవహించినట్లయితే ప్రభువు యొక్క చేతులలో మంచిపాత్రలుగా ఉండెదరు. మన యొక్క గత ఓటములకు మీరు సాష్టాంగపడినచో సాతాను దానిని దీనత్వముగా చూపించును. కాని మనము ఇతరుల విషయములో కఠినంగా ఉండునట్లు శోధించబడినప్పుడు, మనయొక్క గత ఓటములను జ్ఞాపకము చేసుకోవాలి. మరి ఎప్పుడైనను వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు (2 పేతురు 1:9).
ఈ రెండు విషయములు స్పష్టముగా తెలుసుకొనినయెడల మీ జీవితములో మీరు ఒక రాకెట్‌వలె పైకి ఎగురుదురు. మీ తెలివితేటలతో దీనిని అర్థము చేసుకొనుటకు ప్రయత్నించవద్దు. కేవలము దేవునివాక్యము విశ్వసించి నమ్ముడి.
నేరారోపణ మరియు నిరాశ సాతానునుండి వచ్చును. మీరు ఎప్పుడైనను గతములో జీవించవద్దు. మీ యొక్క గత ఓటముల గురించి లేక మీరు గతములో పొందిన జయముల గురించిగాని ఆలోచించకుడి. మరియు మీరు పడిపోయినప్పుడు వెంటనే లేచి మరియు పరుగెత్తుడి. ఎప్పుడైననూ విడిచిపెట్టవద్దు.
మూడు వివాహములు:
ధర్మశాస్త్రమునుండియు మరియు పాపమునుండియు విడుదల పొందుటకు ఇక్కడ చిన్నవివరణ ఇవ్వబడింది.
మొదటివివాహము: మనం రక్షణ పొందకముందు, ప్రాచీనపురుషునితో వివాహము జరిగింది. మనకు అతడు భర్తగా ఉండెను. పాపములను చేయమని బలవంతపెట్టే చెడ్డభర్తగా అతడు ఉన్నాడు. కాని మనము అతనినుండి విడుదల పొందుటకు మనము క్రొత్తగా జన్మించినప్పుడు దేవుడు అతనిని చంపియున్నాడు. (మన ప్రాచీనపురుషుడు క్రీస్తుతోకూడా సిలువవేయబడెను రోమా 6:6).
రెండవవివాహము: కాని మనము క్రీస్తుని వివాహముచేసుకొనక, క్రీస్తు అనుకొని ధర్మశాస్త్రమును వివాహమాడితిమి. ఇతడు ప్రాచీనపురుషునికి వేరుగా ఉండి, పరిపూర్ణమైన భర్తగాఉండి అన్ని విషయములలో పరిపూర్ణతకోరును. ఈ భర్త నీతికరమైన కోరికలే కోరును గాని కొంచెము కూడా సహాయపడడు. కాబట్టి మనము దౌర్భాగ్యులమైయుంటిమి. దేవునిని సంతోషపెట్టుటకు మనము ఎంతో పోరాడినప్పటికిని ఓడిపోతిమి. ఇది ధర్మశాస్త్రము క్రిందవున్న జీవితము. ఈ ధర్మశాస్త్రము పరిపూర్ణమైయున్నది మరియు ఎప్పటికి మరణించదు. గనుక ఈ వివాహము నుండి తప్పించుకొనే మార్గము తెలియదు. కాని ఈ వివాహమునుండి విడుదలపొందుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పరిచెను. ఆయన భార్యను చంపుట ద్వారా ఆ వివాహమును రద్దుచేసెను. రోమా 7:1-4 ఆవిధముగా మనము ధర్మశాస్త్రము నుండియు లీగలిజమునుండియు విడుదల పొందియున్నాము.
మూడవ వివాహము: అప్పుడు దేవుడు భార్యను(మనలను) మరణంనుండి తిరిగి లేపినందువలన ఇప్పుడు సంతోషముగా క్రీస్తుతో ఏకమైయున్నాము (రోమా 7:4). ఇటువంటి సమృద్ధిజీవమును మనకు ఇచ్చుటకే యేసు వచ్చియున్నాడు. ధర్మశాస్త్రమువలే క్రీస్తు కూడా పరిపూర్ణుడై యున్నాడు. కాని ఆయన సహాయపడేభర్త. నిజానికి మనలో 99 శాతం పని ఆయనే చేయును మరియు ఆయన ఎన్నడైనను బలవంతపెట్టడు. ఎంత అద్భుతమైన భర్త! ఇదియే నిజమైన క్రైస్తవజీవితము. క్రీస్తు మరియు నీవు ఒకే కాడిని మోయుదురు (మత్తయి 11:29). ఇదియే జయజీవితము.
''వాకిట పాపము పొంచియుండును. నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను'' అని దేవుడు కయీనుతో చెప్పినట్లే ఎల్లప్పుడు పురుషులకు వ్యభిచార పాపము పొంచియుండెను (ఆదికాండము 4:7). దీనిని తప్పించుకొను మార్గము ఏమనగా, 1. యోసేపువలే దేవునియెడల గొప్ప భయభక్తులు కలిగియుండుట (ఆదికాండము 39:9) మరియు 2. యోసేపువలే ఒంటరిగా స్త్రీలతో ఉండకుండా జాగ్రత్తపడుట (ఆదికాండము 39:10, 1తిమోతి 6:18, 2తిమోతి 2:22). మీరు స్త్రీలతో మాట్లాడునప్పుడు కూడా జాగ్రత్తపడవలెను. సరసంగా మాట్లాడినయెడల అపాయము. ఆమెతో మాట్లాడవద్దనిగాని లేక ఆమె వద్దనుండి వెళ్ళిపొమ్మనిగాని పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు వినే చెవులు కలిగియుండవలెను. అప్పుడు మాత్రమే కాలేజీలో మీరు కాపాడబడెదరు. దీనిని ఎల్లప్పుడు మీరు మనస్సులో పెట్టుకొనుడి మరియు భవిష్యత్తులో మీరు చింతించరు.
దేవునికి మాత్రమే మనము విలువనిచ్చిన యెడల, అప్పుడు ప్రభువైనయేసువలె ఎల్లప్పుడు అంతరంగములో విశ్రాంతి కలిగియుండెదరు. డబ్బే సర్వముకాదనియు మరియు చదువుకొనుట, మానవప్రేమ, వివాహము, లైంగికసంతోషము మరియు సుఖవంతమైన జీవితము సర్వముకాదని దేవుడే సర్వమైయున్నాడని మనము లోకానికి చూపించాలి. అవన్నియు మంచివే. కాని దేవుడుమాత్రమే మనకు సర్వములో సర్వమైయున్నాడని మనము లోకానికి చూపించాలి. ఇదియే నిజమైన క్రైస్తవ్యము. దేవుడే మనకు సర్వములో సర్వమై యున్నప్పుడు మిగిలినవి మంచివే.
పరిపూర్ణమైన అతిథిగాయుండుట:
ఈ రోజు నా పుట్టినరోజు మరియు మీ నలుగురు కుమారులు దేవుడు నాకు పుట్టినరోజు కానుకలుగా అనుగ్రహించెనని తలంచుచున్నాను. మీఅందరికి తండ్రిగా యుండుట నాకు సంతోషముగా ఉంది. మీరు నా భారమును తగ్గించియున్నారు. మీరు మీ తండ్రికి మరియు తల్లికి దూరముగా ఉన్నప్పటికిని మీరు ప్రభువుకొరకు నిలిచియుండుటను బట్టి అతిశయించుచున్నాను. మీరు ఆవిధముగా ఉండవలెనని నేను కోరితిని. మనము నిత్యత్వము నిలిచియుండుటకు, క్రీస్తులో మీరు నా సహోదరులు కావలెనని నేను కోరియుంటిని.
మీరు ఇతరుల ఇంటిలోనున్నప్పుడు, మీ ప్రవర్తనగూర్చి కొన్ని సలహాలు ఇచ్చుచున్నాను. ఇంతకు మునుపే నేను మీకు చెప్పినప్పటికి మరలా చెప్పుచున్నాను.
1. ఆ యింటిలోని పిల్లలను స్నేహితులుగా చేసుకొనుడి. పరిచర్యను వెంబడించువారికిని, యేసును వెంబడించేవారికిని తేడా ఇదే. ఫలభరితమైన పరిచర్యకు మొదటి నియమము ఏమనగా, ''యేసు అన్నివిషయములలో తన సహోదరులవంటి వాడాయెను'' (హెబీ 2:17). కాబట్టి మీరు పిల్లలతో ఉన్నప్పుడు వారివలె ఉండవలెను. మీరు వారి స్థాయికి దిగివచ్చి, వారితో మాట్లాడి మరియు వారితో ఆటలాడవలెను. వారు మీలో క్రీస్తును చూడవలెను. పౌలు ఇట్లనెను, ''బలహీనులను సంపాదించికొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను'' (1 కొరింథీ 9:22). పిల్లలతో ఆడవలెను. ప్రభువైన యేసు భూమిమీద ఉన్నప్పుడు ఆ విధంగా చేసియుండును. ఒక కుంటిపిల్లవాడు పరలోకములో యేసుతో కూడా బాలు మరియు బ్యాటుతో ఆడినట్లుగా దర్శనం పొందాడు. ప్రజలు చెప్పుచున్న దర్శనములకంటే ఈ దర్శనం ఎంతో శ్రేష్టమైనది. యేసు ఈ భూమిమీద పరిపాలించునప్పుడు పిల్లలు ప్రార్థించరు కాని వీధులలో ఆడెదరు (జెకర్యా 3:5).
2. మీరు తినుచున్నప్పుడు, ఇతరులను దృష్టిలో పెట్టుకొనుడి. తిండిబోతులుగాయుండక తినే విషయములో క్రమశిక్షణ కలిగియుండుడి.
3. భోజనముచేసిన తరువాత తిన్న పాత్రలను కడుగవలెను.
4. మీరు ఉదయం లేచినతరువాత మీ గదిలోవున్న వస్తువులను శుభ్రముగా పెట్టుకొనవలెను.
5. బాత్‌రూం ఇతరులకు కూడా అవసరము గనుక అందులో తక్కువ సమయము ఉండుట మంచిది. నేను ఇతరుల గృహములలో ఉన్నప్పుడు, వారు బాత్‌రూంలను ఏ సమయములో ఉపయోగించెదరో అడిగివారు ఉపయోగించని సమయములో నేను వెళ్లెదను. ఆ విధముగా అది వారికి అందుబాటులో ఉండును.
6. మీకు ఆతిథ్యము ఇచ్చినవారి వద్దనుండి మీరు వెళ్ళినప్పుడు, వారికి కృతజ్ఞతలు (ప్రత్యేకముగా ఇంటి గృహిణికి) చెప్పండి. మరియు వారికి కొంత డబ్బులనిచ్చి, వారి పిల్లలకు ఏదైనను కొనమని చెప్పవలెను.
మీరు వెళ్ళిన ప్రతి గృహములోను ఇప్పటికే మీరు ఆవిధంగా చేయుచున్నారని నేను వినియున్నాను. మిమ్మల్ని బట్టి గర్వించుచున్నాను. వాటిని గర్తుచేయుటకు మాత్రమే మరలా చెప్పుచున్నాను.
చిన్న పక్షిరాజువలె ఎగురుటకు నేర్చుకొనవలెను:
మనము దేశములమీదగాని మరియు కంపెనీలమీదగాని ఆధారపడక దేవుని మీదనే మన భారము వేసెదము. మీరు దేవునిరాజ్యమును మొదటగా వెదకినయెడల మిగిలినవన్నియు మనకు దొరుకును. అత్యంత శ్రేష్టమైన దేవునిచిత్తమే కావలెనని మీరు కోరినయెడల, అది జరగకుండా ఎవరును ఆటంకపరచలేరు.
ప్రభువైనయేసు యోహాను ద్వారా బాప్తీస్మము తీసుకొనినప్పుడు, తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక తండ్రియొక్క ఆత్మమీద ఆధారపడెను. మనము కూడా ఆ విధముగా జీవించవలెను. మన మనస్సును మరియు స్వబుద్ధిని ఉపయోగించాలి కాని ఎల్లప్పుడు ఆత్మయొక్క సాక్ష్యమే ముఖ్యమైయున్నది. మీరు బెంగుళూరుకు సమీపముగా ఉన్నయెడల, అప్పుడప్పుడు మనము కలుసుకొనవచ్చునని నేను కోరియున్నాను. కాని పక్షిరాజుపిల్లలు ఎగురుట నేర్చుకొనునట్లు, పక్షిరాజు గూడు రేపబడవలెను. ఇది సృష్టిలో దేవునియొక్క చిత్తము మరియు మనము దానికి లోబడవలెను (ద్వితీయోపదేశకాండము 32:11). మీరు అప్పుడప్పుడు నేలమీదపడినను, ఎగురుటను నేర్చుకొనునట్లు ప్రార్థించుచున్నాము. దేవుడు ఎంతో నమ్మకముగా మిమ్ములను పైకి లేపును.
''నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును. ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్లగొట్టి నశింపజేయుమనెను'' (ద్వితీయోపదేశకాండము 33:27).
''యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనైయున్నాను. అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు'' (కీర్తన 37:24-26).
బెంగుళూరులో ప్రత్యేకముగా చిన్న పిల్లలకు మీరు ఆశీర్వాదముగా యున్నారు. మరియు మీరు బెంగుళూరును విడిచివెళ్లినందున మాతోపాటు అనేకులు మీ సహవాసమును పోగొట్టుకొనియున్నారు. కొద్దికాలము క్రితము మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సంఘములోని పిల్లలు నిజముగా సంతోషించారు.
మతానుసారముగానుండుటలో అపాయము:
ఎటువంటిపరిస్థితిలోనైనను మీరు ప్రభువుని గట్టిగాపట్టుకొనినయెడల మీరు నిరాశపడరు. మనము మరిఎక్కువగా ఆయనను ఎరుగుటకొరకే ఆయన ఆ పరిస్థితులను అనుమతించును. అవిశ్వాసులు మరియు లోకానుసారులైన విశ్వాసులు ఈ విషయములో ఓడిపోవుదురు. వారు దేవునివైపు తిరుగటకు బదులుగా, విశ్రాంతిని మరియు శాంతిని పొందుటకు లోకములోఉన్న నిషేధించబడిన వాటివైపు తిరుగుచున్నారు. గనుక ఓడిపోవుచున్నారు లేక నిరాశపడుచున్నారు. అటువంటి వాటిని మీరుచేయవద్దు. కీడుగా కనిపించనివాటికి బానిసలు అయ్యే అవకాశం ఉన్నది.
ఎవరైతే యథార్థవంతులై, తమ ఓటములనుఒప్పుకొని మరియు పడిపోయిన వెంటనే లేచెదరో అటువంటివారే పరిపూర్ణులు అగుదురు. ఆత్మీయసంగతులనుకొని మతస్థులుగా మారే అపాయము ఉన్నది. బాహ్యమైన త్యాగములు ప్రభువుకొరకు చేయుచు మరియు సంఘములలో వారు నిలిచియుండుటకు వారు కేవలం బైబిలుజ్ఞానము కలిగియుండెదరు. వాక్యమును అనుభవించరు మరియు పరిశుద్ధాత్మ నింపబడియున్నామనుటకు ఉద్రేకములు కలిగియుండుటయే ఋజువు అనుకొని అనేకులు మతానుసారులు అవుదురు. ఇది చేయుట తప్పుకాదు లేక ఇవి కొంతవరకు అవసరమే కాని మతానుసారులకు, ఈ క్రియలే ప్రాముఖ్యమైయుండి మరియు అదియే అనుకొని మోసపోవుదురు.
కాని ఆత్మానుసారులు, దేవునిని మరిఎక్కువగా ఎరుగవలెననియు, సహవిశ్వాసులతో కలిసి ప్రభువైనయేసుని ప్రేమించుచుండవలెననియు, వారియెడల దేవునియొక్క ఉద్దేశ్యము తెలుసుకొనవలననియు, పరిశుద్ధాత్మ శక్తి పొందవలెననియు మరియు స్వార్థమునుంచి విడుదల పొందవలెననియు కోరెదము. మతానుసారులు సమాజములను నిర్మించెదరు. ఆత్మానుసారులు క్రీస్తుయొక్క శరీరమును నిర్మించెదరు.
ఈ లోకములో తన కొరకు నిలిచియుండేవారి కొరకు దేవుడు చూచుచున్నాడు కాని దోమలేకుండా వడియగట్టి ఒంటెను మ్రింగువారైన పరిసయ్యులకొరకు దేవుడు చూచుటలేదు. ఏలీయా, బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలు, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఎరిక్ లిడిల్ వలె వారు నమ్మినదాని కొరకు ఎంత వెలైన చెల్లించేవారికొరకు దేవుడు చూస్తున్నాడు. వారు దేవునివాక్యము కొరకు నిలిచిరి. అటువంటి వారితో పరలోకము నింపవలెనని దేవుడు కోరుచున్నాడు. అటువంటి వారిలో మీరుండవలెనని ప్రార్థించుచున్నాడు. కాలేజీలో ప్రభువుకొరకు నిలబడుటకు ఎంతో అవకాశమున్నది. మీరు ఎల్లప్పుడు ఆ విధముగా చేయుదురుగాక.
గత శతాబ్దములో సువార్తయొక్క వర్తమానము కాపాడుటకును మరియు బైబిలు ఇంగ్లీషులోకి తర్జుమా చేయుటకును అనేకమంది దైవజనులు వారి ప్రాణములను కోల్పోయారు. కాని దురదృష్టకరమేమనగా, అనేకమంది విశ్వాసులు బైబిలును రోజుకి ఐదు నిమిషములు కూడా చదువుటలేదు. ధ్యానించుటలేదు. ఈనాడు సిద్ధాంతములను మనము అర్థము చేసుకొన్న రీతిగా, గత శతాబ్దములోని దైవజనులు అర్థము చేసుకొనలేకపోయిరి. కాని సరియైన సిద్ధాంతము కాదుగాని ప్రభువు యొక్క మిక్కుటమైన ప్రేమతో ప్రేమించుటయే ముఖ్యమైయున్నది.
మరిచిపోవుట తీవ్రమైనపాపము కాదు గాని దానిని జయించుటవలన మనకు ఎంతో అనుకూలముగా ఉండును. మనమందరము మరచిపోవుచుండెదము. నేను దానిని జయించుటకు నేను చేయవలసిన ముఖ్యమైన విషయములను ఒక చిన్నపుస్తకము మీద వ్రాసుకొని మరియు దానిని జేబులో ఉంచుకొందును. ప్రభువు నాతో మాట్లాడినమాటలను కూడా వ్రాసుకొందును. నేను వాటిని వ్రాయనట్లయితే, కొన్నిసార్లు ప్రభువు చెప్పినవాటిని మరచిపోవుదును.
అస్థిరత్వము మరియు జ్ఞానము:
మీరు దేవుని చిత్తమును వెదుకుతున్నప్పుడు అస్థిరత్వముగా ఉండుట సహజమని మీరు తెలుసుకొనవలెను. విశ్వాసమూలముగా జీవించునట్లు దేవుడు మనలను ఆ విధముగా సిద్ధపరచును మరియు వెలిచూపునుబట్టి నడుచుట అని కూడా చెప్పవచ్చును.
దేవుని చిత్తమును తెలుసుకొనలేక, పౌలుకూడా అనేకసార్లు అస్థిరత్వములో ఉండెను. ''కొన్ని విషయములు ఎందుకు జరుగుచున్నవో మాకు తెలియనప్పటికిని మేము దానిని విడిచిపెట్టము'' (2 కొరింథీ 4:8 లివింగు బైబిలు).
ఏ శరీరియు దేవునిఎదుట అతిశయింపకుండునట్లు కొన్నిసార్లు అస్థిరత్వమునకును మరియు పొరపాట్లుచేయుటకును అనుమతించును (1 కొరింథీ 1:29). నిత్యత్వములో ఒక వ్యక్తి కూడా నేను అన్నియు సరిగా చేసియున్నాననియు మరియు దేవునిచిత్తము సంపూర్ణముగా నెరవేర్చాడనియు చెప్పలేడు. మనము అనేకపొరపాట్లను మరియు పెద్ద పొరపాట్లను చేసినప్పటికిని, దేవుడు తన సంకల్పం మనలో నెరవేర్చెనని నిత్యత్వములో అతిశయించెదము. నిశ్చయముగా ఇది నా సాక్ష్యము. ఆవిధముగా దేవుడు మాత్రమే మహిమపొందును మరియు మనము ఏమి పొందము. అనేకమంది విశ్వాసులకు దేవుని యొక్క సంకల్పం ఎరుగనందున వారు ఓడిపోయినప్పుడు లేక దేవునిచిత్తములో నిశ్చయత లేనప్పుడు నిరాశపడెదరు. దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత దూరమున్నదో అవి అంత దూరమున్నవి (యెషయా 55:8,9).
దైవికజ్ఞానము కలిగియుండుట మంచిది. ఆ జ్ఞానములో ఉన్న ఒక విషయమేమనగా మనము సరైన ప్రాముఖ్యతలు కలిగియుండెదము. అనగా చదువుటకొరకును అనగా దేవునివాక్యము చదువుటకును పనిచేయుటకును, నిద్రపోవుటకును మరియు విశ్రాంతి తీసుకొనుటకును మొదలగువాటి కొరకు సమయమును సరిగా వినియోగించుట తెలుసుకొనుము. అనేకమంది విశ్వాసులు ముఖ్యముగా పెళ్ళయి మరియు కుటుంబము పెట్టిన తరువాత వారి ప్రాధాన్యతలు సరిగా ఉండవు. కాబట్టి మీరు పెళ్ళికాక ముందే మరియు యౌవనస్థులుగా ఉండినప్పుడే అటువంటి జ్ఞానము సంపాదించుట మంచిది. మీకు జ్ఞానము కొదువగాఉన్నయెడల, మీరు దేవునిని అడుగవలెను మరియు ఆయన ధారాళముగా మీకు ఇచ్చును కాబట్టి ప్రార్థించుడి.
''దేవుని చిత్తమును కనుగొనుట'' అను పుస్తకములోని 6వ అధ్యాయము చదువవలెనని మిమ్ములను ప్రోత్సహించియున్నాను. అక్కడ నిర్ణయము తీసుకోలేని స్థితిలో నుండి విడుదలపొందుట, గత నిర్ణయములను బట్టి చింతించుట నుండి విడుదలపొందుట మరియు పొరపాట్లు చేసెదమని భయమునుండి విడుదల పొందుటను గురించి వ్రాసియున్నాను.
ఒక పొరపాటు కూడా చేయనివాడు ఏమి చేయడు. ప్రభువైనయేసు తప్ప, మరి ఎవరైనను పొరపాట్లు చేయకుండా దేవుని చిత్తము సంపూర్ణముగా చేయలేరు. మంచి వారియొక్క అడుగులు దేవుడు స్థిరపరచును. ''యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు పడినను లేవలేక యుండడు'' (కీర్తన 37:23,24). కాబట్టి పొరపాట్లు చేయుటకు భయపడవద్దు. తీవ్రమైన పొరపాట్లు చేయకుండునట్లు దేవుడు మిమ్మును కాపాడును.
దేవునియొక్క సంపూర్ణచిత్తమును నెరవేర్చుట:
హెబీ 12:27లో సృష్టించబడిన వాటిమీద నిర్మించబడినవాటిని దేవుడు చలింపచేయునని మరియు సృష్టికర్తకు కాక సృష్టించబడినవాటికి విలువనిచ్చువారిని కూడా ఆయన చలింపజేయును. ఇదే ఆదాము, అవ్వయు, ఏశావు యొక్క పాపములు. వారు దేవునిని కలిగిలేరు (హెబీ 12:16). రోమా 1:25లో సృష్టికర్తకంటే సృష్టిని సేవించి ఆరాధించు వారికొరకు చెప్పబడింది. మీ ఉద్యోగముకంటెను అమ్మాయిలకంటెను సుఖబోగముల కంటెను, సౌఖర్యము కంటెను, డబ్బుకంటెను లేక గౌరవముకంటెను ఎక్కువగా మీ జీవితములలో దేవునికి స్థానము ఇచ్చెదరని నేను ప్రార్థించుచున్నాను.
మీ జీవితములో ప్రతి విషయములోనూ దేవుని యొక్క సంపూర్ణచిత్తము నెరవేరాలని తల్లిదండ్రులముగా మేము ప్రార్థించుచున్నాము. దీనికంటే గొప్ప విషయము లేదు. ప్రభువైన యేసు యొక్క శిష్యులమైన తరువాత వివాహము మరియు ఉద్యోగము అను ముఖ్యమైన నిర్ణయములు తీసుకోవలసియున్నది. ఈ రెండు విషయములలో దేవునియొక్క సంపూర్ణ చిత్తములో ఉండవలెనని ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. వీటితో పోల్చినప్పుడు మిగతావన్నియు చిన్న విషయములు. వివాహము మరియు ఉద్యోగముతో పోల్చినప్పుడు మీరు చదివిన కాలేజీగాని మీరు చేసిన డిగ్రీలు ముఖ్యముకాదు. కాబట్టి ఈ రెండు ముఖ్యమైన విషయములలో దేవుని చిత్తము కొరకు ప్రార్థించుము.
దేవుడు మీకొరకు సిద్ధపరచిన ఉద్యోగములు మీకు రావలెనని మేము ప్రార్థించుచున్నాము. సంఖ్యాకాండము 10:33 అనే వాగ్దానము మీరు స్వతంత్రించుకొనవలెను. ''వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణము చేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను''. పాత నిబంధనలో ఉన్న వారికే దేవుడు ఆవిధముగా చేసినప్పుడు క్రొత్తనిబంధనలో ఉన్న మనకు ఇంకా ఎంతో ఎక్కువగా చేయును. మీరు దేవుని రాజ్యమును మరియు నీతిని మొదటిగా వెదకుచూ మరియు అన్నివిషయములలో ఆయనను ఘనపరచవలెనని కోరినయెడల, నా కుమారులైన మీ విషయములో మాకు భయములేదు. అప్పుడు తప్పు జరగదు. 34 సంవత్సరములు దీనిని ఋజువు చేసాను (ఇప్పటికి 57 సంవత్సరములు).
''మీకు కలిగిన వాటిలో దేవుని యొద్దనుండి పొందనిది ఏది?'' (1 కొరింథీ 4:7). ఏమియూలేదు. మీకున్న తెలివితేటలు, మీ యొక్క ఆరోగ్యము, చదువుటకును, ఉద్యోగము చేయుటకును గల అవకాశములు మరియు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దేవుడు దయచేసెను (1 తిమోతి 6:7). మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థించియున్నాము మరియు దేవుడు మా ప్రార్థనలకు జవాబు ఇచ్చియున్నాడు. దీనిని బట్టి మేము కృతజ్ఞులమై యున్నాము. దేవుడు మిమ్ములను ఆత్మీయముగాను, మానసికముగాను, ఉద్రేకములోను మరియు శారీరకముగాను పరిణితిచెందిన వారిగా చేసినందుకు సంతోషించుచున్నాను. జీవితమును ఎదుర్కొనుటకు దేవుడు మిమ్మును సిద్ధపరచెను. కాలేజీలో ఉన్న క్లిష్టపరిస్థితులలో పోరాడి మీరు జయించారు. దేవునికి స్తోత్రము.
''శ్రీమంతుడైన సర్వాధిపతియగు దేవుని గుర్తుంచుకొనుడి'' (1 తిమోతి 6:15 జే.బి ఫిలిప్స్). దానియేలు 4:35 గుర్తుంచుకొనుటకు మంచి వచనము: ''భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోకసేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు''.
ఉదయకాలము దేవునితో కొంత సమయము గడిపినయెడల ఆ దినమంతయు ప్రత్యేకముగా ఉండును. దీనిని మరిచిపోవద్దు. కాబట్టి 10 నిమిషాలు ముందుగానే లేచుట మంచిది. 10 నిమిషాలకంటే ఎక్కువగా మీరు ఆ రోజు సంపాదించగలరు. ఉదయము దేవునితో గడుపుట ఎంతోగొప్ప విషయము కానప్పటికి మన అనుదినవిషయములో ఆయన ముఖ్యమైయున్నాడని ఒప్పుకొనుచున్నాము.
మీ సొంతరక్షణలో కొనసాగుడి:
ఫిలిప్పీ 2:12,13 ఇట్లు చెప్పుచున్నది, ''కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నా యెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా, నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను, వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే''.
ఈ వచనముగురించి ఇక్కడ రెండు విషయములున్నవి.
1. రక్షణ: రక్షణపొందినప్పుడు దేవునియొక్క ఉగ్రతనుండి మరియు తీర్పునుండి రక్షింపబడియున్నాము. ఇది దేవునియొద్దనుండి ఉచితముగా పొందినది. మరియు దీని కొరకు మనమేమియు చేయలేము. ప్రభువైనయేసు సిలువమీద రక్షణకార్యము సమాప్తి చేసియున్నాడు. కాని ఇప్పుడు మనము ఆదాముయొక్క స్వభావమునుండి మరియు పాపముతోను లోకానుసారముగాఉండిన ప్రవర్తననుండియు (కోపము, అపవిత్రత మొదలగునవి) ఆ ప్రవర్తన నుండి రక్షింపబడుచుండవలెను. పైన చెప్పిన వచనము ప్రకారము రక్షణలో రెండు భాగములున్నవి:
మొదటిగా పాపముయొక్క శిక్షనుండి రక్షింపబడియున్నాము.
పాపము యొక్క శక్తినుండి రక్షింపబడుచున్నాము.
క్రీస్తు మరల వచ్చునప్పుడు, ఒకరోజున పాపముయొక్క సన్నిధినుండి రక్షింపబడెదము.
2. దేవుడు మనలో పనిచేయుచున్నాడు, దేవుని వాక్యము చెప్పుచున్నప్పుడెల్లను, అది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను చూపించుచున్నది మరియు పాపమునుండియు లోకమునుండియు మనలను పరిశుద్ధపరచుచు మరియు పరిశుద్ధులుగా చేయుటయే ఆయన యొక్క ముఖ్యమైన పని. దేవుడు మనలో పనిచేయుచున్నప్పుడు, మనము ఆయనతో సహకరించవలెను. దేవుడు మనలో పనిచేయుట అనగా, ఆయన వాక్యముద్వారా మనలో ఉన్న వైఖరినిగాని లేక తలంపులనుగాని లేక ప్రవర్తననుగాని, మారవలెనని చెప్పును. మనము ఆ దిద్దుబాటును అంగీకరించినప్పుడు శరీరమునకును ఆత్మకును కలుగు కలుషితమును పవిత్రపరచుకొనెదము (2 కొరింథీ 7:1). ఒక ప్రత్యేకమైన అలవాటు విషయము కూడా ఆవిధముగా చేయవచ్చు. ఆవిధముగా రక్షణలో కొనసాగెదము.
ప్రభువైనయేసు యొక్క శిష్యుడుగా ఉండుటయే గొప్పవిషయము:
ఆత్మీయముగా కొన్ని విషయములను నేర్పించుటకు మనలను కొన్ని కష్టపరిస్థితుల గుండా ప్రభువు నడిపించును. ఉదాహరణకు, మన విశ్వాసమును ఎగతాళి చేయువారిని దేవుడు అనుమతించును. మనమీద అసూయపడినవారే ఆవిధముగా చేసెదరు. కాబట్టి మనము వారి మీద జాలిపడవలెను. కాని వారు చేసినకార్యమునుబట్టి మనుష్యుల అభిప్రాయమునుండి విడుదల పొందాలి. నా గత జీవితమును చూచినయెడల నేను యౌవనస్తుడుగా ఉన్నప్పుడు నావికాదళములో నా విశ్వాసమును బట్టి ఎగతాళిచేసిరి. మరియు దాని తరువాత జరిగిన విషయములుకూడా మనుష్యులను సంతోషపెట్టుట నుండి విడిపించెను. మరియు ఆవిధముగా ప్రభువు నన్ను పరిచర్యకొరకు సిద్ధపరచెను.
మీకు సహవాసములేనప్పుడు పౌలు అరేబియాలో మూడు సంవత్సరములు అరణ్యములో ఉండుటను మీరు చూడాలి. అక్కడ పౌలు ప్రభువును సన్నిహితముగా మరియు వ్యక్తిగతముగాను తెలుసుకొనెను (గలతీ 1:17,18).
ప్రభువైనయేసు పరలోకములోను భూమిమీదను సర్వాధికారము కలిగియున్నాడని గుర్తించుకొనుడి. ఆయన తన సింహాసనమును విడిచిపెట్టలేదు. మీ జీవితములో ఆయన అనుమతించే ప్రతిపరిస్థితియు అది అరణ్యములో అయినను ఆయన సంకల్పము చొప్పునే జరిగెను. దావీదు ఇట్లు అనెను, ''నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు'' (కీర్తన 37:25). నా యేసు సమస్తమును బాగుగా చేసియున్నాడని (మార్కు 7:37) ఒక రోజు పరలోకములో మనము పాడునట్లును ఇప్పుడు మనము వెలిచూపుతో కాక విశ్వాసముతో జీవించెదము.
మంచిఉద్యోగము పొందుట జీవితములో గొప్ప విషయము కాదు. యేసుప్రభువుయొక్క శిష్యుడుగా ఉండుటయే గొప్పవిషయము. నేను ఇండియాలో ఉండుటకు దేవుడు నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషించుచున్నాను. కాని నేను ఎవరినీ ఇండియాలో ఉండమని అడుగలేదు. నా కుమారులైన మిమ్ములను కూడా అడుగలేదు. ఎందుకనగా ప్రతిఒక్కరి విషయములో దేవునికి ఒక ప్రత్యేకమైన పరిచర్యకలదు. క్రీస్తుయొక్క శరీరములో అనేక పరిచర్యలు ఉన్నవి గనుక నా పిలుపు, నా పరిచర్యకంటే మీది వేరుగా ఉండును. మీరు ఎక్కడ ఉండినను దేవుని మహిమనే కోరుచూ మరియు ఎల్లప్పుడు ఆయన చిత్తములోనే ఉండవలెనని కోరుచున్నాను. ఎందుకనగా అదే ఈ లోకములో శ్రేష్టమైనజీవితము.
''తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది'' (2 దినవృత్తాంతములు 16:9). కాబట్టి ఆయన మీ పక్షముగా కూడా పనిచేయును. మీ తరములో మీరు ప్రభువుకు శక్తివంతమైన సాక్షముగా ఉండెదరుగాక.
ఇతరులను ఆశీర్వదించుటద్వారా ఆత్మీయవృద్ధి కలుగును:
15 రోజులకు ఒకసారిగాని లేక వారానికి ఒకసారిగాని కొంతమంది విశ్వాసులతో బైబిలు ధ్యానము చేయుటకు అవకాశముకొరకు చూడుడి. ప్రభువుని అడగండి. ఆయన మిమ్మును నడిపించును. ఆవిధముగా మనము ప్రభువునిసేవించి మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా నడిపించవలెను. వచ్చిన వారికి ఆసక్తి కలుగవలెను. కాబట్టి క్లుప్తముగా కూటమును జరిగించుము మరియు అది విసుగు పుట్టించకూడదు. అనుభవపూర్వకముగా చెప్పవలెను. మీరు సి.ఎఫ్.సీ బెంగుళూరులోనూ మరియు ఇంట్లోను అనేకసంవత్సరముల నుండి వాక్యము వినియున్నారు గనుక మీకు లేఖనములు బాగుగా తెలియును. సహాయము కొరకు దేవునిని ప్రార్థించుడి. ఆవిధముగా బైబిలు జ్ఞానము కలిగియుండుటద్వారా మీరు ఆత్మీయముగా ఎదిగెదరు. నాకు 23 సంవత్సరముల వయస్సులో దానిని కనుగొన్నాను.
పరిశుద్ధాత్మ అభిషేకము కొరకును మరియు ప్రవచనవరము కొరకును ఎల్లప్పుడు ప్రార్థించుడి. (''వినేవారి అవసరమును బట్టి మాట్లాడవలెను''). ప్రవచనావరము కొరకు అడుగుట గర్వముకాదు. సాతాను ఈవిధముగా ప్రజలను మోసగించును. ప్రతివిశ్వాసియు ప్రవచనా వరమును ఆపేక్షించవలెనని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు (1 కొరింథీ 14:1). కాబట్టి ఆ వరమును ఆపేక్షించుడి. ఏవిషయములో అయినను మీరు దేవునిఅడుగని యెడల పొందరు. మీ యొక్క అవసరముల కొరకు, తెలివితేటలు కొరకు, ఉద్యోగములో ఉన్న సమస్యల కొరకు, ఏ సమస్య కొరకైనను ధైర్యముగా దేవునికి ప్రార్థించవలెను. మనము దేవుని యొద్దకు వెళ్ళి మరియు పరిష్కారము పొందునట్లు, ఆయన కొన్ని సమస్యలను అనుమతించును. ప్రభువైన యేసు వలె మనము తుఫానును ఎదుర్కొననియెడల విసుగుగా ఉండును. కాబట్టి ప్రార్థించుడి మరియు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ప్రార్థించుడి.
జ్ఞానము మరియు సహాయముకొరకు దేవుని వెదకుడి:
శారీరకముగాగాని చదువువిషయములోగాని లేక ఆత్మీయుగాగాని లేక మరీ ఏ విషయములో అయిననూ మిమ్ములను ఏదియు నిరాశ పరచనీయకుడి. నిరాశ ఎల్లప్పుడు సాతాను యొద్దనుండి వచ్చునుగాని దేవునియొద్ద నుండి రాదు. మనము పాపము చేయునట్లు మొదటిగా సాతాను నిరాశపరచును. మీరు జాగ్రత్తగాలేనియెడల, ఒంటరితనము మరియు ఇంటిద్యాస మిమ్ములను నిరాశపరచును. వాటితో మీరు పోరాడి జయించవలెను. దేవుడు మీకు కృపనిచ్చును. మీకు తెలిసినవిధముగా ప్రతీరోజు మీ కొరకు ప్రార్థించుచున్నాను.
మీరు చూడలేని అపాయములను మరియు మీరు తలంచని వాటిని దేవుడు మీకు ముందుగానే చూపించునుగాక. ప్రభువు మీకు జ్ఞానమునిచ్చి కాపాడును గాక.
విశ్వాసముతో అడిగిన వారికి దేవుడు జ్ఞానమును వాగ్దానము చేశాడు (యాకోబు 1:5). మీరు అడగనియెడల పొందరు. లేక మీరు అవిశ్వాసముతో అడిగినను జ్ఞానము పొందరు.
మీరు ఎక్కువ డబ్బు సంపాదించవలెనని కాదుగాని దేవుడు క్రీస్తువలె రూపాంతరము చెందవలెనని కోరుచున్నాడని గుర్తుంచుకొనుము. భూసంబంధమైన ప్రతిఅవసరం దేవుడు తీర్చును. కాని అది ప్రాముఖ్యముకాదు. ఎందుకనగా లోకస్థులు డబ్బు ఎక్కువ సంపాదించుకొనునట్లుగా దేవుడు అనుగ్రహించును మరియు మనము కాదు (పస్రంగి 2:26).
ఆర్థికవనరులను నిర్వహించుట మరియు జీవితములో సమతుల్యతను కలిగియుండుట:
ఆర్థిక విషయములు నిర్వహించుటకు మీరు విద్యార్థిగా ఉన్నప్పుడే నేర్చుకొనవలెను.
మేము ఇంటిలో ఏవిధంగా జీవించియున్నామో మీరు చూచియున్నారు. మేము అవసరములో ఉన్నప్పటికిని, అవసరమలో ఉన్నామని ఇతరులకు తెలిసేటట్లుగా మేము చేయలేదు. నేను కొంచెమే కలిగియున్నను దేవునినే నమ్మియున్నాను. అనేక సంత్సరముల క్రితము మేము కొద్దిగా పెట్టుబడిపెట్టిన దానిని దేవుడు ఎంతో ఆశీర్వదించెను. ''ఆ తొట్టిలో ఉన్న పిండి మరియు నూనె అయిపోదని'' (2 రాజులు 17:14-16) మాకు వివాహము జరిగినప్పటినుండియు దేవుడు ఎంతో నమ్మకముగా మరియు మాయొక్క అవసరము తీర్చెను.
మీరు ఒక బీదబోధకుని కుమారులని అభిప్రాయము ఇతరులకు కలిగించకూడదు. మీరు ధనవంతులైన పరలోకపుతండ్రి కుమారులు. కాని మీరు ధనవంతుల పిల్లలవలే డబ్బును వృథా చేయకూడదు. ఎందుకనగా మనము మితముగా జీవించవలెనని దేవుడు బోధించియున్నాడు. కాని మనము కుటుంబముగా జీవించిన విధానాన్నిబట్టి ఎప్పుడును గర్వించము. అదే సమయములో, వారియొక్క సంఘములపై ఆధారపడుచున్న బోధకులను తీర్పుతీర్చము. కాని ప్రభువైనయేసువలె ఆర్థిక విషయములలో జీవించవలెనని మేము కోరుచున్నాము.
మీరు డబ్బును సంపాదించుట ఆరంభించినప్పుడు, మీరు మితముగాను, జాగ్రత్తగాను ఉండవలెను. మరియు పిసినిగొట్టులుగా ఉండకూడదు. మీరు అనవసరమైన వాటికి ఖర్చుచేయకూడదు. అప్పుడు దేవుడు మీకు ఆత్మీయఐశ్వర్యములను ఇచ్చును. పిసినిగొట్టులుగా ఉండుటలోను మితముగా ఉండుటలోను ఉన్నతేడాను దేవునియొద్ద నుండి నేర్చుకొనుము. మరియు ఇప్పుడు మీ ఉద్యోగముగురించియు, చదువుగురించియు ఒక మాట చెప్పెదను. మీరు సరియైన ప్రాధాన్యతలు కలిగియుండుట ముఖ్యము. ముఖ్యమైన విషయముల గురించి సమయమును వెచ్చించుచు మరియు ప్రాముఖ్యతలేని విషయాలు తరువాత చేయుము. ఆ విధముగా మీ యౌవనజీవితములో సమయమును సంపాదించుకొందురు. ప్రాముఖ్యతను బట్టి పని చేయుటకు దేవుడు మీకు జ్ఞానము ఇచ్చునుగాక.
మీయొక్క చదువులు మరియు ఉద్యోగములకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఎందుకనగా మీరు ఉద్యోగములో చాలా సమయం గడపవలెనని దేవుడు ప్రణాళిక వేసెను. మనయొక్క అనుదినఆహారము కొరకు ప్రార్థించమని ప్రభువు చెప్పాడు. అనగా మీ చదువుల కొరకును మీ ఉద్యోగముల కొరకు ప్రార్థించాలి. ప్రభువైనయేసుకు నజరేతులో 12 నుండి 15 సంవత్సరములు వడ్రంగిపని చేసి తండ్రిని మహిమ పరచినట్లుగా మీకు కూడా మీ చదువునుబట్టి ఉద్యోగమునుబట్టి దేవునిని మహిమపరచాలి. అయినప్పటికి ఆయనవలె ఎల్లప్పుడు నిత్యత్వపు విలువలతో పనిచేయవలెను.
ప్రభువు కొరకు నిలిచియుండుట:
దేవునితో ఉన్న ఒక వ్యక్తి ఎల్లప్పుడు ఎంతో మందితో సమానము. మీరు దీనులై ఉండి, ప్రేమించుచు, పవిత్రులైయున్నయెడల మీ ద్వారా దేవుడు ఎంతో చేయగలడు. కాబట్టి ఎల్లప్పుడు ఈ విషయములలో నిలచియుండుడి, ఒక పాటలో చెప్పినట్లుగా, ''ప్రభువైన యేసు కొరకు మీరు తప్ప వేరేవారు చేయలేని పరిచర్యఉన్నది''.
ఆ విధంగా మీరు ఎల్లప్పుడు దేవునికొరకు దప్పికకలిగి వెలిచూపుతో కాక విశ్వాసముతో జీవించుదురుగాక. మీరు ఎల్లప్పుడు ఇతరుల విషయములో మంచిగాను కృపాసహితముగాను ఉండెదరని ఆశించుచున్నాను. ఆవిధముగా మీరు అనేకమంది స్నేహితులను కలిగియుండెదరు. మరియు అది దేవునిఎదుట కూడా మంచి సాక్ష్యమైఉన్నది. మీ స్నేహితులు ఎల్లప్పుడు మీతో సంతోషముగా ఉండునట్లు మీరు ఎల్లప్పుడు నిరాశను జయించునట్లు కృప కొరకు దేవునిని అడుగుము. నిత్యత్వములో భూమిమీద కలుసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించెదరుగాక.
అవసరములో ఉన్నవారియెడలను మరియు ప్రభువుని యథార్థముగా సేవించుచున్న వారియెడల మీరు విశాలహృదయం కలిగియుండాలని ప్రార్థించుచున్నాను. వారియెడల మీరు చూపుచున్న మంచితనమును బట్టి ప్రభువు ఎంతో బహుమానము ఇచ్చును. కాని మోసపూరితమైన బోధకుల విషయములోను మరియు బహుమానము కొరకు చూచే బోధకుల విషయములోను జాగ్రత్తగాఉండుడి. అటువంటి వారికి దూరముగా ఉండుడి.
''యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము'' అను హెచ్చరికను ఈ లోకములో ఉన్నంత కాలము వినుచుండవలెను. ఒక వ్యక్తి ఈ విధముగా చెప్పారు, ''శోధన అగ్నివంటిది. 100 సంవత్సరముల వ్యక్తిని కూడా అది కాల్చగలదు''. యౌవనేచ్ఛలనుండి పారిపొమ్మని ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ చెప్పుచున్న స్వరమును స్పందించిన రీతిగానే నిత్యత్వములో మీరు సంతోషముతో గాని చింతనుగాని పొందెదరు. కాని మీరందరు సంతోషించవలెనని ప్రార్థించుచున్నాను.
తనను ఘనపరచువారిని దేవుడు ఘనపరచును:
మా యొక్క పుట్టినరోజున మీరు శుభాకాంక్షలు చెప్పినప్పుడు, తల్లిదండ్రులుగా మీరు మాకు ఇచ్చే విలువలనుచూచి సంతోషించుచున్నాము. మీరు మమ్ములను మెచ్చుకొన్నప్పుడు ఎంతో సంతోషించుచున్నాము.
కుటుంబముగా మనము ఎదుర్కొను ప్రతిపరీక్షను ఎదుర్కొనుటకు కావలసిన కృపను అనుగ్రహించినందున ప్రభువుకి కృతజ్ఞత కలిగియున్నాను. అనేకమంది మన విషయములో అసూయపడినందున మనలను ఇబ్బంది పెట్టుటకు సాతాను వారిని ప్రేరేపించాడు. కాని మనము దేవుని యొక్క కృపద్వారా సాతానును జయించి మరియు మన గురించి చెడుగా మాట్లాడి మరియు కీడు చేయవలెనని కోరినవారియెడల మంచి వైఖరిని కలిగి ఉండుటకు సహాయపడెను. అయినప్పటికి ఒక్కరు కూడా కీడు చేయలేకపోయిరి. రోమా 8:28లో వాగ్ధానం చేసినప్రకారము, సమస్తము సమకూడి మనమేలు కొరకే జరిగించియున్నాడు. ఇతరులు మన గురించి చెడ్డ మాటలు చెప్పినప్పుడు మనము చెడ్డవారము కాలేము మరియు మనగురించి మంచి విషయములు చెప్పు వారిని బట్టి మంచివారము కాలేము. ఇతరులు మనగురించి ఏమి చేసినను లేక ఏమి చెప్పినను ప్రతిదినము మన సిలువనెత్తుకొని ప్రభువైన యేసును వెంబడించుచు మరియు ఆయనవలె మనము స్పందించిన యెడల మనము ఆయనవలె అగుదుము.
మనయొక్క అనేక గత పొరపాట్లు మరియు గొప్ప ఓటములు. ఇప్పుడు మనము పూర్ణహృదయముతో దేవుని వెంబడించుటద్వారా దేవుని యొక్క సంకల్పం మన జీవితములో నెరవేర్చబడకుండా ఆపలేవు. నేను క్రొత్తగా జన్మించిన తరువాత అనేకసార్లు ప్రభువుని బాధించితిని. కాని 1975వ సంవత్సరములో (నాకు 36 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మరియు మన ఇంటిలో సంఘముగా కలుసుకొనుటకు ఆరంభించినప్పుడు) నా వలె ప్రభువుని బాధించని వానివలె ఉండవలెనని కోరియున్నాను. మరియు ఈనాడు అనేక సంవత్సరముల తరువాత, దేవుడు నాకు కృపను ఎంతో ఎంతో ఎక్కువగా అనుగ్రహించి నేను తీసుకొనిన నిర్ణయము ఘనపరిచెను. కాబట్టి ఏ నేరము చేయనివారినిగాని లేక ఎప్పుడైననూ పడిపోనివారినిగాని లేక ఓడిపోనివారినిగాని దేవుడు ఏర్పరచుకోడని తెలుసుకొనియున్నాను. కాని ఎంత ఎక్కువగా ఓడిపోయెదమో అంత ఎక్కువగా దేవుడు వాడుకొనెను. కాబట్టి మన సంఘమునకు వచ్చే అత్యంత ఘోరపాపుల విషయములో కూడా నిరీక్షణఉన్నది.
తన యొక్క బిడ్డ చనిపోయినప్పటికిని, సారెపతి స్త్రీని ఎలీషా, ''నీవును నీ బిడ్డయు బాగున్నారా''అని అడిగినప్పుడు, బాగున్నామని ఆమె చెప్పింది (2 రాజులు 4:8,26). ఎంత అద్భుతమైన విశ్వాసముతో ఆమె ఆవిధంగా చెప్పింది. తన బిడ్డను తిరిగిలేపుటద్వారా దేవుడు ఆమె విశ్వాసమును ఘనపరిచాడు. ఆయనను నమ్మినవారికి ఆయన ఎన్నో అద్భుతకార్యములు చేయును. ఎటువంటి పరిస్థితులలో అయిననూ దేవుడు వారిని సిగ్గుపరచలేదు. మీరు ఎంతో ఎక్కువగా ఓడిపోయినప్పటికి లేక కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులలో వెళ్ళినప్పటికిని, ఎల్లప్పుడు దేవునియందు విశ్వాసముతో జీవించెదరుగాక. ఎటువంటి మృతమైన పరిస్థితిలో అయిననూ ప్రభువు పునరుత్థానము తేగలడని గుర్తుంచుకొనుము. యథార్థముగా ఉండుట ఒక్కటే మీరు చేయవలసియున్నది. ఏ మానవునికైనను మీ పాపములు ఒప్పుకొననవసరము లేదు. కాని ప్రభువుయెదుట యథార్థముగా ఉండవలెను.
ఇతరులను ఆశీర్వదించుటకు ఆశీర్వదించబడియున్నాము:
మనము ప్రభువుచేత ఆశీర్వదించబడుటకును మరియు భూమిమీద మనము కలుసుకొనే ప్రతికుటుంబమునకు మరియు ప్రతివ్యక్తికి ఆశీర్వాదకరముగాఉండుటకు పిలువబడియున్నాము. ప్రభువైనయేసు మన కొరకు సిలువమీద శాపగ్రస్తుడుగా మారి అబ్రాహాముయొక్క ఆశీర్వాదము అనగా పరిశుద్ధాత్మఅను వరమును మనకు అనుగ్రహించెనని గలతీ 3:14 చెప్పుచున్నది. ఆదికాండము 12:2,3లో అబ్రాహాము పొందిన ఆశీర్వాదము చూచెదము. ''నేను నిన్ను ఆశీర్వదించెదను మరియు భూమియొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును''. అందువలన పరిశుద్ధాత్మతో నింపమని మనము ఎల్లప్పుడు దేవునిని అడిగెదము.
ఇది మీయొక్క స్వాస్థ్యము కాబట్టి రాబోయే సంవత్సరములలో ఎల్లప్పుడు ఈవిధముగా జీవించేదానిని పొందుకొనుము. ఈ ఆశీర్వాదమనే ప్రవాహము ఆగిపోకుండునట్లు మీరు ఎల్లప్పుడు మారుమనస్సు పొందుచూ, పాపము ఒప్పుకొనుచూ మంచి మనస్సాక్షి కలిగియుండుడి.
మొదటిగా, మీరు చేసే ప్రతీ పనిలో అనగా ఆత్మీయముగాను శారీరకముగాను వస్తువాహనముగాని, ఉద్యోగములోను, ప్రతీ విషయములోను దేవుడు మిమ్మును ఆశీర్వదించవలెనని కోరుచున్నాడు.
''మీరు చేయునదంతయు సఫలమగుననియు'' (కీర్తన 1:3), ''నీ మార్గమును వర్ధిల్ల చేసెదననియు'' దేవుడు వాగ్ధానము చేసియున్నాడు. ఈ క్రొత్తనిబంధన యుగములో మీయొక్క ఆత్మీయజీవితములోను మరియు భూలోకజీవితములోను దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరచి విజయవంతముగా చేయునుగాక. కాని పాతనిబంధనలో కేవలము భూలోక సంబంధమైన ఆశీర్వాదము నిచ్చును.
రెండవదిగా, మీ జీవితముద్వారా దేవుడు ఇతరులను ఆశీర్వదించవలెనని కోరుచున్నాడు. మీలో ఇతరులు దేవుని జీవము రుచిచూడవలెను. ఆవిధముగా మీరు కొందరికి జీవపు సువాసనగాను మరియు దేవుని విసర్జించువారికి మరణపు వాసనగా ఉండెదరు (2 కొరింథీ 2:16).
ఇది నెరవేరుటకు, మీరు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుటకు ఎల్లప్పుడు ఆసక్తితో ప్రార్థించవలెను.
ఇతరులమీద ఆధారపడకుండా ప్రభువుని సేవించుటకొరకును మరియు మన అవసరములకొరకును ఉద్యోగము చేసెదము. కాని భూమిమీద ఈ కొద్ది జీవితములో సాధ్యమైనంతవరకు ఎక్కువ మందికి ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆసక్తి కలిగియుండవలెను.
ఇండియాలోని గొప్పబోధకులు పెద్దపట్టణములలోనే బోధించెదరు. కాని గ్రామములో ఉన్న సామాన్యమైన బీదవారితో మరియు చదువురానివారితో కూర్చుని మాట్లాడుటకు వారికి సమయము ఉండదు. కాని ఇండియాలోని గ్రామములలో ఉన్న బీద ప్రజలకు సువార్త చెప్పి మరియు సేవించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించెను. నేను అక్కడ జయజీవితమును గురించి సువార్తను ప్రకటించినప్పుడు, ప్రభువు అక్కడ సంఘములను నిర్మించియున్నాడు. మీ తల్లి అక్కడ బీద స్త్రీలకును పిల్లలకును ఉచితముగా చికిత్స చేయును. వారికి పరిచర్యచేయుట ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడియున్నాము. మరియు అద్భుతరీతిగా మన యొక్క టేపులు పుస్తకములు అనేకప్రదేశములకు వెళ్ళెను. అవి అన్ని ఖండములకు అనగా భూదింగతములవరకు వెళ్ళెను (అపొ.కా. 1:8). అనేకమంది బోధకులు వారి సంఘములలో బోధించుటకు మన యొక్క పుస్తకములను, టేపులను వాడుచున్నారు. అలాగే నేను వెళ్ళని సంఘములకు కూడా వాక్యము వెళ్ళుచున్నది. దేవునికి స్తోత్రము. మేము జీవించినంతవరకు మా యొక్క పుస్తకములు పంచిపెట్టమనియు మరియు దాని ద్వారా డబ్బు సంపాదించవద్దని ప్రోత్సహించుచున్నాను.
స్పూర్తినిచ్చు రెండు పద్యములు:
కొంతకాలం క్రితం నాకు స్పూర్తినిచ్చిన రెండు పద్యములు:
నేను పళ్లెము నుండి త్రాగుచున్నాను
నేనెప్పుడు ఆస్థి సంపాదించలేదు, ఇప్పుడు సంపాదించబోను
అది ముఖ్యము కాదు, ఎందకంటే నేను సంతోషిస్తున్నాను
నేను ప్రయాణిస్తుండగా, నేను విత్తినదాని కంటే మెరుగైన పంటను కోస్తున్నాను
నా గిన్నె నిండి పొర్లియున్నది గనుక నేను పళ్లెము నుండి త్రాగుచున్నాను.
నాకు ఆస్థిపాస్థులు లేవు కొన్నిసార్లు మనుగడ కష్టముగా నుండును
అయితే నన్ను ప్రేమించే పిల్లలు నాకుండగా, నేను ధనికుడనే
దేవుని కనికరము నాకిచ్చిన ఆశీర్వాదములకై ఆయనకు కృతజ్ఞతలు
నా గిన్నె నిండి పొర్లియున్నది గనుక నేను పళ్లెము నుండి త్రాగుచున్నాను.
మార్గము కష్టమైనప్పుడు దేవుడు బలమును ధైర్యమునిచ్చును
నేను ధన్యుడను గనుక ఇతర దీవెనలను నేనడుగను
ఇతరుల భారములను ఎత్తుటకు నేను సహాయపడెదను
అలా చేయుటకు నాకు తీరిక కలుగును గాక.
నా గిన్నె నిండి పొర్లియున్నది గనుక నేను పళ్లెము నుండి త్రాగుచున్నాను.
(తెలియబడని రచయిత)
దేవుని శ్రేష్ఠమైన ఈవులు
పరీక్షను ఎదుర్కొనే సాహసం చేసేవారికి దేవుడు శ్రేష్ఠమైన ఈవులనిచ్చును
శ్రేష్ఠమైన ఈవులను కోరుకొనని వారికి ఆయన మెరుగైన వాటినే ఇచ్చును
వాగ్దానము చేయబడిన విశ్రాంతిని పోగొట్టుకొనుటకు బహిరంగ పాపమే కారణము కాదు
మెరుగైన దానిని ఎంచుకొనుట శ్రేష్ఠమైన వాటిని మనకు దూరముగా నుంచును
దీవించబడాలనే కోరిక లేనివారు ఎవరూ ఉండరు
ప్రభువా, నాకు కావలసినది నీ దీవెన మాత్రమే కాదు నీ శ్రేష్ఠమైన ఈవులు
కొందరు దేవుని శ్రేష్ఠమైన ఈవులను వెదకెదరు కాని, శోధనలు వచ్చినప్పుడు
వారు వెనుకాడి, సిలువను కాదని దేవుని శ్రేష్ఠమైన ఈవులను కోల్పోతారు.
నాకున్న ఈ చిన్న జీవితములో సాధ్యమైనంతవరకు దేవునికి మనుష్యునికి
నిజమైన సేవను చేయాలనుకొనుచున్నాను. నాకు దేవుని శ్రేష్ఠమైన ఈవులు కావాలి.
ప్రభువా నీ ఉన్నతమైన వాటిని నాకిమ్ము, ఇతరులు తక్కిన వాటిని తీసుకొననిమ్ము.
వారికున్న మంచి వస్తువులు నాకక్కరలేదు, నీవిచ్చే శ్రేష్ఠమైన ఈవులు నాకు కావలెను.
జయించు వారి మధ్యన నా పేరు ఒప్పుకోబడాలని నేను కోరుకొనుచున్నాను
''భళా, నీవు నా శ్రేష్ఠమైన ఈవులను పొందితివి'' అని నా ప్రభువు చెప్పాలని కోరుచున్నాను.
(ఎ.బి.సింప్సన్)
మీరందరు కూడా ప్రభువు కొరకు శ్రేష్ఠమైనవారిగా యుందురుగాక.
మీ జీవితములకు దేవున్ని పరిపాలకుడిగా చేయుడి:
మీరు ఎల్లప్పుడు దేవునిరాజ్యమును మరియు ఆయననీతిని వెదకునట్లు మీ కొరకు ప్రార్థించుచున్నాను. అప్పుడు మీరు చేయునదంతయు సఫలమగును మరియు దేవుడు పరాక్రముగల శూరునివలె మీకు తోడైయుండును (యిర్మీయా 10:11). నా జీవితకాలమంతయు దీనిని అనుభవించాను.
దేవుని రాజ్యమును వెదుకుట అనగా కేవలం సువార్త చెప్పుటకాని, పరిచర్య చేయుటగాని కాదు. దేవునిని మీరు ప్రభువుగా అంగీకరించి, ధనాపేక్షనుండియు భూసంబంధమైన సుఖబోగములనుండియు, మనుష్యుల యొక్క ఘనతనుండియు మీరు విడుదల పొంది, ఎల్లప్పుడు దేవునిని మీకు ప్రభువుగా ఉంచుకొని మరియు మీలో పరలోకవిలువలు కలుగునట్లుగా చేయును.
దేవునినీతిని మొదటగా వెదుకుట అనగా, మీ అంతరంగజీవితములో దేవుని స్వభావం బయలుపరచునట్లు మీరు ఎల్లప్పుడు దప్పికకలిగి మరియు ఆ విధముగా ప్రవర్తించుడి.
జీవితకాలమంతయు సత్యముచేత పట్టుబడుదుముగాక. దానిని మీలో నేను చూచినట్లయితే, సంతోషముగా ఈ లోకమును విడిచిపెట్టెదను.
మరియు మీకు పిల్లలు ఉన్నప్పుడు, వారి జీవితములో కూడా ఇది జరుగునట్లు, ఈ సత్యమును వారికి బోధించాలి. ఆవిధముగా ప్రభువు వచ్చు పర్యంతము తరతరముల వరకు మన కుటుంబము సాక్ష్యముగా నుండును.
సిద్ధాంతముగురించి కాదుగాని దేవునిజీవము కలిగి ఉండవలెను:
నీతియు యథార్థమైన భక్తిగలవారై ఉండవలెనని పౌలు చెప్పుచున్నాడు. ఇవి సిద్ధాంతములను అర్థము చేసుకొనటవలన కాదుగాని మనకు జీవమైయున్న యేసే మనలో జీవించుటద్వారా జరుగును. 1 తిమోతి 3:16 ప్రకారము ప్రభువైనయేసు శరీరధారియైవచ్చుట సిద్ధాంతముకాదుగాని కాని యేసే మనలోనికి వచ్చుటద్వారా దైవభక్తి కలిగియుందుము. సిద్ధాంతముద్వారా కాదుగాని ప్రభువైన యేసునేచూచుట ద్వారా ఆయన సారూప్యములోనికి మార్పుచెందెదము (2 కొరింథీ 3:18). మీ జీవితాంతము వరకు దీనిని గుర్తుపెట్టుకొనుడి.
మీరు యేసువైపు మాత్రమే చూడనియెడల మరియు ఆయనను ప్రేమించువారందరిని ప్రేమించని యెడల వారు ఏ సంఘస్థులైనను, వారు ఏ సిద్ధాంతమును నమ్మినను మీ సిద్ధాంతములన్నియు తప్పిపోయేటట్లు చేయును. క్రీస్తు యొక్క శరీరమునకు ఆయనే శిరస్సయి ఉన్నాడు. కాని సిద్ధాంతమే వారి శిరస్సైన యెడల వారు పరిసయ్యులగుదురు. ఎంతమంచి సిద్ధాంతం కలిగియుంటే అంత ఎక్కువ పరిసయ్యులు అగుదురు. ఈ పాట ఎల్లప్పుడు గుర్తుపెట్టుకొనుడి (ఒకప్పుడు కేవలం ఆశీర్వాదం, కాని ఇప్పుడు ప్రభువు మాత్రమే).
యోహాను 8:1-12 లో వ్యభిచారములో పట్టబడిన స్త్రీకి విరోధముగా ఉన్న పరియసయ్యుల విషయములో ప్రభువైనయేసు తన తండ్రిని చూపినట్లు, మనము కూడా సంఘముగా యేసును చూపించాలి. ప్రభువైనయేసు భూమిమీద అత్యంతప్రమాణముతో పరిశుద్ధతను బోధించినప్పటికి, అత్యంత ఘోర పాపులతో కూడా కలిసిపోయెను (ఉదాహరణ: పునరుత్థానుడైన యేసునుచూచే ధన్యత మరియ మగ్దెలెకు కలిగింది). ఆయన ఒక్కసారి కూడా పాపులను విమర్శించలేదు లేక వారి యొక్క గతమును గూర్చి వారికి గుర్తుచేయలేదు. మనముకూడా సంఘముగా పిలువబడి యేసువలె పరిశుద్ధతను ప్రకటించి మరియు అత్యంత ఘోరపాపులను, వెనుకకు దిగజారిపోయిన వారిని చేర్చుకొని, వారిని ఆయన యొద్దకు ఆకిర్షింపచేయుదము.
మన సంఘము ఒక హాస్పిటల్‌వలె ఉండి, ఎటువంటి జబ్బులున్న వారినైనను చేర్చుకొనును. సాయము పొందలేనంతగా ఏవరూ చెడిపోలేదు. ధనవంతులు మరియు తమను తామే తృప్తిపరచుకొనే వారితో ఉండిన క్లబ్‌ల వంటి సంఘములున్నవి. కాని అత్యంత ఘోరపాపులను చేర్చుకొనే హాస్పిటల్‌గా మనము ఉండవలెను.
నిరాశగాని నేరారోపణగాని లేదు:
క్రైస్తవజీవితములోని క్రమశిక్షణ గురించి కొన్ని తలంపులు పంచుకొనెదను. క్రమశిక్షణ అంత సులభము కాదు గాని మీరు ఆత్మీయులగుటకు అది అవసరము. ఒకవేళ మీరు క్రమశిక్షణ లేనివారిగా యున్నట్లయితే దానినిబట్టి నిరాశపడవద్దు లేక దానిని బట్టి నేరారోపణలో ఉండవద్దు. ఎందుకంటే క్రమశిక్షణ లేకపోవుట కంటే నిరాశ మరియు నేరారోపణలో ఉండుట చాలా చెడ్డది. కాబట్టి మీరు గతమును మరచిపోయి మరియు రాబోయే కాలములో క్రమశిక్షణ కలిగియుండుటకు సహాయముకొరకు ప్రార్థించుడి.
మనలను ఉన్నపాటున దేవుడు అంగీకరించి మరియు మనలను క్రీస్తులో నుంచెను. కాబట్టి మనము క్రమశిక్షణ లేనందువలన శ్రమపడినను ముందుకే సాగిపోవాలి. పాపమును నిందించి మరియు దేవుని చిత్తము చేయుటయే ఈ లోకములో చాలా ముఖ్యమైయున్నది. ఈ రెండు విషయములను సరిగా చేసినట్లయితే 99.9 శాతం సరిగాఉన్నట్లు. ఈ రెండు విషయములలో పరిపూర్ణముగుటకు సాగిపోవాలి. డబ్బును పోగొట్టకొనుట అంత ప్రాముఖ్యమైనది కాదు. మనము ఓడిపోయినప్పుడు అనగా వెయ్యిసార్లు ఒకే పాపములో పడిపోయినప్పటికిని తరువాత ఆ విషయములో శ్రేష్టముగా చేయగలుగునట్లు దేవునికి ప్రార్థించాలి. దేవుడు ఎంతో మంచివాడు మరియు నిశ్చయముగా ఆయన మనకు సహాయపడును.
జ్ఞానము:
క్రైస్తవ జీవితములో జ్ఞానము అత్యవసరమైయున్నది. జ్ఞానము కొదువగా ఉందని ఎరుగుటయే దానిని పొందుటకు మొదటి అర్హత (యాకోబు 1:5). చిన్నవారికైనను లేక పెద్దవారికైనను ఆవిధముగా ఒప్పుకొనుట కష్టము. కాని ఎల్లప్పుడు ఎవరైతే ఒప్పుకొనుచుండెదరో, అటువంటి వారికి జ్ఞానము సమృద్ధిగా ఇవ్వబడుతుంది. కాబట్టి దైవిక జ్ఞానము కొదువగా ఉన్నదని ఒప్పుకొనుటయే గొప్పజ్ఞానము. మీ యొక్క ప్రతిసంబంధ విషయములో మరియు ప్రతిపరిస్థితి విషయములో కావలసిన దేవుని జ్ఞానముతో మీరు నింపబడునట్లును, ఆవిధముగా ఒప్పుకొనుటకు దేవుడు మీకు కృపను ఇచ్చునుగాక. దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు మరియు ఆయన మార్గములు పరిపూర్ణమైయున్నవి మరియు మన యొక్క మార్గములు కూడా పరిపూర్ణము చేయును.
మీ జీవితములో ఎదురయ్యే కష్టములను బాధలను వృథా చేయవద్దు. ప్రతి దానినుండి కొంత మహిమను పొందవలెను. మరియు మన సంఘములో వినుదానిని గుర్తుపెట్టుకొనుడి. అదేమనగా మనలను జ్ఞానవంతులుగా చేయునట్లయితేనే గతమును గూర్చి ఇతరులతో మాట్లాడవలెను. మరియు భవిష్యత్తు కొరకు పూర్ణహృదయముతో ఎదురుచూడవలెను. కాని ''ఈ విధంగా ఉన్నట్లయితే'' లేక ''ఈ విధముగా లేనట్లయితే'' బాగుండేదని గతము గురించి నిరాశపడకూడదు. దేవుడు ఎంతో రహస్యమార్గములలో పనిచేయుచు మరియు మన ఓటములను మరియు మనతప్పిదములను కూడా ఆయన నామమహిమార్థము ఉపయోగించును. ఈ విధముగా ఆయన మనలను విరుగగొట్టి, యేసువలె రూపాంతరపరచును. మనము పాఠములను నేర్చుకొనినయెడల, వెనుక ఉన్నవాటిని మరిచి ముందుకు సాగెదము. మనము ఎదుర్కొనుచున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనములు చెప్పవలెను. కాబట్టి ప్రభువుకు స్తోత్రములు.
మీరు దేవునిచిత్తము నెరవేర్చుటకు ఆటంకముగా ఉన్న పర్వతమును యేసు నామములో మీరు ఆజ్ఞాపించినయెడల అది తొలగిపోవును (మార్కు 11:22-25). దీనిని గుర్తుపెట్టుకొనుడి. ప్రతి పర్వతము మీ విశ్వాసమును సవాలు చేయును మరియు మిమ్ములను వెనుకకు తిరుగునట్లుగా చేయదు.
కృపద్వారా రక్షణ పొందుట:
దేవుడు మనలను అంగీకరించియున్నాడని మనము నిశ్చయత కలిగియుండవలెను. మీరు రోమా మరియు గలతీ పత్రికలలో చదివినయెడల, నిత్యజీవము దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన వరమే అని పౌలు స్పష్టముగా చెప్పియున్నాడు (రోమా 6:23) మరియు దానిని ఎన్నటికిని మనము సంపాదించుకొనలేము. ఎవరైనను వేరొక సువార్త ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడని చెప్పాడు (గలతీ 1:8). విశ్వాసము ద్వారా కృపచేతనే ఉచితముగా రక్షణపొందెదము. ఈ సత్యమును అనేకులు దుర్వినియోగపరచి మరియు విశ్వాసులు కూడా ధర్మశాస్త్రము నెరవేర్చాలని తప్పుడుబోధ చేయుచున్నారు. కాని కృపను దుర్వినియోగపరచువారిని మరియు రక్షణవిషయములో అభధ్రతలో నివసించువారిని సాతాను జయించునని నేను తెలుసుకొనియున్నాను.
రక్షణగురించి అభద్రతకలిగియుండుట కృపను దుర్వినియోగము చేసినంత చెడ్డది కాదు. ఎందుకనగా ఆ తలంపుల ద్వారా రక్షణ పోగొట్టుకొనడు. కాని అవి దేవునికి మనలను పనికిరాకుండా చేయును. ప్రభువైనయేసు రక్తములో మన పాపములన్నియు కడగబడిన తరువాత కూడా మనము పవిత్రులము కామనుకొనుట అవిశ్వాసము. నిజానికి ఆవిధముగా క్రీస్తురక్తము కంటే పాపములను హెచ్చించుచున్నాము కనుక దేవునిని అవమానపరచుచున్నాము.
కృప మొదటిగా పాపములను క్షమించును. తరువాత పాపములో పడకుండా చేయును (రోమా 6:14). ఇదియే నిజమైన దేవుని కృప (1 పేతురు 5:12). దేవుని యొక్క ఈ సంపూర్ణకృపను నమ్మినవారు అవిశ్వాసులమధ్య గొప్ప పరిచర్య చేయగలరు.
క్రీస్తు మనద్వారా పనిచేయగలరు:
ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది
''ఒకే ఒక్క జీవితము - అది త్వరగా గతించిపోవును
క్రీస్తు మనద్వారా చేయునది మాత్రమే నిత్యత్వములో నిలుచును''.
''క్రీస్తు కొరకు మనము చేసినది మాత్రమే నిత్యము నిలుచును'' అనుదానిని నేను కొంచెము మార్చివ్రాసియున్నాను. ఎందుకనగా ఈనాడు క్రీస్తుకొరకు చేయునదంతయు దేవుని చిత్తప్రకారము జరుగుటలేదు. ఒక వ్యక్తి తన సొంత ఆసక్తినిబట్టి దేవునియొక్క నడిపింపులేకుండానే పరిచర్యచేయును. ఉదాహరణకు దేవునిచేత పిలువబడకుండానే అవసరమును బట్టి ఒక వ్యక్తి పూర్తికాలపు పరిచర్యచేయుట. ఇది త్యాగపూరితమైనప్పటికిని దేవునికి బలులు అర్పించుటకంటే మాట వినుట శ్రేష్టము (1 సమూయేలు 15:22).
కొంతమంది మన సంఘమును విడిచి వెళ్ళినప్పుడు నేను బాధపడను ఎందుకనగా పరలోకములో కూడా మూడువంతుల దూతలు ఖాళీ చేయబడిరి (పక్రటన 12:3,4 మరియు యోబు 38:7). ఆవిధముగా జల్లించుట ద్వారా పరలోకము పవిత్రపరచబడింది. ప్రభువైన యేసు యొక్క బోధ వినునప్పుడు కూడా అనేకులు ఆయనను విడిచిపెట్టియున్నారు. మరియు చివరికి 11 మంది మాత్రమే మిగిలియున్నారు (యోహాను 6:60,66,70). ఈ 11 మంది పరిపూర్ణులుకాదు గాని యథార్థవంతులు.
నిషేధించబడుటలోకి నడిపించబడవద్దు:
శోధనకు మరియు పాపమునకు ఉన్నతేడా అనేకమంది విశ్వాసులు అర్థంచేసుకొనుట లేదు. శోధనలో మనముఎంత నమ్మకముగా పోరాడితే, అంత సలుభముగా జయించవచ్చని వారు అర్థం చేసుకొనుటలేదు.
వారియొక్క గతజీవితములో వారికి వచ్చిన శోధనలలో విశ్వాసులు అనేకరీతులుగా స్పందించియున్నారు. ఉదాహరణకు రక్షణపొందక మునుపు సిగరెట్లు తాగినవారు లేక మద్యపానము చేయువారు లేక చెడుగామాట్లాడువారు రక్షణపొందిన తరువాత కూడా ఆ విషయములలో పోరాటము కలిగియుండెదరు. కాని మీరు ఆవిషయములలో ఎందుకు పోరాడుటలేదు? ఎందుకనగా గతములో మీకు ఆ అలవాట్లులేవు.
ప్రభువైనయేసు ఒక్క శోధనకు కూడా లోబడలేదని మనకు తెలియును. కాబట్టి ఆయన శోధన ఏవిధముగా ఎదుర్కొనియున్నాడో మనకు తెలియదు. మరియు ఆయన యొక్క అంతరంగ జీవితము తెలుసుకొనుటకు మనము ప్రయత్నించకూడదు. బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరిచిచూడగా దేవుడు వారిని హతముచేసెను (1 సమూయేలు 6:19). అదేవిధముగా క్రీస్తుయొక్క అంతరంగజీవితము చూచుటకు ప్రయత్నించకూడదు ''రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును'' (ద్వితీయోపదేశకాండము 29:29).
2 యోహాను పత్రిక ఈ తప్పులోని రెండు విషయములను బయలుపరచుచున్నది. మొదటిది: ''యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు'' (2 యోహాను 7) మరియు రెండవది ''క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు'' (2 యోహాను 9).
ప్రభువైన యేసు మనవలే శోధించబడి పాపముచేయలేదని మనకు బయలు పరచబడింది (హెబీ 4:15). మనము దీనిని తెలుసుకొని మరియు అక్కడ ఆగిపోయి ఆయనను వెంబడించవలెను.
యేసుయొక్క అంతరంగ జీవితమంతయు పవిత్రమైనదని మనకు తెలియును. ఆయన నిర్దోషమును నిష్కలంకమైన గొఱ్ఱెపిల్ల అని బైబిలు చెప్పుచున్నది. లేనట్లయితే మన పాపముల కొరకు పాపరహితబలి చేయలేకపోయెడివాడు. ప్రభువైనయేసు పాపశరీరముతో రాలేదు గాని పాపశరీరాకారముతో వచ్చెను (రోమా 8:31). ఆయనలో పాపము లేదు. మరియతో దూత చెప్పినట్లుగా పరిశుద్ధమైన బిడ్డగా ఆయన పుట్టెను (లూకా 1:35).
క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడియున్నాము:
మనపాపములను మనము దేవునిదగ్గర ఒప్పుకొనినప్పుడు (అవి ఎన్నియైనను మరియు ఎంత గొప్పవైననూ) ఆయన మనలను క్షమించి మరియు వెంటనే పవిత్రపరచును (1 యోహాను 1:9) మరియు నేను అనేకసార్లు చెప్పిన విషయమును మరల చెప్పుచున్నాను: మన గత పాపములను దేవుడు ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనడు (హెబీ 8:12). క్రీస్తు రక్తములో ఆయన మన ప్రతిపాపము తుడిచివేసియున్నాడు. మరియు దేవుడే మన పాపములు జ్ఞాపకముంచుకొననియెడల, మనము కూడా వాటిని జ్ఞాపకము చేసుకొననవసరము లేదు. ఎప్పుడైనను ఏ మానవునియొద్ద మన పాపములు ఒప్పుకొననవసరము లేదు. మన యొక్క సమస్త పాపములను సంపూర్ణముగాకడిగి పవిత్రపరచిన క్రీస్తురక్తం కంటే మన పాపములను మనము హెచ్చించకూడదు. క్రీస్తుయొక్క రక్తం మనలను నీతిమంతులుగా చేసియున్నది (రోమా 5:9). అనగా దేవునిదృష్టిలో మనము నీతిమంతులుగా ప్రకటించబడియున్నాము. దానిని మనము విశ్వసించి నోటితో ఒప్పుకొనుచూ జీవించాలి.
''దేవుడు పవిత్ర పరచిన వాటిని నిషిద్ధమైన వాటినిగా ఎంచకూడదు'' అను దేవుని వాక్యము మీద మీరు నిలచియుండవలెనని మిమ్మును ప్రోత్సహించుచున్నాను (అపొ.కా. 10:15,16). ఆ దర్శనమును మూడుసార్లు చూచిన తరువాత మాత్రమే పేతురు ఒప్పించబడెను. ఈ విషయములో మరల అతడు అభ్యంతరపడ్డాడు (గలతీ 2:11-13). కాని మనము అభ్యంతరపడనవసరము లేదు. ఈ విషయములను కనీసము ఇతరులతో మాట్లాడకూడదు. ఎందుకనగా నేరారోపణచేసే అపవాదికి అవకాశము ఇచ్చునట్లు ఉండును మరియు మనలను నీతిమంతులుగా చేసిన దేవునికి, మనలను పవిత్రపరిచిన క్రీస్తు రక్తమునకు అది అవమానము. తలంపులద్వారా కూడా ఈవిధముగా ఒక్కసారికూడా అవమానపరచకూడదు. ఈవిధముగానే నిలిచియుండవలెను. ఇతరులు నేరారోపణచేసే వారితో సహవాసము కలిగియున్నచో ఉండనిమ్ము. కాని మనము అతనితో సహవాసము చేయము.
దేవునియెదుట మాత్రమే మీ పాపములను ఒప్పుకొనవలెను:
రోమన్ క్యాథలిక్ సంఘములో, గురువుదగ్గర పాపములు ఒప్పుకొనే ఆచారమున్నది. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనవలెననియు మరియు మనగురించి లెక్క చెప్పవలసిన వారికి క్రమముగా పాపములు ఒప్పుకొనవలెననియు, ఆవిధంగా పాపములు జయించగలమని ప్రొటెస్టెంటు సంఘములు కూడా చెప్పుచున్నవి. క్రొత్తనిబంధనలో ఇటువంటి బోధను కనుగొనము. ఈ బోధ మానవసంబంధమైనదేగాని పరిశుద్ధాత్మనుండి వచ్చినది కాదు. కాని అనేకమంది విశ్వాసులు గ్రుడ్డిగా ఈ బోధను అంగీకరించి మరియు అనుసరించుచున్నారు. బైబిలులో ఎక్కడ ఈ విధముగా చేయుమని చెప్పలేదు. మనుష్యులఎదుట పాపమును ఒప్పుకొనవలసియున్నది కాబట్టి మనుష్యులయొక్క భయముతో అటువంటివారు పాపమును చేయరు. కాని మానవభయముతో కాక దేవునిభయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోమని బైబిలు చెప్పుతుంది ''మనము దేవునికి మాత్రమే లెక్క చెప్పవలసియున్నది'' (హెబీ 4:13).
ప్రభువుయెదుట మాత్రమే మన పాపములు ఒప్పుకొనవలెను. ''మీ పాపములును ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి యాకోబు 5:16 అను ఆజ్ఞను అనేకులు దుర్వినియోగపరచుచున్నారు. సంఘపెద్దలు ఒక రోగి అయిన విశ్వాసికొరకు ప్రార్థించే సందర్భములో ఇది చెప్పబడింది. కొన్నిసార్లు పాపమునుబట్టి రోగము వచ్చును గనుక (యోహాను 5:14లో చూడవచ్చును) రోగి స్వస్తత పొందుటకు పాపములును ఒప్పుకొనవలెనని చెప్పబడింది. విశ్వాసులు ఇతరవిశ్వాసుల ఎదుట పాపములు ఒప్పుకొనవలెనని ఇక్కడ చెప్పలేదు. సందర్భరహితంగా ఒక వచనము వాడినప్పుడు అది ఎంతో అపాయకరము. ఒక వచనమును సందర్భమునుబట్టిగాక తీసుకొనినయెడల నకిళీ బోధ అగును. కాబట్టి మీరు వచనములు చదువునప్పుడు సందర్భమును చూడాలి మరియు ఆ వచనమును ఇతర వచనములతో పోల్చాలి.
ఒక వ్యక్తికి విరోధముగా మనము పాపముచేసినప్పుడు మాత్రమే దానిని అతని ఎదుట ఒప్పుకొనవలెను. ఉదాహరణకు: మనము అతనిని మోసగించినను లేక గాయపరచినను మొదలగునవి (మత్తయి 5:23,24). దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకొనుడి.
మనయొక్క గత పాపములను గురించి ఇతరులకు వివరముగా చెప్పకూడదు. చెప్పినచో సాతాను ఘనపరచబడును మరియు వినేవారి మనస్సులు కలుషితమగును మరియు మనము క్రీస్తురక్తము ద్వారా పవిత్రపరచబడి నీతిమంతులుగా తీర్చబడియున్నామని (మనము ఒక్కసారి కూడా పాపముచేయని వారిగా తీర్చబడియున్నామని) దేవుని మహిమార్థమై ప్రకటించవలెను. మీ జీవితకాలమంతయు దీనిని గుర్తుపెట్టుకొనవలెను. అయితే మనము దేవునికృపద్వారా రక్షణపొందిన పాపులము అని ఎల్లప్పుడూ ఒప్పుకొనవలెను. అయితే మన పాపంగురించి వివరంగా దేవునికి తప్ప మరిఎవరికీ చెప్పము. ఇదియే క్రొత్త నిబంధన పద్ధతి.
మనయొక్క సాక్ష్యము దేవునిని మాత్రమే మహిమపరచవలెను:
విశ్వాసులందరు సాక్ష్యమిచ్చునప్పుడు వారిలో దేవుడుచేసిన కార్యములను బట్టి దేవునిని మహిమపరచవలెను. మరియు వారు రక్షణపొందకముందు చేసిన కార్యముల గురించి చెప్పి సాతానును మహిమపరచకూడదు. మనము పాపులమనియు లేక తిరుగుబాటు చేయువారమని మొదలగు వాటిని చెప్పినయెడల చాలును.
తాను ప్రభువుని ఎరుగనని బొంకిన విషయము చెప్పక మరియు తాను రూపాంతర కొండమీదపొందిన అనుభవమును తాను వ్రాసిన పత్రికలలో పేతురు వ్రాయుట నాకెంతో ప్రోత్సాహమిచ్చింది (2 పేతురు 1:17,18). అలాగే, పౌలు యూదులకును మరియు అగ్రిప్పకును సాక్ష్యమిచ్చినప్పుడు (అపొ.కా. 22 మరియు 26 అధ్యాయములు), అతడు ప్రభువుయొక్క దర్శనముగూర్చి ఎక్కువగా చెప్పి మరియు క్రైస్తవులను హింసించుట గురించి చాలా తక్కువ చెప్పాడు. పాపమును ఒప్పుకొనే ఆచారము రోమను క్యాథలిక్కు మరియు అన్యుల ఆచారము. కాని ఇప్పుడు కొందరు ప్రొటెస్టెంటువారు కూడా దానిని ప్రోత్సహించుచున్నారు. అవి మనుష్యులయెదుట జ్ఞానరూపముగా ఎంచబడుచున్నవి గాని శరీరేచ్ఛల విషయములో ఏ మాత్రము ఎన్నికచేయదగినవి కావు (కొలొస్స 2:20). స్వీయదుర్వినియోగం చేసుకొనుట దీనత్వము కాదు మరియు జ్ఞానము కూడా కాదు. జ్ఞానము ఎంతో అవసరమైయున్నది.
ప్రభువుని సంతోషెట్టవలెనని ఆసక్తి కలిగియుండుట:
క్రీస్తుయెడల ఎల్లప్పుడు తాజాగా భక్తి శ్రద్ధలు కలిగియుండవలెను. మీరు ఎల్లప్పుడు క్రీస్తుని, మీ పూర్ణహృదయముతోను, బలముతోను, ఆత్మలోను, మనస్సుతోను ప్రేమింపవలెనని మిమ్మును బ్రతిమాలుచున్నాను. దీని ద్వారా నిషేధించబడినవాటిని ప్రేమించుటనుండి విడుదలపొందెదరు. ఈ ప్రేమ ఇతరుల ప్రేమలన్నిని వెళ్ళగొట్టును. ''కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి'' (1 కొరింథీ 10:31). మద్యపానం త్రాగవలెనని మీరు ప్రేరేపింపబడినప్పుడు ఈ వచనము జ్ఞాపకముంచుకొనుడి. అది పరిశుద్ధాత్మకు ఆలయమైయున్న మీ దేహమును పాడుచేయును. ''అన్నిటియందు నాకు స్వాతంత్య్రముకలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్య్రము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే'' (1 కొరింథీ 6:12,13).
మీరందరు ప్రభువుతో నడుచుచున్నందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను. మీరు ఎన్ని డిగ్రీలు సంపాదించారనిగాని లేక మీరు ఎంత జీతం పొందుచున్నారనిగాని లేక మీరు ఎక్కడ జీవించుచున్నారని నాకు ముఖ్యము కాదు. మీ కొరకు ప్రాణముపెట్టిన ప్రభువుని సంతోషపరచవలెనని మీ జీవితలక్ష్యంగా పెట్టుకొన్నారని నేను తెలుసుకొనినప్పుడు నేను నా తలను ఎత్తుకొనినడిచెదను మరియు ప్రభువు పిలిచినప్పుడు సమాధానముగా మరణించెదను. మీ అవసరంకొరకు మీరు సంపాదించుకొనుచు మరియు డబ్బు విషయములో ఎవరిపై ఆధారపడక 100శాతం దేవునికొరకు జీవించడమే ఎంతో విలువైనది. మీరు ఎల్లప్పుడు ఆవిధముగా జీవించుదరుగాక.
రోమా పత్రికనుండి కొన్ని ముఖ్యమైన విషయములు:
రోమా పత్రికనుండి ''క్రీస్తులో నున్న విడుదల''
1. నేరారోపణనుండియు నిందనుండియు విడుదల (1 నుండి 5 అధ్యాయాలు).
2. పాపముయొక్క శక్తినుండి విడుదలపొందుట (6 అధ్యాయము).
3. ధర్మశాస్త్రసంబంధమైన నీతినుండి విడుదలపొందుట (7వ అధ్యాయము).
4. పరిశుద్ధాత్మలో ఉన్న విడుదల (రోమా 8:1-14).
5. భయమునుండి విడుదల పొందుట (రోమా 8:15-39).
6. వృథాతిశయము నుండి విడుదల (రోమా 9 నుండి 11 అధ్యాయములు)
7. లోకతత్వము నుండి విడుదల (రోమా 12:1,2).
8. ఒంటరిగానుండటం (వ్యక్తివాదం) నుండి విడుదల (రోమా 10:3-21)
9. ఇతరులను తృణీకరించుటనుండి విడుదలపొందుట (రోమా 14,15 అధ్యాయములు)
రోమా పత్రికను ఈవిధంగా చదవండి ఇది అద్భుతమైన పుస్తకము.
ప్రభువైనయేసు అత్యధికంగా ద్వేషించిన విషయములు:
5 విషయములను ఆయన ద్వేషించాడు:
1. వేషధారణ (కపటము, అబద్ధములు మొదలగునవి).
2. గర్వము.
3. స్వార్థము (ఇతరులయెడల ఆసక్తిలేకపోవుట, ఇతరులను తృణీకరించుట)
4. ద్వేషించుట (కోపము, అసూయ, ద్వేషము మొదలగునవి)
5. అవిశ్వాసము
ఈ పాపములు 10 ఆజ్ఞలలో ఇయ్యబడలేదు. ఎందుకనగా ధర్మశాస్త్రము పాపముయొక్క ఫలమును మాత్రమే నిర్వహించింది. కాని కృప పాపముయొక్క వేరుతో నిర్వహించును. ధర్మశాస్త్రము ఒక కత్తెరవలె పాపముయొక్క ఫలమును నరికెను. కాని కృప చెట్టుయొక్క వేరును గొడ్డలితో పెకలింపజేయును.
అసూయ, గర్వము వ్యతిరేకముగా ఉండును. మనము ఇతరులతో పోల్చుకొనుట ద్వారా గర్వము మరియు అసూయ కలుగును. అసూయద్వారా కోపము వచ్చి మరియు కఠినమైనమాటలతో ఇతరులను చంపెదరు (కయీనువలె) అసూయగలవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు. మనము ఈ భూమిని విడిచేలోపల దానిని నశింపజేయవలెను.
ప్రభువే మన రక్షణ అయియున్నాడు:
ఇంటిలోను మరియు సంఘములోను అధికారమునకు లోబడుట గురించి కొన్ని విషయములు చెప్పెదను: సూర్యుడు గ్రహములను వాటి కక్ష్యలో తిరుగునట్లు అనుమతించి మరియు ఎంతో ఎక్కువ వేగముగా వెళ్ళునట్లు అనుమతించును. కాని ఆ ఆకర్షణను బట్టి అంతరిక్షములోని గ్రహములు ఒక దానితో ఒకటి ఢీకొని నశించవు. ఆవిధముగానే ఇంటిలోని పిల్లలుకూడా వారికి స్వాతంత్రమున్నప్పటికిని తండ్రియొక్క ఆధీనములో ఉండవలెను. దీనిని వారు గ్రహించలేనప్పటికిని దీనిద్వారా వారికి క్షేమము కలుగును. ఇదే నియమము సంఘ కూటములులో కూడా పనిచేయును.
ఇండియాలోని గ్రామములోఉన్న క్రీస్తును నమ్ముకున్న బీదలను మరియు ఇతరులను నీతిమంతులుగా చేయుటకును మరియు సహాయపడుటకును దేవుడు మాకిచ్చిన ధన్యతను బట్టి మీ తల్లిదండ్రులుగా కృతజ్ఞతకలిగియున్నాము. 1975లో, నేను ప్రపంచములో పెద్ద పట్టణములకు వెళ్ళి అంతర్జాతీయ కూటములలో మాట్లాడుటఆపివేసాను. (1971 నుండి 1975 వరకు చేసాను). మరియు పెద్దబోధకులు వెళ్ళని ఇండియాలోని గ్రామములలో ఉన్న బీదలకు బోధించాలని వెళ్ళుట ఆరంభించాను. ఈ బీదప్రజల యొక్క క్షేమమును మేము కోరిఉన్నందున మా నలుగురు కుమారులయిన మిమ్ములను దేవుడు ఆశీర్వదించెను. గతములో ఎంతో మంచివాడుగా దేవుడు మీకు ఉన్నాడు. మరియు భవిష్యత్తులో కూడా మీకు ఆవిధముగా ఉండును. ఎందుకనగా దేవుడు ఏ మానవునికి అచ్చియుండడు.
మన మీద అసూయవలన కొంతమంది క్రైస్తవులు మన పరిచర్యను వ్యతిరేకించుచున్నారు. దేవుడు ఇప్పుడు మన పరిచర్యను బాగుగా ఆశీర్వదించుచున్నాడు. ప్రతీచోట నా పరిచర్యకు ద్వారములు తెరవబడుచున్నవి. అందువలన సాతాను మనమీద ఆగ్రహించుచున్నాడు. ఇది శుభసూచకమైయున్నది. దీనిఅంతటిని నేను నిర్లక్ష్యముచేసి మరియు ప్రభువునన్ను పిలిచిన పరిచర్యను కొనసాగించెదను.
ఏ విషయములో అయినను మిమ్ములను ఎవరైనా విమర్శించినప్పుడు అవసరమైన సలహాను మీకు ఇచ్చుచున్నాను. మిమ్ములను సమర్థించుకొనుచు ఏమియు మాట్లాడవద్దు. యెషయా 54:17 చెప్పిన ప్రకారం ప్రభువైనయేసు మిమ్ములను సమర్థించును. ''నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు''. అనేకమందికి వివరణ ఇచ్చుట అనవసరమైయున్నది. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు ఆయన యొక్క సత్యము అగ్నివలె వెళ్లును గనుక మనవంటివారు సమర్థించవలసిన అవసరంలేదు.
ప్రేమ మరియు జ్ఞానము:
ఇక్కడ నాయొక్క సామెతను చెప్పుచున్నాను, ''ఒక జ్ఞానవంతుడు ఇతరుల పొరపాట్లనుండి నేర్చుకొనును. ఒక సామాన్యమైన వ్యక్తి తన పొరపాట్లనుండి నేర్చుకొనును. కాని ఒక బుద్ధిహీనుడు తన సొంత పొరపాట్లనుండి కూడా నేర్చుకొనడు''.
నేను ఒక తండ్రిగా, ఇతర తండ్రుల పొరపాట్లనుండి నేర్చుకొనవలెనని కోరుచున్నాను.
మీరు నన్ను వెంబడించునట్లుగా మీకొరకు నేను మాదిరిగా ఉన్నానా లేదా అని ప్రశ్నించుకొంటాను. అదేమనగా, దేవుని రాజ్యమును మొదటిగా వెదకుచు మరియు మీ జీవితకాలమంతయు జ్ఞానము గల ప్రేమతో అందరిని భరించవలెను.
ఇబ్బందిపెట్టే వారినుండి దూరముగా ఉండుటయే జ్ఞానము. మరియు జ్ఞానము ప్రేమతో కలిసియుండవలెను. మీ యొక్క పెట్రోలు ట్యాంకు (మీ హృదయం) ప్రేమతో నింపబడియుండవలెను. కాని జ్ఞానము డ్రైవర్ సీటులో ఉండవలెను. ఎందుకనగా మానవ ప్రేమ అనేకమైన బుద్ధిహీనమైనపనులు చేయును. మీ యొక్క ప్రేమ వివేచించుటలో (జ్ఞానములో) అభివృద్ధి చెందవలెను (ఫిలిప్పీ 1:9). మీరు ఎవరినైనను ద్వేషించకూడదు లేక కఠినముగా ఉండకూడదు. ఇతరులు నమస్కరించకపోయినను మీరు నమస్కరించవలెను. ఎల్లప్పుడూ ఇతరులతో మర్యాదగా మాట్లాడవలెను (1 పేతురు 2:17). కీడుచేసిన వారికి మేలు చేయుడి.
పరిసయ్యులు ప్రభువైనయేసును బయెల్జెబూలు అని పిలిచినప్పుడు, ఆయన వారిని క్షమించెను (మత్తయి 12:24,32). వారు ఆయనను కోర్టుకు తీసుకొనివెళ్ళి మరియు అన్యాయముగా నిందించినప్పుడు, ఆయన వారిని బెదిరింపక తననుతాను తన తండ్రికి అప్పగించుకొనియున్నాడు (1 పేతురు 2:23). యేసుయొక్క అడుగుజాడలను మనము వెంబడించాలి.
కాబట్టి పరిసయ్యులు మిమ్మును దూషించినను (మిమ్ములను కోర్టుకు తీసుకువెళ్ళినను) ప్రభువైనయేసు చెప్పిన మాటలను గుర్తుచేసుకొనవలెను, ''మీరు అందరిచేత ద్వేషించబడుదురు''. మిమ్ములను కోర్టుకు తీసుకువెళ్ళెదరు. కాని మీరు పాముల వలె వివేకులును పావురమువలె నిష్కపటులును అయియుండాలి. మీరు ఏమి చెప్పవలెనో ఆ గడియలోనే ఆత్మ ద్వారా అనుగ్రహింపబడును. హృదయ రహస్యములు అన్ని ఒకరోజు బయలుపడును గనుక ప్రజలకు భయపడవద్దు. కాని అంతమువరకు సహించినవాడే రక్షింపబడును. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అని అనుకొను గడియ వచ్చుచున్నది (మత్తయి 10:16-30; మత్తయి 24:9-13; యోహాను 16:2).
కాబట్టి ఎల్లప్పుడు,
1. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెదకుడి.
2. ఎల్లప్పుడు ఇతరులయెడల జ్ఞానముగల ప్రేమలో అంతకంతకు వేరుపారుడి.
ప్రతి క్రైస్తవగుంపు కూడా వారి బైబిలు పట్టుకొని మరియు ఇట్లు అనెదరు, ''మేము సరిగానే ఉన్నాము. దేవుడు మాతో ఉన్నాడు''. మరి వీరిలో ఎవరు సరియైనవారు? నేను ప్రభువుయొద్దనుండి స్పష్టమైన జవాబు పొందితిని... ''ఎల్లప్పుడు ప్రేమతో సత్యము మాట్లాడువారితోను (వారికి కీడు జరిగిననూ) ఇతరులయెడల ఎల్లప్పుడు ప్రేమతో నిలిచియున్నవారితోను (అనగా ఇతరులకు కీడు చేయవలెనని ఎన్నటికి తలంచనివారు).
ఎల్లప్పుడు మీ జీవితకాలమంతయు దేవుని రాజ్యమును వెదకెదరుగాక. అనగా ఇప్పుడు మీరు మంచిగా చదువుకొనుటకును లేక పనిచేయుటకును మరియు క్రైస్తవులు నీతిమంతులై మరియు నిస్వార్థమైన ప్రేమగలవారై యుండవలెనని చూపించెదరు. దీనికొరకు ఎల్లప్పుడు ప్రార్థించుచున్నాను.
దేవుడు చేయగలడు:
''మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్తవిధములైన కృపను విస్తరింపచేయగలడు'' (2 కొరింథీ 9:8).
మనము చేయవలసిన వాటి విషయములో ఎల్లప్పుడు ఒత్తిడి కలిగియుండవలెను. కాని ఈ వచనములో దేవుడు చేయగలడనే వాటితో ఆరంభమయింది. కాబట్టి దేవుడు మనకొరకు చేయగలడనియు మరియు మనలో చేయగలిగినదియు చూడవలెను. మనకు సమతుల్యము ఉండవలెను.
సి.ఎఫ్.సి లో చేరుతున్న అనేకులు వారి ''కారును'' పూర్తిగా ఎడమ ప్రక్కకు (లోకత్వమును) తీసుకువెళ్ళియన్నారు. సి.ఎఫ్.సిలో చేరిన తరువాత వారు కుడివైపుకు త్రిప్పి వెళ్ళుచున్నారు. కాని వారు ఈ మార్గమునకు వచ్చిన తరువాత చక్కగా వెళ్ళునట్లు స్టీరింగ్‌ను సరిగా పట్టుకొనరు. మరియు వారు కుడివైపునకు త్రిప్పి మరియు కుడివైపున అనగా లీగలిజమ్‌కు వెళ్ళుదురు. కాబట్టి వారు కొద్దిగా ఎడమవైపుకు వచ్చు ప్రధాన రహదారిలో తిన్నగా వెళ్ళవలెను.
దేవుడు మనలను అంగీకరించియున్నాడనియు మరియు ఆయన చిత్తమంతా నెరవేర్చాలనియు సమస్తవిధములైన కృపను అనుగ్రహించియున్నాడనియు మనము ఆలోచించవలెను.
మన యొక్క ప్రతి సమస్యకు క్రీస్తే పరిష్కారమైయున్నాడు. మీరు దానిని విశ్వసించి మరియు పరిష్కారంకొరకు మరియు జయించుటకు కావలసిన కృపకొరకు ఆయనను వెదకిన యెడల, మీ భవిష్యత్తు మహిమకరముగా ఉండును.
భయము:
''భయము'' అనునది సాతాను ఉపయోగించే ప్రధానఆయుధము. అతడు ఎల్లప్పుడు దానిని ఉపయోగించును. విశ్వాసులు ఇతరులతో పోట్లాడునప్పుడుగాని లేక బెదిరించినప్పుడు గాని వారు సాతానుతో సహవాసం కలిగియున్నారు. ఎందుకనగా వారు సాతాను ఆయుధం వాడియున్నారు. ''దేవుడు మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు'' (2 తిమోతి 1:7). భయము ఎల్లప్పుడు సాతాను ఆయుధం అయియున్నది. కావున మనము మనుష్యుల బెదిరింపులకుగాని వారి కుయుక్తులకుగాని భయపడము. అటువంటివారు విశ్వాసులమని పిలుచుకొనినను, సాతాను అనుచరులైయున్నారు. మన జీవితకాలమంతయు ఈ పాఠం నేర్చుకొనవలెను. ఇతరులు భయపడునట్లుగా మనం బోధించకూడదు. నరకం గురించి హెచ్చరించుటకును మరియు ఇతరులను బెదిరించుటకును తేడా ఉంది. ప్రభువైనయేసు ఎవరిని బెదిరించలేదు. అనేకవచనములను చెప్పుటద్వారా బోధకులు మనలను నేరారోపణలోనికిగాని నిందారోపణలోనికిగాని తీసుకు రానీయకూడదు. వారు సంఘమును విడిచిపెట్టునప్పుడు లేక వారు దశమభాగము ఇచ్చునప్పుడు బోధకులు దేవుని తీర్పును బట్టి విశ్వాసులను బెదిరించెదరు. ఇవన్నియు సాతానుయొక్క కుయుక్తులు. ''దేవుని భయము ఆయనకు ఇంపైన సువాసనగా ఉండును అనునది ముఖ్యమైయుంది (యెషయా 11:3). మనము అనేక స్వరములు వినుచున్నప్పటికి పోలీసు యొక్క కుక్క, నేరగానివాసన పసిగట్టినట్లు మనము పరిశుద్ధాత్మ స్వరమునువిని మరియు ఆయనకిష్టమైన దానిని చేసి దేవుని మహిమ పరచవలెను. ఈవిషయమును మీరు త్వరితముగా చేయుదురుగాక. మీరు పాపముతోను మరియు భ్రష్టత్వముతోను ఉండిన దేశములో నివసించుచున్నారు. మిమ్ములను మీరు పవిత్రులుగా ఉంచుకొనుడి.
ప్రార్థన - రెండురకాల కమ్యూనికేషన్:
ఒకభర్త తనభార్యను ప్రేమించి మరియు ఆమెతో సహవాసము చేయునట్లే ప్రభువు మనతో సహవాసం చేయాలనికోరుచున్నాడు. ఆయన ఇట్లుఅనుచున్నాడు, ''బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము. నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము. నీ స్వరము నాకు వినబడనిమ్ము'' (పరమగీతము 2:14). అందువలననే ఆయన ప్రార్థించవలెనని కోరుచున్నాడు. ఒక టెలిఫోన్‌లో మనం వినుచూ మరియు మాట్లాడుచున్నట్లే ప్రార్థనకూడా ఉండును. నీతో మాట్లాడుచున్న అవతలవ్యక్తి నీకంటే శ్రేష్టమైన దైవజనుడైనందువలన, నీవు ఎక్కువగా వినెదవు. దానికంటే ఎక్కువగా దేవుడే నీతో మాట్లాడుచున్నప్పుడు, నీ అవసరములు చెప్పుదానికంటే ఎక్కువగా వినవలెను. ఆయనకు మీ ప్రతిఅవసరం తెలిసేయున్నది. కాబట్టి మీరు కారులో వెళ్ళుచున్నప్పుడు లేక ఆఫీసులో పనిచేయుచున్నప్పటికిని లేక అనుకొనని సంఘటనలు జరిగినప్పటికిని ఎల్లప్పుడూ మీ హృదయనేత్రములు వినుటకు సిద్ధంగాఉండాలి.
అయినప్పటికిని ఆయన తన బిడ్డలను ప్రేమించి మరియు వారికి అనుగ్రహించే తండ్రిగా ఉన్నాడు గనుక మన అవసరము గురించి ప్రార్థించవలెను.
భూసంబంధమైనవాటి గురించి మనం ప్రార్థించవచ్చునా? నిశ్చయముగా అడుగవచ్చును. నిజానికి, మన పాపక్షమాపణ కొరకును మరియు దుష్టునినుండి కాపాడమని ప్రార్థించుటకు ముందుగా మన అనుదిన ఆహారంకొరకు ప్రార్థించమని ప్రభువు చెప్పారు. అది కొంతమందికి ఆత్మీయముగా అనిపించుటలేదు. కాని ప్రభువైనయేసు వాస్తవమే చెప్పారు. మీ అనుదినఆహారం కొరకు మీకు ఏమేమి కావలెనో ఆయనకు తెలియును. మీ కాలేజీ దినములలో ఉద్యోగంపొందుటలో మంచి మార్కులు రావలెననియు, మీకు మంచి ఉద్యోగం కావలెననియు, మరియు మీకు కారు అవసరమనియు మరియు ప్రతిఅవసరమును ఆయన ఎరిగియున్నాడు. మా అనుదిన ఆహారం దయచేయుము అని అడిగినప్పుడు భూమి మీద మనం జీవించుటకు కావలసిన ప్రతీ అవసరంకొరకు మనం ప్రార్థించవచ్చు.
మరియు ప్రభువు అక్కడ ''మనము'' మరియు ''మీరు'' అను బహువచనం వాడియున్నాడు. మా అనుదినఆహారం దయచేయుము. మా ఋణస్థులను క్షమించుము మరియు మమ్మును దుష్టుని నుండి తప్పించుము. కాబట్టి మనం మనకొరకేకాక మన సహవిశ్వాసుల అవసరంకొరకు కూడా ప్రార్థించవలెను.
సాతాను ఓడించబడినశత్రువు:
ఈ సత్యమును ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొనవలెను: పాతనిబంధనలోని వచనములు క్రొత్త నిబంధనలో కొట్టివేయబడినవని చూడవలెను. ఉదాహరణకు, దేవుని గొర్రెపిల్ల మనకొరకు దహించబడిన తరువాత గొర్రెలను దహించే అవసరము లేదు. అదే విధముగా, దానియేలు మూడుసార్లు ప్రార్థించినప్పటికి సాతాను మరియు అతని దూతలు ఓడించబడలేదు. అందువలననే మూడు వారములు సాతానుతో పోరాటం జరిగింది (ఉన్నత స్థలములలో) (దానియేలు 10:12,13). కాని మనము సాతాను సిలువమీద ఓడించబడిన తరువాత జీవించుచున్నాము. కాబట్టి ఇప్పుడు మనము అతనితో మూడువారములు పోరాడవలసిన అవసరములేదు. క్రీస్తుయొక్క జయములో మనము జీవించాలి. ఈ సత్యమును చాలా కొద్దిమంది మాత్రమే బోధించుచున్నారు.
సిలువమీద సాతాను నశింపచేయబడి మరియు నిరాయుధుడుగా చేయబడెనని (కొలొస్స 2:14,15 మరియు హెబీ 2:14) స్పష్టము చేయచున్నది. కాబట్టి మనము ఈనాడు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని మరియు క్రీస్తుయొక్క జయములో నిలిచియుండి మరియు ప్రభువైనయేసు నామములో సాతానును ఎదిరించినయెడల సాతాను ఒక్కసారిగా మనవద్ద నుండి పారిపోవును (యాకోబు 4:7). సాతాను మెరుపువలె ఆకాశంనుండి పడెనని ప్రభువు చెప్పినరీతిగా అతడు ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్లు వేగముతో పారిపోవును (లూకా 10:18). (బైబిలు క్విజ్‌లో ఈ ప్రశ్న అడుగుట మంచిది). యాకోబు 4:7 ప్రకారము, ''సాతానును మనము ఎదురించినయెడల ఎంత వేగముతో పారిపోవును?''.
కాని ఎల్లప్పుడు మీ పాపములను ఒప్పుకొనుచు క్రీస్తుయొక్కరక్తములో పవిత్రపరచబడనియెడల (మీ మనస్సాక్షిచేత నొచ్చుకొనెదరు), అప్పుడు సాతాను మీద మీకు అధికారముండదు. కాబట్టి ప్రభువు యెదుట మీ పాపములను ఒప్పుకొనుట ద్వారా ఎల్లప్పుడు పవిత్రమైన మనస్సాక్షి కలిగియుండవచ్చు.
దేవుడు ప్రేమించే తండ్రియైయున్నాడు. ఆయనలో ఎల్లప్పుడు మీరు భద్రతను కలిగియుండవలెను. భూసంబంధమైన తండ్రి దేవునికి ఒక ఛాయవంటివాడు మాత్రమే కాబట్టి దేవుడు ఎంత ఎక్కువగా మిమ్ములను ప్రేమించుచున్నాడో ఊహించుకొనవచ్చు. ఆయన ప్రేమలో మీరు భద్రత కలిగియుండి మీరు ఆయనను లోతుగా ప్రేమించవలెను. ఆయనకు బాధ కలిగించేవియుచేయవద్దు మరియు అప్పుడప్పుడు మీరు పడిపోయిన యెడల వెంటనే మారుమనస్సు పొంది ఎల్లప్పుడూ యేసువద్దకు వచ్చి, ఆయన రక్తముద్వారా ఎల్లప్పుడూ హృదయములను పవిత్రపరచుకొనుము.
అనేకమంది కరిస్మాటిక్ బోధకులు భూసబంధమైన వాటికొరకును, స్వస్థతకొరకును మరియు దయ్యములను వెళ్ళగొట్టుటకును కావలసిన విశ్వాసము కలిగియుండమని బోధించి మరియు వారికి డబ్బును ఇవ్వమని ఒత్తిడిచేయుదురు. మరికొంత మంది బోధకులు క్రైస్తవులను కేవలం మానసికముగా ఆదరించెదరుగాని దేవుని యొక్క వాగ్ధానములను స్వతంత్రించుకొనే విశ్వాసమును బోధించరు. కాబట్టి ఈ దినములలో అనేక తప్పుడు బోధలు ''అంతరంగ స్వస్థత'', ''అనుకూలముగా ఆలోచించుట'' మరియు ''పితృపారంపర్యమైన పాపములు'' మొదలగువాటిని ఎక్కువగా బోధించుచున్నారు. ఆత్మీయవిషయములలో ఎక్కువగా క్రొత్త నిబంధనలో ఆధారపడవలెను. దేవుని వాక్యమును ధ్యానించుడి అప్పుడు మీరు మోసగించబడరు.
మానవతర్కము యొక్క పరిమితులు:
ఇండియాలో మన సి.ఎఫ్.సి లో జరుగుచున్న విషయములు: 1975 నుండి (సి.ఎఫ్.సి పుట్టిననాటి నుండి) మతమౌడ్యులమని నిందించబడ్డాము. కాని ఇప్పుడు అది తగ్గుచున్నది. గత ఐదువేల సంవత్సరముల నుండి దేవునియొక్క ప్రవక్తలందరి మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలికిరి. ప్రభువైన యేసుతో ప్రారంభమై పౌలు, మార్టిన్ లూథర్, జాన్‌వెస్లీ మరియు అనేకులు మతమౌడ్యులని పిలువబడిరి (మత్తయి 5:11,12) కాని వారు మరణించిన తరువాత వారిని ప్రవక్తలుగా గుర్తించిరి. కాబట్టి మనము మంచి సహవాసములో ఉన్నాము. మనము క్రీస్తులో విజయోత్సవములో జీవించెదము మరియు ఎన్నటికి నిరాశపడము. దైవజనుల యొక్క జీవితము సంతోషకరముగా ఉండునని అనేకసార్లు చెప్పాను (సామెతలు 14:14 లివింగు బైబిలు). దేవునికి స్తోత్రం.
''మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరు - కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి'' (యోహాను 7:12). ఇప్పుడు కూడా అదే వివాదము కొనసాగుచున్నది. పౌలు ఫెలిక్స్‌తో ఇట్లన్నాడు, ''వారు మతబేధమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను'' (అపొ.కా. 24:14,15). దానినే మనం చెప్పుచున్నాము. బైబిలు బోధించేదానంతటిని మనము ధైర్యముగా బోధించుదుము. బైబిలు స్పష్టముగా బోధించనిదానిని, మనం బోధించము.
ఉదాహరణకు దేవుని సార్వభౌమాధికారమునకు మరియు మానవునియొక్క స్వచిత్తమునకు గత ఇరవైశతాబ్దముల నుండి ప్రత్యేకముగా నాలుగు శతాబ్దాలనుండి వివాదము జరుగుచున్నది. ఎందుకనగా మానవమనస్సు దానిని సరిగా గ్రహించలేదు. ఒక పిల్లి తన పిల్లను ఎత్తుకొనునట్లు దేవుడు విశ్వాసులను పట్టుకొనునని కొందరు బోధించుచున్నారు. కోతిపిల్ల తల్లిని పట్టుకొనునట్లు మనము దేవునిగట్టిగా పట్టుకొనవలెనని మరికొందరు బోధించుచున్నారు. ఈ రెండుసత్యములు సరైనవేకాని కొందరికి ఇవి విరోధముగా కనబడుచున్నవి. మనము నిత్యత్వము వరకును దేవునికొరకు భద్రపరచియున్నాము కాని మనము దేవునిని బాధించేవాటిని చేయడానికి ఇష్టపడము. దేవునికి మనము నిత్యత్వము వరకు పిల్లలమైయున్నాము గనుక దేవుడు మనలను గాయపరచడు కాని మనము దేవునిని గాయపరచెదమేమోనని భయపడెదము. దేవునియొక్క చేతిలోనుండి ఎవరుకూడా అపహరించలేరు కాని మనము దానిలోనుండి ఎగురవచ్చును. లేనట్లయితే మనము రక్షణ పొందిన వెంటనే రోబోట్స్ (బొమ్మల)వలె మారినట్లుండును. ప్రభువైన యేసు పాపము చేయగలడా లేదా అను వివాదమున్నది. నేను ఈవిధంగా చెప్పుచున్నాను.
యేసు పాపము చేయగలడా? దేవునిగా నిశ్చయముగా చేయడు కాని మానవునిగా చేయగలడు. ''దైవభక్తిని గూరిచన మర్మము గొప్పదైయున్నది - ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను'' (1 తిమోతి 3:16).
దేవునిగా ఆయన శోధించబడలేడు (దేవునిగా ఆయన శోధించబడడు యాకోబు 1:13) కాని యేసు శోధించబడెను (మత్తయి 4:1-10). మరియు ఆయన అన్ని విషయములలో మనవలే శోధించబడెను (హెబీ 4:15). కాబట్టి మానవునివలె ఆయన పాపము చేయగలడా? అవును. లేనట్లయితే, ఆయన మనవలె శోధించబడలేడు మరియు మనము శోధించబడినప్పుడు పాపము చేయవచ్చును. ఆయన ముప్పైమూడున్నర సంవత్సరములు దుష్టులచేతను, దయ్యములచేతను, ప్రతి విధమైన శోధనలచేతను ఆవరించినప్పటికిని, తలంపులలో గాని మాటలలోగాని, క్రియలలోగాని, వైఖరిలోగాని లేక ఉద్దేశ్యములలోగాని లేక మరేవిధముగానైనను ఆయన పాపము చేయకుండుట ఎంతో గొప్పజయము. ఒకరోజు పవిత్రముగా జీవించుట ఎంత కష్టమో మనకు తెలియును. ప్రభువైనయేసు ముప్పైమూడన్నర సంవత్సరములు సంపూర్ణముగా జీవించెను. ఇది ఎంతో గొప్ప జయముతో కూడిన పరిశుద్ధత.
ప్రభువైనయేసు ఈ భూమిమీదకు వచ్చినప్పుడు, ఆయన యొక్క దైవత్వమును విడిచిపెట్టియున్నాడా? నిశ్చయముగా ఆయన విడిచిపెట్టలేదు. అనేకమందిచేత ఆయన ఆరాధించబడియున్నాడు మరియు ప్రజలయొక్క పాపములను క్షమించాడు. దేవునిగా ఆయన వాటిని చేశాడు. కాని వేరే విషయములలో ఆయన దేవునియొక్క శక్తిని వాడుకొనలేదు. ఆయన అన్ని విషయములలో మనవంటివాడై సమానముగా జీవించాడు కాబట్టి మానవునిగా ఆయన మనకు మాదిరియు మరియు మనవంటివాడైయున్నాడు. అందువలన ఆయన ఈ విధముగా చెప్పుచున్నాడు, ''ప్రతి దినము నిన్ను నీవు ఉపేక్షించుకొని నన్ను వెంబడించుము'' (ప్రతిదినము నా మాదిరిని వెంబడించుము) (లూకా 9:20). ముప్పై మూడున్నర సంవత్సరములలో ఆయన ప్రతిదినము తన్నుతాను ఉపేక్షించుకొనెను.
ఒక మనుష్యుని ఒక కుక్క సంపూర్ణముగా అర్థంచేసుకోలేదు. మానవుడుకూడా దేవుడిని పూర్తిగా అర్థము చేసుకోలేడు. కాబట్టి మనలను మనము తగ్గించుకొని సముద్రము వంటి దేవునిజ్ఞానమును ఒక చిన్నగిన్నెలాంటి మనము అర్థము చేసుకొనలేము.
మనము శోధించబడినప్పుడెల్లను యేసువలె జయించుటకు ప్రతిదినము యేసును మనము మాదిరిగా ఉంచుకొని ఆయనను వెంబడించిన చాలును (పక్రటన 3:21). దేవునికి స్తోత్రము. దీనికి కారణమును వెతికేవారు కలవరము అనే గోతిలో పడెదరు. కాని దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించవలెనని కోరేవారు ఈ సత్యమును అర్థము చేసుకోలేనప్పటికి దానిని అనుభవించి జయించుదురు.
దేవుని ప్రేమలో కొనసాగుట:
మనము మోసకరమైన దినములలో జీవించుచున్నాము మరియు అనేకుల ప్రేమ చల్లారి మరియు సహోదరునికి వ్యతిరేకముగా సహోదరుడు మోసగించే దినములలో ఉన్నాము. కాబట్టి మనము ఎల్లప్పుడు ప్రేమలో నిలిచియుండుటయే కాక ఘర్షణ పోరాటము కలిగియున్న వ్యక్తుల విషయములో మనము జ్ఞానము కలిగియుండవలెను.
క్రైస్తవులముగా మనము ఎవరికీ కీడు చేయము మరియు మనుష్యులతో పోరాడము. కాని తప్పుడు సిద్ధాంతములను బహిర్గతపరచెదము. మరియు ''మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము'' (సామెతలు 31:8,9).అహితోపేలు దావీదుకు వ్యతిరేకముగా అబ్షాలోముతో కలిసి పథకం వేసినప్పుడు, దావీదు దేవునికి ప్రార్థించాడు (2 సమూయేలు 15:31) మరియు దేవుడు అతని ప్రార్థనవినెను (2 సమూయేలు 17:23). ప్రభువైనయేసు తనను గాయపరచినవారిని క్షమించమని తండ్రికి ప్రార్థించాడు. కాని ఇతరులను గాయపరచు వారిని కనికరము లేకుండా ఎంతో ఖండించాడు (మత్తయి 23 చదవండి).
బుద్ధిమంతులైన కన్యకల గురించి ఉపమానమందు ఒక మాట.
ఈ ఉపమానము గురించి ఒక విధంగా వినినప్పుడు దానిమీద మన మనస్సు ఉంచుకొని మరియు ప్రభువు మరియొక విధముగా చెప్పినప్పుడు అంగీకరించలేము. మనముదానిని కొంతకాలము క్రితము ఈ ఉపమానమును సందర్భసహితముగా అర్థము చేసుకొనుటకు ప్రార్థించాను. ఏ ఉపమానమునైనను ఈవిధంగా చేయుట మంచిది.
మత్తయి 24:12లో అంత్యదినములలో అనేకుల ప్రేమ చల్లారుననియు మరియు అంతమువరకు సహించిన వాడే రక్షణపొందుననియు చెప్పాడు (మత్తయి 24:13). తరువాత 10 మందికన్యకలు ఉపమానములో ఐదుగురిదివిటీలు ఆరిపోవుచున్నవి. మరియు ఐదుగురి దివిటీలు చివరివరకు ఉన్నవనియు మరియు వారు పెళ్ళివిందుకు లోపలికి పోయిరి (మత్తయి 25). కాబట్టి ఇక్కడ నూనె అనగా పరిశుద్ధాత్మద్వారా పొందే దైవికమైన ప్రేమ అయియున్నది. కాబట్టి పెళ్ళికుమారునితో కూడా పెండ్లి విందుకు వెళ్ళుటకు మనము ఈ దైవికమైన దేవునిప్రేమలో నిలిచియుండవలెను. కనుక మన యొక్క దివిటీలు మండునట్లు ఎక్కువ నూనె కలిగియుండవలెను. ''నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి'' అని ప్రభువైన యేసు చెప్పారు (యోహాను 15:25). కాని తిరిగి వచ్చినప్పుడు ఆయన వారిని ప్రేమించెను. అంతమువరకు ఆయనయొక్క మాదిరిని వెంబడించెదము. లేనియెడల స్వయమునకు చనిపోవుట ఒక వ్యర్థమైన సిద్ధాంతముగా ఉండును. సిలువమార్గమును గురించి మాట్లాడుతున్న అనేకమంది విశ్వాసులలో ప్రేమకొదువగా ఉండుట మాత్రమే కాక కనీసం మర్యాదలు కూడా లేనివారిని చూచాను. వారి పవిత్రమైన సిద్ధాంతం గురించి గర్వించెదరు గాని వారి జీవితం కంపు కొట్టుచున్నది. మీ సిద్ధాంతం నిజంగా పవిత్రమైనచో, అప్పుడు మీ జీవితములో నుండి క్రీస్తు యొక్క ప్రేమ సువాసన వచ్చును. 19వ శతాబ్దములో క్వాకర్ మిషనరీ, స్టీఫన్ గ్రెల్లెట్ ఒకసారి ఇట్లు ఈ విధంగా చెప్పారు, ''ఒకసారి ఈ లోకములో గుండా వెళ్ళాలని కోరుచున్నాను. ఇక్కడ నేను చేయగలిగిన మంచి కార్యములన్నియు లేక ఇతరులయెడల నేను చూపగలిగిన కనికరమంతటిని ఇప్పుడే చూపించాలని కోరుచున్నాను. నేను మరల ఈ జీవితమును జీవించను కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయను''.
మనయొక్క స్పందనలే మనయొక్క ఆత్మీయస్థితిని తెలియజేయును:
బైబిలు ఈవిధంగా చెప్పుచున్నది, ''భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకివేయును'' (యెషయా 57:20). (ఎందుకనగా అడుగున ఎంతో బురదయు మరియు మురికి ఉండును). ఆ మురికి పైకివచ్చుట ఎప్పుడు ఆగిపోవునో ఏ మానవుడు చెప్పలేడు. అటువంటి వారిగురించి ఏమియు చెప్పలేము. ప్రకృతిలో ఉన్నవాటి ప్రభావము సముద్రముమీద ఉండును. ఉదాహరణకు చంద్రుని ప్రభావం దానిమీద ఉండును. ఇలాంటి వారు కూడా ఆవిధంగా సముద్రమువలే ఉండెదరు. వారికి కోపం వచ్చినప్పుడు ఎంతో దూషించెదరు మరియు కొద్దికాలం మౌనంగా ఉండెదరు. అప్పుడు మరల అకస్మాత్తుగా ఆవిధంగా చేయుచుండెదరు.
సామెతలు 26:4 ఇట్లు చెప్పుచున్నది, ''వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము. ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు''. కొంతమంది బుద్ధిహీనులకు మనము జవాబు ఇవ్వవలెనని తరువాత వచనం చెప్పుచున్నది. కాని వారు ఎటువంటి బుద్ధిహీనులో మనము ఎరిగి యుండవలెను. కోపంతో మరియు ద్వేషంతో నిండిన వారు మొదటి తరగతికి చెందినవారు. మరియు ఇటువంటివారికి జవాబు ఇవ్వకూడదు. నేను దీనిని అనుసరించియున్నాను. మనం మొరిగే కుక్కలను నిర్లక్ష్యంచేసి దూరంగా వెళ్ళినట్లే ఇటువంటి వారికి దూరంగా ఉండవలెను. వారి హృదయములో ఉన్న దానిఅంతటితో వారిని మొరగనీయండి. కాని సత్యం తెలుసుకొనవలెనని కోరికకలిగిన బుద్ధిహీనులతో జవాబు ఇవ్వవచ్చును (సామెతలు 26:5).
మన ఆత్మీయస్థితిని తెలియజేయుటకు మనయొక్క స్పందనలే ముఖ్యమైన సూచనలు ఇచ్చును. కాబట్టి మనం ఇతరులతో స్పందించే విధానముబట్టి మన ఆత్మీయతను తెలుసుకొనవచ్చును. నన్ను విమర్శించేవారి విషయములో నాయొక్క స్పందనను బట్టి నా ఆత్మీయతను బేరీజు వేసుకొందును. (వారికి నేను జవాబు ఇవ్వను). ప్రభువైనయేసు తన యొక్క జీవితములో వ్యతిరేకించబడినప్పుడు ఆయన స్పందించినరీతిగానే మనం కూడా స్పందించాలి.
సంవత్సరం తరువాత సంవత్సరం మనం పెద్దవారమయ్యే కొలది మనము వెలుగులో నడుచుచున్నయెడల మన యొక్క మాటలలోను, మనము ఉత్తరం వ్రాసే విధానంలో అంతకంతకు జ్ఞానం కలిగి చేసెదము. కాబట్టి ఏ సమయములో అయినను, మనం కలిగియున్న జ్ఞానం బట్టి క్రియలు చేసెదము.
పరిణితి చెందుటకును మరియు నిలకడగా ఉండుటకును సమయం పట్టును:
నాకు వచ్చుచున్న ఒత్తిడిలను బట్టి దేవునిని స్తుతించుచున్నాను. ఎందుకనగా అవి నన్ను ప్రభువును మరిఎక్కువగా అనుభవించునట్లు చేయును. మనము ఎప్పుడైనను పడిపోమని కాదు లేక ఓడిపోమనికాదు. కాని నిలకడగల క్రైస్తవజీవితం పొందుటకు కొంత సమయం పడుతుంది. పందొమ్మిదిన్నర సంత్సరముల వయస్సులో నా జీవితమును ప్రభువుకి సమర్పించుకొన్నాను. కాని లెక్కలేనిసార్లు పడిపోయి తిరిగి లేచాను. కాని 16 సంవత్సరముల తరువాత నేను పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ నింపబడుతు మరియు దేవునితో విశ్రాంతిలో ఉండుట నేర్చుకొనిన తరువాత ఇది కొంచెం సులభమయింది.
మైల్స్ స్టోన్ పోర్ట్ తన ''ఆత్మీయ ఎదుగుదలకు నియమములు'' అను పుస్తకములో ''డి.ఎల్. మోడీ, యోనాతాను గోఫోర్థ్, జార్జ్ ముల్లర్, హడ్సన్ టేలర్, చార్లెస్ ట్రుమ్‌బుల్, ఎఫ్.బి మేయర్, ఆండ్రూ ముర్రే, ఫ్రాన్సిస్ హవిర్‌గల్, మెడమ్ గుయాన్, జాన్‌హైడ్, రాబర్ట్ మచైన్, ఆమీ కార్‌మైకల్ మరియు ఎవన్స్ హాకిన్స్ అను దైవజనులందరు ఆత్మీయముగా పరిణితిచెంది మరియు దేవునిమహిమ కొరకు వాడబడిరి. వారు ప్రభువైనయేసును వారియొక్క జీవముగా ఎరుగుచున్నప్పుడు 15 సంవత్సరములు గడిచిన తరువాత ఆయన కొరకు పరిచర్య చేయుట ఆపి మరియు క్రీస్తే వారిలోసర్వములో సర్వము అగునట్లు ఆయనను అనుమతించుచు ఆయన యొక్క పరిచర్యను చేసిరి''.
క్రైస్తవజీవితంలో అభివృద్ధి చెందుటకును మరియు స్థిరపరచబడుటకును సమయము పట్టును. గనుక ధైర్యము తెచ్చుకొనుడి.
నా మీద ఒత్తిడిలు పెరుగుచున్నప్పుడు నేను ప్రేమలో నిలిచి ఉండెదనా లేదా అని పరీక్షింపబడుచున్నాను. దేవునియొక్క కృప ద్వారా అంతము వరకు ప్రేమలోనిలిచి ఉండాలని కోరుచున్నాను. మనము ఎదుర్కొనే ప్రతీ ఒక్క పరీక్ష మనలను పై తరగతికి తీసుకొని వెళ్ళును. ప్రభువైనయేసు తనను చంపే వరకు ప్రేమలో నిలచియుండెను. తనను చంపేవారిని ప్రేమిస్తూనే చనిపోయాడు. ఇటువంటి జీవమును మరియు నూతనమార్గమును ప్రభువు మన కొరకు తెరచియున్నాడు. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఆవిధంగా జీవించగలము. ఇది అసాధ్యమని అపవాది మనతో చెప్పును. కాని మనము, ''దేవునికృప ద్వారా ఇది సాధ్యమే'' అని చెప్పవలెను. అపవాది చెప్పే అబద్దాలు మీ నోటితో ఒప్పుకొనవద్దు. మనం జీవించి మరియు అంతమువరకు ప్రేమలో నిలిచియుండెదము.
ఇంతకుముందు చెప్పిన రీతిగా నేను లెక్కలేనిసార్లు ఓడిపోయాను కాని దేవుడు నా యెడల కనికరము చూపి ఓడిపోవుచున్న స్త్రీ పురుషులకు పరిచర్యను అనుగ్రహించాడు.
కాబట్టి మీరింకను దేవునివిశ్రాంతిలో ప్రవేశింపలేదు గనుక సాతానును ఖండింపనీయకుడి. ఒకరోజున మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశించెదరు.
క్రమశిక్షణను ఒక్కరోజులోనే పొందలేము. కొంతమందికి అవి సహజముగా వచ్చును. ఇతరులకు అది కొంచెము కష్టము. నిజానికి మీరు అనుకొనుదానికంటే మీరు ఎక్కువ క్రమశిక్షణ కలిగియున్నారు. లేనట్లయితే ఈనాడు లోకములో అనేకులవలె మీరు చదువుటమానుకొని ఉద్యోగం లేనివారుగా ఉండెదరు. కాని క్రమశిక్షణగల క్రైస్తవుడుగా ఉండుటకు కోరుకొనుము.
క్రింద చెప్పుచున్న వాటిని ఎల్లప్పుడు మీ నోటితో ఒప్పుకొనుడి. ఎందుకనగా అవి ఎల్లప్పుడు సత్యమైఉన్నవి. మీరు నమ్మినను నమ్మకపోయినను మీరు క్రమశిక్షణ గలవారైనను లేక లేనివారైనను మీరు జయించుచున్నను లేక ఓడిపోవుచున్నను అవి నిజమైయున్నవి.
''దేవుడు సింహాసనాసీనుడై యుండి లోకమును పరిపాలించుచున్నాడు...
ప్రభువైనయేసు నా యొక్క సమస్త పాపముల కొరకు మరణించి సమస్తపాపములు క్షమించియున్నాడు...
సిలువ మీద సాతాను ఓడించబడియున్నాడు....
ప్రభువైనయేసు నా కొరకు తిరిగి రాబోవుచున్నాడు...
ఈ లోకము నాయొక్క శాశ్వతమైన గృహము కాదు...
నాకాళ్ళ క్రింద దేవుడు సాతానును శీఘ్రముగా చితుకత్రొక్కించును'' (రోమా 16:20).
మీ తల్లియెడల కృతజ్ఞత కలిగియుండుడి. లోకములో ఉన్న అనేకులు వారి తల్లి చనిపోయిన తరువాత పొగడెదరు. కాని మీ తల్లి జీవించుచున్నప్పుడు ఆమెను మెచ్చుకొనుచున్నందుకు సంతోషించుచున్నాను. మీ నిమిత్తము తన ఉద్యోగముతోపాటు సమస్తమును త్యాగం చేసి తననుతాను ఉపేక్షించుకొని మరియు ఎంతో శ్రమ పడింది. ఆమె యొక్క త్యాగమును ఎంతో చూచితిని. దేవుని సేవకుడినైన నన్ను వివాహం చేసుకున్నందుకు రహస్యంగా ఆమె చేసిన త్యాగమును, పొందిన శ్రమను నేను పూర్తిగా ఎరుగను. ఆమె చేసిన త్యాగము మరియు శ్రమలన్నిటిని ప్రభువు నిమిత్తమం చేసింది. గనుక ఒకరోజు ఆమె బహుమానం పొందును.
ఆమెనుబట్టియే మీరు చాలా విషయములలో ఈవిధంగా ఉన్నారు:
ఆత్మీయముగా, ఎందుకనగా ఆమె ఎల్లప్పుడూ మీకొరకు ప్రార్థించెడిది.
తెలివితేటలు, మిమ్ములను చదివించుటకు ప్రతీ విషయములో మీకు సహాయపడింది.
శారీరకముగా, మీకు ఇవ్వగలిగిన శ్రేష్టమైన ఆహారమును మరియు చికిత్సను మీకు ఇచ్చియున్నాము.
మీ తల్లిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను. ఆమెను మరిఎక్కువగా మెచ్చుకొనుట నేర్చుకొనియున్నాను.
దైవికజీవితం కొరకు కొన్ని హెచ్చరికలు:
మొదటిగా, వెలుగును ప్రేమించి మరియు వేషధారణను మరియు నటనను ద్వేషించవలెను. మీ యొక్క ఆత్మీయ స్థితిని గురించి మనుష్యులను మోసగించవచ్చుగాని దేవుని మోసగించలేము. మిమ్ములను మీరు మనుష్యులు చూసినట్లుగాకాక దేవుడు చూచినట్లుగా చూచుకొనుటకు దేవుడు సహాయంచేయును గాక.
రెండవదిగా, అమ్మాయిలతో శారీరక సంబంధంను నిరోధించవలెను. వారితో కరచాలనం చేయడం ఆపివేయవలెను. అమ్మాయిలతో ప్రత్యేకంగా రాత్రి సమయములలో ఒంటరిగా ఉండకూడదు మరియు నీ మాటల ద్వారా ఏ అమ్మాయి కూడా తనను నీ భార్యగా చేసుకోవాలని కోరుచున్నావని తలంపులు రానివ్వకు. పౌలు 45 సంవత్సరముల వయస్సుగల, పూర్ణహృదయముగల తిమోతితో, ''యౌవనేచ్ఛలనుండి పారిపొమ్మని'' హెచ్చరించెను. కాబట్టి సాధ్యమైనంతవరకు అమ్మాయిలకు దూరంగా ఉండుట మంచిది. అది పాతనిబంధన అంతస్థు అయియున్నది. కాని మీరు కళ్ళతో కూడా మోహపుచూపు చూడకుండునట్లు పోరాడి క్రొత్త నిబంధన అంతస్థుకు చేరాలి. మరియు దీనిని జీవితాంతం పోరాడవలసియున్నది మరియు పురుషులందరికి ఇది కష్టమైయున్నది. మీరు వివాహము కాక మునుపే ఈ విషయములో హృదయపూర్వకముగా పోరాడుటకు దేవుడు కృపను ఇచ్చునుగాక. ఇది కష్టమైనపోరాటం అని గుర్తించి, వారి ఓటములను ఒప్పుకొని, వాటి విషయమై దు:ఖపడి మరియు దేవునిశక్తి కొరకు ప్రార్థించువారు జయముపొందెదరు.
శ్రమలలో గుండా వెళ్లుచున్న అమ్మాయిలకు సానుభూతిచూపే విషయములో జాగ్రత్తపడాలి. ఇటువంటి వారికి సహాయపడవలెనని కొందరు యౌవనస్థులు వెళ్లియున్నారు. కాని ఇటువంటి అమ్మాయిల ద్వారా మోసపోయారు. బాధలో ఉన్నట్లు నటించేవారిని బట్టి కొందరు మోసపోయారు. ఇటువంటి సందర్భములో జ్ఞానములేకుండా సానుభూతి చూపినయెడల ఆత్మీయముగా వెనుకంజ వేసెదము. కొందరు అమ్మాయిలు అబ్బాయిలను సంపాదించుకొనుటకు తినిపించెదరు లేక త్రాగిపించెదరు. యేసురక్తంలో కడగబడి మరియు వెలుగులో నడచుచ్ను దేవుని యొక్క బిడ్డ, ఇటువంటి వాటి ద్వారా ప్రభావితం చేయబడడు కాని చీకటిలో నడుచుచున్న వారు ప్రభావితం చేయబడిరి. కాబట్టి ఎల్లప్పుడు వెలుగులో నడుచుట క్షేమకరము. పురుషులకు వస్త్రములను బహుమానము ఇచ్చుటద్వారా కొందరు పురుషులను పట్టుకొనియున్నారు.
కొందరు పురుషులు ఒక అమ్మాయిని కలుసుకొని మరియు గదిలోగాని ఇంటిలోగాని ఆమె ఒంటరిగా ఉన్నదని కనుగొనిన వెంటనే యోసేపువలె అక్కడనుండి పారిపోరు. అప్పుడు ఆమె గర్భవతియై అతని మీద పట్టుగలిగియుండి పురుషులను ఈ విధంగా పట్టుకొనినందుకు ఆ అమ్మాయిలు సంతోషించెదరు. కాని అటువంటి పురుషులు బుద్ధిహీనమైనవారు మరియు వారి జీవితాలను పాడుచేసుకొనియున్నారు. జాగ్రత్తగాయుండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మీరు సహాయపడవలెనని కోరినచో, అవసరతలున్న పురుషులకు మాత్రమే సహాయపడండి కాని అవసరములోఉన్న స్త్రీలకు సహాయపడవద్దు (70 సంవత్సరములు మించిన స్త్రీలకు సహాయపడవచ్చు).
మూడవదిగా, ఆత్మలో బీదలైయుండుడి. ఎల్లప్పుడు మీయొక్క ఆత్మీయ అవసరత ఎరిగినవారై మరియు ఎల్లప్పుడు మిమ్మల్ని మీరు తీర్పుతీర్చుకొనుడి. విరుగగొట్టబడుటయే నిజమైనఆత్మీయత యొక్క రహస్యం. జయజీవితం జీవించుటకు ఎల్లప్పుడు మనము నిస్సహాయులమని గుర్తించి మరియు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడియుండుటకు దప్పిక కలిగి యుండవలెను.
నాల్గవదిగా, ప్రతి దినము పదినిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుడి. ఏదోఒక సమయములో ప్రతిదినము దానిని చేయుడి. బైబిలు అధ్యయన పుస్తకము కలిగియుండి దానిని ధ్యానించుడి లేక బైబిలు అధ్యయనటేపును కూడా వాడవచ్చును. ప్రతి రోజు సామెతలనుండి కొన్ని వచనములను చదవండి. నా యౌవనకాలములో క్రమశిక్షణకలిగి వాక్యము చదివినందువలన అనేక అపాయములనుండి రక్షింపబడ్డాను.
ఐదవదిగా, ప్రతిస్థలములో ప్రభువుని ఘనపరచుడి. ఉదాహరణకు, మీరు ఆతిథ్యమిచ్చుచున్నచో దేవునిమహిమార్థము ప్రార్థించి కొన్ని నిమిషములు వాక్యము మాట్లాడవలెను. వాటిని ఎక్కువసేపు చేయవద్దు. కాని దురదృష్టకరము ఏమనగా, అక్కడికి వచ్చిన అవిశ్వాసులు అభ్యంతరపడెదరేమోనని, చాలామంది విశ్వాసులు ప్రభువు నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడెదరు. దేవుని పిల్లలకంటే సాతాను యొక్క పిల్లలు ధైర్యముగా యున్నారు.
సంగీతము మరియు పూర్తికాలపు పరిచర్య:
సంగీతము ఆటలవలె మన జీవితములలో విశ్రాంతిని నెమ్మదిని పొందుటకు వాడెదరు. కాని ఎవరైనను తమ జీవితములలో దానిని ముఖ్యమైనవిగా చేసుకొనకూడదు. సంగీత విద్వాంసులుగా క్రొత్తనిబంధనలో ఎవరైనను పరిచర్య చేసినట్లుగా మనము చూడము.
పాశ్చాత్యదేశములలో క్రైస్తవసంగీతము అనేవి పూర్తికాలపరిచర్యగా చేయుచున్నారు. ఎందుకనగా లౌకికసంగీతకారులు దానిద్వారా ఎంతో డబ్బును సంపాదించుచున్నారు. క్రైస్తవసంగీతము ద్వారా ఇటువంటి వారు ఎంతో ధనవంతులు అవుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ ఆచారము ఇండియాలో కూడా వచ్చింది కాని ఎవరైనను దేవునిని సిరిని సేవించలేడు అని యేసుచెప్పాడు.
ఒక క్రైస్తవుడు బోధించుటద్వారా గాని లేక సంగీతంద్వారాగాని ఆర్థికలాభం పొందకూడదు. మనము జీవించుటకొరకు ఇతరులు ఇచ్చిన బహుమానముల మీద ఆధారపడకూడదు. మొదటగా మనము ప్రభువునకును మరియు తరువాత ఆయన ప్రజలకును స్వచ్ఛందముగా పరిచర్య చేయవలెను. ప్రజలందరికి మనము ఉచితముగా పరిచర్య చేయవలెను (ప్రత్యేకముగా బీదలకు) మరియు మన అవసరముల కొరకు వేరేవాటిద్వారా సంపాదించుకొనవలెను (సి.ఎఫ్.సి ఆరంభమైనప్పటినుండి నేను ఆవిధంగా చేయుచున్నాను). అందువలన ఇండియాలోని గ్రామములలో ఉన్న బీద విశ్వాసులకు పరిచర్య చేసితిని. డబ్బు కొరకు బోధించేవారు మరియు సంగీతం వాయించువారు ధనికులకు మాత్రమే సేవించెదరు. యేసుప్రభువు ఆవిధంగా పరిచర్య చేయలేదు.
భూసంబంధమైన సౌఖ్యములను త్యజించుటయే దేవునిసేవించుట అనునది అన్యుల పద్ధతి. దేవునిచేత పిలువబడినవారు మాత్రమే పూర్తికాలపరిచర్య చేయవలెను. వారు ఇతరులు దేవుని పరిచర్యకు బహుమానము ఇచ్చినను లేక ఇవ్వకపోయినను చేసెదరు. ఆయన సేవకుడిగా యుండుటకు దేవునిచేత పిలువబడకుండా పరిచర్యను చేయుచున్నవారు పరిచర్య కొరకు దేవుని ప్రజలనుండి తీసుకొనుటకు అధికారములేదు. అది దేవుడి సొమ్మును దొంగిలించినట్టు మరియు ఈనాడు ప్రపంచములో అది ఎంతో జరుగుచున్నది. సైన్యములో సేవచేయుటకు ఎన్నుకోబడని వ్యక్తికి, వారు జీతము ఇవ్వరు.
ఒక వ్యక్తి దేవునిచేత పిలువబడనియెడల, క్రైస్తవపరిచర్యలో ఒత్తిడిలు వచ్చినప్పుడు అటువంటి వారు రాజీపడెదరు. నేను నిజముగా దేవునిచేత పిలువబడనియెడల, నా కుటుంబ ఖర్చులు పెరిగేకొలది ఇతరులవలె నేనుకూడా డబ్బు కొరకు ''ప్రార్థన ఉత్తరములు'' వ్రాసెడి వాడను లేక నా వర్తమానమును ఇండియాలోని క్రైస్తవులు నిరాకరించినప్పుడు కొంత రాజీపడెడివాడను. లేక నాకు ఎదురైన వ్యతిరేకతనుబట్టి నిరాశపడేవాడను. కాని ఈ పరిస్థితులన్నింటిలోను దేవుడు నన్ను కాపాడి మరియు నీటిపైన నా తలయెత్తుకొన చేయుటయే గాక నీటి మీద నడిచేటట్లుగా చేశాడు. నాకంటె గొప్పవారు కూడా మునిగియుండగా, నన్ను కాపాడినందుకు మహిమంతయు దేవునికి చెల్లును. ఈ లోకములో పూర్తికాలపు పరిచర్య చేయుటకంటే గొప్పది ఏదియు లేదు. అయినప్పటికి దేవునిచేత పిలువబడకుండా పరిచర్య చేసినయెడల దేవుని దృష్టిలో వారు ఫలించరు. దీనిని ఋజువుచేయుటకే క్రైస్తవ్యములో అనేకఉదాహరణలు ఉన్నాయి.
హెబీ 5:4,5 ఇట్లు చెప్పుచున్నది, ''ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనత పొందును. క్రీస్తు కూడా తన్నుతాను మహిమపరచుకొనలేదు.... ఆయన కూడా దేవుడు చేత పిలువబడెను''.
కాబట్టి దేవుని యొక్క పిలుపులేకుండా ఆయన యొక్క పరిచర్య ఏ విధంగా చేయగలము.
మూడు రెట్లుగా ఉన్న కంచె:
అనేకవిషయములను మనము హక్కుగా కలిగియున్నాము. కాని నా రాజ్యము ఈలోకసంబంధమైనది కాదు గనుక నా సేవకులు తమ హక్కుల కొరకు పోరాడరని ప్రభువైనయేసు చెప్పాడు.
దైవజనులు హక్కుల కొరకు పోరాడక వాటిని విడిచిపెట్టెదరు. అబ్రాహాము లోతుతో పోట్లాడలేదు గాని తన హక్కులను కోల్పోయెను (ఆదికాండము 13). లోతు వెంటనే సొదొమను తీసుకొని సమస్తమును కోల్పోయెను. కాని అబ్రాహాము దేవుడు తనకు ఇచ్చిన దానిని తీసుకొని కనాను దేశమంతటిని తన సంతానమంతయు పొందియున్నారు. ఇస్సాకు కూడా గెరారు లోయలో నీళ్లబావికొరకు పోరాడక మరియు నీళ్ల బావులు తీసుకొనుటకు వారిని అనుమతించెను. కాని దేవుడు అతనికి మంచి ప్రదేశము ఇచ్చెను. మరియు దేవుడు అతనితో ఉండుటను ప్రజలు చూసిరి (ఆదికాండము 26:17-30).
ఒకరోజున, సాత్వికులు క్రొత్తభూమిని స్వతంత్రించుకొనుట మనము చూచెదము (మత్తయి 5:5).
కొందరు సాతాను విషయములో అనుమానముకలిగి మరియు అతనిని ప్రతి చోట చూచినట్లుగా భావించెదరు. అది బుద్ధిహీనత. సాతాను బంధకములను కలవరములను అపవిత్రతను మరియు పోరాటము నిచ్చునని నాకు తెలియును. కాని ప్రభువైనయేసు నామములో ఎదురించినప్పుడు అతడు నిలువనేరడని నాకు తెలియును. అతడు నిశ్చయముగా పారిపోవును కాని అతని తంత్రముల విషయములో నిర్లక్ష్యంగా ఉన్నయెడల లేక అతనిని ఎదురించనియెడల అతడు పారిపోడు.
ఇప్పటివరకు సాతాను మన కుటుంబం మీద జయముపొందలేదు మరియు భవిష్యత్తులో కూడా అతడు జయించలేడు. ఎందుకనగా దేవుడు 1. నా చుట్టూ 2. నా కుటుంబసభ్యుల చుట్టూ 3. నా ఆస్థిపాస్థుల చుట్టూ మూడు కంచెలు వేసియున్నాడు (యోబు 1:10). సాతాను మన మీద దాడిచేసిన ప్రతిసారి దేవుడు అతని తంత్రములను వమ్ముచేసి మరియు అతని ప్రణాళికలు పాడుచేసెను. మనము ఈ లోకంలో జీవించుచున్నంత వరకు మనము సాతానును ఎదురించుచుండెదము. మరియు సాతాను తంత్రములన్నిటిని దేవుడు మరలా మరలా పాడుచేయును. ప్రభువు మరల వచ్చినప్పుడు మీఅందరికొరకు మేము చేసిన పోరాటములు మీరు తెలుసుకొనెదరు (ఎఫెసీ 6:12). అవి ఇప్పుడు మీకు తెలియదు (1 కొరింథీ 4:5). అప్పుడు మా ప్రార్థనలద్వారా దేవుడు మిమ్మల్నికాపాడి మరియు అనేకసార్లు మిమ్మల్ని విడిపించుటను మీరు చూచెదరు.
మీరు ప్రభువైన యేసుకు హృదయ పూర్వకమైన శిష్యులగునట్లును మరియు మీరు సాతానును జయించునట్లును మరియు మీరు దేవుని సంపూర్ణ చిత్తములో జీవించునట్లును ప్రార్థించుచున్నాము. మీరు ఎక్కడ జీవించినప్పటికి, ఎల్లప్పుడు దేవునిచిత్తములో ఉండవలెను.
మీరు కాలేజీలో చేరుచున్నప్పుడు నేను మీ కొరకు ప్రార్థించియున్నాను. కనుక దేవుని చిత్తప్రకారమే ఆ కాలేజీలో ఉన్నారని నమ్ముచున్నాను. మీరు గృహమును విడిచి వెళ్ళిన తరువాత పరిపూర్ణమైన పురుషులైఉన్నారని నమ్ముచున్నాను. మరియు ఈ సంవత్సరము అన్నింటిలో దేవుడు మిమ్మల్ని కాపాడియున్నాడు. ప్రమాదములు జరుగకుండా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా కాపాడియున్నాడు. మీకు తెలియని రీతిగా ఉన్న కీడులనుండి దేవుడు మిమ్ములను విడిపించాడు. మరియు మీరు వెళ్లుచున్న సంఘములలో మీరు చురుకుగా ఉండి, ప్రభువు పరిచర్య చేయుచు మరియు అనేకులకు ఆశీర్వాదంగా ఉండుడి. మిమ్ములను బట్టి అతిశయించుచున్నాను. మిమ్ములను బట్టి సి.ఎఫ్.సి విశ్వాసులు మరియు మేము దేవునికి వందనాలు చెప్పుచున్నాము.
ప్రభువైనయేసు మీ కొరకు కల్వరిసిలువ మీద చేసి ముగించిన దానంతటిని బట్టి మీరు కృతజ్ఞత గలవారై, త్యాగపూరితముగా జీవించుచు, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మరియు పరిచర్య చేయుడి.
ఎల్లప్పుడు పోరాడుడి:
మీరు ఆత్మీయపసిబిడ్డలుగా ఉండక, సంపూర్ణులగుటకు సాగిపోవుచున్నందున నేను సంతోషించుచున్నాను. క్రీస్తులో మీరు నాసహోదరులు కావలెనని ఎల్లప్పుడు కోరియున్నాను. ఎందుకనగా మనము నిత్యత్వము సహోదరులుగా ఉండెదము. మనయొక్క సంభాషణలన్నియు పరిణితిచెందిన విధానం మరియు మితముగాను ఉండి మరియు ప్రాముఖ్యతలేని విషయములలో మనము అంగీకరించకపోయినప్పటికి ఒకరినొకరం ప్రేమించుకొనుచు ఒకరికొరకు ఒకరమున్నాము. మీరు పరిణితి చెందియున్నారని ఇవి చూపించుచున్నవి. దేవునికి స్తోత్రము.
మీ తలంపులలోను మరియు చూపులలోను (సినిమాలు మరియు పత్రికలు) లైంగికవిషయములలో పోరాడవలెనని మిమ్మల్ని ప్రోత్సహించుచున్నాను. మీకు కనీసం 60 సంవత్సరములు వచ్చేవరకు ఈ పోరాటం ఉంటుంది. దావీదు యాభైరెండు సంవత్సరముల వయస్సులో బేత్సెబాతో పాపము చేసెను. అతడు చూచే విషయములో జాగ్రత్తగా లేనందువలన అతను పడిపోయెను. ఇప్పుడు ఆ కోరిక మీలో బలముగా ఉన్నదా, నా యౌవనప్రాయంలో కూడా ఉన్నది. కాని బాహ్యముగా మీకు ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. కాబట్టి మీరు ఎక్కువగా పోరాడవలెను. కాని అంతమువరకు దీనిని జయించుటకు ప్రభువు కృపను ఇచ్చును. మీరు పడిపోయినను, లేచిమళ్ళీ పోరాడవలెను. మీరు ప్రతిరోజు జయించలేక పోయినప్పటికిని, మీరు పోరాడవలెను అప్పుడు ఒక రోజు జయించెదరు మరియు విజయోత్సవముతో పరలోకములోకి ప్రవేశించెదరు.
కీర్తన 112 ను లివింగు బైబిలులో చదవండి. దానిలో మంచిగా వివరించారు.
దేవుని యెడల భయభక్తులు గలవారు ఊహించిన దానికంటే ఆశీర్వదించబడుదురు. ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మంచివారి కుమారులు దీవించబడుదురు, ప్రతీచోట వారు ఘనపరచబడుదురు. అతడు కలిమియు సంపదయు కలిగియుండును. అతని నీతి కార్యములు మరచిపోబడవు. అతనికి చీకటి కలిగినను వెలుగుపుట్టును. అతడు కటాక్షమును వాత్సల్యము కలవాడు. అటువంటివారు చేయుదానంతటిలో సఫలమగుదురు. క్లిష్టపరిస్థితులలో, వారు కదిలింపబడరు. అతని మీద దేవుని యొక్క దృష్టి ఉండుట అనేకులు చూచెదరు. అతడు దుర్వార్తకు జడియడు అతని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. అతడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును. అతనియొక్క క్రియలు మరచిపోబడవు. అతడు ప్రభావము కలిగి ఘనపరచబడును. భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును''.
వ్యక్తిగతమైన ఆర్థికవిషయములను నిర్వహించుట:
ఆర్థికస్వాతంత్య్రము యున్నయెడల, ప్రభువు మనలను ఎక్కడికి నడిపించినను ఎవరిమీద ఆధారపడకుండా వెళ్లవచ్చును మరియు సామెతలు 6లో చెప్పినట్లుగా భవిష్యత్తు కొరకు పొధుపుచేసికొనుట చీమలవద్ద నేర్చుకొనవలెను మరియు ప్రభువైనయేసు ఒక ఉపమానములో చెప్పినట్లుగా ఒక వ్యక్తి తనకీయబడిన తలాంతులను పెట్టుబడిగా పెట్టి పదిరెట్లు (1000 శాతం పెరుగుదల) పొందియున్నారు. మరియు మనకున్న డబ్బును బ్యాంకులో వేసినట్లయితే వడ్డీని పొందవచ్చని ప్రభువు చెప్పారు (లూకా 9:16-23).
మీరు ఎప్పుడైనను కొంతడబ్బును ప్రభువు పరిచర్యకు ఇవ్వవలెనని నిర్ణయించుకొనినచో, ధనవంతులైన పాస్టర్లకు, సంఘములకు ఇవ్వకండి కాని ఇండియాలోని గ్రామములలో ఉన్న బీద సి.ఎఫ్.సి సంఘములకు ఇవ్వండి.
మీరు డబ్బును పొదుపు కూడా చేసుకొనవలెను. దీనికొరకు మీ ముఖ్యమైన ఖర్చులను ఖాతా వ్రాయండి. ప్రతినెల గడిచిన తరువాత, మీరు ఎక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టియున్నారో మరియు ఎక్కడైతే ఖర్చు తగ్గించుకొనవలెనో చూడవలెను. మీరు పన్నును మరియు అద్దె, కారు రుణమును చెల్లించిన తరువాత మిగిలిన దానిలో ఇరవై ఐదు శాతము గాని లేక ఎక్కువగాని ప్రతి సంవత్సరము పొదుపు చేసుకొనవలెను. ఆ విధముగా అత్యవసర ఖర్చులకును మరియు మీ వివాహము జరిగిన తరువాత ఖర్చులకును అది ఉండును.
ఇప్పుడు కొద్దిగా క్రమశిక్షణలో ఉన్నయెడల భవిష్యత్తులో గొప్ప ఫలములు పొందెదరు. భవిష్యుత్తులో మీరు చింతించరు. మీరు ఆర్థికస్వాతంత్య్రము పొందుకొని మరియు ఎక్కువ స్వతంత్రులు అగుదురు. ఐదువేల మందికి పంచిపెట్టిన తరువాత మిగిలిన వాటిని పోగుచేయుడని ప్రభువు చెప్పాడు. అనగా దేనినైనను వృథా చేయవద్దు. మీకు వివాహము జరుగకమునుపే ఆర్థిక విషయములను నెరవేర్చుటను నేర్చుకొనుడి. దీనిని ప్రాముఖ్యమైనవిగా చేయుడి. డబ్బు విషయములో నమ్మకముగా ఉండేవారి గురించియు మరియు అపనమ్మకస్థులుగా ఉండేవారి గురించియు అనేక ఉపమానములలో ప్రభువు చెప్పాడు. దీనిని ఆత్మీయముగాను మరియు ఇతర విషయములలోను అన్వయించుకొనవలెను.
మీరు చెల్లించవలసిన దానంతటిని ముందుగానే చెల్లించుడి. క్రెడిట్‌కార్డుగాని లేక మరియు అప్పునైనను చేయకూడదు. ఎందుకనగా మీరు ఎక్కువగా వడ్డీ కట్టవలసివచ్చును. ఈ విషయములో మీరు జాగ్రత్తగాలేనియెడల, మీరు వివాహమైనతరువాత ఎక్కువ ఖర్చులుండును మరియు ఒకరోజు మీకు తీవ్రమైన సమస్యలు రావచ్చు. కాబట్టి దీనినే జీవిత విధానముగా చేసుకొనుడి. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించునప్పుడు, మీకులేని దానిని ఖర్చు చేయుచున్నారు కాబట్టి జాగ్రత్తగాయుండవలెను. క్రెడిట్ కార్డు అప్పు చేయవద్దు. ప్రతినెల మీ బిల్లులను చెల్లించుడి. కారు ఇన్సురెన్సు చెల్లించినట్టుగానే బిల్లులను చెల్లించుడి.
ప్రతినెల కొంతడబ్బును బ్యాంకులో జమచేయుడి ఎందుకనగా డబ్బు మీ వద్ద లేనప్పుడు మీరు ఖర్చు పెట్టరు. ప్రభువైనయేసు తాను పొందిన వెంటనే ఖర్చు పెట్టలేదు లేనట్లయితే ఆయనకు కోశాధికారిగాని డబ్బుసంచిగాని అవసరముండదు. యూదా వద్ద యుండిన పొదుపు ఖాతాలో డబ్బు యుండెడిది.
స్టాక్‌మార్కెట్ గురించి జాగ్రత్త, కాని మంచి కంపెనీలో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చును. చాలా సంవత్సరముల నుండి నేను దీనిని చేశాను. మరియు దానిద్వారానే కుటుంబమును పోషించాను.
ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను సకాలంలో చెల్లించుడి కాని పన్ను చెల్లించకుండునట్లు, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను (సదుపాయములను) సద్వినియోగం చేసుకొనవలెను. ఆ విధముగా పన్నుభారము తగ్గుటవలన మీరు కొంత పొదుపు చేసుకొనవచ్చును. ఇదియే జ్ఞానము.
నేను చెప్పిన దానిని సమతుల్యం చేయుటకు, దీనిని చెప్పనివ్వండి: సిరిసంపదలు పొందుట దేవుని యొక్క ఆశీర్వాదమునకుగాని దేవునిచిత్తములో ఉన్నామనుటకు ఋజువు కాదు. తలదాచుటకు కూడా స్థలము లేదని ప్రభువు చెప్పాడు. మరియు ఆకలిదప్పులతోను మరియు దిగంబరత్వముతోను ఉంటిమని పౌలు చెప్పాడు (2 కొరింథీ 11:27). కాని వారి కంటే ఎక్కువగా ఎవరైనను దేవుని చిత్తములో లేరు.
ఈ లోకంలో నష్టపోయినప్పుడు అనగా క్యాన్సరు, పాము కరచుట మరియు మొదలగు కీడులు అనేకులను ప్రభువుయొద్దకు నడిపించెను. కాబట్టి మనయొక్క ఆర్థిక స్థితిని బట్టి ఆత్మీయతను అంచనా వేయకూడదు.
''సిరిసంపదలు పాత నిబంధన యొక్క ఆశీర్వాదం కాని ప్రతికూలత క్రొత్త నిబంధన యొక్క ఆశీర్వాదం'' అని ఫ్రాన్సిస్ బెకన్ చెప్పాడు.
సమయము లేకుండాచేయుట సాతాను యొక్క కుతంత్రం:
ప్రజలు తీరికలేకుండా ఎల్లప్పుడు ఏదొక పనిలో హడావిడిగా ఎలాగు ఉంటారోనని ఈ మధ్య చదివాను.
ఒకసారి సాతాను దయ్యములందరితో ప్రపంచ సభను నిర్వహించి, ఈ విధముగా చెప్పాడు, ''సంఘకూటాలకు వెళ్ళకుండా క్రైస్తవులను మనము ఆపలేము. వారి బైబిళ్ళను చదువకుండా వారిని ఆపలేము. కాని మనము ఇంకొకటి చేయగలము. ప్రభువైనక్రీస్తుతో వారు ఎల్లప్పుడు సన్నిహిత సహవాసము కలిగియుండకుండా ఆపగలము. ఆవిధముగా వారు ఎల్లప్పుడు ప్రభువైనయేసును కలిగి జీవించినట్లయితే, వారిమీద మనకు ఎటువంటి పట్టు దొరకదు. కాబట్టి వారిని సంఘకూటములకు వెళ్ళనిద్దాము. వారి మూలసిద్ధాంతములను కలిగియుండనిద్దాము. వారు ఆవిధంగానే జీవించనిద్దాము కాని వారు ప్రభువైనయేసుతో సన్నిహిత సహవాసము చెయ్యకుండా వారి సమయాన్ని దొంగిలిద్దాము. దయ్యములైన మీరు దీనిని చేయాలని కోరుచున్నాను. వారి రక్షకునితో వారు పట్టబడకుండునట్లు, వారిని ఆయన వైపు తిరుగకుండా వారి దృష్టిని మార్చుదాము''.
''దీనిని ఏవిధముగా చేయగలమని'' అతని దయ్యములు అడిగాయి?
సాతానిట్లు చెప్పాడు, ''అనవసర విషయాలలో వారు ఎల్లప్పుడు గడుపునట్లు చేద్దాము''. వారి మనస్సులలో నింపబడునట్లు, అనేక తంత్రములను (కుయుక్తులను) కనిపెట్టండి. వారు డబ్బును ఎంతో ఎక్కువగా ఖర్చుపెట్టేటట్లు వారిని ప్రేరేపించి మరియు ఎక్కువ అప్పులు చేసేటట్లు చేయండి. భార్యలు కూడా ఉద్యోగములు చేయునట్లు వారిని ప్రేరేపించి మరియు భర్తలు కూడా వారములో 6 లేక 7 రోజులు, రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేసేటట్లు వారిని ఒప్పించండి. ఆవిధముగా వారు సౌఖ్యముగా జీవించునట్లు ఒప్పించండి. వారి పిల్లలతో వారు సహవాసము చేయకుండునట్లు చేయండి. అప్పుడు వారి కుటుంబాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
ప్రభువైనయేసు వారితో చెప్పాలనుకున్న విషయాన్ని వారు వినకుండునట్లు వారి మనస్సులను వేరేవాటితో నింపండి. కారులో వెళ్ళుచున్నప్పుడుగాని, ఇంటిలో ఉన్నప్పుడుగాని సంగీతము, వేరే పాటలు వింటూ మరియు టీ.వీ చూచునట్లు వారిని ప్రేరేపించండి. లోకములోని ప్రతి షాపులోను లేక హోటలులోను ఎల్లప్పుడు సంగీతము వినిపించేటట్లు చూడండి.
వారు ఎక్కువగా వార్తాపత్రికలు మరియు మాసపత్రికలు చదివేటట్లు చేయండి. రోజులో 24 గంటలు వార్తలు వినాలనే కోరికను వారి మనస్సులో పెట్టండి. ప్రతివిధమైన వార్తలు, ఉచితముగా ఇచ్చే వస్తువులు, సేవలు మొదలైనవి వారికి వచ్చునట్లు చేయండి.
వారి విశ్రాంతిదినాలలో కూడా వారు చాలా తీరికలేకుండా ఉండేటట్లు చేసి, తరువాత వారానికి సిద్ధపడలేనంతగా వారు అలసిపోయేటట్లు చేయండి. వారు ఎక్కువసేపు నడువకుండా (వాకింగ్ చేయకుండా) చేయండి. వారు అనేక ఆటపాటలు చూచుటకును, సినిమాలకు వెళ్ళునట్లును చేయండి. వారు సంఘముగా కలిసినప్పుడు నేరారోపణగల మనస్సాక్షితోను మరియు నెమ్మదిలేని ఉద్రేకములతోను వెళ్ళేటట్లు చేయాలి.
క్రీస్తును గురించి సాక్ష్యము చెప్పుటకు వారిని అనుమతించండి కాని వారి జీవితాలను క్రీస్తుకు వేరుగా ఉన్న మంచి విషయాలతో నింపి, వారు క్రీస్తులో నుండి శక్తిని, జీవాన్ని అడిగిపొందుకొనుటకు సమయము లేకుండా చేయండి. త్వరలో వారు చేయవలెనని కోరిన మంచిపనిని, దేవునిశక్తితోకాక తమ స్వంతశక్తితో చేసి వారి ఆరోగ్యమును మరియు వారి కుటుంబములో ఐక్యతను పోగొట్టుకొనేటట్లు చేయండి.
ఆవిధముగా ఆ పనిని ఆసక్తితో చేయుటకు దురాత్మలు వెళ్ళి, క్రైస్తవులను తీరికలేకుండా ఇక్కడకు లేక అక్కడకు పరుగెత్తేటట్లు సాతాను చేస్తుంది.
ఈ కుట్రలో అపవాది జయము పొందియున్నాడా? జవాబు నీవే చెప్పాలి.
పరిసయ్యతత్వము:
2 కొరింథీ 3:6లో రెండు విధములైన విశ్వాసులు ఉన్నారు:
1. ఆత్మచేత నడిపించబడువారు.
2. అక్షరానుసారము నడుచుకొనేవారు.
ఆత్మచేతనడిపించబడేవారు అనేకపరీక్షలు మరియు శ్రమలలోగుండా వెళ్ళి వ్యక్తిగతముగా దేవుడిని తెలుసుకొని మరియు ఆయనమనస్సును, ఆయన మార్గములను తెలుసుకొనును. ఆవిధముగా వారు ఆత్మీయ విషయములలో వివేచన కలిగియుండెదరు.
కేవలం బైబిలు చదివి మరియు దానిని అర్థము చేసుకొనువారు అక్షరానుసారముగా యుందురు. వారు యథార్థవంతులైనప్పటికిని ఆత్మానుసారముగా కాక అక్షరానుసారముగా నడుచుకొనెదరు గనుక ఇతరులయెడల పరిసయ్యులవంటి వైఖరి కలిగియుండెదరు. ఈ విధముగా వారు కల్ట్‌గా మారెదరు. వారియొక్క సిద్ధాంతము ఎరిగియుందురు గాని దేవునిని ఎరుగరు. వారియొక్క నాయకులు ఆయా పరిస్థితులలో ప్రవర్తించిన రీతిగానే వీరుకూడా ప్రవర్తించుటకు ప్రయత్నించెదరు. వారి యొక్క నాయకులను అనుసరించుకు, వారి గురించి అనేక విషయములు తెలుసుకొనెదరు మరియు ఆవిధముగా ఆత్మీయులయ్యెదరని ఊహించుకొందురు. వారు మరిఎక్కువగా పరిసయ్యులగుదురు.
క్రైస్తవ్యంలో కొన్ని గుంపుల వారు కల్ట్ కాకపోయినప్పటికి స్వభావములు ఆవిధంగా ఉండును. నేను మిమ్ములను మరియు ఇతరులను అటువంటి గుంపుల గురించి అనేకసార్లు హెచ్చరించాను. అంత్యదినములలో అది మరిఎక్కువగా జరుగును. గనుక ప్రభువు వచ్చువరకు నేను హెచ్చరించుచుండెదను.
పరిసయ్యులయొక్క వ్యతిరేకత:
మనసంఘము అనేక సంవత్సరములుగా ఎదుర్కొనుచున్నట్టుగా పాపాత్ములు మనకు చేసిన వ్యతిరేకత అంతటిని దేవుడు అనుమతించును (హెబీ 12:3). ప్రభువైన యేసు, పౌలు మరియు క్రైస్తవచరిత్రలో దైవజనులందరు దీనిని ఎదుర్కొనియున్నారు. కాబట్టి ఇటువంటి వ్యతిరేకతను మీరు ఎదుర్కొనుచున్నయెడల ప్రభువైనయేసువలె సాత్వికులై ఉండుడి. ఆవిధముగా మీరు మంచిసహవాసములో ఉండెదరు. అప్పుడు ఒక రోజున పరిపూర్ణులు అగుదురు. (యేసువలె రూపాంతరం చెందుట).
విశ్వాసులు ఎల్లప్పుడు తమనుతాము తీర్పుతీర్చుకొనని యెడల, వారు అంతకంతకు దిగజారి పరిసయ్యులువలె మారెదరు. నీకు తెలిసిన విశ్వాసులు ఆవిధంగా దిగజారుట నీవు చూచునప్పుడు, భ్రమపరిచే ఆత్మనుండియు మరియు స్వనీతినుండియు రక్షించుటకు తన కనికరమును ఇచ్చిన ప్రభువుకి కృతజ్ఞత కలిగియుండుడి. దానిని మీరు ఒక హెచ్చరికగా తీసుకొనుము.
పరిసయ్యులనేకులు ఇతరుల విషయములో జోక్యము చేసుకొనే వారుగా ఉండెదరు (1 పేతురు 4:15). మరియు తమ్మునుతాము సమర్థించుకొని ఇతరులకు తీర్పుతీర్చెడి వారిగా ఉండెదరు (యాకోబు 3:1). వారి అడుగుజాడలలో మనము నడవకుండునట్లు దేవుడు వారిని మన హెచ్చరికకొరకు బహిర్గతపరచును.
దీనత్వము ద్వారా జయము:
అత్యంత ఘోరపాపమైన పరిసయ్యతత్వముమీద వెలుగు పొందకుండా జీవించుట ఎంతో ప్రమాదకరము. దుష్టతలంపులనుండియు మరియు కోపమునుండి జయము పొంది మరియు స్వనీతినిబట్టి గర్వించుట ఒక వ్యక్తిని 20 అడుగుల గుంతలోనుండి పైకి లేపి 2000 అడుగుల గుంతలో వేసినట్లుండును. అనేకులు 2000 అడుగు గుంతలోనుండి మరియు 20అడుగుల గుంతలో ఉన్నవారికి పాపము మీద జయము గురించి బోధించుచున్నారు.
ప్రభువు మాత్రమే మనలను పాపములో పడకుండా కాపాడుచున్నాడని ఒప్పుకొనుటకు మరియు ఎల్లప్పుడు దీనుడిగా ఉండుట జయము పొందిన వారికి చాలాకష్టము. ఎల్లప్పుడు ఈ సత్యమును మీరు గుర్తించినయెడల, దీనులైఉండెదరు.
నేను నావికాదళంలో పనిచేయుచున్నప్పుడు నేను పడవతో వెళ్ళుచున్నప్పుడు గాలి బాగా విసిరినప్పుడు, పడవయొక్క పట్టీని క్రిందకు జరిపేవాడిని (బలమైన గాలి వచ్చినప్పుడు పడవ మునిగిపోకుండునట్లు బలమైన పట్టీని క్రిందకు జరిపెదము) ఎల్లప్పుడు మనుష్యులకు కనబడని విధముగా మన హృదయములో దీనులమై ఉండవలెను. పడవ వెళ్ళుచున్నప్పుడు బలమైనగాలి వచ్చిన యెడల పట్టీ క్రిందకు జరపనప్పుడు మునిగిపోవును. మనము ఆ పట్టీని కలిగియున్నప్పుడు, బలమైనగాలి వీచినను ఏమియు జరగదు.
పౌలువలె మనం పాపులలో ప్రధానులమని ఒప్పించబడినయెడల అత్యంత ఘోరపాపులను గాని, లేక వెనుకకు జారిపోయినవారిని చూచి వారిని నిర్లక్ష్యము చేయము. ఎందుకనగా మనము ప్రభువైనయేసు వైపు చూచుచు ఎల్లప్పుడు తీర్పుతీర్చుకొందుము (1 తిమోతి 1:15). స్వనీతిపరుడైన సౌలును దేవుడు దీనుడైన పౌలుగా మార్చునప్పుడు, దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనులమై విరగగొట్టుటకు అంగీకరించినయెడల, దేవుడు ఆవిధంగానే మనలో కూడా చేయును.
ఆవిధముగా మనము యథార్థమైనభక్తియు, నీతిగలవారమగుదుము (ఎఫెసీ 4:24 జె. బి ఫిలిఫ్స్).
స్వశక్తి మరియు కల్టిస్టులు:
కల్టిస్టు క్రైస్తవులు వారి యొక్క స్వశక్తితో వారికి లోబడవలెనని చెప్పెదరు. కాబట్టి అటువంటి వారి విషయములో జాగ్రత్త. ప్రజలు వారి పాపమును తమ యొద్ద ఒప్పుకొనవలెనని చెప్పుట ఇందులో ఒక విధానము. తప్పిపోయిన కుమారుడు తండ్రితో సరిచేసుకున్నట్లు సరిచేసుకున్న యెడల సరిపోవునని వారు చెప్పరు. వారి గుంపులో చేరకుండా ఒకతప్పిపోయిన కుమారుడు పాడుచు సంతోషించుట వారు సహించలేరు. లూకా 15లో ఉన్న పెద్దసహోదరుని వలె వారు ఉండెదరు. పెద్దసహోదరుడు తన పెద్దరికమును కలిగియుండుటకు తప్పిపోయిన కుమారుడు తన యెదుట అతని పాపములు ఒప్పుకొనవలెనని అతడు కోరును. అతడు తన యెదుట ఒప్పుకొనేవరకు కూలివారిలో ఒకరిగా ఉండుటకు ఇష్టపడును. ప్రపంచములోని ప్రతియొక్క కల్ట్ యొక్క విధానము ఇదే. రక్షణ పొందకముందు ప్రజలు చేసిన పాపములను వారి యొద్ద ఒప్పుకొనుటద్వారా ఆ కల్టు నాయకులు వారి మీద పట్టు కలిగియుండెదరు. కమ్యూనిస్టు దేశములో రహస్యముగా పోలీసులు ఉపయోగించే పద్ధతులను వీరు ఉపయోగించుట బాధాకరము. ఇది 100 శాతం సాతాను సంబంధమైనది. అటువంటి పెద్దసహోదరులు తండ్రి హృదయము కలిగియుండరు (లూకా 15). మనము ఒక పెద్ద సహోదరుడి ఇంటికి కాక తండ్రి ఇంటికి రావలసిఉన్నదానిని బట్టి దేవునికి స్తోత్రము.
ఈ కల్టిస్టులు ఎవరైనను వారినివ్యతిరేకించినను లేక వారిగుంపును విడిచిపెట్టినను వారికి కీడు జరుగునని బెదిరించెదరు. కల్ట్ గ్రూపులు అన్నియు దీనిని చేయును.
వారితో ఏకీభవించనివారిని నేరారోపణలో ఉండునట్లుగా చేసి మరియు మానసికంగా బలహీనపరిచి ఎల్లప్పుడు వారి మీద ఆధారపడునట్లుగా చేయును. దేవుడు వారి మధ్యలో ఎంతో అద్భుతంగా పనిచేయుచున్నాడని స్థిరత్వంలేని విశ్వాసులను ఒప్పించెదరు. ఇవన్నియు కల్టిస్టులలో ఉన్న అభధ్రతను సూచించుచున్నవి. ఇటువంటి కల్ట్ గ్రూపుల నుండి మీరు దూరంగా ఉండవలెను.
ప్రభువే మీకు స్వయముగా కాపరిగా ఉన్నప్పుడు మీజీవితకాలమంతా కృపాక్షేమములు వెంబడించును. మీరు నిత్యత్వము దేవునిఇంటిలో నివసించెదరు (కీర్తన 23:6). కాబట్టి దేవుని మంచితనమును బట్టియు, కనికరమునుబట్టియు దేవునికి కృతజ్ఞత కలిగియుండుడి.
కల్టిస్టులు వేదించెదరు (మత మౌడ్యము):
కల్టిస్టులు వేదించేవారైయున్నారు (యెషయా 14:3-6) అని లివింగు బైబిలులో చదవండి. ఇది వారికి సరిపోవును. ''తమ్మును బాధించినవారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు. బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టులు దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి''. యేసుయొక్క దీనత్వములోను సాత్వికములోను పాలివారగుచున్నవారుమాత్రమే నిజమైనఆత్మీయ తండ్రులుగా ఉండి మరియు దేవునిప్రతినిధులుగా ఉండెదరు (మత్తయి 11:29). మరియు పరిసయ్యులు యౌవన విశ్వాసులను వేదించుచు సాతాను ప్రతినిధులుగా ఉండెదరు.
పరిశుద్ధాత్మ కార్యమును వ్యర్థపరిచే ఆత్మలగురించి జాగ్రత్తపడుడి. కల్టిస్టుల యొక్క పైకి కనబడే మంచితనం గురించి జాగ్రత్తపడుడి. అంతరంగములో వారు పరిసయ్యులై ఉందురు. ఒకసారి మీరు వారితో చిక్కబడినయెడల, దానిని విడచి బయటకు వచ్చుట చాలా కష్టము.
అనేకమంది కల్టిస్టులు మంచివారైయుండి, మంచికుటుంబములు కలిగియుండి మరియు ఇతర విశ్వాసులుకంటే మంచిగా జీవించెదరు. వారు యథార్థవంతులైనప్పటికి తాము కల్టులోనికి నడిపించబడ్డారు. ఇటువంటివారు దేవునివాక్యము కంటే మనుష్యుల మాటకు ఎక్కువ విలువనిచ్చెదరు. లేఖనములు వారు సరిగా చెప్పరు. మరియు సత్యమును అర్థం చేసుకొనుటకు ఒక లేఖనమును మరొక లేఖనముతో పోల్చరు. అందువలన వారు తప్పిపోవుదురు. వివేచనలేని విశ్వాసులు ఈ కల్టిస్టుద్వారా మోసపోవుదురు. వారియొక్క ముఖ్యమైననాయకులు మరియు బోధకులు స్వనీతిపరులుగాను, లీగలిస్టులుగాను లేక గర్విస్టులుగాఉన్నారని పరీక్షించుటమంచిది. ఆవిధముగా సలభముగా ఒక కల్టును గర్తించవచ్చును. అందులో ఉన్న మంచివారినే నీవుచూచిన యెడల బుద్ధిహీనముగా వారిలో చేరవచ్చును.
కల్టిస్టులు యొక్క సమతుల్యతలేని బోధ:
అనేకమంది కల్టిస్టులు లూకా 14:26 గురించి చెప్పెదరు. యేసు ఇట్లు అనెను: ''ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు''.
కాని వారు వచనమంతటిని చెప్పరు. వారు తమయెడల తల్లిదండ్రులు దూరమగునట్లు తల్లిదండ్రులను మాత్రమే ద్వేషించమని చెప్పెదరు. మీలో ఎవరైనా ఆవిధంగా చెప్పినయెడల, వారితో పాటు భార్యలు, పిల్లలు, సహోదరులను ద్వేషించమని అదే వచనములో ప్రభువు చెప్పాడని వారితో చెప్పవలెను. వారు ఎవ్వరైనను దీనిని చేయరు. ఆవిధంగా వారి యొక్క వేషధారణను బహిర్గత పరిచెదరు. తల్లిదండ్రులు కంటే భార్య కంటే, పిల్లలు కంటే మరియు మీ గుంపులో ఉన్న సహవిశ్వాసుల కంటే మొదటిగా క్రీస్తును పెట్టుటే నిజమైన విశ్వాసము.
ఆవిధంగా కల్టిస్టులు సగం వచనం చెప్పి మరియు ప్రజలను తప్పు త్రోవ పట్టించెదరు. అటువంటి వారి విషయం జాగ్రత్తగా ఉండి వారిని బట్టి మోసపోవద్దు. మీరు చిన్న వారైనప్పటికి అనేక సంవత్సరములు బెంగుళూరు సంఘములో సమతుల్యమైన దేవునివాక్యము వినియున్నారు. దానిని ఎల్లప్పుడు మనస్సులో ఉంచుకొనుడి.
కల్టిస్టులు క్రీస్తుకంటే ఎక్కువగా మనుష్యులను వెంబడించెదరు:
కల్టిస్టులు వారియొక్క నాయకులను ఎక్కువగా గౌరవించి మరియు గుడ్డిగా వారిని ఎక్కువగా వెంబడించెదరు. లేఖనములకంటే వారి బోధకే ఎక్కువ విలువనిచ్చెదరు.
మనము క్రీస్తుయెడల మరియు క్రీస్తుయొక్క శరీరమను సంఘముయెడల రాజభక్తి కలిగియుండెదము గాని ఏ గుంపునైననూ ఏ వ్యక్తినైననూ మనము ఆవిధంగా కలిగియుండము. దేవునియొక్క బిడ్డలతో మన యొక్క సహవాసము శిరస్సైయున్న క్రీస్తుద్వారానేగాని ఒక సిద్ధాంతమునుబట్టిగాని, ఒక వ్యక్తినిబట్టిగాని కాదు.
యెహెజ్కేలు 21:27 ఈ విధంగా చెప్పుచున్నది, ''దాని స్వాస్థ ్యకర్త వచ్చు వరకు నేను దానిని పడద్రోయుదును''. క్రీస్తుని ప్రభువుగా అంగీకరించక ఒక నాయకునిగాని లేక ఒకనాయకుని దేవునికుమారుని స్థానంలో ఉంచినయెడల లేక దేవుని స్థానంలో డబ్బునైనను దేనినైనను ఉంచినయెడల అవన్నియు విగ్రహములవంటివి గనుక దేవుడు పడద్రోయును.
ఒక కల్టుతో సన్నిహిత సంబంధం కలిగియుండుట, కరెంటు వైరును ముట్టునట్లుగా ఉండును. అతడు దానిని విడిచిపెట్టనియెడల అది తన జీవితకాలమంతయు పట్టుకొనును.
కల్టిస్టులు అహంకారవైఖరి కలిగియుండి ప్రత్యేకతను కలిగియుండెదరు:
కొర్నేలీ ఇంటిలో పేతురు ఇట్లనెను, ''దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాడు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును'' (అపొ.కా. 10:34,35). ఈ మాటలో ఉన్న సత్యము మనం చూసిన యెడల మనం మోసంనుండి పరిసయ్యతత్వంనుండి రక్షింపబడెదము.
ప్రభువైనయేసు కాలంలో, తాము మాత్రమే దేవునిచేత ఎన్నుకోబడియున్నామని యూదులు తలంచిరి. గత 2000 సంవత్సరములనుండియు క్రైస్తవ్యంలో ఇటువంటి ప్రత్యేకతకలిగిన గుంపులు అనేకమైనవి ఉన్నవి. వారు అహంకార వైఖరిని బట్టియు మరియు ప్రత్యేక వైఖరిని బట్టియు అనేకమంది పరిసయ్యులు తమ్మునుతాము నాశనంచేసుకొని తమ్మును వెంబడించువారిని కూడా నాశనంచేసిరి.
అటువంటి కల్టిస్టుల గురించి జాగ్రత్తపడుడి. వారికి దూరంగా ఉండుడి.
''క్రొత్తద్రాక్షారస తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము'' అను పుస్తకములో మతమౌడ్యులు అను సంచికను చదవండి.
జీవితభాగస్వామిని ఎన్నుకొనుటకు కొన్ని ముఖ్యమైన నియమములు:
మీరు భార్యకొరకు చూచునప్పుడు ముఖ్యముగా ఈ ప్రశ్నలను వేసుకొనవలెను.
1. ఆమె క్రొత్తగా జన్మించినదా? (1 యోహాను 3:10).
2. ఆమెకు దేవునిభయము ఉన్నదా? (సామెతలు 31:30).
3. దేవుడు విలువనిచ్చేసాధువైనట్టియు మరియు మృధువైనట్టియు గుణము ఆమెకు ఉన్నదా? (1 పేతురు 3:4).
4. నీకున్న ఆత్మీయవిలువలు ఆమెకు ఉన్నవా? (2 కొరింథీ 6:14).
ఈ విషయములో నిర్లక్ష్యం చేయువారు, వివాహజీవితములో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనెదరు. ప్రభువు తనను నడిపించే మార్గములో వెళ్ళకుండునట్లు ఆమె అతనిని వెనుకకు లాగవచ్చును. ఏశావువలె అటువంటి విశ్వాసి తన యొక్క ఆత్మీయజ్యేష్ఠత్వపు హక్కును ఒక పూటకూటి కొరకు పోగొట్టుకొనినట్లుండును.
ప్రభువు క్రైస్తవయౌవనస్థులను అందమైన తెలివితేటలుగల అమ్మాయిలను కలుసుకొనేటట్లు చేసి వారిని పరీక్షించును. అటువంటి అమ్మాయిలు వారు క్రొత్తగా జన్మించక పోయినప్పటికి, క్రొత్తగాజన్మించామని చెప్పుదురు కాని లోకస్థులువలె జీవించెదరు. మరియు ప్రతి యౌవనస్థుని యొక్క స్పందనను దేవుడు చూచును. అతను బుద్ధిహీనుడైయుండి లేక త్వరపడి నిర్ణయము తీసుకొనినయెడల, ఆ విశ్వాసి యొక్క భవిష్యత్తు పాడవును. వివాహమైన తరువాత వారి యొక్క బార్యలను మార్చుకొనవచ్చునని ఊహించుకొనెదరు. కాని ఆవిధముగా జరుగకపోవచ్చును. ఒక వేళ భార్య ''మారుమనస్సు'' పొందినను సాధారణముగా అది పైకి మాత్రమే ఉండును.
తనకు వివాహము జరుగుటకు అదియే మార్గమని చూచిన ఒక అమ్మాయి, మారుమనస్సు పొందినట్లుగా నటించవచ్చును. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ విషయములో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి ప్రభువైనయేసుకు తన జీవితంలో మొదటిస్థానము ఇచ్చుచున్నదని స్పష్టమైన ఋజువు ఉండవలెను. కేవలం వివాహం జరుగుటకు మారుమనస్సు పొందకూడదు. ఈ విషయమును మీరు తీవ్రముగా తీసుకొననియెడల, మీ జీవితం మీద దేవుని ఆమోదమును ఉపేక్షించినట్లు అవుతుంది. ఈ విధముగా పై పైకి మారుమనస్సు పొందిన అమ్మాయిలు, వివాహం అయిన కొద్ది నెలలలోనే వారి యొక్క నిజస్థితిని బయలుపరిచెదరు. ఈ విషయమును లేఖనము స్పష్టంగా చెప్పుచున్నది. ''మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?'' (2 కొరింథీ 6:14).
సరియైన బోధవినుటద్వారా ఏ అమ్మాయైనను మారుమనస్సు పొందెదరనియు లేక పూర్ణహృదయులుగా ఉండెదరనియు కొందరు యౌవనసహోదరులు భావించెదరు. అది పూర్తిగా తప్పు. ఒకరి జీవితములో నిజమైనమార్పుపొంది, ప్రభువుని వెంబడించవలెనని నిర్ణయించుకొనవలెనని వారు గుర్తించరు. ఇది కేవలం ఒకని యొక్క దృక్పథాన్ని కొద్దిగా మార్చుటకాదు కాని ఇది క్రొత్తయజమానునికి పూర్తిగా విధేయతచూపుట. ఈ జీవిత విధానమును కొందరు ఎన్నుకొనెదరు.
మీ వివాహమునకు చాలా సమయము ఉన్నప్పటికి, నేను ఇప్పుడు ఎందుకు చెప్పుచున్నాను. మీరు నిర్ణయము తీసుకొనుటకు చాలా ముందుగానే, మీరు సరియైన నిర్ణయము తీసుకొనుటవలన మీ వైఖరులు పరిపూర్ణము అగుటకు చెప్పుచున్నాను. మీరు ముందుగానే క్రైస్తవనియమములలో స్థిరపడుట మంచిది.
జీవితభాగస్వామి కొరకు దేవుని విశ్వసించుట:
మీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశ్యం ఉన్నది మరియు క్రొత్తగా జన్మించిన తరువాత వివాహవిషయములోనే ముఖ్యమైన నిర్ణయము తీసుకొనవలెను. రెండు కారణములను బట్టి, ఈ విషయమును ఆయన మాత్రమే చేయగలడు:
1. ఒక అమ్మాయి గురించి బాహ్యముగా ఎంత తెలిసినను, ఆమె యొక్క హృదయములో ఉన్న నిజస్థితిని మీరు చూడలేరు.
2. మీ భవిష్యత్తు ఏవిధముగా ఉండునో మీకు తెలియదు.
కాబట్టి దేవునిమీద ఆధారపడుటయే మీకున్న నిరీక్షణ. సాధువైనట్టియు మరియు మృధువైనట్టియు భార్య మీకు కావలెను. కాబట్టి గర్వముతోను, పెత్తనం చేసే అమ్మాయిల గురించి జాగ్రత్త. జీవితకాలమంతయు ఇంటిలో పోరాటము ఉండుటకంటె, అందమైన అమ్మాయిని చేసుకొనకుండుట మంచిది. అందచందముల కంటే వివాహజీవితములో సంతోషము ముఖ్యమైయున్నది. అదే సమయములో, ఆ అమ్మాయి శారీరకముగా మీకు ఆకర్షణీయముగా ఉండవలెను మరియు ఆమె కూడా మిమ్మును బట్టి సంతోషముగా ఉండవలెను.
మీ కొరకు శ్రేష్టమైనదానిని కోరుచున్నాను మరియు మిమ్ములను ఒత్తిడిచేయను.
మీరు చూచే అమ్మాయిలో ముఖ్యముగా మూడు విషయములు ఉండవలెను:
1. ప్రభువుయెడల ఆమెకు భక్తి శ్రద్ధలు ఉండవలెను. దీనికి వివరణ అవసరం లేదు.
2. తన ఇంటిలో ఆమెయొక్క భర్తను యజమానిగా అంగీకరించవలెను. మీ జీవితకాలమంతయు ఆమె శిరస్సైయున్న మీకు ఆమె లోబడవలెను. ఇంటిలో నిన్ను నాయకునిగా సంతోషముగా అంగీకరించవలెను. ఇటువంటి అమ్మాయిలను, ప్రత్యేకముగా బాగా చదువుకొనిన అమ్మాయిలను కనుగొనుటకష్టం. కాని దేవుడు నీ కొరకు ఒక అమ్మాయిని ఏర్పరచియున్నాడు.
3. తన్నుతాను ఉపేక్షించుటకు ఆమె ఇష్టపడవలెను. ప్రతిదినము తన్నుతాను ఉపేక్షించుకొనుచు మరియు తన స్వజీవమునకు చనిపోవుటయే సంతోషకరమై వివాహ జీవితానికి రహస్యము. ఆమె యొక్క క్రియలను చూచుటద్వారా, ఆమె అటువంటిదా కాదా అని మీరు తెలుసుకొనగలరు. ఆమె చేయుచున్న చిన్న చిన్న పనులను చూచుట ద్వారా, ఆమె తన్నుతాను హెచ్చించుకొనుచున్నదా లేదా ఉపేక్షించుకొనుచున్నదా అని మీరు తెలుసుకొనగలరు.
మీ అందరి వివాహముకొరకు మేము ఎల్లప్పుడు ప్రార్థించుచున్నాము. కాబట్టి మీరు తప్పుడు నిర్ణయము తీసుకొనకుండునట్లు ప్రభువు కాపాడును. సమయము వచ్చినప్పుడు మీయందరిని దేవుడు ఈ విషయములో సరిగా నడిపించునని నేను నమ్ముచున్నాను.
సరియైనవ్యక్తిని కనుగొనుటలో మీ యొక్క నిస్సహాయతను కనుగొని ప్రభువు మీద మీ భారము వేయుడి. మరియు ఇదియే విశ్వాసమునకు ముఖ్యమైయున్నది. ''రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు'' (యెషయా 49:23). ఎందుకనగా ''తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు'' (యెషయా 64:4). అనగా తమ యొక్క నిస్సహాయతను గురించి ప్రభువును నమ్మినవారిని ఈ విధముగా చేయును. కాబట్టి మీతోఉన్న యౌవనస్థులు త్వరపడి వివాహము చేసుకొనినయెడల, మీరు త్వరపడకండి లేక నిరాశపడకుడి. మీరు దేవునిని ఘనపరచి మరియు కనిపెట్టినయెడల ఆయనయొక్క సమయములో మీకు శ్రేష్టమైనదానిని ఇచ్చును.
ఇక్కడ రెండు ముఖ్యమైన సలహాలు ఉన్నవి:
1. మీ సొంత జ్ఞానము మీద ఆధారపడకుడి: ''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము'' (సామెతలు 3:5). దీనులై తమ బలహీనతలు ఒప్పుకొనువారిని ఆయన నడిపించును.
2. త్వరపడవద్దు: ''ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును'' (సామెతలు 29:20). తక్షణమే నిర్ణయము తీసుకొనవద్దు. ఈ విషయములో మీరు జ్ఞానము కలిగియుండెదరని నాకు తెలియును.
మీకు ఇష్టమైన వాటిని బలిపీఠముమీద పెట్టి మరియు మీ చిత్తమును దేవునికి అప్పగించుడి. ఆయన ఎవరిని నిర్ణయించినను దానిని అంగీకరించుడి. అప్పుడు ఆయన మిమ్ములను సరిగా నడిపించును.
దైవభక్తిగల జీవితభాగస్వామి:
మీరు కోరుచున్న అమ్మాయి గొడవచేసే అమ్మాయి కాకుండా సాత్వికముగాను మరియు మృధువుగాను ఉండవలెను. మీ ఉద్యోగమునుబట్టిగాని లేక మీ చదువును బట్టిగాని లేక మీ సంపాదనబట్టిగాని ఆమె ఆకర్షింపబడకూడదు. ఆమె ప్రేమించుచున్నట్లే నీవు కూడా ప్రభువుని ప్రేమించుచున్నావు గనుక ఆమెను నిన్ను ఎన్నుకొనవలెను. మరియు నీవు ప్రేమించుచున్నట్లే ఆమె కూడా ప్రభువుని ప్రేమించుచున్నది గనుక నీవు ఆమెను ఎన్నుకొనవలెను. నీ యొక్క ఆత్మీయత కంటే మరీ ఎక్కువగాగాని మరీ తక్కువగాగాని ఆమె ఒక్క ఆత్మీయస్థాయి ఉండకూడదు. మీరిద్దరును ఆత్మీయముగా ఒకే స్థాయిలోఉన్నయెడల అప్పుడు మీరు ఒకరినొకరు ఆత్మీయముగా గౌరవించుకొనెదరు.
కేవలం వినుట ద్వారా మాత్రమే కాక అనుభవపూర్వకముగా కూడా ఆమె ప్రభువుని ఎరిగి యుండవలెను. ఆమె దేవుని వాక్యమును ప్రేమించవలెను. సంఘముద్వారా గాని లేక తన తల్లిదండ్రులద్వారా తనకు సొంత ఒప్పుదల ఉండవలెను. దైవభక్తిగల కుటుంబంఉండుట మంచిదే కాని దానిని బట్టి ఆమె ప్రభువుని ఎరిగి ఉండకపోవచ్చును. మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు మరియు కఠినపరిస్థితులలో ఉన్నప్పుడు దైవికమైన నిర్ణయములు తీసుకొని మరియు నష్టము కలిగినను ప్రభువుకొరకు నిలచుట ద్వారా ఆత్మీయులగుదుము.
రక్షణపొందిన తరువాత ఆమె బాప్తిస్మము తీసుకొని ఉండవలెను. అప్పుడు పిల్లలు పుట్టిన తరువాత, వారు క్రైస్తవులుగా మారే విషయములో సమస్యలుఉండవు. ఆమె పరిశుద్ధాత్మలో బాప్తిస్మముపొందక పోయినప్పటికిని, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటకు సిద్ధమనస్సుకలిగి ఉండవలెను. మరియు దానిని వ్యతిరేకించకూడదు. పెంతెకొస్తు, లీగలిజంలోను మరియు కొన్ని ఇతర సంఘములలోను దీనిని గురించి చెప్పే తప్పుడు బోధను వ్యతిరేకించవలెను. ఎందుకనగా దేవుడుకూడా వాటిని వ్యతిరేకించుచున్నాడు. కాని పిరికిపందలుగా ఉన్న అపొస్తలులు పెంతెకొస్తురోజున పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తుకొరకు మండే సాక్షులుగా మారారు. మరియు ఆమె లీగలిస్టుగాగాని మతాసక్తిగల పరిసయ్యులుగాగాని ఉండకూడదు.
నీవు చదువుకొనిఉన్నావు గనుక ఆమె కూడా చదువుకొనిఉండవలెను. అప్పుడు మీ వివాహజీవితంలో సులభంగా సంభాషించుకోవచ్చును.
శారీరకముగా ఆమె నీకును, ఆమెకు నీవును ఆకర్షణీయముగా ఉండవలెను. ఒకవేళ గతములో ఆమెకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నయెడల, ఆమె వారిని విడిచిపెట్టి వారితో ఎటువంటి సంబంధం కలిగియుండకూడదు. మరియు ఆమె నీతో సరదాగా ఉండవలెను. అనగా ఆమె ఇతరులను నవ్వించలేక పోయినప్పటికిని కనీసం నవ్వవలెను.
అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కొత్తగా జన్మించవలెనని షరతులేదు. క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చిన భయభక్తులు గల అమ్మాయిలను నేను చూచాను. కాని ఆమె ఎటువంటి కుటుంబంనుండి వచ్చినప్పటికిని కుటుంబవిలువలను గౌరవించవలెను. ఎటువంటి చెడ్డ పరిస్థితులు వచ్చినప్పటికిని 100 శాతం విడాకులను తీసుకొనుటకు ఆమె వ్యతిరేకించవలెను. తల్లిగా ఉండే ప్రాముఖ్యతను ఆమెగుర్తించి మరియు పిల్లలకు విలువనిచ్చి మరియు వారిని పెంచి పెద్దగా చేయుటకు సమర్పించుకొనవలెను. ఒకవేళ ఆమె ఉద్యోగం చేయుచున్నట్లయితే, ఉద్యోగంకంటే కుటంబమునకు ఎక్కువ విలువ నివ్వవలెను.
మా యొక్క మాదిరిని వెంబడించుడి:
మిమ్ములను దైవభక్తిలో పెంచుటకు మీ తల్లిగారు తనయొక్క సమస్తమును - ఉద్యోగం, సదుపాయములను, తన యొక్క ఆరోగ్యమును మరియు తనయొక్క కోరికనలను వదులుకొని మంచి ఉదాహరణగా ఉండెను. అన్ని పరిస్థితులలో ఆమె మిమ్ములను ప్రేమించి, తనను తాను ఉపేక్షించుకొని మరియు మిమ్ములను దైవబిడ్డలుగా పెంచుకొనుటకు శ్రద్ధతీసుకొని ఉన్నది.
నేను మీ తల్లిని పెళ్ళి చేసుకొనకమునుపు, ఆమె నిజముగా ప్రభువుయెడల భక్తిశ్రద్దలు కలిగి యున్నదా లేదా అని ప్రభువుని అడిగితిని. అప్పుడు ఆమె చాలా పేరు ప్రతిష్టలు కలిగిన మెడికల్ కాలేజీలో వెల్లూరులో చదువుకొని కుష్టురోగుల మధ్య పనిచేయుట చూచాను. ఒక యౌవనస్థురాలు ఆ పనిని ఎందుకు ఎన్నుకొన్నది? నేను ఒప్పించబడుటకు అది చాలును. 1968 జూన్ 19న వివాహం జరిగినప్పటి నుండి ఆమె విషయంలో ఒక్కసారి కూడా బాధపడలేదు. మేము పరిపూర్ణులము కాదుగాని మేము ఒకరిని ఒకరము ప్రేమించుకొని మరియు ఒకరిని ఒకరు గౌరవించుకొనియున్నాము. మరియు నా ప్రయాణములన్నింటిలో ఆమె నా కెంతో సరిపోయిన వ్యక్తిగా ఉన్నది. అంతకంటే సరిపోయినవ్యక్తి ఉన్నదో లేదో నాకు తెలియదు. మీ వివాహ జీవితమంతయు మీరు కూడా మీ భార్య గురించి ఈవిధంగా సాక్ష్యం కలిగియుండవలెనని నేను ప్రార్థించుచున్నాను.
ఒక అమ్మాయి నిజముగా దేవునియొక్క చిత్తమా కాదా అని స్పష్టముగా చూపించమని దేవునిని అడుగుడి. ఆవిధంగా మీ యొక్క అత్యంత బలహీనతను ప్రభువు యొద్ద ఒప్పుకొని మరియు ఆయన మాత్రమే సరిగా నడిపించగలడని నమ్ముటద్వారా ఆయనను ఘనపరచెదరు.
మీ జీవితమంతయు ఆయనకు ఋణపడియున్నదని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొనుడి. మీరు మీ సొత్తుకాదు. మీరు మీ కొరకు మాత్రమే జీవించక, ప్రభువుకొరకును మరియు ఆయన సంపూర్ణచిత్తం నెరవేర్చుట కొరకు జీవించవలెను.
నేను ఇచ్చుచున్నసలహాలు మరియు హెచ్చరికలు మీ వివాహం జరిగేటంతవరకు మాత్రమే. ఒకసారి మీ వివాహం అయిన తరువాత, మీ యొక్క భార్యను నేను సంపూర్ణముగాను, పూర్ణ హృదయంతోను అంగీకరించెదను. కాని మీ తల్లిదండ్రులముగా, కొన్ని సంవత్సరముల నుండి కొంత అనుభవమును, కొంత జ్ఞానమును కలిగియుండి ఒక అమ్మాయిని ఏవిధంగా తెలసుకొనవలెనని మీరు తెలుసుకొందురని నమ్ముచున్నాము. కేవలం చూచుటద్వారా కాదు గాని ఆమెతో ఎక్కువ సమయం గడుపుటద్వారా గాని ఆమె మీకు భాగస్వామిగా సరిపోతుందో లేదో తెలుసుకొనలేరు. దేవుడు మాత్రమే సరియైన వ్యక్తిని చూపించగలడు. మీరు నిర్ణయించుకొనకముందు ఎక్కువగా ప్రార్థించండి.
దేవుని వాక్యములో ఉన్న మార్పులేని నియమములు:
బైబిలులో ఆదాము వివాహము తరువాత ఒక పురుషుడిని మరియు ఒక స్త్రీని ఈవిధంగా కలుపుటను ఇస్సాకులోనే చూచెదము. ఆ కాలములో ఉన్నవారు అంగీకరించే విధానం దేవుడు ఉపయోగించియున్నాడు. కాని ఎటువంటి సంస్కృతిలో అయిననూ, సర్వశక్తిగల దేవుడు పని చేయగలడు. క్రీస్తుపూర్వం 20వ శతాబ్దములో అబ్రాహాము ఉపయోగించిన పద్ధతిని ఇప్పుడు క్రీ.శ. 20వ శతాబ్దములో ఉపయోగించడు. ఒక పద్ధతిద్వారా కాదుగాని దేవుని నడిపింపుద్వారానే దేవుడు ఒక అమ్మాయి దగ్గరకు నడిపించును. కాబట్టి నేను పద్ధతి గురించి ఆలోచించుటలేదు. కాని దేవుడే మిమ్ములను నడిపించునని నిశ్చయత కలిగియుండుకు ప్రార్థించుచున్నాను.
ఆరంభంలో, ఆదాముకొరకు సరియైన సహకారిని దేవుడే అనుగ్రహించెను. ఈనాడు కూడా దేవుడు మాత్రమే సరియైన సహకారిని అనుగ్రహించును.
స్త్రీని దేవుడే నిర్మించియున్నాడు గనుక ఆయన మాత్రమే ఆమె గురించి బాగుగా చెప్పగలడు. తయారీ దారునియొక్క అభిప్రాయము ఎంతో శ్రేష్టము. కాబట్టి మీరు సామెతలు 31:10-31 చదివి మరియు ధ్యానించి దేవుడు ఇష్టపడే భార్యను తెలుసుకొనుడి.
రాజైన లెయూయేలు యొక్క తల్లి ఆ లేఖనములను వ్రాసింది. లెమూయేలు ఎవరో మనకు తెలియదు. కాని ఆయన నిశ్చయముగా దైవభక్తిగల తల్లిని కలిగియున్నాడు. బైబిలులో అనేక పుస్తకములు పురుషులచేత వ్రాయబడియున్నవి. కాని ఈ లేఖనము ఒక స్త్రీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాసెను. అతడు వివాహం చేసుకొనవలసిన అమ్మాయి గురించి ఆమె మంచి సలహాలు ఇచ్చింది. కాబట్టి దీనిని బట్టి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు వివాహం గురించి సలహాలు ఇవ్వవలెను.
ఆమె కనికరముతో మాట్లాడును (26వ). మరియు చేతులతో కష్టపడి పనిచేయును. లేక దానికి వ్యతిరేకంగా కూడా ఉండవచ్చును (సామెతలు 31:13,15,17,19,22). ఎవ్వరును కూడా కనికరముగల నాలుకతో పుట్టరు. దానిని సంపాదించుకొనవలెను మరియు ఎవ్వరైననూ కష్టపడే చేతులతో పుట్టరు. దానిని నేర్చుకొనవలెను. ఆర్థికవిషయములలో ఆమె మితముగాను మరియు జ్ఞానము కలిగియుండవలెను (16,22,24వ) మరియు బీదలు యందు ఆమె జాలి, కనికరము కలిగియుండవలెను (20వ). ఆమె తన ఇంటిని ప్రేమించవలెను (27వ). అన్నిటికి పైగా, ఆమె ప్రభువుయెడల భయభక్తులు కలిగియుండవలెను (30వ). లెమూయేలు యొక్క తల్లి చివరకు ఈవిధంగా సలహా ఇచ్చియున్నది, ''రాజైన లెమూయేలు యొక్క తల్లి అతని కుపదేశించిన దేవోక్తి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును'' (సామెతలు 31:1,30).
తన కుమారునికి చెప్పుటకు లెమూయేలు యొక్క తల్లి దేవునిచేత ప్రేరేపించబడిందని నేను ఒప్పుకొనుచున్నాను. అటువంటి అమ్మాయి తన జీవితకాలమంతయు మేలు మాత్రమే చేయును (31:12). మీ ప్రతీ ఒక్కరికొరకు ప్రపంచములో ఏదో ఒకచోట దేవుడు ఒక అమ్మాయిని ఉంచియున్నాడని నేను నమ్ముచున్నాను.
సోమరి అయిన అమ్మాయిని గాని లోకసంబంధమైన ఫ్యాషన్‌తో నిండిన అమ్మాయిలను గాని ఆలోచించవద్దు ఎందుకనగా అటువంటివారు మీ బ్యాంకు ఖాతా డబ్బు అంతటిని ఖాళీ చేసి మరియు మిమ్ములను బీదవారుగా చేయుదురు. పోట్లాడే అమ్మాయిని గాని ఎల్లప్పుడూ తనకు ఏదోఒకటి కావాలసివేదించే అమ్మాయి గురించిగాని ఆలోచించవద్దు. ఎందుకనగా వారు మీ శక్తిని ఎండిపోచేసి మరియు నిరాశపరిచెదరు.
మీరు నిర్ణయములు తీసుకొనునప్పుడు సరిగా నిర్ణయం తీసుకొనుటకు దేవుని వాక్యం జ్ఞానం ఇచ్చునట్లుగా అనుమతించుము.
కేవలం అందచందాలు గల అమ్మాయిలకంటే దేవుని గౌరవించే అమ్మాయిలు మంచిభార్యగా ఉండగలదని గుర్తుంచుకోండి (సామెతలు 31:30). మీ సొంత ప్రయత్నములతో తెలుసుకొనుటకు ప్రయత్నించక దేవుడు చెప్పు దానిని నమ్ముడి (విశ్వసించండి). దీనిని సొంత అనుభవముతో తెలుసుకొనుట ఎంతో బాధను కలిగించును. దేవునియెడల ఆకలిదప్పికలు లేకుండా ఉన్న ఒకఅందమైన అమ్మాయి గురించి పరిశుద్ధాత్ముడు ఇట్లు అనుచున్నాడు, ''వివేకంలేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మివంటిది'' (11:22). ఇది కఠినమైనభాషే గాని నిజము. పందిముక్కుకున్న బంగారు కమ్మివంటి అమ్మాయి యొద్దకు ఎప్పుడైన వెళ్ళవద్దు.
మంచి వివాహజీవితం కొరకు దయచేసి మూడు విషయములు గుర్తుంచుకొనుడి. ఆత్మీయసహవాసము, ఒకరితోఒకరు సంభాషించుట మరియు కుటుంబవిలువలు. కాబట్టి ఇటువంటి అమ్మాయి కొరకు చూడండి:
1. కేవలం క్రమముగా సంఘకూటముకు వెళ్లుట మాత్రమే గాక ప్రభువుకొరకు ఎంతో ఆసక్తికలిగి ఆత్మీయ సంగతులను మాట్లాడే అమ్మాయి. దీనిని ఆ అమ్మాయి హృదయంలో కనుగొనుటకు ఆమె ఎక్కువగా దేనిగురించి మాట్లాడుటకు ఇష్టపడుచున్నదో చూడుము ఎందుకనగా హృదయం నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును అని ప్రభువు చెప్పాడు (మత్తయి 12:34).
2. కుటుంబ జీవితములో ఇద్దరి మధ్య సంభాషణ ముఖ్యం గనుక ఆమె నీతో సరితూగవలెను.
3. కుటుంబం మరియు తల్లిగా ఉండుటకు విలువను ఇవ్వవలెను.
దేవుని దృష్టిలో ఒక అమ్మాయి ''ఆత్మ, ప్రాణము, దేహము'', అంతేగాని శరీరము, ప్రాణము మరియు ఆత్మకాదు (1 థెస్సలోని. 5:23). కాబట్టి ఆ అమ్మాయి విషయంలో మొదటిగా ఆత్మీయవిలువలను, రెండవదిగా తెలివితేటలు (ప్రాణం), మూడవదిగా శరీర విలువలు తెలుసుకొనవలెను. అప్పుడు మీరు పొరపాటు చేయరు.
మీరు మరొకసారి ''సెక్స్, ప్రేమ మరియు వివాహం'' అనే పుస్తకం నుండి 5వ అధ్యాయం చదవండి.
మానవ పరిశీలనలు:
భార్యను నిర్ణయించుకొనునప్పుడు అనేక మానవ సంబంధమైన సంగతులను కూడా పరిగణనలోనికి తీసుకొనవలెను. అనేక దశాబ్దములనుండి అనేక వివాహములు చూచిన తరువాత, ఇక్కడ నా అభిప్రాయము చెప్పుచున్నాను:
మీరు వివాహం చేసుకొనకముందే మీ కుటుంబం పోషించుకొనుటకు ఉద్యోగం చేయుము (సామెతలు 24:27). జారత్వం తప్పించుకొనుటకు బైబిలు చెప్పుచున్నరీతిగా వివాహం చేసుకొనుటకు ఎక్కువ కాలం వేచియుండకూడదు (1 కొరింథీ 7:2). ఆ బలమైనకోరిక పాపమునకు నడిపించును. మంచిగా సంభాషించుకొనుట ద్వారా వివాహజీవితంలో విసుగు పుట్టదు.
ఆర్థికవిషయాలలో కూడా దాదాపు సమముగాఉండుట ద్వారా మీ కుటుంబ జీవితం సులభంగా ఉండును.
మీరు ఎవరిమీదయిన జాలిపడి లేక కనికరముచూపి వివాహం చేసుకొనకూడదు. యథార్థమైన కొందరు యౌవనస్థులు ఈవిధంగా వివాహం చేసుకొని ఎంతో నష్టపోయిరి. వారు త్వరపడి తీసుకున్న నిర్ణయమునుబట్టి ఇప్పుడు దాని ఫలమును అనుభవించుచున్నారు.
ఆత్మీయ విలువలు:
ఎవరైతే వారి జీవితంలో క్రీస్తుకి మొదటి స్థానం ఇచ్చెదరో వారి వివాహజీవితం సంతోషకరంగా ఉండును. అనగా దేవుని రాజ్యము ఆయననీతి మరియు దేవుని వాక్యములో ప్రమాణములు ప్రాముఖ్యం కలిగియుండి మరియు వారి జీవితంలో ప్రతివిషయంలో క్రీస్తుకుమాత్రమే ప్రథమస్థానం ఇవ్వవలెను.
మీరు ఆయనకొరకు జీవించు నిమిత్తము దేవుడు మిమ్ములను సృష్టించి మరియు రక్షించియున్నాడు. మనకు ఇష్టమున్నట్లుగా జీవించుటకొరకు మనం సృష్టించబడలేదు. దేవుని సంతోషపెట్టుటకు సృష్టించబడియున్నాము. మనం మోకరించి, దీనులమై మరియు ఆ సత్యమును ఒప్పుకున్నయెడల, మన జీవితంయొక్క పరమార్థం ఎరుగుదము. లేనియెడల మనజీవితం వ్యర్థమైపోవును. కాబట్టి మిమ్ములను మీరు సంతోషపరచుకొనక దేవుని సంతోషపెట్టుట కోరుకొనుము.
మానవహృదయం మోసకరమైంది గనుక ఎవరైతే వారు నిర్ణయించుకొనువాటి నెరవేర్పుకొరకు బైబిలు చదివెదరో అటువంటి వారు, వారికి తగినటువంటి వచనములు దొరికినప్పుడు సులభంగా మోసపోయెదరు. కాని ఎవరైతే దేవునిని సంతోషపెట్టవలెనని కోరెదరో అటువంటి వారికే దేవుడు లేఖనమును ఉపయోగించును.
బహిరంగంగా సంతోషంగాకనబడే అనేకవివాహములు వారి వ్యక్తిగతజీవితంలో సంతోషంఉండదు. దేవుడు మంచివాడు గనుక అనేక క్రైస్తవ కుటుంబములును ఆశీర్వదించును. కాని వారిలో అనేకులను ఆయన అంగీకరించడు. కేవలం దేవునిఆశీర్వాదం మాత్రమేకాక దేవునియొక్క అంగీకారమును కూడా మీ వివాహజీవితంలో కోరుకొనుము.
మీరు నిరాశలో ఉన్నప్పుడుగాని లేక కృంగిపోయినప్పుడుగాని వివాహంవంటి పెద్ద నిర్ణయములు తీసుకొనకూడదు. అనవసరమైన శోధనలోనికి మిమ్ములను నడిపించే స్నేహితులకు దూరంగా ఉండుము. నేను బాగుగా నిలిచియున్నానని అనుకున్నవాడే మొదటగా పడిపోవును. ఎల్లప్పుడు దీనులై దేవునిపై ఆధారపడుచుండుడి. వీటిని మీరినయెడల నిజమైన సంతోషం ఉండదు.
నేను మీకు మరల చెప్పిన రీతిగా, ఆత్మీయవిలువల కంటే అందము మరియు బాగుగా సంభాషణ చేసే వారికి విలువనిచ్చినయెడల, దేవుడు మీకొరకు దాచిఉంచిన వాటిని పోగొట్టుకొనెదరు. బైబిలుజ్ఞానం కలిగిన వ్యక్తికి కూడా ఎక్కువ విలువనివ్వవద్దు. ఎందుకనగా ఆమె బోధకురాలు అయినప్పటికిని లేక బైబిలు వేదాంతి అయినప్పటికిని ఆమె కుటుంబం మరియు పిల్లలను అశ్రద్ధచేయవచ్చు.
ఆమెయొక్క కుటుంబవిలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యుడి. ఇంటిని నడిపించుటలోను, తల్లిగా ఉండుటలో మరియు పిల్లలనుపెంచే విషయములోను నేను చెప్పుచున్నాను. ఈ విలువలను సంపాదించుకొనుటకు అమ్మాయి తల్లిదండ్రులు విశ్వాసులై ఉండనవసరం లేదు. విడాకులు తీసుకొనిన ఇంటినుండి వచ్చిన అమ్మాయి కూడా దైవికమైన విలువలు కలిగియుండవచ్చు. కావున తల్లిదండ్రుల విశ్వాసంకాదుగాని తన సొంత విశ్వాసం ముఖ్యమైయుంది. విరిగినలిగిన కుటుంబంనుండి వచ్చిన అమ్మాయిలు దేవుని కృపద్వారా దైవికవిలువలు పొందుటను, అద్భుతమైనభార్యగా, తల్లులుగాఉండుట నేనుచూచాను.
అభ్యాసాత్మకమైన పరిశీలనలు:
అమ్మాయిలతో కలిసి ఉండుట గురించి జాగ్రత్తపడవలెనని నేను కోరుచున్నాను. వివేకం కలిగియుండుట ఒక తల్లియొక్క గుణలక్షణమని గుర్తుంచుకొనుడి. జ్ఞానంకలిగి ఉండుడి. మిమ్ములను అంటిపెట్టుకొని ఉండాలని కోరే అమ్మాయిలనుండి లేక మిమ్ములను త్వరగా భర్తగా పొందాలనే అమ్మాయిలనుండి దూరంగా ఉండుము. యేసుకు హృదయ పూర్వకమైన శిష్యులుగా లేని అమ్మాయిలతో స్నేహం చేయవద్దు. మిమ్ములను పవిత్రులుగా ఉంచుకొనుడి.
యౌవనస్త్రీలు చెప్పిన కట్టుకథ ద్వారా అనేకమంచి సహోదరులు వివాహములో చిక్కుకొనియున్నారు. మొదటిగా సానుభూతితో తరువాత ప్రేరేపించుటతోను వ్యభిచారములోనికి నడిపించి, వివాహం చేసుకొనేటట్లుగా చేసెదరు. కాబట్టి మీరు ఆమె విషయం జాగ్రత్త పడేటట్లు కట్టుకథ చెప్పే అమ్మాయిగురించి జాగ్రత్తపడుడి.
ఎటువంటి అమ్మాయితో అయిననూ శారీరక సంబంధం కలిగి ఉండవద్దు. ''స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు'' (1 కొరింథీ 7:1) లో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎందుకనగా అది చిన్నగా ఆరంభమై అంతగా కొనసాగి చివరకు గొప్పవిపత్తు కలుగును. అటువంటి విపత్తులనుండి ప్రభువు మిమ్ములను కాపాడునట్లు నేను మీ కొరకు ఎల్లప్పుడు ప్రార్థించుచున్నాను. అన్నిటికంటెను మరియు అందరికంటెనూ ప్రభువుని ఎక్కువగా ప్రేమించుచున్నామో లేదో అని ఆయన ఎల్లప్పుడు ప్రశ్నించును. ఈ ప్రశ్నకు మీరు ఎల్లప్పుడు అవును అని చెప్పుచున్నయెడల దానిద్వారా మీరు కాపాడబడెదరు మరియు రక్షింపబడెదరు.
ఒక అమ్మాయిని మీరు కలిసినప్పుడు, వివాహం చేసుకొనవలెనని కోరిక ఉండకూడదు. కాని పురుషులు కంటే స్త్రీలు వేరుగా ఉండెదరని గుర్తించుకొనుడి. పురుషులు స్వతంత్రులుగా ఉండుటకు ఇష్టపడి మరియు సంబంధంలో తమయొక్క భధ్రతకొరకు చూడరు. కాని స్త్రీలు అయితే ఇతరులమీద ఆధారపడి మరియు వారిలో భధ్రతను కోరెదరు. కాబట్టి మీరు ఏ అమ్మాయినైననూ కలిసినప్పుడు దేవుడు ఆ అమ్మాయిని మీరు చేసుకొనుట దేవుని చిత్తమని మీరు తెలుసుకొనేవరకు ఆ అమ్మాయితో వివాహంగురించి మాట్లాడకూడదు.
మీ తల్లిదండ్రులముగా సహజముగా మీకొరకు మీయెడల మేము ఆసక్తి కలిగియున్నాము. మీ విషయంలో దేవుడు కోరునదే మేము కోరుచున్నాము. దేవుడు పక్షులను పోషించును గాని ఆహారం వాటి గూళ్లలో వేయడు. అవి ఎగురుచుండగా దేవుడు వాటికి ఆహారం అనుగ్రహించును. కాబట్టి మీకు కూడా దేవుడు సరియైన అమ్మాయిని కనుగొనునట్లు సహాయపడును. దేవుడు మీ కొరకు నిర్ణయించిన అమ్మాయిని మీరు కలుసుకొనునప్పుడు మీరు ఆమె యొక్క ఆత్మీయవిషయములచేత ఆకర్షింపబడెదరు.
కాబట్టి మీకు కాబోయే భాగస్వామికొరకు తీవ్రంగా ప్రార్థించుడి. మీరు ఆవిధంగా ప్రార్థించినప్పుడు మీరు దేవునిపై ఆధారపడుతున్నారని ఋజువు పరచబడును. ప్రతివిషయం కొరకును నిస్సహాయులుగా ఆధారపడే అలవాటు మీకు లేనియెడల మీ జీవితంలో ఎంతో నష్టపోయెదరు. ఎంతసేపు ప్రార్థించామనికాదుగాని విశ్వాసంకలిగి మరియు అత్యంత బలహీనులుగా దేవునిమీద ఆధారపడి మరియు దేవునిని పూర్తిగా నమ్ముకొనుట.
వివాహం చేసుకొనుటకొరకు సరియైన వయస్సు: ఈ విషయంలో దేవుని వాక్యంలో ఎటువంటి నియమములేదు. మనజీవితం దేవుని చేతిలో ఉన్నది. కాని ఇక్కడ చిన్న సూచన మీకు ఇచ్చుచున్నాను. మీరు ఉద్యోగంనుండి రాజీనామా చేసే సమయానికి మీ పిల్లలందరు చదువుకొనుట (డిగ్రీ) పూర్తి చేసుకొని మరియు ఉద్యోగం చేయుటకు అర్హులై ఉండవలెను. ఆవిధంగా మీకు ఆర్థికంగా భారం ఉండదు. కాబట్టి వివాహం చేసుకొని మరియు పిల్లలను కలిగియుండుటకు ఎక్కువ కాలం వేచియుండవద్దు. ఇది మానవ ధృక్పధంతో సంగతులను చూచినట్లుగా ఉండును. కాని అది నిజము కాదు. భవిష్యత్తుగురించి మనం చింత ఉండకూడదు. ఎందుకనగా మన అవసరం తీర్చే పరలోక తండ్రిని నమ్మవలెను. కాని భవిష్యత్తు విషయంలో చీమల వలె జ్ఞానం కలిగి ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు (సామెతలు 6:6-8). మరియు పిల్లలయొక్క అవసరములను (ఆహారం, బట్టలు, ఇల్లు, ఆరోగ్యం, చదువు) తల్లిదండ్రులు తీర్చవలెననియు (1 తిమోతి 5:8) మరియు వారి భవిష్యత్తులోని అవసరతలకొరకు డబ్బును పొదుపుచేయవలెనని ఆజ్ఞాపించబడియున్నాము (2 కొరింథీ 12:14).
చివరిది మరియు చాలా ముఖ్యమైనది: మీరు పెళ్ళికాకముందే స్వార్థంనుండి విడుదలపొందుట ద్వారా ఒకరోజు క్రీస్తు సంఘమును ప్రేమించునట్లు మీ భార్యను నిస్వార్థంగా ప్రేమించుటకు, క్రీస్తు మీ కొరకు సమర్పించుకొనిన రీతిగా మీరు కూడా ఆమె కొరకు ప్రతిరోజు సమర్పించుకొనుటకు, మరియు మీశరీరం వలె ఆమెను ప్రేమించునట్లును చేయును. ఎఫెసీ 5:25-33 వివాహానికి ముందుగా చదివి ధ్యానించుడి. ఈ విషయంలో దేవుడు మీకు సహాయపడునుగాక.
దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చును:
కాబట్టి మీ వివాహంకొరకు ప్రార్థించుడి మరియు దేవుడు సరియైన సమయంలో సరియైనవ్యక్తి యొద్దకు నడిపించును. మీ జీవితభాగస్వామిగా ఉండుటకొరకు ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడో సిద్ధపరచుచున్నాడు. ఆయన నీ కొరకు ఎన్నుకొని మరియు సిద్ధపరచినవ్యక్తి కంటే శ్రేష్టమైన వ్యక్తిని నీవు కనుగొనలేవు. కాబట్టి మీరు దానిని విశ్వసించి ఆమెను ఆయన మీ యొద్దకు నడిపించునని నమ్ముడి.
మేము మీ కొరకు ప్రార్థించుచున్నాము. మేము ఒక అమ్మాయిని నిర్ణయించి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోమని ఒత్తిడిచేయము. కాని ఈ భూమి మీద తల్లిదండ్రులముగా అనేక సంవత్సరములు జీవించి కొంతజ్ఞానము పొందియున్నాము. కాబట్టి మీరు నిర్ణయించుకొనునప్పుడు మమ్మును సంప్రదించినయెడల మీరు పొరపాటు చేయకుండా కాపాడబడెదరు. క్రైస్తవ వివాహములని పిలువబడుచున్న వాటిలో అనేకములు ఒక విపత్తుగా ఉన్నవి. కాని విశ్వాసముతో మీ కొరకు ప్రార్థించుచున్నాము. గనుక దేవుడు ఆవిధంగా మీ కొరకు జరగనివ్వడని నమ్ముచున్నాము.
దేవుడు ఆదాముకు సరిపోయినవ్యక్తిని అనుగ్రహించినట్లే, మీకు కూడా అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాము. ఈ విషయంలో మీరు తప్పు చేయకుండా దేవుడు మిమ్ములను కాపాడుననియు మరియు ఆయన సమయంలో సరియైన వ్యక్తిని మీ యొద్దకు నడిపించునని నమ్ముచున్నాము.
ఆమేన్ అనగా అట్లే జరుగును గాక. దేవునికి స్తోత్రము.
ప్రభువులో మాత్రమే అతిశయించుట:
తండ్రిగా నాలో ఉన్న రెండుచింతలు:
1. నేను అనేక విషయములలో తీరికలేకుండుట వలన మీతో వ్యక్తిగతముగా ఎక్కువ సమయం గడపలేదు. ఆవిషయంను బట్టి నన్ను క్షమించమని ప్రభువుని అడిగాను. మీరు తండ్రులు అయిన తరువాత నా యొక్క పెద్ద సలహా ఏమిటంటే, మీ భార్యతోను, మీ పిల్లలతోను ఎక్కువ సమయం గడపండి.
2. కొన్నిసార్లు మిమ్ములను అనవసరముగా తీవ్రంగా శిక్షించియున్నాను. ఆవిషయంలో ప్రభువుని క్షమించమని అడిగాను. మీరు కూడా నన్ను క్షమించండి. నేను ఇన్ని తప్పిదములు చేసినప్పటికిని, మన యొక్క క్రియలను బట్టిగాక కేవలం దేవుని కృపనుబట్టియే మీరు దేవుని బిడ్డలుగా మారిరి.
మనకున్న ధనముగాని ఆస్థులుగాని నిజమైన సంపద కాదుగాని ఓటముల ద్వారాను ఆయా పరీక్షలద్వారా ప్రభువుని అనుభవపూర్వకముగా ఎరుగుటయే నిజమైన సంపద. యిర్మీయా 9:23,24లో ఈ విధముగా చదివాను. దేవుడు ఇట్లనుచున్నాడు, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతిన్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనాదించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు''.విలువైనది దానితో పోల్చినప్పుడు ఈలోకములో మిగిలినదంతయు పెంటతో సమానము. ఈ సత్యమును ఎంత తొందరగా కనుగొంటే, అంత తొందరగా జ్ఞానులు అయ్యెదరు.
దావీదు మరియు యోసేపులు 30 సంవత్సరముల వయస్సులోనే పరిచర్యను ఆరంభించిరి. కాబట్టి మీకు కూడా 30 సంవత్సరముల వయస్సు వచ్చేసరికి ప్రభువుతో బలమైనసంబంధం కలిగియుండవలెను. అప్పుటివరకు పడుచూ లేచుచూ ఉండెదరు. మరియు మనము పరిణితి చెందనందున దేవుడు దానిని పట్టించుకొనలేదు. 13 నుండి 30 సంవత్సరముల వయస్సులో మధ్యలో వారి యొక్క తల్లిదండ్రులసలహాను కూడా తృణీకరించెదరు. దేవుడు దానిని అర్థం చేసుకొనును. మరియు జ్ఞానము కలిగిన తల్లిదండ్రులు కూడా గ్రహించెదరు.
నా జీవితంలో కూడా అనేక ఒడిదొడుకులు ఉండేవి. కాని 1975 సంవత్సరము నుండి (అప్పటికి ముప్పై అయిదున్నర సంవత్సరములు) మన ఇంటిలో సంఘకూటములు ఆరంభించినప్పటినుండి సంగతులన్నియు మార్పు చెందుచున్నవి. మంచి సహోదరులతో సహవాసంచేయుట వలన నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. మీకు కూడా అటువంటి సహవాసం అవసరము. అక్కడ మీ సంఘములో మంచి బోధ వినుచున్నప్పటికిని, మీ కాలేజీలో సహవాసం లేదని అనుకొనుచున్నాను. బెంగుళూరులో ఉన్న సహోదరుల మధ్య సహవాసం ద్వారా మాత్రమే మీరు సంఘంగా నిర్మించబడియున్నారు. అక్కడ మీరు కూడా ఒక రోజున ప్రభువును పూర్ణహృదయంతో వెంబడించే మంచి విశ్వాసులతో ఒక క్రొత్త నిబంధన సంఘం నిర్మించాలని ప్రార్థించుచున్నాను. ఇది మన అందరకు అవసరమైయున్నది.
షరతులు లేకుండా దేవుడు మనలను ప్రేమించుచున్నాడు:
గోధుమలవలే పేతురును జల్లించుటకు సాతాను దేవుని అనుమతిని కోరెను. ఇతరులకంటే దేవుడు పేతురుయెడల గొప్ప పరిచర్య కలిగియున్నందువలన దేవుడు సాతానుకు అనుమతించెను. పేతురు యొక్క నమ్మిక తప్పిపోకుండుటకు మాత్రమే ప్రభువు ప్రార్థించారు. పేతురు ప్రభువుని ఎరుగనని మూడుసార్లు బొంకియున్నాడు. దాని ఫలితంగా అతడు ఎంతో విరుగగొట్టబడి దీనుడై పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందియున్నాడు. ఆవిధంగా అతడిలో గర్వంఅనే పొట్టు తీసివేయబడి, అతనిలో దేవుని సంకల్పం నెరవేర్చబడింది. దానికోసం దేవుడు సాతానును ఉపయోగించియున్నాడు. ఆ కారణం బట్టియే దేవుడు సాతానును నాశనం చేయలేదు. దేవునికి స్తోత్రం.
పునరుత్థానుడైన తరువాత ఒక దూత ద్వారా సమాధి యొద్ద నుండి దేవుడు ఒక వర్తమానం పంపెను, ''మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను'' (మార్కు 16:7). అక్కడ ''మరియు పేతురు'' అని ఉన్నది. పేతురుకూడా శిష్యుడే కదా, దేవుడు అతని పేరుని ఎందుకు ప్రత్యేకంగా చెప్పియున్నాడు? ఎందుకనగా అతడు చేసిన ఘోరతప్పిదమునుబట్టి శిష్యులు అతనిని చేర్చుకొనలేదేమో. ప్రభువు అతని పేరును చెప్పియున్నాడు. అనగా ప్రభువు ఇంకను అతనిని అపొస్తులుడిగానే చూచుచున్నాడు.
కాని ఆ వర్తమానం వచ్చినప్పటికిని, పేతురు నిరాశపడి మరల చేపలు పట్టుకొనవలెనని నిర్ణయించకొనియున్నాడు (యోహాను 21:3). కాబట్టి ప్రభువు అతని యొద్దకు వ్యక్తిగతంగా వెళ్ళి మరియు పేతురుని అపొస్తులుడిగా పిలిచియున్నాడు. ఇదియే ప్రభువుయొక్క ప్రేమ. ఆయన ఎల్లప్పుడు మన వెనుకనే వచ్చుచున్నాడు. ఆవిధంగా పేతురు మరల వెనుకకు వచ్చియున్నాడు మరియు అతని నమ్మిక తప్పిపోలేదు. ఇది పేతురు ఓడిపోలేదనిగాని లేక గొప్ప పొరపాటు చేయలేదనిగాని కాదు.
దేవుడు ప్రేమయైయున్నాడు. కాబట్టి మనం నిజంగా క్రొత్తగాజన్మించి మరియు ప్రభువైన యేసుకి శిష్యులమైనయెడల, షరతులులేని ప్రేమతో దేవుడు క్రీస్తులో మనలను అంగీకరించియున్నాడని నమ్మవలెను. రెండు రకాల విశ్వాసులు ఉన్నారు:
1. షరతులులేని ప్రేమతో వారి యొక్క పరలోకపు తండ్రి ప్రేమించుచున్నాడని నమ్మే విశ్వాసులు.
2. షరతులుగల ప్రేమతో వారియొక్క పరలోకపు తండ్రి ప్రేమించుచున్నాడని నమ్మే విశ్వాసులు.
మొదటి తరగతికి చెందిన వారు సత్యమును నమ్ముటవలన విశ్రాంతిలో ఉండెదరు. మిగిలినవారు దేవునిచేత ప్రేమించబడుటకు తగినవిధంగా జీవించవలెననే ఉద్దేశ్యంతో ఆ విశ్రాంతిలో ఉండరు. మనము మంచిగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దేవుడు మనలను ప్రేమించునని ఈలోకములో తప్పుడు మతములు బోధించుచున్నవి. కాని ప్రభువు దానికి వ్యతిరేకంగా బోధించెను. అయినప్పటికి అనేకమంది విశ్వాసులు అన్యులవలె ఆలోచించెదరు. సాతానుయొక్క అబద్ధమును మనము బయలుపరచాలి. ఎందుకనగా దేవుడు తన పిల్లలను షరతులులేని ప్రేమతో ప్రేమించుచున్నాడు. అయితే మనము ఆ ప్రేమను సంపూర్ణంగా తృణీకరించి మరియు దేవునికి దూరంగా వెళ్ళి మరియు నశించవచ్చు కాని ఆయన బిడ్డల విషయంలో ఆయనప్రేమ షరతులులేనిదై యుండును. తప్పిపోయిన కుమారుని ఉపమానములో తండ్రియొక్క ప్రేమ దీనిని పరిపూర్ణంగా చెప్పుచున్నది.
దేవుడు అనేక ప్రమాదాలలో ప్రజలను ప్రేమించుచున్నాడనునది నిజమే. దేవుడు లోకంలో ప్రజలను ఎంతో ప్రేమించెను (యోహాను 3:16). కాని క్రొత్తగా జన్మించిన బిడ్డలను ఆయన మరిఎక్కువగా ప్రేమించెను. మరియు ఆయనయొక్క షరతులు నెరవేర్చు విధానంనుబట్టి ఆయన తన బిడ్డలను ప్రేమించును. యోహాను 14:21లో ప్రభువు ఈవిధముగా చెప్పెను, ''నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను''. మరియు సమస్తమును విడిచిపెట్టి ప్రభువుకు శిష్యులైన అయిన వారిని దేవుడు ఎంతో ఎక్కువగా ప్రేమించును. దేవుడు ప్రభువైనయేసును ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించును (యోహాను 17:23). అయినప్పటికిని దేవుని యొక్క ప్రేమ షరతులులేనిది.
దేవుడు మాత్రమే మనకు సర్వములో సర్వము అయియున్నాడు:
మనము మనుష్యులమీద కాక ఎల్లప్పుడు దేవునిమీద మాత్రమే నమ్మకం ఉంచవలెను. లేదంటే శపించబడెదమని యిర్మీయా 17:5,6లో చెప్పబడింది, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును''. సిలువమీద ఉన్న ప్రభువైనయేసు యొక్క దేహమును సమాధిలో ఉంచుటకు పేరుప్రతిష్టలుగల అరిమతయి యోసేపును దేవుడు వాడుకొనియున్నాడు. ''యేసు మరణమైనప్పుడు భక్తిహీనులతో ఆయనకు సమాధి చేయబడినప్పటికిని ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు . అతని నోట ఏ కపటమును లేదు అని యెషయా ప్రవచనం నెరవేరింది (యెషయా 53:9). పేతురులాంటి చేపలు పట్టుకొనే సామాన్యప్రజలు దానిని చేయలేరు. కాబట్టి ఈనాడు కూడా శరీరమనే సంఘమునకు పలుకుబడిని కలిగిన విశ్వాసులు సహాయపడుతున్నందుకు దేవునికి స్తోత్రం.
మీ జీవితంలో విగ్రహము లేనప్పుడు మాత్రమే విశ్రాంతిలో ఉండెదరు. అనేకమంది క్రైస్తవులకు వారి మంచిఉద్యోగము, గృహములు మరియు భూసంబంధమైన సౌఖ్యములే విగ్రహములై యున్నవి. అది ఒక చెక్కతోగాని రాయితోగాని చేసిన విగ్రహమును ఆరాధించినట్లే ఉండును కాని అనేకమంది క్రైస్తవులు దానిని గుర్తించుటలేదు. అబ్రాహాముకు ఇస్సాకు విగ్రహంగా మారినట్లే ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్యగాని, ఆత్మీయ వరములుగాని విగ్రహంగా మారును. దేవుడే మనకు సర్వంలోసర్వం అయియున్నప్పుడు మన హృదయంలో నుండి ఈ విధంగా చెప్పవలెను, ''నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు'' (కీర్తన 73:25). అప్పుడు మాత్రమే మనము విగ్రహములనుండి విడుదలపొంది ప్రభువును ఆరాధించగలము. మరియు మీరు ప్రతిఒక్క విగ్రహం నుండి విడుదలపొంది ప్రభువుని మాత్రమే ఆరాధించవలెనని నేను దేవుడిని ప్రార్థించుచున్నాను.
ప్రభువు భూమిమీద సర్వాధికారం కలిగియున్నాడు కాబట్టి మీరు ఆయనరాజ్యమును మొదటిగా వెదకి మరియు ఆయనను మాత్రమే సంతోషపెట్టవలెనని కోరినట్లయితే మీ జీవితంలో దేవుని చిత్తము నెరవేరకుండునట్లు ఏదియూ ఆపలేదు. పిలాతు యెదుట ప్రభువైన యేసు రెండు సత్యములు చెప్పారు, 1. ''యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను'' (యోహాను 18:36). 2. ''అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను'' (యోహాను 19:11).
ప్రభువు చెప్పిన ఈ మంచి సాక్ష్యం గురించి పౌలు తిమోతికి గుర్తు చేసియున్నాడు. ''సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను'' (1 తిమోతి 6:13,14).
నేను క్లిష్టపరిస్థితులను మరియు ఇబ్బందిపెట్టే వారిని ఎదుర్కొన్నప్పుడు, దేవుని యెదుటను మరియు సాతానుఎదుటను మరియు ప్రజలఎదుటను దీనినే ఒప్పుకొనియున్నాను.
వర్తమానకాలంలో జీవించుట:
మన దేవునియొక్క పేరు ''నేను ఉన్నవాడను'' గాని ఉండినవాడను కాదు (నిర్గమకాండము 3:14). కాబట్టి మనం మారుమనస్సు పొందినప్పుడు గతంలో మీరు ఏవిధంగా జీవించినప్పటికి దేవునికి తేడా ఉండదు. ఎందుకనగా మన దేవుడు భూతకాలంలో కాదుగాని వర్తమానకాలంలో జీవించియున్నాడు. కాబట్టి మనము పాపములను ఒప్పుకొనిన యెడల, ఆయన క్షమించుటమాత్రమే కాదు, వాటిని ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనడు.సాతాను మరియు అనేకప్రజలు గతములో జీవించుచున్నారు. గనుక గతంలో జరిగినవాటిని మరచిపోలేరు. మరియు వారు ఇతరులను నిందించెదరు. మనుష్యులుకూడా తమ గతమును గుర్తుతెచ్చుకొని నిరాశపడుచుందురు. భవిష్యత్తులో కూడా ఏదో విపత్తుజరుగునని భయముతో జీవించెదరు. కాని మనము అయితే ''నేను ఉన్నవాడను'' అనే దేవునితో జీవించుచున్నాము. ప్రభువైనయేసు మన పాపముల కొరకు మరణించియున్నాడు అనే విషయములో తప్ప మరి ఏ విషయంలోనూ అతిశయించము.
స్వనీతిపరులు (పెద్దకుమారుడు) మరియు మతానుసారులు బయట చలిలో ఉన్నప్పటికిని, మారుమనస్సు పొందిన, తప్పిపోయిన కుమారులను దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టును. ప్రభువైనయేసు పాపులనే పిలువ వచ్చియున్నాడు గాని నీతిమంతులను పిలచుటకురాలేదు అనే సత్యమును ఋజువుపరచుటకు మన తండ్రియైనదేవుడు మారుమనస్సు పొందిన అత్యంత ఘోరపాపులను అత్యంత గొప్ప అపొస్తులులుగా మార్చియున్నాడు.
అవిశ్వాసము దేవునిని అవమానపరచుటయే:
మనకు మంచి ఉద్యోగం వచ్చినప్పటికిని లేక రాకపోయినప్పటికిని, దేవుడు ప్రేమించు వారికి సమస్తము సమకూడి వారి మేలుకొరకే జరిగించును. మన బ్రతుకు దినములన్నియు ఆ విధంగా జీవించవలెను. దేవునియొక్క పిల్లలకు అన్ని దేశములు మంచివే. దేవునియొక్క చిత్తము మాత్రమే ముఖ్యమైయున్నది. మేడమ్ గయాన్ చెప్పినట్లు ఎల్లప్పుడూ చెప్పగలము.
నాకు ఏ ప్రదేశమైనా ఏ సమయమైనా ఒక్కటే
ప్రతి ప్రాంతము నా దేశమే
నేనెక్కడైనను నిశ్చింతగా ఉండగలను
ఎందుకంటే దేవుడు అన్నిచోట్ల ఉన్నాడు
మనము ఎటువంటి మంచి ప్రదేశమును కోరుకొన్నను
ప్రాణమునకు దేనియందును సంతోషముండదు
అయితే నన్ను నడిపించుటకు దేవుడుండగా
వెళ్లుటైనను ఉండుటైనను నాకు సంతోషమే.
నీవు లేనిచోట నేను ఉండుట
అది నిజముగా భయముతో కూడిన స్థితి
అయితే ఎటువంటి మారుమూల ప్రదేశమైనను
దేవుణ్ణి కనుగొనే భద్రత నాకున్నది
అప్పుడు ఏది జరిగిననూ మనము సంతోషముతోను సమాధానములోను విశ్రాంతిలోను జీవించెదము. ఎల్లప్పుడూ ఇది మీ సొంతమగునుగాక.
ప్రభువుయెడల నమ్మకముగా ఉన్నవారికి ఈలోకములోని సమస్తము దేవుడు ఇచ్చునని చెప్పబడలేదు. ''అభివృద్ధి పొందుట, లోకములో జయముపొందుట'' మొదలగునవి ప్రభువైనయేసు మరియు అపొస్తులులబోధలో కనుగొనము. కన్‌కార్డెన్స్‌లో మీరు చూడవచ్చును.
''జయము'' అనుమాట పాతనిబంధనలో 7సార్లు వచ్చింది. కాని క్రొత్త నిబంధనలో ఒక్కసారి కూడా లేదు.
''జయించుట'' అనుమాట పాతనిబంధనలో 14సార్లు వచ్చింది, కాని క్రొత్తనిబంధనలో ఒక్కసారి కూడా లేదు.
''వర్ధిల్లుట'' అనుమాట పాత నిబంధనలో 29 సార్లు వచ్చింది, కాని క్రొత్త నిబంధనలో ఒక్కసారి మాత్రమే ఉంది.
మరియు అది 3 యోహాను 2 అన్నివిషయములలో వర్ధిల్లుట అని వ్రాయబడింది.
కాబట్టి ఇవి పాతనిబంధనకు చెందినమాటలు. క్రొత్త నిబంధనలో ఎక్కువగా పడిపోయిన మానవులయెడల ప్రేమగురించియు, దేవునితో సహవాసం చేయుట గురించియు మరియు దేవుని యొక్క సమృద్ధి జీవము పొందుట గురించియు మాట్లాడుచున్నది.
భూమిమీద నున్న మనుష్యులందరిమీదను మరియు పరిస్థితులన్నిటిమీదను దేవుడు సర్వాధికారమును, శక్తిని కలిగియున్నాడు. అటువంటి దేవునిలో విశ్వాసం ఉంచకపోవుట ఆయనకు అవమానకరము. భూమిమీద ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించలేనంత బలహీనుడుగాను మరియు శక్తిహీనుడిగాను దేవుడు ఉన్నాడని అవిశ్వాసం చెప్పుతుంది. అయితే విశ్వాసం దేవునిని దేవునిగా అంగీకరించి మరియు సర్వశక్తిగల సృష్టికర్తగాను మరియు సమస్తము పరిపాలించువాడుగాను అంగీకరించును. అంతే. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆయనయందు విశ్వాసము ఉంచువారు నిరాశపడరు. ఆయన చేసే క్రియలన్నిటిని మనకు వివరించడు. కాని మన జీవితంలో ప్రతీ విషయం గురించి ఎంతో జాగ్రత్తవహించును.
ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును (కీర్తన 37:23).
సహాయపురాయి (ఎబినేజర్):
నిన్న మీ కారు రోడ్డుమీద వెళ్ళుచున్నప్పుడు నీటిలోగుండా వెళ్ళింది. కాబట్టి మీ తల్లి చదివే ఒక శీర్షిక అనుదినవెలుగు నుండి క్రింది వచనములు వ్రాయబడియున్నవి. ''విస్తారజలముల ఘోషకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషకంటెను ఆకాశునందు యెహోవా బలిష్ఠుడు'', ''నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమద్యను నడచుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు'', ''ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ఓ ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను'',వెంటనే యేసు ఆయన చేతితో అతనిని పట్టుకొనెను. ''నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను'' (కీర్తనలు 93:4, యెషయా 43:2, మత్తయి 14:29-31, కీర్తనలు 56:3). దేవునికి స్తోత్రము.
నా స్కూటరు ఎప్పుడైనా అటు ఇటు ఊగినప్పుడు, నాకేదైనా పెద్ద ప్రమాదం జరగకుండా దేవుడు దానిని హెచ్చరించుచున్నాడ అని నేను భావించెదను. పెద్ద రోడ్డులకు వెళ్ళుచున్నప్పుడు బ్రేకులు పనిచేయనియెడల గొప్పప్రమాదం జరుగవచ్చును. ఆయన కనికరము బట్టి దేవునిని స్తుతించుచున్నాము. ప్రభువుకి మనము జీవితాంతం ఋణపడియున్నాము.
నేను సహాయపురాయిగురించి ఆలోచించుచున్నాను (1 సమూయేలు 7:12). ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను బెదిరించుచున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టియుండగా దేవుడు పరలోకంలోనుండి వారిని రక్షించెను. అప్పుడు దేవుడు చేసిన సహాయంను బట్టి సమూయేలు అక్కడ రాయినిపెట్టి దానికి ఎబినేజరు అని పేరుపెట్టెను. మన గత జీవితంలో కూడా దేవుడు మనలను అపాయాలనుండి మరణంనుండి మొదలగువాటినుండి రక్షించిన సందర్భములను గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా దేవుడు మనకు ఎబినేజరుగా ఉన్నాడు గనుక మనలను ప్రేమించే దేవుడు ఉన్నాడనియు మన జీవితంలో అన్నియు నిర్వహించుచున్నాడనియు ఎరిగి విశ్వాసముతో బలము పొందెదము. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు మన జీవితాంతం మనలను కాపాడును.
గత కాలములో ఆయన చూపిన ప్రేమ ఆయన మనలను
మునిగిపోయే ఇబ్బందులలో వదిలిపెట్టడని మనకు చూపిస్తుంది
గత కాలములో ఆయన సహాయమును మనము గుర్తుచేసుకున్నప్పుడు
ఆయన మనలను ప్రస్థుత శ్రమలనుండి కాపాడునని మనకు ధృడపరుస్తున్నది.
గత సంవత్సరములన్నిటిలో దేవుడు మన ప్రార్థన విన్నందుకు ఆయనకు స్తోత్రం .
ప్రతి పరిస్థితిలో దేవుడు మనలను నడిపించి అనేకమంది ఎబినేజరులను దేవుడు లేపునుగాక.
దేవుడు యేసుకొరకు ఏమి చేసియున్నాడు:
దేవుడు యేసును ప్రేమించినట్లే నన్ను కూడా ప్రేమించుచున్నాడనియు మరియు ఆయనను నా కొరకు శరీరధారిగా ఈ లోకములో పంపియున్నాడనే సత్యమును నేను తెలుసుకొనునప్పుడు అనగా 20 సంవత్సరముల క్రితం (1977లో) ఈ పాట వ్రాసాను.
భారములతో కృంగియుండి
నీ ప్రాణము నిరాశలో ఉన్నప్పుడు
నీవు భయపడనక్కరలేదు
దేవుడు సమీపముగా నున్నాడు
తన కుమారుణ్ణి ప్రేమించినట్లే నిన్ను ప్రేమిస్తున్నాడు
నీకు కూడా ఆయన సహాయపడును,
ఆయన వాగ్దానమాటను నమ్ము
నిన్ను ఆయనే చూచుకొనును
దేవుడు ఏమిచేయగలడనునదే శుభవార్త
ఆయన యేసు కొరకు చేసినది నీ కొరకు చేయును
గొప్ప శక్తితో ఆయన నిన్ను బలపరచును
దేవుడు చేయగల దానికి మితము లేదు
పాపము దుష్టత్వము ఈ లోకమును నింపినను
నీవు వాటిచేత జయింపబడినను
దేవుని వాక్యము సత్యమైనది
పాపము నీమీద ప్రభుత్వము చేయదు
శోధన శక్తివంతమైనదిగా ఉన్నప్పుడు
దేవుని కృప నిన్ను ఆదుకొనును
గనుక నీవు యేసు వలె అనుదినము
విజయముతో నడువగలవు.
నీకు రోగము, బాధ కలిగినప్పుడు
నీ ఆత్మీయులను కూడా సోకినప్పుడు,
నీ బాధ దేవునికి తెలుసు
స్వస్థపరచుటకు ఆయన శక్తిగలవాడు
నీ తండ్రి నీ అవసరతను తీర్చును
ఆయన నమ్మకమైననవాడు, సత్యవంతుడు
ఆయన యేసును చూచుకున్నట్లే
నిన్ను కూడా చూచుకొనును.
యేసును నీ ప్రభువుగా
మరియు నీ పెద్ద సహోదరునిగా
నీవు తెలుసుకొనియుంటే
అది ఎంత మహిమకరమైన ఆదరణ
దేవునికున్నవన్నియు ఇప్పుడు నీవగును
ఆయన నిన్ను విడిచిపెట్టడు
దేవుడు నీ పక్షమున నుండగా
నీకు విరోధి ఎవడు?
''దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు'' (కీర్తన 46:1).
''ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము'' (హెబీ 13:5,6)
ఆమేన్, ఆమేన్.