దేవుడు మనిషిని సృష్టించలేదు ఎందుకంటే అతనికి సేవకుడు అవసరం. అతను మనిషిని సృష్టించాడు ఎందుకంటే అతను తన పాత్ర మరియు అతని స్వభావాన్ని వ్యక్తపరచగల వ్యక్తిని కోరుకున్నాడు. మనం ఈ సత్యాన్ని మరచిపోతే, దేవునికి సేవ చేయడమే క్రీస్తులో మన మోక్షానికి ప్రధాన ఉద్దేశ్యం అని ఊహించుకోవడం సులభం. ఇది చాలా మంది విశ్వాసులు చేసిన తప్పు. పరలోకంలో ఉన్న మన తండ్రి మరియు మన హృదయాలలో ఉన్న పరిశుద్ధాత్మ ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు - మనం యేసులాగా మారడానికి. మనము మన ప్రభువు పాత్రలో ఎంతగా ఉంటామో, ఆయన జీవించినట్లుగా మనం భూమిపై జీవిస్తాము. ఇది మరియు ఇది మాత్రమే ఆత్మతో నిండిన జీవితం. స్క్రిప్చర్ యొక్క ప్రారంభ పేజీలను దాని ముగింపు పేజీలతో పోల్చినప్పుడు, రెండు చెట్లు (జీవన వృక్షం మరియు మంచి మరియు చెడుల జ్ఞాన వృక్షం) రెండు వ్యవస్థలను ఉత్పత్తి చేశాయని మేము కనుగొన్నాము - జెరూసలేం మరియు బాబిలోన్. ఒకరు దేవుణ్ణి మహిమపరచాలని నిశ్చయించుకుంటారు. మరొకటి మనిషిని ఔన్నత్యం చేయడానికి బయలుదేరింది. ఒకరు క్రీస్తును అనుసరిస్తారు. మరొకరు ఆడమ్‌ని అనుసరిస్తారు. ఒకరు ఆత్మలో జీవిస్తారు, మరొకరు మాంసంలో ఉంటారు. మనమందరం నేడు ఈ రెండు వ్యవస్థలలో ఒకదానిలో చిక్కుకుంటున్నాము. ఈ పుస్తకం చదివేటప్పుడు కళ్ళు తెరవమని దేవుడిని కోరండి.... "తాను క్రిస్టియన్ అని చెప్పుకునే ఎవరైనా క్రీస్తు లాగా జీవించాలి." (1 జాన్ 2:6 - TLB)
దేవునికి ఒక సేవకుడు కావలసియుండి ఆయన మానవుని సృష్టించలేదు. ఆయనకు సేవ చేయుటకు లక్షలకొద్దీ దేవదూతలున్నారు. ఆయన యొక్క లక్షణాలను మరియు ఆయన యొక్క జీవమును, స్వభావమును, గుణమును ప్రత్యక్షపరచువారు ఉండుట కొరకు ఆయన మానవుని సృష్టించెను.
ఈ సత్యమును మనము మరచి పోయినట్లయితే, క్రీస్తులో మనరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశ్యము దేవుని కొరకు సేవచేయుట అని ఊహించుకొని చాలా సుళువుగా ప్రక్కత్రోవకు పోవుదుము. చాలా మంది విశ్వాసులు ఇదే పొరపాటు చేయుదురు.దేవుడు ఆదామును చేయకముందు ''మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము'' అను మాటలు పలికెను (ఆది కాండము 1:26).
ఆదాము పాపము చేసినప్పుడు, దేవుడు ఆయన యొక్క భవిష్యజ్ఞానముతో, మానవుడు పడిన పాపపు గోతి నుండి అతడిని లేపుటకు అప్పుడే ఒక ఏర్పాటు చేసెను. ఆదాము సృష్టింపబడక ముందే క్రీస్తు శరీరాకారము ధరించుట మరియు ఆయన సిలువ మరణము దేవుని యొక్క మనసులో ఉండెను.
దేవుని అసలు ఉద్దేశ్యమైన ఆయన జీవమును, స్వభావమును ప్రత్యక్షపరచుటను మనము నెరవేర్చ గలుగునట్లు మనలను తిరిగి తీసుకువచ్చుట క్రీస్తులో ఆయన మన విడుదలకొరకు చేసిన ఏర్పాటైయున్నది.
మన రక్షణ క్రీస్తులో విశ్వాసము ద్వారా కలిగినది. కాని విశ్వాసము క్రీస్తు యొక్క దైవిక ప్రత్యక్షతపై ఆధారపడియున్నది. కేవలము అటువంటి విశ్వాసము మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తు సారూప్యములోనికి మార్చునట్లు చేయును.
దేవుని ప్రత్యక్షత లేకుండా, క్రీస్తును గూర్చి మనము మన తెలివితేటలతో లేక సగము తెలుసుకొనుట, మనలను యేసు క్రీస్తు కాలమందలి బైబిలు పండితులంత గ్రుడ్డివారిగా చేయును. వారికి ఉండిన లేఖనముల యొక్క గ్రహింపు, నజరేయుడైనయేసు కుండిన లక్షణములకు వేరుగా నుండిన వేరొక క్రీస్తును వారు వెదకునట్లు నడిపించినది.
బైబిలు గ్రంధమందలి పేజీలలో కనబడు యేసు, ఆయన దేవుడైయుండి, తండ్రితో సమానముగా నుండి, తనను తాను రిక్తునిగా చేసికొని, ఒక మనుష్యుని పోలికగా పుట్టెను (ఫిలిప్పీ 2:6,7).
ఇక్కడే మనము సత్యమును జాగ్రత్తగా అర్థము చేసికొనవలెను. యేసు మనవంటి శరీరముతో వచ్చినప్పటికిని ఆయన వ్యక్తిత్వములో దేవుడే. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ దేవుడుగా ఉండకుండా ఉండడు. శరీరముతో నుండిన దినములలో యేసు దేవుడు అనుదానికి ఋజువు ఆయన పూజింపబడుటలో చూడగలము. సువార్తలలో ఏడుచోట్ల మనుష్యులు ఆయనను మ్రొక్కినప్పుడు ఆయన దానిని అంగీకరించుటను చూడగలము (మత్తయి 8:2; 9:18; 14:33; 15:25; 20:20; మార్కు 5:6; యోహాను 9:38). దేవదూతలు మరియు దేవునికి భయపడువారు మ్రొక్కబడుటను అంగీకరించరు (అపొ.కా. 10:25,26; ప్రకటన 22:8,9). కాని యేసు దేవుని కుమారుడు కాబట్టి ఆయన దానిని అంగీకరించారు.
అటువంటప్పుడు ఆయన రిక్తునిగా చేసుకొన్నదేమిటి?
అది దేవునిగా ఆయనకుండిన ఆధిక్యతలను.
రెండు ఉదాహరణలను ఆలోచించండి. ''దేవుడు శోధింపబడడు'' (యాకోబు 1:13) అను విషయము మనకు తెలియును. అయినప్పటికిని యేసు శోధింపబడెనని వాక్యములో చెప్పబడింది (మత్తయి 4:4-11).
దేవుడు సర్వాంతర్యామి (సమస్తమును తెలిసినవాడు) అని కూడా మనకు తెలియును. అయినప్పటికిని యేసు ఒక మారు ఒక అంజూరపు చెట్టు నొద్దకు, దానికేమైనా పండ్లు ఉన్నవేమోనని వచ్చి చూడవలసి వచ్చినది (మార్కు 11:13). ఒకసారి ఆయన తన రెండవ రాకడ రోజు ఎప్పుడనేది ఆయనకు తెలియదని చెప్పారు (మార్కు 13:32).
కనుక యేసుప్రభువు ఈ లోకములో శరీరధారియై సంచరించినప్పుడు దేవునిగా ఆయన కుండిన ఆధిక్యతలను ఆయన విడిచి పెట్టారనేది తేటగా ఉన్నది. ''వాక్యము దేవుడై యుండెను.....ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను'' (యోహాను 1:1,14). మనము తప్పుడు బోధలకు దూరముగా ఉండాలంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము గూర్చిన ఈ రెండు సత్యములు - ఆయన యొక్క దైవత్వము మరియు ఆయన యొక్క మానవత్వములను సమానముగా విశ్వసింపవలెను.
వాక్యములో ఏ సత్యమునైనా విడిచిపెట్టినట్లయితే ఆత్మీయ నష్టమును అనుభవింపక తప్పదు. కనుక మన గ్రహింపులో మరియు మన పరిచర్యలో క్రీస్తు యొక్క దైవత్వమునకు మరియు మానవత్వమునకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వకపోయినట్లయితే మనము వాక్యములో ప్రత్యక్షపర్చబడిన క్రీస్తును కాక ''మరియొక యేసు'' అసంపూర్ణమైన క్రీస్తును నమ్మునట్లు మోసపోవుదుము. ఇది మన క్రైస్తవ జీవితమునకు మరియు పరిచర్యకు కూడా నష్టము కలిగించును. మనము క్రీస్తును దేవునిగా ఆరాధించుటకు మాత్రమే కాక ఆయనను మానవుడిగా వెంబడించుటకు కూడా పిలువబడినాము.
యేసుప్రభువు మనలను ఆయన మరణము ద్వారా విడిపించుట మాత్రమే కాక, ఒక మానవుడు ఎలా జీవించవలెనని దేవుడు ఉద్దేశించెనో అది ఆయన ఈలోకములో జీవించుట ద్వారా చూపించెను. ఆయన మన రక్షకుడు మాత్రమేకాక, మనకు ముందు పరిగెత్తిన వాడిగా కూడా నుండెను (హెబ్రీ 6:20); మనము అన్ని సమయములయందు మరియు అన్ని పరిస్థితులలో దేవునికి సంపూర్ణమైన విధేయతతో ఎట్లు జీవింపవలెనో ఆయన మనకు మాదిరి చూపెను.
పాప క్షమాపణ, ఆత్మయొక్క నింపుదల మరియు దేవుడు అన్ని విధాలుగా ఇచ్చే కృప - ఆయన కుమారుని సారూప్యములోనికి మనము మారునట్లు చేయుట కొరకు ఉద్దేశింపబడినవి. ఇదే వీటన్నింటి యొక్క అంతిమ లక్ష్యము. నిజానికి, దేవుని వాక్యములో నుండిన ప్రతి సిద్ధాంత పరమైన బోధ మానవుని కొరకు దేవుని నిత్యమైన ఉద్ధేశ్యమైన ''యేసువలె మారుట'' అను వెలుగులో చూచి సరియైన రీతిలో అర్థము చేసికొనవలెను.
పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య రెండు విధములుగా యుండి, ''ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము'' (2 కొరింథీ 3:18) అని వివరింపబడెను.
పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసు యొక్క మహిమను వాక్యములో (అద్దములో) ఎళ్ళవేలలా మనకు చూపించాలని మరియు ఆయన సారూప్యములోనికి మార్చవలెనని చూచుచుండును.
తండ్రియైన దేవుడు, తన సార్వభౌమాధికారముతో, అన్ని పరిస్థితులు దీని కొరకే సమకూడి జరుగునట్లు ఆజ్ఞలను యిచ్చును. ''దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము...ఎందుకనగా దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను'' (రోమా 8:28,29).
మన జీవితములో ప్రతి సంఘటన మరియు పరిస్థితి మనలను మరికొంచెం యేసువలె రూపాంతరము చెందుటకు మరియు అటువంటి మూసలోనికి తయారగునట్లు దేవుడు ఏర్పాటు చేసెను.
కనుక, మన పరలోకపు తండ్రి మరియు మన హృదయములో నుండిన పరిశుద్ధాత్ముడు ఇరువురు కూడా ఒకే గమ్యము వైపునకు పనిచేయుచున్నారు, అది - మనము యేసువలె మారుట.
మనము ఎంత ఎక్కువగా ప్రభువు యొక్క స్వభావములో పాలివారమగుదుమో, అంత ఎక్కువగా మనము ఆయన ఈ లోకములో జీవించునట్లు జీవించగలము. ఇది ఆత్మచేత నింపబడిన జీవితము.
యేసుప్రభువు ఈ లోకములోనికి ఒక దేవదూతవలె రాలేదు కాని మనవలె వచ్చెను. ''అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను'' (హెబ్రీ 2:17) (ఆయన శిష్యులే ఆయన సహోదరులు. మత్తయి 12:49,50) అని బైబిలు చెప్తుంది. ఆయన అన్ని విషయములలో మనవలె (ఆయన సహోదరుల వలె) ఉండక పోయినట్లయితే, ఆయన మనకు మాదిరిగా ఉండరు. అంతేకాక ఆయన మనలను ''నన్ను వెంబడించు'' అని ఆజ్ఞాపించలేరు. ఎందుకనగా మనకున్నటువంటి హద్దులు లేనివానిని మనము వెంబడించలేము. అది ఒక దేవదూత మనవలె భూమ్యాకర్షణ శక్తితో క్రిందికి లాగబడదు కావున ఆ దూతకు నీటిలో మునుగుట తెలియదు కనుక మనకు ఈత నేర్పించలేనట్లుగా యుండును.
అప్పుడు ''నేను క్రీస్తును పోలి నడచుకొనునట్లు మీరును నన్ను పోలి నడచుకొనుమని'' పౌలు చెప్పిన హెచ్చరిక మాటలు అర్థము లేనివిగా ఉండును, ఎందుకనగా పౌలు యేసుప్రభువు వలె జీవించుటకు అవకాశము లేదు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితము కేవలము మనము ప్రశంసించే జీవితముగా తప్ప మనము ఎప్పటికిని వెంబడించగలిగే జీవితముగా యుండదు.
కాని దేవునికి స్తోత్రము, క్రీస్తు మన శరీరమువంటి శరీరముతో వచ్చెను మరియు మన శరీరమున కుండిన హద్దులను అంగీకరించి, ఆయనవలె జీవించుటకు మనకొక మాదిరిని ఉంచెను.
ఒక మానవునిగా, యేసుప్రభువు పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితమును జీవించి యుండగా, ఇప్పుడు మనము కూడా ''ఆయన నడచినట్లుగానే నడచుట'' ( 1 యోహాను 2:6) సాధ్యముకాదని చెప్పుటకు కారణమేమి లేదు.
మనము బలహీనమైన మానవ మాత్రులము కాబట్టి, యేసు ఈ లోకములో ఒక మానవునిగా జీవించినప్పుడు ఆయనకు ఎటువంటి ఆత్మశక్తి(మరియు జీవమును) ఇవ్వబడెనో అటువంటి శక్తినే దేవుడు మనకు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నారు.
యేసు ప్రభువుకు దేవుడు ఏమి చేసెనో మనకు కూడా అదే సంతోషముగా చేయును, ఆయన ''యేసును ప్రేమించినట్టుగానే మనలను ప్రేమించున్నారు'' (యోహాను 17:23) అయితే ఆయన శక్తి ''ఎవరైతే విశ్వసించుదురో'' (ఎఫెసీ 1:19) వారికే దొరకును. కనుక దేవుని వాక్యము యెడల విశ్వాసము లేకపోవుట వలన ఈనాటి విశ్వాసులు పాపము మరియు సాతానును ఎదుర్కొనుటలో శక్తిలేనివారుగా మరియు చేతగాని వారుగాను యుంటున్నారు.
''మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను, ఆయన పాపము చేయలేదు'' (1 పేతురు 2:21,22) అని మనము ఆజ్ఞాపింపబడగా, మానవులముగా అప్పుడప్పుడు పాపము చేయకుండా యుండలేము అని వంక చూపునట్లు సాతాను మనలను చేయును. అయితే యేసు మన శరీరమువంటి శరీరముతోవచ్చి పాపము చేయలేదని మనము చూచినప్పుడు, రెండు విషయములు జరుగును.
1. మనము పాపము చేయుటకు ఒక వంక దొరదు
2. యేసు జీవించినట్లు మనము కూడా పాపముపై విజయముతో జీవించుటకు మనకు విశ్వాసము వచ్చును.
కనుక మీరు ఈ పుస్తకములో వాక్య సత్యములను చదువునప్పుడు పౌలు ప్రార్థనతో కలసి ఇది నా ప్రార్థన కూడా: ''మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగుతండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు...మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను.....ప్రార్థించుచున్నాను'' (ఎఫెసీ 1:17; 3:15).
క్రీస్తు గూర్చిన సంపూర్ణమైన జ్ఞానముతో మాత్రమే మనము పరిశుద్ధాత్మ శక్తిని తెలుసుకొనగలము. ఆత్మచేత నింపబడిన వ్యక్తికి యేసుప్రభువు పరిపూర్ణమైన మాదిరియైయుండెను.
మనము ఆయన జీవితమును చూచినప్పుడు మరియు ఆయన ఈ లోకములో ఎలా జీవించునో చూచినప్పుడు, ఆత్మచేత నింపబడిన ఒకని జీవితముయొక్క లక్షణములు ఎలా ఉండునో పొరపాటు పడకుండా మనము అర్థము చేసికొనవచ్చును.
దేవుని యొక్క గొప్పతనాన్ని సృష్టిలోనుండిన అద్భుతాల్లో చూడవచ్చును (కీర్తన 19:1). ఈ విశ్వం మానవ మేథస్సు అర్థము చేసుకోలేనంత అనంతమైనది. నక్షత్రాలతో కూడిన పాలపుంతలు కొన్ని లక్షల కాంతి సంవత్సారాల దూరములో అంతరిక్షములో వ్రేలాడుచుండెను. అదే సమయములో, ఈ విశ్వములో నుండిన ప్రతి పదార్థము కంటికి కనబడనంతటి సూక్ష్మమైన అణువులచే నిర్మింపబడెను. ఆ అణువులు చుట్టూ వందలాది ఎలక్ట్రాన్లు అనబడేవి పరిభ్రమిస్తూ ఉండును. ఎంత గొప్పవాడు మన దేవుడు.
అయితే యేసుక్రీస్తు శిష్యులు దేవునిలో చూసే గొప్పతనము ముఖ్యముగా విశ్వములో నుండే అద్భుతాల్లో కాక, దేవుని కుమారుడు తనను తాను రిక్తునిగా చేసికొని పడిపోయిన జనాంగమైన మనతో సమానుడిగా గుర్తింపు పొందేటంత దీనుడుగా అయిన విషయములో ఉంటుంది.
''ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను...మనము ఆయన మహిమను కనుగొంటిమి'' (యోహాను 1:14) దానికి మనము ఆ మహిమ, ఈ సృష్టిలో కనబడే మహిమకంటె ఎంతో ఎక్కువైనది అని చెప్పవచ్చును.
ఆ గొప్ప పరలోకపురాజు వచ్చి మనకున్నటువంటి శరీరముతో మన మధ్య నివసించారు. అంతేకాక ఆయన ఏదో నమ్రత, తగ్గింపును చూపించుకొనేటట్లు కాకుండా నిజమైన దీనత్వముతో ప్రతివిషయములో మనలో ఒకరివలె వచ్చారు.
మనము యేసుప్రభువు యొక్క మహిమను ఆయన చేసిన అద్భుతాల కంటె గొప్పగా ఆయనకుండిన దీనత్వములో చూడగలము.
పరిశుద్ధాత్ముడు అన్నిటికంటె ముందుగా మనకు దీనత్వము యొక్క మార్గమును చూపించాలని ఆశపడుతున్నాడు. దానిని బట్టి మనమును మన దినాలన్నిటిలో ఎలా నడువవలెనో నేర్చుకొనవచ్చును. ఈ విషయములో ముఖ్యముగా మనము యేసుక్రీస్తును వెంబడించవలసి యున్నది.
యేసుప్రభువు ఈ భూమిపై, ఒక మానవుడిగా పవిత్రమైన మరియు ప్రేమతో నిండిన జీవితము జీవించకముందే ఆయన తన్నుతాను తగ్గించుకొనెను. అది మొదటి మెట్టు. అలాగే అదే మనకు కూడా మొదటి మెట్టుగా ఉండవలెను.
యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చుటకు ఎన్నో వేల సంవత్సరములకు ముందు, పరిపూర్ణమైన జ్ఞానము మరియు సౌందర్యము కలిగిన లూసిఫర్ అనే దేవదూతను దేవుడు సృష్టించెను. లూసిఫరు దేవదూతలందరిలో ప్రధానుడుగా ఉండునట్లు దేవుడు ఏర్పాటు చేసెను. కాని తనకు ఏర్పాటు చేయబడిన స్థానమును బట్టి గర్వముతోను మరియు అసంతృప్తితో నిండుకొనినవాడై, లూసిఫరు ఇంకాపైకి ఎక్కిపోయి తన్నుతాను హెచ్చించుకోవాలని ఉద్దేశించాడు (యెహెజ్కేలు 28:11-17; యెషయా 14:12-15). ఆ విధముగా అతడు దేవుని సృష్టిలోనికి పాపాన్ని తెచ్చాడు. అప్పుడు దేవుడు అతడిని వెంటనే క్రిందికి త్రోసివేసాడు. అప్పటి నుండి అతడు సాతాను అయ్యాడు.
అందువలన గర్వము ఈ విశ్వంలో అన్ని పాపములకు మూలము.
ఆదాము పాపము చేసినప్పుడు సాతాను యొక్క గర్వము అతడికిని అంటుకొనినది.
ఇప్పుడు ఆదాము యొక్క ప్రతి బిడ్డకు పుట్టుకతోనే ఈ అంటురోగము యున్నది.
మానవులను ఈ విషము నుండి రక్షించుటకు, యేసు ప్రభువు తననుతాను తగ్గించుకొనెను.
పాపము లూసిఫరు యొక్క గర్వములో ప్రారంభమైనది, కనుక మన యొక్క విడుదల తనను తాను తగ్గించుకొనిన యేసులో ప్రారంభమైనది. ఇటువంటి దీనత్వము మనలో ఎంత ఉంటుందో అంతగా క్రీస్తు యొక్క మనసు మనము కలిగియుందుము. ఇది ఆత్మీయ ఎదుగుదల యొక్క మారని కొలబద్ద.
పరలోకపు మహిమనుండి యేసుప్రభువు ఈ లోకమునకు వచ్చుటలోనే ఆయన యొక్క దీనత్వము గొప్పగా ప్రదర్శింపబడినది. అయితే ''ఆయన మనుష్యునిగా తన్ను తాను తగ్గించుకొనెను'' (ఫిలిప్పీ 2:8) అనియు ''అన్ని విషయములలో తన సహోదరుని వంటి వాడయ్యెను'' (హెబ్రీ 2:17) అనియు చెప్పబడినది. ఆయన దేవునిఎదుట అందరి మానవులవంటి స్థానము తీసుకొనెను. దేవుడే సర్వము అగునట్లు ఆయన ఏమీకాని స్థానాన్ని తీసుకొనెను. ఇదే నిజమైన దీనత్వము.
లోకములో మహిమ మరియు గొప్పతనము ఒక వ్యక్తి యొక్క స్థితి, సంపద, సాధించిన విషయములు, కుటుంబ గొప్పతనము మొదలైన వాటిని బట్టి కొలవబడును. కాని దేవునియొక్క మహిమ యేసుక్రీస్తులో చూచినట్లయితే ఎంత వేరుగా ఉంటుంది! ఏ కుటుంబములో పుట్టాలనేది ఎంచుకో గలిగిన ఒకేఒకవ్యక్తి యేసుప్రభువు. మనలో ఎవరికీ అటువంటి అవకాశములేదు.
యేసుక్రీస్తు ఎటువంటి కుటుంబాన్ని ఎంచుకొన్నాడు? ''అక్కడ నుండి మంచిది ఏదైనా రాగలదా''? (యోహాను 1:46) అని ప్రజలు చెప్పుకొనే నజరేతులోని ఒక అనామకుడైన వడ్రంగి కుటుంబము నుండి ఆయన వచ్చెను. యోసేపు మరియలు ఒకగొఱ్ఱెపిల్లను దహన బలి అర్పణగా తీసుకురాలేనంతటి బీదవారు (లూకా 2:22-24; లేవీయ 12:8తో కలిపి చూడండి).
ఇంకా చూచినట్లయితే పుట్టిన వారిలో యేసుక్రీస్తు మాత్రమే ఎక్కడ తను పుట్టవలెనో ఖచ్చితమైన స్థలమును ఎంచుకొనగలిగియుండెను. అటువంటి అవకాశము కలిగియుండి కూడా ఆయన జననమునకు ఎటువంటి స్థలమును పరిసరాలను ఎంచుకొనెను? ఒక చిన్న పశువులశాలలో పశువులకు గడ్డివేసే తొట్టెలో.
ఇంకా చూచినట్లయితే యేసుప్రభువు ఎటువంటి వంశావళి ఎంచుకొనెనో చూచెదము. మత్తయి 1:3-6లో యేసుప్రభువు యొక్క కుటుంబవృక్షములో నలుగురు స్త్రీల పేర్లు చెప్పబడెను. మొదటి స్త్రీ, తామారు తన మామ యూదాతో వ్యభిచరించుట ద్వారా కుమారుని కనినది. రెండవ స్త్రీ రాహాబు, యెరికోలో పేరెన్నికగన్న వ్యభిచారి. మూడవ స్త్రీ రూతు, లోతు తన స్వంత కుమార్తెతో వ్యభిచరించుట ద్వారా పుట్టిన మోయాబు వంశీయురాలు. నాల్గవ స్త్రీ దావీదు వ్యభిచరించిన యూరియా భార్యయైన బెత్షెబా.
ఇటువంటి అవమానకరమైన వారుండిన వంశాన్ని యేసుప్రభువు ఎందుకు ఎంచుకొన్నారు? దాని ద్వారా ఆయన పూర్తిగా ఆదాము సంతతితో తనను తాను కనపరచుకొనుటకొరకే. ఈ విషయంలో ఆయన దీనత్వమును చూడవచ్చును. ఆయన వంశావళిని లేక కుటుంబమును బట్టి గర్వించాలని అనుకొనలేదు.
యేసుప్రభువు మానవునిగా సంపూర్తిగా గుర్తింపబడెను. ఆయన మానవులలో నుండిన జాతి, కుటుంబము, జీవనస్థితి మొదలైన వాటితో సంబంధములేని సమానత్వాన్ని విశ్వసించెను, మరియు అందుచేతనే సమాజములో క్రిందినున్న వారిలో ఒకడుగా నుండెను. ఆయన అందరకు సేవకుడగునట్లు, ఆయన అందరికంటె తక్కువైన వానిగా వచ్చెను. ఎవడైతే ఇతరుల క్రింద ఉండునో అతడే వారిని పైకెత్తగలడు. యేసుప్రభువు అందుకొరకే వచ్చెను.
పరిశుద్ధాత్ముడు మన మనస్సులను రూపాంతరము చేయుట ద్వారా మనలను మార్చును (రోమా 12:2). అది ఎట్లనగా మన ఆలోచనలో క్రీస్తుయేసుకు ఉన్నటువంటి దీనత్వము అనే నిజమైన విత్తనము నాటుట ద్వారా జరుగును. అంతేకాని మన క్రియల ద్వారా లేక ఇతరుల యెదుట మన ప్రవర్తన ద్వారా కాక మనతలంపుల (మనము ఒంటరిగా ఉన్నప్పుడు) ద్వారా మనము (అవి మనగూర్చి మరియు మనము ఇతరులతో ఎలా సరిపోల్చు కొనుచున్నాము అను దానిని బట్టి) క్రీస్తు పోలికలోనికి మారామో లేదో తెలుసుకొనవచ్చును.
మన మెప్పుడైతే నిజముగా మన ఆలోచనల్లో మన గూర్చి మనము తక్కువగా అంచనా వేసికొంటామో, అప్పుడు నిజముగా మనము ఇతరులను ''మన కంటె యోగ్యమైన వారుగా ఎంచుదుము'' (ఫిలిప్పీ 2:3), మరియు మనలను మనము ''పరిశుద్ధులందరిలో తక్కువవానిగా'' (ఎఫెసీ 3:8,11) ఎంచుకొందుము!
యేసుప్రభువు ఎప్పుడూ ఆయన తండ్రి యెదుట ఆయన ఏ విలువా లేనివానిగా ఉండెను కాబట్టి, దేవుని మహిమంతయు కూడా ఆయన ద్వారా ప్రత్యక్షపరచబడెను. తండ్రియెదుట ఎల్లప్పుడు ఏ విలువలేని వానిగా తన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన జీవితములో తండ్రి సూచించిన దేనికైనా ఆయన సంతోషముతో లోబడెను మరియు తండ్రి యొక్క ఆజ్ఞలన్నిటికి ఆయన పూర్ణహృదయముతో లోబడెను.
''ఆయన సిలువ మరణము పొందునంతగా తన్నుతాను తగ్గించుకొనెను'' (ఫిలిప్పీ 2:8).
దేవునికి సంపూర్తిగా విధేయత చూపించుట దీనత్వము యొక్క పొరపాటు పడనటువంటి గుర్తుయైయున్నది. ఇంతకంటె సరియైన పరీక్ష ఏమీ లేదు.
యేసుప్రభువు ముప్పై సంవత్సరములు పరిపూర్ణులు కానటువంటి పెంపుడు తండ్రికి మరియు తల్లికి లోబడెను, ఎందుకంటె అదే దేవుని చిత్తమైయున్నది. ఆయనకు యోసేపు మరియల కంటె ఎన్నో విషయాలు ఎక్కువగా తెలియును. అంతేకాక ఆయన వారివలె కాక పాపములేని వానిగా ఉండెను. అయినప్పటికీ ఆయన వారికి లోబడెను.
ఒక వ్యక్తికి తన కంటె తెలివి తేటలలోను మరియు ఆత్మీయముగా తక్కువగా ఉన్నవారికి లోబడుట సులువైనదికాదు. కాని దేవుని దృష్టిలో తనకు తాను నిజముగా విలువ లేనివానిగా చూచుకొనిన వానికి, దేవుడు తనపై ఏర్పాటు చేసిన వారెవరికైన లోబడుటలో కష్టము ఉండదు - నిజమైన దీనత్వమునకు ఈ విషయములో ఏ సమస్యా ఉండదు.
యేసుప్రభువు చూచుటకు ఏ మాత్రము గొప్పగా కనబడని వృత్తిని ఎంచుకున్నారు - అది వడ్రంగి పని. ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన పేరుకు ముందు గాని వెనుకగాని ఏ ప్రత్యేక గుర్తింపులు ఉంచుకొనలేదు. ఆయన ''పాస్టరు యేసు'' కాదు. ''రెవ. డా|| యేసు'' అంత కన్నా కాదు. ఆయన సేవ చేయుటకు వచ్చిన సామాన్య ప్రజలు కంటే హెచ్చింపబడే ఏ బిరుదు గాని లేక ఈ లోక సంబంధమైన ఎక్కువైన స్థానాన్ని గాని ఎప్పుడూ ఆయన వెదకలేదు. చెవి గలవాడు వినునుగాక.
ఒకసారి జనసమూహము ఆయనను రాజుగా చేయాలనే ఉద్దేశ్యముతో ఆయనను వెదకినప్పుడు ఆయన నెమ్మదిగా వారి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు (యోహాను 6:15). ఆయన కేవలము ''మనుష్య కుమారుని''గా మాత్రమే తెలియబడుటకు యిష్టపడెను.
ఆయనెప్పుడూ మనుష్యుల నుండి వచ్చు ఘనతను పట్టించు కొనలేదు మరియు దానిగూర్చి వెదకలేదు. ఆయన తన తండ్రి ఎదుట మాత్రమే జీవించెను మరియు ఆయన జీవితమంతా ఇతరులు ఆయనను లక్ష్యపెట్టక పోయిననూ తృణీకరించిననూ ఆయన దానితోనే సంతృప్తిపడెను. దేవునియొక్క మెప్పు మాత్రమే ఆయనకు కావలసినదిగా ఉండెను.
యేసుప్రభువు ఎప్పుడు ఎవ్వరిని స్వస్థపరచినా లేక ఒక సూచకక్రియ చేసినా, ఆ స్వస్థత చేసిన వృత్తాంతము ఎవ్వరికీ తెలియకూడదని అనుకొనేవారు, ఎందుకంటే ఆయన చేసిన సూచక క్రియలు అవసరములో నుండిన వారి యెడల కనికరముతో చేసినవే తప్ప, ప్రాచుర్యము పొందే పనులు కాదు. ఆయన యాయీరు కుమార్తెను మరణము నుండి లేపినప్పుడు కూడా ఆ విషయము ఎవ్వరికి తెలియజేయవద్దని కఠినముగా ఆజ్ఞాపించెను (మార్కు 5:43). యేసుప్రభువు ఈ లోకమును విడిచిన పిమ్మట మాత్రమే ఆయన జీవిత విశేషములను ఆయన అపొస్తలులు బహిరంగ పరిచారు.
ఆయన సిలువ వేయబడిన ముందు రాత్రి, ఆయన ఒక పాత్రలో నీటిని తీసుకొని శిష్యుల కాళ్ళు కడుగుట, ఆయన జీవితమంతటి యొక్క మాదిరియై యున్నది. ఆయన మనుష్యులందరికి సేవకుడుగా ఉండెను. శిష్యుల యొక్క పాదములు మురికిగా నున్నవని వెంటనే గమనించి వేరొకరెవరైనా అప్పుడు అవసరమైనది చేస్తారని చూడకుండా వెనువెంటనే పాత్రను తీసుకొని అవసరమైనది చేసెను. అప్పుడు చేసిన ఆ కార్యము ఆయన జీవిత మంతటిలో ఇతరులకు ఆయన చేసిన పరిచర్యకు సూచనార్థముగా నున్నది. ఎవరో అడుగువరకు యేసు వేచియుండలేదు. ఆయన అవసరమును గమనించి వెంటనే అవసరమైనది చేసారు.
యేసుప్రభువు సమాజములో అట్టడుగున నున్నవారితో చాలా దగ్గరగా కలసిపోయి వారిలో ఒకడిగా సంచరించెను. అయినప్పటికి, ఆయన పాపరహితుడు, పరిపూర్ణుడైనప్పటికిని, ఇతరుల బలహీనతలను బట్టి వారు యిబ్బంది పడేటట్లు చేయలేదు. ఆయన తన శిష్యులతో సంచరిస్తున్నప్పుడు ఆయన గూర్చి ప్రత్యేకముగా చూపుకోలేదు. నిజానికి వారు ఆయనను గద్దించేటంతగా మరియు ఆయనకు సలహా యిచ్చేటంత స్వేచ్ఛగా ఆయన వారితో కలసిపోయెను (మత్తయి 16:22, మార్కు 4:38; 9:5).
యేసుప్రభువు శిష్యులను తనతో కలసి ప్రార్థించమని అడుగుటలో ఆయన దీనత్వమును చూడగలము. గెత్సేెమనే తోటలో ''మరణమగునంతగా నా ప్రాణము బహు దు:ఖములో మునిగియున్నది'' (మత్తయి 26:38) కనుక ఆయనతో కలిసి ప్రార్థించమని ఆయన పేతురు, యాకోబు మరియు యోహానులను అడిగెను. ఆయన ధరించిన శరీరము యొక్క బలహీనతంతా యేసుప్రభువుకు తెలియును. అందుచేతనే ఆయన ప్రార్థనలో వారి తోడు అడిగెను.
మనలోని ఏమి చెయ్యలేని పనికిరానితనాన్ని (నిస్సహాయతను) మనము ఒప్పుకొనుటలో మనకు తగినంత నిజాయితీ లేకపోవుట చేతనే మన ద్వారా దేవుని యొక్క శక్తి ప్రత్యక్షమగుట పరిమితమైపోయినది. యేసు మనకు దీనత్వము యొక్క మార్గము చూపెను. అది మానవులుగా మన శరీరము యొక్క బలహీనతను మరియు మన పనికిరానితనాన్ని ఒప్పుకొనుటైయున్నది.
యేసుప్రభువు తనను తాను తగ్గించుకొనుట చేత, దేవుడు ఆయనను విశ్వములో అత్యున్నత స్థానమునకు హెచ్చించెను (ఫిలిప్పీ 2:9). యేసుతోపాటుగా ఎవరైతే ఆ దీనత్వమార్గము గుండా వెళ్లుదురో వారు మహిమలో యేసుప్రభువుకు కుడిచేతి ప్రక్కన ఎడమచేతి ప్రక్కన కూర్చొనెదరు.
యేసు యొక్క జీవితమంతా ఆయన క్రిందికి వెళ్లుచూఉండెను. ఆయన పరలోకము నుండి క్రిందికి దిగివచ్చెను మరియు సిలువకు వెళ్లునంత వరకూ ఇంకా క్రిందికి, క్రిందికి వెళ్లుచూ ఉండెను. ఎప్పుడు కూడా ఒక్కసారియైనా ఆయన ఆ దిశనుండి వెనక్కు తిరిగి వెళ్లుటకు చూడలేదు.
ఈనాడు ఈ భూమిపై రెండు ఆత్మలు పనిచేయుచున్నవి. ఒకటి, సాతాను యొక్క ఆత్మ. అది లోకములో కాని లేక క్రైస్తవ్యంలో కాని ప్రజలను పైకి వెళ్ళునట్లు తొందరపెట్టును. వేరొక ఆత్మ, ప్రజలను వారి యజమానివలె క్రిందికి నడిపించే క్రీస్తుఆత్మ, గోధుమ గింజవలె, యేసు క్రిందికి వెళ్లెను, మరియు ఆయన యొక్క నిజమైన శిష్యులందరు అటువంటి లక్షణము వలననే గుర్తించబడుదురు.
యేసుయొక్క దీనత్వము ఆయన యొక్క మరణములో బహు ప్రకాశవంతముగా కనబడినది. యేసు పొందిన తీర్పుకంటె అన్యాయపు తీర్పు ఇంక ఎప్పుడూ ఉండి ఉండదు. అయినప్పటికిని ఆయన ఆ బాధకు, అన్యాయమునకు, అవమానము మరియు హేళనకు మౌనముగా లోబడెను. ఆయన తన శతృవులపై శాప వచనములు పలుకలేదు. ఆయన వారిని పగతీర్చుకొనుట గూర్చి భయపెట్టుట కాని దేవదూతలను సహాయమునకు పిలుచుటగాని చెయ్యలేదు. ఆయన దేవుని కుమారునిగా ఆయన కుండిన హక్కులన్నింటిని విడిచిపెట్టెను.
'బిగించిన పిడికిలి' ఒకరి యొక్క హక్కులు, అధికారము మరియు కలిగిన వాటిని పట్టుకొనియుండే కోర్కె. అలాగే వారు ఎదుర్కొనబడినప్పుడు తిరిగి పోరాడే కోర్కెను తెలియజెప్పు మానవ జాతికి సరిగా సరిపోయిన గుర్తు.
వేరొక ప్రక్క యేసు ఆయన సిలువ వేయబడినప్పుడు మేకులు కొట్టబడునట్లు ఆయన యొక్క అరచేతులను యిష్ట పూర్వకముగా తెరిచెను. ఆయన అరచేతులు ఎప్పుడూ ఇచ్చుటకు, ఇచ్చుటకు మరియు ఇచ్చుటకు తెరిచే యుండెడివి. చివరగా ఆయన తన యొక్క జీవితమును కూడా ఇచ్చివేసెను. ఇది నిజమైన దీనత్వము. మరియు ఇది దేవుడు ఉద్దేశించిన మానవత్వము.
దైవ స్వభావమును తనలో చూపవలెనని కోరుకొను యేసు యొక్క శిష్యుడు అన్యాయమును ఫిర్యాదు లేకుండా భరింపవలెను.
''తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల అది మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను'' (1 పేతురు 2:20-23).
యేసుయొక్క దీనత్వము ఆయన ఎవ్వరినీ తీర్పుతీర్చుటకు అనుమతించలేదు. దేవుడొక్కడే మనుష్యులందరికీ తీర్పు తీర్చువాడు మరియు ఏ మానవుడైనా ఇతరులను తీర్పు తీర్చినట్లయితే దేవుడు మాత్రమే కూర్చొను స్థానములో కూర్చొనినట్లే. ఒక మానవుడుగా యేసుప్రభువు ''నేనెవనికిని తీర్పు తీర్చను'' (యోహాను 8:15) అని చెప్పెను. ఆయన తీర్పు అంతటిని తండ్రికి అప్పగించెను. అక్కడ కూడా ఆయన దీనత్వము యొక్క సౌందర్యమును మనము చూడగలము.
యేసు తన తండ్రి కొరకు ఏర్పాటు చేసిన అవమానకరమైన మరణమునకు యిష్టపూర్వకముగా లోబడెను. ఆయన సిలువ మరణము విషయములో మానవ ప్రమేయముతో వేయబడిన ప్రణాళిక మరియు దానిని నెరవేర్చిన తీరుకంటె తండ్రి యొక్క హస్తమును గూర్చి వివేచించి ఆయన ''తండ్రియిచ్చిన గిన్నెలోనిది'' (యోహాను 18:11) యిష్టపూర్వకముగా త్రాగెను.
''మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపెను'' (ఫిలిప్పీ 2:8).
వాక్యములో కనబడు నిజమైన యేసు ఇలా ఉండును. ఈ కాలపు నవీన సువార్తికులు వెల లేక ఒక సినీనటుని వలె గొప్పగా సన్మానము పొందలేదు. దానికి బదులుగా ఆయన మనుష్యులచే తృణీకరింపబడి తిరస్కరింపబడెను; మరియు ఆయన కాలములో నుండిన సమాజము ఆయనను మేకులతో సిలువకు కొట్టుట ద్వారా వదిలించుకొనెను. ఈనాటి లోకము దానికి వేరుగా లేదు; మరియు శిష్యుడు అతడి యజమానుని కంటె గొప్పవాడు కాడు. లోకము యొక్క ఘనతను సంపాదించుకొనే మరియు ప్రఖ్యాతి పొందిన క్రైస్తత్వము నిజమైన విశ్వాసమునకు నకిళీగా ఉన్నది. యేసు యొక్క జీవితము జననము నుండి మరణము వరకు ''లోకములో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టిలో అసహ్యము'' (లూకా 16:15) అను వాస్తవమును చూపించెను.
''నేను దీనుడను సాత్వికుడను కనుక...నా యొద్ద నేర్చుకొనుడి'' (మత్తయి 11:29) అని యేసు చెప్పెను. యేసు తన శిష్యులను ముఖ్యముగా ఆయన యొద్దనుండి దీనత్వమును నేర్చుకొనుమని అడిగెను. మరియు మనము కూడా ఆయన యొద్దనుండి అదే నేర్చుకొనవలెను.
దేవుడు వెలుగు మరియు ప్రేమయై యున్నాడు (1 యోహాను 1:5; 4:8). ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించుచున్నాడు (1 తిమోతి 6:16) అందుచేత ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండవలెనని ఆయన పిలుచుచుండెను.
అయితే పరిశుద్ధత మానవులకు, శోధన ద్వారా మాత్రమే వచ్చును. ఆదాము అమాయకుడుగా, మంచి చెడులంటే ఏమిటో తెలియని వానిగా సృష్టింపబడెను. అతడు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడ కోరుకొనెను. అందుకోసం అతడు పరీక్షింప బడేలా దేవుడు చేసెను.
మంచి చెడుల వివేచననిచ్చే చెట్టు దేవుని చేత సృష్టింపబడెను మరియు అది చెడ్డది కాదు. దేవుడు ''చాలా మంచిది'' అని అనిన ప్రపంచంలో ఆ చెట్టు ఉండెను (ఆది 1:31). ఆదాము తనకు వచ్చు శోధనను ఎదురించుట ద్వారా పరిశుద్ధుడగుటకు అవకాశమొచ్చును కనుక అది ఎంతో మంచిది.
శోధనలు దేవుని యొక్క జీవములోను, పరిశుద్ధతలోను పాలుపంచుకొనునట్లు అవకాశము కల్పించి (హెబ్రీ 12:10) ''పరిపూర్ణులమును మరియు అనునాంగులమును'' (యాకోబు 1:4) అగునట్లు చేయుట చేత ''మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు మహానందమని ఎంచుకొనుడని'' (యాకోబు 1:2) బైబిలు చెప్తుంది.
మనము యేసు ప్రభువు యొక్క పరిశుద్ధతను చూచినప్పుడు ఆయనకు దేవునిగా సంక్రమించిన పరిశుద్ధతను మనము చూడము. ఎందుకంటె అది మనకు ఏ విధముగానూ మాదిరికాదు. మనము ఆయనను ''అన్ని విషయములలో తన సహోదరుల వంటివాడుగాను'' మరియు ''సమస్త విషయములలో మనవలె శోధింపబడినను పాపము చేయనటువంటి'' వానిగా (హెబ్రీ 2:17, 4:15) చూచెదము.
యేసుప్రభువు మనము పరిగెత్త వలసిన పరుగు పందెపు మార్గములో మనకంటె ముందు పరిగెత్తుతూ మనలను ''వెంబడించుమని'' (యోహాను12:16) చేయిఊపుచూ ముందు పరిగెత్తువాడాయెను (హెబ్రీ 6:20). మనము కూడ అలసట పడకయు ప్రాణములు విసుకకయు ఉండునట్లు మనకంటె ముందు పరిగెత్తిన ఆయనవైపు చూచుచూ మనము కూడా పరిగెత్తుదము (హెబ్రీ 12:1-4).
యేసు ప్రభువు ఏమనుష్యుడైనా ఎప్పుడైనా ఎదుర్కొనిన ప్రతి శోధనను ఎదుర్కొనెను. ఆయన ''అన్ని విషయములలో మనవలె శోధింపబడెను''. ఇది హెబ్రీ 4:15లో తేటగా వ్రాయబడెను. ఇది మనకు ప్రోత్సాహకరమైన విషయం. యేసు ఈ రోజున దేవునిచే మనకివ్వబడని ఎటువంటి ప్రత్యేకమైన శక్తినీ ఉపయోగించలేదు. ఆయన ఒక మానవుడిగా, పరిశుద్ధాత్మ ద్వారా తన తండ్రిచే ఇవ్వబడిన శక్తితో శోధనను ఎదుర్కొని జయించారు.
దేవుని న్యాయవిధులు విధేయత చూపుటకు భారమైనవి మరియు అసాధ్యమైనవని సాతాను మనుష్యులకు ఎప్పుడూ చెప్పుచుండును. యేసు మానవునిగా ఆయన జీవితములో పరిపూర్ణ విధేయత చూపుట ద్వారా అది అబద్ధమని ఋజువు చేసెను. యేసుప్రభువు జయించని ఏ శోధననైనా లేక దేవునికి విధేయత చూపని ఏ ఆజ్ఞయైనా యుండినట్లయితే, అప్పుడు దానిని బట్టి మనకు పాపముచేయుటకు అవకాశము దొరికి యుండేది. అలాగే యేసు ప్రభువు అటువంటి పరిపూర్ణమైన జీవితమును మన కున్నటువంటి రక్తమాంసములు గల శరీరములో నుండిన బలహీనతలు లేకుండా ఉండి మనకు అందుబాటులో లేనటువంటి శక్తితో జీవించినట్లయితే, అప్పుడు కూడా ఆయన జీవితము మనము వెంబడించుటకు మాదిరియై యుండేదికాదు లేక మనము శోధింపబడు సమయాలలో అది మనకు ప్రోత్సాహకరముగా యుండేదికాదు. కాని యేసుప్రభువు మానవుడిగా ఈ భూమిపై, దేవుడు మనకు అందుబాటులో ఉంచుశక్తి, ఆయన వాక్యములో మనము చూచు ఆజ్ఞలను పాటించుటకు సరిపోతుందని జీవించి చూపారు.
''మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను'' (హెబ్రీ 4:15). పాపము లేని యేసుప్రభువు యొక్క జీవితము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మానవుడు పాపముపై జయము పొందవచ్చనియు మరియు దేవునికి సంతోషముతో విధేయత చూపవచ్చని లోకమునకు దేవుడు చూపుటైయున్నది. మనము ఆయన యందు నిలిచిఉన్నట్లయితే, మనము ''ఆయన వలె నడువబద్దులై యున్నాము'' (1 యోహాను 2:6).
ఈనాడు మనలను ప్రతిదినము పాపము చేయటకు ఊరించే ప్రతి ఆకర్షణను ఆయన ఎదుర్కొనెను మరియు ఆయన తండ్రి ఏ మానవుడైనా ఎప్పుడైనా ఎదుర్కొనే ప్రతి శోధన గుండా ఆయనను తీసుకువెళ్లెను. ఆ విధముగా ఆయన మనకు నాయకుడుగా మరియు ప్రధానయాజకుడుగా ఉండుటకు సిద్ధపరచబడెను (హెబ్రీ 2:10,17,18; 5:7-9). ఆ పరిస్థితులన్నిటిలో తనను పాపము చేయుటకు శోధించే శరీరాశలన్నిటిని తన్ను తాను ఉపేక్షించుకొని తన శరీరాశలన్నిటిని మరణింపజేసెను. ఆ విధముగా ఆయన ఎల్లప్పుడూ శరీరమందు శ్రమపడెను.
లేఖనములు ఆయనను మనకు మాదిరిగా చూపించెను. ''క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యికనేమియు లేక యుండును'' (1 పేతురు 4:1-2). యేసు ప్రభువు ఆయన జీవితము ద్వారా దేవుని ఆజ్ఞకు ఏ ఒక్క విషయములోనైనా అవిధేయత చూపుట కంటే ఎటువంటి కష్టమెచ్చినా దానిని భరించుట ఎంతో తక్కువైన శ్రమగా ఎంచి ఆయన ''మరణమగునంతగా విధేయత'' చూపెను.
పాపము యొక్క సారమంతా ఒకని స్వంత యిష్టము చేయుటలోనే ఉన్నది. అలాగే మానవునిలో పరిశుద్ధత యొక్క సారమంతా దేవుని ఇష్టమును జరిగించుటకు ఒకని స్వంత ఇష్టమును ఉపేక్షించుకొనుటైయున్నది. ఈ విధముగా యేసు ప్రభువు జీవించెను.
ఆయన ''నా అంతట నేనే ఏమియు చేయలేను. కాని నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే...నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని'' చెప్పెను (యోహాను 5:30, 6:38; మత్తయి 26:39).
యేసుప్రభువు తన స్వంత మానవ ఇష్టమును తన తండ్రికి నిత్యమైన బలిగా, చివరకు అది గొప్ప శ్రమతో కూడియుండినా అర్పించెను. ఆయన ''శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించెను'' (హెబ్రీ 5:7).
యేసుప్రభువు తన ముగ్గురు శిష్యులకు గెత్సేెమెనే వనములో, మానవ శరీరము బలహీనమైనదని, అది కేవలము మెళకువగా యుండి ప్రార్థించుట ద్వారా (అది దేవుని యొద్ద నుండి సహాయమును కోరుకొనుట ద్వారా) శోధనను జయించవచ్చునని హెచ్చరించెను (మత్తయి 26:41). ఆయన కూడా ప్రార్థించెను మరియు అందువలననే ఆయన జయించగలిగెను.
యేసుప్రభువు గెత్సెమనే వనమునకు వెళ్లుటకు ముందు ఆయన శిష్యులతో తండ్రి, పరిశుద్ధాత్ముని వారికి ''సహాయకుని''గా (యోహాను 14:12,16) ఇచ్చునని అందువలన వారు కూడా ఆయన చేసిన కార్యములు ఒక రోజున చేయగలరని చెప్పెను. యేసు ప్రభువు మనలను అద్భుతములు చేయు వారుగా చేయుటకు రాలేదు కాని, పరిశుద్ధులుగా చేయుటకు వచ్చెను. ఆయన కార్యములన్ని పరిశుద్ధమైన కార్యములు, తండ్రికి విధేయత చూపు కార్యములు మరియు అటువంటి కార్యములను కూడా చేయగలమని ఆయన వాగ్ధానము చేసెను. ఆయన వాటన్నిటిని పరిశుద్ధాత్మతో నింపబడిన మానవునిగా చేసెను.
శిష్యులు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడినపుడు వారుకూడా యేసు చేసినట్లుగా విధేయతతో కూడిన కార్యములు చేయుటకు శక్తిని పొందిరి. యేసుప్రభువు భూమిపై జీవించిన కాలములో, వారు రోగులను స్వస్థపరచుటకు, మృతులను లేపుటకు, కుష్టురోగులను స్వస్థపరచుటకు మరియు దయ్యములను వెళ్ళగొట్టుటకు శక్తిని పొందిరి (మత్తయి 10:8) కాని పాపమును జయించుటకు శక్తిని పొందలేదు. దాని కొరకు, వారు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడు వరకు వేచి చూడవలసి వచ్చినది.
ఆత్మతో సంపూర్తిగా నింపబడుట అనగా మనము ''యేసు చేసిన కార్యములు'' లేక వేరొక మాటలో ''దేవుని చిత్తము'' (యోహాను 4:34 చూడండి)ను చేయగలుగునట్లు చేయును.
దేవుడు ఇటువంటి మహిమ గల జీవితమును క్రొత్త నిబంధనలో మనకు ఇవ్వచూపుచుండెను.
''ధర్మ శాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి (దేవుని చిత్తము) నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను'' (రోమా 8:2-4).
యేసు ప్రభువు శోధనను ఎదుర్కొనుట మరియు దానిని జయించుట అనువాస్తవములో మనకుండిన ప్రాధాన్యత ఏమిటంటే, ఆ విధముగా మనము వెంబడించునట్లు ఒక మార్గమును మనకొరకు ఆయన తెరచెను.
''యేసు తెరిచిన మార్గము, నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది'' (హెబ్రీ 10:19,20).
దేవుని ఆలయములో అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమయుండును. ఆ ప్రదేశమునకు ఆయనను వెంబడిస్తూ వెళ్లునట్లు యేసు మన కొరకు మార్గమును తెరచెను. కనుక మనము ఆయన పరిశుద్ధతలో పాలివారమవ్వగలము. ఆయన అందరి కంటె ముందుగా శరీరమనే తెర ద్వారా లోనికి ప్రవేశించి మనకు ముందు పరిగెత్తిన వాడాయెను (హెబ్రీ 6:20). ఇప్పుడు మనము ఆయన మాదిరిని చూస్తూ పందెములో పరిగెత్త వలసియున్నది (హెబ్రీ 12:1,2).
మనము ఇప్పుడు తెరను చింపనక్కర్లేదు. ఎందుకనగా అది మన ప్రభువు ద్వారా, ఒక్కమారుగా చింపబడెను. అయితే మనము చింపబడిన తెర ద్వారా, ఆ మార్గము అది సిలువ మార్గము వెంబడి శరీరము మరియు దాని ఇచ్ఛలను చంపుట ద్వారా మనము ఆయనను వెంబడించవలసి యున్నది.
శరీరాశల విషయములో మరణించుట ద్వారా దేవుని యొక్క మహిమ యేసు యొక్క జీవితములో కనబడినది. మన విషయంలో కూడా వేరే మార్గమేదీ లేదు. మన శరీరములో ఇటువంటి క్రీస్తుయొక్క మరణమును ఉంచుకొన్నట్లయితే, అప్పుడు మాత్రమే పవిత్రమైన మరియు పరిశుద్ధమైన ''యేసు యొక్క జీవము శరీరమందు ప్రత్యక్షపరచబడును'' (2కొరింథీ 4:10).
పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువును నడిపించినట్లుగానే మనలను కూడా మనలో నుండి ఎల్లప్పుడూ సిలువ మార్గములో నడిపించును. మరియు ఈ మార్గములోనే మనము ఆయన యొక్క పరిశుద్ధతలో మరి ఎక్కువగా పాలు పొందవచ్చును. యేసు ప్రభువు విషయంలో అలాగే జరిగింది. మరి అదే మార్గములో వెళ్లువారికందరికీ కూడా అలాగే జరుగును.
ఆయనలో ఉన్న జీవము మనలోను ఉండునట్లుగా మనము దేవుని స్వభావములో పాలివారమగునట్లు చేయుటకు యేసు వచ్చెను.
''తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్ధానములను అనుగ్రహించియున్నాడు....లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్ధానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునుందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను'' (2పేతురు 1:3,4).
మనము ఈ భూమిపై నున్నప్పుడు మనలను పాపరహితులుగా చేయుదునని దేవుడు వాగ్ధానము చేయలేదు. మనము సంపూర్ణులగుటకు సాగిపోవలసియున్నది. అయితే మనము మనస్సాక్షికి తెలిసిన పాపముపై విజయముతో జీవించవచ్చును.
యేసుక్రీస్తు అన్ని విషయములలో మన వలెనె శోధింపబడెనని మనము చూచాము. మనకు వచ్చే బలమైన శోధనలు మన ఆలోచనా జీవితంలోనికి వచ్చి మనపై దాడిచేస్తాయి. యేసు విషయంలోనూ అంతే జరిగియుండాలి. అయినప్పటికీ ఆయనెప్పుడూ పాపం చేయలేదు. అలాగే మనము కూడా మన ఆలోచనా జీవితంలో కూడా జయము పొందవచ్చు.
యేసుయొక్క సంభాషణ పవిత్రంగా యుండేది. ఆయన నోటి నుండి ఏదైనా చెడు మాట కాని వ్యర్థమైన మాట కాని ఎప్పుడూ దొర్లేది కాదు. ఆయనెప్పుడూ సత్యమే మాట్లాడేవారు. ఆయన నోట ఏ కపటము లేదు. ఎప్పుడూ ఎవ్వరు కూడా యేసు ప్రభువును మాటలలోనికి దింపి ఎక్కువ డబ్బు (ఒకరి అవసరాలకు మించి) ఎలా సంపాదించాలనే సంభాషణ సంభాషించలేదు. ఆయనకు అటువంటి విషయాలలో ఆసక్తి లేదు. ఆయన మనసెప్పుడూ పైనున్న వాటిపైనే కాని భూ సంబంధ విషయాలపై ఉండేది కాదు. సందేహం లేకుండా ఆయన వస్తు సామాగ్రిని వాడారు. అయితే, ఆయన వాటిని ప్రేమించలేదు, వాటిలో దేనిని ఆయన హత్తుకొని లేరు.
యేసుయొక్క పరిశుద్ధత అంతరంగమునకు సంబంధించినది. అది ఆహార నియమములు, దుస్తులు లేక ఇతరులతో సాన్నిహిత్యములు మొదలైన బయటకు కనబడే భక్తి కాదు. ఆయన ఒక సన్యాసి కాని సాధువు కాని కాదు. ఆయన మామూలుగా నడుస్తున్న ప్రపంచంలో తన సాంఘిక స్థితికి తగినట్లు ఇతరులు వలె సామాన్యమైన దుస్తులు ధరించుట మరియు తినుట త్రాగుట చేసెడివారు (లూకా 7:34) మరియు ఈ లోకములో మానవుడు అనుభవంచుటకు దేవుడు ఇచ్చిన మంచి విషయములయందు సంతోషించారు (1తిమోతి 6:17). అయినను ఆయన ఆహార విషయంలో తనను తాను ఎప్పుడూ సంతోషపర్చుకొనలేదు. ఆయన నలభై రోజులు ఉపవాసము చేసిన తరువాత కూడా తనకు గల అద్భుతశక్తులను రాళ్ళను రొట్టెలుగా మార్చుటకు ఉపయోగించుకొనకుండునట్లు క్రమశిక్షణ చేసుకొనెను. ఆయన మతాసక్తి గలవారితో మాత్రమేకాక, ఘోరమైన పాపులతోకూడా కలసి యుండినను మచ్చలేకుండా యుండెను. ఆయన పరిశుద్ధత ముఖ్యముగా అంతరంగమునకు సంబంధించినది.
యేసు పాపమును మాత్రమే దూరముగా ఉంచలేదు. ఆయన అనేకమైన లాభకరముకాని న్యాయబద్ధమైన ఆహ్లాదాలను లేక ఆయన పూర్తి చేయుటకు వచ్చిన తండ్రిపనిలో కొంతైనా త్యాగము చేయ్యవలసిన దేనినైనా ఆయన విడిచి పెట్టారు (1కొరింథీ 6:12).
యేసుప్రభువు యొక్క పరిశుద్ధత దేవుని వాక్యమును ధ్యానించు జీవితము(దేవునిలో) నుండి వచ్చినది. లేఖనములు ధ్యానించుటకు ఆయన చూపిన మానసిక పరిశ్రమ, వాక్యముపై దేవుని ఆత్మ యొక్క వెలుగు వెదుకుకొనుట వలన ఆయనకు 12 సంవత్సరములు వయసు వచ్చేటప్పటికి వాక్యము బాగుగా తెలిసెను. ఆయన ఆత్మ యొక్క బయల్పాటును కోరుకొనుట చేత ఆయన వేదాంత పండితుల కంటె ఎక్కువ తెలిసిన వాడుగా యుండెను. యేసుప్రభువు ఏ బైబిలు పాఠశాలకు వెళ్లలేదు. ఆయన తన తండ్రి చేతి క్రింద పాత నిబంధనకాలపు నిజమైన ప్రవక్తలైన మోషే, ఏలియా, ఎలీషా, యిర్మియా, బాప్తిస్మమిచ్చు యోహాను మొదలైన వారివలె నేర్చుకొనెను. బైబిలులో నుండిన ఏ నిజమైన ప్రవక్త కూడా బైబిలు పాఠశాలనుండి రాలేదు. మనము అది జ్ఞాపకముంచుకొనవలెను.
యేసు వాక్యాన్ని చదివి దానికిలోబడెను. ఆ విధముగా వాక్యము ఆయన చేతిలో శక్తిగల ఆయుధముగాయుండి, అది సాతానుతో పోరాటములో మాత్రమే కాకుండా (మత్తయి 4:1-11), ఆయన బోధించు పరిచర్యలో కూడా ఉపయోగపడెను. ఆయన అధికారముతో మాట్లాడేవారు మరియు ఆయన బోధ ఆయన కాలములో నుండిన వేదాంతులు మరియు ధర్మశాస్త్ర పండితులు ప్రకటించిన ప్రాచుర్యం పొందిన ఆ దినాల ఆచారములకు వేరుగా ఉండేది.
ఆయన పరిసయ్యులలో నుండిన వేషధారణను మరియు లోకాకర్షణను బయట పెట్టి వారి యొక్క సిద్ధాంతాలు ఎంత తీవ్రముగా నుండినా వారు నరకముకు వెళ్ళుచున్నారని వారికి చెప్పేవారు (మత్తయి 23:33). అదే సమయములో సద్దూకయ్యలకుండిన సిద్ధాంత పరమైన తప్పులను మరియు లేఖనాలను తప్పుగా అర్థము చేసికొనుటను ఖండించేవారు (మత్తయి 22:23-33).
యేసుప్రభువు ఆయన బోధకు ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఎప్పుడూ చూడలేదు. సత్యముకు సంబంధించి ఒక చిన్న పొల్లు తప్పిపోవుటకంటె ఆయన చిత్రహింసను బాధను సంతోషంగా అంగీకరించేవారు ''ఏది ఏమైనా సమాధానము మరియు ఐక్యత చెడకూడదు'' అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మలేదు. చివరకు ఆయన విరోధులు కూడా ''నీవు సత్యవంతుడవైయుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము'' (మత్తయి 22:16) అని ఒప్పుకొనిరి.
యేసు యొక్క పరిశుద్ధత దేవుని ఇంటిని పవిత్రపర్చుటలో ఆయన కుండిన ఆసక్తిలో చూడగలము (యోహాను 2:14). ఆయన దేవాలయములో ప్రవేశించినప్పుడు అక్కడ వారు మతము పేరిట ధనసంపాదన చేయుట చూచినప్పుడు ఆయనలో నీతి యుక్తమైన కోపము రేగి అక్కడున్న వారిని కొరడాతో బయటకు తరిమివేసేటట్లు చేసినది.
పాపము లేకుండా కోపపడమని బైబిలు మనకు ఆజ్ఞను ఇచ్చింది (ఎఫెసీ 4:26). రోమా సైనికులు పిలాతు ఇంటిలో కొరడాలతో యేసును కొట్టినప్పుడు ఆయన సహనంతో దానినంతా భరించారు. ఆయన ఎప్పుడూ ఒక్కసారికూడ తనకు సంబంధించిన విషయంలో కోపము తెచ్చుకోలేదు. అటువంటి కోపము పాపము. కాని దేవుని ఇంటి యొక్క పవిత్రత విషయం వచ్చేసరికి అది వేరుగా ఉంటుంది. అక్కడ కోపాన్ని అణచి పెట్టుకొనుట పాపము.
ఆ రోజున ఆయన కొరడా వాడినప్పుడు, ఆయనను చూచిన వారు ఆయన నిగ్రహం కోల్పోయి తన బలహీనతకు లొంగి పోయెనని అనుకొంటారేమో అను దానిని ఆయన పట్టించుకోలేదు. ఆయన మనుష్యుల ముఖము యెదుట జీవించలేదు. ఆయన ఖడ్గమును తీసుకు వచ్చెను (మత్తయి 10:34) మరియు ఆయన దానిని వెనుదీయకుండా వాడెను. అది తెగ గొట్టును, గాయము చేయును మరియు బాధించును. ఆ విధముగా తండ్రి యొక్క మహిమ ప్రత్యక్షపర్చబడును.
యేసుప్రభువు జీవితము ఈ లోకము చూసిన వారందరి కంటె ఎంతో సౌందర్యమైనది, ఎంతో క్రమమైనది, ఎంతో శాంతితో కూడికొన్నది మరియు సంతోషకరమైనది. ఇది దేవుని వాక్యమునకు సంపూర్ణముగా విధేయత చూపుట వలన సాధ్యమైనది.
ఈ విశ్వంలో నుండిన క్రమమును గూర్చి ఆలోచించండి. నక్షత్రములు మరియు ఇతర గ్రహములు ఆకాశములో ఒక ఖచ్చితమైన క్రమముతో తిరుగుతూ ఉండును. వాటిని బట్టి మన గడియారములలో సమయాన్ని పదిలక్షలలో ఒక సెకనుకూడా తప్పులేకుండా ఖచ్చితముగా సరిదిద్దుకొనవచ్చును. అవి భవిష్యత్తులో ఏ స్థానములో ఉండునో ఖగోళ శాస్త్రజ్ఞులు లెక్కగట్టగలిగినంతగా వాటిపై ఆధారపడవచ్చును. అంత క్రమముగా నుండుటకు గల రహస్యమేమిటి? ఒకే ఒక కారణం అవి దేవుని చిత్తమునకు ఖచ్చితముగా లోబడి సృష్టికర్త వాటికి ఏర్పాటు చేసిన కక్ష్యలో, ఉద్దేశించిన వేగముతో తిరుగుట.
ఎక్కడైతే దేవునికి విధేయత చూపబడునో, అక్కడ పరిపూర్ణత మరియు సౌందర్యము ఉండును. అలాగే ఎక్కడైతే అవిధేయత ఉండునో, అక్కడ గలిబిలి మరియు వికారముండును.
చివరకు నక్షత్రములు కూడా దేవుని ఆజ్ఞలు మనకు మంచివని మరియు భారమైనవి కావను వాస్తవమును మౌనముగా మనకు సాక్ష్యమిచ్చుచున్నవి.
అన్నిటికంటె దైవభక్తియే యిప్పటి జీవితమునకును, రాబోవు జీవితమునకును లాభకరమైనదని యేసుప్రభువు జీవితము సాక్ష్యమిచ్చుచున్నది (1తిమోతి 4:8) ఒక దైవభక్తి గలవానికంటె ఎవరు కూడా ఎంతో సంతోషకరముతోను, ఎంతో సమాధానముతోను లేక సంతృప్తితోను ఉండరు. ''యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట'' (సామెతలు 14:27) మరియు యేసు ప్రభువు ''నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము'' (సామెతలు 23:17) అను ఆజ్ఞను నెరవేర్చెను. ఆయన యొక్క దైవికమైన భయభక్తుల వలన ఆయన ప్రార్థనలు దేవుడు వినెను (హెబ్రీ 5:7). ఆయన దేవుని యెడల భయముతో జీవించెను. కాబట్టి, యేసు ప్రభువునకు పరలోకము తెరుచుకుంటూ ఉండేది. ''నేను నా తండ్రిని ఘనపర్చుచున్నాను'' (యోహాను 8:49) అని ఆయన ఒకసారి చెప్పారు. ఆయన జీవితము ద్వారా ''యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానము'' (సామెతలు 9:10) అను వాక్యములో సత్యమును జీవించి చూపెను.
యేసుప్రభువుయొక్క ప్రార్థనలు ఆయన దేవుని కుమారుడుగా నుండినందున కాక ఆయన యొక్క భయభక్తుల వలన అంగీకరింపబడెను (హెబ్రీ 5:7). పరిశుద్ధాత్మలో సంతోషము మరియు అధికారముతో అభిషేకింపబడుట (ఆనంద తైలము) ఆయన దేవుని యొక్క కుమారుడుగా నుండుట వలన కాక, ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుట వలన జరిగినది (హెబ్రీ 1:9). ఎవరైతే నీతి విషయంలో స్వచ్ఛముగా నుందురో అటువంటి వానికే దేవుడు తన్ను తాను వశపరచుకొనును. ఇది ఆత్మీయ అధికారము యొక్క రహస్యము.
అయితే యేసు రోజులలో నుండిన మత సంబంధమైన లోకము, యేసు ప్రభువు యొక్క పరిశుద్ధత గూర్చి దేవుని కుండిన ఉద్దేశ్యములను ఒప్పుకొనలేదు. ఆయన వారిలో నుండిన పాపమును నిర్భయముగా ఎత్తిచూపించుట వలన యేసు ప్రభువు యొక్క పరిశుద్ధత వారి ద్వేషమును రెచ్చగొట్టినది (యోహాను 7:7). దాని పర్యవసానముగా యేసుప్రభువు పరిశుద్ధతను బోధించుట యూదా మత నాయకుల నుండి శతృత్వమును, తిరస్కారమును, ద్వేషమును, విమర్శను, వెలివేయబడుటను చివరకు మరణమును అనుభవింపచేసినది. కేవలము పరిశుద్ధజీవితమును జీవించినట్లయితే వారు ఆయనను సిలువ వేసి యుండేవారు కాదు. కాని ఆయన వారి వేషధారితనమును బహిరంగముగా వ్యతిరేకించి వారిలో పాపమును ఆయన బోధలలో బహిరంగ పర్చుట వలన వారు అట్లు జేసారు. అందుచేత వారు ఆయనను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకొన్నారు.
''ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు'' (యోహాను 3:19,20) అని యేసుప్రభువు చెప్పారు.
ఈనాటి క్రైస్తవలోకము అట్లే యున్నది. మరియు శిష్యులు తన యజమాని కంటె గొప్పవారు కాదు. పరిశుద్ధతలో జీవించుట నులివెచ్చని క్రైస్తవలోకము నుండి మనకు చప్పట్లను అభినందనలను తీసుకురావు. అది ఏ కాలములోనైనా, ఏ దేశములోనైనా ''క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరు హింస పొందుదురు'' (2తిమోతి 3:12). అయితే ఆ హింస యేసు ప్రభువుకు వచ్చినట్లే ప్రధానముగా మతపరమైన లోకము నుండి వచ్చును.
ఎవడైనను ప్రభువును వెంబడించాలనుకొంటే, అతడు మొదట కూర్చొని ఖర్చు లెక్క చూచుకొనవలెను మరియు ''మనమాయన నిందను భరించుచు శిబిరము వెలిపలికి ఆయన యొద్దకు వెళ్లవలెను'' (హెబ్రీ 13:13).
దేవుణ్ణి వెలుగుగాను మరియు ప్రేమగాను మనము చూచాము. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తులో, సంపూర్ణమైన వెలుగుగాను మరియు ప్రేమగాను చూపబడినది. ప్రేమ మరియు వెలుగు విడదీయలేనటువంటివి. నిజమైన పరిశుద్ధత ప్రేమతో నిండియుండును మరియు నిజమైన ప్రేమ పరిపూర్ణమైన పవిత్రతతో యుండును. అవి కేవలము మనము అర్థము చేసికొనుట కొరకు మాత్రమే వేరు పర్చబడినవి.
ఒకడు తనకు పరిశుద్ధత కలదని చెప్తూ దేవుని ప్రేమను చూపించలేకపోయినట్లయితే, నిజానికి అతడిలో ఉన్నది నిజమైన పరిశుద్ధత కాక పరిసయ్యతత్వముతో నిండిన నీతియై యున్నది. వేరొక ప్రక్క అందరి యెడలను గొప్ప ప్రేమ యున్నదని చెప్తూ పవిత్రతో మరియు నీతి కలిగి జీవించని వాడు కూడా తనలో భావాలకు అనుగుణంగా పైపైన కనబడే భావావేశాలను దైవికమైన ప్రేమగా పొరబడును.
పరిసయ్యులకు కట్టుదిట్టమైన ఆచారములతో నిండిన 'నీతి' ఉండేది. వారు ఎముకలతో నిండిన ఒక అస్థిపంజరము వలె నుండి కఠినముగా మరియు భయంకలిగించేవారిగా ఉండేవారు. వారిలో కొంత సత్యముండేది కాని, అదంతా సంబంధం లేని విషయములతో అవసరానికి మించి చుట్టబడి యుండేది.
యేసుప్రభువులో సంపూర్ణమైన సత్యముండేది. ఆయన దేవుని ధర్మశాస్త్రములోని ప్రతి చిన్న విషయానికి పరిసయ్యుల కంటే ఎక్కువగా నిలువబడెను. కాని ఆయన కేవలము ఎముకలుగా లేరు. ఎముకలు మానవునిలో ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించారో అలాగే మాంసముతో కప్పబడి యుండెను. వెలుగు ప్రేమతో చుట్టబడియున్నది. ఆయన సత్యమును బోధించారు. అయితే ఆయన ప్రేమతో బోధించారు (ఎఫెసీ 4:15). ఆయన మాటలు అధికారముతో నిండియుండేవి. కాని అవి కృపాసహితముగా నుండేవి (లూకా 4:22,36).
ఇటువంటి స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు మనకు సంక్రమింపచేయాలని మరియు మన ద్వారా ప్రత్యక్ష పర్చాలని ఉద్దేశిస్తున్నాడు.
దేవుడు ప్రేమయై యున్నాడు. దాని అర్థము కేవలం ఆయన ప్రేమతో కార్యములు చేయువాడు మాత్రమే కాదు. ఆయన అన్ని విషయములలో ప్రేమతో నిండి యున్నాడు. యేసుప్రభువులో మనము చూచు దేవుని మహిమ దానిని ప్రత్యక్షపరచుచున్నది. యేసు కేవలము ప్రేమతో నిండిన కార్యములను చేయుట మాత్రమే కాదు. ''ఆయన మేలు చేయుచు...సంచరించుచుండెను'' (అపొ.కా. 10:38). అది ఆయన అణువణువు దేవుని ప్రేమతో నిండియుండుట చేత అట్లుచేయగలిగెను.
పరిశుద్ధత మరియు దీనత్వము వలె ప్రేమకు కూడా మన అంతరంగ పురుషునిలో దాని మూల స్థానమున్నది. ఆత్మతో నిండిన వ్యక్తి యొక్క కడుపులో నుండి జీవజలనదులు ప్రవహించును (యోహాను 7:38,39). మన ఆలోచనలు మరియు వైఖరులు (అవి ఎప్పుడూ బయటకు చెప్పకపోయినా) మన మాటలకు మరియు కార్యములకు మరియు వ్యక్తిత్వమునకు ఒక వాసన నిచ్చును. ఇతరులు ఆ వాసనను సుళువుగా గుర్తించగలరు. ఇతరుల యెడల మన యొక్క ఆలోచనలు మరియు వైఖరులు స్వార్థములోను, విమర్శలతో యుండి యున్నట్లయితే ప్రేమతో కూడిన మనమాటలు క్రియలు ఎందుకూ పనికిరావు. దేవుడు ''మన అంతరంగమందు సత్యమును కోరుచుండెను'' (కీర్తన 51:6).
యేసుప్రభువు మానవులందరి యెడల ఎంతో విలువను ఉంచారు. కాబట్టి ఆయన మనుష్యులందరిని ఎంతో గౌరవముగా చూచారు. దైవభక్తి కలవారిని, నాగరికత కలవారిని మరియు తెలివైన వారిని గౌరవించుట చాలా సుళువు. క్రీస్తులో మన తోటి విశ్వాసులను ప్రేమించినప్పుడు మనమెంతో ఎత్తుకు ఎదిగి పోయామని మనమనుకోవచ్చును. కాని యేసు మనుష్యులందరిని ప్రేమించుటలో దేవుని యొక్క మహిమ కనబడుతుంది. యేసు ప్రభువు ఎప్పుడూ ఎవ్వరిని కూడా వారి బీదతనము, అమాయకత, కురూపము లేక నాగరికత లేకపోవుటను బట్టి తృణీకరించలేదు. ఈ లోకమును మరియు అందులో ఉన్నదంతయు ఒక మానవుని ప్రాణమునకు సాటిరావని ఆయన ప్రత్యేకముగా చెప్పారు (మార్కు 8:36). ఆయన మానవుని అటువంటి విలువతో చూచారు. అందువలన మనుష్యులందరి యందు ఆనందించేవారు. ఆయన మనుష్యులు మోసపోవుటను మరియు సాతాను చేత బంధింపబడి యుండుటను చూచెను. అది చూచి వారిని విడుదల చేయుటకు ఆశపడ్డారు.
ఆయనకుండిన ప్రేమలో నుండి పుట్టిన కోర్కె చాలా బలంగా ఉండెను. మానవులను వారి జీవితాలపై పాపమునకుండిన పట్టునుండి విడుదల చేయుటకు చెల్లించాల్సిన వెల ఎంతైనా చెల్లించుటకు ఆయన సిద్ధపడిరి. మరియు ఆయన మనుష్యులను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన చనిపోవుటకు సిద్ధపడెను. కాబట్టి ఆయన పాపమునకు వ్యతిరేకముగా బలముగా బోధించుటకు హక్కు కలిగియుండెను. మనము మన శరీరములోనుండిన పాపమును తీర్పు తీర్చుకొని దానిని జయించుటకు యిష్టపడక పోయినట్లయితే లేక మనము ఎవరికైతే బోధిస్తున్నామో వారి పాపముల నుండి రక్షించుట కొరకు చనిపోవుటకు (అవసరమైతే) మనము యిష్టపడకపోయినట్లయితే మనకు పాపమునకు వ్యతిరేకముగా మాట్లాడు హక్కులేదు. ఇది ప్రేమ కలిగి సత్యము చెప్పుట (ఎఫెసీ 4:15) అనుదానికి అర్థము.
మనము మాట్లాడు మాటలో నుండిన ప్రేమతో కూడిన వెచ్చదనము దేవుని మహిమ కొరకు ఇతరులలో ఫలమును ఫలింపచేయును. ఉత్తర, దక్షిణ దృవములలో కావలసినంత వెలుతురుండినా అక్కడ వెచ్చదనము లేకపోవుటను బట్టి, అక్కడ ఏమీ మొలవదు.
యేసుప్రభువు మనుష్యులకు మరియు వస్తు సామాగ్రికి మధ్య నుండిన విలువలను తేటగా చూచారు. మనుష్యులు ప్రేమింపబడుటకు, వస్తు సామాగ్రి ఉపయోగింపబడుటకును సృష్టింపబడెనని ఆయన యెరిగియుండెను. అయితే పాపము యొక్క వక్రమైన ప్రభావము వలన, క్రమము వెనుకది ముందు, ముందుది వెనకకు మారిపోయినది. అందువలన ఒకరి అవసరములకు వాడవలసిన వస్తు సామాగ్రినేమో ప్రేమిస్తున్నారు. ప్రేమించవలసిన ప్రజలనేమో ఉపయోగించుకొనుచున్నారు.
ఆయన వస్తువుల కంటే జనులు ఎంతో ప్రాముఖ్యమైన వారని చూచారు. ఆయన మనుష్యులను ఎంతగా ప్రేమించారంటే ఆయన పూర్తిగా వారితో కలసిపోయి ఆయన మాకు కావాలి అని వారనుకునేటట్లు చూసేవారు. ఆయన వారి యొక్క భారములను పంచుకొనేవారు మరియు ఆయన యొద్ద పీడింపబడు వారికి అవసరమైన దయ గల మాటలు మరియు జీవిత పోరాటములలో ఓడిపోయిన వారికి కావలసిన ప్రోత్సాహకరమైన మాటలు ఉండినవి. ఆయన ఎప్పుడూ ఏ మానవుని పనికిరాని వానిగా చూడలేదు. వారు మొండిగా మొరటుగా నుండినా, వారు విడుదల అవసరమైన ప్రజలు.
మరొక ప్రక్క వస్తువులు, ఆయనకు ఏ విలువలేనివిగా ఉండేవి. వస్తు సామాగ్రి ఇతరులకు లాభదాయకముగా ఉపయోగపడకపోయినట్లయితే వాటికి విలువ ఏమీ లేదు. యేసు ప్రభువు వడ్రంగి కొట్టులోనికి పొరుగువారి చిన్న బిడ్డ ఒకరు వచ్చి అక్కడ ఒక ఖరీదైన వస్తువు దేనినైనా విరుగగొట్టినట్లయితే దాని విషయం యేసు మాత్రము చికాకు పడియుండేవారు కాదు, ఎందుకంటే విరిగిన ఆ వస్తువు కంటే ఆయనకు ఆ బిడ్డ ఎంతో విలువైనవాడు. ఆయన వస్తువులను కాక, జనులను ప్రేమించెను. వస్తువులు జనులకు సహాయపడుటకు ఉపయోగపడవలెను.
పరిశుద్ధాత్ముడు మన మనస్సులను నూతన పరచుట వలన మనము ''అన్ని విషయములను ప్రభువు యొక్క ధృక్పథము నుండి చూచు వారముగా'' (అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు - కొలస్సీ 1:9) ఉందుము. ఒక వ్యక్తిని ప్రేమించుట అనగా అతడిని దేవుడు చూచునట్లుగా - కనికరముతో చూడవలెను.
దేవుడు బహు ఆనందముతో ఆయన ప్రజలయందు ఆనందించును (జెఫన్యా 3:17). యేసు దేవునిఆత్మచేత నింపబడుట వలన ఆయన తండ్రియొక్క సంతోషమును ఆయన బిడ్డలకు పంచెను. అదే ఉద్దేశ్యము, ఆవిధముగా ఎవరి మనసులైతే ప్రజలను దేవుని ధృక్పథము నుండి చూచునట్లు నూతన పర్చబడినవో వారికి కూడా ఉండును. ఇతరుల యెడల యేసుకుండిన ఆలోచనలు ఎప్పుడూ ప్రేమతో కూడిన ఆలోచనలే తప్ప, వారి అనాగరికత లేక వికారతను బట్టి వచ్చే విమర్శతో కూడిన ఆలోచనలు కాదు. అందువలన జనులు ఆయన ఆత్మలో నుండిన చక్కని సువాసనను గ్రహించగలిగిరి మరియు ''సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి'' (మార్కు 12:37). మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు మన హృదయములలో ఇటువంటి ప్రేమను క్రుమ్మరించును (రోమా 5:5).
యేసుప్రభువు ఎప్పుడూ రోగులను, అవసరతలో నున్నవారిని ఆకలితోనుండిన వారిని మరియు కాపరిలేని వారిని చూచి కనికరముతో కదలింపబడేవారు. ఆయన వారి యొక్క దైన్య స్థితిని ఆయనదిగా చేసికొనుటచేత, వారిని ఆదరించగలిగెను. మనము ఇతరుల యొక్క దైన్య స్థితిని ఎంతగా గుర్తించగలమో అంతగా మనము వారిని ఆదరించగలము. యేసు ప్రభువు ఆయన ఊహలలో ఇతరుల యొక్క పరిస్థితులలో ఉండినట్లు ఊహించుకొని వారి సమస్యలను అర్థము చేసికొనుట చేత ఆయన ఇతరుల యొక్క పైకి చెప్పలేని అవసరతలకు బహు సునిశితముగా స్పందిచేవారు. ఆయన ఒకసారి జనులు తమ తోటి అవసరతలోనుండిన వ్యక్తి యెడల కనికరము చూపకుండా కఠిన హృదయము కలిగి ఉండుటను చూచి, ఆయన హృదయములో ఎంతో నొచ్చుకొనెను (మార్కు 3:5).
మనుష్యులతో ఆయనకుండిన సంబంధములలో యేసు ఎప్పుడూ తన విషయంలో తాను చనిపోతూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఆయనతో ఎవ్వరైనా చెప్పిన మాటల వలన కాని లేక చేసిన పనుల వలన కాని అభ్యంతర పడలేదు. లేక ఇతరులు ఆయనకు చేయుదునని చెప్పిన ఏదైనా పని విషయంలో తప్పి పోయినప్పుడు ఆయన దాని గూర్చి ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు, దానికి కారణం ఆయన ఎప్పుడూ వారి యొద్దనుండి ఏమీ ఎదురు చూడలేదు. ఆయన పరిచర్య చేయుటకే వచ్చెను గాని పరిచర్య చేయించుకొనుటకు రాలేదు.
ఆయన ప్రతిదినము ఆయనయొక్క సిలువను భరించుటచేత, యేసు ఎప్పుడూ ఏ ఒక్కరి పైనను, వారెంత అనాగరికముగా నుండినా లేక తెలివి లేకుండా యుండినను చిరాకు పడలేదు. ఇతరుల యొక్క నిదానము కాని లేక అశుభ్రత, క్రమము తప్పిన పద్ధతి మరియు ఇతరులలో నుండిన నిర్లక్ష్యముగాని ఆయన తన సహనమును కోల్పోయేటట్లు చేయలేదు. పరిపూర్ణమైన వాడు చాలా సులువుగా పరిపూర్ణత లేని వారిని అంగీకరించగలడు. పరిపూర్ణత లేనివారు మాత్రమే ఇతరులలో నుండిన అపరిపూర్ణతను భరించలేనిదిగా చూచెదరు. ఇతరుల యెడల మనకుండిన ప్రేమను కనపరచు లక్షణములలో సహనము ఒకటి.
యేసుప్రభువు ప్రేమ యొక్క మహిమను, ఆయన మాటలలో ఆలోచించండి.
యేసుప్రభువు ఎవరిని తక్కువగా చూడలేదు లేక వారిని గాయపరిచే చతురోక్తులను వేయలేదు. అయనెప్పుడూ కుటిలతతో కూడిన బాధపరిచే మాటలను వాడలేదు. ఆయన తన శిష్యుల యొక్క తప్పిదములను వారి వెనుక(వారు లేనప్పుడు) చర్చించలేదు. మూడు సంవత్సరముల కాలములో ఆయన ఎప్పుడూ ఇస్కరియోతు యూదాను మిగిలిన పదునొకండు శిష్యులముందు బహిరంగ పర్చలేదు. చివరకు చివరి రాత్రి భోజనములో కూడా పదునొకండు మంది ఎవరు తమ బోధకుని అప్పగించబోవుచున్నారో ఊహించలేకపోయారు, అది నిజముగా అద్భుతవిషయం.
యేసుప్రభువు ఆయన నాలుకను ఇతరులను ప్రోత్సాహపర్చుటకు మరియు హెచ్చరించుటకు మరియు దాని ద్వారా ఆయన నాలుక దేవునియొక్క చేతిలో ఒక పనిముట్టుగా వాడబడుటకు ఉపయోగించెను. ఆయన, తన యొక్క నాలుకను నలిగిన వారితో ఉపశమింపజేయు మాటలను మాట్లాడుటకు ఉపయోగించెను (యెషయా 50:4) మరియు గర్విష్ఠులను, అహంకారులను తెగ గొట్టుటకు ఖడ్గమువలె ఉపయోగించెను (యెషయా 49:2).
రోమా శతాధిపతి మరియు కానాను స్త్రీ బహిరంగముగా వారి విశ్వాసమును యేసు ప్రభువు ప్రశంసించుట వినినప్పుడు వారెంతగా ప్రోత్సాహపడియుందురు (మత్తయి 8:10, 15:28). పాపములో జీవించు స్త్రీ ఆమె ప్రేమను బట్టి ప్రశంసింపబడినప్పుడు (లూకా 7:47) మరియు బేతనిలో నుండిన మరియ ఆమె త్యాగపూరితమైన అర్పణ గూర్చి ప్రశంసించబడినప్పుడు (మార్కు 14:6) వారు యేసు యొక్క మాటలను ఎప్పుడూ మరిచిపోక యుందురు. యేసు ప్రభువు పేతురు గూర్చి ప్రార్థించుచుందునను నిశ్చయత అతడికి ఇచ్చినప్పుడు పేతురు ఎంతగా బలపడి యుండును (లూకా 22:32). కేవలం కొద్ది మాటలు.
కాని ఎంతబలము మరియు ప్రోత్సాహము అవి యిచ్చాయి. ఇంకా ఎందరో, యేసుప్రభువు పెదవుల నుండి వచ్చిన మాటలను విని వారి నలిగిన ఆత్మలు లేపబడి యుండును. ఎందుకంటే యెషయా 50:4లో యేసు ప్రతిదినము ఆయన తండ్రి యొక్క స్వరము వినుట వలన ప్రతి దినము ఆయన మార్గములో ఎదురైన నలిగిన హృదయము కల వారికి తగిన మాట కలిగియుండెను.
యేసుప్రభువు యొక్క నీతి ఆయన ఒక నిరాశతో నుండిన వానిగా కనిపింప చేయలేదు. ఆయనను ఆనంద తైలముతో అభిషేకించెను (హెబ్రీ 1:9). ఆయన సిలువ వేయబడుటకు వెళ్ళుటకు ముందు, ఆయన పొంగిపొర్లే సంతోషముతో యుండి, తన అపొస్తలులతో, ''......నా సంతోషము మీలో ఉండవలెననియు'' (యోహాను 15:11) చెప్పగలిగెను. ఆయన ప్రతి చోటికి వెళ్ళి సంతోషము లేనివారికి, విషాద పూరిత హృదయము గలవారికి ఆయన సంతోషమును యిచ్చుచుండెను.
ఆయన మనుష్యులందరితో మృధువుగా ఉండి, నలిగిన రెల్లును ఎప్పుడూ విరువక లేక ఒడిగడుతూ మిణుకు మిణుకు మనుచున్న ఒత్తిని ఆర్పక యుండేవాడు (మత్తయి 12:20). ఆయన బలహీనులలో, పాపులలో మంచి విషయములను చూచి ప్రతి వారి గూర్చి మంచిని యోచించేవారు. ఆయనతో ఉండాలని ఎవ్వరైనా కోరుకునే వానిగా ఆయన ఉండేవాడు. ఎందుకంటే ఆయన అర్థము చేసికొనేవాడు, దయగలవాడు మరియు సాధువైనవాడు. కేవలము గర్విష్ఠులు మరియు రహస్యపాపము కలవారు మాత్రము ఆయనను తప్పించుకొనేవారు.
యేసు యొక్క ప్రేమ భావోద్రేకముతో కూడుకొన్నది కాదు.అది ఇతరుల యొక్క ఉన్నతమైన మేలును వెదికేది. కనుక ఆయన అవసరమైనప్పుడు మందలించవలసి వచ్చినట్లయితే అటువంటప్పుడు ఆయన అవసరమైన మందలింపు మాటను ఉపయోగించుటకు వెనుకాడేవాడు కాడు. ఆయనను సిలువ నుండి వెనుకకు త్రిప్పుటకు ప్రయత్నించిన పేతురును ''సాతానా, నా వెనుకకు పొమ్ము'' (మత్తయి 16:23) అను కఠినమైన మాటలతో గద్దించెను.
యాకోబు, యోహానులు ఘనమైన స్థలములు కోరుకున్నప్పుడును మరియు వారు సమరయులపై ప్రతీకారము తీర్చుకోవాలను కొన్నప్పుడును (మత్తయి 20:23, లూకా 9:55) ఆయన గద్దించెను. మరియు ఆయన తన శిష్యులను వారి అవిశ్వాసమును బట్టి ఏడు మార్లు గద్దించెను.
యేసు ఎప్పుడూ సత్యము చెప్పుటకు, చివరకు అది ఇతరులకు నొప్పి కల్గించినా, ఆయన హృదయము వారి గూర్చి ప్రేమతో నిండియున్నది కాబట్టి, ఆయన భయపడలేదు. ఆయన కఠినమైన మాటలు మాట్లాడినట్లయితే, దయగలవాడుగా ఆయనకుండిన పేరు పోతుందేమోనని ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన ఇతరులను తన కంటె ఎక్కువగా ప్రేమించెను. కాబట్టి వారికి సహాయము చేయుటకు తన యొక్క ప్రఖ్యాతిని త్యాగము చేయుటకు కూడా ఇష్టపడిరి. అందుచేత ఆయన మనుష్యులు శాశ్వతముగా నాశనము కాకుండునట్లు సత్యమును చాలా స్థిరముగా మాట్లాడారు. మనుష్యుల యొక్క నిత్య సంక్షేమము ఆయనకు పై అభిప్రాయముల కంటే ఎంతో ముఖ్యముగా నుండెను.
పేతురు యేసు ప్రభువు యొక్క పరిచర్యను ''మేలు చేయుచు సంచరించుచుండెను'' (అపొ.కా. 10:38) అని వర్ణించెను. నిజముగా ఇందులో ఆయన జీవితమంతా ఉన్నది. ఆయన కేవలము ఒక మంచి బోధకుడు మాత్రమే కాదు లేక కేవలం ఆయన ఆత్మలను సంపాదించుటలో మాత్రమే ఆసక్తి కలిగియుండలేదు. ఆయన మానవుని ప్రేమించారు. మరియు ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి చేశారు, అది వారి శరీరములకు మరియు ఆత్మలకు కూడా.
ఆయన శతృవులు, ఆయనను తృణీకార భావంలో ''సుంకరులకు మరియు పాపులకు స్నేహితుడు'' (లూకా 7:34) అని పిలిచిరి మరియు అది ఖచ్చితముగా సరియైనదే. ఆయన సమాజములో ఎంతగానో తృణీకరింపబడిన వారి యొక్క స్నేహితుడుగా ఉండెను.
సమాజములో నుండి వెలి వేయబడిన వారితో స్నేహితునిగా నుండుట మరియు మేలు చేయుచు తిరుగుట ఒక మనిషికి సహజము కాదు. ఒకవేళ అట్లు జరిగినా, అది చాలాసార్లు స్వంతము గూర్చిన ఆలోచనలు ముఖ్యముగా నుండి జరుగును. కాని సమాజము నుండి వెలి వేయబడిన వారి యెడలను మరియు ఎవరూ పట్టించుకొనని వారి యెడలను యేసు యొక్క ప్రేమ నిస్వార్థమైనదియు మరియు స్వచ్ఛమైనదిగా యుండెను.
మనము సంస్కృతిని సంస్కరించుట ద్వారా కాక, కేవలం ఏది స్వభావ సిద్ధమైనదో దానిని చంపుట ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా దేవునిలో నుండి (జీవమును, దేవస్వభావమును) పొందుకొనుట ద్వారా మాత్రమే క్రీస్తు యొక్క స్వభావమును ప్రదర్శించగలము.
యేసుప్రభువు యొక్క ప్రేమ శిష్యులకు సంతోషముతో పరిచర్య చేయునట్లు, వారి కాళ్లు కడిగినటువంటి హీనమైన పనులు చేయునట్లు చేసినది. ఇది వారికి ఆయన యొక్క దీనత్వమును చూపుట కాక, వారిపై ఆయనకుండిన ప్రేమయొక్క స్వభావసిద్ధమైన ప్రవాహముగా నుండెను.
మానవపరమైన మంచితనము మరియు ప్రేమలో తప్పనిసరిగా స్వంత ఘనతను ఎంచుకొనుట లేక మరియొక స్వార్థ పూరితమైన కారణం ఎక్కడో దూరంగా ఉండును. అది దాని ప్రారంభ స్థానములో భ్రష్టమైయుండును. కేవలం దేవుని ప్రేమ మాత్రమే ఏ భ్రష్టత్వము లేకుండా ఉండును. యేసుప్రభువు ఏ విధమైన వ్యక్తిగతమైన లాభము ఆశించి ఏ మంచి చేయలేదు. ఆయన మంచితనము ఎవరైతే ''చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడో'' (మత్తయి 5:45) ఆ తన తండ్రియొక్కస్వభావమును చూపించుటకై యున్నది.
దేవునియొక్క స్వభావము మంచిదై యుండి ఇచ్చుట, ఇచ్చుట, ఇచ్చే స్వభావమై యున్నది. అది ఆయనకు సూర్యుడు ప్రకాశించుట ఎంత సహజమై అంత సహజముగా యున్నది. ఇటువంటి మహిమ యేసుయొక్క జీవితములో ప్రదర్శింపబడినది. ఆయన ఎడతెగక మంచి చేసారు, ఇతరులకు పరిచర్య చేసారు. మరియు ఇతరులకు ఆయన ఇవ్వగలిగినదంతా ఇచ్చారు.
యోహాను సువార్త 13:29 లో ఉండిన మాటలు యేసు ఆయన బహిరంగ పరిచర్యలో ధనాన్ని దేనికి ఉపయోగించుటను శిష్యులు చూచారో చెప్తుంది. యేసు ధనాన్ని రెండు విషయాలకు ఉపయోగించుటను చూచారు. అవి అవసరమైనవి కొనుటకు మరియు బీదల కిచ్చుటకు.
యేసు తన శిష్యులకు ''పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యత'' అని బోధించారు (అపొ.కా. 20:35). ఆయన జీవితము ద్వారా ఒకడు ఈ లోకములో దేవుని కొరకు మరియు ఇతరుల కొరకు, అతడిని మరియు అతడికున్నదానిని వారిని దీవించుట కొరకు జీవితము ఎంతో దీవెనకరము మరియు సంతోషకరమని చూపారు.
యేసు ఎవరికైతే బోధించారో వారి కొరకు ఆయన దు:ఖించారు మరియు ప్రార్థించారు. యెరూషలేము వారు దేవుని వాక్యమును తీసుకొనినప్పుడు ఆయన వారి కొరకు దు:ఖించారు. ఆయన దేవాలయములో వేషధారులను బయటకు వెళ్ళగొట్టుటకు కొరడాని ఝుళిపించుటకు ముందు వారి కొరకు దు:ఖించారు (లూకా 19:41,45). ఎవరైతే దు:ఖిస్తారో వారు మాత్రమే కొరడాను వాడుటకు అర్హులు.
ఈ లోకములో పూర్తి చేయుటకు యేసుప్రభువు కుండిన పని కంటే ముఖ్యమైన పని ఇంకెవ్వరికి లేదు. ఎవరు కూడా 3 సంవత్సరములు బహిరంగ పరిచర్యలో అంతకంటే ఉపయోగకరమైన పనిని కూడగట్టలేదు. నిజమే, ఆయన రాత్రిబంగళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఆశ్చర్యములో ఆశ్చర్యమేమిటంటే ఆయన ఎప్పుడూ తన యొద్దకు వచ్చిన జనులను వరుసగా పంపించుటకు సహాయకులను ఏర్పాటు చేసికొనలేదు. తన శిష్యులు సహాయకులుగా ప్రవర్తించబోయినప్పుడు, ఆయన వారిని గద్దించారు (మార్కు 10:13-15).
ఎవరికంటే కూడా ఆయనకు అద్భుతకార్యములు చేయు పరిచర్య ఎంతో ఎక్కువగా యుండినా (ఇటువంటి పరిస్థితిలోనే చాలా మంది సమయం చాలుట లేదని అనుచుందురు) ఆయన అన్నివేళలా అందరికీ అందుబాటులో యుండెడివారు.
ప్రజల యొక్క అవసరములను తీర్చుట కొరకు చివరకు ఆయన భోజనము తినుట కూడా మాను పరిస్థితి వచ్చినప్పుడు ఆయన బంధువులు ఆయనను పిచ్చివాడనిరి (మార్కు 3:20,21).
యేసుప్రభువు యొద్దకు ఎప్పుడైనా వెళ్లవచ్చని జనులకు తెలియును. అందుచేతనే నికొదెము చాలా రాత్రి అయిన తరువాత, యేసు రోజంతా బోధించి అలసి ఇల్లు చేరిన తరువాత కూడా ఆయనను కలుసుకొనుటకు వెళ్ళెను. ఆ సయమంలో యేసు తనను ఆహ్వానించునని నికొదెమునకు తెలియును. జనులు ఆయన యొద్దకు సహాయము కొరకు పగలు లేక రాత్రి ఎప్పుడు వెళ్ళినా వారు ఆహ్వానింపబడుదురనే ఉద్దేశ్యమును యేసు జనులకు కలిగించారు.
ఒక రోజున సూర్యుడస్తమించిన తరువాత రోగులను ఆయన యొద్దకు పెద్ద సంఖ్యలో తీసుకు వచ్చినప్పుడు, యేసు వారిలో ప్రతి ఒక్కరిపై చేతులుంచెను (లూకా 4:40). అలా చేయుటకు చాలా గంటలు పట్టియుండవచ్చును. కాని సమయము కలిసి వచ్చినట్లు చేయుటకు ఆయన అందరికీ కలిసి గుంపుగా ఒకే ప్రార్థన చేయలేదు. ఆయన వారిలో ప్రతి ఒక్కరిపై ఆసక్తి కలిగియుండిరి మరియు ఆయన ప్రతి వారి యెడల తన ఆసక్తిని చూపెను. అట్లుచేయుట వలన ఆయన యొక్క భోజనము మరియు ఎన్ని గంటల నిద్ర పోతుందనే వాస్తవము ఆయనను వెనకు లాగలేదు.
యేసు ఆయన సమయమును ఆయన స్వంతమైనట్లుగా అనుకొనలేదు. ఆయన ప్రజలకు సంపూర్తిగా ఇచ్చుకొన్నారు. అవసరములో నుండిన ప్రజలు ఆయన సమయాన్ని, ఆయనకు కలిగిన వాటిని, ఆయన సమస్తమును ఆయన నుండి తీసుకోగలిగేవారు (యెషయా 58:10). ఆయన ఇబ్బంది పెట్టబడుటకు యిష్టపడేవారు మరియు ఆయనకు ఇబ్బంది కలుగజేసినప్పుడు లేక ఆయన అంతరంగ వ్యవహారములలోనికి ఎవరైనా చొరబడుటను ఆయన యిబ్బంది పడేవారు కాదు.
ఆయనలో నుండిన దేవునిశక్తి మరియు దేవునిప్రేమ కనికరముతో చుట్టబడియుండుట చేత ఆయన యందు ప్రత్యక్ష పర్చబడిన గొప్ప మానవాతీతమైన వరములు జనులకు ఆశీర్వాదకరముగా నుండెను. ప్రేమ మరియు కనికరములులేని అద్భుతములు, పైన చుట్టబడిన రబ్బరు తొడుగు లేని విద్యుత్తు తీగ వలె (ఆత్మీయ) మరణమును తెచ్చును.
యేసుయొక్క ప్రేమ మరియు అభిమానము ఆయనయొక్క శరీర సంబంధమైన బంధువుల యెడల కూడా చూపబడినది. ఆయనకు పరిసయ్యుల కుండిన 'ప్రభువు పని' అని చెప్పే వక్రీకరింపబడిన ఆలోచన లేదు. వారు ''పూర్తి కాలపు పరిచర్య''లోనికి వెళ్ళిన వారిని, వారు ''తల్లిదండ్రుల కంటే దేవునిని ఎక్కువగా ప్రేమించవలెను'' (మార్కు 7:10-13), కావున తమ తల్లిదండ్రులను పట్టించుకొనకూడదని ప్రోత్సహించుదురు. యేసు సిలువపై మరణించబోయే ముందు, తన తల్లి భవిష్యత్తు కొరకు తగినంత ఆలోచన కలిగియుండెను (యోహాను 19:25-27).
యేసుప్రభువు ఎంతగానో దేవునికొరకు, ఇతరులకొరకు జీవించెను. చివరకు ఆయన చనిపోవునప్పుడు కూడా, ఒక దొంగను రక్షణలోనికి నడిపించుటకు సమయమును కల్పించుకొనెను. సిలువపై వ్రేలాడినప్పుడు, ఆయన తన బాధల గురించి గాని ఇతరులు చేసే హేళనలు మరియు వారి ద్వేషమును ఆయన పట్టించుకొనలేదు గాని ఆయనను సిలువ వేయువారి పాపములు క్షమింపబడవలెనను ఆలోచన ఎక్కువగా కలిగియుండెను (లూకా 23:34).
యేసు ఎప్పుడూ కీడును మేలుతో జయించి యుండెను. ఇతరుల యొక్క ద్వేషపూరిత ప్రవాహములు ఆయన ప్రేమ అనే మంటను ఆర్పలేకుండెను (పరమ 8:7). ఇటువంటి ప్రేమను ఆయన ఆత్మ ద్వారా మనకిచ్చి, దానిని బట్టి మనము కూడా ఒకరినొకరము ఆయన మనలను ప్రేమించినట్లు ప్రేమింపగలుగునట్లు చేసెను (యోహాను 13:34,35; రోమా 5:5) ఆ విధముగా మనము కూడా దేవుని స్వభావమును చూపగలము.
ముందు మూడు అధ్యాయములలో, మనము యేసు ఈ భూమిపై ఎట్లు దీనత్వములో, పరిశుద్ధత మరియు ప్రేమతో జీవించెనో చూచాము.
ఇప్పుడున్న ప్రమాదము, మనము ఈ విషయములలో యేసును అనుకరించుట ద్వారా ఆయన వలె మారవచ్చునని అనుకొనవచ్చును. దేవుని మహిమ యేసును అనుకరించుట ద్వారా కాక, దేవుని స్వభావములో పాలివారమగుట ద్వారా మనయందు ప్రత్యక్షపర్చబడవలెను.
ప్రపంచ చరిత్రలో అనేకమంది క్రైస్తవేతరులు, యేసు యెడల ప్రశంస కలిగియుండి, ఆయన దీనత్వము, పవిత్రత మరియు ప్రేమను అనుకరించుటకు ప్రయత్నించుట ద్వారా మంచి స్థితి పొందారు. కాని అది అగ్నిని రంగులతో బొమ్మగీయుట వంటిదే. కాని అది వేడినివ్వదు.
నకిలీ వజ్రములు చూచుటకు నిజమైన వజ్రముల వలె యుండి, ఒక నిపుణుడు మాత్రమే వాటిలో వ్యత్యాసమును గుర్తు పట్టగలిగేటట్లు ఉండును. అయితే అవి గాజు ముక్కలుగా యుండి సరిపోల్చినట్లయితే ఏ విలువ లేనివిగా ఉండును. మానవుడు అనుకరించుటలో నిపుణుడు - అది చివరకు యేసును అనుకరించుటలో కూడా.
అటువంటప్పుడు ఈ మోసము నుండి ఎట్లు తప్పించుకొందుము? మనము కేవలము యేసును అనుకరించుచున్నామో లేక నిజముగా దేవుని స్వభావములో పాలివారముగా నున్నామో ఎలా తెలియును.
దానికి ఒకే ఒక మార్గమున్నది. అది వాక్యమును ఉపయోగించి మన జీవితములో ఆత్మ సంబంధమైన విషయాల నుండి శరీర సంబంధమైన వాటిని వేరుచేయునట్లు (హెబ్రీ 4:17) పరిశుద్ధాత్మ యొక్క కార్యమును ఒప్పుకొనుట ద్వారా జరుగును. మనము శరీర సంబంధ విషయములను మరియు ఆత్మసంబంధ విషయములను విడదీయనట్లయితే మనము ఎంతగానో మోసపోవుదుము. మరియు అట్లు మోసపోయామని కూడా మనకు తెలియకుండా యుండును. ఈ రోజుల్లో విశ్వాసులు ఎక్కువగా తెలుసుకొనవలసినది, వారి మనసు కుండిన శక్తి, ఉద్రేకములు మరియు ఇష్టము ఏ విధముగా పరిశుద్ధాత్మ యొక్కపనికి ఆటంకముగా ఉండునో అర్థము చేసికొనవలసియున్నది. మానసికమైన మరియు ఆత్మీయమైన కార్యక్రమములను సరిగా గుర్తించకపోయినట్లయితే, మనము మన హృదయముల ద్వారా మోసపోవుటయే కాక దేవుని పనికి నకిళీ తయారు చేయు దురాత్మల చేత కూడా మోసపోవుటకు అవకాశము ఉన్నది.
చాలా మంది విశ్వాసులు మానసికమైన కార్యక్రమములకు ఆత్మీయ కార్యక్రమములకు మధ్యనుండిన వ్యత్యాసము సంపూర్తిగా తెలియని వారుగా ఉన్నారు. దానికి కారణం వారి ఆత్మీయ జీవితము యొక్క పెరుగుదల మానసికమైన దానికి మరియు ఆత్మీయమైన దానికి మధ్యనుండిన వ్యత్యాసము తెలుసుకొనుటపై ఆధారపడినదను విషయం వారు నిజముగా తెలుసుకొనలేదు.
ఒక 9వ తరగతి విద్యార్థికి అవకలన గణితము(ణఱటటవతీవఅ్‌ఱaశ్రీ షaశ్రీఱషబశ్రీబర)కు సమాకాలన గణితము (Iఅ్‌వతీస్త్రతీaశ్రీ జaశ్రీఱషబశ్రీబర) కు మధ్యనుండిన వ్యత్యాసము ఏమీ తెలియక పోవచ్చును (రెండూ ఒకటే అనుకోవచ్చు కూడా). దానికి కారణం తరువాత పాఠ్యాంశములో ప్రగతి ఈ రెండు రకాలైన గణితముల యొక్క తేడా తెలుసుకొనుటపై ఆధారపడియున్నదన్నంత లోతైన పాఠ్యాంశము యొద్దకు ఇంకను రాకపోవటమే.
నీవు న్యాయవంతుడవుగా మరియు దయగలవాడవుగా మరియు సాధువైన వాడవుగా మరియు కనికరము కలవాడవుగా పిలువబడుటలో సంతృప్తి చెందినట్లయితే, నీవు కేవలము ఒక ''మానసిక అనుభూతులతో'' నిండిన క్రైస్తవుడుగా నుండి, యేసును అనుకరించుట నుండి దాటి వెళ్లనివాడవుగానే యుండి యుందువు.
పౌలు క్రైస్తవులను మూడు తరగతులుగా విభజించాడు.
1. ఆత్మీయమైన మనుష్యుడు (1కొరింథీ 3:1)
2. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు (1కొరింథీ 2:14)
3. శరీర సంబంధమైన మనుష్యుడు (1కొరింథీ 3:1).
ఇది 1 థెస్సలోనీకయులకు వ్రాయబడిన పత్రికలో 5:23లో చెప్పబడిన ఆత్మ, ప్రాణము మరియు శరీరము అను మానవునిలో నుండిన మూడు భాగములకు సమానముగా ఉన్నది.
మనమెప్పుడైతే మన శరీర కోర్కెలచే పాలింపబడుదుమో అప్పుడు మనము శరీరమునకు సంబంధించిన వారము. అయితే మనము ఆ కోర్కెలను జయించిన తరువాత కూడా మనము ప్రకృతి సంబంధియైన వానిగానే యుందుము. అప్పటికిని మన మనస్సు మరియు ఉద్రేకముల యొక్క కోర్కెలచే పరిపాలింపబడుచుందుము. ఒక ఆత్మ సంబంధియైన మనుష్యుడు పరిశుద్ధాత్మ చేత పాలింపబడి అతడి మనసు మరియు శరీరము ఆత్మ యొక్క అదుపులో యుండును.
ప్రకృతి సంబంధమైన మనుష్యుడు శరీర సంబంధమైన మనుష్యునివలె దేవునికి విరోధిగా ఉండక పోయిననూ, అతడు ఆత్మీయ విషయములను అర్థము చేసికొనలేదు లేక పొందుకొనలేదు ( 1కొరింథీ 2:1-4). అతడియెదుట జీవాత్మలను విడదీసి చూపినను అది వెఱ్ఱితనముగాను అనవసరముగ చిన్న విషయములను పెద్దదిగా చేస్తున్నట్లును అన్పించును, ఎందుకనగా అతడు ప్రకృతి సంబంధియై యుండి, అతడు మనుష్యుల యెదుట మంచి సాక్ష్యము కలిగియుండుట చేత ప్రకృతిసంబంధిగానే యుండుటలో సంతృప్తి కలిగియుండెను. ఎవడైతే మనుష్యుల యెదుట ఘనతను కోరుకొనునో అతడు ప్రకృతి సంబంధమైన స్థితి నుండి ముందుకు వెళ్లడు.
ఈ దినాల్లో అనేకమైన స్వరములు మరియు బయటకు కనపడు విషయములు, అన్నీ దేవుని నుండి వచ్చినవే అని చెప్తూ క్రైస్తవ సంఘమును మోసముతో ముంచెత్తుచుండగా, మనము దుష్టుని యొక్క ఉరుల నుండి తప్పించుకొనవలెనంటే, ఇంతకు ముందెన్నడు లేనంతగా ఇప్పుడు మనము ప్రకృతి సంబంధమైన కార్యక్రమములకును మరియు ఆత్మ సంబంధమైన కార్యక్రమములకు మధ్య తేడాను తెలుసుకొనుట అవసరమై యున్నది.
''ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను'' (1కొరింథీ 15:45).
మొదటి ఆదాము అధికారము నుండి విడుదల చేయబడి క్రీస్తు యొక్క అధికారము క్రిందకు బదిలీ చేయబడిన మనము, ప్రకృతి సంబంధముగా జీవించుటమాని ఆత్మలో జీవింపవలసియున్నది.
మన మాంసములో నుండిన శరీర సంబంధైన మూలమును కదులాడకుండా తక్కువ అసహ్యముగా కనబడినా, అది కూడా ఆత్మీయ జీవితమునకు ప్రమాదకరమైనది మరియు దానిని తీసివేయవలసి యున్నది. మనము ప్రతిదినము పాపపుశక్తినుండి మాత్రమే కాకుండా విరామమెరుగని కార్యక్రమముల నుండి కూడా మన ప్రాణములకు రక్షణను వెదుక్కోవలసి యున్నది.
ప్రకృతి సంబంధమైన మనుష్యులు యేసుప్రభువు కొన్ని సమయములలో ఎందుకు కొన్ని మాటలు మాట్లాడారో అర్థము చేసికొనలేరు.
ఒకసారి ఆయన జనుల మధ్యనుండగా, ఆయన తల్లి అన్నదమ్ములు ఆయనను కలుసుకొనుటకు వచ్చిరని ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన తన శిష్యులను చూపించి వారే తన తల్లియు, బంధువులని చెప్పారు (మత్తయి 12:49,50).
ఆయన అట్లు చెప్పుట ఆలోచనలేని మాటయని ఆయన బంధువులు మరియు ఇతరులు అనుకొనియుండవచ్చును. కాని యేసు తన బంధువులతో ఏ విధమైన ప్రకృతి సంబంధమైన బంధము పెట్టుకొనుటకు ఇష్టపడలేదు.
ఆయన పేతురును ''సాతానా, నా వెనుకకు పొమ్ము'' అనినప్పుడు, ఆయనెందుకు పేతురును అంత కఠినముగా గద్దించారో అర్థము చేసికొనియుండరు.
ప్రకృతి సంబంధమైన వారు ఎప్పుడూ అటువంటి మాటలనరు, ఎందుకనగా వారు ఎప్పుడూ ఇతరులు వారిని ఏమనుకుందురో అని ఆలోచించుదురు.
మనము శరీరములో నుండిన పాపములను జయించి యుండవచ్చును. కాని మనము మానవులుగా ప్రకృతి సంబంధమైన జీవితమునకు అందుబాటులో నుండిన వనరులను బట్టి యేసువలె జీవించుటా లేక దేవుని జీవము యొక్క శక్తిని బట్టి జీవించుట అనునది యిప్పటి ప్రశ్న.
మనము మనకుండిన స్వంత సామర్థ్యములను బట్టి పరిపూర్ణులుగా చేయబడుదుమా లేక పరిశుద్ధాత్మ వలననా (గలతీ 3:3).
ప్రకృతి సంబంధమైనది ఆత్మీయజీవితము యొక్క ఎదుగుదలను ఆటంకపర్చును. పేతురు యేసును సిలువ నుండి ప్రక్కకు త్రిప్పుటకు ప్రయత్నించినప్పుడు, అతడు అది క్రీస్తు యేసుపై నుండిన మిక్కుటమైన మానవ ప్రేమతో అట్లు చేసెను. కాని యేసు ప్రభువు దానిని సాతాను స్వరముగా గుర్తించెను. ఆయన పేతురుతో ''నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావు'' (మత్తయి 16:23) అనెను. ప్రకృతి సంబంధియైన క్రైస్తవుని యొక్క ఆలోచనా తీరును ''ఆదాము యొక్క జీవితము'' నడిపించును. అందులో తీవ్రమైన మానవ ప్రేమ మరియు నీతి కొరకైన ఆశ కూడా యుండవచ్చును. కాని అది దైవికమైనదికాదు.
దేవుడు మానవుని సృష్టించినపుడు, ఆయన అతడిని ఆత్మ, ప్రాణము మరియు శరీరముగా చేసెను (1థెస్స 5:23). మానవుడు దేవుని ఆలయముగా నుండునట్లు చేయబడెను. దేవుడు మోషేకు గుడారము యొక్క మాదిరిని ఇచ్చినప్పుడు, ఈ మూడు కలిసిన విధము అందులో చూడగలము, ఎందుకంటే అది మానవుడు దేవుని నివాస స్థలముగా చూపించును.
గుడారము మూడు భాగములుగా యున్నది. ఒక భాగము ఆవరణము, ఇది బయటకు కనబడు మానవుని శరీరమునకు సమానముగా ఉన్నది. తదుపరి రెండు భాగములైన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము కప్పబడి యుండును. ఇవి మానవునిలో కనిపించని భాగములైన ప్రాణము మరియు ఆత్మగా యున్నవి.
అతిపరిశుద్ధ పరిశుద్ధ
స్థలము స్థలము ఆవరణము
(ఆత్మ) (ప్రాణము) (శరీరము)
దేవునియొక్క సన్నిధి అతి పరిశుద్ధ స్థలములో యుండెను. అక్కడనుండి ఆయన మానవునితో మాటలాడును. మనము నూతనముగా జన్మించినప్పుడు, మన ఆత్మను పరిశుద్ధాత్మ జీవింపజేసి, దేవుని ఆత్మతో ఏకమగునట్లు చేయును (1కొరింథీ 6:17). అది ఒక భర్త, భార్య ఒక శరీరమగునట్లుండును. ఈ విషయములో దేవుడు మన విడుదల పొందిన ప్రాణమును మరియు శరీరమును ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిపాలించాలని అనుకొనెను. ఈ విషయమును మనము అర్థము చేసికొని మన యెడల దేవుని యొక్క ఈ ఉద్దేశములో ఆయనకు లోబడినట్లయితే, మనము ఆత్మ సంబంధమైన మనుష్యులముగా అగుదుము.
మానవుని యొక్క ప్రాణము (ూూఖకూ) లో మనసు (ఆలోచన చేయుశక్తి) ఉద్రేకములు (భావనా శక్తి) మరియు అతడి చిత్తము (నిర్ణయించుకొనే శక్తి) యుండును. వీటిలో దేని ద్వారా కూడా మానవుడు దేవునితో సంబంధం కల్పించుకొనలేడు, ఎందుకనగా దేవుడు ఆత్మయై యున్నాడు (యోహాను 4:24).
భౌతికప్రపంచమును ఏవిధముగా శరీరముతో తాకవచ్చునో, అదే విధముగా ఆత్మ ప్రపంచములో ఆత్మ ద్వారా మాత్రమే సంబంధమేర్పరచుకొనవచ్చును. మనము ప్రకృతి సంబంధమైనదేదో ఆత్మ సంబంధమైనదేదో బేధాన్ని గుర్తించకపోయినట్లయితే, మనము ప్రకృతి సంబంధమైన విషయములకు సంబంధించి పరిశుద్ధాత్మ ముసుగులో సాతాను చేసే నకిళీలను బట్టి మోసపోవుదుము.
మన ప్రాణముద్వారా మనము దేవునిని తెలుసుకొనలేము. దేవునిని తెలుసుకొనుటలో ఒక చురుకుతనము లేని మనసుకంటే తెలివైన మనసుకు ఏ విధమైన ఎక్కువ ప్రయోజనము లేదు. మానవుడు ఆత్మలో ఏమి పొందుకొనుచున్నాడను విషయములో అతడి ప్రాణము యొక్క సామర్థ్యము అతడికి ఏమీ ప్రత్యేక ప్రయోజన మివ్వదు. ఆత్మ, ప్రాణము పూర్తిగా వేరైనవి. కనుక ఒకని ప్రాణము ద్వారా దేవుని తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఒకని చెవితో చూచుటకు ప్రయత్నించుటంత తెలివి తక్కువైనది.
మనము లేఖనములను ఎలా ధ్యానిస్తామో ఆలోచించండి. మనము దేవుని వాక్యమును చదువునప్పుడు మన శరీరమును (కళ్లు) మరియు మన ప్రాణము (మనసు)ను ఉపయోగించుదుము. అయితే పరిశుద్ధాత్మ వాక్యముయొక్క ఆ భావము గూర్చి మనకు ప్రత్యక్షత ఇవ్వక పోయినట్లయితే, మన ఆత్మ మధ్యరాత్రి చీకటి వలె నుండును. బైబిలు జ్ఞానము నీకు ఒక మంచి అర్థము చేసికొనగలిగే మనసు మరియు శక్తి గల ప్రాణము ఉందని మాత్రమే ఋజువు చేస్తుంది. అయినప్పటికిని నీ ఆత్మ ఇంకను గ్రుడ్డితనముతోనే యుండవచ్చును. దేవుడు ఆయన సత్యమును జ్ఞానులకును, వివేకులకును మరుగుపరిచి, దీనులకు దానిని బయల్పర్చును (మత్తయి 11:25). యేసు ప్రభువు జీవించియున్న కాలమందలి వేదాంతుల యొక్క గ్రుడ్డితనమే దానికి తేటయైన ఋజువు (1కొరింథీ 2:7,8).
మన ఉద్రేకములు కూడా ప్రకృతి సంబంధమై ప్రాణములో ఒక భాగమే, ఉద్రేకముచేత దేవుడు దగ్గరగా ఉన్నట్లు అనుకొనలేము. పొంగి వచ్చే మానసిక ఉద్రేకములు ఆత్మీయతకు ఋజువు కాదు, కాని అవి కేవలం మనలోని ప్రకృతి సంబంధమైన ప్రాణము యొక్క ఉత్తేజము మాత్రమే. ఇవి ఒకనిలో పదునైన తెలివితేటలతో పాటు పాపము ఎలా కలిసి ఉండునో అట్లే ఒకనిలో ఈ ఉద్రేకములు లోతైన పాపముతో పాటు ప్రక్క ప్రక్కన కలిసి ఉండవచ్చును.
కర్మేలు పర్వతముపై బయలు దేవత యొక్క ప్రవక్తలు ఎంతో ఉద్రేకపూరితముగా ఉండి, కేకలు వేస్తూ పిచ్చిగా గంతులు వేస్తూ, నాట్యమాడారు (1రాజులు 18:26-29), కాని వారు ఆత్మీయమైన వారుగా లేరు. అటువంటి భావ ప్రకటనలు ఎంతో ఉద్రేక పూరితమైన క్రైస్తవ కూటములలో కూడా ఉండును. కాని వాటికీ ఆత్మీయతకూ సంబంధమేమీ లేదు.
ఇస్కరియోతు యూదా శిష్యులందరిలో తెలివైన వాడగుటకు అవకాశమున్నది. కాని అతడి ప్రకృతి సంబంధమైన ప్రాణమునకుండిన శక్తులు దేవుని యొక్క సత్యమును తెలిసికొనుటకు అతడికి ఏ మాత్రమును సహాయపడలేదు. యెరూషలేములో నుండిన వేదాంత పండితులు, చదువేమీ లేని సీమోను పేతురు అర్థము చేసికొనిన దేవుని ప్రత్యక్షతను (మత్తయి 16:17) అర్థము చేసికొనలేకపోయారు.
మనము దేవునిని మనకుండిన ప్రకృతి సంబంధమైన ప్రాణము యొక్క శక్తితో అర్థము చేసికొనలేము. ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు అట్లు చేయుటకు ప్రయత్నించును.
ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు దీనుడుగా కనబడును, కాని అతడెప్పుడూ అతడి దీనత్వము గురించి ఎరుకలేక ఉండును. నిజమైన దీనత్వము దాని గూర్చి ఏ మాత్రము ఎరుక లేకయుండును. ఒక ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు దీనుడుగా కనబడుటకు కొంత ప్రయత్నించవలసి యుండును. అయితే నిజమైన దీనత్వము ఎప్పుడూ అంతరంగము నుండి వచ్చుట చేత ప్రేరేపణ లేకుండా మరియు ప్రయత్నమేమీ లేకుండా యుండును.
ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు నీతి కొరకైన ఆసక్తి కలిగి యుండినట్లు కనబడును. అతడు తననొక ప్రవక్తగా ఊహించుకొని కొరడా తీసుకొని జనులను గుడిలో నుండి బయటకు తరుమ వచ్చును. మరియు పాపమునకు వ్యతిరేకముగా ఉరుములు ఉరుమవచ్చును. కాని అతడు చేసిన పనులను బట్టి మనుష్యులలో గౌరవమును కోరుకొనును. అతడి యొక్క ఒక కన్ను ఎప్పుడూ మనుష్యుల అభిప్రాయములపై యుండును. దీనిలో ఇంకా సూక్ష్మమైన కుయుక్తి కలిగిన వేరు వేరు పద్ధతులుండును. ఒకడు ''నా గురించి ఎవరేమనుకొనినా నేను లెక్కచేయను'' అనవచ్చును. కాని నిజానికి ఇతరుల అభిప్రాయములను అతడే మాత్రము లెక్కచేయడని ఇతరులు తెలిసికోవాలని కోరుకొనుటలోనే అతడి మనస్తత్వం తెలుస్తుంది.
ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు గొప్ప కనికరము కలిగియున్నట్లు కూడా కనబడును. కాని అది ఎల్లప్పుడూ మానవ రీతిలోను మరియు అజ్ఞానముతో కూడినదిగా యుండును. ఉదాహరణకు ప్రేమగా ఉండాలని, అతడు ఒక అవసరతలో నుండిన వానికి క్రమంగా సహాయము ఏదొక రూపేణా పంపుతూ యుండవచ్చును. అయితే ఆ సహాయము అందుకొనే వాడు నిజానికి ఒక తప్పిపోయిన కుమారుడై యుండి దేవుని చేత క్రమశిక్షణ పొందుచున్న వాడై యుండవచ్చును. అటువంటప్పుడు ఆ సహాయము నిజానికి అతడు దేవుని తట్టు తిరుగుటకు ఒక ఆటంకముగా యుండును. ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు నిజానికి తన ప్రేమతో కూడిన కార్యముల వలన సాతాను ఉద్దేశ్యములను నెరవేరుస్తున్నానని తెలుసుకొనక, దేవుని సేవ చేస్తున్నానని ఊహించుకొంటూ సంతృప్తిపడును.
పైన చెప్పినవి ఇంకా ఎన్నో విషయములలో కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఇది ప్రకృతిసంబంధమైన కార్యక్రమములకు మరియు ఆత్మీయమైన కార్యక్రమములకు మధ్యనున్న తేడాను చూపుటకు సరిపోవును.
మానవ ప్రయత్నంతో (ప్రకృతి సంబంధమైన) వచ్చిన ఫలములు ఆత్మ ఫలముల వలె కనబడును. అందువలన అనేకులు మోసపోవుదురు. మనకు మనము కూడా మోసపోవుదుము.
ప్లాస్టిక్కుతో తయారుచేయబడిన కమలాలు, అరటి పండ్లు భోజన బల్ల యొద్ద కూర్చొనిన అనేకమంది పొరపడునట్లు చేయును. అవి కేవలము అలంకారమునకు మాత్రమే తప్ప అవి తినుటకు పనికిరావు. అదే విధముగా క్రీస్తు సుగుణములను అనుకరించిన మానవ ప్రయత్నముండును.
ఇంతవరకు చెప్పిన దానిని బట్టి మనప్రాణము ఉపయోగము లేనిదని అనుకోకూడదు. దేవుడే మానవుని యొక్క ప్రాణమును సృష్టించాడు మరియు దానికి ఒక పనిని నిర్ణయించెను. మనము మన మనసును మరియు మన ఉద్రేకములను ఉపయోగించవలెను. కాని నిజమైన ఆత్మీయత మనలను మనము దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనులుగా తగ్గించుకొని మన యిష్టమును (ఇది మన ఆత్మ యొక్క ద్వారము) సంపూర్తిగా దేవునికి లోబరుచుకొనుటలో ప్రారంభమగును. మన చిత్తమనే ఈ తలుపునకు బయట నిలువబడి, లోపలకు వచ్చుటకై యేసుప్రభువు తలుపు తట్టుచుండెను (ప్రకటన 3:20).
యేసుప్రభువు మాంసపు శరీరముతో ఉండినప్పుడు ''నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక'' అని చెప్పినట్లు మనమూ చెప్పుటకు యిష్టపడినట్లయితే, అప్పుడు మాత్రమే మనమును యేసు జీవించినట్లు జీవించగలము. అప్పుడు మనలో నుండిన జీవము దేవుని ఆత్మకు సేవకుడగును. మరియు అప్పుడు మన శరీరము కూడా పరిశుద్ధాత్మ అదుపులోనికి వచ్చును. అటువంటి వాడు మాత్రమే ''ఆత్మీయమైన మనుష్యుడు'' లేక ''ఆత్మ చేత నింపబడినవాడు'' అని పిలువబడును.
క్రైస్తత్వములోనికి మారుట, ఆత్మలో బాప్తిస్మము పొందుట మరియు ఆత్మ వరములను కలిగియుండుట ఒక వ్యక్తిని ఆత్మీయమైన వానిగా చేయదు. ఆ విషయాన్ని కొరింథీ క్రైస్తవుల విషయంలో తేటగా చూడగలము. వారు ఆత్మవరములన్నిటిని వినియోగించియుండిరి. అయినప్పటికిని వారు శరీరము యొక్క పాపములో బంధింపబడియుండి, వారి కుండిన వివేకముతో కూడిన జ్ఞానమును బట్టియు ఉద్రేకములతో కూడిన అనుభవాలను బట్టియు గొప్పతనముతో నుండిరి. వారు ఆత్మీయమైన వారు కాదు.
మనము దీనిని ప్రత్యక్ష గుడారము విషయంలో చూచాము. దేవుని యొక్క సన్నిధి అతిపరిశుద్ధ స్థలములో నుండెను. పరిశుద్ధ స్థలమునకును అతిపరిశుద్ధ స్థలమునకును మధ్య ఒక దళసరి తెర వ్రేలాడుచుండెను. దేవుని యొక్క మహిమ పరిశుద్ధ స్థలములోనికి ప్రకాశించకుండునట్లు ఇది అడ్డుకొనుచున్నది. తెర మాంసపు శరీరమునకు సూచనగాయున్నది (హెబ్రీ 10:20) మన మాంసపు శరీరము సిలువ వేయబడినప్పుడు (తెర చినుగుట) దేవుని మహిమ మన వ్యక్తిత్వమంతటిలోనికి (మన ప్రాణములోనికి) ప్రకాశించును(ప్రసరించును).
మన కొరకు యేసు తన శరీరము ద్వారా తెరచిన నూతనమైనదియును జీవము గలదియునైన మార్గము గుండా మనము నమ్మకముగా నడిచినట్లయితే, అప్పుడు దేవుని యొక్క జీవము మన వ్యక్తిత్వము ద్వారా ప్రసరించి మనలో ఇంకా ఇంకా ప్రత్యక్ష పర్చబడును.
అప్పుడు ''పట్టపగలగువరకు(క్రీస్తు తిరిగివచ్చుట) వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' (సామెతలు 4:18) అని చెప్పబడిన వాక్యము నెరవేరును.
ఆ విధముగా మనము యేసు వచ్చేనాటికి పూర్తిగా ఆయన వలె మారు వరకు (1యోహాను 3:2) మనలను మహిమ నుండి అధిక మహిమలోనికి మార్పు చెందునట్లు (2కొరింథీ 3:18) పరిశుద్ధాత్ముడు చేయును.
యేసుప్రభువు ఎప్పుడూ ఆయన స్వంత ఇష్టమును చేయలేదని మనము చూచితిమి. వేరొక విధముగా చెప్పవలెనంటే, ఆయన ఎప్పుడూ తన స్వంత మనసును బట్టి కాని లేక ఆయన యొక్క ఉద్రేకములను అనుసరించి కాని జీవించలేదు. ఆయన ఆత్మలో జీవించారు మరియు ఆయన మానవ ప్రాణము పరిశుద్ధాత్మకు సంపూర్తిగా లొంగిపోయి యుండెను. యేసు క్రీస్తు ప్రభువు తన మనస్సును మరియు భావోద్వేగములను ఎక్కువగా ఉపయోగించాడు. కాని తన జీవితమునకు ప్రభువైన పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ సేవకులుగానే వాటిని ఉపయోగించాడు. ఆ విధముగా దేవుని యొక్క మహిమ ఏ విధముగా ఆటంకము లేకుండా సంపూర్ణముగా ఆయన ద్వారా ప్రకాశించెను(ప్రసరించింది).
యేసుప్రభువు ఈ భూమి పైకి తిరిగి వచ్చినప్పుడు మన జీవితము మరియు ప్రయాస (క్రియలు) అగ్ని ద్వారా పరీక్షింపబడునని బైబిలు చెప్పుచున్నది (1కొరింథీ 3:10-14). మన పని మానవ ఆసక్తితో కూడినదో లేక ఆత్మీయమైనదో అగ్నిపరీక్ష నిర్ణయించును. అగ్నిలో బూడిదైపోయే కర్ర, గడ్డి, కొయ్య కాలుతో కాక నిలువగలిగే బంగారము, వెండి మరియు వెలగల రాళ్లతో నిర్మింపమని మనము హెచ్చరింపబడినాము.
బంగారము, వెండి మరియు వెలగల రాళ్లుతో కట్టడమనగా ఏమిటి?
రోమా 11:36 మనకు జవాబిస్తుంది. అక్కడ అన్ని విషయములు ''దేవుని మూలమున ఆయన ద్వారా మరియు ఆయన నిమిత్తము'' అని చెప్పబడినది.
సృష్టి అంతా దేవునిలో ప్రారంభింపబడి, ఆయన శక్తిచేత నిలువ బెట్టబడి ఆయనను మహిమపర్చుట కొరకైయుండెను. కాని సాతాను మరియు మానవుడు ఈ చట్టమును ఉల్లంఘించెను.
ఏది ఏమైనప్పటికి, దేవుని మూలమునను, దేవుని శక్తి చేతను చేయబడి, దేవుని మహిమ కొరకు ఉండినది మాత్రమే నిత్యమైనది, మిగిలినదంతా, క్రీస్తు న్యాయసింహాసనము యొద్ద అగ్నిలో బూడిదైపోయి నాశనమగును.
కనుక మానవుని యొక్క జీవము మూలమున, మానవశక్తిద్వారా చేయబడి, మానవుని యొక్క ఘనత కొరకైనది, అది క్రైస్తవ పనిగా పిలువబడినా అది కర్ర, గడ్డి మరియు కొయ్యకాలునై యున్నది.
వేరొక ప్రక్క దేవుని మూలమున మరియు ఆయన శక్తి చేత చేయబడి, ఆయన మహిమ కొరకైనది తీర్పుదినమున బంగారము, వెండి మరియు వెలగల రాళ్లుగా యుండును.
చివరి దినమున పరీక్ష మన పని యొక్క పరిమాణము కాక నాణ్యతను పరీక్షింపబడు పరీక్షగా యుండును. మనము నిర్మించిన ఆకారము యొక్క పరిమాణము కాక అందుకు వాడిన వస్తువులు గురించిన వివరములు ముఖ్యమైనదిగా యుండును. మన ప్రయాసముల యొక్క మూలము, శక్తి మరియు ఉద్దేశము మనము ఎంత చేసాము లేక ఎంత త్యాగము చేసాము అనుదానికంటే ఆ దినమున ఎంతో ప్రాముఖ్యముగా చూడబడును.
మానవ ప్రాణముననుసరించి కాకుండా ఆత్మలో జీవించు విషయంలో యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉండెను. ఆయనెప్పుడు తనకు తానుగా గాని లేక ఆయనకు మానవునిగా యుండిన సామర్థ్యమును బట్టిగాని లేక ఆయన స్వంత గొప్పతనము కొరకు గాని ఏమీ చెయ్యలేదు. ఆయనెప్పుడూ దేవుని మూలమైనది మరియు దేవుని శక్తితో మరియు దేవుని మహిమ కొరకు మాత్రమే చేసారు. ఆయన తన శిష్యులతో పలుమార్లు ''ఎవడైతే తన ప్రాణమును కాపాడుకొనునో అతడు దానిని పోగొట్టుకొనును; కాని ఎవడైతే తన ప్రాణమును నా కొరకు పోగొట్టుకొనునో అతడు దానిని కాపాడుకొనును'' అని చెప్పెను. ప్రాణమును ద్వేషించుట కొరకు యేసు చెప్పిన మాటలు నాలుగు సువార్తలలో ఏడుమార్లు మరల మరల వచ్చును (మత్తయి 10:39, 16:25; మార్కు 8:34; లూకా 9:24, 14:26, 17:33; యోహాను 12:25).
నాలుగు సువార్తలలో ఏడుమార్లు మరల మరల వచ్చుట సరియైనదిగా పరిశుద్ధాత్ముడు చూచినట్లయితే తప్పకుండా యేసు బోధించిన వాటిలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనదై యుండును. అయినప్పటికి చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే యేసు ఎందుకు చెప్పారో అర్థము చేసికొందురు.
మన జీవితాల్లో ఏది మానవ ప్రాణమునకు సంబంధించినదో ఏది ఆత్మీయమైనదో మన మెట్లు వేరు చేయగలము? దీనికి జవాబు: పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన వాక్యమైన లేఖనములు మనకు ప్రత్యక్షపర్చబడుటను బట్టి, జీవింపజేసే వాక్యమైన యేసును చూచుట ద్వారా కనుగొనగలము.
మనలను మనము మన స్వంత ప్రాణము యొక్క వెలుగును బట్టి కాక, దేవునియొక్క వెలుగును (కీర్తన 36:9) బట్టి తీర్పు తీర్చుకొనవలెను. ఆ వెలుగు యేసులోను (యోహాను 8:12) మరియు దేవుని వాక్యములోను (కీర్తన 119:105) దొరకును.
వాక్యము శరీరధారియై వచ్చిన యేసు ''నా యొద్ద నుండి నేర్చుకొనుడి....మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును'' (మత్తయి 11:29) అని చెప్పారు.
''దేవుని వాక్యము ప్రాణాత్మలను విభజించి శోధించును'' (హెబ్రీ 4:12 సంక్షిప్తముగా).
కనుక మనకు మాదిరి (ముందుగా పరిగెత్తిన)యైన యేసు వైపు మరియు మనకు దారి చూపుటకు దేవుని వాక్యము వైపు ఈ విషయములో మనము వెలుగు కొరకు చూడవలసియున్నది. పరిపూర్ణత యేసుయొక్క ఈ లోకపు జీవితములోనూ మరియు దేవుని వాక్యములోను దొరుకును. కనుక వీటివైపు మనము జాగ్రత్తగా చూద్దాము.
''సమస్తమును ఆయన మూలమున కలిగినవి'' (రోమా 11:36).
ఆత్మ విషయమై దీనులైన వారిది పరలోక రాజ్యమని యేసు చెప్పెను (మత్తయి 5:3). ఎవరైతే తండ్రి చిత్తమును నెరవేర్చుదురో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశింతురని కూడా చెప్పెను (మత్తయి 7:21). దేవుని రాజ్యము నిత్యమైనది మరియు దేవుని చిత్త ప్రకారము చేయబడినవే అక్కడ ఉండును. ఆత్మలో దీనులైన వారు ఎప్పుడూ వారి యొక్క మానవ పరమైన లోటు నెరిగియుండుట చేత సంపూర్తిగా దేవుని చిత్తముకు లోబడియుందురు.
ఈ విధముగా చూచినట్లయితే యేసు ప్రభువు ఎప్పుడూ ఆత్మ విషయంలో దీనుడుగా ఉండెను. దేవుడు మానవుణ్ణి ఎట్లు జీవించాలని ఉద్దేశించారో - అది దేవునిపై నిరంతరం ఆధారపడియుండేటట్లు, దేవునికి వేరుగా ఆయన మనస్సు యొక్క శక్తులను ఉపయోగించుటకు తిరస్కరిస్తూ జీవించారు. ఆయన మాటలను ఆలోచించండి.
''కుమారుడు తనంతట తాను ఏమియు చేయడు...నా అంతట నేను ఏమియు చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను...నా అంతట నేనే వచ్చి యుండలేదు, ఆయన నన్ను పంపెను...నేనేమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు...నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు; తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు'' (యోహాను 5:19,30; 8:28,42; 12:49;14:10).
యేసు ఎప్పుడూ అవసరమును చూచుట వలన వెంటనే ఏపని చేయలేదు. ఆయన అవసరమును చూచి, దాని గూర్చి పట్టించుకొనేవారు, కాని ఆయన తండ్రి చెప్పిన తరువాత మాత్రమే ఆయన ఏమైనా చేసేవారు.
లోకము రక్షకుని గూర్చి ఎంతో అవసరతతో యుండగా, ఆయన పరలోకములో కనీసము నాలుగు వేల సంవత్సరములు ఆయన వేచియుండి, అప్పుడు ఆయన తండ్రి ఆయనను పంపినప్పుడు ఆయన భూమిపైకి వచ్చెను (యోహాను 8:42). ''అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తనకుమారుని పంపెను'' (గలతీ 4:4). దేవుడు ప్రతిదానికిని ఒక సమయమును నిర్ణయించెను (ప్రసంగి 3:11). ఆ సమయమెప్పుడనేది దేవునికే తెలియును మరియు మనము యేసువలె ప్రతి విషయములో దేవుని చిత్తమును వెదకినట్లయితే మనము పొరపాటు పడము.
యేసు భూమిపైకి వచ్చిన తరువాత, ఆయన కేవలము అటూ ఇటూ తిరుగుతూ ఆయనకు మంచి అని తోచినది చేయలేదు. ఆయన మనసు పరిపూర్ణమైన పవిత్రతతో నుండినా ఆయన మనసుకు తట్టిన ఒక క్రొత్త ఆలోచనను బట్టి ఆయన ఏ కార్యము చేయలేదు. అలా కాకుండా ఆయన తన మనసును పరిశుద్ధాత్మకు సేవకునిగా చేసెను.
ఆయనకు పన్నెండు సంవత్సరములు వయసు వచ్చునప్పటికి లేఖనములన్ని బాగుగా తెలిసినా, ఆయన తరువాత పద్దెనిమిది సంవత్సరములు ఒక వండ్రంగిగా, కుర్చీలు, బల్లలు మొదలైనవి చేసుకుంటూ తన తల్లితో కలిసియుండెను. ఆయన చుట్టూ మరణిస్తూ ఉండిన వారికి అవసరమైన సందేశము ఆయన కలిగియుండినా, ఆయన బోధించు పరిచర్యతో బయటకు వెళ్లలేదు. ఎందుచేత? తండ్రియొక్క సమయమింకను రాకపోవుట చేత యేసు వేచియుండుటకు భయపడలేదు.
''ఆయన యందు విశ్వాసముంచు వాడు ఆతురత (కలవర) పడడు''(యెషయా 28:16).
తండ్రి సమయమొచ్చినప్పుడు ఆయన తన వడ్రంగి కొట్టునుండి బయటకు వెళ్లి బోధించుట ప్రారంభించెను. అటుతరువాత తరచూ ఆయన ఏదైనా విషయం గూర్చి ''నా సమయమింకను రాలేదు'' (యోహాను 2:4; 7:6) అని చెప్పుచుండెను. యేసు జీవితములో ప్రతి విషయం తండ్రి చిత్తము మరియు సమయము ప్రకారము జరుగుచుండెను.
కేవలము మనుష్యుల అవసరము కార్యము చేయుటకు ఒక పిలుపుగా యేసు ఎప్పుడూ తీసుకొనలేదు, అలా చేసినట్లయితే అది తనకు తానుగా తన మానవ జీవము నుండి వచ్చినదిగా ఉండును. మనుష్యుల యొక్క అవసరత లెక్కలోనికి తీసుకొనెను. కాని అక్కడ దేవుని చిత్తము జరుగవలసి యుండెను. ఆ విషయమును యేసు యోహాను 4:34,35లో తేటగా చెప్పెను.
అవసరము (35వ): ''మీ కన్నులెత్తి పొలములను చూడుడి? అనేక మనుష్యుల ఆత్మలు ఇప్పుడే తెల్లబారి కోతకువచ్చి యున్నవి....''
కార్యము చేయుటకు నియమము (34వ): ''నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారము...''
మనుష్యుల మాటలు విని, స్పష్టంగా మంచిది అని తెలిసిన పనులు చేసినట్లయితే, తన తండ్రి తన కొరకు ఉంచిన శ్రేష్టమైన దానిని పోగొట్టుకొనునని తెలియుటచేత తన స్నేహితులు సలహా ఇచ్చిన ఎన్నో మంచి పనులను యేసు చేయలేదు.
ఒకసారి ఒక స్థలములో ఉండమని అక్కడివారు వేడుకొనినప్పుడు, వేరొక చోటికి వెళ్లుమని తన తండ్రి స్వరము వినుటచేత ఆయన అక్కడ ఉండలేనని చెప్పారు. మానవ పద్ధతి ప్రకారము చూచినట్లయితే, అక్కడ ప్రజల నుండి ఆయన సందేశములకు అసాధారణమైన స్పందన వచ్చుట చేత అక్కడ నిలిచియుండుటకు మంచి కారణమున్నది (లూకా 4:42). కాని దేవుని తలంపులు మానవుని తలపంపుల వంటివి కావు. మరియు దేవుని మార్గములు మానవుని మార్గముల వంటివి కావు (యెషయా 55:8). ఆ ఉదయమున వేకువనే యేసు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించినప్పుడు, పేతురు మరియు ఇతరుల సలహాలు వినకముందు ఆయన తన తండ్రి యొక్క స్వరమును వినెను (మార్కు 1:35-39). యేసు మానవ వివేకముపై ఆధారపడి యుండలేదు. ఆయన ''నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యోహోవాయందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును'' (సామెతలు 3:5,6) అను వాక్యమునకు విధేయత చూపెను. ఆయన ప్రతి విషయములో తన తండ్రి నడిపింపుపై ఆధారపడెను.
యెషయా 50:4లో యేసు ప్రభువు గూర్చి ''నేను వినుటకు ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు'' అని ప్రవచనానుసారముగా నుండిన మాటను మనము చదువుదుము. అది యేసు యొక్క అలవాటు. యేసు ఉదయకాలమునే మొదలుకొని దినమంతయు కూడా తన తండ్రి స్వరమును వింటూ ఖచ్చితముగా అదే విధముగా చేసేవాడు. ఆయన ఏ విషయంలోనైనా ఏమి చెయ్యాలని మనుష్యులతో చర్చించుట కాక తన తండ్రితో ప్రార్థన కూటములు కలిగియుండేవారు. ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు మనుష్యులతో చర్చించుట ద్వారా ప్రణాళికలు వేయుదురు. ఆత్మీయమైన క్రైస్తవులు దేవుని నుండి వినుటకు వేచి యుందురు.
యేసు తన తండ్రి మూలమున జీవించెను (యోహాను 6:57). ఆయనకు దేవుని వాక్యము ఆహారము కంటే ఎంతో ప్రాముఖ్యమైనది (మత్తయి 4:4). ఆయన దానిని దినములో ఎన్నోమార్లు తండ్రి యొద్ద నుండి సూటిగా పొందవలసి యుండెను. ఆయన దానిని పొందుకొని, దానికి విధేయత చూపెను. విధేయత కూడా ఆయనకు తన అనుదినాహారము కంటే ఎంతో ప్రాముఖ్యమైనదిగా యుండెను (యోహాను 4:34). యేసు తన తండ్రిపై ఆధారపడి జీవించెను. రోజంతటిలో ఆయన వైఖరి ''చెప్పండి తండ్రీ, నేను ఆలకించుచున్నాను'' అనునదిగా యుండెను.
రూకలు మార్చు వారిని దేవాలయమునుండి వెళ్ళగొట్టిన సందర్భమును ఆలోచించండి. రూకలు మార్చు వారు దేవాలయములో ఉన్నప్పుడు యేసు అనేకమార్లు వారితో పాటు దేవాలయములో ఉండిననూ ఆయన వారిని వెళ్ళగొట్టలేదు. ఆయన తన తండ్రి చేత అట్లు చేయుమని నడిపింపబడినప్పుడే అట్లు చేసెను. ఒక ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు నిరంతరం రూకలు మార్చువారిని వెళ్లగొడుతూ ఉండవచ్చును లేక ఎప్పుడూ అటువంటి పని చేయకుండానైనా ఉండును. అయితే దేవుని చేత నడిపింపబడు వానికి ఎప్పుడు, ఎక్కడ మరియు ఎట్లు చేయవలెనో తెలియును.
కొన్ని పనులు తన విషయంలో తండ్రి చిత్తమునకు బయట యుండుటచేత యేసు అనేక మంచి పనులు చేయగలిగియుండినా, ఆయనెప్పుడూ వాటిని చేయలేదు. ఆయనెప్పుడూ అతిశ్రేష్టమైన పనులు చేయటంలో తీరిక లేకుండా ఉండేవారు. అవి ఆయనకు సరిపోయేవి. ఆయన ఈ లోకమునకు వచ్చినది మంచి పనులు చేయుటకు కాక, తన తండ్రి చిత్తము చేయుటకు వచ్చియుండెను.
''నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా?'' అని పన్నెండు సంవత్సరాలప్పుడు యేసు యోసేపు మరియలతో అన్నారు (లూకా 2:49). కేవలం ఆ పనులు మాత్రము నెరవేర్చుటకు ఆయన ఆసక్తి కలిగియున్నారు. ఆయన ఈ భూమిపై 33 1/2 సంవత్సరాల చివరకు వచ్చునప్పటికి, ''తండ్రీ, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని'' (యోహాను 17:4) అని నిజమైన సంతృప్తితో చెప్పగలిగెను.
ఆయన ప్రపంచమంతా చుట్టి రాలేదు. ఆయన ఏ పుస్తకాన్ని వ్రాయలేదు. ఆయనను వెంబడించిన వారు కొద్దిమంది మాత్రమే ఇంకా లోకములో అనేక భాగములలో తీరని అవసరములెన్నో ఉన్నవి. ఇలా ఎన్నో చెప్పుకొనవచ్చును. కాని తన తండ్రి తనకు ఏర్పాటు చేసిన పనిని ఆయన పూర్తి చేసారు. అది మాత్రమే చివరకు ముఖ్యమైనది.
యేసు, ప్రభువైన యెహోవాకు సేవకుడు. మరియు ''సేవకునికి ముఖ్యమైనది తన యజమాని చేయుచున్నది చేయుటైయున్నది'' (1కొరింథీ 4:2 లివింగ్ బైబిలు) ఆయన జీవితమంతా తన తండ్రి చెప్పినది వినుచుండుట చేత తన తండ్రి చిత్తమును అలసిపోకుండా లేక ఫలితంలేని విశ్రాంతి యెరుగని రీతిలో కాకుండా నెరవేర్చెను. ఆయన యొక్క మానవపరమైన ఆసక్తిలన్నిటిని మరణింప చేసెను. ఆయన ప్రకృతిసంబంధమైన మానవజీవము అనుసరించకుండా యుండెను. ఆయన ఆత్మీయమైన వానిగా యుండెను.
ప్రార్థనకు ఆయన జీవితములో ఎంతో విలువ నిచ్చెను. ఆయన తరచు తప్పించుకొని ప్రార్థించుటకు అరణ్యములోనికి పోవుచుచండెను (లూకా 5:16). ఒకసారి ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసికొనుట కొరకు తండ్రి చిత్తమును తెలిసి కొనుటకు రాత్రంతా ప్రార్థించెను (లూకా 6:12,13). ఒక ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు ప్రార్థనలో దేవునిపై వేచియుండుట, సమయమును వ్యర్థపుచ్చుట అనుకొని కేవలము తన మనస్సాక్షిని సంతృప్తి పర్చుకొనుటకు మాత్రమే ప్రార్థించును. అతడిపై అతడికి నమ్మకముండుట చేత ప్రార్థన అతడి జీవితములో తప్పని అవసరతగా యుండదు. అయితే ఆత్మీయమైన క్రైస్తవుడు ప్రతి దానికీ నిరంతరం దేవునిపై ఆధారపడి యుండి నిజమైన అవసరతచేత ప్రార్థనవైపునకు వెళ్లును.
ఆయన మాటవినుట ఒక్కటే అవసరమైనదని యేసు చెప్పారు (లూకా 10:42). బేతనిలో మరియ దీనికి ఒక ఉదాహరణ. వేరొక ప్రక్క, మార్త నిస్వార్థమైన పరిచర్యలో తీరిక లేకుండా యుండినా ఆమె మనసులో నెమ్మది లేకుండా మరియపై విమర్శనతో యుండినది. ఆ ఇద్దరు అక్కచెల్లెల్లలో ఆత్మ సంబంధికి మరియు ప్రకృతి సంబంధికి మధ్యనుండిన వ్యత్యాసమును మనము చూడగలము. మార్త ప్రభువుకు మరియు ఆయన శిష్యులకు పరిచర్య చేయుటవలన పాపమేమి చేయలేదు. అయినప్పటికిని ఆమె నెమ్మది లేకుండాయుండి ఆమె సోదరిని విమర్శిస్తుయుండినది. ఇది ప్రకృతి సంబంధమైన పరిచర్యకు తేటయైన దృశ్యముగా యున్నది. ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు నెమ్మది లేకుండాయుండి చికాకు పడ్తూయుండును. అతడు తన స్వంత కార్యములను మాని దేవుని విశ్రాంతిలో ప్రవేశింప లేదు (హెబ్రీ 4:10). అతడి ఆలోచనలు మంచివి, కాని అతడి స్వంత కార్యములు అవి ఎంత మంచివైనా, చివరకు అతడు క్రైస్తవుడుగా మారిన తరువాత కూడా అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు మాత్రమే (యెషయా 64:6).
అమాలేకీయుల యొక్క మంచి గొఱ్ఱెలు కూడా (శరీరము) పనికిరాని వాటితో పాటుగా దేవునికి అంగీకారముకాదు (1సమూ 15:3, 9-19). కాని మానవుని వివేకము దీనిని అర్థము చేసికొనలేదు. దేవునికి ఇవ్వదగిన మంచి గొఱ్ఱెలను పారవేయడం తెలివి తక్కువతనముగా ఉంటుంది. కాని దేవుడు విధేయతను కోరుకొనుచుండెను, కాని బల్యర్పణను కాదు, ''బలులు అర్పించుట కంటె ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము'' (1సమూ 15:22). అయితే దేవుడు ఏమి చెప్పుచుండెనో వినక పోయినట్లయితే, ఎలా విధేయత చూపించెదము. వినుటకు ముందు విధేయత రావలెను. అందుచేతనే తన స్వరమును వినుట ఒక్కటే అవసరమైనదని యేసు చెప్పెను. తదుపరి విషయములన్ని దానిపై ఆధారపడియుండును.
మార్తవలె పరిచర్య చేయు వారందరు, వారెంత నిష్కపటముగా యుండినా, నిజానికి వారు వారినే సేవించుకొనుచున్నారు. వారు దేవుని సేవకులుగా పిలువబడరు, ఎందుకంటే సేవకులు వారు ఏదైనా చేయుటకు ముందు వారి యజమాని ఏమి చెప్పునో వినుటకు సిద్ధపడియుందురు.
మనము మన స్వంత శక్తిని పూర్తిగా ఖాళీచేసుకొన్నట్లయితే సొలొమోను వలె ''నా దేవా యెహోవా నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీవాడనైన నాకు వివేకముగల (వినగల) హృదయమును దయచేయుము'' (1రాజులు 3:7,9) అని ప్రార్థించుదుము. మంచిది ఏదో మంచిది కానిదేదో తండ్రి చిత్తానుసారమైనదేదో మరియు ఏది కాదో తేడా తెలుసుకొనుట కొరకు తన తండ్రి నుండి వినవలెనని యేసుకు తెలియును.
శృంగారమను యెరూషలేము దేవాలయ ద్వారము వద్ద, ఒక కుంటివాడు బిక్షమడుగుటను యేసుక్రీస్తు తరచుగా చూస్తుండేవారు. కాని తన తండ్రి నుండి ఆయనకు నడిపింపు లేనందున ఆయన అతడిని స్వస్థపర్చలేదు. తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడైన తరువాత తండ్రి యొక్క పరిపూర్ణ సమయములో పేతురు, యోహానులు అతడికి స్వస్థత కలిగించారు. మరియు దాని ఫలితముగా అనేకులు ప్రభువు వైపునకు తిరిగిరి (అపొ.కా. 3:1-4:4). అదే ఆ మనుష్యుని స్వస్థపరచుటకు తండ్రి యొక్క సమయము దానికి ముందు కాదు. ఆ మనుష్యుని అంతకు ముందు స్వస్థపరచినట్లయితే, తండ్రి యొక్క చిత్తమును ఆయన ఆటంక పరచియుండేవారు. తండ్రి యొక్క సమయము పరిపూర్ణమైనదని ఆయనెరుగుట చేత ఏదైనా చేయుటకు ఆయనెప్పుడూ తొందరపడలేదు.
యేసుయొక్క జీవితము సంపూర్ణమైన విశ్రాంతిలో నుండేది. ఆయనకు ప్రతిదినము తండ్రి చిత్తము చేయుటకు 24 గంటలలో సరిపడు సమయముండేది. కాని తనకు మంచియని తోచినది చేయుటకు నిశ్చయించుకొన్నట్లయితే, అప్పుడు ఆయనకు 24 గంటలు సరిపోయి ఉండేవి కాదు మరియు దీనిని బట్టి ఆయన చాలా రోజులు నెమ్మది లేకుండగా ఉండవలసి వచ్చేది. తన యొక్క రోజువారి కార్యక్రమములను గూర్చి ప్రణాళిక వేసేది పరలోకములో నుండిన సర్వాధికారియైన తన తండ్రియని ఎరిగియుండుట చేత తనకు అడ్డు తగిలే ప్రతి సంఘటనను సంతోషముతో యేసు ప్రభువు అంగీకరించేవారు. కనుక ఆయన ఆటంకాలను బట్టి ఎప్పుడూ కోపము తెచ్చుకొనే వారుకాదు. యేసుయొక్క జీవితము మన అంతరంగములను కూడా సంపూర్ణమైన విశ్రాంతిలోనికి తెచ్చును. దీని అర్థము మనము ఏమి చేయనక్కర్లేదని కాదు, కాని ఏదైతే మన జీవితాల్లో తండ్రి యొక్క ప్రణాళికలో ఉన్నదో అవి మాత్రమే చేయుదుము. అప్పుడు తండ్రి చిత్తమును, మనము ముందుగా అనుకొనిన కార్యక్రమముల కంటే ఎక్కువ త్వరగా పూర్తి చేయుటకు తొందర కలిగియుందుము.
ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు వారి స్వంత ఉద్దేశ ప్రకారమే చేయుటకు ఎంతో ఆసక్తి కలిగియుండుట చేత వారు తరుచుగా తొందరపడ్తూ నెమ్మది లేక యుందురు. వారిలో కొందరు చివరకు నరాల బలహీనత లేక శారీరక రుగ్మతలతో చతికిల పడుదురు.
యేసుప్రభువు అంతరంగములో సంపూర్ణమైన విశ్రాంతితో నుండుట చేత, ఆయన నరముల బలహీనతతో చతికిల పడడము అసంభవము. ''మీమీద నా కాడి యెత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును'' (మత్తయి 11:29) అని ఆయన మనతో చెప్పు చుండెను. దేవునిఆత్మ వాక్యములో మనకు చూపుచున్న యేసు యొక్క మహిమ ఇదే ఆయన దానిని మనకును ఇవ్వాలని మరియు మన ద్వారా ప్రత్యక్ష పర్చవలెనని ఆశించుచుండెను.
యెహోవా మన కాపరి ఆయన తన గొఱ్ఱెలను విశ్రాంతి గల పచ్చిక బయలుల యొద్దకు నడిపించును. గొఱ్ఱెలు తమంత తాముగా కార్యక్రమమును రూపొందించుకొనవు లేక తరువాత ఏ పచ్చిక బయలు యొద్దకు వెళ్ళాలో నిర్ణయించుకొనవు. అవి కేవలము వాటి కాపరిని వెంబడించును. అయితే కాపరిని వెంబడించుటకు ఒకడు తనపై తనకుండిన నమ్మకమును, తన సామర్థ్యమును ఖాళీ చేసికొనవలసియుండును. యేసు తన తండ్రిని సాత్వికముతో వెంబడించారు. ప్రకృతి సంబంధమైన జీవమును బట్టి నడిచే క్రైస్తవులు గొఱ్ఱెలుగా ఉండుటకు యిష్టపడరు. అందుచేత వారి స్వంత తెలివి తేటలను అనుసరించుట వలన దారి తప్పిపోవుదురు. మనకుండిన బుద్ధి దేవుడిచ్చిన అద్భుతమైన మరియు ఎంతో ఉపయోగకరమైన వరము, కాని దానిని మనపై ఏలుబడి చేయునట్లు హెచ్చించినట్లయితే అది వరములన్నిటిలో బహు ప్రమాదకరమైనదిగా మారును.
ప్రభువు తన శిష్యులకు ''తండ్రీ, పరలోకమందు నీ చిత్తము ఏవిధముగా జరుగుతుందో అట్లే భూమియందును నీచిత్తము జరుగును గాక'' అని ప్రార్థించమని నేర్పెను. పరలోకములో దేవుని చిత్తము ఎలాగు జరుగును? అక్కడున్న దేవ దూతలు దేవుని కొరకు ఏదో చెయ్యాలను ప్రయత్నములో చుట్టూ పరిగెత్తరు. వారు అలా చేసినట్లయితే పరలోకములో గలిబిలిగా యుండును. అటువంటప్పుడు వారేమి చేయుదురు? వారు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చు ఆజ్ఞలు వినుటకు వేచియుందురు మరియు అప్పుడు వారికి ఒక్కొక్కరికి ఏమి చేయమని చెప్పబడెనో అది చేయుదురు. జెకర్యాతో గబ్రియేలు దూత ''నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని'' అని చెప్పిన మాటలు వినండి (లూకా 1:19). యేసు ప్రభువు కూడా ఇటువంటి స్థానమునే ఎన్నుకొనెను - అది ఆయన తండ్రి సన్నిధిలో వేచియుండి, ఆయన స్వరమును విని, ఆయన చిత్తమును చేయుట.
ప్రకృతి సంబంధమైన జీవముతో నడిపింపబడే క్రైస్తవులు ఎంతో కష్టపడవచ్చు మరియు ఎంతో త్యాగం చేయవచ్చు కాని నిత్యత్వము యొక్క స్పష్టమైన వెలుగు ''వారు రాత్రంతా శ్రమపడినను ఏమియు పట్టలేదు'' అని బయల్పర్చును. కాని ఎవరైతే వారి సిలువను ప్రతి దినము ఎత్తికొందురో (వారిని వారు ఉపేక్షించుకొని ప్రకృతి సంబంధమైన జీవమును మరణింపజేయుదురో) మరియు ప్రభువుకు విధేయత చూపుదురో వారి వలలు ఆ దినమున చేపలతో నిండుగా యుండును (యోహాను 21:1-6).
''ఎవడైతే తన కొరకు నేను ఏర్పాటు చేసిన పని నుండి ఏకాగ్రత చెరుపుకొనునో వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు'' (లూకా 9:62 లివింగ్ బైబిలు) ''ప్రభువు కొరకు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుము'' (కొలస్సీ 4:17).
''పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును'' (మత్తయి 15:13). ఇక్కడ ప్రశ్న మ్కొ మంచిదా లేదా అనేది కాదు, కాని ఎవరు నాటారు అనేది. దేనికైనా దేవుడే హక్కు కలిగిన మూలమైన వాడు. బైబిలు ''ఆదియందు దేవుడు'' అను మాటలతో ప్రారంభమగును. కనుక మన పనులన్నిటిలో కూడా అది ఎప్పటికీ నిలిచియుండాలంటే మన మనస్సుల్లో కాకుండా దేవునిలో మొదలవ్వవలెను.
''దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును'' (1యోహాను 2:17) మిగిలినవారందరు లయమైపోవుదురు.
మనకు మనము ఈ ప్రశ్నను అడుగు కొందుము.
నేను దేవుని చిత్తములో జీవిస్తున్నానా మరియు ప్రయాసపడుతున్నానా?
''ఆయన ద్వారా సమస్తమును కలిగియున్నది'' (రోమా 11:36).
ఆదాము తన ప్రకృతి సంబంధమైన ప్రాణములో విచిత్రమైన శక్తులతో దేవునిచే సృష్టింపబడెను. దేవుడు చేసిన ప్రతి జంతువు మరియు పక్షికి అతడు పేర్లు పెట్టెను (ఆది 2:19). ఆ వేలకొలది పేర్లలో కొన్నింటినైనా జ్ఞాపకముంచుకొనుట మనకు కష్టముగా యుండును. ఆదాము ఒక్కొక్క దానికి వేరువేరు పేర్లు పెట్టెను. అది ఆదాము ప్రాణము కున్న శక్తులలో ఒకటి. దేవుడిచ్చిన ఈ శక్తులు దేవునిపై ఆధారపడి ఉపయోగించుట కొరకు ఉద్దేశించబడినవి. కాని ఆదాము ఏదేను వనములో ఆ నాశనకరమైన ఎంపిక చేసికొనిన తరువాత దేవునికి వేరుగా తన స్వంత ప్రాణము నడిపించిన దాని ప్రకారం జీవించుటకు మొదలు పెట్టాడు.
మనము ప్రాణము మరియు ఆత్మకు సంబంధించిన కార్యక్రమములకు మధ్యలో నుండిన తేడాను తెలుసుకొని మరియు సాతాను యొక్క నఖిలీ అనుభవముల ద్వారా మోసపోవుట నుండి తప్పించుకోవలెనంటే మనము పరిశుద్ధాత్మ శక్తి మరియు మానవ ప్రాణముకుండిన శక్తికి మధ్య వ్యత్యాసమును కొంతైనా తెలుసుకొనవలెను.
ఈనాడు మానవ ప్రాణము యొక్క శక్తి క్రైస్తవ లోకములో బహుగా వాడబడుచుండిన స్వస్థత గూర్చి ఆలోచించండి.
19వ శతాబ్దము నుండి మానవ మనస్సు కుండిన అద్భుత శక్తులు గూర్చి శాస్త్రీయ విజ్ఞానము కనిపెట్టుట మొదలు పెట్టినది. హిప్నాటిజం యొక్క శాస్త్రము చాలా వృద్ధి చెందింది, మానసిక శక్తుల ద్వారా ఎటువంటివి సాధ్యమవునో చూచుటకు అద్భుతముగా నుండినది. హిప్నోటిజముకు సంబంధించిన సూత్రము 'పరిశుద్ధాత్మ వరములు' అను పేరుతో క్రైస్తవ్యములోనికి దిగుమతి చేయబడినది.
నిజమైన ఆత్మ వరములు ఎల్లప్పుడూ సంఘము కట్టబడుటకు మరియు దేవుని మహిమ కొరకు ఉపయోగపడును; వాటిని తృణీకరించుట కాదు కాని, నిజమైనవన్నట్లుగా కనబడే నఖిళీ వరములు మానవ వ్యక్తిత్వములను హెచ్చించుటకును మరియు వారి స్వంత రాజ్యములు మరియు వారి ఆర్థిక సామ్రాజ్యములను కట్టుటకును ఉపయోగపడును.
ఈ రోజులలో విశ్వాసము ద్వారా స్వస్థపరిచే (క్రైస్తవులు- క్రైస్తవేతరులు) వారి ద్వారా జరిగే దైవిక స్వస్థతలు కేవలం ఇటువంటి మానవ మనస్సు యొక్క శక్తులను ఉపయోగించుట వలన జరిగి, ఒకరిలో రోగము తాలూకు లక్షణములు ఇంకను ఉండినా అతడు స్వస్థపడినట్లు ఒప్పించుటయై యున్నది. ఈనాటి రోగములలో ఎక్కువ శాతము మానసిక రోగమునకు సంబంధించినవగుట చేత, అనుకూలముగా ఆలోచించుట మరియు రోగము గూర్చి వైఖరిలో మార్పు వలన చాలా సార్లు శరీర స్వస్థత చేకూరుటకు కారణమగుట యదార్థమే. అయితే ఇది కేవలం శరీరము మరియు మనసు యొక్క సహజమైన నియమముల యొక్క పనియై యున్నది. అది మానవాతీతమైన స్వస్థత ఏ మాత్రము కాదు.
యేసుప్రభువు ఈనాడు కూడా జనులను అద్భుతముగా స్వస్థపరచుచున్నారు. కాని అటువంటి మానసిక శక్తులతో మాత్రము కాదు. ఎక్కడైతే నిజమైన స్వస్థతావరము కనబడునో, అక్కడ నమ్ముటను గూర్చిన పెనుగులాట ఉండదు. ఎందుకనగా విశ్వాసము దేవుని యొక్క వరమై యున్నది. మరియు అది దేవునివాక్యము నందలి వాగ్దానము ననుసరించినదై యున్నది, అంతేకాని అది సానుకూలముగా ఆలోచించుట వలన వచ్చినది కాదు.
హిప్నాటిజం యొక్క సూత్రములు పాటించుట ద్వారా (ఉద్దేశ పూర్వకంగా కాకపోయినా), మనుష్యులు ఇతరులపై దేవుడు ఎప్పుడూ ఉద్దేశించని విధముగా శక్తి కలిగియుందురు. దీనిని క్రైస్తవ పరిధులలో ఒక వ్యక్తిలో నుండిన పరిశుద్ధాత్మ యొక్క అధికారముగా పొరబడుదురు.
దేవునితో కాక, ఒకరి యొక్క మానసిక శక్తులను అభివృద్ధి చేసికొనుటలో చాలా ప్రమాదమున్నది. దేవుడు ఆ శక్తులను ఆయన కొరకు వాడబడునట్లు ఆయనకు లోబర్చుటకు ఇచ్చును.
యేసు అట్లు జీవించెను. ఆయన తన ప్రకృతి సంబంధమైన మానవ జీవితమును మరణింపజేసి, తన మానవ జీవమునకు సంబంధించిన శక్తులతో జీవించుటను తిరస్కరించారు. దానికి బదులు ఆయన తన తండ్రిపై సంపూర్తిగా ఆధారపడి జీవించెను మరియు ఆయన తన జీవితము కొరకు మరియు పరిచర్య కొరకు ఆయన ఎల్లప్పుడూ మానక పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వెదకుచుండెను.
ఆయన తరచుగా ప్రార్థించుటకు అరణ్యములోనికి తప్పించుకొని వెళ్లుచుండెనని మనము ఇప్పటికే చూచితిమి (లూకా 5:16). ఆయన సిలువ వేయబడక ముందు, ఆయన యొక్క చివరి దినములలో పగలు ఆయన దేవాలయములో బోధించుచు రాత్రులందు ఒలీవల కొండకు వెళ్లుచుండెను. అది నిరాటంకముగా ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుటకు అనుటలో సందేహము లేదు (లూకా 21:37,38).
విశ్వాసము మూలముగా జీవించుట అనగా తండ్రిపై అటువంటి నిరంతరమైన ఆధారపడుటయై యున్నది.
కేవలము దేవుని శక్తితో చేసినది మాత్రమే నిత్యత్వముండును. మిగిలినవన్నీ నాశనమై పోవును. దేవునిపై ఆధారపడి జీవించు వాని జీవితము నీటి ఊటల నుండి పోషణను పొందు చెట్టువలె నుండునని బైబిలు చెప్పుచున్నది (యిర్మీయా 17:5-8). యేసు ఆ విధముగా ఒక మానవునిగా ఆత్మీయ వనరులను పరిశుద్ధాత్మ నుండి (దేవునియొక్కనది) నిరంతరం పొందుకుంటూ జీవించెను.
యేసుప్రభువు శోధనపై విజయమును, మానవ కృత నిశ్చయములో కాక, క్షణక్షణము ఆయన తన తండ్రి నుండి శక్తిని పొందుకొనుట ద్వారా పొందెను. యేసు మాదిరి చూపిన మరియు బోధించిన తన్ను తాను ఉపేక్షించుకొను మార్గము మానవ జీవము(ప్రాణము) సాధించినది కాదు. అది బౌద్ధమతంలో మరియు యోగాలో నుండినది మరియు దానికిని మరియు లేఖనములలో చెప్పబడిన విషయములకును, పరలోకమునకు మరియు భూమికి ఎంత వ్యత్యాసము ఉన్నదో అంత వ్యత్యాసము ఉన్నది.
మానవ మాత్రులముగా దేవునిలో జీవించుట మరియు ఆయనకు పరిచర్య చేయుట మనము చేయవలసిన విధముగా చేయుటకు మనకు శక్తి లేదని యేసు బోధించారు. మనము ఫలములిచ్చు చెట్టుపై పూర్తిగా ఆధారపడిన స్వంత శక్తి లేని కొమ్మలవంటి వారమని ఆయన చెప్పారు. ''నాకు వేరుగా నుండి మీరేమియు చేయలేరు'' అని ఆయన చెప్పారు (యోహాను 15:5). కనుక పరిశుద్ధాత్ముని సహాయము లేకుండా మనకు మనము ఏదొక విధముగా చేసినది ఎందుకూ పనికి రానిదిగా నుండును.
ఇక్కడే ''ఎల్లప్పుడు ఆత్మతో నింపబడియుండుడి'' (ఎఫెసీ 5:18) అను ముఖ్యమైన అవసరత ఉన్నది.
యేసు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడెను (లూకా 4:1,18) మరియు ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో తన తండ్రి పని గూర్చి జీవించెను మరియు ప్రయాస పడెను. ఆయన ఆత్మలో దీనుడుగా ఉన్న కారణమును బట్టి ఒక మానవునిగా ఇది సాధ్యమైనది.
యేసుప్రభువు వచ్చిన మానవశరీరము యొక్క బలహీనతను ఆయన ఎరిగియుండెను. అందువలన ఆయన నిరంతరం ఒంటరిగా ప్రార్థించుటకు అవకాశముల కొరకు వెదుకుచుండెను. ఒక విహార యాత్రికుడు ఒక పట్టణములో ప్రవేశించినప్పుడు చూడవలసిన ప్రాముఖ్య స్థలములు గూర్చి మరియు మంచి వసతి గృహములు గూర్చి ఎలా వెదుకునో అట్లు యేసు ఆయన ప్రార్థించుటకు అనువైన ఒంటరి ప్రదేశములు గూర్చి వెదికే వారని ఒకరు అన్నారు.
ఆయన తన మానవపరమైన శక్తిని మరణింపచేయుటకును, శోధనను జయించుటకును శక్తి గూర్చి వెదకేవారు. యేసువలె, ఏ మానవుడు కూడా తన శరీరము యొక్క బలహీనతను ఎరిగి యుండలేదు కనుక సహాయం కొరకు తండ్రిని ఏ మానవుడు ఎప్పుడు వేడుకొననంతగా ఆయన వేడుకొనెను. ఆయన శరీరధారియై యున్నప్పుడు ''మహా రోదనతోను మరియు కన్నీళ్ళతోను'' ఆయన ప్రార్థించెను. దాని ఫలితముగా ఆయన తన తండ్రి చేత ఏ మానవుని కంటే ఎక్కువగా బహుగా బలపర్చబడెను. ఆ విధముగా, యేసు ఎప్పుడూ ఒక్కసారి కూడా పాపము చేయలేదు మరియు ప్రకృతి సంబంధిగా ఎప్పుడు జీవించలేదు (హెబ్రీ 4:15; 5:7-9).
సువార్తలలో యేసు ప్రభువునకు సంబంధించి 25 మార్లు ''ప్రార్థించు'' లేక ''ప్రార్థన'' అను మాటలు వచ్చుట చెప్పుకోదగిన విషయం కాదా? అక్కడనే ఆయన జీవితము మరియు ప్రయాసల యొక్క రహస్యమున్నది.
యేసు ఆయన జీవితములో జరిగిన గొప్ప సంఘటనలకు ముందుగా మాత్రమే కాకుండా, కొన్ని గొప్ప కార్యములు జరిగిన తర్వాత కూడా ప్రార్థించెను. ఐదు వేల మందికి అద్భుతముగా ఆహారము పెట్టిన తరువాత, ఆయన కొండలలోనికి ప్రార్థించుటకు వెళ్లెను. అది అనుమానమేమి లేకుండా గర్వములో పడే శోధన నుండి తప్పించుకొనుటకు లేక జరిగిన పనిని బట్టి ఉదాసీనముగా ఉండకుండునట్లు మరియు అక్కడ జరిగిన పనిని గూర్చి స్తుతులు చెల్లించుటకు మరియు తండ్రి యొద్ద వేచి యుండుట ద్వారా ఆయన శక్తిని పొందుకొనుటకు అయ్యుండును (యెషయా 40:31). మనము సాధారణముగా దేవుని కొరకు ఏదైనా ప్రాముఖ్యమైనది చేయుటకు ముందు ప్రార్థించుదుము కాని మనము యేసు ప్రభువు కుండిన అలవాటు వలె, మనము ఏదైనా పని సాధించిన తరువాత తండ్రి యెదుట వేచియుండుటను నేర్చుకొనినట్లయితే, మనకు మనము గర్వము నుండి కాపాడబడి దేవుని కొరకు ఇంకా గొప్ప పనులు చేయుటకు సిద్ధపర్చబడుటకు మనలను మనము భద్రపరచుకొనెదము.
యేసుయొక్క జీవితము ఎంతగా తీరికలేని పనులతో నిండియుంటే అంత ఎక్కువగా ప్రార్థించేవారు. ఆయనకు కొన్ని సమయములలో భోజనము చేయుటకు లేక విశ్రమించుటకు కూడా సమయముండేది కాదు (మార్కు 3:20; 6:31,33,48). కాని ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించుటకు సమయము నుంచుకొనేవారు. ఆయన ఆత్మ చెప్పే మాటలు వినేవారు, కావున, ఎప్పుడు నిద్రించాలి మరియు ఎప్పుడు ప్రార్థించాలి అనేది తెలిసియుండెను.
ఫలవంతమైన ప్రార్థనకు దీనమైన మనస్సు ముందు కావలసియుండెను. ప్రార్థన మానవ నిస్సహాయతను చెప్పుకొనుటైయున్నది మరియు అది కేవలం ఆచారముగా కాకుండా, అర్థవంతముగా నుండవలెననంటే, క్రైస్తవ జీవితము జీవించుటకు గాని లేక దేవుని సేవించుటకు గాని మానవుని యొక్క వనరులు సరిపోవనే తలంపు ఎప్పుడూ ఉండవలెను.
యేసుప్రభువు ఎడతెగకుండా ప్రార్థనలో దేవుని శక్తిని కోరుకుంటూ ఉండేవారు మరియు ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఆ విధముగా ఆయన ఇంకే విధముగాను సాధించలేని విషయములను ప్రార్థన ద్వారా సాధించారు.
తన మీద తనకు నమ్మకముండిన వ్యక్తి, పాపముపై విజయము కొరకు శరీరమును నమ్ముకొనుటను కొనసాగించును. అటువంటి వ్యక్తి విజయములోనికి తీసుకువెళ్లే దేవుని శక్తిని తెలుసుకొనుటకు ముందు విరుగ గొట్టబడవలసియున్నది. కనుక దేవుడు అటువంటి వాడు మరల మరల నెల తరువాత నెల అతడు ఏమీ లేని 'సున్నా' వంటి స్థితికి వచ్చి తన దుర్భలత్వమును ఒప్పుకొను వరకు ఓడిపోవునట్లు అనుమతించును. అప్పుడు దేవుడు అతడిపై తన కృపాసహితమైన ఆత్మను కుమ్మరించును. మరియు జయ జీవితములోనికి నడిపించును దాని వలన దేవుని యొక్క మహిమ అతడి ద్వారా ప్రత్యక్షపర్చబడును.
అట్లు మనమెప్పుడు బలహీనులమో అప్పుడు మనము యదార్థముగా బలవంతులముగా యుందుము (2కొరింథీ 12:10).
అబ్రాహాము తన సహజమైన శక్తితో ఇష్మాయేలును కనెను, కాని దేవుడు ఇష్మాయేలును అంగీకరించక అతడిని పంపించి వేయుమని అతడితో చెప్పెను (ఆది 17:18-21; 21:10-14). క్రీస్తు తీర్పు సింహాసనం యొద్ద, మనము మన మంచి ప్రయత్నముతో దేవునిపై ఆధారపడకుండా మన మానవ సామర్థ్యముల ద్వారా తయారు చేసిన వాటిని పెట్టినప్పుడు, అది కూడా అంగీకారము కాదని ఆయన చెప్పును. కర్ర, గడ్డి మరియు కొయ్యకాలుతో చేసినవన్ని బూడిదైపోవును. 'దేవుని ద్వారా' చేసినది మాత్రమే నిలుచును.
అబ్రాహాము దుర్భలత్వ స్థితికి వచ్చినప్పుడు బిడ్డలను పుట్టింపగలిగిన తన సహజ సామర్థ్యము ఇంక లేనప్పుడు, దేవునిశక్తి ద్వారా ఇస్సాకు పుట్టెను. ఆ కుమారుడు దేవునికి అంగీకారమయ్యెను.
దేవునికి సంబంధించి ఒక ఇస్సాకు వేయిమంది ఇష్మాయేలుల కంటే ఎక్కువ విలువైన వాడు. అగ్నితో పరీక్షించిన పిదప ఒక గ్రాము బంగారము ఒక కేజీ కర్ర కంటె ఎంతో విలువైనదిగా యుండును. పరిశుద్ధాత్మ శక్తితో చేసిన కొద్దిపని మన స్వంత శక్తితో చేసిన ఎంతో గొప్పపని కంటె విలువైనది.
మనము చేసిన మంచి క్రియలు మరియు ప్రభువును సేవించుటకు చేసిన మంచి ప్రయత్నములన్నీ ఎప్పుడూ అది మనము క్రీస్తులోనికి మార్పుచెందక ముందు మరియు మార్పు చెందిన తరువాత కూడా అవి మురికి గుడ్డలుగా ఉన్నవి. కాని విశ్వాసము ద్వారా వచ్చిన (పొందిన) నీతి మరియు పరిశుద్ధాత్మపై ఆధారపడుట ద్వారా చేసిన సేవ మనకు గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవమునకు వివాహ వస్త్రముగా తయారగును (ప్రకటన 19:8). ఎంతటి వ్యత్యాసము - మురికి గుడ్డలు లేక సుందరమైన వివాహ వస్త్రములు. ఇదంతా మన జీవితము మానవ శక్తితో జీవించితిమా లేక దేవుని శక్తితో జీవించితిమా అనుదానిపై ఆధారపడి యుండును.
యేసుప్రభువు ఆయన పరిచర్య కొరకు కూడా ఆత్మ యొక్క శక్తిపై ఆధారపడెను. ఆయన మొదట పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడకుండా బోధించు పరిచర్యలోనికి వెళ్లుటకు ధైర్యము చేయలేదు. ఆయన మొదటి ముప్పది సంవత్సరములు సంపూర్ణమైన పరిశుద్ధ జీవితమును, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా జీవించెను. కనుకనే తండ్రి ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను'' (మత్తయి 3:17) అని సాక్ష్యమిచ్చెను. అయినప్పటికిని పరిచర్య కొరకు ఆయన అభిషేకింపబడవలసి యున్నది. కనుకనే ఆయన అభిషేకింపబడుటకు ప్రార్థించెను (లూకా 3:21) మరియు ఆయన ఎప్పుడైనా జీవించిన ఏ మానవుని కంటె ఎక్కువగా నీతిని ప్రేమించి పాపమును ద్వేషించుట చేత, ఆయన ఏ మానవుని కంటే కూడా సమృద్ధిగా అభిషేకింపబడెను (హెబ్రీ 1:9). దాని ఫలితముగా, ఆయన పరిచర్య ద్వారా జనులు సాతాను యొక్క బంధకముల నుండి విడిపింపబడిరి. ఇది అభిషేకము యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము మరియు ప్రాథమిక ప్రత్యక్షత (లూకా 4:18, అపొ.కా. 10:38).
దేవుని కార్యము మానవుని ప్రతిభను బట్టి మరియు సామర్థ్యాలను బట్టి జరుగదు. సహజంగా మంచి వరములున్నవారు క్రీస్తులోనికి మారినప్పుడు, వారికుండిన తెలివితేటలు, మరియు ఉద్రేకములతో కూడిన వారి శక్తులను, ఇతరులను దేవుని యొద్దకు తెచ్చునట్లు ఉపయోగించవచ్చునని సాధారణంగా తలంచుదురు.
చాలా మంది క్రైస్తవులు వారి యొక్క వాగ్దాటి, తర్కము మరియు మంచిగా మాట్లాడే విధానము పరిశుద్ధాత్మ యొక్క శక్తి అని పొరబడుచుందురు. కాని ఇవన్నీ కేవలము మానవునిలో ఉండు శక్తులు, మరియు వీటిపై ఏ మాత్రము ఆధారపడినా, అది దేవుని సేవకు ఆటంకముగా యుండును. మానవునిలో నుండిన శక్తి ద్వారా జరిగిన పని ఎప్పుడూ శాశ్వతమైనది కాదు. అది ఇప్పుడు కాకపోతే కొంతకాలమైన తరువాత లేక క్రీస్తు న్యాయసింహాసనం యెదుట నాశనమైపోవును.
యేసుప్రభువు ప్రజలను దేవుని వైపు కదలించుటకు వాగ్దాటి లేక ఉద్రేకముల యొక్క శక్తి పై ఆధారపడలేదు. అటువంటి మానవ శక్తితో చేయబడినపని, ఆయన యొద్దకు వచ్చు వారి మానవ జీవమునే తాకును కాని వారికి ఎప్పుడూ ఆత్మీయమైన సహాయము కలుగదని ఆయనకు తెలియును. అందుచేతనే దేవుని యొద్దకు ప్రజలను రాబట్టుటకు ఆయన ఏ విధమైన సంగీత వాయిద్య సహకారమును తీసుకొనలేదు.
ఆయన తన మాటలు వినుటకు వచ్చిన వారిని మహా ఉద్రేకముతో నిండిపోయి దేవునికి వారిని వారు అప్పగించుకొనేలా చేయలేదు. నిజానికి, ఆయన ఈనాడు సువార్తికులు మరియు బోధకులు సాధారణంగా ఉపయోగించే వీటిని కాని లేక వేరే ఏ మానవపరమైన పద్ధతులను కాని ఉపయోగించలేదు. ఆయన ఉద్రేక పూరిత భావములను మరియు మానవపరమైన తీవ్రతను ప్రజలపై ప్రభావము చూపుటకు ఉపయోగించలేదు. ఇవి రాజకీయ నాయకుడు మరియు వస్తువులను అమ్ము వారి యొక్క పద్ధతులు, ఈ రెండింటిలో ఆయన దేనికీ సంబంధించినవాడు కాదు.
యోహాను దేవుని సేవకునిగా, యేసు పూర్తిగా ఆయన ప్రయాసమంతటిలో పరిశుద్ధాత్మపై ఆధారపడెను. దాని ఫలితముగా ఆయనను వెంబడించిన వారు దేవునిలో లోతైన జీవితములోనికి వచ్చెడివారు.
ఇతరులు ఆయన యొక్క ఆలోచనా ధోరణిలోనికి వచ్చునట్లు చేయుటకు యేసు ప్రభువు ఎప్పుడూ తనను తాను ఇతరులపై రుద్దలేదు. ఆయనెప్పుడూ ఇతరులకు కావాలనుకుంటే ఆయనను తిరస్కరించు స్వేచ్ఛ నిచ్చెను. ఆత్మ సంబంధికాని క్రైస్తవనాయకులు ఎప్పుడైనా వారి గుంపు మరియు వారి సహచరులను తమ యొక్క బలమైన వ్యక్తిత్వము క్రింద నుంచుదురు. ప్రజలు అటువంటి నాయకులకు భయముతో(ఆశ్చర్యముతో) లోబడుదురు మరియు వారి ప్రతి మాటను గొప్పగా తీసుకొని విధేయత చూపుదురు.
సమూహములు ఇటువంటి నాయకుని చుట్టూ చేరవచ్చును మరియు వారందరు ఐకమత్యముగా కూడా ఉండవచ్చును. కాని అది ఒక నాయకుని యెడల ఉండిన అంకితభావము మాత్రమే. ఆత్మ సంబంధమైనదేదో ప్రకృతి సంబంధమైనదేదో తెలియక పోవుట వలన అటువంటి నాయకులు వారికుండినది పరిశుద్ధాత్మ శక్తి అని భ్రమలో పడుదురు. వారిని అనుసరించువారు కూడా అదే విధముగా మోసపోవుదురు. కాని క్రీస్తు యొక్క తీర్పు సింహాసనపు తేటయైన వెలుగు, అదంతా మానవపరమైన శక్తి అనియు మరియు అది దేవుని కార్యమునకు ఆటంకముగా యున్నదని బయల్పర్చును.
జనాకర్షణ కలిగిన రాజకీయనాయకులు మరియు క్రైస్తవేతర నాయకులు కూడా అటువంటి మానవపరమైన గుర్తింపు కలిగియుండి, వారుకూడా వారికుండిన ఆకర్షణ మరియు వాగ్దాటి మొదలైన వాటిని బట్టి ఎక్కువ జనులను ఆకట్టుకొందురు.
యేసుప్రభువు అటువంటి నాయకుడు కాడు. అలాగే ఏ క్రైస్తవుడు కూడా అట్లుండకూడదు. మనము అటువంటి మానవశక్తిని ఉపయోగించుటకు భయపడవలెను ఎందుకంటే అది మానవుని యెడల దేవుని చట్టములను అతిక్రమించుచున్నది మరియు అది ఆయన సేవకు ఆటంకముగా యున్నది.
మానవపరమైన శక్తి ఇతరులలో పైపైన మార్పులను తీసుకువచ్చును. కాని దానిలో దేవునియెడల లోతైన అంకితభావము కాని వారి రహస్య జీవితములో పాపముపై విజయము కాని యుండదు.
నిజమైన ఆత్మీయకార్యము మానవశక్తితో జరుగదు, కాని కేవలము పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే జరుగును. యేసుప్రభువుకు ఇది తెలియును; అందుచేతనే ఆయనను వెంబడించిన వారిలో చాలా తక్కువ సమయములో లోతైన మరియు నిలిచియుండే కార్యమును చేసెను.
ఆయన ఇతరులపై ఎప్పుడూ తన యొక్క వ్యక్తిత్వమును రుద్దలేదు మరియు ఎప్పుడైనా ఏ ఒక్కరిపైనా అధికారము చెలాయించలేదు మరియు ఆయన మాటతీరును బట్టిగాని లేక మానవశక్తుల చేతగాని ఎవరికీ భయము(ఆశ్చర్యమును) కలుగజేయలేదు. ఆయనపై మనుష్యులకు మంచి అభిప్రాయము కలుగజెయ్యవలెనని చూడలేదు గాని వారికి సహాయపడెను.
ప్రకృతిసంబంధమైన క్రైస్తవులు ఇతరులకు సహాయపడుట కంటే వారికి మంచి అభిప్రాయము కలుగజేయుటకు ఎక్కువ ఆసక్తి చూపుదురు. ప్రకృతి సంబంధమైన క్రైస్తవ నాయకులు జనులను శిరస్సైన క్రీస్తుతో ఐక్యపరచక, వారిని తమతోనే ఐక్యపరచుకొందురు గనుక వారు నిజమైన సంఘమును కట్టలేరు.
సహజముగా ప్రజ్ఞ కలిగిన వారు దేవునివాక్య పరిచర్య చేయునప్పుడు భయముతో వణుకుతో అది చేయవలెను (1కొరింథీ 2:1-5 లో పౌలు చెప్పినట్లు), అలా కానట్లయితే విను వారి హృదయములు దేవుని శక్తిపై కాక మాట్లాడువాని మానవ జ్ఞానముపై నిలుచును.
యేసుప్రభువు అన్ని వేళలయందు ఆయన యొక్క మానవ బలహీనతను ఎరిగియుండెను. ''కుమారుడు తనకు తానుగా ఏమియు చేయలేడు'' (యోహాను 5:19) అని చెప్పెను. అందువలననే ఆయన బహుగా ప్రార్థనా జీవితమును గడిపెను. దాని వలన తండ్రి ఆయన క్రియలన్నిటిని యేసులో చేయగలిగెను (యోహాను 14:10).
దేవునిపై ఆధారపడే అటువంటి వైఖరి మనలను, దేవుడు నిషేధించినటువంటి మరియు యేసు ప్రభువు మనలను ద్వేషించమని చెప్పినటువంటి మన ప్రకృతి సంబంధమైన జీవితము మరియు దాని ద్వారా వచ్చు శక్తులను ఉపయోగించకుండా మనలను దూరముగా ఉంచును. అప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మహిమను మన ద్వారా చూపగలుగును.
మనము విశ్వాసమును బట్టి జీవించినట్లయితే (దేవునిపై ఆధారపడి జీవించుట) మరియు మన పని ఒక విశ్వాసము యొక్క క్రియయైతే, అప్పుడు మనము తప్పనిసరిగా బంగారము, వెండి మరియు వెలగల రాళ్ళతో కట్టినవారమగుదుము.
కనుక, మనము ఈ రెండు ప్రశ్నలను వేసుకొందుము.
అది: నేను దేవుని శక్తితో జీవించుచున్నానా? మరియు దేవుని శక్తితో ప్రయాసపడుచున్నానా?
''ఆయన నిమిత్తము సమస్తమును కలిగియున్నవి'' (రోమా 11:36).
దేవుడు అల్ఫయును, ఒమేగ, ప్రారంభమును మరియు అంతమును, మొదటి వాడును మరియు ఆఖరివాడునై యున్నాడు. కనుక, శాశ్వత స్వభావము కలిగిన సమస్తమును ఆయనలో ఉద్భవించుట చేత, వాటి యొక్క లక్ష్యప్రాప్తి కూడా ఆయనలోనే చూచుకొనుచుండెను.
సమస్తము దేవునికి మహిమ తెచ్చుటకొరకు ఆయన చేత సృష్టింపబడెను. ఇది దేవుడు మననుండి స్వార్థముతో మహిమను అపేక్షిస్తున్నారని కాదు. ఆయన తనలో పూర్తిగా అన్నియు కలిగిన వాడు మరియు ఆయనకు కలిగిన వాటికి కలుపుట కొరకు మనము దేనినీ ఇచ్చుకొనలేము. ఆయనయొక్క మహిమను వెదకమని ఆయన మనలను పిలుచుట, మనకు గొప్ప మేలు జరుగుట కొరకే, అలా కానట్లయితే మనము మన కొరకు మాత్రమే ఆలోచించుకొనుచూ దుర్భరమైన జీవితము గడుపుదుము.
ఆయనలో మనము కేంద్రముగా నుండునది సృష్టిలో దేవుడు ఏర్పరచిన నియమము ఆ నియమమును మీరగలిగినది వారి కొరకు వారే ఆలోచించగలిగే స్వేచ్చ యుండిన ప్రాణులు మాత్రమే. సృష్టిలో స్పందన లేని జడ పదార్థములు సృష్టి కర్తకు సంతోషముగా విధేయత చూపిస్తూ ఆయనను మహిమపర్చును. కాని ఆదాము ఈ నియమమునకు అవిధేయత చూపినందున మానవజాతికి వచ్చిన దుర్భరత్వములో ఆ పర్యవసానమును మనము చూచుచున్నాము.
ప్రభువు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో, అన్నిటికంటే మొదటి అభ్యర్థన ''నీ నామము పరిశుద్ధ పర్చబడును గాక'' అనునది. యేసు ప్రభువు హృదయములో ప్రప్రథమముగా నుండిన ఆశ అది. ''తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక'' అని ప్రార్థించి, తండ్రికి మహిమ కలుగు సిలువ మార్గమును ఎంచుకొనెను (యోహాను 12:27,28). యేసు ప్రభువు జీవితమును నడిపించిన ఒక ప్రధానమైన కోర్కె తండ్రి యొక్క మహిమ.
ఆయన చేసిన ప్రతి పని తండ్రి మహిమకొరకే చేసారు. ఆయన జీవితములో పవిత్రమైనది మరియు లౌకికమైనది అనే వేరు వేరు పద్ధతులు లేవు. ప్రతిది పవిత్రమైనదే. ఆయన బోధించుట మరియు రోగులను స్వస్థపరచుట ఎంతగా దేవుని మహిమ కొరకు చేసెనో ఆయన బల్లలు మరియు కుర్చీలు చేయుట కూడా అంతగా దేవుని మహిమ కొరకే చేసారు. ప్రతిరోజు కూడా ఆయనకు ఒకే విధమైన పవిత్రత కలిగి యుండేది, మరియు దైనందిక జీవిత అవసరాలకు ఖర్చు పెట్టిన సొమ్ము దేవుని పనికి లేక బీదలకు ఇచ్చినప్పుడు ఎంత పరిశుద్ధముగా ఎంచుదుమో అంతే పరిశుద్ధముగా ఆయన ఎంచెను.
యేసుప్రభువు ఎప్పుడూ తండ్రి మహిమను వెదకుటచేత మరియు తండ్రికి ఆమోదమైన దాని కొరకు మాత్రమే పట్టించుకొనుట చేత ఆయన ఎల్లవేళలయందూ హృదయములో పరిపూర్ణమైన విశ్రాంతితో జీవిస్తూ యుండేవాడు. ఆయన తన తండ్రిముఖము ఎదుట జీవిస్తూ ఉండేవాడు మరియు మనుష్యుల నుండి ఘనతను కాని పొగడ్తలను గాని లెక్కచేయలేదు.
''తనంతట తానే బోధించువాడు స్వంత మహిమను వెదుకును'' (యోహాను 7:18) అని యేసు చెప్పెను.
ప్రకృతి సంబంధియైన క్రైస్తవుడు అతడెంతగా దేవుని మహిమను వెదకినట్లు కనబడినా, అతడి అంతరంగములో నిజానికి తన స్వంత ఘనత యెడల ఆసక్తి కలిగియుండును. యేసైతే ఎప్పుడూ తన కొరకు ఘనతను ఆశించలేదు.
మానవుని యొక్క జ్ఞానములో ప్రారంభింపబడి మానవపరమైన చాతుర్యము మరియు ప్రతిభ ద్వారా కొనసాగబడేది ఎప్పుడూ మనుష్యుని ఘనపర్చును. మానవుని యొక్క ప్రకృతి సంబంధమైన జీవములో మొదలయ్యేది సృష్టింపబడిన దానినే మహిమపర్చును.
కాని పరలోకమందు లేక భూమిపై శాశ్వతకాలము ఏ మానవునికి ఘనతను లేక మహిమను తీసుకొని వచ్చేది ఏదీ లేదు.
దేవుని నుండి, దేవుని ద్వారా మరియు దేవుని కొరకైన ప్రతిదీ మాత్రమే కాల పరిస్థితులకు నిలిచి నిత్యత్వములో ప్రవేశించును.
దేవునికి సంబంధించినంత వరకు ఏ కార్యమునకైనా దాని వెనుకనున్న ఉద్దేశ్యము ఆ కార్యమునకు విలువను ప్రాధాన్యతను ఇచ్చును.
మనము ఏంచేస్తున్నామనేది ముఖ్యమే, కాని ఎందుకు చేస్తున్నామనేది ఇంకా ముఖ్యమైనది.
యేసుప్రభువు తన తండ్రి చిత్తమంతటిని, తండ్రియైన దేవుని శక్తి ద్వారా నెరవేరునట్లు తన యెడల తండ్రి ప్రణాళికను తెలుసుకొనుటకు తండ్రి యొద్ద వేచియుండినట్లు మరియు ఆ ప్రణాళికను నెరవేర్చుటకు కావలసిన శక్తిని పొందుటకు కూడా తండ్రి గూర్చి వేచియుండినట్లు మనము చూచితిమి. కాని అంతటితో పూర్తవలేదు. మనము గత అధ్యాయములో చూచినట్లు, యేసు కొన్ని గొప్ప కార్యములు చేసిన తరువాత తండ్రికి మహిమ చెల్లించుటకు, ప్రార్థించుటకు వెళ్లినట్లు చూడగలము. ఆయన తన ప్రయాస యొక్క ఫలమును తన తండ్రికి ఒక అర్పణగా అర్పించెను. ఆయన తన కొరకు ఘనతను వెదుక్కొనలేదు. లేక ఆయనకు ఇవ్వబడినప్పుడు దానిని స్వీకరించలేదు (యోహాను 5:41;8:50). ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించినప్పుడు, ఆయన తన తండ్రిని మహిమపరుచుటకు అరణ్యములోనికి వెళ్లిపోయెను (లూకా 5:15,16). ఆ మహిమను తాను ముట్టుకోకూడదని ఆయన నిశ్చయించుకొనెను.
ఆయన అటువంటి వైఖరిని చివరి వరకూ కొనసాగించి యుండెను. కనుకనే యేసుప్రభువు యొక్క జీవితపు చివరిలో, ఆయన నిజాయితీతో, ''తండ్రీ, భూమిమీద నిన్ను ఘనపరచితిని'' (యోహాను 17:4) అని చెప్పగలిగెను.
ఆయన భూమిపైకి ఒక మానవునిగా తండ్రిని మహిమపరచుటకు వచ్చెను అదే గురిగా ఆయన ప్రతి ఒక్క దినము జీవించెను. ఆయన ఎంత వెల చెల్లించవలసినా కూడా, తండ్రి మాత్రము మహిమ పర్చబడవలెనని ఆయన ఆసక్తిగా ప్రార్థించెను. తండ్రి పరలోకమందు ఎలాగునో అలాగుననే భూమిపైన కూడా ఘనపర్చబడునట్లు ఆయన చివరికి మరణించెను.
అగ్నిచేత మన పని పరీక్షింపబడుదినమున (1కొరింథీ 3:12,13) ప్రతివాడు ఎందుకొరకు దేవుని పని చేసెననేది బయలుపర్చబడునని పౌలు చెప్పెను (1కొరింథీ 4:5). ఆ రోజున మన ఉద్దేశ్యములు బయటపెట్టబడి దేవుని చేత పరీక్షించబడును.
ప్రకృతిసంబంధమైన పరిచర్య జనులను దేవుని యొద్దకు ఆకర్షించుటకు బదులు మన యొద్దకు ఆకర్షించును. జనులు మన నుండి వినుటకు వచ్చి ఎంతగానో యిష్టపడి తిరిగి మరల మనలను వినుటకు వచ్చి మనలను ఘనపరచి మన గూర్చి గొప్పగా చెప్పుదురు. మనము ఆ స్థలమును విడిచి పెట్టిన తరువాత, వారు మరల వారి గత ఆత్మీయ స్థితికి పడిపోయి, వారు వినిన బోధను బట్టి ఏ మాత్రము మెరుగవకుండా యుందురు. ఒక వ్యక్తి యొక్క ప్రయాసకు నిజమైన పరీక్ష, అతడు మరణించి వెళ్లిపోయిన తరువాత అంతవరకు అతడు పరిచర్య చేసిన ప్రజల స్థితిని బట్టి తెలియును. అప్పుడు అతడి పరిచర్య ఆత్మీయమైనదా లేక ప్రకృతి సంబంధమైనదా అనేది తెలియును.
ఇతరులను మన యొద్దకు ఆకర్షించుకొనే ప్రయాస అంతా కర్ర, గడ్డి, కొయ్యకాలు అని చివరి దినాన ఋజువగును, ఎందుకంటే అది కేవలం మానవున్ని మహిమపర్చును.
యేసు యొక్క పరిచర్య ఆత్మీయమైనది. దానికి ఋజువుగా ఆయన వెనుక విడచిపెట్టిన కొద్దిమంది కూడా ఆత్మీయమైన వారుగా తయారయ్యారు. ప్రకృతి సంబంధీకులుగా తయారవ్వలేదు. ఆయన మహిమను మనము చూపించవలెనంటే, ఈ విషయంలో మనము ఆయన మాదిరిని అనుసరించవలెను.
మానసికోద్రేకములతో కూడిన సేవ మరియు జీవిత విధానము సంపూర్తిగా ప్రకృతి సంబంధమైనదై క్రీస్తువిరోధి రాకకును మరియు అతడు ప్రపంచ వ్యాప్తముగా అంగీకరింపబడునట్లును చేయును. అతడు అందరి కంటే పైగా హెచ్చించుకొని, ప్రజలను తన వైపు ఆకర్షించుకొనుటకు అద్భుత కార్యములను కూడా చేయును (2థెస్స 2:3-10).
దాని ప్రకారము జనులను మన తట్టునకు మరియు మన పని వైపునకు ఆకర్షించు కొనుట క్రీస్తువిరోధి యొక్క ఆత్మసారమైయున్నది. మనము ఇతరులకు వారు ఏమి చెయ్యవలెనో మరియు ఎక్కడకు వెళ్లవలెనో చెప్పగలుగునట్లు వారి మనస్సులపై శక్తి కలిగియుండుట ప్రకృతి సంబంధమైనది. ఇతరులకు సలహా యిచ్చుట ఆత్మీయమైన విషయం కాని వారిని అదుపులో ఉంచుకొనునట్లు వారిపై అధికారము కలిగియుండుట ప్రకృతి సంబంధమైనది.
యేసు ప్రభువు తనను వెంబడించు వారిని ఏదైనా చెయ్యమని ఎప్పుడూ బలవంతం చెయ్యలేదు. దేవుడు మనుష్యునికిచ్చిన వారికి వారుగా ఎంపికచేసుకొనే స్వేచ్ఛను ఆయన ఎప్పుడూ గౌరవించెను.
అందువలననే ఆయన మనుష్యులందరికి సేవకుడైయుండెను మరియు వారిపై అధికారం చెయ్యుటకు బదులు వారికి సేవ చేసెను.
ఒక పని మనిషి ఆత్మతో కాక ఒక అధికారిగా మరియు ఒక ప్రభువుగా బోధించుట చాలా సులువైన పని (2కొరింథీ 4:5). మనకుండిన మానసిక శక్తులను మన అభిప్రాయములను ఇతరులపై రుద్దుటకు మనము ఉపయోగించవచ్చును. దాని ఫలితముగా జనులు మన యొక్క బందికానాలోనికి వచ్చుదురు.
సేవ గూర్చి ఆసక్తి కలిగిన మరియు తన స్వంత బలమైన ప్రకృతి సంబంధమైన శక్తి గూర్చి తెలియనివాడు, జనులను క్రీస్తు కొరకు కాక తన కొరకే గెల్చుచుండెననునది కూడా తెలుసుకొనడు. దేవుని యొక్క పని మానవశక్తితో కాని బలముతో కాని కాక పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనే జరుగును. ఆత్మ కార్యము యొక్క ఒక గుర్తు స్వాతంత్య్రము (2కొరింథీ 3:17). పరిపూర్ణమైన స్వాతంత్య్రము ప్రతి వ్యక్తికి ఇవ్వబడును.
ఒక సేవకుడు ఇంటిలో ఎట్లు ప్రవర్తించునో ఆలోచించండి. అతడు ఏది చేయవలసి యుండెనో అది మౌనముగా చేసి వంటగదిలోనికి నిష్క్రమించును. అతడు పెద్దగా హడావిడి చేసుకుంటూ రాడు మరియు వచ్చి బల్ల యొద్ద కూర్చుండు వారు ఏమి చెయ్యవలెనో చెప్పడు. దేవుని ఆ విధముగా సేవించుటకు యిష్టపడువారెందరు?
''ఒక సేవకునికి అధికారము చెయ్యుటకు ఒకే ఒకటి యున్నది. అది అతడి స్వంత శరీరము'' అని ఒకరు చెప్పారు. అతడు ఏ స్థాయి వరకు తన స్వంత శరీరమును పరిపాలించునో, అంతగా యితరులను అతడు ఆత్మీయ జీవితములోనికి నడిపించును. ఒక ఆత్మీయమైన సేవకుడు దేవుని చేత తనకు ఇవ్వబడిన శక్తి కొలది మాత్రమే సేవ చేయగలడు మరియు ఆ శక్తి అతడికి ఇతరుల అవసరములలో పరిచర్య చేయుట కొరకే యివ్వబడును. అయితే మనము ఒక వ్యక్తిని ఏదొక విధముగా బలవంతము చేయుటకు ఆ శక్తిని ఉపయోగించినట్లయితే అతడు నిరుత్సాహము చెంది చివరకు అతడి స్వంత మార్గాన వెళ్లిపోవచ్చును. ఒక సేవకుని యొక్క పని మనుష్యులను తనతో సంబంధము కల్గించుకొనుట కాక అన్నింటిని సమకూర్చి జరిగించే దేవునితో జీవము గల సంబంధము కలిగియుండునట్లు చేయుటైయున్నది (1కొరింథీ 12:6).
యేసు, తన తరువాత తన అపొస్తలులు తన కంటె గొప్ప కార్యములు చేయునట్లు (యోహాను 14:12) వారికి మార్గమును సిద్ధపరచి చూపునట్లుగా దేవుని మహిమను వెదకుటకు పూర్తిగా సిద్ధపడెను. తండ్రి మరియు కుమారుడు ఏకమైయున్నట్లు (యోహాను 17:21-23) సభ్యులందరు ఏకమై ఉండు సంఘమును కట్టుట నిజముగా గొప్పపనియై యున్నది. యేసుప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు ఏ ఇద్దరు శిష్యులు కూడా తండ్రి మరియు కుమారుడు ఏకమై నుండినట్లు ఏకముగా లేరు. వారందరు వారి స్వంత యిష్టము కోరుకొనిరి. కాని పెంతెకొస్తు దినము తరువాత ఆయన యొక్క శిష్యులు అనేకమంది ఆయన ఆశించినట్లు ఏకమయ్యారు. ఇది గొప్పదైన పని.
ఇతరులు ఆయన కంటే గొప్ప పని చేయగలుగునట్లు ఆయన మార్గమును చూపెను. ఆయన మరణించి పునాది వేసెను మరియు ఆయన శిష్యులు దానిపై కట్టిరి.
యేసుప్రభువుకు వ్యక్తిగతమైన ఆసక్తి లేదు. తండ్రి మహిమ పరచబడినట్లయితే, ఆయన చేసిన దానికి ఇంకొకరు పేరు తెచ్చుకొనినా ఆయన పట్టించుకొనే వారు కారు.
మనము ఈనాడు క్రీస్తు శరీరమైన సంఘమునకు జీవమిచ్చే పరిచర్య చేయవలెనంటే, మరియు దానిని క్రీస్తుయొక్క సంపూర్ణసారూప్యములోనికి నిర్మింపవలెనంటే, మనకు ఆ ఆత్మ చైతన్యమివ్వవలెను.
యేసు మరణమునుండి తిరిగి లేచిన తరువాత తనను సిలువ వేసిన వారి యెడల ఆయన దైవత్వాన్ని నిరూపించుట కొరకు పట్టించుకొనలేదు. దానికి కారణం ఆయన సంపూర్తిగా తండ్రి ముఖము యెదుట మాత్రమే జీవించెను.
లోకము దృష్టిలో మరియు యూద నాయకుల దృష్టిలో, యేసు యొక్క పరిచర్య విజయవంతము కానటువంటిది. యేసు ప్రభువు మానసికోద్రేకములను బట్టి ప్రతిస్పందించే వాడైనట్లయితే, ఆయన పునరుత్థానుడైన పిదప యూదా నాయకుల ఎదుటికి వెళ్లి వారి ఉద్దేశ్యములను భంగపరచి తనను తాను ఋజువు చేసికొనుటకు చూచియుండును. కాని ఆయన అట్లు చేయలేదు. ఆయన పునరుత్థానుడైన తరువాత ఆయన యందు విశ్వసించిన వారికి మాత్రమే ఆయన దర్శనమిచ్చెను.
ప్రభువైన యేసును గూర్చి ఋజువు చేయుటకు తండ్రి సమయమింకను రాలేదు మరియు యేసు దాని కొరకు వేచియుండుటకు సిద్ధపడి యుండెను. ఆ సమయమింకను రాలేదు.
లోకములో యేసుప్రభువు ఇంకను తప్పుగా అర్థము చేసికొనబడుచుండెను. అనేకులు ఆయన జీవితమును ఒక ఓటమిగా ఎంచుచున్నారు. ఆయన జీవితాన్ని (ఒక మానవునిగా) ఒక అవమానకరమైన పశువులకు గడ్డివేసే తొట్టెలో ప్రారంభించెను. మరియు ఆయన భూమిమీద జీవితాన్ని ఇద్దరు ఘోరమైన నేరస్థులతో పాటు అవమానకరమైన సిలువ మరణముతో ముగించెను. ఈ లోకము ఆయనను చూచినది అదే ఆఖరుసారి.
తండ్రి మహిమ పరచబడినట్లయితే, మనుష్యుల యెదుట ఓడిపోయినట్లు కనబడుటకు యేసు సిద్ధపడెను. ఆయన మనుష్యుల చేత మెప్పింపబడుటకు జీవించలేదు లేక సేవ చేయలేదు. అందువలన ఒక రోజున తండ్రి ఆయనను గొప్ప మహిమ మరియు ఘనతతో బహిరంగముగా ఋజువు పరచును, మరియు ఆ రోజున ప్రతి మోకాలు ఆయన నామమున వంగి ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనును. అయితే అది కూడా తండ్రియైన దేవుని మహిమ కొరకే (ఫిలిప్పీ 2:11).
కనుక మనలను మనము అడుగు కొనవలసిన మూడవ ప్రశ్న: ''నేను దేవుని మహిమ కొరకు మాత్రమే జీవించుచున్నానా? మరియు ప్రయాసపడుతున్నానా?'' అనునది.
బైబిలులోని లేఖనముల చివరిలో పరిశుద్ధాత్మ కార్యము యొక్క ఫలితమును మనము చూచుదుము. అది క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె. అదే విధముగా మనము సాతాను యొక్క నకిళీ పని యొక్క ఫలితము - వేశ్య సంఘమును చూచుదుము.
''నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అది దేవుని మహిమ గలదై...ధగ ధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలియున్నది'' అని యోహాను చెప్పెను (ప్రకటన 21:2,10,11).
యోహానుకు క్రీస్తు పెండ్లికుమార్తె గూర్చిన ఈ దర్శనము చూపకముందు దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పి నిజమునకు లోకమును ప్రేమించే ఆత్మీయ వ్యభిచారియైన వేశ్యను చూపెను (యాకోబు 4:4). ఇది పైకి దైవభక్తి రూపము కలిగియుండి (సిద్ధాంత పరముగా సరియైయుండి) శక్తి లేని (దేవుని జీవములేని) నకిళీ క్రైస్తవ్యము (2తిమోతి 3:5).
''నేనొక స్త్రీని చూచితిని, వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహాబబులోను....మహాబబులోను కూలిపోయెను అని ఒక స్వరము చెప్పుచుండెను దాని దహన దూపము చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకునుచు ఏడ్చుచు - అయ్యో అయ్యో, బబులోను మహా పట్టణము ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొనుచు...గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చెను...ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది'' అని యోహాను చెప్పెను (ప్రకటన 17:3,5; 18:2,9; 19:3).
ఈ రెంటికి మధ్య నుండిన తేడా చాలా ప్రత్యేకముగానున్నది. పెండ్లికుమార్తె తీర్పు అగ్నిలో నుండి ''మెరయుచున్న రత్నము'' వలె వచ్చియుండగా, వేశ్య నాశనమై పోయే వస్తువులచే తయారవుట చేత సంపూర్ణముగా బూడిదైపోయి, ఆమె పొగ యుగయుగములు పైకి లేచుచుండెను.
పెండ్లికుమార్తె అయిన యెరూషలేము మరియు వేశ్యయైన బబులోను రెండు వ్యవస్థలు. ఒకటి దేవుని నుండి వచ్చినది మరియొకటి ''భూసంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు మరియు దయ్యముల జ్ఞానము వంటిదియునైనది'' (యాకోబు 3:15).
బబులోను విషయము ముందు చూచెదము.
బబులోను బాబెలు గోపురముతో ఆరంభమైనది. అది మానవుని ప్రణాళికతో మానవుని యొక్క శక్తితో మరియు మానవుని మహిమ కొరకు నిర్మింపబడినది.
''వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ (మానవుని నుండి) ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని (మానవుని ద్వారా), పేరు సంపాదించుకొందుమని (మానవుని కొరకు) మాటలాడుకొనగా'', (ఆది 11:4).
అనేక సంవత్సరముల తరువాత, రాజైన నెబుకద్నెజరు, బబులోను మహా పట్టణమును తన రాజ్యమునకు రాజధానిగా నిర్మించి ఆ పట్టణములో తిరుగుచు అదే విధముగా అనెను. ''బబులోనను ఈ మహా పట్టణము నా బలాధికారమును (మానవుని చేత) నా ప్రభావ ఘనతను కనపరచుటకై (మానవుని కొరకు) రాజధాని నగరముగా నేను కట్టించినది కదా(మానవుని నుండి) అనుకొనెను'' (దానియేలు 4:30).
బాబెలు గోపురము తీర్పుతో ముగిసిపోయినది. నెబుకద్నెజరు యొక్క అతిశయము కూడా దేవుని యొక్క అకస్మాత్తు తీర్పుతో క్రిందికి తేబడినది (దానియేలు 4:31-33). మానవ జ్ఞానముతో మరియు మానవ శక్తితో మానవుని యొక్క మహిమ కొరకు చేయబడిన ప్రతీది చివరకు దేవుని చేత తీర్పు తీర్చబడును. క్రైస్తవ పని అని పిలువబడినా మానవుని ప్రకృతి సంబంధమైన శక్తిచేత చేయబడినదంతా నాశనమైపోవును.
''బబులోను యొక్క విశాలమైన ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు (క్రైస్తవ పనివారా?) వృధాగా ప్రయాస పడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాస పడుచున్నారు'' (యిర్మీయా 51:58).
వేరొక ప్రక్క యెరూషలేము దేవుని పట్టణమై యున్నది (హెబ్రీ 12:22) పాత నిబంధన కాలములో దేవుని ఆలయము ఇక్కడనే ఉండెను. దేవుని నివాస స్థలమైన, యెరూషలేము యొక్క ఉత్పత్తి స్థానము మోషేచే నిర్మింపబడిన మందిరములో యున్నది (నిర్గమ కాండము 25:8).
ప్రత్యక్ష గుడారము ఖచ్చితముగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నిర్మింపబడెను. ''యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, అలాగుననే చేసెను'' (నిర్గమ 40:16) (దేవుని నుండి)
అది దేవుని యొక్క శక్తి చేత నింపబడిన మనుష్యుల చేత నిర్మింపబడెను.
''బెసలేలు....దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను'' (నిర్గమ 31:1-5)
(దేవుని ద్వారా)
అది దేవుని మహిమ కొరకు నిర్మింపబడెను.
''యెహోవా తేజస్సు మందిరమును నింపెను'' (నిర్గమ 40:34).
(దేవుని కొరకు)
దేవునిలో ప్రారంభింపబడి దేవుని శక్తి ద్వారా దేవుని మహిమ కొరకు చేయబడినదే ఎప్పటికీ నిలుచును. అది బంగారము, వెండి మరియు వెలగల రాళ్లతో కట్టబడుట చేత అది అగ్నిలో నుండి వచ్చిన రత్నము వలె ప్రకాశించును.
మనము బైబిలులోని ప్రారంభ పేజీలను, చివరి పేజీలలో పోల్చుచుండినప్పుడు, రెండు చెట్లు (జీవ వృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము) కాలము చివరకు వచ్చునప్పటికి రెండు వ్యవస్థలైన యెరూషలేము మరియు బబులోనులను తీసుకువచ్చెను.
నిజముగా ఆత్మచేత జన్మించినది, దేవునినుండి, దేవునిద్వారా మరియు దేవుని కొరకైనది ఎప్పటికీ నిలుచును. అయితే శరీరము ద్వారా జన్మించినది మానవుని కొరకైనది నాశనమగును.
మన మీనాడు ఆదికాండము మరియు ప్రకటన మధ్యనుండిన పేజీలలో జీవించుచున్నాము. మరియు మనము గ్రహించినా గ్రహించలేకపోయినా మనము ఈ రెండు వ్యవస్థలలో ఒక దానిలో చిక్కుకొని యున్నాము. ఒకటి దేవుని మహిమ పరచి హెచ్చించుటకును మరియు వేరొకటి మానవుని మహిమ పరచి హెచ్చించుటకును నిర్ణయించును; ఒకటి క్రీస్తును వేరొకటి ఆదామును అనుసరించును; ఒకటి ఆత్మలోను మరియొకటి శరీరము మరియు ప్రకృతి సంబంధమైన జీవిలోను జీవించును.
యేసు మరియు ఆదాము కూడా దేవుని స్వరమును విని యుండిరి, అయితే వ్యత్యాసమేమంటే ఒకరు విధేయత చూపారు మరియొకరు అవిధేయత చూపారు. అదే విధముగా యేసు కూడా తన స్వరము విని విధేయత చూపినవారు తన ఇంటిని రాయి మీద కట్టుకొనిన వానిని పోలియుండి, శాశ్వత కాలము కదలక యుండగా, వేరొకరు విని విధేయత చూపనట్లయితే ఇసుకలో కట్టిన వానిని పోలియుండి చివరకు నాశనమగును అని చెప్పెను (మత్తయి 7:24-27).
యేసు చెప్పిన ఈ రెండు ఇళ్లు యెరూషలేము మరియు బబులోనుగా ఉన్నవి.
ఈనాడు ఎవరైతే నిజముగా విశ్వాసముద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడి నూతన నిబంధనలోనికి ప్రవేశించి, యేసు రక్తము చేత ముద్రింపబడి యేసును దేవుని యొక్క చిత్తములో విధేయత గల జీవితముతో వెంబడింతురో (ముఖ్యముగా మత్తయి 5 నుండి 7 అధ్యాయములు) ఎవరైతే అట్లు రాతి మీద ఇల్లు కట్టుదురో వారు యెరూషలేములో భాగముగా యుందురు. ఒకడు ఈ గుంపులో ఉండెనో లేదో తెలుసుకొనుటకు మత్తయి 5 నుండి 7 అధ్యాయములు చదివినట్లయితే సరిపోవును.
అదే విధముగా ఇతరులు (వీరు అనేకులు) మత్తయి 5-7 అధ్యాయములోని యేసు మాటలు విని, నీతిమంతులుగా తీర్పు తీర్చుబడుట గూర్చి, విశ్వాసము మరియు కృప గూర్చి తప్పుడు గ్రహింపు కలిగి తప్పుడు భద్రత కలిగి యేసు చెప్పిన మాటలకు విధేయత చూపుటకు పట్టించుకొనకపోవుట ఆ విధముగా ఇసుకపై కట్టిన బబులోను చివరకు శాశ్వతముగా నాశనమగును.
వీరు తమ దృష్టిలో క్రైస్తవులుగా నుండిన వారు, ఎందుకంటే ఇసుకపై ఇంటిని కట్టినవాడు ఆయన మాట విననివాడని యేసు చెప్పెను దానిని బట్టి అతడు తప్పనిసరిగా క్రైస్తవేతరుడు కాడు, కాని బైబిలు చదువుతూ సంఘమునకు వెళ్లు వాడే. అతడి కుండిన ఒకే ఒక సమస్య విధేయత చూపకపోవుట మరియు దాని వలన యేసుకు విధేయత చూపిన వారికందరికి వాగ్ధానము చేయబడిన నిత్యమైన రక్షణ (హెబ్రీ 5:9)లో వారు పాలుపొందలేరు. అతడి యొక్క విశ్వాసము యదార్ధమైనది కాదు. ఎందుకంటే విశ్వాసమును పరిపూర్ణము చేయు విధేయతతోకూడిన క్రియలు అతడికి లేవు (యాకోబు 2:22,26).
ఆదామును శిరస్సుగా కలిగియుండి బయల్పర్చబడిన దేవుని చిత్తమునకు అవిధేయత చూపుటలో వారి శిరస్సయిన ఆదామును అనుసరించువారు, వారు క్రీస్తుని అంగీకరించుట చేత 'చావనే చావరు' అని సాతాను చేత ఒప్పింపబడుదురు (ఆది 3:4). ఆ విధముగా వారు బబులోను యొక్క తప్పుడు భద్రతలో జీవించుదురు.
అదే విధముగా క్రీస్తును శిరస్సుగా గౌరవించినవారు, వారు దేవుని చిత్తమునకు లోబడుటలో ''యేసు నడిచినట్లు నడుచుట'' (1యోహాను 2:6) ద్వారా గుర్తింపబడుదురు. వీరు క్రీస్తుకు సహోదరులు, సహోదరీలుగా యున్నారు (మత్తయి12:50) మరియు యెరూషలేములో భాగంగా యున్నారు.
యేసుప్రభువు మత్తయి 5-7 అధ్యాయముల చివర చెప్పిన ఉపమానములో జ్ఞానము గలవాని ఇల్లు మరియు బుద్ధిహీనుని ఇల్లు ఈనాటి యెరూషలేము మరియు బబులోను వలె గాలివాన మరియు వరదలు వచ్చువరకు కొంతకాలము నిలిచియున్నవి. బుద్ధిహీనుడు తన ఇంటి యొక్క బాహ్యమైన రూపు కొరకు (మనుష్యుల యెదుట సాక్ష్యము) ఆలోచన కలిగియున్నట్లే, జ్ఞానవంతుడు ముఖ్యముగా పునాది కొరకు ఎక్కువ ఆలోచన కలిగి యుండెను (దేవుని ఎదుట హృదయములో రహస్య జీవితము).
అయితే గాలివాన (దేవుని తీర్పు) వచ్చినప్పుడు పునాది ముందుగా పరీక్షింపబడినది.
''తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు'' (1పేతురు 4:17,18).
''ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొండని వారితో చెప్పుదును (పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు) (మత్తయి 7:21-23, 1యోహాను 3:6).
ఇక్కడ కూడా చూచినట్లయితే అనేకులు వారి మనసుల్లో వారిని గూర్చి క్రైస్తవులుగా అనుకొనిన వారు (యేసును 'ప్రభువా' అని పిలిచినవారు) మరియు భావోద్రేకముతో క్రైస్తవులుగా అనుకొనిన వారు (యేసును ప్రభువా, ప్రభువా అని పిలచినవారు) నిజానికి వారి జీవితాల్లో దేవుని చిత్తము చేయుటకు వారి స్వంత యిష్టమును వదులుకొనకుండా యుండిరి. ప్రభువు వారిని తెలియదన్నట్లుగా తిరస్కరించారు.
యెరూషలేము యొక్క తప్పని ఒక లక్షణము పరిశుద్ధత. అది 'పరిశుద్ధ పట్టణమ'ని పిలువబడెను (ప్రకటన 21:2). అయితే బబులోను తన యొక్క గొప్పతనముతో ప్రత్యేకముగా యుండెను. అది 'గొప్ప పట్టణమని' పిలువబడెను (ప్రకటన 18:10). అది 'గొప్పది' అని ప్రకటనలో పదకొండుసార్లు పిలువబడెను.
ఎవరైతే నిజమైన పరిశుద్ధతలో, దేవునికి విధేయత చూపుతూ జీవించుదురో మరియు విశ్వాసము ద్వారా కృపచే క్రీస్తు స్వభావములో పాలివారగుదురో వారు యెరూషలేముగా కట్టబడుదురు; అలా కాకుండా ఈ భూమిపై గొప్పదనం గూర్చి (మనుష్యుల యెడల సాక్ష్యము మరియు ఘనత చూచువారు బబులోనుగా కట్టబడుదురు).
గత పందోమ్మిది వందల సంవత్సరాల నుండి దేవుని ప్రజలకు ''నా ప్రజలారా, మీరు దాని (బబులోనులో) పాపములలో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దానిని విడిచి రండి'' (ప్రకటన 18:4) అను పిలుపు వచ్చుచున్నది.
మనము ఈ కాలము చివరకు వచ్చుచుండగా, ఈనాడు ఆ పిలుపు మరి యెక్కువ తేటగా యున్నది. తేటగా నుండిన దేవుని యొక్క ఈ పిలుపును వారు పట్టించుకొనక పోయినట్లయితే దేవుని ప్రజలు కూడా బబులోను పద్దతులలో కలిసిపోవుట ద్వారా దాని యొక్క శిక్షలో భాగము పంచుకొనుట నిజముగా ఎంతో బాధపడవలసిన విషయము. వారు నిజమైన బోధకు తగినట్లుగా జీవింపకపోయినా లేక నిజమైన విశ్వాసమునకు గుర్తులయిన విధేయత యొక్క క్రియలను కలిగి లేకపోయినట్లయితే, సువార్తీకరణ ముఖ్యముగా కలిగిన బోధ యుండినా లేక 'క్రీస్తు కొరకు నిర్ణయము తీసుకొనినా' ఆ రోజున ఏదీ సహాయపడదు.
మానవుడు దైవ స్వభావములో పాలివాడై ఆయన యొక్క మహిమను చూపవలెనని దేవుడు ఆయన యొక్క రూపములో మానవుని చేసినప్పుడు ఆయన ఎంతగానో ఆశపడెను.
మరియు మానవుడు పడిపోయినప్పుడు, దేవుడు ఎంతైనా గొప్ప ధర చెల్లించుటకు సిద్ధపడి ''పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను'' (రోమా 8:3,4), కనుక దాని ద్వారా మానవుని యెడల దైవికమైన ఉద్దేశ్యము నెరవేరునట్లు మానవుడు తెగిపోయిన సంబంధము తిరిగి కలుపుకొని వెనుకకు తిరిగి రాగలుగునట్లు ఒక మార్గము వేయబడెను.
మానవుని విడుదల చేసి అతడిని మార్పు చేయు ఈ పనిలో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు కలిసియుండిరి. ఈ విషయములో చాలా మంది స్త్రీ పురుషులు వారి బుద్ధిహీనత చేత దేవుని వైపునకు తిరుగకపోయినా, మిగిలిన కొద్దిమంది (ఎవరైతే ఇరుకు మార్గమైన జీవితమును కనుగొందురో) ఎవరైతే యేసువలె దేవునికి లోబడుదురో, మరియు ఎవరి ద్వారా ఇక్కడ ఈ కాలమందు మాత్రమే కాక శాశ్వత కాల పర్యంతము దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడునో వారి ద్వారా దైవికమైన ఉద్దేశ్యము నెరవేరును. అప్పుడు దేవుడు వారి ద్వారా ఆయన యొక్క కృపామహాదైశ్వర్యములో క్రీస్తు ద్వారా వారు పాలివారగునట్లు చూపును. ఆయనకే ఇప్పటికిని ఎప్పటికిని మహిమ కలుగును గాక.
వినుటకు చెవులు గలవాడు వినును గాక.