ఒక సమాజము, ఒక క్లబ్ మరియు ఒక సంఘము

వ్రాసిన వారు :   డా. అనీ పూనెన్
    Download Formats:

అధ్యాయము 1
క్రొత్త ద్రాక్షారసమును నింపుటకు క్రొత్త తిత్తి అవసరము

"క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను" (లూకా 5:38)


చాలా సంవత్సరములుగా ప్రభువు నా జీవితములో చేయుచున్న దానిని ఈ చిన్న పుస్తకములో వ్రాసి మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఈ జీవమార్గము నాకు ఎంతో విలువైనదిగా ఉన్నది ఎందుకనగా నిత్యత్వపు విలువగల దానిని అనుభవించుటకు త్యాగము అవసరము.


క్రీస్తుయొక్క జీవమును మరియు బోధను అర్థము చేసుకొనుటకు, మనకు ఇష్టమైన కొన్నిటిని మనము విడిచిపెట్టి మరియు అనేక విషయములలో త్యాగము చేయవలసియుంటుంది. అప్పుడు ప్రభువు మనకు బోధించాలనుకొనే దానిని అనుభవపూర్వకముగా మన జీవితములలో తెలుసుకొని మరియు మన జీవితములో దేవుని చిత్తమంతయు నెరవేర్చగలము.


క్రొత్త నిబంధన సంఘమును నిర్మించుటను దేవుడు నాకు ఎంతో అమూల్యమైనదిగా చేశాడు. ఇది చాలా చాలా ఇరుకు మార్గము.


నిత్యత్వము నిలిచేది ఒకే ఒక్కటి

క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయవలెనని ప్రభువైన యేసు చెప్పాడు. జీవింపజేసే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జీవమును మనకు ఇవ్వాలని ఆయన కోరుచున్నాడు. ఈ జీవమును మనము బయలుపరచుటకు ఆయన మనలను క్రొత్త తిత్తి అనగా నూతన నిబంధన సంఘముగా నిర్మించాలని కోరుచున్నాడు.

ఇటువంటి క్రొత్త నిబంధన జీవితమును మనము జీవించాలని కోరినట్లయితే, మనలోని స్వార్థమనే అనేక పొరలను (ఉల్లిపాయలోని పాయలవలె) ఒక్కొక్కటిగా తీసివేయాలనే దానిని కనుగొనెదము. దేవుడు వాటిని కొద్దికొద్దిగా మనకు అప్పుడప్పుడు చూపిస్తాడు. క్రొత్తనిబంధన సంఘము నిర్మించుటకు కూడా ఆవిధముగా చేయాలి.

దేవుని వాక్యమును ఆధారము చేసుకొనకుండా, మానవ పద్ధతులతో నిర్మించిన సంఘము పాత తిత్తివలే ఉంటుంది. దీనికి కూడా అనేక పొరలు ఉండును. ప్రభువు ఆ పొరలను మనకు చూపించిన కొలది, వాటిని మనము తీసివేయాలి. కాని క్రొత్త నిబంధన సంఘమును నిర్మించాలని ప్రయత్నించే అనేకమంది క్రైస్తవులు పాత ద్రాక్షారసము యొక్క పొరలన్నియు తీసివేయబడకముందుగానే దానిని ఆపివేయడం దురదృష్టకరం. వారు కేవలం మానవపరమైన మరియు వారి (డినామినేషన్) తెగకు సంబంధించిన కొన్ని ఆచారములను మాత్రమే తీసివేసి మరియు అంతవరకు మాత్రమే వృద్ధిపొందుతారు. కాని పాత ద్రాక్షారసానికి సంబంధించినది అంతయు తీసివేయాలని ప్రభువు కోరుచున్నాడు. క్రొత్త తిత్తి అంతయు క్రొత్త ద్రాక్షారసముతో నింపబడాలని ప్రభువు కోరుచున్నాడు.

అనేక సంవత్సరములు, నేను క్రొత్త ద్రాక్షారసము మరియు క్రొత్త తిత్తి గురించి మరియు క్రీస్తు శరీరమైన క్రొత్త నిబంధన సంఘమును నిర్మించుట గురించి కేవలము వేదాంతపరముగా తెలుసుకొనియున్నాను. ఇతరులకంటే ఎక్కువగా దీనిగురించి అనేక ప్రసంగములు వినుట ద్వారా నేను, తలలో చాలా జ్ఞానము కలిగియున్నాను. నేను పెద్దవాడనయ్యేకొలది మా నాన్న ప్రతి ఆదివారము చెప్పే ప్రసంగాలు వినేవాడని. సోమవారము నుండి శనివారము వరకు ఇంటిలో కూడా వినేవాడిని. కాని అదంతయు నా తలలో ఉన్నది. అది నా తలలో నుండి నా హృదయములోనికి వచ్చుటకు అనేక సంవత్సరములు పట్టింది. అప్పుడు ప్రభువును సేవించుటకు ఇదియే సరైన మార్గమని గుర్తించాను.


ఇప్పుడు నా జీవితములో ప్రభువైన యేసు అను ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతర సంబంధములన్నియు, ఆయనతో ఉన్న సంబంధములోనుండియే వచ్చును. కాబట్టి ఇప్పుడు క్రీస్తు శరీరముగా సంఘమును నిర్మించుటలో నేను పరిచర్య చేయుట మాత్రమే నా గురి.


ఆయన భూసంబంధమైన జీవితములో ప్రతిరోజు, ఎందుకు సిలువ మార్గమును ప్రభువైన యేసు ఎన్నుకున్నారు? "తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు" అని బైబిలు చెప్పుచున్నది (హెబ్రీ 12:2).

ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము ఏమిటి?


యోహాను 14వ అధ్యాయములో ప్రభువైన యేసు సిలువ వేయబడకముందు తన శిష్యులతో చెప్పిన చివరిమాటలు మనము చదువుతాము. ప్రభురాత్రి భోజనము చేసే సమయములో ప్రభువు చెప్పిన చివరి మాటలను నాలుగు అధ్యాయములలో అపొస్తలుడైన యోహాను వ్రాయడము నేను మెచ్చుకొనుచున్నాను. "లెండి యిక్కడినుండి వెళ్లుదము" (యోహాను 14:31). సిలువ వేయబడుటకు ప్రభువు వెళ్లుచున్నాడు. కాని దానికంటే ముందుగా ప్రభువు ఇలా చెప్పారు "అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను" (యోహాను 14:31). అదియే ఆయన ఆనందము - తన తండ్రికి ఎల్లప్పుడు విధేయత చూపుట ద్వారా నిత్యత్వము నుండి తన తండ్రితో సహవాసము కలిగియుండుటయే ప్రభువు యొక్క ఆనందము. కాబట్టి మొదటిగా తన తండ్రియెడల తనకు కలిగియున్న ప్రేమను బట్టియు మరియు తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటను బట్టియు తరువాత మన యెడల తనకు ఉన్న ప్రేమనుబట్టియు ప్రభువు సిలువవేయబడుటకు వెళ్లారు.


మనము ఆయన సంఘమును నిర్మించుటకు ఇది ఒక్కటియే మార్గము కాబట్టి దీనిని స్పష్టముగా చెప్పాలని కోరుచున్నాను. పాపమును జయించి మరియు ప్రభువు యొక్క పరిచర్య చేయాలని కోరువారి అందరిలో, మొదటిగా తండ్రి యెడల వారికి ఉన్న ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞలకు లోబడి మరియు రెండవదిగా ప్రజల యెడల వారికి ఉన్న ప్రేమనుబట్టి పరిచర్య చేయాలి. మనము సంఘమును నిర్మించుటకు, మనకు ప్రజలయెడల కనికరము ఉండాలి. కాని ఆ కనికరమునకు ముందుగా, మన పరలోకపు తండ్రిని ఆయన ఆజ్ఞలకు లోబడునంతగా ప్రేమించాలి.

క్రొత్త నిబంధన సంఘమును నిర్మించుటకు ముఖ్యముగా రెండు అవసరము అయియున్నవి. తండ్రిని ప్రేమించుట మరియు ఇతరులను ప్రేమించుట. సిలువలో ఉన్నటువంటి నిలువు కమ్మి మరియు అడ్డ కమ్మి ఈ రెండింటిని చూపించుచున్నవి. నిలువు కమ్మితోనే గాని లేక అడ్డ కమ్మితోనే గాని మనము సిలువను కలిగియుండలేము. రెండు కమ్మీలు ఉంటేనే సిలువను కలిగియుండగలము.

మన జీవితములలో సిలువలోని రెండు కమ్మీలు కలిగియుండుట అనగా ఏమిటో మరియు క్రొత్త నిబంధన సంఘమును నిర్మించుటకు ఇవి ఏవిధముగా సహాయపడునో రాబోయే అధ్యాయములలో వివరిస్తాను.


అధ్యాయము 2
సిలువ యొక్క నిలువు కమ్మి

మొదటిగా ఉండవలసిన మన పరలోకపు తండ్రియైన దేవుని యెడల మనకున్న ప్రేమను సిలువలోని నిలువు కమ్మి చూపిస్తుంది. ప్రభువైన యేసు మరణించిన సిలువను తయారు చేసినప్పుడు వారు మొదటిగా నిలువు కమ్మిని తయారు చేసియుంటారు. మరియు ఆ కమ్మి అడ్డ కమ్మి కంటే రెండు రెట్లు పొడవు ఉండాలి.

అనగా పరలోకములో ఉన్న మన తండ్రితో మన సంబంధము చాలా ముఖ్యమైయున్నది. అది మొదటిగా ఉండాలి. దాని తరువాత, అడ్డ కమ్మి అనగా ఇతరులతో ఉన్న సంబంధము ముఖ్యమైయున్నది.

`



ప్రభువైనయేసు యొక్క మాదరిని వెంబడించుట


ప్రభువైన యేసు కల్వరి కొండమీదకు సిలువను మోసికొని పోకముందు, ఆయన భూమి మీద తన జీవితకాలమంతయు అంతరంగములో సిలువను మోసియున్నారు. భూమి మీద ఆయన జీవించిన 12,000 రోజులలో ప్రతిరోజు ఆయన అంతరంగ సిలువను మోసియున్నారు. మరియు ఆయన మనతో ఇట్లనుచున్నాడు, "నీవు నా శిష్యుడుగా ఉండాలని కోరినట్లయితే, అదే విధముగా నీవు కూడా ప్రతిరోజు నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి" (లూకా 9:23). భూమి మీద 12,000 కంటే ఎక్కువ రోజులు ప్రభువు ఒక నియమముతో జీవించారు. "మొదటిగా నా తండ్రియెడల నాకున్న ప్రేమను బట్టి మరియు ఆయన ఆజ్జలను నెరవేర్చుట, తరువాత ఇతరులను ప్రేమించుట ముఖ్యమైయున్నది".


అందువలనే తన భూసంబంధమైన తల్లిదండ్రులకు ఆయన 30 సంవత్సరములు లోబడి జీవించాడు. 30 సంవత్సరములలో ప్రతిరోజు పరిపూర్ణులుకాని మరియ, యోసేపులకు పూర్తిగా లోబడుటకు ఆయన ఎన్నో శోధనలను మరియు పరిస్థితులను జయించియుంటాడు. "తల్లిదండ్రులను సన్మానింపుము" అను తన తండ్రియొక్క ఆజ్ఞను నెరవేర్చుట ద్వారా తన తండ్రి సహవాసములో ఉన్న ఆనందాన్ని ఆయన అనుభవించుటకు సంతోషముగా ఆజ్ఞను నెరవేర్చాడు.


తన సిలువనెత్తుకొని మరియు ప్రతి విషయములో తన తండ్రికి లోబడే వైఖరిని తన జీవితకాలమంతయు ఆయన కలిగియున్నాడు. యేసే, క్రీస్తు యొక్క మొదటి శరీరమైయున్నాడు మరియు ఆయన ముప్పైమూడున్నర సంవత్సరములలో ప్రతిరోజు తన సిలువనెత్తుకొనియున్నాడు. ఈనాడు, ఆయన యొక్క ఆత్మసంబంధమైన శరీరమైయున్న మనము కూడా ఆ విధముగా చేయాలి.


కేవలము మారుమనస్సు పొందినవారు మాత్రమేగాక శిష్యులతో ఉన్న సంఘమే యేసుక్రీస్తు యొక్క సంఘము. తన స్వజీవాన్ని ఉపేక్షించుకుంటూ మరియు ప్రతిరోజు తన సిలువనెత్తుకొనువాడే శిష్యుడు (లూకా 9:23). కాబట్టి యేసు యొక్క జీవమనే క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త నిబంధన సంఘమనే క్రొత్త తిత్తిలో ఉండునట్లు యేసు జీవాన్ని పొందుటకు మన స్వజీవాన్ని ఉపేక్షించుకొనుచు మరియు ప్రతిరోజు మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలి. అప్పుడు మాత్రమే సంఘమును క్రీస్తు శరీరముగా నిర్మించగలము.


విశ్వాసియొక్క రహస్య జీవితము

సంఘమును నిర్మించుటకు ప్రభువుతో మనకున్న సంబంధము చాలా ముఖ్యమైయున్నది. మన వ్యక్తిగత జీవితములో ప్రభువుతో మనకున్న సంబంధము రహస్యముగా ఉంటుంది. బయటకు కనబడే బహిరంగజీవితమే దేవునియెడల భయభక్తులు కలిగియుండుట అని సాతాను అనేకమంది విశ్వాసులను మోసము చేయుచున్నాడు. కాని నిజమైనభక్తి 100 శాతం అంతరంగములో ఉండి, రహస్యముగా ఉంటుంది. ఇది మనయొక్క రహస్య జీవితము.

వైఖరులు, తలంపులు మరియు ఉద్దేశ్యములు క్రొత్త నిబంధనలో ముఖ్యమైయున్నవి.

ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగములో, రహస్య జీవితము గురించి చెప్పారు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలోవలే వ్యభిచారము చేయకుండుటయే గాక, అటువంటి తలంపులను కూడా ద్వేషించాలి. పాత నిబంధనలో మీరు ఎంత ఇచ్చారు, ఎంతగా ప్రార్థించారు మరియు ఎంతగా ఉపవాసము ఉన్నారనునది ముఖ్యమైయున్నది. కాని ఇప్పుడు కానుకలు ఇచ్చుట, ప్రార్థన మరియు ఉపవాసము ఉండుట ఇతరులకు తెలియకుండా రహస్యముగా చేయాలని ప్రభువు చెప్పారు. ఇదియే క్రొత్త నిబంధనలోని క్రొత్త ద్రాక్షారసం. క్రీస్తుయెడల మన యొక్క భక్తి రహస్యముగా ఉండుట గూర్చి మనము గ్రహించనియెడల క్రొత్త నిబంధనలో ముఖ్యమైన విషయం మనము గ్రహించలేము. ప్రభువు యెడల మన యొక్క భక్తి ఎల్లప్పుడు వ్యక్తిగతముగాను, రహస్యముగాను ఉండాలి.



"మన జీవం క్రీస్తుతోకూడా దాచబడి ఉండాలి" (కొలొస్స 3:3). ఈ విధంగా జీవించుట ఎంత అద్భుతం. క్రీస్తు యెడల మన భక్తిని ఎంత మరుగుగా ఉంచుతామో, అంత ఎక్కువగా ప్రభువు యొక్క రహస్యములను తెలుసుకుంటాము. ఇతరులకు తెలియకుండా మన పెళ్ళి కుమారునితో మనము సన్నిహిత సహవాసము కలిగియుండాలి. ఇతరులకు ఏ మాత్రమును తెలియకుండా, భార్యభర్తలు ఇద్దరు కలిసి సన్నిహిత సహవాసము కలిగియున్నప్పుడు అది శ్రేష్టమైన వివావాముగా ఉంటుంది. ఇటువంటి పెండ్లికుమార్తె ఆత్మను కలిగిన వారితో ప్రభువు సంఘమును నిర్మిస్తున్నాడు.


ఒకసారి తండ్రిని ప్రేమించుటలోను మరియు క్రీస్తుయెడల సరళమైన భక్తిని కలిగియున్న తరువాత అనగా నిలువుకమ్మీని పెట్టిన తరువాత అడ్డకమ్మి అనగా ఇతరులయెడల మనము ప్రేమను చూపగలము. అప్పుడు సిలువ పూర్తిచేయబడి, దానిమీద సంతోషముగా సిలువవేయబడెదము.


అధ్యాయము 3
సిలువ యొక్క అడ్డ కమ్మి

అడ్డ కమ్మిని మనము గాలిలో పెట్టనట్లయితే క్రింద పడుతుంది. కాని దానిని నిలువు కమ్మీకి మేకులతో కొట్టినట్లయితే అది సిలువ రూపంలో ఉండి మరియు స్థిరముగా ఉంటుంది. అయితే మొదటిగా నిలువు కమ్మి ఉండాలి.


మనము నిర్మించే సంఘములు క్రొత్త నిబంధన సంఘములై యుండాలి. ఎవరైతే, "నేను కోరినది నేను చెయ్యను. నా పరలోకపు తండ్రి దేనిని కోరితే దానినే నేను చేస్తాను" అని నిర్ణయించుకుంటారో వారు మాత్రమే అటువంటి సంఘములను నిర్మించెదరు.


చాలామంది క్రైస్తవులకు ఇటువంటి వైఖరి లేకపోవటము బాధాకరము. ఒకప్పుడు నా జీవితము కూడా ఆ విధముగానే ఉండెడిది. నేను విశ్వాసిని అని చెప్పుకొనుచు నా స్వంతమునే కోరుకొని మరియు నేను కోరినదానినే చేసియున్నాను. నా అభిప్రాయములకు అనుకూలముగా ఉన్న సంఘములో నేను ఉండాలని కోరియున్నాను. అన్ని విషయములలో నన్ను పోలియున్న వారితో నేను సహవాసము చేయాలని కోరియున్నాను. నాకు ఇష్టమైన వారితో నేను సమయమును గడిపాను.

ఎవరైనా నాకు ఇబ్బందికలిగించినట్లయితే, వారికి దూరముగా ఉండేవాడను. అది సిలువ మార్గములో వెళ్ళుటకాదు. ఆ విధముగా ఉన్నట్లయితే, మనము క్రీస్తు శరీరమును నిర్మించలేము. శ్రేష్టమైన బోధను విని కూడా మనము సిలువ మార్గములో లేకుండవచ్చును.


ప్రభువైన యేసు యొక్క నిజమైన శిష్యుడెవరు?


యోహాను 13:35లో ప్రభువు ఈవిధంగా చెప్పారు. "మీరు ఒకనియెడల ఒకరు ప్రేమ గల వారైన యెడల దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను". కాబట్టి అనేక సంవత్సరములు ఒకరియెడల ఒకరికి ఉన్న ప్రేమయే మనము ప్రభువైన యేసు యొక్క శిష్యులమనుటకు రుజువు అనుకొనువాడను. నేను వెళ్ళే స్థానిక సంఘములోని సహోదర సహోదరీలను ప్రేమించుటయే నేను శిష్యుడను అనుటకు రుజువు అనుకొనేవాడిని. కాని ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, క్రైస్తవేతరులు మనలను ప్రభువు శిష్యులుగా గుర్తించుటకు అది సాక్ష్యమైయుంటుందని గుర్తిస్తాము. అది సిలువ యొక్క అడ్డ కమ్మి.

కాని మన స్వయాన్ని ఉపేక్షించుకొనుచు మరియు స్వచిత్తాన్ని సిలువవేయుటయే శిష్యుడుగా ఉండుటకు షరతని ప్రభువైనయేసు మొదటిగా చెప్పారు (లూకా9:23). ఎవరూ చూడలేని నీ హృదయములోను, నీ అంతరంగజీవితములోను నీవు శిష్యుడవని దేవుడు చూడాలి. నిన్ను నీవు ప్రతి రోజు ఉపేక్షించుకొనుచున్నయెడల దానిని దేవుడు చూచి, నీవు లూకా 9:23 ప్రకారము క్రైస్తవుడవని సాక్ష్యము చెప్పును. అతడే నిజమైన క్రైస్తవుడు ఎందుకనగా "శిష్యులే క్రైస్తవులుగా పిలువబడిరి" (అపొ.కా. 11:26).

తరువాత ప్రభువైన యేసు యొక్క ఇతర శిష్యులను నీవు ప్రేమించుటను బట్టి, ఇతరులు నీవు ప్రభువు యొక్క శిష్యుడవని తెలుసుకుంటారు.

కాని గమనించండి, నిలువు కమ్మి అనగా మొదటిగా దేవునియెడల నీ ప్రేమను గూర్చి ఆయన సాక్ష్యమివ్వాలి. కాబట్టి నీవు స్థానిక సంఘములోని ఇతరులను ప్రేమించినంత మాత్రమున నీవు ప్రభువుయొక్క శిష్యుడవు కాదు! ఇతరులను మానవసంబంధమైన ప్రేమతో ప్రేమించి, నీవు శిష్యుడవని మోసపోవద్దు. ప్రతి ఆదివారము నీవు ఇతర విశ్వాసులతో ఉండుటకు ఇష్టపడినయెడల, అది నీవు శిష్యుడవని అనటానికి రుజువు కాదు. నిన్ను నీవు ఉపేక్షించుకొనుట ద్వారాను మరియు ప్రభువైన యేసును పూర్ణహృదయముతో ప్రేమించుట ద్వారానే నీవు సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము మరియు శనివారము శిష్యుడుగా ఉండగలవు. అనగా ప్రతిరోజు ఆయన ముఖము ఎదుట జీవిస్తావు.

నిజమైన యేసుయొక్క శిష్యుడు తన పెండ్లి కుమారునితో సన్నిహిత సహవాసాన్ని మొదట కోరుకుంటాడు కాబట్టి అతనికి వారములోని ప్రతిరోజు సమానమే. తన ప్రభువుతో తనకున్న సహవాసములో నుండి ఇతర శిష్యులతో సహవాసము ప్రవహిస్తుంది. అటువంటి శిష్యుడు, తమ సంఘానికి ఎవరు వచ్చి చేరినా లేక ఎవరు విడచిపెట్టినా ప్రభావితము చేయబడడు. ఎవరి జీవితములోనైతే ప్రభువైన యేసే ముఖ్యమైనవాడుగా ఉంటాడో, అటువంటి వారితోనే నిజమైన సంఘము నిర్మింపబడుతుంది.

ఒక నిలువు కమ్మితోగాని లేక ఒక అడ్డ కమ్మితోగాని సిలువను నిర్మించలేము. కాని అనేకమంది విశ్వాసులు మరియు అనేక సంఘములు ఏదో ఒకటి అనగా ఒక నిలువు కమ్మినిగాని లేక అడ్డ కమ్మినిగాని మాత్రమే ప్రాముఖ్యమైనదిచేయుట దురదృష్టకరం.

క్రైస్తవులు మూడు రకాలుగా కలుసుకొనుట నేను చూశాను. అవి:

1 సమాజములు

2 క్లబ్ (కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘము)

3 స్థానికముగా వ్యక్తపరిచే నిజమైన సంఘము

చివరిది మాత్రమే క్రొత్త ద్రాక్షారసము కొరకు ఉన్న క్రొత్త తిత్తి


అధ్యాయము 4
సమాజము

నిలువు కమ్మీలు ఒక గుంపుగా కలిసినట్లయితే సమాజము అవుతుంది. నేను వెళ్లిన అనేక సంఘములు ఈ విధముగా ఉన్నవి. ఒక మంచి సమాజములోని ప్రజలు, దేవునితో వ్యక్తిగతముగా నడుచుటకును మరియు బైబిలును ధ్యానించుటకును ఇష్టపడతారు. మంచి సిద్ధాంతమును ఇష్టపడతారు. కాని వారు అనేక పరిమాణాలలో వేరు వేరుగా ఉన్న కమ్మీలవలె ఉంటారు అనగా ప్రభువు యెడల వారి భక్తి విషయములో వ్యత్యాసము ఉంటుంది. వారు ఒకరితో ఒకరు సహవాసాన్ని నిర్మించరు మరియు వారికి ఇబ్బందికరముగా ఉన్న వారికి దూరముగా ఉంటారు. నేను కూడా అనేక సంవత్సరములు అనేక అద్భుతమైన సత్యములను విని, దేవునితో నా వ్యక్తిగత జీవితము బాగానే ఉన్నదని తృప్తిపడ్డాను, కాని యోహాను చెప్పినట్లు, "తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు?" (1 యోహాను 4:20). "సమాజములలో" ఉన్న వారు ఈ వచనాన్ని గురించి శ్రద్ధ చూపరు.

నీకు నిలువు కమ్మి ఉన్నది కాబట్టి నీవు సిలువను కలిగియున్నావని నీవనుకోవచ్చని యోహాను చెప్పుచున్నాడు. మీ సమాజములోని ఇతరులతో నీకు సహవాసము లేదు కాని నీవు కొంత బాహ్యమైన పరిశుద్ధతను కలిగియున్నావు.


"సమాజము" పాత నిబంధన పద్ధతి:


సమాజములో సహోదర సహోదరీలు ఒంటరిగా ఉండి, ఇతరులతో సహవాసాన్ని కోరరు కాని స్నేహితులుగా మాత్రము ఉంటారు. ప్రేమలో ఒకరితో ఒకరు నిర్మించబడుటకు వారు ఇతరులతో సమయాన్ని గడపరు. పాత నిబంధనలోని ఇశ్రాయేలులో కూడా అలాగే ఉండెడిది. అటువంటి సమాజములో భార్యభర్తలు కూడా సహవాసాన్ని కలిగియుండరు ఎందుకనగా వారిలో ఒకరు "ఎక్కువ ఆత్మీయులు" కాబట్టి. ఉదాహరణకు, భార్య పిల్లలతోను, అనేక పనులతో ఒత్తిడిలో ఉండగా, భర్త ఆమెకు కొంచెముకూడా సహాయపడకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. అటువంటి మనుష్యుడు "సమాజపు" వైఖరిని కలిగియుంటాడు.


అటువంటి వ్యక్తిని క్రైస్తవుడని పిలువవచ్చునో లేదో నాకు తెలియదు. అతడు బైబిలు చదువుతూ, ప్రార్థిస్తూ మరియు సంఘానికి కానుకలు ఇస్తున్నందు వలన, తాను ఆత్మీయుడను మరియు ప్రభువైన యేసు యొక్క శిష్యుడనని ఊహించుకుంటాడు. కాని అది తననుతాను మోసిగించుకోవడమే. బాహ్యమైన క్రైస్తవ పరిచర్యలు చేయుట ద్వారా క్రీస్తుయొక్క శిష్యుడనని సాతాను అనేక సంవత్సరములు నన్ను మోసిగించినట్లే, సాతాను అనేకమంది క్రైస్తవులను మోసగించుచున్నాడు.


ఇది పాత నిబంధన మతము మరియు సమాజము అను మాట పాత నిబంధనకు సంబంధించియున్నది.


మోషే వారికి ధర్మశాస్త్రమును ఇచ్చినప్పుడు వారు సమాజమైయున్నారు. వారు సమాజముగా కూడి ఏ విధంగా ఆరాధించాలో వివరముగా దేవుడు ఆజ్ఞాపించిన తరువాత వారు వ్యక్తిగతముగా (స్వతంత్రంగా) కలిసేవారు. వ్యక్తిగతముగా పరిశుద్ధులుగా జీవించుటకు దేవుడు వారిని ఆహ్వానించియున్నాడు.

ఇశ్రాయేలు చరిత్రలో, మోషే లాంటి "ఒక్క నాయకుడు" మరియు ఏలీయాలాంటి "ఒక్క ప్రవక్త" ఉండేవారు. కాని ఇద్దరు నాయకులుగాని లేక ఇద్దరు ప్రవక్తలుగాని కలిసి పనిచేసినట్లుగాని లేక సహవాసము కలిగియున్నట్లుగాని లేక కలిసి పరిచర్య చేసినట్లుగాని మనము చూడము. అది క్రొత్త నిబంధనలోనే సాధ్యమవుతుంది. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో ఉండుట అనే నియమమును బట్టి జరుగుతుంది.


పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులు వారి స్వంతజీవితములను మరియు వారి కుటుంబములను గూర్చి జాగ్రత్తవహించేవారు. వారిలో కొందరు పవిత్రులైనప్పటికీ ఇతరులతో కలసి సహవాసము చేసెడివారు కాదు. పాత నిబంధనలో "సహవాసము" అనుమాట లేదు. వారు ఒంటరిగా సంచరిస్తూ - కొందరు దేవుని పరిచర్యలు చేసేవారు. పాత నిబంధనలో వారు, ఒక శరీరముగా నిర్మించబడుట అసాధ్యము గనుక వారు శరీరములోని అవయవములవలె సహవాసాన్నిగాని లేక కలసి పరిచర్యనుగాని వారు కోరలేదు. అది ఒక సమాజము మాత్రమే.


క్రొత్త ద్రాక్షారసము మరియు క్రొత్త తిత్తి:


కాని ఇప్పుడు ప్రభువుచేత క్రొత్త నిబంధన స్థాపించబడింది. మనము క్రొత్తగా జన్మించినప్పుడు, క్రొత్త ద్రాక్షారసమైయున్న క్రీస్తు యొక్క జీవాన్ని పొందుతాము. ఈ జీవము పాత నిబంధనలోవలె స్వతంత్రముగా జీవించుటకు కాదు. మనము పొందిన ఈ క్రీస్తు జీవాన్ని స్వతంత్రులముగా జీవించుటకు అనగా ఎల్లప్పుడు కేవలము మన కుటుంబము గురించే ఆలోచన కలిగియుంటూ, క్రొత్తగా జన్మించిన ఇతర విశ్వాసులతో స్థానిక సంఘములో సహవాసాన్ని నిర్మించనట్లయితే, ప్రభువు హెచ్చరించినట్లు మన జీవితము (పాత తిత్తి) పిగిలి పోతుంది. దేవుడు మనలను క్రొత్త ద్రాక్షారసమైయున్న తన పరిశుద్ధాత్మతో మనలను నింపును మరియు క్రీస్తు శరీరమైన సంఘములో అనగా క్రొత్త తిత్తిలో కుమ్మరించాలని కోరుచున్నాడు.

దేవుడు నాలో ఈ కార్యము చేశాడు కాబట్టి మనమందరము దీనిలో ప్రవేశించునట్లు ఆయన చేయునని నమ్ముచున్నాను. నేను "సమాజపు" క్రైస్తవుడిగా ఉన్నప్పుడు దేవుని కనికరము నామీద ఉండుట వలన నా జీవితములోనిదంతయు విరిగి తెగిపోయింది. అప్పుడు దేవుడు నాతో ఇట్లన్నాడు, "క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తిలో పోయనిస్తావా?" నాలోనిదంతయు విరిగి(పగిలి)పోవుట వలన పాత ద్రాక్షారసతిత్తి నుండి విడుదలపొందాను. దేవుడు నాయొక్క పాత ద్రాక్షరస తిత్తిని పగులకొట్టుట మంచిదైయున్నది. నేను పరలోక విషయములలో కాక భూలోక విషయముల మీద నమ్మకముంచియున్నట్లు అప్పుడు గుర్తించాను. సంఘ నిర్మాణ విషయములో నేను మనుష్యుల ఆచారముల మీదను మరియు నా స్వంత ఉద్దేశ్యాల మీదను నమ్మకము ఉంచియున్నాను.


చాలామంది క్రైస్తవులకు దైవభక్తి భాహ్యమైనదిగా ఉన్నది. వారు సంఘకూటములకు వెళతారు. వారు ప్రార్థిస్తారు, మర్యాదగా కూటములో కూర్చుంటారు మరియు వారందరు మతానుసారమైన భాషలో మాట్లాడెదరు. వీటినిబట్టి వారు ఆత్మీయులని ఊహించుకుంటారు. కాని వారితో మన నిజ జీవితములో జరిగే సంఘటన గురించి మాట్లాడలేము ఎందుకనగా అవి లోక సంబంధమైనవై మరియు ఆత్మ సంబంధమైనవి కాదని వారు అనుకుంటారు. వారు "మత సంబంధమైన" విషయాలు మాత్రమే మాట్లాడెదరు. సాధారణమైన సంగతులను ఒకరితో ఒకరు మాట్లాడుకొనుటను అనుమతించదు గనుక ఇది నకిలీ క్రైస్తవ్యము.


ప్రభువు తన శిష్యులతోను మరియు ప్రజలతో మాట్లాడిన ప్రతిసారి ఆయన పాత నిబంధనలో నుండి మాట్లాడేవారు కాదు. అవసరమైనప్పుడు ఆయన మాట్లాడియున్నారు. ఉదాహరణకు సాతానుతో మాట్లాడినప్పుడుగాని లేక పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు ఇచ్చినప్పుడు పాత నిబంధననుండి చెప్పేవారు. కాని ముఖ్యముగా ఆయన సాధారణముగా ప్రతిరోజు జరిగే విషయముల గురించి శిష్యులతో మాట్లాడేవారు. నకిలీ ఆత్మీయతతో ఆయన ఎప్పుడైనను మాట్లాడలేదు. క్రొత్త ద్రాక్షారసమంటే ఏమిటో ఆయన చూపించారు.

మతానుసారమైన భాషలో మాట్లాడే వారితో మనము మతసారమైన భాషలో మాట్లాడుచూ, సంఘమును నిర్మిస్తున్నామని ఇతరులకు అభిప్రాయమును కలిగించవచ్చును. బైబిలులోని వచనాలను ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు మరియు కూటములలో మనము వినిన వాక్యమును ఇతరులతో చెప్పుట, ఆత్మీయత అని ఊహించుకోవచ్చును. కాని అది ప్రాణములోనే జీవించునట్లు చేయును.


గోధమగింజ భూమిలోపడి మరియు మరణించుట:


ఈ రోజులలో వేలమంది వెళ్లుచున్న పెద్ద సంఘములను గురించి ఆలోచన చేయండి. వారిలో ఏ ఇద్దరిలో కూడా నిజమైన దైవికమైన సహవాసము లేకుండవచ్చును. గంభీరమైన సంగీతము మరియు బోధను బట్టి వారు అక్కడ ఆకర్షింపబడవచ్చును. అది క్రీస్తు శరీరమును వ్యక్తపరచుట కాదు. దేవునితో తమకున్న సంబంధాన్ని గురించి మాత్రమే ఆలోచించే నిలువు కమ్మీలు గుంపులుగా కలుస్తారు. అడ్డ కమ్మీ లేదు కనుక ఇది మోసము. మరియు అక్కడ సిలువ కూడా లేదు.


ప్రభువైన యేసు ఇట్లన్నారు, "గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును. అది చచ్చినయెడల బహుగా ఫలించును"(యోహాను 12:24). వారికి వారు ఉపేక్షించుకొని, చనిపోయినవారే నిత్యత్వానికి నిలిచే నిజమైన ఫలమును ఫలించగలరు. 10,000 గోధుమ గింజలను బంగారు పాత్రలో పెట్టి చూపించినట్లయితే అది లోకస్థులకు చూచుటకు ఎంతో బాగుంటుంది. పెద్ద సంఘములలో అటువంటి వేల గోధుమ గింజలు ఒకరి తరువాత ఒకరు కూర్చొని యుండవచ్చును. నేను దానిని చూచినప్పుడు ఇట్లనుకుంటాను, "వాటిలో రెండు గోధుమ గింజలు తమ స్వజీవానికి చనిపోయి, ఒకరితో ఒకరు సహవాసాన్ని నిర్మించినయెడల వారిచుట్టూ ఉన్న లోకానికి క్రీస్తు శరీరమును బయలుపరచుటకు దేవుడు వారిలో పనిచేసి యుండెడివాడు. అప్పుడు అక్కడున్న శేషించిన వారు కూడా శరీరముగా నిర్మించబడతారు".

భూమిలోపడి మరియు చనిపోవుటకు సిద్ధముగాలేని అనేక గోధుమ గింజలను మన సంఘములలో సమకూర్చుట నుండి దేవుడు మనలను కాపాడునుగాక. భూమిలోపడి మరియు చనిపోవుటకు సిద్ధముగా ఉన్న ఒక్క గోధుమ గింజతో దేవుడు పనిని ఆరంభిస్తాడు. తరువాత దేవుడు అతనితో మరొకరిని, మరొకరిని కలుపుతూ ఉంటాడు. ఆ విధముగా లోకము యొక్క ఆకలిని తీర్చగల సంఘమనే క్రీస్తు శరీరము నిర్మించబడుతుంది. కాని, చనిపోని గోధుమ గింజ ఆకలిగొని మరియు అవసరములో ఉన్న లోకానికి నిజమైన రొట్టెను కాకుండా కేవలము రొట్టెయొక్క బొమ్మను చూపించగలదు. గోధుమ గింజ భూమిలో పడి మరియు చచ్చినయెడల తప్పుకుండా బహుగా ఫలించునని ప్రభువైన యేసు చెప్పారు.


గోధుమ గింజ ఎంత చిన్నదంటే, నీవేళ్ళ మధ్యలో దానిని పెట్టికొనిన యెడల, దానిని చూడలేము. ఇతర క్రైస్తవ సమాజములు మరియు సంఘములచేత తృణీకరించబడినప్పటికీ, మీరు కూడా అలాగే ఒక చిన్న గుంపుగా ఒక స్థలములో కలువవచ్చును. అప్పుడు నిరాశపడవద్దు. మీ చుట్టుప్రక్కల ఉన్న పెద్ద సంఘముల యొక్క పాస్టర్లు గొప్ప ప్రసంగాలు చేసి మరియు పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ మరియు ఖరీదైన కార్లలో తిరుగవచ్చును. ఆవిధముగా వారిని చేయనివ్వండి. వారి మీద ఆసూయ పడవద్దు. భూమిలో పడి మరియు చనిపోవుటయే మన పిలుపు. నిత్యత్వానికి నిలిచే ఫలములను ప్రభువు మనలో నుండి తీసుకురాగలడు. అది ఆయన చేసిన వాగ్ధానము. నిజమైన సంఘమును నిర్మించుటకు ఇదియే రహస్యము.


అధ్యాయము 5
క్లబ్ (కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘము)

క్లబ్ అనేది సమాజానికి చాలా వ్యత్యాసముగా ఉంటుంది.

మనము చూచినరీతిగా సమాజములో, కొందరు ప్రభువుయెడల ఎక్కువ భక్తి (ప్రేమ) కలిగి మరియు కొందరు తక్కువ భక్తి (ప్రేమ) కలిగి నిలువు కమ్మీల వలె ఉంటారు. కాని వారిలో ఒకరితో ఒకరికి సహవాసము ఉండదు.

కాని క్లబ్లో ఒకరియెడల ఒకరు జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఇది కొందరికి అపాయకరముగా ఉండవచ్చును. ఎందుకనగా సమాజముతో పోల్చుకొని, సరే మనమైతే ఒకరియెడల ఒకరము జాగ్రత్త పడెదమని సులభముగా భావించవచ్చును. కాబట్టి ఇతరులతో మంచిగా మాట్లాడి మరియు మంచి సహవాసము కలిగియున్నామని భావించవచ్చును. అందరు ఒకే సిద్ధాంతమును కలిగియుండి, ఒకే లాగున బట్టలు ధరించుట మొదలగునవి ఆత్మీయులని ఊహించుకొనుట సులభము. కాని అందరు ఒకే పరిమాణము కలిగిన కమ్మీలు మాత్రమే.


ఒక క్లబ్ "నిబంధన లేని" మతము:


మనలో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధము తెలుసుకొని సహవాసము కలిగియున్నట్లయితే మనము ఒక క్లబ్గానే ఉండి మరియు మరింత అపాయములో పడవచ్చును. ఇతరులను మనలో కలవమని ఆహ్వానించి, వారు అన్ని విషయాలలో మనవంటి వారివలె ఉండవలెననియు, మన వలె మాట్లాడి మరియు మనవలె ప్రవర్తించాలని కోరెదము. ఆవిధముగా వారును ఒక క్లబ్గా మారి, అందరును ఒకే పరిమాణములో ఉండి మరియు ఒకే రకమైన క్రైస్తవులుగా ఉండెదరు. అందరూ ఒకే విధముగా మతపు భాషలో మాట్లాడుట మీదనే వారి సహవాసము ఆధారపడియుండును.

వేరే జాతికి చెందినవారితోను మరియు వేరే భాషలు మాట్లాడేవారితోను మనము కలిసిమెలసి ఉండవచ్చును. మనవలె చదువుకొనని మరియు సిద్ధాంతములను ఎరుగని మరియొక సహోదరుడు మన సంఘములో చేరినట్లయితే అతనితో సరిగా సహవాసము చేయలేము. కాబట్టి అతనిని దూరముగా ఉంచుటవలన అతడు వెనుకంజ వేసి చివరకు ఆ క్లబ్ను విడిచిపెట్టవచ్చును. అతడు మనలో ఇమడలేకపోయాడు. అటువంటి వారు పాత నిబంధనలోగాని, క్రొత్త నిబంధనలోగాని లేకుండా ఒక గుంపుగా ఉన్నారు. అక్కడ ఏ నిబంధనా లేదు.


సమాజము పాత నిబంధన మీద ఆధారపడియుండి, ఇతరులతో సహవాసము లేకుండా ఉండి మరియు దేవునితో మాత్రమే కొంత సహవాసాన్ని కలిగియుంటారు. మీరు దానికి స్పందించి, చివరకు ఏ నిబంధనలో లేకుండా ముగియవచ్చును. పాత నిబంధననుండి మరియు ధర్మశాస్త్రమునుండి దేవుడు వారిని విడిపించియున్నాడని తలంచి చివరకి ఏ నిబంధనయులేని వారవుతారు. ఆటువంటి వారు పౌలు వ్రాసిన గలతీ పత్రికను ప్రేమించి మరియు దానిలోని ధర్మశాస్త్రమునుండి స్వతంత్రులమగుటను గురించి అపార్థము చేసుకొనెదరు. వారు నిబంధనను ఇష్టపడరు.


కాని నిబంధన లేకుండా క్రీస్తు వివాహము జరుగదు.


నేను మరియు నా భార్య వివాహము చేసుకొనినప్పుడు, మేము ఒక నిబంధనలో ప్రవేశించాము. వివాహనియమముల పుస్తకము లేకపోయినప్పటికీ, ప్రేమను బట్టి కొన్ని నియమములు ఉంటాయి. ఉదాహరణకు దేవుని కృపనుబట్టి నేను నా భార్యను ఎప్పుడైనను మోసగించలేదు. నీవు వివాహము చేసుకొనిన తరువాత ఇది చేయకూడదు లేక అది చెయ్యకూడదు అని వివాహనియమముల విషయములో ఒక పుస్తకము ఉన్నందువలన కాదు కాని నా భార్యను ప్రేమిస్తున్నాను కనుక నేను నమ్మకముగా ఉంటాను. నేను ఆమెను ప్రేమిస్తున్నాను కనుక ఆమెను బాధించేదేదైనను నేను చేయవద్దని కోరుచున్నాను. క్రీస్తుతో మన వివాహవిషయములో కూడా - మొదట ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నా పూర్ణహృదయముతో ఆయనను ప్రేమిస్తాను. ఒక పుస్తకములోని నియమములను బట్టి కాక ప్రేమ నియమమును బట్టి నా సంబంధము ఆయనతో ఉన్నది.


కాని క్లబ్లో అనేక నియములు ఉండును. మానవుల ఆచారములు - దేవుని ఆజ్ఞలకంటే కఠినమైనవి పాటిస్తేనే ఆ క్లబ్లో నీవు ఉండగలవు.


దేవునితో నీకు ఏ నిబంధన లేనప్పుడు, ఇతరుల సంబంధాల విషయంలో నీ స్వంత నిబంధనను నీవు చేసుకోవాలి. "నీవు నా వీపు మీద గోకినట్లయితే, నేను కూడా నీకు అలాగే చేస్తాను. నీవు నన్ను మర్యాదగా మంచిఆ చూసినట్లయితే, నేను కూడా నీయెడల అలాగే చేస్తాను. కాని నీవు నన్ను ఆ విధముగా చేయుట ఆపివేసినట్లయితే, నేను కూడా అట్లే చేస్తాను" చాలా మంది విశ్వాసులు ఇటువంటి సంబంధాన్ని కలిగియుంటారు.


క్లబ్ ద్వారా కొన్ని భూసంబంధమైన మేలులు కలుగును. "సంఘ కూటములకు" మీరు వెళ్లవచ్చును, మీ పిల్లలు ఇతర పిల్లలతో కలుస్తుండవచ్చును, అక్కడ మీకు వివాహము జరుగవచ్చును మరియు అక్కడ మీకు భూస్థాపనము మంచిగా జరుగవచ్చును,


క్లబ్ జీవితం దౌర్భాగ్యమైన జీవితానికి నడిపిస్తుంది:


విశ్వాసులు ఇటువంటి స్నేహాన్ని ఒకరితో ఒకరు కలిగియున్నప్పుడు, వారు కేవలము కమ్మీలవలె ఉంటారు. వారిలో కొందరు ప్రభువు యెడల కొంత భక్తి, ప్రేమ కలిగియుంటారు కాని నిలువు కమ్మీ చాలా చిన్నదిగా ఉంటుంది. కొందరిలో నిలువు కమ్మీ ఉండదు.


నీవు క్రీస్తు న్యాయపీఠము యెదుట నిలువబడినప్పుడు మేలుకొని మరియు నీవు మంచి క్రైస్తవ క్లబ్ భాగస్థుడవుగా ఉన్నావని కనుగొనవద్దు.


నీ భార్యగాని లేక భర్తగాని లేక మరెవరైనగాని బలవంతపెట్టుటవలన నీవు "సంఘములో" చేరావా? లేక మంచి ప్రసంగములను వినుటకును మరియు నీవు సహాయము పొందుచున్నావు కాబట్టి నీవు సంఘములో చేరావా?

నీవు మంచి బోధను వినినందువలన నీవు గ్రహించియున్నావు కాబట్టి ఆత్మీయుడవనుకొని సులభముగ నిన్ను నీవు మోసగించుకోవచ్చును. వేరే "సంఘములలో" కంటే మీ "సంఘములో" మంచి ప్రసంగములు వినుచున్నందుకు నిన్ను నీవు అభినందించుకోవచ్చును. కాని క్రీస్తును ప్రేమించే నిలువుకమ్మీ నీలో లేకపోవచ్చును. అప్పుడు దేవుని రాజ్యములో నీవు ప్రవేశించలేనందుకు, క్రీస్తు న్యాయపీఠము యెదుట నీవు బహు దుఃఖపడవచ్చును.


మనము విమానాశ్రయమునకు వెళ్లినప్పుడు, మన సామానును తీసుకొని వెళ్లుటకు అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఆ సామానులు భద్రత పరీక్ష జరిగి మరియు అవి గమ్యానికి చేరుతాయి. క్రీస్తు న్యాయపీఠము ఈ విధముగా ఉంటుందని నేను ఊహించుకుంటాను. కాని అక్కడ పెద్ద కొలిమి ఉంటుంది. మన జీవితములోని కార్యములన్నిటినీ దేవుడు ఆ కొలిమిలో గుండా పంపిస్తాడు. మనము భూమిమీద జీవించిన విధానమును బట్టి ఫలితము ఉంటుంది. చాలామంది విశ్వాసులు చేసినదంతయు కొయ్య, గడ్డి, కొయ్యకాలు కాబట్టి అంతయు కాలిపోతుందని 1 కొరింథీ 3:13-15 లో చెప్పబడింది. బహుమానమేమియు ఉండదు.


భూమిమీద వారి జీవితములను వ్యర్థము చేసుకున్నామని ఆ రోజున మంచి "సంఘములలో" కూర్చున్న వారనేకులు ఆశ్చర్యపోవుదురు.


అనేకులు మంచి "సంఘములకు" అనేక సంవత్సరములు వెళ్ళి, అనేక మంచి ప్రసంగములను వినిన వారితో ప్రభువు ఈవిధముగా చెప్పును, "నీ భూలోక జీవితము వృథా అయిపోయింది ఎందుకనగా నీవు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ఎరుగను మరియు నీవు నన్ను ఎరుగవు. నీవు నాతో కలిసి నడువలేదు. నీవు ఒక్కసారి కూడా నీ సిలువనెత్తుకోలేదు" (మత్తయి 7:22,23). అది చాలా బాధాకరము.


మన భద్రత ప్రభువులో ఉన్నదా లేక సంఘములో ఉన్నదా?


క్రీస్తుయేసుయొక్క సంఘము నాకు ఈ భూమిమీద అత్యంత సంతోషకరమైన స్థలమైయున్నది. నా హృదయాంతరంగములో నుండి దానిని చెప్పుచున్నాను. పరిశుద్ధులతో సహవాసము ఎంతో మధురమైనది. అయితే పరలోకమందున్న నా తండ్రితోగాని మరియు ప్రభువైన యేసుతోగాని ఉన్న సహవాసము కంటే మధురమైనది కాదు. ప్రభువైన యేసుతోను మరియు తండ్రితోను నా సహవాసము నా యొక్క భూలోక జీవితములోగాని లేక నిత్యత్వములోగాని ఎన్నటికీ అగిపోదు. ఇప్పుడు ఆ సహవాసము ఆధారముగానే దేవుని ప్రజలతో నేను సహవాసము చేస్తాను.


అయితే క్లబ్లో ఉన్నవారు, ప్రభువులోకాక క్లబ్లో భద్రతను కలిగియుంటారు. దైవజనులనుండి వినుటలో వారు భద్రతను కనుగొంటారు. ఈ సంవత్సరము నీవు అనేక ప్రసంగములను విని యుండవచ్చును. కాని అది నిన్ను ప్రభువైన యేసుకు శిష్యుడుగా చేయలేదు.


క్లబ్లో ఉన్నవారు ఎల్లప్పుడు పొగడబడుటకు మరియు గారాబముగా చూడబడుటను కోరెదరు. మరియు వారిని ప్రత్యేకమైన వారుగా చూడనట్లయితే అభ్యంతర పడతారు. వారు ఘనతను మరియు మనుష్యుల అంగీకారమును కోరెదరు. ఇతరులకు కనబడుటకును మరియు ఇతరులచేత మర్యాదగా చూడబడుటకును వారు కోరెదరు. సంఘపెద్ద వారిని ఏదొక విషయములో దిద్దుబాటు చేసినట్లయితే, వారు వెంటనే అభ్యంతరపడి మరియు ఆ క్లబ్ను కూడా విడిచిపెట్టవచ్చును.


ఒక దైవికమైన నా కంటే పెద్ద సహోదరుడు నన్ను సరిదిద్దినప్పుడు నేను అభ్యంతరపడినయెడల అది నేను "క్లబ్" క్రైస్తవుడనని రుజువు పరచుచున్నదని ప్రభువు నాకు చూపించారు. కాని నేను వారితో అనేక సంవత్సరములు కూర్చొనవచ్చును గాని క్రీస్తు న్యాయపీఠము ఎదుట మాత్రమే నేను ఒక మంచి క్లబ్ సభ్యుడనని కనుగొందును. సరిదిద్దినప్పుడుగాని లేక గద్దించినప్పుడుగాని మనము అభ్యంతరపడకుండునట్లు దేవుడు మనలను రక్షించునుగాక.


మనలను ప్రేమించే పెద్దలను మరియు మన కంటే పెద్ద సహోదరులను దేవుడు మనకు అనుగ్రహించి మరియు వారు ప్రేమతో దేవుని వాక్యాన్ని మనకు చెప్పుదురు. తమ బిడ్డలను ప్రేమించే తండ్రులు బెత్తమును ఉపయోగిస్తారు కాబట్టి వారు కూడా బెత్తాన్ని ఉపయోగిస్తారు. మన పరలోకపు తండ్రి ప్రేమించినట్లే వారు మనలను ప్రేమిస్తారు. కాబట్టి అటువంటి దైవజనులు మాట్లాడినప్పుడు మీరు అభ్యంతరపడి లేక తిరుగుబాటు చేసినట్లయితే, మీరు మానసికముగా క్లబ్ వారైయున్నారు.


దాని ఫలితముగా మీలో అత్మీయ అభివృద్ధి ఉండదు. మరియు మీలో ఆత్మీయ ఎదుగుదల లేనట్లయితే, మీరు వెనుకంజవేస్తారు. క్రైస్తవ జీవితములో ఎల్లప్పుడు ఒకేలాగున ఉండుటలేదు. దైవికమైన పెద్ద సహోదరుడు మనలను గద్దించినప్పుడు అభ్యంతరపడినయెడల, మనము ఆత్మీయముగా దిగజారినట్లే అలాగే కొనసాగినట్లయితే చివరకు నరకానికి కూడా వెళ్ళవచ్చును.


మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించియున్నాడు. కాబట్టి ప్రేమతో ఆయన మనలను శిక్షించినప్పుడు సహించమని హెబ్రీ 12:5-8లో చూస్తాము. ఆవిధముగానే తండ్రి హృదయము కలిగిన మన సంఘపెద్దలు (1 కొరింథీ 4:15లో పౌలువలె), మనము దిగజారిపోయి మరియు నశించకుండునట్లు మనలను గద్దించెదరు. ఈ గద్దింపును బట్టి మనము కోపబడి, ఆగ్రహించినట్లయితే, మనము క్లబ్లో ఉన్న వారివలె ఉన్నామని రుజువు పరచుచున్నది. చివరకు నష్టపోయెదము.


అధ్యాయము 6
నిజమైన సంఘము

క్రొత్త నిబంధనలో పాత నిబంధనలోలేని అనేక మాటలున్నాయి. అందులో ఒకమాట "సహవాసము".


పెంతెకొస్తు రోజున, గొప్ప ఉజ్జీవము కలిగినందువలన మూడు వేలమంది క్రొత్తగ జన్మించారు. వారు తరువాత పదిరోజులు గుడారపు ఉజ్జీవకూటములు పెట్టలేదు. ఈ రోజులలో ప్రజలు దానినే చేయుచున్నారు. దానికి బదులుగా, అనగా ఉజ్జీవకూటములు పెట్టకుండా, వెళ్ళి సంఘమును నిర్మించమని దేవుడు ఆ శిష్యులకు చెప్పాడు.

అపొ.కా 2:42లో "వారందరు సహవాసము కలిగియుండిరి" అని చదువుతాము. బైబిలులో ఆ మాట మొదటిసారి వచ్చింది. దాని గ్రీకు పదానికి అర్థము, "కలసి పంచుకొనుట".


సిలువ యొద్ద నుండి ప్రవహించు ప్రేమ:

శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన ఫలితముగా వెంటనే వారు సహవాసాన్ని కలిగియున్నారు. ఈనాడు పరిశుద్ధాత్మతో నింపబడియున్నామని చెప్పుచున్న క్రైస్తవులు, ఇట్లనుచున్నారు, "నేను అన్యభాషలలో మాట్లాడుచున్నాను" లేక "నేను రోగి కొరకు ప్రార్థించినప్పుడు అతడు స్వస్థత పొందియున్నాడు" (కనీసం అతడు స్వస్థత పొందియున్నాడని నేను అనుకొనుచున్నాను) లేక "ఇప్పుడు నేను గంభీరముగా మాట్లాడుచున్నాను" మొదలగునవి.


కాని పెంతెకొస్తు రోజున, వారు పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఉజ్జీవ కూటము నుండి వెళ్ళి, ఒకరితో ఒకరు సహవాసము చేసిరి (అపొ.కా. 2:42). పరిశుద్ధాత్మతో నింపబడుట వలన మొదటిగా వారు సహవాసము చేశారు.


1 కొరింథీ 12:13లో "మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి" అని చదువుతాము. అక్కడ సంఘము ఒక సమాజముగాగాని లేక క్లబ్గాగాని చెప్పబడలేదు. కాని ఒక శరీరముగా చెప్పబడింది. "మీరు క్రీస్తు యొక్క శరీరమైయుండి వేరువేరు అవయవములుగా ఉన్నారు" (1 కొరింథీ 12:27).


సిలువ ఆధారముగా శరీరము నిర్మించబడుతుంది. ఆ తిత్తి క్రొత్త నిబంధన సంఘము.

సమాజము, పాత నిబంధన ప్రకారము ఉన్నది. క్లబ్లో ఏ నిబంధన లేదు.

కాని క్రొత్త నిబంధనలో నిజమైన సంఘము నిర్మించబడుతుంది.


ఈ రోజులలో నిబంధన అనే మాటను మనము ఎక్కువగా ఉపయోగించము. యేసు క్రీస్తు యొక్క సంఘమును నిర్మించువారు కలిగియున్న ఒప్పందము మరియు సమర్పణయే నిబంధన. మొదటిగా, వారి పెండ్లికుమారుడైన ప్రభువుతోను మరియు ఒకరితో ఒకరును సమర్పించుకొనుట. అక్కడ నిలువు కమ్మీలు మరియు అడ్డకమ్మీలు ఉన్నవి. వారు మొదటిగా ప్రభువును హృదయపూర్వకముగా ప్రేమిస్తారు మరియు ఒకరినొకరు ప్రేమిస్తారు.


ఒక స్థానిక సంఘములో "రొట్టె విరచుట" దీనికే సాదృశ్యముగా ఉన్నది. ఆ విధముగా మనము ప్రభువుతో సహవాసము కలిగియుండి మరియు ఆయనవలె స్వయానికి చనిపోవాలని కోరుచున్నామని చెప్పుచున్నాము (1 కొరింథీ 11:26-28). ఆయన శరీరముగా మనము ఒకరితో ఒకరము సహవాసము కలిగియున్నామని కూడా చెప్పచున్నాము (1 కొరింథీ 10:16,17). అందుకే అక్కడ ఒక్క రొట్టె ఉంటుంది మరియు మనమందరము దానిలో పాలివారమగుచున్నాము.

"నేను నిన్ను ఇష్టపడుచున్నాను, నీవు నన్ను ఇష్టపడుచున్నావు, మనమిప్పుడు సంతోషకరమైన కుటుంబము" అను మానవ ప్రేమను ఒకరియెడల ఒకరము కలిగిలేము. ప్రభువును ప్రేమిస్తున్నము కాబట్టి దానిలోనుండి వచ్చును.

అలాగే, నశించుచున్న వారియెడల మన ప్రేమనుబట్టి మనము వారికి సువార్తికులుగా మారి సువార్త చెప్పము. ప్రభువు యెడల మన ప్రేమను బట్టి సువార్త ప్రకటిస్తాము.

ప్రభువును ప్రేమించుటకును మరియు ఇతరులను ప్రేమించుటకును, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడియున్నది (రోమా 5:5).


నిజమైన సంఘమును నిర్మించుట:

పరిశుద్ధాత్మ యొక్క పాత నిబంధన పరిచర్యకు మరియు క్రొత్త నిబంధన పరిచర్యకు వ్యత్యాసము ఉన్నదని మా తండ్రి (జాక్ పూనెన్)గారు ఒక సాదృశ్యాన్ని చెప్పేవారు: పాత నిబంధనలో మూతవేసిన గిన్నెవలె మానవుని హృదయము ఉన్నది (అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళకుండా ఒక తెర ఉన్నట్లుగా). మోషే వలే, బాప్తిస్మమిచ్చు యోహానువలే మొదలగు వారివలె మూతవేయబడియున్న గిన్నెమీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి మరియు దానిమీదగా ఆశీర్వాదములనే నదులు అనేకుల మీదకు ప్రవహించేవి.


కాని క్రొత్త నిబంధనలో ఆ మూత అనగా ముసుగు తీసివేయబడింది (2 కొరింథీ 3:12-18). ప్రభువైన యేసు మరణించినప్పుడు, ఆ తెర నిలువునా చీలింది మరియు అతిపరిశుద్ధ స్థలములోనికి మార్గము తెరువబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు మొదటిగా గిన్నెనిండి అనగా విశ్వాసి హృదయాన్ని శుద్ధిచేసి మరియు ప్రభువైన యేసు యోహాను 7:37-39లో వివరించినరీతిగా అనేకులను ఆశీర్వదించుటకు వారి కడుపులోనుండి జీవజల నదులు ప్రవహించును. ఆ విధముగా క్రొత్త నిబంధన సంఘము నిర్మించబడుతుంది.


ఇప్పటికీ మనము పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఇతరులకు బోధించాలని కోరనట్లయితే అప్పుడు మనము ఒక సమాజమునుగాని లేక క్లబ్నుగాని నిర్మిస్తాము. కాని మనము దేవునిచేత నింపబడుటకు అనుమతించినట్లయితే, అప్పుడు ఆయన మన హృదయాంతరంగములలోనుండి ఇతరులలోనికి ప్రవహించును. అప్పుడు మనము కూడా సహవాస ఆత్మను కలిగినవారితో సంఘమును నిర్మించగలము. మన హృదయములలోనుండి దేవుని యెడల మరియు ఇతరుల యెడల ప్రేమ ప్రవహిస్తుంది మరియు మనము సిలువ నెత్తుకొనుచున్నయెడల ఆత్మ మనలో కలిగించే ఐక్యత ద్వారా నిర్మించబడగలము.


నిజానికి, మనము ఒకరికి ఒకరు దూరముగా ఉన్నప్పుడు కూడా సంఘముగా నిర్మించబడతాము. ఆదివారపు కూటములలో మాత్రమే మనము నిర్మించబడము. అక్కడ పరిశుద్ధాత్మ వరముల ద్వారా నిర్మించబడగలము. కాని మనము దూరముగా ఉన్నప్పుడు కూడా నిర్మించబడగలము. నీవు అనేక విధములుగా శోధించబడినప్పుడు అనగా నిజాయితీగా లేకుండుటకును, లేక కోపగించుటకును లేక మోహపుచూపులు చూచుటకును మొదలగునవి నీవు ప్రభువైన యేసు సంఘములో పాలిభాగస్థుడవని రుజువు చేయబడుతుంది. ఈ శోధనలు వచ్చినప్పుడు మన సిలువనెత్తుకొని, మన స్వజీవానికి చనిపోయి ప్రభువు ప్రేమలో నిలుకడగా ఉంటూ మరియు పాపమును ఎదురించినయెడల, అప్పుడు మనము వెలుగులో నడిచి మరియు ప్రభువుతో సహవాసము కలిగియుంటాము. అప్పుడు మనము ఒకరితో ఒకరు కలిసినప్పుడు, సహవాసము కలిగియుండగలము (1 యోహాను 1:7).


మనము ప్రేమలో అతుకబడటము గురించి కొలొస్స 2:2లో చెప్పబడింది. నాయంతట నేను ఇతరులతో ప్రేమలో అతుకబడలేను. కేవలము పరిశుద్ధాత్ముడు మాత్రమే మన హృదయములను ప్రేమలో అతుకచేయును. ఆవిధంగా కాకుండా, నేను మానవ పద్ధతిలో బహుమానము లిచ్చుట ద్వారానో లేక మీతో సమయమును గడుపుట ద్వారానో, మొదలగు పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తే, నేను క్లబ్నే నిర్నిస్తాను. "నీ స్వజీవానికి చనిపోవాలని" దేవుడు చెప్పుచున్నాడూ. దేవుడు నన్ను ఉంచిన స్థానిక సంఘములో, నన్ను నేను ఉపేక్షించుకొనినప్పుడు జీవమిచ్చే పరిశుద్ధాత్ముడు నా హృదయములో అద్భుతముగా కార్యము చేసి మరియు నా వలె తమ్మునుతాము ఉపేక్షించుకొను వారితో నన్ను అతుకచేస్తాడు.


అప్పుడు మనము ఒకే సిద్ధాంతమును నమ్ముట వలనగాని లేక ఒకే పాటలు పాడుట వలనగాని కాక, మనము భూమిలోపడి స్వజీవానికి చనిపోవుటవలన మన సహవాసము మధురముగా ఉంటుంది. ఆ విధముగా పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయుట ద్వారా మాత్రమే మనము సహవాసము కలిగియుండగలము.


స్వయానికి చనిపోకుండా ఉన్న ఐక్యత ఏదైనను అది కేవలము స్నేహమేగాని నిజమైన క్రైస్తవ సహవాసము కాదు. సహవాసము ఆత్మ సంబంధమైనది కాని స్నేహము భూలోక సంబంధమైనది.


లోకములోని ప్రజలు స్నేహాన్ని కలిగియుంటారు. లోకానుసారమైన క్లబ్లలోని వారు సన్నిహిత స్నేహాన్ని కలిగియుండి మరియు ఒకరియెడల ఒకరు జాగ్రత్త వహిస్తారు. కాని వారికి నిజమైన సహవాసము లేదు ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మన జీవితములలో పని చేయుట ద్వారా మాత్రమే నిజమైన సహవాసము ఉంటుంది. ఇది ఆత్మ సంబంధమైనది. తన పిల్లలెవరైనను "యేసు యొక్క మరణానుభవమును తమ శరీరమందు వహించుచున్నట్లు" దేవుడు చూచినట్లయితే వారికి బహుమానముగా, "యేసు జీవాన్ని సమృద్ధిగా" ఇచ్చును (2 కొరింథీ 4:10,11). ఇద్దరు విశ్వాసులలో ఉన్న ఈ "యేసు జీవము" మాత్రమే వారిలోనికి నిజమైన సహవాసాన్ని తెస్తుంది. ఆ విధముగా యేసు జీవముతో నింపబడుచున్నవారితోనే దేవుడు తన క్రొత్త నిబంధన సంఘమును నిర్మిస్తాడు.


మన చుట్టు ప్రక్కల ఉన్నవారిలో నుండి పూర్ణ హృదయులైన విశ్వాసులను వెదకుట "ఒక గడ్డివాములోనుండి ఒక సూదిని" వెదకినట్లుంటుంది. ఆ గడ్డి వాములో చిన్న సూదులను వెదకుటకు మనము అనేక సంవత్సరములు ప్రయత్నించవచ్చును, అనేక సంవత్సరముల తరువాత ఆ సూదిని కనుగొనవచ్చును. కాని ప్రభువిట్లనుచున్నాడు, "ఆ సూదుల కొరకు నీ సమయాన్ని వృథా చేసుకొనవద్దు. వారు ఎక్కడున్నారో నాకు తెలియును. నీవు కేవలము భూమిలో పడి మరియు నీ స్వజీవానికి చనిపో". అప్పుడు నీలో ఉన్న యేసుజీవము అయస్కాంతమువలె గొప్ప శక్తి కలిగి, ఆ సూదులను" (హృదయపూర్వకమైన శిష్యులు) నీ యొద్దకు ఆకర్షించును (యోహాను 1:4; 12:32).


దైవభక్తి కలిగి జీవిస్తూ, క్రొత్త నిబంధన సంఘమును నిర్మించాలని కోరే ఇతర విశ్వాసులు మీ యొద్దకు ఆకర్షింపబడి మరియు సిలువ యొక్క సందేశాన్ని అంగీకరిస్తారు. అది దేవుని విధానము. యోహాను 6:37లో, "నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వత్తురు" అని ప్రభువు చెప్పినట్లుగా పూర్ణహృదయముతో ఉన్నవారిని ఆయన మన యొద్దకు నడిపిస్తారు. తండ్రియైన దేవుడు మనకు కూడా అలాగే చేస్తారు. ఆ విధంగా క్రొత్త నిబంధన సంఘమును నిర్మిస్తాము.


వ్యక్తిగత త్యాగమనే పునాది మీద:


యిర్మీయా 3:14,15లో ప్రభువిట్లనుచున్నాడు, "భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనుకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను, వివేకముతోను మిమ్ము నేలుదురు". ఇది ఎంత అద్భుతమైన, సుందరమైన వాగ్ధానము. దేవునికిష్టమైన కాపరులను నీవు కనుగొనినప్పుడు, అది నిజమైన సంఘమని తెలుసుకొనుము. వారు నిన్ను దైవభక్తికి నడిపిస్తారు. కాబట్టి వారు నిన్ను సరిదిద్దినప్పుడు అభ్యంతరపడవద్దు.


ఎఫెసీ 5:25 ఈ విధంగా చెప్పుచున్నది, "క్రీస్తు సంఘమును ప్రేమించి మరియు దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను". వ్యక్తిగత త్యాగములేకుండా సంఘమును నిర్మించలేము. పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసు గొప్ప త్యాగాన్ని చేశారు. ఆయన సుఖసౌఖ్యాలను విడిచి మరియు బీదరికములో జీవించారు. అన్నిటికంటె పైగా, తన్నుతానే అప్పగించుకొనియున్నాడు.


వెలచెల్లించకుండా నీవు క్రొత్త నిబంధన సంఘమును నిర్మిస్తావని ఊహించుకోవద్దు. సంఘమును నిర్మించాలని కోరి, డబ్బును గాని లేక సౌఖ్యాన్నిగాని, త్యాగముగని చేయనివారు ఒక సమాజమునుగాని లేక క్లబ్నుగాని నిర్మిస్తారు. త్యాగములేకుండా నిజమైన సంఘము నిర్మించబడలేదు. దానిని నిర్మించుటకు క్రీస్తు తన్నుతానే అప్పగించుకొనియున్నాడు. మనము కూడా దానిని నిర్మించాలని కోరినట్లయితే, మనము కూడా మన స్వజీవాన్ని త్యాగము చేయాలి.


ఒక వ్యక్తి బలహీనుడైయుండి (చిన్నవాడైయుండి) మరియు అత్యంతపనికిరానివాడైనను, అతడు ఎల్లప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుటకు అనుమతిస్తూ మరియు సిలువ మార్గములో వెళ్ళుచున్నయెడల, ప్రభువు తన సంఘమును నిర్మించుటకు అతనిని వాడుకొనగలడు.


నీ తలంపులలో (కళ్లల్లో) నీవి అల్పుడవైన యెడల, దేవుడు ఈ రోజే నీతో ఇట్లనుచున్నాడు, "నీ అల్పుడవు, గుర్తింపులేని గోధుమ గింజవు. నీవు వెళ్లి భూమిలోపడి మరియు చనిపొమ్ము". అప్పుడు దేవుడు నీ ద్వారా చేసే అద్భుతాన్ని చూడగలవు. రాబోయే రోజులలో దేవుడు నీలోను మరియు నీ ద్వారాను చేసే దానిని నీవు ఇప్పుడు చూడలేవు, ఊహించలేవు (1 కొరింథీ 2:9). కాని ఈ పుస్తకము ద్వారా దేవుడు నీతో చెప్పుచున్న దానిని నీవు ప్రేమతో వినాలి.

అధ్యాయము 7
సంఘముగా నిర్మించబడుట – ఇచ్చువారిగా ఉండుట

"అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయుంచుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తనప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను" మత్తయి 20:28.

,

ప్రభువైనయేసు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన "సంఘము" చాలా చిన్నది. తనను అప్పగించినవానితో కలిపి, 12 మంది అందులో ఉన్నారు. మిగిలిన పదకొండు మంది ప్రభువును వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టియున్నారు. దాని ఫలితముగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత భూమిని తలక్రిందులు చేశారు.


ఇది జరుగకముందు, వారు ఒకరితో ఒకరు వాదించుకొనువారిగా ఉన్నారు. సిలువ వేయబడుటకు తాను వెళ్ళుచున్నానని యేసు చెప్పినప్పుడు, వారు భూలోకసంబంధులవలె ప్రభువు తరువాత నాయకుడెవరని వారు వాదించుట ఆరంభించారు (మార్కు 9:31-39). కొద్ది కాలము తరువాత తాను సిలువ వేయబడి మరణించి మరియు మృత్యుంజయుడనై తిరిగి లేచెదనని ప్రభువు చెప్పారు (మత్తయి 20:18-21). మరలా, యోహాను మరియు యాకోబులు గొప్ప పదవి కొరకు ఆశపడి యున్నారు. యేసు అందరియెదుట "పరిచర్య చేయుంచుకొనుటకు నేను రాలేదు కాని పరిచర్య చేయుటకును మరియు తన ప్రాణమునిచ్చుటకును" వచ్చియున్నానని చెప్పారు (మత్తయి 20:28).


"ఇచ్చువారు" మరియు "పుచ్చుకొనువారు" అను రెండు రకముల ప్రజలు లోకములోను, "క్రైస్తవులని" పిలువబడే వారిలోను ఉన్నారని ప్రభువైనయేసు చూపిస్తున్నారు. లోకపుఆత్మను కలిగిన క్రైస్తవులు (సమాజములోను మరియు క్లబ్లోను ఉన్న క్రైస్తవులు) క్రైస్తవ్యమునుండి ఎల్లప్పుడు ఏమి పొందెదమా అని చూస్తుంటారు. నిజమైన సంఘానికి చెందినవారు ఇచ్చేవారుగా ఉంటారు. వారు ఎల్లప్పుడు దేవునికిగాని లేక ఇతరులకుగాని ఏమి ఇవ్వగలమా అని చూస్తుంటారు. ఇచ్చెడివారే అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారని యేసు చెప్పారు (అపొ.కా. 20:35).


ఈ లోకములో నీవు ఎంత గొప్పవాడవైతే, అంత ఇతరులు నీకు సేవ చేస్తారు. లోకములో ప్రభుత్వాలు చేసేవారిని ఎల్లప్పుడు ప్రజలు సేవిస్తారు. నీలో పరలోకరాజ్యము అభివృద్ధి పొందుచున్న యెడల, ఆ మేరకు ఇతరులకు పరిచర్య చేస్తావు. ప్రభువైన యేసు ఎల్లప్పుడు దీనిని జీవించి మరియు బోధించారు.


సంఘములో పుచ్చుకొనువారు ఎల్లప్పుడు ఇతరులు వారియొక్క అవసరాలు తీర్చాలని చూస్తారు. ఆవిధముగా జరుగనట్లయితే, వారు ఏదోఒక విషయములో అభ్యంతరపడి చివరకు సంఘాన్ని విడిచిపెట్టుదురు. మరొక వైపున, ఇచ్చెడివారు, అక్కడ అవసరాన్నిగాని లేక కొదువనుగాని చూసి కుటుంబమైయున్న సంఘములో సభ్యుల బాధ్యత తీసుకొని మరియు దేవునికృపను అనుభవించుట ద్వారా పరిచర్య చేస్తారు.


ఉదాహరణకు మీ స్థానిక సంఘములో నీకును మరియు మరొకరి మధ్యలో ప్రేమ కొదువగా ఉందని నీవు గ్రహిస్తావు. నీ గిన్నె నిండునట్లు అవతలి వ్యక్తి ప్రేమను కనపరచలేదు కాబట్టి ఇది అతని తప్పని నీవనుకోవచ్చును. పుచ్చుకునేవారు ఈ విధంగా ఉంటారు. నీవు ఇచ్చువాడుగా ఉన్నట్లయితే, నీ గిన్నె నింపమని దేవునికి ప్రార్థిస్తావు. అప్పుడు ప్రేమ నీలోనుండి ఇతరులలోనికి ప్రవహించునట్లు, ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు.


2 కొరింథీ 9:6-8లో దేవుడు తన కృపను మనలో సమృద్ధిగా కుమ్మరించాలని కోరుచున్నాడని చదువుతాము. ఈ వచనము చదివేటప్పుడు, స్వార్థముతో అదంతయు మనమే పొందుకోవాలని ఆలోచిస్తాము. కాని ఈ వాక్యభాగమును జాగ్రత్తగా చదివినట్లయితే, ఇతరులకు మేలు చేయువారికే దేవుడు పొర్లిపారే కృపను అనుగ్రహిస్తాడని చూస్తాము (8వ వచనము చివరి భాగం చూడండి).


దీనిని వ్రాసిన పౌలు, ఎఫెసీ సంఘములో మూడు సంవత్సరములు పరిచర్య చేశాడు. అతడు అక్కడ నుండి వెళ్లిపోయే సమయములో (అపొ.కా. 20:25-35), తాను వారితో ఉన్నంత కాలము ఇచ్చెడివాడిగానే ఉన్నానని వారికి గుర్తుచేశాడు. ఆ సంఘము ఆర్ధికంగా తనకు ఇస్తామనినప్పటికీ, పౌలు నిరాకరించాడు. అతడు తన అవసరములను చూసుకొనుచు, ఇతరుల అవసరాలను కూడా ఇచ్చేవాడు. అతడు ఎల్లప్పుడు ఇచ్చే వైఖరిని కలిగియున్నాడు. కాబట్టి సంఘనిర్మాణములో దేవుడు అతనికి బహుగా వాడుకొనియున్నాడు.


"త్యాగము చేసే గిన్నె" వలె ఎల్లప్పుడు ఇచ్చువారిగా ఉండుటకు చాలామంది ఇష్టపడరు ఎందుకనగా అందులో త్యాగమున్నది. దీనిని మత్తయి 20:22,23లో ప్రభువు వివరించాడు. కాని సంఘము త్యాగము ద్వారానే నిర్మించబడుతుంది. కాబట్టి మన సంఘములో ఇది అవసరం గనుక దప్పికతో మనము దేవునియొద్దకు వచ్చి మరియు దేవుడు ఆయన శక్తితో మన అంతరంగమంతటినీ నింపునట్లు ప్రార్థించాలి. ఎండిన భూమిని తడిపి మరియు సంఘమును నిర్మించుటకు మన కడుపులోనుండి ఇతరులలోనికి జీవజల నదులు ప్రవహించును (యోహాను 7:37-39).


అధ్యాయము 8
సంఘమును కూల్చివేయుట – నిందించేవారుగా ఉండుట

"మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును" (సామెతలు 14:1).

ఒక యింటిని రెండు రకములుగా కూల్చి వేయవచ్చునని బైబిలు చెప్పుచున్నది. ఒకటి, మంచి పునాది మీద కట్టబడని బుద్ధిహీనుని యిల్లు తుఫాను చేత కూల్చివేయబడును (మత్తయి 7:26,27). రెండవ రకము, ఒక బుద్ధిలేని వ్యక్తి తన యింటిలో నివసిస్తూ, అది కూలిపోయే వరకు "ఇటుక తరువాత ఇటుకను విడగొట్టును" (సామెతలు 14:1 మెసేజ్ బైబిలు).


గత చరిత్రలోను మరియు ఈనాడు ప్రపంచములో ఉన్న సంఘములను నేను గమినించినప్పుడు, బయటవారికంటే సంఘసభ్యుల ద్వారానే సంఘములు కూల్చివేయబడ్డాయి. నిజానికి బయటి వారిద్వారా సాతాను సంఘమును హింసించినప్పుడు, అది సంఘమును పవిత్రతలో కాపాడుటకు దోహదపడింది. కాబట్టి క్రైస్తవులే తమ సంఘమును కూల్చివేస్తున్నందుకు సాతాను తృప్తి పడుచుచున్నాడు. కాబట్టి విశ్వాసులు ఒక స్థానిక సంఘములో ఒక్క శరీరముగా నిర్మించబడుటకు దేవుడు, సమాజములలోనుండియు మరియు క్లబ్లలోనుండియు వారిని బయటకు పిలిచినప్పటికీ, స్థానిక సంఘసభ్యులు సాతానుతో సహకరించినయెడల, సంఘము చెడిపోవుచున్నది.


ఒక ఆత్మీయ సంఘములో కూడా అపవాది దీనిని చేయగలడా? చేయగలడు. దీనిని అతడు పరలోకములో, దేవుని సన్నిధిలోనే మూడువంతుల దూతలు తిరుగుబాటు చేసేటట్లు చేశాడు (ప్రకటన 12:4). ఆవిధంగా వారు దురాత్మలైయున్నారు. ఇది మొదటి శతాబ్దములో క్రూరమైన తోడేళ్ల ద్వారాను (అపొ.కా. 20:29,30), అలెక్స్ండ్రు అను కంచరివాడు, దియొత్రెఫే (3 యోహాను 1:9,10) ద్వారాను జరిగింది.


ఇది జరుగకుండునట్లు యాకోబు 3:13,14లో వివరించినట్లుగా దీని యొక్క మూలమును కనుగొనవలెను. దీనికి కారణము భోగేచ్ఛలను కోరుట (యాకోబు 4:1) వలన, హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనుట (యాకోబు 3:14) మరియు దాని ఫలితముగా అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును (యాకోబు 3:16). అందువలన హెబ్రీ 12:15లో, చేదైనవేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన (హృదయములలో మరియు తలంపులలో) అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని హెచ్చరించబడియున్నాము.


సామెతలు 14:1 ప్రకారము రెండు విషయములే ఉన్నవి. మనము స్థానిక సంఘమును నిర్మించవచ్చును లేక దానిని కూల్చివేయవచ్చును. ప్రేమ ద్వారానే స్థానిక సంఘము నిర్మించబడుతుంది (1 కొరింథీ 8:1). సంఘములోని వారిని ప్రేమిస్తున్నామని కేవలము నోటితో చెప్పుటకాక ఆవిధముగా జీవించాలి (1 యోహాను 3:18). మరియు వేషధారులుగా ఉండకూడదు (రోమా 12:9). యేసు ప్రేమతో సంఘముకొరకు అప్పగించుకొనినట్లు మనము కూడా సంఘముకొరకు మన స్వజీవాన్ని ఉపేక్షించుకొని ప్రేమించుట ద్వారా నిరాశలోను మరియు వివాదములలోను మన ప్రేమ రుజువు చేయబడుతుంది (ఎఫెసీ 5:25). అనగా మనకొరకు యేసు విజ్ఞాపన చేయుచున్నట్లుగా మనము కూడా సంఘములోని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి (హెబ్రీ 7:25).


ప్రకటన 12:10లో, "సహోదరుల మీద నేరము మోపువాడని" అపవాది పిలువబడ్డాడు. సంఘసభ్యులు తనతో కలిసి నేరారోపణ చేసినప్పుడు, సంఘము కూల్చబడుతుంది. బబులోనునుండి తిరిగివచ్చిన తరువాత జెకర్యా యెరూషలేములోని మందిరమును కట్టుటకు దేవుని ప్రజలను నడిపించిన సందర్భములో దీనిని చూస్తాము. జెకర్యా 3:1-5లో యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడైయున్నప్పుడు, సాతాను అక్కడ నిలుచుండి నేరారోపణ చేశాడు. యెహోషువ యొక్క మలిన వస్త్రములు తీసివేయకముందే, ప్రభువు సాతానును గద్దించాడు. అప్పుడు ప్రభువు యెహోషువ మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించాడు. కాని అక్కడ జెకర్యా ఎందుకు ఉన్నాడు? అతడు నేరారోపణ చేసేవారి పక్షముగా ఉంటాడా లేక విజ్ఞాపన చేసేవారి పక్షముగా ఉంటాడా అని పరీక్షించబడుటకు అక్కడ ఉన్నాడు. దేవుని ఇంటిని నిర్మించుట అనగానేమిటో జెకర్యా మనకు చూపిస్తున్నాడు. క్రొత్త ప్రశస్త వస్త్రములతో యెహోషువ అలంకరించబడిన వెంటనే అతని తలమీద తెల్లని పాగా పెట్టించాలని జెకర్యా నిర్ణయించుకున్నాడు.


ఈనాడు, దేవునియొక్క నివాసముగా ఉండుటకు మనము సంఘమును నిర్మించాలని కోరినయెడల, మనము ఆవిధముగానే పరీక్షించబడతాము. ఒక వైపున, అపవాది సంఘమును విభజించుటకు మనము సంఘములోని ఇతరుల మీద కొండెములు చెప్పునట్లు మన హృదయములలో ఇతరులకు వ్యతిరేకముగా నేరాన్ని మోపే తలంపులను కలుగజేయుటకు ప్రయత్నిస్తాడు. మరొకవైపున, ప్రభువైన యేసు మనకొరకు నిరంతరము విజ్ఞాపన చేయుచున్నరీతిగా, మనము కూడా ఇతరులు సంపూర్ణరక్షణ పొందుచూ మహిమకరముగా మారునట్లు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటకు ప్రభువు మనలను ఆహ్వానించుచున్నాడు. ఆవిధంగా మనం నిర్మించేపరిచర్య చేయాలి (హెబ్రీ 7:25). ఒకవేళ మన సహోదరుడు పాపములో ఉన్నను అతనిని సంపాదించుటయే మన గురి (మత్తయి 18:15).


ఈ విధంగా సంఘము జీవించినప్పుడు, యేసు మనలో ఉండును. మరియు అంధకారశక్తులన్నిటి మీద మనకు సంపూర్ణ అధికారము ఉంటుంది (మత్తయి 18:18-20).

అధ్యాయము 9
సంఘమును గూర్చి శ్రద్ద వహించుట – కాపరులుగా ఉండుట

"ఆయన జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్నందున వారి మీద కనికరపడెను" (మత్తయి 9:36).


మత్తయి 9:37,38లో లోకములోని విస్తారమైన కోత కోయుటకు చాలా కొద్దిమందే పనివారున్నారని యేసు చెప్పారు. గనుక తన కోతకి పనివారిని పంపుమని ప్రార్థన చేయమని చెప్పారు. ఈ వచనాన్ని బట్టి అనేకులు, సువార్త పరిచర్యకు వెళ్లమని అనేక మందిని ప్రేరేపిస్తున్నారు. మనము మత్తయి 9:36-38 వచనాలను కలిపి చదివినప్పుడు, ఎటువంటి "పనివారిని" గురించి ప్రభువు చెప్పియున్నాడో గ్రహించగలము.


ప్రభువైనయేసు జన సమూహమును చూచినప్పుడు, అక్కడ ఎంతో మంది బోధకులకు, ఉపదేశకులకు (అనేకమంది పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు) కొదువలేదు, కూటములకు (సబ్బాతు రోజున మరియు ఇతర సమయములలో ఉండెడివి) కొదువలేదు మరియు అద్భుతములకు (ఆయన వారి మధ్యలో అనేక అద్భుతములు చేశారు) కొదువలేదు. వారికి కాపరులు లేరు.


ఈనాడు కూడా అలాగే ఉన్నది. మన తరములో బైబిలు మరియు సిద్ధాంతముల గురించిన బోధ పుస్తకము రూపములోను, ఆన్లైన్లోను, స్మార్ట్ ఫోనులలోను మొదలగు రీతులుగా ఉన్నవి. మరియు దాదాపు అన్ని సంఘములవారు అనేక కూటములు కలిగియుంటున్నారు. కాని వారి స్వంతమును కోరే హృదయమును విరుగగొట్టుటకు అనుమతించి మరియు మృధువైన కాపరి హృదయమును పొందువారి కొరకు దేవుడు చూస్తున్నాడు.

యిర్మీయా 3:14,15లోనే, ఆయన సంఘము యొక్క రెండు గుణ లక్షణములను గురించి దేవుడు చెప్పియున్నాడు (సీయోను).


1. వేరు వేరు పట్టణములలోనుండియు, కుటుంబములలోనుండియు వచ్చిన విభిన్నమైనవారు (దేవుని హృదయానుసారులైన)

2. తన కిష్టమైన కాపరులను వారికి ఇచ్చెదను.


దేవుని హృదయానుసారులైన కాపరులు అంటే ఏమిటి?


అటువంటి కాపరి క్రీస్తు యొక్క కనికరాన్ని కలిగియుంటాడు. ఇది జాలిపడుట కంటే ఎక్కువ. "సాతాను చేత వేధింపబడి మరియు పడగొట్టబడిన" (మత్తయి 9:36 మార్జిన్) వారిని చూచి ఆత్మీయముగా కనికరించుట. అనగా శారీరక లేక ఉద్రేకపూరితమైన దానికంటే ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు శ్రద్దవహించుట మరియు ప్రేమతో ధైర్యముగా సత్యమును మాట్లాడుట.


అటువంటి కాపరి అసౌకర్యములో గుండా వెళ్ళుటకు ఇష్టపడతాడు. ప్రభువైన యేసు తన జీవిత కాలమంతయు, తండ్రి నడిపించినరీతిగా ఎల్లప్పుడు కొన్ని వందలమైళ్ళు నడిచివెళ్ళుటకును, బయట ప్రదేశములో నిద్రించుటకును, కొన్నిసార్లు భోజనము చేయకుండుటను మొదలగు వాటిని చేశారు. సమాజపు అధికారి విషయంలోను (మత్తయి 9:18,19) మరియు రక్తస్రావముగల స్త్రీ విషయములోను (మత్తయి 9:20-22) పక్షపాతము లేకుండా వ్యవహిరించాడు. ఆయన తన స్వంతాన్ని కోరకుండా జీవించి మరియు మరణించారు. నిజమైన కాపరులు ఆయన మాదిరిని అనుసరించి జీవిస్తారు.


అటువంటి కాపరి సత్యము విషయములో రాజీపడడు. యూదులు బబులోనుకు చెరపట్టుకొని పోబడినప్పుడు, దానియేలు దేవుని ఆజ్ఞల విషయములో రాజీపడకూడదని తన హృదయములో నిర్ణయించుకున్నాడు (దానియేలు 1:8). అతని ధైర్యమును బట్టి, అతనివలె ధైర్యముగా నిలబడగోరువారికి కాపరి అయ్యాడు (దానియేలు 1:11).

ఇతరుల సంతోషములోను మరియు విశ్వాసములోను సహాయకుడుగా ఉండుటకు పరిశుద్ధాత్మతో ఏకభవించే వ్యక్తి అటువంటి కాపరిగా ఉండును. పౌలు దీనిని ఈ విధంగా వివరించాడు, "మీ విశ్వాసమునకు మేము ప్రభువులము కాదు, అందువలన మిమ్మును మేము విమర్శనాత్మకముగా చూడము, మీతో కలిసి పనిచేయుటకు మేము జతపనివారము. మీరు మీ విశ్వాసము చేతనే నిలకడగా ఉన్నారు గాని మా విశ్వాసాన్ని బట్టి కాదని నాకు తెలియును" (2 కొరింథీ 1:24 మెసేజ్ బైబిలు).


అటువంటి కాపరికి ఆత్మీయ అధికారము ఉంటుంది. ఈ లోకాధికారి (సాతాను) వచ్చినప్పుడు, మన జీవితములలో వానికి సంబంధము లేదని దేవుడే ధృవీకరిస్తాడు (యోహాను 14:30).


అటువంటి కాపరి తప్పనిసరిగా దేవుని రాజ్యముయొక్క సంపూర్ణ సువార్తను ప్రకటిస్తాడు. అనేకమంది బోధకులు ప్రజలకిష్టమైన వాటిని బోధించి మరియు వినువారికి దురదచెవులు కలుగునట్లు చేస్తారు (2 తిమోతి 4:3,4). అటువంటివారు కాపరులుకాదు. కాని పౌలైతే, తనయొక్క పిలుపును తీవ్రముగా తీసుకొని, అతడు "దేవుని సంకల్పమంతయు" ప్రకటించనియెడల ఇతరుల రక్త విషయములో దోషినని చెప్పాడు (అపొ.కా. 20:26,27).


అటువంటి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అనగా తనకు అనుకూలమైన వాటిని తన అవసరములను, తన సౌఖ్యమును, తన ఎజెండాను ఇతరుల నిమిత్తము విడిచిపెట్టి చివరివరకు ధైర్యముగా వారితో ఉంటాడు. జీతగాడికి మరియు కాపరి హృదయము కలిగినవారికి వ్యత్యాసాన్ని ఇట్లు చెప్పారు, "జీతగాడు గొఱ్ఱెలను గూర్చి లక్ష్యము చేయడు గనుక తనకేదైఅను అసౌకర్యము కలిగినను లేక ఇబ్బంది కలిగినను గొఱ్ఱెలను విడిచి పారిపోవును" (యోహాను 10:11-13). పౌలు తన సహపరిచారకుల యొక్క జీవితాలను పరీక్షించినప్పుడు, వారందరు చివరకు తమ స్వంతమునే కోరువారుగా ఉన్నారని గుర్తించాడు. తిమోతి ఒక్కడే దయ కలిగిన ఆత్మను కలిగి, కాపరి హృదయమును కలిగియుండి ఇతరుల క్షేమము విషయమై నిజముగా చింతించువాడైయున్నాడు (ఫిలిప్పీ 2:19-21).

మన కొరకు ఎవరు చేస్తారు?


అనేక సంవత్సరాల క్రితము, నా ఆత్మను కాయుచు మరియు నా జీవితాన్ని గురించి లెక్క అప్పచెప్పవలసియున్నారు గనుక నా మీద ఉన్న కాపరులకు లోబడియుండమని ప్రభువు చెప్పినట్లు నాకు గుర్తున్నది (హెబ్రీ 13:17). ప్రభువైనయేసు తన తండ్రి తన మీద ఉంచిన ప్రతి అధికారానికి ప్రత్యేకముగా తన మొదటి 30 సంవత్సరములు లోబడి యున్నాడు కాబట్టి ఆయనకు నిజమైన ఆత్మీయ అధికారమున్నది (మత్తయి 8:8,9). ఈ ఆత్మీయ అధికారముతో ప్రభువు కొట్టబడి, రక్తము కారుచున్నప్పటికీ పిలాతు ఎదుట ధైర్యముగా నిలువబడియున్నాడు. మరియు పిలాతు తనకున్న అధికారముతో ప్రభువును భయపెట్టుటకు ప్రయత్నించినప్పుడు ప్రభువైన యేసు ఇట్లన్నారు, "పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:10).


ఈ లేఖనాలలో నుండి సత్యమును చూచుటకు నా కళ్లు తెరువబడినప్పుడు, దేవుడు నాకిచ్చిన నిజమైన కాపరులు గల సంఘమును (సీయోను) కనుగొనుటకు మండించబడ్డాను. క్రీస్తు శరీరము నిర్మించుటకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకొని దాని కొరకు ఎంత వెలయైనను (నా బంధువులు, ఉద్యోగము మొదలగునవి) చెల్లించుటకు నిర్ణయించుకున్నాను.


యెషయావలె, దేవుడు నా పాపమునుండి నన్ను పవిత్రపరచి మరియు నన్ను విరుగగొట్టి, నన్నిట్లడిగియున్నాడు, "నేను ఎవరిని పంపెదను మరియు నా నిమిత్తము ఎవడు పోవును?" (యెషయా 6:8).


ఎటువంటి పరిస్థితులలో గుండా నేను వెళ్లవలసి వచ్చినప్పటికీ, 2007లో నేను తీసుకొనిన నిర్ణయం విషయంలో చింతించను.


బబులోనులో ఉన్న సమాజములలోనుండియు మరియు క్లబ్లలోనుండియు బయటకు వచ్చి మరియు ఆత్మీయ "సీయోను" అయిన ఆయన సంఘమును నిర్మించుటకు దేవుడు ఈనాడు నిన్ను పిలిచినయెడల, నీవిట్లు చెప్పగలవా, "నేనున్నాను నన్ను పంపుము".


ఆమేన్.