సర్వోన్నత ప్రాధాన్యతలు

వ్రాసిన వారు :   జాక్ పూనెన్
    Download Formats:

అధ్యాయము 0
పరిచయం

ఈ ప్రపంచం మనందరికీ తప్పుడు విలువలను అందించింది. చాలా మంది క్రైస్తవులు ఆ విలువలచే ప్రభావితమయ్యారు, వారు జీవిత ప్రాధాన్యతలను తప్పుగా పొందారు. ఇది వారి డిప్రెషన్, నిరాశ మరియు ఓడిపోయిన జీవితాలకు ప్రధాన కారణం.

యేసు తన చర్చి ఈ భూమి యొక్క ఉప్పు మరియు ఈ ప్రపంచానికి వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఉప్పు చాలావరకు దాని రుచిని మరియు కాంతి దాని ప్రకాశాన్ని కోల్పోయింది.

అయితే చర్చిలో ఉపరితలం మరియు అవాస్తవికత చాలా సాధారణమైపోయాయి, చాలామంది విశ్వాసులకు వారి వెనుకబడిన స్థితి గురించి కూడా తెలియదు.

దేవుని ఆత్మ ఇప్పుడు దేవుని పిల్లలందరినీ వారి ప్రాధాన్యతలను పునః మూల్యాంకనానికి పిలుస్తోంది. మరియు చాలా మంది ఆ పిలుపుకు ప్రతిస్పందిస్తున్నారు, ప్రతిచోటా.

ఈ పుస్తకం ఆ ఆధ్యాత్మిక ప్రాధాన్యతల గురించి....

అధ్యాయము 1
సరియైన విలువల గ్రహింపు

ఒక గ్రుడ్డివాడు వంద రూపాయల విలువ గల చెక్కును విసిరి వేసి, విలువ లేని ఒక మెరిసే కాగితమును పట్టుకున్నాడు. మొదటి దానికంటే రెండవదే కోరుకొనదగినది అనుకున్నాడు. ఎందుకంటే అదే స్పర్శకు మెత్తగా నున్నది. అతడు గ్రుడ్డివాడు కాబట్టి సరియైన విలువలను గ్రహించుటలో కొదువను కలిగియున్నాడు. ఇదే విధముగా, రెండు సంవత్సరముల వయస్సు గల ఒక బాలుడు కూడా ఒక చెక్కు కంటే విలువలేని ఒక బొమ్మనే కోరుకుంటాడు. అతడు పరిణితి లేని వాడు గనుక, నిజమైన విలువల విషయములో తెలియనివాడుగా ఉన్నాడు.


అయినాకూడా, ప్రపంచములో అనేకమంది తెలివిగల స్త్రీలు, పురుషులు కూడా ఖచ్చితముగా ఈనాడు ఇదే విధముగా చేస్తున్నారు. వారికి తెలియకుండానే ఆ విధముగా చేస్తున్నారు! నీవు సరియైన విలువలను గ్రహించి యున్నావా? నిజమైన విలువలయెడల తప్పుడు ఆలోచన మనలో ఎవరినైనా సరే వ్యర్థమైన జీవితమునకు నడిపించవచ్చు; వ్యర్థ పరచుకొన్న మానవ జీవితములే ఈనాడు లోకములో అతి గొప్ప విచారించదగ్గ విషయము. ఈ వ్యర్థత మతాసక్తి లేని వారిలో మాత్రమే కాదు మతాసక్తి ఉన్న వారిలో కూడా మనము కనుగొనగలము.


మానవుడు ఆత్మీయ అంధునిగా జన్మించాడు. కాబట్టి నిత్యత్వపు విలువ గల విషయములను, నిత్యత్వపు విలువలేని విషయములతో సరిపోల్చిచూచి అంచనా వేయలేడు. దీని ఫలితముగా, తన యొక్క సమయమును, శక్తిని ధనము కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, ఈ లోకమిచ్చు సుఖముల కొరకు వినియోగిస్తున్నాడు. ''దృశ్యమైనవి (అన్నీ) అనిత్యములు. అదృశ్యమైనవి (మాత్రమే) నిత్యములు'' (2కొరింథీ 4:18) అని మానవుడు చాలా తక్కువగా గుర్తెరిగాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరకు తన ప్రాణమును పోగొట్టుకొనిన యెడల వానికేమి ప్రయోజనము అని తప్పుడు విలువలు కలిగి తన తరమందున్న మత సంబంధమైన ప్రజలను కూడా యేసు సవాలు చేశాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సరియైన సంబంధం కలిగిలేనట్లయితే, తన సృష్టికర్త యెదుట నిలబడిన రోజున తాను ఈ భూమి మీద సాధించినదంతయు మరియు పోగుచేసుకున్నదంతయు ఎంతో విలువలేనిదిగా తాను కనుగొంటాడు.


వారి ''పాపములన్నియు క్షమించబడి'' మరియు ''పరలోకముకు వెళ్ళు మార్గము'' లో ఉన్న అనేకమంది విశ్వాసులు కూడా వారి విలువల విషయములో స్పష్టత లేకుంటున్నారు. వారి ఆత్మలు రక్షించబడ్డాయి కాని వారి జీవితములు వ్యర్థమైపోయాయని తీర్పుదినమున వారు ఆశ్చర్యమునకు గురవుతారు. వారు పొందిన రక్షణ చాలనుకొని, సంతోషముగా పాటలు పాడుతు, వారిని కూడా దేవుడు వాడుకొనాలనుకుంటున్నాడని తెలియక ఇతరులను దేవుడు వాడుకుంటుంటే చూస్తూ కేవలము ప్రేక్షకుల వలె ప్రక్కన కూర్చున్నారు. ఇతర క్రైస్తవుల జీవితములలో ఉన్న శక్తి, సంతోషము, ఫలము వారి జీవితములలో ఎందుకు లేవని వారు ఆలోచిస్తుంటారు. వారి ఆత్మీయ జీవితములను పురికొల్పుకొనుటకు వారు అనేక క్రైస్తవ సమావేశములకు హాజరైనా కూడా, వారి అంతరంగ పురుషుడు ఎప్పుడు బలహీనము గాను, అనారోగ్యముతోను ఉంటాడు. ఉన్నతమైన క్రైస్తవ జీవితమును చేరుకోవాలని అప్పుడప్పుడు కోరుకున్నా, ఎంతో త్వరగా వారు ప్రారంభించిన స్థితిలోనికి పడిపోతారు- కొన్నిసార్లు, ఇంకా తక్కువ స్థాయికి దిగిపోతారు. దీనికి కారణమేమిటి? దీనికి సమాధానం ఎంతో సులభం: వారి ప్రాధాన్యతలు వారికి సరిగాలేవు. మనము పైన చూచిన సాదృశ్యములోని గ్రుడ్డివాడు, చిన్నబిడ్డ వలె వీరు వీరి తెలియని తనములో పదే, పదే సత్యమైన ఆత్మీయ ధనమును విసిరివేసి, విలువలేని దానిని హత్తుకొనుచున్నారు. దేవుడు వారిని ధనవంతులుగా ఉండాలని కోరుకుంటుంటే, ఈ విధముగా వారు ఆత్మీయముగా దివాళా తీసిన వారివలె ఉన్నారు.


ఆయన యొద్దకు వచ్చిన వారి కళ్ళ నుండి ఈ అంధత్వమును శాశ్వతముగా తీసివేయుటకు యేసుప్రభువు చూచారు. జీవితములో ఉండవలసిన నిజమైన సర్వోన్నతమైన ప్రాధాన్యతలు ఏమిటో ఆయన వారికి బోధించాడు. ''అవసరమైనది ఒక్కటే'' అని మార్తకు చెప్పాడు, ధనవంతుడైన యౌవనస్తునితో ''నీకు ఒకటి కొదువగా నున్నది'' అని చెప్పాడు. ఈ మాటల ద్వారా వారి యొక్క జీవితములో ప్రథమ స్థానము దేనికివ్వవలసి యున్నదోనని ఆయన నొక్కి చెప్పాడు. పాత నిబంధన కాలములో కూడా దావీదు ఒక్కడే ''దేవుని హృదయానుసారుడు'' అని పిలువబడ్డాడు- మరియు నిశ్చయముగా ఆయన ప్రాధాన్యతలు సరిగానున్నవి! ''ఒక్కటి నేను కోరుకొనుచున్నాను'' అని ఆయన చెప్పాడు. క్రైస్తవ్యములోని ఎంతో గొప్ప అపొస్తలుడైన పౌలు కూడా సరియైన విషయమును ముందు ఉంచుటలో విజయము సాధించాడు. ''నేను ఒక్కటి చేయుచున్నాను'' అని ఆయన మొఱ్ఱపెట్టాడు; ఆయన ఈ అంశముతో, నజరేయుడైన యేసు ఆరోహణమైనప్పటి నుండి లోకము చూచిన వారిలో ఎంతో ప్రభావవంతమైన (పరలోక దృష్టిలో) జీవితమును జీవించాడు.


నేడు ఈ లోక వాతావరణము, ఏ బేధము లేకుండా మనందరికీ తప్పుడు విలువలను ఇస్తుంది. దీని ప్రభావము ద్వారా జీవితము యొక్క ప్రాధాన్యతలను మనము తప్పుగా చూస్తున్నాము. ఆ ప్రభావము ఎంతో శక్తివంతముగా ఉంది. మానవ చరిత్రలో మునుపెన్నడు లేని విధముగా లోకము, నైతిక విలువలు దిగజారిపోవుట మరియు పతనమై పోవుట అను మురికి గుంటలోనికి దిగజారిపోతుంది. మనచుట్టూ కారుచీకటి క్రమ్మునంతగా దాని అంధకారం అధికమౌతోంది. ఇటువంటి పరిస్థితులలో, యేసు తన సంఘము ఈ లోకమునకు ఉప్పుగాను మరియు వెలుగుగాను ఉండవలెనని కోరుకుంటున్నాడు. కాని ఉప్పు తన సారమును, వెలుగు దాని ప్రకాశమును కోల్పోయినవి. దుర్నీతి మరియు చీకటి విశ్వాస గృహములోనికే ప్రవేశించాయి. పరిసయ్యుల పులిసినపిండి అను వేషధారణ సంఘములోనికి ఎంతో లోతుగా చొచ్చుకొని పోవుట వలన, దాని నిజమైన పరిస్థితిని తెలుసుకొనుట కాని లేక ఎదుర్కొనుట గాని చేయడం లేదు. ఇప్పటికే మనకున్న ప్రాధాన్యతలను సమీక్షించుటకు నేడు పిలుస్తున్న ఆత్మ స్వరమును వినగల చెవులు ఉన్న వారు మాత్రమే వినగలరు.


ఇంత గొప్ప చీకటిలో నీకు మరియు నాకు ఇవ్వబడిన వెలుగును బైబిలులోనే కనుగొనగలము. మరి అయితే దానిని త్రిప్పి క్రైస్తవుని యొక్క ముఖ్యమైన నిజమైన ప్రాధాన్యతలు ఏమైయున్నవో మనము చూద్దాము. బైబిలును మనము చదువుచున్నప్పుడు అది మనలను బాధించవచ్చును (గాయపరచవచ్చును) మరియు చివరకు అభ్యంతరపరచవచ్చును, ఎందుకనగా బైబిలు మన యొక్క కనబడని భాగముల (కీళ్ళు, మూలుగులు) గుండా కూడా దూరిపోవును. అయితే ఒక 20వ శతాబ్దపు దేవుని దాసుని యొక్క జ్ఞానయుక్తమైన వ్యాఖ్యలనుండి మనము ధైర్యము తెచ్చుకుందాము. ''మనము ఇంక అభ్యంతరపడుటకు లేక గాయపడుటకు ఏమి లేనంతగా (మిగులకుండా) యేసు యొక్క మాటలు మనలను గాయపరచి, అభ్యంతర పరుస్తాయి'' (మత్తయి 11:6). యేసు ప్రభువు చెప్పిన మాటను బట్టి నీవెప్పుడైనా అభ్యంతర పడనట్లయితే, అసలు మనము ఆయన మాట్లాడినప్పుడు మనము ఎప్పుడైనా విన్నామా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. దేవుని సేవ విషయములో అంతిమముగా మానవుని ఏదైతే నాశనం చేస్తుందో ఆ విషయములో యేసుక్రీస్తు ఎప్పుడు సున్నితముగా లేడు.


మనలను గాయపరచే ఏదైనా ప్రభువు యొక్క మాటను దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞాపకము చేసినట్లయితే అప్పుడు మనము, ఆయన మనలను మరణమగునంత వరకు బాధించుటకు (గాయపరచుటకు) ఏదో ఉన్నదని మనము నిశ్చయముగా చెప్పగలము. (''ూశీ ూవఅస I ్‌శీబ'' అను పుస్తకములోనిది - ఓస్వాల్డ్‌ చాంబర్స్‌)


''నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలినవాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు, నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.....సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక'' (ప్రకటన 3:17-22).


''నీవు స్పష్టముగా పంపిన సత్యము యొక్క స్వరములను


నేను వినగలుగునట్లు నా చెవులను తెరువుము;


నీ తరంగ ధ్వని నా చెవిలో బడగానే,


అసత్యమంతయు అదృశ్యమగునుగాక.


నీ చిత్తమును తెలిసికొనుటకు, నా దేవా నేను సిద్ధముగా


మౌనముగా నీ కొరకు వేచియున్నాను,


పరిశుద్ధాత్మ దేవా, నా నేత్రములు తెరువుము


నన్ను వెలిగించుము''.

అధ్యాయము 2
అవసరమైనది ఒక్కటే

''అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయన యొద్దకు వచ్చి- ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు- మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను'' (లూకా 10-38-42).


42వ వచనములో ''అవసరమైనది ఒక్కటే!'' అని మార్తతో యేసు చెప్పిన మాటలు ఎంత అద్భుతమైనవో కదా! చేయవలసిన మంచి పనులు ఎన్నో ఉండియుండవచ్చు మరియు అందులో ముఖ్యమైనవి కూడా ఎన్నో ఉండవచ్చు. కాని, వాటన్నింటికి పైగా అవసరమైనది ఒక్కటే అని యేసు ధృవపరుస్తున్నారు. ఆ ఒక్కటి ఏమిటి?


యేసు మరియు ఆయన శిష్యులు అప్పుడే బేతనియకు చేరుకున్నారు. మార్త వారిని చూచిన వెంటనే, సంతోషముతో వారిని తన ఇంటిలోనికి చేర్చుకొని, వారిని కూర్చోబెట్టి వారికి భోజనము సిద్ధపరచుటకు నేరుగా వంటగదిలోనికి వెళ్ళింది. ఆ సమయములో అక్కడున్న వారికి యేసు బోధించుచుండెను. మార్త సహోదరియైన మరియ మార్తకు వంటలో సహాయపడకుండా, యేసు యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటున్నదని మార్త కనుగొని, వంటగదిలో నుండి కోపముతో బయటకు వచ్చి, యేసు వైపు చూచి ఆయనతో దాదాపుగా ఈ విధముగా మాట్లాడినది:


''ప్రభువా, మీ అందరికి భోజనము సిద్ధపరచుటకు నేను వంటగదిలో కష్టపడుతు ఉంటే, నా సహోదరి ఏమి చేయకుండా ఇక్కడ కూర్చున్నది. లేచి నాకు సహాయము చేయుమని ఆమెకు చెప్పు!''


ఆయన కూడా, మార్తకు ఆశ్చర్యము కలుగునట్లు మార్తనే గద్దించియున్నాడు. తప్పు చేసినది నీవే కాని మరియ కాదు అని ఆయన ఆమెతో చెప్పాడు.


ఇప్పుడు మనము ఒక విషయమును గమనిద్దాం, మార్త చేసిన దానిలో ఎటువంటి పాపము లేదు. యేసును సంతోషముగా తన గృహములోనికి చేర్చుకున్నది. వంటగదిలో ఆమె చేసినపని తన కొరకు కాదు గాని, ప్రభువు మరియు ఆయన శిష్యుల కొరకు మాత్రమే. తన హృదయములోనికి ప్రభువును చేర్చుకొని, నిస్వార్థముగా ప్రభువుకు మరియు ఇతరులకు సేవ చేయుటకు చూస్తున్న నేటి విశ్వాసికి మార్త సాదృశ్యముగా నున్నది. ఆమె ఎంతో ఆసక్తి కలిగియున్నప్పటికీ, ప్రభువుచేత గద్దించబడినది. ఆమె చేసిన దానిలో తప్పు ఏముంది? అని మనలను మనము ప్రశ్నించుకొన్నట్లయితే, దానికి సమాధానము ఖచ్చితముగా యేసు చెప్పిన ఈ నాలుగు పదాలలోనే ఉంటుంది: ''అవసరమైనది ఒక్కటే''. ఆమె చేసిన పనిని బట్టి మార్త గద్దించబడలేదు, కాని మొదటి విషయములు మొదట ప్రాధాన్యమివ్వనందుకు ఆమె గద్దించబడినది.


మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అని ప్రభువు చెప్పాడు. అది ఏమిటి? ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినుచున్నది. అంతకంటే ఏమి చేయుట లేదు. కాని అది ఉత్తమమైనది. అన్నింటికంటే ఎక్కువగా అవసరమైనది అది ఒక్కటే. మన జీవితములలో వినుటకు ఏ స్థానమున్నది? ప్రభువు పాదముల యొద్ద కూర్చుని, ఆయన వాక్యమును చదువుతు మరియు ఆయన మనతో మాట్లాడునట్లుగా చూచుటకు ఎంత సమయము గడుపు చున్నాము? బహుశా మనము ఎంతో సమయము గడుపుట లేదు. ఇతర విషయములు ఎన్నో ఉండుట వలన, మార్త చేసినట్లు మనము కూడా అదే తప్పు చేసి తరచుగా దోషులుగా కనబడతాము. మనము తీరిక లేకుండా చేసినది లౌకిక సంబంధమైన విషయములు మాత్రమే కాకపోవచ్చు. అది క్రైస్తవ సేవకు సంబంధించిన విషయములు కూడా అయ్యుండవచ్చు. ప్రార్థన, ఆరాధన, కూడికలలో లేక సాక్ష్యమిచ్చు విషయములలో మనము ఎంతో ఉత్సాహముగా పాల్గొనవచ్చును. అయినా కూడా ప్రభువు మార్తను గద్దించినట్లు మనలను కూడా గద్దించుట మనము కనుగొనగలము.


''మరియ ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొన్నది'' ఇవి ప్రభువు ఆమెతో చెప్పిన విలువైన మాటలు. దీనినుండి చూసినట్లయితే ఈనాడు మనకు కూడా దేవుని యొక్క జీవ వాక్యము ద్వారా ఆయన చెప్పుచున్నాడు, అలాగైన మన మొదటి అంశము, ఉత్తమ విషయము- బైబిలులో మనకివ్వబడిన దేవుని వాక్యము. మూడు విధములుగా మనము దీనిని చూద్దాము. మొట్టమొదటిగా, బైబిలు యొక్క అధికారము తరువాత దేవుని వాక్యమును వినుట యొక్క ప్రాముఖ్యత, చివరిగా మన జీవితములలో దేవుని వాక్యము యొక్క ప్రభావము.


బైబిలు యొక్క అధికారము


మొట్టమొదట మనము బైబిలు యొక్క దైవిక అధికారమును పరిగణించాలి. ఎందుకంటే మిగతావన్నింటికీ ఇదే పునాది. ఈ విషయమును గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళుట అనేది పునాది లేకుండా భవనమును నిర్మించినట్లుంటుంది. బైబిలు యొక్క అధికారమును నిశ్చయ పరచుకుంటేనే దానికి మనము సరియైన విలువ నిచ్చి ప్రశంసించగలము.


క్రైస్తవ గృహములలో జన్మించి, పెంచబడిన అనేకులు బైబిలు దేవుని యొక్క వాక్యమని ఎటువంటి ప్రశ్న వేయకుండానే అంగీకరిస్తారు. ఎందుకంటే వారి తల్లిదండ్రుల చేత లేక వారి సంఘము చేత వారు ఆ విధముగా బోధించబడ్డారు. కాని వారు ఆ విధముగా చేయుటకు గల కారణమేమిటో వారి మనస్సులలో నిశ్చయపరచుకొనుటకు ప్రయత్నించరు. ఆధునిక భావాలు కలిగిన ఏదో ఒక వ్యక్తి వచ్చి ''లేఖనములు'' ఒకదానితో ఒకటి సరిపోవుటలేదు. గ్రంధములకు ఉన్న పేర్లు కలిగిన వ్యక్తులే వాటిని వ్రాయలేదు, తరువాత వచ్చిన వారు అనుమానం రాకుండా వాటిని వ్రాశారు. గనుక యేసు లేక ఆయన శిష్యులు ఏమి చెప్పారో తెలుసుకొనుట కష్టము. గొప్ప రక్షణ సంఘటనలకు కూడా సరిపోయినటువంటి ఆధారములు ఏమి లేవు. ఆధునిక మానవులు ఇటువంటి కట్టుకథలను నమ్మడం అసాధ్యం అని చెప్పేవరకు వీరు సంతోషముగానే ముందుకు సాగుతారు. అతడు ఆ విధముగా చెప్పే కొలదీ, వారి యొక్క సమస్త విశ్వాసము సన్నగిల్లిపోతుంది. ఎందుకు? ఎందుకంటే దీనిని ప్రథమ స్థానములో వారు పెట్టుకొనలేదు. సంగతులను గ్రుడ్డిగా నమ్మమని దేవుడు మనలను అడుగుటలేదు. అనేకమంది క్రైస్తవులు ఈ భావమును ఇతరులకు కలుగజేశారు. కాని ఇది పూర్తిగా తప్పు. మనము తెలుసుకొనునట్లుగా మన హృదయ నేత్రములు తెరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.


సాతాను మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాడని బైబిలు బోధిస్తుంది. పాపులమైన మనము మన ప్రకృతి సంబంధమైన మనస్సులతో దేవుని విషయములను అర్థము చేసికొనలేము. ఆ విధముగా మనము దేవుని ప్రత్యక్షత-అనగా దేవుడే తన సందేశమును మనకు తెలియజేయుట (దీనిని యథార్థముగా వెదికే వారికి దేవుడు చేయుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నాడు) మీద పూర్తిగా ఆధారపడాలి. మన మనస్సులు పాపముతో కూడియున్నవి గనుక అవి పడిపోవును. జ్ఞానములో మనము సంపూర్ణులము కాదు. మన పరిమితి గల, పడిపోయిన మనస్సులతో మన గ్రహింపుకు మించిన సంగతులను బైబిలులో మనము అర్థము చేసుకోలేనట్లయితే మనము ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు. బైబిలు మన గ్రహింపునకు వ్యతిరేకమని దీని అర్థము కాదు. దీని అర్థమేమిటంటే, చిన్న పిల్లలవలె మనము దేవుని సంగతుల యొక్క అంచులో మనము ఉన్నాము. ఒకవేళ మన మేథస్సు సంపూర్ణముగా నుండి, పడిపోవుటకు అవకాశము లేనట్లయితే నిశ్చయముగా మనము బైబిలులో సంపూర్ణముగా ఏకీభవించి ఉండేవారము. ఒక వ్యక్తి నూతనముగా జన్మించి, క్రీస్తు సారూప్యములో ఎదుగుచున్నట్లయితే, బైబిలును అర్థము చేసికొనే విషయములో కూడా అంతే ఎదుగుతు దానితో ఏకీభవిస్తాడనేది ఋజువు చేయబడిన సత్యము. అయితే, మన పరిమితులను మనము తెలిసికోకుండా, మనము విమర్శలకు తావిచ్చినట్లయితే, మనము తొట్రిల్లుతాము. మన పడిపోయే మేథస్సుకు ఏదైతే అనువుగా అనిపించిందో దాని మీద మన విశ్వాసముంచినట్లయితే, మనము ఇసుక మీద ఇల్లు కట్టామని ఒక రోజు మనము కనుగొంటాము.


బైబిలు దేవుని యొక్క వాక్యమని మనము ఎందుకు నమ్ముచున్నాము? మొదటిగా, యేసు క్రీస్తు యొక్క సాక్ష్యములను బట్టి నమ్ముచున్నాము. సువార్తలలో తరచుగా ఆయన పాత నిబంధన లేఖనములను ఎత్తిచూపుటను మనము చూస్తాము. ఆయన పరిచర్య ఆరంభములో, లూకా 4వ అధ్యాయములో, సాతానుయొక్క శోధనలకు సరియైన జవాబుగా ద్వితీయోపదేశకాండమును ఎత్తిచూపినట్లుగా మనము కనుగొందుము. యేసు తన పరిచర్యను ''అని వ్రాయబడెను'' అను లేఖనముల యొక్క అధికారమును నిశ్చయపరుస్తూ తన పరిచర్యను ప్రారంభించెను. ఆయన పునరుత్థానుడైన తరువాత లూకా 24వ అధ్యాయములో, మరొకసారి ఆయన లేఖనములను వివరించి చెప్పినట్లుగా కనుగొనగలము. మొదట ఎమ్మాయి మార్గములో నడుస్తూ ఇద్దరు శిష్యులకు కొద్ది సమయము తరువాత, మేడ గదిలోని పదకొండు మంది శిష్యులకు వివరించాడు. తన మూడున్నర సంవత్సరముల పరిచర్యలో ఆయన మరలా, మరలా హెబ్రీ లేఖనములను అధికారము కలిగిన దేవుని వాక్యముగా ఆయన ఎత్తి చూపిన సంఘటనలను మనము చూడగలము. ఈనాడు మనము కలిగియున్న పాత నిబంధన గ్రంథమే యూదుల లేఖనములని మనము జ్ఞాపకముంచుకోవాలి. క్లుప్తంగా వ్రాయబడిన నాలుగు సువార్తలలో, యేసు కనీసం యాబైఏడు వాక్యములను పాత నిబంధన గ్రంథమునుండి ఎత్తి చూపించారు. ఇది ఆయన వాడుక (అలవాటు) కాబట్టి, క్రొత్త నిబంధనలో ఇంకా వివరముగా వ్రాయబడని విషయములలో ఆయన ఇంకా లెక్కలేనన్ని సార్లు ఈ విధముగా చేసి ఉంటారు.


పాత నిబంధన యొక్క అధికారమును గురించి ఎటువంటి సందేహమునకు ప్రభువు చోటివ్వలేదని ఇది ఎంతో స్పష్టముగా తెలియజేస్తుంది. నిజానికి, భూమి మీద ఆయన అంగీకరించిన ఒకే ఒక్క వ్రాయబడిన అధికారము అదే. ఆయన దినములలోని పరిసయ్యులకు, సద్దుకయ్యులకు జవాబిచ్చుటకు ఆయన ఎల్లప్పుడు వాక్యమును ఎత్తి చూపించాడు. ''ఇది వ్రాయబడి యున్నది'' అని దీనిని ఆధారము చేసికొని ఆయన మాట్లాడే వారు. ఈనాడు అనేకమంది బోధకులు వేదాంత పండితుల, తత్వవేత్తల, మానసిక నిపుణుల మరియు లౌకిక సంబంధమైన రచయితల మాటలను ఎత్తి చూపిస్తూ ఉంటే, యేసు ప్రభువు వేరే వారి అభిప్రాయములను ఎత్తి చూపించుటకు ఆయన ఎప్పుడు చూడలేదు. పాత నిబంధన గ్రంథమే ఆయనకున్న ఏకైక అధికారము. ఒకవేళ ఆయన యొక్క సాక్ష్యమును మనము అంగీకరించినట్లయితే, బైబిలు దేవునియొక్కవాక్యము అని కూడా మనము అంగీకరించవలసియున్నది. ఎవరైతే బైబిలును తిరస్కరిస్తారో వారు యేసుప్రభువు యొక్క సాక్ష్యమును కూడా వారు తిరస్కరిస్తారు.


రెండవదిగా, బైబిలును తప్పిపోని దేవుని వాక్యముగా మనము ఎందుకు అంగీకరిస్తున్నామంటే, అందులో విపులముగా ఉన్న ఎన్నో ప్రవచనములు నెరవేరినవి. బైబిలులో మూడవవంతు ప్రవచనములే. యేసు ప్రభువు యొక్క పుట్టుక, మరణము మరియు పునరుత్థానములను గూర్చిన ప్రవచనములు, యేసు ప్రభువు భూమిమీదకు రాకమునుపు కొన్ని వందల సంవత్సరముల క్రితమే పాత నిబంధన గ్రంథములో వ్రాయబడ్డాయి, మరియు ఆయన వచ్చిన తరువాత అవి అక్షరాల నెరవేరాయి. పాత నిబంధన కాలములోని ప్రాముఖ్యమైన దేశములను గూర్చిన ప్రవచనములు ముఖ్యముగా ఇశ్రాయేలును గూర్చిన ప్రవచనములు అక్షరాలా నెరవేర్చబడ్డాయి. మన జీవితకాలములోనే యూదులు తమ స్వంత దేశమైన పాలస్థీనాకు తిరిగివచ్చి యేరూషలేము పట్టణమును స్వాధీనపరచుకున్నారు. ఇవన్నియు 2500 సంవత్సరముల క్రితమే చెప్పబడ్డాయి.


బైబిలుయొక్క దైవిక ప్రేరేపణను గూర్చిన మరొక ఋజువు ఏమిటంటే, బైబిలులో గల అరవై ఆరు పుస్తకములలో గల ఏకత్వమే. ఆ పుస్తకములు మూడు భాషలలో, 1600 సంవత్సరముల వ్యవధిలో, నలుబది వేర్వేరు గ్రంథకర్తల చేత వ్రాయబడ్డాయి. ఈ గ్రంథకర్తల విద్యాప్రమాణాలు, సాంఘీక స్థానాలు, నాగరికతలు వేర్వేరుగా ఉన్నాయి. వీరిలో రాజులు, సాంఘీక స్థానాలు, నాగరికతలు వేర్వేరుగా ఉన్నాయి. వీరిలో రాజులు, గొఱ్ఱెల కాపరులు, సైన్యాధిపతులు, దీర్ఘదర్శులు, పరిసయ్యులు, జాలరులున్నారు. అయినప్పటికీ, వారి వ్రాతలలో అద్భుతమైన ఏకత్వమును మనము కనుగొనగలము. మరియు ప్రాథమికమైన ఎటువంటి బేధమును అందులో లేదు. అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు కనిపించినా అవి ప్రాముఖ్యమైనవి కావు, అవి ఎత్తి వ్రాయుటలో జరిగిన పొరపాట్లు అని చెప్పవచ్చు. ప్రాథమికమైన నైతిక మరియు సిద్ధాంతములకు సంబంధించి ఎటువంటి బేధములను మనము కనుగొనలేము. బైబిలులో వ్రాయబడిన అనేక చారిత్రాత్మక సంగతులు ప్రశ్నించబడ్డాయి, కాని పరిశోధనలు చేసిన తరువాత అవి ఋజువు చేయబడ్డాయి. బైబిలులోని శాస్త్రమునకు (సైన్సుకు) సంబంధించిన సంగతులు (ఇవే కొన్నే ఉన్నాయి. ఎందుకంటే బైబిలు సైన్స్‌ పుస్తకము కాదు) అన్నీ కూడా భౌతిక ప్రపంచంలో స్థిరపరచబడిన సత్యములకు సరిపోలి ఉన్నవి. శాస్త్రము (సైన్స్‌)కు సంబంధించి మానవుని జ్ఞానము ఎంతో తప్పుగా ఉన్న దినములలోనే బైబిలు వ్రాయబడినప్పటికీ ఆదినములలో మరియు ఆ తరువాత దినములలో మానవులు నమ్మిన తప్పుడు సిద్ధాంతములు (విషయములు) బైబిలులో ఎక్కడా లేవు. శాస్త్రం (సైన్స్‌) తన సిద్ధాంతాలను తరచుగా మారుస్తూ, పుస్తకములను మార్చి వ్రాస్తూ ఉంటుంది. కాని బైబిలుకు అలాంటి అవసరం లేదు.


శతబ్దాల తరబడి తన శత్రువులు చేసిన ప్రతి దాడిని ఎదుర్కొని విజయవంతముగా బైబిలు నిలువబడటమే, అది దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినదనుటకు మరొక ఋజువు. బైబిలులాగా తీవ్రమైన దాడిని ఎదుర్కొన్న మరొక పుస్తకము ఈ ప్రపంచములో లేదు. అయినప్పటికీ తన స్నేహితుల విమర్శలను, శత్రువుల ద్వేషమును తట్టుకొని మహిమకరముగా నిలబడగలిగింది. ఫ్రెంచి దేశపు నాస్తికుడైన వోల్టేరు అనే వ్యక్తి, వంద సంవత్సరముల తరువాత బైబిలు ఉండదు అని చెప్పాడు. అవి ప్రఖ్యాతిగాంచిన అతని ''చివరిమాటలు''. అధ్భుతముగా, ఆయన మరణానంతరం బైబిలు సొసైటీ వారు ఆయన ఇంటిలోనే తమ కార్యాలయమును తెరచారు. ఈ విధముగా దేవుడు తన వాక్యమును నిరూపించాడు. నాస్తికులు రావచ్చు, పోవచ్చు కాని బైబిలు శక్తి నుండి అధిక శక్తికి సాగిపోతుంది. ప్రపంచములో ఎక్కువగా ప్రేమించబడి, గౌరవించబడి, విలువ ఇయ్యబడిన పుస్తకము బైబిలు తప్ప మరొకటి లేదు. ప్రపంచములో ఎక్కువగా అమ్మ బడినది బైబిలే.


బైబిలు ద్వారా లెక్కలేనన్ని జీవితాలు మార్చివేయబడ్డాయి. కొన్ని సార్లు బైబిలులోని కేవలము ఒక్క వచనము ద్వారానే జీవితాలు మార్చివేయబడ్డాయి. కాబట్టి దీనిద్వారా కూడా బైబిలు దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడిన గ్రంథమని మనము నమ్ముచున్నాము. బైబిలులోని వాక్యభాగములను, ఎవరూ ఊహించలేని రీతిలో దేవుడు మనుష్యులను మార్చి, రక్షణలోనికి నడిపించుటకు దేవుడు వాడుకున్నాడు. దుష్టులైన స్త్రీ, పురుషులు బైబిలులోని వాక్యభాగములను చదివి ఒక్క రాత్రిలోనే దేవుని పరిశుద్ధులుగా మారిపోయారు. సొంత భాషల్లోనికి చేయబడిన తర్జుమా అంత బాగలేకున్నప్పుడు, ఇటువంటి ఫలితములు రావడం ఎంతో అసాధ్యమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగాయి. మానవ జీవితములో మార్పు తెచ్చుటకై దేవుడు ఈ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు.


బైబిలు దైవ ప్రేరేపిత గ్రంథమని చెప్పుటకు గల ఆరవ ఋజువు ఏమిటంటే, బైబిలు ఒక అపరిమితమైన తరగని పుస్తకము. శతాబ్దముల తరబడి మేథావులనేకులు అత్యాశక్తితో తమ జ్ఞానమంతా ఉపయోగించి, వారి జీవిత కాలమంతా ఈ గ్రంథమును చదివారు. అయినప్పటికీ, బైబిలు యొక్క అడుగును తాకలేక పోయారు. అడుగులేని గనిలాగా, బైబిలు క్రొత్త నిధిని ఇస్తూ ఉంది, మనుష్యులతో ఎల్లప్పుడు క్రొత్తగా (తాజాగా) మాట్లాడుతూ ఉంది. పైగా, దీనిలోని సందేశము ఎంతో సామాన్యముగా చిన్న బిడ్డ కూడా అర్థము చేసుకునే విధముగా ఉంటుంది. కాలము, దీనిని కాలము చెల్లినదిగా చేయలేదు. ఇది శాశ్వత కాలము ఉండునది (సమయముతో ముడిపడిలేనిది). దీనిని సంప్రదించుటకు మనకే గాని దీనత్వమున్నట్లయితే, మన సమస్యలన్నింటికీ పరిష్కారమును ఈ అద్భుతమైన పుస్తకములో కనుగొనగలము. ఇది కేవలము మనుష్యుల చేత వ్రాయబడియుంటే ఈ విధముగా సాధ్యమవ్వదు; అయితే ఇది దేవుని చేత ప్రేరేపించబడిన గ్రంథము గనుక అనంత దేవుని యొక్క తరగని జ్ఞానము ఇందులో ఉన్నది. కావున మానవుడు తన అవసరతను బట్టి ఎల్లప్పుడు దీనిలోనుండి జ్ఞానమును పొందవచ్చును.


చివరిగా, బైబిలు దైవ ప్రేరేపిత గ్రంథమని చెప్పుటకు గొప్ప ఋజువు ఏమిటంటే, దేవుని సన్నిధిలో దీనత్వముతో మనము దీనిని చదివిన యెడల, దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిలులో మాటలు మనము విన్నకొలదీ అది దేవుని యొక్క స్వరమని మనము ఒప్పుకుంటాము. లేఖనముల యొక్క గొప్ప అంశములైన త్రిత్వము మరియు పాప పరిహారము అనువాటిని మానవుడు ఎప్పటికీ తనంతట తానే కనుగొని యుండేవాడు కాదు.


అది కేవలము ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా మాత్రమే తెలియబడతాయి. నిజముగా అవి దేవుడు ఇచ్చినవే. బైబిలులోని ప్రతి పుస్తకములో గల విషయములు మరియు సందేశములు కూడా ఎంతో అద్భుతముగా కూర్చబడింది. ప్రత్యేకముగా, యేసు ప్రభువును అద్దములో చూపించినట్లు చూపించబడినది. ''లేఖనములన్నింటిలో క్రీస్తు'' అను పేరుగల ఒక పాత వ్యాఖ్యానములో, ఎంతో చక్కగా వివరించబడినది. బైబిలు విద్యార్థులు ఆయననే గురి కలిగి చదివినప్పుడు, లేఖనములు అన్నింటిని ''కలిపి'' చూచినప్పుడు వారు ఎంతో అద్భుతమైన, ఒప్పుకోదగిన స్థితిని ఎప్పుడు కనుగొంటారు.


బైబిలు యొక్క అధికారము ఎంతగానో ప్రశ్నించబడుచున్న సమయములో మనము జీవిస్తున్నాము. సాతాను హవ్వ మనసును చెరిపినట్లు, మీ మనస్సులను కూడా చెరిపే అవకాశముందని (2కొరింథీ 11:1-3) పౌలు కొరింథీయులను హెచ్చరించాడు. సాతాను హవ్వ దగ్గరకు వచ్చినప్పుడు, ''దేవుడు చెప్పెనా'' అనే ప్రశ్నను అడిగాడు. అప్పటినుండి అదే పాత ప్రశ్నను ''ఇది నిజముగా దేవుని వాక్యమేనా'' అని మనుష్యులను అడుగుచున్నాడు. ఇది విశ్వాసము నుండి మనుష్యులు తొలగిపోవడానికి సాతాను ఉపయోగించుకుంటున్న ఎంతో విజయవంతమైన తంత్రము. లోకములోని మోసపరచు ఆత్మలయందు లక్ష్యముంచుట వలన కడవరి దినములలో ఎంతో ఎక్కువ మోసము జరుగుతుందని పరిశుద్ధాత్మ మనలను హెచ్చరిస్తున్నాడు (1తిమోతి 4:1). ''కొందరు విశ్వాస భ్రష్టులగుదురు'' అనే మాట అన్యులకు కాదు క్రైస్తవులకే చెప్పబడినది. యేసు క్రీస్తు ప్రభువు అంత్య దినములను గూర్చి చెప్పుచున్నప్పుడు, మత్తయి 24లో (5,11,24 వచనములు) మోసపోవుటకు గల అవకాశమును మూడు సార్లు ప్రస్తావిస్తాడు. 2థెస్సలోనియులకు 2:3లో పౌలు కూడా ప్రభువు దినమునకు ముందు ''పడిపోవుటను'' గూర్చి చెప్పాడు. సాతాను యొక్క నరకగర్భమైన మోసమునకు క్రైస్తవులు చెవి యొగ్గుటయే ఈ తప్పిదమునకు కారణము. ఈ హెచ్చరికలు ఎంతో తీవ్రమైనవి. ఇవన్నియు చెప్పినా కూడా మనము మెలకువగా లేనట్లయితే, ఖచ్చితముగా మనము మోసమునకు గురవుతాము.


ఒక మనుష్యుడు ఏ విధముగా నిన్ను మోసపరచుటకు చూస్తాడు? ఒకవేళ నిజమైన వందరూపాయల నోటుకు బదులు నకిలీ నోటుతో నిన్ను మోసము చేయాలనుకుంటే, ఆ నకిలీ నోటు నిజమైన నోటుకు వీలైనంత దగ్గరగా ఉండునట్లు చూసుకుంటాడు. ఆ విధముగా మాత్రమే అతడు నిన్ను మోసము చేయగలడు. సాతాను అంతకంటే తక్కువ కుయుక్తిపరుడు కాదు. అనుమానము కలగని ఒక క్రైస్తవుణ్ణి, మోసము చేయుటకు సాతాను ఉపయోగించే అత్యంత శక్తివంతమైన పరికరమేమిటంటే ఒక ''క్రైస్తవ'' బోధకుడు - అతడు బైబిలును ఆధారము చేసికొనే బోధిస్తాడు గాని బైబిలు అధికారమునకు అతడు లోబడడు. అతడు బోధించే విషయములు అసలు బైబిలులో ఉన్నవో, లేవో లేక వారు బైబిలు యొక్క సత్యమును అసమతుల్యముగా లేక వక్రీకరించి చెబుతున్నారేమోనని మనము దగ్గరగా పరిశీలించాలి. అతడిని జాగ్రత్తగా గమనించాలి!


ఇటువంటి మోసములన్నింటికి బైబిలే భద్రత. మన బైబిళ్ళు మనకు క్షుణ్ణంగా తెలియకపోతే, అటువంటి మోసమునకు మనము తప్పకుండా పాగావేయబడతాము. మన విశ్వాసమునకు సంబంధించిన అన్ని విషయములలో బైబిలే మనకు అంతిమ అధికారముగా మనము పెట్టుకోనట్లయితే, మన విశ్వాసము కాస్త కోల్పోయేవరకు ఇటు అటు కొట్టబడుతూనే ఉంటాం.


శాస్త్రులు పరిసయ్యులు పాత నిబంధనను నిరాకరించి తమ సొంత సంప్రదాయములను పెట్టినందుకే యేసు ప్రభువు వారిని ఖండించారు (మార్కు 7:5-13). వ్రాయబడిన వాక్యము పట్ల వారి దీర్ఘకాలము తిరస్కరించి చివరకు ఆయన వారి మధ్యలోనికి జీవవాక్యముగా వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించుటకు కారణమైనది. ఆ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క ఆత్మీయ సంతానమును ఈనాడు మన తరములో కనుగొనగలము. అనేకులు వారిచేత మోసగించబడుతున్నారు. మనము ఎంత జాగ్రత్తగా యుండవలెనో గదా!


నీ నామమంతటి కంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు (కీర్తన 138:2) అని మనము కీర్తనాకారుని చేత చెప్పబడ్డాము. కాబట్టి దానిని తిరస్కరించుట గాని లేక విడిచిపెట్టుటగాని లేక తక్కువగా చూచుటగాని చేస్తే అపారమైన నష్టమును ఆహ్వానించినట్లే. కాని దానిని గౌరవించినట్లయితే చెప్పనశక్యము కాని ధన నిధికి ద్వారమును కనుగొంటాము.


దేవుని వాక్యమును వినుటయొక్క ప్రాముఖ్యత


అనుదినము దేవుని వాక్యమును ధ్యానించడంలో సమయము గడుపుట ఎంత ప్రాముఖ్యమో, ప్రభువైన యేసు మార్తతో చెప్పిన మాటలలో గ్రహించగలము. ఇవి ఈ అధ్యాయము ప్రారంభములో మనము చూచాము. మనకు సహాయకరమైనవి, ఉపయోగపడేవి ఎన్నో ఉండవచ్చు కాని వీటన్నిటికంటె, అత్యంత ప్రాముఖ్యమైనది ఇది ఒకటి మాత్రమే. మన శరీరములు ప్రాణవాయువు లేకుండా ఏ విధముగా ఉండలేవో, దేవుని వాక్యమును వినకుండా మనము ఏమీ చేయలేము. ఇది ఎంతో అసాధ్యము. ప్రభువు యొక్క పాదముల యొద్ద కూర్చుని అనుదినము ఆయన మాటలు వినుట అనేది మన ఆత్మలకు ఎంతో అవసరమైయున్నది.


ఒక మనిషి యొక్క జీవితమును ఏయే అంశాలు ప్రభావితము చేస్తాయో, మరెవరికంటే ఎక్కువగా యేసు క్రీస్తు ప్రభువుకే బాగా తెలుసు. ఒక మనుష్యుడు ఏయే పరిస్థితులద్వారా వెళ్ళగలడో అవన్నియు ప్రభువుకు తెలుసు. ప్రతి మనుష్యుని యెదుట నున్న ప్రమాదములు మరియు సాతాను యొక్క తంత్రములు ఆయనకు తెలుసు. మానవుని యొక్క ఆత్మీయ అభివృద్ధికి కావలసినదేమిటో ఆయనకు తెలుసు మరియు ఏ విషయాలు ఎక్కువ ప్రాముఖ్యమైనదో, ఏది ప్రాముఖ్యమైనది కాదో ఆయనకు మాత్రమే తెలుసు. ఇవన్నీ తెలిసే, ఆయన ఈ విధముగా చెప్పాడు: మిగతా అన్నింటికంటే అవసరమైనది ఒక్కటే.


ఇదే విధమైన మాటలు లూకా 4:4 లో కూడా ఆయన ఉపయోగించాడు. ''మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును''. ఇది ద్వితీయోపదేశ కాండము 8:3 నుండి ఎత్తిచూపబడిన వచనము. ఇది ఇశ్రాయేలీయులను అరణ్యములో 40 సంవత్సరములు దేవుడు మన్నాతో వారిని పోషించిన సందర్భములోనిది. పరలోకమునుండి అనుదినము వారికి మన్నా కురిపించుటలో గల ఉద్దేశ్యము ఏమిటంటే, ఏ విధముగా అయితే వారికి మన్నా కురిపించబడిందో అదే విధముగా వారు దేవుని వాక్యమును ప్రతిదినము పొందుటకు నేర్చుకోవాలని ఇశ్రాయేలీయులకు చెప్పబడినది. ఇశ్రాయేలీయులు వారి అరణ్య ప్రయాణములో బలము నొందవలెనంటే, వారికి అనుదినము మన్నా అవసరమైయున్నది. అదే విధముగా, ఒక మనుష్యుడు తన జీవితములోని శోధనలు ఎదుర్కొనుటకు శక్తి కావలెనంటె కూడా, ఆ మనుష్యుడు అనుదినము దేవుని వాక్యమును పొందవలసియున్నది.


యేసు ఈ మాటలను ఏదో తేలికగా చెప్పలేదు. యేసు మాటలను అనుదినము వినుట యొక్క ప్రాముఖ్యతను శిష్యులలో కలుగజేయవలెనని ఆయన చూచాడు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, వ్రాయబడిన దేవుని వాక్యమును ధ్యానించుటకు సమయమివ్వని జీవితము వృథాయే. ఆ జీవితము మరేది సాధించినప్పటికీ వృథాయే.


లూకా 17:26-30 లో, నోవహు, లోతు దినములలో ఉన్నట్టే చివరి దినములుండునని యేసు చెప్పాడు. అక్కడ ప్రజలు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కట్టుచు ఉందురని చెప్పాడు. ఈ విషయములలో ఏది పాపము కాదని నీవు గమనించావా? ఇవన్నియు కూడా చేయదగినవే. మరి ఎందుకు వీటిని ఆ పాపపు దినముల యొక్క ప్రత్యేకమైన లక్షణములుగా యేసు ప్రభువు ప్రస్తావించారు? ఎందుకంటే ఆ దినములలో ప్రజలు చేయదగిన ఈ పనులతోనే ఎంతో తీరికలేకుండా ఉన్నారు. వారికి దేవుని కోసము సమయమే లేదు. వారి జీవితములలో దేవునికి స్థానము లేకుండా చేయుటలో అపవాది విజయం సాధించాడు. ఎప్పుడు ఉన్నట్లే దీని ఫలితమేమిటంటే, అవినీతి మరియు నైతిక విలువలు దిగజారిపోవడము.


ఈనాడు లోకములో మనము చూస్తున్న పరిస్తితులను గమనించినట్లయితే అదే వైఖరిని మరియు అదే ఫలితమును మనము చూడగలము. స్త్రీలు మరియు పురుషులు దేవుని స్వరమును వినుటకు సమయము లేనంత తీరికలేకుండా ఉన్నారు. నీ స్వంత జీవితమును గమనించి ఇది నిజమో కాదో చూడు. ఈ లోకపు ఆత్మ విశ్వాసి యొక్క హృదయములోనికి ప్రవేశించింది. మన పూర్వీకులకు లేని ఎన్నో పరికరములు మనకు సమయము మిగిలిస్తున్నా కూడా, మనిషికి ఇంకా సమయము సరిపోవుట లేదు. ఈ రోజు మనము కారు, రైలు లేక విమానములలో ప్రయాణిస్తు ఉన్నాము. వారైతే జంతువులు గాని లేక వారి కాలినడక మీద ప్రయాణం చేశారు. మన పూర్వీకులు ఇంటిలో పనులు చేసుకోవడానికి ఎంతో సమయము వెచ్చించవలసి వచ్చేది కాని మనమైతే ఇప్పుడు ఎన్నో పరికరములను, వస్తువులను వినియోగిస్తున్నాము. అయినా కూడా మనము దేవుని కోసం కేటాయిస్తున్న సమయము కంటే ఎంతో ఎక్కువ సమయమును వారు దేవుని కోసం కేటాయించారు. ఎందుకు? ఎందుకంటే వారి ప్రాధాన్యతలు సరిగా ఉన్నాయి. వారు మొదట ఉండవలసిన సంగతులను మొదటే పెట్టారు.


మనము ప్రభువు కొరకు ప్రభావము గలిగిన సాక్షులుగా ఉండవలెనంటే, అనుదినము ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన స్వరము వినుట అనివార్యము. దేవుని స్వరమును ప్రతి దినము వినే అలవాటును అబివృద్ధి చేసుకోకుండా ఈనాడు అనేకమంది బోధించాలనే కోరిక కలిగియుంటున్నారు. దీని ఫలితముగా ''ప్రభువు యొక్క మాట'' తగ్గిపోయి మనుష్యుల యొక్క మాటలు ఎక్కువైపోయాయి. ''దేవుని వాక్కు తన యొద్ద నున్నది'' (2రాజులు 3:2) అని చెప్పగలిగిన ఈనాటి బోధకులు ఎంతో తక్కువ మంది ఉన్నారు. అయినా కూడా బైబిలులో ఉన్న ప్రతి నిజమైన దైవసేవకునికి ఇది అసాధ్యమైన గుర్తు.


మొట్టమొదట దేవుడు తనకు ఏమి చెప్పుచున్నాడో తెలిసికొనుటకు సమయం గడపని ఒక వ్యక్తికి దేవుణ్ణి గురించి ఇతర వ్యక్తులకు చెప్పే హక్కు లేదు. ఇది వ్యక్తిగతముగా సాక్ష్యం చెప్పుటయైనా కావచ్చు మరియు బహిరంగముగా బోధించుటయైనా కావచ్చు. మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించెను తరువాత ''అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇశ్రాయేలీయులకు చెప్పెను'' (నిర్గమ 34:34) అని మోషే గురించి వ్రాయబడినది. దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తేనే తన మార్గము వర్ధిల్లుతుందని (యెహోషువ 1:8) యోహోషువ చెప్పబడ్డాడు. దేవుడు మాట్లాడునది వినుటకు వేచియుండి, ఆ తరువాత ప్రజలతో వాటిని మాట్లాడిన వారిలో సమూయేలు ఒక శ్రేష్టమైన మాదిరిగా ఉన్నాడు. దీని ఫలితమేమిటంటే ''సమూయేలు మాటలలో ఏదియు తప్పిపోకుండా'' (1సమూయేలు 3:19) ప్రభువు చేశాడు.


యేసు ప్రభువును గూర్చిన ప్రవచనాత్మకముగా వ్రాయబడిన యెషయా 50:4లో ఆయన గురించి ఈ విధముగా చెప్పబడినది ''శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు''. దీనికి ఫలితమేమిటంటే, అదే వచనములో చెప్పబడినట్లుగా ఆయన యొద్దకు వచ్చు ప్రతి వాని అవసరమునకు తగినట్లుగా యేసు యొద్ద మాటలు సిద్ధముగా నున్నవి. ఆయన నిజముగా తండ్రి యొక్క పరిపూర్ణమైన నోటి బూర. దేవుని యొక్క స్వరమును ప్రతి దినము వినే అలవాటు యేసుకే అంత అవసరమైతే, మరి మనకెంత అవసరమో గదా. మనము ఈ విషయములో తప్పిపోయినట్లయితే, అవసరములో ఉన్న వారికి తగినట్లుగా మనము పరిచర్య చేయలేము. మనము ''శిష్యుని వలె వినుట'' నేర్చుకున్నప్పుడు మాత్రమే ''శిష్యుని నాలుక'' (శిష్యునికి తగిన నోరు)ను మనము కలిగియుండగలము. దురదృష్టవశాత్తు, ఇతరులకు బోధిస్తున్న అనేక మంది ఇంకా ఆత్మీయ పిల్లల వలె ఉన్నారు ఎందుకంటే, వారు ఈ ''ఒక్క విషయము'' ను విడిచిపెట్టయినా ఉండుంటారు లేక నిర్లక్ష్యం చేసైనా ఉండుంటారు.


ప్రభువు చెప్పేది వినడం అంటే కేవలము బైబిలు చదవడము కాదు. ఏదో కేవలము ఆచారముగా బైబిలు చదివే వారు అనేకులున్నారు. ప్రభువు చెప్పేది వినడం అంటే అంత కంటే ఎక్కువైనది. దీని అర్థమేమిటంటే, ఆయన వాక్యము ద్వారా మనము సందేశం పొందేవరకు దానిని ధ్యానించడము. కేవలము ఈ విధముగా మాత్రమే మన మనస్సులు మారి నూతనమై అంతకంతకు క్రీస్తు మనస్సు వలె రూపాంతరమవుతాయి. కాని బైబిలును చదివే అనేకులు ఈ విధముగా ధ్యానించుటను ఇంకా నేర్చుకోలేదు.


మరియ యేసు పాదముల యొద్ద కూర్చొన్న దానిని బట్టి మనము కనీసం మూడు ఆత్మీయ సత్యములను నేర్చుకొనవచ్చును.


కూర్చొనుట అనేది నడచుట లేక పరుగెత్తుట లేక నిలబడుట వంటిది కూడా కాదు. ఇది ప్రాథమికముగా విశ్రాంతిని సూచిస్తుంది. దేవుడు మనతో మాట్లాడునది మనము వినక మునుపు మన హృదయములు విశ్రాంతిలో ఉండాలి మరియు మన మనస్సులు కూడా నెమ్మదిలో ఉండాలని ఇది మనకు బోధిస్తుంది. ఒప్పుకోబడని పాపము మనలను ప్రభువు యొద్ద నుండి వినకుండా చూస్తుంది. ఐహిక విచారములు, సంపదలు దేవుని యొద్ద కూర్చోనివ్వకుండా మార్గ మధ్యములో అడ్డుపడతాయి. సరిగాలేని మనస్సాక్షితో లేక చింత, భయముతో నిండియున్న మనస్సుతో ''దేవుని యొక్క మెల్లనైన స్వరము'' ను వినాలని ఏ విధముగా ఆశించగలము? మనము దేవునిని తెలుసుకోవాలంటే మనము ఆయన సన్నిధిలో ఊరకయుండమని కీర్తనలు 46:10 చెప్పుచున్నది.


ఒక వ్యక్తి యొక్క పాదాల చెంత కూర్చొనుట దీనత్వమును సూచిస్తుంది. మరియ యేసుతో సమానముగా కుర్చీలో కూర్చొనలేదు గాని క్రింద కూర్చొన్నది. దేవుడు తీర్పు దినమున తప్ప ఎప్పుడు గర్విష్టులతో మాట్లాడడు. ఆయన సన్నిధిలో చిన్న బిడ్డ వలె నుండి (మత్తయి 11:25) దీనుడిగా ఉన్న వ్యక్తితో మాట్లాడుటకు మరియు తన కృపను ఇచ్చుటకు దేవుడు ఎల్లప్పుడు సిద్ధముగా నుంటాడు.


మూడవదిగా, మరియ వలె కూర్చొనుట లోబడుటను సూచిస్తుంది. ఇది యజమానుని సన్నిధిలో ఒక శిష్యునికుండవలసిన వైఖరి. దేవుని వాక్యమునకు మనము విధేయత చూపినప్పుడు మన లోబడే తత్వము బయల్పరచబడుతుంది. ఏదో మన కుతూహలమును సంతృప్తి పరచుటకో లేక మనకు సమచారమిచ్చుటకో దేవుడు తన వాక్యములో ఆయన మాట్లాడలేదు. ఆయన హృదయ వాంఛయే ఆయన వాక్యము. మనము విధేయత చూపించుటకు ఆయన మాట్లాడుతాడు. మనము ఆయన చిత్తమును చేయగోరితేనే ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానమును మనకు ఇస్తాడని యేసు యోహాను 7:17లో ఎంతో స్పష్టముగా చెప్పాడు.


బైబిలు ద్వారా దేవుడు వారితో మాట్లాడాలని ఆశించకుండానే (వెదకకుండానే) అనేకమంది క్రైస్తవులు నెలలు, సంవత్సరముల తరబడి బైబిలు చదువుతూ ఉంటారు. అయినా కూడా వారు ఎంతో సంతృప్తి చెందినట్లుగానే ఉంటారు. నేను నిన్ను అడుగుచున్నాను. ప్రతిదినము దేవుని స్వరమును నీవు వినుచున్నావా? ఒకవేళ వినకపోతే దానికి కారణమేమిటి? వినే వారితోనే ఆయన మాట్లాడతాడు. నీ ఆత్మయొక్క చెవులను ఆపుచున్నదేమిటి? ఆయన సన్నిధిలో నెమ్మది కలిగిలేక పోవుటమా, లేక ఆత్మయందు దీనత్వము కలిగి లేకపోవుటమా, లేక ఇప్పటికే ఆయన నీతో చెప్పినదానికి నీవు విధేయత చూపించక పోవుటమా? అదేదైనా సరే, ఒక్కసారే శాశ్వతముగా దేవుడు దానిని బాగుచేయగలడు. ''మాట్లాడు ప్రభువా, నీ దాసుడాలకించుచున్నాడు'' అని సమూయేలు వలె ప్రార్థన చెయ్యి, తరువాత నీ బైబిలు తెరచి ఆసక్తితో దేవుని యొక్క ముఖమును వెదకు, అప్పుడు దేవుని యొక్క స్వరమును నీవు వింటావు.


దేవుని వాక్యము యొక్క ప్రభావము


మన జీవితములో దేవుని వాక్యము యొక్క ప్రభావమును మనము అర్థము చేసుకొనేవరకు ప్రభువు యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆయన వాక్యమును వినుటలో గల ప్రాముఖ్యతను మనము పూర్తిగా ప్రశంసించలేము. ఒక వైద్యుడు ఒక రోగికి మందులు ఇచ్చినప్పుడు, ఆ రోగికి ఆ మందుల పట్ల నమ్మకము లేకున్నా లేక ఆ మందులు అతనికి ఏమి చేయగలవో తెలియక పోయినా అతడు అనుదినము ఆ మందులు వేసుకొనుటలో జాగ్రత్త వహించలేడు. వాటిని తీసుకొనకపోయినా కూడా తానేదో కోల్పోయినట్లుగా అతడు భావించడు. కాని దానికి వేరుగా, అతని శరీరమునకు ఆ మందులు ఎంత స్వస్థత నిస్తాయో, మరియు అతని ఆరోగ్యమును ఎంత అద్భుతముగా అవి బాగు చేయగలవో అతనికి అర్థమయిన యెడల క్రమముగా వాటిని వేసుకొనుటకు ఎంత వెలయైనా సరే వాటిని వేసుకోవడం సాధారణముగా మానుకోడు.


అదే విధముగా, దేవునితో మరియు ఆయన వాక్యముతో క్రమమైన దైవధ్యాన సమయము లేకపోయినా కూడా, వారు ఏదో కోల్పోయాననే భావనలేని వేలాది మంది క్రైస్తవులను మనము కనుగొనగలము. నీ స్వంత జీవితమును పరిశీలించుకొనుము. ఒక దినము దేవునితో మౌనధ్యాన సమయమును కలిగియుండనట్లయితే, విలువైన దానిని నీవు కోల్పోయానని చింతిస్తున్నావా లేక నేనేది కోల్పోలేదు అని నీవు అనుకుంటున్నావా? అనేక మంది దేవుని పిల్లలు ప్రతిరోజూ దేవునితో మౌనధ్యాన సమయము కలిగిలేకుండా కూడా దానియెడల ఎంతో ఆత్మ సంతృప్తి కలిగియుంటారు. దేవుని వాక్యము ఒక వ్యక్తి యొక్క జీవితము మీద చూపు ప్రభావమును వారు చూడనప్పుడే ఈ విధముగా జరుగుతుంది. ఇది మనము పైన చూచినట్లుగా మందుల కంటే ఎక్కువైనది ఇది మన ఆహారము. దేవుని వాక్యము యొక్క నూతనపరచు శక్తికి విధేయత చూపక పోవుట వలన వారు ఎంత నష్టపోవుచున్నారో తెలుసుకోకుంటున్నారు.


ఒక మనిషి మీద దేవుని వాక్యము యొక్క ప్రభావమును అర్థము చేసికొనుటకు, బైబిలులో ఉన్న తొమ్మిది సాదృశ్యములను (గుర్తులను) మనము పరిగణనలోనికి తీసుకొందాము. ఈ గుర్తులు వాటికవే వివరణలుగా ఉండొచ్చు లేక వివరించబడినవైనా అయ్యుండొచ్చు.


మొట్టమొదటిగా, కీర్తనలు 119:105 ను మనము చూద్దాము. అక్కడ వాక్యము వెలుగుతో పోల్చబడినది. ''నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది''. మనము చీకటిలో తెలియని మార్గములో నడుస్తున్నట్లయితే, మన మార్గమును చూచుటకు మనము వెలుగును ఉపయోగిస్తాము. కారు చీకటి అను పాపము కలిగిన లోకములో బైబిలు మనకు ఏమి చేస్తుందో అను దానికి పైన చెప్పినది సాదృశ్యముగా నున్నది. ఇది దేవుని యొద్దకు మార్గమును మనకు చూపిస్తుంది. బైబిలు ద్వారా తప్ప దేవుని మార్గములోని రక్షణను మనము తెలిసికోలేము.


ఇంకా, బైబిలు క్రైస్తవునికి సరియైన సిద్ధాంతముల మార్గములో వెలుగునిస్తుంది, అదే సమయములో త్రోవ ప్రక్క నుండు తప్పుడు బోధలను గోతులలో పడిపోకుండా కూడా వెలుగునిస్తుంది. ఆ వెలుగు లేకుండా, ఏది సత్యమో ఏది అసత్యమో అతడు తెలుసుకోలేడు. బెరయ సంఘములోని విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు అభినందించాడు. ఎందుకంటే, లేఖనములను వారంతట వారే పరిశీలించేంతవరకు అపొస్తలుడైన పౌలు చెప్పినదానిని కూడా వారు స్వీకరించలేదు (అపొ.కా. 17:11). కేవలము అప్పుడు మాత్రమే వారు ఆయన సందేశమును అంగీకరించారు. (వారి యొద్దకు వచ్చే బోధకుల పట్ల వారికున్న ఈ వైఖరే పౌలు వేరే సంఘముల వారికి తప్పుడు సిద్ధాంతమును సరిచేయుటకు పత్రికలు పంపించినట్లుగా బెరయ వారికి పంపించకుండా చేసినదా?).


శ్రద్ధ కలిగి లేఖనములను పరిశీలించుట అనేది తప్పుడు సిద్ధాంతమునకు ఆకర్షింపబడదు. వారికి సత్యము తెలుసు అదే వారిని స్వతంత్రులుగా చేసినది.


దురదృష్టవశాత్తు, ఈనాడు అనేక వేలమంది క్రైస్తవులు వారంతట వారే బైబిలు చదువుటకు ఎంతో సోమరులుగా లేక తీరిక లేకుండా యున్నారు. లేఖనములను నిర్లక్ష్యము చేసిన దాని ఫలితమే అపవాది యొక్క మోసములకు వారు ఎంతో సులువుగా ఎరగా వేయబడుతున్నారు. అయ్యో! వాగ్దాటి, ఉద్రేకత మరియు ప్రసంగమును తార్కికముగా చెప్పుట ఇవే ఈనాడు బోధకుని వివేచించుటకు (తీర్పుతీర్చుటకు) ప్రమాణములుగా ఉన్నాయి.


అతడు దేవుని వాక్యమును సరిగా వివరిస్తున్నాడా లేదా అనేది కేవలము ద్వితీయ స్థానమునకు వచ్చినది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము లేక మాట్లాడే వరము కంటే సరియైన సిద్ధాంతము అనంతమైన గొప్పదని గుర్తుంచుకో. ఒక మందుల డబ్బాలో ఉన్న మందులు ఆ డబ్బా ఆకారము లేక పరిమాణము లేక రూపము కంటే ఎంతో ముఖ్యమైనవి!


నీవు సత్యము కోసము చూస్తున్నావా లేక వాగ్దాటి కలిగిన వర్తమానముల కోసము చూస్తున్నావా? మరియు ఒక వేళ నీవు సత్యము కోసమే చూస్తున్నట్లయితే, మొట్టమొదట బైబిలు నీకు తెలియకుండా(చదువకుండా) సత్యమంటే ఏమిటో ఎలా తెలుస్తుంది?


ఒక కథ ఈ విధంగా ఉంది: బైబిలు నీలాంటి సామాన్యులకు అర్థము కాదు అని ఒక వ్యక్తికి తన యాజకుడు చెప్పాడు. కాని ఆ వ్యక్తి క్రొత్త నిబంధనను చదివి రక్షించబడ్డాడు. ఒక రోజు పుస్తకము తెరచి అతని ముందుండగా, యాజకుడు ఆ వ్యక్తిని దర్శించుటకు వెళ్ళి ఏమి చదువుచున్నావని అతనిని అడిగాడు. బైబిలు అని అతడు ప్రత్యుత్తమిచ్చాడు, నీవు బైబిలు చదువకూడదు అది వేదాంత విద్యలేని సామాన్యుల కోసము కాదని యాజకుడు చెప్పాడు.


కాని, దీనిని చదువుట ద్వారానే నేను రక్షింపబడ్డాను. అంత మాత్రమే గాక 1పేతురు 2:2లో నేను నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పబడినదని ఆ వ్యక్తి చెప్పాడు.


''ఓహో'', ''నీకు పాలను పోయుటకు పాలవానిగా యాజకులైన మమ్ములను దేవుడు నియమించాడు'' అని యాజకుడు బదులిచ్చాడు.


''అయ్యో! సరే'' ''నాకు ప్రతిదినము పాలు పోయుటకు ఒక పాలవాడు ఉండేవాడు, కాని అతడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడని నేను వెంటనే కనుగొన్నాను. అప్పుడు దీనికి బదులుగా ఒక ఆవును కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు స్వచ్ఛమైన పాలను నేను పొందుచున్నాను''.


సహోదరీ, సహోదరులారా, మనంతట మనమే దేవుని వాక్యము చదువుకున్నప్పుడే స్వచ్ఛమైన పాలవలె కల్తీలేని సిద్ధాంతమును పొందగలము. పాపమనే చీకటియున్న ఈ భూమి మీద, నడుచుటకు మనకున్న ఏకైక వెలుగు దేవుని వాక్యమే. కాబట్టి మన నడిపింపులో గల సమస్యకు తాళపు చెవి కూడా ఇదే. మన జీవితములకు మార్గమును దేవుడు ముందుగానే నిర్ణయించాడు, కాని అనేకమంది క్రైస్తవులు దానిని కనుగొనలేక పోవుచున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. సాధారణముగా దీనికి గల కారణమేమిటంటే, దేవుని వాక్యమును క్రమముగా ధ్యానించుటకు సమయము గడపక పోవుటయే. ''నీ వాక్యము......నా త్రోవకు వెలుగైయున్నది''. మనకు మార్గమును చూపుటకు ఇది దేవుని యొక్క ఏర్పాటు.


రెండవదిగా, యాకోబు 1:22,23లో దేవుని వాక్యము అద్దముతో పోల్చబడినది. మన ముఖములు మురికిగా ఉన్నాయా లేక శుభ్రముగా ఉన్నాయా అని చూచుకొనుటకు మరియు మన వెంట్రుకలు దువ్వబడియున్నాయా లేదా అని చూచుకొనుటకు మనకు అద్దము అవసరము. అది లేకుండా మనము ఎలా ఉన్నమో చెప్పలేము. ఒకవేళ యాకోబు 20వ శతాబ్దములో తన పత్రికను వ్రాస్తున్నట్లయితే, బహుశా ఆయన ఇంకొక అడుగు ముందుకువేసి ఇంకా ఆధునికమైన గుర్తుయైన ఎక్స్‌- రే ఫిల్ము నా శరీరంలో ఉన్న లోపలి అవయవముల యొక్క పరిస్థితిని చూపిస్తుంది. ఎక్స్‌-రే లేనట్లయితే వాటి స్థితిని నేను తెలుసుకోలేను. బైబిలు కూడా ఇదే విధముగా దేవుని యెదుట నా హృదయము యొక్క స్థితిని చూపిస్తుంది. నేను సన్నద్ధుడనై ఆయనను సేవించుటకు దేవుని వాక్యము నన్ను సరిచేసి, తప్పుదిద్దును (2తిమోతి 3:16,17). అనేకమంది ప్రజలు వారిలో ఏ తప్పు లేదని తమ ఆత్మీయస్థితిని గురించి తమంతట తామే మోసపోవుచున్నారు. ఎందుకు? ఎందుకంటే దేవుని వాక్యమను ఎక్స్‌-రే కు వారు ఎప్పుడు లోబడలేదు.


విశ్వాసులమైనా కూడా, దేవుని యెదుట దోషులుగా ఉంచే పాపములను మనము గ్రహింపు కలిగియుండకుండా ఉండే అవకాశము ఉంది. దేవుని వాక్యమును ధ్యానించే సమయములో పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక పాపమును గురించి నాకు గ్రహింపు కలుగజేయడాన్ని తరచుగా నేను కనుగొంటాను-అది స్వార్థముతో కూడిన ఉద్దేశ్యమును గూర్చి గాని, బహుశా ఆయన నాకు తెలియజేయు వరకు నేను గ్రహింపుకలిగిలేని క్రియలలో ఆత్మ నింపుదల లేక దిగజారుడును మనము తొలగించుకొనాలంటే ప్రతి దినము మనము అద్దము (లేక ఎక్స్‌-రే) అను దేవుని వాక్యము యొక్క పరిశీలన గుండా వెళ్ళుటకు లోబడాలి. ఒక్కరోజు కూడా తప్పి పోకుండా మన ముఖములు అద్దములో చూచుకుంటాము. అదే విధముగా మన హృదయములు కూడా పరిశీలించబడుటలో ఒక్కరోజు కూడా తప్పిపోదు.


తరువాత, యిర్మీయా 23:29లో దేవుని వాక్యము అగ్నితో పోల్చబడినది. బైబిలులో అగ్నిని పరిశుద్ధ పరచుటకు లేక కాల్చివేయుటకు గుర్తుగా ఉపయోగించారు. అగ్నిలో వేసిన బంగారం శుద్ధి చేయబడుతుంది, అదే చెక్క అయితే కాలిపోతుంది. అదే విధముగా, దేవుని వాక్యము మనలను శుద్ధిచేస్తుంది, క్రీస్తు సారూప్యములో లేని వాటిని తొలగిస్తుంది. మనము పైన చూచినట్లుగా అది మన తప్పులను చూపించుట మాత్రమే గాక, మనలను పవిత్రులుగా కూడా చేస్తుంది. ప్రతి దినము ప్రభువు యొక్క పాదముల యొద్ద కూర్చొనకుండా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులగుటకు ఆశించలేరు. అది ఒక్కటి మాత్రమే తన జీవితములోని చెత్తను తొలగిస్తుంది. కాని అదే అగ్ని దేవుని వాక్యమును తిరస్కరించిన వారిని కాల్చివేయునన్నది కూడా ఎంతో నిజము (యోహాను 12:48). దేవుని వాక్యము యెడల మనకున్న వైఖరే అది మనలను పరిశుద్ధ పరుస్తుంది లేక నాశనము చేస్తుందో తెలియజేస్తుంది. దానికి మనము లోబడినట్లయితే, అది మనలను పరిశుద్ధపరుస్తుంది. ఒకవేళ దానిని మనము విస్మరించి, తిరస్కరిస్తే అప్పుడు అది మనలను తప్పకుండా దహించివేస్తుంది.


నాలుగవదిగా, యిర్మీయా 23లో దేవుని వాక్యము సుత్తె-అనగా బండను బద్దలు చేయు సుత్తితో పోల్చబడినది. కొండలలో గుండా నీవు రహదారి వేయాలంటే, ఆ కొండలను బద్దలు కొట్టాలి. ఈ రోజులలో మనము దానికొరకు డైనమైట్‌ను ఉపయోగిస్తున్నాము, అదే యిర్మీయా దినములలోనైతే వారు సుత్తెలను ఉపయోగించారు. మన మార్గములో గల పెద్ద అడ్డుబండలను తొలగించుటకు సామర్థ్యము కలిగిన దేవుని యొక్క డైనమైట్‌ ఆయన వాక్యము. మనందరము మన జీవితములలో శ్రమలను సమస్యలను ఎదుర్కొంటాము- మన ముందు మార్గములను పర్వతములు మూసి వేసినట్లుండి, మనము చివరకు వెళ్ళినట్లుగాను, మీ ముందు మార్గము లేనట్లుగాను కనబడే కొన్ని పరిస్థితులుంటాయి. అటువంటి పరిస్థితులలో తరచుగా మనము నిరుత్సాహపడి మరియు ఓడిపోయి, ఏమి చేయాలో తెలియక లేక ఎటు తిరగాలో తెలియక అంతే ఉండిపోతాము.


లేఖనములలో దేవుడిచ్చిన వాగ్దానములు మనకు తెలియక పోవుట వలన వాటిని ఎత్తిపట్టుకొన లేకపోవుచున్నాము. ఒకవేళ మనకు తెలుసుంటే, డైనమైట్‌ వలె మన మార్గములో అడ్డంగా ఉన్న వాటిని పేల్చివేసి పర్వతములలో గుండా మనలను విజయోత్సాహముతో అవతల వైపుకు తీసుకువెళ్ళి యుండేవి. దేవుని వాక్యము తెలియక పోవుట వలన మనము ఎంత కోల్పోతున్నామో కదా!


అయిదవదిగా, లూకా 8:11లో దేవుని వాక్యము భూమిలో నాటితే ఫలమిచ్చు విత్తనముతో పోల్చబడినది. 1పేతురు 1:23లో మన నూతన జన్మ కూడా మన హృదయములలో ఆ విత్తనము మొలకెత్తుట ద్వారా జరిగెనని చెప్పబడినది. మనము ఫలించినప్పుడే మన జీవితముల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీ జీవితములో, నీ సేవలో దేవుని మహిమ కొరకైన ఫలమున్నదా? మొట్టమొదట నీ స్వంత జీవితములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహము (గలతీ 5:22) అను వాటిలో అది ప్రత్యక్ష పరచబడుచున్నదా? తరువాత, పాపులు ప్రభువు వైపుకు తిరుగుట మరియు విశ్వాసముతో ఆయనకు దగ్గరగా వచ్చుట వంటి ఫలములు నీ సేవలో చూచుచున్నావా? ఒకవేళ ఆ విధముగా లేకపోయినట్లయితే, బహుశా కారణమేమైయుంటుందంటే ''శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమును'' ప్రతి దినము నీ హృదయములో విత్తనముగా పొందుటలేదు. కీర్తనలు 1:2,3 దివారాత్రములు (క్రమముగా) దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడే ఫలమిచ్చే చెట్టువలె నుండి, ఆయన ఏమి చేసినను అది సఫలమగును అని చెప్పుచున్నది.


కీర్తనలు 119:103లో దేవుని వాక్యము ఆహారముతో పోల్చబడినది. యిర్మీయా 15:16లో మరియు 1పేతురు 2:2లో కూడా ఇదే గుర్తు మరలా కనబడుతుంది. ప్రవక్తయైన యెహెజ్కేలు మరియు అపొస్తలుడైన యోహాను కూడా ''పుస్తకమును తినుచున్నట్లుగా'' లేఖనములలో చూపించబడ్డారు (యెహెజ్కేలు 3:1-3; ప్రకటన 10:9,10). ఇక్కడ మనుష్యులు దేవుని వాక్యమును తిని జీర్ణించుకుంటున్న వారి యొక్క దృశ్యమును మనము చూస్తున్నాము. ఆహారము మనకు బలమునిస్తుంది. ఇది లేకుండా మన శరీరములు కట్టబడలేవు. సరియైన పోషకాహారము తీసుకోని వ్యక్తి సన్నగా, బలహీనముగా కనబడుతాడు. కావున రోగమును తట్టుకొనే శక్తి లేకుండా యుంటాడు. వేరొకరు శారీరకముగా దాడిచేసినా కూడా వారిని వారు కాపాడుకొనే స్థితిలో ఉండరు. చిన్నగా త్రోస్తే చాలు అతడు క్రింద పడిపోతాడు. ఇదేవిధంగా దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసిన వారు ఆత్మీయముగా తక్కువ అభివృద్ధి చెందిన వారుగా ఉంటారు. దీని ఫలితముగా వారు శోధనను ఎదిరించలేక అపవాది యొక్క దాడికి నిలబడలేని వారుగా ఉంటారు. దేవుని వాక్యమును అనుదినము ధ్యానించు వారు మాత్రమే బలమైన, ధృడమైన క్రైస్తవులుగా ఎదుగుతారు (1యోహాను 2:14). కేవలము బైబిలును చదువుట మాత్రమే నిన్ను బలవంతునిగా చేయలేదు, కాని వాక్యమును ధ్యానించుట(ప్రార్థనగా చేయుట) మాత్రమే నీ హృదయాంతరంగములలోనికి వాక్యము చొచ్చుకొని పోవునట్లు చేయును. ఆ విధముగా వాక్యము నీలో భాగమవుతుంది. హృదయములో దాచిపెట్టబడియుంటుంది (కీర్తనలు 119:11). ఆయన నోటి మాటలను నా అనుదిన ఆహారము కంటే ఎక్కువగా ఎంచితిని (యోబు 23:12) అని యోబు చెప్పాడు. దేవుని స్వరమును ప్రతిదినము వినుట ద్వారా అతడు అద్భుతమైన ఆత్మీయనిధిని సమకూర్చుకున్నాడు. సందేహము లేకుండా, ఇది సాతాను యొక్క భీకరమైన దాడిని ఎదుర్కొనుటకు ఒక మనిషికి అసాధారణమైన సామర్థ్యమునిస్తుంది. ఆయన ఎటువంటి శ్రమలను ఎదుర్కొన్నా కూడా, దేవుని యందలి విశ్వాసమును అతడు కోల్పోలేదు. ఆయన భార్య, ఆమె భర్త వలె దేవుని వాక్యమును ఘనపరచలేదు గనుక నష్టము సంభవించిన వెంటనే దేవుణ్ణి శపించుటకు (దూషించుటకు) సిద్ధపడినది. కాని యోబు ఆ విధముగా లేడు. దేవుని వాక్యమును మనము ప్రతిదినము పొందితే ఆ వాక్యము మన జీవితములోని ప్రతి శ్రమను ఎదుర్కొనుటకు ఎంతో గొప్ప శక్తి నివ్వగలదని ఆయన మాదిరి మనకు చెప్పుచున్నది.


ఏడవదిగా, ద్వితీయోపదేశ కాండము 32:2లో దేవుని వాక్యము మంచుతో పోల్చబడినది. బైబిలులో మంచు దేవుని యొక్క ఆశీర్వాదమునకు గుర్తుగా ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినప్పుడు, వారికి మంచును వర్షమును ఇస్తాడు. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు ఆయన 1రాజులు 17:1లో చేసినట్లుగా వాటిని ఇవ్వకుండా ఆపివేస్తాడు. ఎవరైతే దేవుని వాక్యమును అంగీకరించి దానికి లోబడతారో ఆయన వాక్యము ద్వారా దేవుని ఆశీర్వాదములు వస్తాయని ఈ సాదృశ్యము మనకు బోధిస్తున్నది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, మన లోటుపాట్లన్నింటినీ తీర్చును అని సామెతలు 10:22 ప్రకటించుచున్నది. ఇది ఎంత గొప్ప ప్రోత్సాహమో కాదా!


ఒకటి కంటే ఎక్కువసార్లు సువార్తలలో ఇది వివరించబడినది. ఒక బాలుడిచ్చిన కేవలము అయిదు రొట్టెలు, రెండు చేపలతో 5000 మంది ప్రజలకు ఆహారమును పంచిపెట్టవలసినదిగా యేసు శిష్యులు అడగబడ్డారు. ఇంత మందికి అవి సరిపోవు అని వారు చెప్పారు. అవును నిజానికి అవి సరిపోవు. కాని అప్పుడు ప్రభువు వాటిని ఆశీర్వదించారు. దాని ఫలితముగా ప్రజలందరు సంతృప్తి పరచబడ్డారు మరియు ఎక్కువ మొత్తములో మిగిలింది. మరొక సందర్భములో, శిష్యులు రాత్రంతా కష్టపడినా కూడా ఒక్క చేపను కూడా పట్టలేదని మనము చూస్తాము. అప్పుడు తెల్లవారు జామున యేసు వారితో మాట్లాడుటను వారు విన్నారు. ఆయన మాటకు వారు విధేయత చూపించారు, కొద్ది క్షణములలోనే వారి వలలు చేపలతో నిండిపోయినవి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చుననే సత్యమును ఈ రెండు ఉదాహరణలు చెప్పుచున్నవి. ఆయన వాక్యము ద్వారా వచ్చే ఆశీర్వాదము మన కొదువలన్నింటిని తీర్చును. నీకు తలాంతులు లేకపోవచ్చు మరియు నీవు బోధించలేకపోవచ్చు లేక పాడలేకపోవచ్చు లేక ఇతరుల వలె ప్రార్థించలేక పోవచ్చు కాని పరలోకపు మంచు నీ జీవితము మీద పడినప్పుడు, నీ స్వాభావికమైన పరిమితులు ఏవియు నిన్ను అడ్డుకోలేవు, దేవుడు వేలమందికి నీవె ఆశీర్వాదముగా ఉండునట్లు చేయగలడు. గనుక, ఆయన వాక్యమును ముందుంచుకొని ప్రభువు సన్నిధిలో వేచియుండు(ప్రార్థించుము). ఆయన మంచు నీ ఆత్మ మీద పడేవరకు ఆయన సన్నిధిలో నుండి వెళ్ళుటకు తొందరపడవద్దు.


అయితే మంచు ఆశీర్వాదము మాత్రమే కాదు, తాజాదనమునకు కూడా ఇది గుర్తు. నూతనపరచబడుట అను మరొక దానిని బైబిలు మనకిచ్చుచున్నది. అనుదినము ప్రభువు యొక్క స్వరమును వినుట అనేది మన క్రైస్తవ జీవితమును ఎప్పుడు తాజాగా ఉంచుతుంది. ఏదైతే మనలో చెడిపోతుందో అది తగ్గిపోతుంది. అటువంటి తాజాగా లేని పరిస్థితినుండి ఇది మనలను కాపాడుతుంది. బూజు పట్టిన రొట్టె ఎవరి నోరును ఊరించలేదు. అదేవిధముగా, విశ్వాసులు ప్రదర్శించే తాజా లేని స్థితి కూడా ఎవ్వరినీ క్రీస్తు యొద్దకు తీసుకు వచ్చునట్లుగా ఆశించలేము. నీ క్రైస్తవ జీవితము అనుదినము తాజాగా ఉంటుందా? మంచు క్రింద పడిన పరలోకపు మన్నాతో నిన్ను నీవు పోషించుకున్నప్పుడే ఆ విధముగా ఉంటుంది (నిర్గమ 16:13-15; 20వ వచనముతో పోల్చిచూడుము).


కీర్తన 119:162లో దేవుని వాక్యము సంపదతో పోల్చబడియున్నది. లేక ఇతర వాక్యభాగములలో బంగారముతో పోల్చబడియున్నది. డబ్బు నిన్ను నిజమైన సంపన్నునిగా చేయలేదు. నీవు సంపాదించుటకు శక్తినిచ్చు అనేక అర్హతలను నీవు కలిగియుండవచ్చు. ఆ విధముగా నీవు అనుకున్న స్థానమునకు నీవు చేరుకొని ఎంతో డబ్బును సంపాదించవచ్చు. కాని అది కేవలము గతించిపోయే సంపదను మాత్రమే నీకు ఇవ్వగలదు. దేవుని వాక్యము మాత్రమే నిన్ను నిజమైన సంపన్నునిగా చేయగలదు.


ఒక నిజమైన సంపన్నుడు ఏది కొదువ కలిగియుండడు. అతనికి చాలినంత ఉండి మరియు ఇతరులకు ఇచ్చుటకు ఎక్కువ కలిగియుంటాడు. దీనికి వేరుగా ఒక పేదవాడైతే అతనికంటె ఎక్కువగా ఉన్న వాని దగ్గరకు వెళ్ళి అడుక్కొనవలసి వస్తుంది. నీవు కొదువ కలిగియుండనంత సంపన్నునిగా దేవుని వాక్యము నిన్ను చేయగలదు. అది నీ అవసరములకు చాలినంత మాత్రమే కాదు ఇతరుల అవసరములను తీర్చుటకు సహాయపడునంతగా ఇస్తుంది. నీ జీవతములో ఒక్క పరిస్థితి కూడా బైబిలులో నీవు ఏదో ఒక చోట ఆ పరిస్థితిని కనుగొనలేని విధముగా ఉండదు. బైబిలులో ఏదో ఒక వ్యక్తి యొక్క అనుభవములోనో (నీవు వెళ్ళు చున్నటువంటి పరిస్థితులలో) లేక లేఖనముల యొక్క బోధలోనో జవాబు ఎప్పుడు ఉంటుంది. నీ బైబిలు నీకు తెలిసినట్లయితే, నీకు కావలసినటువంటి వాక్య భాగమును పరిశుద్ధాత్మ దేవుడు నీ జ్ఞాపకమునకు తెచ్చి, కష్ట సమయములలో ఆయన జవాబును నీకు ఇస్తాడు.


ఒకటి కంటె ఎక్కువసార్లు ఇది నా జీవితములో నిజమగుట నేను చూశాను. ఆయన సేవ కొరకు ప్రభువు నన్ను 1964 మే 6న పిలచినప్పుడు భారతదేశపు నావికాదళములో నా ఉద్యోగమునకు రాజీనామా చేయుటకు నన్ను అనుమతించండని నేను దరఖాస్తు చేసుకున్నాను, వారు నన్ను అనుమతించమని వెంటనే నావికాదళపు ప్రధాన కార్యాలయము నుండి ప్రత్యుత్తరమొచ్చినది. తరువాత ఏమి చేయవలెనో, నాకు అర్థము కాలేదు. ఇశ్రాయేలీయులు ప్రభువును సేవించుటకు వారిని వదిలిపెట్టమని మోషే ఫరో యొద్దకు వెళ్ళిన సంఘటనను అప్పుడు ప్రభువు నాకు జ్ఞాపకముగా తెచ్చాడు. ఫరో ఆ అభ్యర్థనను నేరుగా తిరస్కరించాడు, అయితే మోషే వదలిపెట్టలేదు. ఇశ్రాయేలీయులు విడచిపెట్టబడే వరకు ఫరో దగ్గరకు తిరిగి వెళ్ళాడు. నా సమస్యకు పరిష్కారము అక్కడ నేను కనుగొన్నాను; గనుక రాజీనామా చేయుటకు అనుమతి కోసం మరలా దరఖాస్తు చేసుకున్నాను, నా దరఖాస్తు మరలా త్రోసివేయబడినది. ఇంతకు ముందు చెప్పిన కారణమునే మరలా చేప్తూ మూడవసారి దరఖాస్తు చేసుకున్నాను. ఎన్నో నెలలు మరలా జవాబు రాలేదు. నేను మొదటిసారి దరఖాస్తు చేసినప్పటి నుండి రెండు సంవత్సరముల తరువాత చివరిగా నేను విడిపించబడ్డాను. ప్రతి పరిస్థితికి తగినట్లుగా దేవుడు మనలను ఏ విధముగా ఐశ్వర్య వంతునిగా చేస్తాడో చెప్పుటకు ఇదొక ఉదాహరణ. అది మన స్వంత జీవితములోనే కాదు గాని, వారి అవసరములో మన దగ్గరకు సహాయము కొరకు వచ్చే ఇతరుల జీవతములలో కూడా ఆయన ఈ విధముగా చేయగలడు.


చివరిగా, ఎఫెసీ 6:17 మనము చూచినట్లయితే, అక్కడ దేవుని వాక్యము ఆత్మఖడ్గముగా పిలువబడినది. క్రైస్తవ జీవితము కుయుక్తి పరుడైన శత్రువుతో ఎప్పుడు యుద్ధమును కలిగియుంటుంది. వాడు దేవుని ప్రేమను, దేవుని యొక్క న్యాయమును చివరకు దేవుణ్ణి కూడా అనుమానించేలా చేసి దాడిచేస్తాడు.


ఈ ఖడ్గమును ఎలా ఉపయోగించాలో మనకు తెలిసియుండుంటే, ఈ ఖడ్గము వానిని ప్రతి అడుగులో ఓడించగలదు. నిరుత్సాహము అనేది అపవాది యొక్క బలమైన ఆయుధాలలో ఒకటి. అపవాది దీనితోనే అనేక మంది గొప్పవారిని పడగొట్టాడు. మోషే, ఏలియా మరియు యోనాలలో ప్రతి ఒక్కరు దీని తాకిడికి భయపడ్డారు. కాని వీరిలో ప్రతి ఒక్కరు ప్రభువు యొక్క మాటలు వినుట ద్వారా వారి నిరుత్సాహమును జయించారు. మనలను ప్రక్కదారి పట్టించే ఏదో ఒక దానిలో మనము నిమగ్నమైయుండుట ద్వారా నీవు, నేను కూడా తాత్కాలికముగా మన నిరుత్సాహమునకు కట్టివేయబడవచ్చును. కాని కేవలము దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనము సంపూర్ణముగా జయించగలము. అరణ్యములో యేసు ప్రభువు కూడా కేవలము ఈ ఖడ్గమును ఉపయోగించుట ద్వారానే సాతానును జయించాడు.


నేను నౌకాదళములో ఉన్న రోజులలో, ఒకసారి మా ఓడ నెలరోజుల కంటె ఎక్కువ ఒక చిన్న ఓడ రేవులో ఉన్న సమయము నాకు జ్ఞాపకమున్నది. మేము వ్యాయామము చేయుటకు సముద్రము నుండి ప్రతిరోజు బయటకు వెళ్ళి వస్తూ ఉండేవారము. పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది మరియు దీనికి తోడు కొంత కాలము క్రైస్తవ సహవాసము చేయుటకు నాకు అవకాశము దొరకలేదు. ఇదంతా కలసి ఒక రోజు నేను ఎంతో నిరుత్సాహమునకు గురయ్యాను. నా పరిస్థితి నాకు మించి ఉన్నది. నా గదిలో నేను ఒంటరిగా కూర్చొని యున్నాను. అప్పుడు తళుక్కున ఒక వచనము నా మనస్సులోనికి వచ్చినది: ''యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు'' (ద్వితీయో 28:14). ప్రతి పరిస్థితిలోను ''పైవానిగా'' నన్ను ఉంచుతాడని ప్రభువు చేసిన వాగ్దానమును నేను చూశాను. వెంటనే, పరలోకపు సంతోష తరంగం వచ్చి నా హృదయమును తాకగానే మరలా నా పెదవులపై సంతోషగానము వచ్చినది. శత్రువు యొక్క ప్రతి దాడిని ఎదుర్కొని జయించుటకు గల దేవుని వాక్యము యొక్క శక్తి ఈ విధముగా ఉంటుంది.


మనము పైన చూచిన తొమ్మిది గుర్తులు (సాదృశ్యములు) ఒక మనుష్యుని జీవితములో దేవుని వాక్యము యొక్క ప్రభావము ఎంత ఉంటుందో అను దానిని గూర్చిన కొద్దిపాటి గ్రహింపును మనకిస్తున్నది. విశ్వాసుల జీవితములలో అన్నింటికంటె పైగా అవసరమైనది ఒక్కటే అని యేసు ఎందుకు చెప్పాడో అని నీవు ఇప్పుడైనా అర్థము చేసికొనుటకు ప్రారంభించావా అని నేను అనుకుంటున్నాను. ఆయన మాటలను నీవు తీవ్రముగా తీసుకుంటావా? ఒక వేళ అలా అయితే, అవసరమైనవి లేక ముఖ్యమైనవి ఎన్ని ఇతర విషయములున్నా, ప్రభువుతో ఆయన వాక్యముతో అనుదిన మౌన ధ్యాన సమయమును దొంగిలించుటకు దేనిని అనుమతించనని ఇప్పుడే తీర్మానం తీసుకో.


దేవుని వాక్యమును గురించి కరువు (ఆమోసు 8:11,12) సంభవించు దినములు ఈ లోకములోనికి రాబోతున్నాయని బైబిలు చెప్పుచున్నది. 1తిమోతి 4:1,2లో మనము చూచినట్లు ఆ దినములలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. కాని నిజమైన ప్రవక్తలు ఉండనందువలన కరువు వస్తుంది. నేను నమ్ముచున్నాను, ఆ దినములలో నిజమైన వాక్యమునకు వచ్చు కరువు సమయము గడిచే కొలదీ పెరుగుతూ ఉంటుంది. యోసేపు ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉన్నప్పుడు వాటిని భద్రపరిచాడు. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పినట్లు అక్కడ కరువు వచ్చినా కూడా వారు కొదువ లేకుండా యున్నారు. మనము జ్ఞానవంతులమైతే, ఈ రోజు దేవుని వాక్యమును మన హృదయములలో భద్రపరచుకొంటాము. అప్పుడు ఎటువంటి అవసరతలో కూడా ఇది సరిపోతుంది. మనందరి హృదయములలో దేవుడు ఈ సందేశములను ముద్రించును గాక.


''అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు'' (సామెతలు 8:34).




''యేసు పాదముల చెంత కూర్చొనియుండి,


ఆయన చెప్పే ఎంతో గొప్ప మాటలు నేను వినుచున్నాను!


సంతోషముతో నిండినస్థలము, ఎంతో దగ్గరగా యున్నది, ఎంతో విలువైనది!


అనుదినము అది నన్ను అచ్చట కనుగొనును గాక.


యేసు పాదముల యొద్ద కూర్చొనియుండి,


అక్కడ కన్నీరు కార్చుటకు, ప్రార్థించుటకు నేను ఇష్టపడెదను,


ఆయన సంపూర్ణతలో నుండి అనుదినము


కృపను మరియు ఆదరణను నేను సమకూర్చుకొందును''.


అధ్యాయము 3
ఒక్క విషయమును నేను కోరుకొంటిని

''యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి. నాతో యుద్దము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నీ మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని. దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో నివసింప గోరుచున్నాను. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను'' (కీర్తన 27:1-4).


ఇశ్రాయేలు సింహాసనమును అదిష్టించిన వాడు ఈ అమోఘమైన కీర్తనను వ్రాశాడు. అయినప్పటికీ, ప్రభువు యొద్ద నుండి ఈ లోకమంతటిలో ఒకే ఒక్క విషయమును కోరుచున్నట్లుగా 4వ వచనములో దావీదు చెప్పుచున్నాడు. ఆ దినములలో రాజులకు ముఖ్యముగా రెండు కోరికలుంటాయి: ఒకటేమో, వారి రాజ్యమును విస్తరించుకోవడం, రెండవది, సంపదను సమకూర్చుకోవడం. అప్పటికి ఇశ్రాయేలు ధనిక దేశం కాదు, దావీదు కూడా సంపన్నుడైన రాజు కాదు. అయినా కూడా, ఆయన ప్రార్థన ఈ రెండు విషయములను విస్తరించుకోవడం గురించి కాదు. ఒకవేళ ఆయన శత్రువుల చేత చుట్టుముట్ట బడియున్నా, ఆయన ముఖ్యమైన కోరిక ప్రభువు యొక్క సన్నిధిలో ఉండి ఆయన ప్రసన్నతను చూడటమే అని ఆయన చెప్పుచున్నాడు. మరియు ఆయన ఇంకా చెప్పుచూ తన జీవితకాలమంతయు దానిని వెదకుతానని అన్నాడు. ఇది ఒక ప్రేమికురాలు తన ప్రియుని సన్నిధిలో కూర్చొని అతని సౌందర్యమును పరికిస్తు, లోకమంతటిలో తనకు ఏది అవసరము లేనట్లున్న దృశ్యమును పోలియున్నది. వారు మారుమనస్సును పొందకుండానే అంత గొప్ప ప్రేమ ఒకరి యెడల ఒకరు వారు కలిగియున్నారు. అటువంటి ప్రేమను అనుభవించిన వారికి ఈ దృశ్యము ఎంత నిజమైనదో తెలియును.


బైబిలులో దావీదు, దేవుని హృదయానుసారునిగా ఎందుకు పిలువబడ్డాడో ఇక్కడ మనకు ఒక కారణముందని నేను నమ్ముచున్నాను. అతడు పరిపూర్ణుడైన వ్యక్తి కాదు. అతని జీవితములో ఒకసారి వ్యభిచారము మరియు హత్యచేయుట ద్వారా పాపములో ఎంతో లోతునకు పడిపోయాడు. అయినప్పటికీ, అతడు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అతనిని క్షమించి, పవిత్రపరచి ఆ ఓటమి లోతులలో నుండి పైకిలేపి, ఇంకను తన హృదయానుసారునిగా పిలుస్తున్నాడు (అపొ.కా. 13:22). మనము ఇంతకు ముందు చెప్పినట్లుగా, దీనికి గల ఒక కారణమేమిటంటే, దావీదు యొక్క హృదయాంతరంగములలో తన ప్రభువు కొరకైన ఎంతో గొప్ప ప్రేమను కలిగియున్నాడు. తాను మనుష్యుని యొక్క హృదయమును లక్ష్యపెట్టుచున్నానని 1సమూయేలు 16:7లో దేవుడు స్పష్టముగా చెప్పుచున్నాడు. దావీదును దృష్టిలో పెట్టుకొనే ఈ మాటలు చెప్పబడ్డాయి. కాబట్టి క్రైస్తవ జీవితములో ఉండవలసిన సర్వోన్నతమైన ప్రాధాన్యతలలో ప్రభువు కొరకైన ప్రేమ మరొకటి.


కనుక ప్రేమ అనేది మన అంశము. మరలా మూడు విధములుగా మనము చూద్దాము. మొదటిగా, మానవునిలో దేవుని యొక్క సంప్రదింపులన్నింటికి ప్రేమే మూలమని మనము చూస్తాము. రెండవదిగా, ప్రేమే మనము ప్రతిష్టించుకొనుటకు ప్రేరణ అని చూస్తాము. చివరిగా, మన ఆత్మీయతకు నిజమైన పరీక్ష ప్రేమేయని మనము చూస్తాము.


ప్రేమ-మనుష్యునితో దేవుని యొక్క సంప్రదింపులన్నింటికి మూలము


మనము మొదటి అధ్యాయములో, మన విశ్వాసమునకు పునాదిని పరిగణనలోనికి తీసుకుని ప్రారంభించాము. అదే విధముగా ఇక్కడ కూడా ప్రభువు కొరకైన మన ప్రేమకు కూడా గట్టి పునాది అవసరమని స్పష్టమగుచున్నది. ఆ పునాది ఏమిటంటే ప్రభువు యొక్క స్వంత మార్పులేని ప్రేమయే కాని మరొకటి కాదు. ''ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము'' (1యోహాను 4:19). ప్రారంభములోనే ఈ విషయమును గూర్చి స్పష్టత లేకపోవుట చేత అనేక మంది క్రైస్తవులు తరువాత వారి జీవితములలో ఇబ్బంది పడతారు. మన క్రైస్తవ జీవిత ప్రారంభములోనే ఈ పునాదిని గట్టిగా వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ముందుకు సాగిపోగలము.


దేవుడు ఈ భూమిని సృష్టించి, దాని మీద మానవుని ఉంచినప్పుడు, భూమి మీద ఉన్న ప్రతిది కూడా ప్రేమ వాతావరణములో జీవించి చలించాలన్నది దేవుని ఉద్దేశ్యమైయున్నది. మానవుని యొద్దనుండి దేవుడు కోరుకొనే విధేయుత కూడా బానిసత్వముతో కాక ప్రేమతో యుండాలని ఆశిస్తున్నాడు. ఎంపిక చేసుకొనుటకు స్వేచ్ఛ నివ్వకుండా ప్రేమ అను పదములో నిజమైన ప్రేమ ఉండదు గనుక, దేవుడు ఆదామునకు స్వేచ్ఛగా ఎంపిక చేసుకొనే చిత్తమునిచ్చాడు. మానవుడు దేవునికి అవిధేయత చూపించే విధముగా ఎన్నుకొనే ప్రమాదము అందులో ఉన్నా కూడా దేవుడు ఆ విధమైన స్వేచ్ఛ నిచ్చాడు. ఎంత వెలయైనా సరే, దేవుడు మానవునిలో స్వాతంత్య్రము కలిగియున్న సంబంధమునే కలిగియుంటాడు. మానవుని యొద్ద నుండి బానిసత్వపు సేవను ఆయన కోరుకొనడు. ఇటువంటిది ఆయనకు అప్పుడు అవసరమే లేదు ఇప్పుడు కూడా అవసరము లేదు.


దేవుడు మానవ జాతితో జరిగించుచున్న సంప్రదింపులన్నింటిని ప్రేమే నడిపించుచున్న దానిని బైబిలులో మొదటి నుండి మనము చూస్తాము. ఈ సందర్భములో, బైబిలులో ''ప్రేమ'' అను పదము గల మొదటి రెండు వాక్యములను చూద్దాము. ఏ అంశమైనా సరే బైబిలులో మొట్టమొదట అది ఎక్కడ ప్రస్తావించబడినది అని చూచుట ఆ అంశమును చదువుటకు మనకు సహాయము చేస్తుంది. కాబట్టి ఈ రెండు వాక్య భాగములను చూచుట ద్వారా గొప్ప లాభమును మనము ఆశించవచ్చును.


అబ్రాహాము తాను ప్రేమించుచున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు అని చెప్పిన సందర్భములో ఆదికాండము 22:2లో ప్రేమ గురించి మొట్టమొదట ప్రస్తావించబడినది. ఇస్సాకును బలిపీఠము మీద నుంచుట మరియు ఆ అధ్యాయములో ఆ తరువాత జరిగిన సంఘటనలన్ని తండ్రియైన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని మన పాపముల కొరకై బలిగా అర్పించిన కల్వరికి సాదృశ్యముగానున్నాయి. అదే విధముగా 2వ వచనములో చెప్పబడిన ప్రేమ తండ్రి దేవునికి క్రీస్తు మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఉన్నది. బైబిలులో ''ప్రేమ'' అని రెండవసారి ఆదికాండము 24:67లో ప్రస్తావించబడినది-అది తన భార్య కొరకైన భర్త ప్రేమ. తన సంఘము కొరకైన క్రీస్తు ప్రేమను గురించి కూడా ఈ అధ్యాములోని మిగిలిన భాగము ఎంతో అందముగా చూపించినట్లు మనకు స్పష్టమైన పోలిక ఇక్కడున్నది. క్రొత్త నిబంధనలో ఈ రెండు అంశములను కలిపి ప్రభువు యోహాను 15:9లో ఈ విధముగా చెప్పారు. ''తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో (ఆదికాండము 22:2లో ఉన్నట్లుగా కుమారుని కొరకైన తండ్రి ప్రేమ) నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని (ఆదికాండము 24:67లో చూపినట్లుగా పెళ్ళి కుమార్తె కొరకై పెళ్ళి కుమారునికుండు ప్రేమ వలె పాపుల కొరకైన క్రీస్తు ప్రేమతో)''. ఈ విధముగా పాత నిబంధనలోని సాదృశ్యములలో కూడా, మానవుని కొరకైన దేవుని యొక్క లోతైన ప్రేమ ప్రతిబింబించినది.


కాబట్టి ఇస్సాకు, రిబ్కాల మద్యగల సంబంధమును చూపిస్తున్న ఈ వెలసిపోయిన (అంతసరిగాలేని) చిత్రమును ఆదికాండము 24లో మనము చూద్దాము. ఇందులో మన కొరకు దేవుని యొక్క మహా ప్రేమను గురించిన కొన్ని గుణలక్షణాలను చూద్దాము. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించుటకు ఒక ఉదాహరణగా భార్య, భర్తల సంబంధమును ఆయన తీసుకొనియున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. భార్యభర్తల ఐక్యత ఈ భూమి మీద ఉన్న అన్ని సంబంధముల కంటే సన్నిహితమైనది. క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5:21-23లో దీనిని గూర్చిన సాదృశ్యమును దేవుడు ఉంచగా ఈ ఉదాహరణ మీద మనము ఇంకా ముందుకు వెళ్ళుట అంత జ్ఞానయుక్తమైనది కాదు. ఎఫెసీ పత్రికలో మనలో ప్రతి ఒక్కరితో దేవుడు వ్యక్తిగతముగా సన్నిహితముగా ఉండాలని కోరుకొంటున్నాడనీ మరియు ఆయనతో మనముండాలని కోరుకుంటున్నాడని స్పష్టముగా వ్రాయబడినది. ఆది కాండము 24లో, మానవునితో అటువంటి సంబంధము కొరకు దేవుడు వెదుకుటను రూపకాలంకారముగా మనము చూస్తాము. అక్కడ అబ్రాహాము తండ్రియైన దేవుని పోలికగాను, అబ్రహాము యొక్క సేవకుడు పరిశుద్ధాత్ముని పోలికగాను, ఇస్సాకు దేవుని కుమారుని పోలికగాను, క్రీస్తు కొరకు గెలచుటకు పరిశుద్ధాత్ముడు చూస్తున్న దూరదేశస్తురాలగు అన్యురాలిగా రిబ్కా పోలియున్నది. అబ్రహాము యొక్క సేవకుని వైఖరిలో (ఈ కార్యక్రమములో అతడు అబ్రాహాము మరియు ఇస్సాకునకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు) మరియు రిబ్కా యెడల ఇస్సాకు వైఖరిలో మన కొరకైన క్రీస్తు ప్రేమ యొక్క గుణలక్షణములను మనము చూడవచ్చు.


మొట్టమొదటిగా, అబ్రాహాము యొక్క సేవకుడు తన యజమానుని ఆస్తిలో నుండి రిబ్కాకు బహుమతులిచ్చినట్లుగా 22,53 వచనాలలో మనము చూస్తాము. దేవుని యొక్క హృదయమును గురించిన అంతర దృష్టిని ఇది మనకు ఇస్తుంది. ఆయన మన యొద్దకు వచ్చునప్పుడు మన యొద్దనుండి ఏదో తీసుకొనుటకు కాదు గాని ఇచ్చుటకు వచ్చును.ఒక మంచి భర్త తనకున్నదంతయు తన భార్యతో ఏ విధముగా పంచుకోవాలనుకుంటాడో, అదే విధముగా ప్రభువు కూడా తనకున్నదంతయు మనతో పంచుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ మనము ప్రభువుకు పూర్తిగా సమర్పించుకొన్నట్లయితే, మన యొద్ద నుండి ఎన్నో ఆయన ఆశిస్తాడు. గనుక మన జీవితములు దౌర్భాగ్యముగా అవుతాయనే ఆలోచనను మనలో అనేకులము కలిగియుంటాము. మనము అనేక మాటలలో దీనిని చెప్పలేక పోయినప్పటికీ, మనము ప్రభువుకు షరతులు లేకుండా అప్పగించుకొనకుండుటకు ఇదే కారణము. మన యొద్ద నున్న వాటిని తీసుకొని పోవుటకు వచ్చు నిజమైన దొంగ అపవాదియేనని (యోహాను 10:10) యేసు ప్రభువు స్పష్టముగా మనకు చెప్పారు. కాని ఎంతో కొద్దిమంది దీనిని నమ్ముచున్నారు. ప్రభువైన యేసు తనకున్న దంతయు మనకు ఇవ్వడానికి వచ్చాడని మనము నిజముగా నమ్మనట్లయితే, అప్పుడు మన జీవితములు ఆయనకు సమర్పించుకొనుటలో మనకు ఎటువంటి షరతులు ఉండవు.


ఒక కాపరిని గురించి ఒక కథ చెప్పబడనది. ఆ కాపరి ఒక పేద స్త్రీ ఇంటికి, ఆమె తన అద్దె కట్టుటకు సరిపోను డబ్బును బహుమతిగా తీసుకొని వెళ్తాడు. అతడు ఆమె ఇంటి తలుపు యొద్దకు వెళ్ళి తట్టాడు, కొంత సమయము వేచియుండి మరలా తట్టాడు. కాని లోపల నుండి ఎటువంటి స్పందన రాలేదు. కనుక ఆయన కొంత సమయము తరువాత వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత అతడు ఆమెను రోడ్డుమీద కలసి ''ఒక రోజు నేను నిన్ను కలవడానికి బహుమతితో వచ్చాను కాని తలుపు వేసి ఉండి లోపల నుండి ఎటువంటి జవాబు రాలేదు'' అని ఆమెతో చెప్పాడు. ''ఓ! అవునా నన్ను క్షమించండి. నేను లోపల ఉన్నాను కాని, అద్దె వసూలు చేయడానికి ఇంటి యజమాని వచ్చాడేమోనని నేను తలుపు తీయలేదు'' అని ఆమె చెప్పింది. సహోదరీ, సహోదరులారా, అద్దె వసూలు చేయడానికి యేసు ప్రభువు రాలేదు! తనకున్నదంతయు మనకు ఇచ్చుటకు ఆయన వచ్చాడు. మనము ఊహించలేనంత సంపదను ఆయన తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఆయనకు తలుపు తీయకుండా ఉండుట ఎంత బుద్ధిహీనతో కదా. ఆయనకు సంపూర్తిగా మన జీవితములను అప్పగించకపోవుట ఎంత బుద్ధిహీనతో కదా.


అబ్రాహాము యొక్క సేవకుని మరలా ఒకసారి చూద్దాం. ఇస్సాకుకు దేవుడేర్పరచినది ఆమెనేనని అతనికి తెలిసినా కూడా ఆయనతో కలసిరమ్మని ఆయన బలవంతము చేయలేదు. ఆమె స్వేఛ్ఛాయుత చిత్తమును ఆయన గౌరవించాడు. ఆమెకిష్టమైన తరువాతనే ఆమెను తీసుకువెళ్ళాడు (54-59 వచనములు). ఈ అధ్యాయమును క్లుప్తంగా పరిశీలించిన యెడల, మన కొరకైన క్రీస్తు ప్రేమ యొక్క లక్షణము కూడా ఇదే విధముగా నున్నది. మానవుని యొక్క స్వేచ్ఛాయుతమైన ఎంపికను దేవుడు గౌరవిస్తాడు. దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి బలవంతముండదు. ఏదైనా చేయమని ఎప్పుడు నిన్ను బలవంతము చేయదు. లోకములోని మనుష్యులు ఈ విధముగా చేయవచ్చును. క్రైస్తవ నాయకులు కూడా నీకు ఇష్టము లేని ఎన్నో పనులు చేయుమని ఒత్తిడి తేవచ్చును కాని దేవుడు ఎప్పుడూ ఆ విధముగా చేయడు (దేవుని వలె ఉండాలనుకొను వారెవరైనా కూడా ఆయనను ఈ విషయములో వెంబడించవలెను). నీ బైబిలును చదువమని, లేక ప్రార్థన చేయుమని, లేక ఆయన కొరకు సాక్ష్యమివ్వమని ప్రభువు నిన్నెప్పుడు బలవంతము చేయడు. ఏ పాపినైనను తన వైపు తిరగమని గాని ఏ విశ్వాసికైనను తనకు విధేయత చూపమని గాని దేవుడు ఎప్పుడు బలవంతము చేయడు. మన:పూర్వకముగా అర్పించువారి యొద్ద మాత్రమే కానుకలు తీసుకొనవలెనని, ప్రత్యక్ష గుడారము గురించి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషేతో ప్రభువు చెప్తాడు (నిర్గమ 25:2). మరియు ఇదే నియమము క్రొత్త నిబంధనలో మరలా వస్తుంది (2కొరింథీ 9:7). బైబిలు మొత్తములో కూడా ఇది మనకు కనిపిస్తుంది. తనకు విధేయత చూపవలెనని దేవుడు ఆజ్ఞాపిస్తాడు గాని ఆయన విధేయత చూపమని ఎవరినీ బలవంతము చేయడు. ఆయనే మనుష్యునికి ఇచ్చిన స్వేచ్ఛాయుత చిత్తమును దేవుడు ఎల్లప్పుడు గౌరవిస్తాడు. మరి ఇటువంటి ప్రేమను గురించి భయపడే అవసరము నీకు, నాకు ఏముంది?


చివరకు రిబ్కా ఇస్సాకు యొక్క ఇంటి యొద్దకు వచ్చేసరికి, ఇస్సాకు ప్రార్థనచేసికొనుటకు పొలమునకు వెళ్ళాడు (63వ వచనము). రిబ్కాను తీసుకుని వచ్చుటకు అబ్రాహాము యొక్క సేవకుడు చేసిన ప్రయాణము ఎంతో సుదీర్ఘమైనది. ఒక వైపు ప్రయాణమే దాదాపు 60 మైళ్ళు. మరియు సుమారుగా రెండు నెలల పాటు అతడు దూరముగా ఉండియున్నాడు. సమయము సమీపించే కొలదీ, ఎన్నో ఆశలతో ఇస్సాకు తన పెండ్లి కుమార్తె ఎప్పుడు వచ్చునోనని ఎదురు చూస్తుండి యుంటాడు. ప్రతి దినము కూడా ఎంతో ఆతురతతో రానైయున్న వారి కోసము ఎంతో ఆతురతతో తన గుడారము యొక్క ద్వారము నుండి చూసి యుండుంటాడు. ప్రతి దినము కూడా అతడు పొలములోనికి వెళ్ళి ఆమె త్వరగా రావలెనని దేవునికి ప్రార్థించియుండుంటాడు. అప్పుడు, ఒంటెలు రావడాన్ని ఒకరోజు చాశాడు. ఆయన హృదయము ఎంత సంతోషముతో నిండియుంటుందో కదా! మనకొరకు మన ప్రియమైన ప్రభువు పరలోకములో ఆతురతతో ఎదురు చూస్తున్న దానితో పోలిస్తే ఇది ఎంతో వెలసిపోయిన దృశ్యము (చిత్రము) వలె కనబడుతుంది. ఇది ఎంతో అద్భుత వాస్తవము కాని ఇది నిజము.


మనము ఎంతో పాపులము చెడిపోయిన వారము, తరచుగా ఎదురుతిరిగే స్వభావము గల వారమైనప్పటికీ ప్రభువు యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఎన్నో ఆశలతో మనకొరకు ఆయన పరలోకములో ఎదురు చూస్తున్నాడు. ఇది ఎంతో గొప్ప అద్భుతమైన వాస్తవము కాని ఇది నిజము. ఆయనను కలుసుకోవాలనే ఆశ మన హృదయములలో ఉండవచ్చునేమో గాని దానికంటే ఎక్కువగా, ఎంతో ఎక్కువగా మనలను చేర్చుకొని ఆయన మహిమలో పాలిభాగస్తులుగా చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు సంపూర్ణముగా స్వయం-సమృద్ధి గలవాడైనప్పటికీ, మనుష్యులతో కలసి జీవించాలనే ఆయన స్వంత కోరిక బైబిలు మొత్తములో కనబడే మరొక అంశము. ఆయన తన ప్రేమను గురించి అది ఎంత గొప్పదో, ఎంత యదార్థమైనదో ఎన్ని ఋజువులు చూపించినప్పుటికీ మనుష్యులు ఆయన ప్రేమను అనుమానించినట్లయితే ఆయన ఎంత దు:ఖిస్తారో కదా.


ఇశ్రాయేలు దేశ చరిత్ర ప్రారంభము నుండి కూడా తనయొక్క శాశ్వతమైన ప్రేమను వారిలో ముద్రించుటకు దేవుడు చాశాడు. శాశ్వతమైన ప్రేమతో వారిని ఆయన ప్రేమించాడు (యిర్మీయా 31:3; ద్వితీ 4:37). దీనికి ప్రతిస్పందనగా వారి యొద్దనుండి వారి ప్రేమను ఆయన కోరుకున్నాడు (ద్వితీ 6:5). కాని వారు మనవలె ఉన్నారు. వారు ఆయన ప్రేమను అనుమానిస్తునే ఉన్నారు. అయినా కూడా దేవుడు వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. నీవు మమ్ములను మరచిపోయావు అని ఆయనతో వారు అన్నప్పుడు యెషయా 49:15లోని ఈ మృదువైన మాటలతో ఆయన ప్రత్యుత్తరమిచ్చాడు: ''స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురుగాని నేను నిన్ను మరువను'' అని చెప్పాడు. ఒక తల్లి తన ఎదిగిన పిల్లలను గురించి ఎల్లప్పుడూ ఆలోచించకపోవచ్చును గాని తన రొమ్ము మీద ఒక బిడ్డ ఉన్నట్లయితే ఆమె మేలుకొని ఉన్న సమయములో ఆ బిడ్డను గూర్చిన ఆలోచన లేకుండా ఒక్క క్షణము కూడా ఉండదు. రాత్రి ఆమె నిద్రించే ముందు, తన బిడ్డ తన ప్రక్కన పడుకొనిఉందని ఆలోచిస్తూ నిద్రిస్తుంది. మధ్య రాత్రిలో ఆమెకు మెలకువ వచ్చినట్లయితే మరలా తన బిడ్డను చూచుకొని అంతా సరిగా ఉందో లేదో చూస్తుంది. ఆమె ఉదయ కాలమున మేల్కొన్నప్పుడు, ఆమె మొదటి తలంపు తన చంటి బిడ్డ గురించే ఉంటుంది. తన చంటి బిడ్డను గురించి తల్లి యొక్క జాగ్రత్త ఆ విధముగా ఉంటుంది. ఆ విధముగా, తన యొక్క పిల్లలను చూసుకుంటానని దేవుడు చెప్పుచున్నాడు.


హోషేయా గ్రంథము కూడా ఈ విషయమును నొక్కి చెప్పుచున్నది. తన స్వంత జీవితములో హోషేయా వెళ్ళిన బాధాకరమైన అనుభవములు ఇశ్రాయేలు యెడల దేవుని యొక్క వైఖరికి ఉపమానముగా నున్నది. విశ్వాసఘాతకురాలైన భార్య పట్ల విశ్వాస్యత కలిగిన భర్త వలె దేవుని ప్రేమ సహించునని ఇది మనకు చెప్పుచున్నది. ఆమె ఇష్టప్రకారము జీవించు తన వధువు (అవిధేయురాలైన) పైన దైవిక ప్రేమికుని కుండే విశ్వాస్యతను గురించిన గొప్ప సత్యమును చూపించుటకు బైబిలులో పరమగీతమును ప్రభువు ఉంచాడు.


మనతో దేవుడు చేసే సంప్రదింపులన్నింటికీ తన ప్రేమే ఆధారమని ఈ సత్యము మీద మన విశ్వాసము దృఢముగా నాటబడాలి. ''నీ యందు తనకున్న ప్రేమను బట్టి ఆయన శాంతము వహించును'' అని జెఫన్యా 3:17 లో ఉన్న మాటలు ఈ విధముగా తర్జుమా చేయబడ్డాయి. ''ప్రేమతో మౌనముగా ఆయన నీ కొరకు ప్రణాళిక వేస్తున్నాడు''. మన జీవితములలోనికి దేవుడు అనుమతించు ఏ ఒక్క విషయము కూడా మన కొరకు ప్రేమతో ప్రణాళికలు వేయు ఆయన హృదయము నుండి వస్తుందని నీవు తెలసుకున్నావా? నీ నా జీవితములో వచ్చే ప్రతి కష్టము, సమస్య కూడా మన మేలు కొరకే ఉద్దేశించబడినది. ఆయనిచ్చు శ్రేష్టమైన దానిని మనము కోల్పోకుండుట కొరకే ఆయన మన ప్రణాళికలను రద్దు చేస్తాడు. దీనిని మనము ఈ భూమి మీద పూర్తిగా అర్థము చేసుకోలేకపోవచ్చు. సమస్తమును ప్రేమ గల దేవుని హస్తముల నుండి మాత్రమే కలుగుచున్నవి. రెండవ కారణములేవి లేవని మనము గుర్తించినట్లయితే, ఇది మనలను బాధించే చింతలన్నింటిని, భయములన్నింటిని మరియు కఠినమైన తలంపులన్నింటిని తీసివేస్తుంది. విశ్వాసులు ఈ సత్యముపై ధృడముగా స్థిపరచబడలేదు గనుక చింతలు, విచారములు వారి మనస్సులలోనికి వచ్చి బైబిలు చెప్పే ''జ్ఞానమునకు మించిన సమాధానము'' మరియు ''చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము''నకు అపరిచితులుగానే ఉన్నారు.


పాత నిబంధనలోని లేఖనములను బాగా చదివి కూడా దేవుని గురించి తప్పుడు జ్ఞానము కలిగియున్న ఆనాటి మత సంబంధమైన వ్యక్తులను సరిచేయడమే తరచుగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యగా నున్నది. యేసుక్రీస్తు ప్రభువు రోగులను స్వస్థపరచుటయు, దు:ఖములో ఉన్న వారిని ఆదరించుటయు, పాపముతో ప్రయాసపడి భారము మోయుచున్న వారిని ఆయన ఆహ్వానించుటయు, తన శిష్యులతో ఆయన సహనము మరియు చివరిగా సిలువలో ఆయన మరణము, యేసు ప్రభువును గురించిన ఇదంతయు దేవుని హృదయము యొక్క ప్రేమించే గుణమును తెలియజేస్తున్నది. వారి యొక్క ప్రతి అవసరతను తన పరలోకపు తండ్రి తీరుస్తాడనే విషయమును యేసు ప్రభువు తరచుగా తన శిష్యులలో కలుగజేశాడు. తన తండ్రిని వారు అనుమానించినప్పుడు ఎంతో తరచుగా యేసు ప్రభువు తన శిష్యులను గద్దించాడు. ఈ భూసంబంధమైన తండ్రులకే తమ పిల్లలకు ఎలా సమకూర్చవలెనని తెలిసినట్లయితే, ప్రేమగల పరలోకపు తండ్రి ఎంత ఎక్కువగా వారికి సమకూర్చునో గదా (మత్తయి 7:9-11). తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము కూడా, తప్పిపోయిన మరియు తిరుగుబాటు చేసిన పిల్లల యెడల దేవుని యొక్క క్షమించే ప్రేమను వారికి చూపించుట కొరకే చెప్పబడినది. కాదనలేని వివరణ ద్వారా ఉపమానముల ద్వారా మరియు తన స్వంత మాదిరి ద్వారా తన తరములో నున్న ప్రజలకు దేవుని గురించి ఉన్న తప్పుడు ఆలోచనలను సరిచేయుటకు యేసు ప్రయత్నించాడు. సిలువ యొద్దకు వెళ్ళేటప్పుడు, తన చివరి ప్రార్థనలో లోకము దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థించాడు (యోహాను 17:23). దేవుడు మనలను శాశ్వతముగా, మార్పులేని ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడనే సత్యమును తన సత్య వాక్యము ద్వారా మన హృదయములలో లోతుగా, శాశ్వతముగా ముద్రించును గాక. దేవుని యందలి విశ్వాసము మరి దేనిమీద కాకుండా ఈ నేలమీదనే ఎరుగును.


ప్రేమ-మనము ప్రతిష్టించుకొనుటకు ప్రేరణ


మనము ప్రభువు కొరకు చేయు ప్రతి పనిలోను దానివెనుక ఉన్న ఉద్దేశ్యమే ముఖ్యము. క్రీస్తు న్యాయసింహాసనము యొద్ద ప్రాముఖ్యమైన ప్రశ్న ''నీవు ఏమిచేశావు?'' అన్నది కాదు గాని ''నీవు ఎందుకు చేశావు?'' అన్నదే. మన బైబిళ్ళు మనము ఎన్ని గంటలు చదివాము లేక ప్రార్థించాము, ఎన్ని ఆత్మలకు మనము సాక్ష్యమిచ్చాము లేక ఎన్ని పత్రికలు పంచాము అన్నది కాదు, ఇవన్నీ ముఖ్యమే కాని ఇవన్నీ ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామనునది ప్రధానము. ఆత్మసంబంధమైన పనులన్నింటిలోను నిమగ్నమై యుండి కూడా, వాటిని స్వార్థపూరిత ఉద్దేశ్యములతో గాని లేక అక్షరానుసారమైన నియమములతో (లీగలిస్టిక్‌) చేసే అవకాశం ఉంది. తప్పిపోయిన కుమారుని ఉపమానములో ఈ రెండు విధములైన ప్రభువు సేవను గురించి (లూకా 15:11-32) చూడగలము. చిన్నకుమారుడు స్వార్థపూరితమైన ఉద్దేశ్యములతో ఉన్నాడు, పెద్ద కుమారుడు అక్షరానుసారమైన (లీగలిస్టిక్‌) ఆత్మను కలిగియున్నాడు. క్లుప్తముగా వీరిద్దరిని పరిశీలిద్దాము.


ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చి ఆస్తిలో తన భాగమును అడుగుతాడు. మనము చూస్తున్నట్లుగా దేవుని యొక్క స్వభావము ధారాళముగా ఇచ్చుట, ఈ ఉపమానములోని తండ్రి కూడా ఇదే విధముగా కుమారునికి ఇచ్చాడు. కాని తనకు కావలసినదంత తీసుకున్న వెంటనే చిన్న కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి దూరదేశమునకు వెళ్ళాడు. తన తండ్రి మీద ఉన్న ప్రేమను బట్టి అతడు ప్రేరణ పొందలేదు గాని తన తండ్రి యొద్ద నుండి తాను ఏమి పొందగలనో అన్న దానిని బట్టి అతడు ప్రేరేపించబడ్డాడని ఇది మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది. అనేక మంది క్రైస్తవ విశ్వాసులు ఈ విధముగా నున్నారు. దేవుని యొద్దనుండి వారు పొందడానికి మాత్రమే వస్తారు. వ్యక్తిగత లాభము మరియు ఆశీర్వాదములు మాత్రమే వారి భక్తికి కావలసిన ప్రేరేపణలు.


అన్యుల మతములలో సాధారణముగా ఇవే వారి ప్రేరేపణలు. వారి దేవుని యొద్దనుండి కొన్ని వ్యక్తిగతమైన ప్రయోజనములను పొందుటకు అన్యులు కానుకలు ఇచ్చినప్పుడు లేక సుదీర్ఘ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనలను ఆశ్చర్యపరచవు. కాని అయ్యో! క్రైస్తవులలో కూడా ఈ వైఖరి కనబడుతుంది. తొంభై శాతం మంది క్రైస్తవులు ఒకవేళ భౌతిక సంబంధమైన వస్తువుల కొరకు (ఒకప్పుడు భారతదేశములో ఉన్నట్లుగా) కాకపోయినా నరకభయముల నుండి పరలోకము యొక్క సౌఖ్యముల కొరకు క్రీస్తును నమ్ముకొన్నారన్న విషయము నిజము కావచ్చును. ఇదంత చెడ్డ విషయమేమి కాదు, కాని ఇది మనకు చెప్పేదేమిటంటే మన క్రైస్తవ జీవిత ప్రారంభములో వ్యక్తిగత లాభము కొరకు స్వార్థపూరితమైన ఉద్దేశ్యముతో దేవుని యొద్దకు వచ్చాము. నా సహోదరీ, సహోదరుడా నీ హృదయమును పరీక్షించుకొని ఒకవేళ ఇది నిజమో, కాదో చూడు.


నేను ఇప్పుడు చెప్పిన విధముగా, ఆత్మీయముగా పరిణితి చెందుచున్న క్రమములో, ప్రభువు యొద్దకు స్వార్థపూరితమైన ఉద్దేశ్యములతో మనము వచ్చామనే విషయమును తెలిసికొని, మన వైఖరిని సరిదిద్దు కుంటున్నట్లయితే ఇదంత చెడ్డ విషయమేమి కాదు. కాని దురదృష్టవశాత్తు, తరచుగా ఇది జరగడం లేదు మరియు అనేకమంది విశ్వాసులు వారి జీవితమంతయు వ్యక్తిగత లాభము కొరకు జీవిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ దేవుని యొద్దనుండి పొందడానికే గాని, ఆయనకు ఇవ్వడానికి చూడటం లేదు గనుక వారి జీవితములో ఎన్నో సమస్యలున్నాయి. మరియు వారి సేవ (పరిచర్య)లో ఎంతో తక్కువ సంతోషం ఉన్నది. మన బైబిళ్ళు మనము ఎందుకు చదువుతున్నాము? కేవలము ఆశీర్వాదము పొందుటకే అనేకసార్లు మనము బైబిలు చదువుతాము. కొన్నిసార్లు, బైబిలు పండితుడు అనే ఘనతను పొందుటకు చదువుతాము. దేవుని చిత్తమును తెలిసికొని, దానిని చేయుటకు తద్వారా మన జీవితములలో దేవుడు మహిమ పరచబడునట్లుగా చాలా కొద్దిసార్లు మనము బైబిలు చదువుతాము. మనము ఎందుకు ప్రార్థిస్తాము? తరచుగా, మన కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదములను పొందుటకు మాత్రమే ప్రార్థిస్తాము. తన మహిమ కొరకు ప్రభువు యొక్క పని ఈ భూమి మీద వృద్ధి పొందునట్లుగా విశ్వాసులు ఎంత తక్కువగా ప్రార్థిస్తారో కదా? బహుశా మనము ఉపవాసముండి కూడా ప్రార్థిస్తుండవచ్చు. కాని మనము ఏ ఉద్దేశ్యముతో ప్రార్థిస్తున్నామో ఎప్పుడైనా మనము ఆగి పరిశాలించుకున్నామా? మనము ఎంతో ఎక్కువగా కోరుకున్న విషయాలను పొందడానికే ప్రార్థిస్తాము. బహుశా మనము ఆత్మీయ విషయమునే కోరుకొనవచ్చును-బహుశా అది మనము పరిశుద్ధాత్మతో నింపబడాలనే కోరిక కావచ్చు.


కాని ఉద్దేశ్యము స్వార్థపూరితమైనదై యుండవచ్చు-అది దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నా సరే దేవుని యొక్క పనివృద్ధి చెందాలనేది కాక మనము దేవుని చేత గొప్పగా వాడబడాలి అనే కోరికైయుండవచ్చు.


నీవు పాడతావా? కొంతమంది సంగీతపరమైన తలాంతులు కలిగిన విశ్వాసులు ఒంటరిగా ప్రదర్శనలిస్తారు. కాని అందులో నేను నా మహిమ కొరకు కాక ప్రభువు యొక్క మహిమ కొరకు మాత్రమే చేస్తున్నానని ఎంతమంది నిజాయితీగా చెప్పగలరు. లేక, దేవుని యొక్క వాక్యము వివరించబడుచున్న కూటములను మనము తీసుకుందాము. ''అక్కడ మేము ఆశీర్వాదమును పొందాము'' అని విశ్వాసులు చెప్పుటను మనము తరచుగా వినుటలేదా? ''మేము''-కూటములో దేవుని యొద్దనుండి వారు పొందినదానిని వారు ముఖ్యముగా చూస్తున్నారు. దేవుడు మహిమ పరచబడ్డాడా లేదా అన్నది వారికి అంత ప్రాముఖ్యమైనది కాదు. మాకేమైనా దొరుకుతుంది అన్న చోటుకే అనేక మంది విశ్వాసులు దాదాపుగా వెళ్ళు చుంటారు. ఆ విధముగా వారు ఆత్మీయముగా చిన్న పిల్లలవలె మిగిలిపోయారు, వారి జీవితమంతయు ఆత్మీయ భిక్షగాళ్ళ వలె ఉంటారు. మేము ఆత్మీయమైన పనులు ఎన్నో చేస్తున్నామని వారు అనుకున్నా కూడా అవి స్వార్థము అనే పాపముతో పులిసిపోయి ఉంటాయి.


1కొరింథీ 3:12-15లో మనము దేవుని కొరకు చేసిన పని కాలిపోతుందనే విచారకరమైన విషయము వివరించబడినది. మనము స్వార్థపూరితమైన ఉద్దేశ్యములతో దేవుని పని చేయుట వలన కలిగే పరిణామమే ఈ విధముగా చేస్తుంది. స్వీయ కేంద్రీకృతము నుండి దేవుని కేంద్రీకృతముగా మారుటయే నిజమైన పశ్చాత్తాపము.


ఉపమానములోని ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు మంచివాడని సాధారణముగా అనుకుంటారు. అతని వైఖరిని మనము పరిశీలించినట్లయితే తన సహోదరినివలె ఇతడు కూడా అదే విధమైన పొరపాటులో ఉన్నాడని చెప్పవచ్చు. చిన్న కుమారుడు తిరిగివచ్చినప్పుడు, తండ్రి తన వారందరితో కలసి సంతోషించాడు. అన్నకున్న అసూయను బట్టి పెద్ద కుమారుడు ఆ సంతోషములో పాలుపొందలేక పోయాడని ఋజువు చేయబడ్డాడు. డబ్బునంతా వృథాగా ఖర్చుచేసిన తన తమ్మునికి అంత ఘనత ఇవ్వబడటం చూచి అతడు ఎంతగానో కోపగించి ఇంటి లోపలకు కూడా వెళ్ళలేదు. తన తండ్రి అతనిని బ్రతిమాలుచున్నప్పుడు తాను ఇచ్చిన ప్రత్యుత్తరమే అతడు ఎందుకు సేవ చేస్తున్నాడనే ఆత్మను బహిర్గతం చేసింది. ''ఇదిగో యిన్ని యేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదు; అయినను ఈ విధముగా నాకెప్పుడు నీవు ఇయ్యలేదు''. అతడు తన తండ్రికి ప్రేమతో, సంతోషముగా సేవ చేసే బదులు, లెక్కలేసుకుని, అక్షరానుసారముగా ఒక సేవకుడు తన యజమానునికి జీతము కొరకు పనిచేసినట్లుగా చేస్తున్నాడు. ఈ విధముగా, మనలో అనేకమంది చేయునట్లు, అతడు వేరే వారితో పోల్చుకొని ఫిర్యాదు చేయుటకు అవకాశమును వెదుక్కుంటున్నాడు. వారు అర్హత కలిగిన దానికంటె ఎక్కువగా ఆశీర్వదించబడుచున్నారు. కాని తాను ఆశీర్వాదము పొందుటకు అర్హత కలిగియున్నా కూడా ఏమి పొందలేకున్నాను అని అనుకొనుచున్నాడు.


నీవు ప్రభువును ఈ విధముగా సేవించుచున్నావా? ఏదో ఒక పనిని నీ మీద రుద్దినట్లుగా మరియు దానిని మీరకూడదు అన్నట్లుగా నీవు బైబిలును చదివి, ప్రార్థించుచున్నావా? బైబిలుతో అనుదిన మౌనధ్యాన సమయము కేవలము మనస్సాక్షిని సంతృప్తిపరచుటకే చేసినట్లయితే, ఆ మౌన ధ్యాన సమయము కేవలము ఆచారము మాత్రమే. అందుకే అనేకమంది విశ్వాసులలో బైబిలు చదువునపుడు, లేక ప్రార్థించినప్పుడు లేక సాక్ష్యమిచ్చునప్పుడు సంతోషము లేకపోవుటలో ఆశ్చర్యము లేదు! ప్రభువు కొరకు వారి చేసే సేవ భారముగా, కష్టముగాను ఉండుటలో ఆశ్చర్యము లేదు. దేవుని కృపను బట్టి వారు ఉచితముగా రక్షించబడినా కూడా వారు స్వచ్ఛందముగా మరియొక సారి వారిని ధర్మశాస్త్రము క్రింద పెట్టుకుంటున్నారు.


పునరుత్థానుడైన క్రీస్తును మనము పెండ్లి చేసుకొనులాగున క్రీస్తు మరణము ద్వారా మనము ధర్మశాస్త్రమునకు చనిపోయాము. ఇది రోమా 7:1-6 యొక్క బోధ. ఇక్కడ పౌలు యొక్క వింతైన మాటలకు అర్థమేమిటంటే, ఒక సేవకుడు తన యజమానుని అక్షరానుసారము (చట్టబద్దము)గా సేవించినట్లు ప్రభువును సేవించుటకు బదులు ఒక భార్య ప్రేమను బట్టి తన భర్తను సేవించినట్లుగా మనము ''నూతనమైన ఆత్మతో'' ఆయనను సేవించవలెను. ఈ రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. మొట్టమొదట మనము సేవకుని (పనివానిని) చూద్దాము. అతడు నియమనిబంధనలను అనుసరించి, నియమింపబడిన గంటలు మరియు నియమింపబడిన జీతమునకు పనిచేస్తాడు. ఒకవేళ అతడు ఎక్కువ పనిచేసి తక్కువ జీతము పొందుతున్నాననుకుంటే ఈ ఆధునిక యుగములో సమ్మెచేసి యుండేవాడు. ఈనాడు అనేకమంది దేవుని పిల్లలు దురదృష్టవశాత్తు దేవుని పనిని ఆవిధముగానే చేస్తున్నారు. అతడు ఎంతో నమ్మకముగా నియమింపబడిన ఆచారముల ద్వారా వెళ్తాడు. అతడు క్లుప్తముగా మౌనధ్యాన సమయమును కలిగియుండి, ఆ తరువాత అతడు చిలుక పలుకులవలె దేవుని ముందు అవసరములో ఉన్న కొన్ని మనుష్యుల పేర్లు పలికి ''విజ్ఞాపనను'' కలిగియుంటాడు.


వీటికి తోడుగా వారమునకు ఒకటి లేక రెండు లేక బహుశా మూడు, నాలుగు కూటములకు హాజరవుతాడు. వీటిద్వారా ఎటువంటి ప్రకృతి వైపరీత్యము ఆయనకు కలుగకుండా లేక తన ఇంటి మీద పడకుండా, తన పిల్లలందరు పరీక్షలలో ఉత్తీర్ణులవునట్లును మరియు తనకు ఉద్యోగములో క్రమమైన పదోన్నతులు కలుగునట్లును దేవుణ్ణి సంతోషపరచానని అతడు అనుకుంటాడు. ఆయన ఇంకా ముందుకు వెళ్ళి తన యొక్క సౌవార్తిక సిద్ధాంతముల యొక్క నిశ్చయతను బట్టి గర్విస్తాడు. మరియు ఎప్పుడైతే, తాను ఆశించిన దానికి విరుద్ధముగా అతనికి ఏదైనా జరిగితే, దేవుని యెదుట మరియు మనుష్యుల యెదుట ఫిర్యాదులు చేయుటకు ఎంతో త్వరపడతాడు.


ఆయనను అసలు సేవించకపోవుట కన్నా, భయముతో ఆయనను సేవించుట శ్రేష్టమని నేను అంగీకరిస్తాను. కాని సహోదరీ, సహోదరులారా, మన మత కార్యకలాపాలను మనము నిర్లక్ష్యము చేస్తే దేవుడు మనలను శిక్షిస్తాడేమో అనే భయముతో మనము వాటిని జరిగించాలని దేవుడు నిన్ను, నన్ను కోరడంలేదు. ప్రేమతో ఒక మంచిభార్య తన భర్తను సేవించినట్లుగా మనము ప్రభువుని సేవించాలని ఆయన కోరుకొనుచున్నాడు. ఆమె ఆయనను జీతము కోసము సేవించదు లేక కేవలము నియమిత సమయములోనే సేవించదు. ఆమె నియమ నిబంధనలను అనుసరించి సేవించదు లేక ఫలము ఆశించి సేవించదు. ఒక వేళ ఆమెయొక్క భర్త జీవితాంతము కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె కేవలము ఆయనను ప్రేమిస్తున్నది గనుక ఆమె సంతోషముగా ఆయనకు పరిచర్య చేస్తూ అతనిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎంతో త్యాగపూరితముగా మరియు ఆమె చేసిన పనికి ఫలితముగా ఏమీ ఆశించకుండా ఆ విధముగా చేస్తుంది. మన యొద్ద నుండి కూడా దేవుడు ఇదే విధమైన సేవను కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కుమారునిలో దేవుడు మనకు ఇదే విధమైన సేవను అనుగ్రహించాడు. ఆయన మీద మనకున్న పవిత్రమైన ప్రేమతో కాక దానికంటే తక్కువగా మరేవిధముగా మనము ఆయన సేవ చేసినా అది ఆయన దృష్టిలో విలువలేనిదిగా ఉంటుంది.


పైగా, స్వార్థపూరితమైన కారణముల చేత లేక అక్షరానుసారమైన ఆత్మతో చేసే దేవుని సేవ వెట్టిచాకిరి వలే ఉంటుంది. అది బేరింగులతో కారు ఇసుకలో నడిపినట్లుగా ఉంటుంది. కొంచెము ముందుకు కదలాలన్నా కూడా అది ఎంతో బలముగా తిరస్కరిస్తుంది, ఫిర్యాదు చేస్తుంది, మొరపెడుతుంది (శబ్దము చేస్తుంది). దురదృష్టవశాత్తు, మనలో ఉన్న చాలా మంది జీవితములు సేవను గూర్చిన వివరణగా ఇది ఉన్నది. అయితే ఇసుకను తొలగించి గ్రీజు వేయుము. ఇప్పుడు ఎంత సున్నితముగా, శబ్దము లేకుండా మరియు త్వరగా కారు ముందుకు వెళ్ళుతుందో కదా! నీ బైబిలు పఠనము, ప్రార్థన కూడా ఇదే విధముగా ఉండాలని దేవుడు కోరుకొంటున్నాడు. నీ ఆరాధన, సాక్ష్యమిచ్చట మరియు నీవు చేసే ప్రతి యొక్క క్రైస్తవ పని కూడా స్వచ్ఛందముగా, సంతోషముతో ఆయన మీద ఉన్న ప్రేమతో చేయవలెనని ఆయన కోరుకొంటున్నాడు.


మనము పరిగణలోనికి తీసుకున్న ఇద్దరి కుమారుల కంటె పాతనిబంధన పరిశుద్ధుడైన యోబు వైఖరి ఎంతో వ్యత్యాసముగా ఉంది. దేవుని దృష్టికి అనుకూలమైన సేవను యోబులో మనము చూడగలము. యోబు ఊరకనే దేవుని సేవించు చున్నాడా అని సాతాను యోబుపై నేరారోపణ చేశాడు. దేవుడు యోబు యొక్క ఆస్తి బహుగా విస్తరించునట్లు ఆశీర్వదించలేదా? అటువంటి ప్రతిఫలమును ఆశించి ఎవరైనా సేవిస్తారుగదా? అని సాతాను చెప్పాడు. సత్యమును ఋజువు చేయుటకు సాతాను యోబును పరీక్షించుటకు దేవుడు అనుమతించాడు. తనకున్న సమస్త ఆస్తి, పిల్లలు చివరిగా యోబు యొక్క ఆరోగ్యము కూడా క్షీణించునట్లు సాతాను మొత్తాడు. ఈ విపత్తులలో కూడా యోబు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఆ కష్టముల యొక్క ఒత్తిడిని బట్టి కొన్నిసార్లు దేవుని యొక్క కాపుదల ఆయన అనుమానించాడు. కాని ఆయన చెప్పిన కొన్ని మాటలను మనము జ్ఞాపకము తెచ్చుకుందాము.


''యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక........మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింపతగదా అనెను.....ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.......ఇదియు నాకు రక్షణార్థమైనదగును........నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును......నా చర్మము చీకిపోయిన తరువాత శరీరములో నేను దేవుణ్ణి చూచెదను......ఆయననన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును.'' (యోబు 1:21; 2:10; 13:15,16; 19:25-27; 23:10). ఆయనను సేవించుటలో యోబు యొక్క ఉద్దేశ్యము పవిత్రమైనదని ఇవన్నియు ఋజువుచేయుచున్నవి .గనుక చిట్టచివరకు దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. ఇటువంటి విధేయత గల ఆత్మను ఎవరైతే ప్రత్యక్షపరుస్తారో వారు దేవుని యొక్క శ్రేష్టమైన వాటిని పొందగలరు. జ్ఞాపకముంచుకొనుడి, యోబు పాతనిబంధన పరిశుద్ధుడు. ఆయనే అంత ఉన్నతస్థానమునకు చేరుకొనగలిగియుండగా, క్రొత్తనిబంధన పరిశుద్ధుడు ఇంకెంత ఉన్నత స్థానమునకు ఎదుగవలెనో గదా!


ఇప్పుడు జెకోస్లోవేకియా అని పిలువబడే దేశములో సుమారు 200 సంవత్సరముల క్రితము మొరేవియన్‌ మిషనరీ ఉద్యమములో దేవుని యొక్క ఆత్మద్వారా విషేశమైన కార్యములు జరిగినవి. అన్ని సమయములలో కంటే అతిశ్రేష్టమైన క్రైస్తవ మిషనరీలను తయారు చేయగలిగినది. ప్రభువు యెడల అటువంటి అసాధారణమైన భక్తిగల మనుష్యులు ఈనాడు చాలా అరుదుగా కనబడతారు. ఈ మొరేవియన్‌ విశ్వాసులలో కొందరు సువార్తతో ఆఫ్రికాలోకి అడుగుపెట్టారు, అక్కడ ఒక కుష్టువ్యాధి కలిగిన ఒక కాలనీ దగ్గరకు వచ్చారు. క్రీస్తు యొక్క సువార్తను ఆ కుష్టువ్యాధిగల వారికి బోధించుటకు వారెంతో ఆశపడ్డారు. కాని ఆ కుష్టువ్యాధి వీరి ద్వారా వేరే ప్రదేశములోని వారికి కుష్టు వ్యాధి అంటుకుంటుందని వారు అనుమతించబడలేదు. వారి ప్రభువు కొరకు ఆత్మలను జయించాలన్న కోరిక ఎంతో తీవ్రముగా ఉన్న కారణమును బట్టి, వారు ఆ కాలనీలో జీవితమును గడిపెదమనుకొని ఆయన కొరకు అక్కడే జీవించి, చనిపోదామని నిశ్చయించుకొన్నారు. వేరొక సందర్భములో వెస్టిండీస్‌లోని ఒక ద్వీపములో కేవలము బానిసలు మాత్రమే నివసిస్తున్నారని మొరేవియన్‌ సహోదరులు వినియున్నారు. కేవలము బానిసలను మాత్రమే అక్కడకు అనుమతిస్తారు. అయితే క్రీస్తు కొరకు ఈ బానిసలను జయించాలన్న భారము ఎంతో తీవ్రముగా కలిగియుండి, వారు మహిమకరమైన సువార్తను ఆ బానిసలకు బోధించులాగున తమ స్వాతంత్య్రమును వదిలిపెట్టుకొని, ఆ ద్వీపము యొక్క యజమానునికి వారంతట వారే బానిసలుగా సమర్పించుకొన్నారు. ఎందుకు ఈ మనుష్యులు అటువంటి త్యాగమును చేయుటకు ఇష్టపడియున్నారు? ఏదైనా స్వార్థపూరితమైన ఉద్ధేశ్యముతో చేసారా? ఈనాటి క్రైస్తవ పనిలో కనపడుచున్నట్లుగా, వారియొక్క పేరు ప్రఖ్యాతలను నిర్మించుకొనుటకా? లేక దేవుని దృష్టిలో ఏదో దయ పొందాలనే అక్షరానుసారమైన (చట్టబద్ధమైన) సేవచేసారా? కానే కాదు. ఈ లోకములో వారికి ప్రియమైనవిగా ఉన్న వాటన్నింటిని వదులుకొని, ఆ కుష్టురోగులు మరియు బానిసల మధ్యనుండి ''వధించబడిన గొఱ్ఱెపిల్ల కొరకు జయించి ఆయన శ్రమలనకు బహుమానము''గా ఇచ్చుటకు ఈ మనుష్యులను క్రీస్తు కొరకైన స్వచ్ఛమైన ప్రేమే వారిని నడిపింది. ఈ భూమి మీద నిత్యత్వపు విలువ కలిగిన వాటిని సాధించినవారు, తమ ప్రభువును ప్రేమతో సేవించినవారే. రాహేలును పొందుటకు యాకోబును 14 సంవత్సరములు కొలువు చేయించినది కేవలము ప్రేమ మాత్రమే (ఆది 29:20). ఆమె కొరకైన ఆయన ప్రేమయే తన శ్రమ అంతటిని మరచిపోవునట్లు చేసినది. నిన్ను, నన్ను కూడా క్రీస్తు కొరకైన ప్రేమయే కఠినమైన సేవను కూడా సంతోషముగా తీసుకువెళ్తుంది.

ప్రేమ-మన ఆత్మీయతకు నిజమైన పరీక్ష


ఈ అధ్యాయములలో, మన చివరి పరిగణన కోసం యోహాను 21:15-17లో గల మన ప్రభువు యొక్క పునరుత్థాన దర్శనమును మనము చూద్దాము. ప్రభువు సిలువ వేయబడక మునుపు ప్రభువు నెరుగనని పేతురు మూడుసార్లు బొంకాడు. ఇది ప్రభువుతో మూడున్నర నిరాశపూరిత సంవత్సరములు గడిపిన దానికి పరాకాష్టగా ఉన్నది. ఆ సమయములో పేతురు గర్విష్టిగాను, స్వీయబలము ఉన్నట్లుగాను, ప్రార్థనలేమితో ఉన్నాడు. అయినా కూడా, ప్రభువు తన మందను కాయమని పేతురుకు అప్పగించినపుడు పేతురు యొక్క ఏ ఒక్క బలహీనతల గురించి ఆయనకు చెప్పలేదు. దీనునిగా ఉండమని మరియు భవిష్యత్తులో బలముగా సాక్ష్యమిచ్చుటకు ప్రార్థన చేయమని మరియు తన ప్రభువు కొరకు అవసరమైతే శ్రమల గుండా వెళ్ళాలని కూడా ప్రభువు పేతురును సవాలు చేయలేదు. ఒక ఆత్మానుసారుడైన మనుష్యునిలో మనము ఈ అర్హతలన్నింటి కొరకు చూచినప్పటికీ, ముఖ్యముగా దేవుని ప్రజల మధ్య నాయకునిగా ఉండగోరు వానిలో చూచినప్పటికీ ఆయన ఇటువంటి ప్రశ్నలేమీ అడుగలేదు. ఒక సామాన్యమైన ప్రశ్న సరిపోతుందని యేసు ప్రభువుకు తెలుసు. ఆ ప్రశ్నకు నిజమైన స్పందన వచ్చినట్లయితే, మిగిలినవన్నీ వాటంతట అవే వస్తాయి. ''మరి దేనికంటె, మరి ఎవరికంటె కూడా ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా?'' ఒక మనుష్యుని ఆత్మీయతకు నిజమైన పరీక్ష ప్రభువు కొరకైన ప్రేమయే. ఒక మనుష్యుడు సంఘములో ఉన్నత స్థానమునకు వెళ్ళినప్పుడు, ఒకవేళ బిషప్‌ అయినా కూడా, అతడు ఆత్మీయుడేమో అని మనము సహజముగా అనుకుంటాము. ఆ విధంగా అయ్యుండవలసిన అవసరము లేదు. నూతన జన్మ మరియు దాని ఫలితముగా క్రీస్తు కొరకైన ప్రేమ మాత్రమే ఒక మనష్యుని ఆత్మానుసారునిగా చేస్తుంది. ఈనాడు ఒక సంఘము యొక్క బిషప్‌ కనీసం నూతనముగా జన్మించకుండా ఉండే అవకాశము ఉంది. వేదాంత విద్యలో ఒక డిగ్రీ లేక ఎన్నో డిగ్రీలు- కలిగియున్నంత మాత్రమున ఒక మనుష్యుడు ఆత్మానుసారుడని చెప్పలేము. సరియైన సౌవార్తీకరణ వేదాంత కళాశాల (సెమినరీ)లో నుండి వచ్చినా కూడా అది ఒక మనుష్యుని ఆత్మానుసారునిగా చేయలేదు. ఒక సమాజమునకు నీవు పూర్తికాలపు క్రైస్తవ పనివానిగా లేక కాపరిగా ఉన్నంత మాత్రమున అది నిన్ను ఒక దైవజనునిగా చేయలేదు. కూటములకు క్రమము తప్పకుండా హాజరగుట లేక మిక్కిలి బైబిలు జ్ఞానము లేక సువార్త కొరకైన మిక్కిలి ఆసక్తి కలిగియుండుట వంటి వాటికి ఆత్మీయతకు గుర్తులుగా అనుకొనే తప్పును నీవు నేను చేస్తూ ఉంటాము.


ప్రత్యేకమైన దుస్తులు మరియు నిష్టతో ఉండే చూపులు కూడా మనలను మోసము చేస్తాయి. అయితే ఇవేవి కూడా పరిగణనలోనికి తీసుకొనబడవు. దేవుని దృష్టిలో నిజమైన ఆత్మీయతకు పరీక్ష ఒకే ఒక్కటి: ఆయనను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు అనేదే. అది చివరకు నీవు, నీ ప్రభువుకు మధ్య ఉండునదే. ''నీవు నన్ను ప్రేమించుచున్నావా?'' అని ఆయన ప్రశ్న అడుగుచున్నాడు. కాని దానికి జవాబును కనుగొనవలసినది నీవే.


ఇస్సాకు రిబ్కాను ప్రేమించినప్పుడు, ఆయన చూచినది ఆమె ప్రేమ కొరకే గాని ఆమె సేవ (పరిచర్య) కొరకు కాదు. ఇదేవిధముగా దేవుడు ముఖ్యముగా మన యొద్దనుండి కోరుకొనేది మన సేవ (పరిచర్య)ను కాదు గాని మన ప్రేమనే. ఎక్కడైతే నిజమైన ప్రేముంటుందో, అక్కడ సేవ సహజముగా వస్తుంది.


అబ్రాహాము యొక్క దాసునితో కలసి రిబ్కా మెసపుటోమియా నుండి కనానుకు 600 మైళ్ళు ప్రయాణం చేసింది. ఆ ప్రయాణములో వారిద్దరు ఏమి మాట్లాడుకొని యుండుంటారు? నిజముగా ఆమె ఇస్సాకును ప్రేమించినట్లయితే, తప్పకుండా రిబ్కా, ఇస్సాకును గురించే మార్గమంతటిలో విచారించి యుంటుంది. తనతో ఉన్న సహచరుడు మరియు మార్గదర్శియైన వానిని ఇస్సాకును గురించి లెక్కలేనన్ని ప్రశ్నలు అడిగియుంటుంది. యేసు ప్రభువును నిజముగా ప్రేమించే ఒక విశ్వాసి అటువంటి ఆకలితో బైబిలును చదువుతాడు. తన ప్రభువును గూర్చిన సౌందర్యమును ఇంకా, ఇంకా ఎక్కువగా తెలుసుకునేందుకు అనుదినము అతడు పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. మనము చూచినట్లుగా, దావీదు కోరుకున్న ఒక్కవిషయము ఇదే (కీర్తనలు 27:4).


ఈ విషయములో దావీదును అనుసరించిన మనుష్యులు ఆయాసమయములలో ఉన్నారు. సామ్యూల్‌ రూథర్‌ఫర్ట్‌ అబెర్డీన్‌ చెఱసాలలో పడియుండి ఈ విధముగా మొఱ్ఱపెట్టాడు. ''ఓ! నా ప్రభువా, ఒకవేళ నీకు, నాకు మధ్యలో ఒక విశాలమైన నరకము ఉంటే, దానిలో గుండా తప్ప నీ యొద్దకు వచ్చుటకు అవకాశము లేనట్లయితే, నేను నిన్ను హత్తుకొనుటకు, నిన్ను నా వానిగా చేసుకొనుటకు, దానిలో మునిగా వచ్చుటకు నేను రెండవసారి ఆలోచించియుండేవాడను కాదు''. ఆహా, అయితే దురదృష్టవశాత్తు, అటువంటి ఆకలి దప్పులు కలిగియున్న వారు ఎంత ఎక్కువ మంది ఉన్నారో కదా! మనము ప్రభువును ఏ కొలతతో అయితే ప్రేమిస్తున్నామో, మన నిజమైన ఆత్మీయత కూడా అదే కొలతలో ఉంటుందనే సత్యమును దేవుడు మనకు నూతనముగా చూపించును గాక. మనలను మనము మోసము చేసికొనకుండునట్లు, ఆయనే మనకిచ్చిన కొలబద్దను జ్ఞాపకము చేసుకొందాము. మన విధేయతే మన ప్రేమకు నిదర్శనము (యోహాను 14:15,21,23,24).


బైబిలులోని చివరి పుస్తకము ఈ గంభీర సత్యమును స్థిరపరస్తున్నది. అక్కడ ఎఫెసీలోనున్న సంఘమును ''నీవు మొదటి ప్రేమను కోల్పోయావు'' (ప్రకటన 2:1-5) అని ప్రభువు గద్దిస్తున్నాడు. వేరే విషయములలో ఇది అద్భుతమైన సంఘము. అక్కడున్న క్రైస్తవులు ఓర్పుతో పనిచేశారు, దుర్నీతిని ద్వేషించారు, అబద్ధ ప్రవక్తలను బహిర్గతం చేశారు, సహనము కలిగి ప్రభువు నామము నిమిత్తము భారము భరించి అలయకుండా ఉన్నారు. వారు దానిని విడిచిపెట్టినట్లు ఏదీ అడ్డుకొనలేకపోయినది. అయనాకూడా, వారికి విరోధముగా ప్రభువు ఒక తప్పును మోపారు. అది ఎంత తీవ్రమైన లోపమంటే, ప్రభువు కొరకైన వారి సాక్ష్యము ఉనికిని కోల్పోయేటంత భయంకరమైనది. వారు పడిపోయారని అయన చెప్పారు. వారు మారుమనస్సు పొందనట్లయితే, వారి సాక్ష్యమునకు ఆయన ఆమోదమునకు గుర్తుగా ఉన్న, ఆయన అభిషేకమును తీసివేస్తానని చెప్పారు. ఆ తీవ్రమైన కొరత (లోపము) ఏమిటి? వారి ప్రభువు కొరకు వారి ప్రేమలో వారు చల్లబడ్డారు. ఆయన కొరకైన వారి మొదటి ప్రేమను వారు కోల్పోలేదు, వారు దానిని వెనుక విడచిపెట్టి వేరే దగ్గరకు వెళ్ళారు. వారు వారి సమావేశాల్లోను, రిట్రీటుల్లోను మరియు సభల్లోను (ఇప్పటి మన పరిస్థితులలో చెప్పాలంటే) మరియు ఇతర క్రైస్తవ కార్యకలాపాలలో ఎంతో తీరిక లేకుండా యుండి అసలు ఇవన్నీ ఎవరి కోసమైతే ఉన్నవో ఆయన మీద వారి దృష్టిని కోల్పోయారు. మన కార్యకలాపములు (పనులు) అన్నింటికంటె కూడా, ఆయన యెడల మనకున్న హృదయములలోని భక్తినే ఆయన గమనముంచుతాడని ఇది మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది.


సాతానుకు ఇది తెలిసి, మనము ఏదోఒక క్రైస్తవ పనిలో నిమగ్నమై పోయి, మన ప్రభువుతో గడుపుటకు సమయము లేకుండా చేసి ఆవిధముగా మనము ఆయనకొరకైన మన వ్యక్తిగల ఆరాధనభావము (భక్తి) నుండి తొలగిపోవునట్లు చేయుటకు శాయశక్తులా ప్రయత్నము చేస్తాడు.


అంత్యదినములలో అక్రమము విస్తరించి అనేకుల ప్రేమ(ప్రభువు కొరకు) చల్లారును (మత్తయి 24:12) అని యేసు మనలను హెచ్చరించారు. ఆ దినములలో మనము ఇప్పుడు జీవిస్తున్నాము. ప్రభువును వెంబడిస్తున్నాము అని చెప్పుకొనే చాలా మందిలో ఆత్మీయ ఉష్ణోగ్రత ఘనీభవస్థానము (ఫ్రీజింగ్‌ పాయింట్‌) కంటె తక్కువగా నున్నది. మనము ఎల్లప్పుడు మెలకువగా లేనట్లయితే, ఆ అతిశీతలమైన స్థితి మనలోనికి కూడా చొచ్చుకొని వచ్చునట్లు కనుగొంటాము. క్రీస్తులో ఉన్న నాసహోదరి, సహోదరులారా, నీవు సమస్తమును కోల్పోయినా సరే, ఈ ఒక్క విషయమును పోనియ్యవద్దు-అది నీ ప్రభువు కొరకైన నీ ప్రేమ. దావీదు వలె, మీ జీవిత దినములన్నింటిలో, మీ హృదయమంతటితో ఒక్క విషయమును కోరుకొనుటకు భద్రపరచుకొనుడి.


''శ్రేష్టమైనది ప్రేమయే.......ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి'' (1కొరింథీ 13:13; 14:1).




''ప్రియమైన స్నేహితుడా నీకు కృతజ్ఞత తెలుపుటకు


ఏ భాషను అరువుగా తెచ్చుకొనవలయును,


మరణమగుచున్న ఈ నీ దు:ఖము కొరకు,


అంతులేని నీ జాలికొరకు,


శాశ్వతకాలము నన్ను నీ వానిగా చేసుకొమ్ము,


మరియు నేను నిరాశచెందుచుండగా,


ప్రభువా, నీ కొరకైన నా ప్రేమ,


ఎన్నటెన్నటికీ తగ్గిపోనివ్వద్దు''.


అధ్యాయము 4
నీకు ఒకటి కొదువగానున్నది

''ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్ళూని-సద్భోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. యేసు -నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. అందుకతడు-బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరిచుచునే యుంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి-నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దు:ఖపడుచు వెళ్లిపోయెను'' (మార్కు 10:17-22).


ఎంతో ఆసక్తితో ప్రభువు యొద్దకు వచ్చి నిరాశతో తిరిగివెళ్ళిన ఒక ధనికుడైన యౌవనస్తుని గురించి మనము ఇక్కడ చదువుతాము. అతడు ఒక అసాధారణమైన యౌవనస్తుడైయున్నాడు. అతడు ప్రభువు యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట ద్వారా సత్యమును తెలుసుకొనుటకు ఆసక్తి కలిగియున్నాడని సూచిస్తున్నది. మరియు అతడు మోకరించుట ద్వారా తన దీనత్వమును సూచిస్తున్నాడు. పైగా, అతడు అడిగిన ప్రశ్న ద్వారా నిత్యజీవమును గురించిన సంగతుల పట్ల ఆసక్తి కలిగియున్నాడని సూచిస్తున్నది. యౌవనస్తుల మధ్య చాలా అరుదుగా జరిగే విషయం ఇది. బహుశా, ధనవంతుడైన యౌవనస్తుల మధ్య ఇది ఇంకా అరుదుగా ఉంటుంది. ఇంకా, యేసు ఆజ్ఞలను గురించి తనతో చెప్పినప్పుడు అతడు తడవు చేయకుండా వెంటనే వీటన్నింటిని నేను పాటిస్తున్నానని జవాబిచ్చాడు. అతడు ఎన్నడూ వ్యభిచారము చేయలేదు, హత్యచేయలేదు, దొంగతనము చేయలేదు, అబద్ధపు సాక్ష్యము చెప్పలేదు, ఎవరినీ మోసగించలేదు మరియు తన తల్లినికాని తండ్రినికాని అగౌరవపరచలేదు. యేసు ప్రబువు ఆ యౌవనస్తుడు చెప్పిన దానిని సవాలు చేయలేదు గనుక, అతడు ఒక అసాధారణమైన యౌవనస్తుడని, యధార్థపరుడు, నిజాయితీపరుడు, నైతిక విలువలు ఉన్నవాడు, నీతి పరుడని, స్వచ్ఛముగా నున్నాడని మనము అంగీకరించాలి. అయితే అతని జీవితములో కొదువగా ఉన్న ఒక విషయమును యేసు వ్రేలు పెట్టి చూపిచాడు. ఆ ఒక్క విషయము ఎంతో ప్రాముఖ్యమైనది అది లేకుండా మిగిలిన తన అర్హతలన్నీ నిరుపయోగమే. భౌతిక సంపదలతో తనకున్న అనుబంధమును బట్టి, సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించుటకు అతడు ఇష్టపడలేదు.


యేసు ఆ యౌవనస్తుని దగ్గరకు తీసుకొని, ప్రేమించాడని 21వ వచనములో చెప్పబడినది. ఆ యౌవనస్తునిలో ఉన్న అత్యద్భుతమైన శక్తి దేవుని మహిమ కోసం ఉపయోగపడుటకైనను లేక స్వంతము మరియు సాతానుని కొరకైనను దుర్వినియోగపరచుటకు వేచియున్నదని యేసు చూచాడు. మరియు ఆయన అతనిని ప్రేమించాడు. ఈనాడు కూడా ప్రభువు యౌవనస్తులను చూచినప్పుడు ఇదే విధముగా చూస్తున్నాడు. ఆయన ప్రతి యౌవన జీవితములో నిక్షిప్తమైన అవకాశములను చూస్తున్నాడు మరియు ఈ జీవితములలో అనేకము నిత్యత్వ విలువలు లేని వాటి కొరకు వ్యర్థము చేయబడుతున్నావని ఆయనకు తెలుసు. ఈనాడు అనేకమంది యౌవనస్తులు అటువంటి విషయముల ద్వారా సమ్మోహపరచ బడుచున్నారు. ఈ యౌవనస్తుని వలె వారు దు:ఖపడుతు వెళ్ళుచున్నారు. యేసు ప్రభువును వెంబడించుటకు గల వెలను చెల్లించుటకు వారు ఇష్టపడుట లేదు, ఆ విధముగా ఆ యౌవనస్తుని వలె దేవుడు వారిని ఏ ఉద్దేశ్యముతోనైతే సృష్టించాడో మరియు విమోచించాడో వారి జీవితముల ద్వారా దానిని నెరవేర్చుకొనే ఆధిక్యతను వారు కోల్పోవుచున్నారు. వారు కోరుకున్న ఆ దు:ఖము శాశ్వత కాలము వారితోనే ఉంటుంది.


మత్తయి 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న పాపులకు యేసు ప్రభువు ఇచ్చిన ఆహ్వానము బాగుగా తెలిసిన ఎంతో మంది వ్యక్తులు, ఆ సమయములో యేసు చెప్పిన తరువాత మాటలు తెలియని వారుగా ఉన్నారు. ''నా యొద్దకు రండి'' అని ఆయన చెప్పిన మాటలు విన్న వారికి ఆయన ఇంకా చెబుతూ, ''నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి'' (29వ వచనము) అని అన్నాడు. ''ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను'' అని యేసు వేరొక చోట చెప్పిన మాటలకు ఇవి సవాలుగా ఉన్నాయి. అయితే మత్తయి 11:28 మరియు 29లో చెప్పిన రెండు వచనములు వేరు చేయవలెననునది ఆయన ఉద్దేశ్యము కాదు. ఆయన యొద్దకు వచ్చు వారందరు తమ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలెనని ఆయన కోరుకొన్నాడు మరియు ఆయనను వెంబడించుటకు ఇష్టపడని వారు ఆయన యొద్దకు రావలెనని ఆయన ఆశించుటలేదు. ఒకటి, కేవలం పరలోకమునకు వెళ్ళుటకు మాత్రమే రక్షణ కావలసినవారికి మరొకటి, సిలువను ఎత్తుకొని ఆయనను సంపూర్ణముగా వెంబడించుటకు సిద్ధపడిన వారికి రెండు స్థాయిలలో ప్రత్యామ్నాయముతో కూడిన ప్రతిష్ఠతను యేసు ప్రభువు మనుష్యులకు ఎప్పుడూ ఇవ్వజూపలేదు. మనుష్యుల యెదుట కేవలం ఒకే ప్రమాణమును ఆయన ఉంచాడు. పాపక్షమాపణ కోసం ఆయన యొద్దకు వచ్చే వారందరు కూడా ఆయన యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడుటకు ప్రయాసపడాలి (వెంటాడాలి). అనేకమంది క్రైస్తవ బోధకులు రెండు రకముల వేర్వేరు ప్రమాణములను అందిస్తారు. ఒకటేమో, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం, రెండవది, ఆయనను ప్రభువుగా అంగీకరించడం. కాని ఇది పౌలు మాటలలో ''వేరొక సువార్త'' గా నున్నది మరియు ఇది అపోస్తలులు బోధించిన క్రీస్తు సువార్త కాదు (గలతీ 1:6-9). దేవుడు జతపరచిన దానిని మనుష్యులు వేరుచేశారు మరియు క్రైస్తవ సందేశములోని ముఖ్యమైన ఈ రెండు అంశములను వేరుచేయుటను బట్టి ఈనాడు క్రైస్తవ సంఘములో శక్తి ఎంతో తక్కువగానున్నది. బహుశా మనలో కొంతమంది నిజముగా సిలువను ఎత్తుకొనుట అంటే ఏమిటో దాని యొక్క భావమును స్పష్టముగా అర్థము చేసుకొని యుంటారు. మన జీవితములో ఆయా పరిస్థితులలో కలిగే భారములనే మన సిలువలని మనలో చాలా మందిమి అంటూ ఉంటాము. మరి కొంతమంది మనకు కలిగే భౌతికమైన జబ్బులనే సిలువలని చూస్తారు. ఇంకా కొంతమంది విధేయత చూపని భార్యను లేక ప్రేమ లేని భర్తను లేక విధేయత లేని పిల్లలను మన సిలువలుగా వారు రూపకముగా వివరిస్తారు. నేను చెప్పుచున్నాను, ప్రజలు వారి మెడలకు వేసుకొనే బంగారు సిలువల వలె లేక చర్చి భవనముల మీద ఉండే రాతి సిలువల వలె ఇవన్నియు మనకు ఏ మాత్రము సిలువలు కాదు. ''తన సిలువను ఎత్తుకొనవలెను'' అని ప్రభువు చెప్పిన మాటలు వీటన్నింటిలో దేని గూర్చి కాదు. ఈనాటి క్రైస్తవ సంఘము ఒక మతపరమైన చిహ్నముగా క్రీస్తు యొక్క సిలువను ఎంతో సుందరీకరించినది. దీనిని బట్టి అనేకమంది ప్రజలకు యేసు ప్రభువు నిజముగా చెప్పిన దానికి వేరుగా సిలువ అంటే తప్పుడు అభిప్రాయము ఉన్నది.


యేసు ఈ భూమి మీద నడచిన దినములలో, సిలువ అనేది ఒక మరణ సాధనముగా నున్నది. ఇది అవమానముతో కూడుకున్న విషయము. ఒకవేళ ఆ దినములలో నీవు యెరూషలేములో నివసించుచున్నట్లయితే, ఒక దినమున ఒక మనుష్యుడు రోడ్డు మీద సిలువను ఎత్తుకొని నడుస్తూ, చుట్టూ రోమా సైనికులు ఉండుట చూచినట్లయితే, ఆ మనుష్యుడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు అనే విషయమునకు సంబంధించి నీ మనస్సులో కొంచెము కూడా సందేహము కలిగియుండేది కాదు. అతడు మరణశిక్ష అమలు చేసే స్థలమునకు వెళ్ళు చున్నాడు. అతడు తన బంధువులకు మరియు స్నేహితులకు వీడ్కోలు చెప్పి యుండి తను మరలా తిరిగి రాలేని మార్గములో వెళ్ళుచున్నాడు. లోకమునకు వీడ్కోలు చెప్పి ఆ లోకమును శాశ్వతముగా విడచిపెట్టి వెళ్ళుచున్నాడు. అతడు కలిగియున్న దానిలో దేనిని మరలా చూడలేడు. అంతమాత్రమే గాక, అతడు ఈ లోకమును ఎంతో సిగ్గుతోను మరియు అవమానముతోను విడచిపెడుతున్నాడు. సిలువ మరణము అవమానకరమైన మరణము. ధనవంతుడైన యౌవనస్తుని వంటి మనుష్యులను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుము అని ఆయన చెప్పిన దానిలో ఇవన్నియు మిళితమై యుండునని ప్రభువు యొక్క భావము. ఆయనను వెంబడించుట అంటే యెరూషలేము నుండి సిలువ వేయబడుటకు ఆయన నడచిన మార్గములో నడచుటయే. సిలువ అంటే మన మనస్సులలో ఈ దృశ్యము రానట్లయితే, విశ్వాసుల జీవితములో సిలువనుగూర్చి ఆయన మాట్లాడిన మాటలను మనమెన్నటికినీ పూర్తిగా అర్థము చేసుకోలేము.


అయితే, మనము ఇంకా ముందుకు సాగిపోవుటకు మునుపు ఒక విషయమును ఇక్కడ గమనించాలి. సిలువను ఎత్తుకొనవలెనని యేసు ఎవరినీ బలవంతపెట్టలేదు. మనుష్యుని యొక్క స్వేచ్ఛాయుత చిత్తమును దేవుడు ఎల్లప్పుడు గౌరవిస్తాడని మునుపటి అధ్యాయములో మనము చూశాము. ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను (లూకా 9:23). ఇక్కడ ఎటువంటి బలవంతము లేదు. దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశ్యము కొరకు మనము స్వచ్ఛందముగా ప్రతిష్టించుకొనవలెనని ఆయన కోరుచున్నాడు.


గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును (యోహాను 12:24) అని మరోక సందర్భములో యేసు ప్రభువు చెప్పారు. సిలువ మీద తాను మరణించబోవు విషయమును మరలా యేసు ఇక్కడ ప్రస్తావించాడు. కాని ఆ వచనములోని నియమము ఆత్మీయముగా ఫలించు జీవితము కొరకు చూచువారందరికీ అన్వయించబడుతుంది. ధాన్యపు కొట్టులో అన్ని గింజలతో పాటు కలసి ఉంటే ఒక గోధమగింజ ఒంటరిగానే ఉంటుంది. అది ఫలించాలంటే, మిగిలిన గింజలతో ఉండకుండా ప్రత్యేకముగా నుండి మరియు భూమిలో ఒంటరిగా పడి చనిపోవలెను. అప్పుడు మాత్రమే అది విజయవంతమైన ఫలముతో బయటకు వస్తుంది. అందువలన ఈ అధ్యాయములోని మన అంశము: క్రీస్తుతో మన మరణము. మరలా దీనిని మనము మూడు శీర్షిక (హెడింగ్‌)లుగా చూద్దాము. మొట్టమొదటిగా సిలువ ప్రమేయము ద్వారా ప్రత్యేకింపబడుట చూద్దాము. రెండవదిగా, సిలువ అంటే మరణము; మూడవదిగా, సిలువ విజయమును మరియు ఫలమును తెస్తుంది.


సిలువ ప్రమేయము ద్వారా ప్రత్యేకింపబడుట (వేరుపరచబడుట)


కలువరి గిరిపైన, యేసు సిలువ వేయబడుతున్న సమయములో ఇద్దరు దొంగలు యేసు ప్రభువునకు ఇరువైపుల వ్రేలాడబడి సిలువవేయబడుటకు శిక్షవిధింపబడ్డారు. వారు శ్రమపడుచున్న సమయములో భౌతికముగా క్రీస్తు యొక్క సిలువ ద్వారా వేరుచేయబడ్డారు. కాని దానిఫలితముగా వారు శాశ్వతముగా వేరుచేయబడ్డారు. ఒకరేమో నిత్యనాశనమునకు, మరొకరేమో ఆయనతో శాశ్వతముగా ఉండుటకు వేరుచేయబడ్డారు.


యేసు యొక్క సిలువ ఎల్లప్పుడు చేయుదానికి ఇది దృశ్యముగా నున్నది. వెలుగును కోరుకొనే మనుష్యుల నుండి అంధకారమును కోరుకొనే మనుష్యులను ఇది వేరు చేస్తుంది. అవును, ఇది వేరుచేస్తుంది (ప్రత్యేకపరుస్తుంది).


అనేక మంది యధార్థపరులైన క్రైస్తవులు, మనుష్యులను వేరుచేసే ఏ ప్రయత్నమైనా సాతాను నుండి మాత్రమే వస్తుందనుకొనే వారున్నారు. మరియు ఐక్యతకు దోహదము చేసే ప్రతిది ఎల్లప్పుడు దేవుని నుండి వస్తుదనుకుంటారు. బైబిలు వారికి బాగా తెలియదు గనుక వారు అలా అనుకుంటారు. వేరుచేయబడుటను గురించి బైబిలు తన మొదటి పేరాగ్రాఫ్‌లోనే మాట్లాడుచున్నది. ఆదికాండము 1:3లో వెలుగు కలిగినట్లుగా మనము చదువుతాము, 4వ వచనములో దేవుడు వెలుగు మంచిగా ఉన్నదని చూచినట్లు చదువుతాము. అక్కడ ఆయన వెలుగును చీకటిని వేరుచేశాడు. ఈ రెండు కలసి కనుచీకటి వచ్చేటట్లు ఆయన అనుమతించాడా? ఒకవేళ ఈ విధముగా చేసియుంటే దేవుడు జీవమిచ్చు ఉద్దేశ్యముతో వెలుగును చేసిన దాని యొక్క అవసరమును చాలా తక్కువగా నెరవేర్చబడేది. కావున వేరుపరచిన మొదటి వ్యక్తి దేవుడేనని మనము చూస్తున్నాము. ఆయన ప్రత్యేకత కలిగిన దేవుడు, బైబిలు మొత్తములోను ఈ నియమము స్పష్టముగా ఉన్నట్లు మనము చూడగలము. అంతమాత్రమే గాక ఈ ''వేరుపరచు నియమము'' మనుష్యులను వేరుపరచుటలో ప్రమేయము కలిగియున్నది.


దేవుడు ఇశ్రాయేలీయులు వేరే దేశస్థులను పెండ్లిచేసుకొనుటను నిషేధించాడు. ఎందుకంటే వారు అంధకారములో కూర్చొనియున్న దేశములకు వెలుగైయున్నారు. అందువలనే క్రొత్తనిబంధనలో లోకమునకు వేరై యుండుమని సంఘమునకు స్పష్టముగా చెప్పబడినది (2కొరింథీ 6:14). నిజానికి, ''ఎక్లీషియా'' అను గ్రీకు పదము ''సంఘము'' అను ఇంగ్లీషులోనికి తర్జుమా చేయబడినది, దీని అర్థము ''పిలువబడిన జనాంగము''.


యేసునకు ఇరువైపుల కలువరిలో వ్రేలాడిన దొంగలవలె సంఘమునకు మరియు లోకమునకు సమాంతర విషయము ఉన్నది. నిజానికి ఇద్దరు మనుష్యులు దుష్టులే, కాని ఒకడు క్షమించబడి, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. వేరొకడు తన పాపములోనే ఉండి క్షమాపణ పొందకుండా చనిపోయాడు. కావున వారి నిత్యమైన గమ్యములు వేరుగాఉన్నాయి. సంఘము మరియు లోకము యొక్క నిత్యమైన గమ్యములు కూడా ఈలాగునే ఉంటాయి. ఈ లోకపు ఆత్మ దేవుని ఆత్మకు పూర్తిగా వ్యతిరేకముగా ఉంటుంది, ఇది చీకటిని ప్రేమిస్తు వెలుగు యొద్ద నుండి వెళ్ళిపోతుంది. ఇది దానియొక్క స్వంత గమ్యమును ఏర్పరచుకుంటుంది- మరియు దానిని కనుగొంటుంది.


అయ్యో, దేవుని కొరకు ప్రత్యేక పరచుకొనుట అనేది కొన్నిసార్లు మతసంబంధమైన ప్రపంచము నుండి కూడా వేరుపరచుకొనుటై యుంటుంది. దేవుని ఆత్మద్వారా కాక, ఈ లోకాత్మ ద్వారాను, దేవుని మాట ద్వారా కాకుండా మనుష్యుల ఆచారాల నడిపింపు మూలముగాను జీవిస్తున్న నేటి క్రైస్తవ సంఘములలో, ఒక విషయము గురించి మనం ఎంచుకొనేలా మనపై ఒత్తిడి చేయబడుతుంది. యేసు ప్రభువు ఎప్పుడైతే యెరూషలేము వెలుపల సిలువ వేయబడ్డాడో, ఆ గడియలోనే పట్టణములోని దేవాలయములో యాజకులు మరియు మన నాయకులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు దేవుని కుమారుని సిలువ వేశారు, కాని వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని విశ్వసిస్తూ వారి యొక్క గ్రుడ్డితనముతో, శూన్యమైన మతాచారాలతో వారు ముందుకు వెళ్ళుచున్నారు. తన జీవితమంతటిలోను మరియు తన మరణము లోను యేసు ప్రభువు తనంతట తానే మతానుసారమైన ఆచారములకు వెలుపల ఉన్నాడు కాబట్టి తన నిజమైన శిష్యులు కూడా ఆ విధముగా ఉంటారు (యోహాను 16:2). లవొదికయ సంఘమువలె, ఈనాడు క్రైస్తవ సంఘములని చెప్పుకొనే అనేక సంఘములు ఆ యూదులు ఉన్న స్థితిలోనే తమ్మును తామే పెట్టుకొన్నవి. మేము బాగానే ఉన్నాము అనుకొని, వారు వారి యొక్క కార్యకలాపాలలో నిమగ్నమైపోయారు. కాని సత్యమేమిటంటే ప్రభువే వారి సంఘమునకు వెలుపల ఉన్నాడు (ప్రకటన 3:14,20).


20వ శాతాబ్దపు ప్రారంభములోని ఒక నీగ్రో-అమెరికన్‌ గురించిన కథ ఒకటి ఉన్నది. అతడు క్రొత్తగా ప్రభువును అంగీకరించి, అమెరికాలోని దక్షిణ భాగములో గల ఒక పట్టణములో సంఘకార్యక్రమునకు హాజరగుటకు అతడు వెళ్ళాడు. వర్ణ బేధము క్రైస్తవ సంఘములోనికి కూడా ప్రవేశించిందని ఆయనకు తెలియక, మరియు ఆ సంఘము కేవలం తెల్లవారికి మాత్రమే అని తెలియక, అక్కడ ఆహ్వానించువారు ఆయనను భవనములోనికి వెళ్ళనియ్యక పోవుటను బట్టి అతడు ఆశ్చర్యపోయాడు. అతడు ఎంతో నిరుత్సాహముగా వెళ్ళిపోయి దీని గురించి ప్రభువుకు ప్రార్థనలో చెప్పాడు. ప్రభువు ఈ విధముగా చెప్పాడు (కథ ఈ విధముగా నడుస్తున్నది): ''నా కుమారుడా, చింతించకు, ఈ సంఘము ప్రారంభమైననాటి నుండి నేను కూడా దీనిలోనికి ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నాను కాని నేను విజయం సాధించలేకపోయాను; కాబట్టి నీవు కూడా వెనుకకు తిరిగి రావలసివచ్చినప్పుడు ఆశ్చర్యపడవద్దు''. సంఘమును దేవుని వాక్యమునకు బదులుగా మతాచారములు లేక సంఘములోని సాంప్రదాయములు పాలించినట్లయితే ఇటువంటి సాంఘీక దురభిమానములు మనుష్యుల హృదయములను సులువుగా పట్టుకుంటాయి.తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించే క్రైస్తవుడు ఇటువంటి లోకత్వపు లక్షణములను చూపించే క్రైస్తవత్వ ఆత్మ నుండి తన్ను తాను ప్రత్యేకపరచుకుంటాడు. కాని ఆ విధముగా ప్రత్యేకపరచుకొనుట అంత సులువు కాదు.


క్రైస్తవ సంఘముల మధ్య ఐక్యతను గురించి ఈనాడు అందరూ మాట్లాడుచున్నారు. దీని ఫలితముగా వేరుపరచుటను గురించి మాట్లాడుటకు అనేకులు భయపడుచున్నారు. వారి సమాజములు వారిని ప్రేమలేని వారిగాను లేక క్రీస్తు వలె లేనివారిగాను అనుకుంటారని వారు భయపడుచున్నారు. కాబట్టి లూకా 12:51,52లో యేసు చెప్పిన మాటలను మనము మనస్సులలో ఉంచుకొనుట మంచిది. నిజమైన క్రీస్తు స్వారూప్యము గురించి మనకు అసమతుల్యమైన దృశ్యము కనబడకుండా ఇది చేస్తుంది. యేసు ఇక్కడ నేను బేధమునే కలుగజేయవచ్చితినని నొక్కి చెప్పాడు. లేఖనానుసారముగా సమస్తమున్నట్లయితే అక్కడ ఐక్యత ఉంటుంది. ఇది యోహాను 17లో యేసు చెప్పిన ఐక్యత, ఇది దేవునిలో ఉన్న ఐక్యత యొక్క లక్షణము గురించి చెప్పబడినది (''మనలో'' 21వ వచనము). అయితే అదే అధ్యాయములో యేసు ప్రత్యేకతను గురించి కూడా ఎంతో గట్టిగా చెప్పాడనునది కూడా గమనించదగిన విషయము (16వ వచనము). ఎఫెసీ 4:3లో చెప్పిన ఐక్యత పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను గురించి చెప్పుచున్నది. ఇదొక విషయము. మనుష్యుడు కలిగించే ఐక్యత వేరుగా ఇది మరొక విషయము. బాబేలు గోపురము యొక్క కనబడిన ఐక్యత కన్నా మనుష్యుడు కలిగంచు ఐక్యతకు ఎక్కువ భవిష్యత్తు ఉండదు (ఆది 11:1-9).


లోకమునుండి ప్రత్యేకముగా నుండుట అనేది క్రొత్త నిబంధనలో మనకు ఎక్కువగా కనబడే అంశము. యేసు సిలువ వేయబడుటకు వెళ్ళక మునుపు మీరు లోకసంబంధులు కారని తన శిష్యులతో చెప్పాడు. యేసు కూడా తనంతట తాను ప్రత్యేకముగా నుండి ''ఈ లోకమునకు సంబంధించిన వానిగా లేడు'' కాబట్టి తన శిష్యులు కూడా ఈ లోకసంబంధులు కారని ఆయన నిశ్చయముగా చెప్పాడు. వారు ఈ లోక సంబంధులు కారు కాబట్టి, జీవించుటకు ఈ లోకము కష్టమైనదని వారు కనుగొందురని ఆయన వారికి చెప్పాడు (యోహాను 15:19; 17:16). ఈ లోకమాలిన్యము తన కంటకుండా చూచుకొనుట అనేది ప్రతి యొక్క శిష్యుని యొక్క బాధ్యతగానున్నది (యాకోబు 1:27). సంఘము కూడా క్రీస్తు వధువైయుండి, ఆయనచేత ప్రేమించబడి, గెలువబడి మరియు పరిశుద్ధపరచబడియున్నది (ఎఫెసీ 5:25-27). ఇది కొరింథీ విశ్వాసుల పట్ల పౌలుకున్న ''దేవాసక్తి''ని గురించి వివరించుచున్నది. ''పవిత్రురాలైన కన్యకనుగా క్రీస్తునకు సమర్పింపవలెనని ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత మిమ్ములను మోసము చేయునేమోనని భయపడుచున్నాను'' (2కొరింథీ 11:3). ఈ విధముగా వారిని సమర్పింపవలెనని ఆయన చెప్పాడు. ఎవరైతే లోకముతో స్నేహము చేయగోరుచున్నారో వారిని యాకోబు ఈవిధముగా అంటున్నాడు. ''వ్యభిచారులారా, వ్యభిచారుణులారా'' (యాకోబు 4:4). ఇది కూడా ఎంతో కఠినమైన మాటలతో వివరించుచున్నది. అవును, వేరుపరచుట (ప్రత్యేకపరచుట) ను గురించి చెప్పుటకు బైబిలులో ఎంతో ఉన్నది.


అయితే, బైబిలు ప్రత్యేకపరచుటను గురించి చెప్పుచున్నప్పుడు దూరముగా నుండమని చెప్పుటలేదని మనము మన మనస్సులలో స్పష్టముగా ఉండాలి. ఇది బాహ్యముగా, భౌతికముగా ఈ లోక ప్రజలతో దూరముగా ఉండుమని కాదు గాని హృదయములో ప్రత్యేకముగా నుండమని చెప్పుచ్నుది. లోకములోని ప్రజలతో సంబంధము లేకుండా ఏకాంత ప్రదేశములో సన్యాసుల వలె జీవిస్తే వారు దేవునికి దగ్గరగా ఉందురని చాలా మంది అనుకుంటారు. ఒక ఆశ్రమములో ఉండు సన్యాసికి, లేక ఒక కాన్వెంట్‌ గోడల మధ్యనే ఉండు ఒక సన్యాసిని, బైబిలు బోధించుచున్న ప్రత్యేకముగా నుండుటను అర్థము చేసికొనలేదు. ప్రత్యేకముగా నుండుట అంటే తెల్లని దుస్తులు లేక కాషాయవస్త్రములు లేక ఏకరీతిగా ఉండు వస్త్రములు ధరించుట కూడా కాదు. బాహ్యముగా కనబడే అటువంటి వేరుగాకనబడుటను చెయ్యమని ఆయన చెప్పలేదు. ఆయన చేయలేదు. ఆయన ఈ లోకములో జీవిస్తున్నా కూడా ఈ లోకపు ఆత్మనుండి స్వాతంత్య్రము పొందమని మనకు చెప్పాడు. ఆయన చేశాడు.


మనము పరదేశులవలె ఉండాలి. సముద్రము మధ్యలో ఉన్న ఒక ఓడ చుట్టూ నీళ్ళు ఉంటాయి. అయినా కూడా ఆ ఓడ లోనికి నీళ్ళు రావు. ఒక విశ్వాసి ఆ విధముగా జీవిస్తూ ఉంటే, ఎప్పుడో ఒకసారి అతడు అపహాస్యమును, వ్యతిరేకతను ఎదుర్కొనవలసివస్తుంది. వెంటనే, అతడు జీవించుటకు ఈ లోకము సౌకర్యముగా ఉంటుంది.


తనను వెంబడించిన కారణముగా ఈ శత్రుత్వము తప్పకుండా వారికి సంభవిస్తుందని ఆయన ముందుగానే తన శిష్యులను హెచ్చరించాడు (యోహాను 16:33). ఒక క్రైస్తవుడు పరలోకమునకు సంబంధించిన వాడైతే, అప్పుడు ఈ భూలోకము అనేది సాధారణముగా అతని స్వాభావికమైన పరిధిలో ఉండదు. అతడు నీళ్ళలో నుండి బయటపడిన చేప వంటివాడు, అతడు ఇక్కడ తన ఉనికిని కాపాడుకొనుటకు కష్టపడుచున్నట్లయితే ఆశ్చర్యపోనవసరము లేదు. నేల మీద చేప బ్రతుకుటకు ఒక అద్భుతము జరగాలి, ఒక నిజమైన సంఘము ఈ భూమి మీద ఉండాలంటే కూడా అంతకంటె ఎక్కువైన అద్భుతము జరగాలి. కాబట్టి క్రైస్తవ జీవితము కూడా ఆయన అద్భుత శక్తి మీద అనుదినము ఆనుకొని జీవించాలని దేవుడు కోరుచున్నాడు.


తన ప్రజలకు మధ్యను మరియు ఈ లోకపు ఆత్మకును మధ్య ఒక అగాధమును, పరదైసుకును నరకమునకు మధ్యనున్నటువంటి లోతైన, వెడల్పైన అగాధమును, వారధి వేయలేని, దాటలేని అగాధమును చూడవలెనని దేవుడు ఆశిస్తున్నాడు (లూకా 16:26). ఈ లోకపు ఆత్మనుండి తన ప్రజలు స్వాతంత్య్రము పొందవలెననునది ఎల్లప్పుడు దేవుని కోరికయై యున్నది. దురదృష్టవశాత్తు, అనేకమది విశ్వాసులు ఇంకా ఈ పాఠమును నేర్చుకొనవలసియున్నది, ఇది నేర్చుకొనే దాకా వారు శక్తిహీనులుగాను, నిష్ఫలులుగాను ఉంటారు.


ఇటువంటి స్వాతంత్య్రముగల ఆత్మను నేర్చుకొనుటను బట్టే అబ్రాహాము శక్తి మరియు ఫలములు కలిగిన స్థానమునకు తీసుకొనిరాబడ్డాడు. ఆదికాండము 22లో ఇది చాలా స్పష్టముగా మన కోసము చెప్పబడినది. అక్కడ దేవుడు నీ ఏకైక కుమారుని నాకు సమర్పించమని అబ్రాహామునకు దేవుడు చెప్పాడు. ఇది ఆయన ఇస్సాకును వధించుటకు కాదుగాని (12వ వచనము నుండి ఋజువుపరచినట్లుగా) ఆ బాలుని మీద మితిమీరిన ప్రేమ అబ్రాహాముకు కలుగకుండా విడుదల చేయుటకు దేవుడు ఆ విధముగా చేశాడు. దైవసేవకునిగా అబ్రాహాము యొక్క ఉపయోగము ఇక్కడ కనబడుచున్నది. ఇస్సాకు యెడల ఎటువంటి స్వార్థపూరితమైన స్వాధీనతాభావమును అబ్రాహాము కలిగియుండకుండునట్లు అతనికి విడుదల నిచ్చుటకు దేవుడు కోరుకున్నాడు. ఇస్సాకు దేవుని వరమని ఎల్లప్పుడు అబ్రాహాము ఆ ఆలోచనను కలిగియుండాలని దేవుడు కోరుకున్నాడు.


మనము ప్రియముగా ఎంచుకున్న భౌతికమైన సంపదలను గాని లేక వేరే విషయములను గాని దేవుడు మనకివ్వకుండా నిరాకరించినా లేక మన యొద్దనుండి తీసివేసినా కూడా అబ్రాహాము వలె దేవుడు మనతో కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకే ధనవంతుడైన యౌవనస్తుని తనకున్నదంతయు అమ్మివేయమని ఆయన అతనిని అడిగాడు. తన డబ్బుకు అతడు ఎంతగానో అంటిపెట్టుకొనియున్నాడు. భౌతికసంబంధమైన వస్తువులలో ఎటువంటి పాపము లేదు. ఎప్పుడైతే మనము ప్రభువును వెంబడించుటకు అవి ఆటంకముగా మారుతాయో అప్పుడు అవి పాపముగా పరిగణింపబడతాయి. మన కుటుంబములలో ఇందుకోసమే దేవుడు శ్రమలు వచ్చునట్లు అనుమతిస్తాడు-తద్వారా మన ప్రియమైన వారి యెడల మనకుండే మితిమీరిన అనురాగము నుండి వేరుచేస్తాడు (లూకా 14:26,27). మనము నమ్మకముంచే మనవన్నియు కూడా దేవునికి సంబంధించినవి, నావికాదు కేవలము ఆయన మహిమ కొరకు ఉపయోగించుటకు మాత్రమే అవి నాకివ్వబడ్డాయి అని చెప్పగలుగుటలోనే నిజమైన ప్రత్యేకపరచుట యున్నది.


మనము దేవుని పిల్లలమని మనము అనుకోవచ్చు, అయితే క్రీస్తు యొక్క సిలువను ఈ కోణములో మరియు పూర్తి క్రమముతో మనము అంగీకరించనట్లయితే, దేవుడు తన కుమారుల మరియు కుమార్తెల కొరకు ఉద్దేశించిన కుమారత్వపు ఆధిక్యతలను మనము అనుభవించలేము (2కొరింథీ 6:14-18). సహోదరీ, సహోదరులారా మన ఊహకందని సంపదను మనము కలిగియుండాలని దేవుడు మనకోసం ఉద్దేశించాడు. మనము ఇంకా దీనిని పొందలేదు, మరియు ఆయన ఇంకా మనకు ఇవ్వలేక పోవుచున్నాడు, ఎందుకంటే మన హృదయములు దృష్టిమళ్ళాయి మరియు మన చేతులు నిండుగా ఈ లోకమును, ఈ లోక విషయములను కలిగియున్నాయి.


సిలువ అంటే మరణము


యేసు తనను వెంబడించు వారితో మాట్లాడిన సిలువను మనము నిజముగా అంగీకరించినట్లయితే, అది మనకు మరణమని అర్థము. గోధుమగింజ భూమిలో పడినప్పుడు, అది పాదముల చేత త్రొక్కబడి చివరకు దాని యొక్క మెరిసే బాహ్యపొర తెరువబడినప్పుడు, అది ఇంకెంత మాత్రము అందముగా ఉండదు. ఖచ్చితముగా ఇదే విధముగా, తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించే ఒక విశ్వాసి కూడా ఈ లోకమునకు ఎంతమాత్రము ఆకర్షణీయముగా ఉండడు. లోకము అతనిని తృణీకరిస్తుంది. అతనిలో ప్రశంసించదగిన విషయములు ఎన్నో ఇంతకు ముందు ఉండవచ్చును కాని, ఇప్పుడు కాదు. తన ప్రభువు వలె, అతడు ఇప్పుడు మనుష్యులచేత తృణీకరింపబడి, విసర్జించబడును.


పాతనిబంధన కాలములలో వలె, బలిపీఠము మీద పెట్టబడిన అర్పణను అగ్ని దహించివేసి బూడిద చేసినట్లుగా, క్రీస్తు యొక్క సిలువకూడా ఒక మనిషికి మరణమును తెస్తుంది. ప్రభువుకు నిజముగా ప్రతిష్టించుకొనుట అంటే ఎల్లప్పుడూ దాని అర్థము ఇదే. తనకు అప్పగించుకొనిన ఆత్మ ఇక ఏ మాత్రము లోకము కొరకు జీవించక, దేవుని కొరకు మాత్రమే జీవించునట్లుగా దేవుని యొక్క అగ్ని దహించివేస్తుంది. అతడు లోకమునకు చనిపోతాడు. లోకము అతనికి చనిపోతుంది (గలతీ 6:14). ఈ సత్యమును పరిగణనలోనికి తీసుకొనకుండా ఈనాడు క్రైస్తవులలో ఎంతో పైపైన ప్రతిష్టించుకొనుట యున్నది. అయితే ''తన సిలువను ఎత్తుకొనవలెను'' అని రక్షకుడు చెప్పినట్లుగా, దేవునికి ఆమోదయోగ్యమైన ప్రతిష్టిత కేవలము ఇది మాత్రమే. పాతనిబంధనలో బలిపీఠము మీద అగ్ని చేత దహించబడకుండా ఏ అర్పణ కూడా దేవుని చేత అంగీకరించబడదు. ఆయన చేత ఆశీర్వదింపబడుటకు మనలను మనము దేవునికి అప్పగించుకొనియుండవచ్చును గాని, ఈ విధముగా మరణించుటకు మనలను మనము ఎప్పుడైనా అప్పగించుకున్నామా? మన కొరకు మనము ఏర్పరచుకొనిన లక్ష్యములను మరియు ప్రణాళికలను బూడిద చేయునట్లుగా మరియు ఆయన కిష్టమొచ్చినట్లు మన యొద్దనుండి ఏదైనా తీసివేసుకొనుటకు మనము అనుమతించామా? సిలువ అంటే అర్థము ఇదే.


ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకొనే క్రైస్తవులు, అదే సమయములో ఆయనను సిలువవేసి, తృణీకరించిన లోకములో ప్రముఖులుగాను, అంగీకరించబడుటకు కోరుకొనే వారిని చూడటం ఎంతో ఆశ్చర్యము. వారిది నఖిళీ క్రైస్తవ్యము కాకుండాపోదు. లోకములోఅంగీకరించబడుట, ప్రసిద్ధిచెందుట అది క్రైస్తవులమధ్యనైనను సరే ఇది దేవుని ఆశీర్వాదమునకు గుర్తు కాదు. ఎల్లప్పుడు జాగ్రత్తగా ఉండమని యేసు మనకు చెప్పిన దానికి విరుద్ధముగా వారున్నారు (లూకా 6:26). ఆయనకైతే ఈ లోకము తనను అంగీకరించినదా లేక తృణీకరించినదా అనునది చాలా చిన్న విషయము. ఆయన సిలువ వద్దకు వెళ్ళకమునుపే ఎప్పుడో తన ఆత్మలో ఈ లోకమునకు చనిపోయాడు. ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు లేనివాడుగా ఉండుటకు ఆయన తనంతటతానే వెళ్లి ఆ విధముగా చేసుకొనలేదుగాని, తన తండ్రి యొక్క చిత్తమును చేసినపుడు ఈ విధముగా జరిగితే దానికి ఆయన కలత చెందలేదు.


శిష్యుని యొక్క ఆత్మ కూడా ఇదే విధముగా ఉండాలి. అందుకే పౌలు తనను తాను ''క్రీస్తు నిమిత్తము వెఱ్ఱివాడను'' అని పిలుచుకొన్నాడు (1కొరింథీ 4:10). ఎఫ్‌.ఆర్‌.సి.యస్‌ కంటే ఎఫ్‌.ఎఫ్‌.సి.యస్‌ డిగ్రీ ఎక్కువగా కోరదగినది అని మనము అనుకుంటాము. లేక ఈ లోకములోని వేరే ఏదైనా అర్హతను కోరుకుంటాము! పౌలు వెళ్ళిన ప్రతిచోట కూడా తనను ఒక వెఱ్ఱివానిగా తృణీకరించిన వారున్నారు. కాని వీటిలో ఏదీ అతనిని కదల్చలేదు. తన ప్రభువువలె ఆయన కూడా ఈ లోకమునకు మరణించాడు.


ఒక పట్టణములో ప్రభువు కొరకు సాక్ష్యమిచ్చుటకు తన ఒంటిమీద బైబిలు వచనములు వ్రాసియున్న ప్రదర్శన కార్టు (ప్లకార్టు) లను పెట్టుకొని వీధులలో తిరుగుతున్న ఒక మనుష్యుడున్నాడు (పశ్చిమ దేశములలో వాటిని ''శాండ్‌విచ్‌ బోర్డ్స్‌'' అంటారు). దాని ఫలితముగా ఆ పట్టణములోని అనేకులకు ఆయన హాస్యాస్పదముగా మారాడు. ఒకరోజు ఆయన బయటకి వెళ్ళినపుడు, ముందున్న ప్రదర్శన కార్టుపై ఈ విధమైన మాటలు ఉన్నాయి ''నేను క్రీస్తు కొరకు వెఱ్ఱివాడను'', వెనుకవైపు ఈ విధముగా ఉన్నాయి ''నీవు ఎవరి కొరకు వెఱ్ఱివాడవు''.


సహోదరీ, సహోదరులారా దీనిని మీరు అర్థము చేసుకున్నారా? మనము క్రీస్తు కొరకు వెఱ్ఱివారము అగుటకు ఇష్టపడనట్లయితే, మనము తెలుసుకున్నా, తెలుసుకోక పోయినా, సాతాను కొరకు వెఱ్ఱివారమగుదము. సిలువను అంగీకరించడమంటే, ఈ లోకమునకు మరణించిన స్థానమును అంగీకరించుటయే, కాబట్టి లోకము స్తుతించినా లేక విమర్శించినా అది పెద్ద విషయమేమి కాదు. అనేకమంది యౌవనస్తులలో తరచుగా కొదువగా ఉన్న ''ఒకటి కొదువగా ఉన్నది'' ఇదే. ఇది ప్రభువు కొరకు ప్రయోజనమైన పరిచర్య చేయకుండా వారిని అడ్డుకుంటుంది. తరచుగా ఇది పూర్తిగా ఆటంకముగాను ఉంటుంది. మనము ఎన్నో విద్యార్హతలను కలిగియుండవచ్చు, ఎన్నో తలాంతులను, వరములను కలిగియుండవచ్చు కాని మనము ఈ ఒక్క విషయము కొదువ కలిగియుంటే ప్రభువు యొక్క సేవలో ఇవన్ని నిరుపయోగముగా ఉంటాయి.


సిలువ అంటే కేవలము ఈ లోకమునకు మాత్రమే చనిపోవుట కాదు, మన స్వంత చిత్తముకు కూడా చనిపోవుట. మనము ఇప్పటిదాకా చూసిన దానికంటె కూడా ఇది ఇంకా కష్టమైనది. మనము ఇక మన స్వంత మార్గములను ఏర్పరచుకొనక ప్రభువు యొక్క మార్గమునే ఎన్నుకొనుట అని దీని అర్థము. మనము ఇక మన స్వంత హక్కుల కొరకు నిలబడమని కూడా దీని అర్థము. మనలను వేరే వారు గాయపరచినపుడు వారిని తిరిగి గాయపరచము. ఇది కొండ మీది ప్రసంగములో తన శిష్యుల కొరకు యేసు నిర్దేశించిన జీవిత ప్రమాణము (మత్తయి 5,6 మరియు 7). మన చుట్టూ మనము చూస్తున్న జీవితములకు ఇది ఎంత వ్యత్యాసముగా నున్నదో కదా- ఇది కేవలము అవిశ్వాసులలోనే కాదు. అయ్యో! అనేకమంది విశ్వాసులలో కూడా! ఆ అధ్యాయములలో యేసు నిర్దేశించిన ప్రమాణములను చూసి ఆ విధముగా జీవించుట చాలా కష్టమని అనేకులు అంటారు. ఇది చాలా కష్టముకాదు: అసాధ్యము! మన అనుదిన జీవితములో సిలువను మనము అంగీకరించే వరకు అటువంటి జీవితము అసాధ్యము. కాని మన జీవితములు క్రీస్తు యొక్క ప్రభుత్వమునకు మనము అప్పగించుకొన్నట్లయితే, మనము తిరిగి కొట్లాడకుండా మరియు మనుష్యులకు మనకు చేయు ప్రతి దానికి సాత్వికముతో, సంతోషముతో లోబడతాము. ఎందుకంటే, ఆ విధముగా వారు మనలను చేయుటకు దేవుడే అనుమతించాడని మనకు తెలుసు.


తాను సభ యెదుట నిలచియున్నప్పుడు యేసుక్రీస్తుప్రభువు యొక్క వైకరి ఈ విధముగానే యున్నది. తనకు సహాయపడుటకు కేవలము ఒక్క మాటతో 72,000 మంది దేవదూతలను పిలచియుండేవాడు, అయినప్పటికీ ఆ విధముగా చేయుటను తిరస్కరించాడు. తప్పుగా నేరారోపణ చేయబడుటకు, అవమానించబడుటకు, కొట్టబడుటకు మరియు సిలువవేయబడుటకు తన తండ్రి ఇవన్నియు అనుమతించాడని విశ్వసిస్తూ సాత్వికముతో లోబడ్డాడు. సభలో ఆయన ఒక పురుగువలె పరిగణించబడ్డాడు, అణగద్రొక్కబడి తిరస్కరించబడ్డాడు (కీర్తన 22:6).


పాముకు మరియు పురుగుకు మధ్య గల బేధమేమిటంటే మొదటి దానిని నీవు త్రొక్కినట్లయితే అది నిన్ను కాటు వేస్తుంది. అదే నీవు పురుగును త్రొక్కి, అణచివేసినా సరే అది నిన్ను తిరిగి ఏమీ చేయదు. ఒకదానిలో దయ్యపు ఆత్మ ఉన్నది వేరొక దానిలో దేవుని కుమారుని ఆత్మ ఉన్నది. ప్రజలు మనకు హాని చేసినా, లేక అవమానపరచినా లేక మన హక్కులకు భంగము కలిగించినా, దీనికి ప్రతిగా మనము ఈ రెండు ఆత్మలలో ఏదో ఒక దానిని చూపిస్తాము. ఇప్పటి వరకు ఏది చూపిస్తున్నాము?


నీవు ఎంతో ఎక్కువగా, దీనముగా అవమానపరచబడ్డావా? ఒకవేళ నీవు సిలువను అంగీకరిస్తే, నిన్ను నిందించినవాడు ఏ స్వరముతో అయితే నిందించాడో అదే విధముగా నీవు ప్రత్యుత్తరమియ్యకుండునట్లు పరిశుద్ధాత్మ నీ నాలుకను అరికట్టునట్లు నీవు అనుమతిస్తావు. పౌరుషముగా ప్రత్యుత్తరము వ్రాయకుండునట్లు నీ చేతులను బంధించునట్లు అనుమతిస్తావు. ద్వేషమునకు బదులు ప్రేమ చూపించే విధముగా నీ హృదయమును కరిగించునట్లు అనుమతిస్తావు. శాపమునకు బదులు ఆశీర్వాదమును, కఠినత్వమునకు బదులు దయను అనుమతిస్తావు. గాయపడిన నీ స్వంతము మరియు నీ స్నేహితులు అటువంటి పరిస్థితులలో అవమానమును అంగీకరించవద్దని చెప్పవచ్చు మరియు అవతలి వ్యక్తి నిన్ను నిందించి పోనివ్వద్దు అని చెప్పవచ్చు. అయితే పరిశుద్ధాత్మ నీకు సిలువ మార్గమును చూపించి ఈ విధముగా చెప్తుంది ''కాదు, ఏమీ చేయవద్దు, ఏమీ మాట్లాడవద్దు, దానికి బదులు నీ ద్వారా నన్ను ప్రేమించనిమ్ము''.


నీవు ఏ స్వరమును వినాలనుకుంటున్నావు? ఈ పాప లోకములో జీవించినంత కాలము ప్రతి దినము, ఒక రోజులో అనేకసార్లు ఇటువంటి పరిస్థితులను నీవు ఎదుక్కొనవలసి వస్తుంది-మరియు కొన్నిసార్లు విశ్వాసుల నుండి కూడా రెచ్చగొట్టబడతాము! అటువంటి ప్రతి పరిస్థితిలోను నీకు రెండు విధానములు అందుబాటులో ఉన్నాయని జ్ఞాపకముంచుకొనుము. మరణమును నీకు నీవుగా అంగీకరించవచ్చు లేదా నీ ప్రభువును నీవు మరలా నూతనముగా సిలువ వేయుదువు. లోకము ప్రభువుకు మరలా సిలువవేయలేదు గాని విశ్వాసులు ఒక విధముగా సిలువ వేయవచ్చును (హెబ్రీ 6:6). మన స్వంత జీవితములలో సిలువను అంగీకరించక తిరస్కరించిన ప్రతిసారి మనము ఆ విధముగా చేయుదము. అటువంటి పరిస్థితులలో సిలువ మార్గమును మనము తిరస్కరించుటను బట్టే మన ఆత్మీయ జీవితమునకు పక్షపాతము వస్తుంది. అక్కడ సిలవను అంగీకరించుట ద్వారా, మన హృదయములను సంతోషముతో నింపుకొనుట మాత్రమే గాక గొప్ప ఫలభరితమైన జీవితమునకు మార్గము సుగమం చేస్తున్నాము.


నేను ఇంతకు ముందు చెప్పిన దానిని మరలా చెప్పనివ్వండి. ఈ విధముగా సిలువను అంగీకరించడమంటే ఏ విషయములోను మన విధానములను కోరుకొనక, కేవలము దేవుని మార్గములను మాత్రమే కోరుకొనుచున్నాము. గెత్సెమనెలో యేసు ప్రార్థనలో ఈ విధముగానే సూచించబడినది ''నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక''. వివాహ బంధమును క్రీస్తులో మన ఐక్యతను గురించి సాదృశ్యముగా చూపించినప్పుడు పౌలు మాటలలో కూడా ఇది సూచించబడినది. ''సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను'' (ఎఫెసీ 5:24). లోబడుట అంటే ఏమిటి? మన స్వంత చిత్తములకు సిలువవేయబడి, కేవలము ఆయన చిత్తమును మాత్రమే చేయుటయే నిశ్చయముగా దీని అర్థము. సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ ఈ విధముగానే యున్నది, ఈ ఆత్మ తనలో ఉన్న కారణముగానే అంధకారశక్తులను ఆయన పారద్రోలగలిగాడు.


క్రీస్తునుందు సహోదరీ, సహోదరులారా, ఆయన చిత్తము తప్ప మరేదియు నీవు కోరుకొనకుండునట్లు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నావా? నీ స్వంత చిత్తమునకు పదే, పదే కాదు అని చెప్పవలసి వచ్చినాకూడా నీవు అప్పగించుకున్నావా? దేవుని చిత్తమును చేయుటకు కోరుకొనిన వారి మార్గములో ఎల్లప్పుడు సిలువ ఉంటుంది.


ఇంకా, మరణము మనిషిని ఈ లోకమునుండి వేరే లోకమునకు తీసుకొనివెళ్ళినట్లుగా, సిలువను అంగీకరించినప్పుడు విశ్వాసిని క్రీస్తు యొక్క రాజ్యాధికారములోనికి తీసుకు వెళుతుంది (కొలస్సీ 1:13). అప్పుడు ఈ లోకమును వేరొక దృష్టిలో చూడటం మొదలుపెట్టి, క్రొత్త విలువలతో చూస్తాడు. ధనము, లోకములోని వస్తువులు, ప్రజలను సిలువ వెలుగులో, నిత్యత్వపు వెలుగులో, క్రీస్తు యొక్క రాజ్యపు వెలుగులో ఇప్పుడు చూడడం మొదలుపెడతాడు. ఇప్పుడు అతడు ప్రజలను బీద లేక ధనికలు గాను, గొప్ప లేక సామాన్యులు గాను, లేక వేర్వేరు సామాజిక స్థాయిలలో చూడడు. ఏ ఆత్మలకొరకైతే, క్రీస్తు మరణించాడో ఆ ఆత్మల వలె వారిని చూస్తాడు.


నిన్ను నీవు పరీక్షించుకొనుటకు జాగ్రత్త కలిగియున్నావా? నీవు ఎంత కొదువలో ఉన్నావో తెలుసుకొనుటకు బాధ్యత కలిగియున్నావా? నీవు కేవలము మత్తయి 5,6 మరియు 7 అధ్యాయాలు చదివి యదార్థముగా నిన్ను నీవు ప్రశ్నించుకొనుము. యేసు యొక్క ఆజ్ఞలలో ఎన్ని ఆజ్ఞలకు కనీసం విధేయత చూపించాల్సిన అవసరమును గూర్చి ఆలోచించలేదు.


సిలువ విజయమును తెస్తుంది


మనము చెప్పుచున్నదంతా కూడా నిరుత్సాహపూర్వకముగా నున్నదా? సిలువను గూర్చిన వర్తమానము వెలుగు వైపు కూడా ఉన్నది- సానుకూలముగా ఉన్నది. సిలువ దానితోనే ముగించబడలేదు. ఇది పునరుత్థాన జీవితమునకు మార్గము. సిలువ కార్యమును అంగీకరించిన ప్రతివారి యెదుట ఆనందము ఉంచబడినది (హెబ్రీ 12:2). భూమిలో పడిన గోధుమగింజ చనిపోయి అక్కడే ఎల్లకాలము ఉండదు. అది విజయవంతమైన ఫలములతో తిరిగి మొలుస్తుంది. సిలువ మార్గమును అంగీకరించిన విశ్వాసి, వేరే వారి చేత ఎంత తప్పుగా అర్థము చేసుకొనబడినప్పటికీ, అంతిమంగా దేవుని చేత న్యాయం తీర్చబడతాడు.


స్వీయ మరణము ద్వారానే ఫలము వస్తుంది. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే కొంత ఫలమును ఇక్కడ చూడవచ్చు, కాని దీని మొత్తమును, ప్రభువు తనకు నమ్మకముగా ఉన్నవారికి ప్రతిఫలము ఇచ్చునపుడు క్రీస్తు న్యాయసింహాసనము యొద్దనే చూడగలము.


యోసేపు జీవితము దీనికి ఒక గొప్ప మాదిరిగా నున్నది. తాను ప్రేమించిన తన సహోదరులే అతనిని అమ్మివేసి, ఒక క్రొత్త దేశములో బానిసగా ఉండడం అనేది ఎంతో బాధాకరమైన అనుభవము. అయినా పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు అతడు ఎటువంటి ఫిర్యాదులు చేయక, తనకు అప్పచెప్పిన పనిని నమ్మకముగా చేశాడు. మరియు పోతీఫరు భార్య అతనిపై తప్పుగా నేరారోపణ చేసినప్పటికీ, దేవునికి నమ్మకముగా ఉన్నాడు. చెఱసాలలో వేయబడినా కూడా అతడు ఫిర్యాదు చేయలేదు. కాని ఎవరిమీద పగ పెట్టుకొనలేదే. ఫరో యొక్క పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయినను ఆయన దేవునిమీదగాని లేక మనుష్యుల మీదగాని ఎటువంటి పగ పెట్టుకొనలేదు. వీటన్నిటి ద్వారా చివరకు అతడు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని ఘనపరచిన వారిని దేవుడు ఘనపరచును (1సమూయేలు 2:30). అప్పుడు ఆయన ఆవిధముగా చేశాడు కాబట్టి ఈనాడు కూడా అదే చేస్తున్నాడు. ఎప్పుడు యోసేపు బాగా లోకపు దృష్టిలో బహిరంగముగా ఘనత రాకపోవచ్చు కాని దేవుని దృష్టిలో ఘనతవస్తుంది. సిలువ మార్గమును తొలగిపోవుట ద్వారా మనము ఎంతో కోల్పోతున్నాము.


కాని కథ ఇంకా ముగియలేదు. ఐగుప్తులో అత్యున్నతమైన స్థానముకు ఎదిగినా, సమస్త అధికారము ఉన్నాకూడా పోతీఫరు భార్యపైన కాని, తన సహోదరులపైన కాని యోసేపు ఎటువంటి పగను కూడా తీర్చుకొనలేదు. కాని వారిని క్షమించాడు. అనేకమంది విశ్వాసులు ప్రారంభములో యోసేపు వలె నడచుకుంటారు, ప్రతి అడుగులోను సిలువయొక్క శ్రమలకు అప్పగించుకుంటారు. కాని జయము వచ్చిన తరువాత దేవుని చేత హెచ్చింపబడి, ఘనపరచబడిన తరువాత, విచారకరముగా గర్వము, స్వార్థమ, ప్రతీకారము తీర్చుకోవాలనే కోరిక వారికి కలుగుతాయి.


యోసేపు ఆ విధముగా లేడు. ఆయన చెఱసాలలో ఉన్నా లేక సింహాసనము మీద ఉన్నా అదే దీనత్వము కలిగినవానిగా ఉన్నాడు. ఎంత విశేషమైనవాడో కదా ఇతడు. ఈ వైఖరినే దేవుడు ప్రశంసించి, ఎల్లప్పుడు ఘనపరచుటకు చూస్తాడు. ఇది తన కుమారుని యొక్క ఆత్మ. మనలో ఇది లేనట్లయితే, మన జీవితములలో ఒకటి కొదువగా యున్నది అని ఆయన చెప్పవలసి వస్తుంది. యేసు సాతానుని శూన్యముగా చేసినది తన అద్భుతాల ద్వారా లేక తాను బోధించిన ప్రసంగముల ద్వారా కాదు. తన మరణము ద్వారా అపవాదిని నశింపజేసెనని హెబ్రీ 2:14 చెప్పుచున్నది. ప్రభువే అపవాదిని తన మరణము ద్వారా ఓడిస్తే, నిశ్చయముగా తన శిష్యులు వేరే మార్గము ద్వారా వానిని ఓడించలేరు. యేసు నామములో కొన్ని అద్భుతమలు చేసినంత మాత్రమున అపవాది ఓడింపబడతాడని ఆలోచనను కొంతమంది కలిగియుంటారు. కాని అపవాది సిలువ ద్వారా తప్ప మరి ఏ ఇతర ఆయుధము ద్వారా లోబడనొల్లడు. ఒక విశ్వాసి తన జీవితములో సిలువ మార్గమును తప్ప ఇతర మార్గములన్నింటిని నిబ్బరముగా తిరస్కరించినట్లయితే, అపవాది అతని జీవితముపై శక్తిని కోల్పోయినట్లు తాను చూస్తాడు. తనలో దేవుడు నిర్వహించు నిర్వహణలన్నింటికి సంతోషముగా, సంపూర్ణముగా ఎవరైతే లోబడతారో, వారి జీవితముల కొరకై అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును (యాకోబు 4:7) అని బైబిలు ఆజ్ఞాపించినది.


సిలువ మార్గము విజయమార్గమే. అందుకే అపవాది, యేసు ఆ మార్గములో వెళ్ళకుండా ఆపుటకు శాయశక్తులా ప్రయత్నించాడు. అందుకే స్త్రీ, పురుషులు వారి జీవితములలో ఈ మార్గములో వెళ్ళకుండా అపవాది ఆపుటకు నిరంతరము ప్రయత్నిస్తున్నాడు. పేతురు ఎంతో ప్రేమతో, యేసు సిలువ శ్రమల గుండా వెళ్ళకుండా ఆపుటకు చూచాడు. అయితే యేసు వెంటనే ఇది సాతాను స్వరమని గుర్తుపట్టాడు (మత్తయి 16:21-23). మన మార్గము కష్టముగా ఉన్నప్పుడు, మన స్నేహితులు, బంధువులు కూడా ఇటువంటి సలహానే ఇవ్వవచ్చును. అయితే జ్ఞాపకముంచుకొనండి, అది మన హృదయములోనుండి గాని లేక వేరే వారి యొద్దనుండి గాని మనలను సిలువ మార్గము నుండి ప్రక్కకు మళ్ళించునది. ఎల్లప్పుడు అపవాది యొక్క గుసగుసలు ఆ విధముగా ఎప్పుడూ మనము వాటిని గుర్తించుచున్నామా?


ప్రకటన గ్రంథములో యేసు ప్రభువును వధించబడిన గొఱ్ఱెపిల్ల వలె మనము చూస్తాము. కలువరి యొక్క పరలోకపు దృష్టిని మనము అక్కడ చూస్తాము. మనుష్యుల దృష్టిలో, కలువరి ఓడిపోయినదిగా ఉన్నది. యేసు పునరుత్థానుడైన తరువాత ఒక్క అవిశ్వాసి కూడా ఆయనను చూచినట్లుగా వ్రాయబడలేదు. కాబట్టి కలువరి ఇంకా ఓడిపోయిన దానివలె మనుష్యులకు కనబడుచున్నది. కాని పరలోకపు దృష్టిలో, ఈ భూమి మీద ఎన్నడైనను గొప్ప విజయము సాధించినదానివలె కలువరి కనబడుచున్నది. భూమి మీద దేవుని యొక్క గొఱ్ఱెపిల్లను సిలువవేశారు, కాని పరలోకములో ఆయనను ఆరాధిస్తున్నారు. యేసు క్రీస్తును వెంబడించేటపుడు, మన హక్కులను మనము కోల్పోయినపుడు ఈ భూమి మీద నున్న ప్రజలు నీవు వెన్నెముక లేదని అనవచ్చును, కాని పరలోకములోనైతే అటువంటి విజయవంతమైన స్థానమును తీసుకొన్న దేవుని బిడ్డను బట్టి అక్కడ సంతోషముంటుంది. ''వానిని (సాతానుని) జయించియున్నారు గాని, మరణము (సిలువ యొక్క) వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు.....అందుచేత పరలోక నివాసులందరు ఉత్సహించుడి'' (ప్రకటన 12:11,12).


కీర్తనలు 124:7లో వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొన్న పక్షి వలె క్రైస్తవ జీవితము సాదృశ్యముగా చూపించబడినది. ఆకాశములో పైపైకి ఎగురుచున్న ఒక పక్షి, తన పిల్లలందరూ అనుభవించాలని దేవుడు కోరుకొనుచున్న మహిమకరమైన స్వాతంత్య్రమునకు ఒక సమగ్రమైన దృశ్యముగా నున్నది. పర్వతములు మరియు నదులు భూమిని అంటిపెట్టుకొని ఉండే జీవరాశులను అడ్డుకొనవచ్చుగాని ఒక పక్షిని మాత్రము అడ్డుకొనలేవు. వాటన్నింటికి పైగా అది ఎగురుతుంది. మానవుడు కూడా ఆ పక్షి వలెఉండి, పరిపూర్ణమైన స్వాతంత్య్రముతో, ప్రతి దాని మీద అధికారము కలిగి, ప్రతి దానిని తనకు లోబరుచుకొనునట్లుగా దేవుడు మానవుని సృష్టించాడు (ఆది. 1:28). అయితే మానవుని యొక్క అవిధేయత తనను ఉరిలో చిక్కుకొన్న పక్షివలె చేసి, ఎగురకుండా చేసినది.


కేవలము సిలువ మాత్రమే ఆ ఉరిని తీసివేసి మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. దీనికి వేరొక మార్గము లేదు. ఈ లోకమునకు మరియు నీ స్వంతమునకు మరణమును నీవు అనుమతిస్తే, అపవాది యొక్క శక్తికి కూడా నీవు చనిపోతావు. నీ మీద అపవాది కున్న పట్టు విరుగగొట్టబడును, అప్పుడు ఆ పక్షి వలె నిన్ను పైకి ఎగురకుండా ఏది ఆపివేయలేదు. అది నిజమైన స్వాతంత్య్రము- మన జీవితములలోని పరిశుద్ధాత్ముడు తీసుకొని రావాలనుకుంటున్నది కూడా ఇదే (2కొరింథీ 3:17). స్వాతంత్య్రమునకు గల ఏకైక మార్గము సిలువ మార్గమే.


ఇంతకు మునుపటి అధ్యాయములవలె, మనము జీవిస్తున్న ఈ చివరిదినములలో ఈ వర్తమానములో కూడా ప్రత్యేకమైన అన్వయింపు ఉంది. ఈ దినములు 2తిమోతి 3:1-8లో వివరించబడినవి. మనుష్యులు, స్వార్థ ప్రియులని మనము అక్కడ చెప్పబడ్డాము. దీని ఫలితముగా వారి స్వభావములో సిలువకు విరోధమైన ఆత్మను కనబరుస్తారు. కనుక క్రైస్తవులకు హింసలు (శ్రమలు) అధికమైనప్పుడు అనేకలు అభ్యంతరపడుదురు (మత్తయి 24:9,10) అని చెప్పిన దానిలో ఎటువంటి ఆశ్చర్యములేదు. పైపై క్రైస్తవ కార్యములను బట్టి వారి జీవితమంతయు తృప్తిపడే అనేక క్రైస్తవులు ఆ దినములలో (శ్రమదినములలో) ప్రభువు యొద్దనుండి తొలగిపోవుదురు. ఎందుకంటే వారి క్రైస్తవ్యమంతయు వారి యొక్క అనుకూలతను బట్టి నియంత్రించబడినది కాని క్రీస్తు యొక్క సిలువ కోర్కెలను బట్టి కాదు. ఇటువంటి క్రైస్తవులను గురించి వేరులేని వారని యేసు మార్కు 4:17లో చెప్పారు. వారు క్రైస్తవ్యం కేవలము ఉపరితలము పైనే ఉంటుంది. ఆ వేరు బలపరచుటకు వారి జీవితములలో సిలువను అంగీకరించునట్లు, వారికి అనేక పరిస్థితులను దేవుడు అనుమతించాడు. వారు ఎల్లప్పుడు దీనిని తొలగించుకున్నారు.


క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన జీవములోనికి మనుష్యులను నడిపించగలిగిన మార్గము ఒక్కటే. మనము కావాలంటే వేరే మార్గములలో కూడా వెళ్ళవచ్చును. గాని దేవుని యొక్క ఉద్దేశ్యములను మరి ఏ మార్గములలో కూడా నెరవేర్చలేము. మన జీవితములలో సిలువ మార్గములను తప్పించినట్లయితే మన వరములు, తలాంతులు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. మనము దీనిని అంగీకరించవచ్చు లేక తిరస్కరించవచ్చు-ఈ ఎన్నికను చేసుకొనవలసినది పూర్తిగా మనమే.


మనము పరలోకమునకు వెళ్ళిన తరువాత యేసు కొరకు సిలువను మోసే రెండవ అవకాశము మనకురాదని సాధు సుందర్‌ సింగ్‌ చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు దీనిని మనము తిరస్కరించవచ్చును గాని, యేసు నడచిన రక్తము చిందిన మార్గములో మనము ఆయనను వెంబడించే అవకాశము పరలోకములో ఉండదు. మన ప్రభువును మనము కలుసుకొన్నప్పుడు, తన చేతులకు మరియు పాదములకు ఇంకా సీలల గుర్తులు ఉంటాయి. అప్పుడు మనము భూలోకములో జీవించిన మన జీవితములను ఒకసారి వెనుదిరిగి చూచుకొని ప్రతి అడుగులోను ఏ విధముగా మనము సిలువను తొలగించుకున్నామో కనుగొనినట్లయితే ఎలా ఉంటుంది? ప్రతి అడుగులోను మనము సిలువకు అప్పగించుకొనునట్లు దేవుడిచ్చునుగాక. ఆ విధముగా ఆరోజున మనము విచారించనవసరము ఉండదు.


''ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించబడుచున్నాము'' (2కొరింథీ 4:11; 2:14).


యేసు, నా సిలువను నేను ఎత్తుకొన్నాను,


సమస్తమును విడచి మరియు నిన్ను వెంబడించుటకు;


నిరాశ్రయుడను, తృణీకరింపబడినవాడను, విడచిపెట్టబడిన వాడను,


ఇప్పటినుండి నీవే నాకు సమస్తముగా నుండుము;


నేను వెదకిన, ఆశించిన మరియు తెలుసుకోవాలనుకున్న,


ప్రతి ప్రియమైన ఆశయము నశించును;


అయిననూ నా స్థితి ఎంత సంపన్నమైనది,


దేవుడు మరియు పరలోకము ఇంకను నావే;


అధ్యాయము 5
ఒకటి చేయుచున్నాను

''అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడునిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను'' (ఫిలిప్పీ 3:7-14).


అపొస్తలుని ఈ మాటలు, ఒక యౌవనస్తుడు అత్యుత్సాహముతో అప్పుడే క్రైస్తవ మార్గమును ప్రారంభించినపుడు వ్రాసిన మాటలు కావని మనందరము జ్ఞాపకము చేసుకోవాలి. సంపన్నమైన మరియు సంపూర్ణమైన జీవితమునకు దగ్గరగా ఉన్న ఒక పరిణితి చెందిన క్రైస్తవుని సాక్ష్యమే ఈ మాటలు. పౌలు మారుమనస్సు పొందిన తరువాత ముప్పది సంవత్సరములు గడిచినవి. ఆ ముప్పది సంవత్సరములలో పౌలును అనేక సంఘములను స్థాపించుటకు దేవుడు వాడుకొన్నాడు, అతని పరిచర్యను సూచనలు, అద్భుతములతో ఎంతగానో ఆమోదించాడు. మొదట పౌలు తన సువార్త సేవలో అపరిమితముగా గడిపాడు. అపారమైన ప్రయాణములు చేసి, ఎన్నో శ్రమలను అనుభవించాడు. తాను ప్రభువు పోలికగా ఎదిగి పాపంపై విజయం యొక్క వాస్తవమును తెలుసుకున్నాడు. అతనికున్న అనేకమైన సంతోషములలో అతనికొక అసాధారణమైన అనుభవము ఉన్నది. అసాధారణమైన ఆత్మీయమైన సత్యములను గూర్చిన ప్రత్యక్షతలను పొందడానికి అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడ్డాడు.


అయినప్పటికినీ, చివరిగా పౌలు చెప్పేదేమిటంటే తన జీవితము కోసం దేవుడు ఉద్దేశించినవన్నీ పొందలేదనే అంటున్నాడు. అన్నికాలాల్లోను శ్రేష్టమైన క్రైస్తవుడే తన జీవితము చివరిలో పరిపూర్ణుడగుటకు (గమ్యమునకు) ముందుకు సాగిపోవుచున్నాడు అని అంటున్నాడు. అయ్యో! చాలా మందికి రక్షణ అనేది నూతన జన్మతో ప్రారంభించి, ముగించబడుతుంది మరియు వారు దేవుని తీర్పును తప్పించుకొన్నామనే నిశ్చయతతో ఉందురు. కాని అపోస్తలులకు, ప్రభువుకు నిజమైన శిష్యునిగా ఉండగోరు వారికి ఈ విధముగా ఉండదు. యేసు ప్రభువు ఒక ఉద్దేశ్యం కలిగియుండి తనను పట్టుకున్నాడని, పౌలుకు యేసు ప్రభువుపై ఉన్న స్థిరమైన విశ్వాసాన్ని గురించి ఈ వాక్యభాగములో చెప్పుచున్నాడు. దానికి ప్రతిగా, ఏదిఏమైనాసరే, ఆ ఉద్దేశ్యాని పట్టుకొనుటకు అతడు నిశ్చయించుకున్నాడు. ప్రభువు మనకు రక్షణ కలుగజేసినపుడు (మార్చినపుడు) కేవలం నరకం నుండి పరలోకమునకు చేర్చడమే కాకుండా ఇంకెంతో అతీతమైన ఉద్దేశ్యం కలిగియున్నాడనేది అద్భుతమైన, గంభీరమైన సత్యము. ముప్పది సంవత్సరములు క్రైస్తవ పరిచర్యను అవిశ్రాంతముగా చేస్తూ ఎంతో పరిణితి చెందిన అపోస్తలుడైన పౌలు వంటి వ్యక్తే, నా జీవితములోని దేవుని యొక్క ఉద్దేశ్యమును నేనింకా చేరుకొనలేదు దాని కొరకు పోరాడుచున్నాను అని అంటే, ఆ ఉద్దేశ్యము ఎంత విస్తృతమైనదో అయిఉండాలి కదా!


ఈ వాక్యభాగములోనే పౌలు ఇంకా ముందుకు సాగిపోతూ, దేవుని యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొని దానిని నెరవేర్చుట అను ఈ సర్వోన్నతమైన లక్ష్యముతో పోల్చినపుడు ఈ లోకములో విలువైనదిగా ఎంచబడే ప్రతి దానిని కూడా అయోగ్యముగాను, పెంటగాను చూస్తున్నాడు. ఈ లోకములోని సమస్తమును విడచిపెట్టదగిన బహుమానముగా అతడు దీనిని ఎంచుకొనుచున్నాడు (14వ వచనము). మన చుట్టూ మనము చూసినపుడు విశ్వాసులు లోకసంబంధమైన సంపదలను స్వాధీనపరచుకొని మరియు భౌతిక సంబంధమైన వస్తువులను హత్తుకొని దేవుని విషయములకంటె వీటన్నింటికి వారి జీవితములలో ఎక్కువ విలువను ఇస్తున్నట్లయితే, వారి క్రైస్తవ్యము పౌలు కంటే ఎంతో దూరములో నున్నదని మనము బలవంతముగా నిర్ధారించవలసి వస్తున్నది.


రక్షణ అంటే కేవలము నరకాగ్నిలోనుండి తప్పించుకొనే జీవిత భీమా లాంటిదని అనుకొనుట కేవలం ఆత్మీయ పసితనమును సూచిస్తుంది. మనము ఆత్మీయముగా పరిణితి చెందినపుడు, మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ముందుగా సిద్ధపరచిన మార్గములో ప్రతి దినము నడచుకొనుటకు రక్షింపబడ్డామని తెలుసుకుంటాము (ఎఫెసీ 2:10). ఇక్కడ పౌలు పిలచే మార్గము అంటే తన జీవితముకొరకైన దేవుని ఉద్దేశ్యము. మనము కేవలం ఆయన కృపను పొందుకొని, మన జీవితములలో ఆయన చిత్తము నెరవేర్చబడుటకు మనము సమర్పించుకొనకుండా తృప్తి పొందినట్లయితే అప్పుడు మనము సిద్ధాంతపరముగా ఎంత ఖచ్చితముగా నున్న కూడా దేవుని దృష్టిలో ఎన్నడు నిలిచియుండేదానిని సాధించకుండానే మన జీవితములను గడిపెదము. యేసు క్రీస్తులో దేవుని కృపను చూడకుండా ఏదో ఒక సాధనములను ఉపయోగించి మనుష్యులను గ్రుడ్డి వారిగా చేసి వారు రక్షణ పొందకుండా చేయుటయే అపవాది యొక్క మొదటి గురియైయున్నది (2కొరింథీ 4:4). ఒకవేళ అపవాది అక్కడ విజయము పొందనట్లయితే, వారియెడల దేవునికొక స్పష్టమైన ప్రణాళిక యున్నదని గుర్తెరగకుండునట్లు క్రొత్త విశ్వాసులను గ్రుడ్డివారిగా చేయుటయే అపవాది యొక్క రెండవ గురి. చాలా వరకు అపవాది అక్కడ విజయం సాధించాడు. ఎటువంటి ఆసక్తితోను దేవుని చిత్తమును వెదకని విశ్వాసులు వేలమంది ఉన్నారు, చివరకు వారి జీవితములలో అతిపెద్ద నిర్ణయములలో కూడా వారు వెదకరు.


ఫిలిప్పీ పత్రికలోని ఈ వాక్య భాగములో క్రైస్తవ జీవితము నిరంతరముగా ముందుకు సాగిపోవలెనని వివరించబడినది. ఈ భూమి మీద మనము చేరుకోగలిగిన ఎటువంటి ఆత్మీయస్థాయి కూడా స్థిరమైన ఈ ఆవశ్యకత నుండి మనలను విడిపించలేరు. అనేకమంది విశ్వాసులు ఈ పాఠమును నిర్లక్ష్యము చేసిన కారణమును బట్టివారు సజీవమైన సాక్ష్యమును కలిగిలేరు. వారు కలిగియుండే ఒకే ఒక్క సాక్ష్యమేమిటంటే, ఎప్పుడో గతములో ఒకసారి సువార్త కూటములలో చేయిపైకెత్తి తీర్మాన పత్రము మీద సంతకం చేసిన అనుభవమే. అది అద్భుతమే కాని, అప్పటినుండి ఇంతవరకు ఏమీ జరుగలేదు! సామెతలు 24:30-34లోని వ్యర్థమైన తోటను గురించిన దానిలో, తాను రక్షణ పొందిన తరువాత సోమరి (ఏమీ చేయకుండా ఉన్నవాని)గా ఉన్న మనుష్యుని గురించి వివరించబడినది. తోటను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకొని, దానిలో కలుపుతీయవలెను. ఒక తోటే కలుపు మొక్కలనుండి, దూలగొండ్ల నుండి నిరంతరము కాపాడువలసివస్తే మనుష్యుని ఆత్మకూడా ఈ విధముగానే చేయవలెను.


మెథడిస్ట్‌ సాక్ష్యముల కూడికలో ఎవ్వరూ కూడా ఒక వారము కంటే పాతదైన సాక్ష్యమునివ్వకూడదనే జాన్‌వెస్లీ ఒక నియమమును విధించాడు. గడచిన వారము దినములలో ప్రభువు యొక్క సంప్రదింపులను గురించి చెప్పుటకు ఏమీ లేనట్లయితే అతడు వెనుకకు వెళ్ళిపోయిన వానిగా తలంచుకోవాలి. ఆ పరీక్షకు మనలో ఎంత మంది నిలబడగలము? అటువంటి కూటములలో మూతిముడుచుకొని కూర్చుందామా?


13,14వచనములలోని పౌలు యొక్క మాటలను గమనించండి: ''సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను-అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను''. ఇక్కడ క్రైస్తవునికి మరొక ప్రాధాన్యతను మనము చూస్తున్నాము. దేవుని ఉద్దేశ్యమును అర్థము చేసికొని దాని యొద్దకు ముందుకు సాగిపోవుట అనేది ఆత్మీయముగా శ్రేష్టమైన స్థితిలోనికి వెళ్ళుటకు చేసే అదనపు ఐచ్ఛికము (ఆప్షన్‌) కాదు.


మరొకసారి మన అంశమును మూడు కోణములలో చూద్దాము. మొదటిగా, దేవుని సంపూర్ణ ఉద్దేశ్యము యొద్దకు సాగిపోకుండా మనలను ఆటంకపరచ గలిగిన విషయములను చూద్దాము. రెండవదిగా, మనము ముందుకు సాగిపోవునట్లు మనలను బలపరచే శక్తి. చివరిగా, మన జీవితాంతము వరకు ఆలాగున చేయుటకు గల మనస్సు వైఖరిని చూద్దాము.


మనలను ఆటంక పరచగలిగిన విషయములు


దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చినపుడు, వారు కనాను వెళ్ళుటకు అరణ్యమార్గము గుండా మార్గమును సిద్ధపరచి ఇచ్చెను. కేవలం వారు మేఘస్తంభమును, అగ్ని స్తంభమును అనుదినము వెంబడించినపుడే దానిని కనుగొనగలరు. ఈనాడు విమోచించబడిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు మార్గమును సిద్ధపరచియున్నాడు. అయితే, అనుదినము ఆయనలో నడచినపుడు మాత్రమే వారు దానిని కనుగొనగలరు. దేవుడు మనలను ఎందుకు పట్టుకున్నాడా, ఆ ఉద్దేశ్యమును మనము కూడా సంపూర్ణముగా పట్టుకొనాలంటే, దేవునితో మనము నడచుట నేర్చుకోవాలి. ఇక్కడే, ప్రతి అడుగులోను సాతాను నుండి ఎదిరింపులను మనము కనుగొంటాము. దొంగలు పేదవారి ఇళ్ళలో కంటే ధనవంతుల ఇళ్ళలోనికే చొరబడినట్లు, సాతాను కూడా తన అగ్ని బాణములను శరీరాను సారమైన మనస్సు కలిగిన క్రైస్తవుల కంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారి మీదే ఎక్కువపెడతాడు. కావున ఆత్మీయ పరిణితి చెందుటకు పురోగతి సాధించే ప్రతి అడుగులోను యుద్ధము తీవ్రముగా ఉంటుందని మనము కనుగొంటాము.


దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును చేయుటకు ముందుకు సాగిపోవుచున్న విశ్వాసిని ఆటంకపరచుటకు అనేకమైన శక్తులు పని చేస్తున్నాయి: అనేక ఆకర్షణలతో ఉన్న లోకము, వ్యామోహములతో ఉన్న శరీరము, నిగూఢమైన తంత్రములు కలిగియున్న అపవాది. విశ్వాసి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఇవి ఆటంకములుగా ఉన్నట్లయితే, మరి దేవుడు ఎందుకు వాటిని తొలగించలేదని లేక కనీసం విశ్వాసులను వాటినుండి కాపాడుటలేదని మనము ఆశ్చర్యపోవచ్చును. ఈ సమస్య అనేక శతాబ్దాలనుండి అనేకమంది మనస్సులను తొలచివేసినది. మనందరికంటే జ్ఞానవంతుడైన మన పరలోకపు తండ్రి ఈ శక్తులు ఉండుటకు అనుమతించాడనే విషయము మనము తెలుసుకుంటే చాలు. ఒక మంచి కారణమేమిటంటే, మన ఆత్మీయ జీవితమును బలపరచుకొనే అవకాశము ఉంటుంది. భౌతికముగా కూడా, వ్యాయామము ద్వారా మన కండరములను నిరోధించినపుడే కండరములు బలపడతాయి. లేన్లయితే మన కండరములు సున్నితముగాను మరియు శక్తిహీనముగాను ఉంటాయి. ఒక మల్లయుద్ధమునకు సిద్ధపడే ఒక మల్లయోధుడు ఆ యుద్ధమునకు సరిపోవుటకు నిరంతర వ్యాయామము, మరియు ఇతరులతో మల్లయుద్దము కలిగియుండవలెను. అదేవిధముగా మనము ఈ లోకము, శరీరము, అపవాది శ్రమలు, శోధనలనుండి కాపాడబడినట్లయితే మన ఆత్మీయ బలము ఎప్పటికీ వృద్ధిచెందదు.


ప్రభువైన యేసు కూడా మనము వెళ్ళుచున్న ప్రతి శోధనల గుండా వెళ్ళాడని మనము తెలుసుకొనుట ద్వారా మనకుఎంతో ఆదరణ లభిస్తుంది (హెబ్రీ 4:15). యేసు ''పరిశుద్ధాత్మపూర్ణుడై'' అరణ్యములోనికి వెళ్ళెను అని లూకా చెప్పుచున్నాడు. శోధన ముగిసిన తరువాత ''పరిశుద్ధాత్మ శక్తి''తో ఆయన వెనుదిరిగాడు (లూకా 4:1,17). ఒక మనిషిగా, మనుష్యులకు మనలో కలుగు సాధారణమైన శోధనలను జయించుట ఆయనను కూడా బలపరచినది. మనలో కూడా ఇదే విధముగా జరుగదా? కేవలము క్రైస్తవ పుస్తకములు చదివి, మతసంబంధమైన కూటములకు హాజరైనంత మాత్రమున మనము ఆత్మీయముగా బలమొందెదమని మనము ఎప్పుడూ ఊహించుకొనకూడదు. అటువంటి కార్యకలాపములు ఆహారము తీసుకొనుట వంటివి, కాని మనము బలముగా నుండవలెనంటే దానికి తోడు వ్యాయామములు కూడా చేయవలెను. లోకములోని ప్రజలనుండి సంబంధములు తెంచివేసుకొని కాపాడబడిన క్రైస్తవ జీవితములు జీవించే వారు ఆత్మీయముగా బలవంతులుగా ఎప్పుడు ఉండలేరు.


పరిశుద్ధత అనేది ఆరోగ్యము వంటిది. పూర్తి ఆరోగ్యముగా ఉండవలెనంటే, క్రమముగా మనము వ్యాయామము చేయవలెను. అప్పుడు మాత్రమే మనము వ్యాధులను నిరోధించగలము. ఆ విధముగా పరిపూర్ణులుగా చేయబడుటకు మనము శోధనలగుండా వెళ్ళి వాటిని జయించాలి. మనము పరీక్షను తప్పించికొన్నట్లయితే మనము ఎన్నటికీ పరిపూర్ణులముగా చేయబడలేము. ఏదేను వనములో నిషిద్ధమైన పండును దేవుడెందుకుంచాడో మరొక కారణమును ఇది మనకు తెలియజేస్తుంది.


ఆదాము శోధనను జయించి నిజముగా పరిశుద్ధుడగుటకు ఇది అవకాశము ఇచ్చినది. శోధనను గురించి మనము భయపడనవసరము లేదు. మనము సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధించడని 1కొరింథీ 10:13లో ప్రభువు మనకు నిశ్చయతనిచ్చాడు.


శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా ఎటువంటి అద్భుతమైన లాభములు కలుగునో పాతనిబంధనలోని కీర్తన 66:10-12లోని వాక్యభాగము చూపిస్తుంది. అగ్ని మరియు నీరు ఆత్మీయముగా మనలను సంపన్నులుగా చేయడమే కాక ఆత్మీయముగా ఆరోగ్యముగా కూడా చేస్తుంది. బైబిలులోని దైవజనులందరూ కూడా మనలను బాధించే శోధనలనే ఎదుర్కొన్నారు. ఏలియా కూడా మనవంటి కోర్కెలు, వ్యామోహములు కలిగయున్న వాడేనని యాకోబు 5:17 చెప్పుచున్నది. వారి శ్రమలను, పరీక్షలను జయించిన కారణమును బట్టి ఈ దైవజనులు బలవంతులయ్యారు. ఈ విధముగా వారు దేవుని చేతిలో వాడబడ్డారు. మనలను పరీక్షించుటకు దేవుడు శోధనను అనుమతిస్తాడు. దేవునిచేత వాడబడబోవు వారందరు తప్పక పరీక్షించబడవలెను. మనము ఒంటరిగా నున్నప్పుడు వచ్చే శోధనలు మనము బహిరంగముగా సేవచేయుటకు సరిపోయేలా నిరూపిస్తాయి. శోధనను జయించడమంటే ఈతను నేర్చుకొనుట వంటిది. ఈతను ఒక్క రోజులో మనము నేర్చుకొనలేము. కాని నీవు నిశ్చయించుకుంటే, కొంచెము ముందో వెనుకో ఆ నైపుణ్యతను నీవు సంపాదించుకుంటావు. అప్పుడు నీరు అంటే నీవు భయపడవు.అదే విధముగా, మనము నిశ్చయించుకున్నట్లయితే, శోధన మీద జయము పొందుటకు క్రీస్తులోని రహస్యమును నేర్చుకుంటాము. అప్పుడు మనము ఇక భయపడనవసరము లేదు.


మత్తయి 4వ అధ్యాయములో యేసుప్రభువుకు కలిగిన మూడు శోధనలను గురించి క్లుప్తముగా చూద్దాము. ఈ వాక్యభాగం చదివినట్లయితే, ఏవిధముగా అపవాది యేసు క్రీస్తును శోధించుటకు వచ్చాడో, అదే విధముగా మన దగ్గరకు కూడా వస్తాడని గ్రహించగలము. 40 దినములు శోధించి, చివరకు ప్రభువును పడగొట్టుటకు సాతాను చేసిన ఆఖరి ప్రయత్నము ఈ మూడు శోధనలుగా మనకు కనబడుతున్నాయి. సాతాను చేతిలో మూడు చివరి ఆయుధములే ఆ మూడు శోధనలు కాని ప్రభువు వాటన్నింటిని జయించాడు.


మొదటి శోధన, శరీరము యొక్క సహజసిద్ధమైన ఆకలి కోసం వచ్చినది. ఇక్కడైతే అది ఆహారము కోసం (3,4 వచనాలు). హవ్వ మరియు ఏశావు కూడా ఈ విధముగానే శోధింపబడ్డారనేది ప్రాముఖ్యము (ఆదికాండము 3:6; 25:34). అయితే వారు ఓడిపోయారు కాని యేసు జయించాడు. సహజసిద్ధమైన కోర్కెలు (ఆకలి)ని తీర్చుకొనుటకు దేవుడు ఏర్పరచిన విధానముల ద్వారా కాక దానికి వెలుపల తృప్తి పొందునట్లు శోధించుటకు సాతాను ఈనాడు కూడా స్త్రీ,పురుషులందరి యొద్దకు వస్తున్నది. ఆకలి కొరకైన కోరిక, విశ్రాంతి కొరకు, లైంగిక వాంఛ వంటి సహజసిద్ధమైన కోర్కెలను దేవుడే మనలో ఉంచాడు, అంతమాత్రమే గాక వాటి ద్వారా సక్రమముగా తృప్తి పొందుటకు కావలసిన మార్గమును, విధానములను కూడా ఆయన నియమించాడు. వాటిద్వారా తృప్తి పొందుటకు దేవుడు నియమించిన విధానములకు వెలుపల వాటిని అనుభవించాలనుకున్నట్లయితే, లేక శరీరము యొక్క సహజసిద్ధమైన కోర్కెలను తీర్చుకొనుటలో మనము ఎక్కువగా నిమగ్నులమైతే అప్పుడు అది పాపము. అపవాది ఇక్కడే మనలను కుయుక్తితో శోధిస్తాడు.


పాపము చేయమని బహిరంగముగా ఎటువంటి పిలుపు లేదు-సహజ సిద్ధమైన శరీర కోర్కెలను, అక్రమముగా నెరవేర్చుకొనమని పిలువడమే. ఆహారము తినే విషయములో మనము ఎక్కువగా నిమగ్నులమైపోతే, మనము తిండిబోతులుగా మారి, ఒక్కదినము కూడా ఆహారము లేకుండా ఉండలేము. ఈ విధముగా మనము దేవునికి ఉపయోగపడకుండా తీవ్రముగా ఆటంకపరుస్తుంది. మనము సోమరులు(మందులు)గా ఉండి, ఉదయకాలమున మన పడకమీదనుండి లేచి దేవునితో మౌనధ్యాన సమయము కలిగియుండుట నేర్చుకొననట్లయితే ఇది కూడా మనలను దేవుని కొరకు ఉపయోగపడకుండా చేస్తుంది.


నేడు పశ్చిమ దేశములో ''నూతన నైతికత'' అని చెప్పుకొనే సిద్ధాంతమునకు సభ్యత్వం తీసుకున్న అనేకమంది అనుచరులను అపవాది కనుగొన్నది. దురదృష్టవశాత్తు, తూర్పునకు కూడా ఈ తత్వము చొరబడుచున్నది. లైంగిక సంబంధమైన కోర్కెలు కలిగినపుడు మనము ఎటువంటి నిగ్రహమును కలిగియుండ వలసిన అవసరము లేదని ఇది బోధిస్తుంది. విస్తారమైన జనసమూహములు ఈ తత్వమునకు టోకు (గంపగుత్త)గా అనుమతి పొంది క్రుంగుతున్నారు. వారు సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరు అబద్ధమును నమ్మునట్లు చేయబడ్డారు (2థెస్స 2:10-12).


సంసోను మరియు దావీదులు మోహము ద్వారా సాతానుకు ఎరగా వేయబడ్డారు. దావీదు గొలియాతును జయించగలిగాడు గాని, తన స్వంత మోహమును జయించలేకపోయాడు. ఎంతోమంది గొప్ప వారు కూడా ఇక్కడ పడిపోయారు. ఎవరైతే ఈ విషయములో తమ జీవితములలో నిర్లక్ష్యముగా ఉండి, క్రమశిక్షణ కలిగియుండరో వారు సాతానుకు సులువైన లక్ష్యముగా ఉంటారు. స్త్రీల యొక్క దుస్తులలోని ఆధునికశైలిని ఉదాహరణగా తీసుకుందాము. వారి శరీర భాగములలో దేవుడు ఏదైతే కప్పుకోవాలనే ఉద్దేశించాడో, వాటిని కప్పుకొనకుండా వారు ఆ దుస్తులను తయారు చేస్తారు. ఆదికాండము 3:21లో ఇది స్పష్టముగా నున్నది. సినిమాలు మరియు నగ్నగర్భముగా రోడ్డు ప్రక్కల నుండే పోస్టర్లు, దినపత్రికలు మరియు సంచిక (మ్యాగజైన్‌)లలో కనబడే నగ్నప్రదర్శనలు, ఆధునిక వస్త్రశైలి వీటన్నింటిని కలిపి జాగ్రత్తగా పథకం ప్రకారం మనుష్యులను వారిస్వంత యిచ్ఛలకు బానిసలుగా చేయుటకు మన మోహపు కోర్కెలను లొంగదీసుకోవాలంటే, యోబు చేసినట్లుగా మన కళ్ళను క్రమశిక్షణలో పెట్టుకోవాలి (యోబు 31:1). ఆ కోర్కెలను రెచ్చగొట్టే విధముగా ఉంటున్న వాటిని చూచుట గాని లేక చదువుటగాని మనము తిరస్కరించాలి. దావీదు తన కళ్ళను అదుపులో పెట్టుకోలేదు గనుక పాపము చేశాడు (2సమూయేలు 11:2). అక్కడ, చేదైన పాఠమును నేర్చుకొన్న తరువాత, దావీదు తన కళ్ళను క్రమశిక్షణలో పెట్టుకొనుటకు సహాయము చేయమని అడుగుతున్నాడు (కీర్తనలు 119:37). మనము కూడా దీనిని పట్టుదలతో కూడిన ప్రార్థనగా చేసుకోవాలి.


శరీరము యొక్క స్వభావసిద్ధమైన కోర్కెలను తీర్చుకొనుటలో ఎక్కువగా మునిగిపోయి దేవుని యొక్క సేవకు అనర్హునిగా అయిపోతానేమోనని పౌలు గమనము కలిగియున్నాడు. కావున అతడు తన శరీరమును తీవ్రముగా నలుగగొట్టుకొని దానిని లోపరచుకున్నాడు (1కొరింథీ 9:27). ఈ విషయములో అనేకులు క్రమశిక్షణ కలిగిలేకపోవుట వలన వేలమంది వారిని వారే దేవుని సేవకు అనర్హులుగా చేసుకున్నారు.


యేసు యొద్దకు వచ్చిన రెండవ శోధన భావన (ఊహను) గురించి వచ్చినది. దేవాలయము శిఖరము మీదనుండి దుమికి, దెబ్బ తగలకుండా, దేవాలయము యొక్క ఆవరణములోఉన్న ప్రజలందరూ చూస్తుండగా అద్భుతముగా పైకి రావాలని యేసు సాతాను చేత శోధించబడ్డాడు. తన భధ్రత కోసం కీర్తనలు 91:11,12 లోని వాగ్దానమును అడగాలి. ఇక్కడ ప్రలోభమేమిటంటే, దేవుని మీద తనకున్న విశ్వాసమును ప్రదర్శించుటకు అద్భుతముగా కనబడు దానిని ఒకటి చేయాలి: దేవుడు అడుగక పోయినా కూడా దుమకాలి.


ఈనాడు అత్యద్భుతమైన వాటికోసం ఎంతో వెఱ్ఱిఉన్నది. క్రైస్తవ సంఘములని కొన్ని భాగములు దీనితో ఓడింపబడ్డాయి. సామాన్యముగా కాకుండా ఏదో ఒక సాహస కార్యమును చేసి దేవుని యందలి విశ్వాసమును ప్రదర్శించమని అపవాది విశ్వాసులను నిరంతరము పురిగొల్పుతుంది. సాతాను యొక్క ఈ పురిగొల్పులను వెంబడించి వారి కొరకు దేవుడేర్పరచిన మార్గములనుండి అనేకులు పూర్తిగా తొలగిపోతున్నారు.


దేవుని యొక్క సమయము, నడిపింపు కొరకు సహనముతో వేచిచూడకుండా ఏదో ఒక పనిని పట్టుకొని ముందుకు పరుగెత్తి వారి జీవితములను బ్రద్దలు చేసుకున్నవారు అనేకులున్నారు. ఒకరు ఈ విధముగా చేప్పారు: ''మనము ఆయన భధ్రతను కావాలనుకొని, ఆయన యొక్క వాగ్దానములను స్వతంత్రించుకొనవలెనంటే మనము ఆయన యొక్క మార్గములో ఉండి ఆయన సమయములో, ఆయన వేగముతో ముందుకు వెళ్ళాలి''. తన తండ్రి మార్గదర్శకత్వములోనే, తన తండ్రి చిత్త ప్రకారమే మరియు తన తండ్రి సమయములోనే ముందుకు వెళ్ళి, సాతాను కాని లేక మనుష్యుల యొద్దనుండి కలుగు పురికొల్పుల నుండి వెళ్ళని పరిపూర్ణమైన మాదిరి యేసుప్రభువు యొక్క జీవితములో మనకున్నది. తనను బ్రతిమిలాడుకొను (పురిగొల్పు) వారితో ఆయన ఈ విధముగా చెప్తాడు ''నా సమయమింకను రాలేదు'' (యోహాను 7:6); ''నా తండ్రి వెళ్ళమంటేనే నేను వెళ్తాను'' అని దీనికర్థము. దేవుని సమయము కొరకు కనిపెట్టకుండా ముందుగా పరుగెత్తిన కారణమును బట్టి సౌలు తన రాజ్యమును పోగొట్టుకున్నాడు (1సమూయేలు 13:8-14). ఈ విధముగా అనేకమంది విశ్వాసులు దేవుడిచ్చే శ్రేష్టమైన దానిని కోల్పోయారు. ఉదాహరణకు, వివాహ విషయములో దేవుని చిత్తము కొరకు కనిపెట్టక ముందుగా పరుగెత్తుదురు. వారు తొందరపాటులో చేసిన పనికి ఇప్పుడు తీరికగా పశ్చాత్తపపడుదురు!


సహోదరీ, సహోదరులారా దేవుని యొక్క సమయము కొరకు సహనముతో కనిపెట్టుకొనుట నేర్చుకొనండి అప్పుడు నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరము ఉండదు. ఆయన కొరకు కనిపెట్టుకొను వారిని ఆయన ఎన్నడూ నిరాశపరచడు (యెషయా 49:23).


మూడవ శోధనలో సాతాను యేసుకు ఈ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపించాడు. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకిచ్చెదనని యేసుతో చెప్పాడు. మనందరకు కలిగే మరొక శోధన ఇది. ఏదో కొంత వ్యక్తిగత లాభము కొరకు మన క్రైస్తవ నియమములలో రాజీపడునట్లు చేసే శోధన ఇది.


మనము కేవలము మన నియమములలో రాజీపడి, అపవాదికి మోకరించుటకు సిద్ధముగా ఉన్నట్లయితే ఈ లోకములో ఎన్నో విషయములను పొందచ్చును. అందులో ఒకటి డబ్బు. ఇది ఎంతో ఆకర్షణీయమైనది. తరచుగా విశ్వాసులు ఇంకొంచెం డబ్బును సంపాదించుటకు వారి యొక్క ప్రమాణములను తగ్గించుకొనునట్లు శోధింపబడతారు. మనము ఉద్యోగము కొరకు చూస్తున్నప్పుడు దేవుని చిత్తము కంటే మనము ఆశించే జీతమును బట్టి నడిపించబడుట లేదా? దీని ఫలితముగా, మన జీవితముల కొరకైన దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యముల నుండి తొలగిపోవునట్లుగా చేయుటకు సాతానుకు సులువుగా ఉంటుంది. ఇది బిలాము యొక్క దోషము. మరియు నేడు అనేకులు ఈ మార్గమును ఎంచుకుంటున్నారు (2పేతురు 2:15, యూదా 11; సంఖ్యా 22). ఇది సాతానుకు నమస్కరించడమేనని మనము గుర్తించామా? ''ప్రభువు యొక్క పని కొరకు డబ్బును వసూలు'' (అనివారు చెప్పుకుంటారు) చేయుటకు లేఖనానుసారము కాని లోక పద్ధతనులను పాటించే క్రైస్తవులు ఉన్నారు. అది చివరకు చూడటానికి ఎంత బాగున్నా వాటిని చేయుటకు దేవుడు ఎప్పుడూ అవినీతి సాధనములను అనుమతించడు. తన దురాక్రమదారుణికి నమస్కారము చేసి మనము లోకమును గెలవాలని దేవుడు కోరుకొనుట లేదు. మనము ప్రభువును సంపూర్ణముగా వెంబడించాలనుకుంటే, ధనము యొక్క ఆకర్షణలను గురించి మనము జాగ్రత్తపడాలి. మనము దేవునినే పట్టుకొని యుండాలంటే, దానిని విడచిపెట్టాలని యేసు మనలను హెచ్చరించాడు (లూకా 16:13).


తరువాత హోదా కొరకైన ఎర ఒకటి ఉంది. ప్రసిద్ధులుగా, ప్రముఖులుగా కావాలనే శోధన. వారి ప్రాణము కోరుకొనే భూసంబంధమైన కీర్తి కొరకు అనేకులు రాజీపడతారు. క్రైస్తవుల మధ్య మరియు ప్రభువు యొక్క పనిలో కూడా ఇదే శోధన ఉంటుంది. బాగా పేరు కలిగియుండాలనే తపన మన అందరిలోను ఉంటుంది. ఇతరుల చేత ప్రశంసించబడుటను, గౌరవించబడుటను మనందరము ఇష్టపడతాము. మన చుట్టూ ఉన్న వాళ్ళందరి కంటే మనము గొప్పగా ఉన్నామని చూచినట్లయితే ''మన జీవితమునకు మన ప్రాణము ఆంతరంగిక సంతృప్తినిస్తుంది. మనము పాడుటలోగాని లేక ప్రసంగించుటలోగాని లేక ప్రార్థించుటలోగాని ఇతరుల కంటే ఎక్కువ తలాంతు గల వారమని లేక శ్రేష్టులమని అని ప్రర్శించుకొనుటకు చివరకు సంఘములో కూడా శోధించబడతాము.


మనము మన సహవిశ్వాసులను ఫణముగా పెట్టి ఇతరుల కంటే మనము గొప్పవారమని హెచ్చించుటకు శోధింపబడుతున్నాము. ఇదంతయు కూడా క్రీస్తు ఆత్మకు విరోధముగా నున్నది.


లేక క్రైస్తవ బోధకుని విజ్ఞప్తినే తీసుకుందాము. అతడు ''విశాల హృదయము'' గలవాడు అనిపించుటకు, తన బోధ వినువారికి రుచికరముగా లేని బైబిలు సిద్ధాంతములు చెప్పకుండా ఉండి, పాపము లేక దురాశను తన ప్రసంగములో బోధించకుండా వెనుకకు తగ్గుటకు శోధించబడతాడు. అతడు సంపన్నులను లేక పలుకుబడి గలవారిని అభ్యంతర పరచకుండా ఉండి ఎక్కువ మంది తన బోధవిను వారిని పొందుతాడు. కాని అది ఎంత క్రయముతో? ఎవరి దగ్గరనుండి అయితే ఈ సలహాలన్నీ పుడతాయో, ఆ సాతానుకు నమస్కరించుట అనే క్రయము చెల్లించుట ద్వారానే. ఏదో ఒకసారి ప్రతి బోధకుడు ఈ విధముగా శోధింపబడతారు. అయ్యో! అనేకులు తెలియకుండానే ఈ రాజీపడుటకు వెనుక ఉన్న సాతానుతో భాగస్వాములగుటకు అప్పగించుకుంటున్నారు.


ఈ మార్గములోనే యౌవనస్త్రీలకు మరియు యౌవనపురుషులకు వివాహమును గురించి తరచు శోధన కలుగుతుది. ఈ విషయములో తొందరపడుట వలన కలిగే ప్రమాదమును గురించి మనము ఇప్పటికే చూశాము. దేవుని సమయము కొరకు ఎదురుచూచుట వలన ఏమీ నష్టపోము. కాని ఇంకా తీవ్రమైన శోధనలు ఉన్నాయి. దేవని యొక్క వాక్యములో స్పష్టమైన బోధ ఉన్నప్పటికీ, ఘోరముగా అవిధేయత చూపించి అవిశ్వాసులను వివాహము చేసుకుంటారు. విద్యార్థి దశలో ఎంతో దైర్యముగా ఉన్న అనేకులు తరువాత విచారకరముగా ఈ కీలకమైన సమయములోనే పడిపోతారు. దేవునికి ఎంతగానో ఉపయోగపడే విధముగా మొదలుపెట్టిన జీవితము ఈ విషయములో రాజీపడుటద్వారా సమస్తఉపయోగము రద్దు చేయబడుతుంది. ఇది సాతానుకు నమస్కరించుటకు చెల్లించవలసిన క్రయము.


భారతదేశములోని యౌవనస్తులు వారి భాగస్వాములను ఎంచుకొనే సమయములో వారు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. మారుమనస్సు పొందని మరియు సానుభూతిలేని తల్లిదండ్రులు మరియు బంధువుల యొద్ద నుండి ఒత్తిడిలు వస్తాయి. కేవలము పేదరికము వలనను లేక అన్యాయపూరితమైన వరకట్న వ్యవస్థ వలన ఆర్థిక సంబంధమైన ఒత్తిడిలు కలుగుతాయి. అన్నింటికంటే విచారకరమైనది క్రైస్తవ్యములోనికి మారిన తరువాత కూడా ఈ దేశము యొక్క అన్యాచారమైన కులవ్యవస్థ ఇంకా నిలచి యుండుట వలన సాంఘీక పరమైన ఒత్తిడిలు వస్తాయి. అపవాది తీసుకొని వచ్చిన ఈ ఒత్తిడిలకు అనేకమంది యౌవనస్తులు చివరికి ఓడిపోయి, ఆత్మీయత లేని సంబంధమునకు ఒప్పుకొనుటలో ఆశ్చర్యము లేదు. సాతాను మనలను మోసగించుటకు లెక్కలేనన్ని నిజమనిపించే వాదనలను కలిగియున్నాడు. 2కొరింథీ 6:14లో చెప్పుచున్న అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అను మాటలలో ''ఉండకుడి'' అని ఆలోచించుట ''చాలా సంకుచిత మనస్సు''తో కూడుకున్నది అని మనకు చెబుతాడు. ''వివాహము జరిగిన తరువాత నీ భాగస్వామిని సువార్త నమ్మమని నచ్చచెప్పచ్చు అప్పుడు అంతా బాగానే ఉంటుంది. నీవు ఈ బంగారు అవకాశమును కోల్పోయినట్లయితే, నీకు ఇంత అనుకూలమైన సంబంధము మళ్ళీ రాకపోవచ్చు''. తన సలహాలను ఎంతమంది తీసుకున్నారో కదా! దేవుడు అద్భుతములను చేస్తాడు. ఎంతో ప్రార్థనకు ఫలితముగా దేవుడు మారుమనస్సు పొందని కొంతమంది భర్తలను, భార్యలను రక్షించాడు. కాని మనము ఆయనకు అవిధేయత చూపించుటకు ఇది హేతువు కాకూడదు. సాతానుకు నమస్కరించుటకు ఇది సాకు కాదు.


నీ జీవితములో అటువంటి సమయము వచ్చినదా? నేను నీకు విజ్ఞప్తి చేస్తున్నాను: నీ ఒప్పుదలలను బట్టి నిలబడుటకు ధైర్యముగా నుండుము! ఎంత ఒత్తిడి ఉన్నా సరే సాతాను సంబంధమైన ప్రతిపాదనలన్నింటినీ త్రోసివేయుము. ప్రార్థనతో ఆయన సహాయము వెదకి తన చిత్తము కొరకు ఆయన యొద్ద కనిపెట్టుము. అతడు నిన్ను తప్పిపోవునట్లు చేయడు. ఆయనను ఘనపరచు, తన ఉద్ధేశ్యంలో ఉన్న భాగస్వామిని నీకిస్తాడు; ఆయన ఎన్నుకున్నదైతే, కేవలం అది శ్రేష్టమైనదే.


శత్రువునకు సాష్టాంగపడి నమస్కరించు (ఆరాధించు)టకు మన ప్రాణములకు అనేక నిగూఢమైన శోధనలు వస్తుంటాయి. సహోదరీ, సహోదరులారా, మీ జీవితముల కొరకు దేవుని యొక్క ఉద్దేశ్యమును కోల్పోవద్దు అనుకున్నట్లయితే వాటన్నింటిని తిరస్కరించండి. నైతిక మరియు ఆత్మీయమైన యధార్థతను కలిగియుండు మార్గమును అంటి పెట్టికొని యుండండి, ఒకవేళ దీనిద్వారా లోకసంబంధమైన నష్టము కలిగినా సరే. తక్కువ ఒప్పుదల కలిగిన వారు మరియు బహుశా రెండు లోకములలోను శ్రేష్టమైన వాటిని వెదకే ఇతర విశ్వాసుల ద్వారా తప్పుత్రోవలో నడిపించబడవద్దు. నీ కంటే మంచిగా ఉన్నట్లుగా వారు కనబడితే ఏమిటి? అటువంటి రూపములు మోసగించవచ్చు. ఈ లోకములో ఎంతో ''విజయముగా'' పిలువబడినది నిత్యత్వపు స్పష్టమైన వెలుగులో ఓటమిగా నిర్ణయించబడవచ్చు. దానిలో ఏదీ కలిగియుండకుండా తీర్మానము చేసుకో. అభివృద్ధి చెందుటకు గాని లేక లాభము కొరకు గాని అపవాది యొక్క సులభమైన మార్గములను అనుమతించకుండా తిరస్కరించుము. దేవునితో నడుస్తూ కేవలము ఆయన యొక్క ప్రశంసను మాత్రమే కోరుకొనుము. ఆయనకు అంటిపెట్టుకొని యుండుము, అప్పుడు తుదకు నీవు పశ్చాత్తాప పడవలసిన అవసరము ఉండదు.


ఇప్పటి వరకు, మనలను దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశ్యముల కొరకు ముందుకు సాగిపోనీయకుండా ఆటంకపరచగలిగిన పాపపు విషయములను మాత్రమే మనము పరిగణించాము. కానీ, మనలను ఆటంక పరచగలిగిన సక్రమమైన (పాపము కాని) విషయములు కూడా ఉన్నాయి. అందుకే, పరుగు పందెములో మనలను ఆటంకపరచు పాపములను ప్రక్కకు పెట్టడమే కాదు, ప్రతి బరువును కూడా ప్రక్కకు పెట్టాలని హెబ్రీ 12:1లో మనము హెచ్చరించబడ్డాము.


ఒక ఉదాహరణ తీసుకుందాము. మాట్లాడుట అను దానిలో ఎటువంటి పాపము లేదు. కాని మాట్లాడుట అనేది ఎంతో తేలికగా ప్రమాదకరమైన పుకారుగా దిగజారిపోవచ్చును. బైబిలు అధ్యయనము మరియు విజ్ఞాపనకు బదులుగా నిరుపయోగమైన మాటలలో మునిగిపోవచ్చును. ఎక్కువగా మాట్లాడే వాడు బుద్ధిహీనుడని ప్రసంగి 5:3 చెబుతుంది. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని సామెతలు 10:19 హెచ్చరిస్తున్నది. వారి యొక్క సంభాషణలో క్రమశిక్షణ లేకపోవుటను బట్టి అనేక మంది విశ్వాసులు దేవుని బూరగా ఉండే ఆధిక్యతను కోల్పోయారు (యిర్మీయా 15:19). అధికమైన లేక నిర్లక్ష్యమైన సంభాషణ తప్పనిసరిగా ఆత్మీయశక్తి కారిపోవునట్లుగా చేస్తుంది.


ఇంకొక దానిని చూద్దాము. క్రైస్తవ ఆరాధనలో సంగీతము యొక్క విలువను ఎవరూ ప్రశ్నించలేరు. కాని అసంఖ్యాకమైన గంటలను మన గొంతులకు తర్ఫీదు ఇచ్చుటలోను, లేక సంగీత వాయిద్యములతో మన తలాంతులను అభివృద్ధి చేసుకొనుటలోను గడుపుతూ మన బైబిలు అధ్యయనము కంటే, ప్రార్థన కంటే అవి ఎక్కువ ప్రాముఖ్యమైనట్లయితే అది సక్రమము (పాపము కానిది) అయినా కూడా మన ఆత్మీయ ప్రగతికి ఆటంకముగా మారుతుంది. వారి అనుదిన మౌనధ్యాన సమయము కంటే వారి సంగీత అభ్యాసమునకు ఎంతో క్రమముగా ఉండే విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు.


అపొస్తలుడైన పౌలు, సాతాను యొక్క అనేకమైన తంత్రములను ఎరిగిన వాడైయుండి కేవలము పాపపు విషయములను తొలగించుకొనుటలోనే జాగ్రత్తగా నుండక, తాను దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చుటకు ఆటంకముగా నున్న సక్రమమైన (లాభకరములు కాని) విషయములను తొలగించుకొనుటలో కూడా జాగ్రత్త కలిగియున్నాడు (1కొరింథీ 10:23). అతడు తన ప్రాధాన్యతలను సరిగా కలిగియుండి, ప్రభువు యొక్క గురిని చేరుకొనుటకు కొన్ని మంచి విషయములను కూడా వదలిపెట్టవలెనని నిర్ణయించుకున్నాడు.


క్రైస్తవ జీవితములో కూడా మంచి అనేది ఉత్తమమైన దానికి శత్రువు అని పౌలు చూశాడు. మనలను పాపసంబంధమైన విషయముల ద్వారా ఆటంక పరచలేనని అపవాది కనుగొన్నప్పుడు, సక్రమమైన (లాభకరముకాని) విషయముల ద్వారా మన ప్రభావమును తగ్గించుటకు చూస్తాడు. ఏవి క్షేమకరములో, ఏది లాభకరములో ఏవి కావో గ్రహించుట కొరకు దేవుని సహాయము అడుగునట్లుగా ఇది మనలను మోకాళ్ళపైకి నడిపించాలి.


మనలను బలపరచు శక్తి


ఇప్పటిదాకా మనము చూసినవన్నీ కూడా మనలను నిరుత్సాహపరచే విధముగా ఉన్నాయి. విజయవంతమైన రక్షణ ఏది లేకుండా మనము విడువబడ్డట్లుగా సాతాను యొక్క తంత్రములు కుయుక్తిగా కనిపిస్తాయి. సాతాను యొక్క వేధింపులను జయించుటకు మనము నిజాయితీగా సంవత్సరముల కొద్దీ ప్రయత్నిస్తూ ఓడిపోయుండవచ్చు. అయితే మన కొరకు నిరీక్షణా సందేశము దేవుని యొద్దనున్నది. తన పరిశుద్ధాత్మను ఆయన మనకిచ్చాడు. దేవుని యొక్క సంకల్పమంతటినీ మనము నెరవేర్చునట్లుగా బలపరచుటకు గల శక్తి ఆయన యొద్దనున్నది. పరిశుద్ధాత్మ అను ఈ వరము మనలో నివసించకుండా, దేవుడు అటువంటి ఆజ్ఞలను (డిమాండ్స్‌) మనకివ్వడు. ఆయన సహాయము లేకుండా మనము ఆయన చిత్తమును చేయవలెనని దేవుడు ఎప్పుడు ఆశించడు. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మరియు పరమునకు ఆరోహణము జరిగిన తరువాత తనకు అప్పగించుకొనిన ఏ మానవ జీవితములోనైనను పరిశుద్ధాత్ముడు నివసించి, నింపును. మనము జీవిస్తున్న ఈ యుగము యొక్క ప్రత్యేకమైన గుర్తు ఇదే.


దేవుడు తన యొక్క ఉన్నత ఉద్దేశ్యము కొరకు మనలను పిలువడమే కాదు. దానిని మనము చేరుకొనునట్లు మనకు సామర్థ్యము కలుగజేయును.


దేవుని సొంత కుమారుడైన, ప్రభువైన యేసు క్రీస్తు కూడా తాను ఈ భూలోక పరిచర్యను ప్రారంభించక మునుపు పరిశుద్ధాత్మతో నింపబడవలసి వచ్చినది. తాను బాప్తిస్మము తీసుకొనుచుండగా ఈ సంఘటన జరిగినది. ఆ తరువాత వచ్చిన అరణ్యములోని శోధనలగుండా పరిశుద్ధాత్మ శక్తిని బట్టే యేసు విజయవంతముగా వచ్చాడు. సుదీర్ఘమైన తన భూలోక పరిచర్య మరియు సిలువ మార్గములో నడచునట్లుగా ఆయనకు సామర్థ్యము కలుగజేసినది ఈ పరిశుద్ధాత్మయొక్క శక్తియే.


పౌలు మరియు ఇతర అపోస్తలుల జీవితములలో కూడా ఇదే జరిగినది. దేవుని యొక్క ఆత్మ శక్తిని బట్టే తాను దేవునికి చేసినసేవ చేయగలిగానని పౌలు సాక్ష్యమిచ్చాడు (రోమా 15:18,19). ''ఆత్మపూర్ణులై యుండుడి'' (ఎఫెసీ 5:18) అనే ఆజ్ఞను నేడు అనేకులు నిర్లక్ష్యము చేసియున్నారు. దీనిని బట్టి వారు మూఢభక్తి (ఫెనాటిక్స్‌) గలవారు అవుదురేమోనని ఈ సంపూర్ణతను కోరుకొనుటకు అనేకులు భయపడుదురు. సంఘములో ఎక్కువ భాగము దీనికొరకు శ్రద్ధగా వేదుకకుండా దూరముగా వెళ్ళిపోవునట్లు అపవాది ఉద్రేకభయమును వాడుకున్నాడు. ఎప్పుడో గతములో జరిగిన పారవశ్యము కలిగించే అనుభవమును బట్టి తృప్తిపడునట్లు అపవాది మరికొందరినుంచాడు. అది ఒకవేళ దేవుని నుండే కలిగినా, పరిశుద్ధాత్మతో నిరంతరము నింపుదల కలిగియుంటూ ప్రస్తుతము అనుభవించనట్లయితే అది విలువలేనిదిగా ఉంటుంది.


ఈ సంపూర్ణ ఆత్మ నింపుదల గురించి అనేకులు గందరగోళమునకు గురవుతారు. దేవుడు తన ఆత్మను మనకిచ్చుటకు ఎంతో అయిష్టముగా నున్నాడని వారు ఆలోచన కలిగియుంటారు. అయితే లూకా 11:11-13లోనే ప్రభువైన యేసు మాటలు మన మనస్సులలో నుండి ఆ అనుమానములను ఎప్పటికీ తరిమివేయాలి. ''పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను''. కనుక ఆ ఆశీర్వాదమును మనకిచ్చుటలో దేవుడు ఆలస్యము చేస్తున్నట్లయితే సమస్య దేవునిలో లేదు గాని మనలోనే ఉన్నది. కేవలము మనము దేవుని యొద్దకు వెళ్ళి ఈ నింపుదల కోసం సామాన్యమైన విశ్వాసముతో అడగాలి. ఆయన మన యొద్దనుండి కోరుకొనేదల్లా ఏమిటంటే, మన జీవితములను షరతులు లేకుండా ఆయనకు అప్పగించుకొనాలని మాత్రమే. ఈ షరతులను నెరవేర్చి, ప్రతి దినము వాటిని నిర్వహిస్తున్నట్లయితే, మనము అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటాము.


ఈ విషయములో డా|| వాల్టెర్‌.యల్‌. విల్సన్‌ గారి సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరముగా నున్నది. పదిహేడు సంవత్సరముల క్రితము రక్షణ అనుభవము తెచ్చిన మార్పుకంటే, పరిశుద్ధాత్మకు సమర్పించుకొనిన అనుభవము తన జీవితములో మరి ఎక్కువ మార్పు తెచ్చిందని అతడు అన్నాడు. రక్షణ పొందిన కొన్ని సంవత్సరముల తరువాత ఈ మాటలు చెప్పాడు. తన జీవితము మరియు పరిచర్య యొక్క ఫలములను బట్టి డా|| విల్సన్‌ అసంతృప్తితోనే ఉన్నాడు. తన జీవితములో పరిశుద్ధాత్మకు తగిన స్థానమును ఇవ్వకపోవుటను బట్టియే ఈ విధముగా నున్నదని అతడు చివరకు తెలుసుకున్నాడు. అదే సమయములో ఆత్మపూర్ణతను కోరుకుంటే మూడభక్తి గలవాడినై పోతానేమోననే భయము అతనిలో నున్నది. ఒకరోజు రోమా 12:1లో నుండి ఒక సందేశము విన్నాడు. దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను సమర్పించు కొనుడని ఆ ప్రసంగీకుడు నొక్కిచెబుతుండగా, ఇది పరిశుద్ధాత్మకే సమర్పించుకొనవలెనని తలంచాడు. యేసు ప్రభువు తన స్వంత శరీరమును కలిగియున్నాడు, తండ్రి యైన దేవుడు పరలోకములో సింహాసనము మీదనున్నాడు. పెంతెకొస్తు దినమున శరీరము లేకుండా భూమిపైకి దిగివచ్చినది పరిశుద్ధాత్ముడే. డాక్టర్‌. విల్సన్‌ ఈ సందేశం విన్న తరువాత తన గదిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో తివాచీపై సాగిలపడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ మాటలతో సంబోధించాడు: ''నా ప్రభువా, నా క్రైస్తవ జీవితమంతటిలో నిన్ను అగౌరవపరచాను, నేను నిన్ను ఒక సేవకుడిలాగా చూశాను. నీవు నాకు కావలసివచ్చినప్పుడు నేను నిన్ను పిలిచాను. నేను ఏదైనా ఒక కార్యమును చేయుటకు తలపెట్టినపుడు నీవు వచ్చి ఆ కార్యమును నిర్వర్తించవలసినదిగా హెచ్చరించాను. నేను నిన్ను ఒక సేవకుని స్థానములో ఉంచాను. నేను నియమించుకొన్న, నేను ఏర్పరచుకొన్న పనిలో ఇష్టపడి సహాయము చేసే సేవకునిలా నిన్ను ఉపయోగించుకొనుటకు నేను చూశాను. నేను ఇక ఆ విధముగా చేయను. ఇప్పుడే ఈ నా శరీరమును నీకు ఇస్తున్నాను. నా తల మొదలుకొని అరికాలు వరకు నీకు సమర్పించుకుంటున్నాను. నా చేతులను, కాళ్ళను, కళ్ళను, పెదవులను, మెదడును అవి బాహ్యంగా నున్నవైనను అంతరంగముగా నున్నవైనను నాకున్నవన్నీ నీకు అంకితము చేస్తున్నాను. నీవు సంతోషపడేలా, నీవే నాలో జీవించునట్లు ఇవన్నీ నీకే అప్పగిస్తున్నాను. ఈ శరీరమును నీవు ఆఫ్రికా పంపించవచ్చు లేక క్యాన్సర్‌ (రాచపుండు)తో పడక మీద నుంచవచ్చు. నీవు ఈ నేత్రములకు అంధత్వము కలుగజేయవచ్చు లేక నీ సందేశముతో టిబెట్‌ పంపవచ్చు. ఈ శరీరమును ఎస్కిమో ప్రజల యొద్దకు తీసుకువెళ్ళవచ్చు లేక న్యుమోనియా జబ్బుతో ఆసుపత్రికి పంపించవచ్చు. ఈ క్షణము నుండి ఇది నీ శరీరము. దీని కొరకు మీరే సహాయము చేయండి. రోమా 12:1లో, ''దేవునికి అనుకూలమైన'' సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని నీవు చెప్పిన ప్రకారము నా శరీరమును నీవు అంగీకరించావని నమ్ముతూ నీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను. నా ప్రభువా నన్ను అంగీకరించినందుకు మరొకసారి వందనములు చెప్పుచున్నాను. ఇప్పుడు మనము ఒకరికొకరము సంబంధము కలిగియున్న వాళ్ళము''.


డాక్టర్‌.విల్సన్‌ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకున్న మరుసటి దినము నుండే తన సేవలో అసాధారణమైన ఫలితములు చూచినట్లుగా సాక్ష్యమిచ్చాడు. ''వారు రహస్యమును కనుగొన్నారు'' (ుష్ట్రవవ ఖీశీబఅస ుష్ట్రవ ూవషతీవ్‌) అను వి. రేమండ్‌ ఎడ్సన్‌ వ్రాసిన పుస్తకములో 18వ అధ్యాయము నుండి ఈ సంఘటన సేకరించబడినది).


మీరు వెళ్ళి ఇదే విధముగా చేయవలెనని నేను మిమ్ములను అడుగుటలేదు. మనము వేరే వారిని అనుకరించాలని దేవుడు అడుగుటలేదు. అయితే మనము జాగ్రత్తగా చూడవలసిన ఒక నియమము ఇక్కడున్నది. అదేమిటంటే, మనము షరతులు లేకుండా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలను పూర్తిగా నింపుతాడు. తరచుగా మన సమర్పణ అనేకమైన అంతరంగ షరతులతో కూడియుంటుంది. మనము ఒకరకమైన ప్రదేశములకు వెళ్ళుటకు ఇష్టపడము లేక ఒకరకమైన ఉద్యోగము (వృత్తి) చేయుటకు ఇష్టపడము.


మనము ప్రభువును ఎక్కడ, ఎలా సేవించాలో మన లోపల కొన్ని ఎంపికలను కలిగియుండి, మన మనస్సులో ఉన్న కార్యములో విజయము సాధించుటకు పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటాము. అసలు విషయము అది. మనము షరతులతో ఆయనకు అప్పగించుకుంటాము. మనము మన స్వంత విధానములను ఏర్పరచుకొన్నాము. అందుకే పరిశుద్ధాత్మ యొక్క కార్యములను బహు అరుదుగా మనము చూస్తున్నాము. అనేకసార్లు ఆయన యొక్క అభిషేకము లేకుండానే మనము బాగానే ముందుకు వెళ్ళుచున్నామని బహుశా మనము అనుకొనవచ్చును. కాని మనము ఏమి కోల్పోతున్నామో మనకు తెలియదు. మనము ఎంత బుద్ధిహీనులము! మన జీవితములను అత్యంత ఉపయోగకరముగా చేయువాడు పరిశుద్ధాత్ముడు కాడా?


సహోదరీ, సహోదరులారా మన సమర్పణ దేవుని ఆత్మకు నిజముగా షరతులు లేనిదిగా ఉండేవరకు, ఆయన ఏ విధముగా మనలను సంపూర్ణముగా స్వాధీనపచుకుంటాడు? చివరకు ఎంత అల్పమైన పనులనైనను చేసే విధముగా, యదార్థముగా తన చిత్తమంతటినీ చేయుటకు మనము ఇష్టపడియుండాలి. వివాహ విషయములలో, ప్రభువులో మనతో ఎవరైతే ఒకరిగా నున్నారో వారిని దేవుడు మన భాగస్వామిగా ఎంపిక చేసినపుడు వారు నల్లగా ఉన్నా లేక తెల్లగా ఉన్నా, చదువుకున్న వారైనా లేక చదువులేని వారైనా, ధనవంతులైనా లేక పేదవారైనా మనము అంగీకరించుటకు ఇష్టపడియుండాలి. మనము ఆయనతో ఉండాలనుకున్నట్లయితే, ఉద్యోగ విషయములో కూడా మనకు, మన కుటుంబాలకు ఎంత నష్టమైనాసరే, అది నిరంతరము బదిలీలతో కూడుకున్నదైనా సరే లేక మన జీవితాంతము ఒకే ప్రదేశములో ఉండవలసినదైనను సరే దానికి మనము సిద్ధపడియుండవలెను. ఏ విషయములోను వ్యక్తిగత ప్రాధాన్యతలు లేక షరతులు లేకుండా ఎప్పుడైనా పరిశుద్ధాత్మకు ఈ విధముగా మనము అప్పగిచుకున్నామా? కేవలం ఇటువంటి సమర్పణ మాత్రమే మన జీవితములలోనికి సంపూర్ణముగా ఆయన శక్తిని తీసుకువస్తుంది. కేవలము ఆ శక్తితో మాత్రమే మనము దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చగలము.


మనలను నిలచియుండునట్లు చేసే మనస్సు యొక్క వైఖరి


ఫిలప్పీయులకు వ్రాసిన పత్రికలో మనము పరిగణించుచున్న వాక్యభాగములో, దేవునియొక్క సంపూర్ణమైన ఉద్దేశ్యమునకు చేరుకొనాలంటే, మనకుండవలసిన మనస్సు యొక్క వైఖరిని గురించి పౌలు ఇక్కడ మనకు మాదిరి చూపిస్తు వివరిస్తున్నాడు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచున్నానని అతడు మనకు చెప్పుచున్నాడు. అతడు వెనుకకు తిరిగి చూచుటకు ఎన్ని శోధనలు కలిగినా కూడా, అతడు వెనుకకు తిరిగి చూచుటకు నిరాకరించాడు. బంధకములును, శ్రమలను నా కొరకు కాచుకొనియున్నవని నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై వెళ్లుచున్నాను, అయితే యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదని అపొ.కా. 20:23,24లో పౌలు చెప్పుచున్నాడు. తరువాత, అపోస్తలుల కార్యములు 26:19లో అగ్రిప్ప రాజుకు ఈ విధముగా సాక్ష్యమిస్తున్నాడు: దాదాపు ముప్పది సంవత్సరముల క్రితం ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. నేను మంచి పోరాటము పోరాడి, నా పరుగు కడముట్టించితినని తాను వ్రాసిన చివరి పత్రికలో చెప్పగలిగాడు (2తిమోతి 4:7). తన చివరి దినమువరకు దేవుని యొక్క ఉద్దేశ్యము అను మార్గములో పట్టువదలక వెంబడించిన వ్యక్తి ఈయన. వదలివేయమని అనేక ప్రేరణలు కలిగినా, మహా శ్రమలు కలిగినా, దుషణలు, అపనిందలు వేసినా, వీటన్నింటిని ఓర్చుకొని, గురి యొద్దకు మాత్రమే దృష్టికలిగియుండి నమ్మకముగా తన పనిని కడముట్టించాడు. మన జీవితాంతములో మనము ఇటువంటి సాక్ష్యమును కలిగియుండుట ధన్యకరము.


వెనుకకు తిరిగి చూచుటకు ఎంత తరచుగా మనము శోధింపబడుచున్నాము! గతములోని ఓటములు మనలను నిరుత్సాహపరచుటకు దారితీస్తాయి, ఇది జరిగినపుడు సాతాను మన యొద్దకు వచ్చి దేవునికి నీతో ఏమీ ఉపయోగము లేదని మన చెవులలో ఊదుతాడు. ఒక గాడిద ప్రభువునకు కావలసి యున్నదని చెప్పిన సందర్భము ఎప్పుడూ నాకు ఎంతో ప్రోత్సాహమునిస్తుంది (మత్తయి 21:2,3). యేసు క్రీస్తు ప్రభువుకు తన మెస్సయ కార్యక్రమమును నెరవేర్చుటకు ఒక గాడిద అవసరమైతే, దేవుడు ఒక సందర్భములో గాడిద ద్వారా కూడా మాట్లాడాడు (సంఖ్యా 22:28). కనుక మనందరకు కూడా నిరీక్షణ ఉంది. కాబట్టి గడచిన దినముల గురించి వ్రాయబడినది, మరియు బిలాము గాడిద గురించి వ్రాయబడినది కూడా మనలను ప్రోత్సాహించుట కొరకే (రోమా 15:4). నీవు ఒక గాడిద వంటి బుద్ధిహీనుడనని నిన్ను నీవు అనుకొనవచ్చు, నీవు పదివేల తప్పులు చేయవచ్చు: అయినా కూడా నీ ప్రభువుకు నీవు కావాలి మరియు ఆయన నిన్ను ఏర్పరచుకుంటే నీ ద్వారా మాట్లాడతాడు కూడా.


రేపటి గురించి ఆలోచించవద్దని చెప్పిన బైబిలే అదే అత్యవసరముతో వెనుకకు తిరిగి చూడవద్దని కూడా చెప్పుచున్నది. ఈ రోజును ఎదుర్కొని, భవిష్యత్తు కొరకు దేవుని యందు నమ్మకముంచుటకు గాను మన నిన్నటి దినములన్నింటిని ముగించాలి. రేపటి దినమున నీవు తప్పిపోయినట్లయితే, అది నిన్ను నిరాశలోనికి నెట్టివేయనియ్యవద్దు. నీవు వెళ్లి నీ ఓటమిని దేవుని యొద్ద ఒప్పుకొని తన రక్తములో కడుగబడు. తరువాత ముందుకు సాగిపొమ్ము. నీకు మరియొకసారి తప్పిపోయినట్లయితే వెళ్లి అదే విధముగా చేయుము. నిరాశలో నిన్ను నీవు ఎప్పుడు పెట్టుకొనవద్దు. వెనుకకు తిరిగి చూచి గతమును గురించి చింతించుట అనే వ్యర్థమైన దానిని తిరస్కరించుటకు తీర్మానము చేసికొనుము. వెనుకకు తిరిగి గతమును గురించి చింతించుట అంటే పడిపోయిన పాలను గురించి ఏడ్చుట లాంటిది.


అయితే గర్వముతో వెనుకకు తిరిగి చూచుటను కూడా తిరస్కరించవలెను. అది నిన్ను నాశనము చేస్తుంది.రేపటిదినమున ఒకవేళ దేవుడు నిన్ను అద్భుతముగా వాడుకున్నట్లయితే, దానిని కూడా మరచిపోవుటకు దేవుని కృప కొరకు చూడాలి. నిన్ను నీవే మెచ్చుకొనే పనిలో ఉండవద్దు. ముందుకు సాగిపొమ్ము. ఒకవైపు నిరుత్సాహముగాను మరియొక వైపు గర్వమును మన మార్గములో నుండునట్లు చేసి మరియు మన ప్రభావమును తగ్గించునట్లు సాతాను ఉపయోగించుకొనును.


మనము ఈ చెడ్డదినములలో జ్ఞానము కలిగినడచుకొనుటకు సమయము సద్వినియోగము చేసుకొనవలెనని ఎఫెసీ 5:15,16లో చెప్పబడ్డాము. అంటే, మన మార్గములో వచ్చు ప్రతి అవకాశమును తెలుసుకొని ప్రభువు యొక్క మహిమ కొరకు వాడాలి (1కొరింథీ 15:58). మనలోని ప్రతి ఒక్కరము సంక్లిప్తమైన (చిన్న) జీవితమును కలిగియున్నాము, ఈ జీవితములోని ప్రతి దినము దేవునికి ఉపయోగపడే విధముగా చేయాలి. నిలకడగా ఆయన వైపునకు చూస్తూ ఉంటేనే ఈ విధముగా జరుగుతుంది. మనము ఎంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు పిలువబడినా, మనము ఈ వైఖరి కలిగిన మనస్సును కలిగియుందాము. కాని మన చుట్టూ ఉన్న విశ్వాసులతో పోల్చుకొనుట కూడా మనలను నిరుత్సాహమునకు లేక గర్వమునకు దారితీస్తుంది. (యోహాను 21:20-22; 2కొరింథీ 10:12). మనము ఇటు అటు చూడక సూటిగా చూడాలి (సామెతలు 4:25).


పౌలు మారుమనస్సు పొందకమునుపు కూడా తన మతము యెడల హృదయపూర్వకముగా నున్నాడు (అపొ.కా.22:3,4). తరచుగా మన దినములలో చూస్తున్నట్లు బలహీనమైన, పేలవమైన విశ్వాసము కాదతనిది. అతడు మారుమనస్సు పొందిన తరువాత, అదే హృదయపూర్వకమైన భక్తిని క్రీస్తు యెడల కలిగియున్నాడు. ఇప్పుడు కలిగిన ఒకే ఒక బేధమేమిటంటే తన మనస్సును భూమి మీద కాకుండా, పైనున్న వాటిపైనే ఉంచాడు. పునరుత్థానుడైన మన యేసు ప్రభువు నులివెచ్చని స్థితిలో ఉన్న వారి యెడల ఆయనకెటువంటి ప్రశంస భావము లేదని స్పష్టముగా చెప్పుచున్నాడు (ప్రకటన 3:16). తన ప్రజలలో సంపూర్ణ సమర్పణ కొరకు దేవుడు చూస్తున్నాడు; తనకు సంపూర్ణముగా సమర్పించుకున్న వారు మాత్రమే భూమిపై దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చగలరు. మన క్రైస్తవత్వములో అర్థ హృదయముతో ఉన్నట్లు మన చదువులలో ఉన్నట్లయితే కనీసం ప్రాథమిక విద్యను కూడా ముగించియుండే వారము కాదు. లేక అర్ధ హృదయముతో అనేకమంది విశ్వాసులు దేవుని సేవ చేసినట్లుగా వారి ఉద్యోగాలను చేసినట్లయితే వారి ఉద్యోగములనుండి ఎప్పుడో తొలగింపబడి యుండేవారు. అనేకమంది క్రైస్తవులకు లౌకిక సంబంధమైన విషయాలు చేయుటకు నిండు హృదయమున్నది గాని అయ్యో! దేవుని సేవలో వారి నిండు హృదయము చాలా తక్కువసార్లు కనబడుతుంది. తన హృదయపూర్వకముగా హిజ్కియా పని చేసినపుడు, వర్థిల్లెను (2దినవృత్తాంతములు 31:21) అని చెప్పబడినది. ''అంతకు మునుపటి విషయములను'' అతడు మరచిపోయిన దినము ఒకటి వచ్చినది. అతడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజున ఎంతో దు:ఖకరముగా ప్రభువు యొద్ద నుండి తప్పిపోయాడు.


తనను వెంబడించే వారు గమ్యము మీద దృష్టికేంద్రీకరించాలని ప్రభువైనయేసు మాటలతోను, ఉపమానములతోను వారిని పురిగొల్పాడు. తనను వెంబడించు వానిలో నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను (లూకా 9:62). తన తండ్రి చూపించిన మార్గములో వెళ్లుటకు ''తన మనస్సును స్థిరపరచుకొని'' ప్రభువైనయేసు వెళ్లుచున్నట్లుగా దీనికంటే ముందు మనము చదువుతున్నాము (51వ వచనము). నేను నా ''తండ్రి పని'' మీద ఉండాలి అనేది యేసు ప్రభువు యొక్క మార్పులేని వైఖరి. అదే దిశలో, మార్గములో వెళ్లుటకు ఇష్టపడని అనుచరులను ఆయన కోరుకొనడం లేదు.


యేసుక్రీస్తు యొక్క శిష్యునికి ఉండవలసిన ఒకే ఒక్క గురి ఏమిటంటే దేవుని చిత్తమును చేస్తూ ఆ విధముగా ఆయనను మహిమపరచుట. జీవితములోని సమస్తము-ధనము, స్థానము, వివాహము, ఉద్యోగము మొదలగునవన్నీ కూడా ఇదొక్కటి చేయుటకే. అన్నీ కూడా దేవుని యొక్క సంకల్పము కొరకే. మనము కేవలము ఇటువంటి వైఖరితో మన మనస్సును కలిగియున్నప్పుడు మాత్రమే రోమా 8:28లోని వాగ్దానమును మనకొరకు ఎత్తి పట్టుకొనగలము. ఎవరైతే దేవుని ప్రేమించుదురో ఆయన ఉద్దేశ్యముతో ఎవరైతే ఏకీభవించి ఉందురో వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును.


ఈ భూమి మీద దేవుని చిత్తము జరిగించిన వారి యొక్క పనులే నిత్యత్వములో నిత్యము నిలుస్తాయనే విషయమును మనం జ్ఞాపకముంచుకోవడం మంచిది (1యోహాను 2:12). మిగిలినవన్నీ కూడా నశించిపోవును. కనుక దేవుని చిత్తము చేయుటయే మన ఏకైక లక్ష్యం అయ్యుండవలెను. యేసుకున్నట్లే మనకు కూడా ఇది భోజనమును, పానము అయ్యుండవలెను (యోహాను 4:34). దేవుని చిత్తమంతటినీ చేయుటకు ఆశ కలిగియున్నవాడే దేవుని హృదయానుసారుడు. కేవలం అటువంటి వారు మాత్రమే దేవుని దృష్టిలో తమ తరము వారికి ప్రభావవంతముగా సేవించగలరు (అపొ.కా. 13:22,36). నేడు ఈ లోకములో అటువంటి స్త్రీ,పురుషుల కోసము దేవుడు చూస్తున్నాడు.


గత మూడు అధ్యాయములలో వలె, మనము జీవిస్తున్న దినములకు ఈ అంశము ఎలా అన్వయించబడుతుందో గమనిద్దాము. చివరి దినములను గురించి హెచ్చరించినపుడు ప్రభువైనయేసు లూకా 17లో వెనుకకు తిరిగి చూచుట వలన కలిగే ప్రమాదమును గురించి చెప్పాడు. ఆ విషయమును బోధించుటకు లోతు భార్య యొక్క భయంకరమైన మాదిరిని ఆయన చూపించాడు. ఆమె బలహీనత ఏమిటి? సొదొమలోని ఇతరుల వలె కాక, ఆమె దేవుని యొక్క సందేశమును నమ్మినది. అంత మాత్రమే గాక, ఆమె దానికి విధేయత చూపించి పట్టణము నుండి బయటకు వచ్చినది. అయితే ఆ తరువాత ఆమెకు వేరే ఆలోచనలు కలిగి వెనుకకు చూసినది. ఏ క్షణములోనైతే ఆమె తిరిగి చూచినదో అప్పుడే తీర్పు ఆమె మీదకి వచ్చినది. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయినది. ఆమె వెనుకకు తిరిగి చూచిన ఫలితముగా నిశ్చలముగా ఉన్న స్తంభము వలె మార్చబడినది. ఆ క్షణము నుండి ఆమె ఒక్క అంగుళము కూడా ముందుకు కదలలేక పోయినది.


ఈనాడు, దురదృష్టవశాత్తు, అనేక మంది విశ్వాసులు లోతు భార్య వలె నిశ్చలముగా (కదలకుండా) ఉన్నారు. ఎన్నో సంవత్సరముల క్రితము రక్షించబడి, అప్పటి నుండి దేవుని విషయములలో ఎటువంటి పురోగతి సాధించని వారిలో లోతు భార్యకు 20వ శతాబ్దపు ప్రతిరూపాలున్నారు. వారిలో పరిశుద్ధత లేక సమాధానము లేక సహనము వారు ప్రారంభించిన నాటికంటే ఇప్పుడు ఏ మాత్రము ఎక్కువ కాలేదు. పాపముల విషయములో పశ్చాత్తాపపడుటలో లేక ప్రభువునందు ఆనందించుటలో లేక లోకము మీద జయం పొందుటలో లేక దేవుని సంకల్పములు అర్థము చేసికొనుటలో వారు రక్షణ పొందిన దినము కంటే నేడు ఎక్కువకాలేదు. వారిని ఒకప్పుడు కలవరపరచిన (జాడ్యములుగా) పాపములు ఇప్పటికీ అంతే ఉన్నాయి. వారు రక్షించబడిన క్రొత్తలో కనబడిన సంపద కొరకు, స్థానము కొరకు, మరియు సౌఖ్యము కొరకైన కోరికలు ఈనాటికి కూడా వారిలో కనబడుతుంటాయి. దీనికి గల ముఖ్య కారణమేమిటంటే, వారు ముందుకు చూడక వెనుకకు తిరిగి చూశారు. చివరిదినములలో ఇది ప్రత్యేకమైన ప్రమాదమని ప్రభువైనయేసు స్పష్టముగా చెప్పాడు.


ఆయన సన్నిధిలోనికి వెళ్లిన తరువాత పశ్చాత్తాపపడవలసిన అవసరము లేని జీవితమును నీవు జీవించాలనుకుంటున్నావా? అయితే దేవుని చిత్తమంతటినీ చేయుటకు నిశ్చయించుకో. నీ జీవితము కొరకైన ఆయన ఉద్దేశ్యమును కనుగొనుటకు మరియు అర్థము చేసికొనుటకు అనుదినము ఆయనను వెదకుము. ఆ ఉద్దేశ్యము ఏమిటో, పరిశుద్ధాత్ముడు నీకు చూపించును. పుస్తకములనుండి సిద్ధాంతపరముగా దీనిని నీవు నేర్చుకొనలేవు గాని కేవలము నీవు ఆయనతో నడుస్తున్న కొద్దీ వచ్చే అనుభవము వలన మాత్రమే నేర్చుకొనగలవు. ''ప్రభువా, నీవు నన్నేమి చేయగోరుచున్నావు?'' అని పౌలు మారుమనస్సు పొందిన వెంటనే అడిగిన ప్రశ్న ఇది. దీనికంటే శ్రేష్టమైన వైఖరిని నీవు, నేను ఏమి కలిగియుండగలము?


మన లక్ష్యము దీర్ఘకాలము జీవించుట కాదు గాని దేవుణ్ణి సంతృప్తి పరచే జీవితముగా నుండునట్లు మనము గురి కలిగియుందాము. ఈ భూమిపైన దేవుని చిత్తము నెరవేర్చిన తరువాత మనము పరలోకము మరియు నిత్యత్వమునకు వెళ్లినపుడు అవి మనకు మధురముగా ఉంటాయి.


మనము ఈ మాటలు చదువుచుండగా, ప్రభువు యొద్దకు యదార్థముగా వచ్చి విశ్వాసముతో నీవు ఆయనకు ఈ మాటలు చెప్పుదువా: ''ప్రభువా, నా జీవితములో నీ సంకల్పమంతటిని నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఆ చిత్తమును కనుగొనుటకు నాకు జ్ఞానము లేదు, దానిని నెరవేర్చుటకు నాకు శక్తి లేదు. అయిననూ ప్రభువా, నీ ఉన్నతమైన పిలుపు అను బహుమానము కొరకు నా హృదయపూర్వకముగా చెమట, రక్తము మరియు కన్నీటితో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. నేను నీ సన్నిధిలోనికి ప్రవేశించినపుడు పశ్చాత్తాపపడకుండునట్లు, నా పనిని ముగించి భూమి మీద నీ నామమును మహిమ పరచాననే ఆనందముతో ఉండునట్లు నాకు దయచేయుము. ప్రభువా, దీని కొరకు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుము''.


ఈ విధముగా చేయుము, అప్పుడు రానున్న దినములలో నీ జీవితము అర్థవంతమైనదిగాని, నిరీక్షణ గలిగినదిగాను నీవు కనుగొంటావు. అటువంటి స్త్రీ, పురుషుల కొరకు ప్రభువు యొక్క కన్నులు భూమి యందంతట సంచారము చేయుచున్నవి. దేవుని యొక్క సమస్త చిత్తమును చేయుటకు అవసరమైన వెలను చెల్లించుటకు సిద్ధపడునట్లు ఈ తరములో నీకు, నాకు దయచేయును.


''ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము'' (ప్రకటన 3:11).


''ఉన్నతమైన మార్గమునకు నేను సాగిపోవుచున్నాను


నూతన ఔన్నత్యములను అనుదినము నేను పొందుచున్నాను


నేను ఇంకను ముందుకు సాగిపోవుచున్న వాని వలె ప్రార్థించుచున్నాను


ప్రభువా, ఉన్నతమైన స్థలము మీద నా పాదములను నిలుపుము


ప్రభువా, నన్ను పై కెత్తుము నేను నిలబడునట్లు చేయుము


విశ్వాసముతో పరలోకపు సమభూమిపై


నేను ఎన్నడూ కనుగొనని ఉన్నతమైన ప్రదేశములో


ప్రభువా, ఉన్నతమైన స్థలము మీద నా పాదములను నిలుపుము''


అధ్యాయము 6
దేవునికి ఇష్టుడైయుండెను


కేవలం మూడు మాటలలో పరిశుద్ధ లేఖనములో హనోకు యొక్క సాక్ష్యము లిఖించబడినది: ''అతడు దేవునికి ఇష్టుడై యుండెను'' (హెబ్రీ 11:5). సంపదను పోగుచేసుకున్నట్లు గాని లేక భూసంబంధమైన ఘనతను పొందినట్లుగాను అక్కడ చెప్పలేదు. ప్రసంగములు చేసినట్లుగాని లేక చేసిన మంచికార్యములు లేక తన సాక్ష్యముద్వారా ఆత్మలను దేవుని యొద్దకు నడిపించినది కూడా అక్కడ వ్రాయబడలేదు. అతడు ఎంత ప్రసిద్ధిగాంచాడో లేక ప్రముఖునిగా ఉన్నాడో కూడా మనకు అక్కడ చెప్పలేదు. దీనంతటికి బదులుగా ఆయన జీవితమంతటిని కలిపి ఒకే వాక్యములో ''అతడు దేవునికి ఇష్టుడై యుండెను'' అని మాత్రమే ఉన్నది మరియు అది చాలును.


సహోదరీ, సహోదరులారా, ప్రాముఖ్యమైనది కూడా ఇదే. నిత్యత్వములో విలువ గలిగిన ఒకే ఒక్క విషయము కూడా ఇదే. ''తన చిత్తము (ఆనందము) కొరకు'' దేవుడు అన్నింటిని సృష్టించెనని బైబిలు చెప్పుచున్నది (ప్రకటన 4:11). కావున మనము దేవునికి ఎంత ప్రీతికరముగా ఉంటే మన జీవితములు కూడా అంత ప్రభావముగా ఉంటాయి. మరే విధముగాను మన విమోచన క్రయధనమునకు న్యాయము జరుగదు. దేవుడు మహిమ పరచబడనట్లయితే ఈ భూమి మీద మన ఉనికి అర్థం లేనిదిగా ఉంటుంది.


ఈ పేజీలలో, జీవితము యొక్క కొన్ని నిజమైన ప్రాధాన్యతలను గురించి దేవుడు కలుగజేసుకుంటున్నాడని మనము నమ్ముదాము. కేవలము మనకు సమాచారము మాత్రమే ఇవ్వడం ద్వారా ఈ విధముగా చేయడు గాని ఆయన చూపించు వాటి మీద మనము పని చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. దాని ప్రకారం మన జీవితములను మనము చక్కదిద్దుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఈ పుస్తకము ద్వారా ఆత్మయొక్క సవాలు మనకు కలిగినట్లయితే, అది మన యొద్దనుండి ప్రతిస్పందనను కోరుతుంది. స్పందిచుటలో తప్పిపోయినట్లయితే అది కేవలం ఆత్మీయ స్తబ్ధతను మరియు మరణమును ఆహ్వానించడమే.


స్వీయజీవితము ఎంత నిగూఢమైనది, మానవుని హృదయము ఎంత మోసకరమైనది! ఈ లోకసంపదల కోసం ఎంత త్వరగా మనల్ని చెరపట్టుకు పోతుంది! ''యేసు ప్రభువును సంపూర్తిగా వెంబడించడంలో వచ్చే అనుమానాస్పదమైన సంతృప్తి కొరకు అటువంటి లోక సంపదలు మరియు సంతోషములు వదలిపెట్టడం ఎంతో విలువైనవిగా ఉంటాయి. ''ఓ'' ఇది ఎంత ఆశ్చర్యము. ఈ క్రైస్తవ పరుగు పందెం నిజముగా సుళువైన పద్ధతులతో పరుగెత్తవచ్చు! ప్రజాభిప్రాయములు తీవ్రముగా నుండుటకు వ్యతిరేకముగా ఉంటాయి. దీనిని మామూలుగా తీసుకుందాం. దేవుని కొరకు మితముగా జీవించుదాం''. ఇటువంటి విశ్వాసము లేని ఆలోచనల నుండి దేవుడు మనలను విడిపించును. మనము ప్రతిభారమును ప్రక్కకు పెట్టి బహుమానము కొరకు ముందుకు సాగిపోవుటకు ఆయన సహాయము చేయగలడు. లోకము యొక్క మూల ప్రమాణములనుండి తొలగిపోయి ఆయనిచ్చు శ్రేష్టమైన దానికంటే తక్కువైన మరిదేనిలోను మనము సంతృప్తి చెందకూడదని ఆయన చూస్తున్నాడు. దేవుడు ఘనపరచే మనుష్యునికి మనుష్యుల ఘనతలో ఏమి పని? పరలోక సంపదలే నీవు కోల్పోయే ప్రమాదములో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన సంపదలకు విలువ ఏమి ఉంటుంది?


నీ జీవితమునకు లౌకికమైన భద్రత కోసం వెదకుచున్నావా? విశ్వాసము వలన కలుగు ప్రమాదముల నుండి ఏదో ఒక విధముగా భీమా చేయించుకొనుటకు చూస్తున్నావా? అయితే నన్ను నమ్ము, నీవు తప్పనిసరిగా దానిని కోల్పోతావు. చివరిలో చూపించుటకు నీకు ఏమీ ఉండదు.


నీ మనస్సు మార్చుకో! యేసు కొరకు నీ జీవితమును పారవేయుటకు సిద్ధపడుము. తన సువార్త కోసం శ్రమపడుము. ఆ నిర్ణయమును బట్టి నీవు ఎన్నటికీ చింతించవు (పశ్చాత్తాపపడవు). ఏమీ వ్యర్థము కాలేదని, నిజమైన నష్టము ఏమీ కలుగలేదని అక్కడ నీవు కనుగొంటావు. దీనికి బదులుగా నీవు విత్తిన విత్తనములకు నిత్యత్వపు ఫలములు వచ్చినవని కనుగొంటావు. ఆయన పాదముల యొద్ద మనము పెట్టిన అర్పణకు పరలోక ప్రతిఫలములు ఎంతో ఎక్కువగా ఉంటాయి. లోకమును దాని ఆశయు గతించుపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును (1యోహాను 2:17). యేసు ప్రభువు మహిమతో తిరిగి వచ్చినప్పుడు, ప్రస్తుత మందున్నవి ఇక ఉండవు. ఆయనను సంపూర్ణముగా వెంబడించిన వారు, వాళ్ళు వదులుకొన్న విలువైనవన్నింటినీ ఆ చెప్పశక్యము కాని మహా సంతోషమునందు మరచిపోతారు.


నేను చిన్నవానిగా ఉన్నప్పుడు, ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగే గణతంత్య్ర దినోత్సవమును చూచుటకు వెళ్తూ ఉండేవాడను. ఆ రోజునే సాహస వీరులకు దేశములోనే అత్యుత్తమ బహుమతులు రాష్ట్రపతి ద్వారా ఇవ్వబడతాయి. తరచుగా, నేను చూస్తున్నప్పుడు, ఏదో ఒక తెలియబడని చిన్న సిపాయి చేతిని కోల్పోయి, లేక కృత్రిమ కాలుతో కుంటుకుంటూ లేక యుద్ధములో తగిలిన దెబ్బల ద్వారా స్వరూపమును కోల్పోయి బహుమతిని తీసుకొనుటకు వస్తారు. తరువాత ఈ బహుమతిని పొందుటకు అతడు ఎందుకు అర్హుడు అని ప్రసంశలతో కూడిన వివరణ ఇస్తారు. చివరిగా, దేశములోని అత్యుత్తమ వ్యక్తుల సమక్షములో భారత రాష్ట్రపతి బహుమతిని అతని గుండెపై చొక్కా మీద గ్రుచ్చుతాడు, అప్పుడు వేల మంది ప్రజలు ఆ సైనికుడు దేశ రక్షణ కోసము తన ప్రాణమును కూడా ఫణముగా పెట్టిన దానిని చూచి శ్లాఘించేలా కరతాలధ్వనులు చేస్తారు.


మనము ప్రభువు యెదుట నిలబడుటకు ఆయన వచ్చి మనలను పరలోకము యొక్క మహిమలోనికి తీసుకొని వెళ్ళే దృశ్యంలా తరచు ఇది నాకు కనబడుతూ ఉంటుంది (ఇది అంత సరిపోయే దృశ్యం కాకపోయినాకూడా). అప్పుడు పరలోకములోని అత్యున్నతమైన వారి సమక్షములో, విమోచిచబడిన స్త్రీ,పురుషులు ఈ భూమి మీద వారి నమ్మకత్వము మరియు విశ్వాస్యతను బట్టి రాజులకు రాజు చేత బహుమానములను అందుకుంటారు. ఆరోజున, తన పేరు పిలువబడినప్పుడు హనోకు ముందుకు నడచివెళతాడు. అప్పుడు ఆయన గురించిన ప్రశంసలతో కూడిన వివరణ ఈ విధముగా ఉంటుందని నేను ఊహిస్తాను: ''ఆయన దేవునికిష్టుడై యుండెను''.


అవును, మూడవందల సంవత్సరముకు పైగా ఈ భూమి మీద అతడు వెక్కిరింపబడి యుండవచ్చు మరియు అపహసించబడియుండవచ్చు కాని యిప్పుడైతే చెవులు దిమ్మెక్కి పోయే దూతల ప్రశంసల మధ్య, యుద్ధములో సాహస వీరుల కిచ్చే పరలోకపు అత్యున్నత పురస్కారముతో అతడు అలంకరించబడ్డాడు.


అపొస్తలుడైన పౌలు కూడా ఈ విధమైన గుర్తింపును తన వంతు వచ్చినపుడు పొందుటను నేను చూస్తాను. భూమి మీద అతడు వెఱ్ఱివాడుగాను మూఢభక్తి గలవాడుగాను పరిగణించబడ్డాడు; యిక్కడైతే అతని కొరకు జీవకిరీటము ఉండబడినది. ఆ క్షణములో ఆ సంవత్సరములంతటిని శ్రమ మరచి పోబడుతుంది. దేవుడు సంతోషపడ్డాడు అని తెలియుట ద్వారా సంతోషము పుడుతుంది. ఆ సంతోషమే నిత్యత్వము అంతటిలో నిలిచియుంటుంది.


ఆ తరువాత నీ వంతు వస్తుంది, నా వంతు వస్తుంది. ప్రియమైన, సహోదరీ, సహోదరుడా, మన గురించి ఏమి చదువబడుతుంది? మత సంబంధమైన పైపూత (పొర), భూమి మీద మన జీవితములను కప్పియున్న బాహ్యసంబంధమైన మాయ మరియు నటన లను మనము అక్కడ నిలబడియున్నప్పుడు తీసివేస్తే, మనకు ఇంకేమి మిగులుతుంది? ఆ రోజున నీ శూన్యతను బట్టి కేవలము నీకు దు:ఖమే మిగులుతుందా? నీవు చేసుకున్న విలువ లేని ఎంపికలను బట్టి, నీవు తేలికగా దాటవేసిన తరుణములను బట్టి నీవు బహుగా దు:ఖిస్తావా? లేక హనోకు, పౌలు ప్రక్కన నీ స్థానమును ఉంచుకుంటావా? ఇవి ఎంతో ఆవశ్యకమైన ప్రశ్నలు, ఎందుకంటే ఇవేవో నేను ఊహించి చెప్పినవి కాదు. కాని కఠోర సత్యము. యేసు మరలా తిరిగి వచ్చినప్పుడు, పైన నేను అపరిష్కృతముగా వల్లించిన దృశ్యము నిజముగా జరుగుతుంది. ఎన్నోసార్లు హెచ్చరించబడిన మనము ఆయన రాకడలో ఆయన యెదుట సిగ్గుపడతాము.


కనుక, ఆయన వాక్యము యెడల ఆసక్తి కలిగి, జాగ్రత్త కలిగి యుందాము. నిత్యత్వపు విలువలు వీటిమీద ఆధారపడియున్నవి గనుక ఈ జీవితపు యొక్క ప్రాధాన్యతలను తీవ్రముగా తీసుకుందాము. ఆ రోజు నుండి అన్ని విషయములలో మన ప్రభువైన యేసునకు సర్వోన్నతమైన స్థానమునిచ్చుటకు నిశ్చయించుకుందాము. మనకు కలిగిన సమస్తమును ఇచ్చివేయాలని పిలచే జీవితము ఈ భూమి మీద జీవించుటకు ఒకటున్నది. మరియు అదే విధముగా పరుగెత్తుటకు ఒక పందెమున్నది, కాని పందెమునకు ఒకగురి యున్నది, జీవితమునకు ఒక బహుమానమున్నది. ఈ లోకము ఇవ్వజూపిన దంతయు కూడా దీనికి ఘోరమైన తిరస్కరణమే. రాజు యొక్క సన్నిధికి మనము ప్రవేశించినపుడు, ''భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీ ప్రభువు యొక్క సంతోషములోనికి ప్రవేశించుము'' అని ఆయన చెప్పే ఆహ్వానపు మాటలు ఏ సంగీతముతోను సరిపోల్చలేము.


''ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది'' (ప్రకటన 22:12).