వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

కానా పల్లెలోని వివాహములో బానలు నీటితో నింపబడకుండానే ప్రభువు ద్రాక్షారసము చేయగలడు. కాని అప్పుడు ఇతరులు పాలిబాగస్థులు కాలేరు. దాన్ని ఒక్కడే చేసినట్లవుతుంది. కాబట్టి ఆ సూచక క్రియలో పరిచారకులు కూడా పాలుపొందునట్లు నీటితో నింపుట అనే సులభమైన పరిచర్యను చేశారు. దానిని ద్రాక్షారసముగా మార్చుట అనే కష్టమైన పనిని ప్రభువైనయేసు చేశారు (యోహాను 2:1-11).

అలాగే ఐదువేలమందికి ఆహారము పెట్టినప్పుడు, ప్రభువైనయేసు శూన్యములోనుండి దానిని సృష్టించగలడు. కాని ఆయన ఆ విధంగా చేయలేదు. ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్న కొన్నిటిని తీసుకున్నాడు. అక్కడ చిన్నబాలునితో కలిసి పరిచర్య చేశాడు (యోహాను 6:5-13). చిన్న బాలుడు చేయగలిగిన దానిని అతడు చేశాడు. మరియు ప్రభువైనయేసు చేయగలిగిన దానిని ఆయన చేశాడు.

పుట్టు గ్రుడ్డివానిగా పుట్టినవానిని కూడా మొదటిగా తాను చేయగలిగిన దానిని ప్రభువు చేయమన్నాడు (యోహాను 9:1-7). అతడు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోవాలి. కళ్ళు తెరచుట అనే కష్టమైన పనిని ప్రభువైనయేసు చేశాడు.

లాజరును లేపుటలో కూడా అదే నియమము చూస్తాము. అతని స్నేహితులు సమాధి రాయిని పక్కకు తొలగించారు. లాజరును మృతులలో నుండి లేపుట అనే కష్టమైన పనిని ప్రభువైనయేసు చేశాడు. తరువాత అతని కట్లు విప్పేపనిని కూడా వారు చేసి అతనిని విడిపించారు (యోహాను 11:38-44).

పునరుత్థానము తరువాత శిష్యులు రాత్రిలో చేపలు పట్టుటకు వెళ్ళారని చూస్తాము. "మరియు ఆ రాత్రి వారేమియు పట్టలేదు" (యోహాను 21:3). ఇది ధర్మశాస్త్రము క్రింద ఒక వ్యక్తి పోరాడుటను సూచిస్తుంది. అప్పుడు ప్రభువైనయేసు వచ్చాడు. వారు వలను సముద్రములో వేయకుండానే దానిలోనికి ప్రభువు చేపలు రప్పింపగలడు. పేతురు దోనె యొద్దకు చేపలను తెప్పింపగలిగిన దేవుడు, ఆ దోనెలో చేపలను పడేటట్లు కూడా చేయగలడు. కాని అప్పుడు వారు పాలిభాగస్థులు కాలేరు. కాబట్టి మనుష్యుడు తాను చేయవలసింది చేయాలి. అప్పుడు వారిని సముద్రములో వల వేయమని వారికి చెప్పాడు. అప్పుడు ప్రభువైనయేసుతో కలిసినందు వలన అద్భుతం జరిగింది. మనుష్యుడు సులభమైన పని చేయాలి మరియు ప్రభువైనయేసు కష్టమైన పని చేయాలి. వారు వలలను సముద్రములో వెయ్యాలి. దీనినే పౌలు విశ్వాసమునకు విధేయత అని చెపుతున్నాడు (రోమా 1:7).

మన జీవితములో ప్రభువైనయేసు మనతో కలసి పని చేయాలని కోరుతున్నాడు. పన్ను గురించి పేతురు ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు, అతడు సముద్రమునకు వెళ్ళి మొదటిగా పట్టిన చేపను తీసుకొని రమ్మన్నాడు. వారిద్దరికి సరిపోయినంతగా దాని నోటిలో ఒక షెకెలు ఉంటుందని చెప్పాడు. "అది నా కొరకును మరియు నీ కొరకును అని ప్రభువు చెప్పాడు" (మత్తయి 17:27). ఈ విధముగా పాలివారమైయుంటాము. మనము పన్నులు కట్టుటకు కూడా ప్రభువు సహయము చేయాలని కోరుతున్నాడు. మన అనుదిన జీవితములలో చిన్న విషయముల దగ్గరనుండి నిత్యత్వం ఉండే విషయముల వరకు "నీవు మరియు నేను" అను నియమముతో జీవించాలని ప్రభువైనయేసు పిలచుచున్నాడు.

మనమాయన కాడిని ఎత్తుకొనినప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి11:28-30). మన స్వంత క్రియల నుండి విడుదల పొంది ఈ విశ్రాంతిలో ప్రవేశించాలని మనము హెచ్చరించబడుచున్నాము (హెబ్రీ 4:10,11).

దేవుడు ఆదామును సృష్టించింది - ఏదేను తోటలో తోటమాలిగా ఉండుటకు కాదు కాని ఆయనతో ఎల్లప్పుడు సహవాసం చేయుటకు సృష్టించాడు. మనము కూడా దేవుని సేవించుటకు కాదు కాని ఆయనతో సహవాసం కలిగియుండుటకు ఆయన మనలను పాపమనే గోతి నుండి రక్షించాడు. ఈనాడు చాలామంది విశ్వాసులు దానిని గ్రహించనందున మార్తావలె భారముతో ఉన్నారు.

దేవునితో 65 సంవత్సరములు నడిచిన 95 సంవత్సరములు గల యోహాను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పత్రిక వ్రాసాడు. ఆ పత్రిక సారాంశమేమనగా "సహవాసం" (1 యోహాను 1:3). మొదటి ప్రేమను కోల్పోయిన సంఘములను సంఘనాయకులను చూచి(ప్రకటన 2:4) మరియు జీవించుచున్నారని పేరు మాత్రమున్నది గాని మృతులైన వారిని చూచి (ప్రకటన 3:1), యోహాను క్రైస్తవులకు తండ్రియొక్కయు, కుమారుడైన యేసు యొక్కయు సహవాసములోనికి వచ్చుట ఎంత అవసరమో చూచియున్నాడు.

అనేక పనులు చేయుటలో సంతోషం ఉండవచ్చును. కొందరు ఆటలలోను, కొందరు సంగీతములోను, కొందరు వారి వృత్తిలోను మరియు కొందరు క్రైస్తవ పరిచర్యలోను సంతోషించవచ్చు. కాని విశ్వములో అత్యంత పవిత్రమైన సంతోషాన్ని తండ్రితో సహవాసం చేయటం ద్వారానే పొందగలము (1 యోహాను 1:4). "నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు" అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు (కీర్తన 16:11). తన యొదుట ఉంచబడిన ఆనందము కొరకు ప్రభువైనయేసు సిలువను సహించియున్నాడు (హెబ్రీ12:2). తండ్రితో సహవాసం చేయుటయే ప్రభువైనయేసుకు అత్యంత ముఖ్యమైయున్నది. ఈ విశ్వములో ఆయన దానిలో సమానముగా దేనిని చూడలేదు. మానవుల కొరకు నిత్య నరకమును అనుభవించుట కొరకు ప్రభువైనయేసు కల్వరి సిలువలో తండ్రితో సహవాసమును 3 గంటలు కోల్పోయారు (మత్తయి 27:45). అప్పుడు తండ్రి తనను విడిచిపెట్టి మరియు నిత్యత్వం నుండి తండ్రితో అనుభవించుచున్న సంతోషాన్ని 3గంటలు పోగొట్టుకున్నాడు. అది జరుగకుండునట్లు గెత్సెమనె తోటలో చెమట రక్తబిందువుల వలె కారునట్లు ప్రార్ధించాడు. దీనిని తొలగించవద్దని ఆయన ప్రార్ధించాడు అనగా తండ్రితో తనకున్న సహవాసం.

దీనిని మనం చూచి మరియు దీని చేత పట్టబడాలి. ప్రభువైనయేసును వెంబడించుట గురించి మన ఎంత తేలికగా మాట్లాడుచు మరియు పాటలు పాడెదమోకదా! ప్రభువైనయేసును వెంబడించుట అనగా ఆయన వలె తండ్రితో సహవాసమును కోరుట. పాపము ఈ సహవాసమును తీసివేస్తుంది కనుక దానిని మనము తీవ్రముగా తీసుకుంటాము. ఇతరుల యెడల ప్రేమలేని వైఖరిని కూడా మనం సహించం. ఎందుకనగా అది తండ్రితో సహవాసాన్ని తీసివేస్తుంది.

పరలోకమందున్న ప్రేమగల తండ్రితో నిరంతరము సహవాసము చేయుటయే నిజమైన క్రైస్తవ్యమని స్పష్టముగా చూడగలుగునట్లు ప్రభువు మనకు ప్రత్యక్షతనిచ్చును గాక!