WFTW Body: 

మనం భవిష్యత్తుకొరకు ఎదురుచూస్తున్నప్పుడు, గతించిన అన్ని సంవత్సరాల కంటే ఇది చాలా మెరుగ్గా ఉండాలని మనం కోరుకుంటాము. కానీ మనం దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటేనే అది మెరుగ్గా ఉంటుంది. మనం నమ్మువాటిని మన నోటితో ఒప్పుకోవాలి - అయితే మన ఒప్పుకోలు దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఉండాలి (రోమా 10:8,9 చూడండి).

దేవుడు అబ్రాహాముకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు - మానవ దృక్కోణంలో చెప్పాలంటే నెరవేరడం అసాధ్యం అనిపించే వాగ్దానం ఇచ్చినప్పుడు, అబ్రాహాము ఏమి చేశాడు? "అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను" (రోమా 4:19-21).

కాబట్టి దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో ఈ క్రింది ఎనిమిది ఒప్పుకోలులు చేద్దాం. మీ హృదయం నుండి తరచుగా మీతోమీరు మరియు సాతానుతో వీటిని చెప్పండి:

1. తండ్రియైన దేవుడు ప్రభువైన యేసును ప్రేమించినట్లే నన్నుకూడా ప్రేమించుచున్నాడు - కాబట్టి నేను ఎల్లప్పుడు ఆనందించెదను (యోహాను 17:23).

2. దేవుడు నా పాపములన్నిటిని క్షమించియున్నాడు - కాబట్టి నేను ఎప్పుడూ నేరారోపణలో ఉండను (1యోహాను 1:9; హెబ్రీ 8:12).

3. దేవుడు నన్ను తన పరిశుద్ధాత్మతో నింపును - కాబట్టి నేను ప్రతి పని చేయుటకు తగినంత బలంగా ఉంటాను (లూకా 11:13).

4. దేవుడు నా సరిహద్దులను నిర్ణయించియున్నాడు - కాబట్టి నేనెల్లప్పుడు సంతృప్తి కలిగియుంటాను (అపొ.కా 17:27; హెబ్రీ 13:5).

5. దేవునియొక్క ఆజ్ఞలన్నియు నా మేలు కొరకే ఉన్నవి - కాబట్టి దేవుని అన్ని ఆజ్ఞలకు లోబడాలని కోరుకొనుచున్నాను (1యోహాను 5:3; ద్వితీ 10:13).

6. నన్ను ప్రభావితం చేసే ప్రతి వ్యక్తి మరియు ప్రతి సంఘటన దేవుని ఆధీనములో ఉన్నది - కాబట్టి నేనెల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లించెదను (రోమా 8:28).

7. యేసు సాతానును ఓడించి, అతని శక్తినుండి నన్ను విడిపించాడు - కాబట్టి నేను ఎప్పుడైనను భయపడను (హెబ్రీ 2:14,15; హెబ్రీ 13:6).

8. దేవుడు నన్ను ఒక ఆశీర్వాదముగా చేయవలెనని కోరుతున్నాడు - కాబట్టి నేను ఇతరులకు ఆశీర్వాదముగా ఉండెదను (ఆదికాండము 12:2, గలతీ 3:14).

"విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము" (హెబ్రీ 11:6).