"పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును" (సామెతలు 4:18).
ఇది నిజంగా కొత్త నిబంధన వాగ్దానం. ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించి, అతని పాపాలు క్షమించబడి, దేవుడు అతన్ని నీతిమంతుడిగా ప్రకటించి, క్రీస్తుయొక్క నీతితో కప్పబడి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు మాత్రమే అతడు నీతిమంతుడని మనకు తెలుసు. కానీ, అతని జీవితం సూర్యోదయంలా మాత్రమే ఉండుట దేవుని చిత్తం కాదు. "నీతిమంతుల మార్గం సూర్యోదయం లాంటిది..." అని చెప్పబడింది అయితే సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు ఉంటుంది, కానీ సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండడు. ఆకాశంలో ఉదయించే సూర్యుని గురించి ఆలోచించండి; ఈ కాంతి మధ్యాహ్నం వరకు అంతకంతకు ప్రకాశవంతంగా వృద్ధిచెందుతుంది, అప్పుడు పరిపూర్ణ ప్రకాశం ఉంటుంది. సూర్యుడు ఉదయించే కొద్దీ నీడలు తగ్గుతాయని మనం చెప్పవచ్చు; మన స్వజీవితపు నీడ తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ చివరకు సూర్యుడు నడినెత్తిపై ఉన్నప్పుడు నీడ పూర్తిగా అదృశ్యమవుతుంది. అది మన పట్ల దేవుని చిత్తం. మనం తిరిగి జన్మించినప్పటి నుండి, ఆయన బిడ్డలెవరికీ హెచ్చు తగ్గుల అనుభవం ఉండుట దేవుని చిత్తం కాదు.
ఇప్పుడు, చాలా మంది క్రైస్తవులకు హెచ్చు తగ్గుల అనుభవం ఉంటుంది. ఇతరులకు హెచ్చు తగ్గుల అనుభవాలు ఉన్నయని మరియు ఒక బోధకునికి హెచ్చు తగ్గుల అనుభవం ఉందని విన్నప్పుడు, మన ఓటమిలో మనం ఓదార్పు పొందుతాము. నీతిమంతుల మార్గంలో హెచ్చు తగ్గులు ఉండవని చెప్పే దేవుని వాక్యం నుండి కాకుండా, ఒక శరీర సంబంధమైన విశ్వాసినుండి లేదా ఒక శరీర సంబంధమైన బోధకుడినుండి మనం మన ప్రమాణాన్ని పొందుతాము. అది ప్రకాశవంతంగా తరువాత చీకటిగా, ఆపై మళ్ళీ ప్రకాశవంతంగా మరియు మళ్ళీ చీకటిగా ఉండదు. పర్వతం పైన, తరువాత చెత్తలో. ప్రభువును స్తుతించడం మరియు ఆనందించడం, తరువాత మరుసటి రోజు దిగులుగా మరియు దుఃఖకరంగా. అది మన అనుభవం అయితే, అది దేవుని చిత్తం కాదని నేను చెప్పాలనుకుంటున్నాను. అది నీతిమంతుల మార్గం కాదు. ఒక వ్యక్తి ఆ విధంగా నడుస్తున్నట్లయితే, అతను నీతిమంతుల మార్గంలో నడవడం లేదని మనం స్పష్టంగా చెప్పగలం.
నీతిమంతుల మార్గం కొత్త నిబంధనలో, "నూతన మరియు సజీవమైన మార్గం" అని పిలువబడింది. ఇది అర్థం చేసుకోవలసిన సిద్ధాంతం కాదు; ఇది నీతిమంతుల మార్గం. ఇప్పుడు, నూతన మరియు సజీవమైన మార్గాన్ని నమ్మే వ్యక్తుల గురించి మనం వింటున్నాము. నాయొద్దకు ఈ వారం, "నూతన మరియు సజీవమైన మార్గపు సోదరులు మరియు సోదరీమణులు" అనే అంశం గురించి మాట్లాడిన ఒకరి గురించి ఒక లేఖ వచ్చింది. నూతన మరియు సజీవమైన మార్గపు సోదరుడు లేదా సోదరి అంటే ఏమిటి? క్రైస్తవ సహవాస సంఘంలో కూర్చున్న వ్యక్తి కాదు. సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కాదు, కానీ హెచ్చు తగ్గులు లేని వ్యక్తి. పైకి క్రిందికి వెళ్ళే వ్యక్తి నూతన మరియు సజీవమైన మార్గంలో లేడు; అది పాత మృతమైన మార్గం. నూతన మరియు సజీవమైన మార్గం ప్రకాశవంతంగా మరియు అంతకంతకు ప్రకాశవంతంగా ఉంటుంది. క్రొత్త నిబంధన చెప్పె ఏకైక నూతన మరియు సజీవమైన మార్గం ఇదే: నీతిమంతుల మార్గం. ఈ "చెత్తకుప్పలోకి దిగే" స్థితి, మనం నిజమైన మార్గంలోకి రాలేదని కేవలం సిద్ధాంతాన్ని మాత్రమే అర్థం చేసుకున్నామని రుజువు చేస్తుంది.
నీతిమంతుల మార్గం సూర్యోదయం లాంటిది, అది అంతకంతకు ప్రకాశవంతంగా వెలుగుతుంది; సూర్యుడు ముందుకు వెనుకకు వెళ్ళడు. అతడు అకస్మాత్తుగా తన మనసు మార్చుకోడు. అతడు స్థిరంగా కొనసాగుతాడు. సహోదరీ సహోదరులారా, అది మన జీవితాల పట్ల దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటంటే మరింత మెరుగ్గా, మరింత మెరుగ్గా, మరింత మెరుగ్గా మారుతూ ఉండాలనేదే. అంటే నా శరీరంలో నివసించే దానిపై నాకు మరింత వెలుగు కలుగుతుంది. 6 నెలల క్రితం నా శరీరంలో నివసించే నాకు తెలియని దానిపై నాకు ఇప్పుడు వెలుగు కలుగుతుంది. మనం ఆ విధంగా లేకపోతే, మనం నీతిమంతుల మార్గంలో లేము. ఏదో ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉండటానికి దానిని చాలా స్పష్టంగా నేర్చుకుందాం. అది వెలుగు మరింత మెరుగ్గా మరియు మరింత మెరుగ్గా మారే మార్గం, అక్కడ నేను నా శరీరంపై మరింత మెరుగ్గా వెలుగును పొందుతాను. లేక 1 యోహాను 1:7 చెప్పినట్లుగా, "దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మన కూడా వెలుగులో నడచినట్లయితే...". దేవుడు వెలుగై ఉన్నాడు, మరియు నేను ఆ వెలుగులో నడిస్తే, నేను దేవునికి దగ్గరగా వెళ్తాను; వెలుగు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అంటే నా శరీరంలో నివసించే దానిపై నాకు మరింత వెలుగు కలుగుతుంది. నేను నా జీవితంలోనివి మరింత ఎక్కువగా మరణానికి గురిచేయగలను మరియు నేను జ్ఞానవంతుడిగా మారుతాను. ఆ విధంగా యేసు జ్ఞానంలో ఎదిగాడు: ఆయన నూతన మరియు సజీవమైన మార్గంలో నడిచాడు. లూకా 2:52 లో ఆయన జ్ఞానంలో ఎదిగాడని చెప్పబడింది. మరియు సొలొమోను ఇక్కడ (సామెతలు 4:18 లో) పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నది అదే.
2 కొరింథీ 3:184:18కి సామాంతరంగా ఉన్న కొత్త నిబంధన వచనం 2 కొరింథీ 3:18. మీరు ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే, మీరు క్రొత్త నిబంధనలోని సంబంధిత వచనమైన 2 కొరింథీ 3:18 వైపు తిరగాలి. అక్కడ, "...మహిమ నుండి మహిమకు, మహిమనుండి అధిక మహిమకు" అని చూస్తాము.
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని మహిమ నుండి మహిమకు యేసు పోలికలోనికి మారుస్తుండగా - 2026వ సంవత్సరం మీ అందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.