దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము. వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును (సామెతలు 6:25,26).
బైబిలంతటిలో ఈ వచనమే మత్తయి సువార్త 5:28లో చెప్పబడిన ‘ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు’ అనే వాక్యానికి ఎంతో సమీపంగా ఉన్న వచనం. సామెతలు 6:25 వలె, మత్తయి 5:28కి అత్యంత దగ్గరైన వచనం మరొకటి లేదు. అది కొత్త నిబంధన యొక్క ఛాయగా ఉంది. వ్యభిచారం హృదయంలోనే ప్రారంభమవుతుందని జ్ఞానం మనల్ని హెచ్చరిస్తుంది. అది వ్యతిరేఖ లింగంయొక్క(opposite sex) అందాన్ని అభినందించడంతో ప్రారంభమవుతుంది. దీనిని నొక్కి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అనేకమంది క్రైస్తవులు (విశ్వాసులు) అందమైన వారిని మెచ్చుకోవడంలో తప్పు లేదని బోధిస్తారు. వారి హృదయంలో దేవుని యెడల ఎటువంటి భయము లేదు కాబట్టి ఇలా జరుగుతుంది. ‘దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము’ అని దేవుని వాక్యం చెబుతుంది.
నీవు భౌతికమైన అందం గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నావా? భౌతికమైన అందం వ్యర్థమైనదని, డొల్ల అని సామెతలు 31:30 చెప్తుంది. యౌవనస్తులారా, భౌతికమైన అందం వ్యర్థమైనదని, డొల్లయని, పనికిరానిదని మీ మనస్సు యెదుట మీరు పెట్టుకొననట్లయితే దానివలన ఒకానొక రోజు మీరు మోసపోతారని నేను మీతో చెప్తున్నాను. మీరు తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకొని మీ జీవితాంతం బాధపడతారు. మీ కళ్ళు అందమైన వ్యక్తి వైపు తిప్పి, ‘నేను మోహపు చూపులు చూడట్లేదు, కేవలం అందాన్ని అభినందిస్తున్నాను’ అని చెప్పకండి. అది ఎంతో భయంకరమైన మోసం మరియు దేవుడు దానిని చూస్తున్నాడు. దేవుడు అటువంటి పురుషులందరినీ పరిచర్యకు పిలిచి ఉండవచ్చు, కానీ ఆయన వారిని పక్కన పెట్టి ఇలా అంటాడు, "అది నీకు దక్కదు. నేను నీకు పరిచర్యను ఇచ్చి ఉండే వాడిని, కానీ నీవు కేవలం నీ కళ్ళతో విచ్చలవిడిగా ఉంటూ, నిన్ను నీవు విశ్వాసి అని పిలుచుకుంటూ నూతనమైన మరియు జీవముగల మార్గం గురించి మాట్లాడావు, ఈ విషయంలో నీవు పూర్ణహృదయుడిగా లేవు!" నీ హృదయంలో కూడా ఆమె సౌందర్యాన్ని ఆశించవద్దు! ఇది వ్యభిచారం గురించి చెప్పడం లేదు. ఇది ఒక అమ్మాయిలో ఉన్న భౌతికమైన అందాన్ని మెచ్చుకోవడం గురించి చెబుతుంది. దానిని కనీసం అభినందించవద్దని అక్కడ చెప్పబడింది. నీవు అంగీకరించగలిగితే ఇదే జ్ఞానం. జాగ్రత్తగా ఉండండి.
తర్వాత ఈ విధంగా చెప్పబడింది ‘తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము’. దేవుని వాక్యము ఎంతో వాస్తవికంగా ఉంటుంది. ఒక అమ్మాయి యొక్క కన్నులు ఒక యౌవ్వన పురుషుని వశపరచుకొనగలవనే విషయం ఇక్కడ చెప్పబడింది. అందుకే ఈ రోజుల్లో అమ్మాయిలు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం వారి కనురెప్పలకు రంగులు వేసుకోవాలని అపవాది నేర్పిందని మనం గమనిస్తున్నాము - ఆ రంగులన్నీ, ఒకవేళ మీరు సమాజంలో మంచి సాక్ష్యం పొందడం కోసం చేతి మీద మృగము యొక్క ముద్రను కోరుకునే వారిలో ఒకరైతే, మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా చేసుకోవడం కోసం మీ కళ్ళకు, పెదవులకు, ఇంకా ముఖమంతటా వేసుకోగల రంగులేని రకాలు కూడా కొన్ని ఉన్నాయని నేను అనుకుంటున్నాను. "ఆమె తన కనురెప్పలతో నిన్ను పట్టుకోనివ్వకుము" అని అక్కడ చెప్పబడింది.
2రాజులు 9:30లో ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడ తన ముఖమునకు రంగు వేసుకొనిన ఒక స్త్రీ గురించి చెప్పబడింది. ఆమె యెజెబెలు. ప్రకటన గ్రంధం రెండవ అధ్యాయంలో కూడా మీరు ఆమె గురించి చదువుతారు. తుయతైర సంఘంలో కూడా యెజెబెలు కూర్చుని ఉంది. 2రాజులు 9లో యెహూ యెజ్రెయేలుకు వచ్చాడని విన్నప్పుడు ఆమె తన కళ్లకు రంగు పూసుకుంది. క్రీస్తు పూర్వం వందల సంవత్సరాల క్రితమే అలంకరణలు ఉన్నాయని మీకు తెలుసా? ఇది 20వ శతాబ్దపు ఆవిష్కరణ కాదు. ఇటువంటి ఉత్పత్తిని ప్రారంభించినది యెజెబెలు. ఆమె తన కళ్ళకు రంగులు పూసుకొని, తన జడను అలంకరించుకుంది. ఆమె ముఖమంతా రంగులు అద్దుకున్నదని కూడా నేను అనుకుంటాను, ఆమె కిటికీలోనుండి చూసినప్పుడు 33వ వచనంలో యెహూ, ‘ఆమెను క్రిందికి తోయండి’ అని చెప్పాడు. ఆమెను క్రిందికి తోసి ఆమెను చంపేశారు. అతను అలంకరింపబడిన ముఖమును చూసి ఆకర్షితుడు కాలేదు. నీవు కూడా ఆకర్షితుడవు కావద్దు. యెహూ దైవభక్తి కలిగిన వ్యక్తి కూడా కాదు అయినప్పటికీ కూడా అతను దానంతటకీ తట్టుకొని నిలబడగలిగాడు. అలంకరించబడిన ముఖముల విషయంలో, ముఖ్యంగా కనురెప్పల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సొలొమోనువలె వ్యతిరేఖ లింగం విషయంలో జాగ్రత్తగా ఉండమని యౌవ్వనస్తులను హెచ్చరించే విషయంలో నేను ఎప్పుడూ అలసిపోను. నీవు దేవుని వాక్యానికి భయపడి దాన్ని తీవ్రంగా తీసుకున్నట్లయితే, సాతాను యొక్క దూతగా ఉండి నీ జీవితాన్ని నాశనం చేసే స్త్రీ నుండి నీ జీవితాన్ని కాపాడుకుంటావు. ఒకవేళ అపవాది నీ జీవితాన్ని నాశనం చేయడంలో సఫలం కాలేకపోతే, ఒక దైవజనుడిగా దేవునికి ఉపయోగపడే నీ ఆత్మీయ ప్రయోజనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అనేకమంది రక్షణపొందారు, ఆయనను వారు స్త్రీలతో విచ్చలవిడిగా ఉండుట చేత దేవుడు వారికిచ్చిన పరిచర్యనంతా వారు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. ‘నా పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్తే సరిపోదు. దేవుడు నీ కొరకు సిద్ధపరచిన పరిచర్యను నీవు నిత్యత్వంలో చూసి, వ్యతిరేఖ లింగం విషయంలో అజాగ్రత్తగా ఉండుటవలన దానిని కోల్పోయావని కనుగొనుట ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. నిత్యత్వంలో నిలబడి, ఒక బుద్ధిహీనమైన అమ్మాయితో చిన్నచిన్న ఆనందాల కొరకు నీ నిత్యత్వమంతా మహిమకరంగా మార్చే పరిచర్యను నీవు కోల్పోయావనే విషయాన్ని నీవు కనుగొనుటను ఊహించండి. భూమిపై నీవు బుద్ధిహీనుడుగా ఉండుట వలన దానిని కొల్పోయావు. ఆరోజు అనేకమంది హృదయాలలో ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి.
నీవు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండు.