వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము తెలిసికొనుట
WFTW Body: 
<

"మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును" (మత్తయి 7:1-5).

దురదృష్టవశాత్తు ఈనాడు క్రైస్తవులలో తీర్పుతీర్చడం, ఇతరులను తక్కువగా చూడడం, మరియు ఇతరులను తృణీకరించడం సర్వసాధారణమైన అలవాట్లుగా మారిపోయాయి. ఇతరుల గురించి ఏమీ తెలియక పోయినప్పటికీ, వారి కంటే శ్రేష్టులమని అనుకోవడం క్రైస్తవుల మధ్యలో ఒక సాధారణమైన అభ్యాసంగా మారిపోయింది. హెబ్రీ 9:27 విధంగా చెప్తుంది, "మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును". కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రజలను ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? ఈ వచనం ప్రకారం "ఒక్కసారే మృతి పొందవలెను తరువాత తీర్పు జరుగును". కాబట్టి ప్రజలు మృతి పొందిన తరువాత మాత్రమే దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు.

నీవు ప్రజలను ఎప్పుడు తీర్పు తీరుస్తున్నావు? వారు మరణించడానికి ఎంతో కాలం ముందే వారిని తీర్పు తీరుస్తున్నావు. దేవుడు ఒక వ్యక్తిని తీర్పు తీర్చుటకు అతను చనిపోయేంతవరకు ఎందుకు ఎదురుచూస్తాడు? అతను దుష్టుడై ఉండవచ్చు అయితే దేవుడు, "అతని పట్ల నాకు ఇంకా నిరీక్షణ ఉంది. బహుశా అతను మార్పు చెందుతాడేమో" అని చెప్తూ ఎదురు చూస్తాడు. పరదైసుకు వెళ్ళిన సిలువమీద దొంగను దేవుడు తీర్పు తీర్చినట్లయితే ఏం జరిగి ఉండేదో ఒకసారి ఆలోచించండి. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు లేక కొద్ది గంటల ముందు దేవుడు అతనికి తీర్పు తీర్చుంటే ఏమయ్యేదో ఆలోచించండి. అది ఎంతో భయానకంగా ఉండేది. చివరిగా అతడు పరదైసుకు వెళ్ళుటకు అర్హుడే, అయితే అతడు తీర్పు తీర్చబడితే నరకమునకు వెళ్లేవాడు. అతడు చనిపోయేంతవరకు దేవుడు ఎదురు చూశాడు తర్వాత అతన్ని పరదైసుకు తీసుకొని వెళ్ళాడు. ఒక వ్యక్తిని తీర్పు తీర్చే ముందు అతడు చనిపోయేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడని ఇది చూపిస్తుంది. మనిషి ఎంతో అసహనంతో ప్రజలు చనిపోవడానికి ముందుగానే వారిని తీర్పు తీరుస్తాడు. ఇది మనిషి యొక్క బుద్ధిహీనత. అతనికి నిజాలన్నీ తెలియదు. ఆ వ్యక్తియొక్క 99% వ్యక్తిగత మరియు అంతర్గత జీవితం అతనికి తెలియదు. ఆ వ్యక్తి ఎంతగా శ్రమపడ్డాడో లేక ప్రార్థించాడో అతనికి తెలియదు. అయినను అతన్ని తీర్పు తీరుస్తాడు. గౌరవనీయమైన ఏ హైకోర్టు న్యాయమూర్తి కూడా ఇంత తక్కువ సాక్ష్యాధారాలతో తీర్పు ఇవ్వడు. ఒక న్యాయమూర్తికి కేసు గురించి 1% మాత్రమే తెలిసినా, అతను ఇలా అంటాడు, "వినండి, నేను తీర్పు ఇవ్వడానికి ముందు నాకు మరిన్ని సాక్ష్యాధారాలు కావాలి. అప్పటి వరకు, నేను తీర్పును నిలిపివేస్తాను". ప్రతి క్రైస్తవుడు కూడా ఇదే చెప్పాలి.

మనం ఒక వ్యక్తిని తీర్పు తీర్చినప్పుడు నిజానికి మనం మనయొక్క హృదయపు స్థితిని చూపిస్తున్నాము. సామెతలు 27:19లో చెప్పబడినట్లుగా "నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును". లేక ఒక అద్దంలో వలె మనిషి తన ముఖమును తాను చూసుకుంటాడు. దీని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క హృదయములో చెడు ఉద్దేశమని నీవు భావించేది, నీ సొంత హృదయములోని తప్పుడు వైఖరులకు గుర్తుగా ఉన్నది. ఆ వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని చేస్తున్నాడని నీవు అనుకోవు. ‘అతను ఖచ్చితంగా ఒక చెడ్డ ఉద్దేశంతోనే దాన్ని చేస్తున్నాడు, ఎందుకంటే నేను అటువంటి దాన్ని చెడ్డ ఉద్దేశంతోనే చేస్తాను’ అని నీవు భావిస్తావు. నీవు నీ యొక్క సొంత హృదయాన్ని వెల్లడిస్తున్నావు. ఇతరులను తీర్పు తీర్చుట బుద్ధిహీనమైన పని.

తప్పిపోయిన కుమారుని కథను గురించి ఆలోచించండి. తప్పిపోయిన కుమారుని కథలో మనం పెద్ద కుమారుని గురించి చదువుతాము. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించుటను పెద్ద కుమారుడు చూసి దాన్ని బట్టి కలత చెందాడు. తండ్రి బయటకు వెళ్లి తన పెద్ద కుమారుడిని ఎందుకు లోపలికి రాలేదని అడిగినప్పుడు లూకా 15:30లో అతను చెప్పిన సమాధానాన్ని చూస్తాము, ‘ఈ నీ కుమారుడు’, అతను ‘నా తమ్ముడని’ కూడా పిలవలేదు, ఎంతగా తృణీకరిస్తూ అతని గూర్చి మాట్లాడుతున్నాడు. "వేశ్యలతో నీ ఆస్తిని తినివేశాడు". అది అతనికి ఏ విధంగా తెలుసు? అతని తమ్ముడు వేశ్యలతో తిరుగుతున్నాడని అతను ఏవిధంగా ఊహించుకున్నాడు? ఎవరైనా వచ్చి అతనికి ఆ విషయాన్ని చెప్పారా? లేనే లేదు. అతను, తన తమ్ముడు ఖచ్చితంగా వేశ్యలపై ధనాన్ని వెచ్చించి ఉంటాడని ఊహించాడు. దానిలో ఎటువంటి నిజం లేకపోవచ్చు. బహుశా అతను వేశ్యలపై గాక తాగుతూ బుద్ధిహీనమైన మార్గంలో ధనాన్ని వ్యర్థపరిచి ఉండవచ్చు. అయితే ఈ పెద్ద సహోదరుడు తన తమ్ముని పట్ల చెడ్డ వైఖరి కలిగి ఉన్నట్లే, నీవు తప్పుడు వైఖరిని కలిగి ఉన్నట్లయితే ఇతరుల గురించి నీవు ఎప్పుడూ చెడ్డ దానినే ఊహిస్తావు. ఇతరుల గురించి ఎప్పుడైనా నువ్వు చెడ్డదాన్ని ఆలోచించినప్పుడు సమస్య వారిలో కంటే నీలోనే అధికంగా ఉన్నదన్న విషయాన్ని నీవు గుర్తెరుగుము. ఆ వ్యక్తి చివరకు తండ్రి యొక్క భోజనపు బల్ల యొద్ద కూర్చుని కొవ్విన దూడను ఆరగిస్తూ ఉండవచ్చు నీవు చివరకు ఇంటి బయట ఉండిపోవచ్చు.

తప్పిపోయిన కుమారుని కథ ప్రారంభంలో చిన్న కుమారుడు ఇంటి బయట పెద్ద కుమారుడు ఇంటి లోపల ఉన్నట్టుగా చూస్తాము. ఆ కథ చివరలో చిన్న కుమారుడు ఇంటి లోపల మరియు పెద్ద కుమారుడు ఇంటి బయట ఉన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే పెద్ద కుమారుడు ప్రజలను తీర్పు తీరుస్తున్నాడు. తగినంత సమాచారం లేకుండా ప్రజలను తీర్పు తీర్చడం వలన మీరు తండ్రి ఇంటి బయటే విడిచిపెట్టబడకుండా చూసుకోండి. అత్యంత సురక్షితమైన పని తీర్పు తీర్చకపోవడమే.

తీర్పు తీర్చవద్దు. నీవు తీర్పు తీర్చినప్పుడు, నీ కంటిలో పెద్ద దూలాన్ని ఉంచుకొని మీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీర్పు తీరుస్తున్నారని యేసు చెప్పారు. ఆయన చెప్పినది అదే. ఒక వ్యక్తిలో ఉన్న దూలం ఏమిటి? ఒక వ్యక్తి తన కంటిలో భౌతికమైన దూలాన్ని కలిగి ఉండలేడు. అయితే యేసు, నీ పాపం ఆ వ్యక్తి పాపంతో పోలిస్తే ఎంత దుఃఖకరమైనదో చూపించడానికి ఆయన దానిని పెద్దగా చేసి చూపిస్తున్నారు. ఆ వ్యక్తి నిజంగా ఒక భయంకరమైన తప్పు చేశాడని అనుకుందాం. అయితే ఆ వ్యక్తి ఎడల నీవు కలిగి ఉన్న ప్రేమలేని వైఖరి అతని పాపంతో పోలిస్తే ఒక దూలంగా ఉంది, అతని పాపము కేవలం ఒక నలుసుగా ఉంది.

బహుశా అతడు వేశ్యల వద్దకు వెళ్లి ఉండవచ్చు. అవును అది పాపమే. అయితే ప్రేమించలేని నీ వైఖరితో పోల్చి చూస్తే అది కూడా కేవలం ఒక నలుసుగా మాత్రమే ఉంది, నీ వైఖరి దూలంగా ఉంది. ఇతరుల ఎడల నీవు కలిగి ఉన్న ప్రేమించలేని వైఖరిని తీసివేయమని ప్రభువు చెప్తున్నారు. ఆ వ్యక్తి పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమలేని వైఖరి ఆ వ్యక్తిలో ప్రతిక్షణం తప్పులను చూసే విధంగా చేస్తుంది. ఆ వ్యక్తి ఏం చేసినప్పటికీ కూడా నీవు దానికి తప్పుడు వైఖరిని ఆపాదిస్తావు. ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా మంచి చేయలేడు. నీ దృష్టిలో ఆ వ్యక్తి దుర్మార్గుడు, అయితే ఆ వ్యక్తి పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమలేని వైఖరి యొక్క నీ దుష్టత్వాన్ని నీవు చూడటం లేదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు? ఉదాహరణగా కంటిచూపు సరిగా లేని ఒక వ్యక్తిని ఊహించండి, నీ కంటిలో ఉన్నదాన్ని తీసివేయుట కొరకు అతని దగ్గరికి వెళ్తావా? కళ్ళు సరిగా కనిపించని లేక కంటిశుక్లాలతో బాధపడుతున్న డాక్టరు దగ్గరకు నీ కంటి సమస్యలతో వెళ్తావా? అతను ఏ విధంగా నీ కళ్ళలోనికి చూస్తూ నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయగలడు? నేను ఆ వ్యక్తి దరిదాపులకు కూడా వెళ్ళను.

ప్రభువు దానినే చెప్తున్నారు. నీ కంటిలో పెద్ద దూలం పెట్టుకొని మరియు నీ కంటిచూపే సరిగా లేనప్పుడు నువ్వు నీ సహోదరునితో నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనివ్వమని ఏ విధంగా చెప్పగలవు? నీవు అతని కంటిని కూడా పాడు చేస్తావు. అయితే ప్రభువు ఈ విధంగా చెప్తున్నారు, "వేషధారి నీ ప్రేమలేని వైఖరిని చూడు". మత్తయి 7:5 ప్రకారం మరొక వ్యక్తిపై ప్రేమలేని వైఖరిని కలిగి ఉన్న ప్రతి వ్యక్తీ మరియు తీర్పు తీర్చే ప్రతి వ్యక్తీ ఒక వేషధారియై ఉన్నాడు. మొదటిగా ప్రేమలేని వైఖరి నుంచి విడుదల పొందు అప్పుడు నీవు స్పష్టంగా చూడగలవు. అప్పుడు ఆ సహోదరుడు తనంతట తానే నీవద్దకు వచ్చి, ‘సహోదరుడా దయచేసి నా కంటిలో నుంచి నలుసును తీసివేయగలవా?’ అని అడగవచ్చు. అటువంటి పరిస్థితిలోనికి నీవు వచ్చుట ఎంతో అద్భుతమైనది కాదా?