మన యొక్క విశ్వాసము కదలింపబడనిదిగా ఉండవలె నంటే అది దేవునికి సంబంధించిన మూడు యదార్థమైన విషయాలపై స్థిరంగా నిలిచి యుండాలి. అవి ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమ, ఆయన యొక్క సంపూర్ణమైన శక్తి మరియు ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానము. మనము ఆయన యొక్క ప్రేమను గురించి ఒప్పింపబడి నట్లయితే, దానికి సమానంగా ఆయన యొక్క సార్వభౌమత్వ అధికారమును గూర్చి కూడ అదే విధంగా ఒప్పింపబడతాము.
ఇందుచేతనే మన ప్రార్థనలలో దేవున్ని "పరలోకమందున్న మా తండ్రీ" అని పిలుస్తూ ప్రారంభించమని యేసు మనకు బోధించెను.
’మా తండ్రి’ అనేది ఆయన యొక్క పరిపూర్ణ ప్రేమను గుర్తు చేస్తుంది మరియు "పరలోకమందున్న" అనేది ఈ విశ్వంలో ఉండిన ప్రతిదానిపై ఆయన యొక్క సంపూర్ణ సార్వభౌమత్వాన్ని మనకు గుర్తుచేస్తుంది. దేవుడుగా, ఆయన జ్ఞానము కలిగిన వాడు గనుక ఆయన యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత మన మార్గాలన్నిటిని శాసించును.
"దేవుడు యదార్థవంతుడు (ఆయన జ్ఞానమందు పరిపూర్ణుడు) నన్ను యదార్థ మార్గమున నడిపించువాడు ఆయనే (నా పరిస్థితులను సరైన విధంగా ఆయన క్రమపర్చును)" (కీర్తన 18:30,32).
దేవుడు ప్రేమ, శక్తి మరియు జ్ఞాన మందు పరిపూర్ణుడు కాకపోయినట్లయితే, మన విశ్వాసము నిలిచియుండుటకు తగినంత పునాది లేక యుండెడిది. కాని ఆయన ఆ మూడు గుణములు కలిగియుండుటచేత మనము ఎన్నటికిని కదిలింపబడాల్సిన అవసరం లేదు.
విశ్వాసమనేది (దేవునిపై) ఆయన యొక్క కొలతలేని ప్రేమపై, ఆయన యొక్క సంపూర్ణమైన శక్తిపై మరియు ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానముపై మానవ వ్యక్తిత్వం సంపూర్తిగా ఆధారపడడము.
దేవుని యొక్క జ్ఞానము మనయొక్క జ్ఞానము కంటె ఎంతో ఉన్నతమైనదని, భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతమైనదో అటువంటిదని ఒప్పుకోవటానికి మనలో ఎవరికిని సమస్య ఉండదని అనుకుంటున్నాను.
"నా తలంపులు మీ తలంపులవంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి" (యెషయా 55:8,9).
అందుకే ఆయన పనిచేసే విధానాన్ని లేక ఆయన అనుమతించే పరిస్థితులను మనము తరచుగా అర్థము చేసుకోలేము. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి యొక్క మార్గములన్నింటిని అర్థంచేసుకోలేక పోతున్నట్లయితే మనము కూడా దేవుని మార్గములను అర్థము చేసుకోలేకపోవుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. మనము ఆత్మీయముగా ఎదుగుచూ దేవుని స్వభావములో పాలివారమవుతుండిన కొద్ది, మనము దేవుని యొక్క మార్గములను అర్థము చేసికొనుటకు ప్రారంభిచెదము.
ఏమైనప్పటికి మనుష్యులందరిపైన మరియు పరిస్థితులన్నిటిపైన దేవుని యొక్క సంపూర్ణ సార్వభౌమత్వమును అనేకమంది విశ్వాసులు అనుమానిస్తుంటారు. వారు దాని గురించి పెదవులతో ఒప్పుకోవచ్చును కాని వారు అది తమ దైనందిక జీవితంలోని ఆయా పరిస్థితులలో పని చేస్తుందని నమ్మరు. అయినప్పటికిని దేవుడు ఏ విధంగా ఆయన యొక్క పిల్లల తరపున సర్వాధికారంతో ఎలా పనిచేసాడో మరియు తరచు అసాధారణమైన విధంగా వాటిని చేయుటను గూర్చిన ఉదాహరణలతో లేఖనాలు నిండియున్నాయి.
మనలో చాలా మందికి దేవుడు తన ప్రజల తరపున స్పష్టమైన అద్భుతాలతో పని చేయటం తెలుసు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఐగుప్తు నుండి విడుదల చేశారో మొదలైనవి. కాని సాతాను దేవుని ప్రజలనెదుర్కొన్నప్పుడు, దేవుడు ఏ విధంగా సాతానును త్రిప్పికొడతాడో, అట్టి గొప్ప అద్భుతాలను తరచు మనము చూచుటలేదు.
యోసేపును గూర్చిన విషయం ఒక మహత్తరమైనట్టిది. యాకోబు యొక్క పదకొండవ కుమారునికి ముప్పయి ఏళ్ళు వచ్చేసరికి ఐగుప్తు పరిపాలనలో రెండవ స్థానముండిన వానిగా చెయ్యడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉండినది.
యోసేపు దేవునికి భయపడే కుర్రవాడు కాబట్టి అతడు సాతాను చేత ద్వేషింపబడ్డాడు. యోసేపును తొలగించివెయ్యాలని అతని అన్నలను సాతాను పురిగొల్పాడు. కాని యోసేపు ప్రాణాన్ని వారు తీయకుండా దేవుడు భద్రపరచెను. అయితే వారు కొందరు ఇశ్మాయేలీయ వర్తకులకు అతడిని అమ్మి వేయగలిగారు. కాని ఆ వర్తకులు యోసేపును ఎక్కడకు తీసుకువెళ్ళారని అనుకుంటున్నారు? ఐగుప్తుకే. అట్లు దేవుని యొక్క ప్రణాళికలో మొదటి మెట్టు నెరవేర్చబడింది.
ఐగుప్తులో యోసేపు పోతీఫరు అనువాని చేత కొనబడ్డాడు. ఇది కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. పోతీఫరు యొక్క భార్య బహుచెడు స్త్రీ; యోసేపును మోహించి, ఆమె అతడిని అనేకమార్లు ఆకర్షించటానికి ప్రయత్నించింది. ఆఖరుగా ఎప్పుడైతే ఆమె అనుకున్నది చేయలేకపోయిందో, యోసేపుపై తప్పుడు అభియోగము మోపి అతడిని కారాగారములో వేయించినది. కాని కారాగారములో యోసేపు ఎవరిని కలుసుకొన్నాడని అనుకుంటున్నారు? ఫరోకు ద్రాక్షారసము అందించువానిని! ఫరో యొక్క ద్రాక్షారసము అందించువానిని యోసేపు కలుసుకొనేలాగు అతడు కూడా అదే సమయంలో ఖైదు చేయబడునట్లు దేవుడు ఏర్పాటు చేసెను. అది దేవుని యొక్క ప్రణాళికలో రెండవ మెట్టు.
దేవుని యొక్క మూడవ మెట్టు, ఫరో పానదాయకుడు యోసేపును గూర్చి రెండు సంవత్సరములు మరచి పోవడము."అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను" (ఆదికాండము 40:23; 41:1).
దేవుని యొక్క సమయము ప్రకారము యోసేపు చెఱసాలలో నుండి విడిపించబడవలసిన సమయము ఇదే. "అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను" (కీర్తనలు 105:19,20).
యోసేపుకు ముప్పయి సంవత్సరములు వచ్చినప్పుడు దేవుని సమయము వచ్చినది - ఫరోకు ఒక కల వచ్చినది మరియు అతడి పానదాయకుడు అకస్మాత్తుగా యోసేపు కలల భావము చెప్పగలడని గుర్తు తెచ్చుకొన్నాడు. ఆ విధంగా యోసేపు ఫరో ముందుకు వచ్చి అతడి తరువాత ఐగుప్తునకు పరిపాలనలో రెండవ స్థానముండిన వాడయ్యాడు. యోసేపు జీవితములోని సంఘటనల యొక్క దేవుని సమయము ఆ విధముగా పరిపూర్ణము చేయబడినది.
ఆయా విషయములను దేవుడు ఏర్పాటుచేసిన విధానమును గురించి మన మెప్పుడును ఆలోచించ లేము.మనకు, దేవునికి ఉండినట్టి శక్తి ఉన్నట్లయితే యోసేపునకు మనుష్యులు చెడు చేయకుండా ఆపి ఉండేవారము. కాని దేవుడు శ్రేష్టమైన విధానములో దీనిని చేశాడు.
మనుష్యులు ఉద్దేశించిన చెడు దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం చాలా గొప్ప అద్భుతం. సాతాను యొక్క ఉద్దేశ్యాలను తలక్రిందులు చేయుటలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఆ విధముగా సమస్తమును ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగును.
ఈ విషయాలను మన పరిస్థితులకు అన్వయించుకుందాం.
దుష్టులయెడల, మన మీద అసూయపడే సహోదరుల యెడల, మనపై తప్పుడు అభియోగము మోపే చెడు స్త్రీల యెడల, అన్యాయంగా ఖైదులోనికి త్రోయబడడం విషయంలో మరియు సహాయం చేస్తామని వాగ్దానం చేసి మరచిపోయిన స్నేహితుల యెడల మన వైఖరి ఎలా ఉండాలి?
వారు చేసిన పనులు వారు ఉద్దేశ పూర్వకంగా చేసినా లేక అనుకోని విధంగా చేసినా వాటినన్నిటిని మన జీవితాలలో ఆయన యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడునట్లు సమకూడి జరిగించటానికి దేవుడు సర్వాధికారము కలవాడని మనము నమ్ముతామా? ఆయన యోసేపు విషయంలో అది చేసినప్పుడు మన కొరకు ఎందుకు చేయలేడు? ఆయన తప్పనిసరిగా చెయ్యగలడు మరియు చేస్తాడు.
అయితే యోసేపు జీవితంలో దేవుని ప్రణాళికను ఎవరు గజిబిజి చేయగలిగి ఉండేవారో నేను చెబుతాను. ఒకే ఒక వ్యక్తి అది యోసేపు. తనకు తాను మాత్రమే. పోతీఫరు భార్య యొక్క ప్రలోభాలకు అతడు లొంగిపోయి ఉండినట్లయితే అతడు దేవునిచేత ప్రక్కకు నెట్టివేయబడి ఉండేవాడు.
ప్రపంచమంతటిలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే నీజీవితములో దేవుని ప్రణాళికను పాడుచేసి, విచ్ఛిన్నం చేయగలడు. అది నీవు మాత్రమే. ఇంకెవ్వరు అది చేయలేరు. నీ స్నేహితులుగాని, నీ శత్రువులుగాని కాదు. దేవదూతలు గాని, అపవాదిగాని కాదు. కేవలం నీవు మాత్రమే. ఒక్కమారు మనము ఇది చూసినట్లయితే అది మనకుండిన ఎన్నో గొప్ప భయాల నుండి మరియు మనకు ఎవరైతే హాని చెయ్యటానికి తలపడతారో వారి యెడల మనకుండిన తప్పుడు వైఖరి నుండి మనలను స్వేచ్ఛాపరులుగా చేయును.