WFTW Body: 

1. యేసును ప్రేమించినట్లే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు
"..నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు..." (యోహాను 17:23).

2. యథార్థవంతులయందు దేవుడు ఆనందిస్తాడు
"ఆయన వెలుగులో ఉన్నప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము ఒకరితోనొకరము సహవాసము గలవారమై యుందుము..." (1యోహాను 1:7).

3. సంతోషముగా ఇచ్చు వారియందు దేవుడు ఆనందిస్తాడు
"...దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" (2 కొరింథీ 9:7).

4. యేసు వైపు చూడటం ద్వారానే పరిశుద్ధపరచబడతాము
"యేసువైపు చూచుచు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము" (హెబ్రీ 12:1,2).

5. మనము నిరంతరము పరిశుద్ధాత్మతో నింపబడాలి
"...ఆత్మపూర్ణులై యుండుడి" (ఎఫెసీ 5:18 - స్వేచ్ఛానువాదం: ఆత్మతో నింపబడుతూ ఉండండి).

6. సిలువ మార్గమే జీవ మార్గం
"మనమాయనతో కూడ చనిపోయినవారమైతే, ఆయనతోకూడ జీవింతుము" (2 తిమోతి 2:11).

7. మనుష్యుల అభిప్రాయాలు మనలను నిరుత్సాహపరచకూడదు
"తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?" (యెషయా 2:22).

8. ఈ లోకం విలువైనవిగా ఎంచువాటిని దేవుడు అసహ్యించుకుంటాడు
"...మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి హేయము" (లూకా 16:15).
"ధనవంతులగుటకు అపేక్షించువారు (1) శోధనలోను, (2) ఉరిలోను, (3) వివేకశూన్యమైనట్టియు, (4) హానికరమైనట్టియు అనేక ఇచ్ఛలలోను పడుదురు. అట్టివి (5) మనుష్యులను నష్టములోను (6) నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి (7) విశ్వాసమునుండి తొలగిపోయి, (8) నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి" (1తిమోతి 6:9,10).

9. మనకు మనమే తప్ప మరెవ్వరూ మనకు హాని చేయలేరు
"మీరు మేలుచేయుటలో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయువాడెవడు?" (1పేతురు 3:13).

10. మనలో ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఒక సంపూర్ణమైన ప్రణాళిక ఉంది
"వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందే సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియై యున్నాము" (ఎఫెసీ 2:10).

11. దేవుణ్ణి వ్యక్తిగతంగా, అంతరంగికంగా ఎరిగి ఉండటమే బలవంతులుగా ఉండుటకు రహస్యం
"...తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు" (దానియేలు 11:32).

12. పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఎంతో శ్రేష్ఠమైనది
"యేసు.. మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు" (హెబ్రీ 8:6).

13. మనము దైవభక్తి కలిగి జీవిస్తే హింసించబడతాము
"క్రీస్తుయేసునందు సద్భక్తితో జీవింప నపేక్షించువారందరు హింసపొందుదురు" (2తిమోతి 3:12).

14. దేవుడు అంగీకరించిన ప్రతి ఒక్కరినీ మనము కూడా అంగీకరించాలి
"శరీరములో వివాదములేకుండునట్లు.... దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను" (1 కొరింథీ 12:25,18).

15. మనము ప్రతి వ్యక్తిని గౌరవించాలి
"దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము... నా సహోదరులారా, ఈలాగుండకూడదు" (యాకోబు 3:9,10).

16. మన ప్రతి అవసరత విషయమై మనము దేవునిపైనే ఆధారపడాలి
"దేవుడు తన ఐశ్వర్యముచొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును" (ఫిలిప్పీ 4:19).

అనుబంధం: పూర్తికాలపు క్రైస్తవ పరిచారకులు డబ్బు విషయంలో ఎన్నటికీ చేయకూడని పది నియమాలు

1. మీ ఆర్థిక అవసరాలను దేవునికి తప్ప మరెవ్వరికీ ఎన్నటికీ తెలియజేయవద్దు (ఫిలిప్పీ 4:19).

2. అవిశ్వాసుల నుండి డబ్బును ఎన్నటికీ స్వీకరించవద్దు (3 యోహాను 7).

3. ఎవరి నుండి కూడా కానుకలను ఎన్నటికీ ఆశించవద్దు (కీర్తనలు 62:5).

4. మీకు డబ్బు ఇవ్వడం ద్వారా ఎవరైనా మిమ్మల్ని నియంత్రించడానికి లేదా మీ పరిచర్యను ప్రభావితం చేయడానికి ఎన్నటికీ అనుమతించవద్దు.

5. మీ పరిచర్యను పొందని వారి నుండి డబ్బును ఎన్నటికీ స్వీకరించవద్దు.

6. మీకంటే పేదవారిగా ఉన్న ఎవరినుండైనా, మీ వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాల కొరకు డబ్బును ఎన్నటికీ స్వీకరించవద్దు.

7. మీ ఆర్థిక అవసరాల కొరకు ఏ మనుష్యునిపైనా ఎన్నటికీ ఆధారపడవద్దు.

8. ఇతరులు అనుమానించే రీతిలో దేవుని డబ్బును ఎన్నటికీ విచ్చలవిడిగా లేదా అజాగ్రత్తగా నిర్వహించవద్దు (2 కొరింథీ 8:20,21).

9. మీరు డబ్బు పొందుకునప్పుడు ఎన్నటికీ ఉప్పొంగిపోవద్దు.

10. మీరు డబ్బు కోల్పోయినప్పుడు ఎన్నటికీ కృంగిపోవద్దు (నిరుత్సాహపడవద్దు).

```