WFTW Body: 

"దైవభక్తిని గూర్చి మర్మము" అనగా ఒక విశ్వాసి దైవభక్తి విషయములో తీవ్రముగాలేనట్లయితే లేక ఇతరులచేత విమర్శించబడతాననే భయముతో లేఖనములలోని సత్యము కొరకు నిలబడుటకొరకు భయపడువారికి దేవుడు ఆ సత్యమును మర్మముగా ఉంచును (1తిమోతి 3:16). ఆయనకు భయపడువారికే దేవుడు తన మర్మములను బయలుపరచును (కీర్తన 25:14). దేవుని విషయములలో "పిరికివారుగా" ఉండుట అపాయకరము. ఎందుకనగా ప్రకటన 21:8లో 'హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికుల' కంటే ముందుగా 'పిరికివారు' అగ్ని గుండములో వేయబడుదురని చెప్పబడింది!.

మార్టిన్ లూథర్ ఈ విధముగా చెప్పాడు: "నేను దేవుని సత్యమంతటిని నమ్మానని చెప్పి, ఈ సమయములో అపవాది ఎదిరించే ఒక సత్యము విషయంలో నేను మౌనముగా ఉన్నట్లయితే, నేను నిజముగా క్రీస్తును ఒప్పుకొనుట లేదు. ఎక్కడైతే పోరాటము ఎక్కువగా ఉంటుందో అక్కడే సైనికుని నమ్మకత్వము పరీక్షించబడుతుంది. ఇప్పుడు జరుగుచున్న పోరాటములో ఒక సైనికుడు ధైర్యముగా నిలబడనిచో, మిగతా విషయములన్నిటిలో అతడు నమ్మకముగా ఉన్నప్పటికిని ప్రయోజనము లేదు".

"క్రీస్తు మనవలే శోధింపబడియు ఒక్క పాపము కూడా చేయలేదు" అను సత్యమును గూర్చి ఇండియాలో మన సంఘములపై గత 43 సంవత్సరములుగా పోరాటము తీవ్రస్థాయిలో ఉన్నది. "ఆ సత్యమునకు స్థంభమును, ఆధారముగా" మనము నిలువబడియున్నాము (1 తిమోతి 3:15). మరియు దానిని ఎంతో ధైర్యముతోను మరియు సిగ్గుపడకుండా ప్రకటించియున్నాము. మరియు దాని ఫలితముగా అనేకమంది జీవితములు మార్పుచెందుట చూచాము.

1 తిమోతి 3:16లో ధైవభక్తిని గూర్చిన మర్మము "క్రీస్తు శరీరధారియై వచ్చియున్నాడన్న సిద్ధాంతములో" లేదుగాని "శరీరధారియై వచ్చియున్న క్రీస్తులో ఉన్నది". చాలామంది ధైవభక్తిని క్రీస్తులో కాక ఒక సిద్ధాంతములో చూచుచున్నారు గనుక పరిసయ్యులుగా మారియున్నారు. అక్షరము (సరియైన సిద్ధాంతమైనప్పటికి) చంపును. ఆత్మ మాత్రమే జీవింపచేయును (2కొరింథీ 3:6). మనము ప్రజలను క్రీస్తులోనికి నడిపించవలెనుగాని ఏ సిద్ధాంతము యొద్దకు కాదు.

ప్రభువైనయేసు శరీరధారియై వచ్చియున్నాడని మన ఆత్మతో ఒప్పుకున్నయెడల (కేవలం మనస్సుతోనే కాకుండా- 1యోహాను 4:2) అనగా హృదయమంతటితో, ఆయన మనవలే సమస్తవిషయములలో శోధింపబడెననియు మరియు మనకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ శక్తి ఆయనకందుబాటులో లేదనియు మనము నమ్మి పూర్ణహృదయులమయినయెడల ఆయన నడుచుకొనిన ప్రకారము మనము కూడా నడుచుకొనగలము (1యోహాను 2:6).

మరొకవిధముగా, మన సొంతమును కోరక మరియు మన స్వచిత్తమును నెరవేర్చాలని కోరుకొనకుండా మన ఆత్మ ఆయన అడుగుజాడలను వెంబడించాలని కోరుకోవటం. భూమిమీద ఉన్నప్పుడు ఆయన శోధనల ద్వారా నేర్చుకొనిన తండ్రియెడల విధేయతను గురించి మనకు ప్రత్యక్షత అవసరము. "ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను" అని వ్రాయబడియున్నది (హెబ్రీ 5:8). ప్రతి శోధనను ఆయన అత్యంత నమ్మకముగా పోరాడియున్నాడు. ఆయన నమ్మకముగా తన ప్రాణమును ధారపోసియున్నాడు(యెషయా 53:12). కాబట్టి దేవునియొక్క సంపూర్ణజీవము ఆయన ద్వారా బయలుపరచబడియున్నది. మొదటిగా వారికి తెలిసిన ప్రతీ పాపము మీద నమ్మకముగా పోరాడేవారు దేవుని దృష్టిలో కొందరే ఉన్నారు గనుక పరిశుద్ధపరచబడుటకు వారి ప్రాణమును ధారపోయువారు కొద్దిమందే ఉన్నారు.

ప్రభువైనయేసు ఆయన శరీరమను తెరద్వారా ఏర్పరచిన నూతనమైనదియు, జీవముగల ఈ మార్గమును గూర్చిన సత్యమును గ్రహించకుండా అనేకమంది విశ్వాసులు వారి జీవితములో దేవుని చిత్తమును పోగొట్టుకొనుచున్నారు (హెబ్రీ 10:20). మనము మొదటిగా సత్యమును గ్రహించిన యెడల "సత్యము మనలను స్వతంత్రులుగా చేయునని" యేసుప్రభువు చెప్పారు (యోహాను 8:32).