WFTW Body: 

1. పారిపొమ్ము:

యోసేపువలె శోధనను విసర్జించి మరియు దానినుండి పారిపోవుటయే జయము పొందుటకు శ్రేష్టమైన మార్గము (ఆదికాండము 39:7-12). నీవు బలముగా శోధింపబడి మరియు నిన్ను బలహీనపరిచే ప్రదేశాలు మరియు ప్రజలకు దూరముగా ఉండుము. "మమ్మును శోధనలోనికి తేకుము" అని ప్రార్థించమని ప్రభువైన యేసు చెప్పారు. ఈ విధముగా నీవు చేసినందుకు నిత్యత్వములో ఎంతో కృతజ్ఞత కలిగియుంటావు. భూమిమీద కూడా నీ శక్తికి మించిన శోధన నీకు రాకుండునట్లు అటువంటి స్థలములను మరియు ప్రజలను నివారించినందుకు కృతజ్ఞత కలిగియుండెదవు. అటువంటి ప్రదేశములు మరియు ప్రజలను నీవు నిరాకరించుట ద్వారా ప్రభువుని మాత్రమే నీవు సంతోషపెట్టవలెనని కోరుచున్నావని ఋజువుపరచుచున్నది (సామెతలు 7వ అధ్యాయము యౌవస్థులు అప్పుడప్పుడు చదువుట మంచిది).

పురుషులు స్త్రీలతోగాని లేక స్త్రీలు పురుషులతోగాని సన్నిహిత స్నేహం కలిగియుండకూడదు. నీలో లైంగిక వాంఛను కలిగించే పుస్తకములుగాని (వైబ్‍సైట్ గాని) చదవకుండా పారిపొమ్ము. ఉపయోగము లేని టి.వీ కార్యక్రమములు చూచి సమయమును వృథా చేసుకొనుట నుండి పారిపొమ్ము. కొండెములను వినుటనుండి పారిపొమ్ము. చెడ్డవాటిని వినుటగాని, చెడ్డవాటిని చదువుటగాని మరియు చెడ్డవాటిని చూచుటగాని చేసినట్లయితే నీవు చెడ్డ వాటిని తెలుసుకొందువు. కాని ఆ చెడ్డ సమాచారము నీకు అవసరమా? అది నిన్ను కలుషితము చేసి మరియు నాశనము చేయును, అటువంటి సమాచారము విషయములో నీ చెవులను, కళ్ళను ఇప్పటినుండి మూసుకొనుము. ఇతరులు చేసిన కీడు తెలుసుకొనుట ద్వారా నీవు ఎన్నటికి జ్ఞానవంతుడవు కావు. కీడు విషయములో పసిబిడ్డలు వలె ఉండవలెనని బైబిలు హెచ్చరించుచున్నది (1 కొరింథీ 14:20). ఒక బిడ్డ యొక్క మనస్సు కీడంతటి విషయములో పవిత్రముగా ఉండును. కాని ఇప్పుడు మనుకున్న సువార్త ఏమనగా బిడ్డలాంటి మనస్సు నీవు కోరినయెడల, గత సంవత్సరములన్నిటిలో చెడ్డ సమాచారమంతటినిబట్టి నీ మనస్సంతటిని పాడుచేసుకున్నప్పటికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడును. ఇదియే దేవుని కృప మన కొరకు చేయును. దేవునికి స్తోత్రము. "మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై ఉండుటకు" మనము పిలువబడియున్నాము (రోమా 16:19). కాబట్టి ప్రభువైన యేసు జీవించిన విధానమును చూపించమని పరిశుద్ధాత్మను అడుగుము. అప్పుడు మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉండుట తెలుసుకొందురు.

2. పశ్చాత్తాపపడుము:

ఒకవేళ నీవు పాపములో పడిపోయినట్లయితే వెంటనే పశ్చాత్తాపడి మరియు క్షమాపణ అడుగుము. లేనట్లయితే నీవు పాపమును చులకనగా తీసుకొని దానినుండి విడుదల పొందుటకు చాలా కష్టమగును. ఏ విషయములో అయినను దేవునికి వ్యతిరేకముగా పాపము చేసియున్నావని నీకు తెలిసినప్పుడు, వెంటనే వాటిని ఒప్పుకొనుము మరియు మారుమనస్సు పొంది విడుదల పొందుటకు హృదయమంతటితో కోరుము. నీవు పాపములో పడిపోయిన ప్రతిసారి దుఃఖించినయెడల, ఆ పాపమును జయించుటకు నీవు దప్పిక కలిగియున్నావని దేవుడు చూచును. కాబట్టి నీ మనసాక్షిలో ఎప్పుడైననూ కొంచెమైననూ విశ్రాంతిలేనియెడల వెంటనే దానిని సరిచేసుకొనుము. కేవలము నీ తలంపులలో తప్పిపోయినప్పటికిని, ఆ పాపము దేవుని యెదుట ఒప్పుకొనుము. ఓడిపోయిన ప్రతిసారి దుఃఖపడుము. అవసరమైనప్పుడు ఇతరులను క్షమాపణ అడుగుము. అప్పుడు దేవుడు నిన్ను ఏవిధముగా బలపరచునో చూడుము.

3. కొనసాగండి:

ఇదియే జయము పొందుటకు రహస్యము. ఒక కంప్యూటర్‍లో ఒక సమస్య పరిష్కరించే వరకు అతడు ఆ కంప్యూటర్‍లో పనిచేసినట్లుగా ఉండును. నిరాశపడుట అనే శోధన సార్వత్రికమైయున్నది. కాని నీవు విడిచిపెట్టవద్దు. నీవు పుట్టకముందే దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక చేసియున్నాడు (కీర్తన 139:16). సాతానుచేత దానిని చెడ్డగొట్టబడనీయకుము. ఏది ఏమైననూ నీవు ప్రభువు కొరకు నిలువబడుము. లోకాధికారి వచ్చినప్పుడు, అతడు తనలో ఏమియూ కనుగొనలేడని ప్రభువైన యేసు యోహాను 14:30లో చెప్పారు. ప్రభువైన యేసువలే మనము నడుచుటకు పిలువబడియున్నాము. సాతాను నీ యొద్దకు వచ్చినప్పుడు, అతడు నీలో ఏమియు కనుగొనకూడదు. అందువలన

"నేను దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను"

(అపొ. కార్యములు 24:16). నీవు తెలిసిన పాపము చేయకుండునట్లు కావలసిన కృపను జీవమును పొందునట్లు పూర్ణ హృదయముతో దేవునిని వెదకవలెను. నీలో ఉన్న దురాశలకు నీవు లోబడుచున్నట్లయితే సాతాను నిన్ను పట్టుకొనును. రోమా 6:1లో,

"మనము పాపములో నిలిచియుండెదమా?"

అని అడుగుచున్నాడు మరియు రోమా 6:15లో

"పాపము చేయుట ఎన్నటికీ కుదరదు"

అని చెప్పియున్నాడు. ఈ రెండు ప్రశ్నలకు,

"ఒక్కసారి కూడా వద్దు అని చెప్పుచున్నాడు"

. నీ జీవితకాలమంతయు శోధనలు మరియు పొరపాటులు ఉండును. తరువాత నీకు తెలిసిన పాపము మీద కొంతకాలానికి జయము పొందెదవు మరియు తరువాత ఆ పాపములో చాలా తక్కువగా పడెదవు.