వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు గృహము పురుషులు
WFTW Body: 

పాపము రాక ముందు, "ఆదాము హవ్వలు దిగంబరముగా ఉండి వారు సిగ్గు ఎరుగక యుండిరి". వారు ఒకొరి యొడల ఒకరు నిజాయితీతో నుండి దాచుకొనుటకు ఏమీ లేకుండా యుండిరి కాని వారు పాపము చేయగానే పరిస్థితులు మారిపోయినవి. వెంటనే వారు అంజూరపు ఆకులతో వారిని కప్పుకొనిరి. వారెందుకు అట్లు చేసిరి? ఆ తోటలో వారిని రహస్యంగా దాగి ఉండుట చూచువారు లేరు మరియు వారు జంతువుల నుండి వారిని వారు కప్పుకొనుట లేదు. అటువంటప్పుడు వారిని వారు అంజూరపు ఆకులతో కప్పుకొను అవసరము ఎందుకు కలిగినది. వారు ఒకరి నుండి ఒకరు కప్పుకొనుచుండిరి.

మనము ఒకరి నుండి ఒకరు కప్పుకొనుట పాపము యొక్క ఒక ఫలితమైయున్నది. జనులందరు బాగుగా లేవనుకొనిన వారి శరీర భాగములను దాచుదురు. వాటి యొక్క వివరములు యితరులకు తెలిసినట్లయితే వారు సిగ్గు పడుదురు. అందుచేత వారు మారు రూపము కలిగించే ముసుగులు ధరించుదురు. వారు లోపల దౌర్భాగ్యముగా, ఓడిపోయియుండినా పైకి చూచుటకు ఏ చింతలేనట్లుగా, నిమ్మళముగా మరియు సంతోషముగా ఉండినట్లు కనపరచుకొందురు.

మీ వివాహసమయంలో మీరు ఒకరి విషయంలో ఒకరు ఎలా ఉందురో అట్లే యుందుమని ఎప్పుడూ మారు రూపమైన ముసుగులు ధరించుకొనమని నిర్ణయించుకొనవలెను. లేనిదానిని ఉన్నట్లుగా చూపకూడదు మరియు అంజూరపు ఆకులు ఉండకూడదు.

తనను (తన బలహీనతలను) గూర్చి పూర్తిగా ఇతరులకు తెలిసినా కూడా తనను ప్రేమించే వ్యక్తిని కనుగొనుట గూర్చిన ఆశ ప్రతిఒక్కరి హృదయములో నుండును. మనకు ఇతరులతో నుండిన చేదు అనుభవాలను బట్టి మనము ముసుగులు ధరించుదుము. మన గురించి ప్రతి విషయము తెలిసినట్లయితే జనులు మనలను అంగీకరించరని మనకు తెలియును. కనుక వారు మనలను అంగీకరించునట్లు మనము వారి యెదుట వారి కిష్టమైన విధముగా యుందుము. ఇది క్రైస్తవుల విషయములో కూడా నిజమైయున్నది. యేసుప్రభువు ఈ భూమిపై నుండినప్పుడు, అనేకమంది మతాసక్తి కలిగిన వారు ముసుగులు వేసికొనుట గమనించారు. అందువలననే ఆయన వారికి సహాయం చేయలేక పోయారు.

ఈ రోజున మీరిరువురు ఒక నిర్ణయము చేసికొనవలెనని నేను కోరుచున్నాను - అది ఎప్పుడును ముసుగు ధరించకుండా ఉండి ఎల్లప్పుడు ఒకరినొకరు ఎలా ఉంటే అట్లు అంగీకరించు వారుగా ఉండవలెను. సంతోష్, నీవు మేఘన్ లో తప్పులు చూచినప్పుడు ఆమెను అంగీకరించగలవా? మేఘన్, నీవు సంతోష్ లో తప్పులు చూచినప్పుడు అతడిని అంగీకరించగలవా?

దేవుని గూర్చిన అద్భుత విషయమేమిటంటే ఆయన మనందరిని మనము ఉన్నట్లుగానే అంగీకరించెను. దేవుడు నిన్ను అంగీకరించుటకు ముందు నీవు కొంత మారాలి అని చెప్పే మతము తప్పుడు మతము. యేసు ప్రభువు అటువంటి మతముతో రాలేదు. మనము ఎలా ఉంటే అలాగే మనలను దేవుడు ప్రేమించును అనే సందేశముతో ఆయన వచ్చెను. మనకు మనముగా మారలేమని దేవునికి తెలియును. అందువలన ఆయన మనలను మనము ఉండిన స్థితిలోనే స్వీకరించును. మరియు ఆయన మనలను మార్చుకొనును. సంతోష్, మేఘన్, "క్రీస్తు మిమ్మలను స్వీకరించినట్లు మీరును ఒకరినొకరు స్వీకరించుకొనవలెను" అని బైబిలు మిమ్ముల నిరువురను అడుగచున్నది.

కొంతకాలము క్రితము ఈ విషయమునకు సంబంధించిన ఒక వ్యాసమును నేను చదివాను. అది వ్రాసిన వాని పేరు నాకు గుర్తులేదు. అందులో ఇలా ఉన్నది.

"జీవితము గుండా వెళ్లుచున్న మనందరము ’దాగుడు మూతలు’ ఆట ఆడుచున్నాము. మన గూర్చి మనము సిగ్గుపడుట చేత మనము ఒకరి నుండి ఒకరు దాగుకొనుచున్నాము. మనలో నివసించుచుండిన నిజమైన వ్యక్తిని ఇతరులు చూడకుండునట్లు మనము ముసుగులు ధరించుకొందుము. మనము ఒకరినొకరు మనయొక్క ముసుగుల ద్వారా చూచుదుము, దానిని "సహవాసము" అను పేరుతో పిలుచుదుము. జనులకు మనము స్థిరముగా మరియు కలవరము లేకుండాయున్నామను అభిప్రాయము కలుగజేయుదుము కాని అది ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగు క్రింద గలిబిలి, భయము కలిగియుండి ఒంటరి వారుగా యుందుము. ఇతరులు మన గూర్చి తెలుసుకొందురని మనము భయపడుదుము. ఇతరలు మనలో ఉండిన నిజమైన వ్యక్తిని చూచినట్లయితే, వారు మనలను తిరస్కరించుదురని మరియు బహుశా మన గూర్చి నవ్వుదురని మరియు వారి నవ్వులు మనలను చంపునని భయపడుదుము. గనుక మనము లేనిది ఉన్నట్లుగా చూపించే ఆట ఆడుదుము అనగా ధైర్యముగా మరియు నమ్మకముతో ఉండినట్లు కనబడుదుము. కాని లోపల చిన్న పిల్లల వలె వణకుతూ ఉందుము. మన జీవితమంతా ఒక కనబరచుకొనేదిగా ఉండును. మనము ఇతరులతో మాట్లాడుతూ మరియు వారికి మన గూర్చిన ప్రాముఖ్యత లేని విషయములను చెప్పుచూ మన లోపల నిజముగా దుఃఖపడుచున్న దాని గూర్చి ఏమీ చెప్పము".

మనము యితరులచే అంగీకరింపబడవలెనని, అర్ధము చేసికొనబడువలెనని మరియు ప్రేమింపబడవలెనని ఎంతగానో ఆశపడుదుము. కాని మన అనుభవములో, మనము ఇతరులకు మనకు మనము యదార్ధముగా తెలియజేసుకొనినప్పుడు, వారు మనలను తిరస్కరించుటను కనుగొంటిమి. మన గూర్చి అంతా తెలిసినా మనలను అంగీకరించు వారికొరకు మనము వెదుకుచుంటిమి. కాని మనకెవ్వరూ దొరకలేదు. మనము నూతనముగా జన్మించిన క్రైస్తవుల ప్రేమ గూర్చి మాట్లాడుట విని, వారొకవేళ మనలను అంగీకరించుదురేమో అని హృదయములో ఆశకలిగి యుందుము. కాని మనము వారితో కలిసినప్పుడు వారు కూడా ముసుగులు ధరించియుండుటను చాలా త్వరగా తెలిసికొందుము. అంతేకాకుండా వారు మనలో తప్పులు ఎంచుదురు.

దీనికి పరిష్కారమేమిటి? మనము ఎలా ఉంటే అట్లు దేవుని చేత అంగీకరింపబడి ప్రేమింపబడియున్నామని మనము చూడవలసిన అవసరమున్నది. దేవుడు ప్రేమయైయున్నాడు. దేవుని ప్రేమను అనుభవించుట మనలను ధైర్యవంతులుగా చేయును. అప్పుడు మనము నటించవలసిన అవసరము లేదు. అప్పుడు మనము దేవునితోను మరియు మనుష్యులతోను మనము ఎలా ఉంటే అలా ఉండవచ్చును. దేవుని ప్రేమ ఎప్పుడు మనలను ఏమైనా చెయ్యమని బలవంతము చేయదు. దేవుడు మనలో ఉండిన అసంపూర్ణమైన వాటన్నిటిని గుర్తించియుండెను అయినప్పటికిని మనలను ఖండించకుండా అంగీకరించెను. మరియు వేరొక ప్రక్క మనలను పరిపూర్ణులుగా చేయవలెనని కోరుచుండెను. అయినను మనలో ఉన్న వాటన్నిటిని చూచి మరియు తెలుసుకొని యుండి కూడా, మనము దేవుని చేత అంగీకరింపబడుచున్నామని తెలియుట క్రైస్తవ జీవితమునకు మూలమైయున్నది. యేసుప్రభువు మనకు యివ్వవలెనని ఉద్దేశించిన సమృద్ధియైన జీవితము (జీవము) ఇదే.

దేవుని ప్రేమను తెలిసికొనుట మనము ఇతరులచే అంగీకరింపబడవలెననే కోర్కెను కూడా శాశ్వతముగా పోగొట్టును. మనము ధైర్యముతో నింపబడుదుము. మనలో నుండిన అపరాధభావన పోవును మరియు మన భయములన్ని త్రోలివేయబడును. మనము కొన్నిమార్లు ఒంటరిగా ఉండవచ్చును, కాని ఎప్పుడూ ఒక్కరము కాదు, ఎందుకనగా దేవుడు మనలను ఎప్పుడు విడువను ఎడబాయను అని వాగ్దానము చేసెను.

మన వివాహ భాగస్వామి అంతరంగములో నుండి తను అంగీకరింపబడవలెననే కోర్కె మొఱ్ఱ పెట్టుచుండెను. కనుక మన భాగస్వామి మాటలాడే మాటలకు మాత్రమే కాక, బయటకు పలుకబడని మాటలకు, ఎప్పుడూ బయటకు చెప్పకపోయినను హృదయములో నుండిన మౌన మాటలకు నీ చెవి నిచ్చుట ఎంతో ప్రాముఖ్యమైన విషయము.

మనలను మనల్నిగా దేవుడు అంగీకరించెను అను విషయమును కూడా మనము అంగీకరించకపోవుట ఎంతో విషాదకరమైనది. అందువలన మనము ఆయన యొద్ద నుండి కూడా దాగుకొందుము. ఆదాము హవ్వలు అదే చేసారు. వారు చెట్టు వెనుకకు పారిపోయి దేవుని నుండి దాగుకొనుటకు ప్రయత్నించారు.

దేవుని చేత అంగీకరింపబడిన సంతోషమును వారికి వారు తెలిసికొనకపోవుట చేత అనేక మంది భార్యభర్తలు ఒకరినొకరు ప్రేమించుకొనలేరు. వారికి మతము ఉండును కాని క్రీస్తు ఉండరు. సాతాను యొక్క అనేకమైన కుతంత్రములలో ఒక్కటేమిటంటే, జనులకు క్రీస్తులేని క్రైస్తవమతము నిచ్చుట, అప్పుడు వారింకను దౌర్భాగ్యముగా నుందురు. అనేకులు అటువంటి మతము నుండి తొలగిపోవుదురు. ఎందుకనగా అది నిజమైన క్రైస్తవ్యము కాదు. క్రీస్తే నిజమైన క్రైస్తవ్యము.

యేసుక్రీస్తు కేంద్రముగా నుండిన ప్రతి గృహము సమాధానకరమైన గృహముగా యుండును. ఆ గృహములో భర్త భార్య ఒకరినొకరు అర్ధము చేసికొనువారుగా యుందురు, వారిరువురిని దేవుడు అంగీకరించెనను వాస్తవమును నమ్ముట చేత మరియు ఆ విషయములో స్థిరముగా నుండుట చేత వారు ఒకరినొకరు అంగీకరించుకొనెదరు. అటువంటి యింటిని మీరు కట్టవలెను.