2 రాజులు 3:11 లో ఇశ్రాయేలులోని ఇతరులు ప్రవక్తయైన ఎలీషాకు ఒక సుందరమైన పేరు పెట్టియున్నారు. “ఏలీయా చేతులమీద నీళ్ళుపోయుచు వచ్చినవాడు”, ఏలీయా భోజనము చేసిన ప్రతిసారి తన చేతులు కడుగుకొనుటకు (శుభ్రము చేసుకొనుటకు), ఎలీషా నీళ్ళు తీసుకొనివచ్చి ఏలీయా చేతులమీద పోసెడివాడు. ఆపనిని అతడు క్రమముగాను మరియు నమ్మకముగాను చేసెను. ఎలీషా ఈ విధముగా తన పరిచర్యను ఆరంభించాడు.
మనకు పరిచర్యను ఇచ్చుటకు ముందుగా చిన్న విషయములలో మన నమ్మకత్వమును దేవుడు పరీక్షించును. యెహోషువా నాయకుడు కాకముందు అనేక సం||లు మోషేకు సేవ చేసెను. తిమోతి కూడా పౌలుకు పరిచర్య చేసి తరువాత అపోస్తలుడు అయ్యాడు.
తన పరిచర్యను ఆరంభించినప్పుడు ఎలీషా గొప్ప బోధకుడుగానో లేక గొప్ప ప్రవక్తగానో పేరుగాంచలేదు. ఒక సేవకునిగానే అతడు తెలియబడెను. చాలామంది యౌవ్వనస్థులు వారి పరిచర్యలో పేరు ప్రతిష్టలు కొరకు చూచుచున్నారు గాని ఇతరులకు సేవ చేసే అవకాశము కొరకు చూచుటలేదు గనుక దేవుని శ్రేష్టమైన వాటిని పోగొట్టుకొనుచున్నారు.
జీవితాంతము వరకు మనము ఇతరుల పాదములు కడిగే వారిగా ఉండాలని ప్రభువైన యేసు తన మాదిరి ద్వారా బోధించారు. ఆరంభములో కొన్ని సం||లు ఇతరుల పాదములు కడిగి తరువాత పెద్ద పరిచర్యలు చేయుటకాదు, అలాకాదు. మన జీవితాంతము వరకు అణకువ(దీనత్వము)తో పనులు చేయాలి.
ఇతరులకు పరిచర్య చేయుటకొరకు వచ్చియున్నాను గాని పరిచర్య చేయించుకొనుటకు రాలేదని ప్రభువైన యేసు చెప్పారు. నీ జీవితకాలమంతయు సేవకునివలె ఉండుము. నీవు ప్రభువుకు యుగయుగములవరకు సేవకునిగా ఉండగోరినయెడల, ప్రజలకు కూడా యుగయుగముల వరకు సేవకునిగా ఉండుము. నిన్ను నీవు ఎల్లప్పుడు ఇతరులకు సేవకునిగా భావించవలెనుగాని మరి ఇంకేమియుకాదు. నీవు ప్రభువును సేవించినపుడు, ఇతరులుకూడా నీయెడల దయకలిగి నీకు సేవ చేయుదురు. కాని దానిని బట్టి సంతోషించవద్దు. వారిని ఎన్నడైనను నీ సేవకుడుగా చూడవద్దు. వారు నీ సహోదరులైయున్నారు. వారికాళ్ళు కడిగి మరియు వారికి సేవ చేయుటకు ఇష్టము కలిగి యుండుము. ఈనాడు చాలామంది బోధకులు “ప్రభువు”లై యున్నారు గనుక వారి పరిచర్యలోనుండి అభిషేకము పోయినది.