వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు
WFTW Body: 

నరునికి సాటియైన సహాయముగా ఉండునట్లు దేవుడు హవ్వను చేశారు (ఆదికాండము 2 : 18). ఆమెకు ఇచ్చిన "సహాయకుడు" అనే పేరునే ప్రభువు పరిశుద్ధాత్మునికి కూడా ఇచ్చారు కాబట్టి ఆ పరిచర్య ఎంత మహిమకరమైనదో చూడగలము (యోహాను 14 : 16). ఒక విశ్వాసికి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే అదృశ్యుడుగా ఉండి, నెమ్మదిగా ఎల్లప్పుడు ఆదరణకర్తగా సహాయము చేయుచున్నాడో అలాగే నరునికి సహాయము చేయుటకు దేవుడు ఆమెను సృష్టించాడు. పరిశుద్ధాత్ముడు అదృశ్యుడుగా, వెనుక ఉండి పరిచర్య చేయును అలాగే ఒక స్త్రీ కూడా.

ప్రభువైనయేసు యొక్క జీవితము స్త్రీలకు మాదిరి. ప్రభువైనయేసుకు తండ్రియైన దేవుడు ఎలాగైతే శిరస్సుగా ఉన్నాడో, స్త్రీకి శిరస్సు పురుషుడైయున్నాడు (I కొరంథీ 11 : 3 ). ప్రభువైనయేసు ఎల్లప్పుడు తండ్రికి విధేయుడైయున్నారు. దైవభక్తిగల స్త్రీ కూడా అలాగే భర్తకు విధేయత చూపును. తన భర్తతో సంప్రదించకుండానే నిర్ణయము తీసుకోవటమే, ఏదేనుతోటలో హవ్వ చేసిన తప్పు. ఆవిధముగా సాతాను ఆమెను మోసగించాడు (I తిమోతి 2 : 14 ). ప్రభువైనయేసు తన తండ్రికి చూపినట్లు మరియు సంఘము క్రీస్తుకు చూపినట్లు, క్రైస్తవులైన భార్యలు కూడా తమ భర్తలకు విధేయత చూపాలి (ఎఫెసీ 5 : 24 ).

లూసిఫర్ తిరుగుబాటు ద్వారా విశ్వములో పాపము ప్రవేశించింది. ప్రభువైనయేసు విధేయత ద్వారా రక్షణ వచ్చింది. దేవుని అధికారమునకు దీనత్వముతో విధేయత చూపుటయే విశ్వమంతటిలో అత్యంత శక్తి కలిగియుంటుంది. ఎందుకనగా అది మాత్రమే క్రీస్తుఆత్మ కాబట్టి ఆ ఆత్మ తిరుగుబాటు ఆత్మలన్నిటిని సిలువ మీద జయించింది. ఒక స్త్రీ తన భర్తకు లోబడినప్పుడు, ఆలాగు చేయమని చెప్పిన దేవుని వాక్యమునకు లోబడుచుబడుచున్నది. అప్పుడు ఆమె విశ్వమంతటిలోనున్న అతిగొప్ప శక్తితో (దేవునిశక్తితో) ప్రభావితము చేయబడును. ఆ శక్తిద్వారా వాక్యమునకు అవిధేయులైన భర్తలు కూడా రక్షింపబడుదురు (I పేతురు 3 : 1, 2 ). అటువంటి లోబడే ఆత్మతో ఆమె జీవించినట్లుయితే, ఆమె జయించే దానిగా ఉండి మరియు వేయ్యేండ్ల పరిపాలనలోను, నిత్యత్వములోను పరిపాలించేదానిగా ఉంటుంది (ప్రకటన 3 : 21 ).

ఈ విషయములోనే ఒక స్త్రీని సాతాను మోసగించును. తిరుగుబాటు చేసే ఆత్మ ద్వారా సాతాను, దూతలను మోసగించి తప్పిపోవునట్లు చేసిన విధముగా స్త్రీలను కూడా మోసగిస్తాడు. తిరుగుబాటు స్వభావముగల భార్య, తనయింటిని అరణ్యభూమిగా మార్చును (సామెతలు 21 : 19 ). మరోవైపు గుణవతియైన లోబడే భార్య తన భర్తకు కిరీటమైయుండి, తన యింటిని రాజభవనముగా మార్చును (సామెతలు12 : 4 ). ఆత్మీయముగా మీ ఇల్లు రాజభవనమువలెనైనను లేక అరణ్యమువలెనైనను ఉండవచ్చును. నీవు ఎటువంటి భార్యవు అనేదాని మీద అంతయు ఆధారపడియుండును. దేవుని దృష్టికి సాత్వీకము మరియు మృదుత్వము అనునవి ఎంతో విలువైనవనుటలో ఆశ్చర్యములేదు (I పేతురు 3 : 4 ).

సామెతలు 31 : 10 - 31లో గుణవతియైన భార్యయొక్క గుణలక్షణములు వివరించబడినవి. ఆమె హృదయము, చేతులు మరియు నాలుక ఎంతో మంచివి. ఆమె అందమును గూర్చిగాని లేక సౌందర్యమును గూర్చిగాని ఏమియు చెప్పబడలేదు. ఎందుకనగా అవి యెంతో మోసకరమైనవనియు మరియు వ్యర్ధమైనవనియు చెప్పబడింది (సామెతలు 31 : 30).

గుణవతియైన స్త్రీ, దేవుని యెడల భయభక్తులు కలిగియుండును (సామెతలు 31 : 30). ఇదియే ఆమె జీవితమునకు పునాది. ఆమె తన చేతులతో వస్త్రములు కుట్టును, భోజనము సిద్ధపరచును, చెట్లను నాటును మరియు దరిద్రులకు ఇచ్చును (సామెతలు 31 : 13 - 22). ఆమె జ్ఞానముతోను, కృపాకనికరములతోను మాట్లాడును (సామెతలు 31 : 26). ఆమె అందముగాలేకపోయినను, దేవునియెడల భయభక్తులు కలిగి తన చేతులతో బలముగా పనిచేస్తుంది. ఆమె తన పవిత్ర హృదయము ద్వారా, గరుకైన చేతులద్వారా మరియు మృదువైన నాలుక ద్వారా దేవుని మహిమను వ్యక్తపరచును. (లోకానుసారమైన స్త్రీలు దానికి వేరుగా అపవిత్రమైన హృదయమును, మృదువైన చేతులు మరియు కఠినమైన నాలుక కలిగియుందురు). దేవుడు తన మహిమను వ్యక్తపరచుటకు, ఇటువంటి లక్షణములు కలిగిన స్త్రీలకొరకు చూస్తున్నాడు.

గుణవతియైన స్త్రీ ఒక భార్యగా తన భర్తకు సహాయకురాలుగా ఉండును. తాను బ్రతుకుదినములన్నియు ఎల్లప్పుడు అతనికి మేలు చేయునుగాని కీడు చేయదు (సామెతలు 31 : 12). అనగా, అతని యెడల ఆమెకు ఉన్న మొదటి ప్రేమను కోల్పోదు. ధనము వృధా అవ్వకుండునట్లు, తన భర్త చేసే పనిలోగాని లేక పరిచర్యలోగాని సహకరిస్తూ, ధనమును జాగ్రత్తగా ఖర్చుపెట్టును. అతడు ప్రభువుకు పరిచర్య చేయునట్లు, ఇంటిలో బాధ్యతలన్నియు తానే నిర్వహిస్తుంది (సామెతలు 31 : 23 - 27). ప్రపంచములో ఉన్న స్త్రీలందరిలో (ప్రధానమంత్రులుగాను, బోధకులుగాను ఉన్న స్త్రీలతో కూడా కలిపి), ఆమెయే నాకు శ్రేష్టమైనదని తన భర్త చెప్పుటలో ఆశ్చర్యమేమియులేదు (సామెతలు 31 : 29). ఒక స్త్రీగా తనయొక్క పిలుపును గ్రహించిన ఆమె, బహిరంగముగా అటువంటి ఘనతకు పాత్రురాలే.