“మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను” (యెహోషువ 1:3) మరియు నీవు బ్రతుకు దినములన్నిటను ఏమనుష్యుడును నీయెదుట నిలువలేకయుండునని (యెహోషువ 1:5) లో యెహోషువాతో దేవుడు చెప్పియున్నాడు. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్ధానము, “మీరు కృపలో ఉన్నారు గనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు” (రోమా 6:14) నకు సాదృశ్యముగా ఉన్నది. గతంలో కనాను దేశములో అనేకమంది ఉన్నత దేహములు కలవారయినప్పటికీ వారు ఓడిపోతారు. ఎటువంటి పాపమైనను(ఎంత శక్తి కలిగినప్పటికీ) మనలను జయించలేదు. ఇది మనయెడల దేవుని సంకల్పము. కాని యెహోషువ, ప్రభువునామములో ఆ దేశములో అడుగుపెట్టి జయించాలి అప్పుడు అతడు జయము పొందుతాడు. మన విషయంలో కూడా అంతే. విశ్వాసముద్వారా మన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. దేవునియొక్క ప్రతి వాగ్ధానాన్ని విశ్వసించి, ప్రార్ధనగా చేయనట్లయితే, ఆవాగ్ధానాలన్నియు మనలో నెరవేరి మన అనుభవంగా మారవు.
“అయితే నీవు నిబ్బరము గలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగానుండి నా సేవకుడైన యోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిచొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవుదానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు” (యెహోషువ 1:7)లోదేవుడు యెహోషువాతో చెప్పియున్నాడు. పాపము మీమీద ప్రభుత్వము చెయ్యదని చెప్పినప్పుడు దానిని నీ హృదయంలో విశ్వసించి, నీనోటితో ఒప్పుకొనుచు ఉండుము (రోమా 6:14). కుడి లేక యెడమకు తొలగిపోవద్దు. అనగా ఆ వాగ్ధానాన్ని కుదించవద్దు. పూర్తిగా నమ్మాలి. ఆ వాగ్ధానాన్ని కొన్ని పాపములకే పరిమితం చేయవద్దు. అలాగే దానిని ఎక్కువగా చేసికూడా చెప్పవద్దు. అనగా భూమిమీద ప్రభువైన యేసువలె పరిపూర్ణులమవుతామని చెప్పవద్దు. ఈ భూమిమీద మనం సంపూర్ణంగా పాపరహితులం కాలేము. ఇట్టి జీవితాన్ని ఆ వచనం వాగ్దానం చెయ్యుటలేదు. అది కేవలం మనం ఎరిగిన పాపముమీద జయము పొందుట గురించి మాత్రమే చెప్పుచున్నది. ప్రభువైన యేసు వచ్చినప్పుడే మనం ఆయనవలె మార్పు చెందుదము. 1 యోహాను 3:2 లో ఈ విషయం స్పష్టంగా ఉంది. కాబట్టి మనం లేఖనాలకు మించి వెళ్ళకూడదు మరియు లేఖనాలలో వాగ్ధానాలను తక్కువ చెయ్యకూడదు.
క్రీస్తువలె మనం రూపాంతరము చెందుటకు కనాను దేశము పూర్తిగా స్వాధీనపరచుకొనుటతోను మరియు ఒక ఎత్తైన పర్వతమును ఎక్కుటతోను పోల్చవచ్చును. మనం రక్షణ పొందినప్పుడు మనపాపములన్నియు క్షమించబడినవి మరియు మన గతమంతయు కొట్టివేయబడింది(తీసివేయబడింది). కాని మనం ఇంకను అనేక పాపములకు బానిసలమైయున్నాము. అది ఆ పర్వతము దగ్గరకు వచ్చుటతో పోల్చవచ్చును. అప్పుడు ఆ పర్వతమును ఎక్కుటను ఆరంభిస్తాము. పర్వతశిఖరము క్రీస్తు సారూప్యాన్ని చూపిస్తున్నది. క్రీస్తు మరలా వచ్చినప్పుడే ఆ పర్వతశిఖరాన్ని చేరుకుంటాము. కాని మనం పర్వతముయొక్క క్రింది భాగమున ఉండనవసరములేదు అనగా పూర్తిగా ఓడిపోవనవసరంలేదు. అలాకాదు. “మనం పరిపూర్ణులమగుటకు సాగిపోయెదమని” బైబిలు చెబుతుంది (హెబ్రీ 6:1,2).2 కొరింథీ 7:1 లో ప్రియులారా, మనకు ఈ వాగ్ధానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు” అని హెచ్చరించబడుచున్నాము. పరిశుద్ధతను “సంపూర్తి చేసుకొనుట” అను మాటకు మనం భయపడవలసిన పనిలేదు. మనం సాగిపోవాలి. పౌలు ఇలా చెప్పాడు, “ఇదివరకే నేను సంపూర్ణ సిద్దిపొందితినని నేను అనుకొనుటలేదు. కాని గురియొద్దకు పరుగెత్తుచున్నాను” (ఫిలిప్పీ 3:12-14).
మనలోని అనేకులతో దేవుడిట్లు చెప్పుచున్నాడు “చాలాకాలమునుండి పర్వత క్రిందిభాగమునే ఉన్నారు. ఇప్పుడు ఎక్కుట ఆరంభించండి. అలా సాగిపోతూనే ఉండండి”. కుడికిగాని లేక యెడమకుగాని తిరుగక ఉందుము.
“ఈ ధర్మశాస్త్ర గ్రంధమును నీవు బోధింపక తప్పిపోకూడదు”(యెహోషువ 1:8). దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి మరియు మన నోటిలో కూడా ఉండాలి. దేవుని వాగ్దానములన్నిటిని మననోటితో ఒప్పుకొనుచు (వాటికి ఆమేన్ చెప్పుచూ) ఉండాలి. చాలామంది క్రైస్తవులలో ఉన్న సమస్యేమిటనగా వారిలో ఉన్న దురాశలనే వారు ఒప్పుకొనుచున్నారు. వారిట్లనుచున్నారు, “నాకు పెద్ద ఇల్లు వస్తుందని ఒప్పుకొనుచున్నాను. మంచి ఉద్యోగము వస్తుందని ఒప్పుకొనుచున్నాను. నాకు మంచి కారు వస్తుందని ఒప్పుకొనుచున్నాను. దానికి బదులుగా దేవుని వాక్యాన్నే ఒప్పుకొందాము, “ఓ యేసుప్రభువా, నేను కోపముమీద జయము పొందెదను. మోహపు చూపులు చూచుటనుండి సంపూర్ణ జయము పొందెదను. ధనాపేక్షమీద జయము పొందెదను”. ఈ సంగతులు మనం ఎల్లప్పుడు నోటితో ఒప్పుకొనుచూ ఉండాలి. కాని మనం వీటిని ఒప్పుకొనుట సాతానుకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇహలోక సంగతులను మనం ఒప్పుకొనేటట్లు సాతాను చేస్తాడు.
వస్తు వాహనాల (సిరి సంపదల)మీద ఆసక్తి కలిగినవారితో మీరు దేవుని సంఘాన్ని కట్టలేరు. దేవుని జీవముతో నింపబడుచూ దైవికముగా జీవించాలనియు మరియు పరలోకసంబంధమైన ఆసక్తితో ఉన్నవారితోనే మీరు సంఘమును కట్టగలరు. భూసంబంధమైన సంపదలు కలుగుతాయనే తప్పుడు బోధతో మీరు ఎవ్వరినీ ఆకర్షించవద్దు. ఇల్లుగాని లేక కారుగాని ఇస్తానని దేవుని వాక్యము వాగ్ధానము చేసిందా? లేదు. రోజుకు 24 గంటలు నిరాశపడక, ఓడిపోక, ఎల్లప్పుడు జయిస్తూ, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తూ, ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిని బట్టియు మరియు ప్రతిదానినిబట్టియు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించునట్లు దేవుని జీవ సరఫరాను సమృద్ధిగా పొందుచూ ఉండునట్లు దేవుని వాక్యము మనకు వాగ్ధానము చేయుచున్నది. ఇది బైబిలు వాగ్ధానము చేసే క్రొత్త నిబంధన జీవితం (అనగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుభవించుట). కాబట్టి, “ఓ యేసుప్రభువా, నా జీవితకాలమంతయు ఇటువంటి జీవితాన్ని కోరుచున్నాను” అని ఎల్లప్పుడు నోటితో ఒప్పుకొందాము.
నేను యౌవ్వన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, బైబిలు మనకు వాగ్ధానము చేసిన ఈ జీవితాన్ని నేను కోరుకున్నాను. కాని చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ నాయకులు పాపములో ఓడిపోవటమును చూచాను. కాబట్టి ఇట్లు చెప్పాను, “ ప్రభువా, నేను వారికి తీర్పు తీర్చాలనుకొనుటలేదు. అది నాపని కాదు. అలాగే వారిని నాకు మాదిరిగా కూడా చూడను. దేవుని వాక్యాన్నే చూడాలనుకొనుచున్నాను. ఎల్లప్పుడు కేవలం నీ వాగ్ధానాలనే చూడాలనుకొనుచున్నాను. ప్రభువైన యేసునే నాకు మాదిరిగా చూడాలనుకొనుచున్నాను”. విశ్వాసిగా నేను అనేక సం||లు ఓడిపోయాను. కాని ఒకసారి నేను క్రీస్తులో నాకొరకు ఉన్న శోధింపశక్యముగాని ఐశ్వర్యమును, స్వాస్థ్యమును చూచిన తరువాత, ఎల్లప్పుడు ప్రభువులో ఆనందమును మరియు జయమును వాగ్ధానము చేసిన దేవుని లేఖనములలోని వాగ్ధానములను ఎల్లప్పుడు నోటితో ఒప్పుకొనుచు ఉన్నాను. చివరకు దేవుడు నా హృదయ వాంఛనలను నెరవేర్చాడు. ఆవిధంగానే ఇప్పుడును మరియు జీవితాంతమువరకు జీవించాలనుకొనుచున్నాను.
గనుక దేవుని వాగ్ధానములను నీ నోటిలోనే ఉండనిచ్చి, వాటిని వెళ్ళనీయకు. పేరు ప్రతిష్టలను కోరే అనేక బోధకులమధ్య, నీవు ఈ వర్తమానములను చెప్పినట్లయితే, నీవు ఒంటరివాడవుతావనుకొనవద్దు. దేవుడు నీతో అంతము వరకు ఉంటాడు.
రాత్రింబవళ్లు దేవునివాక్యాన్ని ధ్యానించాలని యెహోషువ ఆజ్ఞాపించబడ్డాడు. అన్యుల అవసరాలగూర్చి ధ్యానించకు. అది పైకి బాగానే ఉంటుంది. నీవు రాత్రింబవళ్లు దేవుని వాక్యాన్ని ధ్యానించి, ప్రార్ధనగా చేయకుండా అన్యులకు సహాయపడలేవు.
అతడు ఆవిధంగా చేసినట్లయితే దేవుడు అతనికి సమృద్ధిని మరియు జయమును వాగ్ధానము చేసాడు (యెహోషువ 1:8). మనం ఆత్మీయంగాను మరియు పరలోక విషయాలలోను సర్వసమృద్ధిని పొందుకొని, అనుభవించుటయే “నిజమైన సువార్త”. ప్రపంచంలోని ప్రతిఒక్కరు సిరిసంపదలు మరియు జయమును కోరుచున్నారు. కాని యెహోషువ 1:8 లో దేవుడు చెప్పిన రీతిగా వారు వెదకరు.