“నోవహు దినములలో లోకమును శిక్షించినట్లు మరియు సొదొమ గొమొఱ్ఱ పట్టణములను శిక్షించినట్లు దేవుడు కనానీయులను చంపమని ఆజ్ఞాపించెను. లైంగిక పాపములతో భూలోకమంతయు చెడిపోయెను (ఆది 6:11). కనానీయులు అనేక పాపములు చేయుచు సాతానును ఆరాధించారు కాబట్టి “ఆ దేశమందు కాపురమున్నవారిని అది వెళ్లగ్రక్కివేయుచున్నది” (లేవీకాండము 18:24,25). ద్వి.కాండము 9:4; 18:10-12 లలో దేవుడు కనానీయులను నాశనము చేయుటకుగల స్పష్టమైన కారణములను తెలియజేయుచున్నవి. ఒకదేశము చెడిపోయి మరియు భ్రష్టుపట్టునట్లు ప్రేరేపించువారిని, ఆదేశము ఇంకను భ్రష్టుపట్టకుండునట్లు దేవుడు తీసివేయును(శిక్షించును).
శరీరమంతటినీ కుళ్ళిపోయేటట్లు చేసేపుండు ఉన్న కాలును ఛేదించి తీసివేసే దయగల డాక్టరువలె, ప్రేమయైయున్న దేవుడు కూడా కొంతమందిని శిక్షించును. నీకు వైద్యము(చికిత్స) గురించి తెలియనట్లయితే, ఒక డాక్టరు, ఒక వ్యక్తియొక్క కాలు కోయుటను నీవు చూచినట్లయితే, ఆడాక్టరు ఆవ్యక్తిని ద్వేషిస్తున్నాడని నీవు ఊహించుకొనవచ్చు. కాని నిజానికి ఆడాక్టరు అతనిని ద్వేషించుటలేదు. ఆడాక్టరు అతనిని ప్రేమించుచున్నాడు. దేవుడు లోకమును ప్రేమించుచున్నాడు కాబట్టి లోకములో పాపము చేయువారిని ఆయన తీసివేయును. మానవజాతి అంతయు దయ్యముల అధికారములోనికి వెళ్ళకుండా, కాపాడబడునట్లు దేవుడు తన ప్రేమనుబట్టి జలప్రళయములో అందరు తుడిచిపెట్టుకొనిపోవునట్లు చేసెను (ఆది 6:2 - ఇక్కడ పడిపోయిన దూతలే దేవుని కుమారులు). ఒకరిని విశ్వాసమునుండి తొలగించవలెనని ప్రయత్నముచేసిన వ్యక్తిని పౌలు, గ్రుడ్డివాడవగుదువని అతనిని మొత్తెను (అ.కా 13:8-12). ఉజ్జీవమును వ్యతిరేకించిన వ్యక్తులను దేవుడు మరణముతో మొత్తెనని నేను విన్నాను. గనుక కనానీయులగూర్చి యెహోషువాలో మనము చదువునది హత్యకాదు. అది లోకమునకు చికిత్స అయి ఉన్నది.
అబ్రహాము కానానులో నివశించిన దినములలో అక్కడ కనానీయులు ఉండేవారు. కాని కనానీయులను దేవుడు అప్పుడు నాశనము చేయలేదు. దేవుడు నాలుగువందల సంవత్సరములు వేచియుండెను ఎందుకనగా ఆయన అబ్రహాముతో చెప్పినట్లు ఆ సమయములో కనానీయులు “తీర్పునకు పరిపక్వత” చెందలేదు (ఆది 15:16). మామిడిపండు పక్వానికి వచ్చినప్పుడే మనము కోసెదము. దేవుడుకూడా తీర్పు తీర్చుటకుముందు, మానవుని పాపము పరిపక్వము అగువరకు వేచియుండును. పాపము పరిపక్వమైనప్పుడు దేవుడు సొదొమ గొమొఱ్ఱ అను పట్టణములకు తీర్పుతీర్చెను. అలాగే కనానీయులకు కూడా చేసెను.
ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత 700 సం||లకు కనానీయులు చేసిన పాపములనే వారు కూడా చేసారు. గనుక దేవుడు వారినికూడా ఆదేశమునుండి పంపివేసెను. అప్పుడు అస్సీరియనులు ఆదేశమును స్వాధీనపరచుకొన్నారు. 125 సం||ల తరువాత దక్షిణ దేశమైన యూదా కూడా దేవుని ప్రవక్తలయొక్క వర్తమానములను విసర్జించిరి గనుక బాబెలోను వారిద్వారా నాశనము చేయబడుటద్వారా దేవునితీర్పు వారిమీదకు వచ్చెను. దేవుడు పక్షపాతి కాడు. కనానీయులైనను, ఇశ్రాయేలీయులైనను లేక యూదావారైనను అందరికి దేవుని ప్రమాణములు సమానమే. ఆయన ప్రజలు ఆయన ప్రమాణములను అతిక్రమిస్తు మరియు ఆయన ప్రవక్తలను అంగీకరించనట్లయితే, దేవుడు వారికికూడా అదే చికిత్సను చేస్తాడు. మనవిషయములో కూడా దేవుడు అలాగే చేస్తాడు. ఒకవేళ దేవుడు నీపాపములలో నిన్ను విడచిపెట్టినయెడల, ఆయన నిన్ను ప్రేమించుటలేదని ఋజువగుచున్నది. ఒకతండ్రి తన పిల్లలను వారి రోగములతోనే ఉండుటకు అనుమతించినట్లయితే, అది అతడు తన పిల్లలను నిజముగా ప్రేమించుటలేదని ఋజువపరచుచున్నది.