వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

ఒక ఆత్మీయనాయకుడు తన పరిచర్య అంతటినీ దైవ చిత్తానుసారంగానూ దేవుని శక్తితోనూ, దేవుని మహిమార్ధమే జరిగిస్తాడు. కాబట్టి అటువంటి పరిచర్య బంగారము, వెండి, వెలగరాళ్ళు పరీక్షించబడు విధముగా ఆఖరుగా అగ్ని పరీక్షకు నిలుస్తుంది (1 కొరింథీ 3:12-15). దేవుడు మనకు సామర్ధ్యము కలుగజేయని యెడల మనమెన్నడూ నూతన నిబంధన పరిచారకులము కానేరమని 2 కొరింథీ 3:5,6 లో పౌలు చెబుతున్నాడు. ఒక ఆత్మీయనాయకుడు దేవుడు కలుగజేసిన సామర్ధ్యముతో సేవిస్తాడు గనుక తాను చేస్తున్న పని విషయంలో ఎటువంటి గొప్పతనాన్ని పొందలేడు. నిజముగా దేవుని జీవము మనలో ప్రవహిస్తూ, ఇతరులను ఆశీర్వదిస్తునప్పుడు, దానిని గూర్చి మనము ఘనతపొందలేము - ఎందుకంటే మనము తయారుచేయనిదాని విషయంలో అతిశయించలేము! ఉదాహరణకు, ఎవరో తయారు చేసిన కేకును నేనిక్కడకు తెచ్చి మీ అందరికి పంచిపెడితే మీరందరూ నన్ను మెచ్చుకుంటూ "బ్రదర్ జాక్, నిజంగా ఇది అద్భుతమైన కేకు" అని చెబితే - నేను గర్వించుటకు కనీసం శోధింపబడును కూడా, ఎందుకంటే ఆ కేకును తయారు చేసింది నేను కాదు! ఎవరో తయారు చేసిన కేకును నేను పంచిపెట్టాను అంతే. కానీ ఆ రొట్టెను నేనే తయారు చేస్తే ఆ విషయంలో మంచి పని చేశానని నేను గర్వించగలను. అయితే ఎవరో తయారుచేసిన దానికి నేనెలా ఘనతపొందగలను?

మనము ఇతరులకు అందిస్తున్నది మనలో దేవుడు పుట్టించినదా లేక మనంతట మనము తయారు చేసిందా అని తెలుసుకునేందుకు ఇదొక మార్గము. మన పరిచర్య(కేకును) గూర్చి మనం గర్విస్తున్నామా! అలా అయితే ఆ పరిచర్యను(కేకును) మనంతట మనమే సృష్టించుకున్నామన్నమాట! అటువంటి దానిలో దేవునికి ఎలాంటి సంబంధంలేదు. అది దేవుని చేత చేయబడినదైతే దానిగూర్చి మనము గర్వించుటకు వీలుకాదు. జనసమూహానికి రొట్టెలు, చేపలు పంచిపెట్టిన యేసు యొక్క శిష్యులు ఆ పనిగూర్చి ఎటువంటి ఘనతైనా పొందారని మీరనుకుంటున్నారా! లేదు. రొట్టెల మూట యేసుకు అందించిన ఆ చిన్న బాలుడుకూడా ఎలాంటి ఘనతను పొందలేదు. యేసు సృష్టించిన ఆహారమును శిష్యులు పంచిపెట్టారు, అంతే. మనమంతా ఉత్పత్తి వ్యాపారములో లేము గానీ పంచిపెట్టే వ్యాపారంలో ఉన్నందుకు దేవునికి స్తోత్రములు. అందునుబట్టి అన్ని సమయాల్లోనూ మనము సంపూర్ణ విశ్రాంతిలో ఉండవచ్చు. ఉత్పత్తి చేయవలసి వచ్చినప్పుడే శ్రమ కలుగుతుంది గానీ పంచిపెట్టుటలో కాదు! పంచి పెట్టు వ్యాపారంలో మనము అలసిపోవుట నిజమే కానీ అందులో బాధలేదు. మన సామర్ధ్యము దేవునినుండి మాత్రమే లభిస్తుంది. మనంతట మనమే విలువైన దేనినైనా ఉత్పత్తి చేయలేమని మనకు తెలుసు. అందుచేత మనము దేనికోసమైనా ప్రయత్నము కూడా చేయము.

పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నీవు సాధించే సమస్తము మానవ సంబంధమైనదే, దానికి నిత్యత్వపు విలువలేదని గుర్తించుకో. ప్రార్ధన చేయకుండానే దైవసహాయంలేకుండానే, పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే నీవు బోధించవచ్చు, సాధించవచ్చు. నీవు గొప్ప మానవ సామర్ధ్యములు కలిగియుండవచ్చు-వాటితో నీవు గొప్పవి సాధించవచ్చు. కానీ దేవుని దృష్టిలో అదంతా కొయ్యకాలు, గడ్డి, కర్ర లాంటివేనని నీవు ఒక రోజు కనుగొంటావు.

యేసు పరిసయ్యులను గద్దించి సరిచేసిన తరువాత ఒకరోజు శిష్యులు యేసును సమీపించి "పరిసయ్యులు అభ్యంతరపడిరని నీకు తెలియునా?" అని అడిగారు. అందుకు యేసు ఆ పరిసయ్యులు గ్రుడ్డి వారిని నడిపించే గ్రుడ్డి నాయకులు గనుక వారి జోలికి పోకుడని చెప్పాడు. -"దేవుడు నాటని ప్రతి మొక్క ఒకరోజున పెల్లగింపబడును" (మత్తయి 15:12,13). పైన చెప్పబడిన ఆ చివరి వాక్యమును గూర్చి ఒక్క క్షణం మీరు ఆలోచించండి. నీవు బోధించినప్పుడెల్లా ఒక విత్తనం నాటుతున్నావు, నీవు విత్తుతున్నది దేవునినుండి కలిగినది కానిపక్షంలో ఒకరోజున అది పెల్లగింపబడుతుంది. పరిశుద్ధాత్మ ఇచ్చు సామర్ధ్యముతో చేసే మన పని నిత్యత్వంకోసం నిలుస్తుంది. అయితే ప్రార్ధన లేకుండా, దేవునిపై నిస్సహాయుడిగా అనుకోకుండా, దైవాత్మ సహాయం లేకుండా, మనం దేవునికోసము పరిచర్య చేస్తే అది ఒకానొక రోజున తప్పని సరిగా వ్రేళ్ళతోపాటు పెకిలింపవేయబడుతుంది.

అనేక విషయాల్లో క్రైస్తవ పరిచర్యకోసం పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరము లేదు, కానీ కావలసిందల్లా విస్తారమైన డబ్బు, మంచి పరిపాలకుడు మాత్రమే. ఉదాహరణకు మీరొక క్రైస్తవ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు, దానికోసం చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఒక సభా స్థలాన్ని అద్దెకు తీసుకోవాలి. ఆహ్వాన పత్రికలు పంపాలి, వసతి ఏర్పాట్లు చేయాలి. భోజన సదుపాయం కలుగజేయాలి. ఇంకా మొదలైనవి చేయాలి. అయితే ఇవన్నీ ఒక మంచి పరిపాలన అధ్యక్షుడు చేయగలడు. అతడు క్రైస్తవుడై ఉండనవసరము లేదు. వాస్తవానికి చాలా క్రైస్తవ సమావేశాలకన్నా ఈ లోక సంబంధమైన సమావేశాలు చాలా బాగా నిర్వహించబడుతున్నాయి. అయితే క్రైస్తవ సభలో నిత్యత్వము కోసం నిలిచివుండేది దైవవాక్కు పరిచర్య - అందుచేత ఈ పరిచర్య ఆత్మాభిషేకము క్రిందనే జరగాలి!

మంచి మంచి ఏర్పాట్లు, వసతుల అవసరతను నేను కాదనడం లేదు. ఏ సమావేశమైనా విజయవంతం కావలంటే ఇవన్నీ అవసరమే. పరిశుద్ధాత్మ శక్తితో జరిగిన కార్యము మాత్రమే నిత్యత్వములో నిలుచునని గుర్తుంచుకొనుడి. దీనిని మన స్వంత పరిచర్యలో అన్వయించుకుందాం. మానవ శిక్షణ, మానవ వనరుల ఫలితంగా జరిగినది మన పరిచర్యలో ఏ భాగమును గూర్చి మనం చెప్పగలమో మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మనకు మనము యదార్ధవంతులముగా ఉంటే మనము కనుగొన్న జవాబుకు ఆశ్చర్యపడతాము.

యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈనాటికి కూడా యేసు, జీవము లేకుండా జ్ఞానము కలిగి మరియు పరిశుద్ధాత్మాభిషేకము లేకుండా సమాచారమును అందించు బైబిలు కళాశాల అధ్యాపకులతోను మరియు మిషను నాయకులతో పోరాడుచున్నాడు. తాము జీవించిన కాలములో అటువంటి మనుష్యులతో అపొస్తలులు పోరాటము సాగించారు. యేసు అడుగుజాడలలో నడుస్తున్నవారమైతే ఈనాడు మనము కూడా అటువంటి వారితోనే పోరాడవలసివుంది.

నేను ప్రభువుతో నడుస్తూ, అటువంటి విమర్శకులతో పోరాడతాను కానీ వారిని సంతోషపెట్టి ప్రభువును బాధపెట్టను. వాస్తవానికి దేవుణ్ణి సంతోషపెట్టేందుకు నేను చెల్లించవలసిన వెల అదే అయితే, అవసరమైతే లోకమంతటితో పోరాడటానికి నేను సిద్ధమే. "మనము మనష్యులను సంతోషపెట్టగోరుచున్నామా, మనము క్రీస్తు పరిచారకులముగా ఉండనేరము" (గలతీ 1:10). మన పరిచర్యలో దేవునిపై మాత్రమే ఆధారపడుతూ ఎల్లప్పుడూ మనపై పరిశుద్ధాత్మాభిషేకం కోరుకుంటూ సాగిపోదాము.