వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

పౌలుకు ఉన్న అధికారము మనము కూడా కలిగియుండాలని యిష్టపడతాము. కాని ఆ అధికారము కలిగియుండాలంటే, క్రీస్తుని సంపాదించుకొను నిమిత్తము మనము సమస్తమును నష్టముగా ఎంచుకొని మరియు దానిని పెంటతో సమానముగా ఎంచుకోవాలి (ఫిలిప్పీ 3 : 7 - 11).

"నావన్నియు నీవని" ప్రభువైనయేసు తండ్రితో చెప్పారు. మరియు నీవన్నియు నావని" కూడా ప్రభువు చెప్పారు (యోహాను 17 : 10). మనకున్నదంతయు దేవునికి ఉచితముగా ఇచ్చినప్పుడు, దేవునికి ఉన్నదంతయు కూడా మనకు ఉచితముగా ఇవ్వబడుతుంది. మనము ఏ కొలతతో ఇస్తామో అదే కొలతతో మనకు తిరిగి ఆయన ఇస్తారు. అందువలననే అనేక క్రైస్తవ నాయకులు ఆత్మీయ అధికారములో ఎంతో బీదలుగా ఉన్నారు. ఎందుకంటే వారికున్నదంతయు దేవునికి ఇవ్వలేదు.

యోహాను 2 : 23 - 25 లో అనేకులు ప్రభువును విశ్వసించారు. అయినను ప్రభువు తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మన ఆంతర్యమును మరియు మన ఉద్దేశ్యములను కూడా ఎరిగియున్నాడు గనుక ఆయన తన్ను వశపరచుకొనని వారిలో మనము కూడా ఉండవచ్చును.

మన వృత్తి విషయములో మరియు క్రీస్తు శరీరమనే సంఘము కట్టుట విషయములో మనము దేనిని ఎన్నుకుంటాము? మనము సంఘముగా కట్టబడుటకు ఈ లోకపువృత్తిలో అభివృద్ధి చెందుటకును వదులుకుంటామా? అలా వదులుకోలేనట్లయితే, దేవుడు తనను మన వశము ఎందుకు చేసుకోవాలి?

దేవుని ప్రజలకు మన యింటిలో ఆతిధ్యమిచ్చుటకు మనము సిద్ధముగా ఉన్నామా? లేక దానికంటే మన సంతోషము మరియు మనము ఏకాంతముగా ఉండుటమే మనకు ముఖ్యమా? మనము ఉపవాసముండి, ప్రార్ధించినను ఏ విషయములోనైనను మన స్వప్రయోజనమే కోరుకున్నట్లయితే దేవునిలో నుండి ఆత్మీయ అధికారమును పొందలేము. దేవుడు మోసగించబడడు.

మనము క్రీస్తు శరీరమైన సంఘమును కట్టాలంటే, ప్రతివిషయములో మొదటిస్థానమును దేవుని రాజ్యానికి ఇవ్వాలి. దేవునికి ఎటువంటి పక్షపాతము లేదు. ఆయనకు మనమందరము సమానమే. ఆయన ఇతరులకు చేసినదానంటినీ మనకు కూడా చేస్తాడు. ప్రభువైనయేసు మరియు పౌలు వెల చెల్లించారు. కాబట్టి వారి పరిచర్యలలో దేవుడు వారితో ఉన్నాడు. ఆవిధముగా మనము కూడా వెలచెల్లించినట్లయితే, అదే విధముగా దేవుడు మనకు కూడా చేస్తారు.

మనము సంఘము కట్టాలని అనుకున్నట్లయితే, మన ధనము మరియు కూడబెట్టిన ధనము కూడా ప్రభువునకు చెంది ఉండాలి. నోవహును దేవుడు ఓడ కట్టమనినప్పుడు అంత పెద్దఓడను కట్టుటకు ఖర్చు ఎవరు భరిస్తారని అతడు దేవుని అడుగలేదు. నోవహు ఆ ప్రశ్న అడిగియున్నట్లయితే, "దాని వెల నీవే చెల్లించాలి. ఇంకెవరు చెల్లిస్తారని" దేవుడు చెప్పియుండేవాడు. అప్పటికే నోవాహుకు తెలుసు కాబట్టి ఆవిధముగా అడుగవలసిన పనిలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అది మనకు తెలుసా? ఓడను కట్టుటకు బహుశా అతడు తన ఆస్తిలో కొంత అమ్మియుండవచ్చును. దేవుని పనికి ఇచ్చుటకు ఎంతమంది దేవుని సేవకులు వారి సొంత ఆస్తిని అమ్ము వారిని కనుగొనగలము? ఎవరైతే తమకున్నదంతయు దేవునికి ఇచ్చుటకు ఇష్టపడరో అట్టివారికి దేవుడు కూడా తనకున్నదంతయు ఇవ్వడు.

చాలామంది దేవుని సేవకుల వైఖరి ఎలా ఉన్నదంటే దేవుని పరిచర్యకు వారి ధనమును ఇవ్వరుగాని ఇతరులు ఇవ్వాలి. కానుకలను చాలా దుబారా(ఎక్కువ)గా ఖర్చు చేస్తారు. కాని వారి సొంత సొమ్ము అంతగా దేవుని పనికి ఖర్చుపెట్టరు. ధనాపేక్ష నుండి విడుదల పొందని దేవుని సేవకుడు ఆత్మీయ అధికారమును కలిగియుండలేడు.

ప్రభువుతో మనమెప్పుడైనను ఈలాగు చెప్పామా? "ప్రభువా నీ పరిచర్య నాపరిచర్యయైయున్నది. నాకున్న ధనము నీదే. నాధనమును మరియు నీధనమును వేరుగా చూడను". అలా మనము చెప్పలేనట్లయితే, మనమింకను పాతనిబంధనలోనే ఉన్నాము. ఎందుకనగా వారు వారికున్న దానిలో 10% దేవునిది మరియు 90% వారిది అనుకునేవారు. దశమభాగము వారు ఇచ్చినట్లయితే, వారి బాధ్యత తీరును.

కాని ప్రభువైనయేసు తన తండ్రికి దశమభాగము ఇవ్వటానికి రాలేదు. ఆయన క్రొత్తనిబంధనను స్థాపించి, స్థిరపరచి మరియు క్రొత్తనిబంధన సంఘమును కట్టుటకు వచ్చియున్నారు. కాబట్టి ఆయన తన తండ్రికి 100% ఇచ్చారు. "నన్ను వెంబడించుడి" అని ఆయన ఇప్పుడు మనకు చెప్పుచున్నారు. దేవునికి తనకున్నదంతయు ఇచ్చిన వాడే ఆత్మీయ అధికారము కలిగియుండును.

క్రీస్తు శరీరమనే సంఘమును కట్టుటకు ఎంత వెలయైనను చెల్లించాలి - అది ధనముగాని, ఘనతగాని, సౌకర్యముగాని, మనశక్తిగాని, పేరుప్రతిష్టలుగాని, ఉద్యోగముగాని మరిఏదైనను ప్రభువుకొరకు మనమిచ్చే విషయములో పరిమితి ఉండకూడదు. ఏ విషయములోనైనను మనము కేవలము మన సౌకర్యము (సౌఖ్యము)చూడకూడదు. క్రీస్తు శరీరమైన సంఘము కట్టుటకు మనము ప్రయాసపడాలి. మనము ఇతరులకు భారముగా ఉండకుండనట్లు, మనము ఏదైనా పని (ఉద్యోగము మొ||నవి) చేయాలి.

కాబట్టి దేవుని విషయములో మనము లోభులముగా ఉండకూడదు. రాబోయే దినములలో మనము దేవుని విషయములో ధనవంతులముగా ఉందుముగాక. ఆవిధముగా ఆత్మీయ అధికారము కలిగి ప్రభువైనయేసుక్రీస్తు మహిమార్ధమై మన దేశములో క్రీస్తు సంఘమును కట్టుదుముగాక ఆమేన్.