వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   యౌవ్వనస్తులు
WFTW Body: 

లేఖనములలో మూడు వనములు ఉన్నవి.

ఏదేను వనము

ఆదికాండము 2:8,15 లో ఇట్లున్నది, "దేవుడు ఒక తోటను వేసి మరియు దానిని సేద్యపర్చుటకు అందులో నరుని ఉంచెను". పాపము ఏ విధముగా ఆ తోటలోనికి వచ్చినది? అది ముఖ్యముగా ఆదాము హవ్వలకు ఉండిన రెండు తప్పుడు వైఖరుల మూలముగా అట్లు జరిగినది. మొదటిది గర్వము. వారికి దేవునికంటె ఎక్కువ తెలుసునని అనుకొన్నారు. వారు దేవునికి అవిధేయత చూపించి తప్పించుకొని పోవచ్చుని తలంచారు. ఈనాడు కూడా లోకములో అనేకమంది జనులు అదేవిధముగా అనుకొందురు. రెండవది స్వార్ధము. ఆ చెట్టు ఫలమును తినినట్లయితే వారికొరకు వారేమైనా పొందుదుమేమోనని వారు ఆలోచించిరి. "స్త్రీ ఆ వృక్షఫలమును చూచినప్పుడు, అది మంచిదిగా యుండి ఆమె కోర్కెను సంతృప్తిపరిచి ఆమెను జ్ఞానవంతురాలిగా చేయునట్లు కనబడెను" అని చెప్పబడినది. గర్వము మరియు స్వార్ధము పాపమునకు ప్రారంభముగా యున్నవి. మరియు అవి రెండు ఈనాడు మానవజాతిలో అన్ని పాపములకు మూలకారణముగా ఉన్నవి. మరియు అనేక రూపములలో కనబడును. ముఖ్యముగా, మానవుడు తనకు తానే ముఖ్యమైనవాడుగా ఉండి దేవునికి వేరుగా స్వేచ్ఛా జీవితమును జీవించవలెనని కోరుకొనెను. పాపము ఆవిధముగా వచ్చియున్నది.

గెత్సెమనే మరియు కల్వరి వనము

పాపము ఒక వనములోనికి వచ్చెను. యేసుప్రభువు మన రక్షణను కూడా ఒక వనములోనే సంపాదించెను. చాలామందికి గెత్సెమనే వనము గూర్చి మాత్రమే తెలియును. కాని ప్రభువు సిలువ వేయబడినది కూడా ఒక వనములోనే అనియు అలాగే పాతిపెట్టబడినది కూడా ఒక వనములోనే అని వారికి తెలియదు. యోహాను 19:41 "ఆయన సిలువ వేయబడిన చోట ఒక తోట ఉండెను. మరియు ఆ తోటలో ఎవరును ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఉండెను" అని చెప్పుచున్నది. యేసుప్రభువు ఒక తోటలో అప్పగింపబడెను. ఆయన ఒక తోటలో సిలువ వేయబడెను. ఆయన ఒక తోటలో పాతిపెట్టబడెను మరియు ఒక తోటలో ఆయన మృతులలో నుండి లేచెను. ఇప్పుడునూ తోటలోనే మనందరికి రక్షణ లభించింది. ఆ తోటలో యేసుప్రభువు చేసిన దానంతటియొక్క లాభము ఈనాడు మనందరిదీ కావచ్చును. మనము యేసు భూమిమీద జీవించిన జీవితమును చూచినప్పుడు, ఆదాము సంతతిలో నుండిన గర్వము మరియు స్వార్ధమును ఖచ్చితమైన వ్యతిరేకతను అందులో మనము చూచుదుము. క్రీస్తుయొక్క జీవితములో ఆయన తండ్రి ఆయనను చేయమని అడిగిన దేనినైననూ చివరకు సిలువపైన మరణించుటయైనా ఖచ్చితముగా చేయుటకు యిష్టపడిన దీనత్వమును మనము చూచుదుము. ఆయన వెంటనే ఆ మార్గమును ఎటువంటి స్వంత ఇష్టము ఉంచుకొనకుండా ఎంచుకొనెను. క్రీస్తు ఆయన స్వంత యిష్టమును గూర్చి పట్టించుకొనకుండా నిస్వార్ధముగా యితరుల అవసరముల గూర్చి ఆలోచించెను మరియు వారికి సహాయము చేయుటకొరకు ఆయన తనను తాను త్యాగము చేసికొనుటకు యిష్టపడెను. మనమందరము కూడా అటువంటి వైఖరిని కలిగియుండవలెనని ఆయన కోరుచున్నాడు.

పెండ్లి కుమారుని యొక్క వనము

యేసు మనకు చెప్పవలెనని అనుకొనుచుండిన మూడవవనమును గూర్చి చాలామంది క్రైస్తవులకు అంతగా తెలియదు. ఈ వనము పరగీతములో చెప్పబడినది (ఈ గీతము పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె, భర్త మరియు భార్యల మధ్యనుండు సంబంధము గూర్చి వివరించును). పరగీతము 4:12లో పెండ్లికుమారుడు, "నా పెండ్లి కుమార్తె అంతఃపుర ఉద్యానవనము వంటిది", అని చెప్పుచున్నాడు. ఇక్కడ పెండ్లి కుమారుడైయున్న క్రీస్తు మరియు మనము ఆయన యొక్క పెండ్లి కుమార్తెయై, ఆయన యొక్క ఉద్యానవనమై సంపూర్తిగా ఆయన కొరకు ప్రత్యేకింపబడియున్నాము. ఇది మనము అన్నిటికంటె మొదట గుర్తింపవలసియున్నది. అయితే ఆ ఉద్యానవనము ప్రాథమికముగా మన లాభము కొరకు కాదు లేక చివరకు యితరుల లాభము కొరకు కూడా కాదు, కాని ప్రభువు కొరకు, దీనిని మనము ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి - మన జీవితము ప్రభువుకు అంతఃపుర ఉద్యానవనమువలె యుండవలెను. అప్పుడు మనద్వారా ఇతరులు కూడా దీవింపబడుదురు.

యేసుప్రభువు బోధించినది ఇదే. ధర్మశాస్రమంతటిలో గొప్ప ఆజ్ఞ ఏది అని ఒకరు ఆయనను అడిగినప్పుడు, ఆయన "నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించినట్లయితే దాని తరువాత నీవలె నీ పొరుగు వానిని ప్రేమింపగలవని" చెప్పెను (మత్తయి 23:37-40లో నుండి వివరించడమైనది). మన జీవితము ఎప్పుడూ దేవునితో ప్రారంభము కావలెను. అందుచేతనే దేవుడు ఆదాము హవ్వలను విడివిడిగా సృష్టించెను. అట్లు చేయుట వలన ఆదాము కన్నులు తెరువగానే అతడు చూచిన మొదటి వ్యక్తి హవ్వ కాక దేవుడైయుండెను. మరియు తరువాత హవ్వ సృష్టింపబడిన తరువాత ఆమె కన్నులు తెరచి చూచినది ఆదాము కాక దేవుడైయుండెను. మీ జీవితము నీరు పెట్టబడిన ఉద్యానవనమువలె ఉండవలెనంటే మీ జీవితములో కూడా ఎల్లప్పుడూ అదే విధముగా యుండవలెను. ప్రతి ఉద్యానవనమునకు వర్షము కావలసియున్నది. మరియు నూతన నిబంధనలో మనకు పరలోకపు వర్షమైయున్న పరిశుద్ధాత్మచే నింపబడు అవకాశమున్నది. మీరు దీని కొరకు హృదయమంతటితో వెదకుమని మిమ్ములను ప్రోత్సహించుచున్నాను. పరిశుద్ధాత్మచేత నింపబడుట అనగా మీ జీవితములో ప్రతివిషయము పరిశుద్ధాత్మ అధీనము క్రిందకు రావలెనని అర్ధము. అందువలన మీ జీవితములను ప్రతి దినము పరలోకపు వర్షమునకు తెరవండి.

ఇప్పుడు పరమగీతము 4:16 చూచెదము...."ఉత్తర వాయువూ, ఏతెంచుము, దక్షిణవాయువూ, వేంచేయుము (ఉత్తర వాయువు చల్లగాను, దక్షిణ వాయువు వెచ్చగాను ఉండును) వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తన కిష్టమైన ఫలముల నతడు భుజించును గాక". మన జీవితములో మనము చల్లని ఉత్తరపు గాలియైన కష్టపరిస్థితులు, మరియు వెచ్చని దక్షిణపు గాలియైన మంచి పరిస్థితులను ఎదుర్కొందుము. కాని యేసు ప్రభువు మనయొక్క శిరస్సుగా ఉండినప్పుడు మరియు మన జీవితములను ఆయన ఆదుపు చేయుటకు మనము ఒప్పుకొనినప్పుడు, మనము కష్టపరిస్థితులను లేక మంచి పరిస్థితులను, యిబ్బందులను లేక సౌఖ్యమును ఎదుర్కొనినా ఈ రెండు గాలులు కూడా మన ద్వారా క్రీస్తుయొక్క సువాసనను వెదజల్లును. లోకస్థులు అట్లు చేయలేరు. లోకములో ప్రతి విషయము గూర్చి ఫిర్యాదు చేయుదురు. కష్టములు వచ్చినప్పుడు దేవునికి విరోధముగా కూడా ఫిర్యాదు చేయుదురు. లోకములో ప్రతి వారు కూడా దక్షిణ గాలియైన మంచి పరిస్థితులను అనుభవించగలరు. కాని ఉత్తరపుగాలియైన కష్ట పరిస్థితులను ఎదుర్కొనలేరు. కాని క్రీస్తు యొక్క పెండ్లికుమార్తె కష్ట పరిస్థితులను మరియు మంచి పరిస్థితులను విజయోత్సాహముతో అనుభవించగలదు. మనమందరము ఈ విధముగానే ఉండగలము. చివరగా, ఇక్కడ "నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయును గాక, తన కిష్టమైన ఫలముల నతడు భుజించును గాక", అని చదువుదుము. కష్ట సమయములలో మీ విజయములు కేవలము దేవుడు చూచుట కొరకే తప్ప మీరు ఇతరులకు గొప్పగా చూపించుట కొరకు కాదు. ఇతరులు చూడలేని సమయములలో దేవుడు మీ జీవితమును రహస్యమందు చూచును. మరియు ఆయన తన యొక్క ఉద్యానవనములోనికి వచ్చినప్పుడు, ఆయన హృదయమునకు సంతోషము కలిగించేది ఆయన ఎల్లప్పుడూ కనుగొనచుండవలెను.

ప్రతి వనమునకు వర్షము అవసరమైయున్నది. క్రొత్త నిబంధనలో, పరలోకపు వర్షమైయున్న పరిశుద్ధాత్మతో మనము నింపబడవచ్చును. పరిశుద్ధాత్మతో మీరు నింపబడునట్లు, దేవుని పూర్ణహృదయముతో ప్రార్ధించండి. పరిశుద్ధాత్మతో నింపబడుట అనగా మీ ఆత్మ, ప్రాణ, దేహమంతటిలోనికి ఆహ్వానించి, పరిశుద్ధాత్మ చేత ఆక్రమించబడాలి. ప్రతిరోజు ఈ పరలోకపు వర్షము కొరకు తెరువబడుము. అప్పుడు నీ జీవితము నీరు పోయబడిన తోటవలె ఉండును.