సత్యమైన మరియు అసత్యమైన సువార్త

వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   అన్వేషకుడు
Article Body: 

సాధారణంగా చెప్పుకోవాలంటే క్రైస్తవులు రెండు రకాలుగా విభజింపబడుదురు. అవి:

1. వారి పుట్టుకను బట్టి "రోమన్ కథోలిక్కులు" - "ప్రొటెస్టెంట్లు"

2. సంఘ ఆరాధన క్రమమును బట్టి "ఎపిస్కోపల్" మరియు "ఫ్రీచర్స్"

3. అనుభవాన్ని బట్టి "తిరిగి జన్మించిన క్రైస్తవులు" మరియు "నామకార్థ క్రైస్తవులు"

4. సిద్ధాంతాన్ని బట్టి "ఇవాంజిలికల్స్" మరియు "లిబరల్స్"

5. భాషలలో మాట్లాడు అనుభవాన్ని బట్టి "కరిస్మాటిక్" మరియు "నాన్ కారిస్మాటిక్"

6. వృత్తిని బట్టి "ఫుల్ టైం క్రైస్తవ పనివారు" మరియు "సెక్యులర్ పనివారు"

ఇంకా ఇవికాక వేరే విధాలుగా కూడా విభజనలున్నవి. అయితే వీటిలో ఏ విభజన కూడా యేసు ప్రభువు పరిష్కరించుటకు వచ్చిన మూల సమస్య గూర్చి చెప్పుట లేదు.చాలా మందికి "క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయెనని" (1 కొరింథి 15:3) తెలియును. కాని అనేకులకు క్రీస్తు మన కొరకు చనిపోయినది మనమిక మీదట మన కొరకు జీవించుట కాక ఆయన కొరకు జీవించ వలెను" (2 కొరింథి 5:15) అని కూడా బైబిలు చెప్పుచున్నదనునది తెలియదు.

అందువలన క్రైస్తవులను వాక్యానుసారంగా ఈ క్రింది విధంగా విభజించవచ్చును."వారి కొరకు వారు జీవించువారు" మరియు "క్రీస్తు కొరకు జీవించువారు" లేక "వారి స్వంతము కొరకు వెదకు కొనువారు" మరియు "క్రీస్తును గూర్చిన విషయాలను వెదుకువారు" లేక "మొదట ఈ లోక సంబంధమైన విషయాలను వెదుకువారు" మరియు "దేవుని రాజ్యమును మొదట వెదకువారు"

లేక "ధనాన్ని ప్రేమించువారు" మరియు "దేవునిని ప్రేమించువారు", (రెండిటిని ప్రేమించడం అసాధ్యమని యేసు ప్రభువు చెప్పారు - లూకా 16:13).కాని పై విధంగా విభజించడాన్ని నేనెప్పుడూ వినలేదు. ఈ విభజన ఒక క్రైస్తవుని అంతరంగిక జీవితాన్ని మరియు ఎవ్వరూ చూడని చోట దేవునితో అతడికి కల సంబంధాన్ని తెలియజేస్తుంది, అయితే ఇంతకు ముందు చెప్పుకొన్న పద్ధతులన్ని అతడి యొక్క బాహ్య జీవితానికి సంబంధించినవి మాత్రమే. అయితే ఈ రెండవ పద్ధతిలోనే పరలోకము క్రైస్తవులను విభజిస్తుంది. అలాగే జరిగితే, ఈ విధమైన విభజన మాత్రమే అవసరమైనది. మనకొరకు మనమే విభజించుకోవాల్సి యున్నది, ఎందుకంటె మన అంతరంగిక అభిప్రాయాలు ఆశలు ఎవరికీ తెలియవు కాని మనకే బాగుగా తెలియును. చివరకు మన భార్యలకు లేక భర్తలకు కూడా మనము దేని కోసం జీవిస్తున్నామో తెలియదు.

మన ప్రభువు ముఖ్యంగా వచ్చినది ప్రజలకు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చుటకు కాని, లేక ఒక సంఘ ఆరాధనా పద్ధతినిచ్చుటకు లేక భాషలలో మాట్లాడుటకు లేక చివరకు ఒక అనుభవాన్నిచ్చుటకు కాని కాదు.

ఆయన మనలను "మన పాపముల నుండి రక్షించుటకు" వచ్చెను. ఆయన గొడ్డలిని చెట్టువేరుపై వేయుటకు వచ్చెను. పాపము యొక్క మూలము, మనకు మనమే కేంద్రముగా నుండుట, మనకు కావాల్సింది మనము వెదక్కుంటూ మన స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకొనుటైయున్నది. మనము మన జీవితాల్లో నుండిన ఈ "వేరు"ను మన ప్రభువు గొడ్డలితో నరకునట్లు ఒప్పుకొనక పోతే మనము బాహ్యముగా క్రైస్తవులుగా మాత్రమే యుందుము. మన సిద్ధాంతాలను బట్టి లేక మన అనుభవాలను బట్టి లేక మన సంఘ ఆరాధనా కార్యక్రమమును బట్టి మనము ఇతర క్రైస్తవుల కంటె పై తరగతి వారమను కొనునట్లు సైతాను మనలను మోసపుచ్చును!

మన కొరకు మనము జీవించునంత కాలము(ఇది పాపములో జీవించుటకు వేరొక మాట) మనము సరియైన సిద్ధాంతములో నుండినా, అనుభవములో నుండినా మరియు సంఘ కార్యక్రమము సరిగా నుండినా సైతాను పట్టించుకొనడు. ఈనాటి క్రైస్తవలోకము ఎవరిస్వంతము వారు చూచుకొంటూ, వారికొరకే వారు జీవిస్తూ, కేవలము వారి కుండిన సిద్ధాంత భేధము వలన లేక సంఘ ఆరాధనా క్రమము లేక "అనుభవాలను" బట్టి దేవుడు వారిని ప్రత్యేకముగా దృష్టిస్తున్నాడనుకొనే క్రైస్తవులతో నిండిపోయి ఉన్నది.

యోహాను సువార్త 6:38 లో ఆయన ఈ లోకానికి వచ్చుట గూర్చి మన ప్రభువు ఇలా చెప్పారు.

1. తన మానవ చిత్తమును (అది ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చినప్పుడు పొందినది) ఉపేక్షించుట కొరకు.

2. ఒక మానవునిగా తన తండ్రి చిత్తము చేయుటకు. అలా చేయుట ద్వారా ఆయన మనకు మాదిరిగా నుండెను.

యేసు ప్రభువు యొక్క 33 1/2 సంవత్సరాల ఈలోక జీవితంలో ఆయన తన చిత్తాన్ని ఉపేక్షించుకొని తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చెను. మరియు ఆయన తనకు శిష్యులుగా ఉండగోరువారు అదే మార్గములో వెళ్ళవలెనని తేటగా చెప్పెను. ఆయన మన జీవితాల్లో నుండిన పాపము యొక్క వేరును నరుకుటకు వచ్చెను. అది "మన స్వంత ఇష్టమును చేయుట" నుండి మనలను విడుదల చేయుటకు వచ్చెను.

కొన్ని వేల సంవత్సరములు మానవుడు భూమి విశ్వానికి మధ్యలో నున్నదని ఊహించుకొంటూ పొరపాటు పడ్డాడు. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు 24 గంటల కొకసారి భూమి చుట్టూ తిరుగుతున్నట్లు గానే మానవ దృష్టికి కనబడేది. కాని కేవలం 450 సంవత్సరాల క్రితం కొపెర్నికస్ అనే ఒకని ధైర్యం అందరూ సాధారణంగా అనుకొనే దానిని ప్రశ్నించేటట్లు చేసి, భూమి విశ్వానికి మధ్య నుండడం కాదు కాని చివరకు సూర్య కుటుంబానికి కూడా మధ్యలో లేదని చూపించినది. సూర్యునికి మధ్యలో ఉండునట్లుగా భూమి సృష్టింప బడిందని అతడు చూపించాడు. మానవుని యొక్క కేంద్ర స్థానము తప్పుగా ఉన్నంత వరకు, అతడి శాస్త్రీయమైన లెక్కలు, అంచనాలు తప్పుగా ఉంటాయి. ఎందుకంటే అతడి కేంద్రము తప్పుగా ఉన్నది. అయితే ఒకసారి మానవుడు సరియైన కేంద్ర స్థానాన్ని కనుగొనిన తరువాత ఆ లెక్కలు అంచనాలన్నీ సరిగా మారాయి.

దేవుడు మనకు కేంద్ర స్థానముగా ఉంచుటకు బదులు మనము మన స్వంతాన్ని కేంద్రముగా ఉంచుకొన్నంత కాలము మన విషయంలోనూ అంతే. అప్పుడు బైబిలు గూర్చి, దేవుని గూర్చి మన గ్రహింపు (మన లెక్కలు మరియు అంచనాలు) తప్పుగా ఉండును. కాని మానవుడు 5000 సంవత్సరాలు అతడు సరియైన విధముగానే ఆలోచిస్తున్నానని, ఎలా అనుకొన్నాడో (మనము పైన చూచినట్లు) మనము కూడా అలానే సరిగానే ఆలోచిస్తున్నామని అనుకోవచ్చు. కాని మనము నిజానికి 100% తప్పుగా ఉండవచ్చును.

ఇదే విషయాన్ని మనము అనేక "మంచి క్రైస్తవులలో" కూడా చూస్తూ ఉంటాము. వారికి ఒకే బైబిలు నుండి వేరు వేరు వివరణలుంటాయి, వాటిని ప్రతివారు తమదే సరియైనదని ఇతరులది తప్పని అనుకొందురు. ఇతరులు మోసపోతున్నారని కూడా వారంటారు. ఇలా ఎందుకు? దానికి కారణం వారి కేంద్రస్థానము తప్పుగా ఉన్నది.

దేవునిలో మధ్య స్థానంగా ఉండాలని మానవుడు సృష్టింపబడ్డాడు కాని తనకు తాను మధ్యస్థానంగా ఉండుటకు కాదు. ఎప్పుడైతే క్రైస్తవుల యొక్క కేంద్రస్థానము తప్పుగా ఉంటుందో అప్పుడు వారి `సువార్త’ కూడా తప్పుగా నుంటుంది. ప్రాధమికంగా రెండు సువార్తలే ఈనాడు ప్రకటింపబడ్తునాయి. అవి ఒకటి మానవుడు కేంద్రస్థానముగా ఉన్నది రెండవది దేవుడు కేంద్రస్థానముగా ఉన్నది.

మానవుడు కేంద్రస్థానముగా నుండిన సువార్త మానవునికి ఈ లోకంలో అతడి జీవితము సౌఖ్యముగా సాగిపోవుటకు కావలసినవి అన్నీ ఇస్తూ అతడి జీవితాంతము పరలోకములో కూడా స్థానము దేవుడు ఇచ్చునని వాగ్దానము చేస్తుంది. యేసు ప్రభువు ఒకని పాపాలన్నింటిని క్షమించి, రోగములన్నిటి నుండి స్వస్థపరచి, అతడిని అన్ని విధాల వృద్ధి పొందునట్లు దీవించి, తన ఇహలోక సమస్యలన్నింటిని పరిష్కరించుట, మొదలైనవి కలిగించునని మానవునికి భోధింపబడ్తుంది.

అటువంటి జీవితంలో స్వంతానికి సంబంధించినది కేంద్రంగా నిలబడ్తుంది, మరియి దేవుడు అతడి చుట్టూ తిరుగుతూ, అతడికి ఒక సేవకునిగా అతడి ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ అతడు అడిగినది ప్రతీది ఇస్తూ ఉంటాడు!! అతడు చెయ్యాల్సిందల్లా `నమ్మి’ యేసు క్రీస్తు నామములో ఈలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అడగాలి!! ఇది తప్పుడు సువార్త, ఎందుకంటె అందులో మారుమనస్సు గూర్చి లేదు. బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు ప్రభువు, పౌలు, పేతురు, అపోస్తులులందరు మొట్ట మొదట ప్రకటించినది మారుమనస్సు గూర్చియే, అయితే ఇప్పుడు అన్నిటికంటె చివరన కూడా మారుమనస్సు గూర్చి ప్రకటింప బడుటలేదు!!

దేవుడు కేంద్రంగా కలిగిన సువార్త, వేరొక ప్రక్క మారుమనస్సు పొందుమని పిలుస్తుంది. అది మారుమనస్సు గూర్చి ఇలా చెప్తుంది.

ఒకని జీవితంలో స్వంతం గూర్చిన విషయం కేంద్రంగా ఉండుట నుండి తిరుగుట, ఒకని స్వంత ఇష్టాన్ని చేయుట నుండి, ఒకడు తనకు తానుగా ఎంచుకొనిన మార్గమునుండి, ధనాశ నుండి మరియు ఈ లోకాన్ని లోకానికి సంబంధించిన విషయాలను (నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము) మొదలైన వాటి నుండి తిరుగుట అయి ఉన్నది. దేవుని వైపు తిరుగుటలో, ఆయనను ఒకని హృదయమంతటితో ప్రేమించుట, ఆయనను ఒకని జీవితము యొక్క కేంద్రముగా ఉంచుకొనుట మరియు ప్రతివిషయంలో ఆయన చిత్తాన్ని చేయుట మొదలైనవి ఉన్నవి. క్రీస్తు సిలువపై చనిపోయిన దాని గూర్చిన విశ్వాసము ఒక మనుష్యుడు మారుమనస్సు పొందినప్పుడు మాత్రమే అతడి పాపములను క్షమించును. అప్పుడు అతడు దేవుడు కేంద్రంగా కలిగిన జీవితం జీవించుటకు ప్రతి దినము తనను తాను ఉపేక్షించు కొనగలుగుటకు శక్తి పొందునట్లు అతడు పరిశుద్ధాత్మను పొందును.

ఈ సువార్తను యేసుప్రభువు అపోస్తలులు భోధించారు.

అసత్య సువార్త ద్వారాన్ని వెడల్పుగాను మార్గాన్ని విశాలముగాను చేయును. (అందులో ఒకడు తనను తాను ఉపేక్షించుకోనక్కర్లేదు, ఒకనికి ఆసక్తికరమైన విషయాల గూర్చి జీవించుట మాననక్కర్లేదు లేక ఒకనికి లాభము చేకూర్చే వాటిని వెదుకుట మాననక్కర్లేదు. కాబట్టి ఆ మార్గములో నడుచుట సులువుగా నుండును). అటువంటి అసత్యమైన సువార్త బోధింపబడు కూటములను వినుటకు లక్షల కొద్ది ప్రజలు వెళ్ళుదురు. అనేకులు ఆ మార్గము గుండా ప్రవేశించి దానిలో నడుస్తూ అదే నిత్య జీవానికి తీసుకు వెళ్తుందని ఊహించుకొందురు. కాని అది నిజానికి నాశనానికి నడిపిస్తుంది. అయితే ఈ సువార్తను ప్రకటించు సువార్తికులు దీనియందే సంతోషిస్తూ, వారి కూటాలకు హాజరయిన సమూహాలలో క్రీస్తుకొరకు నిర్ణయము తీసుకొని చేతులెత్తిన వారి గూర్చి నివేదికలలో చెప్తుంటారు. కాని అదంతా మోసమే. అటువంటి కూటాల్లో కొందరు వారిలో నున్న నిజమైన ఆశను బట్టి నిజంగా మార్పు చెందినా, మార్పు చెందిన అనేకులు రెండింతలు నరకానికి పాత్రులగుదురు" (మత్త 23:15), ఆ విధంగా వారి నిజస్థితి గూర్చి వారు మోసపోదురు.

అయితే సత్యమైన సువార్త ద్వారాన్ని చిన్నదిగా చేసి మార్గాన్ని ఇరుకుగా చేస్తుంది. కాని కొందరు అతి భక్తులుగా నుండు మతమౌఢ్యులు ఆ మార్గాన్ని యేసుప్రభువు ఇరుకుగా చేసినదానికంటె ఇరుకుగా చేయుదురు. కాని ఆ మార్గమును యేసుప్రభువు ఏ మాత్రము ఇరుకుగా ఉంచారో అంతే ఇరుకుగా సత్య సువార్త చేయును. అందువలన ఈ మార్గాన్ని కనుగొనువారు కొందరే. ఈ సువార్త గూర్చి నివేదికలు ప్రచురించుటకు ఎక్కువ ఏమీ ఉండదు మరియు వాటి లెక్కలు చూన్తే ఆకర్షణీయంగా ఉండవు. కాని ఈ సువార్త ప్రజలను ప్రభువైన యేసు నొద్దకును మరియు పరలోకానికిని తీసుకువెళ్ళును. "మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. తాను వినిన దానికి లోబడి వానికి మరి ఎక్కువ వెలుగును, గ్రహింపును ఇవ్వబడును. కాని ఎవరైతే తాను వినిన దానికి లోబడకుండా ఉండునో, అటువంటి వాని యొద్ద నుండి అతడికి కలిగి యున్నదని అనుకొనిన వెలుగును గ్రహింపును కూడా అతడి యొద్ద నుండి తీసివేయబడును" (లూకా 8:18).

"వినుటకు చెవులు గలవాడు వినునుగాక"!