WFTW Body: 

మత్తయి 11:28-30 వచనాలలో విశ్రాంతి మరియు భారము గురించి యేసు చెప్పారు. ఈ మాటలు ఈ విధముగా చెప్పవచ్చును, మనము భూసంబంధమైన విషయములన్నింటిలో విశ్రాంతిలో ఉండి, మన హృదయములపై ఆయన భారమును(కాడిని) మోయవలెను. భూసంబంధమైన భారములన్నింటిని మనము ప్రభువుకు సమర్పించని యెడల ప్రభువుయొక్క భారములను మోయలేము ("మీ భారము యెహోవామీద మోపుము, మీ చింతలన్ని ఆయనను కలిగియుండనివ్వండి" కీర్తన 55:22; "ఆహారం గూర్చి, దుస్తుల గూర్చి ఎక్కువగా చింతించకుడి. మీరు దేని గురించైనా చింతించవలెనని కోరినయెడల దేవుని రాజ్యము మరియు ఆయన నీతిని గురించి చింతించుడి"-మత్తయి 6:31,33 వివరణ).

మీ మనస్సు అంతా భూసంబంధమైన వాటిని గూర్చిన చింతలతో నిండియుండిన యెడల, ప్రభువు కొరకు మీరు అసమర్థులుగా ఉండెదరు. భూసంబంధమైన వాటి గురించి ఆలోచించాలనుటలో సందేహంలేదు కాని వాటిలో దేని గురించి చింతించకూడదు. నిత్యమైన వాటి గురించి మాత్రమే మీ హృదయము చింతించవలెను. ఈ విధముగా మనము భూసంబంధమైన వారికంటే వేరుగా ఉండెదము. భూమిమీద పరీక్షలలో పొందే ఫలితములు కూడా నిత్యత్వములో విలువలు కలిగియుండవు. మీరు కచ్చితంగా కష్టపడి చదువవలెను. కాని ఫలితము గురించి చింతించకూడదు.

దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుటలో 100శాతం మార్కులు మీరు పొందినయెడల నిత్యత్వములో మీరు మొదటిగా ఉండెదరు. అనేక సంవత్సరముల క్రింతం దీనినే నేను నిర్ణయించుకొన్నాను.

జెఫన్యా 3:17లో జరగబోయే ప్రతి విషయములో "దేవుడు ప్రేమతో, నీ కొరకు మౌనముగా ప్రణాళిక వేయుచున్నాడు"(వివరణ). "నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇకమీదట తెలిసికొందువు" (యోహాను 13:7) అని ప్రభువు జ్ఞాపకము చేయుచున్నాడు. .

చివరిగా నేను ప్రతిచోట ప్రోత్సహించుచున్నట్లే మీరు కూడా దీనత్వమును వెదకి మీ గురించి తక్కువ తలంపులు కలిగియుండాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను. అనగా మీరు దేవుని బిడ్డలుగా మీ విలువను బట్టిగాని, ఆయన ఇచ్చిన వరములు, సామర్థ్యములను బట్టిగాని, మిమ్మును మీరు తక్కువగా ఎంచుకొవాలని కాదు. మీరు దేవుని పిల్లలు, మిమ్మును మీరు తక్కువగా ఎంచుకోవడానికి చోటు లేదు. కాని దేవుని యెదుట మిమ్మును మీరు శూన్యముగా ఎంచుకోవడం, మీ జీవితములో దేవుడే సర్వం అయ్యియుండటమై ఉన్నది. మీకు తెలిసినవారు మిమ్మును చూచి దేవుని మహిమపరచవలెను. మీ చిత్తమును ఉపేక్షించుకొని దేవుని చిత్తము నెరవేర్చుట కూడా దానిలో ఇమిడి ఉంది. అనగా దేవుడు మీకు అనుగ్రహించిన వాటి అన్నిటిని బట్టి ఎల్లప్పుడు ఆయనను మహిమపరచుటకును మరియు ఆయన ఇచ్చిన వాటిని ఆయన మహిమార్థమై ఉపయోగించునట్లు మీరు తీర్మానించుకొనవలెను.

ఎప్పుడూ ఏ వ్యక్తిని అయినా, వారిలో ఎన్ని పొరపాట్లు ఎన్ని లోపాలు ఉన్నను, చిన్న చూపు చూడకండి ఎగతాళి చేయకండి. దేవుడు దీనులకే అత్యధికమైన కృపను అనుగ్రహించును - వారు ఆత్మీయముగా ఎంతో అభివృద్ధి చెందెదరు. యేసువలె మీరు కూడా మీ రోజులన్నిటిలో దీనత్వములో నడచుదురు గాక.