ఏదైనా ఒక విషయములో దేవుని చిత్తమును గూర్చి సందేహములో ఉన్నప్పుడు మనలను మనము ఈ 12 ప్రశ్నలు అడుగుకొనుట ఎంతో మంచిది. మనం నిజాయితిగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్తున్నప్పుడు, దేవుని చిత్తం అంతకంతకు మనకు స్పష్టమవుతుంది.
1. నాకు తెలిసినంతవరకు ఇది యేసుప్రభువుయొక్క బోధకు, అపొస్తలులయొక్క బోధకు, క్రొత్తనిబంధన ఆత్మకు విరుద్ధంగా ఉందా? (2తిమోతి 3:16,17)
2. దాన్ని నేను నిర్మలమైన మనసాక్షితో చేయగలనా? (1యోహాను 3:21)
3. దాన్ని నేను దేవుని మహిమార్థమై చేయగలనా? (1కొరింథి 10:31)
4. దాన్ని నేను యేసుప్రభువుతో సహవాసం చేస్తూ చేయగలనా? (కొలస్సి 3:17)
5. నేను దాన్ని చేస్తుండగా, నన్ను దీవించమని దేవున్ని అడగగలనా? (2కొరంథి 9:8)
6. దాన్ని చేయడం నా ఆత్మీయ పదునును ఏ విధంగానైనా పోగొడుతుందా? (2తిమోతి 2:15)
7. నాకు తెలిసినంతవరకు అది ఆత్మీయంగా లాభకరమైనది క్షేమాభివృద్ధి కలుగజేసేదా? (1కొరింథి 6:12; 10:23)
8. యేసుప్రభువు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు, నేను దాన్ని చేస్తూ ఉంటే, సంతోషిస్తానా? (1యోహాను 2:28)
9. జ్ఞానవంతులైన, పరిణితి చెందిన సహోదరులు దానిని గూర్చి ఏమనుకుంటున్నారు?(సామెతలు 11:14; 15:22; 24:6)
10. నేను చేయాలనుకొంటున్న ఈ పనిని నేను చేయడం ఇతరులకు తెలిస్తే అది దేవుని నామానికి అవమానం తెస్తుందా? లేక నా సాక్ష్యాన్ని పాడుచేస్తుందా? (రోమా 2:24; 2కొరింథి 8:21)
11. దాన్ని నేను చేయడం ఇతరులకు తెలిస్తే, వారు అభ్యంతరపడతారా(తొట్రిల్లుతారా)? (రోమా 14:13; 1కొరింథి 8:9)
12. దాన్ని చేయడానికి నా ఆత్మలో నాకు స్వేచ్ఛ ఉన్నదా? (1యోహాను 2:27)
పై వాక్యభాగలన్నిటిని చూచి, వాటిని ధ్యానించండి.