WFTW Body: 

ప్రకటన 15:3,4 లో ఈ విధముగా చదివెదము, "వారు - ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కరముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు".

పాత నిబంధనలో మోషే వ్రాసిన రెండు కీర్తనలు ఉన్నాయి - ఒకటి నిర్గమకాండము 15:1-18, ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రమును దాటినప్పుడు మరియు ఫరో, అతని సైన్యము అందులో మునిగిపోయినప్పుడు వ్రాయబడింది. మోషే ఈ విధముగా వ్రాశాడు, "యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను. గుఱ్ఱమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. ప్రకటన 6వ అధ్యాయములో కుడా క్రీస్తువిరోధి తెల్లని గుఱ్ఱము మీద ఉన్నట్లు చూడగలము. ఈ గుఱ్ఱమును మరియు దానిమీదనున్న వాడు పడద్రోయబడెనని జయించువారు పాడుచున్నారు. ఆర్మెగెద్దోను యుద్దములో, క్రీస్తువిరోధి మరియు అతని సైన్యములు ఇశ్రాయేలు దేశమునకు వచ్చి మరియు యుద్ధము చేయుదురు. ఆ సమయములో ప్రభువైనయేసు క్రీస్తు తన పరిశుద్ధులతో దిగివచ్చును. ఆయన తన పాదమును ఒలీవల కొండపై నిలిపి, క్రీస్తువిరోధి సైన్యమును నశింపజేయును. పోరాడకుండానే దేవుని ప్రజలు జయమును చూచెదరు. ఈనాడు మనము ప్రతి దానిని ఆవిధముగా జయించాలి. మానవ ఆయుధాలతో మనము పోరాడము. మనము ఉరకయే నిలిచి యుండి మరియు ప్రభువును విశ్వసించెదము మరియు ప్రభువు మన శత్రువులను నశింపజేయును. కాబట్టి అటువంటి విశ్వాసము కలిగినవారు, ఈనాడు కూడా మోషే కీర్తనను పాడెదరు!! మన జీవితములోని పోరాటములలో మనము మోషే కీర్తనను పాడెదము. మనము "ఉరకయే నిలిచియుండి" మరియు ప్రభువు మన శత్రువులకు చేయు దానిని చూచెదము.

ద్వితీయోపదేశకాండము 31:30 - 32:43 వరకు మోషే వ్రాసిన రెండవ కీర్తన ఉన్నది. అక్కడ అతడు ఈవిధముగా కూడా పాడెను, "జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును" (ద్వితీయోపదేశకాండము 32:43). ఈ రెండవ కీర్తనలలో మనము ఒక సత్యమును చూచెదము. దేవుని ప్రజలు వారి శత్రువులతో పోరాడరు. వారు నిలిచియుండి మరియు దేవుడు వారికి ప్రతీకారము చేయుటను చూచెదరు.

మనము ఒకరోజు మహిమలో వాయిద్యములతో దేవునికి కీర్తన పాడునట్లు, ఇప్పుడే ఆ కీర్తనను పాడుట నేర్చుకోవలెను. ఈ కీర్తనను నేర్చుకొనుటకు, మన అనుదిన జీవితములలో పరిస్థితులు మనకు సహకరించును. దేవుని మార్గములు పరిపూర్ణమైనవని జయించువారు పాడెదరు. "ప్రభువైనయేసు సమస్తమును బాగుగా చేసియున్నాడని" పరలోకములో మనము పాడెదము. ఆరోజు, భూమిమీద దేవుడు మనలను నడిపించిన విధానమును చూచినయెడల, సమస్తమును మన మేలుకొరకే సమకూర్చి జరిగించియున్నాడని కనుగొనెదము. ఈనాడు అనేక విషయములు ఎందుకు జరుగుచున్నవో మనకు అర్ధముకాకపోవచ్చును. కాని ఆ దినమున, మనము గ్రహించెదము. కాని విశ్వాసముగల వ్యక్తి ఆ దినము వరకు వేచియుండనవసరములేదు. అతడు ఇప్పుడే విశ్వసించి మరియు వాటిని ఎరిగియున్నాడు. భూమిమీద జరుగుచున్న వాటన్నిటినీ దేవుడు వివరించి చెప్పేవరకు అతడు ఎదురు చూడనవసరము లేదు. "ప్రభువా! నీ మార్గములు పరిపూర్ణమైనవని" అతడిప్పుడే పాడును.