దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అనేక నరమాంస భక్షక తెగలకు నిలయంగా ఉన్న అనేక ద్వీపాలలో యేసుక్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అర్పించిన ఒక మిషనరీ జీవిత చరిత్రను నేను ఇటీవల చదువుతున్నాను. ప్రభువు అతనిని ఎలా విడిపించాడో, అతనిని ఎలా బలపరిచాడో, ధైర్యపరిచాడో, అనేక కష్టమైన పరీక్షల ద్వారా అతనిని ఎలా ఓదార్చాడో చూడటం నన్ను ఎంతో ఉత్తేజపరిచింది. ఈ రోజు నా జీవితంలో నేను ఇవ్వగలిగిన దానికంటే అలాంటి సాక్ష్యం చాలా ప్రత్యేకమైనదని భావించాలనే కోరిక నా హృదయంలో ఉన్నట్లుగా మరియు ఆ కోరికలు పెరుగుతున్నట్లుగా నేను కనుగొన్నాను.
చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని నాకు గుర్తుచేయడానికి ప్రభువు ఆ అనుభవాన్ని ఉపయోగించాడు: నేను ఇవ్వగలిగిన అతి ముఖ్యమైన సాక్ష్యం నేను ఇతరులకు నా పెదవులతో ఇచ్చేది కాదు; కానీ, పరలోకంలోని పాలకులకు మరియు అధికారులకు నా జీవితంతో నేను ఇచ్చేది.
"...పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి..." (ఎఫె.3:10)
బైబిల్లోని మొదటి లేఖనాల నుండి ఎవరిని నిందించవచ్చో వెతుకుతూ సాతాను భూమి అంతటా తిరుగుతున్నాడని మనం చూస్తున్నాము (యోబు 1:6), మరియు దేవుడు, సాతానును తిప్పికొట్టడానికి మరియు మనిషిని సృష్టించడంలో తన గొప్ప ప్రణాళిక యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించడానికి, తన ముఖం ఎదుట జీవించే స్త్రీ పురుషుల కోసం వెతుకుతున్నాడని కూడా మనం చూస్తాము (యోబు 1:7) .
కానీ అది తెలిసిన తర్వాత కూడా, నా జీవితంతో ప్రభువును మహిమపరచడం కంటే, నోటితో చెప్పే సాక్ష్యాన్ని విలువైనదిగా గుర్తించడం చాలా సులభం అని నేను కనుగొన్నాను!
సాక్ష్యమిచ్చే జీవితానికి గుర్తు
నా జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచడం గురించి నేను ఆలోచించినప్పుడల్లా, "తండ్రిని వివరించిన" (యోహాను 1:18) యేసుక్రీస్తు గురించి నాకు గుర్తుకు వస్తుంది. మనం క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు, ఆ వివరణ కోసం మనం యేసు మాట్లాడే మాటలే కాదు ఆయన జీవితాన్ని ఎక్కువగా చూడాలి. ఆయన జీవితంలో మూడు సందర్భాలు తండ్రిని గురించి లోతైన వివరణను నాకు అందిస్తాయి - ఒకే ప్రకాశం కలిగి విభిన్న కోణాలుగల బహుముఖ వజ్రం మాదిరిగా.
"అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను.అప్పుడాయన నిద్రించుచుండెను..." (మత్త. 8:24)
"వెంటనే (యూదా)యేసు నొద్దకు వచ్చి-బోధకుడా,నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.యేసు,చెలికాడా,నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి." (మత్త. 26:49-50)
పిలాతు యేసుతో, "నీవెక్కడ నుండి వచ్చితివని" యేసును అడిగెను;అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు,నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు,నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను. అందుకు యేసు,పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు" అని సమాధానవిచ్చెను. (యోహాను 19: 9-11).
ఈ మూడు సందర్భాలలో నేను చూసేది ఏమిటంటే, యేసు విశ్రాంతిలో ఉన్నాడు! ఆయన తన తండ్రిని విశ్వసించాడు కాబట్టి ఆయన తుఫానులో నిద్రపోగలిగాడు. ఆయన యూదాను తన స్నేహితుడని పిలవగలిగాడు, ఎందుకంటే ఆ పాత్ర తన తండ్రి నుండి వచ్చిందని ఆయన చూశాడు. ఆయన తన తండ్రి యొక్క అత్యున్నత అధికారాన్ని విశ్వసించినందున, ఆయన భూసంబంధమైన పాలకుల ఎదుట ధైర్యంగా నిలబడగలిగాడు. ప్రేమగల, శక్తివంతమైన పరలోకపు తండ్రిలో సంపూర్ణమైన "విశ్రాంతి" కలిగి ఉండటమే ఆయన జీవిత సాక్ష్యం.
దేవుణ్ణి స్తుతించండి, అదే సాక్ష్యాన్ని నేడు మనం కలిగి ఉండవచ్చు. భూమ్మీద ఎవ్వరూ చూడకపోయినా, మనం ఒక్క మాట మాట్లాడకపోయినా (యేసు పడవలో నిద్రిస్తున్నప్పుడు మాట్లాడనట్లే), పరలోకంలో ఉన్న మన తండ్రి యొక్క అత్యున్నత విశ్వసనీయతకు ఆకాశమందున్న పాలకులకు మరియు అధికారులకు మన జీవితాలు సాక్ష్యంగా ఉండవచ్చు.
ఆ సాక్ష్యాన్ని మనం ఎలా ఇస్తాం? ఎదుర్కొనే తుఫానుల మధ్య, మనం యేసు పక్కన పడవలో నిద్రిద్దాం. పరిశుద్ధాత్మ లేని శిష్యులు తుఫాను దాటిపోయే వరకు విశ్రాంతి పొందలేదు. కానీ మనం తుఫానుకు ముందు మరియు దాని ద్వారా కూడా యేసుతో విశ్రాంతి తీసుకోవచ్చు. ద్రోహుల దాడుల మధ్య, మనల్ని మనం రక్షించుకోవడానికి యేసు వలె నిరాకరిస్తాము. పరిశుద్ధాత్మ లేని శిష్యులు, పోరాడాలనే ప్రలోభాన్ని ఎదిరించలేకపోయారు; కానీ అన్యాయానికి గురైనప్పుడు యేసుతో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవచ్చు. ఉన్నత అధికారులు మనకు వ్యతిరేకంగా తెచ్చిన సవాళ్ల మధ్య, దేవుడే అత్యున్నతమైన అధికారం కలిగి ఉన్నాడని యేసు వలె మనం ఓదార్పు పొందుతాము.
నా చిన్న పడవపై తుఫాను కొట్టినప్పుడు "యేసుతో పాటు పడవలో నిద్రించమని" ప్రభువు చాలాసార్లు నన్ను ఆహ్వానిస్తున్నాడు. నన్ను సవాలు చేసిన రెండు నిర్దిష్టమైన విషయాలు:
విశ్రాంతి ఐచ్ఛికం కాదు (ఎంపికలో ఒకటి కాదు)
"ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా,మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము." (హెబ్రీ. 4:1).
నేను విశ్రాంతి లేకపోవుటను చాలా తీవ్రంగా తీసుకోవాలి. అహంకారం వల్లనే విశ్రాంతి లేకుండా ఉంటామని ఇటీవల మా సంఘ సమావేశంలో విన్నాము. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుని విశ్రాంతి లేకుండా కనిపిస్తే, మనం దానిని తీవ్రంగా పరిగణించాలి మరియు ఆయన విశ్రాంతి నుండి మనలను తొలగించే అహంకారంపై వెలుగు కోసం ప్రభువును అడగాలి. బైబిలు ఇలా చెబుతోంది, "పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము". కాబట్టి మనం కొద్ది అవిశ్రాంతిని కూడా తీవ్రంగా పరిగణించాలి!
విశ్రాంతి అంటే సోమరితనం కాదు
వాగ్దానం చేయబడిన విశ్రాంతిని 'నేను ఏమీ చేయనవసరంలేదు' అనే అర్థం వచ్చేలా నా శరీరం తెలివిగా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తుందని నేను గమనించాను. అది తప్పు. క్రీస్తులో విశ్రాంతి తీసుకోవడం అంటే మనం ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. బదులుగా, మనం చేసే పనులన్నీటికీ (యేసు విషయంలో జరిగినట్లే), మన తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ మరియు సంరక్షణ మద్దతుగా ఉండును.
దేవుడు తన విశ్రాంతిలోనికి నన్ను ఆహ్వానిస్తున్న ఈ సమయంలో, నా లౌకిక పని వంటి "చిన్న" విషయాలలో కూడా మరింత శ్రద్ధగా మరియు మరింత జాగ్రత్తగా ఉండమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు.
"మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి" (కొలొ. 3:23).
కాబట్టి నేను విశ్రాంతి యొక్క అన్ని తప్పుడు నిర్వచనాలను తిరస్కరించాలనుకుంటున్నాను మరియు ఆయన మనకు వాగ్దానం చేసిన నిజమైన విశ్రాంతి కోసం వాంఛిస్తూ యేసు వద్దకు రావాలనుకుంటున్నాను. నేను అవిశ్రాంతిలో ఉండటానికి నిరాకరించాలనుకుంటున్నాను మరియు శత్రువు నాకు అందించే ఏదైనా నకిలీ "విశ్రాంతి"ని కూడా తిరస్కరించాలనుకుంటున్నాను.
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా,నా యొద్దకు రండి;నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి;అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి." (మత్త.11:28-30).