WFTW Body: 

"అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానాభాషలు మాటలాడువారినిగాను నియమించెను" (1 కొరింథీ 12:27,28).

సంఘములోని ప్రతిఒక్కరు దేవునిసంఘముగా నిర్మించబడుటకు అవసరమైన కృపావరములను సంఘములోని ప్రతిఒక్కరికి దేవుడు అనుగ్రహించియున్నాడు. కొందరికి అపోస్తలులుగా ఉండుటకు, కొందరికి ప్రవక్తలుగా ఉండుటకు, కొందరికి అద్భుతములు చేయుటకు, కొందరికి స్వస్థపరచుటకు దేవుడు కృపావరములను అనుగ్రహించియున్నారు. క్రీస్తుయొక్క దేహనిర్మాణములో సహాయపడుటకు కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను ఉండుటకు దేవుడు తన కృపావరాలను అనుగ్రహించారు.

సంఘములో దేవుడు నియమించిన "ఉపకారము చేయువారు" ఉన్నారు. వీరు మందిరాన్ని శుభ్రపరచుట, బాత్‍రూములను కడుగుట మొదలగు పరిచర్యలను స్వచ్ఛందంగా చేసేవాళ్ళుకాదు. ఇటువంటి పరిచర్యలు చేసేవాళ్ళు ప్రతి సంఘములో ఉండాలి. కాని ప్రత్యేకమైన ఎటువంటి కృపావరములేనివారైనను ఇటువంటి పనులను చేయవచ్చును. కాని సంఘములోని ఇతర విశ్వాసులు ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందునట్లు ఇతరులకు సహాయపడుటకు వీరు దేవునియొద్దనుండి అద్భుతమైన కృపావరములను పొందినవారు. స్థానికముగా అందరు ఏకమై సంఘముగా నిర్మించబడుటకు ఇటువంటివారు ప్రతి సంఘములో ఎంతో అవసరము. ఇటువంటి పరిచర్య చేయుటకు దేవునిలోనుండి కృపావరమును పొందుటకు మనమందరము ఆసక్తి కలిగియుండాలి.

సంఘములోని బలహీనులను ఆత్మీయముగా బలపరచి, ప్రోత్సహించి, క్రీస్తులో స్థిరపరచుటకు ఉపకారములు చేయువారు అవసరము. పరిశుద్ధాత్ముడు కూడా సహాయుడని పిలువబడియున్నాడు (యోహాను 14:16). ఆయన అదృశ్యుడైయుండి ఎల్లప్పుడు మనకు సహాయం చేస్తాడు. క్రీస్తు శరీరమైయున్న స్థానిక సంఘములో ఉపకారులు కూడా గొప్ప సహాయుడైన పరిశుద్ధాత్మునివలె మౌనముగాఉంటూ ఎటువంటి ఆర్భాటము లేకుండా, గుర్తింపును కోరక సహాయపడుతుంటారు. వారు సహోదరులైనను లేక సహోదరీలైనను అవ్వవచ్చును. అనేక భయములతోను, సంశయములతోను విసిగి వేసారిపోయి ఉన్న బలహీనమైయున్నవారి అవసరము తీర్చబడుటకు ఈ విశ్వాసులు దేవుని యొద్దనుండి ప్రత్యేక కృపావరాన్ని(స్వస్థపరిచే వరాన్ని) పొందుకొని యుంటారు. ఇతరులు ఆహ్వానించేవరకు వారు ఎదురు చూడరు. కాని వారు పరిశుద్దాత్మచేత నడిపించబడినవారై ఆత్మీయంగా పోరాడుచున్నవారిలో విశ్వాసాన్ని కలిగించే విశ్వాసవాక్యాన్ని చెప్పి, వారిని ప్రోత్సహిస్తారు. వారిమీద వారికి నమ్మకముండదు కాని వారు ప్రతిరోజు దేవుని యొద్దనుండి వింటారు. "అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము పొందుతారు" (యెషయా 50:4).

ప్రతి సంఘములోను నిరాశలో ఉన్నవారు, జీవిత పోరాటములలో ఉండి, అలసిపోయి మరియు చింతకలిగినవారు ఉంటారు కాబట్టి ఈనాడు అటువంటి కృపావరములు కలిగిన ఉపకారులు ఎంతో అవసరము. ఎవరైనా వారియొద్దకు వచ్చి వారిని ప్రోత్సహించేవారు కావాలి. కాబట్టి స్థానికంగా క్రీస్తుసంఘము నిర్మించబడునట్లు అనేక సహోదర, సహోదరీలు ఈ కృపావరము కొరకు ప్రభువుయొద్ద కనిపెట్టాలి. ఈ పరిచర్య చేయుటకు కావలసిన కృపను, జీవసరఫరాను పొందుటకు వారు ప్రతిరోజు ప్రభువుయొద్దనుండి వినాలి.