వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు
WFTW Body: 

గుణవతియైన ఒక స్త్రీయొక్క గుణలక్షణములను సామెతలు 31:10-31 వివరించుచున్నది.

ఆమె హృదయము, చేతులు, నాలుక ఉత్తమమైనవి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము గనుక ఆమెయొక్క శరీరసౌందర్యము గురించి చెప్పలేదు(సామెతలు 31:30). స్త్రీలు అందరును మరియు యౌవ్వన స్త్రీలును మరియు ప్రత్యేకముగా వివాహము చేసుకొనగోరిన యౌవ్వన పురుషులును ఈ విషయము గుర్తించిన యెడల చాలా బాగుండును.

ఈమె దేవునియెడల భయభక్తులు గలిగిన స్త్రీ (30వ). ఇదే ఆమె జీవితానికి పునాది. ఆమె చేతులతో కష్టపడి పనిచేయుచూ, బట్టలు కుట్టుచూ, వంట చేయుచూ, చెట్లు నాటుచూ మరియు బీదలకు సహాయపడుతూ ఉంటుంది(13-22వ). ఆమె జ్ఞానముకలిగి మరియు కృపాసహితముగా మాట్లాడును (26వ). ఆమె అందముగా లేకపోయినప్పటికిని దేవుని యెడల భయభక్తులు కలిగియుండి కష్టపడి పనిచేయుచూ మరియు దయకలిగి ఉంటుంది. ఆమె యొక్క పవిత్ర హృదయమునుండి కష్టపడి పనిచేసే చేతులనుండియు మరియు కృపాసహితముగా మాట్లాడే నాలుకనుండియు దేవుని మహిమ బయలుపరచబడుతుంది(దానికి విరోధముగా లోకసంబంధమైన స్త్రీలు అపవిత్రమైన హృదయమును, సున్నితమైన చేతులను మరియు కఠినమైన నాలుక కలిగియుందురు). దేవుడు తన మహిమను ప్రత్యక్షపరుచుటకు స్త్రీలలో ఈ విషయములను చూచుచున్నాడు.

ఇటువంటి గుణవతియైన స్త్రీ ఒక భార్యగా తన భర్తకు నిజమైన సహాయకురాలుగా ఉంటుంది. ఆమె జీవితకాలమంతయు అతనికి కీడు ఏమియు చేయక ఎల్లప్పుడు అతనికి మేలు చేస్తుంది (12వ). మరొకమాటలో చెప్పాలంటే అతనియెడల ఆమెకున్న మొదటిప్రేమను ఆమె ఎప్పటికీ కోల్పోదు. అతనియొక్క వృత్తి విషయములోగాని మరియు అతని పిలుపు విషయములోగాని అతనితో సహకరిస్తూ మరియు డబ్బును వృధాచేయక తానుకూడా ఇంటిలో పనిచేయుచూ సహకరిస్తుంది. అతడు ప్రభువు పరిచర్య కూడా చేయుటకు ఇంటిలో అతనికి పని వత్తిడి లేకుండా చేస్తుంది(23-27వ). ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే(ప్రధానమంత్రులు మరియు బోధకులుగా ఉన్న స్త్రీల కంటే) ఆమె ఎంతో శ్రేష్టమైనదని ఆమె భర్త ఆమెను ప్రశంసిచుటలో ఆశ్చర్యములేదు(29వ). అటువంటి స్త్రీ బహిరంగముగా కూడా ప్రశంసించబడాలి. ఎందుకనగా ఒక స్త్రీగా తన పిలుపును అర్థముచేసుకొని యున్నది(31వ).

మన గృహములో "పరిశుద్ధులకు పరిచర్య చేయుట" గురించి ఎక్కువగా క్రొత్తనిబంధలో చెప్పబడింది. "భోజనము మరియు రాత్రిఉండుటకు వసతి అవసరమైన వారికి ఆనందముతో మీ గృహములో ఆతిథ్యము చేయాలి ... అతిథులను ఇంటికి భోజనానికి పిలిచి అతిథ్యము ఇచ్చే అలవాటు చేసుకోవాలి"(1పేతురు 4:9, రోమా 12:13 లివింగ్ బైబిలు). ఒక ఇంటిలో అతిథ్యము ఇచ్చుట ప్రాముఖ్యముగా స్త్రీయొక్క భాద్యతయైయున్నది. ఆమె ఒక ప్రవక్త కాకపోయినప్పటికి, ఒక ప్రవక్తకు ఆతిథ్యము ఇచ్చుటకు ఇంటికి పిలుచుటద్వారా ప్రవక్త పొందుకొనే బహుమానాన్ని పొందుకోవచ్చును (మత్తయి 10:41). అప్పుడు ప్రభువుయొక్క శిష్యులకు ఆతిథ్యము ఇచ్చుటద్వారా ఆమె తగిన ఫలాన్ని పొందుతుంది (మత్తయి 10:41). ఒక అపొస్తలుని మన ఇంటిలోనికి చేర్చుకొనిట్లయితే మనము యేసుని చేర్చుకొనినట్లే(మత్తయి 10:40). ఆవిధముగా యేసుయొక్క నామములో ఒక బిడ్డను చేర్చుకొనినట్లయితే యేసుని చేర్చుకొనినట్లే(మత్తయి 18:5). ఆతిథ్యము ఇచ్చే విషయంలో ప్రభువు ఎంతో అద్భుతమైన అవకాశములను స్త్రీలకు ఇచ్చాడు. పౌలు మరియు పేతురు ఆతిథ్యముగురించి ఎవరికైతే పత్రికలు వ్రాసారో వారు ఎక్కువ శాతం బీద క్రైస్తవులు. వారినుండి సామాన్యమైన ఆహరమును మరియు పడుకొనుటకు స్థలమును పరిశుద్ధులకు కొరకు అడుగబడెను. మనుష్యుల ఘనతకోరి, వారు శ్రేష్ఠమైన ఆహరము మరియు గొప్ప వసతి గృహము ఇచ్చేంత వరకు తాము అతిథ్యమివ్వలేమని అనుకొనెదరు. మొదటి శతాబ్ధములో బీద విధవరాల్లు కూడా వారి గృహములో పరిశుద్దులకు అతిథ్యము ఇచ్చారని చెప్పబడింది(1 తిమోతి 5:10).