మన యొక్క కొన్ని ప్రార్థనలకు జవాబిచ్చుటకు దేవుడు ఎందుకు ఆలస్యము చేస్తాడో మనము అర్థము చేసుకొనలేము. కాని ఆయన మార్గము పరిపూర్ణమైనది మరియు ఆయన మన మార్గములను పరిపూర్ణము చేయును (కీర్తన 18:30, 32).
అపొ.కా. 1:7లో కాలములను, సమయములను తండ్రి తన ఆధీనములో ఉంచుకొన్నాడని వాటిని తెలుసుకొనుట మన పని కాదని యేసు చెప్పారు.
కొన్ని సంగతులు దేవునికి మాత్రమే చెందియున్నవి. ఉదాహరణకు, క్రింది విషయాలు మానవునికి అనుమతించబడలేదు.
1. ఆరాధన స్వీకరించుట (మత్తయి 4:10)
2. మహిమను పొందుట (యెషయా 42:8)
3. పగదీర్చుకొనుట (రోమా 12:19)
4. కాలములను మరియు సమయములను తెలుసుకొనుట (అపొ.కా. 1:7)
ఈ నాలుగు దేవునికి సంబంధించిన అంశాలు. పైనున్న మొదటి రెండు విషయములను ప్రతి క్రైస్తవుడు ఎంతో త్వరగా అంగీకరిస్తాడు. అనేకులు మూడవ విషయమును కూడా అంగీకరించెదరు. కాని ఆత్మ సంబంధమైన వారు మొదటి దానివలె నాల్గవ విషయమును కూడా వెంటనే అంగీకరిస్తారు. కాబట్టి కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చుటకు చాలా సమయం తీసుకొనినట్లయితే, మనము దీనత్వముతో ఆయన చిత్తమును అంగీకరించాలి.
దేవుడు ఇంకను సింహాసనాసీనుడై యున్నాడు మరియు ఆయన తన వారిని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని సమస్తమును సమకూర్చి వారి మేలు కొరకై జరిగించును.
"దేవుని పక్షమున ఉన్నవాడు ఎల్లప్పుడు జయించును - అతనికి ఏ అవకాశము తప్పిపోదు.తాను వెలచెల్లించుట ద్వారా జయము పొందినప్పుడు దేవుని చిత్తము అతనికి మధురముగా ఉండును".
కాబట్టి మనము "ప్రార్థనయందును వాక్య పరిచర్యయందును ఎడతెగక యుందుము" (అపొ.కా. 6:4). అప్పుడు మనము "ధైర్యముగా దేవుని రాజ్యమును గూర్చియు ప్రభువైన యేసును గూర్చియు ఆటంకము లేకుండా ప్రకటించగలము" (అపొ.కా. 28:31).
మనలోనుండి జీవజలనదులు ప్రవహించుట
క్రొత్త నిబంధన యొక్క శుభవార్తను వినుటకు, ప్రపంచమంతటిలో అనేకమంది విశ్వాసులు అవసరతలో ఉన్నారు. ధనాపేక్షకులైన బోధకులద్వారాను మరియు ఇతరులమీద అధికారం చెలాయించే తప్పుడు బోధకుల ద్వారాను ఈనాడు అనేకప్రాంతములలో నున్న విశ్వాసులు దోచుకొనబడుచున్నారు. ఇటువంటి బానిసత్వములో ఉన్న విశ్వాసులకు మనము స్వాతంత్య్రము ప్రకటించుటకు పిలవబడ్డాము.
ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొనుటకు మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు సున్నితంగా ఉండాలి (యెషయా 30:21). అనేకమంది విశ్వాసులు సత్యమును గూర్చి వినుటకు ఇష్టపడని సమయము ఆసన్నమగుచున్నవి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మరియు అనుకూలముగా లేనప్పుడు ఎల్లప్పుడూ సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి (2 తిమోతి 4:2, 3).
విశ్వాసముతో ఈ దేవుని వాగ్ధానమును స్వతంత్రించుకొనెదము. "జీవజలనదులు మన సంఘములో నుండి అన్ని దిక్కులకు ప్రవహించి తూర్పునకును, పడమటకును సంవత్సరమంతయు ప్రవహించును" (జెకర్యా 14:8).
అయితే ఆ జీవజలాలు మన నుండి ఇతరులకు ఎలా ప్రవహిస్తాయి?
కీర్తనలు 23:5లో, "మా పాత్రలు పొంగిపొరలుచున్నవి" అని చదువుతాము. అక్కడ "పొంగిపొరలుట" కోసం ఉపయోగించిన అసలు హీబ్రూ పదం "రెవయ్యా". ఈ పదం (హీబ్రూలో) బైబిల్‌లో మరొక చోట మాత్రమే ఉపయోగించబడింది - కీర్తన 66:12లో, ఇక్కడ "సమృద్ధిగల చోటు" అని అనువదించబడింది.
కాబట్టి జీవజలాలతో మన "పాత్రలు పొంగిపొరలుచున్న" ఈ ప్రదేశానికి రావాలంటే, కీర్తన 66:12కి ముందున్న 10 నుండి 12 వచనాలలో పేర్కొన్న అనుభవాలగుండా మనం వెళ్ళాలి. ఆ వచనాలలో మనం ఇలా చదువుతాము:
దేవుడు మనలను వెండిలా శుద్ధి చేస్తాడు;
దేవుడు మనలను ఒక వలలోకి తీసుకువస్తాడు (కఠినమైన పరిస్థితులు);
దేవుడు మనపై అణచివేయగల భారాలను మోపడానికి ఇతరులు అనుమతిస్తాడు;
దేవుడు మన తలల మీద స్వారీ చేయడానికి ప్రజలను అనుమతిస్తాడు;
దేవుడు మనలను జ్వలించే "అగ్ని" (శ్రమల కొలిమి)లో ఉంచుతాడు;
అప్పుడు దేవుడు మనలను "చల్లని నీటిలో" ఉంచుతాడు (ఆయన సన్నిధిని అనుభవించకపోవటం).
తమ జీవితాలలో దేవుని ఈ క్రమశిక్షణలను అంగీకరించేవారు చివరకు ఇతరులను ఆశీర్వదించుటకు తమ పాత్రలు పొంగిపొరలుట కనుగొంటారు. ప్రభువును స్తుతించుడి!!.