WFTW Body: 

నీవు దైవభక్తి గలవాడవుగా ఉండుటకు నిర్ణయించుకొన్న యెడల, భవిష్యత్తులో ప్రతి విషయములో దేవుడు నిన్ను నడిపించును. దేవుని ఘనపరచువారే జీవితములో శ్రేష్టమైన వాటిని పొందుకుంటారు - కాని తెలివిగలవారుగాని లేక ధనవంతులుగాని లేక ప్రత్యేకమైన వారుగాని కారు. మన జీవితములో దైవభక్తి కలిగియుండాలని నిర్ణయించుకొనకపోవుట వలన భవిష్యత్తు గురించి ఎంతో అభధ్రత ఉన్నది. కాబట్టి అన్ని సమయములలో దేవుని ఘనపరచాలని నిర్ణయించుకొనుము. అప్పుడు దేవుడు నీకు ఆత్మీయముగా శ్రేష్ఠమైన వాటిని ఇచ్చును. మరియు అదే సమయములో ఈ లోకములోని శారీరక మరియు ఆర్థిక సంబంధమైన ప్రతి అవసరమును తీర్చును. నాయొక్క గత 50 సంవత్సరములలో ఇది సత్యమని కనుగొన్నాను. ఎల్లప్పుడు దేవునిని ఘనపరచవలెననియు మరియు ఒక దైవభక్తి గలవానిగా జీవించవలెననియు ఇప్పుడు నీవు నిర్ణయించుకొని దానిలో కొనసాగినట్లయితే - కాలేజీలో నీవు చదువవలసిన కోర్సుల గురిచి, నీవు చేయబోయే ఉద్యోగము గురించియు, వివాహ విషయములోను మరియు ప్రతి విషయములోను దేవుడు నిన్ను నడిపించును.

అనగా ప్రతి చిన్న విషయములో నమ్మకముగా ఉండుట. ఇతరులకు చెందినదేదియు అనగా ఒక ఇంటిలోనుండిగాని, ఒక వ్యక్తి యొద్దనుండిగాని లేక ఆఫీసునుండిగాని లేక మరెక్కడనుండియైనగాని కనీసం పెన్నుగాని, పెన్సిలుగాని తీసుకొనకూడదు. చిన్న విషయాలలో కూడా ఎవరిని మోసగించకూడదు. అలాగే మేము చెప్పిన రీతిగా పరీక్షలలో కూడా ఏవిధమైన మోసం చేయకూడదు. మోసగించి పాసయ్యేకంటే బీదలుగా ఉండుట మంచిది. నీ మనస్సుని కలుషితం చేసే పుస్తకములను చదువవద్దు మరియు టీ.వీ కార్యక్రమములను చూడవద్దు. అన్ని విషయములలో ఎల్లప్పుడు నీ మనసాక్షిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆవిధముగా జీవించేవారు కరువు ఉన్నప్పటికిని, ప్రతి తరములో దేవునియొక్క శ్రేష్ఠమైన వాటిని పొందెదరు.

అనగా నీవు ఎన్నటికి పడిపోవనికాదు, ఓడిపోవనికాదు. కాని నీవు ఓడిపోయినప్పుడు పశ్చాత్తాపపడుము. నీవు ఏ విషయములోనైనను (ఆత్మీయ విషయములోగాని లేక చదువు విషయములోగాని) 1000సార్లు పడిపోయినను లేచి పరుగెత్తుము. నీయొక్క గత ఓటములను బట్టి చింతించవద్దు. గత ఓటములు ఎప్పుడు గుర్తువచ్చినప్పటికిని, నీ చిత్తమును ఉపేక్షించి మరియు వాటిని విసర్జించుము. నీవు ఈ విధముగా నమ్మకముగా చేయుచున్నట్లయితే కాలము గడిచేకొద్ది అవి తగ్గిపోవుచూ మరియు ఆగిపోవును. అనగా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లుగా చెరపట్టెదము (2కొరింథీ 10:5).

నీతిమంతులు ఆకలిగొనరనియు మరియు దేవునిని ఘనపరచువారిని ఆయన ఘనపరచుననుదానికి అవిశ్వాసులయెదుట మీరు సాక్షులుగా ఉండెదరు. మీ తెలివితేటలను బట్టిగాని లేక మీరు సాధించిన దానినిబట్టిగాని లోకము యొక్క ఘనతను పొందుటకంటే ఈ లోకములో దేవునియొక్క సజీవసాక్షులుగా ఉండుటకు మీ హృదయమంతటితో కోరుకొనుము. ఇతర విషయములు ఏవియు మీకు దేవుడిగా ఉండకుండునట్లు జాగ్రత్తపడుము.

మీ జీవితములు, పాపము మీద జయమును మరియు స్వజీవమునకు చనిపోవుట గురించి ప్రకటింపవలెననియు(దీనిని మీ జీవితములలో అనుభవించుచు) మరియు క్రీస్తు శరీరములో దేవుడు మీకు నిర్ణయించిన పరిచర్యను మీయొక్క ఉద్యోగములు చేసుకొనుచు, ఎవరిమీద ఆధారపడక పౌలువలె మిమ్ములను మీరు పోషించుకొనుచు పరిచర్యను చేయవలెననునదియే దేవుని కోరిక. దీనిని లోకము చూడవలసిన అవసరము ఉన్నది. మరియు మీ విషయములలో ఇదే నా యొక్క గొప్ప కోరిక. ఎల్లప్పుడు దేవుని రాజ్యమును మరియు నీతిని మొదట వెదకువారు, ప్రభువైనయేసు మరలా వచ్చినప్పుడు చింతించరు.