మన సంఘములలోని వారు ఆతిధ్యమిచ్చువారు మరియు కనికరము గలవారై ఉన్నారు గనుక అనేకులు మన సంఘములలో చేరాలని కోరుతారు. కానీ మనము జాగ్రత్తగా ఉండి అటువంటి వారిని వెంటనే బయటికి పంపని యెడల త్వరలోనే భారతదేశములోని ప్రతి బీదవాడు మన సంఘాలలో చేరతారు. మన సంఘంలోని సభ్యుల సంఖ్య విపరీతముగా పెరుగుతుంది. ధనాపేక్ష గల వారే వస్తారు కానీ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కాదు.
భారతదేశంలోని అనేక క్రైస్తవ పరిచారకులకు ‘ప్రభువును సేవించుట’ అనునది ఒక ఉద్యోగంగా ఉన్నది కానీ అది పిలుపు కాదు. సంఘంలో చేరుట ద్వారా అనేకులు ఆర్థికంగా ధనవంతులు అయ్యారు. వారి జీవితంలో నీతిమంతులై ఉండుటను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్లయితే మంచిది. కానీ సంఘంలో చేరిన తర్వాత ధనవంతులతో సంబంధాలు పెట్టుకుని వారు ధనవంతులైన యెడల వారు దేవుని చిత్తాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ఎందుకనగా క్రైస్తవ్యము డబ్బు సంపాదించుటకు ఒక మార్గము కాదు.
సంఘం, త్యాగం చేసే మరియు ఇచ్చే స్థలమై ఉంది కానీ లాభం సంపాదించే స్థలం కాదు. నిజానికి భారతదేశంలో అనేకమంది క్రైస్తవ పరిచారకులు ఉద్యోగం చేసి సంపాదించే దానికంటే ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. అనేక మంది క్రైస్తవ పరిచారకులు ఒక్క రోజు కూడా ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం చేయని వారిని యేసు తన అపోస్తలులుగా పిలవలేదు. ఈనాడు భారతదేశంలో, క్రైస్తవ పరిచర్య అత్యధిక లాభము సంపాదించుకొనుటకు ఒక సాధనమై ఉన్నది. క్రైస్తవేతరులు వారిని చూచి, ‘ఈ వ్యక్తి డబ్బు సంపాదించుటకే క్రైస్తవ పరిచారకుడు అయ్యాడు’ అని అంటున్నారు. వారు చెబుతున్నది నిజమే! వారి నోళ్లను ఏ విధముగా మూయించగలము? క్రైస్తవ పనిలో కంటే వారు ఉద్యోగం చేసి ఎక్కువ సంపాదించగలమని చూపించుట ద్వారా మాత్రమే.
అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయములో పేదలకు పంచిపెట్టుటకు ప్రతి ఒక్కరూ వారి ఆస్తులను అమ్మి అపోస్తలులకు ఇస్తున్నప్పుడు, ‘మన డబ్బు మనదగ్గర ఉంచుకుంటూనే ఇతరులకు ఏ విధముగా ఆత్మీయులుగా కనబడగలము’ అని అననీయ సప్పీరాలు ఆలోచన చేశారు. కాబట్టి వారి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బు అంతటినీ ఇవ్వలేదు. వారి యొక్క డబ్బు అంతటినీ వారు ఇవ్వకపోవుట పాపము కాదు. సంతోషంగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడు మరియు ఆయన ఎవరి డబ్బును ఆశించడు. పేతురు అననీయతో, ‘అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను’ (అపొ.కా. 5:4). అననీయయొక్క పాపం వేషధారణ - హృదయపూర్వకంగా ఉన్నట్లు నటించుట. అతడు ఒకవేళ ఈ విధముగా చెప్పినట్లయితే ‘మేము 50 వేల రూపాయలకు ఆస్తిని అమ్మాము. కానీ అందులో 20% మాత్రమే ఇవ్వాలని అనుకొనుచున్నాము, మిగిలినది మా అవసరాలకు ఉంచుకోవాలని కోరుచున్నాము. కాబట్టి ఇదిగో పదివేల రూపాయలు’, అప్పుడు పేతురు అననీయను ఆశీర్వదించేవాడు. అతడు మరియు అతని భార్య జీవించి ఉండేవారు. అననీయ ఏమి మాట్లాడలేదు. హృదయపూర్వకముగా ఉన్న ఇతరులతో అతడు వరుసలో నిలబడి నోరు తెరవకుండానే అతను అబద్ధం చెప్పాడు. కానీ పేతురు వివేచన గలవాడు. అతని ద్వారా అననీయ సప్పీరాల యొక్క వేషధారణ బహిర్గతం చేయబడింది మరియు వారి వేషధారణను బట్టి వారు మరణించారు.
ఈనాడు దేవుడు ఎందుకు ఆ విధంగా చేయుటలేదు? ఆ విధంగా చేసిన యెడల సంఘంలో కొద్ది మందే ఉంటారు. అననీయ సప్పీరాలు, పవిత్రమైన మరియు శక్తివంతమైన సంఘంలో ఉండుటవలన మరణించారు. కానీ వారు శరీరానుసారమైన, మృతమైన సంఘంలో (కోరంథీ సంఘము వలె) ఉన్నట్లయితే బహుశా వారు సంఘపెద్దలై ఉండేవారేమో. నీవు గర్విష్టుడవై వేషధారణ గలవాడవై ఉన్నట్లయితే సంపూర్ణులు అగుటకు సాగిపోయే సంఘంలో నీవు చేరుట అపాయకరము. ఏదో ఒక విధముగా దేవుడు ఆ సంఘంలో నుండి నిన్ను తీసివేస్తాడు. కానీ ఈ దినములలో అటువంటి సంఘములు ఎక్కువగా లేవు. కాబట్టి ఈరోజు అనేక సంఘములో నీవు జీవించవచ్చు. నీవు గర్విష్టిగా మరియు వేషధారిగా ఉండి జీవించాలని కోరినట్లయితే, ఒక మృత సంఘంలో చేరుట మంచిది.