WFTW Body: 

ఆగస్టు 1993న నేను మోటారు సైకిలు మీదనుండి రైలు పట్టాల మీద పడినప్పుడు దేవుడు నన్ను కాపాడియున్నాడు. రైలు గేటు దగ్గర పనిచేసే వ్యక్తి, నేను గేటు దాటకముందే దానిని క్రిందకు దించుటవలన, అది నాకు తగులుటవలన నేను క్రిందపడ్డాను. రైలు పట్టాల మీద కొంతసేపు నేను స్పృహలేకుండా పడియున్నాను. ఏదైనా రైలు రాకముందే ఒక వ్యక్తి నన్ను లేపియున్నాడు. మృతులలో నుండి లేచినవాడుగా నన్ను నేను భావించుచున్నాను. నా శేష జీవితకాలమంతయు దేవునికి ఋణపడియున్నానని తాజాగా గుర్తుతెచ్చుకొనియున్నాను. నాయొక్క సమయమునుగాని లేక శక్తినిగాని లేక డబ్బునిగాని నా యిష్టప్రకారము ఖర్చుపెట్టను. నాకిష్టమైన దానిని నేను చదువలేను. నాకిష్టమొచ్చినట్లు మాట్లాడలేను. సమస్తము దేవుని మహిమార్థము జరగాలి. ప్రభువైనయేసు ఆ విధముగా జీవించియున్నాడు. గనుక ఇటువంటి జీవితము ద్వారా నష్టపోముగాని మహిమకరమైన జీవితమును కలిగియుండెదము. మీరు రోడ్డుమీద వెళ్ళుచున్నప్పుడు ఇటువంటి ప్రమాదముల గురించి అనుభవములు మీకు ఉండవచ్చును. కాని దేవునియొక్క దూతలు మిమ్ములను కాపాడియున్నారు. కాబట్టి మీరు కూడా దేవునికి ఋణపడియున్నారు. మనలను కాపాడుచున్నందుకు దేవునికి స్తోత్రములు. మృతులలో నుండి సజీవులమనుకొని మనము జీవించెదముగాక.

ప్రమాదము జరిగిన మూడు వారముల తరువాత, నా చేయి మరియు భుజము 95 శాతం మామూలు స్థితికి వచ్చినది. ఈ అద్భుతమును బట్టి దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఆ మూడు వారములలో దేవునిని స్తుతించేటప్పుడు నా చేతులు ఎత్తలేకపోతిని. కాబట్టి నా జీవితములోని చిన్న విషయములను బట్టి కూడా కృతజ్ఞత కలిగియుండుట నేర్చుకొనియున్నాను. దేవుని స్తుతించేటప్పుడు నా చేతులెత్తుటకు కావలసిన శక్తిని ఇచ్చినందుకు, 54 సంవత్సరములలో మొదటిగా దేవునిని స్తుతించాను. అప్పటివరకు దానిని మామూలుగా తీసుకొనియున్నాను. ఆ విధముగానే నాశరీరములోని ఇతర అవయవములైన - నా కళ్ళను బట్టియు, నా చెవులను బట్టియు మరియు నాలుకను బట్టియు, అన్నింటిని బట్టియు కృతజ్ఞత కలిగియున్నాను.

సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగియుండాలి. చేప కడుపులో నుండి యోనా చేసిన ప్రార్థన చాలా మంచిది (యోనా 2వ అధ్యాయము). చేప కడుపులో అతడు మొత్తబడుచున్నప్పటికిని, రసాయనము అతని మీద పడుచున్నప్పటికి, అక్కడ ఉండుటకు దేవుడు అతనికి అనుమతించినందుకు యోనా కృతజ్ఞతలు చెల్లించాడు. అతడు కృతజ్ఞతలు చెల్లించుటకు ఆరంభించినప్పుడు మాత్రమే, ఆరిననేల మీద అతనిని కక్కునట్లు దేవుడు చేపకు ఆజ్ఞాపించెను (యోనా 2:9,10). కాబట్టి నీ పరిస్థితులనుబట్టిగాని లేక ఆహారమునుబట్టిగాని లేక ఇంటినిబట్టిగాని ఫిర్యాదు చేయవద్దు. కృతజ్ఞత కలిగియుండుము. చాలామంది పిల్లలు వారి ఇంటినుండి బయట ప్రపంచములోనికి వెళ్ళి, జీవితమెంత కష్టమో చూచేటంతవరకు వారి తల్లిదండ్రులనుబట్టిగాని మరియు వారి గృహమునుబట్టిగాని కృతజ్ఞత కలిగియుండరు. కృతజ్ఞతలు చెల్లించే ఆత్మ కలిగియుండుట ద్వారా యోనా వలె అనేక బంధకముల నుండి విడుదల పొందెదరు.