WFTW Body: 

రోమా 7:14-25 సంపూర్ణులగుటకు సాగిపోవువారికి మంచి వాక్యభాగమైయున్నది. క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడుగా పౌలు తన అనుభవమును చెప్పుచున్నాడు. ఎందుకనగా రక్షణ పొందని వ్యక్తి "అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను" అని చెప్పలేడు (రోమా 7:22).

రోమా పత్రికలో మొదటి అధ్యాయమునుండి "మనలను రక్షించుటకు, సువార్త దేవుని యొక్క శక్తి" అయి ఉన్నదని పౌలు వ్రాసియున్నాడు (రోమా 1:16). 3,4,5 అధ్యాయములలో విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట గురించి మాట్లాడి మరియు రోమా 6వ అధ్యాయములో పాపము మీద జయము గురించి పౌలు మాట్లాడుచున్నాడు. 7వ అధ్యాయములో తరువాత జరిగే దానిగురించి పౌలు చెప్పుచున్నాడు. తన జీవితములో మారుమనస్సు పొందని కాలములో జరిగిన విషయము గురించి చెప్పుటలేదు. ఆయన సువార్తను వివరించుచున్నాడు. సంపూర్ణులగుటకు సాగిపోవాలని కోరేవ్యక్తి యొక్క అంతరంగ జీవితములో జరిగే పోరాటమును గురించి ఇక్కడ చెప్పుచున్నాడు. దేవునిచిత్తము మాత్రమే చేయవలెనని అతడు కోరుచున్నాడు. అతడు జయమును కోరియున్నాడు మరియు తనకు అవసరమైనప్పుడు కృపను పొందియున్నాడు. అయినను రెండు విషయములను అతడు కనుగొనుచున్నాడు: 1. అజాగ్రత్తగా ఉన్న సమయములో వెలుగుపొందిన తెలిసిన పాపములో ఓడిపోవుటను గమనించాడు; 2. కొన్ని పాపముల విషయములలో వెలుగు లేనందువలన తనకు తెలియని రీతిగా పడిపోయిన తరువాత కొంతకాలానికి పడిపోయినట్లుగా తెలుసుకొనియున్నాడు.

పూర్తిగా సంపూర్ణులు అవ్వాలని కోరనివారు రోమా 5వ అధ్యాయములో ఆగిపోయెదరు. గనుక వారికి పోరాటముండదు. పాపమంతటి మీద జయము పొందాలని కోరేవారు (రోమా 6:14) ఈ పోరాటములు కలిగియుండి మరియు తనతోతాను ఇట్లు చెప్పుకొనెను, "అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?" (రోమా 7:24).

ఇటువంటి పోరాటము తమ జీవితములో లేదని చెప్పువారు యథార్థవంతులుకాదని ఒప్పుకొనుచున్నారు. మన బలహీన సమయములో పడిపోయినప్పటికిని మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది కాబట్టి మనము ఆ పాపమును ఒప్పుకొని మరియు విడిచిపెట్టి మరియు క్రీస్తుయొక్క రక్తములో కడగమని అడుగవలెను. ఇటువంటి పాపమును చేయవలెనని నిర్ణయించుకొని చేయలేదు. మనము పొందిన పశ్చాత్తాపమే దానిని స్పష్టము చేయుచున్నది. మనము చేసిన పాపములను ద్వేషించి మరియు దుఃఖపడినయెడల, ఒక రోజు వాటిమీద జయము పొందెదము.

రోమా 7వ అధ్యాయము జాగ్రత్తగా చదివి మరియు దానిమీద వెలుగునిమ్మని దేవునికి ప్రార్థించుము. రోమా 7:1-13లో ధర్మశాస్త్రము నుండి మనము విడుదల పొందుటను గురించి మాట్లాడుచున్నది. ఇప్పుడు మనకు క్రీస్తుతో వివాహము జరిగియున్నది. కాబట్టి ధర్మశాస్త్రము కంటే ఎక్కువ స్థాయిలో మనము జీవించెదము. మనము అక్షరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా నవీన స్థితికలిగి సేవ చేయుదుము (రోమా 7:6).

వారి పోరాటము విషయములో యథార్థముగా లేనివారు జయమును పొందలేరు. 7వ అధ్యాయము పూర్తిగా అర్థంచేసుకొనుట కంటే మన పోరాటవిషయములో సంపూర్ణముగా యథార్థముగా ఉండుట ముఖ్యము. వారి అంతరంగ జీవితములో పోరాటముల గురించి యథార్థముగా లేనివారు వేషధారులు గనుక వారితో సహవాసము చేయకుము. నీకు వివేచన ఉండాలి.

సర్పమువలె జ్ఞానము కలిగి మరియు పావురమువలె నిష్కపటముగా ఉండాలి.

నీ యొద్దనుండి యథార్థతను అన్నిటికంటే ఎక్కువగా దేవుడు కోరుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. పవిత్రతకు ఇది మొదటి మెట్టు.