మనము బైబిలులోని ప్రారంభ పేజీలను, చివరి పేజీలతో పోల్చినప్పుడు, రెండు చెట్లు (జీవ వృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము) యుగాంతం వచ్చునప్పటికి రెండు వ్యవస్థలైన యెరూషలేము మరియు బబులోనులను ఉత్పత్తిచేసేను.
నిజముగా ఆత్మచేత జన్మించినది, దేవునినుండి, దేవునిద్వారా మరియు దేవుని కొరకైనది ఎప్పటికీ నిలుచును. అయితే శరీరము ద్వారా జన్మించినది మానవునినుండి, మానవునిద్వారా, మానవుని కొరకైనది నాశనమగును.
మనం ఈనాడు ఆదికాండము మరియు ప్రకటన మధ్యనుండిన పేజీలలో జీవించుచున్నాము. మరియు మనము గ్రహించినా గ్రహించకపోయినా మనము ఈ రెండు వ్యవస్థలలో ఒక దానిలో చిక్కుకొని ఉన్నాము. ఒకటి దేవుని మహిమ పరచి హెచ్చించుటకును మరియు వేరొకటి మానవుని మహిమ పరచి హెచ్చించుటకును నిర్ణయించును; ఒకటి క్రీస్తును వేరొకటి ఆదామును అనుసరించును; ఒకటి ఆత్మలోను మరియొకటి శరీరము మరియు మానసిక సంబంధమైన దానిలో జీవించును.
యేసు మరియు ఆదాము కూడా దేవుని స్వరమును విన్నారు, అయితే వ్యత్యాసమేమంటే ఒకరు విధేయత చూపారు మరియొకరు అవిధేయత చూపారు. అదే విధముగా యేసు కూడా తన స్వరము విని విధేయత చూపినవారు రాయి మీద తన ఇళ్ళు కట్టుకొనిన వానిని పోలియుండి, శాశ్వత కాలము కదలక ఉండునని, వేరొకరు విని విధేయత చూపనట్లయితే ఇసుకలో కట్టిన వానిని పోలియుండి చివరకు నాశనమగును అని చెప్పెను (మత్తయి 7:24-27).
యేసు చెప్పిన ఈ రెండు ఇళ్లు యెరూషలేము మరియు బబులోనుగా ఉన్నవి
ఈనాడు ఎవరైతే నిజముగా విశ్వాసముద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడి నూతన నిబంధనలోనికి ప్రవేశించి, యేసు రక్తము చేత ముద్రింపబడి యేసును దేవుని యొక్క చిత్తములో విధేయత గల జీవితముతో వెంబడింతురో (ముఖ్యముగా మత్తయి 5 నుండి 7 అధ్యాయములు) ఎవరైతే అట్లు రాతి మీద ఇల్లు కట్టుదురో వారు యెరూషలేములో భాగముగా ఉందురు. ఒకడు ఈ గుంపులో ఉండెనో లేదో తెలుసుకొనుటకు మత్తయి 5 నుండి 7 అధ్యాయములు చదివినట్లయితే సరిపోవును.
అదే విధముగా ఇతరులు (వీరు అనేకులు) మత్తయి 5-7 అధ్యాయములోని యేసు మాటలు విని, నీతిమంతులుగా తీర్పు తీర్చుబడుట గూర్చి, విశ్వాసము మరియు కృప గూర్చి తప్పుడు గ్రహింపు కలిగి తప్పుడు భద్రత కలిగి యేసు చెప్పిన మాటలకు విధేయత చూపుటను పట్టించుకొనకపోవుట వలన ఆ విధముగా ఇసుకపై కట్టబడుదురు - బబులోను వలె చివరకు శాశ్వతముగా నాశనమగుదురు.
వీరు తమ దృష్టిలో క్రైస్తవులుగా నుండిన వారు, ఎందుకంటే ఇసుకపై ఇంటిని కట్టినవాడు ఆయన మాట వినినవాడని యేసు చెప్పెను. దానిని బట్టి అతడు తప్పనిసరిగా అన్యుడు కాడు, బైబిలు చదువుతూ సంఘమునకు వెళ్లు వాడే. అతడి కుండిన ఒకే ఒక సమస్య విధేయత చూపకపోవుట మరియు దాని వలన యేసుకు విధేయత చూపిన వారికందరికి వాగ్ధానము చేయబడిన నిత్యమైన రక్షణ (హెబ్రీ 5:9)లో పాలుపొందడు. అతడి యొక్క విశ్వాసము యదార్ధమైనది కాదు. ఎందుకంటే విశ్వాసమును పరిపూర్ణము చేయు విధేయతతోకూడిన క్రియలు అతడికి లేవు (యాకోబు 2:22,26).
ఆదామును శిరస్సుగా కలిగి ఉండి బయల్పర్చబడిన దేవుని చిత్తమునకు అవిధేయత చూపుటలో వారి శిరస్సయిన ఆదామును అనుసరించువారు, వారు ’క్రీస్తుని అంగీకరించామని’ చెప్పుటచేత వారు ’చావనే చావరు’ అని సాతాను చేత ఒప్పింపబడుదురు (ఆది 3:4). ఆ విధముగా వారు బబులోను యొక్క తప్పుడు భద్రతలో జీవించుదురు.
అదే విధముగా క్రీస్తును శిరస్సుగా కలిగిన వారు దేవుని చిత్తమునకు లోబడుటలో "యేసు నడిచినట్లు నడుచుట" (1యోహాను 2:6) ద్వారా గుర్తింపబడుదురు. వీరు క్రీస్తుకు సహోదరులు, సహోదరీలుగా ఉన్నారు (మత్తయి12:50) మరియు యెరూషలేములో భాగంగా ఉన్నారు
యేసుప్రభువు మత్తయి 5-7 అధ్యాయముల చివర చెప్పిన ఉపమానములో జ్ఞానము గలవాని ఇల్లు మరియు బుద్ధిహీనుని ఇల్లు ఈనాటి యెరూషలేము మరియు బబులోను వలె గాలివాన మరియు వరదలు వచ్చువరకు కొంతకాలము నిలిచియున్నవి. బుద్ధిహీనుడు తన ఇంటి యొక్క బాహ్యమైన రూపు కొరకు (మనుష్యుల యెదుట సాక్ష్యము) ఆలోచన కలిగియున్నట్లే, జ్ఞానవంతుడు ముఖ్యముగా పునాది కొరకు ఎక్కువ ఆలోచన కలిగి యుండెను (దేవుని ఎదుట హృదయములో రహస్య జీవితము).
యెరూషలేము యొక్క విలక్షణమైన ఒక గుర్తు పరిశుద్ధత. అది ’పరిశుద్ధ పట్టణమ’ని పిలువబడెను (ప్రకటన 21:2). అయితే బబులోను తన యొక్క గొప్పతనముతో ప్రత్యేకముగా ఉండెను. అది ’గొప్ప పట్టణమని’ పిలువబడెను (ప్రకటన 18:10). అది ’గొప్పది’ అని ప్రకటనలో పదకొండుసార్లు పిలువబడెను.
ఎవరైతే నిజమైన పరిశుద్ధతలో, దేవునికి విధేయత చూపుతూ జీవించుదురో మరియు విశ్వాసము ద్వారా కృపచే క్రీస్తు స్వభావములో పాలివారగుదురో వారు యెరూషలేముగా కట్టబడుదురు; అలా కాకుండా ఈ భూమిపై గొప్పదనం గూర్చి (మనుష్యుల యెడల సాక్ష్యము మరియు ఘనత చూచువారు బబులోనుగా కట్టబడుదురు).
గత పందోమ్మిది వందల సంవత్సరాల నుండి దేవుని ప్రజలకు "నా ప్రజలారా, దాన్ని(బబులోను) విడిచి రండి, దాని పాపములలో పాలివారు కావొద్దు, లేనియెడల దానితో పాటు మీరు శిక్షించబడతారు" (ప్రకటన 18:4 TLB) అను పిలుపు వచ్చుచున్నది.
మనము ఈ కాలము చివరకు వచ్చుచుండగా, ఈనాడు ఆ పిలుపు మరి యెక్కువ అవసరమై ఉన్నది. వినుటకు చెవులు గలవాడు వినును గాక.