వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట Religious or Spiritual
WFTW Body: 

మతానుసారతను మరియు ఆత్మీయతను విభజించుట నేర్చుకొనవలెను. అనేక క్రైస్తవపరిచర్యలు చేయుట మతానుసారతైయున్నది. కాని ప్రభువైనయేసు వలే మన వైఖరిని అంతకంతకు నూతనపరిచే పరిశుద్ధాత్మను మనలో పని చేయుటకు అనుమతించినయెడల ఆత్మీయులమగుదము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి (ఫిలిప్పీ 2:5). స్త్రీల విషయములోను, డబ్బు విషయములోను, ప్రజల విషయములోను మొదలగు వాటి విషయములలో మన వైఖరి మార్పుచెందక పోయిననూ, ఆత్మీయముగా ఎదుగుతున్నామని అనుకొనిన యెడల మనలను మనము మోసపరచుకొనెదము. కేవలము మత సంబంధమైన క్రియలు చేయుట పరిసయ్యులవలె సున్నము కొట్టిన సమాధులువలె ఉండును. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తప్పుడు వైఖరుల నుండి సంపూర్ణ రక్షణ పొందుటకు ప్రయాసపడవలెను.

మతానుసారిగా ఉండుటకును మరియు ఆత్మీయుడుగా ఉండుటకు ఎంతో తేడా ఉంది. పాత నిబంధనలో అనేకులు నీతిని వెదకి పరిసయ్యులుగా మారిరి. వారు ప్రభువైన యేసుకు గొప్ప శత్రువులు అయియున్నారు. ఈనాడు కూడా మనము నియమ నిబంధనలతో (ధర్మశాస్త్రముతో) క్రొత్త నిబంధన సత్యములు పొందుకొని మరియు మతానుసారులము కావచ్చును. అప్పుడు మనము కూడా ఈనాడు గొప్ప శత్రువులు కాగలము.

పరిశుద్ధాత్మతో నింపబడుటకంటే ఒక వ్యక్తి దేవుని వాక్యమును చదువుటలో ఆసక్తి కలిగియున్నయెడల, అతడు ఆత్మీయ క్రైస్తవుడుగా కాక మతానుసారమైన పరిసయ్యుడుగా మారును. ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించమని పాత నిబంధనలో ఆజ్ఞాపించబడిరి (కీర్తన 1:2). కాని క్రొత్త నిబంధనలో సువార్తలలో ఉన్న ప్రభువైనయేసు మహిమను గూర్చి మనము ధ్యానించవలెను (2 కొరింథీ 3:18). అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును.

దేవుని రాజ్యము అనగా నీతితో కూడిన సమాధానము మరియు పరిశుద్ధాత్మయందలి ఆనందము (రోమా 14:17). మతస్థులలో మానవనీతి ఉండవచ్చును గాని సమాధానము ఆనందము ఉండదు. వారిలో సణుగుట మరియు గొణుగుట, భయములు మరియు చింతలు ఉండును. కాని నిజమైన క్రైస్తవ విశ్వాసము సంపూర్ణ సమాధానములోనికి నడిపించును అనగా దేవునితో సమాధానము (అన్ని విషయములలో నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుట) మనుష్యులతో సమాధానము (సాధ్యమైనంతవరకు) మరియు అంతరంగములో సమాధానము (చింతనుండి విడుదల పొందుట) అది సంపూర్ణ సంతోషమును తెచ్చును అనగా అన్ని పరిస్థితులలో కృతజ్ఞతలు మరియు స్తుతులు జీవితములో నుండి ప్రవహించును. మనము ఈ విధముగా ఉండెదము.

"ఆయన తన సొంత దుఃఖములు బట్టి కన్నీరు కార్చలేదు"

"కాని నా కొరకు ఆయన చెమటను రక్తమువలె కార్చెను"

ప్రభువైన యేసు ఆవిధముగా జీవించెను. తన కొరకు ఆయన ఎప్పుడైనను బాధపడలేదు. కాని రక్తము కారుచు మరియు ఆయన సిలువను మోయుచున్నప్పుడు, నా నిమిత్తము మీరు ఏడ్వకుడి అని చెప్పెను (లూకా 23:28). ఆయన తనమీద తాను ఎప్పుడైనను జాలిపడలేదు. ఆయన తండ్రిముఖము ఎదుట జీవించియున్నాడు గనుక ఇతరులు బాధించినను ఎల్లప్పుడు సంతోషించెను. మనము కూడా ఆవిధముగా మన కొరకు కన్నీరు కార్చకుండా జీవించాలి.

మతంలో చాలా కార్యక్రమములు ఉన్నవి. కాని ఇతరులను తృణీకరించుచూ మరియు గర్వము కలిగియుండెదరు. మనము ఇతరులను చిన్నచూపు చూసినయెడల లేక మన స్వనీతిని బట్టి గర్వించినయెడల అప్పుడు మనము ఆత్మానుసారులముగా కాక మాతానుసారులముగా నుండెదము (దీనత్వము క్రొత్త నిబంధన యొక్క సుగుణము కనుక పాత నిబంధనలో లేదు). కాబట్టి మన బైబిలు జ్ఞానము అధికమయ్యే కొలది, మనము మతానుసారులము కాక ఆత్మానుసారులమైయున్నట్లు చూచుకొనవలెను.

నీకు కీడు చేసిన వారిని క్షమించుము. దేవునితోను మరియు మనుష్యులతోను సమాధానము కలిగియుండి పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థించుము. మరియు దేవుని యొక్క కృపద్వారా యేసు యొక్క మరణానుభవములో జీవించుటకు నిర్ణయించుకొనుము. అప్పుడు నీవు ఆత్మీయుడవగుదువు.