WFTW Body: 

మత్తయి 14:19లో ఇతరులకు ఆశీర్వాదముగా మారుటకు గల మూడు మెట్లను చూచెదము.

1. రొట్టెలను మరియు చేపలను ప్రభువైన యేసు తీసుకొనును;

2. ఆయన వాటిని ఆశీర్వదించెను; మరియు

3. ఆయన వాటిని విరిచెను.

అప్పుడు జన సముహములు పోషింపబడిరి. ఈ విధముగా నిన్ను కూడా ఇతరులకు ఆశీర్వాదముగా చేయాలని ప్రభువు కోరుచున్నాడు. ఆ చిన్నవాడు చేసినట్లుగా మొదటిగా నీకున్నదంతయు ప్రభువుకి ఇవ్వవలెను. అప్పుడాయన నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో ఆశీర్వదించును. అప్పుడు అనేక పరీక్షలు, ఓటములు, రోగములు, మోసగించబడుట ద్వారా, అనుకున్నవి జరగకుండుట ద్వారా మరియు అనేక రీతులుగా ఆయన నిన్ను విరుగగొట్టి, నిన్ను దీనుడిగా చేసి మరియు మనుష్యుల దృష్టిలో నిన్ను ఏమి కానివాడుగా చేయును. అప్పుడు నీ ద్వారా ఆయన అనేకులకు ఆశీర్వదించును. కాబట్టి ఆయన చేత విరుగగొట్టబడుటను అంగీకరించుము. ప్రభువైన యేసు మొదటిగా నలుగగొట్టబడి మరియు తండ్రి ఉద్దేశ్యము ఆయన ద్వారా సఫలపరిచెను (యెషయా 53:10-12).

ఆయన జీవితములోని అనేక పరిస్థితులలో తన స్వచిత్తము నలుగగొట్టబడుటకు ప్రభువైన యేసు అనుమతించారు. ఆవిధముగా ఆయన ఎటువంటి మచ్చ లేకుండా తండ్రికి అప్పగించగలిగెను. దీనికొరకే పరిశుద్ధాత్మ ఆయనను బలపరిచెను (హెబ్రీ 9:14). నీ సొంత శక్తిని విరుగగొట్టుటకు పరిశుద్ధాత్మ శక్తిని నీవు అనుమతించినప్పుడే నీవు ఆత్మీయుడవగుదువు. దేవుని చిత్తముకాక నీ స్వచిత్తము నెరవేర్చవలెనని బలమైన కోరిక నీకున్నప్పుడు అది విరుగగొట్టబడాలి.

నీ స్వచిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడైతే దేవుని చిత్తము ఉంటుందో అక్కడ నీవు సిలువను కనుగొందువు. అక్కడ నీ స్వచిత్తము సిలువ వేయబడాలి. నీ చిత్తమునకు చనిపోవాలి. ఆత్మ నీకు చెప్పును, నీవు ఎల్లప్పుడూ ఆత్మ స్వరమునకు లోబడుచున్నయెడల, నీవు విరుగగొట్టబడిన వాడిగా జీవించెదవు. మరియు ఎల్లప్పుడు విరిగి నలిగిన హృదయము గలవారిని ఉజ్జీవింపచేసెదనని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. "మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను, అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను" (యెషయా 57:15).

నీవు ఆత్మ విషయములో దీనుడవై అన్ని సమయములలో నీ యొక్క అవసరము ఎరిగియుండుట మంచిది. ఆసక్తితో దేవునిని వెతికే వారికి ఆయన ఫలమిచ్చునని కూడా నమ్మవలెను. దేవుడు నిన్ను ఆశీర్వదించి మరియు ఆయన శక్తితో నిన్ను నింపును అని నీవు నమ్మనియెడల, నీవు దీనాత్మను కలిగియుండుట వ్యర్థము.

ప్రతి సంఘములోని బీదలతోను మరియు బలహీనులైన వారితో సహవాసము చేసి మరియు వారిని ప్రోత్సహించుము. చాలామంది పిల్లలను నిర్లక్ష్యము చేసెదరు గనుక వారిని చేరదీసి ప్రోత్సహించుము. మరియు సంఘములో ఎల్లప్పుడు కనబడకుండా చేసే సామాన్య పరిచర్య చేయుటకు ఇష్టపడాలి. ఏ సంఘములో అయినను పేరు ప్రతిష్ఠలను కోరక మరియు నీకున్న వరములను బట్టియు తలాంతులను బట్టియు ఎవరిమెప్పును కోరవద్దు. ముఖ్యముగా యౌవనస్త్రీలను ఆకట్టుకొనకుండా జాగ్రత్తపడాలి. ఒక మందిరములో ఊడ్చుటకు లేక సంగీతము వాయించుటకు కాని లేక నీకు చేతనైన ఏ పరిచర్యయయిననూ చేయుచు మరియు ప్రతి కూటములో సాక్ష్యము చెప్పుము. పరిచర్య విషయములో ఎవరితో అయినను పోటీపడవద్దు. నీవు నమ్మకముగా ఉండినట్లయితే తగిన సమయములో దేవుడు తన చిత్తప్రకారము నీకు ఒక పరిచర్య ఇచ్చును.