WFTW Body: 

సాతాను మరియు మనయొక్క యిచ్ఛలు ఎంతో బలమైనవిగా యుండునట్లు దేవుడు అనుమతించియున్నాడు గనుక వాటిని మనయొక్క సొంతశక్తితో జయించగలమని ఊహించుకొనకూడదు. దేవునియొక్క శక్తికొరకు ప్రార్థించుటకు బలవంతము చేయబడుచున్నాము. కానానులో ఉన్న ఆజానుబాహులను చూచినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క వేగులవారు వారియెదుట "మేము మిడుతల వలె ఉండినట్లుగా చూచాము" అని చెప్పారు. కాని యెహోషువా మరియు కాలేబులు దేవుని యొక్క శక్తిని విశ్వసించి, దేశములో ప్రవేశించి వారిని హతము చేసిరి. మన యిచ్ఛలన్నిటిని జయించుటకు మనకు కూడా అటువంటి ఆత్మ కావలెను. కాబట్టి ఎల్లప్పుడు విశ్వాసముతో, "దేవునియొక్క శక్తి ద్వారా సాతానును మరియు నా యిచ్ఛలన్నింటిని నేను జయించగలనని" చెప్పుచుండవలెను.

ప్రతియొక్క శోధనలో రెండు మార్గములు ఉన్నవి. 1. సుఖించుమార్గము 2. శ్రమించుమార్గము, అనగా నీ శరీరము కోరుచున్న సుఖమును ఉపేక్షించుటద్వారా "శరీరములో శ్రమపడుటయే" రెండవ మార్గము (1 పేతురు 4:1). నీవు పాపమును ఎదురించుచూ మరియు శ్రమపడుచున్న యెడల చివరకు పాపము చేయుటకంటే మరణించుటకు సిద్ధపడుదువు. అప్పుడు "రక్తము కారునంతగా పాపముతో పోరాడెదవు" (హెబ్రీ 12:4).

ఒక క్రీడాకారుడు అనేక సంవత్సరములు తననుతాను క్రమశిక్షణలో పెట్టుకొనును. నీవు సాతానును మరియు శరీరేచ్ఛలను జయించి మరియు నీవు పరలోకపు పరుగుతో జయము పొందవలెనని కోరినయెడల నీ శరీరేచ్ఛలను అదుపులో పెట్టుకొనవలెను. పౌలు ఇట్లునుచున్నాడు, "నా శరీరము ఏది చేయవలెనో దానినే చేయునట్లును మరియు అది కోరినది చేయకుండునట్లును నా శరీరమును నలుగగొట్టుచున్నాను లేనియెడల ఇతరులకు ప్రకటించినయెడల నేనే బహుమానమును పోగొట్టుకొనెదను" (1 కొరింథీ 9:27 లివింగు బైబిలు).

మనస్సులో ఒక తలంపుగా మనకు శోధన వచ్చును. వెంటనే దానిని మనము ఎదిరించాలి. కాని మనము జయము పొందవలెనని కోరుచున్నప్పుడు కనీసం కొన్ని సెకండ్ల వరకు మనము దానిని ఎదురించలేము ఎందుకనగా అనేక సంవత్సరములు ఈవిధంగా భావించుట అలవాటయినది. ఇది సున్నా అగువరకు మనము పోరాడి దానిని ఎదురించుచుండవలెను. మనము పాపము చేసినయెడల, దానిని వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపపడవలెను.

సముద్రములో పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురు సహాయముకొరకు కేకవేసి ప్రార్థించినట్లే మనకు ఎప్పుడైనా శోధన బలముగా వచ్చి మరియు ఓడిపోయెదమని భయపడినయెడల వెంటనే సహాయము కొరకు ప్రార్థించవలెను (మత్తయి 14:30). సమయోచితమైన సహాయము కొరకు ఈ విధముగా కృపాసింహాసనము దగ్గరకు రావలెను. పాపము యొద్దనుండి పారిపోవుటయు మరియు పాపమునకు వ్యతిరేకముగా పోరాడుటయు, మీరు పాపము మీద జయము పొందుటకు నిర్ణయించుకొనియున్నారనుటకు దేవునియెదుట ఋజువైయున్నది మరియు దేవుడు ఎంతో ఎక్కువగా సహాయపడును.