WFTW Body: 

అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో సంతోషించుటను గూర్చి ఎక్కువగా చెప్పబడింది. "మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను" (ఫిలిప్పీ 1:6). మరియు "ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి" (ఫిలిప్పీ 4:4).

పౌలు జైలులో ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక వ్రాశాడు (ఫిలిప్పీ 1:13). జైలులో ఉండి కూడా సంతోషించుటను గురించి ఇంత ఎక్కువగా వ్రాయుటను చూచినప్పుడు ఇది సవాలుగా ఉన్నది. అన్ని సౌకర్యములు కలిగి ఉండి సంతోషించుటను గురించి బోధించుట ఒక విషయమైతే కష్టపరిస్థితులలో ఉండి కూడా ఆ విధముగా చెప్పుట మరొక విషయమైయున్నది. అన్ని పరిస్థితులలో ఒక క్రైస్తవుడు సంతోషించగలుగుటను పౌలు యొక్క మాటలు బోధించుచున్నవి. ఇదియే క్రీస్తు యొక్క మనస్సు మరియు వైఖరియై యున్నది.

ఆయన సిలువ వేయబడకముందురాత్రి సంతోషమును గూర్చి ప్రభువైనయేసు ఎక్కువగా చెప్పారు (యోహాను 15, 16 అధ్యాయములు). కడరాత్రి భోజన సమయమందు ఆయన తన శిష్యులతో ఇట్లు చెప్పియున్నారు, "మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపుర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను". "మీ సంతోషమును ఎవడును మీ యొద్దనుండి తీసివేయడు". "నా సంతోషాన్ని మీకివ్వవలెనని కోరుచున్నాను". కొన్ని గంటలలో ఆయన ఒక నేరస్థుడుగా అన్యాయముగా తీర్పు తీర్చబడి మరియు బహిరంగముగా సిలువ వేయబడబోవుచున్నాడు. అయినప్పటికిని ఇతరులతో తన సంతోషాన్ని పంచుకొనుచూ మరియు వారిని ప్రోత్సహించాడు.

క్రీస్తు కలిగిన ఇటువంటి మనస్సు మరియు వైఖరిని పౌలు కలిగియున్నాడు. జైలులో కూడా పౌలు సంపూర్ణ సంతోషముతో యున్నాడు. ఈ పత్రిక వ్రాసినప్పుడు అతడు ఇంటిలోనే బంధించబడెనేమో మనకు తెలియదు (అపొ.కా. 28:16, 30, 31) లేక రోమా వారి జైలులో ఉన్నాడేమో తెలియదు. ఆ రోజులలోని రోమా వారి జైళ్ళలో అయితే ఎలుకలు, దోమలు మరియు అనేకమైన పురుగులు ఉండి, గచ్చు మీద నిద్రించేటివిగా ఉండేటివి. మరియు చాలా తక్కువ ఆహారము పెట్టెడివారు. పౌలు ఏ స్థలములో ఉండినను ఇబ్బందికర పరిస్థితులలోనే ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో కూడా పౌలు సంపూర్ణ సంతోషమును కలిగియున్నాడు. సువార్త ప్రకటించినందుకు అతడు జైలులో ఉన్నాడు. కాని అతనికున్న శ్రమలను బట్టి అతడు కన్నీరు కార్చలేదు. అంతేకాక అతడు ఎవరి యొక్క జాలికొరకు చూడలేదు. అతడు సంపూర్ణ సంతోషము కలిగియున్నాడు.

అన్ని సౌకర్యములు కలిగియుండి కూడా, చిన్నచిన్న సమస్యలకే ఫిర్యాదు చేయుచున్న ఈనాటి క్రైస్తవులకు పౌలు ఎంత మాదిరిగా ఉన్నాడు?. చిన్న కష్టములలోగుండా గాని శ్రమలోగుండా గాని వెళ్ళుచున్న విశ్వాసులు ఇతరులు తనమీద జాలిపడాలని కోరటం మనం ఎంత సాధారణముగా చూస్తున్నాము. ఇక్కడ పౌలు తన శ్రమలను గురించి ఒక మాట కూడా చెప్పలేదు. అతడు ఇట్లు అనుచున్నాడు, "ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను" (ఫిలిప్పీ 1:3). ఒక రాత్రి అంతయు దోమలతో కుట్టబడుచు చెరసాలలోని పురుగులను ఎలుకను పారద్రోలుతూ ఉండిన తరువాత ఈ మాటలు వ్రాసాడని నేను ఊహించగలను. రాత్రి అంతయు దోమలతో కుట్టబడిన తరువాత ఇది వ్రాసియుండవచ్చును; మరియు దుప్పటి కూడా అతనికి లేకపోవచ్చును. అతనికి ఈ సంతోషము, అతడు వెళ్ళుచున్న పరిస్థితిలో నుండి కలుగలేదు కాని ఫిలిప్పీ విశ్వాసులలో ఉన్న దేవుని కృపను చూడటం వలన వచ్చింది.

అనేక సంవత్సరముల క్రితము ఒక దర్శనము ద్వారా అతనిని ప్రభువు ఫిలిప్పీ వెళ్ళమన్నాడు(అపొ.కా. 16:9-12). అతడు ఆ దర్శనాన్ని అనుసరించి అక్కడికి వెళ్ళి మరియు ప్రజలను క్రీస్తులోనికి నడిపించి తరువాత జైలులో పెట్టబడ్డాడు. అక్కడ రక్షణ పొందిన జైలు అధికారి ఇప్పుడు ఫిలిప్పీ సంఘము యొక్క పెద్దయైయుండి మరియు ప్రజలతో ఇట్లు చెప్పియుండవచ్చును. "జైలులో ఇతడు ఆనందించుటను నేను చూశాను". పౌలు యొక్క సంతోషము, ప్రభువు కొరకు ప్రయోజనకరముగా వినియోగించిన జీవితమునుండి వచ్చింది. దేవుడు నీకు ఆరోగ్యమును మరియు బలమును ఇచ్చినప్పుడు, దానిని ప్రభువుయొక్క పరిచర్యలోను, దేవునిరాజ్యము కొఱకు ప్రజలను సమకూర్చుటలోను మరియు ఆయన సంఘమును నిర్మించుటలోను వినియోగించినట్లయితే, నీవు చనిపోయేముందు దానిని బట్టి ఎంతో సంతోషిస్తావు. పౌలు వలె నీవు కూడా చనిపోయే ముందు నీ జీవితము ద్వారా దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించునట్లు, ఇప్పుడే ఆలోచన చేయుము.