వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము సంఘము
WFTW Body: 

మనం ప్రభువు చేత ఆశీర్వదించబడుటకు మరియు భూమిమీద మనం కలుసుకొనే ప్రతీ కుటుంబమునకు మరియు ప్రతీ వ్యక్తికి ఆశీర్వాదకరముగా ఉండుటకు పిలువబడియున్నాము. యేసుప్రభువు మన కొరకు సిలువమీద శాపగ్రస్తుడుగా మారి పరిశుద్ధాత్మ వరము ద్వారా అబ్రహాము ఆశీర్వాదము మనకు అనుగ్రహించెనని గలతీ 3:13,14 చెప్పుచున్నది. ఆదికాండము 12:2,3లో ఆ ఆశీర్వాదము చూచెదము. అక్కడ దేవుడు అబ్రహాముతో "నేను నిన్ను ఆశీర్వదించెదను మరియు భూమియొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును" అని చెప్పెను. అందువలన పరిశుద్ధాత్మతో నింపమని మనం ఎల్లప్పుడు దేవునిని అడిగెదము.

ఇది మన యొక్క స్వాస్థ్యము. కాబట్టి దాన్ని స్వతంత్రించుకొనుడి మరియు దానిలో జీవించుడి. ఈ ఆశీర్వాదమనే ప్రవాహము ఆగిపోకుండునట్లు మీరు ఎల్లప్పుడు మారుమనస్సు పొందుచూ పాపము ఒప్పుకొనుచూ మీ మనస్సాక్షిని నిర్మలముగా ఉంచుకొనుడి.

మొదటిగా, మీరు చేసే ప్రతీ పనిలో అనగా ఆత్మీయముగాను, శారీరకముగాను, వస్తువాహనముగాని, ఉద్యోగములోను, ప్రతీ విషయములో దేవుడు మిమ్మును ఆశీర్వదించవలెనని కోరుచున్నాడు. "మీరు చేయునదంతయు సఫలమగుననియు" (కీర్తన 1:3), "నీ మార్గమును వర్థిల్ల చేసెదననియు" (యెహోషువ 1:8) దేవుని వాగ్ధానములై ఉన్నవి. ఈ క్రొత్తనిబంధన యుగములో మొదటిగా మీయొక్క ఆత్మీయ జీవితములోను తరువాత భూలోక జీవితములోను దేవుడు మిమ్మును ఆశీర్వదించి అభివృద్ధి పరచవలెనని కోరుచున్నాడు. కాని పాత నిబంధనలో వారు కేవలము భూలోక సంబంధమైన విషయములతోనే ఆశీర్వదించబడిరి.

రెండవదిగా, మీ జీవితము ద్వారా దేవుడు ఇతరులను ఆశీర్వదించవలెనని కోరుచున్నాడు. మీలో ఇతరులు దేవుని జీవము రుచిచూడవలెను. ఆ విధముగా మీరు కొందరికి జీవపు సువాసనగాను మరియు దేవుని విసర్జించు వారికి మరణపు వాసనగా ఉండెదరు (2కొరింథీ 2:16).

ఇదంతయు నెరవేరుటకు, మీరు నిరంతరం పరిశుద్ధాత్మతో నింపబడుటకు ఎల్లప్పుడు ఆసక్తితో ప్రార్థించవలెను.

ఇతరుల మీద ఆధారపడకుండా ప్రభువుని సేవించుట కొరకును మరియు మన అవసరముల కొరకును ఉద్యోగము చేసెదము. కాని భూమి మీద ఈ కొద్ది జీవితములో సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఆశీర్వాదముగా ఉండుటకు ఆసక్తి కలిగియుండవలెను.

భారతదేశంలోని గొప్ప బోధకులు పెద్దపట్టణములలోనే బోధించెదరు. కాని గ్రామాలలో ఉన్న సామాన్యమైన బీదవారితో, చదువురాని వారితో కూర్చుని మాట్లాడుటకు వారికి సమయము ఉండదు. కాని భారతదేశంలోని గ్రామాలలో ఉన్న బీద ప్రజలకు సువార్త చెప్పి, సేవించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను అక్కడ జయజీవితమును గురించి సువార్తను ప్రకటించినప్పుడు, ప్రభువు అక్కడ సంఘములను నిర్మించియున్నాడు. నా భార్య అక్కడ బీద స్త్రీలకును పిల్లలకును ఉచితముగా చికిత్స చేయును. వారికి పరిచర్య చేయుట ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడియున్నాము.

అద్భుతరీతిగా మా యొక్క టేపులు పుస్తకములు అనేక ప్రదేశములకు వెళ్ళెను. అవి అన్ని ఖండములకు అనగా భూదింగతముల వరకు వెళ్ళెను (అపొ.కా. 1:8). అనేకమంది బోధకులు వారి సంఘములో బోధించుటకు మా యొక్క పుస్తకములను టేపులను వాడుచున్నారు. అలాగే నేను వెళ్ళని సంఘములకు కూడా వాక్యము వెళ్ళుచున్నది. దేవునికి స్తోత్రము. వారు దానిని జీవించినంతవరకు మరియు దాని ద్వారా డబ్బు సంపాదించాలని కోరుకోనంత వరకు మాయొక్క పుస్తకములు, టేపులు స్వేచ్ఛగా ఉపయోగించమని మేము ప్రజలను ప్రోత్సహించాము.

పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మరియు ప్రవచన వరము కొరకు (వినేవారి అవసరమును బట్టి మాట్లాడగల సామర్థ్యము) ఎల్లప్పుడు ప్రార్థించుడి. ప్రవచన వరము కొరకు అడుగుట గర్వము అని ఊహించుకొనవద్దు. సాతాను ఈవిధముగా ప్రజలను మోసగించును. ప్రతి విశ్వాసి ప్రవచన వరమును ఆసక్తితో ఆపేక్షించవలెనని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు (1కొరింథీ 14:1). కాబట్టి ఆ వరమును ఆపేక్షించుడి. ఏ విషయములో అయినను మీరు దేవుని అడుగని యెడల పొందరు. మీయొక్క అవసరముల కొరకు - తెలివితేటల కొరకు, ఉద్యోగములో ఉన్న సమస్యల కొరకు, ఏ సమస్య కొరకైనను ధైర్యముగా దేవునికి ప్రార్థించవలెను. మనం దేవునియొద్దకు వెళ్ళి, పరిష్కారము పొందునట్లు, ఆయన కొన్ని సమస్యలను అనుమతించును. యేసుప్రభువు నెమ్మది పరచని తుఫానులను మనం ఎదుర్కొననియెడల జీవితం ఎంత విసుగుగా ఉండును!. కాబట్టి అడుగుడి - మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుతూ ఉండండి.